te_tn/2pe/front/intro.md

8.5 KiB

2 పేతురు పరిచయం

భాగం 1: సాధారణ పరిచయం

2 పేతురు పత్రిక యొక్క గ్రంధ విభజన

1.ఉపోద్ఘాతము (1: 1-2)

  1. మంచి జీవితాలను జీవించడానికి దేవుడు అనుమతించాడు గనుక అలా జీవించాలని పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు (1: 3-21)
  2. అబద్ద బోధకులకు వ్యతిరేకంగా హెచ్చరిక (2: 1-22)
  3. యేసు రెండవ రాకడకు సిద్ధమగునట్లు ప్రోత్సాహం (3: 1-17)

2 పేతురు పత్రికను ఎవరు రాశారు?

రచయిత తనను తాను సీమోను పేతురునని పేర్కొన్నాడు. సీమోను పేతురు ఒక అపోస్తలుడు. అతను 1 పేతురు కూడా రాశాడు. చనిపోయే ముందు రోమాలోని జైలులో ఉన్నప్పుడు పేతురు బహుశా ఈ లేఖ రాశాడు. పేతురు ఈ పత్రికను తన రెండవ పత్రిక అని పిలిచాడు, కాబట్టి 1 పేతురు తరువాత అని మనం తేదిని నిర్ధారణ చేయవచ్చు. అతను తన మొదటి పత్రిక వలె అదే ప్రేక్షకులకు ఈ పత్రికను ఉద్దేశించాడు. ప్రేక్షకులు బహుశా చిన్న ఆసియా అంతటా చెదిరిపోయిన క్రైస్తవులు అయిఉండవచ్చు.

2 పేతురు పత్రిక దేనిగురించి?

విశ్వాసులను మంచి జీవితాలను గడపమని ప్రోత్సహించడానికి పేతురు ఈ లేఖ రాశాడు. యేసు తిరిగి రావడానికి చాలా సమయం తీసుకుంటున్నట్లు చెప్పే అబద్ద బోధకుల గురించి ఆయన వారిని హెచ్చరించాడు. యేసు తిరిగి రావడంలో ఆలస్యం చేయడని ఆయన వారితో చెప్పాడు. బదులుగా, దేవుడు ప్రజలను పశ్చాత్తాపం చెంది, తద్వారా వారు రక్షింపబడునట్లు సమయం ఇస్తున్నాడు.

ఈ పత్రిక యొక్క శీర్షికను ఎలా అనువదించాలి?

అనువాదకులు ఈ పుస్తకాన్ని దాని సాంప్రదాయ శీర్షిక ఐన""2 పేతురు” లేదా ""రెండవ పేతురు"" లేదా వారు ""పేతురు నుండి రెండవ పత్రిక"" లేదా ""పేతురు రాసిన రెండవ పత్రిక"" వంటి స్పష్టమైన శీర్షికను ఎంచుకోవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

భాగం 2: ముఖ్యమైన మత మరియు సాంస్కృతిక అంశాలు

పేతురు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వ్యక్తులు ఎవరు? పేతురు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తులు జ్ఞానవాదులు (గ్నోస్తికులు) అని పిలవబడేవారు. ఈ బోధకులు తమ సొంత లాభం కోసం లేఖన ఉపదేశములను వక్రీకరించారు. వారు అనైతిక మార్గాల్లో జీవించి మరియు ఇతరులకు అదే విధంగా చేయమని నేర్పించారు.

దేవుడు లేఖనములను ప్రేరేపించాడు అంటే అర్థం ఏమిటి? లేఖనము యొక్క సిద్ధాంతం చాలా ముఖ్యమైనది. 2 పేతురు పత్రిక ప్రతి గ్రంథ రచయిత తనదైన ప్రత్యేకమైన రచనా విధానాన్ని కలిగి ఉన్నప్పటికీ, దేవుడే నిజమైన లేఖన రచయిత (1: 20-21) అని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.

భాగము 3: ముఖ్యమైన అనువాద సమస్యలు

ఏకవచనం మరియు బహువచనంలో ఆంగ్లంలో వాడబడిన “you"" (మీరు) అనే పదం

ఈ పుస్తకంలో, ""నేను"" అనే పదం పేతురును సూచిస్తుంది. అలాగే, ""మీరు"" అనే పదం ఎల్లప్పుడూ బహువచనంలో ఉండి మరియు పేతురు యొక్క ప్రేక్షకులను సూచిస్తుంది. (చూడండి: [[rc:///ta/man/translate/figs-exclusive]] మరియు [[rc:///ta/man/translate/figs-you]])

2 పేతురు పుస్తకంలోని క్రింది వచనాలలోని ప్రధాన సమస్యలు ఏమిటి? ఈ క్రింది వచనాల విషయంలో, బైబిల్ యొక్క కొన్ని ఆధునిక తర్జుమాలు పాత తర్జుమాలకు భిన్నంగా ఉంటాయి. (ULT) యుఎల్టి వచనం ఆధునిక తర్జుమాను కలిగి ఉండి మరియు పాత తర్జుమాను ఫుట్‌నోట్‌లో ఉంచుతుంది. బైబిల్ యొక్క అనువాదం సాధారణ ప్రాంతంలో ఉంటే, అనువాదకులు ఆ తర్జుమాల్లో కనిపించే పఠనాన్ని ఉపయోగించడాన్ని పరిగణించాలి. కానిపక్షంలో, ఆధునిక పఠనాన్ని అనుసరించమని అనువాదకులకు సూచించడమైనది.

  • ""తీర్పు వచ్చేవరకు దట్టమైన చీకటి సంకెళ్ళలో ఉంచాలి"" (2: 4). కొన్ని ఆధునిక తర్జుమాలు మరియు పాత తర్జుమాలలో ""తీర్పు వచ్చేవరకు తక్కువ చీకటి గుంటలలో ఉంచాలి."" అని ఉన్నది
  • ""వారు మీతో విందులో పాల్గొంటూనే వారి భోగాలలో ఆనందిస్తారు"" (2:13). కొన్ని తర్జుమాలలో, ""వారు మీతో ప్రేమ విందులలో విందు చేస్తున్నప్పుడు వారి చర్యలలో సుఖిస్తూ ఉంటారుఅని ఉంది.""
  • ""బెయోరు"" (2:15). మరికొన్ని తర్జుమాలలో ""బోసోరు"" అని చెప్పబడింది.
  • ""పంచభూతాలు మంటల్లో కాలిపోతాయి, మరియు భూమి మరియు అందులో ఉన్నవన్నీ తీర్పుకు గురవుతాయి"" (3:10). ఇతర తర్జుమాలలో, ""పంచభూతాలు అగ్నిలో కాలిపోతాయి, మరియు భూమి మరియు దానిలోని వస్తువులన్నీ కాలిపోతాయి అని ఉంది.""

(చూడండి: rc://*/ta/man/translate/translate-textvariants)