te_tn/act/13/46.md

4.4 KiB

General Information:

“మీరు” అని మొదటిగా పలికినప్పుడు, అది బహువచనమునకు సంబంధించినది మరియు పౌలు మాటలు వింటున్న యూదులను సూచిస్తుంది. ఇక్కడ “మేము” మరియు “మాకు” అనే పదాలు పౌలును మరియు బర్నబాలనే సూచించుచున్నాయిగాని అక్కడున్న జనసమూహమును సూచించుటలేదు. పౌలు ఉపయోగించిన లేఖనము పాత నిబంధనలోని ప్రవక్తయైన యెషయా గ్రంథమునుండి తీయబడింది. వాస్తవికమైన వాక్యభాగములో “నేను” అనే పదము దేవునిని సూచిస్తుంది మరియు “నీవు” అనే పదము ఏకవచనమునకు సంబంధించినది, అది మెస్సయ్యాను సూచిస్తున్నది. ఇక్కడ ఆ వ్యాఖ్య కూడా తమ పరిచర్యను సూచించుచున్నదని పౌలు మరియు బర్నబాలు చెబుతున్నట్లుగా కనబడుతోంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)

It was necessary

దీనిని జరిగించుటకు దేవుడు ఆదేశించియున్నాడని ఇది తెలియజేయుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు ఆజ్ఞాపించియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

that the word of God should first be spoken to you

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ఇక్కడ “దేవుని వాక్యము” అనే మాట “దేవుని సందేశము” అని చెప్పుటకు పర్యాయ పదముగా వాడబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మేము మొట్ట మొదటిగా మీతో దేవుని సందేశమును మాట్లాడుదుము” లేక “మేము మొట్ట మొదటిగా మీతో దేవుని వాక్యమును గూర్చి మాట్లాడుదుము” (చూడండి: [[rc:///ta/man/translate/figs-activepassive]] మరియు [[rc:///ta/man/translate/figs-synecdoche]])

Seeing you push it away from yourselves

వారు ఒక వస్తువును సునాయాసంగా ప్రక్కకు విసిరి వేసినట్లుగా వారు దేవుని వాక్యమును తిరస్కరించుటను గూర్చి చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు దేవుని వాక్యమును తిరస్కరించినందున” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

consider yourselves unworthy of eternal life

మీరు నిత్యజీవమునకు అర్హులు కారని చూపించుచున్నది లేక “మీరు నిత్యజీవమునకు అర్హులు కారన్నట్లుగా నడుచుకొనుచున్నారు”

we will turn to the Gentiles

మేము అన్యుల వద్దకు వెళ్ళెదము. వారు అన్యులకు బోధించాలన్నట్లుగా పౌలు మరియు బర్నబాలు సూచించుచున్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మేము మిమ్ములను వదిలిపెట్టి, అన్యులకు బోధించుట ఆరంభిస్తాము” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)