te_ulb/50-EPH.usfm

329 lines
42 KiB
Plaintext

\id EPH Ephesians
\s5
\c 1
\s అపోస్తలుని అభివందనాలు
\p
\v 1 ఎఫెసులో దేవుడు ప్రత్యేకించుకొనగా క్రీస్తు యేసులో విశ్వాసముంచిన వారికి దేవుని సంకల్పం ప్రకారం క్రీస్తు యేసు అపొస్తలుడు పౌలు రాస్తున్న విషయాలు.
\v 2 మన తండ్రి దేవుని నుండీ యేసు క్రీస్తు ప్రభువు నుండీ మీకు కృప, శాంతిసమాధానాలు కలుగు గాక .
\s కృపలో విశ్వాసి స్థితి
\s5
\p
\v 3 మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతులు కలుగు గాక. ఆయన పరలోక విషయాలలో సమస్త ఆధ్యాత్మిక ఆశీర్వాదాలతో క్రీస్తులో మనల్ని దీవించాడు.
\v 4 క్రీస్తులో విశ్వాసముంచిన మనల్ని సృష్టికి ముందే దేవుడు ఎన్నుకున్నాడు. మనం ఆయన దృష్టిలో పరిశుద్ధులంగా నిందారహితులంగా ఉండేలా ఆయన మనల్ని ఎన్నుకున్నాడు.
\s5
\v 5 యేసు క్రీస్తు ద్వారా మనలను తన సొంత కుమారులుగా ప్రేమతో స్వీకరించడానికి దేవుడు ముందుగానే నిర్ణయించుకున్నాడు. అలా చేయడం ఆయనకు ఎంతో ఆనందం. ఆయన ఆశించింది అదే.
\v 6 తన దివ్య కృపను బట్టి స్తుతి పొందాలని దేవుడు దానిని తన ప్రియ కుమారుని ద్వారా మనకు ఉచితంగా ప్రసాదించాడు.
\s5
\v 7 దేవుని కృపా సమృద్ధి వలననే, ఆయన ప్రియ పుత్రుడు యేసు రక్తం ద్వారా మనకు విమోచన, పాప క్షమాపణ కలిగింది.
\v 8 ఈ కృపను సమస్త జ్ఞాన వివేకాలతో ఆయన మనకు విస్తారంగా అందించాడు.
\s5
\v 9 ఆయన తన ప్రణాళికలో ఉన్న రహస్య సత్యాన్ని క్రీస్తులో విశదపరచి, తన సంకల్పానుసారంగా మనకు వెల్లడించాడు.
\v 10 కాలం సంపూర్ణమైనప్పుడు పరలోకంలోనూ, భూమి మీదా ఉన్న సమస్తాన్ని క్రీస్తులో ఏకంగా సమకూర్చాలని తనలో తాను నిర్ణయించుకున్నాడు.
\s5
\v 11 క్రీస్తును ముందుగా నమ్మిన మనం తన మహిమకు కీర్తి కలగచేయాలని,
\v 12 దేవుడు తన చిత్తప్రకారమైన సంకల్పాన్ని బట్టి మనలను ఎన్నుకొని, మనకు వారసత్వం ఏర్పరచాడు. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం ప్రకారం అన్ని కార్యాలనూ జరిగిస్తున్నాడు.
\s5
\v 13 మీరు కూడ రక్షణ శుభవార్త అయిన సత్య వాక్యాన్ని విని, క్రీస్తులో విశ్వాసముంచారు. దేవుడు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ ముద్ర మీమీద పడింది.
\v 14 దేవుని మహిమకు కీర్తి కలగడానికి ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలిగేంత వరకు మన వారసత్వానికి, ఆత్మ హామీ గా ఉన్నాడు.
\s జ్ఞానం, బలం కలగాలని ప్రార్థన
\s5
\p
\v 15 ఈ కారణం చేత ప్రభువైన యేసులో మీ విశ్వాసం గురించీ పరిశుద్ధులందరి పట్ల మీరు చూపిస్తున్న ప్రేమను గురించీ నేను విన్నప్పటి నుండి
\v 16 మీ విషయంలో మానకుండా నా ప్రార్థనలలో దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను.
\s5
\v 17 మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవుడు, మహిమ గల తండ్రి, తనను తెలుసుకోడానికి మీకు తెలివిగల ఆత్మనూ, తన జ్ఞాన ప్రత్యక్షత గల మనస్సునూ ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను.
\v 18 మీ మనోనేత్రాలు వెలిగి, మన పిలుపు గురించిన ఆశాభావం ఎలాంటిదో, పరిశుద్ధులలో ఆయనకున్న మహిమగల వారసత్వం ఎంత ఐశ్వర్యవంతమో మీరు గ్రహించాలని నా ప్రార్థన.
\s5
\v 19 తనను నమ్ముకున్న మనలో తన అపరిమిత ప్రభావం ఎంత గొప్పదో మీరు తెలుసుకోవాలని నా ప్రార్థన.
\s దేవుడు క్రీస్తును ఘనపరిచాడు
\p
\v 20 దేవుడు ఈ శక్తితో క్రీస్తును తిరిగి లేపి పరలోకంలో తన కుడి పక్కన కూర్చోబెట్టుకున్నాడు.
\v 21 సర్వాధిపత్యం, అధికారం, ప్రభావం, ప్రభుత్వం కంటే ఈ యుగంలో గానీ రాబోయే యుగంలో గానీ పేరు గాంచిన ప్రతి నామం కంటే కూడా ఎంతో పైగా ఆయనను హెచ్చించాడు.
\s5
\v 22 దేవుడు సమస్తాన్నీ క్రీస్తు పాదాల కింద ఉంచి, సంఘం లోని అన్నిటి మీదా ఆయన్ని తల గా నియమించాడు.
\v 23 ఈ సంఘం ఆయన శరీరం, సమస్తాన్నీ పూర్తిగా నింపుతున్న ఆయన సంపూర్ణత.
\s5
\c 2
\s యూదేతరులు రక్షణ పొందే విధానం
\p
\v 1 మీ అతిక్రమాలలో పాపాలలో మీరు మరణించారు.
\v 2 పూర్వం మీరు ఈ లోకం పోకడనూ వాయు మండల సంబంధ అధిపతినీ, అంటే అవిధేయులలో పనిచేస్తున్న ఆత్మను అనుసరించి నడుచుకున్నారు.
\v 3 పూర్వం మనమంతా ఈ అవిశ్వాసులతో పాటు మన శరీర దుష్ట స్వభావాన్ని అనుసరించి బతికాం. శరీరానికీ మనసుకూ ఇష్టమైన వాటిని జరిగిస్తూ, ఇతరుల్లాగా స్వభావసిద్ధంగా దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉండేవారం.
\s5
\v 4 అయితే దేవుడు కరుణాసంపన్నుడు కాబట్టి,
\v 5 మనం మన అతిక్రమాలలో చచ్చి ఉన్నప్పటికీ, మన పట్ల తన మహా ప్రేమను చూపి మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. కృప చేతనే మీకు రక్షణ కలిగింది.
\v 6 దేవుడు క్రీస్తు యేసులో మనలను ఆయనతో కూడా లేపి, పరలోకంలో ఆయనతో పాటు కూర్చోబెట్టుకున్నాడు.
\v 7 రాబోయే యుగాలలో క్రీస్తు యేసులో దేవుడు చేసిన ఉపకారం ద్వారా అపరిమితమైన తన కృపా సమృద్ధిని మనకు కనుపరచడానికి ఆయన ఇలా చేశాడు.
\s5
\v 8 మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షణ పొందారు. ఇది మన వలన కలిగింది కాదు, దేవుడే బహుమానంగా ఇచ్చాడు.
\v 9 అది క్రియల వలన కలిగింది కాదు కాబట్టి ఎవరూ గొప్పలు చెప్పుకోడానికి వీలు లేదు.
\v 10 మనం దేవుని చేతి కళాఖండం, దేవుడు ముందుగా సిద్ధం చేసిన మంచి పనులు మనం చేయడం కోసం మనల్ని క్రీస్తు యేసులో సృష్టించాడు.
\s స్వతహాగా యూదేతరుల స్థితి
\s5
\p
\v 11 కాబట్టి పూర్వం మీరు శారీరకంగా యూదేతరులు. 'సున్నతి పొందిన యూదులు' మిమ్మల్ని 'సున్నతి లేనివారు' అని పిలిచేవారు. ఈ సున్నతిని శరీరంలో చేతితో, మనుషులు చేశారు.
\v 12 ఆ కాలంలో మీరు క్రీస్తుకు వేరుగా ఉన్నారు. ఇశ్రాయేలులో పౌరసత్వం లేనివారుగా వాగ్దాన నిబంధనలకు పరాయివారుగా, నిరీక్షణ లేనివారుగా, లోకంలో దేవుడు లేనివారుగా ఉన్నారు.
\s5
\v 13 అయితే పూర్వం దేవునికి దూరంగా ఉన్న మీరు ఇప్పుడు క్రీస్తు యేసులో క్రీస్తు రక్తం వలన దేవునికి దగ్గరయ్యారు./
\s ఇప్పుడు క్రీస్తులో యూదులూ యూదేతరులూ ఏక శరీరం
\p
\v 14 ఆయనే మన శాంతి. ఆయన యూదుల్నీ యూదేతరుల్నీ ఏకం చేశాడు. మన ఉభయులనూ విడదీస్తున్న ద్వేషమనే అడ్డుగోడను తన శరీరం ద్వారా కూలగొట్టాడు.
\v 15 అంటే, ఆ ఇద్దరినుండి నుండి ఒక కొత్త ప్రజను సృష్టించడానికి, విధులూ ఆజ్ఞలూ గల ధర్మశాస్త్రాన్ని రద్దు చేశాడు.
\v 16 వారి మధ్య ఉన్న ద్వేషాన్ని సిలువ ద్వారా నిర్మూలించి, వీరిద్దరినీ దేవునితో ఏకం చేసి శాంతి నెలకొల్పాలని ఇలా చేశాడు
\s5
\v 17 యేసు వచ్చి దూరంగా ఉన్న మీకూ దగ్గరగా ఉన్నవారికీ సమాధాన సువార్తను ప్రకటించాడు.
\v 18 యేసు ద్వారానే మీరూ మేమూ ఒకే ఆత్మ ద్వారా తండ్రిని చేరగలం.
\s5
\v 19 కాబట్టి యూదేతరులైన మీరు ఇకమీదట అపరిచితులూ విదేశస్థులు కారు, పరిశుద్ధులతో సాటి పౌరులు, దేవుని కుటుంబ సభ్యులు.
\v 20 క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయిగా ఉండి అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టడంగా మీరు ఉన్నారు.
\v 21 అయన శక్తి తోనే తన కుటుంబమనే కట్టడం చక్కగా అమరి, ప్రభువు కోసం పరిశుద్ధ దేవాలయంగా రూపొందుతూ ఉంది.
\v 22 ఆయనలో మీరు కూడా ఆత్మలో దేవునికి నివాసస్థలంగా ఉండడానికి వృద్ది చెందుతూ ఉన్నారు.
\s5
\c 3
\s సంఘం ఒక మర్మం
\p
\v 1 ఈ కారణం చేత యూదేతర విశ్వాసులైన మీకోసం క్రీస్తు యేసు ఖైదీనైన పౌలు అనే నేను ప్రార్థిస్తున్నాను.
\v 2 మీ విషయంలో దేవుడు నాకు అనుగ్రహించిన కృపను గూర్చి మీరు విన్నారు.
\s5
\v 3 అదేమంటే క్రీస్తు మర్మం దర్శనం ద్వారా నాకు వెల్లడైంది. దీని గురించి మీకు కూడా తెలిసిన సంగతిని గూర్చి ఇంతకు ముందు క్లుప్తంగా రాశాను.
\v 4 మీరు దాన్ని చదివితే ఆ క్రీస్తు మర్మం విషయంలో నేను పొందిన వెల్లడింపును గ్రహించగలరు.
\v 5 ఈ మర్మం ఇప్పుడు ఆత్మ ద్వారా దేవుని పరిశుద్ధులైన అపొస్తలులకూ ప్రవక్తలకూ వెల్లడైనట్టుగా పూర్వకాలాల్లోని మనుషులకు తెలియలేదు.
\s5
\v 6 ఈ మర్మం ఏమిటంటే - శుభవార్త కారణంగా యూదులతో పాటు యూదేతరులు కూడా క్రీస్తు యేసులో సమాన వారసులు, ఒకే శరీరంలోని అవయవాలు, వాగ్దానంలో పాలివారు అనేదే.
\v 7 నేను ఆ శుభవార్తకు సేవకుడినయ్యాను. దేవుని శక్తిని బట్టి ఆయన కృప వల్లనే ఇది సాధ్యమైంది.
\s5
\v 8 పరిశుద్ధులందరిలో అతి చిన్నవాణ్ణి అయినా మన ఊహకందని క్రీస్తు ఐశ్వర్యాన్ని యూదేతరులకు ప్రకటించడానికీ,
\v 9 సర్వ సృష్టికర్త అయిన దేవునిలో అనాది నుండీ దాగి ఉన్న ఆ మర్మాన్ని అందరికీ వెల్లడిపరచడానికీ దేవుడు ఆ కృపను నాకు అనుగ్రహించాడు.
\s5
\v 10 తన బహుముఖ జ్ఞానం సంఘం ద్వారా పరలోకంలోని ప్రధానులూ అధికారులూ తెలుసుకోవాలని దేవుని ఉద్దేశం.
\v 11 అది మన ప్రభువు క్రీస్తు యేసులో చేసిన ఆయన నిత్య సంకల్పం.
\s5
\v 12 అయనపై మన విశ్వాసం చేత ఆయనను బట్టి మనకి ధైర్యం, దేవుని సన్నిధిలోకి ప్రవేశించే స్వేచ్ఛ కలిగింది.
\s అంతరంగ పరిపూర్ణత, జ్ఞానాలకై ప్రార్థన
\p
\v 13 కాబట్టి మీ నిమిత్తం నాకు కలిగిన హింసలు చూసి మీరు అధైర్యపడవద్దు. ఇవి మీకు మహిమ కారకాలుగా ఉంటాయి.
\s5
\v 14 ఈ కారణం వలన పరలోకంలో, భూమి మీదా ఉన్న ప్రతి కుటుంబం ఎవరిని బట్టి కుటుంబం అని పేరు పొందిందో ఆ తండ్రి ముందు నేను మోకాళ్లూని
\v 15 మీరు అంతరంగ పురుషునిలో శక్తి కలిగి ఆయన ఆత్మ ద్వారా బలం పొందాలనీ
\v 16 క్రీస్తు మీ హృదయాలలో విశ్వాసం ద్వారా నివసించి తన మహిమ భాగ్యాన్ని మీకు అనుగ్రహించాలనీ
\s5
\v 17 మీరు దేవుని సంపూర్ణత లోకి ఎదిగేలా ప్రేమలో స్థిరంగా పాదుకొని
\v 18 పరిశుద్ధులందరితో కలిసి దాని పొడవు వెడల్పు లోతు ఎత్తు ఎంతో గ్రహించాలనీ
\v 19 జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను తెలిసికోడానికి తగిన శక్తి పొందాలనీ ప్రార్థిస్తున్నాను.
\s5
\v 20 మనలో పని చేసే తన శక్తి ప్రకారం మనం అడిగే వాటి కంటే, ఊహించే వాటి కంటే ఎంతో ఎక్కువగా చేసే శక్తి గల దేవునికి,
\v 21 క్రీస్తు యేసు మూలంగా సంఘంలో తరతరాలకూ ఎప్పుడూ మహిమ కలుగుతుంది గాక. ఆమేన్‌.
\s5
\c 4
\s విశ్వాసుల ప్రవర్తన, సేవ
\p
\v 1 కాబట్టి, మీరు శాంతిసమాధానాలు అనే బంధం ద్వారా పరిశుద్ధాత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవడంలో శ్రద్ధ వహిస్తూ, ప్రేమ కలిగి ఉండండి. ఒకరి పట్ల ఒకరు సహనం వహించండి.
\v 2 ప్రభువు పిలుపుకు తగినట్టు దీర్ఘశాంతంతో, సంపూర్ణ వినయంతో, సాధుగుణంతో జీవించమని
\v 3 ప్రభువును బట్టి ఖైదీగా ఉన్న నేను మిమ్మల్ని బతిమాలుతున్నాను.
\s5
\v 4 శరీరం ఒక్కటే, ఆత్మా ఒక్కడే. మీరు ఒకే నిరీక్షణ గురించిన పిలుపు పొందారు.
\v 5 ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే.
\v 6 అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికంటే పైనా, అందరిలో ఉన్నాడు.
\s తన శరీరం కోసం క్రీస్తు ఇచ్చిన పరిచర్య వరాలు
\s5
\p
\v 7 అయితే క్రీస్తు అనుగ్రహించే కృప కొలతను బట్టి మనలో ప్రతి ఒక్కరికీ వరాలు లభించాయి.
\v 8 దీని గురించే ఆయన ఆరోహణమైనప్పుడు, బందీలను చెరలోకి కొనిపోయాడనీ, తన ప్రజలకు బహుమానాలు ఇచ్చాడనీ లేఖనంలో ఉంది.
\s5
\v 9 'ఆరోహణమయ్యాడు' అనే మాటకు ఆయన భూమి కింది భాగాలకు దిగాడు అని కూడా అర్ధం ఉంది కదా.
\v 10 అలా దిగినవాడే తానే సమస్తాన్నీ నింపేలా ఆకాశ మహాకాశాలన్నింటినీ దాటి, ఎంతో పైకి ఎక్కిపోయాడు.
\s5
\v 11 విశ్వాసులు పరిపూర్ణులు కావాలనీ క్రీస్తు సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలనీ ఆయన కొందరిని అపొస్తలులుగా, కొందరిని ప్రవక్తలుగా,
\s పరిచర్య వరాల ఉద్దేశ్యం
\p
\v 12 కొందరిని సువార్తికులుగా, మరి కొందరిని కాపరులుగా, బోధకులుగా నియమించాడు.
\v 13 మనమంతా విశ్వాసంలో, దేవుని కుమారుని గురించిన జ్ఞానంలో సంపూర్ణత సాధించాలనీ, అంటే క్రీస్తు కలిగి ఉన్న అత్యున్నతమైన సంపూర్ణతకు సమానంగా అభివృద్ధి చెందాలనీ అయన ఉద్దేశం.
\s5
\v 14 కాబట్టి మనం ఇంకా పసిపిల్లలంగా ఉండకూడదు. మనుషులు కపటంతో, కుయుక్తి చేత కల్పించే మాయోపాయాలకు మోసపోకూడదు. అలల తాకిడికి అటూ ఇటూ తేలికగా కొట్టుకొని పోయే వారంగా, వివిధ రకాల సిద్ధాంతాల గాలికి ఎగిరిపోయే వారంగా ఉండకూడదు.
\v 15 ప్రేమతో సత్యమే మాట్లాడుతూ అన్ని విషయాల్లో క్రీస్తులాగా ఎదుగుదాం.
\v 16 ఆయనే శిరస్సు. ఆయన నుండి సంఘమనే శరీరం చక్కగా అమరి, దానిలోని ప్రతి అవయవమూ కీళ్ళ మూలంగా కలిసి ఉండి, తన శక్తి కొలది పనిచేసినపుడు ప్రేమలో తనకు క్షేమాభివృద్ధి కలిగేలా అభివృద్ధి చెందుతుంది.
\s క్రీస్తులో నూతన జీవిగా విశ్వాసి ప్రవర్తన
\s5
\p
\v 17 కాబట్టి మీరిక నుండి అవిశ్వాసుల్లాగా జీవించ వద్దని ప్రభువులో మిమ్మల్ని వేడుకుంటున్నాను.
\v 18 ఎందుకంటే వారి మనసు అంధకారమయమై, తమ హృదయ కాఠిన్యం వలనా తమలోని అజ్ఞానం వలనా తమ మనస్సులోని అజ్ఞానాన్ని అనుసరించి, దేవుని జీవం నుండి వేరైపోయారు.
\v 19 వారు సిగ్గు లేకుండా నానా రకాల అపవిత్ర కార్యాలను ఆత్రుతగా చేయడం కోసం తమను తాము కాముకత్వానికి అప్పగించుకున్నారు.
\s5
\p
\v 20 అయితే మీరు క్రీస్తును నేర్చు కున్నప్పుడు ఆవిధంగా జీవించ కూడదని నేర్చుకున్నారు.
\v 21 యేసులోని సత్యం గురించి ఉన్నది ఉన్నట్టుగానే ఉపదేశం పొందారు.
\v 22 కాబట్టి మీ గత జీవిత విధానానికి కారణమై, మోసకరమైన కోరికల చేత చెడిపోయే మీ పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి.
\s5
\v 23 మీ మనసును కొత్తది చేసుకోవాలి.
\v 24 నీతి, యథార్థమైన భక్తి కలిగి దేవుడు ఇచ్చే కొత్త స్వభావం ధరించుకోవాలి.
\s5
\v 25 మనం ఒకరికొకరం అవయవాల వంటి వారం. కాబట్టి మీరు అబద్ధాలు మానేసి మీ పొరుగువారితో సత్యమే పలకాలి.
\v 26 కోపం చూపవచ్చు గాని అది పాపానికి దారి తీయకూడదు. మీ కోపం పొద్దుగుంకే దాకా ఉండకూడదు.
\v 27 సాతానుకు అవకాశం ఇవ్వకండి.
\s5
\v 28 దొంగతనం చేసేవాడు దానిని విడిచిపెట్టాలి. తన చేతులతో కష్టపడి పనిచేసి అక్కరలో ఉన్నవారికి సహాయం చేయాలి.
\v 29 మీ నోటి వెంట చెడు మాటలు రాకూడదు. వినేవారి అవసరం కొద్దీ వారు అభివృద్ధి చెందేలా కృపా సహితంగా మాట్లాడండి.
\s ఆత్మను కలిగి ఉన్న వాడుగా విశ్వాసి ప్రవర్తన
\p
\v 30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచ వద్దు. ఎందుకంటే ఆయన ముద్ర మీ విమోచన దినం వరకు మీపై ఉంటుంది.
\s5
\v 31 ద్వేషం, కోపం, రౌద్రం, అల్లరి, అపనిందలు వంటి దుష్టత్వాన్ని పూర్తిగా విడిచిపెట్టండి.
\v 32 హృదయంలో కరుణ కలిగి ఒకనిపై మరొకడు దయ చూపించండి. దేవుడు మిమ్మల్ని ఏ విధంగా క్రీస్తులో క్షమించాడో ఆ విధంగానే మీరు కూడా ఇతరులను క్షమించండి.
\s5
\c 5
\s దేవుని ప్రియ సంతానంగా విశ్వాసి ప్రవర్తన
\p
\v 1 కాబట్టి మీరు దేవుని పిల్లల్లాగా ఆయనను పోలి జీవించండి.
\v 2 క్రీస్తు మనలను ప్రేమించి, మనం దేవునికి సువాసనగా ఉండేందుకు మన కోసం తనను తానే బలిగా అర్పించుకున్నాడు. అలాంటి ప్రేమనే మీరూ కలిగి ఉండండి.
\s5
\v 3 మీలో వ్యభిచారం, అపవిత్రత, అసూయ, ఇవేవీ ఉండకూడదు. కనీసం మీరు వాటి పేరైనా ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగిన ప్రవర్తన.
\v 4 కృతజ్ఞత మాటలే మీ నోటి వెంట రావాలి గాని బూతులు, అల్లరి, రెండు అర్థాలతో కూడిన మాటలు మీరు పలకకూడదు. ఇవి మీకు తగినవి కావు.
\s5
\v 5 మీకు తెలుసు. వ్యభిచారులూ, అపవిత్రులూ, విగ్రహారాధికులూ, పిసినిగొట్టులూ, క్రీస్తుకూ, దేవునికీ చెందిన రాజ్యానికి అర్హులు కారు.
\v 6 పనికిమాలిన మాటలు పలికేవారి చేతిలో మోసపోకండి.
\v 7 అలాటి వాటివల్ల అవిధేయుల పైకి దేవుని ఉగ్రత వస్తుంది. కాబట్టి వారికి దూరంగా ఉండండి.
\s5
\v 8 గత కాలంలో మీరు చీకటిలో ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రభువులో వెలుగుగా ఉన్నారు.
\v 9 ఈ వెలుగు మంచితనంలో, నీతిలో, సత్యంలో ప్రతిఫలిస్తుంది.
\v 10 కాబట్టి ప్రభువుకు ఇష్టమైనదేదో దానినే చేస్తూ, వెలుగు సంబంధుల్లాగా జీవించండి.
\v 11 పనికిమాలిన చీకటి పనుల్లో పాల్గొనక, వాటిని ఖండించండి.
\v 12 ఎందుకంటే వారు రహస్యంగా జరిగించే ఆ పనులను గురించి మాటలాడటం కూడా చాలా అవమానకరం.
\s5
\v 13 ప్రతి పనీ వెలుగు చేత బట్టబయలు అవుతుంది. వెలుగు ప్రతిచోటా ప్రకాశిస్తూనే ఉంటుంది కదా?
\v 14 అందుకే నిద్రిస్తున్న నీవు మేలుకో మృతులలో నుండి లే, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు అని రాసి ఉంది.
\s5
\p
\v 15 బుద్ధిహీనుల్లా కాక వివేకంగా జీవించడానికి జాగ్రత్త పడండి.
\v 16 సమయం సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే రోజులు చెడ్డవి.
\v 17 అందుకే మీరు వివేకంగా ఉంటూ ప్రభువు సంకల్పమేమిటో తెలుసుకోండి.
\s5
\v 18 మద్యం సేవించి మత్తులో మునిగిపోకండి. అది మీకు నష్టదాయకం. అయితే పరిశుద్ధాత్మతో నిండి ఉండండి.
\v 19 కీర్తనలతో, సంగీతాలతో, ఆత్మసంబంధమైన పాటలతో ఒకరినొకరు ప్రోత్సహిస్తూ, ప్రభువును గూర్చి మీ హృదయాల్లో పాడుతూ కీర్తించండి.
\v 20 ప్రభు యేసు క్రీస్తు నామంలో అన్నిటిని గురించీ తండ్రి అయిన దేవునికి అన్ని పరిస్థితుల్లో కృతజ్ఞతా స్తుతులు చెల్లించండి.
\s ఆత్మతో నిండిన వారుగా విశ్వాసుల వైవాహిక జీవనం
\p
\v 21 క్రీస్తుపై ఉన్న భక్తి కొద్దీ ఒకరి కొకరు లోబడి ఉండండి.
\s5
\v 22 స్త్రీలు ప్రభువుకు లోబడినట్టే తమ భర్తలకు లోబడాలి.
\v 23 క్రీస్తు సంఘానికి ఏ విధంగా తలగా ఉన్నాడో అలాగే భర్త తన భార్యకు తలగా ఉన్నాడు. క్రీస్తే సంఘమనే శరీరానికి రక్షకుడు.
\v 24 సంఘం క్రీస్తుకు లోబడిన విధంగానే భార్యలు కూడా ప్రతి విషయంలో తమ భర్తలకు లోబడాలి.
\s5
\v 25 పురుషులారా, మీరు కూడా సంఘాన్ని క్రీస్తు ప్రేమించిన విధంగానే మీ భార్యలను ప్రేమించాలి.
\v 26 సంఘాన్ని వాక్యమనే నీటి స్నానంతో శుద్ధిచేసి, పవిత్ర పరచడానికి,
\v 27 దానిని కళంకం గాని, ముడుతలు గాని అలాటిది మరేదీ లేకుండా, పవిత్రంగా, నిర్దోషంగా, మహిమ గలదిగా తన ముందు నిలబెట్టుకోవాలని, దానికోసం తనను తాను సమర్పించుకున్నాడు.
\s5
\v 28 అలాగే పురుషులకు కూడా తమ సొంత శరీరాల్లాగానే తమ భార్యలను ప్రేమించవలసిన బాధ్యత ఉంది. తన భార్యను ప్రేమించే వాడు తనను ప్రేమించుకొన్నట్టే.
\v 29 ఎవడూ తన శరీరాన్ని ద్వేషించడు, ప్రతి ఒక్కడూ దానిని పోషించి సంరక్షించుకుంటాడు.
\v 30 మనం సంఘమనే క్రీస్తు శరీరంలో అవయవాలుగా ఉన్నాం కాబట్టి క్రీస్తు కూడా తన సంఘాన్ని పోషించి సంరక్షిస్తున్నాడు.
\s5
\p
\v 31 "ఇందువలన పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు, వారిద్దరూ ఒక్క శరీరమవుతారు"
\v 32 ఈ మాటల అర్థం గ్రహించడం కష్టసాధ్యం. అయితే నేను క్రీస్తును గూర్చీ సంఘం గూర్చీ చెబుతున్నాను.
\v 33 చివరిగా నేను చెప్పేది, మీలో ప్రతి పురుషుడూ తనను తాను ఎంత ప్రేమించుకుంటాడో అంతగా తన భార్యను ప్రేమించాలి. అలాగే భార్య తన భర్తను గౌరవించాలి.
\s5
\c 6
\s ఆత్మతో నిండిన వారుగా విశ్వాసుల గృహ జీవనం
\p
\v 1 పిల్లలారా, ప్రభువులో మీ తల్లిదండ్రులకు లోబడండి. ఇది మంచిది.
\v 2 "నీకు మేలు కలిగేలా నీ తండ్రిని తల్లిని గౌరవించు. అది నీకు దీర్ఘాయువును కలిగిస్తుంది."
\v 3 ఇది వాగ్దానంతో కలిసి ఉన్న మొదటి ఆజ్ఞ.
\s5
\v 4 తండ్రులారా, మీ పిల్లలకు కోపం పుట్టించవద్దు. వారిని ప్రభువు క్రమశిక్షణలో, బోధలో పెంచండి.
\s5
\v 5 దాసులారా, భయంతో కూడిన గౌరవంతో, వణకుతో, క్రీస్తుకు లోబడినట్టు, ఈ లోకంలోని మీ యజమానులకు హృదయ పూర్వకంగా లోబడండి.
\v 6 మనుషుల్ని సంతోషపెట్టేవారు చేసినట్టు పైపైన కాక, క్రీస్తు దాసులుగా దేవుని సంకల్పాన్ని హృదయ పూర్వకంగా జరిగిస్తూ,
\v 7 ప్రభువుకు చేసినట్టే యిష్టపూర్వకంగా సేవచేయండి.
\v 8 దాసుడైనా, స్వతంత్రుడైనా, మీలో ప్రతివాడూ తాను చేసిన మంచి పనికి ప్రభువు వలన ప్రతిఫలం పొందుతాడని మీకు తెలుసు.
\s5
\v 9 యజమానులారా, మీరూ మీ దాసుల పట్ల అలాగే ప్రవర్తించండి. మీకూ మీ దాసులకూ ఒక్కడే యజమాని పరలోకంలో ఉన్నాడనీ, ఆయన పక్షపాతం లేనివాడనీ గ్రహించి, వారిని బెదరించడం మానండి.
\s ఆత్మతో నిండిన విశ్వాసుల పోరాటం
\s5
\p
\v 10 చివరిగా, ప్రభువు మహా శక్తిని బట్టి ఆయనలో బలవంతులై ఉండండి.
\v 11 మీరు సాతాను కుతంత్రాలను ఎదుర్కోడానికి శక్తి పొందడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి.
\s శత్రువులు
\s5
\p
\v 12 ఎందుకంటే మన పోరాటం మానవమాత్రులతో కాదు. నేటి చీకటి సంబంధమైన లోకనాథులతో, ప్రధానులతో, అధికారులతో, ఆకాశమండలంలోని దురాత్మల సమూహాలతో మనం పోరాడుతున్నాం.
\s కవచం
\p
\v 13 అందుచేత మీరు ఈ చెడ్డ కాలంలో వారిని ఎదిరించి, శక్తివంతులుగా నిలబడగలిగేలా దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి.
\s5
\v 14 మీ నడుముకి సత్యం అనే బెల్టు, నీతి అనే కవచం,
\v 15 పాదాలకు శాంతి శుభవార్త కోసం సిద్ధపడిన మనస్సు అనే చెప్పులు ధరించండి.
\v 16 వాటితోబాటు శత్రువు విసిరే అగ్ని బాణాలను అడ్డుకోడానికి తోడ్పడే విశ్వాసం అనే డాలు పట్టుకోండి.
\s5
\v 17 ఇంకా పాపవిమోచన అనే శిరస్త్రాణం, దేవుని వాక్కు అనే ఆత్మఖడ్గం ధరించుకోండి.
\v 18 ఆత్మలో అన్ని సమయాల్లో అన్ని రకాల ప్రార్థనలు చేస్తూ ఉండండి. అందుకోసం పూర్తి పట్టుదలతో విశ్వాసులందరి కోసమూ విజ్ఞాపనలు చేస్తూ మెలకువగా ఉండండి.
\s5
\v 19 అలాగే నేను ఏ కారణం చేత సంకెళ్లలో ఉన్నానో, ఆ శుభవార్తను ప్రకటించడానికి నోరు తెరచినప్పుడు
\v 20 ధైర్యంగా మాటలాడగలిగేలా నాకోసం ప్రార్ధించండి.
\s5
\v 21 నా ప్రియ సోదరుడు తుకికు నా క్షేమ సమాచారమంతా మీకు తెలియజేస్తాడు. అతడు ప్రభువులో నమ్మకమైన సేవకుడు.
\v 22 మా సంగతులు మీరు తెలుసుకోడానికీ, మీ హృదయాలను ఓదార్చడానికీ అతణ్ణి మీ దగ్గరికి పంపాను.
\s5
\v 23 తండ్రి అయిన దేవుని నుండీ, ప్రభు యేసు క్రీస్తు నుండీ విశ్వాసపూర్ణమైన శాంతీ, ప్రేమా సోదరులకు కలుగు గాక.
\v 24 మన ప్రభు యేసు క్రీస్తుపై నిత్య ప్రేమను కనపరిచే వారికందరికీ కృప తోడై ఉంటుంది గాక.