te_tn/1co/13/intro.md

2.0 KiB

1వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 13వ అధ్యాయములోని సాధారణ గమనికలు

నిర్మాణము మరియు క్రమపరచుట

పౌలు అధ్యాత్మిక వరాల గురించి అతని బోధకు అంతరాయం కలిగించినట్లు తెలుస్తుంది. ఏదేమైనా, ఈ అధ్యాయము బహుశా అతని బోధనలో పెద్ద పనితీరుని అందిస్తుంది.

ఈ అధ్యాయంలోని ప్రత్యేక అంశాలు

ప్రేమ

ప్రేమ విశ్వాసియొక్క అతి ప్రాముఖ్యమైన లక్షణమైయున్నది. ఈ అధ్యాయం పూర్తిగా ప్రేమను వివరిస్తుంది. ఆత్మ వరాలకంటే ప్రేమ ఎందుకు గొప్పదో పౌలు చెపుతాడు. (చూడండి: rc://*/tw/dict/bible/kt/love)

ఈ అధ్యాయములోని ముఖ్యమైన భాషీయములు

రూపకఅలంకారములు

పౌలు ఈ అధ్యాయములో అనేక విభిన్న రూపకఅలంకారములను ఉపయోగిస్తాడు. ముఖ్యముగా కష్టతరమైన అంశాల పై కొరింథీయులకు బోధించుటకు అతను ఈ రూపకఅలంకారములను ఉపయోగిస్తాడు. ఈ బోధనలను అర్థం చేసుకొనుటకు చదవరులకు తరచుగా ఆధ్యాత్మీక వివేచన అవసరమైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)