translationCore-Create-BCS_.../tq_1JN.tsv

25 KiB

1ReferenceIDTagsQuoteOccurrenceQuestionResponse
21:1zmb4జీవ వాక్యం గురించి యోహాను ఏ విధంగా తెలుసుకున్నాడు?జీవ వాకాన్ని యోహాను విన్నాడు, చూసాడు, నిదానించి కనుగొన్నాడు, మరియు చేతులతో తాకాడు.
31:2n05uయోహానుకు నిత్య జీవం ప్రత్యక్షం కాక ముందు ఎక్కడ ఉంది?యోహానుకు నిత్య జీవం ప్రత్యక్షం కాక ముందు అది తండ్రితో ఉంది.
41:3dkvxయోహాను తాను చూసిన దానిని మరియు వినిన దానిని ఎందుకు ప్రకటించాడు?యోహాను తాను చూసిన దానిని మరియు వినిన దానిని ప్రకటించాడు, తద్వారా ఇతరులు కూడా ఆయనతో సహవాసం కలిగి ఉంటారు.
51:3wbweయోహానుకు ఇప్పటికే ఎవరితో సహవాసం ఉంది?యోహాను అప్పటికే తండ్రితోను మరియు ఆయన  కుమారుడు యేసుక్రీస్తుతో సహవాసం కలిగి ఉన్నాడు.
61:5e5d4యోహాను తన పాఠకులకు ప్రకటించే దేవుని సందేశం ఏమిటి?దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో ఎంత మాత్రము చీకటి లేదు అనే సందేశాన్ని యోహాను ప్రకటిస్తున్నాడు.
71:6wnfhతనకు దేవునితో సహవాసం ఉంది ఆయితే తాను చీకటిలో నడుచున్న వ్యక్తిని గురించి యోహాను ఏమి చెపుతున్నాడు?అటువంటి వ్యక్తి అబద్దికుడు మరియు సత్యమును జరిగించడం లేదు అని యోహాను చెప్పాడు.
81:7q6umవెలుగులో నడుస్తున్న వారి పాపం అంతటినీ ఏది శుద్ధి చేస్తుంది?యేసు రక్తం వారిని అన్ని సమస్త పాపముల నుండి శుద్ధి చేస్తుంది.
91:8s0mrమనలో పాపం లేదని చెప్పినట్లయితే మనల్ని మనం ఏమి చేసుకుంటాం?మనలో పాపం లేదని చెప్పినట్లయితే మనల్ని మనం మోసం చేసుకుంటాము మరియు మనలో సత్యం లేదు.
101:9ldreతమ పాపాలను ఒప్పుకునే వారి కోసం దేవుడు ఏమి చేస్తాడు?వారి పాపాలను ఒప్పుకునే వారి పాపాలను దేవుడు క్షమిస్తాడు మరియు సమస్త దుర్నీతినుండి పవిత్రులనుగా చేస్తాడు.
112:3o2gwమనం యేసుక్రీస్తును ఎరుగుదుము అని ఏ విధంగా తెలుసుకోవాలి?మనమాయన ఆజ్ఞలను గైకొనినయెడల, దీని వలననే ఆయనను ఎరిగియున్నామని తెలిసి కొందుము.
122:4oq37ఎటువంటి వ్యక్తి తనకు దేవుడని తెలుసు అని చెపుతాడు అయితే దేవుని ఆజ్ఞలను పాటించడు?ఒక అబద్దికుడు తనకు దేవుడని తెలుసు అని చెపుతాడు అయితే దేవుని ఆజ్ఞలను పాటించడు.
132:6djanఒక వ్యక్తి తాను క్రీస్తులో నిలిచియున్నానని చెప్పిన యెడల అతడు ఏ విధంగా నడవాలి?యేసుక్రీస్తు ఏలాగు నడుచుకొనెనో ఆలాగే తానును నడుచు కొన బద్ధుడైయున్నాడు.
142:9d7erతాను వెలుగులో ఉన్నానని చెపుతూ, తన సోదరుడిని ద్వేషించే వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక పరిస్థితి ఏమిటి?తాను వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు, తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటివరకును చీకటిలోనే యున్నాడు.
152:11t52dతన సోదరుడిని ద్వేషించే వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక పరిస్థితి ఏమిటి?తన సోదరుడిని ద్వేషించే వ్యక్తి చీకటిలో ఉన్నాడు మరియు చీకటిలో నడుస్తున్నాడు.
162:12w6akవిశ్వాసుల పాపాలను దేవుడు ఎందుకు క్షమిస్తాడు?ఆయన నామముబట్టి దేవుడు విశ్వాసుల పాపములను  క్షమిస్తాడు.
172:15afbdలోకములోని సంగతుల విషయంలో విశ్వాసి యొక్క వైఖరి ఏ విధంగా ఉండాలి?లోకాన్ని గానీ లేదా లోకంలో ఉన్నవాటినైననూ ఉన్నవాటిని విశ్వాసి ప్రేమించకూడదు.
182:16pfzuతండ్రి వలన కాకుండా లోకం నుండి వచ్చిన మూడు సంగతులు ఏమిటి?లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే.
192:18cd02క్రీస్తు విరోధిని గురించి మనకు ఏమి తెలుసు?క్రీస్తు విరోధి వచ్చునని మనకు తెలుసు.
202:18dz04ఇది కడవరి గడియ అని మనకు దేని చేత మనం తెలిసికొనుచున్నాము?అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరియున్నారు కనుక ఇది కడవరి గడియ అని దీనిచేత తెలిసికొనుచున్నాము.
212:22u6q4క్రీస్తు విరోధిని మనం ఏవిధంగా గుర్తిస్తాము?తండ్రిని కుమారుని ఒప్పుకొనని వాడే  క్రీస్తువిరోధి అని మనం గుర్తిస్తాము.
222:23g5crఎవరైనా కుమారుని తిరస్కరించి కుమారుని కలిగియుండగలరా?లేదు, కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు.
232:24x90kకుమారునిలో మరియు తండ్రిలో నిలిచి ఉండడానికి విశ్వాసులు ఏమి చేయాలి?వారు మొదటనుండి దేనిని వింటిరో అది వారిలో నిలువనివ్వాలి.
242:25n42dవిశ్వాసులకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏమిటి?దేవుడు విశ్వాసులకు నిత్యజీవాన్ని ఇస్తాడు.
252:28yjr1మనం క్రీస్తులో నిలిచి ఉన్నట్లయితే క్రీస్తు ప్రత్యక్షం అయినప్పుడు మనం ఎటువంటి వైఖరులను కలిగి ఉంటాం?మనం ఆయనలో నిలిచి ఉన్నప్పుడు మనం ధైర్యాన్ని కలిగియుంటాము మరియు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనం సిగ్గుపడము.
263:1uc2nతండ్రి తన ప్రేమను విశ్వాసులకు ఏవిధంగా కనుపరుస్తాడు?వారు దేవుని పిల్లలు అని పిలువబడునట్లు తండ్రి సాధ్యపరుస్తాడు.
273:2voaoక్రీస్తు బయలుపడునప్పుడు విశ్వాసులకు ఏమి జరుగుతుంది?క్రీస్తు బయలుపరచబడినప్పుడు విశ్వాసులు క్రీస్తు వలె ఉంటారు ఎందుకంటే వారు ఆయనను ఉన్నట్టుగానే ఆయన చూస్తారు.
283:3vrucక్రీస్తులో నిరీక్షించే ప్రతి విశ్వాసి తన గురించి ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి?క్రీస్తులో నిరీక్షణ ఉంచే ప్రతి విశ్వాసి తనను తాను శుద్ధి చేసుకోవాలి.
293:5knzfక్రీస్తు తనలో ఏమి కలిగి లేడు?క్రీస్తుకు తనలో పాపం లేదు.
303:6mw43ఒక వ్యక్తి పాపం చేస్తూ ఉంటే, దేవునితో వారి సంబంధం గురించి అది మనకు ఏమి తెలియజేస్తుంది?పాపము చేయువాడెవడును ఆయనను చూడను లేదు ఎరుగనులేదు అని మనకు తెలియపరుస్తుంది.
313:8rioaదేవుని కుమారుడు ఏ కారణంతో ప్రత్యక్షం అయ్యాడు?అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు.
323:9xjnyదేవుని నుండి పుట్టినవాడు ఎందుకు పాపం చేయజాలడు?దేవుని బీజము ఆయనలో నిలిచి యున్నందున అతడు పాపం చేయజాలడు.
333:10sgt9అపవాడి పిల్లలు ఏవిధంగా స్పష్టం అవుతుంది?అపవాడి పిల్లలు స్పష్టంగా కనిపిస్తారు ఎందుకంటే వారు నీతిని జరిగించారు మరియు వారు తమ సోదరుడిని ప్రేమించరు.
343:11wswkమనం మొదటనుండి మనం మీరు వినిన వర్తమానము ఏమిటి?మనమొకని నొకడు ప్రేమింపవలెననునది మొదటనుండి మనం వినిన వర్తమానం.
353:12bo8yకయీను తాను దుష్టుని నుండి వచ్చిన వాడు అని ఏ విధంగా కనుపరచాడు?కయీను తన సోదరుడిని హత్య చేయడం ద్వారా తాను తాను దుష్టుని నుండి వచ్చిన వాడు అని కనుపరచాడు?
363:13tyilవిశ్వాసులు ఏ విషయంలో ఆశ్చర్యపడకూడదని  యోహాను ఏమి చెబుతున్నాడు?లోకము వారిని ద్వేషించినయెడల వారు ఆశ్చర్యపడకూడదని యోహాను చెపుతున్నాడు.
373:14hiypమనం మరణం నుండి జీవితానికి మార్పు చెందినట్లు ఎటువంటి వైఖరి తెలియపరుస్తుంది?మనం సహోదరులను ప్రేమిస్తున్నందున మనం మరణం నుండి జీవితానికి మార్పు చెందినట్లు మనం ఎరుగుదము.
383:16n128మనం ప్రేమను ఏవిధంగా ఎరుగుడుము?క్రీస్తు మనకోసం తన ప్రాణాన్ని అర్పించాడు కాబట్టి మనం ప్రేమను ఎరుగుడుము.
393:17uefxఒక వ్యక్తిలో దేవుని ప్రేమ లేదని ఏది సూచిస్తుంది?ఒకడు ధనవంతుడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, ఆయనయెడల ఎంతమాత్రమును కనికరము చూపనివానియందు దేవుని ప్రేమ నిలువదని మనకు సూచిస్తుంది.
403:18eczeమనం ప్రేమించడానికి సరిపోని రెండు మార్గాలు ఏమిటి?మనం మాటతోను నాలుకతోను ప్రేమించడం సరిపోదు.
413:18sh2iమనం ప్రేమించాల్సిన రెండు మార్గాలు ఏమిటి?మనం క్రియతోను సత్యముతోను ప్రేమించవలసి ఉంది.
423:21yz2hమన హృదయం మనలను దోషారోపణ చేయనియెడల మనం దేనిని కలిగియున్నాము?మన హృదయం మనలను దోషారోపణ చేయనియెడల దేవుని యెదుట ధైర్యముగలవారం అవుతాము.
433:23wvkwదేవుడు మనకు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటి?ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని, ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకనినొకడు ప్రేమింపవలెననునదియే దేవుని ఆజ్ఞ.
443:24c6paదేవుడు తమలో నిలిచి యున్నాడని విశ్వాసులకు ఏవిధంగా తెలుసు?దేవుడు విశ్వాసుల యందు నిలిచియున్నాడని ఆయన అనునుగ్రహించిన ఆత్మమూలముగా తెలిసికొనుచున్నారు
454:1rxpsవిశ్వాసులు ప్రతి ఆత్మను ఎందుకు విశ్వసించకూడదు?విశ్వాసులు ప్రతి ఆత్మను విశ్వసించకూడదు ఎందుకంటే అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి యున్నారు.
464:2w9srదేవుని ఆత్మను మీరు ఏవిధంగా తెలుసుకోవచ్చు?యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని, యే ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది అని మనం తెలుసుకోవచ్చును.
474:3rausయేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని, యే ఆత్మ ఒప్పుకొనదు?యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని, క్రీస్తు విరోధి ఒప్పు కొనడు.
484:4o8nnవిశ్వాసులు దేవుని నుండి రాని ఆత్మలను ఏవిధంగా అధిగమించగలరు?మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటె గొప్పవాడు గనుక మనం వానిని అధిగమించి యున్నాము.
494:7y7jaవిశ్వాసులు ఒకరినొకరు ఎందుకు ప్రేమించాలి?విశ్వాసులు ఒకరినొకరు ప్రేమించాలి ఎందుకంటే ప్రేమ దేవుని నుండి వచ్చింది, మరియు దేవుని నుండి పుట్టిన వ్యక్తి ప్రేమిస్తాడు.
504:8x7exప్రేమించని వ్యక్తి తనకు దేవుడు తెలియదని ఏవిధంగా నిరూపించాడు?దేవుడిని ఎరిగిన వారు ప్రేమిస్తారు ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి.
514:9ax54దేవుడు మనపై తన ప్రేమను ఏవిధంగా వెల్లడించాడు?దేవుడు తన ఏకైక కుమారుడిని లోకానికి పంపడం ద్వారా మనపై తన ప్రేమను వెల్లడించాడు.
524:9z4i9తండ్రి తన కుమారుడిని ఏ ఉద్దేశం కోసం ఈ లోకానికి పంపాడు?మనం ఆయన ద్వారా జీవించునట్లు తండ్రి తన కుమారుడిని ఈ లోకానికి పంపాడు.
534:15glq3దేవుడు ఒక వ్యక్తిలో నిలిచి యున్న యెడల అతడు ఆయన యందు నిలిచియున్న యెడల యేసును గురించి ఆ వ్యక్తి ఒప్పుకోలు ఏమిటి?దేవునిలో నిలిచి ఉన్న వ్యక్తి యేసు దేవుని కుమారుడని ఒప్పుకున్నాడు.
544:17bdoxతీర్పు రోజున దేవుని ప్రేమ మనకు ఎలాంటి వైఖరిని కలిగిస్తుంది?దేవుని ప్రేమ మనకు తీర్పు రోజున విశ్వాసాన్ని కలిగిస్తుంది.
554:19xolqమనం ఏవిధంగా ప్రేమించగలం?దేవుడు మొదట మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ప్రేమిస్తున్నాము.
564:20vyhwఎవరైనా తన సోదరుడిని ద్వేషిస్తే, ఆయనకి దేవుడితో ఎలాంటి సంబంధం ఉంది?తన సోదరుడిని ద్వేషించే వ్యక్తి దేవుడిని ప్రేమించలేడు.
574:21sjhaదేవుడిని ప్రేమించేవాడు తన సోదరుడితో ఏవిధంగా వ్యవహరించాలి?దేవుడిని ప్రేమించేవాడు తన సోదరుడిని కూడా ప్రేమించాలి.
585:3edbxమనం దేవుడిని ప్రేమిస్తున్నామని ఏవిధంగా నిరూపించాలి?మనం మేము ఆయన ఆజ్ఞలను పాటించినప్పుడు మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని కనుపరుస్తాము.
595:4pw9aలోకాన్ని జయించిన విజయం ఏమిటి?విశ్వాసమే లోకాన్ని జయించిన విజయం.
605:6qolaఏ రెండు విషయాల ద్వారా యేసుక్రీస్తు వచ్చాడు?యేసు క్రీస్తు నీరు మరియు రక్తం ద్వారా వచ్చాడు.
615:8je7zయేసు క్రీస్తు గురించి ఏ మూడు విషయాలు సాక్ష్యమిస్తున్నాయి?ఆత్మ, నీరు మరియు రక్తం యేసు క్రీస్తు గురించి సాక్ష్యమిస్తున్నాయి.
625:10s4arఎవరైనా తన కుమారుడి గురించి దేవుడి సాక్ష్యాన్ని నమ్మకపోతే, వారు దేవుడిని ఏవిధంగా చేస్తారు?దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారునిగూర్చి యిచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసినవాడు అవుతాడు.
635:11lgj0దేవుడు తన కుమారునిలో మనకు ఏమి అనుగ్రహించాడు?దేవుడు తన కుమారునిలో మనకు నిత్యజీవాన్ని అనుగ్రహించాడు.
645:14xwehదేవుని ఎదుట విశ్వాసులకు ఎటువంటి ధైర్యం ఉంది?ఆయన చిత్తానుసారముగా మన మేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననునదియే ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం.
655:16yo4uతన సోదరుడు మరణ కరం కాని పాపం చేయడం చూసి ఒక విశ్వాసి ఏమి చేయాలి?తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచినయెడల దేవుడు జీవము దయచేయునట్లు అతని కోసం ప్రార్థన చెయ్యాలి.
665:17dgvxసకల దుర్నీతి ఏమిటి?సకల దుర్నీతియు పాపము.
675:19afpxలోకమంతయు ఎక్కడ నిలిచి ఉంది?లోకమంతయు దుష్టుని యందున్నది.
685:20xwlkదేవుని కుమారుడు మనకు ఇచ్చిన అవగాహన యొక్క ఫలితం ఏమిటి?దేవుని కుమారుడు మనకు ఇచ్చిన అవగాహన కారణంగా, మనం నిజమైన వ్యక్తిని తెలుసుకోవచ్చు.
695:21e9ogవిశ్వాసులు దేని నుండి తమను తాము ఉంచుకోవాలి?విశ్వాసులు తమను తాము విగ్రహాల నుండి దూరంగా ఉంచుకోవాలి.