te_tn/2co/06/intro.md

4.5 KiB

2 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 06 అధ్యాయములోని సాధారణ గమనికలు

నిర్మాణం మరియు క్రమపరచుట

కొన్ని తర్జుమాలు చదవడానికి సులువుగా ఉండటానికి కావ్యంలోని ప్రతి పంక్తిని మిగిలిన వచనం కంటే కుడి వైపుకు అమర్చుతాయి. పాత నిబంధనలోని వచనాలైన 2 మరియు 16-18 వచనాలతో యు.ఎల్.టి(ULT) దీనిని చేస్తుంది.

ఈ అధ్యాయములో ప్రత్యేక అంశాలు

సేవకులు

పౌలు క్రైస్తవులను దేవుని సేవకులుగా తెలియచేస్తున్నాడు. దేవుడు క్రైస్తవులను అన్ని పరిస్థితులలో తనకు సేవ చేయుటకు పిలుస్తాడు. పౌలు మరియు అతని సహచరులు దేవునికి సేవ చేసిన కొన్ని క్లిష్ట పరిస్థితులను అతను వివరించాడు.

ఈ అధ్యాయములో ముఖ్యమైన భాషీయములు

విభేదాలు

పౌలు నాలుగు జతల విభేదాలను ఉపయోగిస్తాడు: నీతికి ప్రతిగా అన్యాయానికి, వెలుగుకు ప్రతిగా చీకటికి, క్రీస్తుకు ప్రతిగా సాతానుకు మరియు దేవుని ఆలయానికి ప్రతిగా విగ్రహాలకు. ఈ విబేధాలు క్రైస్తవులకు మరియు క్రైస్తవులు కానివారి మధ్య వ్యత్యాసాన్ని చూపుతాయి. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/righteous]] మరియు [[rc:///tw/dict/bible/other/light]] మరియు rc://*/tw/dict/bible/other/darkness)

వెలుగు మరియు చీకటి

పరిశుద్ధ గ్రంథము తరచుగా అవినీతి పరులైన వ్యక్తుల గురించి దేవునికి నచ్చినది చేయని వ్యక్తుల గురించి వారు చీకటిలో తిరుగుతున్నట్లుగా ఉందని చెప్పుచున్నాడు. ఆ పాపపు ప్రజలు నీతిమంతులుగా మార్చడానికి, వారు ఏమి తప్పు చేస్తున్నారో అర్థం చేసుకోవడానికి మరియు దేవునికి విధేయత చూపడం ప్రారంభించినట్లుగా ఇది వెలుగు గురించి చెప్పుచున్నది. (చూడండి: rc://*/tw/dict/bible/kt/righteous)

అలంకారికి ప్రశ్నలు

పౌలు తన చదవరులకు నేర్పడానికి అలంకారిక ప్రశ్నల వరసను ఉపయోగిస్తాడు. ఈ ప్రశ్నలన్నియూ అతి ముఖ్యముగా ఒకే విషయాన్ని తెలియచెస్తాయి: క్రైస్తవులు పాపములో ఉన్నవారితో అన్యోన్యముగా సహవాసం చేయకూడదు. పౌలు ఈ ప్రశ్నలను నొక్కి చెప్పాడు. (చూడండి: [[rc:///ta/man/translate/figs-rquestion]] మరియు [[rc:///tw/dict/bible/kt/sin]])

ఈ అధ్యాయములోని ఇతర అనువాద ఇబ్బందులు

మేము

పౌలు తిమోతి మరియు తనను సూచించడానికి “మేము” అనే సర్వనామమును ఉపయోగిస్తాడు. ఇందులో ఇతర వ్యక్తులు కూడా ఉండవచ్చు.