te_ulb/01-GEN.usfm

2894 lines
478 KiB
Plaintext

\id GEN
\ide UTF-8
\sts Genesis
\h ఆదికాండము
\toc1 ఆదికాండము
\toc2 ఆదికాండము
\toc3 gen
\mt1 ఆదికాండము
\s5
\c 1
\p
\v 1 ఆరంభంలో దేవుడు ఆకాశాలనూ భూమినీ సృష్టించాడు.
\v 2 భూమి ఆకారం లేకుండా, శూన్యంగా ఉంది. జల అగాధం మీద చీకటి కమ్ముకొని ఉంది. దేవుని ఆత్మ ఆ మహా జలరాశిపై కదలాడుతూ ఉన్నాడు.
\p
\s5
\v 3 దేవుడు, <<వెలుగు కలుగుతుంది గాక>> అన్నాడు. వెలుగు కలిగింది.
\v 4 ఆ వెలుగు దేవునికి మంచిదిగా అనిపించింది. దేవుడు వెలుగునూ చీకటినీ వేరు చేశాడు.
\v 5 దేవుడు, వెలుగుకు పగలు అనీ చీకటికి రాత్రి అనీ పేర్లు పెట్టాడు. సాయంత్రం అయింది, ఉదయం వచ్చింది- మొదటి రోజు.
\p
\s5
\v 6 దేవుడు, <<మహా జలరాశి మధ్యలో ఒక విశాల ప్రదేశం కలుగుతుంది గాక. అది నీళ్ళనుండి నీళ్ళను వేరుచేస్తుంది గాక>> అన్నాడు.
\v 7 దేవుడు ఆ విశాలమైన ప్రదేశాన్ని చేసి, ఆ విశాలమైన ప్రదేశం పైన ఉన్న జలాలు, కింద ఉన్న జలాలు వేరు చేసాడు. అది అలాగే జరిగింది.
\v 8 దేవుడు ఆ విశాల ప్రదేశానికి <<ఆకాశం>> అని పేరు పెట్టాడు. రాత్రి అయింది, ఉదయం వచ్చింది- రెండవ రోజు.
\p
\s5
\v 9 దేవుడు, <<ఆకాశం కింద ఉన్న జలాలు ఒకే చోట సమకూడి ఆరిన నేల కనబడాలి>>అన్నాడు. అలాగే జరిగింది.
\v 10 దేవుడు ఆరిన నేలకు <<భూమి>> అని పేరు పెట్టాడు. కూర్చి ఉన్న జలాలకు <<సముద్రాలు>> అని పేరు పెట్టాడు. అది ఆయనకు మంచిదిగా అనిపించింది.
\p
\s5
\v 11 దేవుడు, <<వృక్ష జాలాన్ని, విత్తనాలుండే చెట్లను, భూమిపై తమ తమ జాతి ప్రకారం విత్తనాలు ఉండి ఫలం ఇచ్చే పండ్ల చెట్లను, భూమి మొలిపించాలి>> అన్నాడు. అలాగే జరిగింది.
\v 12 వృక్ష జాతిని, విత్తనాలుండే చెట్లను, భూమిమీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనాలు ఉండి ఫలం ఇచ్చే పండ్ల చెట్లను, భూమి మొలిపించినప్పుడు అది ఆయనకు మంచిదిగా కనబడింది.
\v 13 రాత్రి అయింది, ఉదయం వచ్చింది- మూడవ రోజు.
\p
\s5
\v 14 దేవుడు, <<రాత్రి నుంచి పగలును వేరు చెయ్యడానికి ఆకాశ విశాలంలో జ్యోతులు ఉండాలి. కాలాలకు, రోజులకు, సంవత్సరాలకు అవి సూచనలుగా ఉండాలి.
\v 15 భూమికి వెలుగు ఇవ్వడానికి ఆకాశ విశాలంలో జ్యోతులుగా అవి ఉండాలి>> అన్నాడు. అలాగే జరిగింది.
\p
\s5
\v 16 దేవుడు రెండు గొప్ప జ్యోతులు చేశాడు. పగటిని ఏలడానికి పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలడానికి చిన్న జ్యోతిని చేశాడు. ఆయన నక్షత్రాలను కూడా చేశాడు.
\v 17 భూమికి వెలుగు ఇవ్వడానికీ,
\v 18 పగటినీ రాత్రినీ ఏలడానికీ, వెలుగునూ చీకటినీ వేరుపరచడానికీ, దేవుడు ఆకాశ విశాలంలో వాటిని అమర్చాడు. అది ఆయనకు మంచిదిగా కనబడింది.
\v 19 రాత్రి అయింది. ఉదయం వచ్చింది- నాలుగో రోజు.
\p
\s5
\v 20 దేవుడు, <<చలించే ప్రాణులు జలాల్లో కుప్పలు తెప్పలుగా నిండిపోవాలి. భూమి పైన ఉన్న ఆకాశవిశాలంలో పక్షులు ఎగరాలి>> అన్నాడు.
\v 21 దేవుడు బ్రహ్మాండమైన జలచరాలనూ, చలించే ప్రాణులన్నిటినీ వాటి వాటి జాతుల ప్రకారం పుష్కలంగా జలాలను నింపి వేసేలా సృష్టించాడు. ఇంకా వాటి వాటి జాతి ప్రకారం రెక్కలున్న ప్రతి పక్షినీ సృష్టించాడు. అది ఆయనకు మంచిదిగా కనబడింది.
\p
\s5
\v 22 దేవుడు, <<మీరు ఫలించి వృద్ధి పొందండి. సముద్ర జలాలను నింపండి. పక్షులు భూమి మీద విస్తరించాలి>> అని వాటిని దీవించాడు.
\v 23 రాత్రి అయింది. ఉదయం వచ్చింది- ఐదో రోజు.
\p
\s5
\v 24 దేవుడు, <<వాటి వాటి జాతి ప్రకారం ప్రాణం గలవాటిని, అంటే వాటి వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించాలి>> అన్నాడు. అలాగే జరిగింది.
\v 25 దేవుడు, వాటి వాటి జాతుల ప్రకారం అడవి జంతువులనూ వాటి వాటి జాతుల ప్రకారం పశువులనూ, వాటి వాటి జాతుల ప్రకారం నేలమీద పాకే ప్రతి పురుగునూ చేశాడు. అది ఆయనకు మంచిదిగా కనబడింది.
\p
\s5
\v 26 దేవుడు అన్నాడు, <<మన స్వరూపంలో మన పోలికలో మనిషిని చేద్దాం. సముద్రంలో చేపల మీదా ఆకాశంలో పక్షుల మీదా పశువుల మీదా భూమిమీద పాకే ప్రతి జంతువు మీదా భూమి అంతటి మీదా వారికీ ఆధిపత్యం ఉండాలి>> అన్నాడు.
\v 27 దేవుడు తన స్వరూపంలో మనిషిని సృష్టించాడు. దేవుని స్వరూపంలో అతణ్ణి సృష్టించాడు. స్త్రీనిగా, పురుషునిగా వాళ్ళను సృష్టించాడు.
\p
\s5
\v 28 దేవుడు వాళ్ళను దీవించి, <<మీరు ఫలించి, సంఖ్యలో వృద్ధి చెందండి. భూమి అంతటా విస్తరించి, భూమిని నింపి, దానిని స్వాధీనం చేసుకోండి. సముద్రంలో చేపల మీదా ఆకాశంలో పక్షుల మీదా భూమిమీద పాకే ప్రతి ప్రాణి మీదా ఏలుబడి చెయ్యండి>> అని చెప్పాడు.
\v 29 దేవుడు ఇంకా ఇలా అన్నాడు, <<చూడండి, భూమిమీద ఉన్న విత్తనాలిచ్చే ప్రతి చెట్టును, విత్తనాలున్న ఫలాలు ఇచ్చే ప్రతి చెట్టును మీకు ఇచ్చాను. అవి మీకు ఆహారం అవుతాయి.
\p
\s5
\v 30 భూమిమీద ఉండే జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ భూమిమీద పాకే జీవాలన్నిటికీ పచ్చని చెట్లన్నీ ఆహారం అవుతాయి>> అన్నాడు. అలాగే జరిగింది.
\v 31 దేవుడు తాను చేసిందంతా చూసినప్పుడు అది ఆయనకు ఎంతో మంచిదిగా కనబడింది. రాత్రి అయింది. ఉదయం వచ్చింది. ఆరవ రోజు.
\s5
\c 2
\p
\v 1 ఆకాశం, భూమి, వాటిలో ఉన్నవన్నీ పూర్తి అయ్యాయి.
\v 2 ఏడవ రోజు దేవుడు తాను చేసిన పని ముగించాడు. కాబట్టి తాను చేసిన పని అంతటి నుంచి ఏడవ రోజున విశ్రాంతి తీసుకున్నాడు.
\v 3 దేవుడు ఆ ఏడవ రోజును ఆశీర్వదించి పవిత్రం చేశాడు. ఆయన తాను చేసిన సృష్టి కార్యం అంతటినుంచి విశ్రాంతి తీసుకున్న కారణంగా ఆ రోజును పవిత్రపరిచాడు.
\p
\s5
\v 4 దేవుడైన యెహోవా భూమిని ఆకాశాన్ని చేసినప్పుడు, ఆకాశాల, భూమి విషయాలు ఈ విధంగా ఉన్నాయి,
\v 5 భూమి మీద అంతకుముందు ఆరుబయట ఏ పొదలూ లేవు, ఏ చెట్లూ మొలవలేదు. ఎందుకంటే దేవుడైన యెహోవా భూమిమీద వర్షం కురిపించలేదు. నేలని సేద్యం చెయ్యడానికి ఏ మనిషీ లేడు.
\v 6 కాని, భూమిలోనుంచి ఆవిరి లేచి నేలంతా తడిపేది.
\p
\s5
\v 7 దేవుడైన యెహోవా నేలలో నుంచి మట్టి తీసుకొని మనిషిని చేసి అతని నాసికారంధ్రాలలో ఊపిరి ఊదాడు. మనిషికి ప్రాణం వచ్చింది.
\v 8 దేవుడైన యెహోవా తూర్పువైపు ఏదెనులో ఒక తోటను చేసి తాను చేసిన మనిషిని దానిలో ఉంచాడు.
\p
\s5
\v 9 దేవుడైన యెహోవా కనులకు అందమైన, ఆహారానికి మంచిదైన ప్రతి చెట్టునూ నేలలోనుంచి అక్కడ మొలిపించాడు. ఇంకా ఆ తోట మధ్యలో జీవవృక్షాన్నీ, ఏది మంచో, ఏది చెడో తెలిపే తెలివిని ఇచ్చే వృక్షాన్నీ కూడా నేలలోనుంచి మొలిపించాడు.
\v 10 ఆ తోటను తడపడానికి ఏదెనులో నుంచి ఒక నది బయలుదేరి అక్కడ నుంచి చీలిపోయి నాలుగు పాయలు అయ్యింది.
\p
\s5
\v 11 మొదటిదాని పేరు పీషోను; అది బంగారం ఉన్న హవీలా దేశమంతటా ప్రవహిస్తున్నది.
\v 12 ఆ దేశంలో ఉన్న బంగారం ప్రశస్తమైనది. అక్కడ గుగ్గిలం, గోమేధిక మణులు కూడా దొరుకుతాయి.
\p
\s5
\v 13 రెండో నది పేరు గీహోను. అది కూషు దేశమంతటా ప్రవహిస్తున్నది.
\v 14 మూడో నది పేరు హిద్దెకెలు. అది అష్షూరుకు తూర్పు వైపు ప్రవహిస్తున్నది. నాలుగో నది యూఫ్రటీసు.
\p
\s5
\v 15 దేవుడైన యెహోవా ఏదెను తోట సేద్యం చెయ్యడానికీ దానిని చూసుకోడానికీ మనిషిని అక్కడ పెట్టాడు.
\v 16 దేవుడైన యెహోవా, <<ఈ తోటలో ఉన్న ప్రతి చెట్టు ఫలాన్నీ నువ్వు అభ్యంతరం లేకుండా తినొచ్చు,
\v 17 కాని, మంచి చెడ్డల తెలివిని ఇచ్చే చెట్టు ఫలాలు మాత్రం నువ్వు తినకూడదు. నువ్వు వాటిని తిన్నరోజు కచ్చితంగా చచ్చిపోతావు>> అని మనిషికి ఆజ్ఞాపించాడు.
\p
\s5
\v 18 దేవుడైన యెహోవా, <<మనిషి ఒంటరిగా ఉండడం మంచిది కాదు. అతనికి సరిపడిన తోడును అతని కోసం చేస్తాను>> అనుకొన్నాడు.
\v 19 దేవుడైన యెహోవా, ప్రతి భూజంతువునూ ప్రతి పక్షినీ నేలలోనుంచి చేసి, ఆదాము వాటికి ఏ ఏ పేపేర్లు పెడతాడో చూడడానికి అతని దగ్గరకు వాటిని రప్పించాడు. జీవం ఉన్న ప్రతిదానికీ ఆదాము ఏ పేరు పెట్టాడో, ఆ పేరు దానికి ఖాయం అయ్యింది.
\v 20 అప్పుడు ఆదాము పశువులన్నిటికీ, ఆకాశపక్షులన్నిటికీ, భూజంతువులన్నిటికీ పేర్లు పెట్టాడు. కాని ఆదాముకు మాత్రం సరిజోడు లేకపోయింది.
\p
\s5
\v 21 అప్పుడు దేవుడైన యెహోవా ఆదాముకు గాఢ నిద్ర కలిగించాడు. అతడు నిద్రలో ఉండగా అతని పక్కటెముకల్లోనుంచి ఒకదాన్ని తీసి ఆ ఖాళీని మాంసంతో పూడ్చివేశాడు.
\v 22 ఆ తరువాత దేవుడైన యెహోవా ఆదాము నుంచి తీసిన పక్కటెముకతో స్త్రీని తయారుచేసి ఆదాము దగ్గరకు తీసుకువచ్చాడు.
\v 23 ఆదాము, <<ఇప్పుడు ఇది నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం. నరునిలోనుంచి బయటకు తీసినది గనుక ఈమె పేరు <నారి> >> అన్నాడు.
\p
\s5
\v 24 ఆ కారణంగా పురుషుడు తన తండ్రిని, తన తల్లిని విడిచి అతని భార్యతో ఏకం అవుతాడు. వాళ్ళు ఒకే శరీరం అవుతారు.
\v 25 అప్పుడు ఆదాము, అతని భార్య ఇద్దరూ నగ్నంగా ఉన్నారు. వాళ్ళకు సిగ్గు తెలియదు.
\s5
\c 3
\p
\v 1 దేవుడైన యెహోవా చేసిన జంతువులన్నిటిలో పాము జిత్తులమారి. వాడు ఆ స్త్రీతో, <<నిజమేనా? <ఈ తోటలో ఉన్న చెట్లలో ఏ పండ్లూ మీరు తినకూడదు> అని దేవుడు చెప్పాడా?>> అన్నాడు.
\v 2 స్త్రీ ఆ సర్పంతో, <<ఈ తోటలో ఉన్న చెట్ల పండ్లు మేము తినవచ్చు.
\v 3 కానీ తోట మధ్యలో ఉన్న చెట్టు పండ్ల విషయంలో, <మీరు వాటిని తినకూడదు. వాటిని ముట్టుకోకూడదు. అలా చేస్తే మీరు చనిపోతారు> అని దేవుడు చెప్పాడు>> అంది.
\p
\s5
\v 4 పాము స్త్రీతో, <<మీరు చావనే చావరు.
\v 5 ఎందుకంటే, మీరు అది తిన్న రోజున మీ కళ్ళు తెరుచుకుంటాయి. మీరు మంచి చెడ్డలు తెలిసి, దేవుడిలా ఉంటారని దేవునికి తెలుసు>> అన్నాడు.
\v 6 స్త్రీ, ఆ చెట్టు తినడానికి మంచిదిగా, కంటికి ఇంపుగా, వివేకం కలగడం కోసం కోరదగినదిగా ఉండడం చూసి, దాని పండ్లలో కొన్నిటిని కోసి తిని, తనతోపాటు తన భర్తకు కూడా ఇచ్చింది. అతను కూడా తిన్నాడు.
\p
\s5
\v 7 అప్పుడు వాళ్ళిద్దరికీ కళ్ళు తెరుచుకున్నాయి. వాళ్ళు తాము నగ్నంగా ఉన్నాం అని తెలుసుకొని, అంజూరపు ఆకులు కుట్టి తమను కప్పుకునేందుకు దుస్తులు చేసుకొన్నారు.
\v 8 సాయంత్రం చల్లబడిన తరువాత ఆ తోటలో దేవుడు నడుస్తున్న శబ్ధం వాళ్ళు విన్నారు. ఆదాము, అతని భార్య దేవుడైన యెహోవాకు ఎదురు పడకుండా తోటలో చెట్ల మధ్య దాక్కొన్నారు.
\p
\s5
\v 9 దేవుడైన యెహోవా ఆదామును పిలుస్తూ, <<నువ్వెక్కడ ఉన్నావు?>> అన్నాడు.
\v 10 అతను, <<నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు నగ్నంగా ఉన్నాను గనుక భయపడి దాక్కొన్నాను>> అన్నాడు.
\v 11 దేవుడు, <<నువ్వు నగ్నంగా ఉన్నావని నీకెవరు చెప్పారు? తినొద్దని నీకు ఆజ్ఞ ఇచ్చిన ఆ చెట్టు పండు తిన్నావా?>> అన్నాడు.
\p
\s5
\v 12 ఆదాము, <<నాతో ఉండడానికి నువ్వు నాకిచ్చిన స్త్రీ నాకు ఆ చెట్టు పండు ఇచ్చింది. అప్పుడు నేను దాన్ని తిన్నాను>> అన్నాడు.
\v 13 దేవుడైన యెహోవా స్త్రీతో, <<నువ్వు చేసిందేమిటి?>> అన్నాడు. స్త్రీ, <<సర్పం నన్ను మోసం చేసిన కారణంగా నేను తిన్నాను>> అంది.
\s5
\v 14 అందుకు దేవుడైన యెహోవా పాముతో, <<నువ్వు ఇలా చేసినందుకు పశువులన్నిటిలో, జంతువులన్నిటిలో నిన్ను మాత్రమే శపిస్తున్నాను. నువ్వు నీ కడుపుతో పాకుతూ వెళ్తావు. బ్రతికినంత కాలం మట్టి తింటావు.
\v 15 నీకూ స్త్రీకి, నీ సంతానానికి ఆమె సంతానానికి మధ్య శత్రుత్వం ఉండేలా చేస్తాను. అతడు నిన్ను తలమీద కొడతాడు. నువ్వు అతన్ని మడిమె మీద కొడతావు>> అన్నాడు.
\p
\s5
\v 16 ఆయన స్త్రీతో, <<పిల్లల్ని కనేటప్పుడు నీకు కలిగే బాధ అనేక రెట్లు పెంచుతున్నాను. నీ భర్తపై కోరిక కలిగి ఉంటావు. అతను నిన్ను ఏలుతాడు>> అని చెప్పాడు.
\s5
\v 17 ఆయన ఆదాముతో, <<నువ్వు నీ భార్య మాట విని, <తినొద్దు> అని నేను నీకు ఆజ్ఞ ఇచ్చిన ఆ చెట్టు పండు తిన్నావు గనుక నిన్నుబట్టి నేల శాపానికి గురయ్యింది. బ్రతికిన రోజులన్నీ కష్టం చేసి నువ్వు దాని పంట తింటావు.
\v 18 నువ్వు ఎంత కష్టం చేసినా నేల ముళ్ళ తుప్పలు, ముళ్ళ పొదలే మొలిపిస్తుంది. నువ్వు పొలంలో పండించిన పంట తింటావు.
\v 19 నువ్వు మట్టికి తిరిగి చేరే వరకూ చెమటోడ్చి ఆహారం తింటావు. ఎందుకంటే నిన్ను తీసింది మట్టిలోనుంచే. నువ్వు మట్టే గనుక మళ్ళీ మట్టైపోతావు>> అని చెప్పాడు.
\p
\s5
\v 20 ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాడు. ఎందుకంటే, జీవులందరికీ ఆమే తల్లి.
\v 21 దేవుడైన యెహోవా ఆదాముకు అతని భార్యకు జంతు చర్మం బట్టలు చేసి వాళ్లకు తొడిగించాడు.
\p
\s5
\v 22 దేవుడైన యెహోవా, <<ఇప్పుడు మనిషి మంచి చెడ్డలు తెలిసిన మనలాంటివాడయ్యాడు. కాబట్టి ఒకవేళ అతను తన చెయ్యి చాపి ఆ జీవ వృక్షఫలం కూడా తీసికొని తిని శాశ్వతంగా జీవిస్తాడేమో. అతనికి అలా జరగనివ్వకూడదు>> అన్నాడు.
\v 23 దేవుడైన యెహోవా అతణ్ణి ఏ నేలనుంచి తీశాడో ఆ నేలను సేద్యం చెయ్యడానికి ఏదెను తోటలోనుంచి అతణ్ణి పంపివేశాడు.
\v 24 కాబట్టి దేవుడు ఏదెను తోటలోనుంచి ఆదామును వెళ్ళగొట్టి, ఏదెను తోటకు తూర్పు వైపు కెరూబులు, జీవవృక్షానికి వెళ్ళే దారిని కాపలా కాయడానికి ఇటు అటు తిరిగే అగ్నిఖడ్గం నిలబెట్టాడు.
\s5
\c 4
\p
\v 1 ఆదాము తన భార్య హవ్వను కలిసినప్పుడు ఆమె గర్భం ధరించి కయీనుకు జన్మనిచ్చింది. ఆమె, <<యెహోవా సహాయంతో నేనొక మగ బిడ్డకు జన్మనిచ్చాను>> అంది.
\v 2 తరువాత ఆమె అతని తమ్ముడు హేబెలుకు జన్మనిచ్చింది. హేబెలు గొర్రెల కాపరి. కయీను భూమిని సేద్యం చేసేవాడు.
\p
\s5
\v 3 కొంతకాలం తరువాత కయీను సేద్యం ద్వారా వచ్చిన పంటలో కొంత యెహోవాకు అర్పణ ఇవ్వడానికి తెచ్చాడు.
\v 4 హేబెలు కూడా తన మందలో తొలుచూలులో పుట్టిన వాటిలో కొవ్విన వాటిని తెచ్చాడు. యెహోవా హేబెలును, అతని అర్పణను అంగీకరించాడు.
\v 5 కయీనును, అతని అర్పణను ఆయన అంగీకరించలేదు. కాబట్టి కయీనుకు చాలా కోపం వచ్చి అసూయతో రగిలిపోయాడు.
\p
\s5
\v 6 యెహోవా కయీనుతో, <<ఎందుకు కోపగించుకున్నావు? ఎందుకు రుసరుసలాడుతున్నావు?
\v 7 నువ్వు సరైనది చేస్తే నీకు ఆమోదం లభిస్తుంది కదా, సరైనది చెయ్యకపోతే గుమ్మంలో పాపం పొంచి ఉంటుంది. అది నిన్ను స్వాధీపర్చుకోవాలని చూస్తుంది. అయితే, నువ్వు దాని మీద ఏలుబడి చెయ్యాలి>> అన్నాడు.
\p
\s5
\v 8 కయీను తన తమ్ముడు హేబెలుతో మాట్లాడాడు. వాళ్ళు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడు హేబెలు మీద దాడి చేసి అతణ్ణి చంపివేశాడు.
\v 9 అప్పుడు యెహోవా కయీనుతో, <<నీ తమ్ముడు హేబెలు ఎక్కడున్నాడు?>> అన్నాడు. అతను <<నాకు తెలియదు. నేను నా తమ్ముడికి కాపలావాడినా?>> అన్నాడు.
\s5
\v 10 దేవుడు, <<నువ్వు చేసిందేమిటి? నీ తమ్ముడి రక్తం నేలలో నుంచి నాకు మొర్రపెడుతూ ఉంది.
\v 11 ఇప్పుడు నీ మూలంగా ఒలికిన నీ తమ్ముడి రక్తాన్ని మింగడానికి నోరు తెరిచిన ఈ నేలమీద ఉండకుండా నువ్వు శాపానికి గురయ్యావు.
\v 12 నువ్వు నేలను సేద్యం చేసినప్పుడు అది తన సారాన్ని ఇకపై నీకు ఇవ్వదు. నువ్వు భూమి మీద నుంచి అస్తమానం పారిపోతూ, దేశదిమ్మరిగా ఉంటావు>> అన్నాడు.
\p
\s5
\v 13 కయీను, <<నా శిక్ష నేను భరించలేనిది.
\v 14 ఈ రోజు ఈ ప్రదేశం నుంచి నువ్వు నన్ను వెళ్ళగొట్టావు. నీ సన్నిధిలోకి నేనిక రావడం కుదరదు. ఈ భూమి మీద పలాయనం అవుతూ, దేశదిమ్మరిగా ఉంటాను. నన్ను ఎవరు చూస్తే వాళ్ళు నన్ను చంపుతారు>> అన్నాడు.
\p
\v 15 యెహోవా అతనితో, <<ఎవరైనా కయీనును చంపితే అతని మీద ఏడు రెట్లు ప్రతీకారం ఉంటుంది>> అన్నాడు. ఎవరైనా కయీనును చూసినప్పుడు అతణ్ణి చంపకుండా ఉండాలని యెహోవా కయీను మీద ఒక గుర్తు వేశాడు.
\s5
\v 16 అప్పుడు కయీను యెహోవా సన్నిధిలోనుంచి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పువైపు ఉన్న నోదు దేశంలో నివాసం ఉన్నాడు.
\v 17 కయీను తన భార్యను కలిసినప్పుడు ఆమె గర్భం ధరించి హనోకుకు జన్మనిచ్చింది. అతడు ఒక ఊరు కట్టించి దానికి తన కొడుకు పేర హనోకు అని పెట్టాడు.
\p
\s5
\v 18 హనోకు ఈరాదుకు తండ్రి. ఈరాదు మహూయాయేలుకు తండ్రి. మహూయాయేలు మతూషాయేలుకు తండ్రి. మతూషాయేలు లెమెకుకు తండ్రి.
\v 19 లెమెకు ఇద్దరు స్త్రీలను పెళ్ళి చేసుకున్నాడు. వారిలో ఒకామె పేరు ఆదా, రెండవ ఆమె సిల్లా.
\p
\s5
\v 20 ఆదా యాబాలుకు జన్మనిచ్చింది. అతను పశువులు పెంపకం చేస్తూ గుడారాల్లో నివాసం ఉండేవాళ్లకు మూలపురుషుడు.
\v 21 అతని తమ్ముడు యూబాలు. ఇతను తీగె వాయుద్యాలు, వేణువు వాయించే వాళ్ళందరికీ మూలపురుషుడు.
\v 22 సిల్లా తూబల్కయీనుకు జన్మనిచ్చింది. అతడు రాగి, ఇనుప పరికరాలు చేసేవాడు. తూబల్కయీను చెల్లి పేరు నయమా.
\p
\s5
\v 23 లెమెకు తన భార్యలతో ఇలా అన్నాడు,
\q1 <<ఆదా, సిల్లా, నా స్వరం వినండి.
\q1 లెమెకు భార్యలారా, నా మాట ఆలకించండి.
\q1 నన్ను గాయపరచినందుకు నేను ఒక మనిషిని చంపాను.
\q1 కమిలిపోయేలా కొట్టినందుకు ఒక యువకుణ్ణి చంపాను.
\q1
\v 24 ఏడంతలు ప్రతీకారం కయీను కోసం వస్తే, లెమెకు కోసం డెబ్బై ఏడు రెట్లు వస్తుంది.>>
\p
\s5
\v 25 ఆదాము మళ్ళీ తన భార్యను కలిసినప్పుడు ఆమె ఒక కొడుకును కన్నది. అతనికి షేతు అని పేరు పెట్టి, <<కయీను చంపిన హేబెలుకు బదులుగా దేవుడు నాకు మరొక కొడుకును ఇచ్చాడు>> అంది.
\v 26 షేతుకు ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు ఎనోషు. అప్పటినుండి ప్రజలు యెహోవాకు ప్రార్థన చేయడం ఆరంభించారు.
\s5
\c 5
\p
\v 1 ఆదాము వంశక్రమం ఇది. దేవుడు మనిషిని సృష్టించిన రోజున వాళ్ళను తన సొంత పోలికలో చేశాడు.
\v 2 వారిని పురుషులుగా, స్త్రీలుగా సృష్టించాడు. వాళ్ళను సృష్టించిన రోజున ఆయన వాళ్ళను ఆశీర్వదించి వాళ్లకు మనుషులు అని పేరు పెట్టాడు.
\p
\s5
\v 3 ఆదాముకు నూట ముప్ఫై సంవత్సరాల వయస్సులో అతని పోలికగా అతని స్వరూపంలో కొడుకు పుట్టాడు. ఆదాము అతనికి షేతు అని పేరుపెట్టాడు.
\v 4 షేతు పుట్టిన తరువాత ఆదాము ఎనిమిది వందల సంవత్సరాలు బ్రతికాడు. అతనికి ఇంకా కొడుకులు, కూతుళ్ళు పుట్టారు.
\v 5 ఆదాము తొమ్మిది వందల ముప్ఫై సంవత్సరాలు బ్రతికాడు.
\p
\s5
\v 6 షేతుకు నూట అయిదు సంవత్సరాల వయస్సులో ఎనోషును పుట్టాడు.
\v 7 ఎనోషు పుట్టిన తరువాత షేతు ఎనిమిది వందల ఏడు సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
\v 8 షేతు తొమ్మిది వందల పన్నెండు సంవత్సరాలు బ్రతికాడు.
\p
\s5
\v 9 ఎనోషుకు తొంభైసంవత్సరాల వయస్సులో కేయినాను పుట్టాడు.
\v 10 కేయినాను పుట్టిన తరువాత ఎనోషు ఎనిమిది వందల పదిహేను సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
\v 11 ఎనోషు తొమ్మిది వందల అయిదు సంవత్సరాలు బ్రతికాడు.
\p
\s5
\v 12 కేయినానుకు డెబ్భై సంవత్సరాల వయస్సులో మహలలేలు పుట్టాడు.
\v 13 మహలలేలు పుట్టిన తరువాత కేయినాను ఎనిమిది వందల నలభై సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
\v 14 కేయినాను తొమ్మిది వందల పది సంవత్సరాలు బ్రతికాడు.
\p
\s5
\v 15 మహలలేలుకు అరవై ఐదు సంవత్సరాల వయస్సులో యెరెదు పుట్టాడు.
\v 16 యెరెదు పుట్టిన తరువాత మహలలేలు ఎనిమిది వందల ముప్పైసంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
\v 17 మహలలేలు ఎనిమిదివందల తొంభై ఐదు సంవత్సరాలు బ్రతికాడు.
\p
\s5
\v 18 యెరెదుకు నూట అరవై రెండు సంవత్సరాల వయస్సులో హనోకు పుట్టాడు.
\v 19 హనోకు పుట్టిన తరువాత యెరెదు ఎనిమిది వందల సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
\v 20 యెరెదు తొమ్మిది వందల అరవై రెండు సంవత్సరాలు బ్రతికాడు.
\p
\s5
\v 21 హనోకుకు అరవై ఐదు సంవత్సరాల వయస్సులో మెతూషెల పుట్టాడు.
\v 22 మెతూషెల పుట్టిన తరువాత హనోకు మూడు వందల సంవత్సరాలు దేవునితో సహవాసం చేస్తూ కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
\v 23 హనోకు మూడువందల అరవై ఐదు సంవత్సరాలు బ్రతికాడు.
\v 24 హనోకు దేవునితో కలసి నడిచాడు. దేవుడు అతణ్ణి తీసుకువెళ్ళాడు గనుక అతడు కనబడలేదు.
\p
\s5
\v 25 మెతూషెలకు నూట ఎనభై ఏడు సంవత్సరాల వయస్సులో లెమెకు పుట్టాడు.
\v 26 మెతూషెలకు లెమెకు పుట్టిన తరువాత ఏడు వందల ఎనభై రెండు సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
\v 27 మెతూషెల తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికాడు.
\p
\s5
\v 28 లెమెకుకు నూట ఎనభై రెండు సంవత్సరాల వయస్సులో ఒక కొడుకు పుట్టాడు.
\v 29 <<భూమిని యెహోవా శపించినందువల్ల కలిగిన మన చేతుల కష్టం విషయంలో, మన పని విషయంలో, ఇతడు మనకు విశ్రాంతి ఇస్తాడు>> అని, అతనికి నోవహు అని పేరు పెట్టాడు.
\p
\s5
\v 30 లెమెకుకు నోవహు పుట్టిన తరువాత అయిదు వందల తొంభై అయిదు సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
\v 31 లెమెకు ఏడువందల డెబ్భై ఏడు సంవత్సరాలు బ్రతికాడు.
\p
\s5
\v 32 అయిదు వందల సంవత్సరాలు బ్రతికిన నోవహుకు షేము, హాము, యాపెతు అనే ముగ్గురు కొడుకులు పుట్టారు.
\s5
\c 6
\p
\v 1 మనుషులు భూమి మీద విస్తరించడం మొదలుపెట్టారు. వాళ్లకు కూతుళ్ళు పుట్టినప్పుడు
\v 2 దైవ కుమారులు మనుషుల కూతుళ్ళు అందంగా ఉండడం చూసి, వాళ్ళల్లో తమకు నచ్చిన స్త్రీలను పెళ్ళి చేసుకొన్నారు.
\v 3 యెహోవా, <<నా ఆత్మ మనుషులలో ఎల్లకాలం ఉండదు, ఎందుకంటే వారు కేవలం రక్తమాంసాలు గలవారు. వారు నూట ఇరవై సంవత్సరాలు బ్రతుకుతారు>> అన్నాడు.
\p
\s5
\v 4 ఆ రోజుల్లో నెఫీలులు అనేవారు భూమి మీద ఉండేవాళ్ళు. ఆ తరువాత కూడా వాళ్ళు ఉన్నారు. దైవ కుమారులు మనుషుల కూతుళ్ళను పెళ్ళి చేసుకున్నప్పుడు వాళ్లకు పిల్లలు పుట్టారు. పూర్వకాలంలో పేరు పొందిన శూరులు వీరే.
\p
\s5
\v 5 మనుషుల చెడుతనం భూమిమీద అధికంగా ఉందని, వాళ్ళ హృదయ ఆలోచనా విధానం ఎప్పుడూ దుష్టత్వమే అని యెహోవా చూసి,
\v 6 తాను భూమిమీద మనుషుల్ని చేసినందుకు బాధపడి, ఆయన తన హృదయంలో విచారించాడు.
\p
\s5
\v 7 కాబట్టి యెహోవా, <<నేను సృష్టించిన మనుషుల్ని ఈ భూమిమీద లేకుండా చేస్తాను. మనుషులతో పాటు జంతువుల్ని, పాకే జీవుల్ని, ఆకాశపక్షుల్ని భూమిమీద లేకుండా తుడిచివేస్తాను. ఎందుకంటే నేను వాళ్ళను సృష్టించినందుకు బాధపడుతున్నాను>> అన్నాడు.
\v 8 అయితే నోవహు యెహోవా దృష్టిలో అనుగ్రహం పొందాడు.
\p
\s5
\v 9 నోవహు గురించిన సంగతులు ఇవే. నోవహు నీతిపరుడు. అతని తరంవాళ్ళల్లో నింద లేనివాడు. నోవహు దేవునితో కలసి నడిచాడు.
\v 10 షేము, హాము, యాపెతు అనే ముగ్గురు కొడుకులకు నోవహు తండ్రి అయ్యాడు.
\p
\s5
\v 11 దేవుని దృష్టిలో లోకం చెడిపోయింది. అది హింసతో నిండిపోయింది.
\v 12 దేవుడు లోకాన్ని చూడగా అది చెడిపోయి ఉంది. భూమిమీద మనుషులందరూ తమ మార్గాల్లో చెడిపోయారు.
\p
\s5
\v 13 దేవుడు నోవహుతో, <<మనుషుల మూలంగా భూమి హింసతో నిండిపోయింది గనుక వాళ్ళను అంతం చేసే సమయం వచ్చినట్టు తేటతెల్లం అయింది. కచ్చితంగా ఈ భూమితోపాటు వాళ్ళందరినీ నాశనం చేస్తాను.
\v 14 కోనిఫర్ కలపతో నీ కోసం ఒక ఓడ సిద్ధం చేసుకో. గదులతో ఉన్న ఓడను తయారుచేసి, దానికి లోపలా బయటా కీలు పూయాలి.
\v 15 నువ్వు దాన్ని చెయ్యాల్సిన విధానం ఇదే. ఆ ఓడ మూడు వందల మూరల పొడవు, ఏభై మూరల వెడల్పు, ముప్ఫై మూరల ఎత్తు ఉండాలి.
\p
\s5
\v 16 ఆ ఓడకు కిటికీ చేసి పైనుంచి కిందికి ఒక మూర దూరంలో దాన్ని బిగించాలి. ఓడకు ఒక పక్క తలుపు ఉంచాలి. మూడు అంతస్థులు ఉండేలా దానిని చెయ్యాలి.
\v 17 విను, నేను ఊపిరి ఉన్నవాటన్నిటినీ ఆకాశం కింద లేకుండా నాశనం చెయ్యడానికి భూమి మీదికి జలప్రవాహం రప్పించబోతున్నాను. లోకంలో ఉన్నవన్నీ చనిపోతాయి.
\p
\s5
\v 18 కానీ, నీతో నా నిబంధన నెరవేరుస్తాను. నువ్వు, నీతోపాటు నీ కొడుకులు, నీ భార్య, నీ కోడళ్ళు ఆ ఓడలో ప్రవేశిస్తారు.
\v 19 నీతోపాటు వాటిని కూడా సజీవంగా ఉంచడం కోసం జీవులన్నిటిలో, అంటే, శరీరం ఉన్న ప్రతి జాతిలోనుంచి రెండేసి చొప్పున నువ్వు ఓడలోకి తేవాలి. వాటిలో ఒకటి మగది ఒకటి ఆడది ఉండాలి.
\p
\s5
\v 20 నువ్వు వాటిని సజీవంగా ఉంచడానికి వాటి వాటి జాతుల ప్రకారం పక్షుల్లో, వాటి వాటి జాతుల ప్రకారం జంతువుల్లో, వాటి వాటి జాతుల ప్రకారం నేలమీద పాకే వాటన్నిట్లో, ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ దగ్గరకు అవే వస్తాయి.
\v 21 తినడానికి కావలసిన అన్నిరకాల ఆహార పదార్ధాలు సమకూర్చుకొని నీ దగ్గర ఉంచుకోవాలి. అవి నీకు, వాటికి ఆహారం అవుతాయి>> అని చెప్పాడు.
\v 22 దేవుడు నోవహుకు ఆజ్ఞాపించిన ప్రకారం అంతా చేశాడు.
\s5
\c 7
\p
\v 1 యెహోవా, <<ఈ తరంలో నా దృష్టిలో నువ్వే నీతిమంతుడవుగా ఉండడం చూశాను కాబట్టి నువ్వు, నీ కుటుంబం ఓడలో ప్రవేశించండి.
\v 2 శుద్ధమైన జంతువుల్లో ప్రతి జాతిలో మగవి ఏడు, ఆడవి ఏడు, శుద్ధంకాని జంతువుల్లో ప్రతి జాతిలో మగ ఆడ రెండు,
\v 3 ఆకాశపక్షుల్లో ప్రతి జాతిలో మగవి ఏడు, ఆడవి ఏడు తీసుకురావాలి. నువ్వు భూమి అంతటిమీద వాటి సంతానాన్ని ప్రాణంతో ఉంచి భద్రం చేసేలా అలా చెయ్యాలి.
\p
\s5
\v 4 ఎందుకంటే, ఇంకా ఏడు రోజుల్లో నేను, నలభై పగళ్ళు, నలభై రాత్రులు భూమిమీద వర్షం కురిపించి, నేను చేసిన జీవం ఉన్న ప్రతి దాన్ని నాశనం చేస్తాను>> అని నోవహుతో చెప్పాడు.
\v 5 తనకు యెహోవా ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం నోవహు అంతా చేశాడు.
\p
\s5
\v 6 ఆ జలప్రళయం భూమిమీదికి వచ్చినప్పుడు నోవహుకు వయస్సు ఆరు వందల సంవత్సరాలు.
\v 7 నోవహు, అతనితోపాటు అతని కొడుకులు, అతని భార్య, అతని కోడళ్ళు ఆ జలప్రళయం తప్పించుకోడానికి ఆ ఓడలో ప్రవేశించారు.
\p
\s5
\v 8 దేవుడు నోవహుకు ఆజ్ఞాపించిన ప్రకారం శుద్ధ జంతువుల్లో, అపవిత్ర జంతువుల్లో, పక్షుల్లో నేలమీద పాకే వాటన్నిటిలో,
\v 9 మగ, ఆడ, జతలుగా ఓడలో ఉన్న నోవహు దగ్గరకు చేరాయి.
\v 10 ఏడు రోజుల తరువాత ఆ ప్రళయజలాలు భూమిమీదికి వచ్చాయి.
\p
\s5
\v 11 నోవహు వయస్సు ఆరువందల సంవత్సరాల రెండు నెలల పదిహేడవ రోజున, మహా అగాధజలాల ఊటలన్నీ తెరుచుకున్నాయి. ఆకాశపు కిటికీలు తెరుచుకున్నాయి.
\v 12 నలభై పగళ్ళు, నలభై రాత్రులు భూమిమీద వర్షం కురిసింది.
\p
\s5
\v 13 ఆ రోజే నోవహు, నోవహు కొడుకులు షేము, హాము, యాపెతు, నోవహు భార్య, వాళ్ళతోపాటు అతని ముగ్గురు కోడళ్ళు ఆ ఓడలో ప్రవేశించారు.
\v 14 వాళ్ళతోపాటు, వాటి వాటి జాతుల ప్రకారం ప్రతి మృగం, వాటి వాటి జాతుల ప్రకారం ప్రతి పశువు, వాటి వాటి జాతుల ప్రకారం నేలమీద పాకే ప్రతి పురుగు, వాటి వాటి జాతుల ప్రకారం ప్రతి పక్షి, నానావిధాల రెక్కల పక్షులు ప్రవేశించాయి.
\p
\s5
\v 15 శ్వాస పీల్చగల, శరీరం కలిగినవన్నీ రెండేసి చొప్పున నోవహు దగ్గరకు వచ్చి, ఓడలో ప్రవేశించాయి.
\v 16 ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం శరీరం కలిగిన ఆ జీవులన్నీ, మగవిగా, ఆడవిగా, ప్రవేశించాయి. అప్పుడు యెహోవా, వాళ్ళను ఓడలో ఉంచి, ఓడ తలుపు మూశాడు.
\p
\s5
\v 17 ఆ జలప్రళయం నలభై రోజులు భూమి మీదికి వచ్చినప్పుడు, నీళ్ళు విస్తరించి ఓడను నీళ్ళ మీద తేలేలా చేశాయి. ఓడ భూమి మీద నుంచి పైకి లేచింది.
\v 18 నీళ్ళు భూమి మీద భీకరంగా ప్రవహించి అధికంగా విస్తరించినప్పుడు, ఆ ఓడ నీళ్ళ మీద తేలింది.
\p
\s5
\v 19 ఆ భీకర జలాలు భూమి మీద పైపైకి లేచినప్పుడు, ఆకాశం కింద ఉన్న ఎత్తైన పర్వతాలన్నీ మునిగిపోయాయి.
\v 20 ఎత్తైన పర్వత శిఖరాలకన్నా పదిహేను మూరలు ఎత్తుగా నీళ్ళు విస్తరించాయి.
\p
\s5
\v 21 పక్షులు, పశువులు, మృగాలు భూమిమీద పాకే పురుగులు, శరీరం ఉండి భూమిమీద తిరిగేవన్నీ చనిపోయాయి. మనుషులందరూ చనిపోయారు.
\v 22 పొడి నేలమీద ఉన్న వాటన్నిటిలో, నాసికారంధ్రాలలో ఊపిరి ఉన్నవన్నీ చనిపోయాయి.
\p
\s5
\v 23 మనుషులతో పాటు పశువులు, పురుగులు, ఆకాశపక్షులు, నేలమీద ఉన్న జీవాలన్నీ అంతం అయిపోయాయి. అవన్నీ భూమిమీద ఉండకుండా నాశనం అయ్యాయి. నోవహు, అతనితో పాటు ఆ ఓడలో ఉన్నవి మాత్రం మిగిలాయి.
\v 24 నూట ఏభై రోజుల వరకు భూమిమీద నీళ్ళు ఆధిపత్యం ప్రదర్శించాయి.
\s5
\c 8
\p
\v 1 దేవుడు నోవహును, అతనితోపాటు ఓడలో ఉన్న ప్రతి జంతువునూ, పశువునూ జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు భూమి మీద గాలి విసిరేలా చేయడంవల్ల నీళ్ళు తగ్గుముఖం పట్టాయి.
\v 2 అగాధజలాల ఊటలు, ఆకాశపు కిటికీలు మూసుకొన్నాయి. ఆకాశం నుంచి కురుస్తున్న భీకర వర్షం ఆగిపోయింది.
\v 3 అప్పుడు నీళ్ళు భూమి మీద నుంచి క్రమక్రమంగా తగ్గిపోతూ వచ్చాయి. నూట ఏభై రోజుల తరువాత నీళ్ళు తగ్గిపోయాయి.
\p
\s5
\v 4 ఏడవ నెల పదిహేడవ రోజున అరారాతు కొండలమీద ఓడ నిలిచింది.
\v 5 పదో నెల వరకు నీళ్ళు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. పదోనెల మొదటి రోజున కొండల శిఖరాలు కనిపించాయి.
\p
\s5
\v 6 నలభై రోజులు గడిచిన తరువాత నోవహు ఓడ కిటికీ తీసి
\v 7 ఒక బొంతకాకిని బయటకు పోనిచ్చాడు. అది బయటకు వెళ్ళి భూమిమీద నుంచి నీళ్ళు ఇంకిపోయేవరకు ఇటూ అటూ తిరుగుతూ ఉంది.
\p
\s5
\v 8 నీళ్ళు నేలమీదనుంచి తగ్గాయో లేదో చూడడానికి అతను తన దగ్గరనుంచి ఒక పావురాన్ని బయటకు వదిలాడు.
\v 9 భూమి అంతటా నీళ్ళు నిలిచి ఉన్నందువల్ల దానికి అరికాలు మోపడానికి స్థలం దొరకలేదు గనుక ఓడలో ఉన్న అతని దగ్గరకు తిరిగి వచ్చింది. అతను చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోకి తీసుకున్నాడు.
\p
\s5
\v 10 అతడు మరో ఏడు రోజులు ఆగి ఆ పావురాన్ని ఓడలోనుంచి బయటకు పంపాడు.
\v 11 సాయంకాలానికి అది అతని దగ్గరకు తిరిగి వచ్చింది. దాని నోట్లో అప్పుడే తుంచిన ఒలీవ ఆకు ఉంది. దీన్నిబట్టి నీళ్ళు నేల మీద ఇంకి పోయాయని నోవహు గ్రహించాడు.
\v 12 అతడు మరో ఏడు రోజులు ఆగి ఆ పావురాన్ని బయటకు పంపాడు. అది అతని దగ్గరకు తిరిగి రాలేదు.
\p
\s5
\v 13 ఆరువందల ఒకటో సంవత్సరం మొదటి నెల మొదటి రోజున నీళ్ళు భూమి మీద నుంచి ఇంకిపోయాయి. నోవహు ఓడ కప్పు తీసి చూడగా ఆరిన నేల కనబడింది.
\v 14 రెండో నెల ఇరవై ఏడో రోజున భూమి పొడిగా అయిపోయింది.
\p
\s5
\v 15 అప్పుడు దేవుడు నోవహుతో,
\v 16 <<నువ్వు, నీతోపాటు నీ భార్య, నీ కొడుకులు, కోడళ్ళు ఓడలోనుంచి బయటకు రండి.
\v 17 పక్షులను, పశువులను భూమి మీద పాకే ప్రతి జాతి పురుగులను, శరీరం ఉన్న ప్రతి జీవినీ నీతోపాటు ఉన్న ప్రతి జంతువును నువ్వు వెంటబెట్టుకొని బయటకు రావాలి. అవి భూమిమీద అధికంగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందాలి>> అని చెప్పాడు.
\p
\s5
\v 18 కాబట్టి నోవహు, అతనితోపాటు అతని కొడుకులు అతని భార్య, అతని కోడళ్ళు బయటకు వచ్చారు.
\v 19 ప్రతి జంతువు, పాకే ప్రతి పురుగు, ప్రతి పక్షి, భూమిమీద తిరిగేవన్నీ వాటి వాటి జాతుల ప్రకారం ఆ ఓడలోనుంచి బయటకు వచ్చాయి.
\p
\s5
\v 20 అప్పుడు నోవహు యెహోవాకు పవిత్రమైన పశువులు, పక్షులన్నిట్లో నుంచి కొన్నిటిని తీసి హోమబలి అర్పించాడు.
\v 21 యెహోవా ఆ ఇంపైన వాసన ఆస్వాదించి, <<వారి హృదయాలు బాల్యం నుంచే దుష్టత్వం వైపు మొగ్గుచూపాయి. ఇక ఎప్పుడూ మనుషులను బట్టి భూమిని కీడుకు గురిచేయను. నేనిప్పుడు చేసినట్టు ప్రాణం ఉన్నవాటిని ఇకపై ఎన్నడూ నాశనం చెయ్యను.
\v 22 భూమి ఉన్నంత వరకు విత్తనాలు నాటేకాలం, కోతకాలం, వేసవి, శీతాకాలాలు, పగలూ రాత్రీ ఉండక మానవు>> అని తన హృదయంలో అనుకొన్నాడు.
\s5
\c 9
\p
\v 1 దేవుడు నోవహుని అతని కొడుకుల్ని ఆశీర్వదించాడు. <<మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి.
\v 2 అడవి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ నేలమీద పాకే ప్రతి పురుగుకూ సముద్రపు చేపలన్నిటికీ మీపట్ల భయం ఉంటుంది, అవి మిమ్మల్ని చూసి బెదురుతాయి.
\p
\s5
\v 3 ప్రాణంతో కదలాడే ప్రతి జీవీ మీకు ఆహారం అవుతుంది. పచ్చని మొక్కల్ని ఇచ్చినట్టు ఇప్పుడు నేను ఇవన్నీ మీకు ఇచ్చాను.
\v 4 కాని ప్రాణమే రక్తం గనుక మీరు మాంసాన్ని దాని రక్తంతో పాటు తినకూడదు.
\p
\s5
\v 5 మీకు ప్రాణం అయిన మీ రక్తం గురించి లెక్క అడుగుతాను. దాని గురించి ప్రతి జంతువునీ ప్రతి మనిషినీ లెక్క అడుగుతాను. ప్రతి మనిషిని, అంటే తన సోదరుణ్ణి హత్యచేసిన ప్రతి మనిషినీ ఆ మనిషి ప్రాణం లెక్క అడుగుతాను.
\v 6 దేవుడు తన స్వరూపంలో మనిషిని చేశాడు గనుక మనిషి రక్తాన్ని ఎవరు చిందిస్తారో, అతని రక్తాన్ని కూడా మనిషే చిందించాలి.
\v 7 మీరు ఫలించి అభివృద్ధి పొందండి. మీరు భూమి మీద అధికంగా సంతానం కని విస్తరించండి>> అని వాళ్ళతో చెప్పాడు.
\p
\s5
\v 8 దేవుడు నోవహు, అతని కొడుకులతో మాట్లాడుతూ,
\v 9 <<వినండి, నేను మీతోను, మీ తరువాత వచ్చే మీ సంతానంతోను,
\v 10 మీతో పాటు ఉన్న ప్రతి జీవితోను, అవి పక్షులే గాని పశువులే గాని, మీతోపాటు ఉన్న ప్రతి జంతువే గాని, ఓడలోనుంచి బయటకు వచ్చిన ప్రతి భూజంతువుతో నా నిబంధన స్థిరం చేస్తున్నాను.
\p
\s5
\v 11 నేను మీతో నా నిబంధన స్థిరపరుస్తున్నాను. సర్వ శరీరులు ప్రవహించే జలాల వల్ల ఇంకెప్పుడూ నాశనం కారు. భూమిని నాశనం చెయ్యడానికి ఇంకెప్పుడూ జలప్రళయం రాదు>> అన్నాడు.
\p
\v 12 దేవుడు, <<నాకు, మీకు, మీతోపాటు ఉన్న జీవరాసులన్నిటికీ మధ్య నేను తరతరాలకు చేస్తున్న నిబంధనకు గుర్తు ఇదే,
\v 13 మేఘంలో నా ధనుస్సు ఉంచాను. అది నాకు, భూమికి, మధ్య నిబంధనకు గుర్తుగా ఉంటుంది.
\p
\s5
\v 14 భూమిమీదికి నేను మేఘాన్ని తీసుకొచ్చినప్పుడు మేఘంలో ఆ ధనుస్సు కనబడుతుంది.
\v 15 అప్పుడు నాకు, మీకు, జీవరాసులన్నిటికీ మధ్య ఉన్న నా నిబంధన జ్ఞాపకం చేసుకొంటాను గనుక సర్వశరీరులను నాశనం చెయ్యడానికి ఇక ఎన్నడూ నీళ్ళు జలప్రళయంగా రావు.
\p
\s5
\v 16 ఆ ధనుస్సు మేఘంలో ఉంటుంది. నేను దాన్ని చూసి దేవునికీ, భూమి మీద ఉన్న సర్వశరీరులలో ప్రాణం ఉన్న ప్రతి దానికీ మధ్య ఉన్న శాశ్వత నిబంధనను జ్ఞాపకం చేసుకొంటాను>> అన్నాడు.
\v 17 దేవుడు <<నాకు, భూమిమీద ఉన్న సర్వశరీరులకు మధ్య నేను స్థిరం చేసిన నిబంధనకు గుర్తు ఇదే>> అని నోవహుతో చెప్పాడు.
\p
\s5
\v 18 ఓడలోనుంచి వచ్చిన నోవహు ముగ్గురు కొడుకులు షేము, హాము, యాపెతు. హాము కనానుకు తండ్రి.
\v 19 వీళ్ళ సంతానం, భూమి అంతటా వ్యాపించింది.
\p
\s5
\v 20 నోవహు భూమిని సాగుచేయడం ప్రారంభించి, ద్రాక్షతోట వేశాడు.
\v 21 ఆ ద్రాక్షారసం తాగి మత్తెక్కి తన గుడారంలో బట్టలు లేకుండా పడి ఉన్నాడు.
\p
\s5
\v 22 అప్పుడు కనాను తండ్రి అయిన హాము, తన తండ్రి బట్టలు లేకుండా పడి ఉండడం చూసి, బయట ఉన్న తన ఇద్దరు సోదరులకు ఆ విషయం చెప్పాడు.
\v 23 అప్పుడు షేము, యాపెతు, ఒక బట్ట తీసుకొని తమ ఇద్దరి భుజాల మీద వేసుకుని వెనుకగా నడిచివెళ్ళి తమ తండ్రి నగ్న శరీరానికి కప్పారు. వాళ్ళ ముఖాలు మరొక వైపు తిరిగి ఉన్నాయి గనుక వాళ్ళు తమ తండ్రి నగ్న శరీరం చూడలేదు.
\p
\s5
\v 24 అప్పుడు నోవహు మత్తులోనుంచి మేల్కొని తన చిన్నకొడుకు చేసిన దాన్ని తెలుసుకొని,
\p
\v 25 <<కనాను శపితుడు. అతడు తన సోదరులకు దాసుడుగా ఉంటాడు>> అన్నాడు.
\s5
\v 26 అతను, <<షేము దేవుడైన యెహోవా స్తుతి పొందుతాడు గాక.
\p కనాను అతనికి సేవకుడవుతాడు గాక.
\p
\v 27 దేవుడు యాపెతును అభివృద్ధి చేస్తాడు గాక.
\p అతను షేము గుడారాల్లో నివాసం ఉంటాడు.
\p అతనికి కనాను సేవకుడవుతాడు>> అన్నాడు.
\p
\s5
\v 28 ఆ జలప్రళయం తరువాత నోవహు మూడు వందల ఏభై సంవత్సరాలు బ్రతికాడు.
\v 29 నోవహు మొత్తం తొమ్మిదివందల ఏభై సంవత్సరాలు జీవించాడు.
\s5
\c 10
\p
\v 1 నోవహు కొడుకులు షేము, హాము, యాపెతుల వంశావళి ఇది. జలప్రళయం తరువాత వాళ్లకు కొడుకులు పుట్టారు.
\p
\s5
\v 2 యాపెతు కొడుకులు గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు, తీరసు.
\v 3 గోమెరు కొడుకులు అష్కనజు, రీఫతు, తోగర్మా.
\v 4 యావాను కొడుకులు ఏలీషా, తర్షీషు, కిత్తీము, దాదోనీము.
\v 5 వీళ్ళనుంచి సముద్రం వెంబడి ప్రజలు వేరుపడి తమ ప్రాంతాలకు వెళ్ళారు. తమ తమ జాతుల ప్రకారం, తమ తమ భాషల ప్రకారం, తమ తమ వంశాల ప్రకారం, ఆ దేశాలలో ఉన్నవాళ్ళు వేరైపోయారు.
\p
\s5
\v 6 హాము కొడుకులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను.
\v 7 కూషు కొడుకులు సెబా, హవీలా, సబ్తా, రాయమా, సబ్తకా. రాయమా కొడుకులు షేబ, దదాను.
\p
\s5
\v 8 కూషుకు నిమ్రోదు పుట్టాడు. అతను భూమి మీద పరాక్రమం కలిగిన శూరుల్లో మొదటివాడు.
\v 9 అతడు యెహోవా దృష్టిలో పరాక్రమం గల వేటగాడు. కాబట్టి,
\p <<యెహోవా దృష్టిలో పరాక్రమం కలిగిన వేటగాడైన నిమ్రోదు వలే>>
\p అనే నానుడి ఉంది.
\v 10 షీనారు ప్రాంతంలో ఉన్న బాబెలు, ఎరెకు, అక్కదు, కల్నే అనే పట్టణాలు అతని రాజ్యంలో ముఖ్య పట్టాణాలు.
\p
\s5
\v 11 ఆ ప్రాంతంలో నుంచి అతడు అష్షూరుకు బయలుదేరి వెళ్ళి నీనెవె, రహోబోతీరు, కాలహు పట్టణాలను,
\v 12 నీనెవె కాలహుల మధ్య రెసెను అనే ఒక పెద్ద పట్టాణాన్నీ కట్టించాడు.
\p
\v 13 మిస్రాయిముకు లూదీ, అనామీ, లెహాబీ, నప్తుహీ,
\v 14 పత్రుసీ, కస్లూహీ, కఫ్తోరీలు పుట్టారు. ఫిలిష్తీయులు కస్లూహీయుల సంతతి.
\p
\s5
\v 15 కనాను మొదటి కొడుకు సీదోనుకు హేతు, యెబూసీ, అమోరీయ, గిర్గాషీ,
\v 16 హివ్వీ, అర్కీయు, సినీయ,
\v 17 అర్వాదీయ, సెమారీయ, హమాతీలు పుట్టారు.
\v 18 ఆ తరువాత కనానీయుల వంశాలు వ్యాప్తి చెందాయి.
\p
\s5
\v 19 కనానీయుల సరిహద్దు సీదోను నుంచి గెరారుకు వెళ్ళే దారిలో గాజా వరకు, సొదొమ గొమొర్రా, అద్మా సెబోయిములకు వెళ్ళే దారిలో లాషా వరకు ఉంది.
\v 20 వీళ్ళు, తమ తమ వంశాల ప్రకారం, తమ తమ భాషల ప్రకారం, తమ తమ జాతులను బట్టి హాము సంతానం.
\p
\s5
\v 21 యాపెతు అన్న షేముకు కూడా సంతానం కలిగింది. ఏబెరు వంశానికి మూలపురుషుడు షేము.
\v 22 షేము కొడుకులు ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరాము.
\v 23 అరాము కొడుకులు ఊజు, హూలు, గెతెరు, మాష.
\p
\s5
\v 24 అర్పక్షదుకు షేలహు పుట్టాడు. షేలహుకు ఏబెరు పుట్టాడు.
\v 25 ఏబెరుకు ఇద్దరు కొడుకులు పుట్టారు. వాళ్ళల్లో ఒకడు పెలెగు. ఎందుకంటే అతని రోజుల్లో భూమి విభజన జరిగింది. రెండవవాడు యొక్తాను.
\p
\s5
\v 26 యొక్తానుకు అల్మోదాదు, షెలపు, హసర్మావెతు, యెరహు,
\v 27 హదోరము, ఊజాలు, దిక్లా,
\v 28 ఓబాలు, అబీమాయెలు, షేబ,
\v 29 ఓఫీరు, హవీలా, యోబాబులు పుట్టారు.
\p
\s5
\v 30 వాళ్ళు నివాసం ఉండే స్థలాలు మేషా నుంచి సపారాకు వెళ్ళే దారిలో తూర్పు కొండలు.
\v 31 వీళ్ళు, తమ తమ వంశాల ప్రకారం, తమ తమ భాషల ప్రకారం, తమ తమ ప్రాంతాలను బట్టి, తమ తమ జాతులను బట్టి షేము కొడుకులు.
\p
\s5
\v 32 తమ తమ జనాలలో తమ తమ సంతానాల ప్రకారం నోవహు కొడుకుల వంశాలు ఇవే. జలప్రళయం జరిగిన తరువాత వీళ్ళల్లోనుంచి జనాలు భూమి మీద వ్యాప్తి చెందారు.
\s5
\c 11
\p
\v 1 అప్పుడు భూమిపై అందరూ ఒకే భాష మాట్లాడేవారు.
\v 2 వాళ్ళు తూర్పుకు ప్రయాణం చేస్తున్నప్పుడు షీనారు ప్రాంతంలో వాళ్లకు ఒక మైదానం కనబడింది. వాళ్ళు అక్కడ స్థిరపడ్డారు.
\p
\s5
\v 3 వాళ్ళు ఒకరితో ఒకరు, <<మనం ఇటుకలు తయారు చేసి, చక్కగా కాల్చుదాం రండి>> అని మాట్లాడుకున్నారు. రాళ్ళకు బదులు ఇటుకలు, అతకడానికి తారు కీలు వాళ్లకు అందుబాటులో ఉన్నాయి.
\v 4 వాళ్ళు, <<మనం భూమి అంతటా చెదిరిపోకుండా ఉండేలా ఒక పట్టణాన్ని, ఆకాశాన్ని అంటే శిఖరం ఉన్న ఒక గోపురం కట్టుకొని పేరు సంపాదించుకుందాం రండి>> అని మాట్లాడుకున్నారు.
\p
\s5
\v 5 యెహోవా ఆదాము సంతానం కట్టిన పట్టణాన్ని, గోపురాన్ని, చూడడానికి దిగి వచ్చాడు.
\v 6 యెహోవా, <<ఇదిగో, ఒకే భాష ఉన్న ఈ ప్రజలు పని చేయడం ప్రారంభించారు! ఇకముందు వాళ్ళు చెయ్యాలనుకున్న ఏ పనైనా వాళ్లకు అసాధ్యం కాదు.
\v 7 కాబట్టి మనం కిందికి వెళ్లి, వాళ్ళల్లో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వాళ్ళ భాషను తారుమారు చేద్దాం రండి>> అనుకున్నాడు.
\p
\s5
\v 8 ఆ విధంగా యెహోవా వారు అక్కడ నుంచి భూమి అంతటా చెదిరిపోయేలా చేశాడు. ఆ పట్టణ నిర్మాణం ఆగిపోయింది.
\v 9 అందువల్ల దానికి బాబెలు అనే పేరు పెట్టారు. ఎందుకంటే, అక్కడ యెహోవా భూమి మీద ఉన్న ప్రజలందరి భాషను తారుమారు చేశాడు. అక్కడ నుంచి యెహోవా వాళ్ళను భూమి మీద అనేక ప్రదేశాలకు చెదరగొట్టాడు.
\p
\s5
\v 10 షేము వంశావళి ఇది. షేముకు వంద సంవత్సరాల వయస్సులో, జలప్రళయం తరువాత రెండు సంవత్సరాలకు అర్పక్షదు పుట్టాడు.
\v 11 షేముకు అర్పక్షదు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు అయిదు వందల సంవత్సరాలు బ్రతికాడు.
\p
\s5
\v 12 అర్పక్షదుకు ముప్ఫై అయిదు సంవత్సరాల వయస్సులో షేలహు పుట్టాడు.
\v 13 అర్పక్షదుకు షేలహు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు నాలుగు వందల మూడు సంవత్సరాలు బతికాడు.
\p
\s5
\v 14 షేలహుకు ముప్ఫై సంవత్సరాల వయస్సులో ఏబెరు పుట్టాడు.
\v 15 షేలహుకు ఏబెరు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు నాలుగు వందల మూడు సంవత్సరాలు బతికాడు.
\p
\s5
\v 16 ఏబెరుకు ముప్ఫై నాలుగు సంవత్సరాల వయస్సులో పెలెగు పుట్టాడు.
\v 17 ఏబెరుకు పెలెగు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు నాలుగు వందల ముప్ఫైసంవత్సరాలు బతికాడు.
\p
\s5
\v 18 పెలెగుకు ముప్ఫై సంవత్సరాల వయస్సులో రయూ పుట్టాడు.
\v 19 పెలెగుకు రయూ పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు రెండువందల తొమ్మిది సంవత్సరాలు బతికాడు.
\p
\s5
\v 20 రయూకు ముప్ఫై రెండు సంవత్సరాల వయస్సులో సెరూగు పుట్టాడు.
\v 21 రయూకు సెరూగు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు రెండు వందల ఏడు సంవత్సరాలు బతికాడు.
\p
\s5
\v 22 సెరూగుకు ముప్ఫై సంవత్సరాల వయస్సులో నాహోరు పుట్టాడు.
\v 23 సెరూగుకు నాహోరు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు, అతడు రెండువందల సంవత్సరాలు బతికాడు.
\p
\s5
\v 24 నాహోరుకు ఇరవై తొమ్మిది సంవత్సరాల వయస్సులో తెరహు పుట్టాడు.
\v 25 నాహోరుకు తెరహు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు నూట పంతొమ్మిది సంవత్సరాలు బతికాడు.
\p
\v 26 తెరహుకు డెబ్భై సంవత్సరాల వయస్సులో అబ్రాము, నాహోరు, హారానులు పుట్టారు.
\p
\s5
\v 27 తెరహు వంశావళి ఇది: తెరహుకు అబ్రాము, నాహోరు, హారానులు పుట్టారు. హారానుకు లోతు పుట్టాడు.
\v 28 హారాను, తాను పుట్టిన ప్రదేశంలో ఊరు అనే కల్దీయుల పట్టణంలో తన తండ్రి తెరహు కంటె ముందే చనిపోయాడు.
\p
\s5
\v 29 అబ్రాము, నాహోరు పెళ్ళిళ్ళు చేసుకొన్నారు. అబ్రాము భార్య శారయి. నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కా, ఇస్కాలకు తండ్రి అయిన హారాను కూతురు.
\v 30 శారయి గొడ్రాలు. ఆమెకు పిల్లలు లేరు.
\p
\s5
\v 31 తెరహు తన కొడుకు అబ్రామును, తన మనుమడు, హారాను కొడుకు లోతును, తన కోడలు శారయిని తీసికొని కనానుకు బయలుదేరాడు. ఊరు అనే కల్దీయుల పట్టణంలోనుంచి వాళ్ళతోపాటు బయలుదేరి హారాను వరకు వచ్చి అక్కడ నివాసం ఉన్నాడు.
\v 32 తెరహు రెండు వందల అయిదు సంవత్సరాలు బతికి, హారానులో చనిపోయాడు.
\s5
\c 12
\p
\v 1 యెహోవా అబ్రాముతో ఇలా చెప్పాడు, <<నీ దేశం నుంచి, నీ బంధువుల దగ్గర నుంచి, నీ తండ్రి ఇంటి నుంచి బయలుదేరి, నేను నీకు చూపించే ప్రదేశానికి వెళ్ళు.
\v 2 నిన్ను ఒక గొప్ప జాతిగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నీ పేరును గొప్పచేస్తాను. నువ్వు దీవెనగా ఉంటావు.
\v 3 నిన్ను ఆశీర్వదించే వాళ్ళను నేను ఆశీర్వదిస్తాను. నిన్ను దూషించేవాళ్ళను శపిస్తాను. భూమి మీద ఉన్న వంశాలన్నిటికీ నీ ద్వారా ఆశీర్వాదం కలుగుతుంది.>>
\p
\s5
\v 4 యెహోవా అతనికి చెప్పినట్టు అబ్రాము చేశాడు. అతనితోపాటు లోతు కూడా బయలుదేరాడు. హారాను నుంచి బయలుదేరినప్పుడు అబ్రాము వయసు డెబ్భై ఐదు సంవత్సరాలు.
\v 5 అబ్రాము తన భార్య శారయిని, తన సోదరుడి కొడుకు లోతును, హారానులో తాను, తనవాళ్ళు, సేకరించిన ఆస్థి అంతటినీ, వాళ్ళ సంపాదన మొత్తాన్నీ తీసుకొని కనాను అనే ప్రదేశానికి వచ్చాడు.
\p
\s5
\v 6 అబ్రాము ఆ ప్రదేశంలో షెకెములో ఉన్న ఒక ప్రాంతానికి వచ్చి మోరే ప్రాంతంలో సింధూర వృక్షం దగ్గరకు చేరుకున్నాడు. అప్పటికి ఆ ప్రదేశంలో కనానీయులు నివాసం ఉన్నారు.
\v 7 యెహోవా అబ్రాముతో, <<నీ వారసులకు ఈ దేశాన్ని ఇస్తాను>> అని చెప్పాడు. అక్కడ అతడు యెహోవాకు హోమ బలి అర్పించాడు.
\p
\s5
\v 8 అతడు అక్కడనుంచి బయలుదేరి బేతేలుకు తూర్పువైపు ఉన్న కొండ దగ్గరకు వచ్చాడు. పడమర వైపు ఉన్న బేతేలుకు, తూర్పున ఉన్న హాయికి మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు హోమబలి అర్పించి, యెహోవా పేరట ప్రార్థన చేశాడు.
\v 9 అబ్రాము ఇంకా ప్రయాణం చేస్తూ దక్షిణం వైపు వెళ్ళాడు.
\p
\s5
\v 10 అప్పుడు ఆ ప్రదేశంలో కరువు వచ్చింది. కరువు తీవ్రంగా ఉన్న కారణంగా అబ్రాము ఐగుప్తులో నివసించడానికి వెళ్ళాడు.
\v 11 అతడు ఐగుప్తులో ప్రవేశించడానికి ముందు తన భార్య శారయితో, <<చూడు, నువ్వు చాలా అందగత్తెవని నాకు తెలుసు,
\v 12 ఐగుప్తీయులు నిన్ను చూసి, <ఈమె అతని భార్య> అని నీ మూలంగా నన్ను చంపుతారు. కాని నిన్ను బ్రతకనిస్తారు.
\v 13 నీ వల్ల నాకు మేలు కలిగేలా, నీ కారణంగా నేను చావకుండేలా నువ్వు నా సోదరివి అని దయచేసి చెప్పు>> అన్నాడు.
\p
\s5
\v 14 అబ్రాము ఐగుప్తులో ప్రవేశించినప్పుడు ఐగుప్తీయులు శారయి చాలా అందంగా ఉండడం గమనించారు.
\v 15 ఫరో అధిపతులు ఆమెను చూసి ఫరో వద్ద ఆమె అందాన్ని పొగిడారు. ఆమెను ఫరో ఇంటికి తీసుకెళ్ళారు.
\v 16 ఆమె మూలంగా అతను అబ్రాము ను చాలా బాగా చూసుకున్నాడు. అతనికి గొర్రెలు, ఎడ్లు, మగ గాడిదలు, సేవకులు, పనికత్తెలు, ఆడగాడిదలు, ఒంటెలు ఇచ్చాడు.
\p
\s5
\v 17 అప్పుడు యెహోవా అబ్రాము భార్య శారయిని బట్టి ఫరోను, అతని ఇంటివాళ్ళను తీవ్రమైన రోగాలతో బాధపరిచాడు.
\v 18 అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి, <<నువ్వు నాకు చేసిందేమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు చెప్పలేదు?
\v 19 ఈమె నా సోదరి అని ఎందుకు చెప్పావు? ఒకవేళ నేను ఆమెను నా భార్యగా చేసుకొని ఉంటే ఏమి జరిగేది? ఇదిగో నీ భార్య. ఈమెను తీసుకువెళ్ళు>> అని చెప్పాడు.
\v 20 తరువాత ఫరో అతని గూర్చి ప్రజలకు ఆజ్ఞాపించాడు. వాళ్ళు అబ్రామును అతని భార్యతో అతని ఆస్తిపాస్తులన్నిటితో సహా పంపివేశారు.
\s5
\c 13
\p
\v 1 అబ్రాము తనకు కలిగిన వాటినన్నిటినీ, తన భార్యనూ, తనతో ఉన్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తు నుంచి నెగెబుకు వెళ్ళాడు.
\v 2 అబ్రాము చాలా ధనవంతుడు. అతనికి వెండి, బంగారం, పశువులు ఉన్నాయి.
\p
\s5
\v 3 అతడు ప్రయాణం చేసి దక్షిణం నుంచి బేతేలు వరకు అంటే బేతేలుకు, హాయికి మధ్య మొదట తన గుడారం ఉన్న స్థలానికి వెళ్ళాడు.
\v 4 అతడు మొదట బలిపీఠం కట్టిన చోటుకు వచ్చాడు. అక్కడ అబ్రాము యెహోవా పేరట ప్రార్థన చేశాడు.
\p
\s5
\v 5 అబ్రాముతోపాటు కలసి వెళ్ళిన లోతుకు కూడా గొర్రెలు, పశువులు, గుడారాలు ఉన్నాయి.
\v 6 వాళ్ళు కలిసి నివాసం చెయ్యడానికి ఆ ప్రదేశం చాల లేదు. ఎందుకంటే వాళ్ళు కలిసి ఉండలేనంత విస్తారమైన సంపద వారికి ఉంది.
\v 7 ఆ సమయంలో అబ్రాము పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు వివాదం ఏర్పడింది. ఆ కాలంలో కనానీయులు, పెరిజ్జీయులు ఆ ప్రదేశంలో కాపురం ఉన్నారు.
\p
\s5
\v 8 కాబట్టి అబ్రాము, <<మనం బంధువులం కాబట్టి నాకూ నీకూ నా పశువుల కాపరులకూ నీ పశువుల కాపరులకూ ఘర్షణ ఉండకూడదు.
\v 9 ఈ ప్రదేశం అంతా నీ ముందు కనిపిస్తూ ఉంది కదా. దయచేసి నన్ను విడిచిపెట్టి వేరుగా ఉండు. నువ్వు ఎడమవైపు వెళ్తే నేను కుడివైపుకు, నువ్వు కుడివైపుకు వెళ్తే నేను ఎడమవైపుకు వెళ్తాను>> అని లోతుకు చెప్పాడు.
\p
\s5
\v 10 లోతు యొర్దాను మైదాన ప్రాంతం అంతా గమనించి చూశాడు. యెహోవా సొదొమ గొమొర్రా అనే పట్టణాలు నాశనం చెయ్యకముందు సోయరుకు వచ్చేవరకు ఆ ప్రాంతం అంతా యెహోవా తోట వలే ఐగుప్తు దేశంలో నీళ్ళు పారే ప్రాంతంలాగా ఉంది.
\v 11 కాబట్టి లోతు యొర్దాను ప్రాంతాన్ని తన కోసం ఎంపిక చేసుకొని, తూర్పు వైపు ప్రయాణం చేశాడు. ఆ విధంగా వాళ్ళు ఒకరినుంచి ఒకరు వేరైపోయారు.
\p
\s5
\v 12 అబ్రాము కనానులో నివాసం ఉన్నాడు. లోతు ఆ మైదానంలో ఉన్న పట్టణాలలో కాపురం ఉండి, సొదొమ దగ్గర తన గుడారం వేసుకున్నాడు.
\v 13 సొదొమ మనుషులు యెహోవా దృష్టిలో ఘోర పాపులుగా ఉన్నారు.
\p
\s5
\v 14 లోతు అబ్రామును విడిచి వెళ్ళిన తరువాత యెహోవా, <<నువ్వు ఉన్నచోటనుంచి నాలుగు దిక్కులకూ చూడు.
\v 15 నువ్వు చూస్తున్న ఈ ప్రదేశం అంతా నీకు, నీ వారసులకు శాశ్వతంగా ఇస్తాను.
\s5
\v 16 నీ వారసుల్ని భూమి మీద ఉండే ఇసుక రేణువుల్లాగా విస్తరింపజేస్తాను. ఇది ఎలాగంటే, ఎవడైనా భూమి మీద ఉండే ఇసుక రేణువులను లెక్కించగలిగితే, నీ వారసుల్నికూడా లెక్కపెట్టవచ్చు.
\v 17 నువ్వు లేచి ఈ ప్రదేశంలో ఆ చివరినుండి ఈ చివరివరకు సంచరించు. అదంతా నీకు ఇస్తాను>>అని అబ్రాముతో చెప్పాడు.
\v 18 అప్పుడు అబ్రాము తన గుడారం తీసి, హెబ్రోనులో ఉన్న మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షాల దగ్గర వేసుకుని అక్కడ నివసించాడు. అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టాడు.
\s5
\c 14
\p
\v 1 షీనారు రాజు అమ్రాపేలు, ఎల్లాసరు రాజు అర్యోకు, ఏలాము రాజు కదొర్లాయోమెరు, గోయీయుల రాజు తిదాలు అనేవారు పాలిస్తున్న రోజుల్లో
\v 2 ఆ రాజులు సొదొమ రాజు బెరాతో, గొమొర్రా రాజు బిర్షాతో, అద్మా రాజు షినాబుతో, సెబోయీయుల రాజు షెమేబెరుతో, బెల (దీన్ని సోయరు అని కూడా పిలుస్తారు) రాజుతో యుద్ధం చేశారు.
\p
\s5
\v 3 వీళ్ళందరూ కలిసి సిద్దీము (ఉప్పు సముద్రం) లోయలో ఏకంగా సమకూడారు.
\v 4 ఈ రాజులు పన్నెండు సంవత్సరాలు కదొర్లాయోమెరుకు లొంగి ఉన్నారు. పదమూడో సంవత్సరంలో తిరుగుబాటు చేశారు.
\v 5 పద్నాలుగో సంవత్సరంలో కదొర్లాయోమెరు, అతనితోపాటు ఉన్న రాజులు వచ్చి అష్తారోత్‌ కర్నాయిములో రెఫాయీయులపై, హాములో జూజీయులపై, షావే కిర్యతాయిము మైదానంలో ఏమీయులపై,
\v 6 శేయీరు పర్వత ప్రదేశంలో అరణ్యం వైపుగా ఉన్న ఏల్ పారాను వరకు ఉన్న హోరీయులపై దాడి చేశారు.
\p
\s5
\v 7 తరువాత మళ్ళీ ఏన్మిష్పతుకు (దీన్ని కాదేషు అనికూడా పిలుస్తారు) వచ్చి అమాలేకీయుల దేశమంతటినీ హససోను తామారులో కాపురం ఉన్న అమోరీయులను కూడా ఓడించారు.
\p
\v 8 అప్పుడు సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయీము, బెల (సోయరు) రాజులు బయలుదేరి సిద్దీము లోయలో
\v 9 ఏలాము రాజు కదొర్లాయోమెరు, గోయీయుల రాజు తిదాలు, షీనారు రాజు అమ్రాపేలు, ఎల్లాసరు రాజు అర్యోకు అనే నలుగురితో ఈ ఐదుగురు రాజులు యుద్ధం చేశారు.
\p
\s5
\v 10 ఆ సిద్దీము లోయలో తారు బంక గుంటలు ఎక్కువగా ఉన్నాయి. సొదొమ గొమొర్రాల రాజులు పారిపోయి వాటిలో పడ్డారు. మిగిలిన వాళ్ళు కొండలకు పారిపోయారు.
\v 11 అప్పుడు వాళ్ళు సొదొమ గొమొర్రాల ఆస్తి అంతటినీ వాళ్ళ భోజన పదార్ధాలన్నిటినీ దోచుకున్నారు.
\v 12 ఇంకా అబ్రాము సోదరుడి కొడుకు లోతు సొదొమలో కాపురం ఉన్నాడు గనుక అతణ్ణి, అతని ఆస్తిని కూడా దోచుకొని తీసుకుపోయారు.
\p
\s5
\v 13 ఒకడు తప్పించుకొని వచ్చి హెబ్రీయుడైన అబ్రాముకు ఆ సంగతి తెలియజేశాడు. ఆ సమయంలో అతడు ఎష్కోలు, ఆనేరుల సోదరుడు మమ్రే అనే అమోరీయునికి చెందిన సింధూర వృక్షాల దగ్గర కాపురం ఉన్నాడు. వీళ్ళు అబ్రాముతో పరస్పర సహాయం కోసం ఒప్పందం చేసుకున్నవాళ్ళు.
\v 14 తన బంధువు శత్రువుల స్వాధీనంలో ఉన్నాడని అబ్రాము విని, తన ఇంటిలో పుట్టి, సుశిక్షితులైన మూడువందల పద్దెనిమిది మందిని వెంటబెట్టుకొని వెళ్లి దాను వరకు ఆ రాజులను తరిమాడు.
\p
\s5
\v 15 రాత్రి సమయంలో అతడు తన సేవకులను గుంపులుగా చేశాక వాళ్ళంతా అ రాజులపై దాడి చేసి, దమస్కుకు ఎడమవైపు ఉన్న హోబా వరకు తరిమాడు.
\v 16 అతడు ఆస్తి మొత్తాన్ని, అతని బంధువు లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను వెనక్కి తీసుకు వచ్చాడు.
\p
\s5
\v 17 అతను కదొర్లాయోమెరును, అతనితో ఉన్న రాజులను ఓడించి తిరిగి వస్తున్నప్పుడు, సొదొమ రాజు అతన్ని ఎదుర్కోడానికి రాజు లోయ అనే షావే లోయ వరకు బయలుదేరి వచ్చాడు.
\v 18 అంతేగాక షాలేము రాజు మెల్కీసెదెకు రొట్టె, ద్రాక్షారసం తీసుకువచ్చాడు. అతడు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు.
\p
\s5
\v 19 అతను అబ్రామును ఆశీర్వదించి, <<ఆకాశానికి భూమికి సృష్టికర్త, సర్వోన్నతుడు అయిన దేవుని వలన అబ్రాముకు ఆశీర్వాదం కలుగుతుంది గాక.
\v 20 నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడైన దేవునికి స్తుతి కలుగుతుంది గాక>> అని చెప్పాడు. అప్పుడు అబ్రాము అతనికి తనకున్న దానిలో పదవ వంతు ఇచ్చాడు.
\p
\s5
\v 21 సొదొమ రాజు <<మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నువ్వే తీసుకో>> అని అబ్రాముతో అన్నాడు.
\v 22 అబ్రాము<<నేనే అబ్రామును ధనవంతుణ్ణి చేశాను, అని నువ్వు చెప్పకుండా ఉండేలా, ఒక్క నూలు పోగైనా, చెప్పుల పట్టీ అయినా నీ వాటిలోనుండి తీసుకోను.
\v 23 ఆకాశానికి భూమికి సృష్టికర్త, సర్వోన్నతుడైన దేవుడైన యెహోవా దగ్గర నా చెయ్యి ఎత్తి ఒట్టు పెట్టుకున్నాను.
\v 24 ఈ యువకులు తిన్నది గాక, నాతోపాటు వచ్చిన ఆనేరు, ఎష్కోలు, మమ్రే అనే వాళ్లకు ఏ వాటా రావాలో ఆ వాటాలు మాత్రం వాళ్ళను తీసుకోనివ్వు>> అని సొదొమ రాజుతో చెప్పాడు.
\s5
\c 15
\p
\v 1 ఈ సంగతులు జరిగిన తరువాత యెహోవా దూత అబ్రాముకు దర్శనమిచ్చాడు. << అబ్రామూ, భయపడకు! నేనే నీకు డాలును, గొప్ప బహుమానాన్ని>>అన్నాడు.
\v 2 అబ్రాము, <<ప్రభువా యెహోవా, నాకేం ఇస్తావు? నేను సంతానం లేనివాడిగా ఉండిపోతున్నాను కదా. దమస్కు వాడైన ఎలీయెజెరే నా ఆస్తికి వారసుడు అవుతాడు కదా!
\v 3 నువ్వు నాకు సంతానం ఇవ్వలేదు గనుక, చూడు, నా సేవకుల్లో ఒకడు నాకు వారసుడు అవుతాడు>> అన్నాడు.
\p
\s5
\v 4 యెహోవా వాక్కు అతని దగ్గరకు వచ్చి <<ఇతడు నీ వారసుడు కాడు. నీ ద్వారా నీకు పుట్టబోయేవాడే నీ వారసుడు అవుతాడు>> అన్నాడు.
\v 5 ఆయన అతణ్ణి బయటకు తీసుకువచ్చి <<నువ్వు ఆకాశం వైపు చూసి, ఆ నక్షత్రాలు లెక్కపెట్టడం నీకు చేతనైతే లెక్కపెట్టు>> అని చెప్పి, <<నీ సంతానం కూడా అలా అవుతుంది >> అని చెప్పాడు.
\p
\s5
\v 6 అతడు యెహోవాను నమ్మాడు. ఆ నమ్మకాన్నే ఆయన అతనికి నీతిగా పరిగణించాడు.
\v 7 యెహోవా << నీకు ఈ ప్రదేశాన్ని వారసత్వంగా ఇవ్వడానికి కల్దీయుల ఊర్ అనే పట్టణంలో నుంచి నిన్ను ఇవతలకు తీసుకువచ్చిన యెహోవాను నేనే>> అని చెప్పినప్పుడు
\v 8 అతడు <<ప్రభువా యెహోవా, ఇది నాకు సొంతం అవుతుందని నాకు ఎలా తెలుస్తుంది?>> అన్నాడు.
\p
\s5
\v 9 ఆయన <<మూడేళ్ళ వయసు ఉన్న ఒక దూడ, ఒక మేక, ఒక పొట్టేలు, ఒక తెల్ల గువ్వ, ఒక పావురం పిల్లను నా దగ్గరకు తీసుకురా>> అని అతనితో చెప్పాడు.
\v 10 అతడు వాటిని తీసుకొని వాటిని సగానికి రెండు ముక్కలుగా నరికి, రెండు సగాలను ఎదురెదురుగా పెట్టాడు. పక్షుల్ని మాత్రం ఖండించలేదు.
\v 11 ఆ మృతదేహాల మీద గద్దలు వాలగా అబ్రాము వాటిని తోలివేశాడు.
\p
\s5
\v 12 చీకటి పడుతున్నప్పుడు అబ్రాముకు గాఢ నిద్ర పట్టింది. భయం కలిగించే చిమ్మచీకటి అతణ్ణి ఆవరించింది.
\v 13 ఆయన, <<దీనిని ఖచ్చితంగా తెలుసుకో. నీ వారసులు తమది కాని దేశంలో పరదేశులుగా నివాసం ఉంటారు. ఆ దేశవాసులకు బానిసలుగా నాలుగు వందల సంవత్సరాలు అణచివేతకు గురి అవుతారు.
\p
\s5
\v 14 వీళ్ళు దాసులుగా ఉన్న ఆ దేశానికి నేను తీర్పు తీరుస్తాను. ఆ తరువాత వాళ్ళు అపారమైన సంపదతో బయటకు వస్తారు.
\v 15 కాని, నువ్వు నీ తండ్రుల వద్దకు ప్రశాంతంగా చేరుకుంటావు. పండు ముసలితనంలో మరణించి పాతిపెట్టబడతావు.
\v 16 అమోరీయుల అక్రమం ఇంకా హద్డు మీరలేదు గనుక, నీ నాలుగవ తరం ప్రజలు ఇక్కడకు తిరిగి వస్తారని కచ్చితంగా తెలుసుకో>> అని అబ్రాముతో చెప్పాడు.
\p
\s5
\v 17 సూర్యుడు అస్తమించి చీకటి పడినప్పుడు, పొగ లేస్తున్న కొలిమి, మండుతున్న కాగడా దిగివచ్చి పేర్చిన మాంస ఖండాల మధ్యగా దాటుకుంటూ వెళ్ళాయి.
\v 18 ఆ రోజున యెహోవా, <<ఐగుప్తు నది నుంచి, పేరుగాంచిన యూఫ్రటీసు నది వరకు ఉన్న ఈ ప్రదేశాన్ని నీ వారసులకు ఇస్తాను.
\v 19 కేనీయులను, కనిజ్జీయులను, కద్మోనీయులను,
\v 20 హిత్తీయులను, పెరిజ్జీయులను, రెఫాయీయులను,
\v 21 అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను నీ వారసులకు దాసులుగా చేస్తాను>> అని అబ్రాముతో నిబంధన చేశాడు.
\s5
\c 16
\p
\v 1 అబ్రాముకు భార్య శారయి వల్ల పిల్లలు పుట్టలేదు. ఆమె దగ్గర ఈజిప్ట్ దేశానికి చెందిన ఒక దాసి ఉంది. ఆమె పేరు హాగరు.
\v 2 శారయి అబ్రాముతో <<ఇదుగో, యెహోవా నాకు పిల్లలు లేకుండా చేశాడు. నువ్వు నా దాసి దగ్గరికి వెళ్ళు. ఒకవేళ ఆమె ద్వారా నాకు పిల్లలు పుట్టవచ్చేమో>> అంది. అబ్రాము శారయి మాట విన్నాడు.
\p
\v 3 అబ్రాము అప్పటికి కనాను దేశంలో పదేళ్లనుండి నివాసముంటున్నాడు. అబ్రాము భార్య శారయి ఈజిప్టుకు చెందిన తన దాసి హాగరును తన భర్తకు భార్యగా ఉండటానికి ఇచ్చింది.
\v 4 అతడు హాగరుతో సంబంధం పెట్టుకున్నాడు. దాంతో ఆమె గర్భం ధరించింది. తాను గర్భం ధరించానని తెలుసుకున్న హాగరు తన యజమానురాలిని చులకనగా చూడటం ప్రారంభించింది.
\p
\s5
\v 5 అప్పుడు శారయి అబ్రాముతో <<నా ఉసురు నీకు తగులుతుంది. ఇదంతా నీ వల్లే జరిగింది. నా దాసిని నేనే నీ చేతుల్లో పెట్టాను. ఆమె గర్భవతి అయింది. అది తెలిసిన దగ్గరనుండీ అది కన్నూమిన్నూ గానక నన్ను చులకనగా చూడటం మొదలు పెట్టింది. నీకూ నాకూ మధ్యన యెహోవా న్యాయం తీరుస్తాడు>> అంది.
\v 6 అందుకు అబ్రాము <<ఇలా చూడు, నీ దాసి నీ చెప్పుచేతల్లోనే ఉంది గదా. ఆమె విషయంలో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో >> అన్నాడు. శారయి తన దాసిని రాచి రంపాన పెట్టింది. దాంతో ఆమె శారయి దగ్గర నుండి పారిపోయింది.
\p
\s5
\v 7 షూరుకు వెళ్ళే దారిలో అడవిలో నీటి ఊట దగ్గర యెహోవా దూత ఆమెను చూశాడు.
\v 8 ఆమెతో <<శారయి దాసివైన హాగరూ, ఎక్కడనుండి వస్తున్నావ్? ఎక్కడికి వెళ్తున్నావ్?>> అని అడిగాడు. అందుకామె, <<నా యజమానురాలైన శారయి దగ్గరనుండి పారిపోతున్నాను>> అంది.
\s5
\v 9 అప్పుడు యెహోవా దూత <<నువ్వు మళ్ళీ నీ యజమానురాలి దగ్గరకు తిరిగి వెళ్ళు. ఆమెకు పూర్తిగా అణిగి మణిగి ఉండు>> అన్నాడు.
\v 10 యెహోవా దూత ఇంకా ఇలా చెప్పాడు, <<నీ సంతానానికి తప్పకుండా ఆధిక్యత కలిగిస్తాను. అది లెక్క పెట్టడానికి వీలు లేనంతగా అయ్యేలా చేస్తాను>> అని ఆమెకు చెప్పాడు.
\m
\s5
\v 11 తర్వాత యెహోవా దూత <<ఇలా చూడు, యెహోవా నీ మొర విన్నాడు. ఇప్పుడు నువ్వు గర్భవతిగా ఉన్నావు. నీకు కొడుకు పుడతాడు. అతనికి ఇష్మాయేలు అనే పేరు పెడతావు.
\v 12 అతడు అడవి గాడిదలా స్వేచ్ఛాజీవిగా ఉంటాడు. అతడు ప్రతి ఒక్కరికీ విరోధంగా ఉంటాడు. అందరూ అతనికి విరోధంగా ఉంటారు. అతడు తన సోదరులకు వేరుగా నివసిస్తాడు>> అని ఆమెకు చెప్పాడు.
\m
\s5
\v 13 అప్పుడు ఆమె <<నన్ను చూసినవాడు నాకు నిజంగా కనిపించాడు కదా!>> అంది. అందుకనే తనతో మాట్లాడిన యెహోవాకు <<నన్ను చూస్తున్న దేవుడివి నువ్వే>>అనే పేరు పెట్టింది.
\v 14 దీనిని బట్టి ఆ నీటి ఊటకి <<బెయేర్‌ లహాయి రోయి >>అనే పేరు వచ్చించి. అది కాదేషుకీ బెరెదుకీ మధ్యలో ఉంది.
\p
\s5
\v 15 తరువాత హాగరు అబ్రాము కొడుక్కి జన్మనిచ్చింది. హాగరు ద్వారా పుట్టిన తన కుమారుడికి అబ్రాము ఇష్మాయేలు అనే పేరు పెట్టాడు.
\v 16 అబ్రాము కొడుకు ఇష్మాయేలుకు హాగరు జన్మనిచ్చినప్పుడు అబ్రాము వయస్సు ఎనభై ఆరేళ్ళు.
\s5
\c 17
\p
\v 1 అబ్రాముకు తొంభై తొమ్మిది ఏళ్ల వయసులో యెహోవా అతనికి ప్రత్యక్షమై, << నేను సర్వశక్తి గల దేవుణ్ణి. నా సముఖంలో మెలగుతూ నిందారహితుడిగా ఉండు.
\v 2 అప్పుడు నాకూ నీకూ మధ్య ఉన్న నిబంధనను నేను స్థిరం చేస్తాను. నీ సంతానాన్ని అత్యధికంగా విస్తరింపజేస్తాను >> అని చెప్పాడు.
\m
\s5
\v 3 అబ్రాము సాష్టాంగపడి తన ముఖాన్ని నేలకు వంచుకుని ఉన్నాడు. దేవుడు ఇంకా ఇలా అన్నాడు, << చూడు, నేను నీతో నిబంధన చేశాను.
\v 4 నువ్వు అనేక జాతులకు మూల పురుషుడివి అవుతావు.
\v 5 ఇకపైన నీ పేరు అబ్రాము కాదు. నిన్ను అనేక జాతులకు తండ్రిగా నియమిస్తున్నాను కనుక ఇకనుండి నీ పేరు అబ్రాహాము అవుతుంది.
\v 6 నిన్ను అత్యధికంగా ఫలింపజేస్తాను. నీ సంతానం అనేక జాతులుఅయ్యేలా చేస్తాను. నీ సంతానంలో రాజులు జన్మిస్తారు.
\s5
\v 7 నేను నీకూ నీ తర్వాత నీ సంతానానికీ దేవుడిగా ఉండే విధంగా నాకూ నీకూ మధ్యన, నీ తర్వాత నాకూ నీ సంతానానికీ మధ్యన నా నిబంధనను స్థిరం చేస్తాను. అది శాశ్వతమైన నిబంధనగా ఉంటుంది.
\v 8 నీకూ నీ తర్వాత నీ సంతానానికీ ప్రస్తుతం నువ్వు పరదేశిగా ఉన్న భూమిని, అంటే కనాను దేశాన్నంతా ఇస్తాను. దానిని శాశ్వత సంపదగా ఇచ్చి వారికి దేవుడిగా ఉంటాను.>>
\m
\s5
\v 9 దేవుడు మళ్ళీ అబ్రాహాముతో ఇలా చెప్పాడు, <<నీ వరకు నువ్వు నా నిబంధన పాటించాలి. నువ్వు మాత్రమే గాక, నీ తర్వాత నీ సంతానం తమ తరతరాలలో నా నిబంధన పాటించాలి.
\v 10 నాకూ నీకూ మధ్యన, నీ తర్వాత నీ సంతానానికీ మధ్య ఉన్న నిబంధన ఇదే. మీలో ప్రతి మగవాడూ సున్నతి పాటించాలి.
\v 11 అంటే మీరు మీ మర్మాంగం పైచర్మపు కొన కత్తిరించాలి. అది నాకూ నీకూ మధ్య ఉన్న నిబంధనకు సూచనగా ఉంటుంది.
\m
\s5
\v 12 నీ ప్రజల తరాలన్నిటిలో ప్రతీ మగవాడికీ ఎనిమిది రోజున సున్నతి జరగాలి. ఇది నీ ఇంట్లో పుట్టిన వాడికీ, నీ సంతానం కాకుండా మీరు వెల ఇచ్చి ఏ విదేశీయుడి దగ్గరైనా కొనుక్కున్న వాడికీ వర్తిస్తుంది.
\v 13 నీ ఇంట్లో పుట్టిన వారికీ, మీరు వెల పెట్టి కొనుక్కున్న వారికీ తప్పకుండా సున్నతి జరగాలి. ఆ విధంగా నా నిబంధన మీ శరీరంలో శాశ్వత నిబంధన గా ఉంటుంది.
\v 14 సున్నతి పొందని మగవాడు, అంటే ఎవరి మర్మాంగం పై చర్మం సున్నతి కాలేదో అలాంటివాడిని అతని జాతిలోనుండి బహిష్కరించాలి. అతడు నా నిబంధనను భంగం చేశాడు.>>
\m
\s5
\v 15 దేవుడు అబ్రాహాముతో ఇంకా ఇలా అన్నాడు, <<నీ భార్య అయిన శారయిని ఇకనుండి శారయి అని పిలువవద్దు. ఇకనుండి ఆమె పేరు శారా
\v 16 నేను ఆమెను ఆశీర్వదించి, ఆమె ద్వారా నీకు కొడుకుని ఇస్తాను. ఆమె అనేక జాతులకు తల్లి అవుతుంది. ఆమె నుండి అనేక జాతుల రాజులు వస్తారు.>>
\m
\s5
\v 17 అప్పుడు అబ్రాహాము తన ముఖాన్ని నేలకు వంచి తన హృదయంలో నవ్వుకుని <<ఒక మనిషికి నూరేళ్ళ వయస్సులో పిల్లలు పుడతారా? తొంభై ఏళ్ల శారా పిల్ల వాణ్ని కంటుందా?>> అని మనస్సులో అనుకొన్నాడు.
\v 18 అబ్రాహాము <<నీవు ఇష్మాయేలును చల్లగా చూస్తే నాకదే పదివేలు>> అని దేవునితో అన్నాడు.
\m
\s5
\v 19 అప్పుడు దేవుడు ఇలా అన్నాడు, <<అలా కాదు. నీ భార్య అయిన శారా కచ్చితంగా నీకు కొడుకుని కంటుంది. అతనికి నువ్వు ఇస్సాకు అనే పేరు పెడతావు. అతనితో నా నిబంధనను స్థిరం చేస్తాను. అతని తర్వాత అతని వారసులందరికీ అది శాశ్వతమైన నిబంధనగా ఉంటుంది.
\v 20 ఇష్మాయేలును గూర్చి నువ్వు చేసిన ప్రార్థన నేను విన్నాను. చూడు, నేను అతణ్ణి ఆశీర్వదిస్తాను. అతని సంతానాన్ని అత్యధికం చేస్తాను. అతడు అత్యధికంగా విస్తరిచేలా చేస్తాను. అతడు పన్నెండు జాతుల రాజులకు మూలపురుషుడు అవుతాడు. అతణ్ణి ఒక గొప్ప జాతిగా చేస్తాను.
\v 21 కాని వచ్చే సంవత్సరం ఈ సమయానికి శారా ద్వారా నీకు పుట్టబోయే ఇస్సాకుతో నా నిబంధననను స్థిరపరుస్తాను.>>
\m
\s5
\v 22 అబ్రాహాముతో మాట్లాడటం ముగిసిన తర్వాత దేవుడు అతని దగ్గరనుండి పైకి వెళ్ళిపోయాడు.
\v 23 అప్పుడు అబ్రాహాము అదే రోజు తన కుమారుడైన ఇష్మాయేలునూ, తన ఇంట్లో పుట్టిన వారినందర్నీ, అలాగే తాను వెల ఇచ్చి కొన్న వారందరినీ తన ఇంట్లోని ప్రతీ మగవాణ్ణీ తీసుకుని వారందరికీ వారి మర్మాంగం పైచర్మాన్ని సున్నతి చేశాడు.
\m
\s5
\v 24 అబ్రాహాము మర్మాంగం పైచర్మానికి సున్నతి జరిగినప్పుడు అతని వయస్సు తొంభై తొమ్మిది ఏళ్ళు.
\v 25 అతని కుమారుడైన ఇష్మాయేలుకు సున్నతి జరిగినప్పుడు అతనికి పదమూడేళ్ళు.
\v 26 అబ్రాహామూ అతని కుమారుడు ఇష్మాయేలూ ఒక్కరోజే సున్నతి పొందారు.
\v 27 అతని ఇంట్లో పుట్టినవారూ, విదేశీయుల దగ్గర వెల ఇచ్చి కొన్నవారూ, ఇంకా అతని ఇంట్లో మగవాళ్ళంతా సున్నతి పొందారు.
\s5
\c 18
\p
\v 1 మమ్రే అనే ప్రాంతంలో సింధూర చెట్ల దగ్గర ఒక మధ్యాహ్నం వేళ అబ్రాహాము తన గుడారం వాకిట్లో కూర్చుని ఉన్నాడు. అప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడు.
\v 2 అతడు తలెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ముందు నిలబడి ఉన్నారు. అతడు వారిని చూసి తన గుడారం వదిలి వారిని కలుసుకోవడానికి పరుగెత్తుకుంటూ వెళ్ళాడు. వారి ఎదుట నేల వరకూ వంగి ఇలా అన్నాడు.
\m
\s5
\v 3 << ప్రభూ, నీ దాసుడనైన నాపై దయ చూపి నన్ను దాటి వెళ్ళకండి. నాతో రండి.
\v 4 నేను నీళ్ళు తెప్పిస్తాను. వాటితో మీ కాళ్ళు కడుక్కోండి. చెట్టు కింద విశ్రాంతి తీసుకోండి.
\v 5 మీ దాసుడినైన నా దగ్గరకు వచ్చారు కదా, కొంచెం ఆహారం తీసుకు వస్తాను. దాన్ని తిని సేద దీర్చుకోండి. ఆ తర్వాత మీ దారిన మీరు వెళ్ళవచ్చు.>> అందుకు వారు, << నువ్వు చెప్పినట్టే చెయ్యి>> అన్నారు.
\m
\s5
\v 6 అప్పుడు అబ్రాహాము వెంటనే గుడారంలో ఉన్న శారా దగ్గరకు వెళ్ళి <<నువ్వు త్వరగా మూడు మానికల మెత్తటి పిండి తెచ్చి కలిపి రొట్టెలు చెయ్యి>> అన్నాడు.
\v 7 తర్వాత అబ్రాహాము పశువుల మంద దగ్గరకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను పట్టుకు వచ్చి ఒక పనివాడికి ఇచ్చాడు. వాడు త్వర త్వరగా దాన్నివధించి వండి సిద్ధం చేశాడు.
\v 8 తరువాత అతడు పెరుగూ, పాలూ వాటితోపాటు తాను వండించి సిద్ధం చేయించిన దూడ మాంసాన్ని తెచ్చి వాళ్ళ ముందు పెట్టాడు. వాళ్ళు భోజనం చేస్తుంటే అక్కడే ఆ చెట్టు కిందే నిలబడ్డాడు.
\m
\s5
\v 9 వారు అతణ్ణి <<నీ భార్య ఎక్కడ? >> అని అడిగారు. అతడు <<అదిగో, గుడారంలో ఉంది>> అన్నాడు.
\v 10 అప్పుడు ఆయన <<తిరిగి వసంతకాలంలో నేను మళ్ళీ నీ దగ్గరకు తప్పకుండా వస్తాను. విను, అప్పటికి నీ భార్య శారాకు ఒక కొడుకు ఉంటాడు.>> అన్నాడు. శారా ఆయన వెనుక ఉన్న గుడారం ద్వారం దగ్గర ఉండి ఈ మాటలు వింటూ ఉంది.
\m
\s5
\v 11 అప్పటికి అబ్రాహాము శారాలు వయసు ఉడిగిపోయి ముసలివాళ్ళయ్యారు. శారాకు పిల్లల్ని కనే వయసు దాటిపోయింది.
\v 12 శారా <<నా బలమంతా పోయింది. ఈ సుఖం నాకెలా కలుగుతుంది? నా యజమాని అయిన నా భర్త కూడా ముసలివాడయ్యాడు కదా>> అనుకుని తనలో తాను నవ్వుకుంది.
\m
\s5
\v 13 అప్పుడు యెహోవా అబ్రాహాముతో <<శారా <ముసలిదాన్ని అయిన నేను నిజంగా బిడ్డను కనగలనా> అనుకుని ఎందుకు నవ్వింది?
\v 14 యెహోవాకు సాధ్యం కానిది ఏమైనా ఉందా? నేను నిర్ణయించిన కాలంలో మళ్ళీ నీ దగ్గరకు వస్తాను. వచ్చే సంవత్సరం ఇదే సమయానికి శారాకు ఒక కొడుకు ఉంటాడు>> అన్నాడు.
\v 15 అప్పుడు శారా భయపడి <<నేను నవ్వలేదండీ>> అంది. దానికి ఆయన <<అలా అనకు, నువ్వు నవ్వావు>> అని జవాబిచ్చాడు.
\m
\s5
\v 16 అప్పుడు ఆ మనుషులు అక్కడనుండి వెళ్ళడానికి లేచారు. లేచి సొదొమ పట్టణం వైపు చూసారు. వారిని సాగనంపడానికి అబ్రాహాము వారితో కలిసి వెళ్ళాడు.
\v 17 కానీ యెహోవా ఇలా అనుకున్నాడు. <<అబ్రాహాము కచ్చితంగా ఒక బలమైన గొప్ప జాతి అవుతాడు.
\v 18 అతని మూలంగా భూమిపై అన్ని జాతులూ ఆశీర్వాదం పొందుతాయి. నేను చేయబోతున్న పనులను అబ్రాహాముకు తెలియకుండా ఎలా దాచగలను?
\v 19 అతని తర్వాత అతని వారసులు నీతి న్యాయాలను జరిగించేలా వారికి యెహోవా మార్గాన్ని బోధించడానికీ తద్వారా అబ్రాహాముకు ఆయన చెప్పిన విషయాలన్నీజరిగించడానికీ నేను అబ్రాహామును ఎన్నుకున్నాను.>>
\m
\s5
\v 20 అప్పుడు యెహోవా ఇలా అన్నాడు, <<సొదొమ గొమొర్రాలను గూర్చిన విన్నపాలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. అలాగే వాటి పాపం కూడా చాలా ఘోరం. కనుక
\v 21 నేను దిగి వెళ్ళి నాకు చేరిన ఆ విన్నపం ప్రకారం వాళ్ళు అంత దుర్మార్గులా కాదా అన్నది చూస్తాను. లేకపోతే నాకు తెలుస్తుంది.>>
\m
\s5
\v 22 ఆ మనుషులు అక్కడనుండి వెళ్ళడానికి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళారు. కానీ అబ్రాహాము ఇంకా యెహోవా సముఖంలోనే నిలబడి ఉన్నాడు.
\v 23 అప్పడు అబ్రాహాము వారిని సమీపించి ఇలా అడిగాడు, <<దుర్మార్గులతో పాటు నీతిమంతుల్ని కూడా నాశనం చేస్తావా?
\m
\s5
\v 24 ఆ పట్టణంలో ఒకవేళ యాభైమంది నీతిమంతులు ఉంటే ఆ యాభైమంది నీతిమంతుల కోసం పట్టణాన్ని నాశనం చేయకుండా రక్షించలేవా?
\v 25 నీతిమంతులకూ దుర్మార్గులకూ ఒకే రకంగా తీర్పు తీర్చడం నీకు దూరమౌతుంది గాక. అలాగే దుర్మార్గులతో పాటుగా నీతిమంతుల్ని నాశనం చేయడం నీకు దూరమౌతుంది గాక! సర్వలోకానికీ తీర్పు తీర్చేవాడు న్యాయం చెయ్యడా?>>
\v 26 దానికి యెహోవా, <<సొదొమ పట్టణంలో యాభైమంది నీతిమంతులు నాకు కనిపిస్తే వాళ్ళ కోసం ఆ ప్రదేశాన్నంతా కాపాడతాను >> అన్నాడు.
\m
\s5
\v 27 అందుకు అబ్రాహాము, <<అయ్యా చూడు, నేను దుమ్ముతో, బూడిదతో సమానం. అయినా నేను ప్రభువుతో మాట్లాడే సాహసం చేస్తున్నాను.
\v 28 యాభై మంది నీతిమంతులలో ఒకవేళ ఐదుగురు తక్కువయ్యారనుకోండి. ఐదుగురు తక్కువయ్యారని ఆ పట్టణమంతటినీ నాశనం చేస్తావా? >> అని మళ్ళీ అడిగాడు. అందుకాయన <<అక్కడ నలభై ఐదుగురు కనిపిస్తే నాశనం చేయను>> అన్నాడు.
\m
\s5
\v 29 అతడు మళ్ళీ ఆయనతో మాట్లాడుతూ, <<ఒకవేళ అక్కడ నలభై మందే కనిపిస్తారేమో>> అన్నాడు. దానికి ఆయన <<ఆ నలభై మంది కోసం నాశనం చేయను>> అని చెప్పాడు.
\v 30 అతడు మళ్ళీ <<ప్రభువా నాపై కోప్పడనంటే నేను మాట్లాడతాను. ఒకవేళ ముప్ఫై మందే అక్కడ కనిపిస్తారేమో>> అన్నాడు. అప్పుడాయన <<ముప్పై మంది కనిపించినా నేను పట్టణాన్ని నాశనం చేయను>> అన్నాడు.
\v 31 అందుకు అతడు <<నా ప్రభువుతో మాట్లాడే సాహసం చేస్తున్నాను. ఒకవేళ ఇరవైమందే ఉంటారేమో>> అన్నాడు. అప్పుడు ప్రభువు <<ఆ ఇరవైమంది కోసం నాశనం చేయను>> అన్నాడు.
\m
\s5
\v 32 చివరిగా అతడు <<ప్రభువా, నాపై కోపగించకు. నేనింకా ఒక్కసారే మాట్లాడతాను. ఒకవేళ పదిమందే అక్కడ ఉన్నారేమో>> అన్నాడు. అప్పుడు ప్రభువు <<పదిమంది కోసం నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను>> అన్నాడు.
\v 33 అబ్రాహాముతో మాటలు ముగిసిన వెంటనే యెహోవా వెళ్ళిపోయాడు. అబ్రాహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాడు.
\s5
\c 19
\p
\v 1 ఆ సాయంత్రం ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరుకున్నారు. ఆ సమయంలో లోతు సొదొమ పట్టణ ప్రధాన ద్వారం వద్ద కూర్చుని ఉన్నాడు. లోతు దేవదూతలను చూడగానే వారిని కలుసుకోవడానికి వారికి ఎదురు వెళ్ళి సాష్టాంగపడి నమస్కారం చేశాడు.
\v 2 వారితో ఇలా అన్నాడు, << నా ప్రభువులారా, దయచేసి మీ దాసుడైన నా ఇంటికి రండి. వచ్చి కాళ్ళు కడుక్కోవాలనీ, ఈ రాత్రి గడపాలనీ వేడుకుంటున్నాను. తిరిగి తెల్లవారే లేచి మీ ప్రయాణం కొనసాగించవచ్చు.>> అన్నాడు. అందుకు వాళ్ళు <<అలా కాదు. మేం వీధిలోనే ఈ రాత్రి గడుపుతాం.>> అన్నారు.
\v 3 కానీ అతడు వాళ్ళను చాలా బలవంతపెట్టాడు. వారు అతనితో కలసి అతని ఇంటికి వెళ్ళారు. అతడు వారికి విందు చేశాడు. అతడు వారి కోసం పొంగని రొట్టెలు కాల్చి ఇచ్చాడు. వారు భోజనం చేశాడు.
\m
\s5
\v 4 అయితే వాళ్ళు నిద్రపోయే ముందే ఆ పట్టణ ప్రజలు అంటే సోదొమలోని యువకులూ, వృద్ధులూ పట్టణం నలుమూలల నుండీ వచ్చిన మనుషులు ఆ ఇంటిని చుట్టుముట్టారు.
\v 5 వాళ్ళు లోతును పిలిచారు, <<ఈ రాత్రి నీ దగ్గరకు వచ్చిన మనుషులు ఏరీ? మేం వారితో లైంగిక సంబంధం పెట్టుకోవాలి. వాళ్ళను బయటకు తీసుకు రా>> అన్నారు.
\m
\s5
\v 6 దాంతో లోతు బయటి ద్వారం దగ్గర ఉన్నవాళ్ళ దగ్గరకు వెళ్ళాడు. తన వెనకే తలుపు మూసివేశాడు.
\v 7 <<సోదరులారా, ఇంత దుర్మార్గమైన పని చేయవద్దు.
\v 8 చూడండి. పురుష సంబంధం లేని ఇద్దరు కూతుళ్ళు నాకు ఉన్నారు. మీరు ఒప్పుకుంటే వారిని మీ దగ్గరకు తీసుకుని వస్తాను. వారిని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. కానీ ఈ వ్యక్తులను మాత్రం ఏమీ చేయవద్దు. వాళ్ళు నా ఇంటికి వచ్చిన అతిధులు>> అన్నాడు.
\m
\s5
\v 9 కానీ వాళ్ళు <<నువ్వు అవతలికి పో>> అన్నారు. ఇంకా వాళ్ళు <<వీడు మన మధ్యలో పరదేశిగా నివసించాడు. ఇప్పుడు మనకు తీర్పరి అయ్యాడు చూడండి! ఇప్పుడు వాళ్ళపైన కంటే నీపై ఎక్కువ దౌర్జన్యం చేస్తాం.>>అన్నారు. అలా అని వాళ్ళంతా లోతుపై దొమ్మీగా పడి తలుపు పగలగొట్టడానికి పూనుకున్నారు.
\m
\s5
\v 10 అయితే ఆ దూతలు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి లాగేశారు. ఆ వెనుకే తలుపు మూసేశారు.
\v 11 అప్పుడు లోతు అతిథులు పిల్లల నుండి పెద్దల వరకూ ఆ తలుపు దగ్గర ఉన్న వాళ్ళందరికీ గుడ్డితనం కలుగజేశారు. దాంతో వాళ్ళు తలుపు ఎక్కడ ఉందో వెదికీ వెదికీ విసిగిపోయారు.
\m
\s5
\v 12 అప్పుడు ఆ దూతలు లోతుతో << ఇక్కడ నీ వారు ఇంకా ఎవరన్నా ఉన్నారా? నీ అల్లుళ్ళూ, కొడుకులూ, కూతుళ్ళూ ఈ ఊరిలో నీకు కలిగినవారందర్నీ బయటకు తీసుకురా.
\v 13 మేము ఈ ప్రాంతాన్నంతా ధ్వంసం చేయడానికి వచ్చాం. ఈ ప్రజలకు వ్యతిరేకంగా గొప్ప మొర యెహోవా సముఖానికి చేరింది. అందుకని వాళ్ళను నాశనం చేయడానికి యెహోవా మమ్మల్ని పంపించాడు.>> అన్నారు.
\m
\s5
\v 14 అప్పుడు లోతు బయటకు వెళ్ళి తన కూతుళ్ళను పెళ్లి చేసుకోబోతున్న తన అల్లుళ్ళతో మాట్లాడాడు. <<త్వరగా రండి. ఇక్కడినుండి బయట పడాలి. యెహోవా ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు>> అని చెప్పాడు. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి హాస్యమాడుతున్నవాడిలా కనిపించాడు.
\v 15 ఉదయం అయినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టారు. <<రా, రా, బయల్దేరు. ఈ ఊరికి కలుగబోయే శిక్షలో తుడిచి పెట్టుకుపోకుండా నీ భార్యనూ ఇక్కడే ఉన్న నీ ఇద్దరు కూతుళ్లనూ తీసుకుని బయల్దేరు>> అన్నారు.
\m
\s5
\v 16 అయితే అతడు ఆలస్యం చేసాడు. యెహోవా అతని పట్ల కనికరం చూపడం వల్ల ఆ మనుషులు అతని చేతినీ, అతని భార్య చేతినీ అతని ఇద్దరు కూతుళ్ళ చేతుల్నీ పట్టుకున్నారు. వాళ్ళని బయటకు తీసుకువచ్చారు. అలానే పట్టణం బయటకు తీసుకువచ్చారు.
\v 17 ఆ దూతలు వారిని పట్టణం బయటకు తీసుకు వచ్చిన తర్వాత వాళ్ళలో ఒకడు <<మీ ప్రాణాలు దక్కించుకోవడం కోసం పారిపొండి. వెనక్కు తిరిగి చూడవద్దు. మైదాన ప్రాంతాల్లో ఎక్కడా ఆగవద్దు. మీరు తుడిచి పెట్టుకుపోకుండేలా పర్వతాల్లోకి పారిపోయి తప్పించుకోండి.>>అని చెప్పాడు.
\m
\s5
\v 18 అప్పుడు లోతు <<ప్రభువులారా, అలా కాదు.
\v 19 మీ సేవకుడినైన నన్ను దయ చూశారు. నా ప్రాణాన్ని రక్షించి నా పట్ల మీ మహా కనికరాన్ని ప్రదర్శించారు. కానీ నేను ఆ పర్వతాలకు పారిపోయి తప్పించుకోలేను. ఆ పర్వతాలను చేరుకునే లోపుగానే ఏదైనా కీడు నాపైకి వస్తుందేమో. అలా జరిగి నేను ఇక్కడే చనిపోతానేమో.
\v 20 చూడండి, నేను పారిపోవడానికి ఆ కనిపించే ఊరు దగ్గర్లో ఉంది. నన్ను అక్కడికి వెళ్ళనివ్వండి. అది చిన్నది గదా, నేను బతుకుతాను>> అన్నాడు.
\m
\s5
\v 21 అప్పుడు ఆయన <<అలాగే, ఈ మనవి కూడా అంగీకరిస్తున్నాను. నువ్వు చెప్పిన ఈ ఊరిని నేను నాశనం చేయను.
\v 22 నువ్వు త్వరపడి, అక్కడికి వెళ్లి తప్పించుకో. నువ్వు అక్కడకు చేరుకునే వరకూ నేను ఏమీ చేయలేను.>> అన్నాడు. కాబట్టి ఆ ఊరికి సోయరు అనే పేరు వచ్చింది.
\m
\s5
\v 23 లోతు సోయరు చేరేటప్పటికి ఆ దేశంపై సూర్యుడు ఉదయించాడు.
\v 24 అప్పుడు సొదొమ గొమొర్రాల పైన ఆకాశం నుండి యెహోవా గంధకాన్నీ అగ్నినీ కురిపించాడు.
\v 25 ఆయన ఆ పట్టణాలనూ, ఆ మైదానమంతటినీ, ఆ పట్టణాల్లో నివసించేవారందరినీ, నేలపై మొక్కల్నీ నాశనం చేశాడు.
\m
\s5
\v 26 కానీ లోతు వెనుకే వస్తున్న అతని భార్య వెనక్కి తిరిగి చూసింది. వెంటనే ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది.
\m
\v 27 ఉదయమైంది. అబ్రాహాము లేచి తాను అంతకుముందు యెహోవా సముఖంలో నిలబడిన చోటుకు వచ్చాడు.
\v 28 అక్కడి నుండి సొదొమ, గొమొర్రాల వైపు, ఆ మైదాన ప్రాంతం మొత్తాన్నీ చూశాడు. కొలిమిలోనుండి లేచే పొగ లాగా ఆ ప్రాంతం అంతా పొగలు వస్తూ కనిపించింది.
\m
\s5
\v 29 ఆ విధంగా దేవుడు ఆ మైదానపు పట్టణాలను నాశనం చేసినప్పుడు దేవుడు అబ్రాహామును జ్ఞాపకం చేసుకున్నాడు. లోతు కాపురమున్న పట్టణాలను ధ్వంసం చేసినప్పుడు ఆ విధ్వంసంలో లోతు నాశనం కాకుండా తప్పించాడు.
\m
\s5
\v 30 అయితే లోతు సోయరులో ఉండటానికి భయపడ్డాడు. తన ఇద్దరు కూతుళ్ళనూ తీసుకుని పర్వత ప్రాంతానికి వెళ్లిపోయాడు. అక్కడ తన ఇద్దరు కూతుళ్ళతో కలసి ఒక గుహలో నివసించాడు.
\m
\s5
\v 31 ఇలా ఉండగా అతని పెద్ద కూతురు తన చెల్లితో <<నాన్న ముసలివాడయ్యాడు. ఈ లోకరీతిగా మనతో శారీరిక సంబంధం పెట్టుకోడానికి ఏ పురుషుడూ లేడు.
\v 32 నాన్నకు ద్రాక్షారసం తాగిద్దాం. తర్వాత అతనితో శారీరిక సంబంధం పెట్టుకుందాం. ఆ విధంగా నాన్న ద్వారా మనకు సంతానం కలిగేలా చేసుకుందాం, పద>> అని చెప్పింది.
\v 33 ఆ రాత్రి వాళ్ళు తమ తండ్రికి ద్రాక్షారసం తాగించారు. ఆ తర్వాత అతని పెద్ద కూతురు లోపలికి వెళ్ళి తన తండ్రితో శారీరక సంబంధం పెట్టుకుంది. కాని ఆమె ఎప్పుడు తన పక్కన పడుకుందో, ఎప్పుడు లేచి వెళ్లిందో అతనికి తెలియలేదు.
\m
\s5
\v 34 మరునాడు అక్క తన చెల్లిని చూసి ఇలా అంది, <<నిన్న రాత్రి నేను నాన్నతో పడుకున్నాను. ఈ రాత్రి కూడా అతనికి ద్రాక్షారసం తాగిద్దాం. ఆ తర్వాత నువ్వు లోపలి వెళ్లి అతనితో కలిసి పండుకో. అలా మనం నాన్న ద్వారా సంతానం పొందుదాం>> అంది.
\v 35 ఆ రాత్రి కూడా వాళ్ళు తమ తండ్రికి ద్రాక్షారసం తాగించారు. అప్పుడు అతని చిన్న కూతురు వెళ్ళి తన తండ్రితో శయనించింది. ఆమె ఎప్పుడు తన పక్కన పడుకుందో, ఎప్పుడు లేచి వెళ్ళిందో అతనికి తెలియలేదు.
\m
\s5
\v 36 ఆ విధంగా లోతు ఇద్దరు కూతుళ్ళూ తమ తండ్రి మూలంగా గర్భం ధరించారు.
\v 37 అతని పెద్ద కూతురు ఒక కొడుక్కి జన్మనిచ్చింది. వాడికి మోయాబు అనే పేరు పెట్టింది. అతడే నేటి మోయాబీయులకు మూల పురుషుడు.
\v 38 లోతు రెండో కూతురు కూడా ఒక కొడుకుని కని వాడికి బెన్ అమ్మి అనే పేరు పెట్టింది. నేటి అమ్మోనీయులకు అతడే మూలపురుషుడు.
\s5
\c 20
\p
\v 1 అబ్రాహాము అక్కడ నుండి బయలుదేరి దక్షిణదేశానికి తరలి వెళ్ళాడు. అలా కాదేషుకూ, షూరుకూ మధ్య ఉన్న ప్రాంతంలో నివసించాడు. కొంతకాలం గెరారులో పరదేశిగా ఉన్నాడు.
\v 2 అక్కడ అబ్రాహాము తన భార్య శారాను గూర్చి <<ఈమె నా చెల్లి >> అని చెప్పాడు. కాబట్టి గెరారు రాజైన అబీమెలెకు శారా కోసం తన మనుషుల్ని పంపించాడు. వాళ్ళు శారాను అబీమెలెకు ఇంట్లో చేర్చారు.
\v 3 కాని దేవుడు రాత్రి కలలో అబీమెలెకు దగ్గరకుకు కనబడి అతనితో, <<చూడు, నువ్వు చచ్చినట్టే! ఎందుకంటే నువ్వు నీ ఇంట్లో పెట్టుకున్న స్తీ ఒక వ్యక్తికి భార్య>>అని చెప్పాడు.
\p
\s5
\v 4 అయితే అబీమెలెకు ఆమె దగ్గరికి వెళ్ళలేదు. కాబట్టి అతడు, <<ప్రభూ, ఇలాంటి నీతిగల జాతిని చంపివేస్తావా?
\v 5 <ఈమె నా చెల్లి> అని నాతో అతడే చెప్పాడు కదా! ఆమె కూడా <అతడు నా అన్న> అన్నది కదా. నేను నా చేతులతో ఏ దోషమూ చేయలేదు. నిజాయితీగానే ఈ పని చేశాను>> అన్నాడు.
\m
\s5
\v 6 అందుకు దేవుడు అతనికి కలలో కనబడి << అవును, నువ్వు యథార్థ హృదయంతోనే దీనిని చేశావని నాకు తెలుసు. నువ్వు నాకు విరోధంగా పాపం చేయకుండా నిన్ను అడ్డుకున్నాను. అందుకే నేను నిన్ను ఆమెను తాకడానికి అనుమతించ లేదు.
\v 7 కాబట్టి ఆ వ్యక్తి భార్యను తిరిగి అతనికప్పగించు. ఎందుకంటే అతడు ప్రవక్త. నువ్వు బతికేలా అతడు నీ కోసం ప్రార్థిస్తాడు. ఒకవేళ నువ్వు ఆమెను తిరిగి అతనికి అప్పగించకపోతే నువ్వూ, నీకు చెందినవారూ తప్పక చనిపోతారు. ఈ సంగతి నువ్వు బాగా తెలుసుకో>> అని చెప్పాడు.
\p
\s5
\v 8 తెల్లవారకముందే అబీమెలెకు లేచి తన సేవకులందరినీ పిలిపించాడు. వారికి ఈ విషయాలన్నీ తెలియజేశాడు. వారంతా అది విని ఎంతో భయపడ్డారు.
\v 9 అబీమెలెకు అబ్రాహాముకు కబురు పెట్టి రప్పించాడు. అతనితో ఇలా అన్నాడు, <<నువ్వు మాకు చేసినదేమిటి? నాపైనా నా రాజ్యం పైనా ఇంత పెద్ద దోషం వచ్చేలా చేశావు. నేను నీకు చేసిన అపకారం ఏమిటి? నా పట్ల చేయకూడని పని చేశావు.>> అన్నాడు.
\s5
\v 10 అబీమెలెకు అబ్రాహామును చూసి <<నువ్వు ఇలా చేయడానికి గల కారణాలేమిటి?>> అని అడిగాడు.
\p
\v 11 అబ్రాహాము <<ఇక్కడ దేవుని భయం బొత్తిగా లేదు కాబట్టి నా భార్య కోసం నన్ను చంపుతారేమో అన్న భయంతోనే నేనిలా చేసాను
\v 12 అదీకాకుండా ఆమె నాకు చెల్లి అనే మాట కూడా నిజమే. ఆమె నా తండ్రి కూతురు. తల్లి కూతురు కాదు. అలా నాకు భార్య అయింది.
\s5
\v 13 దేవుడు నేను నా తండ్రి ఇంటిని వదిలి వివిధ ప్రదేశాలు ప్రయాణాలు చేసేలా పిలిచినప్పుడు నేను ఆమెతో <మనం వెళ్ళే ప్రతి స్థలంలోనూ నన్ను గూర్చి అతడు నా అన్న అని చెప్పు. నా కోసం నువ్వు చేయగలిగిన ఉపకారం ఇదే> అని చెప్పాను>> అన్నాడు.
\v 14 అబీమెలెకు గొర్రెల్నీ ఎద్దుల్నీ దాసుల్నీ దాసీల్నీ రప్పించి అబ్రాహాముకు ఇచ్చాడు. తర్వాత అతని భార్య అయిన శారాను అతనికి అప్పగించేశాడు.
\p
\s5
\v 15 తర్వాత అబీమెలెకు <<చూడు, నా దేశం అంతా నీ ఎదుట ఉంది. నీకు ఎక్కడ ఇష్టమైతే అక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకో>> అని అబ్రాహాముతో అన్నాడు.
\v 16 తర్వాత అతడు శారాతో <<చూడు, నీ అన్నకు నేను వెయ్యి వెండి నాణేలు ఇచ్చాను. నీవు నిర్దోషివని నీతో ఉన్నవారందరి ఎదుట ఈడబ్బు రుజువుగా ఉంటుంది. అందరి ఎదుటా నీకు న్యాయం జరిగింది.>> అన్నాడు.
\s5
\v 17 అప్పుడు అబ్రాహాము దేవుణ్ణి ప్రార్థించాడు. దేవుడు అబీమెలెకునూ, అతని భార్యనూ అతని దాసీలనూ స్వస్థపరిచాడు. వారు పిల్లల్ని కనగలిగారు.
\v 18 ఎందుకంటే దేవుడు అబ్రాహాము భార్య అయిన శారాను బట్టి అబీమెలెకు ఇంట్లో స్త్రీలందరినీ పూర్తిగా గొడ్రాళ్ళనుగా చేశాడు.
\s5
\c 21
\p
\v 1 యెహోవా తాను చెప్పినట్టే శారాపై కనికరం చూపించాడు. తాను చేసిన వాగ్దానాన్ని శారా పట్ల నెరవేర్చాడు.
\v 2 అబ్రాహాము వృద్ధాప్యంలో శారా గర్భం ధరించి అతనికి ఒక కొడుకును కన్నది. అబ్రాహాముతో దేవుడు చెప్పిన సమయంలోనే ఇది జరిగింది.
\v 3 అబ్రాహాము తన భార్య శారా ద్వారా తనకు పుట్టిన తన కొడుక్కి ఇస్సాకు అనే పేరు పెట్టాడు.
\v 4 దేవుడు అబ్రాహాముకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం తన కొడుకు ఇస్సాకుకు ఎనిమిదవ రోజున సున్నతి చేశాడు.
\m
\s5
\v 5 ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రాహాము వయస్సు నూరేళ్ళు.
\v 6 అప్పుడు శారా <<దేవుడు నాకు నవ్వు పుట్టించాడు. నా సంగతి తెలిసినవారంతా నాతో కలసి సంతోషిస్తారు>> అన్నది.
\v 7 ఆమె ఇంకా, <<శారా తన పిల్లలకు పాలు ఇస్తుందని అబ్రాహాముతో ఎవరు చెప్పగలిగే వారు? అయినా ముసలివాడయ్యాక నేను అతనికి ఒక కొడుకుని కని ఇచ్చాను గదా>> అన్నది.
\m
\s5
\v 8 ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచిపెట్టాడు. ఇస్సాకు పాలు మానిన రోజున అబ్రాహాము గొప్ప విందు చేశాడు.
\v 9 అప్పుడు అబ్రాహాముకు ఐగుప్తు జాతిదైన హాగరు ద్వారా పుట్టిన కొడుకు ఇస్సాకును ఎగతాళి చేయడం శారా చూసింది.
\m
\s5
\v 10 ఆమె అబ్రాహాముతో ఇలా అంది, <<ఈ దాసీనీ ఈమె కొడుకునీ వెళ్ళగొట్టు. ఎందుకంటే ఈ దాసీ కొడుకు నా కొడుకు ఇస్సాకుతో కలసి వారసుడిగా ఉండటానికి వీలులేదు.>>
\v 11 ఈ మాట విన్న అబ్రాహాము తన కొడుకు ఇష్మాయేలుని బట్టి చాలా వేదన చెందాడు.
\m
\s5
\v 12 అయితే దేవుడు <<ఈ అబ్బాయి కోసం, నీ దాసీ కోసం నువ్వు బాధ పడవద్దు. ఈ విషయంలో శారా నీకు చెప్పినట్టు చెయ్యి. ఎందుకంటే ఇస్సాకు వలన కలిగే సంతానమే నీకు వారసులౌతారు.
\v 13 అయినప్పటికీ ఈ దాసీ కొడుకుకూడా నీ సంతానం గనక నేను అతణ్ణి కూడా ఒక జాతిగా చేస్తాను >> అని అబ్రాహాముతో చెప్పాడు.
\m
\s5
\v 14 కనుక అబ్రాహాము తెల్లవారకముందే లేచి రొట్టె, నీళ్ళు పోసిన తోలు తిత్తి సిద్ధం చేసి వాటిని హాగరు భుజంపై పెట్టాడు. ఆ బాలుణ్ణి ఆమెకు అప్పగించి పంపివేశాడు. ఆమె వెళ్ళి బెయేర్షెబా అడవికి చేరి అక్కడ తిరుగుతూ ఉంది.
\v 15 ఆ తోలు తిత్తిలోని నీళ్ళు అయిపోయాక ఆమె బాలుణ్ణి ఒక పొద కింద విడిచిపెట్టింది.
\v 16 <<ఈ పిల్లవాడి చావు చూడటం నా వల్ల కాదు>> అనుకుని కొంత దూరం వెళ్లి వాడికి ఎదురుగా కూర్చుంది. అక్కడ ఎలుగెత్తి బిగ్గరగా ఏడ్చింది.
\m
\s5
\v 17 దేవుడు ఆ బాలుడి మొర విన్నాడు. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచాడు. <<హాగరూ, నీకు వచ్చిన కష్టం ఏమిటి? భయపడవద్దు. ఆ బాలుడు ఉన్నచోటనే దేవుడు అతని మొర విన్నాడు.
\v 18 నువ్వు లేచి ఆ బాలుణ్ణి పైకి లేపు. అతనికి ధైర్యం చెప్పు. ఎందుకంటే నేను అతణ్ణి ఒక గొప్ప జాతిగా వృద్ది చేయబోతున్నాను>>అని ఆమెకు చెప్పాడు.
\m
\s5
\v 19 అప్పుడు దేవుడు ఆమె కళ్ళు తెరుచుకోనేలా చేశాడు. ఆమె ఎదురుగా ఉన్న ఒక నీళ్ళ ఊటను చూసింది. ఆమె వెళ్ళి తోలు తిత్తిని నీళ్ళతో నింపి ఆ బాలుడికి తాగించింది.
\v 20 దేవుడు ఆ అబ్బాయికి తోడుగా ఉన్నాడు. అతడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఆ అడవిలోనే నివసించి విలువిద్యలో ప్రవీణుడయ్యాడు.
\v 21 అతడు పారాను అటవీ ప్రాంతంలో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశంనుండి ఒక అమ్మాయిని తెచ్చి అతనికి పెళ్ళి చేసింది.
\m
\s5
\v 22 ఆ రోజుల్లో అబీమెలెకూ, అతని సైన్యాధిపతి ఫీకోలూ కలసి వచ్చి అబ్రాహాముతో మాట్లాడారు. <<నువ్వు చేసే పనులన్నిటిలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు.
\v 23 నువ్వు నన్ను, నా కొడుకుని, నా మనుమళ్ళను మోసం చేయనని దేవుని పేరిట నాకు వాగ్దానం చెయ్యి. నేను నీకు చూపిన అదే నిబంధన విశ్వసనీయతను నా పట్లా, నువ్వు పరదేశిగా ఉన్న ఈ దేశం పట్లా చూపించు>> అన్నాడు.
\v 24 అందుకు అబ్రాహాము <<నేను వాగ్దానం చేస్తాను>> అన్నాడు.
\m
\s5
\v 25 అబీమెలెకు దాసులు దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్న అబ్రాహాముకు చెందిన నీటి బావిని గూర్చి అబ్రాహాము తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. దానికి అబీమెలెకు <<ఈ పని ఎవరు చేశారో నాకు తెలియదు.
\v 26 నువ్వు కూడా దీని విషయం నాకేమీ చెప్పలేదు. నాకీ సంగతి ఈ రోజే తెలిసింది>> అన్నాడు.
\v 27 అబ్రాహాము గొర్రెలనూ ఎడ్లనూ తెప్పించి అబీమెలెకుకు ఇచ్చాడు. వాళ్ళిద్దరూ ఈ విధంగా ఒక నిబంధన చేసుకున్నారు.
\m
\s5
\v 28 తర్వాత అబ్రాహాము తన గొర్రెల మందలో నుంచి ఏడు ఆడ గొర్రెల్ని తీసి వేరుగా ఉంచాడు.
\v 29 అది చూసి అబీమెలెకు అబ్రాహాముతో << నువ్వు ఏడు ఆడ గొర్రెల్ని వేరుగా తీసి ఉంచావు. దాని అంతరార్ధం ఏమిటి?>> అని అడిగాడు.
\v 30 దానికి అబ్రాహాము <<ఈ బావిని నేనే తవ్వించాననడానికి సాక్ష్యంగా ఈ ఏడు ఆడ గొర్రెల్ని నువ్వు తీసుకోవాలి>> అన్నాడు.
\m
\s5
\v 31 అలా వాళ్ళిద్దరూ అక్కడ ఒక నిబంధన చేసుకున్నారు కాబట్టి ఆ స్థలానికి బెయేర్షెబా అనే పేరు వచ్చింది.
\v 32 బెయేర్షెబాలో వాళ్ళు అలా ఒక నిబంధన చేసుకున్న తర్వాత అబీమెలెకు లేచి తన సైన్యాధిపతి ఫీకోలుతో కలసి ఫిలిష్తీయుల దేశానికి తిరిగి వెళ్ళాడు.
\m
\s5
\v 33 అబ్రాహాము బెయేర్షెబాలో ఒక తమరిస్క చెట్టు నాటాడు. అక్కడ శాశ్వత దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేశాడు.
\v 34 అబ్రాహాము ఫిలిష్తీయుల దేశంలో చాలా రోజులు పరదేశిగా ఉన్నాడు.
\s5
\c 22
\p
\v 1 ఈ సంగతులన్నీ జరిగిన తర్వాత దేవుడు అబ్రాహామును పరీక్షించాడు. ఆయన, << అబ్రాహామా, >> అని పిలిచినప్పుడు అతడు << చిత్తము ప్రభువా >> అన్నాడు.
\v 2 అప్పుడు ఆయన అబ్రాహాముతో, <<నువ్వు ప్రేమించే నీ ఒక్కగానొక్క కొడుకైన ఇస్సాకును తీసుకుని మోరియా దేశానికి వెళ్ళు. అక్కడ నేను చెప్పబోయే ఒక పర్వతం మీద అతణ్ణి దహనబలిగా అర్పించు.>> అన్నాడు.
\v 3 కనుక అబ్రాహాము తెల్లవారగానే లేచి తన గాడిదకు జీను కట్టి సిద్ధం చేసి, దహనబలి కోసం కట్టెలు కొట్టి, తన కొడుకు ఇస్సాకుతోపాటు ఇద్దరు పనివాళ్ళనూ వెంటబెట్టుకొని దేవుడు తనకు చెప్పిన ప్రాంతానికి ప్రయాణమయ్యాడు.
\m
\s5
\v 4 మూడవ రోజు అబ్రాహాము తలెత్తి దూరంగా ఉన్న ఆ స్థలాన్ని చూశాడు.
\v 5 తన పనివాళ్ళతో, <<మీరు గాడిదతో ఇక్కడే ఉండండి. నేనూ అబ్బాయీ అక్కడికి వెళ్లి దేవుణ్ణి ఆరాధించి తిరిగి మీ దగ్గరకు వస్తాం>> అని చెప్పాడు.
\m
\v 6 అప్పుడు అబ్రాహాము దహనబలి కోసం తెచ్చిన కట్టెలు తీసుకొని తన కొడుకు ఇస్సాకు తలపై పెట్టాడు. తన చేతిలో నిప్పు, కత్తి పట్టుకున్నాడు. ఇక వాళ్ళిద్దరూ కలసి కొండపైకి ఎక్కుతున్నారు.
\m
\s5
\v 7 ఇస్సాకు తన తండ్రి అబ్రాహామును << నాన్నా>> అని పిలిచాడు. దానికి అబ్రాహాము, <<ఏం నాయనా>> అన్నాడు. అప్పుడతడు, <<చూడండి, ఇక్కడ నిప్పూ కట్టెలూ ఉన్నాయి గానీ దహనబలికి గొర్రె పిల్ల ఏది? >> అని అడిగాడు.
\v 8 దానికి అబ్రాహాము <<కొడుకా, దహనబలికి గొర్రెపిల్లను దేవుడే దయచేస్తాడు>> అన్నాడు.
\m
\s5
\v 9 దేవుడు అబ్రాహాముకు చెప్పిన స్థలానికి వారు చేరుకున్నారు. అక్కడ అబ్రాహాము ఒక బలిపీఠం నిర్మించి దానిపై కట్టెలు పేర్చాడు. ఇస్సాకును తాళ్ళతో బంధించాడు. ఆ బలిపీఠంపై పేర్చిన కట్టెలపై అతణ్ణి పడుకోబెట్టాడు.
\v 10 తర్వాత అబ్రాహాము తన కుమారుణ్ణి వధించడానికి చెయ్యి చాపి కత్తి పట్టుకున్నాడు.
\m
\s5
\v 11 అప్పుడు ఆకాశం నుండి యెహోవా దూత <<అబ్రాహామూ, అబ్రాహామూ>> అని పిలిచాడు. దానికతడు <<చిత్తం ప్రభూ>> అన్నాడు.
\v 12 అప్పుడు ఆయన, << ఆ బాలునిపై చెయ్యి వేయకు. అతనికి ఏ హానీ తలపెట్టవద్దు. నీకున్న ఒక్కగానొక్క కొడుకుని నాకివ్వడానికి వెనుకంజ వేయలేదు. అది చూశాక నీకు దేవునిపట్ల భయభక్తులు ఉన్నాయని నాకు తెలిసింది.>> అన్నాడు.
\m
\s5
\v 13 అప్పుడు అబ్రాహాము తలెత్తి చూశాడు. ఆశ్చర్యం కలిగించేలా అక్కడ ఉన్న ఒక పొదలో కొమ్ములు చిక్కుకుని ఉన్న ఒక పొట్టేలు అతనికి కనిపించింది. అబ్రాహాము వెళ్ళి ఆ పోట్టేలుని పట్టుకుని తన కొడుక్కి బదులుగా దానిని దహనబలిగా అర్పించాడు.
\v 14 అబ్రాహాము ఆ చోటును <యెహోవా యీరే> అని పిలిచాడు. కాబట్టి <యెహోవా తన పర్వతం పైన దయచేస్తాడు> అనే మాట ఈ నాటి వరకూ నిలిచి వాడుకలో ఉంది.
\m
\s5
\v 15 యెహోవా దూత రెండవసారి ఆకాశం నుండి అబ్రాహామును పిలిచి ఇలా అన్నాడు
\v 16 <<నువ్వు నీ ఒక్కగానొక్క కొడుకుని ఇవ్వడానికి వెనుకంజ వేయకుండా ఇదంతా చేశావు. అందుకే ప్రమాణం చేస్తున్నాను.
\v 17 నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీ వారసులను ఆకాశంలో ఉండే నక్షత్రాల వలే, సముద్ర తీరంలో ఉండే ఇసుక రేణువులవలే అత్యధికంగా విస్తరించేలా చేస్తాను. నీ వారసులు తమ శత్రువుల భూములను స్వాధీనం చేసుకుంటారు.
\m
\s5
\v 18 నువ్వు నా మాట విన్నావు కనుక నీ సంతానం వల్ల భూమి పైన ఉన్న జాతులన్నిటినీ ఆశీర్వదిస్తాను.>>
\v 19 తర్వాత అబ్రాహాము తన పనివాళ్ళ దగ్గరకు వచ్చాడు. వాళ్ళంతా కలసి బెయేర్షెబాకు వెళ్ళారు. అబ్రాహాము బెయేర్షెబాలో నివసించాడు.
\m
\s5
\v 20 ఆ సంగతులన్నీ జరిగిన తర్వాత తన సోదరుడైన నాహోరుకు మిల్కా ద్వారా పిల్లలు కలిగారు అనే వార్త అబ్రాహాముకు చేరింది.
\v 21 ఆ పిల్లలు ఎవరంటే, పెద్ద కొడుకు ఊజు, అతడి తమ్ముడు బూజు, ఆరాము తండ్రి కెమూయేలు,
\v 22 కెసెదు, హజో, పిల్దాషు, జిద్లాపు, బెతూయేలు. ఈ బెతూయేలు రిబ్కాకు తండ్రి.
\m
\s5
\v 23 అబ్రాహాము సోదరుడైన నాహోరుకు ఆ ఎనిమిదిమందీ మిల్కా ద్వారా కలిగారు.
\v 24 అతని ఉంపుడుకత్తె రెయూమా ద్వారా అతనికి తెబహు, గహము, తహషు, మయకా పుట్టారు.
\s5
\c 23
\p
\v 1 శారా నూట ఇరవై ఏడు సంవత్సరాలు జీవించింది.
\v 2 కనాను దేశంలో హెబ్రోను అని పిలిచే కిరియత్ ఆర్బా అనే ప్రాంతంలో ఆమె మరణించింది. అప్పుడు అబ్రాహాము శారా కోసం దుఃఖించడానికి, విలపించడానికీ వచ్చాడు.
\m
\s5
\v 3 తర్వాత అబ్రాహాము చనిపోయిన తన భార్య దగ్గరనుండి లేచి హేతు వారసులతో ఇలా మాట్లాడాడు,
\v 4 << నేను మీ మధ్య ఒక పరదేశిగానూ పరాయి వాడిగానూ ఉన్నాను. చనిపోయిన నా భార్య నా కళ్ళెదుట ఉంది. చనిపోయిన నా వాళ్ళను పాతిపెట్టడానికి నాకు ఒక స్మశాన భూమిని సొంతానికి ఇవ్వండి >>అన్నాడు.
\m
\s5
\v 5 దానికి హేతు వారసులు ఇలా అన్నారు, <<అయ్యా, మేం చెప్పేది వినండి. నువ్వు మా మధ్య ఒక మహారాజులా ఉన్నావు.
\v 6 మా శ్మశాన భూముల్లో అతి శ్రేష్టమైన దాంట్లో చనిపోయిన నీ వాళ్ళను పాతి పెట్టు. చనిపోయిన నీ భార్యను పాతి పెట్టడానికి మాలో ఎవరూ తమ భూమిని నీకివ్వడానికి నిరాకరించరు. >>
\m
\s5
\v 7 అప్పుడు అబ్రాహాము లేచి ఆ దేశ ప్రజలైన హేతు వారసుల ముందు సాగిల పడ్డాడు.
\v 8 <<చనిపోయిన నా భార్యను పాతిపెట్టే విషయంలో మీరు నాతో ఏకీభవిస్తే నా మాట వినండి. సోహరు కొడుకైన ఎఫ్రోనుతో నా తరపున మాట్లాడండి.
\v 9 అతని పొలం చివరన ఉన్న మక్పేలా గుహను నాకు ఇమ్మని అతనితో మనవి చేయండి. అది నా సొంత స్మశానంగా ఉండటానికి దానిని పూర్తి వెలకు నాకు అమ్మమని చెప్పండి>> అన్నాడు.
\p
\s5
\v 10 ఆ ఎఫ్రోను హేతు సంతతివారి మధ్యలోనే కూర్చుని ఉన్నాడు. హిత్తీయుడైన ఎఫ్రోను ఆ పట్టణ ద్వారం లో ప్రవేశించే వారందరి ముందు హేతు సంతతివారు వింటుండగా అబ్రాహాముకు ఇలా చెప్పాడు.
\v 11 << అయ్యా, అలా కాదు. నేను చెప్పేది వినండి. ఆ పొలాన్నీ దానిలో ఉన్న గుహను కూడా మీకిస్తున్నాను. నా ప్రజలందరి సమక్షంలోనే దానిని మీకిస్తున్నాను. చనిపోయిన మీ భార్యను పాతిపెట్టడానికి మీకిస్తున్నాను.>>
\m
\s5
\v 12 అప్పుడు అబ్రాహాము ఆ దేశపు ప్రజల ముందు సాగిల పడ్డాడు. <<
\v 13 నీ కిష్టమైతే నా మనవి విను. ఆ పొలానికి వెల చెల్లిస్తాను. నా దగ్గర వెల పుచ్చుకో. అప్పుడు నా భార్యను అక్కడ పాతిపెడతాను >> అని అందరికీ వినపడేలా చెప్పాడు.
\m
\s5
\v 14 దానికి ఎఫ్రోను ఇలా జవాబిచ్చాడు.
\v 15 << అయ్యా, వినండి. ఆ భూమి వెలగా నాలుగు వందల తులాల వెండి చెల్లిస్తే చాలు. ఆ మాత్రం మొత్తం నీకూ నాకూ ఎంత? చనిపోయిన నీ భార్యను పాతిపెట్టుకో>> అన్నాడు.
\v 16 అబ్రాహాము ఎఫ్రోను చెప్పిన మాట విన్నాడు. హేతు కుమారులకు వినబడేలా ఎఫ్రోను చెప్పిన వెలను అంటే వర్తకుల తూకం ప్రకారం నాలుగు వందల తులాల వెండిని అబ్రాహాము తూచి అతనికి ఇచ్చాడు.
\m
\s5
\v 17 ఆ విధంగా మమ్రే పక్కనే ఉన్న మక్పేలా లోని ఎఫ్రోను పొలం, దాంట్లో ఉన్న గుహ, ఆ పొలంలోనూ దాని సరిహద్దుల్లోనూ ఉన్న చెట్లతో సహా
\v 18 ఆ ఊరి ద్వారంలో ప్రవేశించే వారందరి ముందు హేతు వారసుల సమక్షంలో అబ్రాహాముకు స్వాధీనం అయింది.
\m
\s5
\v 19 ఆ తర్వాత అబ్రాహాము కనాను దేశంలో హెబ్రోను అని పిలిచే మమ్రే పక్కనే ఉన్న మక్పేలా పొలం లోని గుహలో తన భార్య శారాను పాతిపెట్టాడు.
\v 20 ఆ విధంగా ఆ పొలాన్నీ, దాంట్లో ఉన్న గుహనీ శ్మశానం కోసం అబ్రాహాముకు హేతు సంతతి వారు ఇవ్వడం వల్ల అవి అతని సొంతం అయ్యాయి.
\s5
\c 24
\p
\v 1 అబ్రాహాము బాగా వయస్సు మళ్ళి వృద్దుడయ్యాడు. యెహోవా అన్ని విషయాల్లో అబ్రాహామును ఆశీర్వదించాడు.
\v 2 అప్పుడు అబ్రాహాము తన ఆస్తి వ్యవహారాలనూ ఇంటి విషయాలనూ నిర్వహించే పెద్ద దాసుడిని పిలిచాడు. <<నీ చెయ్యి నా తొడ కింద ఉంచు.
\v 3 నేను నివాసముంటున్న ఈ కనాను వాసుల కూతుళ్ళలో ఒక అమ్మాయిని ఇచ్చి నా కొడుక్కి పెళ్ళి చేయకుండా
\v 4 నా స్వదేశంలో ఉన్న నా బంధువుల దగ్గరకు వెళ్ళు. అక్కడనుండి నా కొడుకు ఇస్సాకుకు భార్యను తీసుకురావాలి. ఇలా చేస్తానని నీతో <భూమీ ఆకాశాలకు దేవుడైన యెహోవా తోడు> అని ప్రమాణం చేయిస్తాను>> అని అతనితో అన్నాడు.
\m
\s5
\v 5 దానికి ఆ దాసుడు <<ఒకవేళ ఆమె నాతో కలసి ఈ దేశం రావడానికి ఇష్టపడక పొతే నీ కొడుకునే నీ స్వదేశానికి తీసుకుని వెళ్ళాలా?>> అని ప్రశ్నించాడు.
\v 6 అప్పుడు అబ్రాహాము <<ఎట్టి పరిస్థితిలోనూ నా కొడుకుని నువ్వు అక్కడికి తీసుకు వెళ్ళకూడదు.
\v 7 నా తండ్రి ఇంటి నుండీ, నా బంధువుల దేశం నుండీ నన్ను తీసుకు వచ్చి <నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తాను> అని పరలోకపు దేవుడైన యెహోవా నాకు ప్రమాణం చేశాడు. ఆ దేవుడే తన దూతను నీకు ముందుగా పంపుతాడు. అక్కడనుండి నువ్వు నా కొడుక్కి భార్యను తీసుకుని వస్తావు.
\m
\s5
\v 8 అయితే ఒకవేళ నీ వెంట రావడానికి ఆమె ఇష్టపడక పొతే నాకు చేసిన ప్రమాణం నుండి విడుదల పొందుతావు. అంతేకానీ నా కొడుకుని మాత్రం నువ్వు అక్కడికి తీసుకు వెళ్ళకూడదు>> అని చెప్పాడు.
\v 9 కాబట్టి ఆ దాసుడు తన యజమాని అయిన అబ్రాహాము తొడ కింద తన చెయ్యి పెట్టి ఈ విషయం ప్రమాణం చేశాడు.
\m
\s5
\v 10 ఆ దాసుడు తన యజమానికి చెందిన పది ఒంటెల్ని తీసుకుని ప్రయాణమయ్యాడు. అలాగే తన యజమాని దగ్గర నుండి అనేక రకాలైన వస్తువుల్ని బహుమానాలుగా తీసుకు వెళ్ళాడు. అతడు ప్రయాణమై వెళ్ళి అరాం నహరాయిము ప్రాంతంలో ఉన్న నాహోరు పట్టణం చేరాడు.
\v 11 అతడు ఆ పట్టణం బయటే ఉన్న ఒక నీటి బావి దగ్గర తన ఒంటెలను మోకరింప చేశాడు. అప్పటికి సాయంత్రం అయింది. ఊరి స్త్రీలు నీళ్ళు తోడుకోడానికి వచ్చే సమయమది.
\m
\s5
\v 12 అప్పుడు అతడు ఇలా ప్రార్థించాడు, <<నా యజమాని అయిన అబ్రాహాము దేవుడివైన యెహోవా, నా యజమాని అయిన అబ్రాహాముపట్ల నీ నిబంధన విశ్వాస్యత చూపి ఈ రోజు నాకు కార్యం సఫలం చేయి.
\v 13 ఇదిగో చూడు, నేను ఈ నీళ్ళ బావి దగ్గర నిలబడ్డాను. ఈ ఊళ్ళో వాళ్ళ పిల్లలు నీళ్ళు తోడుకోవడం కోసం వస్తున్నారు.
\v 14 ఇది ఈ విధంగా జరగనియ్యి. <నీ కుండ కొంచెం వంచి నేను తాగడానికి కాసిన్ని నీళ్ళు పొయ్యి> అని నేను అంటే <తాగండి, మీ ఒంటెలకు కూడా నీళ్ళు పెడతాను>అని ఏ అమ్మాయి అంటుందో ఆ అమ్మాయే నీ సేవకుడు ఇస్సాకు కోసం నువ్వు ఏర్పాటు చేసిన అమ్మాయి అయి ఉండాలి. ఈ విధంగా నువ్వు నా యజమాని పట్ల నిబంధన విశ్వాస్యత చూపించావని తెలుసుకుంటాను>> అన్నాడు.
\m
\s5
\v 15 అతడు ఈ మాటలు ముగించక ముందే రిబ్కా కుండ భుజంపై పెట్టుకుని అక్కడికి వచ్చింది. ఆమె బెతూయేలు కూతురు. ఈ బెతూయేలు అబ్రాహాము సోదరుడైన నాహోరుకూ అతని భార్య అయిన మిల్కాకూ పుట్టిన కుమారుడు.
\v 16 ఆ అమ్మాయి చాలా అందకత్తె, కన్య. పురుష స్పర్శ ఎరగనిది. ఆమె ఆ బావిలోకి దిగి కుండతో నీళ్ళు నింపుకుని పైకి వచ్చింది.
\m
\s5
\v 17 అప్పుడు ఆ సేవకుడు ఆమెను కలుసుకోడానికి పరుగెత్తుకుంటూ వెళ్ళాడు. <<దయచేసి నీ కుండలో నీళ్ళు తాగడానికి నాకు పోస్తావా?>> అని ఆమెను అడిగాడు.
\v 18 దానికామె <<అయ్యా, తాగండి>> అంటూ చప్పున కుండ చేతిమీదికి దించుకుని అతడు తాగడానికి నీళ్ళు ఇచ్చింది.
\m
\s5
\v 19 ఆమె అతనికి తాగడానికి నీళ్ళు ఇచ్చిన తర్వాత <<మీ ఒంటెలు తాగేందుకు కూడా నీళ్ళు తోడి పోస్తాను>> అని చెప్పి
\v 20 త్వరగా అక్కడి తొట్టిలో కుండెడు నీళ్ళు కుమ్మరించి తిరిగి నీళ్ళు తోడటానికి బావి దగ్గరకు పరుగు తీసింది. అతని ఒంటెలన్నిటికీ నీళ్ళు తోడి పోసింది.
\m
\s5
\v 21 ఆ వ్యక్తి తన ప్రయాణాన్ని యెహోవా సఫలం చేశాడో లేదో తెలుసుకోడానికి ఆమెను మౌనంగా గమనిస్తూనే ఉన్నాడు
\v 22 ఒంటెలు నీళ్ళు తాగడం అయ్యాక అతడు అరతులం బరువున్న ఒక బంగారపు ముక్కుపుడకను, ఆమె చేతులకు పది తులాల బరువున్న రెండు బంగారు కడియాలను బయటకు తీశాడు.
\v 23 ఆమెను, <<నువ్వు ఎవరి అమ్మాయివి? మీ నాన్న గారింట్లో మేం ఈ రాత్రి ఉండటానికి స్థలం దొరుకుతుందా? దయచేసి నాకు చెప్పు>> అని అడిగాడు.
\m
\s5
\v 24 దానికి ఆమె, <<నేను నాహోరుకూ మిల్కాకూ కొడుకైన బెతూయేలు కూతుర్ని.>> అంది.
\v 25 ఇంకా ఆమె <<మా దగ్గర చాలా గడ్డీ, మేతా ఉన్నాయి. రాత్రి ఉండటానికి స్థలం కూడా ఉంది>> అంది.
\m
\s5
\v 26 ఆ వ్యక్తి తల వంచి యెహోవాను ఇలా ఆరాధించాడు.
\v 27 <<అబ్రాహాము అనే నా యజమాని దేవుడైన యెహోవాకు స్తుతి కలుగుతుంది గాక! ఆయన నా యజమానికి తన నిబంధన విశ్వాస్యతనూ, తన విశ్వసనీయతనూ చూపడం మానలేదు. నన్నయితే ఆయన సరిగ్గా నా యజమాని బంధువుల ఇంటికే నడిపించాడు>> అన్నాడు.
\m
\s5
\v 28 అప్పుడు ఆ అమ్మాయి ఇంటికి పరుగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ అందరికీ జరిగిన విషయమంతా చెప్పింది.
\v 29 ఈ రిబ్కాకు ఒక సోదరుడున్నాడు. అతని పేరు లాబాను. అతడు తన సోదరి చేతులకున్న కడియాలూ ముక్కుకు ఉన్న పుడకనూ చూశాడు. అలాగే <ఆ వ్యక్తి నాతొ ఇలా చెప్పాడు> అంటూ తన సోదరి చెప్పిన మాటలూ విన్నాడు.
\v 30 అప్పుడు లాబాను బయట ఆ బావి దగ్గరే ఉన్న ఆ వ్యక్తి దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చాడు. అప్పుడతను తన ఒంటెల పక్కనే నిలబడి ఉన్నాడు.
\m
\s5
\v 31 అతణ్ణి చూసి లాబాను ఇలా అన్నాడు, << యెహోవా ఆశీర్వదించిన వాడా. లోపలికి రండి. మీరు బయటే ఎందుకున్నారు? నేను ఇంటినీ, మీ ఒంటెలకు స్థలాన్నీ సిద్ధం చేశాను>> అన్నాడు.
\v 32 ఆ వ్యక్తి తన ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఆ ఒంటెల జీను ఊడదీసి వాటికి గడ్డీ మేతా పెట్టాడు. అబ్రాహాము సేవకునికీ అతనితో కూడా వచ్చిన వారికీ కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళు ఇచ్చాడు.
\m
\s5
\v 33 భోజనం చేయమని అతని ముందు ఆహారం పెట్టారు. కానీ అతడు <<నేను చెప్పాల్సిన విషయం ఒకటుంది. అది చెప్పే వరకూ నేను భోజనం చేయను>> అన్నాడు. అందుకు <<చెప్పండి>> అన్నాడు.
\v 34 అప్పుడు అతను ఇలా చెప్పాడు, <<నేను అబ్రాహాము దాసుణ్ణి.
\v 35 యెహోవా నా యజమానిని ఎంతో ఆశీర్వదించాడు. అతడు చాలా గొప్పవాడయ్యాడు. ఆయన అతనికి ఎన్నో గొర్రెల్నీ, పశువుల్నీ, వెండీ బంగారాల్నీ, దాసులనీ, దాసీలనీ అనుగ్రహించాడు.
\m
\s5
\v 36 నా యజమాని భార్య శారా. ఆమె వృద్ధురాలు అయ్యాక నా యజమానికి ఒక కొడుకుని కని ఇచ్చింది. నా యజమాని తనకున్న ఆస్తినంతా తన కొడుక్కే ఇచ్చాడు.
\v 37 నా యజమాని నాతో ఇలా చెప్పాడు, <నేను ప్రస్తుతం నివసిస్తున్న ఈ కనాను దేశపు అమ్మాయిలలో ఎవర్నీ నా కొడుక్కి ఇచ్చి పెళ్ళి చేయవద్దు.
\v 38 నువ్వు నా తండ్రి ఇంటికీ, నా రక్త సంబధికుల దగ్గరకూ వెళ్ళి అక్కడ నుండి నా కొడుకు కోసం ఒక అమ్మాయిని భార్యగా తీసుకు రావాలి> అంటూ నాతో ప్రమాణం చేయించుకున్నాడు.
\m
\s5
\v 39 దానికి నేను <ఒకవేళ ఆ అమ్మాయి నాతో రాకపోతే?> అని నా యజమానిని అడిగినప్పుడు
\v 40 అతడు <నేను యెహోవా సన్నిధిలో నివసిస్తున్నాను. ఆయనే నీతో తన దూతను పంపి నీ ప్రయాణాన్ని సఫలం చేస్తాడు. కాబట్టి నువ్వు నా కొడుక్కి నా బంధువుల నుండి నా తండ్రి వారసులనుండి భార్యగా ఉండేందుకు ఒక అమ్మాయిని తీసుకు వస్తావు.
\v 41 అయితే నువ్వు నా రక్త సంబధికుల దగ్గరకు వెళ్ళాక వాళ్ళ అమ్మాయిని నీతో పంపడానికి వాళ్ళు ఇష్టపడక పోతే ఈ ప్రమాణం నుండి నువ్వు విముక్తుడివి అవుతావు>అన్నాడు.
\m
\s5
\v 42 నేను ఈ రోజు ఆ బావి దగ్గరకు వచ్చినప్పుడు ఇలా ప్రార్థించాను, <<నా యజమాని అబ్రాహాము దేవుడవైన యెహోవా, నా ఈ ప్రయాణాన్ని విజయవంతం చేస్తే
\v 43 నేను ఈ నీళ్ళ బావి దగ్గర ఉన్నప్పుడు నీళ్ళు తోడుకోడానికి వచ్చిన అమ్మాయితో నేను, <దయచేసి నీ కుండలో నీళ్ళు కాసిన్ని నాకు తాగడానికి ఇవ్వు> అని అడిగితే
\v 44 <మీరు తాగండి, మీ ఒంటెలకు కూడా నీళ్ళు తోడి పోస్తాను> అని ఏ అమ్మాయి చెప్తుందో ఆ అమ్మాయే నా యజమాని కొడుక్కి నువ్వు నియమించిన భార్య అయి ఉంటుంది అని నేను యెహోవా దగ్గర మనవి చేసుకున్నాను.
\m
\s5
\v 45 నేను నా హృదయంలో అలా అనుకున్నానో లేదో రిబ్కా తన భుజం మీద కుండ పెట్టుకుని బావి దగ్గరకు వచ్చి ఆ బావి లోకి దిగి నీళ్ళు తోడుకుని వచ్చింది. అప్పుడు నేను నాకు తాగడానికి నీళ్ళు ఇమ్మని ఆమెను అడిగాను.
\v 46 ఆమె వెంటనే కుండ దించి <తాగండి, మీ ఒంటెలకు కూడా నీళ్ళు పెడతాను> అంది. నేను ఆ నీళ్ళు తాగాను. ఆమె ఒంటెలకు కూడా నీళ్ళు పెట్టింది.
\m
\s5
\v 47 అప్పుడు నేను <నువ్వు ఎవరి అమ్మాయివి?> అని అడిగాను. ఆమె <నేను మిల్కా నాహోరుల కొడుకు అయిన బెతూయేలు కూతురుని> అని చెప్పినప్పుడు నేను ఆమెకు ముక్కుకు పుడకా చేతులకు కడియాలూ పెట్టాను.
\v 48 నా యజమాని బంధువు కూతుర్నే అతని కొడుక్కి భార్యగా తీసుకు వెళ్ళడానికి నన్ను సరైన మార్గంలో నడిపించిన యెహోవాను నా తలవంచి ఆరాధించాను. నా యజమాని దేవుడైన యెహోవాకు స్తుతులు చెల్లించాను.
\m
\s5
\v 49 కాబట్టి ఇప్పుడు నా యజమాని పట్ల మీరు దయనూ నమ్మకాన్నీ చూపించ దల్చుకుంటే ఆ విషయం నాకు చెప్పండి. మీకిష్టం లేకపోతే అదైనా చెప్పండి. అప్పుడు నేనెటు వెళ్ళాలో అటు వెళ్తాను>> అన్నాడు.
\m
\s5
\v 50 అప్పుడు లాబానూ, బెతూయేలూ ఇలా జవాబిచ్చారు, <<ఈ విషయం యెహోవా నుండి కలిగింది. ఇది మంచో, చెడో మేమేమి చెప్పగలం?
\v 51 చూడు, రిబ్కా ఇక్కడే నీ ఎదుటే ఉంది. ఆమెను తీసుకు వెళ్ళు. యెహోవా మాట ప్రకారం ఆమె నీ యజమాని కొడుక్కి భార్య అవుతుంది గాక!>>
\m
\s5
\v 52 అబ్రాహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేశాడు.
\v 53 తరువాత ఆ సేవకుడు వెండీ బంగారు నగలనూ, వస్త్రాలనూ బయటికి తీసి రిబ్కాకు ఇచ్చాడు. అలాగే అతను ఆమె తల్లికీ, సోదరుడికీ విలువైన కానుకలిచ్చాడు.
\m
\s5
\v 54 అప్పుడు అతడూ అతనితో వచ్చిన వాళ్ళూ భోజన పానాదులు చేశారు. ఆ రాత్రి అక్కడే గడిపారు. ఉదయాన్నే లేచి అతడు <<నా యజమాని దగ్గరకు నన్ను పంపించండి>> అని అడిగాడు.
\v 55 ఆమె సోదరుడూ, ఆమె తల్లీ <<మా అమ్మాయిని కనీసం పది రోజులన్నా మా దగ్గర ఉండనీయి. తర్వాత ఆమెను తీసుకు వెళ్ళవచ్చు>> అన్నారు.
\m
\s5
\v 56 కానీ అతడు <<యెహోవా నా ప్రయాణాన్ని సఫలం చేసాడు. కాబట్టి దయచేసి నన్ను ఆపవద్దు. నా యజమాని దగ్గరకు నన్ను పంపించండి>> అన్నాడు.
\v 57 అప్పుడు వాళ్ళు అమ్మాయిని పిలిచి తను ఏమంటుందో తెలుసుకుందాం
\v 58 అని రిబ్కాను పిలిచారు. <<ఈ వ్యక్తి తో నువ్వు వెళ్తావా?>> అని అడిగారు. దానికామె <<వెళ్తాను>> అంది.
\m
\s5
\v 59 కాబట్టి వాళ్ళు తమ సోదరి అయిన రిబ్కాను మరో దాసీని తోడుగా ఇచ్చి అబ్రాహాము సేవకుడూ, అతనితో వచ్చిన మనుషులతో పంపించారు.
\v 60 అప్పుడు వాళ్ళు రిబ్కాతో <<మా సోదరీ, నువ్వు లక్షలాది మందికి తల్లివి కావాలి. నీ సంతానం తమను ద్వేషించే వారి గుమ్మాలను ఆక్రమించుకుంటారు గాక!>> అంటూ ఆమెను దీవించారు.
\m
\s5
\v 61 రిబ్కా, ఆమె సేవకురాళ్ళూ ఒంటెలెక్కి ఆ వ్యక్తి వెంట వెళ్లారు. ఆ విధంగా అబ్రాహాము సేవకుడు రిబ్కాను తీసుకుని తన దారిన వెళ్ళాడు.
\m
\v 62 ఇస్సాకు కనాను దక్షిణ దేశంలో నివాసమున్నాడు. ఆ సమయంలో అతడు బెయేర్‌ లహాయిరోయి నుండి వస్తూ ఉన్నాడు.
\m
\s5
\v 63 ఆ సాయంత్రం ఇస్సాకు ధ్యానం చేయడానికి మైదానంలోకి వెళ్ళాడు. అక్కడ అతను తలెత్తి చూసినప్పుడు ఒంటెలు వస్తూ ఉన్నాయి.
\v 64 రిబ్కా కూడా ఇస్సాకును చూసింది. వెంటనే ఒంటె పైనుండి దిగింది.
\v 65 <<మనల్ని కలుసుకోడానికి మైదానం నుండి వస్తున్నఆ వ్యక్తి ఎవరు?>> అని అబ్రాహాము సేవకుణ్ణి అడిగింది. దానికతడు <<ఆయన నా యజమాని>> అన్నాడు. వెంటనే ఆమె ముసుగు వేసుకుంది.
\m
\s5
\v 66 అప్పుడు ఆ దాసుడు జరిగినదంతా ఇస్సాకుకు వివరించి చెప్పాడు.
\v 67 అప్పుడు ఇస్సాకు తన తల్లి అయిన శారా గుడారం లోకి ఆమెను తీసుకు వెళ్ళాడు. అలా అతడు రిబ్కాను తన భార్యగా స్వీకరించాడు. అతడు ఆమెను ప్రేమించాడు. అప్పుడు ఇస్సాకు తన తల్లి మరణం విషయమై ఆదరణ పొందాడు.
\s5
\c 25
\p
\v 1 అబ్రాహాము మళ్ళీ ఇంకో స్త్రీని పెళ్ళి చేసుకున్నాడు. ఆమె పేరు కెతూరా.
\v 2 ఆమె ద్వారా అతనికి జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు అనేవాళ్ళు పుట్టారు.
\v 3 యొక్షాను షేబ, దెదానులకు జన్మనిచ్చాడు. అష్షూరీయులు, లెతూషీయులు, లెయుమీయులు అనే జాతులు ఈ దెదాను సంతానమే.
\v 4 మిద్యాను కొడుకులు ఎవరంటే ఏయిఫా, ఏఫెరు, హనోకు, అబీదా, ఎల్దాయా అనేవాళ్ళు.
\p
\s5
\v 5 వీళ్ళందరూ కెతురా సంతానం. అబ్రాహాము తన సంపదనంతా ఇస్సాకుకు ఇచ్చేశాడు.
\v 6 అబ్రాహాము తాను బదికి ఉండగానే తన ఉంపుడుగత్తెల కొడుకులకు కానుకలిచ్చి తన కొడుకు ఇస్సాకు దగ్గర నుండి వారిని తూర్పు ప్రాంతాలకు పంపి వేశాడు.
\p
\s5
\v 7 అబ్రాహాము మొత్తం నూట డెబ్భై ఐదు సంవత్సరాలు జీవించాడు.
\v 8 అబ్రాహాము సుదీర్ఘకాలం జీవించి నిండు వృద్ధాప్యంలో సంపూర్ణ జీవితం గడిపి చనిపోయి తన పితరులను చేరుకున్నాడు.
\p
\s5
\v 9 అతని కొడుకులు ఇస్సాకూ, ఇష్మాయేలూ కలసి మమ్రే ఎదురుగా ఉన్న మక్పేలా గుహలో అతణ్ణి పాతి పెట్టారు. అది హిత్తీయుడైన సోహరు కుమారుడైన ఎఫ్రోనుకు చెందిన పొలంలో ఉంది.
\v 10 అబ్రాహాము హేతు వారసుల దగ్గర కొన్న ఈ పొలంలోనే అబ్రాహామునూ అతని భార్య శారానూ పాతిపెట్టారు.
\v 11 అబ్రాహాము చనిపోయిన తర్వాత దేవుడు అతని కొడుకు ఇస్సాకును ఆశీర్వదించాడు. ఆ సమయంలో ఇస్సాకు బేయేర్‌ లహాయిరోయి దగ్గర నివాసమున్నాడు.
\p
\s5
\v 12 ఐగుప్తీయురాలూ శారా దాసీ అయిన హాగరు ద్వారా అబ్రాహాముకు పుట్టిన ఇష్మా యేలు వంశావళి ఇది.
\p
\s5
\v 13 ఇష్మాయేలు పెద్ద కొడుకు అయిన నేబాయోతూ, కేదారూ, అద్బయేలూ, మిబ్శామూ,
\v 14 మిష్మా, దూమానమశ్శా,
\v 15 హదరూ, తేమా, యెతూరూ, నాపీషూ, కెదెమా.
\v 16 ఇష్మాయేలు కొడుకులు వీరే. వారి వారి గ్రామాల ప్రకారమూ, కోటల ప్రకారమూ వంశావళుల ప్రకారమూ వాళ్ళ పేర్లు ఇవి. వీళ్ళు తమ తమ వంశాల ప్రకారం పన్నెండు మంది రాజులు.
\p
\s5
\v 17 ఇష్మాయేలు నూట ముప్ఫై ఏడు సంవత్సరాలు జీవించాడు. ఆ తర్వాత అతడు ప్రాణం విడిచాడు. తన పితరులను చేరుకున్నాడు.
\v 18 వీళ్ళు అష్షూరుకు వెళ్ళే దారిలో హవీలా నుండి ఐగుప్తుకు సమీపంగా ఉన్న షూరు వరకు నివసిస్తుండే వాళ్ళు. వీళ్ళు ఒకరి పట్ల మరొకరు శత్రుభావం కలిగి జీవించేవారు.
\p
\s5
\v 19 అబ్రాహాము కొడుకు ఇస్సాకును గూర్చిన సంగతులు ఇవి. అబ్రాహాము ఇస్సాకుకు తండ్రి.
\v 20 ఇస్సాకు పద్దనరాములో నివసించే సిరియా వాడైన బెతూయేలు కూతురూ సిరియావాడైన లాబాను సోదరీ అయిన రిబ్కా ను పెళ్ళి చేసుకున్నాడు. అప్పటికి అతని వయస్సు నలభై సంవత్సరాలు.
\p
\s5
\v 21 ఇస్సాకు భార్యకి పిల్లలు కలుగలేదు. అందుకని ఇస్సాకు ఆమె విషయం యెహోవాను వేడుకున్నాడు. యెహోవా అతని ప్రార్థన విన్నాడు. ఆ ప్రార్థనకు జవాబిచ్చాడు. ఫలితంగా అతని భార్య రిబ్కా గర్భవతి అయింది.
\v 22 ఆమె గర్భంలో ఇద్దరు శిశువులు ఉన్నారు. వాళ్ళిద్దరూ గర్భంలోనే పోరాడుకుంటున్నారు. కాబట్టి ఆమె <<నాకెందుకిలా జరుగుతోంది. ఇలా అయితే నేను బతకడం ఎందుకు?>> అనుకుని ఈ విషయమై యెహోవాను ప్రశ్నించింది.
\p
\s5
\v 23 అప్పుడు యెహోవా ఆమెతో ఇలా చెప్పాడు.
\q1 <<రెండు జాతులు నీ గర్భంలో ఉన్నాయి.
\p రెండు గోత్రాలు నీ గర్భంలో నుండే వేరుగా వస్తాయి.
\p ఒక జాతి కంటే ఒక జాతి బలంగా ఉంటుంది.
\p పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు.>>
\p
\s5
\v 24 ఆమెకు నెలలు నిండి ప్రసవించే సమయం వచ్చినప్పుడు ఆమె గర్భంలో కవలలు ఉన్నారు.
\v 25 మొదటివాడు ఎర్రగా పుట్టాడు. ఎర్రటి వస్త్రంలా ఒళ్ళంతా జుట్టు ఉంది. కాబట్టి అతనికి ఏశావు అనే పేరు పెట్టారు.
\v 26 తర్వాత అతని తమ్ముడు బయటకు వచ్చాడు. ఇతడు ఏశావు మడిమను చేత్తో పట్టుకుని వచ్చాడు. అతనికి యాకోబు అనే పేరు పెట్టారు. వాళ్ళిద్దరూ పుట్టినప్పుడు ఇస్సాకుకు అరవై ఏళ్ళు.
\p
\s5
\v 27 ఆ పిల్లలిద్దరూ పెద్దవాళ్ళయ్యారు. వారిలో ఏశావు జంతువులను వేటాడడంలో నైపుణ్యం సాధించాడు. అరణ్యవాసిగా తిరిగేవాడు. కానీ యాకోబు నెమ్మదస్తుడు. గుడారంలోనే ఉండేవాడు.
\v 28 ఇస్సాకు ఏశావును ప్రేమించాడు. ఎందుకంటే ఏశావు వేటాడి తెచ్చిన జంతు మాంసాన్ని అతడు ఇష్టపడి తింటూ ఉండేవాడు. రిబ్కాకు అయితే యాకోబు అంటే ఇష్టం.
\p
\s5
\v 29 యాకోబు కూరలతో వంట చేస్తూ ఉన్న సమయంలో ఏశావు చాలా అలసిపోయి పొలం నుండి ఇంటికి వచ్చాడు.
\v 30 ఏశావు యాకోబును, <<దయచేసి ఎర్రగా ఉన్న ఆ వంటకాన్ని నాకు తినడానికివ్వు. నేను చాలా అలసి పోయాను>> అని అడిగాడు. అందుకే అతనికి ఏదోము అనే పేరు వచ్చింది.
\p
\s5
\v 31 అందుకు యాకోబు <<ముందు పెద్దవాడుగా నీ జన్మ హక్కుని నాకు ఇచ్చెయ్యి>> అన్నాడు.
\v 32 అప్పుడు ఏశావు <<చూడు, నేను ఆకలితో చావబోతున్నాను. ఈ జన్మహక్కు నాకెందుకు?>> అన్నాడు.
\v 33 యాకోబు <<ముందు ప్రమాణం చెయ్యి>> అన్నాడు. ఏశావు యాకోబుతో ప్రమాణం చేసి తన జన్మ హక్కుని అతనికి ఆ విధంగా అమ్మి వేశాడు.
\v 34 యాకోబు తన దగ్గర ఉన్న రొట్టె, చిక్కుడు కాయల కూర ఏశావుకు ఇచ్చాడు. ఏశావు రొట్టే, కూరా తిని, తాగి అక్కడ నుండి తన దారిన వెళ్లి పోయాడు. ఆ విధంగా ఏశావు తన జ్యేష్ఠత్వపు జన్మ హక్కుని తిరస్కారంగా ఎంచాడు.
\s5
\c 26
\p
\v 1 అబ్రాహాము రోజులలో వచ్చిన మొదటి కరువు కాకుండా ఆ దేశంలో మరో కరువు వచ్చింది. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజు అబీమెలెకు దగ్గరకు వెళ్ళాడు.
\p
\s5
\v 2 అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడు. <<నువ్వు ఐగుప్తుకి వెళ్ళవద్దు. నేను నీతో చెప్పే దేశంలోనే నివసించు.
\v 3 ప్రస్తుతం నువ్వున్న ఈ దేశంలోనే పరదేశిగా ఉండిపో. నేను నీతో ఉంటాను. నిన్ను ఆశీర్వదిస్తాను. నీ తండ్రి అయిన అబ్రాహాముతో చేసిన నిబంధనను నెరవేరుస్తాను.
\p
\s5
\v 4 నీ వంశస్థుల్ని ఆకాశంలో నక్షత్రాల్లా విస్తరింపజేస్తాను. నీ వంశస్థులకు ఈ భూములన్నీ ఇస్తాను. నీ వంశస్థుల ద్వారా భూమిపైని జాతులన్నిటినీ ఆశీర్వదిస్తాను.
\v 5 ఎందుకంటే నీ తండ్రి అబ్రాహాము నా మాటకు లోబడి నా ఆజ్ఞలనూ, శాసనాలనూ, నా చట్టాలనూ, నా నియమాలనూ పాటించాడు.>> అని అతనికి చెప్పాడు.
\p
\s5
\v 6 కాబట్టి ఇస్సాకు గెరారులో నివసించాడు.
\v 7 అక్కడి మనుషులు అతని భార్యను చూసి ఆమె సంగతి ఇస్సాకును అడిగారు. దానికతడు <<ఆమె నా చెల్లి>> అని చెప్పాడు. ఆమె తన భార్య అని చెప్పడానికి భయపడ్డాడు. ఎందుకంటే రిబ్కా అందకత్తె కాబట్టి అక్కడి మనుషులు ఆమె కోసం తనని చంపుతారేమో అనుకున్నాడు.
\v 8 అతడు చాలా రోజులు అక్కడ గడిపాడు. తరువాత ఒక రోజు ఫిలిష్తీయుల రాజు అబీమెలెకు కిటికీలో నుండి చూస్తుంటే సరిగ్గా అదే సమయంలో ఇస్సాకు తన భార్య రిబ్కాతో సరస సల్లాపాలు ఆడటం అతనికి కనిపించింది.
\p
\s5
\v 9 అప్పుడు అబీమెలెకు ఇస్సాకును పిలిపించి <<చూడు, ఆమె కచ్చితంగా నీ భార్యే, ఆమె నా చెల్లి అని ఎందుకు చెప్పావు?>> అని అడిగాడు. దానికి ఇస్సాకు <<ఆమెను పొందటం కోసం ఎవరైనా నన్ను చంపుతారేమోనని అనుకున్నాను>> అన్నాడు.
\v 10 అందుకు అబీమెలెకు <<నువ్వు మాకు చేసిన ఈ పని ఏమిటి? ఈ ప్రజలలో ఎవడైనా భయం లేకుండా తేలిగ్గా ఆమెతో శారీరిక సంబంధం పెట్టుకునే వాడే కదా! మాకు ఆ పాతకం చుట్టుకునేదే కదా!>> అన్నాడు.
\v 11 కాబట్టి అబీమెలెకు తన ప్రజలందరికీ <<ఈ వ్యక్తి ని గానీ ఇతని భార్యను గానీ ముట్టుకునే వాడు కచ్చితంగా మరణశిక్ష పొందుతాడు>> అంటూ ఒక హెచ్చరిక జారీ చేశాడు.
\p
\s5
\v 12 ఇస్సాకు ఆ దేశంలో నివసించి వ్యవసాయం చేసాడు. ఆ సంవత్సరం యెహోవా ఆశీర్వదించడం వల్ల నూరంతలు అధిక పంటను కోయగలిగాడు.
\v 13 కాబట్టి ఇస్సాకు ఆస్తిపరుడయ్యాడు. క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ చాలా గొప్పవాడయ్యాడు.
\v 14 అతనికి అనేక గొర్రెలూ పశువులూ సమకూడాయి. అనేకమంది దాసులు అతనికి ఉన్నారు. అతని సంపద చూసి ఫిలిష్తీయులు అతనిపై అసూయ పడ్డారు.
\p
\s5
\v 15 అతని తండ్రి అయిన అబ్రాహాము రోజుల్లో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు మట్టి వేసి పూడ్చివేశారు.
\v 16 అప్పుడు అబీమెలెకు ఇస్సాకుతో <<నువ్వు మాకంటే బలవంతుడివి. కాబట్టి ఈ ప్రాంతం విడిచి మాకు దూరంగా వెళ్లి పో>> అన్నాడు.
\v 17 కాబట్టి ఇస్సాకు అక్కడనుండి తరలి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకుని అక్కడ నివసించాడు.
\p
\s5
\v 18 అక్కడ ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రాహాము ఆ రోజుల్లో తవ్వించిన నీళ్ళ బావుల్ని తిరిగి తవ్వించాడు. ఎందుకంటే అబ్రాహాము మరణం తర్వాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేశారు. అబ్రాహాము పెట్టిన పేర్లనే ఇస్సాకు వాటికి పెట్టాడు.
\p
\s5
\v 19 ఇస్సాకు దాసులు ఆ లోయలో తవ్వినప్పుడు ఊటలు గల నీళ్ళ బావి లభ్యమైంది.
\v 20 అప్పుడు గెరారులోని పశువుల కాపరులు ఇస్సాకు కాపరులతో <<ఈ నీళ్ళు మావే>> అంటూ పోట్లాడారు. ఈ విధంగా వాళ్ళు తనతో పోట్లాడారు కనుక ఇస్సాకు ఆ బావికి ఏశెకు అని పేరు పెట్టాడు.
\p
\s5
\v 21 తర్వాత వాళ్ళు మరో బావి తవ్వారు. దాని కోసం కూడా అక్కడి వాళ్ళు పోట్లాడారు. కాబట్టి ఇస్సాకు దానికి శిత్నా అనే పేరు పెట్టాడు.
\v 22 అతడు అక్కడ్నించి వెళ్ళిపోయి మరో బావి తవ్వించాడు. దానికోసం ఎలాంటి గొడవా జరగలేదు. కాబట్టి ఇస్సాకు <<యెహోవా మనకు ఒక తావు అనుగ్రహించాడు. కాబట్టి ఇక ఈ దేశంలో మనం అభివృద్ధి చెందుతాం>> అంటూ ఆ స్థలానికి రహబోతు అనే పేరు పెట్టాడు.
\p
\s5
\v 23 అప్పుడు అక్కడనుండి ఇస్సాకు బెయేర్షెబాకు వెళ్ళాడు.
\v 24 ఆ రాత్రే యెహోవా అతనికి ప్రత్యక్షమై ఇలా అన్నాడు, <<నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుణ్ణి. నేను నీకు తోడుగా ఉన్నాను. కాబట్టి భయపడవద్దు. నా దాసుడైన అబ్రాహామును బట్టి నిన్ను ఆశీర్వదిస్తాను. నీ సంతానాన్ని అత్యధికం చేస్తాను.>>
\v 25 ఇస్సాకు అక్కడ ఒక బలిపీఠం కట్టాడు. అక్కడ యెహోవా పేరుమీద ప్రార్థన చేసి అక్కడే తన గుడారం వేసుకున్నాడు. ఇస్సాకు దాసులు అక్కడ ఒక బావి తవ్వారు.
\p
\s5
\v 26 ఆ సమయంలో గెరారు నుండి అబీమెలెకు తన స్నేహితుడైన ఆహుజ్జతునూ తన సైన్యాధిపతి అయిన ఫీకోలునూ వెంటబెట్టుకుని ఇస్సాకు దగ్గరకు వచ్చాడు.
\v 27 వారితో ఇస్సాకు <<మీరు నామీద కక్ష కట్టి మీ దగ్గరనుండి పంపివేశారు. ఇప్పుడు దేనికోసం నా దగ్గరకు వచ్చారు?>> అని వారిని అడిగాడు.
\p
\s5
\v 28 అప్పుడు వారు ఇలా జవాబిచ్చారు, <<యెహోవా కచ్చితంగా నీకు తోడుగా ఉండటం మేం స్పష్టంగా చూశాం. కాబట్టి మన మధ్య ఒక నిబంధన ఉండాలని అంటే నీకూ మాకూ మధ్య నిబంధన ఉండాలని కోరుతున్నాం.
\v 29 మేము నీకు ఎలాంటి హానీ చేయలేదు. నీకెలాంటి అపకారం చేయకుండా నిన్ను గౌరవంగా మా మధ్యనుండి పంపించాం. కాబట్టి ఇప్పుడు నువ్వు కూడా మాకు ఎలాంటి అపకారం చేయకుండా నీతో ఒక శాంతి ఒప్పందం చేసుకోవాలని అనుకున్నాం. నువ్వు నిజంగానే యెహోవా ఆశీర్వాదం పొందావు.>>
\p
\s5
\v 30 కాబట్టి ఇస్సాకు వాళ్ళకు విందు చేశాడు. వాళ్ళు చక్కగా తిని తాగారు.
\v 31 పెందలకడనే వాళ్ళు లేచి ఒకరితో మరొకరు నిబంధన చేసుకున్నారు. తర్వాత ఇస్సాకు వాళ్ళను శాంతియుతంగా సాగనంపాడు.
\p
\s5
\v 32 అదే రోజు ఇస్సాకు దాసులు వచ్చి తాము తవ్విన ఒక బావిని గూర్చి అతనికి తెలియజేశారు. తాము తవ్విన బావిలో నీళ్ళు పడ్డాయని చెప్పారు.
\v 33 ఆ బావికి ఇస్సాకు షీబా అనే పేరు పెట్టాడు. కాబట్టి ఇప్పటి వరకూ ఆ ఊరి పేరు బెయేర్షెబాయే.
\p
\s5
\v 34 ఏశావు నలభై సంవత్సరాల వయస్సులో హిత్తీయుడైన బేయేరీ కూతురు యహూదీతునూ, హిత్తీయుడైన ఏలోను కూతురు బాశెమతునూ పెళ్ళి చేసుకున్నాడు.
\v 35 వీరు ఇస్సాకు రిబ్కాలకు ఎంతో మనోవేదన కలిగించారు.
\s5
\c 27
\p
\v 1 ఇస్సాకు బాగా ముసలి వాడయ్యాడు. అతని కళ్ళు పూర్తిగా మసకబారాయి. ఆ పరిస్థితిలో అతడు తన పెద్ద కుమారుడు ఏశావుతో <<నా కొడుకా>> అని పిలిచాడు. అతడు <<చిత్తం నాన్నగారూ>> అన్నాడు.
\v 2 అప్పుడు ఇస్సాకు <<చూడు, నేను ముసలివాణ్ణి. ఎప్పుడు చనిపోతానో తెలియదు.
\p
\s5
\v 3 కాబట్టి నువ్వు నీ ఆయుధాలు అమ్ముల పొదినీ, విల్లునీ తీసుకుని అడవికి వెళ్ళి అక్కడ నాకోసం వేటాడి మాంసం తీసుకురా.
\v 4 దానిని నాకోసం రుచికరంగా వండి తీసుకురా. నాకిష్టమైన వంటకాలు సిద్ధం చేసి పట్టుకు వస్తే నేను చనిపోక ముందు వాటిని తిని నిన్ను ఆశీర్వదిస్తాను>> అన్నాడు.
\p
\s5
\v 5 ఇస్సాకు తన కొడుకు ఏశావుతో ఇలా చెప్తుంటే రిబ్కా వీరికి తెలియకుండా చాటు నుండి వింటూ ఉంది. ఏశావు వేటాడి మాంసం తీసుకు రావడానికి అడవికి వెళ్ళాడు.
\v 6 అప్పుడు రిబ్కా తన కొడుకు యాకోబుతో, <<జాగ్రత్తగా విను. మీ నాన్న నీ అన్నతో మాట్లాడటం నేను విన్నాను. ఆయన నీ అన్నతో
\v 7 <నేను చనిపోక ముందు భోజనం చేసి యెహోవా సముఖంలో నిన్ను ఆశీర్వదిస్తాను. కాబట్టి నువ్వు వేటాడి మాంసం తెచ్చి నాకోసం రుచిగా వండి తీసుకురా> అన్నాడు.
\p
\s5
\v 8 కొడుకా, కాబట్టి ఇప్పుడు నా మాట విను. నేను నీకు చెప్పింది చెయ్యి.
\v 9 నువ్వు మంద దగ్గరకు వెళ్ళి రెండు మంచి మేక పిల్లల్ని పట్టుకుని రా. నేను వాటితో మీ నాన్నఇష్టపడే విధంగా రుచిగా భోజనం తయారు చేస్తాను.
\v 10 నీ నాన్న చనిపోకముందు వాటిని తిని నిన్ను ఆశీర్వదించేలా దానిని నువ్వు ఆయన దగ్గరకు తీసుకు వెళ్ళు>> అంది.
\p
\s5
\v 11 దానికి యాకోబు తన తల్లితో <<నా అన్న ఏశావుకు ఒళ్ళంతా జుట్టు ఉంది. నేను నున్నగా ఉంటాను.
\v 12 ఒకవేళ మా నాన్న నన్ను తడిమి చూశాడనుకో. అప్పుడు నేను అతని దృష్టికి ఒక మోసగాడిలా ఉంటాను. అప్పుడిక నా మీదికి ఆశీర్వాదం స్థానంలో శాపం వస్తుంది>> అన్నాడు.
\p
\s5
\v 13 కానీ అతని తల్లి <<కొడుకా, ఆ శాపం నాపైకి వస్తుంది గాక! నువ్వు మాత్రం నా మాట విను. వెళ్ళి నేను చెప్పినట్టు వాటిని నా దగ్గరకు తీసుకుని రా>> అని చెప్పింది.
\v 14 కాబట్టి యాకోబు రెండు మేక పిల్లలను పట్టుకుని వాటిని తన తల్లి దగ్గరకు తీసుకుని వచ్చాడు. ఆమె వాటితో అతని తండ్రి ఇష్టపడే విధంగా రుచికరంగా వండి భోజనం సిద్ధం చేసింది.
\p
\s5
\v 15 రిబ్కా ఇంట్లో ఆమె పెద్ద కొడుకు ఏశావుకు చెందిన మంచి బట్టలు ఉన్నాయి.
\v 16 ఆమె వాటిని యాకోబుకు తొడిగింది. మేక పిల్లల చర్మాన్ని అతని మెడ పైని నున్నని భాగంలో కప్పింది.
\v 17 తాను వండి సిద్ధం చేసిన రుచికరమైన వంటకాలనూ రొట్టెనూ తన కొడుకైన యాకోబు చేతికిచ్చింది.
\p
\s5
\v 18 అతడు తన తండ్రి దగ్గరకు వచ్చాడు. నాన్నగారూ, అని పిలిచాడు. ఇస్సాకు <<కొడుకా ఏమిటి? నువ్వు ఎవరివి?>> అని అడిగాడు.
\v 19 దానికి యాకోబు <<నేను ఏశావుని. నీ పెద్ద కొడుకుని. నువ్వు నాకు చెప్పినట్టే చేశాను. లేచి నేను వేటాడి తెచ్చిన దానిని తిని నన్ను ఆశీర్వదించు>>అన్నాడు.
\p
\s5
\v 20 అప్పుడు ఇస్సాకు తన కొడుకుతో <<నా కొడుకా అది ఇంత త్వరగా నీకు ఎలా దొరికింది?>> అన్నాడు. దానికి యాకోబు <<నీ దేవుడైన యెహోవా దానిని నా ముందుకు రప్పించాడు. అందుకే ఇంత త్వరగా దొరికింది>> అన్నాడు.
\v 21 అప్పుడు ఇస్సాకు <<నా కొడుకా, నువ్వు ఏశావువి అవునో కాదో తడిమి చూస్తా. దగ్గరకు రా>> అన్నాడు.
\p
\s5
\v 22 యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చాడు. అతడు యాకోబును తడిమి చూసి ఇలా అన్నాడు, <<స్వరం యాకోబుది కానీ చేతులు ఏశావు చేతులే>> అన్నాడు.
\v 23 యాకోబు చేతులు అతని అన్న అయిన ఏశావు చేతుల్లా జుట్టు కలిగి ఉండటంతో ఇస్సాకు యాకోబును గుర్తు పట్టలేకపోయాడు. కాబట్టి ఇస్సాకు అతణ్ణి ఆశీర్వదించాడు.
\p
\s5
\v 24 <<నువ్వు నిజంగా నా కొడుకు ఏశావువేనా?>> అని అడిగాడు. యాకోబు, <<అవును నేనే>> అన్నాడు.
\v 25 అప్పుడు ఇస్సాకు, <<ఆ ఆహారం తీసుకురా. నువ్వు వేటాడి తెచ్చిన దాన్ని నేను తిని నిన్ను ఆశీర్వదిస్తాను>> అన్నాడు. యాకోబు ఆహారం తీసుకు వచ్చాడు. దానిని అతడు తిన్నాడు. ద్రాక్షారసం తీసుకు వస్తే తాగాడు.
\p
\s5
\v 26 అప్పుడు అతని తండ్రి అయిన ఇస్సాకు <<నా కొడుకా, దగ్గరకు వచ్చి నాకు ముద్దు పెట్టు>> అన్నాడు.
\v 27 యాకోబు దగ్గరకు వచ్చి అతణ్ణి ముద్దు పెట్టుకొన్నాడు. అప్పుడు ఇస్సాకు అతని బట్టలు వాసన చూసి అతణ్ణి ఆశీర్వదిస్తూ ఇలా అన్నాడు.
\q1 <<చూడు, నా కొడుకు సువాసన
\p యెహోవా ఆశీర్వదించిన చేని సువాసనలాగా ఉంది.
\p
\s5
\v 28 ఆకాశం నుండి కురిసే మంచులో ఒక భాగాన్నీ,
\p భూమి సమృద్దిలో ఒక భాగాన్నీ, విస్తారమైన ధాన్యాన్నీ,
\p ద్రాక్షారసాన్నీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు గాక!
\p
\s5
\v 29 ప్రజలు నీకు సేవలు చేస్తారు గాక!
\p జాతులు నీ ముందు సాగిలపడతారు గాక!
\p నీ బంధువులందరికీ నువ్వు రాజువి అవుతావు.
\p నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడతారు గాక!
\p నిన్ను శపించేవారు శాపానికి గురి అవుతారు గాక!
\p నిన్ను ఆశీర్వదించే వారికి ఆశీర్వాదం కలుగుతుంది గాక.>>
\p
\s5
\v 30 ఇలా ఇస్సాకు యాకోబును ఆశీర్వదించిన తర్వాత యాకోబు తన తండ్రి ఇస్సాకు దగ్గర్నుంచి వెళ్ళిపోయాడు. వెంటనే అతని అన్న వేట నుండి తిరిగి వచ్చాడు.
\v 31 అతడు కూడా రుచికరమైన ఆహారం సిద్ధం చేసి తన తండ్రి దగ్గరకు తెచ్చాడు. <<నాన్నా, నీ కొడుకు వేటాడి తెచ్చిన దానిని తిని నన్ను ఆశీర్వదించు>> అని తండ్రితో అన్నాడు.
\p
\s5
\v 32 అతని తండ్రి అయిన ఇస్సాకు <<నువ్వు ఎవరివి?>> అని అడిగాడు. అతడు <<నేను నీ కొడుకుని. ఏశావు అనే నీ పెద్ద కొడుకుని>> అన్నాడు.
\v 33 దాంతో ఇస్సాకు గడగడ వణికిపోయాడు. <<అలా అయితే వేటాడిన మాంసం నా దగ్గరకు పట్టుకు వచ్చినదెవరు? నువ్వు రాకముందు నేను వాటన్నిటినీ తిని అతణ్ణి ఆశీర్వదించాను. తప్పనిసరిగా అతడే దీవెన పొందినవాడు.>>
\p
\s5
\v 34 ఏశావు తన తండ్రి మాటలు విని ఎంతో వేదనతో పెద్ద కేక పెట్టాడు. ఏడ్చాడు. తన తండ్రితో <<నాన్నా, నన్ను కూడా ఆశీర్వదించు>>అన్నాడు.
\v 35 ఇస్సాకు <<నీ తమ్ముడు మోసంతో వేషం వేసుకుని వచ్చి నీ ఆశీర్వాదాన్ని తీసుకువెళ్ళాడు>> అన్నాడు.
\p
\s5
\v 36 ఏశావు ఇలా అన్నాడు, <<యాకోబు అనే పేరు వాడికి చక్కగా సరిపోయింది. వాడు నన్ను రెండు సార్లు మోసం చేశాడు. నా జ్యేష్ఠత్వపు జన్మహక్కు తీసుకున్నాడు. ఇప్పుడు నాకు రావలసిన ఆశీర్వాదం తీసుకు పోయాడు.>> ఇలా చెప్పి ఏశావు తన తండ్రిని <<నాకోసం ఇక ఏ ఆశీర్వాదమూ మిగల్చలేదా?>> అని అడిగాడు.
\v 37 అందుకు ఇస్సాకు <<చూడు, అతణ్ణి నీకు యజమానిగా నియమించాను. అతని బంధువులందరినీ అతనికి సేవకులుగా ఇచ్చాను. ధాన్యాన్నీ కొత్త ద్రాక్షారసాన్నీ అతనకి ఇచ్చాను? ఇవి కాక నీకు ఇంకా ఏ ఆశీర్వాదాలు మిగిలి ఉన్నాయి?>> అన్నాడు.
\p
\s5
\v 38 ఏశావు తన తండ్రితో, <<నాన్నా, నీ దగ్గర ఒక్క ఆశీర్వాదమూ లేదా? నాన్నా, నన్ను కూడా ఆశీర్వదించు>>అంటూ గట్టిగా ఏడ్చాడు.
\p
\s5
\v 39 అతని తండ్రి ఇస్సాకు అతనికిలా జవాబిచ్చాడు.
\q1 <<చూడు, నీ నివాసం భూసారానికి దూరంగా ఉంటుంది.
\p పైనుండి ఆకాశపు మంచు దాని మీద కురవదు.
\p
\v 40 నువ్వు నీ కత్తిమీద ఆధారపడి జీవిస్తావు.
\p నీ తమ్ముడికి దాసుడివి అవుతావు.
\p కానీ నువ్వు తిరగబడితే అతని కాడిని నీ మెడపైనుండి విరిచి వేస్తావు.>>
\p
\s5
\v 41 యకోబుకు తన తండ్రి ఇచ్చిన ఆశీర్వాదం విషయమై ఏశావు అతణ్ణి ద్వేషించాడు. ఏశావు ఇలా అనుకున్నాడు. <<నా తండ్రి చనిపోయే రోజు ఎంతో దూరం లేదు. అది అయ్యాక నా తమ్ముడు యాకోబును చంపుతాను.>>
\v 42 తన పెద్దకొడుకు ఏశావు పలికిన ఈ మాటలను గూర్చి రిబ్కా వింది. ఆమె తన చిన్నకొడుకు యాకోబును పిలిపించింది. అతనితో, <<చూడు, నీ అన్న ఏశావు నిన్ను చంపుతాను అనుకుంటూ తనను తాను ఓదార్చుకుంటున్నాడు.
\p
\s5
\v 43 కాబట్టి కొడుకా, నా మాట విను. హారానులో ఉన్న నా సోదరుడు లాబాను దగ్గరకు పారిపో.
\v 44 నీ అన్న కోపం చల్లారే వరకూ కొద్ది రోజులు అక్కడే అతనితోనే ఉండు.
\v 45 నీ అన్న కోపం పూర్తిగా చల్లారిపోయి, నువ్వు అతనికి చేసిన దానిని అతడు మర్చిపోయే వరకూ అక్కడ ఉండు. అప్పుడు నేను అక్కడనుండి నిన్ను పిలిపిస్తాను. ఒక్క రోజులోనే నేను మీ ఇద్దరినీ పోగొట్టుకోవడం ఎందుకు?>> అంది.
\p
\s5
\v 46 రిబ్కా ఇస్సాకుతో, <<ఏశావు పెళ్ళాడిన హేతు జాతి స్త్రీల వల్ల నా ప్రాణం విసిగిపోయింది. ఈ దేశపు అమ్మాయిలైన హేతు కుమార్తెలలో వీళ్ళలాంటి మరో అమ్మాయిని యాకోబు కూడా పెళ్ళి చేసుకుంటే ఇక నేను బతికి ఏం ప్రయోజనం?>> అంది.
\s5
\c 28
\p
\v 1 ఇస్సాకు యాకోబును పిలిపించి <<నువ్వు కనాను అమ్మాయిల్లో ఎవరినీ పెళ్ళి చేసుకోకూడదు.
\v 2 నువ్వు పద్దనరాములో ఉన్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ మేనమామ లాబాను కుమార్తెలలో ఒకామెను వివాహం చేసుకో
\s5
\v 3 సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి, నువ్వు అనేక జనాంగాలయ్యేలా నీకు సంతానాభివృద్ధి కలిగించి, నిన్ను విస్తరింపజేసి నువ్వు పరవాసిగా ఉన్న దేశాన్ని, అంటే దేవుడు అబ్రాహాముకు ఇచ్చిన దేశాన్ని నువ్వు వారసత్వంగా పొందేలా
\v 4 ఆయన నీకూ నీ సంతానానికీ అబ్రాహాముకు అనుగ్రహించిన ఆశీర్వాదాన్ని దయచేస్తాడు గాక>> అని దీవించి పంపివేశాడు.
\s5
\v 5 అతడు పద్దనరాములో ఉన్న లాబాను దగ్గరకి ప్రయాణమయ్యాడు. లాబాను సిరియావాడు బెతూయేలు కుమారుడూ యాకోబు, ఏశావుల తల్లి అయిన రిబ్కా సోదరుడూ.
\p
\s5
\v 6 ఇస్సాకు యాకోబును దీవించి, పద్దనరాములో పెళ్ళి చేసికొని రావడానికి అతణ్ణి అక్కడికి పంపాడనీ అతనిని దీవించినప్పుడు <<నువ్వు కనాను దేశపు అమ్మాయిల్లో ఎవరినీ పెళ్ళి చేసుకోవద్దు>> అని అతనికి ఆజ్ఞాపించాడనీ ఏశావుకు తెలిసింది.
\v 7 యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరాముకు వెళ్ళిపోయాడనీ,
\s5
\v 8 ఇదిగాక కనాను స్త్రీలు తన తండ్రి ఇస్సాకుకు ఇష్టం లేదనీ ఏశావు తెలుసుకున్నాడు.
\v 9 అతడు ఇష్మాయేలు దగ్గరకు వెళ్ళి, తనకున్న భార్యలు గాక అబ్రాహాము కుమారుడు ఇష్మాయేలు కూతురు, నెబాయోతు సోదరి అయిన మహలతును కూడా పెళ్ళి చేసుకున్నాడు.
\p
\s5
\v 10 యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్తూ
\v 11 ఒకచోట పొద్దుగుంకడంతో అక్కడ ఆ రాత్రి ఆగిపోయి, అక్కడి రాళ్ళలో ఒక దానిని తనకు తలగడగా చేసికొని, పడుకున్నాడు.
\s5
\v 12 అప్పుడతనికి ఒక కల వచ్చింది. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలిపి ఉంది. దాని కొన ఆకాశాన్ని అంటింది. దానిమీద దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు.
\v 13 యెహోవా దానికి పైగా నిలబడి, <<నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు అయిన యెహోవాని. నువ్వు పండుకున్న ఈ భూమిని నీకూ నీ సంతానానికీ ఇస్తాను.
\p
\s5
\v 14 నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల్లాగా అసంఖ్యాకంగా పెరిగిపోతుంది. నువ్వు పడమర, తూర్పు, ఉత్తరం, దక్షిణం దిక్కులకు వ్యాపిస్తావు. భూమి మీద వంశాలన్నీ నీ మూలంగా, నీ సంతానం మూలంగా ఆశీర్వాదం పొందుతాయి.
\v 15 ఇదిగో నేను నీకు తోడై ఉండి, నువ్వు వెళ్ళే ప్రతి చోటా నిన్ను కాపాడి ఈ దేశానికి నిన్ను మళ్ళీ రప్పిస్తాను. నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకూ నిన్ను విడిచిపెట్టను>> అని చెప్పాడు.
\p
\s5
\v 16 యాకోబు నిద్ర మేలుకొని <<నిశ్చయంగా యెహోవా ఈ స్థలంలో ఉన్నాడు. అది నాకు తెలియలేదు>> అనుకున్నాడు.
\v 17 అతడు భయపడి, <<ఈ స్థలం ఎంతో భయం గొలిపేది. ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు.
\s5
\v 18 పరలోకద్వారం ఇదే>> అనుకున్నాడు.
\p తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దానిని స్తంభంగా నిలబెట్టి, దాని కొనమీద నూనె పోశాడు.
\v 19 అతడు ఆ స్థలానికి బేతేలు అనే పేరు పెట్టాడు. మొదట ఆ ఊరి పేరు లూజు.
\s5
\v 20 అప్పుడు యాకోబు, <<నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చేలా దేవుడు నాకు తోడై ఉండి, నేను వెళ్తున్న ఈ మార్గంలో నన్ను కాపాడి,
\v 21 తినడానికి ఆహారమూ ధరించడానికి వస్త్రాలూ నాకు దయచేసినట్లైతే యెహోవా నాకు దేవుడై ఉంటాడు.
\v 22 అంతేకాదు, స్తంభంగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరం అవుతుంది. నువ్వు నాకిచ్చే సమస్తంలో పదవ వంతు నీకు తప్పక చెల్లిస్తాను>> అని మొక్కుకున్నాడు.
\s5
\c 29
\p
\v 1 యాకోబు బయలుదేరి తూర్పు ప్రజల దేశానికి వెళ్ళాడు.
\v 2 అక్కడ అతనికి పొలంలో ఒక బావి కనబడింది. దాని దగ్గర మూడు గొర్రెల మందలు పండుకొని ఉన్నాయి. కాపరులు తమ మందలకు ఆ బావి నీళ్ళు పెడతారు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉంది.
\v 3 అక్కడికి మందలన్నీ వచ్చి చేరినప్పుడు ఆ బావి మీద నుండి ఆ రాయిని తొలగించి, గొర్రెలకు నీళ్ళు పెట్టి తిరిగి బావి మీద రాయిని పెట్టేస్తారు.
\s5
\v 4 యాకోబు వారిని చూసి, <<సోదరులారా, మీరెక్కడి వాళ్ళు?>> అని అడగ్గా వారు, <<మేము హారాను వాళ్ళం>> అన్నారు.
\v 5 అతడు <<నాహోరు కుమారుడు లాబాను మీకు తెలుసా?>> అని వారిని అడిగితే వారు, <<అవును, మాకు తెలుసు>> అన్నారు.
\v 6 <<అతడు క్షేమంగా ఉన్నాడా?>> అని అడిగినప్పుడు వారు, <<క్షేమంగానే ఉన్నాడు, అదిగో, అతని కూతురు రాహేలు గొర్రెల వెనకాలే వస్తున్నది>> అని చెప్పారు.
\p
\s5
\v 7 అతడు <<ఇదిగో, ఇంకా చాలా పొద్దు ఉంది, పశువుల్ని సమకూర్చే వేళ కాలేదు, గొర్రెలకు నీళ్ళు పెట్టి, పోయి వాటిని మేపండి>> అని చెప్పినప్పుడు,
\v 8 వారు, <<మందలన్నిటినీ మళ్ళించే దాకా అది మా వల్ల కాదు. బావి మీద నుండి రాయిని దొర్లిస్తారు. అప్పుడే మేము గొర్రెలకు నీళ్ళు పెడతాం>> అన్నారు.
\p
\s5
\v 9 అతడు వారితో ఇంకా మాట్లాడుతూ ఉండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకు వచ్చింది. ఆమె వాటిని మేపుతున్నది.
\v 10 యాకోబు తన మేనమామ అయిన లాబాను కూతురు రాహేలును, అతని గొర్రెలను చూసినప్పుడు, అతడు దగ్గరకు వెళ్ళి బావి మీద నుండి రాతిని దొర్లించి తన మేనమామ లాబాను గొర్రెలకు నీళ్ళు పెట్టాడు. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకొని పెద్దగా ఏడ్చాడు.
\s5
\v 11 యాకోబు తాను ఆమె తండ్రి బంధువుననీ,
\v 12 రిబ్కా కుమారుణ్ణి అనీ రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరుగెత్తి వెళ్లి తన తండ్రితో చెప్పింది.
\s5
\v 13 లాబాను తన సోదరి కుమారుడైన యాకోబు సమాచారం విన్నప్పుడు అతణ్ణి ఎదుర్కోడానికి పరుగెత్తుకొని వచ్చి అతని కౌగలించి ముద్దు పెట్టుకొని తన ఇంటికి తీసుకు వెళ్ళాడు. యాకోబు ఈ సంగతులన్నీ లాబానుతో చెప్పాడు.
\v 14 అప్పుడు లాబాను <<నిజంగా నువ్వు నా ఎముకవీ నా మాంసానివీ>> అన్నాడు.
\p యాకోబు నెల రోజులు అతని దగ్గర నివసించిన తరువాత,
\s5
\v 15 లాబాను <<నువ్వు నా బంధువ్వి కాబట్టి ఉచితంగా నాకు కొలువు చేస్తావా? నీకేం జీతం కావాలో చెప్పు>> అని యాకోబును అడిగాడు.
\v 16 లాబానుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు.
\v 17 లేయావి మబ్బు కళ్ళు, రాహేలు ఆకర్షణీయంగా అందంగా ఉంది.
\v 18 యాకోబు రాహేలును ప్రేమించి, <<నీ చిన్న కూతురు రాహేలు కోసం నీకు ఏడు సంవత్సరాలు సేవ చేస్తాను>> అన్నాడు.
\p
\s5
\v 19 అందుకు లాబాను <<ఆమెని పరాయివాడికి ఇవ్వడం కంటే నీకివ్వడం మేలు కదా, నా దగ్గర ఉండు>> అని చెప్పాడు.
\v 20 యాకోబు రాహేలు కోసం ఏడు సంవత్సరాలు పని చేశాడు. అయినా అతడు ఆమెను ప్రేమించడం వలన అవి అతనికి చాలా తక్కువ రోజులుగా అనిపించాయి.
\p
\s5
\v 21 తరువాత యాకోబు <<నా రోజులు పూర్తి అయ్యాయి కాబట్టి నేను నా భార్య దగ్గరకు పోతాను, ఆమెను నాకివ్వు>> అని లాబానును అడిగాడు.
\v 22 లాబాను ఆ స్థలంలో ఉన్న మనుషులందరిని పోగుచేసి విందు చేయించి
\s5
\v 23 రాత్రి వేళ తన పెద్ద కూతురు లేయాని అతని దగ్గరకు తీసికొని వెళ్ళాడు. యాకోబు ఆమెతో ఆ రాత్రి గడిపాడు.
\v 24 లాబాను తన దాసి అయిన జిల్పాను తన కూతురు లేయాకు దాసిగా ఇచ్చాడు.
\p
\v 25 తెల్లవారిన తరువాత యాకోబు ఆమె లేయా అని తెలుసుకొని లాబానుతో <<నువ్వు నాకు చేసిన పని యేమిటి? రాహేలు కోసమే గదా నేను నీకు సేవ చేసింది? ఎందుకు నన్ను మోసపుచ్చావు?>> అన్నాడు.
\s5
\v 26 అందుకు లాబాను, <<పెద్దదాని కంటె ముందుగా చిన్నదానికి పెళ్ళి చేయడం మా దేశమర్యాద కాదు.
\v 27 ముందు ఈమె ఏడు నిద్రలు పూర్తి చెయ్యి. నువ్వు ఇంకా ఏడు సంవత్సరాలు నాకు సేవ చేస్తానంటే, అందుకు ప్రతిఫలంగా రెండో ఆమెను కూడ నీకిస్తాం>> అని చెప్పాడు.
\s5
\v 28 యాకోబు ఆ విధంగా లేయా వారం సంపూర్తి చేసిన తరువాత లాబాను తన కూతురు రాహేలును కూడా అతనికి భార్యగా ఇచ్చాడు.
\v 29 లాబాను తన దాసి అయిన బిల్హాను తన కూతురు రాహేలుకు దాసిగా ఇచ్చాడు.
\v 30 యాకోబు రాహేలుతో రాత్రి గడిపాడు. అతడు లేయా కంటె రాహేలును ఎక్కువగా ప్రేమించి లాబానుకు మరి ఏడు సంవత్సరాలు సేవ చేశాడు.
\p
\s5
\v 31 అతడు లేయాను ప్రేమించక పోవడం చూసి యెహోవా ఆమె గర్భం తెరిచాడు. రాహేలు గొడ్రాలుగా ఉంది.
\v 32 లేయా గర్భవతి అయ్యి, కొడుకును కని, <<యెహోవా నా కష్టాన్నిచూశాడు కాబట్టి నా భర్త నన్ను ప్రేమిస్తాడు>> అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టింది.
\s5
\v 33 ఆమె మళ్ళీ గర్భవతి అయ్యి, కొడుకును కని, <<నేను ప్రేమకు నోచుకోలేదనే సంగతి యెహోవా విన్నాడు కాబట్టి వీడిని కూడా నాకు దయచేశాడు>> అనుకొని అతనికి షిమ్యోను అని పేరు పెట్టింది.
\p
\v 34 ఆమె మళ్ళీ గర్భవతి అయ్యి, కొడుకుని కని <<చివరికి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉంటాడు. ఎందుకంటే అతనికి ముగ్గురు కొడుకుల్ని కన్నాను>> అనుకొని అతనికి లేవి అని పేరు పెట్టింది.
\s5
\v 35 ఆమె మళ్ళీ గర్భవతి అయ్యి కొడుకుని కని, <<ఈసారి యెహోవాను స్తుతిస్తాను>> అనుకొని అతనికి యూదా అని పేరు పెట్టింది. తరువాత ఆమె కానుపులు ఆగిపోయాయి.
\s5
\c 30
\p
\v 1 రాహేలు యాకోబు ద్వారా తనకు పిల్లలు కలగక పోవడం చూసి తన అక్క మీద అసూయపడింది. ఆమె యాకోబుతో, <<నాకు గర్భఫలమియ్యి. లేకపోతే నేను చచ్చిపోతాను>> అంది.
\v 2 యాకోబు కోపం రాహేలు మీద రగులుకొంది. అతడు, <<నీకు గర్భఫలం ఇవ్వకుండా ఉన్న దేవుని స్థానంలో నేను ఉన్నానా?>> అన్నాడు.
\s5
\v 3 అందుకు ఆమె, <<నా దాసి బిల్హా ఉంది గదా, ఆమెతో రాత్రి గడుపు. ఆమె నా కోసం పిల్లల్ని కంటుంది. ఆ విధంగా ఆమె వలన నాకు కూడా పిల్లలు కలుగుతారు>> అని చెప్పి
\v 4 తన దాసి బిల్హాను అతనికి భార్యగా ఇచ్చింది. యాకోబు ఆమెతో లైంగికంగా కలిశాడు.
\p
\s5
\v 5 అప్పుడు బిల్హా గర్భవతి అయ్యి యాకోబుకు ఒక కొడుకుని కన్నది.
\v 6 అప్పుడు రాహేలు, <<దేవుడు నాకు తీర్పు తీర్చాడు. ఆయన నా మొర విని నాకు కుమారుణ్ణి దయచేశాడు>> అనుకొని అతనికి దాను అని పేరు పెట్టింది.
\s5
\v 7 రాహేలు దాసి బిల్హా మళ్ళీ గర్భవతి అయ్యి యాకోబుకు రెండవ కొడుకుని కన్నది.
\v 8 అప్పుడు రాహేలు, <<దేవుని కృప విషయంలో నా అక్కతో పోరాడి గెలిచాను>> అనుకొని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టింది.
\p
\s5
\v 9 లేయా తనకు కానుపు ఉడిగిపోవడం చూసి తన దాసి జిల్పాను యాకోబుకు భార్యగా ఇచ్చింది.
\v 10 జిల్పా యాకోబుకు కొడుకుని కన్నది.
\v 11 అప్పుడు లేయా, <<ఇది అదృష్టమే గదా>> అనుకొని అతనికి గాదు అని పేరు పెట్టింది.
\s5
\v 12 లేయా దాసి జిల్పా యాకోబుకు రెండవ కొడుకుని కన్నది.
\v 13 లేయా, <<నేను భాగ్యవంతురాలిని. స్త్రీలు నన్ను భాగ్యవతి అంటారు కదా>> అని అతనికి ఆషేరు అని పేరు పెట్టింది.
\p
\s5
\v 14 గోధుమల కోతకాలంలో రూబేను వెళ్ళి పొలంలో మంత్రమూలిక వేర్లు చూసి తన తల్లి లేయాకు తెచ్చి ఇచ్చాడు. అప్పుడు రాహేలు, <<నీ కొడుకు తెచ్చిన మంత్రమూలికల్లో కొన్ని నాకు ఇవ్వు>> అని లేయాతో అంది.
\v 15 అందుకామె, <<నా భర్తను తీసుకున్నావు కదా, అది చాలదా? ఇప్పుడు నా కొడుకు తెచ్చిన మూలికలు కూడా తీసుకుంటావా>> అంది. అందుకు రాహేలు, <<అలాగైతే నీ కొడుకు తెచ్చిన మూలికల నిమిత్తం ని భర్త ఈ రాత్రి నీతో గడుపుతాడు>> అని చెప్పింది.
\p
\s5
\v 16 ఆ సాయంకాలం యాకోబు పొలం నుండి వచ్చేటప్పుడు లేయా అతనికి ఎదురు వెళ్లి, <<నువ్వు నా దగ్గరకు రావాలి. నా కొడుకు తెచ్చిన మంత్రమూలికలతో నిన్ను కొన్నాను>> అని చెప్పింది. కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో ఉన్నాడు.
\v 17 దేవుడు లేయా మనవి విన్నాడు, ఆమె గర్భవతి అయ్యి యాకోబుకు అయిదవ కొడుకుని కన్నది.
\v 18 లేయా, <<నా భర్తకు నా దాసిని ఇవ్వడం వలన దేవుడు నాకు ప్రతిఫలం దయచేశాడు>> అనుకొని అతనికి ఇశ్శాఖారు అని పేరు పెట్టింది.
\s5
\v 19 లేయా మళ్ళీ గర్భవతి అయ్యి యాకోబుకు ఆరవ కొడుకుని కన్నది.
\v 20 అప్పుడు లేయా, <<దేవుడు నాకు మంచి బహుమతి దయచేశాడు. నా భర్తకు ఆరుగురు కొడుకుల్ని కన్నాను. కాబట్టి అత డు ఇకపై నాతో కాపురం చేస్తాడు>> అనుకొని అతనికి జెబూలూను అని పేరు పెట్టింది.
\v 21 ఆ తరువాత ఆమె ఒక కూతురిని కని ఆమెకు దీనా అనే పేరు పెట్టింది.
\p
\s5
\v 22 దేవుడు రాహేలును జ్ఞాపకం చేసికొని, ఆమె మనవి విని ఆమె గర్భం తెరిచాడు.
\v 23 అప్పుడామె గర్భవతి అయ్యి కొడుకును కని, <<దేవుడు నా నింద తొలగించాడు>> అనుకుంది.
\v 24 ఇంకా ఆమె <<యెహోవా నాకు ఇంకొక కొడుకుని ఇస్తాడు గాక>> అనుకొని అతనికి యోసేపు అనే పేరు పెట్టింది.
\p
\s5
\v 25 రాహేలు యోసేపును కన్న తరువాత యాకోబు లాబానుతో, <<నన్ను పంపివేయి. నా స్థలానికి, నా దేశానికి తిరిగి వెళ్తాను.
\v 26 నా భార్యలను, నా పిల్లలను నా కప్పగించు. నేను వెళ్ళిపోతాను, వారి కోసం నీకు సేవ చేశాను. నేను సేవ చేసిన విధానం నీకు తెలుసు కదా>> అని చెప్పాడు.
\s5
\v 27 అందుకు లాబాను అతనితో, <<నీ దయ నా మీద ఉంటే నా మాట విను. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించాడని నేను శకునం చూసి తెలుసుకున్నాను.
\v 28 నీ జీతం ఇంత అని నాతో స్పష్టంగా చెప్పు, అది నీకు ఇస్తాను>> అన్నాడు.
\p
\s5
\v 29 యాకోబు అతణ్ణి చూసి, <<నేను నీకేవిధంగా సేవ చేశానో, నీ మందలు నా దగ్గర ఎలా ఉండేవో అది నీకు తెలుసు.
\v 30 నేను రాకముందు నీకున్నది కొంచెమే, అయితే అది బాగా అభివృద్ధి పొందింది. నేను అడుగు పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. అయితే నేను నా స్వంతఇంటివారి కోసం ఎప్పుడు సంపాదించుకుంటాను?>> అన్నాడు.
\p
\s5
\v 31 అప్పుడు లాబాను, <<నేను నీకేమివ్వాలి?>> అని అడిగాడు. అందుకు యాకోబు, <<నువ్వు నాకేమీ ఇయ్యవద్దు, నువ్వు నాకోసం నేను చెప్పిన విధంగా చేస్తే, నేను తిరిగి నీ మందను మేపుతూ వాటి బాగోగులు చూస్తాను.
\v 32 ఈ రోజు నేను నీ మంద అంతటిలో నడచి చూసి పొడలైనా మచ్చలైనా గల ప్రతి గొర్రెను గొర్రెపిల్లల్లో నల్లని ప్రతిదానినీ, మేకలలో మచ్చలైనా, పొడలైనా గలవాటినీ వేరు చేస్తున్నాను. అలాటివన్నీ నాకు జీతమౌతాయి.
\s5
\v 33 ఇక ముందు నాకు రావలసిన జీతం గూర్చి నువ్వు చూడడానికి వచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనే నాకు సాక్ష్యం అవుతుంది. మేకలలో పొడలూ మచ్చలూ లేనివీ, గొర్రెపిల్లల్లో నల్లగా లేనివీ నా దగ్గర ఉంటే నేను దొంగిలించానని చెప్పవచ్చు>> అన్నాడు.
\v 34 అందుకు లాబాను, <<మంచిది, నీ మాట ప్రకారమే కానివ్వు>> అన్నాడు.
\p
\s5
\v 35 ఆ రోజు లాబాను చారలూ, మచ్చలూ ఉన్న మేకపోతులనూ, పొడలూ మచ్చలూ గల ఆడ మేకలనూ కొంచెం తెలుపు గల ప్రతిదానినీ గొర్రెపిల్లల్లో నల్లవాటినీ అన్నిటినీ వేరుచేసి తన కొడుకులకు అప్పగించాడు.
\v 36 తనకూ యాకోబుకూ మధ్య మూడు రోజుల ప్రయాణమంత దూరం పెట్టాడు. లాబానుకు చెందిన మిగిలిన మందను యాకోబు మేపుతూ ఉన్నాడు.
\p
\s5
\v 37 యాకోబు చినారు, జంగిసాలు అనే చెట్ల చువ్వలు తీసికొని ఆ చువ్వల్లో తెల్లచారలు కనబడేలా అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచాడు.
\v 38 మందలు నీళ్ళు తాగడానికి వచ్చినప్పుడు అవి చూలు కట్టడం కోసం అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు తాగడానికి వచ్చే కాలవల్లో, నీటి గాళ్ళలో, వాటి ముందు పెట్టాడు.
\p
\s5
\v 39 అప్పుడు ఆ మందలు ఆ చువ్వల ముందు చూలు కట్టి చారలు, పొడలు, మచ్చలు గల పిల్లలను ఈనాయి.
\v 40 యాకోబు ఆ గొర్రెపిల్లల్ని వేరుచేసి, చారలుగల వాటి వైపుకు, లాబాను మందలలో నల్లని వాటి వైపుకు మందల ముఖాలు తిప్పి తన మందల్ని లాబాను మందలతో ఉంచకుండా వాటిని వేరుగా ఉంచాడు.
\s5
\v 41 మందలో బలమైనవి చూలు కట్టినప్పుడెల్లా అవి ఆ చువ్వల ముందు చూలు కట్టే విధంగా యాకోబు మందకు ఎదురుగా కాలవల్లో ఆ చువ్వలు పెట్టాడు.
\v 42 మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు. ఆ విధంగా బలహీనమైనవి లాబానుకూ బలమైనవి యాకోబుకూ వచ్చాయి.
\p
\s5
\v 43 ఆ విధంగా ఆ మనిషి అత్యధికంగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసదాసీలు, ఒంటెలు, గాడిదలు గలవాడయ్యాడు.
\s5
\c 31
\p
\v 1 లాబాను కొడుకులు<<యాకోబు మన తండ్రికి ఉన్నదంతా తీసుకొని, దాని వలన ఈ ఆస్తి అంతా సంపాదించుకున్నాడు>> అని చెప్పుకోవడం యాకోబు విన్నాడు.
\v 2 అంతే గాక అతడు లాబాను ముఖం చూసినప్పుడు అది తన విషయంలో ఇంతకు ముందులాగా ప్రసన్నంగా లేదు.
\p
\v 3 అప్పుడు యెహోవా, <<నీ పూర్వీకుల దేశానికి, నీ బంధువుల దగ్గరికి తిరిగి వెళ్ళు. నేను నీకు తోడై ఉంటాను>> అని యాకోబుతో చెప్పాడు.
\p
\s5
\v 4 యాకోబు పొలంలో తన మంద దగ్గరికి రాహేలునీ లేయానీ పిలిపించి వారితో,
\v 5 <<ఇంతకు ముందులాగా మీ నాన్న నేనంటే ఇష్టం చూపడం లేదని నాకు కనిపిస్తున్నది. అయితే నా తండ్రి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు.
\v 6 నేను మీ నాన్నకు నా శాయశక్తులా సేవ చేశానని మీకు తెలుసు.
\s5
\v 7 మీ నాన్న నన్ను మోసం చేసి పది సార్లు నా జీతం మార్చాడు. అయినా దేవుడు అతని మూలంగా నాకు నష్టం రానియ్యలేదు.
\p
\v 8 అతడు, <పొడలు గలవి నీ జీతమవుతాయి> అని చెప్పినప్పుడు మందలన్నీ పొడలు గల పిల్లల్ని ఈనాయి. <చారలు గలవి నీ జీతమవుతాయి> అని చెప్పినప్పుడు అవి చారలు గల పిల్లల్ని ఈనాయి.
\v 9 ఆ విధంగా దేవుడు మీ నాన్న మందలను తీసి నాకిచ్చాడు.
\s5
\v 10 మందలు చూలు కట్టే కాలంలో నేను కలలో చూసినపుడు గొర్రెలతో జంటకట్టే పొట్టేళ్ళు చారలు గానీ పొడలు గానీ మచ్చలు గానీ కలిగి ఉన్నాయి.
\p
\v 11 ఆ కలలో దేవుని దూత <యాకోబూ> అని నన్ను పిలిచినప్పుడు నేను <చిత్తం, ప్రభూ> అని అన్నాను.
\s5
\v 12 అప్పుడు ఆయన <నీ కళ్ళు పైకెత్తి చూడు. గొర్రెలతో జంటకట్టే పొట్టేళ్ళన్నీ చారలు, పొడలు, మచ్చలు కలిగి ఉన్నాయి. ఎందుకంటే లాబాను నీకు చేస్తున్న దానంతటినీ నేను చూశాను.
\v 13 నీవెక్కడ స్తంభం మీద నూనె పోశావో, ఎక్కడ నాకు మొక్కుబడి చేశావో, ఆ బేతేలు దేవుణ్ణి నేనే. ఇప్పుడు నువ్వు ఈ దేశం విడిచిపెట్టి నువ్వు పుట్టిన దేశానికి తిరిగి వెళ్ళు> అని నాతో చెప్పాడు>> అన్నాడు.
\p
\s5
\v 14 అందుకు రాహేలు, లేయాలు, <<ఇంకా మా నాన్న ఇంటిలో మాకు వంతు, వారసత్వం ఉన్నాయా? అతడు మమ్మల్ని పరాయివాళ్ళుగా చూడడం లేదా?
\v 15 అతడు మమ్మల్ని అమ్మివేసి, మాకు రావలసిన సొమ్మంతటినీ పూర్తిగా తినేశాడు.
\v 16 దేవుడు మా నాన్న దగ్గరనుండి తీసేసిన ధనమంతా మాదీ మా పిల్లలదీ కాదా? కాబట్టి దేవుడు నీతో ఏది చెబితే అది చెయ్యి>> అని అతనికి జవాబు చెప్పారు.
\p
\s5
\v 17 యాకోబు తన కొడుకుల్నీ తన భార్యల్నీ ఒంటెల మీద ఎక్కించి
\v 18 తన తండ్రి ఇస్సాకు దగ్గరికి వెళ్ళడానికి తన పశువులన్నిటినీ, పద్దనరాములో తాను సంపాదించిన సంపద అంతటినీ తీసికొని కనాను దేశానికి బయలుదేరాడు.
\s5
\v 19 లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి వెళ్ళిన సమయంలో రాహేలు తన తండ్రి ఇంట్లో ఉన్న గృహ దేవతలను దొంగిలించింది.
\v 20 యాకోబు తాను వెళ్ళిపోతున్నట్టు సిరియావాడైన లాబానుకు తెలియ పరచకపోవడం చేత అతణ్ణి మోసపుచ్చినట్టు అయ్యింది.
\v 21 అతడు తనకు కలిగినదంతా తీసికొని పారిపోయాడు. అతడు నది దాటి గిలాదు కొండ ప్రాంతాల వైపు వెళ్ళాడు.
\p
\s5
\v 22 యాకోబు పారిపోయాడని మూడో రోజుకి లాబానుకు తెలిసింది.
\v 23 అతడు తన బంధువుల్ని వెంటబెట్టుకొని, ఏడు రోజుల ప్రయాణమంత దూరం యాకోబును తరుముకొని వెళ్లి, గిలాదు కొండ మీద అతణ్ణి కలుసుకున్నాడు.
\s5
\v 24 ఆ రాత్రి కలలో దేవుడు లాబాను దగ్గరకు వచ్చి, <<నువ్వు యాకోబుతో మంచి గానీ చెడు గానీ పలకవద్దు. జాగ్రత్త సుమా>> అని అతనితో చెప్పాడు.
\v 25 చివరికి లాబాను యాకోబును కలుసుకున్నాడు. యాకోబు తన గుడారాన్ని ఆ కొండ మీద వేసికొని ఉన్నాడు. లాబాను కూడా తన బంధువులతో గిలాదు కొండమీద గుడారం వేసుకున్నాడు.
\p
\s5
\v 26 అప్పుడు లాబాను యాకోబుతో, <<ఏంటి, ఇలా చేశావు? నన్ను మోసపుచ్చి, కత్తితో చెరపట్టిన వారిలాగా నా కూతుళ్ళను తీసుకుపోవడం ఎందుకు?
\v 27 నాకు చెప్పకుండా రహస్యంగా పారిపోయి నన్ను మోసపుచ్చావేంటి? సంబరంగా, పాటలతో, కంజరిలతో, సితారాలతో నిన్ను సాగనంపి ఉండేవాడినే.
\v 28 నేను నా మనవళ్ళనూ, కూతుళ్ళనూ ముద్దు పెట్టుకోనియ్యకుండా బుద్ధిహీనంగా ఇలా చేశావు.
\p
\s5
\v 29 నేను మీకు హాని చేయగలను. అయితే రాత్రి మీ తండ్రి దేవుడు, <జాగ్రత్త సుమా! నువ్వు యాకోబుతో మంచి గానీ చెడు గానీ పలకవద్దు> అని నాతో చెప్పాడు.
\v 30 నీ తండ్రి ఇంటి మీద బెంగ కలిగి వెళ్ళిపోవాలనిపిస్తే వెళ్ళు, నా దేవతలను దొంగిలించావేంటి?>> అన్నాడు.
\p
\s5
\v 31 అందుకు యాకోబు, <<నువ్వు బలవంతంగా నా నుండి నీ కుమార్తెలను తీసుకుంటావేమో అని భయపడ్డాను.
\v 32 ఎవరి దగ్గర నీ దేవతలు కనబడతాయో వారు బతకకూడదు. నువ్వు మన బంధువుల ముందు వెదికి చూసి నీది నా దగ్గర ఏదైనా ఉంటే దానిని తీసుకో>> అని లాబానుతో చెప్పాడు. రాహేలు వాటిని దొంగిలించిందని యాకోబుకు తెలియలేదు.
\s5
\v 33 లాబాను యాకోబు గుడారంలోకీ లేయా గుడారంలోకీ ఇద్దరు దాసీల గుడారాల్లోకీ వెళ్ళాడు గాని అతనికేమీ దొరకలేదు. తరువాత అతడు లేయా గుడారంలో నుండి రాహేలు గుడారంలోకి వెళ్ళాడు.
\p
\s5
\v 34 రాహేలు ఆ విగ్రహాల్ని తీసి ఒంటె సామగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుంది. లాబాను ఆ గుడారమంతా వెదికి చూసినా అవి దొరకలేదు.
\v 35 ఆమె తన తండ్రితో, <<తమ ఎదుట నేను లేఛి నిలబడనందుకు తమరు కోపపడవద్దు. నేను నా నెలసరి కాలంలో ఉన్నాను>> అని చెప్పింది. అతడెంత వెదకినా ఆ విగ్రహాలు దొరకలేదు.
\p
\s5
\v 36 యాకోబు కోపంగా లాబానుతో వాదిస్తూ, <<నేనేం ద్రోహం చేశాను? నీవిలా మండిపడి నన్ను తరమడానికి నేను చేసిన పాపమేంటి?
\v 37 నువ్వు నా సామానంతా తడివి చూశాక నీ ఇంటి వస్తువుల్లో ఏమైనా దొరికిందా? నావారి ముందూ, నీవారి ముందూ దానిని తెచ్చి పెట్టు. వారు మన ఇద్దరి మధ్య తీర్పు తీరుస్తారు.
\s5
\v 38 ఈ ఇరవై సంవత్సరాలూ నేను నీ దగ్గర ఉన్నాను. నీ గొర్రెలైనా మేకలైనా ఏవీ పిల్లలు కనకుండా పోలేదు, నీ మంద పొట్టేళ్ళను దేనినీ నేను తినలేదు.
\v 39 క్రూర జంతువులు చంపివేసిన దానిని నీ దగ్గరకు తీసుకురాకుండా ఆ నష్టం నేనే పెట్టుకున్నాను. పగలైనా, రాత్రైనా, ఇతరులు దొంగిలించిన వాటి విలువను నా దగ్గరే వసూలు చేశావు.
\v 40 నేనెలా ఉన్నానో చూడు, పగలు ఎండకీ రాత్రి మంచుకూ క్షీణించిపోయాను. నా కళ్ళకి నిద్ర అనేదే లేకుండా పోయింది.
\p
\s5
\v 41 నీ ఇద్దరు కూతుళ్ళకోసం పద్నాలుగు సంవత్సరాలూ నీ మంద కోసం ఆరు సంవత్సరాలూ మొత్తం ఇరవై సంవత్సరాలు నీకు సేవ చేస్తూ నీ ఇంట్లో ఉన్నాను. అయినా నువ్వు నా జీతం పదిసార్లు మార్చావు.
\v 42 నా తండ్రి దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండకపోతే నువ్వు నన్ను తప్పకుండా ఖాళీ చేతులతోనే వెళ్ళగొట్టి ఉండేవాడివి. దేవుడు నా ప్రయాసనీ నా చేతుల కష్టాన్నీ చూశాడు. అందుకే గత రాత్రి నిన్ను గద్దించాడు>> అని అన్నాడు.
\p
\s5
\v 43 అందుకు లాబాను, <<ఈ కుమార్తెలు నా కుమార్తెలు, ఈ కుమారులు నా కుమారులు, ఈ మంద నా మంద, నీకు కనబడేదంతా నాదే. ఈ నా కుమార్తెలనైనా, వీరికి పుట్టిన కొడుకులనైనా నేనేం చేయగలను?
\v 44 కాబట్టి నువ్వూ నేనూ ఒక నిబంధన చేసుకుందాం రా. అది నాకూ, నీకూ మధ్య సాక్షిగా ఉంటుంది>> అని యాకోబుతో అన్నాడు.
\s5
\v 45 అప్పుడు యాకోబు ఒక రాయి తీసి దాన్ని ఒక స్తంభంగా నిలబెట్టాడు.
\v 46 <<రాళ్ళు పోగుచేయండి>> అని తన బంధువులతో చెప్పగానే వారు రాళ్ళు తెచ్చి కుప్పగా వేశారు. వారు ఆ కుప్ప దగ్గర భోజనం చేశారు.
\v 47 లాబాను దానికి యగర్‌ శాహదూతా అని పేరు పెట్టాడు. కానీ యాకోబు దానికి గలేదు అని పేరు పెట్టాడు.
\p
\s5
\v 48 లాబాను <<ఈ రోజు ఈ కుప్ప నాకూ నీకూ మధ్య సాక్షిగా ఉంటుంది>> అని చెప్పాడు. అందుకే దానికి గలేదు అనే పేరు వచ్చింది.
\v 49 ఇంకా, <<మనం ఒకరి కొకరం దూరంగా ఉన్నప్పటికీ యెహోవా నాకూ నీకూ మధ్య జరిగేది కనిపెడతాడు>> అని చెప్పాడు కాబట్టి దానికి మిస్పా అని కూడా పేరు పెట్టారు.
\v 50 తరువాత లాబాను, <<నువ్వు నా కుమార్తెలను బాధ పెట్టినా, నా కుమార్తెలను కాక ఇతర స్త్రీలను పెళ్ళి చేసుకున్నా, చూడు, మనదగ్గర ఎవరూ లేకపోయినా, నాకూ నీకూ మధ్య దేవుడే సాక్షి>> అని చెప్పాడు.
\p
\s5
\v 51 అదీ గాక లాబాను, <<నాకూ నీకూ మధ్య నేను నిలబెట్టిన ఈ స్తంభాన్నీ, ఈ రాళ్ళ కుప్పనీ చూడు.
\v 52 నీకు హాని చేయడానికి నేను ఈ కుప్పనీ, ఈ స్తంభాన్నీ దాటి నీ దగ్గరికి రాకుండా, నువ్వు నాకు హాని చేయడానికి ఈ కుప్పనీ, ఈ స్తంభాన్నీ దాటి నా దగ్గరకు రాకుండా ఉండడానికి ఈ కుప్ప, ఈ స్తంభమూ సాక్షి.
\v 53 అబ్రాహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు, మన మధ్య న్యాయం తీరుస్తాడు>> అని చెప్పాడు. అప్పుడు యాకోబు తన తండ్రి ఇస్సాకు భయపడిన దేవుని తోడు అని ప్రమాణం చేశాడు.
\p
\s5
\v 54 యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనం చేయడానికి తన బంధువుల్ని పిలిచినప్పుడు వారు భోజనం చేసి కొండ మీద ఆ రాత్రి గడిపారు.
\v 55 తెల్లవారినప్పుడు లాబాను తన మనుమలనూ తన కుమార్తెలనూ ముద్దు పెట్టుకొని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయాడు.
\s5
\c 32
\p
\v 1 యాకోబు తన దారిలో వెళ్తూ ఉండగా దేవదూతలు అతనికి ఎదురయ్యారు.
\v 2 యాకోబు వారిని చూసి, <<ఇది దేవుని సేన>> అని చెప్పి ఆ చోటికి మహనయీము అని పేరు పెట్టాడు.
\s5
\v 3 యాకోబు ఎదోము ప్రాంతంలో, అంటే శేయీరు దేశంలో ఉన్న తన సోదరుడు ఏశావు దగ్గరకు తనకు ముందుగా దూతలను పంపి,
\v 4 <<మీరు నా ప్రభువైన ఏశావుతో, <ఇంతవరకు నేను లాబాను దగ్గర నివసించాను.
\v 5 నాకు పశువులూ గాడిదలూ మందలూ దాసదాసీజనమూ ఉన్నారు. నీ అనుగ్రహం నాపైనఉండాలని నా ప్రభువుకు తెలపడానికి పంపాను అని నీ సేవకుడైన యాకోబు అన్నాడు> అని చెప్పండి>> అని వారికి ఆజ్ఞాపించాడు.
\p
\s5
\v 6 ఆ దూతలు యాకోబు దగ్గరకు తిరిగివచ్చి, <<మేము నీ సోదరుడైన ఏశావు దగ్గరకు వెళ్ళాం, అతడు నాలుగు వందల మందితో నీకు ఎదురు వస్తున్నాడు>> అని చెప్పారు.
\v 7 అప్పుడు యాకోబు చాలా భయపడి, హతాశుడై,
\v 8 <<ఏశావు ఒక గుంపు మీదికి వచ్చి దాన్ని హతం చేస్తే మిగిలిన గుంపు తప్పించుకొని పోవచ్చు>> అనుకొని, తనతో ఉన్న ప్రజలనూ మందలనూ పశువులనూ ఒంటెలనూ రెండు గుంపులు చేశాడు.
\s5
\v 9 అప్పుడు యాకోబు, <<నా తండ్రి అబ్రాహాము దేవా, నా తండ్రి ఇస్సాకు దేవా, <నీ దేశానికీ, నీ బంధువుల దగ్గరికీ తిరిగి వెళ్ళు, నీకు మేలు చేస్తాను> అని నాతో చెప్పిన యెహోవా,
\v 10 నువ్వు నీ సేవకుడికి చేసిన ఉపకారాలన్నిటికీ నమ్మకత్వమంతటికీ నేను పాత్రుణ్ణి కాను. ఎందుకంటే, కేవలం ఈ నా చేతి కర్రతో ఈ యొర్దాను దాటాను. ఇప్పుడు నేను రెండు గుంపులయ్యాను.
\s5
\v 11 నా సోదరుడు ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించు. అతడు వచ్చి పిల్లలనీ వారి తల్లుల్నీ నన్నూ చంపుతాడేమో అని భయపడుతున్నాను.
\v 12 నాతో, <నేను నీకు తోడై తప్పకుండా మేలు చేస్తూ వారి సంఖ్యను బట్టి లెక్కించలేని సముద్రపు ఇసకలాగా నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను> అని నువ్వు సెలవిచ్చావు కదా>> అన్నాడు.
\p
\s5
\v 13 అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్న ఏశావు కోసం ఒక కానుకను సిద్ధం చేశాడు.
\v 14 అతడు రెండువందల మేకలూ ఇరవై మేక పోతులూ రెండువందల గొర్రెలూ ఇరవై పొట్టేళ్ళూ
\v 15 ముప్ఫై పాడి ఒంటెలూ వాటి పిల్లలూ నలభై ఆవులూ పది ఆబోతులూ ఇరవై ఆడ గాడిదలూ పది గాడిద పిల్లలూ తీసికొని మందమందను వేరు వేరుగా ఉంచాడు.
\v 16 వాటిని అతడు తన దాసులకు అప్పగించి, <<మీరు మంద మందకు మధ్య ఖాళీ ఉంచి నాకంటే ముందుగా నడవండి>> అని వారితో చెప్పాడు.
\p
\s5
\v 17 వారిలో మొదటివాడితో, <<నా సోదరుడు ఏశావు నీకు ఎదురుగా వచ్చి, <నీవెవరి వాడివి? ఎక్కడికి వెళ్తున్నావు? నీ ముందు ఉన్నవి ఎవరివి?> అని నిన్ను అడిగితే
\v 18 నువ్వు, <ఇవి నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభువైన ఏశావు కోసం అతడు పంపిన కానుక. అదిగో అతడు మా వెనక వస్తున్నాడు> అని చెప్పు>> అని ఆజ్ఞాపించాడు.
\s5
\v 19 <<నేను ముందుగా పంపుతున్న కానుకల వలన అతనిని శాంతింపజేసిన తరువాత నేను అతనికి కనబడతాను. అప్పుడతడు ఒకవేళ నా పైన దయ చూపుతాడేమో.
\v 20 కాబట్టి మీరు ఏశావును చూసి, <ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనకాలే వస్తున్నాడు> అని చెప్పాలి>> అని వారికి చెప్పాడు. రెండవ గుంపుకు, మూడవ గుంపుకు, మందల వెంబడి వెళ్ళిన వారికందరికీ అతడు ఇదే విధంగా ఆజ్ఞాపించాడు.
\v 21 అతడు ఆ కానుకను తనకు ముందుగా పంపి తాను గుంపులో ఆ రాత్రి నిలిచిపోయాడు.
\p
\s5
\v 22 ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యల్నీ తన ఇద్దరు దాసీలనీ తన పదకొండు మంది పిల్లల్నీ తీసికొని యబ్బోకు రేవు దాటిపోయాడు.
\v 23 యాకోబు వారిని ఆ యేరు దాటించి తనకు కలిగిందంతా వారితో పంపేశాడు.
\s5
\v 24 యాకోబు ఒక్కడు మిగిలి పోయాడు. ఒక మనిషి తెల్లవారేదాకా అతనితో పెనుగులాడాడు.
\v 25 తాను గెలవకపోవడం చూసి అతడు యాకోబు తొడ గూటి మీద కొట్టాడు. అప్పుడు ఆయనతో పెనుగులాడ్డం వలన యాకోబు తొడ గూడు జారిపోయింది.
\v 26 ఆయన <<తెల్లవారుతున్నది, నన్ను పోనియ్యి>> అన్నప్పుడు, యాకోబు, <<నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను పోనియ్యను>> అన్నాడు.
\p
\s5
\v 27 ఆయన, <<నీ పేరేమిటి?>> అని అడిగాడు. అతడు, <<యాకోబు>> అని చెప్పాడు.
\v 28 అప్పుడాయన, <<నువ్వు దేవునితో, మనుషులతో పోరాడి గెలిచావు. కాబట్టి ఇక ముందు నీ పేరు ఇశ్రాయేలు, యాకోబు కాదు>> అని చెప్పాడు.
\s5
\v 29 అప్పుడు యాకోబు, <<దయచేసి నీ పేరు చెప్పు>> అన్నాడు. అందుకాయన, <<నా పేరు ఎందుకు అడుగుతావు?>> అని చెప్పి అక్కడ అతణ్ణి ఆశీర్వదించాడు.
\v 30 యాకోబు, <<నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూశాను. అయినా నా ప్రాణం నిలిచింది>> అని ఆ స్థలానికి పెనూయేలు అని పేరు పెట్టాడు.
\p
\s5
\v 31 అతడు పెనూయేలు నుండి బయలుదేరి నప్పుడు సూర్యోదయం అయ్యింది. అతడు తొడ కుంటుతూ నడిచాడు.
\v 32 ఆయన యాకోబు తొడగూటి మీది తుంటినరంపై కొట్టి గూడు వసిలేలా చేసాడు కాబట్టి ఈనాటి వరకు ఇశ్రాయేలీయులు తొడ గూటి మీద ఉన్న తుంటినరాన్ని తినరు.
\s5
\c 33
\p
\v 1 యాకోబు కళ్ళెత్తి చూసినప్పుడు ఏశావు, అతనితో నాలుగువందల మంది మనుషులు వస్తూ ఉన్నారు.
\v 2 అప్పుడు అతడు తన పిల్లలను లేయా, రాహేలులకు, ఇద్దరు దాసీలకు అప్పగించాడు. అతడు ముందు దాసీలనూ వారి పిల్లలనూ, వారి వెనక లేయానూ ఆమె పిల్లలనూ, ఆ వెనక రాహేలునూ యోసేపునూ ఉంచాడు.
\v 3 తాను వారి ముందు వెళ్తూ తన సోదరుణ్ణి సమీపించే వరకు ఏడు సార్లు నేలపై సాగిలపడ్డాడు.
\s5
\v 4 అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కోడానికి పరుగెత్తి అతనిని కౌగలించుకొని అతని మెడను కౌగలించుకుని ముద్దుపెట్టుకున్నాడు. వారిద్దరూ కన్నీళ్ళు పెట్టుకున్నారు.
\v 5 ఏశావు ఆ స్త్రీలనూ పిల్లలనూ చూసి, <<వీరు నీకేమౌతారు?>> అని అడిగాడు. అతడు <<వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే>> అని చెప్పాడు.
\p
\s5
\v 6 అప్పుడు ఆ దాసీలూ వారి పిల్లలూ దగ్గరకు వచ్చి ఏశావు ఎదుట సాగిలపడ్డారు.
\v 7 లేయా ఆమె పిల్లలూ దగ్గరకు వచ్చి సాగిలపడ్డారు. ఆ తరువాత యోసేపూ రాహేలూ దగ్గరకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు.
\v 8 ఏశావు, <<నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతా ఎందుకు?>> అని అడిగాడు. అతడు, <<నా ప్రభువు దయ నా మీద కలగడానికే>> అని చెప్పాడు.
\s5
\v 9 అప్పుడు ఏశావు, <<తమ్ముడూ, నాకు కావలసినంత ఉంది, నీది నీవే ఉంచుకో>> అని చెప్పాడు.
\v 10 అప్పుడు యాకోబు, <<అలా కాదు, నీ అనుగ్రహం నా మీద ఉంటే దయచేసి ఈ కానుకను అంగీకరించు. దేవుని ముఖం చూసినట్టుగా నీ ముఖం చూశాను. నీ దయ నా మీద ఉంది కదా.
\v 11 నేను నీ కోసం తెచ్చిన కానుకను దయచేసి అంగీకరించు. దేవుడు నన్ను కనికరించాడు. పైగా, నాకు కావలసినంత ఉంది>> అని చెప్పి అతన్ని బలవంతం చేశాడు కాబట్టి అతడు దానిని పుచ్చుకొని
\s5
\v 12 <<మనం వెళదాం, నేను నీకు ముందుగా సాగిపోతాను>> అని చెప్పగా
\v 13 అతడు <<నాదగ్గర ఉన్న పిల్లలు పసిపిల్లలనీ, గొర్రెలు, మేకలు, పశువులు పాలిచ్చేవి అనీ నా ప్రభువుకు తెలుసు. ఒక్క రోజే వాటిని వేగంగా తోలితే ఈ మంద అంతా చస్తుంది.
\v 14 నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళాలి. నేను నా ప్రభువు దగ్గరకు శేయీరుకు వచ్చేవరకూ, ముందున్న మందలూ, ఈ పిల్లలూ నడవగలిగిన కొలదీ వాటిని మెల్లగా నడిపించుకొని వస్తాను>> అని అతనితో చెప్పాడు.
\s5
\v 15 అప్పుడు ఏశావు <<నీ కిష్టమైతే నా దగ్గర ఉన్న ఈ మనుషుల్లో కొందరిని నీ దగ్గర విడిచిపెడతాను>> అనగా అతడు, <<అదెందుకు? నా ప్రభువు కటాక్షం నా మీద ఉంది. అది చాలు>> అన్నాడు.
\v 16 ఆ రోజునే ఏశావు తన దారిలో శేయీరుకు తిరిగి వెళ్ళిపోయాడు.
\v 17 అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమై వెళ్లి తమకొక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించాడు. అందుకు ఆ చోటికి సుక్కోతు అనే పేరు వచ్చింది.
\p
\s5
\v 18 ఆ విధంగా యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తరువాత కనాను దేశంలో ఉన్న షెకెము అనే ఊరికి సురక్షితంగా వచ్చి ఆ ఊరి ముందు తన గుడారాలు వేశాడు.
\v 19 అతడు గుడారాలు వేసిన పొలంలోని భాగాన్ని షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల దగ్గర నూరు వెండి నాణాలకు కొన్నాడు.
\v 20 అక్కడ ఒక బలిపీఠం కట్టించి దానికి <<ఏల్‌ ఎలోహేయి ఇశ్రాయేలు>> అని పేరు పెట్టాడు.
\s5
\c 34
\p
\v 1 యాకోబుకు లేయా ద్వారా పుట్టిన కూతురు దీనా. ఆమె ఆ దేశపు యువతులను చూడడానికి బయటికి వెళ్ళింది.
\v 2 ఆ దేశపు రాజు, హివ్వీయుడైన హమోరు కుమారుడు షెకెము ఆమెను చూసి ఆమెను పట్టుకొని, బలాత్కారం చేసి చెరిచాడు.
\v 3 అయితే అతడు ఆమెపై మనసు పడ్డాడు. ఆమెని ప్రేమించి ఆమెతో ఇష్టంగా మాట్లాడాడు.
\p
\s5
\v 4 షెకెము తన తండ్రి హమోరును <<ఈ అమ్మాయిని నాకిచ్చి పెళ్ళి చెయ్యి>> అని అడిగాడు.
\v 5 అతడు తన కూతురిని చెరిచిన సంగతి యాకోబు విన్నాడు. తన కుమారులు పశువులతో పొలంలో ఉండడం వలన వారు వచ్చే వరకు నెమ్మదిగా ఉన్నాడు.
\s5
\v 6 షెకెము తండ్రి హమోరు యాకోబుతో మాట్లాడడానికి అతని దగ్గరకు వచ్చాడు.
\v 7 యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలం నుండి తిరిగి వచ్చారు. అతడు యాకోబు కూతురును మానభంగం చేసి ఇశ్రాయేలు ప్రజలను కించపరిచాడు. అది చేయకూడని పని కాబట్టి అది వారికి చాలా అవమానకరంగా ఉంది. వారికి చాలా కోపం వచ్చింది.
\p
\s5
\v 8 అప్పుడు హమోరు వారితో, <<షెకెము అనే నా కొడుకు మీ కూతురిపై మనసు పడ్డాడు. దయచేసి ఆమెను అతనికిచ్చి పెళ్ళి చేయండి.
\v 9 మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో వియ్యం కలుపుకొని మా మధ్య నివసించండి.
\v 10 ఈ దేశం మీ ఎదుట ఉంది. మీరు ఇందులో నివసించి వ్యాపారాలు చేసి ఆస్తి సంపాదించుకోండి>> అని చెప్పాడు.
\s5
\v 11 అతడింకా, <<నామీద దయ చూపండి. మీరేమి అడుగుతారో దానిని నేనిస్తాను.
\v 12 ఓలి గానీ, కట్నం గానీ ఎంతైనా అడగండి. మీరు అడిగినంతా ఇస్తాను. ఆ యువతిని మాత్రం నాకు ఇవ్వండి>> అని ఆమె తండ్రితో, సోదరులతో చెప్పాడు.
\v 13 అయితే తమ సోదరి అయిన దీనాను అతడు చెరిచినందుకు యాకోబు కుమారులు షెకెముతో, అతని తండ్రి హమోరుతో కపటంగా జవాబిచ్చారు.
\p
\s5
\v 14 వారు, <<మేము ఈ పనికి అంగీకరించలేం. సున్నతి చేయించుకోని వానికి మా సోదరిని ఇయ్యలేము. ఎందుకంటే అది మాకు అవమానకరం.
\v 15 అయితే మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మాలాగా ఉండే పక్షంలో మాత్రమే మేము దీనికి అంగీకరించగలం.
\v 16 ఆ ఒక్క షరతుతో మీ మాటకు ఒప్పుకొని, మా పిల్లలను మీ కిచ్చి మీ పిల్లలను మేము చేసుకొని, మీ మధ్య నివసిస్తాం. అప్పుడు మనమంతా ఒకే జనంగా ఉంటాం.
\v 17 మీరు మా మాట విని సున్నతి పొందకపోతే మా అమ్మాయిని తీసికొని వెళ్ళిపోతాం>> అన్నారు.
\p
\s5
\v 18 వారి మాటలు హమోరుకూ అతని కుమారుడు షెకెముకూ ఇష్టంగా ఉన్నాయి.
\v 19 ఆ యువకుడికి యాకోబు కూతురు అంటే ప్రేమ కాబట్టి అతడు ఆ పని చేయడానికి ఆలస్యం చేయలేదు. అతడు తన వంశం వారందరిలో పేరు పొందినవాడు.
\p
\s5
\v 20 హమోరూ అతని కుమారుడు షెకెమూ ఆ ఊరి ద్వారం దగ్గరకు వచ్చి తమ ఊరి ప్రజలతో మాట్లాడుతూ,
\v 21 <<ఈ మనుషులు మనతో సమాధానంగా ఉన్నారు కాబట్టి వారిని మన దేశంలో ఉండనిచ్చి దీనిలో వ్యాపారం చేసుకోనిద్దాం. ఈ భూమి వారికి కూడా చాలినంత విశాలంగా ఉంది కదా, మనం వారి పిల్లల్ని చేసుకొని మన పిల్లల్ని వారికి ఇద్దాం.
\p
\s5
\v 22 అయితే ఒక విషయం, ఆ మనుషులు సున్నతి పొందినట్టుగానే మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందితేనే వారు మన మాటకు ఒప్పుకొని మనలో నివసించి ఒకే జనంగా కలిసి ఉంటారు.
\v 23 వారి మందలూ వారి ఆస్తీ వారి పశువులూ అన్నీ మనవవుతాయి కదా. ఎలాగైనా మనం వారి షరతుకు ఒప్పుకుందాం. అప్పుడు వారు మనలో నివసిస్తారు.>>
\p
\s5
\v 24 హమోరు, అతని కుమారుడు షెకెము చెప్పిన మాటలు ఆ ఊరి ద్వారం గుండా వెళ్ళేవారంతా విన్నారు. అప్పుడు ఆ ద్వారం గుండా వెళ్ళే వారిలో ప్రతి పురుషుడు సున్నతి పొందాడు.
\v 25 మూడో రోజు వారంతా బాధపడుతూ ఉన్నప్పుడు యాకోబు కుమారుల్లో ఇద్దరు, అంటే దీనా సోదరులైన షిమ్యోను, లేవి, వారి కత్తులు తీసికొని అకస్మాత్తుగా ఆ ఊరిమీద పడి ప్రతి మగ వాణ్నీ చంపేశారు.
\v 26 వారు హమోరునీ అతని కొడుకు షెకెమునీ కత్తితో చంపి షెకెము ఇంట్లో నుండి దీనాను తీసుకెళ్ళిపోయారు.
\s5
\v 27 తక్కిన యాకోబు కొడుకులు తమ సోదరిని చెరిపినందుకు చనిపోయిన వారు పడి ఉన్నచోటికి వచ్చి ఆ ఊరిపై పడి దోచుకున్నారు.
\v 28 వారి గొర్రెలనూ పశువులనూ గాడిదలనూ ఊరిలో గానీ పొలంలో గానీ
\v 29 వారి ఆస్తి అంతా తీసికొని, వారి పిల్లలనూ స్త్రీలనూ చెరపట్టి, వారి ఇళ్ళలో ఉన్న వస్తువులు సైతం దోచుకున్నారు.
\p
\s5
\v 30 అప్పుడు యాకోబు షిమ్యోనునూ లేవినీ పిలిచి, <<మీరు ఈ దేశంలో నివసించే కనానీయులూ పెరిజ్జీయులూ నన్ను అసహ్యించుకొనేలా చేశారు. నా ప్రజల సంఖ్య తక్కువే. వారు నా మీదికి గుంపుగా వచ్చి నన్ను చంపుతారు. నేను, నా ఇంటివారు నాశనమవుతాం>> అన్నాడు.
\v 31 అందుకు వారు, <<మరి వేశ్య పట్ల చేసినట్టు మా చెల్లి పట్ల చేయవచ్చా?>> అన్నారు.
\s5
\c 35
\p
\v 1 దేవుడు యాకోబుతో, <<నువ్వు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించు. నీ సోదరుడైన ఏశావు నుండి నువ్వు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ ఒక బలిపీఠం కట్టు>> అని చెప్పాడు.
\v 2 యాకోబు తన ఇంటివారితో, తన దగ్గర ఉన్న వారందరితో, <<మీ దగ్గర ఉన్న అన్యదేవతలను పారవేసి, మిమ్మల్ని మీరు పవిత్ర పరచుకొని, మీ వస్త్రాలు మార్చుకోండి.
\v 3 మనం బేతేలుకు బయలుదేరి వెళ్దాం. నా కష్ట సమయంలో నాకు సహాయం చేసి, నేను వెళ్ళిన అన్ని చోట్లా నాకు తోడై ఉన్న దేవునికి అక్కడ ఒక బలిపీఠం కడతాను>> అని చెప్పాడు.
\p
\s5
\v 4 వారు తమ దగ్గర ఉన్న అన్యదేవతలన్నిటినీ తమ చెవి పోగులనూ యాకోబుకు అప్పగించారు. యాకోబు వాటిని షెకెము దగ్గర ఉన్న సింధూర వృక్షం కింద పాతిపెట్టాడు.
\v 5 వారు ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు, వారి చుట్టూ ఉన్న పట్టణాల వారికి దేవుడు భయం పుట్టించాడు కాబట్టి వారు యాకోబు కుటుంబాన్ని తరమ లేదు.
\p
\s5
\v 6 యాకోబు, అతడితో ఉన్నవారంతా కనానులో లూజుకు, అంటే బేతేలుకు వచ్చారు.
\v 7 అతడు తన అన్న దగ్గర నుండి పారిపోయినప్పుడు దేవుడక్కడ అతడికి ప్రత్యక్షమయ్యాడు కాబట్టి వారు అక్కడ ఒక బలిపీఠం కట్టి ఆ ప్రదేశానికి ఏల్‌ బేతేలు అని పేరు పెట్టారు.
\v 8 రిబ్కా దాది అయిన దెబోరా చనిపోయినప్పుడు ఆమెను బేతేలుకు దిగువన ఉన్న సింధూరవృక్షం కింద పాతిపెట్టి, దానికి అల్లోన్ బాకూత్‌ అనే పేరు పెట్టారు.
\p
\s5
\v 9 యాకోబు పద్దనరాము నుండి వస్తూ ఉండగా దేవుడు అతడికి మళ్ళీ ప్రత్యక్షమై అతణ్ణి ఆశీర్వదించాడు.
\v 10 అప్పుడు దేవుడు అతనితో, <<నీ పేరు యాకోబు. కానీ ఇప్పటినుండి అది యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు>> అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు.
\s5
\v 11 దేవుడు, <<నేను సర్వశక్తిగల దేవుణ్ణి. నువ్వు ఫలించి అభివృద్ధి పొందు. ఒక జనాంగం, జనాంగాల గుంపు నీనుండి కలుగుతాయి. రాజులు నీ సంతానంలో నుండి వస్తారు.
\v 12 నేను అబ్రాహాముకు, ఇస్సాకుకు ఇచ్చిన దేశాన్ని నీకిస్తాను. నీ తరువాత నీ సంతానానికి కూడా ఈ దేశాన్ని ఇస్తాను>> అని అతనితో చెప్పాడు.
\v 13 దేవుడు అతనితో మాట్లాడిన ఆ స్థలం నుండి పరలోకానికి వెళ్ళాడు.
\p
\s5
\v 14 దేవుడు తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభం, అంటే ఒక రాతి స్తంభం నిలబెట్టి దానిమీద పానార్పణం చేసి దాని మీద నూనె పోశాడు.
\v 15 తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలు అని పేరు పెట్టాడు.
\s5
\v 16 వారు బేతేలు నుండి ప్రయాణమై వెళ్ళారు. దారిలో ఎఫ్రాతాకు ఇంకా కొంత దూరం ఉన్నప్పుడు రాహేలుకు కానుపు నొప్పులు మొదలయ్యాయి.
\v 17 ఆమె ప్రసవం వలన తీవ్రంగా ప్రయాసపడుతూ ఉండగా మంత్రసాని ఆమెతో, <<భయపడ వద్దు, ఈ సారి కూడా నీకు కొడుకే పుడతాడు>> అంది.
\v 18 రాహేలు కొడుకును ప్రసవించి చనిపోయింది. ప్రాణం పోతూ ఉన్న సమయంలో ఆమె, <<వీడి పేరు బెనోని>> అంది. కాని అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టాడు.
\v 19 ఆ విధంగా రాహేలు చనిపోయినప్పుడు ఆమెను బేత్లెహేము అని పిలిచే ఎఫ్రాతా మార్గంలో సమాధి చేశారు.
\v 20 యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభాన్ని నిలిపాడు. అది ఈ రోజు వరకు రాహేలు సమాధి స్తంభంగా నిలిచి ఉంది.
\p
\s5
\v 21 ఇశ్రాయేలు ప్రయాణం కొనసాగించి మిగ్దల్‌ ఏదెరుకు అవతల తన గుడారం వేసుకున్నాడు.
\v 22 ఇశ్రాయేలు ఆ దేశంలో నివసిస్తున్నప్పుడు రూబేను తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించాడు. ఆ సంగతి ఇశ్రాయేలుకు తెలిసింది.
\p
\s5
\v 23 యాకోబు కొడుకులు పన్నెండు మంది. యాకోబు జ్యేష్ఠకుమారుడు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను. వీరు లేయా కొడుకులు.
\v 24 యోసేపు, బెన్యామీను. వీరు రాహేలు కొడుకులు.
\v 25 రాహేలు దాసి అయిన బిల్హా కొడుకులు దాను, నఫ్తాలి.
\s5
\v 26 లేయా దాసి అయిన జిల్పా కొడుకులు గాదు, ఆషేరు. వీరంతా పద్దనరాములో యాకోబుకు పుట్టిన కొడుకులు.
\v 27 అబ్రాహాము, ఇస్సాకులు నివసించిన మమ్రేలోని కిర్యతర్బాలో తన తండ్రి ఇస్సాకు దగ్గరకు యాకోబు వచ్చాడు. అదే హెబ్రోను.
\p
\s5
\v 28 ఇస్సాకు నూట ఎనభై సంవత్సరాలు బతికాడు.
\v 29 ఇస్సాకు కాలం నిండిన వృద్ధుడై చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరిపోయాడు. అతని కొడుకులు ఏశావు, యాకోబు అతణ్ణి సమాధి చేశారు.
\s5
\c 36
\p
\v 1 ఎదోము అనే మారు పేరు గల ఏశావు వంశావళి ఇది.
\v 2 ఏశావు హిత్తీయుడైన ఏలోను కూతురు ఆదా, హివ్వీయుడైన సిబ్యోను కూతురైన అనా కూతురు అహోలీబామా,
\v 3 ఇష్మాయేలు కూతురు, నెబాయోతు సోదరి అయిన బాశెమతు అనే కనాను యువతులను పెళ్ళి చేసుకున్నాడు.
\s5
\v 4 ఏశావుకు ఆదా ఎలీఫజును, బాశెమతు రగూయేలును కన్నారు.
\v 5 అహోలీబామా యూషును, యాలామును, కోరహును కన్నది. వీరు కనాను దేశంలో ఏశావుకు పుట్టిన కొడుకులు.
\s5
\v 6 ఏశావు తన భార్యలనూ కుమారులనూ కూతుళ్ళనూ తన ఇంటివారందరినీ తన మందలనూ పశువులనూ తాను కనాను దేశంలో సంపాదించిన ఆస్తి అంతటినీ తీసుకుని తన తమ్ముడైన యాకోబు నుండి దూరంగా మరొక దేశానికి వెళ్ళిపోయాడు.
\v 7 వారు విస్తారమైన సంపద గలవారు కాబట్టి వారు కలిసి నివసించలేక పోయారు. వారి పశువులు అధికంగా ఉండడం వలన వారు నివసించే స్థలం వారిద్దరికీ సరిపోలేదు.
\v 8 కాబట్టి ఏశావు శేయీరు కొండ ప్రాంతంలో నివసించాడు. ఏశావుకు మరొక పేరు ఎదోము.
\p
\s5
\v 9 శేయీరు కొండ ప్రాంతంలో నివసించిన ఎదోమీయుల మూల పురుషుడైన ఏశావు వంశావళి ఇది.
\v 10 ఏశావు కొడుకుల పేర్లు, ఏశావు భార్య ఆదా కొడుకు ఎలీఫజు, మరొక భార్య బాశెమతు కొడుకు రగూయేలు.
\v 11 ఎలీఫజు కొడుకులు తేమాను, ఓమారు, సెపో, గాతాము, కనజు. ఎలీఫజు ఉపపత్ని తిమ్నా.
\v 12 ఆమె కొడుకు అమాలేకు. వీరంతా ఏశావు భార్య అయిన ఆదాకు మనుమలు.
\p
\s5
\v 13 రగూయేలు కొడుకులు నహతు, జెరహు, షమ్మా, మిజ్జా. వీరు ఏశావు భార్య అయిన బాశెమతుకు మనుమలు.
\v 14 ఏశావుకున్న మరొక భార్య సిబ్యోను కూతురు అయిన అనా కూతురు అహొలీబామా. ఈమె ఏశావుకు కన్న కొడుకులు యూషు, యాలాము, కోరహు.
\p
\s5
\v 15 ఏశావు కొడుకుల్లో తెగల నాయకులు ఎవరంటే, ఏశావు మొదటి సంతానమైన ఎలీఫజు కొడుకులు తేమాను, ఓమారు, సెపో, కనజు,
\v 16 కోరహు, గాతాము, అమాలేకు. వీరు ఎదోము దేశంలో ఎలీఫజు నుండి వచ్చిన నాయకులు. వీరు ఏశావు భార్య ఆదాకు మనుమలు.
\s5
\v 17 ఏశావు కొడుకైన రగూయేలు కొడుకులు నహతు, జెరహు, షమ్మా, మిజ్జా. వీరు ఎదోము దేశంలో రగూయేలు నుండి వచ్చిన నాయకులు. వీరు ఏశావు భార్య బాశెమతు మనుమలు.
\p
\v 18 ఇక ఏశావు భార్య, అనా కూతురు అయిన అహొలీబామా కొడుకులు యూషు, యగ్లాము, కోరహు. వీరు అహొలీబామా పుత్రసంతానపు నాయకులు.
\v 19 వీరంతా ఎదోము అనే ఏశావు కొడుకులు, వారి వారి సంతానపు తెగల నాయకులు.
\p
\s5
\v 20 ఎదోము దేశంలో ఆదినుండీ నివసించిన హోరీయుడైన శేయీరు కొడుకులు లోతాను, శోబాలు, సిబ్యోను, అనా,
\v 21 దిషోను, ఏసెరు, దీషాను. వీరు ఎదోము దేశంలోని శేయీరు కొడుకులైన హోరీయుల నాయకులు.
\p
\v 22 లోతాను కొడుకులు హోరీ, హేమాను. లోతాను సోదరి తిమ్నా.
\s5
\v 23 శోబాలు కొడుకులు అల్వాను, మానహదు, ఏబాలు, షపో, ఓనాము.
\v 24 సిబ్యోను కొడుకులు అయ్యా, అనా అనేవారు. ఈ అనా తన తండ్రి సిబ్యోనుకు చెందిన గాడిదలను మేపుతూ ఉండగా మొదటి సారిగా అరణ్యంలో ఉష్ణధారలు కనుగొన్నాడు.
\p
\s5
\v 25 అనా కొడుకు దిషోను, కూతురు అహొలీబామా.
\v 26 దిషోను కొడుకులు హెమ్దాను, ఎష్బాను, ఇత్రాను, కెరాను,
\v 27 ఏసెరు కొడుకులు బిల్హాను, జవాను, అకాను.
\v 28 దీషాను కొడుకులు ఊజు, అరాను.
\p
\s5
\v 29 హోరీయుల నాయకులు ఎవరంటే, లోతాను, శోబాలు, సిబ్యోను, అనా,
\v 30 దిషోను, ఏసెరు, దీషాను. శేయీరు దేశంలోని వారి నాయకుల జాబితా ప్రకారం వీరు హోరీయుల నాయకులు.
\p
\s5
\v 31 ఇశ్రాయేలీయుల మీద ఏ రాజూ పరిపాలన చేయక ముందే, ఎదోము దేశంలో పరిపాలించిన రాజులు ఎవరంటే,
\v 32 బెయోరు కొడుకు బెల ఎదోములో పాలించాడు. అతని ఊరు దిన్హాబా.
\v 33 బెల చనిపోయిన తరువాత బొస్రావాడైన జెరహు కొడుకు యోబాబు రాజయ్యాడు.
\s5
\v 34 యోబాబు చనిపోయిన తరువాత తేమానీయుల దేశస్థుడు హుషాము రాజయ్యాడు.
\v 35 హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశంలో మిద్యానీయుల్ని ఓడించిన బదదు కొడుకు హదదు రాజయ్యాడు. అతని ఊరు అవీతు.
\v 36 హదదు చనిపోయిన తరువాత మశ్రేకా వాడైన శమ్లా రాజయ్యాడు.
\p
\s5
\v 37 శమ్లా చనిపోయిన తరువాత నదీతీర ప్రాంతమైన రహెబోతుకు చెందిన షావూలు రాజయ్యాడు.
\v 38 షావూలు చనిపోయిన తరువాత అక్బోరు కొడుకు బయల్‌ హానాను రాజయ్యాడు.
\v 39 అక్బోరు కొడుకు బయల్‌ హానాను చనిపోయిన తరువాత హదరు రాజయ్యాడు. అతని ఊరు పాయు. అతని భార్య పేరు మహేతబేలు. ఆమె మేజాహాబు మనుమరాలు అయిన మత్రేదు కూతురు.
\p
\s5
\v 40 వారివారి తెగల ప్రకారం వారివారి ప్రాంతాల్లో వారివారి పేర్ల చొప్పున ఏశావు సంతానపు నాయకుల పేర్లు ఏవంటే, తిమ్నా, అల్వా, యతేతు,
\v 41 అహొలీబామా, ఏలా, పీనోను,
\v 42 కనజు, తేమాను, మిబ్సారు,
\v 43 మగ్దీయేలు, ఈరాము. వీరంతా తమ తమ స్వాధీనంలో ఉన్న దేశంలో తమతమ నివాస స్థలాల ప్రకారం ఎదోము నాయకులు. ఎదోమీయులకు మూల పురుషుడు ఏశావు.
\s5
\c 37
\p
\v 1 యాకోబు తన తండ్రి పరదేశీయుడుగా ఉండిన కనాను దేశంలో నివసించాడు.
\v 2 యాకోబు జీవిత వృత్తాంతం ఇది. యోసేపు పదిహేనేళ్ళ వాడుగా ఉన్నప్పుడు తన సోదరులతో కూడ మందను మేపుతూ ఉన్నాడు. అతడు చిన్నవాడుగా తన తండ్రి భార్యలైన బిల్హా కొడుకుల దగ్గరా జిల్పా కొడుకుల దగ్గరా ఉండేవాడు. అప్పుడు యోసేపు వారి చెడ్డ పనులను గూర్చిన సమాచారం వారి తండ్రికి చేరవేసేవాడు.
\s5
\v 3 యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యంలో పుట్టిన కొడుకు కాబట్టి తన కొడుకులందరికంటె అతణ్ణి ఎక్కువగా ప్రేమించి అతని కోసం ఒక అందమైన నిలువుటంగీ కుట్టించాడు.
\v 4 అతని సోదరులు తమ తండ్రి అతణ్ణి తమందరికంటె ఎక్కువగా ప్రేమించడం వలన అతని మీద పగపట్టి, అతనితో ఎప్పుడూ ప్రేమగా మాట్లాడేవారు కాదు.
\p
\s5
\v 5 యోసేపు ఒక కల కని తన సోదరులతో దానిని గూర్చి చెప్పినప్పుడు వారు అతని మీద మరింత పగపట్టారు.
\v 6 అతడు వారితో ఇలా చెప్పాడు, <<నేను కన్న ఈ కల మీరూ వినండి.
\s5
\v 7 అదేమిటంటే మనం పొలంలో ధాన్యం కట్టలు కడుతూ ఉన్నాం. నా కట్ట లేచి నిలబడగానే మీ కట్టలు దాని చుట్టూ చేరి నా కట్టకి సాష్టాంగపడ్డాయి.>>
\v 8 అందుకు అతని సోదరులు, <<నువ్వు నిజంగానే మమ్మల్ని ఏలుతావా? మామీద నువ్వు అధికారివి అవుతావా>> అని అతనితో చెప్పి, అతని కలల్ని బట్టీ అతని మాటల్ని బట్టీ అతని మీద మరింత పగ పెంచుకున్నారు.
\p
\s5
\v 9 అతడింకొక కల కని తన సోదరులతో, <<ఇదిగో నేను మరొక కల గన్నాను. అందులో సూర్య చంద్రులూ, పదకొండు నక్షత్రాలూ నాకు సాష్టాంగ పడ్డాయి>> అని చెప్పాడు.
\v 10 అతడు తన తండ్రితో, తన అన్నలతో అది చెప్పాడు. అతని తండ్రి అతనితో, <<నువ్వు కన్న ఈ కల ఏమిటి? నేనూ నీ తల్లీ నీ అన్నలూ నిజంగా నీకు సాష్టాంగపడాలా?>> అని అతణ్ణి గద్దించాడు.
\v 11 అతని సోదరులు అతనిపై కక్ష పెంచుకున్నారు. అయితే అతని తండ్రి ఆ మాటలు జ్ఞాపకం ఉంచుకున్నాడు.
\p
\s5
\v 12 యోసేపు సోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపడానికి వెళ్ళారు.
\v 13 అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో, <<నీ సోదరులు షెకెములో మందను మేపుతున్నారు. నిన్ను వారి దగ్గరకు పంపుతాను, రా>> అన్నప్పుడు అతడు, <<అలాగే>> అని చెప్పాడు.
\v 14 అప్పుడు యాకోబు, <<నువ్వు వెళ్ళి నీ సోదరుల క్షేమాన్ని, మంద క్షేమాన్ని తెలిసికొని నాకు కబురు తీసుకురా>> అని అతనితో చెప్పి హెబ్రోను లోయ నుండి అతణ్ణి పంపించాడు. అతడు షెకెముకు వచ్చాడు.
\p
\s5
\v 15 యోసేపు పొలంలో ఇటు అటు తిరుగుతూ ఉండగా ఒక మనిషి అతణ్ణి చూసి, <<దేని గురించి వెదుకుతున్నావు?>> అని అడిగాడు.
\v 16 అందుకతడు, <<నేను నా సోదరులను వెదుకుతున్నాను. వారు మందను ఎక్కడ మేపుతున్నారో దయచేసి నాకు చెప్పు>> అని అడిగాడు.
\v 17 అందుకు ఆ మనిషి, <<వారు ఇక్కడి నుండి వెళ్ళిపోయారు. వారు <దోతానుకు వెళ్దాం పదండి> అని చెప్పుకోవడం నేను విన్నాను>> అని చెప్పాడు. అప్పుడు యోసేపు తన సోదరుల కోసం వెదుకుతూ వెళ్ళి దోతానులో వారిని కనుగొన్నాడు.
\p
\s5
\v 18 అతడు దగ్గరకు రాక ముందే వారు అతణ్ణి దూరం నుండి చూసి అతణ్ణి చంపడానికి దురాలోచన చేశారు.
\v 19 వారు, <<అడుగో, కలలు కనేవాడు వస్తున్నాడు.
\v 20 వీణ్ణి చంపి ఒక గుంటలో పారేసి, <ఏదో క్రూర జంతువు వీణ్ణి చంపి తినేసింది> అని చెబుదాం. అప్పుడు వీడి కలలేమౌతాయో చూద్దాం>> అని ఒకరి కొకరు చెప్పుకున్నారు.
\p
\s5
\v 21 రూబేను ఆ మాట విని, <<మనం వాణ్ణి చంపకూడదు>> అని చెప్పి వారి చేతుల్లో చావకుండా యోసేపును తప్పించాడు.
\v 22 ఎలాగంటే రూబేను అతణ్ణి తమ తండ్రికి అప్పగించాలని, వారు అతణ్ణి చంపకుండా విడిపించాలని ఉద్దేశించి, <<రక్తం చిందించ వద్దు. అతణ్ణి చంపకుండా అడవిలో ఉన్న ఈ గుంటలో తోసేయండి>> అని వారితో చెప్పాడు.
\s5
\v 23 యోసేపు తన సోదరుల దగ్గరికి వచ్చినప్పుడు వారు యోసేపు తొడుక్కొన్న ఆ అందమైన నిలువుటంగీని తీసేసి,
\v 24 అతణ్ణి పట్టుకొని ఆ గుంటలో పడదోశారు. అది నీళ్ళు లేని వట్టి గుంట.
\p
\s5
\v 25 వారు భోజనానికి కూర్చున్నపుడు, ఐగుప్తుకు సుగంధ ద్రవ్యాలు, మస్తకి, బోళం మోసుకుపోతున్న ఒంటెలతో ఇష్మాయేలీ యాత్రికులు గిలాదు నుండి రావడం చూశారు.
\v 26 అప్పుడు యూదా, <<మనం మన తమ్ముణ్ణి చంపి వాడి చావుని దాచిపెట్టడం వలన ఏం ప్రయోజనం?
\s5
\v 27 ఈ ఇష్మాయేలీయులకు వాణ్ణి అమ్మేద్దాం రండి. ఎలాగైనా వాడు మన తమ్ముడు, మన రక్త సంబంధి గదా? వాడిని చంపకూడదు>> అని తన సోదరులతో చెప్పాడు. అందుకు అతని సోదరులు అంగీకరించారు.
\v 28 ఆ మిద్యాను వర్తకులు దగ్గరకు వచ్చినపుడు వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు ఇరవై తులాల వెండికి అతణ్ణి అమ్మేశారు. వారు యోసేపును ఐగుప్తుకు తీసికొనిపోయారు.
\p
\s5
\v 29 రూబేను ఆ గుంట దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు యోసేపు అందులో లేకపోవడంతో అతడు తన బట్టలు చింపుకున్నాడు.
\v 30 అతడు తన సోదరుల దగ్గరికి వెళ్ళి, <<చిన్నవాడు లేడే, అయ్యో, నేనెక్కడికి వెళతాను?>> అన్నాడు.
\s5
\v 31 వారు ఒక మేకపిల్లను చంపి, యోసేపు అంగీని దాని రక్తంలో తడిపారు.
\v 32 వారు దాన్ని తమ తండ్రి దగ్గరకు తీసుకెళ్ళి, <<ఇది మాకు దొరికింది. ఇది నీ కొడుకు అంగీనో కాదో చూడు>> అన్నారు.
\v 33 అతడు దాన్ని గుర్తుపట్టి, <<ఈ అంగీ నా కొడుకుదే, ఏదో ఒక క్రూరజంతువు వాణ్ణి చంపి తినేసింది. తప్పనిసరిగా అది యోసేపును చీల్చేసి ఉంటుంది>> అన్నాడు.
\p
\s5
\v 34 యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుముకు గోనెపట్ట కట్టుకొని చాలా రోజులు తన కొడుకు కోసం దుఃఖించాడు.
\v 35 అతని కొడుకులు, కూతుర్లు అందరూ అతణ్ణి ఓదార్చడానికి ప్రయత్నం చేశారు గానీ అతడు ఓదార్పు పొందలేదు. <<నేను ఏడుస్తూ చనిపోయిన వారుండే స్థలానికి నా కొడుకు దగ్గరకు వెళ్తాను>> అని అతడు యోసేపు కోసం ఏడ్చాడు.
\p
\v 36 మిద్యానీయులు యోసేపును ఐగుప్తుకు తీసుకువెళ్లి, ఫరో రాజు అంగ రక్షకుల సేనానిగా పని చేస్తున్న పోతీఫరుకు అతణ్ణి అమ్మేశారు.
\s5
\c 38
\p
\v 1 ఆ కాలంలో యూదా తన సోదరులను విడిచిపెట్టి హీరా అనే ఒక అదుల్లాము వాడితో నివసించాడు.
\v 2 అక్కడ షూయ అనే ఒక కనానీ యువతిని చూసి ఆమెను వివాహమాడి ఆమెతో కాపురం చేశాడు.
\s5
\v 3 ఆమె గర్భవతి అయ్యి ఒక కొడుకును కన్నప్పుడు వాడికి ఏరు అని పేరు పెట్టారు.
\v 4 ఆమె మళ్ళీ గర్భం ధరించి మరొక కొడుకును కని వాడికి ఓనాను అని పేరు పెట్టింది.
\v 5 ఆమె మళ్ళీ గర్భం ధరించి మూడవ కొడుకును కని వాడికి షేలా అని పేరు పెట్టింది. వారు కజీబులో ఉన్నప్పుడు ఆమె వాణ్ణి కన్నది.
\p
\s5
\v 6 యూదా తన పెద్ద కొడుకు ఏరుకి తామారు అనే యువతిని పెళ్ళి చేశాడు.
\v 7 యూదా జ్యేష్ఠ కుమారుడు ఏరు యెహోవా దృష్టికి దుష్టుడు కాబట్టి యెహోవా అతణ్ణి చంపాడు.
\s5
\v 8 అప్పుడు యూదా ఓనానుతో, <<నీ అన్నభార్య దగ్గరకు వెళ్ళి మరిది ధర్మం జరిగించి నీ అన్నకి సంతానం కలిగించు>> అని చెప్పాడు.
\v 9 ఓనాను ఆ సంతానం తనది కాబోదని తెలిసి ఆమెతో పండుకున్నప్పుడు తన అన్నకి సంతానం కలగకూడదని తన వీర్యాన్ని నేలపై విడిచాడు.
\v 10 అతడు చేసింది యెహోవా దృష్టికి చెడ్డది కాబట్టి ఆయన అతణ్ణి కూడా చంపాడు.
\s5
\v 11 అప్పుడు యూదా ఇతడు కూడా ఇతని అన్నల్లాగా చనిపోతాడేమో అని భయపడి, <<నా కుమారుడు షేలా పెద్దవాడయ్యే వరకూ నీ తండ్రి ఇంట్లో విధవరాలుగా ఉండు>> అని తామారుతో చెప్పాడు. కాబట్టి తామారు వెళ్ళి తన తండ్రి ఇంటిలో నివసించింది.
\p
\s5
\v 12 చాలా రోజుల తరువాత యూదా భార్య అయిన షూయ కూతురు చనిపోయింది. తరువాత యూదా దుఃఖనివారణ పొంది, అదుల్లామీయుడైన హీరా అనే తన స్నేహితుడితో కలిసి తిమ్నాతులో తన గొర్రెల బొచ్చు కత్తిరించే వారి దగ్గరకు వెళ్ళాడు.
\v 13 తన మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి తిమ్నాతుకు వెళ్తున్నాడని తామారుకు తెలిసింది.
\v 14 షేలా పెద్దవాడైనప్పటికీ తనను అతనికి భార్యగా తీసుకోకుండా ఉండడం చూసి తామారు తన విధవరాలి బట్టలు తీసివేసి, ముసుగు వేసుకుని, శరీరమంతా కప్పుకొని, తిమ్నాతుకు వెళ్ళే మార్గంలో ఏనాయిము అనే ద్వారం దగ్గర కూర్చుంది.
\p
\s5
\v 15 యూదా ఆమెను చూసి, ఆమె ముఖం కప్పుకొని ఉండడం వలన ఆమె వేశ్య అనుకొని,
\v 16 ఆమె దగ్గరకు వెళ్ళి, ఆమె తన కోడలని తెలియక, <<నీతో సుఖిస్తాను, రా>> అని పిలిచాడు. అందుకు ఆమె <<నువ్వు నాతో సుఖించినందుకు నాకేమిస్తావు?>> అని అడిగింది.
\s5
\v 17 అందుకు అతడు, <<నా మందలో నుండి ఒక మేక పిల్లను పంపుతాను>> అన్నాడు. ఆమె, <<అది పంపే వరకు ఏమైనా తాకట్టు పెడితే సరే>> అని అంది.
\v 18 అతడు, <<ఏమి తాకట్టు పెట్టమంటావ్?>>అని ఆమెను అడిగాడు. ఆమె, <<నీ ముద్ర, దాని దారం, నీ చేతికర్ర>> అని చెప్పింది. అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో వెళ్ళాడు. ఆమె అతని వలన గర్భవతి అయ్యింది.
\p
\s5
\v 19 అప్పుడామె లేచి వెళ్లిపోయి ముసుగు తీసేసి తన విధవరాలి వస్త్రాలు ధరించింది.
\v 20 తరవాత యూదా ఆ స్త్రీ దగ్గర నుండి ఆ తాకట్టు వస్తువులను తీసుకోడానికి తన స్నేహితుడయిన అదుల్లామీయుడి ద్వారా మేకపిల్లను పంపినప్పుడు ఆమె అతనికి కనబడలేదు.
\p
\s5
\v 21 కాబట్టి అతడు <<ఆ మార్గంలో ఏనాయిము దగ్గర కనిపించిన ఆ వేశ్య ఎక్కడ ఉంది?>> అని అక్కడి మనుషుల్ని అడిగాడు. అయితే వారు, <<ఇక్కడ వేశ్య ఎవరూ లేదు>> అని అతనికి చెప్పారు.
\v 22 కాబట్టి అతడు యూదా దగ్గరకు తిరిగి వెళ్ళి, <<ఆమె నాకు కనబడలేదు. అంతేగాక, అక్కడి మనుషులు ఇక్కడికి వేశ్య ఎవరూ రాలేదని చెప్పారు>> అన్నాడు.
\v 23 యూదా, <<మనల్ని అపహాస్యం చేస్తారేమో, ఆమె వాటిని ఉంచుకోనీ. నేను నీతో ఈ మేక పిల్లను పంపాను, ఆమె నీకు కనబడలేదు>> అని అతనితో అన్నాడు.
\p
\s5
\v 24 సుమారు మూడు నెలలైన తరువాత, <<నీ కోడలు తామారు జారత్వం జరిగించింది. అంతేకాక ఆమె జారత్వం వలన గర్భవతి అయ్యింది>> అని యూదాకు కబురొచ్చింది. అప్పుడు యూదా, <<ఆమెను తీసుకు రండి, ఆమెను సజీవ దహనం చెయ్యాలి>> అని చెప్పాడు.
\v 25 ఆమెను బయటికి తీసుకు వచ్చినప్పుడు, ఆమె తన మామ దగ్గరకు అతని వస్తువులను పంపి, <<ఇవి ఎవరివో ఆ మనిషి వలన నేను గర్భవతి నయ్యాను. ఈ ముద్ర, ఈ దారం, ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తు పట్టండి>> అని చెప్పించింది.
\v 26 యూదా వాటిని గుర్తు పట్టి, <<నేను నా కుమారుడు షేలాను ఆమెకు ఇయ్యలేదు కాబట్టి ఆమె నాకంటె నీతి గలది>> అని చెప్పి ఇంకెప్పుడూ ఆమెతో పండుకోలేదు.
\p
\s5
\v 27 నెలలు నిండినప్పుడు ఆమె గర్భంలో కవలలు ఉన్నారు.
\v 28 ఆమె ప్రసవిస్తున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాపాడు. మంత్రసాని ఒక ఎర్ర దారం వాడి చేతికి కట్టి, <<వీడు మొదట బయటికి వచ్చాడు>> అని చెప్పింది.
\s5
\v 29 వాడు తన చెయ్యి వెనక్కి తీయగానే అతని సోదరుడు బయటికి వచ్చాడు. అప్పుడామె, <<నువ్వెందుకురా చొచ్చుకు వచ్చావు?>> అంది. అందుచేత వాడికి పెరెసు అని పేరు పెట్టారు.
\v 30 ఆ తరువాత చేతికి దారం కట్టి ఉన్న అతని సోదరుడు బయటికి వచ్చాడు. అతనికి జెరహు అని పేరు పెట్టారు.
\s5
\c 39
\p
\v 1 యోసేపును ఐగుప్తుకు తీసుకొచ్చారు. ఫరో దగ్గర ఉద్యోగి, రాజు అంగరక్షకుల అధిపతి అయిన పోతీఫరు అనే ఐగుప్తీయుడు, అతన్ని అక్కడికి తీసుకొచ్చిన ఇష్మాయేలీయుల దగ్గర యోసేపును కొన్నాడు.
\v 2 యెహోవా యోసేపుతో ఉన్నాడు. అతడు వర్ధిల్లుతూ తన యజమాని అయిన ఐగుప్తీయుని ఇంట్లో ఉన్నాడు.
\s5
\v 3 యెహోవా అతనికి తోడై ఉన్నాడనీ, అతడు చేసేదంతా యెహోవా సఫలం చేస్తున్నాడనీ అతని యజమాని గమనించాడు.
\v 4 యోసేపు అతని దృష్టిలో దయ పొందాడు. అతడు పొతీఫరుకు సేవ చేశాడు. పొతీఫరు తన ఇంటి మీద యోసేపును కార్యనిర్వాహకునిగా నియమించి తనకు కలిగినదంతా అతని అధీనంలో ఉంచాడు.
\p
\s5
\v 5 అతడు తన ఇంటి మీదా తనకు ఉన్న దానంతటి మీదా అతన్ని కార్యనిర్వహకునిగా నియమించిన దగ్గరనుండి యెహోవా యోసేపును బట్టి ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించాడు. యెహోవా దీవెన అతని ఇంట్లో, పొలంలో, అతనికి ఉన్న దానంతటి మీదా ఉంది.
\v 6 అతడు తనకు కలిగినదంతా యోసేపుకు అప్పగించి, తాను భోజనం చేయడం తప్ప తనకేమి ఉందో ఏమి లేదో చూసుకొనేవాడు కాడు. యోసేపు అందగాడు, చూడడానికి బావుంటాడు.
\p
\s5
\v 7 ఆ తరువాత అతని యజమాని భార్య యోసేపును మోహించింది. <<నాతో సుఖపడు>> అని అతనిని అడిగింది.
\v 8 అయితే అతడు తిరస్కరించి, <<నా యజమాని తనకు కలిగినదంతా నా వశంలో ఉంచాడు. నేను ఇక్కడ ఉండడం వలన ఇంట్లో ఏ విషయాన్నీ అతడు చూసుకోవడం లేదు.
\v 9 ఈ ఇంటిలో నాకంటె పైవాడు ఎవడూ లేడు. నువ్వు అతని భార్యవు కాబట్టి నిన్ను మినహాయించి మిగతా అంతటినీ అతడు నా అధీనంలో ఉంచాడు. కాబట్టి నేనెలా ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం చేస్తాను?>> అని తన యజమాని భార్యతో అన్నాడు.
\p
\s5
\v 10 ప్రతిరోజూ ఆమె యోసేపుతో మాట్లాడుతూ ఉంది గానీ అతడు ఆమెతో ఉండడానికి గానీ పాపం చేయడానికి గానీ ఒప్పుకోలేదు.
\v 11 అలా ఉండగా ఒక రోజు అతడు పని మీద ఇంటి లోపలికి వెళ్ళాడు. ఇంట్లో పనిచేసే వాళ్ళెవరూ అక్కడ లేరు.
\v 12 అప్పుడామె అతని పై వస్త్రాన్ని పట్టుకొని, <<నాతో పండుకో>> అని అడిగింది. అతడు తన బట్టను ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాడు.
\s5
\v 13 అతడు తన పై వస్త్రాన్ని ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవడం ఆమె చూసి,
\v 14 తన ఇంట్లో పనిచేసే వారిని పిలిచి, <<చూడండి, పోతీఫరు మనల్ని ఎగతాళి చేయడానికి ఒక హెబ్రీయుణ్ణి మన దగ్గరకు తెచ్చాడు. నాతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని వీడు నా దగ్గరకు వస్తే నేను పెద్ద కేక వేశాను.
\v 15 నేను పెద్దగా కేకవేయడం వాడు విని నా దగ్గర తన పై వస్త్రాన్ని విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాడు>> అని వారితో చెప్పింది.
\p
\s5
\v 16 అతని యజమాని ఇంటికి వచ్చే వరకు ఆమె అతని వస్త్రాన్ని తన దగ్గర ఉంచుకుంది.
\v 17 ఆమె తన భర్తతో ఇలా వివరించింది, <<నువ్వు మన దగ్గరికి తెచ్చిన ఆ హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయడానికి నా దగ్గరికి వచ్చాడు.
\v 18 నేను బిగ్గరగా కేక వేస్తే వాడు తన పై వస్త్రాన్ని నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాడు.>>
\s5
\v 19 <<నీ దాసుడు నాకిలా చేశాడు>> అని తన భార్య తనతో చెప్పిన మాటలు విని పొతీఫరు, కోపంతో మండిపడ్డాడు.
\p
\v 20 యోసేపు యజమాని అతన్ని రాజు ఖైదీలను బంధించే చెరసాలలో వేయించాడు. అతడు చెరసాలలో ఉన్నాడు.
\s5
\v 21 అయితే యెహోవా యోసేపుకు తోడై ఉండి, అతని మీద నిబంధన సంబంధమైన విశ్వాస్యతను చూపించాడు. చెరసాల అధిపతి అతన్ని అభిమానంగా చూసుకోనేలా చేశాడు.
\v 22 చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపుకు అప్పగించాడు. వారక్కడ చేసే పనులన్నీ యోసేపే చేయించేవాడు.
\v 23 యెహోవా అతనికి తోడై ఉన్నాడు కాబట్టి ఆ చెరసాల అధిపతి యోసేపుకు తాను అప్పగించిన దేనినీ ఇక పట్టించుకునేవాడు కాదు. అతడు చేసేదంతా యెహోవా సఫలం చేశాడు.
\s5
\c 40
\p
\v 1 ఆ తరువాత ఐగుప్తు రాజుకు గిన్నె అందించేవాడూ, రొట్టెలు చేసేవాడూ తమ యజమాని పట్ల నేరం చేశారు.
\v 2 తన ఇద్దరు ఉద్యోగస్థులు, అంటే గిన్నె అందించే వాడి మీదా రొట్టెలు చేసే వాడి మీదా ఫరో కోపగించుకున్నాడు.
\v 3 వారిని చెరసాలలో ఉంచడానికి రాజు అంగరక్షకుల అధిపతికి అప్పగించాడు. ఆ చెరసాలలోనే యోసేపును కూడా బంధించారు.
\s5
\v 4 ఆ అధిపతి వారందరినీ యోసేపు ఆధీనంలో ఉంచాడు. అతడు వారి బాగోగులు చూసేవాడు.
\p వారు కొన్నిరోజులు బందీలుగా ఉన్న తరువాత
\v 5 వారిద్దరూ, అంటే ఐగుప్తు రాజుకు గిన్నె అందించేవాడు, రొట్టెలు చేసేవాడు ఒకే రాత్రి కలలు కన్నారు. ఒక్కొక్కడు వేరు వేరు భావాలతో కల కన్నారు.
\p
\s5
\v 6 ఉదయాన యోసేపు వారి దగ్గరకు వచ్చి చూసినపుడు వారు విచారంగా ఉన్నారు.
\v 7 అతడు <<మీరెందుకు విచారంగా ఉన్నారు?>> అని వారిని అడిగాడు.
\v 8 అందుకు వారు <<మా ఇద్దరికీ ఒక్కో కల వచ్చింది. వాటి అర్ధం చెప్పేవాళ్ళు ఎవరూ లేరు>> అన్నారు. యోసేపు వారితో, <<అర్ధాలు తెలియచేయడం దేవుని అధీనమే గదా! దయచేసి నాకు చెప్పండి>> అన్నాడు.
\s5
\v 9 అప్పుడు గిన్నె అందించేవారి నాయకుడు యోసేపుతో, <<నా కలలో ఒక ద్రాక్షతీగ నా ఎదుట ఉంది.
\v 10 ఆ ద్రాక్షతీగకు మూడు కొమ్మలున్నాయి. దానికి మొగ్గలొచ్చి పూలు పూసి గెలలు పండి ద్రాక్షపళ్ళు వచ్చాయి.
\v 11 ఫరో గిన్నె నా చేతిలో ఉంది. నేను ద్రాక్షపళ్ళు తీసుకుని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చాను>> అని చెప్పాడు.
\s5
\v 12 అప్పుడు యోసేపు, <<దాని అర్ధం ఇదే. ఆ మూడు కొమ్మలు, మూడు రోజులు.
\v 13 ఇంక మూడు రోజుల్లో ఫరో నిన్ను హెచ్చించి, నువ్వు అతనికి గిన్నె అందించే నీ ఉద్యోగం నీకు మళ్ళీ ఇప్పిస్తాడు.
\s5
\v 14 అయితే నీకంతా సరి అయినప్పుడు నన్ను గుర్తు చేసుకొని నామీద దయ చూపించు. ఫరో దగ్గర నా గురించి మాట్లాడి ఈ చెరసాల నుండి నేను బయటికి వచ్చేలా చూడు.
\v 15 ఎందుకంటే నన్ను హెబ్రీయుల దేశం నుండి దొంగిలించి తీసుకొచ్చారు. ఈ చెరసాలలో నన్ను వేయడానికి ఇక్కడ కూడా నేనేమీ నేరం చేయలేదు>> అన్నాడు.
\p
\s5
\v 16 రొట్టెలు చేసే వాడు యోసేపు మంచి అర్ధం చెప్పడం చూసి అతనితో, <<నాకూ ఒక కల వచ్చింది. మూడు రొట్టెల బుట్టలు నా తల మీద ఉన్నాయి.
\v 17 పై బుట్టలో ఫరో కోసం అన్ని రకాల పిండివంటలు ఉన్నాయి. పక్షులు వచ్చి నా తల మీద ఉన్న ఆ బుట్టలో నుండి వాటిని తిన్నాయి>> అన్నాడు.
\s5
\v 18 యోసేపు, <<దాని అర్ధం ఇదే. ఆ మూడు బుట్టలు మూడు రోజులు.
\v 19 ఇంక మూడు రోజుల్లో ఫరో నీ తల తీసి చెట్టుకు వేలాడదీస్తాడు. పక్షులు నీ మాంసం తింటాయి>> అని జవాబిచ్చాడు.
\s5
\v 20 మూడవ రోజు ఫరో పుట్టినరోజు. అతడు తన సేవకులందరికీ విందు చేయించాడు. వారందరిలో గిన్నె అందించేవారి నాయకుడిపైనా రొట్టెలు చేసే వారి నాయకుడిపైనా మిగతా సేవకులందరికంటే ధ్యాస పెట్టాడు.
\v 21 గిన్నె అందించేవారి నాయకుని ఉద్యోగం అతనికి తిరిగి ఇచ్చాడు, కాబట్టి అతడు ఫరో చేతికి మళ్ళీ గిన్నె అందించాడు.
\v 22 యోసేపు చెప్పినట్టుగా రొట్టెలు చేసేవారి నాయకుణ్ణి ఉరి తీయించాడు.
\v 23 అయితే గిన్నె అందించేవారి నాయకుడు యోసేపుకు చేస్తానన్న సాయం గురించి పట్టించుకోలేదు. అసలు అతని గురించి మరచిపోయాడు.
\s5
\c 41
\p
\v 1 రెండు సంవత్సరాల తరువాత ఫరోకు ఒక కల వచ్చింది. అందులో అతడు నైలు నది దగ్గర నిలబడ్డాడు.
\v 2 పుష్టిగా ఉన్న అందమైన ఏడు ఆవులు నైలు నదిలో నుండి పైకి వచ్చి జమ్ముగడ్డిలో మేస్తున్నాయి.
\v 3 వాటి తరువాత వికారంగా, బక్కచిక్కిన ఏడు ఆవులు నైలు నదిలో నుండి పైకి వచ్చి ఆ ఆవుల దగ్గర నది ఒడ్డున నిలబడ్డాయి.
\s5
\v 4 అప్పుడు అందవిహీనమైనవీ చిక్కిపోయినవీ అయిన ఆవులు అందమైన బలిసిన ఆవుల్ని తినేశాయి. దాంతో ఫరో నిద్రలేచాడు.
\v 5 అతడు నిద్రపోయి రెండవసారి కల కన్నాడు. అందులో మంచి పుష్టిగల ఏడు కంకులతో ఉన్న కాడ పైకి వచ్చింది.
\v 6 తూర్పుగాలి వల్ల పాడైపోయిన ఏడు తాలు కంకులు వాటి తరువాత మొలిచాయి.
\p
\s5
\v 7 అప్పుడు నిండైన పుష్టిగల ఆ ఏడు కంకులను ఆ తాలుకంకులు మింగివేశాయి. అంతలో ఫరో మేలుకొని అది కల అని గ్రహించాడు.
\v 8 ఉదయాన్నే అతని మనస్సు కలవరపడింది కాబట్టి అతడు ఐగుప్తు శకునగాళ్ళందరినీ అక్కడి పండితులందరిని పిలిపించి తన కలలను వివరించి వారితో చెప్పాడు గాని ఫరోకు వాటి అర్ధం చెప్పే వాడెవడూ లేడు.
\p
\s5
\v 9 అప్పుడు గిన్నె అందించేవారి నాయకుడు, <<ఈ రోజు నా తప్పు గుర్తుకు వచ్చింది.
\v 10 ఫరో తన సేవకుల మీద కోపపడి నన్నూ రొట్టెలు చేసేవారి నాయకుడినీ రాజు అంగరక్షకుల అధిపతి ఇంట్లో కావలిలో ఉంచాడు.
\v 11 ఒకే రాత్రి నేనూ అతడు కలలు కన్నాము. ఒక్కొక్కడు వేర్వేరు అర్ధాలతో కలలు కన్నాము.
\s5
\v 12 అక్కడ రాజ అంగ రక్షకుల అధిపతికి సేవకుడిగా ఉన్న ఒక హెబ్రీ యువకుడు మాతో కూడ ఉన్నాడు. అతనితో మా కలల్ని మేము వివరించి చెబితే అతడు వాటి అర్ధాన్ని మాకు తెలియచేశాడు.
\v 13 అతడు మాకు ఏమి చెప్పాడో దాని ప్రకారమే జరిగింది. నా ఉద్యోగం నాకు మళ్ళీ ఇప్పించి వేరేవాడిని ఉరి తీయించారు>> అని ఫరోతో చెప్పాడు.
\p
\s5
\v 14 ఫరో యోసేపును పిలిపించాడు. చెరసాలలో నుండి అతన్ని త్వరగా రప్పించారు. అతడు క్షవరం చేసుకుని బట్టలు మార్చుకుని ఫరో దగ్గరకు వచ్చాడు.
\p
\v 15 ఫరో యోసేపుతో <<నేనొక కల కన్నాను. దాని అర్ధం చెప్పేవారు ఎవరూ లేరు. నువ్వు కలను వింటే దాని అర్ధాన్ని తెలియచేయగలవని నిన్నుగూర్చి విన్నాను>> అన్నాడు.
\v 16 యోసేపు, <<నావలన కాదు, దేవుడే ఫరోకు అనుకూలమైన సమాధానం ఇస్తాడు>> అని ఫరోతో చెప్పాడు.
\p
\s5
\v 17 అందుకు ఫరో <<నా కలలో నేను ఏటి ఒడ్డున నిలబడ్డాను.
\v 18 బలిసిన, అందమైన ఏడు ఆవులు ఏటిలోనుండి పైకివచ్చి జమ్ముగడ్డిలో మేస్తున్నాయి.
\s5
\v 19 నీరసంగా చాలా వికారంగా చిక్కిపోయిన మరి ఏడు ఆవులు వాటి తరువాత పైకి వచ్చాయి. వీటి అంత వికారమైనవి ఐగుప్తు దేశంలో ఎక్కడా నాకు కనబడలేదు.
\v 20 చిక్కిపోయి వికారంగా ఉన్న ఆవులు బలిసిన మొదటి ఏడు ఆవుల్ని తినేశాయి.
\v 21 అవి వాటి కడుపులో పడ్డాయి గాని అవి కడుపులో పడినట్టు కనబడలేదు, మొదట ఉన్నట్లే అవి చూడ్డానికి వికారంగా ఉన్నాయి. అంతలో నేను మేలుకున్నాను.
\s5
\v 22 నా కలలో నేను చూస్తే, పుష్టిగల ఏడు మంచి వెన్నులు ఒక్క కంకికి పుట్టాయి.
\v 23 తూర్పు గాలిచేత చెడిపోయి, ఎండిన ఏడు పీలవెన్నులు వాటి తరువాత మొలిచాయి.
\v 24 ఈ పీలవెన్నులు ఆ మంచి వెన్నుల్ని మింగివేశాయి. ఈ కలను పండితులకు తెలియచేశాను గాని దాని అర్ధాన్ని తెలియచేసే వారెవరూ లేరు>> అని అతనితో చెప్పాడు.
\p
\s5
\v 25 అందుకు యోసేపు <<ఫరో కనిన కల ఒక్కటే. దేవుడు తాను చేయబోయేది ఫరోకు తెలియచేశాడు. ఆ ఏడు మంచి ఆవులు, ఏడేళ్ళు.
\v 26 ఆ ఏడు మంచికంకులు ఏడేళ్ళు.
\s5
\v 27 కల ఒక్కటే. వాటి తరువాత చిక్కిపోయి వికారంగా పైకి వచ్చిన ఏడు ఆవులూ ఏడేళ్ళు. తూర్పు గాలి చేత చెడిపోయిన ఏడు తాలువెన్నులు, ఏడేళ్ళ కరువు.
\v 28 నేను ఫరోతో చెప్పే మాట ఇదే. దేవుడు తాను చేయబోయేది ఫరోకు చూపించాడు.
\v 29 ఇదిగో ఐగుప్తు దేశమంతటా చాలా సమృద్ధిగా పంట పండే ఏడేళ్ళు రాబోతున్నాయి.
\s5
\v 30 వాటి తరువాత ఏడేళ్ళ కరువు వస్తుంది. అప్పుడు ఆ పంట సమృద్ధినంతా ఐగుప్తు దేశం మరచిపోతుంది. ఆ కరువు దేశాన్ని నాశనం చేస్తుంది.
\v 31 దాని తరువాత వచ్చే కరువుచేత దేశంలో ఆ పంట సమృద్ధి జ్ఞాపకంలో లేకుండా పోతుంది. ఆ కరువు చాలా భారంగా ఉంటుంది.
\v 32 ఈ పని దేవుడే నిర్ణయించాడు. దీనిని దేవుడు చాలా త్వరగా జరిగిస్తాడు. అందుకే ఆ కల ఫరోకు రెండుసార్లు వచ్చింది.
\p
\s5
\v 33 కాబట్టి ఫరో వివేకమూ జ్ఞానమూ ఉన్నమనిషిని వెతికి ఐగుప్తు దేశం మీద అతన్ని నియమించాలి.
\v 34 ఫరో అలా చేసి ఈ దేశం మీద పర్యవేక్షకుల్ని నియమించి, సమృద్ధిగా పంట పండే ఏడేళ్ళలో ఐగుప్తు దేశమంతటా అయిదో భాగం తీసుకోవాలి.
\s5
\v 35 వారు రాబోయే ఈ మంచి సంవత్సరాల్లో దొరికే ఆహారమంతా సమకూర్చాలి. ఆ ధాన్యాన్ని ఫరో ఆధీనంలో ఉంచి, పట్టణాలలో భద్రం చేయాలి.
\v 36 కరువు వలన ఈ దేశం నశించి పోకుండా ఆ ధాన్యం ఐగుప్తు దేశంలో రాబోయే ఏడేళ్ళ కరువు కాలంలో సిద్ధంగా ఉంటుంది>> అని ఫరోతో చెప్పాడు.
\p
\s5
\v 37 ఈ సలహా ఫరోకూ అతని పరివారమందరి దృష్టికీ నచ్చింది.
\v 38 ఫరో తన పరివారంతో <<ఇతనిలాగా దేవుని ఆత్మ ఉన్నవాడు మనకు దొరుకుతాడా?>> అన్నాడు.
\s5
\v 39 ఫరో, యోసేపుతో <<దేవుడు ఇదంతా నీకు తెలియచేశాడు కాబట్టి నీలాగా వివేకమూ జ్ఞానమూ ఉన్న వారెవరూ లేరు.
\v 40 నువ్వు నా భవనంలో అధికారిగా ఉండాలి. నా ప్రజలంతా నీకు లోబడతారు. సింహాసనం విషయంలోనే నేను నీకంటె పైవాడిగా ఉంటాను>> అన్నాడు.
\v 41 ఫరో, <<చూడు, ఐగుప్తు దేశమంతటి మీద నేను నిన్ను నియమించాను>> అని యోసేపుతో చెప్పాడు.
\s5
\v 42 ఫరో తన చేతికి ఉన్న తన రాజముద్ర ఉంగరాన్ని తీసి యోసేపు చేతికి పెట్టాడు. శ్రేష్టమైన బట్టలు అతనికి తొడిగించి, అతని మెడలో బంగారు గొలుసు వేశాడు.
\v 43 తన రెండవ రథంలో అతన్ని ఎక్కించాడు. కొందరు అతని ముందు నడుస్తూ, <<నమస్కారం చేయండి>> అని కేకలు వేశారు. ఐగుప్తు దేశమంతటి మీదా ఫరో అతన్ని నియమించాడు.
\p
\s5
\v 44 ఫరో యోసేపుతో <<నేను ఫరోని. నీ సెలవు లేకుండా ఐగుప్తు దేశమంతటా ఎవరూ తన చేతిని కానీ కాలిని కానీ ఎత్తకూడదు>> అన్నాడు.
\v 45 ఫరో, యోసేపుకు <<జఫనత్ పనేహు>> అని పేరు పెట్టాడు. అతనికి ఓను అనే పట్టణ యాజకుడైన పోతీఫెర కూతురు ఆసెనతుతో పెళ్ళిచేశాడు.
\s5
\v 46 యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుటికి వచ్చినప్పుడు ముప్ఫై ఏళ్లవాడు. యోసేపు ఫరో దగ్గరనుండి బయలుదేరి ఐగుప్తు దేశమంతటా తిరిగాడు.
\v 47 సమృద్ధిగల ఏడేళ్ళలో భూమి చాలా విరివిగా పండింది.
\s5
\v 48 ఐగుప్తు దేశంలోని ఏడేళ్ళ ధాన్యమంతా అతడు సమకూర్చి, పట్టణాలలో దాన్ని నిల్వ చేశాడు. ఏ పట్టణం చుట్టు ఉన్న పొలాల ధాన్యం ఆ పట్టణంలోనే నిల్వచేశాడు.
\v 49 యోసేపు సముద్రపు ఇసుకంత విస్తారంగా ధాన్యాన్ని నిలవ చేశాడు. అది కొలతకు మించిపోయింది కాబట్టి దానినిక కొలవడం మానుకున్నారు.
\p
\s5
\v 50 కరువు కాలం ముందే యోసేపుకు ఇద్దరు కొడుకులు పుట్టారు. ఓను పట్టణ యాజకుడైన పోతీఫెర కూతురు ఆసెనతు వారికి తల్లి.
\v 51 అప్పుడు యోసేపు <<దేవుడు నా కష్టాన్నంతా మా నాన్న ఇంట్లో వారందరినీ నేను మరచిపోయేలా చేశాడు>> అని తన పెద్దకొడుక్కి మనష్షే అనే పేరు పెట్టాడు.
\v 52 <<నేను బాధ అనుభవించిన దేశంలో దేవుడు నన్ను ఫలవంతం చేశాడు>> అని రెండో కొడుక్కి ఎఫ్రాయిము అనే పేరు పెట్టాడు.
\s5
\v 53 ఐగుప్తు దేశంలో సమృద్ధిగా పంట పండిన ఏడేళ్ళు గడిచిపోయాయి.
\v 54 యోసేపు చెప్పిన ప్రకారం ఏడేళ్ళ కరువు మొదలయింది గాని ఐగుప్తు దేశమంతటా ఆహారముంది.
\p
\s5
\v 55 ఐగుప్తు దేశమంతటా కరువు వచ్చినప్పుడు ఆ దేశప్రజలు ఆహారం కోసం ఫరోకు మొరపెట్టుకున్నారు. అప్పుడు ఫరో <<మీరు యోసేపు దగ్గరకు వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయండి>> అని ఐగుప్తీయులందరితో చెప్పాడు.
\v 56 ఆ ప్రదేశమంతా కరువు వ్యాపించింది. యోసేపు గిడ్డంగులన్నీ విప్పించి ఐగుప్తీయులకు ధాన్యం అమ్మాడు. ఐగుప్తు దేశంలో ఆ కరువు తీవ్రంగా ఉంది.
\v 57 ఆ కరువు లోకమంతా తీవ్రంగా ఉండడం వల్ల లోకమంతా యోసేపు దగ్గర ధాన్యం కొనడానికి ఐగుప్తుకు వచ్చింది.
\s5
\c 42
\p
\v 1 ఐగుప్తులో ధాన్యం ఉందని యాకోబు తెలుసుకొని <<మీరు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారేంటి?>> అని తన కొడుకులతో అన్నాడు.
\v 2 <<చూడండి, ఐగుప్తులో ధాన్యం ఉందని విన్నాను. మనం చావకుండా బతికేలా మీరు అక్కడికి వెళ్ళి మన కోసం అక్కడనుంచి ధాన్యం కొనుక్కురండి>> అన్నాడు.
\p
\v 3 యోసేపు పదిమంది అన్నలు ఐగుప్తులో ధాన్యం కొనడానికి వెళ్ళారు.
\v 4 అయితే యాకోబు <<అతనికి ఏదైనా హాని సంభవిస్తుందేమో>> అని యోసేపు తమ్ముడైన బెన్యామీనును అతని అన్నలతో పంపలేదు.
\p
\s5
\v 5 కరువు కనాను దేశంలో ఉంది కాబట్టి ధాన్యం కొనడానికి వచ్చిన వారితో ఇశ్రాయేలు కొడుకులు కూడా వచ్చారు.
\v 6 అప్పుడు యోసేపు ఆ దేశానికి అధికారిగా ఉన్నాడు. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యాన్ని అమ్మేవాడు కాబట్టి యోసేపు అన్నలు వచ్చి ముఖాలు వంచి నేలకు వంగి యోసేపుకు నమస్కారం చేశారు.
\p
\s5
\v 7 యోసేపు తన అన్నల్ని చూసి వారిని గుర్తు పట్టి వారికి తెలియని మనిషిలా వారితో కఠినంగా మాట్లాడి <<మీరెక్కడనుండి వచ్చారు?>> అని అడిగాడు. అందుకు వారు <<ఆహారం కొనడానికి కనాను దేశం నుండి వచ్చాము>> అన్నారు.
\v 8 యోసేపు తన అన్నల్ని గుర్తు పట్టాడు గాని వారు అతణ్ణి గుర్తు పట్టలేదు.
\p
\s5
\v 9 యోసేపు వారిని గూర్చి తనకు వచ్చిన కలల్ని గుర్తుకు తెచ్చుకుని <<మీరు గూఢచారులు. ఈ దేశపు గుట్టు తెలుసుకోడానికి వచ్చారు>> అన్నాడు.
\v 10 వారు <<లేదు ప్రభూ, మీ దాసులైన మేము ఆహారం కొనడానికే వచ్చాము.
\v 11 మేమంతా ఒక తండ్రి కొడుకులం. మేము నిజాయితీగల వాళ్ళం. నీ దాసులమైన మేము గూఢచారులం కాదు>> అని బదులిచ్చారు.
\s5
\v 12 అయితే అతడు వారితో <<కాదు, ఈ దేశం గుట్టు తెలుసుకోడానికి మీరు వచ్చారు>> అన్నాడు.
\v 13 అందుకు వారు, <<నీ దాసులమైన మేము పన్నెండుగురు అన్నదమ్ములం. కనాను దేశంలో ఉన్న ఒక తండ్రి కొడుకులం. ఇదిగో, అందరిలో చిన్నవాడు ఈ రోజు మా నాన్న దగ్గర ఉన్నాడు. ఒకడు లేడు>> అన్నారు.
\p
\s5
\v 14 అయితే యోసేపు, <<కాదు, నేను చెప్పినట్టు మీరు గూఢచారులే.
\v 15 మీ అసలు సంగతి ఇలా తెలుస్తుంది. ఫరో జీవం తోడు, మీ తమ్ముడు ఇక్కడికి వస్తేనే తప్ప మీరిక్కడనుంచి వెళ్ళరు.
\v 16 మీ తమ్ముణ్ణి తీసుకురావడానికి మీలో ఒకణ్ణి పంపండి. అప్పటి వరకు మీరు ఇక్కడ బందీలుగా ఉంటారు. మీలో నిజముందో లేదో మీ మాటల్లో తెలుస్తుంది. లేకపోతే ఫరో జీవం తోడు, మీరు గూఢచారులే>> అని చెప్పి
\v 17 వారిని మూడు రోజులు చెరసాలలో వేయించాడు.
\p
\s5
\v 18 మూడవ రోజు యోసేపు వారిని చూసి <<నేను దేవునికి భయపడే వాణ్ణి. మీరు బతకాలంటే ఇలా చేయండి.
\v 19 మీరు నిజాయితీగల వారైతే మీ సోదరుల్లో ఒకడు ఈ చెరసాలలో ఉండాలి. మిగతావారు మీ ఇంటి వారి కరువు తీరడానికి ధాన్యం తీసుకు వెళ్ళండి.
\p
\v 20 మీ తమ్ముణ్ణి నా దగ్గరకు తీసుకురండి. అప్పుడు మీ మాటలు నిజమే అని తెలుస్తుంది, మీరు చావరు>> అని చెప్పాడు. కాబట్టి వారు అలా చేశారు.
\s5
\v 21 అప్పుడు ఒకరితో ఒకరు, <<మన తమ్ముని విషయంలో మనం నిజంగా అపరాధులమే. అతడు మనల్ని బతిమాలినప్పుడు మనం అతని వేదన చూసి కూడా వినలేదు.
\v 22 రూబేను, <<ఈ చిన్నవాడి పట్ల పాపం చేయవద్దని నేను మీతో చెప్పినా మీరు వినలేదు, కాబట్టి అతని చావును బట్టి మనకు తగిన శాస్తి జరుగుతున్నది>> అని వారితో అన్నాడు.
\p
\s5
\v 23 వారి మాటలు యోసేపుకు అర్ధమయ్యాయని వారికి తెలియదు, ఎందుకంటే వారి మధ్య తర్జుమా చేసేవాడు ఒకడున్నాడు.
\v 24 యోసేపు వారి దగ్గరనుండి అవతలకు పోయి ఏడ్చాడు. వారి దగ్గరకు తిరిగి వచ్చి వారితో మాట్లాడాడు. వారిలో షిమ్యోనును పట్టుకొని వారి కళ్ళెదుటే అతన్ని బంధించాడు.
\v 25 తన అన్నల సంచుల్లో ధాన్యం నింపమనీ, ఎవరి డబ్బులు వారి సంచుల్లోనే తిరిగి ఉంచమనీ, ప్రయాణం కోసం భోజనపదార్ధాలు వారికివ్వాలనీ తన పనివారికి ఆజ్ఞాపించాడు.
\s5
\v 26 వారు, తాము కొనిన ధాన్యాన్ని గాడిదల మీద ఎక్కించుకొని అక్కడనుంచి వెళ్ళిపోయారు.
\p
\v 27 అయితే వారు దిగిన చోట ఒకడు తన గాడిదకు మేతపెట్టడానికి తన సంచి విప్పితే అతని ధనం కనబడింది. అవి అతని సంచి మూతిలో ఉన్నాయి.
\v 28 అప్పుడతడు, <<నా డబ్బు నాకే ఉంది. చూడండి, నా సంచిలోనే ఉంది>> అని తన సోదరులతో అన్నాడు. వారి గుండెలు అదిరిపోయాయి. వారు వణికిపోతూ ఒకరితో ఒకరు <<ఇదేంటి దేవుడు మనకిలా చేశాడు?>> అనుకున్నారు.
\p
\s5
\v 29 వారు కనాను దేశంలో ఉన్న తమ తండ్రి యాకోబు దగ్గరకు వచ్చి తమకు జరిగినదంతా అతనికి తెలియచేశారు.
\v 30 <<ఆ దేశానికి అధిపతి, మాతో కఠినంగా మాట్లాడి, మేము ఆ దేశాన్ని వేగు చూడడానికి వచ్చామనుకున్నాడు.
\v 31 అప్పుడు మేము, <అయ్యా, మేము నిజాయితీపరులం, గూఢచారులం కాదు.
\v 32 పన్నెండు మంది సోదరులం, ఒక్క తండ్రి కొడుకులం, ఒకడు లేడు, చిన్నవాడు ఇప్పుడు కనాను దేశంలో మా నాన్న దగ్గర ఉన్నాడు> అని అతనితో చెప్పాము.
\s5
\v 33 అందుకు ఆ దేశాధిపతి, మాతో <మీరు నిజాయితీపరులని ఇలా తెలుసుకుంటాను. మీ సోదరుల్లో ఒకణ్ణి నా దగ్గర విడిచిపెట్టి, మీ ఇంట్లోవారికి కరువు తీరేలా ధాన్యం తీసుకు వెళ్ళండి.
\v 34 నా దగ్గరకు ఆ చిన్నవాణ్ని తీసుకు రండి. అప్పుడు మీరు నిజాయితీపరులనీ గూఢచారులు కారనీ నేను తెలిసికొని మీ సోదరుణ్ణి మీకప్పగిస్తాను. అప్పుడు మీరు ఈ దేశంలో వ్యాపారం చేసుకోవచ్చు> అని చెప్పాడు>> అన్నారు.
\p
\s5
\v 35 వారు తమ సంచులు కుమ్మరిస్తే ఎవరి డబ్బుల మూట వారి సంచుల్లో ఉంది. వారూ వారి తండ్రీ ఆ డబ్బుల మూటలు చూసి భయపడ్డారు.
\v 36 అప్పుడు వారి తండ్రి యాకోబు <<మీరు నా పిల్లల విషయంలో నన్ను దుఃఖానికి గురిచేశారు. యోసేపు లేడు, షిమ్యోను లేడు, మీరు బెన్యామీనును కూడ తీసుకుపోతారు. ఇవన్నీ నా మీదికే వచ్చాయి>> అని వారితో అన్నాడు.
\s5
\v 37 అందుకు రూబేను <<నేనతన్ని నీ దగ్గరకు తీసికొని రాకపోతే, నా ఇద్దరు కొడుకుల్ని నువ్వు చంపెయ్యవచ్చు. అతన్ని నా చేతికి అప్పగిస్తే, అతన్ని తిరిగి మీ దగ్గరికి తీసుకు వస్తాను>> అని చెప్పాడు.
\v 38 అయితే అతడు <<నా కొడుకుని మీతో వెళ్ళనివ్వను. అతని అన్న చనిపోయాడు, ఇతడు మాత్రమే మిగిలాడు. మీరు వెళ్ళే దారిలో ఇతనికి హాని కలిగితే తల నెరిసిన నన్ను దుఖంతో మృత్యులోకంలోకి దిగిపోయేలా చేస్తారు>> అన్నాడు.
\s5
\c 43
\p
\v 1 ఆ దేశంలో కరువు తీవ్రంగా ఉంది.
\v 2 వారు ఐగుప్తునుండి తెచ్చిన ధాన్యం తినివేసిన తరువాత వారి తండ్రి <<మీరు మళ్ళీ వెళ్ళి మన కోసం కొంచెం ఆహారం కొనండి>> అని వారితో అన్నాడు.
\s5
\v 3 యూదా, <<అతడు మీ తమ్ముడు మీతో ఉంటేనే గాని మీరు నా ముఖం చూడకూడదు, అని మాతో గట్టిగా చెప్పాడు.
\v 4 కాబట్టి నువ్వు మా తమ్ముణ్ణి మాతో పంపితే మేము వెళ్ళి నీ కోసం ఆహారం కొంటాము.
\v 5 నువ్వువాణ్ణి పంపకపోతే మేము వెళ్ళం. మీ తమ్ముడు మీతో లేకపోతే మీరు నా ముఖం చూడకూడదని అతడు మాతో చెప్పాడు>>అన్నాడు.
\p
\s5
\v 6 అందుకు ఇశ్రాయేలు, <<మీకు ఇంకొక తమ్ముడు ఉన్నాడని మీరు అతనితో చెప్పి నాకు ఇంత కీడు ఎందుకు తెచ్చిపెట్టారు?>> అన్నాడు.
\v 7 వారు <<అతడు <మీ తండ్రి ఇంకా బతికే ఉన్నాడా? మీకు ఇంకో తమ్ముడు ఉన్నాడా?> అని మా గురించి, మన కుటుంబం గురించిన వివరాలు అడిగాడు. మేము ఆ ప్రశ్నలకు తగినట్టు జవాబిచ్చాము. <మీ తమ్ముణ్ణి తీసుకు రండి>అని అతడు అడుగుతాడని మాకెలా తెలుస్తుంది?>> అన్నారు.
\s5
\v 8 యూదా తన తండ్రి ఇశ్రాయేలుతో, <<ఆ చిన్నవాణ్ని నాతో పంపు. మేము వెళతాము. అప్పుడు మేమే కాదు, నువ్వూ మా పిల్లలూ చావకుండా బతుకుతాం.
\v 9 నేను అతనికి జామీను ఉంటాను. నువ్వు నన్ను బాధ్యుడుగా ఎంచవచ్చు. నేను అతణ్ణి తిరిగి నీ దగ్గరకు తీసికొనివచ్చి నీముందు నిలబెట్టకపోతే నా జీవితమంతా ఆ నింద భరిస్తాను.
\v 10 మాకు ఆలస్యం కాకపోతే ఈపాటికి రెండవ సారి వెళ్లి మళ్ళీ వచ్చి ఉండేవాళ్ళమే>> అన్నాడు.
\p
\s5
\v 11 వారి తండ్రి ఇశ్రాయేలు, వారితో <<అలా అయితే మీరిలా చేయండి. ఈ దేశంలోని మేలైన వస్తువుల్ని మీ సంచుల్లో వేసుకొని తీసుకెళ్ళండి. కొంచెం సుగంధ ద్రవ్యాలు, కొంచెం తేనె, మసాలా దినుసులు, బోళం, పిస్తా కాయలు, బాదం కాయలు మీ సంచుల్లో వేసికొని అతనికి కానుకగా తీసుకెళ్లండి.
\v 12 రెండింతల డబ్బు తీసుకు వెళ్ళండి. మీ సంచుల మూతిలో వాళ్ళు ఉంచిన డబ్బు కూడా మళ్ళీ చేత పట్టుకొని వెళ్ళండి. బహుశా అది పొరబాటు కావచ్చు.
\s5
\v 13 మీ తమ్ముణ్ణి వెంటబెట్టుకుని అతని దగ్గరకు తిరిగి వెళ్ళండి.
\v 14 అతడు మీ అన్ననూ బెన్యామీనును మీకు అప్పగించేలా సర్వశక్తుడైన దేవుడు, అతని ముందు మిమ్మల్ని కరుణించు గాక. నేను సంతానాన్ని పోగొట్టుకోవలసి ఉంటే పోగొట్టుకుంటాను>> అని వారితో చెప్పాడు.
\v 15 వాళ్ళు ఆ కానుక తీసికుని, చేతుల్లో రెండింతల డబ్బు, తమవెంట బెన్యామీనును తీసికొని ఐగుప్తుకు వెళ్ళి యోసేపు ముందు నిలబడ్డారు.
\p
\s5
\v 16 యోసేపు వారితో ఉన్న బెన్యామీనును చూసి తన గృహనిర్వాహకునితో <<వీరిని ఇంటిలోకి తీసికెళ్ళి ఒక జంతువును కోసి వంట సిద్ధం చేయించు. మధ్యాహ్నం వీరు నాతో భోజనం చేస్తారు>> అని చెప్పాడు.
\v 17 యోసేపు చెప్పినట్లు అతడు చేసి వారిని యోసేపు ఇంటికి తీసికెళ్ళాడు.
\s5
\v 18 తమను యోసేపు ఇంటికి తీసుకువెళ్ళినందుకు వారు భయపడి, <<మొదట మన సంచుల్లో తిరిగి ఇచ్చేసిన డబ్బు కోసం అతడు మన మీద దాడి చేసే అవకాశం ఉంది. మనల్ని బంధించి, దాసులుగా చెరపట్టి, మన గాడిదల్ని తీసుకోవచ్చు>> అనుకున్నారు.
\v 19 వారు యోసేపు గృహనిర్వాహకుని దగ్గరకు వచ్చి, ఇంటి గుమ్మం ముందు అతనితో మాట్లాడి,
\v 20 <<అయ్యగారూ, మొదట మేము ఆహారం కొనడానికి మొదటిసారి వచ్చాము.
\s5
\v 21 అయితే, మేము దిగిన చోటికి చేరి మా సంచులు విప్పితే, చూడండి, మా అందరి డబ్బు మొత్తం, ఎవరి డబ్బు వారి సంచి మూతిలో ఉంది. అదంతా పట్టుకొచ్చాము.
\v 22 ఆహారం కొనడానికి వేరే డబ్బు కూడా తెచ్చాము. మా డబ్బు మా సంచుల్లో ఎవరు వేశారో మాకు తెలియదు>> అని చెప్పారు.
\p
\v 23 అందుకతడు <<మీకు అంతా క్షేమమే. భయపడవద్దు. మీ తండ్రి దేవుడూ, మీ దేవుడు, మీ సంచుల్లో మీ డబ్బు పెట్టి ఉంటాడు. మీ డబ్బు నాకు అందింది>> అని చెప్పి షిమ్యోనును వారి దగ్గరకు తెచ్చాడు.
\s5
\v 24 గృహనిర్వాహకుడు వారిని యోసేపు ఇంట్లోకి తీసికు వచ్చి, వారికి నీళ్ళిస్తే, వారు కాళ్ళు కడుక్కు న్నారు. అతడు వారి గాడిదలకు మేత వేయించాడు.
\v 25 అక్కడ తాము భోజనం చేయాలని వారు విన్నారు కాబట్టి మధ్యాహ్నం, యోసేపు వచ్చే సమయానికి తమ కానుక సిద్ధంగా ఉంచారు.
\p
\s5
\v 26 యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతుల్లో ఉన్న కానుకను ఇంటిలోకి తెచ్చి, అతనికి నేలను వంగి, నమస్కారం చేశారు.
\v 27 అప్పుడు <<మీరు చెప్పిన ముసలివాడైన మీ నాన్న క్షేమంగా ఉన్నాడా? అతడు ఇంకా బతికే ఉన్నాడా?>> అని వారి క్షేమ సమాచారం అడిగినప్పుడు వారు,
\s5
\v 28 <<నీ దాసుడైన మా తండ్రి ఇంకా బతికే ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు>> అని చెప్పి వంగి సాగిలపడ్డారు.
\v 29 అప్పుడతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడూ తన తమ్ముడు అయిన బెన్యామీనును చూసి <<మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా?>> అని అడిగి, <<బాబూ, దేవుడు నీకు దయ చూపుతాడు గాక>> అన్నాడు.
\s5
\v 30 అప్పుడు తన తమ్ముని మీద యోసేపుకు ప్రేమ పొర్లుకొని వచ్చింది కాబట్టి అతడు త్వరగా ఏడవడానికి చోటు వెతికి, లోపలి గదిలోకి వెళ్ళి, అక్కడ ఏడ్చాడు.
\v 31 అతడు తన ముఖం కడుక్కుని బయటికి వచ్చాడు. అతడు తన్ను తాను సముదాయించుకుని, <<భోజనం వడ్డించండి>> అని చెప్పాడు.
\p
\s5
\v 32 అతనికీ వారికీ అతనితో భోజనం చేస్తున్న ఐగుప్తీయులకు వేర్వేరుగా వడ్డించారు. ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి భోజనం చేయరు. అది ఐగుప్తీయులకు అసహ్యం.
\v 33 పెద్దవాడు మొదలుకొని చిన్నవాని వరకు వారు అతని ముందు తమ తమ వయసు ప్రకారం కూర్చున్నారు. వారంతా ఆశ్చర్యపోయారు.
\v 34 అతడు తన దగ్గర నుంచి వారికి పళ్ళేల్లో భోజనం వంతులెత్తి పంపాడు. బెన్యామీను వంతు వారందరి వంతులకంటే అయిదంతలు ఎక్కువగా ఉంది. వారంతా తాగి, యోసేపుతో విందారగించి ఉల్లాసంగా గడిపారు.
\s5
\c 44
\p
\v 1 యోసేపు, <<వారు మోసికెళ్ళినంత ఆహారాన్ని వారి సంచుల్లో నింపి ఎవరి డబ్బు వారి సంచి మూతిలో పెట్టు,
\v 2 చివరివాడి సంచి మూతిలో నా వెండి గిన్నె, అతని ధాన్యపు డబ్బు పెట్టు>> అని తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపించగా, యోసేపు చెప్పినట్టు అతడు చేశాడు.
\s5
\v 3 తెల్లవారినప్పుడు ఆ మనుషుల్ని తమ గాడిదలతో పాటు పంపి వేశారు.
\v 4 వారు ఆ పట్టణం నుండి బయలుదేరి ఎంతో దూరం వెళ్ళక ముందే, యోసేపు తన గృహనిర్వాహకునితో <<నువ్వు లేచి ఆ మనుష్యుల వెంబడించి వెళ్ళి వారిని కలుసుకుని, <మీరు మేలుకు ప్రతిగా కీడు చేశారేమిటి?
\v 5 నా యజమాని తాగే గిన్నె, శకునాలు చూసే గిన్నె యిదే కదా? మీరు చేసిన ఈ పని చాలా దుర్మార్గం> అని వారితో చెప్పు>> అన్నాడు.
\s5
\v 6 అతడు వారిని కలిసికొని ఆ మాటలు వారితో చెప్పాడు.
\v 7 వారు <<మా ప్రభువు ఇలాంటి మాటలు చెప్పడం ఎందుకు? మీ దాసులైన మేము ఇలాంటి పని చేయము.
\p
\s5
\v 8 చూడండి, మా సంచుల మూతుల్లో మాకు దొరికిన డబ్బును కనాను దేశంలో నుండి తిరిగి తీసికొని వచ్చాము. నీ ప్రభువు ఇంట్లో నుంచి మేము వెండి గానీ బంగారం గానీ ఎలా దొంగిలిస్తాము?
\v 9 నీ దాసుల్లో ఎవరి దగ్గర అది దొరుకుతుందో వాడు చస్తాడు గాక. మేము మా ప్రభువుకు దాసులమవుతాం>> అని అతనితో అన్నారు.
\v 10 గృహ నిర్వాహకుడు, <<మంచిది, మీరు చెప్పినట్టే చేయండి. ఎవరి దగ్గర ఆ గిన్నె దొరుకుతుందో అతడే నాకు బానిస ఆవుతాడు. మిగతా వారు నిర్దోషులు>> అని చెప్పాడు.
\s5
\v 11 అప్పుడు ప్రతివాడు గబగబా తన సంచిని దించి దానిని విప్పాడు.
\v 12 ఆ గృహ నిర్వాహకుడు పెద్దవాడి సంచితో మొదలు పెట్టి చిన్నవాడి సంచి వరకూ వెతికాడు. ఆ గిన్నె బెన్యామీను సంచిలో దొరికింది.
\v 13 వారు తమ బట్టలు చింపుకున్నారు. అందరూ గాడిదల మీద సంచులు ఎక్కించుకుని పట్టణానికి తిరిగి వచ్చారు.
\p
\s5
\v 14 అప్పుడు యూదా, అతని సోదరులు యోసేపు ఇంటికి వచ్చారు. అతడింకా అక్కడే ఉన్నాడు, వారు అతని ముందు నేలమీద సాగిలపడ్డారు.
\v 15 అప్పుడు యోసేపు <<మీరు చేసిన ఈ పని ఏమిటిటి? నాలాటి మనిషి శకునం చూసి తెలుసుకుంటాడని మీకు తెలియదా>> అని వారితో అన్నాడు.
\s5
\v 16 యూదా <<మా యజమానులైన మీతో ఏమి చెప్పగలం? ఏమనగలం? మేము నిర్దోషులమని ఎలా రుజువు చేయగలం? దేవుడే నీ దాసుల అపరాధం కనుగొన్నాడు. ఇదిగో, మేమూ ఎవని దగ్గర ఆ గిన్నె దొరికిందో వాడూ మా యజమానులైన మీకు దాసులమవుతాం>> అన్నాడు.
\v 17 యోసేపు <<అలా చేయడం నాకుదురమౌతుంది గాక. ఎవరి దగ్గర ఆ గిన్నె దొరికిందో వాడే నాకు దాసుడుగా ఉంటాడు. మీరు మీ తండ్రి దగ్గరకు సమాధానంగా వెళ్ళండి>> అని చెప్పాడు.
\p
\s5
\v 18 యూదా అతని సమీపించి, <<ప్రభూ, ఒక మనవి. ఒక మాట రహస్యంగా నా యజమానులైన మీతో మీ దాసుడైన నన్ను చెప్పుకోనివ్వండి. తమ కోపం తమ దాసుని మీద రగులుకోనివ్వకండి. తమరు ఫరో అంతవారు గదా.
\v 19 నా యజమానులైన మీరు, <మీకు తండ్రి అయినా తమ్ముడైనా ఉన్నాడా?> అని తమ దాసుల్ని అడిగారు.
\s5
\v 20 అందుకు మేము, <మాకు ముసలి వాడైన తండ్రి, అతని ముసలితనంలో పుట్టిన ఒక చిన్నవాడు ఉన్నారు. వాని అన్న చనిపోయాడు. వాడి తల్లికి వాడొక్కడే మిగిలాడు. అతని తండ్రి అతన్ని ఎంతో ప్రేమిస్తాడు> అన్నాము.
\v 21 అప్పుడు తమరు, <నేనతన్ని చూడడానికి అతన్ని నా దగ్గరకు తీసికొని రండి> అని తమ దాసులతో చెప్పారు.
\p
\v 22 అందుకు మేము, <ఆ చిన్నవాడు తన తండ్రిని వదిలి ఉండలేడు. వాడు తన తండ్రిని విడిచి పోతే వాడి తండ్రి చనిపోతాడు> అని నా యజమానులైన మీతో చెప్పాము.
\s5
\v 23 అందుకు తమరు, <మీ తమ్ముడు మీతో రాకపోతే మీరు మరలా నా ముఖం చూడకూడదు> అని తమ దాసులతో చెప్పారు.
\v 24 కాబట్టి నా తండ్రి అయిన తమ దాసుని దగ్గరకు మేము వెళ్ళి, నా యజమానులైన మీ మాటల్ని అతనికి తెలియచేశాము.
\v 25 మా తండ్రి, <మీరు తిరిగి వెళ్ళి మనకోసం కొంచెం ఆహారం కొనుక్కొని రండి> అని చెబితే
\v 26 <మేము అక్కడికి వెళ్ళలేము, మా తమ్ముడు మాతో కూడా ఉంటేనే వెళ్తాము. మా తమ్ముడు మాతో ఉంటేనే గాని ఆయన ముఖం చూడలేము> అని చెప్పాము.
\p
\s5
\v 27 అందుకు తమ దాసుడైన నా తండ్రి, <నా భార్య నాకిద్దరిని కన్నదని మీకు తెలుసు.
\v 28 వారిలో ఒకడు నాకు దూరమైపోయాడు. అతడు తప్పకుండా క్రూర మృగాల బారిన పడి ఉంటాడు. అప్పటినుంచి అతడు నాకు కనబడలేదు.
\v 29 మీరు నా దగ్గరనుంచి ఇతన్ని కూడా తీసుకుపోతే, ఇతనికి ఏదైనా హాని జరిగితే, తల నెరిసిన నన్ను మృతుల లోకంలోకి దుఃఖంతో దిగిపోయేలా చేస్తారు> అని మాతో చెప్పాడు.
\p
\s5
\v 30 కాబట్టి, తమ దాసుడైన నా తండ్రి దగ్గరకు నేను తిరిగి వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు మాతో బాటు లేకపోతే
\v 31 మా తండ్రి ప్రాణం ఇతని ప్రాణంతో పెనవేసుకుంది కాబట్టి ఈ చిన్నవాడు మాతో లేకపోవడం చూడగానే అతడు చచ్చిపోతాడు. అలా తమ దాసులమైన మేము తల నెరిసిన తమ సేవకుడైన మా తండ్రిని మృతుల లోకంలోకి దుఖంతో దిగిపోయేలా చేస్తాము.
\v 32 తమ సేవకుడినైన నేను, <ఈ బాలునికి జామీనుగా ఉండి, నీ దగ్గరకు నేనతని తీసికొని రాకపోతే మా నాన్న దృష్టిలో ఆ నింద నా మీద ఎప్పుడూ ఉంటుంది>అని చెప్పాను.
\s5
\v 33 కాబట్టి తమ దాసుడైన నన్ను ఈ అబ్బాయికి ప్రతిగా ఏలినవారికి దాసునిగా ఉండనిచ్చి ఈ చిన్నవానిని తన సోదరులతో వెళ్ళనివ్వండి.
\v 34 ఈ చిన్నవాడు నాతో కూడ లేకపోతే మా నాన్న దగ్గరికి నేనెలా వెళ్ళగలను? ఒకవేళ వెళితే, మా నాన్నకు వచ్చే అపాయం చూడవలసి వస్తుంది>> అని చెప్పాడు.
\s5
\c 45
\p
\v 1 అప్పుడు యోసేపు తన దగ్గర నిలబడ్డ పరివారం ఎదుట తమాయించుకోలేక, <<అందరినీ నా దగ్గరనుంచి బయటికి పంపేయండి>> అని బిగ్గరగా చెప్పాడు. యోసేపు తన అన్నలకు తనను తాను తెలియజేసుకున్నప్పుడు అతని దగ్గర ఎవరూ లేరు.
\v 2 అతడు పెద్దగా ఏడవగా ఐగుప్తీయులు విన్నారు. ఫరో ఇంటివారు ఆ ఏడుపు విన్నారు.
\v 3 అప్పుడు యోసేపు <<నేను యోసేపును. నా తండ్రి ఇంకా బతికే ఉన్నాడా?>> అని అడిగినప్పుడు, అతని సోదరులు అతని సమక్షంలో కంగారుపడి అతనికి జవాబు ఇవ్వలేకపోయారు.
\s5
\v 4 అప్పుడు యోసేపు, <<నా దగ్గరకు రండి>> అని తన సోదరులతో చెబితే, వారు అతని దగ్గరకు వచ్చారు. అప్పుడతడు, <<ఐగుప్తుకు వెళ్లిపోయేలా మీరు అమ్మేసిన మీ తమ్ముడు యోసేపును నేనే.
\v 5 అయినా, నన్నిక్కడకు మీరు అమ్మేసినందుకు దుఃఖపడవద్దు. మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు. ప్రాణరక్షణ కోసం దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు.
\v 6 రెండేళ్ళ నుంచి దేశంలో కరువు ఉంది. ఇంకా ఐదేళ్ళు దున్నడం గానీ పంటకోత గానీ ఉండదు.
\p
\s5
\v 7 మిమ్మల్ని రక్షించి, భూమి మీద మిమ్మల్ని శేషంగా నిలపడానికీ ప్రాణాలతో కాపాడడానికీ దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు.
\v 8 కాబట్టి నన్ను దేవుడే పంపాడు. మీరు కాదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగా అతని ఇంటివారందరికి ప్రభువుగా ఐగుప్తు దేశమంతటి మీదా అధికారిగా నియమించాడు.
\s5
\v 9 మీరు త్వరగా నా తండ్రి దగ్గరకు వెళ్ళి అతనితో <నీ కొడుకు యోసేపు ఇలా చెబుతున్నాడు- దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటి మీదా అధిపతిగా నియమించాడు, నా దగ్గరకు రండి. ఆలస్యం చేయవద్దు.
\v 10 నువ్వు గోషెను ప్రాంతంలో నివసిస్తావు. అప్పుడు నువ్వూ నీ పిల్లలూ నీ పిల్లల పిల్లలూ నీ గొర్రెల మందలూ నీ పశువులూ నీకు కలిగిన సమస్తమూ నాకు దగ్గరగా ఉంటాయి.
\v 11 ఇంకా ఐదేళ్ళు కరువు ఉంటుంది, కాబట్టి నీకూ నీ ఇంటి వారికీ నీకు కలిగినదానంతటికీ పేదరికం రాకుండా అక్కడ నిన్ను పోషిస్తాను> అన్నాడని చెప్పండి.
\s5
\v 12 ఇదిగో మీతో మాట్లాడేది నా నోరే అని మీ కళ్ళూ నా తమ్ముడు బెన్యామీను కళ్ళూ చూస్తున్నాయి.
\p
\v 13 ఐగుప్తులో నాకున్న వైభవాన్నీ మీరు చూసిన సమస్తాన్నీ మా నాన్నకు తెలియచేసి త్వరగా మా నాన్నను ఇక్కడికి తీసికొని రండి>> అని తన సోదరులతో చెప్పాడు.
\s5
\v 14 తన తమ్ముడు బెన్యామీను మెడను కౌగలించుకుని ఏడ్చాడు. బెన్యామీను అతణ్ణి కౌగలించుకుని ఏడ్చాడు.
\v 15 అతడు తన సోదరులందరిని ముద్దు పెట్టుకొని వారిని హత్తుకుని ఏడ్చిన తరువాత అతని సోదరులు అతనితో మాట్లాడారు.
\s5
\v 16 <<యోసేపు సోదరులు వచ్చారు>> అనే సంగతి ఫరో ఇంట్లో వినబడింది. అది ఫరోకు, అతని సేవకులకు చాలా ఇష్టమయింది.
\v 17 అప్పుడు ఫరో యోసేపుతో ఇలా అన్నాడు, <<నీ సోదరులతో ఇలా చెప్పు, <మీరిలా చేయండి. మీ పశువుల మీద బరువులు కట్టి కనాను దేశానికి వెళ్ళి
\v 18 మీ తండ్రినీ మీ ఇంటివారినీ వెంట బెట్టుకొని నా దగ్గరకు రండి, ఐగుప్తు దేశంలోని మంచి వస్తువులను మీకిస్తాను. ఈ దేశపు సారాన్ని మీరు అనుభవిస్తారు.
\s5
\v 19 మీకు ఆజ్ఞ ఇస్తున్నాను, ఇలా చేయండి. మీ పిల్లల కోసం, మీ భార్యల కోసం ఐగుప్తులో నుండి బండ్లను తీసికొనిపోయి మీ తండ్రిని వెంటబెట్టుకొని రండి.
\v 20 ఐగుప్తు దేశమంతటిలో ఉన్న మంచి వస్తువులు మీవే అవుతాయి కాబట్టి మీ సామగ్రిని లక్ష్యపెట్టవద్దు> >> అన్నాడు.
\s5
\v 21 ఇశ్రాయేలు కుమారులు అలాగే చేశారు. యోసేపు ఫరో మాట ప్రకారం వారికి బండ్లను ఇప్పించాడు. ప్రయాణానికి భోజన పదార్ధాల్ని ఇప్పించాడు.
\v 22 అతడు వారికి రెండేసి జతల బట్టలు ఇచ్చాడు, బెన్యామీనుకు ౩౦౦ తులాల వెండి, ఐదు జతల బట్టలు ఇచ్చాడు.
\v 23 అతడు తన తండ్రి కోసం వీటిని పంపించాడు, ఐగుప్తులోని శ్రేష్టమైన వాటిని మోస్తున్న పది గాడిదల్నీ ప్రయాణానికి తన తండ్రి కోసం ఆహారం, ఇతర ధాన్యం, వేర్వేరు తినే సరుకులు మోస్తున్న పది ఆడ గాడిదల్నీ పంపించాడు.
\s5
\v 24 అప్పుడతడు తన సోదరులను సాగనంపి వారు బయలుదేరుతుంటే <<దారిలో పోట్లాడుకోవద్దు>> అని వారితో చెప్పాడు.
\p
\v 25 వారు ఐగుప్తునుండి బయలు దేరి కనాను దేశానికి తమ తండ్రి అయిన యాకోబు దగ్గరకు వచ్చి
\v 26 <<యోసేపు ఇంకా బతికే ఉన్నాడు. ఐగుప్తు దేశమంతటి మీదా అధిపతిగా ఉన్నాడు>> అని అతనికి తెలియచేశారు. అయితే అతడు వారి మాట నమ్మలేక పోయాడు. అతని హృదయం విస్మయం చెందింది.
\s5
\v 27 అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నీ అతనితో చెప్పారు. తనను తీసుకు వెళ్ళడానికి యోసేపు పంపిన బండ్లు చూసి, వారి తండ్రి యాకోబు ప్రాణం తెప్పరిల్లింది.
\v 28 అప్పుడు ఇశ్రాయేలు <<ఇంతే చాలు. నా కొడుకు యోసేపు బతికే ఉన్నాడు, నేను చావక ముందు వెళ్ళి అతన్ని చూస్తాను>> అన్నాడు.
\s5
\c 46
\p
\v 1 ఇశ్రాయేలు తనకున్నదంతా తీసికొని ప్రయాణమై బెయేర్షెబా వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులర్పించాడు.
\v 2 అప్పుడు రాత్రి దర్శనంలో దేవుడు <<యాకోబూ యాకోబూ>> అని ఇశ్రాయేలును పిలిచాడు. అందుకతడు, <<చిత్తం ప్రభూ>> అన్నాడు.
\v 3 ఆయన <<నేనే దేవుణ్ణి, మీ తండ్రి దేవుణ్ణి. ఐగుప్తు వెళ్ళడానికి భయపడవద్దు. అక్కడ నిన్ను గొప్ప జనంగా చేస్తాను.
\v 4 నేను నీతో కూడా ఐగుప్తు వస్తాను. నేను నిన్ను తప్పకుండా ఇక్కడికి తిరిగి తీసుకువస్తాను. నువ్వు చనిపోయేటప్పుడు యోసేపు తన సొంత చేతులతో నీ కళ్ళు మూస్తాడు.>>
\p
\s5
\v 5 యాకోబు లేచి బెయేర్షెబా నుండి తరలి వెళ్ళాడు. ఫరో అతనినెక్కించి తీసుకు రావడానికి పంపిన బండ్ల మీద ఇశ్రాయేలు కొడుకులు తమ తండ్రి యాకోబునూ తమ పిల్లలనూ తమ భార్యలనూ ఎక్కించారు.
\v 6 యాకోబు అతనితో పాటు అతని సంతానమంతా ఐగుప్తు వచ్చారు. వారు తమ పశువుల్నీ తాము కనానులో సంపాదించిన సంపదనంతా తీసికెళ్లారు.
\v 7 అతడు తన కొడుకుల్నీ మనుమల్నీ తన కూతుర్లనూ తన కొడుకుల కూతుర్లనూ తన సంతానాన్నంతా తనతో ఐగుప్తు తీసికొని వచ్చాడు.
\p
\s5
\v 8 ఐగుప్తుకు వచ్చిన ఇశ్రాయేలు కొడుకుల పేర్లు ఇవే.
\p
\v 9 యాకోబు పెద్ద కొడుకు, రూబేను. రూబేను కొడుకులు, హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ.
\p
\v 10 షిమ్యోను కొడుకులు, యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు, కనానీయురాలి కొడుకు షావూలు.
\p
\v 11 లేవి కొడుకులు, గెర్షోను, కహాతు, మెరారి.
\p
\s5
\v 12 యూదా కొడుకులు ఏరు, ఓనాను, షేలా, పెరెసు, జెరహు. (ఏరు, ఓనాను, కనాను దేశంలో చనిపోయారు). పెరెసు కొడుకులు హెస్రోను, హామూలు.
\p
\v 13 ఇశ్శాఖారు కొడుకులు తోలా, పువ్వా, యోబు, షిమ్రోను.
\p
\v 14 జెబూలూను కొడుకులు సెరెదు, ఏలోను, యహలేలు.
\p
\v 15 వీరు లేయా కొడుకులు. ఆమె పద్దనరాములో యాకోబుకు వారినీ అతని కూతురు దీనానూ కన్నది. అతని కొడుకులూ అతని కుమార్తెలూ మొత్తం ముప్పై ముగ్గురు.
\p
\s5
\v 16 గాదు కొడుకులు సిప్యోను, హగ్గీ, షూనీ, ఎస్బోను, ఏరీ, ఆరోదీ, అరేలీ.
\p
\v 17 ఆషేరు కొడుకులు ఇమ్నా, ఇష్వా, ఇష్వీ, బెరీయా. వారి సోదరి శెరహు. బెరీయా కొడుకులు హెబెరు, మల్కీయేలు.
\v 18 లాబాను తన కూతురు లేయా కిచ్చిన జిల్పా కొడుకులు వీరే. ఆమె ఈ పదహారు మందిని యాకోబుకు కన్నది.
\p
\s5
\v 19 యాకోబు భార్య అయిన రాహేలు కొడుకులు యోసేపు, బెన్యామీను.
\p
\v 20 యోసేపుకు మనష్షే, ఎఫ్రాయిములు పుట్టారు. వారిని ఐగుప్తుదేశంలో ఓనుకు యాజకుడైన పోతీఫెర కూతురు ఆసెనతు అతనికి కన్నది.
\p
\v 21 బెన్యామీను కొడుకులు బెల, బేకెరు, అష్బేలు, గెరా, నయమాను, ఏహీరోషు, ముప్పీము, హుప్పీము, ఆర్దు.
\v 22 యాకోబుకు రాహేలు కనిన కొడుకులైన వీరంతా పద్నాలుగురు.
\p
\s5
\v 23 దాను కొడుకు హుషీము.
\p
\v 24 నఫ్తాలి కొడుకులు యహనేలు, గూనీ, యేసెరు, షిల్లేము.
\v 25 లాబాను తన కూతురు రాహేలుకు ఇచ్చిన బిల్హా కొడుకులు వీరే. ఆమె వారిని యాకోబుకు కన్నది. వారంతా ఏడుగురు.
\s5
\v 26 యాకోబు కోడళ్ళను మినహాయించి అతని వారసులు యాకోబుతో ఐగుప్తుకు వచ్చిన వారంతా అరవై ఆరుగురు.
\v 27 ఐగుప్తులో యోసేపుకు పుట్టిన కొడుకులు ఇద్దరు. ఐగుప్తుకు వచ్చిన యాకోబు కుటుంబీకులు మొత్తం డెభ్భై మంది.
\p
\s5
\v 28 యాకోబు గోషెనుకు దారి చూపడానికి యోసేపు దగ్గరికి యూదాను తనకు ముందుగా పంపాడు. వారు గోషెను ప్రాంతానికి వచ్చారు.
\v 29 యోసేపు తన రథాన్ని సిద్ధం చేయించి తన తండ్రి ఇశ్రాయేలును కలుసుకోడానికి గోషెనుకు వచ్చాడు. యోసేపు అతన్ని చూసి, అతని మెడను కౌగలించుకుని చాలా సేపు ఏడ్చాడు.
\v 30 అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో <<నీవింకా బతికే ఉన్నావు. నీ ముఖం చూశాను. కాబట్టి నేనిక చనిపోగలను>> అని చెప్పాడు.
\p
\s5
\v 31 యోసేపు తన సోదరులతో తన తండ్రి కుటుంబం వారితో <<నేను వెళ్ళి యిది ఫరోకు తెలియచేసి, <కనాను దేశంలో ఉన్న నా సోదరులూ నా తండ్రి కుటుంబం వారూ నా దగ్గరకు వచ్చారు.
\v 32 వారు గొర్రెల కాపరులు. పశువుల్ని మేపేవారు. వారు తమకు కలిగినదంతా తీసికొని వచ్చారు> అని అతనితో చెబుతాను.
\s5
\v 33 కాబట్టి ఫరో మిమ్మల్ని పిలిపించి, < మీ వృత్తి ఏంటి?> అని అడిగితే
\v 34 <మా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మేమూ మా పూర్వీకులంతా కాపరులం.> మీరు గోషెను ప్రాంతంలో నివసించేలా ఇలా చెప్పండి. ఎందుకంటే, గొర్రెల కాపరి వృత్తిలో ఉన్నవారంటే ఐగుప్తీయులకు అసహ్యం.>>
\s5
\c 47
\p
\v 1 యోసేపు వెళ్ళి ఫరోతో <<మా నాన్న, నా అన్నలు వారి గొర్రెల మందలతో వారి పశువులతో వారికి కలిగినదంతటితో కనాను దేశం నుండి వచ్చి గోషెనులో ఉన్నారు>> అని తెలియచేసి,
\v 2 తన సోదరులలో అయిదుగురిని వెంటబెట్టుకొని వెళ్లి వారిని ఫరో ముందు నిలబెట్టాడు.
\s5
\v 3 ఫరో, అతని సోదరులను చూసి, <<మీ వృత్తి ఏంటి?>> అని అడిగితే వారు, <<నీ దాసులమైన మేమూ మా పూర్వికులు, గొర్రెల కాపరులం>> అని ఫరోతో చెప్పారు.
\v 4 వారు <<కనాను దేశంలో కరువు తీవ్రంగా ఉంది. నీ దాసుల మందలకు మేత లేదు కాబట్టి ఈ దేశంలో కొంత కాలముండడానికి వచ్చాము. గోషెను ప్రాంతంలో నీ దాసులు నివసించడానికి సెలవు ఇప్పించండి>> అని ఫరోతో అన్నారు.
\s5
\v 5 ఫరో యోసేపును చూసి, <<మీ నాన్న, నీ సోదరులు నీ దగ్గరకు వచ్చారు.
\v 6 ఐగుప్తు దేశం నీ ఎదుట ఉంది. ఈ దేశంలోని మంచి ప్రాంతంలో మీ నాన్న, నీ సోదరులూ నివసించేలా చెయ్యి. గోషెను ప్రాంతంలో వారు నివసించవచ్చు. వారిలో ఎవరైనా సమర్ధులని నీకు అనిపిస్తే నా మందల మీద వారిని అధిపతులుగా నియమించు>> అని చెప్పాడు.
\p
\s5
\v 7 యోసేపు తన తండ్రి యాకోబును లోపలికి తీసుకు వచ్చి ఫరో ముందు నిలబెట్టినప్పుడు, యాకోబు ఫరోను దీవించాడు.
\v 8 ఫరో, <<నీ వయసెంత?>> అని యాకోబును అడిగాడు.
\v 9 యాకోబు <<నేను ప్రయాణాలు చేసినవి 130 ఏళ్ళు. నా జీవించిన దినాలు కొద్డిగానూ బాధాకరమైనవిగానూ ఉన్నాయి. అవి నా పూర్వీకులు యాత్ర చేసిన సంవత్సరాలన్ని కాలేదు>> అని ఫరోతో చెప్పి,
\v 10 ఫరోను దీవించి వెళ్ళిపోయాడు.
\p
\s5
\v 11 ఫరో ఆజ్ఞ ఇచ్చినట్లే, యోసేపు తన తండ్రికీ తన సోదరులకూ ఐగుప్తు దేశంలో రామెసేసు అనే మంచి ప్రదేశంలో స్వాస్థ్యం ఇచ్చాడు.
\v 12 యోసేపు తన తండ్రినీ తన సోదరులనూ తన తండ్రి కుటుంబం వారినందరినీ పోషిస్తూ వారి పిల్లల లెక్క ప్రకారం ఆహారమిచ్చి సంరక్షించాడు.
\p
\s5
\v 13 కరువు చాలా తీవ్రంగా ఉంది కాబట్టి ఆ దేశమంతటా ఆహారం లేదు. కరువుతో ఐగుప్తు దేశం, కనాను దేశం దుర్బలమైన స్థితికి వచ్చాయి.
\v 14 యోసేపు ప్రజలకు ధాన్యం అమ్ముతూ ఐగుప్తు దేశంలోనూ కనాను దేశంలోనూ ఉన్న డబ్బంతా పోగుచేశాడు. ఆ డబ్బంతా, ఫరో భవనంలోకి యోసేపు తెప్పించాడు.
\s5
\v 15 ఐగుప్తు దేశంలో కనాను దేశంలో డబ్బు అయిపోయిన తరువాత ఐగుప్తీయులంతా యోసేపు దగ్గరకు వచ్చి <<మాకు ఆహారం ఇప్పించు. నీ ముందు మేమెందుకు చావాలి? మా డబ్బంతా అయిపోయింది>> అన్నారు.
\p
\v 16 అందుకు యోసేపు, <<మీ పశువులు ఇవ్వండి, మీ డబ్బులు అయిపోతే మీ పశువులకు బదులు నేను మీకు ధాన్యమిస్తాను>> అని చెప్పాడు.
\v 17 కాబట్టి వారు తమ పశువుల్ని యోసేపు దగ్గరకు తెచ్చారు. ఆ సంవత్సరం, వారి మందలన్నిటికి బదులుగా అతడు వారికి ఆహారమిచ్చి వారిని పోషించాడు.
\s5
\v 18 ఆ సంవత్సరం గడిచాక, తర్వాతి సంవత్సరం వారు అతని దగ్గరకు వచ్చి <<మా డబ్బంతా అయిపోయింది. ఆ సంగతి మా యజమానులైన మీ దగ్గర దాచలేము. మా పశువుల మందలన్నీ మా యజమానులైన మీ వశమయ్యాయి. మా శరీరాలూ మా భూములూ తప్ప ఇంకేమీ మాకు మిగలలేదు.
\v 19 మీ కళ్ళముందు మేమూ మా పొలాలు ఎందుకు నశించాలి? ఆహారమిచ్చి మమ్మల్నీ మా పొలాల్నీ కొనండి. మా పొలాలతో పాటు మేము ఫరోకు దాసులమవుతాం. మేము చావకుండా బతికేలా, పొలాలు పాడైపోకుండా మాకు విత్తనాలివ్వండి>> అని అడిగారు.
\p
\s5
\v 20 ఆవిధంగా, యోసేపు ఐగుప్తు భూములన్నిటినీ ఫరో కోసం కొన్నాడు. కరువు ఇగుప్తు వారిపాలిట తీవ్రంగా ఉండడం వలన వారంతా తమ పొలాల్ని అమ్మేశారు కాబట్టి, భూమి ఫరోది అయింది.
\v 21 అతడు ఐగుప్తు పొలిమేరల ఈ చివరనుండి ఆ చివర వరకు ప్రజల్ని దాసులుగా చేశాడు.
\v 22 యాజకుల భూమి మాత్రమే అతడు కొనలేదు, యాజకులకు ఫరో భత్యం నియమించాడు. వారు ఫరో ఇచ్చిన ఆహారం తినేవారు కాబట్టి వారు తమ భూముల్ని అమ్మలేదు.
\s5
\v 23 యోసేపు <<ఇదిగో నేడు మిమ్మల్ని, మీ భూముల్ని ఫరో కోసం కొన్నాను. మీకు విత్తనాలు ఇవిగో. పొలాల్లో చల్లండి.
\v 24 నాలుగు భాగాలు మీవి. పంటలో అయిదవ భాగం మీరు ఫరోకు ఇవ్వాలి. అది పొలాల్లో విత్తడానికీ మీ పిల్లలకూ మీ ఇంట్లోవారి ఆహారానికి>> అని ప్రజలతో చెప్పాడు.
\s5
\v 25 వారు, <<నువ్వు మా ప్రాణాలు నిలబెట్టావు. మాపై నీ దయ ఉంటుంది గాక. మేము ఫరోకు బానిసలమవుతాం>> అని చెప్పారు.
\v 26 అప్పుడు ఐదవ భాగం ఫరోది అని యోసేపు ఐగుప్తు వారికి చట్టం నియమించాడు. అది ఇప్పటివరకు నిలిచి వుంది. యాజకుల భూములు మాత్రమే ఫరోవి కాలేదు.
\p
\s5
\v 27 ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలోని గోషెను ప్రాంతంలో నివసించారు. అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది చాలా విస్తరించారు.
\v 28 యాకోబు ఐగుప్తుదేశంలో 17 ఏళ్ళు జీవించాడు. యాకోబు మొత్తం 147 ఏళ్ళు బతికాడు.
\s5
\v 29 ఇశ్రాయేలు అవసాన కాలం దగ్గర పడినప్పుడు అతడు తన కొడుకు యోసేపును పిలిపించి, <<నాపట్ల నీకు అభిమానం ఉంటే, నీ చెయ్యి నా తొడ కింద ఉంచి నాకు నమ్మకాన్నీ విశ్వాసాన్నీ కలిగించు. దయచేసి నన్ను ఐగుప్తులో పాతిపెట్టవద్దు.
\v 30 నేను నా పితరులతో నిద్రించినప్పుడు ఐగుప్తులో నుంచి నన్ను తీసుకెళ్ళి, వారి సమాధిలో నన్ను పాతిపెట్టు>> అని అతనితో చెప్పాడు.
\v 31 అందుకు యోసేపు, <<నేను నీ మాట చొప్పున చేస్తాను>> అన్నాడు. ఇశ్రాయేలు, <<నాతో ప్రమాణం చేయి>> అంటే, యోసేపు అతనితో ప్రమాణం చేశాడు. అప్పుడు ఇశ్రాయేలు తన పడక తలగడ దగ్గర వంగి నమస్కరించాడు.
\s5
\c 48
\p
\v 1 ఈ సంగతులైన తరువాత <<ఇదిగో, మీ నాన్నకు ఒంట్లో బాగాలేదు>> అని ఒకడు యోసేపుతో చెప్పాడు. అప్పుడతడు మనష్షే, ఎఫ్రాయిము అనే తన ఇద్దరు కొడుకుల్ని వెంటబెట్టుకొని వెళ్ళాడు.
\v 2 <<ఇదిగో నీ కొడుకు యోసేపు నీ దగ్గరకు వస్తున్నాడు>> అని యాకోబుకు తెలిసింది. అప్పుడు ఇశ్రాయేలు బలం తెచ్చుకొని తన మంచం మీద కూర్చున్నాడు.
\p
\s5
\v 3 అతడు యోసేపుతో, <<కనాను దేశంలో ఉన్న లూజులో సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి
\v 4 <ఇదిగో నిన్ను ఫలవంతంగా చేసి, విస్తరింపజేస్తాను. నువ్వు జన సమూహమయ్యేలా చేస్తాను. నీ వారసులకు ఈ దేశాన్ని నిత్య స్వాస్థ్యంగా ఇస్తాను> అన్నాడు.
\s5
\v 5 నేను ఐగుప్తుకు నీ దగ్గరకు రాకముందు ఐగుప్తు దేశంలో నీకు పుట్టిన నీ ఇద్దరు కొడుకులు నా బిడ్డలే. రూబేను షిమ్యోనుల్లాగే ఎఫ్రాయిము, మనష్షే నా కొడుకులే.
\v 6 వారి తరువాత నీకు పుట్టిన సంతానం నీదే. వారి పేర్లు వారి సోదరుల స్వాస్థ్యం జాబితాల ప్రకారం నమోదు అవుతాయి.
\p
\v 7 పద్దనరాము నుండి నేను వస్తున్నపుడు, ఎఫ్రాతాకు ఇంకా కొంత దూరాన ఉన్నపుడు ప్రయాణంలో రాహేలు కనాను దేశంలో చనిపోయింది. అక్కడ బేత్లెహేము అనే ఎఫ్రాతా దారిలో నేను ఆమెను పాతిపెట్టాను>> అని యాకోబు చెప్పాడు.
\s5
\v 8 ఇశ్రాయేలు, యోసేపు కొడుకుల్ని చూసి, <<వీరెవరు?>> అని అడిగాడు.
\v 9 యోసేపు <<వీళ్ళు నా కొడుకులు. వీరిని ఈ దేశంలో దేవుడు నాకిచ్చాడు>> అని తన తండ్రితో చెప్పాడు. అందుకతడు <<నేను వారిని దీవించడానికి నా దగ్గరకు వారిని తీసుకు రా>> అన్నాడు.
\v 10 ఇశ్రాయేలు కళ్ళు వృద్ధాప్యం వలన మసకబారి చూడలేక పోయాడు. కాబట్టి, యోసేపు వారిని అతని దగ్గరకు తీసికొని వచ్చాడు. అతడు వారిని ముద్దు పెట్టుకొని కౌగిలించుకున్నాడు.
\p
\s5
\v 11 ఇశ్రాయేలు యోసేపుతో <<నీ ముఖాన్ని మళ్ళీ చూస్తానని నేను అనుకోలేదు. అయితే, నీ సంతానాన్ని కూడా దేవుడు నన్ను చూడనిచ్చాడు>> అన్నాడు.
\v 12 యోసేపు అతని మోకాళ్ళ మధ్య నుండి వారిని తీసికొని అతనికి సాగిలపడ్డాడు.
\v 13 తరువాత యోసేపు ఇశ్రాయేలు ఎడమచేతి వైపు తన కుడిచేత ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడిచేతి వైపు తన ఎడమ చేత మనష్షేను పట్టుకొని, వారిద్దరిని అతని సమీపంగా తీసికొని వచ్చాడు.
\s5
\v 14 ఇశ్రాయేలు, చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడిచేతిని, మనష్షే తలమీద తన ఎడమచేతిని ఉంచాడు.
\p
\v 15 ఇశ్రాయేలు యోసేపును దీవించి, <<నా పూర్వీకులు అబ్రాహాము ఇస్సాకులు ఎవరి సమక్షంలో నడుచుకున్నారో ఆ దేవుడు, ఇప్పటి వరకు నన్ను పోషించిన ఆ దేవుడు,
\v 16 సమస్త కీడుల నుంచి నన్ను కాపాడిన దూత, ఈ పిల్లల్ని దీవించు గాక. నా పేరు, అబ్రాహాము ఇస్సాకులనే నా పితరుల పేరు వారికి కలుగుతుంది గాక. లోకంలో వారు విస్తార జనసమూహంగా అవుతారు గాక>> అన్నాడు.
\p
\s5
\v 17 యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడిచెయ్యి పెట్టడం చూశాడు. అది అతనికి నచ్చలేదు. అతడు మనష్షే తల మీద పెట్టించాలని తన తండ్రి చెయ్యి, ఎఫ్రాయిము తలమీద నుండి ఎత్తి,
\v 18 <<నాన్నా, అలా కాదు. ఇతడే పెద్దవాడు. నీ కుడి చెయ్యి ఇతని తలమీద పెట్టు>> అని చెప్పాడు.
\s5
\v 19 అతని తండ్రి ఒప్పుకోక, <<నాకు తెలుసు. కచ్చితంగా తెలుసు. ఇతడు కూడా ఒక జన సమూహమై గొప్పవాడవుతాడు. అయితే, ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడవుతాడు. అతని సంతానం జన సమూహాలు అవుతారు>> అన్నాడు.
\v 20 ఆ రోజు అతడు వారిని ఇలా దీవించాడు, <<ఇశ్రాయేలీయులు ఎవరినైనా దీవించేటపుడు, <ఎఫ్రాయిములాగా మనష్షేలాగా దేవుడు మిమ్మల్ని చేస్తాడు గాక> అని మీ పేరెత్తి దీవిస్తారు>> అని చెప్పి మనష్షే కంటె ఎఫ్రాయిమును ముందుగా ఉంచాడు.
\s5
\v 21 ఇశ్రాయేలు <<ఇదిగో నేను చనిపోతున్నాను, అయినా దేవుడు మీకు తోడై ఉండి మీ పూర్వీకుల దేశానికి మిమ్మల్ని తిరిగి రప్పిస్తాడు.
\v 22 నేను నీ సోదరులకంటె నీకు ఒక భాగం ఎక్కువ ఇచ్చాను. దానిని, నా కత్తితో నా వింటితో, అమోరీయుల చేతిలోనుండి తీసుకున్నాను>> అని యోసేపుతో చెప్పాడు.
\s5
\c 49
\p
\v 1 యాకోబు తన కొడుకుల్ని పిలిపించి ఇలా అన్నాడు, <<మీరు కలిసి రండి, రాబోయే రోజుల్లో మీకు ఏం జరుగుతుందో నేను చెబుతాను.
\q1
\v 2 యాకోబు కొడుకుల్లారా, కలిసి వచ్చి వినండి.
\p మీ తండ్రి ఇశ్రాయేలు మాట వినండి.
\q1
\s5
\v 3 రూబేనూ, నువ్వు నా పెద్ద కొడుకువి. నా బలానివి,
\p నా శక్తి ప్రథమ ఫలానివి. ఘనతలోనూ బలంలోనూ ఆధిక్యం గలవాడివి.
\q1
\v 4 పారే నీళ్ళలా అస్థిరుడివి. నీది ఉన్నత స్థాయి కాదు.
\p ఎందుకంటే నువ్వు, నీ తండ్రి మంచం ఎక్కి దానిని అపవిత్రం చేశావు.
\p నువ్వు నా మంచం మీదికి ఎక్కావు.
\q1
\s5
\v 5 షిమ్యోను, లేవి అన్నదమ్ములే. వారి కత్తులు దౌర్జన్యం చేసే ఆయుధాలు.
\q1
\v 6 నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు, వారి సభలో చేరవద్దు.
\p నా హృదయం వారితో కలవలేనంత ఉదాత్తమైనది.
\p కోపంలో వారు మనుషులను చంపారు.
\p సరదా కోసం ఎద్దుల గుదికాళ్ళ నరం తెగ్గొట్టారు.
\q1
\s5
\v 7 వారి కోపం చాలా తీవ్రమైనది. వారి ఆగ్రహం క్రూరమైంది.
\p అవి శాపగ్రస్తమైనవి. నేను వారిని యాకోబు ప్రజలలో విభాగిస్తాను.
\p ఇశ్రాయేలులో వారిని చెదరగొడతాను.
\q1
\s5
\v 8 యూదా, నీ సోదరులు నిన్ను స్తుతిస్తారు.
\p నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉంటుంది.
\p నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడతారు.
\q1
\s5
\v 9 యూదా సింహం పిల్ల.
\p నా కుమారుడా, నువ్వు చీల్చిన దాని దగ్గరనుంచి వచ్చావు.
\p అతడు కాళ్ళు ముడుచుకొని పడుకున్నాడు.
\p సింహం లాగా, ఆడ సింహం లాగా గర్జించాడు.
\p అతన్ని లేపడానికి తెగించేవాడెవడు?
\q1
\s5
\v 10 షిలోహు వచ్చే వరకు యూదా దగ్గరనుంచి రాజదండం తొలగదు.
\p అతని కాళ్ళ మధ్య నుంచి అధికార రాజదండం తొలగదు.
\p రాజ్యాలు అతనికి లోబడతాయి.
\q1
\s5
\v 11 ద్రాక్షావల్లికి తన గాడిదనూ,
\p మేలైన ద్రాక్ష తీగెకు తన గాడిద పిల్లనూ కట్టి,
\p ద్రాక్షారసంలో తన బట్టలనూ, ద్రాక్షల రక్తంలో తన అంగీనీ ఉతికాడు.
\q1
\v 12 అతని కళ్ళు ద్రాక్షారసమంత ఎర్రగా,
\p అతని పళ్ళు పాలవలే తెల్లగా ఉంటాయి.
\q1
\s5
\v 13 జెబూలూను సముద్రపు ఒడ్డున నివసిస్తాడు.
\p అతడు ఓడలకు రేవుగా ఉంటాడు.
\p అతని పొలిమేర సీదోను వరకు ఉంటుంది.
\q1
\s5
\v 14 ఇశ్శాఖారు రెండు దొడ్ల మధ్య పడుకున్న బలమైన గాడిద.
\q1
\v 15 అతడు మంచి విశ్రాంతి స్థలాన్నీ రమ్యమైన భూమినీ చూశాడు.
\p బరువులు మోయడానికి భుజం వంచి చాకిరీ చేసే దాసుడయ్యాడు.
\q1
\s5
\v 16 దాను ఇశ్రాయేలు గోత్రాల్లో ఒక గోత్రంగా
\p తన ప్రజలకు న్యాయం తీరుస్తాడు.
\q1
\v 17 దాను, దారిలో పాము లాగా, గుర్రం మడిమె కరచి,
\p రౌతు వెనక్కి పడిపోయేలా చేసే కట్లపాముగా దారిలో ఉంటాడు.
\q1
\v 18 యెహోవా, నీ రక్షణ కోసం కనిపెడుతున్నాను.
\q1
\s5
\v 19 దోపిడీ గాళ్ళు గాదును కొడతారు.
\p అయితే, అతడు వాళ్ళ మడిమెను కొడతాడు.
\q1
\v 20 ఆషేరు యొక్క ఆహారం శ్రేష్ఠమైనది.
\p రాజులకు తగిన మధుర పదార్దాలు అతడు అందిస్తాడు.
\q1
\v 21 నఫ్తాలి వదిలిపెట్టిన లేడి.
\p అతనికి అందమైన పిల్లలుంటారు.
\q1
\s5
\v 22 యోసేపు ఫలించే కొమ్మ. ఊట దగ్గర పండ్లు కాసే పెద్ద కొమ్మ.
\p దాని కొమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపిస్తాయి.
\q1
\v 23 విలుకాళ్ళు అతనీపై దాడి చేస్తారు.
\p ఆతని మీద బాణాలు వేసి అతన్ని హింసిస్తారు.
\q1
\s5
\v 24 అయితే, అతని విల్లు స్థిరంగా ఉంటుంది.
\p అతని చేతులు నైపుణ్యంతో ఉంటాయి.
\p ఎందుకంటే, ఇది యాకోబు యొక్క పరాక్రమశాలి చేతుల వలన,
\p ఇశ్రాయేలు యొక్క ఆధార శిల, కాపరి పేరున అయింది.
\q1
\s5
\v 25 నీకు సహాయం చేసే నీ తండ్రి యొక్క దేవుని వలన,
\p నిన్ను దీవించే సర్వశక్తుని వలన, నీకు పైనుండి వచ్చే దీవెనలు,
\p కింది అగాధపు దీవెనలు, స్తనాల, గర్భాల దీవెనలు వస్తాయి.
\q1
\s5
\v 26 నీ తండ్రి దీవెనలు, పురాతన పర్వతాలంత ఘనంగా,
\p నిత్య గిరులంత ఉన్నతంగా ఉంటాయి.
\p అవి యోసేపు తల మీద ఉంటాయి.
\p తన సోదరుల్లో ఘనుడైన వాని నడినెత్తి మీద ఉంటాయి.
\q1
\s5
\v 27 బెన్యామీను ఆకలిగొన్న తోడేలు.
\p అతడు ఉదయాన ఎరను మింగి,
\p దోచుకున్న దానిని, సాయంత్రం వేళ పంచుకుంటాడు.>>
\p
\s5
\v 28 ఇవన్నీ ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలు. వారి తండ్రి వారిని దీవిస్తూ వారితో చెప్పింది యిదే. ఎవరి దీవెన వారికి తగినదే.
\v 29 తరువాత అతడు వారికి ఆజ్ఞాపిస్తూ ఇలా అన్నాడు, <<నేను నా పూర్వీకుల దగ్గరకు వెళ్ళబోతున్నాను.
\v 30 హిత్తీయుడైన ఎఫ్రోను పొలంలోని గుహలో నా పూర్వీకుల దగ్గర నన్ను పాతిపెట్టండి. ఆ గుహ కనాను దేశంలోని మమ్రే దగ్గర ఉన్న మక్పేలా మైదానంలో ఉంది. అబ్రాహాము దానినీ ఆ పొలాన్నీ హిత్తీయుడైన ఎఫ్రోను దగ్గర శ్మశాన భూమి కోసం స్వాస్థ్యంగా కొన్నాడు.
\p
\s5
\v 31 అక్కడే వారు అబ్రాహామునూ అతని భార్య శారాను పాతిపెట్టారు. అక్కడే ఇస్సాకును అతని భార్య రిబ్కాను పాతి పెట్టారు. అక్కడే నేను లేయాను పాతిపెట్టాను.
\v 32 ఆ పొలాన్నీ అందులోని గుహనూ హేతు కొడుకుల దగ్గర కొన్నారు>> అన్నాడు.
\v 33 యాకోబు తన కొడుకులకు ఆజ్ఞాపించడం ముగించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణం విడిచి తన వారి దగ్గరకు చేరాడు.
\s5
\c 50
\p
\v 1 యోసేపు తన తండ్రి మీద వాలి ముఖాన్ని ముద్దు పెట్టుకుని ఏడ్చాడు.
\v 2 యోసేపు సుగంధ ద్రవ్యాలతో తన తండ్రి శవాన్ని సిద్ధపరచాలని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించాడు. కాబట్టి ఆ వైద్యులు ఇశ్రాయేలు శవాన్ని సిద్ధపరచారు.
\v 3 అందుకు వారికి 40 రోజులు పట్టింది. సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరచడానికి అంత సమయం పడుతుంది. ఐగుప్తీయులు అతని గురించి 70 రోజులు దుఖించారు.
\p
\s5
\v 4 అతని గురించి దుఃఖించే రోజులు అయిపోయిన తరువాత, యోసేపు ఫరో ఇంటి వారితో మాటలాడి <<మీ దయ నా మీద ఉంటే నా పక్షంగా ఫరోతో
\v 5 మా నాన్న నాతో ప్రమాణం చేయించి <ఇదిగో, నేను చనిపోతున్నాను, కనానులో నా కోసం తవ్వించిన సమాధిలో నన్ను పాతిపెట్టాలి> అని చెప్పాడు కాబట్టి అనుమతిస్తే నేనక్కడికి వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి మళ్ళీ వస్తాను అని యోసేపు అన్నాడు> అని చెప్పండి>> అన్నాడు.
\v 6 అందుకు ఫరో <<అతడు నీ చేత చేయించిన ప్రమాణం ప్రకారం వెళ్ళి మీ నాన్నను పాతిపెట్టు>> అన్నాడు.
\p
\s5
\v 7 కాబట్టి యోసేపు తన తండ్రిని పాతిపెట్టడానికి వెళ్ళాడు. అతనితో ఫరో ఇంటి పెద్దలైన అతని సేవకులంతా ఐగుప్తు దేశపు పెద్దలంతా
\v 8 యోసేపు ఇంటివారంతా అతని సోదరులు, అతని తండ్రి ఇంటివారు వెళ్ళారు. వారు తమ పిల్లలనూ తమ గొర్రెల మందలనూ తమ పశువులనూ మాత్రం గోషెను దేశంలో విడిచిపెట్టారు.
\v 9 రథాలు, రౌతులు అతనితో వెళ్ళాయి. అది చాలా పెద్ద గుంపు అయింది.
\s5
\v 10 వారు యొర్దానుకు అవతల ఉన్న ఆటదు కళ్ళం వచ్చినపుడు చాలా పెద్దగా ఏడ్చారు. యోసేపు తన తండ్రిని గురించి ఏడు రోజులు విలపించాడు.
\v 11 ఆ దేశంలో నివసించిన కనానీయులు ఆటదు కళ్ళం దగ్గర ఏడవడం చూసి, <<ఐగుప్తీయులకు ఇది చాలా సంతాప సమయం>> అని చెప్పుకున్నారు. అందుకే దానికి ఆబేల్‌ మిస్రాయిము అనే పేరుంది. అది యొర్దానుకు అవతల ఉంది.
\s5
\v 12 యాకోబు విషయంలో అతడు వారికి చెప్పినట్లు అతని కొడుకులు చేశారు.
\v 13 అతని కొడుకులు కనాను దేశానికి అతని శవాన్ని తీసుకుపోయి మమ్రే దగ్గరున్న మక్పేలా పొలంలోని గుహలో పాతిపెట్టారు. అబ్రాహాము పొలంతో పాటు గుహను శ్మశానం కోసం కొన్నాడు. అతడు దానిని హిత్తీయుడైన ఎఫ్రోను దగ్గర కొన్నాడు.
\v 14 యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తరువాత అతడు, అతని సోదరులు, అతని తండ్రిని పాతిపెట్టడానికి వెళ్ళిన వారంతా తిరిగి ఐగుప్తుకు వచ్చారు.
\p
\s5
\v 15 యోసేపు సోదరులు తమ తండ్రి చనిపోవడం చూసి, <<ఒకవేళ యోసేపు మన మీద పగబట్టి, మనం అతనికి చేసిన కీడుకు ప్రతీకారం చేస్తాడేమో>> అనుకున్నారు.
\v 16 కాబట్టి వారు యోసేపుకు ఈ కబురు పంపించారు.
\v 17 <<మన తండ్రి తన మరణానికి ముందు మీరు యోసేపుతో, <నీ సోదరులు నీకు కీడు చేశారు. వారినీ, వారి అపరాధాన్నీ దయచేసి క్షమించు>అని చెప్పమన్నాడు>> అని అతనితో చెప్పారు.
\p
\s5
\v 18 అతని సోదరులు పోయి అతని ముందు సాగిలపడి, <<ఇదిగో మేము నీకు దాసులం>> అన్నారు.
\v 19 యోసేపు <<భయపడవద్దు. నేను దేవుని స్థానంలో ఉన్నానా?
\v 20 మీరు నాకు కీడు చేయాలని చూశారు గానీ మీరిప్పుడు చూస్తున్నట్టు, అనేకమందిని బతికించేలా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు.
\v 21 కాబట్టి భయపడవద్దు. నేను మిమ్మల్ని, మీ పిల్లల్ని పోషిస్తాను>> అని చెప్పి వారిని ఆదరించి వారితో ఇష్టంగా మాట్లాడాడు.
\p
\s5
\v 22 యోసేపు, అతని తండ్రి కుటుంబం వారూ ఐగుప్తులో నివసించారు. యోసేపు 110 ఏళ్ళు బతికాడు.
\v 23 యోసేపు ఎఫ్రాయిము యొక్క మూడవ తరం పిల్లల్ని చూశాడు. మనష్షే కొడుకయిన మాకీరు పిల్లల్ని కూడా చూశాడు. వారిని యోసేపు ఒడిలో ఉంచారు.
\p
\s5
\v 24 యోసేపు తన సోదరులను చూసి, <<నేను చనిపోబోతున్నాను. దేవుడు కచ్చితంగా మిమ్మల్ని చూడవచ్చి, ఈ దేశంలోనుండి తాను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశానికి మిమ్మల్ని తీసికొనివెళ్తాడు>> అని చెప్పాడు
\v 25 అంతే గాక యోసేపు, <<దేవుడు కచ్చితంగా మిమ్మల్ని చూడవస్తాడు. అప్పుడు మీరు నా ఎముకల్ని ఇక్కడనుంచి తీసుకుపోవాలి>> అని చెప్పి ఇశ్రాయేలు కొడుకులతో ప్రమాణం చేయించుకున్నాడు.
\v 26 యోసేపు 110 ఏళ్ల వయసులోవాడై చనిపోయాడు. వారు సుగంధ ద్రవ్యాలతో అతని శవాన్ని సిద్ధపరచి ఐగుప్తు దేశంలో ఒక శవపేటికలో ఉంచారు.