te_tn/1pe/front/intro.md

6.3 KiB

పేతురు వ్రాసిన మొదటి పత్రిక యొక్క పరిచయము

భాగము 1: సహజ పరిచయము

1 పేతురు పత్రిక యొక్క విభజన

  1. పరిచయము (1:1-2)
  2. విశ్వాసుల రక్షణ నిమిత్తమై దేవునికి స్తోత్రములు చెల్లించడం (1:3-2:10)
  3. క్రైస్తవ జీవితం (2:11-4:11)
  4. శ్రమలలో స్థిరముగా ఉండుటకు ప్రోత్సాహం (4:12-5:11)
  5. ముగింపు (5:12-14)

1 పేతురు పత్రికను ఎవరు వ్రాసారు?

1 పేతురు పత్రికను అపొస్తలుడైన పౌలు వ్రాసాడు. చిన్న ఆసియా ప్రాంతమంత చెదరియున్న క్రైస్తవులకు అతడు ఈ పత్రికను వ్రాసాడు.

1 పేతురు పత్రిక దేనిని ఉద్దేశించి వ్రాయబడింది?

అతడు తన పత్రికను వ్రాస్తూ “ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యం చెబుతూ, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను” (5:12) అని పేతురు వ్రాసాడు. క్రైస్తవులు శ్రమలలో ఉన్నప్పటికి దేవునికి విధేయులైయుండాలని వారిని హెచ్చరించాడు. యేసు త్వరలో తిరిగి రానైయున్నాడని అతడు ఈ సంగతులను వారితో చెప్పెను. క్రైస్తవులుగా వున్నవారు అధికారులకు సహితం లోబడియుండాలని పేతురు హెచ్చరించాడు.

ఈ పుస్తకము యుక్క ముఖ్యాంశమును ఏవిదముగా తర్జుమా చేయవలెను?

అనువాదకులు ఈ పుస్తకమును 1 పేతురు లేక మొదటి పేతురు అని సాంప్రదాయకంగా పిలవవచ్చును. లేక “పేతురు వ్రాసిన మొదటి పత్రిక” లేక “పేతురు ద్వారా వ్రాయబడిన మొదటి పత్రిక” అని స్పష్టమైన రీతిలో పిలవవచ్చును. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

భాగము 2: ప్రాముఖ్యమైన మతపరమైన మరియు సాంస్కృతిక అంశములు

రోమా పట్టణములో క్రైస్తవులపట్ల వారి దోరణి ఏరితిగా ఉండెను?

ఈ పత్రికను వ్రాసినప్పుడు బహుశః పేతురు రోమాలో ఉండియుండవచ్చును. అతడు రోమా పట్టణమునకు “బబులోను” (5:13) అని సంకేతపరమైన పేరు పెట్టాడు. పేతురు ఈ పత్రికను వ్రాసినప్పుడు, రోమీయులు క్రైస్తవులను బహుగా హింసించుచుండిరి.

భాగము 3: ముఖ్యమైన తర్జుమా సమస్యలు

ఏకవచనం మరియు బహువచనం “నువ్వు”

ఈ పుస్తకములో, “నేను” అనే పదము రెండు సార్లు తప్ప అన్ని మార్లు పేతురును సూచించుచున్నది: 1 పేతురు 1:16 మరియు 1 పేతురు 2:6. “మీరు” అనే పదము అన్ని మార్లు బహువచానమునే సూచిస్తుంది మరియు పేతురు యొక్క ప్రేక్షకులను సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

1 పేతురు పత్రికలో గల ప్రధానమైన సమస్యలు ఏవి?

  • “సత్యానికి లోబడడం ద్వారా మీరు మీ మనసులను పవిత్రపరచుకున్నారు. తద్వారా యథార్ధమైన సోదర ప్రేమను పొందారు. అందుచేత ఒకరినొకరు హృదయ పూర్వకంగా, గాఢంగా ప్రేమించుకోండి” (1:22). యుఎల్టి,యు.ఎస్టి మరియు కొన్ని ఆధునిక అనువాదాలలో పైన పేర్కొనబడిన రీతిలో ఈ వాక్యం ఉండగా ప్రాచిన ప్రతులలో “మీరు సత్యమునకు విధేయులవుటచేత మీ మనస్సులను పవిత్ర పరచుకొనిన వరైయుండి, యొకనినొకడు హృదయ పూర్వకముగాను మిక్కుటము గాను ప్రేమించుడి” అని వ్రాయబడియున్నది.

ప్రాంతీయ భాషలో పరిశుద్ధ గ్రంథ అనువాదం ఉన్నయెడల అనువాదకులు తమ స్థానిక భాషలలో ఉన్న తర్జుమాలను పరిశీలించండి. లేనియెడల, అనువాదకులు ఆధునిక అనువాదమును వెంబడించాలని సూచించడమైనది.

(చూడండి: rc://*/ta/man/translate/translate-textvariants)