te_tn/2ti/front/intro.md

11 KiB

తిమోతికి వ్రాసిన 2వ పత్రికకు పరిచయము

భాగము 1: సాధారణ పరిచయము

తిమోతికి వ్రాసిన 2వ పత్రికయొక్క విభజన

  1. పౌలు తిమోతిని పలకరిస్తూ దేవుని సేవ చేస్తున్నప్పుడు కష్టాలను సహించమని ప్రోత్సహిస్తున్నాడు (1:1-2:13).
  2. పౌలు తిమోతికి సాధారణ ఉపదేశమును ఇస్తాడు (2:14-26).
  3. పౌలు భవిష్యత్తులో జరగవలసిన సంఘటనలను గురించి హెచ్చరించాడు మరియు దేవునికి తన సేవను ఎలా చేయాలన్నదాని గురించి ఉపదేశిస్తాడు (3:1-4:8).
  4. పౌలు వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తాడు(4:9-24).

తిమోటికి వ్రాసిన 2వ పత్రికను ఎవరు వ్రాసారు?

పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రికను వ్రాసాడు. అతడు తార్సు అనే ఊరికి చెందినవాడు. అతడు తన ప్రారంభ జీవితంలో సౌలు అని పిలువబడ్డాడు. పౌలు క్రైస్తవుడిగా మారటానికి ముందు, ఒక పరిసయ్యుడుగా ఉండేవాడు. అతడు క్రైస్తవులను హింసించాడు. క్రైస్తవుడిగా మారిన తరువాత, అతడు యేసుని గురించి ప్రజలకు ప్రకటిస్తూ రోమియుల సామ్రాజ్యమంతట చాల సార్లు ప్రయాణము చేసాడు.

ఈ పత్రిక పౌలు తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక.తిమోతి అతని శిష్యుడు మరియు సన్నిహితుడైయున్నాడు. రోమ దేశములోని చెరసాలలో ఉన్నప్పుడు పౌలు ఈ పత్రికను వ్రాసాడు. పౌలు ఈ పత్రికను వ్రాసిన వెంటనే మరణిస్తాడు

తిమోతికి వ్రాసిన 2వ పత్రిక దేనిని గురించి వివరించుచున్నది?

పౌలు తిమోతిని ఎఫేసీయుల పట్టణములో అక్కడి విశ్వాసులకు సహాయం చేయడానికి విడచిపెట్టాడు.పౌలు వివిధ విషయాలను గురించి ఉపదేశించుటకు ఈ పత్రికను వ్రాసాడు. అతడు ప్రసంగించిన అంశాలలో తప్పుడు బోధకుల గురించి హెచ్చరికలు మరియు క్లిష్ట పరిస్థితులను భరించడం ఉన్నాయి.సంఘాలలో సంఘపెద్దగా ఉండుటకు తిమోతికి పౌలు ఎలా శిక్షణ ఇస్తున్నాడో కూడా ఈ పత్రిక చూపిస్తుంది.

ఈ పత్రిక పేరును ఎలా తర్జుమా చేయాలి?

తర్జుమాచేయువారు ఈ పత్రికను “2వ తిమోతి పత్రిక” లేదా “తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక.” అని దాని సాంప్రదాయ పేరుతొ పిలవడానికి ఎంచుకోవచ్చు. లేదా వారు “పౌలు తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక” లేదా “తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక” వంటి స్పష్టమైన పేరును ఎంచుకోవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

భాగము 2: భక్తిపరమైన మరియు సాంస్కృతిక ముఖ్య అంశాలు

తిమోతికి వ్రాసిన రెండవ పత్రికలోని సైనికుల చిత్రమేమిటి?

పౌలు చెరసాలలో వేచియుండగా, తాను త్వరలోనే మరణిస్తాడని తెలిసి, చాలాసార్లు తననుతాను యేసుక్రీస్తు సైనికుడిగా మాట్లాడేవాడు. సైనికులు తమ నాయకులకు సమాధానం ఇస్తారు.\nఅదే విధంగా, క్రైస్తవులు యేసుకు సమాధానం ఇస్తారు. క్రీస్తుయొక్క “సైనికులు” గా విశ్వాసులు మరణించినా సరే ఆయన ఆజ్ఞలకు విధేయులై యుండాలి.

దేవుడు లేఖనాన్ని ప్రేరేపించాడన్న మాటల అర్థం ఏమిటి?

దేవుడు లేఖనముకు నిజమైన రచయితగా ఉన్నాడు. మానవ రచయితలు గ్రంథాలను వ్రాయుటకు ఆయన ప్రేరేపించాడు. అంటే ప్రజలు వ్రాసిన వాటిని వ్రాయుటకు దేవుడు ఏదో ఒక విధంగా కారణమయ్యాడు. అందుకే దీనిని దేవుని మాటలు అని కూడా పిలుస్తారు. ఇది పరిశుద్ద గ్రంథము గురించి అనేక విషయాలను గురించి బయలుపరుస్తుంది. మొదటిది పరిశుద్ద గ్రంథము లోపం లేనిది మరియు నమ్మదగినది. రెండవది, గ్రంథాన్ని వాక్రీకరించడానికి లేక నాశనం చేయాలనుకునే వారి నుండి రక్షించుటకు మనం దేవునిపై ఆధారపడవచ్చు అని చెప్పబడింది. మూడవదిగా, దేవుని వాక్యాన్ని ప్రపంచములోని అన్ని భాషలలో తర్జుమా చేయాలి.

భాగము 3: ముఖ్యమైన తర్జుమా విషయాలు

ఏకవచనం మరియు బహువచనం “మీరు”

ఈ పత్రికలో, “నేను” అనే పదం పౌలుని గురించి చెప్పబడింది. ఇక్కడ “నీవు” అనే పదం దాదాపుగా ఏకవచనమైయున్నది మరియు ఇది తిమోతిని గురించి తెలియచేస్తుంది. దీనికి మినహాయింపు 4:22 (చూడండి: [[rc:///ta/man/translate/figs-exclusive]] మరియు [[rc:///ta/man/translate/figs-you]])

“క్రీస్తులో,” “దేవునిలో,” మొదలైన వాక్కులకు అర్థం ఏమిటి అని పౌలు చెప్పుచున్నాడు?

పౌలు క్రీస్తుతో మరియు విశ్వాసులతో ఐకమత్యముగా ఉండాలనే ఆలోచనను వ్యక్తపరచడానికి ఉద్దేశించాడు. ఈ విధమైన వాక్కుల గురించి మరిన్ని వివరాల కోసం రోమీయులకు వ్రాసిన పత్రికయోక్క పరిచయమును చూడండి

తిమోతికి వ్రాసిన 2వ పత్రికయొక్క వాక్యములోని ప్రధాన వచన విషయాలు ఏమిటి?

క్రింది వచనాల కొరకు పరిశుద్ధ గ్రంథముయొక్క ఆధునిక అనువాదాలు పాత అనువాదాలకు భిన్నంగా ఉంటాయి. యు.ఎల్.టి.(ULT) ఆధునికి తర్జుమాని కలిగి ఉంది మరియు పాత తర్జుమాలన్నియు పేజి క్రింది భాగంలో ఉంటాయి. పరిశుద్ధ గ్రంథముయొక్క తర్జుమా స్థానిక ప్రాంతంలో ఉంటే, తర్జుమా చేయువారు ఆ తర్జుమాల్లో కనిపించే తర్జుమాను ఉపయోగించడాన్ని పరిగణించాలి. లేకపోతే, తర్జుమా చేయువారు ఆ వాక్య భాగాన్నే అనుసరించాలని సూచించపబడ్డారు.

  • “ఈ కారణంగా నేను బోధకుడిగా, అపోస్తలుడిగా మరియు ప్రచారకుడిగా నియామకం పొందాను” (1:11). కొన్ని పాత తర్జుమాలు ఇలా ఉన్నాయి, “ఈ కారణంగా నన్ను అన్యజనులకు బోధకుడిగా, అపోస్తలుడిగా మరియు ప్రచారకుడిగా నియమించారు.”
  • “దేవుని ఎదుట వారిని హెచ్చరించండి” కొన్ని పాత తర్జుమాలు ఇలా ఉన్నాయి, “ప్రభువు ఎదుట వారిని హెచ్చరించండి.”

(చూడండి: rc://*/ta/man/translate/translate-textvariants)