te_tn/2co/03/intro.md

3.4 KiB

2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 03 అధ్యాయములోని సాధారణ గమనికలు

నిర్మాణం మరియు క్రమపరచుట

పౌలు తన రక్షణను కొనసాగిస్తున్నాడు. పౌలు కోరినట్లు క్రైస్తవులను తన పనికి రుజువుగా భావిస్తాడు.

ఈ అధ్యాయములో ప్రత్యేక అంశాలు

మోషే ధర్మశాస్త్రము

దేవుడు రాతి పలకలపై పది ఆజ్ఞలను ఇవ్వడం గురించి పౌలు ఉల్లేఖించుచున్నాడు. ఇది మోషే ధర్మశాస్త్రం గురించి తెలియచేస్తుంది. ధర్మశాస్త్రము దేవునినుండి వచ్చినందున మంచిదైయున్నది. ఇశ్రాయేలీయులు దానికి అవిధేయత చూపినందున దేవుడు వారిని శిక్షించాడు. పాత నిబంధన ఇంకా తర్జుమా చేయబడక పోతే తర్జుమా చేయువారు ఈ అధ్యాయమును అర్థం చేసుకొనుట కష్ట తరంగా ఉంటుంది. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/lawofmoses]] మరియు [[rc:///tw/dict/bible/kt/covenant]] మరియు rc://*/tw/dict/bible/kt/reveal)

ఈ అధ్యాయములో ముఖ్యమైన భాషీయములు

రూపకఅలంకారాలు

పౌలు క్లిష్టమైన ఆధ్యాత్మిక సత్యాలను వివరించుటకు ఈ అధ్యాయములో ఉపయోగించిన అనేక రూపకఅలంకారాలను ఉపయోగిస్తాడు. పౌలు బోధలను ఇది సులభతరం చేస్తుందా లేక అర్థం చేసుకోవడం చాల కష్టతరంగా ఉంటుందా అనేది అస్పష్టంగా ఉంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

ఈ అధ్యాయములోని ఇతర అనువాద ఇబ్బందులు

“ఇది పత్రిక యొక్క నిబంధన కాదు కాని పరిశుద్దాత్మ యొక్క నిబంధనయైయున్నది.”

పౌలు పాత మరియు క్రొత్త నిబంధనలకు వ్యత్యాసము చూపుచున్నాడు. క్రొత్త నిబంధన నియమాల క్రమం వ్యవస్థ కాదు. ఇక్కడ “ఆత్మ” అనేది బహుశః పరిశుద్ధాత్మ దేవుని గురించి తెలియచేస్తుంది. ఇది ప్రకృతిలో “ఆధ్యాత్మికం”గా ఉన్న క్రొత్త నిబంధన అని కూడా తెలియచేస్తుంది. (చూడండి: rc://*/tw/dict/bible/kt/spirit)