te_ulb/04-NUM.usfm

2613 lines
407 KiB
Plaintext

\id NUM - Telugu Unlocked Literal Bible
\ide UTF-8
\rem Copyright © 2017 Bridge Connectivity Solutions. This translation is made available to you under the terms of the Creative Commons Attribution-ShareAlike 4.0 License
\h సంఖ్యాకాండం
\toc1 సంఖ్యాకాండం
\toc2 సంఖ్యాకాండం
\toc3 num
\mt1 సంఖ్యా కాండము
\s5
\c 1
\s జనాభా లెక్కలు
\p
\v 1 యెహోవా సీనాయి అరణ్యంలో ఉన్న సన్నిధి గుడారంలో నుండి మోషేతో మాట్లాడాడు. ఇది ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన రెండో సంవత్సరం రెండో నెల మొదటి తేదీన జరిగింది. యెహోవా మోషేతో ఇలా చెప్పాడు.
\v 2 <<ఇశ్రాయేలు ప్రజల జనాభా లెక్కలు వారి వారి వంశాల ప్రకారం, పూర్వీకుల కుటుంబాల ప్రకారం రాయించు. వారి పేర్లు రాయించు.
\v 3 ఇశ్రాయేలు రాజ్యం కోసం సైనికులుగా యుద్ధానికి వెళ్ళగలిగిన వారు, ఇరవై ఇంకా ఆ పై వయసున్న పురుషులందరినీ లెక్కపెట్టు. ఒక్కో దళంలో ఎంతమంది పురుషులున్నారో నువ్వూ, అహరోనూ కలసి నమోదు చేయాలి.
\p
\s5
\v 4 మీతో కలసి సేవ చేయడానికి ఒక్కో గోత్రం నుండి ఒక వ్యక్తి గోత్ర నాయకుడిగా ఉండాలి. అతడు తన తెగలో ప్రముఖుడై ఉండాలి.
\v 5 మీతో కలసి పోరాటాల్లో పాల్గొనే నాయకులు వీరు. రూబేను గోత్రం నుండి షెదేయూరు కొడుకు ఏలీసూరు,
\v 6 షిమ్యోను గోత్రం నుండి సూరీషద్దాయి కొడుకు షెలుమీయేలు,
\p
\s5
\v 7 యూదా గోత్రం నుండి అమ్మీనాదాబు కొడుకు నయస్సోను,
\v 8 ఇశ్శాఖారు గోత్రం నుండి సూయారు కొడుకు నెతనేలు
\v 9 జెబూలూను గోత్రం నుండి హేలోను కొడుకు ఏలీయాబు.
\p
\s5
\v 10 యోసేపు సంతానమైన ఎఫ్రాయిము గోత్రం నుండి అమీహూదు కొడుకు ఎలీషామాయు, మనష్షే గోత్రం నుండి పెదాసూరు కొడుకు గమలీయేలు,
\v 11 బెన్యామీను గోత్రం నుండి గిద్యోనీ కొడుకు అబీదాను,
\p
\s5
\v 12 దాను గోత్రం నుండి అమీషద్దాయి కొడుకు అహీయెజెరు,
\v 13 ఆషేరు గోత్రం నుండి ఒక్రాను కొడుకు పగీయేలు,
\v 14 గాదు గోత్రం నుండి దెయూవేలు కొడుకు ఎలాసాపు
\v 15 నఫ్తాలి గోత్రం నుండి ఏనాను కొడుకు అహీర.>>
\p
\s5
\v 16 వీళ్ళంతా ప్రజల్లోనుండి నియమితులయ్యారు. వీరు తమ పూర్వీకుల గోత్రాలకు నాయకులుగానూ, ఇశ్రాయేలు ప్రజల తెగలకు
\f +
\fr 1:16
\ft వెయ్యి మందికి నాయకులుగా ఉన్నారు.
\f* పెద్దలుగానూ ఉన్నారు.
\p
\s5
\v 17 ఈ పేర్లతో ఉన్న వ్యక్తులను మోషే అహరోనులు పిలిచారు.
\v 18 వీళ్ళతో పాటు ఇశ్రాయేలు ప్రజల్లో పురుషులందరినీ రెండో నెల మొదటి రోజున సమావేశపర్చారు. ఇరవై ఏళ్ళూ ఆ పై వయసున్న వారు తమ తమ వంశాలనూ, పూర్వీకుల కుటుంబాలనూ తమ తెగల పెద్దల పేర్లనూ తెలియజేసారు.
\v 19 అప్పుడు యెహోవా తనకాజ్ఞాపించినట్టుగా సీనాయి అరణ్యంలో మోషే వారి సంఖ్య నమోదు చేశాడు.
\p
\s5
\v 20 ఇశ్రాయేలు మొదటి కొడుకు రూబేను సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
\v 21 అలా రూబేను గోత్రం నుండి 46,500 మందిని లెక్కించారు.
\p
\s5
\v 22 షిమ్యోను సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
\v 23 అలా షిమ్యోను గోత్రం నుండి 59,300 మందిని లెక్కించారు.
\p
\s5
\v 24 గాదు సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
\v 25 అలా గాదు గోత్రం నుండి 45,650 మందిని లెక్కించారు.
\p
\s5
\v 26 యూదా సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాల, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
\v 27 అలా యూదా గోత్రం నుండి 74,600 మందిని లెక్కించారు.
\p
\s5
\v 28 ఇశ్శాఖారు సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
\v 29 అలా ఇశ్శాఖారు గోత్రం నుండి 54,400 మందిని లెక్కించారు.
\p
\s5
\v 30 జెబూలూను సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
\v 31 అలా జెబూలూను గోత్రం నుండి 57,400 మందిని లెక్కించారు.
\p
\s5
\v 32 యోసేపు కొడుకుల్లో ఒకడైన ఎఫ్రాయిము సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
\v 33 అలా ఎఫ్రాయిము గోత్రం నుండి 40,500 మందిని లెక్కించారు.
\p
\s5
\v 34 మనష్షే సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
\v 35 అలా మనష్షే గోత్రం నుండి 32,200 మందిని లెక్కించారు.
\p
\s5
\v 36 బెన్యామీను సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
\v 37 అలా బెన్యామీను గోత్రం నుండి 35,400 మందిని లెక్కించారు.
\p
\s5
\v 38 దాను సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
\v 39 అలా దాను గోత్రం నుండి 62,700 మందిని లెక్కించారు.
\p
\s5
\v 40 ఆషేరు సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
\v 41 అలా ఆషేరు గోత్రం నుండి 41,500 మందిని లెక్కించారు.
\p
\s5
\v 42 నఫ్తాలి సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
\v 43 అలా నఫ్తాలి గోత్రం నుండి 53,400 మందిని లెక్కించారు.
\p
\s5
\v 44 ఇశ్రాయేలులోని పన్నెండు గోత్రాలకు నాయకత్వం వహించిన వారితో పాటు వీరందర్నీ మోషే అహరోనులు లెక్కించారు.
\v 45 ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజల్లో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధాలకు వెళ్ళగలిగే వారిందర్నీ వారి వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం లెక్కించారు.
\v 46 వారింతా కలసి 6,03,550 మంది అయ్యారు.
\p
\s5
\v 47 కాని లేవీ వారసులను వారు లెక్కించలేదు.
\v 48 ఎందుకంటే యెహోవా మోషేకి ఇంతకు ముందే ఆజ్ఞాపించాడు.
\v 49 <<లేవీ గోత్రికులను ఇశ్రాయేలు జనసంఖ్యలో చేర్చకూడదు. వారిని నమోదు చేయవద్దు.
\p
\s5
\v 50 వాళ్లకు నిబంధన శాసనాల గుడారం బాధ్యతలు అప్పగించు. శాసనాల గుడారం లోని అలంకరణలూ, వస్తువులన్నిటినీ వారు చూసుకోవాలి. లేవీయులే గుడారాన్ని మోసుకుంటూ వెళ్ళాలి. దానిలో ఉన్న వస్తువులను వారే మోయాలి. దాని చుట్టూ వారు తమ గుడారాలు వేసుకోవాలి.
\p
\s5
\v 51 గుడారాన్ని మరో స్థలానికి తరలించాల్సి వస్తే లేవీయులే దాన్ని ఊడదీయాలి. తిరిగి గుడారాన్ని నిలపాలన్నా లేవీయులే దాన్ని నిలపాలి. ఎవరన్నా పరాయి వ్యక్తి గుడారాన్ని సమీపిస్తే వాడికి మరణ శిక్ష విధించాలి.
\v 52 ఇశ్రాయేలు ప్రజలు వారి వారి సైనిక దళానికి చెందిన జెండా ఎక్కడ నాటారో అక్కడే తమ గుడారాలు వేసుకోవాలి.
\p
\s5
\v 53 నా కోపం ఇశ్రాయేలు ప్రజలపైకి రాకుండా ఉండాలంటే లేవీయులు నిబంధన శాసనాల గుడారం చుట్టూ తమ నివాసాలు ఏర్పాటు చేసుకోవాలి. నిబంధన శాసనాల గుడారాన్ని వారే జాగ్రత్తగా చూసుకోవాలి.>>
\v 54 ఇశ్రాయేలు ప్రజలు ఈ ఆజ్ఞల ప్రకారం అన్నీ చేసారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ ఇశ్రాయేలు ప్రజలు నెరవేర్చారు.
\s5
\c 2
\s ప్రయాణాలు కోసం, గోత్రాలు మకాం చేసే ఏర్పాటు
\p
\v 1 యెహోవా మరోసారి మోషే, అహరోనులతో మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు.
\v 2 <<ఇశ్రాయేలు ప్రజల్లో ప్రతి ఒక్కరూ సైన్యంలో తమ దళానికి చెందిన పతాకం చుట్టూ, తన గోత్రాన్ని సూచించే చిన్నజెండా చుట్టూ తమ గుడారాలు వేసుకోవాలి. సన్నిధి గుడారానికి అభిముఖంగా వారి గుడారాలు ఉండాలి.
\p
\s5
\v 3 యూదా శిబిరానికి చెందిన వారు తమ సైనిక దళంతో యూదా పతాకం చుట్టూ తమ గుడారాలు వేసుకోవాలి. ఇవి సన్నిధి గుడారానికి తూర్పు దిక్కున సూర్యుడు ఉదయించే వైపున ఉండాలి. యూదా సైనిక దళానికి అమ్మీనాదాబు కొడుకు నయస్సోను నాయకత్వం వహించాలి.
\v 4 యూదా దళంలో నమోదైన వారు 74,600 మంది పురుషులు.
\p
\s5
\v 5 యూదా గోత్రం సమీపంలో ఇశ్శాఖారు గోత్రం వారు తమ శిబిరం ఏర్పాటు చేసుకోవాలి. సూయారు కొడుకు నెతనేలు ఇశ్శాఖారు గోత్రం వారి నాయకుడు.
\v 6 నెతనేలుతో ఉన్న సైన్యంలో 54,400 మంది పురుషులు నమోదయ్యారు.
\p
\s5
\v 7 ఇశ్శాఖారు గోత్రం వారి తరువాత జెబూలూను గోత్రం వారుండాలి. హేలోను కొడుకు ఏలీయాబు జెబూలూను గోత్రం వారి నాయకుడు.
\v 8 అతని దళంలో నమోదైన వారు 57,400 మంది పురుషులు.
\p
\s5
\v 9 యూదా వారితో కలసి శిబిరం ఏర్పాటు చేసుకున్న వారు మొత్తం లెక్కిస్తే 1,86,400 మంది పురుషులు ఉన్నారు. వీరు మొదటగా శిబిరం నుండి కదిలి వెళ్ళాలి.
\p
\s5
\v 10 దక్షిణ దిక్కున రూబేను దళం తమ పతాకం చుట్టూ గుడారాలు వేసుకోవాలి. షెదేయూరు కొడుకు ఏలీసూరు రూబేను సైనిక దళాలకు నాయకుడు.
\v 11 అతని సైన్యంలో నమోదైన వారు 46,500 మంది పురుషులు.
\p
\s5
\v 12 రూబేను గోత్రం వారి పక్కనే షిమ్యోను గోత్రం వారు తమ గుడారాలు వేసుకోవాలి. సూరీషద్దాయి కొడుకు షెలుమీయేలు షిమ్యోను గోత్రం వాళ్లకు నాయకుడు.
\v 13 అతని దళంలో నమోదైన వారు 59,300 మంది పురుషులు.
\p
\s5
\v 14 తరువాత గాదు గోత్రం ఉండాలి. రగూయేలు కుమారుడు ఏలీయాసాపు గాదు గోత్రానికి నాయకత్వం వహించాలి.
\v 15 అతని సైన్యంలో నమోదైన వారు 45,650 మంది పురుషులు.
\p
\s5
\v 16 కాబట్టి రూబేను గోత్రం వారితో కలసి శిబిరం ఏర్పాటు చేసుకున్న వారి మొత్తం లెక్కిస్తే 1,51,450 మంది పురుషులు ఉన్నారు. వీళ్ళంతా రెండో వరుసలో ముందుకు నడవాలి.
\p
\s5
\v 17 సన్నిధి గుడారం శిబిరం నుండి మిగిలిన గోత్రాలన్నిటి మధ్యలో లేవీయులతో కలసి ముందుకు కదలాలి. వారు శిబిరంలోకి ఏ క్రమంలో వచ్చారో అదే క్రమంలో శిబిరం నుండి బయటకు వెళ్ళాలి. ప్రతి ఒక్కడూ తన స్థానంలో ఉండాలి. తన పతాకం దగ్గరే ఉండాలి.
\p
\s5
\v 18 ఎఫ్రాయిము గోత్రం సన్నిధి గుడారానికి పడమటి వైపున ఉండాలి. అమీహూదు కొడుకు ఎలీషామా ఎఫ్రాయిము సైన్యాలకు నాయకత్వం వహించాలి.
\v 19 ఎఫ్రాయిము సైన్యంగా నమోదైన వారు 40,500 మంది పురుషులు.
\p
\s5
\v 20 మనష్షే గోత్రం వారు ఎఫ్రాయిము గోత్రం వారి పక్కనే ఉండాలి. పెదాసూరు కొడుకు గమలీయేలు మనష్షే సైన్యాలకు నాయకుడుగా ఉండాలి.
\v 21 అతని సైన్యంగా నమోదైన వారు 32,200 మంది పురుషులు.
\p
\s5
\v 22 మనష్షే గోత్రం వాళ్లకు దగ్గర్లోనే బెన్యామీను గోత్రం వారుండాలి. గిద్యోనీ కొడుకు అబీదాను బెన్యామీను సైన్యాలకు నాయకుడుగా ఉండాలి.
\v 23 అతని సైన్యంగా నమోదైన వారు 35,400 మంది పురుషులు.
\p
\s5
\v 24 కాబట్టి ఎఫ్రాయిము గోత్రం వారితో కలసి శిబిరం ఏర్పాటు చేసుకున్న వారి మొత్తం లెక్కిస్తే 1,08,100 మంది పురుషులు ఉన్నారు. వారింతా మూడో వరుసలో శిబిరం నుండి కదలాలి.
\p
\s5
\v 25 దాను శిబిరానికి చెందిన వారు తమ సైనిక దళంతో దాను పతాకం చుట్టూ తమ గుడారాలు వేసుకోవాలి. సన్నిధి గుడారానికి ఉత్తరం వైపున తమ గుడారాలు వేసుకోవాలి. అమీషదాయి కొడుకు అహీయెజెరు దాను గోత్రానికి నాయకత్వం వహించాలి.
\v 26 దాను గోత్రానికి చెందిన సైన్యంగా నమోదైన వారు 62,700 మంది పురుషులు.
\p
\s5
\v 27 అతనికి దగ్గరలోనే ఆషేరు గోత్రం వారు ఉండాలి. ఒక్రాను కొడుకు పగీయేలు ఆషేరు సైన్యానికి నాయకుడుగా ఉండాలి.
\v 28 అతని సైన్యంగా 41,500 మంది పురుషులు నమోదయ్యారు.
\p
\s5
\v 29 ఆషేరు గోత్రం వాళ్లకు దగ్గరలోనే నఫ్తాలి గోత్రం వారుండాలి. ఏనాను కొడుకు అహీర నఫ్తాలి గోత్రం వాళ్లకు నాయకుడిగా ఉండాలి.
\v 30 నఫ్తాలి గోత్రం వారి సైన్యంగా నమోదైన వారు 53,400 మంది పురుషులు.
\p
\s5
\v 31 కాబట్టి దాను గోత్రం వారితో కలసి శిబిరం ఏర్పాటు చేసుకున్న వారు మొత్తం లెక్కిస్తే 1,57,600 మంది పురుషులు ఉన్నారు. వీరు తమ ధ్వజాల ప్రకారం చివరి బృందంగా నడవాలి.>>
\p
\s5
\v 32 ఇశ్రాయేలు ప్రజల్లో తమ తమ పూర్వీకుల కుటుంబాల ప్రకారం మోషే, అహరోనులు వీళ్ళను లెక్కించారు. వీరు మొత్తం 6,03,550 మంది పురుషులు.
\v 33 అయితే యెహోవా మోషేకి ఆజ్ఞాపించిన ప్రకారం లేవీయుల సంఖ్య లెక్కపెట్టలేదు.
\p
\s5
\v 34 ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలు మోషేకి యెహోవా ఆజ్ఞాపించినదంతా చేసారు. వారు తమ తమ ధ్వజాల దగ్గర గుడారాలు వేసుకున్నారు. శిబిరం నుండి బయటకు వెళ్ళినప్పుడు తమ పూర్వీకుల కుటుంబాల క్రమంలో వెళ్ళారు.
\s5
\c 3
\s లేవీ గోత్రం
\p
\v 1 యెహోవా సీనాయి కొండపైన మోషేతో మాట్లాడిన నాటికి అహరోను మోషేల సంతానం వివరాలు ఇవి.
\v 2 అహరోను పెద్ద కొడుకు నాదాబు. ఆ తరువాత అబీహు, ఎలియాజరు, ఈతామారు పుట్టారు.
\p
\s5
\v 3 ఈ పేర్లు కలిగిన అహరోను కొడుకులు యాజకులుగా పనిచేయడానికి అభిషేకం పొందారు. వారిని యాజకులుగా ప్రతిష్టించారు.
\v 4 కాని నాదాబు, అబీహు సీనాయి అరణ్యంలో దేవునికి అంగీకారం కాని అగ్నిని అర్పించినప్పుడు యెహోవా సమక్షంలో పడి చనిపోయారు. నాదాబు, అబీహులకు పిల్లలు లేరు. కాబట్టి ఎలియాజరు, ఈతామారు మాత్రమే తమ తండ్రి అయిన అహరోనుతో కలసి యాజక సేవ జరిగించారు.
\p
\s5
\v 5 తరువాత యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. <<నువ్వు లేవీ గోత్రం వారిని తీసుకుని రా.
\v 6 వారిని అహరోను ఎదుట నిలబెట్టు. వారు అతనికి సహాయకులుగా ఉండాలి.
\p
\s5
\v 7 వారు సన్నిధి గుడారం ఎదుట అహరోను తరపునా, సమాజమంతటి తరపునా బాధ్యతలు నిర్వర్తించాలి. వారు దేవుని మందిరంలో పరిచర్య చేయాలి.
\v 8 సన్నిధి గుడారంలోని అలంకరణలూ, వస్తువుల విషయమై వారు జాగ్రత్త తీసుకోవాలి. ఇశ్రాయేలు గోత్రాల ప్రజలు మందిరంలో సేవ చేస్తున్నప్పుడు వాళ్లకి సహాయం చేయాలి.
\p
\s5
\v 9 కాబట్టి నువ్వు లేవీయులను అహరోనుకూ అతని కొడుకులకూ అప్పగించు. ఇశ్రాయేలు ప్రజలకి సేవ చేయడంలో వారు అహరోనుకి సాయంగా ఉండాలి. వారు సంపూర్ణంగా అతనికి స్వాధీనం అయ్యారు.
\v 10 నువ్వు అహరోనునూ అతని కొడుకులను యాజకులుగా నియమించు. ఆ పరిచర్య చేయడానికి పరాయి వాడు ఎవడన్నా సమీపిస్తే వాడికి మరణ శిక్ష విధించాలి.>>
\p
\s5
\v 11 యెహోవా మోషేతో ఇంకా మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు.
\v 12 <<ఇశ్రాయేలు ప్రజల్లో నుండి నేను లేవీయులను ఎన్నుకున్నాను. ఇశ్రాయేలు ప్రజల్లో నుండి ప్రతి మొదటి మగ సంతానాన్ని తీసుకోడానికి బదులుగా నేను లేవీయులను తీసుకున్నాను. వారు నా వారు.
\v 13 మొదటి సంతానం నాకు చెందుతుంది. ఐగుప్తు దేశంలో నేను వారి మొదటి సంతానాన్ని సంహరించినప్పుడు ఇశ్రాయేలులో మనుషుల్లోనూ, పశువుల్లోనూ మొదటి సంతానాన్ని నా కోసం నేను ప్రత్యేక పరచుకున్నాను. వారు నా వారు. అవి నావి. నేనే యెహోవాను.>>
\p
\s5
\v 14 సీనాయి అరణ్యంలో యెహోవా మోషేకు ఇలా చెప్పాడు.
\v 15 <<లేవీ వంశానికి చెందిన వాళ్లందర్నీ లెక్కించు. వారి వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం, వారి వంశాల ప్రకారం లెక్కించు. లేవీ వంశానికి చెందిన వాళ్లందర్నీ లెక్కించు. వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం, వారి వంశాల ప్రకారం లెక్కించు. ఒక నెల వయసున్న పిల్లల నుండి పురుషులందరినీ లెక్కపెట్టు.>>
\v 16 మోషే యెహోవా తనకు ఆదేశించిన ప్రకారం ఆయన చెప్పినట్టే వారిని లెక్కించాడు.
\p
\s5
\v 17 లేవీకి గెర్షోను, కహాతు, మెరారి అనే కొడుకులున్నారు.
\v 18 గెర్షోను కొడుకుల పేర్లు లిబ్నీ, షిమీ. ఈ పేర్లతో పిలిచే తెగలకు వీరే వంశకర్తలు.
\v 19 కహాతు కొడుకుల పేర్లు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు. ఈ పేర్లతో పిలిచే తెగలకు వీరే వంశకర్తలు.
\v 20 మెరారి కొడుకుల పేర్లు మాహలి, మూషి. ఈ పేర్లతో పిలిచే తెగలకు వీరే వంశకర్తలు. ఇవి లేవీ వంశానికి చెందిన తెగలు.
\p
\s5
\v 21 గెర్షోను వంశస్తులు లిబ్నీయులు, షిమీయులు. గెర్షోనీయుల తెగలు అంటే వీరే.
\v 22 వీళ్ళలో ఒక నెల వయసున్న మగ పిల్లల నుండి లెక్క పెడితే మొత్తం 7,500 మంది ఉన్నారు.
\v 23 గెర్షోనీయుల తెగలు దేవుని మందిరానికి పడమటి దిశగా అంటే వెనుక వైపున గుడారాలు వేసుకోవాలి.
\p
\s5
\v 24 గెర్షోనీయుల తెగలకు లాయేలు కుమారుడు ఎలీయాసాపు నాయకత్వం వహించాలి.
\v 25 గెర్షోను వంశం వారు సన్నిధి గుడారంలో మందిరానికీ, పైకప్పుగా ఉన్న తెరలకు బాధ్యత వహించాలి. ఇంకా గుడారానికీ, పైకప్పుకీ, సన్నిధి గుడారం ప్రవేశద్వారం దగ్గర ఉండే తెరలకీ బాధ్యత వహించాలి.
\v 26 మందిరమూ, బలిపీఠమూ ఉండే ఆవరణ అడ్డతెరలకూ, ఆవరణ ద్వారం దగ్గర ఉండే తెరలకూ వారు బాధ్యత వహించాలి. సన్నిధి గుడారం లోని తాళ్లకీ దానిలో ఉన్న సమస్తానికీ వారు బాధ్యత వహించాలి.
\p
\s5
\v 27 కహాతు నుండి అమ్రామీయులు, ఇస్హారీయులు, హెబ్రోనీయులు, ఉజ్జీయేలీయులు అనే తెగలు కలిగాయి. ఇవి కహాతీయుల తెగలు
\v 28 వీళ్ళలో ఒక నెల వయసున్న మగ పిల్లల నుండి లెక్క పెడితే మొత్తం 8,600 మంది ఉన్నారు. వీరు పరిశుద్ధ స్థలం బాధ్యత తీసుకోవాలి.
\v 29 కహాతు వంశస్తులు మందిరం దక్షిణం వైపున తమ గుడారాలు వేసుకోవాలి.
\p
\s5
\v 30 కహాతీయుల తెగలకు ఉజ్జీయేలు కొడుకు ఎలీషాపాను నాయకత్వం వహించాలి.
\v 31 వీరు మందసం, బల్ల, దీపస్తంభం, వేదికలు, పరిశుద్ధ స్థలంలోని వస్తువులు, పరిశుద్ధస్థలం తెర ఇంకా పరిశుద్ధస్థలంలో ఉన్న వాటి విషయమై బాధ్యత వహించాలి.
\v 32 లేవీయులను నడిపించే వారందరికీ యాజకుడైన అహరోను కొడుకు ఎలియాజరు నాయకత్వం వహించాలి. అతడు పరిశుద్ధస్థలం బాధ్యత తీసుకున్న వారిని పర్యవేక్షించాలి.
\p
\s5
\v 33 మెరారి నుండి రెండు తెగలు కలిగాయి. అవి మహలీయులు, మూషీయులు. ఇవి మెరారి తెగలు.
\v 34 వీళ్ళలో ఒక నెల వయసున్న మగ పిల్లల నుండి లెక్క పెడితే మొత్తం 6,200 మంది ఉన్నారు.
\v 35 మెరారీ తెగలకు అబీహాయిలు కొడుకు సూరీయేలు నాయకత్వం వహించాలి. వారు మందిరానికి ఉత్తరం వైపున తమ గుడారాలు వేసుకోవాలి.
\p
\s5
\v 36 మెరారి వంశస్తులు మందిరపు పలకలకూ, దాని అడ్డకర్రలకూ, దాని స్తంభాలకూ, దాని మూలాలకూ, దాని స్థిర సామగ్రికీ, ఇంకా దానికి సంబంధిన వాటన్నిటికీ,
\v 37 అంటే దాని చుట్టూ ఉన్న ఆవరణ స్తంభాలకీ, వాటి దిమ్మలకీ, మేకులకీ, తాళ్లకీ బాధ్యత వహించాలి.
\p
\s5
\v 38 మోషే, అహరోనూ, అతని కొడుకులూ మందిరానికి తూర్పు వైపున సూర్యోదయ దిశగా సన్నిధి గుడారానికి ఎదురుగా తమ గుడారాలు వేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు చేయాల్సిన పనులకూ, పరిశుద్ధ స్థలంలో నెరవేర్చాల్సిన విధులకూ వారు బాధ్యత వహించాలి. పరాయి వాడు ఎవడైనా పరిశుద్ధ స్థలాన్ని సమీపిస్తే వాడికి మరణ శిక్ష విధించాలి.
\v 39 యెహోవా తమకు ఆదేశించినట్లు మోషే అహరోనులు లేవీ వంశంలో ఒక నెల వయసున్న మగ బిడ్డ నుండి అందర్నీ లెక్కించారు. వారు 22,000 మంది అయ్యారు.
\p
\s5
\v 40 తరువాత యెహోవా మోషేతో ఇలా చెప్పాడు<<ఇశ్రాయేలు ప్రజల్లో మొదటి సంతానం అయిన పురుషులను ఒక నెల, ఆ పై వయసున్న వారిందర్నీ లెక్క పెట్టు. వారి పేర్లు రాయి.
\v 41 నేనే యెహోవాను. ఇశ్రాయేలు ప్రజల్లో మొదటి సంతానానికి బదులుగా నాకోసం లేవీ జాతి వారిని వేరు చెయ్యి. అలాగే ఇశ్రాయేలు ప్రజలకు చెందిన పశువుల్లో మొదటి సంతానానికి బదులుగా లేవీ జాతి వారి పశువులను నాకోసం తీసుకోవాలి.>>
\p
\s5
\v 42 యెహోవా తనకు ఆదేశించిన విధంగా మోషే ఇశ్రాయేలు ప్రజల్లో మొదటి సంతానాన్ని లెక్కపెట్టాడు.
\v 43 ఒక నెల, ఆ పై వయసున్న మొదటి మగ సంతానాన్ని లెక్కించాడు. వారి సంఖ్య 22,273 అయింది.
\p
\s5
\v 44 తరువాత యెహోవా మోషేకి ఇలా ఆదేశించాడు.
\v 45 <<ఇశ్రాయేలు ప్రజల్లో మొదటి సంతానం అయిన 22,273 మందిలో ప్రతివాడికి బదులుగా నువ్వు లేవీ జాతి వారిని వారి పశువులకి బదులుగా లేవీ జాతి వారి పశువులను తీసుకో. లేవీ జాతి వారు నా వారుగా ఉంటారు. నేనే యెహోవాను.
\p
\s5
\v 46 ఇశ్రాయేలు ప్రజల్లో మొదటి పుట్టినవారు లేవీ జాతి వారి కంటే 273 మంది ఎక్కువ అయ్యారు. వారిని విడిపించడం కోసం ఒక్కొక్కరి దగ్గర ఐదేసి తులాల వెండి తీసుకో.
\v 47 పరిశుద్ధ స్థలంలో ప్రమాణమైన తులం బరువులో అది ఉండాలి. ఒక తులం 20 చిన్నాలు.
\v 48 ఎక్కువైన వారిని విడిపించడానికి సేకరించిన ఆ ధనాన్ని అహరోనుకూ అతని కొడుకులకూ ఇవ్వాలి.>>
\p
\v 49 కాబట్టి మోషే లేవీ జాతివారి కంటే ఎక్కువగా ఉన్న వారి దగ్గర ఆ విడుదల సొమ్మును సేకరించాడు.
\v 50 ఇశ్రాయేలు ప్రజల పెద్ద కొడుకుల దగ్గర ఆ సొమ్మును సేకరించాడు. పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం ప్రకారం 1,365 తులాలు సేకరించాడు.
\v 51 మోషే తనకు యెహోవా ఆదేశించినట్లు ఆ విడుదల సొమ్మును అహరోనుకీ అతని కొడుకులకీ ఇచ్చాడు.
\s5
\c 4
\s కహాతు వంశస్తులు
\p
\v 1 యెహోవా మోషే అహరోనులతో మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు.
\v 2 <<లేవీ గోత్రం ప్రజల్లోని కహాతు వంశస్తుల్లో పురుషులను వారి తెగల ప్రకారం, వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం లెక్క పెట్టాలి.
\v 3 వారిలో ముప్ఫై ఏళ్ల వయస్సు నుండి యాభై ఏళ్ల వరకూ ఉన్న వారిని లెక్క పెట్టు. వీరు సన్నిధి గుడారంలో సేవలో చేరాలి.
\v 4 సన్నిధి గుడారంలో నా కోసం జరగాల్సిన అతి పరిశుద్ధమైన పరిచర్యలకు కహాతు వంశస్తులు బాధ్యత తీసుకోవాలి.
\p
\s5
\v 5 ప్రజలు ప్రయాణానికి సిద్ధమైనప్పుడు అహరోనూ, అతని కుమారులూ గుడారంలోకి వెళ్ళాలి. అక్కడ పరిశుద్ధ స్థలానికీ అతి పరిశుద్ధ స్థలానికీ మధ్యలో ఉన్న అడ్డ తెరలను దించాలి. ఆ తెరలతో నిబంధన శాసనాలున్న మందసం పెట్టెను కప్పాలి.
\v 6 దానిపైన
\f +
\fr 4:6
\ft నిర్గమ 25:5
\f* డాల్ఫిన్ చర్మాన్ని కప్పాలి. ఇంకా దానిపైన నీలం రంగు బట్ట పరచాలి. దాన్ని మోసుకు వెళ్ళడానికి పెట్టెకు ఉన్న రింగుల్లో కర్రలు దూర్చాలి.
\p
\s5
\v 7 సన్నిధి బల్ల పైన నీలం రంగు బట్టను పరచి దాని పైన గిన్నెలను, గరిటెలను, పాత్రలను, నీళ్ళు పోయడానికి కలశాలను ఉంచాలి. దాని పైన రొట్టె ప్రతినిత్యం ఉండాలి.
\v 8 దాని పైన ఎర్రటి బట్టను పరచాలి. తిరిగి దాని పైన డాల్ఫిన్ చర్మాన్ని కప్పాలి.
\p
\s5
\v 9 తరువాత వారు నీలం రంగు బట్టను తీసుకుని దానితో ఏడు దీపాల స్తంభాన్నీ, దాని దీపాలను, కత్తెరనూ కత్తెర పళ్ళాలను, దీపాల్లో పోసే నూనె పాత్రలనూ కప్పాలి.
\v 10 ఏడు దీపాల స్తంభాన్నీ, దానికి సంబంధించిన పరికరాలన్నిటినీ గండుచేప చర్మంలో చుట్టి మోసుకు వెళ్ళడానికి వీలుగా కర్రల పైన ఉంచాలి.
\v 11 తరువాత బంగారు బలిపీఠం పైన నీలం రంగు బట్ట పరచాలి. దాన్ని గండుచేప చర్మంలో చుట్టి దానికున్న రింగుల్లో కర్రలు దూర్చాలి.
\p
\s5
\v 12 తరువాత పరిశుద్ధ స్థలంలో సేవకు ఉపయోగించే పరికరాలన్నిటి పైనా నీలం రంగు బట్ట పరచాలి. దాన్ని గండుచేప చర్మంలో చుట్టి మోసుకు వెళ్ళడానికి వీలుగా కర్రల పైన ఉంచాలి.
\v 13 బలిపీఠం పైన బూడిదను తీసివేసి దానిపై ఊదా రంగు బట్ట పరచాలి.
\v 14 బలిపీఠం దగ్గర సేవకై ఉపయోగించే పరికరాలన్నిటినీ మోసుకు వెళ్ళడానికి వీలుగా కర్రలపైన ఉంచాలి. ఈ పరికరాలేవంటే నిప్పు తెచ్చే పాత్రలూ, ముళ్ళ గరిటెలూ, పారలూ, గిన్నెలూ. బలిపీఠాన్ని గండుచేప చర్మంలో చుట్టి మోసుకు వెళ్ళడానికి వీలుగా దానికున్న రింగుల్లో కర్రలు దూర్చాలి.
\p
\s5
\v 15 అహరోనూ అతని కొడుకులూ పరిశుద్ధ స్థలాన్నీ, దానికి సంబంధించిన పరికరాలన్నిటినీ సంపూర్ణంగా కప్పిన తరువాత ప్రజలు ప్రయాణం మొదలు పెట్టినప్పుడు కహాతు వంశస్తులు పరిశుద్ధ స్థలాన్ని మోయడానికి ముందుకు రావాలి. అయితే వారు పరిశుద్ధ పరికరాలను ముట్టుకుంటే చనిపోతారు. సన్నిధి గుడారంలోని పరికరాలను మోసుకు వెళ్ళడం కహతు వంశస్తుల బాధ్యత.
\v 16 యాజకుడు అహరోను కొడుకు ఎలియాజరు దీపాల్లో నూనె ఉందో లేదో చూసుకోవాలి. అలాగే అతడు పర్యవేక్షించాల్సిన బాధ్యతలు, పరిమళ సాంబ్రాణి, నైవేద్యం, అభిషేకానికి వాడే నూనె, మొత్తం మందిరం, దానిలోనివన్నీ, పరిశుద్ధ పరికరాలు, వస్తువులు- వీటన్నిటికీ అతడు బాధ్యత వహించాలి.>>
\p
\s5
\v 17 తరువాత యెహోవా మోషే, అహరోనులతో మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు.
\v 18 <<మీరు కహాతు తెగ వారిని లేవీ గోత్రం నుండి వేరు కానీయవద్దు.
\v 19 వారు పరిశుద్ధమైన వాటిని సమీపించి చావకుండా వారిని పరిరక్షించండి.
\v 20 వారు పరిశుద్ధ స్థలంలోకి ఒక్క క్షణం కూడా వెళ్ళడానికి వీల్లేదు. అలా వెళ్తే వారు చనిపోతారు. అహరోనూ, అతని కొడుకులూ లోపలికి వెళ్ళాలి. ఆ తరువాత కహాతు వారిలో ఒక్కొక్కరికీ వారు చేయాల్సిన పనినీ, వారి ప్రత్యేక విధులను అప్పగించాలి.>>
\s గెర్షోను వంశస్తులు
\p
\s5
\v 21 తరువాత యెహోవా మోషే, అహరోనులతో మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు.
\v 22 <<గెర్షోను వంశస్తులను కూడా వారి తెగల ప్రకారం, వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం లెక్కించండి.
\v 23 వారిల్లో ముప్ఫై ఏళ్ల నుండి యాభై ఏళ్ల వయసున్న వారిని లెక్కించండి. సన్నిధి గుడారంలో సేవ చేయడానికి ఈ వయస్సులో ఉన్న వారినందర్నీ లెక్కపెట్టాలి.
\p
\s5
\v 24 గెర్షోను తెగల వారు చేయాల్సిన సేవలూ, వారు మోయాల్సిన బరువులూ ఇవి.
\v 25 వారు సన్నిధి గుడారాన్నీ, మందిరం తెరలను, దాని పైకప్పునూ దాని పైన కప్పి ఉన్న గండుచేప చర్మాన్నీ, సన్నిధి గుడారం ప్రవేశం దగ్గర ఉన్న తెరలనూ మోసుకు వెళ్ళాలి.
\v 26 మందిరానికీ, బలిపీఠానికీ సమీపంగా ఉండే ఆవరణలోని తెరలను, ఆవరణ ద్వారం దగ్గర ఉండే తెరలను వాటి తాళ్లనూ, వాటి సేవకి సంబంధించిన పరికరాలన్నిటినీ వారు మోసుకు వెళ్ళాలి. వీటితో చేయాల్సిన పనులన్నీ వారు చేయాలి.
\p
\s5
\v 27 గెర్షోను తెగల ప్రజలు చేయాల్సిన సేవల విషయంలో, వారు మోయాల్సిన బరువుల విషయంలో వారిని అహరోనూ అతడి కొడుకులూ నిర్దేశించాలి. వారి బాధ్యతలను వాళ్లకు మీరు అప్పగించాలి.
\v 28 సన్నిధి గుడారం దగ్గర గెర్షోను తెగల ప్రజలు జరిగించాల్సిన సేవ ఇది. యాజకుడు అహరోను కొడుకు ఈతామారు చేతి కింద వారు తమ సేవ జరిగించాలి.
\s మెరారి వంశస్తులు
\p
\s5
\v 29 మెరారి వంశస్తులను వారి తెగల ప్రకారం, వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం లెక్కించండి.
\v 30 వారిల్లో ముప్ఫై ఏళ్ల నుండి యాభై ఏళ్ల వయసున్న వారిని లెక్కించండి. సన్నిధి గుడారంలో సేవ చేయడానికి ఈ వయస్సులో ఉన్న వారినందర్నీ లెక్కపెట్టాలి.
\p
\s5
\v 31 సన్నిధి గుడారంలో వారు తమ బాధ్యతగా జరిగించాల్సిన సేవలు ఇవి. వారు మందిరం చట్రాన్నీ, దాని అడ్డ కర్రలను, స్తంభాలను, దాని దిమ్మలను చూసుకోవాలి.
\v 32 వీటితో పాటు మందిరం చుట్టూ ఉన్న ఆవరణలోని స్తంభాలను, వాటి దిమ్మలను, మేకులను, వాటి తాళ్లనూ, వాటికి సంబంధించిన సామగ్రినీ జాగ్రత్తగా చూసుకోవాలి. వారు మోసుకు వెళ్ళాల్సిన బరువులను పేర్ల వరుసలో రాసి ఉంచాలి.
\p
\s5
\v 33 మెరారి తెగల ప్రజలు సన్నిధి గుడారంలో యాజకుడు అహరోను కొడుకు ఈతామారు చేతికింద చేయాల్సిన సేవ ఇది.>>
\s లేవీ గోత్రంలోని మూడుతెగల వారిని లెక్కించుట
\p
\s5
\v 34 అప్పుడు మోషే, అహరోనూ, సమాజంలోని నాయకులూ కహాతు తెగల ప్రజలను వారి తెగల ప్రకారం, వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం లెక్క పెట్టారు.
\v 35 వారిల్లో ముప్ఫై ఏళ్ళు నుండి యాభై ఏళ్ల వయసున్న వారిని సన్నిధి గుడారంలో సేవ చేయడానికి చేరే వారిందర్నీ లెక్క పెట్టారు.
\v 36 వారి తెగల ప్రకారం 2 750 మంది మగ వారిని లెక్క పెట్టారు.
\p
\s5
\v 37 కహాతు తెగల ప్రజల్లో నుండి సన్నిధి గుడారంలో సేవ చేయడానికి మోషే, అహరోనులు వీరిని లెక్కించారు. మోషే ద్వారా యెహోవా పలికిన ఆజ్ఞకు లోబడి వారు ఈ పని చేశారు.
\p
\s5
\v 38 గెర్షోను తెగల ప్రజలను వారి తెగల ప్రకారం, వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం లెక్క పెట్టారు.
\v 39 వారిల్లో ముప్ఫై ఏళ్ళు నుండి యాభై ఏళ్ల వయసున్న వారిని, సన్నిధి గుడారంలో సేవ చేయడానికి చేరే వారందర్నీ లెక్క పెట్టారు.
\v 40 వారి తెగల ప్రకారం, వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం 2,630 మంది పురుషులను లెక్కపెట్టారు.
\p
\s5
\v 41 గెర్షోను తెగల ప్రజల్లోనుండి సన్నిధి గుడారంలో సేవ చేయడానికి మోషే, అహరోనులు వీళ్ళను లెక్కించారు. మోషే ద్వారా యెహోవా పలికిన ఆజ్ఞకు లోబడి వారు ఈ పని చేశారు.
\p
\s5
\v 42 మెరారి తెగల ప్రజలను వారి తెగల ప్రకారం, వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం లెక్క పెట్టారు.
\v 43 వారిల్లో ముప్ఫై ఏళ్ళు నుండి యాభై ఏళ్ల వయసున్న వారిని, సన్నిధి గుడారంలో సేవ చేయడానికి చేరే వారిందర్నీ లెక్క పెట్టారు.
\v 44 వారి తెగల ప్రకారం, వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం 3 200 మంది పురుషులను లెక్కపెట్టారు.
\p
\s5
\v 45 మెరారి తెగల ప్రజల్లోనుండి సన్నిధి గుడారంలో సేవ చేయడానికి మోషే, అహరోనులు వీరిని లెక్కించారు. మోషే ద్వారా యెహోవా పలికిన ఆజ్ఞకు లోబడి వారు ఈ పని చేశారు.
\p
\s5
\v 46 ఈ విధంగా మోషే, అహరోనూ, ఇశ్రాయేలు ప్రజల నాయకులూ లేవీ గోత్రం వారిందర్నీ వారి తెగల ప్రకారం, వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం లెక్క పెట్టారు.
\v 47 వారిల్లో ముప్ఫై ఏళ్ళు నుండి యాభై ఏళ్ల వయసున్న వారిని, మందిరంలో సేవ చేయడానికి చేరే వారిందర్నీ, సన్నిధి గుడారంలో బరువులు మోసే వారిని లెక్కించారు.
\v 48 అలా మొత్తం 8,580 మంది మగ వారిని లెక్క పెట్టారు.
\p
\s5
\v 49 యెహోవా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మోషే వారిని లెక్కించాడు. వారిలో ప్రతి ఒక్కడూ తాను చేసే సేవల ప్రకారం, మోసే బరువుల ప్రకారం నమోదయ్యారు. ఈ విధంగా మోషే ద్వారా యెహోవా పలికిన ఆజ్ఞకు విధేయత చూపారు.
\s5
\c 5
\s శిబిరంలో ఆదేశాలు
\p
\v 1 తరువాత యెహోవా మోషేతో మాట్లాడాడు.
\v 2 <<ఇశ్రాయేలు ప్రజలకి ఇలా ఆజ్ఞాపించు. చర్మంలో అంటువ్యాధి కలిగిన వాణ్ణీ, శరీరంలో నుండి స్రావం అవుతున్న వాణ్ణీ, శవాన్ని ముట్టుకుని అపవిత్రుడైన వాణ్ణి శిబిరంలో నుండి బయటికి పంపివేయాలి.
\v 3 వారు ఆడవారైనా మగవారైనా శిబిరం నుండి బయటకు పంపించి వేయాలి. వారు శిబిరాన్ని కలుషితం చేయడానికి వీల్లేదు. ఎందుకంటే నేను శిబిరంలో వారి మధ్య నివసిస్తున్నాను.>>
\v 4 ఇశ్రాయేలు ప్రజలు అలాగే చేశారు. యెహోవా మోషేకి ఆజ్ఞాపించినట్లు అలాంటి వారిని శిబిరం బయటకు వెళ్ళగొట్టారు. ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు విధేయత చూపారు.
\s పాపాలకు పరిహారం
\p
\s5
\v 5 యెహోవా మరోసారి మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు. <<ఇశ్రాయేలు ప్రజలకి ఇలా చెప్పు.
\v 6 పురుషుడు గానీ స్త్రీ గానీ ఏదన్నా పాపం చేసి నాకు ద్రోహం చేస్తే ఆ వ్యక్తి అపరాధి అవుతాడు.
\v 7 అప్పుడు అతడు తాను చేసిన పాపాన్ని ఒప్పుకోవాలి. తాను చేసిన పాపం వల్ల కలిగిన నష్టాన్ని అతడు చెల్లించాలి. ఆ రుసుముకి అదనంగా దానిలో ఐదో వంతు కలిపి చెల్లించాలి. తాను ఎవరికి విరోధంగా పాపం చేసాడో వారికి దాన్ని చెల్లించాలి.
\p
\s5
\v 8 ఆ అపరాధ చెల్లింపుని తీసుకోడానికి ఆ వ్యక్తికి దగ్గర బంధువు ఎవరూ లేకుంటే అతడు ఆ సొమ్మును యాజకుడి ద్వారా నాకు చెల్లించాలి. దాంతోపాటు ఒక పొట్టేలును తన పరిహారం కోసం అర్పించాలి. ఆ సొమ్ముతో పాటు పొట్టేలు కూడా యాజకునిదవుతుంది.
\v 9 ఇశ్రాయేలు ప్రజలు యాజకునికి సమర్పించేదీ, నా కోసం ప్రతిష్టించినదీ ఏదైనా యాజకునికే చెందుతుంది.
\v 10 ప్రతిష్టిత వస్తువులు ఎవరి దగ్గర ఉన్నా అవి యాజకునికే చెందుతాయి. యాజకునికి ఇచ్చింది యాజకునికే చెందుతుంది.>>
\s ద్రోహం చేసిన భార్యకు పరీక్ష
\p
\s5
\v 11 యెహోవా మళ్ళీ మోషేతో మాట్లాడాడు.
\v 12 <<ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడి వారికి ఇలా చెప్పు. ఎవరైనా ఒకడి భార్య దారి తప్పి అతడికి ద్రోహం చేసినప్పుడు,
\s5
\v 13 అంటే వేరే వ్యక్తి ఆమెతో సంబంధం పెట్టుకున్నాడనుకోండి. అప్పుడు ఆమె అపవిత్రం అయినట్టే. ఆ విషయాన్ని ఆమె భర్త చూడకపోయినా, అతనికి తెలియక పోయినా, ఆ కార్యం చేస్తుండగా ఎవరూ పట్టుకోకపోయినా, ఆమెకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ఎవరూ ముందుకు రాకపోయినా ఆమె పట్టుబడదు.
\v 14 కానీ ఆ భర్త మనస్సులో రోషం పుట్టి తన భార్య అపవిత్రమైన సంగతి గ్రహిస్తే, లేదా ఆమె అపవిత్రం కాకపోయినా అలాంటిదే అనుమానం అతని మనస్సులో కలిగితే అతడు చేయాల్సింది ఇది.>>
\p
\s5
\v 15 అలాంటి విషయంలో ఆ వ్యక్తి తన భార్యను యాజకుడి దగ్గరికి తీసుకురావాలి. ఆమెతో పాటు తూమెడు యవల పిండిలో పదో వంతు కూడా తీసుకు రావాలి. దానిమీద నూనె పోయకూడదు. సాంబ్రాణి వేయకూడదు. ఎందుకంటే అది రోషాన్ని సూచించే నైవేద్యం. పాపాన్ని సూచించడానికి చేస్తున్న నైవేద్యం.
\p
\s5
\v 16 యాజకుడు ఆమెను యెహోవా సమక్షానికి తీసుకురావాలి.
\v 17 తరువాత యాజకుడు మట్టికుండలో పవిత్రజలం తీసుకోవాలి. మందిరం నేలపైనుండి కొంత ధూళి తీసుకుని ఆ నీళ్ళలో కలపాలి.
\p
\s5
\v 18 తరువాత యాజకుడు యెహోవా సమక్షంలో ఆ స్త్రీని నిలబెట్టాలి. ఆ స్త్రీ తలపై ముసుగుని తీసి ఆమె జుట్టు జడలు విప్పాలి. రోషం కారణంగా చేసిన నైవేద్యాన్ని అంటే పాపానికి సూచనగా ఉన్న నైవేద్యాన్ని యాజకుడు ఆమె చేతుల్లో ఉంచాలి. ఇది రోషం కారణంగా చేసిన నైవేద్యం. ఆ సమయంలో శాపాన్ని కలిగించే చేదు నీళ్ళు యాజకుడి చేతిలో ఉండాలి.
\v 19 అప్పుడు యాజకుడు ఆ స్త్రీతో ఒట్టు పెట్టించి ఇలా చెప్పాలి. <<ఏ పురుషుడూ నీతో లైంగికంగా కలవక పొతే, నువ్వు దారి తప్పి అపవిత్ర కార్యం చేయకపోతే శాపాన్ని కలిగించే ఈ చేదు నీళ్ళు నీపై ప్రభావం చూపించవు.
\p
\s5
\v 20 కానీ భర్త ఆధీనంలో ఉన్న నువ్వు దారి తప్పి ఉంటే, అపవిత్రురాలివైతే, వేరే వ్యక్తి నీతో సంబంధం పెట్టుకుంటే>>
\v 21 ఇక్కడ యాజకుడు ఆమె పైకి శాపం వచ్చేట్లు ఆమెతో ఒట్టు పెట్టించాలి. తరువాత తన మాటలు కొనసాగించాలి. <<యెహోవా నీ ప్రజల్లో అందరికీ తెలిసేలా నిన్ను శాపానికి గురిచేస్తాడు గాక. నీ తొడలు బలహీనమై నీ కడుపు ఉబ్బిపోతుంది.
\v 22 శాపాన్ని కలిగించే ఈ నీళ్ళు నీ కడుపులోకి వెళ్లి
\f +
\fr 5:22
\ft నీవు ఎన్నటికీ పిల్లలను కనలేవు.
\f* నీ పొత్తికడుపు ఉబ్బిపోయేలా చేసి నీ తొడలను బలహీనం చేస్తాయి.>> యాజకుడు ఇలా చెప్పిన తరువాత ఆ స్త్రీ <<నేను దోషినైతే అలాగే జరగాలి>> అని చెప్పాలి.
\p
\s5
\v 23 యాజకుడు అప్పుడు ఆ శాపాలను ఒక పత్రం పైన రాయాలి. రాసిన ఆ శాపాలను చేదు నీళ్ళతో తుడిచి వేయాలి.
\p
\s5
\v 24 తరువాత యాజకుడు శాపాన్ని కలిగించే ఆ చేదు నీళ్ళని ఆమెతో తాగించాలి. శాపాన్ని కలిగించే ఆ నీళ్ళు ఆమెలో చేదును పుట్టిస్తాయి.
\v 25 తరువాత యాజకుడు రోషం కారణంగా అర్పించిన నైవేద్యాన్ని ఆమె చేతిలోనుండి తీసుకుని యెహోవా సమక్షంలో పైకి ఎత్తి, ఊపి దాన్ని బలిపీఠం దగ్గరకి తీసుకురావాలి.
\v 26 తరువాత యాజకుడు ఆ నైవేద్యంలో నుండి ఓ గుప్పెడు తీసి బలిపీఠం పైన దాన్ని దహించాలి. ఆ తరువాత ఆ నీళ్ళను ఆమెకు తాగించాలి.
\p
\s5
\v 27 యాజకుడు ఆమెకు ఆ నీళ్లు త్రాగించినప్పుడు ఒకవేళ ఆమె అపవిత్రురాలై తన భర్తకి ద్రోహం చేసి ఉంటే శాపం కలుగజేసే ఆ నీళ్ళు ఆమె కడుపులోకి వెళ్ళి చేదు అవుతాయి. ఆమె పొత్తి కడుపు వాచి ఉబ్బుతుంది. ఆమె తొడలు బలహీనం అవుతాయి. ఆమె తన ప్రజల్లో శాపగ్రస్తురాలవుతుంది.
\v 28 ఒకవేళ ఆ స్త్రీ అపవిత్రం కాకుండా పవిత్రంగా ఉంటే విడుదల పొందుతుంది. ఆమె సంతానం పొందడానికి యోగ్యురాలవుతుంది.
\p
\s5
\v 29 అనుమానం గురించిన చట్టం ఇది. భర్త ఆధీనంలో ఉన్న ఏ స్త్రీ అయినా దారి తప్పి అపవిత్రురాలైనప్పుడు పాటించాల్సిన చట్టం ఇది.
\v 30 ఒకవేళ భర్తకు తన భార్యపై అనుమానం కలిగినా ఇదే చట్టం పాటించాలి.
\f +
\fr 5:30
\ft యాజకుడు కూడా కావచ్చు.
\f* అతడు ఆమెను యెహోవా సమక్షంలోకి తీసుకు రావాలి. ఈ అనుమానం గురించిన చట్టం వివరించిన వాటన్నిటినీ యాజకుడు ఆమె విషయంలో జరిగించాలి.
\p
\s5
\v 31 అప్పుడు ఆ వ్యక్తి తన భార్యను యాజకుడి దగ్గరకి తీసుకు వచ్చిన నేరం నుండి విముక్తుడవుతాడు. ఆ స్త్రీ ఏదన్నా అపరాధం చేస్తే ఆ శిక్ష భరించాలి.
\s5
\c 6
\s నాజీరు వారు
\p
\v 1 తరువాత యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు.
\v 2 <<ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడి ఇలా చెప్పు. ఎవరన్నా స్త్రీ గానీ పురుషుడు గానీ తనను యెహోవా కోసం ప్రత్యేకపరచుకుని
\f +
\fr 6:2
\ft యెహోవా పని కోసం ప్రత్యేకించబడిన.
\f* నాజీరు కావడానికి మొక్కుకుంటే ఆ వ్యక్తి ద్రాక్షారసాన్ని గానీ మత్తు కలిగించే పానీయాలు గానీ తీసుకోకూడదు. పులిసిన ద్రాక్షారసం గానీ మద్యాన్ని గానీ తీసుకోకూడదు.
\v 3 ఎలాంటి ద్రాక్షారసాన్నీ తాగకూడదు. ద్రాక్షాపళ్ళు పండినవైనా, ఎండినవైనా తినకూడదు.
\v 4 నా కోసం అతడు ప్రత్యేకంగా ఉన్న రోజుల్లో ద్రాక్ష తీగల నుండి తీసిన దేనినీ తినకూడదు. అవి పచ్చి కాయలైనా, పైన ఉండే తోలు అయినా తినకూడదు.
\p
\s5
\v 5 అతడు ప్రత్యేకంగా ఉండాలని మొక్కుకున్న రోజుల్లో మంగలి కత్తి అతడి తలని తాకకూడదు. యెహోవాకు ప్రత్యేకంగా ఉండాలని మొక్కుకున్న రోజులు పూర్తయే వరకూ జుట్టు పెరగనియ్యాలి. దేవుని కోసం అతడు ప్రత్యేకంగా ఉండాలి. తలపై జుట్టు పొడుగ్గా పెరగనియ్యాలి.
\p
\s5
\v 6 అతడు తనను యెహోవాకు ప్రత్యేకించుకున్న రోజుల్లో మృతదేహాన్ని సమీపించకూడదు.
\v 7 తన తండ్రి, తల్లి, సోదరుడు, సోదరి, వీరిలో ఎవరు మరణించినా అతడు వారిని తాకి తనను అపవిత్రం చేసుకోకూడదు.
\v 8 అతడు ప్రత్యేకంగా ఉన్న రోజుల్లో పవిత్రంగా ఉంటాడు. యెహోవా కోసం ప్రత్యేకంగా ఉంటాడు.
\p
\s5
\v 9 ఎవరైనా అతని పక్కనే అకస్మాత్తుగా పడి చనిపోతే, దానివల్ల ప్రత్యేకంగా ఉండే వ్యక్తి అపవిత్రుడైతే అతడు తాను పవిత్రం అయ్యాక అంటే ఏడు రోజుల తరువాత తన తల జుట్టుని కత్తిరించుకోవాలి. అంటే ఏడో రోజున కత్తిరించుకోవాలన్నమాట.
\p
\s5
\v 10 ఎనిమిదో రోజున అతడు రెండు గువ్వలను గానీ లేదా రెండు పావురం పిల్లలను గానీ పట్టుకుని వాటిని సన్నిధి గుడారం ద్వారం దగ్గర ఉన్న యాజకుడి దగ్గరికి తీసుకురావాలి.
\v 11 అప్పుడు యాజకుడు ఒకదాన్ని పాపం కోసం చేసే బలిగా. రెండో దాన్ని దహనబలిగా అర్పించాలి. ఆ వ్యక్తి మృతదేహాన్ని తాకి పాపం చేసాడు కాబట్టి ఇవి అతని కోసం పరిహారం అవుతాయి. ఆ రోజునే అతడు తనను తను పవిత్రం చేసుకోవాలి.
\p
\s5
\v 12 తరువాత అతడు తిరిగి నాజీరుగా ఉండే కాలాన్ని ప్రతిష్టించాలి. అతడు అపరాధ బలిగా ఒక ఏడాది వయసున్న మగ గొర్రె పిల్లని తీసుకురావాలి. అతడు అపవిత్రుడు కాకముందు మొక్కుకున్న రోజులు లెక్కలోకి రాకూడదు. ఎందుకంటే అతడు యెహోవా కోసం ప్రత్యేకంగా ఉండి అపవిత్రం అయ్యాడు.
\p
\s5
\v 13 నాజీరుగా ఉండటానికి మొక్కుకుని ఆ నాజీరుగా ఉండే సమయం ముగిసిన తరువాత అతడు చేయాల్సిన దాని గురించిన చట్టం ఇది. అతణ్ణి సన్నిధి గుడారం ద్వారం దగ్గరకి తీసుకురావాలి.
\v 14 అతడు తన అర్పణ యెహోవాకు అర్పించాలి. ఒక ఏడాది వయసున్న లోపరహితమైన ఒక మగ గొర్రెపిల్లని దహనబలిగా అర్పించాలి. అలాగే ఒక ఏడాది వయసున్న లోపరహితమైన ఆడ గొర్రెపిల్లను పాపం కోసం చేసే అర్పణగా తీసుకురావాలి. అతడింకా లోపరహితమైన ఒక పొట్టేలును శాంతి బలిగా తీసుకురావాలి.
\v 15 అలాగే అతడు తన నైవేద్య అర్పణ, పానార్పణలతో పాటు పొంగజేసే పదార్ధం లేకుండా చేసిన గంపెడు రొట్టెలూ, సన్నని గోదుమ పిండితో నూనె రాసి చేసిన వంటకాలూ, పొంగజేసే పదార్ధం లేకుండా నూనె రాసి చేసిన అప్పడాలూ యెహోవా దగ్గరకి తీసుకురావాలి.
\p
\s5
\v 16 అప్పుడు యాజకుడు యెహోవా సమక్షంలోకి వాటిని తెచ్చి అతడి కోసం దహనబలినీ, పాపం కోసం చేసే బలినీ అర్పించాలి.
\v 17 పొంగజేసే పదార్ధం లేకుండా చేసిన రొట్టెల గంపతో పాటు ఆ పొట్టేలును యెహోవాకు శాంతి బలిగా అర్పించాలి. అతని నైవేద్యాన్ని పానార్పణతో కలిపి అర్పించాలి.
\p
\s5
\v 18 అప్పుడా నాజీరు సన్నిధి గుడారం ద్వారం దగ్గర తన ప్రత్యేకతను సూచించే తల జుట్టు కత్తిరించుకోవాలి. ఆ జుట్టును శాంతిబలి అర్పణ సామగ్రి కింద ఉన్న మంటలో పడవేయాలి.
\p
\s5
\v 19 అప్పుడు యాజకుడు ఉడికిన పొట్టేలు జబ్బనీ గంపలోనుండి పొంగని పదార్ధంతో చేసిన ఒక రొట్టెనూ పొంగని పదార్ధంతో చేసిన ఒక అప్పడాన్నీ తీసుకోవాలి. యాజకుడు వాటిని ప్రత్యేకతను సూచించే తన తల వెండ్రుకలు కత్తిరించుకున్న నాజీరు చేతుల్లో ఉంచాలి.
\v 20 తరువాత యాజకుడు యెహోవా సమక్షంలో పైకెత్తి కదిల్చే అర్పణ గా వాటిని కదిలించాలి. వాటిని యెహోవాకు అర్పించాలి. అది పవిత్ర ఆహారం. పైకెత్తి కదిలించిన రొమ్ము భాగం, తొడ భాగంతో కలిపి ఇది యాజకునికి చెందుతుంది. దాని తరువాత ఆ నాజీరు ద్రాక్షారసం తాగవచ్చు.
\p
\s5
\v 21 మొక్కుకున్న నాజీరును గురించిన ఉపదేశం ఇది. తనను యెహోవా కోసం ప్రత్యేకించుకోడానికి అతడు అర్పించాల్సిన వాటిని గురించిన ఉపదేశం ఇది. తాను నాజీరు కావడానికి మొక్కుకున్న దంతా అతడు నెరవేర్చాలి.>>
\s యాజకుడు ప్రజలను దీవించే విధానం
\p
\s5
\v 22 యెహోవా మళ్ళీ మోషేతో మాట్లాడాడు.
\v 23 <<అహరోనుకూ అతని కొడుకులకూ ఇలా చెప్పు. మీరు ఇశ్రాయేలు ప్రజలను ఈ విధంగా దీవించాలి. మీరు వారితో ఇలా చెప్పాలి.
\p
\v 24 యెహోవా మిమ్మల్ని దీవించి సంరక్షిస్తాడు గాక!
\p
\s5
\v 25 యెహోవా మీపై తన వెలుగు ప్రకాశింప చేస్తాడు గాక! మిమ్మల్ని కరుణిస్తాడు గాక!
\p
\v 26 యెహోవా మిమ్మల్ని కన్నులారా చూసి మీకు శాంతి ప్రసాదించు గాక!
\p
\v 27 ఈ విధంగా వారు ఇశ్రాయేలు ప్రజలకి నా నామాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి. నేను అప్పుడు వారిని దీవిస్తాను.>>
\s5
\c 7
\s దేవుని మందిరంలోకి తీసుకు వచ్చిన అర్పణలు
\p
\v 1 మోషే దేవుని మందిర నిర్మాణం ముగించిన రోజునే దాన్ని దానిలోని అలంకరణలతో సహా యెహోవా సేవ కోసం అభిషేకించి పవిత్ర పరిచాడు. బలిపీఠాన్ని, అక్కడ పాత్రలను అభిషేకించి పవిత్ర పరిచాడు. వాటన్నిటినీ అభిషేకించి పవిత్ర పరిచాడు.
\v 2 ఆ రోజునే ఇశ్రాయేలు ప్రజల నాయకులు, తమ పూర్వీకుల కుటుంబాల పెద్దలు బలులు అర్పించారు. వీరు తమ తమ గోత్రాల ప్రజలను నడిపిస్తున్నవారు. జనాభా లెక్కలను పర్యవేక్షించింది వీరే.
\v 3 వీరు తమ అర్పణలను యెహోవా సమక్షంలోకి తీసుకు వచ్చారు. వీరు ఆరు గూడు బళ్ళూ, పన్నెండు ఎద్దులను తీసుకు వచ్చారు. ఇద్దరు నాయకులకు ఒక బండినీ, ఒక్కొక్కరికీ ఒక ఎద్దునీ తీసుకు వచ్చారు. వీటిని మందిరం ఎదుటికి వారు తీసుకు వచ్చారు.
\p
\s5
\v 4 అప్పుడు యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు.
\v 5 <<వారి దగ్గర నుండి ఈ కానుకలు స్వీకరించు. వాటిని సన్నిధి గుడారంలో సేవకై ఉపయోగించు. ఈ కానుకలను లేవీ వారికప్పగించు. వారిలో ప్రతి వాడి సేవకు తగినట్టుగా వాటిని వాళ్లకివ్వు.>>
\p
\s5
\v 6 మోషే ఆ బళ్లనూ ఎద్దులను తీసుకుని వాటిని లేవీ వారికి ఇచ్చాడు.
\v 7 వాటిలో గెర్షోను వంశం వారికి వారు చేసే సేవ ప్రకారం రెండు బళ్లనూ నాలుగు ఎద్దులను ఇచ్చాడు.
\v 8 యాజకుడు అహరోను కొడుకు ఈతామారు పర్యవేక్షణ లో పనిచేసే మెరారి వంశస్తులకి వారు చేసే సేవను బట్టి నాలుగు బళ్లనూ ఎనిమిది ఎద్దులనూ ఇచ్చాడు.
\p
\s5
\v 9 అయితే కహాతు వాళ్లకి ఏమీ ఇవ్వలేదు. ఎందుకంటే వారి సేవ అంతా మందిరంలోని సామగ్రికీ వస్తువులకీ సంబంధించింది. వాటిని వారు తమ భుజాలపై మోసుకు వెళ్ళాలి. కాబట్టి వారికి బళ్ళు ఇవ్వలేదు.
\p
\s5
\v 10 మోషే బలిపీఠాన్ని అభిషేకించిన రోజున ఆ నాయకులు బలిపీఠాన్ని ప్రతిష్టించడానికి సామగ్రిని తీసుకు వచ్చారు. బలిపీఠం ఎదుట తాము తెచ్చిన అర్పణలను సమర్పించారు.
\v 11 యెహోవా మోషేకి <<బలిపీఠం అభిషేకం కోసం అర్పణలు తీసుకు రావడానికి ప్రతి నాయకుడికీ ఒక్కో రోజు కేటాయించు>> అని ఆదేశించాడు.
\p
\s5
\v 12 మొదటి రోజు అర్పణం తెచ్చింది యూదా గోత్రం వాడూ, అమ్మీనాదాబు కొడుకు నయస్సోను.
\v 13 అతడు పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం 130 తులాల బరువున్న వెండి గిన్నెనూ, 70 తులాల బరువున్న వెండి పళ్ళేన్నీ సమర్పించాడు. ఈ రెంటి నిండా నూనెతో కలిపిన మెత్తని పిండిని నైవేద్య అర్పణగా ఉంచాడు.
\v 14 వీటితో పాటు పది తులాల బరువున్న పాత్రను సాంబ్రాణితో నింపి అర్పించాడు.
\p
\s5
\v 15 ఇంకా అతడు దహనబలిగా ఒక చిన్న కోడెనూ ఒక పొట్టేలునూ ఒక ఏడాది వయసున్న గొర్రె పిల్లనూ ఇచ్చాడు.
\v 16 పాపం కోసం బలిగా ఒక మేక పోతును ఇచ్చాడు.
\v 17 రెండు ఎద్దులను, ఐదు పొట్టేళ్లనూ ఐదు మేకపోతులను, ఒక ఏడాది వయసున్న ఐదు గొర్రె పిల్లలను శాంతిబలిగా సమర్పించాడు. ఇవి అమ్మీనాదాబు కొడుకు నయస్సోను తెచ్చిన అర్పణం.
\p
\s5
\v 18 రెండో రోజు అర్పణం తెచ్చింది ఇశ్శాఖారు వంశంలో నాయకుడూ, సూయారు కొడుకూ అయిన నెతనేలు.
\v 19 అతడు పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం 130 తులాల బరువున్న వెండి గిన్నెనూ 70 తులాల బరువున్న వెండి పళ్ళేన్నీ సమర్పించాడు. ఈ రెంటి నిండా నూనెతో కలిపిన సన్నని పిండిని నైవేద్య అర్పణగా ఉంచాడు.
\p
\s5
\v 20 అతడింకా సాంబ్రాణి తో నిండి ఉన్న పది తులాల బంగారు పాత్రను ఇచ్చాడు.
\v 21 దహన బలిగా ఒక చిన్న కోడెనూ ఒక పొట్టేలునూ ఒక సంవత్సరం వయసున్న గొర్రె పిల్లనూ ఇచ్చాడు.
\v 22 పాపం కోసం చేసే బలిగా ఒక మేకపోతును ఇచ్చాడు.
\v 23 అలాగే అతడు శాంతిబలిగా రెండు ఎద్దులను, ఐదు పోట్టేళ్ళనూ ఐదు మేకపోతులను, ఒక సంవత్సరం వయసున్న ఐదు గొర్రె పిల్లలను తీసుకు వచ్చాడు. ఇది సూయారు కొడుకు నెతనేలు తెచ్చిన అర్పణం.
\p
\s5
\v 24 మూడో రోజు జెబూలూను వంశస్తులకు నాయకుడూ హేలోను కొడుకూ అయిన ఏలీయాబు తన అర్పణ తీసుకు వచ్చాడు.
\v 25 అతడు పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం 130 తులాల బరువున్న వెండి గిన్నెనూ 70 తులాల బరువున్న వెండి పళ్ళేన్నీ సమర్పించాడు. ఈ రెంటి నిండుగా నైవేద్య అర్పణ కోసం నూనె కలిపిన మెత్తని గోదుమ పిండిని తెచ్చాడు.
\v 26 ఇంకా సాంబ్రాణి తో నిండి ఉన్న పది తులాల బంగారు పాత్రను తీసుకువచ్చాడు.
\p
\s5
\v 27 ఇంకా దహనబలిగా ఒక కోడెనూ ఒక పొట్టేలునూ ఒక సంవత్సరం వయసున్న ఒక మగ గొర్రెపిల్లనూ ఇచ్చాడు.
\v 28 పాపం కోసం చేసే బలిగా ఒక మేకపోతును ఇచ్చాడు.
\v 29 శాంతి బలిగా రెండు ఎద్దులను, ఐదు పోట్టేళ్ళనూ ఐదు మేకపోతులను, ఒక సంవత్సరం వయసున్న ఐదు మగ గొర్రె పిల్లలను తీసుకు వచ్చాడు. ఇది హేలోను కొడుకు ఏలీయాబు తెచ్చిన అర్పణం.
\p
\s5
\v 30 నాలుగో రోజు రూబేను వంశస్తుల నాయకుడూ, షెదేయూరు కొడుకూ అయిన ఏలీసూరు తన అర్పణ తీసుకు వచ్చాడు.
\v 31 అతడు పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం 130 తులాల బరువున్న వెండి గిన్నెనూ 70 తులాల బరువున్న వెండి పళ్ళేన్నీ సమర్పించాడు. ఈ రెంటి నిండా నూనెతో కలిపిన మెత్తని పిండిని నైవేద్య అర్పణగా ఉంచాడు.
\v 32 ఇంకా సాంబ్రాణితో నిండి ఉన్న పది తులాల బంగారు పాత్రను తీసుకువచ్చాడు.
\p
\s5
\v 33 అతడు దహనబలిగా ఒక ఎద్దునూ ఒక పొట్టేలునూ ఒక సంవత్సరం వయసున్న ఒక మగ గొర్రెపిల్లనూ తీసుకువచ్చాడు.
\v 34 పాపం కోసం చేసే బలిగా ఒక మేకపోతును తీసుకువచ్చాడు.
\v 35 ఇంకా రెండు ఎద్దులను, ఐదు పొట్టేళ్ళనూ ఐదు మేకపోతులను, ఐదు మగ గొర్రెపిల్లలను శాంతిబలి అర్పణగా తీసుకువచ్చాడు. ఇది షెదేయూరు కొడుకు ఏలీసూరు అర్పణం.
\p
\s5
\v 36 ఐదో రోజు షిమ్యోను వంశస్తుల నాయకుడూ, సూరీషదాయి కొడుకూ అయిన షెలుమీయేలు తన అర్పణం తీసుకు వచ్చాడు.
\v 37 అతడు పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం 130 తులాల బరువున్న వెండి గిన్నెను, 70 తులాల బరువున్న వెండి పాత్రను, సమర్పించాడు. ఈ రెంటి నిండుగా నైవేద్య అర్పణ కోసం నూనె కలిపిన మెత్తని గోదుమ పిండిని తెచ్చాడు.
\v 38 ఇంకా సాంబ్రాణితో నిండి ఉన్న పది తులాల బంగారు పాత్రను తీసుకు వచ్చాడు.
\p
\s5
\v 39 ఇతడు దహనబలిగా ఒక కోడెనూ ఒక పొట్టేలునూ ఒక సంవత్సరం వయసున్న ఒక గొర్రె పిల్లనూ తీసుకువచ్చాడు.
\v 40 ఒక మేకపోతును పాపం కోసం చేసే బలిగా ఇచ్చాడు.
\v 41 ఇంకా రెండు ఎద్దులను, ఐదు పొట్టేళ్లనూ ఐదు మేకపోతులను, ఒక సంవత్సరం వయసున్న ఐదు మగ గొర్రె పిల్లలను శాంతిబలిగా ఇచ్చాడు. ఇది సూరీషదాయి కొడుకు షెలుమీయేలు అర్పణం.
\p
\s5
\v 42 ఆరో రోజు గాదు వంశస్తులకు నాయకుడూ, దెయూవేలు కొడుకు ఎలీయాసాపా తన అర్పణ తీసుకువచ్చాడు.
\v 43 అతడు పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం 130 తులాల బరువున్న వెండి గిన్నెనూ 70 తులాల బరువున్న వెండి పళ్ళేన్నీ సమర్పించాడు. ఈ రెంటి నిండుగా నైవేద్య అర్పణ కోసం నూనె కలిపిన మెత్తని గోదుమ పిండిని తెచ్చాడు.
\v 44 ఇంకా సాంబ్రాణితో నిండి ఉన్న పది తులాల బంగారు పాత్రను తీసుకు వచ్చాడు.
\p
\s5
\v 45 అతడు దహనబలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఒక సంవత్సరం వయసున్న ఒక గొర్రెపిల్లను తీసుకు వచ్చాడు.
\v 46 పాపం కోసం చేసే బలిగా ఒక మేకపోతును తెచ్చాడు.
\v 47 ఇంకా రెండు ఎద్దులను, ఐదు పొట్టేళ్లనూ ఐదు మేకపోతులను, ఒక సంవత్సరం వయసున్న ఐదు మగ గొర్రె పిల్లలను శాంతిబలిగా ఇచ్చాడు. ఇది దెయూవేలు కొడుకు ఎలీయాసాపా అర్పణం.
\p
\s5
\v 48 ఏడో రోజు ఎఫ్రాయిము వంశస్తులకు నాయకుడూ, అమీహూదు కొడుకూ అయిన ఎలీషామా తన అర్పణ తీసుకువచ్చాడు.
\v 49 అతడు పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం 130 తులాల బరువున్న వెండి గిన్నెనూ 70 తులాల బరువున్న వెండి పళ్ళేన్నీ సమర్పించాడు. ఈ రెంటి నిండుగా నైవేద్య అర్పణ కోసం నూనె కలిపిన మెత్తని గోదుమ పిండిని తెచ్చాడు.
\v 50 ఇంకా సాంబ్రాణి తో నిండి ఉన్న పది తులాల బంగారు పాత్రను తీసుకువచ్చాడు.
\p
\s5
\v 51 అతడు దహనబలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఒక సంవత్సరం వయసున్న ఒక గొర్రెపిల్లను తీసుకు వచ్చాడు.
\v 52 పాపం కోసం చేసే బలిగా ఒక మేకపోతును తెచ్చాడు.
\v 53 ఇంకా రెండు ఎద్దులను, ఐదు పొట్టేళ్లనూ ఐదు మేకపోతులను, ఒక సంవత్సరం వయసున్న ఐదు మగ గొర్రె పిల్లలను శాంతిబలిగా ఇచ్చాడు. ఇది అమీహూదు కొడుకు ఎలీషామా అర్పణం.
\p
\s5
\v 54 ఎనిమిదో రోజు మనష్శే వంశస్తుల నాయకుడూ, పెదాసూరు కొడుకూ అయిన గమలీయేలు తన అర్పణ తీసుకువచ్చాడు.
\v 55 అతడు పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం 130 తులాల బరువున్న వెండి గిన్నెనూ 70 తులాల బరువున్న వెండి పళ్ళేన్నీ సమర్పించాడు. ఈ రెంటి నిండుగా నైవేద్య అర్పణ కోసం నూనె కలిపిన మెత్తని గోదుమ పిండిని తెచ్చాడు.
\v 56 ఇంకా సాంబ్రాణి తో నిండి ఉన్న పది తులాల బంగారు పాత్ర ఒకదాన్ని తీసుకువచ్చాడు.
\p
\s5
\v 57 అతడు దహనబలిగా ఒక చిన్న కోడెనూ ఒక పొట్టేలునూ ఒక సంవత్సరం వయసున్న ఒక గొర్రెపిల్లనూ తీసుకు వచ్చాడు.
\v 58 పాపం కోసం చేసే బలిగా ఒక మేకపోతును తెచ్చాడు.
\v 59 ఇంకా రెండు ఎద్దులను, ఐదు పొట్టేళ్లనూ ఐదు మేకపోతులను, ఒక సంవత్సరం వయసున్న ఐదు మగ గొర్రె పిల్లలను శాంతిబలిగా ఇచ్చాడు. ఇది పెదాసూరు కొడుకు గమలీయేలు అర్పణం.
\p
\s5
\v 60 తొమ్మిదో రోజు బెన్యామీను వంశస్తులకి నాయకుడూ, గిద్యోనీ కొడుకూ అయిన అబీదాను తన అర్పణ తీసుకు వచ్చాడు.
\v 61 అతడు పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం 130 తులాల బరువున్న వెండి గిన్నెనూ 70 తులాల బరువున్న వెండి పళ్ళేన్నీ సమర్పించాడు. ఈ రెంటి నిండుగా నైవేద్య అర్పణ కోసం నూనె కలిపిన మెత్తని గోదుమ పిండిని తెచ్చాడు.
\v 62 ఇంకా సాంబ్రాణి తో నిండి ఉన్న పది తులాల బంగారు పాత్రను తీసుకువచ్చాడు.
\p
\s5
\v 63 అతడు దహనబలిగా ఒక చిన్న కోడెనూ ఒక పొట్టేలునూ ఒక సంవత్సరం వయసున్న ఒక గొర్రెపిల్లనూ తీసుకు వచ్చాడు.
\v 64 పాపం కోసం చేసే బలిగా ఒక మేకపోతును తెచ్చాడు.
\v 65 ఇంకా రెండు ఎద్దులను, ఐదు పొట్టేళ్లనూ ఐదు మేకపోతులను, ఒక సంవత్సరం వయసున్న ఐదు మగ గొర్రె పిల్లలను శాంతిబలిగా ఇచ్చాడు. ఇది గిద్యోనీ కొడుకు అబీదాను అర్పణం.
\p
\s5
\v 66 పదో రోజు దాను వంశస్తులకి నాయకుడూ, అమీషదాయి కొడుకూ అయిన అహీయెజెరు తన అర్పణ తీసుకు వచ్చాడు.
\v 67 అతడు పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం 130 తులాల బరువున్న వెండి గిన్నెనూ 70 తులాల బరువున్న వెండి పళ్ళేన్నీ సమర్పించాడు. ఈ రెంటి నిండుగా నైవేద్య అర్పణ కోసం నూనె కలిపిన మెత్తని గోదుమ పిండిని తెచ్చాడు.
\v 68 ఇంకా సాంబ్రాణి తో నిండి ఉన్న పది తులాల బంగారు పాత్రను తీసుకు వచ్చాడు.
\p
\s5
\v 69 అతడు దహనబలిగా ఒక చిన్న కోడెనూ ఒక పొట్టేలునూ ఒక సంవత్సరం వయసున్న ఒక గొర్రెపిల్లనూ తీసుకు వచ్చాడు.
\v 70 పాపం కోసం చేసే బలిగా ఒక మేకపోతును తెచ్చాడు.
\v 71 ఇంకా రెండు ఎద్దులను, ఐదు పొట్టేళ్లను, ఐదు మేకపోతులను, ఒక సంవత్సరం వయసున్న ఐదు మగ గొర్రె పిల్లలను శాంతిబలిగా ఇచ్చాడు. ఇది అమీషదాయి కొడుకు అహీయెజెరు అర్పణం.
\p
\s5
\v 72 పదకొండో రోజు ఆషేరు వంశస్తుల నాయకుడూ, ఒక్రాను కొడుకూ అయిన పగీయేలు తన అర్పణ తీసుకు వచ్చాడు.
\v 73 అతడు పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం 130 తులాల బరువున్న వెండి గిన్నెనూ 70 తులాల బరువున్న వెండి పళ్ళేన్నీ సమర్పించాడు. ఈ రెంటి నిండుగా నైవేద్య అర్పణ కోసం నూనె కలిపిన మెత్తని గోదుమ పిండిని తెచ్చాడు.
\v 74 ఇంకా సాంబ్రాణి తో నిండి ఉన్న పది తులాల బంగారు పాత్రను తీసుకు వచ్చాడు.
\p
\s5
\v 75 అతడు దహనబలిగా ఒక చిన్న కోడెనూ ఒక పొట్టేలునూ ఒక సంవత్సరం వయసున్న ఒక గొర్రెపిల్లనూ తీసుకు వచ్చాడు.
\v 76 పాపం కోసం చేసే బలిగా ఒక మేకపోతును తెచ్చాడు.
\v 77 ఇంకా రెండు ఎద్దులను, ఐదు పొట్టేళ్లనూ ఐదు మేకపోతులను, ఒక సంవత్సరం వయసున్న ఐదు మగ గొర్రె పిల్లలను శాంతిబలిగా ఇచ్చాడు. ఇది ఒక్రాను కొడుకు పగీయేలు అర్పణం.
\p
\s5
\v 78 పన్నెండో రోజు నఫ్తాలీ వంశస్తులకి నాయకుడూ, ఏనాను కొడుకూ అయిన అహీరా.
\v 79 అతడు పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం 130 తులాల బరువున్న వెండి గిన్నెనూ 70 తులాల బరువున్న వెండి పళ్ళేన్నీ సమర్పించాడు. ఈ రెంటి నిండుగా నైవేద్య అర్పణ కోసం నూనె కలిపిన మెత్తని గోదుమ పిండిని తెచ్చాడు.
\v 80 ఇంకా సాంబ్రాణి తో నిండి ఉన్న పది తులాల బంగారు పాత్రను తీసుకువచ్చాడు.
\p
\s5
\v 81 అతడు దహనబలిగా ఒక చిన్న కోడెనూ ఒక పొట్టేలునూ ఒక సంవత్సరం వయసున్న ఒక గొర్రెపిల్లనూ తీసుకు వచ్చాడు.
\v 82 పాపం కోసం చేసే బలిగా ఒక మేకపోతును తెచ్చాడు.
\v 83 ఇంకా రెండు ఎద్దులను, ఐదు పొట్టేళ్లనూ ఐదు మేకపోతులను, ఒక సంవత్సరం వయసున్న ఐదు మగ గొర్రె పిల్లలను శాంతిబలిగా ఇచ్చాడు. ఇది ఏనాను కొడుకు అహీరా అర్పణం. బలిపీఠాన్ని అభిషేకించిన రోజున ఇశ్రాయేలీయుల ప్రధానులు అర్పించిన ప్రతిష్ఠార్పణలు ఇవి. వెండి గిన్నెలు పన్నెండు, వెండి ప్రోక్షణపాత్రలు పన్నెండు, బంగారు ధూపార్తులు పన్నెండు, ప్రతి వెండి గిన్నె నూట ముప్ఫై తులాల బరువు ఉంది.
\p
\s5
\v 84 మోషే బలిపీఠాన్ని అభిషేకించిన రోజున ఇశ్రాయేలు నాయకులు వీటన్నిటినీ ప్రతిష్టించారు. వారు పన్నెండు వెండి గిన్నెలను, పన్నెండు వెండి పాత్రలను, పన్నెండు బంగారు పాత్రలను ప్రతిష్టించారు. ప్రతి ప్రోక్షణపాత్ర డెబ్భై తులాల బరువున్నది. ఆ ఉపకరణాల వెండి అంతా పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం రెండు వేల నాలుగువందల తులాల బరువు.
\v 85 ప్రతి వెండి గిన్నే 130 తులాలు, ప్రతి పాత్రా 70 తులాల బరువైనవి. పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం మొత్తం వెండి పాత్రలన్నీ 2,400 తులాల బరువు ఉన్నాయి.
\v 86 సాంబ్రాణితో నిండిన బంగారు పాత్రలు పన్నెండు ఉన్నాయి. పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం ఒక్కొక్కటి పది తులాల బరువుంది. మొత్తం బంగారం 120 తులాలుంది.
\p
\s5
\v 87 దహనబలి కింద వారు పన్నెండు ఎద్దులను, పన్నెండు పొట్టేళ్లనూ ఒక సంవత్సరం వయసున్న పన్నెండు మగ గొర్రెలను ప్రతిష్టించారు. తమ నైవేద్య అర్పణ అర్పించారు. పాపం కోసం బలిగా పన్నెండు మేకపోతులను అర్పించారు. పశువులన్నీ పన్నెండు కోడెలు, పొట్టేళ్లు పన్నెండు, ఏడాది గొర్రెపిల్లలు పన్నెండు, వాటి నైవేద్యాలు పాపపరిహారం కోసం మగ మేక పిల్లలు పన్నెండు, సమాధానబలి పశువులు ఇరవై నాలుగు కోడెలు,
\v 88 వారి పశువులన్నిటిలో నుండి 24 ఎద్దులను, 60 పొట్టేళ్లనూ 60 మేకపోతులను, ఒక సంవత్సరం వయసున్న 60 మగ గొర్రె పిల్లలను శాంతిబలిగా అర్పించారు.
\p
\s5
\v 89 యెహోవాతో మాట్లాడడానికి మోషే సన్నిధి గుడారంలోకి వెళ్ళినప్పుడు అతడు దేవుని స్వరం తనతో మాట్లాడడం విన్నాడు. నిబంధన మందసం శాసనాల పెట్టె పైన ఉన్న పరిహార స్థానం నుండి ఇద్దరు కెరూబుల మధ్యలోనుండి దేవుడు అతనితో మాట్లాడాడు. యెహోవా అతనితో మాట్లాడాడు.
\s5
\c 8
\s దీపాల స్తంభాని అహరోను వెలిగించుట
\p
\v 1 తరువాత యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు.
\v 2 <<నువ్వు అహరోనుతో మాట్లాడి ఇలా చెప్పు. దీపాలను వెలిగించినప్పుడు ఆ ఏడు దీపాల వెలుగు ఏడు దీపాల స్తంభానికి ఎదురుగా పడేలా చూడు.>>
\p
\s5
\v 3 అహరోను అలాగే చేశాడు. మోషేకి యెహోవా ఆజ్ఞాపించినట్టే దీపాల కాంతి ఆ ఏడు దీపాల స్తంభానికి ఎదురుగా పడేలా వాటిని వెలిగించాడు.
\v 4 దాని అడుగు నుండి పైన పువ్వుల వరకూ ఆ దీప స్తంభాన్ని సాగగొట్టిన బంగారంతో చేశారు. దాన్ని ఎలా చేయాలో యెహోవా మోషేకి చూపించాడు.
\s లేవీ గోత్రం వారిని వేరు చేయుట
\p
\s5
\v 5 యెహోవా మళ్ళీ మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు.
\v 6 <<ఇశ్రాయేలు ప్రజల్లోనుండి లేవీ వారిని వేరు చెయ్యి. తరువాత వారిని పవిత్రం చెయ్యి.
\p
\s5
\v 7 వారిని పవిత్రం చేయడానికి ఇలా చెయ్యి. పరిహారం కోసం వారిపై పవిత్రజలాన్ని చిలకరించు. వారిల్లో ప్రతి ఒక్కడూ మంగలి కత్తితో తన శరీరం పై ఉన్న జుట్టు అంతటినీ నున్నగా కత్తిరించుకుని, తన బట్టలు ఉతుక్కుని, తనను పవిత్రం చేసుకోవాలి.
\v 8 తరువాత వారు ఒక కోడెదూడను, దాని నైవేద్య అర్పణగా నూనె కలిపిన సన్నని గోదుమ పిండినీ తీసుకు రావాలి. పాపాల కోసం చేసే బలిగా మరో కోడెని తీసుకు రావాలి.
\p
\s5
\v 9 తరువాత నువ్వు వారిని సన్నిధి గుడారం ఎదుటకి తీసుకు రావాలి. ఇశ్రాయేలు సమాజాన్నంతా సమావేశ పరచాలి.
\v 10 లేవీ వారిని యెహోవా నైన నా ఎదుట నిలబెట్టు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు లేవీ వారిపైన తమ చేతులుంచాలి.
\v 11 లేవీ వారిని అహరోను నా ఎదుట సమర్పించాలి. ఇశ్రాయేలు ప్రజల తరపున వారిని కదలిక అర్పణగా నా ఎదుట కదిలించాలి. లేవీ వారు నాకు సేవ చేయడానికి అతడు ఈ విధంగా చేయాలి.
\p
\s5
\v 12 లేవీ వారు ఆ కోడెదూడల తలలపై తమ చేతులుంచాలి. లేవీ వారి కోసం పరిహారం చేయడానికి పాపం కోసం అర్పణగా ఒక ఎద్దునూ దహనబలిగా మరొక ఎద్దునూ నువ్వు నాకు అర్పించాలి.
\v 13 వారిని అహరోను ఎదుటా, అతని కొడుకుల ఎదుటా హాజరు పరచి నాకు కదలిక అర్పణగా నా ఎదుట నిలబెట్టాలి.
\p
\s5
\v 14 ఈ విధంగా నువ్వు ఇశ్రాయేలు ప్రజల నుండి లేవీ వారిని వేరు చేయాలి. లేవీ వంశం వారు నాకు చెందిన వారుగా ఉంటారు.
\v 15 ఇదంతా అయ్యాక లేవీ వారు సేవ చేయడానికి సన్నిధి గుడారంలోకి వెళ్ళాలి. నువ్వు వారిని పవిత్ర పరచాలి. వారిని నాకు కదలిక అర్పణ గా నా ఎదుట వారిని ఎత్తి పట్టుకోవాలి.
\p
\s5
\v 16 ఇలా తప్పకుండా చెయ్యి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల్లోనుండి వీరు సంపూర్ణంగా నా వారు. ఇశ్రాయేలు సంతానంలో గర్భం నుండి బయటకు వచ్చే ప్రతి మొదటి మగ పసికందు స్థానాన్ని వీరు తీసుకుంటారు. లేవీ వారిని నేను తీసుకున్నాను.
\v 17 ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల్లో ప్రతి మొదటి సంతానం నాదే. ఇది మనుషులకీ, పశువులకీ వర్తిస్తుంది. ఈజిప్టులో మొదటి సంతానాన్ని నేను సంహరించినప్పుడు వీరిని నాకోసం ప్రత్యేకించుకున్నాను.
\p
\s5
\v 18 మొదటి సంతానానికి బదులుగా నేను ఇశ్రాయేలు ప్రజల్లో నుండి లేవీ వారిని తీసుకున్నాను.
\v 19 వారిని అహరోనుకీ అతని కొడుకులకీ ఒక బహుమానంగా ఇచ్చాను. సన్నిధి గుడారంలో ఇశ్రాయేలు ప్రజల కోసం పనిచేయడానికి వారిని ఇశ్రాయేలు ప్రజల్లో నుండి తీసుకున్నాను. ఇశ్రాయేలు ప్రజలు పరిశుద్ధ స్థలాన్ని సమీపించినప్పుడు వాళ్లకి ఎలాంటి తెగులు హాని చేయకుండా వారి కోసం పరిహారం చేయడానికి నేను వీరిని నియమించాను.>>
\p
\s5
\v 20 అప్పుడు మోషే, అహరోనూ, ఇశ్రాయేలు సమాజమంతా అలాగే చేశారు. లేవీ వారి విషయంలో యెహోవా మోషేకి ఆదేశించింది అంతా అమలు చేశారు. ఇశ్రాయేలు ప్రజలు లేవీ వాళ్లకి ఇదంతా చేశారు.
\v 21 లేవీ వారు తమ బట్టలు ఉతుక్కుని పవిత్రం అయ్యారు. వారిని పవిత్రం చేయడానికి అహరోను వారిని యెహోవా ఎదుట సమర్పించి వారి కోసం పరిహారం చేశాడు.
\p
\s5
\v 22 తరువాత లేవీ వారు అహరోను ఎదుటా, అతని కొడుకుల ఎదుటా సన్నిధి గుడారంలో తమ సేవ చేయడానికి వెళ్ళారు. లేవీ వారిని గురించి యెహోవా మోషేకి ఆదేశించిన దాని ప్రకారం ఇది జరిగింది. లేవీ వాళ్లకందరికీ ఇలాగే జరిగించారు.
\p
\s5
\v 23 యెహోవా తిరిగి మోషేతో మాట్లాడాడు.
\v 24 <<ఇరవై ఐదు సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయసున్న లేవీ వాళ్లందరికీ ఇలాగే చేయాలి. వారు సన్నిధి గుడారంలో సేవ చేయడం కోసం చేరాలి.
\p
\s5
\v 25 అయితే వాళ్లకి యాభై ఏళ్ళు వచ్చాక ఈ విధంగా చేసే సేవ నుండి విరమించాలి. వారు అక్కడితో ఆగిపోవాలి.
\v 26 సన్నిధి గుడారంలో పని చేసే తమ సోదరులకు వారు సహాయం చేయవచ్చు గానీ సేవ నుండి మానుకోవాలి. ఈ విషయాలన్నిటిలో నువ్వు వాళ్లకి మార్గ దర్శనం చేయాలి.>>
\s5
\c 9
\s పస్కా పండుగ
\p
\v 1 యెహోవా సీనాయి అరణ్యంలో మోషేతో మాట్లాడాడు. ఇది వారు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన రెండో సంవత్సరం మొదటి నెలలో జరిగింది. ఆయన ఇలా చెప్పాడు.
\v 2 <<ప్రతి సంవత్సరం ఇశ్రాయేలు ప్రజలు పస్కా పండగను దానికి నిర్ధారించిన తేదీల్లో ఆచరించాలి.
\v 3 దాన్ని నిర్ధారించిన కాలం ఈ నెల పద్నాలుగో రోజు. ఆ రోజు సాయంత్రం మీరు పస్కా జరుపుకోవాలి. దాన్ని ఆచరించాలి. దానికి సంబంధించిన నియమాలను, ఆదేశాలను తప్పక పాటించాలి.>>
\p
\s5
\v 4 కాబట్టి మోషే పస్కా పండగను ఆచరించాలని ఇశ్రాయేలు ప్రజలకి చెప్పాడు.
\v 5 దాంతో సీనాయి అరణ్యంలో ఆ మొదటి నెలలో పద్నాలుగో రోజు సాయంత్రం వారు పస్కా ఆచరించారు. యెహోవా మోషేకి ఆజ్ఞాపించిన వాటికి ఇశ్రాయేలు ప్రజలు విధేయులయ్యారు.
\p
\s5
\v 6 కొంతమంది చనిపోయిన వ్యక్తి శరీరాన్ని తాకి అపవిత్రులయ్యారు. కాబట్టి ఆ రోజు వారు పస్కా ఆచరించలేక పోయారు.
\v 7 ఆ వ్యక్తులు మోషే దగ్గరకి వచ్చి <<మేము చనిపోయిన వ్యక్తి కారణంగానే కదా అపవిత్రులమయ్యాం. ఈ సంవత్సరంలో నిర్ధారించిన రోజున యెహోవాకు బలి అర్పించకుండా మమ్మల్ని ఎందుకు దూరం చేస్తున్నారు?>> అని అడిగారు.
\v 8 దానికి మోషే <<కాస్త ఆగండి. మీ గురించి యెహోవా ఏం చెబుతాడో విందాం.>> అని జవాబిచ్చాడు.
\p
\s5
\v 9 అప్పుడు యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు.
\v 10 <<నువ్వు ఇశ్రాయేలు ప్రజలకి ఇలా చెప్పు. <మీలో ఎవరైనా లేదా మీ సంతానంలో ఎవరైనా శవాన్ని తాకి అపవిత్రుడైనా, లేదా దూర ప్రయాణంలో ఉన్నా ఆ వ్యక్తి పస్కాను ఆచరించ వచ్చు.>
\p
\s5
\v 11 వారు రెండో నెల పద్నాలుగో రోజున సాయంత్రం పస్కా ఆచరించాలి. పొంగజేసే పదార్ధం లేకుండా చేసిన రొట్టెలు, చేదు ఆకు కూరలతో తినాలి.
\v 12 మర్నాటి ఉదయానికి దానిలో దేన్నీ మిగల్చకూడదు. దాని ఎముకల్లో దేన్నీ విరగ్గొట్టకూడదు. పస్కాకి సంబంధించిన నియమాలన్నిటినీ వారు పాటించాలి.
\p
\s5
\v 13 అయితే పవిత్రంగా ఉండీ, ప్రయాణమేదీ చేయని వాడు ఒకవేళ పస్కాను ఆచరించకపోతే ఆ వ్యక్తిని సమాజంలో లేకుండా చేయాలి. ఎందుకంటే ఆ వ్యక్తి సంవత్సరంలో నిర్ధారించిన రోజున యెహోవాకు అవసరమైన బలి అర్పణ అర్పించలేదు. ఆ వ్యక్తి తన పాపాన్ని భరించాల్సిందే.
\v 14 మీ మధ్య నివసించే విదేశీయుడు ఎవరైనా యెహోవా గౌరవం కోసం పస్కాని ఆచరించాలనుకుంటే అతడు ఆయన ఆదేశాలను అనుసరించాలి. నియమాలను అనుసరించే పస్కా ఆచరించాలి. పస్కా అనుసరించే విషయంలో మీ దేశంలో పుట్టిన వాడికీ మీ మధ్య నివసించే విదేశీయుడికీ ఒకే విధానం ఉండాలి.>>
\s మందిరం పైగా మేఘం కనిపించుట
\p
\s5
\v 15 మందిరాన్ని నిలబెట్టిన రోజున మేఘం నిబంధన శాసనాల గుడారాన్ని కమ్ముకుంది. సాయంత్రానికి మేఘం మందిరం పైగా కనిపించింది. అది మర్నాటి ఉదయం వరకూ అగ్నిలా కనిపించింది.
\v 16 అది ఎల్లప్పుడూ అలాగే కనిపించింది. మేఘం మందిరాన్ని కమ్మి రాత్రిలో అగ్నిలా కనిపించింది.
\v 17 గుడారం పైనుండి ఆ మేఘం పైకి వెళ్ళిపోయినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం సాగించేవారు. ఆ మేఘం ఆగినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు నిలిచి గుడారాలు వేసుకునేవారు.
\p
\s5
\v 18 యెహోవా ఆదేశాల ప్రకారం ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం సాగించారు. ఆయన ఆదేశాల ప్రకారం గుడారాలు వేసుకుని నిలిచి పోయారు. మందిరం పైన మేఘం నిలిచినప్పుడు తమ శిబిరంలో ఉండే వారు.
\v 19 ఆ మేఘం ఒకవేళ ఎక్కువ రోజులు మందిరం పైన ఉండిపోతే యెహోవా ఆదేశాలను బట్టి ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేసేవారు కాదు.
\p
\s5
\v 20 కొన్నిసార్లు మేఘం కొన్ని రోజులు మాత్రమే మందిరం పైన నిలిచి ఉంటే వారు కూడా నిలిచిపోయే వారు. యెహోవా ఆదేశాల మేరకు గుడారాలు వేసుకుని తిరిగి ఆయన ఆదేశాల ప్రకారం ప్రయాణమయ్యే వారు.
\v 21 కొన్నిసార్లు మేఘం సాయంత్రం నుండి మర్నాటి ఉదయం వరకూ ఉండేది. అప్పుడు ఉదయం మేఘం వెళ్ళగానే ప్రయాణం మొదలు పెట్టేవారు. ఒకవేళ మేఘం ఒక పగలూ ఒక రాత్రీ ఉంటే ఆ మేఘం వెళ్ళిన తరువాత మాత్రమే ప్రయాణం చేసేవారు.
\p
\s5
\v 22 ఆ మేఘం రెండు రోజులు గానీ, ఒక నెల గానీ, లేదా ఒక సంవత్సరం గానీ మందిరం పైన నిలిచి పొతే ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేయకుండా తమ గుడారాల్లో ఉండి పోయారు. ఆ మేఘం వెళ్లి పోయిన తరువాత మాత్రమే ప్రయాణం చేశారు.
\v 23 యెహోవా ఆదేశాలకు విధేయులై వారు తమ గుడారాలు వేసుకున్నారు. యెహోవా ఆదేశాలకు విధేయులై ప్రయాణం చేశారు. యెహోవా మోషే ద్వారా తమకిచ్చిన ఆదేశాలకు వారు విధేయులయ్యారు.
\s5
\c 10
\s వెండి బాకాలు
\p
\v 1 యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు.
\v 2 <<రెండు వెండి బాకాలు చేయించు. వెండిని సాగగొట్టి వాటిని చేయించాలి. సమాజాన్ని సమావేశం కోసం పిలవడానికీ, సేనలను తరలించడానికీ ఆ బాకాలను ఉపయోగించాలి.
\p
\s5
\v 3 సన్నిధి గుడారం ఎదుట నీ దగ్గరికి సమాజమంతా సమావేశం కావడానికి యాజకులు ఆ బాకాలు ఊదాలి.
\v 4 యాజకులు ఒకే బాకా ఊదితే ఇశ్రాయేలు సమాజంలో నాయకులూ, తెగల పెద్దలు నీ దగ్గరకి రావాలి.
\v 5 మీరు పెద్ద శబ్దంతో వాటిని ఊదితే అది సంకేతంగా భావించి తూర్పు వైపున ఉన్న సేనలు ప్రయాణం ప్రారంభించాలి.
\p
\s5
\v 6 మీరు రెండో సారి పెద్ద శబ్దంతో వాటిని ఊదితే అది సంకేతంగా భావించి దక్షిణం వైపున సైన్యాలు ప్రయాణం మొదలు పెట్టాలి. వారి ప్రయాణం ప్రారంభించినప్పుడు పెద్ద శబ్దంతో ఊదాలి.
\v 7 సమాజం సమావేశంగా కూడినప్పుడు బాకాలు ఊదాలి గానీ పెద్ద శబ్దం చేయకూడదు.
\v 8 యాజకులైన అహరోను కొడుకులు ఆ బాకాలు ఊదాలి. మీ తరతరాల్లో మీ సంతానానికి అది నిత్యమైన నియమంగా ఉండాలి.
\p
\s5
\v 9 మిమ్మల్ని బాధించే శత్రువుకి వ్యతిరేకంగా మీ దేశంలో యుద్ధానికి బయలు దేరే సమయంలో ఆ బాకాలు పదేపదే పెద్ద శబ్దంతో ఊదాలి. అప్పుడు మీ దేవుడైన యెహోవా అనే నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని శత్రువుల నుండి మిమ్మల్ని రక్షిస్తాను.
\p
\s5
\v 10 మీ పండగల సమయంలోనూ, నెల ప్రారంభంలోనూ మీరు వేడుకలు చేసుకునేటప్పుడు మీరు అర్పించే దహన బలుల గౌరవార్ధం, మీ శాంతి బలుల గౌరవార్ధం మీరు బాకాలు ఊదాలి. ఇవి మీకు మీ దేవుడినైన నన్ను జ్ఞాపకం చేస్తాయి. నేనే యెహోవాను. మీ దేవుణ్ణి.>>
\s ఇశ్రాయేలు ప్రజలు సీనాయిని వదిలిపెట్టడం
\p
\s5
\v 11 రెండో సంవత్సరం రెండో నెల ఇరవయ్యో రోజున శాసనాల గుడారం పైనుండి మేఘం వెళ్లి పోయింది.
\v 12 కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు సీనాయి అరణ్యంలో తమ ప్రయాణం సాగించారు. మేఘం తిరిగి పారాను అరణ్యంలో నిలిచింది.
\v 13 యెహోవా మోషేకి ఇచ్చిన ఆదేశాలను బట్టి వారు తమ మొదటి ప్రయాణం చేశారు.
\p
\s5
\v 14 యూదా గోత్రం వారి ధ్వజం కింద ఉన్న సైన్యం మొదట శిబిరం బయటికి కదిలింది. అమ్మీనాదాబు కొడుకు నయస్సోను ఆ సైన్యానికి నాయకుడు.
\v 15 ఇశ్శాఖారు గోత్రం సైన్యాన్ని సూయారు కొడుకు నెతనేలు నడిపించాడు.
\v 16 జెబూలూను గోత్రం సైన్యానికి హేలోను కొడుకు ఏలీయాబు నాయకుడు.
\p
\s5
\v 17 గెర్షోను, మెరారి తెగలవారు తమ బాధ్యత ప్రకారం మందిరాన్ని విప్పి దాన్ని మోస్తూ ముందుకు సాగారు.
\v 18 తరువాత రూబేను గోత్రం ధ్వజం కింద ఉన్న సైన్యం ముందుకు కదిలింది. ఆ సైన్యానికి నాయకుడు షెదేయూరు కొడుకు ఏలీసూరు.
\v 19 షిమ్యోను గోత్రం సైన్యానికి సూరీషదాయి కొడుకు షెలుమీయేలు నాయకుడు.
\v 20 గాదు గోత్రం సైన్యానికి దెయూవేలు కొడుకు ఎలీయాసాపు నాయకుడు.
\p
\s5
\v 21 కహాతు తెగవారు ప్రయాణమయ్యారు. వారు పరిశుద్ధ స్థలంలోని పరిశుద్ధ పరికరాలను మోస్తూ వెళ్ళారు. తరువాతి శిబిరంలో కహాతు తెగవారు వచ్చేలోగా ఇతరులు మందిరాన్ని నిలబెడుతూ ఉన్నారు.
\v 22 ఎఫ్రాయీము గోత్రం వారి ధ్వజం కింద వారి సేనలు కదిలాయి. ఈ సైన్యానికి అమీహూదు కొడుకు ఎలీషామా నాయకుడు.
\v 23 మనష్శే గోత్రం సైన్యానికి పెదాసూరు కొడుకు గమలీయేలు నాయకుడు.
\v 24 బెన్యామీను గోత్రం సైన్యానికి గిద్యోనీ కొడుకు అబీదాను నాయకుడు.
\p
\s5
\v 25 చివర్లో దాను గోత్రపు సైన్యాలు తమ ధ్వజం కింద కదిలాయి. ఈ సైన్యానికి నాయకుడు అమీషదాయి కొడుకు అహీయెజెరు.
\v 26 ఆషేరు గోత్రం సైన్యానికి ఒక్రాను కొడుకు పగీయేలు నాయకుడు.
\v 27 నఫ్తాలి గోత్రం సేనలకి ఏనాను కొడుకు అహీరా నాయకుడు.
\v 28 ఈ విధంగా ఇశ్రాయేలు సైన్యాలు ముందుకు ప్రయాణం చేసాయి.
\p
\s5
\v 29 మోషే హోబాబుతో మాట్లాడాడు. ఈ హోబాబు మోషే భార్యకు తండ్రి అయిన రెవూయేలు కొడుకు. ఇతడు మిద్యాను ప్రాంతం వాడు. మోషే హోబాబుతో <<యెహోవా మాకు చూపించిన దేశానికి మేము వెళ్తున్నాం. దాన్ని మీకు ఇస్తానని యెహోవా మాకు చెప్పాడు. నువ్వు మాతో రా. మా వల్ల మీకు మేలు కలుగుతుంది. ఇశ్రాయేలు ప్రజలకి మేలు చేస్తానని యెహోవా ప్రమాణం చేశాడు>> అని చెప్పాడు.
\v 30 దానికి అతడు <<నేను రాను. నేను నా స్వదేశానికీ, నా సొంత ప్రజల దగ్గరకీ వెళ్తాను>> అన్నాడు.
\p
\s5
\v 31 అప్పుడు మోషే ఇలా జవాబిచ్చాడు. <<నువ్వు మమ్మల్ని దయచేసి విడిచి పెట్టవద్దు. అరణ్యంలో ఎలా నివసించాలో నీకు బాగా తెలుసు. నువ్వు మా కోసం కనిపెట్టుకుని ఉండాలి.
\v 32 నువ్వు మాతో వస్తే యెహోవా మాకు చేసిన మేలుని మేము నీకు చేస్తాం.>>
\p
\s5
\v 33 వారు యెహోవా కొండ దగ్గర నుండి మూడు రోజులు ప్రయాణం చేశారు. వారి విశ్రాంతి స్థలం కోసం చేసిన మూడు రోజుల ప్రయాణంలో యెహోవా నిబంధన శాసనాల పెట్టె వాళ్లకి ముందుగా కదిలింది.
\v 34 వారు తాము మజిలీ చేసిన స్థలం నుండి ప్రయాణం చేసినప్పుడు యెహోవా మేఘం పగటివేళ వారి మీద ఉంది.
\p
\s5
\v 35 నిబంధన పెట్టె ప్రయాణం కోసం లేచినప్పుడల్లా మోషే <<యెహోవా, లే, నీ శత్రువులను చెదరగొట్టు. నిన్ను ద్వేషించే వారిని నీ ఎదుటనుండి తరిమి కొట్టు>> అనేవాడు.
\v 36 నిబంధన పెట్టె ఆగినప్పుడు మోషే <<యెహోవా లక్షలాది మంది ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి తిరిగి రా>> అనేవాడు.
\s5
\c 11
\s యెహోవా దగ్గర నుండి అగ్ని
\p
\v 1 ప్రజలు యెహోవా వింటుండగా తమ సమస్యల గురించి ఫిర్యాదు చేయడం మొదలు పెట్టారు. వారి మాటలు విని యెహోవా ఆగ్రహించాడు. దాంతో వారి మధ్యలో మంటలు రేగి శిబిరం ఒక వైపున అంచుల్లో కాలిపోవడం మొదలయింది.
\v 2 అప్పుడు ప్రజలు గట్టిగా కేకలు పెట్టి మోషేను బతిమాలారు. కాబట్టి మోషే యెహోవాకు ప్రార్ధించాడు. అప్పుడు ఆ మంటలు చల్లారాయి.
\v 3 యెహోవా అగ్ని వారి మధ్యలో రగిలింది కాబట్టి ఆ స్థలానికి <<
\f +
\fr 11:3
\ft తగలబడిపోవడం.
\f* తబేరా>> అనే పేరు వచ్చింది.
\s యెహోవా దగ్గర నుండి పూరేడు పిట్టలు
\p
\s5
\v 4 కొంతమంది విదేశీయులు ఇశ్రాయేలు ప్రజల మధ్య వారితో కలసి నివసిస్తున్నారు. వారు తినడానికి ఇంకా మంచి ఆహారం కోరుకున్నారు. దాంతో ఇశ్రాయేలు ప్రజలు ఫిర్యాదు చేస్తూ <<తినడానికి మాకు మాంసం ఎవరిస్తారు?
\v 5 ఐగుప్తులో మేము స్వేచ్ఛగా ఆరగించిన చేపలూ, కీర దోస కాయలూ, కర్బూజాలూ, ఆకు కూరలూ, ఉల్లి పాయలూ, వెల్లుల్లీ మాకు గుర్తుకు వస్తున్నాయి.
\v 6 ఇప్పుడు మేము బలహీనులమయ్యాం. తినడానికి ఈ మన్నా తప్పించి మాకేం కన్పించడం లేదు>> అని చెప్పుకున్నారు.
\p
\s5
\v 7 ఆ మన్నా కొత్తిమీర గింజల్లా ఉంటుంది. చూడ్డానికి గుగ్గిలంలా ఉంటుంది.
\v 8 ప్రజలు శిబిరం మైదానంలో నడుస్తూ మన్నాని సేకరించేవారు. తిరగలిలో విసిరి గానీ రోట్లో దంచి గానీ దాన్ని పిండి చేసి పెనం పైన కాల్చి రొట్టెలు చేసే వారు. దాని రుచి తాజా ఒలీవ నూనె రుచిలా ఉండేది.
\p
\s5
\v 9 రాత్రి వేళల్లో శిబిరం పైన మంచు కురిసినప్పుడు దాంతో పాటే మన్నా కూడా ఆ మంచు పైన పడేది.
\v 10 ప్రజలు వారి కుటుంబాలతో కలసి ఎవరి గుమ్మం ఎదుట వారు కూర్చుని ఏడుస్తుండగా మోషే విన్నాడు. యెహోవా భీకర కోపం రగిలి పోయింది. వారు ఏడవడం, ఫిర్యాదు చేయడం మోషే దృష్టిలో తప్పుగా ఉంది.
\p
\s5
\v 11 అప్పుడు మోషే యెహోవాతో ఇలా అన్నాడు. <<నేను నీ సేవకుణ్ణి. నాపై ఇంత నిర్దయగా వ్యవహరించావెందుకు? నాపై ఇంత కోపంగా ఉన్నావెందుకు? ఈ ప్రజల భారాన్ని నాపై మోపావు.
\v 12 ఈ జనాన్నంతా నేను కన్నానా? <తండ్రి తన బిడ్డని గుండెకి హత్తుకున్నట్టుగా వీరిని హత్తుకో> అని నువ్వు నాతో చెప్పడానికి నేనేమన్నా వారిని నా గర్భంలో మోసానా? వారి పూర్వీకులకి నువ్వు ఇస్తానని ప్రమాణం చేసిన దేశానికి నేను వారిని మోసుకు వెళ్ళాలా?
\p
\s5
\v 13 ఇంతమంది ప్రజలకి మాంసం నేను ఎక్కడ నుండి తేవాలి? వారు నన్ను చూసి ఏడుస్తున్నారు. <మేము తినడానికి మాంసం ఇవ్వు> అంటున్నారు.
\v 14 ఈ ప్రజలందరి భారం మోయడం నా ఒక్కడి వల్ల కాదు. వీళ్ళ భారం నా శక్తికి మించింది.
\v 15 నువ్వు నాతో ఇలా వ్యవహరించదలిస్తే నన్ను ఇప్పుడే చంపెయ్యి. నా మీద నీకు దయ కలిగితే నన్ను చంపి నా బాధ తీసెయ్యి.>>
\p
\s5
\v 16 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు. <<ఇశ్రాయేలు ప్రజల్లో పెద్దలు 70 మందిని నాదగ్గరికి తీసుకురా. వారు ప్రజల్లో పెద్దలనీ అధిపతులనీ స్పష్టంగా గుర్తించి తీసుకురా. వారిని సన్నిధి గుడారం దగ్గరికి తీసుకుని రా. వారిని నీతో కూడా నిలబెట్టు.
\v 17 అక్కడ నేను దిగి నీతో మాట్లాడతాను. తరువాత నీ మీద ఉన్న ఆత్మలో కొంత వారి పైన ఉంచుతాను. వారు నీతో కలసి ప్రజల భారాన్ని మోస్తారు. నువ్వు ఒంటరిగా ఈ భారం మోయాల్సిన అవసరం లేదు.
\p
\s5
\v 18 నువ్వు ప్రజలకుఇలా చెప్పు. రేపటికి మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోండి. యెహోవా రాకకై సిద్ధపడండి. యెహోవా వింటుండగా మీరు ఏడ్చారు కాబట్టి మీరు కచ్చితంగా మాంసం తింటారు. <మాకు మాంసం ఎవరు పెడతారు? మాకు ఐగుప్తులోనే బాగుంది> అన్నారు గదా. అందుకని యెహోవా మీకు మాంసం ఇస్తాడు. మీరు దాన్ని తింటారు.
\v 19 ఒక్క రోజు కాదు, రెండు రోజులు కాదు, ఐదు రోజులు కాదు, పది రోజులు కాదు, ఇరవై రోజులు కాదు.
\v 20 ఒక నెల రోజులు మీరు మాంసం తింటారు. అది మీ ముక్కు పుటాల్లోంచి బయటకు వచ్చి మీకు అసహ్యం పుట్టే వరకూ తింటారు. మీరు మీ మధ్య ఉన్న యెహోవాను తిరస్కరించారు కాబట్టి అది మీకు వెగటు పుట్టిస్తుంది. ఆయన ముందు మీరు ఏడ్చారు. <ఐగుప్తు నుండి ఎందుకు వచ్చాం?> అన్నారు.>>
\p
\s5
\v 21 దానికి మోషే <<నేను ఆరు లక్షలమంది జనంతో ఉన్నాను. నువ్వేమో <ఒక నెల అంతా వాళ్లకి మాంసం ఇస్తాను> అంటున్నావు.
\v 22 ఇప్పుడు వారిని తృప్తి పరచడానికి గొర్రెలను, పశువులను చంపాలా? సముద్రంలో ఉన్న చేపలన్నిటినీ వారి కోసం పట్టాలా?>> అన్నాడు.
\v 23 అప్పుడు యెహోవా మోషేతో <<నా బాహుబలానికి శక్తి తగ్గిందా? నా మాట నిజమో కాదో నువ్వు ఇప్పుడే చూస్తావు>> అన్నాడు.
\p
\s5
\v 24 మోషే బయటికి వచ్చి యెహోవా మాటలు ప్రజలకు చెప్పాడు. ప్రజల్లోనుండి 70 మంది పెద్దలను గుడారం చుట్టూ నిలబెట్టాడు.
\v 25 అప్పుడు యెహోవా మేఘంలో దిగాడు. అతనితో మాట్లాడాడు. అతని పైన ఉన్న ఆత్మలో ఒక భాగాన్ని పెద్దల పైన ఉంచాడు. ఆత్మ వారిపై ఉన్నప్పుడు వారు ప్రవచనం చెప్పారు. వారంతా ఆ సందర్భంలోనే ప్రవచించారు, ఆ తరువాత ఎప్పుడూ ప్రవచనం చెప్పలేదు.
\p
\s5
\v 26 ఆ మనుషుల్లో ఇద్దరు శిబిరంలో ఉండిపోయారు. వారి పేర్లు ఎల్దాదు, మేదాదు. ఆత్మ వారిపై కూడా నిలిచాడు. వారి పేర్లు పెద్దల జాబితాలో ఉన్నాయి కానీ వారు గుడారం దగ్గరకి వెళ్ళలేదు. అయినా వారి శిబిరంలోనే వారు ప్రవచించారు.
\v 27 అప్పుడు శిబిరంలో ఒక యువకుడు మోషే దగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చి <<ఎల్దాదు, మేదాదులు శిబిరంలో ప్రవచిస్తున్నారు>> అని చెప్పాడు.
\p
\s5
\v 28 మోషే సహాయకుడూ, తాను ఎన్నుకున్న వారిలో ఒకడూ, నూను కొడుకూ అయిన యెహోషువ <<మోషే, నా యజమానీ, వారిని ఆపు>>అన్నాడు.
\v 29 దానికి మోషే <<నా కోసం నీకు రోషం వచ్చిందా? అసలు యెహోవా ప్రజలందరూ ప్రవక్తలు కావాలని కోరుకుంటున్నాను. దాని కోసం యెహోవా తన ఆత్మని అందరి పైనా ఉంచుతాడు గాక>> అని అతనితో చెప్పాడు.
\v 30 అప్పుడు మోషే, ఇశ్రాయేలు పెద్దలంతా శిబిరంలోకి వెళ్ళారు.
\p
\s5
\v 31 అప్పుడు యెహోవా దగ్గరనుండి వాయువు బయల్దేరింది. అది సముద్రం నుండి పూరేడు పిట్టలను తీసుకు వచ్చి శిబిరంలో అంతటా పడవేసింది. ఈ వైపునుండి ఆ వైపుకీ, ఆ వైపునుండి ఈ వైపుకీ ఒక రోజు ప్రయాణమంత దూరం వరకూ అవి వచ్చి పడ్డాయి. అవి భూమికి రెండు మూరల ఎత్తున పడ్డాయి.
\v 32 కాబట్టి ప్రజలు ఉదయాన్నే లేచి ఆ రోజంతా వాటిని సేకరించారు. ఆ రాత్రీ మరుసటి రోజు అంతా వాటిని సేకరించారు. నూరు తూముల పిట్టల కంటే తక్కువ సేకరించినవాడు లేడు. తరువాత వారు వాటిని శిబిరం చుట్టూ తమ కోసం పరచి ఉంచారు.
\p
\s5
\v 33 ఆ మాంసం వారి పళ్ళ మధ్య ఉండగానే, వారు దాన్ని నములుతూ ఉన్నప్పుడే యెహోవా వారిపై ఆగ్రహించాడు. పెద్ద రోగంతో ఆయన వారిని బాధించాడు.
\v 34 మాంసం కోసం అతిగా ఆశ పడిన వారిని ప్రజలు ఒక స్థలంలో పాతిపెట్టారు. అందుకే ఆ స్థలానికి <<
\f +
\fr 11:34
\ft అత్యాశ స్మశానం.
\f* కిబ్రోతు హత్తావా>> అనే పేరు కలిగింది.
\v 35 ప్రజలు కిబ్రోతు హత్తావా నుండి హజేరోతుకి ప్రయాణమై వెళ్ళారు. అక్కడ నివసించారు.
\s5
\c 12
\s మోషేకి వ్యతిరేకంగా మిర్యాము, అహరోను
\p
\v 1 మోషే కూషు దేశానికి చెందిన ఒక స్త్రీని పెళ్ళి చేసుకున్నాడు. అందుకని మిర్యాము, అహరోనులు మోషేకి వ్యతిరేకంగా మాట్లాడారు.
\v 2 <<యెహోవా కేవలం మోషేతోనే మాట్లాడాడా? మాతో ఆయన మాట్లాడలేదా?>> అని చెప్పుకున్నారు. వాళ్ల మాటలు యెహోవా విన్నాడు.
\v 3 మోషే ఎంతో సాధుగుణం గలవాడు. భూమిపైన ఉన్నవారందరిలో ఎంతో సాత్వికుడు.
\p
\s5
\v 4 వెంటనే యెహోవా మోషే, అహరోను, మిర్యాములతో మాట్లాడాడు. <<మీరు ముగ్గురూ ఉన్న పళంగా సన్నిధి గుడారం దగ్గరకి రండి>> అన్నాడు. ఆ ముగ్గురూ అక్కడికి వెళ్ళారు.
\v 5 అప్పుడు యెహోవా మేఘస్తంభంలో దిగి వచ్చాడు. గుడారం ద్వారం దగ్గర నుండి అహరోను, మిర్యాములను పిలిచాడు. వారిద్దరూ అక్కడికి వెళ్ళారు.
\p
\s5
\v 6 యెహోవా ఇలా అన్నాడు.
\p <<మీరు ఇప్పుడు నా మాటలు వినండి.
\p మీ మధ్య నా ప్రవక్త ఎవరన్నా ఉంటే, నేను అతనికి స్వప్నాల ద్వారా దర్శనం ఇస్తాను.
\p కలల ద్వారా అతనితో మాట్లాడతాను.
\p
\v 7 నా సేవకుడు మోషే అలాంటి వాడు కాదు.
\p అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు.
\p
\v 8 నేను అతనితో స్వప్నాల్లోనో, నిగూఢమైన రీతిలోనో మాట్లాడను.
\p ముఖాముఖీగా మాట్లాడతాను.
\p అతడు నా స్వరూపాన్ని చూస్తాడు.
\p అలాంటప్పుడు నా సేవకుడైన మోషేకి వ్యతిరేకంగా మాట్లాడడానికి మీరెందుకు భయపడలేదు?>>
\p
\s5
\v 9 యెహోవా వారిపై తీవ్రంగా ఆగ్రహించి అక్కడనుండి వెళ్ళిపోయాడు.
\v 10 గుడారం పైనుండి మేఘం పైకి వెళ్ళిపోయింది. అప్పుడు అకస్మాత్తుగా మిర్యాముకు కుష్టు వ్యాధి సోకింది. ఆమె మంచులా తెల్లగా కన్పించింది. అహరోను ఆమెని చూశాడు. ఆమెకి కుష్టువ్యాధి ఉండడం చూశాడు.
\p
\s5
\v 11 అప్పుడు అహరోను మోషేతో ఇలా అన్నాడు. <<అయ్యో నా ప్రభూ, మేము చేసిన పాపానికి శిక్ష మాకు వేయవద్దు. మేము తెలివి తక్కువగా మాట్లాడి పాపం చేశాం.
\v 12 తన తల్లి గర్భంలోంచి బయటకి వచ్చేటప్పటికే సగం మాంసం పోగొట్టుకున్న మృతశిశువులా ఆమెని ఉండనీయకు.>>
\p
\s5
\v 13 కాబట్టి మోషే యెహోవాకు మొర పెట్టాడు. <<దేవా, దయచేసి ఈమెను బాగు చెయ్యి>> అని ప్రార్ధించాడు.
\v 14 అప్పుడు యెహోవా మోషేతో <<ఆమె తండ్రి ఆమె ముఖంపై ఉమ్మి వేస్తే ఆ అవమానం ఆమె ఏడు రోజులు భరిస్తుంది కదా. ఆ ఏడు రోజులూ ఆమెని శిబిరం బయట ప్రత్యేకంగా ఉంచు. ఆ తరువాత ఆమెని తిరిగి శిబిరంలోకి తీసుకు రా>> అన్నాడు.
\v 15 కాబట్టి మిర్యాము ఏడు రోజులు శిబిరం బయటే గడిపింది. మిర్యాము తిరిగి శిబిరంలోకి వచ్చే వరకూ ప్రయాణం చేయకుండా ప్రజలు నిలిచిపోయారు.
\p
\s5
\v 16 ఆ తరువాత ప్రజలు హజేరోతు నుండి ప్రయాణం చేసి పారాను అరణ్యంలో ఆగారు.
\s5
\c 13
\s కనాను దేశాన్ని పరీక్షించడానికి
\p
\v 1 ఆ తరువాత యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు.
\v 2 నేను ఇశ్రాయేలు ప్రజలకి ఇస్తున్న కనాను దేశాన్ని పరీక్షించడానికి కొంతమందిని పంపించు. తమ పూర్వీకుల గోత్రాల ప్రకారం ఒక్కో గోత్రం నుండి ఒక్కో వ్యక్తిని మీరు పంపించాలి. వారిల్లో ప్రతి వాడూ తమ ప్రజల్లో నాయకుడై ఉండాలి.
\p
\s5
\v 3 మోషే యెహోవా ఆజ్ఞకు విధేయులయ్యేలా వారిని పారాను అరణ్యం నుండి పంపించాడు. వెళ్ళిన వారంతా ఇశ్రాయేలు ప్రజల్లో నాయకులు.
\v 4 వారి పేర్లు ఇవి. రూబేను గోత్రం నుండి జక్కూరు కొడుకు షమ్మూయ,
\p
\s5
\v 5 షిమ్యోను గోత్రం నుండి హోరీ కొడుకు షాపాతు,
\v 6 యూదా గోత్రం నుండి యెఫున్నె కొడుకు కాలేబు,
\v 7 ఇశ్శాఖారు గోత్రం నుండి యోసేపు కొడుకు ఇగాలు.
\v 8 ఎఫ్రాయిము గోత్రం నుండి నూను కుమారుడు హోషేయ,
\p
\s5
\v 9 బెన్యామీను గోత్రం నుండి రాఫు కొడుకు పల్తీ,
\v 10 జెబూలూను గోత్రం నుండి సోరీ కొడుకు గదీయేలు,
\v 11 యోసేపు గోత్రం నుండి అంటే మనష్షే గోత్రం నుండి సూసీ కొడుకు గదీ,
\v 12 దాను గోత్రం నుండి గెమలి కొడుకు అమ్మీయేలు,
\p
\s5
\v 13 ఆషేరు గోత్రం నుండి మిఖాయేలు కొడుకు సెతూరు,
\v 14 నఫ్తాలి గోత్రం నుండి వాపెసీ కొడుకు నహబీ,
\v 15 గాదు గోత్రం నుండి మాకీ కొడుకు గెయువేలు.
\v 16 ఆ దేశాన్ని పరీక్షించడానికి మోషే పంపిన వ్యక్తుల పేర్లు ఇవి. నూను కొడుకు హోషేయకి మోషే యెహోషువ అనే పేరు పెట్టాడు.
\p
\s5
\v 17 వారిని కనాను దేశాన్ని చూసి పరీక్షించడానికి మోషే పంపించాడు. అప్పుడు వాళ్లతో ఇలా చెప్పాడు. <<మీరు దక్షిణం వైపు నుండి ప్రవేశించి పర్వత ప్రాంతంలోకి ఎక్కి వెళ్ళండి.
\v 18 ఆ దేశం ఎలాంటిదో పరీక్షించండి. అక్కడ నివసించే ప్రజలను పరిశీలించండి. ఆ ప్రజలు బలవంతులా లేక బలహీనులా అన్నది చూడండి. అక్కడి ప్రజల జనాభా కొద్దిమందే ఉన్నారా లేక అధికంగా ఉన్నారా అనేది చూడండి.
\v 19 వారు నివసించే నేల ఎలాంటిదో చూడండి. అది మంచిదా, చెడ్డదా? ఎలాంటి పట్టణాలు అక్కడ ఉన్నాయి? వారి నివాసాలు శిబిరాల్లా ఉన్నాయా లేక ప్రాకారాలున్న కోటల్లో నివసిస్తున్నారా?
\v 20 అక్కడి భూమి లక్షణం ఎలాంటిదో చూడండి. అది సారవంతమైనదా లేక నిస్సారమైనదా? అక్కడ చెట్లు ఉన్నాయో లేవో చూడండి. ధైర్యంగా ఉండండి. అక్కడి భూమి మీద పండే ఉత్పత్తుల్లో ఏవైనా రకాలు తీసుకు రండి.>> అది ద్రాక్ష పళ్ళు పక్వానికి వచ్చే కాలం.
\p
\s5
\v 21 కాబట్టి ఆ వ్యక్తులు బయల్దేరి వెళ్ళారు. వారు లెబో హమాతు అనే ప్రాంతానికి దగ్గరగా సీను అరణ్యం నుండి రెహోబు వరకూ వెళ్లి సంచారం చేశారు.
\v 22 వారు దక్షిణం వైపు నుండి ప్రయాణం చేసి హెబ్రోనుకి వచ్చారు. అక్కడ అనాకు వంశం వారు అయిన అహీమాను, షేషయి, తల్మయి అనే తెగల ప్రజలు ఉన్నారు. ఆ హెబ్రోను పట్టణాన్ని ఐగుప్తులో ఉన్న సోయను పట్టణం కంటే ఏడేళ్ళు ముందుగా కట్టారు.
\p
\s5
\v 23 వారు ఎష్కోలు లోయ చేరుకున్నారు. అక్కడ ద్రాక్ష గుత్తులు ఉన్న ఒక కొమ్మను కోశారు. దాన్ని ఒక కర్రకి కట్టి ఇద్దరు వ్యక్తులు మోశారు. అక్కడనుంచే కొన్ని దానిమ్మ పళ్ళనూ కొన్ని అంజూరు పళ్ళనూ తీసుకు వచ్చారు.
\v 24 ఇశ్రాయేలు ప్రజలు ఆ ప్రాంతంలో కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ ప్రాంతానికి <<
\f +
\fr 13:24
\ft గుత్తి, గెల
\f* ఎష్కోలు లోయ>> అనే పేరు పెట్టారు.
\s పరీక్షించిన కనాను దేశం నుంచి సమాచారం
\p
\s5
\v 25 వారు ఆ దేశంలో నలభై రోజుల పాటు సంచరించి, పరీక్షించి తిరిగి వచ్చారు.
\v 26 పారాను అరణ్యంలో కాదేషులో ఉన్న మోషే అహరోనుల దగ్గరికీ, ఇశ్రాయేలు ప్రజలందరి దగ్గరికీ వచ్చారు. ఆ దేశం గురించిన సమాచారం తెలియజేశారు. అలాగే తాము తెచ్చిన ఆ ప్రాంతం పళ్ళు చూపించారు.
\p
\s5
\v 27 వారు మోషేకి ఇలా చెప్పారు. <<నువ్వు మమ్మల్ని పంపించిన దేశానికి మేము వెళ్లాం. అక్కడ పాలు తేనెలు ప్రవహిస్తున్నాయి అన్నది నిజమే. ఆ దేశం పళ్ళు ఇవి.
\v 28 కానీ అక్కడ నివసిస్తున్న ప్రజలు చాలా బలవంతులు. అక్కడి పట్టణాలు పెద్దవి. అవన్నీ బ్రమ్హాండమైన ప్రాకారాలు ఉన్న పట్టణాలు. అక్కడ మేము అనాకు వంశం వారిని చూశాం.
\v 29 దక్షిణ ప్రాంతంలో అమాలేకు ప్రజలు నివసిస్తున్నారు. కొండ ప్రాంతంలో హిత్తీ, యెబూసీ, అమోరీ తెగల వారు నివసిస్తున్నారు. ఇక సముద్రం సమీపంలోనూ, యొర్దాను నదీ ప్రాంతంలోనూ కనాను ప్రజలు నివసిస్తున్నారు.>>
\p
\s5
\v 30 అప్పుడు కాలేబు మోషే చుట్టూ చేరిన జనాన్ని ఉత్సాహపరచడానికి ప్రయత్నం చేశాడు. <<మనం దానిపై దాడి చేసి స్వాధీనం చేసుకుందాం. దాన్ని జయించడానికి మనకున్న బలం సరిపోతుంది>> అన్నాడు.
\v 31 కాని అతనితో వెళ్ళిన మిగతా వారు <<అక్కడి ప్రజలపై మనం దాడి చేయలేం. ఎందుకంటే వారు మనకన్నా బలవంతులు.>> అన్నారు.
\p
\s5
\v 32 ఈ విధంగా వారు తాము వెళ్లి చూసి వచ్చిన ప్రాంతం గురించి ఇశ్రాయేలు ప్రజలకు నిరుత్సాహ పరిచే నివేదిక ఇచ్చారు. <<మేము చూసి వచ్చిన ఆ దేశం తన నివాసుల్నే మింగివేసే దేశం. మేము చూసిన ప్రజలంతా ఆజానుబాహులు.
\v 33 అక్కడ మేము నెఫీలీ ప్రజలను చూశాం. వారు అనాకు వంశం వాడైన నెఫీలీ తెగ వారు. వారి ఎదుట మా దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాం. వారి దృష్టికీ అలాగే ఉన్నాం>> అన్నారు.
\s5
\c 14
\s ఇశ్రాయేలు ప్రజల తిరుగుబాటు
\p
\v 1 ఆ రాత్రి ప్రజలందరూ పెద్దగా కేకలు పెట్టి ఏడ్చారు.
\v 2 ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనులకు వ్యతిరేకంగా గొడవ చేశారు.
\v 3 ఆ సమాజమంతా వారితో <<ఈ అరణ్యంలో చనిపోవడం కన్నా మేము ఐగుప్తులో చనిపోతే బాగుండేది! మేము కత్తివాత చావాలని యెహోవా మమ్మల్ని ఈ ప్రదేశానికి తీసుకొచ్చాడా? మా భార్యలు, మా చిన్న పిల్లలు బాధల పాలౌతారు. మళ్ళీ ఐగుప్తు తిరిగి వెళ్ళడం మాకు మేలు కాదా?>> అన్నారు.
\p
\s5
\v 4 వారు <<మనం ఇంకొక నాయకుణ్ణి ఎంపిక చేసుకుని ఐగుప్తుకు తిరిగి వెళ్దాం పదండి>> అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.
\v 5 అప్పుడు మోషే, అహరోను ఇశ్రాయేలు ప్రజల సమావేశం ఎదుట సాగిలపడ్డారు.
\p
\s5
\v 6 అప్పుడు, ఆ ప్రదేశాన్ని పరిశీలించి చూసిన వారిలో నూను కొడుకు యెహోషువ, యెఫున్నె కొడుకు కాలేబు బట్టలు చింపుకుని,
\v 7 ఇశ్రాయేలీయుల సర్వజన సమూహంతో మాట్లాడుతూ <<మేము సంచారం చేసి పరిశీలించి చూసిన ప్రదేశం ఎంతో మంచి ప్రదేశం.
\v 8 యెహోవా మనలను బట్టి ఆనందిస్తే, ఆ ప్రదేశంలో మనలను చేర్చి, దాన్ని మనకు ఇస్తాడు. అది పాలు తేనెలు ప్రవహించే ప్రదేశం.
\p
\s5
\v 9 కాబట్టి, మీరు యెహోవా మీద తిరగబడవద్దు. ఆ దేశ ప్రజలకు భయపడవద్దు. వారు మనకు అన్నం తిన్నంత తేలిక. యెహోవా మనతో ఉన్నాడు గనక వారి భద్రత ఇక వారి పై నుండి తొలిగిపోతుంది. వాళ్లకు భయపడవద్దు>> అన్నారు. కాని, ఆ సమూహం, వారిని రాళ్లతో కొట్టి చంపాలన్నారు.
\v 10 అప్పుడు సన్నిధి గుడారంలో యెహోవా మహిమ ఇశ్రాయేలీయులందరికీ కనబడింది.
\p
\s5
\v 11 యెహోవా మోషేతో <<ఎంతకాలం ఈ ప్రజలు నన్ను కించపరుస్తారు? నా శక్తిని చూపించే సూచనలన్నీ నేను వారి మధ్య జరిగించినా, నన్ను ఇంకెంతకాలం నమ్మకుండా ఉంటారు?
\v 12 నేను వారి మీద తెగులుపంపిస్తాను. వారికి వారసత్వ హక్కు లేకుండా చేస్తాను. ఈ జనం కంటే మరింత గొప్ప బలమైన జనాంగాన్ని నీ వంశం ద్వారా పుట్టిస్తాను>> అన్నాడు.
\p
\s5
\v 13 మోషే యెహోవాతో <<అలా చేస్తే ఐగుప్తీయులు దాని గురించి వింటారు. ఎందుకంటే నీ బలంతో నువ్వు ఈ జనాన్ని ఐగుప్తీయుల్లో నుంచి రప్పించావు. వారు ఈ దేశ వాసులతో ఈ విషయం చెప్తారు.
\v 14 యెహోవా అనే నువ్వు ఈ ప్రజల మధ్య ఉన్నావనీ, యెహోవా అనే నువ్వు ముఖాముఖిగా కనిపించినవాడివనీ, నీ మేఘం వారి మీద నిలిచి ఉన్నదనీ, నువ్వు పగలు మేఘస్తంభంలోనూ, రాత్రి అగ్నిస్తంభంలోనూ వారి ముందు నడుస్తున్నావనీ, వారు విని ఉన్నారు గదా.
\p
\s5
\v 15 కాబట్టి నువ్వు ఒక్క దెబ్బతో ఈ ప్రజలను చంపితే నీ కీర్తిని గురించి విన్న ప్రజలు
\v 16 <ప్రమాణ పూర్వకంగా తాను ఈ ప్రజలకిచ్చిన దేశంలో వారినిచేర్చడానికి శక్తిలేక, యెహోవా వారిని అరణ్యంలో చంపేశాడు> అని చెప్పుకుంటారు.
\s5
\v 17 <యెహోవా దీర్ఘశాంతుడు, నిబంధన నమ్మకత్వం సమృద్ధిగా కలిగినవాడు.
\v 18 దోషం, అతిక్రమం పరిహరించేవాడు. అపరాధిని నిరపరాధిగా ఎంచకుండా, మూడు నాలుగు తరాల వరకూ తండ్రుల దోషాన్ని కొడుకుల మీదికి తెచ్చే వాడిగా ఉన్నాడు> అని నువ్వు చెప్పిన మాట ప్రకారం నా ప్రభువు బలానికి ఘనత కలుగు గాక.
\v 19 ఐగుప్తులోనుంచి వచ్చింది మొదలు ఇంతవరకూ నువ్వు ఈ ప్రజల పాపం పరిహరించినట్టు నీ గొప్ప నిబంధన నమ్మకత్వాన్నిబట్టి ఈ ప్రజల పాపాన్ని దయచేసి క్షమించు>> అన్నాడు.
\s5
\v 20 యెహోవా <<నీ కోరిక ప్రకారం నేను క్షమించాను.
\v 21 కాని, నా జీవంతో తోడు, భూమి అంతా నిండి ఉన్న యెహోవా మహిమ తోడు,
\v 22 ఐగుప్తులో, అరణ్యంలో నేను చేసిన సూచనలనూ, నా మహిమను చూసిన ఈ మనుషులందరూ, ఈ పదిసార్లు నా మాట వినకుండా నన్ను పరీక్షకు గురి చేశారు.
\s5
\v 23 కాబట్టి వారి పితరులకు ప్రమాణ పూర్వకంగా నేనిచ్చిన దేశాన్ని వారు చూడనే చూడరు. నన్ను పట్టించుకోని వారిలో ఎవరూ దాన్ని చూడరు.
\v 24 నా సేవకుడైన కాలేబు వీళ్ళ లాంటి వాడు కాదు. అతడు పూర్ణమనస్సుతో నన్ను అనుసరించిన కారణంగా అతడు పరిశీలించడానికి వెళ్ళిన దేశంలో అతన్ని ప్రవేశపెడతాను.
\v 25 అతని సంతానం దాన్ని స్వాధీనం చేసుకుంటుంది. అమాలేకీయులు, కనానీయులు ఆ లోయలో నివాసం ఉంటున్నారు. రేపు మీరు తిరిగి ఎర్రసముద్రం మార్గంలో అరణ్యంలోకి ప్రయాణమై వెళ్ళండి>> అన్నాడు.
\p
\s5
\v 26 ఇంకా యెహోవా మోషే అహరోనులతో మాట్లాడుతూ,
\v 27 <<నాకు విరోధంగా నన్ను విమర్శించే ఈ చెడ్డ సమాజాన్ని నేనెంత వరకూ సహించాలి? ఇశ్రాయేలీయులు నాకు విరోధంగా చేస్తున్న విమర్శలు నేను విన్నాను.
\p
\s5
\v 28 నువ్వు వారితో, యెహోవా చెప్పేదేమంటే, నేను జీవంతో ఉన్నట్టు, మీరు నాతో చెప్పినట్టు నేను కచ్చితంగా మీపట్ల చేస్తాను.
\v 29 మీ శవాలు ఈ అరణ్యంలోనే రాలిపోతాయి. మీ పూర్తి లెక్క ప్రకారం మీలో లెక్కకు వచ్చిన వారందరూ, అంటే, ఇరవై సంవత్సరాలు మొదలు ఆ పైవయస్సు కలిగి, నాకు విరోధంగా విమర్శించిన వారిందరూ రాలిపోతారు.
\v 30 యెఫున్నె కొడుకు కాలేబు, నూను కొడుకు యెహోషువ తప్ప మీకు నివాసంగా ఇస్తానని నేను ప్రమాణం చేసిన దేశంలో కచ్చితంగా మీలో ఎవరూ ప్రవేశించరు.
\p
\s5
\v 31 కాని, బందీలౌతారని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశం లోపలికి రప్పిస్తాను. మీరు తృణీకరించిన దేశాన్ని వారు అనుభవిస్తారు.
\v 32 మీ విషయంలో మాత్రం, మీ శవాలు ఈ అరణ్యంలో రాలిపోతాయి.
\v 33 మీ పిల్లలు ఈ అరణ్యంలో నలభై సంవత్సరాలు తిరుగులాడతారు. ఈ అరణ్యం మీ శరీరాలను చంపే వరకూ మీ తిరుగుబాటు వల్ల వచ్చిన పర్యవసానాలను వారు భరించాలి.
\p
\s5
\v 34 మీరు ఆ ప్రదేశాన్ని సంచారం చేసి చూసిన నలభై రోజుల లెక్క ప్రకారం రోజుకు ఒక సంవత్సరం ప్రకారం నలభై సంవత్సరాలు మీ పాపశిక్షను భరించి, నేను మీకు శత్రువైతే ఎలా ఉంటుందో మీరు తెలుసుకోవాలి.
\v 35 నేను, యెహోవాను మాట్లాడాను. నాకు విరోధంగా సమకూడిన ఈ దుర్మార్గపు సమాజం పట్ల నేను దీన్ని కచ్చితంగా జరిగిస్తాను. ఈ అరణ్యంలో వారు నాశనం అయిపోతారు. ఇక్కడే చనిపోతారు>> అన్నాడు.
\p
\s5
\v 36 మోషే పంపినప్పుడు ఆ దేశంలో సంచారం చేసి చూడడానికి వెళ్లి తిరిగి వచ్చి ఆ దేశం గురించి చెడ్డ సమాచారం చెప్పడం వల్ల సమాజం అంతా అతని మీద తిరుగుబాటు చేసిన మనుషులు,
\v 37 అంటే ఆ దేశం గురించి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిలో తెగులు వల్ల చనిపోయారు.
\v 38 అయితే ఆ దేశం సంచారం చేసి చూసిన మనుషుల్లో నూను కొడుకు యెహోషువ, యెఫున్నె కొడుకు కాలేబు బ్రతికారు.
\p
\s5
\v 39 మోషే ఇశ్రాయేలీయులందరితో ఆ మాటలు చెప్పినప్పుడు ఆ ప్రజలు చాలా దుఃఖపడ్డారు.
\v 40 వారు ఉదయాన లేచి ఆ కొండ శిఖరం ఎక్కి <<మనం నిజంగా పాపం చేశాం. చూడండి, మనం ఇక్కడ ఉన్నాం. యెహోవా మనకు వాగ్దానం చేసిన స్థలానికి వెళ్దాం>> అన్నారు.
\s5
\v 41 కాని మోషే <<మీరు యెహోవా ఆజ్ఞను ఎందుకు అతిక్రమిస్తున్నారు?
\v 42 దాన్ని మీరు సాధించ లేరు. యెహోవా మీ మధ్య లేడు కాబట్టి మీ శత్రువుల ఎదుట మీరు హతం అవుతారు. మీరు వెళ్ళవద్దు.
\v 43 ఎందుకంటే, అమాలేకీయులు, కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరారు. మీరు ఖడ్గం చేత చనిపోతారు. మీరు యెహోవాను అనుసరించ లేదు గనక ఇంక యెహోవా మీకు తోడుగా ఉండడు>> అని చెప్పాడు.
\p
\s5
\v 44 కాని వారు మూర్ఖంగా ఆ కొండ కొన మీదకు ఎక్కి వెళ్ళారు. కాని, యెహోవా నిబంధన మందసం గానీ, మోషే గానీ శిబిరం నుంచి బయటకు వెళ్ళలేదు.
\v 45 అప్పుడు ఆ కొండ మీద నివాసం ఉన్న అమాలేకీయులు, కనానీయులు దిగి వచ్చి వారిపై దాడి చేసి, హోర్మా వరకూ వారిని తరిమి హతం చేశారు.
\s5
\c 15
\s వివిధ అర్పణలకు నియామాలు
\p
\v 1 తరువాత యెహోవా మోషేతో మాట్లాడుతూ,
\v 2 <<నువ్వు ఇశ్రాయేలీయులతో చెప్పు, <యెహోవా మీకిస్తున్న ఆ ప్రదేశంలోకి మీరు వెళ్ళినప్పుడు,
\v 3 యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగేలా మందలోని పశువుల్లో, దహనబలిగానైనా, బలిగానైనా తెచ్చి, మొక్కుబడి చెల్లించడానికి గాని, స్వేచ్ఛార్పణగా గాని, నియామక కాలంలో అర్పించేదిగా గాని, దేనినైనా మీరు అర్పించాలనుకున్నారనుకోండి.
\p
\s5
\v 4 యెహోవాకు ఆ అర్పణ అర్పించే వాడు ముప్పావు నూనెతో కలిపిన రెండున్నర కిలోల పిండిని నైవేద్యంగా తేవాలి.
\v 5 ఒక్కొక్క గొర్రెపిల్లతో పాటు దహనబలి మీద గాని, బలి మీద గాని పొయ్యడానికి ముప్పావు లీటర్ల ద్రాక్షారసం పానార్పణగా సిద్ధం చెయ్యాలి.
\s5
\v 6 పొట్టేలుతో పాటు ఒక పడి నూనెతో కలిపిన నాలుగు లీటర్ల పిండిని నైవేద్యంగా సిద్ధం చెయ్యాలి
\v 7 ఒక లీటరు ద్రాక్షారసం పానార్పణగా తేవాలి. అది యెహోవాకు ఇష్టమైన సువాసన.
\p
\s5
\v 8 మొక్కుబడి చెల్లించడానికైనా, యెహోవాకు సమాధానబలి అర్పించడానికైనా, నువ్వు దహనబలిగానైనా, బలిగానైనా లేత దున్నపోతును సిద్ధం చేస్తే,
\v 9 దానితో పాటు, లీటరున్నర నూనె కలిపిన ఏడున్నర కిలోల గోదుమపిండిని నైవేద్యంగా అర్పించాలి.
\v 10 ఇంకా, యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగిన దహన బలిగా మీరు తేవలసినవి.
\p
\s5
\v 11 లీటరున్నర ద్రాక్షారసం పానీయార్పణగా తేవాలి. ఒక్కొక్క కోడెతోపాటు, ఒక్కొక్క పొట్టేలుతోపాటు, గొర్రెల్లోనైనా, మేకల్లోనైనా ఒక్కొక్క పిల్లతో పాటు ఆ విధంగా చెయ్యాలి.
\v 12 మీరు సిద్ధపరిచే వాటి లెక్కను బట్టి వాటి లెక్కలో ప్రతి దానికీ ఆ విధంగా చెయ్యాలి.
\v 13 దేశంలో పుట్టిన వారందరూ యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగిన దహనబలి అర్పణ తెచ్చేటప్పుడు ఆ విధంగానే చెయ్యాలి.
\p
\s5
\v 14 మీ దగ్గర నివాసం ఉన్న పరదేశిగాని, మీ తరతరాల్లో మీ మధ్య ఉన్నవాడు ఎవడైనా గాని యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగిన దహనబలి అర్పించాలని అనుకున్నప్పుడు, మీరు చేసినట్టే అతడు కూడా చెయ్యాలి.
\v 15 సమాజానికి, అంటే మీకూ, మీలో నివాసం ఉన్న పరదేశికీ ఒకే కట్టడ. అది మీ తరతరాలకు ఉండే శాశ్వతమైన కట్టుబాటు. యెహోవా సన్నిధిలో మీరున్నట్టే పరదేశి కూడా ఉండాలి.
\v 16 మీకూ, మీ దగ్గర నివాసం ఉండే పరదేశికీ ఒకే ఏర్పాటు, ఒకే న్యాయవిధి ఉండాలి> >> అన్నాడు.
\p
\s5
\v 17 యెహోవా మోషేతో మళ్ళీ మాట్లాడుతూ <<ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు,
\v 18 నేను మిమ్మల్ని తీసుకెళ్తున్న దేశంలో మీరు ప్రవేశించిన తరువాత
\v 19 మీరు ఆ దేశపు ఆహారం తిన్నప్పుడు యెహోవాకు ప్రతిష్ట అర్పణ అర్పించాలి.
\p
\s5
\v 20 మీరు మీ మొదటి పిండిముద్ద రొట్టెను ప్రతిష్టార్పణగా అర్పించాలి. కళ్లపు అర్పణలా దాన్ని అర్పించాలి.
\v 21 మీ తరతరాలకు మీ మొదటి పిండిముద్దలోనుంచి ప్రతిష్ఠార్పణను యెహోవాకు అర్పించాలి>> అన్నాడు.
\s పొరపాటున చేసిన పాపాలకు అర్పణలు
\p
\s5
\v 22 <<యెహోవా మోషేతో చెప్పిన ఈ ఆజ్ఞలన్నిట్లో, అంటే
\v 23 యెహోవా ఆజ్ఞాపించిన రోజు మొదలుకుని ఆ తరువాత మీ తరతరాలకు యెహోవా మోషే ద్వారా మీకు ఆజ్ఞాపించిన వాటిలో పొరపాటున దేనినైనా మీరు చెయ్యనప్పుడు, అది సమాజానికి తెలియజేస్తే,
\v 24 సమాజమంతా యెహోవాకు ఇష్టమైన సువాసనగా ఉండడానికి దహనబలిగా ఒక లేత దున్నపోతును ఆజ్ఞప్రకారం దాని నైవేద్యాన్ని, దాని పానీయార్పణను, పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సిద్ధం చెయ్యాలి.
\p
\s5
\v 25 యాజకుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజం కోసం ప్రాయశ్చిత్తం చెయ్యాలి. తెలియక దాన్ని చేశారు గనక క్షమాపణ దొరుకుతుంది. వారు పొరపాటున చేసిన పాపాలను బట్టి తమ అర్పణ, అంటే యెహోవాకు చెందవలసిన దహనబలి, పాపపరిహారార్థబలి యెహోవా సన్నిధికి తీసుకు రావాలి.
\v 26 అప్పుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజానికి గాని, వారి మధ్య నివాసం ఉంటున్న పరదేశికి గాని, క్షమాపణ దొరుకుతుంది. ఎందుకంటే, ప్రజలందరూ తెలియక దాన్ని చెయ్యడం జరిగింది.
\p
\s5
\v 27 ఒకడు పొరపాటున పాపం చేస్తే, అతడు పాపపరిహారార్థ బలిగా ఒక సంవత్సరం వయస్సు ఉన్న ఆడమేక పిల్లను తీసుకురావాలి.
\v 28 పొరపాటుగా యెహోవా సన్నిధిలో దాన్ని చేశాడు గనక తెలియక పాపం చేసిన అతని కోసం యాజకుడు ప్రాయశ్చిత్తం చేస్తాడు. అతని కోసం ప్రాయశ్చిత్తం చేయడం వల్ల అతడు క్షమాపణ పొందుతాడు.
\v 29 ఇశ్రాయేలీయుల్లో పుట్టినవాడు గాని వారి మధ్య నివాసం ఉంటున్న పరదేశి గాని పొరపాటున ఎవరైనా పాపం చేస్తే, అతనికీ, మీకూ ఒక్కటే చట్టం ఉండాలి.
\p
\s5
\v 30 కాని, దేశంలో పుట్టినవాడు గాని పరదేశి గాని ఎవరైనా కావాలని పాపం చేస్తే,
\v 31 అతడు యెహోవాను తృణీకరించిన వాడు గనక అలాంటి వాడు కచ్చితంగా ప్రజల్లో ఉండకుండాా కొట్టివేయాలి. అతని పాపం అతని మీద ఉంటుంది. అతడు యెహోవా మాటను అలక్ష్యం చేసి ఆయన ఆజ్ఞను అతిక్రమించిన కారణంగా అతడు తన ప్రజల్లో లేకుండా పోతాడు>> అన్నాడు.
\s విశ్రాంతి దినాన పని చేసిన వారికి శిక్ష
\p
\s5
\v 32 ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినాన కట్టెలు ఏరడం గమనించారు.
\v 33 అతడు కట్టెలు ఏరడం చూసిన వారు మోషే అహారోనుల దగ్గరికి, సమాజం ఎదుటికి అతన్ని తీసుకొచ్చారు.
\v 34 అతని పట్ల ఏం చెయ్యాలో అది వాళ్లకు తెలియ లేదు గనక అతన్ని అదుపులోకి తీసుకుని ఉంచారు.
\p
\s5
\v 35 తరువాత యెహోవా మోషేతో <<ఆ వ్యక్తికి మరణ శిక్ష విధించాలి.
\v 36 సర్వసమాజం శిబిరం బయట అతన్ని రాళ్లతో కొట్టి చంపాలి>> అన్నాడు. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు సర్వ సమాజం శిబిరం బయటకు అతన్ని తీసుకెళ్ళి, రాళ్లతో కొట్టి చంపారు.
\s బట్టలు కుచ్చులు
\p
\s5
\v 37 ఇంకా యెహోవా మోషేతో మాట్లాడుతూ,
\v 38 <<నువ్వు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు, వారు తమ తరతరాలకు తమ బట్టల అంచులకు కుచ్చులు చేసుకుని, అంచుల కుచ్చుల మీద నీలిరంగు దారం తగిలించాలి.
\v 39 మీరు నా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని, మీ దేవునికి ప్రతిష్ఠితులై ఉండేలా ఇదివరకు కోరిన వాటిని బట్టి, చూసిన వాటిని బట్టి ఆధ్యాత్మిక వ్యభిచారం చెయ్యకుండా ఉండాలి.
\p
\s5
\v 40 మీరు నా కోసం ప్రత్యేకపరచిన వారు గనక, మీరు పవిత్రులుగా ఉండేందుకు యెహోవా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని వాటిని అనుసరించడానికి జాగ్రత్త తీసుకోండి.
\v 41 నేను మీకు దేవుడుగా ఉండాలని ఐగుప్తు దేశంలో నుంచి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడనైన యెహోవాను. మీ దేవుడనైన యెహోవాను నేనే.>>
\s5
\c 16
\s కోరహు, దాతాను, అబీరాము
\p
\v 1 లేవీ మునిమనవడు, కహాతు మనవడు, ఇస్హారు కొడుకు కోరహు, రూబేనీయుల్లో ఏలీయాబు కొడుకులు దాతాను, అబీరాము, పేలెతు కొడుకు ఓనుతో కలిసి
\v 2 ఇశ్రాయేలీయుల్లో పేరు పొందిన 250 మంది నాయకులతో సహా మోషే మీద తిరుగుబాటుగా లేచి
\v 3 మోషే అహరోనులకు విరోధంగా సమకూడారు. <<మీరు చాలా ఎక్కువ అధికారం చలాయిస్తున్నారు. ఈ సమాజంలో ఉన్న వారిందరూ పవిత్రులే. అందరూ యెహోవా కోసం ప్రత్యేకించిన వారే. యెహోవా వారి మధ్య ఉన్నాడు. యెహోవా సమాజం మీద మిమ్మల్ని మీరు ఎందుకు గొప్ప చేసుకుంటున్నారు?>> అన్నారు.
\p
\s5
\v 4 మోషే ఆ మాట విన్నప్పుడు, సాగిలపడ్డాడు. ఆ తరువాత అతడు కోరహుతో, అతని గుంపుతో,
\v 5 <<ఆయన వారు ఎవరో యెహోవా కోసం ప్రత్యేకించిన వారెవరో రేపు యెహోవా తెలియజేసి అతన్ని తన సన్నిధికి రానిస్తాడు. ఆయన తాను ఏర్పరచుకున్నవాణ్ణి తన దగ్గరికి చేర్చుకుంటాడు.
\p
\s5
\v 6 కోరహు, నువ్వూ నీ గుంపూ ఇలా చెయ్యండి, మీరు ధూపార్తులు తీసుకుని వాటిలో నిప్పు ఉంచి రేపు యెహోవా సన్నిధిలో వాటి మీద ధూపసాంబ్రాణి వెయ్యండి.
\v 7 అప్పుడు యెహోవా ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడో అతనే పవిత్రుడు. లేవీ కొడుకులారా, మీరు చాలా దూరం వెళ్ళారు>>అన్నాడు.
\p
\s5
\v 8 ఇంకా మోషే కోరహుతో <<లేవీ కొడుకులారా వినండి,
\v 9 తన మందిరసేవ చెయ్యడానికి యెహోవా మిమ్మల్ని తన దగ్గరికి చేర్చుకోవడం చిన్న విషయమా? మీరు సమాజం ఎదుట నిలబడి వారు చెయ్యవలసిన సేవ చేసేలా ఇశ్రాయేలీయుల దేవుడు ఇశ్రాయేలీయుల సమాజంలోనుంచి మిమ్మల్ని ప్రత్యేక పరచుకోవడం మీకు తక్కువగా కనిపిస్తున్నదా?
\v 10 ఆయన నిన్నూ, నీతో లేవీయులైన నీ గోత్రం వారిందర్నీ చేర్చుకున్నాడు గదా. ఇప్పుడు మీరు యాజకత్వం కూడా కోరుతున్నారు.
\v 11 దీని కోసం నువ్వూ, నీ గుంపూ యెహోవాకు విరోధంగా పోగయ్యారు. మీరు అహరోనును ఎందుకు విమర్శిస్తున్నారు? అతడు కేవలం యెహోవాకు లోబడినవాడు>> అన్నాడు.
\p
\s5
\v 12 మోషే అప్పుడు ఏలీయాబు కొడుకులు దాతాను అబీరాములను పిలిపించాడు.
\v 13 కాని వారు <<మేము రాము, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపాలని
\f +
\fr 16:13
\ft సారవంతమైన
\f* పాలు తేనెలు ప్రవహించే దేశంలో నుంచి మమ్మల్ని తీసుకు రావడం చాలదనట్టు, మామీద ప్రభుత్వం చెయ్యడానికి నీకు అధికారం కావాలా?
\v 14 అంతేకాదు, నువ్వు పాలు తేనెలు ప్రవహించే దేశం లోకి మమ్మల్ని తీసుకు రాలేదు. పొలాలు, ద్రాక్షతోటలు ఉన్న స్వాస్థ్యం మాకివ్వలేదు. మమ్మల్ని శుష్క ప్రియాలతో గుడ్డివారుగా చేస్తావా? మేము రాము>> అన్నారు.
\p
\s5
\v 15 అందుకు మోషే పట్టరాని కోపంతో, యెహోవాకు చెప్తూ<<నువ్వు వారి నైవేద్యాన్ని గుర్తించ వద్దు. ఒక్క గాడిదనైనా నేను వారి దగ్గర తీసుకోలేదు. వారిలో ఎవరికీ నేను హాని చెయ్యలేదు>> అన్నాడు.
\v 16 అప్పుడు మోషే కోరహుతో<<నువ్వూ, నీ గుంపూ, అంటే నువ్వూ, నీ వారూ, అహరోను, రేపు యెహోవా సన్నిధిలో నిలబడాలి.
\v 17 మీలో ప్రతివాడూ తన ధూపార్తిని తీసుకుని వాటి మీద ధూప సాంబ్రాణి వేసి, ఒక్కొక్కడు తన ధూపార్తిని పట్టుకుని 250 ధూపార్తులను యెహోవా సన్నిధికి తేవాలి. నువ్వూ, అహరోను ఒక్కొక్కడు తన ధూపార్తిని తేవాలి>> అని చెప్పాడు.
\p
\s5
\v 18 కాబట్టి వారిల్లో ప్రతివాడూ తన ధూపార్తిని తీసుకుని వాటిలో నిప్పు ఉంచి వాటి మీద ధూప సాంబ్రాణి వేసినప్పుడు, వారూ, మోషే అహరోనులూ సన్నిధి గుడారం ద్వారం దగ్గర నిలబడ్డారు.
\v 19 కోరహు సన్నిధి గుడారం ద్వారం దగ్గరికి తన సమాజాన్ని వాళ్లకు విరోధంగా పోగు చేసినప్పుడు, యెహోవా మహిమ సమాజమంతటికీ కనిపించింది.
\p
\s5
\v 20 అప్పుడు యెహోవా <<మీరు ఈ సమాజంలోనుంచి అవతలికి వెళ్ళండి.
\v 21 తక్షణమే నేను వారిని కాల్చేస్తాను>> అని మోషే అహరోనులతో చెప్పినప్పుడు,
\v 22 వారు సాగిలపడి<<దేవా, సమస్త మానవాళి ఆత్మలకు దేవా, ఈ ఒక్కడు పాపం చేసినందుకు ఈ సమాజం అంతటి మీద నువ్వు కోపం చూపిస్తావా?>> అని యెహోవాను వేడుకున్నారు.
\p
\s5
\v 23 అప్పుడు యెహోవా మోషేకు జవాబిస్తూ,
\v 24 <<సమాజమంతటితో చెప్పు, కోరహు, దాతాను, అబీరాముల గుడారాల చుట్టుపట్ల నుంచి వెళ్ళి పొండి>> అన్నాడు.
\s5
\v 25 అప్పుడు మోషే లేచి, దాతాను అబీరాముల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలీయుల పెద్దలు అతని వెంట వెళ్ళారు.
\v 26 అతడు <<ఈ దుష్టుల గుడారాల దగ్గర నుంచి వెళ్ళి పొండి. మీరు వారి పాపాలన్నిట్లో పాలివారై నాశనం కాకుండా ఉండేలా వాళ్లకు కలిగినది ఏదీ ముట్టుకోకండి>> అని ఆ సమాజంతో అన్నాడు.
\v 27 కాబట్టి వారు కోరహు, దాతాను, అబీరాముల గుడారాల దగ్గర నుంచి ఇటు అటు లేచి వెళ్ళిపోయారు. దాతాను, అబీరాము, వారి భార్యలు, వారి కొడుకులు, వారి పసిపిల్లలు తమ గుడారాల ద్వారం దగ్గర నిలబడ్డారు.
\p
\s5
\v 28 అప్పుడు మోషే <<ఈ కార్యాలన్నీ చెయ్యడానికి యెహోవా నన్ను పంపాడనీ, నా అంతట నేనే వాటిని చెయ్యలేదనీ దీనివల్ల మీరు తెలుసుకుంటారు.
\v 29 మనుషులందరికీ వచ్చే చావు లాంటి చావు వీళ్ళకు వస్తే ప్రతి మనిషికీ కలిగేదే వీళ్ళకూ కలిగితే, యెహోవా నన్ను పంపలేదు.
\v 30 కాని, యెహోవా ఒక అద్భుతం చేసి, వారు ప్రాణాలతోనే పాతాళంలోకి కుంగిపోయేలా భూమి తన నోరు తెరచి వారిని, వాళ్లకు కలిగిన సమస్తాన్నీ మింగేస్తే, వారు యెహోవాను అలక్ష్యం చేశారని మీకు తెలుస్తుంది>> అన్నాడు.
\p
\s5
\v 31 మోషే ఆ మాటలన్నీ చెప్పిన వెంటనే వారి కింద ఉన్న నేల తెరుచుకుంది.
\v 32 భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబాలను, కోరహు సంబంధులందర్నీ, వాళ్లకు చెందిన వాటన్నిటినీ మింగేసింది.
\p
\s5
\v 33 వారూ, వారి సంబంధులందరూ ప్రాణాలతో పాతాళంలోకి కుంగిపోయారు. భూమి వారిని మింగేసింది. వారు సమాజంలో ఉండకుండాా నాశనం అయ్యారు.
\v 34 వారి చుట్టూ ఉన్న ఇశ్రాయేలీయులందరూ వారి కేకలు విని <<భూమి మనలను కూడా మింగేస్తుందేమో>> అనుకుంటూ పారిపోయారు.
\v 35 అప్పుడు యెహోవా దగ్గర నుంచి అగ్ని బయలుదేరి, ధూపార్పణ తెచ్చిన ఆ 250 మందిని కాల్చేసింది.
\p
\s5
\v 36 అప్పుడు యెహోవా మోషేతో <<నువ్వు యాజకుడైన అహరోను కొడుకు ఎలియాజరుతో చెప్పు, ఆ అగ్ని మధ్యలోనుంచి ఆ ధూపార్తులను ఎత్తు, అవి ప్రతిష్ఠితమైనవి.
\v 37 ఆ నిప్పుని దూరంగా చల్లు.
\v 38 పాపం చేసి తమ ప్రాణాలకు ముప్పు తెచ్చుకున్న వీళ్ళ ధూపార్తులను తీసుకుని బలిపీఠానికి కప్పుగా వెడల్పైన రేకులు చెయ్యాలి. వారు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చిన కారణంగా అవి ప్రతిష్ఠితం అయ్యాయి. అవి ఇశ్రాయేలీయులకు గుర్తుగా ఉంటాయి.>>
\p
\s5
\v 39 అహరోను సంతాన సంబంధి కాని అన్యుడు ఎవరూ యెహోవా సన్నిధిలో ధూపం అర్పించడానికి వచ్చి,
\v 40 కోరహులా, అతని గుంపులా అయపోకుండా ఇశ్రాయేలీయులకు జ్ఞాపికగా ఉండడానికి కాలిపోయినవారు అర్పించిన ఇత్తడి ధూపార్తులను యాజకుడైన ఎలియాజరు తీసి యెహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్టు వాటితో బలిపీఠానికి కప్పుగా వెడల్పైన రేకులు చెయ్యించాడు.
\p
\s5
\v 41 తరువాత రోజు ఇశ్రాయేలీయుల సమాజమంతా మోషే అహరోనులను విమర్శిస్తూ <<మీరు యెహోవా ప్రజలను చంపారు>> అని చెప్పి,
\v 42 సమాజమంతా మోషే అహరోనులకు విరోధంగా సమకూడారు. వారు సన్నిధి గుడారం వైపు తిరిగి చూసినప్పుడు, ఆ మేఘం దాన్ని కమ్మింది. యెహోవా మహిమ కూడా కనిపించింది.
\v 43 మోషే అహరోనులు సన్నిధి గుడారం ఎదుటికి వచ్చినప్పుడు,
\p
\s5
\v 44 యెహోవా మోషేతో <<మీరు ఈ సమాజం మధ్య నుంచి వెళ్ళి పొండి,
\v 45 తక్షణమే నేను వారిని నాశనం చేస్తాను>> అని చెప్పినప్పుడు, వారు సాగిలపడ్డారు.
\v 46 అప్పుడు మోషే <<నువ్వు ధూపార్తిని తీసుకుని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపం వేసి త్వరగా సమాజం దగ్గరికి వెళ్లి వారి కోసం ప్రాయశ్చిత్తం చెయ్యి, ఎందుకంటే, యెహోవా సన్నిధిలోనుంచి కోపం బయలుదేరింది. తెగులు మొదలయ్యింది>> అని అహరోనుతో చెప్పాడు.
\p
\s5
\v 47 మోషే చెప్పినట్టు అహరోను వాటిని తీసుకుని సమాజం మధ్యకు పరుగెత్తి వెళ్ళినప్పుడు ప్రజల్లో తెగులు మొదలై పాకిపోతూ ఉంది. కాబట్టి అతడు ధూపం వేసి ఆ ప్రజల కోసం ప్రాయశ్చిత్తం చేశాడు.
\v 48 అతడు చనిపోయిన వారికీ, బతికున్న వారికీ మధ్య నిలబడినప్పుడు తెగులు ఆగింది.
\p
\s5
\v 49 కోరహు తిరుగుబాటులో చనిపోయిన వారు కాకుండా 14,700 మంది ఆ తెగులు వల్ల చనిపోయారు.
\v 50 ఆ తెగులు ఆగినప్పుడు అహరోను సన్నిధి గుడారపు ద్వారం దగ్గర ఉన్న మోషే దగ్గరికి తిరిగి వచ్చాడు.
\s5
\c 17
\s అహరోను చేతికర్ర చిగిర్చడం
\p
\v 1 యెహోవా మోషేతో మాట్లాడుతూ,
\v 2 <<నువ్వు ఇశ్రాయేలీయులతో మాట్లాడు, వారి దగ్గర ఒక్కొక్క పితరుల వంశానికి ఒక్కొక్క చేతికర్ర చొప్పున, అంటే ప్రతి వంశానికి చెందిన వారి నాయకుని దగ్గరనుంచి తమ తమ వంశాల ప్రకారం 12 చేతికర్రలు తీసుకుని ఎవరి చేతికర్ర మీద వారి పేరు రాయి.
\p
\s5
\v 3 లేవీ చేతికర్ర మీద అహరోను పేరు రాయాలి. ఎందుకంటే ఒక్కొక్క పితరుల వంశాల నాయకునికి ఒక్క చేతికర్రే ఉండాలి.
\v 4 నేను మిమ్మల్ని కలుసుకునే సన్నిధి గుడారంలోని
\f +
\fr 17:4
\ft నిబంధన మందసం. సంఖ్యా 17:4 చూడండి. నిర్గమ అధ్యా. 31 మొ. చూడండి.
\f* నిబంధన శాసనాల ముందు వాటిని ఉంచాలి.
\v 5 అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుంటానో, అతని కర్ర చిగురిస్తుంది. ఇశ్రాయేలీయులు మీకు విరోధంగా చేస్తున్న ఫిర్యాదులు నాకు వినిపించకుండా ఆపేస్తాను>> అన్నాడు.
\p
\s5
\v 6 కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో చెప్పినప్పుడు వారి నాయకులందరూ తమ తమ పితరుల వంశాల్లో ఒక్కొక్క నాయకునికి ఒక్కొక్క కర్ర ప్రకారం 12 కర్రలు అతనికిచ్చారు. అహరోను కర్ర కూడా వారి కర్రల మధ్యలో ఉంది.
\v 7 మోషే, వారి కర్రలను నిబంధన శాసనాల గుడారంలో యెహోవా సన్నిధిలో పెట్టాడు.
\p
\s5
\v 8 తరువాత రోజు మోషే నిబంధన శాసనాల గుడారంలోకి వెళ్లి చూసినప్పుడు లేవీ వంశానికి చెందిన అహరోను కర్ర మొగ్గ తొడిగి ఉంది. అది మొగ్గలు తొడిగి, పూలు పూసి, పండిన బాదం కాయలు కాసింది.
\v 9 మోషే యెహోవా సన్నిధిలోనుంచి ఆ కర్రలన్నీ ఇశ్రాయేలీయులందరి ఎదుటకు తెచ్చినప్పుడు వారు వాటిని చూసి ఒక్కొక్కరూ ఎవరి కర్ర వారు తీసుకున్నారు.
\p
\s5
\v 10 అప్పుడు యెహోవా మోషేతో <<అహరోను కర్రను నిబంధన శాసనాల ఎదుట శాశ్వతంగా ఉంచు. అలా చేస్తే, అది తిరుగుబాటు చేసిన వారి అపరాధానికి గుర్తుగానూ, నాకు విరోధంగా సణిగి ఎవ్వరూ చనిపోకుండా ఉండడానికీ వీలౌతుంది>> అన్నాడు.
\v 11 అప్పుడు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు, అతడు కచ్చితంగా అలాగే చేశాడు.
\p
\s5
\v 12 అయితే ఇశ్రాయేలీయులు మోషేతో <<మేము ఇక్కడ చనిపోతాం. మేమందరం నశించిపోతాం!
\v 13 యెహోవా మందిరాన్ని సమీపించిన ప్రతిఒక్కరూ చనిపోతారు. మేమందరం చావాల్సిందేనా?>> అన్నారు.
\s5
\c 18
\s లేవీవారి, యాజకుల భాధ్యతలు
\p
\v 1 యెహోవా అహరోనుతో <<పవిత్ర స్థలంలో సేవలో జరిగే పాపాలకు నువ్వూ, నీ కొడుకులూ, నీ వంశం జవాబుదారులు. నువ్వూ, నీ కొడుకులూ మీ యాజకత్వపు పాపాలకు జవాబుదారులు.
\v 2 ఇంకా, నీ తండ్రి గోత్రం, అంటే లేవీ వంశస్తులైన నీ సహోదరులను నువ్వు దగ్గరికి తీసుకు రావాలి. నువ్వూ నీ కొడుకులూ నిబంధన శాసనాల గుడారం ఎదుట పరిచర్య చేస్తున్నప్పుడు వారు నీతో కలిసి నీకు సాయం చేస్తారు.
\p
\s5
\v 3 వారు నీకూ, గుడారం అంతటికీ సేవ చెయ్యాలి. కాని వారూ, మీరూ చనిపోకుండా ఉండాలంటే వారు పవిత్ర స్థలపు ఉపకరణాల దగ్గరకైనా, బలిపీఠం దగ్గరకైనా రాకూడదు.
\v 4 వారు నీతో కలిసి సన్నిధి గుడారంలోని సేవంతటి విషయంలో శ్రద్ధ వహించాలి.
\v 5 ఒక బయటి వాడు మీ దగ్గరికి రాకూడదు. ఇకముందు ఇశ్రాయేలీయుల మీదకి నా కోపం రాకుండా ఉండాలంటే మీరు పవిత్రస్థలం పట్ల, బలిపీఠం పట్ల బాధ్యత వహించాలి.
\p
\s5
\v 6 చూడండి, ఇశ్రాయేలీయుల మధ్య నుంచి లేవీయులైన మీ సహోదరులను నేనే ఎంపిక చేసుకున్నాను. సన్నిధి గుడారపు సేవ చెయ్యడానికి వారిని యెహోవా కోసం మీకు ఒక బహుమానంగా ఇచ్చాను.
\v 7 కాని నువ్వూ, నీ కొడుకులు మాత్రమే బలిపీఠానికీ, అడ్డతెర లోపల ఉన్న వాటికీ సంబంధించిన పనులన్నిటి విషయంలో యాజకత్వం జరుపుతూ సేవ చెయ్యగలరు. కేవలం మీరు మాత్రమే ఈ బాధ్యతలు చేపట్టగలరు. ఈ యాజకత్వాన్ని మీకు ఒక బహుమానంగా ఇస్తున్నాను. వేరే ఎవరైనా దాన్ని సమీపిస్తే అతనికి మరణ శిక్ష విధించాలి>> అన్నాడు.
\s లేవీయులు, యాజకుల కోసం అర్పణలు
\p
\s5
\v 8 ఇంకా యెహోవా అహరోనుతో <<చూడు, ఇశ్రాయేలీయులు నాకు తెచ్చే కానుకలు, పవిత్ర అర్పణల బాధ్యత నీకిచ్చాను. ఈ అర్పణల్లో నీకూ, నీ కొడుకులకూ శాశ్వతంగా భాగం దక్కుతుంది.
\v 9 అతి పవిత్రమైన వాటిలో అగ్నిలో పూర్తిగా కాలనివి నీకు చెందుతాయి. వారి నైవేద్యాలన్నిట్లో, వారి పాప పరిహారార్థ బలులన్నిట్లో, వారి అపరాధ పరిహారార్థ బలులన్నిట్లో, వారు నాకు చెల్లించే పవిత్ర అర్పణలన్నీ నీకు, నీ కొడుకులకూ చెందుతాయి. మీరు వాటిని అతి పవిత్రమైనవిగా ఎంచి తినాలి.
\p
\s5
\v 10 మీలో ప్రతి మగవాడు ఈ అర్పణలు తినాలి. అవి నాకు
\f +
\fr 18:10
\ft పరిశుద్ధమైనదిగా ఎంచి తినాలి. దాన్ని పరిశుద్ధ స్థలంలో ఆరగించాలి.
\f* ప్రత్యేకించిన అర్పణలుగా మీరు పరిగణించాలి.
\v 11 ఇంకా వారి దానాల్లో ప్రతిష్టించిందీ, ఇశ్రాయేలీయులు అల్లాడించే అర్పణలన్నీ నీకు చెందుతాయి. నీకూ, నీ కొడుకులకూ, నీ కూతుళ్ళకూ శాశ్వతమైన భాగంగా నేను మీకిచ్చాను. నీ ఇంట్లో ఆచారరీతిగా శుచిగా ఉన్నవారు ఈ అర్పణల్లో దేనినైనా తినొచ్చు.
\p
\s5
\v 12 వారు యెహోవాకు అర్పించే మొదటి ఫలాలు, అంటే, నూనెలో ప్రశస్తమైనది, ద్రాక్షారసం, ధాన్యాల్లో ప్రశస్తమైనవన్నీ నీకిచ్చాను.
\v 13 వారు తమ దేశపు పంటలన్నిట్లో యెహోవాకు తెచ్చే మొదటి ఫలాలు నీకు చెందుతాయి. నీ ఇంట్లో ఆచారరీతిగా శుచిగా ఉన్నవారు ఈ అర్పణల్లో దేనినైనా తినొచ్చు.
\p
\s5
\v 14 ఇశ్రాయేలీయులు ప్రతిష్ట చేసిన ప్రతిదీ నీకు చెందుతుంది.
\v 15 మనుష్యుల్లోగాని, పశువుల్లోగాని, వారు యెహోవాకు అర్పించే ప్రాణులన్నిట్లో ప్రతి తొలిచూలు నీకు చెందుతుంది. అయితే, ప్రజలు తొలిచూలు మగబిడ్డను వెల చెల్లించి తిరిగి సంపాదించుకోవాలి.
\v 16 అపవిత్ర పశువుల తొలిచూలు మగపిల్లను వెల చెల్లించి మళ్ళీ కొనుక్కోవాలి. వెల చెల్లించి మళ్ళీ కొనుక్కోవాల్సిన వాటిని పుట్టిన నెల రోజులకు నువ్వు నియమించిన వెల ప్రకారం పవిత్ర మందిరపు తూకంతో ఐదు తులాల వెండి ఇచ్చి వాటిని తిరిగి కొనుక్కోవాలి. అంటే
\f +
\fr 18:16
\ft 20 గేరాలు.
\f* 55 గ్రాములు.
\p
\s5
\v 17 కాని ఆవు తొలి చూలుని, గొర్రె తొలి చూలుని, మేక తొలి చూలుని విడిపించకూడదు. అవి ప్రతిష్ఠితమైనవి. వాటి రక్తం నువ్వు బలిపీఠం మీద పోసి, యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగేలా వాటి కొవ్వును కాల్చాలి. కాని వాటి మాంసం నీకు చెందుతుంది.
\v 18 అల్లాడించే అర్పణగా ఉన్న బోర, కుడి జబ్బ, నీదైనట్టు అది కూడా నీకు చెందుతుంది.
\p
\s5
\v 19 ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించే పవిత్రమైన ప్రతిష్ఠార్పణలన్నీ నేను నీకూ, నీ కొడుకులకూ, నీ కూతుళ్ళకూ శాశ్వతమైన భాగంగా ఇచ్చాను. అది నీకూ, నీతో పాటు నీ సంతానానికీ యెహోవా సన్నిధిలో స్థిరమైన శాశ్వత నిబంధన>> అన్నాడు.
\v 20 ఇంకా యెహోవా అహరోనుతో <<ప్రజల భూమిలో నీకు స్వాస్థ్యం ఉండకూడదు. వారి మధ్య నీకు ఆస్తిగాని భాగం గాని ఉండకూడదు. ఇశ్రాయేలీయుల మధ్య నీ భాగం, నీ స్వాస్థ్యం నేనే.
\p
\s5
\v 21 చూడు, లేవీయులు చేసే సేవకు, అంటే, సన్నిధి గుడారపు సేవకు ప్రతిగా నేను ఇశ్రాయేలీయుల పదోవంతును వాళ్లకు వారసత్వంగా ఇచ్చాను.
\v 22 ఇశ్రాయేలీయులు ఇకముందు సన్నిధి గుడారం దగ్గరికి రాకూడదు. అలా చేస్తే ఆ పాపం కారణంగా చనిపోతారు.
\p
\s5
\v 23 అయితే లేవీయులు సన్నిధి గుడారం సేవ చేసి, వారి సేవలో పాపాలకు వారే జవాబుదారులుగా ఉంటారు. మీ ప్రజల తరతరాలకు ఇది శాశ్వతమైన శాసనం. ఇశ్రాయేలీయుల మధ్య వాళ్లకు ఏ స్వాస్థ్యం ఉండకూడదు.
\v 24 అయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠార్పణగా అర్పించే పదోవంతు భాగాలు నేను లేవీయులకు స్వాస్థ్యంగా ఇచ్చాను. అందుచేత వారు ఇశ్రాయేలీయుల మధ్య స్వాస్థ్యం సంపాదించకూడదని వారితో చెప్పాను>> అన్నాడు.
\p
\s5
\v 25 ఇంకా యెహోవా మోషేతో,
\v 26 <<నువ్వు లేవీయులతో ఇలా చెప్పు, <నేను ఇశ్రాయేలీయుల ద్వారా మీకు స్వాస్థ్యంగా ఇప్పించిన పదోవంతు భాగాలు మీరు వారి దగ్గర తీసుకున్నప్పుడు మీరు దానిలో, అంటే ఆ పదోవంతు భాగంలో పదోవంతు భాగం యెహోవాకు ప్రతిష్ఠార్పణగా చెల్లించాలి.
\v 27 మీకు వచ్చే ప్రతిష్ఠార్పణను కళ్లపు పంటలా, ద్రాక్షల తొట్టి ఫలంలా ఎంచాలి.
\p
\s5
\v 28 ఆ విధంగా మీరు ఇశ్రాయేలీయుల దగ్గర పొందిన మీ పదోవంతు భాగాలు అన్నిట్లోనుంచి మీరు ప్రతిష్ఠార్పణ యెహోవాకు చెల్లించాలి. దానిలోనుంచి మీరు యెహోవాకు ప్రతిష్ఠించే అర్పణ యాజకుడైన అహరోనుకు ఇవ్వాలి.
\v 29 మీరు పొందిన బహుమానాల్లో ప్రశస్తమైన వాటిలోనుంచి యెహోవాకు శ్రేష్ఠమైన అర్పణ ఇవ్వాలి.>
\p
\s5
\v 30 ఇంకా నువ్వు వారితో, మీరు పొందిన వాటిలో నుంచి ప్రశస్తభాగం అర్పించినప్పుడు, లేవీయులు దాన్ని కళ్ళం నుంచీ, ద్రాక్షగానుగ నుంచీ వచ్చిన ఫలంలా పరిగణించాలి.
\v 31 మీరూ, మీ కుటుంబాలూ ఏ స్థలంలోనైనా వాటిని తినొచ్చు. ఎందుకంటే సన్నిధి గుడారంలో మీరు చేసే సేవకు అది మీకు జీతం.
\v 32 మీరు పొందిన వాటిలోనుంచి ప్రశస్తమైనవి యెహోవాకు అర్పించి ఉంటే, దాన్ని తిని, తాగినందుకు మీకు ఏ పాపశిక్ష ఉండదు. మీరు చనిపోకుండా ఉండాలంటే ఇశ్రాయేలీయుల ప్రతిష్ఠితమైన వాటిని అపవిత్రం చెయ్యకూడదని చెప్పు>> అన్నాడు.
\s5
\c 19
\s అశుద్ధతను తొలగించే నీళ్ళు
\p
\v 1 యెహోవా మోషే అహరోనులతో,
\v 2 <<యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదంటే, ఇశ్రాయేలీయులు కళంకం లేనిదీ, మచ్చ లేనిదీ, ఎప్పుడూ కాడి మోయ్యని ఎర్ర ఆవును నీ దగ్గరికి తీసుకురావాలని వారితో చెప్పు.
\p
\s5
\v 3 మీరు యాజకుడైన ఎలియాజరుకు దాన్ని అప్పగించాలి. ఒకడు పాళెం బయటికి దాన్ని తోలుకెళ్ళి అతని ఎదుట దాన్ని వధించాలి.
\v 4 యాజకుడైన ఎలియాజరు దాని రక్తం కొంచెం వేలితో తీసి, సన్నిధి గుడారం ఎదుట ఆ రక్తాన్ని ఏడుసార్లు చిమ్మాలి.
\v 5 అతని కళ్ళ ఎదుట ఒకడు ఆ ఆవును కాల్చాలి. దాని చర్మం, మాంసం, రక్తం, పేడతో సహా కాల్చెయ్యాలి.
\v 6 ఇంకా ఆ యాజకుడు దేవదారు కర్ర, హిస్సోపు, ఎర్రరంగు నూలు తీసుకుని, ఆ ఆవును కాలుస్తున్న మంటల్లో వాటిని వెయ్యాలి.
\p
\s5
\v 7 అప్పుడు ఆ యాజకుడు తన బట్టలు ఉతుకుకుని, నీళ్లతో తలస్నానం చేసిన తరువాత పాలెంలో ప్రవేశించి సాయంకాలం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు.
\v 8 దాన్ని కాల్చినవాడు నీళ్లతో తన బట్టలు ఉతుకుకుని నీళ్లతో తలస్నానం చేసి సాయంకాలం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు.
\p
\s5
\v 9 ఇంకా శుద్ధుడైనవాడు ఒకడు ఆ ఆవు బూడిదను పోగు చేసి పాలెం బయట ఒక శుద్ధమైన స్థలంలో పెట్టాలి. ఆ బూడిదను ఇశ్రాయేలీయుల సమాజం కోసం భద్రం చెయ్యాలి. ఆ బూడిద పాపపరిహారార్ధ అర్పణ నుంచి వచ్చింది గనక, పాపం నుంచి శుద్ధీకరణ కోసం వారు ఆ బూడిదను నీళ్ళతో కలుపుతారు.
\v 10 ఆ ఆవు బూడిదను పోగు చేసిన వాడు తన బట్టలు ఉతుక్కుని, సాయంకాలం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు. ఇది ఇశ్రాయేలీయులకూ, వారిల్లో నివాసం ఉంటున్న పరదేశులకూ శాశ్వతమైన శాసనం.
\p
\s5
\v 11 మానవ శవాన్ని ముట్టుకున్నవాడు ఏడు రోజులు అశుద్ధుడుగా ఉంటాడు.
\v 12 అతడు మూడో రోజు ఆ నీళ్ళతో పాపశుద్ధి చేసుకుని, ఏడో రోజు శుద్ధుడౌతాడు. అయితే అతడు మూడో రోజు పాపశుద్ధి చేసుకోకపోతే ఏడో రోజు శుద్ధుడు కాడు.
\v 13 మనిషి శవాన్ని ముట్టుకున్నవాడు ఆ విధంగా పాపశుద్ధి చేసుకోకపోతే అతడు యెహోవా మందిరాన్ని అపవిత్రం చేసినవాడౌతాడు. పాపపరిహార జలం అతని మీద చల్ల లేదు గనక ఆ వ్యక్తిని ఇశ్రాయేలీయుల్లో లేకుండా చెయ్యాలి. అతడు అశుద్ధుడుగానే ఉండిపోతాడు. అతని అశుద్ధత అతని మీద ఉంటుంది.
\p
\s5
\v 14 ఎవరైనా ఒక గుడారంలో చనిపోతే, దాని గురించిన చట్టం ఇది. ఆ గుడారంలో ప్రవేశించే ప్రతివాడూ, ఆ గుడారంలో ఉన్నవారూ ఏడు రోజులు అశుద్ధంగా ఉంటారు.
\v 15 మూత వేయకుండా తెరచి ఉన్న పాత్రలన్నీ అశుద్ధం ఔతాయి.
\v 16 గుడారం బయట కత్తితో నరికిన వాడినైనా, శవాన్నైనా, మనిషి ఎముకనైనా, సమాధినైనా ముట్టుకున్నవాడు ఏడు రోజులు అశుద్ధుడుగా ఉంటాడు.
\p
\s5
\v 17 అశుద్ధుడైన వ్యక్తి కోసం, పాప పరిహారార్థమైన కాలిన బూడిద కొంచెం తీసుకుని ఒక కూజాలో ఉన్న మంచినీళ్ళతో కలపాలి.
\v 18 తరువాత ఒక శుద్ధుడు హిస్సోపు తీసుకుని ఆ నీళ్ళల్లో ముంచి, ఆ గుడారం మీద, దానిలోని ఉపకరణాలు అన్నిటి మీదా, అక్కడున్న మనుషుల మీదా చల్లాలి. ఎముకనుగాని, కత్తితో నరికిన వాణ్ణి గాని, శవాన్నిగాని, సమాధినిగాని ముట్టుకున్న వాడి మీద కూడా దాన్ని చల్లాలి.
\v 19 మూడో రోజు, ఏడో రోజూ, శుద్ధుడు అశుద్ధుని మీద దాన్ని చల్లాలి. ఏడో రోజు అతడు పాపశుద్ధి చేసుకుని, తన బట్టలు ఉతుక్కుని నీళ్లతో స్నానం చేసి, సాయంకాలానికి శుద్ధుడౌతాడు.
\p
\s5
\v 20 ఎవరైనా అశుద్ధుడుగానే ఉండి పాపశుద్ధి చేసుకోడానికి నిరాకరిస్తే, అతడు యెహోవా పరిశుద్ధ స్థలాన్ని అశుద్ధం చేశాడు గనక అలాంటి వాణ్ణి సమాజంలో లేకుండా చేయాలి. పాపపరిహార జలం అతని మీద చల్ల లేదు గనక అతడు అశుద్ధుడుగానే ఉంటాడు.
\v 21 ఈ పరిస్థితులకు సంబంధించిన శాశ్వతమైన శాసనం ఏదంటే - పాపపరిహార జలం చల్లేవాడు తన బట్టలు ఉతుక్కోవాలి. పాపపరిహార జలం ముట్టుకున్నవాడు సాయంకాలం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు. అశుద్ధుడు ముట్టుకున్నదంతా అశుద్ధం
\v 22 దాన్ని ముట్టుకున్న వారిందరూ సాయంకాలం వరకూ అశుద్ధులుగా ఉంటారు.>>
\s5
\c 20
\s బండలోనుంచి నీళ్ళు
\p
\v 1 మొదటి నెలలో ఇశ్రాయేలీయుల సమాజమంతా సీను అనే నిర్జన బీడు ప్రాంతానికి వెళ్ళారు. వారు కాదేషులో శిబిరం వేసుకున్నారు. అక్కడ మిర్యాము చనిపోయింది. ఆమెను అక్కడ పాతిపెట్టారు.
\p
\s5
\v 2 ఆ సమాజానికి నీళ్లు లేనందువల్ల వారు మోషే అహరోనులకు విరోధంగా పోగయ్యారు.
\v 3 ప్రజలు మోషేను విమర్శిస్తూ <<మా తోటి ఇశ్రాయేలీయులు యెహోవా ముంగిట్లో చనిపోయినప్పుడు మేము కూడా చనిపోతే బాగుండేది!
\s5
\v 4 మేమూ మా పశువులూ చనిపోడానికి యెహోవా సమాజాన్ని ఈ నిర్జన బీడు ప్రాంతంలోకి ఎందుకు తీసుకొచ్చావు?
\v 5 ఈ భయంకరమైన ప్రాంతానికి మమ్మల్ని తీసుకు రావడానికి ఐగుప్తులోనుంచి మమ్మల్ని ఎందుకు రప్పించావు? ఈ ప్రాంతంలో గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, తాగడానికి నీళ్ళే లేవు>> అన్నారు.
\p
\s5
\v 6 అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుట నుంచి సన్నిధి గుడారపు ద్వారం లోకి వెళ్లి సాగిలపడినప్పుడు, యెహోవా మహిమ వాళ్లకు కనిపించింది.
\p
\s5
\v 7 అప్పుడు యెహోవా మోషేతో,
\v 8 <<నువ్వు నీ కర్ర తీసుకుని, నువ్వూ, నీ సహోదరుడు అహరోను, ఈ సమాజం అంతట్నీటిని చేర్చి, వారి కళ్ళఎదుట ఆ బండతో మాట్లాడి, నీళ్ళు ప్రవహించమని దానికి ఆజ్ఞాపించు. నువ్వు వారి కోసం బండలోనుంచి నీళ్ళు రప్పించి, ఈ సమాజం, వారి పశువులూ తాగడానికి ఇవ్వాలి>> అన్నాడు.
\v 9 యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్టు, మోషే ఆయన సన్నిధిలోనుంచి ఆ కర్ర తీసుకెళ్ళాడు.
\p
\s5
\v 10 తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజాన్ని సమకూర్చినప్పుడు అతడు వారితో <<తిరుగుబాటు జనాంగమా, వినండి. మేము ఈ బండలోనుంచి మీకోసం నీళ్ళు రప్పించాలా?>> అన్నారు.
\v 11 అప్పుడు మోషే తన చెయ్యెత్తి రెండుసార్లు తన కర్రతో ఆ బండను కొట్టినప్పుడు నీళ్లు సమృద్ధిగా ప్రవహించాయి. ఆ సమాజం, పశువులూ తాగాయి.
\p
\s5
\v 12 అప్పుడు యెహోవా మోషే అహరోనులతో <<మీరు ఇశ్రాయేలీయుల దృష్టిలో నన్ను నమ్మలేదు, నా పవిత్రత నిలబెట్టలేదు గనక, నేను ఈ సమాజానికి ఇచ్చిన దేశంలోకి మీరు వారిని తీసుకెళ్లలేరు>> అన్నాడు.
\v 13 ఈ నీళ్ళ ప్రాంతానికి
\f +
\fr 20:13
\ft జగడం.
\f* మెరీబా అని పేరు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్య తన పవిత్రత చూపించుకున్నాడు.
\s ఎదోము రాజు ఇశ్రాయేలు వారిని తన సరిహద్దుల్లో గుండా వెళ్ళడానికి అనుమతించక పోవటం
\p
\s5
\v 14 మోషే కాదేషు నుంచి ఎదోము రాజు దగ్గరికి రాయబారులను పంపించి <<నీ సహోదరుడు ఇశ్రాయేలు అడుగుతున్నది ఏమంటే, మాకొచ్చిన కష్టమంతా నీకు తెలుసు.
\v 15 మా పితరులు ఐగుప్తుకు వెళ్ళారు. మేము చాలా రోజులు ఐగుప్తులో ఉన్నాం. ఐగుప్తీయులు మమ్మల్ని, మా పితరులను బాధల పాలు చేశారు.
\v 16 మేము యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన మా మొర విని, ఒక దూతను పంపించి ఐగుప్తులోనుంచి మమ్మల్ని రప్పించాడు. చూడు, మేము నీ సరిహద్దుల చివర ఉన్న కాదేషు పట్టణంలో ఉన్నాం.
\p
\s5
\v 17 మమ్మల్ని నీ దేశం గుండా దాటి వెళ్లనివ్వు. పొలాల్లోనుంచైనా, ద్రాక్షతోటల్లోనుంచైనా మేము వెళ్ళం. బావుల్లో నీళ్లు తాగం. రాజ మార్గంలో నడిచి వెళ్ళిపోతాం. నీ సరిహద్దులు దాటే వరకూ కుడివైపుకైనా. ఎడమవైపుకైనా తిరుగకుండా వెళ్ళిపోతాం>> అని చెప్పించాడు.
\p
\s5
\v 18 కాని ఎదోము రాజు <<నువ్వు నా దేశంలోగుండా వెళ్లకూడదు. అలా వెళ్తే, నేను ఖడ్గంతో నీ మీద దాడి చేస్తాను>> అని జవాబిచ్చాడు.
\v 19 అప్పుడు ఇశ్రాయేలీయులు అతనితో <<మేము రాజమార్గంలోనే వెళ్తాం. మేము గాని, మా పశువులుగాని నీ నీళ్లు తాగితే, దాని ఖర్చు చెల్లిస్తాం. కేవలం మమ్మల్ని కాలినడకతో వెళ్లనివ్వు అంతే>> అన్నారు. అప్పుడు అతడు<<నువ్వు రాకూడదు>> అన్నాడు.
\p
\s5
\v 20 అప్పుడు ఎదోము రాజు అనేకమంది సైన్యంతో, మహా బలంతో బయలుదేరి, వారి మీదకు వచ్చాడు.
\v 21 ఎదోము రాజు ఇశ్రాయేలును తన సరిహద్దుల్లో గుండా దాటి వెళ్ళడానికి అనుమతించలేదు గనక ఇశ్రాయేలీయులు అతని దగ్గరనుంచి తిరిగి వెళ్ళిపోయారు.
\s అహరోను మరణం
\p
\s5
\v 22 అప్పుడు ఇశ్రాయేలీయుల సమాజమంతా కాదేషులోనుంచి ప్రయాణం చేసి హోరు కొండకు వచ్చారు.
\v 23 యెహోవా ఎదోము పొలిమేరల దగ్గరున్న హోరు కొండ దగ్గర మోషే అహరోనులతో మాట్లాడుతూ,
\v 24 <<మీరిద్దరూ మెరీబా నీళ్ళ దగ్గర నా మాటలకు ఎదురు తిరిగారు గనక నేను ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన దేశంలో అహరోను ప్రవేశించకుండా, తన పితరులతో చేరిపోతాడు.
\p
\s5
\v 25 నువ్వు అహరోను, అతని కొడుకు ఎలియాజరును తీసుకుని హోరు కొండెక్కి,
\v 26 అహరోను వస్త్రాలు తీసి అతని కొడుకు ఎలియాజరుకు తొడిగించు. అహరోను తన పితరులతో చేరి అక్కడ చనిపోతాడు>> అన్నాడు.
\p
\s5
\v 27 యెహోవా ఆజ్ఞాపించినట్టు మోషే చేశాడు. సమాజమంతా చూస్తూ ఉన్నప్పుడు వారు హోరు కొండ ఎక్కారు.
\v 28 మోషే అహరోను వస్త్రాలు తీసి, అతని కొడుకు ఎలియాజరుకు తొడిగించాడు. అహరోను కొండశిఖరం మీద చనిపోయాడు. తరువాత మోషే, ఎలియాజరు ఆ కొండ దిగి వచ్చారు.
\v 29 అహరోను చనిపోయాడని సమాజమంతా గ్రహించినప్పుడు, ఇశ్రాయేలీయుల కుటుంబాలన్నీ అహరోను కోసం ముప్ఫై రోజులు శోకించారు.
\s5
\c 21
\s అరాదు నాశనం
\p
\v 1 ఇశ్రాయేలీయులు అతారీం మార్గంలో వస్తున్నారని దక్షిణం వైపు నివాసం ఉన్న కనానీయుడైన అరాదు రాజు విని, అతడు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసి వారిల్లో కొంతమందిని బందీలుగా పట్టుకున్నాడు.
\v 2 ఇశ్రాయేలీయులు యెహోవాకు మొక్కుకుని <<నువ్వు మాకు ఈ జనం మీద జయం ఇస్తే, మేము నీ పేరట వారి పట్టణాలు పూర్తిగా నాశనం చేస్తాం>> అన్నారు.
\v 3 యెహోవా ఇశ్రాయేలీయుల స్వరం విని, ఆ కనానీయుల మీద వాళ్లకు జయం ఇచ్చాడు. అప్పుడు వారు ఆ కనానీయులను, వారి పట్టణాలను పూర్తిగా నాశనం చేశారు. ఆ చోటికి <<
\f +
\fr 21:3
\ft వినాశనం
\f* హోర్మా>> అని పేరు.
\s ఇత్తడి పాము
\p
\s5
\v 4 ఆ తరువాత వారు ఎదోము చుట్టూ తిరిగి వెళ్లాలని, హోరు కొండనుంచి ఎర్ర సముద్రం దారిలో ప్రయాణం చేశారు. ఆ ప్రయాణంలో అలసటతో ప్రజలు సహనం కోల్పోయారు.
\v 5 అప్పుడు ప్రజలు దేవునికి, మోషేకి విరోధంగా మాట్లాడుతూ <<ఈ నిర్జన బీడు ప్రాంతంలో చావడానికి ఐగుప్తులోనుంచి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించారు? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, ఈ నికృష్టమైన భోజనం మాకు అసహ్యం>> అన్నారు.
\p
\s5
\v 6 అప్పుడు యెహోవా ప్రజల్లోకి విషసర్పాలు పంపించాడు. అవి ప్రజలను కాటువేసినప్పుడు ఇశ్రాయేలీయుల్లో చాలామంది చనిపోయారు.
\v 7 కాబట్టి ప్రజలు మోషే దగ్గరికి వచ్చి <<మేము యెహోవాకు, నీకు విరోధంగా మాట్లాడి పాపం చేశాం. యెహోవా మా మధ్యనుంచి ఈ సర్పాలు తొలగించేలా ఆయనకు ప్రార్ధించండి>> అన్నారు.
\p
\s5
\v 8 మోషే ప్రజల కోసం ప్రార్థన చేసినప్పుడు యెహోవా <<పాము ఆకారం చేయించి స్థంభం మీద పెట్టు. అప్పుడు పాము కాటేసిన ప్రతి వాడు దానివైపు చూసి బతుకుతాడు>> అని మోషేకు చెప్పాడు.
\v 9 కాబట్టి మోషే, ఇత్తడి పాము ఒకటి చేయించి, స్థంభం మీద దాన్ని పెట్టాడు. అప్పుడు పాము కాటు తిన్న ప్రతివాడూ ఆ ఇత్తడి పాము వైపు చూసినప్పుడు అతడు బతికాడు.
\s మోయాబుకు ప్రయాణం
\p
\s5
\v 10 తరువాత ఇశ్రాయేలీయులు ప్రయాణం చేసి ఓబోతులో శిబిరం వేసుకున్నారు.
\v 11 ఓబోతులోనుంచి వారు ప్రయాణం చేసి తూర్పు వైపు, అంటే మోయాబుకు ఎదురుగా ఉన్న బంజరు భూమి ఈయ్యె అబారీము దగ్గర శిబిరం వేసుకున్నారు.
\p
\s5
\v 12 అక్కడనుంచి వారు ప్రయాణం చేసి, జెరెదు లోయలో శిబిరం వేసుకున్నారు.
\v 13 అక్కడనుంచి వారు ప్రయాణం చేసి బంజరు భూమిలో అర్నోను నది అవతల శిబిరం వేసుకున్నారు. ఆ నది అమోరీయుల దేశ సరిహద్దులనుంచి ప్రవహిస్తుంది. అర్నోను నది మోయాబుకు, అమోరీయులకు మధ్య ఉన్న మోయాబు సరిహద్దు.
\p
\s5
\v 14 ఆ కారణంగా యెహోవా యుద్ధాల గ్రంథంలో <<సుఫాలో ఉన్న వాహేబు, అర్నోను లోయలు, ఆరు అనే స్థలం వరకూ ఉన్న అర్నోను లోయలు,
\v 15 మోయాబు సరిహద్దుకు దగ్గరగా ఉన్న పల్లపు లోయలు>> అని రాసి ఉంది.
\p
\s5
\v 16 అక్కడనుంచి వారు బెయేరుకు వెళ్ళారు. అక్కడ ఉన్న బావి దగ్గర యెహోవా మోషేతో <<ప్రజలను సమకూర్చు. నేను వాళ్లకు నీళ్ళు ఇస్తాను>> అన్నాడు.
\p
\s5
\v 17 అప్పుడు ఇశ్రాయేలీయులు ఈ పాట పాడారు. <<బావీ, పైకి ఉబుకు! ఆ బావిని కీర్తించండి. నాయకులు దాన్ని తవ్వారు.
\v 18 వారు తమ అధికార దండంతో, చేతికర్రలతో ప్రజల నాయకులు దాన్ని తవ్వారు.>>
\p
\s5
\v 19 వారు ఆ ఎడారిలోనుంచి మత్తానుకూ, మత్తాను నుంచి నహలీయేలుకూ, నహలీయేలు నుంచి బామోతుకూ,
\v 20 మోయాబు దేశంలోని లోయలో ఉన్న బామోతు నుంచి ఎడారికి ఎదురుగా ఉన్న పిస్గా కొండ దగ్గరికి వచ్చారు.
\s సీహోను, ఓగుల పరాజయం
\p
\s5
\v 21 ఇశ్రాయేలీయులు అమోరీయుల రాజైన సీహోను దగ్గరికి రాయబారులను పంపించి <<మమ్మల్ని నీ దేశం గుండా వెళ్లనివ్వు,
\v 22 మేము పొలాల్లోకైనా, ద్రాక్షతోటల్లోకైనా వెళ్ళం. బావుల్లో నీళ్లు తాగం. మేము నీ సరిహద్దులు దాటే వరకూ రాజమార్గంలోనే నడిచి వెళ్తాం>> అని అతనితో చెప్పించారు.
\v 23 కాని, సీహోను ఇశ్రాయేలీయులను తన సరిహద్దుల గుండా వెళ్ళనివ్వ లేదు. ఇంకా సీహోను తన జనమంతా సమకూర్చుకుని ఇశ్రాయేలీయుల మీద దాడి చెయ్యడానికి ఎడారిలోకి వెళ్లి, యాహజుకు వచ్చి ఇశ్రాయేలీయులతో యుద్ధం చేశాడు.
\p
\s5
\v 24 ఇశ్రాయేలీయులు అతన్ని కత్తితో హతం చేసి, అతని దేశం అర్నోను మొదలు యబ్బోకు వరకూ, అంటే అమ్మోనీయుల దేశం వరకూ స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు అమ్మోనీయుల సరిహద్దు బలోపేతం అయ్యింది.
\v 25 ఇశ్రాయేలీయులు ఆ పట్టాణాలన్నీ స్వాధీనం చేసుకున్నారు. ఇశ్రాయేలీయులు అమోరీయుల పట్టాణాలన్నిట్లో, హెష్బోనులో, దాని పల్లెలన్నిట్లో శిబిరం వేసుకున్నారు.
\v 26 హెష్బోను, అమోరీయుల రాజైన సీహోను పట్టణం. అతడు అంతకు మునుపు మోయాబు రాజుతో యుద్ధం చేసి అర్నోను వరకూ అతని దేశమంతా స్వాధీనం చేసుకున్నాడు.
\p
\s5
\v 27 కాబట్టి సామెతలు పలికే వారు <<హెష్బోనుకు రండి. సీహోను పట్టణం కట్టాలి, దాన్ని స్థాపించాలి,
\v 28 హెష్బోను నుంచి అగ్ని బయలువెళ్ళింది, సీహోను పట్టణంనుంచి జ్వాలలు బయలువెళ్ళాయి, అది మోయాబుకు ఆనుకున్న ఆర్ దేశాన్ని కాల్చేసింది, అర్నోను
\f +
\fr 21:28
\ft అధిపతులను.
\f* కొండ ప్రదేశాలను కాల్చేసింది.
\s5
\v 29 మోయాబూ, నీకు బాధ, కెమోషు ప్రజలారా, మీరు నశించారు. తన కొడుకులను పలాయనం అయ్యేలా, తన కూతుళ్ళను అమోరీయులరాజైన సీహోనుకు బందీలుగా చేశాడు.
\v 30 కాని మేము సీహోనును జయించాం.
\f +
\fr 21:30
\ft హెష్బోనునుండి దీబోను వరకు రాళ్ళతో కొట్టి ధ్వంసం చేసాము.
\f* హెష్బోను దీబోను వరకూ నాశనం అయ్యింది. నోఫహు వరకూ దాన్ని పాడు చేశాం. అగ్నితో మేదెబా వరకూ తగల బెట్టాం>> అంటారు.
\p
\s5
\v 31 కాబట్టి ఇశ్రాయేలీయులు అమోరీయుల దేశంలో నివాసం ఉండడం ఆరంభించారు.
\v 32 అప్పుడు, యాజెరు దేశాన్ని సంచారం చేసి చూడడానికి మోషే మనుషులను పంపినప్పుడు వారు దాని గ్రామాలు స్వాధీనం చేసుకుని అక్కడున్న అమోరీయులను తోలివేశారు.
\p
\s5
\v 33 వారు తిరిగి బాషాను మార్గంలో ముందుకు వెళ్లినప్పుడు బాషాను రాజైన ఓగు, అతని జనమంతా ఎద్రెయీలో యుద్ధం చెయ్యడానికి బయలుదేరారు.
\v 34 యెహోవా మోషేతో <<అతనికి భయపడొద్దు. నేను అతని మీద, అతని జనం మీద, అతని దేశం మీద నీకు విజయం ఇచ్చాను. నువ్వు హెష్బోనులో నివాసం ఉన్న అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్టు ఇతనికి కూడా చేస్తావు>> అన్నాడు.
\v 35 కాబట్టి వారు అతన్ని, అతని కొడుకులను, ఒక్కడు కూడా మిగలకుండా అతని జనం అంతటినీ హతం చేసి అతని దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు.
\s5
\c 22
\s బాలాకు, బిలాము కోసం కబురంపటం
\p
\v 1 తరువాత ఇశ్రాయేలీయులు ప్రయాణం చేసి యెరికోకు ఎదురుగా యొర్దాను తీరంలో ఉన్న మోయాబు మైదానాల్లో శిబిరం వేసుకున్నారు.
\p
\s5
\v 2 సిప్పోరు కొడుకు బాలాకు ఇశ్రాయేలీయులు అమోరీయు పట్ల చేసిందంతా చూశాడు.
\v 3 ప్రజలు ఎక్కువగా ఉన్న కారణంగా మోయాబీయులు వారిని చూసి చాలా కంగారుపడ్డారు. మోయాబీయులు ఇశ్రాయేలీయులను చూసి భయభ్రాంతులకు లోనయ్యారు.
\v 4 మోయాబీయులు మిద్యాను పెద్దలతో <<ఒక ఎద్దు పొలంలో ఉన్న పచ్చిగడ్డి తినేసినట్టు ఈ జనసమూహహం ఇప్పుడు మన చుట్టూ ఉన్నదంతా తినేస్తారు>> అన్నారు. ఆ కాలంలో సిప్పోరు కొడుకు బాలాకు మోయాబీయులకు రాజు.
\p
\s5
\v 5 కాబట్టి అతడు బెయోరు కొడుకు బిలామును పిలవడానికి అతని ప్రజల దేశంలో ఉన్న నది దగ్గర ఉన్న పెతోరుకు ఇలా కబురంపారు. <<చూడు, ఒక జాతి ఐగుప్తులోనుంచి వచ్చింది. వారు ఈ ప్రదేశమంతా కమ్మి, ఇప్పుడు నాకు ఎదురు గుండా శిబిరం వేసుకున్నారు.
\v 6 కాబట్టి నువ్వు దయచేసి వచ్చి నా కోసం ఈ జనాన్ని శపించు. వారు నాకంటే చాలా బలవంతులు. ఒకవేళ నేను వారి మీద దాడి చేసి వారిని ఈ ప్రదేశం నుంచి తరమగలుగుతానేమో. ఎందుకంటే నువ్వు దీవించినవాడికి దీవెన, శపించిన వాడికి శాపం కలుగుతాయని నాకు తెలుసు>> అని అన్నాడు.
\p
\s5
\v 7 కాబట్టి మోయాబు పెద్దలు, మిద్యాను పెద్దలు భవిష్యవాణి చెప్పడానికి ఇచ్చే చెల్లింపు తీసుకుని బిలాము దగ్గరికి వచ్చి బాలాకు మాటలు అతనితో చెప్పారు.
\v 8 అతడు వారితో <<ఈ రాత్రి ఇక్కడే ఉండండి. యెహోవా నాకు చెప్పిన మాటలు నేను మళ్ళీ వచ్చి మీతో చెప్తాను>> అన్నాడు. అప్పుడు మోయాబు నాయకులు ఆ రాత్రి బిలాము దగ్గర ఉన్నారు.
\p
\s5
\v 9 దేవుడు బిలాము దగ్గరికి వచ్చి <<నీ దగ్గరున్న ఈ మనుషులు ఎవరు?>> అన్నాడు.
\v 10 బిలాము దేవునితో <<సిప్పోరు కొడుకు బాలాకు అనే మోయాబు రాజు వార్త పంపించి,
\v 11 <చూడు, ఒక జాతి ఐగుప్తునుంచి బయలుదేరి వచ్చింది. వారు ఈ ప్రదేశమంతా కమ్మి ఉన్నారు. నువ్వు వెంటనే వచ్చి నా కోసం వారిని శపించు. ఒకవేళ నేను వారి మీద దాడి చేసి వారిని ఈ ప్రదేశం నుంచి తరమగలుగుతానేమో> అని వీళ్ళతో నాకు వార్త పంపించాడు>> అన్నాడు.
\p
\s5
\v 12 దేవుడు బిలాముకు జవాబిస్తూ <<నువ్వు వారితో వెళ్లకూడదు. ఆ ప్రజలను శపించకూడదు. వారు ఆశీర్వాదం పొందిన వారు>> అన్నాడు.
\v 13 కాబట్టి బిలాము ఉదయాన లేచి, బాలాకు నాయకులతో <<మీరు మీ స్వదేశానికి వెళ్ళి పొండి. మీతో వెళ్ళడానికి యెహోవా నాకు అనుమతి ఇవ్వలేదు>> అన్నాడు.
\v 14 కాబట్టి మోయాబు నాయకులు లేచి బాలాకు దగ్గరికి వెళ్లి <<బిలాము మాతో రావడానికి నిరాకరించాడు>> అని చెప్పారు.
\p
\s5
\v 15 బాలాకు వారికంటే ఘనత కలిగిన ఇంకా ఎక్కువ మంది నాయకులను మళ్ళీ పంపించాడు.
\v 16 వారు బిలాము దగ్గరికి వచ్చి అతనితో <<సిప్పోరు కొడుకు బాలాకు, <నువ్వు నా దగ్గరికి రావడానికి దయచేసి ఏదీ నిన్ను ఆపనివ్వకు,
\v 17 ఎందుకంటే, నేను నిన్ను చాలా గొప్పవాణ్ణి చేస్తాను. నువ్వు నాతో ఏం చెప్పినా చేస్తాను. కాబట్టి నువ్వు దయచేసి వచ్చి, నా కోసం ఈ జనాన్ని శపించు> అని చెప్పమన్నాడు>> అన్నారు.
\p
\s5
\v 18 బిలాము జవాబిస్తూ <<బాలాకు తన రాజమందిరమంత వెండి బంగారాలు నాకిచ్చినా, నేను చెయ్యాల్సిన పని చిన్నదైనా పెద్దదైనా, నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను.
\v 19 కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి కూడా ఇక్కడ ఉండండి. యెహోవా నాతో ఇంకేం చెప్తాడో నేను తెలుసుకుంటాను>> అన్నాడు.
\v 20 ఆ రాత్రి దేవుడు బిలాము దగ్గరికి వచ్చి <<ఆ మనుషులు నిన్ను పిలిపించారు గనక నువ్వు లేచి వారితో వెళ్ళు. కాని కేవలం నేను నీతో చెప్పినట్టే నువ్వు చెయ్యాలి>> అని చెప్పాడు.
\s బిలాము గాడిద
\p
\s5
\v 21 ఉదయాన బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు నాయకులతోపాటు వెళ్ళాడు.
\v 22 అతడు వెళ్తూ ఉన్నప్పుడు, దేవుని కోపం రగులుకుంది. యెహోవా దూత అతనికి విరోధంగా దారిలో అడ్డంగా నిలిచి ఉన్నాడు. అతడు తన గాడిద ఎక్కి వెళ్తూ ఉన్నప్పుడు, అతని పనివారు ఇద్దరు అతనితోపాటు ఉన్నారు.
\v 23 యెహోవా దూత కత్తి దూసి, దారిలో నిలిచి ఉండడం ఆ గాడిద చూసింది గనక అది దారి మళ్ళి పొలంలోకి వెళ్ళింది. బిలాము గాడిదను దారిలోకి మళ్ళించాలని దాన్ని కొట్టాడు.
\p
\s5
\v 24 యెహోవా దూత అటూ ఇటూ గోడలున్న ద్రాక్షతోటల సందులో నిలిచాడు.
\v 25 గాడిద యెహోవా దూతను చూసి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమింది గనక అతడు మళ్ళీ దాన్ని కొట్టాడు.
\p
\s5
\v 26 యెహోవా దూత ముందుకు వెళ్లి, కుడికైనా ఎడమకైనా తిరగడానికి దారిలేని ఇరుకు ప్రాంతంలో నిలిచినప్పుడు,
\v 27 ఆ గాడిద యెహోవా దూతను చూసి బిలాముతోబాటు కింద పడిపోయింది గనక బిలాము మండిపడ్డాడు. తన చేతి కర్రతో గాడిదను కొట్టాడు.
\p
\s5
\v 28 అప్పుడు యెహోవా ఆ గాడిద నోరు తెరిచాడు. అది <<నువ్వు నన్ను మూడుసార్లు కొట్టావు. నేను ఏమి చేశాను?>> అని బిలాముతో అంది.
\v 29 బిలాము <<నువ్వు నన్ను ఒక వెర్రివాణ్ణి చేశావు. నా చేతిలో కత్తి ఉంటే నిన్ను చంపేసే వాణ్ణి>> అన్నాడు.
\v 30 ఆ గాడిద <<ఈ రోజు వరకూ నీ జీవితమంతా నువ్వు స్వారీ చేసిన నేను నీదాన్ని కాదా? నేనెప్పుడైనా నీ పట్ల ఈవిధంగా చేశానా?>> అని బిలాముతో అంది. బిలాము <<లేదు>> అన్నాడు.
\p
\s5
\v 31 అప్పుడు యెహోవా బిలాము కళ్ళు తెరిచాడు గనక దూసిన కత్తి చేత్తో పట్టుకుని దారిలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూసి తల వంచి సాష్టాంగ నమస్కారం చేశాడు.
\v 32 యెహోవా దూత <<నీ గాడిదను మూడుసార్లు ఎందుకు కొట్టావు? చూడు, నా దృష్టిలో నువ్వు దుర్మార్గమైన పనులు చేశావు గనక నేను నీకు విరోధిగా వచ్చాను.
\v 33 ఆ గాడిద నన్ను చూసి ఈ మూడుసార్లు నా ఎదుట నుంచి పక్కకు వెళ్ళింది. అది నా ఎదుట నుంచి పక్కకు వెళ్ళకపోతే కచ్చితంగా అప్పుడే నేను నిన్ను చంపి దాని ప్రాణం రక్షించి ఉండేవాణ్ణి>> అని అతనితో అన్నాడు.
\p
\s5
\v 34 అందుకు బిలాము <<నేను పాపం చేశాను. నువ్వు నాకు ఎదురుగా దారిలో నిలుచుని ఉన్నావని నాకు తెలియలేదు. కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను ఎక్కడనుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోతాను>> అని యెహోవా దూతతో చెప్పాడు.
\v 35 యెహోవా దూత <<నువ్వు ఆ మనుషులతోపాటు వెళ్ళు. కాని, నేను నీతో చెప్పే మాటలేగాని, ఇంకేమీ పలకొద్దు>> అని బిలాముతో చెప్పాడు. అప్పుడు బిలాము బాలాకు అధికారులతో పాటు వెళ్ళాడు.
\p
\s5
\v 36 బిలాము వచ్చాడని బాలాకు విని, ఆ సరిహద్దు చివర ఉన్న అర్నోను తీరంలో అతన్ని కలుసుకోడానికి మోయాబు పట్టణం వరకూ వెళ్ళినప్పుడు,
\v 37 బాలాకు బిలాముతో <<నిన్ను పిలవడానికి నేను నీ దగ్గరికి రాయబారులను పంపాను గదా! నువ్వెందుకు నా దగ్గరికి రాలేదు? నిన్ను గొప్పవాణ్ణి చేసే సామర్థ్యం నాకు లేదా?>> అన్నాడు.
\p
\s5
\v 38 అప్పుడు బిలాము <<చూడు, నేను నీ దగ్గరికి వచ్చాను. నాకిష్టమొచ్చింది చెప్పడానికి నాకు శక్తి ఉందా? దేవుడు నా నోట పలికించే మాటే పలకగలను గదా>> అని బాలాకుతో చెప్పాడు.
\v 39 అప్పుడు బిలాము బాలాకుతో పాటు వెళ్ళాడు. వారు కిర్యత్‌ హుజోతుకు వచ్చినప్పుడు
\v 40 బాలాకు ఎడ్లు, గొర్రెలు బలిగా అర్పించి, కొంతభాగం బిలాముకు, అతని దగ్గరున్న నాయకులకు పంపించాడు.
\p
\s5
\v 41 బాలాకు ఆ తరువాత రోజు బిలామును
\f +
\fr 22:41
\ft బామోతు బయలు.
\f* బయలుకు చెందిన ఎత్తైన స్థలాల దగ్గరికి తీసుకు వెళ్ళాడు. అక్కడనుంచి బిలాము ఇశ్రాయేలీయుల శిబిరంలో కొంత భాగమే చూడగలిగాడు.
\s5
\c 23
\s బిలాము మొదటి సందేశం
\p
\v 1 అప్పుడు బిలాము బాలాకుతో <<ఇక్కడ నా కోసం ఏడు బలిపీఠాలు కట్టించి, ఏడు దున్నపోతులను, ఏడు పొట్టేళ్లను సిద్ధం చెయ్యి>> అన్నాడు.
\v 2 బిలాము చెప్పినట్టు బాలాకు చేసినప్పుడు, బాలాకు, బిలాము ప్రతి బలిపీఠం మీద ఒక దున్నపోతునూ ఒక పొట్టేలునూ దహనబలిగా అర్పించారు.
\v 3 ఇంకా బిలాము బాలాకుతో <<బలిపీఠం మీద నీ దహనబలి దగ్గర నిలిచి ఉండు. ఒకవేళ నన్ను కలవడానికి యెహోవా వస్తాడేమో. ఆయన నాకు ఏమి చూపిస్తాడో అది నీకు తెలియజేస్తాను>> అని చెప్పి చెట్లు లేని కొండ ఎక్కి వెళ్ళాడు.
\p
\s5
\v 4 దేవుడు బిలామును కలుసుకున్నప్పుడు, బిలాము ఆయనతో <<నేను ఏడు బలిపీఠాలు కట్టి, ప్రతి దాని మీద ఒక దున్నపోతు, ఒక పొట్టేలును అర్పించాను>> అని చెప్పాడు.
\v 5 యెహోవా ఒక వార్త బిలాము నోట ఉంచి <<నువ్వు బాలాకు దగ్గరికి తిరిగి వెళ్లి అతనితో మాట్లాడు>> అన్నాడు.
\v 6 అతడు బాలాకు దగ్గరికి తిరిగి వెళ్లినప్పుడు అతడు మోయాబు నాయకులందరితో తన దహనబలి దగ్గర నిలబడి ఉన్నాడు.
\p
\s5
\v 7 అప్పుడు బిలాము ప్రవచనరీతిగా,
\p <<అరాము నుంచి బాలాకు, తూర్పు పర్వతాల నుంచి మోయాబురాజు నన్ను రప్పించి,
\p <వచ్చి, నాకోసం యాకోబును శపించు> అన్నాడు,
\p <వచ్చి ఇశ్రాయేలును వ్యతిరేకించు> అన్నాడు.
\p
\v 8 దేవుడు శపించనివారిని నేనెలా శపించను?
\p దేవుడు వ్యతిరేకించని వారిని నేనెలా వ్యతిరేకించను?
\p
\s5
\v 9 రాతిబండల మీద నుంచి ఆయన్ని చూస్తున్నాను.
\p కొండలపై నుండి ఆయన్ని కనుగొన్నాను.
\p చూడు, ఒంటిగా నివసించే జనం ఒకటి ఉంది.
\p వారు ఒక సాధారణ జనంగా తమను తాము ఎంచుకోరు.
\p
\s5
\v 10 యాకోబు రేణువులను ఎవరు లెక్కించ గలరు?
\p ఇశ్రాయేలులో నాల్గోవంతునైనా ఎవరు లేక్కించ గలరు?
\p నీతిమంతుల మరణం లాంటి మరణం నాకు రానివ్వండి.
\p నా జీవిత అంతం ఆయన జనంలా ఉండనివ్వండి>> అన్నాడు.
\p
\s5
\v 11 బాలాకు బిలాముతో <<నువ్వు నాకు ఏం చేశావు? నా శత్రువులను శపించడానికి నిన్ను రప్పించాను. కాని నువ్వు వారిని దీవించావు>> అన్నాడు.
\v 12 బిలాము జవాబిస్తూ <<యెహోవా నా నోట ఉంచినదే నేను జాగ్రత్తగా పలకాలి కదా?>> అన్నాడు.
\s బిలాము రెండవ సందేశం
\p
\s5
\v 13 అప్పుడు బాలాకు అతనితో <<దయచేసి నాతోపాటు ఇంకొక చోటికి రా. అక్కడనుంచి వారిని చూడొచ్చు. చివర ఉన్న వారిని మాత్రమే నువ్వు చూడ గలుగుతావు. వారందరూ నీకు కనిపించరు. అక్కడ నుంచి నా కోసం వారిని శపించాలి>> అని చెప్పి
\v 14 పిస్గా కొండపైన ఉన్న కాపలావారి పొలానికి అతన్ని తీసుకెళ్ళి, ఏడు బలిపీఠాలు కట్టించి, ప్రతి బలిపీఠం మీద ఒక దున్నపోతును, ఒక పొట్టేలును అర్పించాడు.
\v 15 అప్పుడు బిలాము బాలాకుతో <<నువ్వు ఇక్కడ నీ దహనబలి దగ్గర నిలిచి ఉండు. నేను అక్కడ యెహోవాను కలుసుకుంటాను>> అన్నాడు.
\p
\s5
\v 16 యెహోవా బిలామును కలుసుకుని ఒక వార్త అతని నోట ఉంచి <<నువ్వు బాలాకు దగ్గరికి తిరిగి వెళ్లి నా వార్త అతనికి అందించు>> అన్నాడు.
\v 17 అతడు బాలాకు దగ్గరికి వెళ్లినప్పుడు అతడు తన దహనబలి దగ్గర నిలిచి ఉన్నాడు. మోయాబు నాయకులు కూడా అతని దగ్గర ఉన్నారు. బాలాకు<<యెహోవా ఏం చెప్పాడు?>> అని అడిగాడు.
\p
\v 18 బిలాము ప్రవచనంగా <<బాలాకూ, లేచి విను. సిప్పోరు కుమారుడా, ఆలకించు.
\p
\s5
\v 19 అబద్ధమాడడానికి దేవుడు మనిషి కాదు.
\p మనస్సు మార్చుకోడానికి ఆయన మానవుడు కాదు.
\p ఆయన వాగ్దానం చేసి కార్యం చెయ్యకుండా ఉంటాడా?
\p ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉంటాడా?
\p
\v 20 చూడు, దీవించమని నాకు ఆజ్ఞ వచ్చింది.
\p దేవుడు దీవెన ఇచ్చాడు. నేను దాన్ని మార్చలేను.
\p
\s5
\v 21 ఆయన యాకోబులో కష్టం గాని, దోషం గాని కనుగొనలేదు.
\p వారి దేవుడైన యెహోవా వాళ్లకు తోడుగా ఉన్నాడు.
\p
\v 22 అడవిదున్న బలం లాంటి బలంతో దేవుడు వారిని ఐగుప్తులోనుంచి తీసుకొచ్చాడు.
\p
\s5
\v 23 యాకోబుకు వ్యతిరేకంగా ఏ మంత్రం పనిచెయ్యదు.
\p ఏ శకునం హాని చెయ్యదు.
\p దానికి బదులుగా యాకోబు గురించీ, ఇశ్రాయేలు గురించీ <దేవుడు ఏం చేశాడో చూడు> అని చెప్పుకోవాలి.
\p
\s5
\v 24 చూడు, ఆ ప్రజలు ఆడసింహంలా లేస్తారు,
\p ఆ జాతి సింహంలా బయటకు వచ్చి వేటాడుతుంది.
\p చంపిన దాన్ని తిని, దాని రక్తం తాగే వరకూ అది పండుకోదు>> అని పలికాడు.
\p
\s5
\v 25 అప్పుడు బాలాకు బిలాముతో <<వారిని శపించడం గాని, ఆశీర్వదించడం గాని ఏదీ చెయ్యొద్దు>> అన్నాడు.
\v 26 కాని బిలాము <<యెహోవా నాకు చెప్పిందంతా నేను చెయ్యాలని నేను నీతో చెప్పలేదా?>> అని బాలాకుకు జవాబిచ్చాడు.
\s బిలాము మూడవ సందేశం
\p
\v 27 బాలాకు బిలాముతో <<నువ్వు దయచేసి రా, నేను ఇంకొక చోటికి నిన్ను తీసుకెళ్తాను. అక్కడ నుంచి నా కోసం నువ్వు వారిని శపించడం దేవుని దృష్టికి అనుకూలంగా ఉంటుందేమో>> అన్నాడు.
\p
\s5
\v 28 బాలాకు ఎడారికి ఎదురుగా ఉన్న పెయోరు శిఖరానికి బిలామును తీసుకు పోయాడు.
\v 29 బిలాము<<ఇక్కడ నాకు ఏడు బలిపీఠాలు కట్టించి, ఏడు దున్నపోతులను, ఏడు పొట్టేళ్లను సిద్ధం చెయ్యి>> అని బాలాకుతో చెప్పాడు.
\v 30 బిలాము చెప్పినట్టు బాలాకు చేసి, ప్రతి బలిపీఠం మీద ఒక దున్నపోతును, ఒక పొట్టేలును అర్పించాడు.
\s5
\c 24
\p
\v 1 ఇశ్రాయేలీయులను దీవించడం యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకున్నప్పుడు అతడు ఇంతకు ముందు లాగా శకునం చూడడానికి వెళ్ళకుండా ఎడారి వైపు తన ముఖాన్ని తిప్పుకున్నాడు.
\p
\s5
\v 2 బిలాము కళ్ళెత్తి ఇశ్రాయేలీయులు తమ తమ గోత్రాల ప్రకారం శిబిరంలో ఉండడం చూసినప్పుడు, దేవుని ఆత్మ అతని మీదికి దిగి వచ్చాడు.
\v 3 అతడు ఇలా ప్రవచించాడు.
\p <<బెయోరు కొడుకు బిలాముకు పలుకబోతున్నాడు.
\p కళ్ళు బాగా తెరుచుకున్నవాడు పలకబోతున్నాడు.
\p
\s5
\v 4 అతడు దేవుని మాటలు మాట్లాడతాడు,
\p దేవుని మాటలు వింటాడు. అతడు సర్వశక్తుని దగ్గర నుంచి వచ్చే దర్శనం చూస్తాడు,
\p ఆయన ఎదుట అతడు తన కళ్ళు తెరిచి వంగి నమస్కరిస్తాడు.
\p
\v 5 యాకోబూ, నీ గుడారాలు ఎంతో అందంగా ఉన్నాయి.
\p ఇశ్రాయేలూ, నీ నివాసస్థలాలు ఎంత రమ్యంగా ఉన్నాయి!
\p
\s5
\v 6 అవి లోయలు వ్యాపించినట్టు, నదీతీరంలో తోటల్లా,
\p యెహోవా నాటిన అగరు చెట్లలా నీళ్ళ దగ్గరున్న దేవదారు వృక్షాల్లా ఉన్నాయి.
\p
\s5
\v 7 అతడు నీరు తోడుకునే చేదల నుండి నీళ్ళు కారుతాయి.
\p అతడు నాటిన విత్తనానికి సమృద్ధిగా నీళ్ళు అందుతాయి.
\p వారి రాజు అగగు కంటే గొప్పవాడౌతాడు.
\p వారి రాజ్యం ఘనత పొందుతుంది.
\p
\s5
\v 8 దేవుడు ఐగుప్తులోనుంచి అతన్ని రప్పించాడు.
\p అతనికి అడవిదున్నకు ఉన్నంత బలం ఉంది.
\p అతడు తనకు విరోధంగా పోరాడే వారిని మింగేస్తాడు.
\p వారి ఎముకలు విరిచేస్తాడు. తన బాణాలతో వారిని చంపేస్తాడు.
\p
\s5
\v 9 అతడు సింహంలా, ఆడ సింహంలా పొంచి ఉంటాడు.
\p అతని విశ్రాంతికి భంగం కలిగించేవాడెవడు?
\p అతన్ని దీవించే ప్రతివాడికీ దీవెన వస్తుంది గాక,
\p అతన్ని శపించే ప్రతివాడికీ శాపం వస్తుంది గాక>> అన్నాడు.
\p
\s5
\v 10 అప్పుడు బాలాకు కోపం బిలాము మీద రగిలింది గనక అతడు తన చేతులు చరిచి బిలాముతో <<నా శత్రువులను శపించడానికి నిన్ను పిలిపించాను కాని నీవు ఈ మూడుసార్లు వారిని దీవించావు. కాబట్టి నువ్వు ఇప్పుడు నీ స్థలానికి తొందరగా వెళ్లు.
\v 11 నేను నిన్ను ఎంతో గొప్పవాణ్ణి చేస్తానని చెప్పాను గాని, నీకు అది దక్కకుండా యెహోవా నిన్ను ఆటంకపరిచాడు>> అన్నాడు.
\p
\s5
\v 12 అందుకు బిలాము బాలాకుతో <<బాలాకు తన రాజమందిరమంత వెండి బంగారాలు నాకిచ్చినా నా ఇష్టప్రకారం మేలైనా కీడైనా చెయ్యడానికి యెహోవా చెప్పిన మాట మీరలేను,
\v 13 యెహోవా ఏం చెప్తాడో అదే పలుకుతానని నువ్వు నా దగ్గరికి పంపించిన నీ వర్తమానికులతో నేను చెప్పలేదా?
\v 14 కాబట్టి, చూడు, నేను నా ప్రజల దగ్గరికి వెళ్తున్నాను. కాని, ముందు రోజుల్లో ఈ ప్రజలు నీ ప్రజలకు ఏం చేస్తారో, ఆ హెచ్చరిక నీకు నేనివ్వాలి>> అన్నాడు.
\s బిలాము నాలుగో సందేశం
\p
\s5
\v 15 బిలాము ప్రవచనం చెప్పాడు. <<బెయోరు కొడుకు బిలాము మాట్లాడుతున్నాడు,
\p కనువిప్పు కలిగినవాడు మాట్లాడుతున్నాడు.
\p
\v 16 ఇది దేవుని వాక్కులను విన్నవాడి ప్రవచనం.
\p మహాన్నతుని జ్ఞానం తెలిసినవాడి ప్రవచనం.
\p సర్వశక్తుని దర్శనాలు చూసినవాడి ప్రవచనం.
\p ఆయన ఎదుట తెరిచిన కళ్ళతో అతడు వంగి నమస్కారం చేస్తున్నాడు.
\p
\s5
\v 17 నేను ఆయన్ని చూస్తున్నాను, కాని ఇప్పుడు ఆయన ఇక్కడ లేడు.
\p నేను ఆయన్ని గమనిస్తున్నాను కాని ఆయన ఇప్పుడు సమీపంగా లేడు.
\p ఒక నక్షత్రం యాకోబులో ఉదయిస్తుంది.
\p రాజదండం ఇశ్రాయేలులోనుంచి వస్తుంది.
\p అతడు మోయాబు
\f +
\fr 24:17
\ft సరిహద్దులు.
\f* నాయకులను పడగొడతాడు.
\p అతడు
\f +
\fr 24:17
\ft అల్లరి రేకెత్తించే వారిని, సమస్యలు తెచ్చే వారిని.
\f* షేతు వంశస్తులందరినీ నాశనం చేస్తాడు.
\p
\s5
\v 18 ఎదోము, శేయీరు, ఇశ్రాయేలు శత్రువులు స్వాధీనం అవుతారు.
\p వారిని ఇశ్రాయేలీయులు తమ బలం చేత జయిస్తారు.
\s బిలాము చివరి సందేశం
\p
\v 19 యాకోబు సంతానంలోనుంచి రాజ్యాధికారం వస్తుంది.
\p అతడు వారి పట్టణాల్లో మిగిలిన వారిని నాశనం చేస్తారు>> అన్నాడు.
\p
\s5
\v 20 ఇంకా బిలాము అమాలేకీయులవైపు చూసి ప్రవచనం చెప్తూ,
\p <<ఒకప్పుడు అమాలేకు దేశాల్లో గొప్ప దేశం.
\p కాని దాని అంతం నాశనమే>> అన్నాడు.
\p
\s5
\v 21 తరువాత బిలాము కేనీయులవైపు చూసి ప్రవచనం చెప్తూ,
\p <<నువ్వు నివాసం ఉన్న స్థలం బలమైనది.
\p నీ గూడు బండరాళ్ళల్లో ఉంది.
\p
\v 22 కాని అష్షూరు నిన్ను బందీగా పట్టుకున్నప్పుడు కయీను నాశనమౌతుంది>> అన్నాడు.
\p
\s5
\v 23 అప్పుడు అతడు ప్రవచనంగా చెప్తూ <<అయ్యో! దేవుడు ఇలా చేసినప్పుడు ఎవరు బతుకుతారు?
\p
\v 24 కిత్తీము తీరం నుంచి ఓడలు వస్తాయి.
\p అవి అష్షూరు, ఏబెరుల మీద దాడి చేస్తాయి.
\p కిత్తీయులు కూడా నాశనమౌతారు>> అన్నాడు.
\p
\v 25 అప్పుడు బిలాము లేచి తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. బాలాకు కూడా వెళ్ళిపోయాడు.
\s5
\c 25
\s మోయాబులు దగ్గర ఇశ్రాయేలీయుల పాపం
\p
\v 1 ఇశ్రాయేలీయులు షిత్తీములో ఉన్నప్పుడు ప్రజలు మోయాబు స్త్రీలతో వ్యభిచారం చెయ్యడం మొదలు పెట్టారు.
\v 2 ఆ స్త్రీలు తమ దేవుళ్ళ బలులకు ప్రజలను ఆహ్వానించినప్పుడు వీరు భోజనం చేసి వారి దేవుళ్ళకు నమస్కారం చేశారు.
\v 3 ఇశ్రాయేలీయులు బయల్పెయోరును ఆరాధించిన కారణంగా యెహోవా కోపం వారి మీద రగులుకుంది.
\p
\s5
\v 4 అప్పుడు యెహోవా మోషేతో <<నువ్వు ప్రజల నాయకులందర్నీ చంపి, నా ఎదుట,
\f +
\fr 25:4
\ft యెహోవా ఎదుట, అందరూ చూసేలా.
\f* పట్టపగలు వారిని వేలాడదియ్యి. అప్పుడు నా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద నుంచి తొలిగి పోతుంది>> అని చెప్పాడు.
\v 5 కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల నాయకులతో <<మీలో ప్రతివాడూ, బయల్పెయోరును ఆరాధించే వారితో కలిసిన వారిని చంపాలి>> అన్నాడు.
\p
\s5
\v 6 అప్పుడు మోషే కళ్ళ ఎదుట, సన్నిధి గుడారం ద్వారం దగ్గర, ఏడుస్తూ ఉన్న ఇశ్రాయేలీయుల సమాజం అంతటి కళ్ళ ఎదుట, ఇశ్రాయేలీయుల్లో ఒకడు తన కుటుంబికుల మధ్యకు ఒక మిద్యాను స్త్రీని తీసుకొచ్చాడు.
\v 7 యాజకుడైన అహరోను మనవడు, ఎలియాజరు కొడుకు ఫీనెహాసు అది చూసి,
\p
\s5
\v 8 సమాజం నుంచి లేచి, ఈటె చేత్తో పట్టుకుని ఆ ఇశ్రాయేలీయుడి వెంట ఆ గుడారంలోకి వెళ్లి ఆ ఇద్దరినీ, అంటే ఆ ఇశ్రాయేలీయుణ్ణీ, ఆ స్త్రీనీ, కడుపులో గుండా దూసుకు పోయేలా పొడిచాడు. అప్పుడు ఇశ్రాయేలీయుల్లోకి దేవుడు పంపించిన తెగులు ఆగిపోయింది.
\v 9 ఆ తెగులు వల్ల 24 వేల మంది చనిపోయారు.
\p
\s5
\v 10 అప్పుడు యెహోవా మోషేతో <<యాజకుడైన అహరోను మనవడూ, ఎలియాజరు కొడుకూ అయిన ఫీనెహాసు,
\v 11 వారి మధ్య నేను సహించలేనిదాన్ని తానూ సహించకపోవడం వల్ల ఇశ్రాయేలీయుల మీద నుంచి నా కోపం మళ్ళించాడు గనక నేను సహించలేకపోయినా ఇశ్రాయేలీయులను నాశనం చెయ్యలేదు.
\p
\s5
\v 12 కాబట్టి నువ్వు అతనితో ఇలా అను, చూడు, నేను ఫినెహాసుకు నా సమాధాన నిబంధన చేస్తున్నాను.
\v 13 అది శాశ్వతమైన యాజక నిబంధనగా అతనికీ, అతని సంతానానికీ ఉంటుంది. ఎందుకంటే అతడు తన దేవుని విషయంలో ఆసక్తి కలిగిన వాడుగా ఇశ్రాయేలీయుల కోసం ప్రాయశ్చిత్తం చేశాడు>> అన్నాడు.
\p
\s5
\v 14 ఫినెహాసు చంపినవాడి పేరు జిమ్రీ. అతడు షిమ్యోనీయుల్లో తన పితరుల వంశానికి నాయకుడైన సాలూ కొడుకు.
\v 15 ఫినెహాసు చంపిన స్త్రీ పేరు కొజ్బీ, ఆమె సూరు కూతురు. అతడు మిద్యానీయుల్లో ఒక గోత్రానికీ, కుటుంబానికీ నాయకుడు.
\p
\s5
\v 16 ఇంకా యెహోవా మోషేతో <<మిద్యానీయులను శత్రువులుగా భావించి వారి మీద దాడి చెయ్యండి.
\v 17 వారు మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని శత్రువులుగా ఎంచారు.
\v 18 పెయోరు విషయంలో, తెగులు రోజున చంపిన తమ సహోదరి, మిద్యాను నాయకుని కూతురు కొజ్బీ విషయంలో, మిమ్మల్ని దుర్మార్గంలోకి నడిపించారు.>>
\s5
\c 26
\s రెండోసారి జనాభా లెక్కలు
\p
\v 1 ఆ తెగులు పోయిన తరువాత యెహోవా మోషేతో, యాజకుడైన అహరోను కొడుకు ఎలియాజరుతో మాట్లాడుతూ,
\v 2 <<మీరు ఇశ్రాయేలీయుల సమాజమంతట్లో 20 సంవత్సరాలు మొదలుకుని ఆ పై వయస్సు ఉన్న ఇశ్రాయేలీయుల్లో యుద్ధం చెయ్యగల సామర్థ్యం ఉన్న వారిని, తమ పితరుల కుటుంబాల ప్రకారం లెక్కపెట్టండి>> అన్నాడు.
\p
\s5
\v 3 కాబట్టి మోషే, యాజకుడైన ఎలియాజరు యెరికో దగ్గర యోర్దాను తీరంలో మోయాబు మైదానాల్లో సమాజమంతటితో మాట్లాడుతూ,
\v 4 <<20 సంవత్సరాలు, ఆ పై వయస్సు కలిగి, ఐగుప్తులోనుంచి బయటకు వచ్చిన వారిని లెక్కపెట్టమని యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు>> అన్నారు.
\p
\s5
\v 5 ఇశ్రాయేలు పెద్దకొడుకు రూబేను. రూబేను కొడుకు హనోకు నుంచి హనోకీయులు హనోకు వంశస్థులు,
\v 6 పల్లువీయులు పల్లు వంశస్థులు. హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు, కర్మీయులు కర్మీ వంశస్థులు.
\v 7 వీరు రూబేనీయుల వంశస్థులు. వారిల్లో లెక్కకు వచ్చినవారు 43,730 మంది పురుషులు.
\p
\s5
\v 8 పల్లు కొడుకు ఏలీయాబు. ఏలీయాబు కొడుకులు నెమూయేలు, దాతాను, అబీరాము.
\v 9 కోరహు, అతని సమాజం యెహోవాకు విరోధంగా వాదించినప్పుడు సమాజంలో మోషే అహరోనులకు విరోధంగా వాదించిన దాతాను అబీరాములు వీరే.
\p
\s5
\v 10 ఆ సమాజం వారు చనిపోయినప్పుడు అగ్ని 250 మందిని కాల్చేసినందువల్ల, భూమి తన నోరు తెరచి వారిని, కోరహును మింగేసినందువల్ల, వారు ఒక హెచ్చరికగా అయ్యారు.
\v 11 అయితే కోరహు కొడుకులు చనిపోలేదు.
\p
\s5
\v 12 షిమ్యోను కొడుకుల వంశంలో నెమూయేలీయులు నెమూయేలు వంశస్థులు, యామీనీయులు యామీను వంశస్థులు, యాకీనీయులు యాకీను వంశస్థులు,
\v 13 జెరహీయులు జెరహు వంశస్థులు, షావూలీయులు షావూలు వంశస్థులు.
\v 14 ఇవి షిమ్యోనీయుల వంశాలు. వారు 22,200 మంది పురుషులు.
\p
\s5
\v 15 గాదు కొడుకుల వంశాల్లో సెపోనీయులు సెపోను వంశస్థులు, హగ్గీయులు హగ్గీ వంశస్థులు, షూనీయులు షూనీ వంశస్థులు,
\v 16 ఓజనీయులు ఓజని వంశస్థులు, ఏరీయులు ఏరీ వంశస్థులు,
\v 17 ఆరోదీయులు ఆరోదు వంశస్థులు, అరేలీయులు అరేలీ వంశస్థులు.
\v 18 వీరు గాదీయుల వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 40,500 మంది పురుషులు.
\p
\s5
\v 19 యూదా కొడుకులు ఏరు, ఓనాను. ఏరు, ఓనాను, కనాను ప్రదేశంలో చనిపోయారు.
\v 20 యూదావారి వంశాల్లో షేలాహీయులు షేలా వంశస్థులు, పెరెసీయులు పెరెసు వంశస్థులు, జెరహీయులు జెరహు వంశస్థులు,
\v 21 పెరెసీయుల్లో హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు, హామూలీయులు హామూలు వంశస్థులు.
\v 22 వీరు యూదా వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 76,500 మంది పురుషులు.
\p
\s5
\v 23 ఇశ్శాఖారు కొడుకుల వంశస్థుల్లో తోలాహీయులు తోలా వంశస్థులు, పువ్వీయులు పువ్వా వంశస్థులు, యాషూబీయులు యాషూబు వంశస్థులు, షిమ్రోనీయులు షిమ్రోను వంశస్థులు. వీరు ఇశ్శాఖారీయుల వంశస్థులు.
\v 24 రాసిన వారి లెక్క ప్రకారం వీరు 64,300 మంది పురుషులు.
\p
\v 25 జెబూలూను కొడుకుల వంశస్థుల్లో సెరెదీయులు సెరెదు వంశస్థులు,
\s5
\v 26 ఏలోనీయులు ఏలోను వంశస్థులు, యహలేలీయులు యహలేలు వంశస్థులు.
\v 27 రాసిన వారి లెక్క ప్రకారం వీరు 60,500 మంది పురుషులు.
\p
\s5
\v 28 యోసేపు వంశస్థులు అతని కొడుకులు మనష్షే, ఎఫ్రాయిము.
\v 29 మనష్షే కొడుకుల్లో మాకీరీయులు మాకీరు వంశస్థులు. మాకీరు గిలాదుకు తండ్రి. గిలాదీయులు గిలాదు వంశస్థులు. వీరు గిలాదు కొడుకులు,
\p
\s5
\v 30 ఈజరీయులు ఈజరు వంశస్థులు, హెలకీయులు హెలకు వంశస్థులు,
\v 31 అశ్రీయేలీయులు అశ్రీయేలు వంశస్థులు, షెకెమీయులు షెకెము వంశస్థులు,
\v 32 షెమీదాయీయులు షెమీదా వంశస్థులు, హెపెరీయులు హెపెరు వంశస్థులు.
\p
\s5
\v 33 హెపెరు కొడుకు సెలోపెహాదుకు కూతుళ్ళేగాని కొడుకులు పుట్టలేదు. సెలోపెహాదు కూతుళ్ళ పేర్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా.
\v 34 వీరు మనష్షీయుల వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 52,700 మంది పురుషులు.
\p
\s5
\v 35 ఇవి ఎఫ్రాయిము కొడుకుల వంశాలు - షూతలహీయులు షూతలహు వంశస్థులు, బేకరీయులు బేకరు వంశస్థులు, తహనీయులు తహను వంశస్థులు.
\v 36 షూతలహు వంశస్థుడు ఏరాను. అతని వంశం ఏరాను వంశం.
\v 37 వీరు ఎఫ్రాయిమీయుల వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 32,500 మంది పురుషులు. వీరు యోసేపు కొడుకుల వంశస్థులు.
\p
\s5
\v 38 బెన్యామీను కొడుకుల వంశాల్లో బెలీయులు బెల వంశస్థులు, అష్బేలీయులు అష్బేల వంశస్థులు,
\v 39 అహీరామీయులు అహీరాము వంశస్థులు,
\v 40 షూఫామీయులు షూపఫాము వంశస్థులు. బెల కొడుకులు ఆర్దు, నయమాను. ఆర్దీయులు ఆర్దు వంశస్థులు, నయమానీయులు నయమాను వంశస్థులు.
\v 41 వీరు బెన్యామీనీయుల వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 45,600 మంది పురుషులు.
\p
\s5
\v 42 దాను కొడుకుల వంశాల్లో షూహామీయులు షూహాము వంశస్థులు.
\v 43 రాసిన వారి లెక్క ప్రకారం వీరు 64,400 మంది పురుషులు.
\p
\s5
\v 44 ఆషేరు కొడుకుల వంశాల్లో యిమ్నీయులు యిమ్నా వంశస్థులు, ఇష్వీయులు ఇష్వీ వంశస్థులు, బెరీయులు బెరీయా వంశస్థులు.
\v 45 బెరీయానీయుల్లో హెబెరీయులు హెబెరు వంశస్థులు, మల్కీయేలీయులు మల్కీయేలు వంశస్థులు.
\v 46 ఆషేరు కూతురు పేరు శెరహు.
\v 47 రాసిన వారి లెక్క ప్రకారం వీరు 53,400 మంది పురుషులు.
\p
\s5
\v 48 నఫ్తాలీ కొడుకుల వంశాల్లో యహసయేలీయులు యహసయేలు వంశస్థులు, గూనీయులు గూనీ వంశస్థులు,
\v 49 యేసెరీయులు యేసెరు వంశస్థులు, షిల్లేమీయులు షిల్లేము వంశస్థులు.
\v 50 వీరు నఫ్తాలీయుల వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 45,400 మంది పురుషులు.
\p
\s5
\v 51 ఇశ్రాయేలీయుల్లో లెక్కకు వచ్చినవారు 6,01,730 మంది పురుషులు.
\s5
\v 52 యెహోవా మోషేతో <<వీళ్ళ పేర్ల లెక్క ప్రకారం ఆ దేశాన్ని వీళ్ళకు స్వాస్థ్యంగా పంచిపెట్టాలి.
\v 53 తమ తమ లెక్క ప్రకారం ఆ స్వాస్థ్యం వాళ్లకు ఇవ్వాలి.
\p
\s5
\v 54 ఎక్కువమంది ఉన్న వంశాలకు ఎక్కువ స్వాస్థ్యం, తక్కువమంది ఉన్నవారికి తక్కువ స్వాస్థ్యం ఇవ్వాలి. తమ తమ లెక్కను బట్టి వివిధ గోత్రాలకు స్వాస్థ్యం ఇవ్వాలి.
\v 55 చీటీలు వేసి ఆ భూమిని పంచిపెట్టాలి. వారు తమ తమ పితరుల గోత్రాల జనాభా లెక్క ప్రకారం స్వాస్థ్యం పొందాలి.
\v 56 ఎక్కువ మందికైనా తక్కువ మందికైనా చీటీలు వేసి, ఎవరి స్వాస్థ్యం వారికి పంచిపెట్టాలి.>>
\p
\s5
\v 57 వీరు తమ తమ వంశాల్లో లెక్కకు వచ్చిన లేవీయులు. గెర్షోనీయులు గెర్షోను వంశస్థులు, కహాతీయులు కహాతు వంశస్థులు, మెరారీయులు మెరారి వంశస్థులు.
\v 58 లేవీయుల వంశాలు ఏవంటే, లిబ్నీయుల వంశం, హెబ్రోనీయుల వంశం, మహలీయుల వంశం, మూషీయుల వంశం, కోరహీయుల వంశం.
\v 59 కహాతు అమ్రాము తండ్రి. అమ్రాము భార్య పేరు యోకెబెదు. ఆమె లేవీ కూతురు. ఆమె ఐగుప్తులో లేవీకి పుట్టింది. ఆమె అమ్రామువల్ల అహరోను, మోషే, వీళ్ళ సహోదరి మిర్యాములను కన్నది.
\p
\s5
\v 60 అహరోనుకు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు పుట్టారు.
\v 61 నాదాబు అబీహులు యెహోవా సన్నిధిలో అంగీకారం కాని అగ్ని అర్పణ చేసినప్పుడు చనిపోయారు.
\v 62 వారిల్లో నెల మొదలుకొని పై వయస్సు కలిగి లెక్కకు వచ్చిన వాళ్లందరూ 23,000 మంది పురుషులు. వారు ఇశ్రాయేలీయుల్లో లెక్కకు రాని వారు గనక ఇశ్రాయేలీయుల్లో వాళ్లకు స్వాస్థ్యం దక్కలేదు.
\p
\s5
\v 63 యెరికో ప్రాంతాల్లో యొర్దాను దగ్గరున్న మోయాబు మైదానాల్లో మోషే, యాజకుడైన ఎలియాజరు, ఇశ్రాయేలీయుల జనాభా లెక్కపెట్టినప్పుడు లెక్కకు వచ్చిన వారు వీరు.
\v 64 మోషే అహరోనులు సీనాయి ఎడారిలో ఇశ్రాయేలీయుల జనాభా లెక్కపెట్టినప్పుడు లెక్కకు వచ్చిన వారిలో ఒక్కడైనా వీళ్ళల్లో లేడు.
\p
\s5
\v 65 ఎందుకంటే వారు కచ్చితంగా ఎడారిలో చనిపోతారని యెహోవా వారి గురించి చెప్పాడు. యెపున్నె కొడుకు కాలేబు, నూను కొడుకు యెహోషువ తప్ప వారిల్లో ఒక్కడైనా మిగల్లేదు.
\s5
\c 27
\s సెలోపెహాదు కూతుళ్ళు
\p
\v 1 అప్పుడు యోసేపు కొడుకు మనష్షే వంశస్థుల్లో సెలోపెహాదు కూతుళ్ళు వచ్చారు. సెలోపెహాదు హెసెరుకు కొడుకు, గిలాదుకు మనవడు, మాకీరుకు మునిమనవడు. అతని కూతుళ్ళ పేర్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా.
\p
\s5
\v 2 వారు సన్నిధి గుడారం ద్వారం దగ్గర, మోషే ఎదుట, యాజకుడైన ఎలియాజరు ఎదుట, నాయకుల ఎదుట, సమాజమంతటి ఎదుట నిలిచి <<మా తండ్రి ఎడారిలో చనిపోయాడు.
\v 3 అతడు కోరహు గుంపులో, అంటే యెహోవాకు విరోధంగా కూడినవారి గుంపులో లేడు. తన పాపాన్నిబట్టి, తన సొంత పాపాన్నిబట్టి చనిపోయాడు.
\p
\s5
\v 4 అతనికి కొడుకులు పుట్టలేదు. అతనికి కొడుకులు లేనంత మాత్రాన మా తండ్రి పేరు అతని వంశంలోనుంచి తీసెయ్యాలా? మా తండ్రి సహోదరులతో పాటు మాకు కూడా స్వాస్థ్యం ఇవ్వండి>> అన్నారు.
\v 5 అప్పుడు మోషే వారి కోసం యెహోవా సన్నిధిలో అడిగాడు,
\p
\s5
\v 6 యెహోవా మోషేతో <<సెలోపెహాదు కూతుళ్ళు చెప్పింది నిజమే.
\v 7 కచ్చితంగా వారి తండ్రి సహోదరులతో పాటు వారసత్వం వారి ఆధీనం చేసి, వారి తండ్రి స్వాస్థ్యం వాళ్లకు వచ్చేలా చూడు.
\v 8 ఇంకా నువ్వు ఇశ్రాయేలీయులతో, ఇలా చెప్పు. ఒకడు కొడుకు పుట్టకుండా చనిపోతే మీరు అతని భూస్వాస్థ్యం అతని కూతుళ్ళకు వచ్చేలా చూడాలి.
\p
\s5
\v 9 అతనికి కూతుళ్ళు లేకపోతే అతని అన్నదమ్ములకు అతని స్వాస్థ్యం ఇవ్వాలి.
\v 10 అతనికి అన్నదమ్ములు లేకపోతే అతని భూస్వాస్థ్యం అతని తండ్రి అన్నదమ్ములకు ఇవ్వాలి.
\v 11 అతని తండ్రికి అన్నదమ్ములు లేకపోతే అతని కుటుంబంలో అతని సమీప బంధువుకు అతని స్వాస్థ్యం ఇవ్వాలి. వాడు దాన్ని స్వాధీనం చేసుకుంటాడు. యెహోవా నాకు ఆజ్ఞాపించినట్టు ఇది ఇశ్రాయేలీయులకు విధించిన శాసనం>> అన్నాడు.
\s మోషే తరువాత యెహోషువ నాయకుడు
\p
\s5
\v 12 ఇంకా యెహోవా మోషేతో<<నువ్వు ఈ అబారీము కొండెక్కి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశాన్ని చూడు.
\v 13 నువ్వు దాన్ని చూసిన తరువాత, నీ సహోదరుడు అహరోను చేరినట్టు నువ్వు కూడా నీ సొంతవారితో చేరిపోతావు.
\v 14 ఎందుకంటే, సీను ఎడారిలో సమాజం వాదించినప్పుడు ఆ నీళ్ల దగ్గర వారి కళ్ళ ఎదుట నన్ను ఘనపరచకుండా, నా మీద మీరు తిరగబడ్డారు>> అన్నాడు. ఆ నీళ్లు సీను ఎడారిలో కాదేషులో ఉన్న మెరీబా నీళ్ళు.
\p
\s5
\v 15 అప్పుడు మోషే యెహోవాతో <<యెహోవా, సమస్త మానవుల ఆత్మలకు దేవా, సమాజం కాపరి లేని గొర్రెల్లా ఉండకుండాా ఈ సమాజం మీద యెహోవా ఒకణ్ణి నియమించు గాక.
\v 16 అతడు వారి ముందు వస్తూ, పోతూ,
\v 17 వాళ్లకు నాయకుడుగా ఉండడానికి సమర్థుడుగా ఉండాలి>> అన్నాడు.
\p
\s5
\v 18 అందుకు యెహోవా మోషేతో <<నూను కొడుకు యెహోషువలో నా ఆత్మ నివసిస్తూ ఉంది. నువ్వు అతన్ని తీసుకుని అతని మీద నీ చెయ్యి పెట్టి
\v 19 యాజకుడైన ఎలియాజరు ఎదుట, సమాజమంతటి ఎదుట, అతని నిలబెట్టి, వారి కళ్ళ ఎదుట అతనికి ఆజ్ఞ ఇవ్వు.
\p
\s5
\v 20 ఇశ్రాయేలీయుల సమాజమంతా అతని మాట వినేలా నీ అధికారంలో కొంత అతని మీద పెట్టు.
\v 21 యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలిచినప్పుడు అతడు యెహోవా సన్నిధిలో
\f +
\fr 27:21
\ft యెహోవా నిర్ణయం తెలుసుకోవడానికి యాజకుడు ఉపయోగించే వెలగల రాళ్లు అయి ఉండవచ్చు.
\f* ఊరీము నిర్ణయం ద్వారా అతని కోసం అడగాలి. అతడు, అతనితోపాటు ఇశ్రాయేలీయులందరూ, అంటే, సమాజమంతా ప్రతి పని అతని మాట ప్రకారం చెయ్యాలి>> అన్నాడు.
\p
\s5
\v 22 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు అతడు చేశాడు. అతడు యెహోషువను తీసుకుని యాజకుడైన ఎలియాజరు ఎదుట, సమాజమంతటి ఎదుట అతన్ని నిలబెట్టి,
\v 23 అతని మీద తన చేతులు పెట్టి, యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్టు అతనికి ఆజ్ఞ ఇచ్చాడు.
\s5
\c 28
\s ప్రతి రోజు అర్పణలు
\p
\v 1 యెహోవా మోషేతో మాట్లాడుతూ,
\v 2 <<నువ్వు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి వారితో చెప్పు. నాకు ఇష్టమైన సువాసనగా మీరు దహనబలి అర్పణగా నాకు అర్పించే ఆహారం నియామక కాలంలో నా దగ్గరికి తేవడానికి జాగ్రత్త పడాలి.
\p
\s5
\v 3 ఇంకా నువ్వు వాళ్లకు ఈ విధంగా ఆజ్ఞాపించు. మీరు యెహోవాకు నిత్యం జరిగే దహనబలిగా ప్రతి రోజూ ఏ దోషం లేని ఒక సంవత్సరం వయస్సు ఉన్న రెండు మగ గొర్రెపిల్లలను అర్పించాలి.
\v 4 వాటిలో ఒక గొర్రెపిల్లను ఉదయాన, రెండోదాన్ని సాయంకాలం అర్పించాలి.
\v 5 మెత్తగా దంచిన ఒక కిలో పిండిని ఒక లీటరు నూనెతో కలిపి పదోవంతు నైవేద్యంగా అర్పించాలి.
\p
\s5
\v 6 అది యెహోవాకు ఇష్టమైన సువాసన ఇచ్చే అగ్ని అర్పణగా సీనాయి కొండ మీద నియమించిన నిత్యం జరిగే దహనబలి.
\v 7 ఆ మొదటి గొర్రెపిల్లతో అర్పించాల్సిన పానార్పణ ముప్పావు లీటరు. పవిత్రస్థలంలో యెహోవాకు మద్యం పానార్పణగా పొయ్యాలి.
\v 8 ఉదయ నైవేద్యం, దాని పానార్పణ అర్పించినట్టే యెహోవాకు ఇష్టమైన సువాసన ఇచ్చే అగ్ని అర్పణగా ఆ రెండో గొర్రెపిల్లను సాయంకాలం అర్పించాలి.
\s విశ్రాంతి రోజు అర్పణలు
\p
\s5
\v 9 విశ్రాంతి రోజున ఒక సంవత్సరం వయస్సు ఉండి, ఏ దోషం లేని రెండు గొర్రెపిల్లలను నైవేద్యంగాను, దానితో పాటు పానార్పణ, నూనెతో కలిపిన నాలుగున్నర లీటర్ల పిండిలో రెండు పదోవంతులు అర్పించాలి.
\v 10 నిత్యం జరిగే దహనబలీ, దాని పానార్పణ కాకుండా, ఇది ప్రతి విశ్రాంతి రోజు చెయ్యాల్సిన దహనబలి.
\s ప్రతినెల అర్పణలు
\p
\s5
\v 11 ప్రతినెల మొదటి రోజు యెహోవాకు దహన బలి అర్పించాలి. రెండు లేగదూడలు, ఒక పొట్టేలు, ఏ దోషం లేని ఒక సంవత్సరం వయస్సు ఉన్న ఏడు గొర్రెపిల్లలు అర్పించాలి. వాటిలో ప్రతి లేగ దూడతో
\v 12 నూనెతో కలిపిన నాలుగున్నర లీటర్ల పిండిలో మూడు పదోవంతులు నైవేద్యంగా అర్పించాలి. ఒక్కొక్క పొట్టేలుతో, నూనెతో కలిపిన నాలుగున్నర లీటర్ల పిండిలో రెండు పదోవంతులు నైవేద్యంగా అర్పించాలి. ఒక్కొక్క గొర్రెపిల్లతో నూనెతో కలిపిన నాలుగున్నర లీటర్ల పిండిలో ఒక్క పదో వంతు నైవేద్యంగా అర్పించాలి.
\v 13 అది యెహోవాకు ఇష్టమైన సువాసన ఇచ్చే దహనబలి.
\p
\s5
\v 14 వాటి పానార్పణలు ఒక్కొక్క దున్నపోతుతో ఒక లీటరు ద్రాక్షారసం, పొట్టేలుతో ఒక లీటరు, గొర్రెపిల్లతో ముప్పావు లీటరు ఉండాలి. ఇది సంవత్సరంలో ప్రతినెలా జరగాల్సిన దహనబలి.
\v 15 నిత్యం జరిగే దహనబలీ, దాని పానార్పణ కాకుండా ఒక మేక పిల్లను పాపపరిహారార్థబలిగా యెహోవాకు అర్పించాలి.
\s పస్కాపండగ
\p
\s5
\v 16 మొదటి నెల 14 వ రోజు యెహోవా పస్కాపండగ వస్తుంది.
\v 17 ఆ నెల 15 వ రోజు పండగ జరుగుతుంది. ఏడు రోజులు పొంగని రొట్టెలే తినాలి.
\v 18 మొదటి రోజు పవిత్ర సంఘం సమకూడాలి. ఆ రోజు మీరు జీవనోపాధికి సంబంధించిన పనులేమీ చెయ్యకూడదు.
\p
\s5
\v 19 అయితే, యెహోవాకు దహనబలిగా మీరు రెండు లేగదూడలు, ఒక పొట్టేలు, ఒక సంవత్సరం వయస్సు ఉన్న ఏడు మగ గొర్రెపిల్లలు అర్పించాలి. అవి మీ మందల్లో ఏ దోషం లేనివిగా ఉండాలి.
\v 20 వాటి నైవేద్యం నూనెతో కలిపిన గోదుమపిండి.
\v 21 ఒక్కొక్క దున్నపోతుతో నూనెతో కలిపిన ఆరు లీటర్ల మెత్తని పిండి, పొట్టేలుతో నూనెతో కలిపిన నాలుగు లీటర్ల మెత్తని పిండి, ఆ ఏడు గొర్రెపిల్లల్లో ఒక్కొక్క గొర్రెపిల్లతో నూనెతో కలిపిన రెండు లీటర్ల మెత్తని పిండి అర్పించాలి.
\v 22 మీకు ప్రాయశ్చిత్తం కలగడానికి పాపపరిహారార్థబలిగా ఒక మేకను అర్పించాలి.
\p
\s5
\v 23 ఉదయాన మీరు నిత్యం అర్పించే దహనబలి కాకుండా వీటిని మీరు అర్పించాలి.
\v 24 ఆ విధంగానే, ఆ ఏడు రోజుల్లో ప్రతిరోజూ యెహోవాకు ఇష్టమైన సువాసన ఇచ్చే పదార్థం ఆహారంగా అర్పించాలి. నిత్యం జరిగే దహనబలి, దాని పానార్పణ కాకుండా దాన్ని కూడా అర్పించాలి.
\v 25 ఏడో రోజు పవిత్ర సంఘం సమకూడాలి. ఆ రోజు మీరు జీవనోపాధికి సంబంధించిన పనులేమీ చెయ్యకూడదు.
\s వారాల పండగ
\p
\s5
\v 26 ఇంకా, ప్రథమ ఫలాలు అర్పించే రోజు, అంటే, వారాల పండగరోజు మీరు యెహోవాకు కొత్త పంటలో నైవేద్యం తెచ్చినప్పుడు మీరు పవిత్ర సంఘంగా సమకూడాలి. ఆ రోజు మీరు జీవనోపాధికి సంబంధించిన పనులేమీ చెయ్యకూడదు.
\v 27 యెహోవాకు ఇష్టమైన సువాసన ఇచ్చే దహనబలిగా మీరు రెండు దున్నపోతు దూడలు, ఒక పొట్టేలు, ఒక సంవత్సరం వయస్సు ఉన్న ఏడు మగ గొర్రెపిల్లలను, వాటికి నైవేద్యంగా ప్రతి దున్నపోతు దూడతో
\v 28 నూనెతో కలిపిన ఆరు కిలోల మెత్తని పిండిలో మూడు పదో వంతులు, ప్రతి పొట్టేలుతో రెండు పదో వంతులు,
\p
\s5
\v 29 ఆ ఏడు గొర్రెపిల్లల్లో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదో వంతు,
\v 30 మీ కోసం ప్రాయశ్చిత్తం చెయ్యడానికి ఒక మేకపిల్ల, అర్పించాలి.
\v 31 నిత్యం జరిగే దహనబలి, దాని నైవేద్యం కాకుండా వాటినీ, వాటి పానార్పణను అర్పించాలి. అవి ఏ దోషం లేనివిగా ఉండాలి.>>
\s5
\c 29
\s బూరలూదే పండగ
\p
\v 1 ఏడో నెల మొదటి రోజు మీరు పరిశుద్ధ సమాజంగా సమావేశం కావాలి.
\s5
\v 2 ఆ రోజు మీ జీవనోపాధి కోసం ఏ పనీ చేయకూడదు. అది మీరు బాకానాదం చేసే రోజు.
\s5
\v 3 ఏ లోపం లేని ఒక కోడె, ఒక పొట్టేలు, ఒక సంవత్సరం వయసున్న ఏడు మగ గొర్రె పిల్లలను యెహోవాకు ఇష్టమైన సువాసన గల దహనబలిగా అర్పించాలి.
\v 4 వాటి వాటి పద్ధతి ప్రకారం దహనబలిని, దాని నైవేద్యాన్ని, వాటి పానార్పణలు అర్పించాలి.
\p
\v 5 వాటి నైవేద్యం నూనెతో కలిపిన గోదుమపిండి, ప్రతి కోడెతో ఆరున్నర కిలోలు, పొట్టేలుతో నాలుగున్నర కిలోలు, ఏడు గొర్రె పిల్లలతో ఒక్కొక్క దానికి రెండుంబావు కిలోలు అర్పించాలి.
\s5
\v 6 అలాగే మీ కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి పాపపరిహార బలిగా ఒక మేకపిల్లను అర్పించాలి.
\s ప్రాయశ్చిత్తం (పాపపరిహార బలి)
\p
\s5
\v 7 ఈ ఏడో నెల పదో రోజు మీరు పరిశుద్ధ సమాజంగా సమకూడాలి. అప్పుడు మిమ్మల్ని మీరు
\f +
\fr 29:7
\ft ఉపవాసం.
\f* అదుపులో పెట్టుకోవాలి, ఆహారం తీసుకోకూడదు. పనులేమీ చేయకూడదు.
\p
\v 8 ప్రాయశ్చిత్తం కోసం పాపపరిహార బలి, నిత్యమైన దహనబలి, దాని నైవేద్యం, వాటి వాటి పానార్పణలు కాక, ఒక కోడెదూడ, ఒక పొట్టేలు, ఒక సంవత్సరం వయసున్న ఏడు మగ గొర్రెపిల్లలను యెహోవాకు ఇష్టమైన సువాసనగల దహనబలిగా అర్పించాలి. వాటిలో ఏలోపమూ ఉండకూడదు.
\p
\s5
\v 9 వాటి నైవేద్యం నూనెతో కలిపిన గోదుమపిండి, ప్రతి కోడెతో ఆరున్నర కిలోలు, పొట్టేలుతో నాలుగున్నర కిలోలు,
\v 10 ఏడు గొర్రె పిల్లలతో ఒక్కొక్క దానికి రెండుంబావు కిలోలు అర్పించాలి.
\v 11 అలాగే మీ కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి పాపపరిహార బలిగా ఒక మేకపిల్లను అర్పించాలి.
\s గుడారాల పండగ
\p
\s5
\v 12 ఆ తరవాత ఏడో నెల 15 వ రోజున మీరు పరిశుద్ధ సమాజంగా సమావేశం కావాలి. అప్పుడు మీరు జీవనోపాధి కోసం పనులేమీ చేయకూడదు. ఏడు రోజులు యెహోవాకు పండగ జరపాలి.
\v 13 దహనబలి, దాని నైవేద్యం, దాని పానార్పణ, కాకుండా, యెహోవాకు ఇష్టమైన సువాసనగల దహనబలిగా 13 కోడెలూ రెండు పొట్టేళ్ళు, ఒక సంవత్సరం వయసున్న 14 గొర్రె పిల్లలను అర్పించాలి. వాటిలో ఏ లోపమూ ఉండకూడదు.
\s5
\v 14 నైవేద్యంగా ప్రతి కోడెతో ఆరున్నర కిలోలు, ప్రతి పొట్టేలుతో నాలుగున్నర కిలోలు
\v 15 ప్రతి గొర్రె పిల్లతో రెండుంబావు కిలోలు నూనెతో కలిపిన గోదుమ పిండి తేవాలి.
\v 16 అలాగే పాపపరిహార బలిగా ఒక మేక పిల్లను అర్పించాలి.
\p
\s5
\v 17 రెండో రోజు దహనబలి దాని నైవేద్యం, వాటి పానార్పణలు కాక ఏ లోపం లేని 12 కోడెలను, రెండు పొట్టేళ్ళను, ఒక సంవత్సరం వయసున్న 14 గొర్రెపిల్లలను
\v 18 వాటి వాటి లెక్క ప్రకారం వాటి వాటి నైవేద్యం,
\v 19 పానార్పణలతోబాటు పాపపరిహార బలిగా ఒక మేకపిల్లను అర్పించాలి.
\s5
\v 20 మూడో రోజు నిత్యమైన దహనబలి దాని నైవేద్యం, దాని పానార్పణలు కాక ఏ లోపం లేని 11 కోడెలను, రెండు పొట్టేళ్లను, ఒక సంవత్సరం వయసున్న 14 గొర్రెపిల్లలను
\v 21 వాటి వాటి లెక్క ప్రకారం వాటి నైవేద్యం, పానార్పణలను
\v 22 పాపపరిహార బలిగా ఒక మేకపిల్లను అర్పించాలి.
\p
\s5
\v 23 నాలుగో రోజు నిత్యమైన దహనబలి దాని నైవేద్యం, పానార్పణ కాక ఏ లోపం లేని 10 కోడెలను రెండు పొట్టేళ్లను ఒక సంవత్సరం వయసున్న 14 గొర్రెపిల్లలను వాటి వాటి లెక్క ప్రకారం
\v 24 వాటి నైవేద్యం, పానార్పణలను,
\v 25 పాప పరిహార బలిగా ఒక మేకపిల్లను అర్పించాలి.
\s5
\v 26 అయిదో రోజు నిత్యమైన దహనబలి, దాని నైవేద్యం, పానార్పణ కాక ఏ లోపం లేని తొమ్మిది కోడెలను, రెండు పొట్టేళ్లను ఒక సంవత్సరం వయసున్న 14 గొర్రెపిల్లలను
\v 27 వాటి వాటి లెక్క ప్రకారం, వాటి నైవేద్యం, పానార్పణను,
\v 28 అలాగే పాపపరిహార బలిగా ఒక మేకపిల్లను అర్పించాలి.
\p
\s5
\v 29 ఆరో రోజు నిత్యమైన దహనబలి, దాని నైవేద్యం, పానార్పణ కాక ఏ లోపం లేని ఎనిమిది కోడెలను, రెండు పొట్టేళ్లను ఒక సంవత్సరం వయసున్న 14 గొర్రెపిల్లలను, వాటి వాటి లెక్క ప్రకారం,
\v 30 వాటి నైవేద్యం, పానార్పణను
\v 31 పాపపరిహార బలిగా ఒక మేక పిల్లను అర్పించాలి.
\s5
\v 32 ఏడో రోజు నిత్యమైన దహనబలి, దాని నైవేద్యం, పానార్పణ కాక ఏ లోపం లేని ఏడు కోడెలను, రెండు పొట్టేళ్లను ఒక సంవత్సరం వయసున్న 14 గొర్రె పిల్లలను వాటి వాటి లెక్క ప్రకారం,
\v 33 వాటి వాటి నైవేద్యం, పానార్పణలను,
\v 34 పాపపరిహార బలిగా ఒక మేక పిల్లను అర్పించాలి.
\p
\s5
\v 35 ఎనిమిదో రోజు మీకు ప్రత్యేకమైన రోజు. ఆ రోజు మీరు జీవనోపాధి కోసం ఏ పనీ చేయకూడదు.
\v 36 ఆ రోజు నిత్యమైన దహనబలి, దాని నైవేద్యం, పానార్పణ కాక మీరు యెహోవాకు ఇష్టమైన సువాసనగల దహనబలిగా ఏ లోపం లేని నిర్దోషమైన ఒక కోడెను ఒక పొట్టేలును ఒక సంవత్సరం వయసున్న ఏడు గొర్రెపిల్లలను వాటి వాటి లెక్క ప్రకారం
\s5
\v 37 వాటితో వాటి వాటి నైవేద్యం, పానార్పణను
\v 38 పాపపరిహార బలిగా ఒక మేకపిల్లను అర్పించాలి.
\s5
\v 39 మీ మొక్కుబళ్ళు, మీ స్వేచ్ఛార్పణలు మీ దహనబలులు, మీ నైవేద్యాలు, మీ పానార్పణలు, మీ సమాధాన బలులు కాక వీటిని నియమిత సమయాల్లో యెహోవాకు అర్పించాలి.
\v 40 యెహోవా తనకు ఆజ్ఞాపించిన దాన్నంతా మోషే ఇశ్రాయేలీయులతో పూర్తిగా వివరించాడు.
\s5
\c 30
\s మొక్కుబడి
\p
\v 1 మోషే ఇశ్రాయేలు గోత్రాల నాయకులతో ఇలా అన్నాడు,
\v 2 <<ఇది యెహోవా ఆజ్ఞ. ఒకడు యెహోవాకు మొక్కుకుంటే లేక ప్రమాణం చేసి ఉంటే, అతడు మాట తప్పకూడదు. తన నోటినుండి వచ్చిన దానంతటినీ అతడు నెరవేర్చాలి.
\s5
\v 3 తన తండ్రి ఇంట్లో ఉన్న ఒక స్త్రీ యెహోవాకు చేసిన మొక్కుబడి గురించి ఆమె తండ్రి ఎరిగి, ఏమీ మాట్లాడకపోతే ఆమె మొక్కుబడి నిలిచి ఉంటుంది.
\v 4 ఆమె ప్రమాణాలు అన్నీ నిలిచి ఉంటాయి.
\s5
\v 5 అయితే ఆమె చేసిన ప్రమాణాలను ఆమె తండ్రి విని వాటి విషయంలో ఆక్షేపణ తెలిపి ఉంటే, ఆమె మొక్కుబడులు, ప్రమాణాలు, ఏవీ నిలబడవు.
\s5
\v 6 ఆమె తండ్రి దానికి ఆక్షేపణ తెలిపాడు కాబట్టి యెహోవా ఆమెను క్షమిస్తాడు.
\p
\v 7 ఆమె వివాహిత అయితే, ఆమె మొక్కుబడులు, తొందరపాటులో చేసిన ప్రమాణాలు ఆమె భర్త ఎరిగి ఏమీ మాట్లాడకపోతే, ఆమె మొక్కుబడులు, ప్రమాణాలు ఆమెపై నిలిచి ఉంటాయి.
\s5
\v 8 అయితే ఆమె మొక్కుబడులు, తొందరపాటులో చేసిన ప్రమాణాలు ఆమె భర్త విని వాటి విషయంలో ఆక్షేపణ తెలిపి ఉంటే, అతడు ఆమె మొక్కుబడులను, తొందరపాటుగా చేసిన ప్రమాణాలను రద్దు చేసిన వాడవుతాడు. యెహోవా ఆమెను క్షమిస్తాడు.
\p
\s5
\v 9 వితంతువు గాని విడాకులు ఇచ్చిన స్త్రీ గాని చేసిన మొక్కుబడులు అన్నీ ఆమె మీద నిలిచి ఉంటాయి.
\v 10 ఆమె తన భర్త ఇంట్లో ఉన్నప్పుడు మొక్కుబడులు, ప్రమాణాలు చేసి ఉంటే,
\v 11 వాటిని గురించి ఆమె భర్త విని ఏ ఆక్షేపణా చేయకుండా ఉంటే, ఆమె మొక్కుబడులు, ప్రమాణాలు, అన్నీ నిలిచి ఉంటాయి.
\s5
\v 12 ఆమె భర్త వాటి గురించి విన్న రోజునే వాటిని పూర్తిగా రద్దు చేసి ఉంటే, ఆమె మొక్కుబడులు, ప్రమాణాలు గురించిన ఆమె మాటలు ఏవీ నిలబడవు. ఆమె భర్త వాటిని రద్దుచేశాడు కాబట్టి యెహోవా ఆమెను క్షమిస్తాడు.
\s5
\v 13 ఒక స్త్రీ చేసిన ప్రతి మొక్కుబడిని, ప్రమాణపూర్వకంగా తన మీద మోపుకొన్న ప్రతి బాధ్యతను ఆమె భర్త స్థిరపరచవచ్చు, రద్దు చేయవచ్చు.
\v 14 అలా కాక ఆమె భర్త ఎప్పటికప్పుడు దాని విషయం మౌనంగా ఉంటూ వస్తే, అతడు ఆమె చేసిన మొక్కుబడులనూ ప్రమాణాలనూ స్థిరపరచిన వాడవుతాడు. అతడు వాటిని విన్న రోజు మౌనంగా ఉండడం ద్వారా వాటిని స్థిరపరిచాడు.
\s5
\v 15 అతడు వాటిని గురించి విన్న చాలా కాలం తరువాత వాటిని రద్దుచేస్తే, అతడు ఆమె దోషశిక్షను తానే భరిస్తాడు.>>
\v 16 ఇవి భర్తను గూర్చీ భార్యను గూర్చీ, తండ్రిని గూర్చీ బాల్యంలో తన తండ్రి ఇంట్లో ఉన్న కుమార్తెను గూర్చీ యెహోవా మోషేకిచ్చిన ఆజ్ఞలు.
\s5
\c 31
\s మిద్యానీయులు మీద ప్రతీకారం
\p
\v 1 యెహోవా <<మిద్యానీయులు ఇశ్రాయేలీయులకు చేసిన దానికి ప్రతీకారం తీర్చుకోండి.
\v 2 ఆ తరవాత నీవు చనిపోయి నీ పూర్వీకుల దగ్గరికి చేరుకుంటావు>> అని మోషేకు చెప్పాడు.
\s5
\v 3 అప్పుడు మోషే <<మీలో కొందరు యుద్ధానికి సిద్ధపడి మిద్యానీయుల మీదికి పోయి వారికి యెహోవా విధించిన ప్రతిదండన చేయండి.
\v 4 ఇశ్రాయేలీయుల ప్రతి గోత్రం నుండి వెయ్యిమంది చొప్పున యుద్ధానికి పంపండి>> అని ప్రజలతో అన్నాడు.
\v 5 ఆ విధంగా గోత్రానికి వెయ్యి మంది చొప్పున, ఇశ్రాయేలీయుల మొత్తం సైన్యంలో నుండి పన్నెండు వేల మంది యుద్ధ వీరులను సిద్ధం చేశారు.
\s5
\v 6 మోషే వారిని, యాజకుడైన ఎలియాజరు కుమారుడు ఫీనెహాసుతో పంపించాడు. అతనికి పరిశుద్ధమైన కొన్ని వస్తువులు, యుద్ధంలో ఊదటానికి బాకాలు పంపాడు.
\p
\v 7 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే ఇశ్రాయేలీయులు మిద్యానీయులతో యుద్ధం చేసి మగవారందరినీ చంపేశారు.
\v 8 వారు కాక మిద్యాను రాజులు, ఎవీ, రేకెము, సూరు, హూరు, రేబ అనే ఐదుగుర్ని చంపారు. బెయోరు కొడుకు బిలామును కత్తితో చంపేశారు.
\s5
\v 9 వారు మిద్యాను స్త్రీలను, వారి చిన్నపిల్లలను చెరపట్టుకుని, వారి పశువులు, గొర్రెలు, మేకలు అన్నిటిని, వారి సమస్తాన్ని దోచుకున్నారు.
\v 10 వారి పట్టణాలు, కోటలు అన్నిటిని తగలబెట్టారు.
\s5
\v 11 వారు మనుషులను గాని పశువులను గాని మిద్యానీయుల ఆస్తి అంతటినీ కొల్లగొట్టారు.
\v 12 తరువాత వారు దానంతటినీ, చెరపట్టిన వారిని మోయాబు మైదానాల్లో యెరికో దగ్గర యొర్దాను పక్కన విడిది చేసి ఉన్న మోషే, యాజకుడు ఎలియాజరు దగ్గరికి, ఇశ్రాయేలీయుల సమాజం దగ్గరికి తీసుకు వచ్చారు.
\s5
\v 13 అప్పుడు మోషే, యాజకుడు ఎలియాజరు, సమాజ నాయకులంతా విడిది బయటికి వారికి ఎదురు వెళ్ళారు.
\p
\v 14 అప్పుడు మోషే యుద్ధం నుండి వచ్చిన సహస్రాధిపతులు, శతాధిపతుల పైన కోపపడ్డాడు.
\v 15 అతడు వారితో <<మీరు మిద్యాను స్త్రీలను ఎందుకు బతకనిచ్చారు?
\s5
\v 16 బిలాము సలహా ప్రకారం పెయోరు విషయంలో ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు ఎదురు తిరిగేలా చేసింది వారే కదా! అందుచేత యెహోవా మన సమాజంలో తెగులు పుట్టించాడు కదా.
\v 17 కాబట్టి మీరు మగ పిల్లలందరినీ మగవారితో సంబంధం ఉన్న ప్రతి స్త్రీనీ చంపండి.
\s5
\v 18 మగవారితో సంబంధం లేని ప్రతి ఆడపిల్లను మీ కోసం బతకనీయండి.
\v 19 మీరు ఏడు రోజులు విడిది బయట ఉండాలి. మీలో మనిషిని చంపిన ప్రతివాడూ, చనిపోయిన వారిని తాకిన ప్రతివాడూ, మీరు, మీరు చెరగా పట్టుకొచ్చిన వారు, మూడో రోజున, ఏడో రోజున మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవాలి.
\v 20 మీరు మీ వస్త్రాలను, చర్మంతో, మేక వెండ్రుకలతో చేసిన వస్తువులను, చెక్కతో చేసిన వస్తువులను అన్నిటినీ శుద్ధి చేయాలి.>>
\p
\s5
\v 21 అప్పుడు యాజకుడు ఎలియాజరు యుద్ధానికి వెళ్ళిన సైనికులతో <<యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు,
\v 22 <అగ్నితో చెడిపోని బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, తగరం, సీసం, వీటితో చేసిన వస్తువులన్నిటినీ
\v 23 మంటల్లో వేసి తీయడం ద్వారా శుద్ధి చేయాలి. వాటిని పాపపరిహార జలంతో కూడా శుద్ధి చేయాలి. అగ్నితో చెడిపోయే ప్రతి వస్తువును నీళ్లలో వేసి తీయాలి.
\v 24 ఏడో రోజు మీరు మీ బట్టలు ఉతుక్కొని శుద్ధి అయిన తరవాత విడిదిలోకి రావచ్చు.> >> అన్నాడు.
\s చెరగా పట్టుకున్నవి రెండు భాగాలు
\p
\s5
\v 25 యెహోవా మోషేకు ఇంకా ఇలా ఆజ్ఞాపించాడు,
\v 26 <<నువ్వూ యాజకుడు ఎలియాజరు సమాజంలోని పూర్వీకుల వంశాల నాయకులు మీరు చెరగా పట్టుకున్న మనుషులను, పశువులను లెక్కబెట్టి రెండు భాగాలు చేయండి.
\v 27 సైన్యంగా యుద్ధానికి వెళ్ళిన వారికి సగం, మిగిలిన సర్వసమాజానికి సగం పంచిపెట్టండి.
\s5
\v 28 యుద్ధానికి వెళ్ళిన సైనికులపై యెహోవా కోసం పన్ను వేసి, ఆ మనుషుల్లో, పశువుల్లో, గాడిదల్లో, గొర్రె మేకల్లో ఐదు వందలకు ఒకటి చొప్పున వారి సగభాగంలో నుండి తీసుకుని
\v 29 యెహోవాకు అర్పణగా యాజకుడు ఎలియాజరుకు ఇవ్వాలి.
\s5
\v 30 అదే విధంగా మిగిలిన ఇశ్రాయేలీయుల సగంలో నుండి మనుషుల్లో, పశువుల్లో, గాడిదల్లో, గొర్రె మేకల్లో, అన్ని రకాల జంతువుల్లోనుండి 50 కి ఒకటి చొప్పున తీసుకుని యెహోవా మందిరాన్ని కాపాడే లేవీయులకు ఇవ్వాలి.>>
\v 31 యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధంగా మోషే, యాజకుడు ఎలియాజరు చేశారు.
\p
\s5
\v 32 ఆ సైనికులు దోచుకున్నది గాక మిగిలింది
\v 33 6,75,000 గొర్రెలు లేక మేకలు,
\v 34 72,000 పశువులు, 61,000 గాడిదలు,
\v 35 32,000 మంది మగవారితో సంబంధం లేని స్త్రీలు ఉన్నారు.
\s5
\v 36 అందులో సగం యుద్ధానికి వెళ్ళిన వారి వంతు, గొర్రె మేకలు 3,37,500. వాటిలో యెహోవాకు చెందిన పన్ను 675. పశువుల్లో సగం 36,000.
\v 37 వాటిలో యెహోవా పన్ను 72.
\v 38 గాడిదల్లో సగం 30,500.
\s5
\v 39 వాటిలో యెహోవా పన్ను 61.
\v 40 మనుషుల్లో సగం 16,000 మంది. వారిలో యెహోవా పన్ను 32 మంది.
\v 41 యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధంగా అతడు యెహోవాకు చెందాల్సిన అర్పణను యాజకుడు ఎలియాజరుకు ఇచ్చాడు.
\p
\s5
\v 42 మోషే సైనికుల నుండి తీసుకుని ఇశ్రాయేలీయులకు ఇచ్చిన సగంలో నుండి లేవీయులకు ఇచ్చాడు.
\v 43 3,37,500 గొర్రె మేకలు,
\v 44 36,000 పశువులు, 30,500 గాడిదలు,
\v 45 16,000 మంది మనుషులు సమాజానికి రావలసిన సగం.
\v 46 మోషే ఆ సగం నుండి మనుషుల్లో, జంతువుల్లో,
\s5
\v 47 50 కి ఒకటి చొప్పున తీసి, యెహోవా తనకు ఆజ్ఞాపించిన విధంగా యెహోవా మందిరాన్ని కాపాడే లేవీయులకు ఇచ్చాడు.
\p
\s5
\v 48 అప్పుడు సైన్యంలో వేలమందికి, వందల మందికి అధిపతులు మోషే దగ్గరికి వచ్చి
\v 49 <<నీ సేవకులైన మేము మా కింద ఉన్న సైనికులందరినీ లెక్కపెట్టాం. మొత్తానికి ఒక్కడు కూడా తగ్గలేదు.
\s5
\v 50 కాబట్టి యెహోవా సన్నిధిలో మా కోసం ప్రాయశ్చిత్తం కలిగేలా మాలో ప్రతి ఒక్కడికి దొరికిన బంగారు నగలు, గొలుసులు, కడియాలు, ఉంగరాలు, పోగులు, పతకాలు యెహోవాకు అర్పణ తెచ్చాం>> అని చెప్పారు.
\v 51 మోషే, యాజకుడు ఎలియాజరు ఆ బంగారు నగలను వారి నుండి తీసుకున్నారు.
\s5
\v 52 వేలమందికి, వందల మందికి అధిపతులైన నాయకులు యెహోవాకు అర్పించిన బంగారం మొత్తం 16,750 తులాలు.
\v 53 ఆ సైనికుల్లో ప్రతివాడూ తన మట్టుకు తాను దోపుడు సొమ్ము తెచ్చుకున్నాడు.
\v 54 అప్పుడు మోషే, యాజకుడు ఎలియాజరు వేలమందికి, వందల మందికి అధిపతుల దగ్గర తీసుకున్న బంగారాన్ని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థంగా ప్రత్యక్ష గుడారంలో ఉంచారు.
\s5
\c 32
\s యొర్దాను నది తూర్పు ప్రాంతం
\p
\v 1 రూబేనీయులకు, గాదీయులకు, పశువులు అతి విస్తారంగా ఉండడం వలన యాజెరు, గిలాదు ప్రాంతాలు మందలకు తగిన స్థలమని వారు గ్రహించారు.
\v 2 వారు మోషేతో, యాజకుడు ఎలియాజరుతో సమాజ నాయకులతో
\v 3 <<అతారోతు, దీబోను, యాజెరు, నిమ్రా, హెష్బోను, ఏలాలే, షెబాము, నెబో, బెయోను అనే ప్రాంతాలు,
\s5
\v 4 అంటే ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట యెహోవా జయించిన దేశం పశువుల మందలకు అనువైంది. మీ సేవకులైన మాకు మందలు ఉన్నాయి.
\v 5 కాబట్టి మా మీద మీకు దయ కలిగితే, మమ్మల్ని యొర్దాను నది దాటించవద్దు. మాకు ఈ దేశాన్ని వారసత్వంగా ఇవ్వండి>> అన్నారు.
\p
\s5
\v 6 అప్పుడు మోషే గాదీయులకు, రూబేనీయులకు ఇలా జవాబిచ్చాడు. <<మీ సోదరులు యుద్ధాలు చేస్తూ ఉంటే మీరు ఇక్కడే ఉండిపోవచ్చా?
\v 7 యెహోవా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన దేశానికి వెళ్ళకుండా మీరు వారి హృదయాలను ఎందుకు నిరుత్సాహ పరుస్తున్నారు?
\s5
\v 8 ఆ దేశాన్ని చూసి రావడానికి కాదేషు బర్నేయలో నేను మీ తండ్రులను పంపినప్పుడు వారు కూడా ఇలాగే చేశారు కదా.
\v 9 వారు ఎష్కోలు లోయలోకి వెళ్లి ఆ దేశాన్ని చూసి ఇశ్రాయేలు ప్రజలను అధైర్యపరిచారు కాబట్టి యెహోవా తమకిచ్చిన దేశంలో ప్రవేశించలేకపోయారు.
\p
\s5
\v 10 ఆ రోజు యెహోవా కోపం తెచ్చుకున్నాడు.
\v 11 ఇరవై సంవత్సరాలకు మించి, ఐగుప్తుదేశం నుండి వచ్చిన మనుషుల్లో యెహోవాను పూర్ణ మనస్సుతో అనుసరించిన కెనెజీయుడు, యెఫున్నె కొడుకు కాలేబు, నూను కొడుకు యెహోషువ తప్ప
\v 12 మరి ఎవ్వడూ పూర్ణమనస్సుతో నన్ను అనుసరించలేదు కాబట్టి నేను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ఇస్తానని ప్రమాణం చేసిన దేశాన్ని మరి ఎవరూ చూడనే చూడరు, అని శపథం చేశాడు.
\s5
\v 13 అప్పుడు ఇశ్రాయేలు ప్రజల మీద యెహోవా కోపం రగులుకోవడం వల్ల ఆయన దృష్ఠికి చెడుతనం చూపిన ఆ తరం వారంతా నాశనం అయ్యే వరకూ వారిని అరణ్యంలో తిరిగేలా చేశాడు.
\p
\v 14 ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల మీద యెహోవాకు మరింత కోపం పుట్టించేలా ఆ పాపుల పిల్లలైన మీరు వారి స్థానంలో బయలుదేరారు.
\v 15 మీరు ఆయన్ని అనుసరించకుండా వెనక్కి తగ్గిపోతే ఆయన ఈ ప్రజలందరినీ ఈ అడవిలోనే నిలిపివేస్తాడు. ఆ విధంగా మీరు ఈ ప్రజలందరి నాశనానికి కారకులౌతారు.>>
\s5
\v 16 అందుకు వారు అతనితో <<మేము ఇక్కడ మా పశువుల కోసం దొడ్లూ, మా పిల్లల కోసం ఊరులూ కట్టుకుంటాం.
\v 17 ఇశ్రాయేలు ప్రజలను వారివారి స్థలాలకు చేర్చే వరకూ మేము యుద్ధానికి సిద్ధపడి వారి ముందు సాగిపోతాం. అయితే మా పిల్లలు ఈ ప్రాంత ప్రజల భయం వలన ప్రాకారాలున్న ఊర్లలో నివసించాలి.
\s5
\v 18 ఇశ్రాయేలీయుల్లో ప్రతివాడూ తన తన వారసత్వాన్ని పొందేవరకూ మా ఇళ్ళకు తిరిగి రాము.
\v 19 తూర్పున యొర్దాను ఇవతల మాకు వారసత్వం దొరికింది కాబట్టి ఇక యొర్దాను అవతల వారితో వారసత్వం అడగం>> అన్నారు.
\p
\s5
\v 20 అప్పుడు మోషే వారితో <<మీరు మీ మాట మీద నిలబడి యెహోవా సన్నిధిలో యుద్ధానికి సిద్ధపడి యెహోవా తన ఎదుటనుండి తన శత్రువులను వెళ్లగొట్టే వరకూ
\v 21 యెహోవా సన్నిధిలో మీరంతా యొర్దాను అవతలికి వెళ్ళి
\v 22 ఆ దేశాన్ని జయించిన తరవాత మీరు తిరిగి రావచ్చు. మీరు యెహోవా దృష్టికీ ఇశ్రాయేలీయుల దృష్టికీ నిర్దోషులుగా ఉంటారు. అప్పుడు ఈ దేశం యెహోవా సన్నిధిలో మీకు వారసత్వం అవుతుంది.
\s5
\v 23 మీరు అలా చేయకపోతే యెహోవా దృష్టికి పాపం చేసిన వారవుతారు కాబట్టి మీ పాపం మిమ్మల్ని పట్టుకొంటుందని తెలుసుకోండి.
\v 24 మీరు మీ పిల్లల కోసం ఊర్లను, మీ పశువుల కోసం దొడ్లను కట్టుకుని మీరు చెప్పిన ప్రకారం చేయండి అన్నాడు.>>
\p
\v 25 అందుకు గాదీయులు, రూబేనీయులు మోషేతో <<మా యజమానివి నువ్వు ఆజ్ఞాపించినట్టు నీ సేవకులైన మేము చేస్తాం.
\s5
\v 26 మా పిల్లలు, భార్యలు, మా ఆవుల మందలు గిలాదు ఊళ్ళలో ఉంటారు.
\v 27 నీ సేవకులైన మేము, అంటే మా సైన్యంలో ప్రతి యోధుడు మా యజమానివి నువ్వు చెప్పినట్టు యెహోవా సన్నిధిలో యుద్ధం చేయడానికి యొర్దాను అవతలికి వస్తాము>> అన్నారు.
\p
\s5
\v 28 కాబట్టి మోషే వారిని గురించి యాజకుడైన ఎలియాజరుకు, నూను కుమారుడు యెహోషువకు, ఇశ్రాయేలు గోత్రాల్లో పూర్వీకుల వంశాల నాయకులకు ఇలా ఆజ్ఞాపించాడు,
\v 29 <<గాదీయులు, రూబేనీయులు అందరూ యెహోవా సన్నిధిలో యుద్ధానికి సిద్దపడి మీతో కూడా యొర్దాను అవతలికి వస్తే, ఆ దేశాన్ని మీరు జయించిన తరవాత మీరు గిలాదు దేశాన్ని వారికి వారసత్వంగా ఇవ్వాలి.
\v 30 కాని వారు యుద్ధానికి సిద్ధపడి మీతో కలిసి అవతలకి రాకపోతే వారు కనాను దేశంలో మీ మధ్యనే వారసత్వం పొందుతారు>>
\s5
\v 31 దానికి గాదీయులు, రూబేనీయులు <<యెహోవా నీ సేవకులైన మాతో చెప్పినట్టే చేస్తాం.
\v 32 మేము యెహోవా సన్నిధిలో యుద్ధానికి సిద్ధపడి నది దాటి కనాను దేశంలోకి వెళ్తాం. అప్పుడు యొర్దాను ఇవతల మేము వారసత్వం పొందుతాం>> అని జవాబిచ్చారు.
\p
\s5
\v 33 అప్పుడు మోషే వారికి, అంటే గాదీయులకు, రూబేనీయులకు, యోసేపు కుమారుడు మనష్షే అర్థగోత్రం వారికి, అమోరీయుల రాజైన సీహోను రాజ్యాన్ని, బాషాను రాజైన ఓగు రాజ్యాన్ని, వాటి ఊళ్ళన్నిటినీ ఆ దేశాల చుట్టూ ఉన్న గ్రామాలనూ ఇచ్చాడు.
\p
\s5
\v 34 గాదీయులు దీబోను, అతారోతు, అరోయేరు, అత్రోతు, షోపాను,
\v 35 యాజెరు, యొగ్బెహ, బేత్నిమ్రా, బేత్హారాను
\v 36 అనే ఊళ్ళలో ప్రాకారాలు, పశువుల దొడ్లు కట్టుకున్నారు.
\p
\s5
\v 37 రూబేనీయులు హెష్బోను, ఏలాలే, కిర్యతాయిము, నెబో, బయల్మెయోను,
\v 38 షిబ్మా అనే ఊళ్లు కట్టి, వాటికి కొత్త పేర్లు పెట్టారు.
\p
\v 39 మనష్షే సంతానం అయిన మాకీరీయులు గిలాదుపై దండెత్తి దాన్ని ఆక్రమించి దానిలోని అమోరీయులను వెళ్లగొట్టారు.
\s5
\v 40 మోషే మనష్షే కొడుకు మాకీరుకు గిలాదును ఇచ్చాడు.
\v 41 అతని సంతానం అక్కడ నివసించింది. మనష్షే కొడుకు యాయీరు వెళ్లి అక్కడి గ్రామాలను ఆక్రమించి వాటికి
\f +
\fr 32:41
\ft హవ్వోతు యాయిరు.
\f* యాయీరు గ్రామాలు అని పేరు పెట్టాడు.
\v 42 నోబహు వెళ్లి కెనాతును దాని గ్రామాలను ఆక్రమించి దానికి నోబహు అని తన పేరు పెట్టాడు.
\s5
\c 33
\s ఐగుప్తుదేశం నుండి మోయాబు వరకు ఇశ్రాయేలీయులు చేసిన ప్రయాణాలు
\p
\v 1 మోషే అహరోనుల నాయకత్వంలో తమ తమ సేనల ప్రకారం ఐగుప్తుదేశం నుండి ఇశ్రాయేలీయులు చేసిన ప్రయాణాలు.
\v 2 యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం, మోషే వారు ప్రయాణించిన మార్గాల వివరాలను రాశాడు. ఇవి వారి ప్రయాణ మార్గాల వివరాలు.
\s5
\v 3 మొదటి నెల 15 వ రోజున వారు రామెసేసు నుండి పస్కా పండగ మరునాడు ఇశ్రాయేలీయులు జయోత్సాహంతో బయలుదేరారు. అప్పుడు ఐగుప్తీయులు తమ మధ్య యెహోవా హతం చేసిన మొదటి సంతానాలను పాతిపెట్టుకుంటూ వారిని చూస్తూ ఉన్నారు.
\v 4 ఆ విధంగా ఐగుప్తీయుల దేవుళ్ళకు యెహోవా తీర్పు తీర్చాడు.
\p
\s5
\v 5 ఇశ్రాయేలీయులు రామెసేసు నుండి సుక్కోతుకు వచ్చారు.
\v 6 సుక్కోతు నుండి అడవి చివరిలో ఉన్న ఏతాముకు వచ్చారు.
\v 7 ఏతాము నుండి బయల్సెఫోను ఎదుట ఉన్న పీహహీరోతు వైపు తిరిగి మిగ్దోలు దగ్గర ఆగారు.
\s5
\v 8 పీహహీరోతు నుండి సముద్రం మధ్య నుండి అరణ్యంలోకి వెళ్ళి ఏతాము అరణ్యంలో మూడు రోజుల ప్రయాణం చేసి మారాకు వచ్చారు. మారా నుండి ఏలీముకు వచ్చారు.
\v 9 ఏలీములో 12 నీటిబుగ్గలు, 70 ఈతచెట్లు ఉన్నాయి. వారక్కడ ఆగారు.
\v 10 ఏలీము నుండి వారు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు.
\s5
\v 11 అక్కడినుండి సీను అరణ్యంలో ఆగారు.
\v 12 సీను అరణ్యం నుండి దోపకాకు వచ్చారు.
\v 13 దోపకా నుండి ఆలూషుకు వచ్చారు.
\v 14 ఆలూషు నుండి రెఫీదీముకు వచ్చారు. అక్కడ వారికి తాగడానికి నీళ్లు లేవు.
\p
\s5
\v 15 రెఫీదీము నుండి సీనాయి అరణ్యంలో ఆగారు.
\v 16 అక్కడి నుండి కిబ్రోతు హత్తావాకు వచ్చారు.
\v 17 కిబ్రోతు హత్తావా నుండి హజేరోతు వచ్చారు.
\v 18 హజేరోతు నుండి రిత్మా వచ్చారు.
\s5
\v 19 రిత్మా నుండి రిమ్మోను పారెసుకు వచ్చారు.
\v 20 రిమ్మోను పారెసు నుండి లిబ్నాకు వచ్చారు.
\v 21 లిబ్నాలో నుండి రీసాకు వచ్చారు.
\v 22 రీసా నుండి కెహేలాతాకు వచ్చారు.
\s5
\v 23 కెహేలాతా నుండి బయలుదేరి షాపెరు కొండ దగ్గర ఆగారు.
\v 24 షాపెరు కొండ దగ్గర నుండి హరాదాకు వచ్చారు.
\v 25 హరాదా నుండి మకెలోతుకు వచ్చారు.
\v 26 మకెలోతు నుండి తాహతుకు వచ్చారు.
\s5
\v 27 తాహతు నుండి తారహుకు వచ్చారు.
\v 28 తారహు నుండి మిత్కాకు వచ్చారు.
\v 29 మిత్కా నుండి హష్మోనాకు వచ్చారు.
\v 30 హష్మోనా నుండి మొసేరోతుకు వచ్చారు.
\s5
\v 31 మొసేరోతు నుండి బెనేయాకానుకు వచ్చారు.
\v 32 బెనేయాకాను నుండి హోర్‌హగ్గిద్గాదుకు వచ్చారు.
\v 33 హోర్‌హగ్గిద్గాదు నుండి యొత్బాతాకు వచ్చారు.
\v 34 యొత్బాతా నుండి ఎబ్రోనాకు వచ్చారు.
\s5
\v 35 ఎబ్రోనా నుండి ఎసోన్గెబెరుకు వచ్చారు.
\v 36 ఎసోన్గెబెరు నుండి కాదేషు అని పిలిచే సీను అరణ్యానికి వచ్చారు.
\v 37 కాదేషు నుండి ఎదోము దేశం అంచులో ఉన్న హోరు కొండ దగ్గర ఆగారు.
\p
\s5
\v 38 యెహోవా ఆజ్ఞ ప్రకారం యాజకుడు అహరోను హోరు కొండ ఎక్కి అక్కడ చనిపోయాడు. అది ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి వచ్చిన 40 వ సంవత్సరం అయిదో నెల మొదటి రోజు.
\v 39 అహరోను 123 సంవత్సరాల వయసులో హోరు కొండమీద చనిపోయాడు.
\s5
\v 40 అప్పుడు కనాను దేశపు దక్షిణాన నివసించే అరాదు రాజైన కనానీయుడు ఇశ్రాయేలీయులు వచ్చిన సంగతి విన్నాడు.
\p
\s5
\v 41 వారు హోరు కొండ నుండి సల్మానాకు వచ్చారు.
\v 42 సల్మానాలో నుండి పూనోనుకు వచ్చారు.
\v 43 పూనోనులో నుండి ఓబోతుకు వచ్చారు.
\s5
\v 44 ఓబోతు నుండి మోయాబు పొలిమేర దగ్గర ఉన్న ఈయ్యె అబారీముకు వచ్చారు.
\v 45 ఈయ్యె అబారీము నుండి దీబోను గాదుకు వచ్చారు.
\v 46 దీబోను గాదు నుండి అల్మోను దిబ్లాతాయిముకు వచ్చారు.
\s5
\v 47 అల్మోను దిబ్లాతాయిము నుండి నెబో ఎదురుగా ఉన్న అబారీము కొండలకు వచ్చారు.
\v 48 అబారీము కొండల నుండి యెరికో దగ్గర యొర్దానుకు దగ్గరగా ఉన్న మోయాబు మైదానాలకు వచ్చారు.
\v 49 వారు మోయాబు మైదానాల్లో బెత్యేషీమోతు మొదలు ఆబేలు షిత్తీము వరకూ యొర్దాను దగ్గర విడిది చేశారు.
\p
\s5
\v 50 యెరికో దగ్గర, అంటే యొర్దానుకు పక్కనే ఉన్న మోయాబు మైదానాల్లో యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు,
\v 51 <<నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పు, <మీరు యొర్దానును దాటి కనాను దేశాన్ని చేరిన తరువాత
\v 52 ఆ దేశ ప్రజలందరినీ మీ ఎదుట నుండి వెళ్లగొట్టి, వారి ప్రతిమలన్నిటినీ ధ్వంసం చేసి వారి పోత విగ్రహాలన్నిటిని పగలగొట్టి వారి ఉన్నత ప్రదేశాల్లో ఉన్న వారి పూజా స్థలాలను పాడుచేయాలి.
\s5
\v 53 ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుని దానిలో నివసించాలి. ఎందుకంటే ఆ దేశాన్ని మీకు వారసత్వంగా నేను మీ స్వాధీనం చేశాను.
\m
\v 54 మీరు మీ వంశాల ప్రకారం చీట్లు వేసి ఆ దేశాన్ని వారసత్వంగా పంచుకోవాలి. ఎక్కువ మందికి ఎక్కువ, తక్కువ మందికి తక్కువ వారసత్వం ఇవ్వాలి. చీటీ ప్రకారం ఎవరికి ఏ స్థలం వస్తుందో ఆ స్థలమే అతడు తీసుకోవాలి. మీ తండ్రుల గోత్రాల ప్రకారం మీరు వారసత్వం పొందాలి.
\s5
\v 55 అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ ప్రజలను వెళ్లగొట్టకపోతే, మీరు ఎవరిని ఉండనిచ్చారో వారు మీ కళ్ళలో ముళ్ళుగా, మీ పక్కలో శూలాలుగా ఉండి, మీరు నివసించే ఆ దేశంలో వారు మిమ్మల్ని బాధలకు గురిచేస్తారు.
\v 56 అంతేగాక నేను వారికి ఏం చేయాలనుకున్నానో దానినే మీకు కూడా చేస్తాను.> >>
\s5
\c 34
\s కనాను దేశంలో ఇశ్రాయేలీయుల సరిహద్దులు
\p
\v 1 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. <<నువ్వు ఇశ్రాయేలీయులతో చెప్పు,
\v 2 <కనాను దేశంలో, అంటే ఏ దేశాన్ని మీరు చీట్లు వేసి వారసత్వంగా పంచుకోబోతున్నారో ఆ దేశంలో మీరు ప్రవేశిస్తున్నారు.
\v 3 మీ దక్షిణపు సరిహద్దు సీను అరణ్యం మొదలు ఎదోము సరిహద్దు వరకూ, అంటే, ఉప్పు సముద్రం తూర్పు తీరం వరకూ ఉంటుంది.
\s5
\v 4 మీ సరిహద్దు దక్షిణం మొదలు అక్రబ్బీము కనుమ దగ్గర తిరిగి సీను వరకూ వ్యాపిస్తుంది. అది దక్షిణం నుండి కాదేషు బర్నేయ వరకూ వ్యాపించి, అక్కడ నుండి హసరద్దారు వరకూ పోయి, అక్కడ నుండి అస్మోను వరకూ కొనసాగుతుంది.
\v 5 అస్మోను నుండి ఐగుప్తు నది వరకూ సరిహద్దు తిరిగి సముద్రం వరకూ వ్యాపిస్తుంది.
\p
\s5
\v 6 మీకు పడమటి సరిహద్దుగా మహాసముద్రం ఉంటుంది.
\s5
\v 7 మీ ఉత్తరపు సరిహద్దును మహాసముద్రం నుండి హోరు కొండ దాకా,
\v 8 హోరు కొండ నుండి హమాతుకు వెళ్ళే దారి వరకూ ఏర్పాటు చేసుకోవాలి. ఆ సరిహద్దు సెదాదు వరకూ,
\v 9 అక్కడ నుండి జిప్రోను వరకూ వ్యాపిస్తుంది. దాని అంచు హసరేనాను దగ్గర ఉంటుంది. అది మీకు ఉత్తరపు సరిహద్దు.
\p
\s5
\v 10 తూర్పు సరిహద్దు హసరేనాను నుండి షెపాము వరకూ మీరు లెక్కించుకోవాలి.
\v 11 అది షెపాము నుండి అయీనుకు తూర్పున రిబ్లా వరకూ ఉంటుంది. ఆ సరిహద్దు దిగి తూర్పున కిన్నెరెతు సముద్రపు ఒడ్డును తాకుతూ ఉంటుంది.
\v 12 అది యొర్దాను నది వరకూ దిగి ఉప్పు సముద్రం వరకూ వ్యాపిస్తుంది. ఆ దేశం చుట్టూ ఉన్న సరిహద్దుల మధ్య ఉన్న ప్రాంతమంతా మీ దేశం> అని వారితో చెప్పు.>>
\p
\s5
\v 13 మోషే ఇశ్రాయేలీయులతో <<ఇది మీరు చీట్లు వేసుకుని పొందే దేశం. తొమ్మిది గోత్రాలకు, ఒక అర్థ గోత్రానికి ఇవ్వమని యెహోవా ఆజ్ఞాపించాడు.
\v 14 ఎందుకంటే తమ పూర్వీకుల కుటుంబాల ప్రకారం రూబేనీయులు, గాదీయులు తమ వారసత్వాలను పొందారు.
\v 15 అలాగే మనష్షే అర్థగోత్రం కూడా వారసత్వం పొందింది. ఆ రెండు గోత్రాలు, అర్థ గోత్రం, సూర్యోదయం దిక్కున, అంటే తూర్పున యెరికో దగ్గర యొర్దాను అవతల తమ తమ వారసత్వాలను పొందారు>> అని చెప్పాడు.
\s5
\v 16 అప్పుడు యెహోవా మోషేతో ఇలా చెప్పాడు,
\v 17 <<ఆ దేశాన్నిమీకు వారసత్వంగా పంచి పెట్టాల్సిన వ్యక్తులు ఎవరంటే, యాజకుడు ఎలియాజరు, నూను కొడుకు యెహోషువ.
\v 18 వారు కాక ఆ దేశాన్ని మీకు పంచిపెట్టడానికి ప్రతి గోత్రం నుండి ఒక్క నాయకుణ్ణి ఎన్నుకోవాలి.
\p
\s5
\v 19 వారెవరంటే, యూదా గోత్రంలో యెఫున్నె కొడుకు కాలేబు,
\v 20 షిమ్యోను గోత్రంలో అమీహూదు కొడుకు షెమూయేలు,
\s5
\v 21 బెన్యామీను గోత్రంలో కిస్లోను కొడుకు ఎలీదాదు.
\v 22 దాను గోత్రంలో యొగ్లి కొడుకు బుక్కీ నాయకుడు.
\v 23 యోసేపు కొడుకుల్లో ఏఫోదు కొడుకు హన్నీయేలు, మనష్షే గోత్ర నాయకుడు,
\s5
\v 24 ఎఫ్రాయిము గోత్రంలో షిప్తాను కొడుకు కెమూయేలు నాయకుడు,
\v 25 జెబూలూను గోత్రంలో పర్నాకు కొడుకు ఎలీషాపాను నాయకుడు,
\v 26 ఇశ్శాఖారీయుల గోత్రంలో అజాను కొడుకు పల్తీయేలు నాయకుడు,
\s5
\v 27 ఆషేరీయుల గోత్రంలో షెలోమి కొడుకు అహీహూదు నాయకుడు.
\v 28 నఫ్తాలీయుల గోత్రంలో అమీహూదు కొడుకు పెదహేలు నాయకుడు.>>
\v 29 వీరంతా కనాను దేశంలో ఇశ్రాయేలీయులకు వారి వారి వారసత్వాలను పంచిపెట్టడానికి యెహోవా ఆజ్ఞాపించినవారు.
\s5
\c 35
\s లేవీయులు నివసించడానికి పట్టణాలు
\p
\v 1 యెరికో దగ్గర యొర్దానుకు సమీపంలోని మోయాబు మైదానాల్లో యెహోవా మోషేకు ఈ విధంగా చెప్పాడు.
\v 2 <<తాము పొందే వారసత్వాల్లో లేవీయులు నివసించడానికి వారికి పట్టణాలను ఇవ్వాలని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించు. ఆ పట్టణాల చుట్టూ ఉన్న పల్లెలను కూడా లేవీయులకు ఇవ్వాలి.
\s5
\v 3 అవి వారి నివాసానికి వారి పట్టణాలవుతాయి. వాటి పొలాలు వారి పశువులకు, మందలకు, వారి ఆలమందలకు ఉండాలి.
\v 4 మీరు లేవీయులకిచ్చే పట్టణాల గోడ మొదలుకుని చుట్టూ వెయ్యి మూరలు,
\s5
\v 5 ఆ పట్టణాల బయట నుండి తూర్పున రెండు వేల మూరలు, దక్షిణాన రెండు వేల మూరలు, పడమర రెండు వేల మూరలు, ఉత్తరాన రెండు వేల మూరలు కొలవాలి. ఆ మధ్యలో పట్టణాలుండాలి. అవి వారి పట్టణాలకు పల్లెలుగా ఉంటాయి.
\s శరణు పట్టణాలు
\p
\s5
\v 6 మీరు లేవీయులకు ఇచ్చే పట్టణాల్లో ఆరు ఆశ్రయపురాలుండాలి. హత్య చేసినవాడు వాటిలోకి పారిపోగలిగేందుకు వీలుగా వాటిని నియమించాలి. అవి గాక 42 పట్టణాలను కూడా ఇవ్వాలి.
\v 7 వాటి పల్లెలతో కలిపి మీరు లేవీయులకు ఇవ్వాల్సిన పట్టణాలన్నీ నలభై ఎనిమిది.
\s5
\v 8 మీరిచ్చే పట్టణాలు ఇశ్రాయేలీయుల వారసత్వంలో నుండే ఇవ్వాలి. ఎక్కువ భూమి ఉన్నవారు ఎక్కువగా, తక్కువ భూమి ఉన్నవారు తక్కువగా ఇవ్వాలి. ప్రతి గోత్రం తాను పొందే వారసత్వం ప్రకారం తన తన పట్టణాల్లో కొన్నిటిని లేవీయులకు ఇవ్వాలి.>>
\p
\s5
\v 9 యెహోవా ఇంకా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు. <<నువ్వు ఇశ్రాయేలీయులతో చెప్పు,
\v 10 మీరు యొర్దాను దాటి కనాను దేశంలోకి వెళ్లిన తరవాత
\v 11 ఆశ్రయపురాలుగా ఉండటానికి పట్టణాలను ఎన్నిక చేయాలి.
\s5
\v 12 పొరబాటున ఎవరినైనా చంపినవాడు వాటిలోకి పారిపోవచ్చు. తీర్పు కోసం నరహంతకుడు సమాజం ఎదుట నిలిచే వరకూ వాడు మరణశిక్ష పొందకూడదు కాబట్టి ప్రతికారం తీర్చుకునేవాడి నుండి అవి మీకు ఆశ్రయం కల్పిస్తాయి.
\v 13 మీరు ఆరు పట్టణాలను ఆశ్రయ పురాలుగా ఇవ్వాలి.
\s5
\v 14 వాటిలో యొర్దాను ఇవతల మూడు పట్టణాలు, కనాను దేశంలో మూడు పట్టణాలు ఇవ్వాలి. అవి మీకు ఆశ్రయపురాలుగా ఉంటాయి.
\p
\v 15 ఎవరినైనా పొరబాటున చంపిన వాడు వాటిలోకి పారిపోయేలా ఆ ఆరు పట్టణాలు ఇశ్రాయేలీయులకు, పరదేశులకు, మీ మధ్య నివసించే ఎవరికైనా ఆశ్రయంగా ఉంటాయి.
\s5
\v 16 ఒకడు చనిపోయేలా ఇనుప ఆయుధంతో కొట్టినవాడు నరహంతకుడు. వాడికి తప్పకుండా మరణశిక్ష విధించాలి.
\v 17 ఒకడు చనిపోయేలా రాతితో కొట్టినప్పుడు ఆ కొట్టినవాడు నరహంతకుడు. వాడికి తప్పకుండా మరణశిక్ష విధించాలి.
\v 18 అలాగే ఒకడు చనిపోయేలా మరొకడు చేతి కర్రతో కొడితే కొట్టినవాడు నరహంతకుడు. వాడు తప్పకుండా మరణశిక్ష పొందాలి.
\p
\s5
\v 19 హత్య విషయంలో ప్రతికారం తీర్చుకునే వాడు తానే స్వయంగా ఆ నరహంతకుణ్ణి చంపాలి. వాణ్ణి కలిసినప్పుడు చంపవచ్చు.
\v 20 ఎవరైనా చనిపోయేలా పగపట్టి పొడిచినా, లేక పొంచి ఉండి వాడి మీద దేనినైనా విసిరినా, లేక వైరంతో చేతితో కొట్టినా, కొట్టినవాడు నరహంతకుడు. అతణ్ణి తప్పకుండా చంపాలి.
\v 21 ప్రతికారం తీర్చుకునేవాడు ఆ నరహంతకుణ్ణి కలిసినప్పుడు వాడిని చంపవచ్చు.
\p
\s5
\v 22 అయితే పగ ఏమీ లేకుండా వాడిని పొడిచినా, పొంచి ఉండకుండాా వాడిమీద ఏ ఆయుధమైనా విసిరినా ఒకడు చనిపోయేలా వాడిమీద రాయి విసిరినా,
\v 23 దెబ్బతిన్న వాడు చనిపోతే ఆ కొట్టినవాడు వాడి మీద పగపట్ట లేదు, వాడికి హాని చేసే ఉద్దేశం లేదు.
\s5
\v 24 కాబట్టి సమాజం ఈ నియమాల ప్రకారం కొట్టిన వాడికీ ప్రతికారం తీర్చుకునే వాడికీ మధ్య తీర్పుతీర్చాలి.
\v 25 ఆ విధంగా చేసి సమాజం నరహత్య విషయంలో ప్రతికారం తీర్చుకునే వాడి చేతి నుండి ఆ నరహంతకుణ్ణి కాపాడాలి. సమాజం మొదట పారిపోయిన ఆశ్రయపురానికి వాణ్ణి మళ్ళీ పంపించాలి. వాడు పవిత్ర తైలంతో అభిషేకం పొందిన ప్రధాన యాజకుడు చనిపోయే వరకూ అక్కడే నివసించాలి.
\s5
\v 26 అయితే అతడు ఎప్పుడైనా తన ఆశ్రయపురం సరిహద్దు దాటి వెళితే
\v 27 నరహత్య విషయంలో ప్రతికారం తీర్చుకునేవాడు ఆశ్రయపురం సరిహద్దు బయట అతణ్ణి చూసి చంపినప్పటికీ వాడి మీద హత్యాదోషం ఉండదు.
\v 28 ఎందుకంటే, ప్రధాన యాజకుడు చనిపోయే వరకూ అతడు ఆశ్రయపురంలోనే నివసించాలి. ఆ ప్రధాన యాజకుడు చనిపోయిన తరువాత ఆ నరహంతకుడు తన వారసత్వం ఉన్న దేశానికి తిరిగి వెళ్లవచ్చు.
\p
\s5
\v 29 ఇవి మీరు నివాసముండే స్థలాలన్నిటిలో అన్ని తరాలకు మీకు విధించిన కట్టడ.
\v 30 ఎవరైనా ఒకణ్ణి చంపితే సాక్షుల నోటి మాట వలన ఆ నరహంతకుడికి మరణశిక్ష విధించాలి. ఒక్క సాక్షిమాట మీద ఎవరికీ మరణశిక్ష విధించకూడదు.
\s5
\v 31 హత్యా దోషంతో చావుకు తగిన నరహంతకుని ప్రాణం కోసం మీరు విమోచన ధనాన్ని అంగీకరించక తప్పకుండా వాడికి మరణశిక్ష విధించాలి.
\v 32 ఆశ్రయపురానికి పారిపోయిన వాడు యాజకుడు చనిపోక ముందుగా తన స్వంత ఊరిలో నివసించేలా చేయడానికి వాడి దగ్గర విమోచన ధనాన్ని అంగీకరించకూడదు.
\s5
\v 33 మీరు జీవించే దేశాన్ని అపవిత్రం చేయకూడదు. నరహత్య దేశాన్ని అపవిత్రపరుస్తుంది. దేశంలో చిందిన రక్తం కోసం ప్రాయశ్చిత్తం ఆ చిందించిన వాడి రక్తం వల్లనే కలుగుతుంది గాని మరి దేనివల్లా జరగదు.
\v 34 కాబట్టి మీరు జీవించే దేశాన్ని అపవిత్రం చేయవద్దు. ఎందుకంటే నేను దానిలో నివసిస్తున్నాను. నిజంగా యెహోవా అనే నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసిస్తున్నాను.>>
\s5
\c 36
\s సెలోపెహాదు కూతుళ్ళ వారసత్వం
\p
\v 1 యోసేపు కొడుకుల వంశాల్లో మాకీరు కొడుకు, మనష్షే మనమడు అయిన గిలాదు వంశం పెద్దలు వచ్చి మోషేతో, ఇశ్రాయేలీయుల పూర్వీకుల కుటుంబాల నాయకులతో ఇలా అన్నారు,
\v 2 <<ఈ దేశాన్ని చీటీల ప్రకారం ఇశ్రాయేలీయులకు వారసత్వంగా ఇవ్వాలని యెహోవా మా ఏలికవైన నీకు ఆజ్ఞాపించాడు. మా సోదరుడు సెలోపెహాదు వారసత్వాన్ని అతని కూతుళ్ళకు ఇవ్వాలని కూడా యెహోవా నీకు ఆజ్ఞాపించాడు.
\s5
\v 3 అయితే వారు ఇశ్రాయేలీయుల్లో ఇతర గోత్రాల వారిని ఎవరిని పెళ్లి చేసుకున్నా వారి వారసత్వం మా పూర్వీకుల వారసత్వం నుండి తీసి, వారు చేసుకున్న గోత్రపు వారసత్వంతో కలిసిపోయి, మా గోత్రానికి వచ్చిన చీటీల ప్రకారం లభించిన వారసత్వం నుండి వేరైపోతుంది.
\v 4 కాబట్టి ఇశ్రాయేలీయులకు సునాద సంవత్సరం వచ్చినప్పుడు వారి వంతు వారు పెళ్లి చేసుకున్న గోత్రపు వారసత్వంతో కలిసిపోతుంది కాబట్టి ఆ మేరకు మా పూర్వీకుల గోత్ర వారసత్వం తగ్గిపోతుంది.>>
\p
\s5
\v 5 అప్పుడు మోషే యెహోవా మాట ప్రకారం ఇశ్రాయేలీయులకు ఇలా ఆజ్ఞాపించాడు. <<యోసేపు కొడుకుల గోత్రికులు చెప్పింది న్యాయంగానే ఉంది.
\v 6 యెహోవా సెలోపెహాదు కూతుళ్ళ గురించి చెప్పింది ఏమిటంటే, వారు తమకు ఇష్టమైన వారిని వివాహం చేసుకోవచ్చు గాని, తమ తండ్రి గోత్ర వంశాల్లోనే చేసుకోవాలి.
\s5
\v 7 ఇశ్రాయేలీయుల వారసత్వం ఒక గోత్రం నుండి వేరొక గోత్రంలోకి వెళ్ళకూడదు. ఇశ్రాయేలీయుల్లో ప్రతి ఒక్కడూ తన పూర్వీకుల గోత్ర వారసత్వానికి కట్టుబడి ఉండాలి.
\s5
\v 8 ఇశ్రాయేలీయులకు వారి పూర్వీకుల వారసత్వం కలిగేలా ఇశ్రాయేలీయుల గోత్రాల్లో వారసత్వం ఉన్న ప్రతి యువతీ తన తండ్రి గోత్రంలోనే వివాహం చేసుకోవాలి.
\v 9 వారసత్వం ఒక గోత్రం నుండి మరొక గోత్రానికి వెళ్ళకూడదు. ఇశ్రాయేలీయుల గోత్రాలు వారి వారి వారసత్వాల్లోనే నిలిచి ఉండాలి.>>
\p
\s5
\v 10 యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధంగా సెలోపెహాదు కూతుళ్ళు చేశారు.
\v 11 మహలా, తిర్సా, హొగ్లా, మిల్కా, నోయా అనే సెలోపెహాదు కూతుళ్ళు తమ తండ్రి సోదరుని కొడుకులను వివాహం చేసుకున్నారు.
\v 12 అంటే యోసేపు కొడుకులైన మనష్షీయులను వివాహం చేసుకోవడం వలన వారి వారసత్వం వారి తండ్రి గోత్రంలోనే ఉండిపోయింది.
\s5
\v 13 ఇవి యెరికో దగ్గర యొర్దానుకు సమీపంగా ఉన్న మోయాబు మైదానాల్లో యెహోవా మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన విధులు, ఆజ్ఞలు.