te_tn/1jn/front/intro.md

13 KiB

1వ యోహాను పత్రిక పరిచయము

భాగము 1: సాధారణ పరిచయము

యోహాను వ్రాసిన మొదటి పత్రికయొక్క విభజన

  1. పరిచయము (1:1-4)
  2. క్రైస్తవ జీవితం (1:5-3:10)
  3. ఒకరినొకరు ప్రేమించాలన్న ఆజ్ఞ (3:11-5:12)
  4. ముగింపు (5:13-21)

యోహాను వ్రాసిన మొదటి పత్రికను ఎవరు వ్రాసారు?

ఈ పుస్తకంలో రచయిత గురించి తెలియచేయుటలేదు. ఏదేమైనా, ప్రారంభ క్రైస్తవ కాలంనుండి, చాలా మంది క్రైస్తవులు అపోస్తలుడైన యోహాను రచయిత అని భావించారు. ఆయన యోహాను సువార్తను కూడా వ్రాసారు.

యోహాను వ్రాసిన 1వ పత్రిక దేనిని గురించి వివరించుచున్నది?

తప్పుడు బోధకులు ఇబ్బంది పెడుతున్న సమయములో యోహాను ఈ పత్రికను వ్రాసారు. విశ్వాసులను పాపము చేయకుండా నిరోధించాలనుకున్నందున యోహాను ఈ పత్రికను వ్రాసారు. తప్పుడు బోధలనుండి విశ్వాసులను రక్షించాలనుకున్నారు. మరియు వారు రక్షింపబడ్డారని విశ్వాసులకు నిశ్చయత కలుగాజేయలనుకున్నాడు.

ఈ పత్రికను పేరును ఎలా తర్జుమా చేయాలి?

తర్జుమాచేయువారు ఈ పత్రికను “1వ యోహాను పత్రిక” లేదా “యోహాను వ్రాసిన మొదటి పత్రిక.” అని దాని సాంప్రదాయ పేరుతో పిలవడానికి ఎంచుకోవచ్చు, లేదా వారు “యోహానునుండి వ్రాయబడిన మొదటి పత్రిక” లేదా “ యోహాను వ్రాసిన మొదటి పత్రిక” వంటి స్పష్టమైన పేరును ఎంచుకోవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

భాగము 2: భక్తిపరమైన మరియు సాంస్కృతిక ముఖ్య అంశాలు

యోహాను వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తులు ఎవరు?

యోహాను వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తులు జ్ఞానవాదులు అని పిలువబడే గ్నోస్తికులై ఉండవచ్చు. ఈ ప్రజలు భౌతిక ప్రపంచం చెడ్డది అని నమ్మినారు. యేసు దేవుడు అని విశ్వసించినందున, ఆయన నిజముగా మనుష్యుడని తిరస్కరించారు. దీనికి కారణం భౌతిక శరీరం చేడ్డది గనుక దేవుడు మనుష్యుడు కాదని వారు భావించారు. (చూడండి:rc://*/tw/dict/bible/kt/evil)

భాగము 3: ముఖ్యమైన అనువాద సమస్యలు

యోహాను వ్రాసిన మొదటి పత్రికలో “ఉండి,” “నివసించు’” మరియు “కట్టుబడే” అనే పదాలకు అర్థం ఏమిటి?

యోహాను తరచుగా “ఉండి,” “నివసించు’” మరియు “కట్టుబడే” అనే పదాలను రూపకఅలకంకారాలుగా ఉపయోగించారు. యేసును మరింత తెలుసుకోవడం గురించి విశ్వాసిలో “ఉండిపోయినట్లుగా” ఒక విశ్వాసి విశ్వాసపాత్రుడు కావాలి అనే మాటను గురించి విశ్వాసిలో యేసు వాక్యం “ఉండిపోయినట్లుగా” యోహాను చెప్పాడు. ఆలాగే, ఒక వ్యక్యి ఆత్మియంగా ఉండి మరొక వ్యక్తితో సహవాసం చేస్తే ఆ వ్యక్తిలో “ఉండిపోయినట్లుగా” యోహాను చెప్పారు. \nక్రైస్తవులు క్రిస్తులోను మరియు దేవునిలోను “ఉన్నారని” చెప్పబడ్డారు. తండ్రి కుమారునిలో “ఉన్నాడని”, మరియు కుమారుడు తండ్రిలో “ఉన్నాడని” చెప్పబడ్డారు. కుమారుడు విశ్వాసులలో “ఉన్నాడని” చెప్పబడ్డాడు. పరిశుద్దాత్మ దేవుడు కూడా విశ్వాసులలో “ఉండును” అని చెప్పబడ్డాడు.

తర్జుమా చెయువారిలో చాల మంది ఈ ఆలోచనలను వారి భాషలలో సరిగ్గా అదే విధంగా వ్యక్తపరచటానికి అసాధ్యమౌతుంది. ఉదాహరణకు, “ఆయనలో ఉన్నానని” చెప్పుకొనువాడు అని యోహాను చెప్పినప్పుడు ఆ క్రైస్తవులు దేవునితో ఆత్మీయంగా కలసి ఉండాలనే ఆలోచనను వ్యక్తపరచడానికి ఉద్దేశించి చెప్పాడు. (1వ యోహాను పత్రిక 2:6). “మనము దేవునితో ఏకమైయున్నామని మనము చెప్పుకున్నట్లయితే” అని యు.ఎస్.టి. చెప్పుతుంది. కాని తర్జుమా చేయువారు ఈ ఆలోచనలను చక్కగా తెలియచేసే ఇతర వాక్కులను కనుగొనవలసి ఉంటుంది.

ఈ వాక్య భాగంలో “దేవుని వాక్యం మీలో ఉంది” (యోహాను వ్రాసిన 1వ పత్రిక 2:13), యు.ఎస్.టి. ఈ ఆలోచనను “దేవుడు ఆజ్ఞాపించిన వాటిని మీరు పాటిస్తూనే ఉండాలి” అని వ్యక్తపరుస్తుంది. చాలా మంది తర్జుమా చేయువారు ఈ తర్జుమాను ఒక మాదిరిగా ఉపయోగించడం సాధ్యమౌతుంది.

1వ యోహాను పత్రికయొక్క కీలక విషయాలు ఏమిటి?

క్రింది వచనాల కొరకు పరిశుద్ధ గ్రంథముయొక్క ఆధునిక అనువాదాలు పాత అనువాదాలకు భిన్నంగా ఉంటాయి. యు.ఎల్.టి. వచనము ఆధునిక తర్జుమాని కలిగి ఉంది మరియు పాత తర్జుమాలన్నియు పేజి క్రింది భాగంలో ఉంటాయి. పరిశుద్ధ గ్రంథముయొక్క తర్జుమా స్థానిక ప్రాంతంలో ఉంటే, తర్జుమా చేయువారు ఆ తర్జుమాల్లో కనిపించే తర్జుమాను ఉపయోగించడాన్ని పరిగణించాలి. లేకపోతే, తర్జుమా చేయువారు ఆ వాక్య భాగాన్నే అనుసరించాలని సూచింపబడ్డారు.

  • “మరియు మా సంతోషము సంపూర్ణమగునట్లు మేము ఈ విషయాలు మీకు వ్రాయుచున్నాము"" (1:4). కొన్ని పాత అనువాదాలు ఉన్నాయి, ""మరియు మీ సంతోషము సంపూర్ణమగుటకు మేము ఈ విషయాలను మీకు వ్రాయుచున్నాము. “
  • “మరియు మీరందరూ సత్యమును ఎరుగుదురు” (2:20). ఇతర ఆధునిక తర్జుమాలు ఉన్నాయి, ""మరియు మీ అందరికీ జ్ఞానము ఉంది."" కొన్ని పాత తర్జుమాలు ఉన్నాయి, ""మరియు మీకు అన్ని విషయాలు తెలుసు.”
  • “మరియు ఇదే మనము!” (3:1). యుఎల్టి, యుఎస్టి మరియు చాలా ఆధునిక అనువాదాలు ఈ విధంగా చదవబడతాయి. కొన్ని తర్జుమాలు ఈ మాటలను తీసివేయుట జరిగింది.
  • మరియు యేసును అంగీకరించని ప్రతి ఆత్మ దేవుని నుండి వచ్చినది కాదు” (4:3). యు.ఎల్.టి., యు.ఎస్.టి, మరియు చాలా ఆధునిక తర్జుమాలు ఈ అనువాదాన్ని కలిగి ఉన్నాయి. కొన్ని పాత తర్జుమాలు ఇలా ఉన్నాయి, ""మరియు యేసు రక్తమాంసముతో వచ్చాడని అంగీకరించని ప్రతి ఆత్మ దేవుని నుండి వచ్చినది కాదు.”

క్రింది భాగం కోసం, తర్జుమా చేయువారు యు.ఎల్.టి వలె దీనిని తర్జుమా లలో వ్రాయబదడియున్నవని సలహా ఇవ్వడమైనది. అయితే, తర్జుమా చేయువారు ఉన్నటువంటి ప్రాంతంలో, పరిశుద్ధ గ్రంథముకు సంబధించిన ఈ వాక్యభాగాలను చేర్చి ఉండవచ్చు.\n \nఇలా చేర్చబడితే, అది ఒకవేళ యోహాను వ్రాసిన మొదటి పత్రికయొక్క అసలు తర్జుమాలలో లేదని సూచించుటకు చదరపు బ్రాకెట్లలో ([]) ఉంచాలి.

  • “ ఆత్మ, నీరు, మరియు రక్తం అనే సాక్షామిచ్చువారు ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు అంగీకరిస్తున్నారు”. (5:7-8) కొన్ని పాత తర్జుమాలు ఉన్నాయి, “ ఏలయనగా పరలోకములో సాక్షామిచ్చే ముగ్గురు ఉన్నారు: తండ్రి, వాక్యమైయున్న యేసు, మరియు పరిశుద్దాత్మ దేవుడు; మరియు ఈ ముగ్గురు ఒక్కరై ఉన్నారు. భూమిపై సాక్ష్యమిచ్చే ముగ్గురు ఉన్నారు: ఆత్మ, నీరు, మరియు రక్తం; మరియు ఈ మూడు ఒక్కటే.”

(చూడండి:rc://*/ta/man/translate/translate-textvariants)