te_ulb/24-JER.usfm

3528 lines
556 KiB
Plaintext

\id JER 1SA GEN - Telugu Unlocked Literal Bible
\ide UTF-8
\rem Copyright © 2017 Bridge Connectivity Solutions. This translation is made available to you under the terms of the Creative Commons Attribution-ShareAlike 4.0 License
\h యిర్మీయా
\toc1 యిర్మీయా
\toc2 యిర్మీయా
\toc3 jer
\mt1 యిర్మీయా
\s5
\c 1
\p
\v 1 బెన్యామీను గోత్ర ప్రాంతంలోని అనాతోతులో నివసించే యాజకుల్లో ఒకడు, హిల్కీయా కొడుకు అయిన యిర్మీయా పలుకులు.
\v 2 ఆమోను కొడుకు యోషీయా యూదాకు రాజుగా ఉన్నప్పుడు అతని పాలనలో 13 వ సంవత్సరం యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమయ్యాడు.
\v 3 యోషీయా కొడుకు యెహోయాకీము యూదాకు రాజుగా ఉన్న రోజుల్లో, యోషీయా కొడుకు సిద్కియా యూదాను పాలించిన 11 వ సంవత్సరం అయిదో నెలలో యెరూషలేము ప్రజలు చెరలోకి వెళ్ళే వరకూ ఆ వాక్కు అతనికి ప్రత్యక్షమవుతూనే ఉన్నాడు.
\s యిర్మీయా పిలుపు
\p
\s5
\v 4 యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు,
\q1
\v 5 <<నీ తల్లి గర్భంలో నీకు రూపం రాక ముందే నువ్వు నాకు తెలుసు. నువ్వు గర్భం నుండి బయట పడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించాను.
\q1 జనాలకు నిన్ను ప్రవక్తగా నియమించాను.>>
\q1
\v 6 అందుకు నేను <<అయ్యో, యెహోవా ప్రభూ, నేను చిన్న పిల్లవాణ్ణి కదా, నాకు మాట్లాడడం చేత కాదు>> అన్నాను.
\q1
\s5
\v 7 అయితే యెహోవా నాతో ఇలా అన్నాడు. <<నేను పిల్లవాణ్ణి అనవద్దు. నేను నిన్ను పంపేవారందరి దగ్గరకీ నువ్వు వెళ్ళాలి.
\q1 నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ వారితో చెప్పాలి.
\q1
\v 8 వారికి భయపడవద్దు. నిన్ను విడిపించడానికి నేను నీతో ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు.>>
\p
\s5
\v 9 అప్పుడు యెహోవా తన చేత్తో నా నోరు తాకి ఇలా అన్నాడు. <<ఇదిగో, నేను నా మాటలు నీ నోటిలో ఉంచాను.
\q1
\v 10 పెళ్లగించడానికీ విరగగొట్టడానికీ నశింపజేయడానికీ కూలదోయడానికీ కట్టడానికీ నాటడానికీ
\q1 నేను ఈ రోజు జనాల మీదా రాజ్యాల మీదా నిన్ను నియమించాను.>>
\p
\s5
\v 11 యెహోవా వాక్కు నాకు కనబడి <<యిర్మీయా, నీకేం కనబడుతున్నది?>> అని అడిగాడు. అందుకు నేను <<బాదం చెట్టు కొమ్మ కనబడుతున్నది>> అన్నాను.
\v 12 అప్పుడు యెహోవా <<నువ్వు బాగా కనిపెట్టావు. నేను చెప్పిన మాటలు నెరవేర్చడానికి నాకు ఆత్రుతగా ఉంది>> అన్నాడు.
\p
\s5
\v 13 రెండోసారి యెహోవా వాక్కు నాకు కనబడి <<నీకేం కనబడుతున్నది?>> అని అడగ్గా, నేను <<మరుగుతున్న బాన ఒకటి నాకు కనబడుతున్నది. అది ఉత్తరం వైపుకు తిరిగి ఉంది>> అన్నాను.
\v 14 అందుకు యెహోవా ఇలా చెప్పాడు. <<ఉత్తరం నుండి ఈ దేశప్రజల మీదికి వినాశనం రాబోతున్నది.
\s5
\v 15 ఇదిగో, నేను ఉత్తర దిక్కున ఉన్న రాజ్యాల జాతులన్నిటినీ పిలుస్తాను. వారిలో ప్రతివాడూ యెరూషలేము ద్వారాల్లో, యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారాలన్నిటికీ యూదా పట్టణాలన్నిటికీ ఎదురుగా తమ ఆసనాలు వేసుకుని కూర్చుంటారు.
\v 16 అప్పుడు యెరూషలేము ప్రజలు నన్ను విడిచి అన్యదేవుళ్ళకు ధూపం వేసి, తమ స్వంత చేతులతో చేసిన విగ్రహాలను పూజించి చేసిన చెడుతనాన్ని బట్టి నేను వారిపై నా తీర్పులు ప్రకటిస్తాను.>>
\p
\s5
\v 17 <<కాబట్టి లేచి నిలబడు! నేను నీకాజ్ఞాపించినదంతా వారికి ప్రకటించు. నువ్వు వారికి భయపడ వద్దు. లేదా, నేనే నీకు వారంటే భయం పుట్టిస్తాను.
\v 18 యూదా రాజుల దగ్గరికి, అధికారుల దగ్గరికి, యాజకుల దగ్గరికి, దేశ ప్రజల దగ్గరికి, ఈ దేశంలో నీవెక్కడికి పోయినా, నిన్ను ఒక ప్రాకారం ఉన్న పట్టణంగా, ఇనప స్తంభంగా, ఇత్తడి గోడగా ఉండేలా ఈ రోజు నియమించాను.
\v 19 వారు నీతో యుద్ధం చేస్తారు గాని నిన్ను కాపాడడానికి నేను నీతో ఉన్నాను కాబట్టి వారు నీపై విజయం పొందలేరు. ఇదే యెహోవా వాక్కు.>>
\s5
\c 2
\s ఇశ్రాయేలు దేవుణ్ణి విడిచిపెట్టడం
\p
\v 1 యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు.
\q1
\v 2 <<యెరూషలేము నివాసులకు ఇలా ప్రకటించు. యెహోవా చెప్పేదేమిటంటే, నువ్వు అరణ్యంలో, పంటలు పండని ప్రాంతాల్లో నా వెంట నడుస్తూ నీ యవ్వనకాలంలో నీవు నాపై చూపిన నిబంధన నమ్మకత్వం, నీ వైవాహిక ప్రేమ, నేను గుర్తు చేసుకుంటున్నాను.
\q1
\v 3 అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనంగా, ఆయన పంటలో ప్రథమ ఫలంగా ఉంది.
\q1 వారిని బాధించే వారందరూ శిక్షకు పాత్రులు. వారిపైకి కీడు దిగి వస్తుంది.>> ఇదే యెహోవా వాక్కు.
\q1
\s5
\v 4 యాకోబు సంతానమా, ఇశ్రాయేలు ప్రజలారా, మీరంతా యెహోవా మాట వినండి.
\q1
\v 5 యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. <<నాలో ఏ తప్పిదం చూసి మీ పూర్వికులు నాకు దూరమై వ్యర్థమైన విగ్రహాలను పూజించి వారూ వ్యర్థులుగా మారిపోయారు?
\q1
\v 6 <ఐగుప్తు దేశంలో నుండి మమ్మల్ని తెచ్చిన యెహోవా ఏడీ> అని అడగలేదు.
\q1 అంటే <అరణ్యంలో, చవిటి నేలలతో, గోతులతో నిండిన ప్రదేశంలో, అనావృష్టీ చీకటీ నిండిన, ఎవరూ తిరగని, నివసించని దేశంలో మమ్మల్ని నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడు?> అని ప్రజలు అడగడం లేదు.
\q1
\s5
\v 7 ఫలవంతమైన దేశంలోకి మిమ్మల్ని తీసుకువచ్చి దాని పంటను, దానిలోని శ్రేష్ఠమైన పదార్థాలను తినేలా చేశాను.
\q1 అయితే మీరు నా దేశాన్ని అపవిత్రం చేసి నా వారసత్వాన్ని హేయపరిచారు.>>
\q1
\v 8 <<యెహోవా ఎక్కడ ఉన్నాడు?>> అని యాజకులు వెతకడం లేదు. ధర్మశాస్త్ర బోధకులకు నేనెవరో తెలియదు.
\q1 ప్రజల నాయకులు నా మీద తిరుగుబాటు చేశారు. ప్రవక్తలు బయలు దేవుడి పేరట ప్రవచించి, వ్యర్ధమైన వాటిని అనుసరించారు.
\q1
\s5
\v 9 కాబట్టి నేనికనుండి మీపైనా మీ పిల్లల పైనా వారి పిల్లల పైనా నేరం మోపుతాను. ఇది యెహోవా వాక్కు.
\q1
\v 10 కిత్తీయుల ద్వీపాలకు వెళ్లి చూడండి, కేదారుకు దూతలను పంపి విచారించండి. మీలో జరుగుతున్న ప్రకారం ఇంకెక్కడైనా జరుగుతున్నదా?
\q1
\v 11 దేవుళ్ళు కాని వారితో తమ దేవుళ్ళను ఏ ప్రజలైనా ఎప్పుడైనా మార్చుకున్నారా? కానీ నా ప్రజలు ప్రయోజనం లేని దాని కోసం తమ మహిమను మార్చుకున్నారు.
\q1
\s5
\v 12 ఆకాశమా, దీని గురించి విస్మయం చెందు. భయపడి వణుకు. ఇదే యెహోవా వాక్కు.
\q1
\v 13 నా ప్రజలు రెండు తప్పులు చేశారు. జీవజలాల ఊటనైన నన్ను విడిచి పెట్టేశారు. తమకోసం తొట్లు, అంటే నీటిని నిలపలేక బద్దలైపోయే తొట్లను తొలిపించుకున్నారు.
\q1
\s5
\v 14 ఇశ్రాయేలు ఒక బానిసా? అతడు ఇంటిలో జన్మించిన వాడే కదా? మరెందుకు అతడు దోపుడు సొమ్ముగా మారాడు?
\q1
\v 15 కొదమ సింహాలు అతనిపై గర్జించాయి, అతనిపై పెద్దగా అరుస్తూ అతని దేశాన్ని భయకంపితం చేశాయి. అతని పట్టణాలు ప్రజలు నివసించలేనంతగా నాశనం అయ్యాయి.
\q1
\v 16 నోపు, తహపనేసు అనే పట్టణాల ప్రజలు నీకు బోడిగుండు చేసి నిన్ను బానిసగా చేసుకున్నారు.
\q1
\v 17 నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపిస్తున్నప్పుడు నువ్వు ఆయన్ని విడిచి వేరైపోయి నీకు నీవే ఈ బాధ తెచ్చిపెట్టుకున్నావు గదా?
\q1
\s5
\v 18 ఐగుప్తు దారిలో వెళ్లి షీహోరు
\f +
\fr 2:18
\fq షీహోరు
\ft నైలు నది
\f* నీళ్లు తాగడానికి నీకేం పని? అష్షూరు దారిలో వెళ్లి యూఫ్రటీసు నది నీళ్లు తాగడానికి నీకేం పని?
\q1
\v 19 నీ చెడుతనం నీ శిక్షకు కారణమౌతుంది. నువ్వు చేసిన ద్రోహం నిన్ను దండిస్తుంది అని ప్రభువు, సేనల ప్రభువు అయిన యెహోవా సెలవిస్తున్నాడు.
\q1 ఎందుకంటే నీ దేవుడైన యెహోవాను నీవు విడిచిపెట్టావు. నేనంటే నీకెంత మాత్రం భయం లేదు.
\q1
\s5
\v 20 పూర్వకాలం నుండి ఉన్న నీ కాడిని విరగగొట్టి, నీ బంధకాలను తెంపివేశాను. అయినా <<నేను నిన్ను పూజించను>> అని చెబుతున్నావు.
\q1 ఎత్తయిన ప్రతి కొండ మీదా పచ్చని ప్రతి చెట్టు కిందా వేశ్యలాగా వ్యభిచారం చేశావు.
\q1
\v 21 శ్రేష్ఠమైన ద్రాక్షావల్లిగా నేను నిన్ను నాటాను. నిక్కచ్చి విత్తనం గల చెట్టులాగా నిన్ను నాటాను.
\q1 అయినా నా పట్ల ఎందుకు నువ్వు పిచ్చి ద్రాక్షాతీగెలాగా నిష్ప్రయోజనం అయిపోయావు?
\q1
\v 22 నువ్వు నదిలో కడుక్కున్నా, ఎక్కువ సబ్బు రాసుకున్నా నీ దోషం నాకు గొప్ప మరకలాగా కనిపిస్తున్నది. ఇది ప్రభువైన యెహోవా వాక్కు.
\q1
\s5
\v 23 <<నాలో అపవిత్రత లేదు, బయలు దేవుళ్ళ వెనక నేను వెళ్ళడం లేదు>> అని నువ్వు ఎలా అనుకుంటున్నావు?
\q1 లోయల్లో నీవెలా ప్రవర్తించావో చూడు. నువ్వు చేసిన దాన్ని గమనించు. నువ్వు విచ్చలవిడిగా తిరిగే ఒంటెవి.
\q1
\v 24 అరణ్యానికి అలవాటు పడిన అడవి గాడిదవు. అది కామంతో దీర్ఘంగా శ్వాస తీసుకుంటుంది.
\q1 మగ గాడిదను కలిసినప్పుడు దాన్ని ఆపగల వాడెవడు?
\q1 దాని వెంటబడే గాడిదలకు అలుపు రాదు. తన జత కోసం వెదికే కాలంలో అది తేలికగా కనిపిస్తుంది.
\q1
\v 25 నీ పాదాలకు చెప్పులు తొడుక్కుని జాగ్రత్త పడు, నీ గొంతు ఆరిపోకుండా జాగ్రత్తపడు, అని నేను చెప్పాను. కాని <<నీ మాట వినను, కొత్తవారిని మోహించాను, వారి వెంట వెళ్తాను>> అని చెబుతున్నావు.
\q1
\s5
\v 26 దొంగ దొరికిపోయినప్పుడు సిగ్గుపడే విధంగా ఇశ్రాయేలు కుటుంబం సిగ్గుపడుతుంది.
\q1 చెట్టుతో <<నువ్వు మా తండ్రివి>> అనీ, రాయితో <<నువ్వే నన్ను పుట్టించావు>> అనీ చెబుతూ,
\q1 ఇశ్రాయేలు ప్రజలు, వారి రాజులు, అధిపతులు, యాజకులు, ప్రవక్తలు అవమానం పొందుతారు.
\q1
\v 27 వారు నా వైపు నేరుగా చూడకుండా తమ వీపు తిప్పుకున్నారు.
\q1 అయినా ఆపద సమయంలో మాత్రం, <<వచ్చి మమ్మల్ని రక్షించు>> అని నన్ను వేడుకుంటారు.
\q1
\v 28 నీ కోసం చేసుకున్న దేవుళ్ళు ఎక్కడ ఉన్నారు? నీ ఆపదలో వాళ్ళు వచ్చి నిన్ను రక్షిస్తారేమో.
\q1 యూదా, నీ పట్టణాలెన్ని ఉన్నాయో నీ దేవతా విగ్రహాలు కూడా అన్ని ఉన్నాయి కదా.
\q1
\s5
\v 29 మీరంతా నా మీద తిరగబడి పాపం చేశారు. ఇంకా ఎందుకు నాతో వాదిస్తారు? అని యెహోవా అడుగుతున్నాడు.
\q1
\v 30 నేను మీ ప్రజలను శిక్షించడం వ్యర్థమే. ఎందుకంటే వారు శిక్షకు లోబడరు. నాశనవాంఛ గల సింహంలాగా మీ ఖడ్గం మీ ప్రవక్తలను చంపుతూ ఉంది.
\q1
\v 31 ఇప్పటి తరం ప్రజలు యెహోవా చెప్పే మాట వినండి, నేను ఇశ్రాయేలుకు ఒక అరణ్యం లాగా అయ్యానా?
\q1 గాఢాంధకారంతో నిండిన దేశంలా అయ్యానా? <<మాకు స్వేచ్ఛ లభించింది, ఇంక నీ దగ్గరికి రాము>> అని నా ప్రజలెందుకు చెబుతున్నారు?
\q1
\s5
\v 32 ఒక కన్య తన ఆభరణాలు మర్చిపోతుందా? పెళ్ళికూతురు తన మేలిముసుగులు మర్చిపోతుందా?
\q1 అయితే నా ప్రజలు లెక్కలేనన్ని దినాలు నన్ను మర్చిపోయారు.
\q1
\v 33 కామం తీర్చుకోడానికి నీవెంత తెలివిగా నటిస్తున్నావు? కులటలకు కూడా నువ్వు ఇలాటివి నేర్పించగలవు.
\q1
\v 34 నిర్దోషులైన దీనుల ప్రాణరక్తం నీ బట్ట చెంగుల మీద కనబడుతూ ఉంది.
\q1 వారేమీ నిన్ను దోచుకోడానికి వచ్చినవారు కాదు.
\q1
\s5
\v 35 ఇంతా చేసినా నువ్వు <<నేను నిర్దోషిని, యెహోవా కోపం నా మీదికి రాదులే>> అని చెప్పుకుంటున్నావు.
\q1 ఇదిగో చూడు, <<నేను పాపం చేయలేదు>> అని నువ్వు చెప్పిన దాన్నిబట్టి నిన్ను శిక్షిస్తాను.
\q1
\v 36 నీ ప్రవర్తనలో మార్పును అంత తేలికగా ఎలా తీసుకోగలుగుతున్నావు?
\q1 నువ్వు అష్షూరుపై ఆధారపడి సిగ్గుపడినట్టు ఐగుప్తు విషయంలో కూడా సిగ్గుపడతావు.
\q1
\v 37 ఆ జనం దగ్గర నుండి నిరాశతో చేతులు తలపై పెట్టుకుని తిరిగి వెళ్తావు.
\q1 నువ్వు నమ్ముకున్న వారిని యెహోవా తోసిపుచ్చాడు. వారు నీకు ఏ విధంగానూ సహాయం చేయలేరు.
\s5
\c 3
\q1
\v 1 ఒక మనిషి తన భార్యను విడిచిపెట్టి ఆమెను పంపి వేస్తే ఆమె అతని దగ్గర నుండి వెళ్ళి ఇంకొకడికి భార్య అయ్యింది.
\q1 అప్పుడు అతడు ఆమెను తిరిగి చేర్చుకుంటాడా? అదే జరిగితే ఆ దేశం ఎంతో అపవిత్రమవుతుంది కదా.
\q1 నువ్వు అనేకమంది విటులతో వ్యభిచారం చేశావు. అయినా నా దగ్గరికి తిరిగి రమ్మని యెహోవా సెలవిస్తున్నాడు.
\q1
\v 2 నీ తలెత్తి చెట్లు లేని కొండప్రదేశాలను చూడు. మనుషులు నీతో వ్యభిచారం చేయని స్థలం ఏదైనా ఉందా?
\q1 ఎడారి దారిలో సంచార జాతి వాడు కాచుకుని ఉన్నట్టు నువ్వు వారి కోసం దారి పక్కన కూర్చుని ఎదురు చూశావు.
\q1 నీ వ్యభిచారంతో, నీ దుష్ట ప్రవర్తనతో నువ్వు దేశాన్ని అపవిత్రం చేశావు.
\q1
\s5
\v 3 కాబట్టి వానలు కురవడం లేదు. కడవరి వర్షం ఆగిపోయింది.
\q1 అయినా నువ్వు కులట మొహం వేసుకుని సిగ్గు పడడం లేదు.
\q1
\v 4 అయినా ఇప్పుడు నువ్వు <<నా తండ్రీ, చిన్నప్పటి నుండి నాకు దగ్గర స్నేహితుడివి>> అని నాకు మొర పెడుతున్నావు.
\q1
\v 5 <<నువ్వు ఎల్లప్పుడూ కోపిస్తావా? ఇక నీ ఆగ్రహం మానవా?>>
\q1 అని అంటూనే నువ్వు చేయాలనుకున్న దుష్కార్యాలు చేస్తూనే ఉన్నావు.
\s నమ్మకత్వం లేని ఇశ్రాయేలు
\p
\s5
\v 6 యోషీయా రాజు పాలన సమయంలో యెహోవా నాకిలా చెప్పాడు.
\q1 <<ఇశ్రాయేలు ఎంత అపనమ్మకం చూపిందో చూశావా? ఆమె ఎత్తయిన ప్రతి కొండమీదికీ పచ్చని ప్రతి చెట్టు కిందికీ వెళ్ళి అక్కడ వ్యభిచారం చేస్తున్నది.
\q1
\v 7 ఆమె వాటన్నిటినీ చేసినా ఆమెను నా దగ్గరికి తిరిగి రమ్మన్నాను కానీ ఆమె రాలేదు. ద్రోహి అయిన ఆమె సోదరి అయిన యూదా దాన్ని చూసింది.
\q1
\s5
\v 8 ఇశ్రాయేలు వ్యభిచారం చేసినందుకే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు విడాకులిచ్చి పంపేశాను. విశ్వాసఘాతకురాలైన ఆమె సోదరి యూదా దాన్ని చూసి ఆమె కూడా భయం లేకుండా వ్యభిచారం చేస్తూ ఉంది.
\q1
\v 9 రాళ్ళతో, మొద్దులతో విగ్రహాలను చేసుకుని, ఆమె నిర్భయంగా వ్యభిచారం చేసి దేశాన్ని అపవిత్రపరచింది.
\q1
\v 10 ఇంత జరిగినా విశ్వాసఘాతకురాలైన ఆమె సోదరి యూదా పైపైనే గాని తన పూర్ణహృదయంతో నా దగ్గరికి రావడం లేదు.
\p
\s5
\v 11 కాబట్టి యూదా చేసిన ద్రోహం చూస్తే దానికంటే ఇశ్రాయేలే కొంచెం మంచిది అనిపిస్తున్నది.
\v 12 నువ్వు వెళ్లి ఉత్తరం వైపుకు ఇలా ప్రకటించు, విశ్వాసం లేని ఇశ్రాయేలూ, తిరిగి రా. మీ మీద నేను కోపపడను. నేను దయగలవాణ్ణి కాబట్టి శాశ్వతంగా కోపించేవాణ్ణి కాను.>> ఇదే యెహోవా వాక్కు.
\q1
\s5
\v 13 నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేస్తూ, నా మాట తోసిపుచ్చి ప్రతి పచ్చని చెట్టు కిందా అన్యులతో
\f +
\fr 3:13
\fq అన్యులతో
\ft అన్య దేవతలతో
\f* వ్యభిచరించావు.
\q1 నువ్వు నీ దోషాన్ని ఒప్పుకోవాలి. ఇదే యెహోవా వాక్కు.
\q1
\v 14 చెడిపోయిన పిల్లలారా, తిరిగి రండి, నేను మీ యజమానిని. ఇదే యెహోవా వాక్కు
\q1 ఒక్కొక్క ఊరిలోనుండి ఒకణ్ణి, ఒక్కొక్క వంశం లోనుండి ఇద్దరినీ, సీయోనుకు తీసుకొస్తాను.
\q1
\v 15 నాకిష్టమైన కాపరులను మీపైన నియమిస్తాను, వారు జ్ఞానంతో, వివేకంతో మిమ్మల్ని పాలిస్తారు.
\p
\s5
\v 16 ఆ రోజుల్లో మీరు ఆ దేశంలో అభివృద్ధి పొంది విస్తరిస్తూ ఉన్నప్పుడు ప్రజలు యెహోవా నిబంధన మందసం గురించి మాట్లాడరు. అది వారి మనస్సుకు తట్టదు. దాన్ని జ్ఞాపకం చేసుకోరు. అది లేనందుకు బాధపడరు, ఇక ముందు దాన్ని తయారు చేయరు. ఇదే యెహోవా వాక్కు.
\s5
\v 17 ఆ కాలంలో యెరూషలేమును యెహోవా సింహాసనం అంటారు. అన్యజాతులు వారి చెడ్డ హృదయాలను అనుసరించి మూర్ఖులుగా నడుచుకోక ఘనమైన యెహోవా పేరు విని యెరూషలేముకు గుంపులుగా వస్తారు.
\v 18 ఆ రోజుల్లో యూదా వారూ ఇశ్రాయేలు వారూ కలిసి ఉత్తరదేశం నుండి నేను మీ పూర్వీకులకు వారసత్వంగా ఇచ్చిన దేశానికి తిరిగి వస్తారు.
\q1
\s5
\v 19 నిన్ను నా కొడుకుగా చేసుకుని, ఏ జనానికీ లేనంత సుందరమైన దేశాన్ని నీకు వారసత్వంగా ఇవ్వాలని కోరుకున్నాను.
\q1 నువ్వు నా తండ్రీ అని పిలుస్తూ నా వెంట రావాలని కోరుకున్నాను.
\q1
\v 20 అయినా స్త్రీ తన భర్త పట్ల అపనమ్మకం చూపినట్టు ఇశ్రాయేలు ప్రజలారా,
\q1 నిజంగా మీరు నాపట్ల అపనమ్మకస్తులయ్యారు. ఇదే యెహోవా వాక్కు.
\q1
\s5
\v 21 వినండి, చెట్లు లేని ఉన్నత స్థలాల్లో ఒక స్వరం వినబడుతున్నది.
\q1 వినండి, దుర్మార్గులైన ఇశ్రాయేలీయులు తమ దేవుడైన యెహోవాను మరచిపోయినందుకు రోదనలు, విజ్ఞాపనలు చేస్తున్నారు.
\q1
\v 22 ద్రోహులైన ప్రజలారా, తిరిగి రండి. మీ అవిశ్వాసాన్ని నేను బాగుచేస్తాను.
\q1 <<మా దేవుడు యెహోవా నీవే, నీ దగ్గరకే మేం వస్తున్నాం>> అనే ఈ మాటలన్నీ అబద్ధాలు.
\q1
\s5
\v 23 నిజంగా కొండల మీద జరిగేదంతా మోసం. పర్వతాల మీద చేసిన తంతులన్నీ నిష్‌ప్రయోజనం.
\q1 నిజంగా మా దేవుడైన యెహోవా వలన మాత్రమే ఇశ్రాయేలుకు రక్షణ కలుగుతుంది.
\q1
\v 24 మా బాల్యంనుండి మా పూర్వీకుల కష్టార్జితాన్నంతా అసహ్యమైన విగ్రహాలు మింగివేశాయి.
\q1 వారి గొర్రెల్నీ పశువులను, కొడుకులను, కూతుళ్ళను మింగేస్తూ ఉన్నాయి.
\q1
\v 25 మన దేవుడైన యెహోవా మాట వినకుండా మనమూ మన పూర్వికులూ బాల్యం నుండి ఈ రోజు వరకూ ఆయనకు విరోధంగా పాపం చేశాం.
\q1 కాబట్టి రండి, సిగ్గుతో సాష్టాంగపడదాం. మనం కనబడకుండా మన అవమానం మనలను కప్పివేస్తుంది గాక.
\s5
\c 4
\q1
\v 1 యెహోవా చెప్పేదేమంటే, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు తిరిగి రాదలిస్తే నా దగ్గరకే రావాలి.
\q1 మీరు మీ హేయమైన విగ్రహాలను తీసివేసి నా సన్నిధి నుండి ఇటూ అటూ తప్పిపోకుండా ఉంటే,
\q1
\v 2 యథార్థంగా, నీతి నిజాయితీతో <<యెహోవా జీవం తోడు>> అని ప్రమాణం చేస్తే,
\q1 జాతులకు ఆయనలో ఆశీర్వాదం దొరుకుతుంది. వారు ఆయనలోనే అతిశయిస్తారు.
\q1
\v 3 యూదా వారికీ యెరూషలేము నివాసులకూ యెహోవా చెప్పేదేమంటే, ముళ్ల పొదల్లో విత్తనాలు చల్లవద్దు. మీ బీడు భూమిని దున్నండి.
\p
\s5
\v 4 యూదా, యెరూషలేము ప్రజలారా, మీ హృదయాలకు సున్నతి
\f +
\fr 4:4
\fq హృదయాలకు సున్నతి
\ft హృదయాలను అంకితం
\f* చేసుకోండి. మీ దుష్టక్రియలను బట్టి నా కోపం అగ్నిలాగా మండుతున్నది. దాన్ని ఎవరూ ఆర్పివేయలేరు. కాబట్టి యెహోవాకు లోబడి ఉండండి.
\s ఉత్తర దిక్కునుండి తీర్పు
\p
\v 5 యెరూషలేములో వినబడేలా యూదాలో ఇలా ప్రకటించండి. <<దేశంలో బూర ఊదండి.>> గట్టిగా ఇలా హెచ్చరిక చేయండి. <<ప్రాకారాలతో ఉన్న పట్టణాల్లోకి వెళ్దాం రండి.>>
\v 6 సీయోనుకు కనబడేలా జెండా ఎత్తండి. తప్పించుకోడానికి పారిపోండి. ఆలస్యం చేయొద్దు. ఎందుకంటే యెహోవా అనే నేను ఉత్తరదిక్కు నుండి కీడును రప్పిస్తున్నాను. గొప్ప వినాశనాన్ని రప్పిస్తున్నాను.
\p
\s5
\v 7 పొదల్లో నుండి సింహం బయలుదేరింది. జాతుల వినాశకుడు బయలు దేరాడు. నీ దేశాన్ని నాశనం చేయడానికి, నీ పట్టణాలను శిథిలాలుగా మార్చి ఎవరూ నివసించకుండా చేయడానికి అతడు తన చోటు నుండి బయలు దేరాడు.
\v 8 యెహోవా కోపాగ్ని మన మీద నుండి తొలగిపోలేదు. కాబట్టి గోనె పట్ట కట్టుకోండి. రోదనతో విలపించండి.
\p
\s5
\v 9 యెహోవా చెప్పేదేమంటే <<ఆ రోజు రాజూ అతని అధికారులూ ధైర్యం కోల్పోతారు. యాజకులు నిర్ఘాంతపోతారు. ప్రవక్తలు విస్మయానికి గురౌతారు.>>
\v 10 అప్పుడు నేనిలా అన్నాను <<అయ్యో, ప్రభూ యెహోవా! <మీకు క్షేమంగా ఉంటుంది> అని చెప్పి యెరూషలేము ప్రజలను మోసం చేశావు. ఇప్పుడేమో ఖడ్గం వారి ప్రాణాల మీద పడి హతం చేస్తూ ఉంది.>>
\p
\s5
\v 11 ఆ రోజుల్లో ఆ ప్రజలకు యెరూషలేము నివాసుల గూర్చి ఇలా చెబుతారు. <<ఎడారిలో చెట్లులేని మెరకల నుండి నా ప్రజల పైకి వడగాలి వీస్తున్నది. అది తూర్పార పట్టడానికో, శుద్ధి చేయడానికో కాదు.
\v 12 నా మాట చొప్పున అంతకంటే మరింత బలమైన గాలి వీస్తుంది. ఇప్పుడు వారి మీదికి రాబోయే తీర్పులు ప్రకటిస్తాను.>>
\s5
\v 13 ఆయన రాక మేఘాలు కమ్ముతున్నట్టుగా ఉంది. ఆయన రథాలు సుడిగాలిలాగా, ఆయన గుర్రాలు గరుడ పక్షుల కంటే వేగంగా పరుగెత్తుతున్నాయి. అయ్యో, మనం నాశనమై పోయాం.
\p
\v 14 యెరూషలేమా, నీకు విమోచన కావాలంటే నీ హృదయంలోని చెడుగును కడుక్కో. ఎంతకాలం పాపం చేయాలని కోరుకుంటావు?
\v 15 దాను పట్టణం నుండి ఒకడు ప్రకటన చేస్తున్నాడు, కీడు రాబోతున్నదని ఎఫ్రాయిము కొండల్లో ఒకడు చాటిస్తున్నాడు,
\s5
\v 16 దూరదేశం నుండి ముట్టడి వేసేవారు వచ్చి <<యూదా పట్టణాలను పట్టుకోబోతున్నాం>> అని పెద్దపెద్ద కేకలు వేస్తున్నారని యెరూషలేముకు, ఇతర రాజ్యాలకు ప్రకటించండి.
\v 17 యూదా నా మీద తిరుగుబాటు చేసింది కాబట్టి వారు పొలాన్ని కావలి కాసేవారిలాగా యూదాను కూడా ముట్టడిస్తారు. ఇదే యెహోవా వాక్కు.
\p
\v 18 నీ ప్రవర్తన, నీ క్రియలే ఈ ఆపదను నీ మీదికి రప్పించాయి. నీ చెడుతనమే దీనికి కారణం. ఇది చేదుగా ఉండి నీ హృదయాన్ని గట్టిగా తాకుతున్నది కదా?
\s5
\v 19 నా హృదయం! నా హృదయం! వేదనతో నా అంతరంగం అల్లాడుతూ ఉంది. నా గుండె బాధగా కొట్టుకుంటూ ఉంది. తాళలేకపోతున్నాను. బాకానాదం వినబడుతున్నది, యుద్ధ ఘోష విని నేను తట్టుకోలేను.
\v 20 కీడు తరవాత కీడు వస్తూ ఉంది. దేశమంతా నాశనమైంది. హటాత్తుగా నా గుడారాలు, క్షణాల్లో వాటి తెరలు పాడైపోయాయి.
\s5
\v 21 ఇంకెన్నాళ్లు నేను ధ్వజాన్ని చూస్తూ, బాకానాదం వింటూ ఉండాలి?
\v 22 నా ప్రజలు మూర్ఖులు. వారికి నేను తెలియదు. వారు తెలివితక్కువ పిల్లలు, వారికి గ్రహింపు లేదు. చెడు జరిగించడంలో వారికి నైపుణ్యం ఉంది గానీ మంచి చేయడం వారికి అసలు తెలియదు.
\p
\s5
\v 23 నేను భూమిని చూశాను. అది ఆకారం కోల్పోయి శూన్యంగా ఉంది. ఆకాశాన్ని చూశాను, అక్కడ వెలుగు లేదు.
\v 24 పర్వతాలను చూస్తే అవి కంపిస్తూ ఉన్నాయి, కొండలన్నీ కదిలిపోతున్నాయి.
\v 25 నేను చూసినప్పుడు మనిషి ఒక్కడు కూడా లేడు. ఆకాశపక్షులన్నీ ఎగిరిపోయాయి.
\v 26 నేను చూస్తూ ఉండగా యెహోవా కోపాగ్నికి ఫలవంతమైన భూమి ఎడారిలా మారింది. అందులోని పట్టణాలన్నీ పూర్తిగా కూలిపోయాయి.
\p
\s5
\v 27 యెహోవా చెప్పేదేమంటే, ఈ దేశమంతా పాడైపోతుంది. అయితే దాన్ని పూర్తిగా నాశనం చేయను.
\v 28 దాని విషయం భూమి దుఃఖిస్తుంది. ఆకాశం చీకటి కమ్ముతుంది. నేను నిర్ణయించాను, వెనక్కి తగ్గను. పశ్చాత్తాప పడను, దాన్ని రద్దు చేయను.
\v 29 రౌతులూ విలుకాళ్ళూ చేసే శబ్దం విని పట్టణ ప్రజలంతా పారిపోయి అడవుల్లో దూరుతున్నారు, ఉన్నత ప్రాంతాల్లో రాళ్ళ మధ్యకు ఎక్కుతున్నారు. ప్రతి పట్టణం నిర్మానుష్యంగా మారింది. వాటిలో ఎవరూ నివసించడం లేదు.
\p
\s5
\v 30 నీవు ధ్వంసం అయ్యావు. ఏమి చేయగలవు? ఎరుపు రంగు బట్టలు కట్టుకుని, బంగారు నగలు ధరించి, కాటుకతో నీ కళ్ళు పెద్దగా కనబడేలా చేసుకున్నావు, నీ అలంకరణ అంతా వ్యర్ధం. ఇంతకు ముందు నిన్ను ప్రేమించిన వారు నిన్ను తృణీకరిస్తారు. పైగా వారే నిన్ను చంపడానికి చూస్తారు.
\v 31 స్త్రీ పురిటినొప్పులతో కేకలు వేస్తున్నట్టు, తొలి కాన్పులో స్త్రీ కేకలు వేస్తున్నట్టు సీయోను కన్య <<అయ్యో, నాకు బాధ! నా హంతకుల చేతిలో చిక్కి నేను మూర్చబోతున్నాను>> అని ఎగశ్వాసతో చేతులు చాస్తూ వేస్తున్న కేకలు నాకు వినబడుతున్నాయి.
\s5
\c 5
\s నీతిమంతుని కోసం వ్యర్ధమైన అన్వేషణ
\q1
\v 1 యెహోవా చెప్పేదేమంటే <<యెరూషలేము వీధుల్లో అటూ ఇటూ తిరుగుతూ గమనించండి. దాని రాజవీధుల్లో విచారించండి.
\q1 న్యాయం జరిగిస్తూ నమ్మకంగా ఉండాలని ప్రయత్నం చేసే ఒక్కడు మీకు కనిపించినా సరే, నేను దాన్ని క్షమిస్తాను.
\q1
\v 2 యెహోవా మీద ఒట్టు అని పలికినప్పటికీ వారు చేసే ప్రమాణం మోసమే.>>
\q1
\v 3 యెహోవా, యథార్థత చూడాలని కదా నీ కోరిక?
\q1 నువ్వు వారిని కొట్టావు కానీ వారు లెక్క చేయలేదు. వారిని క్షీణింప జేశావు గానీ వారు శిక్షను అంగీకరించలేదు.
\q1 రాతికంటే తమ ముఖాలు కఠినం చేసుకుని నీ వైపు తిరగడానికి ఒప్పుకోలేదు.
\q1
\s5
\v 4 నేనిలా అనుకున్నాను<<వీరు కేవలం బీదవారు. యెహోవా మార్గాలు, తమ దేవుని న్యాయవిధులు తెలియని బుద్ధిహీనులు.
\q1
\v 5 కాబట్టి నేను ప్రముఖుల దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడతాను.
\q1 వారికి యెహోవా మార్గాలు, తమ దేవుని న్యాయవిధులు తెలిసి ఉంటాయి గదా.>>
\q1 అయితే వారందరూ కాడిని విరిచేవారే, దేవునితో అంటుకట్టిన కట్లను తెంపుకొన్న వారే.
\q1
\v 6 అరణ్యం నుండి వచ్చిన సింహం వారిని చంపుతుంది.
\q1 అడవి తోడేలు వారిని నాశనం చేస్తుంది. చిరుతపులి వారి పట్టణాల దగ్గర కాచుకుని వాటిలోనుండి బయటకు వచ్చిన ప్రతివాణ్ణీ చీల్చివేస్తుంది.
\q1 ఎందుకంటే వారి అక్రమాలు మితిమీరిపోయాయి. వారు విశ్వాసఘాతకులయ్యారు.
\q1
\s5
\v 7 నీ పిల్లలు నన్ను విడిచి, దేవుళ్ళు కాని వారి పేరున ప్రమాణం చేస్తారు.
\q1 నేను వారిని సమృద్ధిగా పోషించాను కానీ వారు వ్యభిచారం చేస్తూ వేశ్యల ఇళ్ళలో సమావేశం అవుతారు. వారిని నేనెందుకు క్షమించాలి?
\q1
\v 8 బాగా బలిసిన గుర్రాల్లాగా వారిలో ప్రతి ఒక్కడూ ఇటూ అటూ తిరుగుతూ తన పొరుగువాని భార్యను చూసి సకిలిస్తాడు.
\q1
\v 9 అలాంటి పనుల కారణంగా నేను వారిని దండించకుండా ఉంటానా? అలాటి ప్రజల మీద నా కోపం చూపకూడదా? ఇదే యెహోవా వాక్కు.
\q1
\s5
\v 10 దాని ద్రాక్షతోటల్లోకి వెళ్ళి నాశనం చేయండి. అయితే వాటిని పూర్తిగా అంతం చేయవద్దు.
\q1 దాని కొమ్మలను నరికి వేయండి. ఎందుకంటే అవి యెహోవా నుండి వచ్చినవి కావు.
\q1
\v 11 ఇశ్రాయేలు, యూదా ప్రజలు నాకు పూర్తిగా ద్రోహం చేశారు. ఇదే యెహోవా వాక్కు.
\q1
\v 12 వారు నన్ను తోసిపుచ్చి <<యెహోవా నిజమైనవాడు కాదు. మనపైకి ఏ కీడు గానీ ఖడ్గం గానీ కరువు గానీ రాదు.
\q1
\v 13 ప్రవక్తలు చెప్పేవన్నీ గాలి మాటలు. యెహోవా మాటలు పలికేవాడు వారిలో లేడు. వారు చెప్పింది వారికే జరుగుతుంది>> అని చెబుతారు.
\q1
\s5
\v 14 కాబట్టి సేనల అధిపతీ, దేవుడూ అయిన యెహోవా చెప్పేదేమంటే,
\q1 వారు ఆ విధంగా పలికారు కాబట్టి నా వాక్కు వారిని కాల్చేలా దాన్ని నీ నోట అగ్నిగా ఉంచుతాను. ఈ ప్రజలను కట్టెలుగా చేస్తాను. ఇదే యెహోవా వాక్కు.
\q1
\v 15 ఇశ్రాయేలు ప్రజలారా, వినండి, దూరం నుండి మీ మీదికి ఒక జనాన్ని రప్పిస్తాను. అది చాలా పురాతనమైన జనం.
\q1 దాని భాష నీకు రాదు. ఆ జనం పలికే మాటలు నీకు అర్థం కావు.
\q1
\s5
\v 16 వారి అమ్ముల పొది తెరచిన సమాధిలాంటిది. వారంతా గొప్ప యోధులు.
\q1
\v 17 నీ పంట, నీ ఆహారం వారి చేతిలో నాశనం అవుతుంది. నీ కొడుకులనూ, కూతుళ్ళనూ, నీ గొర్రెలనూ, నీ పశువులనూ నాశనం చేస్తారు.
\q1 నీ ద్రాక్షచెట్ల, అంజూరు చెట్ల ఫలాన్ని నాశనం చేస్తారు. నీవు ఆశ్రయంగా భావించిన ప్రాకారాలుగల పట్టణాలను వారు కత్తి చేత కూలదోస్తారు.
\p
\s5
\v 18 అయినా ఆ రోజుల్లో నేను మిమ్మల్ని పూర్తిగా నాశనం చెయ్యను. ఇదే యెహోవా వాక్కు.
\v 19 <<మన దేవుడు యెహోవా మనకెందుకు ఇలా చేశాడు?>> అని అడిగినప్పుడు నువ్వు వారితో
\f +
\fr 5:19
\fq నువ్వు వారితో
\ft నీ ప్రజలతో
\f* ఇలా చెప్పు. మీరు నన్ను విసర్జించి మీ స్వదేశంలో అన్య దేవుళ్ళను పూజించారు కాబట్టి మీది కాని దేశంలో మీరు అన్య ప్రజలకు సేవ చేస్తారు అని యెహోవా సెలవిస్తున్నాడు.
\q1
\s5
\v 20 యాకోబు వంశ ప్రజలకు ఈ మాట చెప్పండి, యూదా వంశ ప్రజలకు ఈ సమాచారం చాటించండి.
\q1
\v 21 మీరు కళ్ళుండీ చూడడం లేదు, చెవులుండీ వినడం లేదు. మీరు తెలివి లేని మూర్ఖులు.
\q1
\v 22 యెహోవా చెప్పేదేమంటే, నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వణకరా?
\q1 నేను ఒక నిత్యమైన నిర్ణయం తీసుకుని సముద్రానికి ఒక సరిహద్దుగా ఇసుకను ఉంచాను.
\q1 దాని అలలు ఎంత పైకి లేచినా అవి దాన్ని దాటలేవు. ఎంత ఘోష పెట్టినా దాన్ని జయించలేదు.
\q1
\s5
\v 23 ఈ ప్రజలు తిరుగుబాటు, ద్రోహం చేసే మనస్సు గలవారు, వారు పక్కకు తొలగిపోతున్నారు.
\q1
\v 24 వారు <<రండి, మన దేవుడైన యెహోవా పట్ల భయభక్తులు చూపుదాం. తొలకరి వర్షాన్ని, కడవరి వర్షాన్ని వాటి కాలంలో కురిపించేవాడు ఆయనే కదా.
\q1 నిర్ణయించిన ప్రకారం కోతకాలపు వారాలను మనకు వచ్చేలా చేసేవాడు ఆయనే కదా>> అని తమ మనస్సులో అనుకోరు.
\q1
\v 25 అవి క్రమంగా రాకుండా చేసింది మీ దోషాలే. మీకు మేలు కలగక పోవడానికి కారణం మీ పాపాలే.
\q1
\s5
\v 26 నా ప్రజల్లో దుర్మార్గులున్నారు, వేటగాళ్ళు పక్షుల కోసం పొంచి ఉన్నట్టు వారు పొంచి ఉంటారు.
\q1 వారు వల పన్ని మనుషులను పట్టుకుంటారు.
\q1
\v 27 పంజరం నిండా పిట్టలు ఉన్నట్టు వారి ఇళ్ళు కపటంతో నిండి ఉన్నాయి. దానితోనే వారు గొప్పవారు, ధనవంతులు అవుతారు.
\q1
\v 28 వారు కొవ్వు పట్టి బాగా బలిసి ఉన్నారు. దుర్మార్గంలో వారు ఎంతో ముందుకు వెళ్ళారు.
\q1 తండ్రి లేనివారు వ్యాజ్యంలో గెలవకుండేలా వారికి అన్యాయంగా తీర్పు తీరుస్తారు. బీదవారి వ్యాజ్యాల్లో సహకరించరు.
\q1
\v 29 అలాటి వారిని నేను శిక్షించకూడదా? ఈ ప్రజలపై ప్రతీకారం తీర్చుకోకూడదా? ఇదే యెహోవా వాక్కు.
\q1
\s5
\v 30 ఘోరమైన అకృత్యాలు దేశంలో జరుగుతున్నాయి.
\q1
\v 31 ప్రవక్తలు అబద్ధ ప్రవచనాలు చెబుతారు. యాజకులు తమ స్వంత అధికారాన్ని చెలాయిస్తారు.
\q1 అలా జరగడం నా ప్రజలకు కూడా ఇష్టమే. అయితే దాని అంతంలో జరగబోయే దానికి వారేం చేస్తారు?
\s5
\c 6
\s యెరూషలేము ముట్టడి
\q1
\v 1 <<బెన్యామీను ప్రజలారా, యెరూషలేము నుండి పారిపొండి, తెకోవలో బాకానాదం ఊదండి. బేత్‌హక్కెరెంలో ఒక సూచన నిలబెట్టండి.
\q1 ఎందుకంటే ఉత్తర దిక్కునుండి గొప్ప ప్రమాదం ముంచుకొస్తున్నది. గొప్ప దండు వస్తున్నది.
\q1
\v 2 సుందరసుకుమారి సీయోను కన్యను పూర్తిగా నాశనం చేస్తాను.
\q1
\v 3 కాపరులు తమ గొర్రెల మందలతో దానిలోకి వస్తారు. దాని చుట్టూ గుడారాలు వేస్తారు.
\q1 ప్రతివాడూ తన కిష్టమైన చోట మందను మేపుతాడు.
\q1
\s5
\v 4 యెహోవా పేరున ఆమెతో యుద్ధానికి సిద్ధపడండి. లెండి, మధ్యాహ్న సమయంలో దాడి చేద్దాం.
\q1 అయ్యో, పొద్దుగుంకిపోతున్నది. సాయంకాలపు నీడలు సాగిపోతున్నాయి.
\q1
\v 5 కాబట్టి రాత్రిపూట వెళ్ళి ఆమె కోటలు నాశనం చేద్దాం.
\q1
\s5
\v 6 సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమంటే <చెట్లు నరికి యెరూషలేమును చుట్టూ ముట్టడించండి.
\q1 ఈ పట్టణం నిండా అన్యాయమే జరుగుతున్నది. కాబట్టి దాన్ని శిక్షించడం న్యాయమే.
\q1
\v 7 ఊటలో నీరు ఏవిధంగా పైకి ఉబికి వస్తుందో ఆ విధంగా దాని దుష్టత్వం పైకి ఉబుకుతూ ఉంది.
\q1 దానిలో బలాత్కారం, అక్రమం జరగడం వినబడుతున్నది, ఎప్పుడూ గాయాలు, దెబ్బలు నాకు కనబడుతున్నాయి.
\q1
\v 8 యెరూషలేమా, నేను నీ దగ్గర నుండి తొలగి పోకుండేలా, నేను నిన్ను నిర్జనమైన ప్రదేశంగా చేయకుండేలా దిద్దుబాటుకు లోబడు.>
\q1
\s5
\v 9 సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమంటే <ద్రాక్ష పండ్లను ఏరే విధంగా ఇశ్రాయేలులో మిగిలిన వారిని ఏరుతారు.
\q1 ద్రాక్షపండ్లను ఏరేవాడు దాని తీగెల మీద మళ్ళీ చెయ్యి వేసినట్టు నీ చెయ్యి వాళ్ళ మీద వేయి.> >>
\q1
\v 10 నేనెవరితో మాట్లాడి హెచ్చరించాలి? వారు వినడానికి సిద్ధంగా లేరు. కాబట్టి వినలేదు.
\q1 ఇదిగో, యెహోవా వాక్యం వారిని సరిదిద్దడానికి వారి దగ్గరికి వచ్చింది కానీ దాన్ని వారు తృణీకరిస్తారు.
\q1
\s5
\v 11 కాబట్టి నేను యెహోవా కోపంతో నిండిపోయాను. దాన్ని నాలోనే అణచుకోలేక నేను విసిగిపోయాను.
\q1 వీధుల్లో తిరిగే పసిపిల్లలు, యువకులు, ఇలా ప్రతి ఒక్కరి మీదా దాన్ని కుమ్మరించాల్సి వస్తున్నది.
\q1 భార్యతో బాటు భర్తనూ, వయస్సు మీరిన ప్రతి వాడితో కలిపి వృద్ధులందరినీ పట్టుకుంటారు.
\q1
\v 12 వారికిక ఏమీ మిగలదు. వారి ఇళ్ళు, వారి పొలాలు, వారి భార్యలు, మొత్తాన్ని ఇతరులు తీసుకు వెళ్లి పోతారు.
\q1 ఎందుకంటే ఈ దేశ ప్రజల మీద నేను నా చెయ్యి చాపి వారిని ఎదిరిస్తాను. ఇదే యెహోవా వాక్కు
\q1
\s5
\v 13 <<వారిలో అత్యల్పులు, గొప్పవారు అందరూ మోసం చేసేవారే, దోచుకొనేవారే. ప్రవక్తలు గాని, యాజకులు గాని అందరూ వంచకులే.
\q1
\v 14 శాంతి లేని సమయంలో వారు శాంతి, సమాధానం అని ప్రకటిస్తూ నా ప్రజల గాయాలను పైపైన మాత్రమే బాగుచేస్తారు.
\q1
\v 15 వారు చేస్తున్న అసహ్యకార్యాలను బట్టి వారు సిగ్గుపడాలి. అయితే వారు ఏమాత్రం సిగ్గుపడరు.
\q1 తాము అవమానం పాలయ్యామని వారికి తోచడం లేదు.
\q1 కాబట్టి నేను వారికి తీర్పు తీర్చే కాలంలో పడిపోయే వారితో వారు కూడా పడిపోతారు.
\q1 వారు కూలిపోతారు>> అని యెహోవా సెలవిస్తున్నాడు.
\q1
\s5
\v 16 యెహోవా చెప్పేదేమంటే, రహదారుల్లో నిలబడి చూడండి. పురాతన మార్గాలు ఏవో వాకబు చేయండి.
\q1 <<ఏ మార్గంలో వెళ్తే మేలు కలుగుతుంది?>> అని అడిగి అందులో నడవండి. అప్పుడు మీ మనస్సుకు నెమ్మది కలుగుతుంది.
\q1 అయితే వారు <<మేము అందులో నడవం>> అని చెబుతున్నారు.
\q1
\v 17 మిమ్మల్ని కనిపెట్టుకుని ఉండడానికి నేను కావలి వారిని ఉంచాను. అదిగో, వారు చేసే బూరధ్వని వినండి.
\q1
\v 18 అయితే <<మేము వినం>> అని వారంటున్నారు. కాబట్టి, అన్యజనులారా, వినండి. సాక్షులారా, వారికేం జరగబోతున్నదో చూడండి.
\q1
\v 19 భూలోకమా, విను. ఈ ప్రజలు నా మాటలు వినడం లేదు. నా ధర్మశాస్త్రాన్ని విసర్జించారు.
\q1 కాబట్టి వారి ఆలోచనలకు ఫలితంగా వారి పైకి విపత్తును రప్పిస్తున్నాను.
\q1
\s5
\v 20 షేబ దేశం నుండి వచ్చే సాంబ్రాణి నాకెందుకు? సుదూర దేశం నుండి తీసుకొచ్చిన మధురమైన సువాసన గల నూనె నాకెందుకు?
\q1 మీ దహనబలులు నాకిష్టం లేదు. మీ బలులు నాకు సంతోషం కలిగించడం లేదు.
\q1
\v 21 కాబట్టి యెహోవా చెప్పేదేమంటే, చూడండి, ఈ ప్రజలకు వ్యతిరేకంగా ఒక అడ్డుబండను వేయబోతున్నాను.
\q1 తండ్రులూ కొడుకులూ అందరూ అది తగిలి కూలిపోతారు. అక్కడి నివాసులు, వారి పొరుగువారు కూడా నశిస్తారు.
\q1
\v 22 యెహోవా చెప్పేదేమంటే, ఉత్తర దిక్కునుండి ఒక జనాంగం వస్తూ ఉంది.
\q1 ఎక్కడో దూర ప్రాంతం నుండి ఒక మహా గొప్ప రాజ్యం బయలు దేరింది.
\q1
\s5
\v 23 వారు బాణాలు, ఈటెలు వాడతారు. వారు జాలిలేని క్రూర జనాంగం. వారి స్వరం సముద్ర ఘోషలాగా ఉంటుంది.
\q1 సీయోను కుమార్తెలారా, వారు గుర్రాలపై స్వారీ చేస్తూ వస్తారు. నీతో యుద్ధం చేయడానికి వారు యోధుల్లాగా బారులు తీరి ఉన్నారు.
\q1
\v 24 వారి గురించిన వార్త విని నిస్పృహతో మా చేతులు చచ్చుబడి పోయాయి. ప్రసవించే స్త్రీ నొప్పుల వంటి వేదన పడుతున్నాము.
\q1
\s5
\v 25 బయట పొలంలోకి వెళ్ళవద్దు. రహదారుల్లో నడవవద్దు. మా చుట్టూ కదులుతున్న శత్రువుల కత్తులు చూసి అంతటా భయం ఆవరించింది.
\q1
\v 26 నా ప్రజలారా, వినాశనకారి హఠాత్తుగా మా మీదికి వస్తాడు. గోనెపట్ట కట్టుకుని బూడిద చల్లుకోండి.
\q1 ఒక్కడే కొడుకును గూర్చి ఎలా దుఃఖిస్తారో ఆ విధంగా విలపించండి. బహు ఘోరంగా విలపించండి.
\q1
\s5
\v 27 యిర్మీయా, నిన్ను నా ప్రజలకు మెరుగు పెట్టేవాడిగా, వారిని నీకు లోహపు ముద్దగా నేను నియమించాను.
\q1 ఎందుకంటే నువ్వు వారి ప్రవర్తనను పరిశీలించి తెలుసుకోవాలి.
\q1
\v 28 వారంతా బహు ద్రోహులు, కొండెగాళ్ళు. వారు మట్టి లోహం వంటివారు, వారి అంతరంగం ఇత్తడి, ఇనుములాగా బహు కఠినంగా ఉంటాయి.
\q1
\v 29 కొలిమి తిత్తులు మంటల్లో కాలిపోతున్నాయి. ఆ జ్వాలల్లో సీసం తగలబడి పోతున్నది.
\q1 అలా మండిస్తూ ఉండడం నిష్ప్రయోజనం. దుష్టులను వేరు చేయడం వీలు కాదు.
\q1
\v 30 వారిని <<పారవేయాల్సిన వెండి>> అని పిలవాలి. ఎందుకంటే యెహోవా వారిని పూర్తిగా తోసిపుచ్చాడు.
\s5
\c 7
\s యూదా విగ్రహరాధన, అక్రమ జీవితం
\p
\v 1 యెహోవా దగ్గర నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు
\v 2 <<నువ్వు యెహోవా మందిర ద్వారంలో నిలబడి ఈ మాట ప్రకటించు. యెహోవాను పూజించడానికి ఈ ద్వారాల గుండా వచ్చే యూదా ప్రజలారా, యెహోవా మాట వినండి.
\s5
\v 3 సైన్యాల ప్రభువు, ఇశ్రాయేలు దేవుడు అయిన యెహోవా చెప్పేదేమంటే, మీరు ఈ స్థలంలో నివసించడానికి నేను అనుమతించాలంటే మీ మార్గాలు, క్రియలు సరి చేసుకోండి.
\v 4 ఇది యెహోవా ఆలయం! యెహోవా ఆలయం! యెహోవా ఆలయం అని మీరు చెప్పుకొనే మోసకరమైన మాటల వలలో పడకండి.>>
\p
\s5
\v 5 మీ మార్గాలు, క్రియలు మీరు యథార్థంగా సరిచేసుకుని ప్రతివాడూ తన పొరుగువాడి పట్ల న్యాయం జరిగించాలి.
\v 6 పరదేశుల్నీ తండ్రి లేని వారినీ వితంతువులనూ బాధించకూడదు. ఈ స్థలంలో నిర్దోషి రక్తం చిందించకూడదు. మీకు హాని చేసే అన్య దేవతలను పూజించకూడదు.
\v 7 అలా అయితే మీరు శాశ్వతంగా నివసించడానికి పూర్వమే నేను మీ పూర్వికులకు ఇచ్చిన ఈ దేశంలో మిమ్మల్ని ఉండనిస్తాను.
\p
\s5
\v 8 అయితే మీరు ప్రయోజనం లేని మోసపు మాటలు నమ్ముతున్నారు.
\v 9 మీరు వ్యభిచారం, దొంగతనం, నరహత్యలు,
\v 10 అబద్ధ ప్రమాణాలు చేస్తూ, బయలు దేవుడికి ధూపం వేస్తూ మీకు తెలియని దేవుళ్ళను అనుసరిస్తున్నారు. అదే సమయంలో నా పేరు పెట్టిన ఈ మందిరంలోకి వచ్చి నా సన్నిధిలో నిలబడి <<మేం తప్పించుకున్నాం>> అంటున్నారు. మీరు విడుదల పొందింది ఈ అసహ్యమైన పనులు చేయడానికేనా?
\v 11 నా పేరు పెట్టిన ఈ మందిరం మీ కంటికి దొంగల గుహలాగా ఉందా? దీన్నంతా నేను చూస్తూనే ఉన్నానని తెలుసుకోండి. ఇదే యెహోవా వాక్కు.
\p
\s5
\v 12 గతంలో నేను నా సన్నిధిని ఉంచిన షిలోహుకు వెళ్లి పరిశీలించండి. నా ప్రజలైన ఇశ్రాయేలీయుల ద్రోహాన్ని బట్టి నేను దానికి ఏం చేశానో చూడండి.
\v 13 నేను మీతో పదే పదే మాట్లాడినా మీరు వినలేదు. మిమ్మల్ని పిలిచినా మీరు జవాబు చెప్పకుండా మీరు ఈ పనులన్నీ చేశారు.
\v 14 కాబట్టి నేను షిలోహుకు చేసినట్టే నా పేరు పెట్టిన ఈ మందిరానికీ, మీకూ మీ పూర్వికులకూ నేనిచ్చిన ఈ స్థలానికీ చేస్తాను.
\v 15 మీ సోదరులైన ఎఫ్రాయిము సంతానాన్ని నేను వెళ్లగొట్టినట్టు మిమ్మల్ని కూడా నా సన్నిధి నుండి వెళ్లగొడతాను.
\p
\s5
\v 16 కాబట్టి యిర్మీయా, నువ్వు ఈ ప్రజల కోసం ప్రార్థన చేయవద్దు. వారి పక్షంగా మొర్రపెట్టడం, విజ్ఞాపన చేయడం చేయవద్దు. నన్ను బతిమాలవద్దు. ఎందుకంటే నేను నీ మాట వినను.
\v 17 యూదా పట్టణాల్లో, యెరూషలేము వీధుల్లో వారు చేస్తున్న పనులు నువ్వు చూస్తున్నావు కదా.
\v 18 నాకు కోపం పుట్టించడానికి ఆకాశరాణి దేవతకు పిండివంటలు చేయాలనీ, అన్య దేవుళ్ళకు పానార్పణలు పోయాలనీ పిల్లలు కట్టెలు ఏరుతున్నారు, తండ్రులు అగ్ని రగులబెడుతున్నారు, స్త్రీలు పిండి పిసుకుతున్నారు.
\s5
\v 19 నన్ను రెచ్చగొట్టడానికే అలా చేస్తున్నారా? అది వారు తమకు తాము అవమానం తెచ్చుకున్నట్టు కాదా?
\v 20 కాబట్టి ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, ఈ స్థలం మీదా, ఈ మనుషుల మీదా, జంతువుల మీదా, పొలాలమీదా, చెట్ల మీదా, పంటల మీదా నా కోపాన్ని, నా ఉగ్రతను కుమ్మరిస్తాను. అది ఎన్నటికీ ఆరదు, మండుతూనే ఉంటుంది.
\p
\s5
\v 21 సేనల ప్రభువు, ఇశ్రాయేలు దేవుడు అయిన యెహోవా చెప్పేదేమంటే, మీ దహన బలులూ ఇతర బలులూ కలిపి వాటి మాంసం అంతా మీరే తినండి.
\v 22 నేను ఐగుప్తు దేశం నుండి మీ పూర్వికులను రప్పించిన రోజున వారి నుండి ఏమీ కోరలేదు. దహన బలుల గురించీ ఇంకా ఇతర బలుల గురించీ నేను వారికి ఆజ్ఞాపించలేదు.
\v 23 ఒక్క ఆజ్ఞ మాత్రం ఇచ్చాను. అదేమంటే, <<మీరు నా మాటలు అంగీకరిస్తే నేను మీకు దేవుడుగా ఉంటాను, మీరు నా ప్రజలై ఉంటారు. నేను మీకాజ్ఞాపించిన మార్గాల్లో నడుచుకోండి. అప్పుడు మీకు క్షేమం కలుగుతుంది.>>
\p
\s5
\v 24 అయితే వారు వినలేదు, అస్సలు వినలేదు. తమ దుష్టహృదయంలో నుండి వచ్చిన ఆలోచనల ప్రకారం జీవించారు. కాబట్టి వారు ముందుకు సాగలేక వెనకబడిపోయారు.
\v 25 మీ పూర్వికులు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన రోజు నుండి ఈ రోజు వరకూ నేను ఎడతెగక నా సేవకులైన ప్రవక్తలను మీ దగ్గరికి పంపుతూ వచ్చాను.
\v 26 అయినా వారు నా మాట వినలేదు, పెడచెవిని పెట్టారు. తలబిరుసు తనంతో తమ మనస్సు కఠినం చేసుకున్నారు. వారు తమ పూర్వీకుల కంటే మరీ దుర్మార్గులయ్యారు.
\p
\s5
\v 27 నువ్వు ఈ మాటలన్నీ వారితో చెప్పినా వారు నీ మాట వినరు. నువ్వు పిలిచినా వారు బదులు చెప్పరు.
\v 28 కాబట్టి నువ్వు వారితో ఇలా చెప్పు. <<ఈ దేశం తమ దేవుడైన యెహోవా మాట వినలేదు. క్రమశిక్షణకు లోబడలేదు. కాబట్టి సత్యం వారిలో నుండి తొలగిపోయింది. అది వారి నోటినుండి కొట్టి వేయబడింది.
\q1
\s5
\v 29 తనకు కోపం తెప్పించిన తరం ప్రజలను యెహోవా విసర్జించి వెళ్లగొట్టాడు.
\q1 నీ తలవెండ్రుకలు కత్తిరించుకో. వాటిని పారవెయ్యి. చెట్లు లేని ఉన్నత స్థలాల్లో రోదన చెయ్యి.
\s వధ లోయ
\q1
\v 30 యెహోవా చెప్పేదేమంటే, యూదా ప్రజలు నా దృష్టికి దుష్టత్వం జరిగిస్తున్నారు,
\q1 నా పేరు పెట్టిన మందిరం అపవిత్రమయ్యేలా వారు దానిలో అసహ్యమైన వస్తువులు ఉంచారు.
\p
\s5
\v 31 నేనాజ్ఞాపించని దాన్ని, నా ఆలోచనలో లేని దాన్ని వారు చేశారు. అగ్నిలో తమ కొడుకులనూ, కూతుళ్ళనూ కాల్చడానికి బెన్‌ హిన్నోము లోయలోని తోఫెతులో బలిపీఠాలు కట్టారు.
\v 32 యెహోవా చెప్పేదేమంటే, ఒక రోజు రాబోతున్నది. అప్పుడు దాన్ని తోఫెతు అని గానీ, బెన్‌ హిన్నోము లోయ అని గానీ పిలవరు, దాన్ని <వధ లోయ> అని పిలుస్తారు. ఎందుకంటే, పాతిపెట్టడానికి స్థలం లేకపోయేటంత వరకూ తోఫెతులో శవాలు పాతిపెడతారు.
\p
\s5
\v 33 అప్పుడు ఈ ప్రజల శవాలు ఆకాశ పక్షులకూ భూజంతువులకూ ఆహారంగా మారతాయి. వాటిని తోలివేయడానికి ఎవరూ ఉండరు.
\v 34 ఈ దేశం తప్పకుండా పాడైపోతుంది. యూదా పట్టణాల్లో, యెరూషలేము వీధుల్లో ఆనంద ధ్వనులు, కేరింతలు, పెళ్ళికొడుకు, పెళ్ళికూతుళ్ళ స్వరాలు వినబడకుండా చేస్తాను.>>
\s5
\c 8
\p
\v 1 యెహోవా చెప్పేదేమంటే ఆ సమయంలో మీ శత్రువులు యూదా రాజుల, వారి అధిపతుల ఎముకలను, యాజకుల, ప్రవక్తల ఎముకలను, యెరూషలేము నివాసుల ఎముకలను వారి సమాధుల్లో నుండి బయటికి తీస్తారు.
\v 2 వాటిని తెచ్చి వారు వేటినైతే ప్రేమిస్తున్నారో, పూజిస్తున్నారో, వేటి ఎదుట విచారణ చేస్తున్నారో, నమస్కరిస్తున్నారో ఆ సూర్య చంద్ర నక్షత్రాల ఎదుట వాటిని పరుస్తారు. వాటిని పోగు చేసి పాతిపెట్టడం జరగదు. భూమి మీద పెంటలాగా అవి పడి ఉంటాయి.
\v 3 ఈ దుర్మార్గ దేశంలో ఇంకా మిగిలి ఉన్నవారు నేను వారిని చెదర గొట్టిన స్థలాల్లో జీవానికి బదులు చావును కోరుకుంటారు. సేనల ప్రభువైన యెహోవా వాక్కు ఇదే.
\s పాపం, శిక్ష
\p
\s5
\v 4 యెహోవా ఇలా చెబుతున్నాడని వారితో చెప్పు. <<కిందపడిన మనుషులు లేవకుండా ఉంటారా? దారి తప్పిపోయిన వారు తిరిగి రావడానికి ప్రయత్నించకుండా ఉంటారా?>>
\q1
\v 5 మరి ఈ ప్రజలు, యెరూషలేము ఎందుకు దారి తప్పి శాశ్వతంగా తిరిగి రాకుండా ఉన్నారు?
\q1 వారు ఎందుకు మోసంలో నిలిచి ఉండి పశ్చాత్తాప పడడానికి ఒప్పుకోవడం లేదు?
\q1
\s5
\v 6 నేను వారి మాటలు జాగ్రత్తగా ఆలకించాను. కానీ వారు ఒక్కటి కూడా మంచి మాట పలకలేదు.
\q1 <<నేనిలా చేశానేమిటి?>> అని తన తన చెడ్డ పని గురించి పశ్చాత్తాపపడే వాడు ఒక్కడూ లేడు.
\q1 యుద్ధంలోకి చొరబడే గుర్రం లాగా ప్రతివాడూ తనకిష్టమైన మార్గంలో తిరుగుతున్నాడు.
\q1
\v 7 ఆకాశంలో ఎగిరే సంకుబుడి కొంగకు దాని కాలాలు తెలుసు. తెల్ల గువ్వ, మంగలకత్తి పిట్ట, ఓదెకొరుకులకు అవి తిరిగి రావలసిన సమయాలు తెలుసు.
\q1 అయితే నా ప్రజలకు యెహోవా న్యాయవిధి తెలియదు.
\q1
\s5
\v 8 <<మేము జ్ఞానులం, యెహోవా ధర్మశాస్త్రం మాతో ఉంది>> అని మీరెందుకు అంటున్నారు?
\q1 నిజమే గానీ శాస్త్రులు మోసంతో దానికి పెడర్థాలు రాశారు.
\q1
\v 9 జ్ఞానులు అవమానం పాలవుతారు. వారు విస్మయంతో చిక్కుల్లో పడ్డారు.
\q1 వారు యెహోవా వాక్యాన్ని తోసిపుచ్చారు. ఇక వారి జ్ఞానం వలన ఏం ప్రయోజనం?
\q1
\v 10 కాబట్టి వారి భార్యలను అన్యులకు అప్పగిస్తాను. వారి పొలాలు ఇతరుల స్వాధీనం చేస్తాను.
\q1 చిన్నలు, పెద్దలు, అందరూ విపరీతమైన దురాశాపరులు. ప్రవక్తలు, యాజకులు, అంతా నయవంచకులు.
\q1
\s5
\v 11 శాంతి లేని సమయంలో వారు <<శాంతి సమాధానాలు, శాంతి సమాధానాలు>> అని పలుకుతూ నా ప్రజల గాయాలకు పైపై పూత పూస్తారు.
\q1
\v 12 వారు చేసే అసహ్యమైన పనులను బట్టి సిగ్గుపడాలి గాని వారేమాత్రం సిగ్గుపడరు.
\q1 అవమానం అంటే వారికి తెలియదు కాబట్టి పడిపోయే వారితోబాటు వారు కూడా పడిపోతారు.
\q1 నేను వారికి తీర్పు తీర్చేటప్పుడు వారు కూలిపోతారు అని యెహోవా సెలవిస్తున్నాడు.
\q1
\v 13 నేను వారిని పూర్తిగా కొట్టివేస్తున్నాను
\f +
\fr 8:13
\fq పూర్తిగా కొట్టివేస్తున్నాను
\ft ఒక చోటికి తీసుకోని వచ్చినప్పుడు
\f* . ఇక ద్రాక్షతీగెకు ద్రాక్షలు, అంజూరు చెట్టుకు అంజూరపండ్లు కాయవు. వాటి ఆకులు వాడిపోతాయి.
\q1 నేను వారికి ఇచ్చినదంతా నశించిపోతుంది. ఇదే యెహోవా వాక్కు.
\q1
\s5
\v 14 <<మనం ఎందుకు ఇక్కడ కూర్చున్నాం? మనమంతా కలిసి ప్రాకారాలున్న పట్టణాల్లోకి వెళ్ళి అక్కడే చచ్చిపోదాం రండి.
\q1 యెహోవాయే మనలను నాశనం చేస్తున్నాడు. మనం ఆయనకు విరోధంగా పాపం చేశాం కాబట్టి మన దేవుడు యెహోవా మనకు విషజలం తాగించాడు.
\q1
\v 15 మనం శాంతి సమాధానాల కోసం కనిపెట్టుకుని ఉన్నాం గానీ మనకేమీ మంచి జరగలేదు.
\q1 క్షేమం కోసం కనిపెడుతున్నాం గానీ భయమే కలుగుతూ ఉంది అని వారు చెబుతారు.
\q1
\s5
\v 16 దాను ప్రాంతం నుండి వచ్చే వారి గుర్రాల బుసలు వినబడుతున్నాయి. వాటి సకిలింపులకు దేశమంతా అదురుతూ ఉంది.
\q1 వారు వచ్చి దేశాన్ని, దానిలోని సమస్తాన్ని, పట్టణాన్ని దానిలో నివసించే వారిని నాశనం చేస్తారు.
\q1
\v 17 యెహోవా చెప్పేదేమంటే, <నేను పాములనూ, కాలనాగులనూ మీ మధ్యకు పంపిస్తాను. అవి మిమ్మల్ని కాటు వేస్తాయి. వాటికి విరుగుడు మంత్రం ఏమీ లేదు.> >>
\q1
\s5
\v 18 నా గుండె నా లోపల సొమ్మసిల్లి పోతున్నది. నాకు దుఃఖ నివారణ ఎలా దొరుకుతుంది?
\q1
\v 19 యెహోవా సీయోనులో లేడా? ఆమె రాజు ఆమెలో లేడా? అని బహు దూరదేశం నుండి నా ప్రజల రోదనలు వినబడుతున్నాయి.
\q1 వారి విగ్రహాలను ఇతర దేశాల మాయ దేవుళ్ళను పెట్టుకుని నాకు ఎందుకు కోపం తెప్పించారు?
\q1
\s5
\v 20 కోత కాలం గతించిపోయింది. ఎండాకాలం దాటిపోయింది. మనకింకా రక్షణ దొరకలేదు అని చెబుతారు.
\q1
\v 21 నా జనుల వేదన చూసి నేనూ వేదన చెందుతున్నాను, వారికి జరిగిన ఘోరమైన సంగతులను బట్టి నేను రోదిస్తున్నాను. విపరీతమైన భయం నన్ను ఆవరించింది.
\q1
\v 22 గిలాదులో ఔషధం ఏమీ లేదా? అక్కడ వైద్యుడెవరూ లేరా? నా ప్రజలకు ఎందుకు స్వస్థత కలగడం లేదు?
\s5
\c 9
\q1
\v 1 నా తల జలమయంగా నా కళ్ళు కన్నీటి ఊటగా ఉండు గాక.
\q1 ఎందుకంటే హతమైన నా ప్రజలను గూర్చి నేను రాత్రింబగళ్ళూ విలపించాలని కోరుతున్నాను.
\q1
\v 2 నా ప్రజలంతా వ్యభిచారులు, ద్రోహుల గుంపులాగా ఉన్నారు.
\q1 నేను వారిని విడిచిపెట్టి వెళ్లి ఉండడానికి అరణ్యంలో ఒక బాటసారుల నివాసం నాకు దొరికితే బాగుండును.
\q1
\v 3 విల్లును వంచినట్టుగా వారు తమ నాలుకను అబద్ధమాడడానికి వంచుతారు. ఈ భూమిపై వారు నమ్మదగిన వారు కాదు. వారు ఒకటి తరవాత మరొకటి చెడుకార్యాలు జరిగిస్తున్నారు. <<నేను ఎవరో వారు ఎరుగరు>> అని యెహోవా చెబుతున్నాడు.
\q1
\s5
\v 4 మీలో ప్రతివాడూ తన పొరుగువాడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
\q1 ఏ సోదరుణ్నీ నమ్మవద్దు. ఎందుకంటే నిజంగా ప్రతి సోదరుడూ మోసం చేసేవాడే.
\q1 ప్రతి పొరుగువాడూ అపనిందలు వేస్తూ తిరుగుతుంటాడు.
\q1
\v 5 ప్రతివాడూ సత్యం చెప్పకుండా తన పొరుగువాడిని మోసం చేస్తాడు. అక్రమం జరిగించడం వారికి అలవాటై పోయింది. ఎంతసేపూ ఎదుటి వారిలో తప్పులు పట్టాలని చూస్తారు.
\q1
\v 6 కపటం మధ్యలో నువ్వు నివసిస్తున్నావు. వారి కపటంలో వారు నన్ను తెలుసుకోలేక పోతున్నారు. ఇదే యెహోవా వాక్కు.
\q1
\s5
\v 7 కాబట్టి సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమంటే, చూడూ, నేను వారిని లోహం లాగా కరిగించి పరీక్షించబోతున్నాను. వారికి ఇంతకంటే మరేమి చెయ్యను?
\q1
\v 8 వారి నాలుక పదును పెట్టిన బాణం, అది కపటమే పలుకుతుంది.
\q1 ఒకడు తన పొరుగువారితో పైకి స్నేహపూర్వకంగా మాట్లాడతాడు గాని మనస్సులో మాత్రం మోసపూరితమైన ఆలోచనలు ఉంటాయి.
\q1
\v 9 ఈ సంగతులు తెలిసీ నేను వారిని శిక్షించకూడదా?
\q1 ఈ దేశాన్ని దండించ కూడదా? ఇదే యెహోవా వాక్కు.
\q1
\s5
\v 10 పర్వతాల గురించి ఏడుస్తాను, విలాప గీతం ఆలపిస్తాను. వాటి మేతస్థలాల గురించి రోదిస్తాను.
\q1 ఎందుకంటే అవి పాడైపోయాయి. వాటిగుండా ఎవరూ వెళ్ళడం లేదు. వాటిలో పశువుల అరుపులు వినబడడం లేదు.
\q1 ఆకాశ పక్షులు, జంతువులు అన్నీ పారిపోయాయి.
\q1
\v 11 యెరూషలేమును పాడుదిబ్బగా నక్కల నివాసంగా చేస్తాను.
\q1 యూదా పట్టణాలను ఎవరూ నివసించలేకుండా పాడు చేస్తాను.
\q1
\v 12 ఈ సంగతిని అర్థం చేసుకోగల జ్ఞానం ఎవరికుంది? దాన్ని వివరించడానికి యెహోవా ఎవరికి తన నోటి మాట ఇచ్చాడు?
\q1 ఎవరూ ప్రయాణం చేయలేకుండా ఆ దేశం ఎందుకు ఎడారిలా మారిపోయింది?
\p
\s5
\v 13 యెహోవా చెప్పేదేమంటే, <<దానికి కారణం, వారు నా మాట వినలేదు, నా ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా తోసిపుచ్చారు.
\v 14 తమ హృదయంలోని మూర్ఖత్వం ప్రకారం చేశారు. తమ పూర్వికుల దగ్గర నేర్చుకున్నట్టు బయలు దేవుళ్ళను పూజించారు. అందుకే వారి దేశం పాడైపోయింది.>>
\p
\s5
\v 15 సైన్యాల ప్రభువు, ఇశ్రాయేలు దేవుడు అయిన యెహోవా చెప్పేదేమంటే, <<నేను ఈ ప్రజలు చేదుకూరలు తినేలా చేస్తాను. విషజలం తాగిస్తాను.
\v 16 వారు గానీ, వారి పూర్వికులు గానీ ఎరగని జాతి ప్రజల్లోకి వారిని చెదరగొడతాను. వారు పూర్తిగా నాశనం అయ్యేవరకూ వారి పైకి ఖడ్గం పంపుతాను.>>
\q1
\s5
\v 17 సేనల ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే <<ఆలోచించండి. రోదనం చేసే స్త్రీలను వెతికి వారిని పిలిపించండి.
\q1 విలాపంలో నైపుణ్యం గల స్త్రీలను వెదికి వారిని పిలవండి.
\q1
\v 18 మనం కన్నీళ్లు విడిచేలా, మన కనురెప్పల నుండి నీళ్లు కారిపోయేలా వారు త్వరగా వచ్చి రోదన ధ్వని చేయమని చెప్పండి.>>
\q1
\s5
\v 19 <<మనం నాశనమయ్యాం, చాలా అవమానానికి గురయ్యాం. వారు మన ఇళ్ళను కూలదోశారు.
\q1 మనం దేశం విడిచి వెళ్ళాల్సివచ్చింది>> అని సీయోనులో రోదన ధ్వని వినబడుతున్నది.
\q1
\v 20 స్త్రీలారా, యెహోవా మాట వినండి. ఆయన నోటి నుండి వచ్చే సందేశాలను జాగ్రత్తగా ఆలకించండి.
\q1 మీ కూతుళ్ళకు విలాప గీతం నేర్పండి. ఒకరికొకరు అంగలార్పు గీతాలు నేర్పండి.
\q1
\s5
\v 21 మరణం మన ఇంటి కిటికీల గుండా ఎక్కుతూ ఉంది. మన రాజభవనాల్లో అడుగు పెడుతూ ఉంది.
\q1 అది వీధుల్లో పసిపిల్లలు, రాజమార్గాల్లో యువకులు లేకుండా వారిని నాశనం చేస్తున్నది.
\q1
\v 22 యెహోవా చెప్పేదేమంటే <<పొలాల్లో పేడ పడేలా, కోతపనివారి వెనక పనలు పడేలా మనుషుల శవాలు కూలుతాయి.
\q1 వాటిని పోగు చేయడానికి ఎవరూ ఉండరు.>>
\q1
\s5
\v 23 యెహోవా చెప్పేదేమంటే <<తెలివైనవాడు తన తెలివిని బట్టీ బలవంతుడు తన బలాన్ని బట్టీ గర్వించకూడదు. అలాగే ధనవంతుడు తన ఆస్తిని బట్టి గర్వించకూడదు.
\q1
\v 24 దేనిలో అతిశయించాలంటే, ఈ భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయాలు జరిగిస్తున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకోవడంలోనే అతిశయించాలి.
\q1 అలాటి వాటిలోనే నేను ఆనందిస్తాను.>>
\p
\s5
\v 25 యెహోవా చెప్పేదేమంటే <<అన్యజాతి ప్రజలు సున్నతి పొందలేదు. ఇశ్రాయేలీయులేమో హృదయ సంబంధమైన సున్నతి పొందలేదు. కాబట్టి రాబోయే రోజుల్లో సున్నతి పొందని వారినీ, పొందిన వారినీ కలిపి శిక్షిస్తాను.
\v 26 అంటే ఐగుప్తు వారు, యూదులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఎడారిలో నివసిస్తూ తమ గడ్డాలు చెంపలపై గొరిగించుకునేవారు, వీరందరినీ నేను శిక్షిస్తాను.>>
\s5
\c 10
\s జీవం గల దేవుడు, విగ్రహాలు
\r 10:12-16; యిర్మీయా 51:15-19
\q1
\v 1 ఇశ్రాయేలు ప్రజలారా, యెహోవా మీ గురించి చెప్పే మాటలు వినండి.
\q1
\v 2 యెహోవా చెప్పేదేమంటే, అన్యజాతుల ప్రజల ఆచారాలు పాటించకండి.
\q1 వారు ఆకాశంలో కనబడే సూచనలకు భయపడతారు. కానీ మీరు మాత్రం భయపడవద్దు.
\q1
\s5
\v 3 ఆ ప్రజల ఆచారాలు నిష్ప్రయోజనం. ఒకడు అడవిలో చెట్టు నరకుతాడు, పనివాడు దాన్ని గొడ్డలితో చెక్కుతాడు.
\q1
\v 4 అప్పుడు వారు దానికి వెండి బంగారు వస్తువులు అలంకరిస్తారు. అది కదలకుండా ఉండేలా దానికి సుత్తితో మేకులు కొట్టి బిగిస్తారు.
\q1
\v 5 అవి దోస తోటల్లో దిష్టి బొమ్మల్లాగా నిలబడి ఉంటాయి. పలకవు, నడవలేవు కాబట్టి వాటిని ఎవరైనా మోయాలి.
\q1 అవి మీకు హాని చేయలేవు. కాబట్టి వాటికి భయపడకండి. వాటి వలన మంచి ఏమీ జరగదు.
\q1
\s5
\v 6 యెహోవా, నీలాంటివాడు ఎవరూ లేరు. నువ్వు గొప్పవాడివి. నీ బల ప్రభావాలను బట్టి నీ పేరు ఎంతో ఘనతకెక్కింది.
\q1
\v 7 లోక జాతులకు రాజువైన నీకు భయపడని వాడెవడు? ఆయా రాజ్యాల ప్రజల్లోని జ్ఞానులందరిలో నీవంటి వాడెవడూ లేడు. కాబట్టి మనుషులు నీలో భయభక్తులు నిలపాలి.
\q1
\s5
\v 8 వారంతా బుద్ధి హీనులు, అవివేకులు. చెక్కిన బొమ్మలను పూజించడం వలన వారికి కలిగే జ్ఞానం సున్నా.
\q1
\v 9 తర్షీషు నుండి రేకులుగా సాగగొట్టిన వెండినీ ఉఫాజ్ నుండి బంగారాన్నీ తెస్తారు.
\q1 అది కూలీల చేతి పని. ఆ విగ్రహాలకు నీలి, ఊదా రంగు వస్త్రాలు తొడిగారు. అవన్నీ వైపుణ్యం గల పనివారు చేసినవే.
\q1
\v 10 అయితే యెహోవాయే నిజమైన దేవుడు. ఆయనే సజీవుడైన దేవుడు, శాశ్వతమైన రాజు.
\q1 ఆయన కోపాన్ని చూస్తే భూమి కంపిస్తుంది. ఆయన కోపాన్ని రాజ్యాలు తట్టుకోలేవు.
\q1
\s5
\v 11 మీరు వారితో ఇలా చెప్పాలి. <<భూమ్యాకాశాలను సృష్టించని ఈ దేవుళ్ళు భూమి మీదా, ఆకాశం కిందా ఉండకుండా నశించిపోతారు.
\q1
\v 12 ఆయన తన బలంతో భూమిని సృష్టించాడు. తన జ్ఞానంతో ప్రపంచాన్ని స్థాపించాడు, తన తెలివితో ఆకాశాన్ని చక్కగా పరిచాడు.
\q1
\v 13 ఆయన స్వరం ఆకాశమండలంలో నీటి గర్జనలాగా వినిపిస్తుంది. భూదిగంతాల్లో నుండి ఆయన ఆవిరి మేఘాలు వచ్చేలా చేస్తాడు. వర్షంతో బాటు ఆయన మెరుపులు పుట్టిస్తాడు. తన గిడ్డంగుల నుండి గాలిని పంపిస్తాడు.
\q1
\s5
\v 14 ప్రతి మనిషీ తెలివిలేని మూర్ఖుడు. విగ్రహాలు పోతపోసే ప్రతివాడూ తాను చేసిన విగ్రహాన్నిబట్టి అవమానం పొందుతాడు. అతడు పోత పోసిన విగ్రహాలు నకిలీవి. వాటికి ప్రాణం లేదు.
\q1
\v 15 అవి ఉపయోగం లేనివి. అవన్నీ ఎగతాళి పనులు. వాటి మీద తీర్పు జరిగినప్పుడు అవి నశించి పోతాయి.
\q1
\v 16 యాకోబు వంశానికి వారసత్వంగా ఉన్నవాడు అలాంటి వాడు కాడు. ఆయన సమస్తాన్నీ నిర్మించేవాడు.
\q1 ఇశ్రాయేలు ప్రజలు ఆయన వారసత్వం. సేనల ప్రభువు అని ఆయనకు పేరు.
\s రాబోయే ఉపద్రవం
\q1
\s5
\v 17 ముట్టడిలో ఉన్న ప్రజలారా, దేశం విడిచి వెళ్ళడానికి నీ సామాను సర్దుకోండి.>>
\q1
\v 18 యెహోవా చేప్పేదేమంటే <<నేను ఈసారి ఈ దేశ నివాసులను బయటికి విసిరివేస్తాను.
\q1 వారు పట్టబడేలా చేసి నిస్పృహకు గురి చేస్తాను.>>
\q1
\s5
\v 19 అయ్యో, నా ఎముకలకు దెబ్బ తగిలి ఆ గాయం పుండుగా మారింది.
\q1 అయితే <<ఇది నాకు కలిగిన బాధ. నేను దీనిని సహించాల్సిందే>> అనుకుంటాను.
\q1
\v 20 నా గుడారం చిందర వందర అయ్యింది. నా డేరా తాళ్ళు అన్నీ తెగిపోయాయి. వారు నా పిల్లలను తీసుకెళ్ళిపోయారు. అందుకే వారు లేరు.
\q1 నా డేరా నిలబెట్టడానికి, వాటి తెరలు వేయడానికి నా దగ్గర ఎవరూ లేరు.
\q1
\s5
\v 21 కాపరులు మూర్ఖులై యెహోవాను అడగరు. కాబట్టి వారికి విజయం లేదు. వారి మందలన్నీ చెదరిపోతున్నాయి.
\q1
\v 22 అదిగో వినండి, వార్త రానే వచ్చింది, వారి రాక ధ్వని వినబడుతూ ఉంది. యూదా పట్టణాలను పాడు చేసి, వాటిని నక్కల నివాసంగా చేయడానికి ఉత్తరదేశం నుండి వస్తున్న గొప్ప అల్లరి ధ్వని వినబడుతూ ఉంది.
\q1
\s5
\v 23 యెహోవా, మనుషులు తమ మార్గాలను నిర్ణయించుకోవడం వారికి చేతకాదనీ, మంచిగా ప్రవర్తించడం వారి వశంలో లేదనీ నాకు తెలుసు.
\q1
\v 24 యెహోవా, నన్ను నీ న్యాయవిధిని బట్టి క్రమశిక్షణలో పెట్టు. అలా కాక నీ కోపాన్ని బట్టి శిక్షించావంటే నేను నాశనమైపోతాను.
\q1
\v 25 నిన్నెరగని అన్యజనాల మీదా నీ పేరున ప్రార్థించని వంశాల మీదా నీ కోపాన్ని కుమ్మరించు.
\q1 ఎందుకంటే వారు యాకోబు వంశాన్ని పూర్తిగా నిర్మూలం చేయడానికి మింగివేశారు. దాని నివాస స్థలాలను పాడు చేశారు.
\s5
\c 11
\s నిబంధన ఉల్లంఘన
\p
\v 1 యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు.
\v 2 <<మీరు ఈ నిబంధన మాటలు వినండి. యూదా ప్రజలతో, యెరూషలేము నివాసులతో ఇలా చెప్పు.
\s5
\v 3 ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పేదేమంటే, ఈ నిబంధన మాటలు వినని వాడు శాపానికి గురౌతాడు.
\v 4 ఐగుప్తుదేశం అనే ఆ ఇనప కొలిమిలో నుండి నేను మీ పూర్వికులను రప్పించిన రోజున నేను ఈ ఆజ్ఞ ఇచ్చాను, <నేను మీ పూర్వికులకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానని వారికి చేసిన ప్రమాణాన్ని నెరవేర్చేలా, మీరు నా వాక్యం విని నేను మీకిచ్చే ఆజ్ఞలను బట్టి ఈ నిబంధన వాక్యాలను అనుసరిస్తే మీరు నా ప్రజలుగా, నేను మీ దేవుడుగా ఉంటాను.> >>
\v 5 అందుకు నేను <<యెహోవా, అలాగే జరుగు గాక>> అన్నాను.
\p
\s5
\v 6 యెహోవా నాతో ఇలా చెప్పాడు. <<నువ్వు యూదా పట్టణాల్లో, యెరూషలేము వీధుల్లో ఈ మాటలు ప్రకటించు. <మీరు ఈ నిబంధన మాటలు విని వాటిని పాటించండి.>
\v 7 ఐగుప్తులో నుండి మీ పూర్వికులను రప్పించిన రోజు మొదలుకుని నేటివరకూ వారితో <నా మాట వినండి> అని నేను గట్టిగా, ఖండితంగా చెబుతూ వచ్చాను.
\v 8 అయినా వారు తమ దుష్టహృదయంతో, మూర్ఖులై నడుచుకుంటూ నామాట వినలేదు. ఈ నిబంధన మాటలన్నిటినీ అనుసరించి నడవమని చెప్పినా వారు వినలేదు కాబట్టి నేను ఆ నిబంధనలోని శాపాలన్నిటినీ వారి మీదికి రప్పిస్తాను.>>
\p
\s5
\v 9 యెహోవా నాతో ఇలా చెప్పాడు. <<యూదా ప్రజల్లో, యెరూషలేము నివాసుల్లో ఒక కుట్ర జరుగుతున్నట్టు కనిపిస్తున్నది.
\v 10 అదేమంటే, ఇశ్రాయేలు, యూదా వంశస్థులు నా మాటలు వినని తమ పూర్వీకుల దోషాలను కొనసాగించడానికి నిర్ణయించుకున్నారు. వారు అన్య దేవుళ్ళను పూజిస్తూ, వాటిని అనుసరిస్తూ వారి పూర్వికులతో నేను చేసిన నిబంధనను భంగం చేశారు.>>
\p
\s5
\v 11 కాబట్టి యెహోవా చెప్పేదేమంటే <<వారు తప్పించుకోలేని విపత్తును వారి మీదికి రప్పిస్తాను, వారు నన్ను ఎంత వేడుకున్నా నేను వినను.
\v 12 యూదా పట్టణాలు, యెరూషలేము ప్రజలు తాము ఎవరికైతే ధూపం వేస్తూ పూజిస్తున్నారో ఆ దేవుళ్ళకు విన్నవించుకుంటారుగానీ వారి ఆపదలో అవి వారిని ఏమాత్రం కాపాడలేవు.
\v 13 యూదా, నీ పట్టణాలు ఎన్ని ఉన్నాయో అన్ని దేవుళ్ళు నీకు ఉన్నారు కదా? యెరూషలేము ప్రజలారా, బయలు దేవతకు ధూపం వేయడానికి మీరు వీధి వీధినా అసహ్యమైన బలిపీఠాలు దానికి నిర్మించారు.
\q1
\s5
\v 14 కాబట్టి యిర్మీయా, నువ్వు ఈ ప్రజల కోసం ప్రార్థన చేయవద్దు. వారి పక్షంగా అంగలార్చవద్దు, వేడుకోవద్దు. వారు తమ విపత్తులో నాకు మొర పెట్టినపుడు నేను వినను.
\q1
\v 15 దుష్ట తలంపులు కలిగిన నా ప్రియమైన ప్రజలకు నా మందిరంతో పనేంటి?
\q1 బలుల కోసం నువ్వు మొక్కుకుని తెచ్చిన ప్రతిష్ఠితమైన మాంసం భుజించడం వలన నీకు ప్రయోజనం లేదు.
\q1 ఎందుకంటే నువ్వు చెడు జరిగించి సంతోషించావు.
\q1
\v 16 గతంలో యెహోవా నిన్ను, <ఫలభరితమైన పచ్చని ఒలీవ చెట్టు> అని పిలిచాడు.
\q1 అయితే ఆయన గొప్ప తుఫాను శబ్దంలా వినిపించే మంట రగిలించాడు. దాని కొమ్మలు విరిగిపోతాయి.
\p
\s5
\v 17 ఇశ్రాయేలు, యూదా ప్రజలు బయలు దేవతకు ధూపం వేసి నాకు కోపం పుట్టించారు. కాబట్టి మీకై మీరు చేసిన చెడు క్రియలను బట్టి మిమ్మల్ని నాటిన సేనల ప్రభువైన యెహోవా మీపైకి మహా విపత్తును పంపిస్తాడు.>>
\s యిర్మీయాని చంపడానికి పన్నాగం
\p
\s5
\v 18 దీనంతటినీ యెహోవా నాకు వెల్లడి చేసినప్పుడు నేను గ్రహించాను. ఆయన వారి పనులను నాకు కనపరిచాడు.
\v 19 అయితే నేను వధకు తీసుకుపోయే గొర్రెపిల్లలాగా ఉన్నాను. వారు నాకు వ్యతిరేకంగా చేసిన ఆలోచనలు నేను గ్రహించలేదు. <<మనం చెట్టును దాని ఫలంతో సహా కొట్టివేద్దాం రండి, అతని పేరు ఇకపై ఎవరూ జ్ఞాపకం చేసుకోకుండా అతనిని సజీవుల్లో నుండి నిర్మూలం చేద్దాం రండి>> అని వారు చెప్పుకున్నారు.
\q1
\v 20 సేనల ప్రభువైన యెహోవా న్యాయంగా తీర్పు తీరుస్తూ, హృదయాన్నీ, మనస్సునూ పరిశోధిస్తాడు.
\q1 యెహోవా, నా వ్యాజ్యాన్ని నీ ఎదుట పెట్టాను. వారి మీద నువ్వు చేసే ప్రతీకారం నేను చూస్తాను.
\p
\s5
\v 21 <<నువ్వు యెహోవా పేరున ప్రవచిస్తే, మా చేతిలో చనిపోతావు>> అని చెప్పే అనాతోతు ప్రజల గురించి సేనల ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే,
\v 22 <<నేను వారిని శిక్షించబోతున్నాను, వారి యువకులు ఖడ్గం చేత చనిపోతారు. వారి కొడుకులు, కూతుర్లు కరువు చేత చనిపోతారు.
\v 23 వారిలో ఎవరూ మిగలరు. ఎందుకంటే నేను వారికి తీర్పు తీర్చిన సంవత్సరం వారి పైకి మహా విపత్తును పంపిస్తాను.>>
\s5
\c 12
\s యిర్మీయా ప్రార్థన
\q1
\v 1 యెహోవా, నా వాదన నీకు వినిపించిన ప్రతిసారీ నువ్వు నీతిమంతుడవుగానే ఉంటావు.
\q1 అయినా నీ న్యాయ విధానాల గురించి నేను నీతో మాట్లాడతాను.
\q1 దుర్మార్గులు ఎందుకు వర్ధిల్లుతారు? అపనమ్మకస్తులు విజయాలు సాధిస్తారెందుకు?
\q1
\v 2 వారిని నువ్వే నాటావు, వారు వేరు పారి పెరిగి ఫలిస్తున్నారు.
\q1 వారి మాటలు చూస్తే నువ్వు వారికి దగ్గరగా ఉన్నావు గానీ వారి హృదయాలకు దూరమే.
\p
\s5
\v 3 యెహోవా, నీకు నేను బాగా తెలుసు. నన్ను చూస్తూ ఉన్నావు. నా హృదయాన్ని పరిశోధిస్తున్నావు.
\q1 వధ కోసం ఏర్పాటు చేసిన గొర్రెల్లాగా వారిని తీసుకుపో. వధ రోజు కోసం వారిని ప్రత్యేక పరచు.
\q1
\v 4 దాని ప్రజల చెడుతనం వలన భూమి ఎంతకాలం దుఃఖించాలి? దేశంలో గడ్డి ఎన్నాళ్లు ఎండిపోవాలి? జంతువులు, పక్షులు అంతరించి పోతున్నాయి.
\q1 వారేమో <<మనకేం జరగబోతున్నదో దేవునికి తెలియదు>> అని చెప్పుకుంటున్నారు.
\s దేవుని జవాబు
\q1
\s5
\v 5 యిర్మీయా, నువ్వు పాదచారులతో పరిగెత్తినప్పుడే నీవు అలసిపోయావు కదా, నువ్వు గుర్రపు రౌతులతో ఏ విధంగా పోటీ పడతావు?
\q1 నెమ్మదిగా ఉన్న ప్రాంతంలోనే నువ్వు నిశ్చింతగా ఉండగలవు. మరి యొర్దాను పరవళ్ళు తొక్కుతూ వస్తే నీవేం చేస్తావు?
\q1
\v 6 నీ సోదరులు, నీ తండ్రి ఇంటివారు సైతం నిన్ను మోసం చేసి అల్లరి చేశారు.
\q1 వారు నీతో ఎంత దయగా మాటలాడినా నువ్వు వారిని నమ్మవద్దు.
\q1
\s5
\v 7 నేను నా మందిరం విడిచిపెట్టాను. నా వారసత్వాన్ని వదిలేశాను.
\q1 నా ప్రియమైన ప్రజలను వారి శత్రువుల చేతికి అప్పగించాను.
\q1
\v 8 నా వారసత్వం నాకు అడవిలోని సింహంలాగా అయ్యింది. అది నా మీద గర్జిస్తూ ఉంది. కాబట్టి అది నాకు అసహ్యం అయ్యింది.
\q1
\v 9 నా వారసత్వం నాకు ఒక హైనా జంతువులాగా అయ్యింది. క్రూరపక్షులు దాని చుట్టూ గుమిగూడి ఉంటున్నాయి.
\q1 రండి, అవి తినడానికి అడవి జంతువులన్నిటినీ పోగు చేయండి.
\q1
\s5
\v 10 అనేకమంది కాపరులు నా ద్రాక్షతోటలను పాడు చేశారు. నా ఆస్తిని తొక్కివేశారు.
\q1 నాకిష్టమైన పొలాన్ని బీడుగా ఎడారిగా చేశారు.
\q1
\v 11 వారు దాన్ని పాడు చేయడం చూసి నేను దుఃఖిస్తున్నాను. దేశమంతా పాడైపోయింది. దాని గూర్చి బాధపడే వాడు ఒక్కడూ లేడు.
\q1
\s5
\v 12 వినాశకులు అరణ్యంలోని ఖాళీ స్థలాలన్నిటి మీదకీ వస్తున్నారు.
\q1 దేశం ఈ అంచు నుండి ఆ అంచు వరకూ యెహోవా ఖడ్గం తిరుగుతూ హతం చేస్తున్నది. నరులన్నవారికి ఏమీ భద్రత లేదు.
\q1
\v 13 ప్రజలు గోదుమలు చల్లారు కానీ ముండ్ల పంట కోస్తారు. పనిలో అలసిపోతున్నారు గాని ప్రయోజనం లేదు.
\q1 యెహోవా కోపం కారణంగా కోయడానికి పంట లేక మీరు సిగ్గుపడతారు.
\p
\s5
\v 14 యెహోవా చెప్పేదేమంటే <<నేను ఇశ్రాయేలు అనే నా ప్రజలకు ఇచ్చిన వారసత్వాన్ని ఆక్రమించుకొనే దుష్టులను వారి దేశాల నుండి పెళ్లగిస్తాను. వారి మధ్య నుండి యూదావారిని బయటికి తెస్తాను.
\v 15 ఆ యా దేశాలను పెళ్ళగించిన తరువాత నేను మళ్ళీ వారి మీద జాలిపడతాను. వారి వారసత్వాలకు, వారి దేశాలకు వారిని తిరిగి రప్పిస్తాను.>>
\p
\s5
\v 16 వారు <<బయలు తోడు>> అని ప్రమాణం చేయడం నా ప్రజలకు నేర్పారు. ఇప్పుడు వారు <<యెహోవా జీవం తోడు>> అని నా పేరున ప్రమాణం చేయడానికి నా ప్రజల విధానాలను జాగ్రత్తగా నేర్చుకుంటే వారు నా ప్రజల మధ్య అభివృద్ధి చెందుతారు.
\v 17 అయితే వారు నా మాట వినకపోతే నేను ఆ జనాలను వేరుతో సహా పెళ్ళగించి వారిని సంపూర్ణంగా నాశనం చేస్తాను. ఇదే యెహోవా వాక్కు.
\s5
\c 13
\s అవిసెనార నడికట్టు ఉపమానం
\p
\v 1 యెహోవా నాతో ఇలా చెప్పాడు. <<నువ్వు వెళ్లి అవిసెనార నడికట్టు కొనుక్కుని నీటితో తడపకుండానే నీ నడుముకు కట్టుకో.>>
\v 2 కాబట్టి యెహోవా మాట ప్రకారం నేను నడికట్టు ఒకటి కొనుక్కుని నడుముకు కట్టుకున్నాను.
\v 3 యెహోవా వాక్కు నాకు రెండోసారి ప్రత్యక్షమై ఇలా చెప్పాడు.
\v 4 <<నువ్వు కొని నడుముకు కట్టుకున్న నడికట్టును తీసి, యూఫ్రటీసు నది దగ్గరికి పోయి అక్కడ ఉన్న బండ సందులో దాన్ని దాచిపెట్టు.>>
\s5
\v 5 యెహోవా ఆజ్ఞాపించినట్టే నేను వెళ్ళి యూఫ్రటీసు దగ్గర దాన్ని దాచిపెట్టాను.
\p
\v 6 చాలా రోజుల తరవాత యెహోవా <<నువ్వు యూఫ్రటీసు దగ్గరికి వెళ్ళి, అక్కడ దాచిపెట్టిన నడికట్టు తీసుకో>> అని నాతో చెప్పాడు.
\v 7 నేను యూఫ్రటీసు దగ్గరికి పోయి తవ్వి దాచిపెట్టిన నడికట్టును తీసుకున్నాను. అయితే ఆ నడికట్టు చెడిపోయి ఉంది. అది దేనికీ పనికిరాకుండా ఉంది.
\p
\s5
\v 8 అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు.
\v 9 <<యెహోవా చెప్పేదేమంటే, ఇదే విధంగా యూదా ప్రజల గర్వాన్ని, యెరూషలేము ప్రజల మహా గర్వాన్ని నేను అణచివేస్తాను.
\v 10 ఈ ప్రజలు అన్య దేవుళ్ళను పూజిస్తూ, వాటికే నమస్కారం చేస్తున్నారు. వాటినే అనుసరిస్తూ, నా మాటలు వినకుండా తమ హృదయ కాఠిన్యం చొప్పున నడుస్తున్నారు. వారు ఎందుకూ పనికిరాని ఈ నడికట్టులాగా అవుతారు.
\v 11 వారిని నా ప్రజలుగా చేసుకుని వారి ద్వారా నాకు కీర్తి ప్రతిష్టలు, మహిమ కలగాలని నేను ఆశించాను. ఒకడు నడికట్టు కట్టుకున్నట్టుగా నేను ఇశ్రాయేలు, యూదా ప్రజలందరినీ నా నడుము చుట్టూ కట్టుకున్నాను గానీ, వారు నా మాటలు వినలేదు.>>
\s ద్రాక్ష తిత్తుల రసం ఉపమానం
\p
\s5
\v 12 కాబట్టి నువ్వు వారితో ఇలా చెప్పు. <<ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పేదేమంటే, ప్రతి ద్రాక్ష తిత్తీ రసంతో నిండి ఉండాలి.>> <<ద్రాక్ష తిత్తులు రసంతో నిండి ఉండాలి అని మాకు తెలియదా>> అని వారు నీతో అంటే, వారితో ఈ మాటలు చెప్పు.
\v 13 <<యెహోవా చెప్పేదేమంటే, ఈ దేశ ప్రజలందరినీ, అంటే, దావీదు సింహాసనం మీద కూర్చునే రాజులను, యాజకులను, ప్రవక్తలను, యెరూషలేము ప్రజలను, అందరినీ నేను మత్తులో మునిగేలా చేయబోతున్నాను.
\v 14 అప్పుడు నేను తండ్రులూ కొడుకులూ అందరూ కూలిపోయి ఒకడి మీద ఒకడు పడేలా చేస్తాను. వారి మీద జాలీ, కనికరమూ చూపకుండా వారిని నాశనం చేస్తాను.>>
\s చెరను గురించి హెచ్చరిక
\q1
\s5
\v 15 జాగ్రత్తగా వినండి. యెహోవా మాట్లాడుతున్నాడు, అహంకారం వద్దు.
\q1
\v 16 మీ దేవుడైన యెహోవా చీకటి కమ్మజేయక ముందే, చీకటిలో మీ కాళ్లు కొండలపై తొట్రుపడక ముందే, ఆయనను ఘనపరచి కొనియాడండి.
\q1 ఎందుకంటే మీరు వెలుగు కోసం చూస్తుండగా ఆయన దాన్ని గాఢాంధకారంగా మారుస్తాడు.
\q1
\v 17 ఇప్పుడు మీరు ఆ మాట వినకపోతే మీ గర్వం విషయంలో నేను రహస్యంగా విలపిస్తాను.
\q1 యెహోవా మందను చెరగా పట్టుకున్నందుకు నేను కన్నీరు మున్నీరుగా విలపిస్తాను.
\q1
\s5
\v 18 రాజుతో, రాజమాతతో ఇలా చెప్పు. <<మిమ్మల్ని మీరు తగ్గించుకుని, నేల మీద కూర్చోండి.
\q1 మీ తలపై కిరీటాలు, మీ అహంకారం, మీ మహిమ అన్నీ పడిపోయాయి.>>
\q1
\v 19 దక్షిణదేశ పట్టణాలు మూతబడి ఉన్నాయి. వాటిని తెరిచేవాడు ఉండడు. యూదా ప్రజలంతా చెరలోకి వెళ్ళిపోయారు.
\q1
\s5
\v 20 మీ కళ్ళెత్తి ఉత్తరం నుండి వస్తున్న వారిని చూడండి. నీకిచ్చిన సుందరమైన మంద ఎక్కడ ఉంది?
\q1
\v 21 వారిని నీకై నువ్వు స్నేహితులుగా చేసికొన్నావు. ఇప్పుడు వారినే ఆయన నీ మీద అధిపతులుగా నియమిస్తే నీవేం చేస్తావు?
\q1 ప్రసవించే స్త్రీ పడే వేదన నీకు కలుగుతుంది కదా?
\q1
\s5
\v 22 <<ఇవన్నీ నాకెందుకు జరుగుతున్నాయి?>> అని నీ మనస్సులో అనుకోవచ్చు.
\q1 నువ్వు చేసిన విస్తారమైన దోషాలే దానికి కారణం. అందుకే నీ వస్త్రాలు తీసివేయడం, నీపై అత్యాచారం చేయడం జరుగుతుంది.
\q1
\v 23 కూషు దేశ ప్రజలు తమ చర్మపు రంగు మాపుకోగలరా? చిరుతపులి తన మచ్చలను మార్చుకోగలదా?
\q1 అదే గనుక సాధ్యమైతే చెడు చేయడానికి అలవాటు పడిన మీకు మంచి చేయడం సాధ్యమౌతుంది.
\q1
\v 24 కాబట్టి అడవిగాలికి పొట్టు ఎగిరిపోయినట్టు నేను వారిని చెదరగొడతాను.
\q1
\s5
\v 25 మీరు నన్ను మరచిపోయి మోసాన్ని నమ్ముకున్నారు కాబట్టి అదే మీ వంతుగా నేను కొలిచి ఇచ్చాను, అని యెహోవా చెబుతున్నాడు.
\q1
\v 26 కాబట్టి మీకు సిగ్గు కలిగేలా నేను మీ బట్టల అంచులను లేపి మీ ముఖం మీద పడేలా చేస్తాను.
\q1
\v 27 నీ వ్యభిచారం, కామంతో కూడిన నీ సకిలింపులు నీ జార కార్యాలు నాకు తెలుసు.
\q1 పొలాల్లోని ఉన్నత స్థలాల్లో నీవు చేసిన అసహ్యమైన కార్యాలు నాకు కనబడుతున్నాయి.
\q1 యెరూషలేమా, నీకు శ్రమ. నిన్ను నువ్వు పవిత్ర పరచుకోవడం లేదు. ఇలా ఎంత కాలం కొనసాగుతుంది?
\s5
\c 14
\s కరువు, దేవుని సందేశం
\p
\v 1 కరువు గురించి యెహోవా యిర్మీయాకు ఇలా చెప్పాడు,
\q1
\v 2 <<యూదా రోదించాలి. దాని ద్వారాలు పడిపోవాలి. వాళ్ళు భూమి కోసం ఏడుస్తున్నారు. యెరూషలేము కోసం వాళ్ళు చేస్తున్న రోదన పైకి వెళ్తూ ఉంది.
\q1
\v 3 వాళ్ళ నాయకులు తమ పనివాళ్ళను నీళ్ల కోసం పంపుతారు. వాళ్ళు బావుల దగ్గరికి పోతే నీళ్లుండవు. ఖాళీ కుండలతో వాళ్ళు తిరిగి వస్తారు. సిగ్గుతో అవమానంతో తమ తలలు కప్పుకుంటారు.
\q1
\s5
\v 4 దేశంలో వాన రాకపోవడంతో నేల బీటలు వారింది. రైతులు సిగ్గుతో తమ తలలు కప్పుకుంటున్నారు.
\q1
\v 5 గడ్డి లేకపోవడంతో లేడి కూడా తన పిల్లలను పొలాల్లో వదిలేస్తున్నది.
\q1
\v 6 అడవి గాడిదలు చెట్లులేని మెట్టల మీద నిలబడి నక్కల్లాగా రొప్పుతున్నాయి. మేత లేక వాటి కళ్ళు పీక్కుపోతున్నాయి.>>
\q1
\s5
\v 7 యెహోవా, మా అపరాధాలు మా మీద నేరారోపణ చేస్తున్నప్పటికీ, నీ నామం కోసం కార్యం జరిగించు. చాలాసార్లు దారి తప్పాం. నీకు విరోధంగా మేము పాపం చేశాం.
\q1
\v 8 ఇశ్రాయేలు ఆశ్రయమా! కష్టకాలంలో వారిని రక్షించేవాడివి. దేశంలో నువ్వెందుకు పరాయివాడిగా ఉన్నావు? ఒక్క రాత్రే బస చేసే బాటసారిలా ఎందుకు ఉన్నావు?
\q1
\v 9 కలవరపడిన వాడిలా, ఎవరినీ కాపాడలేని శూరునిలా నువ్వెందుకున్నావు? యెహోవా, నువ్వు మా మధ్య ఉన్నావు! నీ పేరు మా మీద నిలిచి ఉంది. మమ్మల్ని విడిచి పెట్టవద్దు.
\q
\s5
\v 10 యెహోవా ఈ ప్రజలను గురించి ఇలా చెబుతున్నాడు. <<తిరుగులాడడం అంటే వాళ్ళకెంతో ఇష్టం. వాళ్ళు తమ కాళ్లను అదుపులో ఉంచుకోవడం లేదు.>> యెహోవా వారిపట్ల ఇష్టంగా లేడు. ఇప్పుడు ఆయన వారి అక్రమాన్ని గుర్తుకు తెచ్చుకుని వారి పాపాలను బట్టి వారిని శిక్షించాడు.
\q
\v 11 అప్పుడు యెహోవా నాతో ఇలా చెప్పాడు. <<ఈ ప్రజల మేలు కోసం ప్రార్థన చేయవద్దు.
\q
\v 12 వాళ్ళు ఉపవాసమున్నప్పటికీ నేను వారి మొర వినను. వాళ్ళు దహనబలులూ నైవేద్యాలూ అర్పించినా నేను వాటిని అంగీకరించను. కత్తితో, కరువుతో, అంటువ్యాధులతో వారిని నాశనం చేస్తాను.>>
\p
\s5
\v 13 అందుకు నేనిలా అన్నాను<<అయ్యో, యెహోవా ప్రభూ! <మీరు కత్తి చూడరు. మీకు కరువు రాదు. ఈ స్థలంలో నేను స్థిరమైన భద్రత మీకిస్తాను> అని ప్రవక్తలు వాళ్ళతో ఇలా చెబుతున్నారు.>>
\p
\v 14 అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నాడు. <<ప్రవక్తలు నా పేరున అబద్ధాలు ప్రకటిస్తున్నారు. నేను వాళ్ళను పంపలేదు. వాళ్ళకు ఎలాంటి ఆజ్ఞా ఇవ్వలేదు. వాళ్ళతో మాట్లాడలేదు. అయితే వాళ్ళ హృదయాల్లోనుంచి మోసపూరితమైన దర్శనాలూ పనికిమాలిన, మోసపు శకునాలూ వస్తున్నాయి. వీటినే వాళ్ళు మీకు ప్రవచిస్తున్నారు.
\p
\s5
\v 15 అందుచేత యెహోవా అనే నేను చెబుతున్నది ఏమంటే, నేను వాళ్ళను పంపకపోయినా, నా పేరును బట్టి కత్తిగానీ కరువుగానీ ఈ దేశంలోకి రాదు అని చెబుతున్నారు. ఆ ప్రవక్తలు కత్తితో కరువుతో నాశనమవుతారు.>>
\p
\v 16 <<వాళ్ళెవరితో అలాంటి ప్రవచనాలు చెబుతారో ఆ ప్రజలు కరువుకూ కత్తికీ గురై, యెరూషలేము వీధుల్లో కూలుతారు. నేను వాళ్ళ దుర్మార్గాన్ని వాళ్ళ మీదికి రప్పిస్తాను. వాళ్ళనూ వాళ్ళ భార్యలనూ వాళ్ళ కొడుకులనూ కూతుళ్ళనూ పాతిపెట్టడానికి ఎవడూ ఉండడు.>>
\q
\s5
\v 17 <<నువ్వు వాళ్ళతో ఈ మాటలు చెప్పు, కన్య అయిన నా ప్రజల కూతురు ఘోరంగా పతనమవుతుంది. అది మానని పెద్ద గాయం పాలవుతుంది. రాత్రి, పగలు నా కళ్ళ నుంచి కన్నీళ్లు కారనివ్వండి.
\q
\v 18 పొలంలోకి వెళ్లి చూసినప్పుడు కత్తితో చచ్చిన వాళ్ళు కనిపిస్తున్నారు. పట్టణంలోకి వెళ్లి చూస్తే కరువుతో అలమటించే వాళ్ళు కనిపిస్తున్నారు. ప్రవక్తలూ యాజకులూ తెలివిలేక తిరుగుతున్నారు.>>
\q
\s5
\v 19 నువ్వు యూదాను పూర్తిగా వదిలేశావా? సీయోను అంటే నీకు అసహ్యమా? మేము కోలుకోలేనంతగా నువ్వు మమ్మల్ని ఎందుకు కొట్టావు? మేము శాంతి కోసం ఆశించాం గానీ మేలు కలిగించేది ఏదీ రాలేదు. కోలుకునేలా ఎదురు చూశాం గానీ చుట్టూ భయానక దృశ్యాలే.
\q
\v 20 యెహోవా, మేము నీకు విరోధంగా పాపం చేశాం. మా దుర్మార్గాన్నీ మా పూర్వీకుల దోషాన్నీ మేము ఒప్పుకుంటున్నాం.
\q
\s5
\v 21 నీ పేరును బట్టి మిమ్మల్ని గౌరవించేలా మమ్మల్ని తోసివేయవద్దు. మాతో నువ్వు చేసిన నిబంధనను గుర్తు చేసుకో. దాన్ని భంగం చేయవద్దు.
\q
\v 22 ఇతర రాజ్యాలు పెట్టుకున్న విగ్రహాలు ఆకాశం నుంచి వాన కురిపిస్తాయా? మా యెహోవా దేవా, ఇలా చేసేది నువ్వే గదా! ఇవన్నీ నువ్వే చేస్తున్నావు, నీ కోసమే మేము ఆశాభావంతో ఉన్నాము.
\s5
\c 15
\p
\v 1 అప్పుడు యెహోవా నాకిలా చెప్పాడు. <<మోషే అయినా సమూయేలైనా నా ఎదుట నిలబడినప్పటికీ ఈ ప్రజలను అంగీకరించడానికి నాకు మనస్సు ఒప్పుకోదు. నా దగ్గర నుంచి వాళ్ళను వెళ్లగొట్టు. వాళ్ళను వెళ్లనియ్యి.>>
\q1
\v 2 <<మేమెక్కడికి వెళ్ళాలి?>> అని వాళ్ళు నిన్నడితే నువ్వు వాళ్ళతో ఇలా చెప్పు. <<యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, చావు కోసం ఏర్పాటైన వాళ్ళు చావుకూ, కత్తి కోసం ఏర్పాటైన వాళ్ళు కత్తికీ, కరువు కోసం ఏర్పాటైన వాళ్ళు కరువుకూ, చెరకు ఏర్పాటైన వాళ్ళు చెరకూ వెళ్ళాలి.
\q1
\s5
\v 3 చంపడానికి కత్తినీ, చీల్చడానికి కుక్కలనూ, తినివేయడానికీ నాశనం చేయడానికీ ఆకాశ పక్షులనూ, భూమి మీద తిరిగే మృగాలనూ పంపిస్తాను. ఈ నాలుగు రకాల బాధలు వారికి వస్తాయి.>> ఇది యెహోవా వాక్కు.
\q1
\v 4 యూదా రాజు హిజ్కియా కొడుకు మనష్షే యెరూషలేములో చేసిన పనులను బట్టి భూమి మీద ఉన్న రాజ్యాలన్నిటికీ భీతి కలిగేలా చేస్తాను.
\q1
\s5
\v 5 యెరూషలేమా, నిన్ను ఎవరు కనికరిస్తారు? నీ గురించి ఎవరు ఏడుస్తారు? నీ బాగోగులు ఎవరు పట్టించుకుంటారు? ఇది యెహోవా వాక్కు.
\q1
\v 6 నువ్వు నన్ను వదిలేసావు. నా దగ్గర నుంచి వెళ్ళిపోయావు. కాబట్టి నా చేత్తో నిన్ను కొడతాను. నిన్ను నాశనం చేస్తాను. నీ మీద జాలిపడి విసిగిపోయాను.
\q1
\v 7 దేశం గుమ్మాల్లో నేను వారిని చేటతో తూర్పారపడతాను. నా ప్రజలు తమ పద్ధతులను విడిచి నా దగ్గరికి రావడం లేదు కాబట్టి వాళ్ళను నాశనం చేస్తాను. వారికి వియోగం కలిగిస్తాను.
\q1
\s5
\v 8 వారి వితంతువుల సంఖ్య సముద్రతీరాన ఇసుక కంటే ఎక్కువయ్యేలా చేస్తాను. నేను మధ్యాహ్నం సమయంలో యువకుల తల్లుల మీదికి నాశనం చేసేవాణ్ణి పంపిస్తాను. వారి మీదికి భయం, దిగ్భ్రాంతి ఆకస్మాత్తుగా రప్పిస్తాను.
\q1
\v 9 ఏడుగురిని కనిన స్త్రీ నీరసించి ప్రాణం విడుస్తుంది. పగటి సమయం ఇంకా ఉండగానే ఆమె పొద్దు ముగుస్తుంది. ఆమె సిగ్గుతో అవమానం పాలవుతుంది. మిగిలిన వారిని తమ శత్రువుల ఎదుట కత్తిపాలు చేస్తాను. ఇది యెహోవా వాక్కు.
\q1
\s5
\v 10 అయ్యో నాకెంతో బాధ! అమ్మా! దేశస్థులందరితో కలహాలు పెట్టుకునేవాడిగా నన్ను కన్నావు. నేనెవరికీ అప్పివ్వలేదు, అప్పు తీసుకోలేదు. అయినా వారంతా నన్ను దూషిస్తున్నారు.
\q1
\v 11 అందుకు యెహోవా ఇలా చెప్పాడు. <<మంచి కోసం నేను నిన్ను తప్పించనా? తప్పకుండా విపత్తులో బాధలో నీ శత్రువులు నీ సాయాన్ని అర్థించేలా చేస్తాను.
\q1
\v 12 ఇనుమును, మరి ముఖ్యంగా ఉత్తర దేశం నుంచి వచ్చిన కంచు కలిసిన ఇనుమును ఎవడైనా విరగ గొట్టగలడా?
\q1
\s5
\v 13 మీ ప్రాంతాలన్నిటిలో మీరు చేసే పాపాలన్నిటికీ మీ సంపదనూ మీ విలువైన వస్తువులనూ నేను దోపుడు సొమ్ముగా అప్పగిస్తాను.
\q1
\v 14 నువ్వెరుగని దేశంలో మీ శత్రువులకు మిమ్మల్ని బానిసలుగా చేస్తాను. నా కోపం మంటల్లాగా రగులుకుంది. అది మిమ్మల్ని దహిస్తుంది.
\q1
\s5
\v 15 యెహోవా, నా బాధ నీకే తెలుసు. నన్ను గుర్తు చేసుకుని సాయం చెయ్యి. నన్ను బాధించే వారి మీద నా కోసం ప్రతీకారం చెయ్యి. నువ్వు ఓర్పు వహించి నన్ను తీసుకుపోవద్దు. నీ కోసమే నేను నింద భరిస్తున్నానని గుర్తు చేసుకో.
\q1
\v 16 సేనల ప్రభువైన యెహోవా, నేను నీ పేరు పెట్టుకున్నాను. నీ మాటలు నాకు దొరికితే నేను వాటిని తిన్నాను. నీ మాటలు నాకెంతో సంతోషంగా హృదయానందంగా ఉన్నాయి.
\q1
\s5
\v 17 వేడుక చేసుకునే వాళ్ళ గుంపులో నేను కూర్చుని సంతోషించలేదు. నీ బలమైన చెయ్యి నా మీద ఉంది. కడుపుమంటతో నువ్వు నన్ను నింపావు. కాబట్టి, నేను ఒంటరిగా కూర్చున్నాను.
\q1
\v 18 నా బాధకు అంతం లేదెందుకు? నా గాయం ఎందుకు ఘోరమై నయం కాకుండా ఉంది? నువ్వు నాకు మోసజలం లాగా, ఇంకిపోయే ఊటలాగా ఉంటావా?>>
\q1
\s5
\v 19 అప్పుడు యెహోవా ఇలా చెప్పాడు. <<యిర్మీయా, నువ్వు నావైపు తిరిగితే నువ్వు నా సన్నిధిని నిలిచేలా నేను నిన్ను తిరిగి రప్పిస్తాను. యోగ్యమైన వాటిలో నుంచి పనికిమాలిన వాటిని నువ్వు తీసేస్తే నా నోటిలాగా నువ్వుంటావు. ప్రజలు నీవైపుకు తిరుగుతారు. అయితే నువ్వు వారి వైపుకు తిరగకూడదు.
\q1
\v 20 నేను నిన్ను ఈ ప్రజలకు అభేధ్యమైన కంచుకోటగా చేస్తాను. వాళ్ళు నీ మీద యుద్ధం చేస్తారు గాని నిన్ను గెలవలేరు. నిన్ను రక్షించడానికి, నిన్ను విడిపించడానికి నేను నీకు తోడై ఉంటాను. ఇది యెహోవా వాక్కు.
\q1
\v 21 నేను నిన్ను దుర్మార్గుల చేతిలోనుంచి విడిపిస్తాను. నిరంకుశుల బారినుంచి నిన్ను విమోచిస్తాను.>>
\s5
\c 16
\s శిక్ష - వాగ్దానం
\p
\v 1 యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు,
\q1
\v 2 <<నువ్వు పెళ్లి చేసుకోవద్దు. ఈ స్థలంలో నీ కోసం కొడుకులనుగానీ కూతుళ్ళను గానీ కనొద్దు.>>
\q1
\v 3 ఈ స్థలంలో పుట్టే కొడుకుల గురించి కూతుళ్ళ గురించి, వాళ్ళను కనిన తల్లులను గురించి, ఈ దేశంలో వాళ్ళను కనిన తండ్రులను గురించి యెహోవా ఇలా చెబుతున్నాడు.
\q1
\v 4 <<వాళ్ళు ఘోరమైన చావు చస్తారు. వాళ్ళను గురించి ఎవ్వరూ ఏడవరు. వాళ్ళను పాతిపెట్టరు. వాళ్ళు భూమి మీద పెంటకుప్పలాగా పడి ఉంటారు. వాళ్ళు కత్తితో, కరువుతో నశిస్తారు. వాళ్ళ శవాలు రాబందులకూ భూజంతువులకూ ఆహారంగా ఉంటాయి.>>
\q1
\s5
\v 5 యెహోవా ఇలా చెబుతున్నాడు. <<నేను ఈ ప్రజలకు నా శాంతి, నా దయ, నా వాత్సల్యం తీసివేశాను, కాబట్టి విలపించే వాళ్ళ ఇంట్లోకి నువ్వు వెళ్లొద్దు. వాళ్ళను గురించి విలపించడానికి వెళ్ళవద్దు. ఎవరినీ ఓదార్చడానికి వెళ్ళవద్దు.>> ఇది యెహోవా వాక్కు.
\q1
\v 6 ఈ దేశంలో గొప్పవాళ్ళు, సామాన్యులు అందరూ చస్తారు. వాళ్ళను ఎవ్వరూ పాతిపెట్టరు. వాళ్ళ గురించి ఎవరూ ఏడవరు. తమను తాము గాయపరచుకోరు. తలవెంట్రుకలు కత్తిరించుకోరు.
\q1
\s5
\v 7 చచ్చినవారి గురించి ప్రజలను ఓదార్చడానికి వారితో కలిసి తినే వాళ్ళెవరూ ఉండరు. ఒకరి నాన్న గానీ అమ్మ గానీ చనిపోతే కూడా ఎవరూ వారిని ఓదార్చేలా తాగడానికి ఏమీ ఇవ్వరు.
\q1
\v 8 విందు జరిగే ఇంట్లోకి నువ్వు వెళ్లొద్దు. వారితో కూర్చుని తిని తాగొద్దు.
\q1
\v 9 ఇశ్రాయేలు దేవుడు, సేనల ప్రభువు యెహోవా ఇలా చెబుతున్నాడు. <<మీ కళ్ళ ముందే మీ రోజుల్లోనే ఇక్కడే సంతోష ధ్వనినీ ఉత్సవ ధ్వనినీ పెళ్ళి కొడుకు, పెళ్లి కూతురు స్వరాలనూ ఆపబోతున్నాను.>>
\q1
\s5
\v 10 నువ్వు ఈ మాటలన్నీ ఈ ప్రజలకు తెలియచేసిన తరువాత, వారు <<యెహోవా మాకెందుకు ఈ ఘోర విపత్తు నిర్ణయించాడు? మా దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా మేము చేసిన దోషం, పాపం ఏమిటి?>> అని నిన్ను అడుగుతారు.
\q1
\v 11 అప్పుడు నువ్వు వారితో ఇలా చెప్పు. <<యెహోవా ఈ మాట చెబుతున్నాడు. మీ పూర్వీకులు నన్ను విడిచి వేరే దేవుళ్ళను అనుసరించి పూజించి వాటికి మొక్కారు. వాళ్ళు నన్ను వదిలేసి నా ధర్మశాస్త్రాన్ని పాటించలేదు.
\q1
\s5
\v 12 వినండి. మీరంతా నా మాట వినకుండా మీ చెడ్డ హృదయ కాఠిన్యం ప్రకారం నడుచుకుంటున్నారు. మీరు మీ పూర్వీకుల కంటే మరి ఎక్కువ దుర్మార్గం చేశారు.
\q1
\v 13 కాబట్టి నేను మీ పట్ల ఏమాత్రం దయ చూపను. ఈ దేశం నుంచి మీకు గానీ మీ పూర్వీకులకు గానీ తెలియని దేశంలోకి ఇక్కడ నుంచి మిమ్మల్ని విసిరివేస్తాను. అక్కడ మీరు రాత్రింబగళ్ళు ఇతర దేవుళ్ళను పూజిస్తారు.>>
\q1
\s5
\v 14 యెహోవా తెలియజేసేదేమిటంటే <<నేను వారి పూర్వీకులకు ఇచ్చిన దేశానికి వారిని మళ్ళీ రప్పిస్తాను. కాబట్టి రాబోయే రోజుల్లో <ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీయులను రప్పించిన యెహోవా జీవం తోడు> అని ఇకమీదట అనరు.
\q1
\v 15 కానీ <ఉత్తరదేశంలో నుంచి ఆయన వారిని తరిమిన దేశాలన్నిటిలో నుంచి ఇశ్రాయేలీయులను రప్పించిన యెహోవా జీవం తోడు> అని ప్రజలు ప్రమాణం చేస్తారు.>>
\q1
\s5
\v 16 ఇదే యెహోవా వాక్కు. <<వాళ్ళను పట్టుకోడానికి నేను చాలామంది జాలరులను పిలిపిస్తాను. తరువాత ప్రతి పర్వతం మీద నుంచి ప్రతి కొండ మీద నుంచి మెట్టల సందుల్లోనుంచి వారిని వేటాడి తోలివేయడానికి చాలామంది వేటగాళ్ళను పిలిపిస్తాను.
\q1
\v 17 ఎందుకంటే వారు వెళ్ళిన దారులన్నిటి మీద నా దృష్టి ఉంది. ఏదీ నాకు కనిపించకుండా పోలేదు. వారి దోషం నా కళ్ళకు తేటతెల్లమే.
\q1
\v 18 వాళ్ళు తమ నీచమైన విగ్రహాలతో నా సొత్తు నింపారు. నా దేశాన్ని అపవిత్రపరచారు. కాబట్టి నేను మొదట వారి దోషాన్ని బట్టి, వారి పాపాన్ని బట్టి రెండంతలుగా వారికి ప్రతీకారం చేస్తాను.>>
\q1
\s5
\v 19 యెహోవా, నువ్వే నా బలం. నా దుర్గం. దురవస్థలో ఆశ్రయంగా ఉన్నావు. ప్రపంచమంతటి నుంచి రాజ్యాలు నీ దగ్గరికి వచ్చి <<మా పూర్వీకులు, వ్యర్ధాన్ని
\f +
\fr 16:19
\fq వ్యర్ధాన్ని
\ft నీచమైన విగ్రహాలు
\f* స్వతంత్రించుకున్నారు. అవి వట్టివి విగ్రహాలు. అవి పనికిమాలినవి>> అని చెబుతారు.
\q1
\v 20 మనుషులు తమకు దేవుళ్ళను కల్పించుకుంటారా? అయినా వారు దేవుళ్ళు కారు.
\q1
\v 21 కాబట్టి <<నా పేరు యెహోవా>> అని వారు తెలుసుకునేలా నేను ఈసారి వారికి నేర్పిస్తాను. నా బలం, నా శౌర్యం ఎంతటివో వారికి తెలియజేస్తాను.
\s5
\c 17
\q1
\v 1 యూదా పాపం వజ్రపు కొన ఉన్న ఇనుప కలంతో రాసి ఉంది. అది వారి హృదయాలు అనే పలకల మీద, మీ బలిపీఠాల కొమ్ముల మీద చెక్కి ఉంది.
\q1
\v 2 వారి ప్రజలకు ఎత్తయిన కొండల మీదున్న తమ బలిపీఠాలూ పచ్చని చెట్ల కిందున్న అషేరా దేవతా స్థంభాలూ గుర్తే.
\q1
\s5
\v 3 సరిహద్దుల్లోని పర్వతాల మీదున్న వారి బలిపీఠాలు వారికి గుర్తే. నీ ఆస్తిని, నీ నిధులన్నిటిని దోపుడు సొమ్ముగా నేనప్పగిస్తాను. మీ పాపం మీ దేశమంతా ఉంది.
\q1
\v 4 నేను నీకిచ్చిన స్వాస్థ్యాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. మీరు నా కోపాగ్ని రగులబెట్టారు. అది ఎప్పటికీ మండుతూ ఉంటుంది. నీవెరుగని దేశంలో నీ శత్రువులకు నువ్వు బానిసవవుతావు.
\q1
\s5
\v 5 యెహోవా ఇలా సెలవిస్తున్నాడు<<మనుషులను నమ్ముకునేవాడు శాపగ్రస్తుడు. శరీరులను తనకు బలంగా చేసుకుని తన హృదయాన్ని యెహోవా మీదనుంచి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు.
\q1
\v 6 వాడు ఎడారిలోని పొదలాగా ఉంటాడు. వాడికి ఏ మేలూ కనబడదు. వాడు ఎడారిలో రాళ్ళ మధ్య, చవిటి భూమిలో నిర్జన ప్రాంతంలో నివసిస్తాడు.
\q1
\s5
\v 7 అయితే యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. యెహోవా వాడికి ఆశ్రయంగా ఉంటాడు.
\q1
\v 8 వాడు నీళ్ళ ఊట దగ్గర చెట్టులాగా ఉంటాడు. దాని వేళ్ళు చుట్టుపక్కలా వ్యాపిస్తాయి. ఎండ వచ్చినా దానికి చలనం ఉండదు. దాని ఆకులు పచ్చగా ఉంటాయి. కరువు కాలాల్లో కంగారు పడదు. కాపు మానదు.
\q1
\s5
\v 9 హృదయం అన్నిటికంటే మోసకరం. దానికి వ్యాధి ఉంది. దాన్ని ఎవడు అర్థం చేసుకోగలడు?
\q1
\v 10 నేను యెహోవాను. హృదయాన్ని పరిశోధిస్తాను. మనసును పరీక్షిస్తాను. ప్రతి ఒక్కరికీ వారి ప్రవర్తన ప్రకారం వారి పనులకు తగ్గట్టుగా నేనిస్తాను.
\q1
\v 11 కౌజుపిట్ట తాను పెట్టని గుడ్లను పొదుగుతుంది. ఎవడైనా అక్రమంగా ఆస్తి సంపాదించుకోగలడు. అయితే తన ఉచ్ఛదశలో ఆ ఆస్తి వాణ్ణి వదిలేస్తుంది. చివరికి వాడు తెలివితక్కువవాడని తేలుతుంది.>>
\q1
\s5
\v 12 మొదటి నుంచి మా దేవాలయ స్థలం ఘనమైన సింహాసనం లాంటిది.
\q1
\v 13 యెహోవాయే ఇశ్రాయేలుకు ఆశాభావం. నిన్ను విడిచిపెట్టే వాళ్ళంతా సిగ్గుపాలవుతారు. దేశంలో నీనుంచి దూరమైన వాళ్ళతో సంబంధం తెగిపోతుంది. ఎందుకంటే వాళ్ళు యెహోవా అనే జీవజలాల ఊటను వదిలేశారు.
\q1
\v 14 యెహోవా, నన్ను బాగు చెయ్యి. నేను బాగుపడతాను! నన్ను కాపాడు. నేను క్షేమంగా ఉంటాను. నువ్వే నా స్తుతి పాట.
\q1
\s5
\v 15 వాళ్ళు <<యెహోవా వాక్కు ఎక్కడుంది? దాన్ని రానివ్వు>> అంటున్నారు.
\q1
\v 16 నేను నిన్ను అనుసరిస్తూ కాపరిగా ఉండడం మానలేదు. విపత్తుదినం కోసం నేను ఎదురు చూడలేదు. నా నోట నుంచి వచ్చిన మాటలు నీకు తెలుసు. అవి నీ దగ్గరనుంచే వచ్చాయి.
\q1
\s5
\v 17 నువ్వు నాకు భయకారణంగా ఉండవద్దు. విపత్తు రోజున నువ్వే నా ఆశ్రయం.
\q1
\v 18 నన్ను తరిమేవాళ్ళు సిగ్గుపడాలి, కానీ నన్ను సిగ్గుపడనివ్వొద్దు. నన్ను దిగులు పడనివ్వక వాళ్ళను దిగులు పడనివ్వు. వాళ్ళ మీదికి ఆపద రోజులు రప్పించు. రెట్టింపు నాశనం వాళ్ళ మీదికి రప్పించు.
\s విశ్రాంతి దినం గురించి హెచ్చరిక
\q1
\s5
\v 19 యెహోవా నాతో ఇలా చెప్పాడు. <<నువ్వు వెళ్లి యూదా రాజులు వచ్చిపోయే కోట గుమ్మంలో, ఆ తర్వాత యెరూషలేము ద్వారాలన్నిటిలో నిలబడు.
\q1
\v 20 వారితో ఇలా చెప్పు, యూదా రాజులారా! యూదా ప్రజలారా! యెరూషలేము నివాసులారా! ఈ ద్వారాలగుండా ప్రవేశించే మీరంతా యెహోవా మాట వినండి.
\q1
\s5
\v 21 యెహోవా చెప్పేదేమిటంటే, మీరు జాగ్రత్తగా ఉండి విశ్రాంతి దినాన బరువులు మోయవద్దు. యెరూషలేము ద్వారాలగుండా వాటిని తీసుకు రావద్దు.
\q1
\v 22 విశ్రాంతి దినాన మీ ఇళ్ళలోనుంచి బరువులు మోసుకుపోవద్దు. మరి ఏ పనీ చేయవద్దు. నేను మీ పూర్వీకులకు ఆజ్ఞాపించినట్టు విశ్రాంతి దినాన్ని పవిత్ర దినంగా ఆచరించండి.
\q1
\v 23 అయితే వాళ్ళు వినలేదు, శ్రద్ధ వహించలేదు. తలబిరుసుగా ఉండి నా మాట వినక, క్రమశిక్షణ పాటించలేదు.>>
\q1
\s5
\v 24 యెహోవా ఇలా చెప్పాడు. <<మీరు నామాట జాగ్రత్తగా విని, విశ్రాంతి దినాన మరే పనీ చేయక దాన్ని పవిత్ర దినంగా ఆచరించండి. విశ్రాంతి దినాన ఈ పట్టణపు ద్వారాల గుండా బరువులు తీసుకు రాకండి.
\q1
\v 25 అప్పుడు దావీదు సింహాసనమెక్కే రాజులూ అధిపతులూ ఈ నగర ద్వారాలగుండా ప్రవేశిస్తారు. రథాల మీదా గుర్రాల మీదా ఎక్కి తిరిగే రాజులూ అధిపతులూ యూదావారూ యెరూషలేము నివాసులూ వస్తారు. ఈ పట్టణం ఎప్పటికీ నిలిచి ఉంటుంది.
\q1
\s5
\v 26 ప్రజలు దహనబలులనూ బలులనూ నైవేద్యాలనూ ధూపద్రవ్యాలనూ స్తుతియాగ ద్రవ్యాలనూ నా మందిరానికి తెస్తారు. వాళ్ళు యూదా పట్టణాల్లో నుంచి, యెరూషలేము ప్రాంతాల్లో నుంచి, బెన్యామీను దేశంలో నుంచి, మైదాన ప్రాంతంలో నుంచి, కొండసీమ నుంచి, దక్షిణ ప్రదేశం
\f +
\fr 17:26
\fq దక్షిణ ప్రదేశం
\ft నెగెబు
\f* నుంచి వస్తారు.
\q1
\v 27 అయితే మీరు విశ్రాంతి దినాన్ని పవిత్రంగా ఆచరించి, ఆ దినాన బరువులు మోస్తూ యెరూషలేము ద్వారాల గుండా ప్రవేశించకూడదని నేను చెప్పిన మాట వినకపోతే నేను దాని ద్వారాల్లో మంట పెడతాను. అది రాజ భవనాలను కాల్చివేస్తుంది. దాన్ని ఆర్పడం ఎవరి తరమూ కాదు.>>
\s5
\c 18
\s కుమ్మరి, కుండ ఉపమానం
\p
\v 1 యెహోవా దగ్గర నుంచి యిర్మీయాకు వచ్చిన సందేశం.
\q1
\v 2 <<నువ్వు లేచి కుమ్మరి యింటికి వెళ్ళు. అక్కడ నా మాటలు నీకు చెబుతాను.>>
\q1
\v 3 నేను కుమ్మరి ఇంటికి వెళితే అతడు తన సారె మీద పని చేస్తున్నాడు.
\q1
\v 4 అయితే కుమ్మరి బంకమట్టితో చేస్తున్న కుండ అతని చేతిలో విడిపోయింది. అందుచేత అతడు తన మనస్సు మార్చుకుని తనకిష్టమైనట్టు మరో కుండ చేశాడు.
\p
\s5
\v 5 అప్పుడు యెహోవా నాతో ఇలా చెప్పాడు,
\q1
\v 6 <<ఇశ్రాయేలు ప్రజలారా! ఈ కుమ్మరి మట్టికి చేసినట్టు నేను మీకు చేయలేనా?>> ఇది యెహోవా వాక్కు. <<బంక మట్టి కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు ప్రజలారా, మీరు నా చేతిలో ఉన్నారు.
\q1
\v 7 దాన్ని వెళ్ళగొడతాననీ పడదోసి నాశనం చేస్తాననీ ఒక దేశం గురించి గానీ రాజ్యం గురించి గానీ నేను చెబుతున్నాను.
\q1
\v 8 ఏ రాజ్యం గురించి నేను చెప్పానో ఆ రాజ్యం దుర్మార్గం చేయడం మానితే నేను వారి మీదికి రప్పిస్తానని నేననుకున్న విపత్తు విషయం నేను జాలిపడి దాన్ని రప్పించను.
\q1
\s5
\v 9 ఒక దేశం గురించి గానీ రాజ్యం గురించి గానీ <నేను కడతాను, లేకపోతే సుస్థిరం చేస్తాను> అని చెప్పినప్పుడు,
\q1
\v 10 ఆ ప్రజలు నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేస్తే దానికి చేయదలచిన మేలు చేయకుండా ఆపుతాను.>>
\q1
\s5
\v 11 కాబట్టి నువ్వు వెళ్లి యూదావారితో యెరూషలేము నివాసులతో ఇలా చెప్పు. <<యెహోవా ఇలా చెబుతున్నాడు, మీ మీదికి విపత్తు రప్పించబోతున్నాను. మీకు విరోధంగా ఒక ఆలోచన చేస్తున్నాను. మీరంతా ఒక్కొక్కరు మీ దుర్మార్గాన్ని విడిచి మీ విధానాలనూ ప్రవర్తననూ మార్చుకోండి.>>
\q1
\v 12 అందుకు వాళ్ళు <<మేము తెగించాము. మేము మా సొంత ఆలోచనల ప్రకారం ప్రవర్తిస్తాం. మేము ఒక్కొక్కరం మా హృదయంలోని దుర్మార్గం ప్రకారం ప్రవర్తిస్తాం>> అంటారు.
\q1
\s5
\v 13 కాబట్టి యెహోవా ఇలా చెబుతున్నాడు, రాజ్యాలను అడిగి తెలుసుకోండి. ఇలాంటిది ఎవరైనా ఎప్పుడైనా విన్నారా? ఇశ్రాయేలు కన్య చాలా ఘోరమైన పని చేసింది.
\q1
\v 14 లెబానోను పర్వతం మీద బండలపై మంచు లేకుండా పోతుందా? దూరం నుంచి పారే చల్లని వాగులు ఇంకిపోతాయా?
\q1
\s5
\v 15 నా ప్రజలైతే నన్ను మర్చిపోయారు. పనికిమాలిన విగ్రహాలకు వాళ్ళు ధూపం వేశారు. వాళ్ళ తమ మార్గాల్లో తడబాటు చెందారు. పురాతన దారులను విడిచిపెట్టి డొంక దారుల్లో నడవాలనుకుంటున్నారు.
\q1
\v 16 వాళ్ళ దేశం పాడైపోతుంది. అది ఎప్పటికీ ఎగతాళికి గురి అవుతుంది. ఆ దారిన వెళ్లేవాళ్ళంతా వణికిపోతూ తమ తలలూపుతారు.
\q1
\v 17 తూర్పుగాలి చెదరగొట్టినట్టు నేను వాళ్ళ శత్రువుల ఎదుట వాళ్ళను చెదరగొడతాను.
\q1
\s5
\v 18 అప్పుడు ప్రజలు ఇలా అన్నారు. <<యిర్మీయా మీద కుట్ర పన్నుదాం రండి. యాజకులు ధర్మశాస్త్రం వినిపించకుండా ఉండరు. తెలివిగలవాళ్ళు సలహాలివ్వకుండా ఉండరు. ప్రవక్తలు సందేశాలు వినిపించకుండా ఉండరు. అతడు ప్రకటించే మాటలేమీ పట్టించుకోకుండా మన మాటలతో అతన్ని ఎదుర్కొందాం రండి.>>
\q1
\v 19 యెహోవా, నా మొర విను. నా విరోధుల రభస విను.
\q1
\v 20 వాళ్ళు నా ప్రాణం తీయాలని గుంట తవ్వారు. వాళ్లకు నేను చేసిన మేలుకు బదులు వాళ్ళు నాకు భయంకరమైన కీడు చేయాలా? వాళ్ళ క్షేమం కోసం వాళ్ళ మీదనుంచి నీ కోపం తప్పించడానికి నీ ఎదుట నేను నిలబడి వాళ్ళ గురించి మాట్లాడిన సంగతి గుర్తుంచుకో.
\q1
\s5
\v 21 కాబట్టి వాళ్ళ పిల్లలను కరువుపాలు చెయ్యి. వాళ్ళను కత్తికి అప్పగించు. వాళ్ళ భార్యలు సంతానాన్ని కోల్పోయేలా వితంతువులయ్యేలా చెయ్యి. వాళ్ళ పురుషులు చావాలి. వాళ్ళ యువకులు యుద్ధంలో కత్తితో చావాలి.
\q1
\v 22 నన్ను పట్టుకోడానికి వాళ్ళు గొయ్యి తవ్వారు. నా కాళ్లకు ఉచ్చులు వేశారు. వాళ్ళ మీదికి నువ్వు అకస్మాత్తుగా దండెత్తే వాళ్ళను రప్పించడం వలన వారి ఇళ్ళలోనుంచి కేకలు వినబడాలి.
\q1
\v 23 యెహోవా, నన్ను చంపడానికి వాళ్ళు చేసిన కుట్ర అంతా నీకు తెలుసు. వాళ్ళ అపరాధాలనూ పాపాలనూ క్షమించవద్దు. వాళ్ళ పాపాలు నువ్వు తుడిచి వేయవద్దు. వాళ్ళు నీ ఎదుట కూలిపోవాలి. నీ ఉగ్రత కురిపించే సమయంలో వారికి తగిన శాస్తి చెయ్యి.
\s5
\c 19
\p
\v 1 యెహోవా ఇలా చెప్పాడు,
\q1
\v 2 నువ్వు వెళ్లి కుమ్మరి చేసిన మట్టికుండ కొను. ప్రజల పెద్దల్లో కొంతమందినీ యాజకుల్లో పెద్దవారినీ వెంటబెట్టుకుని హర్సీతు ద్వారానికి ఎదురుగా ఉన్న బెన్‌ హిన్నోము లోయలోకి వెళ్ళి, నేను నీతో చెప్పే ఈ మాటలు అక్కడ ప్రకటించు.
\q1
\v 3 <<యూదా రాజులారా! యెరూషలేము నివాసులారా! యెహోవా మాట వినండి. సేనల అధిపతి యెహోవా, ఇశ్రాయేలు దేవుడు చెప్పేది వినండి. నేను ఈ స్థలం మీదికి విపత్తు రప్పిస్తున్నాను. దాని గురించి వినేవారందరి చెవులు గింగురుమనేటంత భయంకరంగా ఉంటుంది.
\q1
\s5
\v 4 ఎందుకంటే వాళ్ళు నన్ను విడిచిపెట్టి ఈ స్థలాన్ని పాడు చేశారు. వాళ్ళకు తెలియని ఇతర దేవుళ్ళ ఎదుట ధూపం వేశారు. వాళ్ళూ వాళ్ళ పూర్వీకులూ యూదా రాజులు కూడా నిరపరాధుల రక్తంతో ఈ స్థలాన్ని నింపారు.
\q1
\v 5 వాళ్ళు తమ కొడుకులను దహనబలులుగా కాల్చడానికి బయలుకు బలిపీఠాలు కట్టించారు. అలా చేయమని నేను వాళ్లకు చెప్పలేదు, అది నా మనస్సుకు ఎన్నడూ తోచలేదు.>>
\q1
\s5
\v 6 కాబట్టి యెహోవా చెప్పేదేమిటంటే <<రాబోయే రోజుల్లో ఈ స్థలాన్ని <వధ లోయ> అంటారు. తోఫెతు అని గానీ బెన్‌ హిన్నోము లోయ అని గానీ అనరు.
\q1
\v 7 ఈ స్థలం లోనే యూదావారి ఆలోచనను యెరూషలేమువారి ఆలోచనను నేను వ్యర్ధం చేస్తాను. తమ శత్రువుల ఎదుట కత్తిపాలయ్యేలా చేస్తాను. తమ ప్రాణాలను తీయాలని చూసే వాళ్ళ చేతికి అప్పగిస్తాను. వాళ్ళ శవాలను రాబందులకూ అడవి జంతువులకూ ఆహారంగా ఇస్తాను.
\q1
\v 8 ఈ పట్టణాన్ని పాడు చేసి ఎగతాళికి గురి చేస్తాను. ఆ దారిలో వెళ్ళే ప్రతివాడూ దాని కడగండ్లన్నీ చూసి నిర్ఘాంతపోయి హేళన చేస్తారు.
\q1
\v 9 వాళ్ళు తమ కొడుకుల, కూతుళ్ళ శరీరాలను తినేలా చేస్తాను. తమ ప్రాణం తీయాలని చూసే శత్రువులు ముట్టడి వేసి బాధించే కాలంలో వాళ్ళు ఒకరి శరీరాన్ని ఒకరు తింటారు.
\q1
\s5
\v 10 ఈ మాటలు చెప్పిన తరువాత నీతో వచ్చిన మనుష్యులు చూస్తుండగా నువ్వు ఆ కుండ పగలగొట్టి వాళ్ళతో ఇలా చెప్పాలి.>>
\q1
\v 11 <<సేనల ప్రభువు యెహోవా ఇలా చెబుతున్నాడు, మళ్ళీ బాగుచేయడానికి వీలు లేకుండా కుమ్మరివాని కుండను ఒకడు పగలగొట్టినట్టు నేను ఈ ప్రజలనూ ఈ పట్టణాన్నీ పగలగొట్టబోతున్నాను. తోఫెతులో పాతిపెట్టే చోటు దొరకనంతగా వాళ్ళను అక్కడే పాతిపెడతారు.>>
\q1
\s5
\v 12 యెహోవా వాక్కు ఇదే. <<ఈ పట్టణాన్ని తోఫెతులాంటి స్థలంగా నేను చేస్తాను. ఈ స్థలానికీ అక్కడి నివాసులకూ నేనలా చేస్తాను.
\q1
\v 13 యెరూషలేము ఇళ్ళు, యూదా రాజుల రాజ భవనాలూ ఆ తోఫెతు స్థలం లాగే అపవిత్రమవుతాయి. ఏ ఇళ్ళ మీద ప్రజలు ఆకాశ నక్షత్ర సమూహానికి మొక్కి ఇతర దేవుళ్ళకు పానార్పణలు చేశారో ఆ ఇళ్ళన్నిటికీ ఆలాగే జరుగుతుంది.>>
\q1
\s5
\v 14 యిర్మీయా ఆ ప్రవచనం చెప్పడానికి యెహోవా తనను పంపిన తోఫెతులో నుంచి వచ్చి యెహోవా మందిరపు ఆవరణంలో నిలబడి ప్రజలందరితో ఇలా చెప్పాడు,
\q1
\v 15 <<సేనల ప్రభువు యెహోవా, ఇశ్రాయేలు దేవుడు ఈ మాట చెబుతున్నాడు. ఈ ప్రజలు నా మాటలు వినకుండా మొండికెత్తారు. కాబట్టి ఈ పట్టణం గురించి నేను చెప్పిన విపత్తునంతా దాని మీదికీ దానికి సంబంధించిన పట్టణాలన్నిటి మీదికీ రప్పిస్తున్నాను.>>
\s5
\c 20
\s యిర్మీయా, పషూరు
\p
\v 1 ఇమ్మేరు కొడుకు పషూరు యాజకుడు. యెహోవా మందిరంలో పెద్ద నాయకుడు. యిర్మీయా ఆ ప్రవచనాలను పలుకుతుంటే విన్నాడు.
\p
\v 2 కాబట్టి పషూరు యిర్మీయా ప్రవక్తను కొట్టి, యెహోవా మందిరంలో బెన్యామీను పైగుమ్మం దగ్గర ఉండే బొండలో అతణ్ణి వేయించాడు.
\p
\s5
\v 3 మరుసటి రోజు పషూరు యిర్మీయాను బొండ నుంచి బయటకు రప్పించాడు. అప్పుడు యిర్మీయా అతనితో ఇలా అన్నాడు. <<యెహోవా నీకు పషూరు అని పేరు పెట్టడు. <మాగోర్ మిస్సాబీబ్‌
\f +
\fr 20:3
\fq మాగోర్ మిస్సాబీబ్‌
\ft నలుదిక్కులా భయం
\f* > అని పెడతాడు.>>
\q1
\v 4 యెహోవా ఈ మాట చెబుతున్నాడు. <<నీకూ నీ స్నేహితులందరికీ నిన్ను భయకారణంగా చేస్తాను. నీ కళ్ళముందే వాళ్ళు తమ శత్రువుల కత్తికి గురై కూలుతారు. యూదా వాళ్ళందరినీ బబులోను రాజు చేతికి అప్పగిస్తాను. అతడు వాళ్ళను బందీలుగా బబులోను తీసుకుపోతాడు. కత్తితో వాళ్ళను చంపేస్తాడు.
\q1
\s5
\v 5 ఈ పట్టణంలోని సంపద అంతా, దాని ఆస్తి, విలువైన వస్తువులన్నీ యూదా రాజుల ఖజానా అంతా నేనప్పగిస్తాను. మీ శత్రువుల చేతికి వాటిని అప్పగిస్తాను. శత్రువులు వాటిని దోచుకుని బబులోను తీసుకుపోతారు.
\q1
\v 6 పషూరు! నువ్వూ నీ ఇంట్లో నివాసముంటున్న వాళ్ళంతా బందీలుగా పోతారు. నువ్వు బబులోను వెళ్లి అక్కడే చస్తావు. నీ ప్రవచనాలతో నువ్వు మోసపుచ్చిన నీ స్నేహితులందరినీ బబులోనులో పాతిపెడతారు.
\s యిర్మీయా ఫిర్యాదు
\q1
\s5
\v 7 యెహోవా, నువ్వు నన్ను ప్రేరేపించావు. నీ ప్రేరేపణకు నేను లొంగిపోయాను. నువ్వు నన్ను గట్టిగా పట్టుకుని గెలిచావు. నేను నవ్వుల పాలయ్యాను. రోజంతా నన్ను ఎగతాళి చేస్తున్నారు.
\q1
\v 8 ఎందుకంటే నేను మాట్లాడే ప్రతిసారీ కేకలేస్తూ <దుర్మార్గం, నాశనం> అని చాటించాను. రోజంతా యెహోవా మాట నాకు అవమానం, ఎగతాళి అయింది.
\q1
\v 9 <ఇక నుంచి నేను యెహోవా గురించి ఆలోచించను, ఆయన పేరు ఎత్తను> అనుకుంటే అది నా గుండెలో మండినట్టుంది. నా ఎముకల్లో మంట పెట్టినట్టుంది. నేను ఓర్చుకుందాం అనుకుంటున్నాను గానీ నావల్ల కావడం లేదు.
\q1
\s5
\v 10 చుట్టుపక్కలా చాలామంది ఎంతో భయంతో ఇలా గుసగుసలాడడం విన్నాను. నిందించండి. తప్పకుండా నిందించాలి. నాకు సన్నిహితంగా ఉండేవాళ్ళంతా నేను పడిపోవాలని కనిపెడుతున్నారు. <ఒకవేళ అతడు చిక్కుపడతాడు. అప్పుడు మనం ఓడించి పగ తీర్చుకుందాం> అంటున్నారు.
\q1
\v 11 అయితే బలం గల యుద్ధవీరుడులాగా యెహోవా నాతో ఉన్నాడు. కాబట్టి నన్ను హింసించేవాళ్ళు నన్ను గెలవలేక తొట్రుపడిపోతారు. వాళ్ళు అనుకున్నది సాధించలేక సిగ్గుపాలవుతారు. వాళ్ళ అవమానం ఎప్పటికీ ఉంటుంది.
\q1
\s5
\v 12 సేనల ప్రభువు యెహోవా, నువ్వు నీతిమంతులను పరీక్షించే వాడివి. హృదయాన్నీ మనసునూ చూసే వాడివి. నా ఫిర్యాదు నీకే అప్పచెప్పాను కాబట్టి నువ్వు వారికి చేసే ప్రతీకారం నన్ను చూడనివ్వు.
\q1
\v 13 యెహోవాకు పాట పాడండి! యెహోవాను స్తుతించండి! దుర్మార్గుల చేతిలోనుంచి అణగారిన వారి ప్రాణాన్ని ఆయన తప్పించాడు.
\q1
\s5
\v 14 నేను పుట్టిన రోజు శపితమౌతుంది గాక. నా తల్లి నన్ను కనిన రోజు శుభదినం అని ఎవరూ అనరుగాక.
\q1
\v 15 <నీకు బాబు పుట్టాడు> అని నా తండ్రికి కబురు తెచ్చి అతనికి ఆనందం తెచ్చినవాడు శాపానికి గురి అవుతాడు గాక.
\q1
\s5
\v 16 ఏమీ జాలి లేక యెహోవా నాశనం చేసిన పట్టణంగా వాడు ఉంటాడు గాక! ఉదయాన ఆర్త ధ్వనినీ మధ్యాహ్నం యుద్ధ ధ్వనినీ అతడు వినుగాక!
\q1
\v 17 యెహోవా నన్ను గర్భంలోనే చంపలేదు. నా తల్లి నాకు సమాధిలాంటిదై ఎప్పటికీ నన్ను గర్భాన మోసేలా చేయలేదు.
\q1
\v 18 కష్టం, దుఖం, అనుభవిస్తూ నేను అవమానంతో నా రోజులు గడుపుతూ ఉన్నాను. ఇందుకేనా నేను గర్భంలోనుంచి బయటికి వచ్చింది?>>
\s5
\c 21
\s సిద్కియా ప్రార్థన, దేవుని జవాబు
\p
\v 1 సిద్కియా రాజు మల్కీయా కొడుకైన పషూరునూ, మయశేయా కొడుకూ, యాజకుడైన జెఫన్యానూ పిలిపించాడు.
\p
\v 2 <<బబులోను రాజు నెబుకద్నెజరు మన మీద యుద్ధం చేస్తున్నాడు. అతడు మనలను విడిచి వెళ్లిపోయేలా యెహోవా తన అద్భుత క్రియలన్నిటిని మన పట్ల జరిగిస్తాడేమో దయచేసి మా కోసం యెహోవా దగ్గర విచారణ చేయండి>> అని చెప్పడానికి యిర్మీయా దగ్గరికి వారిని పంపించాడు. అప్పుడు యెహోవా దగ్గరనుంచి యిర్మీయాకు వచ్చిన సందేశం.
\q1
\s5
\v 3 యిర్మీయా వారితో ఇలా అన్నాడు. <<మీరు సిద్కియాతో ఈ మాట చెప్పండి.
\q1
\v 4 ఇశ్రాయేలు దేవుడు యెహోవా ఇలా చెబుతున్నాడు, ప్రాకారం వెలుపల మిమ్మల్ని ముట్టడి వేసే బబులోను రాజు మీద, కల్దీయుల మీద, మీరు ప్రయోగిస్తున్న యుద్దాయుధాలను వెనక్కి పంపించేస్తాను. వాటిని ఈ పట్టణం మధ్యలో పోగుచేయిస్తాను.
\q1
\v 5 నేనే నా బలమైన చెయ్యి చాపి తీవ్రమైన కోపంతో, రౌద్రంతో, ఆగ్రహంతో మీమీద యుద్ధం చేస్తాను.
\q1
\s5
\v 6 ఈ పట్టణంలోని మనుషులనూ పశువులనూ చంపేస్తాను. వాళ్ళు తీవ్రమైన అంటురోగంతో చస్తారు.>>
\q1
\v 7 యెహోవా ఇలా చెబుతున్నాడు. <<ఆ తరువాత యూదా దేశపు రాజు సిద్కియానూ అతని ఉద్యోగులనూ తెగులును, కత్తిని, కరువును తప్పించుకున్న మిగిలిన ప్రజలనూ బబులోను రాజు నెబుకద్నెజరు చేతికీ వారి ప్రాణాలను తీయాలని చూసేవాళ్ళ శత్రువుల చేతికీ అప్పగిస్తాను. అతడు వారి మీద కనికరం, జాలి ఏమీ చూపక వారిని కత్తితో చంపేస్తాడు.>>
\q1
\s5
\v 8 ఈ ప్రజలతో ఇలా చెప్పు. <<యెహోవా చెప్పేదేమిటంటే, జీవమార్గం, మరణ మార్గం, నేను మీ ఎదుట ఉంచుతున్నాను.
\q1
\v 9 ఈ పట్టణంలో ఉండబోయే వాళ్ళు కత్తితో, కరువుతో, అంటురోగంతో చస్తారు. పట్టణం బయటకు వెళ్లి మిమ్మల్ని ముట్టడి వేస్తూ ఉన్న కల్దీయులకు లోబడేవాళ్ళు బతుకుతారు. దోపిడీలాగా వాళ్ళ ప్రాణం దక్కుతుంది.
\q1
\v 10 నేను ఈ పట్టణంపై దయ చూపను. దానికి ఆపద కలిగిస్తాను. ఇది బబులోను రాజు వశమవుతుంది. అతడు దాన్ని కాల్చి వేస్తాడు.>> ఇది యెహోవా వాక్కు.
\q1
\s5
\v 11 యూదా రాజవంశం వారికి ఇలా చెప్పు. <<యెహోవా మాట వినండి.>>
\q1
\v 12 దావీదు వంశస్థులారా, యెహోవా ఇలా చెబుతున్నాడు. <<ప్రతిరోజూ న్యాయంగా తీర్పు తీర్చండి. దోపిడీకి గురైన వారిని పీడించేవారి చేతిలోనుంచి విడిపించండి. లేకపోతే మీపై నా క్రోధం మంటలాగా బయలుదేరుతుంది. ఎవడూ ఆర్పడానికి వీలు లేకుండా అది మిమ్మల్ని దహిస్తుంది.>> ఇది యెహోవా వాక్కు.
\q1
\s5
\v 13 <<లోయలో నివసించేదానా, మైదానంలోని బండవంటిదానా, <మా మీదికి ఎవరు వస్తారు? మా ఇళ్ళల్లో ఎవరు అడుగుపెడతారు?> అని నువ్వు అనుకుంటున్నావు.
\q1
\v 14 మీ పనులకు తగినట్టు మిమ్మల్ని దండిస్తాను. అడవుల్లో నిప్పు పెడతాను. అది దాని చుట్టూ ఉన్నదాన్నంతా కాల్చివేస్తుంది.>> ఇది యెహోవా వాక్కు.
\s5
\c 22
\s దుష్ట రాజుల శ్రమ
\q1
\v 1 యెహోవా ఇలా చెబుతున్నాడు<<నువ్వు యూదా రాజు రాజనగరుకు వెళ్లి అక్కడ ఈ మాట ప్రకటించు.
\q1
\v 2 <దావీదు సింహాసనం మీద కూర్చున్న యూదా రాజా, నువ్వూ, ఈ ద్వారాలగుండా ప్రవేశించే నీ సిబ్బందీ, నీ ప్రజలూ యెహోవా మాట వినండి.>
\q1
\v 3 యెహోవా ఇలా చెబుతున్నాడు, <మీరు నీతి న్యాయాలను అనుసరించి ప్రవర్తించండి. దోపిడీకి గురైన వారిని పీడించేవారి చేతిలోనుంచి విడిపించండి. విదేశీయులనూ తండ్రిలేని వారినీ విధవరాళ్ళనూ బాధించవద్దు. వాళ్ళ మీద హింసాకాండ చేయవద్దు. ఈ స్థలంలో నిరపరాధుల రక్తం చిందింపవద్దు.
\q1
\s5
\v 4 మీరు వీటిని జాగ్రత్తగా పాటిస్తే, దావీదు సింహాసనం మీద కూర్చునే రాజులు రథాలూ గుర్రాలూ ఎక్కి ఈ పట్టణ ద్వారాలగుండా ప్రవేశిస్తారు. వారి వెంట వారి సిబ్బందీ వారి ప్రజలూ వస్తారు.
\q1
\v 5 మీరు ఈ మాటలు వినకపోతే ఈ పట్టణం పాడైపోతుంది.> ఇది యెహోవా వాక్కు.>>
\q1
\s5
\v 6 యూదా రాజభవనం గురించి యెహోవా ఇలా చెబుతున్నాడు. <<నాకు నువ్వు గిలాదులాగా ఉన్నావు, లెబానోను పర్వత శిఖరంలాగా ఉన్నావు. అయినా నిన్ను ఎడారిగా నివాసులు లేని పట్టణంగా చేస్తాను.
\q1
\v 7 నీ మీదికి రావడానికి నాశనం చేసేవాళ్ళను ఎన్నుకున్నాను. తమ ఆయుధాలను పట్టుకుని వాళ్ళు వస్తారు. నీ మంచి దేవదారు మ్రానులను నరికేసి మంటల్లో కాల్చివేస్తారు.>>
\q1
\s5
\v 8 అనేక దేశాలవాళ్ళు ఈ పట్టణపు దారిలో నడుస్తారు. <<ఈ గొప్ప పట్టణాన్ని యెహోవా ఎందుకు ఇలా చేశాడు?>> అని ఒకరినొకరు ప్రశ్నించుకుంటారు.
\q1
\v 9 <<ఎందుకంటే వాళ్ళు తమ దేవుడైన యెహోవా నిబంధనను నిరాకరించి ఇతర దేవుళ్ళను పూజించి వాటికి మొక్కారు>> అని జవాబు చెప్పుకుంటారు.
\q1
\s5
\v 10 చనిపోయిన వాళ్ళను గురించి ఏడవవద్దు, వాళ్ళ గురించి అంగలార్చవద్దు. బందీలుగా వెళ్లిపోతున్నవాళ్ళ గురించి మీరు తప్పకుండా ఏడవాలి. ఎందుకంటే వాళ్ళు ఇక ఎన్నటికీ తిరిగిరారు. తమ జన్మభూమిని ఇక చూడరు.
\q1
\s5
\v 11 తన తండ్రి యోషీయాకు బదులు పరిపాలన చేసి, ఈ స్థలంలోనుంచి వెళ్లిపోయిన యూదా రాజు యోషీయా కొడుకు షల్లూము గురించి యెహోవా ఇలా చెబుతున్నాడు. <<అతడు ఇక్కడికి ఎప్పటికీ తిరిగి రాడు.
\q1
\v 12 ఈ దేశాన్ని ఇంకెప్పుడూ అతడు చూడడు. వారు అతణ్ణి బందీగా తీసుకుపోయిన స్థలంలోనే అతడు చస్తాడు.>>
\q1
\s5
\v 13 అక్రమంగా తన ఇంటినీ, అన్యాయంగా తన మేడగదులనూ కట్టించుకునే వాడికి బాధ. జీతమివ్వకుండా తన పొరుగువాడి చేత ఊరికే పని చేయించుకునే వాడికి బాధ.
\q1
\v 14 <<నేను విశాలమైన మేడ గదులున్న పెద్ద ఇంటిని కట్టించుకుంటాను, అనుకునే వాళ్లకు బాధ. అతడు పెద్ద పెద్ద కిటికీలు చేయించుకుని దేవదారు పలకలతో పొదిగి, ఎర్ర రంగుతో అలంకరిస్తాడు.>>
\q1
\s5
\v 15 నువ్వు దేవదారు పలకల ఇంటిని కట్టించుకుని రాజువవుతావా? నీ తండ్రి కూడా తింటూ తాగుతూ నీతిన్యాయాలను అనుసరించలేదా? అప్పుడు అతడు బాగానే ఉన్నాడు.
\q1
\v 16 అతడు పేదలకూ అక్కరలో ఉన్నవారికీ న్యాయం జరిగిస్తూ సుఖంగా బతికాడు. అలా చేయడమే నన్ను తెలుసుకోవడం కాదా? ఇది యెహోవా వాక్కు.
\q1
\s5
\v 17 అయితే అక్రమ సంపాదనపై, నిర్దోషుల రక్తం ఒలికించడంపై, దుర్మార్గం చేయడంపై, ఇతరులను అణగదొక్కడంపై నీ దృష్టి, మనసూ ఉంది.
\q1
\v 18 కాబట్టి యోషీయా కొడుకు యెహోయాకీము అనే యూదా రాజు గురించి యెహోవా ఇలా చెబుతున్నాడు. <<ప్రజలు, అయ్యో నా సోదరా! అయ్యో నా సోదరీ>> అని అతని గురించి ఏడవరు. <<అయ్యో, యజమానీ! అయ్యో, ఘనుడా>> అని అతని కోసం ఏడవరు.
\q1
\v 19 అతణ్ణి యెరూషలేము ద్వారాల బయటికి ఈడ్చుకుపోయి అక్కడ పారేసి, గాడిదను పాతిపెట్టినట్టు పాతిపెడతారు.
\q1
\s5
\v 20 లెబానోను పర్వతాలు ఎక్కి కేకలు వెయ్యి. బాషానులో నీ గొంతు పెద్దది చెయ్యి. అబారీము పర్వతాలనుంచి కేకలు వెయ్యి. ఎందుకంటే నీ స్నేహితులంతా నాశనమవుతారు.
\q1
\v 21 నువ్వు క్షేమంగా ఉన్నప్పుడు నీతో మాట్లాడాను. అయితే <<నేను వినను>> అని నువ్వన్నావు. చిన్నప్పటినుంచి నువ్వు నా మాట వినకుండా ఉండడం నీకు అలవాటే.
\q1
\s5
\v 22 నీ కాపరులంతా గాలికి కొట్టుకుపోతారు. నీ స్నేహితులంతా బందీలుగా వెళ్ళిపోతారు. అప్పుడు నీ దుర్మార్గమంతటి బట్టి నువ్వు కచ్చితంగా అవమానం పొంది సిగ్గుపడతావు.
\q1
\v 23 రాజువైన నువ్వు, లెబానోను అడవిలోని ఇంటిలో నివసిస్తున్న నువ్వు, దేవదారు వృక్షాల్లో గూడు కట్టుకున్నా, ప్రసవిస్తూ ఉన్న స్త్రీకి కలిగే వేదనల్లాటివి నీకు కలుగుతాయి. నువ్వెంత మూలుగుతావో!
\q1
\s5
\v 24 యెహోవా చెప్పేదేమిటంటే. <<యూదా రాజు యెహోయాకీము కొడుకు యెహోయాకీను నా కుడి చేతికి రాజముద్రగా ఉన్నా అక్కడ నుంచి నిన్ను పెరికివేస్తాను.
\q1
\v 25 నీ ప్రాణం తీయడానికి చూస్తున్న వారి చేతికి, నువ్వు భయపడుతున్న బబులోను రాజు నెబుకద్నెజరు చేతికి, కల్దీయుల చేతికి నిన్ను అప్పగిస్తాను.
\q1
\v 26 నిన్నూ, నిన్ను కన్న మీ అమ్మనూ మీ జన్మభూమి కాని వేరే దేశంలోకి విసిరివేస్తాను. మీరు అక్కడే చస్తారు.
\q1
\s5
\v 27 వాళ్ళు తిరిగి రావాలని ఎంతో ఆశపడే దేశానికి వాళ్ళు తిరిగి రారు.>>
\q1
\v 28 ఇతడు హేయమైన ఓటికుండ వంటివాడా? యెహోయాకీను పనికిమాలిన కుండా? అతన్నీ అతని సంతానాన్నీ తమకు తెలియని దేశంలోకి వాళ్ళెందుకు తోసేశారు?
\q1
\s5
\v 29 దేశమా, దేశమా, దేశమా, యెహోవా మాట విను.
\q1
\v 30 యెహోవా ఇలా చెబుతున్నాడు<<సంతానం లేనివాడనీ తన రోజుల్లో అతడు వర్ధిల్లడనీ ఈ మనిషి గురించి రాయండి. అతని సంతానంలో ఎవడూ వర్ధిల్లడు, వారిలో ఎవడూ దావీదు సింహాసనం ఎక్కడు. ఇక మీదట ఎవడూ యూదాలో రాజుగా ఉండడు.>>
\s5
\c 23
\s న్యాయమైన కొమ్మ
\p
\v 1 <<నా మందలో చేరిన గొర్రెలను నాశనం చేస్తూ చెదరగొట్టే కాపరులకు బాధ.>> ఇది యెహోవా వాక్కు.
\q1
\v 2 ఇశ్రాయేలు దేవుడు యెహోవా తన ప్రజలను మేపే కాపరులను గురించి ఇలా చెబుతున్నాడు. <<మీరు నా గొర్రెలను చెదరగొట్టి వెళ్ళగొట్టారు. మీరు వాటిని అసలేమీ పట్టించుకోలేదు. మీరు చేసిన చెడ్డ పనులను బట్టి మిమ్మల్ని శిక్షిస్తాను. ఇది యెహోవా వాక్కు.
\q1
\s5
\v 3 నేను వాటిని తోలి వేసిన దేశాలన్నిటిలో నుంచి మిగిలిన నా గొర్రెలను దగ్గరికి చేరుస్తాను. వాటి మేత భూములకు వాటిని రప్పిస్తాను. అవి వృద్ధి చెంది విస్తరిస్తాయి.
\q1
\v 4 నేను వాటి మీద కాపరులను నియమిస్తాను. ఇకనుంచి అవి భయపడకుండా, బెదరి పోకుండా, వాటిలో ఒకటైనా తప్పిపోకుండా వారు నా గొర్రెలను మేపుతారు. ఇది యెహోవా వాక్కు.>>
\q1
\s5
\v 5 యెహోవా ఇలా చెబుతున్నాడు<<రాబోయే రోజుల్లో నేను దావీదుకు నీతి అనే చిగురు పుట్టిస్తాను. ఆయన రాజుగా పాలిస్తాడు. ఆయన సౌభాగ్యం తెస్తాడు. భూమి మీద నీతి న్యాయాలను జరిగిస్తాడు.
\q1
\v 6 ఆయన రోజుల్లో యూదాకు విడుదల వస్తుంది. ఇశ్రాయేలు నిర్భయంగా నివసిస్తుంది. <యెహోవా మనకు నీతి> అని అతనికి పేరు పెడతారు.>>
\q1
\s5
\v 7 కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలు <<ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుంచి రప్పించిన యెహోవా జీవం తోడు>> అని ఇకపై ప్రమాణం చెయ్యరు.
\q1
\v 8 <<ఉత్తర దేశంలో నుంచి, నేను వారిని చెదరగొట్టిన దేశాలన్నిటిలో నుంచి వారిని రప్పించిన యెహోవానైన నా తోడు>> అని ప్రమాణం చేస్తారు. వాళ్ళు తమ దేశంలో నివసిస్తారు అని యెహోవా చెబుతున్నాడు.
\s అబద్ధ ప్రవక్తలు
\q1
\s5
\v 9 ప్రవక్తల గూర్చిన సమాచారం. యెహోవా గురించి, ఆయన పరిశుద్ధమైన మాటలను గురించి నా గుండె నాలో పగిలిపోయింది. నా ఎముకలన్నీ వణికి పోతున్నాయి. నేను మత్తు మందు సేవించినవాడిలా అయ్యాను. ద్రాక్షమద్యం వశమైన వాడిలా అయ్యాను.
\q1
\v 10 దేశం వ్యభిచారులతో నిండిపోయింది. వారిని బట్టే దేశం దుఃఖిస్తూ ఉంది. ఎడారిలో పచ్చిక మైదానాలు ఎండిపోయాయి. ప్రవక్తలు చెడ్డగా ప్రవర్తిస్తున్నారు. తమ బలాన్ని సరిగా వాడడం లేదు.
\q1
\s5
\v 11 ప్రవక్తలూ యాజకులూ పాడైపోయారు. నా ఆలయంలో కూడా వాళ్ళ దుర్మార్గం నేను చూశాను. ఇది యెహోవా వాక్కు.
\q1
\v 12 కాబట్టి చీకట్లో వాళ్ళ దారి జారిపోయే నేలలాగా ఉంటుంది. వాళ్ళను గెంటేస్తారు. వాళ్ళు దానిలో పడిపోతారు. వాళ్ళను శిక్షించే సంవత్సరంలో వాళ్ళ మీదికి విపత్తు రప్పిస్తాను. ఇది యెహోవా వాక్కు.
\q1
\s5
\v 13 సమరయ ప్రవక్తల మధ్య నేరం చూశాను. వాళ్ళు బయలు దేవుడి పేర ప్రవచనం చెప్పి నా ఇశ్రాయేలు ప్రజలను దారి తప్పించారు.
\q1
\v 14 యెరూషలేము ప్రవక్తల మధ్య ఘోరమైన పనులు నేను చూశాను. వాళ్ళు వ్యభిచారులు. మోసంలో నడుస్తున్నారు. వాళ్ళు దుర్మార్గుల చేతులను బలపరుస్తున్నారు! ఎవడూ తన దుర్మార్గం విడిచిపెట్టడం లేదు. వాళ్ళంతా నా దృష్టికి సొదొమ ప్రజల్లాగా మారారు. యెరూషలేము నివాసులు గొమొర్రా ప్రజల్లాగా మారారు.
\q1
\v 15 కాబట్టి సేనల ప్రభువు యెహోవా ఈ ప్రవక్తలను గురించి చెప్పేదేమిటంటే, యెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతా వ్యాపించింది. కాబట్టి వాళ్లకు తినడానికి చేదుకూరలూ తాగడానికి విషజలం నేను వారికిస్తాను.
\q1
\s5
\v 16 సేనల ప్రభువు యెహోవా ఇలా చెబుతున్నాడు. <<మీకు ప్రవచనాలు ప్రకటించే ప్రవక్తల మాటలు వినవద్దు. వాళ్ళు మిమ్మల్ని భ్రమపెట్టారు! వాళ్ళు యెహోవా నోటి నుంచి వచ్చినవి కాక తమ సొంత మనస్సులోని దర్శనాలను ప్రకటిస్తున్నారు.>>
\q1
\v 17 <<మీకు శాంతిక్షేమాలు కలుగుతాయని యెహోవా చెబుతున్నాడు>> అని నన్ను తృణీకరించే వాళ్ళతో అదే పనిగా చెబుతున్నారు. <<మీ మీదికి ఏ కీడూ రాదు>> అని తన హృదయ మూర్ఖత ప్రకారం నడుచుకునే ప్రతివారూ చెబుతున్నారు.
\q1
\v 18 అయితే యెహోవా మాట విని గ్రహించడానికి వాళ్ళలో ఆయన సభలో ఎవరు నిలబడ్డారు? ఆయన మాట ఎవరు విని పట్టించుకున్నారు?
\q1
\s5
\v 19 ఇదిగో యెహోవా ఆగ్రహం తుఫానులాగా బయలుదేరింది. అది తీవ్రమైన సుడిగాలిలాగా దుర్మార్గుల తల మీదికి విరుచుకుపడుతుంది.
\q1
\v 20 తన మనస్సులోని ఆలోచనలను నెరవేర్చి సాధించే వరకూ యెహోవా కోపం చల్లారదు. చివరి రోజుల్లో ఈ విషయం మీరు బాగా తెలుసుకుంటారు.
\q1
\s5
\v 21 <<నేను ఈ ప్రవక్తలను పంపలేదు. అయినా వాళ్ళు వచ్చారు. నేను వాళ్ళతో మాట్లాడలేదు. అయినా వాళ్ళు ప్రవచించారు.
\q1
\v 22 ఒకవేళ వాళ్ళు నా సలహా మండలిలో నిలబడి ఉంటే, వాళ్ళు నా మాటలు నా ప్రజలకు తెలియజేసే వాళ్ళే. వాళ్ళ చెడ్డ మాటల నుంచి, వాళ్ళ దుర్మార్గపు అలవాట్ల నుంచి వాళ్ళను తప్పించి ఉండే వాళ్ళే.>>
\q1
\s5
\v 23 యెహోవా చెప్పేదేమిటంటే <<నేను దగ్గరలో మాత్రమే ఉన్న దేవుడినా? దూరంగా ఉన్న దేవుణ్ణి కానా?
\q1
\v 24 నాకు కనబడకుండా రహస్య స్థలాల్లో ఎవరైనా దాక్కోగలరా? అని యెహోవా అడుగుతున్నాడు. నేను భూమ్యాకాశాల్లో ఉన్నాను కదా? ఇది యెహోవా వాక్కు.>>
\q1
\s5
\v 25 <<నా పేర మోసపు మాటలు ప్రవచించే ప్రవక్తల మాటలు నేను విన్నాను. <నాకు కల వచ్చింది! నాకు కల వచ్చింది> అని వాళ్ళు చెబుతున్నారు.>>
\q1
\v 26 ఎంతకాలం ఇలా జరగాలి? ప్రవక్తలు తమ మనస్సులో నుంచి అబద్ధాలు ప్రవచిస్తున్నారు. తమ హృదయాల్లోని మోసంతో ప్రవచిస్తున్నారు.
\q1
\v 27 బయలు దేవతను పూజిస్తూ తమ పూర్వీకులు నా పేరును మరచిపోయినట్టు ప్రతివాడూ తమ పొరుగు వారితో చెప్పే కలలతో నా ప్రజలు నా పేరును మరచిపోవాలని ఆలోచిస్తున్నారు.
\q1
\s5
\v 28 కల కనిన ప్రవక్త ఆ కలను చెప్పవచ్చు. అయితే ఎవడికి నేను నా వాక్కు వెల్లడించానో అతడు దాన్ని నమ్మకంగా చెప్పవచ్చు. ధాన్యంతో పొట్టుకు ఏం సంబంధం? ఇదే యెహోవా వాక్కు.
\q1
\v 29 <<నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేసే సుత్తి లాంటిది కాదా?
\q1
\v 30 కాబట్టి ఒకడి దగ్గర నుంచి మరొకడు నా మాటలను దొంగిలించే ప్రవక్తలకు నేను విరోధిని.>> ఇది యెహోవా వాక్కు.
\q1
\s5
\v 31 <<సొంత మాటలు పలుకుతూ వాటినే దేవోక్తులుగా ప్రకటించే ప్రవక్తలకు నేను విరోధిని.>> ఇది యెహోవా వాక్కు.
\q1
\v 32 <<మోసపు కలలను పలికే వాళ్లకు నేను విరోధిని. వాళ్ళు అబద్ధాలు చెబుతూ మోసంతో గొప్పలు చెప్పుకుంటూ నా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు.>> ఇది యెహోవా వాక్కు. <<నేను వాళ్ళను పంపలేదు, వారికి ఆజ్ఞ ఇవ్వలేదు, వాళ్ళ వలన ఈ ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం లేదు.>> ఇదే యెహోవా వాక్కు.
\s యెహోవా భారం
\q1
\s5
\v 33 ఈ ప్రజలు గానీ ప్రవక్త గానీ యాజకుడు గానీ నిన్ను <<యెహోవా సందేశం ఏమిటి?>> అని అడిగితే నువ్వు వారితో ఇలా చెప్పు. <<ఏ సందేశం? నేను మిమ్మల్ని వదిలేశాను.>> ఇది యెహోవా సందేశం.
\q1
\v 34 <<ఇదే యెహోవా సందేశం>> అని ప్రవక్త గానీ యాజకుడు గానీ ప్రజలు గానీ అంటే, అతన్నీ అతని కుటుంబాన్నీ శిక్షిస్తాను.
\q1
\s5
\v 35 అయితే <<యెహోవా జవాబేమిటి? యెహోవా ఏం చెప్పాడు?>> అని మీరు మీ పొరుగువారితో మీ సోదరులతో చెప్పాలి.
\v 36 <<యెహోవా సందేశం>> అనే మాట మీరికమీదట పలకవద్దు. ఎందుకంటే ఎవడి మాట వాడికి సందేశం అవుతుంది. జీవంగల మన దేవుని మాటలను, సేనల అధిపతి అయిన యెహోవా దేవుని మాటలను, మీరు తారుమారు చేశారు.
\q1
\s5
\v 37 మీరు మీ ప్రవక్తతో ఇలా చెప్పాలి. <<యెహోవా నీకేం జవాబు చెప్పాడు? యెహోవా ఏం చెప్పాడు?>>
\q1
\v 38 అయితే మీరు <<ఇది యెహోవా సందేశం>> అని చెబితే యెహోవా ఇలా చెబుతున్నాడు. <<ఇది యెహోవా సందేశం>> అని మీరు చెప్పకూడదని నేను మీకు ఆజ్ఞ ఇచ్చినా మీరు యెహోవా సందేశం అంటున్నారు.
\q1
\v 39 కాబట్టి నేను మిమ్మల్ని ఏరి నా దగ్గర నుంచి పారవేస్తాను. మీకూ మీ పూర్వీకులకూ నేనిచ్చిన పట్టణాన్నీ పారవేస్తాను.
\q1
\v 40 ఎప్పటికీ నిలిచి ఉండే నిందనూ అవమానాన్నీ మీ మీదికి రప్పిస్తాను.
\s5
\c 24
\s రెండు గంపల అంజూరు పళ్ళు
\p
\v 1 బబులోను రాజు నెబుకద్నెజరు యూదా రాజు యెహోయాకీము కొడుకు యెకోన్యాను, యూదా ప్రధానులను, శిల్పకారులను, కంసాలులను, యెరూషలేము నుంచి బందీలుగా బబులోనుకు తీసుకుపోయిన తరువాత యెహోవా మందిరం ముందున్న రెండు గంపల అంజూరు పళ్ళు యెహోవా నాకు చూపించాడు.
\p
\v 2 ఒక గంపలో మగ్గిన అంజూరు పళ్ళు ఉన్నాయి. రెండవ గంపలో తినడానికి వీలు లేకుండా బాగా కుళ్ళిపోయిన అంజూరు పళ్ళు ఉన్నాయి.
\p
\v 3 <<యిర్మీయా! నువ్వేమి చూస్తున్నావు?>> అని యెహోవా నన్ను ఆడిగాడు. అందుకు నేను <<అంజూరు పళ్ళు. మంచివి చాలా బాగున్నాన్నాయి. చెడ్డవి బాగా కుళ్ళిపోయాయి. తినడానికి పనికి రావు.>> అన్నాను.
\p
\s5
\v 4 అప్పుడు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు.
\v 5 <<ఇశ్రాయేలు దేవుడు యెహోవా చెప్పేదేమిటంటే, వారికి మేలు కలగాలని యూదావారిలో కొంతమందిని బందీలుగా ఈ స్థలం నుంచి నేను కల్దీయుల దేశానికి పంపించాను. వాళ్ళను ఈ మంచి అంజూరు పళ్ళలాగా ఎంచుతాను.
\v 6 వాళ్లకు మేలు కలగడానికి నేను వాళ్ళ మీద దృష్టి పెడతాను. ఈ దేశానికి వాళ్ళను మళ్ళీ తీసుకువస్తాను. నేను వాళ్ళను పడగొట్టకుండా కడతాను. పెళ్లగించకుండా నాటుతాను.
\v 7 నేను వాళ్లకు నన్ను తెలుసుకునే మనసు ఇస్తాను. నేను యెహోవాను. వాళ్ళు సంపూర్ణ హృదయంతో నా వైపు తిరిగేలా నేను వాళ్ళ దేవుడుగా వాళ్ళు నా ప్రజలుగా ఉంటారు.>>
\p
\s5
\v 8 <<యూదా రాజు సిద్కియానూ అతని అధికారులనూ దేశంలో మిగిలిన వాళ్ళనూ ఐగుప్తు దేశంలో నివసించే వాళ్ళనూ బాగా చెడిపోయి తినడానికి పనికిరాని ఆ కుళ్ళిపోయిన అంజూరు పళ్ళలాగా ఉంచుతానని యెహోవా చెబుతున్నాడు.
\v 9 వాళ్ళను చెదరగొట్టిన ప్రపంచ రాజ్యాలన్నిటిలో నేను వాళ్ళను తోలివేసే స్థలాలన్నిటిలో వాళ్ళను భయకారణంగా విపత్తుగా నిందాస్పదంగా సామెతగా అపహాస్యంగా శాపంగా ఉంచుతాను.
\v 10 నేను వారికీ వాళ్ళ పూర్వీకులకూ ఇచ్చిన దేశంలో ఉండకుండా వాళ్ళు నాశనమయ్యే వరకూ నేను కత్తినీ కరువునూ అంటు వ్యాధుల్నీ వాళ్లలోకి పంపుతాను.>>
\s5
\c 25
\s 70 సంవత్సరాలు చెర
\p
\v 1 యోషీయా కొడుకూ, యూదా రాజు అయిన యెహోయాకీము నాలుగో సంవత్సరం పాలనలో, అంటే బబులోను రాజు నెబుకద్నెజరు మొదటి సంవత్సరంలో యూదా ప్రజలందరి గురించి యిర్మీయాకు వచ్చిన సందేశం.
\p
\v 2 ప్రవక్త యిర్మీయా యూదా ప్రజలందరితో, యెరూషలేము నివాసులందరితో ఆ సందేశాన్ని ప్రకటించాడు.
\q1
\s5
\v 3 <<ఆమోను కొడుకు యూదా రాజు యోషీయా పాలించిన 13 వ సంవత్సరం మొదలు నేటివరకూ ఈ 23 సంవత్సరాలు యెహోవా నాకు సందేశం ఇస్తూ ఉన్నాడు. నేను పెందలకడ లేచి మీకు ఆ మాటలు ప్రకటిస్తూ ఉన్నప్పటికీ మీరు పెడచెవిన పెట్టారు.
\q1
\v 4 యెహోవా మీ దగ్గరికి తన సేవకులైన ప్రవక్తలను పంపించాడు. మీరు వారి మాట వినలేదు, వారిపట్ల శ్రద్ధ చూపలేదు.
\q1
\s5
\v 5 ఈ ప్రవక్తలు ఇలా చెప్పారు, <మీలో ప్రతి ఒక్కరూ మీ దుర్మార్గం, దురాచారాల నుంచి మళ్ళుకోండి. యెహోవా మీకూ, మీ పూర్వీకులకూ శాశ్వతమైన బహుమానంగా దయచేసిన ఈ దేశంలో మీరు నివసించేలా చేసుకోండి.
\q1
\v 6 మీరు ఇతర దేవుళ్ళను పూజించడం, వాటికి నమస్కారం చేయడం మానండి. మీ చేతులతో చేసిన వాటితో నన్ను విసికించవద్దు. అప్పుడు ఆయన మీకు ఏ బాధా కలిగించడు.>
\q1
\s5
\v 7 అయితే మీరు నా మాట వినలేదు. మీ చేతులతో చేసుకున్న వాటి మూలంగా నేను మిమ్మల్ని శిక్షించేలా నన్ను రెచ్చగొట్టారు>> అని యెహోవా చెబుతున్నాడు.
\q1
\v 8 సేనల ప్రభువు యెహోవా ఇలా చెబుతున్నాడు. <<మీరు నా మాటలు వినలేదు కాబట్టి నేను ఉత్తర దిక్కున ఉన్న రాజ్యాలన్నిటినీ నా సేవకుడు నెబుకద్నెజరు అనే బబులోను రాజునూ పిలిపిస్తున్నాను.
\q1
\v 9 ఈ దేశం మీదికి, దీని నివాసుల మీదికి, చుట్టూ ఉన్న ఈ ప్రజలందరి మీదికీ వారిని రప్పిస్తున్నాను. ఈ ప్రజలను నాశనం చేస్తాను. వాళ్ళను అసహ్యకారణంగా, అపహాస్యంగా ఎప్పటికి పాడుగా ఉంచుతాను.
\q1
\s5
\v 10 సంతోషసంబరాల ధ్వనులూ, పెళ్ళికొడుకు పెళ్ళికూతురు స్వరాలూ, తిరుగటిరాళ్ల శబ్దం, దీపాల వెలుగూ వారిలో ఉండకుండా చేస్తాను.
\q1
\v 11 ఈ దేశమంతా పాడైపోతుంది. శిథిలమైపోతుంది. ఈ ప్రజలు 70 సంవత్సరాలు బబులోను రాజుకు సేవ చేస్తారు.
\q1
\s5
\v 12 డెబ్భై సంవత్సరాలు గడచిన తరువాత వారి దోషాలనుబట్టి నేను బబులోను రాజును, ఆ ప్రజలను, కల్దీయుల దేశాన్ని శిక్షిస్తాను. ఆ దేశాన్ని ఎప్పటికీ శిథిలంగా ఉండేలా చేస్తాను.>> ఇది యెహోవా వాక్కు.
\q1
\v 13 నేను ఆ దేశానికి వ్యతిరేకంగా చెప్పిన మాటలన్నిటి ప్రకారం, రాజ్యాలన్నిటి గురించి ఈ గ్రంథంలో రాసినదంతా యిర్మీయా ప్రవచించినట్టు ఆ దేశం మీదికి రప్పిస్తాను.
\q1
\v 14 ఎందుకంటే నేను వాళ్ళ పనులకూ వాళ్ళు చేతులతో చేసిన వాటికీ ప్రతీకారం చేస్తాను. అనేక రాజ్యాలూ, గొప్ప రాజులూ వాళ్ళ చేత సేవ చేయించుకుంటారు.
\s దేవుని కోప పాత్ర
\q1
\s5
\v 15 ఇశ్రాయేలు దేవుడు, యెహోవా నాతో ఇలా చెప్పాడు. <<కోపంతో నిండి ఉన్న మద్యపాత్రను నువ్వు నా చేతిలోనుంచి తీసుకుని, నేను నిన్ను పంపిస్తున్న రాజ్యాలన్నిటికీ దాన్ని తాగించు.
\q1
\v 16 వాళ్ళు దాన్ని తాగి, తూలుతూ పిచ్చివాళ్ళలాగా అయిపోతారు. నేను వాళ్ళ మీదకు పంపిస్తున్న కత్తిని బట్టి వాళ్ళు అలా అవుతారు.>>
\q1
\s5
\v 17 అప్పుడు యెహోవా చేతిలో నుంచి నేను ఆ పాత్రను తీసుకుని, యెహోవా నన్ను పంపిన రాజ్యాలన్నిటికీ దాన్ని తాగించాను.
\q1
\v 18 వాళ్ళు ఈ రోజు ఉన్నట్టుగా అసహ్యకారణంగా, అపహాస్యంగా ఎప్పటికి పాడుగా ఉండడానికి యెరూషలేముకూ యూదా పట్టణాలకూ దాని గొప్ప రాజులకూ దాని అధిపతులకూ తాగించాను.
\q1
\s5
\v 19 మిగతా రాజ్యాలు కూడా తాగాల్సి వచ్చింది. ఐగుప్తురాజు ఫరో, అతని సేవకులూ అతని అధికారులూ అతని పరివారమంతా,
\v 20 అక్కడ ఉన్న మిశ్రిత ప్రజలూ, ఊజు దేశపు రాజులందరూ, ఫిలిష్తీయుల దేశపు రాజులందరూ, అష్కెలోను, గాజా, ఎక్రోను, అష్డోదులో మిగిలిన వాళ్ళూ,
\v 21 ఎదోమీయులు, మోయాబీయులు, అమ్మోనీయులు దానిలోనిది తాగుతారు.
\q1
\s5
\v 22 ఇంకా తూరు రాజులందరూ, సీదోను రాజులందరూ, సముద్రానికి అవతలి తీరాల రాజులూ,
\q1
\v 23 దదానీయులు, తేమానీయులు, బూజీయులు, గడ్డపు పక్కల కత్తిరించుకున్నవాళ్ళు,
\q1
\s5
\v 24 అరేబియా దేశపు రాజులందరూ, ఎడారిలో ఉంటున్న మిశ్రిత ప్రజల రాజులందరూ,
\q1
\v 25 జిమ్రీ రాజులందరూ, ఏలాము రాజులందరూ, మాదీయుల రాజులందరూ,
\q1
\v 26 ఉత్తర దిక్కున దగ్గరగా, దూరంగా ఉన్న రాజులందరూ, భూమి మీద ఉన్న ప్రపంచ రాజ్యాలన్నీ దానిలోనిది తాగుతారు. చివరిగా బబులోను రాజు వాళ్ళ తరువాత తాగుతాడు.
\q1
\s5
\v 27 నువ్వు వాళ్ళతో ఇలా చెప్పు. <<ఇశ్రాయేలు దేవుడు సేనల అధిపతి యెహోవా ఇలా చెబుతున్నాడు, తాగండి! మత్తేక్కే వరకు తాగి, కక్కండి. నేను మీ మీదికి పంపించే కత్తి ఎదుట మళ్ళీ లేవకుండా కూలండి.>>
\q1
\v 28 మేము తాగమని వాళ్ళు నీ చేతిలో నుంచి ఆ పాత్రను తీసుకోకపోతే నువ్వు వాళ్ళతో ఇలా చెప్పు, మీరు తప్పకుండా దాన్ని తాగాలని సేనల అధిపతి యెహోవా చెబుతున్నాడు.
\q1
\v 29 నా పేరున్న పట్టణానికి నేను విపత్తు రప్పించబోతున్నాను. మీకు శిక్ష లేకుండా పోతుందా? మీరు తప్పించుకోలేరు. భూమి మీద ఉంటున్న వారందరి మీదికి నేను కత్తిని రప్పిస్తున్నాను. ఇది సేనల ప్రభువు యెహోవా వాక్కు.
\q1
\s5
\v 30 కాబట్టి యిర్మీయా! నువ్వు ఈ మాటలన్నీ వారికి ప్రకటించు. వారికిలా చెప్పు<<యెహోవా పైనుంచి గర్జిస్తున్నాడు. తన పవిత్ర నివాసం నుంచి తన స్వరాన్ని వినిపిస్తున్నాడు. తన నివాస స్థలానికి విరోధంగా గర్జిస్తున్నాడు. దేశంలో నివసిస్తున్న వారందరికీ వ్యతిరేకంగా కేకలు వేస్తున్నాడు. ద్రాక్షగానుగ తొక్కే వారిలాగా అరుస్తున్నాడు.
\q1
\v 31 ప్రపంచమంతా ఆ సందడి చేరింది. యెహోవా రాజ్యాలతో నేరారోపణ చేస్తున్నాడు. మనుషులందరికీ ఆయన తీర్పు తీరుస్తాడు. ఆయన దుర్మార్గులను కత్తికి గురిచేస్తాడు.>> ఇది యెహోవా వాక్కు.
\q1
\s5
\v 32 సేనల ప్రభువు యెహోవా ఇలా చెబుతున్నాడు. <<ఒక రాజ్యం నుంచి మరొక రాజ్యానికి విపత్తు వ్యాపిస్తూ ఉంది. భూదిగంతాల నుంచి గొప్ప తుఫాను బయలుదేరుతూ ఉంది.
\q1
\v 33 ఆ రోజు యెహోవా చేత హతం అయిన వాళ్ళు భూమి ఒక అంచు నుంచి మరొక అంచు వరకూ ఉంటారు. వాళ్ళ కోసం ఎవరూ ఏడవరు. వాళ్ళను పోగుచేయరు. పాతిపెట్టరు. పెంటలాగా వారి శవాలు నేల మీద పడి ఉంటాయి.
\q1
\s5
\v 34 కాపరులారా, ఏడవండి. సాయం కోసం కేకలు పెట్టండి. మందలోని నాయకులారా, నేల మీద పడి దొర్లండి. మీరు చావడానికి రోజులు దగ్గరపడ్డాయి. మీరు చెదిరిపోయే రోజు వచ్చింది. ఎంపిక చేసిన గొర్రె పొట్టేళ్ళు కింద పడినట్టు మీరు పడతారు.
\q1
\v 35 కాపరులకు దాక్కునే చోటు ఉండదు. మందలోని శ్రేష్ఠమైన వాటికి దాక్కునే చోటు లేదు.
\q1
\v 36 వినండి, కాపరుల కేకలూ, మందలోని శ్రేష్ఠమైన వాటి గోల వినిపిస్తూ ఉంది. యెహోవా వాళ్ళ పచ్చిక మైదానాలను నాశనం చేస్తున్నాడు.
\q1
\s5
\v 37 ప్రశాంతంగా ఉన్న మైదానాలు యెహోవా కోపాగ్నికి పాడైపోతున్నాయి.
\q1
\v 38 గుహలోనుంచి కొదమ సింహం వచ్చినట్టు ఆయన బయలుదేరాడు. ఎందుకంటే వాళ్ళ దేశం ఆయన కోపాగ్నికి నాశనమైపోతుంది.>>
\s5
\c 26
\s యిర్మీయాను చంపే ప్రయత్నం
\p
\v 1 యోషీయా కొడుకు యూదా రాజు యెహోయాకీము పరిపాలన మొదట్లో యెహోవా దగ్గర నుంచి సందేశం ఇలా వచ్చింది,
\p
\v 2 <<యెహోవా చెప్పేదేమిటంటే, నువ్వు యెహోవా మందిర ఆవరణంలో నిలబడి, నేను నీకు ఆజ్ఞాపించే మాటలన్నిటిని యెహోవా మందిరంలో ఆరాధించడానికి వచ్చే యూదా పౌరులందరికీ ప్రకటించు. వాటిలో ఒక మాట కూడా విడిచిపెట్టవద్దు.
\v 3 ఒకవేళ వాళ్ళు విని తమ దుర్మార్గాన్ని విడిచిపెడితే వాళ్ల మీదికి రప్పిస్తానని చెప్పిన విపత్తును తప్పిస్తాను.>>
\p
\s5
\v 4 నువ్వు వారితో ఈ మాట చెప్పాలి. <<యెహోవా చెప్పేదేమిటంటే,
\v 5 మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోతే, నేను ప్రతిసారీ పంపిస్తున్న నా సేవకులైన ప్రవక్తల మాటలు మీరు వినకపోతే
\v 6 నేను షిలోహుకు చేసినట్టు ఈ మందిరానికి కూడా చేస్తాను. ఈ పట్టణాన్ని భూమిపై ఉన్న రాజ్యాలన్నిటికీ శాపంగా చేస్తాను.>>
\p
\s5
\v 7 యిర్మీయా యీ మాటలను యెహోవా మందిరంలో పలుకుతూ ఉంటే యాజకులూ ప్రవక్తలూ ప్రజలంతా విన్నారు.
\v 8 అయితే యిర్మీయా యెహోవా చెప్పమని తనకు ఆజ్ఞాపించిన మాటలన్నీ ప్రజలందరికీ చెప్పడం ముగించిన తరువాత యాజకులూ ప్రవక్తలూ ప్రజలంతా అతణ్ణి పట్టుకుని <<నువ్వు తప్పకుండా చావాలి.
\v 9 ఈ మందిరం షిలోహులాగా అవుతుందనీ ఈ పట్టణంలో ఎవరూ నివసించరనీ, పట్టణం పాడైపోతుందనీ యెహోవా పేరున నువ్వు ఎందుకు ప్రకటిస్తున్నావు?>> అన్నారు. ప్రజలంతా యెహోవా మందిరంలో యిర్మీయా చుట్టూ గుమికూడారు.
\p
\s5
\v 10 యూదా అధికారులు ఈ మాటలు విని రాజ భవనంలో నుంచి యెహోవా మందిరానికి వచ్చి, యెహోవా మందిరపు కొత్త ద్వారం ప్రవేశంలో కూర్చున్నారు.
\v 11 యాజకులతో, ప్రవక్తలతో, అధిపతులతో, ప్రజలందరితో వాళ్ళు ఇలా అన్నారు. <<మీరు చెవులారా విన్నట్టుగా ఈ వ్యక్తి ఈ పట్టణానికి వ్యతిరేకంగా ప్రకటిస్తున్నాడు, కాబట్టి ఇతడు చావడం సమంజసమే.>>
\v 12 అప్పుడు యిర్మీయా అధికారులందరితో ప్రజలందరితో ఇలా చెప్పాడు <<<ఈ మందిరానికీ ఈ పట్టణానికీ వ్యతిరేకంగా మీరు విన్న మాటలన్నీ ప్రకటించు> అని యెహోవా నన్ను పంపాడు.
\p
\s5
\v 13 కాబట్టి మీరు ఇప్పుడైనా మీ మార్గాలనూ మీ ప్రవర్తననూ చక్కపరచుకుని మీ యెహోవా దేవుని మాట వినండి. యెహోవా మీమీదికి తేవాలనుకున్న ఆపద రాకుండా చేస్తాడు.
\v 14 ఇదిగో నేను మీ చేతుల్లో ఉన్నాను. మీ దృష్టికేది మంచిదో ఏది సరైనదో అదే నాకు చేయండి.
\v 15 అయితే ఈ మాటలన్నీ చెప్పడానికి నిజంగా యెహోవా మీ దగ్గరికి నన్ను పంపాడు. కాబట్టి, మీరు నన్ను చంపితే నిర్దోషి రక్తాపరాధం మీ మీదికీ ఈ పట్టణం మీదికీ దాని నివాసుల మీదికీ తెచ్చుకున్న వాళ్ళవుతారు. దీనిని మీరు కచ్చితంగా తెలుసుకోవాలి.>>
\p
\s5
\v 16 అప్పుడు అధిపతులు, ప్రజలంతా యాజకులతో ప్రవక్తలతో ఇలా అన్నారు. <<ఈ వ్యక్తి మన యెహోవా దేవుని పేరున మనతో మాట్లాడాడు కాబట్టి ఇతడు చావడం సరి కాదు.>>
\p
\v 17 దేశంలోని పెద్దల్లో కొంతమంది లేచి అక్కడ చేరిన ప్రజలతో,
\p
\s5
\v 18 <<యూదా రాజు హిజ్కియా రోజుల్లో మోరషు ఊరివాడు మీకా ప్రవచిస్తూ ఉండేవాడు. అతడు యూదా ప్రజలందరితో ఇలా చెప్పాడు. సేనల అధిపతి యెహోవా చెప్పేదేమిటంటే, సీయోనును పొలంలాగా దున్నడం జరుగుతుంది. యెరూషలేము రాళ్ల కుప్ప అవుతుంది. మందిరమున్న పర్వతం అరణ్యంలోని కొండలాగా అవుతుంది.
\v 19 యూదా రాజు హిజ్కియా గానీ యూదా ప్రజలు గానీ అతణ్ణి చంపారా? రాజు యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఆయనను వేడుకుంటే వాళ్లకు చేస్తానన్న విపత్తు చేయలేదు కదా! అయితే మన మీదికి మనమే గొప్ప కీడు తెచ్చుకుంటున్నాము>> అని చెప్పారు.
\p
\s5
\v 20 కిర్యత్యారీము వాసి షెమయా కొడుకు ఊరియా అనే ఒకడు యెహోవా పేరున ప్రవచిస్తూ ఉండేవాడు. అతడు యిర్మీయా చెప్పిన మాటల్లాగే ఈ పట్టణానికీ ఈ దేశానికీ వ్యతిరేకంగా ప్రవచించాడు.
\v 21 యెహోయాకీం రాజు, అతని శూరులంతా అధికారులంతా అతని మాటలు విన్నప్పుడు, రాజు అతణ్ణి చంపాలని చూశాడు. ఊరియా అది తెలుసుకుని భయపడి ఐగుప్తుకు పారిపోయాడు.
\p
\s5
\v 22 అయినప్పటికీ యెహోయాకీం రాజు, అక్బోరు కొడుకు ఎల్నాతానునూ అతనితో కూడా కొంతమందిని ఐగుప్తుకు పంపాడు.
\v 23 వాళ్ళు ఐగుప్తు నుంచి ఊరియాను యెహోయాకీం రాజు దగ్గరికి తెచ్చారు. రాజు కత్తితో అతణ్ణి చంపి సాధారణ ప్రజల సమాధుల్లో అతని శవాన్ని పాతిపెట్టాడు.
\v 24 అయితే షాఫాను కొడుకు అహీకాము యిర్మీయాకు సాయపడ్డాడు. అతణ్ణి చంపడానికి ప్రజలకు అప్పగించలేదు.
\s5
\c 27
\s నెబుకద్నెజరుకు యూదా సేవచేయాలి
\p
\v 1 యూదా రాజు యోషీయా కొడుకు యెహోయాకీము పరిపాలించడం మొదలు పెట్టినపుడు యెహోవా దగ్గరనుంచి ఈ సందేశం యిర్మీయాకు వచ్చింది.
\p
\v 2 యెహోవా నాకు ఇలా చెప్పాడు<<నువ్వు కాడి, బేడీలూ చేయించుకుని నీ మెడకు కట్టుకో.
\v 3 ఎదోం, మోయాబు, అమ్మోను, తూరు, సీదోను దేశాల రాజుల దగ్గర నుంచి యూదా రాజు సిద్కియా దగ్గరికి యెరూషలేముకు రాయబారులు వచ్చారు.
\v 4 ఆ రాయబారులు తమ యజమానులకు తెలియచేయాలని ఈ ఆజ్ఞ వారితో చెప్పు, సేనల ప్రభువు ఇశ్రాయేలు దేవుడు చెప్పేదేమిటంటే, మీరు మీ యజమానులకు ఈ విషయం తెలియజేయండి.
\p
\s5
\v 5 <నా గొప్ప బలంతో చాచిన చేతితో భూమిని చేశాను. భూమి మీద ఉన్న మట్టినీ జంతువులనూ నేనే చేశాను. వాటిని నా దృష్టిలో ఎవరు సరిగా ఉన్నారో వారికే ఇస్తాను.
\v 6 ఇప్పుడు దేశాలన్నిటినీ నా సేవకుడూ బబులోను రాజు అయిన నెబుకద్నెజరుకు ఇస్తున్నాను. భూమి మీద తిరిగే జంతువులను కూడా అతణ్ణి సేవించడానికి ఇస్తున్నాను.
\v 7 అతని స్వదేశానికి అంతం వచ్చే వరకూ రాజ్యాలన్నీ అతనికీ అతని కొడుకుకీ అతని మనుమడికీ సేవ చేస్తారు. ఆ తర్వాత అనేక రాజ్యాలూ గొప్ప రాజులూ అతనికి వ్యతిరేకంగా పనిచేస్తారు.
\p
\s5
\v 8 ఏ దేశం, ఏ రాజ్యం బబులోను రాజు నెబుకద్నెజరు సేవ చేయదో, బబులోను రాజు కాడిని తన మెడ మీద పెట్టుకోదో ఆ దేశాన్ని నేను శిక్షిస్తాను. అతని చేత బొత్తిగా నాశనం చేయించే వరకూ ఆ దేశాన్ని కత్తితో కరువుతో అంటు రోగాలతో శిక్షిస్తాను.> ఇది యెహోవా వాక్కు.
\p
\s5
\v 9 కాబట్టి <మీరు బబులోను రాజుకు సేవ చేయవద్దు> అని మీ ప్రవక్తలూ సోదెగాళ్ళూ, కలల అర్థం చెప్పేవాళ్ళూ, శకునాలు చూసేవాళ్ళూ, మాంత్రికులూ చెబుతుంటే వినొద్దు.
\v 10 మిమ్మల్ని మీ దేశం నుంచి దూరంగా పంపించడానికి వాళ్ళు అబద్ధ ప్రవచనాలు మీకు ప్రకటిస్తున్నారు. నేను మిమ్మల్ని వెళ్లగొడతాను. మీరు నాశనమవుతారు.
\v 11 అయితే ఏ ప్రజలు బబులోను రాజు కాడి కిందికి తమ మెడను వంచి అతనికి సేవ చేస్తారో ఆ ప్రజలను తమ దేశంలో నెమ్మదితో ఉండనిస్తాను. వాళ్ళు తమ భూమిని సాగుచేసుకుంటూ దానిలోనే కాపురముంటారు.>> ఇది యెహోవా వాక్కు.
\p
\s5
\v 12 నేను యూదా రాజు సిద్కియాతో మాట్లాడి ఈ విషయం చెప్పాను. <<బబులోను రాజు కాడిని మీ మెడ మీద పెట్టుకుని, అతనికీ అతని ప్రజలకూ సేవ చేస్తే మీరు బతుకుతారు.
\v 13 బబులోను రాజుకు సేవ చేయని ప్రజలు కత్తితో గానీ కరువుతో గానీ అంటురోగాలతోగానీ చస్తారు అని యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు. నువ్వు, నీ ప్రజలు అలా ఎందుకు చావాలి?
\p
\s5
\v 14 కాబట్టి <మీరు బబులోను రాజుకు సేవ చేయవద్దు> అని మీతో చెప్పే ప్రవక్తలు అబద్దమే ప్రవచిస్తున్నారు. నేను వాళ్ళను పంపలేదు, వాళ్ళ మాటలు వినవద్దు.>> ఇది యెహోవా వాక్కు.
\v 15 <<మిమ్మల్ని మీ దేశం నుంచి దూరంగా పంపించడానికి వాళ్ళు అబద్ధ ప్రవచనాలు మీకు ప్రకటిస్తున్నారు. నేను మిమ్మల్ని వెళ్లగొడతాను. మీరూ మీకు ప్రవచించే మీ ప్రవక్తలు నాశనమవుతారు.>>
\p
\s5
\v 16 యాజకులతో ప్రజలందరితో నేను ఈ మాటలు చెప్పాను. <<యెహోవా చెప్పేదేమిటంటే, <యెహోవా మందిరపు పాత్రలను ఇప్పుడే త్వరగా బబులోను నుంచి మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది.> అని ప్రవచించే మీ ప్రవక్తలు మీతో అబద్ధాలు చెబుతున్నారు.
\v 17 వాళ్ళ మాటలు వినవద్దు. బబులోను రాజుకు సేవ చేస్తే మీరు బతుకుతారు. ఈ పట్టణం ఎందుకు పాడైపోవాలి?
\v 18 వాళ్ళు ప్రవక్తలైతే యెహోవా సందేశం వాళ్ళతో ఉంటే యెహోవా మందిరంలో యూదా రాజు మందిరంలో యెరూషలేములో మిగిలిన పాత్రలు బబులోనుకు తరలి పోకుండా వాళ్ళు సేనల ప్రభువు యెహోవాను బతిమాలుకోవడం మంచిది.>>
\p
\s5
\v 19 బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేములోనుంచి యెహోయాకీము కొడుకు యెకొన్యాను యూదా యెరూషలేముల ప్రధానులందరినీ బబులోనుకు బందీలుగా తీసుకుపోయినప్పుడు,
\v 20 అతడు విడిచి పెట్టిన స్థంభాలు, సముద్రం, పీఠాలు, ఈ పట్టణంలో మిగిలిన పాత్రలను గురించి సేనల ప్రభువు యెహోవా ఇలా సెలవిస్తున్నాడు.
\p
\s5
\v 21 యెహోవా మందిరంలో యూదా రాజు రాజ భవనంలో యెరూషలేములోని మిగిలిన పాత్రలను గురించి ఇశ్రాయేలు దేవుడు సేనల అధిపతి అయిన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు,
\v 22 <<వాటిని బబులోనుకు తెస్తారు. నేను వాటి కోసం అక్కడికి వెళ్ళే రోజు వరకు అవి అక్కడే ఉంటాయి. అప్పుడు నేను వాటిని మళ్ళీ తెప్పించి ఈ స్థలంలో ఉంచుతాను. ఇది యెహోవా వాక్కు.>>
\s5
\c 28
\s అబద్ధ ప్రవక్త హనన్యా
\p
\v 1 యూదా రాజు సిద్కియా పరిపాలన మొదట్లో నాలుగో సంవత్సరం అయిదో నెలలో గిబియోనువాడు, అజ్జూరు ప్రవక్త కొడుకు హనన్యా యాజకుల ఎదుట, ప్రజలందరి ఎదుట యెహోవా మందిరంలో నాతో ఇలా అన్నాడు,
\v 2 <<ఇశ్రాయేలు దేవుడు, సేనల అధిపతి యెహోవా ఇలా చెబుతున్నాడు, <నేను బబులోను రాజు కాడిని విరిచేశాను.
\p
\s5
\v 3 రెండేళ్లలో బబులోను రాజు నెబుకద్నెజరు ఈ స్థలంలో నుంచి బబులోనుకు తీసుకుపోయిన యెహోవా మందిరంలోని పాత్రలన్నీ ఇక్కడికి మళ్ళీ తెప్పిస్తాను.
\v 4 బబులోను రాజు కాడిని విరగగొట్టి యెహోయాకీము కొడుకు యూదా రాజు యెకొన్యాను, బబులోనుకు బందీలుగా తీసుకుపోయిన యూదులందరినీ ఈ స్థలానికి తిరిగి రప్పిస్తాను.> ఇదే యెహోవా వాక్కు.>>
\p
\s5
\v 5 అప్పుడు ప్రవక్త అయిన యిర్మీయా యాజకుల ఎదుట, యెహోవా మందిరంలో నిలబడి ఉన్న ప్రజలందరి ఎదుట హనన్యా ప్రవక్తతో ఇలా అన్నాడు,
\v 6 <<యెహోవా దీనిని చేస్తాడు గాక! యెహోవా మందిరపు పాత్రలన్నీ బందీలుగా తీసుకుపోయిన వారందరినీ యెహోవా బబులోనులో నుంచి ఈ స్థలానికి తెప్పించి నువ్వు ప్రకటించిన మాటలను నెరవేరుస్తాడు గాక!
\v 7 అయినా నువ్వు వింటుండగా ఈ ప్రజలందరూ వింటుండగా నేను చెబుతున్న మాట విను.
\p
\s5
\v 8 నాకూ నీకూ ముందున్న ప్రవక్తలు, అనేక దేశాలకూ గొప్ప రాజ్యాలకూ వ్యతిరేకంగా యుద్ధాలు జరుగుతాయనీ కీడు సంభవిస్తుందనీ అంటురోగాలు వస్తాయనీ ఎప్పటినుంచో ప్రవచిస్తూ ఉన్నారు.
\v 9 అయితే క్షేమం కలుగుతుందని ప్రకటించే ప్రవక్త మాట నెరవేరితే అతన్ని నిజంగా యెహోవాయే పంపాడని తెలుసుకోవచ్చు,>> అని యిర్మీయా ప్రవక్త చెప్పాడు.
\p
\s5
\v 10 అయితే హనన్యా ప్రవక్త, యిర్మీయా ప్రవక్త మెడ మీదనుంచి ఆ కాడిని తీసి దాన్ని విరిచేశాడు.
\v 11 ప్రజలందరి ఎదుట హనన్యా ఇలా అన్నాడు. <<యెహోవా ఇలా చెబుతున్నాడు, <రెండేళ్ళలో నేను బబులోను రాజు నెబుకద్నెజరు కాడిని రాజ్యాలన్నిటి మెడమీద నుంచి తొలగించి దానిని విరిచివేస్తాను.> >> అప్పుడు యిర్మీయా ప్రవక్త తన దారిన వెళ్లిపోయాడు.
\p
\s5
\v 12 హనన్యా, యిర్మీయా మెడ మీద ఉన్న కాడిని విరిచిన తరువాత యెహోవా దగ్గర నుంచి ఈ సందేశం యిర్మీయాకు వచ్చింది.
\v 13 <<నువ్వు పోయి హనన్యాతో ఇలా చెప్పు, <యెహోవా ఇలా చెబుతున్నాడు, నువ్వు కొయ్య కాడిని విరిచావు గదా! దానికి బదులు ఇనుప కాడిని నేను చేయిస్తాను.>
\v 14 ఇశ్రాయేలు దేవుడు సేనల ప్రభువు యెహోవా ఇలా చెబుతున్నాడు. <ఈ ప్రజలంతా బబులోను రాజు నెబుకద్నెజరుకు సేవ చేయాలని వారి మెడ మీద ఇనుప కాడి ఉంచాను. కాబట్టి వాళ్ళు అతనికి సేవ చేస్తారు. భూజంతువులను కూడా నేను అతనికి అప్పగించాను.> >>
\p
\s5
\v 15 అప్పుడు యిర్మీయా ప్రవక్త, హనన్యాతో ఇలా అన్నాడు. <<హనన్యా, విను. యెహోవా నిన్ను పంపలేదు, ఈ ప్రజల చేత అబద్ధాలను నమ్మించావు.
\v 16 కాబట్టి యెహోవా ఈ మాట చెబుతున్నాడు, <నేను నిన్ను భూమి మీద లేకుండా చేయబోతున్నాను. యెహోవా మీద నమ్మకం ఉంచకుండా చేయడానికి నువ్వు ప్రజలను ప్రేరేపించావు. కాబట్టి ఈ సంవత్సరమే నువ్వు చనిపోతావు> >> అని చెప్పాడు.
\v 17 ఆ సంవత్సరం ఏడో నెలలో హనన్యా ప్రవక్త చనిపోయాడు.
\s5
\c 29
\s చెర ఉన్న వారికి లేఖ
\p
\v 1 యెరూషలేము నుంచి నెబుకద్నెజరు బబులోనుకు చెరపట్టి తీసుకెళ్ళిన వాళ్ళలో ఉన్న యాజకులకూ, ప్రవక్తలకూ, ప్రజలందరికీ ప్రవక్త అయిన యిర్మీయా యెరూషలేము నుంచి పంపించిన వ్రాత చుట్ట లోని మాటలు ఇవి.
\v 2 రాజైన యెకొన్యా, రాజమాత, ఇంకా యూదాలో, యెరూషలేములో ఉన్న ఉన్నతాధికారులూ, శిల్పకారులూ, కంసాలులూ, యెరూషలేము నుంచి వెళ్ళిపోయిన తరువాత ఇది జరిగింది.
\v 3 అతడు ఈ పత్రాన్ని యూదా రాజైన సిద్కియా పంపిన షాఫాను కొడుకు ఎల్యాశా, హిల్కీయా కొడుకు గెమర్యాల చేత బబులోను రాజైన నెబుకద్నెజరుకు పంపాడు.
\p
\s5
\v 4 అందులో ఇలా ఉంది <<ఇశ్రాయేలు దేవుడూ, సేనల ప్రభువూ అయిన యెహోవా తన ఉద్దేశం చొప్పున బబులోనుకు బందీలుగా వెళ్ళిన వాళ్ళందరికీ ఇలా చెబుతున్నాడు,
\v 5 <ఇళ్ళు కట్టుకుని వాటిలో నివాసం ఉండండి. తోటలు నాటి వాటి ఫలాలు అనుభవించండి.
\p
\s5
\v 6 పెళ్ళిళ్ళు చేసుకుని కొడుకులనూ కూతుళ్ళనూ కనండి. అక్కడ మీరు తక్కువ సంఖ్యలో ఉండకుండా అభివృద్ధి పొందడానికి మీ కొడుకులకూ, కూతుళ్ళకూ పెళ్ళిళ్ళు చేసి వాళ్ళను కొడుకులూ కూతుళ్ళూ కననివ్వండి.
\v 7 నేను మిమ్మల్ని బందీలుగా తీసుకెళ్ళిన పట్టణం క్షేమం కోరి దాని కోసం యెహోవాకు ప్రార్థన చేయండి. ఎందుకంటే, దానికి క్షేమం కలిగితే మీకు క్షేమం కలుగుతుంది.>
\p
\s5
\v 8 ఇశ్రాయేలు దేవుడూ, సేనల ప్రభువూ అయిన యెహోవా ఇలా అంటున్నాడు, <మీ మధ్య ఉన్న ప్రవక్తలు, మంత్రగాళ్ళు మిమ్మల్ని మోసం చెయ్యనివ్వకుండా చూసుకోండి. మీలో కలలు కనే వాళ్ళు చెప్పే మాటలు వినకండి.
\v 9 వాళ్ళు నా పేరట అబద్ధ ప్రవచనాలు మీతో చెప్తారు. నేను వాళ్ళను పంపలేదు.> ఇదే యెహోవా వాక్కు.
\p
\s5
\v 10 ఎందుకంటే యెహోవా ఇలా అంటున్నాడు, <బబులోను మిమ్మల్ని డెబ్భై సంవత్సరాలు పాలించిన తరువాత, నేను మీకు సాయం చేసి, నేను మీకోసం పలికిన శుభ వచనం నెరవేర్చి, ఈ స్థలానికి మిమ్మల్ని తిరిగి తీసుకొస్తాను.
\v 11 ఎందుకంటే, మీ కోసం నేను ఉద్దేశించిన ప్రణాళికలు నాకే తెలుసు,> ఇది యెహోవా వాక్కు. <అవి మీకు ఒక భవిష్యత్తునూ, నిరీక్షణనూ కలిగించే సమాధానకరమైన ప్రణాళికలే. అవి హానికరమైనవి కావు.
\p
\s5
\v 12 అప్పుడు మీరు నన్ను వెతికి, నాకు ప్రార్థన చేస్తారు. అప్పుడు నేను మీ మాట ఆలకిస్తాను.
\v 13 మీరు పూర్ణమనస్సుతో నన్ను అన్వేషిస్తారు కాబట్టి, నన్ను కనుగొంటారు.
\v 14 అప్పుడు నేను మీకు దొరుకుతాను,> ఇది యెహోవా వాక్కు. <తరువాత, నేను మిమ్మల్ని నిర్బంధంలో నుంచి రప్పించి, మిమ్మల్ని చెదరగొట్టిన దేశాల్లోనుంచి, స్థలాల్లోనుంచి మిమ్మల్ని పోగు చేస్తాను.> ఇది యెహోవా వాక్కు. <ఎక్కడినుంచి మిమ్మల్ని బందీలుగా పంపానో, అక్కడికే మిమ్మల్ని మళ్ళీ తీసుకొస్తాను,>
\p
\s5
\v 15 బబులోనులో యెహోవా మాకు ప్రవక్తలను నియమించాడని మీరు అన్నారు గనుక,
\v 16 దావీదు సింహాసనం మీద కూర్చున్న రాజుతో, మీతోబాటు బందీలుగా వెళ్ళకుండా ఈ పట్టణంలో నివాసం ఉన్న మీ సహోదరులతో, ప్రజలందరితో యెహోవా ఈ మాట అంటున్నాడు,
\v 17 సేనల ప్రభువు అయిన యెహోవా ఇలా అంటున్నాడు, <నేను వాళ్ళ మీదికి ఖడ్గం, కరువు, తెగులు పంపబోతున్నాను. తినడానికి వీలు లేని కుళ్ళిపోయిన అంజూరు పళ్ళలా వాళ్ళను చేస్తాను.
\p
\s5
\v 18 తరువాత ఖడ్గంతో, కరువుతో, తెగులుతో నేను వాళ్ళను తరుముతాను. భూమి మీద ఉన్న రాజ్యాలన్నిటి దృష్టిలో వాళ్లను ఒక అసహ్యంగా చేస్తాను. నేను వాళ్ళను చెదరగొట్టిన దేశాల్లో వాళ్ళను శాపానికీ, తృణీకారానికీ, ఎగతాళికీ ప్రతీకగా చేస్తాను.
\v 19 ఎందుకంటే వాళ్ళు నా మాట వినలేదు,> ఇది యెహోవా వాక్కు. <నా సేవకులైన ప్రవక్తల ద్వారా నా వాక్కు పదేపదే పంపాను. కాని, మీరు వినలేదు> ఇది యెహోవా వాక్కు.>>
\p
\s5
\v 20 <<నేను యెరూషలేము నుంచి బబులోనుకు బందీలుగా పంపిన ప్రజలారా, మీరందరూ యెహోవా మాట వినండి.
\p
\v 21 నా పేరును బట్టి మీకు అబద్ధ ప్రవచనాలు ప్రకటించే కోలాయా కొడుకు అహాబు గురించి, మయశేయా కొడుకు సిద్కియా గురించి, ఇశ్రాయేలు దేవుడూ, సేనల ప్రభువు అయిన యెహోవా ఇలా అంటున్నాడు, చూడండి, బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి వాళ్ళను అప్పగించబోతున్నాను. మీ కళ్ళ ఎదుట అతడు వాళ్ళను చంపుతాడు.
\p
\s5
\v 22 అప్పుడు వీళ్ళ గురించి బబులోనులో ఉన్న వాళ్ళందరూ శాపవచనాలు పలుకుతారు. <బబులోను రాజు అగ్నిలో కాల్పించిన సిద్కియాలాగా, అహాబులాగా యెహోవా నిన్ను చేస్తాడు గాక,> అని శాపం పెడతారు.
\v 23 ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, వాళ్ళు ఇశ్రాయేలీయుల్లో దుర్మార్గం జరిగిస్తూ, తమ పొరుగువాళ్ళ భార్యలతో వ్యభిచారం చేస్తూ, నేను వాళ్లకు ప్రకటించని అబద్ధపు మాటలు నా పేరట ప్రకటించారు. నేనే ఈ సంగతి తెలుసుకున్నాను, నేనే దానికి సాక్షం,>> ఇదే యెహోవా వాక్కు.
\s షెమయాకు లేఖ
\p
\s5
\v 24 <<నెహెలామీయుడైన షెమయా గురించి ఇలా చెప్పు.
\v 25 ఇశ్రాయేలు దేవుడూ, సేనల ప్రభువు అయిన యెహోవా ఇలా అంటున్నాడు, యెరూషలేములో ఉన్న ప్రజలందరికీ, యాజకుడైన మయశేయా కొడుకు జెఫన్యాకూ, యాజకులకందరికీ, నీ సొంత పేరుతో ఉత్తరాలు పంపి,
\v 26 <యాజకుడైన యెహోయాదాకు బదులుగా యెహోవా మందిర విషయాల్లో విచారణకర్త అయిన యాజకునిగా యెహోవా నిన్ను నియమించాడు. వెర్రివాళ్లై తమను తాము ప్రవక్తలుగా ఏర్పరచుకున్న వాళ్ళను నువ్వు సంకెళ్లతో బంధించి బొండలో బిగించాలి> అన్నావు.
\p
\s5
\v 27 <కాబట్టి ఇప్పుడు, నీకు ప్రత్యర్ధిగా, తనను తాను ప్రవక్తగా చేసుకున్న అనాతోతీయుడైన యిర్మీయాను నువ్వెందుకు చీవాట్లు పెట్టలేదు?
\v 28 మీరు ఇక్కడ చాలాకాలం ఉంటారు. ఇళ్ళు కట్టుకుని వాటిలో నివాసం ఉండండి, తోటలు నాటి వాటి ఫలాలు తినండి,> అని బబులోనులో ఉన్న మాకు అతడు వర్తమానం పంపాడు,>>
\v 29 అప్పుడు యాజకుడైన జెఫన్యా, ప్రవక్త అయిన యిర్మీయా వింటూ ఉండగా ఆ పత్రికను చదివి వినిపించాడు.
\p
\s5
\v 30 అప్పుడు యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు,
\v 31 <<బందీలుగా ఉన్న వాళ్ళందరికీ నువ్వు కబురంపి ఇలా చెప్పు, <యెహోవా నెహెలామీయుడైన షెమయా గురించి ఇలా అంటున్నాడు, నేను అతణ్ణి పంపకపోయినా, షెమయా మీకు ప్రవచించి మీరు అబద్ధపు మాటలు నమ్మేలా చేశాడు కాబట్టి,
\v 32 నెహెలామీయుడైన షెమయా యెహోవాకు వ్యతిరేకంగా అబద్ధం ప్రకటించాడు కాబట్టి అతన్నీ, అతని సంతానాన్నీ నేను శిక్షించబోతున్నాను. ఈ ప్రజల్లో కాపురం ఉండేవాడు ఒక్కడూ అతనికి మిగిలి ఉండడు. నా ప్రజలకు నేను చేసే మేలు అతడు చూడడు.> ఇది యెహోవా వాక్కు.>>
\s5
\c 30
\s ఇశ్రాయేలను చెర నుండి విడిపిస్తాను
\p
\v 1 ఇది యెహోవా నుంచి యిర్మీయాకు వచ్చిన వాక్కు,
\v 2 <<ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు,
\v 3 <రాబోయే రోజుల్లో నేను ఇశ్రాయేలు వాళ్ళూ, యూదా వాళ్ళైన నా ప్రజలను చెరనుంచి విడిపించి, వాళ్ళ పితరులకు నేనిచ్చిన దేశాన్ని వారు స్వాధీనం చేసుకునేలా వాళ్ళను తిరిగి రప్పిస్తాను,> అని యెహోవానైన నేను చెప్పాను. కాబట్టి, నేను నీతో చెప్పిన మాటలన్నీ ఒక రాతచుట్టలో రాయి.>>
\p
\s5
\v 4 యెహోవా ఇశ్రాయేలు వాళ్ళ గురించి, యూదా వాళ్ళ గురించి చెప్పిన మాటలివి.
\v 5 <<యెహోవా ఇలా అంటున్నాడు, <భయంతో వణుకుతున్న స్వరం మేం విన్నాం. ఆ స్వరంలో శాంతి లేదు.
\q1
\s5
\v 6 ప్రసూతి వేదనతో ఒక పురుషుడు బిడ్డను కనగలడా? మీరు అడిగి తెలుసుకోండి. ప్రతి యువకుడు తన నడుము మీద చేతులెందుకు పెట్టుకుంటున్నాడు? ప్రసవ వేదన పడే స్త్రీలా వాళ్ళ ముఖాలు ఎందుకు పాలిపోయాయి?
\q1
\v 7 అయ్యో, ఎంత భయంకరమైన రోజు! అలాంటి రోజు ఇంకొకటి రాదు. అది యాకోబు సంతతి వాళ్లకు ఆందోళన కలిగించే సమయం. అయినా దానిలోనుంచి అతనికి రక్షణ దొరుకుతుంది.> >>
\p
\s5
\v 8 సేనల ప్రభువు అయిన యెహోవా ఇలా అంటున్నాడు <<ఆ రోజు, నీ మెడ మీద ఉన్న నీ కాడి విరిచి, నేను నీ బంధకాలు తెంపుతాను. ఇంక విదేశీయులు నీ చేత దాస్యం చేయించుకోరు.
\v 9 కాని, వాళ్ళు తమ దేవుడైన యెహోవాను ఆరాధించి, నేను వాళ్ళ మీద రాజుగా చేసే తమ రాజైన దావీదును సేవిస్తారు.
\q1
\s5
\v 10 కాబట్టి, నా సేవకుడవైన యాకోబూ, భయపడకు, యెహోవా చేప్పేదేమంటే, <ఇశ్రాయేలూ, దిగులు పడకు. దూరంగా ఉన్న నిన్ను, బందీలుగా ఆ దేశంలో ఉన్న నీ సంతతి వాళ్ళను, నేను రక్షించబోతున్నాను. యాకోబు సంతతి తిరిగి వచ్చి, శాంతి కలిగి ఉంటుంది. అతడు సురక్షితంగా ఉంటాడు, భయభీతులు ఇంక ఉండవు.
\q1
\v 11 ఎందుకంటే, నేను నీతో ఉన్నాను,> యెహోవా వాక్కు ఇదే, <నిన్ను రక్షించడానికి నేను నీకు తోడుగా ఉన్నాను, నిన్ను ఏ దేశాల్లోకైతే చెదరగొట్టానో, ఆ దేశాలన్నిటినీ నేను సమూల నాశనం చేస్తాను. కాని, నిన్ను మాత్రం పూర్తిగా నాశనం చెయ్యను. అయితే నిన్ను తగిన క్రమశిక్షణలో పెడతాను. శిక్ష లేకుండా మాత్రం నిన్ను విడిచిపెట్టను.>
\q1
\s5
\v 12 యెహోవా ఇలా అంటున్నాడు, <నీ దెబ్బ నయం కాదు. నీ గాయం మానని పుండుగా అయ్యింది.
\q1
\v 13 నీ పక్షంగా వాదించేవాళ్ళు ఎవరూ లేరు. నీ పుండు నయం చేసే మందు లేదు.
\q1
\s5
\v 14 నీ ప్రేమికులంతా నిన్ను మరిచిపోయారు. వాళ్ళు నీ కోసం చూడరు. ఎందుకంటే, అధికమైన నీ పాపాలనుబట్టి, నీ గొప్ప దోషాన్నిబట్టి, ఒక కఠినమైన యజమాని పెట్టే క్రమశిక్షణ కింద నిన్ను ఉంచి, ఒక శత్రువు గాయపరిచినట్టు నేను నిన్ను గాయపరిచాను.
\q1
\v 15 నీ గాయాన్నిబట్టి నువ్వు సాయం కోసం అడుగుతున్నావా? నీ బాధ తీరనిది. విస్తారమైన నీ పాపాలనుబట్టి, అనేకమైన నీ దోషాలను బట్టి నేను నీకు ఇలా చేశాను.
\q1
\s5
\v 16 కాబట్టి, నిన్ను దిగమింగే వాళ్ళెవరో, వాళ్ళనే దిగమింగడం జరుగుతుంది. నీ ప్రత్యర్దులందరూ బందీలుగా చెరలోకి వెళ్తారు. నిన్ను దోచుకున్నవాళ్ళు దోపుడు సొమ్ము అవుతారు. నిన్ను కొల్లగొట్టిన వాళ్ళను కొల్లసొమ్ముగా చేస్తాను.
\q1
\v 17 నీకు స్వస్థత తీసుకొస్తాను. నీ గాయాలను స్వస్థపరుస్తాను.> >> ఇదే యెహోవా వాక్కు.<<ఎందుకంటే వాళ్ళు <సీయోను వెలి వేయబడింది. దాన్ని పట్టించుకునే వాడు లేడు> అని నీ గురించి అన్నారు గనుక, నేను ఈ విధంగా చేస్తాను.>>
\q1
\s5
\v 18 యెహోవా ఇలా అంటున్నాడు <<చూడు, యాకోబు నివాసస్థలాలను కరుణించి అతని గుడారాల మీద నేను కనికరం చూపిస్తాను. అప్పుడు శిథిలాల గుట్ట మీద ఒక పట్టణం నిర్మాణం అవుతుంది. ఇదివరకు ఉన్నట్టే ఒక స్థిరమైన నివాసం ఏర్పాటవుతుంది.
\q1
\v 19 అప్పుడు వాటిలోనుంచి ఒక స్తుతి కీర్తన, ఒక వేడుక శబ్దం బయటకు వస్తుంది. ప్రజలు తక్కువ సంఖ్యలో లేకుండా నేను వాళ్ళను విస్తరింపజేస్తాను. అల్పులు కాకుండా నేను వాళ్ళకు ఘనత కలుగజేస్తాను.
\q1
\s5
\v 20 వాళ్ళ ప్రజలు మునుపటిలా ఉంటారు. వాళ్ళను హింసించే వాళ్ళందరినీ నేను శిక్షించినప్పుడు, వాళ్ళ సమాజం నా ఎదుట స్థిరం అవుతుంది.
\q1
\v 21 వాళ్ళ నాయకుడు వాళ్ళల్లోనుంచే వస్తాడు. నేను వాళ్ళను ఆకర్షించినప్పుడు, వాళ్ళు నన్ను సమీపించినప్పుడు, వాళ్ళ మధ్య నుంచి అతడు బయలుదేరుతాడు. నేను ఇది చెయ్యకపోతే, నన్ను సమీపించే సాహసం ఎవడు చెయ్యగలడు?>> ఇది యెహోవా వాక్కు.
\q1
\v 22 <<అప్పుడు మీరు నా ప్రజలుగా ఉంటారు. నేను మీ దేవుడుగా ఉంటాను.
\q1
\s5
\v 23 చూడు, యెహోవా ఉగ్రత పెనుగాలిలా బయలుదేరింది. అది ఎల్లప్పుడూ వీచే పెనుగాలి. అది సుడిగాలిలా దుష్టుల తలల మీద గిరగిరా తిరుగుతుంది.
\q1
\v 24 తన కార్యం జరిగించే వరకూ, తన హృదయాలోచనలు నెరవేర్చే వరకూ యెహోవా కోపాగ్ని చల్లారదు. చివరి రోజుల్లో మీరు దీన్ని అర్థం చేసుకుంటారు.>>
\s5
\c 31
\p
\v 1 యెహోవా వాక్కు ఇదే. <<ఆ కాలంలో నేను ఇశ్రాయేలు వంశం వారందరికీ దేవుడుగా ఉంటాను. వాళ్ళు నాకు ప్రజలుగా ఉంటారు.>>
\p
\v 2 యెహోవా ఇలా అంటున్నాడు,
\q1 <<ఇశ్రాయేలును వధించడానికి వచ్చిన ఖడ్గం బారినుంచి తప్పించుకున్న ప్రజలకు అరణ్యంలో దయ దొరికింది.
\q1
\v 3 గతంలో యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలా అన్నాడు, <ఇశ్రాయేలూ, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించాను.
\q1 కాబట్టి, నిబంధనా నమ్మకత్వంతో నేను నిన్ను ఆకర్షించుకున్నాను.
\q1
\s5
\v 4 ఇశ్రాయేలు కన్యా, నువ్వు నిర్మాణం అయ్యేలా నేను నిన్ను మళ్ళీ కడతాను.
\q1 నువ్వు మళ్ళీ తంబురలు వాయిస్తావు. సంతోష నాట్యాలతో బయటకు వెళ్తావు.
\q1
\v 5 నువ్వు షోమ్రోను కొండల మీద ద్రాక్షావల్లులు మళ్ళీ నాటుతావు. రైతులు వ్యవసాయం చేసి వాటి ఫలాలు అనుభవిస్తారు.
\q1
\v 6 ఎఫ్రాయిము పర్వతాల మీద కాపలావాళ్ళు మన దేవుడైన యెహోవా దగ్గరికి, సీయోనుకు ఎక్కి వెళ్దాం రండి> అని ప్రకటించే రోజు ఒకటి రాబోతుంది.>>
\q1
\s5
\v 7 యెహోవా ఇలా అంటున్నాడు. <<యాకోబునుబట్టి సంతోషంతో కేక పెట్టండి! రాజ్యాల్లో ప్రధానమైన జాతిని బట్టి ఉత్సాహధ్వని చెయ్యండి! స్తుతి వినిపించనివ్వండి. <యెహోవా ఇశ్రాయేలులో మిగిలిన తన ప్రజలను రక్షించాడు> అని పలకండి.
\q1
\s5
\v 8 చూడు, ఉత్తరదేశంలో నుంచి నేను వాళ్ళను తీసుకురాబోతున్నాను. గుడ్డివాళ్ళను, కుంటివాళ్ళను, గర్భిణులను, ప్రసవించడానికి సిద్ధంగా ఉన్న స్త్రీలను భూమి సుదూర ప్రాంతాలనుంచి అందరినీ సమకూరుస్తాను. మహా సమూహమై వారిక్కడికి తిరిగి వస్తారు.
\q1
\v 9 వాళ్ళు ఏడుస్తూ వస్తారు. వాళ్ళు తమ విన్నపాలు చెప్తూ ఉండగా నేను వాళ్ళను నడిపిస్తాను. తిన్ననైన రహదారిలో, సెలయేళ్ల దగ్గరికి వాళ్ళను ప్రయాణం చేయిస్తాను. ఆ మార్గంలో వాళ్ళు తొట్రిల్లరు. ఎందుకంటే ఇశ్రాయేలుకు నేను తండ్రిగా ఉంటాను. ఎఫ్రాయిము నా జ్యేష్ఠసంతానంగా ఉంటాడు.>>
\q1
\s5
\v 10 ప్రజలారా, యెహోవా మాట వినండి. దూరంగా తీరం వెంబడి ఉన్న ప్రాంతాలకు నివేదిక అందించండి. <<ఇశ్రాయేలును చెదరగొట్టినవాడు దాన్ని సమకూర్చి, గొర్రెల కాపరి తన మందను కాపాడేలా కాపాడుతున్నాడు>> అని చెప్పండి.
\q1
\v 11 ఎందుకంటే, మూల్యం చెల్లించి, తనకు మించిన బలం ఉన్న వాడి చేతిలోనుంచి యెహోవా యాకోబును విమోచించాడు.
\q1
\s5
\v 12 వాళ్ళు వచ్చి సీయోను కొండ మీద ఉత్సాహధ్వని చేస్తారు. యెహోవా మంచితనాన్నిబట్టి, మొక్కజొన్నలను బట్టి, ద్రాక్షామధురసాన్నిబట్టి, తైలాన్ని బట్టి, గొర్రెలకూ, పశువులకూ పుట్టే పిల్లలను బట్టి, వాళ్ళు ఆనందిస్తారు. వాళ్ళ జీవితాలు నీళ్ళు పారే తోటలా ఉంటాయి. వాళ్ళు ఇంకెన్నడూ దుఃఖం అనుభవించరు.
\q1
\s5
\v 13 అప్పుడు కన్యలు నాట్యమాడి ఆనందిస్తారు. యువకులూ వృద్ధులూ కలిసి ఉంటారు. <<ఎందుకంటే, వాళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాను. వాళ్ళ మీద కనికరం చూపించి దుఃఖానికి బదులుగా వాళ్ళు ఆనందించేలా చేస్తాను.
\q1
\v 14 సమృద్ధితో యాజకుల జీవితాలను నింపుతాను. నా ప్రజలు నా మంచితనంతో తమను తాము నింపుకుంటారు.>> ఇదే యెహోవా వాక్కు.
\q1
\s5
\v 15 యెహోవా ఇలా అంటున్నాడు. <<రమాలో ఏడుపు, మహా రోదన స్వరం వినిపిస్తూ ఉంది. రాహేలు తన పిల్లల గురించి ఏడుస్తూ ఉంది. ఆమె పిల్లలు చనిపోయిన కారణంగా ఆదరణ పొందడానికి నిరాకరిస్తూ ఉంది.>>
\q1
\s5
\v 16 యెహోవా ఇలా అంటున్నాడు. <<ఏడవకుండా నీ స్వరాన్ని, కన్నీళ్లు కార్చకుండా నీ కళ్ళను ఆపుకో, ఎందుకంటే నీ బాధలు ముగిసాయి. నీ పిల్లలు శత్రువు దేశంలోనుంచి తిరిగి వస్తారు,>> ఇదే యెహోవా వాక్కు.
\q1
\v 17 <<భవిష్యత్తు కోసం నీకు ఒక ఆశ ఉంది. నీ సంతానం తిరిగి తమ సరిహద్దుల్లోకి వస్తారు,>> ఇది యెహోవా వాక్కు.
\q1
\s5
\v 18 <<నేను కచ్చితంగా ఎఫ్రాయిము దుఃఖించడం విన్నాను, <నువ్వు నన్ను శిక్షించావు, నేను శిక్షకు లోనయ్యాను. కాడి మోసే శిక్షణలేని దూడలా ఉన్న నన్ను మళ్ళీ తీసుకురా, అప్పుడు నేను వస్తాను. నువ్వు నా దేవుడవైన యెహోవావు.
\q1
\v 19 నేను నీ వైపు తిరిగిన తరువాత పశ్చాత్తాపం చెందాను. నేను కాడి మోసే శిక్షణ పొందిన తరువాత విచారంతో చాతిని
\f +
\fr 31:19
\fq చాతిని
\ft తొడ
\f* చరుచుకున్నాను. నా చిన్నతనంలో కలిగిన నిందను భరించి నేను అవమానం పొంది సిగ్గుపడ్డాను.>
\q1
\v 20 ఎఫ్రాయిము నా విలువైన బిడ్డ కాదా? అతడు నాకు ప్రియమైన ముద్దు బిడ్డ కాదా? నేనతనికి విరోధంగా మాట్లాడిన ప్రతిసారీ అతన్ని నా ప్రేమపూర్వకమైన మనస్సుకు జ్ఞాపకం తెచ్చుకుంటాను. ఈ రకంగా అతనికోసం నా హృదయం తపిస్తూ ఉంది. కచ్చితంగా నేను అతనిమీద కనికరం చూపిస్తాను.>> ఇది యెహోవా వాక్కు.
\q1
\s5
\v 21 ఇశ్రాయేలు కుమారీ, రహదారిలో గుర్తులు పెట్టించుకో. దోవ చూపే స్థంభాలు పాతించుకో. నువ్వు వెళ్ళాల్సిన సరైన దారివైపు నీ మనస్సు నిలుపుకో. తిరిగి రా, నీ పట్టణాలకు తిరిగిరా.
\q1
\v 22 నమ్మకద్రోహం చేసే అమ్మాయీ, నువ్వు ఎన్నాళ్లు ఇటు అటు తిరుగులాడుతావు? యెహోవా భూమి మీద కొత్త సృష్టి చేశాడు. బలవంతులైన పురుషులను సంరక్షించడానికి స్త్రీలు వారి చుట్టూ ఆవరిస్తున్నారు.
\p
\s5
\v 23 ఇశ్రాయేలు దేవుడూ, సేనల ప్రభువు అయిన యెహోవా ఇలా అంటున్నాడు,
\q1 <<ప్రజలను నేను తమ దేశానికి తిరిగి తీసుకొచ్చిన తరువాత, యూదా దేశంలో, దాని పట్టణాల్లో ప్రజలు ఇలా అంటారు, <పవిత్ర పర్వతమా, న్యాయశీలి నివసించే ప్రదేశమా, యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు గాక,>
\v 24 యూదా, అతని ఇతర పట్టాణాలన్నీ దానిపై సహజీవనం చేస్తారు. రైతులు, గొర్రెల కాపరులు తమ మందలతో సహా అక్కడ ఉంటారు.
\q1
\v 25 ఎందుకంటే అలసినవాళ్ళు తాగడానికి నీళ్ళిస్తాను. దప్పికతో బాధపడుతున్న వాళ్ళందరి కడుపు నింపుతాను.>>
\q1
\v 26 అటు తరువాత నాకు మెలుకువ వచ్చి లేచాను, అప్పుడు, నా నిద్ర నాకు హాయిగా ఉన్నట్టు గమనించాను.
\q1
\s5
\v 27 ఇది యెహోవా వాక్కు. <<చూడు, ఇశ్రాయేలు గృహాల్లో, యూదా గృహాల్లో మనుషుల, మృగాల సంతానపు విత్తనాలు చల్లే రోజులు వస్తున్నాయి.
\q1
\v 28 వాళ్ళను పెల్లగించడానికి, విరగగొట్టడానికి, పడద్రోయడానికి, నాశనం చెయ్యడానికి, హింసించడానికి, నేనెలా కనిపెట్టుకుని ఉన్నానో, అలాగే వాళ్ళను స్థాపించడానికి, నాటడానికి కనిపెట్టుకుని ఉంటాను.>> ఇది యెహోవా వాక్కు.
\q1
\s5
\v 29 <<ఆ రోజుల్లో, <తండ్రులు ద్రాక్షపళ్ళు తిన్నప్పుడు పిల్లల పళ్లు పులిశాయి> అన్న మాట ఇంక ఎవరూ అనరు.
\q1
\v 30 ప్రతి వాడూ తన దోషం కారణంగానే చనిపోతాడు. ఎవడు ద్రాక్షపళ్ళు తింటాడో వాడి పళ్లే పులుస్తాయి.
\q1
\s5
\v 31 చూడు, నేను ఇశ్రాయేలు వాళ్ళతో, యూదా వాళ్ళతో, ఒక కొత్త ఒప్పందం స్థిరం చేసే రోజులు వస్తున్నాయి,>> ఇది యెహోవా వాక్కు.
\q1
\v 32 <<అది ఐగుప్తులోనుంచి నేను వాళ్ళ చెయ్యి పట్టుకుని బయటకు తీసుకొచ్చిన రోజుల్లో వాళ్ళ పితరులతో నేను చేసిన ఒప్పందం లాంటిది కాదు. నేను వాళ్ళకు ఒక భర్తగా ఉన్నా, ఆ రోజుల్లో వాళ్ళు ఆ ఒప్పందం ఉల్లంఘించారు.>> ఇది యెహోవా వాక్కు.
\q1
\s5
\v 33 <<కానీ, ఈ రోజుల తరువాత నేను ఇశ్రాయేలు వాళ్ళతో, యూదా వాళ్ళతో స్థిరం చేసే ఒప్పందం ఇదే, వాళ్ళల్లో నా ధర్మశాస్త్రం ఉంచుతాను. వాళ్ళ హృదయం మీద దాన్ని రాస్తాను. నేను వాళ్లకు దేవుడుగా ఉంటాను, వాళ్ళు నాకు ప్రజలుగా ఉంటారు,>> ఇది యెహోవా వాక్కు.
\q1
\v 34 <<అప్పుడు ప్రతివాడూ తన పొరుగువాడికి, తన సహోదరునికి బోధిస్తూ, <యెహోవాను తెలుసుకో!> అని ఇక చెప్పడు. ఎందుకంటే, వాళ్ళల్లో చిన్నవాడి నుంచి పెద్దవాడి వరకు అందరూ నన్ను తెలుసుకుంటారు. నేను వాళ్ళ దోషాలు క్షమించి, వాళ్ళ పాపాలు ఇంక ఎన్నడూ మనసులో పెట్టుకోను.>> ఇది యెహోవా వాక్కు.
\q1
\s5
\v 35 యెహోవా ఇలా అంటున్నాడు, పగటి వెలుగు కోసం సూర్యుణ్ణి, రాత్రి వెలుగుకోసం చంద్ర నక్షత్రాలను నియమించేవాడు, దాని తరంగాలు ఘోషించేలా సముద్రాన్ని రేపే వాడైన యెహోవా ఆ మాట అంటున్నాడు, సేనల ప్రభువు అయిన యెహోవా అని ఆయనకు పేరు,
\q1
\v 36 <<ఈ శాశ్వతమైన సంగతులు నాకు కనుమరుగైపోయినప్పుడు మాత్రమే తప్ప, ఇశ్రాయేలు సంతతివాళ్ళు నా ఎదుట ఒక శాశ్వత రాజ్యంగా ఉండకుండా ఉండడం జరగదు.>> ఇది యెహోవా వాక్కు.
\q1
\s5
\v 37 యెహోవా ఇలా అంటున్నాడు. <<పైనున్న ఆకాశ వైశాల్యం కొలవడం, కిందున్న భూమి పునాదులు కనుగొనడం సాధ్యం ఐతే తప్ప, ఇశ్రాయేలు సంతానం చేసిన వాటన్నిటిని బట్టి నేను వాళ్ళందరినీ తోసివేయడం జరగదు.>> ఇది యెహోవా వాక్కు.
\p
\s5
\v 38 యెహోవా ఇలా అంటున్నాడు,
\q1 <<హనన్యేలు గోపురం మొదలుకుని మూలగుమ్మం వరకూ నా కోసం ఆ పట్టణం పునర్నిర్మాణం అయ్యే రోజులు వస్తున్నాయి.
\q1
\v 39 అప్పుడు కొలత దారం దానికి ఎదురుగా ఉన్న గారేబు కొండ వరకూ వెళ్ళి గోయా వరకూ తిరిగి వస్తుంది.
\q1
\v 40 శవాలు, బూడిద వేసే లోయ అంతా, కిద్రోను వాగు వరకూ, గుర్రాల గుమ్మం వరకూ, తూర్పువైపు ఉన్న పొలాలన్నీ యెహోవానైన నా కోసం ప్రతిష్ఠితం అవుతాయి. దాన్ని ఇంక ఎన్నడూ పెల్లగించడం, పడదోయడం జరగదు.>>
\s5
\c 32
\s యిర్మీయా పొలం కొనడం
\p
\v 1 యూదా రాజైన సిద్కియా పాలన పదో సంవత్సరంలో, అంటే, నెబుకద్నెజరు ఏలుబడి 18 వ సంవత్సరంలో యెహోవా దగ్గర నుంచి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు.
\p
\v 2 ఆ కాలంలో బబులోను రాజు సైన్యం యెరూషలేముకు ముట్టడి వేస్తూ ఉన్నప్పుడు ప్రవక్త అయిన యిర్మీయా యూదా రాజు గృహ ప్రాంగణంలో ఖైదీగా ఉన్నాడు.
\p
\s5
\v 3 యూదా రాజైన సిద్కియా అతణ్ణి బంధించి, అతనితో మాట్లాడుతూ <<నువ్వు ఇలా ఎందుకు ప్రవచిస్తున్నావు?>> అని అడిగాడు. అందుకు అతడు <<యెహోవా ఇలా అంటున్నాడు, <చూడు, ఈ పట్టణాన్ని బబులోను రాజు చేతికి అప్పగిస్తాను, అతడు దాన్ని స్వాధీనం చేసుకుంటాడు,
\v 4 యూదా రాజైన సిద్కియా కల్దీయుల చేతిలోనుంచి తప్పించుకోలేడు. ఎందుకంటే ఇప్పటికే అతణ్ణి బబులోను రాజు చేతికి అప్పగించడం జరిగింది. అతని నోరు రాజు నోటితో మాట్లాడుతుంది. అతని కళ్ళు రాజు కళ్ళను చూస్తాయి.
\v 5 సిద్కియా బబులోను వెళ్లి నేను అతని పట్ల ఏదో ఒకటి జరిగించే వరకు అక్కడే ఉంటాడు. మీరు కల్దీయులతో యుద్ధం చేశారు కాబట్టి మీరు జయం పొందరు.> >> ఇది యెహోవా వాక్కు.
\p
\s5
\v 6 యిర్మీయా ఇలా అన్నాడు. <<యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు,
\q1
\v 7 చూడు, మీ బాబాయి షల్లూము కొడుకు హనమేలు నీ దగ్గరికి వచ్చి ఇలా అంటాడు, <అనాతోతులో ఉన్న నా భూమిని కొనుక్కో. ఎందుకంటే దాన్ని కొనుక్కునే హక్కు నీకే ఉంటుంది.> >>
\p
\s5
\v 8 అప్పుడు, యెహోవా ప్రకటించినట్టే, మా బాబాయి కొడుకు హనమేలు చెరసాల ప్రాంగణంలో ఉన్న నా దగ్గరికి వచ్చి, నాతో ఇలా అన్నాడు. <<బెన్యామీను దేశంలో అనాతోతులో ఉన్న నా భూమిని నీ కోసం కొనుక్కో. ఎందుకంటే దాని మీద వారసత్వపు హక్కు నీదే.>> అప్పుడు ఇది యెహోవా వాక్కు అని నాకు తెలిసింది.
\v 9 కాబట్టి, మా బాబాయి కొడుకు హనమేలు పొలం కొని, 17 తులాల వెండి
\f +
\fr 32:9
\fq 17 తులాల వెండి
\ft 200 గ్రాములు
\f* తూచి అతనికిచ్చాను.
\p
\s5
\v 10 అప్పుడు నేను దాన్ని తోలు చుట్ట మీద రాసి ముద్ర వేసి సాక్షుల సంతకాలు పెట్టించుకున్నాను. ఆ తరువాత వెండిని తూచి ఇచ్చాను.
\v 11 ఆ తరువాత ఆజ్ఞల, చట్టాల ప్రకారం ముద్ర ఉన్న, ముద్ర లేని దస్తావేజులను తీసుకున్నాను.
\v 12 అప్పుడు మా బాబాయి కొడుకు హనమేలు ఎదుట, ఆ రాత పత్రంలో రాసిన సాక్షుల ఎదుట, చెరసాల ప్రాంగణంలో కూర్చున్న యూదులందరి ఎదుట, నేను మహసేయా కొడుకైన నేరీయా కొడుకు బారూకుకు ఆ దస్తావేజులు అప్పగించి,
\p
\s5
\v 13 వాళ్ళ కళ్ళ ఎదుట బారూకుకు ఇలా ఆజ్ఞాపించాను,
\v 14 <<ఇశ్రాయేలు దేవుడూ, సేనల ప్రభువు అయిన యెహోవా ఇలా అంటున్నాడు, <కొనుగోలు రసీదుతో పాటు ఈ రాత ప్రతులు, అంటే, ముద్ర వేసిన రాత పత్రం, ముద్ర లేని రాత పత్రం తీసుకుని, అవి చాలా కాలం ఉండేలా వాటిని కొత్త కుండలో ఉంచు.>
\v 15 ఇశ్రాయేలు దేవుడూ, సైన్యాలకు అధిపతి అయిన యెహోవా ఇలా అంటున్నాడు, <ఇల్లు, పొలాలు, ద్రాక్షతోటలు మళ్ళీ ఈ దేశంలో కొనడం జరుగుతుంది.> >>
\p
\s5
\v 16 నేరీయా కొడుకు బారూకు చేతికి ఆ రసీదును నేను అప్పగించిన తరువాత, నేను యెహోవాకు ప్రార్థన చేసి ఇలా అన్నాను,
\v 17 <<అయ్యో! ప్రభువైన యెహోవా! చూడు! కేవలం నువ్వే నీ గొప్ప బలంతోను, ఎత్తిన నీ చేతితోనూ భూమ్యాకాశాలను సృష్టించావు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు.
\v 18 నువ్వు వేవేల మందికి నీ నిబంధనా నమ్మకత్వం కనపరుస్తావు. తండ్రుల దోషం వాళ్ళ తరువాత వాళ్ళ పిల్లల ఒడిలో వేస్తావు. నువ్వు గొప్ప శక్తిగల దేవుడవు. సేనల ప్రభువైన యెహోవా అని నీకు పేరు.
\p
\s5
\v 19 జ్ఞానంలో, శక్తిగల కార్యాలు చెయ్యడంలో నువ్వు గొప్పవాడివి. ప్రతివాడి పనులను బట్టి, ప్రవర్తనను బట్టి వాళ్లకు తగినది ఇవ్వడానికి, తెరిచిన నీ కళ్ళు ప్రజలందరి మార్గాలు చూస్తున్నాయి.
\v 20 నువ్వు ఐగుప్తు దేశంలో చేసినట్టు ఈరోజు వరకూ ఇశ్రాయేలు వాళ్ళ మధ్య, ఇతర మనుషుల మధ్య సూచక క్రియలు, గొప్ప కార్యాలు చేస్తూ నీ పేరు ప్రసిద్ధి చేసుకున్నావు.
\v 21 సూచక క్రియలు, గొప్ప కార్యాలు జరిగిస్తూ మహా బలం కలిగి, చాపిన చేతులతో మహాభయం పుట్టించి, ఐగుప్తు దేశంలోనుంచి నీ ప్రజలను బయటకు తీసుకొచ్చావు.
\p
\s5
\v 22 <మీకు ఇస్తాను> అని వాళ్ళ పితరులకు ప్రమాణం చేసి, పాలు తేనెలు ప్రవహించే ఈ దేశాన్ని వాళ్లకు ఇచ్చావు.
\v 23 కాబట్టి, వాళ్ళు ప్రవేశించి, దాన్ని సొంతం చేసుకున్నారు. కాని, నీ మాట వినలేదు. నీ ధర్మశాస్త్రం అనుసరించలేదు. చెయ్యాలని వాళ్లకు నువ్వు ఆజ్ఞాపించిన వాటిలో దేన్నీ చెయ్య లేదు. గనుక, నువ్వు ఈ విపత్తు వాళ్ళ మీదకి రప్పించావు.
\p
\s5
\v 24 చూడు! పట్టణాన్ని స్వాధీనం చేసుకోడానికి ముట్టడి దిబ్బలు పైపైకి లేస్తున్నాయి. ఖడ్గం, కరువు, తెగులు రావడం వల్ల దాని మీద యుద్ధం చేసే కల్దీయుల చేతికి ఈ పట్టణం అప్పగించడం జరిగింది. నువ్వు ఏం చెప్పావో అది జరుగుతూ ఉంది. జరుగుతున్నది నువ్వు చూస్తున్నావు.
\v 25 అప్పుడు స్వయంగా నువ్వే నాతో ఇలా అన్నావు, కల్దీయుల చేతికి ఈ పట్టణం అప్పగించడం జరిగినా, <ఒక పొలం కొనుక్కుని, దానికి సాక్షంగా సాక్షులను పెట్టుకో.> >>
\p
\s5
\v 26 యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు.
\v 27 <<చూడు! నేను యెహోవాను. సమస్త మానవాళికి దేవుణ్ణి. చెయ్యడానికి అసాధ్యమైనది ఏదైనా నాకు ఉందా?>>
\v 28 కాబట్టి యెహోవా ఇలా అంటున్నాడు. <<చూడు, నేను ఈ పట్టణాన్ని కల్దీయుల చేతికి, బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి అప్పగించబోతున్నాను. అతడు దాన్ని స్వాధీనం చేసుకుంటాడు.
\p
\s5
\v 29 ఈ పట్టణం మీద యుద్ధం చేసే కల్దీయులు వచ్చి, ఈ పట్టణానికి నిప్పంటించి, ఏ మిద్దెల మీదైతే ప్రజలు బయలుకు ధూపార్పణ చేసి అన్యదేవుళ్ళకు పానార్పణలు అర్పించి నన్ను రెచ్చగొట్టారో ఆ మిద్దెలన్నిటినీ కాల్చేస్తారు.
\v 30 ఎందుకంటే ఇశ్రాయేలు వాళ్ళు, యూదా వాళ్ళు అయిన ఈ ప్రజలు, కచ్చితంగా తమ చిన్నతనం నుంచి నా ఎదుట చెడుతనమే చేస్తూ వచ్చారు. తమ చేతులతో వాళ్ళు చేసిన పనుల వల్ల వాళ్ళు కచ్చితంగా నాకు కోపమే పుట్టించారు.>> ఇది యెహోవా వాక్కు.
\p
\s5
\v 31 <<ఎందుకంటే, ఇశ్రాయేలు వాళ్ళు, యూదా వాళ్ళు. వాళ్ళ రాజులు, వాళ్ళ ప్రధానులు, వాళ్ళ యాజకులు, వాళ్ళ ప్రవక్తలు, యూదాలోనూ, యెరూషలేములోనూ ఉన్న ప్రజలందరూ నన్ను రెచ్చగొట్టే చెడు ప్రవర్తన అంతటిని బట్టి,
\v 32 ఈ పట్టణాన్ని కట్టిన రోజు నుంచి, ఇది నా ఉగ్రతను, నా కోపాన్ని రేకెత్తిస్తూనే ఉంది. ఈ రోజు వరకూ అది జరుగుతూనే ఉంది. కాబట్టి నేను నా ఎదుట నుంచి దాన్ని తొలగిస్తాను.
\p
\s5
\v 33 నేను ఉదయాన్నే లేచి వాళ్లకు బోధించినా వాళ్ళు నా ఉపదేశం అంగీకరించ లేదు. వాళ్ళు నా వైపు తమ ముఖం తిప్పడానికి బదులుగా తమ వీపును తిప్పారు.
\v 34 తరువాత వాళ్ళు నా పేరు పెట్టిన మందిరాన్ని అపవిత్రం చెయ్యడానికి దానిలో హేయమైన వాటిని పెట్టారు.
\v 35 వాళ్ళు తమ కొడుకులను, కూతుళ్ళను మొలెకుకు బలి ఇవ్వడానికి బెన్‌ హిన్నోము లోయలో ఉన్న బయలు దేవుడికి గుళ్ళు కట్టారు. ఇలా చెయ్యడానికి నేను వాళ్లకు ఆజ్ఞ ఇవ్వలేదు. యూదా వాళ్ళు పాపంలో పడి, ఇంత అసహ్యమైన పనులు చేస్తారని నా హృదయంలో ఆలోచన కూడా ఎప్పుడూ రాలేదు.
\p
\s5
\v 36 కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలు దేవుణ్ణి, యెహోవాను అయిన నేను, ఈ పట్టణం గురించి ఈ మాట చెబుతున్నాను. అది ఖడ్గంతో, కరువుతో, తెగులుతో బాధ పొందింది. దాన్ని బబులోను రాజు చేతికి అప్పగించడం జరిగింది. మీరు ఈ పట్టణం గురించి ఇలా అంటున్నారు,
\v 37 చూడు, నాకు కలిగిన కోపోద్రేకాలతో, మహా ఉగ్రతతో నేను వాళ్ళను వెళ్లగొట్టిన దేశాలన్నిటిలో నుంచి వాళ్ళను సమకూర్చి ఈ స్థలానికి మళ్ళీ తీసుకు రాబోతున్నాను. వాళ్ళు ఇక్కడ క్షేమంతో నివాసం ఉండేలా చేస్తాను.
\p
\s5
\v 38 వాళ్ళు నాకు ప్రజలుగా ఉంటారు. నేను వాళ్లకు దేవుడుగా ఉంటాను.
\v 39 వాళ్ళకూ, వాళ్ళ కొడుకులకూ మేలు కలగడానికి, వాళ్ళు నిత్యం నాకు భయపడేలా నేను వాళ్లకు ఒకే హృదయం, ఒకే మార్గం ఇస్తాను
\v 40 నేను వాళ్ళ నుంచి తిరిగిపోకుండా ఉండేలా వాళ్లతో ఒక నిత్యమైన నిబంధన స్థిరం చేస్తాను. వాళ్లకు మేలు చేసేందుకు, వాళ్ళు నన్ను వెంబడించడం విడిచిపెట్టకుండా ఉండేలా వాళ్ళ హృదయాల్లో నా పట్ల గౌరవం కలిగిస్తాను.
\p
\s5
\v 41 వాళ్లకు మంచి చెయ్యడంలో ఆనందిస్తాను. నా నిండు హృదయంతో, నా ఉనికి అంతటితో కచ్చితంగా ఈ దేశంలో వాళ్ళను నాటుతాను.>>
\p
\v 42 యెహోవా ఇలా అంటున్నాడు. <<నేను ఈ ప్రజల మీదికి ఇంత గొప్ప విపత్తు రప్పించిన విధంగానే నేను వాళ్ళ గురించి చెప్పిన మంచి అంతా వాళ్ళకు ప్రసాదిస్తాను.
\p
\s5
\v 43 <ఇది పాడైపోయింది. దానిలో మనుషులు లేరు. పశువులు లేవు. ఇది కల్దీయుల వశమైపోయింది> అని మీరు చెబుతున్న ఈ దేశంలో, అప్పుడు పొలాల విక్రయం జరుగుతుంది.
\v 44 వాళ్ళు వెండితో పొలాలు కొని ముద్రించిన రాత పత్రాల్లో రాస్తారు. వాళ్ళు బెన్యామీను దేశంలో, యెరూషలేము ప్రాంతాల్లో, యూదా పట్టణాల్లో, మన్యంలోని పట్టణాల్లో, దక్షిణదేశపు పట్టణాల్లో సాక్షులను సమావేశపరుస్తారు. ఎందుకంటే నేను వాళ్ళ భాగ్యం వాళ్లకు మళ్ళీ తీసుకొస్తాను.>>
\q1 ఇది యెహోవా వాక్కు.
\s5
\c 33
\s పునరుద్ధరణ వాగ్దానం
\p
\v 1 యిర్మీయా ఇంకా చెరసాలలో ఉన్నప్పుడు యెహోవా వాక్కు రెండోసారి అతనికి ప్రత్యక్షమై ఇలా చెప్పాడు.
\v 2 <<సృష్టికర్త అయిన యెహోవా, రూపించిన దాన్ని స్థిరపరిచే యెహోవా, యెహోవా అనే పేరు గలవాడు ఇలా అంటున్నాడు,
\v 3 నాకు మొర పెట్టు, అప్పుడు నేను నీకు జవాబిస్తాను. నువ్వు గ్రహించలేని గొప్ప సంగతులు, నీకు అర్థం కాని మర్మాలు నీకు వివరిస్తాను.
\p
\s5
\v 4 ముట్టడి దిబ్బల వలనా, ఖడ్గం వలనా నాశనమైన పట్టణంలోని యూదా రాజుల గృహాల విషయంలో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు.
\v 5 <యుద్ధం చెయ్యడానికి కల్దీయులు వస్తున్నారు. నా ఉగ్రతను బట్టి, నా ఆగ్రహాన్ని బట్టి, తమ దుష్టత్వం కారణంగా నేను ఈ పట్టణం నుండి ముఖం తిప్పేసుకున్నందు వల్ల హతమయ్యే ప్రజల శవాలతో ఆ ఇళ్ళను నింపడానికి వారు వస్తున్నారు.
\p
\s5
\v 6 కాని, చూడు, నేను ఆరోగ్యం, స్వస్థత తీసుకొస్తాను. నేను వాళ్ళను స్వస్థపరిచి వాళ్ళను సమృద్ధిలోకి, శాంతిలోకి, నమ్మకత్వంలోకి తీసుకొస్తాను.
\v 7 యూదా, ఇశ్రాయేలు ప్రజలకు వాళ్ళ భాగ్యం మళ్ళీ తీసుకొస్తాను. ఆరంభంలో ఉన్నట్టు వాళ్ళను నిర్మాణం చేస్తాను.
\p
\v 8 అప్పుడు వాళ్ళు నాకు విరోధంగా చేసిన దోషాల నుంచి వాళ్ళను పవిత్రం చేస్తాను. నాకు విరోధంగా చేసిన వాళ్ళ దోషాలనూ తిరుగుబాటునూ క్షమిస్తాను.
\v 9 నేను వాళ్ళ కోసం చెయ్యబోతున్న మంచి సంగతులు విన్న భూజనులందరి ఎదుట, వాళ్ళు నా ఆనందానికి, స్తోత్ర గీతానికి, ఘనతకు కారణంగా ఉంటారు. నేను వారికి ఇచ్చే మంచి విషయాలు, శాంతి కారణంగా వాళ్ళు భయపడతారు.> >>
\p
\s5
\v 10 యెహోవా ఇలా అంటున్నాడు. <<<ఇది నివాసయోగ్యం కాదు, యూదా పట్టణాల్లో మనుషులు లేరు, జంతువులు లేవు, యెరూషలేము వీధుల్లో జనంగానీ, జంతువులుగానీ లేవు> అని మీరు చెప్పే ఈ స్థలాల్లోనే,
\v 11 సంతోష స్వరం, ఆనంద శబ్దం, పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు స్వరాలు ఇలా అంటాయి, <సైన్యాలకు అధిపతి అయిన యెహోవాకు స్తుతి చెల్లించండి, యెహోవా మంచివాడు, ఆయన నిబంధనా నమ్మకత్వం నిరంతరం ఉంటుంది.> స్తుతి అర్పణ నా మందిరంలోకి తీసుకు రండి, ఎందుకంటే ముందు ఉన్నట్టుగానే ఈ దేశపు భాగ్యం మళ్ళీ దానికి కలుగజేస్తాను,>> అని యెహోవా అంటున్నాడు.
\p
\s5
\v 12 సేనల ప్రభువు అయిన యెహోవా ఇలా అంటున్నాడు <<మనుషులు, జంతువులు లేక పాడైపోయిన ఈ పట్టణాలు, కాపరులు తమ గొర్రెలను మేపే ప్రాంతాలుగా, వాటిని విశ్రమింపజేసే ప్రదేశాలుగా ఉంటాయి.
\v 13 మన్య పట్టణాల్లో, మైదానపు పట్టణాల్లో, దక్షిణ దేశపు పట్టణాల్లో, బెన్యామీను దేశంలో, యెరూషలేము ప్రాంతంలో, యూదా పట్టణాల్లో మందలు లెక్కించుకుంటూ తిరుగుతారు.>>
\p
\s5
\v 14 యెహోవా వాక్కు ఇదే. <<చూడు! ఇశ్రాయేలు, యూదా ప్రజలకు నేను చేసిన వాగ్దానాలు నెరవేర్చే రోజులు వస్తున్నాయి.
\v 15 ఆ రోజుల్లో, ఆ సమయంలో నేను దావీదు కోసం నీతి చిగురు మొలిపిస్తాను. అతడు దేశంలో నీతి న్యాయాలను జరిగిస్తాడు.
\v 16 ఆ రోజుల్లో యూదా వాళ్ళు రక్షణ పొందుతారు. యెరూషలేము నివాసులు సురక్షితంగా ఉంటారు. <యెహోవాయే మనకు నీతి> అని యెరూషలేముకు పేరు ఉంటుంది.>>
\p
\s5
\v 17 ఎందుకంటే, యెహోవా ఇలా అంటున్నాడు <<ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చోడానికి దావీదు సంతతివాడు ఒకడు లేకుండా పోడు,
\v 18 నా సన్నిధిలో నిత్యం దహన బలులు అర్పించడానికీ, నైవేద్యాలు అర్పించడానికీ, ధాన్య అర్పణలు అర్పించడానికీ యాజకులైన లేవీయుల్లో ఒకడు ఎప్పుడూ లేకుండా ఉండడు.>>
\p
\s5
\v 19 యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు,
\v 20 యెహోవా ఇలా అంటున్నాడు. <<దివారాత్రులు, వాటి సమయాల్లో అవి ఉండకుండా నేను పగటికి చేసిన నిబంధన, రాత్రికి చేసిన నిబంధన మీరు వ్యర్ధం చెయ్యగలిగితే,
\v 21 అప్పుడు, నా సేవకుడైన దావీదు సింహాసనం మీద కూర్చుని పాలించే వారసుడు అతనికి ఉండకుండా మానడని అతనితో, నా సేవకులైన లేవీయులతో, యాజకులతో నేను చేసిన నా నిబంధన వ్యర్ధం అవుతుంది.
\v 22 ఆకాశ నక్షత్రాలు, సముద్రపు ఇసుక రేణువులు లెక్కపెట్టడం సాధ్యం కానట్టే, నా సేవకుడైన దావీదు సంతానాన్ని, నాకు సేవ చేసే లేవీయులను లెక్క పెట్టలేనంతగా నేను అధికం చేస్తాను.>>
\p
\s5
\v 23 యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు,
\v 24 తాను ఏర్పరచుకున్న రెండు వంశాలను యెహోవా తిరస్కరించాడు, నా ప్రజలు ఇకమీదట తమ దృష్టిలో ఒక జనాంగంగా ఉండరు, అని, ఈ రకంగా నా ప్రజలను తృణీకరిస్తూ ఈ ప్రజలు చెప్పుకునే మాట గురించి నువ్వు ఆలోచించలేదా?
\p
\s5
\v 25 యెహోవానైన నేను ఇలా అంటున్నాను, <<పగలు గురించి, రాత్రి గురించి, నేను చేసిన నిబంధన నిలకడగా ఉండకపోతే,
\v 26 భూమ్యాకాశాలను గురించిన నిబంధన నిలిచి ఉండకపోతే, అప్పుడు మాత్రమే అబ్రాహాము ఇస్సాకు, యాకోబుల సంతానాన్ని పరిపాలించడానికి అతని సంతాన సంబంధి అయిన వ్యక్తిని ఏర్పరచుకోకుండా, నేను యాకోబు సంతానంలోని నా సేవకుడైన దావీదు సంతానాన్ని తృణీకరిస్తాను. కచ్చితంగా నేను వాళ్ళ పట్ల కనికరం చూపించి వాళ్ళ భాగ్యం వాళ్లకు మళ్ళీ తీసుకొస్తాను.>>
\s5
\c 34
\s సిద్కియాకు హెచ్చరిక
\p
\v 1 బబులోను రాజైన నెబుకద్నెజరు, అతని సైన్యం అంతా, అతని అధికారం కింద ఉన్న భూరాజ్యాలు, ప్రజలు, అందరూ కలిసి యెరూషలేము మీద, దాని ప్రాంతాలన్నిటి మీద యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు యెహోవా వాక్కు యిర్మీయాతో ఇలా అన్నాడు.
\v 2 <<ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు, నువ్వు వెళ్లి యూదా రాజైన సిద్కియాతో ఇలా చెప్పు, <యెహోవా చెప్పేదేమంటే, చూడు, నేను ఈ పట్టణాన్ని బబులోను రాజు చేతికి అప్పగించబోతున్నాను. అతడు దానికి నిప్పుపెట్టి కాల్చేస్తాడు.
\v 3 నువ్వు అతని చేతిలోనుంచి తప్పించుకోలేవు, కచ్చితంగా నువ్వు అతనికి దొరికిపోతావు, నిన్ను అతని చేతికి అప్పగించడం జరుగుతుంది. బబులోను రాజును నువ్వు నీ కళ్ళతో చూస్తావు. నువ్వు బబులోను వెళ్ళినప్పుడు నువ్వు అతనితో ముఖాముఖి మాట్లాడతావు.>
\p
\s5
\v 4 యూదా రాజువైన సిద్కియా, యెహోవా మాట విను! నీ విషయంలో యెహోవా ఇలా అంటున్నాడు, <నీకు ఖడ్గంతో చావు రాదు. ప్రశాంతంగానే చనిపోతావు.
\v 5 నీకంటే ముందుగా ఉన్న పూర్వపు రాజులైన నీ పితరులను దహనం చేసినట్టు నీ శరీరాన్ని దహనం చేస్తారు.> అప్పుడు వాళ్ళు <అయ్యో, ప్రభూ!> అంటారు. నీ కోసం ఏడుస్తారు. అలా జరగాలని పలికిన వాణ్ణి నేనే. ఇదే యెహోవా వాక్కు.>>
\p
\s5
\v 6 కాబట్టి, యెరూషలేములో ఉన్న యూదా రాజైన సిద్కియాకు యిర్మీయా ఈ వాక్కులన్నీ ప్రకటించాడు.
\v 7 బబులోను రాజు సైన్యం యెరూషలేము మీద, మిగతా యూదా పట్టాణాలన్నిటి మీద, ప్రాకారాలు కలిగిన పట్టణాలైన లాకీషు, అజేకా మీద దండెత్తింది.
\s బానిసలు, దేవుని సందేశం
\p
\s5
\v 8 యూదాలో తన తోటి ఇశ్రాయేలీయుణ్ణి ఎవరూ దాస్యానికి పెట్టుకోకూడదనీ, తమ దాస్యంలో ఉన్న ఇశ్రాయేలు స్త్రీలను, పురుషులను ప్రతివాడూ విడుదల చెయ్యాలనీ,
\v 9 రాజైన సిద్కియా యెరూషలేములో ఉన్న ప్రజలందరితో ఒప్పందం చేసిన తరువాత, యెహోవా దగ్గర నుంచి యిర్మీయాకు వచ్చిన వాక్కు.
\p
\s5
\v 10 ఆ ఒప్పందాన్నిబట్టి అందరూ తమకు దాసదాసీలుగా ఉన్న వాళ్ళను విడిపిస్తామనీ, ఇకముందు ఎవరూ వాళ్ళచేత దాస్యం చేయించుకోమనీ ఒప్పుకుని, ఆ నిబంధనలో చేరిన నాయకులు, ప్రజలు దానికి విధేయులై, వాళ్ళను విడిపించారు.
\v 11 అయితే ఆ తరువాత వాళ్ళు మనస్సు మార్చుకుని, తాము స్వతంత్రులుగా వెళ్ళనిచ్చిన దాసదాసీలను మళ్ళీ దాసులుగా, దాసీలుగా చేసుకోడానికి బలవంతంగా వాళ్ళను పట్టుకున్నారు.
\p
\s5
\v 12 కాబట్టి, యెహోవా వాక్కు యిర్మీయాతో ఇలా చెప్పాడు,
\v 13 <<ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు, దాస్య గృహమైన ఐగుప్తుదేశం నుంచి నేను మీ పితరులను తీసుకొచ్చిన రోజు వాళ్ళతో ఈ ఒప్పందం చేశాను.
\v 14 నీకు అమ్మకం జరిగాక, నీకు ఆరు సంవత్సరాలు దాస్యం చేసిన హెబ్రీయులైన మీ సహోదరులకు, ఏడు సంవత్సరాలు తీరిన తరువాత, విడుదల ప్రకటించాలి. కాని మీ పితరులు శ్రద్ధ వహించలేదు, నా మాట వినలేదు.>>
\p
\s5
\v 15 <<మీరైతే ఇప్పుడు మనస్సు మార్చుకుని, ఒక్కొక్కడు తన పొరుగువాడికి విడుదల ప్రకటిస్తామని చెప్పి, నా పేరు పెట్టిన ఈ మందిరంలో నా సన్నిధిలో ఒప్పందం చేశారు. నా దృష్టిలో ఏది మంచిదో అది చెయ్యడం మొదలుపెట్టారు.
\v 16 కాని, తరువాత మీరు మనస్సు మార్చుకుని నా పేరును అపవిత్రం చేశారు. వాళ్ళకు ఎటు ఇష్టమైతే అటు వెళ్ళగలిగేలా వాళ్ళను స్వతంత్రులుగా వెళ్ళనిచ్చిన తరువాత, అందరూ తమ దాసదాసీలను మళ్ళీ తెచ్చుకుని, తమకు దాసులుగా, దాసీలుగా ఉండడానికి వాళ్ళను బలవంతంగా మళ్ళీ పట్టుకున్నారు.>>
\p
\s5
\v 17 కాబట్టి యెహోవా ఇలా అంటున్నాడు. <<ఒక్కొక్కడు తన సహోదరులకూ, తన పొరుగువారికీ విడుదల ప్రకటించాలని నేను చెప్పిన మాట మీరు వినలేదు. కాబట్టి చూడండి, నేను మీకు విడుదల ప్రకటించబోతున్నాను. అది ఖడ్గంతో, తెగులుతో, కరువుతో మీరు నాశనం అవ్వడానికే నేను ప్రకటించే విడుదల. భూమి మీద ఉన్న ప్రతి రాజ్యాన్ని బట్టి మీరు గడగడా వణికేలా చేస్తాను.
\v 18 నా సన్నిధిలో తాము చేసిన ఒప్పందపు మాటలు నెరవేర్చకుండా దాన్ని అతిక్రమించిన వాళ్ళ విషయం పట్టించుకుంటాను. వాళ్ళు ఒక దున్నపోతును రెండు భాగాలుగా కోసి వాటి మధ్య నడిచేవాళ్ళు.
\v 19 తరువాత యూదా నాయకులు, యెరూషలేము నాయకులు, నపుంసకులు, యాజకులు, దేశంలో ఉన్న ప్రజలందరూ ఆ దున్నపోతు రెండు భాగాల మధ్య నడిచేవాళ్ళు. ఆ దున్నపోతుకు చేసినట్టు నేను వాళ్ళకు చేస్తాను.
\p
\s5
\v 20 వాళ్ళ ప్రాణం తియ్యాలని చూసే శత్రువుల చేతికి వాళ్ళను అప్పగిస్తాను. వాళ్ళ శవాలు ఆకాశపక్షులకు, భూమృగాలకు ఆహారంగా ఉంటాయి.
\v 21 యూదా రాజైన సిద్కియాను, అతని నాయకులను, వాళ్ళ ప్రాణం తియ్యాలని చూసే వాళ్ళ శత్రువుల చేతికి, మీ మీదకు లేచిన బబులోను రాజు సైన్యం చేతికి అప్పగిస్తాను.>>
\v 22 యెహోవా వాక్కు ఇదే. <<నేను ఒక ఆజ్ఞ ఇవ్వబోతున్నాను. వాళ్ళను ఈ పట్టణానికి మళ్ళీ తీసుకొస్తాను. వాళ్ళు దాని మీద యుద్ధం చేసి దాన్ని స్వాధీనం చేసుకుని, తగలబెడతారు. యూదా పట్టణాలను శిథిలాలుగా, నిర్జనంగా మారుస్తాను.>>
\s5
\c 35
\s రేకాబీయులు
\p
\v 1 యోషీయా కొడుకూ, యూదా రాజు అయిన యెహోయాకీము రోజుల్లో యెహోవా వాక్కు యిర్మీయాతో ఇలా అన్నాడు,
\v 2 <<నువ్వు రేకాబీయుల దగ్గరికి వెళ్లి, వాళ్ళతో మాట్లాడి, యెహోవా మందిరంలో ఉన్న గదుల్లో ఒకదానిలోకి వాళ్ళను తీసుకొచ్చి, తాగడానికి వాళ్లకు ద్రాక్షారసం ఇవ్వు.>>
\p
\s5
\v 3 కాబట్టి నేను, యిర్మీయా కొడుకూ, యజన్యా మనవడూ అయిన హబజ్జిన్యాను, అతని సోదరులను, అతని కొడుకులందరినీ అంటే రేకాబీయుల కుటుంబికులను తీసుకొచ్చాను.
\v 4 యెహోవా మందిరంలో దైవజనుడైన యిగ్దల్యా కొడుకు, హానాను కొడుకుల గదిలోకి వాళ్ళను తీసుకొచ్చాను. అది రాజుల గదికి దగ్గరలో ఉన్న ద్వారపాలకుడూ, షల్లూము కొడుకు అయిన మయశేయా గదికి పైగా ఉంది.
\p
\s5
\v 5 నేను రేకాబీయుల ఎదుట ద్రాక్షా రసంతో నిండిన పాత్రలు, గిన్నెలు పెట్టి <<ద్రాక్షా రసం తాగండి>> అని వాళ్ళతో చెప్పాను.
\v 6 కాని వాళ్ళు <<మా పితరుడైన రేకాబు కొడుకు యెహోనాదాబు, <మీరు గానీ మీ సంతానం గానీ ఎప్పుడూ ద్రాక్షారసం తాగకూడదు,> అని మాకు ఆజ్ఞాపించాడు గనక, మేం ద్రాక్షారసం తాగం.
\v 7 ఇంకా, <మీరు ఇళ్ళు కట్టుకోవద్దు, విత్తనాలు చల్ల వద్దు, ద్రాక్షతోట నాటవద్దు, అది మీకు ఉండనే ఉండకూడదు, మీరు పరదేశులుగా ఉంటున్న దేశంలో దీర్ఘాయుష్మంతులయ్యేలా మీ రోజులన్నీ గుడారాల్లోనే మీరు నివాసం చెయ్యాలి,> అని అతడు మాకు ఆజ్ఞాపించాడు.
\p
\s5
\v 8 కాబట్టి మా పితరుడైన రేకాబు కొడుకు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన అన్ని విషయాల్లో అతని మాటను బట్టి మేము, మా భార్యలు, మా కొడుకులు, మా కూతుళ్ళు ద్రాక్షారసం తాగడం లేదు.
\v 9 మా తండ్రి అయిన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన దానికి మేము విధేయులం అయ్యేందుకు, మేము ఇళ్ళు కట్టుకుని వాటిలో నివాసం ఉండం. ద్రాక్ష తోటలు, పొలాలు, విత్తనాలు మా ఆస్తులుగా ఉండవు.
\v 10 గుడారాల్లోనే నివాసం ఉంటాం.
\v 11 కాని, బబులోను రాజైన నెబుకద్నెజరు ఈ దేశం మీద దాడి చేసినప్పుడు, <కల్దీయుల సైన్యం, సిరియనుల సైన్యం నుంచి మనం తప్పించుకుని యెరూషలేముకు వెళ్దాం రండి> అని మేము చెప్పుకున్నాం కాబట్టి మేము యెరూషలేములో నివాసం ఉంటున్నాం>> అని చెప్పారు.
\p
\s5
\v 12 అప్పుడు యెహోవా వాక్కు యిర్మీయాతో ఇలా అన్నాడు. <<ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పేదేమంటే,
\v 13 నువ్వు వెళ్లి యూదా వాళ్ళకూ, యెరూషలేము నివాసులకూ ఈ మాట ప్రకటించు, <యెహోవా వాక్కు ఇదే, మీరు దిద్దుబాటుకు లోబడి నా మాటలు వినరా?> ఇదే యెహోవా వాక్కు.
\v 14 <ద్రాక్షారసం తాగొద్దు,> అని రేకాబు కొడుకు యెహోనాదాబు తన కొడుకులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరంగా ఉన్నాయి, ఈ రోజు వరకూ తమ పితరుడి ఆజ్ఞకు విధేయులై వాళ్ళు ద్రాక్షారసం తాగడం లేదు. కాని, నేను ఉదయాన్నే లేచి మీతో ఎంతో శ్రద్ధగా మాట్లాడినా, మీరు నా మాట వినరు.
\p
\s5
\v 15 ఉదయాన్నే లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ దగ్గరికి పంపుతూ, <ప్రతివాడూ తన దుర్మార్గత విడిచి మంచి పనులు చేయాలి, అన్యదేవుళ్ళ వెంట పడకూడదు. వాటిని పూజించకూడదు. నేను మీకూ, మీ పితరులకూ ఇచ్చిన దేశానికి తిరిగి వచ్చి దానిలో నివాసం ఉండాలి> అని నేను ప్రకటించాను గాని, మీరు పట్టించుకోలేదు. నా మాట వినలేదు.
\v 16 రేకాబు కొడుకు యెహోనాదాబు సంతానం తమ తండ్రి తమకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చారు. కాని ఈ ప్రజలు నా మాట వినరు.
\p
\s5
\v 17 కాబట్టి, ఇశ్రాయేలు దేవుడూ, సైన్యాలకు అధిపతి అయిన యెహోవా ఇలా అంటున్నాడు, <చూడు, నేను వాళ్ళతో మాట్లాడాను గాని వాళ్ళు వినలేదు. నేను వాళ్ళను పిలిచాను గాని వాళ్ళు పలకలేదు. గనుక యూదా, యెరూషలేము నివాసులందరి మీదకీ తీసుకొస్తానని నేను చెప్పిన కీడంతా వాళ్ళ మీదకి తీసుకురాబోతున్నాను.> >>
\p
\s5
\v 18 యిర్మీయా రేకాబీయులను చూసి ఇలా అన్నాడు. <<ఇశ్రాయేలు దేవుడూ, సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా అంటున్నాడు, మీరు మీ తండ్రి అయిన యెహోనాదాబు ఆజ్ఞకు విధేయులై అతని విధులన్నిటినీ పాటించి, అతడు మీకు ఆజ్ఞాపించినవన్నీ చేస్తున్నారు.
\v 19 కాబట్టి, ఇశ్రాయేలు దేవుడూ, సైన్యాలకు అధిపతి అయిన యెహోవా చెప్పేదేమంటే, <నాకు సేవ చెయ్యడానికి, రేకాబు కొడుకు యెహోనాదాబు సంతతివాడు ఒకడు ఎప్పుడూ ఉంటాడు.> >>
\s5
\c 36
\s యిర్మీయా వ్రాతపత్రాలను యెహోయాకీము కాల్చివేశాడు
\p
\v 1 యూదా రాజు యోషీయా కొడుకు యెహోయాకీము పాలించిన నాలుగో సంవత్సరంలో యెహోవా వాక్కు యిర్మీయాతో ఇలా చెప్పాడు.
\v 2 <<నువ్వు ఒక పుస్తకం తీసుకుని నేను నీతో మాట్లాడిన రోజు మొదలుకుని, అంటే, యోషీయా కాలం మొదలుకుని ఈ రోజు వరకు ఇశ్రాయేలు, యూదా ప్రజల గురించీ, అన్ని జాతుల గురించీ నీతో పలికిన మాటలన్నీ దానిలో రాయి.
\v 3 నేను యూదా ప్రజలకు చెయ్యాలని ఉద్దేశించిన కీడంతటి గురించి వాళ్ళు విని, నేను వాళ్ళ దోషం, వాళ్ళ పాపం క్షమించేలా తమ దుర్మార్గత విడిచి పశ్చాత్తాప పడతారేమో.>>
\p
\s5
\v 4 యిర్మీయా నేరీయా కొడుకు బారూకును పిలిపించాడు. యెహోవా యిర్మీయాతో చెప్పిన మాటలన్నీ యిర్మీయా చెప్తూ ఉండగా అతడు ఆ పుస్తకంలో రాశాడు.
\v 5 తరువాత యిర్మీయా బారూకుకు ఇలా ఆజ్ఞ ఇచ్చాడు. <<నేను చెరసాలలో ఉన్నాను కాబట్టి యెహోవా మందిరానికి రాలేను.
\v 6 కాబట్టి నువ్వు వెళ్లి, ఉపవాసదినాన యెహోవా మందిరంలో ప్రజలకు వినిపించేలా, నేను చెప్తూ ఉండగా నువ్వు పుస్తకంలో రాసిన యెహోవా మాటలు ప్రకటించు. తమ పట్టణాలనుంచి వచ్చే యూదా ప్రజలందరికీ వినిపించేలా వాటిని ప్రకటించు.
\p
\s5
\v 7 దయ చూపించమని వాళ్ళు చేసే అభ్యర్ధనలు ఒకవేళ యెహోవా దృష్టికి ఆమోదం అవుతాయేమో, ఒకవేళ వాళ్ళు తమ చెడుమార్గం విడిచిపెడతారేమో, ఎందుకంటే ఈ ప్రజల మీద యెహోవా ప్రకటించిన ఉగ్రత, మహాకోపం ఎంతో తీవ్రంగా ఉన్నాయి.>>
\v 8 కాబట్టి ప్రవక్త అయిన యిర్మీయా తనకు ఆజ్ఞ ఇచ్చినట్టు, నేరీయా కొడుకు బారూకు యెహోవా మాటలన్నీ, బిగ్గరగా యెహోవా మందిరంలో చదివి వినిపించాడు.
\p
\s5
\v 9 యూదా రాజైన యోషీయా కొడుకు యెహోయాకీము పరిపాలనలో ఐదో సంవత్సరం తొమ్మిదో నెలలో యెరూషలేములో ఉన్న ప్రజలందరూ, యూదా పట్టాణాల్లో నుంచి యెరూషలేముకు వచ్చిన ప్రజలందరూ యెహోవా పేరట ఉపవాసం ప్రకటించినప్పుడు,
\v 10 బారూకు యెహోవా మందిరంలో లేఖికుడైన షాఫాను కొడుకు గెమర్యా గదికి పైగా ఉన్న ప్రాంగణంలో, యెహోవా మందిరపు ప్రవేశ ద్వారం దగ్గర, ప్రజలందరూ వినేలా యిర్మీయా చెప్పిన మాటలు పుస్తకంలోనుంచి చదివి వినిపించాడు.
\p
\s5
\v 11 షాఫాను కొడుకైన గెమర్యా కొడుకు మీకాయా ఆ పుస్తకంలో ఉన్న యెహోవా మాటలన్నీ విని
\v 12 రాజమందిరంలో ఉన్న లేఖికుడి గదిలోకి వెళ్ళినప్పుడు నాయకులందరూ లేఖికుడైన ఎలీషామా, షెమాయా కొడుకు దెలాయ్యా, అక్బోరు కొడుకు ఎల్నాతాను, షాఫాను కొడుకు గెమర్యా, హనన్యా కొడుకు సిద్కియా అనే వాళ్ళూ, నాయకులందరూ అక్కడ కూర్చుని ఉన్నారు.
\p
\s5
\v 13 బారూకు ప్రజలందరికీ వినిపించేలా ఆ పుస్తకంలో నుంచి చదివి వినిపించిన మాటలన్నీ మీకాయా వాళ్లకు తెలియజేసినప్పుడు,
\v 14 అధికారులందరూ కూషీ మునిమనవడు, షెలెమ్యాకు మనవడు, నెతన్యాకు కొడుకు అయిన యెహూదిని బారూకు దగ్గరికి పంపి <<నువ్వు ప్రజలు వింటుండగా చదివిన ఆ పుస్తకపు చుట్ట నీ చేత్తో పట్టుకుని తీసుకురా>> అని ఆజ్ఞ ఇచ్చారు. నేరీయా కొడుకు బారూకు ఆ పుస్తకపు చుట్ట చేత్తో పట్టుకుని వచ్చాడు.
\v 15 అతడు వచ్చినప్పుడు వాళ్ళు <<నువ్వు కూర్చుని మాకు చదివి వినిపించు>> అన్నారు. కాబట్టి బారూకు దాన్ని వారికి చదివి వినిపించాడు.
\p
\s5
\v 16 వాళ్ళు ఆ మాటలన్నీ విన్నప్పుడు భయంతో ఒకరినొకరు చూసుకుని <<మనం కచ్చితంగా ఈ మాటలు రాజుకు తెలియజేయాలి>> అని బారూకుతో అన్నారు.
\v 17 అప్పుడు వాళ్ళు బారూకుతో <<మాతో చెప్పు, ఈ మాటలన్నీ యిర్మీయా చెప్తూ ఉన్నప్పుడు నువ్వు ఎలా రాశావు?>> అని అడిగారు.
\v 18 బారూకు వాళ్ళతో <<అతడు తన నోటితో ఈ మాటలన్నీ పలికినప్పుడు, నేను పుస్తకపు చుట్టలో వాటిని సిరాతో రాశాను>> అన్నాడు.
\v 19 అప్పుడు ఆ అధికారులు బారూకుతో <<నువ్వూ, యిర్మీయా, ఇద్దరూ వెళ్లి దాగి ఉండండి. మీరున్న చోటు ఎవరికీ తెలియనివ్వొద్దు>> అన్నారు.
\p
\s5
\v 20 అప్పుడు వాళ్ళు ఆ పుస్తకాన్ని లేఖికుడైన ఎలీషామా గదిలో ఉంచి, రాజమందిరానికి తామే వెళ్లి, ఆ మాటలన్నీ రాజుకు చెప్పారు.
\v 21 అప్పుడు రాజు ఆ పుస్తకపు చుట్టను తీసుకురావడానికి యెహూదిని పంపించినప్పుడు అతడు లేఖికుడైన ఎలీషామా గదిలోనుంచి దాన్ని తీసుకొచ్చి రాజుకు, రాజు పక్కన నిల్చుని ఉన్న అధికారులకూ వినిపించేలా బిగ్గరగా చదివాడు.
\v 22 తొమ్మిదో నెలలో, రాజు శీతాకాలం రాజమందిరంలో కూర్చుని ఉన్నప్పుడు, అతని ఎదుట కుంపటిలో అగ్ని రగులుతూ ఉంది.
\p
\s5
\v 23 యెహూది మూడు నాలుగు వరుసలు చదివిన తరువాత, రాజు చాకుతో దాన్ని కోసి, ఆ కుంపటిలో వేశాడు. అప్పుడు అది పూర్తిగా కాలిపోయింది.
\v 24 అయితే, రాజుగాని, ఈ మాటలన్నీ విన్న అతని సేవకుల్లో ఒక్కడైనా భయపడ లేదు, తమ బట్టలు చింపుకోలేదు.
\p
\s5
\v 25 పుస్తకపు చుట్టను కాల్చవద్దని ఎల్నాతాను, దెలాయ్యా, గెమర్యా రాజును కోరినా, అతడు వాళ్ళ మాట వినలేదు.
\v 26 లేఖికుడైన బారూకును, ప్రవక్త అయిన యిర్మీయాను పట్టుకోవాలని రాజవంశస్థుడైన యెరహ్మెయేలుకు, అజ్రీయేలు కొడుకు శెరాయాకు, అబ్దెయేలు కొడుకు షెలెమ్యాకు రాజు ఆజ్ఞాపించాడు, కాని యెహోవా యిర్మియా బారూకులను వారికి కనబడకుండా చేశాడు.
\p
\s5
\v 27 యిర్మీయా చెప్పిన మాటనుబట్టి బారూకు రాసిన పుస్తకం చుట్టను రాజు కాల్చివేసిన తరువాత యెహోవా వాక్కు యిర్మీయాతో ఇలా చెప్పాడు.
\v 28 నువ్వు ఇంకొక పుస్తకం చుట్ట తీసుకుని యూదా రాజైన యెహోయాకీము కాల్చిన మొదటి పుస్తకంలో రాసిన మాటలన్నీ దానిలో రాయి.
\v 29 యూదా రాజైన యెహోయాకీముకు నువ్వు ఈ మాట చెప్పాలి. <<యెహోవా చెప్పేదేమంటే, నువ్వు పుస్తకపు చుట్టను కాల్చేశావు! <బబులోను రాజు కచ్చితంగా వచ్చి ఈ దేశాన్ని నాశనం చేసి, ఈ ప్రజలను, జంతువులను నాశనం చేస్తాడు> అని నువ్వు ఇందులో ఎందుకు రాశావు? అని అడిగావు.>>
\p
\s5
\v 30 ఆ కారణంగా యూదా రాజైన యెహోయాకీము గురించి యెహోవా ఇలా అంటున్నాడు. <<దావీదు సింహాసనం మీద కూర్చోడానికి నీ వారసులు ఎవరూ ఉండరు. పగలు ఎండలో, రాత్రి గడ్డ కట్టిన మంచులో పాడైపోయేలా నీ శవాన్ని పారేస్తారు.
\v 31 వాళ్ళ దోషాన్ని బట్టి అతన్నీ, అతని సంతతినీ, అతని సేవకులనూ నేను శిక్షిస్తాను. నేను వాళ్ళ గురించి చెప్పిన కీడంతా వాళ్ళ మీదకీ, యెరూషలేము, యూదా ప్రజల మీదకీ తీసుకొస్తానని మిమ్మల్ని బెదిరించినా వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు.>>
\p
\s5
\v 32 కాబట్టి యిర్మీయా ఇంకొక పుస్తకం చుట్టను తీసుకుని లేఖికుడైన నేరియా కొడుకు బారూకు చేతికి ఇచ్చినప్పుడు, అతడు యిర్మీయా నోటితో చెప్పిన మాటలనుబట్టి యూదా రాజైన యెహోయాకీము తగలబెట్టిన పుస్తకం చుట్టలోని మాటలన్నీ మళ్ళీ రాశాడు. ఆ మాటలే కాకుండా, అలాంటివి ఇంకా ఎన్నో మాటలు వాటికి జోడించి రాశాడు.
\s5
\c 37
\s యిర్మీయా చెరసాల్లో
\p
\v 1 యెహోయాకీము కొడుకు కొన్యాకు బదులుగా బబులోనురాజు నెబుకద్నెజరు యూదా దేశంలో రాజుగా నియమించిన యోషీయా కొడుకు సిద్కియా రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు.
\v 2 అతడుగాని, అతని సేవకులుగాని, దేశప్రజలుగాని యెహోవా ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా యెహోవా చెప్పిన మాటలు పట్టించుకోలేదు.
\p
\s5
\v 3 రాజైన సిద్కియా షెలెమ్యా కొడుకు యెహుకలునూ, యాజకుడైన మయశేయా కొడుకు జెఫన్యానూ, ప్రవక్త అయిన యిర్మీయా దగ్గరికి పంపి <<మా పక్షంగా మన దేవుడైన యెహోవాకు ప్రార్థన చెయ్యి,>> అని అన్నారు.
\v 4 అప్పటికి వాళ్ళు యిర్మీయాను చెరసాల్లో పెట్టలేదు. అతడు ప్రజల మధ్య తిరుగుతూ ఉన్నాడు.
\v 5 ఫరో సైన్యం ఐగుప్తులోనుంచి బయలుదేరినప్పుడు, యెరూషలేమును ముట్టడి వేస్తున్న కల్దీయులు ఆ విషయం విని యెరూషలేమును విడిచి వెళ్ళిపోయారు.
\p
\s5
\v 6 అప్పుడు యెహోవా వాక్కు ప్రవక్తయైన యిర్మీయాతో ఇలా అన్నాడు,
\v 7 <<ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు, నన్ను అడిగి తెలుసుకోమని నిన్ను నా దగ్గరికి పంపిన యూదా రాజుతో నువ్వు ఈ విధంగా చెప్పాలి, <చూడు, మీకు సాయం చెయ్యడానికి బయలుదేరి వస్తున్న ఫరో సైన్యం తమ స్వదేశమైన ఐగుప్తుకు తిరిగి వెళ్ళిపోయింది.
\v 8 కల్దీయులు మళ్ళీ తిరిగి వస్తారు. వాళ్ళు వచ్చి ఈ పట్టణం మీద యుద్ధం చేసి దాని పట్టుకుని అగ్నితో కాల్చేస్తారు.> >>
\p
\s5
\v 9 యెహోవా ఇలా అంటున్నాడు. <<కల్దీయులు కచ్చితంగా మా దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారు,>> అని మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. ఎందుకంటే, వాళ్ళు వెళ్లనే వెళ్లరు.
\v 10 మీతో యుద్ధం చేసే కల్దీయుల సైన్యమంతటినీ మీరు హతం చేసి వాళ్ళల్లో గాయపడిన వాళ్ళను మాత్రమే మిగిల్చినా, వాళ్ళే తమ గుడారాల్లోనుంచి వచ్చి ఈ పట్టణాన్ని అగ్నితో కాల్చేస్తారు.
\p
\s5
\v 11 ఫరో సైన్యం వస్తున్నందున భయపడి కల్దీయుల సైన్యం యెరూషలేమును విడిచి వెళ్ళిపోయింది.
\v 12 అప్పుడు యిర్మీయా బెన్యామీను దేశంలో తన వాళ్ళ దగ్గర ఒక భూభాగం తీసుకోడానికి యెరూషలేము నుంచి బయలు దేరాడు.
\v 13 అతడు బెన్యామీను ద్వారం దగ్గర నిలబడి ఉండగా కాపలాదారుల అధికారి అక్కడ ఉన్నాడు. అతడు షెలెమ్యా కొడుకు, హనన్యా మనవడు అయిన ఇరీయా. అతడు యిర్మీయా ప్రవక్తను పట్టుకుని <<నువ్వు కల్దీయుల్లో చేరబోతున్నావు>> అన్నాడు.
\p
\s5
\v 14 కాని యిర్మీయా <<అది నిజం కాదు. నేను కల్దీయుల్లో చేరడం లేదు>> అన్నాడు. అయితే అతడు యిర్మీయా మాట వినలేదు. ఇరీయా యిర్మీయాను పట్టుకుని అధికారుల దగ్గరికి తీసుకొచ్చాడు.
\v 15 అధికారులు యిర్మీయా మీద కోపపడి, అతన్ని కొట్టి, తాము చెరసాలగా మార్చిన లేఖికుడైన యోనాతాను ఇంట్లో అతన్ని ఉంచారు.
\p
\s5
\v 16 యిర్మీయా భూగర్భంలో ఉన్న ఒక చెరసాల గదిలో చాలా రోజులు ఉన్నాడు.
\v 17 తరువాత రాజైన సిద్కియా అతన్ని రప్పించడానికి ఒకణ్ణి పంపి, అతన్ని తన ఇంటికి పిలిపించి <<యెహోవా దగ్గర నుంచి ఏ మాటైనా వచ్చిందా?>> అని ఏకాంతంగా అతన్ని అడిగాడు. యిర్మీయా <<వచ్చింది, నిన్ను బబులోను రాజు చేతికి అప్పగించడం జరుగుతుంది>> అన్నాడు.
\p
\s5
\v 18 అప్పుడు యిర్మీయా, రాజైన సిద్కియాతో ఇంకా ఇలా అన్నాడు. <<నేను నీ పట్ల, నీ సేవకుల పట్ల, ఈ ప్రజల పట్ల ఏ పాపం చేశానని నన్ను చెరసాల్లో వేశావు?
\v 19 బబులోను రాజు మీమీదకైనా, ఈ దేశం మీదకైనా రాడని మీకు ప్రకటించిన మీ ప్రవక్తలు ఎక్కడ ఉన్నారు?
\v 20 కాని, రాజా, నా యేలినవాడా! విను. నా అభ్యర్ధన నీ ఎదుటకు రానివ్వు. నన్ను మళ్ళీ లేఖికుడైన యోనాతాను ఇంటికి తిరిగి పంపొద్దు. పంపితే నేను ఇంక అక్కడే చనిపోతాను.>>
\p
\s5
\v 21 కాబట్టి రాజైన సిద్కియా ఆజ్ఞ జారీ చేశాడు. అతని సేవకులు ఆ ప్రాంగణంలో ఉన్న చెరసాలలో యిర్మీయాను పెట్టారు. పట్టణంలో రొట్టెలున్నంత వరకూ రొట్టెలు కాల్చేవాళ్ళ వీధిలోనుంచి ప్రతిరోజూ ఒక రొట్టె అతనికి ఇస్తూ వచ్చారు. కాబట్టి సేవకుల ప్రాంగణంలో ఉన్న చెరసాలలో యిర్మీయా ఉన్నాడు.
\s5
\c 38
\s బురద గోతిలో యిర్మీయా
\p
\v 1 <<యెహోవా ఇలా అంటున్నాడు, ఈ పట్టణంలో నిలిచి ఉన్న వాళ్ళు ఖడ్గంతో, కరువుతో, తెగులుతో చస్తారు. కాని కల్దీయుల దగ్గరికి బయలుదేరి వెళ్ళేవాళ్ళు బతుకుతారు. అతడు తన జీవాన్ని ఒకడు కొల్లసొమ్ము దక్కించుకున్నట్టు దక్కించుకుంటాడు. ఎందుకంటే, అతడు బతుకుతాడు.>>
\p
\v 2 యెహోవా ఇలా అంటున్నాడు. <<ఈ పట్టణం కచ్చితంగా బబులోను రాజు సైన్యం చేతికి అప్పగించడం జరుగుతుంది. అతడు దాన్ని చెరపట్టుకుంటాడు,>> అని యిర్మీయా ప్రజలందరికీ ప్రకటించినప్పుడు,
\v 3 మత్తాను కొడుకు షెఫట్య, పషూరు కొడుకు గెదల్యా, షెలెమ్యా కొడుకు యూకలు, మల్కీయా కొడుకు పషూరు విన్నారు గనుక ఆ నాయకులు రాజుతో <<ఈ మనిషి ఈ ప్రజల నాశనం కోరేవాడేగాని, క్షేమం కోరేవాడు కాదు.
\s5
\v 4 ఇతను ఇలాంటి సమాచారం వాళ్లకు ప్రకటన చెయ్యడం వల్ల ఈ పట్టణంలో నిలిచి ఉన్న యోధుల చేతులను, ప్రజలందరి చేతులను బలహీనం చేస్తున్నాడు. ఇతనికి మరణశిక్ష విధించాలి>> అన్నారు.
\v 5 అందుకు రాజైన సిద్కియా <<అతడు మీ చేతిలో ఉన్నాడు. రాజు మీకు అడ్డం రాగలడా,>> అన్నాడు.
\p
\s5
\v 6 వాళ్ళు యిర్మీయాను పట్టుకుని చెరసాల ప్రాంగణంలో ఉన్న రాజకుమారుడు మల్కీయా గోతిలోకి దింపారు. అందులోకి యిర్మీయాను తాళ్ళతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉంది. ఆ బురదలో యిర్మీయా కూరుకుపోయాడు.
\p
\s5
\v 7 అప్పుడు, రాజగృహంలో, కూషీయుడైన ఎబెద్మెలెకు నపుంసకుల్లో ఒకడు. యిర్మీయాను గోతిలో పెట్టారని అతడు విన్నాడు. ఆ సమయంలో రాజు బెన్యామీను ద్వారం దగ్గర కూర్చుని ఉన్నాడు.
\v 8 కాబట్టి ఎబెద్మెలెకు రాజ గృహంలోనుంచి వెళ్లి రాజుతో ఇలా అన్నాడు,
\v 9 <<రాజా, నా ప్రభూ, ఆ గోతిలో వేసిన యిర్మీయా అనే ప్రవక్త పట్ల ఈ మనుషులు చేసిందంతా దుర్మార్గమే. అతడు ఆకలితో చావాలని అతన్ని గోతిలో పడేశారు. ఎందుకంటే పట్టణంలో ఆహారం ఇంక లేదు.>>
\p
\s5
\v 10 అప్పుడు రాజు కూషీయుడైన ఎబెద్మెలెకుకు ఆజ్ఞ ఇచ్చి <<నువ్వు ఇక్కడనుంచి 30 మంది మనుషులను వెంటబెట్టుకుని వెళ్లి, ప్రవక్త అయిన యిర్మీయా చావకముందు ఆ గోతిలోనుంచి అతన్ని తీయించు,>> అన్నాడు.
\v 11 కాబట్టి ఎబెద్మెలెకు ఆ మనుషులను వెంటబెట్టుకుని రాజమందిరంలో ఖజానా కింద గదిలోకి వచ్చాడు.
\p
\s5
\v 12 అక్కడ నుంచి పాతబడి చీకిపోయి, చినిగిపోయిన బట్టలు తీసుకువెళ్లి, ఆ గోతిలో ఉన్న యిర్మీయా పట్టుకునేలా తాళ్ళతో వాటిని దింపి <<పాతవై చిరిగి చీకిపోయిన ఈ బట్టలతో పేనిన తాళ్ళను నీ చంకల కింద పెట్టుకో,>> అని అతనితో చెప్పాడు.
\v 13 యిర్మీయా అలాగే చేశాడు. అప్పుడు వాళ్ళు యిర్మీయాను తాళ్ళతో లాగారు. ఈ విధంగా వాళ్ళు అతన్ని ఆ గోతిలోనుంచి పైకి లాగారు. ఆ తరువాత యిర్మీయా ఆ చెరసాల ప్రాంగణంలో ఉంటూ ఉన్నాడు.
\s యిర్మీయాను మళ్ళి సిద్కియా ప్రశ్నించడం
\p
\s5
\v 14 తరువాత రాజైన సిద్కియా యెహోవా మందిరంలో ఉన్న మూడో ద్వారంలోకి ప్రవక్త అయిన యిర్మీయాను పిలిపించి, అతనితో <<నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. నా నుంచి ఏదీ దాచకుండా చెప్పు,>> అన్నాడు.
\v 15 యిర్మీయా సిద్కియాతో <<నేను నీకు జవాబు చెప్తే, కచ్చితంగా నువ్వు నాకు మరణ శిక్ష వేస్తావు. నేను నీకు సలహా ఇచ్చినా, నువ్వు నా మాట వినవు,>> అన్నాడు.
\v 16 కాని రాజైన సిద్కియా ఏకాంతంగా యిర్మీయాతో ప్రమాణం చేసి <<మనలను సృష్టించిన యెహోవా తోడు, నేను నిన్ను చంపను, నిన్ను చంపాలని చూసేవాళ్ల చేతికి నిన్ను అప్పగించను,>> అన్నాడు.
\p
\s5
\v 17 కాబట్టి యిర్మీయా సిద్కియాతో ఇలా అన్నాడు. <<ఇశ్రాయేలు దేవుడు, సైన్యాలకు అధిపతి అయిన దేవుడు, యెహోవా ఇలా అంటున్నాడు, నువ్వు బబులోను రాజు అధిపతుల దగ్గరికి వెళ్తే బతుకుతావు. ఈ నగరాన్ని తగలబెట్టరు. నువ్వూ, నీ ఇంటి వాళ్ళు బతుకుతారు.
\v 18 కాని నువ్వు బబులోను అధిపతుల దగ్గరికి వెళ్లకపోతే, ఈ నగరాన్ని కల్దీయుల చేతికి అప్పగించడం జరుగుతుంది. వాళ్ళు అగ్నితో దాన్ని కాల్చేస్తారు. నువ్వు వాళ్ళ చేతిలోనుంచి తప్పించుకోలేవు.>>
\p
\s5
\v 19 అందుకు రాజైన సిద్కియా యిర్మీయాతో <<కల్దీయుల పక్షంగా ఉన్న యూదులకు భయపడుతున్నాను. ఒకవేళ కల్దీయులు నన్ను వాళ్ళ చేతికి అప్పగిస్తే, వాళ్ళు నాపట్ల చెడ్డగా ప్రవర్తిస్తారు,>> అన్నాడు.
\p
\s5
\v 20 అందుకు యిర్మీయా <<నిన్ను వాళ్ళ చేతికి అప్పగించరు. నీకు అన్నీ సవ్యంగా జరిగేలా, నువ్వు బతికేలా నేను నీతో చెప్పిన యెహోవా సందేశానికి లోబడు.
\v 21 కాని, నువ్వు ఒకవేళ బయలుదేరి వెళ్లకపోతే, యెహోవా నాకు చూపించిన సంగతి ఇదే.
\p
\s5
\v 22 యూదా రాజమందిరంలో మిగిలి ఉన్న స్త్రీలందరినీ బబులోను అధిపతుల దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అప్పుడు, చూడు! ఆ స్త్రీలు నిన్ను చూసి ఇలా అంటారు,
\q1 <నీ స్నేహితులు నిన్ను మోసం చేసి నిన్ను నాశనం చేశారు.
\q1 నీ పాదాలు బురదలో కూరుకుపోయి ఉన్నాయి. వాళ్ళు నిన్ను విడిచి పెట్టి పారిపోతారు.
\v 23 నీ భార్యలందరినీ, నీ పిల్లలనూ కల్దీయుల దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది. నువ్వు కూడా వాళ్ళ చేతిలోనుంచి తప్పించుకోలేవు. బబులోను రాజుకు దొరికిపోతావు గనుక ఈ పట్టణాన్ని అగ్నితో కాల్చడానికి నువ్వే కారణం అవుతావు.> >>
\p
\s5
\v 24 అప్పుడు సిద్కియా యిర్మీయాతో <<నువ్వు చావకుండా ఉండాలంటే ఈ సంగతులు ఎవరికీ చెప్పొద్దు.
\v 25 నేను నీతో మాట్లాడిన సంగతి అధిపతులకు తెలిస్తే, వాళ్ళు నీ దగ్గరికి వచ్చి, <రాజుతో ఏం మాట్లాడావో చెప్పు. మానుంచి దాచకు, లేకపోతే చంపేస్తాం. ఇంకా, రాజు నీతో చెప్పిన సంగతులు మాకు చెప్పు,> అంటారు.
\v 26 అప్పుడు నువ్వు వాళ్ళతో, <యోనాతాను ఇంటికి మళ్ళీ నన్ను పంపొద్దని, పంపితే నేను అక్కడ చనిపోతానని రాజుతో విన్నవించుకున్నాను,> అని చెప్పాలి,>> అన్నాడు.
\p
\s5
\v 27 అప్పుడు అధిపతులందరూ యిర్మీయా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు అతడు రాజు చెప్పిన మాటల ప్రకారం వాళ్లకు జవాబిచ్చి ఆ విషయం వాళ్లకు తెలియజేయని కారణంగా వాళ్ళు అతనితో మాట్లాడడం ఆపారు. ఎందుకంటే యిర్మీయాతో రాజు చేసిన సంభాషణ వాళ్ళు వినలేదు.
\v 28 యెరూషలేము స్వాధీనం అయ్యే రోజు వరకూ యిర్మీయా ఆ చెరసాల ప్రాంగణంలోనే ఉన్నాడు.
\s5
\c 39
\s యెరూషలేము పతనం
\r 39:1-10; 2 రాజులు 25:1-12; యిర్మీయా 52:4-16
\p
\v 1 యూదా రాజైన సిద్కియా పరిపాలనలో తొమ్మిదో సంవత్సరం పదో నెలలో బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యం అంతటితో యెరూషలేమును ముట్టడి వేశాడు.
\v 2 సిద్కియా పరిపాలనలో 11 వ సంవత్సరం నాలుగో నెల తొమ్మిదో రోజున ప్రాకారాలను కూల్చి పట్టణాన్ని ఆక్రమించారు.
\v 3 అప్పుడు బబులోను రాజు అధికారులు నేర్గల్‌ షరేజరు, సమ్గర్ నెబో, ముఖ్య అధికారి శర్సెకీము లోపలికి వచ్చి సింహద్వారంలో కూర్చున్నారు. నేర్గల్‌ షరేజరు ఒక ఉన్నత అధికారి. మిగిలిన వాళ్ళు బబులోను రాజుకు చెందిన అధికారులు.
\p
\s5
\v 4 యూదుల రాజైన సిద్కియా, అతని యోధులందరూ వాళ్ళను చూసి పారిపోయారు. వాళ్ళు రాత్రిపూట రాజు తోట మార్గంలో రెండు గోడల మధ్య ఉన్న గుమ్మపు దారిలో నుంచి పట్టణం బయటకు వెళ్ళిపోయారు. రాజు అరాబా మైదానం వైపుగా వెళ్ళాడు.
\v 5 అయితే కల్దీయుల సేన వాళ్ళను తరిమి, యెరికో దగ్గర ఉన్న మైదానాల్లో సిద్కియాను కలుసుకుని, అతన్ని పట్టుకుని, హమాతు దేశంలోని రిబ్లా పట్టణం దగ్గర ఉన్న బబులోను రాజైన నెబుకద్నెజరు దగ్గరికి తీసుకొచ్చారు. అక్కడ రాజు అతనికి శిక్ష విధించాడు.
\p
\s5
\v 6 బబులోను రాజు రిబ్లా పట్టణంలో సిద్కియా కొడుకులను అతని కళ్ళముందే చంపాడు. అతడు యూదా ప్రధానులందరినీ చంపాడు.
\v 7 తరువాత అతడు సిద్కియా కళ్ళు పెరికించి అతన్ని బబులోనుకు తీసుకెళ్ళడానికి ఇత్తడి సంకెళ్లతో బంధించాడు.
\p
\s5
\v 8 కల్దీయులు రాజమందిరాన్ని, ప్రజల ఇళ్ళను, అగ్నితో తగలబెట్టి, యెరూషలేము చుట్టూ ఉన్న గోడలు పడగొట్టారు.
\v 9 అప్పుడు రాజదేహ సంరక్షకుల అధిపతి నెబూజరదాను, పట్టణంలో మిగిలి ఉన్న ప్రజలను, ద్రోహులై తమ రాజును విడిచి కల్దీయులతో చేరిన వాళ్ళను, ఇంకా మిగిలిన ప్రజలందరినీ బబులోనుకు తీసుకెళ్ళిపోయాడు.
\v 10 అయితే నెబూజరదాను నిరుపేదలను యూదా దేశంలోనే ఉండనిచ్చి, వాళ్లకు ద్రాక్షతోటలు, పొలాలు ఇచ్చాడు.
\p
\s5
\v 11 యిర్మీయా గురించి బబులోను రాజైన నెబుకద్నెజరు రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదానుకు ఇలా ఆజ్ఞాపించాడు,
\v 12 <<నువ్వు అతనికి హాని చెయ్యొద్దు. అతన్ని జాగ్రత్తగా చూసుకో. అతడు నీతో ఏది చెప్పినా అది అతని కోసం చెయ్యి.>>
\v 13 కాబట్టి రాజదేహసంరక్షకుల అధిపతి నెబూజరదాను, నపుంసకుల అధిపతి నేర్గల్‌ షరేజరు, ఉన్నత అధికారి నేర్గల్‌షరేజరు, ఇంకా బబులోను రాజు ప్రధానులందరూ మనుషులను పంపి,
\v 14 చెరసాల ప్రాంగణంలో నుంచి యిర్మీయాను తెప్పించి, అతన్ని ఇంటికి తీసుకెళ్ళడానికి షాఫాను కొడుకైన అహీకాము కొడుకు గెదల్యాకు అతన్ని అప్పగించారు. అప్పుడు యిర్మీయా ప్రజల మధ్య నివాసం చేశాడు.
\p
\s5
\v 15 యిర్మీయా చెరసాల ప్రాంగణంలో ఉన్నప్పుడు యెహోవా వాక్కు అతనితో ఇలా చెప్పాడు,
\v 16 <<నువ్వు వెళ్లి కూషీయుడైన ఎబెద్మెలెకుతో ఇలా చెప్పు, <ఇశ్రాయేలు దేవుడూ, సేనల ప్రభువు అయిన యెహోవా ఇలా అంటున్నాడు, చూడు, మేలు చెయ్యడం కోసం కాకుండా కీడు చెయ్యడానికి నేను ఈ పట్టణం గురించి చెప్పిన మాటలు నెరవేరుస్తున్నాను. ఆ రోజున నీవు చూస్తూ ఉండగా ఆ మాటలు నెరవేరుతాయి.
\p
\s5
\v 17 ఆ రోజున నేను నిన్ను విడిపిస్తాను. నువ్వు భయపడే మనుషుల చేతికి నిన్ను అప్పగించడం జరగదు> అని యెహోవా అంటున్నాడు,
\v 18 <కచ్చితంగా నేను నిన్ను తప్పిస్తాను. నువ్వు ఖడ్గంతో చనిపోవు. నువ్వు నన్ను నమ్మావు గనుక, నీ ప్రాణమే నీకు కొల్లసొమ్ము అవుతుంది.> ఇదే యెహోవా వాక్కు.>>
\s5
\c 40
\s యిర్మీయా విడుదల
\p
\v 1 రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను యెరూషలేములో నుంచి, యూదాలో నుంచి బబులోనుకు బందీలుగా తీసుకెళ్ళిన ప్రజలందరి దగ్గర నుంచి, సంకెళ్లతో బంధించి ఉన్న యిర్మీయాను రమా నుంచి పంపించేసినప్పుడు యెహోవా నుంచి అతనికి వచ్చిన వాక్కు.
\p
\v 2 రాజదేహ సంరక్షకుల అధిపతి యిర్మీయాను పక్కకు తీసుకెళ్ళి, అతనితో <<ఈ స్థలానికి ఈ విపత్తు తెస్తానని నీ దేవుడైన యెహోవా ప్రకటించాడు గదా,
\s5
\v 3 తాను చెప్పిన ప్రకారం యెహోవా ఆ విపత్తు రప్పించాడు. మీరు యెహోవాకు విరోధంగా పాపం చేసి ఆయన మాటలు వినలేదు కాబట్టి ఆయన చెప్పినట్టే చేశాడు. అందుకే మీకు ఇలా జరిగింది.
\v 4 కాని ఇప్పుడు చూడు! ఈ రోజు నేను నీ చేతుల సంకెళ్లను తీసి నిన్ను విడిపించాను. నాతోబాటు బబులోను రావడం మంచిదని నీకు అనిపిస్తే నాతో రా. నేను నీ గురించి జాగ్రత్త తీసుకుంటాను. అయితే మంచిది కాదనిపిస్తే రావద్దు. దేశమంతా నీ ఎదుట ఉంది. ఎక్కడికి వెళ్ళడం నీ దృష్టికి అనుకూలమో అక్కడికి వెళ్ళు.>>
\p
\s5
\v 5 యిర్మీయా ఏ జవాబూ చెప్పకుండా ఉన్నప్పుడు, నెబూజరదాను అతనితో ఇలా అన్నాడు. <<షాఫాను కొడుకైన అహీకాము కొడుకు గెదల్యాను యూదా పట్టణాల మీద అధికారిగా బబులోను రాజు నియమించాడు. అతని దగ్గరికి వెళ్లు. అతనితో ఉంటూ, ప్రజల మధ్య నివాసం ఉండు. లేదా, ఎక్కడికి వెళ్ళడం నీ దృష్టికి అనుకూలమో అక్కడికే వెళ్లు.>> అప్పుడు రాజదేహ సంరక్షకుల అధిపతి అతనికి ఆహారం, ఒక బహుమానం ఇచ్చి పంపించాడు.
\v 6 యిర్మీయా మిస్పాలో ఉన్న అహీకాము కొడుకు గెదల్యా దగ్గరికి వెళ్లి అతనితోబాటు దేశంలో మిగిలిన ప్రజల మధ్య కాపురం ఉన్నాడు.
\s అధిపతి గెదల్యా మరణం
\r 40:7-9; 41:1-3; 2 రాజులు 25:22-26
\p
\s5
\v 7 ఇప్పుడు, అక్కడ పల్లెటూళ్ళల్లో ఉన్న కొంతమంది యూదయ సేనల అధిపతులూ, వారి మనుషులూ, బబులోను రాజు అహీకాము కొడుకు గెదల్యాను దేశం మీద అధికారిగా నియమించాడనీ, బబులోనుకు బందీలుగా వెళ్ళకుండా అక్కడే మిగిలిన వాళ్ళలో ఉన్న స్త్రీలను, పురుషులను, పిల్లలను, దేశంలోని నిరుపేదలను అతనికి అప్పగించాడనీ విన్నారు.
\v 8 కాబట్టి నెతన్యా కొడుకు ఇష్మాయేలు, కారేహ కొడుకులైన యోహానాను, యోనాతాను, తన్హుమెతు కొడుకు శెరాయా, నెటోపాతీయుడైన ఏపయి కొడుకులు, మాయకాతీయుడి కొడుకు యెజన్యా, వాళ్ళ మనుషులు, మిస్పాలో ఉన్న గెదల్యా దగ్గరికి వచ్చారు.
\p
\s5
\v 9 అప్పుడు షాఫాను కొడుకు అహీకాము కొడుకు గెదల్యా ప్రమాణంచేసి వాళ్ళతోనూ, వాళ్ళ మనుషులతోనూ ఇలా అన్నాడు. <<మీరు కల్దీయులను సేవించడానికి భయపడవద్దు. దేశంలో కాపురం ఉండి, బబులోను రాజును సేవిస్తే మీకు మేలు కలుగుతుంది.
\v 10 చూడండి, మన దగ్గరికి వచ్చే కల్దీయులను కలుసుకోడానికి నేను మిస్పాలో కాపురం ఉంటున్నాను. కాబట్టి ద్రాక్షారసం తయారుచేసుకోండి. వేసవికాల ఫలాలు, నూనె సమకూర్చుకుని, పాత్రల్లో నిల్వ చేసుకోండి. మీరు స్వాధీనం చేసుకున్న పట్టణాల్లో నివాసం ఉండండి.>>
\p
\s5
\v 11 మోయాబులో, అమ్మోనీయుల ప్రజల మధ్య, ఎదోములో, ఇంకా మిగతా ప్రదేశాలన్నిటిలో ఉన్న యూదులందరూ, బబులోను రాజు యూదయలో కొంతమంది ప్రజలను విడిచిపెట్టాడనీ, షాఫాను కొడుకు అహీకాము కొడుకైన గెదల్యాను వాళ్ళ మీద అధికారిగా నియమించాడని విన్నారు.
\v 12 కాబట్టి యూదయ వాళ్ళందరూ తాము చెదిరిపోయి ఉన్న స్థలాలన్నిటినీ విడిచి, గెదల్యా దగ్గరికి మిస్పా తిరిగి వచ్చారు. వాళ్ళు ద్రాక్షారసం, వేసవికాలపు ఫలాలు అత్యంత సమృద్ధిగా సమకూర్చుకున్నారు.
\p
\s5
\v 13 కారేహ కొడుకు యోహానాను, పల్లెటూళ్ళల్లో నున్న సేనల అధిపతులందరూ మిస్పాలో ఉన్న గెదల్యా దగ్గరికి వచ్చి,
\v 14 <<నిన్ను చంపడానికి అమ్మోనీయుల రాజైన బయలీను నెతన్యా కొడుకు ఇష్మాయేలును పంపాడని నీకు తెలియదా?>> అన్నారు. కాని, అహీకాము కొడుకు గెదల్యా వాళ్ళ మాట నమ్మలేదు.
\p
\s5
\v 15 కారేహ కొడుకు యోహానాను మిస్పాలో గెదల్యాతో ఏకాంతంగా <<నెతన్యా కొడుకు ఇష్మాయేలును నేను చంపుతాను. నన్ను ఎవరూ అనుమానించరు. అతడు నిన్నెందుకు చంపాలి? నీ దగ్గరికి కూడివచ్చిన యూదులందరూ ఎందుకు చెదిరిపోవాలి? మిగిలిన ప్రజలందరూ ఎందుకు నాశనం కావాలి?>> అన్నాడు.
\v 16 కాని అహీకాము కొడుకు గెదల్యా, కారేహ కొడుకు యోహానానుతో <<నువ్వు ఈ పని చెయ్యొద్దు. ఎందుకంటే నువ్వు ఇష్మాయేలు గురించి అబద్ధాలు చెబుతున్నావు>> అన్నాడు.
\s5
\c 41
\p
\v 1 కాని ఏడో నెలలో ఎలీషామా మనవడూ, నెతన్యా కొడుకూ, రాజవంశం వాడూ, రాజు ప్రధానుల్లో ఒకడైన ఇష్మాయేలూ, అతనితోపాటు మరో పదిమంది మనుషులు కలిసి, మిస్పాలో ఉన్న అహీకాము కొడుకు గెదల్యా దగ్గరికి వచ్చి అక్కడ అతనితోపాటు మిస్పాలో భోజనం చేశారు.
\v 2 అప్పుడు నెతన్యా కొడుకు ఇష్మాయేలు, అతనితోపాటు ఉన్న ఆ పదిమంది మనుషులు లేచి, బబులోను రాజు ఆ దేశం మీద అధికారిగా నియమించిన షాఫాను మనవడూ, అహీకాము కొడుకైన గెదల్యాను ఖడ్గంతో హతం చేశారు.
\v 3 తరువాత ఇష్మాయేలు మిస్పాలో గెదల్యా దగ్గర ఉన్న యూదులందరినీ, అక్కడ ఉన్న యోధులైన కల్దీయులను చంపాడు.
\p
\s5
\v 4 అది అతడు గెదల్యాను చంపిన రెండో రోజు. కానీ ఎవరికీ తెలియదు.
\v 5 గడ్డాలు గీయించుకుని, బట్టలు చింపుకుని, శరీరాలు గాయపరచుకున్న 80 మంది పురుషులు యెహోవా మందిరానికి తీసుకెళ్ళడానికి నైవేద్యాలు, ధూపద్రవ్యాలు చేతపట్టుకుని షెకెము నుంచి, షిలోహు నుంచి, షోమ్రోను నుంచి వచ్చారు.
\p
\s5
\v 6 నెతన్యా కొడుకు ఇష్మాయేలు దారిపొడుగునా ఏడుస్తూ, వాళ్ళను ఎదుర్కోడానికి మిస్పాలోనుంచి బయలుదేరి వెళ్లి వాళ్ళను కలుసుకుని, వాళ్ళతో <<అహీకాము కొడుకు గెదల్యా దగ్గరికి రండి,>> అన్నాడు.
\v 7 అయితే, వాళ్ళు ఆ పట్టణంలోకి ప్రవేశించినప్పుడు, నెతన్యా కొడుకు ఇష్మాయేలూ, అతనితోబాటు ఉన్నవాళ్ళు, వాళ్ళను చంపి గోతిలో పడేశారు.
\p
\s5
\v 8 కాని, వాళ్ళల్లో పదిమంది మనుషులు ఇష్మాయేలుతో <<మమ్మల్ని చంపొద్దు, పొలంలో దాచిన గోధుమలు, బార్లీ, నూనె, తేనె మొదలైన ద్రవ్యాలు మా దగ్గర ఉన్నాయి,>> అన్నారు. కాబట్టి అతడు వాళ్ళను, వాళ్ళతో ఉన్నవాళ్ళను కూడా చంపలేదు.
\v 9 ఇష్మాయేలు గెదల్యాతోబాటు చంపిన మనుషుల శవాలన్నీ పారేసిన గొయ్యి, రాజైన ఆసా ఇశ్రాయేలు రాజైన బయషాకు భయపడి తవ్వించినదే. నెతన్యా కొడుకు ఇష్మాయేలు తాను చంపిన వాళ్ళ శవాలతో దాన్ని నింపాడు.
\p
\s5
\v 10 అప్పుడు ఇష్మాయేలు, మిస్పాలో ఉన్న మిగిలిన జనమంతటినీ, రాజకుమార్తెలందరినీ, అంటే, రాజదేహ సంరక్షకుల అధికారి నెబూజరదాను అహీకాము కొడుకు గెదల్యాకు అప్పగించిన ప్రజలందరినీ, బందీలుగా తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళను తీసుకెళ్ళి అమ్మోనీయుల దగ్గర చేరాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు,
\s5
\v 11 కారేహ కొడుకు యోహానాను, అతనితోపాటు ఉన్న సేనాధిపతులందరూ నెతన్యా కొడుకు ఇష్మాయేలు చేసిన హాని అంతటి గురించి విన్నారు.
\v 12 కాబట్టి వాళ్ళు పురుషులందరినీ తీసుకుని, నెతన్యా కొడుకు ఇష్మాయేలుతో యుద్ధం చెయ్యడానికి వెళ్ళారు. గిబియోనులో ఉన్న పెద్ద కొలను దగ్గర అతన్ని కనుగొన్నారు.
\p
\s5
\v 13 కారేహ కొడుకు యోహానాను, అతనితోపాటు ఉన్న సేనాధిపతులందరినీ చూసినప్పుడు, ఇష్మాయేలుతోపాటు ఉన్న ప్రజలు ఎంతో సంతోషించారు.
\v 14 ఇష్మాయేలు మిస్పానుంచి బందీలుగా తీసుకెళ్ళిన ప్రజలందరు అతన్ని విడిచి కారేహ కొడుకు యోహానానుతో కలిశారు.
\p
\s5
\v 15 కాని, నెతన్యా కొడుకు ఇష్మాయేలూ, ఎనిమిదిమంది మనుషులు, యోహానాను చేతిలోనుంచి తప్పించుకుని, అమ్మోనీయుల దగ్గరికి పారిపోయారు.
\s ఐగుప్తుకు పారిపోవడం
\p
\v 16 అప్పుడు నెతన్యా కొడుకు ఇష్మాయేలు అహీకాము కొడుకు గెదల్యాను చంపిన తరువాత,
\s5
\v 17 కారేహ కొడుకు యోహానానూ, అతనితోపాటు ఉన్న సేనల అధిపతులందరూ, మిస్పా దగ్గర నుంచి, ఇష్మాయేలు చేతిలో నుంచి రక్షించిన మిగిలిన ప్రజలందరినీ, అంటే, గిబియోను దగ్గరనుంచి ఇష్మాయేలు తీసుకెళ్ళిన యోధులను, స్త్రీలను, పిల్లలను, రాజకుటుంబాన్ని, మళ్ళీ తీసుకొచ్చారు.
\v 18 అయితే వాళ్ళు బబులోను రాజు దేశం మీద అధికారిగా నియమించిన అహీకాము కొడుకు గెదల్యాను నెతన్యా కొడుకు ఇష్మాయేలు చంపిన కారణంగా వాళ్ళు కల్దీయులకు భయపడి, ఐగుప్తుకు వెళ్దాం అనుకుని, బేత్లెహేము దగ్గర ఉన్న గెరూతు కింహాములో కొంత కాలం ఉన్నారు.
\s5
\c 42
\p
\v 1 అప్పుడు కారేహ కుమారుడు యోహానానూ, హోషేయా కుమారుడు యెజన్యా, సైన్యాధిపతులందరూ ఇంకా గొప్పవారూ, సామాన్యులూ ప్రజలందరూ కలసి ప్రవక్త అయిన యిర్మీయా దగ్గరికి వచ్చారు.
\v 2 వాళ్ళు అతనితో ఇలా అన్నారు. <<నువ్వు చూస్తున్నట్టు మేం చాలా తక్కువ మందిమి. మా మనవిని చెవినబెట్టి మిగిలిన ఈ ప్రజల కోసం నీ దేవుడైన యెహోవాను ప్రార్థించు.
\v 3 మేం ఏ మార్గాన వెళ్ళాలో, ఏం చేయాలో నీ దేవుడైన యెహోవాను అడిగి మాకు తెలియజేయి.>>
\p
\s5
\v 4 కాబట్టి ప్రవక్త అయిన యిర్మీయా వాళ్లకిలా చెప్పాడు. <<మీరు చెప్పింది విన్నాను. చూడండి, మీరు అభ్యర్ధించినట్టే నేను మీ దేవుడైన యెహోవాను ప్రార్ధిస్తాను. యెహోవా ఏం జవాబిచ్చాడో అది ఏదీ దాచకుండా మీకు చెప్తాను.>>
\v 5 వాళ్ళు యిర్మీయాతో ఇలా అన్నారు. <<నీ దేవుడైన యెహోవా మాకు చెప్పినదంతా మేం చేయకపోతే అప్పుడు యెహోవా మాకు వ్యతిరేకంగా నమ్మకమైన సత్యసాక్షిగా ఉంటాడు గాక.
\v 6 అది మాకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా మేము మాత్రం నిన్ను పంపుతున్న మన దేవుడైన యెహోవా స్వరానికి లోబడతాం. మన దేవుడైన యెహోవా చెప్పిన మాటకు లోబడటం మాకు మేలు చేస్తుంది.>>
\p
\s5
\v 7 పది రోజుల తర్వాత యెహోవా వాక్కు యిర్మీయా దగ్గరికి వచ్చింది.
\v 8 కాబట్టి అతడు కారేహ కొడుకు యోహానానునూ, అతనితో ఉన్న సైన్యాధిపతులందర్నీ, ఇంకా గొప్పవారూ, సామాన్యులూ అయిన ప్రజలందర్నీ తన దగ్గరికి పిలిచాడు.
\v 9 వారికిలా చెప్పాడు. <<ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దగ్గర మీ కోసం ప్రార్ధించడానికి మీరు నన్ను పంపారు. ఆయన ఇలా చెప్పాడు.
\v 10 <మీరు వెనక్కి వెళ్లి ఈ దేశంలోనే నివసించినట్లయితే నేను మిమ్మల్ని నిర్మిస్తాను. మిమ్మల్ని చీల్చివేయను. మిమ్మల్ని నాటుతాను గానీ పెకలించి వేయను. మీ పైకి నేను తెచ్చిన విపత్తును తప్పిస్తాను.
\p
\s5
\v 11 మీరు బబులోను రాజుకు భయపడుతూ ఉన్నారు. అతనికి భయపడకండి.> ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. <మిమ్మల్ని రక్షించడానికీ, అతని చేతిలో నుండి తప్పించడానికీ నేను మీతో ఉన్నాను కాబట్టి అతనికి భయపడకండి.
\v 12 నేను మిమ్మల్ని కరుణిస్తాను. మీ పైన కనికరపడతాను. మీ దేశానికి తిరిగి మిమ్మల్ని తీసుకువస్తాను,>
\p
\s5
\v 13 అయితే ఒకవేళ మీరు కత్తి మూలంగానో, కరువు మూలంగానో, వ్యాధి మూలంగానో మీ దేవుడైన యెహోవానైన నా మాట వినకుండా <మేం ఈ దేశంలో నివసించం,> అన్నారనుకోండి,
\v 14 లేదా మీరు <ఇక్కడ కాదు. మనం ఐగుప్తు దేశానికి వెళ్దాం. అక్కడ ఎలాంటి యుద్ధమూ చూడం, అక్కడ యుద్ధ భేరీనాదం వినం, ఆహారం కోసం ఆకలితో ఉండం. మనం అక్కడే నివసిద్దాం> అనుకోవచ్చు కూడా.
\p
\s5
\v 15 యూదా ప్రజల్లో మిగిలి ఉన్న వారు యెహోవా చెప్పే ఈ మాట వినండి. సేనల ప్రభువూ, ఇశ్రాయేలు దేవుడూ అయిన యెహోవా ఇలా చెప్తున్నాడు. మీరు ఒకవేళ ఐగుప్తులో నివసించడానికి వెళ్లాలని నిర్ణయం చేసుకుంటే,
\v 16 మీరు భయపడుతున్న కత్తి ఐగుప్తులో మిమ్మల్ని కలుసుకుంటుంది. మీరు చింతించే కరువు మీ వెనుకే ఐగుప్తు వచ్చి మిమ్మల్ని పట్టుకుంటుంది. మీరు అక్కడే చనిపోతారు.
\v 17 కాబట్టి ఐగుప్తులో నివసించాలని నిర్ణయం తీసుకుని అక్కడకు వెళ్ళే వాళ్ళు కత్తి మూలంగానో, కరువు మూలంగానో, వ్యాధి మూలంగానో చనిపోతారు. నేను వాళ్ళ పైకి పంపించే ఆపద నుండి ఎవరూ తప్పించుకోరు. ఎవరూ మిగిలి ఉండరు.>>
\p
\s5
\v 18 ఎందుకంటే సేనల ప్రభువూ, ఇశ్రాయేలు దేవుడూ అయిన యెహోవా ఇలా చెప్తున్నాడు. <<యెరూషలేము నివాసుల పైకి నా తీవ్ర కోపమూ, నా ఉగ్రతా వచ్చినట్టే, మీరు ఐగుప్తుకు వెళ్ళినట్టయితే మీ మీద కూడా నా క్రోధాన్ని కుమ్మరిస్తాను. మీరు శాపానికి గురౌతారు. మీరు భయాన్ని పుట్టించే వాళ్ళుగా ఉంటారు. దూషణ పాలవుతారు. ఈ స్థలాన్ని మీరు ఇక మీదట చూడరు.
\v 19 యూదా ప్రజల్లో మిగిలి ఉన్న మీ కోసం యెహోవా చెప్తున్నాడు. ఐగుప్తుకు వెళ్ళకండి! ఈ రోజు మీకు వ్యతిరేకంగా సాక్ష్యం నేనే అని మీకు తెలుసు.
\p
\s5
\v 20 <మా కోసం మన దేవుడైన యెహోవాకు ప్రార్థించు. మన దేవుడైన యెహోవా చెప్పినదంతా మాకు తెలియజెయ్యి. మేం దాన్ని జరిగిస్తాం> అంటూ మీరే యిర్మీయా అనే నన్ను మీ దేవుడైన యెహోవా దగ్గరికి పంపించారు. కాబట్టి మీరు మీ ప్రాణాలనే చెల్లించాల్సి ఉంటుంది.
\v 21 ఈ రోజు నేను మీకు తెలియజేశాను. కానీ మీరు మీ దేవుడైన యెహోవా మాట వినలేదు. ఆయన నా ద్వారా మీకు తెలియజేసిన వాటిలో దేనినీ వినలేదు.
\v 22 కాబట్టి ఎక్కడ నివాసముండాలని మీరు కోరుకుంటున్నారో అక్కడే మీరు కత్తి మూలంగానో, కరువు మూలంగానో, వ్యాధి మూలంగానో చనిపోతారు. అది మీకు తప్పకుండా తెలుసుకోవాలి.>>
\s5
\c 43
\p
\v 1 వాళ్ళ దేవుడైన యెహోవా వాళ్ళతో చెప్పమని తనకి ఆదేశించిన మాటలన్నిటినీ యిర్మీయా వాళ్లకు చెప్పి ముగించాడు.
\v 2 అప్పుడు హోషేయా కొడుకు అజర్యా, కారేహ కొడుకు యోహానానూ ఇంకా అక్కడ ఆహంకారులందరూ యిర్మీయాతో <<నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. <మీరు నివసించడానికి ఐగుప్తుకు వెళ్ళవద్దు> అని మా దేవుడు యెహోవా నీతో చెప్పి పంపలేదు.
\v 3 మేం చావడానికీ, బబులోనుకు బందీలుగా పోవడానికీ కల్దీయుల చేతిలో చిక్కాలని నేరీయా కొడుకు బారూకు మాకు వ్యతిరేకంగా నిన్ను రెచ్చగొడుతున్నాడు>> అన్నారు.
\p
\s5
\v 4 ఈ విధంగా కారేహ కొడుకు యోహానానూ, సైన్యాధిపతులందరూ, ఇంకా ప్రజలందరూ యూదా దేశంలో నివసించమన్న దేవుని మాట వినలేదు.
\v 5 కారేహ కొడుకు యోహానానూ, సైన్యాధిపతులందరూ చెరలో నుండి యూదా దేశంలో నివసించడానికి అనేక ప్రాంతాల నుండి తిరిగి వచ్చిన వాళ్ళనందరినీ తీసుకు వెళ్ళారు.
\v 6 స్త్రీ పురుషులనందరినీ, పిల్లలనూ, రాజ కుమార్తెలనూ, రాజు అంగరక్షకులకు అధిపతి అయిన నెబూజరదాను షాఫాను కొడుకైన అహీకాము కొడుకు గెదల్యా ఆధీనంలో ఉంచిన వాళ్ళనందరినీ తీసుకుని వెళ్ళారు. వాళ్ళు ప్రవక్త అయిన యిర్మీయానూ, నేరీయా కొడుకు బారూకును కూడా తీసుకు వెళ్ళారు.
\v 7 వాళ్ళు దేవుని మాట వినకుండా ఐగుప్తుదేశంలో ఉన్న తహపనేసుకు వచ్చారు.
\p
\s5
\v 8 కాబట్టి యెహోవా వాక్కు తహపనేసులో ఉన్న యిర్మీయా వద్దకు వచ్చి ఇలా చెప్పాడు.
\v 9 యూదులు చూస్తూ ఉండగా నువ్వు కొన్ని పెద్ద రాళ్ళను చేతిలో పట్టుకుని తహపనేసులో ఉన్న ఫరో భవన ద్వారం దగ్గరికి వెళ్ళు. అక్కడ ఇటుకలు పేర్చిన దారిలో సున్నం కింద వాటిని దాచి పెట్టు.
\v 10 తర్వాత వాళ్లకిలా ప్రకటించు. <<సేనల ప్రభువూ, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నాడు. <చూడండి, నేను నా సేవకుడూ, బబులోను రాజూ అయిన నెబుకద్నెజరును పిలవడానికి వార్తాహరులను పంపిస్తున్నాను. యిర్మీయా పాతిన ఈ రాళ్ళ పైన అతని సింహాసనాన్ని నిలబెడతాను. వాటిపైనే అతడు తన కంబళి పరుస్తాడు.
\p
\s5
\v 11 అతడు వచ్చి ఐగుప్తు పై దాడి చేస్తాడు. చావుకు నిర్ణయమైన వాళ్ళు చనిపోతారు. బందీలుగా వెళ్ళడానికి నిర్ణయమైన వాళ్ళు బందీలుగా వెళ్తారు. కత్తి మూలంగా చావడానికి నిర్ణయమైన వాళ్ళు కత్తి మూలంగానే చనిపోతారు.
\v 12 అప్పుడు నేను ఐగుప్తు దేవుళ్ళ గుళ్లలో అగ్ని రాజేస్తాను. నెబుకద్నెజరు వాటిని కాల్చి వేస్తాడు. లేదా ఆ దేవుళ్ళను పట్టుకుపోతాడు. గొర్రెల కాపరి తన బట్టలపై ఉన్న పురుగులను తుడిచి పెట్టినట్టుగా అతడు ఐగుప్తు దేశాన్ని తుడిచి పెట్టేస్తాడు. విజయం సాధించి అక్కడ నుండి వెళ్తాడు.
\v 13 అతడు ఐగుప్తులో సూర్య మందిరాలలో ఉన్న రాతి స్తంభాలను కూల్చి వేస్తాడు. ఐగుప్తు దేవుళ్ళ ఆలయాలను కాల్చివేస్తాడు.> >>
\s5
\c 44
\s ఐగుప్తులో ఉన్న వారికి హెచ్చరికలు
\p
\v 1 ఐగుప్తు లోని మిగ్దోలు, తహపనేసు, నొపు, పత్రోసు నగరాల్లో నివాసమున్న యూదా ప్రజలందరిని గూర్చి యిర్మీయా వద్దకు వచ్చిన దేవుని వాక్యం ఇది.
\v 2 <<సేనల ప్రభువూ, ఇశ్రాయేలు దేవుడూ అయిన యెహోవా ఇలా చెప్తున్నాడు. నేను యెరూషలేము పైకీ మిగిలిన యూదా దేశపు పట్టణాల పైకీ పంపిన విపత్తులన్నిటినీ మీరు చూశారు. చూడండి, అవి శిథిలాలై పడి ఉన్నాయి. అక్కడ ఎవరూ నివసించడం లేదు.
\v 3 మీకుగానీ మీ పితరులకిగానీ తెలియని దేవుళ్ళకి సాంబ్రాణి వేసి పూజించి నాకు కోపం పుట్టించారు కాబట్టి అలా జరిగింది.
\p
\s5
\v 4 అందుకని నేను నా సేవకులైన ప్రవక్తలందర్నీ పదే పదే పంపిస్తూ వచ్చాను. నేను అసహ్యించుకునే ఈ నీచమైన పనులు చేయవద్దు అని చెప్పేందుకు వాళ్ళని పంపాను.
\v 5 కానీ వాళ్ళు వినలేదు. ఇతర దేవుళ్ళకి ధూపం వేయడం గానీ, దుర్మార్గపు పనులను చేయడం గానీ మానుకోలేదు. నా మాటపై శ్రద్ధ పెట్టలేదు.
\v 6 కాబట్టి నా దగ్గర నుండి తీవ్రమైన కోపం, ఉగ్రత ప్రవహించింది. అది అగ్నిలా యూదా పట్టణాలనూ, యెరూషలేము రహదారులనూ తగులబెట్టింది. కాబట్టి అవి ఇప్పుడు చూస్తున్నట్టుగా నాశనమై శిథిలాలుగా పడి ఉన్నాయి.>>
\p
\s5
\v 7 కాబట్టి ఇప్పుడు సేనల ప్రభువూ, ఇశ్రాయేలు దేవుడూ అయిన యెహోవా ఇలా చెప్తున్నాడు. <<మీకు విరోధంగా మీరే ఎందుకిలా దుర్మార్గం చేస్తూ ఉన్నారు? స్త్రీలూ, పురుషులూ, పిల్లలూ, పసికందులూ ఇలా ఎవరూ యూదా దేశంలో ఉండకుండా నిర్మూలం అయ్యేలా, మీలో ఎవరూ మిగలకుండా మీరే ఎందుకు చేసుకుంటున్నారు?
\v 8 మీ దుర్మార్గత చేత మీరు మీ చేతులతో చేసే పనులతో నాకు అభ్యంతరకరంగా నేరం చేస్తున్నారు. మీరు నివాసం ఉండబోతున్న ఐగుప్తు దేశపు దేవుళ్ళకి ధూపం వేస్తూ నన్ను ఉల్లంఘిస్తున్నారు. మీరు నాశనం కావడానికీ భూమి పైన ఉన్న అన్ని దేశాల్లో మీరు నవ్వుల పాలు కావడానికీ, ఒక శాప వచనంగా ఉండటానికీ మీరు అక్కడికి వెళ్తున్నారు.
\p
\s5
\v 9 మీ పితరులు చేసిన దుర్మార్గాన్నీ, మీ యూదా రాజులూ, వాళ్ళ భార్యలూ చేసిన దుర్మార్గాన్నీ మరచిపోయారా? యూదా దేశంలోనూ, యెరూషలేము వీధుల్లోనూ మీరూ, మీ భార్యలూ చేసిన దుర్మార్గాన్ని మరచిపోయారా?
\v 10 ఈ రోజు వరకూ వాళ్ళు అణకువతో ఉండలేదు. వాళ్ళ ముందూ వాళ్ళ పితరుల ముందూ నేను ఉంచిన ధర్మశాస్త్రాన్నిగానీ ఆజ్ఞలనుగానీ వాళ్ళు గౌరవించలేదు. వాటి ప్రకారం జీవించలేదు.>>
\p
\s5
\v 11 కాబట్టి సేనల ప్రభువూ, ఇశ్రాయేలు దేవుడూ అయిన యెహోవా ఇలా చెప్తున్నాడు. <<చూడండి, మీ పైకి అపాయాన్ని తీసుకురావడానికీ, యూదా దేశాన్నంతా నాశనం చేయడానికీ నేను నా ముఖాన్ని మీకు వ్యతిరేకంగా తిప్పుకుంటున్నాను.
\v 12 యూదా ప్రజలలో మిగిలిన వాళ్ళలో ఐగుప్తు దేశానికి వెళ్ళాలని నిర్ణయించుకున్న వాళ్ళని నేనే తీసుకు వెళ్తాను. వాళ్ళంతా ఐగుప్తులో నాశనం కావడానికే ఇలా చేస్తాను. వాళ్ళు అక్కడ కత్తి మూలంగానూ, కరువు మూలంగానూ కూలిపోతారు. వాళ్ళు చనిపోయి శాపానికీ, దూషణకూ, అవమానానికీ, భయానికీ సామెతగా ఉంటారు.
\p
\s5
\v 13 యెరూషలేములో నివసించే వాళ్ళని కత్తితో, కరువుతో, వ్యాధులతో నేను ఎలా శిక్షించానో అలాగే ఐగుప్తులో నివసించే వాళ్ళను కూడా శిక్షిస్తాను.
\v 14 ఐగుప్తులో నివాసముండటానికి వెళ్ళిన మిగిలిన యూదా ప్రజల్లో ఎవరూ కాందిశీకుల్లా తిరిగి యూదా దేశానికి రావాలని ఎంత కోరుకున్నా రాలేరు. అక్కడ నుండి తప్పించుకుని పారిపోయిన ఏ కొద్దిమందో తప్ప ఎవరూ తిరిగి రారు.>>
\p
\s5
\v 15 అప్పుడు తమ భార్యలు ఇతర దేవుళ్ళకు సాంబ్రాణి ధూపం వేస్తారని తెలిసిన పురుషులందరూ, అక్కడ సమూహంలో ఉన్న ఆడవాళ్ళందరూ, ఐగుప్తు దేశంలో పత్రోసులో నివాసముండే ప్రజలందరూ యిర్మీయాకు జవాబిచ్చారు.
\v 16 వాళ్ళిలా అన్నారు. <<యెహోవా పేరు మీద నువ్వు చెప్పిన మాట మేం వినం.
\v 17 మేం చేస్తామని చెప్పిన పనులను మేం తప్పకుండా చేస్తాం. యూదా దేశంలోనూ, యెరూషలేము వీధులలోనూ మేమూ, మా రాజులూ, మా పితరులూ, మా నాయకులూ చేసినట్టే ఆకాశ రాణికి ధూపం వేస్తాం, ఆమెకు పానీయ నైవేద్యాలు సమర్పిస్తాం. అప్పుడే ఎలాంటి ఆపదా కలగకుండా మాకు సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది. మేం అభివృద్ధి చెందుతాం.
\p
\s5
\v 18 మేం ఆకాశరాణికి ధూపం వేయకుండా, ఆమెకు పానీయ నైవేద్యాలు అర్పించకుండా ఉన్నప్పుడు పేదరికంతో బాధ పడ్డాం. కత్తి మూలంగానూ, కరువు మూలంగానూ నశించిపోతున్నాం.>>
\v 19 అక్కడి స్త్రీలు <<మేం మా భర్తలకు తెలియకుండానే ఆకాశ రాణికి ధూపం వేస్తూ, ఆమెకు పానీయ నైవేద్యాలు అర్పిస్తూ ఉన్నామా ఏమిటి?>> అన్నారు.
\p
\s5
\v 20 అప్పుడు యిర్మీయా ఆ ప్రజలందరితో, ఆ స్త్రీ పురుషులందరితో, తనకు జవాబు చెప్పిన వాళ్ళందరితో ఇలా అన్నాడు. వాళ్ళకి ఇలా ప్రకటన చేశాడు.
\v 21 <<మీరూ, మీ పితరులూ, మీ రాజులూ, మీ నాయకులూ, మీ ప్రజలందరూ యూదా పట్టణాల్లోనూ, యెరూషలేము వీధులలోనూ మీరు వేసిన ధూపం యెహోవా మర్చిపోయాడు అనుకుంటున్నారా? ఆయన దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన ఆలోచనల్లో ఇది మెదులుతూనే ఉంది.
\p
\s5
\v 22 ఆయన మీ దుర్మార్గపు పనులనూ, మీరు జరిగించిన అసహ్య కార్యాలనూ చూసి సహించలేక పోయాడు. అందుకే మీ భూమి ఎడారి అయింది. భీకరమైన ప్రాంతంగా, ఒక శాపంగా అయింది. అందుకే ఈ రోజు వరకూ అక్కడ ఎవరూ నివాసమేర్పరచుకోలేదు.
\v 23 మీరు ధూపం వేసి యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశారు. ఆయన మాట వినకుండా ఆయన ధర్మశాస్త్రాన్నీ, ఆయన ఆజ్ఞలనూ, ఆయన నిబంధన నియమాలనూ పాటించలేదు. అందుకే ఈ రోజు మీకీ దురవస్థ కలిగింది.>>
\p
\s5
\v 24 తర్వాత యిర్మీయా అక్కడి ప్రజలనందరికీ, స్త్రీలందరికీ ఇలా చెప్పాడు. <<ఐగుప్తులో ఉన్న యూదా ప్రజలారా, యెహోవా మాట వినండి.
\v 25 సేనల ప్రభువూ, ఇశ్రాయేలు దేవుడూ అయిన యెహోవా ఇలా చెప్తున్నాడు. <మీరూ, మీ భార్యలూ, ఇద్దరూ కలసి మీ నోటితో చెప్పారు.> అలా చెప్పిన దాన్ని చేతులతో చేసి చూపించారు. ఆకాశ రాణికి ధూపం వేస్తామనీ, ఆమెకు పూజ చేస్తామనీ మీరు ఒట్టు పెట్టుకున్నారు. ఇప్పుడు మీ ఒట్టును నెరవేర్చండి. దానిని జరిగించండి.
\p
\s5
\v 26 అయితే ఐగుప్తులో నివసించే యూదా ప్రజలందరూ యెహోవా మాట వినండి. ఆయన ఇలా అంటున్నాడు. చూడండి. నేను నా ఘన నామంపై ప్రమాణం చేసి చెప్తున్నాను. ఐగుప్తులో ఉన్న యూదులంతా ఇప్పుడు <యెహోవా జీవం తోడు> అంటూ ఉంటారు. అయితే ఐగుప్తులో ఉన్న యూదుల్లో ఎవ్వరూ ఇక మీదట నా పేరును తమ నోటితో పలకరు.
\v 27 నేను వాళ్ళ క్షేమం కోసం కాకుండా వాళ్ళ వినాశనం కోసమే వాళ్ళని కనిపెట్టుకుని ఉన్నాను. ఐగుప్తులోని యూదులంతా కత్తి మూలంగానో కరువు మూలంగానో చనిపోతారు. వాళ్ళలో ఒక్కడు కూడా మిగలడు. వారు ఖడ్గం వల్ల గానీ కరువు వల్ల గానీ క్షీణించిపోతారు. ఐగుప్తు దేశంలో ఉన్న యూదా వారంతా ఎవరూ మిగలకుండా అంతమై పోతారు.
\v 28 కత్తిని తప్పించుకున్న కొద్దిమంది ఐగుప్తు నుండి యూదా దేశానికి తిరిగి వస్తారు. కాబట్టి యూదాలో మిగిలిన వాళ్లకు ఎవరి మాట నిజమైనదో, నాదో, వారిదో అప్పడు తెలుసుకుంటారు.
\p
\s5
\v 29 ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. <నా మాట మీకు విరోధంగా మీ పైకి ఘోర విపత్తును తీసుకు వస్తుంది. దానికి ఇది మీకు ఒక సూచనగా ఉంటుంది.>
\v 30 యెహోవా ఇలా చెప్తున్నాడు. <సిద్కియా ప్రాణాన్ని తీయాలని వెదికిన అతని శత్రువు నెబుకద్నెజరు చేతికి సిద్కియాను అప్పగించినట్టే ఐగుప్తు రాజైన ఫరో హోఫ్రాను అతని శత్రువులకీ, అతని ప్రాణం తీయాలని చూసేవాళ్లకీ అప్పగించబోతున్నాను.> >>
\s5
\c 45
\s బారూకుకు దేవుని సందేశం
\p
\v 1 ఇది యిర్మీయా ప్రవక్త నేరీయా కొడుకు బారూకుతో పలికిన మాట. యోషీయా కొడుకూ యూదా రాజూ అయిన యెహోయాకీము పరిపాలనలో నాలుగో సంవత్సరంలో ఇది జరిగింది. ఈ మాటలు యిర్మీయా చెప్తుండగా బారూకు రాశాడు.
\v 2 <<బారూకు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నీకు ఇలా చెప్తున్నాడు.
\v 3 <అయ్యో, నాకు ఎంత శ్రమ! యెహోవా నా బాధకి తోడు వేదనను జోడించాడు. మూలుగులతో అలసిపోయాను. నాకు విశ్రాంతి దొరకడం లేదు> అని నువ్వు అనుకుంటున్నావు.
\p
\s5
\v 4 నువ్వు అతనికి ఈ విధంగా చెప్పాలి. <యెహోవా ఈ మాట చెప్తున్నాడు. చూడు, నేను కట్టిన దాన్ని నేనే కూలదోస్తున్నాను. నేను నాటిన దాన్ని నేనే పెకలించి వేస్తున్నాను. భూమి అంతటా ఇదే జరుగుతుంది.
\v 5 కానీ నీ కోసం నువ్వు గొప్ప వాటిని కోరుకుంటున్నావా? గొప్ప వాటి కోసం చూడకు. ఎందుకంటే సర్వ మానవాళికీ వినాశనం కలుగబోతుంది.> ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. <కానీ నువ్వు వెళ్ళిన స్థలాలన్నిటిలో దోపిడీ సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణాన్ని నీకిస్తున్నాను.> >>
\s5
\c 46
\s ఐగుప్తుకు గూర్చి ప్రవచనం
\p
\v 1 ఇతర జాతులనూ దేశాలనూ గూర్చి యిర్మీయా దగ్గరికి వచ్చిన యెహోవా వాక్కు.
\v 2 ఐగుప్తును గూర్చిన మాట. యూఫ్రటీసు నది సమీపాన ఉన్న కర్కెమీషు దగ్గర ఉన్న ఐగుప్తు రాజు ఫరో నెకో సైన్యాలను గూర్చిన సంగతులు. యోషీయా కొడుకూ యూదా రాజు అయిన యెహోయాకీము పరిపాలనలో నాలుగో సంవత్సరంలో బబులోను రాజు నెబుకద్నెజరు ఈ సైన్యాలను ఓడించాడు.
\q1
\v 3 <<డాలునూ కవచాన్నీ సిద్ధం చేసుకోండి. యుద్ధానికి ముందుకు కదలండి.
\q1
\v 4 గుర్రాలను సిద్ధం చేయండి. రౌతులారా, శిరస్త్రాణం పెట్టుకుని వాటిని అధిరోహించండి.
\q1 బల్లేలకు పదును పెట్టండి. ఆయుధాలు ధరించండి.
\q1
\s5
\v 5 ఇక్కడ నేనేం చూస్తున్నాను? వాళ్ళు భయకంపితులయ్యారు. పారిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ సైన్యాలు ఓడిపోయాయి.
\q1 వాళ్ళు వెనక్కి తిరిగి చూడకుండా సురక్షితమైన చోటును వెదుక్కుంటూ వేగంగా పారిపోతున్నారు. అన్నివేపులా భయం ఆవరించింది. యెహోవా చేస్తున్న ప్రకటన ఇది.
\q1
\v 6 వేగం గలవాళ్ళు పారిపోలేక పోతున్నారు. సైనికులు తప్పించుకోలేక పోతున్నారు.
\q1 ఉత్తర దిక్కులో వాళ్ళు యూఫ్రటీసు నదీ తీరంలో తడబడి పడిపోతున్నారు.
\q1
\s5
\v 7 నైలునదీ ప్రవాహంలా ఉప్పొంగుతూ వస్తున్న ఈ వ్యక్తి ఎవరు? ఇతని నీళ్ళు నదుల్లా ఎగసి పడుతున్నాయి.
\q1
\v 8 ఐగుప్తు నైలు నదిలా పైకి లేస్తుంది. దాని నీళ్ళు నదుల్లా పైకీ కిందికీ విసిరినట్టుగా ప్రవహిస్తుంది.
\q1 అది <నేను పైకి లేస్తాను. భూమిని కప్పి వేస్తాను. నేను పట్టణాలనూ, వాటిలో ప్రజలనూ నాశనం చేస్తాను> అంటుంది.
\q1
\v 9 గుర్రాలూ, పైకి లేవండి. రథాలూ రోషం తెచ్చుకోండి. సైనికుల్లారా బయలుదేరండి.
\q1 డాలు వాడటంలో నిపుణులైన కూషు వాళ్ళూ, పూతు వాళ్ళూ, విల్లు వంచి బాణాలు సంధించడంలో నిపుణులైన లూదీ వాళ్ళూ బయలుదేరాలి.
\q1
\s5
\v 10 ఇది సేనల ప్రభువైన యెహోవా ప్రతీకారం తీర్చుకునే రోజు. ఆయన తన శత్రువులపై పగ తీర్చుకుంటాడు.
\q1 కత్తి శత్రువులని చీల్చివేస్తుంది. తృప్తి చెందుతుంది. వాళ్ళ రక్తాన్ని పానం చేస్తుంది.
\q1 యూఫ్రటీసు నది దగ్గర ఉత్తర దేశంలో సేనల ప్రభువైన యెహోవాకు బలి అర్పణ జరగబోతూ ఉంది.
\q1
\s5
\v 11 కన్య అయిన ఐగుప్తు కుమారీ, గిలాదుకి వెళ్లి ఔషధం తెచ్చుకో.
\q1 నీ పైన ఎక్కువ ఔషధాలు ఉపయోగించడం వ్యర్ధం. నీకు స్వస్థత కలుగదు.
\q1
\v 12 నీకు కలిగిన అవమానం గూర్చి జాతులన్నీ తెలుసుకున్నాయి. నువ్వు చేసే రోదన ధ్వని భూమి అంతటా వినిపిస్తుంది.
\q1 ఒక సైనికుడు తడబడి మరో సైనికుడి పైన పడతాడు. ఇద్దరూ కలసి కూలి పోతారు.>>
\p
\s5
\v 13 బబులోను రాజైన నెబుకద్నెజరు బయలుదేరి వచ్చి ఐగుప్తుపై దాడి చేసినప్పుడు ప్రవక్త అయిన యిర్మీయాకు యెహోవా చెప్పిన మాట ఇది.
\q1
\v 14 ఐగుప్తులో తెలియజేయండి. అది మిగ్దోలులోనూ మెంఫిస్ లోనూ వినిపించాలి.
\q1 తహపనేసులో వాళ్ళు ఇలా ప్రకటించారు. నీ చుట్టూ కత్తి స్వైర విహారం చేస్తూ అంతటినీ మింగివేస్తుంది. కాబట్టి మీరు లేచి ధైర్యంగా నిలిచి ఉండండి.
\q1
\s5
\v 15 ఏపిస్ అనే నీ దేవుడు ఎందుకు పారిపోయాడు? నీ ఎద్దు దేవుడు ఎందుకు నిలబడలేదు? ఎందుకంటే యెహోవా అతణ్ణి కిందకు పడవేశాడు.
\q1
\v 16 తడబడే వాళ్ళ సంఖ్యను ఆయన అధికం చేస్తున్నాడు. ఒక్కో సైనికుడు మరొకడి మీద పడిపోతున్నాడు. వాళ్ళు <<లేవండి, ఇంటికి వెళ్దాం.
\q1 మన స్వంత ప్రజల దగ్గరకూ, మన స్వదేశానికీ వెళ్దాం. మనలను బాధిస్తున్న ఈ కత్తిని వదిలించుకుందాం.>> అని చెప్పుకుంటున్నారు.
\q1
\v 17 వాళ్ళు అక్కడ <<ఐగుప్తు రాజైన ఫరో కేవలం ఒక ధ్వని మాత్రమే. అతడు అవకాశాలను చేజార్చుకునే వాడు>> అని ప్రకటించారు.
\q1
\s5
\v 18 సేనల ప్రభువూ, రాజూ అయిన యెహోవా ఇలా ప్రకటన చేస్తున్నాడు. <<నా తోడు, ఒక మనిషి రాబోతూ ఉన్నాడు. అతడు తాబోరు పర్వతం లాంటి వాడు. సముద్రం పక్కనే ఉన్న కర్మెలు లాంటి వాడు.
\q1
\v 19 ఐగుప్తు ఆడపడుచులారా, మీరు చెరలోకి వెళ్ళడానికి సిద్ధపడండి.
\q1 ఎందుకంటే నోపు భయం కలిగించేలా శిథిలమై పోతుంది. అక్కడ ఎవరూ నివసించలేరు.
\q1
\s5
\v 20 ఐగుప్తు ఒక అందమైన లేగదూడ వంటిది. కానీ ఉత్తరం వైపు నుండి కుట్టే కందిరీగ ఒకటి వస్తుంది. అది సమీపిస్తూ ఉంది.
\q1
\v 21 వాళ్ళ మధ్యలో అద్దెకు తెచ్చుకున్న సైనికులు కొవ్వు పట్టిన ఎద్దుల్లా ఉన్నారు. అయితే వాళ్ళు కూడా వెనక్కి తిరిగి పారిపోతారు.
\q1 వాళ్ళు కలసి ఉండరు. వాళ్ళు నాశనమయే రోజు వాళ్లకు వ్యతిరేకంగా వస్తూ ఉంది. అది వాళ్ళని శిక్షించే రోజు.
\q1
\v 22 ఐగుప్తు పైకి శత్రువులు దండెత్తి వస్తున్నారు. అది పాములా బుసలు కొడుతూ పాక్కుంటూ అవతలికి వెళ్ళిపోతుంది.
\q1 చెట్ల కొమ్మలు నరికే వాళ్ళు గొడ్డళ్ళు పట్టుకుని వచ్చినట్టుగా వాళ్ళు ఆమె దగ్గరికి వస్తున్నారు.>>
\q1
\s5
\v 23 ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. <<అవి ఎంత దట్టమైన అడవులైనా వాళ్ళు దాన్ని నరికి వేస్తారు.
\q1 ఎందుకంటే వాళ్ళ సంఖ్య మిడతల దండు కంటే ఎక్కువగా ఉంటుంది. వాళ్ళను లెక్క పెట్టడం సాధ్యం కాదు.
\q1
\v 24 ఐగుప్తు కుమారిని అవమానపరుస్తారు. ఉత్తరం వైపున దేశాల వారికి ఆమెను అప్పగిస్తారు.>>
\p
\s5
\v 25 సేనల ప్రభువూ, ఇశ్రాయేలు దేవుడూ అయిన యెహోవా ఇలా చెప్తున్నాడు. <<చూడండి, నో పట్టణంలో ఉన్న ఆమోను దేవుణ్ణి, ఫరోనూ, ఐగుప్తునూ, దాని దేవుళ్ళనూ, రాజులనూ, ఫరో రాజులనూ, ఇంకా వాళ్ళలో నమ్మకముంచే వాళ్ళనీ నేను శిక్షించ బోతున్నాను.
\v 26 వాళ్ళ ప్రాణాలు తీయాలని చూసే వాళ్ళ చేతుల్లోకి వాళ్ళను అప్పగిస్తున్నాను. బబులోను రాజు నెబుకద్నెజరుకూ, అతని సేవకులకూ వాళ్ళని అప్పగిస్తున్నాను. ఆ తర్వాత ఐగుప్తు మళ్ళీ ఇంతకు ముందు లాగానే ప్రజలకు నివాస యోగ్యం అవుతుంది.>> ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.
\p
\s5
\v 27 <<కానీ నా సేవకుడవైన యాకోబూ, నువ్వు భయపడకు. ఇశ్రాయేలూ, వ్యాకుల పడకు. ఎందుకంటే చూడు, నిన్ను దూర ప్రాంతాల్లోనుండి వెనక్కి తీసుకు వస్తాను. బందీలుగా ఉన్న నీ సంతానాన్ని చెరలో ఉన్న దేశం నుండి తీసుకు వస్తాను. యాకోబు తిరిగి వస్తాడు. అతనికి శాంతి లభిస్తుంది. క్షేమంగా ఉంటాడు. అతణ్ణి భయపెట్టే వాళ్ళు ఎవరూ ఉండరు.
\p
\v 28 నా సేవకుడైన యాకోబూ, నువ్వు భయపడకు.>> ఇదే యెహోవా చేస్తున్న ప్రకటన. <<ఎందుకంటే నేను నీతో ఉన్నాను. నేను మిమ్మల్ని ఏ ఏ దేశాల్లోకి చెదరగొట్టానో ఆ దేశాలను సమూలంగా నాశనం చేస్తాను. కానీ నిన్ను పూర్తిగా నాశనం చేయను. అయితే నా సేవకుడవైన యాకోబూ, నేను నీకు తోడుగా ఉన్నాను. భయపడకు. నేనెక్కడికి నిన్ను చెదరగొట్టానో ఆ దేశప్రజలందరినీ సమూల నాశనం చేస్తాను. అయితే నిన్ను సమూలంగా నాశనం చేయను. న్యాయమైన విధంగా నిన్ను శిక్షిస్తాను. శిక్షించకుండా నిన్ను వదిలిపెట్టను.>>
\s5
\c 47
\s ఫిలిష్తీయులను గూర్చి ప్రవచనం
\p
\v 1 ఫిలిష్తీ ప్రజలను గూర్చి ప్రవక్త అయిన యిర్మీయాకు యెహోవా నుండి వచ్చిన వాక్కు. ఈ వాక్కు ఫరో గాజా పై దండెత్తక ముందు వచ్చింది.
\q1
\v 2 <<యెహోవా ఇలా చెప్తున్నాడు. చూడండి. ఉత్తర దిక్కున నీళ్ళు వరదలా పొర్లి పారుతున్నాయి. వాళ్ళు వెల్లువలా పొంగిన నదిలా ఉంటారు.
\q1 తర్వాత వాళ్ళు దేశం పైనా, దాని పట్టణాల పైనా, దానిలో నివాసముండే వాళ్ళ పైనా వెల్లువలా ప్రవహిస్తారు! కాబట్టి అందరూ సహాయం కోసం మొర్ర పెడతారు.
\q1 దేశంలోని ప్రజలందరూ విలపిస్తారు.
\q1
\s5
\v 3 వాళ్ళ బలమైన గుర్రాల డెక్కలు నేలను తన్నే చప్పుడు వినిపించినప్పుడు,
\q1 వాళ్ళ రథాల వేగం హోరుకూ, ఉరుము లాంటి వాటి చక్రాల శబ్దానికీ
\q1 భయపడిన తండ్రులు తమ బలహీనత కారణంగా తమ పిల్లలకు సహాయం చేయరు.
\q1
\v 4 ఫిలిష్తీ వాళ్ళను నాశనం చేసే రోజు, తూరు, సీదోనులకు సహాయం చేయాలనుకునే వాళ్ళను కూడా నాశనం చేసే రోజు వస్తుంది. ఎందుకంటే యెహోవా ఫిలిష్తీ వాళ్ళనూ, కఫ్తోరు ద్వీపంలో మిగిలిపోయిన వాళ్ళనూ సర్వ నాశనం చేస్తాడు.
\p
\s5
\v 5 గాజా బోడిగా అయింది. అష్కెలోను విషయంలో అయితే, ఆ లోయలో మిగిలిన ఉన్న వాళ్ళు మౌనంగా ఉండిపోతారు. శోకంలో ఎంతకాలం నీకు నువ్వే గాయాలు చేసుకుంటావు?
\v 6 అయ్యో, యెహోవా ఖడ్గమా, నువ్వు ఎప్పటికి చాలించుకుంటావు?
\q1 ఇక ఆగు. నీ వరలోకి పోయి మౌనంగా ఉండు.
\q1
\v 7 అష్కెలోను పైనా, సముద్ర తీర ప్రాంతాల పైనా దాడి చేయమని యెహోవా నీకు ఆజ్ఞాపించాడు కదా!
\q1 నువ్వు ఇక మౌనంగా ఎలా ఉంటావు?
\s5
\c 48
\s మోయాబును గూర్చి ప్రవచనం
\r 48:29-36; యెషయా 16:6-12
\p
\v 1 సేనల ప్రభువూ, ఇశ్రాయేలు దేవుడూ అయిన యెహోవా మోయాబును గూర్చి ఇలా అంటున్నాడు.
\q1 నెబోకు బాధ, అది సర్వ నాశనమౌతుంది. కిర్యతాయిమును వశం చేసుకున్నారు. అది అవమానాన్ని ఎదుర్కుంటుంది.
\q1 ఆమె కోటను కూల్చివేశారు. అవమానం పాలు చేశారు.
\q1
\v 2 మోయాబు గౌరవం అంతరించింది. వాళ్ళ శత్రువులు హెష్బోనులో దానికి కీడు చేయాలని ఆలోచిస్తున్నారు.
\q1 <రండి, అది ఒక దేశంగా ఉండకుండా దాన్ని నాశనం చేద్దాం. మద్మేనా కూడా అంతరించి పోతుంది. కత్తి నిన్ను తరుముతూ ఉంది.>
\q1
\s5
\v 3 వినండి! హొరొనయీము నుండి ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. అక్కడ అనర్ధం, మహా విధ్వంసం జరిగాయి.
\q1
\v 4 మోయాబు దేశాన్ని నాశనం చేశారు. దాని పిల్లల రోదన ధ్వని వినిపిస్తుంది.
\q1
\v 5 ప్రజలు లూహీతు కొండ ఎక్కుతూ ఏడుస్తున్నారు.
\q1 హొరొనయీము వెళ్ళే దారిలో జరిగిన విధ్వంసాన్ని బట్టి ప్రజల పెడబొబ్బలు వినిపిస్తునాయి.
\q1
\s5
\v 6 పారిపోండి. మీ ప్రాణాలు కాపాడుకోండి. అడవిలో పెరిగే అరూహ చెట్లలా ఉండండి.
\q1
\v 7 నువ్వు నీ పనుల పైనా, నీ ధనం పైనా నమ్మకముంచావు. కాబట్టి నువ్వు కూడా వాళ్ళ వశం అవుతావు.
\q1 కెమోషు దేవుణ్ణి, వాడి యాజకుల, నాయకులతో సహా బందీలుగా పట్టుకుపోతారు.
\q1
\s5
\v 8 యెహోవా చెప్పినట్టు వినాశకుడు ప్రతి పట్టణం పైకీ వస్తాడు. ఏ పట్టణం కూడా తప్పించుకోలేదు.
\q1 లోయ నశించి పోతుంది. మైదానం ధ్వంసమై పోతుంది.
\q1
\v 9 మోయాబు ఎగిరి పోవాల్సి ఉంది. దానికి రెక్కలు ఇవ్వండి.
\q1 ఆమె పట్టణాలు వ్యర్ధభూమి అవుతాయి. అక్కడ ఎవ్వరూ నివసించరు.
\v 10 యెహోవా చెప్పిన పనులను నిర్లక్ష్యంగా చేసేవాడు శాపానికి గురి అవుతాడు గాక! రక్తం రుచి చూడకుండా తన కత్తిని వరలో పెట్టేవాడు శాపానికి గురి అవుతాడు గాక!
\q1
\s5
\v 11 మోయాబు తన బాల్యం నుండీ సురక్షితంగానే ఉన్నట్టు భావించాడు.
\q1 అతడు ఒక పాత్రనుండి మరో పాత్రకు పోయని ద్రాక్షరసంలా ఉన్నాడు. అలాగే అతడు ఎప్పుడూ చెరలోకి వెళ్ళలేదు.
\q1 కాబట్టి అతని రుచి ఎప్పటిలా బాగానే ఉంది. సువాసన కూడా మారకుండా ఉంది.
\v 12 కాబట్టి చూడండి. ఆ రోజులు రాబోతున్నాయి. ఆ రాబోయే రోజుల్లో వాడి పాత్రలను వంచి వాటిని ఖాళీ చేసే వారిని పంపుతాను. వాళ్ళు అతని కుండలను పగలగొడతారు.>> ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.
\p
\s5
\v 13 <<ఇశ్రాయేలు ప్రజలు తాము నమ్ముకున్న బేతేలు విషయంలో సిగ్గు పడినట్టే మోయాబు వాళ్ళు కెమోషు విషయంలో సిగ్గు పడతారు.
\q1
\v 14 <మేము బలవంతులం, పోరాడే సైనికులం> అని మీరెలా చెప్తారు?
\q1
\s5
\v 15 మోయాబు సర్వనాశనమవుతుంది. దాని పట్టణాలు దాడులకు గురౌతాయి. దాని యువకుల్లో శ్రేష్ఠమైన వాళ్ళు వధ జరిగే ప్రదేశానికి వెళ్తున్నారు.
\q1 సేనల ప్రభువైన యెహోవా అనే పేరున్న రాజు చేస్తున్న ప్రకటన ఇదే!
\q1
\v 16 మోయాబు త్వరలో నాశనం కాబోతోంది. దాని పైకి రావాలని ఘోర దుర్ఘటన త్వరపడుతూ ఉంది.
\q1
\v 17 మోయాబు చుట్టూ నివసించేవాళ్ళు, దాని కీర్తి ప్రతిష్టలు తెలిసిన వాళ్ళు రోదించండి.
\q1 <దాని బలమైన రాజదండం, ఘనత పొందిన దాని చేతిలోని కర్ర విరిగిపోయాయి> అని చెప్తూ విలపించండి.
\q1
\s5
\v 18 దేబోనులో గౌరవపీఠంపై కూర్చున్నదానా, కిందకు దిగి రా. ఎండిన నేలపై కూర్చో.
\q1 ఎందుకంటే మోయాబును నాశనం చేయబోయే వాడు నీపై దాడి చేస్తున్నాడు. అతడు నీ కోటలను నాశనం చేస్తాడు.
\q1
\v 19 అరోయేరులో నివసించే వాళ్ళు దారిలో నిలబడి గమనించండి.
\q1 తప్పించుకుని పారిపోతున్న వాళ్ళని <ఏం జరిగింది> అని అడగండి.
\q1
\v 20 మోయాబుకు అవమానం జరిగింది. అది ధ్వంసమై పోయింది. రోదించండి, పెడబొబ్బలు పెట్టండి. సహాయం కోసం కేకలు వేయండి.
\q1 మోయాబు సమూలంగా నాశనమైందని అర్నోను నదీ తీరాన ఉన్న వాళ్లకు చెప్పండి.
\q1
\s5
\v 21 ఇప్పుడు కొండమీది దేశాల పైకి శిక్ష వస్తుంది.
\q1 హోలోను, యాహసు, మేఫాతు, దీబోను,
\q1
\v 22 నెబో, బేత్‌దిబ్లాతయీము, కిర్యతాయిము, బేత్గామూలు,
\q1
\v 23 బేత్మెయోను, కెరీయోతు, బొస్రా ల పైకి శిక్ష వస్తుంది.
\q1
\v 24 దూరాన, సమీపాన ఉన్న మోయాబు పట్టణాలన్నిటి పైకి శిక్ష వస్తుంది.
\q1
\v 25 మోయాబు కొమ్మును నరికివేశారు. దాని చేతిని విరిచి వేశారు.>> ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.
\p
\s5
\v 26 <<యెహోవానైన నాకు విరోధంగా మోయాబు ఆహంకరించాడు. అతనికి మత్తెక్కనీ. మోయాబు తన వాంతిలో పొర్లాడి అవమానం పొందుతాడు. ఎగతాళి పాలవుతాడు.
\v 27 ఇశ్రాయేలును చూసి నువ్వు నవ్వలేదా? ఎగతాళి చేయలేదా? అతణ్ణి గూర్చి మాట్లాడినప్పుడల్లా నువ్వు తల ఊపుతూ ఉన్నావే, అతణ్ణి దొంగల గుంపులో చూశావా ఏమిటి?
\q1
\s5
\v 28 మోయాబు నివాసులారా, మీరు పట్టణాలు విడిచి పెట్టండి. కొండపై బండ సందుల్లో నివసించండి.
\q1 బండపైని రంధ్రాల మొదట్లో గూడు కట్టుకునే గువ్వల్లా ఉండండి.
\q1
\v 29 మోయాబు గర్వం గురించీ, అహంకారం గురించీ విన్నాం.
\q1 అతడి అహంకారం, గర్వం, ఆత్మ స్తుతీ, హృదయంలో అతిశయం, అన్నీ విన్నాం.>>
\p
\s5
\v 30 ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. <<అతడి తిరస్కార పూరితమైన మాటలు నేను విన్నాను. అతడు చేసే పనుల్లానే అతడి మాటలకు కూడా ఎలాంటి విలువా లేదు.
\q1
\v 31 కాబట్టి మోయాబు కోసం నేనే ఒక రోదనం చేస్తాను. మోయాబు అంతటి కోసం వేదనతో కేకలు పెడతాను.
\q1 కీర్హరెశు ప్రజలు కోసం ఏడుస్తాను.
\q1
\v 32 సిబ్మా ద్రాక్ష చెట్టూ, యాజెరు గూర్చి నేను ఏడ్చిన దాని కంటే ఎక్కువగా నీ కోసం విలపిస్తాను! నీ తీగెలు ఉప్పు సముద్రాన్ని దాటాయి.
\q1 అవి యాజెరు వరకూ వ్యాపించాయి. వినాశకుడు నీ వేసవి కాలం పంట పైనా, నీ ద్రాక్షారసం పైనా దాడి చేశాడు.
\q1
\s5
\v 33 కాబట్టి మోయాబు దేశంలో నుండి పళ్ళ చెట్ల మూలంగా కలిగే సంతోషమూ, సంబరమూ తొలగిపోయాయి.
\q1 <వాళ్ళ ద్రాక్ష గానుగల్లో ద్రాక్షారసానికి నేను ముగింపు పలికాను. వాళ్ళు గానుగలో ద్రాక్షలు తొక్కేటప్పుడు ఆనందంతో కూడిన కేకలు వినిపించవు. వినిపించే కేకల్లో ఆనందం ఉండదు.
\p
\s5
\v 34 నిమ్రీములో నీళ్ళు కూడా ఎండిపోయాయి. కాబట్టి ప్రజల కేకలు హెష్బోను నుండి ఏలాలే వరకూ, ఇంకా యాహసు వరకూ, సోయరు నుండి హొరొనయీము వరకూ, ఎగ్లాత్షాలిషా వరకూ వినిపిస్తున్నాయి.
\v 35 మోయాబు గుళ్ళలో బలులర్పించే వాళ్ళను నేను అంతం చేస్తాను. తన దేవుడికి ధూపం వేసే వాణ్ణి కూడా ఉండనియ్యను.> >> ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.
\p
\s5
\v 36 కాబట్టి నా హృదయం పిల్లనగ్రోవిలా మోయాబు కోసం విలపిస్తుంది. నా హృదయం పిల్లనగ్రోవిలా కీర్హరెశులో ప్రజల కోసం విలపిస్తుంది. వాళ్ళు సంపాదించిన సంపదలన్నీ పోయాయి.
\v 37 ప్రతి తలా బోడి అయింది. ప్రతి గడ్డమూ క్షవరం అయింది. ప్రతి వ్యక్తి చేతి పైనా గాట్లు ఉన్నాయి. ప్రతి నడుముకూ గోనె పట్టా ఉంది.
\p
\s5
\v 38 మోయాబులో ప్రతి ఇంటి కప్పు పైనా, ప్రతి వీధిలోనూ ఏడ్పులు వినిపిస్తున్నాయి. <<ఎందుకంటే ఒక వ్యక్తి ఒక పనికిరాని కుండను పగలగొట్టినట్టు నేను మోయాబును పాడు చేశాను.>> ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.
\q1
\v 39 <<ఇది ఎలా సర్వ నాశనమైంది? వీళ్ళు రోదిస్తూ ఎలా కేకలు పెడుతున్నారో! మోయాబు సిగ్గుతో వెనక్కి తిరిగింది. కాబట్టి మోయాబు తన చుట్టూ ఉన్న వాళ్లకు భయాన్ని కలిగించేదిగా, పరిహాసం చేయదగ్గదిగా ఉంటుంది.>>
\p
\s5
\v 40 యెహోవా ఇలా చెప్తున్నాడు. <<తన రెక్కలను విప్పార్చుకుని ఎగిరే గద్దలా శత్రువు మోయాబు పైకి వస్తున్నాడు.
\q1
\v 41 కోటలు పడగొడుతున్నారు. బలమైన దుర్గాలు పట్టుకుంటున్నారు.
\q1 ఆ రోజున మోయాబు వీరుల హృదయాలు ప్రసవించబోయే స్త్రీ హృదయంలా ఉంటాయి.
\q1
\s5
\v 42 యెహోవా నైన నాకు వ్యతిరేకంగా ఆహంకరించింది కాబట్టి మోయాబు ఒక జాతిగా ఉండకుండా నాశనమైంది.
\q1
\v 43 మోయాబు నివాసీ, భయమూ, గుంటా, వలా నీ పైకి వస్తున్నాయి>> ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.
\q1
\v 44 <<భయంతో పారిపోయే వాళ్ళు గుంటలో పడతారు.
\q1 గుంటలో నుండి తప్పించుకుని పైకి వచ్చిన వాళ్ళు వలలో చిక్కుకుంటారు.
\q1 వాళ్ళపై ప్రతీకారం చేసే సంవత్సరంలో నేనే దీన్ని వాళ్ళ పైకి తీసుకు వచ్చాను.>>ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.
\q1
\s5
\v 45 <<పారిపోయిన వాడు హెష్బోనులో బలహీనుడై నీడలో నిలబడతాడు. ఎందుకంటే హెష్బోనులో నుండి అగ్ని బయలుదేరుతుంది.
\q1 సీహోను నుండి అగ్ని జ్వాలలు బయలు దేరుతాయి. అవి మోయాబు నుదుటినీ, అహంకారుల తలలనూ చీల్చివేస్తాయి.
\q1
\s5
\v 46 అయ్యో, మోయాబూ! నీకు బాధ, కెమోషు
\f +
\fr 48:46
\fq కెమోషు
\ft మోయాబు దేవత
\f* ప్రజలు నాశనమయ్యారు.
\q1 ఎందుకంటే నీ కొడుకులను బందీలుగా తీసుకు వెళ్ళారు. నీ కూతుళ్ళు చెరలోకి పోయారు.
\q1
\v 47 కాని తర్వాత రోజుల్లో మోయాబు ప్రజల భాగ్యాన్ని నేను పునరుద్ధరిస్తాను.>> ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.
\q1 ఇక్కడితో మోయాబు పైన తీర్పును గూర్చిన వివరాలు ముగిశాయి.
\s5
\c 49
\s అమ్మోనీయుల గూర్చి ప్రవచనం
\q1
\v 1 అమ్మోను ప్రజలను గూర్చి యెహోవా ఇలా చెప్తున్నాడు.
\q1 <<ఇశ్రాయేలుకు పిల్లలు లేరా? అతడికి వారసుడుగా ఎవరైనా ఉన్నారా?
\q1 మల్కోము దేవత గాదును ఎందుకు ఆక్రమించుకున్నాడు? వాడి ప్రజలు దాని పట్టణాల్లో ఎందుకు నివసిస్తారు?>>
\q1
\v 2 అయితే యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు. <<రబ్బాకు వ్యతిరేకంగానూ, అమ్మోను ప్రజలకు వ్యతిరేకంగానూ నేను యుద్ధ భేరీని మోగించే రోజులు వస్తున్నాయి.
\q1 దాంతో రబ్బా అంతా వదిలివేసిన గుట్టలా ఉంటుంది. దాని ఊళ్ళు తగలబడి పోతాయి.
\q1 దాని వారసులను ఇశ్రాయేలు ప్రజలు స్వాధీనం చేసుకుంటారు.
\q1
\s5
\v 3 హెష్బోనూ, రోదన చెయ్యి. ఎందుకంటే హాయి నాశనమై పోయింది. రబ్బా కుమార్తెలారా, ఏడవండి, గోనె పట్టలు కట్టుకోండి.
\q1 విలపించండి. ఊరకే అటూ ఇటూ పరుగెత్తండి. ఎందుకంటే మోలెకు దేవుడు చెరలోకి వెళ్తున్నాడు.
\q1 వాడితో పాటు వాడి యాజకులూ, అధిపతులూ కూడా చెరలోకి వెళ్తున్నారు.
\q1
\v 4 విశ్వాసం లేని కూతురా, నీ బలాన్ని గూర్చి నీకు అంత ఆహంకారమెందుకు? నీ బలం నీళ్ళ లాగా ప్రవహించి పోతుంది.
\q1 నీ సంపదలపై నమ్మకం పెట్టుకున్నావు. <నాకు విరోధిగా ఎవరొస్తారు?> అంటున్నావు.
\q1
\s5
\v 5 చూడు. నీ పైకి తీవ్రమైన భయం తీసుకు వస్తున్నాను.>> సేనల ప్రభువు అయిన యెహోవా చేస్తున్న ప్రకటన ఇది.
\q1 <<నీ చుట్టూ ఉన్న ప్రజలనుండి నీకు ఆ భయం వస్తుంది. దాని ఎదుట నువ్వు చెదరిపోతావు.
\q1 పారిపోతున్న వాళ్ళను పోగు చేయడానికి ఎవరూ ఉండరు.
\q1
\v 6 అయితే ఇదంతా అయ్యాక నేను అమ్మోను ప్రజల భాగ్యాన్ని పునరుద్ధరిస్తాను.>> ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.
\s ఏదోమును గూర్చి ప్రవచనం
\r 49:9-10; ఓబద్యా 5-6
\r 49:14-16; ఓబద్యా 1-4
\q1
\s5
\v 7 ఏదోమును గూర్చి సేనల ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. <<తేమానులో జ్ఞానమనేదే లేదా?
\q1 అవగాహన ఉన్న వాళ్ళ దగ్గర ఒక మంచి సలహా లేకుండా పోయిందా? వాళ్ళ జ్ఞానమంతా వెళ్లిపోయిందా?
\q1
\v 8 దేదాను నివాసులు పారిపోండి. వెనక్కి తిరగండి. నేలపై ఉన్న కలుగుల్లో ఉండండి.
\q1 ఎందుకంటే నేను ఏశావు ప్రజల పైకి ఆపదను రప్పించి అతణ్ణి శిక్షించబోతున్నాను.
\q1
\s5
\v 9 ద్రాక్షపళ్ళు ఏరుకునే వాళ్ళు నీ దగ్గరికి వస్తే, కొన్ని పళ్ళు వాళ్ళు వదిలేయరా?
\q1 రాత్రి వేళ దొంగలు వచ్చినప్పుడు, వాళ్లకు కావాల్సింది తీసుకుని మిగిలినది వదిలేయరా?
\q1
\v 10 కానీ నేను ఏశావును నగ్నంగా నిలబెడుతున్నాను. అతని రహస్య స్థలాలను బహిర్గతం చేస్తున్నాను. అతడు ఇక ఎక్కడా దాక్కోలేడు.
\q1 అతని సంతానం, సోదరులూ, అతడి పొరుగు వాళ్ళూ అంతా నాశనమవుతున్నారు. అతడూ మిగలడు.
\q1
\v 11 అనాథలైన పిల్లలను విడిచిపెట్టు. వాళ్ళను నేను చూసుకుంటాను. నీ వితంతువులు నన్ను నమ్ముకోవచ్చు.>>
\p
\s5
\v 12 యెహోవా ఇలా చెప్తున్నాడు. <<పాత్రలోని దాన్ని తాగాల్సిన అవసరం లేని వాళ్ళు కూడా కచ్చితంగా పాత్రలోది కొంత తాగుతున్నారు. అలాంటప్పుడు నువ్వు శిక్షను ఎలా తప్పించుకుంటావు. తప్పించుకోలేవు. ఆ పాత్రలోది తప్పకుండా తాగాల్సిందే.
\v 13 బొస్రా భయాన్ని కలిగించే స్థలంగానూ, అవమానంగానూ, ఒక శాపవచనంగానూ ఉంటుంది. దాని పట్టణాలన్నీ ఎప్పటికీ నాశనమై ఉంటాయి. ఎందుకంటే నేను నా పేరు చెప్పి ప్రమాణం చేశాను.>> ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.
\q1
\s5
\v 14 యెహోవా దగ్గర నుండి నేనొక వార్త విన్నాను. ఆ వార్తతో జాతులన్నిటి దగ్గరికి ఒక వార్తాహరుడు వెళ్ళాడు.
\q1 <<<అందరం సమకూడి ఆమెపై దాడి చేద్దాం. యుద్ధానికి సిద్ధం కండి.>
\q1
\v 15 ఇతర జాతులతో పోలిస్తే నిన్ను అల్పుడుగా చేస్తాను. వాళ్ళ దృష్టిలో నిన్ను నీచుడిగా చేస్తాను.
\q1
\s5
\v 16 కొండ శిఖరాలపై నివసిస్తావు. పర్వత శిఖరాలను స్వాధీనం చేసుకున్నావు,
\q1 నీ భీకరత్వం విషయంలో నీ హృదయంలో గర్వం నిన్ను మోసం చేసింది.
\q1 గద్దలాగా ఉన్నత స్థలాల్లో గూడు కట్టుకుని ఉన్నావు.
\q1 అయినా నిన్ను అక్కడనుండి కిందకు లాగి పడవేస్తాను.>> ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.
\q1
\s5
\v 17 <<ఏదోమును దాటి వెళ్ళే వాళ్ళకు అది భయం పుట్టిస్తుంది.
\q1 అందరూ దానికి కలిగిన కష్టాలు చూసి ఆశ్చర్యపడి ఎగతాళి చేస్తారు.>>
\q1
\v 18 యెహోవా ఇలా చెప్తున్నాడు. <<నేను సొదోమ, గొమొర్రా వాటి చుట్టూ ఉన్న పట్టణాలను నాశనం చేసినట్టే వీటికీ చేసిన తరువాత,
\q1 అక్కడిలాగే ఇక్కడ కూడా ఎవరూ నివసించరు. ఏ మనిషీ అక్కడ బస చేయడు.
\q1
\s5
\v 19 చూడండి, అతడు యొర్దాను అడవుల్లో నుండి ఎంతో కాలంగా ఉన్న పచ్చిక మైదానం లోకి వచ్చే సింహంలా వస్తున్నాడు.
\q1 దాన్ని చూసి ఏదోము తక్షణమే పారిపోయేలా చేస్తాను. దానిపైన నేను ఎంపిక చేసిన వాణ్ణి అధిపతిగా నియమిస్తాను.
\q1 ఎందుకంటే నాలాంటి వాడు ఎక్కడ ఉన్నాడు? నన్ను రమ్మని ఆజ్ఞాపించగలిగేది ఎవరు? నన్ను నిరోధించే కాపరి ఎవరు?
\q1
\s5
\v 20 కాబట్టి ఏదోముకు వ్యతిరేకంగా యెహోవా నిర్ణయించిన ప్రణాళికలను వినండి.
\q1 తేమాను నివాసులకు వ్యతిరేకంగా ఆయన చేసిన ప్రణాళికలు వినండి.
\q1 కచ్చితంగా మందలో బలహీనమైన వాటితో సహా అందర్నీ శత్రువులు బయటకు ఈడుస్తారు.
\q1 పచ్చిక బయళ్ళు శిథిలమైన స్థలాలుగా మారతాయి.
\q1
\s5
\v 21 వాళ్ళు కూలినప్పుడు భూమి కంపించింది. దాని దుర్గతికి అది వేసే కేకలు ఎర్ర సముద్రం వరకూ వినిపించాయి.
\q1
\v 22 చూడండి డేగలా శత్రువు దాడి చేస్తాడు. అది దూసుకు వచ్చి బొస్రాను తన రెక్కలతో కప్పివేస్తుంది.
\q1 ఆ రోజున ఏదోము సైనికుల హృదయాలు ప్రసవించడానికి నొప్పులు పడుతున్న స్త్రీ హృదయంలా ఉంటాయి.>>
\q1
\s5
\v 23 దమస్కు గూర్చిన వాక్యం. <<హమాతు, అర్పాదూ జరిగిన వినాశనం వార్త విని సిగ్గుపడతాయి.
\q1 అవి కరిగిపోతున్నాయి. నిమ్మళంగా ఉండటం సాధ్యం కాని సముద్రంలా అవి కలవరపడుతున్నాయి.
\q1
\v 24 దమస్కు ఎంతో బలహీనంగా ఉంది. పారిపోడానికి అది వెనక్కు తిరిగింది. దాన్ని భయం పట్టుకుంది.
\q1 నిస్పృహ దాన్ని ఆవరించింది. ప్రసవించే స్త్రీ పడే వేదన వంటి వేదన దానికి కలిగింది.>>
\q1
\v 25 దానిలో నివసించే ప్రజలు ఇలా అనుకుంటారు. <<ఇంత ప్రసిద్ధి చెందిన పట్టణం, నాకెంతో ఆనందాన్ని ఇచ్చే పట్టణం ఇది. ప్రజలు దీనిని ఇంకా ఖాళీ చేయలేదేమిటి?>>
\q1
\s5
\v 26 కాబట్టి పట్టణంలో యువకులు దాని వీధుల్లోనే కూలిపోతారు.
\q1 ఆ రోజున యుద్ధవీరులంతా అంతమై పోతారు. ఇది సేనల ప్రభువైన యెహోవా చేస్తున్న ప్రకటన.
\q1
\v 27 <<నేను దమస్కు ప్రాకారం పై అగ్ని రాజేస్తాను. అది బెన్హదదు బలమైన దుర్గాలను తగలబెట్టేస్తుంది.>>
\p
\s5
\v 28 కేదారు, హాసోరు రాజ్యాలను గూర్చి యెహోవా బబులోనురాజు నెబుకద్నెజరుకు ఇలా చెప్పాడు. ఈ రాజ్యాలపై దాడి చేయడానికి నెబుకద్నెజరు వెళ్తున్నాడు.
\s కేదారు గూర్చి ప్రవచనం
\q1 <<లేవండి. కేదారుపై దాడి చేయండి. ఆ తూర్పు దిక్కున ఉన్న ప్రజలను నాశనం చేయండి.
\q1
\v 29 అతని సైన్యం వాళ్ళ గుడారాలనూ, వాళ్ళ మందలనూ, గుడారాల తాళ్లనూ మిగిలిన సామాగ్రినంతా తీసుకు వెళ్తారు.
\q1 కేదారు ప్రజల ఒంటెలను వాళ్ళు తీసుకువెళ్తారు. <అన్ని వైపులా భయం> అంటూ చెప్తారు.
\q1
\s5
\v 30 హాసోరు నివాసులారా, పారిపోండి. దూరంగా వెళ్ళండి. భూమి పైన ఉన్న కలుగుల్లో ఉండండి.>> ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.
\q1 <<ఎందుకంటే బబులోను రాజు నెబుకద్నెజరు మీకు విరోధంగా ప్రణాళికలు రచిస్తున్నాడు. వెనక్కి తిరిగి పారిపోండి!
\q1
\v 31 మీరు లేవండి! నిశ్చింతగానూ క్షేమంగానూ నివసిస్తున్న రాజ్యంపై దాడి చేయండి.>> ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.
\q1 <<వాళ్లకు ద్వారాలు లేవు. ఉన్నా వాటికి అడ్డు గడియలు లేవు. ప్రజలు హాయిగా నివసిస్తున్నారు.
\q1
\s5
\v 32 వాళ్ళ ఒంటెలు దోపుడు సొమ్ము అవుతాయి. విస్తారమైన వాళ్ళ సంపద మీకు యుద్ధంలో కొల్లగొట్టే సొమ్ముగా ఉంటుంది.
\q1 తర్వాత చెంపలపైన కత్తిరించుకునే వాళ్ళను చెదరగొడతాను.
\q1 వాళ్ళ మీదకు అన్ని వేపుల నుండీ ఆపద రప్పిస్తాను.>> ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.
\q1
\v 33 <<హాసోరు పాడై నక్కలకు నివాస స్థలంగా ఉంటుంది. శాశ్వతంగా వ్యర్ధభూమిగా ఉంటుంది.
\q1 అక్కడ ఎవ్వరూ నివాసముండరు. ఏ మనిషీ అక్కడ బస చేయడు.>>
\p
\s5
\v 34 యూదా రాజు సిద్కియా పరిపాలన ప్రారంభంలో యెహోవా వాక్కు యిర్మీయా ప్రవక్త దగ్గరికి వచ్చింది. ఆయన ఏలాము గూర్చి ఇలా చెప్పాడు.
\v 35 <<సేనల ప్రభువు యెహోవా ఇలా చెప్తున్నాడు. చూడండి, నేను ఏలాముకు ముఖ్య బలమైన వాళ్ళ విల్లునూ, దాన్ని సంధించే వాళ్ళనూ విరగగొడతాను.
\q1
\v 36 ఎలాగంటే ఆకాశంలోని నాలుగు దిక్కుల నుండి నాలుగు వాయువులను రప్పిస్తాను.
\q1 నాలుగు దిక్కుల నుండి వస్తున్న గాలులతో ఏలాము ప్రజలను చెదరగొడతాను.
\q1 చెదిరిపోయిన ఏలాము ప్రజలు వెళ్ళడానికి ఏ దేశమూ ఉండదు.
\q1
\s5
\v 37 వాళ్ళ శత్రువుల ఎదుటా, వాళ్ళ ప్రాణాలు తీయాలని చూసే వారి ఎదుటా వాళ్ళను చెదరగొడతాను.
\q1 తీవ్రమైన నా క్రోధాన్ని బట్టి వాళ్లకు వ్యతిరేకంగా వినాశనాన్ని పంపుతాను.
\q1 వాళ్ళని సంపూర్ణంగా నిర్మూలం చేసే వరకూ వారి వెనకే కత్తిని పంపుతాను.>> ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.
\q1
\v 38 <<ఏలాములో నా సింహాసనాన్ని నిలబెడతాను. అక్కడి రాజునూ, అధిపతులనూ నాశనం చేస్తాను.>> ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.
\q1
\v 39 <<అయితే తర్వాత రోజుల్లో ఏలాము భాగ్యాన్ని పునరుద్ధరిస్తాను.>> ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.
\s5
\c 50
\s బబులోనును గూర్చి ప్రవచనం
\r 51:15-19; యిర్మీయా 10:12-16
\p
\v 1 కల్దీయుల దేశమైన బబులోనును గూర్చి యిర్మీయా ప్రవక్త ద్వారా యెహోవా చేసిన ప్రకటన.
\q1
\v 2 దేశాల్లో, జాతుల్లో ప్రకటించండి. అందరూ వినేలా చేయండి. వాళ్ళు వినడానికి సూచనగా ఒక జెండాను ఎత్తి ఉంచండి. దాన్ని కనబడనివ్వండి.
\q1 ఇలా చెప్పండి. <<బబులోనును ఆక్రమించుకున్నారు. బేలు దేవుడికి అవమానం కలిగింది. మెరోదకు దేవుడికి వ్యాకులం కలిగింది. వాళ్ళ విగ్రహాలకు అవమానం కలిగింది., వాళ్ళ దేవుళ్ళ బొమ్మలు పతనమయ్యాయి.
\q1
\s5
\v 3 దాని భూమిని నాశనం చేయడానికి దానికి వ్యతిరేకంగా ఉత్తర దిక్కునుండి ఒక జనం లేచింది.
\q1 మనిషైనా, జంతువైనా దానిలో నివసించరు. వాళ్ళంతా పారిపోతారు.>>
\q1
\v 4 ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. <<ఆ రోజుల్లో ఆ సమయంలో యూదా ప్రజలూ, ఇశ్రాయేలు ప్రజలూ
\q1 ఏడుస్తూ తమ దేవుడైన యెహోవాను వెదకడానికి కలిసి వస్తారు.
\q1
\v 5 సీయోనుకు వెళ్ళే మార్గం ఏది అంటూ వాకబు చేస్తారు. ఆ మార్గంలో ప్రయాణం మొదలు పెడతారు.
\q1 ఉల్లంఘించలేని శాశ్వత నిబంధనలో యెహోవాను కలవడానికి కలిసి వెళ్తారు.
\p
\s5
\v 6 నా ప్రజలు దారి తప్పిన గొర్రెలు. వారి కాపరులు వారిని పర్వతాల పైకి తీసుకు వెళ్లి దారి మళ్ళించారు.
\q1 ఒక కొండ నుండి మరో కొండకు వాళ్ళని తిప్పారు. వాళ్ళు వెళ్ళారు. చివరకు తాము నివసించిన చోటు మర్చిపోయారు.
\q1
\v 7 వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వారంతా వాళ్ళను మింగివేస్తూ వచ్చారు. వాళ్ళ శత్రువులు <మేం అపరాధులం కాము.
\q1 ఎందుకంటే వీళ్ళు తమ నిజమైన నివాసం, తమ పూర్వీకులకు ఆధారం అయిన యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశారు.> అన్నారు.
\q1
\s5
\v 8 బబులోనులో నుండి బయల్దేరండి. కల్దీయుల దేశంలో నుండి పారిపోండి.
\q1 మందకు ముందు నడిచే మేకపోతుల్లా ప్రజలకు ముందు నడవండి.
\q1
\v 9 ఎందుకంటే చూడండి, నేను బబులోనుకు విరోధంగా ఉత్తర దిక్కునుండి కొన్ని గొప్ప దేశాల సముదాయాన్ని రేపుతున్నాను.
\q1 వాళ్ళు సిద్ధపడుతూ ఉన్నారు. బబులోనును వాళ్ళు పట్టుకుంటారు.
\q1 వాళ్ళ బాణాలు నైపుణ్యం కల్గిన వీర యోధుల్లా ఉన్నాయి. అవి వ్యర్ధంగా తిరిగి రావు.
\q1
\v 10 కల్దీయుల దేశం దోపుడు సొమ్ము అవుతుంది. దాన్ని దోచుకునే వాళ్ళంతా సంతృప్తి చెందుతారు.>>ఇదే యెహోవా చేస్తున్న ప్రకటన.
\q1
\s5
\v 11 <<నా సొమ్మును మీరు దోచుకుని మీరు సంతోషించారు.
\q1 పచ్చిక నేలపై గంతులు వేసే లేగ దూడలాగా మీరు గంతులు వేశారు.
\q1 బలమైన గుర్రాల్లా సకిలిస్తూ ఉన్నారు.
\q1
\v 12 కాబట్టి మీ తల్లి ఎంతో అవమానం పాలవుతుంది. మిమ్మల్ని కడుపున కన్న ఆమె ఎంతో చీకాకుపడుతుంది.
\q1 జనాలన్నిటిలో ఆమె నీచమైనదిగా ఉంటుంది. ఆమె ఎడారిగానూ, ఎండిన భూమిగానూ, అడవిగానూ ఉంటుంది.
\q1
\v 13 యెహోవాకు కలిగిన క్రోధాన్ని బట్టి బబులోను నిర్మానుష్యమవుతుంది. సర్వనాశనమవుతుంది.
\q1 బబులోను దారి గుండా వెళ్ళే వాళ్ళందరూ దాన్ని చూసి ఆశ్చర్యపోతారు. దాని గాయాలను చూసి దాన్ని తిరస్కరిస్తారు.
\q1
\s5
\v 14 బబులోనుకు చుట్టూ బారులు తీరండి. విల్లును వంచగలిగిన ప్రతి ఒక్కడూ ఆమెపై బాణం వెయ్యాలి.
\q1 ఆమె యెహోవాకు విరోధంగా పాపం చేసింది. కాబట్టి మీ బాణాలు దాచుకోవద్దు.
\q1
\v 15 దాని చుట్టూ నిలిచి జయజయ ధ్వానాలు చేయండి. ఆమె తన అధికారాన్ని వదులుకుంది. ఆమె గోపురాలు కూలిపోయాయి.
\q1 దాని గోడలు పడిపోతున్నాయి. యెహోవా ప్రతీకారం తీర్చుకుంటున్నాడు.
\q1 అది ఇతర దేశాలకు చేసినట్టే మీరు దానికి చేయండి.
\q1
\s5
\v 16 బబులోనులో విత్తనాలు చల్లే వాణ్ణీ, కొడవలి తీసుకుని పంట కోసే వాణ్ణీ ఉండకుండా వాళ్ళను నిర్మూలం చేయండి.
\q1 క్రూరమైన ఖడ్గానికి భయపడి వారందరు తమ ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నారు తమ తమ దేశాలకు పారిపోతున్నారు.
\q1
\s5
\v 17 ఇశ్రాయేలు వారు చెదిరిపోయిన గొర్రెలు. సింహాలు వాటిని చెదరగొట్టి, తరిమాయి. మొదటిగా అష్షూరు రాజు వాళ్ళను మింగివేశాడు.
\q1 దాని తర్వాత బబులోను రాజైన ఈ నెబుకద్నెజరు వాళ్ళ ఎముకలు విరగ్గొట్టాడు.>>
\v 18 కాబట్టి సేనల ప్రభువూ, ఇశ్రాయేలు దేవుడూ అయిన యెహోవా ఇలా చెప్తున్నాడు. <<చూడండి, అష్షూరు రాజును నేను దండించినట్టు బబులోను రాజునూ అతని దేశాన్నీ దండించ బోతున్నాను.
\q1
\s5
\v 19 ఇశ్రాయేలును తన స్వదేశానికి నేను చేరుస్తాను. అతడు కర్మెలు, బాషానులపై మేత మేస్తాడు.
\q1 ఎఫ్రాయిము, గిలాదు మన్య ప్రాంతాల ద్వారా అతడు తృప్తి చెందుతాడు.>>
\q1
\v 20 యెహోవా ఇలా చెప్తున్నాడు. <<ఆ రోజుల్లో, ఆ సమయంలో ఇశ్రాయేలులో అతిక్రమాల కోసం వెదుకుతారు, కానీ ఎంత వెదికినా అవి కనపడవు.
\q1 యూదా ప్రజల పాపాల కోసం వాకబు చేస్తాను కానీ అవి దొరకవు. మిగిలి ఉన్న వాళ్ళను నేను క్షమిస్తాను.
\q1
\s5
\v 21 మెరాతయీయుల దేశంపైకి దండెత్తి వెళ్ళండి. అలాగే పెకోదీయుల దేశం పైకి వెళ్ళండి.
\q1 వాళ్ళని కత్తితో అంతం చెయ్యి. వాళ్ళను నాశనం చెయ్యి.>> ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.
\q1 <<నేను ఆజ్ఞాపించిన ప్రకారం చెయ్యి.
\q1
\v 22 వినండి, యుద్ధమూ, మహా వినాశనమూ జరుగుతున్న ధ్వని వినిపిస్తున్నది.
\q1
\s5
\v 23 అన్ని దేశాలనూ అణగ గొట్టే సుత్తి ఎలా విరిగి పోయిందో చూడండి.
\q1 దేశాల మధ్య బబులోను ఎలా ఒక భయానక దృశ్యంలా ఉందో చూడండి
\q1
\v 24 బబులోనూ, నేను నీ కోసం ఒక బోను పెట్టాను. నువ్వు అందులో చిక్కావు. కానీ ఆ సంగతి నీకు తెలియలేదు.
\q1 యెహోవా అనే నన్ను సవాలు చేశావు. కాబట్టి నిన్ను వెతికి పట్టుకున్నాను.>>
\q1
\s5
\v 25 కల్దీయుల దేశంలో సేనల ప్రభువైన యెహోవాకు చేయాల్సిన పని ఉంది.
\q1 ఆయన తన క్రోధాన్ని చూపడానికి తన ఆయుధాగారాన్ని తెరచి ఆయుధాలను బయటకు తీస్తున్నాడు.
\q1
\v 26 దూరం నుండే ఆమెపై దాడి చేయండి. ఆమె ధాన్యాగారాన్ని తెరవండి. ధాన్యం కుప్పలు పోసినట్టుగా ఆమెను కుప్పలుగా వేయండి.
\q1 ఆమెను నాశనం చేయండి. ఆమెలో ఏదీ మిగల్చకుండా నాశనం చేయండి.
\q1
\s5
\v 27 ఆమె యెడ్లన్నిటినీ చంపండి. వధశాలకు వాటిని పంపండి.
\q1 అయ్యో, వాళ్ళకు బాధ. వాళ్ళ దినం, వాళ్ళ శిక్షాకాలం వచ్చింది.
\q1
\v 28 వినండి. బబులోనులో నుండి తప్పించుకుని పారిపోతున్న వాళ్ళ శబ్దం వినిపిస్తుంది.
\q1 సీయోను విషయంలోనూ, తన మందిరం విషయంలోనూ మన దేవుడైన యెహోవా చేస్తున్న ప్రతీకారాన్ని ప్రకటించండి.
\q1
\s5
\v 29 <<బబులోనుకు రమ్మని బాణాలు వేసే వాళ్ళను పిలవండి. తమ విల్లును వంచే వాళ్ళందరినీ పిలవండి.
\q1 మీరు దాని చుట్టూ శిబిరం వేయండి. ఎవర్నీ తప్పించుకోనీయవద్దు.
\q1 ఆమె చేసిన దానికి ప్రతిఫలం ఆమెకు చెల్లించండి.
\q1 ఆమె చేసిన పనులను బట్టి ఆమెకూ చేయండి.
\q1 ఎందుకంటే ఆమె ఇశ్రాయేలు పరిశుద్ధుడైన యెహోవాను అవమానించింది.
\v 30 కాబట్టి ఆమె యువకులు పట్టణం వీధుల మూలల్లో పడిపోతారు. ఆమె కోసం యుద్ధం చేసే వీరులందరూ ఆ రోజున నాశనమౌతారు.>> ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.
\q1
\s5
\v 31 సేనల ప్రభువు అయిన యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు. <<అహంకారీ, నేను నీకు విరోధంగా ఉన్నాను.
\q1 నిన్ను శిక్షించే రోజూ, సమయమూ వచ్చాయి.
\q1
\v 32 అహంకారి తడబడి కింద పడతాడు. వాణ్ణి ఎవరూ పైకి లేపరు.
\q1 నేను అతడి పట్టణాల్లో అగ్ని రాజేస్తాను. అతని చుట్టూ ఉన్నదాన్ని అది మింగి వేస్తుంది.>>
\q1
\s5
\v 33 సేనల ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. <<ఇశ్రాయేలు ప్రజలు, యూదా వారితో పాటు అణచివేతకు గురయ్యారు.
\q1 వాళ్ళను చెర పట్టిన వాళ్ళందరూ వాళ్ళని ఇంకా పట్టుకునే ఉన్నారు. వాళ్ళను విడిచి పెట్టడానికి ఒప్పుకోవడం లేదు.
\q1
\v 34 వాళ్ళను విడుదల చేసే వాడు శక్తి గలిగిన వాడు. ఆయన పేరు సేనల ప్రభువైన యెహోవా. భూమికి విశ్రాంతి కలగజేయడానికీ, బబులోను నివాసుల్లో కలహం పుట్టించడానికీ ఆయన తన ప్రజల పక్షం వహిస్తాడు.>>
\q1
\s5
\v 35 ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. <<కల్దీయులకూ. బబులోను నివాసులకూ వాళ్ళ నాయకులకూ,
\q1 వాళ్ళల్లో జ్ఞానులకూ విరోధంగా ఒక కత్తి వస్తూ ఉంది.
\q1
\v 36 తమను తాము మూర్ఖుల్లా కనపరచుకోడానికి వాళ్ళలో జ్యోతిష్యం చెప్పే వాళ్ళకి విరోధంగా ఒక కత్తి వస్తూ ఉంది.
\q1 సైనికులు భయకంపితులు అయ్యేలా ఒక కత్తి వాళ్ళకు విరోధంగా వస్తూ ఉంది.
\q1
\v 37 వాళ్ళ గుర్రాలకూ, రథాలకూ, బబులోనులో ఉన్న వాళ్ళందరికీ విరోధంగా ఒక కత్తి వస్తూ ఉంది.
\q1 అందుచేత వాళ్ళు స్త్రీల వలే బలహీనులౌతారు. ఆమె గిడ్డంగులకు విరోధంగా ఒక కత్తి వస్తూ ఉంది. వాటిని దోచుకుంటారు.
\q1
\s5
\v 38 ఒక కత్తి ఆమె నీళ్ళకు విరోధంగా వస్తూ ఉంది. ఊటలు ఇంకి పోయి నీటిఎద్దడి ఏర్పడుతుంది.
\q1 ఎందుకంటే అది పనికిమాలిన విగ్రహాలున్న దేశం. ఈ భయంకరమైన విగ్రహాలను బట్టి ప్రజలు పిచ్చివాళ్ళలా ప్రవర్తిస్తారు.
\q1
\v 39 కాబట్టి నక్కలతో పాటు ఎడారి జంతువులు అక్కడ నివాసముంటాయి. అక్కడే నిప్పుకోళ్ళూ నివసిస్తాయి.
\q1 ఇకమీదట అది ఎప్పుడూ నివాస స్థలంలా ఉండదు. తరతరాల్లో అక్కడ ఎవరూ నివసించరు.>>
\q1
\v 40 ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. <<దేవుడు సొదొమనూ గొమొర్రానూ వాటి చుట్టూ ఉన్న పట్టణాలనూ శిక్షించినప్పుడు జరిగినట్టే ఇప్పుడూ జరుగుతుంది.
\q1 అక్కడ ఎవరూ నివసించరు. ఆ పట్టణంలో ఎవరూ కాపురముండరు.
\q1
\s5
\v 41 ప్రజలు ఉత్తర దిక్కునుండి వస్తున్నారు. దూరప్రాంతంలోని ఒక గొప్ప జనం, అనేకమంది రాజులూ ఉత్సాహంగా వస్తూ ఉన్నారు.
\q1
\v 42 వాళ్ళు వింటినీ, బల్లేలనూ పట్టుకుని వస్తున్నారు. వాళ్ళు క్రూరులు. వాళ్ళలో కనికరం లేదు.
\q1 వాళ్ళ స్వరం సముద్రపు ఘోషలా ఉంది. బబులోను కుమారీ, వాళ్ళు యుద్ధ వీరుల్లా బారులు తీరి తమ గుర్రాలపై వస్తున్నారు.
\q1
\v 43 బబులోను రాజు వాళ్ళను గూర్చిన సమాచారం విన్నాడు. భయంతో అతని చేతులు చచ్చుబడి పోయాయి.
\q1 ప్రసవించ బోయే స్త్రీకి కలిగే వేదన లాంటిది అతనికి కలిగింది.
\q1
\s5
\v 44 చూడండి! యొర్దాను ఉన్నత ప్రదేశం నుండి నిరంతరం నిలిచే పచ్చిక భూమిలోకి వచ్చే సింహంలా ఆయన వస్తున్నాడు.
\q1 ఆ సింహాన్ని ఎదుర్కోలేక వాళ్ళు వెంటనే పారిపోయేలా చేస్తాను. దానికి అధికారిగా నేను ఎంపిక చేసిన వాణ్ణి నియమిస్తాను. నేనెవరిని ఏర్పరుస్తానో వాణ్ణి దాని మీద నియమిస్తాను. నాలాటి వాడెవడు? నన్ను ఆక్షేపించే వాడెవడు? నన్ను ఎదిరించగల కాపరి ఏడీ?
\q1
\s5
\v 45 బబులోనును గూర్చి యెహోవా చేసిన ఆలోచన వినండి.
\q1 కల్దీయుల దేశాన్ని గూర్చి ఆయన ఉద్దేశించినది వినండి. నిశ్చయంగా మందలోని అల్పులైన వారిని వారు లాగుతారు.
\q1 నిశ్చయంగా వారిని బట్టి వారు నివసించిన ప్రదేశం నిర్ఘాంతపోతుంది.
\q1
\v 46 బబులోనును ఆక్రమించుకుంటున్నారు అనే వార్త విని భూమి కంపిస్తున్నది. జనాల్లో అంగలార్పు వినబడుతున్నది.>>
\s5
\c 51
\q1
\v 1 యెహోవా ఇలా చెప్తున్నాడు. <<చూడండి! బబులోనుకూ, లేబ్ కమాయ్
\f +
\fr 51:1
\fq లేబ్ కమాయ్
\ft బబులోను రహస్య పేరు
\f* లో నివసించే వాళ్లకూ వ్యతిరేకంగా ప్రచండమైన గాలులనూ, నాశనం చేసే ఆత్మనూ రేపబోతున్నాను.
\q1
\v 2 విదేశీయులను బబులోనుకు పంపిస్తాను. వాళ్ళు ఆమెను చెదరగొడతారు. ఆమెను సర్వనాశనం చేస్తారు.
\q1 వినాశనం జరిగే రోజున వాళ్ళు నాలుగు దిక్కులనుండి ఆమెకు విరోధంగా వస్తారు.
\q1
\s5
\v 3 బాణాలు వేసే వాళ్ళకు అవకాశమివ్వకండి. ఆయుధం ధరించే వాణ్ణి నిరోధించండి.
\q1 దేశంలోని యువకులను వదిలి పెట్టకండి. ఆమె సైన్యాన్నంతటినీ నిర్మూలం చేయండి.
\q1
\v 4 గాయపడిన వాళ్ళు కల్దీయుల దేశంలో కూలిపోవాలి. వీధుల్లో చనిపోయిన వాళ్ళను పడవేయాలి.
\q1
\s5
\v 5 తమ దేశాలు ఇశ్రాయేలు పరిశుద్ధుడైన దేవునికి వ్యతిరేకంగా చేసిన అపరాధాలతో నిండిపోయినప్పటికీ,
\q1 సేనల ప్రభువూ, తమ దేవుడూ అయిన యెహోవా యూదా ప్రజలనూ, ఇశ్రాయేలు ప్రజలనూ విడిచిపెట్టలేదు.
\q1
\v 6 బబులోనులో నుండి పారిపోండి. ప్రతి ఒక్కడూ తన ప్రాణాన్ని రక్షించుకోవాలి. దాని పాపానికి పడే శిక్షలో మీరు నాశనం కావద్దు.
\q1 ఇది యెహోవా ప్రతీకారం చేసే కాలం. ఆమెకు తన పనులను బట్టి ఆయన తిరిగి చెల్లిస్తాడు.
\q1
\s5
\v 7 బబులోను యెహోవా చేతిలో ఉన్న బంగారు పాత్ర. ఆ పాత్రలోని మద్యాన్ని ఆయన సర్వలోకానికీ తాగించాడు.
\q1 లోకంలోని జనాలు ఆమె చేతి మద్యాన్ని తాగి పిచ్చివాళ్ళు అయ్యారు.
\q1
\v 8 బబులోను అకస్మాత్తుగా కూలిపోతుంది. సర్వనాశనమౌతుంది.
\q1 ఆమె కోసం విలపించండి! ఆమె వేదన తీరడానికి ఔషధం ఇవ్వండి. ఆమెకు ఒకవేళ స్వస్థత కలుగుతుందేమో,
\q1
\s5
\v 9 మేము బబులోనును బాగు చేద్దామనుకున్నాం. కానీ ఆమె బాగవ్వలేదు. అందరం ఆమెను విడిచిపెట్టి వెళ్లి పోదాం.
\q1 మన స్వదేశాలకు వెళ్ళి పోదాం. ఆమె దోషం తీవ్రత ఆకాశాన్నంటింది. అది మేఘాల్లో పోగవుతుంది.
\q1
\v 10 యెహోవా మన నిర్దోషిత్వాన్ని ప్రకటించాడు. రండి మనం సీయోనులో దీన్ని చెపుదాం.
\q1 మన దేవుడైన యెహోవా చేసిన పనులను వివరిద్దాం.
\q1
\s5
\v 11 బాణాలు పదును పెట్టండి. డాళ్ళు చేత పట్టుకోండి.
\q1 బబులోనును నాశనం చేయడానికి యెహోవా మాదీయుల రాజు మనస్సును రేపుతున్నాడు.
\q1 అది యెహోవా తీర్చుకుంటున్న ప్రతీకారం. తన మందిరాన్ని కూలగొట్టినందుకు ఆయన చేస్తున్న ప్రతిదండన.
\q1
\v 12 బబులోను ప్రాకారాలపై జెండా ఎగరవేయండి. గస్తీ వాళ్ళను నియమించండి.
\q1 యెహోవా తాను చేయదలిచింది చేయబోతూ ఉన్నాడు. అందుకని కావలి వాళ్ళను పెట్టండి.
\q1 పట్టణం నుండి తప్పించుకుని పారిపోయే వాళ్ళను పట్టుకోడానికి సైనికులను దాచి ఉంచండి.
\q1
\s5
\v 13 అనేక ప్రవాహ జలాల దగ్గర నివసించే ప్రజలారా! మీకున్న సంపదలతో మీరు సంపన్నులయ్యారు.
\q1 మీ ముగింపు వచ్చేసింది. నీ జీవితకాలాన్ని ఆయన కుదించి వేశాడు.>>
\q1
\v 14 సేనల ప్రభువైన యెహోవా తన ప్రాణం మీదనే ప్రమాణం చేసి <<మిడతల దండు దాడి చేసినట్టుగా నిన్ను నీ శత్రువులతో నింపివేస్తాను.
\q1 వాళ్ళు నీకు వ్యతిరేకంగా యుద్ధనినాదం చేస్తారు.
\q1
\s5
\v 15 తన శక్తితో ఈ భూమిని చేసిన వాడు తన జ్ఞానంతో పొడి నేలను ఏర్పాటు చేశాడు.
\q1 తన వివేచనతో ఆకాశాలను విశాలపరిచాడు.
\q1
\v 16 ఆయన ఉరిమినట్టుగా ఆజ్ఞ ఇస్తాడు. అప్పుడు ఆకాశంలో జలఘోష మొదలవుతుంది. ఆయన భూమి అగాధాల్లో నుండి ఆవిరిని పైకి వచ్చేలా చేస్తాడు.
\q1 ఆయన వర్షం కురిసేలా మెరుపులు పుట్టిస్తాడు. తన గిడ్డంగుల్లోనుండి గాలిని రప్పిస్తాడు.
\q1
\s5
\v 17 జ్ఞానం లేని ప్రతి ఒక్కడూ జంతువులా మారతాడు. లోహంతో పోత పోసి విగ్రహాలు చేసేవాడికి ఆ విగ్రహాల మూలంగానే అవమానం కలుగుతుంది.
\q1 ఎందుకంటే వాడు పోత పోసి చేసేది మోసపు విగ్రహాలే. వాటిలో ప్రాణం ఉండదు.
\q1
\v 18 అవి పనికిమాలినవి. వాటిని చేసే వాళ్ళు అపహాసకులు. వాటి పైకి శిక్ష వచ్చినప్పుడు అవి నశించి పోతాయి.
\q1
\v 19 యాకోబుకు చెందిన దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన అన్నిటినీ రూపొందించేవాడు. ఇశ్రాయేలును ఆయన తన వారసత్వంగా ఎన్నుకున్నాడు.
\q1 సేనల ప్రభువైన యెహోవా అని ఆయనకు పేరు.
\q1
\s5
\v 20 నువ్వు నాకు యుద్ధంలో ప్రయోగించే గద లాంటి వాడివి. యుద్ధంలో నువ్వు నా ఆయుధం.
\q1 నీ ద్వారా నేను జనాలనూ జాతులనూ ధ్వంసం చేస్తాను. రాజ్యాలను నాశనం చేస్తాను.
\q1
\v 21 నీ ద్వారా నేను గుర్రాలనూ వాటిపై స్వారీ చేసే రౌతులనూ చితకగొడతాను. నీ ద్వారా నేను రథాలను, వాటిని నడిపే సారధులనూ ధ్వంసం చేస్తాను.
\q1
\s5
\v 22 నీ ద్వారా నేను ప్రతి పురుషుణ్ణీ, స్త్రీనీ ధ్వంసం చేస్తాను. నీ ద్వారా యువకులనూ, వృద్ధులనూ మట్టుబెడతాను.
\q1 నీ ద్వారా నేను యవ్వనంలో ఉన్న వాళ్ళనూ, కన్యలనూ మట్టుబెడతాను.
\q1
\v 23 నీ ద్వారా నేను గొర్రెల కాపరులనూ, వాళ్ళ మందలనూ ధ్వంసం చేస్తాను. నీ ద్వారా నేను నాగలి దున్నే వాళ్ళనీ వాళ్ళ బృందాలనూ ధ్వంసం చేస్తాను.
\q1 నీ ద్వారా నేను పాలించే వాళ్ళనూ అధికారులనూ ధ్వంసం చేస్తాను.
\q1
\s5
\v 24 బబులోనూ, కల్దీయ దేశనివాసులూ సీయోనుకి చేసిన దుర్మార్గానికంతటికీ
\q1 మీరు చూస్తుండగానే వాళ్లకి ప్రతీకారం చేస్తాను.>> ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.
\q1
\s5
\v 25 <<చూడు, ఇతరులను నాశనం చేసే పర్వతమా, నేను నీకు విరోధంగా ఉన్నాను>> ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. <<భూమినంతా నాశనం చేసేదానా,
\q1 నేను నిన్ను నా చేతితో కొడతాను. నిన్ను శిఖరాల పైనుండి కిందకు దొర్లించి వేస్తాను.
\q1 పూర్తిగా తగలబడి పోయిన కొండలా నిన్ను చేస్తాను.
\q1
\v 26 ఇళ్ళు కట్టుకునే వాళ్ళు గోడ మూలాలకు గానీ, పునాదికి గానీ నీ రాళ్ళు వాడుకోరు.
\q1 నువ్వు ఎప్పటికీ నాశనమయ్యే ఉంటావు.>> ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.
\q1
\s5
\v 27 దేశంలో జెండాలెత్తండి. జనాల్లో బాకా ఊదండి. ఆమెపై దాడి చేయడానికి జనాలకు బాధ్యత అప్పగించండి.
\q1 దాని పై దాడి చేయడానికి అరారాతు, మిన్నీ, అష్కనజు అనే రాజ్యాలకు దాన్ని గూర్చి తెలియజేయండి.
\q1 దానిపై దాడి చేయడం కోసం ఒక సైన్యాధిపతిని నియమించండి. మిడతల దండులా గుర్రాలను తరలించండి.
\q1
\v 28 ఆమెపై దాడి చేయడానికి జనాలకు బాధ్యత అప్పగించండి. మాదీయుల రాజులను, ఏలికలను పిలవండి.
\q1 రాజు కింద అధికారులను, అతడి ఆధీనంలో ఉన్న దేశాలన్నిటినీ దాడి చేయడం కోసం నియమించండి.
\q1
\s5
\v 29 బబులోను దేశానికి విరోధంగా యెహోవా ఆలోచనలు కొనసాగుతాయి. కాబట్టి అది వేదన భారంతో ఉంటుంది. భూమి కంపిస్తుంది.
\q1 అక్కడ నివసించే వాడు ఒక్కడూ లేకుండా బబులోనును పనికిరాని నేలగా చేయాలని ఆయన సంకల్పించాడు.
\q1
\s5
\v 30 బబులోనులో సైనికులు పోరాడటం ఆపేశారు. వాళ్ళు తమ కోటలోనే నిలిచారు.
\q1 వాళ్ళ బలం విఫలమై పోయింది. వాళ్ళు స్త్రీలవలే బలహీనంగా ఉన్నారు.
\q1
\v 31 బబులోను రాజూ, అతడి పట్టణమూ ఈ చివర నుండి ఆ చివరి వరకూ శత్రువు స్వాధీనంలోకి వెళ్లి పోయాయి.
\q1 ఒక వార్తాహరుడు మరో వార్తాహరుడికీ, ఒక సైనికుడి నుండి మరో సైనికుడికీ ఈ వార్త అందించడానికి పరుగు పెడుతున్నారు.
\q1
\v 32 నదుల పక్కన ఉన్న రేవులను శత్రువులు పట్టుకున్నారు. దాని కోటలను శత్రువులు తగలబెడుతున్నారు.
\q1 బబులోనులో యుద్ధం చేసే యోధులు అయోమయంలో మునిగిపోయారు.
\q1
\s5
\v 33 సేనల ప్రభువూ, ఇశ్రాయేలు దేవుడూ అయిన యెహోవా ఇలా అంటున్నాడు. <<బబులోను కుమార్తె ధాన్యం నూర్చే కళ్ళం లాగా ఉంది.
\q1 ఆమెను కింద తొక్కివేసే సమయం ఇదే. మరికొంత కాలానికి పంట ధాన్యం వస్తుంది.
\q1
\s5
\v 34 యెరూషలేము ఇలా అంటుంది. <బబులోను రాజు నెబుకద్నెజరు నన్ను మింగి వేశాడు. నేను ఎండిపోయేలా చేశాడు.
\q1 నన్ను ఖాళీ కుండగా చేశాడు. కొండ చిలవలాగా నన్ను మింగివేశాడు.
\q1 నా ఆహారంతో తన కడుపు నింపుకున్నాడు. నన్ను ఖాళీ పాత్రలా చేశాడు.> >>
\q1
\v 35 సీయోను నివాసులు ఇలా అంటారు. <<నాకూ నా కుటుంబానికీ వ్యతిరేకంగా జరిగిన హింస నా ఉసురు తగిలి బబులోనుకు జరుగుతుంది గాక!>>
\q1 యెరూషలేము ఇలా అంటుంది. <<నా రక్తం ఒలికించిన పాపం కల్దీయులకు తగులుతుంది గాక!>>
\q1
\s5
\v 36 కాబట్టి యెహోవా ఇలా చెప్తున్నాడు. <<చూడండి, నేను నీ పక్షంగా వాదించ బోతున్నాను. నీ తరపున ప్రతీకారం చేస్తాను.
\q1 బబులోనులో నీళ్ళు లేకుండా చేస్తాను. దాని ఊటలు ఇంకిపోయేలా చేస్తాను.
\q1
\v 37 బబులోను ఒక పెద్ద చెత్త కుప్పలా ఉంటుంది. నక్కల నిలయంగా మారుతుంది. భయానికీ, ఎగతాళికీ కారణంగా ఉంటుంది. ఎవరూ అక్కడ నివాసం ఉండరు.
\q1
\s5
\v 38 బబులోను వాళ్ళంతా కలసి సింహాల్లా గర్జిస్తారు. సింహం కూనల్లాగా కూత పెడతారు.
\q1
\v 39 వాళ్ళు దురాశతో ఉద్రేకం చూపినప్పుడు వాళ్ళ కోసం ఒక విందు ఏర్పాటు చేస్తాను. వాళ్ళు బాగా సంతోషపడేలా వాళ్ళతో మద్యం తాగిస్తాను.
\q1 అప్పుడు వాళ్ళు శాశ్వత నిద్రలోకి వెళ్తారు. ఇక మేల్కొనరు. ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.
\q1
\v 40 గొర్రెలు వధకు వెళ్ళినట్టుగా వాళ్ళని వధ్యశాలకు పంపుతాను. గొర్రెపిల్లలూ, మేకలూ వధకు వెళ్ళినట్టుగా వాళ్ళను పంపుతాను.
\q1
\s5
\v 41 బబులోనును ఎలా పట్టుకున్నారు? భూమిపై అందరూ పొగిడే పట్టణం లొంగిపోయింది.
\q1 రాజ్యాలన్నిటిలో బబులోను ఎలా శిథిల దేశంగా మారింది?
\q1
\v 42 సముద్రం బబులోను పైకి వచ్చింది. భీకర హోరుతో అలలు దాన్ని ముంచెత్తాయి.
\q1
\s5
\v 43 దాని పట్టణాలు నిర్జనంగానూ, ఎండిన భూమిగానూ, అడవిగానూ మారిపోయాయి.
\q1 ఎవ్వరూ నివాసముండని, ఎవరూ దాని మీదుగా ప్రయాణం చేయని ప్రాంతంలాగా మారిపోయాయి.
\q1
\v 44 కాబట్టి బబులోనులో ఉన్న బేలు దేవుణ్ణి శిక్షిస్తాను. వాడు మింగినదంతా వాడితో కక్కిస్తాను.
\q1 ఇకపైన ప్రజలు గుంపులుగా వాడికి అర్పణలు చెల్లించడానికి రారు. బబులోను గోడలు కూలిపోతాయి.
\q1
\s5
\v 45 నా ప్రజలారా! మీరు దానిలో నుండి బయటకు వెళ్ళండి. మీలో ప్రతి ఒక్కడూ నా క్రోధం నుండి తన ప్రాణాన్ని రక్షించుకోవాలి.
\q1
\v 46 దేశంలో వినిపించే వార్తలకు మీ హృదయాలను భయపడనివ్వకండి.
\q1 ఈ వార్తలు ఈ సంవత్సరం వినిపిస్తాయి. ఇది అయ్యాక తర్వాత సంవత్సరం మళ్ళీ వార్తలు వినిపిస్తాయి.
\q1 దేశంలో హింస జరుగుతుంది. ఒక రాజ్యాధిపతికి విరోధంగా మరో రాజ్యాధిపతి ఉంటాడు.
\q1
\s5
\v 47 కాబట్టి చూడండి, బబులోను లోని చెక్కిన విగ్రహాలను నేను శిక్షించే రోజులు రాబోతున్నాయి.
\q1 ఆమె దేశం అంతా సిగ్గుపాలు అవుతుంది. వధకు గురైన ఆమె ప్రజలు దేశంలోనే పడిపోతారు.
\q1
\v 48 వినాశకులు ఉత్తరం వైపు నుండి ఆమె కోసం వస్తున్నారు>> ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.
\q1 అప్పుడు ఆకాశంలోనూ, భూమిపైనా ఉన్నదంతా బబులోనుకు పట్టిన దుర్గతి చూసి సంతోషిస్తుంది.
\q1
\v 49 ఇశ్రాయేలులో వధకు గురైన వాళ్ళను బబులోను కూల్చినట్టుగానే బబులోనులో వధకు గురైన వాళ్ళు అక్కడే కూలిపోతారు.
\q1
\s5
\v 50 కత్తిని తప్పించుకున్న వాళ్ళు వెంటనే వెళ్ళి పొండి. అక్కడే ఉండకండి.
\q1 దూరం నుండి మీరు యెహోవాను జ్ఞాపకం చేసుకోండి. యెరూషలేమును మీ జ్ఞాపకాల్లోకి రానివ్వండి.
\q1
\v 51 మమ్మల్ని అవమానపరిచే మాటలు విన్నాం. దానికి సిగ్గు పడుతున్నాం. మాపై పడ్డ నింద మా ముఖాలను కప్పి వేసింది.
\q1 ఎందుకంటే యెహోవా పేరును కలిగి ఉన్న పరిశుద్ధ స్థలాల్లోకి విదేశీయులు ప్రవేశించారు.
\q1
\s5
\v 52 కాబట్టి, వినండి, ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. <<నేను ఆమె వద్ద ఉన్న చెక్కిన విగ్రహాలను శిక్షించే రోజులు రాబోతున్నాయి.
\q1 ఆమె దేశమంతా గాయపడిన వాళ్ళు మూలుగుతూ ఉంటారు.
\q1
\v 53 బబులోను తన ఎత్తయిన కోటలను ఎంత బలోపేతం చేసినా, వాళ్ళ కోటలు ఆకాశంలోకి కట్టుకున్నా వినాశకులు నానుండి ఆమె దగ్గరికి వస్తారు.>> ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.
\q1
\s5
\v 54 <<బబులోనులో నుండి ఏడుపు వినిపిస్తుంది. కల్దీయుల దేశం కూలిపోతున్న మహా నాశన ధ్వని వినిపిస్తుంది.
\q1
\v 55 యెహోవా బబులోనును నాశనం చేస్తున్నాడు. దాని మహా ఘోషను అణచివేస్తున్నాడు.
\q1 వాళ్ళ శత్రువులు అనేక ప్రవాహ జలాల్లా గర్జిస్తున్నారు. వాళ్ళు చేసే శబ్దం బలంగా వినిపిస్తున్నది.
\q1
\v 56 ఆమెకు వ్యతిరేకంగా, బబులోనుకు వ్యతిరేకంగా వినాశకులు వచ్చేశారు. ఆమె యోధులను పట్టుకున్నారు.
\q1 వాళ్ళ ధనుస్సులను విరగ్గొట్టేశారు. యెహోవా ప్రతీకారం చేసే దేవుడు. ఆయన తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు.
\q1
\s5
\v 57 బబులోను అధిపతులూ, ఆమె జ్ఞానులూ, ఆమె అధికారులూ, ఆమె సైనికులూ మద్యం తాగి మత్తెక్కేలా చేస్తాను.
\q1 వాళ్ళు శాశ్వత నిద్రలోకి జారుకుంటారు. ఇక లేవరు.>> ఇది రాజు చేస్తున్న ప్రకటన.
\q1 ఆయన పేరు సేనల ప్రభువైన యెహోవా.
\q1
\v 58 సేనల ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. <<బబులోను భారీ ప్రాకారాలను సంపూర్ణంగా కూల్చి వేస్తారు.
\q1 దాని ఎత్తయిన ద్వారాలను అగ్నితో కాల్చివేస్తారు.
\q1 ఆమెకు సహాయం చేయడానికి వచ్చే వాళ్ళ ప్రయాస వృథాయే. ఆమె కోసం జనాలు చేసే ప్రయత్నాలన్నీ అగ్నికి ఆహుతి అవుతాయి.>>
\q1
\s5
\v 59 ఇది మహసేయా మనవడూ, నేరీయా కొడుకూ అయిన సెరాయాకు యిర్మీయా ప్రవక్త ఆజ్ఞాపించిన వాక్కు. ఈ శెరాయా రాజు దగ్గర ప్రధాన అధికారి గనక సిద్కియా పరిపాలన నాలుగో సంత్సరంలో, రాజైన సిద్కియాతో కలిసి సెరాయా యూదా దేశం నుండి బబులోనుకు వెళ్ళినప్పుడు,
\p
\v 60 బబులోను పైకి రాబోతున్న విపత్తులన్నిటి గూర్చీ యిర్మీయా ఒక పుస్తకంలో రాశాడు. ఈ మాటలన్నీ బబులోను గూర్చి రాశాడు.
\s5
\v 61 యిర్మీయా శెరాయాతో ఇలా చెప్పాడు.<<నువ్వు బబులోనుకు వెళ్ళినప్పుడు ఈ మాటలన్నీ తప్పనిసరిగా చదివి వినిపించు.
\v 62 <యెహోవా, ఈ స్థలాన్ని నాశనం చేయడానికి నువ్వు ఈ మాటలు ప్రకటించావు. బబులోనులో నివసించేవాడు ఎవడూ లేడు. ప్రజలు గానీ, పశువులుగానీ లేక ఇది శాశ్వతంగా వ్యర్ధభూమిగా ఉండిపోతుంది. ఈ మాటలన్నీ నువ్వే చెప్పావు> అని నువ్వు చెప్పాలి.
\p
\s5
\v 63 ఈ పుస్తకాన్ని నువ్వు చదివి ముగించిన తర్వాత దానికో రాయి కట్టి యూఫ్రటీసు నదిలో విసిరివెయ్యి.
\v 64 <బబులోను ఇలాగే మునిగిపోతుంది. ఆమెకు విరోధంగా నేను పంపబోయే విపత్తుల కారణంగా అది ఇక పైకి లేవదు. దాని ప్రజలు కూలిపోతారు.>అని ప్రకటించు.>> దీంతో యిర్మీయా మాటలు ముగిసాయి.
\s5
\c 52
\s యెరూషలేము పతనం
\r 52:1-3; 2 రాజులు 24:18-20; 2 దిన 36:11-16
\r 52:4-16; యిర్మీయా 39:1-10
\r 52:4-21; 2 రాజులు 25:1-21; 2 దిన 36:17-20
\p
\v 1 తన పరిపాలన ప్రారంభించినప్పుడు సిద్కియా వయస్సు 21 సంవత్సరాలు. అతడు యెరూషలేములో పదకొండు సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు హమూటలు. ఆమె లిబ్నా అనే ఊరికి చెందిన యిర్మీయా
\f +
\fr 52:1
\fq యిర్మీయా
\ft ఈ యిర్మీయా, యిర్మీయా పుస్తకం వ్రాసిన యిర్మీయా కాదు
\f* కూతురు.
\v 2 యెహోయాకీము లాగే సిద్కియా కూడా యెహోవా దృష్టికి దుర్మార్గంగా ప్రవర్తించాడు.
\v 3 యెహోవా తీవ్రమైన కోపంతో వాళ్ళని తన ఎదుట నుండి వెళ్లగొట్టే వరకూ ఈ దుర్మార్గాలు యెరూషలేములోనూ యూదాలోనూ జరిగాయి. తర్వాత సిద్కియా బబులోను రాజు మీద తిరుగుబాటు చేశాడు.
\p
\s5
\v 4 అతని పరిపాలనలో తొమ్మిదో సంవత్సరం పదోనెల్లో పదో రోజున బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యాన్నంతా తీసుకుని యెరూషలేముకు వచ్చాడు. వాళ్ళు యెరూషలేముకు ఎదురుగా శిబిరం వేసుకున్నారు.
\v 5 ఈ విధంగా రాజైన సిద్కియా పరిపాలనలో పదకొండో సంవత్సరం వరకూ పట్టణం ముట్టడిలో ఉంది.
\p
\s5
\v 6 ఆ సంవత్సరం నాలుగో నెల తొమ్మిదో రోజున పట్టణంలో తీవ్రమైన కరువు ఏర్పడింది. దేశంలో ప్రజలకు ఆహరం బొత్తిగా లేకుండా పోయింది.
\v 7 అప్పుడు ప్రాకారాలను పడగొట్టారు. కల్దీయులు పట్టణంలో ప్రవేశించారు. పట్టణంలో సైనికులందరూ రాజు తోట దగ్గరున్న రెండు గోడల మధ్య ద్వారం గుండా పట్టణం విడిచిపెట్టి పారిపోయారు. అరాబా దిశగా తరలి వెళ్ళారు.
\v 8 కానీ కల్దీయుల సైన్యం రాజును తరిమింది. యెరికో సమీపంలోని యోర్దాను నదీలోయ మైదాన ప్రాంతంలో వాళ్ళు సిద్కియాను తరిమి పట్టుకున్నారు. అతని సైన్యం అతణ్ణి విడిచి పెట్టి కకావికలై పోయారు.
\p
\s5
\v 9 వాళ్ళు రాజును పట్టుకుని హమాతు దేశంలోని రిబ్లా పట్టణంలో ఉన్న బబులోను రాజు దగ్గరికి అతణ్ణి తీసుకు వచ్చారు. అక్కడే అతడు యూదా రాజైన సిద్కియాకు శిక్ష విధించాడు.
\v 10 బబులోను రాజు సిద్కియా కొడుకులను అతని కళ్ళ ఎదుటే చంపించాడు. అతడు రిబ్లాలోనే యూదా అధిపతులనందరినీ ఊచకోత కోయించాడు.
\v 11 సిద్కియా రెండు కళ్ళూ పీకించాడు. అతణ్ణి ఇత్తడి సంకెళ్ళతో బంధించి, బబులోనుకు తీసుకు వచ్చారు. అతడు చనిపోయేంత వరకూ బబులోను రాజు అతణ్ణి చెరసాలలోనే ఉంచాడు.
\p
\s5
\v 12 అయిదో నెల పదో రోజున, అంటే బబులోను రాజైన నెబుకద్నెజరు పరిపాలన పందొమ్మిదో సంవత్సరంలో బబులోను రాజు అంగరక్షకుల అధిపతీ, రాజు సేవకుడూ అయిన నెబూజరదాను యెరూషలేముకు వచ్చాడు.
\v 13 అతడు యెహోవా మందిరాన్నీ, రాజు భవనాన్నీ, యెరూషలేములోని ప్రాముఖ్యమైన ఇళ్లనూ తగలబెట్టించాడు.
\v 14 రాజు దగ్గర అంగరక్షకుల అధిపతితో పాటు వెళ్ళిన సైన్యం యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారాలను కూల్చివేశారు.
\p
\s5
\v 15 రాజు అంగరక్షకుల అధిపతి నెబూజరదాను ప్రజల్లో కొందరు నిరుపేదలనూ పట్టణంలో మిగిలిపోయిన కొందరినీ, బబులోను రాజు పక్షాన చేరిన వాళ్ళనూ, వృత్తి పనుల వాళ్ళలో కొందరినీ తీసుకు పోయాడు.
\v 16 రాజు అంగరక్షకుల అధిపతి నెబూజరదాను ద్రాక్షాతోటల్లో పని చేయడానికి కొందరు నిరుపేదలను ఉండనిచ్చాడు.
\p
\s5
\v 17 కల్దీయులు యెహోవా మందిరంలో ఉన్న ఇత్తడి స్తంభాలను, పీటలను, ఇత్తడి సరస్సునూ ఊడదీసి వాటిని ముక్కలు చేసి ఆ ఇత్తడినంతా బబులోనుకు పట్టుకుపోయారు.
\v 18 అలాగే బిందెలనూ, కుండలనూ గిన్నెలనూ కత్తెరలనూ గరిటెలనూ ఇంకా యాజకులు ఉపయోగించే ఇత్తడి వస్తువులు అన్నిటినీ తీసుకువెళ్ళారు.
\v 19 పళ్ళేలనూ, ధూపం వేసే పళ్ళేలనూ పాత్రలనూ కుండలనూ దీప స్తంభాలనూ ఇంకా బంగారు పళ్ళేలనూ వెండి పళ్ళేలనూ రాజు అంగరక్షకుల అధిపతి తీసుకువెళ్ళాడు.
\p
\s5
\v 20 రాజైన సొలొమోను యెహోవా మందిరానికి చేయించిన రెండు స్థంభాలూ సరస్సూ పీటల కింద ఉన్న పన్నెండు ఎద్దుల ఇత్తడి ప్రతిమలూ అన్నీ ఇత్తడివి. ఆ ఇత్తడిని తూకం వేయడం సాధ్యం కాదు. వాటన్నిటినీ అతడు బబులోనుకు తీసుకు వెళ్ళాడు.
\v 21 వాటిలో ఒక్కో స్తంభం దాదాపు ఇరవై ఆరు అడుగుల ఎత్తు ఉంటుంది. వాటి చుట్టు కొలత పదిహేడున్నర అడుగులు ఉంటుంది. ఇత్తడి రేకు నాలుగు వేళ్ళ మందం ఉంటుంది. అది లోపల బోలుగా ఉంటుంది.
\p
\s5
\v 22 ఒక స్తంభం పైన ఒక ఇత్తడి పీట ఉంది. ఆ పీట ఐదు అడుగుల ఎత్తు ఉంటుంది. ఆ పీట చుట్టూ ఇత్తడి దానిమ్మలూ, అల్లిక పనీ ఉన్నాయి. ఇవి కూడా ఇత్తడితో చేసినవే. రెండో స్తంభం పైన కూడా ఇలాగే ఉంది. దానిక్కూడా ఇత్తడి దానిమ్మలు ఉన్నాయి.
\v 23 కాబట్టి పీటల పక్కన మొత్తం తొంభై ఆరు దానిమ్మలూ, అల్లిక పని చుట్టూ వంద దానిమ్మలూ ఉన్నాయి.
\p
\s5
\v 24 రాజు అంగరక్షకుల అధిపతి ప్రధానయాజకుడు శెరాయానూ, రెండవ యాజకుడు జెఫన్యానూ, ముగ్గురు కాపలా వాళ్ళనూ పట్టుకున్నాడు.
\v 25 అతడు సైనికుల పైన ఉండే ఒక అధికారినీ, రాజు సలహాదారుల్లో ఏడుగురినీ పట్టుకున్నాడు. వీళ్ళు ఇంకా పట్టణంలోనే ఉన్నారు. వీళ్ళతో పాటు పట్టణంలో ప్రముఖులైన అరవై మందినీ పట్టుకున్నాడు.
\p
\s5
\v 26 రాజు అంగరక్షకుల అధిపతి నెబూజరదాను వీళ్ళందరినీ రిబ్లాలో ఉన్న బబులోను రాజు దగ్గరికి తీసుకు వచ్చాడు.
\v 27 బబులోను రాజు హమాతు దేశంలోని రిబ్లాలో వాళ్ళని కొట్టి చంపించాడు. మిగిలిన యూదా వాళ్ళను బందీలుగా బబులోనుకు తీసుకు వెళ్ళాడు.
\p
\s5
\v 28 నెబుకద్నెజరు తన పరిపాలన ఏడో సంవత్సరంలో 3,023 మంది యూదులను బందీలుగా తీసుకు వెళ్ళాడు.
\v 29 నెబుకద్నెజరు పరిపాలన పద్దెనిమిదో సంవత్సరంలో యెరూషలేము నుండి 832 మందిని బందీలుగా తీసుకు వెళ్ళాడు.
\v 30 నెబుకద్నెజరు పరిపాలన ఇరవై మూడో సంవత్సరంలో రాజు అంగరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను యూదుల్లో 745 మందిని బందీలుగా తీసుకు వెళ్ళాడు. కాబట్టి మొత్తం యూదా దేశం నుండి బందీలుగా వెళ్ళిన వాళ్ళ సంఖ్య 4,600.
\s యెహోయాకీను విడుదల
\r 52:31-34; 2 రాజులు 25:27-30
\p
\s5
\v 31 యూదా రాజైన యెహోయాకీను బందీగా వెళ్ళిన ముప్ఫై ఏడో సంవత్సరం పన్నెండో నెల ఇరవై ఐదో రోజున బబులోను రాజైన ఎవీల్మెరోదకు తన పరిపాలన మొదటి సంవత్సరంలో అతణ్ణి చెరసాల నుండి విడుదల చేశాడు.
\p
\s5
\v 32 రాజు అతనితో దయగా మాట్లాడాడు. బబులోనులో తనతో ఉన్న మిగిలిన రాజుల కంటే గౌరవనీయమైన స్థానాన్ని అతనికిచ్చాడు.
\v 33 రాజైన ఎవీల్మెరోదకు అతడు వేసుకున్న చెరసాల బట్టలు తీసి వేయించాడు. ఇక యెహోయాకీను బతికి ఉన్న రోజులన్నీ అతడు రాజైన ఎవీల్మెరోదకుతో కలసి భోజనం చేస్తూ ఉన్నాడు.
\v 34 అతడు చనిపోయే వరకూ అతని పోషణ కోసం రాజు భత్యం ఇస్తూ వచ్చాడు.