te_tn/2co/12/intro.md

6.8 KiB

2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 12 అధ్యాయములోని సాధారణ గమనికలు

నిర్మాణం మరియు క్రమపరచుట

ఈ అధ్యాయములో పౌలు తన అధికారాన్ని సమర్తిస్తూనే ఉన్నాడు.

పౌలు కొరింథీయులతో ఉన్నప్పుడు, శక్తివంతమైన పనుల ద్వారా తనను తాను అపోస్తలుడని నిరూపించాడు. అతను వారి నుండి ఏమియు తీసుకోలేదు. ఇప్పుడు అతను మూడవ సారి వస్తున్నాడు, అతడు ఇంకా మరేమియు తీసుకోడు. అతను సందర్శించినప్పుడు, అతను వారితో కఠినంగా ఉండవలసిన అవసరం లేదని అతను ఆశిస్తున్నాడు. (చూడండి: rc://*/tw/dict/bible/kt/apostle)

ఈ అధ్యాయములో ప్రత్యేక అంశాలు

పౌలు యొక్క దర్శనములు

పౌలు ఇప్పుడు పరలోకం యొక్క అద్భుతమైన దర్శనం గురించి చెప్పడం ద్వారా తన అధికారాన్ని సమర్థించుకున్నాడు. అతను 2-5 వచనాలలో మూడవ వ్యక్తిలాగా మాట్లాడుతున్నప్పటికి, 7వ వచనం అతను దర్శనాలను అనుభవించే వ్యక్తి అని తెలియచేస్తుంది. ఇది చాలా గొప్పది, అతడు విధేయతగా ఉండటానికి దేవుడు శరీరంలో ఒక ముల్లును పెట్టాడు. (చూడండి: rc://*/tw/dict/bible/kt/heaven)

మూడవ ఆకాశం

“మూడవ” ఆకాశం దేవుని నివాసమని చాలా మంది పండితులు నమ్ముతారు. ఎందుకంటే ఆకాశం (మొదటి పరలోకం) మరియు విశ్వం (రెండవ పరలోకము) అని తెలియచేయుటకు లేఖనములు “పరలోకము” అనే పదాన్ని ఉపయోగిస్తుంది.

ఈ అధ్యాయములో ముఖ్యమైన భాషీయములు

అలంకారిక ప్రశ్నలు

తనపై ఆరోపణలు చేసిన తన శత్రువులపై తనను తానూ సమర్థించుకుంటూ పౌలు అనేక అలంకారిక ప్రశ్నలను ఉపయోగిస్తాడు: “నేను మీకు భారం కాదని తప్ప మిగతా సంఘాలకన్నా నీకు ఎలా తక్కువ ప్రాముఖ్యత ఉంది?” “తీతు మీ ప్రయోజనాన్ని తీసుకున్నాడా? మనం అదే విధంగా నడవలేదా? మనం ఒకే అడుగుజాడలలో నడవలేదా?” మరియు “ఈ సమయమందు అంతట మేము మిమ్మల్ని సమర్థించుకుంటున్నామని మీరు అనుకుంటున్నారా?” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

వ్యంగ్యం

పౌలు వ్యంగం యొక్క ఒక ప్రత్యేకమైన వ్యంగ్యాన్ని ఉపయోగిస్తాడు, అతను ఎటువంటి ఖర్చు లేకుండా వారికి ఏ విధంగా సహాయం చేసాడో వారికి గుర్తు చేస్తాడు. “ఈ తప్పుకు నన్ను క్షమించు” అని అతను అంటాడు. “కాని నేను చాలా కపటమైన స్వభావము గలవాడను కాబట్టి, మోసానికి నిన్ను పట్టుకున్నది నేనే” అని అతను చెప్పినప్పుడు అతడు సాధారణ వ్యంగ్యాన్ని కూడా ఉపయోగిస్తాడు. నిజాయితీగా ఉండడం ఎంత అసాధ్యమో చూపించుటకు ఈ నిందకు వ్యతిరేకంగా తన రక్షణను పరిచయం చేయడానికి అతడు దానిని ఉపయోగిస్తాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-irony)

ఈ అధ్యాయములోని ఇతర అనువాద ఇబ్బందులు

వైపరీత్యం

“వైపరీత్యం” అనేది అసాధ్యమైనదాన్ని వివరించడానికి కనిపించే నిజమైన వివరణయై యున్నది. 5వ వచనములో ఈ వాక్యం ఒక శాస్త్రవిరుద్ధమైనది: “నా బలహీనతల గురించి తప్ప నేను గొప్పలు చెప్పను.” చాలా మంది బలహీనంగా ఉన్నారని గొప్పలు చెప్పుకోరు. 5వ వచనములో ఈ వాక్యం కూడా ఒక శాస్త్రవిరుద్ధమైనది: “నా బలహీనతల గురించి తప్ప గొప్పలు చెప్పుకోను.” చాలా మంది బలహీనంగా ఉండటం గురించి గొప్పలు చెప్పుకోవడం లేదు. చాలా మంది బలహీనంగా ఉండటం గురించి గొప్పలు చెప్పుకోవడం లేదు: “నేనెప్పుడు బలహీనంగా ఉన్నానో అప్పుడే బలవంతుడిగా ఉన్నాను.” ఈ రెండు ప్రకటనలు ఎందుకు నిజమైనవి అని పౌలు 9వ వచనం లో వివరించాడు. (2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 12:5)