translationCore-Create-BCS_.../tq_MRK.tsv

112 KiB

1ReferenceIDTagsQuoteOccurrenceQuestionResponse
21:2-3a4zcప్రభువు రాకముందు ఏమి జరుగుతుందని యెషయా ప్రవక్త ప్రవచించాడు?ప్రభువు మార్గాన్ని సిద్ధం చేయడానికి దేవుడు ఒక దూత, కేకవేయుచున్న ఒకనిశబ్దమును పంపుతాడని యెషయా ప్రవచించాడు.
31:4g2v6ఏమి ప్రకటించడానికి యోహాను వచ్చాడు?యోహాను పాప క్షమాపణ నిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తిస్మము గురించి ప్రకటించడానికి వచ్చాడు.
41:5kdd7యోహాను ద్వారా బాప్తిస్మము పొందుకున్న ప్రజలు ఏమి చేసారు?యోహానుచే బాప్తిస్మము పొందుకున్న ప్రజలు తమ పాపాలను ఒప్పుకున్నారు.
51:6zlqiయోహాను ఏమి తిన్నాడు?యోహాను మిడతలు మరియు అడవి తేనె తిన్నాడు.
61:8yaklతన తర్వాత వచ్చేవాడు ఎవరితో బాప్తిస్మము పొందుకుంటాడని యోహాను చెప్పాడు?తన తర్వాత వచ్చేవాడు పరిశుద్ధాత్మతో బాప్తిస్మము పొందుకుంటాడని యోహాను చెప్పాడు.
71:10y6faయోహానుచే బాప్తిస్మము పొందుకున్న తర్వాత యేసు నీళ్లలో నుండి పైకి వచ్చినప్పుడు ఏమి చూశాడు?బాప్తిస్మము పొందుకున్న తర్వాత, యేసు ఆకాశము చీల్చబడుటయు మరియు పరిశుద్ధాత్మ పావురమువలె తనమీదికి దిగివచ్చుటయు చూశాడు.
81:12ahm3యేసును అరణ్యంలోకి త్రోసికొనిపోయింది ఎవరు?పరిశుద్ధాత్మ యేసును అరణ్యంలోకి త్రోసికొనిపోయింది.
91:13ex5pయేసు అరణ్యములో ఎంతకాలం ఉన్నాడు, అక్కడ ఆయనకి ఏమి జరిగింది?యేసు 40 రోజులు అరణ్యములో ఉన్నాడు, అక్కడ ఆయన సాతానుచే శోధించబడ్డాడు.
101:15kyxpయేసు ఏ సందేశాన్ని ప్రకటించాడు?దేవుని రాజ్యము సమీపించి యున్నది, మరియు ప్రజలు మారుమనస్సు పొంది సువార్తను నమ్మాలని యేసు ప్రకటించాడు.
111:16yzo9యాకోబు మరియు యోహానుల యొక్క వృత్తి ఏమిటి?యాకోబు మరియు యోహాను జాలరులు.
121:17r3baసీమోను మరియు అంద్రెయ ఏమి చేస్తానని యేసు చెప్పాడు?సీమోను మరియు అంద్రెయలను మనుష్యులను పట్టు జాలరులనుగా చేసెదనని యేసు చెప్పాడు.
131:19foqjయాకోబు మరియు యోహానుల యొక్క వృత్తి ఏమిటి?యాకోబు మరియు యోహాను జాలరులు.
141:22lq6yయేసు బోధనలు సమాజ మందిరంలోని ప్రజలను ఎందుకు ఆశ్చర్యపరిచాయి?యేసు బోధ ప్రజలను ఆశ్చర్యపరిచింది ఎందుకంటే యేసు అధికారంతో బోధించాడు.
151:24rtx4సమాజ మందిరంలో ఉన్న అపవిత్రాత్మ యేసుకు ఏ బిరుదునిచ్చింది?సమాజ మందిరంలోని అపవిత్రాత్మ యేసుకు దేవుని పరిశుద్ధుడవు అనే బిరుదును ఇచ్చింది.
161:28dn9oయేసు గురించిన సమాచారముతో ఏమి జరిగింది?యేసు గురించిన సమాచారము ప్రతిచోటా వ్యాపించింది.
171:30ii0vవారు సీమోను ఇంటికి వెళ్ళినప్పుడు, యేసు ఎవరిని స్వస్థపరిచాడు?వారు సీమోను ఇంటికి వెళ్లినప్పుడు, యేసు సీమోను అత్తగారిని స్వస్థపరిచాడు.
181:32-34ywmcసాయంకాలము అవగానే ఏం జరిగింది?సాయంకాలము అవగానే, ప్రజలు అనారోగ్యంతో ఉన్నవారిని లేదా దయ్యములు పట్టిన వారందరినీ తీసుకువచ్చారు, మరియు యేసు వారిని స్వస్థపరిచాడు.
191:35i2xaసూర్యోదయానికి ముందు యేసు ఏమి చేసాడు?సూర్యోదయానికి ముందు, యేసు ఒక అరణ్యప్రదేశమునకు వెళ్లి అక్కడ ప్రార్థించాడు.
201:38-39y32lతాను ఏమి చేయడానికి వచ్చానని యేసు సీమోనుకు చెప్పాడు?తాను సమీప గ్రామములలో ప్రకటించడానికి వచ్చానని యేసు చెప్పాడు.
211:40-41xyj3యేసును స్వస్థపరచమని వేడుకున్న కుష్ఠరోగి పట్ల యేసుకు ఎలాంటి వైఖరి కలిగి ఉన్నాడు?యేసు కుష్ఠురోగిపై కనికరపడి అతన్ని స్వస్థపరిచాడు.
221:44dzi8యేసు కుష్ఠరోగితో ఏమి చేయమని చెప్పాడు, ఎందుకు?మోషే నియమించిన కానుకలను సమర్పించుమని యేసు కుష్ఠరోగితో చెప్పాడు. అతడు స్వస్థత పొందాడని అది ప్రజలకు సాక్ష్యంగా ఉపయోగపడుతుంది.
232:4zvpgపక్షవాయువు గల వానిని మోస్తున్న నలుగురు వ్యక్తులు ఏం చేశారు?మనుష్యులు ఇంటి పైకప్పును తీసివేసి, పక్షవాయువు గల వానిని యేసు వద్దకు దింపిరి.
242:5efneపక్షవాయువు గల వానితో యేసు ఏమి చెప్పెను?యేసు, “కుమారుడా, నీ పాపాలు క్షమింపబడియున్నవి” అని చెప్పెను.
252:6-7k9lqయేసు చెప్పిన దానికి కొందరు శాస్త్రులు ఎందుకు అభ్యంతరం చెప్పారు?దేవుడు మాత్రమే పాపాలను క్షమించగలడు కాబట్టి యేసు దూషించాడని కొందరు శాస్త్రులు వాదించారు.
262:10-12v3ysభూమి మీద పాపాలను క్షమించే అధికారం తనకు ఉందని యేసు ఎలా చూపించాడు?యేసు పక్షవాయువు గల వానితో తన పరుపును తీసుకొని తన ఇంటికి వెళ్లమని చెప్పాడు, మరియు ఆ వ్యక్తి చేశాడు.
272:13-14llaqలేవీని వెంబడించుమని యేసు చెప్పినప్పుడు లేవీ ఏమి చేస్తున్నాడు?యేసు అతన్ని పిలిచినప్పుడు లేవీ సుంకపు మెట్టునొద్ద కూర్చున్నాడు.
282:15-16c07hలేవీ ఇంట్లో, పరిసయ్యులను కించపరిచేలా యేసు ఏమి చేస్తున్నాడు?యేసు పాపులతో మరియు సుంకరులతోను కలిసి భోజనం చేస్తున్నాడు.
292:17zqw0తాను ఎవరిని పిలవడానికి వచ్చానని యేసు చెప్పాడు?తాను పాపులనే పిలవడానికి వచ్చానని యేసు చెప్పాడు.
302:18p9lnఉపవాసం గురించి కొందరు యేసును ఏ ప్రశ్న అడిగిరి?యోహాను శిష్యులు మరియు పరిసయ్యుల శిష్యులు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన శిష్యులు ఎందుకు ఉపవాసం చేయలేదని వారు యేసును అడిగిరి.
312:19w6goతన శిష్యులు ఎందుకు ఉపవాసం చేయరని యేసు ఎలా వివరించాడు?పెండ్లికుమారుడు ఇంకా పెండ్లి ఇంటివారు ఉన్నప్పుడు, వారు ఉపవాసం చేయరని యేసు చెప్పాడు.
322:23-24ej7hపరిసయ్యులను బాధపెట్టిన విశ్రాంతి దినమున యేసు శిష్యులు కొన్ని చేనులలో ఏమి చేసారు?యేసు శిష్యులు వెన్నులు త్రుంచి విశ్రాంతి దినమున తిన్నారు.
332:25-26iwe2సాధారణంగా తమకు నిషేధించబడిన రొట్టెలు అవసరమైన మరియు తినే వ్యక్తికి యేసు ఎలాంటి ఉదాహరణ ఇచ్చాడు?యేసు దావీదు ఉదాహరణను ఇచ్చాడు, అతడు అవసరాన్ని బట్టి, సాధారణంగా యాజకుల కోసం కేటాయించిన సముఖపు రొట్టెలను తిన్నాడు.
342:27m19rవిశ్రాంతి దినము ఎవరి కోసం నియమింపబడెనని యేసు చెప్పాడు?విశ్రాంతి దినము ప్రజల కోసం నియమింపబడెనని యేసు చెప్పాడు.
352:28ak51యేసు తనకు ఏ అధికారము ఉందని చెప్పెను?తాను విశ్రాంతి దినముకు కూడా ప్రభువై యున్నాడని యేసు చెప్పెను.
363:1-2o82fవిశ్రాంతి దినమున వారు సమాజ మందిరంలో యేసును ఎందుకు కనిపెట్టుచుండిరి?అచ్చటి వారు ఆయన మీద నేరము మోపవలెననియుండి, విశ్రాంతి దినమున వానిని స్వస్థపరచునేమో అని యేసును కనిపెట్టుచుండిరి.
373:4dk1gవిశ్రాంతి దినమున యేసు ప్రజలను ఏ ప్రశ్న అడిగాడు?విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా కీడు చేయుట ధర్మమా అని యేసు ప్రజలను అడిగాడు.
383:4p1z9యేసు ప్రశ్నకు ప్రజలు ఎలా స్పందించారు?ప్రజలు మౌనంగా ఉన్నారు.
393:5mrbjఅప్పుడు వారిపట్ల యేసు వైఖరి ఏమిటి?యేసు వారి మీద కోపగించుకున్నాడు.
403:6acwqయేసు ఆ వ్యక్తిని స్వస్థపరచినప్పుడు పరిసయ్యులు ఏమి చేసారు?పరిసయ్యులు వెలుపలికి పోయి, యేసును ఎలా చంపాలని ఆలోచన చేసిరి.
413:7-8b2bkయేసు సముద్రము నొద్దకు వెళ్ళినప్పుడు ఎంతమంది ఆయనను వెంబడించిరి?ఒక గొప్ప జన సమూహము యేసును వెంబడించిరి.
423:11tke0యేసును చూసినప్పుడు దయ్యాలు ఏమని కేకలు వేసిరి?యేసును చూచి, దేవుని కుమారుడని దయ్యాలు కేకలు వేసిరి.
433:14-15e2s0యేసు ఎంతమంది మనుష్యులను అపొస్తలులుగా నియమించాడు, వారు ఏమి చేయాలి?యేసు తనతో ఉండునట్లును 12 మంది అపొస్తలులను నియమించాడు, వారిని సువార్త ప్రకటించుటకును మరియు దయ్యములను వెళ్లగొట్టుటకు అధికారం కలిగి ఉన్నారు.
443:19raj7యేసుకు అప్పగించిన అపొస్తలుడు ఎవరు?యేసుకు అప్పగించిన అపొస్తలుడు ఇస్కరియోతు యూదా.
453:21rh8oయేసు చుట్టూ ఉన్న జనసమూహం మరియు సంఘటనల గురించి యేసు కుటుంబం ఏమనుకుంది?యేసుకు మతి చలించియున్నదని ఆయన కుటుంబ సభ్యులు భావించారు.
463:22xmhsశాస్త్రులు యేసు మీద ఎలాంటి నిందలు వేశారు?యేసు దయ్యముల యధిపతిచేత దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని శాస్త్రులు నిందలు వేశారు.
473:23-24ob9vశాస్త్రుల ఆరోపణకు యేసు ప్రతిస్పందన ఏమిటి?తనకు వ్యతిరేకంగా విభజించబడిన ఏ రాజ్యమూ నిలబడదని యేసు ప్రతిస్పందించాడు.
483:28-29txqbఏ పాపం క్షమించబడదని యేసు చెప్పాడు?పరిశుద్ధాత్మను దూషించడం క్షమించబడదని యేసు చెప్పాడు.
493:33-35xtjnతన తల్లి మరియు సహోదరులు ఎవరు అని యేసు చెప్పాడు?దేవుని చిత్తం చేసే వారే తన తల్లి మరియు సహోదరులు యేసు చెప్పాడు.
504:1bki3యేసు బోధించడానికి ఎందుకు దోనె ఎక్కాడు?యేసు కూర్చొని బోధించడానికి దోనె ఎక్కాడు, ఎందుకంటే బహు జనులు ఆయన చుట్టూ గుమిగూడిరి.
514:4wzuuత్రోవ ప్రక్కన వేసిన విత్తనాలు ఏమయ్యాయి?పక్షులు వచ్చి వాటిని మ్రింగివేసాయి.
524:6wyhfసూర్యుడు ఉదయించినప్పుడు రాతి నేలపై నాటిన విత్తనాలు ఏమయ్యాయి?వేరులేనందున అవి ఎండిపోయాయి.
534:7b6maముండ్లపొదల మధ్య నాటిన విత్తనాలు ఏమయ్యాయి?ముండ్లపొదలు ఎదిగి వాటిని అణచివేసాయి.
544:8ivy4మంచి నేలలో నాటిన విత్తనాలు ఏమయ్యాయి?విత్తనాలు మొలిచి పెరిగి పైరై 30, 60 మరియు 100 దంతలుగాను ఫలించెను.
554:11o0ssపన్నెండు మందికి ఏమి ఇవ్వబడింది అని యేసు చెప్పాడు, కానీ వెలుపల నుండు వారికి ఇవ్వబడలేదు?దేవుని రాజ్యం యొక్క మర్మము పన్నెండు మందికి ఇవ్వబడింది, కానీ వెలుపల నుండు వారికి ఇవ్వబడలేదని యేసు చెప్పాడు.
564:14pskjయేసు ఉపమానంలో, విత్తనం అంటే ఏమిటి?విత్తనం అంటే దేవుని వాక్యం.
574:15t1r5త్రోవప్రక్కన విత్తిన విత్తనం దేనిని గురించి సూచిస్తుంది?ఇది వాక్యం విన్న వారి గురించి సూచిస్తుంది, అయితే సాతాను వెంటనే దానిని ఎత్తుకెళుతాడు.
584:16-17zy18రాతి నేలపై నాటిన విత్తనం దేనిని గురించి సూచిస్తుంది?ఇది సంతోషముగా వాక్యాన్ని వినే వారిని గురించి సూచిస్తుంది, కానీ హింస వచ్చినప్పుడు, వారు అభ్యంతరపడుదురు.
594:18-19alo5ముండ్లపొదలలో మధ్య నాటిన విత్తనం దేనిని గురించి సూచిస్తుంది?ఇది వాక్యము విన్న వారి గురించి సూచిస్తుంది, కానీ లోకము యొక్క అపేక్షలు వాక్యాన్ని నిష్ఫల చేస్తాయి.
604:20lhwrమంచి నేలలో నాటిన విత్తనం దేనిని గురించి సూచిస్తుంది?ఇది వాక్యాన్ని విని, దానిని అంగీకరించి మరియు ఫలాలను ఇచ్చే వారిని గురించి సూచిస్తుంది.
614:22c1eyదాచబడిన మరియు రహస్యమైన వాటికి ఏమి జరుగుతుందని యేసు చెప్పాడు?దాచబడిన మరియు రహస్యమైన విషయాలు బయలు పరచబడుతాయని యేసు చెప్పాడు.
624:26-27fteqదేవుని రాజ్యం ఏ విధంగా తన విత్తనాన్ని నేల మీద పారవేసే వ్యక్తి వంటిది?మనుష్యుడు విత్తనం చలినప్పుడు, వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యమున్నది.
634:30-32tzc2దేవుని రాజ్యం ఏ విధంగా ఆవగింజ వంటిది?ఆవగింజలలో అతి చిన్నవిగా ఎదిగి, అయినప్పటికీ చాలా మంది తమ గూళ్ళను తయారు చేసుకునే గొప్ప మొక్కగా ఎదుగుతుంది.
644:35-37tojtశిష్యులు మరియు యేసు అద్దరికి పోయినప్పుడు ఏమి జరిగింది?ఒక పెద్ద తుఫాను రేగి, దోనెమీద అలలు కొట్టినందున దోనె నిండిపోయెను.
654:38j9v3ఆ సమయంలో యేసు దోనెలో ఏమి చేస్తున్నాడు?యేసు నిద్రించుచుండెను.
664:38vu2bశిష్యులు యేసును ఏ ప్రశ్న అడిగిరి?మేము నశించిపోవు చున్నాము; నీకు చింతలేదని, శిష్యులు యేసును అడిగిరి.
674:39vehjఅప్పుడు యేసు ఏమి చేసాడు?యేసు గాలిని గద్దించి సముద్రాన్ని నిశ్శబ్దపరిచాడు.
684:41fkprయేసు ఇలా చేసిన తర్వాత, శిష్యుల ప్రత్యుత్తరము ఏమిటి?శిష్యులు మిక్కిలి భయపడి మరియు గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవి యేసు ఎవరు అని వారు ఆశ్చర్యపోయారు.
695:1-2f3h1వారు గెరసేనుల దేశమునకు వచ్చినప్పుడు యేసును ఎవరు కలిశారు?అపవిత్రాత్మ పట్టిన వాడొకడు యేసును కలుసుకున్నాడు.
705:4pvchప్రజలు ఈ వ్యక్తిని సంకెళ్లతో అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఏమి జరిగింది?ప్రజలు ఈ వ్యక్తిని సంకెళ్లతో అడ్డుకునేందుకు ప్రయత్నించగా, అతడు సంకెళ్లను తెంపివేసాడు.
715:7s4bfఅపవిత్రాత్మ యేసుకు ఏ బిరుదునిచ్చాడు?అపవిత్రాత్మ యేసును సర్వోన్నతుడైన దేవునికుమారుడా బిగ్గరగా కేకలు వేసింది.
725:9yw86అపవిత్రాత్మ పేరు ఏమిటి?అపవిత్రాత్మ పేరు సేన, ఎందుకంటే అనేక మంది ఉన్నారు.
735:13jvthయేసు ఆ వ్యక్తి నుండి అపవిత్రాత్మను వెళ్లగొట్టినప్పుడు ఏమి జరిగింది?ఆత్మలు బయటకు వచ్చి పందుల గుంపులోకి ప్రవేశించెను, అవి ఏటవాలు కొండపైకి పరిగెత్తి సముద్రపు దారిని వడిగా మునిగిపోయాయి.
745:15ist0అపవిత్రాత్మ వెళ్లగొట్టి తర్వాత, మనిష్యుని పరిస్థితి ఏమిటి?ఆ వ్యక్తి యేసుతో కూర్చొని, బట్టలు ధరించి, స్వస్థచిత్తుడై ఉన్నాడు.
755:17mpj9ఆ ప్రాంతంలోని ప్రజలు యేసును ఏమి చేయమని అడిగారు?ప్రజలు తమ ప్రాంతాన్ని విడిచిపెట్టమని యేసును అడిగారు.
765:19w96xసమాధులలో నివసించిన వ్యక్తిని ఇప్పుడు ఏమి చేయమని యేసు చెప్పాడు?ప్రభువు తన కోసం ఏమి చేశాడో తన ప్రజలకు చెప్పమని యేసు ఆ వ్యక్తితో చెప్పాడు.
775:22-23pj22యాయీరు అనే సమాజ మందిరపు అధికారి యేసును ఏ విన్నపం చేసాడు?మరణానికి దగ్గర్లో ఉన్న తన కుమార్తెపై చేయి వేయడానికి తనతో రావాలని యాయీరు యేసును కోరాడు.
785:25atxmయేసు వస్త్రమును తాకిన స్త్రీకి వచ్చిన సమస్య ఏమిటి?ఆ స్త్రీ 12 ఏళ్లుగా రక్తస్రావ రోగముతో బాధపడుతోంది.
795:28afd1ఆ స్త్రీ యేసు వస్త్రమును ఎందుకు తాకింది?యేసు వస్త్రమును ముట్టుకుంటే స్వస్థత చేకూరుతుందని ఆ స్త్రీ భావించింది.
805:30mrlfఆ స్త్రీ తన వస్త్రమును తాకినప్పుడు యేసు ఏమి చేశాడు?తనలో నుండి ప్రభావము బయలువెళ్లెనని యేసుకు తెలుసు కాబట్టి తన వస్త్రమును ఎవరు ముట్టుకున్నారని అడిగాడు.
815:32lyq8ఆ స్త్రీ తన వస్త్రమును తాకిన తర్వాత యేసు ఏమి చేశాడు?తనను తాకిన వారెవరో అని యేసు చుట్టూ చూశాడు.
825:34jfchఆ స్త్రీ యేసుకు నిజం చెప్పినప్పుడు, యేసు ఆమెకు ఏమి చెప్పాడు?ఆమె విశ్వాసం ఆమెను స్వస్థపరిచిందని, సమాధానముతో వెళ్లమని యేసు ఆమెకు చెప్పాడు.
835:35spbiయేసు ఇంటికి వచ్చినప్పుడు యాయీరు కుమార్తె యొక్క పరిస్థితి ఏమిటి?యాయీరు కూతురు చనిపోయింది.
845:36fai5ఈ సమయంలో యేసు యాయీరుతో ఏమి చెప్పాడు?భయపడకు, నమ్మమని యేసు యాయీరుతో చెప్పాడు.
855:37ffseచిన్నదాని గదిలోకి యేసుతో పాటు ఏ శిష్యులు వెళ్లారు?పేతురు, యాకోబు, యోహాను యేసుతోపాటు గదిలోకి వెళ్లారు.
865:40sunlయాయీరు కుమార్తె కేవలం నిద్రపోతోందని యేసు చెప్పినప్పుడు ఇంట్లోని ప్రజలు ఏమి చేసారు?యాయీరు కుమార్తె కేవలం నిద్రపోతోందని యేసు చెప్పినప్పుడు ప్రజలు అపహసించిరి.
875:42km08చిన్నది లేచి నడిచినప్పుడు, ప్రజలు ఎలా స్పందించారు?ప్రజలు చాలా ఆశ్చర్యపోయిరి మరియు విస్మయ మొందిరి.
886:2o2l2యేసు స్వదేశములోని ప్రజలు ఆయన గురించి ఎందుకు ఆశ్చర్యపోయారు?ఆయన తన బోధలను, ఆయన జ్ఞానాన్ని మరియు ఆయన అద్భుతాలను ఎక్కడ నుండి పొందాడని ప్రజలకు తెలియదు.
896:4d9faప్రవక్త ఘనహీనుడు కాడని యేసు ఎక్కడ చెప్పాడు?ఒక ప్రవక్త తన దేశములో, అతని బంధువులలో మరియు తన యింటివారిలో ఘనహీనుడిగా లేకుండా ఉంటాడని యేసు చెప్పాడు.
906:6arwkతన సొంత పట్టణంలోని ప్రజల గురించి యేసును ఏమి ఆశ్చర్యపరిచింది?యేసు తన సొంత పట్టణంలోని ప్రజల అవిశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయాడు.
916:7djdlయేసు పండ్రెండుగురు శిష్యులను బయటకు పంపినప్పుడు వారికి ఏ అధికారం ఇచ్చాడు?యేసు పండ్రెండుగురు శిష్యులకు అపవిత్రాత్మల మీద అధికారం ఇచ్చాడు.
926:8-9e4e2పండ్రెండుగురు శిష్యులు తమ ప్రయాణంలో ఏమి తీసుకెళ్లారు?పండ్రెండుగురు శిష్యులు చెప్పులు మరియు రెండంగీలు తీసుకున్నారు.
936:11yfhpఒక స్థలం వారిని చేర్చుకొనకపొతే పండ్రెండుగురు శిష్యులను ఏమి చేయమని యేసు చెప్పాడు?వారి మీద సాక్ష్యముగా ఉండుటకు పాదముల క్రింది ధూళి దులిపి వేయుడి యేసు పండ్రెండుగురు శిష్యులకు చెప్పాడు.
946:14-15iotaయేసు ఎవరని ప్రజలు అనుకున్నారు?ప్రజలు యేసు బాప్తిస్మమిచ్చు యోహాను లేదా ఏలీయా లేదా ప్రవక్త అని భావించారు.
956:18wv8iబాప్తిస్మమిచ్చు యోహాను హేరోదు చట్టవిరుద్ధంగా ఏమి చేస్తున్నాడని చెప్పాడు?హేరోదు తన సహోదరుని భార్యను వివాహం చేసుకోవడం చట్టవిరుద్ధమని యోహాను హెరోదుతో చెప్పాడు.
966:20l858యోహాను బోధించడం విన్న హేరోదు ఎలా ప్రతిస్పందించాడు?యోహాను బోధించడం విన్నప్పుడు హేరోదు కలత చెందాడు, కానీ అతడు అతనిని వినడానికి ఇంకా సంతోషించాడు.
976:23fzf0హేరోదు హేరోదియతో ఏ ప్రమాణం చేశాడు?హేరోదు తన రాజ్యంలో సగభాగం వరకు ఆమె తన నుండి ఏది అడిగినా ఆమె పొందగలనని ప్రమాణం చేశాడు.
986:25tn2qహేరోదియ దేని కోసం అడిగాడు?హేరోదియ ఒక పళ్లెములో బాప్తిస్మమిచ్చు యోహాను తలని అడిగాడు.
996:26cu47హేరోదియ విన్నపముకు హేరోదు ఎలా ప్రతిస్పందించాడు?హేరోదు చాలా పశ్చాత్తాపపడ్డాడు కానీ ఆమె విన్నపమును తిరస్కరించలేదు, ఎందుకంటే అతడు తన అతిథుల ముందు చేసిన ప్రమాణం కారణంగా.
1006:33c20jయేసు మరియు అపొస్తలులు విశ్రాంతి తీసుకోవడానికి ఒంటరిగా వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు ఏమి జరిగింది?చాలామంది ప్రజలు వారిని గుర్తించి, యేసు మరియు అపొస్తలుల కంటే ముందుగా అక్కడికి చేరుకోవడానికి పరిగెత్తారు.
1016:34mdl0తమ కోసం ఎదురు చూస్తున్న జనసమూహం పట్ల యేసు వైఖరి ఏమిటి?వారు కాపరి లేని గొఱ్ఱలవలె ఉన్నారు కాబట్టి యేసు వారిపై కనికరం చూపించాడు.
1026:37if60యేసు అడిగినప్పుడు, శిష్యులు ప్రజలకు ఆహారం ఇవ్వడానికి ఏమి చేయాలని అనుకున్నారు?శిష్యులు వెళ్లి 200 దేనారముల రొట్టెలు కొనుక్కోవాలి అనుకున్నారు.
1036:38o56uశిష్యుల దగ్గర అప్పటికే ఏ ఆహారం ఉంది?శిష్యుల దగ్గర అప్పటికే ఐదు రొట్టెలు, రెండు చేపలు ఉన్నాయి.
1046:41bqywయేసు రొట్టెలు మరియు చేపలు తీసుకున్నప్పుడు ఏమి చేశాడు?ఆయన రొట్టెలు మరియు చేపలను తీసుకుంటుండగా, యేసు ఆకాశమువైపు కన్నులెత్తి ఆశీర్వదించి, ఆ రొట్టెలు విరిచి, తన శిష్యులకు ఇచ్చాడు.
1056:43zbvhఅందరూ తిన్న తర్వాత ఎంత ఆహారం మిగిలింది?అందరూ తిన్న తర్వాత అక్కడ 12 గంపళ్ల రొట్టెల ముక్కలు, చేపలు మిగిలాయి.
1066:44yrioఎంత మంది పురుషులకు ఆహారం అందించారు?అక్కడ 5,000 మంది పురుషులు ఆహారం పుచ్చుకున్నారు.
1076:48uxaeయేసు అద్దరి మీద శిష్యుల వద్దకు ఎలా వచ్చాడు?యేసు అద్దరి మీద నడుచుకుంటూ శిష్యుల దగ్గరకు వచ్చాడు.
1086:50j2xzయేసు శిష్యులు తనను చూసినప్పుడు వారికి ఏమి చెప్పాడు?ధైర్యంగా ఉండమని, భయపడవద్దని యేసు శిష్యులకు చెప్పాడు.
1096:52icdcరొట్టెల అద్భుతం గురించి శిష్యులకు ఎందుకు అర్థం కాలేదు?రొట్టెల అద్భుతం గురించి శిష్యులు అర్థం చేసుకోలేదు ఎందుకంటే వారి హృదయము అర్థం చేసుకోవడానికి కఠినమాయెను.
1106:55qiduయేసును గుర్తించినప్పుడు ఆ ప్రాంత ప్రజలు ఏమి చేసారు?యేసు ఎక్కడికి వస్తున్నాడని విని ప్రజలు రోగులను మంచముల మీద మోసికొని ఆయన దగ్గరకు తీసుకొచ్చారు.
1116:56nktoయేసు వస్త్రపు చెంగును ముట్టన వారికి ఏమి జరిగింది?యేసు వస్త్రపు చెంగును ముట్టన వారు స్వస్థత పొందారు.
1127:2t05xయేసు శిష్యులలో కొందరు పరిసయ్యులను, శాస్త్రులను కించపరిచేలా ఏమి చేస్తున్నారు?కొంతమంది శిష్యులు కడుగని చేతులతో భోజనము చేస్తున్నారు.
1137:3-4ym0vభోజనం చేసే ముందు చేతులు, గిన్నెలు, కుండలు, ఇత్తడి పాత్రలు కడుక్కోవడం ఎవరి సంప్రదాయం?భోజనం చేసే ముందు చేతులు, గిన్నెలు, కుండలు, ఇత్తడి పాత్రలు కడుక్కోవడం పెద్దల సంప్రదాయం.
1147:8-9qrmrపరిసయ్యులు మరియు శాస్త్రులు కడగడం గురించి వారి బోధ గురించి యేసు ఏమి చెప్పాడు?పరిసయ్యులు మరియు శాస్త్రులు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుష్యుల పారంపర్యా చారమును గైకొనుచున్నారని యేసు చెప్పాడు.
1157:11-13d1yrమీ తండ్రిని మరియు తల్లిని ఘనపరచవలెనని చెప్పిన దేవుని ఆజ్ఞను పరిసయ్యులు మరియు శాస్త్రులు ఎలా రద్దు చేసారు?వారు తమ తండ్రి మరియు తల్లికి సహాయం చేసే డబ్బును కొర్బానుగా ఇవ్వాలని ప్రజలకు చెప్పడం ద్వారా దేవుని ఆజ్ఞను రద్దు చేశారు.
1167:15nqfnఒక మనుష్యుని ఏమి అపవిత్రం చేయదని యేసు చెప్పాడు?ఒక మనుష్యుని వలుపలి నుండి లోపలికి పోయిన్నప్పుడు అతన్ని అపవిత్రం చేయదని యేసు చెప్పాడు.
1177:15l384ఒక మనుష్యుని ఏమి అపవిత్రం చేస్తుందని యేసు చెప్పాడు?ఒక మనుష్యుని లోపలి నుండి బయలు వెళ్లునవే అతన్ని అపవిత్రం చేస్తుందని యేసు చెప్పాడు.
1187:18-19gvrqఒక మనుష్యుని ఏమి అపవిత్రం చేయదని యేసు చెప్పాడు?ఒక మనుష్యుని వలుపలి నుండి లోపలికి పోయిన్నప్పుడు అతన్ని అపవిత్రం చేయదని యేసు చెప్పాడు.
1197:19yf7hఏ రకమైన భోజన పదార్థములు పవిత్రంగా ఉన్నాయని యేసు ప్రకటించాడు?భోజన పదార్థములన్ని పవిత్రమైనవి యేసు ప్రకటించాడు.
1207:20-23w1icఒక మనుష్యుని ఏమి అపవిత్రం చేస్తుందని యేసు చెప్పాడు?ఒక మనుష్యుని లోపలి నుండి బయలు వెళ్లునవే అతన్ని అపవిత్రం చేస్తుందని యేసు చెప్పాడు..
1217:21-22t1rzఒక మనుష్యుని అపవిత్రం చేయడానికి అతని నుండి బయటకు రావచ్చని యేసు చెప్పిన మూడు విషయాలు ఏమిటి?దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును ఒక వ్యక్తిని అపవిత్రపరచగలవని యేసు చెప్పాడు.
1227:25-26y2wfఅపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె యూదురాల లేక గ్రీకు దేశస్థురాల?అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గ్రీకు దేశస్థురాలు.
1237:28q2o4పిల్లల రొట్టెలను తీసుకొని కుక్కలకు విసిరేయడం సరికాదని యేసు చెప్పినప్పుడు ఆ స్త్రీ ఎలా స్పందించింది?కుక్కపిల్లలు కూడ బల్లక్రింద ఉండి, పిల్లలు పడవేయు రొట్టె ముక్కలు తినును అని స్త్రీ చెప్పింది.
1247:29-30nb1xయేసు స్త్రీకి ఏమి చేసాడు?యేసు ఆ స్త్రీ కూతురి నుండి దయ్యాన్ని వెళ్ళగొట్టాడు.
1257:33-34ca4dచెవిటివాడు మరియు నత్తి గల వ్యక్తిని యేసు దగ్గరకు తీసుకువచ్చినప్పుడు, స్వస్థపరచడానికి ఆయన ఏమి చేసాడు?యేసు ఆ వ్యక్తి చెవుల్లో వేళ్లు పెట్టి, ఉమ్మివేసి, అతని నాలుకను ముట్టి, ఆకాశము వైపు చూసి, “తెరువు!” అన్నాడు.
1267:36hc18తన స్వస్థత గురించి ఎవరికీ చెప్పవద్దని యేసు చెప్పినప్పుడు ప్రజలు ఏమి చేసారు?నిశ్శబ్దంగా ఉండమని యేసు వారికి ఎంత ఎక్కువ ఆజ్ఞాపించాడో, వారు దాని గురించి అంత ఎక్కువగా ప్రసిద్ధిచేసిరి.
1278:1-2slguతనను వెంబడిస్తున్న బహు జనుల గూర్చి యేసు ఎలాంటి ఆందోళన వ్యక్తం చేశాడు?బహు జనులు తినడానికి ఏమీ లేదని తాను ఆందోళన చెందుతున్నానని యేసు చెప్పాడు.
1288:5s9ojశిష్యుల దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి?శిష్యుల దగ్గర ఏడు రొట్టెలు ఉన్నాయి.
1298:6y5p3శిష్యుల రొట్టెలతో యేసు ఏమి చేశాడు?యేసు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, రొట్టెలు విరిచి, వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చాడు.
1308:8ckyoఅందరూ తిన్న తర్వాత ఎంత ఆహారం మిగిలి ఉంది?అందరూ తిన్న తర్వాత ఆహారం ఏడు గంపలు మిగిలాయి
1318:9h9smఎంత మంది తిని సంతృప్తి చెందారు?దాదాపు 4,000 మంది పురుషులు తిని సంతృప్తి చెందారు.
1328:11bo9wఆయనను పరీక్షించడానికి, యేసు ఏమి చేయాలని పరిసయ్యులు కోరుకున్నారు?యేసు తమకు ఆకాశము నుండి యొక సూచకక్రియను చూపుమని పరిసయ్యులు కోరుకున్నారు.
1338:15jt3xపరిసయ్యుల గురించి యేసు తన శిష్యులను దేని గురించి హెచ్చరించాడు?యేసు తన శిష్యులను పరిసయ్యుల పులిసిన పిండిని పట్ల జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు.
1348:16fjm2యేసు దేని గురించి మాట్లాడుతున్నాడని శిష్యులు అనుకున్నారు?రొట్టెలు తీసుకురావడం మర్చిపోయారని గురించి యేసు మాట్లాడుతున్నాడని శిష్యులు అనుకున్నారు.
1358:19nrwxయేసు ఐదు రొట్టెలు విరిచినప్పుడు ఏమి జరిగిందో యేసు తన శిష్యులకు గుర్తు చేశాడు?తాను ఐదు రొట్టెలు విరిచినప్పుడు, 5,000 మందికి ఆహారం ఇచ్చారని, 12 గంపల నిండా విరిగిన ముక్కలను ఎత్తారని యేసు వారికి గుర్తుచేశాడు.
1368:23lkdfగ్రుడ్డివాడికి చూపు తిరిగి రావడానికి యేసు మొదట ఏ రెండు పనులు చేశాడు?యేసు మొదట అతని కన్నుల మీద ఉమ్మివేసి అతని మీద చేతులు వేశాడు.
1378:25w8loగ్రుడ్డివాడికి చూపు పూర్తిగా తిరిగి రావడానికి యేసు అతనికి చేసిన మూడవ విషయం ఏమిటి?యేసు మళ్లీ అతని కన్నుల మీద చేతులు వేశాడు.
1388:28scqlయేసు ఎవరని ప్రజలు చెప్పుకొనుచున్నారు?యేసు బాప్తిస్మమిచ్చు యోహాను, ఏలీయా లేదా ప్రవక్తలలో ఒకడని ప్రజలు చెప్పుకొనుచున్నారు.
1398:29pf6hయేసు ఎవరు అని పేతురు చెప్పాడు?యేసు క్రీస్తు అని పేతురు చెప్పాడు.
1408:31ssr3భవిష్యత్తులో జరిగే ఏ సంఘటనల గురించి యేసు తన శిష్యులకు స్పష్టంగా బోధించడం ప్రారంభించాడు?మనుష్యకుమారుడు అనేక హింసలుపొంది, పెద్దల చేతను ప్రధానయాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి, మూడు దినములైన తరువాత లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు బోధించాడు.
1418:33o8mdపేతురు తనను గద్దించడం ప్రారంభించినప్పుడు యేసు ఏమి చెప్పాడు?యేసు పేతురుతో, “సాతానా, నా వెనుకకు పొమ్ము; నీవు మనుష్యుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్కరింపకున్నావు.
1428:34vqyxతనను వెంబడించే వారు ఎవరైనా ఏమి చేయాలని యేసు చెప్పాడు?తనను వెంబడించాలనుకునే ఎవరైనా తన్ను తాను ఉపేక్షించుకొని ఆయన సిలువను ఎత్తుకొని యేసును వెంబడించాలని యేసు చెప్పాడు.
1438:36eoscలోకంలోని వస్తువులను పొందాలనే వ్యక్తి కోరిక గురించి యేసు ఏమి చెప్పాడు?యేసు, “ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము?”
1448:38fczmతన గురించి మరియు తన మాటల గురించి సిగ్గుపడే వారి విషయంలో తాను ఏమి చేస్తానని యేసు చెప్పాడు?యేసు తను వచ్చునప్పుడు తన గురించి మరియు తన మాటల గురించి సిగ్గుపడే వారి గురించి సిగ్గుపడతానని చెప్పాడు.
1459:1ryudదేవుని రాజ్యం బలముతో వచ్చుట ఎవరు చూస్తారని యేసు చెప్పాడు?దేవుని రాజ్యం బలముతో రావడాన్ని చూసే ముందు తనతో పాటు నిలిచియున్న వారిలో కొందరు మరణము రుచిచూడరని యేసు చెప్పాడు.
1469:2-3j5nwపేతురు, యాకోబు, యోహాను యేసుతో పాటు ఎత్తైన కొండపైకి వెళ్లినప్పుడు ఆయనకు ఏమి జరిగింది?యేసు రూపాంతరం చెందాడు మరియు ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లనివిగా మారాయి.
1479:4hsspకొండపై యేసుతో ఎవరు మాటలాడుచుండిరి?ఏలీయా మరియు మోషే యేసుతో మాటలాడుచుండిరి.
1489:9wh06శిష్యులు కొండపై చూసిన దాని గురించి యేసు వారికి ఏమి ఆజ్ఞాపించాడు?మనుష్యకుమారుడు మృతులలో నుండి లేచే వరకు తాము చూసిన వాటిని ఎవరికీ చెప్పవద్దని యేసు వారికి ఆజ్ఞాపించాడు.
1499:11-13ct8yఏలీయా రాకడ గురించి యేసు ఏమి చెప్పాడు?సమస్తమును చక్కపెట్టుటకు ఏలీయా ముందుగా వస్తాడని మరియు ఏలీయా అప్పటికే వచ్చాడని యేసు చెప్పాడు.
1509:17-18tzbrశిష్యులు తండ్రి మరియు అతని కుమారుని కోసం ఏమి చేయలేకపోయారు?శిష్యులు తండ్రి కుమారుని నుండి దురాత్మను వెళ్లగొట్టలేకపోయారు.
1519:22ifimకుమారుని నాశనం చేయడానికి దురాత్మ దేనిలోకి విసిరింది?దురాత్మ కుమారుని అగ్నిలో లేదా నీటిలోకి విసిరి నాశనం చేయడానికి ప్రయత్నించింది.
1529:23-24ay7zనమ్మువానికి సమస్తమును సాధ్యమేనని యేసు చెప్పినప్పుడు తండ్రి ఎలా స్పందించాడు?తండ్రి, “నేను నమ్ముచున్నాను, నాకు అపనమ్మకముండకుండ సహాయము చేయుమని బిగ్గరగా!” సమాధానమిచ్చాడు.
1539:28-29uh6oశిష్యులు కుమారునిలోని మూగ మరియు చెవిటి అపవిత్రాత్మను ఎందుకు వెళ్లగొట్టలేకపోయారు?శిష్యులు ఆత్మను వెళ్లగొట్టలేకపోయారు, ఎందుకంటే ప్రార్థన ద్వారా తప్ప అది వదలిపోవుట అసాధ్యము.
1549:31uvpdతనకు ఏమి జరుగుతుందని యేసు తన శిష్యులకు చెప్పాడు?యేసు తనకు మరణశిక్ష విధిస్తారని, మూడు రోజుల తర్వాత మళ్లీ లేస్తానని చెప్పాడు.
1559:33-34q8mjదారిలో శిష్యులు దేని గురించి వాదించుకున్నారు?శిష్యులు తమలో ఎవరు గొప్ప అని వాదించుకున్నారు.
1569:35xnwcమొదట ఎవరు అని యేసు చెప్పాడు?అందరికి సేవకుడైన మొదటివాడు తానేనని యేసు చెప్పాడు.
1579:36-37d095ఎవరైనా యేసు పేరు మీద చిన్న బిడ్డను చేర్చుకొనునప్పుడు, వారు ఎవరిని స్వీకరిస్తారు?ఎవరైనా యేసు పేరు మీద చిన్న బిడ్డను చేర్చుకొనునప్పుడు, వారు యేసును మరియు యేసును పంపిన వ్యక్తిని కూడా చేర్చుకొందురు.
1589:42xm92యేసును నమ్మే చిన్నవాడిని పొరపాట్లు చేసే వ్యక్తికి ఏది మంచిది?అతని మెడకు మర రాయి కట్టి సముద్రంలో పడవేయడం అతనికి మంచిది.
1599:47qvrvనీ కన్ను అభ్యంతరపరచిన యెడల దానిని ఏమి చేయమని యేసు చెప్పాడు?నీ కన్ను అభ్యంతరపరుచుటకు కారణమైతే దానిని తీసి పారవేయుమని యేసు చెప్పాడు.
1609:48l2p2నరకంలో ఏమి జరుగుతుందని యేసు చెప్పాడు?నరకంలో పురుగు చావదని, అగ్ని ఆరదని యేసు చెప్పాడు.
16110:2tk8rయేసును శోధించుటకై పరిసయ్యులు ఏ ప్రశ్న అడిగారు?భర్త తన భార్యకు విడాకులు ఇవ్వడం న్యాయమా అని పరిసయ్యులు యేసును అడిగారు.
16210:4p0nlవిడాకుల విషయంలో యూదులకు మోషే ఏ ఆజ్ఞ ఇచ్చాడు?అతడు విడాకుల ధృవీకరణ పత్రాన్ని వ్రాసి, ఆమెను విడనాడవలెనని మోషే ఆజ్ఞ ఇచ్చాడు.
16310:5cuwgవిడాకుల గురించిన ఈ ఆజ్ఞను మోషే యూదులకు ఎందుకు ఇచ్చాడు?మోషే యూదుల కఠిన హృదయాలను బట్టి వారికి ఈ ఆజ్ఞ ఇచ్చాడు.
16410:6b18wవివాహం కొరకు దేవుని అసలు రూపకల్పన గురించి పరిసయ్యులకు చెప్పేటప్పుడు యేసు చరిత్రలో ఏ సంఘటనను ప్రస్తావించాడు?వివాహానికి సంబంధించిన దేవుని అసలు రూపకల్పన గురించి చెప్పేటప్పుడు యేసు మొదట్లో స్త్రీ పురుషుల సృష్టిని ప్రస్తావించాడు.
16510:7-8lkz2ఇద్దరు వ్యక్తులు, ఆ పురుషుడు మరియు అతని భార్య వివాహం చేసుకున్నప్పుడు వారు ఏమి అవుతారని యేసు చెప్పాడు?ఇద్దరూ ఏకశరీరమవుతారని యేసు చెప్పాడు.
16610:9bxgtవివాహంలో దేవుడు ఏమి జతపరిచాడనే దాని గురించి యేసు ఏమి చెప్పాడు?దేవుడు దేవుడు జతపరచిన వారిని మనుష్యుడు వేరు పరచకూడదని యేసు చెప్పాడు.
16710:13-14ftqqచిన్న పిల్లలను తన దగ్గరకు తీసుకువస్తున్న వారిని శిష్యులు గద్దించినప్పుడు యేసు ప్రతిస్పందన ఏమిటి?యేసు శిష్యులపై కోపపడి మరియు చిన్న పిల్లలను తన వద్దకు రావడానికి అనుమతించమని చెప్పాడు.
16810:15s8f7దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే దేనిని అంగీకరించాలని యేసు ఎలా చెప్పాడు?దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే చిన్నబిడ్డ వలె అంగీకరించాలని యేసు చెప్పాడు.
16910:19slblనిత్యజీవాన్ని వారసత్వంగా పొందాలంటే ఆ వ్యక్తి ఏమి చేయాలని యేసు మొదట చెప్పాడు?యేసు ఆ వ్యక్తికి నరహత్య చేయవద్దు, వ్యభిచ రింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధసాక్ష్యము పలుకవద్దు, మోస పుచ్చవద్దు, నీ తలిదండ్రులను సన్మానింపుము చెప్పాడు.
17010:21h1ntయేసు ఆ వ్యక్తికి ఏ అదనపు ఆజ్ఞ ఇచ్చాడు?యేసు ఆ వ్యక్తికి తన వద్ద ఉన్నదానిని అమ్మి, ఆయనను వెంబడించుమని ఆజ్ఞాపించాడు.
17110:22r5hjయేసు ఈ ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి ఎలా ప్రతిస్పందించాడు, ఎందుకు?అతడు మిగుల ఆస్తిగలవాడు గనుక ఆ వ్యక్తి దుఃఖంతో వెళ్ళిపోయాడు.
17210:23-25fn0bదేవుని రాజ్యంలోకి ప్రవేశించడం ఎవరికి చాలా కష్టంగా ఉందని యేసు చెప్పాడు?ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టమని యేసు చెప్పాడు.
17310:26-27a2prధనవంతుడు కూడా రక్షింపబడతాడని యేసు ఎలా చెప్పాడు?మనుషులతో అది అసాధ్యమని, అయితే దేవునికి సమస్తము సాధ్యమేనని యేసు చెప్పాడు.
17410:29-30ut0nయేసు నిమిత్తము ఇల్లు, కుటుంబము మరియు భూములను విడిచిపెట్టిన ఎవరైనా ఏమి పొందుతారని యేసు చెప్పాడు?వారు ఈ లోకంలో, హింసలతో, రాబోవు లోకంలో నిత్యజీవమును పొందుతారని యేసు చెప్పాడు.
17510:32t4vqయేసు శిష్యులు ఏ దారిలో ప్రయాణిస్తున్నారు?యేసు మరియు శిష్యులు యెరూషలేముకు వెళ్లే దారిలో ప్రయాణిస్తున్నారు.
17610:33-34ie59యెరూషలేములో తనకు ఏమి జరుగుతుందని యేసు తన శిష్యులకు చెప్పాడు?తనకు మరణశిక్ష విధించబడుతుందని మరియు అన్యజనులకు అప్పగింపబడునని యేసు తన శిష్యులతో చెప్పాడు.
17710:35-37mu7dయాకోబు మరియు యోహాను యేసును ఏ విన్నపము చేశారు?యాకోబు మరియు యోహాను మహిమతో యేసుతో పాటు ఆయన కుడి మరియు ఎడమ వైపున కూర్చోమని విన్నపించారు.
17810:39xafkయాకోబు, యోహాను ఏమి సహిస్తారని యేసు చెప్పాడు?యాకోబు మరియు యోహాను యేసు త్రాగుచున్న గిన్నె మరియు యేసు బాప్తిస్మము తీసుకునే బాప్తిస్మమము సహిస్తారని యేసు చెప్పాడు.
17910:40vd45యాకోబు మరియు యోహానుల విన్నపము యేసు ఆమోదించాడా?లేదు. తన కుడి ఎడమల కూర్చుండ ఇవ్వడానికి తనవి కావని యేసు చెప్పాడు.
18010:42m3q4అన్యజనుల అధికారులు తమ ప్రజలతో ఎలా ప్రవర్తిస్తారని యేసు చెప్పాడు?అన్యజనుల అధికారులు వారి ప్రజల మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారని యేసు చెప్పాడు.
18110:43-44yky8శిష్యులలో గొప్పగా ఉండాలనుకునే వారు జీవించాలని యేసు ఎలా చెప్పాడు?శిష్యులలో గొప్పగా ఉండాలనుకునే వారు అందరికీ దాసుడై ఉండాలని యేసు చెప్పాడు.
18210:48ece0గ్రుడ్డివాడైన బర్తిమయిను చాలా మంది మందలించినప్పుడు, నిశ్శబ్దంగా ఉండమని చెప్పి ఏమి చేశాడు?బర్తిమయి, “దావీదు కుమారుడా యేసూ, నన్ను కరుణింపుమని!” అని కేకలు వేసెను.
18310:52ratoబర్తిమయి గ్రుడ్డితనము నుండి ఏమి స్వస్థపరిచిందని యేసు చెప్పాడు?బర్తిమయి విశ్వాసం తనను స్వస్థపరిచిందని యేసు చెప్పాడు.
18411:2agr2యేసు తన ఇద్దరు శిష్యులను వారికి ఎదురుగా ఉన్న గ్రామంలో ఏమి చేయడానికి పంపాడు?ఎప్పుడూ ఎక్కని గాడిద పిల్లను తన దగ్గరికి తీసుకురావడానికి యేసు వారిని పంపించాడు.
18511:5-6u8heశిష్యులు గాడిదను విప్పినప్పుడు ఏమి జరిగింది?కొంతమంది శిష్యులను మీరు ఏమి చేస్తున్నారని అడిగారు, కాబట్టి వారు ప్రజలతో యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి.
18611:8cgd8యేసు గాడిద మీద ప్రయాణించినప్పుడు ప్రజలు దారి మీద ఏమి పరచిరి?ప్రజలు పొలాల నుండి నరికిన తమ కొమ్మలను మరియు వస్త్రాలను దారి మీద పరచిరి.
18711:10vfq1యేసు యెరూషలేము వైపు ప్రయాణిస్తున్నప్పుడు రాబోయే ఏ రాజ్యం గురించి ప్రజలు కేకలు వేయుచుండిరి?తమ తండ్రియైన దావీదు రాజ్యము స్తుతింపబడుగాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి.
18811:11pj8sయేసు దేవాలయము ప్రాంతంలోకి ప్రవేశించినప్పుడు ఏమి చేశాడు?చుట్టు సమస్తమును చూచి కూడ బేతనియకు వెళ్లెను..
18911:14qg7eఅంజూరపు చెట్టు మీద పండు లేకుండా ఉండడం చూసి యేసు ఏమి చేసాడు?యేసు అంజూరపు చెట్టుతో, “ఎన్నటి కిని నీ పండ్లు ఎవరును తినకుందురు గాక” అని చెప్పెను.
19011:15-16pbr1యేసు ఈసారి దేవాలయము ప్రాంతంలోకి ప్రవేశించినప్పుడు ఏమి చేశాడు?యేసు దేవాలయములో క్రయ విక్రయ ములు చేయువారిని వెళ్లగొట్ట నారంభించి, రూకలు మార్చువారి బల్లలను, గువ్వలమ్మువారి పీటలను పడద్రోసెను.
19111:17dgqlలేఖనాల ప్రకారం దేవాలయం ఏమి కావాలని యేసు చెప్పాడు?దేవాలయం సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరంగా ఉండాలని యేసు చెప్పాడు.
19211:17hpgpప్రధాన యాజకులు మరియు శాస్త్రులు దేవాలయాన్ని ఏమి చేశారని యేసు చెప్పాడు?వారు దేవాలయాన్ని దొంగల గుహగా చేశారని యేసు చెప్పాడు.
19311:18x7njప్రధాన యాజకులు మరియు శాస్త్రులు యేసుకు ఏమి చేయాలని ప్రయత్నిస్తున్నారు?ప్రధాన యాజకులు మరియు శాస్త్రులు యేసును చంపడానికి ప్రయత్నిస్తున్నారు.
19411:20geb7యేసు చెప్పిన అంజూరపు చెట్టుకు ఏమి జరిగింది?యేసు చెప్పిన అంజూరపు చెట్టు దాని మూలాలకు ఎండిపోయింది.
19511:24okwnప్రార్థనలో మనం అడిగే ప్రతిదాని గురించి యేసు ఏమి చెప్పాడు?ప్రార్థనలో మనం అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్మాలి; అప్పుడు అవి మనకు కలుగునని యేసు చెప్పాడు.
19611:25udprపరలోకంలో ఉన్న తండ్రి కూడా మిమ్మల్ని క్షమించేలా మనం ఏమి చేయాలని యేసు చెప్పాడు?ఒకనిమీద విరోధ మేమైనను ఉంటే క్షమించాలని అప్పుడు తండ్రి కూడా మనలను క్షమిస్తానని యేసు చెప్పాడు.
19711:27-28y3u8దేవాలయంలో, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు యేసు నుండి ఏమి తెలుసుకోవాలనుకున్నారు?ఏ అధికారంతో ఆయన ఈ కార్యములు చేస్తున్నాడని చెప్పాలన్నారు.
19811:29-30cdceప్రధాన యాజకులను, శాస్త్రులను, పెద్దలను యేసు ఏ ప్రశ్న అడిగాడు?యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదా లేక మనుష్యుల నుండి కలిగినదా అని యేసు వారిని అడిగాడు.
19911:31qfb1యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగిందని ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు ఎందుకు సమాధానం చెప్పడానికి ఇష్టపడలేదు?వారు యోహానును ఎందుకు నమ్మలేదని యేసు అడుగుతాడు కాబట్టి వారు ఈ సమాధానం ఇవ్వడానికి ఇష్టపడలేదు.
20011:32zg5iప్రధాన యాజకులు, శాస్త్రులు మరియు పెద్దలు యోహాను ఇచ్చిన బాప్తిస్మము మనుష్యుల నుండి అని ఎందుకు సమాధానం చెప్పడానికి ఇష్టపడలేదు?యోహాను ప్రవక్త అని అందరూ విశ్వసించే ప్రజలకు భయపడి వారు ఈ సమాధానం చెప్పడానికి ఇష్టపడలేదు.
20112:1k9g4ద్రాక్షతోటను నిర్మించి, గుత్తకిచ్చి తర్వాత, యజమాని ఏమి చేశాడు?ద్రాక్షతోటను నిర్మించి, గుత్తకిచ్చి తరువాత, యజమాని ప్రయాణానికి బయలుదేరాడు.
20212:5qm75ద్రాక్షతోట ఫలాలను అందుకోవడానికి యజమాని పంపిన అనేకమంది సేవకులను ద్రాక్ష తోటలు వేసేవారు ఏమి చేసారు?ద్రాక్షతోట కాపులు కొందరిని కొట్టారు మరియు చాలా మంది సేవకులలో కొందరిని చంపారు.
20312:6p7p2యజమాని కాపుల యొద్దకు చివరిగా ఎవరిని పంపాడు?యజమాని తన ప్రియమైన కుమారుని చివరిగా పంపాడు.
20412:8abgxయజమాని చివరిగా పంపిన ద్రాక్షతోట కాపులు ఏమి చేసారు?ద్రాక్షతోట కాపులు అతనిని పట్టుకుని, చంపి, ద్రాక్షతోట వెలుపల పారవేసిరి.
20512:9bpsjద్రాక్షతోట యజమాని ద్రాక్షతోట కాపులను ఏమి చేస్తాడు?ద్రాక్షతోట యజమాని వచ్చి ద్రాక్షతోటలు కాపులను నాశనం చేసి, ద్రాక్షతోటను ఇతరులకు ఇస్తాడు.
20612:10c54cలేఖ్నములో, ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయికి ఏమి జరిగింది?అట్టివారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయెను.
20712:14n5veపరిసయ్యులు మరియు కొంతమంది హెరోదీయులు యేసును ఏ ప్రశ్న అడిగారు?కైసరుకు పన్నులు చెల్లించడం న్యాయమా కాదా అని వారు అడిగారు.
20812:17z3xoవారి ప్రశ్నకు యేసు ఎలా జవాబిచ్చాడు?కైసరుకు చెందిన వాటిని కైసరుకు ఇవ్వాలని మరియు దేవునికి సంబంధించిన వాటిని దేవునికి ఇవ్వాలని యేసు చెప్పాడు.
20912:18jy15సద్దూకయ్యులు దేనిని నమ్మలేదు?సద్దూకయ్యులు పునరుత్థానము నమ్మలేదు.
21012:22nmukసద్దూకయ్యులు చెప్పిన విషయములో, స్త్రీకి ఎంత మంది భర్తలు ఉన్నారు?ఆ స్త్రీకి ఏడుగురు భర్తలు.
21112:23fehvఆ స్త్రీ గురించి సద్దూకయ్యులు యేసును ఏ ప్రశ్న అడిగారు?పునరుత్థానములో ఎవనికి ఆమె భార్యగా ఉండును వారు అడిగారు.
21212:24bs3eసద్దూకయ్యులు చేసిన తప్పుకు యేసు వారికి ఏ కారణం చెప్పాడు?సద్దూకయ్యులకు లేఖనాలు లేదా దేవుని శక్తి యెరుగకుండిరి అని యేసు చెప్పాడు.
21312:25ks2qస్త్రీ గురించి సద్దూకయ్యులు అడిగిన ప్రశ్నకు యేసు సమాధానం ఏమిటి?పునరుత్థానంలో స్త్రీపురుషులు పెళ్లి చేసుకోరని, దేవదూతలా ఉంటారని యేసు చెప్పాడు.
21412:26-27ete1పునరుత్థానము ఉందని యేసు లేఖనాల నుండి ఎలా చూపించాడు?యేసు మోషే గ్రంథము నుండి ఉల్లేఖించాడు, అక్కడ దేవుడు తాను అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబుల దేవుడు అని చెప్పాడు - వీరంతా ఇప్పటికీ సజీవంగా ఉండాలి.
21512:29-30tzehఏ ఆజ్ఞ అత్యంత ప్రాముఖ్యమైనదని యేసు చెప్పాడు?నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణహృదయముతోను, పూర్ణాత్మతోను, పూర్ణ వివేకముతోను, పూర్ణ బలముతోను ప్రేమించుట అత్యంత ప్రాముఖ్యమైన ఆజ్ఞ అని యేసు చెప్పాడు.
21612:31mh0yరెండవది ఏ ఆజ్ఞ అని యేసు చెప్పాడు?నిన్నువలె నీ పొరుగువారిని ప్రేమించుట రెండవ ఆజ్ఞ అని యేసు చెప్పాడు.
21712:35-37qo6tదావీదు గురించి యేసు శాస్త్రులను ఏ ప్రశ్న అడిగాడు?క్రీస్తు దావీదు కుమారుడైనప్పుడు దావీదు క్రీస్తును ప్రభువు అని ఎలా పిలుస్తాడని యేసు అడిగాడు.
21812:38-40ndccశాస్త్రుల విషయంలో జాగ్రత్తగా ఉండమని యేసు ప్రజలకు ఏమి చెప్పాడు?శాస్త్రులు మనుష్యులచే గౌరవించబడాలని కోరుకుంటారని యేసు చెప్పాడు, అయితే వారు విధవరాండ్ర యిండ్లు దిగమింగుచు, ప్రజలు మాయవేషముగా దీర్ఘప్రార్థనలు చేయుదురు.
21912:44vxj4కానుక పెట్టె విరాళాలు ఇచ్చిన వారందరికంటే పేద విధవరాలు ఎక్కువ వేసెనని యేసు ఎందుకు చెప్పాడు?ఇతరులు తమ సమృద్ధి నుండి విరాళాలు ఇస్తే ఆమె తన లేమిలో తనకు కలిగినదంతయు జీవనమంతయు వేసెనని యేసు చెప్పాడు.
22013:2a889దేవాలయంలోని అద్భుతమైన రాళ్లకు, భవనాలకు ఏమి జరుగుతుందని యేసు చెప్పాడు?ఒక రాయిపై మరొక రాయి మిగలదని యేసు చెప్పాడు.
22113:4et3pఅప్పుడు శిష్యులు యేసును ఏ ప్రశ్న అడిగారు?ఈ సంగతులు ఎప్పుడు జరుగుతాయి, దానికి గురుతు ఏమిటని శిష్యులు యేసును అడిగారు.
22213:5-6znviశిష్యులు జాగ్రత్తగా ఉండాలని యేసు దేని గురించి చెప్పాడు?శిష్యులు ఎవరూ తప్పుదారి పట్టకుండా జాగ్రత్తపడాలని యేసు చెప్పాడు.
22313:7-8umt6వేదనలకు ప్రారంభము నాంది ఏమని యేసు చెప్పాడు?వేదనలకు ప్రారంభము నాంది యుద్ధాలు, యుద్ధాల పుకార్లు, భూకంపాలు మరియు కరువులు అని యేసు చెప్పాడు.
22413:9arqhశిష్యులకు ఏమి జరుగుతుందని యేసు చెప్పాడు?శిష్యులు సభలకు అప్పగించబడుతారని, సమాజ మందిరాల్లో కొట్టబడతారని, సాక్ష్యార్థమై అధిపతుల యెదుటను రాజుల యెదుటను నిలబడతారని యేసు చెప్పాడు.
22513:10p9a0మొదట ఏమి జరగాలని యేసు చెప్పాడు?సువార్త ముందుగా అన్ని దేశాలకు ప్రకటించబడాలని యేసు చెప్పాడు.
22613:12zlctకుటుంబ సభ్యుల మధ్య ఏమి జరుగుతుందని యేసు చెప్పాడు?ఒక కుటుంబ సభ్యుడు మరొక కుటుంబాన్ని మరణానికి అప్పగిస్తారని యేసు చెప్పాడు.
22713:13trz5ఎవరు రక్షింపబడతారని యేసు చెప్పాడు?అంతము వరకు సహించినవాడే రక్షింపబడతాడని యేసు చెప్పాడు.
22813:14a194యూదయలో ఉన్నవారు నాశనమనే అసహ్యాన్ని చూసినప్పుడు ఏమి చేయాలని యేసు చెప్పాడు?యూదయలో ఉన్నవారు నాశనమనే అసహ్యాన్ని చూసి కొండలకు పారిపోవాలని యేసు చెప్పాడు.
22913:20pgpiఎన్నుకోబడిన వారి కొరకు ప్రభువు ఏమి చేస్తాడని యేసు చెప్పాడు, తద్వారా వారు రక్షింపబడతారు?యేసు ప్రభువు ఎన్నుకోబడిన వారి కొరకు శ్రమ దినాలను తగ్గిస్తాడని చెప్పాడు.
23013:22zmokప్రజలను మోసం చేయడానికి ఎవరు తలెత్తుతారని యేసు చెప్పాడు?ప్రజలను మోసగించడానికి అబద్ధపు క్రీస్తులు మరియు అబద్ధపు ప్రవక్తలు తలెత్తుతారని యేసు చెప్పాడు.
23113:24-25mxj5ఆ దినములలో ఆ శ్రమతీరిన తరువాత ఆకాశము నుండి వెలుగులు మరియు శక్తులకు ఏమి జరుగుతుంది?చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు, ఆకాశమునుండి నక్షత్రములు రాలును. ఆకాశమందలి శక్తులు కదలింపబడును.
23213:26cturప్రజలు మేఘాలలో ఏమి చూస్తారు?మనుష్యకుమారుడు మహా ప్రభావముతోను మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూచెదరు.
23313:27kyemమనుష్యకుమారుడు వచ్చినప్పుడు ఏమి చేస్తాడు?మనుష్యకుమారుడు తాను ఎన్నుకోబడిన వారిని భూమి మరియు ఆకాశము కొనలనుండి పోగుచేయును.
23413:30zo90ఈ సంగతులన్నీ సంభవించేంత వరకు ఏది గతించదని యేసు చెప్పాడు?ఇవన్నీ జరిగే వరకు ఈ తరం గతించదని యేసు చెప్పాడు.
23513:31oxg8ఎన్నటికీ ఏమి గతించదని యేసు చెప్పాడు?తన మాటలు ఎన్నటికీ గతించవని యేసు చెప్పాడు.
23613:32pmdnఇవన్నీ ఎప్పుడు జరుగుతాయని యేసు చెప్పాడు?తండ్రికి తప్ప ఆ దినమును లేదా గడియను ఎవరికీ తెలియదని యేసు చెప్పాడు.
23713:33mck3కాలము ఎప్పుడు వచ్చునో అనే విషయంలో యేసు తన శిష్యులకు ఏ ఆజ్ఞ ఇచ్చాడు?యేసు తన శిష్యులతో జాగ్రత్తగా ఉండమని, మెలకువగా ఉండి ప్రార్థించమని చెప్పాడు.
23813:35zfgpతన రాకడ గురించి యేసు తన శిష్యులకు ఏ ఆజ్ఞ ఇచ్చాడు?యేసు తన శిష్యులకు తన రాకడ కోసం ఎదురుచూస్తున్నప్పుడు మెలకువగా ఉండమని చెప్పాడు.
23913:37c6rmతన రాకడ గురించి యేసు తన శిష్యులకు ఏ ఆజ్ఞ ఇచ్చాడు?యేసు తన శిష్యులతో జాగ్రత్తగా ఉండమని మరియు మెలకువగా ఉండమని చెప్పాడు.
24014:1l7mbప్రధాన యాజకులు మరియు శాస్త్రులు ఏమి చేయాలని ఆలోచిస్తున్నారు?వారు యేసును దొంగతనంగా బంధించి, ఆయనను ఎలా చంపాలని ఆలోచిస్తున్నారు.
24114:2ezqiపులియని రొట్టెల పండుగలో ప్రధాన యాజకులు మరియు శాస్త్రులు ఎందుకు పని చేయకూడదు?ప్రజలలో అల్లరి కలుగు నేమో అని పండుగలో వద్దని చెప్పుకొనిరి.
24214:3lyx4కుష్టురోగి అయిన సీమోను ఇంట్లో ఒక స్త్రీ యేసును ఏమి చేసింది?ఒక స్త్రీ ఖరీదైన జటామాంసి అత్తరుబుడ్డి పగలగొట్టి యేసు తల మీద పోసింది.
24314:5tn7qకొందరు స్త్రీని దేనికి సణుగుకొనిరి?అత్తరు అమ్మి పేదలకు డబ్బు ఇవ్వచ్చు కదాని కొందరు స్త్రీలు సణుగుకొనిరి.
24414:8rqmpఆ స్త్రీ తన కోసం ఏమి చేసిందని యేసు చెప్పాడు?ఆ స్త్రీ తన శక్తికొలదిచేసి, నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెనని యేసు చెప్పాడు.
24514:9s2syఆ స్త్రీ చేసిన దాని గురించి యేసు ఏ వాగ్దానం చేశాడు?సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని యేసు వాగ్దానం చేశాడు.
24614:10rueuఇస్కారియోతు యూదా ప్రధాన యాజకుల దగ్గరకు ఎందుకు వెళ్లాడు?ఇస్కారియోతు యూదా ప్రధాన యాజకుల వద్దకు యేసును అప్పగించడానికి వెళ్ళాడు.
24714:12-15glcbశిష్యులు అందరూ పస్కా తినే స్థలాన్ని ఎలా కనుగొన్నారు?యేసు వారితో పట్టణంలోకి వెళ్లి నీటి కుండ మోసుకెళ్లే వ్యక్తిని వెంబడించి, పస్కాను తినడానికి అతిథి గది ఎక్కడుందో అడగమని చెప్పాడు.
24814:18kkmcవాళ్లు బల్ల దగ్గర భోజనం చేస్తుండగా యేసు ఏమి చెప్పాడు?తనతో భోజనం చేస్తున్న శిష్యులలో ఒకరు తనకు ద్రోహం చేస్తాడని యేసు చెప్పాడు.
24914:20grhrఏ శిష్యుడు తనకు ద్రోహం చేస్తాడని యేసు చెప్పాడు?తనతోపాటు పాత్రలో రొట్టెలు ముంచుతున్న శిష్యుడు తనకు ద్రోహం చేస్తాడని యేసు చెప్పాడు.
25014:21lk7cతనకు ద్రోహం చేసిన శిష్యుని విధి గురించి యేసు ఏమి చెప్పాడు?అతడు పుట్టకపోయి ఉంటే తనకు మంచిదని యేసు చెప్పాడు.
25114:25r9soఈ ద్రాక్షారసము మళ్లీ ఎప్పుడు తాగుతానని యేసు చెప్పాడు?యేసు తాను దేవుని రాజ్యంలో ఈ ద్రాక్షా రసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు మళ్ళీ త్రాగుతానని చెప్పాడు.
25214:27yns3ఒలీవల కొండ వద్ద, యేసు తన శిష్యుల గురించి ఏమి ప్రవచించాడు?తన వల్ల తన శిష్యులందరూ చెదరి పోవును అని యేసు ప్రవచించాడు.
25314:30gvoqపేతురు తాను ఎప్పటికీ పడిపోనని చెప్పిన తర్వాత యేసు పేతురుకు ఏమి చెప్పాడు?కోడి రెండుసార్లు కూయకముందే పేతురు మూడుసార్లు యేసును తిరస్కరిస్తాడని యేసు పేతురుతో చెప్పాడు.
25414:32-34v9zaయేసు తన ముగ్గురు శిష్యులతో ప్రార్థిస్తున్నప్పుడు ఏమి చేయమని చెప్పాడు?అక్కడే ఉండి చూడమని యేసు వారికి చెప్పాడు.
25514:35uvgsయేసు దేని కొరకు ప్రార్థించాడు?ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవలెనని యేసు ప్రార్థించాడు.
25614:36u792తండ్రికి తన ప్రార్థనకు సమాధానంగా యేసు దేనిని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు?యేసు తన కోసం తండ్రి చిత్తం దేనినైనా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు.
25714:37vaa4యేసు ముగ్గురు శిష్యుల వద్దకు తిరిగి వచ్చినప్పుడు ఏమి కనుగొన్నాడు?ముగ్గురు శిష్యులు నిద్రపోతున్నట్లు యేసు చూశాడు.
25814:40taduయేసు రెండవసారి ప్రార్థన నుండి తిరిగి వచ్చినప్పుడు ఏమి కనుగొన్నాడు?ముగ్గురు శిష్యులు నిద్రపోతున్నట్లు యేసు చూశాడు.
25914:41yc6cయేసు మూడవసారి ప్రార్థన నుండి తిరిగి వచ్చినప్పుడు ఏమి కనుగొన్నాడు?ముగ్గురు శిష్యులు నిద్రపోతున్నట్లు యేసు చూశాడు.
26014:44-45xku4యేసు ఎవరని కాపలాదారులకు చూపించడానికి యూదా ఏ గురుతు ఇచ్చాడు?యేసు ఎవరని కాపలాదారులకు చూపించడానికి యూదా యేసును ముద్దుపెట్టుకున్నాడు.
26114:48-49afwaలేఖనాన్ని నెరవేర్చడానికి తన అరెస్టులో ఏమి జరుగుతుందని యేసు చెప్పాడు?వాళ్లు కత్తులు, కర్రలతో దొంగలా తనను బంధించడానికి వచ్చారు కాబట్టి లేఖనాలు నెరవేరుతున్నాయని యేసు చెప్పాడు.
26214:50v5q7యేసు బంధించబడినప్పుడు యేసుతో ఉన్నవారు ఏమి చేసారు?యేసుతో ఉన్నవారు ఆయనను విడిచి పారిపోయారు..
26314:51-52xj5bయేసు బంధించబడినప్పుడు యేసును వెంబడిస్తున్న ఒక యువకుడు ఏమి చేశాడు?ఆ యువకుడు తన నార వస్త్రాన్ని అక్కడే వదిలి దిగంబరుడై పారిపోయాడు.
26414:53-54mcjrయేసును ప్రధాన యాజకుని దగ్గరకు తీసుకువెళ్లినప్పుడు పేతురు ఎక్కడ ఉన్నాడు?బంట్రౌతులతోకూడ కూర్చుండి, మంటయొద్ద చలి కాచు కొనుచుండెను.
26514:55-56k3gbమహాసభవారందరు యేసుకు వ్యతిరేకంగా ఇచ్చిన సాక్ష్యంలో తప్పు ఏమిటి?యేసుకు వ్యతిరేకంగా ఇచ్చిన సాక్ష్యం తప్పు మరియు అంగీకరించబడలేదు.
26614:62rabuప్రధాన యాజకుని ప్రశ్నకు యేసు సమాధానం ఏమిటి?యేసు, “నేనే” అని సమాధానం చెప్పాడు.
26714:64xherయేసు సమాధానం విని, ప్రధాన యాజకుడు యేసును దోషి అని ఏమి చెప్పాడు?యేసు దైవదూషణకు పాల్పడ్డాడని ప్రధాన యాజకుడు చెప్పాడు.
26814:65if4hయేసును మరణానికి అర్హుడు అని ఖండించిన తర్వాత వారు ఆయనను ఏమి చేసారు?వారు ఆయన మీద ఉమ్మి, గుద్దిరి మరియు కొట్టి పట్టుకొనిరి.
26914:66-68tjt2పేతురు యేసుతో ఉన్నాడని చెప్పిన సేవకురాలికి పేతురు సమాధానం ఏమిటి?అమ్మాయి ఏమి మాట్లాడుతుందో తనకు తెలియదని లేదా అర్థం కావడం లేదని పేతురు సమాధానం ఇచ్చాడు.
27014:71orueమీరు యేసు శిష్యులలో ఒకరా అని మూడవసారి అడిగినప్పుడు పేతురు ప్రతిస్పందన ఏమిటి?పేతురు తనకు యేసును తెలియదని ప్రమాణం చేసి శాపనార్థాలు పెట్టుకున్నాడు.
27114:72dgcnపేతురు మూడవసారి సమాధానం ఇచ్చిన తర్వాత ఏమి జరిగింది?పేతురు మూడోసారి సమాధానం చెప్పిన తర్వాత, కోడి రెండోసారి కూసింది.
27214:72wesnకోడి కూత విన్న తర్వాత పేతురు ఏమి చేసాడు?కోడి కూత విన్న తర్వాత పేతురు విలపించి ఏడ్చాడు.
27315:1myuoఉదయమున, ప్రధాన యాజకులు యేసుతో ఏమి చేసారు?ఉదయమున, వారు యేసును బంధించి పిలాతుకు అప్పగించారు.
27415:5w0fhప్రధాన యాజకులు యేసుపై అనేక ఆరోపణలు చేస్తున్నప్పుడు, యేసు గురించి పిలాతుకు ఏమి ఆశ్చర్యపరిచింది?యేసు తనకు సమాధానం చెప్పనందుకు పిలాతు ఆశ్చర్యపోయాడు.
27515:6juiiపండుగ సమయంలో పిలాతు సాధారణంగా జనసమూహం కోసం ఏమి చేసేవాడు?పిలాతు సాధారణంగా పండుగ సమయంలో ప్రజలు కోరిన ఒక ఖైదీని విడుదల చేసేవాడు.
27615:10c38rపిలాతు యేసును జనసమూహానికి ఎందుకు విడుదల చేయాలనుకున్నాడు?అసూయ కారణంగానే ప్రధాన యాజకులు యేసును తనకు అప్పగించారని పిలాతుకు తెలుసు.
27715:11cjv6జన సమూహము ఎవరిని విడుదల చేయమని కేకలు వేశారు?బరబ్బను విడుదల చేయాలని జనం కేకలు వేశారు.
27815:12-13v1o8యూదుల రాజుతో ఏమి చేయాలని గుంపు చెప్పారు?యూదుల రాజును సిలువ వేయాలని జనం అన్నారు.
27915:17hku5సైనికుల బృందం యేసుకు ఏమి తొడిగారు?సైనికులు యేసుకు ఊదారంగు వస్త్రం వేసి, ముళ్లతో కూడిన కిరీటాన్ని ఆయనకు తొడిగారు.
28015:21vt0vయేసు సిలువను ఎవరు మోసాడు?కురేనీయకు చెందిన సీమోనను బాటసారుడు యేసు సిలువను మోయవలసి వచ్చింది.
28115:22ekh7యేసును సిలువ వేయడానికి సైనికులు తీసుకువచ్చిన ప్రదేశం పేరు ఏమిటి?ఆ ప్రదేశం పేరు గోల్గోతా, అంటే కపాల స్థలము.
28215:24osm6యేసు వస్త్రాలను సైనికులు ఏమి చేశారు?సైనికులు యేసు వస్త్రాల కోసం చీట్లు వేశారు.
28315:29-30dh4rదారిన వెళ్లేవారు యేసును ఏమి చేయమని సవాలు చేశారు?ఆ దారిన వెళ్ళిన వారు యేసును రక్షించి సిలువపై నుండి దిగమని సవాలు చేశారు.
28415:31-32o4ccప్రధాన యాజకులు నమ్మేలా యేసు ఏమి చేయాలని చెప్పారు?ప్రధాన యాజకులు వారు నమ్మేలా యేసు సిలువ నుండి దిగి రావాలని చెప్పారు.
28515:32wdk2ప్రధాన యాజకులు యేసును ఎగతాళి చేస్తున్నప్పుడు ఆయనకు ఏ బిరుదులు ఉపయోగించారు?ప్రధాన యాజకులు యేసును క్రీస్తు అని మరియు ఇశ్రాయేలు రాజు అని పిలిచారు.
28615:33pptoఆరవ గంటలో ఏం జరిగింది?ఆరవ గంటకు భూమి అంతా చీకటి అలుముకుంది.
28715:34t3wiతొమ్మిదవ గంటలో యేసు ఏమి అరిచాడు?యేసు, “నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు విడిచిపెట్టావు?” అని కేకలు వేసెను.
28815:37x92vయేసు చనిపోయే ముందు ఏమి చేశాడు?యేసు చనిపోయే ముందు పెద్ద స్వరంతో కేకలు వేసాడు.
28915:38jdq8యేసు చనిపోయినప్పుడు దేవాలయములో ఏమి జరిగింది?యేసు చనిపోయినప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందికి రెండుగా చీలిపోయింది.
29015:39tf5mయేసు ఎలా చనిపోయాడో చూసినప్పుడు శతాధిపతి ఏమి సాక్ష్యమిచ్చాడు?ఈ వ్యక్తి నిజంగా దేవుని కుమారుడని శతాధిపతి సాక్ష్యమిచ్చాడు.
29115:42mthbయేసు ఏ రోజు మరణించాడు?Jesus died on the day before the Sabbath.
29215:43-46yusfయేసు చనిపోయిన తర్వాత అరిమతయియ యోసేపు ఏమి చేశాడు?అరిమతీయాకు చెందిన యోసేపు యేసును సిలువపై నుండి దించి, నారబట్టలో చుట్టి, సమాధి ప్రవేశానికి వ్యతిరేకంగా ఒక రాయిని చుట్టి సమాధిలో ఉంచాడు.
29316:1-2l3lcయేసు శరీరానికి అభిషేకం చేయడానికి స్త్రీలు ఎప్పుడు ఆయన సమాధికి వెళ్లారు?వారంలో మొదటి రోజు సూర్యోదయమైనప్పుడు స్త్రీలు సమాధి వద్దకు వెళ్లారు.
29416:4b2ozద్వారం వద్ద చాలా పెద్ద రాయి ఉన్నప్పటికీ స్త్రీలు సమాధిలోకి ఎలా ప్రవేశించారు?ప్రవేశ ద్వారం నుండి చాలా పెద్ద రాయిని ఎవరో దొర్లించారు.
29516:5habpసమాధిలోకి ప్రవేశించినప్పుడు స్త్రీలు ఏమి చూశారు?తెల్లటి వస్త్రం ధరించిన యువకుడు కుడివైపున కూర్చోవడం స్త్రీలు చూశారు.
29616:6nvicయేసు గురించి యువకుడు ఏమి చెప్పాడు?యేసు లేచాడని, అక్కడ లేడని ఆ యువకుడు చెప్పాడు.
29716:7iqwxశిష్యులు యేసును ఎక్కడ కలుస్తారని యువకుడు చెప్పాడు?శిష్యులు గలిలయలో యేసును కలుస్తారని యువకుడు చెప్పాడు.
29816:9mgj4యేసు తన పునరుత్థానం తర్వాత మొదట ఎవరికి కనబడెను?యేసు మొట్టమొదట మగ్దలేనే మరియకు కనబడెను.
29916:11ge9jతాను యేసును సజీవంగా చూశానని మరియ చెప్పినప్పుడు యేసు శిష్యులు ఎలా ప్రతిస్పందించారు?శిష్యులు నమ్మలేదు.
30016:13bhrbయేసును సజీవంగా చూశామని మరో ఇద్దరు వ్యక్తులు చెప్పినప్పుడు యేసు శిష్యులు ఎలా స్పందించారు?శిష్యులు నమ్మలేదు.
30116:14f1b4ఆయన శిష్యులకు కనిపించినప్పుడు, వారి అవిశ్వాసం గురించి యేసు వారితో ఏమి చెప్పాడు?శిష్యుల అవిశ్వాసానికి యేసు వారిని గద్దించాడు.
30216:15zvc5యేసు శిష్యులకు ఏ ఆజ్ఞ ఇచ్చాడు?లోకమంతటా వెళ్లి సువార్త ప్రకటించమని యేసు శిష్యులకు ఆజ్ఞాపించాడు.
30316:16p7ixఎవరు రక్షింపబడతారని యేసు చెప్పాడు?నమ్మి బాప్తిస్మము పొందుకున్న వారు రక్షింపబడతారని యేసు చెప్పాడు.
30416:16u11wఎవరు శిక్షించబడతారని యేసు చెప్పాడు?నమ్మని వారు శిక్షించబడతారని యేసు చెప్పాడు.
30516:17-18l58hనమ్మిన వారిలో ఏ సూచక క్రియలు కనబడునని యేసు చెప్పాడు?దయ్య ములను వెళ్లగొట్టుదురు; క్రొత్త భాషలు మాటలాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకర మైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు రోగులను స్వస్థపరచుదురు అని యేసు చెప్పాడు.
30616:19bac6యేసు శిష్యులతో మాట్లాడిన తర్వాత ఆయనకు ఏమి జరిగింది?ఆయన శిష్యులతో మాట్లాడిన తర్వాత, యేసు పరలోకానికి ఎక్కి దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు.
30716:20wd92అప్పుడు శిష్యులు ఏమి చేసారు?అప్పుడు శిష్యులు బయలుదేరి వాక్య మంతట ప్రకటించిరి.
30816:20f45xఅప్పుడు ప్రభువు ఏమి చేసాడు?ప్రభువు శిష్యులకు సహకారుడై యుండి, వెనువెంట జరుగుచు వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను.