translationCore-Create-BCS_.../tn_PHP.tsv

137 KiB
Raw Permalink Blame History

1ReferenceIDTagsSupportReferenceQuoteOccurrenceNote
2front:intropv9j0# ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక\n## భాగము 1: సాధారణ పరిచయం\n\n### ఫిలిప్పీ పత్రిక యొక్క విభజన\n\n1. శుభములు, కృతజ్ఞతాస్తుతులు మరియు ప్రార్థన (1:1-11)\n1. పౌలు యొక్క సేవను గూర్చిన నివేదిక (1:12-26)\n1. సూచనలు\n- నిలకడగా ఉండుట (1:27-30)\n- ఐక్యత కలిగియుండుట (2:1-2)\n- వినయము కలిగియుండుట (2:3-11)\n- మనలో దేవుడు పనిచేయడంతో పాటు మన రక్షణ కూడా కార్యం చేయవలసియున్నది (2:12-13)\n- నిష్కలంకులు మరియు వెలుగుగా ఉండుట (2:14-18)\n1. తిమోతి మరియు ఎపఫ్రొదితు (2:19-30)\n1. అబద్ధ బోధకులను గూర్చిన హెచ్చరిక (3:1-4:1)\n1. వ్యక్తిగత సూచన (4:2-5)\n1. సంతోషించుడి మరియు చింతించవద్దు (4:4-6)\n1. తుది వ్యాక్యలు\n- విలువలు (4:8-9)\n- సంతుష్టి (4:10-20)\n- తుది శుభములు (4:21-23)\n\n### ఫిలిప్పీ పత్రికను ఎవరు వ్రాసారు?\n\nపౌలు ఫిలిప్పీ పత్రికను వ్రాసాడు. పౌలు తార్సు ఊరుకు చెందినవాడైయుండెను. అతను ఇంతకుముందు సౌలు అని పిలవబడేవాడు. పౌలు క్రైస్తవుడు కాకముందు అతను ఒక పరిసయ్యుడైయుండెను. అతడు క్రైస్తవులను హింసిచెను. అతడు క్రైస్తవుడుగా మారిన తరువాత రోమా సాంమ్రాజ్యమునకు అనేక మార్లు వెళ్లి యేసును గూర్చి ప్రజలకు చెప్పాడు.\n\n రోమా చెరసాలలో ఉన్నప్పుడు పౌలు ఈ పత్రికను రాసాడు.\n\n### ఫిలిప్పీ పత్రిక దేని గూర్చి మాట్లాడుచున్నది?\n\nమాసిదోనియా పట్టణమునకు చెందిన ఫిలిప్పీ పట్టణ విశ్వాసులకు పౌలు ఈ పత్రికను వ్రాసాడు. అతనికి వాళ్ళు పంపిన కానుకకు కృతజ్ఞతలు తెల్పుటకు ఈ పత్రికను వ్రాసాడు. అతడు చెరసాలలో ఎలా ఉన్నాడని అతడు చెప్పనుద్దేశించియుండెను మరియు వారు శ్రమలలో ఉన్నప్పటికి ఆనందించాలని వారిని అతడు ప్రోత్సహించాడు. ఎపఫ్రొదీతు అనే ఒక వ్యక్తిని గూర్చి అతను వారికి వ్రాసాడు. అతడే పౌలుకు ఆ కానుకను తెచ్చియుండెను. పౌలును దర్శించుటకు వచ్చినప్పుడు, ఎపఫ్రొదీతు రోగి అయ్యాడు. అందువలన, అతనిని తిరిగి ఫిలిప్పీకి పంపించాలని పౌలు నిర్ణయించుకున్నాడు. ఎపఫ్రొదీతు వెనుదిరిగినప్పుడు అతడిని స్వాగతించాలని మరియు అతనిపట్ల కనికరం కలిగియుండాలని పౌలు ఫిలిప్పీ విశ్వాసులను ప్రోత్సహించాడు.\n\n### ఈ పుస్తక శీర్షికను ఎలా తర్జుమా చేయాలి?\n\nఅనువాదకులు ఈ పుస్తకమును దాని సాంప్రదాయక పేరైన “ఫిలిప్పీ పత్రిక” అని పిలవవచ్చు. లేక “ఫిలిప్పీలోని సంఘమునకు పౌలు వ్రాసిన పత్రిక” లేక “ఫిలిప్పీలోని క్రైస్తవులకు వ్రాసిన పత్రిక” అనే స్పష్టమైన పేరును వాడవచ్చును. (చూడండి: [[rc://te/ta/man/translate/translate-names]])\n\n## భాగము 2: భక్తిపరమైన మరియు సంస్కృతిపరమైన ముఖ్య అంశములు\n\n### ఫిలిప్పీ పట్టణము ఎలా ఉండెను?\n\nమహా అలెగ్జాండర్ తండ్రియైన ఫిలిప్, మాసిదోనియా ప్రాంతములోని ఫిలిప్పీని కనుగొన్నాడు. ఫిలిప్పీ పట్టనస్తులు కూడా రోమా పౌరులుగా పిలువబడిరి అని దీని అర్థము. ఫిలిప్పీ పట్టనస్తులు రోమా పౌరసత్వము పొందుకొనియుండుటను గర్వంగా ఎంచిరి. అయితే వారు పరలోక పౌరులైయున్నారని విశ్వాసులతో పౌలు చెప్పెను (3:20).\n\n## భాగము 3: ప్రాముఖ్యమైన తర్జుమా ఇబ్బందులు\n\n### ఏకవచనము మరియు బహువచనము “మీరు”\n\nఈ పుస్తకములో, “నేను” అనే పదము పౌలును సూచించుచున్నది. “మీరు” అనే పదము అనేక మార్లు బహువచనముగా వాడబడియున్నది మరియు ఫిలిప్పీలోని విశ్వాసులను సూచించుచున్నది. 4:3వ వచనములో ఇది మినహాయించబడియున్నది. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-exclusive]] మరియు [[rc://te/ta/man/translate/figs-you]])\n\n### ఈ పత్రికలో చెప్పబడిన “క్రీస్తు సిలువకు శత్రువులు” (3:18) ఎవరు?\n\nబహుశః దేవుని ఆజ్ఞలను గైకొనక, తమను తాము విశ్వాసులు అని పిలుచుకొనుచున్న ప్రజలు “క్రీస్తు సిలువకు శత్రువులైయుండవచ్చు”. క్రీస్తులోని స్వాతంత్ర్యంలో వారు ఏమైనా చేయవచ్చని మరియు దేవుడు వారిని శిక్షించడని వారు తలంచారు (3:19).\n\n### ఈ పత్రికలో “సంతోషం” మరియు “ఆనందం” అనే పదాలను పదే పదే ఎందుకు ఉపయోగించబడియున్నది?\n\nఈ పత్రికను వ్రాసినప్పుడు పౌలు చెరసాలలో ఉండెను (1:7). అతడు శ్రమపడుచున్నప్పటికి, యేసు క్రీస్తు ద్వారా దేవుడు అతని పట్ల కనికరము కలిగియున్నాడని అందునుబట్టి పౌలు అనేక మార్లు అతడు సంతోషించుచున్నాడని చెప్పెను. యేసు క్రీస్తులో అదే నమ్మకము అతని చదువరులు కలిగియుండాలని వారిని అతడు ప్రోత్సహించనుద్దేశించియుండెను. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-irony]])\n\n### “క్రీస్తులో”, “ప్రభువులో” మొదలగు పదములను ఉపయోగించుటలో పౌలు ఏ ఉద్దేశ్యమును కలిగియుండెను?\n\nఇటువటి పదాలు 1:1, 8, 13, 14, 26, 27; 2:1, 5, 19, 24, 29; 3:1, 3, 9, 14; 4:1, 2, 4, 7, 10, 13, 19, 21 వచనములలో కనబడును. విశ్వాసులు మరియు క్రీస్తుతో కలిగియున్న సన్నిహితమైన సంబంధము అనే ఆలోచనను వ్యక్తపరచుట పౌలు ఉద్దేశ్యమైయుండెను. ఈ విధమైన పదాలకు సంబంధించిన మరిన్ని వివరములకొరకు రోమీయులకు వ్రాసిన పత్రిక ఉపోద్ఘాతమును చూడండి.\n\n### ఫిలిప్పీ పత్రికలోని వాక్య భాగాలలో ఉన్నటువంటి క్లిష్టమైన సంగతులు ఏవి?\n\n* కొన్ని తర్జుమాలలో ఆఖరి వచనము తరువాత “ఆమెన్” అని చేర్చబడియున్నది (4:23). యుఎల్టి, యుఎస్టి మరియు అనేక ఆదునిక తర్జుమాలలో అలా ఉండదు. ఒకవేళ “ఆమెన్” అని చేర్చబడియుంటే, అది బహుశః ఫిలిప్పీ పత్రిక మూలములో లేకపోయియుండవచ్చని సూచించడానికి దానిని చదరపు బ్రాకెట్లలో ([]) ఉంచాలి.\n\n(చూడండి: [[rc://te/ta/man/translate/translate-textvariants]])
31:introkd3g0# ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక 01 సాధారణ అంశములు\n## విభజన మరియు క్రమము\n\nఈ పత్రిక ప్రారంభములో పౌలు ప్రార్థనను చేర్చియున్నాడు. ఆ కాలములో, మత నాయకులు కొన్ని మార్లు అనధికారిక పత్రికలు ప్రార్థనతో ప్రారంభించేవారు.\n\n## ఈ అధ్యాయములోని విశేషమైన అంశములు\n\n### క్రీస్తు దినము\nఇది బహుశః క్రీస్తు రాకడను సూచించవచ్చు. దైవిక జీవితమును కలిగియుండుటకు ప్రేరణ మరియు క్రీస్తు రాకడకు సంబంధమున్నట్లు పౌలు అనేక మార్లు చెప్పియున్నాడు. (చూడండి: [[rc://te/tw/dict/bible/kt/godly]])\n\n## ఈ అధ్యాయములో ఎదురైయ్యే ఇతర తర్జుమా ఇబ్బందులు\n\n### అసంబంధము\n\nఅసధము అనునది అసంభవమైనవాటిని వివరించు విధముగా చెప్పబడిన నిజమైన వాక్యమైయున్నది. 21వ వచనములో ఉన్న ఈ మాట అసంబంధమైయున్నది: “మరణించుట లాభమే.” 23వ వచనములో పౌలు ఇది ఎందుకు నిజము అని వివరించుచున్నాడు. ([ఫిలిప్పీయులకు 1:21](../../పిఎచ్ పి/01/21.ఎండి))
41:1c255rc://*/ta/man/translate/figs-youGeneral Information:0# General Information:\n\nపౌలు మరియు తిమోతి ఈ పత్రికను ఫిలిప్పీలోని సంఘమునకు వ్రాయుచున్నారు. ఎందుకంటే పౌలు పత్రికలోని తరువాత భాగములో “నేను” అని సంబోధించియున్నాడు, అతడే గ్రంథకర్తయైయున్నాడని సహజముగా భావించగలము మరియు పౌలు చెప్పుచుండగా అతనితో ఉన్న తిమోతి దానిని వ్రాసియుండెను. ఈ పత్రికలో “మీరు” మరియు “మీ” అనే పదాలు ఫిలిప్పీ సంఘములోని విశ్వాసులను సూచించుచున్నది మరియు అది బహువచనమైయున్నది. “మన” అనే పదము బహుశః పౌలు, తిమోతి, మరియు ఫిలిప్పీ విశ్వాసులతో కలిపి క్రీస్తులోని విశ్వాసులందరిని సూచించవచ్చు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-you]] మరియు [[rc://te/ta/man/translate/figs-inclusive]])
51:1kze2Παῦλος καὶ Τιμόθεος & καὶ διακόνοις1పత్రికల గ్రంథకర్తను పరిచయం చేయడానికి మీ భాషలో ప్రత్యేకమైన పద్ధతి ఉన్నట్లయితే దానిని ఇక్కడ ఉపయోగించండి.
61:1kx8hΠαῦλος καὶ Τιμόθεος, δοῦλοι Χριστοῦ Ἰησοῦ1క్రీస్తు యేసు సేవకులైన, తిమోతి
71:1na5jπᾶσιν τοῖς ἁγίοις ἐν Χριστῷ Ἰησοῦ1క్రీస్తుతో కూడా ఏకమైన వారిని దేవుడు తనకు సంబంధించిన వారిగా ఎన్నుకున్నవారిని ఇది సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తు యేసులోని దేవుని ప్రజలందరూ” లేక “క్రీస్తుతో ఏకమైయున్నందున దేవునికి చెందిన ప్రజలందరూ”
81:1im6vἐπισκόποις καὶ διακόνοις1సంఘములోని నాయకులు
91:3ntp5ἐπὶ πάσῃ τῇ μνείᾳ ὑμῶν1ఇక్కడ “మిమ్మల్ని గుర్తుకు తెచ్చుకున్నా” అనే పదములు పౌలు ప్రార్థించుచున్నప్పుడు ఫిలిప్పీయులను గూర్చి జ్ఞాపకము చేసుకున్నప్పుడు అని అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “మిమ్మల్ని గూర్చి నేను జ్ఞాపకము చేసుకొనిన ప్రతి సారి”
101:5yi9lrc://*/ta/man/translate/figs-metonymyἐπὶ τῇ κοινωνίᾳ ὑμῶν εἰς τὸ εὐαγγέλιον1ప్రజలకు సువార్తను బోధించుటకు ఫిలిప్పీయులు అతనితో కలిసినందుకు పౌలు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాడు. వారు అతని కొరకు ప్రార్థించుట మరియు అతడు ప్రయాణించి ఇతరులకు చెప్పడానికి అవసరమైన ధనమును వారు పంపించిన దాని గూర్చి అతడు చెప్పుచుండవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “సువార్త ప్రకటించుటలో నాకు సహాయము చేసినందుకు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]])
111:6s1l8πεποιθὼς1నా గట్టి నమ్మకం
121:6jf4xὁ ἐναρξάμενος1ప్రారంభించిన దేవుడు
131:7v7yuἐστιν δίκαιον ἐμοὶ1నాకిది సబబే లేక “నాకిది మంచిదే”
141:7fmc6rc://*/ta/man/translate/figs-metonymyτὸ ἔχειν με ἐν τῇ καρδίᾳ ὑμᾶς1ఇక్కడ “హృదయము” అనే పదము ఒక వ్యక్తి యొక్క భావములకు అతిశయోక్తిగా వాడబడియున్నది. ఈ పదబంధము బలమైన అనుబంధమును వ్యక్తపరచుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]] మరియు [[rc://te/ta/man/translate/figs-idiom]])
151:7jn2sσυνκοινωνούς μου τῆς χάριτος & ὄντας1మీరంతా ఈ కృపలో నాతో పాలివారుగా ఉన్నారు లేక “నాతో పాటు కృపను పంచుకొనియున్నారు”
161:8sf3aμάρτυς & μου ὁ Θεός1దేవునికి తెలుసు లేక “దేవుడు అర్థంచేసికొనును”
171:8xun1rc://*/ta/man/translate/figs-abstractnounsἐν σπλάγχνοις Χριστοῦ Ἰησοῦ1“కనికరం” అనే నైరూప్య నామవాచక పదమును “ప్రేమ” అనే క్రియాపదముతో తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరియు క్రీస్తు యేసు మనలందరిని ప్రియముగా ప్రేమించు రీతిగానే నేను మిమ్మును ప్రేమించుచున్నాను” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-abstractnouns]])
181:9v2rwConnecting Statement:0# Connecting Statement:\n\nఫిలిప్పీలోని విశ్వాసుల కొరకు పౌలు ప్రార్థించుచున్నాడు మరియు ప్రభువు కొరకు శ్రమపడుటలోని ఆనందమును గూర్చి మాట్లాడుచున్నాడు.
191:9l2jlrc://*/ta/man/translate/figs-metaphorἔτι & περισσεύῃ1ప్రజలు అత్యధికముగా పొందుకొను వస్తువులవలె ఉన్నదని పౌలు ప్రేమను గూర్చి చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వృద్ధి చెందుతూ” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
201:9l1cyrc://*/ta/man/translate/figs-explicitἐν ἐπιγνώσει καὶ πάσῃ αἰσθήσει1ఇక్కడ “వివేచన” అనే పదము దేవుని గూర్చి అర్థం చేసికొనుటను సూచించుచున్నది. ఇది స్పష్టంగా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవునికి ఇష్టమైన వాటిని గూర్చి మీరు అర్థం చేసుకొని మరియు నేర్చుకొనుచున్నప్పుడు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-explicit]])
211:10e17gδοκιμάζειν1ఇది విషయాలను పరిశీలించి మరియు శ్రేష్ఠమైనవాటిని మాత్రమే తీసుకొనుటను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “పరీక్షించి మరియు ఎంచుకో” (చూడండి: @)
221:10s4ecτὰ διαφέροντα1దేవునికి ఇష్టకరమైన విషయాలు ఏవి
231:10siv8rc://*/ta/man/translate/figs-doubletεἰλικρινεῖς καὶ ἀπρόσκοποι1“యథార్థంగా” మరియు “నిర్దోషంగా” అనే పదములు సహజముగా ఒకే అర్థమును కలిగియున్నది. పౌలు నైతిక పరిశుద్ధతను నొక్కి చెప్పడానికి ఈ పదములను కలిపి ఉపయోగించియున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సంపూర్ణముగా మచ్చలేకుండుండుట” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-doublet]])
241:11lu5nrc://*/ta/man/translate/figs-metaphorπεπληρωμένοι καρπὸν δικαιοσύνης τὸν διὰ Ἰησοῦ Χριστοῦ1దేనితోనో నింపబడియుండుట అనేది ఒక దానిని క్రమబద్దముగా చేసి దానిని అలవాటుగా చేసికొనియున్న దానిని రూపకఅలంకారముగా ఉపయోగించబడియున్నది. నీతి ఫలమునకు ఈ అర్థములు కూడా ఉండవచ్చును 1) అది నీతి ప్రవర్తనను సూచించు రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు క్రీస్తు మిమ్మును సమర్థులుగా చేసియున్నందున అలవాటుగా నీతి పనులను చేయడం” లేక 2) అది నీతిమంతులుగా ఉండుటకు ప్రతిఫలముగా ఉన్న మంచి కార్యముల రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు మిమ్మును నీతిమంతులుగా చేసెను గనుక అలవాటుగా మంచి పనులను చేయడం” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
251:11hwg1εἰς δόξαν καὶ ἔπαινον Θεοῦ1దీనికి ఈ అర్థములు కూడా ఉండవచ్చును 1) “అప్పుడు నీవు దేవుని ఏవిధముగా ఘనపరచుచున్నావని ఇతర ప్రజలు చూచెదరు” లేక 2) “నీవు చేయు మంచి కార్యములను చూచి ప్రజలు దేవునికి స్తుతులు చెల్లించెదరు మరియు దేవునిని ఘనపరచుదురు.” ఈ ప్రత్యామ్నాయ తర్జుమాలకు క్రొత్త వాక్యము అవసరమైయుండవచ్చు.
261:12uyc6General Information:0# General Information:\n\n“సువార్త వ్యాపకం” ద్వారా రెండు సంగతులు జరిగాయని పౌలు చెప్పుచున్నాడు: రాజ భవనం లోపల మరియు బయటనున్న అనేక ప్రజలు అతను చెరసాలలో ఎందుకున్నాడు అని తెలిసికొన్నారు మరియు సువార్త ప్రకటించడానికి తక్కిన క్రైస్తవులు ఇక ఎన్నడు భయపడరు.
271:12yrp2δὲ & βούλομαι1ఇక్కడ “ఇప్పుడు” అనే పదము పత్రికలోని క్రొత్త భాగమునకు గురుతుగా ఉన్నది.
281:12tu2tἀδελφοί1ఇక్కడ దీనికి స్త్రీ పురుషులు కలిసియున్న తోటి క్రైస్తవులు అని అర్థం, ఎందుకనగా క్రీస్తులోని విశ్వాసులందరు ఒకే ఆత్మీయ కుటుంబ సభ్యులుగా ఉన్నారు మరియు వారికి దేవుడు పరలోకపు తండ్రిగా ఉన్నాడు.
291:12zy4grc://*/ta/man/translate/figs-explicitὅτι τὰ κατ’ ἐμὲ1చెరసాలలో తన సమయమును గూర్చి పౌలు మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసును గూర్చి ప్రకటించినందుకు నేను చెరసాలలో వేయబడినందున నాకు సంభవించిన సంగతులు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-explicit]])
301:12q288μᾶλλον εἰς προκοπὴν τοῦ εὐαγγελίου ἐλήλυθεν1అనేక మంది సువార్త వినులాగున చేసినది
311:13h1lyrc://*/ta/man/translate/figs-metaphorτοὺς δεσμούς μου φανεροὺς ἐν Χριστῷ1క్రీస్తు కోసమైన సంకెళ్ళు అనే మాట క్రీస్తు కొరకు చెరసాలలో ఉండడం అనే దానికి అతిశయోక్తిగా వాడబడియున్నది. “తెలియవచ్చెను” అనే మాటకు “వేలుగులోనికి వచ్చెను” అనే రూపఅకలంకారము ఉపయోగించబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను క్రీస్తు కొరకు చెరసాలలో ఉన్నానని తెలియవచ్చెను” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
321:13wi6nrc://*/ta/man/translate/figs-activepassiveτοὺς δεσμούς μου φανεροὺς ἐν Χριστῷ & τῷ πραιτωρίῳ & τοῖς λοιποῖς πᾶσιν1దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను క్రీస్తు కోసము సంకెళ్ళలో ఉన్నానని రాజభవన కావలివారు మరియు రోమాలోని తక్కిన జనులకు తెలిసింది” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-activepassive]])
331:13f8azτοὺς δεσμούς μου & ἐν Χριστῷ1ఇక్కడ పౌలు “కొరకు” అనే పదమునకు బదులుగా “లో” అనే విభక్తి పదమును ఉపయోగించియున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తు కొరకు నా సంకెళ్ళు” లేక “నా సంకెళ్ళు ఎందుకంటే నేను ప్రజలకు క్రీస్తును గూర్చి బోధించాను”
341:13i46jrc://*/ta/man/translate/figs-metonymyτοὺς δεσμούς μου1ఇక్కడ నిర్బంధంలో ఉన్నదానికి అతిశయోక్తిగా “సంకెళ్ళు” అనే పదము ఉపయోగించబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా నిర్బంధనలో” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]])
351:13dm1mπραιτωρίῳ1రోమా చక్రవర్తిని కాపాడడానికి ఈ సైనికుల గుంపు సహాయం చేసింది.
361:14gy47ἀφόβως τὸν λόγον λαλεῖν1దేవుని సందేశమును నిర్భయంగా చెప్పుట
371:15vw1sτινὲς μὲν καὶ & τὸν Χριστὸν κηρύσσουσιν1క్రీస్తును గూర్చి సువార్తను కొంత మంది ప్రకటించుచున్నారు
381:15f32hδιὰ φθόνον καὶ ἔριν1ఎందుకనగా ప్రజలు నా మాటలు వినడం వారికిష్టం లేదు మరియు వారు కలహం కలుగజేయుచున్నారు
391:15v1sbτινὲς δὲ καὶ δι’ εὐδοκίαν1అయితే కొంతమంది కనికరం కలిగియున్నారు మరియు వారు సహాయము చేయనుద్దేశించి దానిని చేయుచున్నారు
401:16qf4pοἱ1మంచి ఉద్దేశ్యముతో క్రీస్తును ప్రకటించు వారు
411:16ttr2rc://*/ta/man/translate/figs-activepassiveεἰς ἀπολογίαν τοῦ εὐαγγελίου κεῖμαι1దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. దీనికి ఈ అర్థములు కూడా ఉండవచ్చును 1) “సువార్త పక్షమున వాదించడానికి దేవుడు నియమించాడు” లేక 2) “నేను సువార్త పక్షమున ఉన్నాను గనుక నేను చెరసాలలో ఉన్నాను.” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-activepassive]])
421:16st7kεἰς ἀπολογίαν τοῦ εὐαγγελίου1యేసును గూర్చిన సందేశము సత్యమని అందరికి బోధించడానికి
431:17eq7sοἱ δὲ1అయితే కొందరు లేక “అయితే కలహముతో మరియు అసూయతో క్రీస్తును గూర్చి ప్రకటించేవారు”
441:17z8tyrc://*/ta/man/translate/figs-metonymyτοῖς δεσμοῖς μου1ఇక్కడ “బంధకాలు” అనే పదము చెరసాలలో వేయబడుటకు అతిశయోక్తిగా వాడబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను చెరసాలలో ఉన్నప్పుడు” లేక “నేను సంకెళ్ళలో ఉన్నప్పుడు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]])
451:18z5iarc://*/ta/man/translate/figs-rquestionτί γάρ1[ఫిలిప్పీయులకు 15-17] (./15.ఎండి). వచనములో అతను వ్రాసిన సందర్భమును గూర్చి తనకు ఏమి అనిపించుచున్నదని చెప్పుటకు పౌలు ఈ ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. దీనికి ఈ అర్థములు కూడా ఉండవచ్చును 1) ఇది “దానిని పట్టించుకోనక్కరలేదు” అనే అర్థమిచ్చే పదబంధమైయున్నది. లేక 2) “నేను దీనిని గూర్చి ఆలోచించనా” అనే మాట ప్రశ్నలో ఒక భాగమని అర్థం చేసుకోగలము. ప్రత్యామ్నాయ తర్జుమా: “దీనిని గూర్చి నేను ఏమని ఆలోచించాలి?” లేక “దానిని గూర్చి నేను ఇలా ఆలోచించుచున్నాను” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-rquestion]] మరియు [[rc://te/ta/man/translate/figs-ellipsis]])
461:18ah9vπλὴν ὅτι παντὶ τρόπῳ, εἴτε προφάσει εἴτε ἀληθείᾳ, Χριστὸς καταγγέλλεται1ప్రజలు క్రీస్తును గూర్చి ప్రకటించుచున్నంత వరకు, వారు మంచి ఉద్దేశ్యములతో చేయుచున్నారా లేక చెడు ఉద్దేశ్యములతో చేయుచున్నారా అని పట్టించుకోనక్కరలేదు
471:18c8trἐν τούτῳ χαίρω1ప్రజలు యేసుని గూర్చి ప్రకటించుచున్నందున నేను సంతోషించుచున్నాను
481:18cf58χαρήσομαι1నేను సంబరం చేసుకొందును లేక “నేను ఆనందించెదను”
491:19qp81τοῦτό μοι ἀποβήσεται εἰς σωτηρίαν1అయితే ప్రజలు క్రీస్తును గూర్చి ప్రకటించెదరు, దేవుడు వారిని విడిపించును
501:19h9hfrc://*/ta/man/translate/figs-abstractnounsμοι & εἰς σωτηρίαν1ఒక వ్యక్తిని మరియొక వ్యక్తి సురక్షిత ప్రాంతమునకు తీసుకురావడమును సూచించడానికి విడుదల అనే నైరూప్య నామవాచకమును ఇక్కడ ఉపయోగించబడియున్నది. దేవుడు అతనిని విడిపించునని పౌలు ఎదురుచూస్తున్నాడని మీరు స్పష్టంచేయగలరు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సురక్షిత ప్రాంతమునకు నేను తీసుకోనిరాబడుట” లేక “దేవునిలో నేను సురక్షిత స్థలమునకు తీసుకోనిపొబడెదను” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-abstractnouns]])
511:19x3fsδιὰ τῆς ὑμῶν δεήσεως, καὶ ἐπιχορηγίας τοῦ Πνεύματος Ἰησοῦ Χριστοῦ1మీ ప్రార్థనల వలన మరియు యేసు క్రీస్తు ఆత్మ నాకు సహాయము వలన
521:19c48jΠνεύματος Ἰησοῦ Χριστοῦ1పరిశుద్ధాత్మ
531:20fh48rc://*/ta/man/translate/figs-doubletκατὰ τὴν ἀποκαραδοκίαν καὶ ἐλπίδα μου1ఇక్కడ “నిరీక్షణ” అనే పదము మరియు “నిబ్బరమైన ఆశాభావం” అనే మాట ఒకే అర్థమును స్పురింపజేయుచున్నవి. అతని నిరీక్షణ ఎంత బలముగా ఉన్నదని నొక్కి చెప్పడానికి పౌలు ఈ మాటలను కలిపి ఉపయోగించియున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను ఆతురతతో మరియు నిబ్బరముగా ఆశాభావం కలిగియున్నాను” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-doublet]])
541:20tk7lἀλλ’ ἐν πάσῃ παρρησίᾳ1ఇది పౌలు నిరీక్షణ మరియు ఆశాభావంలో భాగమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అయితే నేను చాలా ధైర్యంగా ఉంటాను”
551:20jz1zrc://*/ta/man/translate/figs-metonymyμεγαλυνθήσεται Χριστὸς ἐν τῷ σώματί μου1“నా శరీరము” అనే మాట పౌలు తన దేహమునకు ఏమి జరుగునో అనే దానికి అతిశయోక్తిగా ఉన్నది. దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. దీనికి ఈ అర్థములు కూడా ఉండవచ్చును 1) “నేను చేయు పనులతో క్రీస్తును ఘనపరచెదను” లేక 2) “నేను చేయు పనులను బట్టి ప్రజలు క్రీస్తును స్తుతించెదరు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]] మరియు [[rc://te/ta/man/translate/figs-activepassive]])
561:20y78kεἴτε διὰ ζωῆς εἴτε διὰ θανάτου1నేను జీవించిన లేక మరణించిన లేక “నేను జీవించుచున్న లేక నేను మరణించిన”
571:21p9b7ἐμοὶ γὰρ1ఈ మాటలు నొక్కి చెప్పబడియున్నాయి. ఇది పౌలు వ్యక్తిగత అనుభవం అని అవి సూచించుచున్నవి.
581:21sxt5rc://*/ta/man/translate/figs-metaphorτὸ ζῆν Χριστὸς1ఇక్కడ క్రీస్తును సేవించడం మరియు ఆయనను సంతోషపెట్టడం పౌలు జీవించడానికి కలిగియున్న ఏకైక లక్ష్యమని చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “జీవించుచున్నది క్రీస్తును సంతోషపెట్టడానికి ఒక అవకాశం” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
591:21n3jdrc://*/ta/man/translate/figs-metaphorτὸ ἀποθανεῖν κέρδος1ఇక్కడ మరణము “లాభముగా” చెప్పబడియున్నది. “లాభము” అనే పదముకు ఈ అర్థములు కూడా ఉండవచ్చును 1) పౌలు మరణము ద్వారా సువార్త వ్యాప్తిచెందుతుంది లేక 2) పౌలు ఇంకా మంచి పరిస్థితితో ఉంటాడు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
601:22a21crc://*/ta/man/translate/figs-metonymyεἰ δὲ τὸ ζῆν ἐν σαρκί1“శరీరం” అనే పదము దేహమునకు అతిశయోక్తిగాను మరియు “శరీరములో జీవించడం” అనేది జీవించడానికి అతిశయోక్తిగా వాడబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అయితే నేను నా శరీరములో జీవించుచున్న యెడల” లేక “అయితే నేను జీవించుచున్నయెడల” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]])
611:22y9fvκαὶ τί αἱρήσομαι1అయితే నేను ఏమి కోరుకోవాలి?
621:22mwl6rc://*/ta/man/translate/figs-metaphorτοῦτό μοι καρπὸς ἔργου1“ఫలము” అనే పదము ఇక్కడ పౌలు చేసిన పనులకు కలిగిన మంచి ప్రతిఫలమును సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అంటే నేను పని చేయగలను మరియు నా పని మంచి ప్రతిఫలములను కలుగజేయును” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]] మరియు [[rc://te/ta/man/translate/figs-explicit]])
631:23tq29rc://*/ta/man/translate/figs-metaphorσυνέχομαι δὲ ἐκ τῶν δύο1రెండు వేవేరు దిశలలో నుండి ఒకే సారి అతనిని నెట్టుచున్న బండలు లేక మొద్దుల వలె భారము కలిగన వస్తువులు లాగా మరణము మరియు జీవము ఉన్నవని, వాటిలో దేనిని ఎన్నుకోవడం ఎంత కష్టమని పౌలు చెప్పుచున్నాడు. మీ భాషలో రెండు వస్తువులు నెట్టుచున్నాయి అనేదానికి బదులుగా లాగుతున్నాయి అని చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను ఒత్తిడికి గురవ్వుతున్నాను. నేను జీవమును ఎన్నుకోవాలా లేక మరణమును ఎన్నుకోవాలా అని నాకు తెలియడంలేదు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
641:23f7qgrc://*/ta/man/translate/figs-euphemismτὴν ἐπιθυμίαν ἔχων εἰς τὸ ἀναλῦσαι καὶ σὺν Χριστῷ εἶναι1అతని చనిపోవడానికి భయపడటం లేదని తెలియపరచడానికి పౌలు ఇక్కడ సభ్యోక్తిని ఉపయోగించియున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను మరణించుటకు ఇష్టపడెదను ఎందుకంటే నేను క్రీస్తుతో ఉండటానికి వెళ్ళెదను” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-euphemism]])
651:25bu8dτοῦτο πεποιθὼς1నేను జీవించునది మీకు మేలు అని నాకు నిశ్చయత ఉన్నందున
661:25kmp4οἶδα ὅτι μενῶ1నేను జీవించుటకు కొనసాగించెదనని నాకు తెలియును లేక “నేను జీవించుచుండెదనని నాకు తెలుసు”
671:26i9clἵνα & ἐν ἐμοὶ1తద్వారా నా వలన లేక “తద్వారా నేను చేయువాటివలన”
681:27cd3brc://*/ta/man/translate/figs-parallelismὅτι στήκετε ἐν ἑνὶ πνεύματι, μιᾷ ψυχῇ συναθλοῦντες τῇ πίστει τοῦ εὐαγγελίου1“ఏక భావంతో నిలిచియున్నారని” మరియు “కలిసికట్టుగా ఒక్క మనస్సుతో పోరాడుచు” అనే మాటలు ఒకే అర్థమును కలిగియున్నాయి మరియు ఐక్యత యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పడానికి ఉపయోగించబడియున్నాయి. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-parallelism]])
691:27jey6rc://*/ta/man/translate/figs-metaphorμιᾷ ψυχῇ συναθλοῦντες1కలిసికట్టుగా ఒక్క మనస్సుతో పోరాడుచు. ఒకరితో ఒకరు ఏకభావము కలిగియుండుటను ఒక్క మనస్సు కలిగియుండడం అని చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒకరితో ఒకరు ఎకభావము కలిగియుండి మరియు కలిసికట్టుగా పోరాడుట” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
701:27ej2sσυναθλοῦντες1కలిసి కష్టపడి పనిచేయుట
711:27ya3hτῇ πίστει τοῦ εὐαγγελίου1దీనికి ఈ అర్థములు కూడా ఉండవచ్చును 1) “సువార్తపై ఆధారమైన విశ్వాసమును చెప్పుట” లేక 2) “సువార్త మనకు బోధించిన ప్రకారము దానిని నమ్ముట మరియు దాని ప్రకారము జీవించుట”
721:28i9ytrc://*/ta/man/translate/figs-youμὴ πτυρόμενοι ἐν μηδενὶ1ఫిలిప్పీ విశ్వాసులకు ఇది ఒక ఆజ్ఞయైయున్నది. మీ భాషలో బహువచన ఆజ్ఞ ఉన్నట్లయితే దానిని ఇక్కడ ఉపయోగించండి. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-you]])
731:28l495ἥτις ἐστὶν αὐτοῖς ἔνδειξις ἀπωλείας, ὑμῶν δὲ σωτηρίας, καὶ τοῦτο ἀπὸ Θεοῦ1దేవుడు వారిని నాశనము చేయునని మీ ధైర్యం వారికి చూపించును. దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు అని కూడా అది వారికి చూపించును
741:28nb4bκαὶ τοῦτο ἀπὸ Θεοῦ1మరియు ఇది దేవుని వలన కలిగినది. “ఇది” అనే పదమునకు ఈ అర్థములు కూడా సూచించవచ్చును 1) విశ్వాసుల ధైర్యము లేక 2) గురుతు లేక 3) నాశనము మరియు రక్షణ.
751:30x4z3τὸν αὐτὸν ἀγῶνα ἔχοντες, οἷον εἴδετε ἐν ἐμοὶ, καὶ νῦν ἀκούετε ἐν ἐμοί1నేను శ్రమబడినది మీరు చూసిన ప్రకారము మీరు శ్రమబడెదరు మరియు నేను ఇంకా శ్రమనొందుచున్నాను