te_ulb/13-1CH.usfm

2156 lines
290 KiB
Plaintext

\id 1CH 1SA GEN - Telugu Unlocked Literal Bible
\ide UTF-8
\rem Copyright © 2017 Bridge Connectivity Solutions. This translation is made available to you under the terms of the Creative Commons Attribution-ShareAlike 4.0 License
\h 1 దినవృత్తాంతాలు
\toc1 1 దినవృత్తాంతాలు
\toc2 1 దినవృత్తాంతాలు
\toc3 1ch
\mt1 1 దినవృత్తాంతాలు
\s5
\c 1
\s ఆది పితరులు వంశస్థులు
\r 1:5-7; ఆది 10:2-5
\r 1:8-16; ఆది 10:6-20
\r 1:17-23; ఆది 10:21-31; 11:10-27
\r 1:29-31; ఆది 25:12-16
\r 1:32-33; ఆది 25:1-4
\r 1:35-37; ఆది 36:10-14
\r 1:38-42; ఆది 36:20-28
\p
\v 1 ఆదాము కొడుకు షేతు. షేతు కొడుకు ఎనోషు.
\v 2 ఎనోషు కొడుకు కేయినాను. కేయినాను కొడుకు మహలలేలు. మహలలేలు కొడుకు యెరెదు.
\v 3 యెరెదు కొడుకు హనోకు. హనోకు కొడుకు మెతూషెల. మెతూషెల కొడుకు లెమెకు.
\v 4 లెమెకు కొడుకు నోవహు. నోవహు కొడుకులు షేము, హాము, యాపెతు.
\p
\s5
\v 5 యాపెతు కొడుకులు వీళ్ళు: గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు, తీరసు.
\v 6 గోమెరు కొడుకులు అష్కనజు, రీఫతు, తోగర్మా అనే వాళ్ళు.
\v 7 యావాను కొడుకులు ఎలీషా, తర్షీషు, కిత్తీము, దోదానీము.
\p
\s5
\v 8 హాము కొడుకులు ఎవరంటే, కూషు, మిస్రాయిము, పూతు, కనాను అనే వాళ్ళు.
\v 9 కూషు కొడుకులు వీళ్ళు: సెబా, హవీలా, సబ్తా, రాయమా, సబ్తకా. ఇక రాయమా కొడుకులు షెబా, దదాను అనే వాళ్ళు.
\v 10 కూషుకు నిమ్రోదు పుట్టాడు. ఈ నిమ్రోదు భూమి మీద మొదటి విజేత.
\p
\s5
\v 11 ఇక మిస్రాయిము లూదీయులు, అనామీయులు, లెహాబీయులు, నప్తుహీయులు,
\v 12 పత్రుసీయులు అనే జాతులకు తండ్రి. ఫిలిష్తీయుల వంశకర్తలైన కస్లూహీయులూ కఫ్తోరీయులూ కూడా మిస్రాయిము సంతతివారే.
\p
\s5
\v 13 కనానుకు మొదటగా సీదోను పుట్టాడు. తరువాత హేతు పుట్టాడు.
\v 14 ఇతడు యెబూసీయులు, అమోరీయులు, గిర్గాషీయులు,
\v 15 హివ్వీయులు, అర్కీయులు, సీనీయులు
\v 16 అర్వాదీయులు, సెమారీయులు, హమాతీయులు అనే జాతులకు మూలపురుషుడు కూడా.
\p
\s5
\v 17 షేము కొడుకులు ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరాము, ఊజు, హూలు, గెతెరు, మెషెకు అనే వాళ్ళు.
\v 18 అర్పక్షదుకు షేలహు పుట్టాడు. షేలహుకు ఏబెరు పుట్టాడు.
\v 19 ఏబెరుకు ఇద్దరు కొడుకులు పుట్టారు. వాళ్ళలో పెలెగు అనేవాడి రోజుల్లో ప్రాంతాలుగా భూమి విభజన జరిగింది. అందుకే అతనికి ఆ పేరు వచ్చింది. అతని సోదరుడి పేరు యొక్తాను.
\p
\s5
\v 20 యొక్తానుకు అల్మోదాదు, షెలపు, హసర్మావెతు, యెరహు,
\v 21 హదోరము, ఊజాలు, దిక్లాను,
\v 22 ఏబాలు, అబీమాయేలు, షేబా,
\v 23 ఓఫీరు, హవీలా, యోబాలు పుట్టారు.
\p
\s5
\v 24 షేముకు అర్పక్షదు, అర్పక్షదుకు షేలహు, షేలహుకు ఏబెరు,
\v 25 ఏబెరుకు పెలెగు, పెలెగుకు రయూ,
\v 26 రయూకు సెరూగు, సెరూగుకు నాహోరు, నాహోరుకు తెరహు,
\v 27 తెరహుకు అబ్రాహాము అనే పేరు పెట్టిన అబ్రామూ పుట్టారు.
\p
\s5
\v 28 అబ్రాహాము కొడుకులు ఇస్సాకు, ఇష్మాయేలులు.
\v 29 వీళ్ళ సంతానం వివరాలు ఇవి. ఇష్మాయేలు పెద్దకొడుకు నెబాయోతు. ఇతని తరువాత పుట్టిన వాళ్ళు, కేదారు, అద్బయేలు, మిబ్శామూ,
\v 30 మిష్మా, దూమా, మశ్శా, హదదు, తేమా,
\v 31 యెతూరు, నాపీషు, కెదెమా. వీళ్ళు ఇష్మాయేలు కొడుకులు.
\p
\s5
\v 32 అబ్రాహాము ఉంపుడుకత్తె అయిన కెతూరాకు పుట్టిన కొడుకులు వీళ్ళు: జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకూ, షూవహు. వీళ్ళలో యొక్షానుకు షేబా, దదానూ అనే కొడుకులు పుట్టారు.
\v 33 మిద్యాను కొడుకులు ఎవరంటే ఏయిఫా, ఏఫెరు, హనోకు, అబీదా, ఎల్దాయా. వీళ్ళంతా కెతూరా సంతానం.
\p
\s5
\v 34 అబ్రాహాముకు ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు కొడుకులు ఏశావు, యాకోబు.
\p
\v 35 ఏశావు కొడుకులు ఎవరంటే ఏలీఫజు, రెయూవేలు, యెయూషు, యాలాము, కోరహు అనే వాళ్ళు.
\v 36 వీళ్ళలో ఎలీఫజు కొడుకులు తేమాను, ఓమారు, సెపో, గాతాము, కనజు, తిమ్నా అమాలేకు అనేవాళ్ళు.
\v 37 రెయూవేలు కొడుకులు నహతు, జెరహు, షమ్మా, మిజ్జా.
\p
\s5
\v 38 శేయీరు కొడుకులు, లోతాను, శోబాలు, సిబ్యోను, అనా, దిషోను, ఏసెరు, దిషాను.
\v 39 లోతాను కొడుకులు, హోరీ, హోమాములు. లోతాను సోదరి పేరు తిమ్నా.
\v 40 శోబాలు కొడుకులు అల్వాను, మనహతు, ఏబాలు, షెపో, ఓనాము. సిబ్యోను కొడుకులు అయ్యా, అనా.
\p
\s5
\v 41 అనా కొడుకు పేరు దిషోను. దిషోను కొడుకులు హమ్రాను, ఎష్బాను, ఇత్రాను, కెరాను.
\v 42 ఏసెరు కొడుకులు బిల్హాను, జవాను, యహకాను. దిషాను కొడుకులు ఊజు, అరాను.
\s ఎదోము రాజులు
\r 1:43-54; ఆది 36:31-43
\p
\s5
\v 43 ఇశ్రాయేలీయులను ఏ రాజూ పరిపాలించక ముందే ఏదోం దేశంలో ఈ రాజులు పరిపాలించారు. బెయోరు కొడుకు బెల. అతని పట్టణం పేరు దిన్హాబా.
\v 44 బెల చనిపోయిన తరువాత అతని స్థానంలో యోబాబు అనేవాడు రాజు అయ్యాడు. ఇతడు బొస్రా అనే ఊరికి చెందిన జెరహు కొడుకు.
\v 45 యోబాబు చనిపోయిన తరువాత అతని స్థానంలో తేమాను ప్రాంతం వాడయిన హుషాము రాజు అయ్యాడు.
\p
\s5
\v 46 హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశంలో మిద్యానీయులను ఓడించిన వాడూ, బెదెదు కొడుకూ అయిన హదదు అతని స్థానంలో రాజు అయ్యాడు. ఇతడి పట్టణం పేరు అవీతు.
\v 47 హదదు చనిపోయిన తరువాత మశ్రేకా అనే ఊరికి చెందిన శమ్లా అతని స్థానంలో రాజు అయ్యాడు.
\v 48 శమ్లా చనిపోయిన తరువాత నది తీరంలో ఉన్న రహెబోతు అనే ఊరికి చెందిన షావూలు అతని స్థానంలో రాజు అయ్యాడు.
\p
\s5
\v 49 షావూలు చనిపోయిన తరువాత అతని స్థానంలో బయల్‌ హానాను రాజు అయ్యాడు. ఇతని తండ్రి అక్బోరు.
\v 50 బయల్‌ హానాను చనిపోయిన తరువాత హదదు అనేవాడు అతని స్థానంలో రాజు అయ్యాడు. ఇతని పట్టణం పేరు పాయు. ఇతని భార్యపేరు మెహేతబేలు. ఈమె తల్లి పేరు మత్రేదు. ఈమె మేజాహాబుకు పుట్టింది.
\p
\s5
\v 51 హదదు చనిపోయిన తరువాత ఎదోములో నాయకులెవరంటే తిమ్నా, అల్వా, యతేతు,
\v 52 అహలీబామా, ఏలా, పీనోను,
\v 53 కనజు, తేమాను, మిబ్సారు,
\v 54 మగ్దీయేలు, ఈలాము అనేవాళ్ళు. వీళ్ళంతా ఎదోము దేశానికి నాయకులుగా ఉన్నారు.
\s5
\c 2
\s ఇశ్రాయేలు
\r 2:1-2; ఆది 35:23-26
\p
\v 1 ఇశ్రాయేలు కొడుకులు వీళ్ళు: రూబేను, షిమ్యోను, లేవీ, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను,
\v 2 దాను, యోసేపు, బెన్యామీను, నఫ్తాలి, గాదు, ఆషేరు.
\s యూదా
\r 2:5-15; రూతు 4:18-22; మత్తయి 1:3-6
\p
\s5
\v 3 యూదా కొడుకులు ఏరు, ఓనాను, షేలా అనేవాళ్ళు. ఈ ముగ్గురి తల్లి ఒక కనానీయురాలు. ఆమె షూయ అనేవాడి కూతురు. యూదా పెద్దకొడుకు పేరు ఏరు. ఇతడు యెహోవా దృష్టిలో పాపం చేశాడు. అందుకని యెహోవా అతణ్ణి చంపాడు.
\v 4 తరువాత అతని కోడలైన తామారు ద్వారా అతనికి పెరెసు, జెరహు అనే కొడుకులు పుట్టారు. యూదాకు మొత్తం ఐదుగురు కొడుకులు.
\p
\s5
\v 5 పెరెసు కొడుకులు హెస్రోను, హామూలు అనేవాళ్ళు.
\v 6 జెరహుకు ఐదుగురు కొడుకులు కలిగారు. వీరు జిమ్రీ, ఏతాను, హేమాను, కల్కోలు, దారా.
\v 7 కర్మీ కొడుకుల్లో ఒకడి పేరు ఆకాను. ఇతడు శాపానికి గురైన వస్తువుల్లో కొన్నిటిని దొంగతనం చేశాడు. అలా చేసి ఇశ్రాయేలీయులను ఎంతో యాతన పెట్టాడు.
\v 8 ఏతాను కొడుకు పేరు అజర్యా.
\p
\s5
\v 9 హెస్రోనుకు పుట్టిన కొడుకులు యెరహ్మెయేలు, రము, కెలూబై.
\v 10 రముకు అమ్మీనాదాబు, అమ్మీనాదాబుకు నయస్సోను పుట్టాడు. ఈ నయస్సోను యూదా ప్రజలకి నాయకుడిగా ఉన్నాడు.
\v 11 నయస్సోనుకు శల్మాను పుట్టాడు, శల్మానుకు బోయజు పుట్టాడు.
\v 12 బోయజుకు ఓబేదు పుట్టాడు. ఓబేదుకు యెష్షయి పుట్టాడు.
\p
\s5
\v 13 యెష్షయి పెద్ద కొడుకు పేరు ఏలీయాబు. రెండోవాడు అబీనాదాబు, మూడోవాడు షమ్మా,
\v 14 నాల్గోవాడు నెతనేలు, ఐదోవాడు రద్దయి,
\v 15 ఆరోవాడు ఓజెము, ఏడోవాడు దావీదు.
\p
\s5
\v 16 వీళ్ళకు ఇద్దరు అక్కచెల్లెళ్ళు. వాళ్ళు సెరూయా అబీగయీలు. సెరూయాకు అబీషై, యోవాబు, అశాహేలు అనే ముగ్గురు కొడుకులు పుట్టారు.
\v 17 అబీగయీలుకు అమాశా పుట్టాడు. ఈ అమాశా తండ్రి యెతెరు అనే ఇష్మాయేలీయుడు.
\p
\s5
\v 18 హెస్రోను కొడుకు కాలేబుకు అజూబా అనే తన భార్య వల్లా, యెరీయోతు
\f +
\fr 2:18
\fq యెరీయోతు
\ft అజూబా భార్య
\f* అనే ఆమె వల్లా పిల్లలు కలిగారు. అజూబా కొడుకులు యేషెరు, షోబాబు, అర్దోను.
\v 19 అజూబా చనిపోయిన తరువాత కాలేబు ఎఫ్రాతా అనే ఆమెను పెళ్ళిచేసుకున్నాడు. ఆమె వల్ల అతనికి హూరు పుట్టాడు.
\v 20 హూరుకు ఊరీ పుట్టాడు. ఊరీకి బెసలేలు పుట్టాడు.
\p
\s5
\v 21 తరువాత హెస్రోను అరవై ఏళ్ల వయస్సప్పుడు మాకీరు కూతుర్ని పెళ్ళి చేసుకున్నాడు. ఈ మాకీరు గిలాదుకు తండ్రి. హెస్రోనుకు సెగూబు పుట్టాడు.
\v 22 సెగూబుకు యాయీరు పుట్టాడు. ఇతని ఆధీనంలో గిలాదు దేశంలో ఇరవై మూడు పట్టణాలు ఉండేవి.
\p
\s5
\v 23 వీళ్ళ దగ్గరనుండి యాయీరు పట్టణాలనూ, కెనాతునూ, వీటి చుట్టూ ఉన్న మరో అరవై ఊళ్లనూ గెషూరు వాళ్లూ అరామీయులూ తీసుకున్నారు. వీళ్ళంతా గిలాదుకు తండ్రి అయిన మాకీరు సంతానం.
\v 24 హెస్రోను చనిపోయిన తరువాత కాలేబు - ఎఫ్రతా పట్టణంలో హెస్రోను భార్య అష్షూరును కన్నది. ఈ అష్షూరు తెకోవ అనే వాడికి తండ్రి.
\p
\s5
\v 25 హెస్రోను పెద్దకొడుకు యెరహ్మెయేలు. ఈ యెరహ్మెయేలు పెద్ద కొడుకు రము. మిగిలిన కొడుకులు ఎవరంటే బూనా, ఓరెను, ఓజెము, అహీయా అనేవాళ్ళు.
\v 26 ఈ యెరహ్మెయేలుకు మరో భార్య ఉంది. ఆమె పేరు అటారా. ఈమె ఓనాము తల్లి.
\v 27 యెరహ్మెయేలు పెద్దకొడుకు రముకు మయజూ, యామీను, ఏకెరు అనే కొడుకులున్నారు.
\v 28 ఓనాము కొడుకులు షమ్మయి, యాదాలు. షమ్మయి కొడుకులు నాదాబు, అబీషూరు.
\p
\s5
\v 29 అబీషూరు భార్య పేరు అబీహయిలు. ఈమె ద్వారా అబీషూరుకు అహ్బాను, మొలీదు అనే పేరున్న కొడుకులు పుట్టారు.
\v 30 నాదాబు కొడుకులు సెలెదు, అప్పయీము. సెలెదు పిల్లలు పుట్టకుండానే చనిపోయాడు.
\v 31 అప్పయీం కొడుకుల్లో ఇషీ అనే వాడున్నాడు. ఇషీ కొడుకుల్లో షేషాను అనే వాడున్నాడు. షేషాను కొడుకుల్లో అహ్లయి అనే వాడున్నాడు.
\v 32 షమ్మయికి సోదరుడైన యాదా కొడుకులు యెతెరు, యోనాతాను. వీరిలో యెతెరు ఎలాంటి సంతానం లేకుండానే చనిపోయాడు.
\v 33 యోనాతాను కొడుకులు పేలెతు, జాజా. వీళ్ళంతా యెరహ్మెయేలు వారసులు.
\p
\s5
\v 34 షేషానుకు కూతుళ్ళు పుట్టారు గానీ కొడుకులు కలగలేదు. ఈ షేషానుకు యరహా అనే ఒక దాసుడున్నాడు. వాడు ఐగుప్తీయుడు
\v 35 షేషాను తన కూతుర్ని ఈ యరహాకు ఇచ్చాడు. యరహాకు ఆమె ద్వారా అత్తయి పుట్టాడు.
\p
\s5
\v 36 అత్తయికి నాతాను పుట్టాడు. నాతానుకి జాబాదు పుట్టాడు.
\v 37 జాబాదుకి ఎప్లాలు పుట్టాడు. ఎప్లాలుకి ఓబేదు పుట్టాడు.
\v 38 ఓబేదుకి యెహూ పుట్టాడు. యెహూకి అజర్యా పుట్టాడు.
\p
\s5
\v 39 అజర్యాకి హేలెస్సు పుట్టాడు. హేలెస్సుకి ఎలాశా పుట్టాడు.
\v 40 ఎలాశాకి సిస్మాయీ పుట్టాడు. సిస్మాయీకి షల్లూము పుట్టాడు.
\v 41 షల్లూముకి యెకమ్యా పుట్టాడు. యెకమ్యాకి ఎలీషామా పుట్టాడు.
\p
\s5
\v 42 యెరహ్మెయేలు తోడబుట్టిన వాడు కాలేబు కొడుకులెవరంటే మేషా, మారేషా. వీరిలో మేషా పెద్దవాడు. ఇతని కొడుకు జీఫు. మారేషా కొడుకు పేరు హెబ్రోను.
\v 43 హెబ్రోను కొడుకులు కోరహు, తప్పూయ, రేకెము, షెమ.
\v 44 షెమకు రహము పుట్టాడు. ఈ రహము యోర్కెయాముకు తండ్రి. రేకెముకు షమ్మయి పుట్టాడు.
\p
\s5
\v 45 షమ్మయి కొడుకు మాయోను. ఈ మాయోను బేత్సూరుకు తండ్రి.
\v 46 కాలేబు ఉంపుడుకత్తె అయిన ఏయిఫా హారాను, మోజాను, గాజేజులకు జన్మనిచ్చింది. హారానుకు గాజేజు పుట్టాడు.
\v 47 యెహ్దయి కొడుకులు రెగెము, యోతాము, గేషాను, పెలెటు, ఏయిఫా, షయపు.
\p
\s5
\v 48 కాలేబు ఉంపుడుకత్తె అయిన మయకా షెబెరుకీ, తిర్హనాకీ జన్మనిచ్చింది.
\v 49 ఆమెకి ఇంకా షయపు, షెవాను పుట్టారు. వీరిలో షయపుకు మద్మన్నా, షెవానుకు గిబీ వాడు మక్బేనా పుట్టారు. కాలేబు కూతురి పేరు అక్సా.
\p
\v 50 ఇక కాలేబు సంతానం ఎవరంటే, ఎఫ్రాతా వల్ల అతనికి మొదట హూరు పుట్టాడు. హూరుకు శోబాలు, శల్మా, హారేపు పుట్టారు.
\s5
\v 51 వీళ్ళలో శోబాలుకు కిర్యత్యారీము, శల్మాకు బేత్లెహేము, హారేపుకు బేత్గాదేరు పుట్టారు.
\p
\s5
\v 52 కిర్యత్యారీము తండ్రి అయిన శోబాలు వారసులు హారోయే, ఇంకా మనుహోతీయుల్లో సగం మంది ఇతని వంశం వాళ్ళే.
\v 53 కిర్యత్యారీముకు చెందిన తెగలు ఎవరంటే ఇత్రీయులూ, పూతీయులూ, షుమ్మాతీయులూ, మిష్రాయీయులు. వీరినుండి జొరాతీయులూ, ఎష్తాయులీయులూ వచ్చారు.
\p
\s5
\v 54 శల్మాకు సంబంధించిన తెగలు ఇవి, బేత్లెహేము, నెటోపాతీయులూ, యోవాబు కుటుంబానికి సంబంధించిన అతారోతీయులూ, మానహతీయుల్లో సగ భాగంగా ఉన్న జారీయులూ.
\v 55 యబ్బేజులో నివసించే లేఖికుల కుటుంబాలైన తిరాతీయులూ, షిమ్యాతీయులూ, శూకోతీయులూ. వీళ్ళు రేకాబు కుటుంబాలకు పూర్వీకుడైన హమాతుకు వారసులుగా కలిగిన కేనీయులు.
\s5
\c 3
\s దావీదు కుటుంబం
\r 3:1-4; 2 సమూ 3:2-5
\r 3:5-8; 2 సమూ 5:14-16; 1 దిన 14:4-7
\p
\v 1 దావీదుకు హెబ్రోనులో పుట్టిన కొడుకులు వీళ్ళు: పెద్దకొడుకు పేరు అమ్నోను. ఇతని తల్లి అహీనోయము. ఈమెది యెజ్రెయేలు పట్టణం.
\p రెండవ వాడు దానియేలు. ఇతని తల్లి పేరు అబీగయీలు. ఈమెది కర్మెల్ గ్రామం.
\p
\v 2 మూడవ వాడు అబ్షాలోము. ఇతని తల్లి పేరు మయకా. ఈమె గెషూరు దేశానికి రాజు తల్మయి కూతురు.
\p నాలుగో వాడు అదోనీయా. ఇతని తల్లి పేరు హగ్గీతు.
\p
\v 3 అయిదోవాడు షెఫట్య. ఇతని తల్లి పేరు అబీటలు.
\p ఆరోవాడు ఇత్రెయాము. ఇతని తల్లి ఎగ్లా.
\s5
\v 4 ఈ ఆరుగురూ అతనికి హెబ్రోనులో పుట్టారు. ఇక్కడ దావీదు ఏడు సంవత్సరాల ఆరు నెలలు పరిపాలించాడు.
\p యెరూషలేములో అతడు ముప్ఫై మూడు సంవత్సరాలు పరిపాలించాడు.
\p
\v 5 యెరూషలేములో అతనికి అమ్మీయేలు కూతురు బత్షెబ వల్ల షిమ్యా, షోబాబు, నాతాను, సొలొమోను అనే నలుగురు కొడుకులు పుట్టారు.
\p
\s5
\v 6 దావీదుకి కలిగిన మిగిలిన తొమ్మిదిమంది కొడుకుల పేర్లు ఏమిటంటే, ఇభారు, ఎలీషామా, ఎలీపేలెటు,
\v 7 నోగహు, నెపెగు, యాఫీయ,
\v 8 ఎలీషామా, ఎల్యాదా, ఎలీపేలెటు అనే వాళ్ళు.
\p
\v 9 వీళ్ళంతా దావీదు కొడుకులు, అతని ఉంపుడుకత్తెల వల్ల కలిగిన సంతానం కాదు. వీళ్ళందరికీ సోదరి తామారు.
\s సొలొమోను కుటుంబం
\p
\s5
\v 10 సొలొమోను కొడుకు రెహబాము, రెహబాము కొడుకు అబీయా. అబీయా కొడుకు ఆసా. ఆసా కొడుకు యెహోషాపాతు.
\p
\v 11 యెహోషాపాతు కొడుకు యెహోరాము. యెహోరాము కొడుకు అహజ్యా. అహజ్యా కొడుకు యోవాషు.
\p
\v 12 యోవాషు కొడుకు అమజ్యా. అమజ్యా కొడుకు అజర్యా. అజర్యా కొడుకు యోతాము.
\p
\s5
\v 13 యోతాము కొడుకు ఆహాజు. ఆహాజు కొడుకు హిజ్కియా. హిజ్కియా కొడుకు మనష్షే.
\p
\v 14 మనష్షే కొడుకు ఆమోను. ఆమోను కొడుకు యోషీయా.
\p
\s5
\v 15 యోషీయా కొడుకులెవరంటే పెద్దవాడు యోహానాను, రెండోవాడు యెహోయాకీము, మూడోవాడు సిద్కియా, నాలుగోవాడు షల్లూము.
\p
\v 16 యెహోయాకీము కొడుకు యెకొన్యా. అతని కొడుకు సిద్కియా ఆఖరి రాజు.
\p
\s5
\v 17 యెకొన్యా కొడుకులు అసీరు, షయల్తీయేలు,
\v 18 మల్కీరాము, పెదాయా, షెనజ్జరు, యెకమ్యా, హోషామా, నెదబ్యా.
\p
\s5
\v 19 పెదాయా కొడుకులు జెరుబ్బాబెలు, షిమీ. జెరుబ్బాబెలు కొడుకులు మెషుల్లాము, హనన్యా. వీళ్ళ సోదరి షెలోమీతు.
\p
\v 20 అతనికి ఇంకో ఐదుగురు కొడుకులున్నారు. వాళ్ళు హషుబా, ఓహెలు, బెరెక్యా, హసద్యా, యూషబ్హెసేద్.
\p
\v 21 హనన్యా వారసులు పెలట్యా, యెషయా, రెఫాయా కొడుకులు, అర్నాను కొడుకులు, ఓబద్యా కొడుకులు, షెకన్యా కొడుకులు.
\p
\s5
\v 22 షెకన్యా కొడుకుల్లో షేమయా అనేవాడున్నాడు. షెమయాకు ఆరుగురు కొడుకులున్నారు. వాళ్ళెవరంటే, హట్టూషు, ఇగాలు, బారియహూ, నెయర్యా, షాపాతు.
\p
\v 23 నెయర్యాకు ముగ్గురు కొడుకులున్నారు. వాళ్ళు ఎల్యోయేనై, హిజ్కియా, అజ్రీకాము.
\p
\v 24 ఎల్యోయేనైకి ఏడుగురు కొడుకులున్నారు. వాళ్ళు హోదవ్యా, ఎల్యాషీబు, పెలాయా, అక్కూబు, యోహానాను, దెలాయా, అనానీ.
\s5
\c 4
\s యూదా వంశం
\p
\v 1 యూదా కొడుకులు పెరెసు, హెస్రోను, కర్మీహూరు, శోబాలు అనేవాళ్ళు.
\v 2 శోబాలు కొడుకు పేరు రెవాయా. రెవాయాకి యహతు పుట్టాడు. యహతుకి అహూమై, లహదు పుట్టారు. వీళ్ళు జొరాతీయుల తెగల మూల పురుషులు.
\p
\s5
\v 3 అబీయేతాము సంతానం యెజ్రెయేలు, ఇష్మా, ఇద్బాషు అనేవాళ్ళు. వీళ్ళ సోదరి పేరు హజ్జెలెల్పోని.
\p
\v 4 ఇక పెనూయేలు గెదోరీయులకు మూలపురుషుడు. ఏజెరు అనేవాడు హూషాయీయులకు మూలపురుషుడు. వీళ్ళంతా హూరు కొడుకులు. హూరు ఎఫ్రాతాకు పెద్ద కొడుకు, బేత్లెహేముకు తండ్రి.
\p
\s5
\v 5 అష్షూరు తండ్రి తెకోవ. ఇతనికి ఇద్దరు భార్యలున్నారు. వీరి పేళ్ళు హెలా, నయరా.
\v 6 నయరా ద్వారా అతనికి అహూజ్జాము, హెపెరు, తేమనీ, హాయహష్తారీ పుట్టారు. వీళ్ళు నయరా కొడుకులు.
\p
\v 7 హెలా కొడుకులెవరంటే జెరెతు, సోహరు, ఎత్నాను, కోజు.
\v 8 వీరిలో కోజు ద్వారా ఆనూబు, జోబేబా, హారుము కొడుకైన అహర్హేలు ద్వారా కలిగిన తెగల ప్రజలూ వచ్చారు.
\p
\s5
\v 9 యబ్బేజు తన సోదరులందరి కంటే ఎక్కువ గౌరవం పొందాడు. అతని తల్లి అతనికి యబ్బేజు అనే పేరు పెట్టింది. ఎందుకంటే <<యాతనలో నేను వీడికి జన్మనిచ్చాను>> అని చెప్పింది.
\v 10 ఈ యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుడికి ఇలా విజ్ఞాపన చేశాడు. <<నువ్వు నన్ను కచ్చితంగా ఆశీర్వదించు. నా భూభాగాన్ని విశాలం చెయ్యి. నీ చేతిని నాకు తోడుగా ఉంచు. నేను వేదన పడకుండా దయతో నన్ను కీడు నుండి తప్పించు.>> దేవుడు అతని ప్రార్థన అంగీకరించి అతడు అడిగినట్టే అతనికి దయచేశాడు.
\p
\s5
\v 11 షూవహు సోదరుడైన కెలూబు కొడుకు పేరు మెహీరు. ఇతని కొడుకు పేరు ఎష్తోను.
\v 12 ఎష్తోను కొడుకులు బేత్రాఫా, పాసెయా, తెహిన్నా అనే వాళ్ళు. ఈ తెహిన్నా ఈర్నాహాషుకు తండ్రి. వీళ్ళు రేకాకు చెందిన వాళ్ళు.
\p
\s5
\v 13 కనజు కొడుకుల పేర్లు ఒత్నీయేలు శెరాయా. ఒత్నీయేలు కొడుకుల్లో హతతు అనే ఒకడుండేవాడు.
\v 14 మెయానొతైకి ఒఫ్రా పుట్టాడు. శెరాయా కొడుకు పేరు యోవాబు. ఇతడు నిపుణులైన చేతి వృత్తుల వాళ్ళ లోయలో జీవించే వారికి మూలపురుషుడు. ఆ లోయలో ఉన్న వాళ్ళంతా చేతిపనుల వాళ్ళే.
\p
\v 15 యెఫున్నె కొడుకైన కాలేబుకు ఈరు, ఏలా, నయం పుట్టారు. ఏలా కొడుకుల్లో కనజు అనే వాడున్నాడు.
\v 16 యెహల్లెలేలు కొడుకులు జీఫు, జీఫా, తీర్యా, అశర్యే.
\p
\s5
\v 17 ఎజ్రా కొడుకులు యెతెరు, మెరెదు, ఏఫెరు, యాలోను. ఐగుప్తీయురాలూ, ఫరో కూతురూ అయిన బిత్యా ద్వారా మెరెదుకు పుట్టిన కొడుకులు మిర్యాము,, షమ్మయి, ఎష్టెమో, ఇష్బాహు అనేవాళ్ళు. ఈ ఇష్బాహు ఎష్టేమోను వాళ్లకి తండ్రి.
\v 18 యూదురాలైన అతని భార్య వల్ల అతనికి గెదోరుకు తండ్రి అయిన యెరెదు, శోకోకు తండ్రి అయిన హెబెరు, జానోహకు తండ్రి అయిన యెకూతీయేలు పుట్టారు.
\p
\s5
\v 19 నహము సోదరీ హూదీయా భార్యా అయిన ఆమెకు పుట్టిన కొడుకుల్లో ఒకడు గర్మీ వాడు కెయిలాకు తండ్రి. మరొకడు మాయకాతీయుడైన ఎష్టేమో.
\v 20 షీమోను కొడుకులు అమ్నోను, రిన్నా, బెన్హానాను, తీలోనులు. ఇషీ కొడుకులు జోహేతు, బెన్జోహేతులు.
\p
\s5
\v 21 యూదా కొడుకైన షేలహు కొడుకులు ఎవరంటే లేకాకు తండ్రియైన ఏరు, మారేషాకు తండ్రీ, బేత్ ఆష్బియాలో సన్నటి వస్త్రాలు నేసే వారికి మూలపురుషుడైన లద్దాయు,
\v 22 యోకిం, కోజేబా సంతతి, యోవాషు సంతతి, మోయాబులో ప్రసిద్ధులై బెత్లేహెంకు తిరిగి వచ్చిన శారాపీయులూ.
\p ఇవన్నీ పూర్వకాలంలోనే రాసి ఉన్న సంగతులే.
\v 23 వీళ్ళు కుమ్మరి వాళ్ళు. నెతాయీములోనూ, గెదేరలోనూ వీళ్ళు నివసించారు. వీళ్ళు రాజు కోసం పని చేయడానికి అక్కడ నివసించారు.
\s షిమ్యోను వంశం
\r 4:28-43; యెహో 19:2-10
\p
\s5
\v 24 షిమ్యోను కొడుకులు వీళ్ళు. నెమూయేలు, యామీను, యారీబు, జెరహు, షావూలు.
\v 25 వీళ్ళలో షావూలుకు షల్లూము పుట్టాడు. షల్లూముకు మిబ్సాము పుట్టాడు. మిబ్సాముకు మిష్మా పుట్టాడు.
\v 26 మిష్మా సంతతి వారెవరంటే అతని కొడుకు హమ్మూయేలు, అతని మనవడు జక్కూరు, మునిమనవడు షిమీ.
\p
\s5
\v 27 షిమీకి పదహారు మంది కొడుకులూ, ఆరుగురు కూతుళ్ళూ పుట్టారు. కానీ అతని అన్నదమ్ములకు ఎక్కువమంది సంతానం కలుగలేదు. యూదా తెగ ప్రజలు వృద్ధి చెందినట్లు వీళ్ళ తెగలు వృద్ధి చెందలేదు.
\v 28 వీళ్ళు బెయేర్షెబా, మోలాదా, హజర్షువలు అనే ఊళ్లలో నివసించారు.
\p
\s5
\v 29 వీళ్ళు ఇంకా బిల్హా, ఎజెము, తోలాదు,
\v 30 బెతూయేలు, హోర్మా, సిక్లగు
\v 31 బేత్మర్కాబోతు, హాజర్సూసా, బేత్బీరీ, షరాయిము అనే ప్రాంతాల్లో కూడా నివసించారు. దావీదు పరిపాలన మొదలయ్యే వరకూ వీళ్ళు ఈ ఊళ్లలో నివసించారు.
\p
\s5
\v 32 వాళ్ళ ఐదు ఊళ్ళు ఏవంటే ఏతాము, అయీను, రిమ్మోను, తోకెను, ఆషాను.
\v 33 వీటితో పాటు బయలు వరకూ ఉన్న గ్రామాలు వాళ్ళ వశంలో ఉండేవి. వీళ్ళు నివాసం ఏర్పరుచుకున్న ప్రాంతాలు ఇవి. వీళ్ళు తమ వంశావళి వివరాలను భద్రం చేసుకున్నారు.
\p
\s5
\v 34 వీళ్ళ తెగల నాయకులు ఎవరంటే మెషోబాబు, యమ్లేకు, అమజ్యా కొడుకైన యోషా,
\v 35 యోవేలు, అశీయేలు కొడుకైన శెరాయాకు పుట్టిన యోషిబ్యా కొడుకైన యెహూ,
\v 36 ఎల్యోయేనై, యహకోబా, యెషోహాయా, అశాయా, అదీయేలు, యెశీమీయేలు, బెనాయా,
\v 37 షెమయాకు పుట్టిన షిమ్రీ కొడుకైన యెదాయాకు పుట్టిన అల్లోను కొడుకైన షిపి కొడుకైన జీజా అనేవాళ్ళు.
\v 38 వీళ్ళ కుటుంబాలన్నీ ఎంతో అభివృద్ధి చెందాయి.
\p
\s5
\v 39 వీళ్ళు తమ దగ్గర ఉన్న మందలకు మేత కోసం గెదోరుకు తూర్పు దిక్కున ఉన్న పల్లపు ప్రాంతానికి వెళ్ళారు.
\v 40 అక్కడ వాళ్ళకు పుష్టిగా, విస్తారంగా మేత ఉన్న ప్రాంతం కనిపించింది. ఆ దేశం విశాలంగా, ప్రశాంతంగా, హాయిగా ఉంది. అంతకుముందు అక్కడ హాము వంశం వాళ్ళు నివసించారు.
\v 41 ఆ వంశావళిలో పేర్లు ఉన్న వీరు యూదా రాజు హిజ్కియా పరిపాలించిన రోజుల్లో అక్కడకు వెళ్ళారు. అక్కడ హాము తెగల నివాసాల పైనా అక్కడే ఉన్న మేయూనిము తెగలపైనా దాడులు చేశారు. వాళ్ళను పూర్తిగా నాశనం చేసి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. తమ మందలకు సరిపోయినంత మేత అక్కడ ఉండటం వల్ల వాళ్ళు అక్కడే స్థిరపడ్డారు.
\p
\s5
\v 42 షిమ్యోను తెగ నుండి ఐదు వందలమంది శేయీరు పర్వత ప్రాంతాలకు వెళ్ళారు. వీళ్ళకు ఇషీ కుమారులైన పెలట్యా, నెయర్యా, రెఫాయా, ఉజ్జీయేలు నాయకులుగా ఉన్నారు.
\v 43 వీళ్ళు అమాలేకీయుల్లో మిగిలి ఉన్న కాందిశీకులను హతమార్చి అక్కడే ఈ రోజు వరకూ స్థిర నివాసం ఏర్పరచుకుని ఉన్నారు.
\s5
\c 5
\s రూబేను వంశం
\p
\v 1 ఇశ్రాయేలుకు పెద్దకొడుకైన రూబేను సంతానం గూర్చిన వివరాలు. ఇతడు పెద్ద కొడుకే గానీ అతని ప్రథమ సంతానపు జన్మహక్కును అతని నుండి తీసివేసి ఇశ్రాయేలుకు మరో కొడుకైన యోసేపు కొడుకులకు బదలాయించడం జరిగింది. ఎందుకంటే రూబేను తన తండ్రి మంచాన్ని అపవిత్రం చేశాడు.
\v 2 తన సోదరులందరికంటే యూదా ప్రముఖుడు. యూదా వంశంలోనుండే పరిపాలకుడు రానున్నాడు. అయినా ప్రథమ సంతానపు జన్మహక్కు యోసేపు పరమయింది.
\v 3 ఇశ్రాయేలుకు పెద్ద కొడుకుగా పుట్టిన రూబేను కొడుకులు ఎవరంటే హనోకు, పల్లూ, హెస్రోను, కర్మీ అనే వారు.
\p
\s5
\v 4 యోవేలు వారసుల వివరాలిలా ఉన్నాయి.
\p యోవేలు కొడుకు షెమయా, షెమయా కొడుకు గోగు, గోగు కొడుకు షిమీ,
\p
\v 5 షిమీ కొడుకు మీకా, మీకా కొడుకు రెవాయా, రెవాయా కొడుకు బయలు,
\p
\v 6 బయలు కొడుకు బెయేర. ఇతడు రూబేనీయులకు నాయకుడు. అష్షూరు రాజు తిగ్లత్పిలేసెరు ఇతణ్ణి బందీగా చేసి తీసుకు వెళ్ళాడు.
\p
\s5
\v 7 వాళ్ళ వంశావళి లెక్కల్లో ఉన్న తమ కుటుంబాల ప్రకారం అతని సోదరులెవరంటే ప్రధాని అయిన యెహీయేలూ, జెకర్యా,
\v 8 యోవేలు కొడుకైన షెమ మనుమడూ ఆజాజు కొడుకూ అయిన బెల అనే వాళ్ళు. వీళ్ళు అరోయేరు లోనూ, నెబో, బయల్మెయోనుల వరకూ నివాసం ఏర్పరచుకున్నారు.
\p
\v 9 వాళ్ళ పశువులు గిలాదు దేశంలో అతి విస్తారమయ్యాయి. కాబట్టి వాళ్ళు తూర్పున యూఫ్రటీసు నది దగ్గరనుండి అరణ్యపు సరిహద్దుల వరకూ నివాసాలు ఏర్పరచుకున్నారు.
\p
\s5
\v 10 సౌలు పరిపాలనా కాలంలో వాళ్ళు హగ్రీ జాతి వారితో యుద్ధం చేసి వాళ్ళను హతమార్చారు. గిలాదు తూర్పు వైపు వరకూ ఉన్న ప్రాంతమంతా నివాసమున్నారు.
\s గాదు వంశం
\p
\s5
\v 11 వాళ్ళకెదురుగా ఉన్న బాషాను దేశంలో సలేకా వరకూ గాదు గోత్రం వాళ్ళు నివసించారు.
\v 12 వాళ్ళ నాయకులు యోవేలు, షాపాము అనేవాళ్ళు. వీళ్ళు తమ తమ కుటుంబాల నాయకులు. వీళ్ళ తరువాత షాపాతు, యహనై అనే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు బాషానులో నివసించారు.
\v 13 వీళ్ళ తండ్రుల వైపు కుటుంబాల బంధువులు మొత్తం ఏడుగురున్నారు. వాళ్ళు మిఖాయేలు, మెషుల్లాము, షేబా, యోరై, యకాను, జీయా, ఏబెరు అనే వాళ్ళు.
\p
\s5
\v 14 వీళ్ళు హూరీ అనే వాడికి పుట్టిన అబీహాయిలు కొడుకులు. ఈ హూరీ యరోయకీ, యారోయ గిలాదుకీ, గిలాదు మిఖాయేలుకీ, మిఖాయేలు యెషీషైకీ, యెషీషై యహదోకీ, యహదో బూజుకీ పుట్టారు.
\m
\v 15 గూనీకి పుట్టిన అబ్దీయేలు కుమారుడు అహీ వాళ్ళ తండ్రుల కుటుంబాలకు నాయకుడు.
\p
\s5
\v 16 వారు బాషానులోని గిలాదులోనూ, మిగిలిన ఊళ్లలోనూ, షారోను సరిహద్దుల వరకూ ఉన్న పచ్చని భూముల్లోనూ నివాసమున్నారు.
\v 17 యూదా రాజు యోతాము కాలంలోనూ ఇశ్రాయేలు రాజు యరొబాము కాలంలోనూ వీళ్ళను వాళ్ళ వంశావళి లెక్కల్లో నమోదు చేశారు.
\p
\s5
\v 18 రూబేను గోత్రం, గాదు గోత్రం, మనష్షే అర్థ గోత్రం వాళ్ళల్లో బల్లెం, కత్తి పట్టగలిగిన వాళ్ళూ, బాణాలు వేయడంలో నేర్పరులూ, యుద్ధం చేయడానికి సన్నద్ధమైన వాళ్ళూ మొత్తం నలభై నాలుగు వేల ఏడు వందల అరవైమంది ఉన్నారు.
\v 19 వీళ్ళు హగ్రీ జాతి వాళ్ళ పైనా, యెతూరు వాళ్ళపైనా, నాపీషు వాళ్ళపైనా, నోదాబు వాళ్ళపైనా దాడులు చేసారు.
\p
\s5
\v 20 యుద్ధంలో వాళ్ళకు దేవుడు సహాయం చేశాడు. ఈ విధంగా హగ్రీ జాతి వాళ్ళూ, వాళ్ళతో ఉన్న వాళ్ళంతా ఓడిపోయారు. యుద్ధంలో ఇశ్రాయేలీయులు దేవునికి విజ్ఞాపన చేశారు. వాళ్ళు తన పైన నమ్మకముంచారు గనక దేవుడు వాళ్ళ ప్రార్థనను అంగీకరించాడు.
\v 21 కాబట్టి ఇశ్రాయేలీయులు జయించడానికి దేవుడు సహాయం చేశాడు. వాళ్ళు యాభై వేల ఒంటెలనూ, రెండు లక్షల యాభై వేల గొర్రెలనూ, రెండు వేల గాడిదలనూ, లక్ష మంది మనుషులనూ స్వాధీనం చేసుకున్నారు.
\v 22 దేవుడు యుద్ధంలో వారికి సహాయం చేశాడు గనుక వాళ్ళు అనేక మందిని హతమార్చారు. తరువాత కాలంలో చెరలోకి వెళ్ళేంత వరకూ రూబేను గోత్రం, గాదు గోత్రం, మనష్షే అర్థగోత్రం వాళ్ళంతా హగ్రీ జాతి వాళ్ళ దేశంలోనే నివాసం ఉన్నారు.
\s మనష్షే అర్థగోత్రం
\p
\s5
\v 23 మనష్షే అర్థగోత్రం వాళ్ళు ఆ బాషాను దేశంలో నివసించి అభివృద్ధి చెందారు. బాషాను నుండి బయల్హెర్మోను వరకూ ఇంకా హెర్మోను పర్వతం అయిన శెనీరు వరకూ వ్యాపించారు.
\v 24 వాళ్ళ కుటుంబాలకు నాయకులు ఎవరంటే ఏఫెరు, ఇషీ, ఎలీయేలు, అజ్రీయేలు, యిర్మీయా, హోదవ్యా, యహదీయేలు అనే వాళ్లు. వీళ్ళు ధైర్యవంతులు, బలవంతులు, ప్రసిద్ధులైన వాళ్ళు. తమ తమ కుటుంబాలకు నాయకులు.
\p
\s5
\v 25 కానీ వాళ్ళు తమ పూర్వీకుల దేవునిపై తిరుగుబాటు చేశారు. దేవుడు తమ కళ్ళెదుట ఏ జాతులనైతే నాశనం చేశాడో ఆ జాతుల దేవుళ్ళను పూజించారు.
\v 26 కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడు అష్షూరు రాజు పూలు (అంటే అష్షూరు రాజు తిగ్లత్పిలేసెరు) ను రెచ్చగొట్టాడు. ఆ రాజు రూబేను గోత్రం, గాదు గోత్రం, మనష్షే అర్థగోత్రం వాళ్ళనందర్నీ బందీలుగా హాలహుకీ, హాబోరుకీ, హారాకుకీ, గోజాను నదీ ప్రాంతాలకీ పట్టుకుని పోయాడు. ఈ రోజుకీ వీళ్ళు అక్కడ కనిపిస్తున్నారు.
\s5
\c 6
\s లేవి వంశం
\r 6:54-80; యెహో 21:4-39
\p
\v 1 లేవి కొడుకులు గెర్షోను, కహాతు, మెరారీ.
\v 2 కహాతు కొడుకులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు అనే వాళ్ళు.
\v 3 అమ్రాము కొడుకులు అహరోను, మోషే. కూతురు పేరు మిర్యాము. అహరోను కొడుకులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు.
\p
\s5
\v 4 ఎలియాజరుకు ఫీనెహాసు పుట్టాడు. ఫీనెహాసుకు అబీషూవ పుట్టాడు.
\v 5 అబీషూవకు బుక్కీ పుట్టాడు. బుక్కీకి ఉజ్జీ పుట్టాడు.
\v 6 ఉజ్జీకి జెరహ్యా పుట్టాడు. జెరహ్యాకి మెరాయోతు పుట్టాడు.
\p
\s5
\v 7 మెరాయోతుకి అమర్యా పుట్టాడు. అమర్యాకి అహీటూబు పుట్టాడు.
\v 8 అహీటూబుకి సాదోకు పుట్టాడు. సాదోకుకి అహిమయస్సు పుట్టాడు.
\v 9 అహిమయస్సుకి అజర్యా పుట్టాడు. అజర్యాకి యోహానాను పుట్టాడు.
\p
\s5
\v 10 యోహానానుకి అజర్యా పుట్టాడు. ఈ అజర్యా యెరూషలేములో సొలొమోను కట్టించిన మందిరంలో యాజకత్వం జరిగించాడు.
\v 11 అజర్యాకి అమర్యా పుట్టాడు. అమర్యాకి అహీటూబు పుట్టాడు.
\v 12 అహీటూబుకి సాదోకు పుట్టాడు. సాదోకుకి షల్లూము పుట్టాడు.
\p
\s5
\v 13 షల్లూముకి హిల్కీయా పుట్టాడు. హిల్కీయాకి అజర్యా పుట్టాడు.
\v 14 అజర్యాకి శెరాయా పుట్టాడు. శెరాయాకి యెహోజాదాకు పుట్టాడు.
\v 15 యెహోవా నెబుకద్నెజరు ద్వారా యూదావాళ్ళనూ యెరూషలేము వాళ్ళనూ చెరలోకి బందీలుగా తీసుకు వెళ్లినప్పుడు ఈ యెహోజాదాకు కూడా చెరలోకి వెళ్ళాడు.
\p
\s5
\v 16 లేవి కుమారులు గెర్షోను, కహాతూ, మెరారీలు.
\v 17 గెర్షోను కొడుకులు లిబ్నీ, షిమీలు.
\v 18 కహాతు కొడుకులు అమ్రామూ, ఇస్హారూ, హెబ్రోనూ, ఉజ్జీయేలూ అనేవాళ్ళు.
\p
\s5
\v 19 మెరారి కొడుకులు మహలీ, మూషి. పూర్వీకుల వంశావళి ప్రకారం లేవీయుల కుటుంబాలు ఏవంటే,
\p
\v 20 గెర్షోను కొడుకు లిబ్నీ,
\p లిబ్నీ కొడుకు యహతు,
\p యహతు కొడుకు జిమ్మా.
\p
\v 21 జిమ్మా కొడుకు యోవాహు,
\p యోవాహు కొడుకు ఇద్దో,
\p ఇద్దో కొడుకు జెరహు,
\p జెరహు కొడుకు యెయతిరయి.
\p
\s5
\v 22 కహాతు కొడుకుల్లో ఒకడు అమ్మీనాదాబు.
\p ఇతని కొడుకు కోరహు,
\p కోరహు కొడుకు అస్సీరు,
\p
\v 23 అస్సీరు కొడుకు ఎల్కానా,
\p ఎల్కానా కొడుకు ఎబ్యాసాపు,
\p ఎబ్యాసాపు కొడుకు అస్సీరు,
\p
\v 24 అస్సీరు కొడుకు తాహెతు,
\p తాహెతు కొడుకు ఊరియేలు,
\p ఊరియేలు కొడుకు ఉజ్జియా,
\p ఉజ్జియా కొడుకు షావూలు.
\p
\s5
\v 25 ఎల్కానా కొడుకులు అమాశై, అహీమోతు.
\p
\v 26 ఎల్కానా కొడుకుల్లో ఒకడు జోపై.
\p జోపై కొడుకు నహతు,
\p
\v 27 నహతు కొడుకు ఏలీయాబు,
\p ఏలీయాబు కొడుకు యెరోహాము,
\p యెరోహాము కొడుకు ఎల్కానా.
\p
\s5
\v 28 సమూయేలు కొడుకులు ఎవరంటే, పెద్దవాడు యోవేలు
\f +
\fr 6:28
\fq యోవేలు
\ft వషీని
\f* , మరొకడు అబీయాయు.
\p
\v 29 మెరారి కొడుకుల్లో ఒకడు మహలి.
\p మహలి కొడుకు లిబ్నీ.
\p లిబ్నీ కొడుకు షిమీ. షిమీ కొడుకు ఉజ్జా.
\p
\v 30 ఉజ్జా కొడుకు షిమ్యా. షిమ్యా కొడుకు హగ్గీయా.
\p హగ్గీయా కొడుకు అశాయా.
\p
\s5
\v 31 నిబంధన మందసాన్ని యెహోవా మందిరంలో ఉంచిన తరువాత మందిరంలో సంగీత సేవ కోసం దావీదు నియమించిన వాళ్ళు వీళ్ళే.
\v 32 సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరాన్ని నిర్మించే సమయంలో వీళ్ళు ప్రత్యక్ష గుడారం ఆవరణలో సంగీత సేవ చేస్తూ ఉన్నారు.
\p
\s5
\v 33 ఈ విధంగా వీళ్ళు తమ కొడుకులతో కలసి పరిచర్య చేసినవాళ్ళు.
\p కహాతీయుల కొడుకుల్లో గాయకుడైన హేమాను. ఇతను సమూయేలు కొడుకైన యోవేలుకి పుట్టాడు.
\p
\v 34 సమూయేలు ఎల్కానాకి పుట్టాడు.
\p ఎల్కానా యెరోహాముకి పుట్టాడు.
\p యెరోహాము ఎలీయేలుకి పుట్టాడు.
\p ఎలీయేలు తోయహుకి పుట్టాడు.
\p
\v 35 తోయహు సూపుకి పుట్టాడు.
\p సూపు ఎల్కానాకి పుట్టాడు.
\p ఎల్కానా మహతుకి పుట్టాడు.
\p మహతు అమాశైకి పుట్టాడు.
\p
\s5
\v 36 అమాశై ఎల్కానాకి పుట్టాడు.
\p ఎల్కానా యోవేలుకి పుట్టాడు.
\p యోవేలు అజర్యాకి పుట్టాడు.
\p అజర్యా జెఫన్యాకి పుట్టాడు.
\p
\v 37 జెఫన్యా తాహతుకి పుట్టాడు.
\p తాహతు అస్సీరుకి పుట్టాడు.
\p అస్సీరు ఎబ్యాసాపుకి పుట్టాడు.
\p ఎబ్యాసాపు కోరహుకి పుట్టాడు.
\p
\v 38 కోరహు ఇస్హారుకి పుట్టాడు.
\p ఇస్హారు కహాతుకి పుట్టాడు.
\p కహాతు లేవికి పుట్టాడు.
\p లేవి ఇశ్రాయేలుకి పుట్టాడు.
\p
\s5
\v 39 హేమాను సహచరుడైన ఆసాపు కుడివైపున నిలుచుని ఉండేవాడు. ఈ ఆసాపు బెరక్యా కొడుకు.
\p బెరక్యా షిమ్యా కొడుకు.
\p
\v 40 షిమ్యా మిఖాయేలు కొడుకు.
\p మిఖాయేలు బయశేయా కొడుకు.
\p బయశేయా మల్కీయా కొడుకు.
\p
\v 41 మల్కీయా యెత్నీ కొడుకు.
\p యెత్నీ జెరహు కొడుకు.
\p జెరహు అదాయా కొడుకు.
\p
\v 42 అదాయా ఏతాను కొడుకు.
\p ఏతాను జిమ్మా కొడుకు.
\p జిమ్మా షిమీ కొడుకు.
\p
\v 43 షిమీ యహతు కొడుకు.
\p యహతు గెర్షోను కొడుకు.
\p గెర్షోను లేవి కొడుకు.
\p
\s5
\v 44 హేమానుకి ఎడమవైపున మెరారీయులు నిలుచుని ఉండేవాళ్ళు. వాళ్ళలో ఏతాను కీషీ కొడుకు.
\p కీషీ అబ్దీ కొడుకు.
\p అబ్దీ మల్లూకు కొడుకు.
\p మల్లూకు హషబ్యా కొడుకు.
\p
\v 45 హషబ్యా అమజ్యా కొడుకు.
\p అమజ్యా హిల్కీయా కొడుకు.
\p
\v 46 హిల్కీయా అమ్జీ కొడుకు.
\p అమ్జీ బానీ కొడుకు.
\p బానీ షమెరు కొడుకు.
\p
\v 47 షమెరు మహలి కొడుకు.
\p మహలి మూషి కొడుకు.
\p మూషి మెరారి కొడుకు.
\p మెరారి లేవి కొడుకు.
\p
\s5
\v 48 వీళ్ళ సోదరులైన ఇతర లేవీయులను దేవుని మందిరానికి సంబంధించిన అన్ని పనులకు నియమించారు.
\s అహరోనూ వంశం
\p
\s5
\v 49 అతి పరిశుద్ధ స్థలానికి సంబంధించిన అన్ని పనులూ అహరోనూ, అతని సంతానం చేస్తూ ఉన్నారు. వీళ్ళు దహన బలి అర్పణని బలిపీఠం పైన అర్పించేవాళ్ళు. అలాగే ధూపార్పణని బలిపీఠం పైన అర్పించేవాళ్ళు. ఇశ్రాయేలీయుల కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి ఇదంతా దేవుని సేవకుడైన మోషే ఆజ్ఞాపించినట్లుగా జరిగేది.
\p
\s5
\v 50 అహరోను సంతానం ఎవరంటే, అహరోను కొడుకు ఎలియాజరు.
\p ఎలియాజరు కొడుకు ఫీనెహాసు.
\p ఫీనెహాసు కొడుకు అబీషూవ.
\p
\v 51 అబీషూవ కొడుకు బుక్కీ.
\p బుక్కీ కొడుకు ఉజ్జీ.
\p ఉజ్జీ కొడుకు జెరహ్య.
\p
\v 52 జెరహ్య కొడుకు మెరాయోతు.
\p మెరాయోతు కొడుకు అమర్యా.
\p అమర్యా కొడుకు అహీటూబు.
\p
\v 53 అహీటూబు కొడుకు సాదోకు.
\p సాదోకు కొడుకు అహిమయస్సు.
\p
\s5
\v 54 అహరోను వారసులకు కేటాయించిన స్థలాలు ఇవి. దీనికోసం చీటీలు వేసినప్పుడు మొదటి చీటీ కహాతీయుల కుటుంబాల పైన పడింది.
\v 55 దాని ప్రకారం యూదా దేశంలోని హెబ్రోనూ దాని చుట్టూ ఉన్న పచ్చిక మైదానాలూ వారికి అప్పగించడం జరిగింది.
\v 56 అయితే ఆ పట్టణం చుట్టూ ఉన్న పొలాలనూ దాని చుట్టుపక్కల గ్రామాలనూ యెఫున్నె కొడుకు కాలేబుకి ఇచ్చారు.
\p
\s5
\v 57 అహరోను వారసులకు వచ్చిన పట్టణాలేవంటే, ఆశ్రయ పట్టణమైన హెబ్రోను, లిబ్నా దాని పచ్చిక మైదానాలూ, యత్తీరూ, ఎష్టేమో దాని పచ్చిక మైదానాలూ,
\v 58 హీలేనూ, దాని పచ్చిక మైదానాలూ, దెబీరూ దాని పచ్చిక మైదానాలూ.
\p
\s5
\v 59 అహరోను వారసులకు వీటితో పాటు ఆషానూ దాని పచ్చిక మైదానాలూ, బేత్షెమెషూ దాని పచ్చిక మైదానాలూ కూడా దక్కాయి.
\v 60 ఇంకా బెన్యామీను గోత్ర ప్రదేశాల్లో నుండి గెబా దాని పచ్చిక మైదానాలూ, అల్లెమెతు దాని పచ్చిక మైదానాలూ, అనాతోతూ, దాని పచ్చిక మైదానాలూ కూడా వీరికి వచ్చాయి. ఇలా కహాతీయుల కుటుంబాలు మొత్తం పదమూడు పట్టణాలను పొందాయి.
\p
\s5
\v 61 కహాతు వారసుల్లో మిగిలిన వాళ్లకు వారికి పడిన చీటీ ప్రకారం మనష్షే అర్థగోత్ర ప్రదేశాల్లో నుండి పది పట్టణాలు వచ్చాయి.
\p
\v 62 గెర్షోను వారసులకు వాళ్ళ వివిధ తెగల ప్రకారం పదమూడు పట్టణాలు వచ్చాయి. ఇవి ఇశ్శాఖారూ, ఆషేరూ, నఫ్తాలీ, గోత్రాల ప్రదేశాల నుండీ బాషానులో ఉన్న మనష్షే అర్థగోత్ర ప్రదేశాల నుండీ ఇవ్వడం జరిగింది.
\p
\s5
\v 63 మెరారీయులకు పడిన చీటీ ప్రకారం వాళ్ళ తెగలకు పన్నెండు పట్టణాలు వచ్చాయి. ఈ పట్టణాలను రూబేనూ, గాదూ, జెబూలూనూ గోత్రాల ప్రదేశాల నుండి ఇవ్వడం జరిగింది.
\v 64 ఈ విధంగా ఇశ్రాయేలీయులు లేవీయులకు ఈ పట్టణాలనూ వాటి పచ్చిక మైదానాలనూ ఇచ్చారు.
\v 65 వాళ్ళు చీటీ వేసి, ముందు పేర్కొన్న పట్టణాలను యూదా, షిమ్యోనూ, బెన్యామీను గోత్ర ప్రదేశాల నుండి వాటిని కేటాయించారు.
\p
\s5
\v 66 కహాతీయుల తెగలో కొందరికి ఎఫ్రాయిము గోత్రానికి చెందిన కొన్ని పట్టణాలను ఇచ్చారు.
\v 67 ఎఫ్రాయిము పర్వత ప్రాంతంలోని ఆశ్రయ పట్టణమైన షెకెము, దాని పచ్చిక మైదానాలనూ, గెజెరున దాని పచ్చిక మైదానాలనూ,
\v 68 యొక్మెయాము దాని పచ్చిక మైదానాలనూ, బేత్‌హోరోను దాని పచ్చిక మైదానాలనూ,
\v 69 అయ్యాలోను దాని పచ్చిక మైదానాలనూ, గత్రిమ్మోను దాని పచ్చిక మైదానాలనూ, వాళ్ళకి ఇచ్చారు.
\s5
\v 70 అలాగే మనష్షే అర్థగోత్ర ప్రదేశాల నుండి ఆనేరు దాని పచ్చిక మైదానాలనూ బిలియాము దాని పచ్చిక మైదానాలనూ, కహాతీయులకు ఇచ్చారు.
\s5
\v 71 అలాగే మనష్షే అర్థగోత్రం వాళ్ళ నుండి గెర్షోనీయులకు బాషానులో ఉన్న గోలాను ప్రాంతం, దాని పచ్చిక మైదానాలూ, అష్తారోతూ దాని పచ్చిక మైదానాలూ,
\v 72 ఇశ్శాఖారు గోత్రం నుండి కెదెషూ, దాని పచ్చిక మైదానాలూ, దాబెరతు, దాని పచ్చిక మైదానాలూ,
\v 73 రామోతూ దాని పచ్చిక మైదానాలూ, ఆనేమూ దాని పచ్చిక మైదానాలూ,
\s5
\v 74 ఆషేరుగోత్రం నుండి మాషాలూ దాని పచ్చిక మైదానాలూ, అబ్దోనూ దాని పచ్చిక మైదానాలూ,
\v 75 హుక్కోకూ దాని పచ్చిక మైదానాలూ, రెహోబూ దాని పచ్చిక మైదానాలూ,
\v 76 నఫ్తాలి గోత్రం నుండి గలిలయలో ఉన్న కెదెషు దాని పచ్చిక మైదానాలూ, హమ్మోనూ దాని పచ్చిక మైదానాలూ, కిర్యతాయిమూ దాని పచ్చిక మైదానాలూ ఇచ్చారు.
\p
\s5
\v 77 ఇంకా మిగిలిన లేవీయుల్లో మెరారీ వారసులకు జెబూలూను గోత్రం నుండి రిమ్మోను దాని పచ్చిక మైదానాలూ, తాబోరూ దాని పచ్చిక మైదానాలూ ఇచ్చారు.
\v 78 ఇంకా వారికి యెరికోకి అవతల వైపు యొర్దానుకి తూర్పుగా ఉండే రూబేను గోత్ర ప్రదేశాల నుండి అరణ్యంలోని బేసెరు దాని పచ్చిక మైదానాలూ, యహజా దాని పచ్చిక మైదానాలూ,
\v 79 కెదేమోతూ దాని పచ్చిక మైదానాలూ, మేఫాతూ దాని పచ్చిక మైదానాలూ ఇచ్చారు.
\s5
\v 80 అలాగే గాదు గోత్ర ప్రదేశాల నుండి గిలాదులోని రామోతూ దాని పచ్చిక మైదానాలూ, మహనయీము దాని పచ్చిక మైదానాలూ,
\v 81 హెష్బోనూ దాని పచ్చిక మైదానాలూ, యాజెరూ దాని పచ్చిక మైదానాలూ ఇచ్చారు.
\s5
\c 7
\s ఇశ్శాఖారు వంశం
\p
\v 1 ఇశ్శాఖారుకి నలుగురు కొడుకులున్నారు. వాళ్ళు, తోలా, పువ్వా, యాషూబూ, షిమ్రోనూ అనేవాళ్ళు.
\v 2 తోలాకి ఉజ్జీ, రెఫాయా, యెరీయేలూ, యహ్మయీ, యిబ్శామూ, షెమూయేలూ పుట్టారు. తోలా కొడుకులైన వీళ్ళు తమ పూర్వీకుల కుటుంబాలకు పెద్దలు. వీళ్ళు బలిష్టులు. ధైర్యవంతులు. దావీదు పరిపాలించిన కాలంలో వీళ్ళ సంఖ్య ఇరవై రెండు వేల ఆరు వందలు.
\v 3 ఉజ్జీ కొడుకుల్లో ఒకడి పేరు ఇజ్రహయా. ఇజ్రహయా కొడుకుల పేర్లు, మిఖాయేలు ఓబద్యా, యోవేలూ, ఇష్షీయా అనేవాళ్ళు. వీళ్ళు ఐదు గురూ తమ తెగల నాయకులు.
\p
\s5
\v 4 వాళ్ళకి అనేకమంది భార్యలూ, పిల్లలూ ఉన్నారు. అందుచేత వాళ్ళ వంశావళి లెక్కల ప్రకారం వాళ్ళ వంశాల నుండి సైన్యంలో ముప్ఫై ఆరు వేల మంది ఉన్నారు.
\v 5 ఇశ్శాఖారు వంశాల్లో వాళ్ళ బంధువుల నుండి తమ వంశావళి లెక్కల ప్రకారం యుద్ధం చేయగలిగిన వాళ్ళు ఎనభై ఏడువేలమంది ఉన్నారు.
\s బెన్యామీను వంశం
\p
\s5
\v 6 బెన్యామీనుకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. వాళ్ళు బెలా, బేకరు, యెదీయవేలూ అనేవాళ్ళు.
\v 7 బెలకు ఐదుగురు కొడుకులున్నారు. వాళ్ళు, ఎస్బోనూ, ఉజ్జీ, ఉజ్జీయేలూ, యెరీమోతూ, ఈరీ అనేవాళ్ళు. వీళ్ళు తమ పూర్వీకుల కుటుంబాలకు నాయకులు. వాళ్ళ వంశావళి లెక్కల ప్రకారం వీళ్ళలో ఇరవై రెండు వేల ముప్ఫై నల్గురు యుద్ధం చేసే వాళ్ళున్నారు.
\p
\s5
\v 8 బేకరు కొడుకులు జెమీరా, యోవాషు, ఎలీయెజెరు, ఎల్యోయేనై, ఒమ్రీ, యెరీమోతు, అబీయా, అనాతోతు, ఆలెమెతు అనేవాళ్ళు. వీళ్ళంతా బేకరు కొడుకులు.
\v 9 తమ వంశావళి లెక్కల ప్రకారం వీళ్ళలో ఇరవై వేల రెండు వందలమంది కుటుంబ నాయకులున్నారు. వీళ్ళంతా శూరులు.
\v 10 యెదీయవేలు కొడుకుల్లో ఒకడు బిల్హాను. బిల్హాను కొడుకులు యూషు, బెన్యామీను, ఏహూదు, కెనయనా, జేతాను, తర్షీషు, అహీషహరు.
\p
\s5
\v 11 యెదీయవేలు కొడుకులైన వీళ్ళంతా తమ పూర్వీకుల కుటుంబాలకు నాయకులు. వీళ్ళలో యుద్ధానికి వెళ్ళగలిగిన శూరులు పదిహేను వేల రెండు వందలమంది ఉన్నారు.
\v 12 ఈరుకి షుప్పీము, హుప్పీము అనే ఇద్దరు కొడుకులున్నారు. అహేరు కొడుకుల్లో హుషీము ఉన్నాడు.
\s నఫ్తాలీ వంశం
\p
\s5
\v 13 బిల్హా కొడుకు నఫ్తాలీ. నఫ్తాలీ కొడుకులు యహజియేలు, గూనీ, యేసెరు, షిల్లేము అనేవాళ్ళు.
\p
\s5
\v 14 మనష్షే కొడుకుల్లో అశ్రీయేలు అనే వాడున్నాడు. వాడు అతని ఉంపుడుగత్తె వల్ల పుట్టాడు. ఈ ఉంపుడుగత్తె ఒక అరామీయురాలు. ఈమే గిలాదుకి నాయకుడైన మాకీరుకి కూడా జన్మనిచ్చింది.
\v 15 మాకీరు హుప్పీము, షుప్పీముల సోదరిని పెళ్ళి చేసుకున్నాడు. ఆమె సోదరి పేరు మయకా. మనష్షే రెండో కొడుకు పేరు సెలోపెహాదు. ఈ సెలోపెహాదుకి కూతుళ్ళు మాత్రమే పుట్టారు.
\v 16 మాకీరు భార్య మయకాకి ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు పెరెషు. ఇతని సోదరుడి పేరు షెరెషు. షెరెషు కొడుకులు ఊలాము, రాకెము.
\p
\s5
\v 17 ఊలాము కొడుకు బెదాను. వీరంతా మనష్షే కొడుకు మాకీరుకి పుట్టిన గిలాదు సంతానం.
\v 18 మాకీరు సోదరి అయిన హమ్మోలెకెతు. ఈ మెకు ఇషోదు, అబీయెజెరు, మహలాలు పుట్టారు.
\v 19 షెమీదా కొడుకులు అహెయాను, షెకెము, లికీ, అనీయాము.
\s ఎఫ్రాయిము వంశం
\p
\s5
\v 20 ఎఫ్రాయిము సంతానం వివరాలు ఇవి. ఎఫ్రాయిము కొడుకు షూతలహు. షూతలహు కొడుకు బెరెదు. బెరెదు కొడుకు తాహతు. తాహతు కొడుకు ఎలాదా. ఎలాదా కొడుకు తాహతు.
\v 21 తాహతు కొడుకు జాబాదు. ఇతనికి షూతలహూ, ఏజెరూ, ఎల్యాదూ అనేవాళ్ళు పుట్టారు. వాళ్ళు అక్కడ స్థానికులైన గాతు ప్రజల పశువులను దొంగతనం చేయడానికి వెళ్ళారు. దాంతో గాతు ప్రజలు వాళ్ళను పట్టుకుని చంపివేశారు.
\v 22 వాళ్ళ తండ్రియైన ఎఫ్రాయిము చాలా రోజులు దుఃఖించాడు. అప్పుడు అతని సోదరులు వచ్చి అతణ్ణి పరామర్శించారు.
\p
\s5
\v 23 తరువాత అతడు తన భార్యను కూడగా ఆమె గర్భం ధరించి ఒక కొడుక్కి జన్మనిచ్చింది. తన ఇంట్లో కలిగిన విషాదాన్నిబట్టి ఎఫ్రాయిము తన కొడుక్కి బెరీయా అనే పేరు పెట్టాడు.
\v 24 అతని కుమార్తె పేరు షెయెరా. ఈమె ఉత్తర బేత్‌ హోరోను, దక్షిణ బేత్‌ హోరోను, ఉజ్జెన్‌ షెయెరా పట్టణాలను నిర్మించింది.
\s5
\v 25 వాని కొడుకులు రెపహూ, రెషెపులు. రెపహు కొడుకు తెలహు, తెలహు కొడుకు తహను,
\v 26 తహను కొడుకు లద్దాను, లద్దాను కొడుకు అమీహూదు, అమీహూదు కొడుకు ఎలీషామా,
\v 27 ఎలీషామా కొడుకు నూను, నూను కొడుకు యెహోషువ.
\p
\s5
\v 28 వాళ్ళు స్వాస్థ్యంగా పొందిన వారి నివాస స్థలాలు ఏవంటే, బేతేలూ దాని చుట్టూ ఉన్న గ్రామాలు. ఇంకా తూర్పువైపు ఉన్న నహరానూ, పడమటి వైపు ఉన్న గెజెరు, దాని చుట్టూ ఉన్న గ్రామాలు, షెకెము, దాని చుట్టూ ఉన్న గ్రామాలు, గాజా, దాని చుట్టూ ఉన్న గ్రామాల వరకూ వారి నివాస స్థలాలు వ్యాపించాయి.
\v 29 అలాగే మనష్షీయుల సరిహద్దు ప్రాంతాల్లోని బేత్షెయాను, దాని గ్రామాలు, తానాకు, దాని గ్రామాలు, మెగిద్దో, దాని గ్రామాలు, దోరు, దాని గ్రామాలు వాళ్ళకున్నాయి. ఇశ్రాయేలు కొడుకైన యోసేపు వారసులు ఈ ఊళ్ళలోనే నివాసమున్నారు.
\s ఆషేరు వంశం
\p
\s5
\v 30 ఆషేరు కొడుకులు ఎవరంటే ఇమ్నా, ఇష్వా, ఇష్వీ, బెరీయా అనేవాళ్ళు. వీళ్ళ సోదరి పేరు శెరహు.
\v 31 బెరీయా కొడుకులు హెబెరూ, మల్కీయేలూ. మల్కీయేలు కొడుకు బిర్జాయీతు.
\v 32 హెబెరు కొడుకులు యప్లేటు, షోమేరూ, హోతాములు. వీళ్ళ సోదరి పేరు షూయా.
\p
\s5
\v 33 యప్లేటు కొడుకులు ఎవరంటే పాసకు, బింహాలు, అష్వాతు. వీళ్ళు యప్లేటు కొడుకులు.
\v 34 అతని సోదరుడైన షోమేరుకు అహీ, రోగా, యెహుబ్బా, అరాము అనే కొడుకులున్నారు.
\v 35 అతని సోదరుడైన హేలెముకు జోపహు, ఇమ్నా, షెలెశు, ఆమాలు అనే కొడుకులున్నారు.
\p
\s5
\v 36 జోపహు కొడుకులు సూయా, హర్నెపెరు, షూయాలు, బేరీ, ఇమ్రా,
\v 37 బేసెరు, హోదు, షమ్మా, షిల్షా, ఇత్రాను, బెయేరు అనేవాళ్ళు.
\v 38 ఎతెరు కొడుకులు యెఫున్నె, పిస్పా, అరా.
\p
\s5
\v 39 ఉల్లా కొడుకులు ఆరహు, హన్నియేలు, రిజెయాలు.
\v 40 వీళ్ళంతా ఆషేరు సంతానం. వీళ్ళు తమ పూర్వీకుల కుటుంబాలకు నాయకులుగా ఉన్నారు. వీళ్ళు ప్రఖ్యాతి చెందిన శూరులుగానూ, నాయకుల్లో ప్రముఖులుగానూ ఉన్నారు. ఈ వంశానికి చెందిన వాళ్ళలో ఇరవై ఆరు వేలమంది యుద్ధానికి వెళ్లదగిన వాళ్ళున్నారు.
\s5
\c 8
\s బెన్యామీను వంశం
\r 8:28-38; 1 దిన 9:34-44
\p
\v 1 బెన్యామీను కొడుకుల్లో పెద్దవాడు బెల, రెండో వాడు అష్బేలు,
\v 2 మూడో వాడు అహరహు, నాల్గో వాడు నోహా, అయిదో వాడు రాపా.
\p
\v 3 వీళ్ళలో బెలకు అద్దారు, గెరా, అబీహూదు,
\v 4 అబీషూవ, నయమాను, అహోయహు,
\v 5 గెరా, షెపూపాను, హూరాము పుట్టారు.
\p
\s5
\v 6 ఏహూదుకు పుట్టిన వాళ్ళు గెబలో నివాసమున్న వివిధ తెగలకు నాయకులుగా ఉన్నారు. వీళ్ళు బలవంతంగా మనహతుకు తరలి వెళ్ళాల్సి వచ్చింది.
\v 7 ఏహూదు కొడుకులు నయమాను, అహీయా, గెరా. చివరివాడు గెరా మహానతుకు తరలి వెళ్తున్న వాళ్లకు నాయకత్వం వహించాడు. ఇతను ఉజ్జా, ఆహిహుదులకు తండ్రి.
\p
\s5
\v 8 షహరయీము మోయాబు దేశంలో తన భార్యలు హుషీము, బయరా అనే వాళ్ళని వదిలి వేసిన తరువాత అతనికి పిల్లలు కలిగారు.
\v 9 అతని మరో భార్య అయిన హోదెషు ద్వారా అతనికి యోబాబు, జిబ్యా, మేషా, మల్కాము,
\v 10 యెపూజు, షాక్యా, మిర్మాలు పుట్టారు. వీళ్ళు అతని కొడుకులు. వీళ్ళు తమ తెగలకు నాయకులుగా ఉన్నారు.
\v 11 హుషీము అనే తన భార్య ద్వారా అతనికి అప్పటికే అహీటూబు, ఎల్పయలు అనే కొడుకులు ఉన్నారు.
\s5
\v 12 ఎల్పయలు కొడుకులు ఏబెరు, మిషాము, షెమెదు. షెమెదు ఓనోనూ, లోదునూ వాటితో పాటు వాటి చుట్టూ ఉన్న గ్రామాలనూ కట్టించాడు.
\v 13 ఇంకా బెరీయా, షెమా అయ్యాలోనులో నివసించారు. వీళ్ళు తమ వంశ నాయకులు. వీళ్ళు గాతు నివాసులను అక్క డి నుంచి వెళ్ళగొట్టారు.
\p
\s5
\v 14 బెరీయా కొడుకులు అహ్యో, షాషకు, యెరేమోతు,
\p
\v 15 జెబద్యా, అరాదు, ఏదెరు,
\p
\v 16 మిఖాయేలు, ఇష్పా, యోహా.
\p
\v 17 ఎల్పయలు కొడుకులు జెబద్యా, మెషుల్లాము, హిజికీ, హెబెరు,
\p
\v 18 ఇష్మెరై, ఇజ్లీయా, యోబాబు.
\p
\s5
\v 19 షిమీ కొడుకులు యాకీము, జిఖ్రీ, జబ్ది,
\p
\v 20 ఎలీయేనై, జిల్లెతై, ఎలీయేలు,
\p
\v 21 అదాయా, బెరాయా, షిమ్రాతు.
\p
\s5
\v 22 షాషకు కొడుకులు ఇష్పాను, ఏబెరు, ఎలీయేలు,
\p
\v 23 అబ్దోను, జిఖ్రీ, హానాను,
\p
\v 24 హనన్యా, ఏలాము, అంతోతీయా,
\p
\v 25 ఇపెదయా, పెనూయేలు.
\p
\s5
\v 26 ఇక యెరోహాము కొడుకులు షంషెరై, షెహర్యా, అతల్యా,
\p
\v 27 యహరెష్యా, ఏలీయ్యా, జిఖ్రీ.
\p
\v 28 వీళ్ళంతా తమ తమ వంశాలకు నాయకులు. వీళ్ళు యెరూషలేములో నివసిస్తూ ప్రముఖులయ్యారు.
\p
\s5
\v 29 గిబియోనుకి తండ్రి అయిన యహియేలు గిబియోనులో నివసించాడు. ఇతని భార్య పేరు మయకా.
\v 30 ఇతని పెద్దకొడుకు పేరు అబ్దోను. మిగిలిన కొడుకులు సూరు, కీషు, బయలు, నాదాబు,
\v 31 గెదోరు, అహ్యో, జెకెరు.
\p
\s5
\v 32 మిక్లోతుకు షిమ్యాను పుట్టాడు. వీళ్ళు కూడా యెరూషలేములో తమ బంధువులకు సమీపంగా నివసించారు.
\p
\v 33 నేరుకి కీషు పుట్టాడు.
\p కీషుకి సౌలు పుట్టాడు.
\p సౌలుకు యోనాతాను, మల్కీషూవ, అబీనాదాబు, ఎష్బయలు పుట్టారు.
\p
\v 34 యోనాతాను కొడుకు మెరీబ్బయలు. మెరీబ్బయలుకు మీకా పుట్టాడు.
\p
\s5
\v 35 మీకా కొడుకులు పీతోను, మెలెకు, తరేయా, ఆహాజు అనే వాళ్ళు.
\p
\v 36 ఆహాజుకు యెహోయాదా పుట్టాడు.
\p యెహోయాదా కొడుకులు ఆలెమెతు, అజ్మావెతు, జిమ్రీ.
\p జిమ్రీకి మోజా పుట్టాడు.
\p
\v 37 మోజాకి బిన్యా పుట్టాడు. బిన్యా కొడుకు రాపా. రాపా కొడుకు ఎలాశా. ఎలాశా కొడుకు ఆజేలు.
\p
\s5
\v 38 ఆజేలుకి ఆరుగురు కొడుకులు. వాళ్ళ పేర్లు అజ్రీకాము, బోకెరు, ఇష్మాయేలు, షెయర్యా, ఓబద్యా, హానాను. వీళ్ళంతా ఆజేలు కొడుకులు.
\p
\v 39 ఆజేలు సోదరుడు ఏషెకు. ఇతనికి ముగ్గురు కొడుకులున్నారు. వీళ్ళలో ఊలాము పెద్దవాడు. రెండోవాడు యెహూషు. మూడోవాడు ఎలీపేలెటు.
\p
\v 40 ఊలాము కొడుకులు విలువిద్యలో ప్రావీణ్యం పొందిన శూరులు. వీళ్ళకు నూట యాభై మంది కొడుకులూ, మనవళ్ళూ ఉన్నారు.
\p వీళ్ళంతా బెన్యామీను గోత్రం వాళ్ళు.
\s5
\c 9
\s యెరూషలేములో నివాసం ఉంటున్న ప్రజలు
\r 9:1-17; నెహెమ్యా 11:3-19
\p
\v 1 ఈ విధంగా ఇశ్రాయేలీయులందరి పేర్లూ తమ వంశాల ప్రకారం ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో నమోదయ్యాయి. యూదావాళ్ళు చేసిన పాపం కారణంగా వాళ్ళు బబులోనుకి బందీలుగా కునిపోబడ్డారు.
\v 2 తరువాత మొదటగా కొందరు ఇశ్రాయేలీయులూ, యాజకులూ, లేవీయులూ, దేవాలయ సేవకులూ తమ సొంత పట్టణాల్లో తిరిగి నివాసం ఏర్పరచుకున్నారు.
\v 3 అలాగే కొందరు యూదావాళ్ళూ, బెన్యామీనీయులూ, ఎఫ్రాయిము, మనష్షే గోత్రాలకు చెందిన వాళ్ళూ యెరూషలేములో నివాసమున్నారు.
\p
\s5
\v 4 ఈ విధంగా నివాసం ఏర్పరచుకున్న వాళ్ళలో ఊతైయూ ఉన్నాడు.
\p ఊతైయూ అమీహూదు కొడుకు.
\p అమీహూదు ఒమ్రీ కొడుకు.
\p ఒమ్రీ ఇమ్రీ కొడుకు.
\p ఇమ్రీ బానీ కొడుకు.
\p బానీ పెరెసు వంశం వాడు.
\p పెరెసు యూదా కొడుకు.
\p
\v 5 షిలోనీ వాళ్ళలో పెద్దవాడు ఆశాయా, అతని సంతానమూ,
\v 6 జెరహు సంతతి వాళ్ళలో యెవుయేలు, అతని సోదరులైన ఆరు వందల తొంభై మందీ ఉన్నారు.
\p
\s5
\v 7 ఇంకా బెన్యామీనీయుల్లో సెనూయా కొడుకు హోదవ్యాకి పుట్టిన మెషుల్లాము కొడుకైన సల్లూ,
\p
\v 8 యెరోహాము కొడుకైన ఇబ్నెయా, మిక్రి పుట్టిన ఉజ్జీకి పుట్టిన ఏలా, ఇబ్నీయా కొడుకైన రగూవేలుకి పుట్టిన షెఫట్యా కొడుకైన మెషుల్లామూ ఉన్నారు.
\p
\v 9 వీళ్ళూ వీళ్ళ సోదరులూ కలసి వంశావళి లెక్కల్లో తొమ్మిది వందల యాభై ఆరు మంది అయ్యారు. వీళ్ళంతా తమ తమ వంశాలకు నాయకులుగా ఉన్నారు.
\p
\s5
\v 10 యాజకుల్లో యెదాయా, యెహోయారీబు, యాకీను ఉన్నారు.
\v 11 అలాగే నివాసం ఏర్పరచుకున్న వాళ్ళలో అజర్యా ఉన్నాడు. ఈ అజర్యా హిల్కీయా కొడుకు. హిల్కీయా మెషుల్లాము కొడుకు. మెషుల్లాము సాదోకు కొడుకు. సాదోకు మెరాయోతు కొడుకు. మెరాయోతు దేవుని మందిరంలో అధిపతిగా ఉన్న అహీటూబు కొడుకు.
\p
\s5
\v 12 అలాగే నివాసం ఏర్పరచుకున్న వాళ్ళలో అదాయా ఉన్నాడు. అదాయా యెరోహాము కొడుకు.
\p యెరోహాము పషూరు కొడుకు.
\p పసూరు మల్కీయా కొడుకు.
\p ఇంకా అదీయేలు కొడుకు మశై కూడా ఉన్నాడు.
\p అదీయేలు యహజేరా కొడుకు.
\p యహజేరా మెషుల్లాము కొడుకు.
\p మెషుల్లాము మెషిల్లేమీతు కొడుకు.
\p మెషిల్లేమీతు ఇమ్మెరు కొడుకు.
\p
\v 13 వీరితో పాటు వీరి వంశానికి నాయకులుగా ఉన్న ఒక వెయ్యీ ఏడు వందల అరవై మంది ఉన్నారు. వీళ్ళంతా దేవుని మందిరానికి సంబంధించిన సేవల్లో ఎంతో సమర్ధులు.
\p
\s5
\v 14 ఇక లేవీయుల్లో షెమయా ఉన్నాడు.
\p షెమయా హష్షూబు కొడుకు.
\p హష్షూబు అజ్రీకాము కొడుకు.
\p అజ్రీకాము హషబ్యా కొడుకు.
\p హషబ్యా మెరారి వంశం వాడు.
\p
\v 15 బక్బక్కరూ, హెరెషూ, గాలాలూ, వీరితో పాటు మత్తన్యా ఉన్నాడు.
\p మత్తన్యా మీకా కొడుకు.
\p మీకా జిఖ్రీ కొడుకు.
\p జిఖ్రీ ఆసాపు కొడుకు.
\p
\v 16 ఇంకా ఓబద్యా ఉన్నాడు.
\p ఈ ఓబద్యా షెమయా కొడుకు.
\p షెమయా గాలాలు కొడుకు.
\p గాలాలు యెదూతోను కొడుకు.
\p నెటోపాతీయుల గ్రామాల్లో నివసించిన ఎల్కానా మనుమడూ ఆసా కొడుకూ అయిన బెరెక్యా ఉన్నాడు.
\p
\s5
\v 17 ఇక షల్లూము, అక్కూబు, టల్మోను, అహీమాను, వీళ్ళ బంధువులూ ద్వారపాలకులుగా ఉన్నారు. వీళ్ళకి షల్లూము నాయకుడు.
\v 18 లేవీ గోత్రానికి చెందిన వీళ్ళు తూర్పు వైపు ఉండే రాజ ద్వారానికి కాపలా కాసేవాళ్ళు.
\v 19 కోరహు కొడుకైన ఎబ్యాసాపుకి పుట్టిన కోరే కొడుకైన షల్లూము అతని బంధువులూ, అతని తండ్రి తెగకు చెందిన కోరహీయులూ మందిర సేవలో గుడారానికి కాపలాగా ఉండేవాళ్ళు. వాళ్ళ పూర్వీకులు యెహోవా మందిర ద్వారాలకు కావలి కాస్తూ ఉండేవాళ్ళు.
\p
\s5
\v 20 గతంలో ఎలియాజరు కొడుకైన ఫీనెహాసు వాళ్ళపై అధికారిగా ఉన్నాడు. యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు.
\v 21 మెషెలెమ్యా కొడుకైన జెకర్యా మందిర ప్రవేశ ద్వారానికి కాపలాగా ఉన్నాడు.
\p
\s5
\v 22 ఇలా ద్వారాల దగ్గర కాపలా కాయడానికి ఏర్పాటైన వాళ్ళు మొత్తం రెండువందల పన్నెండు మంది. వీళ్ళ పేర్లు తమ తమ గ్రామాల వరుసలో వంశావళిలో నమోదు అయ్యాయి. వీళ్ళు విశ్వసనీయులూ, ఆధారపడదగ్గ వాళ్ళూ కాబట్టి దావీదూ, దీర్ఘదర్శి అయిన సమూయేలూ వీరిని నియమించారు.
\v 23 వాళ్ళూ వాళ్ళ కొడుకులూ యెహోవా మందిర ద్వారాల దగ్గర, అంటే ప్రత్యక్ష గుడారం ద్వారాల దగ్గర కాపలా కాశారు.
\v 24 ఇలా కాపలా కాసేవారు గుడారం నాలుగు దిక్కుల్లో తూర్పు వైపునా, పడమర వైపునా, ఉత్తరం వైపునా, దక్షిణం వైపునా నిలుచున్నారు.
\p
\s5
\v 25 గ్రామాలనుండి వాళ్ళ బంధువులు వాళ్ళ క్రమంలో ఏడు రోజులకోసారి వాళ్ళ దగ్గరికి వచ్చి సహాయం చేసేవాళ్ళు.
\v 26 అయితే లేవీయులైన నలుగురు ప్రముఖ ద్వారపాలకులు మిగిలిన వాళ్ళపై అజమాయిషీ చేసేవాళ్ళు ఉన్నారు. దేవుని మందిరంలోని గదులనూ, ఖజానాలనూ భద్రపరచే బాధ్యత వాళ్ళదే.
\v 27 వాళ్ళు దేవుని మందిరానికి కావలివారు కాబట్టి రాత్రంతా మేలుకుని కాపలా కాయడం, ఉదయాన్నే మందిరపు ద్వారాలు తెరవడం వాళ్ళ విధి.
\p
\s5
\v 28 వాళ్ళల్లో కొంతమంది మందిరంలో సేవకు ఉపయోగించే సామగ్రిని కనిపెట్టుకుని ఉండాలి. వాటిని బయటకు తీసుకు వెళ్తున్నప్పుడూ, లోపలికి తెస్తున్నప్పుడూ వాళ్ళు వాటిని లెక్కిస్తారు.
\v 29 మిగిలిన సామగ్రినీ, పరిశుద్ధ స్థలం లో పాత్రలనూ జాగ్రత్త పరిచే బాధ్యత మరి కొందరిపై ఉంటుంది. సన్నని పిండి, ద్రాక్షారసం, నూనె, సాంబ్రాణి, ఇతర పరిమళ సామగ్రి వంటి సరుకులను వీళ్ళు జాగ్రత్త చేస్తారు.
\p
\s5
\v 30 యాజకుల కొడుకుల్లో కొందరు సుగంధద్రవ్యాలను, పరిమళ తైలాన్నీ తయారు చేస్తారు.
\v 31 అర్పణల కోసం రొట్టెను తయారుచేసే బాధ్యత లేవీయుడైన మత్తిత్యాది. ఇతను కోరహు సంతతికి చెందిన షల్లూముకి పెద్ద కొడుకు.
\v 32 వాళ్ళ బంధువులైన కహాతీయుల్లో కొందరికి ప్రతి విశ్రాంతి దినాన సన్నిధి రొట్టెలు సిద్ధపరిచే బాధ్యత ఉంది.
\p
\s5
\v 33 గాయకులూ లేవీయుల వంశ నాయకులూ పని లేనప్పుడు మందిరం గదుల్లో నివాసముంటారు. ఎందుకంటే వీళ్ళు రాత్రీ పగలూ తేడా లేకుండా సేవ చేయాలి.
\v 34 వీళ్ళు తమ వంశావళి జాబితా ప్రకారం లేవీ గోత్రంలో నాయకులుగా, పెద్దలుగా ఉన్నవాళ్ళు. వీళ్ళు యెరూషలేములో నివాసమున్నారు.
\s సౌలు కుటుంబం
\r 9:34-44; 1 దిన 8:28-38
\p
\s5
\v 35 గిబియోను తండ్రి యెహీయేలు. ఇతను గిబియోను పట్టణంలో నివాసమున్నాడు. ఇతని భార్య పేరు మయకా.
\p
\v 36 ఇతని పెద్దకొడుకు అబ్దోను. తరువాత సూరు, కీషు, బయలు, నేరు, నాదాబు,
\v 37 గెదోరు, అహ్యో, జెకర్యా, మిక్లోతు అనేవాళ్ళు పుట్టారు.
\p
\s5
\v 38 మిక్లోతుకు షిమ్యాను పుట్టాడు. వీళ్ళు యెరూషలేములో నివాసముండే తమ బంధువులకు సమీపంగా ఉండే ఇళ్లలోనే నివసించారు.
\p
\v 39 నేరుకి కీషు పుట్టాడు. కీషుకి సౌలు పుట్టాడు. సౌలుకి యోనాతాను, మల్కీషూవ, అబీనాదాబు, ఎష్బయలు పుట్టారు.
\p
\v 40 యోనాతాను కొడుకు మెరీబ్బయలు. మెరీబ్బయలుకి మీకా పుట్టాడు.
\p
\s5
\v 41 మీకా కొడుకులు పీతోను, మెలెకు, తరేయా, ఆహాజు అనేవాళ్ళు.
\p
\v 42 ఆహాజుకి యరా పుట్టాడు. యరాకి ఆలెమెతు, అజ్మావెతు, జిమ్రీ పుట్టారు. జిమ్రీకి మోజా పుట్టాడు.
\p
\v 43 మోజాకు బిన్యా పుట్టాడు. బిన్యా కొడుకు రెఫాయా. రెఫాయా కొడుకు ఎలాశా. ఎలాశా కొడుకు ఆజేలు.
\p
\v 44 ఆజేలుకి అజ్రీకాము, బోకెరు, ఇష్మాయేలు, షెయర్యా, ఓబద్యా, హానాను అనే పేర్లున్న ఆరుగురు కొడుకులున్నారు. వీళ్ళు ఆజేలు కొడుకులు.
\s5
\c 10
\s గిల్బోవ పర్వతం మీద సౌలు మరణం
\r 10:1-12; 1 సమూ 31:1-13; 2 సమూ 1:4-12
\p
\v 1 ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేశారు. ఇశ్రాయేలీయులందరూ పారిపోయారు. ఫిలిష్తీయులు వాళ్ళను గిల్బోవ పర్వతం మీద హతమార్చారు.
\v 2 ఫిలిష్తీయులు సౌలునీ అతని కొడుకులనూ వెంటపడి తరిమారు. వాళ్ళు సౌలు కొడుకులు యోనాతానునీ, అబీనాదాబునీ, మల్కీషూవనీ చంపేశారు.
\p
\v 3 సౌలుకి వ్యతిరేకంగా యుద్ధం తీవ్రమైంది. బాణాలు వేసే వాళ్ళు అతణ్ణి చూశారు. అతనిపై గురిపెట్టి బాణాలు వేసారు. సౌలుకు తీవ్ర గాయాలయ్యాడు.
\p
\s5
\v 4 అప్పుడు సౌలు తన ఆయుధాలు మోసేవాడితో <<నీ కత్తితో నన్ను పొడిచెయ్యి. లేకుంటే ఈ సున్నతి లేని వాళ్ళు వచ్చి నన్ను అవమానిస్తారు>> అన్నాడు. వాడు అలా చేయడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే వాడు చాలా భయపడ్డాడు. దాంతో సౌలు తన కత్తి నేలకు ఆనించి దాని మీద పడ్డాడు.
\p
\s5
\v 5 సౌలు చనిపోయాడని ఆయుధాలు మోసేవాడికి అర్థం అయింది. దాంతో వాడు కూడా తన కత్తి పట్టుకుని దానిపైన పడ్డాడు. వాడూ చనిపోయాడు.
\v 6 ఈ విధంగా సౌలూ, అతని ముగ్గురు కొడుకులతో పాటు అతని కుటుంబ సభ్యులందరూ చనిపోయారు.
\s5
\v 7 తమ వాళ్ళు యుద్ధంలో నుండి పారిపోయారనీ, సౌలూ అతని కొడుకులూ చనిపోయారనీ లోయలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు తెలిసింది. అప్పుడు వాళ్ళంతా తమ పట్టణాలు వదిలి పారిపోయారు.
\p
\v 8 తరువాత రోజు చనిపోయిన వారి బట్టలనూ ఇతర వస్తువులనూ దోచుకోడానికి ఫిలిష్తీయులు వచ్చారు. అప్పుడే వాళ్ళు సౌలు, అతని కుమారులూ గిల్బోవ పర్వతంపై చనిపోయి పడి ఉండటం చూశారు.
\s5
\v 9 వాళ్ళు సౌలు కవచాన్నితీసుకున్నారు. అతని తలనూ, ఆయుధాలనూ తీసుకువెళ్ళారు. తమ విగ్రహాల మధ్యా, ప్రజల మధ్యా ఈ వార్తను చాటించడానికి మనుషులను పంపారు.
\v 10 తమ దేవుని గుడిలో అతని ఆయుధాలను ఉంచారు. అతని తలను దాగోను గుడికి వేలాడదీశారు.
\p
\s5
\v 11 ఫిలిష్తీయులు సౌలుకి చేసింది యాబేష్గిలాదు నివాసులకు తెలిసింది.
\v 12 అప్పుడు వాళ్ళలో శూరులైన వాళ్ళంతా అక్కడికి వెళ్ళి సౌలు శరీరాన్నీ, అతని కొడుకుల శరీరాలనూ యాబేషుకి తీసుకు వచ్చారు. వాళ్ళ ఎముకలను యాబేషులోనే ఉన్న సింధూరం చెట్టు కింద పాతిపెట్టారు. ఏడు రోజులు వాళ్ళ కోసం ఉపవాసం ఉన్నారు.
\p
\s5
\v 13 సౌలు యెహోవాకు విరోధంగా ద్రోహం చేసాడు కాబట్టి ఈ విధంగా చనిపోయాడు. అతడు యెహోవా ఆజ్ఞలు పాటించలేదు. ఆత్మలతో సంభాషించే మనిషి దగ్గరికి సలహా కోసం వెళ్ళాడు.
\v 14 మార్గనిర్దేశం కోసం అతడు యెహోవా దగ్గరికి వెళ్ళలేదు. అందుకే యెహోవా అతన్ని చంపి రాజ్యాన్ని యెష్షయి కొడుకైన దావీదు వశం చేశాడు.
\s5
\c 11
\s దావీదు ఇశ్రాయేలు ప్రజలందరికి రాజు
\r 11:1-3; 2 సమూ 5:1-3
\r 11:4-9; 2 సమూ 5:6-10
\p
\v 1 ఇదంతా అయ్యాక ఇశ్రాయేలు ప్రజలందరూ హెబ్రోనులో ఉన్న దావీదు దగ్గరికి వచ్చారు. <<ఇలా చూడు, మేము నీకు రక్తమాంసాల్లాంటి వాళ్ళం. నీ సొంత బంధువులం.
\v 2 ఇటీవల సౌలు మాపై రాజుగా ఉన్నప్పుడు నువ్వు ఇశ్రాయేలు సైన్యాలను నడిపిస్తూ ఉన్నావు. నీ దేవుడైన యెహోవా నీతో <నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు నీవు కాపరిగా ఉంటావు. వారిమీద అధిపతిగా ఉండి పరిపాలన చేస్తావు> అని చెప్పాడు కదా>> అని దావీదుతో అన్నారు.
\p
\v 3 ఇలా ఇశ్రాయేలు ప్రజల పెద్దలంతా హెబ్రోనులో ఉన్న రాజు దగ్గరికి వచ్చారు. అప్పుడు రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిలో వారితో నిబంధన చేశాడు. వారంతా కలసి ఇశ్రాయేలు ప్రజలందరి పై రాజుగా దావీదుకి అభిషేకం చేశారు. ఈ విధంగా సమూయేలు ప్రకటించిన యెహోవా మాట నెరవేరింది.
\s యెరూషలేమును దావీదు ఆక్రమించడం
\r 11:4-9; 2 సమూ 5:6-10
\p
\s5
\v 4 ఆ తరువాత దావీదూ, ఇశ్రాయేలు ప్రజలంతా యెరూషలేము అనే పేరున్న యెబూసుకి వెళ్ళారు. అప్పటికి ఆ దేశంలో స్థానికులైన యెబూసీయులు నివసిస్తున్నారు.
\v 5 యెబూసులో నివసించే స్థానికులు దావీదుతో <<నువ్వు ఇక్కడికి రాలేవు>> అన్నారు. కాని దావీదు అక్కడి సీయోను కోటని ఆక్రమించాడు. ఈ సీయోనునే <<దావీదు పట్టణం>> అంటారు.
\p
\v 6 దానికి ముందు దావీదు <<ఎవరు మొదట యెబూసీయులపై దాడి చేస్తాడో అతడే సైన్యాధిపతి అవుతాడు>> అని ప్రకటించాడు. దాంతో సెరూయా కొడుకైన యోవాబు అందరి కన్నా ముందుగా వారిపై దాడి చేశాడు. కాబట్టి యోవాబునే సైన్యాధిపతిగా నియమించారు.
\p
\s5
\v 7 తరువాత దావీదు ఆ కోటలోనే నివసించాడు. కాబట్టి దానికి <<దావీదు పట్టణం>> అనే పేరు కలిగింది.
\v 8 దావీదు ఆ పట్టణాన్ని పునర్నిర్మించాడు. మిల్లో నుండి ప్రాకారం వరకూ పటిష్ట పరిచాడు. పట్టణంలో మిగిలిన ప్రాంతాలను యోవాబు పటిష్టపరిచాడు.
\v 9 దావీదు అంతకంతకూ ఘనత పొందుతూ ఉన్నాడు. ఎందుకంటే సైన్యాలకు అధిపతి అయిన యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు.
\s దావీదు శూరులు
\r 11:10-41; 2 సమూ 23:8-39
\p
\s5
\v 10 ఇశ్రాయేలు ప్రజల విషయంలో యెహోవా మాటకు లోబడి ఇశ్రాయేలు ప్రజలందరితో కలసి దావీదుని రాజుగా చేసినవాళ్ళూ, దావీదుతో కూడా శూరులుగా, బలవంతులుగా నిలిచిన వాళ్ళూ, నాయకులుగా ఉన్నవాళ్ళూ వీళ్ళే.
\v 11 దావీదు దగ్గర శ్రేష్ఠులుగా ఉన్న ఆ శూరుల జాబితాలో ముప్ఫై మంది ఉన్నారు. వారిలో ప్రముఖుడు ఒక హక్మోనీ వాడి కొడుకైన యాషాబాము. ఇతను ఒక యుద్ధంలో కేవలం తన ఈటెతో మూడు వందల మందిని చంపాడు.
\p
\s5
\v 12 ఇతని తరువాత పేరు అహోహీయుడైన దోదో కొడుకైన ఎలియాజరుది. ఇతడు ముగ్గురు బలవంతులుగా పేరు పొందిన వారిలో ఒకడు.
\v 13 ఇతడు పస్దమ్మీములో ఫిలిష్తీయులతో జరిగిన యుద్ధంలో దావీదుతో కూడా ఉన్నాడు. అక్కడ ఒక బార్లీ చేను ఉంది. మిగిలిన సైన్యం ఫిలిష్తీయులను చూసి పారిపోయారు.
\v 14 అయితే వీళ్ళు ఆ చేని మధ్యలో నిలిచి ఫిలిష్తీయులను అడ్డుకుని వారిని హతమార్చారు. యెహోవా వారిని రక్షించి వాళ్లకు గొప్ప విజయం అనుగ్రహించాడు.
\p
\s5
\v 15 ఆ ముప్ఫై మంది శూరుల్లో ప్రముఖులైన ఈ ముగ్గురూ అదుల్లాము అనే రాతి గుహలో ఉన్న దావీదు దగ్గరికి వచ్చారు. ఫిలిష్తీ సైన్యం రెఫాయీము లోయలో మజిలీ చేశారు.
\v 16 ఆ సమయంలో దావీదు తన స్థావరం అయిన గుహలో ఉండగా ఫిలిష్తీ సైన్యం బేత్లెహేములో మకాం చేశారు.
\v 17 దావీదు బేత్లెహేము నీటి కోసం ఆశ పడ్డాడు. <<బేత్లెహేములోని బావిలో నీళ్ళు నాకెవరు తెస్తారు? ఆ ఊరి ద్వారం దగ్గర ఉన్న బావి నీళ్ళు నా దాహం తీర్చడానికి నాకెవరు తెస్తారు?>> అన్నాడు.
\p
\s5
\v 18 కాబట్టి ఆ ముగ్గురు బలవంతులూ ఫిలిష్తీ సైన్యంలోకి చొరబడ్డారు. వారి మధ్యలో నుండి వెళ్ళి ఆ ఊరి ద్వారం దగ్గర బావిలోని నీళ్ళు తోడుకుని వాటిని దావీదుకు తెచ్చి ఇచ్చారు. కానీ దావీదు ఆ నీళ్ళు తాగేందుకు నిరాకరించాడు. వాటిని యెహోవాకు అర్పణగా పారబోసాడు.
\v 19 తరువాత ఇలా అన్నాడు<<నేను ఈ నీళ్ళు తాగకుండా నా దేవుడు నన్ను కాపాడుతాడు గాక. వీళ్ళు తమ ప్రాణాలకు తెగించి తెచ్చిన ఈ నీళ్ళు వాళ్ళ రక్తం లాంటిది. దాన్నినేను ఎలా తాగగలను?>> అన్నాడు. ఈ ముగ్గురు బలవంతులు ఇలాంటి కార్యాలు చేశారు.
\p
\s5
\v 20 యోవాబు సోదరుడైన అబీషై ముగ్గురికీ నాయకుడు. ఒక యుద్ధంలో ఇతడు మూడు వందల మందిని కేవలం తన ఈటెతో హతమార్చాడు. అలా ఆ ముగ్గురితో పాటు తరచుగా ఇతని పేరు కూడా వినిపించేది.
\v 21 ముగ్గురిలో ఇతనికి ఎక్కువ గౌరవం, కీర్తీ కలిగాయి. అయితే అతనికి కలిగిన కీర్తి పేరు మోసిన ఆ ముగ్గురు సైనికుల కీర్తికి సాటి కాలేదు.
\p
\s5
\v 22 ఇంకా కబ్సెయేలు ఊరివాడు యెహోయాదా కొడుకు బెనాయా ఎంతో బలవంతుడు. తన పరాక్రమ కార్యాల వల్ల ఇతడు ఎంతో ప్రసిద్ధికెక్కాడు. ఇతడు మోయాబు వాడు అరీయేలు కొడుకులిద్దర్నీ చంపాడు. ఇంకా ఇతడు మంచు పడే కాలంలో ఒక బిలంలోకి దిగి అక్కడ ఒక సింహాన్ని చంపివేశాడు.
\v 23 ఒకసారి ఇతను ఏడున్నర అడుగుల ఎత్తున్న ఒక ఐగుప్తీయున్నిచంపాడు. ఆ ఐగుప్తీయుడి చేతిలో సాలెవాడి దండె అంత పెద్ద ఈటె ఉంది. బెనాయా వాడి మీదికి ఒక కర్ర పట్టుకుని వెళ్ళాడు. ఆ ఈటెను ఐగుప్తీయుడి చేతిలోనుండి లాక్కుని దానితోనే వాణ్ణి చంపివేశాడు.
\p
\s5
\v 24 ఇలాంటి ఘన కార్యాలు చేసిన యెహోయాదా కొడుకైన బెనాయా పేరు ఆ ముగ్గురు బలవంతుల పేర్లలో చేర్చారు.
\v 25 ముప్ఫై మంది సైనికుల్లో అతణ్ణి గొప్పవాడిగా ఎంచారు, కానీ పేరు మోసిన ఆ ముగ్గురు వీరులకు సాటి కాలేదు. కానీ దావీదు ఇతణ్ణి అంగ రక్షకులపై అధిపతిగా నియమించాడు.
\p
\s5
\v 26 ఆ యోధులు ఎవరంటే యోవాబు తమ్ముడు అశాహేలు, బేత్లెహేము ఊరివాడు దోదో కొడుకైన ఎల్హానాను,
\v 27 హరోరీయుడైన షమ్మోతు, పెలోనీయుడైన హేలెస్సు,
\v 28 తెకోవీయుడైన ఇక్కేషు కొడుకైన ఈరా, అన్నేతోతీయుడైన అబీయెజెరు,
\v 29 హుషాతీయుడైన సిబ్బెకై, అహోహీయుడైన ఈలై,
\p
\s5
\v 30 నెటోపాతీయుడైన మహరై, నెటోపాతీయుడైన బయనా కొడుకు హేలెదు,
\v 31 బెన్యామీను సంతతికి చెందిన గిబియా ఊరివాడు రీబై కొడుకు ఈతయి, పిరాతోనీయుడు బెనాయా,
\v 32 గాయషు లోయకు చెందిన హూరై, అర్బాతీయుడైన అబీయేలు,
\v 33 బహరూమీయుడు అజ్మావెతు, షయల్బోనీయుడైన ఎల్యాహ్బా,
\p
\s5
\v 34 గిజోనీయుడైన హాషేము కొడుకులూ, హరారీయుడైన షాగే కొడుకైన యోనాతాను,
\v 35 హరారీయుడైన శాకారు కొడుకైన అహీయాము, ఊరు కొడుకు ఎలీపాలు,
\v 36 మెకేరాతీయుడైన హెపెరు, పెలోనీయుడైన అహీయా,
\v 37 కర్మెలీయుడైన హెజ్రో, ఎజ్బయి కొడుకైన నయరై,
\p
\s5
\v 38 నాతాను సోదరుడైన యోవేలు, హగ్రీయుడైన మిబ్హారు,
\v 39 అమ్మోనీయుడైన జెలెకు, సెరూయా కొడుకైన యోవాబు ఆయుధాలు మోసేవాడూ బెరోతీయుడూ అయిన నహరై,
\v 40 ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు,
\v 41 హిత్తీయుడైన ఊరియా, అహ్లయి కొడుకైన జాబాదు,
\p
\s5
\v 42 రూబేనీయుడైన షీజా కొడుకూ, రూబేనీయులకు నాయకుడూ అయిన అదీనా, అతని తోటి వారైన ముప్ఫై మందీ,
\v 43 మయకా కొడుకైన హానాను, మిత్నీయుడైన యెహోషాపాతు,
\v 44 ఆష్తెరాతీయుడైన ఉజ్జీయా, అరొయేరీయుడైన హోతాను కొడుకులు షామా యెహీయేలు,
\p
\s5
\v 45 షిమ్రీ కొడుకైన యెదీయవేలు, అతని సోదరుడూ, తిజీయుడూ అయిన యోహా,
\v 46 మహవీయుడైన ఎలీయేలు, ఎల్నయము కొడుకులైన యెరీబై యోషవ్యా, మోయాబు వాడు ఇత్మా,
\v 47 ఎలీయేలు, ఓబేదు, మెజోబాయా ఊరివాడు యహశీయేలు అనే వాళ్ళు.
\s5
\c 12
\s దావీదు సహాయకులు
\p
\v 1 కీషు కొడుకైన సౌలుకు భయపడి దావీదు ఇంకా దాగి ఉన్నప్పుడు, సౌలు బంధువులైన బెన్యామీనీయుల్లో పరాక్రమవంతులు కొంతమంది దావీదుకు యుద్ధంలో సాయం చెయ్యడానికి అతని దగ్గరికి సిక్లగుకు వచ్చారు.
\v 2 వీళ్ళు బాణాలు ధరించి, కుడి ఎడమ చేతులతో, వడిసెలతో రాళ్లు రువ్వడంలో, బాణాలు వేయడంలో సామర్ధ్యం ఉన్నవాళ్ళు.
\p
\s5
\v 3 వాళ్లెవరంటే, గిబియావాడు షెమాయా కొడుకులైన అహీయెజెరు, ఇతడు అధిపతి. ఇతని తరువాతి వాడు యోవాషు, అజ్మావెతు కొడుకులైన యెజీయేలు, పెలెటు, బెరాకా, అనెతోతీయుడైన యెహూ,
\v 4 ముప్ఫైమందిలో పరాక్రమశాలి, ముప్ఫైమందికి పెద్ద ఇష్మయా అనే గిబియోనీయుడు, యిర్మీయా, యహజీయేలు, యోహానాను, గెదేరాతీయుడైన యోజాబాదు,
\p
\s5
\v 5 ఎలూజై, యెరీమోతు, బెయల్యా, షెమర్యా, హరీపీయుడైన షెఫటయా,
\v 6 కోరహీయులు ఎల్కానా, యెష్షీయా, అజరేలు, యోహెజెరు, యాషాబాము,
\v 7 గెదోరు ఊరివాడు యెరోహాము కొడుకులు యోహేలా, జెబద్యా అనేవాళ్ళు.
\p
\s5
\v 8 ఇంకా, గాదీయుల్లో పరాక్రమవంతులు కొంతమంది అరణ్యంలో దాగి ఉన్న దావీదు దగ్గర చేరారు. వీళ్ళు డాలు, ఈటె తో యుద్ధం చేయడంలో ప్రవీణులు. వీళ్ళు సింహం ముఖంలాంటి ముఖం ఉన్నవాళ్ళు. కొండల్లో ఉండే జింకలంత వేగంగా పరుగెత్త గలిగిన వాళ్ళు.
\p
\s5
\v 9 వాళ్లెవరంటే, మొదటివాడు ఏజెరు, రెండోవాడు ఓబద్యా, మూడోవాడు ఏలీయాబు,
\v 10 నాల్గోవాడు మిష్మన్నా, ఐదోవాడు యిర్మీయా,
\v 11 ఆరోవాడు అత్తయి, ఏడోవాడు ఎలీయేలు,
\v 12 ఎనిమిదోవాడు యోహానాను, తొమ్మిదోవాడు ఎల్జాబాదు,
\v 13 పదోవాడు యిర్మీయా, పదకొండోవాడు మక్బన్నయి.
\p
\s5
\v 14 గాదీయులైన వీళ్ళు సైన్యానికి అధిపతులుగా ఉన్నారు. వాళ్ళల్లో అతి అల్పుడైనవాడు, వందమందికి అధిపతి, అత్యధికుడైనవాడు వెయ్యిమందికి అధిపతి,
\v 15 యొర్దాను గట్టుల మీదుగా పొర్లి పారే మొదటి నెలలో, దాన్ని దాటి వెళ్లి తూర్పు లోయల్లో, పడమటి లోయల్లో ఉన్నవాళ్ళందర్నీ తరిమివేసిన వాళ్ళు వీళ్ళే.
\p
\s5
\v 16 ఇంకా బెన్యామీనీయుల్లో కొంతమంది, యూదావాళ్ళల్లో కొంతమంది, దావీదు దాగి ఉన్న స్థలానికి వచ్చారు.
\v 17 దావీదు బయల్దేరి వాళ్లకు ఎదురు వెళ్లి వాళ్లతో <<మీరు సమాధానంతో నాకు సాయం చెయ్యడానికి నా దగ్గరికి వచ్చి ఉంటే, నా హృదయం మీతో కలుస్తుంది. అలా కాకుండా నావల్ల మీకు అపకారమేమీ కలుగలేదని తెలిసినా, నన్ను శత్రువుల చేతికి అప్పగించాలని మీరు వచ్చి ఉంటే, మన పూర్వీకుల దేవుడు దీన్ని చూసి మిమ్మల్ని గద్దించు గాక>> అన్నాడు.
\p
\s5
\v 18 అప్పుడు ముప్ఫైమందికి అధిపతైన అమాశై ఆత్మవశంలో ఉండి <<దావీదూ, మేము నీవాళ్ళం, యెష్షయి కొడుకా, మేము నీ పక్షాన ఉన్నాం. నీకు సమాధానం కలుగుగాక, సమాధానం కలుగుగాక, నీ సహకారులకు కూడా సమాధానం కలుగుగాక, నీ దేవుడే నీకు సహాయం చేస్తున్నాడు>> అని పలికినప్పుడు, దావీదు వాళ్ళను చేర్చుకుని వాళ్ళను తన దండుకు అధిపతులుగా చేశాడు.
\p
\s5
\v 19 మనష్షేవాళ్ళు కూడా కొంతమంది వచ్చి దావీదు పక్షాన చేరారు. దావీదు ఫిలిష్తీయులతో కలిసి సౌలుమీద యుద్ధం చెయ్యడానికి వెళ్ళినప్పుడు, వాళ్ళు వచ్చి దావీదుతో కలిశారు. కాని, వాళ్ళు దావీదుతో కలిసి ఫిలిష్తీయులకు సాయం చెయ్యలేదు. ఎందుకంటే దావీదు తన యజమాని అయిన సౌలు పక్షాన చేరిపోయి, వాళ్లకు ప్రాణహాని చేస్తాడని తమలో తాము చర్చించి, ఫిలిష్తీయుల అధికారులు దావీదును పంపివేశారు.
\p
\v 20 అప్పుడు అతడు సిక్లగుకు తిరిగి వెళ్తూ ఉన్నప్పుడు మనష్షే వారు అద్నా యోజాబాదు, యెదీయవేలు, మిఖాయేలు, యోజాబాదు, ఎలీహు, జిల్లెతై అనే వేలమందిమీద అధిపతులు దావీదు పక్షాన చేరారు.
\p
\s5
\v 21 వాళ్ళందరూ పరాక్రమశాలులూ, సైన్యాధిపతులు. ఆ తిరుగులాడే దండులను హతం చెయ్యడానికి వాళ్ళు దావీదుకు సాయం చేశారు.
\v 22 దావీదు సైన్యం దేవుని సైన్యంలా మహా సైన్యంగా అవుతూ, ప్రతిరోజూ అతనికి సాయం చేసేవాళ్ళు అతని దగ్గరికి వచ్చి చేరుతూ ఉన్నారు.
\s హెబ్రోనులో దావీదును కలుసుకొన్నవారు
\p
\s5
\v 23 యెహోవా నోటి మాట ప్రకారం సౌలు రాజ్యాన్ని దావీదు వైపుకు తిప్పాలన్న ప్రయత్నంలో యుద్ధానికి ఆయుధాలు ధరించి అతని దగ్గరికి హెబ్రోనుకు వచ్చిన అధిపతుల లెక్క ఇలా ఉంది.
\v 24 యూదా వాళ్ళల్లో డాలు, ఈటె పట్టుకుని యుద్ధానికి సిద్ధపడిన వాళ్ళు ఆరువేల ఎనిమిది వందలమంది.
\v 25 షిమ్యోనీయుల్లో యుద్ధానికి తగిన శూరులు ఏడువేల వందమంది.
\p
\s5
\v 26 లేవీయుల్లో అలాంటివాళ్ళు నాలుగువేల ఆరువందలమంది.
\v 27 అహరోను సంతతి వాళ్లకు అధిపతి యెహోయాదా. అతనితోపాటు ఉన్నవాళ్ళు మూడువేల ఏడు వందలమంది.
\v 28 పరాక్రమవంతుడైన సాదోకు అనే యువకునితో పాటు అతని తండ్రి యింటి వాళ్ళైన అధిపతులు ఇరవై ఇద్దరు.
\p
\s5
\v 29 సౌలు సంబంధులైన బెన్యామీనీయులు మూడు వేలమంది. అప్పటి వరకూ వాళ్ళల్లో చాలామంది సౌలు ఇంటిని కాపాడుతూ ఉన్నవాళ్ళు.
\v 30 తమ పూర్వీకుల యింటివాళ్ళల్లో పేరుపొందిన పరాక్రమశాలులు ఎఫ్రాయిమీయుల్లో ఇరవైవేల ఎనిమిదివందల మంది.
\v 31 మనష్షే అర్థ గోత్రం వారిలో దావీదును రాజుగా చెయ్యడానికి వచ్చిన వాళ్ళు పద్దెనిమిది వేల మంది.
\p
\s5
\v 32 ఇశ్శాఖారీయుల్లో సమయోచిత జ్ఞానం ఉండి, ఇశ్రాయేలీయులు ఏం చెయ్యాలో అది తెలిసిన అధిపతులు రెండువందల మంది. వీళ్ళ సంబంధులందరూ వీళ్ళ ఆజ్ఞకు బద్ధులై ఉన్నారు.
\v 33 జెబూలూనీయుల్లో అన్నిరకాల యుద్ధ ఆయుధాలు ధరించి యుద్ధానికి వెళ్ళగలిగిన వాళ్ళు, యుద్ధ నైపుణ్యం కలిగిన వాళ్ళు, దావీదు పట్ల నమ్మకంగా స్వామిభక్తి కలిగి యుద్ధం చెయ్య గలవాళ్ళు యాభై వేల మంది.
\p
\s5
\v 34 నఫ్తాలీయుల్లో వెయ్యిమంది అధిపతులూ, వాళ్లతోపాటు డాలు, ఈటె పట్టుకొన్నవాళ్ళు ముప్ఫై ఏడువేలమంది.
\v 35 దానీయుల్లో యుద్ధానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు ఇరవై ఎనిమిదివేల ఆరువందలమంది.
\p
\s5
\v 36 ఆషేరీయుల్లో యుద్ధ ప్రావీణ్యం కలిగి, యుద్ధానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు నలభై వేలమంది.
\v 37 ఇంకా యొర్దాను నది అవతల ఉండే రూబేనీయుల్లో గాదీయుల్లో మనష్షేవాళ్ళల్లో సగం మంది, అన్ని రకాల ఆయుధాలు ధరించిన యుద్ధశూరులైన ఈ యోధులందరూ హృదయంలో దావీదును ఇశ్రాయేలు మీద రాజుగా నియమించాలన్న కోరిక కలిగి ఉండి ఆయుధాలు ధరించి హెబ్రోనుకు వచ్చారు.
\p
\s5
\v 38 ఇశ్రాయేలులో మిగిలిన వాళ్ళందరూ ఏక మనస్సుతో దావీదును రాజుగా చేసుకోవాలని కోరుకున్నారు.
\v 39 వాళ్ళ సహోదరులు వాళ్ళ కోసం భోజనపదార్ధాలు సిద్ధం చేసినప్పుడు, వాళ్ళు దావీదుతో కలిసి అక్కడ మూడు రోజులుండి అన్నపానాలు పుచ్చుకుంటూ ఉన్నారు.
\p
\v 40 ఇశ్రాయేలీయులకు సంతోషం కలిగింది. ఇశ్శాఖారు, జెబూలూను, నఫ్తాలి పొలిమేరల వరకూ వారి సంబంధులు గాడిదల మీద, ఒంటెల మీద, కంచర గాడిదల మీద, ఎద్దుల మీద ఆహారం, పిండి వంటలు, అంజూర పళ్ళ ముద్దలు, ఎండిన ద్రాక్షపళ్ళ గెలలు, ద్రాక్షామధురసం, నూనె, గొర్రెలు, పశువులు, విస్తారంగా తీసుకొచ్చారు.
\s5
\c 13
\s దేవుని మందసాన్ని ఓబేదెదోము ఇంటికీ తీసుకువెళ్ళడం
\r 13:1-14; 2 సమూ 6:1-11
\p
\v 1 దావీదు వేలమంది మీద అధిపతులుగా ఉన్నవాళ్ళతోను, వందలమంది మీద అధిపతులుగా ఉన్న వాళ్ళతోను, అధిపతులందరితోను ఆలోచన చేసి, సమావేశంగా కూడుకున్న ఇశ్రాయేలీయులందరితో,
\v 2 <<ఈ ఆలోచన మీ దృష్టిలో అనుకూలంగా ఉంటే, ఇది మన దేవుడైన యెహోవా వలన కలిగినదే ఐతే, ఇశ్రాయేలీయుల నివాసప్రదేశాలన్నిట్లో మిగిలి ఉన్న మన సహోదరులు తమ పట్టణాల్లో, పల్లెల్లో కాపురం ఉన్న యాజకులు, లేవీయులు, మనతో కలిసేలా వాళ్ళ దగ్గరికి వార్తాహరులను పంపి,
\v 3 మన దేవుని మందసం మళ్ళీ మన దగ్గరికి తీసుకొద్దాం రండి. సౌలు రోజుల్లో దాని దగ్గర మనం ఆయన చిత్తాన్ని అడగలేదు>> అన్నాడు.
\v 4 ఈ పని సమావేశం అయిన అందరి దృష్టిలో అనుకూలం అయింది గనక ప్రజలందరూ ఆ విధంగా చెయ్యడానికి అంగీకరించారు.
\p
\s5
\v 5 దేవుని మందసాన్ని కిర్యత్యారీము నుంచి తీసుకు రావడానికి దావీదు ఐగుప్తులోని షీహోరు నది మొదలుకుని హమాతు పొలిమేర వరకూ ఉండే ఇశ్రాయేలీయులందరినీ సమావేశపరిచాడు.
\v 6 కెరూబుల మధ్య నివాసం చేసే దేవుడైన యెహోవా పేరు పెట్టిన ఆయన మందసాన్ని యూదాలో ఉండే కిర్యత్యారీము అనే బాలా నుంచి తీసుకు రావడానికి అతనూ, ఇశ్రాయేలీయులందరూ అక్కడికి వెళ్ళారు.
\p
\s5
\v 7 వాళ్ళు దేవుని మందసాన్ని ఒక కొత్త బండి మీద ఎక్కించి, అబీనాదాబు ఇంటి నుంచి తీసుకువచ్చారు. ఉజ్జా, అహ్యో అనే వారు బండిని తోలారు.
\v 8 దావీదూ, ఇశ్రాయేలీయులందరూ తమ పూర్ణశక్తితో దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ, తీగ వాయిద్యాలు, తంబురాలు, కంచు తాళాలను వాయిస్తూ బాకాలు ఊదుతూ ఉన్నారు.
\p
\s5
\v 9 వాళ్ళు కీదోను కళ్ళం దగ్గరికి వచ్చినప్పుడు పశువులకు కాలు జారినందువల్ల మందసాన్ని పట్టుకోవాలని ఉజ్జా చెయ్యి చాపినప్పుడు
\v 10 యెహోవా కోపం అతని మీద రగిలింది. అతడు తన చెయ్యి మందసం దగ్గరికి చాపినప్పుడు ఆయన అతన్ని దెబ్బ కొట్టాడు. అతడు అక్కడే దేవుని సన్నిధిలో చనిపోయాడు.
\v 11 యెహోవా ఉజ్జాను హతం చెయ్యడం చూసి దావీదుకు కోపం వచ్చింది. ఆ కారణంగా ఆ స్థలానికి ఈ రోజు వరకూ పెరెజ్‌ ఉజ్జా అని పేరు.
\p
\s5
\v 12 ఆ రోజున దావీదు దేవుని విషయంలో భయపడి <<దేవుని మందసాన్ని నా దగ్గరికి నేను ఎలా తీసుకు పోతాను?>> అన్నాడు.
\v 13 కాబట్టి దావీదు, మందసాన్ని దావీదు పట్టణానికి తీసుకుపోకుండా గిత్తీయుడైన ఓబేదెదోము ఇంట్లోకి దాన్ని తీసుకువెళ్ళాడు.
\v 14 దేవుని మందసం ఓబేదెదోము ఇంట్లో అతని కుటుంబంతో మూడు నెలలు ఉంది. యెహోవా ఓబేదెదోము ఇంటివాళ్ళను, అతని ఆస్తి అంతటినీ ఆశీర్వదించాడు.
\s5
\c 14
\s యెరూషలేములో దావీదు
\r 14:1-7; 2 సమూ 5:11-16; 1 దిన 3:5-8
\p
\v 1 తూరు రాజు హీరాము దావీదు దగ్గరికి మనుషులను పంపాడు. దేవదారు మానులను, వడ్రంగి వాళ్ళను, తాపీ పనివారిని పంపాడు. వారు అతనికి ఒక ఇల్లు కట్టారు.
\v 2 తన ప్రజలైన ఇశ్రాయేలీయుల కోసం యెహోవా అతని రాజ్యాన్ని ఉన్నత స్థితికి తెచ్చాడనీ, ఆయన తనను ఇశ్రాయేలీయుల మీద రాజుగా స్థిరపరిచాడనీ దావీదు గ్రహించాడు.
\p
\s5
\v 3 తరువాత, యెరూషలేములో దావీదు మరి కొంతమంది స్త్రీలను పెళ్లి చేసుకుని ఇంకా కొడుకులనూ కూతుళ్ళనూ కన్నాడు.
\v 4 యెరూషలేములో అతనికి పుట్టిన కొడుకుల పేర్లు, షమ్మూయ, షోబాబు, నాతాను, సొలొమోను,
\v 5 ఇభారు, ఏలీషూవ, ఎల్పాలెటు,
\v 6 నోగహు, నెపెగు, యాఫీయ,
\v 7 ఎలీషామా, బెయెల్యెదా, ఎలీపేలెటు.
\s దావీదు ఫిలిష్తీయులను ఓడించడం
\r 14:8-17; 2 సమూ 5:17-25
\p
\s5
\v 8 దావీదుకు ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా అభిషేకం అయ్యిందని విని, ఫిలిష్తీయులందరూ దావీదును వెతికి పట్టుకోడానికి బయలుదేరారు. దావీదు ఆ సంగతి విని, వాళ్ళని ఎదుర్కోడానికి వెళ్ళాడు.
\v 9 ఫిలిష్తీయులు వచ్చి రెఫాయీముల లోయలో ఉన్న ప్రజల మీద దాడి చేశారు.
\p
\s5
\v 10 <<ఫిలిష్తీయుల మీద నేను దాడి చేస్తే నువ్వు వాళ్ళ మీద నాకు జయం ఇస్తావా?>> అని దావీదు దేవుణ్ణి అడిగాడు. యెహోవా <<వెళ్ళు, నేను వాళ్ళను నీకు అప్పగిస్తాను>> అన్నాడు.
\v 11 వాళ్ళు బయల్పెరాజీముకు వచ్చినప్పుడు దావీదు అక్కడ వాళ్ళను హతం చేసి <<ఉధృతమైన వరద ప్రవాహపు తాకిడిలా దేవుడు నాచేత నా శత్రువులను నాశనం చేయించాడు>> అన్నాడు. దాన్నిబట్టి ఆ స్థలానికి బయల్పెరాజీము అనే పేరు వచ్చింది.
\v 12 ఫిలిష్తీయులు తమ దేవుళ్ళను అక్కడే విడిచి పారిపోయారు. వాటన్నిటినీ తగలబెట్టమని దావీదు ఆజ్ఞ ఇచ్చాడు.
\p
\s5
\v 13 ఫిలిష్తీయులు మరొకసారి ఆ లోయ మీదికి దాడి చేశారు.
\v 14 దావీదు మళ్ళీ దేవుని దగ్గర మనవి చేశాడు. అందుకు దేవుడు <<నువ్వు ముందు నుంచి కాకుండా, వెనుక నుంచి వాళ్ళ చుట్టూ తిరిగి వెళ్లి, కంబళిచెట్లకు ఎదురుగా ఉండు.
\p
\s5
\v 15 కంబళి చెట్ల చిటారు కొమ్మల్లో కాళ్ళ చప్పుడు నీకు వినిపించగానే బయలుదేరి వాళ్ళ మీద దాడి చెయ్యి. ఆ చప్పుడు వినిపించినప్పుడు ఫిలిష్తీయుల సేనను హతం చెయ్యడానికి దేవుడు నీకు ముందుగా బయలుదేరి వెళ్ళాడని తెలుసుకో>> అని చెప్పాడు.
\v 16 దేవుడు తనకు చెప్పినట్టే దావీదు చేశాడు. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల సైన్యాన్ని గిబియోను మొదలుకుని గెజెరు వరకూ తరిమి హతం చేశారు.
\v 17 కాబట్టి దావీదు కీర్తి ఇశ్రాయేలీయుల ప్రాంతాలన్నిట్లో ప్రసిద్ధి అయింది. యెహోవా అన్యజనులందరికీ అతడంటే భయం కలిగించాడు.
\s5
\c 15
\s మందసాన్ని యెరూషలేముకు తిరిగి తీసుకురావడం
\r 15:25—16:3; 2 సమూ 6:12-19
\p
\v 1 దావీదు తన కోసం దావీదు పట్టణంలో ఇళ్ళు కట్టించుకున్నాడు. దేవుని మందసం కోసం ఒక స్థలాన్ని సిద్ధపరచి, అక్కడ ఒక గుడారం వేయించాడు.
\v 2 అప్పుడు దావీదు <<మందసాన్ని మోయడానికీ నిత్యం ఆయనకు సేవ చెయ్యడానికీ యెహోవా లేవీయులను ఏర్పరచుకున్నాడు, వాళ్ళు తప్ప ఇంక ఎవ్వరూ దేవుని మందసాన్ని మోయకూడదు>> అని ఆజ్ఞాపించాడు.
\v 3 అప్పుడు దావీదు తాను యెహోవా మందసం కోసం సిద్ధం చేసిన స్థలానికి దాన్ని తీసుకురావడానికి ఇశ్రాయేలీయులందరినీ యెరూషలేములో సమావేశపరిచాడు.
\p
\s5
\v 4 అహరోను సంతతి వారిని, లేవీయులను,
\p
\v 5 కహాతు సంతతిలో నుండి వారి నాయకుడైన ఊరీయేలును, అతని బంధువుల్లో నూట ఇరవైమందిని,
\p
\v 6 మెరారీయుల్లో వారి నాయకుడైన అశాయాను, అతని బంధువుల్లో రెండువందల ఇరవై మందిని,
\p
\s5
\v 7 గెర్షోను సంతతిలో వారి నాయకుడైన యోవేలును, అతని బంధువుల్లో నూట ముప్ఫై మందిని,
\p
\v 8 ఎలీషాపాను సంతతిలో వారి నాయకుడైన షెమయాను, అతని బంధువుల్లో రెండువందల మందిని,
\p
\v 9 హెబ్రోను సంతతి వారికి అధిపతి అయిన ఎలీయేలును, అతని బంధువుల్లో ఎనభై మందిని,
\p
\v 10 ఉజ్జీయేలు సంతతిలో వారి నాయకుడైన అమ్మీనాదాబును, అతని బంధువుల్లో నూట పన్నెండు మందిని దావీదు సమావేశపరిచాడు.
\p
\s5
\v 11 అప్పుడు దావీదు యాజకులైన సాదోకును, అబ్యాతారును, లేవీయులైన ఊరియేలు, అశాయా, యోవేలు, షెమయా, ఎలీయేలు, అమ్మీనాదాబు అనే వాళ్ళతో
\v 12 <<లేవీయుల పూర్వీకుల వంశాలకు మీరు పెద్దలుగా ఉన్నారు.
\s5
\v 13 ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా మందసాన్ని మోయకపోవడం చేత, ఆయన దగ్గర విచారణ చేయక పోవడం చేత, ఆయన మనలో నాశనం కలగజేశాడు. కాబట్టి ఇప్పుడు మీరు, మీవాళ్ళు, మిమ్మల్ని మీరు ప్రతిష్ట చేసుకుని, నేను ఆ మందసానికి సిద్ధం చేసిన స్థలానికి దాన్ని తీసుకురావాలి>> అన్నాడు.
\v 14 అప్పుడు యాజకులు, లేవీయులు, ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా మందసాన్ని తీసుకురావడానికి తమను తాము ప్రతిష్ట చేసుకున్నారు.
\v 15 తరువాత లేవీయులు యెహోవా చెప్పిన మాటను బట్టి మోషే ఆజ్ఞాపించినట్టు దేవుని మందసాన్ని దాని మోత కర్రలతో తమ భుజాల మీదికి ఎత్తుకున్నారు.
\p
\s5
\v 16 అప్పుడు దావీదు <<మీరు మీ బంధువులైన వాద్యకారులను పిలిచి, స్వరమండలాలు, తీగ వాద్యాలు, కంచు తాళాలతో ఉన్న వాద్యాలతో, గంభీర శబ్ధంతో, సంతోషంతో గొంతెత్తి పాడేలా ఏర్పాటు చెయ్యండి>> అని లేవీయుల నాయకులకు ఆజ్ఞాపించాడు.
\v 17 కాబట్టి లేవీయులు, యోవేలు కొడుకు హేమాను, అతని బంధువుల్లో బెరెక్యా కొడుకు ఆసాపు, తమ బంధువులైన మెరారీయుల్లో కూషాయాహు కొడుకు ఏతాను,
\v 18 వీళ్ళతోపాటు రెండవ వరుసగా ఉన్న తమ బంధువులైన జెకర్యా, బేన్, యహజీయేలు, షెమీరామోతు, యెహీయేలు, ఉన్నీ, ఏలీయాబు, బెనాయా, మయశేయా, మత్తిత్యా, ఎలీప్లేహు, మిక్నేయాహు అనే వాళ్ళను, ద్వారపాలకులైన ఓబేదెదోము, యెహీయేలు అనే వాళ్ళను నియమించారు.
\p
\s5
\v 19 వాద్యకారులైన హేమాను, ఆసాపు, ఏతాను పంచలోహాల తాళాలు వాయించడానికి నిర్ణయం అయింది.
\v 20 జెకర్యా, అజీయేలు, షెమీరామోతు, యెహీయేలు, ఉన్నీ, ఏలీయాబు, మయశేయా, బెనాయా అనే వాళ్ళు హెచ్చు స్వరం కలిగిన స్వరమండలాలు వాయించాలని నిర్ణయం అయింది.
\v 21 ఇంకా, మత్తిత్యా, ఎలీప్లేహు, మిక్నేయాహు, ఓబేదెదోము, యెహీయేలు, అజజ్యాహు అనే వాళ్ళు రాగం ఎత్తడానికీ, తీగ వాయిద్యాలు వాయించడానికీ నిర్ణయం అయింది.
\p
\s5
\v 22 లేవీయులకు అధిపతి అయిన కెనన్యా సంగీతం నిర్వహణలో ప్రవీణుడు గనుక అతడు దాన్ని జరిగించాడు.
\v 23 బెరెక్యా, ఎల్కానా మందసానికి ముందు నడిచే సంరక్షకులుగా,
\v 24 షెబన్యా, యెహోషాపాతు, నెతనేలు, అమాశై, జెకర్యా, బెనాయా, ఎలీయెజెరు అనే యాజకులను దేవుని మందసానికి ముందు బాకాలు ఊదే వారిగా, ఓబేదెదోము, యెహీయా వెనుక వైపున ఉండే సంరక్షకులుగా నియమించారు.
\p
\s5
\v 25 దావీదు, ఇశ్రాయేలీయుల పెద్దలు, సహస్రాధిపతులు యెహోవా నిబంధన మందసాన్ని ఓబేదెదోము ఇంట్లోనుంచి తీసుకు రావడానికి ఉత్సాహంతో వెళ్ళారు.
\v 26 యెహోవా నిబంధన మందసం మోసే లేవీయులకు దేవుడు సహాయం చేయగా, వాళ్ళు ఏడు కోడెలను ఏడు గొర్రె పొట్టేళ్లను బలులుగా అర్పించారు.
\p
\s5
\v 27 దావీదు, మందసం మోసే లేవీయులందరూ, సంగీతం నిర్వహించే కెనన్యా సన్నని నారతో నేసిన వస్త్రాలు వేసుకున్నారు. దావీదు సన్నని నారతో నేసిన ఏఫోదును ధరించాడు.
\v 28 ఇశ్రాయేలీయులందరూ ఆర్భాటం చేస్తూ కొమ్ములు, బాకాలు ఊదుతూ, కంచు తాళాలు కొడుతూ, స్వరమండలాలు, తీగ వాద్యాలు వాయిస్తూ యెహోవా నిబంధన మందసాన్ని తీసుకు వచ్చారు.
\p
\s5
\v 29 కాని, యెహోవా నిబంధన మందసం దావీదు పట్టణంలోకి వచ్చినప్పుడు, సౌలు కూతురు మీకాలు కిటికీలో నుంచి చూసి రాజైన దావీదు నాట్యం చేస్తూ సంబరం చేసుకోవడం గమనించి, తన మనస్సులో అతన్ని అసహ్యించుకుంది.
\s5
\c 16
\s దావీదు కృతజ్ఞత పాట
\r 16:8-22; కీర్తన 105:1-15
\r 16:23-33; కీర్తన 96:1-13
\r 16:34-36; కీర్తన 106:1, 47-48
\p
\v 1 ఈ విధంగా వాళ్ళు దేవుని మందసాన్ని తీసుకొచ్చి, దావీదు దాని కోసం వేయించిన గుడారం మధ్యలో దాన్ని ఉంచి, దేవుని సన్నిధిలో దహన బలులు, సమాధాన బలులు అర్పించారు.
\v 2 దహన బలులు, సమాధాన బలులు దావీదు అర్పించడం ముగించిన తరువాత అతడు యెహోవా పేరట ప్రజలను దీవించాడు.
\v 3 పురుషులైనా, స్త్రీలైనా ఇశ్రాయేలీయులందరిలో ఒక్కొక్కరికీ ఒక రొట్టె, ఒక మాంసపు ముద్ద, ఒక ఎండిన ద్రాక్షపళ్ళ గుత్తిని పంచిపెట్టాడు.
\p
\s5
\v 4 అతడు యెహోవా మందసం ముందు సేవ చేస్తూ, ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవాను ఘనపరచడానికీ, కృతజ్ఞత చెల్లించడానికీ, ఆయనకు స్తోత్రాలు చెల్లించడానికీ లేవీయుల్లో కొందరిని నియమించాడు.
\p
\v 5 వాళ్ళల్లో అధిపతి అయిన ఆసాపు, అతని తరువాతి వాడు జెకర్యా, యెహీయేలు, షెమీరామోతు, యెహీయేలు, మత్తిత్యా, ఏలీయాబు, బెనాయా, ఓబేదెదోము, యెహీయేలు అనే వాళ్ళు స్వరమండలాలు, తీగ వాద్యాలు వాయించడానికి నిర్ణయంయామకం జరిగింది. ఆసాపు కంచు తాళాలు వాయించేవాడు.
\v 6 బెనాయా, యహజీయేలు అనే యాజకులు ఎప్పుడూ దేవుని నిబంధన మందసం ముందు బాకాలు ఊదడానికి నియామకం అయ్యారు.
\p
\s5
\v 7 ఆ రోజు దావీదు మొదటిగా ఆసాపునూ, అతని బంధువులనూ, యెహోవాను స్తుతిస్తూ కృతజ్ఞత అర్పించడానికి ఈ పాట పాడాలని నియమించాడు.
\q1
\v 8 యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి.
\q1 ఆయన పేరును ప్రకటన చెయ్యండి.
\q1 ఆయన కార్యాలను ప్రజల్లో తెలియజెయ్యండి.
\q1
\v 9 ఆయనను గూర్చి పాడండి.
\q1 ఆయనను కీర్తించండి.
\q1 ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయండి.
\q1
\s5
\v 10 ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి అతిశయించండి.
\q1 యెహోవాను కోరుకునే వాళ్ళు హృదయంలో సంతోషిస్తారు గాక.
\q1
\v 11 యెహోవాను ఆశ్రయించండి. ఆయన బలాన్ని ఆశ్రయించండి.
\q1 ఆయన సన్నిధిని నిత్యం వెదకండి.
\q1
\s5
\v 12 ఆయన దాసులైన ఇశ్రాయేలు వంశస్థులారా,
\q1 ఆయన ఏర్పరచుకొన్న యాకోబు సంతతి వారలారా,
\q1
\v 13 ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోండి.
\q1 ఆయన సూచక క్రియలను ఆయన నోట పలికిన తీర్పులను జ్ఞాపకం చేసుకోండి.
\q1
\v 14 ఆయన మన దేవుడు యెహోవా.
\q1 ఆయన తీర్పులు లోకమంతటా జరుగుతున్నాయి.
\q1
\s5
\v 15 ఆయన తను చేసిన నిబంధనను
\q1 తాను పలికిన ఆజ్ఞలను వెయ్యి తరాలు జ్ఞాపకం ఉంచుకుంటాడు.
\q1
\v 16 ఆయన అబ్రాహాముతో చేసిన నిబంధనను
\q1 ఇస్సాకుతో చేసిన ప్రమాణాన్ని మనస్సుకు తెచ్చుకుంటాడు.
\q1
\v 17 యాకోబుకు కట్టడగా ఇశ్రాయేలుకు నిత్య నిబంధనగా
\q1 ఆయన స్థిరపరిచింది దీనినే.
\p
\v 18 ఆయన మాట ఇచ్చాడు. <<నేను కనాను భూమిని మీకు వారసత్వంగా ఇస్తాను.>>
\p
\s5
\v 19 మీరు లెక్కకు కొద్ది మందిగా ఉన్నప్పుడే,
\p అల్ప సంఖ్యాకులుగా, దేశంలో పరాయివారుగా ఉన్నపుడే ఇలా చెప్పాను.
\q1
\v 20 వాళ్ళు జనం నుంచి జనానికి, రాజ్యం నుంచి రాజ్యానికి తిరుగుతున్నప్పుడు,
\q1
\v 21 ఆయన ఎవరినీ వాళ్లకు హాని చేయనివ్వలేదు.
\p వారి నిమిత్తం రాజులను గద్దించాడు.
\p
\v 22 నేను అభిషేకించిన వాళ్ళను ముట్టవద్దనీ,
\p నా ప్రవక్తలకు కీడు చేయవద్దనీ చెప్పాడు.
\q1
\s5
\v 23 సర్వలోక నివాసులారా, యెహోవాను సన్నుతించండి
\q2 ప్రతిరోజూ ఆయన రక్షణను ప్రకటించండి.
\q1
\v 24 అన్యజనుల్లో ఆయన మహిమను ప్రచురించండి.
\q2 సమస్త జనాల్లో ఆయన ఆశ్చర్యకార్యాలను ప్రచురించండి.
\q1
\s5
\v 25 యెహోవా మహా ఘనత వహించినవాడు.
\q2 ఆయన ఎంతో స్తుతి పొందదగినవాడు.
\q2 సమస్త దేవుళ్ళకంటే ఆయన పూజార్హుడు.
\q1
\v 26 జాతుల దేవుళ్ళన్నీ వట్టి విగ్రహాలే.
\q2 యెహోవా ఆకాశ వైశాల్యాన్ని సృష్టించినవాడు.
\q1
\v 27 ఘనతా ప్రభావాలు ఆయన సన్నిధిలో ఉన్నాయి.
\q2 బలం, సంతోషం ఆయన దగ్గర ఉన్నాయి.
\q1
\s5
\v 28 జనాల వంశాల్లారా, యెహోవాకు చెల్లించండి.
\q2 మహిమను బలాన్నీ యెహోవాకు ఆపాదించండి.
\q1
\v 29 యెహోవా నామానికి తగిన మహిమను ఆయనకు చెల్లించండి.
\q2 నైవేద్యాలు చేత పట్టుకుని ఆయన సన్నిధిలో చేరండి.
\pi పవిత్రత అనే ఆభరణాలు ధరించుకుని
\q2 ఆయన ముందు సాగిలపడండి.
\q1
\s5
\v 30 భూజనులారా, ఆయన సన్నిధిలో వణకండి.
\q2 అప్పుడు భూలోకం కదలకుండా ఉంటుంది.
\q2 అప్పుడది స్థిరంగా ఉంటుంది.
\q1
\v 31 యెహోవా ఏలుతున్నాడని జనాల్లో చాటించండి.
\q2 ఆకాశాలు ఆనందించు గాక.
\q2 భూమి సంతోషించు గాక
\q1
\s5
\v 32 సముద్రం, దాని సంపూర్ణత ఘోషిస్తుంది గాక.
\q2 పొలాలు వాటిలో ఉన్న సమస్తం సంతోషిస్తాయి గాక.
\q2 యెహోవా వస్తున్నాడు.
\q1
\v 33 భూజనులకు తీర్పు చెప్పడానికి యెహోవా వస్తున్నాడు.
\q2 వనవృక్షాలు ఆయన సన్నిధిలో ఆనందంతో కేకలు వేస్తాయి.
\q1
\s5
\v 34 యెహోవా మంచివాడు, ఆయన కృప శాశ్వతంగా ఉంటుంది.
\q2 ఆయనను స్తుతించండి.
\q1
\v 35 దేవా మా రక్షకా, మమ్మల్ని రక్షించు.
\q2 మమ్మల్ని సమకూర్చు.
\q1
\s5
\v 36 మేము నీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేలా
\q2 నిన్ను స్తుతిస్తూ అతిశయించేలా
\q2 అన్యజనుల వశంలో నుంచి మమ్మల్ని విడిపించు
\q2 అని ఆయన్ను బతిమాలుకోండి.
\q2 ఇశ్రాయేలీయులకు దేవుడు యెహోవా
\q2 యుగాలన్నిట్లో స్తోత్రం పొందుతాడు గాక.
\p ఈ విధంగా వాళ్ళు పాడినప్పుడు ప్రజలందరూ ఆమేన్‌ అని చెప్పి యెహోవాను స్తుతించారు.
\p
\s5
\v 37 అప్పుడు మందసం ముందు నిత్యమూ జరగవలసిన అనుదిన సేవ జరిగించడానికి దావీదు అక్కడ యెహోవా నిబంధన మందసం దగ్గర ఆసాపునూ అతని బంధువులనూ నియమించాడు. ఓబేదెదోమునూ, వాళ్ళ బంధువులైన అరవై ఎనిమిదిమందినీ,
\v 38 యెదూతూను కొడుకు ఓబేదెదోమునూ, హోసానూ ద్వారపాలకులుగా నియమించాడు.
\v 39 గిబియోనులోని ఉన్నత స్థలం లో ఉన్న యెహోవా గుడారం మీద, అక్కడ ఉన్న బలిపీఠం మీద, యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన ధర్మవిధుల్లో రాసి ఉన్న ప్రకారం,
\s5
\v 40 ఉదయం, సాయంత్రాల్లో ప్రతిరోజూ నిత్యమైన దహనబలిని ఆయనకు అర్పించడానికి అక్కడ అతడు యాజకుడైన సాదోకును, అతని బంధువులైన యాజకులను నియమించాడు.
\v 41 యెహోవా కృప నిత్యమూ ఉంటుందని ఆయనను స్తుతించడానికి వీళ్ళతోపాటు హేమానునూ, యెదూతూనునూ, పేర్ల క్రమంలో ఉదాహరించిన మరి కొందరిని నియమించాడు.
\p
\s5
\v 42 బాకాలు ఊదడానికి, కంచు తాళాలను వాయించడానికి, దేవుని గూర్చి పాడదగిన పాటలను వాద్యాలతో వినిపించడానికి వీళ్ళల్లో ఉండే హేమానునూ, యెదూతూనునూ అతడు నియమించాడు. ఇంకా యెదూతూను కొడుకులను అతడు ద్వారపాలకులుగా నియమించాడు.
\v 43 తరువాత ప్రజలందరూ తమతమ ఇళ్ళకు వెళ్లిపోయారు. దావీదు తన ఇంటివాళ్ళను దీవించడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు.
\s5
\c 17
\s దావీదుతో దేవుని ఒడంబడిక
\r 17:1-15; 2 సమూ 7:1-17
\p
\v 1 దావీదు తన ఇంటికి వెళ్లి సేదదీరిన తరువాత ప్రవక్త అయిన నాతానును పిలిపించి అతనితో <<నేను దేవదారుకలపతో కట్టిన భవనంలో నివసిస్తున్నాను. కాని, యెహోవా నిబంధన మందసం మాత్రం ఒక గుడారంలో ఉంది>> అని చెప్పాడు.
\v 2 అప్పుడు నాతాను <<దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ హృదయంలో ఉన్నదంతా చెయ్యి>> అని దావీదుతో అన్నాడు.
\p
\s5
\v 3 ఆ రాత్రి దేవుని వాక్కు నాతానుకు ప్రత్యక్షమై ఇలా అన్నాడు,
\v 4 <<నువ్వు వెళ్లి నా సేవకుడైన దావీదుతో ఇలా చెప్పు. యెహోవా చెప్పేదేమంటే, నా నివాసం కోసం ఒక ఆలయాన్ని నువ్వు కట్టించకూడదు.
\v 5 ఇశ్రాయేలీయులను రప్పించిన రోజు నుంచి ఈ రోజు వరకూ నేను ఒక ఇంట్లో నివాసం చెయ్యకుండా, డేరాలో, ప్రత్యక్ష గుడారంలో నివాసం చేశాను.
\v 6 నేను ఇశ్రాయేలీయులందరి మధ్యలో సంచారం చేసిన కాలంలో, మీరు నాకోసం దేవదారు మానులతో ఆలయం ఎందుకు కట్టలేదు? అని నా ప్రజలను కాయడానికి నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయుల న్యాయాధిపతుల్లో ఎవరితోనైనా నేను ఒక్క మాటైనా అన్నానా?
\p
\s5
\v 7 కాబట్టి నువ్వు నా సేవకుడైన దావీదుతో ఏం చెప్పాలంటే, సైన్యాలకు అధిపతి అయిన యెహోవా ఇలా చెబుతున్నాడు, గొర్రెల వెంట తిరుగుతున్న నిన్ను గొర్రెల మంద నుంచి తీసుకు, నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద అధిపతిగా చేశాను.
\v 8 నువ్వు వెళ్లిన ప్రతిచోటా నీకు తోడుగా ఉండి, నిన్ను ద్వేషించినవాళ్ళను నీ ముందు నిలవకుండా నిర్మూలం చేశాను. లోకంలో ఘనులకు ఉన్న పేరులాంటి పేరు నీకు ఉండేలా చేస్తాను.
\p
\s5
\v 9 ఇంకా నేను నా ప్రజలైన ఇశ్రాయేలీయుల కోసం ఒక స్థలం ఏర్పాటు చేసి, వాళ్ళను అక్కడ నాటుతాను. వాళ్ళు ఇంక తిరుగులాడకుండా తమ స్థానంలో కాపురం ఉంటారు. పూర్వం జరిగినట్టూ, నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద నేను న్యాయాధిపతులను నిర్ణయించిన కాలం మొదలుకుని జరుగుతూ వచ్చినట్టూ, దుష్టులు వాళ్ళను ఇక బాధ పెట్టరు.
\v 10 నీ పగవాళ్ళందరినీ నేను అణచివేస్తాను. అంతమాత్రమే కాదు, యెహోవానైన నేను నీ తరువాత నీ సంతానమే పరిపాలిస్తుందని నీకు తెలియజేశాను.
\p
\s5
\v 11 నీ జీవితకాలం ముగిసి నీ పూర్వీకుల దగ్గరికి నువ్వు చేరే సమయానికి, నీ తరువాత నీ కొడుకుల వల్ల కలిగే నీ సంతానాన్ని లేపుతాను. వాళ్ళల్లో ఒకరి ద్వారా నేను రాజ్య స్థాపనచేసి అతని రాజ్యాన్ని స్థిరపరుస్తాను.
\v 12 అతడు నాకు ఒక మందిరం కట్టిస్తాడు. అతని సింహాసనాన్ని నేను శాశ్వతమైనదిగా చేస్తాను.
\p
\s5
\v 13 నేను అతనికి తండ్రిగా ఉంటాను. అతడు నాకు కొడుకుగా ఉంటాడు. నీ మీద పరిపాలించిన సౌలు దగ్గరనుండి తీసి వేసినట్టుగా అతని దగ్గరనుండి నా నిబంధన విశ్వాస్యత తీసివేయను.
\v 14 నా మందిరంలో, నా రాజ్యంలో, నేను నిత్యం అతన్ని స్థిరపరుస్తాను, అతని సింహాసనం ఎన్నటికీ స్థిరంగా ఉంటుంది అని అతనికి తెలియచెయ్యి.>>
\p
\v 15 నాతాను తనకు ప్రత్యక్షం అయిన యీ మాటలన్నిటినీ దావీదుకు తెలియజేశాడు.
\s దావీదు ప్రార్థన
\r 17:16-27; 2 సమూ 7:18-29
\p
\s5
\v 16 రాజైన దావీదు యెహోవా సన్నిధిలో కూర్చుని ఈ విధంగా మనవి చేశాడు. <<దేవా యెహోవా, నువ్వు నన్ను ఇలాటి ఉన్నత స్థితికి తేవడానికి నేను ఎంతటివాణ్ణి? నా కుటుంబం ఏమాత్రం?
\v 17 దేవా, ఇది నీ దృష్టిలో చిన్న విషయమే. దేవా యెహోవా, నువ్వు దూర భవిషత్తులో ఉండబోయే నీ సేవకుని సంతతినిగూర్చి చెప్పి, ముందు తరాలను నాకు చూపించావు.
\v 18 నీ దాసుడైన నాకు కలుగబోయే ఘనతను గూర్చి దావీదు అనే నీ దాసుడనైన నేను నీతో ఇంకా ఏమని మనవి చెయ్యను? నువ్వు నీ దాసునికి ప్రత్యేక గుర్తింపు ఇచ్చావు.
\p
\s5
\v 19 యెహోవా, నీ దాసుని నిమిత్తమే నీ చిత్తప్రకారం ఈ మహా ఘనత కలుగుతుందని నువ్వు తెలియచేశావు. అతని నిమిత్తమే నువ్వు ఈ గొప్ప కార్యం చేశావు.
\v 20 యెహోవా, మేము మా చెవులతో విన్నదంతా నిజం. నీలాంటివాడు ఎవ్వడూ లేడు. నువ్వు తప్ప ఇంక ఏ దేవుడూ లేడు.
\v 21 నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల్లాంటి జాతి భూలోకంలో ఏది? ఐగుప్తులోనుంచి నువ్వు విమోచించిన నీ ప్రజల ముందు నిలబడనివ్వకుండా నువ్వు అనేక జాతులను తోలివేసినందువల్ల మహా భీకరమైన పేరు తెచ్చుకొన్నావు. వాళ్ళు నీ సొంత ప్రజలయ్యేలా వాళ్ళను విమోచించడానికి దేవుడవైన నువ్వు బయలుదేరావు.
\p
\s5
\v 22 నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు నిత్యం నీకు ప్రజలయ్యేలా నువ్వు ఆ విధంగా చేశావు. యెహోవావైన నువ్వు వాళ్లకు దేవుడివయ్యావు.
\v 23 యెహోవా, ఇప్పుడు నీ దాసుని గూర్చీ, అతని సంతతిని గూర్చీ నువ్వు చెప్పిన మాట నిత్యం స్థిరమౌతుంది గాక.
\v 24 ఇశ్రాయేలీయుల దేవుడు సైన్యాలకు అధిపతి అయిన యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడై ఉన్నాడని నీ పేరుకు ఎన్నటికీ ఘనత వచ్చేలా నువ్వు చెప్పిన మాట నిశ్చయంగా స్థిరమౌతుంది గాక. ఇంకా, నీ దాసుడైన దావీదు సంతతి నీ సన్నిధిలో స్థిరపడు గాక.
\p
\s5
\v 25 దేవా, నీకు సంతానం ఇస్తానని నీ దాసునికి నువ్వు తెలియచేశావు గనుక నీ సన్నిధిలో విన్నపం చెయ్యడానికి నీ దాసునికి ధైర్యం కలిగింది.
\v 26 యెహోవా, నువ్వు దేవుడవై ఉండి, నీ దాసునికి ఈ మేలు దయచేస్తానని చెప్పావు.
\v 27 ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యం నీ సన్నిధిలో ఉండేలా దాన్ని ఆశీర్వదించడానికి నీకు ఇష్టం అయింది. యెహోవా, నువ్వు ఆశీర్వదిస్తే అది ఎప్పటికీ ఆశీర్వాదంగానే ఉంటుంది.>>
\s5
\c 18
\s దావీదు విజయాలు
\r 18:1-13; 2 సమూ 8:1-14
\r 18:14-17; 2 సమూ 8:15-18
\p
\v 1 ఇది జరిగిన తరువాత దావీదు ఫిలిష్తీయుల మీద దాడి చేసి వాళ్ళను జయించాడు. గాతు పట్టణాన్ని, దాని గ్రామాలను, ఫిలిష్తీయుల ఆధీనంలోనుంచి లాగేసుకున్నాడు.
\v 2 తరువాత అతడు మోయాబీయులను జయించగా వాళ్ళు దావీదుకు కప్పం కట్టి దాసోహమయ్యారు.
\p
\s5
\v 3 తరువాత, సోబా రాజు హదరెజెరు యూఫ్రటీసు నది వరకూ తన అధికారం స్థాపించడానికి బయలు దేరగా హమాతు దగ్గర దావీదు అతన్ని ఓడించాడు.
\v 4 అతని దగ్గర నుంచి వెయ్యి రథాలను, ఏడువేల గుర్రపు రౌతులను, ఇరవైవేల మంది సైనికులను స్వాధీనం చేసుకున్నాడు. దావీదు వాటిలో వంద రథాలకు సరిపడిన గుర్రాలు ఉంచుకుని, మిగిలిన వాటికి చీలమండ నరాలు తెగవేయించాడు.
\p
\s5
\v 5 సోబా రాజు హదరెజెరుకు సాయం చెయ్యాలని దమస్కులోని అరామీయులు వచ్చినప్పుడు, దావీదువారిలో ఇరవై రెండు వేలమందిని హతం చేశాడు.
\v 6 తరువాత దావీదు సిరియా సంబంధమైన దమస్కులో కావలి సైన్యాన్ని ఉంచాడు. అరామీయులు దావీదుకు కప్పం కట్టి దాసోహమన్నారు. ఈ ప్రకారం దావీదు వెళ్లిన ప్రతి చోటా యెహోవా అతనికి సహాయం చేస్తూ వచ్చాడు.
\p
\s5
\v 7 దావీదు ఇంకా, హదరెజెరు సేవకులు స్వాధీనంలో ఉన్న బంగారు డాళ్లను యెరూషలేముకు తీసుకొచ్చాడు.
\v 8 హదరెజెరు పట్టణాలు టిబ్హతు నుంచీ కూను నుంచీ దావీదు లెక్క లేనంత ఇత్తడిని తీసుకొచ్చాడు. తరువాతి కాలంలో సొలొమోను దీనితోనే ఇత్తడి సముద్రాన్ని, స్తంభాలను, ఇత్తడి వస్తువులను చేయించాడు.
\p
\s5
\v 9 దావీదు సోబా రాజు హదరెజెరు సైన్యం అంతటినీ ఓడించాడన్న వార్త హమాతు రాజు తోహూకు వినబడింది.
\v 10 హదరెజెరుకూ తోహూకూ మధ్య విరోధం ఉంది కాబట్టి రాజైన దావీదు హదద్ ఎజెరుతో యుద్ధం చేసి అతన్ని ఓడించినందుకు, దావీదు క్షేమం తెలుసుకోడానికీ, అతనితో శుభవచనాలు పలకడానికీ, బంగారంతో, వెండితో, ఇత్తడితో చేసిన అనేక రకాలైన పాత్రలు ఇచ్చి, తోహూ తన కొడుకు హదోరమును అతని దగ్గరికి పంపించాడు.
\v 11 ఈ వస్తువులను కూడా రాజైన దావీదు, తాను ఎదోమీయుల దగ్గర నుంచి, మోయాబీయుల దగ్గర నుంచి, అమ్మోనీయుల దగ్గర నుంచి, ఫిలిష్తీయుల దగ్గర నుంచి, అమాలేకీయుల దగ్గర నుంచి తీసుకొన్న వెండి బంగారాలతో పాటుగా యెహోవాకు ప్రతిష్ఠించాడు.
\p
\s5
\v 12 ఇంకా సెరూయా కొడుకు అబీషై ఉప్పు లోయలో ఎదోమీయుల్లో పద్దెనిమిది వేలమందిని హతం చేశాడు.
\v 13 దావీదు ఎదోములో కావలి సైన్యాన్ని ఉంచాడు. ఎదోమీయులందరూ అతనికి దాసులయ్యారు. దావీదు వెళ్లిన ప్రతిచోటా యెహోవా అతన్ని రక్షించాడు.
\p
\s5
\v 14 ఈ విధంగా దావీదు ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా ఉండి తన ప్రజలందరికీ నీతిన్యాయాలు జరిగించాడు.
\v 15 సెరూయా కొడుకు యోవాబు సైన్యాధిపతి. అహీలూదు కొడుకు యెహోషాపాతు రాజ్యపు దస్తావేజుల లేఖరి.
\v 16 అహీటూబు కొడుకు సాదోకూ, అబ్యాతారు కొడుకు అబీమెలెకూ యాజకులు. షవ్శా శాస్త్రి.
\v 17 యెహోయాదా కొడుకు బెనాయా కెరేతీయులకూ, పెలేతీయులకూ అధిపతి. ఇంకా, దావీదు కొడుకులు రాజుకు సహాయకులు
\f +
\fr 18:17
\fq సహాయకులు
\ft యాజకులు
\f* .
\s5
\c 19
\s దావీదు, అమ్మోనీయుల
\r 19:1-19; 2 సమూ 10:1-19
\p
\v 1 ఇది జరిగిన తరువాత అమ్మోనీయుల రాజు నాహాషు చనిపోగా అతని కొడుకు అతని స్థానంలో రాజయ్యాడు.
\v 2 అప్పుడు దావీదు <<హానూను తండ్రి నాహాషు నా పట్ల దయ చూపించాడు కాబట్టి నేను అతని కొడుకు పట్ల దయ చూపిస్తాను>> అనుకుని, అతని తండ్రి నిమిత్తం అతన్ని పరామర్శించడానికి దూతలను పంపాడు. దావీదు సేవకులు హానూనును పరామర్శించడానికి అమ్మోను దేశానికి వచ్చినప్పుడు,
\v 3 అమ్మోనీయుల అధిపతులు హానూనుతో<<నిన్ను పరామర్శించడానికి నీ దగ్గరికి దావీదు దూతలను పంపడం నీ తండ్రిని ఘనపరచడానికే అనుకుంటున్నావా? దేశాన్ని జాగ్రత్తగా గమనించి, దాన్ని నాశనం చెయ్యడానికే అతని సేవకులు నీ దగ్గరికి వచ్చారు>> అని చెప్పారు.
\p
\s5
\v 4 హానూను దావీదు సేవకులను పట్టుకుని, వాళ్ళ జుట్టు గొరిగించి, వాళ్ళ బట్టలు మొల కంటే కిందకు దిగకుండా సగానికి కత్తిరించి వాళ్ళను పంపేశాడు.
\v 5 ఆ మనుషులు ఇంటికి వస్తూ ఉన్నప్పుడు కొందరు వచ్చి వాళ్ళను గూర్చిన వార్త దావీదుకు తెలియజేశారు. వాళ్ళు ఎంతో సిగ్గు పాలై ఉన్నారు గనుక రాజు వాళ్లకు ఎదురుగా మనుషులను పంపి <<మీ గడ్డాలు పెరిగే వరకూ మీరు యెరికోలో ఉండి, తరువాత రండి>> అని సందేశం పంపాడు.
\p
\s5
\v 6 అమ్మోనీయులు తమ పట్ల దావీదుకు అసహ్యం కలిగేలా చేసుకున్నాం అని గ్రహించారు. హానూనూ, అమ్మోనీయులూ రెండు వేల మణుగుల వెండి ఇచ్చి అరామ్నహరయీము నుంచి, ఆరాము మయకా నుంచి, సోబా నుంచి, రథాలను, గుర్రపు రౌతులను కిరాయికి తెచ్చుకున్నారు.
\v 7 కిరాయి చెల్లించి మయకా రాజును, అతని సైన్యాన్నీ ముప్ఫై రెండువేల రథాలను కుదుర్చుకున్నారు. వీళ్ళు వచ్చి మేదెబా ఎదుట దిగారు. అమ్మోనీయులు తమ పట్టణాల్లో నుంచి యుద్ధం చెయ్యడానికి వచ్చారు.
\p
\s5
\v 8 దావీదు ఈ సంగతి విని యోవాబునూ, సైన్యంలో ఉన్న పరాక్రమశాలులు అందరినీ పంపాడు.
\v 9 అమ్మోనీయులు బయలుదేరి పట్టణపు ద్వారం దగ్గర యుద్ధపంక్తులు తీర్చారు. వచ్చిన రాజులు ప్రత్యేకంగా బయట ఉన్న భూమిలో యుద్ధానికి సిద్ధంగా నిలిచారు.
\s5
\v 10 తాను రెండు సైన్యాల మధ్యలో చిక్కి ఉండడం చూసి, యోవాబు ఇశ్రాయేలీయుల్లో ఉన్న శ్రేష్ఠుల్లో పరాక్రమశాలులను సిద్ధం చేసుకుని, అరామీయులకు ఎదురుగా వాళ్ళను బారులు తీర్చి,
\v 11 మిగిలిన సైన్యాన్ని తన సోదరుడు అబీషైకి అప్పగించి, అమ్మోనీయులకు ఎదురుగా మొహరింప జేశాడు.
\s5
\v 12 <<అరామీయుల బలగాలను ఎదిరించి నేను నిలబడలేకపోతే, నువ్వు నాకు సాయం చెయ్యాలి. అమ్మోనీయుల బలానికి నువ్వు నిలబడలేకపోతే, నేను నీకు సాయం చేస్తాను.
\v 13 ధైర్యంగా ఉండు. మనం మన ప్రజల నిమిత్తమూ మన దేవుని పట్టణాల నిమిత్తమూ శౌర్యం చూపుదాం. యెహోవా తన దృష్టిలో ఏది మంచిదో అది చేస్తాడు గాక>> అన్నాడు.
\p
\s5
\v 14 ఆ విధంగా యోవాబు అతనితో కూడ ఉన్న సైన్యమూ, అరామీయులతో యుద్ధం చేయడానికి కదిలినప్పుడు, వాళ్ళు అతని ముందు నిలవలేక వెనక్కి తిరిగి పారిపోయారు.
\v 15 అరామీయులు పారిపోవడం అమ్మోనీయులు చూసినప్పుడు వాళ్ళు కూడా యోవాబు సోదరుడు అబీషై ఎదుట నిలవలేక వెనక్కి తిరిగి పట్టణంలోకి పారిపోయారు. యోవాబు యెరూషలేముకు తిరిగి వచ్చాడు.
\p
\s5
\v 16 తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోయామని అరామీయులు గ్రహించి దూతలను పంపి, నది అవతల ఉన్న అరామీయులను పిలిపించుకున్నారు. హదరెజెరు సైన్యాధిపతి షోపకు వాళ్లకు నాయకుడయ్యాడు.
\v 17 దావీదు ఆ సంగతి తెలుసుకుని ఇశ్రాయేలీయులందరినీ సమకూర్చి యొర్దాను దాటి, వాళ్లకు ఎదురుగా సైన్యాలను సిద్ధం చేశాడు. దావీదు అరామీయులకు ఎదురుగా సైన్యాలను బారులు తీర్చి యుద్ధం చేశాడు.
\p
\s5
\v 18 అరామీయులు ఇశ్రాయేలీయుల ముందు నిలవలేక, వెనుదిరిగి పారిపోయారు. దావీదు అరామీయుల్లో ఏడువేల రథికులనూ, నలభై వేల మంది సైనికులనూ హతం చేసి వారి సేనాని షోపకును చంపాడు.
\v 19 తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోయామని హదరెజెరు సేవకులు గ్రహించి దావీదుతో సంధి చేసుకుని అతనికి దాసోహమయ్యారు. అప్పటినుంచి అరామీయులు అమ్మోనీయులకు సాయం చెయ్యడానికి అంగీకరించ లేదు.
\s5
\c 20
\s రబ్బాను ఓడించడం
\r 20:1-3; 2 సమూ 11:1; 12:29-31
\p
\v 1 తరువాతి సంవత్సరం రాజులు సాధారణంగా యుద్ధానికి బయలుదేరే కాలంలో యోవాబు సైన్యంలో శూరులైన వాళ్ళను సమకూర్చి, అమ్మోనీయుల దేశాన్ని ధ్వంసం చేసి, రబ్బా పట్టణాన్ని ముట్టడించాడు. దావీదు యెరూషలేములోనే ఉండగా, యోవాబు రబ్బాను ఓడించి ప్రజలను హతం చేశాడు.
\s5
\v 2 దావీదు వచ్చి, వాళ్ళ రాజు తల మీద ఉన్న కిరీటం తీసుకున్నాడు. దాని బరువు 34 కిలోగ్రాములు. అందులో విలువైన రత్నాలు పొదిగి ఉన్నాయి. దాన్ని దావీదు ధరించాడు. ఇంకా అతడు ఎంతో విస్తారమైన కొల్లసొమ్ము ఆ పట్టణంలో నుంచి తీసుకుపోయాడు.
\v 3 దాని ప్రజలను అతడు బయటకు తీసుకొచ్చి, వాళ్ళతో రంపాలతో, ఇనుప పనిముట్లతో, గొడ్డళ్లతో బలవంతంగా పని చేయించాడు. ఈ విధంగా అతడు అమ్మోనీయుల పట్టణాలన్నిటికీ చేశాడు. తరువాత దావీదూ, సైన్యమూ, యెరూషలేముకు తిరిగి వచ్చారు.
\s ఫిలిష్తీయులతో యుద్ధం
\r 2:4-8; 2 సమూ 21:15-22
\p
\s5
\v 4 అటు తరువాత గెజెరులో ఉన్న ఫిలిష్తీయులతో యుద్ధం జరిగినప్పుడు హుషాతీయుడైన సిబ్బెకై రెఫాయీయుల సంతతివాడు సిప్పయి అనే ఒకణ్ణి హతం చేశాడు. అందువల్ల ఫిలిష్తీయులు లొంగిపోయారు.
\v 5 మళ్ళీ ఫిలిష్తీయులతో యుద్ధం జరిగినప్పుడు యాయీరు కొడుకు ఎల్హానాను, గిత్తీయుడైన గొల్యాతు సహోదరుడైన లహ్మీని చంపాడు. అతని ఈటె నేతపని చేసేవాడి అడ్డకర్ర అంత పెద్దది.
\p
\s5
\v 6 మళ్ళీ గాతులో యుద్ధం జరిగింది. చాలా పొడవుగాగా ఉన్న వాడొకడు అక్కడ ఉన్నాడు. అతని చేతులకూ కాళ్ళకు, ఆరేసి చొప్పున ఇరవై నాలుగు వేళ్ళు ఉన్నాయి. అతడు రెఫాయీయుల సంతతికి చెందిన వాడు.
\v 7 అతడు ఇశ్రాయేలీయులను దూషించగా దావీదు సోదరుడు షిమ్యాకు పుట్టిన యోనాతాను అతన్ని చంపాడు.
\v 8 గాతులో ఉన్న రెఫాయీయుల సంతతి వారైన వీరు దావీదు చేత, అతని సేవకుల చేత హతమయ్యారు.
\s5
\c 21
\s దావీదు చేసిన జనసంఖ్య
\r 21:1-26; 2 సమూ 24:1-25
\p
\v 1 తరువాత సాతాను ఇశ్రాయేలుకు విరోధంగా లేచి, ఇశ్రాయేలీయులను లెక్కపెట్టడానికి దావీదును ప్రేరేపించాడు.
\v 2 అప్పుడు దావీదు యోవాబుకూ ప్రజల అధిపతులకూ <<మీరు వెళ్లి బెయేర్షెబా నుండి దాను వరకూ ఉన్న ఇశ్రాయేలీయులను లెక్కపెట్టి, జనసంఖ్య నాకు తెలియజేయండి>> అని ఆజ్ఞ ఇచ్చాడు.
\v 3 అందుకు యోవాబు <<రాజా నా ప్రభూ, యెహోవా తన ప్రజలను ఇప్పుడున్న వారికంటే వందరెట్లు ఎక్కువమందిగా చేస్తాడు గాక. వాళ్ళందరూ నా ప్రభువుకు దాసులు కారా? నా ప్రభువుకు ఈ వివరం ఎందుకు? దీనికి కారణం ఏంటి? ఇది జరిగితే ఇశ్రాయేలీయులకు శిక్ష కలుగుతుంది>> అన్నాడు.
\p
\s5
\v 4 కాని, యోవాబు మాట చెల్ల లేదు. రాజు మాటే చెల్లింది కాబట్టి యోవాబు ఇశ్రాయేలు దేశమంతటా తిరిగి యెరూషలేముకు వచ్చాడు.
\v 5 ఇశ్రాయేలీయులందరిలో యుద్ధం చెయ్యగలిగిన వాళ్ళు పదకొండు లక్షలమంది. యూదావాళ్ళల్లో యుద్ధం చెయ్యగలిగిన వాళ్ళు నాలుగు లక్షల డెబ్భైవేలమందిగా లెక్కకు వచ్చారు.
\p
\s5
\v 6 రాజు మాట యోవాబుకు అసహ్యంగా అనిపించింది కాబట్టి అతడు లేవి, బెన్యామీను గోత్రం వాళ్ళను ఆ లెక్కలో చేర్చలేదు.
\v 7 ఈ పని దేవుని దృష్టికి ప్రతికూలంగా ఉన్న కారణం చేత ఆయన ఇశ్రాయేలీయులను బాధపెట్టాడు.
\v 8 దావీదు <<నేను ఈ పని చేసి పెద్ద పాపం చేశాను. నేను చాలా అవివేకంగా ప్రవర్తించాను. ఇప్పుడు నీ దాసుని దోషం తీసివెయ్యి>> అని దేవునికి మొర్రపెట్టాడు.
\p
\s5
\v 9 దావీదుకు ప్రవక్త అయిన గాదుతో యెహోవా <<నువ్వు వెళ్లి దావీదుతో ఇలా చెప్పు,
\v 10 యెహోవా చెప్పేదేమంటే, మూడు విషయాలు నేను నీముందు ఉంచుతున్నాను. వాటిలో ఒక దాన్ని నువ్వు కోరుకో. దాన్ని నీకు చేస్తాను>> అన్నాడు.
\p
\s5
\v 11 కాబట్టి, గాదు దావీదు దగ్గరికి వచ్చి,
\p
\v 12 <<మూడు సంవత్సరాలు కరువు కలగడం,
\p లేదా మూడు నెలలపాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరిమితే నువ్వు వాళ్ళ ముందు నిలవలేక ఓటమి పాలవ్వడం,
\p లేదా, మూడు రోజులపాటు దేశంలో యెహోవా ఖడ్గం, అంటే తెగులు వచ్చి యెహోవా దూత ఇశ్రాయేలీయుల దేశమంతటా నాశనం కలగజేయడం.
\p ఈ మూడింట్లో నువ్వు ఒకదాన్ని కోరుకోమని యెహోవా చెబుతున్నాడు. కాబట్టి, నన్ను పంపిన ఆయనకు నేను ఏం జవాబివ్వాలో దాని విషయం ఆలోచించు>> అన్నాడు.
\p
\s5
\v 13 అందుకు దావీదు <<నేను చాలా ఇరుకులో చిక్కుకుపోయాను. యెహోవా మహా కృప గలవాడు, నేను మనుషుల చేతిలో పడకుండా ఆయన చేతిలోనే పడతాను>> అని గాదుతో అన్నాడు.
\v 14 కాబట్టి, యెహోవా ఇశ్రాయేలీయుల మీదికి తెగులు పంపగా ఇశ్రాయేలీయుల్లో డెబ్భైవేలమంది చనిపోయారు.
\v 15 యెరూషలేమును నాశనం చెయ్యడానికి దేవుడు ఒక దూతను పంపాడు. అతడు నాశనం చెయ్యబోతున్నప్పుడు యెహోవా చూసి, ఆ కీడు విషయంలో బాధపడి, నాశనం చేసే దూతతో<<చాలు, ఇప్పుడు నీ చెయ్యి వెనక్కి తీసుకో>> అని చెప్పగా ఆ దూత యెబూసీయుడైన ఒర్నాను కళ్ళం దగ్గర నిలబడ్డాడు.
\p
\s5
\v 16 దావీదు తేరిచూడగా, భూమ్యాకాశాల మధ్యలో నిలిచి, వరలోనుంచి తీసిన కత్తి చేత పట్టుకుని దాన్ని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కనబడ్డాడు. అప్పుడు దావీదూ, పెద్దలూ, గోనెపట్టలు కట్టుకుని, సాష్టాంగపడ్డారు.
\v 17 దావీదు <<ప్రజలను లెక్కపెట్టమని ఆజ్ఞ ఇచ్చినవాణ్ణి నేనే కదా? పాపం చేసి చెడుతనం జరిగించిన వాణ్ణి నేనే కదా? గొర్రెల్లాంటి వీళ్ళేం చేశారు? యెహోవా, నా దేవా, బాధపెట్టే నీ చెయ్యి నీ ప్రజల మీద ఉండకుండాా నా మీద, నా తండ్రి ఇంటివారి మీద ఉండనియ్యి>> అని దేవునికి మనవి చేశాడు.
\p
\s5
\v 18 <<యెబూసీయుడైన ఒర్నాను కళ్లంలో యెహోవాకు ఒక బలిపీఠం కట్టించడానికి దావీదును అక్కడికి వెళ్ళమని చెప్పు>> అని యెహోవా దూత గాదుకు చెప్పాడు.
\v 19 యెహోవా పేరట గాదు చెప్పిన మాట ప్రకారం దావీదు వెళ్ళాడు.
\v 20 అప్పుడు ఒర్నాను గోదుమలు నూర్చుతున్నాడు. అతడు వెనక్కు తిరిగి దూతను చూసి అతడు, అతనితోపాటు ఉన్న అతని నలుగురు కొడుకులూ దాక్కున్నారు.
\p
\s5
\v 21 దావీదు ఒర్నాను దగ్గరికి రాగా అతడు దావీదును చూసి, కళ్ళంలోనుంచి బయటకు వచ్చి, తల నేల వరకూ వంచి దావీదుకు నమస్కారం చేశాడు.
\v 22 అప్పుడు దావీదు ఒర్నానుతో <<ఈ తెగులు ప్రజలను విడిచిపోయేలా ఈ కళ్ళం ఉన్న చోట నేను యెహోవాకు ఒక బలిపీఠం కట్టించడానికి తగిన ఖరీదుకు దాన్ని నాకు అమ్ము>> అన్నాడు.
\p
\s5
\v 23 ఒర్నాను <<రాజైన నా ప్రభువు దాన్ని తీసుకుని తన దృష్టిలో ఏది మంచిదో అది చేస్తాడు గాక. ఇదిగో, దహనబలుల కోసం ఎద్దులు, కట్టెల కోసం ధాన్యం నూర్చే పరికరాలు, నైవేద్యం కోసం గోదుమ పిండి, అన్నీ నేను ఇస్తాను>> అని దావీదుతో అన్నాడు.
\v 24 అప్పుడు రాజైన దావీదు <<అలా కాదు, నేను నీ సొత్తును ఊరికే తీసుకు యెహోవాకు దహనబలులు అర్పించను, న్యాయమైన వెల ఇచ్చి తీసుకుంటాను>> అని ఒర్నానుతో చెప్పి,
\s5
\v 25 ఆ స్థలం కోసం ఆరువందల తులాల బంగారం అతనికి ఇచ్చాడు.
\v 26 తరువాత దావీదు యెహోవాకు అక్కడ ఒక బలిపీఠం కట్టించి, దహనబలులు, సమాధానబలులు అర్పించి యెహోవాకు మొర్ర పెట్టగా ఆయన ఆకాశంలో నుంచి దహన బలిపీఠం మీదికి అగ్నితో అతనికి జవాబిచ్చాడు.
\v 27 యెహోవా దూతకు ఆజ్ఞాపించినప్పుడు అతడు తన ఖడ్గాన్ని మళ్ళీ వరలో పెట్టేశాడు.
\p
\s5
\v 28 యెబూసీయుడైన ఒర్నాను కళ్లంలో యెహోవా తనకు జవాబిచ్చాడని దావీదు చూసి అక్కడే బలి అర్పించాడు.
\v 29 మోషే అరణ్యంలో చేయించిన యెహోవా నివాసపు గుడారం, దహన బలిపీఠం ఆ కాలంలో గిబియోనులో ఉన్న ఒక కొండ మీద ఉన్నాయి.
\v 30 అయితే, దావీదు యెహోవా దూత పట్టుకొన్న కత్తికి భయపడి దారి చూపమని దేవుణ్ణి అడగడానికి ఆ స్థలానికి వెళ్ళలేకపోయాడు.
\s5
\c 22
\p
\v 1 దావీదు <<దేవుడైన యెహోవా నివాసం ఉన్న స్థలం ఇదే. ఇశ్రాయేలీయులు అర్పించే దహనబలులకు స్థానం ఇదే>> అని చెప్పాడు.
\s దేవుని మందిరం కట్టించడానికి సిద్ధపాట్లు
\p
\v 2 తరువాత దావీదు, ఇశ్రాయేలీయుల దేశంలో ఉన్న అన్యజాతి వాళ్ళను సమకూర్చమని ఆజ్ఞ ఇచ్చి, దేవుని మందిరం కట్టించడానికి రాళ్లు చెక్కేవారుగా వారిని నియమించాడు.
\s5
\v 3 వాకిలి తలుపులకు కావలసిన మేకులకు, బందులకు భారీగా ఇనుమును, తూయడానికి వీలులేనంత ఇత్తడిని,
\v 4 లెక్కలేనన్ని దేవదారు మానులను దావీదు సంపాదించాడు. సీదోనీయులూ, తూరీయులూ దావీదుకు విస్తారమైన దేవదారు మానులను తీసుకు వస్తూ ఉన్నారు.
\p
\v 5 దావీదు<<నా కొడుకు సొలొమోనుది అనుభవం లేని లేత వయస్సు. యెహోవా కోసం కట్టబోయే మందిరం దాని కీర్తిని బట్టి, అందాన్ని బట్టి, అన్ని దేశాల్లో ప్రసిద్ధి చెందినది, చాలా వైభవోపేతంగా ఉండాలి. కాబట్టి, దానికి కావలసిన సరంజామా అంతటినీ సిద్ధపరుస్తాను>> అని చెప్పి, అతడు తన మరణానికి ముందు విస్తారంగా సామగ్రిని సమకూర్చాడు.
\p
\s5
\v 6 తరువాత అతడు తన కొడుకు సొలొమోనును పిలిపించి, ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవాకు ఒక మందిరం కట్టాలని అతనికి ఆజ్ఞ ఇచ్చాడు.
\v 7 దావీదు సొలొమోనుతో <<నా కుమారా, నేను నా దేవుడైన యెహోవా నామ ఘనత కోసం ఒక మందిరం కట్టించాలని నా హృదయంలో నిశ్చయం చేసుకొన్నప్పుడు,
\v 8 యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, నువ్వు చాలా రక్తపాతం, చాలా యుద్ధాలు చేసిన వాడివి, నువ్వు నా పేరట మందిరం కట్టించకూడదు, నా దృష్టిలో నువ్వు విస్తారంగా రక్తం చిందించావు.
\p
\s5
\v 9 నీకు పుట్టబోయే ఒక కొడుకు శాంతిపరుడు. చుట్టూ ఉండే అతని శత్రువులందరిని నేను తోలివేసి అతనికి శాంతిసమాధానాలు కలగజేస్తాను. ఆ కారణంగా అతనికి సొలొమోను అను పేరు ఉంటుంది. అతని కాలంలో ఇశ్రాయేలీయులకు శాంతి సమాధానాలు, విశ్రాంతి దయచేస్తాను.
\v 10 అతడు నా పేరట ఒక మందిరం కట్టిస్తాడు, అతడు నాకు కొడుకుగా ఉంటాడు. నేనతనికి తండ్రిగా ఉంటాను, ఇశ్రాయేలీయుల మీద అతని రాజ్య సింహాసనాన్ని నిత్యం స్థిరపరుస్తాను, అన్నాడు.
\p
\s5
\v 11 నా కుమారా, యెహోవా నీకు తోడుగా ఉంటాడు గాక. నువ్వు వర్ధిల్లి నీ దేవుడు యెహోవా నీ గురించి చెప్పిన ప్రకారం ఆయనకు మందిరం కట్టిస్తావు.
\v 12 నీ దేవుడు యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించేలా యెహోవా నీకు వివేకమూ తెలివీ ఇచ్చి, ఇశ్రాయేలీయుల మీద నీకు అధికారం దయచేస్తాడు గాక.
\v 13 యెహోవా ఇశ్రాయేలీయులను గూర్చి మోషేకు ఇచ్చిన కట్టడల ప్రకారంగా, ఆయన తీర్చిన తీర్పుల ప్రకారంగా, లోబడడానికి జాగ్రత్త పడితే నీవు వృద్ధి పొందుతావు. ధైర్యం తెచ్చుకుని బలంగా ఉండు. భయపడొద్దు, దిగులు పడొద్దు.
\s5
\v 14 చూడు, నేను చాలా బాధ తీసుకుని యెహోవా మందిరం కోసం మూడు వేల నాలుగు వందల యాభై టన్నుల బంగారం, ముప్ఫై నాలుగు వేల ఐదు వందల టన్నుల వెండీ, తూయడానికి వీలు కానంత విస్తారమైన ఇత్తడీ, ఇనుమూ సమకూర్చాను. మానులను, రాళ్లను తెచ్చి పెట్టాను. దీని కన్నా మరింత ఎక్కువగా నువ్వు సమకూరుస్తావు గాక.
\p
\s5
\v 15 ఇంకా, పని చేయగలిగిన ఎందరో శిల్పకారులూ తాపీ పనివాళ్ళూ వడ్రంగులు, నిపుణులైన పనివాళ్ళు నీ దగ్గర ఉన్నారు.
\v 16 లెక్కకు మించిన బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము నీదగ్గర ఉంది. కాబట్టి నువ్వు పనికి పూనుకో, యెహోవా నీకు తోడుగా ఉంటాడు>> అన్నాడు.
\p
\s5
\v 17 దావీదు తన కొడుకు సొలొమోనుకు సాయం చెయ్యాలని ఇశ్రాయేలీయుల అధిపతులందరికీ ఆజ్ఞాపించాడు.
\v 18 అతడు వారితో <<మీ దేవుడు యెహోవా మీతో ఉన్నాడు గదా? మీ సరిహద్డులంతటా ఆయన మీకు శాంతినిచ్చాడు గదా? దేశనివాసులను ఆయన నా వశం చేశాడు. యెహోవా భయం వల్ల, ఆయన ప్రజల భయం వల్ల దేశం స్వాధీనం అయింది.
\p
\v 19 కాబట్టి, హృదయపూర్వకంగా మీ దేవుడు యెహోవాను కోరుకోడానికి మీ మనస్సులు దృఢపరచుకుని, ఆయన నిబంధన మందసాన్ని, దేవునికి ప్రతిష్ఠితమైన ఉపకరణాలను, ఆయన పేరు కోసం కట్టే ఆ మందిరంలోకి చేర్చడానికి మీరు పూనుకుని దేవుడైన యెహోవా పరిశుద్ధ స్థలాన్ని కట్టండి>> అన్నాడు.
\s5
\c 23
\s యాజకులు, లేవీయులు సమావేశం
\p
\v 1 దావీదు సంవత్సరాలు నిండిన వృద్ధుడయ్యాడు. కాబట్టి అతడు తన కొడుకు సొలొమోనును ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించాడు.
\v 2 ఇంకా అతడు ఇశ్రాయేలీయుల నాయకులందరినీ, యాజకులనూ, లేవీయులనూ సమావేశపరచాడు.
\v 3 అప్పుడు లేవీయులు ముప్ఫై సంవత్సరాలు మొదలుకుని అంతకు పైవయస్సు ఉన్న వాళ్ళను లెక్కలో చేర్చారు. వాళ్ళ సంఖ్య ముప్ఫై ఎనిమిది వేలు.
\p
\s5
\v 4 వాళ్ళల్లో ఇరవై నాలుగు వేలమంది యెహోవా మందిరం పని పర్యవేక్షించే వారుగా, ఆరు వేల మంది అధికారులుగా న్యాయం తీర్చేవారుగా ఉన్నారు.
\v 5 నాలుగు వేలమంది ద్వారపాలకులుగా నియమితులయ్యారు. మరో నాలుగు వేలమందిని దావీదు చేయించిన వాయిద్యాలతో యెహోవాను స్తుతించేవాళ్ళుగా నియమించారు.
\v 6 వారిని దావీదు గెర్షోనీయులు, కహాతీయులు, మెరారీయులు, అనే లేవీయుల గుంపులుగా దావీదు భాగించాడు.
\p
\s5
\v 7 గెర్షోనీయుల్లో లద్దాను, షిమీ అనే వాళ్ళు ఉన్నారు. లద్దాను కొడుకులు ముగ్గురు.
\p
\v 8 వాళ్ళు యెహీయేలు, జేతాము, యోవేలు.
\p
\v 9 షిమీ కొడుకులు ముగ్గురు. వాళ్ళు షెలోమీతు, హజీయేలు, హారాను. వీళ్ళు లద్దాను వంశానికి నాయకులు.
\p
\s5
\v 10 యహతు, జీనా, యూషు, బెరీయా అనే నలుగురూ షిమీ కొడుకులు.
\p
\v 11 యహతు పెద్దవాడు, జీనా రెండోవాడు. యూషుకూ బెరీయాకూ కొడుకులు ఎక్కువ మంది లేరు గనుక తమ పూర్వీకుల యింటివారిలో వారిని ఒక్క వంశంగా లెక్కించారు.
\p
\s5
\v 12 కహాతు కొడుకులు నలుగురు. వాళ్ళు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు.
\p
\v 13 అమ్రాము కొడుకులు అహరోను, మోషే. అహరోనునూ, అతని కొడుకులనూ నిత్యం అతి పరిశుద్ధ వస్తువులను ప్రతిష్ఠించడానికీ, యెహోవా సన్నిధిలో ధూపం వెయ్యడానికీ, ఆయన సేవ జరిగించడానికీ, ఆయన పేరునుబట్టి ప్రజలను దీవించడానికీ ప్రత్యేకించారు.
\v 14 దైవసేవకుడు మోషే సంతతిని లేవి గోత్రం వాళ్ళల్లో లెక్కించారు.
\p
\s5
\v 15 మోషే కొడుకులు గెర్షోము, ఎలీయెజెరు.
\p
\v 16 గెర్షోము కొడుకుల్లో షెబూయేలు పెద్దవాడు.
\p
\v 17 ఎలీయెజెరుకు సంతానం రెహబ్యా. అతనికి ఇంకెవ్వరూ కొడుకులు లేరు. అయితే రెహబ్యాకు చాలా మంది కొడుకులున్నారు.
\p
\v 18 ఇస్హారు కొడుకుల్లో షెలోమీతు పెద్దవాడు.
\p
\s5
\v 19 హెబ్రోను కొడుకుల్లో యెరీయా పెద్దవాడు, అమర్యా రెండోవాడు, యహజీయేలు మూడోవాడు, యెక్మెయాము నాలుగోవాడు.
\p
\v 20 ఉజ్జీయేలు కొడుకుల్లో మీకా పెద్దవాడు, యెషీయా రెండోవాడు.
\p
\s5
\v 21 మెరారి కొడుకులు మహలి, మూషి. మహలి కొడుకులు ఎలియాజరు, కీషు.
\p
\v 22 ఎలియాజరు చనిపోయినప్పుడు అతనికి కూతుళ్ళు ఉన్నారు గాని కొడుకులు లేరు. కీషు కొడుకులూ, వాళ్ళ సహోదరులూ వాళ్ళను పెళ్లి చేసుకున్నారు.
\p
\v 23 మూషి కొడుకులు ముగ్గురు. వాళ్ళు మహలి, ఏదెరు, యెరీమోతు.
\s లేవీయుల విధులు
\p
\s5
\v 24 వీళ్ళు తమ పూర్వికుల వంశాల ప్రకారం లేవీయులుగా లెక్కించారు. పూర్వీకుల ఇళ్ళకు పెద్దలైన వీళ్ళు ఇరవై సంవత్సరాలు మొదలుకుని అంతకు పైవయస్సు గలవారు తమ తమ పేర్ల లెక్క ప్రకారం ఒక్కొక్కరుగా లెక్కకు వచ్చి, యెహోవా మందిరపు సేవ పని చేసేవారయ్యారు.
\v 25 అప్పుడు దావీదు <<ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా తన ప్రజలకు నెమ్మది దయచేశాడు గనుక వాళ్ళు నిత్యం యెరూషలేములో నివాసం చేస్తారు.
\v 26 లేవీయులు కూడా ఇక మీదట గుడారాన్నైనా, దాని సేవకొరకైన ఉపకారణాలనైనా మోసే పని లేదు>> అని చెప్పాడు.
\p
\s5
\v 27 దావీదు ఇచ్చిన చివరి ఆజ్ఞను బట్టి లేవీయుల్లో ఇరవై సంవత్సరాలు మొదలుకుని అంతకు పైవయస్సు ఉన్నవాళ్ళు లెక్కలోకి వచ్చారు.
\v 28 వీళ్ళు అహరోను సంతతివాళ్ళ చేతి కింద పనిచెయ్యాలి. వాళ్ళ వశంలో ఉన్న యెహోవా మందిర సేవ కోసం శాలల్లో, గదుల్లో ఉంచిన ప్రతిష్ఠిత వస్తువులు అన్నీ శుద్ధి చెయ్యడానికీ, దేవుని మందిర సేవ కొరకైన పనిని పర్యవేక్షించడానికీ వారు ఉన్నారు.
\v 29 సన్నిధి రొట్టెలు, నైవేద్యం కోసం కావలసిన మెత్తని పిండి, పులియని అప్పడం, పెనంలో కాల్చిన దాన్నీ, నూనెలో వేయించిన దాన్నీ, నానారకాలైన పరిమాణాల, కొలతల చొప్పున సిద్ధపరచడం వారి పని.
\p
\s5
\v 30 ప్రతిరోజూ ఉదయ సాయంకాలాల్లో యెహోవాను గూర్చిన స్తుతి పాటలు పాడడానికీ కొందరు ఉన్నారు. విశ్రాంతి దినాల్లో, అమావాస్యల్లో, పండగల్లో, యెహోవాకు దహనబలులను అర్పించాల్సిన సమయాలన్నిట్లో లెక్క ప్రకారం తమ వంతు ప్రకారం నిత్యం యెహోవా సన్నిధిలో సేవ జరిగించడానికి వారిని నియమించారు.
\v 31 సమాజపు గుడారాన్ని, పరిశుద్ధ స్థలాన్ని కాపాడడం,
\s5
\v 32 యెహోవా మందిరపు సేవతో సంబంధం ఉన్న పనుల్లో తమ సహోదరులైన అహరోను సంతతి వాళ్లకు సాయం చెయ్యడం, వాళ్లకు నియమించిన పని.
\s5
\c 24
\s యాజకుల విభజన
\p
\v 1 అహరోను సంతానం విభజన ఎలా ఉందంటే, అహరోను కొడుకులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు.
\v 2 నాదాబు, అబీహు, సంతానం లేకుండానే తమ తండ్రి కంటే ముందుగా చనిపోయారు గనుక ఎలియాజరు, ఈతామారు యాజకత్వం జరుపుతూ వచ్చారు.
\v 3 దావీదు ఎలియాజరు సంతానంలో సాదోకును, ఈతామారు సంతానంలో అహీమెలెకును ఏర్పాటు చేసి, వారి జనం లెక్కను బట్టి పని నియమించాడు.
\p
\s5
\v 4 వాళ్ళను ఏర్పాటు చెయ్యడంలో ఈతామారు సంతానంలోని పెద్దలకంటే ఎలియాజరు సంతానంలోని పెద్దలు ఎక్కువగా కనిపించారు గనుక ఎలియాజరు సంతానంలో పదహారుగురు తమ పూర్వీకుల ఇంటివాళ్లను పెద్దలుగానూ, ఈతామారు సంతానంలో ఎనిమిదిమంది తమ తమ పూర్వీకుల ఇంటివాళ్లను పెద్దలుగానూ నియమించడం జరిగింది.
\v 5 ఎలియాజరు సంతానంలో ఉన్నవాళ్ళు, ఈతామారు సంతానంలో కొందరూ దేవునికి ప్రతిష్ఠితులైన అధికారులుగా ఉన్నారు గనుక పరిశుద్ధ స్థలానికి అధికారులుగా ఉండడానికి చీట్లు వేసి వంతులు పంచుకున్నారు.
\p
\s5
\v 6 లేవీయుల్లో శాస్త్రిగా ఉన్న నెతనేలు కొడుకు షెమయా, ఈ జాబితా రాశాడు. రాజు, అధికారులు, యాజకుడు సాదోకు, అబ్యాతారు కొడుకు అహీమెలెకు, యాజకులు, లేవీయులు, పూర్వీకుల ఇంటిపెద్దలు, వీళ్ళందరి సమక్షంలో వాళ్ళ పేర్లు రాశాడు. ఒక్కొక్క పాత్రలోనుంచి ఒక పూర్వీకుని వంశం చీటీ తీసినప్పుడు, ఒకటి ఎలియాజరు పేరట, తరువాత ఇంకొకటి ఈతామారు పేరట తీశారు.
\p
\s5
\v 7 మొదటి చీటి యెహోయారీబుకు, రెండోది యెదాయాకు,
\p
\v 8 మూడోది హారీముకు, నాలుగోది శెయొరీముకు,
\p
\v 9 అయిదోది మల్కీయాకు, ఆరోది మీయామినుకు,
\p
\v 10 ఏడోది హక్కోజుకు, ఎనిమిదోది అబీయాకు,
\p
\s5
\v 11 తొమ్మిదోది యేషూవకు, పదోది షెకన్యాకు, పదకొండోది ఎల్యాషీబుకు,
\p
\v 12 పండ్రెండోది యాకీముకు,
\p
\v 13 పదమూడోది హుప్పాకు, పదనాలుగోది యెషెబాబుకు,
\p
\v 14 పదిహేనోది బిల్గాకు, పదహారోది ఇమ్మేరుకు,
\p
\s5
\v 15 పదిహేడోది హెజీరుకు, పద్దెనిమిదోది హప్పిస్సేసుకు,
\p
\v 16 పంతొమ్మిదోది పెతహయాకు, ఇరవైయవది యెహెజ్కేలుకు,
\p
\v 17 ఇరవై ఒకటోది యాకీనుకు, ఇరవై రెండోది గామూలుకు,
\p
\v 18 ఇరవై మూడోది దెలాయ్యాకు, ఇరవైనాలుగోది మయజ్యాకు పడ్డాయి.
\p
\s5
\v 19 ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా వాళ్ళ పితరుడైన అహరోనుకు ఆజ్ఞాపించిన ప్రకారంగా వాళ్ళు తమ పద్ధతి ప్రకారం యెహోవా మందిరంలో ప్రవేశించి చెయ్యవలసిన సేవాధర్మం ఈ విధంగా ఏర్పాటు అయింది.
\p
\s5
\v 20 మిగిలిన లేవీ సంతానం ఎవరంటే, అమ్రాము సంతానంలో షూబాయేలు, షూబాయేలు సంతానంలో యెహెద్యాహు,
\p
\v 21 రెహబ్యా ఇంట్లో అంటే రెహబ్యా సంతానంలో పెద్దవాడు ఇష్షీయా,
\p
\v 22 ఇస్హారీయుల్లో షెలోమోతు, షెలోమోతు సంతానంలో యహతు,
\p
\s5
\v 23 హెబ్రోను సంతానంలో పెద్దవాడు యెరీయా, రెండోవాడు అమర్యా, మూడోవాడు యహజీయేలు, నాలుగోవాడు యెక్మెయాములు.
\p
\v 24 ఉజ్జీయేలు సంతానంలో మీకా, మీకా సంతానంలో షామీరు,
\p
\v 25 ఇష్షీయా సంతానంలో జెకర్యా,
\p
\s5
\v 26 మెరారీ సంతానంలో మహలి, మూషి అనేవాళ్ళు, యహజీయాహు సంతానంలో బెనో.
\p
\v 27 యహజీయాహు వలన మెరారికి కలిగిన కొడుకులు ఎవరంటే, బెనో, షోహము, జక్కూరు, ఇబ్రీ.
\p
\v 28 మహలికి ఎలియాజరు పుట్టాడు, ఇతనికి కొడుకులు లేరు.
\p
\s5
\v 29 కీషు సంతతి వారిలో యెరహ్మెయేలు ఉన్నాడు.
\p
\v 30 మూషి కొడుకులు మహలి, ఏదెరు, యెరీమోతు. వీళ్ళు తమ కుటుంబ లెక్కల్లో ఉన్న లేవీయులు.
\p
\v 31 రాజైన దావీదు ఎదుటా, యాజకులైన సాదోకు, అహీమెలెకుల ఎదుటా వీరంతా చీట్లు వేశారు. వంశంలో పెద్ద కొడుకుల కుటుంబాల వారు, చిన్న కొడుకుల కుటుంబాల వారితో కలిసి చీట్లు వేసుకున్నారు. వీరంతా తమ సహోదరులైన అహరోను సంతానం చేసినట్టే చీట్లు వేసుకున్నారు.
\s5
\c 25
\s సంగీతకారుల నియామకం
\p
\v 1 దావీదు, మందిరం పనుల కోసం ఏర్పరచిన అధిపతులూ కలిసి, ఆసాపు, హేమాను, యెదూతూను అనేవాళ్ళ కొడుకుల్లో కొందరిని సేవ నిమిత్తం ప్రత్యేకపరచి, సితారాలను, స్వరమండలాలను, కంచు తాళాలను వాయిస్తూ ప్రవచించేలా నియమించారు. ఈ సేవా వృత్తిని బట్టి ఏర్పాటైన వాళ్ళ సంఖ్య ఎంతంటే,
\p
\v 2 ఆసాపు కొడుకుల్లో రాజాజ్ఞప్రకారం ప్రవచిస్తూ, ఆసాపు చేతికింద ఉండేవాళ్ళు జక్కూరు, యోసేపు, నెతన్యా, అషర్యేలా, అనే వాళ్ళు.
\p
\v 3 యెదూతూను సంబంధుల్లో స్తుతిపాటలు పాడుతూ యెహోవాను స్తుతించడానికి తీగవాయిద్యం వాయిస్తూ ప్రవచించే తమ తండ్రి యెదూతూను చేతికింద ఉండేవాళ్ళు గెదల్యా, జెరీ, యెషయా, హషబ్యా, మత్తిత్యా అనే ఆరుగురు.
\p
\s5
\v 4 హేమాను సంబంధుల్లో హేమాను కొడుకులు బక్కీయాహు, మత్తన్యా, ఉజ్జీయేలు, షెబూయేలు, యెరీమోతు, హనన్యా, హనానీ, ఎలీయ్యాతా, గిద్దల్తీ, రోమమ్తియెజెరు, యొష్బెకాషా, మల్లోతి, హోతీరు, మహజీయోతు అనేవాళ్ళు.
\p
\v 5 వీళ్ళందరూ దేవుని వాక్కు విషయంలో రాజుకు ప్రవక్త అయిన హేమాను కొడుకులు. హేమానును గొప్ప చెయ్యడానికి దేవుడు హేమానుకు పద్నాలుగు మంది కొడుకులను, ముగ్గురు కూతుళ్ళను అనుగ్రహించాడు.
\p
\s5
\v 6 వీళ్ళందరూ ఆసాపుకూ, యెదూతూనుకూ, హేమానుకూ, రాజు చేసిన కట్టడ ప్రకారం యెహోవా ఇంట్లో తాళాలు, స్వరమండలాలు, తీగ వాయిద్యాలు వాయిస్తూ, పాటలు పాడుతూ, తమ తండ్రి చేతి కింద దేవుని మందిరం సేవ జరిగిస్తూ ఉన్నారు.
\p
\v 7 యెహోవాకు పాటలు పాడడంలో నేర్పు గల తమ సహోదరులతో పాటు ఉన్న ప్రవీణులైన వాద్యకారుల లెక్క రెండు వందల ఎనభై ఎనిమిది.
\p
\v 8 తాము చేసే సేవ విషయంలో చిన్న అనీ, పెద్ద అనీ, గురువనీ శిష్యుడనీ భేదం లేకుండా వంతుల కోసం చీట్లు వేశారు.
\p
\s5
\v 9 మొదటి చీటి ఆసాపు వంశంలో ఉన్న యోసేపు పేరట పడింది,
\p రెండోది గెదల్యా పేరట పడింది. ఇతనూ, ఇతని సహోదరులూ కొడుకులూ పన్నెండుమంది.
\p
\v 10 మూడోది జక్కూరు పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండుమంది.
\p
\v 11 నాలుగోది యిజ్రీ పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండుమంది.
\p
\v 12 అయిదోది నెతన్యా పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.
\p
\s5
\v 13 ఆరోది బక్కీయాహు పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.
\p
\v 14 ఏడోది యెషర్యేలా పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.
\p
\v 15 ఎనిమిదోది యెషయా పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.
\p
\v 16 తొమ్మిదోది మత్తన్యా పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.
\p
\s5
\v 17 పదోది షిమీ పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.
\p
\v 18 పదకొండోది అజరేలు పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.
\p
\v 19 పన్నెండోది హషబ్యా పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.
\p
\v 20 పదమూడోది షూబాయేలు పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.
\p
\s5
\v 21 పదునాలుగోది మత్తిత్యా పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.
\p
\v 22 పదిహేనోది యెరేమోతు పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.
\p
\v 23 పదహారోది హనన్యా పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.
\p
\v 24 పదిహేడోది యొష్బెకాషా పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.
\p
\s5
\v 25 పద్దెనిమిదోది హనానీ పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.
\p
\v 26 పందొమ్మిదవది మల్లోతి పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.
\p
\v 27 ఇరవయ్యోది ఎలీయ్యాతా పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.
\p
\v 28 ఇరవై ఒకటోది హోతీరు పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.
\p
\s5
\v 29 ఇరవై రెండోది గిద్దల్తీ పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.
\p
\v 30 ఇరవై మూడోది మహజీయోతు పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.
\p
\v 31 ఇరవై నాలుగోది రోమమ్తీయెజెరు పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.
\s5
\c 26
\s ద్వారపాలకుల నియామకం
\p
\v 1 ఇది ద్వారపాలకుల విభజన గూర్చిన సంగతి. ఆసాపు సంతానంలో కోరే కొడుకు మెషెలెమ్యా కోరహు సంతానం వాడు.
\p
\v 2 మెషెలెమ్యా కొడుకులు ఎవరంటే జెకర్యా పెద్దవాడు, యెదీయవేలు రెండోవాడు, జెబద్యా మూడోవాడు, యత్నీయేలు నాల్గోవాడు.
\p
\v 3 ఏలాము అయిదోవాడు, యెహోహనాను ఆరోవాడు, ఎల్యోయేనై ఏడోవాడు.
\p
\s5
\v 4 దేవుడు ఓబేదెదోమును ఆశీర్వదించి అతనికి కొడుకులను దయ చేశాడు. వాళ్ళెవరంటే, షెమయా పెద్దవాడు, యెహోజాబాదు రెండోవాడు, యోవాహు మూడోవాడు, శాకారు నాల్గోవాడు, నెతనేలు అయిదోవాడు,
\p
\v 5 అమ్మీయేలు ఆరోవాడు, ఇశ్శాఖారు ఏడోవాడు, పెయుల్లెతై ఎనిమిదోవాడు.
\v 6 అతని కొడుకు షెమయాకు కొడుకులు పుట్టారు. వాళ్ళు పరాక్రమశాలులుగా ఉండి తమ తండ్రి కుటుంబంలో పెద్దలయ్యారు.
\p
\s5
\v 7 షెమయా కొడుకులు ఒత్ని, రెఫాయేలు, ఓబేదు, యెల్జాబాదు, బలవంతులైన అతని సహోదరులు ఎలీహు, సెమక్యా.
\p
\v 8 ఓబేదెదోము కొడుకులూ, వాళ్ళ కొడుకులూ వాళ్ళ సహోదరులూ అరవై ఇద్దరు, వాళ్ళు తమ పని చెయ్యడంలో గట్టివాళ్ళు.
\p
\v 9 మెషెలెమ్యాకు పుట్టిన కొడుకులూ, సహోదరులూ, పరాక్రమశాలురు. వీళ్ళు పద్దెనిమిది మంది.
\s5
\v 10 మెరారీయుల్లో హోసా అనే అతనికి పుట్టిన కొడుకులు పెద్దవాడు షిమ్రీ, అతడు పెద్దకొడుకు కాకపోయినా అతని తండ్రి అతన్ని నాయకునిగా చేశాడు.
\p
\v 11 రెండోవాడు హిల్కీయా, మూడోవాడు టెబల్యాహు, నాలుగోవాడు జెకర్యా, హోసా కొడుకులూ, సహోదరులూ అందరూ కలిసి పదముగ్గురు.
\p
\s5
\v 12 ఈ విధంగా ఏర్పాటైన తరగతులనుబట్టి యెహోవా మందిరంలో వంతుల ప్రకారం తమ సోదరులు సేవ చెయ్యడానికి ఈ ద్వారపాలకులు, అంటే వాళ్ళలో ఉన్న పెద్దలు వాళ్ళను జవాబుదారులుగా నియమించడం జరిగింది.
\p
\v 13 చిన్నలకైనా పెద్దలకైనా పూర్వీకుల ఇంటి వరసనుబట్టి ఒక్కొక్క ద్వారం దగ్గర కావలి ఉండడానికి వాళ్ళు చీట్లు వేశారు.
\v 14 తూర్పు వైపు కావలి షెలెమ్యాకు పడింది, వివేకం గలిగి ఆలోచన చెప్పగలిగిన అతని కొడుకు జెకర్యాకు చీటివేసినప్పుడు ఉత్తరం వైపు కావలి అతనికి పడింది.
\p
\s5
\v 15 ఓబేదెదోముకు దక్షిణం వైపు కావలీ, అతని కొడుకులకు గిడ్డంగుల కావలి పడింది.
\v 16 షుప్పీముకూ, హోసాకూ, పడమటి వైపున ఉన్న షల్లెకెతు గుమ్మానికి ఎక్కే రాజమార్గాన్ని కాయడానికి చీటి పడింది.
\p
\s5
\v 17 తూర్పున లేవీయులైన ఆరుగురు, ఉత్తరాన రోజుకు నలుగురూ, దక్షిణాన రోజుకు నలుగురూ, గిడ్డంగుల దగ్గర ఇద్దరిద్దరూ,
\v 18 బయట ద్వారం దగ్గర పడమరగా ఎక్కి వెళ్ళే రాజమార్గం దగ్గర నలుగురూ, బయట దారిలో ఇద్దరూ, ఏర్పాటు అయ్యారు.
\v 19 కోరే సంతానంలోనూ, మెరారీయుల్లోనూ ద్వారం కావలి కాసే వాళ్లకు ఈ విధంగా వంతులు వచ్చాయి.
\s ధనాగారం ఏర్పాటు
\p
\s5
\v 20 చివరికి లేవీయుల్లో అహీయా అనేవాడు దేవుని మందిరపు గిడ్డంగులనూ, ప్రతిష్ఠిత వస్తువుల గిడ్డంగులనూ కాసేవాడుగా నియామకం జరిగింది.
\v 21 ఇది లద్దాను సంతానం గూర్చినది. గెర్షోనీయుడైన లద్దాను కొడుకులు, అంటే, గెర్షోనీయులుగా ఉంటూ తమ పూర్వీకుల కుటుంబాలకు పెద్దలై ఉన్నవాళ్ళను గూర్చినది.
\v 22 యెహీయేలీ కొడుకులైన జేతాము, అతని సహోదరుడు యోవేలు, యెహోవా మందిరపు గిడ్డంగులకు కావలి కాసేవాళ్ళు.
\p
\s5
\v 23 ఇది అమ్రామీయులు, ఇస్హారీయులు, హెబ్రోనీయులు, ఉజ్జీయేలీయులు, అనేవాళ్ళను గూర్చినది.
\v 24 మోషే కొడుకు గెర్షోముకు పుట్టిన షెబూయేలుకు గిడ్డంగుల మీద ప్రధానిగా నియామకం జరిగింది.
\v 25 ఎలీయెజెరు సంతానం వాళ్ళు షెబూయేలు సహోదరులు ఎవరంటే,
\p అతని కొడుకు రెహబ్యా,
\p రెహబ్యా కొడుకు యెషయా,
\p యెషయా కొడుకు యెహోరాము,
\p యెహోరాము కొడుకు జిఖ్రీ,
\p జిఖ్రీ కొడుకు షెలోమీతు.
\p
\s5
\v 26 రాజైన దావీదూ, పూర్వీకుల కుటుంబాల పెద్దలూ, సహస్రాధిపతులూ, శతాధిపతులూ, సైన్యాధిపతులూ ప్రతిష్ఠించిన ప్రత్యేకమైన సామగ్రి ఉన్న గిడ్డంగులకు షెలోమీతూ, అతని సహోదరులూ కావలి కాసేవాళ్ళయ్యారు.
\v 27 యెహోవా మందిరం మరమ్మతు పనుల కోసం యుద్ధాల్లో పట్టుకున్న కొల్లసొమ్ము కొంత భాగాన్ని వీరు సమర్పించారు.
\v 28 ప్రవక్త అయిన సమూయేలు, కీషు కొడుకు సౌలు, నేరు కొడుకు అబ్నేరు, సెరూయా కొడుకు యోవాబు ప్రతిష్ఠించిన సొమ్మంతటినీ షెలోమీతు, అతని సహోదరుల ఆధీనంలో ఉంచారు.
\p
\s5
\v 29 ఇది ఇస్హారీయులను గూర్చినది. వాళ్ళల్లో కెనన్యా, అతని కొడుకులను, పురపాలన జరిగించడానికి ఇశ్రాయేలీయులకు లేఖికులుగా, న్యాయాధిపతులుగా నియమించారు.
\p
\v 30 ఇది హెబ్రోనీయులను గూర్చినది. హషబ్యా, అతని సహోదరులు పరాక్రమశాలురు. వీళ్ళు పదిహేడువేల మంది. వీళ్ళు యొర్దాను ఇవతల పడమటి వైపున ఉండే ఇశ్రాయేలీయుల మీద యెహోవా సేవను గూర్చిన వాటన్నిటి విషయంలోనూ, రాజు నియమించిన పని విషయంలోనూ, పర్యవేక్షకులుగా నియమితులయ్యారు.
\p
\s5
\v 31 ఇది హెబ్రోనీయులను గూర్చినది. హెబ్రోనీయుల పూర్వీకుల ఇంటి పెద్దలందరికీ యెరీయా పెద్ద. దావీదు ఏలుబడిలో నలభయ్యవ సంవత్సరంలో వాళ్ళ సంగతి పరిశీలించినప్పుడు, వాళ్ళల్లో గిలాదు దేశంలోని యాజేరులో ఉన్న వాళ్ళు పరాక్రమశాలురుగా కనిపించారు.
\v 32 పరాక్రమశాలురైన అతని సంబంధులు రెండువేల ఏడువందల మంది కుటుంబ పెద్దలుగా కనిపించారు. దావీదు దైవసంబంధమైన కార్యాల విషయంలోనూ, రాజకార్యాల విషయంలోనూ, రూబేనీయుల మీదా, గాదీయుల మీదా, మనష్షే అర్థగోత్రపు వాళ్ళ మీదా వాళ్ళను నియమించాడు.
\s5
\c 27
\s సైనిక, పురపాలక అధికారులు
\p
\v 1 ప్రజాసంఖ్యను బట్టి ఇది ఇశ్రాయేలీయుల పూర్వీకుల కుటుంబ పెద్దలు, సహస్రాధిపతులు, శతాధిపతులు, వాళ్ళ లెక్క గురించినది. అంటే ఏర్పాటైన వంతుల విషయంలో ప్రతి సంవత్సరం, ప్రతి నెలా రాజుకు సేవ చేసిన వాళ్ళ గురించినది. వీళ్ళ సంఖ్య ఇరవై నాలుగు వేలు.
\p
\v 2 మొదటి నెల మొదటి గుంపు మీద జబ్దీయేలు కొడుకు యాషాబాము అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో ఇరవై నాలుగు వేల మంది ఉన్నారు.
\v 3 పెరెజు సంతానంలో ఒకడు మొదటి నెలలో సైన్యాధిపతులకందరికీ అధిపతిగా ఉన్నాడు.
\p
\s5
\v 4 రెండో నెల వంతు అహోహీయుడైన దోదై, అతని గుంపుదీ అయింది. అతని గుంపులో మిక్లోతు అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
\p
\v 5 మూడో నెల యెహోయాదా కొడుకూ, సభాముఖ్యుడైన బెనాయా అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరినవాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
\v 6 ఈ బెనాయా ఆ ముప్ఫై మంది పరాక్రమశాలుల్లో ఒకడై ఆ ముప్ఫైమందికి అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో అతని కొడుకు అమ్మీజాబాదు ఉన్నాడు.
\p
\s5
\v 7 నాలుగో నెల యోవాబు సహోదరుడు అశాహేలు నాలుగో అధిపతిగా ఉన్నాడు. అతని కొడుకు జెబద్యా అతని తరువాత అధిపతి అయ్యాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
\p
\v 8 అయిదో నెల ఇశ్రాహేతీయుడైన షంహూతు అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
\p
\v 9 ఆరో నెల తెకోవీయుడైన ఇక్కేషుకు పుట్టిన ఈరా అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
\p
\s5
\v 10 ఏడో నెల ఎఫ్రాయిము సంతతివాడూ, పెలోనీయుడు అయిన హేలెస్సు అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
\p
\v 11 ఎనిమిదో నెల జెరహీయుల బంధువూ, హుషాతీయుడు అయిన సిబ్బెకై అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
\p
\v 12 తొమ్మిదో నెల బెన్యామీనీయుల బంధువూ, అనాతోతీయుడు అయిన అబీయెజెరు అధిపతిగా ఉన్నాడు, అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
\p
\s5
\v 13 పదో నెల జెరహీయుల బంధువూ, నెటోపాతీయుడు అయిన మహరై అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
\p
\v 14 పదకొండో నెల ఎఫ్రాయిము సంతానం వాడూ, పిరాతోనీయుడు అయిన బెనాయా అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
\p
\v 15 పన్నెండో నెల ఒత్నీయేలు బంధువూ, నెటోపాతీయుడు అయిన హెల్దయి అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
\s ఇతర అధికారులు
\p
\s5
\v 16 ఇంకా, ఇశ్రాయేలీయుల గోత్రాల మీద ఉన్నవాళ్ళ వివరం, జిఖ్రీ కొడుకు ఎలీయెజెరు రూబేనీయులకు అధిపతిగా ఉన్నాడు,
\p మయకా కొడుకు షెపట్య షిమ్యోనీయులకు అధిపతిగా ఉన్నాడు,
\p
\v 17 కెమూయేలు కొడుకు హషబ్యా లేవీయులకు అధిపతిగా ఉన్నాడు,
\p సాదోకు అహరోనీయులకు అధిపతిగా ఉన్నాడు.
\p
\v 18 దావీదు సహోదరుల్లో ఎలీహు అనే ఒకడు యూదా వాళ్లకు అధిపతిగా ఉన్నాడు.
\p మిఖాయేలు కొడుకు ఒమ్రీ ఇశ్శాఖారీయులకు అధిపతిగా ఉన్నాడు,
\p
\s5
\v 19 ఓబద్యా కొడుకు ఇష్మయా జెబూలూనీయులకు అధిపతిగా ఉన్నాడు.
\p అజ్రీయేలు కొడుకు యెరీమోతు నఫ్తాలీయులకు అధిపతిగా ఉన్నాడు.
\p
\v 20 అజజ్యాహు కొడుకు హోషేయ ఎఫ్రాయిమీయులకు అధిపతిగా ఉన్నాడు.
\p మనష్షే అర్థగోత్రం వాళ్లకు పెదాయా కొడుకు యోవేలు అధిపతిగా ఉన్నాడు.
\p
\v 21 గిలాదులో ఉన్న మనష్షే అర్థగోత్రం వాళ్లకు జెకర్యా కొడుకు ఇద్దో అధిపతిగా ఉన్నాడు.
\p బెన్యామీనీయులకు అబ్నేరు కొడుకు యహశీయేలు అధిపతిగా ఉన్నాడు.
\p
\v 22 దానీయులకు యెరోహాము కొడుకు అజరేలు అధిపతిగా ఉన్నాడు. వీళ్ళు ఇశ్రాయేలు గోత్రాలకు అధిపతులు.
\p
\s5
\v 23 ఇశ్రాయేలీయులను ఆకాశ నక్షత్రాలంత విస్తారంగా చేస్తానని యెహోవా చెప్పాడు గనుక ఇరవై సంవత్సరాలు మొదలుకుని, అంతకు తక్కువ వయస్సు ఉన్నవాళ్ళను దావీదు ప్రజాసంఖ్యలో చేర్చలేదు.
\v 24 ప్రజాసంఖ్య చూసే విషయంలో ఇశ్రాయేలీయుల మీదికి ఉగ్రత వచ్చిన కారణంగా సెరూయా కొడుకు యోవాబు దాన్ని చెయ్యడం ఆరంభించాడు గాని దాన్ని ముగించలేదు. కాబట్టి ప్రజాసంఖ్య మొత్తం దావీదు రాజు వృత్తాంత గ్రంథాల్లో చేర్చలేదు.
\p
\s5
\v 25 రాజు గిడ్డంగుల మీద అదీయేలు కొడుకు అజ్మావెతు నియామకం జరిగింది.
\p అయితే పొలాల్లో, పట్టణాల్లో గ్రామాల్లో, దుర్గాల్లో ఉన్న ఆస్తి మీద ఉజ్జియా కొడుకు యెహోనాతాను నియామకం జరిగింది.
\p
\v 26 పొలాల్లో పనిచేసే వాళ్ళ మీద, భూమి దున్నే వాళ్ళ మీద కెలూబు కొడుకు ఎజ్రీ నియామకం జరిగింది.
\p
\v 27 ద్రాక్షతోటల మీద రామాతీయుడైన షిమీ,
\p ద్రాక్షతోటల ఆదాయమైన ద్రాక్షామధురసం నిలువ చేసే కొట్ల మీద షిష్మీయుడైన జబ్ది నియామకం జరిగింది.
\p
\s5
\v 28 షెఫేలా ప్రదేశంలో ఉన్న ఒలీవ చెట్ల మీద, మేడిచెట్ల మీద గెదేరీయుడైన బయల్‌ హనాను నియామకం జరిగింది.
\p నూనె కొట్ల మీద యోవాషు నియామకం జరిగింది.
\p
\v 29 షారోనులో మేసే పశువుల మీద షారోనీయుడైన షిట్రయి,
\p లోయల్లో ఉన్న పశువుల మీద అద్లయి కొడుకు షాపాతు నియామకం జరిగింది.
\p
\s5
\v 30 ఒంటెల మీద ఇష్మాయేలీయుడైన ఓబీలు,
\p గాడిదల మీద మేరోనోతీయుడైన యెహెద్యాహు నియామకం జరిగింది.
\p
\v 31 గొర్రెల మీద హగ్రీయుడైన యాజీజు నియామకం జరిగింది. వీళ్ళందరూ దావీదు రాజు ఆస్తి మీద నియమించిన అధిపతులు.
\p
\s5
\v 32 దావీదు పినతండ్రి యోనాతాను వివేకం కలిగిన ఆలోచనకర్తగా ఉన్నాడు గనుక అతన్ని ప్రధానమంత్రిగా నియమించారు.
\p హక్మోనీ కొడుకు యెహీయేలు రాకుమారుల దగ్గర ఉండడానికి నియమించారు.
\p
\v 33 అహీతోపెలు రాజుకు మంత్రి.
\p అర్కీయుడైన హూషై రాజుకు అంతరంగిక సలహాదారు.
\v 34 అహీతోపెలు చనిపోయిన తరువాత బెనాయా కొడుకు యెహోయాదా, అబ్యాతారు మంత్రులయ్యారు.
\p రాజు సేనకు యోవాబు సర్వసైన్యాధ్యక్షుడు.
\s5
\c 28
\s దేవాలయం కట్టడానికి దావీదు ఏర్పాట్లు
\p
\v 1 గోత్రాల పెద్దలనూ, వంతుల చొప్పున రాజుకు సేవ చేసే అధిపతులనూ సహస్రాధిపతులనూ, శతాధిపతులనూ, రాజుకూ, రాకుమారులకూ ఉన్న యావత్తు స్థిర చరాస్తుల మీదా ఉన్న అధిపతులను అంటే ఇశ్రాయేలీయుల పెద్దలనందరినీ, రాజు దగ్గరున్న పరివారాన్నీ, పరాక్రమశాలురనూ, సేవా సంబంధులైన పరాక్రమశాలులందరినీ రాజైన దావీదు యెరూషలేములో సమావేశపరిచాడు.
\p
\s5
\v 2 అప్పుడు రాజైన దావీదు లేచి నిలబడి<<నా సహోదరులారా, నా ప్రజలారా, నా మాట ఆలకించండి. యెహోవా నిబంధన మందసానికీ, మన దేవుని పాదపీఠంగా ఉండడానికీ, ఒక మందిరం కట్టించాలని నేను నా హృదయంలో నిశ్చయం చేసుకుని సమస్తం సిద్ధపరచాను.>>
\p
\v 3 అయితే<<నువ్వు యుద్ధాలు జరిగించి రక్తం ఒలికించిన వాడవు గనుక నువ్వు నా పేరట మందిరం కట్టించకూడదు>> అని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు.
\p
\s5
\v 4 ఇశ్రాయేలీయుల మీద నిత్యం రాజుగా ఉండడానికి ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా నా తండ్రి ఇంటి వాళ్ళందర్లో నన్ను కోరుకున్నాడు. ఆయన యూదా గోత్రానికి, యూదా గోత్రం వాళ్ళలో ప్రధానమైనదిగా నా తండ్రి ఇంటినీ, నా తండ్రి ఇంట్లో నన్నూ ఏర్పరచుకుని, నా మీద దయ చూపించి, ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించాడు.
\v 5 యెహోవా నాకు చాలా మంది కొడుకులను దయ చేశాడు. అయితే ఇశ్రాయేలీయుల మీద, యెహోవా రాజ్యసింహాసనం మీద కూర్చోడానికి ఆయన నా కొడుకులందరిలో సొలొమోనును కోరుకున్నాడు. ఆయన నాతో,
\p
\s5
\v 6 <<నేను నీ కొడుకు సొలొమోనును నాకు కొడుకుగా ఏర్పరచుకొన్నాను. నేను అతనికి తండ్రిగా ఉంటాను. అతడు నా మందిరాన్నీ, నా ఆవరణాలూ కట్టిస్తాడు.
\v 7 ఈ రోజు చేస్తున్నట్టుగా అతడు ధైర్యంతో నా ఆజ్ఞలూ, నా న్యాయవిధులూ పాటిస్తే, నేను అతని రాజ్యాన్ని నిత్యం స్థిరపరుస్తాను>> అన్నాడు.
\p
\s5
\v 8 <<కాబట్టి మీరు ఈ మంచి దేశాన్ని స్వాస్థ్యంగా అనుభవించి, మీ తరువాత మీ సంతానానికి శాశ్వత స్వాస్థ్యంగా దాన్ని అప్పగించేలా మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఆజ్ఞలు అన్నీ తెలుసుకుని వాటిని పాటించండి.
\p
\s5
\v 9 సొలొమోనూ, నా కుమారా, నీ తండ్రి దేవుడైన యెహోవా అందరి హృదయాలను పరిశీలిస్తాడు. ఆయన అందరి ఆలోచనలూ, ఉద్దేశాలూ తెలిసిన వాడు. నువ్వు ఆయన్ని తెలుసుకుని హృదయ పూర్వకంగా, మనస్పూర్తిగా, ఆయన్ని సేవించు. ఆయన్ని కోరుకుంటే ఆయన నీకు ప్రత్యక్షం ఔతాడు, నువ్వు ఆయన్ని విడిచి పెడితే ఆయన నిన్ను శాశ్వతంగా తోసివేస్తాడు.
\v 10 పరిశుద్ధ స్థలంగా ఉండడానికి ఒక మందిరాన్ని కట్టించడానికి యెహోవా నిన్ను కోరుకున్న సంగతి గుర్తించి ధైర్యంగా ఉండి, అది జరిగించు>> అన్నాడు.
\p
\s5
\v 11 అప్పుడు దావీదు మంటపానికీ, మందిర నిర్మాణానికి, గిడ్డంగులకు, మేడ గదులకూ, లోపలి గదులకూ, ప్రాయశ్చిత్త వేదిక ఉన్న గదికీ, యెహోవా మందిరపు ఆవరణాలకూ,
\v 12 వాటి చుట్టూ ఉన్న గదులకూ, దేవుని మందిర గిడ్డంగులకు, ప్రతిష్ఠిత వస్తువుల గిడ్డంగులకు, తాను ఏర్పాటు చేసి సిద్ధం చేసిన నిర్మాణ ప్రణాళికలను తన కొడుకు సొలొమోనుకు అప్పగించాడు.
\p
\s5
\v 13 యాజకులూ, లేవీయులూ, సేవ చెయ్యవలసిన వంతుల జాబితా, యెహోవా మందిరపు సేవను గూర్చిన జాబితా, యెహోవా మందిరపు సేవ ఉపకరణాల జాబితా దావీదు అతనికి అప్పగించాడు.
\v 14 ఇంకా, అనేక సేవాక్రమాలకు కావలసిన బంగారు ఉపకారణాలన్నిటినీ చెయ్యడానికి తూకం ప్రకారం బంగారం, అనేక సేవాక్రమాలకు కావలసిన వెండి ఉపకారణాలన్నిటినీ చెయ్యడానికి తూకం ప్రకారం వెండిని దావీదు అతనికి అప్పగించాడు.
\p
\v 15 బంగారు దీపస్తంభాలకూ, వాటి బంగారు ప్రమిదెలకూ, ఒక్కొక్క దీపస్తంభానికీ, దాని ప్రమిదెలకూ కావలసినంత బంగారం తూకం ప్రకారంగా,
\p వెండి దీపస్తంభాలకూ ఒక్కొక దీపస్తంభానికీ, దాని దాని ప్రమిదలకూ కావలసినంత వెండిని తూకం ప్రకారంగా,
\p
\s5
\v 16 సన్నిధి రొట్టెలు ఉంచే ఒక్కొక బల్లకు కావలసినంత బంగారం తూకం ప్రకారంగా వెండి బల్లలకు కావలసినంత వెండినీ,
\p
\v 17 ముళ్ళ కొంకులకూ, గిన్నెలకూ, పాత్రలకూ కావలసినంత స్వచ్ఛమైన బంగారం, గిన్నెల్లో ఒక్కొక్క గిన్నెకూ కావలసినంత బంగారం తూకం ప్రకారం,
\p వెండి గిన్నెల్లో ఒక్కొక గిన్నెకు కావలసినంత వెండిని తూకం ప్రకారం,
\p
\s5
\v 18 ధూపపీఠానికి కావలసినంత స్వచ్ఛమైన బంగారం తూకం ప్రకారం,
\p రెక్కలు విప్పుకుని యెహోవా నిబంధన మందసాన్ని కప్పే కెరూబుల రూపకల్పనకు కావలసినంత బంగారం అతనికి అప్పగించాడు.
\p
\v 19 ఇవన్నీ అప్పగించి <<యెహోవా నాకిచ్చిన అవగాహన, నడిపింపును బట్టి ఈ నిర్మాణ ప్రణాళిక అంతా రాసి పెట్టాను>> అని సొలొమోనుతో చెప్పాడు.
\p
\s5
\v 20 ఇంకా దావీదు తన కొడుకు సొలొమోనుతో<<నువ్వు బలం పొంది ధైర్యం తెచ్చుకుని ఈ పనికి పూనుకో. భయపడొద్దు, కంగారు పడొద్దు. నా దేవుడైన యెహోవా నీతో ఉంటాడు. యెహోవా మందిర సేవను గూర్చిన పనంతా నువ్వు ముగించే వరకూ ఆయన నిన్ను ఎంతమాత్రం విడిచిపెట్టడు.
\v 21 దేవుని మందిర సేవంతటికీ, యాజకులూ, లేవీయులూ వంతుల ప్రకారం ఏర్పాటయ్యారు. నీ ఆజ్ఞకు లోబడి ఉంటూ ఈ పనంతా నెరవేర్చడానికి వివిధ పనుల్లో ప్రవీణులైన వాళ్ళూ, మనస్పూర్తిగా పని చేసేవాళ్ళూ, అధిపతులూ, ప్రజలందరూ, నీకు సహాయకులుగా ఉంటారు>> అన్నాడు.
\s5
\c 29
\s దేవుని మందిరాని ఇవ్వాల్సిన బహుమతులు
\p
\v 1 తరువాత రాజైన దావీదు సంఘంతో <<దేవుడు కోరుకున్న నా కొడుకు సొలొమోను ఇంకా అనుభవం లేని చిన్నవాడే. కట్టే ఈ ఆలయం మనిషి కోసం కాదు. ఇది దేవుడైన యెహోవా కోసం గనుక, ఈ పని చాలా గొప్పది.
\p
\v 2 నేను చాలా ప్రయాసపడి నా దేవుని మందిరానికి కావలసిన బంగారపు పనికి బంగారం, వెండి పనికి వెండి, ఇత్తడి పనికి ఇత్తడి, ఇనుప పనికి ఇనుము, కర్ర పనికి కర్ర, గోమేధికపు రాళ్ళు, చెక్కుడు రాళ్ళు, వింతైన రంగులున్న అనేక రకాల రాళ్ళు, చాలా విలువైన అనేక రకాల రత్నాలు, తెల్ల పాల రాయి విస్తారంగా సంపాదించాను.
\p
\s5
\v 3 ఇంకా, నా దేవుని మందిరం మీద నాకున్న మక్కువతో నేను ఆ ప్రతిష్ఠిత మందిరం నిమిత్తం సంపాదించిన వస్తువులు కాకుండా, నా సొంత బంగారం, వెండి, నా దేవుని మందిరం నిమిత్తం నేను ఇస్తున్నాను.
\v 4 గదుల గోడల రేకు అతకడం కోసం బంగారపు పనికి బంగారం, వెండి పనికి వెండి, పనివాళ్ళు చేసే ప్రతి విధమైన పనికి ఆరువేల మణుగుల ఓఫీరు బంగారం, పద్నాలుగు వేల మణుగుల స్వచ్ఛమైన వెండిని ఇస్తున్నాను.
\p
\v 5 ఈ రోజు యెహోవాకు ప్రతిష్టితంగా, మనస్పూర్తిగా ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా?>> అన్నాడు.
\s5
\v 6 అప్పుడు పూర్వీకుల ఇళ్ళకు అధిపతులూ, ఇశ్రాయేలీయుల గోత్రపు అధిపతులూ, సహస్రాధిపతులూ, శతాధిపతులూ, రాజు పని మీద నియామకం అయిన అధిపతులూ కలసి
\v 7 మనస్పూర్తిగా దేవుని మందిరపు పనికి 188 మణుగుల బంగారం, 10,000 మణుగుల బంగారపు నాణాలు, 375 మణుగుల వెండి, 675 మణుగుల ఇత్తడి, 3,750 మణుగుల ఇనుము ఇచ్చారు.
\s5
\v 8 తమ దగ్గర రత్నాలున్న వాళ్ళు వాటిని తెచ్చి యెహోవా మందిరపు గిడ్డంగులకు అధిపతిగా ఉన్న గెర్షోనీయుడైన యెహీయేలుకు ఇచ్చారు.
\v 9 వాళ్ళు పూర్ణమనస్సుతో యెహోవాకు ఇచ్చారు గనుక ఆ విధంగా మనస్పూర్తిగా ఇచ్చినందుకు ప్రజలు సంతోషపడ్డారు.
\s దావీదు ప్రార్థన
\p
\s5
\v 10 రాజైన దావీదు కూడా ఎంతో సంతోషపడి, సమావేశం అందరి ఎదుటా యెహోవాకు స్తోత్రాలు చెల్లిస్తూ <<మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలీయుల దేవా, యెహోవా, నిరంతరం నువ్వు స్తోత్రానికి అర్హుడవు.
\v 11 యెహోవా, భూమ్యాకాశాల్లో ఉన్న సమస్తం నీ వశం. మహాత్యం, పరాక్రమం, ప్రభావం, తేజస్సు, ఘనత నీకే చెందుతాయి. యెహోవా, రాజ్యం నీది. నువ్వు అందరిమీదా నిన్ను అధిపతిగా హెచ్చించుకొన్నావు.
\s5
\v 12 ఐశ్వర్యం, గొప్పతనం, నీ వలన కలుగుతాయి. నువ్వు సమస్తం ఏలే వాడవు. బలం, పరాక్రమం నీ దానాలు. హెచ్చించేదీ, అందరికి బలం ఇచ్చేదీ నువ్వే.
\v 13 మా దేవా, మేము నీకు కృతజ్ఞత, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభావం గల నీ పేరును కొనియాడుతున్నాం.
\p
\s5
\v 14 ఈ విధంగా మనస్పూర్తిగా ఇచ్చే సామర్ధ్యం మాకు కలగడానికి నేను ఏమాత్రం వాణ్ణి? నా ప్రజలు ఏమాత్రం వాళ్ళు? అన్నీ నీ వలనే కలిగాయి గదా? నీ దానిలో నుంచి కొంత మేము నీకిచ్చాం.
\v 15 మా పూర్వీకులందరిలా మేము కూడా నీ సన్నిధిలో అతిథులంగా, పరదేశులంగా ఉన్నాం. మా భూనివాస కాలం ఒక నీడ లాంటిది. శాశ్వతంగా ఉండేవాడు ఒక్కడూ లేడు.
\p
\s5
\v 16 మా దేవా యెహోవా, నీ పవిత్ర నామ ఘనత కోసం మందిరం కట్టించడానికి మేము సమకూర్చిన ఈ వస్తువులన్నీ నీ వల్ల కలిగినవే. ఇదంతా నీదే.
\v 17 నా దేవా, నువ్వు హృదయాన్ని చూస్తూ, నిజాయితీ ఉన్నవాళ్ళను ఇష్టపడుతున్నావని నాకు తెలుసు. నేనైతే నిజాయితీగా ఇవన్నీ మనస్పూర్తిగా ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడున్న నీ ప్రజలు కూడా మనస్ఫూర్తిగా నీకు ఇవ్వడం చూసి సంతోషిస్తున్నాను.
\p
\s5
\v 18 అబ్రాహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు అనే మా పూర్వీకుల దేవా యెహోవా, నీ ప్రజలు హృదయపూర్వకంగా సంకల్పించిన ఈ ఉద్దేశాన్ని నిత్యం కాపాడు. వాళ్ళ హృదయం నీకు అనుకూలంగా ఉండేలా చెయ్యి.
\v 19 నా కొడుకు సొలొమోను నీ ఆజ్ఞలకు, నీ శాసనాలకు, నీ కట్టడలకు లోబడుతూ, వాటినన్నిటినీ అనుసరించేలా నేను కట్టదలచిన ఈ ఆలయం కట్టించడానికి అతనికి నిర్దోషమైన హృదయం ఇవ్వు>> అన్నాడు.
\p
\s5
\v 20 ఈ విధంగా అన్న తరువాత దావీదు <<ఇప్పుడు మీ దేవుడైన యెహోవాను స్తుతించండి>> అని ప్రజల సమావేశం అంతటితో చెప్పినప్పుడు వాళ్ళందరూ తమ పూర్వీకుల దేవుడైన యెహోవాను స్తుతించి యెహోవా సన్నిధిలో రాజు ముందు తల వంచి నమస్కారం చేశారు.
\p
\v 21 తరువాత వాళ్ళు యెహోవాకు బలులు అర్పించారు. తరువాత రోజు, దహనబలిగా వెయ్యి ఎద్దులను, వెయ్యి పొట్టేళ్లను, వెయ్యి గొర్రె పిల్లలను, వాటి పానార్పణలతో పాటు ఇశ్రాయేలీయులందరి సంఖ్యకు తగినట్టుగా అర్పించారు.
\s సొలొమోను రాజుకు పట్టాభిషేకం
\r 29:21-25; 1 రాజులు 1:28-53
\p
\s5
\v 22 ఆ రోజు వాళ్ళు యెహోవా సన్నిధిలో ఎంతో సంతోషంతో అన్నపానాలు పుచ్చుకున్నారు. దావీదు కొడుకు సొలొమోనుకు రెండో సారి పట్టాభిషేకం చేసి, యెహోవా సన్నిధిలో అతన్ని పరిపాలకుడిగా, సాదోకును యాజకునిగా, అభిషేకించారు.
\p
\v 23 అప్పుడు సొలొమోను తన తండ్రి దావీదుకు బదులుగా యెహోవా సింహాసనం మీద రాజుగా కూర్చుని వర్ధిల్లుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులందరూ అతని ఆజ్ఞకు లోబడ్డారు.
\s5
\v 24 అధిపతులందరూ, యోధులందరూ, రాజైన దావీదు కొడుకులు అందరూ రాజైన సొలొమోనుకు లోబడ్డారు.
\v 25 యెహోవా సొలొమోనును ఇశ్రాయేలీయులందరి ముందు ఎంతో ఘనపరచి, అతనికి ముందుగా ఇశ్రాయేలీయులను ఏలిన ఏ రాజుకైనా దక్కని రాజ్యప్రభావం అతనికి అనుగ్రహించాడు.
\s దావీదు మరణం
\r 29:26-28; 1 రాజులు 2:10-12
\p
\s5
\v 26 యెష్షయి కొడుకు దావీదు, ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా ఉన్నాడు.
\v 27 అతడు ఇశ్రాయేలీయులను ఏలిన కాలం నలభై సంవత్సరాలు. హెబ్రోనులో ఏడు సంవత్సరాలు, యెరూషలేములో ముప్ఫై మూడు సంవత్సరాలు అతడు ఏలాడు.
\v 28 అతడు వృద్ధాప్యం వచ్చినప్పుడు ఐశ్వర్యం, ఘనత కలిగి, మంచి పండు వృద్ధాప్యంలో మరణించాడు. అతని తరువాత అతని కొడుకు సొలొమోను అతనికి బదులుగా రాజయ్యాడు.
\p
\s5
\v 29 రాజైన దావీదు సాధించిన విజయాలు ప్రవక్త సమూయేలు రాసిన చరిత్రలోను, ప్రవక్త నాతాను రాసిన చరిత్రలోను, ప్రవక్త గాదు రాసిన చరిత్రలోను ఉన్నాయి.
\v 30 అతని పరిపాలన చర్యలు, అతని విజయాలు, అతనికీ, ఇశ్రాయేలీయులకూ, ఇతర రాజ్యాలన్నిటికీ జరిగిన పరిణామాల గూర్చి వారు రాశారు.