# 1 కొరింథీయులు 04 సాధారణ గమనికలు ## ఈ అధ్యాయంలోని ప్రత్యేక అంశాలు ### అతిశయం అపొస్తలులు వినయంగా ఉండడాన్ని కొరింథీయులు గర్వించడానికి మధ్య పౌలు వ్యత్యాసం చూపుతున్నాడు. కొరింథీ విశ్వాసులు గర్వపడటానికి ఎటువంటి కారణం లేదు. వారు కలిగి ఉన్నవన్నీ, మరియు వారికున్నవన్నీ దేవుని వరం. (చూడండి: [[rc://*/tw/dict/bible/kt/apostle]]) ## ఈ అధ్యాయంలోని ముఖ్యమైన భాషా రూపాలు ### రూపకాలు పౌలు ఈ అధ్యాయంలో అనేక రూపకాలను ఉపయోగించాడు. అతను అపొస్తలులను సేవకులుగా అభివర్ణిoచాడు. అపొస్తలులు చంపబడబోవు ఖైదీలుగా ఉన్న విజయ కవాతు గురించి పౌలు మాట్లాడుతున్నాడు. అతను శిక్ష కోసం నిలబడటానికి అతను ఒక బెత్తంను ఉపయోగించాడు. అతను వారి ""ఆత్మీయ తండ్రి"" అయినందున అతను తనను తాను వారి తండ్రి అని పిలుచుకున్నాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]] మరియు [[rc://*/tw/dict/bible/kt/spirit]]) ### వ్యంగ్యం గర్వంగా ఉన్నందుకు కొరింథీయులను సిగ్గుపర్చడానికి పౌలు వ్యంగ్యాన్ని ఉపయోగించాడు. కొరింథీ విశ్వాసులు రాజ్యం చేస్తున్నారు కాని అపొస్తలులు శ్రమపడుతున్నారు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-irony]]) ### అలంకారిక ప్రశ్నలు పౌలు ఈ అధ్యాయంలో అనేక అలంకారిక ప్రశ్నలను ఉపయోగించాడు. అతను కొరింథీయులకు బోధిస్తున్నప్పుడు ముఖ్యమైన అంశాలను నొక్కి చెప్పడానికి అతను వాటిని ఉపయోగించాడు. (చూడండి: rc: //te/ta/man/translate/figs-rquestion)