te_tn/1ti/01/intro.md

3.6 KiB

తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 01 సాధారణ అంశాలు

నిర్మాణము మరియు క్రమపరచుట

పౌలు పధ్ధతి ప్రకారముగా 1-2 వచనములలో ఈ పత్రికను పరిచయము చేయుచున్నాడు. తూర్పు దేశాలలో పురాతన కాలములో ఈ విధముగానే రచయితలు అనేకమార్లు పత్రికలను వ్రాసేవారు.

ఈ అధ్యాయములో ప్రత్యేకమైన అంశాలు

ఆత్మీయ పిల్లలు

ఈ అధ్యాయములో పౌలు తిమోతిని “కుమారుడని” మరియు తన “బిడ్డ” అని పిలుచుచున్నాడు. పౌలు తిమోతిని క్రమశిక్షణ కలిగిన క్రైస్తవుడిగా మరియు సంఘ నాయకుడిగా తీర్చిదిద్దియున్నాడు. బహుశః తిమోతి క్రీస్తునందు విశ్వాసముంచుటకు కూడా పౌలు కారణమైయుండవచ్చును. అందుచేతనే, పౌలు తిమోతి “విశ్వాసమునందు నా ప్రియ కుమారుడు” అని పిలిచాడు. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/disciple]], [[rc:///tw/dict/bible/kt/faith]] మరియు [[rc:///tw/dict/bible/kt/spirit]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])

వంశావళులు

ఒక వ్యక్తి యొక్క పూర్వీకులు లేక ఆ వ్యక్తి యొక్క సంతానమును దాఖలు చేయబడిన పట్టికలే వంశావళులు. రాజుగా ఉండుటకు సరియైన వ్యక్తిని ఎన్నుకోవడానికి యూదులు వంశావళులను ఉపయోగించేవారు. ఏ గోత్రమునుండి మరియు ఎటువంటి కుటుంబమునుండి వారు వచ్చారని కూడా వారు చూపించారు. ఉదాహరణకొరకు, యాజకులు లేవి గోత్రమునుండి మరియు ఆహారోను కుటుంబమునుండి వచ్చారు. ఎక్కువ శాతపు ప్రాముఖ్యమైన ప్రజలు వారి వంశావళుల పట్టికలు కలిగియున్నారు.

ఈ అధ్యాయములో ప్రాముఖ్యమైన అలంకారములు

పదాల ప్రయోగము

”ధర్మశాస్త్రము మంచిదే దానిని దాని నియమప్రకారముగా ఉపయోగించినట్లయితే మంచిదే’ అనేది పదాల ప్రయోగానికి సంబంధించింది. “ధర్మశాస్త్రము” మరియు “నియమప్రకారముగా లేక ధర్మశాస్త్ర ప్రకారముగా” అనే పదాలు మూల భాషలో ఒకే విధముగా ఉంటాయి.