STR_te_iev/42-MRK.usfm

1212 lines
270 KiB
Plaintext
Raw Normal View History

2019-11-30 01:11:16 +00:00
\id MRK - Indian Easy Version (IEV) Telugu
\ide UTF-8
\h మార్కు సువార్
\toc1 మార్కు సువార్
\toc2 మార్కు సువార్
\toc3 mrk
\mt1 మార్కు సువార్
\s5
\c 1
\p
\v 1 దేవుని కుమారుడు, యేసు క్రీస్తు గురించిన సువార్త ఇది. యెషయా ప్రవక్త రాసిన గ్రంథంలో ఈ సువార్తను గురించి ఇలా ఉంది. "ఇదిగో, నా వార్తాహరుణ్ణి నీకు ముందుగా పంపుతున్నాను.
\v 2 ప్రజలు సంతోషంగా నిన్ను ఆహ్వానించేలా అతడు వాళ్ళను సిద్ధం చేస్తాడు.
\v 3 అతడు అడవిలో కేక పెడుతూ వింటున్న వారితో ఇలా అంటున్నాడు. ప్రభువుని స్వాగతించడానికి తయారుగా ఉండండి."
\s5
\v 4 యెషయా గ్రంథం లో రాసి ఉన్న ఆ వార్తాహరుడు యోహానే. ప్రజలు అతణ్ణి "బాప్తీసం ఇచ్చేవాడు" అని పిలిచారు. అతడు అడవిలో ఉండే వాడు. ప్రజలతో, "చేసిన పాపాలకి పశ్చాత్తాప పడండి. ఇక మీదట పాపం చేయకూడదు అని నిర్ణయించుకోండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని క్షమించొచ్చు. ఆ తరువాత నేను మీకు బాప్తీసం ఇస్తాను." అని చెప్తూ ఉండేవాడు.
\p
\v 5 యూదయ ప్రాంతం లో, యెరూషలేము పట్టణ ప్రాంతాల్లో చాలా మంది ఈ యోహాను చెప్తున్నది వినడానికి అడవిలోకి వెళ్లారు. వారిలో చాలా మంది ఆయన మాటలు విన్న తరువాత "మేము పాపం చేసాము" అని ఒప్పుకున్నారు. తరువాత యోహాను యోర్దాను నదిలో వారికి బాప్తిసం ఇచ్చాడు.
\p
\v 6 యోహాను ఒంటె వెంట్రుకలతో చేసిన బట్టలు కట్టుకుని, నడుముకు తోలు నడికట్టు కట్టుకునేవాడు. అడవిలో దొరికే తేనె, మిడతలు అతని ఆహారం
\s5
\v 7 అతడు "అతి త్వరలో చాలా గొప్ప వాడు రాబోతున్నాడు. ఆయనతో పోలిస్తే నేను సూర్యుని ముందు దివిటీనే. వంగి ఆయన చెప్పులు విప్పడానికి కూడా తగను.
\v 8 నేను మీకు నీళ్లలో బాప్తిసం ఇచ్చాను గాని ఆయన మీకు దేవుని పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాడు" అన్నాడు.
\s5
\p
\v 9 యోహాను బోధిస్తున్న సమయంలోనే, గలిలయకు చెందిన నజరేతు ఊరి నుండి, యోహాను బోధిస్తున్న చోటుకి యేసు రాగా యోహాను ఆయనకి బాప్తిసం ఇచ్చాడు.
\v 10 యేసు నీళ్లలో నుండి ఒడ్డుకు రాగానే ఆకాశం చీలి, దేవుని ఆత్మ పావురం లాగా తన మీదికి దిగి రావడం చూశాడు.
\v 11 అప్పుడు దేవుడు ఆకాశం నుండి "నువ్వు నా ప్రియ కుమారుడివి, నీ విషయం నాకెంతో ఆనందం" అని పలికాడు.
\s5
\p
\v 12 వెంటనే దేవుని ఆత్మ యేసును అరణ్య ప్రాంతానికి తీసుకు వెళ్ళాడు.
\v 13 ఆయన అక్కడ నలభై రోజులున్నాడు. ఆ సమయంలో సైతాను చేత పరీక్షలకు గురయ్యాడు. అక్కడ అడవి మృగాల మధ్య జీవించాడు. అప్పుడు దేవుని దూతలు ఆయనకు సపర్యలు చేశారు.
\s5
\p
\v 14 యోహానును చెరసాలలో వేసిన తరవాత యేసు గలిలయ ప్రాంతానికి వచ్చి దేవుని రాజ్య సువార్త బోధించసాగాడు.
\v 15 "కాలం దగ్గర పడింది. త్వరలోనే దేవుడు రాజుగా కనబడబోతున్నాడు. "అయ్యో, పాపం చేసాను, ఇకమీదట చెయ్యను." అని పశ్చాత్తాపపడితే దేవుడు క్షమిస్తాడు. ఈ సువార్తను నమ్మండి" అని ప్రకటిస్తూ వచ్చాడు.
\s5
\p
\v 16 ఒక రోజు ఆయన గలిలయ సరస్సు ఒడ్డున నడుస్తూ ఉండగా సీమోను, అతని సోదరుడు అంద్రెయ సరస్సులో వల వేయడం చూశాడు. వాళ్ళు చేపలు పట్టుకుని, వాటిని అమ్ముకుంటూ జీవించే జాలరులు.
\v 17 యేసు వారితో, "నాతో రండి, ఇప్పుడు మీరు చేపలు పడుతున్నట్టే మనుషుల్ని పట్టడం ఎలాగో మీకు నేర్పిస్తాను" అన్నాడు.
\v 18 వారు వెంటనే వలలను వదిలిపెట్టి ఆయన వెంట వెళ్ళారు.
\s5
\p
\v 19 ఆయన వారితో ఇంకా కొంత దూరం వెళ్ళి జెబెదయి కొడుకులు యాకోబును, అతని సోదరుడు యోహానునూ చూశాడు. వాళ్ళు తమ పడవల్లో కూర్చుని వలలు బాగు చేసుకుంటున్నారు.
\v 20 యేసు వారిని చూసిన వెంటనే తన వెంట రమ్మని పిలిచాడు. వారు తమ తండ్రి జెబెదయిని పడవలో పనివారి దగ్గర విడిచిపెట్టి యేసు వెంట వచ్చారు.
\s5
\p
\v 21 తరువాత ఆయన తన శిష్యులతో కలిసి దగ్గరలో ఉన్న కపెర్నహూము అనే ఊరికి వెళ్ళాడు. ఆ తరువాత వచ్చిన విశ్రాంతి రోజున ఆయన యూదుల సమాజ మందిరంలోకి వెళ్ళి అక్కడ చేరిన వారికి బోధించడం మొదలుపెట్టాడు.
\v 22 అది చూసిన వాళ్ళంతా ఆయన ఉపదేశానికి ఆశ్చర్యపడ్డారు. స్వతహాగా తనకే ఉన్న స్వంత విషయ పరిజ్ఞానంతో ఆయన బోధించాడు. యూదుల ధర్మశాస్త్రం బోధించే వారిలాగా ఇతరులు చెప్పినదే తాము చిలకపలుకుల్లాగా చెప్పే గురువుల్లాగా బోధించలేదు.
\s5
\p
\v 23 ఆ సమయంలో దయ్యం పట్టిన వాడొకడు ఆ సమాజ మందిరంలో ఉన్నాడు. వాడు పెద్దగా కేకలు పెడబొబ్బలు పెట్టడం మొదలు పెట్టాడు.
\v 24 వాడు, "యేసూ, నజరేతు వాడా, మాతో నీకేం పని? మమ్మల్ని నాశనం చెయ్యడానికి వచ్చావా? నీవెవరివో నాకు తెలుసులే. నువ్వు దేవుని పవిత్రుడివి" అని కేకలు వేశాడు.
\v 25 యేసు దురాత్మను గద్దిస్తూ, "నోరు మూసుకో, ఇతన్ని వదిలి వెళ్ళు” అన్నాడు.
\v 26 ఆ దయ్యం అతన్ని గిజగిజలాడించి పెద్దగా కేకలు పెట్టించి, అతనిలో నుంచి బయటకు వెళ్ళిపోయింది.
\s5
\v 27 అక్కడున్న ప్రజలంతా ఆశ్చర్యపోయారు. "ఇదేమిటి? అధికారంతో కూడిన ఈ కొత్త ఉపదేశం అద్భుతంగా ఉందే! ఈయన దయ్యాలను కూడా ఆజ్ఞాపిస్తున్నాడు అవి కూడా ఈయన మాటకు లొంగుతున్నాయి" అని ముక్కున వేలేసుకున్నారు.
\v 28 ఆయన్ని గురించిన సమాచారం గలిలయ ప్రాంతమంతా త్వరగా వ్యాపించింది.
\s5
\p
\v 29 సమాజ మందిరం నుండి బయటకు వచ్చిన వెంటనే యేసు, ఆయనతో ఉన్న వారు సీమోను, అంద్రెయల ఇంటికి వచ్చారు. యాకోబు, యోహాను కూడా వారితో ఉన్నారు.
\v 30 సీమోను అత్త జ్వరంతో మంచం పట్టి ఉంది. వెంటనే అక్కడున్న వాళ్ళు యేసుకు ఆ విషయం చెప్పారు.
\v 31 ఆయన ఆమె దగ్గరికి వచ్చి, ఆమె చెయ్యి పట్టుకుని లేవనెత్తిన వెంటనే జ్వరం తగ్గిపోవడమే కాకుండా, ఆమె లేచి అందరికీ ఆహారం వడ్డించడం వంటి పనులు చేయసాగింది.
\s5
\p
\v 32 సాయంకాలం సూర్యాస్తమయానికల్లా ప్రజలు రోగులనూ, దయ్యాలు పట్టిన వారినీ, అలాంటి చాలా మందిని ఆయన దగ్గరికి తీసుకువచ్చారు.
\v 33 నేల ఈనినట్టుగా ఆ పట్టణంలోని వారంతా సీమోను ఇంటికి వచ్చేశారు.
\v 34 రకరకాల రోగాలతో ఉన్న వారిని యేసు బాగు చేశాడు. ఎన్నో దయ్యాలను వెళ్ళగొట్టాడు. తాను దేవుడి దగ్గరనుండి వచ్చిన పరిశుద్ధుడినని ఆ దయ్యాలకు తెలుసు గనుక ఆయన వాటిని మాట్లాడనివ్వలేదు.
\s5
\p
\v 35 మరుసటి రోజు ఇంకా తెల్లవారక ముందే యేసు లేచి ఆ పట్టణం బయట ఏకాంత ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థనలో గడిపాడు.
\v 36 సీమోను, అతని ఉన్న వారు యేసు కోసం వెతికారు.
\v 37 ఆయన కనబడినప్పుడు, "అందరూ నీ కోసం చూస్తున్నారు" అని ఆయనతో అన్నారు.
\s5
\v 38 ఆయన వారితో, "చుట్టుపక్కల గ్రామాలకు వెళ్దాం పదండి. అక్కడ కూడా నేను ప్రకటించాలి. నేను ఈ లోకానికి వచ్చింది అందుకే" అన్నాడు.
\v 39 ఆయన గలిలయ ప్రాంతమంతటా తిరుగుతూ, యూదుల సమాజ మందిరాల్లో బోధిస్తూ, ప్రజలను పట్టి పీడిస్తున్న దయ్యాలను వెళ్ళగొడుతూ ఉన్నాడు.
\s5
\p
\v 40 ఒకరోజు ఒక కుష్టురోగి ఆయన దగ్గరికి వచ్చి ఆయన ముందు మోకరిల్లి, "దయతో నన్ను స్వస్థ పరుచు. నీకిష్టమైతే నన్ను బాగు చేయగలవు" అని ఆయనను బతిమాలాడు.
\v 41 యేసు అతనిపై జాలిపడి, చెయ్యి చాపి అతన్ని తాకి "నిన్ను బాగు చేయడం నాకిష్టమే, స్వస్థత పొందు” అన్నాడు.
\v 42 వెంటనే కుష్టురోగం అతన్ని వదలిపోయింది. అతడు బాగయ్యాడు.
\s5
\v 43 ఆయన అతన్ని పంపివేస్తూ, అతన్ని హెచ్చరించాడు. ఏమనంటే,
\v 44 "ఈ విషయం ఎవ్వరితోనూ చెప్పొద్దు సుమా, నువ్వు శుద్ధుడివైనట్టు యాజకునికి మాత్రం కనిపించు. యాజకుడు నువ్వు బాగుపడ్డావని పరీక్షించి తెలుసుకుంటాడు. తరువాత మోషే ఆజ్ఞాపించిన ప్రకారం అర్పణలు అర్పించు. అప్పుడు సమాజం ముందు నీకు కుష్టు లేదని ఋజువౌతుంది" అన్నాడు.
\s5
\p
\v 45 కానీ అతడు యేసు చెప్పింది చెప్పినట్టు చెయ్యకుండా అందరికీ యేసు తనని ఎలా స్వస్థపరిచాడో చాటించసాగాడు. అప్పుడు ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి ఆయన మీద పడడం మొదలు పెట్టారు. ఆ కారణంగా యేసు ఆ ఉళ్ళో బహిరంగంగా తిరగలేక ఊరి బయట నిర్మానుష్య ప్రదేశాల్లో ఉండిపోవలసి వచ్చింది. అయితే వివిధ ప్రాంతాల నుండి ప్రజలే ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు.
\s5
\c 2
\p
\v 1 కొన్నిరోజుల తరువాత యేసు కపెర్నహోముకు తిరిగి వచ్చాడు. యేసు తిరిగి వచ్చాడనీ, ఇంట్లో ఉన్నాడనీ వార్త దావానలంలా వ్యాపించింది.
\v 2 చూస్తుండగానే చాలా మంది యేసు ఉన్న ఆ ఇంటికి చేరుకున్నారు. జనం విపరీతంగా రావడం వల్ల మనిషి నిలబడడానికి కూడా చోటు లేక పోయింది. తలుపు దగ్గర సైతం జనం క్రిక్కిరిసిపోయారు. యేసు వారికి దైవోపదేశం చేయసాగాడు.
\s5
\p
\v 3 నలుగురు మనుషులు ఒక పక్షవాత రోగిని అతను పడుకున్న పరుపుతో సహా మోసుకుంటూ అక్కడికి తెచ్చారు
\v 4 ప్రజలంతా గుమికూడిన కారణంగా రోగిని ఆయనకు దగ్గరగా తీసుకు రాలేకపోయారు. అందువల్ల వారు ఆయన ఉన్న గది పైకప్పు కొంత మేర ఊడదీసి, సందు చేసి, ఆ పక్షవాత రోగిని అతని పరుపుతో సహా తాళ్ళతో యేసు ముందు దించారు
\s5
\v 5 తన వల్ల ఈ రోగి స్వస్థత పొందుతాడని ఆ మనుషులు ఎంత గట్టిగా నమ్మారో యేసు గ్రహించి ఆ రోగితో, "కుమారా, నీ పాపాలకు క్షమాపణ దొరికింది" అన్నాడు.
\p
\v 6 అక్కడ ఉన్న కొందరు ధర్మశాస్త్ర పండితులు ఉలిక్కిపడి తమలో తాము ఇలా ఆలోచించారు,
\v 7 "ఈ మనిషి తన గురించి తాను ఏమనుకుంటున్నాడు? పొగరెక్కి దేవుణ్ణి అవమానిస్తున్నాడు గదా. దేవుడు తప్ప పాపాలు క్షమించ గలవారెవరు?"
\s5
\p
\v 8 వారు లోలోపల ఇలా ఆలోచిస్తున్నారని యేసు అంతరాత్మలో గ్రహించి, వారితో ఇలా అన్నాడు, "మీరు ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తున్నారు?
\v 9 ఏది తేలిక? ఈ పక్షవాత రోగితో, నీ పాపాలకు క్షమాపణ దొరికింది అనడమా? లేక లేచి నీ పడక ఎత్తుకుని నడువు, అనడమా?
\s5
\v 10 భూలోకంలో పాపాలు క్షమించే అధికారం మనుష్య కుమారుడికి ఉందని మీరు తెలుసుకోవాలి" అని చెప్పి, ఆ పక్షవాత రోగిని చూసి,
\v 11 "నువ్వు లేచి నీ పడక తీసుకుని ఇంటికి వెళ్ళమని నేను నీతో చెబుతున్నాను" అన్నాడు.
\v 12 వెంటనే ఆ పక్షవాత రోగి లేచి పరుపు చుట్టుకుని అందరూ చూస్తూ ఉండగా నడుస్తూ బయటకు వెళ్ళిపోయాడు. ఇది చూసి వారంతా విస్మయం చెంది, "మనం ఇంతవరకూ ఇలాంటిది చూడలేదే" అని దేవుణ్ణి స్తుతించారు.
\s5
\p
\v 13 యేసు మళ్లీ గలిలయ సరస్సు తీరానికి వెళ్ళాడు. అనేక మంది ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన వారికి ఉపదేశం చేశాడు
\v 14 ఆయన నడుస్తుండగా, దారిలో అల్ఫయి కొడుకు లేవీని చూశాడు. అతడు పన్ను వసూలు చేసే చోట కూర్చుని ఉన్నాడు. యేసు అతనితో, "నా వెంట రా" అని పిలిచాడు. అతడు లేచి ఆయన వెంట వెళ్ళాడు.
\s5
\p
\v 15 తరువాత లేవి ఇంట్లో యేసు భోజనం చేస్తున్నపుడు పన్ను వసూలు చేసేవారు, సమాజంలో పాపులు అనిపించుకునే వాళ్ళు చాలామంది ఆయనతో, ఆయన శిష్యులతో కలిసి భోజనం చేస్తున్నారు.
\v 16 అది చూసి ధర్మశాస్త్ర పండితులు, పరిసయ్యులు ఆయన శిష్యులతో, "మీ గురువుగారు పాపులతో, పన్ను వసూలు చేసేవాళ్లతో కలిసి భోజనం చేస్తున్నాడేమిటి?" అన్నారు.
\s5
\p
\v 17 యేసు ఈ మాట విని వారితో, "ఆరోగ్యంగా ఉన్నవారికి వైద్యుడి అవసరం లేదు. రోగులకే వైద్యుడు అవసరం. మేము నీతిపరులమని అనుకుంటున్న వారిని పిలవడానికి నేను రాలేదు, మేము నీతిపరులం కాదు, పాపాత్ములమే అని తమ గురించి తాము అనుకుంటున్న వారిని పిలవడానికే వచ్చాను" అన్నాడు.
\s5
\p
\v 18 ఆ సమయంలో బాప్తిసం ఇచ్చే యోహాను శిష్యులు, మరి కొంతమంది పరిసయ్యులు తరచూ చేస్తున్నట్టే ఉపవాసం ఉన్నారు. కొంత మంది యేసు దగ్గరికి వచ్చి "యోహాను శిష్యులూ, పరిసయ్యుల శిష్యులూ ఉపవాసం చేస్తారు గాని నీ శిష్యులు ఉపవాసం చెయ్యరేమిటి?" అని ఆయనను అడిగారు.
\v 19 యేసు వారితో, "పెళ్ళికొడుకు తమతో ఉన్న సమయంలో అతని స్నేహితులు ఉపవాసం చేస్తారా? అతడు ఉన్నంత కాలం వారు ఉపవాసం చేయరు. పెళ్ళి అనేది పెళ్ళికుమారుడితో కలిసి పండగలా చేసుకునేది. అది ఉపవాసం చేసే సమయం కాదు, మరి ముఖ్యంగా పెళ్ళికొడుకు వారితో ఉన్నప్పుడు కాదు.
\s5
\v 20 పెళ్ళికొడుకును వారి దగ్గర నుండి తీసుకు వెళ్ళే సమయం వస్తుంది. ఆ రోజుల్లో వారు ఉపవాసం ఉంటారు."
\p
\v 21 యేసు వారితో ఇంకా ఇలా చెప్పాడు. "పాత బట్ట చిరుగుకు నీటిలో తడపని కొత్త బట్టతో ఎవరూ మాసిక వేయరు. అలా చేస్తే కొత్తది పాత దాన్ని గుంజి, చినుగు పెద్దదవుతుంది
\s5
\v 22 అలాగే, కొత్త ద్రాక్షారసం నిలవచేయడానికి పాత తిత్తుల్లో ఎవరూ పోయరు. అలా పోస్తే కొత్త ద్రాక్షరసం పులియడం మొదలవగానే దానికి తగినట్టుగా ఆ తిత్తులు సాగక పోవడం వల్ల చినిగిపోయి ద్రాక్షారసం కూడా కారిపోతుంది. కొత్త ద్రాక్షరసం కొత్త తిత్తుల్లోనే పోయాలి."
\s5
\p
\v 23 ఒక విశ్రాంతి రోజున ఆయన పంట చేలలో తన శిష్యులతో కలిసి నడుస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు తినడానికి కొన్ని ధాన్యం కంకులు తుంచుకున్నారు.
\v 24 పరిసయ్యులలో కొందరు అది చూసి యేసుతో "చూడు, నీ శిష్యులు విశ్రాంతి రోజున యూదుల ఆచారం ప్రకారం చేయకూడని పని ఎందుకు చేస్తున్నారు?" అని అడిగారు.
\s5
\p
\v 25 అందుకాయన వారితో, "దావీదు రాజు, అతనితో ఉన్నవారు అవసరంలో ఆకలిగా ఉన్నప్పుడు చేసింది మీరు చదవలేదా?ఈ సంగతి పవిత్ర గ్రంథంలో ఉంది కదా?
\v 26 అబ్యాతారు ప్రధాన యాజకుడిగా ఉన్నప్పుడు దావీదు దేవుని మందిరంలో ప్రవేశించి "ఆకలిగా ఉంది. తినడానికేమైనా ఇవ్వండి" అన్నప్పుడు ఆ ప్రధాన యాజకుడు అబ్యాతారు, దేవుని సన్నిధిలో ఉన్న రొట్టెలు అతనికి ఇవ్వలేదా? దావీదు మన శాస్త్రాల ప్రకారం యాజకులు తప్ప మరెవ్వరూ తినకూడని రొట్టెలు తిని తనతో ఉన్నవారికి పెట్టలేదా?" అన్నాడు.
\s5
\p
\v 27 ఆయన వారితో , "విశ్రాంతి రోజు మనుషుల కోసమే ఏర్పాటు అయింది. మనుషులు విశ్రాంతి రోజు కోసం కాదు.
\v 28 కాబట్టి మనుష్య కుమారుడు విశ్రాంతి రోజుకు కూడా ప్రభువే" అని స్పష్టంగా వారితో చెప్పాడు.
\s5
\c 3
\p
\v 1 మరోసారి ఒక విశ్రాంతి రోజున యేసు సమాజమందిరంలో ప్రవేశించాడు. చెయ్యి చచ్చుబడిపోయిన వాడొకడు అక్కడ ఉన్నాడు.
\v 2 పరిసయ్యుల వర్గానికి చెందిన కొద్ది మంది అక్కడ ఉన్నారు. వారు "ఈ విశ్రాంతి రోజున పాటించాల్సిన మన నియమాలను యేసు పాటిస్తాడా పాటించడా, లేక అదేమీ లెక్క చేయకుండా ఈ మనిషిని బాగుచేస్తాడా, చూడాలి," అనుకుంటూ ఏదో ఒక నేరం మోపాలి అని జాగ్రత్తగా గమనిస్తున్నారు.
\s5
\p
\v 3 యేసు ఆ చెయ్యి చచ్చుబడిన వాడితో, "ఇటు వచ్చి అందరి ముందూ నిలబడు" అన్నాడు. ఆయన అలా అనగానే వాడు వచ్చి అందరి ముందు నిలబడ్డాడు.
\v 4 అప్పుడు ఆయన వారితో, "విశ్రాంతి రోజున మేలు చేయడం ధర్మమా? కీడు చేయడం ధర్మమా? దేవుడు మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రజల్ని మంచి చేయమని చెబుతున్నదా లేక చెడు చేయమని చెబుతున్నదా? ధర్మశాస్త్రం విశ్రాంతి రోజున ఒక మనిషి ప్రాణం కాపాడవద్దనిగాని, ఆ మనిషి చనిపోయినా పరవాలేదని గానీ, చెప్పిందా?" అన్నాడు. అందుకు వారు ఏ జవాబూ చెప్పలేదు.
\s5
\p
\v 5 యేసు వాళ్ళను తీక్షణంగా చూశాడు. అవసరంలో నిస్సహాయంగా నిలబడి ఉన్న మనిషికి సహాయం చేయక పోగా, ఎటువైపు నుండీ కూడా సహాయం అందకూడదు, మా ఆచారాలే ముఖ్యం అన్నట్టు ఉన్న వారి కఠిన హృదయాలను బట్టి నొచ్చుకొని, కోపంతో రగిలిపోయాడు. అప్పుడు ఆ చెయ్యి చచ్చుబడిన వాడితో, "నీ చెయ్యి చాపు" అనగానే వాడు చెయ్యి చాపాడు. వెంటనే అతని చెయ్యి పూర్తిగా బాగైపోయింది.
\p
\v 6 అప్పుడు పరిసయ్యులు బయటకు వెళ్ళి, హేరోదు అంతిప అనే అధికారి అనుయాయులతో, కొందరు యూదులతో కలిసి యేసుని చంపడానికి కుట్ర పన్నారు. హేరోదు అంతిప గలిలయ ప్రాంతపు అధికారి.
\s5
\p
\v 7 యేసు తన శిష్యులతో కలసి గలిలయ సరస్సు ఒడ్డున వెళ్తూ ఉన్నాడు. గలిలయ, యూదయ ప్రాంతాల నుండి వచ్చిన చాలామంది ప్రజలు ఆయన వెంబడిస్తూ వెళ్ళారు.
\v 8 యేసు చేస్తున్నవన్నీ విని చాలామంది ప్రజలు యూదయ, యెరూషలేము పట్టణ ప్రాంతాల నుండీ, ఇదూమియ సీమ నుండీ, యొర్దాను నదికి తూర్పు వైపు నుండీ, తూరు, సీదోను చుట్టుపక్కల ప్రాంతాలనుండీ ఆయన దగ్గరికి వచ్చారు.
\s5
\v 9 ఎందుకంటే ఆయన చాలామంది జబ్బులు నయం చేశాడు.
\p
2020-10-16 17:09:26 +00:00
\v 10 అందువల్ల వ్యాధులతో ఉన్నవాళ్లు ఆయనను తాకాలని ఆయన దగ్గరికి తోసుకొస్తున్నారు. ఆయనని తాకితే చాలు స్వస్థపడతామని వాళ్ళందరూ నమ్ముతున్నారు.
\p అప్పుడాయన తన శిష్యులతో "తొక్కిసలాట జరుగుతూ ఉంది, నా కోసం ఒక చిన్న పడవ తీసుకురండి. ఒడ్డు నుండి కాస్త విడిగా నిలబడతాను" అన్నాడు.
2019-11-30 01:11:16 +00:00
\s5
\p
\v 11 దయ్యాలు ఆయనను చూడగానే, అవి తాము పట్టి పీడిస్తున్న వాళ్ళని ఆయన ఎదుట నేలపై పడేసి, "నువ్వు దేవుని కుమారుడివి" అని కేకలు వేశాయి.
\v 12 యేసు, తానెవరో తెలపాల్సిన పని లేదని దయ్యాలకు ఖండితంగా ఆజ్ఞాపించాడు.
\s5
\p
\v 13 తరువాత యేసు కొండ ప్రాంతానికి ఎక్కి వెళుతూ తనను అనుసరించాలని కోరుకున్న వారిని పిలిచాడు. వారు ఆయనతో వెళ్ళారు.
\v 14 తనతో ఉండడానికీ, బయటకు వెళ్ళి సువార్త ప్రకటించడానికీ ఆయన పన్నెండు మందిని నియమించాడు. వారికి పంపించిన వాళ్ళు లేక అపొస్తలులు అని పేరు పెట్టాడు.
\v 15 రోగాలు బాగుచేయడానికీ, దయ్యాలను వెళ్ళగొట్టడానికీ వారికి అధికారం ఇచ్చాడు.
\p
\v 16 ఆ పన్నెండుమంది పేర్లు ఏవంటే, సీమోను (ఇతనికి ఆయన పేతురు అనే కొత్త పేరు పెట్టాడు),
\s5
\v 17 ఇతనితోపాటు జెబెదయి కుమారుడు యాకోబు, అతని సోదరుడు యోహాను (వీరికి ఉన్న చురుకుదనం, ఉత్సాహాన్ని బట్టి ఆయన "బోయనేర్గెసు" అనే పేరు పెట్టాడు, ఆ మాటకి "గర్జించే వాళ్ళు" అని అర్థం),
\v 18 ఇంకా అంద్రెయ, ఫిలిప్పు, బర్తొలొమయి, మత్తయి, తోమా, అల్ఫయి కొడుకు యాకోబు, తద్దయి, కనానీయుడైన సీమోను అనే వారూ,
\v 19 చివరిగా తరువాతి రోజుల్లో యేసును శత్రువులకు పట్టి ఇచ్చిన ఇస్కరియోతు యూదా.
\s5
\p
\v 20 తరువాత యేసు, ఆయన శిష్యులు ఒక ఇంటికి వెళ్ళారు. మళ్ళీ అక్కడ చాలా మంది గుమిగూడి ఉన్నారు. కాబట్టి వారికి భోజనం చేయడానికి కూడా వీలు లేకపోయింది
\v 21 ఇది తెలిసిన యేసు కుటుంబీకులు ఆయనను పట్టుకుని ఇంటికి తీసుకు వెళ్ళడానికి వచ్చారు. ఎందుకంటే కొందరు "ఆయనకు మతి స్థిమితం లేదు" అన్నారు.
\p
\v 22 యెరూషలేము నుండి వచ్చిన కొద్దిమంది ధర్మశాస్త్ర పండితులేమో యేసు దయ్యాలను వెళ్ళగొడుతున్నాడని విని "బయల్జెబూలు ఇతణ్ణి ఆవహించాడు. ఆ దయ్యాల అధిపతి సహాయంతోనే ఇతడు దయ్యాలను పారదోలుతున్నాడు" అని అందరి సమక్షంలో అన్నారు.
\s5
\p
\v 23 యేసు అలా అన్నవారిని తన దగ్గరికి పిలిచి, ఒక ఉదాహరణ చెప్పాడు. "సైతాను సైతానును ఎలా వెళ్ళగొడతాడు?
\v 24 ఒకే రాజ్యంలో ఉన్న ప్రజలు ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం మొదలు పెడితే ఆ రాజ్యం ఒక్కటిగా ఎప్పటికీ వుండదు. పైగా నాశనం అవుతుంది కూడా.
\v 25 అలాగే, ఒకే ఇంట్లో ఉండే ఒకే కుటుంబసభ్యుల మధ్యలో ఇలాంటి పోట్లాటలు మొదలైతే ఆ ఇల్లు గానీ, ఆ కుటుంబం గానీ ఒక్కటిగా ఉండకపోగా దుంపనాశనం అవుతుంది.
\s5
\v 26 అలాగే సైతాను తనకు తానే విరోధంగా ఉంటే అతని బలం ఉడిగిపోయి అధికారం అంతమౌతుంది గదా.
\v 27 అసలు ఒక బలవంతుడి ఇంట్లో దొంగతనం చేయాలంటే మొదట అతణ్ణి కట్టిపడేయాల్సిందే గదా."
\s5
\p
\v 28 యేసు ఇంకా ఇలా చెప్పాడు. "జాగ్రత్తగా గమనించండి, మనుషులు ఎన్ని రకాల పాపాలు చేసినా, ఆఖరికి దేవుణ్ణి దూషించినా కూడా దేవుడు క్షమిస్తాడు.
\v 29 కాని పరిశుద్ధాత్మను దూషించిన వాణ్ణి దేవుడు ఎన్నటికీ క్షమించడు. అలా చేసేవాడు పాపం చేసి శాశ్వత కాలం దోషిగా ఉంటాడు."
\v 30 ఆయనకు దయ్యం పట్టింది అని వారు అన్నందుకు ఆయన వారితో ఇలా చెప్పాడు.
\s5
\p
\v 31 అప్పుడు యేసు తల్లి, ఆయన సోదరులు అక్కడికి వచ్చి, బయట నిలబడి యేసు కోసం కబురు చేశారు.
\v 32 ఆ సమయంలో యేసు చుట్టూ చాలా మంది ప్రజలు ఉన్నారు. వారిలో ఒకడు "మీ అమ్మ, తమ్ముళ్ళు బయట నీ కోసం చూస్తున్నారు" అన్నాడు.
\s5
\v 33 ఆయన తనతోపాటు ఉన్న వారితో, "ఎవరు నా తల్లి? ఎవరు నా సోదరులు?" అన్నాడు.
\v 34 తన చుట్టూ కూర్చున్న వారిని చూస్తూ, "మీరే నా తల్లి, మీరే నా సోదరులు.
\v 35 ఎందుకంటే, దేవుని ఇష్టప్రకారం నడుచుకునే వారే నా సోదరులు, నా అక్క చెల్లెళ్ళు, నా తల్లి" అన్నాడు.
\s5
\c 4
\p
\v 1 మరొకసారి ఆయన గలలీ సరస్సు ఒడ్డున ఉపదేశిస్తున్నాడు. ఆయన మాట్లాడుతుండగా చుట్టూ జనాల తాకిడి ఎక్కువైపోయింది. దాన్నుండి తప్పించుకుని, అందరితోనూ స్పష్టంగా మాట్లాడడం కోసం, ఆయన ఒడ్డునున్న ఒక పడవను కొంచం నీటి లోకి తోసి దాని మీద కూర్చుని మాట్లాడసాగాడు. వెంటనే ప్రజలందరూ వినడానికి వీలుగా నీళ్ళ దగ్గరికి జరిగారు.
\p
\v 2 అప్పుడు ఎన్నో సూక్తులు నీతికథల పంలో చెప్పాడు.
\s5
\v 3 "ఇది వినండి. ఒక రైతు తన పొలంలో విత్తనాలు చల్లడానికి వెళ్ళాడు.
\v 4 విత్తనాలు చల్లుతూ ఉండగా, కొన్ని దారి పక్కన పడ్డాయి, పక్షులు వచ్చి వాటిని తినేశాయి.
\v 5 మరికొన్ని మట్టి ఎక్కువగా లేని రాతినేల మీద పడ్డాయి. పై పైన కాస్త తేమ తగలడం వల్ల అవి త్వరగానే మొలకెత్తాయి. అయితే అడుగున రాతి నేల ఉండడం వల్ల వేర్లు కిందికి లోతుగా ఎదగలేదు.
\s5
\v 6 ఆ లేత మొక్కలమీద సూర్యరశ్మి పడగానే వాటి వేర్లు లోతుగా లేనందువల్ల ఎండ వేడికి వడిలిపోయి ఎండిపోయాయి.
\v 7 ఇంకా కొన్ని విత్తనాలు ముళ్ళ తుప్పల్లో పడ్డాయి. అక్కడ విత్తనాలు మొలకెత్తాయి, కానీ ఆ ముళ్ళ తుప్పలు ఆ మొక్కలకంటే బలంగా పెరిగి, ఎదుగుతున్న మొక్కలను అణచి వేయడం వల్ల అవి పంటకు రాలేదు.
\s5
\v 8 మిగిలిన విత్తనాలు మంచి సారవంతమైన నేలలో పడ్డాయి. అవి మొలకెత్తి, చక్కగా పెరిగి మంచి పంటను ఇచ్చాయి. కొన్ని మొక్కలు ముప్ఫై రెట్లు, కొన్ని అరవై రెట్లు, ఇంకొన్ని వంద రెట్లు పండి కోతకు వచ్చాయి."
\v 9 యేసు ఇలా చెప్పి "జాగ్రత్తగా విని, విచారించి తెలుసుకుంటే తప్ప యదాలాపంగా వింటే ఇప్పుడు చెప్పింది అర్థం కాదు" అన్నాడు.
\s5
\p
\v 10 తరువాత ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులు, ఆయన సన్నిహితులు కొందరు ఆ కథ గురించి ఆయనను అడిగారు
\v 11 "దేవుడు తనని తాను రాజుగా అగుపరచుకుంటున్న ఈ సందేశాన్ని నేను మీకు వివరిస్తాను. ఆసక్తి లేని ఇతరులకైతే ఇలాంటి ప్రతీ విషయమూ ఉపమానాల రూపంలోనే చెబుతాను.
\v 12 ఎందుకంటే,
\q వాళ్ళు నేను చేస్తున్నది చూస్తూనే ఉన్నా గ్రహించరు.
\q నేను చెప్పేది వింటున్నాఅర్థం చేసుకోలేరు.
\q వాళ్ళు గ్రహిస్తే అర్థం చేసుకుంటే
\q దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుతారేమో."
\s5
\p
\v 13 ఆయన వారితో ఇంకా ఇలా అన్నాడు, "ఈ ఉపమానం మీకు అర్థం కాలేదా? మరైతే మిగతావన్నీ ఎలా అర్థం చేసుకుంటారు?
\v 14 నేను మీకు చెప్పిన కథలో, విత్తనాలు చల్లేవాడు దేవుని సందేశాన్ని ఇతరులకు చెప్పేవాడు. అంటే వాడు చల్లేది దేవుని వాక్కునే.
\v 15 కొంతమంది ఆ విత్తనాలు పడిన కాలి బాటను పోలి వుంటారు. వాళ్ళు దేవుని సందేశం వింటారు గానీ, వెంటనే సైతాను వచ్చి, దొరికిన విత్తనాల్ని పక్షులు చటుక్కున ఎలా పట్టుకు పోతాయో అలా విన్నవాళ్ళు మర్చిపోయేలా చేస్తాడు.
\s5
\p
\v 16 అలాగే కొంతమంది పైపైనే మట్టి ఉండి అడుగున రాతి నేలను పోలిన వారు. వీళ్ళు దేవుని సందేశం విని మొదట ఆనందంతో దాన్ని స్వీకరిస్తారు.
\v 17 కానీ పలచగా మట్టి ఉన్న రాతి నేల మీద మొక్క ఎలా పెరగలేక ఎండిపోయిందో అలా దేవుని సందేశాన్ని విని అంగీకరించినందుకు, వారిని ఎవరైనా హీనంగా చూసినా, బాధ పెట్టినా వెంటనే వాళ్ళు దేవుని సందేశాన్ని నమ్మడం మానేస్తారు.
\s5
\p
\v 18 కొంతమంది ముళ్ళతుప్పలు మొలిచే నేల లాంటి వారు. వీరు దేవుని సందేశాన్ని విని, నాటిన విత్తనం భూమిని చీల్చుకుని ఎలా పైకి ఎదుగుతుందో మొదట అలానే ఉంటారు.
\v 19 కానీ, "మనం ఇలాగే ఉండిపోతే ఎలా, ఇంకా చాలా సంపాదించాలి, చాలా పనులు చేయాల్సి ఉంది" అనుకుంటూ జీవితంలో కలిగే చింతలు, ధనం కలిగించే మోసం, ఇతర విషయాల పట్ల కోరికలు ఎక్కువైపోయి, ఎదుగుతున్న మొక్కను చుట్టూ ఉన్న ముళ్ళ తుప్పలు ఎలా అణగ తొక్కుతాయో, అలా దేవుని సందేశం అణిగిపోయి మొక్క ఫలించకుండా పోతుంది. అందువల్ల దేవుడు ఏం చెప్పాడో, ఏం చేయమన్నాడో మర్చిపోయి, ఎంతసేపూ తమ సొంత విషయాల్లోనే మునిగి పోతారు.
\p
\v 20 మరి కొందరు సారవంతమైన నేలలాంటి వారు. వీళ్ళు దేవుని సందేశాన్ని విని, అంగీకరించి, నమ్మకంగా ఆచరణలో పెడతారు. చక్కగా ఎదిగిన మొక్క పరిస్థితులను సానుకూల పరుచుకుని ఎలా మంచి పంటనిస్తుందో, అలా కొందరు ముప్ఫై రెట్లు, కొందరు అరవై రెట్లు, కొందరు వంద రెట్లు ఫలిస్తారు."
\s5
\p
\v 21 ఆయన వారితో ఇంకొక కథ చెప్తూ, "దీపాన్ని వెలిగించి, తీసుకొచ్చి, బోర్లించిన పాత్ర కింద, లేక మంచం కింద ఉంచుతారా? దాన్ని ఎత్తుగా, అందరికీ వెలుగు కనబడేలా దీపస్తంభం మీద ఉంచుతాం గదా.
\v 22 అలా ఆ వెలుగు పడగానే, అప్పటివరకూ కనబడకుండా దాచినవి బయటపడతాయి. చీకటి మాటున రహస్యంగా జరుగుతున్నవీ బయటపడతాయి.
\v 23 ఇది అర్థం కావాలంటే, జాగ్రత్తగా విని, విచారించి తెలుసుకోవాలే తప్ప, యదాలాపంగా వింటే ఇప్పుడు చెప్పింది అర్థం కాదు" అన్నాడు.
\s5
\p
\v 24 యేసు వారితో ఇంకా ఇలా అన్నాడు, "నేను మీతో చెప్పేది జాగ్రత్తగా గమనించండి. మీరు నానుంచి విన్న దానిని ఎంతగా పట్టించుకుంటారో, దేవుడు కూడా అంతగా మీకు ఆ మాటలు అర్థం అయ్యేలా చేస్తాడు. మీ ఆసక్తిని చూసి ఇంకా బాగా అర్థం అయ్యేలా కూడా చేస్తాడు.
\v 25 వినాలి, నేర్చుకోవాలి అనే ఆసక్తి కలిగిన వారికి దేవుడు ఆ సామర్థ్యం ఇంకా ఎక్కువగా ఇస్తాడు. అలా లేని వారినుండి అంటే మొక్కుబడిగా వింటున్న వారి దగ్గర నుండి ఉన్నది కూడా తీసివేస్తాడు."
\s5
\p
\v 26 ఆయన మళ్ళీ ఇలా అన్నాడు, "రాజు తన ప్రజల యోగ క్షేమాలు చూడడానికి అంతఃపురం వదిలి, ప్రజల మధ్యకు వచ్చినట్టుగా దేవుడు తన ప్రభుత్వంతో మనుషుల మధ్యకు వచ్చినప్పుడు ఇలా జరుగుతుంది. ఒక మనిషి పొలంలో గింజలు చల్లి,
\v 27 చల్లిన విత్తనాల గురించి ఏ బాదరబందీ లేకుండా, నిద్ర పోతున్నా మెలకువగా ఉన్నా రాత్రి, పగలు అతనికి తెలియకుండానే ఆ విత్తనాలు మొలకెత్తి పెరుగుతూనే ఉంటాయి.
\v 28 ఎందుకంటే భూమి దానంతట అదే పండుతుంది. మొదట మొలక, ఆ తరువాత కంకి, ఆ కంకి నిండా గింజలు పుడతాయి.
\v 29 పంట పండీ పండగానే అతడు కోతకాలం వచ్చిందని, వెంటనే తన మనుషులను పంపించి పంట కోస్తాడు."
\s5
\p
\v 30 ఆయన మళ్ళీ ఈ విధంగా అన్నాడు. "దేవుని రాజ్యాన్ని దేనితో పోల్చగలం? ఏ ఉపమానం ఉపయోగించి దాన్ని వర్ణించగలం?
\v 31 దేవుని రాజ్యాన్ని ఆవగింజలతో పోల్చితే, మనం భూమి మీద నాటే విత్తనాలన్నిటిలోకీ అవి చిన్నవైనప్పటికీ, పెద్ద మొక్కలుగా పెరుగుతాయి.
\v 32 దాన్ని నాటిన తరువాత తోటలో ఉన్న అన్ని మొక్కల కన్నా అది పెద్దగా పెరుగుతుంది. దాని కొమ్మలు పెద్దగా ఎదుగుతాయి. పక్షులు సైతం దాని నీడలో గూడు కట్టుకుంటాయి."
\s5
\p
\v 33 యేసు ఇలాంటి ఉదాహరణలు, కథలు ఎన్నో ఉపయోగించి, ప్రజలందరికీ దేవుని సందేశాన్ని ఉపదేశించాడు. వారు అర్థం చేసుకోగలిగిన కొద్దీ మరి ఎక్కువగా వివరించాడు.
\v 34 కథలు లేకుండా వారికి ఏ ఉపదేశమూ చేయలేదు. తరువాత ఆయన తన శిష్యులతో ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం వారికి అన్నీ వివరించి చేప్పేవాడు.
\s5
\p
\v 35 ఆ రోజు సాయంత్రం సూర్యుడు అస్తమిస్తుండగా ఆయన తన శిష్యులతో, "సరస్సు అవతలి ఒడ్డుకు వెళ్దాం పదండి" అన్నాడు.
\v 36 యేసు అప్పటికే పడవ ఎక్కేశాడు. శిష్యులు జనసమూహాలను విడిచి యేసుతో పడవలో బయలుదేరారు. మిగతా వారు కూడా పడవలు ఎక్కి వారివెంట వెళ్ళారు.
\v 37 అప్పుడు పెద్ద తుఫాను వచ్చింది. అలలు లేచి పడవను నీళ్ళతో నింపసాగాయి.
\s5
\v 38 పడవ వెనక భాగంలో యేసు తలకింద దిండు పెట్టుకుని నిద్రపోతూ ఉన్నాడు. శిష్యులు ఆయనను నిద్ర లేపి ఆయనతో, "గురువుగారూ! మేము మునిగిపోతుంటే నీకేమీ పట్టదా?" అని గాభరాగా అన్నారు.
\v 39 ఆయన లేచి గాలిని, సముద్రాన్ని గద్దిస్తూ, "శాంతించు! ఆగిపో!" అని ఆజ్ఞాపించాడు. వెంటనే గాలి ఆగిపోయింది. అంతా ప్రశాంతంగా మారింది.
\s5
\p
\v 40 అప్పుడాయన శిష్యులతో, "మీరెందుకు భయపడుతున్నారు? నేను మిమ్మల్ని కాపాడగలననే విశ్వాసం ఇంకా కలగలేదా?" అన్నాడు.
\v 41 వారికి చాలా భయమేసింది. ఒకరితో ఒకరు, "ఎవరీయన? గాలి, సముద్రం సహా ఈయన మాటకు లోబడుతున్నాయే!" అని చెప్పుకున్నారు.
\s5
\c 5
\p
\v 1 వారు గలలీ సరస్సు దాటి అవతలి ఒడ్డున ఉన్న గెరాసేను ప్రాంతానికి వెళ్ళారు.
\v 2 యేసు పడవ దిగగానే దయ్యం పట్టిన వాడొకడు స్మశానం నుండి ఆయన దగ్గరికి వచ్చాడు.
\s5
\v 3 వాడు స్మశానంలోనే నివసించేవాడు. వాణ్ణి గురించి తెలిసిన ప్రజలు వాణ్ణి కట్టడి చెయ్యడానికి ప్రయత్నం చేసినా వీలు కాలేదు. ఇనప గొలుసులతో సైతం వాణ్ణి ఎవ్వరూ కట్టెయ్యలేకపోయారు.
\v 4 వాడి చేతులు, కాళ్ళు ఎన్నిసార్లు గొలుసులతో, సంకెళ్ళతో కట్టినా ఆ సంకెళ్ళు తెంపి, కట్లను చిందరవందర చేసే వాడు. వాణ్ణి అదుపు చేసే శక్తి ఎవరికీ లేకపోయింది.
\s5
\v 5 వాడు స్మశానంలో, కొండల మీదా, గుహల్లోనూ రేయింబవళ్ళు తిరుగుతూ పెద్దగా కేకలు పెడుతూ తన శరీరాన్ని పదునైన రాతి ముక్కలతో గాయపరచుకొనేవాడు.
\p
\v 6 వాడు యేసును దూరం నుండి చూసి పరుగెత్తుకు వచ్చి ఆయన ముందు మోకరించి నమస్కారం చేశాడు.
\s5
\v 7 యేసు అతనితో, "అపవిత్రాత్మా, ఈ మనిషిని వదలి బయటకు రా!" అన్నాడు.
\v 8 అప్పటికీ ఆ మనిషిని వదలడం ఇష్టంలేని దయ్యం "యేసూ, మహోన్నత దేవుని కుమారా! నాతో నీకేం పని? దేవుని పేరిట నిన్ను బతిమాలుతున్నాను, నన్ను బాధ పెట్టవద్దు!" అని గట్టిగా కేకలేస్తూ అన్నాడు.
\s5
\v 9 ఆయన, "నీ పేరేమిటి?" అని అతణ్ణి అడిగాడు. "నా పేరు దయ్యాల దళం. మేము చాలా మంది అపవిత్రాత్మలం కలసి ఇతనిలో ఉన్నాం" అని అతడు జవాబు చెప్పాడు
\v 10 ఆ ప్రాంతం నుండి తమను పంపివేయవద్దని ఆ దయ్యాలు ఆయన్ని ఎంతో బతిమాలుకున్నాయి. అందుకు యేసు ససేమిరా అన్నాడు.
\s5
\p
\v 11 అదే సమయంలో ఆ కొండ పక్కన పెద్ద పందుల గుంపు మేస్తూ ఉంది.
\v 12 ఆ దయ్యాలు యేసుతో, "మమ్మల్ని ఆ పందుల గుంపులో చొరబడడానికి అనుమతి ఇవ్వు" అని ప్రాధేయపడ్డాయి.
\v 13 యేసు వాటికి అనుమతి ఇచ్చాడు. దయ్యాలు అతణ్ణి వదిలి ఆ పందుల్లోకి చొరబడ్డాయి. ఆ మందలో సుమారు రెండు వేల పందులు ఉన్నాయి. అవి వాలుగా ఉన్న కొండమీద నుండి వేగంగా పరుగెత్తి సముద్రంలో పడి మునిగి చచ్చాయి.
\s5
\v 14 ఆ పందులు మేపేవారు పారిపోయి ఊర్లో, ఆ చుట్టుపక్కల పల్లెప్రాంతాల్లో ఈ సంగతి చెప్పారు. అక్కడి ప్రజలు జరిగినదాన్ని చూడాలని వచ్చారు.
\p
\v 15 వారు యేసు దగ్గరికి వచ్చినప్పుడు దయ్యాల సేన పట్టిన వాడు బట్టలు వేసుకొని బుద్ధిగా కూర్చుని ఉండడం గమనించారు. ఇదంతా చూసి వారికి భయం వేసింది.
\s5
\v 16 దయ్యాలు మనిషిని వదిలిపోవడం, ఆ తరువాత పందుల్లో దూరడం, పందులు సరస్సులో పడడం, అంతా స్వయంగా చూసినవారు, దయ్యాలు పట్టిన వాడికి జరిగిన దాన్ని గురించి, పందుల గురించి అందరికీ కళ్ళకి కట్టినట్టు చెప్పారు.
\v 17 వారు యేసును తమ ప్రాంతం విడిచి వెళ్ళిపొమ్మని వేడుకున్నారు.
\s5
\p
\v 18 యేసు పడవ ఎక్కుతూ ఉండగా దయ్యాలు వదిలి పోయినవాడు వచ్చి తనను కూడా వెంట రానిమ్మని బతిమాలాడు.
\v 19 కాని యేసు దానికి అంగీకరించలేదు. అతనితో, "నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళి ప్రభువు నీకు చేసినదాని గురించీ, నీపై చూపిన దయ గురించీ మీ వాళ్ళకి చెప్పు" అన్నాడు
\v 20 అతడు వెళ్ళి, యేసు తనకు చేసిన గొప్ప కార్యం గురించి దెకపొలి చుట్టుపక్కల ప్రాంతంలో కనీసం పది పట్టణాలలో ప్రకటించాడు. అది విన్న అందరికీ ఎంతో ఆశ్చర్యం కలిగింది.
\s5
\p
\v 21 యేసు పడవ ఎక్కి తిరిగి గలలీ సరస్సు అవతలి ఒడ్డుకు చేరుకొన్నాడు. ఆయన సరస్సు ఒడ్డున ఉండగానే పెద్ద గుంపు ఆయన దగ్గర చేరింది.
\v 22 అప్పుడు యాయీరు అనే యూదుల సమాజ మందిరం అధికారి ఒకడు యేసును వెతుక్కుంటూ వచ్చి ఆయన పాదాల దగ్గర మోకరిల్లి,
\v 23 "నా కూతురు చావు బతుకుల్లో ఉంది. దయచేసి నువ్వు వచ్చి నీ చేతులు ఆమె మీద ఉంచు. ఆమె బాగుపడి బతుకుతుంది" అని దీనంగా వేడుకున్నాడు.
\v 24 యేసు అతని వెంట బయలుదేరాడు. పెద్ద గుంపు ఆయన మీద పడుతూ ఆయన వెంట వెళ్ళింది.
\s5
\p
\v 25 పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో దిన దిన గండంగా బ్రతుకుతున్న ఒక స్త్రీ ఆ గుంపులో ఉంది.
\v 26 ఆమె చాలామంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది. కాని, ఆమె బాధ తగ్గలేదు. తన డబ్బంతా ఖర్చు చేసింది. అయినా జబ్బు నయం కావడానికి బదులు ఆమె పరిస్థితి ఇంకా క్షీణించింది.
\v 27 చాలామంది రోగులను యేసు నయం చేసాడని విని, యేసు దగ్గరకు వచ్చింది. చుట్టూ ఉన్న గుంపులోకి శక్తినంతా కూడదీసుకుని చొరబడింది.
\s5
\v 28 "నేను ఆయన్ని గానీ, ఆయన బట్టలు గానీ తాకితే చాలు, నాకు నయమౌతుంది" అనుకుని, ఆయన వెనకగా వచ్చి ఆయన అంగీ అంచు తాకింది.
\v 29 వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది. తన జబ్బు పూర్తిగా నయమైందని ఆమెకి తెలిసిపోయింది.
\s5
\p
\v 30 వెంటనే యేసు తనలో నుండి శక్తి ప్రవహించిందనీ ఎవరో స్వస్థపడ్డారనీ గ్రహించి, ప్రజల వైపు తిరిగి, "నా అంగీ తాకినదెవరు?" అన్నాడు.
\v 31 ఆయన శిష్యులు, "ఇంతమంది నీ మీద పడుతున్నారు గదా! అయినా "నన్ను తాకినది ఎవరు" అంటున్నావేమిటి?" అన్నారు.
\v 32 కాని యేసు, తనను తాకిన వారికోసం చుట్టూ చూశాడు.
\s5
\p
\v 33 ఆ స్త్రీ తన రోగం నయం అయిందన్న సంగతి యేసు గ్రహించి, తనకోసమే వెతుకుతున్నాడని గ్రహించి భయంతో వణుకుతూ వచ్చి యేసు కాళ్ళపై పడి, జరిగిందంతా చెప్పింది.
\v 34 ఆయన ఆమెతో, "ఏమ్మా, నేను నయం చేయగలని నమ్మావు కదా. నీ విశ్వాసమే నిన్ను బాగుచేసింది. నీ జబ్బు సంపూర్ణంగా నయం అయిందనీ, మరెప్పటికీ నిన్ను వేధించదనీ మాట ఇస్తున్నాను. హాయిగా ఇంటికి వెళ్ళు" అన్నాడు.
\s5
\p
\v 35 యేసు ఇంకా మాట్లాడుతుండగా, యూదుల సమాజ మందిరం అధికారి యాయీరు ఇంటి నుండి కొందరు వచ్చి అతనితో, "నీ కూతురు చనిపోయింది. ఇంక గురువును ఇంటిదాకా తీసికెళ్ళి ఇబ్బంది కలిగించడం ఎందుకు? వద్దులే" అన్నారు.
\s5
\v 36 యేసు వారి మాటలు పట్టించుకోకుండా, యాయీరుతో, "భయపడకు, అమ్మాయి తప్పక బతుకుతుంది. నమ్మకం ఉంచు, అసలు వదులుకోవద్దు" అన్నాడు
\v 37 అప్పుడాయన తనతో సన్నిహితంగా ఉన్న పేతురును, యాకోబును, యాకోబు సోదరుడు యోహానును తప్ప ఎవ్వరినీ తన వెంట యాయీరు ఇంటికి రానివ్వలేదు.
\p
\v 38 వాళ్ళు ఆ ఇంటి దగ్గరకు వచ్చినపుడు, అక్కడ ఉన్నవారు బిగ్గరగా ఏడుస్తూ, శోకాలు పెడుతూ గుండెలు బాదుకుంటూ ఉండడం చూశాడు.
\s5
\v 39 ఆయన ఇంట్లోకి వెళ్ళి వాళ్లతో, "ఎందుకు గాభరా పడుతున్నారు? ఎందుకు ఏడుస్తున్నారు? ఆమె చనిపోలేదు, నిద్రలో ఉంది, అంతే" అన్నాడు.
\v 40 కాని, వారు ఆయనను హేళన చేశారు. ఎందుకంటే ఆ అమ్మాయి చనిపోవడం వాళ్ళు కళ్ళారా చూశారు. యేసు వారందర్నీ బయటకు పంపి, తరవాత ఆమె తండ్రిని, తల్లిని, తనతో ఉన్న శిష్యుల్ని వెంటబెట్టుకొని ఆమెను పడుకోబెట్టి ఉన్న గదిలోకి వెళ్ళాడు.
\s5
\v 41 ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకుని, "తలితా కుమీ" అన్నాడు. వాళ్ళ భాషలో ఆ మాటకు, "చిన్ని పాపా, నీతో నేనంటున్నాను, లే" అని అర్థం.
\v 42 వెంటనే ఆ అమ్మాయి లేచి నడవసాగింది. ఆ అమ్మాయి వయస్సు పన్నెండేళ్ళు. ఇది చూసిన వారంతా చాలా ఆశ్చర్య పోయారు.
\v 43 నేను చేసిన ఈ సంగతి ఎవ్వరికీ చెప్పవద్దని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించాడు. ఆ అమ్మాయికి తినడానికి ఏదైనా ఇవ్వమని వారితో చెప్పాడు.
\s5
\c 6
\p
\v 1 యేసు కపెర్నహోము పట్టణం నుండి తన స్వగ్రామం నజరేతుకు తన శిష్యులతో కలసి వెళ్ళాడు.
\v 2 యూదుల విశ్రాంతి రోజున, యూదులు వారి మత విశ్వాసాన్ని బోధించుకునే సమాజ మందిరంలో యేసు ప్రవేశించి ఉపదేశించడం మొదలు పెట్టాడు. చాలామంది ఆయన ఉపదేశం విని ఎంతో ఆశ్చర్యపడ్డారు. "ఈ సంగతులన్నీ ఇతనికెలా తెలుసు? దేవుడు ఇతనికి ఎంతటి జ్ఞానం ఇచ్చాడు! ఇతని ద్వారా ఇన్ని మహత్కార్యాలు ఎలా జరుగుతున్నాయి?
\v 3 ఇతడు మామూలు వడ్రంగే కదా! మరియ కొడుకేగదా! యాకోబు, యోసే, యూదా, సీమోనుల అన్నే గదా. ఇతడి చెల్లెళ్ళు అందరూ ఇక్కడ మనతోనే ఉన్నారు గదా!" అని చెప్పుకుంటూ ఆయన గురించి చాలా తక్కువ చేసి మాట్లాడడమే కాకుండా ఆయన విషయంలో చాలా అసూయపడ్డారు.
\s5
\p
\v 4 యేసు వారితో, "నాకైనా, ఏ ప్రవక్తకైనా తన సొంత ఉళ్ళో, సొంత వారి మధ్య, సొంత ఇంట్లో తప్ప అన్ని చోట్లా గౌరవం లభిస్తుంది” అన్నాడు.
\v 5 అక్కడ యేసు కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని బాగు చేయడం తప్ప మరి ఏ మహత్కార్యాలూ చేయలేకపోయాడు.
\v 6 వారి అపనమ్మకానికి ఆయన ఆశ్చర్యపడ్డాడు. ఆ తరువాత యేసు చుట్టుపక్కల గ్రామాలు తిరుగుతూ ఉపదేశం చేశాడు.
\s5
\p
\v 7 ఒక రోజు యేసు తన పన్నెండుమంది శిష్యులను దగ్గరికి పిలుచుకుని, "మీరు వెళ్ళి ప్రజలకు బోధించాల్సిన సమయం వచ్చింది" అంటూ, వారికి దయ్యాలను వెళ్ళగొట్ట గల అధికారమిచ్చి, ఇద్దరిద్దరిగా పంపుతూ ఇలా ఆజ్ఞ ఇచ్చాడు.
\v 8 "ప్రయాణం కోసం చేతికర్ర తప్ప ఇంకేదీ తీసుకు వెళ్ళకండి. ఆహారం గాని, సామాన్లు పెట్టుకునే చేతి సంచిగాని, ప్రయాణం కోసం డబ్బుగాని, తీసుకు వెళ్ళకండి.
\v 9 ఒంటిమీది దుస్తులు తప్ప విడిగా దుస్తులు తీసుకు వెళ్ళకండి.
\s5
\v 10 ఏ గ్రామం, ఊరు వెళ్ళినా, అక్కడ ఎవరైనా వాళ్ళ ఇంటికి రమ్మని ఆహ్వానిస్తే, ఆ ఇంటికి వెళ్ళాక అక్కడే తినండి, అక్కడే పడుకోండి. ఆ గ్రామం విడిచే వరకూ ఆ ఇంట్లోనే ఉండండి.
\v 11 ఏ ఊరు వాళ్లైనా మిమ్మల్ని స్వీకరించకపోతే, మీ మాటలు వినకపోతే, మీరు ఆ గ్రామం వదిలే ముందు వారి తిరస్కారానికి సాక్ష్యంగా మీ పాద ధూళిని దులిపి వేయండి."
\s5
\p
\v 12 తరువాత శిష్యులు వెళ్ళి, చాలా గ్రామాలూ, ఊర్లూ తిరుగుతూ "మీ పాపాల గురించి పశ్చాత్తాప పడండి, మీ ప్రవర్తనను సరి చేసుకోండి, ఇకమీదట తప్పులు చేయకూడదని నిర్ణయించుకోండి, అలాంటి వారిని దేవుడు క్షమిస్తాడు" అంటూ ప్రకటించారు.
\v 13 శిష్యులు ఎన్నో దయ్యాలను వదిలించారు. అనేకమంది రోగులను నూనె రాసి బాగుచేశారు.
\s5
\p
\v 14 యేసు పేరు బాగా ప్రసిద్ధి కావడం వల్ల ఆ సంగతి ఆ నోటా ఈ నోటా హేరోదు రాజుకు తెలిసింది. బాప్తిసం ఇచ్చే యోహాను బతికి వచ్చాడని, అందుకే యేసులో మహత్కార్యాలు చేసే శక్తి ఉన్నదని కొందరు అన్నారు.
\v 15 కొద్దిమంది, "ఈయన ఒకప్పటి ప్రవక్త ఏలీయా, ఆయనను దేవుడు తిరిగి పంపిస్తాను అన్నాడు గదా" అన్నారు. ఇంకొందరు, "ఈయన ఫలానా అని ఇదమిద్దంగా చెప్పలేము కానీ, తప్పకుండా పూర్వకాలపు ప్రవక్తల వంటి ప్రవక్తే” అన్నారు.
\s5
\p
\v 16 కాని, హేరోదైతే, "నేను తల నరికించిన యోహానే మళ్ళీ బతికి వచ్చాడు" అన్నాడు.
\v 17 అంతకు ముందు ఏం జరిగిందంటే, హేరోదియ అనే ఆమెను ఈ హేరోదు వివాహం చేసుకున్నాడు. అప్పటికే ఆమె హేరోదు సోదరుడైన ఫిలిప్పు భార్య.
\s5
\v 18 యోహాను హేరోదుతో, "నీ సోదరుడు బ్రతికుండగానే అతని భార్యను తెచ్చుకోవడం అన్యాయం, దేవుడు ఇలాంటి వివాహాలను అనుమతించడు" అని హెచ్చరించాడు. హేరోదియకు ఆ హెచ్చరికలు రుచించ లేదు. అందుచేత ఆమె యోహానుకు వ్యతిరేకంగా హేరోదుపై ఒత్తిడి తీసుకువచ్చింది. గత్యంతరం లేక హేరోదు సైనికులను పంపి యోహానును బంధించి, ఖైదులో వేయించాడు.
\p
\v 19 హేరోదియ మాత్రం యోహాను మీద పగపట్టి, అతణ్ణి చంపాలని ఆశించింది. కానీ అలా చెయ్యలేకపోయింది. హేరోదు యోహానును జైల్లో వేయించడం ద్వారా ఒక విధంగా హేరోదియ నుండి కాపాడినట్టు అయింది.
\v 20 ఎందుకంటే హేరోదు యోహానుకు భయపడేవాడు. యోహాను దైవభక్తుడు, నీతిమంతుడు, పవిత్రమైనవాడు అని హేరోదుకు తెలుసు కనుక అతణ్ణి కాపాడుతూ వచ్చాడు. హేరోదు యోహాను మాటలు విన్న ప్రతీసారీ బెంబేలు పడేవాడు. అయినా అతని మాటలు వినడానికి ఇష్టపడేవాడు.
\s5
\p
\v 21 ఒక రోజు హేరోదియకు అవకాశం దొరికింది. హేరోదు తన రాజ్యంలోని అధికారులను, సేనానులను, గలిలయలోని గొప్పవారిని పిలిచి తన పుట్టిన రోజు విందు చేశాడు.
\v 22 హేరోదియ కూతురు వచ్చి నాట్యం చేసి, హేరోదును అతని అతిథుల్ని మెప్పించింది. అప్పుడు హేరోదు ఆమెతో, "నీకు ఏది ఇష్టమో అడుగు, ఇస్తాను!
2020-10-16 17:09:26 +00:00
\v 23 అర్థ రాజ్యమైనా సరే!". అని ఆవేశంతో ప్రమాణం చేశాడు.
2019-11-30 01:11:16 +00:00
\p
\v 24 ఆమె బయటకి వెళ్ళి తన తల్లితో, "నన్నేమి కోరుకోమంటావు?" అని అడిగింది. ఆమె, "బాప్తిసం ఇచ్చే యోహాను తల కోరుకో" అని చెప్పింది.
\v 25 వెంటనే ఆమె రాజు దగ్గరికి గబగబా వెళ్ళి, "బాప్తిసం ఇచ్చే యోహాను తలను పళ్ళెంలో పెట్టి నాకు ఇప్పించండి, నాకు కావలసింది అదే" అని అడిగింది.
\v 26 రాజుకు చాలా దుఃఖం కలిగింది గానీ, తను తొందరపాటుగా చేసిన ప్రమాణం తనతో కూర్చుని ఉన్నవారంతా విన్నారు. ఇక ఆమె కోరికను తోసిపుచ్చలేక పోయాడు.
2020-10-16 17:09:26 +00:00
\s5
2019-11-30 01:11:16 +00:00
\v 27 అందువల్ల అతడు వెంటనే యోహాను తల తీసుకు రమ్మని భటుణ్ణి పంపాడు. ఆ భటుడు వెళ్ళి ఖైదులోనే యోహాను తల నరికి చంపాడు.
\v 28 అతని తలను ఒక పళ్ళెంలో పెట్టి, తీసుకు వచ్చి ఆమెకు హేరోదు తరుపున కానుకగా ఇచ్చాడు. ఆమె దాన్ని తన తల్లికి ఇచ్చింది.
\v 29 యోహాను శిష్యులు ఈ సంగతి విని వచ్చి అతని శవాన్ని తీసుకుపోయి సమాధి చేశారు. ఇదంతా మనసులో వుండడం వల్ల హేరోదు యేసును గురించి అలా అన్నాడు.
\p
\v 30 పన్నెండుమంది అపొస్తలులు యేసు దగ్గరికి తిరిగి వచ్చి తాము చేసిన వాటి గురించీ బోధించిన వాటి గురించీ వివరంగా ఆయనకు చెప్పారు.
\v 31 వారి దగ్గరికి అనేకమంది వస్తూ పోతూ ఉండడం వల్ల వారికి కాస్త విశ్రాంతి తీసుకోవడానికి, భోజనం తినడానికి కూడా సమయం లేకపోయింది. యేసు వారితో, "మీరు నాతో రండి. మనం ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళి, కొంత విశ్రాంతి తీసుకుందాం" అన్నాడు.
\p
\v 32 వాళ్లంతా పడవలో ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి వెళ్ళారు.
\v 33 అయితే వారు వెళ్తూ ఉండగా జనసమూహాలు ఆయనను, ఆయన శిష్యులను గుర్తుపట్టి, వాళ్ళు ఎక్కడికి వెళుతున్నారో గమనించి, వివిధ గ్రామాల నుంచి, చుట్టు పక్కల పట్టణ ప్రాంతాలనుండి పరిగెత్తుకుంటూ వెళ్ళి వారికన్నా ముందే ఆ ప్రదేశానికి చేరుకున్నారు.
\v 34 పడవలో యేసు, ఆయన శిష్యులు అక్కడికి చేరినప్పుడు, వారికంటే ముందే అక్కడకి చేరిన పెద్ద జనసమూహం ఆయనకు కనిపించింది. కాపరి లేని గొర్రెల్లా ఉన్న ఆ ప్రజలను చూసి ఆయనకు అమితమైన జాలి కలిగింది. అందుచేత ఆయన వారికి అనేక విషయాలు ఉపదేశించసాగాడు.
\p
\v 35 చాలా పొద్దుపోయిన తరువాత ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, "ఇది మనుషులెవారూ లేని తావు. ఇక్కడ ఎవరూ నివసించ గలిగే పరిస్థితి లేదు. ఇప్పటికే పొద్దుపోయింది.
\v 36 ఈ ప్రజలకు తినడానికి ఇక్కడ ఏమీ లేదు. కాబట్టి వారు చుట్టూ ఉన్న పల్లెలకో గ్రామాలకో వెళ్ళి ఏదైనా కొనుక్కోడానికి వారిని పంపివెయ్యి" అన్నారు.
\v 37 అయితే యేసు వారితో "మీరే వారికి తినడానికి ఏమైనా పెట్టండి" అన్నాడు. అందుకు వారు ఆయనతో, "వీళ్ళకు ఆహారం పెట్టాలంటే రెండు వందల దేనారాలకు రొట్టెలు కొనాలి. అంటే ఒక మనిషి దాదాపు రెండు వందల రోజులు పని చేస్తే వచ్చే కూలీ అది. మనవల్లేమౌతుంది" అని ఆయనతో అన్నారు.
\v 38 ఆయన వారితో, "మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయో చూడండి" అన్నాడు. వారు వెళ్ళి చూసి, "ఐదు రొట్టెలు, రెండు కాల్చిన చిన్నచేపలు ఉన్నాయి" అన్నారు.
\p
\v 39 అప్పుడాయన అందరినీ గుంపులు గుంపులుగా పచ్చగడ్డి మీద కూర్చోబెట్టమని శిష్యులతో చెప్పాడు.
\v 40 ప్రజలు పంక్తికి యాభైమంది, వందమంది చొప్పున కూర్చున్నారు.
\v 41 యేసు ఆ ఐదు రొట్టెలు, రెండు చేపలు చేతపట్టుకొని ఆకాశం వైపు చూసి, దేవునికి ఆ ఆహారం నిమిత్తం కృతజ్ఞత చెప్పి రొట్టెలు విరిచి, జనసమూహానికి వడ్డించడానికి శిష్యులకు అందించాడు. అదే విధంగా ఆ రెండు చేపల్ని కూడా భాగాలు చేసి అందరికీ పంచాడు.
\v 42 అందరూ తిని సంతృప్తి చెందారు.
\v 43 శిష్యులు మిగిలిన రొట్టె ముక్కల్ని, చేప ముక్కల్ని పన్నెండు గంపల నిండా నింపారు.
\v 44 ఆ రోజు అక్కడ రొట్టెలు, చేపలు తిన్న పురుషులు ఐదు వేల మంది. ఇంకా ఉన్న స్త్రీలనూ, పిల్లలనూ లెక్కబెట్టలేదు.
\p
\v 45 ఆ తరువాత యేసు తన శిష్యులను తనకన్నా ముందు గలలీ సరస్సు దాటి బేత్సయిదా అనే ఊరికి వెళ్ళమని చెప్పి వారిని పడవ ఎక్కించాడు.
\v 46 తరువాత తనతో ఉన్న జనసమూహాన్ని కూడా పంపేసి ఆయన ప్రార్థన చేసుకోడానికి కొండకు వెళ్ళాడు.
\v 47 చీకటి పడుతూ ఉన్న సమయానికి బెత్సయిదాకు బయలుదేరిన శిష్యులు ఉన్న పడవ సరస్సు నడిబొడ్డున ఉంది. యేసు మాత్రం ఒడ్డునే ఉండిపోయాడు.
\p
\v 48 ఎదురుగాలి విపరీతంగా వీస్తూ ఉండడం వల్ల శిష్యులు దాదాపు ఆ రాత్రంతా పడవను గాలికి ఎదురు నడపలేక, చాలా కష్టపడుతూ సరస్సు మధ్యలోనే ఉండిపోవడం యేసు చూశాడు. ఆయన తెల్లవారుజామున సరస్సు మీద నడుస్తూ వారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన వారిని దాటి వెళ్ళబోతూ ఉండగా,
\v 49 ఆయన శిష్యులు ఆయన నీళ్ళ మీద నడవడం చూసి, దయ్యం అనుకొని భయపడి గావుకేకలు వేశారు.
\v 50 వెంటనే యేసు వారితో "ధైర్యంగా ఉండండి. నేనే, భయపడకండి" అన్నాడు.
\v 51 ఆయన వారి దగ్గరికి వచ్చి, పడవ ఎక్కగానే గాలి ఆగింది. వారు మ్రాన్పడిపోయారు.
\v 52 ఎందుకంటే అంతకుముందే ఐదు రొట్టెలు, రెండు చేపల్ని ఎన్నో రెట్లుగా పెంచి, పంచిపెట్టిన అద్భుతాన్ని వారు చూశారు గానీ, ఆయన ఎంత శక్తిమంతుడో వారు గ్రహించలేక పోయారు. వారి హృదయాలు బండబారి పోయినందువల్ల రొట్టెలను, చేపలను గురించిన సంగతి వారు గ్రహించలేదు.
\p
\v 53 వారు అవతలి ఒడ్డుకు వెళ్ళి గెన్నేసరెతు ప్రాంతానికి చేరి అక్కడ పడవ నిలిపారు.
\p
\v 54 వారు పడవ దిగిన వెంటనే ప్రజలు యేసును గుర్తుపట్టారు.
\v 55 ప్రజలు చుట్టు పక్కల ఉన్న ప్రాంతాలకు పరుగెత్తుకుంటూ వెళ్ళి యేసు వచ్చిన సమాచారం అందరికీ అందించారు. ప్రజలు రోగులను మంచాల మీద మోసుకుంటూ ఆయన ఉన్న చోటికి తీసుకొచ్చారు.
\v 56 యేసు ఏ గ్రామంలో, ఏ పట్టణంలో, ఏ పల్లెలో ప్రవేశించినా వారు రోగులను వీధుల్లో పడుకోబెట్టి, ఆయన వస్త్రాన్నయినా తాకనియ్యమని ఆయనను బతిమాలారు. ఆయనను తాకిన వారంతా బాగుపడ్డారు.
\s5
\c 7
\p
\v 1 ఒక రోజు యెరూషలేము నుండి వచ్చిన కొందరు పరిసయ్యులూ ధర్మశాస్త్ర పండితులూ యేసు చుట్టూ గుమికూడారు.
\s5
\v 2 వారు ఆయన శిష్యుల్లో కొందరు అశుద్ధమైన చేతులతో, అంటే ఆచార నియమం ప్రకారం చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం గమనించారు.
\v 3 పరిసయ్యులే కాక యూదులందరూ పెద్దల సంప్రదాయం ప్రకారం తమ చేతుల్ని ఆచారరీతిగా కడుక్కోకుండా భోజనం చేయరు. అలా కడుక్కోవడానికి వీలుగా లేకపోతే భోజనం చేయడానికి నిరాకరిస్తారు.
\v 4 ప్రత్యేకంగా ఎప్పుడైనా బయటకు బజారుకు పోయి రిగి ఇంటికి రాగానే అలా ఒక పద్దతిగా కడుక్కునే ఆచారాన్ని పాటించకపోతే దేవుడు తప్పక కోపిస్తాడని వాళ్ళు నమ్మే వారు. ఎందుకంటే బజారుకెళ్ళి సరుకులు కొనుక్కుంటూ దేవుని దృష్టిలో అపవిత్రమైన దాన్ని దేన్నైనా ముట్టుకుని ఉండొచ్చు. యూదుల దృష్టిలో అపవిత్రమైనవి అని భావిస్తున్న పట్టీలో కొన్ని వస్తువులే కాదు కొంతమంది మనుషులు కూడా ఉన్నారు.
\s5
\v 5 ఆరోజు పరిసయ్యులు, ధర్మశాస్త్ర పండితులు, యేసు శిష్యులు సాంప్రదాయాన్ని పాటించకపోవడంతో, "మీ శిష్యులు పెద్దల సంప్రదాయాన్ని పాటించకుండా అశుద్ధమైన చేతులతో ఎందుకు భోజనం చేస్తున్నారు?" అని యేసును అడిగారు.
\s5
\v 6 యేసు వారితో, "ఈ ప్రజలు మాటలతో నన్ను గౌరవిస్తారు గానీ,
\q1 వారి హృదయం నాకు చాలా దూరంగా ఉంది.
\q1
\v 7 వారు మానవ కల్పితమైన నియమాలను
2020-10-16 17:09:26 +00:00
\q1 దేవుని ఉపదేశంగా బోధిస్తారు కాబట్టి వారి ఆరాధన వ్యర్థం,
\p అని మీ పూర్వికులను యెషయా గద్దించాడు. ఇప్పుడు మీలో కపట వేషధారులైన వారి గురించి యెషయా ప్రవక్త ముందుగా పలికిన ఆ మాటలు చక్కగా అతికినట్టు సరిపోయాయి.
2019-11-30 01:11:16 +00:00
\s5
\v 8 మీరూ మీ పూర్వీకుల్లాగే దేవుని ఆజ్ఞల్ని తోసిపుచ్చి మనుషులు నేర్పించిన సంప్రదాయాలకు పెద్ద పీట వేశారు.
\v 9 మీ సంప్రదాయాలను పాటించడం కోసం దేవుని ఆజ్ఞలను మీరడంలో మీరు సిద్ధహస్తులు."
\p
\v 10 "ఉదాహరణకి మోషే, మీ తల్లిదండ్రుల్ని గౌరవించమనీ, తల్లిని తండ్రిని దూషించిన వారికి శిక్ష మరణదండన అనీ దేవుని ఆజ్ఞగా రాశాడు కదా.
\s5
\v 11 కానీ మీరైతే, ఒక వ్యక్తి తన తల్లితో, తండ్రితో "అయ్యో, మీకు సాయం చేయాలని నాకు ఉంది గానీ, అదంతా కొర్బాన్ (అంటే దైవార్పితం, దేవుడికి మొక్కుకున్నాను)" అనేస్తే ఇక మోషే ద్వారా దేవుడిచ్చిన ఆజ్ఞ పాటించనక్కర్లేదు, అని బోధిస్తున్నారు.
\v 12 పైగా ఇంక ఆ వ్యక్తి తన తల్లిదండ్రుల కోసం ఏమీ చేయనక్కర లేదని కూడా చెబుతారు. దేవుడికి మొక్కుకున్నాను అని చెబితే చాలు, తల్లి, తండ్రులకు చేయవలసినదంతా ఎగ్గొట్టొచ్చు అని నేర్పిస్తున్న మీరు,
\v 13 మీ పెద్దల సంప్రదాయాలను పాటించే ముసుగులో దేవుని ఆజ్ఞ మీరుతున్నారు. ఇలాంటివి మరెన్నో మీరు చేస్తున్నారు" అన్నాడు.
\s5
\p
\v 14 అప్పుడు యేసు ప్రజలందరినీ తన దగ్గరికి రమ్మని పిలిచి, "నేను చెప్పేది ప్రతి ఒక్కరూ విని జాగ్రత్తగా అర్థం చేసుకోండి.
\v 15 మనుషులు తింటున్న పదార్థాలను బట్టి దేవుడు వారిని మైలగా, శుచిగా, లేక భ్రష్టుడుగా, పవిత్రుడుగా ఎంచడు. అంటే బయట నుండి మనిషి లోపలికి వెళ్ళేవి ఏవీ అతన్ని అపవిత్రం చేయవు.
\v 16 మనిషిలోనుండి బయటకు వచ్చేదే అతన్ని అపవిత్రం చేస్తుంది" అన్నాడు.
\s5
\p
\v 17 ఆయన జనసమూహన్ని విడిచి ఒక ఇంట్లో ప్రవేశించిన తరువాత ఆయన శిష్యులు ఇందాక మాట్లాడిన ఉపదేశం గురించి వివరంగా చెప్పమని ఆయనను అడిగారు.
\p
\v 18 ఆయన వారితో, "అరే, మీకు ఇంకా అర్థం కాలేదా?" బయట నుండి మనిషిలోకి వచ్చేది అతన్ని అపవిత్రం చేయదు. దేవుడు దాన్నిబట్టి అతణ్ణి అపవిత్రుడనో, పవిత్రుడనో ఎంచడు.
\v 19 తిన్నదేదీ మనిషి హృదయంలోకి వెళ్ళదు. కడుపులోకి వెళ్ళి అక్కడ నుండి బయటకు వెళ్ళిపోతుంది” అని చెప్పాడు. (ఈ విధంగా చెప్పడం ద్వారా అన్ని ఆహార పదార్ధాలూ తినడానికి పనికొచ్చేవే అనీ, వాటిని బట్టి దేవుడు ఒకణ్ణి చేరదీసేది కానీ, దూరంగా పెట్టేది కానీ లేదు అని యేసు సూచించాడు).
\s5
\p
\v 20 ఆయన మళ్ళీ అన్నాడు, "మనిషి లోపలి నుండి బయటకు వచ్చేవే, అంటే అతని ఆలోచనలూ, ఉద్దేశాలు, వాటినిబట్టి చేసే పనులు అతన్ని దేవుడి దృష్టిలో అపవిత్రం చేస్తాయి.
\v 21 ఎందుకంటే మనిషి హృదయంలో నుండి చెడ్డ తలంపులు బయటకు వచ్చి ఆ మనిషిచేత దొంగతనాలు చేయిస్తాయి, లైంగికమైన అవినీతి పనులు చేయిస్తాయి, ఆవేశంతో హత్యలు చేయిస్తాయి."
\p
\v 22 "అంతమాత్రమే కాక అంతరంగంలోని చెడ్డ తలంపులవల్లే మనిషి వ్యభిచారం చేయడానికి సిగ్గుపడక పోగా ఆ కామవికారాలనుబట్టి అతిశయిస్తాడు. దురాశతోటి లంచాలు ఆశించడమే కాక పరాయి సొమ్ము మీద కన్నేస్తాడు. ఎదుటివారి నాశనం కోరినట్టుగా, నేను తప్ప ఎవడూ బాగుపడకూడదు అన్నట్టుగా దుర్మార్గతలు, మోసాలు, అసూయలు, అహంభావం, మూర్ఖత్వం, ఎదుటివారిని చిన్న చూపు చూడడం, వారిని దూషించడం మరెన్నో ఇలాంటివి బయటకు వస్తాయి.
\v 23 ఇవన్నీ లోపలి నుండి బయటకు క్రియల రూపంలో వచ్చి మనిషిని దేవుని దృష్టిలో అపవిత్రం చేస్తాయి."
\s5
\p
\v 24 యేసు తన శిష్యులతో గలలీ ప్రాంతం విడిచి తూరు, సీదోను ప్రాంతంలోని ఒక ఇంటికి వెళ్ళాడు. తాను అక్కడ ఉన్నట్టు ఎవరికీ తెలియకూడదని ఆయన ఉద్దేశం. కాని, యేసు వారిదగ్గరకు వచ్చినట్టుగా వారు పసిగట్టేసారు. ఆయన వారికి కనిపించకుండా ఉండలేకపోయాడు.
\p
\v 25 ఒక స్త్రీ యేసు గురించి విని, వచ్చి ఆయన కాళ్ళపై పడింది. ఆమె కూతురికి దయ్యం పట్టింది.
\v 26 ఈమె సిరియాకు చెందిన ఫెనికయా ప్రాంతంలో పుట్టిన గ్రీసు దేశస్తురాలు. తన కూతురులో నుండి ఆ దయ్యాన్ని వదిలించమని యేసును బతిమలాడింది.
\s5
\v 27 అందుకు యేసు ఆమెతో, "మొదటగా పిల్లలు తృప్తిగా తినాలి. తల్లి వండిన ఆహారం పిల్లలకు కడుపునిండా పెట్టకుండా తీసి కుక్క పిల్లలకు వేయడం భావ్యమా?" అన్నాడు.
\v 28 అందుకామె, "ఔను ప్రభూ, అది నిజమే గాని, ఆ ఇంటి కుక్కలు కూడా బల్లకింద ఉండి పైనుంచి పిల్లలు పడేసిన ముక్కలు తింటాయి కదా" అని జవాబు ఇచ్చింది
\s5
\v 29 అప్పుడాయన ఆమెతో, "ఈ మాట చెప్పినందువల్ల ఇక నువ్వు నిశ్చింతగా వెళ్ళవచ్చు. నీ కూతురిని దయ్యం వదలిపోయేలా చేశాను" అన్నాడు.
\v 30 ఆమె ఇంటికి వెళ్ళి తన కూతురు మంచంపై ప్రశాంతంగా పడుకుని ఉండడం చూసింది. దయ్యం ఆమెను వదలిపోయింది.
\s5
\p
\v 31 యేసు, ఆయన శిష్యులు తూరు నుండి బయలుదేరి, సీదోనుకు ఉత్తర దిశగా బయలుదేరి, కొంత దూరం పోయాక అక్కడనుండి తూర్పుకు తిరిగి దెకపొలి అనే పది గ్రామాలున్న మండల ప్రాంతం గుండా వెళుతూ దక్షిణాన గలిలయ సముద్రం దగ్గరగా ఉన్న పట్టణాలను చేరుకున్నారు.
\p
\v 32 అక్కడ కొందరు చెవుడు, నత్తి ఉన్న మనిషిని ఆయన దగ్గరికి తీసుకు వచ్చి అతని మీద చెయ్యి ఉంచి స్వస్థపరచమని వేడుకున్నారు.
\s5
\v 33 యేసు అతన్ని జనంలో నుండి పక్కకి తీసుకు వెళ్ళి మొదట తన చేతి వేళ్ళను అతని రెండు చెవుల్లోనూ ఉంచాడు. తరువాత తన చేతి వేళ్ళపై ఉమ్మి వేసుకుని అతని నోరు తెరవమని నాలుకను తన వేళ్ళతో తాకాడు.
\v 34 అప్పుడు ఆయన ఆకాశం వైపు తల ఎత్తి నిట్టూర్చి, "ఎప్ఫతా" అని అతనితో అన్నాడు. ఆ మాటకు వారి భాషలో "తెరుచుకో" అని అర్థం.
\v 35 వెంటనే అతని చెవులు తెరుచుకున్నాయి. చక్కగా విన సాగాడు. అతని నాలుక సడలి తేటగా మాట్లాడడం మొదలుపెట్టాడు. అప్పటిదాకా అతణ్ణి పీడించిన జబ్బు వదిలిపోయింది.
\s5
\v 36 ఆ సంగతి ఎవ్వరితోనూ చెప్పవద్దని యేసు అతనికి, అతని చుట్టూ ఉన్నవారికీ ఆజ్ఞాపించాడు కాని, ఎంత కఠినంగా వారికి ఆజ్ఞాపించాడో అంత ఎక్కువగా వారు దాన్ని చాటించారు
\v 37 అది విన్నవారందరూ అంతులేని ఆశ్చర్యంతో "ఈయన చాలా అద్భుతాలు చేశాడు, అంతే కాకుండా అన్నిటినీ చక్కపరుస్తున్నాడు. చెవిటివారు వినగలిగేలా చేస్తున్నాడు, మూగ వారు మాట్లాడేలా చేస్తున్నాడు" అని చెప్పుకున్నారు.
\s5
\c 8
\p
\v 1 ఆ రోజుల్లో ఒకసారి ఒక నిర్జన ప్రదేశంలో ఉన్న యేసు చుట్టూ పెద్ద జనసమూహం గుమిగూడారు. రెండు రోజులపాటు వాళ్ళు ఆయన మాటలు వింటూ వుండిపోయారు. మూడోరోజు వాళ్ళదగ్గర తినడానికి ఇంకేమీ లేదని యేసు గమనించాడు. అప్పుడాయన తన శిష్యులను దగ్గరికి పిలిచి,
\v 2 "ఈ ప్రజల మీద నాకు జాలి కలుగుతున్నది. వారు ఇప్పటికే మూడు రోజుల నుండి నా దగ్గర ఉన్నారు. తినడానికి వారి దగ్గర ఏమీ లేదు.
\v 3 వారిని ఇప్పుడు పంపివేస్తే దారిలో సొమ్మసిల్లి పోవచ్చు, వారిలో కొందరు చాలా దూరం నుండి కూడా వచ్చారు" అన్నాడు.
\p
\v 4 యేసు మనసు వారికి అర్థం అయింది. వాళ్ళందరికీ భోజనం ఏర్పాట్లు చూడమని ఆయన అంటున్నాడని తెలిసి శిష్యులలో ఒకడు "ఇంత పెద్ద గుంపుకి ఆహారం అమర్చడం మన వల్ల అయ్యే పని కాదు. పైగా ఈ చుట్టుపక్కల ఊళ్లు కూడా ఏమీ లేవు" అన్నారు.
\s5
\v 5 "మీ దగ్గర రొట్టెలు వుండాలి కదా, ఎన్ని ఉన్నాయి?" అని శిష్యుల్ని ఆయన తిరిగి అడిగాడు. "ఏడు చిన్న రొట్టెలు ఉన్నాయి" అని వారు జవాబిచ్చారు.
\p
\v 6 యేసు ఆ ప్రజలందరినీ నేల మీద కూర్చోమని ఆజ్ఞాపించాడు. ఆ ఏడు రొట్టెలను చేతపట్టుకొని దేవునికి కృతజ్ఞత చెప్పి వాటిని ముక్కలు చేసి శిష్యులకిచ్చి వారందరికీ పంచమన్నాడు. శిష్యులు అలాగే చేశారు.
\s5
\v 7 వారి దగ్గర కొన్నివండిన చిన్న చేపలు కూడా ఉన్నట్టు తరువాత శిష్యులు గమనించి వాటిని కూడా యేసు చేతిలో పెట్టారు. ఆయన వాటి కోసం కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పి, వాటిని అందరికీ పంచమని శిష్యులకు ఇచ్చాడు.
\v 8 ఆ ప్రజలంతా తృప్తిగా తిన్న తరువాత మిగిలిన ఆహారాన్ని ఏడు పెద్ద గంపల నిండా నింపారు.
\v 9 తిన్నవారిలో పురుషులే సుమారు నాలుగు వేలమంది.
\p యేసు వారిని పంపివేసి,
\v 10 వెంటనే తన శిష్యులతో కలసి, పడవ ఎక్కి గలలీ సరస్సు చుట్టూ తిరిగి దల్మనూతా ప్రాంతానికి వెళ్ళాడు.
\s5
\v 11 అప్పుడు కొద్దిమంది పరిసయ్యులు వచ్చి యేసుతో వాదించడం మొదలుపెట్టారు. ఆయనను దేవుడు పంపించాడు అని నమ్మడానికి గుర్తుగా తమకోసం ఆకాశం నుండి ఒక సూచన చూపమని అడిగారు.
\v 12 దానికి ఆయన తనలో తాను పెద్దగా నిట్టూర్చి, "ఈ తరం వారు అద్భుతాలు చేయమని ఎందుకు అడుగుతున్నారు? మీతో కచ్చితంగా చెప్తున్నాను, ఈ తరానికి ఏ సూచనా చూపడం జరగదు" అని వారితో చెప్పాడు.
\p
\v 13 తరవాత ఆయన వారిని విడిచిపెట్టి, తన శిష్యులతో కలసి మళ్ళీ పడవ ఎక్కి గలలీ సరస్సు అవతలి ఒడ్డు చేరుకున్నాడు.
\s5
\v 14 శిష్యులు తమతో రొట్టెలు తెచ్చుకోవడం మర్చిపోయారు. వారి దగ్గర పడవలో ఒక్క రొట్టె తప్ప ఏమీ లేదు.
\v 15 యేసు వారితో, "పరిసయ్యులకు, హేరోదుకు సంబంధించిన రొట్టె పిండిని పొంగజేసే ఈస్ట్ గురించి జాగ్రత్తగా ఉండండి" అన్నాడు.
\s5
\p
\v 16 శిష్యులు, ఆయన అన్న మాటను అర్థం చేసుకోకుండా "మన దగ్గర రొట్టెలు లేవని ఇలా అంటున్నాడా?" అని ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు.
\v 17 అది కనిపెట్టి యేసు, "రొట్టెలు లేవనే విషయం ఎందుకు చర్చించుకుంటున్నారు? మీకు ఇంకా అర్థం కాలేదా? మీరు గ్రహించలేదా? మీ బుద్ధి మందగించిందా? ఆలోచించరా?
\s5
\v 18 మీరు కళ్ళుండి కూడా చూడరా? చెవులుండి కూడా వినరా? మీకు గుర్తు లేదా?
\v 19 ఐదు రొట్టెలు విరిచి ఐదు వేల మందికి నేను పంచిపెట్టినప్పుడు మిగిలిన ముక్కల్ని మీరు ఎన్ని పెద్ద గంపలు నింపారు?" అని అడిగాడు. వారు, "పన్నెండు” అని జవాబు చెప్పారు.
\s5
\v 20 "మరి ఏడు రొట్టెలు విరిచి నాలుగు వేల మందికి పంచినప్పుడు మిగిలిన ముక్కల్ని ఎన్ని పెద్ద గంపలు నింపారు?" అని అడిగినప్పుడు వారు, "ఏడు గంపల నిండా" అని జవాబు చెప్పారు
\v 21 ఆయన వారితో, "భోజనం గురించి ఎప్పటికీ దిగులు పడక్కర్లేదన్న సంగతి ఇంకా మీకు అర్థం కాలేదా? నాకు చాలా నిరుత్సాహంగా ఉంది" అన్నాడు.
\s5
\p
\v 22 యేసు, ఆయన శిష్యులు బేత్సయిదా అనే పట్టణానికి వచ్చారు. అక్కడి వారు కొందరు ఒక గుడ్డివాణ్ణి యేసు దగ్గరికి తీసుకు వచ్చారు. అతని మీద చెయ్యి ఉంచి బాగు చెయ్యమని వేడుకున్నారు.
\v 23 యేసు ఆ గుడ్డివాడి చేయి పట్టుకుని ఊరి బయటకు తీసుకు వెళ్ళాడు. అతని కళ్ళ మీద ఉమ్మివేసి, అతని మీద చేతులుంచి, "నీకు ఏమైనా కనిపిస్తుందా?" అన్నాడు.
\s5
\v 24 ఆ గుడ్డివాడు పైకి చూస్తూ, "మనుషులు అస్పష్టంగా నడుస్తున్న చెట్ల లాగా కనిపిస్తున్నారు" అన్నాడు.
\v 25 అప్పుడు ఆయన మళ్ళీ అతని కళ్ళపై తన చేతులుంచాడు. అప్పుడా మనిషి కళ్ళు తెరుచుకొని బాగుపడి అన్నిటినీ స్పష్టంగా చూడగలిగాడు.
\v 26 యేసు అతనిని పంపివేస్తూ, "నువ్వు ఊరిలోకి వెళ్ళవద్దు, నీ ఇంటికి వెళ్ళిపో" అని అతనితో చెప్పాడు.
\s5
\p
\v 27 యేసు ఆయన శిష్యులతో కలిసి ఫిలిప్పు కైసరయ పట్టణం పరిసర గ్రామాలకు వెళ్ళాడు. దారిలో ఆయన, "నేను ఎవరినని ప్రజలు చెప్పుకుంటున్నారు?" అని తన శిష్యులను అడిగాడు.
\v 28 అందుకు వారు, "బాప్తిసం ఇచ్చే యోహానని కొందరూ, ఏలీయా అని కొందరూ, పూర్వం ఉన్న ప్రవక్తల్లో ఒకడు అని కొందరూ అంటున్నారు" అని చెప్పారు.
\s5
\v 29 "అయితే నేనెవరినని మీరు అనుకుంటున్నారు?" అని ఆయన వారిని అడిగాడు. దానికి జవాబుగా పేతురు, "నువ్వు క్రీస్తువి!" అన్నాడు.
\p
\v 30 అప్పుడు ఆయన తన గురించి ఎవ్వరికీ చెప్పవద్దని వారిని హెచ్చరించాడు.
\s5
\v 31 ఆ తరువాత యేసు వారితో ఇలా చెప్పడం మొదలు పెట్టాడు, "మనుష్య కుమారుడు ఎన్నో కష్టాలు భరించాలి. పెద్దలు, ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర పండితుల తిరస్కారానికి గురై మృత్యువాత పడాలి. ఆయన మూడు రోజుల తరువాత సజీవంగా బతికి వస్తాడు."
\p
\v 32 యేసు ఈ విషయం చాలా స్పష్టంగానే చెప్పాడు. అయితే పేతురు ఆయన చెయ్యి పట్టుకుని, పక్కకు తీసుకు వెళ్ళి అలా మాట్లాడినందుకు మందలించాడు.
\s5
\v 33 కాని యేసు వెనక్కి తిరిగి తన శిష్యులను చూసి, పేతురుతో, "సైతాను నీచేత ఇలా మాట్లాడిస్తున్నాడు. అలాంటి ఆలోచనలు మానుకో. దేవుడు కోరుకున్నట్టు కాక మనుషులు కోరుకుంటున్నట్టు నన్ను చావవద్దని అడుగుతున్నావు. నా వెనక్కి పో! మనుషుల సంగతుల పైనే గాని దేవుని సంగతుల మీద నీకు మనసు లేదు” అని గద్దించాడు.
\p
\v 34 తరువాత యేసు తన శిష్యులను, ప్రజలను దగ్గరికి పిలిచి వారితో ఇలా అన్నాడు. "ఎవరైనా నా శిష్యుడిగా నా వెంట రావాలనుకుంటే, ఎలాగోలాగా ఇబ్బంది లేకుండా బతికితే చాలు అనుకోకూడదు. తప్పు చేసినవాడు కొరడా దెబ్బలు తింటూ తనకి దాపురించిన మరణశిక్ష అనుభవించడానికి, తన మీద ఉంచిన సిలువను మోసుకుంటూ ఎలా నడుస్తాడో అలా నాతో నడవాలి.
\s5
\v 35 ఎందుకంటే నన్ను హింసించినట్టే నా వారిని మనుషులు హింసించడం మొదలు పెట్టినపుడు, తన ప్రాణాన్ని దక్కించుకోవాలని "నేను యేసుకు చెందిన వాణ్ణి కాదు అని చెప్పి తప్పించుకో జూసేవాడు దాన్ని నిజంగా పోగొట్టుకుంటాడు. కాని నా కోసం, సువార్త కోసం తన ప్రాణాన్ని సైతం లెక్కచేయని వాడు, లేక కోల్పోయేవాడు దాన్ని దక్కించుకుంటాడు. అతడు నాతో నిత్యం జీవిస్తాడు."
\p
\v 36 "ఒక మనిషి నిత్యజీవాన్ని సంపాయించుకోకుండా ప్రపంచమంతా సంపాదించి, చివరికి తన ప్రాణాన్నే పోగొట్టుకుంటే ఆ వ్యక్తికి ఏం లాభం?
\v 37 ఒకడు తన ప్రాణాన్ని తిరిగి పొందడానికి, లేక నిత్యజీవాన్ని సంపాయించుకోవడానికి దేవుడికి ఏమి ఇవ్వగలడు? అలా ఇవ్వడానికి వాడి దగ్గర ఏమీ లేదు. జాగ్రత్తగా ఆలోచించండి.
\s5
\v 38 దేవునికి వ్యతిరేకంగా వ్యభిచారం, పాపం జరిగించే ఈ తరంలో ఎవరైనా నా గురించీ నా మాటల గురించీ సిగ్గుపడి ఆయన వాళ్ళం కాదు, ఆయనెవరో మాకు తెలీదు అంటే మనుష్య కుమారుడు కూడా తన తండ్రి మహిమతో, పవిత్ర దేవదూతలతో కలసి వచ్చేటప్పుడు అలాంటి వారి విషయంలో సిగ్గుపడతాడు, వారెవరో నాకు తెలీదు అంటాడు."
\s5
\c 9
\p
\v 1 ఆయన తన శిష్యులతో, "నేను చెప్పేది జాగ్రతగా వినండి. దేవుడు రాజుగా తానే తన గొప్ప శక్తిని మీలో కొందరికి ఇప్పుడు చూపిస్తాడు. మీరు చనిపోక ముందే ఆయన చేసే ఈ పనిని మీరు చూస్తారు" అన్నాడు.
\p
\v 2 ఆరు రోజుల తరువాత యేసు పేతురును, యాకోబును, యాకోబు సోదరుడు యోహానును ఒక ఎతైన కొండపైకి తీసుకు వెళ్ళాడు. వారు ఒంటరిగా ఉన్నప్పుడు, ఆయన వారి ఎదుట రూపాంతరం చెందాడు.
\v 3 ఆయన బట్టలు కళ్ళు మిరుమిట్లు గొలిపే తెల్లని రంగులోకి మారాయి. ఈ లోకంలో ఎవరు ఉతికినా కూడా కానంత తెల్లగా ఆయన బట్టలు మారాయి.
\s5
\v 4 చాలాకాలం క్రితం జీవించిన ఏలీయా, మోషే వారికి కనిపించారు. వారు యేసుతో మాట్లాడుతూ ఉన్నారు.
\p
\v 5 కొంతసేపటికి పేతురు తేరుకుని "బోధకా, మనం ఇక్కడ ఉంటే అద్భుతంగా ఉంటుంది. మీరు అనుమతిస్తే మూడు కుటీరాలను కడతాము. ఒకటి మీకు, ఒకటి మోషేకు, మరొకటి ఏలీయా కోసం" అన్నాడు.
\v 6 అతను ఏదో చెప్పాలనుకుని ఇలా చెప్పాడు, కానీ అసలు ఏమి చెప్పాలో అతనికి తెలియదు. అతడు, మిగిలిన ఇద్దరు శిష్యులు జరిగింది చూసి భయపడిపోయారు.
\s5
\v 7 అప్పుడు మెరుస్తున్న మేఘం ఒకటి వారికి కనిపించి, వారిని కమ్ముకుంది. ఆ మేఘంలో నుండి దేవుడు వారితో "ఈయన నేను ఎంతో ప్రేమించే నా కుమారుడు. కాబట్టి ఆయన మీతో చెప్పే మాటలు వినండి" అన్నాడు.
\v 8 వారు ముగ్గురూ అయోమయంగా చుట్టూ చూస్తుంటే, అకస్మాత్తుగా యేసు ఒక్కడే వారికి కనిపించాడు. అక్కడ ఆయనతో ఇంక ఎవరూ లేరు.
\s5
\p
\v 9 వారు కొండ దిగివస్తున్నప్పుడు, యేసు వారితో ఇప్పుడు ఇక్కడ తనకు జరిగింది ఎవరికీ చెప్పవద్దని చెప్పాడు. ఆయన వారితో, తాను అంటే మనుష్యకుమారుడు చనిపోయి, తిరిగి లేచిన తరువాత దీన్ని బయట పెట్టవచ్చని చెప్పాడు.
\v 10 కాబట్టి వారు చాలా కాలం ఇతరులకు ఈ విషయం చెప్పలేదు. కానీ ఆయన చనిపోయి తిరిగి లేస్తానని చెప్పినదాన్ని గురించి తమలోతాము చర్చించుకున్నారు.
\s5
\p
\v 11 వారు యేసును, "క్రీస్తు రావడానికి ముందు, ఏలీయా తిరిగి వస్తాడని మన ధర్మశాస్త్రాన్ని బోధించేవారు చెబుతున్నారేమిటి?" అని అడిగారు.
\v 12 అందుకు యేసు "అది నిజమే, దేవుడు అంతా మొదట నిర్ణయించిన ప్రకారమే చేశాడు. అలానే ఏలీయా మొదట వచ్చి అంతా సరిచేస్తాడని మాట ఇచ్చాడు. అలాగే ఇప్పటికే ఏలీయా వచ్చాడు. మన మతపెద్దలు గ్రంథాల్లో రాసినట్లే ఈ ప్రజలు అతడితో తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు. కాని మనుష్యకుమారుడైన నన్ను గురించి అదే గ్రంథాల్లో ఇంకా ఎక్కువగా రాశారు. ప్రజలు నన్ను నిరాకరిస్తారని, నేను అనేక బాధలు పొందాలని ఆ గ్రంథాల్లో నా గురించి రాశారు" అన్నాడు.
\p
\v 13 ఆయన ఆ ముగ్గురితో కలిసి మిగిలిన శిష్యులు ఉన్న చోటికి వచ్చాడు.
\s5
\v 14 వారి చుట్టూ పెద్ద జనసమూహం ఉంది. కొందరు యూదా ధర్మశాస్త్ర బోధకులు వారితో వాదిస్తున్నారు.
\v 15 ఆయన రావడం చూసి ఆ జనసమూహం ఆశ్చర్యపోయారు. వెంటనే వారందరు పరుగెత్తుకెళ్ళి ఆయనకు నమస్కరించారు.
\p
\v 16 ఆయన వారితో, "మీరు దేన్ని గురించి వాదిస్తున్నారు?" అని అడిగాడు.
\s5
\v 17 ఆ జనసమూహంలో ఒకడు ఆయనతో, "బోధకా నా కుమారుడిలో దురాత్మ చేరి, అతణ్ణి మాట్లాడకుండా చేస్తుంది. నా కొడుకును బాగు చేస్తారని మీ దగ్గరికి తీసుకువచ్చాను.
\v 18 తనను దురాత్మ పట్టినప్పుడు వాడు బిగదీసుకుపోతున్నాడు. పళ్ళు కొరుక్కుంటున్నాడు. నోట్లోంచి చొంగ కారుతుంది. దయ్యం అతణ్ణి కింద పడేస్తుంది. నీ శిష్యుల్ని ఆ దురాత్మను వదిలించమని అడిగాం, కాని వారివల్ల కావడం లేదు.
\p
\v 19 అప్పుడు యేసు, "విశ్వాసం లేని మనుషులారా, నేను చాలాకాలం నుండి మీతో ఉంటున్నా కూడా నేను చేస్తున్న దానిని మీరు చేయలేకపోతున్నారు. మీరు నా సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఆ పిల్లవాణ్ణి నా దగ్గరకు తీసుకు రండి" అన్నాడు.
\s5
\v 20 అప్పుడు యేసు దగ్గరికి ఆ పిల్లవాణ్ణి తెచ్చారు. ఆ దురాత్మ యేసును చూసీ చూడడం తోటే వాణ్ణి విలవిల్లాడిస్తూ కింద పడవేసింది. వాడు నేలపై గిలగిలకొట్టుకుంటూ, నోట్లోనుంచి చొంగ కార్చాడు.
\v 21 యేసు ఆ అబ్బాయి తండ్రితో, "ఎంత కాలం నుంచి ఇలా ఉంది?" అని అడిగాడు. అతడు "చిన్నతనం నుంచే ఉంది.
\v 22 అంతే కాదు ఈ దురాత్మ చాలాసార్లు వాడిని చంపాలని మంటల్లోకి, నీళ్ళలోకి తోసేస్తుంది. నీ వల్లనైతే మాపై దయుంచి, సహాయం చెయ్యి" అన్నాడు.
\s5
\p
\v 23 యేసు "నేను చేయగలను. తనని ఎవరైతే నమ్ముతారో, వారికోసం ఏదైనా దేవుడు చేస్తాడు" అన్నాడు.
\v 24 వెంటనే ఆ పిల్లవాడి తండ్రి, "నువ్వు చేయగలవని నేను నమ్ముతున్నాను, కానీ గట్టి నమ్మకం లేదు. నా నమ్మకం బలపడేలా నాకు సహాయం చెయ్యి" అని గట్టిగా అరిచాడు.
\p
\v 25 యేసు జనసమూహం ఇంకా పెరగడం గమనించాడు. ఆయన ఆ దురాత్మను గద్దించాడు. "ఓ దురాత్మా, ఈ పిల్లవాడికి మూగ, కుంటితనం నీవల్లే వచ్చింది. అతడిలో నుండి బయటకు రా! మళ్ళీ ఎప్పుడూ ఆతణ్ణి పీడించడానికి వీల్లేదని నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను" అన్నాడు.
\s5
\v 26 ఆ దురాత్మ బిగ్గరగా కేకలు పెడుతూ ఆ అబ్బాయిని నేల మీద పడి తన్నుకునేలా చేసి విడిచిపెట్టింది. ఆ పిల్లవాడు కదలటం లేదు. శవంలా పడి ఉన్నాడు. కాబట్టి చాలా మంది, "పిల్లవాడు చనిపోయాడు" అన్నారు.
\v 27 అయితే యేసు ఆ పిల్లవాడి చేయి పట్టుకుని లేపాడు. అప్పుడు ఆ పిల్లవాడు లేచి నిల్చున్నాడు.
\s5
\p
\v 28 తరువాత యేసు, ఆయన శిష్యులు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు, వారు ఆయన్ని, "మేమెందుకు ఆ దురాత్మను వెళ్ళగొట్టలేకపోయాం?" అని అడిగారు.
\v 29 అప్పుడు ఆయన వారితో "ఉపవాసం, ప్రార్థనల ద్వారా దేవుడు మీకు ఇచ్చే శక్తి ద్వారానే ఇలాటి దురాత్మలను మీరు వెళ్లగొట్టగలరు. అంతే తప్ప వాటిని వెళ్లగొట్టటానికి మరో మార్గం అంటూ లేదు" అన్నాడు.
\s5
\p
\v 30 తరువాత యేసు ఆయన శిష్యులు ఆ ప్రాంతం వదిలి, గలిలయ ప్రాంతం మీదుగా ప్రయాణించారు. యేసు తాను ఎక్కడ ఉండేదీ ఎవరికి తెలియనియ్యలేదు.
\v 31 ఆయన తన శిష్యులకు బోధించడానికి తగినంత సమయం కోసం చూస్తున్నాడు. ఆయన వారితో, "ఏదో ఒక రోజు మనుష్యకుమారుడైన నన్ను నా శత్రువులు నిర్బంధిస్తారు. ఇతరజాతివారి చేతికి నన్ను అప్పగిస్తారు. వాళ్ళు నన్ను చంపుతారు. కాని చనిపోయి మూడో రోజు నేను తిరిగి బ్రతుకుతాను" అన్నాడు.
\v 32 ఆయన చెబుతున్న విషయాలు వారికి ఆర్థం కాలేదు. వాటి అర్థం ఏమిటో ఆయన్ని అడగటానికి వారు భయపడ్డారు.
\s5
\p
\v 33 అప్పుడు యేసు ఆయన శిష్యులు తిరిగి కపెర్నహోముకు వచ్చారు. వారందరూ ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఆయన వారిని, "మనం దారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు దేన్ని గురించి మాట్లాడుకుంటున్నారు?" అని అడిగాడు.
\v 34 వారు జవాబు చెప్పలేక మిన్నకుండిపోయారు. ఎందుకంటే ప్రయాణంలో వారు ఒకరితో ఒకరు వాదించుకునే వాటిల్లో ఒక్కటైనా ముఖ్యమైనది లేదు. అందుకే వారు జవాబు చెప్పటానికి సిగ్గు పడ్డారు.
\p
\v 35 ఆయన కూర్చుని తన పన్నెండు మంది శిష్యులను దగ్గరకు రమ్మన్నాడు. అప్పుడు వారితో, "దేవుడు తనని ముఖ్యమైన వ్యక్తిగా గుర్తించాలి అని కోరుకుంటే, మొదటగా తనని తాను అందరికంటే తక్కువవాడుగా భావించుకోవాలి. అతడు అందరికీ సాయపడాలి."
\s5
\v 36 అయన ఒక పిల్లవాణ్ణి వారి మధ్య నిలబెట్టాడు. ఆ పిల్లవాణ్ణి ఎత్తుకుని వారితో ఇలా అన్నాడు.
\v 37 "చిన్నపిల్లలు నన్ను ప్రేమిస్తారు కాబట్టి నన్ను స్వీకరిస్తారు. వీళ్ళలాగా ఎవరైతే నన్ను ప్రేమిస్తారో, వాళ్ళు నన్ను స్వీకరించగలరని దేవుడు భావిస్తాడు. అంతేకాకుండా ఎవరైతే నన్ను పంపించాడో, ఆ దేవుణ్ణి వాళ్ళు నిజంగా స్వీకరించగలరు" అన్నాడు.
\s5
\p
\v 38 యేసుతో యోహాను, "బోధకా, ఎవరో ఒకతను దురాత్మలను వెళ్ళగొట్టడం మేము చూశాము. అతనికి ఆ విధంగా చేసే అధికారం నీ నుంచి వచ్చినట్టు చెబుతున్నాడు. ఐతే అతణ్ణి అలా చేయకుండా మేము అడ్డుపడ్డాము. ఎందుకంటే అతడు నీ శిష్యుల్లో ఒకడు కాదు" అని చెప్పాడు.
\v 39 యేసు, "అతణ్ణి ఆపవద్దు. నా పేరుతో అతడు గొప్ప పనులు చేస్తున్నప్పుడు, అది నాకు మంచి పేరే తెచ్చిపెడుతుంది గదా.
\s5
\v 40 మనల్ని వ్యతిరేకించకుండా మన ఉద్దేశాలను నెరవేరుస్తున్న వారు మనవారే కదా.
\v 41 క్రీస్తునైన నన్ను అనుసరించే మీకు తాగడానికి గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చినా కూడా, అలాటి వారికి దేవుడు తప్పకుండా తగిన బహుమతి ఇస్తాడు" అని చెప్పాడు.
\s5
\p
\v 42 ఇంకా "నాపై నమ్మకం ఉంచినవాళ్ళు, సమాజంలో చిన్నపిల్లల్లాగా అల్పమైన వాళ్ళు సైతం పాపం చేయడానికి ఎవరైతే కారణం అయ్యారో వారిని దేవుడు తీవ్రంగా శిక్షిస్తాడు. నన్ను నమ్ముకున్న వారిచేత పాపం చేయించి శిక్ష పొందడం కంటే, మెడకు పెద్దరాయి కట్టుకుని సముద్రంలో పడడం ఎంతో మేలు.
\v 43 కాబట్టి పాపం చెయ్యడానికి నీ చేతుల్లో ఒక దాన్ని ఉపయోగించ దలుచుకుంటే దాన్ని నరికి పారెయ్యడం మంచిది. పరలోకంలో శాశ్వతకాలం జీవించడం కోసం ఈ లోకంలో ఒక చేతితోనే జీవించవలసి వచ్చినా కూడా పర్వాలేదు.
\v 44 నువ్వు పాపం చేస్తే దేవుడు నీ శరీరం మొత్తాన్ని నరకంలో పడవేస్తాడు. అది ఎప్పటికీ ఆరని నరకాగ్ని" అన్నాడు.
\s5
\p
\v 45 "పాపం చెయ్యడానికి నీ కాళ్ళలో ఒక దాన్ని ఉపయోగించ దలుచుకుంటే దాన్ని నరికి పారెయ్యడం మంచిది. పరలోకంలో శాశ్వతకాలం జీవించడం కోసం ఈ లోకంలో ఒంటి కాలితో జీవించవలసి వచ్చినా ఫర్వాలేదు.
\v 46 కాని నువ్వు పాపం చేస్తే దేవుడు నీ మొత్తం శరీరాన్ని నరకంలో పడవేస్తాడు గదా."
\s5
\p
\v 47 "నువ్వు కంటితో చూసేది ఏదైనా నిన్ను పాపం చేయమని ప్రేరేపిస్తుందనుకుంటే వాటిని చూడడం మానివెయ్యి. పాపం చేయకుండా ఉండాలంటే అవసరమైతే నీ కన్ను పీకి పారవెయ్యి. నువ్వు రెండు కళ్ళతో నరకంలో పడటం కంటే, దేవుని ఆధిపత్యాన్ని ఒప్పుకుని ఒక కంటితో ఉండటం ఎంతో మేలు కదా.
\v 48 ఆ నరకంలో అంతులేనంత కాలం పురుగులకు ఆహారంగా మనుష్యులును వేస్తారు, అక్కడి మంటలు చల్లారవు" అని చెప్పాడు.
\s5
\p
\v 49 "మనుషులు ఆహారంలో ఉప్పు కలుపుకున్నట్టే దేవుడు కూడా మనుష్యుల్లో ఆగ్నిని పడేస్తాడు.
\v 50 ఆహారంలో ఉప్పు వేయడం మంచిది. కాని ఆ ఉప్పు రుచి కోల్పోతే నువ్వు దానిని మళ్ళీ ఉప్పగా మార్చలేవు. మనందరం ఆహారానికి రుచి కల్పించే ఉప్పులాగా ఉండాలి. ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండాలి."
\s5
\c 10
\p
\v 1 యేసు తన శిష్యులతో కలసి ఆ ప్రాంతం విడిచిపెట్టి యొర్దాను నదికి తూర్పుగా నడుస్తూ, యూదయకు ప్రయాణం చేశారు. ఆయన్ని చూడగానే జనసమూహం ఆయన చుట్టూ చేరడం ప్రారంభించారు. ఆయన ఎప్పటిలానే వారికి బోధించడం ప్రారంభించాడు.
\v 2 ఆయన వారికి బోధిస్తున్నప్పుడు కొందరు పరిసయ్యులు ఆయన దగ్గరకు వచ్చి ఆయన్ని, "మన ధర్మశాస్త్రం ప్రకారం ఏ మనిషైనా తన భార్యకు విడాకులు ఇవ్వవచ్చా?" అని అడిగారు. వారు ఆ విధంగా అడిగింది ఆయన అవుననో, కాదనో చెబితే దాన్ని బట్టి ఆయనలో తప్పు పట్టుకోవచ్చని.
\p
\v 3 ఆయన జవాబిస్తూ "మీ పూర్వీకులకు దీన్ని గురించి మోషే ఏమని ఆజ్ఞాపించాడు?" అని అడిగాడు.
\v 4 వారు "విడాకుల పత్రం రాసి ఇచ్చి ఆమెను పంపించెయ్య వచ్చని చెప్పాడు" అన్నారు.
\s5
\v 5 యేసు వారితో, "మీ పూర్వికులు తమ భార్యలను వదిలి పెట్టాలని మొండిగా కోరుకున్నారు. అందుకే మోషే ధర్మశాస్త్రంలో ఇలాటి నియమం రాశాడు.
\v 6 అయితే దేవుడు మాత్రం మొదట్లో మానవుల్ని చేసినప్పుడు,
2020-10-16 17:09:26 +00:00
\q1 దేవుడు వారిని స్త్రీ పురుషులుగా నిర్మించాడు,
\p అని ధర్మశాస్త్రం చెబుతున్నది.
2019-11-30 01:11:16 +00:00
\s5
\v 7 ఎప్పుడైతే పురుషుడు వివాహం చేసుకుంటాడో, అప్పటినుంచి అతడు తన తల్లిదండ్రులను కచ్చితంగా విడిచిపెట్టి తన భార్యతో కలసి ఉండాలి, అని దేవుడు చెప్పింది ఇందుకే.
\v 8 వాళ్ళిద్దరూ ఒకే మనిషిగా మారిపోతారు. ఇక వారు ఇద్దరు మనుషులు కాదు, ఒక్కరే.
\v 9 ఇది సత్యం. కాబట్టి, ఏ పురుషుడు తన భార్యను విడిచిపెట్టకూడదు. దేవుడు వారిద్దరినీ జత కలిపాడు. వారిద్దరూ కలిసి ఉండాలని దేవుడు ఆశించాడు" అని చెప్పాడు.
\s5
\p
\v 10 యేసు , ఆయన శిష్యులు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు, వాళ్ళు దీన్ని గురించి ఆయన్ని అడిగారు.
\v 11 ఆయన వారితో, "ఎవరన్నా తన భార్యకు విడాకులిచ్చి ఇంకో స్త్రీని పెళ్ళి చేసుకుంటే దేవుని దృష్టిలో అతడు వ్యభిచారం చేస్తున్నట్టే.
\v 12 అలాగే దేవుని దృష్టిలో ఏ స్త్రీ అయితే తన భర్తకు విడాకులిచ్చి ఇంకో పురుషుణ్ణి పెళ్ళిచేసుకుంటుందో ఆమె వ్యభిచారం చేస్తున్నట్టే" అని చెప్పాడు.
\s5
\p
\v 13 అదే సమయంలో కొందరు తమ చిన్నపిల్లల్ని యేసు ముట్టుకుని దీవించాలని ఆయన దగ్గరికి తెచ్చారు. కాని శిష్యులు వాళ్ళను అడ్డుకుని గదమాయించారు.
\v 14 వారలా చేయడం చూసి యేసు వారిపై కోప్పడ్డాడు. ఆయన తన శిష్యులతో, "చిన్నపిల్లలను నా దగ్గరకు రానివ్వండి. వారిని ఆపవద్దు. ఎవరైతే ఈ చిన్నపిల్లల లక్షణాలు కలిగి ఉంటారో, వారినే దేవుడు పాలించడానికి ఒప్పుకుంటాడు.
\s5
\v 15 మీరొక విషయాన్ని గమనించండి. చిన్న పిల్లల్లాగా ఎవరైతే దేవుణ్ణి తమ రాజుగా అంగీకరించరో, వారిని దేవుడు కచ్చితంగా తన రాజ్యంలోకి రానివ్వడు."
\v 16 తరువాత ఆయన ఆ చిన్నపిల్లలను కౌగిలించుకున్నాడు. వారి తలలపై తన చేతులుంచి, వారికి మంచి జరగాలని దేవుణ్ణి కోరాడు.
\s5
\p
\v 17 ఆయన మళ్ళీ తన శిష్యులతో కలసి ప్రయాణానికి సిద్దమయ్యాడు. ఒక వ్యక్తి ఆయన దగ్గరకు పరుగు పరుగున వచ్చాడు. అతడు యేసు ముందు మోకరిల్లి ఆయన్ని, "సద్బోధకా, పరలోకానికి వెళ్ళాలంటే నేనేం చెయ్యాలి?" అని అడిగాడు.
\v 18 యేసు అతడితో, "నన్ను మంచివాడని ఎందుకు అంటున్నావ్? దేవుడొక్కడే మంచివాడు" అన్నాడు.
\v 19 "సరే, నీ ప్రశ్నకు జవాబు ఏంటంటే, నీకు మోషే చెప్పిన ధర్మశాస్త్రం తెలుసుగా. హత్య, వ్యభిచారం, దొంగతనం చేయగూడదు. అబద్ద సాక్ష్యం చెప్పకూడదు. ఎవరినీ మోసం చేయవద్దు. నీ తల్లిదండ్రులను గౌరవించు. నువ్వు పాటించవలసినవి ఇవే" అని చెప్పాడు.
\s5
\v 20 ఆ వ్యక్తి యేసుతో, "బోధకా, నా చిన్నతనం నుండి ఆ ఆజ్ఞలను నేను పాటిస్తున్నాను" అని చెప్పాడు.
\p
\v 21 యేసు అతనికేసి చూసినప్పుడు ఆయనకి అతనిపై ప్రేమ కలిగింది. ఆయన అతడితో "నువ్వు ఇప్పటివరకు చేయకుండా వదిలేసింది ఒకటుంది. ఇంటికి పోయి నీకున్న ఆస్తిని అమ్మి పేదలకు పంచిపెట్టు. తద్వారా నువ్వు పరలోకంలో ధనవంతుడివి అవుతావు. నేను నీకు చెప్పినదంతా చేసిన తరువాత వచ్చి నన్ను అనుసరించు" అన్నాడు.
\v 22 యేసు చెప్పిన మాట విని అతడు చాలా నిరుత్సాహ పడ్డాడు. అతడు చాలా ధనవంతుడు కాబట్టి బాధగా ఆయన దగ్గర నుండి వెళ్ళిపోయాడు.
\s5
\p
\v 23 యేసు తన చుట్టూ ఉన్నవాళ్ళను చూసి తన శిష్యుల వైపు తిరిగి, "ధనవంతులు దేవుని రాజ్యాన్ని అంగీకరించడం చాలా కష్టం" అన్నాడు.
\v 24 ఆయన చెప్పింది విన్న శిష్యులు కంగారుపడ్డారు. యేసు మళ్ళీ, "నా ప్రియ స్నేహితుల్లారా, దేవుని రాజ్యాన్ని ఇలాటి వారు అంగీకరించడం చాలా కష్టం.
\v 25 నిజానికి, ధనవంతులు దేవుని రాజ్యాన్ని అంగీకరించడం కంటే, చాలా పెద్ద జంతువైన ఒంటె సూది రంధ్రంలో దూరడం సులభం" అన్నాడు.
\s5
\p
\v 26 ఆయన శిష్యులు ఇది విని చాలా ఆశ్చర్యపోయారు. వారు ఒకరితో ఒకరు, "అలాగైతే ఎవరూ రక్షణ పొందలేరు గదా?" అని చెప్పుకున్నారు.
\v 27 యేసు వారిపైపు చూసి, "నిజమే, ఎవరైనా తమను తాము రక్షించుకోవడం అసాధ్యమే గానీ దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు గనక వాళ్ళను తప్పక రక్షించగలడు" అని చెప్పాడు.
\p
\v 28 పేతురు యేసుతో, "బోధకా, మేము అన్నీ వదిలిపెట్టి నీ వెంట తిరుగుతున్నాం గదా" అన్నాడు.
\s5
\v 29 దానికి యేసు, "మీరంతా ఇది తెలుసుకోండి. సువార్త కోసం, ఎవరైతే నాకోసం తమ ఆస్తిపాస్తుల్ని, పిల్లల్ని, తల్లిదండ్రుల్ని, అక్కాచెల్లెళ్ళను, అన్నదమ్ములను, ఇళ్ళను వదులుకుంటారో
\v 30 వాళ్ళందరూ తాము వదులుకున్న దానికంటే వంద రెట్లు ఈ జీవితంలోనే పొందుతారు. దానితో బాటు ఆస్తిపాస్తులు, ప్రియమైన అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు, పిల్లలు, ఇళ్ళు ఉంటాయి. అయితే మీరు నన్ను నమ్ముకున్న కారణాన లోకులు మిమ్మల్ని హింసిస్తారు. కానీ రాబోయే కాలంలో అంతకంటే ఎక్కువైన పరలోకాన్ని మీరు పొందుతారు.
\v 31 కాని నేను మిమ్మల్నందరినీ హెచ్చరిస్తున్నాను. మీలో కొందరు తమను తాము ముఖ్యమైన వారిగా భావించుకుంటున్నారు గదా. అయితే రాబోయే కాలంలో మీలో కొందరు ముఖ్యమైనవారు అనిపించుకోరు. అలాగే ముఖ్యం కాని వారిలో కొందరు ముఖ్యమైనవారుగా రాబోయే కాలంలో ఉంటారు."
\s5
\p
\v 32 కొన్ని రోజులు తరువాత వాళ్ళు అదే విధంగా తమ ప్రయాణాన్ని కొనసాగించారు. యేసు, ఆయన శిష్యులు యెరూషలేము దారిలో నడుస్తున్నారు. యేసు వారికంటే కొంచెం ముందుగా నడుస్తున్నాడు. అది చూసి ఆయన శిష్యులు ఆశ్చర్యపోతున్నారు. వారితో ఉన్న మిగతావారు భయపడ్డారు. ఆయన తన పన్నెండు మంది శిష్యులను వారినుంచి వేరు చేసి తనతో పాటు వేరే ప్రదేశానికి తీసుకువెళ్ళాడు. అప్పుడు మళ్ళీ తనకు జరగపోయే దాన్ని వారికి చెప్పడం మొదలుపెట్టాడు.
\p
\v 33 ఆయన వారితో, "నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మనం ఇప్పుడు యెరూషలేముకు వెళ్తున్నాం. అక్కడ ధర్మశాస్త్రాన్ని బోధించే పండితులు, ప్రధాన యాజకులు మనుష్యకుమారుడినైన నన్ను బంధిస్తారు. నాకు మరణశిక్ష పడాలని ప్రకటిస్తారు. ఆ తరవాత నన్ను రోమన్ ప్రభుత్వానికి అప్పగిస్తారు.
\v 34 వాళ్ళు నన్ను ఎగతాళి చేసి నాపై ఉమ్మివేస్తారు. నన్ను కొరడాలతో కొట్టి హింసించి నన్ను చంపుతారు. కాని చనిపోయిన మూడో రోజున నేను మళ్ళీ తిరిగి బ్రతుకుతాను" అని చెప్పాడు.
\s5
\p
\v 35 మార్గమధ్యంలో, జెబెదయి ఇద్దరు కొడుకులు యాకోబు, యోహానులు యేసు దగ్గరకు వచ్చి, ఆయనతో, "బోధకా, దయచేసి నువ్వు మా కోరిక మన్నించాలి" అని అడిగారు.
\v 36 ఆయన వారిని, "మీకేం కావాలి?" అని అడిగాడు.
\v 37 వారు ఆయనతో, "ప్రభూ, నువ్వు నీ రాజ్యాన్ని పాలించేటప్పుడు మాలో ఒకణ్ణి నీ కుడి వైపునా మరొకణ్ణి ఎడమ వైపునా కూర్చోనివ్వు" అని అడిగారు.
\s5
\v 38 యేసు వారితో, "మీరేం అడుగుతున్నరో మీకు అర్థం అవుతున్నదా?" అన్నాడు. తరువాత వాళ్ళను, "నేను పొందబోయే బాధల్ని మీరు భరించగలరా? నేను పొందబోయే మరణం లాంటి మరణాన్ని మీరు పొందగలరా?" అని అడిగాడు.
\v 39 వాళ్ళు ఆయనతో, "అవును, మేము పొందగలం" అన్నారు. అప్పుడు యేసు వాళ్ళతో, "నిజమే, నేను అనుభవించబోయే బాధల్ని మీరు అనుభవిస్తారు. శత్రువులు నన్ను ఏ విధంగా చంపబోతున్నారో ఆ విధంగానే మిమ్మల్ని కూడా చంపుతారు.
\v 40 కాని నా సరసన ఎవరు ఉండాలో ఎంపిక చేసుకునే అవకాశం నాకు లేదు. దేవుడు ముందుగానే ఎంపిక చేసిన వారికే ఆ స్థానాన్ని ఇస్తాడు" అని చెప్పాడు.
\s5
\p
\v 41 తరువాత యాకోబు, యోహానులు యేసును అడిగిన దాన్ని గురించి మిగతా పది మంది శిష్యులకు తెలిసింది. వాళ్ళు అలా అడగడం తమకు నచ్చలేదని వారికి చెప్పారు.
\v 42 అప్పుడు యేసు తన శిష్యులందరినీ దగ్గరకు పిలిచి, వాళ్ళతో, "రాజులు, ప్రభుత్వ పెద్దలు తామేదో గొప్ప వాళ్ళమన్నట్టు తమ ప్రజలపై పెత్తనం చేస్తూ మురిసి పోతుంటారని మీకు తెలుసు. అంతేకాకుండా వాళ్ళ పైఆధికారులు వాళ్ళపై పెత్తనం చెలాయిస్తారనీ మీకు తెలుసు.
\s5
\v 43 కాని మీరు వారిలా ఉండవద్దు. దానికి విరుద్దంగా, మీలో ఎవరైతే దేవుడు మిమ్మల్ని గొప్పవాడుగా చూడాలనుకుంటారో, అతడు తనను మిగతా వారికి సేవకుడిలా భావించుకోవాలి."
\p
\v 44 "ఇంకా నేను చెప్పేదేమిటంటే, మీలో ఎవరైతే దేవుడు మిమ్మల్ని ముఖ్యమైనవానిగా భావించాలనుకుంటారో, అతడు మిగతా వారికి బానిసగా మారిపోవాలి.
\v 45 మనుష్యకుమారుడినైన నేను మీతో సేవ చేయించుకోడానికి రాలేదు. దానికి విరుద్ధంగా మీకు సేవ చేయడానికీ నా జీవితాన్ని ధారపోసి అనేకమందిని రక్షించడానికీ వచ్చాను" అన్నాడు.
\s5
\p
\v 46 యేసు ఆయన శిష్యులు యెరూషలేముకు పోతూ, దారిలో యెరికో అనే ఊరికి చేరుకున్నారు. అప్పుడు గొప్ప జనసమూహం వెంట రాగా ఆయన యెరికోను వదిలి వెళ్ళిపోతున్నాడు. గుడ్డి వాడొకడు రోజూ దారి పక్కనే కూర్చుని అడుక్కునేవాడు. అతడి పేరు బర్తిమయి. అతడి తండ్రి పేరు తీమయి.
\v 47 నజరేతు వాడు యేసు అటుగా వెళ్తున్నాడని అతడు విన్నాడు. అతడు, "ఓ యేసూ, దావీదు వంశంలో పుట్టిన క్రీస్తూ, నాపై దయ చూపించు" అని గొంతు చించుకుని అరవసాగాడు.
\v 48 దారిన వెళుతున్న వాళ్ళంతా నోరు మూసుకోమని అతన్ని గదమాయించారు. కాని అతడు మరింత బిగ్గరగా "దావీదు కుమారుడైన క్రీస్తూ, నా పై దయ చూపించు" అని అరిచాడు.
\s5
\p
\v 49 యేసు ఆగి, "అతణ్ణి ఇక్కడకు తీసుకు రండి" అన్నాడు. అక్కడి వారు ఆ బిచ్చగాడితో, "నీ పంట పండింది. యేసు నిన్ను పిలుస్తున్నాడు, రా" అన్నారు.
\v 50 అతడు వెంటనే తన పైబట్టను విసిరేసి, చటుక్కున లేచి ఆయన దగ్గరకు వచ్చాడు.
\s5
\v 51 యేసు అతడితో, "నేను నీకు ఏం చేయాలి? నీ కోరిక ఏమిటి?" అని అడిగాడు. ఆ గుడ్డివాడు ఆయనతో, "బోధకా, నాకు మళ్లీ చూపు ప్రసాదించు" అని చెప్పాడు.
\v 52 యేసు అతడితో, "నువ్వు నన్ను నమ్మావు కాబట్టి నేను నిన్ను బాగుచేస్తున్నాను. ఇక నువ్వు వెళ్ళవచ్చు" అని చెప్పాడు. అతనికి వెంటనే చూపు వచ్చింది. సంతోషంగా యేసుతో కలిసి ఆ దారినే వెళ్ళాడు.
\s5
\c 11
\p
\v 1 యేసు, ఆయన శిష్యులు యెరూషలేము మార్గంలోని బేత్పగే, బేతనియలకు దగ్గరగా ఉన్న ఒలీవల కొండకు చేరుకున్నారు. అప్పుడు యేసు ఇద్దరు శిష్యులను పిలిచి, వాళ్ళతో
\v 2 "మీరు ఎదురుగా ఉన్న ఆ గ్రామంలోకి వెళ్ళండి. ఆ గ్రామంలో ప్రవేశించగానే, ఒక కట్టి ఉన్న గాడిద పిల్ల కనిపిస్తుంది. దానిమీద ఇంతకుముందు ఎవరూ కూర్చోలేదు. దాన్ని విప్పి నా దగ్గరికి తోలుకు రండి.
\v 3 ఎవరైనా మీతో, "ఇలా ఎందుకు చేస్తున్నారు?" అని అడిగితే "ప్రభువుకి ఇది కావాలి" అని చెప్పండి."
\s5
\p
\v 4 ఆయన చెప్పినట్లే ఆ ఇద్దరు శిష్యులు వెళ్ళి, ఆ గాడిద పిల్లను కనుగొన్నారు. ఆ గాడిద పిల్ల ఒక వీధి ప్రక్కనే ఉన్న ఇంటి తలుపుకి కట్టేసి ఉంది. వాళ్ళు దాన్ని విప్పారు.
\v 5 అక్కడే ఉన్న కొంతమంది వాళ్ళు చేస్తున్న దాన్ని చూసి వారితో, "మీరు గాడిదను ఎందుకు విప్పుతున్నారు?" అని అడిగారు.
\v 6 వాళ్ళకి యేసు ఏమని బదులు ఇవ్వమని చెప్పాడో, అదే విధంగా వాళ్ళు ఆ మనుషులకు చెప్పారు.
\s5
\v 7 ఆ ఇద్దరు శిష్యులు ఆ గాడిదపిల్లను యేసు దగ్గరకు తెచ్చి ఆయన కూర్చోడానికి వీలుగా, దానిపై కొన్ని బట్టలు పరిచారు.
\v 8 అనేకమంది తమ బట్టలను ఆయనకు ముందుగా దారిపొడుగునా నేలపై పరిచారు. మిగతా వారు దగ్గరిలోని పొలాల్లోకి వెళ్ళి, ఈత చెట్టు కొమ్మలను నరికి, నేలపై ఆయనకు ముందుగా పరిచారు.
\v 9 ఆయనకు ముందు, వెనుకగా వస్తున్న వారందరు బిగ్గరగా, "దేవునికి స్తుతులు! సర్వాధికారిగా వస్తున్న ఈయన్ని దేవుడు దీవించు గాక" అంటూ కేకలు వేసారు.
\p
\v 10 అంతేకాకుండా వారు "మన పూర్వికుడైన దావీదు రాజు ఏ విధంగా పాలించాడో , ఆ విధంగానే నీ పాలన కూడా ఉండేలా దేవుడు దీవించు గాక! అలాగే పరలోకంలో ఉన్న దేవునికి స్తుతులు కలుగు గాక" అంటూ కేకలు వేసారు.
\s5
\p
\v 11 ఆ విధంగా యేసు యెరూషలేములోకి వచ్చాడు. వెంటనే ఆయన దేవాలయ ప్రాంగణం లోకి వెళ్ళాడు. అక్కడ జరుగుతున్నదంతా ఆయన ఒకసారి కలియజూసి, వెంటనే అక్కడి నుంచి వచ్చేసాడు. ఎందుకంటే అప్పటికే సాయంకాలం కావస్తుంది. ఆయన తన ఇద్దరు శిష్యులతో కలసి బేతనియకు వచ్చాడు.
\p
\v 12 తరువాతి రోజు యేసు ఆయన శిష్యులు బేతనియ నుంచి వస్తున్నప్పుడు, ఆయనకు చాలా ఆకలేసింది.
\s5
\v 13 ఆయన కొంత దూరంలో ఉన్న అంజూరుు చెట్టును చూశాడు. అది ఆకులతో గుబురుగా ఉంది. ఏమైనా పళ్ళు దొరుకుతాయేమోనని ఆయన దాని దగ్గరకు వెళ్ళాడు. కాని ఒక్క పండు కూడా కానరాలేదు. కారణం అది అంజూరుు పండ్లకాలం కాదు.
\p
\v 14 ఆయన ఆ చెట్టుతో, "ఇక ఎప్పటికి పండ్లు కాయని చెట్టుగానే ఉంటావు. ఎవ్వరూ నీ దగ్గరికి పండ్ల కోసం మళ్ళీ రారు" అని చెప్పాడు. ఆ మాటలు శిష్యులు విన్నారు.
\s5
\v 15 యేసు, ఆయన శిష్యులు యెరూషలేముకి తిరిగి వచ్చి, దేవాలయ ప్రాంగణంలోకి వెళ్లారు. అక్కడ మనుషులు బలుల కోసం జంతువులను కొనడం అమ్మడం ఆయన చూశాడు. వాళ్ళనందరినీ దేవాలయ ప్రాంగణం నుంచి తరిమివేశాడు. అంతేకాకుండా ఆలయానికి అర్పణగా వస్తున్న వాటిని రోమన్ నాణేల్లోకి మారుస్తున్న వాళ్ళ బల్లలను ఆయన తోసేసాడు. బలికోసం పావురాలు అమ్ముతున్న వాళ్ళ కుర్చీలను కూడా తోసేసాడు.
\v 16 దేవాలయ ప్రాంగణంలో ఎవరూ ఎలాటి అమ్మకాలు చెయ్యడానికి ఆయన అంగీకరించలేదు.
\s5
\p
\v 17 తరువాత వాళ్ళకి ఆయన బోధిస్తూ, "దేవుడు గ్రంథాల్లో రాయించినది ఏమిటంటే, నా ఇల్లు అన్ని జాతులవారికీ ప్రార్థన స్థలంగా ఉండాలని నేను కోరుతున్నాను. కాని బందిపోటు దొంగలైన మీరు, నా ఇంటిని దొంగలు దాక్కునే గుహగా చేశారు" అన్నాడు.
\p
\v 18 ఆయన చేసిన దాన్ని గురించి యూదుల ధర్మశాస్త్ర బోధకులు, ప్రధాన యాజకులు తరువాత తెలుసుకున్నారు. అప్పటినుంచి ఆయన్ని ఎలా చంపాలని వాళ్ళు ఆలోచించారు. కాని ఆయన బోధలు విన్న ప్రజలు ఆశ్చర్యంతో ఆయన్ని చాలా అభిమానించడం వాళ్ళు గమనించారు. కాబట్టి ఆయన అంటే భయపడ్డారు.
\p
\v 19 ప్రతి రోజూ సాయంకాలానికి యేసు ఆయన శిష్యులు ఆ నగరాన్ని వదిలి వెళ్ళేవారు.
\s5
\v 20 మరుసటి రోజు ఉదయమే వాళ్ళు యెరూషలేముకు వెళ్తుంటే , యేసు శపించిన ఆ అంజూరు చెట్టు పూర్తిగా ఎండిపోయి వాళ్ళకి కనిపించించింది.
\v 21 పేతురు ఆ చెట్టు గురించి యేసు ఏం చెప్పాడో గుర్తుకు వచ్చి యేసుతో, "బోధకా నువ్వు శపించిన ఆ చెట్టు ఏ విధంగా ఎండిపోయిందో చూడు" అన్నాడు.
\s5
\v 22 దానికి జవాబుగా యేసు, "దేవుణ్ణి మీరు ఏం కావాలని అడుగుతారో దాన్ని ఆయన చేస్తాడని విశ్వాసం ఉంచండి"
\v 23 మీరు గమనించవలసింది ఏమిటంటే, ఆ పర్వతాన్ని చూసి దానితో, "లేచి సముద్రంలో పడు" అని ఎటువంటి సందేహం లేకుండా అంటే అది తప్పకుండా జరుగుతుంది. నువ్వు అనుకున్నది జరుగుతుంది అని నువ్వు నమ్మితే, దేవుడు నీకోసం దాన్ని చేస్తాడు" అని చెప్పాడు.
\s5
\p
\v 24 "కాబట్టి నేను చెప్పేదేమిటంటే, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుణ్ణి అడిగే దాన్ని పొందినట్టుగా నమ్మితే దేవుడు నీకోసం దాన్ని చేస్తాడు.
\v 25 ఇప్పుడు ఇంకో విషయాన్ని కూడా మీకు చెబుతాను. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, నీకు ఎవరైతే హాని చేస్తారో వారిపై నీకున్న కోపాన్ని తీసివేసి, వారిని క్షమించు. ఏవిధంగా ఐతే నీ పాపాల్ని పరలోకంలోని తండ్రి క్షమిస్తున్నాడో, ఆవిధంగా నువ్వు వాళ్ళని క్షమించు.
\v 26 అప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి మీ పాపాలను క్షమిస్తాడు."
\s5
\p
\v 27 యేసు ఆయన శిష్యులు యెరూషలేములోని దేవాలయ ప్రాంగణానికి మళ్ళీ వచ్చారు. అక్కడ ఆయన తిరుగుతుంటే, పెద్దలు, యూదు ధర్మశాస్త్ర పండితులు, ప్రధాన యాజకులు గుంపుగా ఆయన దగ్గరకు వచ్చారు.
\v 28 వాళ్ళు ఆయనతో, "నువ్వు ఏ అధికారంతో ఇదంతా చేస్తున్నావు? నిన్న ఆ విధంగా చేసే అధికారం నీకు ఎవరిచ్చారు?" అని అడిగారు.
\s5
\v 29 యేసు వాళ్ళతో, "నేనూ మిమ్ముల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీరు దానికి సరైన జవాబు చెబితే, నేను కూడా నాకు ఎవరు ఆ అధికారాన్ని ఇచ్చారో చెబుతాను.
\v 30 తన దగ్గరకు వస్తున్న వారికి బాప్తిసం ఇచ్చిన యోహానుకి ఆ అధికారం దేవుడు ఇచ్చాడా? లేక మనుషులు ఇచ్చారా?" అని అడిగాడు.
\s5
\v 31 ఆయన అడిగిన దానికి ఎలాటి జవాబు చెప్పాలో వాళ్ళలో వాళ్ళు చర్చించుకున్నారు. వాళ్ళల్లో వాళ్ళు, "ఒక వేళ అధికారం దేవుడి నుంచి వచ్చింది అని చెబితే, "మీరు యోహాను చెబుతున్న వాటిని ఎందుకు నమ్మలేదు?" అంటాడు.
\v 32 అలా కాకుండా మనం అతనికి ఆ అధికారం మనుషుల వల్ల వచ్చింది అంటే, ఇక మన పనైపోతుంది!" అనుకున్నారు. ఎందుకంటే అలా చెబితే ప్రజలు తమపై తిరగబడతారని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే యోహాను దేవుడు పంపిన ప్రవక్తగా ప్రజలు నిజంగా నమ్ముతున్నారని వాళ్ళకి తెలుసు.
\v 33 అందువల్ల వాళ్ళు యేసుతో, "యోహానుకు వచ్చిన ఈ అధికారం ఎవరి నుంచి వచ్చిందో మాకు తెలియదు" అన్నారు. అప్పుడు యేసు వాళ్ళతో, "నేను అడిగిన ప్రశ్నకు మీరు జవాబు చెప్పలేదు కాబట్టి నేను కూడా నిన్న ఏ అధికారంతో అదంతా చేశానో చెప్పను" అన్నాడు.
\s5
\c 12
\p
\v 1 అప్పుడు యేసు వారితో ఒక కథ చెప్పడం ప్రారంభించారు. ఆయన "ఒక మనిషి ద్రాక్ష తోటను వేసాడు. దాని చుట్టూ కంచె వేసాడు. ద్రాక్ష రసం నింపడానికి ఒక రాతి తొట్టె తొలిపించాడు. ద్రాక్ష తోటను కాపలా కాసే వారి కోసం ఒక కావలి గోపురం నిర్మించాడు. ద్రాక్ష తోటను సేద్యం చెయ్యడానికి కొందరు రైతులకు కౌలుకిచ్చి, అతడు మరో దేశానికి వెళ్ళిపోయాడు.
\v 2 ద్రాక్ష తోట పక్వకాలానికి వచ్చినపుడు, ఆ తోట యజమాని తన కౌలు కోసం తన పని వాడిని, ఆ కౌలు రైతుల దగ్గరకు పంపాడు. ఎందుకంటే ఫలించిన ద్రాక్ష తోటలో తన భాగంగా రావలసిన పంట అతడు తీసుకోవాలనుకున్నాడు.
\v 3 కాని ఆ కౌలుదారులు ఆ వచ్చిన పనివాడికి, కౌలు ఇవ్వకపోగా అతణ్ణి తోటలోనుంచి బయటకిలాగి అతని మీద పడి కొట్టారు. అతణ్ణి అక్కడనుంచి తరిమివేశారు."
\s5
\p
\v 4 "ఆ తరవాత ఆ తోట యజమాని వాళ్ళ దగ్గరకు మరొక పనివాణ్ణి పంపాడు. కాని వాళ్ళు ఎంతమాత్రం తాము చేస్తున్న తప్పుకు సిగ్గుపడక, అతణ్ణి కూడా వాళ్ళు తలపై మోది గాయపరిచారు.
\v 5 అలా జరిగిన తరువాత కూడా ఆ తోట యజమాని మరో పనివాణ్ణి పంపాడు. అతణ్ణి కూడా వాళ్ళు చంపేశారు. అతడు ఎంతమంది పనివాళ్ళను పంపినా వాళ్ళను బాధలు పెట్టారు. కొంతమందిని గాయపరచి, కొంతమందిని చంపారు.
\s5
\v 6 వారి దగ్గరకు పంపడానికి ఆ తోట యజమాని దగ్గర మరొక వ్యక్తి ఉన్నాడు- ఆయన ప్రియమైన కొడుకు. తన సొంత కొడుకైతే వాళ్ళు తప్పకుండా గౌరవిస్తారని భావించి అతణ్ణి పంపాడు.
\v 7 కాని దుర్మార్గులైన ఆ కౌలుదారులు, ఆ తోట యజమాని కొడుకుని చూసి తమలో తాము, "చూడండి, తోట యజమాని కొడుకు వస్తున్నాడు. ఏదో ఒకనాటికి ఈ ద్రాక్ష తోటకు అతడే యజమాని అవుతాడు. కాబట్టి ఈ తోట మన సొంతం కావాలంటే అతణ్ణి చంపేద్దాం" అనుకున్నారు.
\s5
\v 8 వాళ్ళు ఆ తోట యజమాని కొడుకును పట్టుకుని బంధించి చంపారు. తరువాత అతడి శవాన్ని తోట బయట పారేసారు.
\v 9 కాబట్టి ఇప్పుడు ఆ తోట యజమాని ఏం చేస్తాడో మీకు తెలుసా? అతడు వచ్చి, తోట కౌలుకు తీసుకున్న ఆ దుర్మార్గులను చంపుతాడు. అప్పుడు దాన్ని జాగ్రత్తగా చూసుకోవటానికి వేరే మనుషుల్ని ఏర్పాటు చేస్తాడు.
\s5
\v 10 మీరు రోజు చదువుతున్న గ్రంథాల్లో రాసిన ఈ వాక్యాల్ని ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించడి. "ఇల్లు కట్టేవారు, ఆ ఇల్లు కట్టడంలో ఒక రాయి తీసి పారేశారు. కాని దేవుడు అదే రాయిని సరైన స్థలంలో పెట్టాడు. ఆ ఇంటికి అదే ముఖ్యమైన రాయిగా మారింది.
\v 11 దేవుడు చేసిన ఈ పనిని చూస్తుంటే సంభ్రమాశ్చర్యాలు కలుగుతాయి" అన్నాడు.
\p
\v 12 ఆయన చెప్పిన కథలోని ఆ రాక్షసులు ఎవరో కాదు, యేసు తమను మనసులో పెట్టుకునే ఈ కథ ఆయన చెప్పాడని యూదు పెద్దలు గ్రహించారు. కాబట్టి వాళ్ళు ఆయన్ని బంధించాలని అనుకున్నారు. కాని అలా చేస్తే అక్కడే ఉన్న జనసమూహం ఏం చేస్తారోనని వాళ్ళు భయపడ్డారు. అందుకే ఆయన్ని వదిలి వెళ్ళిపోయారు.
\s5
\p
\v 13 అప్పుడు ఆ యూదా పెద్దలు, హేరోదు అంతిపాను మద్దతు దారులైన కొంతమంది సంఘ సభ్యులను, కొంతమంది పరిసయ్యలను యేసు దగ్గరకు పంపారు. వాళ్ళు ఆయనపై కుట్ర పన్నారు. ఆయన మాట్లాడే మాటల్లో ఏదో ఒక తప్పు దొర్లేలా చేసి, ఇదిగో ఈయన తప్పుడు బోధలు చేస్తున్నాడు అంటూ అందరికీ చూపించి, ఆయనపై నేరారోపణ చేయాలనుకున్నారు.
\p
\v 14 యూదా పెద్దలు పంపిన మనుష్యులు వచ్చి ఆయనతో, "బోధకా" నువ్వు సత్యమే బోధిస్తున్నావని మాకు తెలుసు. అలానే నీ గురించి ఎదుటి వారు ఏం అనుకుంటారో అని నువ్వు లెక్కచేయవు అని మాకు తెలుసు. ముఖ్యమైన వ్యక్తులకు నువ్వు చెప్పేది నచ్చక పోయినా నువ్వు పట్టించుకోవు. మేము ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడో దాన్నే బోధిస్తావు. కాబట్టి ఈ విషయం గురించి నువ్వేం ఆలోచిస్తున్నావో మాకు చెప్పు: మనం రోమన్ ప్రభుత్వానికి పన్ను కట్టడం తప్పా, ఒప్పా? మనం పన్ను కట్టాలా, కట్టనవసరం లేదా?" అని అడిగారు.
\v 15 కానీ దేవుడు ఏం చేయమంటున్నాడో తెలుసుకోవాలని నిజంగా వాళ్ళు అనుకోవడం లేదని యేసుకు తెలుసు, అందుకే వాళ్ళతో, "నేను ఏదైనా తప్పు మాట్లాడితే నాపై నేరారోపణ చెయ్యాలని మీరు అనుకుంటున్నారని నాకు తెలుసు. అయినా మీ ప్రశ్నకు జవాబు ఇస్తాను. ఒక నాణెం చూపించండి" అన్నాడు.
\s5
\v 16 వాళ్ళు ఒక నాణెం ఆయనకి చూపారు. వాళ్ళతో ఆయన, "ఈ నాణెంపై ఉన్న బొమ్మ ఎవరిది? దీనిపై ఎవరి పేరు ఉంది?" అని అడిగాడు. దానికి వాళ్ళు, "దీనిపై బొమ్మ, పేరు సీజర్ వి" అని చెప్పారు.
\v 17 యేసు, "నిజమే, కాబట్టి సీజర్ కి చెందినవి సీజరుకీ దేవుడికి చెందేవి దేవుడికీ ఇవ్వండి" అని చెప్పాడు. ఆయన చెప్పిన సమాధానికి వాళ్ళు ఆశ్చర్యపోయారు.
\s5
\p
\v 18 సద్దూకయ్యుల బృందానికి చెందిన కొంతమంది మనుషులు కూడా అక్కడ ఉన్నారు. చనిపోయినవారు తిరిగి బతుకుతారు అని నమ్మే యూదుల నమ్మకాన్ని వీళ్ళు ఒప్పుకోరు. కొంతమంది సద్దుకయ్యాలు యేసు దగ్గరికి వచ్చి ఆయనతో,
\v 19 "బోధకా, మోషే రాసినట్టు, ఒకడు పిల్లలు లేకుండా చనిపోతే, అతడి సోదరుడు ఆ వితంతువును పెళ్లి చేసుకుని తన సోదరుని కోసం వారసుణ్ణి కనాలి అని చెప్పాడు.
\s5
\v 20 దీనికి ఒక ఉదాహరణ. ఒక కుటుంబంలో ఏడుగురు అన్నదమ్ములు ఉన్నారు. అందులో పెద్దవాడు ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. కానీ వారికి పిల్లలు పుట్టలేదు. కొంతకాలానికి అతడు చనిపోయాడు.
\v 21 ఆ కుటుంబంలో రెండోవాడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అతడికి కూడా పిల్లలు పుట్టలేదు. ఇతడు కూడా చనిపోయాడు. మూడోవాడు కూడా తన సోదరుని లాగానే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అతడికి కూడా పిల్లలు పుట్టలేదు. తరువాత అతడు చనిపోయాడు.
\v 22 చివరికి మొత్తం ఏడుగురు సోదరులు, ఒకరి తరువాత ఒకరు ఆమెను పెళ్ళి చేసుకున్నారు, కానీ ఎవ్వరికీ పిల్లలు పుట్టలేదు. ఒకరి తరువాత ఒకరు చనిపోయారు. అందరి తరువాత ఆమె కూడా చనిపోయింది."
\p
\v 23 "చనిపోయిన మనుషులు తిరిగి బతికే రోజున, ఆ స్త్రీ ఎవరి భార్య అవుతుంది? మనం గుర్తు పెట్టుకోవలసిదేంటంటే, ఆమె ఆ ఏడుగురు అన్నదమ్ముల్ని పెళ్లి చేసుకుంది" అన్నారు.
\s5
\v 24 యేసు వాళ్ళతో, "మీరు పొరపాటు పడుతున్నారు. దీన్ని గురించి గ్రంథాలు ఏమి బోధిస్తున్నాయో మీకు తెలియదు. అంతేకాక మనుషులను బ్రతికించే దేవుడి శక్తి ఏంటో కూడా మీరు అర్థం చేసుకోలేదు.
\v 25 ఆ అన్నదమ్ములెవ్వరికీ ఆ స్త్రీ భార్యగా ఉండదు. ఎందుకంటే మనుషులు తిరిగి బ్రతికినప్పుడు, పురుషులకు భార్యలు, స్త్రీలకు భర్తలు ఉండరు. వాళ్ళందరూ దేవదూతల్లాగా పరలోకంలో ఉంటారు. దేవదూతలు పెళ్ళిళ్ళు చేసుకోరు."
\s5
\p
\v 26 "ఇక మనుషులు చనిపోయి తిరిగి బ్రతికే విషయానికి వస్తే మోషే రాసిన గ్రంథంలో చనిపోయిన వాళ్ళను గురించి ఇలా రాశాడు. మీరు కచ్చితంగా చదివే ఉంటారు. కాలిపోతున్న పొదను చూస్తున్న మోషేతో దేవుడు ఇలా, "ఎవరు నన్ను ఆరాధించారో , ఆ అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి" అన్నాడు.
\v 27 ఇప్పుడు ఎవరు దేవుణ్ణి ఆరాధిస్తారో వాళ్ళు చనిపోయినట్టు కాదు. ఆయన్ని ఆరాధించిన వాళ్ళు జీవిస్తున్నట్టే. కాబట్టి చనిపోయిన మనుషులు తిరిగి బ్రతకరని మీరు చెప్పేది సరికాదు" అని జవాబు చెప్పాడు.
\s5
\p
\v 28 యూదుల ధర్మశాస్త్ర బోధకుల్లో ఒకడు వాళ్ళ సంభాషణ అంతా విన్నాడు. సద్దూకయ్యుల ప్రశ్నకు యేసు సరిగ్గా సమాధానం చెప్పాడని గ్రహించాడు. కాబట్టి అతడు ముందుకు వచ్చి యేసుతో, "ఆజ్ఞల్లో ముఖ్యమైన ఆజ్ఞ ఏంటి?" అని అడిగాడు.
\v 29 యేసు అతడికి, "ఆజ్ఞల్లో ముఖ్యమైన ఆజ్ఞ ఇదే. "ఓ ఇశ్రాయేలూ విను, మన ప్రభువైన దేవుడొక్కడే ప్రభువు.
\v 30 నువ్వు చేసే పనులన్నిటిలోనూ , నువ్వు చేసే ఆలోచలన్నిటిలోనూ, నీ భావనలన్నిటిలోనూ, నీ కోరికలన్నిటిలోనూ నీ ప్రభువైన దేవుణ్ణి ప్రేమించాలి"
\v 31 తరవాత ముఖ్యమైన ఆజ్ఞ ఏమిటంటే, "నిన్ను నువ్వు ఎంతగా ప్రేమించుకుంటావో, అలానే నీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా అలానే ప్రేమించాలి." ఈ రెంటికీ మించిన ముఖ్యమైన ఆజ్ఞలంటూ మరేవీ లేవు" అని చెప్పాడు.
\s5
\p
\v 32 ఆ వ్యక్తి యేసుతో, "బోధకా, నువ్వు చాలా చక్కగా జవాబు చెప్పావు. మన దేవుడొక్కడే దేవుడు అని నువ్వు చెప్పింది అక్షరాల నిజం. ఆయన తప్ప వేరే దేవుడు లేడు.
\v 33 అలాగే మన పనులన్నిటిల్లో, మన ఆలోచనలన్నిటిల్లో, మన భావనలన్నిటిల్లో, మన కోరికలన్నిటిల్లో మన దేవుడినే ప్రేమించాలని నువ్వు చెప్పింది నిజమే. అంతేకాకుండా మనల్ని మనం ఎంతగా ప్రేమించుకుంటామో మనతో పరిచయం ఉన్న ప్రతి మనిషినీ మనం ప్రేమించాలని నువ్వు సరిగ్గా చెప్పావు. దహన బలులుగా జంతువులను, ఆహారపదార్థాలను, ఇతర అర్పణలను అర్పించడం కంటే నువ్వు చెప్పిన వీటిని చేస్తే దేవుడు నిజంగా సంతోషిస్తాడు అని నువ్వు చెప్పింది ఎంతో నిజం" అని చెప్పాడు.
\p
\v 34 అతడు సరిగా జవాబు చెప్పాడని యేసు గ్రహించాడు. అతనితో "దేవుడు తన పాలనలోకి నిన్ను తీసుకోవడానికి నువ్వు ఎంతో దూరంలో లేవు" అని చెప్పాడు. ఆ తరువాత ఆ యూదా పెద్దలు ఆయన్ని కుట్రపూరితమైన ప్రశ్నలు అడగాలన్న ఆలోచనను మానుకున్నారు. ఎందుకంటే ఆయన్ని ఇంకా ప్రశ్నలను అడగాలంటే వారికి భయం వేసింది.
\s5
\p
\v 35 ఆ తరువాత దేవాలయ ఆవరణలో ప్రజలకు బోధిస్తూ ఆయన ఇలా అన్నాడు. "ధర్మ శాస్త్రాన్ని బోధిస్తున్నవారు చెప్పేదంతా నిజమేనా? క్రీస్తు దావీదు కుమారుడా?
\v 36 పరిశుద్ధాత్ముని ద్వారా దావీదు క్రీస్తును గురించి, దేవుడు నా ప్రభువుతో పలికిన మాట, "నీ శత్రువులు పూర్తిగా దాసోహం అయ్యే వరకు ఎక్కడైతే నీకు గొప్ప గౌరవం కలుగుతుందో, అక్కడ అంటే అందరికంటే అత్యున్నతమైన నా కుడివైపున కూర్చో" అని దావీదు పలికాడు.
\v 37 ఈ కీర్తనలో దావీదు క్రీస్తును ప్రభువు అని పిలుస్తున్నాడు. కాబట్టి ధర్మశాస్త్ర బోధకులు క్రీస్తును దావీదు కుమారుడు అని ఎలా చెబుతారు?" ఆయన బోధించే ఈ విషయాలను అనేకమంది సంతోషంగా విన్నారు.
\s5
\p
\v 38 యేసు ప్రజలకు బోధిస్తున్నప్పుడు, వాళ్ళతో ఆయన, "ధర్మశాస్త్రాన్ని బోధించే వారిలా ఉండకుండా జాగ్రత్త పడండి. తామెంతో గొప్పవాళ్ళమన్నట్టు ప్రదర్శిస్తూ, పొడుగాటి అంగీలు వేసుకొని వీధుల్లో తిరుగుతూ ప్రజలు తమను గౌరవించాలని కోరుకుంటారు. బజారుల్లో ప్రజలు తమకు గౌరవంగా నమస్కారం చేయాలని కోరుకుంటారు.
\v 39 యూదుల ప్రార్థన మందిరాలలో ప్రముఖ స్థానాల్లో కూర్చోడానికి ఇష్టపడతారు. పండుగల్లో ప్రముఖులు కూర్చునే చోట కూర్చోడానికి ఇష్టపడతారు.
\v 40 వాళ్ళు వితంతువుల ఆస్తులను, ఇళ్ళను దిగమింగుతారు. బహిరంగ ప్రదేశాల్లో సుదీర్ఘ ప్రార్థనలు చేస్తూ, అందరూ తమను మంచివాళ్ళు అనుకోవాలని చూస్తారు. వాళ్ళను దేవుడు తీవ్రంగా శిక్షిస్తాడు" అని చెప్పాడు.
\s5
\p
\v 41 తరువాత యేసు దేవాలయ ఆవరణలో ప్రజలు తమ కానుకలు వేసే హుండీకి ఎదురుగా కూర్చున్నాడు. అక్కడ ఆ విధంగా కూర్చుని, ప్రజలు కానుకలు వేసే కానుకల పెట్టెలో ఒక కానుకను గమనించాడు. వానిలో అనేకమంది ధనవంతులు చాలా పెద్ద మొత్తంలో కానుకలు వేస్తున్నారు.
\v 42 అప్పుడు పేద విధవరాలు వారితోపాటే వచ్చి తన దగ్గర ఉన్న రెండు రాగి నాణేలను అందులో వేసింది. ఆ మొత్తం విలువ చాలా తక్కువ.
\s5
\v 43 యేసు తన శిష్యులందరినీ తన చుట్టూ సమకూర్చి వారితో, "ఇదిగో, వీరందరి దగ్గర చాలా ధనం ఉందనేది వాస్తవం, కాని దానిలో కొద్ది భాగాన్ని మాత్రమే వారు ఇచ్చారు. కాని బీద విధవరాలు ఈ రోజు తన అవసరాలకు కావలసిన ధనం మొత్తం హుండీలో వేసింది.
\v 44 కాబట్టి వారందరి కంటే కూడా ఈ బీద విధవరాలు చాలా ధనాన్ని హుండీలో వేసింది" అని చెప్పాడు.
\s5
\c 13
\p
\v 1 యేసు దేవాలయ ఆవరణ వదిలి వెళ్తున్నప్పుడు, ఆయన శిష్యుల్లో ఒకడు ఆయనతో, "బోధకా, ఈ భవనాలు ఎంత రమ్యంగా ఉన్నాయో, ఈ పెద్ద పెద్ద రాళ్లు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో చూడండి" అన్నాడు.
\v 2 యేసు అతడితో, "నిజమే, నువ్వు చూస్తున్న ఈ భవనాలు అద్బుతంగా ఉన్నాయి. కాని వీటి గురించి నీకు ఒకటి చెప్పాలి. ఇవి పూర్తిగా ధ్వంసం అవుతాయి. ఈ కోవెల ఆవరణలో ఒకదానిపై ఒకటి పేర్చిన ఈ రాళ్లు ఇక్కడ ఉండవు" అన్నాడు.
\s5
\p
\v 3 వాళ్ళు దేవాలయం నుండి లోయలోగుండా వెళ్ళి ఒలీవ కొండకు చేరుకున్నారు. అక్కడ యేసు కూర్చున్నాడు. వారు ఒంటరిగా ఉన్నపుడు పేతురు, యాకోబు, యోహాను, అంద్రేయ ఆయన దగ్గరకు వచ్చి, ఆయనతో,
\v 4 ఈ విషయాలన్నీ ఎప్పుడు జరుగుతాయో చెప్పమని ఇవి జరగడానికి ముందు జరిగే విషయాలు ఏమిటని అడిగారు.
\s5
\v 5 యేసు వారికి సమాధానంగా, జరగబోయే వాటికి సంబంధించి ఎవరూ మిమ్మల్ని మోసం చేయకుండా జాగ్రత్తపడండి.
\v 6 అనేకమంది వచ్చి నేను వాళ్ళను పంపానని చెబుతారు. వాళ్ళు, "నేనే క్రీస్తును" అని చెప్పుకుంటారు. వాళ్ళు అనేకమందిని నా పేరుతో మోసం చేస్తారు."
\s5
\p
\v 7 "మీరు దూర ప్రాంతాల్లో యుద్ధాలు జరుగుతున్న వార్తలు గురించి విన్నప్పుడు, అలాగే ఆ యుద్ధాలలో సైనికుల పోరాటాల శబ్దాలు విన్నప్పుడు, కంగారుపడవద్దు. ఈ విషయాలన్ని కచ్చితంగా జరుగుతాయి. కాని ఇవి జరుగుతున్నప్పుడే, దేవుడు మొదట్లో నిర్ణయించినట్లుగా అంతా నాశనం చేస్తున్నట్లు ఆలోచించకండి."
\p
\v 8 "దేశ దేశాల్లో ఉన్న మనుష జాతులు ఒకరితో ఒకరు కలహించుకుంటారు. వివిధ దేశాల రాజులు, అధిపతులు ఒకరిపై ఒకరు పోరాడుకుంటారు. వివిధ ప్రాంతాల్లో భూకంపాలు కూడా వస్తాయి, అనేకచోట్ల కరువుకాటకాలు వస్తాయి. ఇలా జరుగుతున్నప్పటికీ, మనుషులు పడుతున్న ఈ బాధలకి ఇది కేవలం ఆరంభం మాత్రమే. వీళ్ళు పడబోయే ఈ మొదటి హింసలు, బిడ్డను కనడానికి స్త్రీ పడే మొదటి పురిటినొప్పుల వంటివే. వాళ్ళు అంతకంటే ఎక్కువ బాధలు పడతారు."
\s5
\p
\v 9 "ఆ సమయంలో మనుషులు మీకు చేయబోయే దానికి సిద్ధంగా ఉండండి. వాళ్ళు మిమ్మల్ని బంధించి నాయకుల సమూహం ముందు నిలబెట్టి, దోషుల్లా విచారిస్తారు. మనుషులు వివిధ ప్రార్థనా మందిరాల్లో మిమ్మల్ని కొడతారు. ప్రభుత్వ ఉన్నత ఆధికారుల ముందుకు మిమ్మల్ని ఈడ్చుకు పోయి విచారిస్తారు. దాని ఫలితంగా మీరు నా గురించిన సువార్తను బోధించడానికి వీలౌవుతుంది.
\v 10 దేవుడు ముందుగా నిర్ణయించిన తన ప్రణాళిక ప్రకారం సమస్తాన్నీ నాశనం చేయకముందే నా శిష్యులు సువార్తను అన్నీ దేశాల వారికి కచ్చితంగా ప్రకటించాలి."
\s5
\p
\v 11 "ఆ మనుషులు మిమ్మల్ని బంధించినప్పుడు ఏం చెప్పాలా అని ఆందోళన పడకండి. ఆ సమయంలో దేవుడు మీ మనస్సుల్లో పెట్టినది చెప్పండి. ఆ సమయంలో మాట్లాడేది మీరు కాదు. మీ ద్వారా పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు.
\v 12 కొందరు తమ సొంత సోదర సోదరీలకు ద్రోహం చేస్తారు. కొందరు తండ్రులు తమ పిల్లలను మోసం చేస్తారు. కొందరు పిల్లలు తమ తల్లి దండ్రులను మోసం చేస్తారు.
\v 13 నన్ను నమ్మడం వల్ల అనేక మంది మిమ్మల్ని ద్వేషిస్తారు. అయితే ఎవరైతే తాము జీవితాంతం నాపై నమ్మకం ఉంచుతారో, వారే రక్షణ పొందగలరు."
\s5
\p
\v 14 "ఆ సమయంలో అసహ్యమైన వస్తువులు, విషయాలు కోవెలలోకి వస్తాయి. వాటివల్ల కోవెల అపవిత్రం అవుతుంది. అందువల్ల మనుషులు దేవాలయానికి వెళ్ళడం మానేస్తారు. ఏదైతే అక్కడ ఉండకూడదో, అది అక్కడ ఉండటం మీరు చూసినప్పుడు, త్వరగా అక్కడనుంచి పారిపోవాలి" (దీన్ని చదువుతున్న వాళ్ళు దీనిపై శ్రద్ధ పెట్టాలి). ఆ సమయంలో ఎవరైతే యూదయ రాష్ట్రంలో ఉన్నారో వాళ్ళు కొండ ప్రాంతాలకు పారిపోవాలి.
\v 15 ఇళ్ళ బయట ఉన్నవాళ్ళు దేనికోసం తమ ఇళ్ళల్లోకి పోకూడదు.
\v 16 పొలాల్లో పనిచేసుకునే వాళ్ళెవ్వరూ వేరే బట్టల కోసం తమ ఇళ్ళకు పోకూడదు."
\s5
\p
\v 17 "ఆ రోజుల్లో గర్భవతుల గురించీ, పాలిస్తున్న తల్లుల గురించీ చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే ఆ సమయంలో వాళ్ళు తప్పించుకు పారిపోవడం చాలా కష్టం.
\v 18 ఆ రోజుల్లో వచ్చే హింసలు చాలా తీవ్రంగా ఉంటాయి. కాబట్టి అవి చలికాలంలో రాకూడదని ప్రార్థన చేయండి, అప్పుడు ప్రయాణం చేయడం కష్టం.
\v 19 ఎందుకంటే దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించిన రోజు నుండి ఈనాటి వరకూ కనీవినీ ఎరుగని కష్టాలు ఆ రోజుల్లో వస్తాయి.
\v 20 ప్రభువైన దేవుడే ఆ హింసలు తగ్గించాలని నిర్ణయించుకోపోతే, ఆ హింసలు విపరీతంగా ఉంటాయి. చాలామంది హతం అవుతారు. కాని ఆయన ఆ రోజుల్ని తగ్గించాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే ఆయనకు తాను ఎంపిక చేసుకున్న వాళ్ళపై చాలా ప్రేమ."
\s5
\p
\v 21 "కాబట్టి ఆ సమయంలో ఎవరైనా మీతో, "క్రీస్తు ఇక్కడ ఉన్నాడు చూడండి, అక్కడ ఉన్నాడు చూడండి" అని చెబితే నమ్మవద్దు.
\v 22 ఆ కాలంలో కొందరు తామే క్రీస్తు అంటూ అందరినీ తప్పుదోవ పట్టిస్తారు. కొందరు తాము దేవుడు పంపిన ప్రవక్తలుగా అందరికీ చెప్పుకుంటారు. వాళ్ళు అనేక అద్బుతాలు చేసి చూపిస్తారు. అంతేకాకుండా వాళ్ళు దేవుడు ఎంపిక చేసుకున్నవాళ్ళను కూడా మోసం చేయడానికి చూస్తారు."
\p
\v 23 "ఇవి అన్నీ జరగడానికి ముందే వాటిని గురించి నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నానని గుర్తుపెట్టుకోండి" అప్రమత్తంగా ఉండండి"
\s5
\v 24 మనుషులు ఆ హింసలు అనుభవించిన తరువాత సూర్యుడు నల్లగా మారతాడు. చంద్రుడు ప్రకాశించడు.
\v 25 నక్షత్రాలు ఆకాశం నుంచి రాలి పడతాయి. ఆకాశంలో ఉన్న శక్తులన్నీ వాటి స్థానం నుంచి కదిలిపోతాయి.
\v 26 అప్పుడు మహిమతోను, శక్తితోను వస్తున్న మనుష్య కుమారుడినైన నన్ను ఈ ప్రజలందరూ చూస్తారు."
\p
\v 27 "అప్పుడు నేను నా దూతలను భూమి మీదకు పంపిస్తాను. వాళ్ళు అన్నీ చోట్ల దేవుడు ఎంపిక చేసుకున్న వాళ్ళనందరినీ అంటే మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని కూడా కలిపి నా దగ్గరకు పోగుచేస్తారు.
\s5
\v 28 అంజూరు చెట్లు ఏవిధంగా పెరుగుతాయో మీరందరూ నేర్చుకోవాలని ఇప్పుడు నేను కోరుతున్నాను. ఎప్పుడైతే వాటి కొమ్మలు లేతగా మారతాయో, వాటికీ ఆకులు చిగురిస్తాయే అప్పుడు మనకు వేసవికాలం దగ్గర్లో ఉందని మీకు అర్థం అవుతుంది.
\v 29 అదే విధంగా నేను ఇప్పుడు ఏవైతే వివరించానో, అవి జరగడం చూడగానే నేను తిరిగి వచ్చే సమయం దగ్గర్లో ఉందని మీలో మీరు తెలుసుకుంటారు. నేను అప్పటికే తలుపు దగ్గర ఉన్నట్లుగా ఆ సమయం ఉంటుంది.
\s5
\v 30 నేను చెప్పే విషయాలు జరిగే వరకు మనుష్య జాతి అంతం కాదు. ఇది మీ మనస్సుల్లో ఉంచుకోండి."
\p
\v 31 "నేను చెప్పిన ఈ ప్రవచనాలు తప్పక జరుగుతాయని మీరు నమ్మవచ్చు. భూమి, ఆకాశాల్లో ఉన్నవి ఒకనాటికి నశించి పోతాయేమో కాని నేను మీతో చెప్పే ఈ విషయాలు కచ్చితంగా జరుగుతాయి.
\v 32 కాని నేను ఏ సమయంలో తిరిగి వస్తానో ఏవరికి కచ్చితంగా తెలియదు. పరలోకంలోని దేవదుతలకు కూడా తెలియదు. చివరికి దేవుని కుమారుడినైన నాక్కూడా తెలియదు. ఒక్క నా తండ్రికి మాత్రమే తెలుసు.
\s5
\v 33 ఏ సమయంలో, ఏప్పుడు ఈ సంఘటనలు జరుగుతాయో మీకు తెలియదు కాబట్టి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండండి, సిద్ధంగా ఉండండి."
\p
\v 34 "ఒక మనిషి తన ఇల్లు విడిచి చాలా దూరం వెళ్ళవలసి వచ్చినప్పుడు, అతడు తన పనివాళ్ళను పిలిచి ఇంటిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. తన పనివాళ్ళల్లో ఒక్కొక్కడికి ఒక్కొక్క పని అప్పజెప్పాడు. అలాగే తన ఇంటి కాపలాదారుడికి తాను వచ్చే సరికి సిద్ధంగా ఉండమని చెప్పాడు.
\s5
\v 35 తన యజమానుడు తెల్లవారుజామున వస్తాడో, కోడి కూసే వేళకు వస్తాడో, అర్ధరాత్రి వస్తాడో, సాయంత్రం పూట వస్తాడో అతడికి తెలియదు కాబట్టి ఆ మనిషి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. అలాగే నేను ఏప్పుడు తిరిగి వస్తానో మీకు తెలియదు కాబట్టి మీరు సిద్ధంగా ఉండాలి.
\v 36 నేను మీరు ఉహించని సమయంలో వచ్చేటప్పటికి, మీరు సిద్ధంగా ఉండకపోవడం జరగకూడదు.
\v 37 ఈ మాటల్ని నా శిష్యులైన మీకు మాత్రమే చెప్పడం లేదు. నేను అందరికీ అంటే నా మాటలు చదివే వాళ్ళందరికీ చెబుతున్నాను. ఎప్పుడూ సిద్ధంగా ఉండండి" అని చెప్పాడు.
\s5
\c 14
\p
\v 1 వారం రోజులపాటు జరుపుకునే పండుగను వాళ్ళు పస్కా పండుగ అని పిలుస్తారు. దానికి ఇంకా రెండు రోజులే ఉంది. అదే సమయంలో వారు పులియని రొట్టెల పండుగను కూడా జరుపుకుంటారు. ప్రధాన యాజకులు, యూదా ధర్మ శాస్త్ర బోధకులు యేసును రహస్యంగా బంధించి ఎలా చంపాలా అని ఆలోచన చేస్తున్నారు.
\v 2 కాని వాళ్ళు ఒకరితో ఒకరు ఇలా, "మనం ఈ పండగ రోజుల్లో ఏమీ చేయ వద్దు. ఎందుకంటే ఇప్పుడు చేస్తే ప్రజలు మనపై ఎదురు తిరిగి అల్లర్లు చేస్తారు" అని చెప్పుకున్నారు.
\s5
\p
\v 3 యేసు బేతనియ లోని సీమోను ఇంట్లో ఉన్నాడు. అతడు కుష్టురోగి. వాళ్ళందరూ భోజనం చేస్తున్నప్పుడు ఒక స్త్రీ వచ్చింది. ఆమె రాతి కూజాలో చాలా విలువైన సువాసననిచ్చే అత్తరు తీసుకు వచ్చింది. ఆమె ఆ సీసా మూత తీసి యేసు తలపై మొత్తం అత్తరును పోసింది.
\v 4 అక్కడే ఉన్న కొంతమంది మనుషులు ఆమె చేసింది చూసి చాలా కోపగించుకుని, తమలో తాము, "ఆమె ఈ అత్తరు మొత్తాన్ని ఇలా వృధా చేయడం ఎందుకు?
\v 5 దీన్ని అమ్మితే సంవత్సరానికి సరిపడా ఆదాయం వచ్చేది. ఆ డబ్బును పేదవాళ్ళకు ఇవ్వవచ్చు కదా" అనుకున్నారు. కాబట్టి వాళ్ళు ఆమెను విమర్శించారు.
\s5
\p
\v 6 కాని యేసు వాళ్ళతో, "ఆమెను తిట్టవద్దు. ఆమె నాకు చేసిన ఈ పని సరైనదిగానే నేను భావిస్తున్నాను. కాబట్టి మీరు ఆమెను బాధ పెట్టవద్దు.
\v 7 పేద ప్రజలు ఎప్పుడూ మీతోనే ఉంటారు. కాబట్టి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళకు సాయం చేయవచ్చు. కాని నేను మీతో ఎక్కువ కాలం ఇక్కడ ఉండను.
\v 8 ఆమె ఏమైతే చేయగలదో, అది సరిగానే చేసినందుకు అభినందించాలి. నన్ను ఆపాదమస్తకం అభిషేకించడం ద్వారా నా శరీరాన్ని సమాధి చేయడానికి సిద్ధం చేసింది. ఎందుకంటే నేను త్వరలో చనిపోతున్నానని ఆమెకు తెలిసే ఇది చేసింది.
\v 9 నేను మీకు చెప్పేదేంటంటే, లోకమంతటికీ ఈ సువార్త ప్రచారం చేసేటప్పుడు నా శిష్యులు ఆమె చేసిన దీన్ని తప్పక చెబుతారు, మనుషులు ఆమెను గుర్తు చేసుకుంటారు" అని చెప్పాడు.
\s5
\p
\v 10 అప్పుడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల దగ్గరకు వెళ్ళి , ఆయన్ని బంధించడానికి వాళ్ళకు తాను ఏ విధంగా సాయపడగలడో మాట్లాడాడు. తాను పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైనప్పటికీ ఈ పాపానికి ఒడిగట్టాడు.
\v 11 అతడు వాళ్ళకు సాయం చేయటానికి సిద్ధపడినందుకు ప్రధాన యాజకులు చాలా సంతోషించారు. వాళ్ళు అతడికి చాలా పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తామని ఒప్పుకున్నారు. దానికి యూదా అంగీకరించి, ఆయన్ని వాళ్లకు అప్పగించడానికి అనువైన సమయం కోసం ఎదురు చూడడం మొదలుపెట్టాడు.
\s5
\p
\v 12 పొంగని రొట్టెల పండగ మొదటి రోజున, పస్కా కోసం గొర్రెల్ని వధించే సమయంలో యేసు శిష్యులు ఆయనతో, "మనందరం భోజనం చెయ్యడం కోసం ఎక్కడ ఏర్పాటు చెయ్యమంటావు?" అని అడిగారు.
\v 13 ఆ ఏర్పాట్లు చేయడానికి ఆయన తన శిష్యుల్లో ఇద్దర్ని పిలిచి యేసు, "యెరూషలేముకు వెళ్ళండి. పెద్ద కుండలో నీళ్ళు నింపుకుని వెళ్తున్న ఒక మనిషి మీకు ఎదురౌతాడు. అతడి వెంట వెళ్ళండి.
\v 14 అతడు ఇంట్లోకి వెళ్ళగానే ఇది ఎవరి ఇల్లు అని అడిగి, అతడితో, "మా బోధకుడు శిష్యులతో కలసి పస్కా పండగ భోజనం చేయడానికి ఏర్పాటు చేయమని మాకు చెప్పాడు. దయచేసి మాకు ఒక గది చూపించు" అని అడగండి.
\s5
\v 15 అతడు మీకు ఆ ఇంటి పైఅంతస్తులోని పెద్దగది చూపిస్తాడు. అది మనం భోజనం చేయడానికి కావలసిన అన్ని సామాన్లతో సిద్ధపరచి ఉంది. అప్పుడు అక్కడ మన కోసం భోజనాలు సిద్ధపరచండి" అని చెప్పాడు.
\v 16 కాబట్టి ఆ ఇద్దరు శిష్యులు ఆ నగరంలోకి వెళ్ళి అక్కడ ఆయన చెప్పినట్లుగానే అన్ని జరగడం చూశారు. వాళ్ళు పస్కా పండగకు కావలసిన భోజనం అక్కడ సిద్ధం చేశారు.
\s5
\p
\v 17 సాయంకాలం అయినప్పుడు, యేసు ఆయన పన్నెండు మంది శిష్యులు అక్కడకి చేరుకున్నారు.
\v 18 వాళ్ళందరూ అక్కడ కూర్చుని తింటున్నప్పుడు, యేసు వాళ్ళతో, "జాగ్రత్తగా వినండి. శత్రువులు నన్ను బంధించడానికి మీలో ఒకడు అవకాశం ఇస్తాడు. ఇప్పుడు ఇక్కడ నాతో కలసి భోజనం చేస్తున్నారో, వాళ్ళల్లో ఒకడు ఇది చేస్తాడు" అని చెప్పాడు.
\v 19 ఆ శిష్యులు బాధపడుతూ, ఆయనతో ఒకడి తరువాత ఒకడు, "కచ్చితంగా నేను కాదుగా?" అని అడిగారు.
\s5
\v 20 అప్పుడు ఆయన వారితో, "మీ పన్నెండు మందిలో నాతో పాటు గిన్నెలోని పులుసులో రొట్టె ముంచే వాడే.
\v 21 మనుష్య కుమారుడినైన నేను చనిపోతాను. ఎందుకంటే ఆ విధంగానే నా గురించి ముందుగానే రాశారు. కాని నన్ను మోసం చేసిన ఆ మనిషికి భయంకరమైన శిక్ష ఉంది. నిజానికి, అతడు పుట్టకపోతేనే, ఆతడికి చాలా మంచిది" అన్నాడు.
\s5
\p
\v 22 వాళ్ళు తింటున్నప్పుడు ఆయన ఒక రొట్టెను తీసుకుని, దేవునికి దానికోసం కృతజ్ఞతలు చెప్పాడు. తరువాత ఆ రొట్టెను ముక్కలు చేసి వారికీ ఇస్తూ వారితో, "ఇది నా శరీరం ఇది తీసుకుని తినండి."
\v 23 ఆ తరవాత, ద్రాక్ష రసంతో నిండిన గిన్నెను తీసుకుని, దేవునికి దాని కోసం కృతజ్ఞతలు చెప్పాడు. తరువాత ఆయన వాళ్ళకి దాన్ని ఇస్తే , వాళ్ళందరూ తాగారు.
\v 24 ఆయన వారితో , "ఈ ద్రాక్ష రసం నా రక్తం, నా శత్రువులు నన్ను చంపినపుడు చిందేది. అనేకుల పాపాలను క్షమించడానికి దేవుడు చేసిన వాగ్దానాన్ని నా రక్తంతో స్థిరపరుస్తున్నాను.
\v 25 ఇది మీరు తెలుసుకోవాలని కోరుతున్నాను. దేవుడు తనను తాను రాజుగా చూపించుకున్నప్పుడే ఈ ద్రాక్ష రసాన్ని తారాగుతాను అప్పటి వరకు తాగను.
\s5
\p
\v 26 ఒక కీర్తన పాడిన తరువాత, వాళ్ళు ఒలీవ కొండకు బయలుదేరి వెళ్లారు.
\v 27 వాళ్ళు ఆ దారిలో వెళ్ళ్తున్నప్పుడు యేసు వాళ్ళతో, "దేవుడు నా గురించి చెప్పినది వాళ్ళు లేఖనాల్లో ఇలా రాశారు, "నేను గొర్రెల కాపరిని చంపుతాను, దానితో అతని గొర్రెలు చెల్లాచెదురు అవుతాయి." ఇప్పుడు ఆ మాటలు నిజం కాబోతున్నాయి. మీరు నన్ను వదలి పారిపోతారు.
\s5
\v 28 కాని దేవుడు మళ్ళీ నన్ను బ్రతికించిన తరువాత, నేను మీ కంటే ముందుగా గలిలయ రాష్ట్రానికి వెళ్తాను. అక్కడ మళ్ళీ మిమ్ముల్ని కలుస్తాను." అని చెప్పాడు.
\p
\v 29 పేతురు ఆయనతో, "బహుశా మిగతా శిష్యులందరూ నిన్ను వదలినా నేను మాత్రం నిన్ను వదలి పెట్టనే పెట్టను." అన్నాడు.
\s5
\v 30 యేసు అతడితో, "ఈ అర్ధరాత్రి కోడి రెండుసార్లు కూయకముందే, నేనెవరో తెలియదని నువ్వు మూడుసార్లు నా గురించి చెబుతావు.
\v 31 కాని పేతురు ఆయనతో, "వాళ్ళు నన్ను చంపినా కూడా నువ్వు నాకు తెలియదని చెప్పనే చెప్పను"అని గట్టిగా వాదించాడు. అలాగే మిగతా శిష్యులు కూడా అదే విధంగా చెప్పారు.
\s5
\p
\v 32 అదే మార్గంలో గేత్సేమనే అనే చోటికి యేసు, ఆయన శిష్యులు వచ్చారు. అప్పుడు ఆయన తన శిష్యులు కొందరితో, "నేను ప్రార్థన చేసుకుని వచ్చేవరకు ఇక్కడ ఉండండి" అని చెప్పాడు.
\v 33 ఆయన పేతురును, యాకోబును, యోహానును తీసుకుని వెళ్ళాడు. ఆయన చాలా కలత చెందాడు.
\v 34 ఆయన వారితో , "నేను చాల బాధాకరమైన స్థితిలో ఉన్నాను. అది నా చావును గురించిన బాధ. మీరు ఇక్కడ ఉండి గమనించండి" అన్నాడు.
\s5
\v 35 ఆయన కొంచెం ముందుకు వెళ్ళి, నేలమట్టుకు వంగాడు. ఈ బాధలు పడకుండా సాధ్యమైతే తప్పించ మని ప్రార్థన చేసాడు.
\v 36 ఆయన , "నా తండ్రి , నువ్వే సమస్తాన్ని చేసేవాడివి కాబట్టి ఇప్పుడు నాకు ఈ హింసలు తప్పించు. అయితే నేను కోరింది తప్పక చెయ్యాలని కాదు. నువ్వు ఏం చెయ్యాలనుకున్నావో అదే చెయ్యి.
\s5
\v 37 అప్పుడు ఆయన తిరిగి తన శిష్యుల దగ్గరికి వస్తే వారు నిద్రపోతున్నారు. ఆయన వారిని నిద్రలేపి వారితో, "సీమోనూ, నువ్వు కూడా నిద్ర పోతున్నావా? కొంచం సేపు కూడా మెలకువగా ఉండలేరా?" అన్నాడు.
\v 38 ఆయన వారితో, "నేను చెప్పింది చెయ్యాలని మీకు ఉంది. కాని మీరు బలహీనులు. కాబట్టి మెలకువగా ఉండి ప్రార్ధించండి. దాని వల్ల మీకు శోధనలు వచ్చినపుడు తట్టుకుని నిలబడగలరు.
\p
\v 39 తరవాత మళ్ళీ ప్రార్థన చేయడానికి అక్కడి నుండి వెళ్ళి, అంతకుముందు ప్రార్థన చేసినట్టే మళ్ళీ చేసాడు.
\s5
\v 40 శిష్యులు ఆ సమయంలో నిద్రమత్తులో జోగుతున్నందున, కనీసం కళ్ళు తెరవలేకపోయారు. ఆయన వాళ్ళని నిద్రలేపినప్పుడు ఏం చెప్పాలో వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళు నోరు తెరవడానికి సిగ్గుపడ్డారు.
\p
\v 41 ఆయన మళ్ళా వెళ్ళి ప్రార్థించాడు. ఆయన మూడోసారి వచ్చి చూసినప్పుడు, వాళ్ళు మళ్ళా నిద్రించడం ఆయన గమనించి, వాళ్ళతో, "మీరింకా నిద్రపోతూనే ఉన్నారా? సరేలే, ఇంక అవసరం లేదు. నేను హింసలు పడే సమయం మొదలైంది. మనుష్యకుమారుడినైన నన్ను పట్టుకోవడానికి పాపాత్ములు తన ప్రయత్నం మొదలుపెట్టారు. చూడండి.
\v 42 కాబట్టి లేవండి. ఇక్కడి నుంచి వెళ్దాం పదండి. నన్ను పట్టుకోవాలనుకున్న వాళ్ళకి దారి చూపిస్తున్న వాడు వస్తున్నాడు" అన్నాడు.
\s5
\v 43 ఆయన వాళ్ళతో మాట్లాడుతుండగానే యూదా వచ్చాడు. అతడు యేసు పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైనప్పటికీ యేసు శత్రువులు ఆయన్ని పట్టుకునే వీలు కల్పించడానికి అతడు వచ్చాడు. కత్తులతో, దుడ్డు కర్రలతో ఒక గుంపు అతనితో వచ్చింది. యూదా సంఘ పెద్దలు వాళ్ళని పంపారు.
\v 44 ద్రోహానికి పాల్పడిన యూదా అంతకుముందు ఆ గుంపుతో "నేనెవర్నైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే మీకు కావలసినవాడు. నేను ఆయన్ని ముద్దు పెట్టుకోగానే, ఆయన్ని బంధించి అక్కడ నుంచి తీసుకుపోండి" అని చెప్పాడు.
\v 45 కాబట్టి యూదా అక్కడకు చేరుకున్న వెంటనే యేసు దగ్గరకు వెళ్ళి యేసుతో, "నా బోధకుడా" అని పిలిచి, ఆయన్ని ముద్దు పెట్టుకున్నాడు.
\v 46 అప్పుడు వాళ్ళు యేసును పట్టుకున్నారు.
\s5
\v 47 అయితే ఆయన పక్కనే ఉన్న శిష్యుల్లో ఒకడు కత్తిదూసి ప్రధాన యాజకుని పనివాడిపై దాడి చేసి వాడి చెవి నరికాడు.
\p
\v 48 యేసు వాళ్ళతో, "నేనేమైనా బందిపోటు దొంగనా, నన్ను బంధించడానికి కత్తులతోను, దుడ్డు కర్రలతోను వచ్చారు?
\v 49 వింతగా ఉంది. నేను ప్రతి రోజూ కోవెల ఆవరణలో ప్రజలకు బోధించ లేదా? మరి అక్కడ ఎందుకని నన్ను బంధించలేదు? ఐతే ప్రవక్తలు నా గురించి గ్రంథాల్లో రాసినవి నిజం కావడానికి ఇలా జరుగుతుంది" అని చెప్పాడు.
\p
\v 50 ఆయన శిష్యులంతా ఒక్కసారిగా ఆయన్ని వదలి పారిపోయారు.
\s5
\v 51 ఆ సమయంలో ఒక యువకుడు యేసు వెంట వెళ్ళ్తున్నాడు. అతడు తన శరీరానికి నార బట్టను మాత్రమే చుట్టుకున్నాడు. ఆ గుంపు అతణ్ణి కూడా పట్టుకోబోయారు.
\v 52 అతడు వాళ్ళని విదిలించుకొని తన నార బట్టను వాళ్ళ చేతుల్లోనే వదలి, బట్టల్లేకుండా పారిపోయాడు.
\s5
\p
\v 53 యేసును బంధించిన మనుషులు ఆయన్ని ప్రధాన యజకుని ఇంటికి తీసుకుని వెళ్ళారు. యూదా పెద్దల సమాజం మొత్తం అక్కడికి చేరుకుంటున్నారు.
\v 54 పేతురు యేసును కొంత దూరంగా వెంబడిస్తూ వెళ్ళాడు. ప్రధాన యాజకుని ఇంటి ఆవరణలోకి వెళ్ళి అక్కడ కాపలా మనుషులతో పాటు కూర్చుని చలికాచుకుంటున్నాడు.
\s5
\p
\v 55 ప్రధాన యాజకులు, యూదా సమాజ పెద్దలందరూ యేసుకు మరణ శిక్ష పడడానికి కావలసిన గట్టి సాక్ష్యం కోసం చూశారు. కాని అధికారులు ఆయన్ని చంపడానికి సరిపడే సాక్ష్యాలు వాళ్ళు తీసుకు రాలేకపోయారు.
\v 56 కొందరు యేసును గురించి అబద్ధాలు చెప్పారు, కాని వాళ్ళు చెప్పిన సాక్ష్యాల్లో ఒక్కటి కూడా ఒకదానితో ఒకటి సరిపడలేదు. కాబట్టి యేసుపై చర్యలు తీసుకోవడానికి వాళ్ళు చెప్పిన సాక్ష్యాల్లో తగినంత బలం లేదు.
\s5
\p
\v 57 చివరికి కొందరు తప్పుడు ఆరోపణలు మోపుతూ,
\v 58 "మనుషులు కట్టిన ఈ దేవాలయాన్ని నేను కూల్చివేసి, ఏ ఒక్కరి సాయం లేకుండానే దాన్ని తిరిగి మూడురోజుల్లోనే కడతాను అని అతడు చెప్పినప్పుడు మేము విన్నాము" అని ఆరోపించారు.
\v 59 కాని మిగతా వాళ్ళు చెప్పిన దానికి వీళ్ళల్లో కొందరి సాక్ష్యం సరిపోలేదు.
\s5
\p
\v 60 అప్పుడు ప్రధాన యాజకుడు వాళ్ళ ఎదుట నిలబడి యేసుతో, "నువ్వు ఏమీ జవాబు చెప్పవా? నీపై వీళ్ళు చేస్తున్నా ఆరోపణలు గురించి నువ్వేం చెబుతావు?" అని అడిగాడు.
\v 61 కాని యేసు ఏ జవాబూ చెప్పకుండా మౌనంగా ఉన్నాడు. అప్పుడు ప్రధాన యాజకుడు మళ్ళీ ప్రయత్నిస్తూ, ఆయనతో, "నువ్వు క్రీస్తువా? నువ్వు దేవుని కుమారుణ్ణి అని చెబుతున్నావా?" అని అడిగాడు.
\v 62 యేసు, "నేనే. ఇంకా సర్వశక్తిమంతుడైన ఆ దేవుని కుడిచేతి ప్రక్కన కూర్చుని పాలించే మనుష్య కుమారుడిలా నన్ను నువ్వు చూస్తావు. ఆకాశం నుంచి మేఘవాహనుడై క్రిందికి దిగి వచ్చే నన్ను నువ్వు కూడా చూస్తావు" అన్నాడు.
\s5
\p
\v 63 యేసు ఆవిధంగా చెప్పినప్పుడు, ఆయన మాటలకు నిరసనగా ప్రధాన యాజకుడు తన పై వస్త్రాలు చింపుకుని, "ఈ మనిషికి వ్యతిరేకంగా ఇంతకంటే సాక్ష్యాలు ఇంకేం కావాలి?
\v 64 ఇతడు చేసిన దైవదూషణ మీరు విన్నారు కదా. వీడు తనని తాను దేవుడిగా చెప్పుకుంటున్నాడు" అన్నాడు. వారంతా అంగీకరించి యేసుపై నేరం ఖాయం చేసి ఆయన్ని మరణ శిక్షకు అర్హుడిగా ఎంచారు.
\v 65 అప్పుడు కొందరు ఆయనపై ఉమ్మి వేయడం మొదలుపెట్టారు. వాళ్ళు ఆయన కళ్ళకు గంతలు కట్టి, కొట్టడం మొదలుపెట్టారు. ఆయనతో, "నువ్వు ప్రవక్తవైతే, నిన్ను కొట్టిందెవరో చెప్పు" అంటూ అపహసించారు. యేసుకు కాపలాఉన్నవాళ్లు కూడా ఆయన్ని తమ అరచేతుల్తో కొట్టారు.
\s5
\p
\v 66 పేతురు ప్రధాన యాజకుని ఇంటి ఆవరణలో ఉన్నపుడు , ప్రధాన యజకుని ఇంట్లో పనిచేసే ఒక పాప అతడి దగ్గరకు వచ్చింది.
\v 67 చలిమంట దగ్గర చలి కాచుకుంటున్న పేతుర్ని ఆ పాప చూసినప్పుడు, అతని దగ్గరగా వచ్చి పరీక్షగా చూసింది. అప్పుడు ఆమె, "నజరేతునుంచి వచ్చిన యేసు అనే మనిషితో పాటు నువ్వు కూడా ఉన్నావు కదా" అని అడిగింది.
\v 68 కాని అతడు నిరాకరిస్తూ, "నువ్వు చెబుతున్న దాని గురించి నాకు తెలియదు" నువ్వు చెప్పెదానిగూర్చి నాకేమి అర్థం కావడం లేదు" అని చెప్పాడు. అప్పుడు అతడు అక్కడ నుంచి ఆవరణలోని గుమ్మం దగ్గరకు వెళ్ళిపోయాడు.
\s5
\v 69 అతణ్ణి ఆ పని మనిషి అక్కడ చూసి మళ్ళీ ఆ ఆవరణలో నిలుచున్న వాళ్ళతో "ఇతడు కూడా ఇవాళ బంధించిన ఆ వ్యక్తి మనుషుల్లో ఒకడు" అని చెప్పింది.
\v 70 కాని అతను మళ్ళీ ఆ మాటని నిరాకరించాడు. కొంతసేపటికి అక్కడ నిలుచున్న వాళ్ళు పేతురుతో, "నువ్వు కూడా గలిలయ రాష్ట్రానికి చెందిన వాడవని చెప్పొచ్చు. కాబట్టి యేసుతో పాటు ఉన్నవారిలో నువ్వు కూడా ఒకడివే" అన్నారు.
\s5
\v 71 కానీ అతడు తాను చెప్పేది నిజం కాకపోతే దేవుడు తన్ను శిక్షిస్తాడని చెప్పడం మొదలు పెట్టాడు. అతడు, "మీరు చెప్పే వ్యక్తి గురించి నాకు అసలు తెలియదు" అని చెప్పాడు.
\v 72 వెంటనే రెండవ సారి కోడి కూసింది. అప్పుడు పేతురు యేసు తనతో ముందే చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. యేసు, "ఈ రోజు కోడి రెండు సార్లు కూయక ముందే నేను తెలియదని మూడు సార్లు అంటావు" అని చెప్పాడని గుర్తుకు వచ్చింది. అప్పుడు పేతురు యేసు తనకి తెలియదని మూడుసార్లు నిరాకరించానని అర్థమైనప్పుడు అతడు ఏడ్వటం మొదలు పెట్టాడు.
\s5
\c 15
\p
\v 1 తెల్లవారుజామున ప్రధాన యాజకులు, మిగతా యూదా సమాజ పెద్దలతో కలసి రోమా అధిపతి ముందు యేసుపై నేరారోపణ చెయ్యడం ఎలానో నిర్ణయిచడానికి సమావేశం అయ్యారు. వాళ్ళ కాపలదారులు మళ్ళీ యేసును చేతులు కట్టేసారు. వాళ్ళు ఆయన్ని గవర్నర్ పిలాతు ఇంటికి తీసుకువెళ్ళారు.
\p
\v 2 పిలాతు యేసుతో, "నువ్వు యూదుల రాజువని నువ్వు చెపుతున్నావా?" అని అడిగాడు. యేసు అతడితో, "నీకు నువ్వుగానే అడుగుతున్నావా?" అని అడిగాడు.
\v 3 అప్పుడు ప్రధాన యాజకులు యేసు చాలా తప్పుడు పనులు చేశాడని వాదించారు.
\s5
\v 4 కాబట్టి పిలాతు మళ్ళీ యేసుతో, "నీ దగ్గర ఏం సమాధానం లేదా? నువ్వు ఎన్నో నేరాలు చేసినట్టుగా వాళ్ళు నీపై ఆరోపిస్తున్నారో చూడు" అన్నాడు.
\v 5 కాని యేసు అంతకుమించి ఏం మాట్లాడలేదు. పిలాతు చాలా ఆశ్చర్యపోయాడు.
\s5
\p
\v 6 ప్రతి పస్కా పండుగ సమయంలో జైల్లో ఉన్న ఒక ఖైదీని విడుదల చేయడం అధిపతికి ఆచారంగా వస్తుంది.
\v 7 ఆ సమయంలో బరబ్బా అనే కరడుగట్టిన నేరస్థుడు జైల్లో ఉన్నాడు. అతడు రోమన్ ప్రభుత్వానికి ఎదురు తిరిగి, అనేక హత్యలు చేసాడు.
\v 8 కొంత మంది గుంపుగా పిలాతు దగ్గరకు వెళ్ళి గతంలో జరిగినట్లే తమకు ఎవరినైనా విడుదల చేయమని అడిగారు.
\s5
\v 9 పిలాతు సమాధానంగా వాళ్ళని, "ఎవరినైతే మీ రాజుగా చెబుతున్నారో ఆ వ్యక్తిని విడుదల చేయడం మీకు ఇష్టమేనా?" అని అడిగాడు.
\v 10 అతడు ఇలా ఎందుకు అడిగాడంటే, ప్రధాన యాజకులు ఏం చేయాలనుకుంటున్నారో అతడికి అర్ధమైంది. వాళ్ళు యేసుపై నిందారోపణలు ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు ఆయన పై అసూయతో ఉన్నారు. కారణం అనేక మంది మనుషులు ఆయన శిష్యులుగా అవుతున్నారు.
\p
\v 11 కానీ ప్రధాన యాజకులు యేసుకు బదులుగా బరబ్బాను విడుదల చేయమని గుంపుని వేడుకునేలా ప్రేరేపించారు.
\s5
\v 12 పిలాతు వాళ్ళతో, "నేను బరబ్బాను విడుదల చేస్తే, మీ రాజును నేనేం చెయ్యాలని మీరు కోరుతున్నారు?" అని అడిగాడు.
\v 13 అప్పుడు వాళ్ళు తిరిగి బిగ్గరగా, "ఆయన్ని సిలువ వేయమని నీ సైనికులకు ఆజ్ఞాపించు" అని అరిచారు.
\s5
\p
\v 14 అప్పుడు పిలాతు వాళ్ళతో, "ఎందుకు? ఇతడు చేసిన నేరం ఏమిటి?" అని అడిగాడు. కాని వాళ్ళు మరింత గట్టిగా, "అతణ్ణి సిలువ వెయ్యి" అని అరిచారు.
\v 15 కాబట్టి అతడు ప్రజలను సంతోషపెట్టాలని బరబ్బను విడుదల చేశాడు. అప్పుడు సైనికులు యేసును కొట్టారు. తరువాత ఆయన్ని తీసుకువెళ్ళి సిలువ వేయమని పిలాతు అజ్ఞాపించాడు.
\s5
\p
\v 16 సైనికులు యేసును తమ సైనిక శిబిరాలకు తీసుకుపోయారు. వాళ్ళందరూ ఒక చోటికి చేరారు.
\v 17 వాళ్ళు యేసుకు పొడుగాటి ఊదారంగు అంగీ తొడిగి ముళ్ళ కంపతో చేసిన కిరీటం ఆయన తలపై పెట్టారు.
\v 18 అప్పుడు ఒక రాజును సంబోధించినట్టు పిలుస్తూ ఎగతాళి చేశారు. వాళ్ళు, "యూదుల రాజా నీకు జోహార్లు" అన్నారు.
\s5
\v 19 వాళ్ళు పదేపదే ఆయన తలపై కర్రతో కొడుతూ, ఆయనపై ఉమ్మివేశారు. ఆయన ముందు మోకాళ్ళపై కూర్చుని ఆయన్ని గౌరవిస్తున్నట్లు నటించారు.
\p
\v 20 వాళ్ళు ఆయన్ని ఎగతాళి చేయడం పూర్తి అయిన తరువాత ఆ ఊదారంగు అంగీ తీసి, ఆయన బట్టలు ఆయనకు తొడిగి, ఆయన్ని సిలువకు మేకులతో కొట్టడానికి నగరానికి బయటకు తీసుకు వెళ్లారు.
\p
\v 21 సీమోను అనే వ్యక్తి కురేనే నుంచి అప్పుడే వచ్చాడు. అతడు అలెగ్జాండరు, రూఫస్ ల తండ్రి. ఎక్కడినించో అతడు నగరంలోకి తన దారిని తాను యేసును దాటి పోతున్నాడు. అప్పుడు సైనికులు సీమోనును పట్టుకుని యేసు సిలువను మోయడానికి బలవంతపెట్టారు.
\s5
\v 22 సైనికులు గొల్గొతా అనే స్థలానికి వాళ్ళిద్దర్నీ తీసుకువచ్చారు. గొల్గొతా అంటే "పుర్రె" అని అర్థం.
\v 23 అప్పుడు వాళ్ళు ద్రాక్షరసంలో బోళాన్ని కలిపి ఆయనకు తాగడానికి ఇవ్వడానికి ప్రయత్నించారు. కాని ఆయన తాగలేదు.
\p
\v 24 కొందరు సైనికులు ఆయన బట్టలు తీశారు. అప్పుడు వాళ్ళు ఆయన్ని సిలువకు మేకులతో కొట్టారు. ఆ తరువాత చీట్లు ద్వారా ఆయన బట్టలు తమలో తాము పంచుకున్నారు.
\s5
\v 25 ఆయన్ని సిలువ వేసేటప్పటికి ఉదయం తొమ్మిది గంటలు అయింది.
\v 26 ఆయన్ని ఏ కారణంతో సిలువ వేస్తున్నారో, ఆ కారణాన్ని ఒక పలకపై రాసి, దాన్ని ఆయన తలపైన సిలువకు తగిలించారు. దానిమీద, "యూదులకు రాజు" అని రాశారు.
\p
\v 27 ఇద్దరు దొంగల్ని కూడా వాళ్ళు సిలువ వేశారు. యేసుకు కుడివైపున ఒకణ్ణి, ఎడమవైపున ఒకణ్ణి సిలువ వేశారు.
\v 28 ఆయనను అక్రమకారుల్లో ఒకడిగా ఎంచారు’ అని లేఖనాల్లో రాసిన వాక్కు దీని వలన నెరవేరింది.
\s5
\v 29 ఏవరైతే అటు వైపుగా వెళ్ళు తున్నవాళ్ళు, తమ తలలు అడ్డంగా ఉపుతూ ఆయన్ని అవమానించారు. వాళ్ళు, "ఆహా నువ్వు దేవాలయాన్ని పడగొట్టి మళ్ళీ మూడురోజుల్లోనే తిరిగి కడతానని చెప్పావు కదా.
\v 30 ఇప్పుడు సిలువ మీది నుంచి దిగి నిన్ను నువ్వు రక్షించుకుంటే, నువ్వు అది చేయగలవు అనుకుంటాము" అన్నారు.
\s5
\v 31 యూదుల ధర్మశాస్రాన్ని బోధకులతో కలసి ప్రధాన యాజకులు కూడా యేసును హేళన చేస్తూళు ఒకరితో ఒకరు, "ఇతడు అనేక మందిని ఇబ్బందుల్లోనించి రక్షించాడు కాని తనను మాత్రం రక్షించుకోలేడు" అన్నారు.
\v 32 వీడు "నేనే క్రీస్తును. ఈ ఇశ్రాయేలు ప్రజలను పాలించే రాజును, అన్నాడు. అతడి మాటలు నిజమైతే, అతడు తప్పకుండా ఇప్పుడు సిలువ దిగి వస్తాడు. అప్పుడు మేము నమ్ముతాము" అన్నారు. అలాగే ఆయనతో పాటు సిలువ వేసిన ఆ ఇద్దరు కూడా ఆయన్ని అవమానించారు.
\s5
\p
\v 33 మధ్యాహ్న సమయంలో ఆ ప్రదేశం మొత్తం చీకటిగా మారింది. మధ్యాహ్నం మూడు గంటలవరకు అలాగే చీకటిగానే ఉంది.
\v 34 మధ్యాహ్నం మూడు గంటలకు యేసు బిగ్గరగా కేకవేస్తూ, "ఏలోయి , ఏలోయి , లామా సబక్తానీ" అన్నాడు. అంటే నా దేవా, నా దేవా, నన్నెందుకు విడిచి పెట్టావు అని అర్థం.
\v 35 అక్కడ నిలుచున్న వాళ్ళలో కొందరు "ఏలోయి" అనే పదాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. వాళ్ళు "అతడు ఏలీయా ప్రవక్తను పిలుస్తున్నాడు చూడండి" అన్నారు.
\s5
\p
\v 36 అందులో ఒకడు పరుగెత్తికెళ్లి పులిసిన ద్రాక్షరసంలో స్పాంజి ముంచి తీసుకొచ్చాడు. అతడు దాన్ని వెదురుకర్ర చివరన తగిలించి, యేసు నోటితో ఆ చిరకను పీల్చుకునేలా ఎత్తి నోటి దగ్గర పెట్టాడు. అతడు, "ఆగండి. ఇప్పుడు సిలువ నుండి ఇతన్ని దింపడానికి ఏలీయా వస్తాడేమో చూద్దాం" అన్నాడు.
\p
\v 37 అప్పుడు యేసు గట్టిగా కేక పెట్టాడు. అప్పుడు ఊపిరి ఆగిపోయింది. ఆయన చనిపోయాడు.
\v 38 అదే సమయంలో దేవాలయం పవిత్ర స్థలానికి అడ్డుగా ఉన్న తెర పైనుంచి క్రిందికి రెండుగా చీలింది.
\s5
\v 39 యేసును సిలువకు మేకులతో కొట్టిన ఆ సైనికులపై అధికారి యేసుకు ఎదురుగా నిల్చుని ఉన్నాడు. యేసు చనిపోయిన విధానం అతడు చూసి "నిజంగానే ఈ మనిషి దేవుని కుమారుడు" అన్నాడు.
\p
\v 40 అక్కడ కొంతమంది స్త్రీలు కూడా ఉన్నారు. వాళ్ళు కొంత దూరం నుంచి జరుగుతున్న సంఘటనలను చూస్తున్నారు. ఆయన గలిలయలో ఉన్నపుడు యేసుతో కలసి ఉన్నవాళ్ళు. ఆయనకు ఏంకావాలో వాటిని అందించేవారు. వారు యేసుతో కలసి యేరూషలేముకు వచ్చారు. వాళ్ళల్లో మగ్ధలేనే అనే ఊరినుంచి వచ్చిన మరియ ఉంది. వాళ్ళలో మరొక మరియ ఉంది. ఆమె యుసే, చిన్న యకోబులకు తల్లి సలోమి కూడా ఉంది.
\p
\v 41 ఆ సాయం సంధ్యా సమయంలో అరిమతయి నుండి వచ్చిన యోసేపు అక్కడకు వచ్చాడు.
\s5
\v 42 అతడు యూదుల మహాసభలో పేరు పొందిన ఒక సభ్యుడు. అతడు దేవుడే రాజుగా గల దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నవాళ్ళలో ఒకడు.
\v 43 సబ్బాతుకు ముందు రోజును యూదులు సిద్ధపడే రోజుగా పిలిస్తారు. ఆ రోజు సాయంత్రం సమిపిస్తూ ఉండగా అతడు ధైర్యం తెచ్చుకొని పిలాతు దగ్గరకు వెళ్ళి యేసు శరీరాన్ని సిలువ పై నుండి దించి వెంటనే సమాధి చేయడానికి తనకు ఇవ్వమని అడిగాడు.
\v 44 ఆ మాట విని పిలాతు, "యేసు ఇంత త్వరగా చనిపోయాడా?" అని ఆశ్చర్యపోయాడు. అప్పుడు తన అధికారులలో యేసును సిలువ వేసిన ఒకడిని పిలిచి ఈ విషయాన్ని నిర్ధారించుకున్నాడు.
\s5
\v 45 ఆ అధికారి యేసు నిజంగా చనిపోయాడని నిర్ధారించాడు. అప్పుడు ఆ శరీరాన్ని యోసేపు తీసుకు వెళ్ళడానికి అంగీకరించాడు.
\p
\v 46 మరణించిన వారి శరీరాలకు చుట్టే నారతో చేసిన వస్త్రాలను యేసేపు తన వెంట తీసుకెళ్ళాడు. యేసేపు, అతనితో ఉన్న మరి కొద్ది మంది కలిసి యేసు శరీరాన్ని సిలువ పైనుండి దించి తాము తెచ్చిన వస్త్రాలతో చుట్టి, అంతకు మునుపే ఒక కొండ రాతిలో తొలిచిన సమాధిలో ఉంచారు. తరువాత వాళ్ళు ఒక పలకవంటి రాతి బండను దాని ద్వారానికి అడ్డుగా వేశారు.
\v 47 మగ్డలేనే నుండి వచ్చిన మరియ, యోసేపు తల్లి మరియా ఇద్దరు యేసు శరీరాన్ని ఎక్కడ ఉంచారో గమనించారు.
\s5
\c 16
\p
\v 1 యూదుల సబ్బాతు రోజు అనగా శనివారం పూర్తి అయిన వెంటనే, మగ్దలేనే నుండి వచ్చిన మరియ, చిన్న యాకోబు తల్లి మరియ, సలోమి అను ముగ్గురు స్త్రీలు, చనిపోయి సమాధిలో ఉంచిన యేసు శరీరానికి పూయాలని, అత్తరు సీసాలు, సువాసన వెదజల్లే లేపనాల వంటివి కొనుగోలు చేశారు. యూదులలో చనిపోయిన వారికి చేసే దిన కర్మల ఆచారంలో భాగంగా ఇవి కొన్నారు.
\p
\v 2 యూదుల కేలండర్ ప్రకారం వారంలోని మొదటి రోజైన ఆదివారం తెల్లవారుజామున ఆ స్త్రీలు తెల్లవారే లేచి తాము కొన్న సుగంధ ద్రవ్యాలు తీసుకుని యేసును ఉంచిన సమాధి వైపుగా వెళ్ళారు.
\s5
\p
\v 3 వాళ్ళు నడుస్తూ ఇలా మాట్లాడుకున్నారు. "ఆ సమాధి ముందు అడ్డంగా ఉంచిన బండ రాయిని దొర్లించడానికి మనకెవరు సాయం చేస్తారు?"
\v 4 వాళ్లక్కడకు చేరుకోగానే అడ్డంగా ఉంటుంది అనుకున్న ఆ పెద్ద బండ రాయి ఎవరో సునాయాసంగా దొర్లించినట్టు ప్రక్కకు పడి ఉంది.
\s5
\v 5 అప్పుడు ఆ స్త్రీలు గుహవంటి ఆ సమాధి లోపలికి వెళ్ళగానే వాళ్ళని ఆశ్చర్యచకితుల్ని చేసిన దృశ్యం ఒకటి కనబడింది. అక్కడ యువ ప్రాయంలో తెల్లటి దుస్తులతో వెలిగిపోతున్న దేవదూతను చూశారు.
\p
\v 6 అప్పుడు యువకుడిలా ఉన్న ఆ దేవదూత, "కంగారు పడకండి, మీరు సిలువకు మేకులతో కొట్టి క్రూరంగా హింసించి చంపిన నజరేతు వాడైన యేసు కోసం చూస్తున్నారని నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఆయన లేచాడు. ఇక్కడ లేడు. మరణించిన తరువాత ఆయన శరీరాన్ని వాళ్ళు ఉంచిన స్థలం ఇదే.
\v 7 మీరు వెళ్ళి ఆయన శిష్యులకు ఈ విషయం చెప్పండి. ఇంతకుముందు ఆయన మీ అందరితో చెప్పినట్లు మీ అందరికంటే ముందే గలలీకి వెళ్ళిపోతున్నాడు. అక్కడకి వెళ్ళండి, మీరూ ఆయనని చూస్తారు" అని ఆ దేవదూత అన్నాడు.
\s5
\p
\v 8 అప్పుడు ఆ స్త్రీలు సమాధిలోనుండి బయటకు పరుగెత్తారు. భయమూ, కంగారూ కలగలిసిపోయి వణికిపోయారు. అందువల్ల ఎవరితోనూ ఒక్క మాట కూడా చెప్పడానికి తెగించలేదు.
\s5
\v 9 మరణంనుండి తిరిగి లేచిన యేసు ఆదివారం ఇంకా తెల్లవారక ముందే మొట్టమొదటిగా మగ్దలేనే నుండి వచ్చిన మరియకు కనపడ్డాడు. ఈమె గతంలో ఏడు అపవిత్రాత్మలు పట్టి పీడిస్తున్న సమయంలో యేసు వచ్చి, వాటిని పారద్రోలగా స్వస్థత పొందిన స్త్రీ.
\v 10 ఆవిడ, యేసు మరణించాడని సంతాపంతో ఏడుస్తూ ఉన్న యేసు శిష్యుల దగ్గరకు ఉరుకులు పరుగులతో వెళ్ళి, యేసు తిరిగి లేచాడనీ, తాను కళ్ళారా చూశాననీ చెప్పింది.
\v 11 ఆవిడ ఎంత చెప్పినా వారు నమ్మలేక పోయారు.
\s5
\p
\v 12 అదేరోజు మరికొంత సేపటికి యేసు, తన శిష్యులలో ఇద్దరు యెరూషలేము నుండి వేరొక ప్రాంతానికి వెళుతుంటే, తోటి బాటసారిలాగ వచ్చి వారికి తనని తాను కనపరుచుకున్నాడు.
\v 13 ఆయనను గుర్తుపట్టిన వెంటనే ఆ ఇద్దరు శిష్యులు వెనక్కితిరిగి యెరూషలేము వెళ్ళిపోయి మిగిలిన శిష్యులందరికీ జరిగింది చెప్పారు. అయినా వాళ్ళు నమ్మలేదు.
\s5
\p
\v 14 ఆ తరువాత యేసు శిష్యులు పదకొండు మంది ఒక చోట చేరి భోజనం చేస్తూ ఉండగా, ఆయన వారి మధ్యకు వచ్చి కనపడ్డాడు. తాను మరణం నుండి తిరిగి లేచిన సంగతి ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా నమ్మనందుకు చివాట్లు పెట్టాడు.
\p
\v 15 ఆయన వారితో "మీరు ప్రపంచం మొత్తం తిరగండి. తిరుగుతూ నేను మరణించి, సమాధి లో ఉండి తిరిగి లేచి మరణాన్ని జయించాను అన్న సువార్తను ప్రతి ఒక్కరికీ చాటండి.
\v 16 మీరు ప్రకటించిన సువార్తను నమ్మి, అందుకు రుజువుగా బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరినీ దేవుడు రక్షిస్తాడు.
\s5
\v 17 ఈ సువార్తను నమ్మి రక్షణ పొందిన వారంతా నేను వారితో ఉన్నాను అనడానికి నిదర్శనంగా ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేయగలుగుతారు. మనుషులలోనుండి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టగలుగుతారు. ఎప్పుడూ నేర్చుకోని పరాయి భాషలు మాట్లాడగలుగుతారు.
\v 18 ఒకవేళ పాములను పట్టుకోవాల్సి వచ్చినా, విషం తాగాల్సి వచ్చినా అవి వారికి హాని చేయవు. అనారోగ్యంతో బాధపడుతున్న వారి మీద తమ చేతులు ఉంచినపుడు, దేవుడు వారిని స్వస్థ పరుస్తాడు."
\s5
\p
\v 19 యేసు ప్రభువు తన శిష్యులకు ఈ విషయాలన్నీ చెప్పిన తరువాత, దేవుడు ఆయనను పైకి, పరలోకంలోనికి తీసుకుని వెళ్ళిపోయాడు. అక్కడ ఆయన తన సింహాసనంపై, దేవుని కుడి పక్కన కూర్చున్నాడు. అలా దేవునితో కలిసి పరిపాలించడానికి అత్యున్నతమైన, ఘనమైన స్థానంలో ఉన్నాడు.
\p
2020-10-16 17:09:26 +00:00
\v 20 శిష్యులైతే యెరూషలేము నుండి బయలుదేరి అన్ని ప్రదేశాలు తిరుగుతూ దేవుని సువార్త ప్రకటించారు. ప్రభువు వాళ్లకి ఎంత సామర్ధ్యం ఇచ్చాడంటే, వాళ్ళు ఎక్కడికి పొతే అక్కడ ప్రజలు ఆశ్చర్య పడేలా శారీరక, మానసిక రోగాలను నయం చేశారు, అద్భుతాలు చేసారు. ఆయన ఇలా చేయడంతో శిష్యులు ప్రకటిస్తున్న సువార్త సత్యమని చూపించాడు.