translationCore-Create-BCS_.../tn_1TH.tsv

90 KiB
Raw Permalink Blame History

1ReferenceIDTagsSupportReferenceQuoteOccurrenceNote
2front:introjp2y0# 1 థెస్సలొనీకయులకు పత్రిక పరిచయం\n ## భాగ1: సాధారణ పరిచయం \n\n ### 1 థెస్సలోనీకయుల పుస్తకం యొక్క గ్రంధ విభజన \n\n 1. శుభములు (1: 1) \n 1. థెస్సలోనికయ క్రైస్తవుల కొరకు కృతజ్ఞతా ప్రార్థన (1: 2-10) \n 1. థెస్సలోనికయలో పౌలు పరిచర్య (2: 1-16) \n 1. వారి ఆధ్యాత్మిక వృద్ధి విషయమై పౌలు భారములు \n - తల్లివలే (2: 7) \n - తండ్రివలే (2:11) \n 1. పౌలు తిమోతిని థెస్సలొనీకయకు పంపుతాడు మరియు తిమోతి పౌలుకు తిరిగి నివేదించాడు (3: 1-13) \n1. ఆచరణాత్మక సూచనలు\n - దేవుణ్ణి సంతోషపెట్టడానికి జీవించుట (4: 1-12) \n - మరణించినవారి విషయమైన ఆదరణ (4: 12-18) \n - క్రీస్తు తిరిగి రాకడ దైవిక జీవనానికి ఒక ప్రేరణ (5: 1-11) \n 1 . ముగింపు ఆశీర్వాదాలు, కృతజ్ఞతలు మరియు ప్రార్థనలు (5: 12-28) \n\n ### 1 థెస్సలొనీకయులకు పత్రిక ఎవరు వ్రాసారు? \n\n 1 థెస్సలొనీకయులకు పత్రిక పౌలు వ్రాశాడు. పౌలు తార్సు నగరానికి చెందినవాడు. అతను తన ప్రారంభ జీవితంలో సౌలు అని పేరొందినవాడు. క్రైస్తవుడు కావడానికి ముందు పౌలు పరిసయ్యుడు. అతను క్రైస్తవులను హింసించాడు. అతను క్రైస్తవుడైన తరువాత, యేసును గురించి ప్రజలకు చెప్పడానికి అతను రోమా సామ్రాజ్యం అంతటా చాలాసార్లు ప్రయాణించాడు. \n\n కొరింథు నగరంలో ఉంటున్నప్పుడు పౌలు ఈ లేఖ రాశాడు. పౌలు బైబిల్లో ఉన్న అన్ని లేఖలలో, చాలా మంది పండితులు 1 థెస్సలొనీకయులకు పత్రిక పౌలు రాసిన మొదటి లేఖ అని అభిప్రాయపడుతున్నారు. \n\n ### 1 థెస్సలొనీకయుల పత్రిక ఎందుకు వ్రాయబడింది? ? ? \n\n పౌలు థెస్సలోనీక నగరంలోని విశ్వాసులకు ఈ లేఖ రాశాడు. నగరంలోని యూదులు అతనిని బలవంతంగా వెళ్ళగొట్టిన తర్వాత ఆయన దీనిని రాశారు. ఈ లేఖలో అతను బలవంతంగా వెళ్ళగొట్టబడినప్పటికీ, అతని సందర్శన విజయవంతం అయినట్లుగా తాను భావిస్తున్నట్లు చెప్పాడు. \n\n థెస్సలొనీక విశ్వాసుల గురించి తిమోతి నుండి వచ్చిన సమాచారానికి పౌలు స్పందించాడు. అక్కడి విశ్వాసులు హింసించబడ్డారు. దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా జీవించడాన్ని కొనసాగించమని ఆయన వారిని ప్రోత్సహించాడు. క్రీస్తు తిరిగి రాకముందే చనిపోయినవారికి ఏమి జరుగుతుందో వివరిస్తూ ఆయన వారిని ఆదరించాడు. \n\n ### ఈ పుస్తకం యొక్క శీర్షికను ఎలా అనువదించవచ్చు? \n\n అనువాదకులు ఈ పుస్తకాన్ని దాని సాంప్రదాయ శీర్షిక "1 థెస్సలొనీకయులకు" లేదా "మొదటి థెస్సలొనీకయులకు" అని పిలువడాన్ని ఎంచుకోవచ్చు. వారు అందుకు బదులుగా "థెస్సలొనికయలోని సంఘానికి పౌలు యొక్క మొదటి పత్రిక" లేదా "థెస్సలొనికయలోని క్రైస్తవులకు మొదటి పత్రిక" వంటి స్పష్టమైన శీర్షికను ఎంచుకోవడానికి కోరవచ్చు. (చూడండి: [[rc://te/ta/man/translate/translate-names]]) \n\n ## భాగం 2: ముఖ్యమైన మత మరియు సాంస్కృతిక అంశాలు \n\n ### యేసు యొక్క "రెండవ రాకడ" అనగా ఏమిటి? \n\n యేసు చివరికి భూమికి తిరిగి రావడం గురించి పౌలు ఈ లేఖలో ఎక్కువగా రాశాడు. యేసు తిరిగి వచ్చినప్పుడు, అతను మానవాళినంతటిని తీర్పు తీర్చుతాడు. . అతను సృష్టిని కూడా పరిపాలిస్తాడు, ప్రతిచోటా శాంతి ఉంటుంది. \n\n ### క్రీస్తు తిరిగి రాకముందే చనిపోయేవారికి ఏమి జరుగుతుంది?\n\nt క్రీస్తు తిరిగి రాకముందే చనిపోయేవారు తిరిగి జీవించి యేసుతోఉంటారని పౌలు స్పష్టం చేశాడు. వారు ఎప్పటికీ మృతులుగానే ఉండరు. థెస్సలొనీకయులను ప్రోత్సహించడానికి పౌలు దీనిని రాశాడు. ఎందుకనగా వారిలో కొందరు మరణించిన వారు యేసు తిరిగి వచ్చే ఆ గొప్ప రోజును కోల్పోతారని భయపడ్డారు. \n\n ## భాగం 3: ముఖ్యమైన తర్జుమా సమస్యలు \n\n ### "క్రీస్తులో" మరియు "ప్రభువులో" వంటి వ్యక్తీకరణల విషయంలో పౌలు అర్థం ఏమిటి? \n\n క్రీస్తుతో మరియు విశ్వాసులతో చాలా సన్నిహిత సహవాస భావనను వ్యక్తపరచడమే ఇక్కడ పౌలు ఉద్దేశ్యం. ఈ రకమైన వ్యక్తీకరణ గురించి మరిన్ని వివరాల కోసం దయచేసి రోమా పత్రిక పరిచయాన్ని చూడండి. \n\n ### 1 థెస్సలొనీకయుల పత్రిక యొక్క వచనాలలోని ప్రధాన సమస్యలు ఏమిటి? \n\n కింది వచనాల విషయంలో, బైబిల్ యొక్క నవీన తర్జుమాలు పాత తర్జుమాలకు భిన్నంగా ఉన్నాయి. ULT వచనం పాత పఠనాన్ని ఫుట్‌నోట్‌లో ఉంచుతూ ఆధునిక పఠనాన్ని కలిగి ఉంది. బైబిల్ యొక్క అనువాదం సాధారణ బాగంలో ఉంటే, అనువాదకులు ఆ తర్జుమాల్లో కనిపించే పఠనాన్ని ఉపయోగించడాన్ని పరిగణించాలి. కానిపక్షంలో, అనువాదకులు ఆధునిక పఠనాన్ని అనుసరించమని సలహా ఇవ్వబడుచున్నది. \n\n * “కృప మరియు శాంతి మీకు కలుగు గాక" (1: 1). కొన్ని పాత తర్జుమాలు చదవండి: "మన తండ్రి అయిన దేవుని నుండియు మరియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు మీకు కృప మరియు శాంతి కలుగును గాక." \n * "బదులుగా, పాలిచ్చే తల్లి తన పసిపిల్లలను సాకినట్టు తల్లిలాగే మేము మీతో మృదువుగా వ్యవహరించాం." (2: 7) ఇతర ఆధునిక సంస్కరణలు మరియు పాత సంస్కరణలు ఇలా ఉన్నాయి, "బదులుగా, ఒక తల్లి తన పిల్లలను ఓదార్చునట్లు మేము మీ మధ్య శిశువులలాగా ఉన్నాము." \n * " మన సోదరుడు మరియు క్రీస్తు సువార్త విషయంలో దేవుని సేవకుడు అయిన తిమోతి" (3: 2 ). ఇతర తర్జుమాలు ఇలా ఉన్నాయి: "మన సోదరుడు మరియు దేవుని సేవకుడు అయిన తిమోతి." \n\n (చూడండి: [[rc://te/ta/man/translate/translate-textvariants]]) \n
31:introy8c50# 1 థెస్సలొనీకయులు 01 సాధారణ గమనికలు \n ## నిర్మాణం మరియు ఆకృతీకరణ \n\n వచనం 1 అధికారికంగా ఈ లేఖను పరిచయం చేస్తుంది. పురాతన సమీప తూర్పు ప్రాంతంలోని ఉత్తరాలలో సాధారణంగా ఈ రకమైన పరిచయాలు ఉంటాయి. \n\n ## ఈ అధ్యాయంలోని ప్రత్యేక అంశాలు \n\n ### కష్టాలు \n థెస్సలొనీకాలో క్రైస్తవులను ఇతర వ్యక్తులు హింసించారు. కానీ అక్కడి క్రైస్తవులు దానిని చక్కగా నిర్వహించగలిగారు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-explicit]])
41:1dp37General Information:0# General Information:\n\nపౌలు తనను తాను పత్రిక రాసిన వ్యక్తిగా పేర్కొంటూ థెస్సలొనీకాలోని సంఘానికి శుభములుతెలియజేస్తున్నాడు.
51:1ms5erc://*/ta/man/translate/figs-explicitΠαῦλος, καὶ Σιλουανὸς, καὶ Τιμόθεος; τῇ ἐκκλησίᾳ1ఈ లేఖ రాసినది పౌలే అని UST స్పష్టం చేస్తుంది. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-explicit]])
61:1luw5rc://*/ta/man/translate/figs-metonymyχάρις ὑμῖν καὶ εἰρήνη1"కృప" మరియు "శాంతి" అనే పదాలు ప్రజల పట్ల దయతో మరియు శాంతియుతంగా వ్యవహరించే వ్యక్తికి ఉపయోగించే ఉపమానాలు. ప్రత్యామ్నాయ అనువాదం: "దేవుడు మీ పట్ల దయ చూపి మీకు శాంతిని ఇస్తాడు" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]])
71:1nn67rc://*/ta/man/translate/figs-youεἰρήνη1“మీకు” అనే పదం థెస్సలొనీక విశ్వాసులను సూచిస్తుంది. (చూడండి:[[rc://te/ta/man/translate/figs-you]])
81:2xud4εὐχαριστοῦμεν τῷ Θεῷ πάντοτε1పౌలు దేవుణ్ణి ప్రార్థించినప్పుడు, థెస్సలొనీకయులను తన ప్రార్థనలలో దేవునికి నిరంతరం సమర్పిస్తాడని ఇక్కడ వాడబడిన "ఎల్లప్పుడూ" అనే పదం సూచిస్తుంది.
91:2r3ydμνείαν ποιούμενοι ἐπὶ τῶν προσευχῶν ἡμῶν, ἀδιαλείπτως1ఎప్పుడూ మీకోసం ప్రార్ధిస్తూ ఉన్నాము.
101:3bl7lτοῦ ἔργου τῆς πίστεως1దేవునిలో ఉన్న నమ్మకాన్ని బట్టి కార్యాలు జరిగాయి.
111:4xky4Connecting Statement:0# Connecting Statement:\n\nపౌలు థెస్సలొనీకా వద్ద విశ్వాసులకు కృతజ్ఞతలు తెలుపుతూనే ఉన్నాడు మరియు దేవునిపై విశ్వాసం ఉంచినందుకు వారిని ప్రశంసిస్తున్నాడు.
121:4erb6ἀδελφοὶ1ఇక్కడ పురుషులు మరియు స్త్రీలను కలుపుకొని తోటి క్రైస్తవులు అని భావము.
131:4u5errc://*/ta/man/translate/figs-exclusiveεἰδότες1“మేము” అనే మాట థెస్సలొనీక విశ్వానులను కాక పౌలును, సిల్వానును, మరియు తిమోతిని సూచిస్తుంది. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-exclusive]])
141:5ude4οὐκ & ἐν λόγῳ μόνον1మేము చెప్పినవాటిలో మాత్రమే కాదు
151:5h675ἀλλὰ καὶ ἐν δυνάμει, καὶ ἐν Πνεύματι Ἁγίῳ1సాధ్యమయ్యే అర్ధాలు 1) పరిశుద్ధాత్మ పౌలుకు మరియు అతని సహచరులకు సువార్తను శక్తివంతంగా బోధించే సామర్థ్యాన్ని ఇచ్చాడు లేదా 2) పరిశుద్ధాత్మ దేవుడు సువార్త ప్రకటనను థెస్సలొనీకయ విశ్వాసులలో శక్తివంతమైన ప్రభావాన్ని కలిగించేలా చేశాడు లేదా 3) పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతాలు, సూచక క్రియలు మరియు ఆశ్చర్య కార్యాల ద్వారా సువార్త ప్రకటన సత్యాన్ని ప్రదర్శించాడు.
161:5t1w3rc://*/ta/man/translate/figs-abstractnounsκαὶ πληροφορίᾳ πολλῇ1నైరూప్య నామవాచకం ‘నిశ్చయత" ను క్రియగా అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "ఇది సత్యమని దేవుడు మీకు నిర్ధారించాడు" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-abstractnouns]])
171:5e889οἷοι1మీమధ్య ఉన్నప్పుడు మేమెలా ప్రవర్తించామో
181:6cs49καὶ ὑμεῖς μιμηταὶ & ἐγενήθητε1“అనుకరించడం” అనగా ఇతరులవలే ప్రవర్తించుట లేదా ఇతరుల ప్రవర్తనను అనుసరించుట
191:6cl6rδεξάμενοι τὸν λόγον1సందేశాన్ని ఆహ్వానించారు లేదా “మేము చెప్పవలసిన దానిని అంగీకరించారు”
201:6q4gmἐν θλίψει πολλῇ1తీవ్ర బాధలు కలిగిన సమయంలో లేదా “తీవ్ర హింసలలో”
211:7ml7urc://*/ta/man/translate/translate-namesἐν τῇ Ἀχαΐᾳ1ప్రస్తుత గ్రీస్‌లో ఉన్న పురాతన జిల్లా ఇది. (చూడండి: [[rc://te/ta/man/translate/translate-names]])
221:8qyk6rc://*/ta/man/translate/figs-metonymyὁ λόγος τοῦ Κυρίου1ఇక్కడ వాడబడిన పదం "సందేశం" యొక్క మారుపేరు. ప్రత్యామ్నాయ అనువాదం: "ప్రభువు యొక్క బోధలు" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]])
231:8sht4rc://*/ta/man/translate/figs-metaphorἐξήχηται1థెస్సలొనీక విశ్వాసులద్వారా బయల్పరచబడిన క్రైస్తవ సాక్ష్యo గురించి ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు, అది మోగించిన గంటవలే లేదా సంగీత వాయిద్యం వలే ఉన్నదన్నట్లుగా చెప్పాడు.. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
241:9rd2bαὐτοὶ γὰρ1థెస్సలొనీక విశ్వాసుల గురించి విన్న పరిసర ప్రాంతాలలో అప్పటికే ఉన్న సంఘాల గురించి పౌలు ప్రస్తావిస్తున్నాడు.
251:9amc1rc://*/ta/man/translate/figs-rpronounsαὐτοὶ1థెస్సలొనీక విశ్వాసుల గురించి విన్న వారిని గూర్చి చెప్పడానికి ఇక్కడ “వారు” అనే పదం ఉపయోగించబడింది. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-rpronouns]])
261:9v145rc://*/ta/man/translate/figs-metonymyὁποίαν εἴσοδον ἔσχομεν πρὸς ὑμᾶς1"రిసెప్షన్" అనే నైరూప్య నామవాచకం "స్వీకరించుట" లేదా "స్వాగతించుట" అనే క్రియగా వ్యక్తీకరించబడింది. ప్రత్యామ్నాయ అనువాదం: "మీరు మమ్మల్ని ఎంత హృదయపూర్వకంగా స్వీకరించారు" లేదా "మీరు మమ్మల్ని ఎంత హృదయపూర్వకంగా స్వాగతించారు" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]])
271:9u1umrc://*/ta/man/translate/figs-metaphorἐπεστρέψατε πρὸς τὸν Θεὸν ἀπὸ τῶν εἰδώλων, δουλεύειν Θεῷ ζῶντι καὶ ἀληθινῷ1ఇక్కడ "వదిలి ... తిరిగారో" అనేది ఒక రూపకం అంటే ఒక వ్యక్తికి విధేయత చూపడానికి ప్రారంభించడం మరియు మరొకరికి విధేయత చూపడాన్ని ఆపడం. ప్రత్యామ్నాయ అనువాదం: "మీరు విగ్రహాలను ఆరాధించడం మానేసి, సజీవమైన మరియు నిజమైన దేవునికి సేవ చేయడం ప్రారంభించారు" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
281:10dg6arc://*/ta/man/translate/guidelines-sonofgodprinciplesτὸν Υἱὸν αὐτοῦ1యేసుకు దేవునితో ఉన్న సంబంధాన్ని వివరించే ముఖ్యమైన శీర్షిక ఇది. (చూడండి: [[rc://te/ta/man/translate/guidelines-sonofgodprinciples]])
291:10pmi8ὃν ἤγειρεν1ఎవరికైతే దేవుడు తిరిగి జీవించడానికి కారణమయ్యాడో
301:10wba8ἐκ τῶν νεκρῶν1తద్వారా అతను మరణించి అలాగే ఉండలేదు. ఈ వ్యక్తీకరణ పాతాళంలో చనిపోయిన ప్రజలందరిని గూర్చి తెలియజేస్తుంది. వారి నుండి తిరిగి రావడానికి మళ్ళీ సజీవంగా మారడం గురించి మాట్లాడుతుంది.
311:10pt1src://*/ta/man/translate/figs-inclusiveτὸν ῥυόμενον ἡμᾶς1ఇక్కడ పౌలు థెస్సలొనీయ విశ్వాసులను కలిపి మాట్లాడుతున్నాడు. (చూడండి:[[rc://te/ta/man/translate/figs-inclusive]])
322:introkt5l0# 1 థెస్సలొనీకయులు 02 సాధారణ గమనికలు \n ## ఈ అధ్యాయంలోని ప్రత్యేక అంశాలు \n\n ### క్రైస్తవ సాక్ష్యo \n పౌలు సువార్త సత్యమని చెప్పడానికి తన "క్రైస్తవ సాక్ష్యము"ను విలువైనదిగా భావిస్తాడు. దైవభక్తి లేదా పరిశుద్దoగా ఉండటం క్రైస్తవేతరులకు సాక్ష్యముగా నిలుస్తుందని పౌలు చెప్పాడు. పౌలు తన ప్రవర్తనను సమర్థిస్తాడు, తద్వారా అతని సాక్ష్యం ప్రభావితం కాకుండా ఉంటుంది. (చూడండి: [[rc://te/tw/dict/bible/kt/testimony]] మరియు [[rc://te/tw/dict/bible/kt/godly]] మరియు [[rc://te/tw/dict/bible/kt/holy]]) \n
332:1pt75Connecting Statement:0# Connecting Statement:\n\nపౌలువిశ్వాసుల యొక్క సేవ మరియు బహుమానాన్ని నిర్వచిస్తున్నాడు.
342:1gpr4rc://*/ta/man/translate/figs-rpronounsαὐτοὶ1“మీ” మరియు“ మీకు” అని వాడబడిన పదాలు థెస్సలొనీయ విశ్వాసులను సూచిస్తాయి. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-rpronouns]])
352:1tdl3ἀδελφοί1ఇక్కడ దీని అర్ధం పురుషులు మరియు స్త్రీలు కలిపి సహ విశ్వాసులు అని.
362:1g6qqrc://*/ta/man/translate/figs-exclusiveτὴν εἴσοδον ἡμῶν1“మేము అనే మాట పౌలు, సిల్వాను, మరియు తిమోతిని సూచిస్తుంది కాని థెస్సలొనీయ విశ్వాసులను కాదు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-exclusive]])
372:1w584rc://*/ta/man/translate/figs-doublenegativesοὐ κενὴ γέγονεν1ఇది సానుకూల పద్ధతిలో వ్యక్తీకరించబడవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదం: "చాలా విలువైనది" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-doublenegatives]])
382:2x6ezπροπαθόντες καὶ ὑβρισθέντες1నిరాదరణకు మరియు అవమానాన్ని అనుభవించాము.
392:2v4dgἐν πολλῷ ἀγῶνι1గొప్ప వ్యతిరేకతలో పోరాడుతున్నప్పుడు
402:3t7tyοὐκ ἐκ πλάνης, οὐδὲ ἐξ ἀκαθαρσίας, οὐδὲ ἐν δόλῳ1సత్యమైన, పవిత్రమైన, మరియు నిజాయితీతో కూడినది.
412:4is1aδεδοκιμάσμεθα ὑπὸ τοῦ Θεοῦ, πιστευθῆναι1పౌలు దేవునిచే పరీక్షించబడి నమ్మకస్తుడని (యోగ్యుడని) రుజువుపరచబడ్డాడు.
422:4qqj2rc://*/ta/man/translate/figs-explicitλαλοῦμεν1పౌలు సువార్త సందేశాన్ని ప్రకటించడాన్ని సూచిస్తున్నాడు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-explicit]])
432:4k1m9rc://*/ta/man/translate/figs-metonymyτῷ δοκιμάζοντι τὰς καρδίας ἡμῶν1"హృదయాలు" అనే పదం ఒక వ్యక్తి యొక్క కోరికలు మరియు ఆలోచనలకు వాడబడిన ఒక మారుపేరు. ప్రత్యామ్నాయ అనువాదం: "మా కోరికలు మరియు ఆలోచనలు ఎవరికీ తెలుసో" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]])
442:5xcy6General Information:0# General Information:\n\nతన ప్రవర్తన ముఖస్తుతి, దురాశ లేదా ఆత్మ స్తుతిపై ఆధారపడలేదని థెస్సలొనీక విశ్వాసులకు పౌలు చెబుతాడు.
452:5i8crοὔτε & ἐν λόγῳ κολακίας ἐγενήθημεν1మేము మీతో తప్పుడు పొగడ్తలతో మాట్లాడలేదు.
462:7ag1lrc://*/ta/man/translate/figs-simileὡς ἐὰν τροφὸς θάλπῃ τὰ ἑαυτῆς τέκνα1ఒక తల్లి తన పిల్లలను సున్నితంగా ఆదరించినట్లే, పౌలు, సిల్వాను మరియు తిమోతి థెస్సలొనీక విశ్వాసులతో సున్నితంగా మాట్లాడారు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-simile]])
472:8r8b4οὕτως ὁμειρόμενοι ὑμῶν1ఈ విధంగా మేము మీపట్ల మా ఆప్యాయతను చూపాము.
482:8g73fὁμειρόμενοι ὑμῶν1మేము మిమ్మల్ని ప్రేమించాము.
492:8q86vrc://*/ta/man/translate/figs-metaphorεὐδοκοῦμεν μεταδοῦναι ὑμῖν, οὐ μόνον τὸ εὐαγγέλιον τοῦ Θεοῦ, ἀλλὰ καὶ τὰς ἑαυτῶν ψυχάς1సువార్త సందేశం మరియు అతని జీవితం మరియు అతనితో ఉన్నవారి జీవితాల గురించి అవి ఇతరులతో పంచుకోగల భౌతిక వస్తువులాగా పౌలు మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "మీకు దేవుని సువార్త చెప్పడానికి మాత్రమే కాకుండా, మీతో సమయాన్ని గడపడానికి మరియు మీకు సహాయం చేయడానికి మేము సంతోషిస్తున్నాము" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
502:8p4e4ἀγαπητοὶ ἡμῖν ἐγενήθητε1మీరు మాకు ఎంతో ఇష్టమైనవారు
512:9j9luἀδελφοί1ఇక్కడ దీని అర్ధం పురుషులు మరియు స్త్రీలు కలిసి తోటి క్రైస్తవులు.
522:9tc98rc://*/ta/man/translate/figs-doubletτὸν κόπον ἡμῶν καὶ τὸν μόχθον1"ప్రయాస" మరియు "కష్టము" అనే పదాలు ప్రాథమికంగా ఒకే విషయం. వారు ఎంత కష్టపడ్డారో నొక్కి చెప్పడానికి పౌలు వాటిని ఉపయోగించాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "మేము ఎంత కస్టపడి పని చేశామో" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-doublet]])
532:9b16fνυκτὸς καὶ ἡμέρας ἐργαζόμενοι, πρὸς τὸ μὴ ἐπιβαρῆσαί τινα ὑμῶν1కాబట్టి మీరు మాకు సహాయం చేయనవసరం లేకుండా మా స్వంత జీవనం కోసం మేము చాలా కష్టపడ్డాము.
542:10il3eὁσίως, καὶ δικαίως, καὶ ἀμέμπτως1థెస్సలొనీక విశ్వాసుల పట్ల వారి మంచి ప్రవర్తనను వివరించే మూడు పదాలను పౌలు ఉపయోగించాడు.
552:11i58mrc://*/ta/man/translate/figs-metaphorὡς πατὴρ τέκνα ἑαυτοῦ1ఎలా ప్రవర్తించాలో తన పిల్లలకు సున్నితంగా నేర్పించే తండ్రితో థెస్సలొనీకయులను తాను ప్రోత్సహించిన విధానాన్ని పౌలు పోల్చాడు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
562:12m91erc://*/ta/man/translate/figs-doubletπαρακαλοῦντες ὑμᾶς, καὶ παραμυθούμενοι, καὶ μαρτυρόμενοι & ὑμᾶς1పౌలు బృందం థెస్సలొనీకయులను ఎంత భారంతో ప్రోత్సహించిందో వ్యక్తీకరించడానికి "ఉపదేశించడం," "ప్రోత్సహించడం" మరియు "విజ్ఞప్తి" అనే పదాలు కలిసి ఉపయోగించబడ్డాయి. ప్రత్యామ్నాయ అనువాదం: "మేము మిమ్మల్ని గట్టిగా ప్రోత్సహిస్తున్నాము" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-doublet]])
572:12n8drrc://*/ta/man/translate/figs-hendiadysεἰς τὴν ἑαυτοῦ βασιλείαν καὶ δόξαν1“మహిమ” అనే పదం “రాజ్యము” అనే పదమును వివరిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “ఆయన స్వంత మహిమాన్విత రాజ్యము లోనికి” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-hendiadys]])
582:12qmc3rc://*/ta/man/translate/figs-metaphorεἰς τὸ περιπατεῖν ὑμᾶς ἀξίως τοῦ Θεοῦ1ఇక్కడ నడవడం "జీవించడానికి” వాడబడిన ఒక రూపకం. ప్రత్యామ్నాయ అనువాదం: "ప్రజలు దేవుని గురించి బాగా ఆలోచించేలా జీవించండి" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
592:13z53wκαὶ ἡμεῖς εὐχαριστοῦμεν τῷ Θεῷ ἀδιαλείπτως1తాను వారితో పంచుకున్న సువార్త సందేశాన్ని అంగీకరించినందుకు పౌలు తరచుగా దేవునికి కృతజ్ఞతలు తెలిపేవాడు.
602:13zj5frc://*/ta/man/translate/figs-synecdocheοὐ λόγον ἀνθρώπων1ఇక్కడ “మనుషుల మాట”గా వాడబడిన పదం "మనిషి నుండి వచ్చిన సందేశం"కు వాడబడిన క్లుప్త పదం. ప్రత్యామ్నాయ అనువాదం: "(ఇది) మనిషి ద్వారా రూపొందించబడిన సందేశం కాదు" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-synecdoche]])
612:13rpb1rc://*/ta/man/translate/figs-metonymyἐδέξασθε & καθὼς ἀληθῶς ἐστὶν, λόγον Θεοῦ1ఇక్కడ వాడబడిన పదం "సందేశం" యొక్క మారుపేరు. ప్రత్యామ్నాయ అనువాదం: "మీరు ఇది నిజంగానే దేవుని నుండి వచ్చిన సందేశం వలే" దీన్ని అంగీకరించారు ... (చూడండి:[[rc://te/ta/man/translate/figs-metonymy]])
622:13ci1erc://*/ta/man/translate/figs-personificationὃς καὶ ἐνεργεῖται ἐν ὑμῖν τοῖς πιστεύουσιν1పౌలు దేవుని సువార్త సందేశాన్ని పని చేస్తున్న వ్యక్తిగా పోల్చి మాట్లాడుతున్నాడు. "వాక్కు" అనేది "సందేశం" యొక్క మారుపేరు. ప్రత్యామ్నాయ అనువాదం: "మీలో విశ్వాసులైనవారు వింటున్నారు మరియు విధేయత చూపుటకు ప్రారంభిస్తున్నారు" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-personification]] మరియు [[rc://te/ta/man/translate/figs-metonymy]])
632:14s2mpἀδελφοί1ఇక్కడ దీని అర్ధం పురుషులు మరియు స్త్రీలు కలిసి సహ క్రైస్తవులు.
642:14mh8nμιμηταὶ ἐγενήθητε & τῶν ἐκκλησιῶν1థెస్సలొనీయ విశ్వాసులు యూదా విశ్వాసుల మాదిరిగానే హింసలను భరించారు. "దేవుని సంఘాల ను పొలి నడుచుకుంటున్నారు"
652:14cxm3ὑπὸ τῶν ἰδίων συμφυλετῶν1ఇతర థెస్సలొనీయుల నుండి
662:16rw7eκωλυόντων ἡμᾶς & λαλῆσαι1వారు ప్రకటించకుండా మమ్మల్ని అడ్డుకున్నారు
672:16n2uerc://*/ta/man/translate/figs-metaphorτὸ ἀναπληρῶσαι αὐτῶν τὰς ἁμαρτίας πάντοτε1ఎవరైనా తమ పాపాలతో ఒక కంటైనర్‌ను ద్రవంతో నింపగలిగినట్లు పోల్చి పౌలు మాట్లాడుతున్నాడు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
682:16fq9mἔφθασεν & ἐπ’ αὐτοὺς ἡ ὀργὴ εἰς τέλος1ఇది దేవుడు చివరకు ప్రజల పాపాలకు తీర్పు ఇవ్వడం మరియు శిక్షించడం సూచిస్తుంది.
692:17edb1ἀδελφοί1ఇక్కడ దీని అర్ధం పురుషులు మరియు స్త్రీలు కలిసి సహ క్రైస్తవులు.
702:17vr7vrc://*/ta/man/translate/figs-metonymyπροσώπῳ οὐ καρδίᾳ1ఇక్కడ "హృదయం" అనేది ఆలోచనలు మరియు భావోద్వేగాలను సూచిస్తుంది. పౌలు మరియు అతనితో ప్రయాణిస్తున్నవారు థెస్సలొనీక లో భౌతికంగా వారితో లేనప్పటికీ, వారు అక్కడి విశ్వాసుల గురించి శ్రద్ధ తీసుకోవడం మరియు ఆలోచించడం కొనసాగించారు. ప్రత్యామ్నాయ అనువాదం: "ముఖాముఖిగా, కానీ మేము మీ గురించి ఆలోచిస్తూనే ఉన్నాము" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]])
712:17t5d5rc://*/ta/man/translate/figs-synecdocheτὸ πρόσωπον ὑμῶν ἰδεῖν1ఇక్కడ "మీ ముఖము" అంటే మొత్తం వ్యక్తి అని అర్ధం. ప్రత్యామ్నాయ అనువాదం: "మిమ్మల్ని చూడటానికి" లేదా "మీతో ఉండటానికి" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-synecdoche]])
722:19j7j5rc://*/ta/man/translate/figs-rquestionτίς γὰρ ἡμῶν ἐλπὶς ἢ χαρὰ ἢ στέφανος καυχήσεως? ἢ οὐχὶ καὶ ὑμεῖς, ἔμπροσθεν τοῦ Κυρίου ἡμῶν, Ἰησοῦ, ἐν τῇ αὐτοῦ παρουσίᾳ?1పౌలు థెస్సలొనీక విశ్వాసులను చూడాలనుకుంటున్న కారణాలను నొక్కి చెప్పడానికి ప్రశ్నలను ఉపయోగిస్తాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "భవిష్యత్తులో మన ప్రభువైన యేసు రాకడలో మా ఆశ, ఆనందము, అతిశయ కిరీటము ఆయన యెదుట మీరే." (చూడండి: [[rc://te/ta/man/translate/figs-rquestion]])
732:19mj9nrc://*/ta/man/translate/figs-metonymyἡμῶν ἐλπὶς & ἢ οὐχὶ καὶ ὑμεῖς1"ఆశ" ద్వారా పౌలు భావమేమంటే దేవుడు తన పనికి ప్రతిఫలమిస్తాడనే భరోసా. అతని ఆశకు థెస్సలొనీయ క్రైస్తవులు కారణం. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]])
742:19ty78rc://*/ta/man/translate/figs-metonymyἢ χαρὰ1అతని ఆనందానికి థెస్సలొనీకయులే కారణం. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]])
752:19e7tlrc://*/ta/man/translate/figs-metonymyστέφανος καυχήσεως1ఇక్కడ "కిరీటం" అనేది విజయవంతమైన అథ్లెట్లకు (జెట్టియైనవారికి) ఇచ్చే లారెల్ దండను సూచిస్తుంది. "అతిశయ కిరీటం" అనే వ్యక్తీకరణ అంటే విజయానికి ప్రతిఫలం, లేదా బాగా చేసినది అనే భావం. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]])
763:introj3790# 1 థెస్సలొనీకయులు 03 సాధారణ గమనికలు \n ## ఈ అధ్యాయంలోని ప్రత్యేక అంశాలు \n\n ### నిలుచుట\n ఈ అధ్యాయంలో, పౌలు స్థిరంగా ఉండటాన్ని వివరించడానికి "నిలుకడగా ఉండుట"ను ఉపయోగించాడు. స్థిరంగా ఉండుట లేదా నమ్మకంగా ఉండుట అనేది వివరించడానికి ఇది ఒక సాధారణ మార్గం. పౌలు స్థిరంగా ఉండటానికి విరుద్ధంగా "చెదిరిపోవుట" అని ఉపయోగించాడు. (చూడండి: [[rc://te/tw/dict/bible/kt/faithful]]) \n
773:1nal1Connecting Statement:0# Connecting Statement:\n\nవిశ్వాసులను బలపరచడానికి తిమోతిని పంపినట్లు పౌలు తెలియజేస్తున్నాడు.
783:1fqe3μηκέτι στέγοντες1మేము మీ గురించి చింతిస్తూ ఉండక
793:1t3vtηὐδοκήσαμεν καταλειφθῆναι ἐν Ἀθήναις μόνοι1సిల్వాను మరియు నేను ఏథెన్సులో ఒంటరిగా ఉండుట మంచిదని
803:1qhj4ηὐδοκήσαμεν1ఇది సరైనది లేదా “ఇది సహేతుకమైనది”
813:1laf9rc://*/ta/man/translate/translate-namesἈθήναις1ఇది అకయ ప్రాంతంలోని ఒక నగరం, ఇది ఇప్పుడు ఆధునిక గ్రీసుగా పిలువబడుచున్నది.. (చూడండి: [[rc://te/ta/man/translate/translate-names]])
823:2d8yyτὸν ἀδελφὸν ἡμῶν, καὶ διάκονον1ఈ రెండు వ్యక్తీకరణలు కూడా తిమోతిని గూర్చే తెలియజేస్తున్నాయి.
833:3y74mrc://*/ta/man/translate/figs-idiomμηδένα σαίνεσθαι1"చెదిరిపోవడం" అనే మాట భయపడటానికి వాడబడిన ఒక జాతీయం. ప్రత్యామ్నాయ అనువాదం: "క్రీస్తుపై నమ్మకం ఉంచడంలో ఎవరూ భయపడరు" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-idiom]])
843:3rkx9rc://*/ta/man/translate/figs-explicitκείμεθα1వారిని నియమించినది దేవుడేనని అందరికీ తెలుసు అని పౌలు అనుకొంటున్నాడు. దీన్నిస్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "దేవుడు మనలను నియమించాడు" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-explicit]])
853:4nm1lθλίβεσθαι1ఇతరులచేత తప్పుగా వ్యవహరించబడుటకు
863:5st3drc://*/ta/man/translate/figs-idiomκἀγὼ μηκέτι στέγων1పౌలు ఒక జాతీయాన్ని ఉపయోగించి తన భావోద్వేగాలను వివరించాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "నేను ఇక ఉండబట్టలేక" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-idiom]])
873:5zn36rc://*/ta/man/translate/figs-explicitἔπεμψα1పౌలు తిమోతిని పంపించాడని సూచించబడింది. దీన్ని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "నేను తిమోతిని పంపాను" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-explicit]])
883:5g92sὁ κόπος ἡμῶν1మీ మధ్య మా ప్రయాస లేదా “మీ మధ్య మా బోధ”
893:5ne5xεἰς κενὸν1వ్యర్ధమైపోయిందేమో
903:6r4paConnecting Statement:0# Connecting Statement:\n\nవారిని దర్శించిన తర్వాత తిమోతి ఇచ్చిన సమాచారం గురించి పౌలు తన పాఠకులకు తెలియజేస్తున్నాడు.
913:6gci4rc://*/ta/man/translate/figs-exclusiveἐλθόντος & πρὸς ἡμᾶς1“మమ్మల్ని” అనే పదం పౌలును మరియుసిల్వానును సూచిన్తుంది. (చూడండి:[[rc://te/ta/man/translate/figs-exclusive]])
923:6tu8drc://*/ta/man/translate/figs-explicitεὐαγγελισαμένου & τὴν πίστιν & ὑμῶν1ఇది క్రీస్తులో ఉంచే విశ్వాసాన్ని సూచిస్తుందని అర్ధం అవుతుంది. దీన్ని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "మీ విశ్వాసంను గూర్చిన మంచి వార్త" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-explicit]])
933:6e6kxἔχετε μνείαν & ἀγαθὴν πάντοτε1వారు పౌలు గురించి ఆలోచించినప్పుడు, వారెల్లప్పుడూ అతని గురించి మంచి ఆలోచనలు కలిగి ఉందేవారు.
943:6tx4hἐπιποθοῦντες ἡμᾶς ἰδεῖν1మమ్మల్ని చూడాలని ఆశపడుతున్నారు
953:7mqy5ἀδελφοί1ఇక్కడ “సోదరులు” అనగా తోటి క్రైస్తవులు
963:7k54jrc://*/ta/man/translate/figs-explicitδιὰ τῆς ὑμῶν πίστεως1ఇది క్రీస్తులో విశ్వాసాన్ని సూచిస్తుంది. దీన్ని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "క్రీస్తులో మీ విశ్వాసం కారణంగా" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-explicit]])
973:7csz7rc://*/ta/man/translate/figs-doubletἐπὶ πάσῃ τῇ ἀνάγκῃ καὶ θλίψει ἡμῶν1"ఇబ్బంది" అనే పదం వారు ఎందుకు "బాధలో" ఉన్నారో వివరిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: "మా ఇబ్బందుల వల్ల కలిగే అన్ని బాధలలో" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-doublet]])
983:8x5xtrc://*/ta/man/translate/figs-idiomζῶμεν1సంతృప్తి కరమైన జీవితాన్ని జీవించడాన్ని వ్యక్తీకరించే ఒక జాతీయం ఇది. ప్రత్యామ్నాయ అనువాదం: “మేము చాలా ప్రోత్సహించబడ్డాము” (చూడండి:[[rc://te/ta/man/translate/figs-idiom]])
993:8x4znrc://*/ta/man/translate/figs-idiomἐὰν ὑμεῖς στήκετε ἐν Κυρίῳ1"నిలుకడగా ఉండుట" అనేది నమ్మకస్తులుగా కొనసాగడానికి ఉపయోగించబడిన ఒక జాతీయం. ప్రత్యామ్నాయ అనువాదం: "మీరు ప్రభువుపై నమ్మకం ఉంచుట కొనసాగిస్తే" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-idiom]])
1003:9pzq7rc://*/ta/man/translate/figs-rquestionτίνα γὰρ εὐχαριστίαν δυνάμεθα τῷ Θεῷ ἀνταποδοῦναι περὶ ὑμῶν, ἐπὶ πάσῃ τῇ χαρᾷ ᾗ χαίρομεν δι’ ὑμᾶς, ἔμπροσθεν τοῦ Θεοῦ ἡμῶν1ఈ అలంకారిక ప్రశ్నను ఒక ప్రకటనగా వ్యక్తీకరించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "దేవుడు మీ కోసం చేసిన దానికి మేము తగినంతగా కృతజ్ఞతలు చెల్లించలేము! మేము మన దేవునికి ప్రార్థించినప్పుడల్లా మేము మీ విషయమై ఎంతో ఆనందిస్తున్నాము!" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-rquestion]])
1013:9p5karc://*/ta/man/translate/figs-metaphorἔμπροσθεν τοῦ Θεοῦ ἡμῶν1పౌలు తాను మరియు అతని సహచరులు శారీరకంగా దేవుని సన్నిధిలో ఉన్నట్లు మాట్లాడుతున్నాడు. అతను బహుశా ప్రార్థన యొక్క కార్యాచరణను సూచిస్తున్నాడు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
1023:10k71nὑπέρ ἐκ περισσοῦ1తీవ్రంగా
1033:10eb26rc://*/ta/man/translate/figs-synecdocheτὸ ἰδεῖν ὑμῶν τὸ πρόσωπον1"ముఖం" అనే పదం వారి మొత్తం వ్యక్తిని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: "మిమ్మల్ని దర్శించాలని" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-synecdoche]])
1043:11bql9rc://*/ta/man/translate/figs-inclusiveὁ Θεὸς & Πατὴρ ἡμῶν1పౌలు తన పరిచర్య బృందంతో థెస్సలొనీక విశ్వాసులను చేర్చాడు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-inclusive]])
1053:11mc2mὁ Θεὸς & ἡμῶν1ప్రార్ధనలో వేడుకుంటున్నాము
1063:11um1crc://*/ta/man/translate/figs-metaphorκατευθύναι τὴν ὁδὸν ἡμῶν πρὸς ὑμᾶς1థెస్సలొనీక క్రైస్తవులను దర్శించడానికి దేవుడు తనకు మరియు అతని సహచరులకు మార్గం చూపించాలని తాను కోరుకుంటున్నట్లు పౌలు మాట్లాడుతున్నాడు. దేవుడు అలా చేయటానికి వీలు కల్పించాలని అతను కోరుకుంటున్నాడు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
1073:11efl5rc://*/ta/man/translate/figs-exclusiveκατευθύναι τὴν ὁδὸν ἡμῶν πρὸς ὑμᾶς1"మమ్మల్ని" అనే పదం పౌలును, సిల్వానును మరియు తిమోతిలను సూచిస్తుంది కాని థెస్సలొనీయ విశ్వాసులను కాదు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-exclusive]])
1083:11mp6src://*/ta/man/translate/figs-rpronounsαὐτὸς & Πατὴρ1ఇక్కడ "స్వయంగా" అనే పదం "తండ్రి"ని సూచిస్తూ ప్రాముఖ్యత కోసం చెప్పబడింది. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-rpronouns]])
1093:12f5z3rc://*/ta/man/translate/figs-metaphorπλεονάσαι καὶ περισσεύσαι τῇ ἀγάπῃ1పౌలు ప్రేమను ఎక్కువగా పొందగల ఒక వస్తువుగా పోల్చి మాట్లాడుతున్నాడు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
1103:13ly21rc://*/ta/man/translate/figs-metonymyτὸ στηρίξαι ὑμῶν τὰς καρδίας, ἀμέμπτους1ఇక్కడ "హృదయం" అనేది ఒకరి నమ్మకాలు మరియు అభిప్రాయాలకు వాడబడిన ఒక మారుపేరు. ప్రత్యామ్నాయ అనువాదం: "బలపరచును గాక, కాబట్టి మీరు అలా ఉండేలా" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]])
1113:13xsd3ἐν τῇ παρουσίᾳ τοῦ Κυρίου ἡμῶν, Ἰησοῦ1యేసు భూమిపైకి వచ్చినప్పుడు
1123:13jlc5μετὰ πάντων τῶν ἁγίων αὐτοῦ1తన పరిశుద్దులందరితో కలిసి
1134:introb1z50# 1 థెస్సలొనీకయులు 04 సాధారణ గమనికలు \n ## ఈ అధ్యాయంలోని ప్రత్యేక అంశాలు \n\n ### లైంగిక అనైతికత \n వివిధ సంస్కృతులు లైంగిక నైతికత విషయంలో భిన్నమైన ప్రమాణాలను కలిగి ఉంటాయి. ఈ విభిన్న సాంస్కృతిక ప్రమాణాలు ఈ భాగాన్ని తర్జుమా చేయడాన్ని కష్టతరం చేస్తాయి. సాంస్కృతిక నిషేధాల గురించి అనువాదకులు కూడా అప్రమత్తులై ఉండాలి. ఇవి చర్చించటానికి అనుచితమైన అంశాలు. \n\n ### క్రీస్తు తిరిగి రాకముందే మరణించడం\n ప్రారంభ సంఘంలో, క్రీస్తు తిరిగి రాకముందే విశ్వాసి మరణిస్తే ఏమి జరుగుతుందో అని ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేసేవారు. క్రీస్తు తిరిగి రాకముందే చనిపోయేవారు దేవుని రాజ్యంలో భాగమేనా అని వారు భయపడి ఉండవచ్చు. పౌలు ఆ ఆందోళనకు సమాధానమిచ్చాడు. \n\n ### "ఆకాశమండలంలో ప్రభువును కలవడానికి మేఘాలపై తీసుకెళ్లబడడం"\nఈ భాగం యేసు తనను నమ్మిన వారిని తనను తాను పిలిచే సమయాన్ని సూచిస్తుంది. ఇది క్రీస్తు యొక్క చివరి అద్భుతమైన రాకడని సూచిస్తుందా లేదా అనే దానిపై పండితులు విభేదిస్తున్నారు. (చూడండి: [[rc://te/tw/dict/bible/kt/believe]]) \n
1144:1wk39ἀδελφοί1ఇక్కడ “సోదరులు” అనగా తోటి క్రైస్తవులు అని అర్ధం.
1154:1u2lwrc://*/ta/man/translate/figs-doubletἐρωτῶμεν ὑμᾶς καὶ παρακαλοῦμεν1విశ్వాసులను వారు ఎంత బలంగా ప్రోత్సహిస్తారో నొక్కిచెప్పడానికి పౌలు "బ్రతిమాలుట" మరియు "ఆదేశము" అనే పదాలను ఉపయోగించాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "మేము మిమ్మల్ని గట్టిగా ప్రోత్సహిస్తున్నాము" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-doublet]])
1164:1iij6rc://*/ta/man/translate/figs-activepassiveπαρελάβετε παρ’ ἡμῶν1దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "మేము మీకు నేర్పించాము" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-activepassive]])
1174:1p4dbrc://*/ta/man/translate/figs-metaphorδεῖ ὑμᾶς περιπατεῖν1ఇక్కడ "నడక" అనేది ఒక వ్యక్తి జీవించే విధానానికి వ్యక్తీకరణ. ప్రత్యామ్నాయ అనువాదం: "మీరు జీవించాలి" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
1184:2vg16rc://*/ta/man/translate/figs-metaphorδιὰ τοῦ Κυρίου Ἰησοῦ1పౌలు తన సూచనలను యేసే స్వయంగా ఇచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
1194:3mw4jἀπέχεσθαι ὑμᾶς & τῆς πορνείας1మీరు లైంగిక అనైతిక కార్యాలకు దూరంగా ఉండాలి
1204:4f4uxεἰδέναι & τὸ ἑαυτοῦ σκεῦος, κτᾶσθαι1సాధ్యమయ్యే అర్ధాలు 1) "తన స్వంత భార్యతో ఎలా జీవించాలో తెలుసుకొనుట" లేదా 2) "తన శరీరాన్ని ఎలా నియంత్రించాలో తెలుసుకొనుట"
1214:5x2t7ἐν πάθει ἐπιθυμίας1తప్పుడు కామ వికారంతో
1224:6gn9irc://*/ta/man/translate/figs-gendernotationsτὸ μὴ1ఇక్కడ “సోదరున్ని" అనేది పురుషుడు లేదా స్త్రీని సూచిస్తుంది. "ఎవరూ" లేదా " ఏ వ్యక్తి" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-gendernotations]])
1234:6a9strc://*/ta/man/translate/figs-doubletὑπερβαίνειν καὶ πλεονεκτεῖν1భావనను బలోపేతం చేయడానికి ఒకే ఆలోచనను రెండు విధాలుగా పేర్కొనే [డబ్లెట్ స్టేటింగ్] ప్రకటన ఇది. ప్రత్యామ్నాయ అనువాదం: "తప్పు పనులు చేయండి" (చూడండి:[[rc://te/ta/man/translate/figs-doublet]])
1244:6q7bfrc://*/ta/man/translate/figs-explicitἔκδικος Κύριος1దీన్ని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "అతిక్రమించినవారిని ప్రభువు శిక్షిస్తాడు మరియు అన్యాయానికి గురైన వారిని రక్షిస్తాడు" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-explicit]])
1254:6d1ipπροείπαμεν ὑμῖν καὶ διεμαρτυράμεθα1మీకు ముందే చెప్పి, దానికి వ్యతిరేకంగా గట్టిగా హెచ్చరించాము
1264:7v3nprc://*/ta/man/translate/figs-doublenegativesοὐ & ἐκάλεσεν ἡμᾶς ὁ Θεὸς ἐπὶ ἀκαθαρσίᾳ, ἀλλ’ ἐν ἁγιασμῷ1దీనిని సానుకూల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "దేవుడు మనల్ని పరిశుభ్రత మరియు పవిత్రత కొరకు పిలిచాడు" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-doublenegatives]])
1274:7q4tjrc://*/ta/man/translate/figs-inclusiveοὐ & ἐκάλεσεν ἡμᾶς ὁ Θεὸς1"మనలను" అనే పదం విశ్వాసులందరినీ సూచిస్తుంది. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-inclusive]])
1284:8mn5yὁ ἀθετῶν1ఎవరైతే ఈ ఉపదేశమును నిరాకరిస్తారో లేదా "ఈ ఉపదేశమును ఎవరు తిరస్కరిస్తారో"
1294:8su51ἀθετῶν, οὐκ ἄνθρωπον ἀθετεῖ, ἀλλὰ τὸν Θεὸν1ఈ ఉపదేశము మనిషి నుండి కాదు, దేవుని నుండి వచ్చినదని పౌలు నొక్కి చెప్పాడు.
1304:9uxn8τῆς φιλαδελφίας1తోటి విశ్వాసులపట్ల ప్రేమ
1314:10dec9ποιεῖτε αὐτὸ εἰς πάντας τοὺς ἀδελφοὺς, τοὺς ἐν ὅλῃ τῇ Μακεδονίᾳ1మాసిదోనియా అంతటా ఉన్న తోటి విశ్వాసులకు మీరు ప్రేమ చూపించారు
1324:10jcg3ἀδελφοὺς1ఇక్కడ “సోదరులు” అంటే తోటి క్రైస్తవులు అని అర్ధం.
1334:11d2fgφιλοτιμεῖσθαι1ప్రయత్నించడానికి
1344:11j4c7rc://*/ta/man/translate/figs-metaphorἡσυχάζειν1పౌలు "ప్రశాంతత" అనే పదాన్ని ఒక సమాజంలో మరియు కలహాలకు కారణం కాకుండా శాంతిగా జీవించడం అనేదాన్ని వివరించడానికి ఒక రూపకంగా ఉపయోగించాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "ప్రశాంతంగా మరియు క్రమంగా జీవించండి" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
1354:11jmt9rc://*/ta/man/translate/figs-explicitπράσσειν τὰ ἴδια1మీ స్వంత పని చేయండి లేదా "మీరు చేయవలసిన బాధ్యతలను జాగ్రత్తగా చూసుకోండి."మనము ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకూడదని, వారి విషయమై వ్యర్ధంగా మాట్లాడకూడదని కూడా సూచిస్తుంది. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-explicit]])
1364:11bz8src://*/ta/man/translate/figs-metaphorἐργάζεσθαι ταῖς ἰδίαις χερσὶν ὑμῶν1ఇది ఉత్పాదక జీవితాన్ని గడపడాన్ని గురించి చెప్పే ఒక రూపకం. ప్రత్యామ్నాయ అనువాదం: "మీరు జీవించడానికి అవసరమైనదాన్ని సంపాదించడానికి మీ స్వంత పనులు చేయండి" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
1374:12hp6grc://*/ta/man/translate/figs-metaphorπεριπατῆτε εὐσχημόνως1ఇక్కడ "నడక" అనేది "జీవించుట" లేదా "ప్రవర్తించుట"కు ఒక రూపకం. ప్రత్యామ్నాయ అనువాదం: "సరిగ్గా ప్రవర్తించండి" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
1384:12yl36εὐσχημόνως1ఇతరులకు మర్యాద చూపించే విధంగా మరియు వారి మర్యాదను సంపాదించే విధంగా
1394:12k59rrc://*/ta/man/translate/figs-metaphorπρὸς τοὺς ἔξω1క్రీస్తును నమ్మని వారి గురించి విశ్వాసులకు దూరంగా స్థలానికి వెలుపల ఉన్నట్లు పౌలు మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "క్రీస్తును నమ్మని వారి దృష్టిలో" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
1404:13j68eGeneral Information:0# General Information:\n\nపౌలు చనిపోయిన విశ్వాసుల గురించి, ఇంకా బతికే ఉన్నవారి గురించి మరియు క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు సజీవంగా ఉండబోవువారి గురించి మాట్లాడుతున్నాడు.
1414:13d9g4οὐ θέλομεν & ὑμᾶς ἀγνοεῖν1దీనిని సానుకూల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "మీకు సమాచారం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము" లేదా "మీరు తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాము"
1424:13wt7lἀδελφοί1ఇక్కడ “సోదరులు” అనగా తోటి క్రైస్తవులు
1434:13zqz6rc://*/ta/man/translate/figs-euphemismτῶν κοιμωμένων1ఇక్కడ "కన్నుమూసిన" అనేది చనిపోయిన స్థితికి ఒక సభ్యోక్తి. ప్రత్యామ్నాయ అనువాదం: "మరణించిన వారు" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-euphemism]])
1444:13r9f8ἵνα μὴ λυπῆσθε, καθὼς & οἱ λοιποὶ1ఎందుకనగా మిగిలిన వారివలే మీరు దుఃఖపడాలని మేము కోరుకోవడం లేదు
1454:13qt5bλυπῆσθε1దుఃఖపడుట, దేనిగురించో విచారంగా ఉండుట
1464:13rl73rc://*/ta/man/translate/figs-explicitκαθὼς & οἱ λοιποὶ, οἱ μὴ ἔχοντες ἐλπίδα1భవిష్యత్ వాగ్దానంపై నమ్మకం లేని వ్యక్తులు. ఆ వ్యక్తులు వేటిపై నమ్మకముంచరో స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "వారు మృతులలోనుండి లేస్తారని ఖచ్చితంగా తెలియని వ్యక్తుల వలె" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-explicit]])
1474:14ybz6rc://*/ta/man/translate/figs-inclusiveεἰ & πιστεύομεν1ఇక్కడ "మేము"అనే పదము పౌలు మరియు అతని ప్రేక్షకులను సూచిస్తుంది. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-inclusive]])
1484:14kmk2ἀνέστη1తిరిగి జీవించుటకు లేచుట
1494:14bi9wrc://*/ta/man/translate/figs-euphemismτοὺς κοιμηθέντας διὰ τοῦ Ἰησοῦ1ఇక్కడ "కన్ను మూయుట" అనేది మరణించినట్లు సూచించడానికి ఒక మర్యాదపూర్వక మార్గం. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-euphemism]])
1504:15ni3mrc://*/ta/man/translate/figs-metonymyἐν λόγῳ Κυρίου1ఇక్కడ పదం "సందేశం" యొక్క మారుపేరు. ప్రత్యామ్నాయ అనువాదం: "ప్రభువు బోధలను అర్థం చేసుకోవడం ద్వారా" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]])
1514:15b786εἰς τὴν παρουσίαν τοῦ Κυρίου1ప్రభువు తిరిగి వచ్చువరకు
1524:16ah7pαὐτὸς ὁ Κύριος & καταβήσεται1ప్రభువు తానే దిగి వస్తాడు
1534:16z9kaἀρχαγγέλου1ప్రధాన దూత
1544:16dr89rc://*/ta/man/translate/figs-explicitοἱ νεκροὶ ἐν Χριστῷ ἀναστήσονται πρῶτον1"క్రీస్తును నమ్మి చనిపోయినవారు" చనిపోయిన విశ్వాసులు. ప్రత్యామ్నాయ అనువాదం: "యేసుక్రీస్తును విశ్వసించినవారు, కాని అప్పటికే మరణించిన వారు మొదట లేస్తారు" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-explicit]])
1554:17l5l1rc://*/ta/man/translate/figs-inclusiveἡμεῖς οἱ ζῶντες1ఇక్కడ "మనము" అంటే మరణించని విశ్వాసులందరినీ సూచిస్తుంది. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-inclusive]])
1564:17wvi8σὺν αὐτοῖς1"వారిని" అనే పదం చనిపోయి తిరిగి లేచిన విశ్వాసులను సూచిస్తుంది.
1574:17se1yἁρπαγησόμεθα ἐν νεφέλαις εἰς ἀπάντησιν τοῦ Κυρίου εἰς ἀέρα1ఆకాశమండలంలో ప్రభువును ఎదుర్కోవడానికి
1585:introay3d0# 1 థెస్సలొనీకయులు 05 సాధారణ గమనికలు \n ## నిర్మాణం మరియు ఆకృతీకరణ \n\n పౌలు తన లేఖను పురాతన సమీప తూర్పు ప్రాంతంలోని అక్షరాలకు విలక్షణమైన రీతిలో ముగించారు. \n\n ## ఈ అధ్యాయంలో ప్రత్యేక అంశాలు \n\n ### ప్రభువు దినo \nప్రభువు రాబోయే రోజు యొక్క ఖచ్చితమైన సమయం ప్రపంచానికి ఆశ్చర్యం కలిగిస్తుంది. "రాత్రి పూట దొంగ లాగా" అనేదాని అనుకరణ అంటే ఇదే. ఈ కారణంగా, క్రైస్తవులు ప్రభువు రాక కోసం సిద్ధంగా ఉండాలి. (చూడండి: [[rc://te/tw/dict/bible/kt/dayofthelord]] మరియు [[rc://te/ta/man/translate/figs-simile]]) \n\n ### ఆత్మను ఆర్పుట\n దీని అర్థం నిర్లక్ష్యపెట్టుట లేదా పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వం మరియు పనికి వ్యతిరేకంగా పనిచేయడం. \n
1595:1z1s6Connecting Statement:0# Connecting Statement:\n\nయేసు తిరిగి వచ్చే రోజు గురించి మాట్లాడడాన్ని పౌలు కొనసాగిస్తున్నాడు.
1605:1h84mτῶν χρόνων καὶ τῶν καιρῶν1ఇది యేసు తిరిగి వచ్చినప్పుడు జరుగబోవు సంఘటనలను సూచిస్తుంది.
1615:1uq3nἀδελφοί1ఇక్కడ “సోదరులు” అనగా తోటి క్రైస్తవులు అని భావం
1625:2mcq9ἀκριβῶς1చాలా బాగా లేదా "ఖచ్చితంగా"
1635:2tmj3rc://*/ta/man/translate/figs-simileὡς κλέπτης ἐν νυκτὶ οὕτως1ఒక దొంగ ఏ రాత్రి వస్తాడో ఒకనికి తెలియనట్లే , ప్రభువు దినం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ప్రత్యామ్నాయ అనువాదం: "అనుకోకుండా" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-simile]])
1645:3p1wiὅταν λέγωσιν1ప్రజలు చెప్పుకుంటూ ఉన్నప్పుడు
1655:3ne9nτότε αἰφνίδιος & ὄλεθρος1అప్పుడు అకస్మాత్తుగా నాశనం
1665:3f1xrrc://*/ta/man/translate/figs-simileὥσπερ ἡ ὠδὶν ἐν γαστρὶ ἐχούσῃ1గర్భిణీ స్త్రీకి పుట్టిన నొప్పులు అకస్మాత్తుగా వచ్చి, పుట్టుక పూర్తయ్యే వరకు ఆగనట్లే, నాశనం వస్తుంది, మరియు ప్రజలు తప్పించుకోలేరు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-simile]])
1675:4rr9jὑμεῖς & ἀδελφοί1ఇక్కడ “సోదరులు” అనగా తోటి క్రైస్తవులు అని భావం
1685:4b6lvrc://*/ta/man/translate/figs-metaphorοὐκ ἐστὲ ἐν σκότει1పౌలు వారు చీకటిలో ఉన్నట్లుగా దేవుని గురించిన వారి చెడు మరియు అజ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "చీకటిలో నివసించే వ్యక్తుల మాదిరిగా మీకు తెలియదు" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
1695:4elp9rc://*/ta/man/translate/figs-simileἵνα ἡ ἡμέρα ὑμᾶς ὡς κλέπτας καταλάβῃ1ప్రభువు వచ్చే రోజు విశ్వాసులకు ఆశ్చర్యం కలిగించకూడదు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-simile]])
1705:5zp3zrc://*/ta/man/translate/figs-metaphorπάντες γὰρ ὑμεῖς υἱοὶ φωτός ἐστε, καὶ υἱοὶ ἡμέρας1పౌలు సత్యాన్ని వెలుగులా, పగటిలా మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: " వెలుగులో నివసించే వ్యక్తులలాగా, పగటిపూట మనుషులలాగా మీకు సత్యం తెలుసు" (చూడండి:[[rc://te/ta/man/translate/figs-metaphor]])
1715:5d6fmrc://*/ta/man/translate/figs-metaphorοὐκ ἐσμὲν νυκτὸς οὐδὲ σκότους1పౌలు వారు చీకటిలో ఉన్నట్లుగాదేవుని గురించి వారికున్న చెడు మరియు అజ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: చీకటిలో నివసించే వ్యక్తుల మాదిరిగా, రాత్రిపూట మనుషుల మాదిరిగా మనము తెలియనివారము కాము" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
1725:6us6src://*/ta/man/translate/figs-metaphorμὴ καθεύδωμεν ὡς οἱ λοιποί1పౌలు ఆత్మీయ అజ్ఞానం గురించి అది నిద్రయై ఉన్నట్లు మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "యేసు తిరిగి వస్తున్నాడని తెలియని ఇతరుల మాదిరిగా మనము ఉండకూడదు" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
1735:6gu51rc://*/ta/man/translate/figs-inclusiveκαθεύδωμεν1"మనము" అనే పదం విశ్వాసులందరినీ సూచిస్తుంది. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-inclusive]])
1745:6d2ajrc://*/ta/man/translate/figs-metaphorγρηγορῶμεν καὶ νήφωμεν1పౌలు ఆత్మీయ అవగాహనను నిద్ర మరియు మద్యపానానికి విరుద్దమైనదిగా వర్ణించాడు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
1755:7s253rc://*/ta/man/translate/figs-metaphorοἱ γὰρ καθεύδοντες, νυκτὸς καθεύδουσιν1ప్రజలు నిద్రపోతున్నప్పుడు ఏమి జరుగుతుందో తెలియనట్లు, క్రీస్తు తిరిగి వస్తాడని ఈ ప్రపంచ ప్రజలకు తెలియదు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
1765:7exa8rc://*/ta/man/translate/figs-metaphorοἱ μεθυσκόμενοι, νυκτὸς μεθύουσιν1రాత్రివేళ ప్రజలు త్రాగుతుంటారు, అలాగే క్రీస్తు తిరిగి రావడం గురించి అవగాహన లేని ప్రజలు వారు స్వీయ నియంత్రణ జీవితాన్ని జీవించలేరు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
1775:8wh3grc://*/ta/man/translate/figs-metaphorἡμεῖς & ἡμέρας ὄντες1ఆ దినము గురించిన దేవుని సత్యాన్ని తెలుసుకొనుట గురించి పౌలు మాట్లాడుతాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "మాకు సత్యం తెలుసు" లేదా "మేము సత్యం యొక్క వెలుగును పొందుకున్నాము" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
1785:8i8j1rc://*/ta/man/translate/figs-metaphorνήφωμεν1పౌలు మత్తుగా ఉండటాన్ని ఆత్మ నియంత్రణను అభ్యాసము చేయడంతో పోల్చాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "మనం స్వీయ నియంత్రణను అభ్యాసం చేద్దాం" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
1795:8ev6irc://*/ta/man/translate/figs-metaphorἐνδυσάμενοι θώρακα πίστεως καὶ ἀγάπης1ఒక సైనికుడు తన శరీరాన్ని రక్షించుకోవడానికి రొమ్ముకు కవచాన్ని ధరించినట్లు, విశ్వాసం మరియు ప్రేమతో జీవించే విశ్వాసికి రక్షణ లభిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: "విశ్వాసం మరియు ప్రేమద్వారా మనల్ని మనం రక్షించుకుందాం" లేదా "క్రీస్తును విశ్వసించి, ఆయనను ప్రేమించడం ద్వారా మనల్ని మనం రక్షించుకుందాం" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
1805:8fk6rrc://*/ta/man/translate/figs-metaphorπερικεφαλαίαν, ἐλπίδα σωτηρίας1శిరస్త్రాణము సైనికుడి తలని రక్షించినట్లు, రక్షణ కొరకైన ఆశాభావం విశ్వాసిని రక్షిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: "క్రీస్తు మనలను రక్షిస్తాడు అనే నిశ్చయత ద్వారా మనల్ని మనం భద్రపరచుకుందాం" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
1815:10w59crc://*/ta/man/translate/figs-euphemismεἴτε γρηγορῶμεν εἴτε καθεύδωμεν1ఇవి సజీవంగా లేదా చనిపోయినట్లు చెప్పే మర్యాదపూర్వక మార్గాలు. ప్రత్యామ్నాయ అనువాదం: "మనము జీవించి ఉన్నా లేక చనిపోయినా" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-euphemism]])
1825:11r921rc://*/ta/man/translate/figs-metaphorοἰκοδομεῖτε εἷς τὸν ἕνα1ఇక్కడ ఆంగ్లంలో ఉపయోగించిన"బిల్డ్" అనేది ఒక రూపకం అంటే ప్రోత్సహించండి. ప్రత్యామ్నాయ అనువాదం: "ఒకరినొకరు ప్రోత్సహించండి" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
1835:12pd47General Information:0# General Information:\n\nపౌలు తన తుది హెచ్చరికలను థెస్సలొనీకలోని సంఘానికి ఇవ్వడం ప్రారంభించాడు.
1845:12rka4ἀδελφοί1ఇక్కడ “సోదరులు” అనగా తోటి విశ్వాసులు.
1855:12ksp2εἰδέναι τοὺς κοπιῶντας1నాయకత్వంలో ఉన్నవారిని గౌరవించడం మరియు అభినందించడం
1865:12fqh3προϊσταμένους ὑμῶν ἐν Κυρίῳ1స్థానిక విశ్వాసుల సమూహానికి నాయకులుగా ఉండి సేవ చేయడానికి దేవుడు నియమించిన వ్యక్తులను ఇది సూచిస్తుంది.
1875:13c966ἡγεῖσθαι αὐτοὺς ὑπέρ ἐκ περισσοῦ ἐν ἀγάπῃ, διὰ τὸ ἔργον αὐτῶν1పౌలు విశ్వాసులకు తమ సంఘ నాయకులను ప్రేమించాలని మరియు గౌరవించాలని బోధిస్తున్నాడు.
1885:16chw9πάντοτε χαίρετε1అన్ని విషయాలలో సంతోషించే ఆత్మీయ వైఖరిని కొనసాగించాలని పౌలు విశ్వాసులను ప్రోత్సహిస్తున్నాడు
1895:17l63iἀδιαλείπτως προσεύχεσθε1ప్రార్థనలో ఆప్రమత్తంగా ఉండాలని పౌలు విశ్వాసులను ప్రోత్సహిస్తున్నాడు.
1905:18z9ggἐν παντὶ εὐχαριστεῖτε1అన్ని విషయాలలో కృతజ్ఞత కలిగి ఉండాలని పౌలు విశ్వాసులను హెచ్చరిస్తున్నాడు.
1915:18bt5qἐν παντὶ1అన్ని పరిస్థితులలో
1925:18l3skτοῦτο γὰρ θέλημα Θεοῦ1పౌలు విశ్వాసుల కొరకు దేవుని చిత్తమని తాను పేర్కొన్న ప్రవర్తనను సూచిస్తున్నాడు.
1935:19j1eiτὸ Πνεῦμα μὴ σβέννυτε1మీ మధ్య పనిచేస్తున్న పరిశుద్ధాత్మ పనిని ఆపవద్దు.
1945:20iv1nπροφητείας μὴ ἐξουθενεῖτε1ప్రవచనాల పట్ల నిర్లక్ష్యం వద్దు లేదా "పరిశుద్ధాత్మ ఎవరికైనా చెప్పిన దేన్నైనా ద్వేషించవద్దు
1955:21wx69πάντα δοκιμάζετε1దేవుని నుండి వచ్చినట్లు కనిపించే అన్ని సందేశాలు నిజంగా ఆయన నుండి వచ్చాయా లేదా అని నిర్ధారించుకోండి
1965:21r12rrc://*/ta/man/translate/figs-metaphorτὸ καλὸν κατέχετε1పౌలు పరిశుద్ధాత్మ నుండి వచ్చిన సందేశాలను తన చేతుల్లో పట్టుకోగలిగే వస్తువులతో పోల్చి మాట్లాడుతున్నాడు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
1975:23gu2cἁγιάσαι ὑμᾶς ὁλοτελεῖς1దేవుడు ఒక వ్యక్తిని పాపము చేయనివాడుగా మరియు తన దృష్టిలో పరిపూర్ణుడుగా చేయడాన్ని ఇది సూచిస్తుంది.
1985:23s36krc://*/ta/man/translate/figs-activepassiveὁλόκληρον ὑμῶν τὸ πνεῦμα, καὶ ἡ ψυχὴ, καὶ τὸ σῶμα, ἀμέμπτως & τηρηθείη1ఇక్కడ "ఆత్మ, ప్రాణము మరియు శరీరం" మొత్తం పూర్తి వ్యక్తిని సూచిస్తాయి. మీ భాషకు ఈ భాగాలకు సంబంధించిన మూడు పదాలు లేకపోతే మీరు దానిని "మీ మొత్తం జీవితం" లేదా "మీరు" అని పేర్కొనవచ్చు. దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "దేవుడు మీ జీవితాన్నంతా పాపం లేకుండా చేయును గాక" లేదా "దేవుడు మిమ్మును పూర్తిగా నిర్దోషిగా ఉంచునుగాక" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-activepassive]])
1995:24mq2uπιστὸς ὁ καλῶν ὑμᾶς1మిమ్మల్ని పిలిచినవాడు నమ్మదగినవారు
2005:24c3jgὃς καὶ ποιήσει1ఆయన మీకు సహాయం చేస్తాడు
2015:25q8kiGeneral Information:0# General Information:\n\nపౌలు తన ముగింపు ప్రకటనలు ఇస్తున్నాడు.
2025:26qa1cἀδελφοὺς1ఇక్కడ “సోదరులు” అంటే తోటి క్రైస్తవులు.
2035:27n5cnrc://*/ta/man/translate/figs-activepassiveἐνορκίζω ὑμᾶς τὸν Κύριον, ἀναγνωσθῆναι τὴν ἐπιστολὴν1దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "ప్రభువు మీతో మాట్లాడుతున్నట్లుగా, ప్రజలు ఈ లేఖను చదవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను" లేదా "ప్రభువు యొక్క అధికారంతో ఈ లేఖను చదవమని నేను మీకు ఆదేశిస్తున్నాను" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-activepassive]])