te_tn/1co/05/intro.md

3.5 KiB

1వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 05 అధ్యాయములోని సాధారణ గమనికలు

నిర్మాణము మరియు క్రమపరచుట

కొన్ని అనువాదాలు పాత నిబంధన నుండి ఉదహరింపబడిన వచనాలను పేజీలో కుడి వైపున చదవడానికి సులువుగా అమర్చుతాయి. 13 వ వచనంలో ఉదహరించబడిన పదాల విషయంలో ULT (యుఎల్టి) దీన్ని చేస్తుంది.

ఈ అధ్యాయంలోని ప్రత్యేక అంశాలు

ఈ అధ్యాయంలోని ముఖ్యమైన భాషీయములు

సభ్యోక్తులు

సున్నితమైన సంగతులను వివరించుటకు పౌలు సభ్యోక్తులను ఉపయోగిస్తాడు. ఈ అధ్యాయము ఒక సంఘ సభ్యుడి లైంగిక అనైతికతకు సంబంధించినది. (చూడండి: [[rc:///ta/man/translate/figs-euphemism]] మరియు [[rc:///tw/dict/bible/other/fornication]])

రూపకఅలంకారాలు

పౌలు అనేక రూపకఅంలకారములను ఉపయోగించి విస్తరించిన పోలికను ఉపయోగిస్తాడు. పులిపిండి చెడును గురించి తెలియచేస్తుంది. రొట్టె అనేది బహుశా మొత్తం ప్రార్థన సభ గురించి తెలియచేస్తుంది. పులియని రొట్టె పవిత్రముగా జీవించడం గురించి తెలియచేస్తుంది. కాబట్టి మొత్తం వాక్య భాగంలోని అర్థం: కొద్ది మొత్తములోని చెడు సభను ప్రభావితం చేస్తుందని మీకు తెలియదా? కాబట్టి చేడునుండి బయట పడండి తద్వారా మీరు పవిత్రముగా జీవించవొచ్చు. క్రీస్తు మన కోసం బలి అయ్యాడు. కాబట్టి మనం నిష్కపటంగా మరియు నిజాయితిగా ఉండాలి మరియు దుర్మార్గులై చేడుగా ప్రవర్తించకూడదు. (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]], [[rc:///tw/dict/bible/kt/evil]] మరియు [[rc:///tw/dict/bible/kt/unleavenedbread]] మరియు [[rc:///tw/dict/bible/kt/purify]])

అలంకారిక ప్రశ్నలు

పౌలు ఈ అధ్యాయములో అలంకారిక ప్రశ్నలను ఉపయోగిస్తాడు. అతను కొరింథీయులకు బోధిస్తున్నప్పుడు ముఖ్యమైన అంశాలను నొక్కి చెప్పుటకు అతను వాటిని ఉపయోగిస్తాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)