te_tn/act/06/intro.md

2.7 KiB

అపొస్తలుల కార్యములు 06 సాధారణ విషయాలు లేక అంశాలు

ఈ అధ్యాయములో ప్రత్యేకమైన ఉద్దేశాలు లేక ఆలోచనలు

విధవరాండ్రకు పంచిపెట్టుట

యెరూషలేములోనున్న విశ్వాసులు భర్తలు చనిపోయిన విశ్వాసులందరికి ప్రతిరోజూ ఆహారమును పంచిపెట్టుచుండిరి. వారందరూ యూదులవలె పెంపొందించబడియుండిరి, కాని వారిలో కొందరు యుదాలో నివాసముండిరి మరియు హెబ్రీ భాషను మాట్లాడుచుండిరి, మరియు మిగిలినవారు అన్యుల ప్రాంతాలాలో నివాసముండిరి, వీరు గ్రీకు భాష మాట్లాడుచుండిరి. బయటికి ఆహారమిచ్చువారు హెబ్రీ భాష మాట్లాడు విధవరాండ్రకు మాత్రమే ఇచ్చియుండిరిగాని గ్రీకు మాట్లాడు స్త్రీలకు ఆహారమిచ్చియుండలేదు. దేవుని మెప్పించుటకు సంఘ నాయకులు గ్రీకు మాట్లాడు మనుష్యులను నియమించిరి, పంచిపెట్టే ఆహారము గ్రీకు మాట్లాడు విధవరాండ్రు పొందుకునేటట్లు చూచుకొనుటయే వీరి బాధ్యతైయుండెను. గ్రీకు మాట్లాడు ఈ మనుష్యులలో స్తెఫెను ఒకడు.

ఈ అధ్యాయములో తర్జుమాపరమైన క్లిష్ట సందర్భాలు

“ఆయన ముఖము దూత ముఖమువలె ఉండెను!”

స్తెఫెను ముఖము దూత ముఖమువలె ఉండెననుటను గూర్చి ఎవరికీ నిశ్చయత లేకుండెను, ఎందుకంటే ఇక్కడ లూకా మనకు చెప్పడం లేదు. ఈ విషయమై యుఎల్.టి ఏమి చెబుతున్నదో దానినే తర్జుమా వ్రాయుట లేక చెప్పుట మంచిది.