te_ulb/45-ACT.usfm

2184 lines
318 KiB
Plaintext

\id ACT Acts
\s5
\c 1
\s పరిచయం
\p
\v 1 తియొఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపొస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన
\v 2 తరువాత ఆయన పరలోకానికి ఆరోహణమైన రోజు వరకు ఆయన చేసిన, బోధించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథాన్ని రచించాను.
\v 3 ఆయన హింసలు పొందిన తరువాత నలభై రోజులపాటు వారికి కనబడుతూ, దేవుని రాజ్య విషయాలను బోధిస్తూ, అనేక రుజువులను చూపించి వారికి తన్నుతాను సజీవునిగా కనపరచుకున్నాడు.
\s క్రీస్తు పునరుత్థానానంతర పరిచర్య
\s5
\p
\v 4 ఆయన వారిని కలిసికొని ఈ విధంగా ఆజ్ఞాపించాడు, "మీరు యెరూషలేమును విడిచి పోవద్దు. నా ద్వారా విన్న తండ్రి వాగ్దానం కోసం కనిపెట్టండి.
\v 5 యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాడు గాని కొద్ది రోజుల్లో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారు."
\s5
\p
\v 6 వారు సమకూడినప్పుడు, "ప్రభూ, ఇప్పుడు ఇశ్రాయేలు రాజ్యాన్ని పునరుద్ధరిస్తావా?" అని శిష్యులు అడగ్గా ఆయన,
\v 7 "కాలాలూ సమయాలూ తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. వాటిని తెలిసికోవడం మీ పని కాదు.
\s అపోస్తలిక అదేశం
\p
\v 8 అయితే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. కాబట్టి, మీరు యెరూషలేములో, యూదయ సమరయ దేశాల్లో, ప్రపంచమంతటా నాకు సాక్షులుగా ఉంటారు" అన్నాడు.
\s5
\v 9 ఈ మాటలు చెప్పి, వారు చూస్తూ ఉండగా ఆయన ఆరోహణమయ్యాడు. అప్పుడు ఒక మేఘం వచ్చి వారికి కనబడకుండా ఆయనను తీసుకు వెళ్లిపోయింది.
\v 10 ఆయన వెళుతూ ఉండగా వారు ఆకాశం వైపు అదే పనిగా చూస్తున్నారు. అప్పుడు తెల్లని బట్టలు ధరించిన ఇద్దరు వ్యక్తులు వారి దగ్గర నిలబడి
\v 11 "గలిలయ నివాసులారా, మీరెందుకు ఆకాశం వైపు చూస్తున్నారు? మీ దగ్గర్నుండి పరలోకానికి ఆరోహణమైన ఈ యేసు ఏ విధంగా పరలోకానికి వెళ్లడం మీరు చూశారో ఆ విధంగానే తిరిగి వస్తాడ" ని వారితో చెప్పారు.
\s1 పరిశుద్ధాత్మకై పది దినాల నిరీక్షణ
\s5
\p
\v 12 అప్పుడు వారు ఆలివ్ తోట అనే పేరు గల కొండనుండి యెరూషలేము తిరిగి వెళ్ళారు. ఆ కొండ యెరూషలేముకు విశ్రాంతి దినాన నడవదగినంత దూరంలో ఉంది.
\v 13 వారు పట్టణంలో ప్రవేశించి, తాము బస చేస్తున్న మేడగది లోకి వెళ్ళారు. వారెవరంటే, పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, దేశభక్తుడు అయిన సీమోను, యాకోబు కుమారుడు యూదా.
\v 14 వీరూ, వీరితోకూడా కొందరు స్త్రీలూ, యేసు తల్లి మరియ, ఆయన తమ్ముళ్ళూ ఏకగ్రీవంగా, నిలకడగా ప్రార్థన చేస్తూ ఉన్నారు.
\s మత్తీయ ఎంపిక
\s5
\p
\v 15 ఆ రోజుల్లో సుమారు నూట ఇరవై మంది శిష్యులు సమావేశమై ఉన్నపుడు పేతురు వారి మధ్య నిలబడి,
\v 16 "సోదరులారా, యేసును పట్టుకొన్నవారికి దారి చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనం నెరవేరవలసి వచ్చింది.
\s5
\v 17 ఇతడు మనలో ఒకడుగా లెక్కలోకి వచ్చి ఈ పరిచర్యలో భాగం పొందాడు.
\v 18 ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన డబ్బులిచ్చి ఒక పొలం కొన్నాడు. అతడు తలక్రిందుగాపడి శరీరం బద్దలై పేగులన్నీ బయటికి వచ్చాయి.
\v 19 ఈ విషయం యెరూషలేములో నివసిస్తున్న వారందరికీ తెలిసింది. కాబట్టి వారి భాషలో ఆ పొలాన్ని అకెల్దమ అంటున్నారు. దాని అర్థం 'రక్త భూమి.' "ఇందుకు రుజువుగా
\q1
\s5
\v 20 అతని యిల్లు పాడై పోవు గాక,
\q1 దానిలో ఎవ్వడూ కాపురముండక పోవు గాక,
\q1 అతని ఉద్యోగం వేరొకడు తీసికొనును గాక
\q1 అని కీర్తనల గ్రంథంలో రాసి ఉంది.
\s5
\p
\v 21 కాబట్టి యోహాను బాప్తిస్మమిచ్చింది మొదలు ప్రభువైన యేసు మన దగ్గర నుండి పరలోకానికి వెళ్ళిన రోజు వరకు,
\v 22 ఆయన మన మధ్య ఉన్నకాలమంతా మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు, మనతో కూడ ఆయన పునరుత్థానం గురించి సాక్షిగా ఉండాలి" అని చెప్పాడు.
\v 23 అప్పుడు వారు యూస్తు, బర్సబ్బా అనే మారు పేర్లున్న యోసేపునూ, మత్తీయనూ నిలబెట్టి ఇలా ప్రార్థించారు
\s5
\v 24 "అందరి హృదయాలను ఎరిగిన ప్రభూ,
\v 25 తన చోటికి వెళ్ళడానికి యూదా దారి తప్పి పోగొట్టుకొన్న ఈ పరిచర్యలో అపొస్తలత్వంలో పాలు పొందడానికి వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొన్నవానిని కనపరచు."
\v 26 తరువాత శిష్యులు వీరి కోసం చీట్లు వేస్తే మత్తీయ పేరుతో చీటి వచ్చింది కాబట్టి అతనిని పదకొండుమంది అపొస్తలులతో కలిపి లెక్కించారు.
\s5
\c 2
\s పెంతెకోస్తు
\p
\v 1 పెంతెకొస్తు అనే పండగరోజు వచ్చింది. అంతా ఒక చోట సమావేశమయ్యారు.
\v 2 అప్పుడు వేగంగా వీచే బలమైన గాలి వంటి శబ్దం ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న యిల్లంతా నిండింది.
\v 3 జ్వాలల లాంటివి నాలుకలుగా చీలినట్టుగా వారికి కనబడి, వారిలో ప్రతి ఒక్కరిమీదా వ్రాలాయి.
\v 4 అందరూ పరిశుద్ధాత్మతో నిండి ఆ ఆత్మ వారిని మాట్లాడించినట్టుగా వేరు వేరు భాషల్లో మాట్లాడసాగారు.
\s5
\v 5 ఆ రోజుల్లో ఆకాశం కింద ఉన్న ప్రతి జనంలోనుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో నివసిస్తున్నారు.
\v 6 ఈ శబ్దం విన్న జన సందోహం కూడి వచ్చి, ప్రతి వాడూ తమ సొంత భాషలో వారు మాట్లాడ్డం విని కలవరపడ్డారు.
\v 7 వారు ఆశ్చర్యంతో తలమునకలైపోతూ "మాట్లాడే వీరంతా గలిలయ వారే గదా.
\s5
\v 8 మనలో ప్రతివాడి మాతృభాషలో వీరు మాట్లాడ్డం మనం వింటున్నామేంటి ?
\v 9 పార్తీయులూ మాదీయులూ ఏలామీయులూ, మెసొపొతమియ యూదయ కప్పదొకియ పొంతు ఆసియ
\v 10 ఫ్రుగియ పంపులియ ఐగుప్తు అనే దేశాల వారూ, కురేనే లో భాగంగా ఉన్న లిబియ ప్రాంతాలవారూ, రోమ్ నుండి సందర్శకులుగా వచ్చిన
\v 11 యూదులూ, యూదమతంలోకి మారినవారూ, క్రేతీయులూ అరబీయులూ మొదలైన మనమంతా వీరు మన భాషల్లో దేవుని గొప్ప కార్యాలను చెప్తుంటే వింటున్నామ"ని చెప్పుకున్నారు.
\s5
\v 12 అందరూ ఆశ్చర్య చకితులై ఎటూ తోచక ఇదేమిటోనని ఒకనితో ఒకడు చెప్పుకొన్నారు.
\v 13 కొందరైతే వీరు కొత్త సారా తాగి ఉన్నారని ఎగతాళి చేశారు.
\s పేతురు ఉపన్యాసం. యేసే ప్రభువు, క్రీస్తు
\s5
\p
\v 14 అయితే పేతురు ఆ పదకొండు మందితో లేచి నిలబడి బిగ్గరగా వారితో ఇలా అన్నాడు, ''యూదయ ప్రజలారా, యెరూషలేములో నివసిస్తున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియాలి. నా మాటలు జాగ్రత్తగా వినండి.
\s (1) యోవేలు ప్రవచనం నెరవేర్పు
\p
\v 15 మీరనుకున్నట్టు వీరు మద్యపానం చేయలేదు. ఇప్పుడు ఉదయం తొమ్మిది అయినా కాలేదు.
\s5
\v 16 యోవేలు ప్రవక్త చెప్పిన సంగతి ఇదే
\q1
\v 17 అంత్యదినాల్లో నేను
\q1 మనుషులందరి మీదా నా ఆత్మను కుమ్మరిస్తాను.
\q1 మీ కుమారులూ కుమార్తెలూ ప్రవచిస్తారు.
\q1 మీ యువకులకు దర్శనాలొస్తాయి.
\q1 మీ వృద్ధులు కలలు కంటారు,
\q1
\s5
\v 18 ఆ రోజుల్లో నా దాసుల మీదా దాసీల మీదా నా ఆత్మను కుమ్మరిస్తాను కాబట్టి వారు ప్రవచిస్తారు.
\q1
\v 19 పైన ఆకాశంలో మహత్కార్యాలనూ కింద భూమ్మీద సూచకక్రియలనూ రక్తం, అగ్ని, పొగ, ఆవిరిని చూపిస్తాను.
\q1
\s5
\v 20 ప్రభువు ప్రత్యక్షమయ్యే ఆ మహాదినం రాక ముందు సూర్యుడు చీకటిగా, చంద్రుడు రక్తంగా మారతారు.
\q1
\v 21 ప్రభువు పేరున ప్రార్థన చేసే వాళ్ళంతా పాప విముక్తి పొందుతారు అని
\q1 దేవుడు చెప్తున్నాడు.
\s (2) యేసు క్రియలు ఆయన్ను ప్రభువుగా క్రీస్తుగా నిరూపిస్తున్నాయి
\s5
\p
\v 22 ఇశ్రాయేలు ప్రజలారా, ఈ మాటలు వినండి, దేవుడు నజరేయుడైన యేసు చేత అద్భుతాలూ మహత్కార్యాలూ సూచకక్రియలూ మీ మధ్య చేయించి, ఆయనను తన దృష్టికి యోగ్యుడుగా కనపరిచాడు. ఇది మీకే తెలుసు.
\v 23 దేవుని స్థిరమైన ప్రణాళికనీ ఆయనకున్న భవిష్యద్‌ జ్ఞానాన్నీ అనుసరించి ఆయన్ని అప్పగించడం జరిగింది. ఈయన్ని మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపారు.
\v 24 మరణం ఆయనను బంధించి ఉంచడం అసాధ్యం గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపాడు.
\s (3) క్రీస్తు సజీవంగా తిరిగి లేచాక అయన రాజరికం గురించి దావీదు ప్రవచనం
\s5
\p
\v 25 ఆయన గూర్చి దావీదు ఇలా అన్నాడు
\q1 నే నెప్పుడూ నా ఎదుట ప్రభువును చూస్తున్నాను,
\q1 ఆయన నా కుడిపక్కనే ఉన్నాడు కాబట్టి ఏదీ నన్ను కదల్చదు.
\v 26 నా హృదయం ఉల్లాసంగా ఉంది. నా నాలుక ఆనందించింది.
\q1 నా శరీరం కూడా ఆశాభావంతో నిశ్చింతగా ఉంటుంది.
\s5
\v 27 నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు,
\q1 నీ పరిశుద్ధుణ్ణి కుళ్లు పట్టనియ్యవు
\v 28 నాకు జీవమార్గాలు తెలిపావు.
\q1 నీ ముఖదర్శనంతో నన్ను ఉల్లాసంతో నింపుతావు.
\s5
\v 29 సోదరులారా, పూర్వికుడైన దావీదును గురించి మీతో నేను ధైర్యంగా మాట్లాడగలను. అతడు చనిపోయి సమాధి అయ్యాడు.
\v 30 అతని సమాధి ఇప్పటికీ మన మధ్య ఉంది. అతడు ప్రవక్త కాబట్టి
\p అతని గర్భఫలం నుంచి అతని సింహాసనం మీద ఒకడిని కూర్చోబెడతానని
\q1 దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా శపథం చేసిన సంగతి ఎరిగి
\v 31 క్రీస్తు పాతాళంలో నిలిచి ఉండి పోలేదనీ, ఆయన శరీరం కుళ్లి పోలేదనీ దావీదు ముందే తెలిసికొని ఆయన పునరుత్థానాన్నిగూర్చి చెప్పాడు.
\s (4) యేసు పునరుత్థానం ఆయన్ను క్రీస్తుగా ప్రభువుగా నిరూపిస్తున్నది
\s5
\p
\v 32 ఈ యేసును దేవుడు లేపాడు. దీనికి మేమంతా సాక్షులం.
\v 33 కాబట్టి ఆయన దేవుని కుడిపక్కకు హెచ్చించడం జరిగింది. తండ్రి వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను ఆయన వలన పొంది, మీరు చూస్తున్న వింటున్న పరిశుద్ధాత్మను కుమ్మరించాడు.
\s5
\v 34 దావీదు పరలోకానికి ఆరోహణం కాలేదు. అయితే అతడిలా అన్నాడు
\p
\v 35 నేను నీ శత్రువుల్ని నీ పాదాల కింద పాదపీఠంగా ఉంచే వరకు
\q1 నీవు నా కుడిపక్కన కూర్చోమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాడు.
\q1
\v 36 మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు. ఇది ఇశ్రాయేలు జాతి అంతా ఖచ్చితంగా తెలుసుకోవాలి.''
\s (5) ఇశ్రాయేలు ప్రజ ప్రస్తుత కర్తవ్యం
\s5
\p
\v 37 వారీ మాట విని హృదయంలో గుచ్చినట్టయి , "సోదరులారా, మేమేం చేయాల"ని పేతురునూ మిగతా అపొస్తలులనూ అడిగారు
\v 38 దానికి పేతురు, "మీరు పశ్చాత్తాపపడి, పాపక్షమాపణ కోసం ప్రతివాడూ యేసుక్రీస్తు పేరున బాప్తిస్మం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు.
\v 39 ఈ వాగ్దానం మీకూ మీ పిల్లలకూ, దూరంగా ఉన్న వారందరికీ, అంటే ప్రభువైన మన దేవుడు తన దగ్గరకు పిలిచే వారందరికీ చెందుతుంద" ని వారితో చెప్పాడు.
\s5
\v 40 ఇంకా అతడు అనేక రకాలైన మాటలతో సాక్ష్యమిచ్చి, " మీరు యీ దుష్ట తరం నుండి వేరుపడి రక్షణ పొందండి" అని వారిని హెచ్చరించాడు.
\v 41 అతని సందేశం నమ్మినవారు బాప్తిస్మం పొందారు. ఆ రోజు దాదాపు మూడువేల మంది సంఘంలో చేరారు.
\s అది క్రైస్తవ సంఘం
\p
\v 42 వీరు అపొస్తలుల బోధలో, సహవాసంలో, రొట్టె విరవడంలో, ప్రార్థనలో కొనసాగారు.
\s5
\p
\v 43 అప్పుడు ప్రతివానికి దేవుని భయం కలిగింది. అపొస్తలులు చాలా అద్భుతాలూ సూచకక్రియలూ చేసారు.
\v 44 నమ్మినవారంతా కలిసి ఉండి తమకు ఉన్నదంతా ఉమ్మడి గా ఉంచుకొన్నారు.
\v 45 అంతేగాక వారు తమ ఆస్తిపాస్తులను అమ్మేసి, అందరికీ వారి వారి అవసరాలకు తగ్గట్టుగా పంచిపెట్టారు.
\s5
\v 46 ప్రతిరోజూ ఏక మనస్సుతో దేవాలయంలో సమావేశమౌతూ ఇళ్ళలో రొట్టె విరుస్తూ,
\v 47 ఆనందంతో, కపటంలేని హృదయంతో, వినయంతో కలిసి భోజనాలు చేశారు. వారు దేవుణ్ణి స్తుతిస్తూ ప్రజలందరి మన్నన పొందారు. రక్షణ పొందుతూ ఉన్నవారిని ప్రభువు ప్రతి రోజూ సంఘం లో చేరుస్తున్నాడు.
\s5
\c 3
\s ప్రథమ అపోస్తలిక అద్భుతం
\p
\v 1 మధ్యాహ్నం మూడు గంటల ప్రార్థన సమయంలో పేతురు, యోహాను దేవాలయానికి వెళ్తూ ఉన్నారు.
\v 2 పుట్టినప్పటినుండి కుంటివాడుగా ఉన్న ఒకణ్ణి కొందరు ప్రతిరోజూ మోసుకొచ్చి 'సౌందర్యం' అనే దేవాలయ ద్వారం దగ్గర ఉంచేవారు. వాడు దేవాలయం లోనికి వెళ్ళేవారి దగ్గర భిక్షమెత్తుకునే వాడు.
\v 3 పేతురు యోహాను దేవాలయం లోకి ప్రవేశిస్తూ ఉండగా వారిని బిచ్చమడిగాడు.
\s5
\v 4 పేతురు యోహాను వాడిని తదేకంగా చూస్తూ, "మావైపు చూడు" అన్నారు.
\v 5 అతడు వారిదగ్గర ఏమైనా దొరుకుతుందేమోనని ఆశించి వారివైపు చూసాడు.
\v 6 అప్పుడు పేతురు, "వెండి బంగారాలు నా దగ్గర లేవు, నాకున్నదాన్నే నీకిస్తాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో లేచి నడువు" అని
\s5
\v 7 వాడి కుడిచెయ్యి పట్టుకొని పైకి లేపాడు. వెంటనే వాని పాదాలూ, చీలమండలూ బలం పొందాయి.
\v 8 వాడు వెంటనే లేచి నడవడం మొదలు పెట్టాడు. నడుస్తూ గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ వారితో పాటు దేవాలయం లోకి వెళ్ళాడు.
\s5
\v 9 వాడు నడుస్తూ దేవుణ్ణి కీర్తించడం ప్రజలందరూ చూశారు.
\v 10 'సౌందర్యం అనే దేవాలయ ద్వారం దగ్గర అడుక్కోడానికి కూర్చున్నవాడు వీడే' అని గుర్తుపట్టి, అతనికి జరిగిన దానిని చూసి ఆశ్చర్యంలో, విస్మయంలో మునిగిపోయారు.
\s5
\p
\v 11 వాడు పేతురు, యోహానులను అంటిపెట్టుకుని ఉండగా జనమంతా విస్మయం చెంది, సొలొమోను మంటపంలో ఉన్నవారి దగ్గరికి పరుగెత్తుకు వచ్చారు.
\s పేతురు రెండవ ఉపన్యాసం: నిబంధన నెరవేర్పు
\p
\v 12 పేతురు దీన్ని చూసి ప్రజలతో ఇలా అన్నాడు, "ఇశ్రాయేలీయులారా, దీని గురించి మీరెందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంతశక్తితోనో , భక్తితోనో ఇతడు నడిచేలా చేశామన్నట్టు మీరెందుకు మా వైపు అదేపనిగా చూస్తున్నారు?
\s5
\v 13 అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడు, అంటే మన పూర్వికుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమ పరిచాడు. అయితే మీరాయన్ని పిలాతుకు అప్పగించారు, అతడు ఆయనను విడుదల చేయడానికి నిశ్చయించుకున్నపుడు మీరు అతని ఎదుట ఆయనను తిరస్కరించారు.
\v 14 పవిత్రుడూ నీతిమంతుడైన వానిని మీరు తిరస్కరించి, హంతకుణ్ణి మీకోసం విడుదల చేయాలని అడిగారు.
\s5
\v 15 మీరు జీవానికి కర్తను చంపించారు కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు. అందుకు మేమే సాక్షులం.
\v 16 ఆయన నామంలో ఉంచిన విశ్వాసమే మీరు చూసి ఎరిగిన ఇతనిని బలపరచింది, యేసుపై ఉన్న విశ్వాసమే మీ అందరి ముందు ఇతనికి ఈ సంపూర్ణ స్వస్థత కలిగించింది.
\s5
\v 17 సోదరులారా, మీరూ మీ నాయకులూ తెలియక చేశారని నాకు తెలుసు.
\v 18 అయితే తన క్రీస్తు తప్పక బాధల పాలు కావాలని దేవుడు ప్రవక్తలందరి ద్వారా ముందే తెలియచేసిన సంగతులను ఆయన ఇప్పుడు నెరవేర్చాడు.
\s5
\v 19 కనుక పశ్చాత్తాపపడి తిరగండి. అప్పుడు ప్రభువు సన్నిధినుండి విశ్రాంతి సమయాలు వస్తాయి.
\v 20 అభిషిక్తుడైన క్రీస్తు యేసును మీ కోసం ఆయన పంపుతాడు. మీ పాపాలు తుడిచి వేస్తాడు.
\s5
\v 21 అన్నిటికీ పునరుద్ధరణ సమయం వస్తుందని దేవుడు లోకారంభం నుండి తన పరిశుద్ధ ప్రవక్తలచేత చెప్పించాడు. అంతవరకు యేసు పరలోకంలో ఉండడం అవసరం.
\v 22 మోషే నిజంగా యిలా అన్నాడు కదా "ప్రభువైన దేవుడు నాలాంటి ఒక ప్రవక్తను మీ సొంత ప్రజల్లో నుండి మీకోసం పుట్టిస్తాడు. ఆయన మీతో చెప్పేదంతా మీరు తప్పకుండా వినాలి.
\v 23 ఆ ప్రవక్త చెప్పేది పెడచెవిన పెట్టేవాడు ప్రజల్లో ఉండకుండ సర్వనాశనమై పోతాడు.
\s5
\v 24 సమూయేలుతో మొదలుపెట్టి మిగతా ప్రవక్తలంతా ఈ రోజుల గురించి ముందుగా చెప్పారు.
\v 25 నీ సంతానం ద్వారా భూమి మీద ఉన్న కుటుంబాలన్నిటినీ ఆశీర్వదిస్తానని దేవుడు అబ్రహాముతో చెప్పినట్టుగా మీరు ప్రవక్తలకూ నిబంధనకూ వారసులు. ఆ నిబంధనను దేవుడు మీ పూర్వికులతో చేశాడు.
\v 26 దేవుడు తన సేవకుని పుట్టించి, మీలో ప్రతివానినీ వాని దుష్టత్వం నుండి తప్పించడం ద్వారా మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఆయనను మొదట మీ దగ్గరికి పంపాడు."
\s5
\c 4
\s హింసలు ఆరంభం
\p
\v 1 పేతురు యోహానులు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నపుడు యాజకులూ, దేవాలయపు అధికారీ, సద్దూకయ్యులూ వారిమీదికి వచ్చారు.
\v 2 వారు యేసుని గూర్చి బోధిస్తూ ఆయన చనిపోయి తిరిగి లేచాడని ప్రకటించడం విని కలవరపడ్డారు.
\v 3 వారిని బలవంతంగా పట్టుకొని, సాయంకాలం అయిందని మరునాటి వరకు వారిని ఖైదు లో ఉంచారు.
\v 4 వాక్యం విన్నవారిలో చాలామంది నమ్మారు. వారిలో పురుషుల సంఖ్య దాదాపు అయిదువేలు.
\s సన్ హెడ్రిన్ సభ ఎదుట పేతురు
\s5
\p
\v 5 మరుసటి రోజు వారి అధికారులూ పెద్దలూ ధర్మశాస్త్ర పండితులూ యెరూషలేములో సమావేశమయ్యారు.
\v 6 ప్రధాన యాజకుడైన అన్న, కయప, యోహాను, అలెగ్జాండర్, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో ఉన్నారు.
\v 7 వారు పేతురు యోహానులను వారి మధ్యలో నిలబెట్టి, "మీరు ఏ అధికారంతో ఏ నామంలో దీనిని చేసార" ని అడిగారు
\s5
\v 8 పేతురు పరిశుద్ధాత్మతో నిండిపోయి ఇలా అన్నాడు, "ప్రజల అధికారులారా, పెద్దలారా,
\v 9 ఆ కుంటివాడికి చేసిన మంచి పని గురించి, వాడెలా బాగుపడ్డాడని ఇవాళ మమ్మల్ని ప్రశ్నిస్తున్నట్టయితే
\v 10 ఇశ్రాయేలు ప్రజలైన మీరంతా తెలుసుకోవలసింది ఏమంటే, మీరు సిలువ వేసిన, మృతుల్లో నుండి దేవుడు లేపిన నజరేయుడైన యేసుక్రీస్తు నామాన్నే వీడు బాగుపడి మీ ముందు నిల్చున్నాడు.
\s5
\v 11 ఇల్లు కట్టే మీరు వదిలేసిన రాయి ఆయనే. ఆ రాయి భవనానికి ఆధార శిల అయ్యింది.
\v 12 ఎవ్వరివల్లా రక్షణ రాదు. ఈ నామంలోనే మనం రక్షణ పొందాలి గాని, ఆకాశం కింద ఉన్న మనుషుల్లోని మరి ఏ నామం లోనూ రక్షణ పొందలేము."
\s యేసు నామం ప్రకటించడం నిషేధం
\s5
\p
\v 13 వారు పేతురు యోహానుల ధైర్యాన్ని చూసి, వారు చదువులేని సామాన్యులని తెలిసికొని ఆశ్చర్యపడి, వారు యేసుతో ఉండేవారు అని గుర్తించారు.
\v 14 బాగుపడ్డ ఆ వ్యక్తి వారితోపాటు నిలబడడం చూసి ఏమీ ఎదురు చెప్పలేకపోయారు.
\s5
\v 15 అధికారులు సభాస్థలం నుంచి బయటికి వెళ్ళండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసుకొని,
\v 16 'ఈ మనుషులను మనమేం చేద్దాం? వారిద్వారా గొప్ప అద్భుతం జరిగిందని యెరూషలేములో నివసిస్తున్న వారందరికీ తెలుసు, అది జరగలేదని చెప్పలేం.
\v 17 అయినా ఇది జనాల్లోకి యింకా వెళ్ళకుండా, ఇకనుండి ఈ నామంతో ఎవరితోనూ మాట్లాడ వద్దని మనం వారిని బెదిరిద్దాం' అని చెప్పుకొన్నారు.
\v 18 అప్పుడు వారిని పిలిపించి, "మీరు యేసు నామంలో ఏ మాత్రం మాట్లాడకూడదు, బోధించకూడదు" అని వారికి ఆజ్ఞాపించారు.
\s5
\v 19 అందుకు పేతురు యోహాను వారిని చూసి, "దేవుని మాట కంటె మీ మాట వినడం దేవుని దృష్టికి న్యాయమేనా? మీరే చెప్పండి.
\v 20 మేమేం చూశామో, ఏమి విన్నామో వాటిని చెప్పకుండా ఉండలేము" అని వారికి జవాబిచ్చారు.
\s5
\v 21 ప్రజలందరూ జరిగిన దానిని గురించి దేవుని కొనియాడుతున్నారు కాబట్టి సభవారు ప్రజలకు భయపడి, వీరిని ఎలా శిక్షించాలో తెలియక గట్టిగా బెదరించి విడుదల చేశారు.
\v 22 అద్భుతంగా బాగుపడిన వాడి వయస్సు నలభై ఏళ్ళు పై మాటే.
\s విశ్వాసులు మరలా ఆత్మతో నిండిపోవడం
\s5
\p
\v 23 పేతురు యోహానులు విడుదలై తమ సొంతవారి దగ్గరికి వచ్చి, ప్రధాన యాజకులూ పెద్దలూ తమతో చెప్పిన మాటలన్నీ వారికి చెప్పారు.
\v 24 వారు విని, ఒకే మనస్సుతో దేవునికిలా గొంతెత్తి మొరపెట్టారు. 'ప్రభూ, నీవు ఆకాశాన్నీ భూమినీ సముద్రాన్నీ వాటిలోని సమస్తాన్నీ కలుగజేశావు.
\p
\v 25 యూదేతరులు ఎందుకు అల్లరి చేసారు?
\q1
\s5
\v 26 ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొన్నారు?
\q1 ప్రభువు మీదా ఆయన క్రీస్తు మీదా భూరాజులు లేచారు,
\q1 అధికారులు ఏకమయ్యారు
\q1 అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా, నీ సేవకుడూ, మా తండ్రీ అయిన దావీదుతో చెప్పించావు.
\s5
\v 27 ఏవి జరగాలని నీవు సంకల్పించి ముందుగానే నిర్ణయించావో,
\v 28 వాటన్నిటినీ చేయడానికి నీవు అభిషేకించిన నీ పవిత్ర సేవకుడైన యేసుకు విరోధంగా హేరోదు, పొంతి పిలాతు, యూదేతరులు, ఇశ్రాయేలు ప్రజలతో కలిసి ఈ పట్టణంలో ఒక్కటయ్యారు.
\s5
\v 29 ప్రభూ, వారి బెదరింపులు గమనించి
\v 30 రోగుల్ని బాగుచేయడానికీ, నీ పవిత్ర సేవకుడైన యేసు పేరున సూచక క్రియలనూ, మహత్కార్యాలనూ చేయడానికీ నీ చేయి చాపి ఉండగా, నీ సేవకులు బహు ధైర్యంగా నీ వాక్యం బోధించేలా అనుగ్రహించు.'
\v 31 వారు ప్రార్థన చేయగానే వారు సమావేశమై ఉన్న చోటు కంపించింది. అప్పుడు వారంతా పరిశుద్ధాత్మతో నిండిపోయి దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించారు.
\s యెరూషలేములో దేవుని సంఘం
\s5
\p
\v 32 విశ్వసించిన వారంతా ఏకహృదయం, ఏకాత్మ కలిగి ఉన్నారు. ఎవరూ తన ఆస్తిపాస్తుల్లో ఏదీ తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతా సమష్టిగా ఉంచుకున్నారు.
\v 33 అపొస్తలులు గొప్ప ప్రభావంతో ప్రభువైన యేసు పునరుత్థానాన్ని గురించి సాక్ష్యమిచ్చారు. గొప్ప దైవ కృప అందరినీ ఆవరించింది.
\s5
\v 34 భూములూ ఇళ్ళూ ఉన్నవారంతా వాటిని అమ్మేసి, ఆ డబ్బు అపొస్తలుల పాదాల దగ్గర పెట్టారు.
\v 35 వారు ప్రతివారికీ అవసరం చొప్పున పంచి పెట్టారు కాబట్టి వారిలో ఎవరికీ కొదువ లేకపోయింది.
\s5
\p
\v 36 సైప్రస్ దీవికి చెందిన యోసేపు అనే ఒక లేవీయునికి అపొస్తలులు 'బర్నబా' అనే పేరు పెట్టారు. ఆ పేరుకు అర్థం ఆదరణ పుత్రుడు. ఇతడు తనకున్న పొలం అమ్మేసి
\v 37 ఆ డబ్బు తెచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టాడు.
\s5
\c 5
\s అననీయ, సప్పిర ల మరణకరమైన పాపం
\p
\v 1 అననీయ అనే ఒక వ్యక్తి తన భార్య సప్పీరాతో కలిసి పొలం అమ్మాడు.
\v 2 భార్యకు తెలిసే అతడు ఆ డబ్బులో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టాడు.
\s5
\v 3 అప్పుడు పేతురు, "అననీయా, నీ భూమి ఖరీదులో కొంత దాచుకొని సాతాను ప్రేరణకు లొంగి పరిశుద్ధాత్మను ఎందుకు మోసగించావు?
\v 4 అది నీ దగ్గరున్నపుడు నీదే గదా? అమ్మిన తర్వాత ఆ డబ్బు నీ ఆధీనంలోనే ఉంది కదా! ఈ సంగతిని ఎందుకు నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవుని తోనే అబద్ధమాడావ" ని అతనితో చెప్పాడు.
\v 5 అననీయ ఈ మాటలు వింటూనే కుప్పకూలి ప్రాణం విడిచాడు. అది విన్నవారందరికీ చాలా భయం వేసింది.
\v 6 అప్పుడు కొందరు యువకులు వచ్చి అతణ్ణి గుడ్డలో చుట్టి మోసుకుపోయి పాతిపెట్టారు.
\s5
\p
\v 7 సుమారు మూడుగంటల తర్వాత అతని భార్య ఏం జరిగిందో తెలియక లోపలికి వచ్చింది.
\v 8 అప్పుడు పేతురు "మీరు ఆ పొలాన్ని ఇంతకే అమ్మారా? నాతో చెప్పు" అని ఆమెనడిగాడు. అందుకామె "అవును, యింతకే అమ్మాము" అని చెప్పింది.
\s5
\v 9 అందుకు పేతురు "ప్రభువు ఆత్మను పరీక్షించడానికి మీరెందుకు ఒకటయ్యారు? ఇదిగో, నీ భర్తను పాతిపెట్టిన వారింకా లోపలికైనా రాలేదు. వారు నిన్నూ మోసికొని పోతారు" అని ఆమెతో చెప్పాడు.
\v 10 వెంటనే ఆమె అతని కాళ్ళ దగ్గర పడి ప్రాణం విడిచింది. ఆ యువకులు లోపలికి వచ్చి ఆమె చనిపోయిందని చూసి ఆమెనూ మోసికొనిపోయి, ఆమె భర్త పక్కనే పాతిపెట్టారు.
\v 11 సంఘమంతటికీ, ఇంకా ఈ సంగతులు విన్న వారందరికీ చాలా భయం వేసింది.
\s సంఘం మహాత్మ్యం
\s5
\p
\v 12 ప్రజల మధ్య అపొస్తలుల ద్వారా అనేక సూచకక్రియలూ అద్భుతాలూ జరుగుతూ ఉన్నాయి. నమ్మిన వారంతా కలిసి సొలొమోను మంటపంలో కలుసుకుంటూ ఉన్నారు.
\v 13 తక్కిన వారిలో ఎవరికీ వారితో కలిసే ధైర్యం లేదు. అయితే
\s5
\v 14 సామాన్య ప్రజలు వారిని గౌరవిస్తూ ఉన్నారు. చాలా మంది స్త్రీ పురుషులు విశ్వసించి ప్రభువు పక్షాన చేరారు.
\v 15 పేతురు వస్తూ ఉంటే ప్రజలు రోగుల్ని వీధుల్లోకి తెచ్చి, వారి మీద అతని నీడ అయినా పడాలని మంచాల మీదా పరుపుల మీదా వారిని ఉంచారు.
\v 16 యెరూషలేము చుట్టూ ఉన్న పట్టణాల్లోని ప్రజలు, రోగుల్నీ దురాత్మల చేత బాధల పాలౌతున్న వారినీ తీసుకొచ్చారు. వారంతా బాగుపడ్డారు.
\s రెండవ సారి హింసాకాండ
\s5
\p
\v 17 ప్రధాన యాజకుడూ అతనితో పాటు ఉన్నవారంతా, అంటే సద్దూకయ్యుల తెగ వారంతా అసూయతో నిండిపోయి
\v 18 అపొస్తలుల్ని పట్టుకొని పట్టణం లోని చెరసాలలో వేశారు.
\s5
\v 19 అయితే ప్రభువు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొచ్చి "మీరు వెళ్లి దేవాలయంలో నిలబడి
\v 20 ఈ జీవాన్ని గూర్చిన మాటలన్నిటినీ ప్రజలకు చెప్పంది " అని వారితో అన్నాడు.
\v 21 వారా మాట విని, ఉదయాన్నే దేవాలయానికి వెళ్లి బోధిస్తూ ఉన్నారు. ప్రధాన యాజకుడూ, అతనితో ఉన్నవారూ వచ్చి, మహాసభ వారినీ ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పిలిపించి వారిని తీసుకు రమ్మని మనుషులను చెరసాలకు పంపారు.
\s5
\v 22 భటులు అక్కడికి వెళ్లి, వారు చెరసాలలో కనబడక పోయేసరికి తిరిగివచ్చి
\v 23 "చెరసాల చాలా భద్రంగా మూసి ఉంది. కావలివారు తలుపుల ముందు నిలబడి ఉండడం చూశాం గానీ తలుపులు తీసినప్పుడు లోపల మాకెవరూ కనబడలేదని" వారికి తెలిపారు.
\s5
\v 24 దేవాలయం అధికారీ, ప్రధాన యాజకులూ ఆ మాట విని 'ఇది ఏమవుతుందోన'ని వారి విషయమై అయోమయంలో పడిపోయారు.
\v 25 అప్పుడొకడు వచ్చి "మీరు జైల్లో వేయించిన మనుషులు దేవాలయంలో నిలబడి ప్రజలకు బోధిస్తూ ఉన్నారు" అని చెప్పాడు.
\s5
\v 26 అప్పుడు అధికారి సైనికులతో కూడా పోయి, ప్రజలు రాళ్లతో కొడతారేమోనని భయపడి, సౌమ్యంగానే
\v 27 వారిని తీసికొని వచ్చి మహాసభ ముందుంచాడు.
\v 28 ప్రధాన యాజకుడు వాళ్ళతో "ఈ పేరున బోధించవద్దని మేము మీకు ఖచ్చితంగా ఆజ్ఞాపించాము గదా. అయినా మీరు యెరూషలేమును మీ బోధతో నింపి, ఈ వ్యక్తి హత్యానేరాన్ని మా మీదికి తేవాలని చూస్తున్నారు" అని చెప్పాడు.
\s అపోస్తలుల జవాబు
\s5
\p
\v 29 అందుకు పేతురు, మిగిలిన అపొస్తలులు యిలా జవాబిచ్చారు "మనుషులకు కాదు, దేవునికే మేము లోబడాలి గదా.
\v 30 మీరు మానుకు వేలాడదీసి చంపిన యేసును మన పితరుల దేవుడు లేపాడు.
\v 31 ఇశ్రాయేలుకు హృదయ పరివర్తనా , పాప క్షమాపణ దయచేయడానికి దేవుడాయన్ని అధికారిగా రక్షకునిగా తన కుడివైపున ఉండే స్థాయికి హెచ్చించాడు.
\v 32 మేమూ, దేవుడు తన విధేయులకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మా, ఈ సంగతులకు సాక్షులం."
\s5
\v 33 వారీమాట విని తీవ్ర కోపంతో వీరిని చంపాలని చూశారు.
\v 34 అప్పుడు అందరి గౌరవం చూరగొన్న ధర్మశాస్త్ర బోధకుడు గమలీయేలు అనే ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి "ఈ అపొస్తలులను కాసేపు బయట ఉంచ" మని ఆజ్ఞాపించి వారితో ఇలా అన్నాడు.
\s గమలియేలు హితవు
\s5
\p
\v 35 "ఇశ్రాయేలీయులారా, ఈ మనుషులకు మీరేమి చేయాలని చూస్తున్నారో జాగ్రత్త సుమా.
\v 36 కొంతకాలం క్రితం థూదా లేచి తాను గొప్పవాడినని చెప్పుకున్నాడు. సుమారు నాలుగు వందల ది అతనితో కలిశారు. అతడు హతుడయ్యాడు. అతనిని అనుసరించిన వాళ్ళంతా చెల్లా చెదరై పోయారు.
\v 37 అతని తర్వాత జనాభా లెక్కలు తీసే రోజుల్లో గలలీవాడైన యూదా అనేవాడు లేచి, కొంతమందిని తన వైపుకు ఆకర్షించాడు. వాడు కూడా నశించిపోయాడు, వాణ్ణి అనుసరించిన వాళ్ళంతా చెదరిపోయారు.
\s5
\v 38 కాబట్టి నేను మీతో చెప్పేది ఏమంటే ఈ మనుషుల జోలికి వెళ్ళకుండా వారిని విడిచిపెట్టండి. ఈ ఆలోచన గానీ వారి పనిగానీ మనుషుల వలన కలిగినదైతే, అది వ్యర్థమై పోతుంది.
\v 39 దేవుని వలన కలిగినదైతే వారిని మీరు ఓడించలేరు. మీరొకవేళ దేవునితో పోరాడే వారవుతారేమో కదా."
\s5
\v 40 వారతని మాటకు అంగీకరించి, అపొస్తలుల్ని పిలిపించి వారిని కొట్టించి, యేసు పేరున బోధించ వద్దని ఆజ్ఞాపించి విడుదల చేశారు.
\v 41 ఆ నామాన్ని బట్టి అవమానం పొందడానికి పాత్రులని దేవుడు తమను ఎంచినందుకు అపోస్తలులు సంతోషిస్తూ మహాసభ నుండి వెళ్లిపోయారు.
\v 42 ప్రతిరోజూ దేవాలయంలో, ఇంటింటా మానకుండా బోధిస్తూ, యేసే క్రీస్తని ప్రకటిస్తూ వచ్చారు.
\s5
\c 6
\s ప్రథమ సంఘ పరిచారకులు
\p
\v 1 ఆ రోజుల్లో శిష్యుల సంఖ్య పెరుగుతున్నపుడు రోజువారీ భోజనాల వడ్డనల్లో తమలోని విధవరాళ్ళను చిన్నచూపు చూస్తున్నారని గ్రీకు భాష మాట్లాడే యూదులు హీబ్రూ భాష మాట్లాడే యూదుల మీద ఫిర్యాదు చేసారు.
\s5
\v 2 అప్పుడు పన్నెండుమంది అపొస్తలులు శిష్యుల సమూహాన్ని తమ దగ్గరికి పిలిచి, "మేము దేవుని వాక్యాన్ని బోధించడం మాని భోజనాలు వడ్డించడం మంచిది కాదు.
\v 3 కాబట్టి సోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండిన వారై, మంచి పేరున్న ఏడుగురిని మీలో ఏర్పరచుకోండి. మేము వారిని ఈ పనికి నియమిస్తాం.
\v 4 మేము మాత్రం ప్రార్థనలోనూ, వాక్య పరిచర్యలోనూ కొనసాగుతూ ఉంటాం" అన్నారు.
\s5
\v 5 ఈ మాట అందరికీ నచ్చింది. కాబట్టి, వారు విశ్వాసంతోనూ పవిత్రాత్మతోనూ నిండి ఉన్న స్తెఫను, ఇంకా ఫిలిప్పు, ప్రొకొరు, నీకానొరు, తీమోను, పర్మెనాసు, యూదామతంలోకి మారిన అంతియొకయ నివాసి నీకొలాసు అనేవారిని ఎంచుకున్నారు.
\v 6 వారిని అపొస్తలుల ముందుంచారు. అపోస్తలులు ప్రార్థన చేసి వారిమీద చేతులుంచారు.
\s5
\p
\v 7 దేవుని వాక్యం అంతకంతకూ వ్యాపించి శిష్యుల సంఖ్య యెరూషలేములో పెరిగిపోయింది. యాజకుల్లో కూడా చాలామంది విశ్వసించారు.
\s మూడవ హింసాకాండ: మహాసభ ఎదుట స్తెఫను
\s5
\p
\v 8 స్తెఫను కృపతో, బలంతో నిండి ప్రజల మధ్య అద్భుతాలనూ గొప్ప సూచక క్రియలనూ చేస్తున్నాడు.
\v 9 అయితే 'స్వతంత్రుల సమాజం' అనే సమాజానికి చెందినవారూ, కురేనీయులూ, అలెగ్జాండ్రియా వారు, కిలికియ, ఆసియాకు చెందిన కొంత మందీ వచ్చి స్తెఫనుతో తర్కించారు గాని
\s5
\v 10 అతని మాటల్లోని తెలివినీ, అతనిని ప్రేరేపించిన ఆత్మనూ వారు ఎదిరించలేక పోయారు.
\v 11 అప్పుడు వారు 'వీడు మోషే మీదా దేవుని మీదా దూషణ మాటలు పలుకుతుంటే మేము విన్నామ'ని చెప్పడానికి రహస్యంగా కొంతమందిని కుదుర్చుకున్నారు.
\s5
\v 12 ప్రజలను, పెద్దలను, ధర్మ శాస్త్ర పండితులనూ రేపి అతని మీదికి వచ్చి
\v 13 అతణ్ణి పట్టుకొని మహాసభ ముందుకు తీసికొనిపోయి అబద్ధపు సాక్షులను నిలబెట్టారు. వారు "ఈ వ్యక్తి ఎప్పుడూ ఈ పరిశుద్ధ స్థలానికీ మన ధర్మశాస్త్రానికీ విరోధంగా మాట్లాడుతున్నాడు.
\v 14 నజరేయుడైన యేసు ఈ చోటును పాడుచేసి, మోషే మనకిచ్చిన ఆచారాలను మారుస్తాడని వీడు చెప్పగా మేము విన్నాము" అని చెప్పారు.
\v 15 సభలో కూర్చున్న వారంతా అతని వైపు తేరి చూసినపుడు అతని ముఖం దేవదూత ముఖంలా వారికి కనబడింది.
\s5
\c 7
\p
\v 1 ప్రధాన యాజకుడు 'ఈ మాటలు నిజమేనా?' అని అడిగాడు.
\s మహాసభ ఎదుట స్తెఫను ప్రసంగం: ఇశ్రాయేలు చరిత్ర
\p
\v 2 అందుకు స్తెఫను చెప్పింది ఏమంటే "సోదరులారా, తండ్రులారా, వినండి. మన పూర్వీకుడైన అబ్రాహాము హారానులో నివసించక ముందు మెసెపోటేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై
\v 3 'నీవు నీ దేశాన్నీ, నీ సొంతజనాన్నీ విడిచి బయలుదేరి, నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్ళమ'ని చెప్పాడు.
\s5
\p
\v 4 అప్పుడతడు కల్దీయుల దేశాన్ని విడిచి హారానులో నివసించాడు. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడనుండి మీరిప్పుడు నివసిస్తున్న ఈ దేశంలో నివసించడానికి దేవుడతన్ని తీసుకొచ్చాడు.
\v 5 ఆయన ఇందులో అతనికి కనీసం కాలుపెట్టేంత స్థలం కూడా సొంత భూమిగా ఇవ్వకుండా, అతడికి సంతానం లేనపుడు అతనికీ, అతని తర్వాత అతని సంతానానికీ దీన్ని స్వాధీనం చేస్తానని వాగ్దానం చేశాడు.
\s5
\p
\v 6 అయితే దేవుడు అతని సంతానం పరాయి దేశంలో కొంతకాలం ఉంటారనీ, ఆ దేశస్థులు వారిని 400 ఏళ్ళు బానిసలుగా బాధపెడతారనీ చెప్పాడు.
\v 7 అంతేగాక వారు బానిసలుగా ఉండబోతున్న ఆ దేశాన్ని తాను శిక్షిస్తాననీ ఆ తర్వాత వారు బయటికి వచ్చి ఈ స్థలంలో తనను ఆరాధిస్తారనీ దేవుడు చెప్పాడు.
\v 8 ఆయన అబ్రాహాముకు సున్నతితో కూడిన ఒక ఒడంబడికను ఇచ్చాడు. అతడు ఇస్సాకును కని ఎనిమిదవ రోజున సున్నతి చేసాడు. ఇస్సాకు యాకోబును, యాకోబు పన్నెండుమంది గోత్ర మూలపురుషులనూ కని వాళ్లకి సున్నతి చేశారు.
\s5
\p
\v 9 ఆ గోత్రకర్తలు అసూయతో యోసేపును ఐగుప్తులోకి అమ్మేశారు గాని, దేవుడతనికి తోడుగా ఉండి అతడి బాధలన్నిటిలో నుండి తప్పించాడు.
\v 10 ఐగుప్తు రాజైన ఫరో ముందు అతనికి దయనూ జ్ఞానాన్నీ అనుగ్రహించాడు. ఫరో ఐగుప్తు మీదా తన ఇల్లంతటి మీదా అతనిని అధికారిగా నియమించాడు.
\s5
\p
\v 11 ఆ తర్వాత ఐగుప్తు దేశమంతటి మీదా, కనాను దేశమంతటి మీదా తీవ్రమైన కరువూ, గొప్ప బాధలూ వచ్చాయి. కాబట్టి మన పితరులకు ఆహారం దొరకలేదు.
\v 12 ఐగుప్తులో తిండి గింజలున్నాయని యాకోబు తెలుసుకొని మన పూర్వీకులను అక్కడికి మొదటిసారి పంపాడు.
\v 13 వారు రెండవసారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములకు తనను తాను తెలియచేసుకున్నాడు. అప్పుడు యోసేపు కుటుంబం గురించి ఫరోకు తెలిసింది.
\s5
\p
\v 14 యోసేపు తన తండ్రి యాకోబునూ, తన సొంత వారందరినీ పిలిపించాడు. వారు మొత్తం 75 మంది.
\v 15 యాకోబు ఐగుప్తు వెళ్ళాడు. అతడూ మన పితరులూ అక్కడే చనిపోయారు. వారిని షెకెము అనే ఊరికి తెచ్చి
\v 16 హమోరు సంతతి దగ్గర అబ్రాహాము వెల ఇచ్చి కొన్న సమాధిలో ఉంచారు.
\s5
\p
\v 17 అయితే దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసిన సమయం దగ్గరపడే కొద్దీ ప్రజలు ఐగుప్తులో విస్తారంగా వృద్ధి చెందారు.
\v 18 చివరికి యోసేపును గూర్చి తెలియని వేరొక రాజు ఐగుప్తులో అధికారానికి వచ్చేవరకూ అలా జరిగింది.
\v 19 ఆ రాజు మన జాతి ప్రజలని మోసగించి, వారికి పుట్టిన పిల్లలు బతక్కుండా వారిని బయట పారేసేలా మన పూర్వీకులను పీడించాడు.
\s5
\p
\v 20 ఆ రోజుల్లో మోషే పుట్టాడు. అతడు చాలా అందగాడు. తన తండ్రి ఇంట్లో మూడు నెలలు పెరిగాడు.
\v 21 అతనిని బయట పారేస్తే ఫరో కుమార్తె ఆ బిడ్డను తీసికొని తన కుమారునిగా పెంచుకొంది.
\s5
\v 22 మోషే ఐగుప్తీయుల అన్ని విద్యలూ నేర్చుకొని, మాటల్లో, చేతల్లో ఎంతో ప్రావీణ్యం సంపాదించాడు.
\v 23 అతనికి సుమారు నలభై ఏళ్ళ వయసప్పుడు ఇశ్రాయేలీయులైన తన స్వంత ప్రజలను చూడాలని నిశ్చయించుకున్నాడు.
\v 24 అప్పుడు వాళ్ళలో ఒకడు అన్యాయానికి గురి కావడం చూసి, అతనిని కాపాడి అతడి పక్షాన ఒక ఐగుప్తు వాణ్ణి చంపి ప్రతీకారం చేశాడు.
\v 25 తన ద్వారా తన ప్రజను దేవుడు విడుదల చేస్తున్నాడనే సంగతి వారు గ్రహిస్తారని అతడనుకున్నాడు గాని వారు గ్రహించలేదు.
\s5
\p
\v 26 ఆ తర్వాతి రోజు ఇద్దరు పోట్లాడుకుంటుంటే అతడు వారిని చూసి 'అయ్యలారా, మీరు సోదరులు. మీరెందుకు ఒకరికొకరు అన్యాయం చేసుకుంటున్నార'ని వారికి సర్దిచెప్పాలని చూశాడు.
\v 27 అయితే తన పొరుగువాడికి అన్యాయం చేసినవాడు 'మామీద అధికారిగా, న్యాయనిర్ణేతగా నిన్నెవరు నియమించారు?
\v 28 నిన్న ఐగుప్తు వాణ్ణి చంపినట్టు నన్నూ చంపాలనుకుంటున్నావా?' అని చెప్పి అతణ్ణి నెట్టేశాడు .
\s5
\p
\v 29 మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశంలో విదేశీయుడుగా ఉంటూ, అక్కడే ఇద్దరు కొడుకులను కన్నాడు.
\v 30 నలభై ఏళ్లయిన తర్వాత సీనాయి పర్వతారణ్యంలో, ఒక మండుతున్న పొద లోని అగ్నిమంటల్లో దేవదూత అతనికి కనిపించాడు.
\s5
\v 31 మోషే అది చూసి ఆ దర్శనానికి ఆశ్చర్యపడి దానిని స్పష్టంగా చూడ్డానికి దగ్గరకు వచ్చినపుడు
\v 32 'నేను నీ పూర్వీకుల దేవుణ్ణి, అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుణ్ణి' అన్న ప్రభువు మాట వినబడింది. మోషే వణికిపోతూ, అటు చూడడానికి సాహసించలేక పోయాడు.
\s5
\v 33 ప్రభువు అతనితో ఇలా అన్నాడు, 'నీ చెప్పులు తీసివెయ్యి . నీవు నిలబడిన చోటు పవిత్ర స్థలం.
\v 34 ఐగుప్తులో ఉన్న నా ప్రజల యాతన చూశాను. వారి మూలుగులు విన్నాను. వారిని విడిపించడానికి దిగి వచ్చాను. రా, నేనిప్పుడు నిన్ను ఐగుప్తుకు పంపుతాను.'
\s5
\p
\v 35 'మాపై అధికారిగా, న్యాయనిర్ణేతగా నిన్ను నియమించినవాడు ఎవడ'ని వారు నిరాకరించిన ఈ మోషేను, అతనికి పొదలో కనబడిన దూత ద్వారా దేవుడు అధికారిగా విమోచకునిగా నియమించి పంపాడు.
\v 36 మోషే ఐగుప్తులో, ఎర్రసముద్రంలో, అరణ్యంలో నలభై ఏళ్ళు అనేక అద్భుతాలనూ మహత్కార్యాలనూ సూచక క్రియలనూ చేసి వారిని ఐగుప్తు నుండి తోడుకొని వచ్చాడు.
\q1
\v 37 'నాలాటి ఒక ప్రవక్తను దేవుడు మీ సోదరుల్లో బయలు దేరేలా చేస్తాడు' అని
\q1 ఇశ్రాయేలీయులతో చెప్పింది ఈ మోషేనే.
\s5
\v 38 సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దూతతోనూ మన పూర్వీకులతోనూ అరణ్యంలోని సంఘంలో ఉన్నదీ మన కివ్వడానికి జీవవాక్యాలను తీసికొన్నదీ ఇతడే.
\s ఇశ్రాయేలు అపనమ్మకం
\p
\v 39 మన పూర్వికులు లోబడకుండా ఇతడినే తిరస్కరించి, తమ హృదయాల్లో ఐగుప్తుకు తిరిగి వెళ్లిపోదామనుకున్నారు.
\v 40 అప్పుడు వారు 'మా ముందర నడిచే దేవుళ్ళను మాకోసం ఏర్పాటు చేయి. ఐగుప్తు దేశంనుండి మమ్ములను తోడుకొని వచ్చిన ఈ మోషే ఏమయ్యాడో మాకు తెలియద'ని అహరోనుతో అన్నారు.
\s5
\v 41 ఆ రోజుల్లో వాళ్ళొక దూడను చేసికొని ఆ విగ్రహానికి బలి అర్పించి, తమ చేతులతో చేసిన పనిలో ఆనందించారు.
\v 42 అందుకని దేవుడు ఆకాశ సమూహాలను పూజించడానికి వారిని విడిచిపెట్టేశాడు. ప్రవక్తల గ్రంథంలో రాసి ఉన్నట్టుగా
\q 'ఇశ్రాయేలీయులారా,
\q నలభై ఏళ్ళు మీరు అరణ్యంలో
\q వధించిన పశువులనూ, బలులనూ నాకు అర్పించారా?
\q
\s5
\v 43 మీరు మొలెకు గుడారాన్నీ ,
\q రెఫాను అనే శని దేవుడి నక్షత్రాన్నీ పూజించడానికి మీరు చేసుకున్న ప్రతిమలను మోసుకుపోయారు.
\p కాబట్టి బబులోను అవతలికి మిమ్మల్ని తీసుకుపోతాను.'
\s5
\v 44 అతడు చూసిన నమూనా చొప్పున సాక్ష్యపు గుడారం చేయాలని మోషేతో దేవుడు మాట్లాడి ఆజ్ఞాపించాడు. ఆ సాక్ష్యపు గుడారం అరణ్యంలో మన పితరుల దగ్గర ఉంది.
\v 45 మన పూర్వీకులు దానిని తీసికొని, దేవుడు తమ ఎదుట నుండి వెళ్లగొట్టిన రాజ్యాలను వారు స్వాధీనపర్చుకున్నప్పుడు, యెహోషువతో కూడ ఈ దేశంలోకి దానిని తీసుకొచ్చారు. అది దావీదుకాలం వరకూ ఉంది.
\v 46 దావీదు దేవుని అనుగ్రహం పొంది యాకోబు దేవునికి నివాస స్థలాన్ని నిర్మించాలని ఆశించాడు.
\s5
\v 47 కాని మందిరం కట్టింది సోలోమోను.
\q
\v 48 అయితే, సర్వోన్నతుడు మనుషుల చేతులతో చేసిన ఇళ్ళల్లో నివసించడు.
\q ప్రవక్త చెప్పినట్టుగా
\q
\v 49 'ఆకాశం నా సింహాసనం,
\q భూమి నా పాదపీఠం.
\q మీరు నాకోసం ఎలాంటి ఇల్లు కడతారు?
\q నా విశ్రాంతి స్థలమేది?
\q
\v 50 ఇవన్నీ నా చేతిపనులు కావా?
\q అని ప్రభువు అడుగుతున్నాడు.
\s ఆనాటి ప్రజల పాపం
\s5
\p
\v 51 మీరు మెడ వంచనివారూ, హృదయంలో చెవులలో సున్నతి లేనివారు. మీరు కూడా మీ పూర్వీకుల లాగే ప్రవర్తిస్తున్నారు, ఎప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు.
\v 52 మీ పూర్వీకులు ఏ ప్రవక్తను హింసించకుండా ఉన్నారు? ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందే తెలియచేసిన వారిని చంపేశారు. ఆయన్ని కూడా మీరిప్పుడు అప్పగించి హత్య చేసిన వారయ్యారు.
\v 53 దూతలు అందించిన ధర్మశాస్త్రాన్ని పొందారు గాని దానిని మీరే పాటించలేదు " అని చెప్పాడు.
\s మొదటి హతసాక్షి. పౌలు మొదటి ప్రస్తావన
\s5
\p
\v 54 మహాసభవారు ఈ మాటలు విని కోపంతో మండిపడి స్తెఫనును చూసి పళ్లు కొరికారు.
\v 55 అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండి ఆకాశం వైపు తదేకంగా చూస్తూ, దేవుని తేజస్సును చూశాడు. దేవుని కుడిపక్కన యేసు నిలబడి ఉండడం చూసి
\v 56 "ఆకాశం తెరచుకోవడం, మనుష్యకుమారుడు దేవుని కుడిపక్క నిలిచి ఉండడం చూస్తున్నాను" అని పలికాడు.
\s5
\v 57 అప్పుడు వారు గట్టిగా కేకలు వేస్తూ చెవులు మూసికొని మూకుమ్మడిగా అతని మీదికి వచ్చి
\v 58 అతనిని పట్టణం బయటకు ఈడ్చుకు పోయి, రాళ్ళతో కొట్టారు. సాక్షులు సౌలు అనే యువకుని పాదాల దగ్గర తమ పైబట్టలు పెట్టారు.
\s5
\v 59 వారు స్తెఫనును రాళ్ళతో కొడుతూ ఉన్నపుడు అతడు ప్రభువును సంబోధిస్తూ "యేసు ప్రభూ, నా ఆత్మను చేర్చుకోమ" ని చెప్పాడు.
\v 60 అతడు మోకరించి "ప్రభూ, వీరి మీద ఈ పాపం మోపవద్ద"ని గొంతెత్తి పలికాడు. ఈ మాట పలికి కన్ను మూశాడు. సౌలు అతని చావుకు సమ్మతించాడు.
\s5
\c 8
\s నాలుగవ హింసాకాండ. సౌలు ఆధ్వర్యంలో
\p
\v 1 ఆ రోజునుండి యెరూషలేములోని సంఘానికి తీవ్రమైన హింస మొదలైంది.
\v 2 కాబట్టి, అపొస్తలులు తప్ప అందరూ యూదయ, సమరయ ప్రాంతాల్లోకి పారిపోయారు. భక్తిపరులైన మనుషులు స్తెఫనును సమాధి చేసి అతని గూర్చి చాలా దుఖించారు.
\v 3 అయితే సౌలు ప్రతి ఇంట్లోకి చొరబడి, స్త్రీ పురుషులను ఈడ్చుకుపోయి, చెరసాలలో వేస్తూ సంఘాన్ని పాడుచేస్తున్నాడు.
\s మొట్టమొదటి సువార్త ప్రచారకులు
\s5
\p
\v 4 అయినా, చెదరిపోయిన వారు వాక్యం ప్రకటిస్తూ వెళుతున్నారు.
\s ఫిలిప్పు పరిచర్య
\p
\v 5 ఫిలిప్పు సమరయ ఊరికి వెళ్లి వారికి క్రీస్తును ప్రకటించాడు.
\s5
\v 6 జనసమూహాలు ఫిలిప్పు చేసిన సూచక క్రియలు చూసి అతడు చెప్పిన మాటల మీద ధ్యాస పెట్టారు.
\v 7 చాలా మందికి పట్టిన దురాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదలిపోయాయి. చాలామంది పక్షవాతం వచ్చినవారూ, కుంటివారూ బాగుపడ్డారు.
\v 8 అందుకు ఆ పట్టణంలో చాలా ఆనందం కలిగింది.
\s మంత్రగాడు సిమోను వ్యవహారం
\s5
\p
\v 9 సీమోను అనే ఒకడు అంతకు ముందు అక్కడ మంత్రవిద్య చేస్తూ, తానొక గొప్పవాడినని చెప్పుకొంటూ, సమరయ ప్రజలను ఆశ్చర్యపరిచేవాడు.
\v 10 అల్పులు మొదలుకుని అధికుల వరకూ అందరూ, 'దేవుని మహాశక్తి అంటే ఇతడే' అని చెప్పుకొంటూ అతని మాటలు శ్రద్ధగా విన్నారు.
\v 11 అతడు చాలాకాలం పాటు మంత్రవిద్యలు చేస్తూ వారిని ఆశ్చర్యపరచడం చేత వారతని మాట విన్నారు.
\s5
\v 12 అయితే ఫిలిప్పు దేవుని రాజ్యం గురించీ యేసు క్రీస్తు నామం గురించీ సువార్త ప్రకటిస్తూ ఉంటే, స్త్రీ పురుషులు నమ్మి బాప్తిస్మం పొందారు.
\v 13 అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పుతో ఉంటూ, అతని ద్వారా సూచకక్రియలూ గొప్ప అద్భుతాలూ జరగడం చూసి ఆశ్చర్యపడ్డాడు.
\s5
\v 14 సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించారని యెరూషలేములోని అపొస్తలులు పేతురు యోహానులను వారి దగ్గరికి పంపారు.
\v 15 వారు వచ్చి సమరయ విశ్వాసులు పరిశుద్ధాత్మ పొందేలా వారికోసం ప్రార్థన చేశారు.
\v 16 అంతకు ముందు వారిలో ఎవరి మీదా పరిశుద్ధాత్మ దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు పేరున బాప్తిస్మం మాత్రం పొందారు.
\p
\v 17 అప్పుడు పేతురు, యోహాను వారి మీద చేతులుంచగానే వారు పరిశుద్ధాత్మను పొందారు.
\s5
\v 18 అపొస్తలులు చేతులుంచడం వల్ల పరిశుద్ధాత్మ వారి పైకి దిగడం సీమోను చూసి
\v 19 వారికి డబ్బులివ్వ జూపి 'నేనెవరి మీద చేతులుంచుతానో వాడు పరిశుద్ధాత్మ పొందేలా ఈ అధికారం నాకివ్వండ'ని అడిగాడు.
\s5
\v 20 అందుకు పేతురు "నీవు ధనమిచ్చి దేవుని వరాన్ని పొందాలనుకున్నావు కాబట్టి నీ వెండి నీతో పాటు నశించు గాక.
\v 21 నీ హృదయం దేవునితో సరిగా లేదు కాబట్టి ఈ పనిలో నీకు భాగం లేదు.
\v 22 నీ దుర్మార్గానికి పశ్చాత్తాపపడి ప్రభువును వేడుకో. ఒకవేళ నీ చెడు కోరిక విషయంలో ప్రభువు నిన్ను క్షమించవచ్చు.
\v 23 నువ్వు ఘోర దుష్టత్వపు బంధకాలలో ఉన్నావు. నీ నిలువెల్లా విషమే' అని చెప్పాడు.
\s5
\v 24 అప్పుడు సీమోను 'మీరు చెప్పిన వాటిలో ఏదీ నా మీదికి రాకుండా మీరే నా కోసం ప్రభువుకు ప్రార్ధించమని' జవాబిచ్చాడు.
\s5
\p
\v 25 ఆ తర్వాత వారు సాక్ష్యమిస్తూ ప్రభువు వాక్యం బోధించి యెరూషలేము తిరిగి వెళ్తూ, సమరయ ప్రజల గ్రామాల్లో సువార్త ప్రకటిస్తూ వెళ్ళారు.
\s ఇతియోపియా కోశాధికారి తో ఫిలిప్పు
\s5
\p
\v 26 ప్రభువు దూత ఫిలిప్పుతో 'లే, దక్షిణానికి వెళ్లి, యెరూషలేము నుండి గాజా పోయే అరణ్యమార్గంలో వెళ్ళు' అని చెప్పగానే అతడు లేచి వెళ్ళాడు.
\v 27 అప్పుడు ఇతియోపియా రాణి కందాకే దగ్గర ముఖ్య అధికారిగా ఉంటూ ఆమె ఖజానా అంతటినీ నిర్వహిస్తున్న ఇతియోపియా నపుంసకుడు ఆరాధించడానికి యెరూషలేము వచ్చాడు.
\v 28 అతడు తిరిగి వెళ్తూ, తన రథం మీద కూర్చుని యెషయా ప్రవక్త గ్రంథం చదువుతున్నాడు.
\s5
\v 29 ఆత్మ ఫిలిప్పుతో 'నీవు ఆ రథం దగ్గరకు వెళ్ళి దానిని కలుసుకో' అని చెప్పాడు.
\v 30 ఫిలిప్పు పరుగెత్తుకుంటూ వెళ్లి అతడు ప్రవక్తయైన యెషయా గ్రంథం చదువుతుంటే విని "మీరు చదివేది మీకు అర్థమవుతుందా?" అని అడిగాడు.
\v 31 అతడు "నాకెవరైనా వివరించకపోతే ఎలా అర్థమవుతుంద"ని చెప్పి, రథమెక్కి తన దగ్గర కూర్చోమని ఫిలిప్పును బతిమాలాడు.
\s5
\v 32 ఇతియోపీయుడు చదివే లేఖన భాగం ఏదంటే-
\q1 ఆయనను గొర్రెలా వధకు తెచ్చారు.
\q1 బొచ్చు కత్తిరించే వాడి దగ్గర
\q1 గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్టే ,
\q1 ఆయన నోరు తెరవలేదు.
\q1
\v 33 ఆయన దీనత్వాన్ని బట్టి ఆయనకు న్యాయం దొరకలేదు.
\q1 ఆయన సంతతి గురించి ఎవరు వివరిస్తారు?
\q1 ఎందుకంటే ఆయన ప్రాణాన్ని లోకం నుండి తీసేసారు .
\s5
\p
\v 34 అప్పుడు ఆ నపుంసకుడు, "ప్రవక్త చెప్పేది ఎవరి గురించి ? తన గురించా లేక వేరొక వ్యక్తిని గురించా? దయచేసి చెప్పు" అని ఫిలిప్పును అడిగాడు.
\v 35 ఫిలిప్పు ఆ లేఖనంతో మొదలుపెట్టి యేసును గూర్చిన సువార్తను అతనికి బోధించాడు.
\s5
\v 36 వారు దారిలో వెళ్తూ ఉండగానే కొద్దిగా నీళ్లున్న ఒక చోటికి వచ్చారు. నపుంసకుడు 'ఇక్కడ నీళ్లున్నాయి! నాకు బాప్తిస్మమివ్వడానికి ఆటంకమేంట'ని అడిగి రథాన్ని ఆపమని ఆజ్ఞాపించాడు.
\v 37 ఫిలిప్పు, నపుంసకుడు ఇద్దరూ నీటిలోకి దిగారు.
\v 38 అప్పుడు ఫిలిప్పు అతనికి బాప్తిస్మమిచ్చాడు.
\s5
\v 39 వారు నీళ్లలోనుండి బయటికి వచ్చినపుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును తీసుకొనిపోయాడు. నపుంసకుడు ఆనందిస్తూ తన దారిన వెళ్ళిపోయాడు. అతడు ఫిలిప్పును ఇంకెప్పుడూ చూడలేదు.
\v 40 అయితే ఫిలిప్పు అజోతు అనే ఊళ్ళో కన్పించాడు. అతడు ఆ ప్రాంతం గుండా వెళ్తూ కైసరయ వరకూ అన్ని ఊళ్లలో సువార్త ప్రకటించాడు.
\s5
\c 9
\s సౌలు మార్పు (అపో. కా. 22:1-16; 26:9-18)
\p
\v 1 ప్రభువు శిష్యుల్ని హతమారుస్తానని సౌలు యింకా బుసలుకొడుతూ ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళి
\v 2 యేసు మార్గాన్ని అనుసరించే పురుషులు గానీ స్త్రీలు గానీ తనకు దొరికితే, వారిని బంధించి యెరూషలేముకు తీసికొచ్చేలా దమస్కు ఊరి సమాజ మందిరాల వారికి ఉత్తరాలు రాసి ఇమ్మని అడిగాడు.
\s5
\v 3 అతడు ప్రయాణం చేస్తూ దమస్కు సమీపించే సరికి, అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది.
\v 4 అప్పుడతడు నేల మీద పడిపోయాడు. "సౌలూ, సౌలూ, నీవెందుకు నన్ను హింసిస్తున్నావు?" అనే ఒక శబ్దం విన్నాడు.
\s5
\v 5 "ప్రభూ, నీవెవరివి?" అనిఅతను అడిగినప్పుడు, ప్రభువు "నువ్వు హింసిస్తున్న యేసుని.
\v 6 లేచి పట్టణంలోకి వెళ్ళు, అక్కడ నీవేం చేయాలో అది నీకు తెలుస్తుంది" అని చెప్పాడు.
\v 7 అతనితో కూడా ప్రయాణించే వారు ఆ శబ్దం విన్నారు గాని ఎవర్నీ చూడలేక మాటల్లేక నిలబడిపోయారు.
\s5
\v 8 సౌలు నేలమీద నుండి లేచి కళ్ళు తెరచినా ఏమీ చూడలేకపోయాడు కాబట్టి వారతని చేయి పట్టుకొని దమస్కులోకి నడిపించారు.
\v 9 అతడు మూడు రోజులు చూపు లేకుండా ఉన్నాడు. ఏమీ తినలేదు, తాగలేదు.
\s5
\p
\v 10 దమస్కులో అననీయ అనే ఒక శిష్యుడున్నాడు. ప్రభువు దర్శనంలో "అననీయా" అని అతనిని పిలిచాడు.
\v 11 అతడు "చిత్తం" అన్నాడు. అందుకు ప్రభువు "నువ్వు లేచి, 'ఋజుమార్గం' అనే పేరున్న వీధికి వెళ్ళు. అక్కడ యూదా అనే అతని ఇంట్లో తార్సు ఊరి వాడు సౌలు అనే మనిషి కోసం అడుగు. అతడు ప్రార్థన చేసుకుంటున్నాడు.
\v 12 దర్శనంలో అతడు అననీయ అనే వ్యక్తి లోపలికి వచ్చి అతడు చూపు పొందేలా తల మీద చేతులుంచడం చూశాడు" అని చెప్పాడు.
\s5
\v 13 అయితే అననీయ "ప్రభూ, ఈ వ్యక్తి యెరూషలేము లోని నీ ప్రజలకు ఎంతో కీడు చేశాడని అతని గురించి చాలామంది చెప్పారు.
\v 14 ఇక్కడ కూడా నీ పేరున ప్రార్థన చేసే వాళ్ళందరినీ బంధించడానికి అతడు ప్రధాన యాజకులనుండి అధికారం పొందాడు" అని జవాబిచ్చాడు.
\v 15 అందుకు ప్రభువు "నీవు వెళ్లు, యూదేతరుల ముందూ, రాజుల ముందూ, ఇశ్రాయేలీయుల ముందూ నా నామం భరించడానికి ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనం.
\v 16 ఇతడు నా నామం కోసం ఎన్ని బాధలు అనుభవించాలో నేనతనికి చూపిస్తాను" అని అతనితో చెప్పాడు.
\s5
\v 17 అననీయ వెళ్లి ఆ ఇంట్లో ప్రవేశించి, అతని మీద చేతులుంచి "సౌలా, సోదరా, నీవు వచ్చిన దారిలో నీకు కనబడిన ప్రభు యేసు, నీవు చూపు పొంది, పరిశుద్ధాత్మతో నిండిపోయేలా నన్ను నీ దగ్గరకి పంపాడు" అని చెప్పాడు.
\v 18 వెంటనే అతని కళ్ళ నుండి పొరల్లాంటివి రాలిపోగా అతడు చూపు పొంది, లేచి బాప్తిస్మం పొందాడు. తరువాత భోజనం చేసి బలం పుంజుకున్నాడు.
\s పౌలు సువార్త ప్రకటన
\p
\v 19 అతడు దమస్కులో ఉన్న శిష్యులతో చాలా రోజులు గడిపాడు.
\s5
\v 20 వెంటనే సమాజ మందిరాల్లో యేసే దేవుని కుమారుడని ప్రకటిస్తూ వచ్చాడు.
\v 21 విన్నవారంతా ఆశ్చర్యపడి, యెరూషలేములో ఈ పేరుతో ప్రార్థన చేసే వారిని నాశనం చేసింది ఇతడే కదా? వారిని బందీలుగా ప్రధాన యాజకుల దగ్గరకు తీసుకుపోడానికి ఇక్కడికి కూడా వచ్చాడని చెప్పుకున్నారు.
\v 22 అయితే సౌలు మరింతగా బలపడి 'యేసే క్రీస్తు' అని రుజువు పరుస్తూ దమస్కులో నివసిస్తున్న యూదుల్ని కలవరపరచాడు.
\s5
\p
\v 23 చాలా రోజులు గడిచిన తర్వాత యూదులు అతనిని చంపాలని ఆలోచించారు.
\v 24 వారి కుతంత్రం సౌలుకు తెలిసింది. వారు అతనిని చంపాలని రాత్రింబవళ్ళు ద్వారాల దగ్గర కాపు కాశారు.
\v 25 అయితే అతని శిష్యులు రాత్రి వేళ అతనిని తీసికొనిపోయి గంపలో కూర్చోబెట్టి గోడమీద నుండి అతనిని కిందికి దింపి తప్పించారు.
\s యెరూషలేము సందర్శనం
\s5
\p
\v 26 అతడు యెరూషలేము వచ్చినపుడు శిష్యులతో చేరడానికి ప్రయత్నం చేశాడు గాని, అతడు శిష్యుడని నమ్మలేక అందరూ అతనికి భయపడ్డారు.
\v 27 అయితే బర్నబా అతనిని చేరదీసి అపొస్తలుల దగ్గరికి తీసుకొని వచ్చి 'అతడు దారిలో ప్రభువును చూశాడనీ, ప్రభువు అతనితో మాట్లాడాడనీ, అతడు దమస్కులో యేసు పేరున ధైర్యంగా బోధించాడ'నీ, వారికి వివరంగా తెలియపరచాడు.
\s5
\v 28 అతడు యెరూషలేములో వారితో కలిసి వస్తూ పోతూ,
\v 29 ప్రభువు నామంలో ధైర్యంగా బోధిస్తూ, గ్రీకు యూదులతో తర్కించాడు. అయితే వారు అతణ్ణి చంపాలని ప్రయత్నం చేశారు.
\s పౌలు తార్సుకు తిరుగు ప్రయాణం
\p
\v 30 సోదరులు దీనిని తెలిసికొని అతనిని కైసరయకు తీసుకు వచ్చి తార్సుకు పంపేశారు.
\s5
\p
\v 31 కాబట్టి యూదయ, గలిలయ, సమరయ, ప్రాంతాలంతటా సంఘం ప్రశాంతంగా ఉంటూ అభివృద్ది చెందింది. ప్రభువుపట్ల భయం, పరిశుద్ధాత్మ ప్రసాదించే ఆదరణ కలిగి సాగిపోతూ విస్తరించింది.
\s ఐనెయ స్వస్థత
\p
\v 32 ఆ తరువాత పేతురు ఆ ప్రాంతమంతా తిరిగి, లుద్ద అనే ఊరులో నివసిస్తున్న దేవుని ప్రజల దగ్గరికి వచ్చాడు.
\s5
\v 33 అక్కడ పక్షవాతంతో ఎనిమిది సంవత్సరాల నుండి మంచం పట్టిన ఐనెయ అనే ఒకతన్ని చూసి
\v 34 "ఐనెయా, యేసు క్రీస్తు నిన్ను బాగుచేశాడు, నీవు లేచి నీ చాప సర్దుకో" మని అతనితో చెప్పగానే
\v 35 వెంటనే అతడు పైకి లేచాడు. లుద్దలో, షారోనులో నివసిస్తున్న వారంతా అతనిని చూసి ప్రభువును విశ్వసించారు.
\s తబితకు ప్రాణం పోయడం
\s5
\p
\v 36 యొప్పేలో తబిత అనే ఒక శిష్యురాలు ఉంది. ఈమె అస్తమానం మంచి పనులు చేస్తూ, పేదలను ఆదుకుంటూ ఉండేది.
\v 37 ఆ రోజుల్లో ఆమె జబ్బుపడి చనిపోయింది. ఆమె శవానికి స్నానం చేయించి మేడ గదిలో ఉంచారు.
\s5
\v 38 లుద్ద అనే ఊరు యొప్పేకు దగ్గరగా ఉండడం వల్ల పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని, ఆలస్యం చేయకుండా తమ దగ్గరికి రమ్మని అతనిని బతిమాలడానికి ఇద్దర్ని అతని దగ్గిరికి పంపారు.
\v 39 పేతురు లేచి వారితో కూడా వెళ్ళాడు. అక్కడ చేరినప్పుడు, వారు మేడగదిలోకి అతనిని తీసుకొచ్చారు. వితంతువులందరూ ఏడుస్తూ, దోర్కా తమతో ఉన్నప్పుడు కుట్టిన అంగీలు, బట్టలు చూపిస్తూ అతని పక్కనే నిలబడ్డారు.
\s5
\v 40 పేతురు అందరినీ బయటికి పంపి మోకరించి ప్రార్థన చేశాడు. తరువాత ఆ శవం వైపు తిరిగి "తబితా, లే" అనగానే ఆమె కళ్ళు తెరచి పేతురును చూడగానే లేచి కూర్చుంది.
\v 41 అతడామె చెయ్యి పట్టుకుని పైకి లేపాడు. విశ్వాసుల్నీ, వితంతువులనూ పిలిచి ఆమెను సజీవంగా వారికి అప్పగించాడు.
\v 42 ఇది యొప్పే ప్రాంతమంతా తెలిసింది , చాలామంది ప్రభువులో విశ్వాసముంచారు.
\v 43 పేతురు యొప్పేలో సీమోను అనే జంతు చర్మాలు బాగు చేసే అతని దగ్గర చాలా రోజులున్నాడు.
\s5
\c 10
\s యూదేతరులకు సువార్త. కొర్నేలి దర్శనం
\p
\v 1 కైసరయ పట్టణంలో కొర్నేలి అనే భక్తిపరుడు ఉండేవాడు. ఇతడు ఇటలీ దళానికి చెందిన ఒక శతాధిపతి.
\v 2 అతడు కుటుంబ సమేతంగా దేవుణ్ణి ఆరాధించేవాడు. యూదు ప్రజలకు దానధర్మాలు చేస్తూ ఎప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు.
\s5
\v 3 మధ్యాహ్నం సుమారు మూడు గంటలప్పుడు దేవుని దూత అతని దగ్గరికి వచ్చి "కొర్నేలీ" అని పిలవడం దర్శనంలో స్పష్టంగా చూశాడు.
\v 4 అతడు దూతను తేరి చూసి చాలా భయపడి "ప్రభూ, ఏమిటి?" అని అడిగాడు. అందుకు దూత "నీ ప్రార్థనలూ పేదలకు నీవు చేసే దానధర్మాలూ దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి.
\v 5 ఇప్పుడు యొప్పేకు మనుషుల్ని పంపి, పేతురు అనే మారు పేరున్న సీమోనును పిలిపించుకో.
\v 6 అతడు సీమోను అనే ఒక చర్మకారుని దగ్గర ఉన్నాడు. అతని ఇల్లు సముద్రం పక్కనే ఉంది" అని చెప్పాడు.
\s కొర్నేలి పేతురు కొరకు పిలువనంపించడం
\s5
\p
\v 7 ఆ దూత వెళ్లిన తర్వాత కొర్నేలి తన ఇంటిలో పనిచేసే ఇద్దర్ని, తనను ఎప్పుడూ కనిపెట్టుకొని ఉండే భక్తిపరుడైన ఒక సైనికుణ్ణి పిలిచి
\v 8 వారికీ సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకి పంపాడు.
\s పేతురు దర్శనం
\s5
\p
\v 9 తర్వాతి రోజున వారు ప్రయాణమై పోయి పట్టణానికి దగ్గరగా వచ్చేటప్పటికి పగలు సుమారు పన్నెండు గంటల వేళకి పేతురు ప్రార్థన చేసుకోడానికి ఇంటి పైకి వెళ్ళాడు.
\v 10 అతనికి బాగా ఆకలిగా ఉండి, భోజనం చేయాలనిపిస్తే ఇంట్లో వారు వంట సిద్ధం చేస్తూ ఉన్నారు. అదే సమయంలో అతడు పారవశ్యానికి లోనై,
\v 11 ఆకాశం తెరచుకొని, నాలుగు చెంగులు పట్టి దింపిన పెద్ద దుప్పటి లాంటి పాత్ర ఒకటి భూమి మీదికి దిగి రావడం చూశాడు.
\v 12 దాన్లో భూమి మీద ఉన్న అన్నిరకాల నాలుగుకాళ్ళ జంతువులూ పాకే పురుగులూ ఆకాశ పక్షులూ ఉన్నాయి.
\s5
\v 13 అప్పుడు "పేతురూ, లేచి చంపుకొని తిను" అనే ఒక శబ్డం అతనికి వినిపించింది.
\v 14 అయితే పేతురు "వద్దు ప్రభూ. నిషిద్ధమైన దానినీ అపవిత్రమైన దానినీ నేనెప్పుడూ తినలేదు" అని జవాబిచ్చాడు.
\v 15 'దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధం అనకు' అని మళ్ళీ రెండవసారి ఆ స్వరం అతనికి వినబడింది.
\v 16 ఈ విధంగా మూడుసార్లు జరిగింది. వెంటనే ఆ పాత్ర ఆకాశానికి తిరిగి వెళ్ళిపోయింది.
\s5
\p
\v 17 పేతురు తనకు వచ్చిన దర్శనం ఏమిటో అని తనలో తాను ఆలోచించుకుంటూ అయోమయంలో ఉండగా, కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇంటి కోసం వాకబు చేసి, తలుపు దగ్గర నిలబడి
\v 18 "పేతురు అనే పేరున్న సీమోను ఇక్కడుంటున్నాడా?" అని అడిగారు.
\s5
\v 19 పేతురు ఆ దర్శనాన్ని గురించి ఇంకా ఆలోచిస్తూ ఉండగానే ఆత్మ "చూడు, ముగ్గురు వ్యక్తులు నీ కోసం చూస్తున్నారు.
\v 20 నీవు లేచి కిందికి దిగి వారితో పాటు వెళ్ళు. వారితో వెళ్ళడానికి భయపడవద్దు. వారిని నేనే పంపాను" అని అతనితో చెప్పాడు.
\v 21 పేతురు ఆ మనుషుల దగ్గరికి దిగి వెళ్లి "మీరు వెదికే వాణ్ణి నేనే. మీరెందుకు వచ్చారు?" అని అడిగాడు.
\s5
\v 22 అందుకు వారు "నీతిమంతుడు, దేవుణ్ణి ఆరాధించేవాడు, యూదులందరి దగ్గరా మంచి పేరు సంపాదించిన శతాధిపతి కొర్నేలి అనే ఒకాయన ఉన్నాడు. తన ఇంటికి నిన్ను పిలిపించుకుని నీవు చెప్పే మాటలు వినాలని పరిశుద్ధ దూత అతనికి తెలియచేసాడ" ని చెప్పారు. అప్పుడు పేతురు వారిని లోపలికి పిలిచి అతిథ్యమిచ్చాడు.
\s పేతురు కైసరయ ప్రయాణం
\p
\v 23 తెల్లవారగానే పేతురు లేచి, వారితో బయలుదేరాడు. వారితోపాటు కొంతమంది యొప్పే ఊరి సోదరులు కూడా వెళ్లారు.
\s5
\v 24 ఆ మరుసటి రోజు వారు కైసరయ చేరుకున్నారు. కొర్నేలి తన బంధుమిత్రులను పిలిపించి వాళ్ళ కోసం ఎదురుచూస్తున్నాడు.
\s5
\v 25 పేతురు లోపలికి రాగానే కొర్నేలి అతనికి ఎదురు వెళ్లి అతని పాదాల మీద పడి నమస్కారం చేశాడు.
\v 26 అయితే పేతురు అతనిని లేపి 'లేచి నిలబడు. నేను కూడ మనిషినే' అని చెప్పాడు.
\s5
\v 27 అతనితో మాట్లాడుతూ లోపలికి వెళ్ళి చాలామంది సమావేశమై ఉండడం చూశాడు.
\v 28 అప్పుడతడు "అన్యజాతి వారిని సందర్శించడం, వారితో సాంగత్యం చేయడం యూదునికి నియమం కాదని మీకు తెలుసు. అయితే ఏ వ్యక్తినీ నిషేధించకూడదనీ, అపవిత్రుడుగా భావించకూడదనీ దేవుడు నాకు చూపించాడు.
\v 29 కాబట్టి నన్ను పిలిచినప్పుడు అభ్యంతరం చెప్పకుండా వచ్చాను. కాబట్టి ఇప్పుడు నన్నెందుకు పిలిపించావో నాకు చెప్పు" అని కొర్నేలి తో చెప్పాడు.
\s5
\v 30 అందుకు కొర్నేలి "నాలుగు రోజుల క్రితం ఇదే సమయానికి, మధ్యాహ్నం మూడు గంటలకు నేను మా ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాను. ఉన్నట్టుండి ధగధగలాడే బట్టలు ధరించిన ఒక వ్యక్తి నా ఎదురుగా నిలబడి
\v 31 'కొర్నేలీ, దేవుడు నీ ప్రార్థన విన్నాడు. పేదవారికి నీవు చేసిన దానధర్మాలను బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నీవు యొప్పేకు మనిషిని పంపి
\v 32 పేతురు అనే మారు పేరున్న సీమోనును పిలిపించు. అతడు సముద్రం పక్కనే ఉన్న చర్మకారుడు సీమోను ఇంట్లో ఉన్నాడ' ని నాతో చెప్పాడు.
\v 33 వెంటనే మీకు కబురు పెట్టాను. మీరు వచ్చింది మంచిది అయింది. ప్రభువు మీకాజ్ఞాపించిన వాటన్నిటిని వినడానికి ఇప్పుడు మేమంతా దేవుని సన్నిధిలో ఇక్కడ సమావేశమయ్యాము" అని చెప్పాడు.
\s కోర్నేలి ఇంట్లో యూదేతరులకు పేతురు సందేశం. విశ్వాసం ద్వారా రక్షణ
\p అందుకు పేతురు ఇలా అన్నాడు,
\s5
\v 34 "దేవుడు పక్షపాతం లేకుండా అందరినీ సమదృష్టితో చూస్తాడని నేను ఇప్పుడు స్పష్టంగా తెలుసుకున్నాను.
\v 35 ప్రతి జనంలోనూ తనపట్ల భయభక్తులు కలిగి ఆయనను ఆరాధించి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరిస్తాడు.
\s5
\v 36 యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు శాంతి గురించిన సువార్తను ప్రకటిస్తూ, ఇశ్రాయేలీయులకు పంపిన సందేశం మీకు తెలిసిందే కదా .
\v 37 యోహాను ప్రకటించిన బాప్తిస్మం తరువాత గలిలయ మొదలు యూదయ ప్రాంతమంతా జరిగిన సంగతులు కూడా మీకు తెలుసు.
\v 38 అవేవంటే దేవుడు నజరేతువాడైన యేసును పరిశుద్ధాత్మతోనూ , బలప్రభావాలతోనూ అభిషేకించాడు. దేవుడు ఆయనతో ఉన్నాడు కాబట్టి ఆయన మేలు చేస్తూ పిశాచం పీడ కింద ఉన్న వారందరినీ బాగుచేస్తూ వెళ్ళాడు.
\s5
\p
\v 39 ఆయన యూదుల దేశంలో, యెరూషలేములో చేసిన వాటన్నిటికీ మేము సాక్షులం. ఈ యేసుని వారు మానుకు వేలాడ తీసి చంపారు.
\v 40 దేవుడాయనను మూడవ రోజున సజీవంగా తిరిగి లేపాడు.
\v 41 ప్రజలందరికీ కాక దేవుడు ముందుగా ఏర్పరచిన సాక్షులకే, అంటే ఆయన చనిపోయి లేచిన తరువాత ఆయనతో కలిసి భోజన పానాలు చేసిన మాకే, ఆయన ప్రత్యక్షంగా కనిపించేలా అనుగ్రహించాడు.
\s5
\v 42 దేవుడు సజీవులకూ మృతులకూ న్యాయాధిపతిగా నియమించినవాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి సాక్ష్యమివ్వాలని ఆయన మాకు ఆజ్ఞాపించాడు.
\v 43 ఆయనలో విశ్వాసముంచే వారంతా ఆయన పేరున పాపక్షమాపణ పొందుతారని ప్రవక్తలంతా ఆయనను గూర్చి సాక్ష్యమిస్తున్నార" ని చెప్పాడు.
\s యూదేతర విశ్వాసుల పైకి పరిశుద్ధాత్మ దిగి రావడం
\s5
\p
\v 44 పేతురు ఈ మాటలు చెప్తూ ఉండగానే అతని బోధ విన్నవారందరి మీదికీ పరిశుద్ధాత్మ దిగాడు.
\v 45 సున్నతి పొందిన విశ్వాసులంతా, అంటే పేతురుతో పాటు వచ్చినవారంతా, పరిశుద్ధాత్మ వరాన్ని యూదేతరుల మీద కూడా దేవుడు కుమ్మరించడం చూసి ఆశ్చర్యచకితులయ్యారు .
\s5
\v 46 ఎందుకంటే యూదేతరులు ఇతర భాషల్లో మాట్లాడుతూ దేవుణ్ణి స్తుతించడం వారు విన్నారు.
\v 47 అప్పుడు పేతురు "మనలాగా పరిశుద్ధాత్మను పొందిన వీళ్ళు నీటితో బాప్తిస్మం పొందకుండా ఎవరైనా నీళ్లకు అడ్డు చెప్పగలరా" అని చెప్పి
\v 48 యేసుక్రీస్తు పేరున వారు బాప్తిస్మం పొందాలని ఆజ్ఞాపించాడు. మరికొన్ని రోజులు తమ దగ్గర ఉండమని వారతన్ని బతిమాలారు.
\s5
\c 11
\s పేతురు యూదేతరులమధ్య తన పరిచర్యను సమర్థించుకోవడం
\p
\v 1 యూదేతరులు కూడా దేవుని వాక్యం అంగీకరించారని అపొస్తలులు, యూదయలోని సోదరులు విన్నారు.
\v 2 పేతురు యెరూషలేముకు వచ్చినపుడు సున్నతి పొందినవారు,
\v 3 'నీవు సున్నతి లేని వారి దగ్గరికి పోయి వారితో భోజనం చేశావ' ని అతనిని విమర్శించారు.
\s5
\p
\v 4 అందుకు పేతురు మొదటనుండి వరుసగా వారికి ఆ సంగతి యిలా వివరించి చెప్పాడు,
\v 5 "నేను యొప్పే ఊరిలో ప్రార్థన చేసుకుంటుంటే, పారవశ్యంలో ఒక దర్శనం చూశాను. దాన్లో నాలుగు చెంగులు పట్టి దింపిన పెద్ద దుప్పటివంటి ఒక విధమైన పాత్ర ఆకాశం నుండి దిగి నా దగ్గరికి వచ్చింది.
\v 6 దానిని నేను నిదానించి చూస్తే భూమిమీదుండే వివిధ రకాల నాలుగు కాళ్ళ జంతువులూ అడవి జంతువులూ పాకే పురుగులూ ఆకాశపక్షులూ నాకు కనబడ్డాయి.
\s5
\v 7 అప్పుడు, 'పేతురూ, నీవు లేచి చంపుకొని తిను' అనే ఒక శబ్దం నాతో చెప్పడం విన్నాను.
\v 8 అందుకు నేను, 'వద్దు ప్రభూ, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదీ నేనెన్నడూ తినలేద' ని జవాబిచ్చాను.
\v 9 రెండవసారి ఆ శబ్దం ఆకాశం నుండి, 'దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్ద' ని వినిపించింది .
\v 10 ఈ విధంగా మూడుసార్లు జరిగింది. తరువాత అదంతా ఆకాశానికి తిరిగి వెళ్ళిపోయింది.
\s5
\v 11 వెంటనే కైసరయ నుండి నా దగ్గరికి వచ్చిన ముగ్గురు మనుషులు మేమున్న యింటి దగ్గర నిలబడ్డారు.
\v 12 అప్పుడు ఆత్మ, 'నీవు ఏ భేదం చూపకుండా వారితో కూడా వెళ్లమ' ని అజ్ఞాపించాడు. ఈ ఆరుగురు సోదరులు నాతో వచ్చారు. మేము కొర్నేలి ఇంటికి వెళ్ళాం.
\v 13 అతడు తన యింట్లో నిలబడిన దూతను తానెలా చూశాడో చెప్తూ, 'నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అనే పేరున్న సీమోనును పిలిపించు.
\v 14 నీవూ, నీ యింటివారంతా రక్షణ పొందే మాటలు అతడు నీతో చెప్తాడు' అని అన్నాడని తెలియచేసాడు.
\s5
\v 15 నేను మాట్లాడడం మొదలుపెట్టినపుడు పరిశుద్ధాత్మ మొదట్లో మన మీదికి దిగినట్టుగా వారి మీదికీ దిగాడు.
\v 16 అప్పుడు, 'యోహాను నీళ్లతో బాప్తిస్మమిచ్చాడు గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతార'ని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకున్నాను.
\s5
\p
\v 17 కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తులో విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా అదే వరం ఇస్తే, దేవుణ్ణి అడ్డగించడానికి నేనెవర్ని?" అని చెప్పాడు.
\v 18 వారీమాటలు విని ఇంకేమీ అడ్డు చెప్పకుండా 'అలాగయితే యూదేతరులకు కూడా దేవుడు నిత్యజీవాన్ని మారుమనసును దయచేశాడని చెప్పుకొంటూ దేవుణ్ణి మహిమ పరచారు.
\s అంతియొకయ సంఘం. విశ్వాసుల కొత్త పేరు
\s5
\p
\v 19 స్తెఫను విషయంలో కలిగిన హింస వలన చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికీ వాక్యం బోధించకుండా ఫేనీకే, సైప్రస్, అంతియొకయ వరకు సంచరించారు.
\v 20 వారిలో కొంతమంది సైప్రస్ వారూ, కురేనీ వారూ అంతియొకయ వచ్చి గ్రీకు వారితో మాట్లాడుతూ యేసుప్రభువును ప్రకటించారు.
\v 21 ప్రభువు హస్తం వారికి తోడై ఉంది. అనేక మంది నమ్మి ప్రభువు వైపు తిరిగారు.
\s5
\v 22 వారిని గూర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘం విని బర్నబాను అంతియొకయకు పంపారు.
\v 23 అతడు వచ్చి దేవుని వరాన్ని చూసి సంతోషించి, ప్రభువులో పూర్ణ హృదయంతో నిలిచి ఉండాలని అందరినీ ప్రోత్సహపరిచాడు.
\v 24 అతడు పరిశుద్ధాత్మతో విశ్వాసంతో నిండిన మంచి వ్యక్తి. చాలామంది ప్రభువు ను నమ్మారు.
\s5
\v 25 బర్నబా సౌలును వెదకడానికి తార్సు ఊరు వెళ్లి, అతనిని వెదికి పట్టుకుని అంతియొకయ తోడుకొని వచ్చాడు.
\v 26 వారు కలిసి ఒక సంవత్సరమంతా సంఘంతో ఉండి చాలామందికి బోధించారు. అంతియొకయ లోని శిష్యులను మొట్టమొదటి సారిగా 'క్రైస్తవులు' అన్నారు.
\s అంతియొకయ సంఘం యెరూశలేము విశ్వాసులకోసం సహాయం పంపడం
\s5
\p
\v 27 ఆ రోజుల్లో కొంతమంది ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియొకయ వచ్చారు.
\v 28 వారిలో అగబు అనే ఒకడు నిలబడి, లోకమంతటా తీవ్రమైన కరవు రాబోతున్నదని ఆత్మ ద్వారా సూచించాడు. ఇది క్లాడియస్ చక్రవర్తి రోజుల్లో జరిగింది.
\s5
\v 29 అప్పుడు శిష్యుల్లో ప్రతి వాడూ తన శక్తి కొద్దీ యూదయ లోని సోదరులకు సహాయం పంపడానికి నిశ్చయించుకున్నాడు.
\v 30 వారు అలా చేసి, బర్నబా, సౌలు అనే వారితో పెద్దలకు డబ్బు పంపించారు.
\s5
\c 12
\s ఐదవ హింసాకాండ. పేతురు చెర
\p
\v 1 ఆపైన హేరోదు రాజు విశ్వాస సమాజంలోని కొంతమందిని హింసించడం కోసం పట్టుకున్నాడు.
\v 2 యోహాను సోదరుడైన యాకోబును కత్తితో చంపించాడు.
\s5
\v 3 ఇది యూదులకు ఇష్టంగా ఉండడం చూసి, పేతురును కూడా బంధించాడు. అవి పొంగని రొట్టెల పండగ రోజులు.
\v 4 అతనిని బంధించి చెరసాలలో వేసి, పస్కా పండగైన తర్వాత ప్రజల ఎదుటికి అతనిని తీసుకురావాలని ఉద్దేశించి, అతనికి కాపలాగా జట్టుకు నలుగురు చొప్పున నాలుగు సైనిక దళాలను నియమించాడు.
\s5
\v 5 పేతురును చెరసాలలో ఉంచారు, అయితే సంఘం అతని కోసం తీవ్రమైన ఆసక్తితో దేవునికి ప్రార్థన చేశారు.
\v 6 హేరోదు అతనిని విచారణకై తీసికొని రావాలని అనుకుంటూ ఉండగా, ఆ రాత్రి పేతురు రెండు సంకెళ్ల బంధకాల్లో ఇద్దరు సైనికుల మధ్య నిద్రపోతూ ఉన్నాడు. కాపలా వారు చెరసాల తలుపు ముందు కావలి కాస్తున్నారు.
\s దూత మూలంగా పేతురు విడుదల
\s5
\p
\v 7 అకస్మాత్తుగా ప్రభువు దూత అతనికి ప్రత్యక్షమయ్యాడు. అతడున్న గదిలో వెలుగు ప్రకాశించింది. దూత పేతురును తట్టి, త్వరగా లెమ్మని చెప్పాడు. అప్పుడు అతని చేతుల నుంచి సంకెళ్లు ఊడి పడ్డాయి.
\v 8 దూత అతనితో, "నీ నడుం కట్టుకుని, చెప్పులు తోడుక్కో" అని చెప్పాడు. పేతురు అలానే చేశాడు. ఆ పైన "పై బట్ట వేసికొని నాతో రా" అన్నాడు.
\s5
\v 9 అతడు బయటికి వచ్చి దూత వెంట వెళ్లి, దూత వలన జరిగింది వాస్తవమేనని తెలియక, తాను దర్శనం చూస్తున్నానేమో అనుకున్నాడు.
\v 10 మొదటి కావలినీ రెండవ కావలినీ దాటి పట్టణంలోకి వెళ్ళే ఇనుప తలుపు దగ్గరికి వచ్చినప్పుడు అది దానంతట అదే తెరచుకొంది. వారు బయటికి వెళ్ళి ఒక వీధి దాటిన తరువాత దూత అతని దగ్గర నుండి వెళ్ళిపోయాడు.
\s5
\p
\v 11 పేతురు తెలివి తెచ్చుకుని, ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలోనుండీ, యూదులు తలపెట్టిన వాటన్నిటి నుండీ నన్ను తప్పించాడని ఇప్పుడు నాకు నిజంగా తెలిసిందని అనుకొన్నాడు.
\v 12 దీనిని గ్రహించిన తర్వాత అతడు మార్కు అనే పేరున్న యోహాను తల్లి అయిన మరియ యింటికి వచ్చాడు. చాలామంది విశ్వాసులు అక్కడ చేరి ప్రార్థన చేస్తున్నారు.
\s5
\v 13 అతడు తలుపు తట్టినప్పుడు, రోడా అనే ఒక పని పిల్ల తలుపు తీయడానికి వచ్చింది.
\v 14 ఆమె పేతురు గొంతు గుర్తుపట్టి, సంతోషంలో తలుపు తీయకుండానే లోపలికి పరుగెత్తుకు పోయి, పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపింది.
\v 15 అందుకు వారు ఆమెను 'పిచ్చి దానివి' అన్నారు. అయితే తాను చెప్పింది ముమ్మాటికీ నిజమని ఆమె చెప్పినప్పుడు వారు, 'అతని దూత అయి ఉండవచ్చు' అన్నారు.
\s5
\v 16 పేతురు ఇంకా తలుపు కొడుతూ ఉంటే వారు తలుపు తీసి చూసి ఆశ్చర్యపోయారు.
\v 17 అతడు నెమ్మదిగా ఉండమని వారికి చేతితో సైగ చేసి, ప్రభువు తనను చెరసాల నుండి ఎలా బయటికి తెచ్చాడో వారికి చెప్పి యాకోబుకూ సోదరులకూ ఈ విషయాలు తెలియచేయమని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళాడు.
\s5
\v 18 తెల్లవారగానే పేతురు ఏమయ్యాడో అని సైనికులు ఎంతో గాబరా పడ్డారు.
\v 19 హేరోదు అతని కోసం వెతికి కనబడక పోయేసరికి కావలి వారిని ప్రశ్నించి వారికి మరణ శిక్ష విధించాడు. ఆ తర్వాత హేరోదు యూదయ నుండి కైసరయ వెళ్లి అక్కడ నివసించాడు.
\s హేరోదు దుర్మరణం
\s5
\p
\v 20 తూరు, సీదోను వాసులపై హేరోదుకు చాలా కోపం వచ్చింది. వారంతా కలిసి, రాజు దగ్గిరికి వెళ్ళారు. రాజుకు నచ్చజెప్పి సహాయం చేయాలని వారు రాజభవన పర్యవేక్షకుడైన బ్లాస్తును వేడుకున్నారు. ఎందుకంటే రాజు దేశం నుండి వారి దేశానికి ఆహారం వస్తూ ఉంది.
\v 21 నిర్ణయించిన ఒక రోజు హేరోదు రాజవస్త్రాలు ధరించి సింహాసనం మీద కూర్చొని వారికి ఉపన్యాసమిచ్చాడు.
\s5
\v 22 ప్రజలు, "ఇది దేవుని స్వరమే గానీ మనిషిది కాదు" అని కేకలేశారు.
\v 23 అతడు దేవునికి మహిమ ఇవ్వనందుకు వెంటనే ప్రభువు దూత అతనికి ఘోర వ్యాధి కలిగించాడు. అతడు పురుగులు పడి చచ్చాడు.
\s5
\p
\v 24 దేవుని వాక్యం అంతకంతకూ వ్యాపించింది.
\v 25 బర్నబా, సౌలు యెరూషలేములో తమ సేవ నెరవేర్చిన తరువాత మార్కు అనే పేరున్న యోహానును వెంటబెట్టుకొని తిరిగి వచ్చారు.
\s5
\c 13
\s పౌలు బర్నబాలకు పరిశుద్ధాత్మ పిలుపు
\p
\v 1 అంతియొకయ లోని క్రైస్తవ సంఘంలో బర్నబా, నీగెరు అనే సుమెయోను, కురేనీవాడైన లూకియ, రాష్ట్రపాలకుడు హేరోదుతో పాటు పెరిగిన మనయేను, సౌలు అనే ప్రవక్తలూ బోధకులూ ఉన్నారు.
\v 2 వారు ప్రభువును ఆరాధిస్తూ ఉపవాసం ఉన్నపుడు, పరిశుద్ధాత్మ, 'నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కోసం వారిని నాకు కేటాయించండి' అని వారితో చెప్పాడు.
\v 3 విశ్వాసులు ఉపవాసముండి, ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిన తర్వాత వారిని పంపించారు.
\s పౌలు మొదటి సువార్త ప్రయాణం
\s5
\p
\v 4 కాబట్టి బర్నబా, సౌలు పరిశుద్ధాత్మ పంపగా బయలుదేరి సెలూకియ వచ్చి అక్కడ నుండి సముద్ర మార్గంలో సైప్రస్ ద్వీపానికి వెళ్లారు.
\v 5 వారు సలమీ అనే ఊరికి చేరుకొని యూదుల సమాజ మందిరాలలో దేవుని వాక్యం ప్రకటించారు. మార్కు అనే యోహాను వారికి సహాయంగా ఉన్నాడు.
\s5
\v 6 వారు ఆ ద్వీపమంతా తిరిగి పాఫు అనే ఊరికి వచ్చి మంత్రగాడూ యూదీయ అబద్ధ ప్రవక్త అయిన బర్‌ యేసు అనే ఒకణ్ణి చూశారు.
\v 7 ఇతడు వివేకి అయిన సెర్గియ పౌలు అనే అధిపతి దగ్గర ఉండేవాడు. ఆ అధిపతి దేవుని వాక్యం వినాలని బర్నబానూ సౌలునూ పిలిపించాడు.
\v 8 అయితే ఎలుమ(ఈ పేరుకు మాంత్రికుడు అని అర్ధం) ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగించాలనే ఉద్దేశంతో వారిని ఎదిరించాడు.
\s5
\v 9 అందుకు పౌలు అని పేరు మారిన సౌలు పరిశుద్ధాత్మతో నిండి
\v 10 అతనిని తేరి చూసి "అపవాది కొడుకా, నీవు అన్ని రకాల కపటంతో దుర్మార్గంతో నిండి ఉన్నావు, నీవు నీతికి విరోధివి, ప్రభువు తిన్నని మార్గాలను చెడగొట్టడం మానవా?
\s5
\v 11 ఇదిగో, ప్రభువు నీ మీద చెయ్యి ఎత్తాడు. నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడవ'ని చెప్పాడు. వెంటనే మబ్బూ, చీకటీ అతనిని కమ్మాయి, కాబట్టి అతడు ఎవరైనా చేయి పట్టుకొని నడిపిస్తారేమో అని తడుములాడ సాగాడు.
\v 12 అధిపతి, జరిగిన దానిని చూసి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించాడు.
\s5
\p
\v 13 తరువాత పౌలు, అతని సహచరులు ఓడ ఎక్కి పాఫు నుండి బయలుదేరి పంపులియా లోని పెర్గే వచ్చారు. అక్కడ యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేము తిరిగి వెళ్లిపోయాడు.
\s పిసిదియ అంతియొకయ సమాజ కేంద్రం లో పౌలు ఉపదేశం: విశ్వాసం ద్వారానే నిర్దోషత్వం
\p
\v 14 అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియ లోని అంతియొకయ వచ్చి విశ్రాంతిదినాన సమాజ మందిరంలోకి వెళ్లి కూర్చున్నారు.
\v 15 ధర్మశాస్త్రం, ప్రవక్తల లేఖనాలను చదివిన తరువాత సమాజ మందిరపు అధికారులు, "సోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా ఉపదేశం చెయ్యాలంటే, చెయ్యండి" అని అడిగారు.
\s5
\v 16 అప్పుడు పౌలు నిలబడి చేతితో సైగ చేసి ఇలా అన్నాడు,
\p
\v 17 "ఇశ్రాయేలీయులారా, దేవుడంటే భయభక్తులున్న వారలారా, వినండి. ఇశ్రాయేలు ప్రజల దేవుడు మన పూర్వీకులను ఏర్పరచుకొని, వారు ఐగుప్తు దేశంలో ఉన్నపుడు ఆ ప్రజలను అసంఖ్యాకులుగా చేసి, తన భుజబలం చేత వారిని అక్కడ నుండి తీసికొని వచ్చాడు.
\v 18 సుమారు నలభై ఏళ్ళు అరణ్యంలో వారిని సహించాడు.
\s5
\v 19 కనాను దేశంలో ఏడు జాతుల వారిని నాశనం చేసి వారి దేశాలను మన ప్రజలకు వారసత్వంగా ఇచ్చాడు.
\v 20 ఈ సంఘటనలన్నీ సుమారు 450 సంవత్సరాలు జరిగాయి. ఆ తరువాత సమూయేలు ప్రవక్త వరకు దేవుడు వారికి న్యాయాధిపతులను ఇచ్చాడు.
\s5
\v 21 ఆ తరువాత వారు తమకు రాజు కావాలని కోరితే దేవుడు బెన్యామీను గోత్రికుడూ కీషు కుమారుడూ అయిన సౌలును వారికి నలభై ఏళ్ల పాటు రాజుగా ఇచ్చాడు.
\v 22 తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా చేశాడు. ఆయన 'నేను యెష్షయి కుమారుడు దావీదును కనుగొన్నాను. అతడు నా యిష్టానుసారుడైన మనిషి. అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాడ' ని దావీదును గురించి దేవుడు సాక్షమిచ్చాడు.
\s5
\p
\v 23 అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇశ్రాయేలు కోసం రక్షకుడైన యేసును పుట్టించాడు.
\v 24 ఆయన రాకముందు యోహాను ఇశ్రాయేలు ప్రజలందరికీ మారుమనస్సు విషయమైన బాప్తిస్మం ప్రకటించాడు.
\v 25 యోహాను తన పనిని నెరవేరుస్తుండగా, "నేనెవరినని మీరనుకుంటున్నారు? నేను ఆయనను కాను. వినండి, నా వెనక ఒకాయన వస్తున్నాడు, ఆయన కాళ్ల చెప్పులు విప్పడానికి కూడా నేను అర్హుడిని కాదు" అని చెప్పాడు.
\s5
\p
\v 26 "సోదరులారా, అబ్రాహాము వంశస్థులారా, దేవుణ్ణి ఆరాధించే వారలారా, ఈ రక్షణ సందేశం మనకే వచ్చింది.
\v 27 యెరూషలేములో నివసిస్తున్నవారు, వారి అధికారులూ, ఆయనను గాని, ప్రతి విశ్రాంతిదినాన చదివే ప్రవక్తల మాటలను గాని నిజంగా గ్రహించక, యేసుకు మరణ శిక్ష విధించి ఆ ప్రవచనాలను నెరవేర్చారు.
\s5
\v 28 ఆయనలో మరణానికి తగిన కారణమేమీ కనబడక పోయినా ఆయనను చంపాలని పిలాతును కోరారు .
\v 29 ఆయనను గురించి రాసినవన్నీ నెరవేరిన తరువాత వారాయన్ని మాను మీదనుండి దింపి సమాధిలో పెట్టారు.
\s5
\v 30 అయితే దేవుడు చనిపోయిన వాళ్ళలో నుండి ఆయనను లేపాడు.
\v 31 ఆయన గలిలయ నుండి యెరూషలేముకు తనతో వచ్చిన వారికి చాలా రోజులు కనిపించాడు. వారే ఇప్పుడు ప్రజలకు ఆయన సాక్షులుగా ఉన్నారు.
\s5
\v 32 పితరులకు చేసిన వాగ్దానాల గురించి మేము మీకు సువార్త ప్రకటిస్తున్నాం. దేవుడు ఈ వాగ్దానాలను వారి పిల్లలమైన మనకు ఇప్పుడు యేసును మృతులలో నుండి లేపడం ద్వారా నెరవేర్చాడు."
\p
\v 33 "నీవు నా కుమారుడివి, నేడు నేను నిన్ను కన్నాను" అని రెండవ కీర్తనలో కూడా రాసి ఉంది.
\v 34 యింకా, ఇకపై కుళ్లు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపడం ద్వారా, 'దావీదుకు అనుగ్రహించిన పవిత్రమైన, నమ్మకమైన దీవెనలను మీకిస్తాను' అని చెప్పాడు.
\s5
\v 35 అందుకే వేరొక కీర్తనలో, 'నీ పరిశుద్ధుని కుళ్లు పట్టనియ్యవు' అని చెబుతున్నాడు.
\v 36 దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి కన్ను మూశాడు.
\v 37 తన పితరుల దగ్గర సమాధిలో కుళ్లిపోయాడు గాని, దేవుడు లేపినవాడు కుళ్లు పట్టలేదు.
\s5
\v 38 కాబట్టి సోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రకటిస్తున్నాము.
\v 39 మిమ్మల్ని మోషే ధర్మశాస్త్రం ఏ విషయాల్లో నిర్దోషులుగా తీర్చలేక పోయిందో ఆ విషయాలన్నిటిలో, విశ్వసించే ప్రతివానినీ ఈయనే నిర్దోషిగా తీరుస్తాడని మీకు తెలియాలి.
\s5
\v 40 ప్రవక్తలు చెప్పినవి మీ మీదికి రాకుండా జాగ్రత్త పడండి. అవేవంటే,
\q1
\v 41 'తిరస్కరిస్తున్న మీరు, ఆశ్చర్యపడి, నశించండి.
\q1 మీ రోజుల్లో నేనొక పని చేస్తాను,
\q1 ఆ పని ఎవరైనా మీకు వివరించినా మీరెంత మాత్రమూ నమ్మరు.'"
\s5
\p
\v 42 పౌలు బర్నబాలు వెళ్లిపోతుంటే ఈ మాటలు మరుసటి విశ్రాంతి దినాన మళ్ళీ చెప్పాలని ప్రజలు బతిమిలాడారు.
\v 43 సమావేశం ముగిసిన తర్వాత చాలామంది యూదులూ, యూదా మతంలోకి మారినవారూ, పౌలునూ బర్నబానూ వెంబడించారు. పౌలు బర్నబాలు వారితో మాట్లాడుతూ, దేవుని కృపలో నిలిచి ఉండాలని వారిని ప్రోత్సహించారు.
\s యూదుల నుండి ప్రతిఘటన
\s5
\p
\v 44 మరుసటి విశ్రాంతి దినాన దాదాపు ఆ పట్టణమంతా దేవుని వాక్యం వినడానికి సమావేశం అయింది.
\v 45 యూదులు ఆ జనసమూహాలను చూసి కన్ను కుట్టి, పౌలు చెప్పిన వాటికి అడ్డం చెప్పి అవమానపర్చారు.
\s5
\v 46 అప్పుడు పౌలు బర్నబాలు ధైర్యంగా ఇలా అన్నారు,"దేవుని వాక్యం మొదట మీకు చెప్పడం అవసరమే. అయినా మీరు దానిని తోసి వేసి, మీకు మీరే నిత్యజీవానికి అయోగ్యులుగా చేసుకుంటున్నారు. కాబట్టి మేము యూదేతరుల దగ్గరికి వెళ్తున్నాం.
\p
\v 47 ఎందుకంటే, 'నీవు ప్రపంచమంతటా రక్షణ తెచ్చే వానిగా ఉండేలా నిన్ను యూదేతరులకు వెలుగుగా ఉంచాను' అని ప్రభువు మాకు ఆజ్ఞాపించాడు" అన్నారు.
\s5
\v 48 యూదేతరులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్కును కొనియాడారు. అంతేగాక నిత్యజీవానికి నియమితులైన వారంతా విశ్వసించారు.
\v 49 ప్రభువు వాక్యం ఆ ప్రదేశమంతటా వ్యాప్తి చెందింది.
\s5
\v 50 అయితే భక్తి మర్యాదలున్న స్త్రీలనూ ఆ పట్టణ ప్రముఖులనూ, యూదులు రెచ్చగొట్టి పౌలునూ బర్నబానూ హింసల పాలు చేసి, వారిని తమ ప్రాంతం నుండి తరిమేశారు.
\v 51 అయితే పౌలు బర్నబాలు తమ పాద ధూళిని వారికి దులిపి వేసి ఈకొనియ ఊరికి వచ్చారు.
\v 52 అయితే శిష్యులు ఆనందంతో పరిశుద్ధాత్మతో నిండి ఉన్నారు.
\s5
\c 14
\s ఈకొనియలో పరిచర్య
\p
\v 1 ఈకొనియలో ఏం జరిగిందంటే, పౌలు బర్నబాలు యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి, ఎంత బాగా మాట్లాడారంటే చాలామంది యూదులూ గ్రీకులూ విశ్వసించారు.
\v 2 అయితే అవిధేయులైన యూదులు యూదేతరులను రెచ్చగొట్టి వారి మనస్సుల్లో సోదరుల మీద పగ పుట్టించారు.
\s5
\v 3 పౌలు బర్నబాలు ప్రభువు శక్తితో ధైర్యంగా మాటలాడుతూ అక్కడ చాలా కాలం గడిపారు. ప్రభువు వారిద్వారా సూచకక్రియలనూ మహత్కార్యాలనూ చేయించి తన కృపా సందేశాన్ని రుజువు చేశాడు.
\v 4 ఆ పట్టణంలోని జనసమూహంలో భేదాలు వచ్చి, కొందరు యూదుల వైపు, మరి కొందరు అపొస్తలుల వైపు చేరారు.
\s5
\v 5 యూదేతరులూ యూదులూ తమ అధికారులతో కలిసి పౌలు బర్నబాలను బాధించి రాళ్లు రువ్వి చంపాలని అనుకున్నారు.
\v 6 వారు ఆ సంగతి తెలిసికొని లుకయోనియ ప్రాంతంలోని లుస్త్ర, దెర్బే పట్టణాలకూ చుట్టుపక్కల ప్రదేశానికీ పారిపోయి అక్కడ సువార్త ప్రకటించారు.
\s లుస్త్ర, దెర్బే పట్టణాలలో
\p
\v 7 లుస్త్రలో కాళ్ళలో సత్తువ లేనివాడు ఒకడున్నాడు.
\s5
\v 8 అతడు పుట్టు కుంటివాడు, ఎన్నడూ నడవలేదు.
\v 9 అతడు పౌలు మాటలాడుతుంటే విన్నాడు. పౌలు సూటిగా అతని వైపు చూసి, బాగుపడడానికి అతనికి విశ్వాసముందని గమనించి,
\v 10 'లేచి నిలబడు' అని బిగ్గరగా అనగానే అతడు ఒక్క ఉదుటున లేచి నడవసాగాడు.
\s5
\v 11 జనం పౌలు చేసిన దానిని చూసి, లుకయోనియ భాషలో, 'దేవతలు మానవ రూపంలో మన దగ్గరికి వచ్చారు' అని కేకలు వేసి,
\v 12 బర్నబాకు జూస్ అనీ, పౌలు ముఖ్య ప్రసంగి కాబట్టి అతనికి హెర్మే అనీ పేర్లు పెట్టారు.
\v 13 పట్టణానికి ఎదురుగా ఉన్న జూస్ దేవుడి పూజారి, ఎడ్లనూ పూల దండల్నీ పట్టణ ముఖద్వారం దగ్గిరికి తీసికొని వచ్చి సమూహంతో కలిసి, బలి అర్పించాలని చూశాడు.
\s5
\v 14 అపొస్తలులు బర్నబా, పౌలు ఈ సంగతి విని, తమ బట్టలు చింపుకొని సమూహం లోకి చొరబడి
\v 15 "అయ్యా, మీరెందుకిలా చేస్తున్నారు? మేము కూడా మీలాంటి మానవమాత్రులమే. మీరు ఇలాంటి పనికిమాలిన వాటిని విడిచిపెట్టి, ఆకాశాన్నీ భూమినీ సముద్రాన్నీ వాటిలో ఉండే సమస్తాన్నీ సృష్టించిన జీవం గల దేవుని వైపు తిరగాలని మీకు సువార్త ప్రకటిస్తున్నాం.
\v 16 ఆయన గతించిన కాలాల్లో మనుషులందరినీ తమ సొంత మార్గాల్లో నడవనిచ్చాడు.
\s5
\v 17 అయినా ఆయన మేలు చేస్తూ ఆకాశం నుండి మీకు వర్షాన్నీ, ఫలవంతమైన రుతువుల్నీ దయచేస్తూ, ఆహారం అనుగ్రహిస్తూ, ఉల్లాసంతో మీ హృదయాలను నింపుతూ, తన గురించిన సాక్షం నిలిపి ఉంచాడు."
\v 18 వారీవిధంగా ఎంతగా చెప్పినా సరే, తమకు బలి అర్పించకుండా ఆ గుంపులను ఆపడం చాలా కష్టమయింది.
\s లుస్త్రలో పౌలును రాళ్ళతో కొట్టడం
\s5
\p
\v 19 అంతియొకయ, ఈకొనియ నుండి యూదులు వచ్చి జనాన్ని తమ వైపు తిప్పుకొని, పౌలు మీద రాళ్లు రువ్వి అతడు చనిపోయాడనుకొని పట్టణం బయటికి అతనిని ఈడ్చివేశారు.
\v 20 అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి, మరుసటి రోజు బర్నబాతో కూడ దెర్బేకు వెళ్ళిపోయాడు.
\s5
\v 21 వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి చాలామందిని శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రకూ ఈకొనియకూ అంతియొకయకూ తిరిగివచ్చి
\v 22 శిష్యుల మనస్సులను దృఢపరచి, విశ్వాసంలో నిలకడగా ఉండాలనీ, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే అనేక హింసలు పొందాలనీ వారిని ప్రోత్సహించారు.
\s సంఘాలలో పెద్దలను నియమించడం. అంతియొకయకు తిరిగి రాక
\s5
\p
\v 23 ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరచి ఉపవాసముండి ప్రార్థన చేసి, వారు నమ్మిన ప్రభువుకు వారిని అప్పగించారు.
\v 24 తరువాత పిసిదియ దేశమంతటా సంచరించి పంఫూలియ వచ్చారు.
\v 25 పెర్గేలో వాక్యం బోధించి, అత్తాలియ వెళ్ళారు.
\v 26 అక్కడనుండి ఓడ ఎక్కి, తాము నెరవేర్చిన పని నిమిత్తం దేవుని కృపకు అప్పగించుకొని, మొదట బయలుదేరిన అంతియొకయ తిరిగి వచ్చారు.
\s5
\v 27 వారు వచ్చి సంఘాన్ని సమకూర్చి, దేవుడు తమకు తోడై చేసిన పనులన్నిటినీ, యూదేతరులు విశ్వసించడానికి ఆయన ద్వారం తెరచిన సంగతీ వివరించారు.
\v 28 ఆ తరువాత వారు శిష్యుల దగ్గర చాలాకాలం గడిపారు.
\s5
\c 15
\s యెరూషలేము పెద్దల సభ: సున్నతి గురించి చర్చ
\p
\v 1 యూదయ నుండి కొందరు వచ్చి, 'మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే గాని మీకు రక్షణ లేదు', అని విశ్వాసులకు బోధించారు.
\v 2 పౌలుకు, బర్నబాకు వారితో తీవ్రమైన వాదోపవాదాలు జరిగాయి. ఈ సమస్య గురించి పౌలు బర్నబాలు, యింకా మరి కొంతమంది యెరూషలేములోని అపొస్తలుల, పెద్దల దగ్గరికి వెళ్ళాలని సోదరులు నిశ్చయించారు.
\s5
\v 3 కాబట్టి సంఘం వారిని సాగనంపగా, వారు ఫేనీకే, సమరయ ప్రాంతాల ద్వారా వెళ్తూ, యూదేతరులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియచేసి సోదరులందరికి మహానందం కలగజేశారు.
\v 4 వారు యెరూషలేము చేరగానే సంఘం, అపొస్తలులూ పెద్దలూ వారికి స్వాగతం ఇచ్చారు. దేవుడు తమకు తోడై చేసిన వాటన్నిటినీ వారు వివరించారు.
\s5
\v 5 పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి, యూదేతరులకు సున్నతి చేయించాలనీ, మోషే ధర్మశాస్త్రాన్ని పాటించేలా వారికి ఆజ్ఞాపించాలనీ చెప్పారు.
\p
\v 6 అప్పుడు అపొస్తలులూ పెద్దలూ ఈ సంగతి గూర్చి ఆలోచించడానికి సమకూడారు. చాలా చర్చ జరిగిన తరువాత పేతురు లేచి వారితో యిలా అన్నాడు,
\s క్రైస్తవ స్వేచ్ఛకు అనుకూలంగా పేతురు వాదం
\s5
\p
\v 7 "సోదరులారా, యూదేతరులు నా నోట సువార్త విని విశ్వసించేలా మీలోనుండి నన్ను కొన్ని రోజుల ముందు దేవుడు ఎన్నుకున్నాడని మీకు తెలుసు.
\v 8 హృదయాలను ఎరిగిన దేవుడు పరిశుద్ధాత్మను మనకు ఇచ్చినట్టే, వారికీ ఇచ్చి, తాను వారిని స్వీకరించినట్టుగా వెల్లడి చేశాడు.
\v 9 మనకీ వారికీ ఏ తేడా చూపకుండా వారి హృదయాలను విశ్వాసంతో పవిత్రపరచాడు. .
\s5
\v 10 కాబట్టి మన పూర్వీకులు గానీ మనం గానీ మోయలేని కాడిని శిష్యుల మెడమీద పెట్టి మీరెందుకు దేవుణ్ణి పరీక్షిస్తున్నారు?
\v 11 ప్రభువైన యేసు కృప ద్వారా మనం రక్షణ పొందుతామని నమ్ముతున్నాం గదా? అలాగే వారూ రక్షణ పొందుతారు."
\s పౌలు బర్నబాల సాక్ష్యం
\s5
\p
\v 12 అప్పుడు బర్నబా, పౌలు తమ ద్వారా దేవుడు యూదేతరులలో చేసిన సూచకక్రియలనూ మహత్కార్యాలనూ వివరిస్తుంటే సభ అంతా నిశ్శబ్దంగా ఆలకించింది.
\s యాకోబు సమీక్ష
\s5
\p
\v 13 వారు చెప్పడం ముగించిన తరువాత యాకోబు యిలా అన్నాడు, "సోదరులారా, నా మాట వినండి.
\v 14 యూదేతరులలో నుండి దేవుడు తన పేరున ఒక జనాన్ని ఏర్పరచుకోడానికి వారిని మొదట ఎలా కటాక్షించాడో సీమోను తెలియచేసాడు.
\s5
\v 15 ఇందుకు ప్రవక్తల మాటలు సరిపోతున్నాయి. ఎలాగంటే
\q1
\v 16 'ఆ తరువాత నేను తిరిగి వస్తాను.
\q1 మనుషుల్లో మిగిలినవారూ,
\q1 నా నామం ఎవరైతే ధరించారో
\q1 ఆ యూదేతరులందరూ, ప్రభువును వెదకేలా
\q1
\v 17 పడిపోయిన దావీదు గుడారాన్ని తిరిగి నిర్మిస్తాననీ పాడైన వాటిని తిరిగి కట్టి వాటిని నిలబెడతాననీ
\v 18 అనాదికాలం నుండి ఈ సంగతులను తెలియచేసిన ప్రభువు సెలవిస్తున్నాడు'
\q1 అని రాసి ఉంది.
\s యూదేతరులను ధర్మశాస్త్రం కిందికి తేకూడదు
\s5
\p
\v 19 కాబట్టి యూదేతరులలోనుండి దేవుని వైపు తిరిగే వారిని మనం కష్టపెట్టకుండా
\v 20 విగ్రహ సంబంధమైన అపవిత్రతనూ, జారత్వాన్నీ విసర్జించాలనీ, గొంతు నులిమి చంపిన దానినీ, రక్తాన్నీ తినకూడదనీ, వారికి ఉత్తరం రాసి పంపాలని నా అభిప్రాయం.
\v 21 ఎందుకంటే, సమాజ మందిరాలలో ప్రతి విశ్రాంతిదినాన మోషే లేఖనాలను చదువుతూ తరతరాల నుండి దానిని ప్రకటించే వారు ప్రతి పట్టణంలో ఉన్నారు" అని చెప్పాడు.
\s5
\p
\v 22 అప్పుడు సోదరులలో ముఖ్యులైన బర్సబ్బా అనే పేరున్న యూదానూ సీలనూ ఎన్నుకుని, పౌలు బర్నబాలతో అంతియొకయ పంపడం మంచిదని అపొస్తలులకూ పెద్దలకూ సంఘమంతటికీ తోచింది.
\v 23 వారు ఇలా రాసి పంపారు, "అపొస్తలులూ పెద్దలూ సోదరులూ అయిన మేము అంతియొకయ, సిరియ, కిలికియ లోని యూదేతరులైన సోదరులకు, శుభాకాంక్షలతో చెప్పి రాసేది,
\s5
\v 24 కొందరు మా దగ్గర నుండి వెళ్లి తమ బోధతో మిమ్మల్ని గాభరా పెట్టి, మీ మనస్సులను చెరుపుతున్నారని విన్నాం. వారికి మేము ఏ అధికారమూ యివ్వలేదు.
\v 25 కాబట్టి కొందరిని ఎన్నుకొని, మన ప్రభువైన యేసు క్రీస్తు కోసం ప్రాణాలకు తెగించిన బర్నబా, పౌలు అనే
\v 26 మన ప్రియ మిత్రులతో కూడా వారిని మీ దగ్గరికి పంపడం మంచిదని మాకందరికీ ఏకాభిప్రాయం కలిగింది.
\s5
\v 27 అందువలన యూదానూ సీలనూ పంపుతున్నాము. వారు కూడా నోటిమాటతో ఈ విషయాలు మీకు తెలియచేస్తారు.
\v 28 విగ్రహాలకు అర్పించిన వాటినీ, రక్తాన్నీ, గొంతు నులిమి చంపిన దానినీ తినకూడదు. జారత్వానికి దూరంగా ఉండాలి.
\v 29 తప్పనిసరైన వీటి కంటె ఎక్కువైన ఏ భారాన్నీ మీ మీద మోపకూడదని, పరిశుద్ధాత్మకూ మాకూ అనిపించింది. వీటికి దూరంగా ఉండి జాగ్రత్త పడితే అది మీకు మేలు. సెలవు."
\s5
\p
\v 30 ఆ పైన వారు వీడ్కోలు పలికి అంతియొకయ వచ్చి శిష్యులను సమకూర్చి ఆ ఉత్తరం యిచ్చారు.
\v 31 వారు దానిని చదువుకొని ప్రోత్సాహం పొంది సంతోషించారు.
\v 32 యూదా, సీల కూడ ప్రవక్తలైనందున వారు చాలా మాటలతో సోదరులను ఆదరించి ప్రోత్సాహపరిచారు.
\s5
\v 33 వారు అక్కడ కొంతకాలం గడిపిన తరువాత, వారిని పంపిన
\v 34 వారి దగ్గరికి వెళ్లడానికి, సోదరులు వారిని ప్రశాంతంగా సాగనంపారు.
\v 35 పౌలు బర్నబాలు అంతియొకయలో చాలా మందికి ప్రభువును బోధిస్తూ ప్రకటిస్తూ ఉన్నారు.
\s పౌలు రెండవ సువార్త ప్రయాణం
\s5
\p
\v 36 కొన్నిరోజులైన తరువాత పౌలు 'ఏ ఏ పట్టణాల్లో ప్రభువు వాక్యం ప్రకటించామో ఆ ప్రతి పట్టణంలో ఉన్న సోదరుల దగ్గరికి తిరిగి వెళ్లి, వారెలా ఉన్నారో చూద్దామ'ని బర్నబాతో అన్నాడు.
\v 37 అప్పుడు మార్కు అనే పేరున్న యోహానును వెంటబెట్టుకొని వెళ్ళడానికి బర్నబా ఇష్టపడ్డాడు.
\v 38 అయితే పౌలు, పంఫులియ లో పనికోసం తమతో రాకుండా విడిచి వెళ్ళిపోయిన వానిని వెంటబెట్టుకొని పోవడం భావ్యం కాదని తలంచాడు.
\s5
\v 39 ఇద్దరి మధ్య తీవ్రమైన భేదాభిప్రాయం రావడంతో వారు ఒకరి నొకరు విడిచి వేరైపోయారు. బర్నబా, మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి సైప్రస్ వెళ్ళాడు.
\v 40 పౌలు సీలను ఎంపిక చేసుకుని, సోదరులు తనను ప్రభువు కృపకు అప్పగించగా బయలుదేరి,
\v 41 సంఘాలను బలపరుస్తూ సిరియ కిలికియ దేశాల గుండా ప్రయాణం చేశాడు.
\s5
\c 16
\s తిమోతి పరిచయం
\p
\v 1 పౌలు, దెర్బే లుస్త్ర పట్టణాలకు వచ్చాడు. అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడున్నాడు. అతని తల్లి విశ్వాసి అయిన యూదు వనిత. తండ్రి గ్రీసు దేశం వాడు.
\v 2 తిమోతికి లుస్త్ర, ఈకొనియలో ఉన్న సోదరుల మధ్య మంచి పేరు ఉంది.
\v 3 అతడు తనతోకూడ రావాలని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులందరికీ తెలుసు గనక వారిని బట్టి అతనికి సున్నతి చేయించాడు .
\s5
\v 4 వారు ఆ పట్టణాల ద్వారా వెళ్తూ, యెరూషలేములో ఉన్న అపొస్తలులూ పెద్దలూ నిర్ణయించిన విధుల్ని పాటించేలా వాటిని వారికి అందజేశారు.
\v 5 కాబట్టి సంఘాలు విశ్వాసంలో బలపడి, ప్రతిరోజూ సంఖ్యలో పెరిగాయి.
\s ఆత్మ మార్గనిర్దేశం. మాసిదోనియా దర్శనం
\s5
\p
\v 6 ఆసియా ప్రాంతంలో వాక్యం చెప్పవద్దని పరిశుద్ధాత్మ వారిని వారించాడు, అప్పుడు వారు ఫ్రుగియ గలతీయ ప్రదేశాల ద్వారా వెళ్లారు. ముసియ దగ్గరకు వచ్చి బితూనియ వెళ్ళడానికి ప్రయత్నం చేసారు గాని
\v 7 యేసు ఆత్మ వారిని వెళ్లనివ్వలేదు.
\v 8 అందుకని వారు ముసియ దాటిపోయి త్రోయకు వచ్చారు.
\s5
\v 9 అప్పుడు మాసిదోనియ వాసి ఒకడు కనిపించి, 'నీవు మాసిదోనియ వచ్చి మాకు సహాయం చేయి' అని అతనిని పిలుస్తున్నట్టు రాత్రి సమయంలో పౌలుకు దర్శనం వచ్చింది.
\v 10 అతనికి ఆ దర్శనం వచ్చినపుడు వారికి సువార్త ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని పిలిచాడని మేము నిశ్చయించుకుని వెంటనే మాసిదోనియ బయలుదేరడానికి ప్రయత్నం చేశాము .
\s5
\v 11 మేము త్రోయ నుండి ఓడలో నేరుగా సమొత్రాకెకు, మరుసటి రోజు నెయపొలి, అక్కడనుండి ఫిలిప్పీకి వచ్చాము.
\s ఫిలిప్పి లో పరిచర్య. ఐరోపా ఖండంలో మొదటి విశ్వాసి లూదియ మార్పు
\p
\v 12 మాసిదోనియ దేశంలో ఆ ప్రాంతానికి అది ముఖ్య పట్టణం, రోమీయుల వలస ప్రదేశం. మేము కొన్ని రోజులు ఆ పట్టణంలో ఉన్నాం.
\v 13 విశ్రాంతి దినాన ఊరి బయటి ద్వారం దాటి నదీ తీరాన ప్రార్థనాస్థలం ఉంటుందని తెలిసింది. మేము అక్కడ కూర్చుని, అక్కడికి వచ్చిన స్త్రీలతో మాట్లాడాం.
\s5
\v 14 లూదియ అనే ఒక భక్తురాలు మా మాటలు విన్నది. ఆమె ఊదారంగు వస్త్రాలు అమ్మేది. ఆమెది తుయతైర పట్టణం. పౌలు చెప్పే మాటలను శ్రద్ధగా వినేలా ప్రభువు ఆమె హృదయం తెరచాడు.
\v 15 ఆమె, ఆమె యింటివారూ బాప్తిస్మం పొందారు. ' నేను ప్రభువులో విశ్వాసం గలదానిని అని మీరు భావిస్తే, నా యింటికి వచ్చి ఉండాలి,' అని ఆమె మమ్మల్ని బలవంతం చేసింది.
\s దయ్యాన్ని వదిలించడం. పౌలు సీలలకు దెబ్బలు
\s5
\p
\v 16 మరొక రోజు మేము ప్రార్థనాస్థలానికి వెళ్తూ ఉంటే దయ్యం పట్టిన ఒక యువతి మాకు ఎదురైంది. ఆమె సోదె చెబుతూ తన యజమానులకు చాలా లాభం సంపాదించేది.
\v 17 ఆమె పౌలునూ మమ్మల్ని వెంబడిస్తూ, "వీరు సర్వోన్నతుడైన దేవుని సేవకులు. వీరు మీకు రక్షణమార్గం ప్రకటిస్తున్నారు" అని కేకలు వేసి చెప్పింది.
\v 18 ఆమె యిలాగే చాలా రోజులు చేస్తూ వచ్చింది. కాబట్టి పౌలు చాలా చికాకు పడి ఆమె వైపు తిరిగి, 'నీవు ఈమెను వదలి బయటికి వెళ్ళిపోమని యేసుక్రీస్తు పేరున ఆజ్ఞాపిస్తున్నాను,' అని ఆ దయ్యంతో చెప్పాడు. వెంటనే అది ఆమెను వదలిపోయింది.
\s5
\v 19 ఆమె యజమానులు తమ రాబడి పోయిందని చూసి, పౌలునూ సీలనూ పట్టుకొని రచ్చబండ దగ్గర అధికారుల దగ్గరికి ఈడ్చుకు పోయారు.
\v 20 న్యాయాధిపతుల దగ్గరికి వారిని తీసికొచ్చి, 'వీరు యూదులై ఉండి
\v 21 రోమీయులమైన మనం అంగీకరించని, పాటించని ఆచారాలు ప్రకటిస్తూ, మన పట్టణాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు', అని చెప్పారు.
\s5
\v 22 అప్పుడు జనసమూహమంతా వారి మీదికి దొమ్మిగా వచ్చింది. న్యాయాధిపతులు వారి బట్టలు లాగేసి బెత్తాలతో కొట్టాలని ఆజ్ఞాపించారు.
\v 23 వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో పడేసి, భద్రంగా ఉంచాలని చెరసాల అధికారికి ఆజ్ఞాపించారు.
\v 24 అతడు ఆ ఆజ్ఞను పాటించి, వారిని లోపలి చెరసాల లోకి తోసి, కాళ్లను రెండు కొయ్య దుంగల మధ్య బిగించాడు.
\s జైలు అధికారి మార్పు
\s5
\p
\v 25 మధ్యరాత్రి సమయంలో పౌలు సీల ప్రార్థన చేసుకొంటూ పాటలు పాడుకుంటూ ఉంటే యితర ఖైదీలు వింటున్నారు.
\v 26 అప్పుడు అకస్మాత్తుగా పెద్ద భూకంపం వచ్చింది, చెరసాల పునాదులు కదిలి పోయాయి, వెంటనే తలుపులన్నీ తెరచుకున్నాయి, అందరి సంకెళ్ళు ఊడిపోయాయి.
\s5
\v 27 అంతలో చెరసాల అధికారి నిద్ర లేచి, చెరసాల తలుపులన్నీ తెరచి ఉండడం చూచి, ఖైదీలు పారిపోయారనుకొని, కత్తిదూసి, ఆత్మహత్య చేసుకోబోయాడు.
\v 28 అయితే పౌలు, "నీవు ఏ హానీ చేసుకోవద్దు, మేమంతా యిక్కడే ఉన్నాం", అన్నాడు..
\s5
\v 29 చెరసాల అధికారి దీపాలు తెమ్మని చెప్పి వేగంగా లోపలికి వచ్చి, వణుకుతూ పౌలు, సీలలకు సాష్టాంగ పడి ,
\v 30 వారిని బయటికి తెచ్చి, "అయ్యా, రక్షణ పొందాలంటే నేనేమి చేయాలి?" అని అడిగాడు.
\v 31 అందుకు వారు, "ప్రభువైన యేసులో విశ్వాసముంచు, అప్పుడు నువ్వూ, నీ యింటివారూ రక్షణ పొందుతారు", అని చెప్పి
\s5
\v 32 అతనికీ అతని ఇంట్లో ఉన్న వారందరికీ దేవుని వాక్యం చెప్పారు.
\v 33 రాత్రి ఆ సమయంలోనే చెరసాల అధికారి వారిని తీసికొచ్చి, వాళ్ళ గాయాలు కడిగాడు. వెంటనే అతడూ అతని ఇంటి వారంతా బాప్తిస్మం పొందారు.
\v 34 అతడు పౌలు సీలలను తన యింటికి తీసికెళ్ళి భోజనం పెట్టి, తాను దేవుని లో విశ్వాసముంచినందుకు తన యింటి వారందరితో కూడ ఆనందించాడు.
\s5
\v 35 తెల్లవారగానే, వారిని విడిచి పెట్టండని చెప్పడానికి న్యాయాధికారులు భటుల్ని పంపారు.
\v 36 చెరసాల అధికారి ఈ మాటలు పౌలుకు తెలియ చేసి, "మిమ్మల్ని విడుదల చేయమని న్యాయాధికారులు కబురు పంపారు, కాబట్టి మీరిప్పుడు బయలుదేరి క్షేమంగా వెళ్ళండి", అని చెప్పాడు.
\s5
\v 37 అయితే పౌలు, "వారు న్యాయం విచారించకుండానే రోమీయులమైన మమ్మల్ని బహిరంగంగా కొట్టించి చెరసాలలో వేయించి, ఇప్పుడు రహస్యంగా వెళ్లగొడతారా? మేము ఒప్పుకోము. వాళ్ళే వచ్చి మమ్మల్ని బయటికి తీసుకు రావాలి", అని చెప్పాడు.
\v 38 భటులు ఈ మాటల్ని న్యాయాధికారులకు తెలియచేశారు. పౌలు సీలలు రోమీయులని విని వారు భయపడ్డారు. ఆ న్యాయాధికారులు వచ్చి
\v 39 వారిని బతిమాలుకొని చెరసాల బయటికి తీసికొనిపోయి, పట్టణం విడిచి వెళ్ళండని వారిని ప్రాధేయపడ్డారు .
\s5
\v 40 పౌలు, సీల చెరసాల నుండి బయటికి వచ్చి లూదియ యింటికి వెళ్లారు. వారు సోదరులను చూచి, ప్రోత్సహించి అ పట్టణం నుండి బయలుదేరి వెళ్లి పోయారు.
\s5
\c 17
\s తెస్సలోనిక సంఘ స్థాపన
\p
\v 1 వారు అంఫిపొలి, అపొల్లోనియ పట్టణాల మీదుగా తెస్సలొనీక పట్టణానికి వచ్చారు. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉంది.
\v 2 పౌలు తన అలవాటు ప్రకారం అక్కడికి వెళ్లి మూడు విశ్రాంతి దినాలు లేఖనాలలో నుండి వారితో తర్కించాడు.
\s5
\v 3 క్రీస్తు హింసలు అనుభవించి మృతులలోనుండి లేవడం తప్పనిసరి అని లేఖనాలను విప్పి వివరించాడు. 'నేను మీకు ప్రకటించే యేసే, క్రీస్తు' అని తెలియచేశాడు.
\v 4 కొంతమంది యూదులు ఒప్పుకొని పౌలు సీలల తో కలిశారు, వారిలో భక్తిపరులైన గ్రీకు వారూ, చాలమంది ప్రముఖమైన స్త్రీలూ ఉన్నారు.
\s యూదుల వ్యతిరేకత
\s5
\p
\v 5 అయితే అ బోధకి సమ్మతించని యూదులు అసూయతో నిండి పోయి , ఊరిలో పనిపాటా లేకుండా తిరిగే కొంతమంది పోకిరీవాళ్ళను వెంటబెట్టుకుని గుంపు కూర్చి పట్టణమంతా పెద్దగా అల్లరి చేస్తూ, యాసోను యింటి మీదపడి పౌలు సీలలను జనం మధ్యకు తీసుకు వెళ్లాలనుకున్నారు.
\v 6 అయితే వారు కనబడక పోయేసరికి యాసోనునూ మరి కొంతమంది సోదరుల్నీ ఆ పట్టణ అధికారుల దగ్గరికి ఈడ్చుకు పోయి, "భూలోకాన్ని తలక్రిందులు చేసిన వీరు యిక్కడికి కూడ వచ్చారు. యాసోను వీరిని తన ఇంట్లో పెట్టుకున్నాడు.
\v 7 వీళ్ళంతా యేసు అనే వేరొక రాజున్నాడని చెప్తూ కైసరు చట్టాలకు విరోధంగా నడుచుకొంటున్నారు," అని కేకలు వేశారు.
\s5
\v 8 జనమూ అధికారులూ ఈ మాటలు విని అందోళనపడ్డారు.
\v 9 వారు యాసోను దగ్గరా మిగతావారి దగ్గరా జామీను తీసికొని విడుదల చేశారు.
\s బెరాయలో పరిచర్య
\s5
\p
\v 10 సోదరులు అదే రాత్రి పౌలునూ సీలనూ బెరయ ఊరికి పంపించారు. వారు వచ్చి యూదుల సమాజ మందిరం లోకి వెళ్ళారు.
\v 11 వీరు తెస్సలొనీక లో ఉన్నవారి కంటె ఉదాత్తమైన మనసు గలవారు. ఎందుకంటే వీరు శ్రద్ధతో వాక్యాన్ని అంగీకరించి, పౌలు సీల చెప్పిన సంగతులు అలా ఉన్నాయో లేవో అని ప్రతి రోజూ లేఖనాలను తరచి చూస్తూ వచ్చారు.
\v 12 అందుచేత వారిలో చాలామంది నమ్మారు. ప్రముఖ గ్రీకు స్త్రీలూ, పురుషులూ విశ్వసించారు.
\s5
\v 13 అయితే బెరయలో కూడా పౌలు దేవుని వాక్యం ప్రకటిస్తున్నాడని తెస్సలొనీకే లోని యూదులు తెలిసికొని అక్కడికి కూడా వచ్చి జనాన్ని రేపి కలవరపరచారు.
\v 14 వెంటనే సోదరులు పౌలును సముద్రం వరకు పంపారు. సీల, తిమోతి లు అక్కడే ఉండిపోయారు.
\v 15 పౌలును సాగనంపడానికి వెళ్లిన వారు అతనిని ఏతెన్సు పట్టణం వరకు తెచ్చారు. సీల, తిమోతి సాధ్యమైనంత తొందరగా తన దగ్గరికి రావాలని పౌలు, వారి ద్వారా కబురు పంపాడు.
\s ఎతెన్సులో పౌలు
\s5
\p
\v 16 పౌలు ఏతెన్సులో వారి కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ పట్టణం నిండా ఉన్న విగ్రహాలను గమనించి అతని ఆత్మ పరితపించింది.
\v 17 అందుచేత సమాజ మందిరంలో యూదులతోనూ దేవుణ్ణి అరాధించే వారితోనూ, అంగడి వీధుల్లో ప్రతి రోజూ తనను కలిసికొనే వారితోనూ చర్చిస్తూ వచ్చాడు.
\s5
\v 18 ఎపికూరీయుల స్తోయికుల వర్గానికి చెందిన కొంతమంది తత్వవేత్తలు అతనితో వాదించారు. కొంతమంది, "ఈ వాగుడుకాయ చెప్పేది ఏమిటి" అని చెప్పుకున్నారు. అతడు యేసుని గూర్చీ, చనిపోయిన వారు తిరిగి బ్రతకడం గూర్చీ ప్రకటించాడు కాబట్టి మరి కొంత మంది, "ఇతడు మనం ఎరగని దేవుళ్ళను ప్రచారం చేస్తున్నాదు" అని చెప్పుకున్నారు.
\s5
\v 19 వారు అతనిని వెంటబెట్టుకొని అరేయొపగు అనే సమాఖ్య దగ్గరికి తీసికొనిపోయి, "నీవు చెప్తున్న ఈ కొత్త బోధ మేము తెలిసికోవచ్చా?
\v 20 నీవు కొన్ని వింత విషయాలు మాకు వినిపిస్తున్నావు. అందుచేత వీటి అర్థమేంటో మాకు తెలుసుకోవాలని ఉంది," అని చెప్పారు.
\v 21 ఏతెన్సు వారూ, అక్కడ నివసించే విదేశీయులూ ఏదో ఒక కొత్త విషయం చెప్పడంలో వినడంలో మాత్రమే తమ సమయాన్ని గడిపేవారు.
\s అరియోపగు సభలో పౌలు ఉపన్యాసం
\s5
\p
\v 22 పౌలు అరేయొపగు సభనుద్దేశించి "ఏతెన్సు వాసులారా, మీరు అన్ని విషయాల్లో చాలా భక్తిపరులని నేను గమనిస్తున్నాను.
\v 23 నేను దారిన పోతుంటే మీరు పూజించే వాటిని చూశాను. అక్కడ ఒక బలిపీఠం నాకు కనబడింది. దాని మీద 'తెలియని దేవునికి' అని రాసి ఉంది. కాబట్టి మీరు తెలియకుండా దేనిని అరాధిస్తున్నారో దానినే నేను మీకు తెలియచేస్తున్నాను.
\s5
\v 24 విశ్వాన్నీ, దానిలోని సమస్తాన్నీ చేసిన దేవుడు, తానే ఆకాశానికీ భూమికీ ప్రభువు కాబట్టి చేతితో చేసిన ఆలయాలలో నివసించడు.
\v 25 ఆయన అందరికీ జీవాన్నీ ఊపిరినీ తక్కిన అన్నింటినీ దయచేసేవాడు. కాబట్టి తనకు ఏదో అక్కర ఉన్నట్టుగా మనుషులు చేతులతో చేసే సేవలు అందుకోడు.
\s5
\v 26 ఆయన ఒక్క మనిషి నుండి లోకమంతట్లో నివసించే అన్ని జాతుల మనుషులను చేసి, వారి కోసం కాలాలను నియమించాడు. నివసించే సరిహద్దులను ఏర్పరిచాడు. అందుచేత వారు దేవుణ్ణి వెతికి కనుగొనాలి.
\v 27 వాస్తవానికి ఆయన మనలో ఎవరికీ దూరంగా ఉండేవాడు కాదు.
\s5
\v 28 మనం ఆయనలో బతుకుతున్నాం, ఆయన లోనే మన కదలికలూ ఉనికీ ఉన్నాయి. 'మనమాయన సంతానం,' అని మీ కవుల్లో కూడా కొందరు చెప్పారు.
\v 29 కాబట్టి మనం దేవుని సంతానం గదా, దేవత్వం అనేది మనుషులు తమ ఆలోచనా నైపుణ్యాలతో చెక్కిన బంగారు, వెండి, రాతి బొమ్మలను పోలి ఉంటుందని అనుకోకూడదు.
\s5
\v 30 ఆ అజ్ఞాన కాలాలను దేవుడు చూసీ చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అంతటా అందరూ పశ్చాత్తాప పడాలని అందరికీ ఆజ్ఞాపిస్తున్నాడు.
\v 31 ఎందుకంటే తాను నియమించిన వ్యక్తితో నీతిని బట్టి లోకానికి తీర్పు తీర్చే ఒక రోజు నిర్ణయించాడు. మృతుల్లో నుండి ఆయనను లేపాడు కాబట్టి దీన్ని నమ్మడానికి అందరికీ ఆధారం కలగజేశాడు."
\s5
\v 32 మృతులు చనిపోయి తిరిగి లేవడం గురించి వారు విన్నప్పుడు కొంతమంది ఎగతాళి చేసారు. మరి కొంతమంది దీనిని గురించి నీవు చెప్పేది మరొకసారి వింటామని చెప్పారు.
\v 33 ఆ తర్వాత పౌలు వారి దగ్గర నుండి వెళ్లిపోయాడు.
\v 34 అయితే కొంతమంది అతనితో చేరి విశ్వసించారు. వారిలో అరేయొపగీతు వాడైన దియొనూసియ, దమరి అనే ఒక స్త్రీ, వీరితోపాటు మరి కొంతమంది కూడా ఉన్నారు.
\s5
\c 18
\s కొరింతు లో పౌలు
\p
\v 1 ఆ తరువాత పౌలు ఏతెన్స్ నుండి బయలుదేరి కొరింతుకు వచ్చి, పొంతు వంశానికి చెందిన అకుల అనే ఒక యూదుడినీ అతని భార్య ప్రిస్కిల్లనూ గురించి తెలుసుకుని వారి దగ్గరకు వెళ్ళాడు.
\v 2 యూదులంతా రోమ్ నగరాన్ని విడిచి వెళ్ళాలని క్లాడియస్ చక్రవర్తి ఆజ్ఞ జారీ చేసిన కారణం చేత, వారు ఇటలీ నుంచి కొద్ది కాలం క్రితమే ఈ పట్టణానికి తరలి వచ్చారు.
\v 3 వారి వృత్తి డేరాలు కుట్టడం. పౌలు వృత్తి కూడా అదే కాబట్టి అతడు వారితో నివసిస్తూ కలిసి పని చేశాడు.
\s5
\v 4 అతడు ప్రతి విశ్రాంతిదినాన సమాజ మందిరంలో యూదులతో, గ్రీకు వారితో తర్కిస్తూ వారిని ఒప్పిస్తూ వచ్చాడు.
\v 5 సీల, తిమోతిలు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించడంలో మరింతగా నిమగ్నమయ్యాడు. ఆసక్తితో యేసే క్రీస్తని యూదులకు బలంగా సాక్ష్యమిస్తున్నాడు.
\v 6 వారు అతనిని ఎదిరించి దూషించారు, అతడు తన బట్టలు దులుపుకొని "మీ రక్తం మీ తలమీదే ఉంటుంది గాక. నేను నిర్దోషిని. ఇకనుండి నేను యూదేతరుల దగ్గరికి వెళ్తాన" ని వారితో చెప్పి
\s5
\v 7 అక్కడనుండి వెళ్లి, దైవభక్తి గల తితియస్ యూస్తు అనే అతని ఇంటికి వచ్చాడు. అతని ఇల్లు సమాజ మందిరాన్ని ఆనుకొని ఉంది.
\v 8 ఆ సమాజ మందిరం అధికారి క్రిస్పు కుటుంబ సమేతంగా ప్రభువులో విశ్వాసముంచాడు. ఇంకా కొరింతు పౌరుల్లో చాలామంది విని, విశ్వసించి బాప్తిస్మం పొందారు.
\s5
\v 9 ప్రభువు రాత్రివేళ దర్శనంలో "నీవు భయపడకుండా మాట్లాడు. మౌనంగా ఉండవద్దు.
\v 10 నేను నీకు తోడుగా ఉన్నాను, హాని చేయడానికి నీ మీదికి ఎవడూ రాడు. ఈ పట్టణంలో నాకు చెందినవారు చాలామంది ఉన్నారు" అని పౌలుతో చెప్పాడు.
\v 11 అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధిస్తూ, ఒకటిన్నర సంవత్సరాలు అక్కడ నివసించాడు.
\s గల్లియో నిర్లక్షం
\s5
\p
\v 12 గల్లియో అకయకు గవర్నర్ గా ఉన్న రోజుల్లో యూదులంతా ఏకమై పౌలు మీదికి లేచి న్యాయపీఠం ముందుకి అతణ్ణి తీసికొని వచ్చారు.
\v 13 "వీడు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా దేవుణ్ణి ఆరాధించడానికి ప్రజలను ప్రేరేపిస్తున్నాడ" ని ఆరోపణ చేశారు.
\s5
\v 14 పౌలు మాట్లాడడం ప్రారంభించినపుడు గల్లియో, "యూదులారా, ఈ వివాదం ఏదో ఒక అన్యాయానికో, ఒక చెడ్డ నేరానికో సంబంధించినదైతే నేను మీ మాట సహనంగా వినడం న్యాయమే.
\v 15 ఇది ఏదో ఉపదేశం గురించో, పేరులు గురించో, ధర్మశాస్త్రం గురించో వాదన అయితే ఆ విషయం మీరే చూసుకోండి. ఇలాంటి వాటి గురించి విచారణ చేయడానికి నాకు మనసు లేదు" అని యూదులతో చెప్పి
\s5
\v 16 వారిని న్యాయపీఠం దగ్గర నుండి పంపి వేశాడు.
\v 17 అప్పడు అందరూ సమాజ మందిరం అధికారి సోస్తేనేసును పట్టుకొని న్యాయపీఠం దగ్గర కొట్టసాగారు అయితే ఈ సంగతులేవీ గల్లియో పట్టించుకోలేదు.
\s పౌలు మొక్కుబడి
\s5
\p
\v 18 పౌలు ఇంకా చాల రోజులు అక్కడే ఉండి చివరికి వారి దగ్గర సెలవు తీసుకున్నాడు. అతనికి మొక్కుబడి ఉండడం వల్ల కెంక్రేయలో తన జుట్టు కత్తిరించుకొని ప్రిస్కిల్ల, అకులతో కలిసి సిరియాకు బయలుదేరాడు.
\v 19 వారు ఎఫెసు వచ్చినప్పుడు పౌలు వారిని అక్కడ విడిచి పెట్టి తాను మాత్రం సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో వాదిస్తూ ఉన్నాడు.
\s5
\v 20 వారు ఇంక కొంతకాలం తమతో ఉండమని పౌలును బతిమాలారు.
\v 21 అతడు అంగీకరించక దేవుని చిత్తమైతే మరొకసారి వస్తానని చెప్పి వారి దగ్గర సెలవు తీసుకొని ఓడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరాడు.
\s5
\v 22 తరువాత కైసరయ రేవు లో దిగి యెరూషలేము వెళ్ళి, అక్కడి సంఘాన్ని పలకరించి, అంతియొకయకు వచ్చాడు.
\v 23 అక్కడ కొంతకాలం ఉన్న తరువాత బయలుదేరి వరసగా గలిలయ ప్రాంతంలో, ఫ్రుగియలో సంచరిస్తూ శిష్యులందరినీ స్థిరపరిచాడు.
\s ఎఫెసులో అపోల్లో
\s5
\p
\v 24 అలెగ్జాండ్రియ వాడైన అపొల్లో అనే ఒక యూదుడు ఎఫెసు వచ్చాడు. అతడు గొప్ప విద్వాంసుడు, లేఖనాల్లో ప్రావీణ్యత కలిగినవాడు.
\v 25 అతడు ప్రభువు మార్గంలో ఉపదేశం పొంది, ఆత్మలో తీవ్రత కలిగి, యేసును గూర్చి స్పష్టంగా మాట్లాడుతూ, సమాజ మందిరాలలో ధైర్యంగా బోధించడం మొదలు పెట్టాడు. కానీ అతనికి యోహాను బాప్తిస్మం గురించి మాత్రమే తెలుసు.
\v 26 ప్రిస్కిల్ల, అకుల అతని గురించి విని, అతనిని చేర్చుకొని దేవుని మార్గం గురించి పూర్తిగా విశదపరిచారు.
\s5
\v 27 తరువాత అతడు అకయ వెళ్ళాలని తలంచినప్పుడు అక్కడి విశ్వాసులకు ఉత్తరాలు రాసి అతనిని చేర్చుకోమని అక్కడి సోదరులను ప్రోత్సాహపరిచారు. అతడు అక్కడికి వచ్చి, దైవ కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేసాడు.
\v 28 లేఖనాల ఆధారంతో యేసే క్రీస్తని రుజువు పరుస్తూ, బహిరంగంగా యూదుల వాదాన్ని గట్టిగా ఖండిస్తూ వచ్చాడు.
\s5
\c 19
\s ఎఫెసులో యోహాను శిష్యగణం క్రైస్తవులు కావడం
\p
\v 1 అపొల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగిందేమంటే, పౌలు మన్య ప్రాంతాల్లో సంచరించి ఎఫెసుకు వచ్చినప్పుడు కొందరు శిష్యులు అతనికి కనిపించారు. వారిని "మీరు నమ్ముకున్నప్పుడు పరిశుద్ధాత్మను పొందారా" అని అడిగాడు.
\v 2 వారు "పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతే మేం వినలే" దని చెప్పారు.
\s5
\v 3 అప్పుడు పౌలు "అలాగైతే మీరు దేనిలోకి బాప్తిస్మం పొందార"ని అడగ్గా, వారు "యోహాను బాప్తిస్మం లోకి" అని చెప్పారు.
\v 4 అందుకు పౌలు "యోహాను తన వెనుక వచ్చే వానిలో, అనగా యేసులో విశ్వాసముంచాలని ప్రజలతో చెప్తూ, మారుమనస్సు విషయమైన బాప్తిస్మమిచ్చాడు" అని చెప్పాడు.
\s5
\v 5 వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు పేరున బాప్తిస్మం పొందారు.
\v 6 తరువాత పౌలు వారి మీద చేతులుంచినపుడు పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చాడు. అప్పుడు వారు భాషలతో మాటలాడటం, ప్రవచించడం మొదలుపెట్టారు.
\v 7 వారందరూ సుమారు పన్నెండు మంది పురుషులు.
\s సమాజకేంద్రంలో ఆపైన తురన్ను అనే వాడి బడిలో పౌలు బోధనలు
\s5
\p
\v 8 తరువాత అతడు సమాజ మందిరంలోకి వెళ్లి ప్రసంగిస్తూ, దేవుని రాజ్యం గూర్చి తర్కిస్తూ, ఒప్పిస్తూ, ధైర్యంగా మాట్లాడుతూ మూడు నెలలు గడిపాడు.
\v 9 అయితే కొందరు తమ హృదయాలను కఠినం చేసికొని అతనిని తిరస్కరించి, జనసమూహం ఎదుట క్రీస్తు మార్గాన్ని దూషిస్తూ వచ్చారు. కాబట్టి అతడు వారిని విడిచిపెట్టి, శిష్యులను వారినుండి వేరు చేసి ప్రతిరోజూ తురన్ను అనే అతని బడిలో చర్చిస్తూ వచ్చాడు.
\v 10 రెండు సంవత్సరాల పాటు ఈ విధంగా జరిగింది. కాబట్టి యూదులు, గ్రీకులు, ఆసియలో నివసించే వారంతా ప్రభువు వాక్యం విన్నారు.
\s పౌలు చేసిన అద్భుతాలు
\s5
\p
\v 11 అంతేగాక దేవుడు పౌలు చేత కన్నులు మిరిమిట్లు గొలిపే అద్భుతాలను చేయించాడు.
\v 12 అతని శరీరానికి తాకిన చేతిగుడ్డలయినా, నడికట్లయినా రోగుల దగ్గరకు తెస్తే వారి రోగాలు పోయాయి, దుష్టాత్మలు కూడ వదలిపోయాయి.
\s5
\v 13 అప్పుడు దేశసంచారం చేసే యూదు మాంత్రికులు కొందరు "పౌలు ప్రకటించే యేసు తోడు, మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను" అని చెప్పి, దుష్టాత్మలు పట్టినవారి మీద ప్రభువైన యేసు పేరు ఉచ్ఛరించడానికి పూనుకొన్నారు.
\v 14 స్కెవ అనే ఒక యూదు ప్రధాన యాజకుని కొడుకులు ఏడుగురు కూడా ఆ విధంగా చేస్తున్నారు.
\s5
\v 15 అందుకు ఆ దుష్టాత్మ "నాకు యేసు ఎవరో తెలుసు, పౌలు కూడా తెలుసు గాని, మీరెవర"ని అడగింది.
\v 16 ఆ దుష్టాత్మ పట్టినవాడు ఎగిరి వారిమీద పడి వారిని లొంగదీసుకోవడంతో ఆ దుష్టాత్మ గెలిచింది. అందుచేత వారు గాయాలతో నగ్నంగా ఆ ఇంటినుండి పారిపోయారు.
\v 17 ఈ సంగతి ఎఫెసులో నివసించే యూదులకు, గ్రీకువారికి తెలిసినప్పుడు వారందరికీ భయం కలిగింది కాబట్టి ప్రభువైన యేసు నామానికి ఘనత కలిగింది.
\s5
\v 18 విశ్వసించినవారు అనేకులు వచ్చి, తమ దుర్మార్గ క్రియలను ఒప్పుకున్నారు.
\v 19 అంతేగాక మాంత్రిక విద్య అభ్యసించినవారు చాలా మంది తమ పుస్తకాలను తెచ్చి, బహిరంగంగా వాటిని కాల్చివేశారు. లెక్క చూసినప్పుడు వాటి విలువ యాభై వేల వెండి రూపాయలు అయింది.
\v 20 అంత ప్రభావ సహితంగా ప్రభువు వాక్యం వ్యాపించింది.
\s5
\v 21 ఇది జరిగిన తరువాత పౌలు మాసిదోనియ, అకయ దేశాల మార్గంలో యెరూషలేము వెళ్ళాలని ఉద్దేశించి 'నేను అక్కడికి వెళ్లిన తరువాత రోమ్ నగరాన్ని కూడా చూడాలి' అని నిర్ణయించుకున్నాడు.
\v 22 అప్పుడు తన పరిచారకుల్లో తిమోతి, ఎరస్తు అనే ఇద్దరిని మాసిదొనియ పంపించి తాను మాత్రం ఆసియలో కొంతకాలం నిలిచిపోయాడు.
\s ఎఫెసులో కంసాలుల ఆగడం
\s5
\p
\v 23 ఆ రోజుల్లో క్రీస్తు మార్గం గురించి అక్కడ చాలా అల్లరి చెలరేగింది.
\v 24 ఎలాగంటే, దేమేత్రి అనే ఒక కంసాలి డయానా దేవతకు వెండి విగ్రహాలను చేయిస్తూ అక్కడి పనివారికి మంచి ఆదాయం కల్పించేవాడు.
\v 25 అతడు వారిని, ఆ పని చేసే ఇతరులను పోగుచేసి వారితో, "ఈ పని ద్వారా మనకి మంచి ఆదాయం వస్తూ మన జీవనోపాధి బాగా జరుగుతూ ఉందని మీకు తెలుసు.
\s5
\v 26 అయితే ఈ పౌలు, చేతులతో చేసిన విగ్రహాలు నిజమైన దేవుళ్లు కారని బోధించి, ఎఫెసులో మాత్రమే కాక మొత్తం ఆసియా అంతట చాలామంది ప్రజలను పెడత్రోవ పట్టించాడని మీరు విన్నారు, చూశారు కూడా.
\v 27 పైగా మన వృత్తిమీద శ్రద్ధ తగ్గిపోవడమే కాక, డయానా దేవస్థానం కూడ నిర్లక్ష్యానికి గురై, ఆసియా అంతటా, ఇంకా భూలోకమంతటా పూజలందుకుంటున్న ఈమె ప్రభావం తగ్గిపోతుందేమో అని నాకు భయం వేస్తున్నది" అని వారితో చెప్పాడు.
\s5
\v 28 వారు అది విని ఉగ్రులైపోయి "ఎఫెసీయుల డయానా మహాదేవి" అని కేకలు వేశారు.
\v 29 దానితో పట్టణం బహు గందరగోళం గా తయారైంది. వెంటనే వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మసిదోనియాకు చెందిన గాయినీ అరిస్తార్కునీ పట్టుకొని దొమ్మీగా అక్కడి నాటక ప్రదర్శన శాలలోకి ఈడ్చుకు పోయారు.
\s5
\v 30 పౌలు ఆ జనసమూహం పోగైన సభ దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు గాని, శిష్యులు అతనిని వెళ్లనియ్యలేదు.
\v 31 అంతేగాక ఆసియా దేశాధికారుల్లో అతని స్నేహితులు కొందరు అతనికి కబురు పంపి "నీవు నాటక ప్రదర్శనశాల లోకి వెళ్లవద్దు" అని నచ్చజెప్పారు.
\v 32 ఆ సభ గందరగోళంగా ఉంది. కొందరు ఒక రకంగా, మరికొందరు మరో రకంగా కేకలు వేస్తున్నారు. అసలు తామెందుకు అక్కడ గుమిగూడామో చాలమందికి తెలియనే లేదు.
\s5
\v 33 అప్పుడు యూదులు అలెగ్జాండర్ ను ముందుకు తోసి అతనిని జనం ముందుకు తెచ్చారు. అలెగ్జాండర్ సైగ చేసి ఆ ప్రజలకి సమాధానం చెప్పుకోవాలని చూసాడు.
\v 34 అయితే అతడు యూదుడని వారికి తెలిసి అందరూ మూకుమ్మడిగా రెండు గంటలసేపు 'ఎఫెసీయుల డయానా మహాదేవి' అని నినాదాలు చేసారు.
\s5
\v 35 అప్పుడు ఊరి కరణం సమూహాన్ని సముదాయించి "ఎఫెసీవాసులారా, ఎఫెసు పట్టణం డయానా మహాదేవికీ ఆకాశం నుండి పడిన పవిత్ర శిలకూ ధర్మకర్త అని తెలియని వారెవరు?
\v 36 ఈ సంగతులు తిరుగులేనివి కాబట్టి మీరు శాంతం వహించి ఏ విషయంలోనూ తొందరపడక పోతే మంచిది
\v 37 మీరు ఈ వ్యక్తుల్ని తీసికొచ్చారు గదా, వీరు గుడిని దోచుకున్న వారా? మన దేవతను దూషించారా?
\s5
\v 38 దేమేత్రికీ అతనితో ఉన్న కంసాలులకూ వీరి మీద ఆరోపణలు ఏవైనా ఉంటే న్యాయసభలు జరుగుతున్నాయి, అధికారులు ఉన్నారు కాబట్టి వారు ఒకరిపై ఒకరు వ్యాజ్యం వేయవచ్చు.
\v 39 అయితే మీరు ఇతర సంగతులను గురించి విచారణ చేయాలనుకుంటే అవి క్రమమైన సభలోనే పరిష్కారమవుతాయి.
\v 40 మనం ఈ గందరగోళం గూర్చి చెప్పదగిన కారణం ఏమీ లేదు గనక, ఈ రోజు జరిగిన అల్లరిని గురించి అధికారులు మనపై విచారణ జరుపుతారేమో అని భయంగా ఉంది. ఈ విధంగా గుంపు కూడడానికి తగిన కారణం ఏం చెబుతాం?" అని వారితో అన్నాడు.
\v 41 అతడలా చెప్పి సభను ముగించేసాడు.
\s5
\c 20
\s మాసిదోనియ గ్రీసుల గుండా పౌలు యెరూషలేము ప్రయాణం
\p
\v 1 ఆ అల్లరి సద్దుమణిగిన తరువాత పౌలు శిష్యులను దగ్గరికి పిలిచి ప్రోత్సాహక వాక్కులు చెప్పి వారి దగ్గర సెలవు తీసికొని మాసిదోనియ బయలుదేరాడు.
\v 2 ఆ ప్రాంతాలన్నీ తిరిగి అక్కడి విశ్వాసుల్ని ప్రోత్సహించి గ్రీసు వచ్చాడు.
\v 3 అతడు అక్కడ మూడు నెలలు గడిపిన తరువాత ఓడపై సిరియా వెళ్ళాలని భావించాడు గాని అక్కడి యూదులు అతనిపై కుట్ర చేస్తున్నారని తెలిసి తిరిగి మాసిదోనియ వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు.
\s5
\v 4 ఫుర్రస్ కుమారుడు, బెరయ ఊరికి చెందిన సోపత్రు, థెస్సలొనికవారు అరిస్తార్కు, సెకుందు, దెర్బె ఊరివాడు గాయి, తిమోతి, ఆసియా దేశాలకు చెందిన తుకికు, త్రోఫిము లు అతనితో ఆసియా వరకు వచ్చారు.
\v 5 అయితే వారంతా ముందుగా వెళ్లి త్రోయలో మా కోసం ఎదురు చూస్తున్నారు.
\s త్రోయ లో పౌలు చర్యలు
\p
\v 6 మేము పులియని పిండితో చేసే రొట్టెల పండగ దినాలు పూర్తయ్యాక ఓడ ఎక్కి ఫిలిప్పి విడిచి పెట్టి అయిదు రోజులు ప్రయాణించి త్రోయ చేరుకొని వారి దగ్గర ఏడు రోజులు గడిపాము.
\s5
\p
\v 7 ఆదివారం నాడు మేము రొట్టె విరవడానికి సమకూడినప్పుడు పౌలు తరువాతి రోజు వెళ్ళవలసి ఉంది కాబట్టి అతడు వారితో అర్థరాత్రి దాకా విస్తరించి మాట్లాడుతూ ఉండిపోయాడు.
\v 8 మేము సమావేశమైన మేడగదిలో చాలా దీపాలు ఉన్నాయి.
\s5
\v 9 పౌలు చాలాసేపు ప్రసంగిస్తుంటే కిటికీ లో కూర్చున్న ఐతుకు అనే యువకుడు గాఢ నిద్రలో మునిగి జోగి, మూడో అంతస్తు నుండి జారి కింద పడి చనిపోయాడు
\v 10 అప్పుడు పౌలు కిందికి వెళ్లి అతని మీద పడుకొని కౌగలించుకొని, "మీరిక చింతించాల్సిన పని లేదు. ఎందుకంటే అతను బ్రతికే ఉన్నాడ" ని వారితో చెప్పాడు.
\s5
\v 11 అతడు మళ్ళీ పైకి వచ్చి రొట్టె విరిచి భుజించి తెల్లవారే వరకు వారితో ఎన్నో విషయాలు మాట్లాడి బయలుదేరాడు.
\v 12 సజీవంగా ఉన్న ఆ యువకుణ్ణి లోపలి తీసుకు వచ్చినప్పుడు వారికి గొప్ప ఆదరణ కలిగింది.
\s మిలేతుకు
\s5
\p
\v 13 మేము ఓడ ఎక్కి అస్సు అనే ప్రాంతానికి వెళ్లి అక్కడ పౌలుని ఎక్కించుకోవాలని ముందుగా బయల్దేరాం. తాను అక్కడివరకు కాలి నడకను రావాలని ఉద్దేశించి పౌలు మమ్మల్ని ఆ విధంగా ఆదేశించాడు.
\v 14 అస్సులో అతడు మాతో కలిసిన తరువాత మేమంతా కలిసి మితిలేనే వచ్చాం.
\s5
\v 15 అక్కడ నుండి బయలుదేరి మరునాటికి కీయోసు ద్వీపానికి ఎదురుగా వచ్చాం. మరునాటికి సమొసు చేరుకొని ఆ తరువాతి రోజుకి మిలేతు చేరుకున్నాం.
\v 16 సాధ్యమైతే పెంతెకోస్తు రోజున యెరూషలేములొ ఉండాలని పౌలు త్వరపడుతున్నాడు కాబట్టి ఆసియాలో కాలయాపన చేయకుండా ఎఫెసు వెళ్ళిపోవాలని అతడు నిశ్చయించుకున్నాడు.
\s ఎఫెసు సంఘపెద్దలతో పౌలు
\s5
\p
\v 17 అతడు మిలేతులో ఉండగానే ఎఫెసు లోని పెద్దలకు కబురు పెట్టి వారిని పిలిపించాడు.
\v 18 వారు వచ్చినపుడు వారితో యిలా అన్నాడు, "నేను ఆసియాలో కాలు మోపిన రోజు నుండి మీ మధ్య ఏ విధంగా ప్రవర్తించానో మీకే తెలుసు.
\v 19 యూదుల కుట్రల వలన నాకు విషమ పరీక్షలు సంభవించినా కన్నీటితోనూ, సంపూర్ణమైన వినయభావంతోనూ ప్రభువుకు సేవ చేసానని మీకు తెలుసు.
\v 20 ప్రయోజనకరమైన దేనినీ నేను దాచుకోకుండా బహిరంగంగా, ఇంటింటికీ తిరిగి బోధించాను.
\v 21 అంతేకాక, దేవుని ఎదుట మారుమనస్సు పొంది మన ప్రభువైన యేసు క్రీస్తులో విశ్వాసముంచాలని యూదులకూ , గ్రీసు దేశస్తులకూ ఏ విధంగా సాక్ష్యం ఇస్తున్నానో, అంతా మీకు తెలుసు.
\s5
\v 22 ఇదిగో, ఇప్పుడు నేను ఆత్మ నిర్బంధంలో యెరూషలేము వెళ్తున్నాను, అక్కడ నాకు ఏమేమి సంభవిస్తాయో నాకు తెలియదు.
\v 23 కానీ , పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో సాక్ష్యమిస్తూ నా కోసం సంకెళ్ళు, హింసలూ వేచి ఉన్నాయని చెప్పాడని మాత్రం తెలుసు.
\v 24 అయితే దేవుని కృపాసువార్తను గురించి సాక్ష్యం ఇవ్వడంలో నా జీవిత లక్ష్యాన్ని, ప్రభువైన యేసు వలన నేను పొందిన పరిచర్యను పూర్తి చేయడం కోసం నా ప్రాణాన్ని నాకెంత మాత్రం ప్రియంగా ఎంచుకోవడం లేదు.
\s5
\v 25 ఇదిగో, దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తూ నేను మీ మధ్య తిరుగుతూ ఉన్నాను. మీరెవరూ ఇక మీదట నా ముఖం చూడరని నాకు తెలుసు.
\v 26 కాబట్టి మీ అందరి రక్తం విషయంలో నేను నిర్దోషినని మిమ్మల్నే సాక్ష్యంగా పెడుతున్నాను.
\v 27 ఎందుకంటే దేవుని సంకల్పాన్ని మీకు పూర్తిగా ప్రకటించకుండా నేనేమీ దాచుకోలేదు.
\s5
\v 28 ప్రభువు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని కాయడం కోసం పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనికి అధ్యక్షులుగా నియమించాడో ఆ మంద అంతటిని గురించీ, మీ మట్టుకు మిమ్మల్ని గురించీ జాగ్రత్తగా ఉండండి.
\v 29 నాకు తెలుసు, నేను వెళ్ళిపోయిన వెంటనే క్రూరమైన తోడేళ్ళు వంటి వారు మీలో ప్రవేశిస్తారు. వారు మందపై జాలి చూపరు.
\v 30 అంతేకాక శిష్యుల్ని తమతో ఈడ్చుకుపోవడం కోసం వక్రమైన మాటలు పలికే వ్యక్తులు మీలోనుండే బయలుదేరుతారు.
\s5
\v 31 కాబట్టి మూడు సంవత్సరాలుగా నేను రాత్రింబగళ్ళు కన్నీళ్ళతో మీలో ప్రతి ఒక్కరికీ ఎడతెగక బుద్ధి చెప్తూ ఉన్నానని గుర్తుంచుకుని మెలకువగా ఉండండి.
\v 32 ఇప్పుడు దేవునికీ, ఆయన కృపావాక్యానికీ మిమ్మల్ని అప్పగిస్తున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగజేయటానికీ పరిశుద్దులందరితో వారసత్వం అనుగ్రహించడానికీ శక్తిమంతుడు.
\s5
\v 33 నేను ఎవరి వెండిని గానీ, బంగారాన్ని గానీ ఆశించలేదు.
\v 34 నా అవసరాల నిమిత్తం, నాతో ఉన్నవారి నిమిత్తం ఈ నా చేతులు కష్టపడ్డాయని మీకు తెలుసు.
\v 35 మీరు కూడా అదే విధంగా ప్రయాసపడి బలహీనులను సంరక్షించాలనీ, 'పుచ్చుకొనుటకంటే ఇచ్చుట ధన్యము', అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసికోవాలనీ, నేను అన్ని విషయాల్లో మీకు ఆదర్శంగా నిలిచాను".
\s5
\p
\v 36 అతడు ఈ విధంగా చెప్పి మోకరించి వారందరితో కలిసి ప్రార్థన చేసాడు.
\v 37 అప్పుడు వారంతా చాలా ఏడ్చి పౌలును కౌగలించుకుని ముద్దుపెట్టుకున్నారు.
\v 38 మరి ముఖ్యంగా మీరు ఇక మీదట నా ముఖం చూడరని అతడు చెప్పిన మాటను బట్టి వారు ఎంతో దుఃఖిస్తూ ఓడ వరకు అతనిని సాగనంపారు.
\s5
\c 21
\s తూరు పట్టణానికి ప్రయాణం
\p
\v 1 మేము వారిని విడిచి ఓడ ఎక్కి నేరుగా వెళ్లి కోసుకు, మరునాడు రొదుకు, అక్కడ నుంచి పతర రేవుకు వచ్చాం.
\v 2 అక్కడ ఫేనీకే బయలుదేరుతున్న ఒక ఓడను చూసి దానిలో ఎక్కాం.
\s5
\v 3 దానిపై వెళ్తూ కుప్ర కనిపిస్తూ ఉండగా దానికి కుడి పక్కగా ప్రయాణించి, సిరియా వైపుగా వెళ్లి, తూరులో దిగాం. అక్కడ ఓడలోని సరుకు దిగుమతి చెయ్యాల్సి ఉంది.
\s యెరూషలేముకు వెళ్ళవద్దని పౌలుకు హెచ్చరిక
\p
\v 4 మేమక్కడి శిష్యులను కలుసుకొని అక్కడ ఏడు రోజులు ఉన్నాం. వారు ఆత్మ ద్వారా 'నీవు యెరూషలేములో కాలు పెట్టవద్ద'ని పౌలుతో చెప్పారు.
\s5
\v 5 ఆ రోజులు గడిచిన తరువాత మేము ప్రయాణమైనప్పుడు వారంతా భార్యా పిల్లలతో వచ్చి మమ్మల్ని పట్టణం బయటి వరకు సాగనంపారు. వారూ, మేమూ సముద్రతీరంలో మోకాళ్ళపై ప్రార్థించి ఒకరి దగ్గర మరొకరు సెలవు తీసుకున్నాం.
\v 6 మేము ఓడ ఎక్కిన తరువాత వారు తమ ఇళ్ళకు తిరిగి వెళ్ళారు.
\s5
\p
\v 7 మేము తూరునుండి ప్రయాణించి, తొలెమాయి వచ్చి, అక్కడి సోదరులను పలకరించి వారి దగ్గర ఒక రోజు గడిపాం.
\v 8 మరునాడు బయలుదేరి కైసరయ వచ్చి, అపొస్తలులు నియమించిన ఏడుగురిలో ఒకడైన సువార్తికుడు ఫిలిప్పు ఇంటికి వచ్చి అతనితో ఉన్నాం.
\v 9 ప్రవచన వరం ఉన్న నలుగురు కుమార్తెలు అతనికి ఉన్నారు. వారంతా కన్యలు.
\s యెరూషలేముకు వెళ్ళవద్దని మరలా హెచ్చరిక
\s5
\p
\v 10 మేమక్కడ చాలా రోజులు ఉన్నాం. అగబు అనే ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చాడు.
\v 11 అతడు వచ్చి పౌలు నడికట్టు తీసికొని, దానితో తన చేతులను కాళ్లను కట్టుకొని "యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల వ్యక్తిని ఈ విధంగా బంధించి, యూదేతరుల చేతికి అప్పగిస్తారని పరిశుద్ధాత్మ చెబుతున్నాడని" అన్నాడు.
\s5
\v 12 ఈ మాట విన్నప్పుడు మేమూ, అక్కడివారూ యెరూషలేముకు వెళ్లవద్దని పౌలును బతిమాలుకొన్నాం.
\v 13 కానీ పౌలు, "ఇదేమిటి? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేస్తున్నారు? నేను ప్రభు యేసు నామం నిమిత్తం యెరూషలేములో బంధకాలకే కాదు, చనిపోవడానికి సైతం సిద్ధంగా ఉన్నాను" అని చెప్పాడు.
\v 14 అతడు మా మాట అంగీకరించక పోవడం వలన మేము "ప్రభువు చిత్తం జరుగు గాక" అని ఊరుకున్నాం.
\s యెరూషలేములో పౌలు
\s5
\p
\v 15 ఆ రోజులు గడచిన తరువాత మాకు కావలసిన సామగ్రి తీసికొని యెరూషలేముకు ప్రయాణించాం.
\v 16 మాతో కలిసి కైసరయ నుంచి కొందరు శిష్యులు, మొదటి నుండి శిష్యుడుగా ఉన్న సైప్రసు వాసి మ్నాసోనును తమతో తీసుకువచ్చారు. అతని ఇంట్లో మాకు బస ఏర్పాటు చేసారు.
\s5
\v 17 మేము యెరూషలేము చేరినప్పుడు సోదరులు మమ్మల్ని సంతోషంతో చేర్చుకొన్నారు.
\v 18 మరునాడు పెద్దలంతా అక్కడికి వచ్చినపుడు పౌలు మాతో కలిసి యాకోబు దగ్గరికి వచ్చాడు.
\v 19 అతడు వారిని కుశల ప్రశ్నలు అడిగి, తన పరిచర్య వలన దేవుడు యూదేతరుల్లో చేసిన కార్యాలను వివరంగా తెలియజెప్పాడు.
\s5
\v 20 అది విని వారు దేవుణ్ణి మహిమ పరచి అతనితో "సోదరా, యూదులలో విశ్వాసులు ఎన్ని వేలమంది ఉన్నారో చూశావు కదా? వారంతా ధర్మశాస్త్ర్రంలో ఆసక్తి గలవారు.
\v 21 యూదేతరుల మధ్య నివసించే యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనీ, మన ఆచారాలను పాటించ కూడదనీ నీవు చెప్పడం వలన వారంతా మోషేను విడిచిపెట్టాలని నీవు బోధిస్తున్నట్టుగా ఇక్కడి వారికి సమాచారం ఉంది.
\s5
\v 22 కాబట్టి మనమేం చేద్దాం? నీవు వచ్చిన సంగతి వారికి తప్పకుండా తెలుస్తుంది.
\v 23 మేము నీకు చెప్పినట్టు చెయ్యి. మొక్కుబడి ఉన్న నలుగురు వ్యక్తులు మా దగ్గర ఉన్నారు.
\v 24 నీవు వారిని తీసుకుపోయి వారితో కూడ శుద్ధి చేసికొని, వారు తల క్షౌరం చేయించుకోడానికి అయ్యే ఖర్చు నువ్వే భరించు. అప్పుడు నిన్ను గూర్చి తాము విన్న సమాచారం నిజం కాదనీ, నువ్వు కూడా ధర్మశాస్త్రాన్ని యథావిధిగా పాటించే వ్యక్తివనీ వీరు గ్రహిస్తారు.
\s5
\v 25 అయితే విశ్వసించిన యూదేతరుల విషయంలో విగ్రహాలకు అర్పించిన వాటి రక్తాన్నీ, గొంతు నులిమి చంపిన దానినీ, జారత్వాన్నీ మానాలని నిర్ణయించి వారికి రాశాం." అని చెప్పారు.
\v 26 కాబట్టి పౌలు ఆ మరునాడు మొక్కుబడి ఉన్న ఆ వ్యక్తుల్ని వెంటబెట్టుకొని వెళ్లి , వారితో కలిసి శుద్ధి చేసికొని, దేవాలయంలో ప్రవేశించి, వారందరి పక్షంగా కానుక అర్పించే వరకు శుద్ధిదినాలు నెరవేరుస్తానని చెప్పాడు.
\s ఆలయంలో యూదులు పౌలును బంధించడం
\s5
\p
\v 27 ఏడు రోజులు పూర్తి కావచ్చినప్పుడు ఆసియనుండి వచ్చిన యూదులు దేవాలయంలో అతన్ని చూసి, బలవంతంగా పట్టుకొని అక్కడి ప్రజలందరినీ కలవర పరచి
\v 28 "ఇశ్రాయేలీయులారా, వచ్చి సహాయం చేయండి. ప్రజలకీ, ధర్మశాస్త్రానికీ, ఈ స్థలానికీ విరోధంగా అందరికీ, అన్నిచోట్లా బోధిస్తున్నవాడు వీడే. పైగా వీడు గ్రీకు వారిని దేవాలయంలోకి తెచ్చి ఈ పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రం చేసాడు" అని కేకలు వేశారు.
\v 29 ఎఫెసు వాడైన త్రోఫిము అంతకు ముందు పౌలుతో కలిసి ఉండడం వారు చూశారు కాబట్టి పౌలు అతణ్ణి కూడా దేవాలయంలోకి తీసికొని వచ్చాడని వారు భావించారు.
\s5
\v 30 పట్టణమంతా గందరగోళం ఉంది. ప్రజలు గుంపులు గుంపులుగా పరుగెత్తుకు వచ్చి, పౌలును పట్టుకొని దేవాలయంలో నుండి బయటికి ఈడ్చి తలుపులు మూసేశారు.
\v 31 వారు అతణ్ణి చంపడానికి ప్రయత్నించారు. యెరూషలేము నగరమంతా అల్లకల్లోలంగా ఉందని ప్రధాన సైన్యాధికారికి సమాచారం వచ్చింది.
\s5
\v 32 వెంటనే అతడు సైనికుల్నీ, శతాధిపతుల్నీ వెంటబెట్టుకొని వారి దగ్గరికి పరుగెత్తుకు వచ్చాడు. వారు ఆ అధికారినీ, సైనికులనీ చూసి పౌలును కొట్టడం ఆపారు.
\v 33 అతడు వచ్చి పౌలుని పట్టుకొని, రెండు సంకెళ్లతో అతనిని బంధించమని ఆజ్ఞాపించి, "ఇతడెవడు? ఏమి చేశాడు?" అని అడిగాడు.
\s5
\v 34 అయితే జనం వివిధ రకాలుగా కేకలు వేస్తూ అల్లరి చేయడం చేత అతడు నిజం తెలుసుకోలేక పౌలుని కోటలోకి తీసికొని పొమ్మని ఆజ్ఞాపించాడు.
\v 35 పౌలు మెట్ల మీదికి వచ్చినప్పుడు ప్రజలు గుంపులుగా పోగై దాడికి దిగడం వలన సైనికులు అతణ్ణి మోసుకు పోవాల్సి వచ్చింది.
\v 36 ఎందుకంటే అతణ్ణి చంపమని ఆ జనసమూహం కేకలు వేస్తూ వారి వెంటబడ్డారు.
\s5
\p
\v 37 వారు పౌలుని కోటలోకి తీసుకు పోతుండగా అతడు ఆ సేనాధిపతిని "నేను నీతో ఒక మాట చెప్పవచ్చా?" అని అడిగాడు. అందుకు అతడు "నీకు గ్రీకు భాష తెలుసా?'
\v 38 ఇంతకు ముందు నాలుగు వేలమంది ఉద్యమకారుల్ని తీసుకొని అరణ్యంలోకి పారిపోయిన ఐగుప్తీయుడివి నువ్వే కదా?" అని అడిగాడు.
\s5
\v 39 అందుకు పౌలు, "నేను కిలికియలోని తార్సు పట్టణానికి చెందిన యూదుణ్ణి. ఒక మహా పట్టణపు పౌరుణ్ణి. నాకు ఈ ప్రజలతో మాటలాడే అవకాశం ఇవ్వమని నిన్ను వేడుకుంటున్నా" అన్నాడు.
\v 40 అతడు దానికి అనుమతించాడు. అప్పుడు పౌలు మెట్లమీద నిలబడి ప్రజలకి చేతితో సైగ చేశాడు. వారు సద్దు మణిగాక అతడు హెబ్రీ భాషలో ఇలా అన్నాడు,
\s5
\c 22
\s జనసమూహం ఎదుట పౌలు సంజాయిషీ. తన మార్పు గురించి సాక్ష్యం (అపో. కా. 9:1-18; 26:9-18)
\p
\v 1 "సోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ ఎదుట చెప్పుకొనే జవాబు వినండి.''
\p
\v 2 అతడు హెబ్రీభాషలో మాటలాడటం విన్నప్పుడు వారు నిశ్శబ్దమై పోయారు. అతడు ఈ విధంగా చెప్పాడు.
\s5
\p
\v 3 "నేను కిలికియలోని తార్సు పట్టణంలో పుట్టిన యూదుణ్ణి. అయితే ఈ పట్టణంలో గమలీయేలు పాదాల దగ్గర పెరిగి, మన పూర్వీకుల ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలలో శిక్షణ పొందాను. మీరంతా ఈ రోజు ఉన్న విధంగా దేవుని విషయంలో ఆసక్తి కలిగి,
\v 4 ఈ విశ్వాస మార్గాన్ని అనుసరిస్తున్న స్త్రీ పురుషుల్ని బంధించి చెరసాలలో వేయిస్తూ, చనిపోయేదాకా హింసించాను.
\v 5 ఈ విషయంలో ప్రధాన యాజకుడూ పెద్దలందరూ సాక్షులు. నేను వారి నుండి దమస్కులోని మన సోదరులకు లేఖలు తీసికొని, అక్కడి విశ్వాసులను కూడా బంధించి శిక్ష వేయడానికి యెరూషలేముకు తీసుకు రావాలని అక్కడికి వెళ్ళాను.
\s5
\v 6 నేను ప్రయాణం చేస్తూ దమస్కును సమీపించినప్పుడు మధ్యాహ్నం ఆకాశం నుండి ఒక గొప్ప వెలుగు హఠాత్తుగా నా చుట్టూ ప్రకాశించింది.
\v 7 నేను నేల మీద పడి 'సౌలూ సౌలూ, నీవు నన్నెందుకు హింసిస్తున్నావని' నాతో ఒక స్వరం పలకడం విన్నాను.
\v 8 అందుకు నేను 'ప్రభూ! నీవెవరివి?' అని అడగ్గా ఆయన, 'నేను నీవు హింసిస్తున్న నజరేయుడైన యేసుని' అని నాతో చెప్పాడు.
\s5
\v 9 నాతో ఉన్నవారు ఆ వెలుగును చూశారు గాని నాతో మాటలాడిన స్వరాన్ని వినలేదు.
\v 10 అప్పుడు నేను 'ప్రభూ, నన్నేం చేయమంటావు?' అని అడిగాను. అప్పుడు ప్రభువు, 'నువ్వు లేచి దమస్కులోకి వెళ్లు, అక్కడ నువ్వేం చేయాలని నేను నిర్ణయించానో అవన్నీ నీకు తెలుస్తాయి' అని నాతో అన్నాడు.
\v 11 ఆ వెలుగు ప్రభావం వలన నేను చూడలేకపోయాను. దాంతో నాతో ఉన్నవారు నన్ను నడిపిస్తూ దమస్కు పట్టణంలోకి తీసుకెళ్ళారు.
\s5
\p
\v 12 అక్కడ ధర్మశాస్త్రం విషయంలో భక్తిపరుడూ, అక్కడ నివసించే యూదులందరి చేతా మంచి పేరు పొందిన అననీయ అనే వ్యక్తి నా దగ్గరకు వచ్చి
\v 13 ' సోదరా సౌలూ, చూపు పొందు' అని నాతో చెప్పగానే నేను చూపు పొంది అతణ్ణి చూశాను.
\s5
\v 14 అప్పుడు అతడు 'మన పూర్వీకుల దేవుని సంకల్పాన్ని తెలిసికోడానికీ, ఆ నీతిమంతుణ్ణి చూడటానికీ , ఆయన నోటి మాట వినడానికీ నిన్ను నియమించాడు.
\v 15 నీవు చూసిన వాటిని గురించీ, విన్నవాటిని గురించీ ప్రజలందరి ముందూ ఆయనకు సాక్షివై ఉంటావు.
\v 16 కాబట్టి ఆలస్యమెందుకు? లేచి ఆయన పేరున బాప్తిస్మం పొంది, ప్రార్థన చేసి నీ పాపాలను కడిగి వేసికో' అన్నాడు.
\s5
\v 17 ఆ వెంటనే నేను యెరూషలేముకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేస్తుండగా పరవశానికి లోనై ప్రభువుని చూశాను.
\v 18 ఆయన నాతో, 'నీవు వెంటనే యెరూషలేము విడిచి వెళ్లు. నన్ను గూర్చి నీవిచ్చే సాక్ష్యం ఇక్కడి వారు అంగీకరించరు' అని చెప్పాడు.
\s5
\v 19 అందుకు నేను, 'ప్రభూ, ప్రతి సమాజ మందిరంలో నీపై నమ్మకముంచిన వారిని నేను చెరసాలలో వేయిస్తూ కొడుతూ ఉన్నానని వారికి తెలుసు.
\v 20 అంతేగాక నీ సాక్షి అయిన స్తెఫను రక్తం ఒలికించినప్పుడు నేను కూడా అక్కడ నిలబడి అందుకు సమ్మతించి అతణ్ణి చంపినవారి వస్త్రాలకు కాపలా ఉన్నాను' అని చెప్పాను.
\v 21 అందుకు ఆయన 'వెళ్లు, ఎందుకంటే నేను నిన్ను దూరంగా యూదేతరుల దగ్గరకు పంపుతాను' అని నాతో చెప్పాడు".
\s5
\p
\v 22 ఇంతవరకు అతడు చెప్పింది వారు చక్కగా విన్నారు. కానీ ఆ వెంటనే వారు, 'ఇటువంటివాడు బతకడానికి అర్హుడు కాదు. భూమి మీద ఉండకుండ వాణ్ణి చంపివేయండి' అని కేకలు వేశారు.
\v 23 వారు కేకలు వేస్తూ తమ పై వస్త్రాలు విదిలించుకుంటూ ఆకాశం వైపు దుమ్మెత్తి పోశారు.
\v 24 ఈ విధంగా వారు అతనికి వ్యతిరేకంగా కేకలు వేయడానికి కారణమేమిటో తెలిసికోవడం కోసం సహస్రాధిపతి అతనిని కొరడాలతో కొట్టి, విచారణ కోసం కోటలోకి తీసికొని పొండని ఆజ్ఞాపించాడు.
\s రోమా పౌరుని ఆధిక్యత
\s5
\p
\v 25 వారు పౌలును తాళ్ళతో కట్టేటప్పుడు అతడు తన దగ్గర నిలబడిన శతాధిపతిని, 'శిక్ష విధించకుండానే ఒక రోమా పౌరుణ్ణి కొరడాలతో కొట్టడానికి మీకు అధికారం ఉందా?' అని అడిగాడు.
\v 26 శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి దగ్గరకు వెళ్ళి, 'నీవేం చేస్తున్నావు? ఈ వ్యక్తి రోమీయుడు, తెలుసా?' అన్నాడు.
\s5
\v 27 అప్పుడు సహస్రాధిపతి వచ్చి పౌలును చూసి, 'నీవు రోమీయుడవా? అది నాతో చెప్పు' అన్నప్పుడు
\v 28 అతడు 'అవున'ని చెప్పాడు. అప్పుడా సహస్రాధిపతి 'నేను చాలా వెల చెల్లించి ఈ పౌరసత్వం సంపాదించు కున్నాను' అన్నాడు. అందుకు పౌలు, 'నేనైతే పుట్టుకతోనే రోమీయుణ్ణి' అని చెప్పాడు.
\v 29 కాబట్టి వారు వెంటనే పౌలుని విడిచిపెట్టారు. పైగా అతడు రోమీయుడని తెలిసికొన్నప్పుడు అతణ్ణి బంధించినందుకు సహస్రాధిపతి కూడా భయపడ్డాడు.
\s5
\p
\v 30 మరునాడు, యూదులు అతని మీద మోపిన నేరాన్ని ఖచ్చితంగా తెలిసికోవడం కోసం, సహస్రాధిపతి అతని సంకెళ్ళు విడిపించి, ప్రధాన యాజకులూ, మహా సభవారంతా సమావేశం కావాలని ఆజ్ఞాపించి, పౌలును తీసుకొచ్చి వారి ముందు నిలబెట్టాడు.
\s5
\c 23
\s సన్ హెడ్రిన్ సభ ఎదుట పౌలు
\p
\v 1 పౌలు మహా సభవారిని సూటిగా చూసి, "సోదరులారా, నేను ఈ రోజు వరకు దేవుని ముందు పూర్తిగా మంచి మనస్సాక్షితో నడుచుకొంటున్నాను" అని చెప్పాడు.
\v 2 అందుకు ప్రధాన యాజకుడు అననీయ, "అతన్ని నోటి మీద కొట్టండి" అని దగ్గర నిలబడిన వారికి ఆజ్ఞాపించాడు.
\v 3 పౌలు అతణ్ణి చూసి, "సున్నం కొట్టిన గోడా, దేవుడు నిన్ను కొడతాడు. నీవు ధర్మశాస్త్రం ప్రకారం నన్ను విచారణ చేయడానికి కూర్చుని, ధర్మశాస్త్రానికి విరోధంగా నన్ను కొట్టమని ఆజ్ఞాపిస్తున్నావా?" అన్నాడు.
\s5
\v 4 అప్పుడు దగ్గర ఉన్నవారు, "నీవు దేవుని ప్రధాన యాజకుణ్ణి దూషిస్తున్నావేంటి?" అన్నారు.
\v 5 అందుకు పౌలు "సోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు.'నీ ప్రజల అధికారిని నిందింపవద్దు' అని రాసి ఉంది" అన్నాడు.
\s పరిసయ్యుడు పౌలు
\s5
\p
\v 6 అక్కడ ఉన్న వారిలో ఒక భాగం సద్దూకయ్యులూ, మరొక భాగం పరిసయ్యులూ ఉన్నట్టు పౌలు గ్రహించి, "సోదరులారా, నేను పరిసయ్యుణ్ణి, పరిసయ్యుల సంతతివాణ్ణి. మనకున్న నిరీక్షణ గూర్చీ, మృతుల తిరిగి బ్రతకడం గూర్చీ నేను విచారణ పాలవుతున్నాను." అని సభలో గొంతెత్తి చెప్పాడు.
\v 7 అతడా విధంగా చెప్పినప్పుడు పరిసయ్యులకు సద్దూకయ్యులకు మధ్య కలహం రేగింది. అందువల్ల ఆ సమూహం రెండు పక్షాలుగా చీలిపోయింది.
\v 8 సద్దూకయ్యులు పునరుత్థానం లేదనీ, దేవదూత గానీ, ఆత్మగానీ లేదనీ చెప్తారు. కాని పరిసయ్యులు రెండూ ఉన్నాయంటారు.
\s5
\v 9 అప్పుడు పెద్ద గోల పుట్టింది. పరిసయ్యుల పక్షంగా ఉన్న శాస్త్రులలో కొందరు లేచి, "ఈ మనిషిలో ఏ దోషమూ మాకు కనబడలేదు. బహుశా ఒక ఆత్మగాని, దేవదూత గానీ అతనితో మాట్లాడి ఉండవచ్చు" అని వాదించారు.
\v 10 కలహం ఎక్కువైనప్పుడు వారు పౌలును చీల్చివేస్తారేమో అని సహస్రాధిపతి భయపడి, "వారి మధ్యనుండి అతణ్ణి బలవంతంగా పట్టుకొని కోటలోకి తీసికొని రండ" ని సైనికులకు ఆజ్ఞాపించాడు.
\s ప్రభువు ఆదరణ వాక్కులు
\s5
\p
\v 11 ఆ రాత్రి ప్రభువు అతని పక్కన నిలబడి 'ధైర్యంగా ఉండు. యెరూషలేములో నన్ను గూర్చి నువ్వెలా సాక్ష్యం చెప్పావో అదే విధంగా రోమ్ లో కూడా చెప్పాల్సి ఉంటుంది." అని చెప్పాడు.
\s5
\p
\v 12 తెల్లవారిన తర్వాత కొందరు యూదులు పోగై, తాము పౌలుని చంపేటంత వరకు అన్నపానాలు ముట్టం అని ఒట్టు పెట్టుకొన్నారు.
\v 13 నలభై కంటే ఎక్కువమంది ఈ కుట్రలో చేరారు.
\s5
\v 14 వారు ప్రధాన యాజకుల దగ్గరకూ, పెద్దల దగ్గరకూ వచ్చి, "మేము పౌలును చంపేవరకు ఏమీ రుచి చూడమని గట్టిగా ఒట్టుపెట్టుకొన్నాం.
\v 15 కాబట్టి మీరు మహా సభతో కలిసి, అతనిని క్షుణ్ణంగా విచారించాలి అన్న వంకతో అతణ్ణి మీ దగ్గరకు తీసికొని రమ్మని సహస్రాధిపతితో మనవి చేయండి. అతడు మీ దగ్గరకి రాకముందే మేము అతనిని చంపడానికి సిద్ధపడి ఉన్నాం" అని చెప్పారు.
\s5
\v 16 అయితే పౌలు మేనల్లుడు వారు అలా పొంచి ఉన్నారని విని కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలియజేసాడు.
\v 17 అప్పుడు పౌలు ఒక శతాధిపతిని పిలిచి, "ఈ యువకుణ్ణి సహస్రాధిపతి దగ్గరకి తీసికొని వెళ్ళు. ఇతడు అతనితో ఒక మాట చెప్పాల్సి ఉంది" అన్నాడు.
\s5
\v 18 శతాధిపతి ఆ యువకుణ్ణి సహస్రాధిపతి దగ్గరికి తీసుకొని పోయి, "'ఖైదీగా ఉన్న పౌలు నన్ను పిలిచి ఈ యువకుణ్ణి నీ దగ్గరకు తీసికొని పొమ్మని అడిగాడు. ఇతడు నీతో ఒక మాట చెప్పుకోవాలట" అని చెప్పాడు.
\v 19 సహస్రాధిపతి ఆ యువకుడి చెయ్యి పట్టుకొని అవతలికి తీసికొని పోయి, 'నీవు నాతో చెప్పాలనుకొన్న సంగతి ఏమిటి?' అని ఒంటరిగా అడిగాడు.
\s5
\v 20 అందుకతడు, "నువ్వు పౌలును పూర్తిగా విచారించడం కోసం అతణ్ణి రేపు మహాసభ దగ్గరకు తీసికొని రావాలని నిన్నుబ్రతిమాలేటందుకు యూదులు ఎదురుచూస్తున్నారు.
\v 21 వారి విన్నపానికి ఒప్పుకోవద్దు. ఎందుకంటే వారిలో నలభై కంటె ఎక్కువమంది అతని కోసం చూస్తూ ఉన్నారు. వారు అతణ్ణి చంపే దాకా అన్నపానాలు ముట్టకూడదని ఒట్టు పెట్టుకొన్నారు. ఇప్పుడు నీ మాట కోసం కనిపెట్టుకొని ఉన్నారు" అని చెప్పాడు.
\s5
\v 22 అప్పుడు ఆ సహస్రాధిపతి, 'నువ్వు ఈ సంగతి నాకు తెలిపినట్టు ఎవరితోనూ చెప్పవద్ద'ని హెచ్చరించి పంపేశాడు.
\s కైసరయకు పౌలు
\p
\v 23 తరువాత అతడు ఇద్దరు శతాధిపతులను పిలిచి, 'కైసరయ వరకు వెళ్ళడానికి రెండు వందలమంది సైనికులనూ డెబ్భై మంది గుఱ్ఱపురౌతులనూ రెండు వందలమంది యీటెలవారినీ రాత్రి తొమ్మిది గంటలకల్లా సిద్ధపరచండి.
\v 24 గవర్నర్ ఫేలిక్సు దగ్గరికి తీసికొని పోవడానికి గుర్రాలను ఏర్పాటు చేయండి' అని చెప్పాడు.
\s5
\v 25 అతడు ఈ విధంగా ఒక ఉత్తరం కూడా రాశాడు,
\p
\v 26 "అత్యంత గౌరవనీయులైన గవర్నర్ ఫేలిక్సుకు, క్లాడియస్ లూసియస్ వందనాలు.
\v 27 యూదులు ఈ వ్యక్తిని పట్టుకొని చంపబోతుండగా, అతడు రోమీయుడని విని, సైనికులతో వెళ్ళి అతణ్ణి తప్పించాను.
\s5
\v 28 వారు అతని మీద మోపిన నేరమేమిటో తెలిసికోవాలని నేను వారి మహాసభకు అతణ్ణి తీసికొని వెళ్ళాను.
\v 29 వారు తమ ధర్మశాస్త్ర వాదాలను గూర్చి ఏవో నేరాలు అతని మీద మోపారు తప్ప మరణానికి గాని, చెరసాలకు గాని తగిన నేరమేదీ అతనిలో చూపలేదు.
\v 30 అయితే వారు ఈ వ్యక్తిని చంపడానికి కుట్ర చేస్తున్నారని నాకు తెలిసి, వెంటనే అతణ్ణి మీ దగ్గరకు పంపించాను. నేరం మోపినవారు కూడా అతని మీద చెప్పాలనుకున్న సంగతిని మీ ముందే చెప్పుకోవాలని ఆజ్ఞాపించాను."
\s5
\p
\v 31 కాబట్టి సహస్రాధిపతి సైనికులకు ఆజ్ఞాపించిన ప్రకారం వారు పౌలుని రాత్రి పూట అంతిపత్రి తీసికొని వెళ్ళారు. మరునాడు వారు గుర్రపురౌతులను పౌలుతో పంపి తమ కోటకు తిరిగి వెళ్ళారు.
\v 32 వారు కైసరయ వచ్చి గవర్నరుకి ఆ ఉత్తరాన్ని అప్పగించి పౌలును అతని ముందు నిలబెట్టారు.
\v 33 గవర్నర్ ఆ ఉత్తరం చదివి ఇతడు ఏ ప్రాంతపు వాడని అడిగి, కిలికియకు చెందినవాడని తెలిసికొని,
\s5
\v 34 "'నీ మీద నేరం మోపిన వారు కూడా వచ్చిన తరువాత నీ సంగతి పూర్తిగా విచారిస్తాన" ని చెప్పి,
\v 35 హేరోదు రాజమందిరంలో అతణ్ణి కావలిలో ఉంచాలని ఆజ్ఞాపించాడు.
\s5
\c 24
\s ఫేలిక్స్ ఎదుట పౌలు
\p
\v 1 ఐదు రోజుల తరువాత ప్రధాన యాజకుడు అననీయ, కొందరు పెద్దలు, తెర్తుల్లు అనే ఒక న్యాయవాది కైసరయ వచ్చి, పౌలు మీద మోపిన ఫిర్యాదును గవర్నరుకి తెలియజేశారు.
\v 2 పౌలు గవర్నర్ ఎదుట నిలబడినప్పుడు తెర్తుల్లు అతని మీద నేరం మోపుతూ ఇలా అన్నాడు,
\v 3 "మహా ఘనత వహించిన ఫేలిక్స్, మేము మీ పరిపాలనలో ఎంతో నెమ్మది అనుభవిస్తున్నామనీ, ఈ దేశ ప్రజలకు కలిగే అనేక సమస్యలు మీ ద్వారా పరిష్కారం అవుతున్నాయనీ ఒప్పుకొంటున్నాము. అ కారణంగా మేము అన్ని విధాలా, అన్ని చోట్లా మీ పట్ల పూర్ణ కృతజ్ఞత కలిగి ఉన్నాం.
\s5
\v 4 నేను మీకు ఎక్కువ విసుగు పుట్టించకుండా క్లుప్తంగా చెప్పే విషయాలను మీరు ఎప్పటిలాగా శాంతంగా వినాలని వేడుకొంటున్నాను.
\v 5 ఈ వ్యక్తి ఒక చీడలాంటి వాడు. భూమిపై ఉన్న యూదులందరినీ తిరుగుబాటుకు రేపుతున్నాడు. ఇతడు నజరేయులనే మతశాఖకు నాయకుడని మేం గమనించాం.
\v 6 పైగా ఇతడు దేవాలయాన్ని కూడా అపవిత్రం చేయడానికి ప్రయత్నించాడు.
\s5
\v 7 అందువలన మేము అతణ్ణి నిర్బంధించాం. మీరు విచారిస్తే
\v 8 మేం ఇతని మీద మోపుతున్న నేరాలన్నీ మీకే తెలుస్తాయి."
\v 9 యూదులంతా అందుకు సమ్మతించి ఈ మాటలు నిజమే అని చెప్పారు.
\s ఫేలిక్స్ ఎదుట పౌలు సంజాయిషీ
\s5
\p
\v 10 అప్పుడు గవర్నర్, పౌలుని మాట్లాడమని సైగ చేసాడు. పౌలు ఇలా అన్నాడు, "మీరు అనేక సంవత్సరాలుగా ఈ ప్రజలకు న్యాయాధిపతిగా ఉన్నారని తెలిసి నేను ధైర్యంగా జవాబు చెప్పుకుంటున్నాను.
\v 11 నేను యెరూషలేములో ఆరాధించడానికి వెళ్లి కేవలం పన్నెండు రోజులు మాత్రమే అయ్యిందని మీరు విచారించి తెలిసికోవచ్చు.
\v 12 దేవాలయంలో గానీ, సమాజ మందిరాల్లో గానీ, పట్టణంలో గానీ, నేను ఎవరితోనైనా తర్కించడం, లేదా ప్రజలను పోగుచేయడం ఎవరూ చూడలేదు.
\v 13 వారు ఇప్పుడు నా మీద మోపే నేరాలను మీకు రుజువు పరచ లేరు.
\s5
\v 14 ధర్మశాస్త్రంలో, ప్రవక్తల గ్రంథాల్లో రాసి ఉన్నవన్నీ నమ్మి,
\v 15 నీతిపరులకూ అనీతిపరులకూ పునరుత్థానం కలుగుతుందని వీరు నమ్ముతున్నట్టుగానే నేను కూడా దేవునిలో నమ్మకముంచి, వారు మతభేదం అని పిలిచిన ఈ మార్గంలోనే నా పూర్వీకుల దేవుణ్ణి ఆరాధిస్తున్నానని మీ ముందు ఒప్పుకొంటున్నాను.
\v 16 ఈ విధంగా నేను దేవుని పట్లా, మనుష్యుల పట్లా ఎప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషంగా ఉండేలా చూసుకుంటున్నాను.
\s5
\v 17 కొన్ని సంవత్సరాలైన తరువాత నేను నా సొంత ప్రజలకి దాన ధర్మంగా డబ్బు, కానుకలు ఇవ్వడానికి వచ్చాను.
\v 18 నేను శుద్ధి చేసికొని వాటిని అప్పగిస్తుండగా వీరు దేవాలయంలో నన్ను చూశారు. నేనేమీ గుంపు కూర్చలేదు, నా వలన అల్లరీ కాలేదు. ఆసియనుండి వచ్చిన కొందరు యూదులు ఉన్నారు.
\v 19 నామీద వారికేమైన ఉంటే వారే మీ వద్దకు వచ్చి నా మీద నేరం మోపి ఉండవలసింది.
\s5
\v 20 లేదా, నేను మహాసభలో నిలబడి ఉన్నప్పుడు, 'మృతుల పునరుత్థానం గురించి నేడు వారి ముందు విమర్శ పాలవుతున్నా'నని
\v 21 నేను బిగ్గరగా చెప్పిన ఆ ఒక్క మాట విషయమై తప్ప నాలో మరి ఏ నేరమైనా వీరు కనిపెట్టి ఉంటే అది చెప్పవచ్చు."
\s5
\v 22 ఫేలిక్సుకు ఈ మార్గం గూర్చి బాగా తెలుసు. అతడు "సహస్రాధిపతి లూసియస్ వచ్చినప్పుడు నీ సంగతి నేను విచారించి తెలుసుకుంటాన" ని చెప్పి విచారణ నిలిపివేశాడు.
\v 23 పౌలుని విడిగా కావలిలో ఉంచి, అతనికి పరిచారం చేయడానికి అతని బంధువులలో ఎవరినీ ఆటంకపరచ వద్దని శతాధిపతికి ఆజ్ఞాపించాడు.
\s రెండవ సారి ఫేలిక్స్ ఎదుట పౌలు
\s5
\p
\v 24 కొన్ని రోజుల తరువాత ఫేలిక్సు యూదురాలైన ద్రుసిల్ల అనే తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి, క్రీస్తు యేసులో విశ్వాసం గూర్చి అతడు బోధించగా విన్నాడు.
\v 25 అప్పుడు పౌలు నీతిని గూర్చీ ఆశానిగ్రహం గూర్చీ రాబోయే తీర్పును గూర్చీ ప్రసంగిస్తుండగా ఫేలిక్సు చాలా భయపడి, "ఇప్పటికి వెళ్లు, నాకు సమయం దొరికినప్పుడు నిన్ను పిలిపిస్తాను" అని చెప్పాడు.
\s5
\v 26 తరువాత పౌలు తనకు ఏమైనా లంచం ఇస్తాడేమోనని ఆశపడి, అతణ్ణి మాటిమాటికీ పిలిపించి మాట్లాడుతూ ఉన్నాడు.
\s రెండేళ్ళు విరామం
\p
\v 27 రెండు సంవత్సరాల తరువాత ఫేలిక్సుకు బదులుగా పోర్కియస్ ఫేస్తు గవర్నర్ గా వచ్చాడు. అప్పుడు ఫేలిక్సు యూదుల దృష్టిలో మంచివాడు అనిపించుకోవాలని, పౌలును చెరసాలలోనే విడిచిపెట్టి వెళ్ళాడు.
\s5
\c 25
\s ఫేస్తు ఎదుట పౌలు
\p
\v 1 ఫేస్తు అధికారానికి వచ్చిన మూడు రోజులకు కైసరయ నుండి యెరూషలేము వెళ్ళాడు.
\v 2 అప్పుడు ప్రధాన యాజకులూ , యూదుల పెద్దలూ, పౌలు మీద తమ ఫిర్యాదు సంగతి అతనికి తెలియజేశారు.
\v 3 "దయచేసి పౌలును యెరూషలేముకు పిలిపించండ" ని ఫేస్తును వారు కోరారు. ఎందుకంటే వారు అతణ్ణి దారిలో చంపడానికి కాచుకొని ఉన్నారు.
\s5
\v 4 అందుకు ఫేస్తు, "పౌలు కైసరయలో ఖైదీగా ఉన్నాడు. నేను త్వరలో అక్కడికి వెళ్లబోతున్నాను.
\v 5 కాబట్టి మీలో సమర్థులు నాతో వచ్చి అతని మీద నేరమేదైనా ఉంటే మోపవచ్చు" అని జవాబిచ్చాడు.
\s5
\v 6 అతడు వారి దగ్గర ఎనిమిది లేక పది రోజులు గడిపి కైసరయ వెళ్లి మరునాడు న్యాయపీఠం మీద కూర్చుని పౌలును తీసికొని రమ్మని ఆజ్ఞాపించాడు.
\v 7 పౌలు వచ్చినప్పుడు యెరూషలేము నుండి వచ్చిన యూదులు అతని చుట్టు నిలబడి, ఎన్నో తీవ్ర నేరాలు మోపారు గాని వాటిని రుజువు చేయలేక పోయారు.
\v 8 పౌలు "యూదుల ధర్మశాస్త్రం గూర్చి గానీ, దేవాలయం గూర్చి గానీ, కైసరును గూర్చి గానీ నేనే తప్పూ చేయలేద"ని జవాబు చెప్పాడు.
\s5
\v 9 అయితే ఫేస్తు యూదుల చేత మంచివాడని అనిపించుకోవాలని "యెరూషలేముకు వచ్చి అక్కడ నా ముందు ఈ సంగతులను గూర్చి విచారణ నెదుర్కోవడం నీకిష్టమేనా?" అని పౌలును అడిగాడు.
\s "సీజరు ఎదుటే చెప్పుకుంటాను."
\p
\v 10 అందుకు పౌలు, "కైసరు న్యాయపీఠం ముందు నిలబడి ఉన్నాను. నన్ను విమర్శించ వలసిన స్థలమిదే, యూదులకు నేను ఏ అన్యాయమూ చేయలేదని మీకు బాగా తెలుసు.
\s5
\v 11 నేను న్యాయం తప్పి మరణానికి తగిన పని ఏదైనా చేసి ఉంటే మరణానికి భయపడను. వీరు నామీద మోపుతున్న నేరాల్లో ఏదీ నిజం కానప్పుడు నన్ను వారికి అప్పగించడానికి వీలు లేదు. నేను కైసరు ముందే చెప్పుకుంటాను' అన్నాడు.
\v 12 అప్పుడు ఫేస్తు తన సలహాదారులతో ఆలోచించి, "కైసరు ముందు చెప్పుకుంటాను అన్నావు కదా, కైసరు దగ్గరకే పంపిస్తాను" అని జవాబిచ్చాడు.
\s5
\p
\v 13 ఆ తరవాత కొన్ని రోజులకు అగ్రిప్ప రాజు, బెర్నీకే, ఫేస్తును దర్శించడానికి కైసరయ వచ్చారు.
\v 14 వారక్కడ చాలా రోజులున్న తరువాత, ఫేస్తు పౌలు గురించి రాజుకు ఇలా చెప్పాడు, 'ఫేలిక్సు విడిచిపెట్టి పోయిన ఒక ఖైదీ ఒకడు నా దగ్గర ఉన్నాడు.
\v 15 నేను యెరూషలేములో ఉన్నప్పుడు ప్రధాన యాజకులూ, యూదుల పెద్దలూ, అతని మీద ఫిర్యాదు చేసి అతణ్ణి శిక్షించమని కోరారు.
\v 16 అందుకు నేను 'నేరం ఎవరి మీద మోపారో ఆ వ్యక్తి నేరం మోపిన వారికి ముఖాముఖిగా వచ్చి, తన మీద వారు మోపిన నేరం గూర్చి సమాధానం చెప్పుకోడానికి అవకాశం ఇవ్వకుండా ఏ వ్యక్తికీ తీర్పు తీర్చడం రోమనుల ఆచారం కాదు' అని జవాబిచ్చాను.
\s5
\v 17 వారిక్కడికి వచ్చినప్పుడు నేను ఆలస్యమేమీ చేయకుండా, మరునాడే న్యాయపీఠం మీద కూర్చొని ఆ వ్యక్తిని తీసుకు రమ్మని ఆజ్ఞాపించాను.
\v 18 అయితే నేరం మోపినవారు నేను ఊహించిన నేరాల్లో ఒక్కటి కూడా అతని మీద మోపలేదు.
\v 19 కానీ మీ మతం గూర్చీ, చనిపోయిన యేసు అనే ఒకని గూర్చీ ఇతనితో వారికి కొన్ని వివాదాలున్నట్టు కనబడింది.
\v 20 ఆ యేసు బతికే ఉన్నాడని పౌలు చెప్తున్నాడు. నేనలాటి వాదాల విషయం ఏ విధంగా విచారించాలో తోచక, యెరూషలేముకు వెళ్లి అక్కడ వీటిని గూర్చి విచారించడం అతని కిష్టమవుతుందేమో అడిగాను.
\s5
\v 21 అయితే పౌలు, చక్రవర్తి ముందు తనను నిలబెట్టాలని చెప్పడం చేత నేనతణ్ణి కైసరు దగ్గరకు పంపించే వరకు కావలిలో ఉంచమని ఆజ్ఞాపించాను."
\v 22 అందుకు అగ్రిప్ప "ఆ వ్యక్తి చెప్పుకొనేది నాక్కూడా వినాలనుంది" అన్నాడు. దానికి ఫేస్తు "రేపు వినవచ్చు" అని చెప్పాడు.
\s5
\p
\v 23 మరునాడు అగ్రిప్ప, బెర్నీకే ఎంతో ఆడంబరంగా వచ్చి, సైనికాధిపతులతో, పురప్రముఖులతో అధికార మందిరంలో ప్రవేశించిన తరువాత ఫేస్తు ఆజ్ఞ పై పౌలును తీసుకు వచ్చారు.
\v 24 అప్పుడు ఫేస్తు, "అగ్రిప్ప రాజా, ఇక్కడ ఉన్న సమస్త ప్రజలారా, మీరు ఈ వ్యక్తిని చూస్తున్నారు గదా. యెరూషలేములోనూ, ఇక్కడా యూదులంతా వీడు ఇక బతక కూడదని కేకలు వేస్తూ అతనికి వ్యతిరేకంగా నాకు మనవి చేసుకున్నారు.
\s5
\v 25 ఇతడు మరణానికి తగిన పని ఏదీ చేయలేదని నేను గ్రహించాను. కానీ ఇతడు చక్రవర్తి ముందు చెప్పుకుంటానని అనడం చేత ఇతనిని అక్కడికే పంపాలని నిశ్చయించాను.
\v 26 కానీ ఇతని గూర్చి మన చక్రవర్తికి రాయడానికి నాకు సరైన కారణం ఏమీ కనబడలేదు. కాబట్టి విచారణ అయిన తరువాత రాయడానికి ఏమైనా నాకు దొరకవచ్చని మీ అందరి ముందుకు, మరి ముఖ్యంగా అగ్రిప్ప రాజా, మీ ముందుకు ఇతనిని రప్పించాను.
\v 27 ఖైదీ మీద మోపిన నేరాలను వివరించకుండా అతనిని పంపడం సమంజసం కాదని నా ఉద్దేశ్యం." అని వారితో చెప్పాడు.
\s5
\c 26
\s అగ్రిప్ప ఎదుట పౌలు
\p
\v 1 అగ్రిప్ప పౌలుతో, "నీ వాదన వినిపించడానికి నీకు అనుమతి నిచ్చాను" అన్నాడు. అప్పుడు పౌలు తను మాట్లాడబోతున్నట్టు సూచిస్తూ చేయి చాచి ఈ విధంగా జవాబు చెప్పాడు.
\v 2 "అగ్రిప్ప రాజా, మీరు యూదుల ఆచారాలనూ, వివాదాలనూ బాగా ఎరిగిన వారు.
\v 3 యూదులు నామీద ఆరోపించిన నేరాలను గూర్చి ఈ రోజు మీ ముందు జవాబు చెప్పుకోవడం నా అదృష్టం అని నేను భావిస్తున్నాను. దయచేసి ఓపికతో నా మనవి వినండి.
\s5
\v 4 యెరూషలేములో నా ప్రజల మధ్య బాల్యం నుండి నేను గడిపిన జీవితం ఎలాటిదో యూదులందరికీ తెలుసు.
\v 5 వారు మొదటినుండి నన్ను ఎరిగినవారు కాబట్టి వారు నా గురించి చెప్పాలంటే నేను మన మతంలోని బహునిష్ఠ గల తెగను అనుసరించి, పరిసయ్యుడిగా జీవించినట్టు చెప్పగలరు.
\s5
\v 6 అయితే ఇప్పుడు దేవుడు మన పూర్వీకులకు చేసిన వాగ్దాన సంబంధమైన నిరీక్షణ గూర్చి విమర్శించడానికి నన్ను నిలబెట్టారు.
\v 7 మన పన్నెండు గోత్రాల ప్రజలు రాత్రింబగళ్ళు దేవుణ్ణి సేవిస్తూ ఆ వాగ్దానం నెరవేర్పు కోసం ఎదురు చూస్తున్నారు. రాజా, ఈ నిరీక్షణ గురించే యూదులు నాపై నేరం మోపారు.
\v 8 దేవుడు మృతులను లేపుతాడన్న సంగతి నమ్మశక్యం కానిదని మీరెందుకు భావిస్తున్నారు?
\s5
\v 9 నజరేయుడైన యేసు అనే పేరుకి విరోధంగా అనేక కార్యాలు చేయాలని నేను అనుకొన్నాను.
\v 10 యెరూషలేములో నేనలాగే చేశాను. ప్రధాన యాజకుల వలన అధికారం పొంది, అనేకమంది పవిత్రులను చెరసాలల్లో వేసాను. వారిని చంపినప్పుడు సమ్మతించాను.
\v 11 చాలాసార్లు సమాజ మందిరాల్లో వారిని దండించి వారు దేవదూషణ చేసేలా బలవంతపెట్టాను. అంతేగాక వారిమీద తీవ్రమైన కోపంతో ఇతర పట్టణాలకు సైతం వెళ్ళి వారిని హింసించాను.
\s5
\v 12 అందుకోసం నేను ప్రధాన యాజకుల చేత అధికారాన్నీ ఆజ్ఞల్నీ పొంది దమస్కు పట్టణానికి వెళుతున్నపుడు
\v 13 రాజా, మధ్యాహ్నం నా చుట్టూ, నాతో కూడ వచ్చినవారి చుట్టూ ఆకాశం నుండి సూర్య తేజస్సుకంటె ఎక్కువ దేదీప్యమానమైన ఒక వెలుగు ప్రకాశించడం చూశాను.
\v 14 మేమందరమూ నేల మీద పడినప్పుడు, 'సౌలూ, సౌలూ, నన్నెందుకు హింసిస్తున్నావు? మునికోలలకు ఎదురు తన్నటం నీకు కష్టం' అని హెబ్రీ భాషలో ఒక స్వరం నాతో పలకడం విన్నాను.
\s5
\v 15 అప్పుడు నేను 'ప్రభూ, నీవు ఎవరివి?' అని అడిగినపుడు ప్రభువు, 'నీవు హింసిస్తున్న యేసుని.
\v 16 నీవు నన్ను చూసిన సంగతిని గురించీ, నీకు ఇకముందు వెల్లడి కాబోయే సంగతులను గురించీ నిన్ను నా పరిచారకునిగా, సాక్షిగా నియమించడానికే నీకు ప్రత్యక్షమయ్యాను. నీవు లేచి నిలబడు,
\v 17 నేను ఈ ప్రజల వల్లా, యూదేతరుల వల్లా నీకు హాని కలుగకుండా కాపాడతాను.
\v 18 వారు చీకటి నుండి వెలుగులోకీ సాతాను అధికారం నుండి దేవుని వైపుకూ తిరిగి, నాపై విశ్వాసముంచడం ద్వారా పాప క్షమాపణనూ, పరిశుద్ధులలో వారసత్వాన్నీ పొందడం కోసం వారి కన్నులు తెరవడానికి నేను నిన్ను వారి దగ్గరకు పంపిస్తాను' అని చెప్పాడు.
\s5
\v 19 కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనానికి నేను లోబడి
\v 20 మొదట దమస్కులో, యెరూషలేములో, యూదయ దేశమంతటా, ఆ తరువాత యూదేతరులకూ, వారు మారుమనస్సు పొంది దేవుని వైపు తిరిగి మారుమనస్సుకు తగిన క్రియలు చేయాలని ప్రకటిస్తున్నాను.
\v 21 ఈ కారణంగానే యూదులు నన్ను దేవాలయంలో పట్టుకొని చంపడానికి ప్రయత్నం చేశారు.
\s5
\v 22 అయినప్పటికీ నేను దేవుని సహాయం వలన ఈ రోజు వరకు నిలిచి ఉన్నాను. క్రీస్తు హింసలు పొంది మృతుల పునరుత్థానం పొందేవారిలో మొదటివాడు కావడంచేత, యూదులకూ యూదేతరులకూ వెలుగు ప్రసరిస్తుందని
\v 23 ప్రవక్తలు, మోషే, ముందుగా చెప్పిన దానికి మరేమీ కలపకుండా, అల్పులకూ ఘనులకూ సాక్ష్యమిస్తున్నాను."
\s5
\v 24 అతడు ఈ విధంగా సమాధానం చెబుతుండగా ఫేస్తు, "పౌలూ, నీవు వెర్రివాడివి, మితిమీరిన విద్య వలన నీకు పిచ్చి పట్టింద"ని గట్టిగా అరిచాడు.
\v 25 అందుకు పౌలు ఇలా అన్నాడు, "మహా ఘనులైన ఫేస్తూ, నేను వెర్రివాణ్ణి కాదు. సత్యం, వివేకం గల మాటలే చెబుతున్నాను.
\v 26 రాజుకు ఈ సంగతులు తెలుసు కాబట్టి వారి ముందు నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను. వాటిలో ప్రతి ఒక్క విషయమూ వారికి తెలుసు అని రూఢిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఇది ఏదో ఒక మూలన జరిగిన విషయం కాదు.
\s5
\v 27 అగ్రిప్ప రాజా, మీరు ప్రవక్తలను నమ్ముతున్నారా? నమ్ముతున్నారని నాకు తెలుసు." అన్నాడు.
\v 28 అందుకు అగ్రిప్ప,"ఇంత తేలికగా నన్ను క్రైస్తవుడుగా మార్చాలని చూస్తున్నావే" అని పౌలుతో అన్నాడు.
\v 29 అందుకు పౌలు, "తేలికగానో కష్టంగానో, మీరు మాత్రమే కాదు, ఈ రోజు నా మాట వింటున్న వారంతా ఈ సంకెళ్ళు తప్ప నా లాగానే ఉండేలా దేవుడు అనుగ్రహిస్తాడు గాక" అన్నాడు.
\s5
\v 30 అప్పుడు రాజు, ఫేస్తూ, బెర్నీకే, వారితో కూడ కూర్చున్నవారు లేచి అవతలకు పోయి
\v 31 "ఈ వ్యక్తి మరణానికి గాని, బంధకాలకు గాని తగిన నేరమేమీ చేయలేదు" అని తమలో తాము మాట్లాడుకున్నారు.
\v 32 అప్పుడు అగ్రిప్ప "ఈ మనిషి కైసరు ముందు చెప్పుకుంటానని అనకపోయి ఉంటే ఇతణ్ణి విడుదల చేసేవాళ్ళమే" అని ఫేస్తుతో చెప్పాడు.
\s5
\c 27
\s రోమ్ కు ప్రయాణ సన్నాహాలు
\p
\v 1 మేము ఓడలో ఇటలీ వెళ్ళాలని నిర్ణయమైంది. వారు పౌలునీ, మరికొందరు ఖైదీలనీ అగస్టస్ సైనిక దళంలోని శతాధిపతి అయిన జూలియస్ అనే అతనికి అప్పగించారు.
\v 2 ఆసియా తీరం పక్కగా ఉన్న పట్టణాల మీదుగా ప్రయాణించే అద్రముత్తియ పట్టణపు ఓడ ఎక్కి మేం బయలుదేరాం. మాసిదోనియలోని థెస్సలొనీక పట్టణం వాడైన అరిస్తార్కు మాతో కూడ ఉన్నాడు.
\s5
\v 3 మరునాడు సీదోను వచ్చాం. అప్పుడు జూలియస్ పౌలు మీద దయ చూపించి, అతడు తన స్నేహితుల దగ్గరకు వెళ్లి పరిచర్యలు పొందడానికి అనుమతించాడు.
\v 4 అక్కడనుండి బయలుదేరిన తరువాత ఎదురుగాలి కొట్టడం చేత సైప్రస్ దీవి చాటుగా ఓడ నడిపించాము.
\v 5 తరువాత కిలికియకు పంఫూలియకు ఎదురుగా ఉన్న సముద్రం దాటి లుకియ పట్టణమైన మూర (మైరా)కు చేరాం.
\v 6 అక్కడ శతాధిపతి ఇటలీ వెళ్ళబోతున్న అలెగ్జాండ్రియ పట్టణపు ఓడను చూసి అందులో మమ్మల్ని ఎక్కించాడు.
\s5
\v 7 చాలా రోజుల పాటు మెల్లగా నడిచి, ఎంతో కష్టపడి క్నీదుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మల్ని అడ్డగించడం చేత క్రేతు చాటుగా సల్మోనే తీరంలో ఓడ నడిపించాము.
\v 8 అతి కష్టంతో దానిని దాటి, 'సురక్షిత ఆశ్రయాలు' అనే స్థలానికి చేరాం. దాని పక్కనే లాసియ పట్టణం ఉంది.
\s5
\v 9 చాలా కాలం గడిచింది. యూదుల ఉపవాసదినం కూడా అప్పటికి గడిచిపోయింది, ప్రయాణం చేయడం ప్రమాదకరంగా మారింది.
\v 10 అప్పుడు పౌలు "సోదరులారా, ఈ ప్రయాణం వలన సరకులకు, ఓడకు మాత్రమే కాక మనకూ ప్రాణహానీ, తీవ్ర నష్టం కలుగబోతున్నదని నాకనిపిస్తుంది". అని వారిని హెచ్చరించాడు.
\v 11 అయితే శతాధిపతి, పౌలు చెప్పింది కాక నావికుడు, ఓడ యజమాని చెప్పిందే నమ్మాడు.
\s5
\v 12 పైగా చలి కాలం గడపడానికి ఆ రేవు అనుకూలమైనది కాకపోవడం చేత అక్కడ నుండి బయలుదేరి వీలైతే ఫీనిక్సు చేరి అక్కడ చలికాలం గడపాలని ఎక్కువమంది ఆలోచన చెప్పారు. అది క్రేతు లోని నైరుతి వాయువ్య దిక్కుల వైపు ఉన్న ఒక రేవు.
\v 13 అంతేగాక దక్షిణపు గాలి మెల్లగా విసరడంతో వారు తమ ఆలోచన సరైందని భావించి లంగరెత్తి, క్రేతు తీరంలో ఓడను నడిపించారు.
\s తుఫాను
\s5
\p
\v 14 కొంచెం సేపటికి ఊరకులోను అనే పెనుగాలి క్రేతు మీదనుండి విసిరింది.
\v 15 ఓడ దానిలో చిక్కుకుపోయి గాలికి ఎదురు నడవలేక పోయింది. ఇక ఎదురు నడిపించడం మాని, గాలికి కొట్టుకొనిపోయాం.
\v 16 తరువాత కౌద అనే ఒక చిన్న ద్వీపం చాటుగా దాని నడిపించాం. బహు కష్టంగా ఓడను కాపాడుకోగలిగాం.
\s5
\v 17 దానిని పైకెత్తి కట్టిన తరువాత తాళ్ళు మొదలైనవి తీసికొని ఓడ చుట్టూ బిగించి కట్టారు. సూర్తిస్ అనే ఇసుకతిప్ప మీద పడతామేమో అని భయపడి, ఓడ చాపలు దింపివేసి, కొట్టుకొనిపోయారు.
\v 18 గాలి చాలా తీవ్రంగా కొట్టడం వలన ఆ మరునాడు సరుకులు పారవేయడం మొదలెట్టారు.
\s5
\v 19 మూడవ రోజున తమ చేతులారా ఓడ సామగ్రిని పారవేశారు.
\v 20 కొన్ని రోజులపాటు సూర్యుడు గాని, నక్షత్రాలు గాని కనబడక పెద్దగాలి మా మీద కొట్టింది. మేము ప్రాణాలతో తప్పించుకుంటామనే ఆశ పూర్తిగా నశించిపోయింది.
\s పౌలు ప్రోత్సాహ వాక్కులు
\s5
\p
\v 21 వారు చాలాకాలం పస్తులు ఉండడం వలన పౌలు వారి మధ్య నిలబడి, "అయ్యలారా, మీరు నా మాట విని క్రేతునుండి బయలు దేరకుండానే ఉండాల్సింది. అప్పుడీ హానీ, నష్టమూ కలగకపోయేది.
\v 22 ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకోండి. ఓడకే గానీ, మీలో ఎవరి ప్రాణానికి గానీ హాని కలగదు.
\s5
\v 23 నేను ఎవరి వాడినో, ఎవరిని సేవిస్తున్నానో, ఆ దేవుని దూత గత రాత్రి నా పక్కన నిలబడి, 'పౌలూ, భయపడకు.
\v 24 నీవు కైసరు ముందు నిలబడాల్సి ఉంది. ఇదిగో, నీతో కూడ ఓడలో ప్రయాణిస్తున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించాడ'ని నాతో చెప్పాడు.
\v 25 కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగుతుందని నేను దేవుని నమ్ముతున్నాను.
\v 26 అయినప్పటికీ మనం కొట్టుకుపోయి ఏదైనా ఒక ద్వీపం మీద పడవలసి ఉంద"ని చెప్పాడు.
\s5
\v 27 పద్నాల్గవ రాత్రి మేము అద్రియ సముద్రంలో ఇటు అటు కొట్టుకు పోతుండగా అర్ధరాత్రి వేళ ఓడనావికులు ఏదో ఒక దేశం దగ్గర పడుతున్నదని ఊహించి
\v 28 ఇనుప గుండు కట్టిన తాడు వేసి చూసి సుమారు నూట ఇరవై అడుగుల లోతని తెలుసుకున్నారు. ఇంకా కొంతదూరం వెళ్లిన తరువాత, మళ్ళీ గుండు వేసి చూసి తొంభై అడుగుల లోతని తెలుసుకున్నారు.
\v 29 అప్పుడు రాతి దిబ్బలకు కొట్టుకుంటామేమో అని భయపడి, వారు ఓడ అడుగు నుండి నాలుగు లంగరులు వేసి ఎప్పుడు తెల్లవారుతుందా అని కాచుకొని ఉన్నారు.
\s5
\v 30 అయితే ఓడవారు ఓడ విడిచి పారిపోవాలని ఆలోచించి, లంగరులు వేయబోతున్నట్లుగా నటించి సముద్రంలో పడవ దింపివేశారు.
\v 31 అందుకు పౌలు "వీరు ఓడలో ఉంటేనేగాని మీరు తప్పించుకోలేర" ని శతాధిపతితో, సైనికులతో చెప్పాడు.
\v 32 వెంటనే సైనికులు పడవ తాళ్లు కోసి దాని కొట్టుకు పోనిచ్చారు.
\s5
\v 33 తెల్లవారుతుండగా పౌలు, "పద్నాలుగు రోజులనుండి మీరేమీ ఆహారం తీసుకోక పస్తులున్నారు.
\v 34 కాబట్టి ఆహారం పుచ్చుకోమని మిమ్మల్ని బతిమాలుతున్నాను. ఇది మీ ప్రాణరక్షణకు సహాయంగా ఉంటుంది. మీలో ఎవరి తలనుండీ ఒక్క వెంట్రుక కూడా నశించదు" అని చెప్పి ఆహారం తీసుకోమని అందరినీ బతిమాలాడు.
\v 35 ఈ మాటలు చెప్పి, ఒక రొట్టె పట్టుకొని అందరి ముందూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి తినసాగాడు.
\s5
\v 36 అప్పుడంతా ధైర్యం తెచ్చుకొని ఆహారం తీసుకున్నారు.
\v 37 ఓడలో ఉన్న మేమంతా రెండు వందల డెబ్భై ఆరు మందిమి.
\v 38 వారు తిని తృప్తిపొందిన తరువాత, గోధుమలను సముద్రంలో పారబోసి ఓడను తేలిక చేశారు.
\s5
\v 39 తెల్లవారిన తరవాత అది ఏ దేశమో వారు గుర్తుపట్టలేకపోయారు, తీరం గల ఒక సముద్రపు పాయను చూసి, సాధ్యమైతే ఓడని అందులోకి తోయాలని ఆలోచించారు.
\v 40 కాబట్టి లంగరుల తాళ్ళు కోసి వాటిని సముద్రంలో విడిచి పెట్టి చుక్కానుల కట్లు విప్పి ముందటి తెరచాప గాలికెత్తి సరిగా ఒడ్డుకి నడిపించారు.
\v 41 కానీ ఓడ రెండు ప్రవాహాలు కలిసిన చోట చిక్కుకు పోయి ఇసుక లో ఇరుక్కుపోయింది. అందువల్ల ఓడ ముందు భాగం కూరుకుపోయి కదల లేదు. వెనక భాగం అలల దెబ్బకు బద్దలై పోతూ ఉంది.
\s5
\v 42 ఖైదీలలో ఎవరూ ఈదుకొని పారిపోకుండేలా వారిని చంపాలనే ఆలోచన సైనికులకు కలిగింది గాని,
\v 43 శతాధిపతి పౌలుని రక్షించాలని కోరి వారి ఆలోచనకు అంగీకరించలేదు. ఈత వచ్చినవారు ముందు సముద్రంలో దూకి ఈదుకుంటూనూ,
\v 44 మిగిలినవారు ఓడ చెక్క పలకలు, ఇతర వస్తువుల సాయంతోనూ ఒడ్డుకు చేరాలని ఆజ్ఞాపించాడు. ఈ విధంగా అందరం తప్పించుకొని ఒడ్డుకు చేరాం.
\s5
\c 28
\s మెలితే దివిలో పౌలుకు పాము కాటు
\p
\v 1 మేము తప్పించుకొన్న తరువాత ఆ ద్వీపం మెలితే అని మాకు తెలిసింది.
\v 2 అనాగరికులైన అక్కడి ప్రజలు మాకు చేసిన పరిచర్యలు అన్నీ ఇన్నీ కాదు. అప్పుడు వర్షం కురుస్తూ చలిగా ఉండడంతో వారు నిప్పు రాజబెట్టి మా అందరినీ చేర్చుకున్నారు.
\s5
\v 3 అప్పుడు పౌలు కొన్ని పుల్లలేరి నిప్పుల మీద వేస్తుండగా ఒక పాము ఆ వేడికి బయటికి వచ్చి అతని చెయ్యి పట్టుకుంది.
\v 4 ఆ ప్రజలు ఆ పాము అతని చేతిని పట్టుకొని వేలాడటం చూసి, 'ఈ మనిషి తప్పకుండా హంతకుడై ఉంటాడు. ఇతడు సముద్రం నుండి తప్పించుకొన్నప్పటికీ న్యాయం మాత్రం అతణ్ణి బతకనియ్యద'ని తమలో తాము చెప్పుకొన్నారు.
\s5
\v 5 కానీ పౌలు మాత్రం ఆ విష జంతువును మంటలో జాడించివేసి, ఏ హానీ పొందలేదు.
\v 6 వారైతే అతని శరీరం వాచి పోవడమో, అతడు అకస్మాత్తుగా పడి చనిపోవడమో జరుగుతుందని కనిపెడుతున్నారు. చాలాసేపు కనిపెట్టిన తరువాత అతనికి ఏ హానీ కలగకపోవడం చూసి తమ అభిప్రాయం మార్చుకొని, 'ఇతడొక దేవుడు' అని చెప్పసాగారు.
\s5
\v 7 పొప్లి అనేవాడు ఆ ద్వీపంలో ముఖ్యుడు. అతనికి ఆ ప్రాంతంలో భూములున్నాయి. అతడు మమ్మల్ని చేర్చుకొని మూడు రోజులు స్నేహభావంతో ఆతిథ్యమిచ్చాడు.
\s పొప్లి తండ్రికి స్వస్థత
\p
\v 8 ఆ సమయంలో పొప్లి తండ్రి జ్వరం, రక్త విరేచనాల చేత బాధపడుతూ పండుకొని ఉన్నాడు. పౌలు అతని దగ్గరకు వెళ్లి ప్రార్థన చేసి, అతని మీద చేతులుంచి స్వస్థపరిచాడు.
\v 9 ఇది చూసి ఆ దీవిలో ఉన్న మిగిలిన రోగులు కూడా వచ్చి స్వస్థత పొందారు.
\v 10 వారు అనేక సత్కారాలతో మాకు మర్యాద చేసి, మేము ఓడ ఎక్కి వెళ్లినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచారు.
\s5
\v 11 అశ్వినీ చిహ్నంతో ఉన్న అలెగ్జాండ్రియ పట్టణపు ఓడ ఒకటి ఆ ద్వీపంలో చలికాలమంతా నిలిచి ఉంది. మూడు నెలలు అక్కడున్న తరువాత ఆ ఓడ ఎక్కి బయలుదేరి
\v 12 సురకూసై నగరానికి వచ్చి అక్కడ మూడు రోజులున్నాం.
\s5
\v 13 అక్కడనుండి చుట్టు తిరిగి రేగియు వచ్చి ఒక రోజు తరువాత దక్షిణపు గాలి విసరడంతో మరునాడు పొతియొలీకి వచ్చాం.
\v 14 అక్కడి సోదరులను కలిసినప్పుడు వారు తమ దగ్గర ఏడు రోజులు ఉండమని మమ్మల్ని వేడుకున్నారు. ఆ తరువాత రోమ్ నగరానికి వచ్చాం.
\v 15 అక్కడ నుండి సోదరులు మా సంగతి విని అప్పీయా సంతపేట వరకు, మూడు సత్రాల పేట వరకు ఎదురు వచ్చి మమ్మల్ని ఆహ్వానించారు. పౌలు వారిని చూసి దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించి ధైర్యం తెచ్చుకొన్నాడు.
\s రోమ్ చేరుకున్న పౌలు, యూదుల మధ్య పరిచర్య
\s5
\p
\v 16 మేము రోమ్ కు వచ్చినప్పుడు పౌలు తనకు కాపలాగా ఉన్న సైనికులతో కలిసి ప్రత్యేకంగా ఉండడానికి అనుమతి పొందాడు.
\v 17 మూడు రోజుల తరువాత అతడు ప్రముఖ యూదులను తన దగ్గరకు పిలిపించాడు. వారు వచ్చినప్పుడు అతడు, "సోదరులారా, నేను మన ప్రజలకూ , పూర్వీకుల ఆచారాలకూ వ్యతిరేకంగా ఏదీ చేయకపోయినా, యెరూషలేములో నన్ను రోమీయుల చేతికి అప్పగించారు.
\v 18 వారు నన్ను విచారించి నాలో మరణానికి తగిన కారణం ఏదీ లేకపోవడంతో నన్ను విడిచిపెట్టాలి అనుకున్నారు గాని
\s5
\v 19 యూదులు అభ్యంతరం చెప్పడం వలన నేను 'కైసరు ఎదుట చెప్పుకుంటాను' అనవలసి వచ్చింది. నా స్వజనం మీద నేరం మోపాలని నా అభిప్రాయం కాదు.
\v 20 ఈ కారణం చేతనే మీతో మాట్లాడాలని పిలిపించాను. ఇశ్రాయేలు నిరీక్షణ నిమిత్తం ఈ గొలుసులతో నన్ను బంధించి ఉంచారు" అని వారితో చెప్పాడు.
\s5
\v 21 అందుకు వారు "యూదయ నుండి మీ గురించి మాకేమీ ఉత్తరాలు రాలేదు, ఇక్కడికి వచ్చిన యూదు సోదరులలో ఒక్కడైనా మీ గురించి చెడ్డ సంగతి ఏదీ మాకు తెలుపలేదు. ఎవరూ చెప్పుకోలేదు కూడా.
\v 22 అయినా ఈ విషయంలో మీ అభిప్రాయం మీ నోటనే వినగోరుతున్నాం. ఈ మతభేదం గూర్చి అన్ని చోట్లా అభ్యంతరాలు ఉన్నాయని మాత్రం మాకు తెలుసు" అని జవాబిచ్చారు.
\s5
\v 23 అతనికి ఒక రోజు ఏర్పాటు చేసి, అతడున్న చోటికి చాలా మంది వచ్చారు. ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యం గూర్చి పూర్తిగా సాక్ష్యమిస్తూ, మోషే ధర్మశాస్త్రంలో నుండీ, ప్రవక్తలలో నుండీ సంగతులను వారికి ఎత్తి చూపుతూ, యేసుని గూర్చి వివరంగా బోధిస్తూ వారిని ఒప్పిస్తూ ఉన్నాడు.
\v 24 అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మారు, కొందరు నమ్మలేదు.
\s5
\v 25 వారిలో భేదాభిప్రాయాలు కలిగాయి. పౌలు చివరిగా వారితో ఒక మాట చెప్పాడు. అదేమంటే,
\p
\v 26 'వారు వింటారు గాని అర్థం చేసుకోరు. చూస్తారు కానీ గ్రహించుకోరు అని ఈ ప్రజలతో చెప్పండి.
\s5
\p
\v 27 ఈ ప్రజలు కన్నులారా చూసి, చెవులారా విని, మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండా వారి హృదయాలు బండబారి పోయాయి. వారు ఏదీ వినిపించుకోరు, వారి కన్నులు మూసుకుని ఉన్నారు' అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరైందే.
\s5
\p
\v 28 కాబట్టి దేవుని వలన కలిగిన ఈ రక్షణ యూదేతరుల దగ్గరకు తరలి పోతున్నదని మీరు తెలుసుకుంటారు.
\v 29 వారు దానిని అంగీకరిస్తారు.' ఈ మాటలు విని వారంతా వెళ్ళిపోయారు.
\s5
\v 30 పౌలు రెండు సంవత్సరాలు పూర్తిగా తన అద్దె ఇంటిలో నివసించి, తన దగ్గరకు వచ్చే వారినందరినీ ఆదరిస్తూ
\v 31 ఏ ఆటంకమూ లేకుండా పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యం గూర్చి ప్రకటిస్తూ, ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన సంగతులు బోధిస్తూ ఉన్నాడు.