te_ulb/02-EXO.usfm

2640 lines
406 KiB
Plaintext

\id EXO EXO- Telugu Unlocked Literal Bible
\ide UTF-8
\rem Copyright © 2017 Bridge Connectivity Solutions. This translation is made available to you under the terms of the Creative Commons Attribution-ShareAlike 4.0 License
\h నిర్గమకాండం
\toc1 నిర్గమకాండం
\toc2 నిర్గమకాండం
\toc3 exo
\mt1 నిర్గమకాండం
\s5
\c 1
\s ఇశ్రాయేలు ప్రజల దురవస్థ
\p
\v 1 యాకోబుతోబాటు ఐగుప్తుకు వెళ్ళిన అతని కొడుకులు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను, బెన్యామీను,
\v 2 దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు.
\v 3 యాకోబుకు పుట్టిన సంతానం మొత్తం 70 మంది.
\v 4 యోసేపు ఐగుప్తులో ఉన్న ఆ సమయంలో
\v 5 వీళ్ళంతా తమ తమ కుటుంబాలతో సహా ఐగుప్తులో నివసించారు.
\p
\s5
\v 6 యోసేపు, అతని అన్నదమ్ములు, వాళ్ళ తరం వారు అంతా చనిపోయారు.
\v 7 ఇశ్రాయేలు ప్రజలు వారు నివసిస్తున్న ప్రాంతమంతటా తమ సంతానంతో బాగా విస్తరించి అభివృద్ధి పొందారు. ఆ ప్రాంతమంతా ఇశ్రాయేలు ప్రజలతో నిండిపోయింది.
\s5
\v 8 కొంతకాలానికి యోసేపు ఎవరో తెలియని కొత్త రాజు ఐగుప్తును పరిపాలించడం మొదలు పెట్టాడు.
\p
\v 9 అతడు తన ప్రజలతో ఇలా అన్నాడు <<ఇశ్రాయేలు ప్రజలను చూడండి. వీళ్ళు మనకంటే సంఖ్యలో ఎక్కువగా, శక్తిమంతులుగా ఉన్నారు.
\v 10 వాళ్ళ విషయంలో మనం తెలివిగా ఏదన్నా చేద్దాం. లేకపోతే వాళ్ళ జనాభా పెరిగిపోతుంది. ఒకవేళ యుద్ధం గనక వస్తే వాళ్ళు మన శత్రువులతో చేతులు కలిపి మనకి వ్యతిరేకంగా యుద్ధం చేసి ఈ దేశం నుండి వెళ్లిపోతారేమో>> అన్నాడు.
\p
\s5
\v 11 అందుచేత వారు ఇశ్రాయేలు ప్రజలచే కఠిన బాధ చేయించి కఠినులైన అధికారులను వారి మీద నియమించాడు. ఆ అధికారులు ఫరో రాజు కోసం పీతోము, రామెసేసు అనే గిడ్డంగుల పట్టణాలను కట్టించారు.
\v 12 ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలను అణగదొక్కేకొద్దీ వారు అంతకంతకూ విస్తరిస్తూ పోవడంతో వారు ఇశ్రాయేలు ప్రజల విషయం భయాందోళనలు పెంచుకున్నారు.
\s5
\v 13 ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలతో మరింత కష్టమైన పనులు చేయించుకున్నారు.
\v 14 బంకమట్టి పని, ఇటుకల పని, పొలంలో చేసే ప్రతి పనీ కఠినంగా చేయించుకుని వారి ప్రాణాలు విసిగిపోయేలా చేశారు. వారు ఇశ్రాయేలు ప్రజలతో చేయించుకొనే అన్ని పనులూ కఠిన బాధతో కూడి ఉండేవి.
\p
\s5
\v 15 ఐగుప్తు రాజు హీబ్రూ మంత్రసానులతో మాట్లాడాడు. వారి పేర్లు షిఫ్రా, పూయా.
\v 16 <<మీరు హెబ్రీ స్త్రీలకు పురుడు పోస్తున్నప్పుడు జాగ్రత్తగా కనిపెట్టి చూడండి. మగ పిల్లవాడు పుడితే ఆ బిడ్డను చంపివేయండి, ఆడ పిల్ల అయితే బతకనియ్యండి>> అన్నాడు.
\v 17 అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తురాజు తమకు ఆజ్ఞాపించినట్టు చేయలేదు. మగపిల్లలను చంపకుండా బతకనిచ్చారు.
\s5
\v 18 ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి <<మీరు ఇలా ఎందుకు చేశారు? మగపిల్లలను చంపకుండా ఎందుకు బతకనిచ్చారు?>> అని అడిగాడు.
\p
\v 19 అప్పుడు ఆ మంత్రసానులు <<హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలలాంటి వాళ్ళు కాదు. తెలివైనవాళ్ళు. మంత్రసాని వాళ్ళ దగ్గరికి వెళ్లకముందే ప్రసవిస్తున్నారు>> అని ఫరోతో చెప్పారు.
\s5
\v 20 మంత్రసానులు దేవునికి భయపడినందువల్ల దేవుడు వారిని దీవించాడు. ఇశ్రాయేలు ప్రజల్లో వారి సంతానం విస్తరించింది.
\v 21 ఆయన వారి వంశాన్ని వృద్ధి చేశాడు.
\v 22 అప్పుడు ఫరో <<వారికి పుట్టిన ప్రతి మగపిల్లవాణ్ణి నైలు నదిలో పడవేయండి. ఆడపిల్లను బతకనియ్యండి>> అని తన ఐగుప్తు ప్రజలకు ఆజ్ఞాపించాడు.
\s5
\c 2
\s మోషే పుట్టుక
\p
\v 1 లేవి వంశానికి చెందిన ఒక వ్యక్తి వెళ్లి లేవి స్త్రీలలో ఒకామెను పెళ్లి చేసుకున్నాడు.
\v 2 ఆమె గర్భం ధరించి ఒక కొడుకును కన్నది. వాడు ఎంతో అందంగా ఉండడం వల్ల అతణ్ణి మూడు నెలల పాటు దాచిపెట్టింది.
\s5
\v 3 ఇక అతణ్ణి దాచి ఉంచలేక జమ్ముతో ఒక పెట్టె చేయించి, దానికి జిగురు, కీలు పూసి, అందులో ఆ పిల్లవాణ్ణి పెట్టి, నది ఒడ్డున జమ్ము గడ్డిలో ఉంచింది.
\v 4 పిల్లవాడికి ఏమైనా జరుగుతుందేమోనని వాడి అక్క దూరంగా నిలబడి చూస్తూ ఉంది.
\p
\s5
\v 5 ఫరో చక్రవర్తి కూతురు స్నానం చేయడానికి నది దగ్గరికి వచ్చింది. ఆమె దాసీలు నది ఒడ్డున విహరిస్తూ ఉన్నారు. ఆమె రెల్లు గడ్డిలో ఉన్న ఆ పెట్టెను చూసి, తన దాసిని పంపి దాన్ని తెప్పించింది.
\v 6 పెట్టె తెరిచినప్పుడు ఏడుస్తూ ఉన్న పిల్లవాడు కనిపించాడు. ఆమె వాడిపై జాలిపడింది. <<వీడు హెబ్రీయుల పిల్లవాడు>> అంది.
\s5
\v 7 అప్పుడు దూరంగా నిలబడి ఉన్న పిల్లవాడి అక్క వచ్చి ఫరో కూతురితో <<నీ కోసం ఈ పిల్లవాణ్ణి పెంచడానికి నేను వెళ్లి హెబ్రీ స్త్రీలలో ఒక ఆయాని తీసుకు రమ్మంటారా?>> అని అడిగింది.
\v 8 ఫరో కూతురు <<వెళ్లి తీసుకు రా>> అంది. ఆ బాలిక వెళ్లి ఆ బిడ్డ తల్లిని తీసుకు వచ్చింది.
\s5
\v 9 ఫరో కూతురు ఆమెతో <<ఈ పిల్లవాణ్ణి తీసుకు పోయి నా కోసం పాలిచ్చి పెంచు. నేను నీకు జీతం ఇస్తాను>> అని చెప్పింది. ఆమె పిల్లవాణ్ణి తీసుకు పోయి పాలిచ్చి పెంచింది.
\p
\v 10 ఆ పిల్లవాడు పెద్దవాడైన తరువాత ఆమె అతణ్ణి ఫరో కూతురి దగ్గరికి తీసుకు వచ్చింది. అతడు ఆమెకు కొడుకు అయ్యాడు. ఆమె <<నీళ్ళలో నుండి నేను ఇతన్ని బయటకు తీశాను, కాబట్టి ఇతని పేరు
\f +
\fr 2:10
\ft నీటిలో నుండి తీసిన.
\f* మోషే>> అని చెప్పింది.
\s మోషే మిద్యాను పలాయనం
\p
\s5
\v 11 మోషే పెద్దవాడైన తరువాత తన ప్రజల దగ్గరికి వెళ్ళాడు. వారు పడుతున్న కష్టాలు, ఇబ్బందులు చూశాడు. ఆ సమయంలో తన సొంత జాతి వాడైన హెబ్రీయుల్లో ఒకణ్ణి ఒక ఐగుప్తీయుడు కొట్టడం చూశాడు.
\v 12 అటూ ఇటూ చూసి అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో ఆ ఐగుప్తీయుణ్ణి కొట్టి చంపి ఇసుకలో పాతిపెట్టాడు.
\p
\s5
\v 13 తరువాతి రోజు మోషే అటుగా వెళ్తుంటే అక్కడ ఇద్దరు హెబ్రీయులు గొడవ పడుతున్నారు.
\v 14 అప్పుడు మోషే తప్పు చేసిన వ్యక్తితో <<నువ్వెందుకు నీ సోదరుణ్ణి కొడుతున్నావు?>> అని అడిగాడు. అందుకు అతడు <<మా మీద నిన్ను అధికారిగా, తీర్పు తీర్చేవాడిగా ఎవరు నియమించారు? నువ్వు ఆ ఐగుప్తీయుణ్ణి చంపినట్టు నన్ను కూడా చంపుదామనుకుంటున్నావా?>> అన్నాడు.
\p ఈ విషయం అందరికీ తెలిసిపోయిందని మోషే భయపడ్డాడు.
\s5
\v 15 ఆ సంగతి విన్న ఫరో మోషేను చంపించాలని చూశాడు. మోషే ఫరో దగ్గరనుండి నుండి మిద్యాను దేశానికి పారిపోయాడు. అక్కడ ఒక బావి దగ్గర కూర్చున్నాడు.
\p
\v 16 మిద్యాను దేశంలో ఉన్న యాజకునికి ఏడుగురు కూతుళ్ళు. వాళ్ళు తమ తండ్రి మందలకు నీళ్లు తోడి నీళ్ళ తొట్టెలు నింపుతున్నారు.
\v 17 అప్పుడు వేరే మంద కాపరులు వచ్చి వాళ్ళను అక్కడి నుండి తోలివేశారు. మోషే లేచి ఆ అమ్మాయిలకు సహాయం చేసి, వాళ్ళ మందకు నీళ్లు తోడిపెట్టాడు.
\p
\s5
\v 18 వాళ్ళు తిరిగి తమ ఇంటికి తిరిగి వచ్చాక వారి తండ్రి రగూయేలు <<మీరు ఇంత త్వరగా ఎలా వచ్చారు?>> అని అడిగాడు.
\v 19 అందుకు వాళ్ళు <<ఒక ఐగుప్తీయుడు మంద కాపరుల చేతిలో నుండి మమ్మల్ని కాపాడి, నీళ్లు తోడి మన మందకు పోశాడు>> అన్నారు.
\v 20 అతడు తన కూతుళ్ళతో <<అతడు ఏడీ? ఎందుకు విడిచిపెట్టి వచ్చారు? అతణ్ణి భోజనానికి పిలుచుకు రండి>> అని చెప్పాడు.
\p
\s5
\v 21 మోషే ఆ కుటుంబంతో కలిసి నివసించడానికి అంగీకరించాడు. రగూయేలు తన కూతురు సిప్పోరాను మోషేకిచ్చి పెళ్లి చేశాడు.
\v 22 వాళ్లకు ఒక కొడుకు పుట్టాడు. అప్పుడు మోషే <<నేను పరాయి దేశంలో పరాయి వ్యక్తిగా ఉన్నాను>> అనుకుని తన కొడుక్కి <<గెర్షోము>> అని పేరు పెట్టాడు.
\p
\s5
\v 23 ఈ విధంగా చాలా రోజులు గడచిపోయిన తరువాత ఐగుప్తు రాజు చనిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు ఇంకా బానిసత్వంలోనే ఉండి, నిట్టూర్పులు విడుస్తూ మొర పెడుతూ ఉన్నారు. తమ వెట్టిచాకిరీ మూలంగా వారు పెట్టిన మొరలు దేవుని సన్నిధికి చేరాయి.
\v 24 దేవుడు వారి నిట్టూర్పులు, మూలుగులు విన్నాడు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు.
\v 25 దేవుడు ఇశ్రాయేలు ప్రజలను చూశాడు, వారిని పట్టించుకున్నాడు.
\s5
\c 3
\s మండుతున్న పొద దగ్గర మోషే
\p
\v 1 మోషే మిద్యానులో యాజకుడైన తన మామ యిత్రో మందను మేపుతున్నాడు. ఆ మందను అరణ్యం అవతలి వైపుకు తోలుకుంటూ
\f +
\fr 3:1
\ft పవిత్ర పర్వతం.
\f* దేవుని పర్వతం హోరేబుకు వచ్చాడు.
\v 2 అక్కడ ఒక పొద మధ్య నుండి అగ్నిజ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యాడు. మోషే చూస్తూ ఉండగా అగ్నిలో ఆ పొద మండుతూ ఉంది గానీ పొద కాలిపోవడం లేదు.
\p
\v 3 అప్పుడు మోషే ఆ పొద ఎందుకు కాలిపోవడం లేదో, ఆ వింత ఏమిటో ఆ వైపుకు వెళ్లి చూద్దాం అనుకున్నాడు.
\s5
\v 4 దాన్ని చూద్దామని అతడు ఆ వైపుకు రావడం యెహోవా చూశాడు. ఆ పొద మధ్య నుండి దేవుడు <<మోషే, మోషే>> అని అతణ్ణి పిలిచాడు. అప్పుడు అతడు <<చిత్తం ప్రభూ>> అన్నాడు.
\v 5 అందుకు ఆయన <<దగ్గరికి రావద్దు. నీ కాళ్ళకున్న చెప్పులు తీసెయ్యి. నువ్వు నిలబడి ఉన్న ప్రదేశం పవిత్రమైనది>> అన్నాడు.
\v 6 ఆయన ఇంకా <<నేను నీ పూర్వికులు అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుణ్ణి>> అని చెప్పగా మోషే తన ముఖం కప్పుకుని దేవుని వైపు చూసేందుకు భయపడ్డాడు.
\p
\s5
\v 7 యెహోవా ఇలా చెప్పాడు. <<ఐగుప్తులో ఉంటున్న నా ప్రజలు పడుతున్న బాధలు నాకు తెలుసు. కఠినమైన పనులు చేయిస్తూ వారిని బాధపెడుతున్న వారిని బట్టి వారు పెడుతున్న మొర నేను విన్నాను. వారి దుఃఖం నాకు తెలుసు.
\v 8 కనుక ఐగుప్తీయుల చేతిలో నుండి నా ప్రజలను విడిపించి, ఆ దేశం నుండి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు యెబూసీయులు నివసిస్తున్న
\f +
\fr 3:8
\ft పాలు తేనెలు ప్రవహించే.
\f* చాలా సారవంతమైన, విశాలమైన మంచి దేశానికి వారిని నడిపించడానికి నేను దిగి వచ్చాను.
\s5
\v 9 నిజంగా ఇశ్రాయేలు ప్రజల మొర నేను విన్నాను. ఐగుప్తీయులు వారి పట్ల జరిగిస్తున్న హింసాకాండను చూశాను.
\v 10 నువ్వు సిద్ధపడు. నిన్ను ఫరో దగ్గరికి పంపిస్తాను. నువ్వు నా ప్రజలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి బయటకు నడిపించాలి.>>
\p
\s5
\v 11 అప్పుడు మోషే దేవునితో <<ఫరో దగ్గరికి వెళ్ళి, ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి బయటకు నడిపించడానికి నేను ఏపాటి వాణ్ణి?>> అని అన్నాడు.
\v 12 దేవుడు <<నువ్వు ఆ ప్రజలను ఐగుప్తు నుండి తీసుకు వచ్చిన తరువాత మీరు ఈ కొండపై దేవుణ్ణి ఆరాధిస్తారు. కచ్చితంగా నేను నీకు తోడుగా ఉంటాను. నేను నిన్ను పంపించాను అని చెప్పడానికి ఇదే సూచన>> అన్నాడు.
\s5
\v 13 మోషే <<నేను ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్లి వారితో మీ పూర్వీకుల దేవుడు మీ దగ్గరికి నన్ను పంపించాడని చెప్పినప్పుడు వారు <ఆయన పేరేమిటి?> అని అడిగితే వారితో నేనేం చెప్పాలి?>> అని దేవుణ్ణి అడిగాడు.
\s దేవుని పేరు వెల్లడి
\p
\v 14 అందుకు దేవుడు <<
\bd నేను శాశ్వతంగా ఉన్నవాణ్ణి
\bd* , అనే పేరు గల వాణ్ణి.
\bd ఉన్నవాడు
\bd* అనే ఆయన నన్ను మీ దగ్గరికి పంపించాడు, అని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు>> అని మోషేతో చెప్పాడు.
\v 15 దేవుడు మోషేతో ఇంకా <<మీ పూర్వీకుల దేవుడు యెహోవా, అంటే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు యెహోవా మీ దగ్గరికి నన్ను పంపించాడు అని నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాలి. చిరకాలం నిలిచి ఉండే, తరతరాలకు జ్ఞాపకముండే నా పేరు ఇదే.
\p
\s5
\v 16 నువ్వు వెళ్లి ఇశ్రాయేలు పెద్దలను సమకూర్చి <మీ పూర్వీకుల దేవుడు యెహోవా, అంటే అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నాకు కనబడి ఇలా చెప్పాడు, నేను ఐగుప్తులో మీకు జరుగుతున్నదంతా చూశాను.
\v 17 ఐగుప్తులో మీరు పడుతున్న బాధల నుండి విడిపించి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు నివసిస్తున్న పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని తీసుకువస్తాను> అని చెప్పాడని వారితో చెప్పు.
\v 18 వాళ్ళు నీ మాట వింటారు గనక నువ్వూ, ఇశ్రాయేలు ప్రజల పెద్దలూ ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్లి, అతనితో, హెబ్రీయుల దేవుడు యెహోవా మాకు ప్రత్యక్షమయ్యాడు, మేము అడవిలోకి మూడు రోజుల ప్రయాణమంత దూరం ప్రయాణించి మా దేవుడు యెహోవాకు బలులు అర్పిస్తాం, మాకు అనుమతి ఇవ్వు, అని అతనితో చెప్పాలి.
\p
\s5
\v 19 ఐగుప్తు రాజు తన గొప్ప సైన్యంతో మిమ్మల్ని అడ్డగించి వెళ్ళనీయకుండా చేస్తాడని నాకు తెలుసు.
\v 20 అయితే నేను నా చెయ్యి చాపి ఐగుప్తు దేశంలో నేను చేయాలనుకున్న నా అద్భుత కార్యాలను చూపించి అతడి ప్రయత్నాలను భంగపరుస్తాను. ఆ తరువాత అతడు మిమ్మల్ని వెళ్ళనిస్తాడు.
\v 21 మీరు ఐగుప్తును విడిచి వెళ్ళే సమయంలో ఖాళీ చేతులతో వెళ్ళరు. ఎందుకంటే ప్రజల పట్ల ఐగుప్తు వారికి మంచి మనస్సు కలిగేలా చేస్తాను.
\v 22 ప్రతి స్త్రీ తన దగ్గర ఉన్న స్త్రీని, తన యజమానురాలిని వెండి, బంగారు నగలు, దుస్తులు ఇమ్మని అడగాలి. వాటిని తీసుకుని మీ కొడుకులకు, కూతుళ్ళకు ధరింపజేయాలి. ఈ విధంగా మీరు ఐగుప్తు దేశ ప్రజలను కొల్లగొడతారు>> అన్నాడు.
\s5
\c 4
\s మోషేకి దేవుడిచ్చిన అద్భుత శక్తి
\p
\v 1 అప్పుడు మోషే <<వాళ్ళు నన్ను నమ్మరు. నా మాట వినరు. <యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదు> అంటారేమో>> అని జవాబిచ్చాడు.
\p
\v 2 యెహోవా <<నీ చేతిలో ఉన్నది ఏమిటి?>> అని మోషేను అడిగాడు. అతడు <<కర్ర>> అన్నాడు.
\p
\v 3 అప్పుడు దేవుడు <<ఆ కర్రను నేల మీద పడవెయ్యి>> అన్నాడు. అతడు దాన్ని నేల మీద పడవెయ్యగానే అది పాముగా మారిపోయింది. మోషే భయపడి దూరంగా పరిగెత్తాడు.
\p
\s5
\v 4 అప్పుడు యెహోవా <<నీ చేత్తో దాని తోక పట్టుకో>> అని చెప్పాడు. అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకోగానే అది అతని చేతిలో కర్రగా మారిపోయింది.
\p
\v 5 ఆయన <<దీన్ని బట్టి వాళ్ళు తమ పూర్వీకుల దేవుడు యెహోవా, అంటే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నీకు ప్రత్యక్షమయ్యాడని నమ్ముతారు>> అన్నాడు.
\p
\s5
\v 6 తరువాత యెహోవా <<నీ చెయ్యి నీ అంగీలో పెట్టుకో>> అన్నాడు. అతడు తన చెయ్యి అంగీలో ఉంచి బయటికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్టురోగం సోకినట్టు మంచులాగా తెల్లగా మారిపోయింది.
\p
\v 7 తరువాత ఆయన <<నీ చెయ్యి మళ్ళీ నీ అంగీలో ఉంచుకో>> అన్నాడు. అతడు తన చెయ్యి తన అంగీలో ఉంచుకుని బయటికి తీసినప్పుడు అది అతని మిగతా శరీరంలాగా మామూలుగా అయిపోయింది.
\p
\s5
\v 8 అప్పుడు దేవుడు <<వాళ్ళు నా శక్తిని కనపరిచే మొదటి అద్భుతాన్ని పట్టించుకోకుండా నమ్మకుండా ఉంటే రెండవ దాన్ని బట్టి నమ్ముతారు.
\v 9 ఈ రెండు అద్భుతాలను చూసి కూడా నిన్ను నమ్మకుండా నీ మాట వినకుండా ఉంటే, నువ్వు నదిలోని కొంచెం నీళ్ళు తీసుకుని ఎండిన నేల మీద కుమ్మరించు. నువ్వు నదిలో నుండి తీసి పొడి నేలపై పోసిన నీళ్లు రక్తంలాగా మారిపోతాయి>> అన్నాడు.
\p
\s5
\v 10 మోషే <<ప్రభూ, నీవు నీ దాసుడినైన నాతో మాట్లాడడానికి ముందుగానీ తరవాతగానీ ఏనాడూ నేను మాటకారిని కాను. నా నోరు, నా నాలుక మందమైనవి>> అన్నాడు.
\p
\v 11 అప్పుడు యెహోవా <<మనుషులకు నోరు ఇచ్చిన వాడు ఎవరు? మూగ వారిని, చెవిటి వారిని, చూపు గలవారిని, గుడ్డి వారిని అందరినీ పుట్టించినది ఎవరు? యెహోవానైన నేనే గదా.
\v 12 కాబట్టి వెళ్లు, నేను నీ నోటికి తోడుగా ఉండి, నువ్వు ఏం మాట్లాడాలో నీకు చెబుతాను>> అని మోషేతో చెప్పాడు.
\p
\v 13 మోషే <<ప్రభూ, నువ్వు వేరెవరినైనా ఎన్నుకుని అతణ్ణి పంపించు>> అన్నాడు.
\s5
\v 14 అందుకు యెహోవా మోషే మీద కోపపడి <<లేవీయుడైన నీ అన్న అహరోను ఉన్నాడు గదా? అతడు చక్కగా మాట్లాడగలడని నాకు తెలుసు. అంతేగాక ఇప్పుడు అతడు నిన్ను కలుసుకోవడానికి నీకు ఎదురు వస్తున్నాడు. అతడు నిన్ను బట్టి తన మనసులో సంతోషిస్తాడు.
\v 15 నువ్వు చెప్పవలసిన మాటలు అతనితో చెప్పు. నేను నీ నోటికీ, అతని నోటికీ తోడుగా ఉంటాను. మీరిద్దరూ ఏమి చేయాలో నేను చెబుతాను.
\v 16 అతడే నీ నోరుగా ఉండి నీకు బదులు ప్రజలతో మాట్లాడతాడు. అతనికి నువ్వు దేవుని స్థానంలో ఉన్నట్టు లెక్క.
\v 17 ఆ చేతికర్రను పట్టుకుని దానితో ఆ అద్భుతాలన్నీ చేయాలి>> అని చెప్పాడు.
\s మోషే ఐగుప్తుకు తిరిగి వెళ్ళడం
\p
\s5
\v 18 ఇది జరిగిన తరువాత మోషే తన మామ యిత్రో దగ్గరికి బయలుదేరి వెళ్ళాడు. <<నువ్వు అనుమతి ఇస్తే నేను ఐగుప్తులో ఉన్న నా జనుల దగ్గరికి వెళ్తాను, వాళ్ళింకా బతికి ఉన్నారో లేదో చూసి వస్తాను>> అన్నాడు. యిత్రో క్షేమంగా వెళ్ళి రమ్మని పంపించాడు.
\v 19 అప్పుడు యెహోవా మిద్యానులో ఉన్న మోషేతో <<నిన్ను చంపాలని చూసిన వాళ్ళంతా చనిపోయారు. కాబట్టి ఐగుప్తుకు తిరిగి వెళ్లు>> అని చెప్పాడు.
\v 20 మోషే తన భార్యబిడ్డలను వెంటబెట్టుకుని గాడిదపై కూర్చోబెట్టి ఐగుప్తుకు ప్రయాణమయ్యాడు. తనతోబాటు దేవుని కర్రను చేతబట్టుకుని వెళ్ళాడు.
\p
\s5
\v 21 అప్పుడు యెహోవా మోషేతో ఇలా చెప్పాడు<<నీవు ఐగుప్తుకు చేరిన తరువాత చేయడానికి నేను నీకిచ్చిన అద్భుత కార్యాలు ఫరో సమక్షంలో చెయ్యాలి, అయితే నేను అతని హృదయం కఠినం చేస్తాను. అతడు ఇశ్రాయేలు ప్రజలను వెళ్ళనివ్వడు.
\v 22 అప్పుడు నువ్వు ఫరోతో ఇలా చెప్పు, <ఇశ్రాయేలు యెహోవా సంతానం. యెహోవాపెద్ద కొడుకు.
\v 23 నన్ను సేవించడానికి నా కుమారుణ్ణి వెళ్ళనిమ్మని నీకు ఆజ్ఞాపిస్తున్నాను. నువ్వు గనక వారిని వెళ్ళనియ్యకపోతే నేను నీ కొడుకును, నీ పెద్ద కొడుకును చంపేస్తాను అని యెహోవా చెబుతున్నాడు> అని అతనితో చెప్పాలి>> అన్నాడు.
\p
\s5
\v 24 ప్రయాణం మధ్యలో వారు బస చేసినప్పుడు యెహోవా వారిని ఎదుర్కొని మోషేను చంపడానికి చూశాడు.
\v 25 మోషే భార్య సిప్పోరా ఒక పదునైన రాయి తీసుకుని తన కొడుక్కి సున్నతి చేసి మర్మాంగ చర్మం కొన మోషే
\f +
\fr 4:25
\ft మూల భాషలో ఇక్కడున్న దానికి మోషే మర్మాంగం దగ్గర తాకించింది అని అర్థం వస్తుంది.
\f* పాదాల దగ్గర పడేసింది. <<నువ్వు నిజంగా నా రక్తసంబంధమైన భర్తవి>> అని చెప్పింది.
\v 26 అప్పుడు యెహోవా అతణ్ణి విడిచిపెట్టాడు. అప్పుడు ఆమె <<ఈ సున్నతిని బట్టి నువ్వు నాకు రక్తసంబంధమైన భర్తవయ్యావు>> అంది.
\p
\s5
\v 27 మోషేను కలుసుకోవడానికి ఎడారికి వెళ్ళమని యెహోవా అహరోనుతో చెప్పాడు. అతడు వెళ్లి దేవుని పర్వతం దగ్గర మోషేను కలుసుకుని అతణ్ణి ముద్దు పెట్టుకున్నాడు.
\v 28 అప్పుడు మోషే యెహోవా తనను పంపిన సంగతిని చెప్పమన్న మాటలన్నిటినీ, ఆయన చేయమని ఆజ్ఞాపించిన అద్భుత క్రియలన్నిటినీ గూర్చి అహరోనుకు తెలియజేశాడు.
\p
\s5
\v 29 తరువాత మోషే అహరోనులు వెళ్లి ఇశ్రాయేలు ప్రజల పెద్దలందరినీ సమావేశ పరిచారు.
\v 30 మోషేతో యెహోవా చెప్పిన మాటలన్నిటినీ వారికి అహరోను వివరించాడు. ప్రజలందరి ఎదుటా అద్భుత క్రియలను జరిగించినప్పుడు అందరూ వారి మాటలు నమ్మారు.
\v 31 యెహోవా తమ బాధలను కనిపెట్టి తమను దర్శించాడని విన్న ఇశ్రాయేలు ప్రజలు తలలు వంచుకుని ఆయనను ఆరాధించారు.
\s5
\c 5
\s మోషే అహరోనులు ఫరో ఎదుట
\p
\v 1 ఈ విషయాలు జరిగిన తరువాత మోషే అహరోనులు ఫరో దగ్గరికి వెళ్లి <<ఇశ్రాయేలు ప్రజల దేవుడు యెహోవా ఆజ్ఞాపిస్తున్నాడు: ఎడారిలో నా కోసం ఉత్సవం చేయడానికి నా ప్రజలను వెళ్ళనివ్వు>> అని చెప్పారు.
\v 2 అందుకు ఫరో <<యెహోవా ఎవరు? నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను ఎందుకు వెళ్ళనివ్వాలి? నాకు యెహోవా అంటే ఎవరో తెలియదు. ఇశ్రాయేలీయులను వెళ్ళనివ్వను>> అన్నాడు.
\s5
\v 3 అప్పుడు ఆ ఇద్దరూ <<హెబ్రీయుల దేవుడు మాతో మాట్లాడాడు. మాకు అనుమతి ఇస్తే మేము ఎడారిలోకి మూడు రోజుల ప్రయాణమంత దూరం వెళ్లి మా దేవుడు యెహోవాకు బలి అర్పిస్తాం, లేని పక్షంలో ఆయన మమ్మల్ని ఏదైనా తెగులుకు, ఖడ్గానికి గురి చేస్తాడేమో>> అన్నారు.
\p
\v 4 ఐగుప్తు రాజు <<మోషే, అహరోనూ, ఈ ప్రజలు తమ పనులు చేసుకోకుండా మీరు అడ్డు పడుతున్నారేమిటి? పోయి మీ పనులు చూసుకోండి.
\v 5 మా దేశంలో హెబ్రీయుల జనాభా ఇప్పుడు బాగా పెరిగిపోయింది. వాళ్ళంతా తమ పనులు మానుకునేలా మీరు చేస్తున్నారు>> అని వాళ్ళతో అన్నాడు.
\p
\s5
\v 6 ఆ రోజున ఫరో ప్రజల గుంపుల నాయకులకు, వారి పైఅధికారులకు ఇలా ఆజ్ఞాపించాడు.
\v 7 <<ఇటుకలు చేయడానికి ఉపయోగించే గడ్డి ఇకనుండి మీరు ఇవ్వకండి. వాళ్ళే వెళ్లి కావలసిన గడ్డి తెచ్చుకోవాలి.
\v 8 అయినప్పటికీ వాళ్ళు లెక్క ప్రకారం ఇంతకు ముందు చేసినట్టుగానే ఇటుకల పని చెయ్యాలి. వాళ్ళు సోమరిపోతులు కనుక లెక్క ఏమాత్రం తగ్గించవద్దు. అందుకే వారు <మేము వెళ్లి మా దేవునికి బలులు అర్పించడానికి అనుమతి ఇవ్వండి> అని కేకలు వేస్తున్నారు.
\v 9 అలాంటి వాళ్లకు మరింత కష్టమైన పనులు అప్పగించండి. అప్పుడు వాళ్ళు ఆ అబద్ధపు మాటలు నమ్మకుండా కష్టపడి పని చేసుకుంటారు>> అన్నాడు.
\p
\s5
\v 10 కాబట్టి పర్యవేక్షకులు, పై అధికారులు వెళ్లి ప్రజలతో <<మేము మీకు గడ్డి ఇయ్యము.
\v 11 మీరే వెళ్లి గడ్డి ఎక్కడ దొరుకుతుందో వెతికి సంపాదించుకోండి. అయితే మీ పని ఏమాత్రం తగ్గించము అని ఫరో సెలవిచ్చాడు>>అన్నారు.
\s5
\v 12 అప్పుడు ప్రజలు గడ్డికి బదులు కొయ్యకాడ పుల్లలు సమకూర్చుకోవడానికి ఐగుప్తు దేశమంతటా చెదిరిపోయారు.
\v 13 అంతేకాదు, ఆ పర్యవేక్షకులు వాళ్ళను ఒత్తిడి చేస్తూ <<గడ్డి ఇస్తున్నప్పటి లాగానే ఏ రోజు పని ఆ రోజు లెక్క ప్రకారం పూర్తి చేయాలి>> అని బలవంతపెట్టారు.
\p
\v 14 ఫరో ఆస్థాన అధికారులు తాము ఇశ్రాయేలు ప్రజల గుంపులపై నియమించిన ఇశ్రాయేల్ నాయకులను కొట్టారు. <<ఇది వరకూ లాగా మీ లెక్క ప్రకారం ఇటుకలు నిన్న, ఈ రోజు ఎందుకు చేయించ లేదు?>> అని అడిగారు.
\p
\s5
\v 15 ఇశ్రాయేలు ప్రజల గుంపులపై నియమించిన తనిఖీదారులు ఫరో దగ్గరికి వచ్చారు. <<తమ దాసులమైన మా పట్ల మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు?
\v 16 తమ దాసులకు గడ్డి ఇవ్వకుండా రోజువారీ లెక్క ప్రకారం ఇటుకలు తయారు చేయమని ఆజ్ఞాపిస్తున్నారు. అధికారులు తమ దాసులైన మా నాయకులను హింసిస్తున్నారు. అసలు తప్పు తమ ఆస్థాన అధికారులదే>> అని మొర పెట్టుకున్నారు.
\p
\v 17 అప్పుడు ఫరో <<మీరు సోమరిపోతులు, వట్టి సోమరిపోతులు. అందుకే <మేము వెళ్లి యెహోవాకు బలులు అర్పించాలి> అని అనుమతి అడుగుతున్నారు.
\v 18 మీరు వెళ్లి పని చెయ్యండి. మీకు గడ్డి ఇవ్వడం జరగదు. మీరు మాత్రం లెక్క ప్రకారం ఇటుకలు అప్పగించక తప్పదు.
\s5
\v 19 మీ ఇటుకలు లెక్కలో ఏమాత్రం తగ్గకూడదు, ఏ రోజు పని ఆ రోజే ముగించాలి>> అని చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజల నాయకులు తాము దుర్భరమైన స్థితిలో కూరుకు పోయామని గ్రహించారు.
\p
\v 20 వాళ్ళు ఫరో దగ్గర నుండి తిరిగి వస్తూ, వారిని కలుసుకోవడానికి దారిలో ఎదురు చూస్తున్న మోషే, అహరోనులను కలుసుకున్నారు.
\v 21 వాళ్ళు <<యెహోవా మీకు తగిన విధంగా న్యాయం చేస్తాడు గాక. ఫరో ఎదుట, అతని సేవకుల ఎదుట మీరే మమ్మల్ని నీచులుగా చేసి, మమ్మల్ని చంపించడానికి వాళ్ళ చేతులకు కత్తులు ఇచ్చిన వాళ్ళయ్యారు>> అన్నారు.
\s5
\v 22 మరోసారి మోషే యెహోవా దగ్గరికి వెళ్లి <<ప్రభూ, ఈ ప్రజలకు ఎందుకు హాని కలిగించావు? నన్ను ఎందుకు పంపించావు?
\v 23 నేను నీ ప్రతినిధిగా మాట్లాడడానికి ఫరో దగ్గరికి వచ్చినప్పటి నుంచి అతడు ఈ ప్రజలకు మరింత హాని కలిగిస్తున్నాడు. నువ్వు నీ ప్రజలను విడిపించడానికి నీవు ఏమీ చేయలేదు>> అన్నాడు.
\s5
\c 6
\s యెహోవా తన ప్రజలను విడిపిస్తానని వాగ్దానం చేశాడు
\p
\v 1 అందుకు యెహోవా <<ఫరోకు నేను చేయబోతున్నదంతా నువ్వు తప్పకుండా చూస్తావు. నా బలిష్ఠమైన హస్తం వల్ల అతడు వారిని బయటకు పంపించేలా చేస్తాను. నా హస్త బలం వల్లనే అతడు తన దేశం నుండి ప్రజలను వెళ్ళగొడతాడు.>>
\p
\s5
\v 2 ఆయన ఇంకా మోషేతో ఇలా అన్నాడు <<నేనే యెహోవాను.
\v 3 నేను <
\f +
\fr 6:3
\ft ఎల్ షద్దాయ్
\f* సర్వశక్తి గల దేవుడు> అనే పేరుతో అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమయ్యాను. కాని, యెహోవా అనే నా పేరు నేను వారికి తెలియబరచలేదు.
\v 4 వాళ్ళు పరాయి వారుగా నివాసం చేసిన కనాను దేశాన్ని వారికి ఇస్తానని నేను ఒప్పందం చేశాను.
\v 5 ఐగుప్తీయులకు బానిసలుగా మారిన ఇశ్రాయేలు ప్రజల నిట్టూర్పులు విని నా నిబంధనను గుర్తు చేసుకున్నాను.
\p
\s5
\v 6 కాబట్టి నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పు. నేనే యెహోవాను. ఐగుప్తీయుల బానిసత్వం కింద ఉన్న మీ కష్టాల నుండి మిమ్మల్ని విడిపిస్తాను. మిమ్మల్ని ఆ దేశం నుండి బయటకు రప్పిస్తాను. వాళ్లకు గొప్ప తీర్పు క్రియలు చూపి, నా చేతులు చాపి వారి బానిసత్వం కింద ఉన్న మిమ్మల్ని విడిపిస్తాను.
\v 7 మిమ్మల్ని నా సొంత ప్రజగా నా చెంత చేర్చుకుని మీకు దేవుడైన యెహోవాగా ఉంటాను. అప్పుడు ఐగుప్తీయుల బానిసత్వం కింద నుండి మిమ్మల్ని విడిపించి బయటకు రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు.
\s5
\v 8 అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఇస్తానని నేను చెయ్యి ఎత్తి శపథం చేసిన దేశానికి మిమ్మల్ని రప్పిస్తాను. ఆ దేశాన్ని మీకు సొంతం చేస్తాను. నేను యెహోవాను.>>
\p
\v 9 మోషే ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్పినదంతా చెప్పాడు. అయితే వాళ్ళు తమ నిరాశ నిస్పృహల వల్ల, కఠినమైన బానిసత్వంలో కూరుకు పోయి ఉండడం వల్ల మోషే మాటలు లక్ష్యపెట్ట లేదు.
\s5
\v 10 యెహోవా మోషేతో <<నువ్వు రాజు ఆస్థానం లోకి వెళ్లి,
\v 11 ఐగుప్తు రాజు ఫరోతో ఇశ్రాయేలు ప్రజలను అతని దేశం నుండి బయటకు పంపించమని చెప్పు>> అన్నాడు.
\p
\v 12 అప్పుడు మోషే <<ఇశ్రాయేలీయులు నా మాట వినకపోతే ఫరో ఎందుకు వింటాడు? నాకు
\f +
\fr 6:12
\ft అక్షరాలా సున్నతి లేని పెదవులు.
\f* వాక్చాతుర్యం లేదు>> అని యెహోవా సముఖంలో చెప్పాడు.
\s మోషే అహరోనుల వంశావళి
\p
\v 13 అప్పుడు యెహోవా మోషే అహరోనులతో <<ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకురావడానికి ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి, ఫరో దగ్గరికి మీరు బయలుదేరి వెళ్ళాలి>> అని ఆజ్ఞాపించాడు.
\p
\s5
\v 14 వారి వంశాల మూలపురుషులు వీరు: ఇశ్రాయేలు మొదటి కొడుకైన రూబేను కొడుకులు, హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ. వీళ్ళు రూబేను కుటుంబాలు.
\p
\v 15 షిమ్యోను కొడుకులు యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు, కనాను స్త్రీకి పుట్టిన షావూలు. వీళ్ళు షిమ్యోను కుటుంబాలు.
\p
\s5
\v 16 లేవి కొడుకులు వారి వారి వంశావళుల ప్రకారం గెర్షోను, కహాతు, మెరారి. లేవి 137 సంవత్సరాలు జీవించాడు.
\p
\v 17 గెర్షోను కొడుకులు వారి వారి వంశాల ప్రకారం లిబ్నీ, షిమీ.
\p
\v 18 కహాతు కొడుకులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు. కహాతు 133 సంవత్సరాలు జీవించాడు.
\p
\v 19 మెరారి కొడుకులు మహలి, మూషి. వీళ్ళు తమ తమ వంశాల ప్రకారం లేవి కుటుంబాలు.
\p
\s5
\v 20 అమ్రాము తన తండ్రి సోదరి యోకెబెదును పెళ్లి చేసుకున్నాడు. వారికి అహరోను, మోషే పుట్టారు. అమ్రాము 137 సంవత్సరాలు జీవించాడు.
\p
\v 21 ఇస్హారు కొడుకులు కోరహు, నెపెగు, జిఖ్రీ.
\p
\v 22 ఉజ్జీయేలు కొడుకులు మిషాయేలు, ఎల్సాఫాను, సిత్రీ.
\p
\s5
\v 23 అహరోను అమ్మీనాదాబు కూతురు, నయస్సోను సహోదరి అయిన ఎలీషెబను పెళ్లి చేసుకున్నాడు. వారికి నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు పుట్టారు.
\p
\v 24 కోరహు కొడుకులు అస్సీరు, ఎల్కానా, అబీయాసాపు. వీళ్ళు కోరహీయుల కుటుంబాలు.
\p
\v 25 అహరోను కొడుకు ఎలియాజరు పూతీయేలు కూతుళ్ళలో ఒకామెను పెళ్లి చేసుకున్నాడు. వారికి ఫీనెహాసు పుట్టాడు. వీళ్ళు తమ తమ కుటుంబాల ప్రకారం లేవీ వంశ నాయకులు.
\p
\s5
\v 26 ఇశ్రాయేలు ప్రజలను తమ వంశాల క్రమం ప్రకారం ఐగుప్తు దేశం నుండి బయటకు తీసుకురావాలని యెహోవా ఆజ్ఞాపించింది ఈ అహరోను మోషేలనే.
\p
\v 27 ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి బయటికి పంపించాలని ఐగుప్తు రాజు ఫరోతో మాట్లాడిన మోషే, అహరోనులు వీరే.
\s మోషే అహరోనుల విధేయత
\p
\s5
\v 28 ఐగుప్తు దేశంలో యెహోవా మోషేతో మాట్లాడాడు.
\v 29 <<నేను యెహోవాను. యెహోవా నీతో చెప్పినది మొత్తం నువ్వు ఐగుప్తు రాజు ఫరోతో చెప్పు.>>
\v 30 అందుకు మోషే <<నాకు వాక్చాతుర్యం లేదు. నా మాట ఫరో ఎలా వింటాడు?>> అని యెహోవా సముఖంలో అన్నాడు.
\s5
\c 7
\s యెహోవా మోషేతో చెప్పిన మాట
\p
\v 1 యెహోవా మోషేతో ఇలా అన్నాడు. <<ఇదిగో నిన్ను ఫరోకు దేవుడిగా నియమించాను. నీ అన్న అహరోను నీ మాటలు వినిపించే ప్రవక్తగా ఉంటాడు.
\v 2 నేను నీకు ఆజ్ఞాపించేదంతా నువ్వు మాట్లాడాలి. ఇశ్రాయేలు ప్రజలను తన దేశం నుండి వెళ్ళనివ్వాలని నీ అన్న అహరోను ఫరోతో చెబుతాడు.
\s5
\v 3 అయితే నేను ఫరో హృదయాన్ని కఠినం చేస్తాను. ఆ దేశంలో అనేకమైన అద్భుతాలు, సూచక క్రియలు జరిగిస్తాను.
\v 4 అప్పుడు కూడా ఫరో మీ మాట వినడు. కాబట్టి నా చెయ్యి ఐగుప్తు మీద మోపి గొప్ప తీర్పు క్రియలతో నా సేనలు అంటే ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తు దేశం నుండి బయటకు రప్పిస్తాను.
\v 5 నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి వాళ్ళ మధ్య నుండి ఇశ్రాయేలు ప్రజలను బయటకు రప్పించినప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుంటారు.>>
\s అహరోను కర్ర పాముగా మారిపోవడం
\p
\s5
\v 6 మోషే అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్టు చేశారు.
\v 7 వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషే వయసు 80 సంవత్సరాలు, అహరోను వయసు 83 సంవత్సరాలు.
\s5
\v 8 యెహోవా మోషే అహరోనులతో ఇలా చెప్పాడు. <<మీ దేవుని శక్తి రుజువు చేయడానికి ఏదైనా ఒక అద్భుతం చూపించండి అని మిమ్మల్ని అడిగితే
\v 9 నువ్వు అహరోనుకు నీ చేతికర్రను ఇచ్చి దాన్ని ఫరో ముందు పడవెయ్యమని చెప్పు. అది పాముగా మారిపోతుంది.>>
\v 10 మోషే, అహరోనులు ఫరో దగ్గరికి వెళ్ళారు. యెహోవా వారికి చెప్పినట్టు అహరోను ఫరో ఎదుటా అతని పరివారం ఎదుటా తన కర్రను పడవేసినప్పుడు అది పాముగా మారింది.
\p
\s5
\v 11 అప్పుడు ఫరో తన దేశంలోని జ్ఞానులను, మాంత్రికులను పిలిపించాడు. ఐగుప్తు దేశపు మాంత్రికులు కూడా తమ మంత్ర శక్తితో అదే విధంగా చేశారు.
\v 12 వాళ్ళలో ప్రతి మాంత్రికుడూ తమ కర్రలను పడవేసినప్పుడు అవి పాములుగా మారాయి గాని అహరోను వేసిన కర్ర వాళ్ళు వేసిన కర్రలను మింగివేసింది.
\v 13 అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠివంగా మారిపోయింది, అతడు వారి మాట పెడచెవిన పెట్టాడు.
\s మొదటి తెగులు
\p
\s5
\v 14 తరువాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు. <<ఫరో హృదయం కఠినంగా మారింది. అతడు ఈ ప్రజలను పంపడానికి ఒప్పుకోవడం లేదు.
\v 15 ఉదయాన్నే ఫరో నది ఒడ్డుకు వెళ్తాడు. అప్పుడు నువ్వు నది దగ్గర నిలబడి పాముగా అయిన కర్రను పట్టుకుని ఫరోకు ఎదురు వెళ్ళు.
\s5
\v 16 అతనితో, <ఎడారిలో ఆయన్ని సేవించడానికి ఆయన ప్రజలను వెళ్ళనివ్వమని ఆజ్ఞాపించడానికి హెబ్రీయుల దేవుడు యెహోవా నన్ను నీ దగ్గరికి పంపించాడు. ఇంతకు ముందు నువ్వు మా మాట వినలేదు.
\v 17 ఇప్పుడు యెహోవా చెబుతున్నది ఏమిటంటే, ఇదిగో నా చేతిలో ఉన్న ఈ కర్రతో నేను నదిలో ఉన్న నీళ్ళను కొడుతున్నాను. నీళ్లన్నీ రక్తంగా మారిపోతాయి. దీన్ని బట్టి ఆయన యెహోవా అని నీవు తెలుసుకుంటావు
\v 18 నదిలోని చేపలన్నీ చనిపోతాయి. నది దుర్వాసన కొడుతుంది. ఐగుప్తీయులు ఆ నీళ్ళు తాగలేకపోతారు> అని యెహోవా చెబుతున్నాడు.>>
\p
\s5
\v 19 యెహోవా మోషేతో ఇలా అన్నాడు. <<నువ్వు అహరోనుతో ఇలా చెప్పు. నీ కర్ర పట్టుకుని ఐగుప్తు నీళ్ళ మీద అంటే, వారి నదుల మీద, కాలువల మీద, చెరువుల మీద, నీటి గుంటలన్నిటి మీదా నీ చెయ్యి చాపు. ఆ నీళ్ళన్నీ రక్తంగా మారిపోతాయి. ఐగుప్తు దేశమంతా చెక్క తొట్లలో, రాతి పాత్రల్లో సహా రక్తం ఉంటుంది.>>
\s5
\v 20 యెహోవా ఆజ్ఞాపించినట్టు మోషే అహరోనులు చేశారు. ఫరో, అతని సేవకులు చూస్తూ ఉండగా అహరోను తన కర్ర పైకెత్తి నది నీళ్లను కొట్టినప్పుడు నది నీళ్లన్నీ రక్తంగా మారిపోయాయి.
\p
\v 21 నదిలోని చేపలన్నీ చచ్చిపోయాయి, నది నుండి దుర్వాసన కొట్టింది. ఐగుప్తీయులు నది నీళ్లు తాగలేక పోయారు. ఐగుప్తు దేశమంతా రక్తమయం అయింది.
\v 22 ఐగుప్తు మాంత్రికులు కూడా ఆ విధంగానే చేయగలిగారు. యెహోవా చెప్పినట్టు ఫరో మళ్ళీ తన హృదయం కఠినం చేసుకుని మోషే అహరోనుల మాట వినలేదు.
\s5
\v 23 జరిగిన దాన్ని లక్ష్యపెట్టకుండా ఫరో తన భవనానికి తిరిగి వెళ్ళిపోయాడు.
\v 24 అయితే ఐగుప్తీయులందరూ నది నీళ్లు తాగలేకపోయారు. మంచినీళ్ళ కోసం నది ఒడ్డున గుంటలు తవ్వుకున్నారు.
\v 25 యెహోవా నదిని కొట్టిన తరువాత ఏడు రోజులు గడిచాయి.
\s5
\c 8
\s రెండవ తెగులు. కప్పలు
\p
\v 1 యెహోవా మోషేతో <<నువ్వు ఫరో దగ్గరికి వెళ్లి అతనితో ఇలా చెప్పు, <నన్ను ఆరాధించి సేవించడానికి నా ప్రజలను పంపించు.
\v 2 నువ్వు వాళ్ళను వెళ్ళనీయకపోతే నేను నీ సరిహద్దులన్నిటినీ కప్పలతో బాధ పెడతాను.
\v 3 నదిలో కప్పలు విపరీతంగా పుట్టుకొస్తాయి. అవి నీ ఇంట్లోకి, నీ పడక గదిలోకి, నీ మంచం పైకి, నీ సేవకుల పైకి, నీ ప్రజల పైకి, నీ పొయ్యిల్లో నీ పిండి పిసికే పాత్రల్లోకి ఎక్కివస్తాయి.
\v 4 ఆ కప్పలు నీపై, నీ ప్రజలపై, నీ సేవకులందరి పై దాడి చేస్తాయి> అని యెహోవా చెబుతున్నాడు.>>
\p
\s5
\v 5 యెహోవా మోషేతో ఇంకా ఇలా చెప్పాడు. <<నువ్వు అహరోనుతో <నీ కర్ర పట్టుకుని నది పాయల మీద, కాలవల మీద, చెరువుల మీద నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశం పైకి కప్పలను రప్పించు> అని చెప్పు>> అన్నాడు.
\v 6 అహరోను ఐగుప్తు దేశం లోని నీళ్ళ మీద తన చెయ్యి చాపాడు. అప్పుడు కప్పలు పుట్టుకొచ్చి ఐగుప్తు దేశాన్ని కప్పివేశాయి.
\v 7 ఐగుప్తు దేశపు మాంత్రికులు కూడా తమ మంత్ర శక్తులు ఉపయోగించి ఐగుప్తు దేశం అంతటా కప్పలను రప్పించారు.
\p
\s5
\v 8 అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించాడు. <<నా దగ్గర నుండి, నా ప్రజల దగ్గర నుండి ఈ కప్పలు తొలగిపోయేలా చేయమని యెహోవాను ప్రాధేయపడండి. కప్పలు తొలగిపోతే యెహోవాకు బలులు అర్పించడానికి ఈ ప్రజలను పంపిస్తాను>> అని చెప్పాడు.
\v 9 అందుకు మోషే <<ఈ కప్పలు మీ మీద, మీ ఇళ్ళలో ఉండకుండాా చచ్చి మిగిలినవన్నీ నదిలోనే ఉండిపోయేలా నీ కోసం, నీ సేవకుల కోసం నేను దేవుణ్ణి ఎప్పుడు ప్రాధేయపడాలో నన్ను అడిగే అవకాశం నీదే>> అన్నాడు. అప్పుడు ఫరో <<రేపే ఆ పని చెయ్యి>> అని బదులిచ్చాడు.
\s5
\v 10 అందుకు మోషే <<మా దేవుడు యెహోవా లాంటి వాడు ఎవ్వరూ లేడు అని నువ్వు గ్రహించేలా నువ్వు కోరుకున్నట్టు జరుగుతుంది.
\v 11 కప్పలు మీ నుండి, మీ ఇళ్ళ నుండి, నీ సేవకుల, నీ ప్రజల ఇళ్ళనుండి తొలగిపోయి నదిలోకి చేరుకుంటాయి>> అన్నాడు.
\p
\v 12 మోషే అహరోనులు ఫరో దగ్గర నుండి బయలుదేరి వెళ్ళారు. యెహోవా ఫరో మీదికి రప్పించిన కప్పల విషయం మోషే ఆయనకు మొరపెట్టాడు.
\s5
\v 13 యెహోవా మోషే మాట ఆలకించాడు. ఇళ్ళలో, బయటా, పొలాల్లో ఎక్కడా కప్పలు మిగలకుండా చనిపోయాయి.
\v 14 ప్రజలు వాటిని కుప్పలుగా పడవేసినప్పుడు నేలంతా దుర్వాసన వచ్చింది.
\v 15 ఇబ్బంది నుండి ఉపశమనం కలిగింది. యెహోవా చెప్పినట్టు ఫరో మళ్ళీ తన హృదయం కఠినం చేసుకుని వారి మాట లక్ష్యపెట్టలేదు.
\s మూడవ తెగులు. చిన్న దోమలు
\p
\s5
\v 16 అప్పుడు యెహోవా మోషేతో <<నువ్వు నీ కర్రను చాపి ఈ దేశంలో ఉన్న దుమ్మును కొట్టు. ఆ దుమ్ము ఐగుప్తు దేశమంతా చిన్న దోమల్లాగా అలుముకుంటుంది అని అహరోనుతో చెప్పు>> అన్నాడు. అప్పుడు వారిద్దరూ ఆ విధంగా చేశారు.
\v 17 అహరోను తన కర్రను చాపి ఆ దేశపు దుమ్మును కొట్టినప్పుడు మనుష్యుల మీద, జంతువుల మీద చిన్న దోమలు వచ్చాయి. ఐగుప్తు దేశంలోని దుమ్ము అంతా రేగి దోమల్లాగా వ్యాపించాయి.
\s5
\v 18 మాంత్రికులు కూడా చిన్నదోమలు పుట్టించాలని తమ మంత్రాలు ప్రయోగించారు గానీ వారి వల్ల కాలేదు. మనుష్యుల మీదా, జంతువుల మీదా చిన్న దోమలు నిలిచి ఉన్నప్పుడు
\v 19 మాంత్రికులు <<ఇది దేవుడైన యెహోవా వేలు>> అని ఫరోతో చెప్పారు. అయినప్పటికీ యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినం కావడం వల్ల అతడు వారి మాట వినలేదు.
\s నాలుగవ తెగులు. ఈగలు
\p
\s5
\v 20 కాబట్టి యెహోవా మోషేతో <<నువ్వు ఉదయాన్నే లేచి నది దగ్గర ఉన్న ఫరో ఎదుట నిలిచి అతనితో, నన్ను ఆరాధించడానికి నా ప్రజలను వెళ్లనివ్వు.
\v 21 నువ్వు నా ప్రజలను వెళ్ళనివ్వని పక్షంలో నేను నీ మీదికీ, నీ సేవకుల మీదికీ, నీ ప్రజలందరి మీదికీ మీ ఇళ్ళలోకీ ఈగల గుంపులను పంపుతాను. ఐగుప్తీయుల ఇళ్ళూ వారు ఉండే ప్రదేశాలూ ఈగల గుంపులతో నిండిపోతాయి.
\p
\s5
\v 22 భూమిపై నేనే యెహోవాను అని నువ్వు తెలుసుకొనేలా ఆ రోజు నేను నా ప్రజలు నివసిస్తున్న గోషెను దేశాన్ని దీని నుండి మినహాయిస్తాను. అక్కడ ఈగల గుంపులు ఉండవు.
\v 23 నా ప్రజలను నీ ప్రజల నుండి
\f +
\fr 8:23
\ft విడిపిస్తాను
\f* ప్రత్యేకపరుస్తాను. రేపే ఈ అద్భుత కార్యం జరుగుతుంది అని యెహోవా సెలవిచ్చాడు అని చెప్పు>>అన్నాడు.
\v 24 యెహోవా ఆ విధంగా జరిగించాడు. బాధ కలిగించే ఈగల గుంపులు ఫరో ఇంట్లోకి, అతని సేవకుల ఇళ్ళలోకి, ఐగుప్తు దేశమంతా వ్యాపించాయి. ఈగల గుంపులమయమై ఆ దేశమంతా పాడై పోయింది.
\p
\s5
\v 25 అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించాడు. <<మీరు వెళ్లి మన దేశంలోనే మీ దేవునికి బలి అర్పించుకోండి>> అని వాళ్ళతో చెప్పాడు.
\v 26 అందుకు మోషే <<అలా చేయడం వీలు కాదు. మా దేవుడు యెహోవాకు మేము అర్పించే బలులు ఐగుప్తీయులకు అసహ్యమైనవి. వాళ్లకు అసహ్యమైన బలులు వాళ్ళ కళ్ళ ఎదుటే అర్పిస్తే వాళ్ళు మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపరా.
\v 27 అందుకేమా దేవుడు యెహోవా మాకు సెలవిచ్చినట్టు మేము ఎడారిలోకి మూడు రోజుల ప్రయాణమంత దూరం వెళ్లి అక్కడ బలులు అర్పిస్తాం>> అని చెప్పాడు.
\p
\s5
\v 28 ఫరో <<మీరు ఎడారిలో మీ దేవుడు యెహోవాకు బలులు అర్పించడానికి మిమ్మల్ని వెళ్ళనిస్తాను. అయితే దూరం వెళ్ళవద్దు. ఇంకా నా కోసం కూడా మీ దేవుణ్ణి వేడుకోండి>> అన్నాడు.
\v 29 అందుకు మోషే <<నేను నీ దగ్గర నుండి వెళ్లి రేపటి రోజున ఈ ఈగల గుంపులు మీ దగ్గర నుండి, మీ సేవకుల దగ్గర నుండి, నీ ప్రజల దగ్గర నుండి తొలగిపోయేలా యెహోవాను వేడుకొంటాను. అయితే యెహోవాకు బలి అర్పించడానికి ప్రజలను వెళ్ళనీయకుండా ఇకపై మోసం చేయవద్దు>> అని చెప్పి
\s5
\v 30 ఫరో దగ్గర నుండి బయలుదేరి వెళ్లి యెహోవాను ప్రార్థించాడు.
\p
\v 31 యెహోవా మోషే కోరినట్టు జరిగించాడు. ఈగల గుంపులు ఫరో దగ్గర నుండి, అతని సేవకుల దగ్గర నుండి, ప్రజల దగ్గర నుండి ఒక్కటి కూడా మిగలకుండా తొలగిపోయాయి.
\v 32 అయితే అప్పుడు కూడా ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకుని ఇశ్రాయేలు ప్రజలను వెళ్ళనియ్యలేదు.
\s5
\c 9
\s ఐదవ తెగులు. పశు సంపద హతం
\p
\v 1 అప్పుడు యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. <<నువ్వు ఫరో దగ్గరికి వెళ్లి ఇలా చెప్పు, దేవుడు యెహోవా ఇలా చెప్పమన్నాడు. <నన్ను ఆరాధించడానికి నా ప్రజలను వెళ్లనివ్వు.>
\v 2 నువ్వు గనక వాళ్ళను వెళ్ళనివ్వకుండా ఇంకా నిర్బంధంలో ఉంచినట్టయితే,
\v 3 యెహోవా చెయ్యి చాపి ఎంతో బాధ కలిగించే తెగులు పంపిస్తాడు. ఆ తెగులు నీ పశువులకు, గుర్రాలకు, గాడిదలకు, ఒంటెలకు, ఎద్దులకు, గొర్రెలకు పాకుతుంది.
\p
\v 4 అయితే యెహోవా ఇశ్రాయేలు ప్రజల పశువులను ఐగుప్తు పశువులను వేరు చేస్తాడు. ఇశ్రాయేలీయులకు చెందిన వాటిలో ఒక్కటి కూడా చనిపోదని హెబ్రీయుల దేవుడు యెహోవా చెబుతున్నాడు.
\s5
\v 5 దేశంలో రేపు నిర్ణీత సమయానికి యెహోవా ఈ కార్యం జరిగిస్తాడు>> అని చెప్పాడు.
\p
\v 6 తరువాతి రోజున యెహోవా తెగులు పంపించినప్పుడు ఐగుప్తీయుల పశువులన్నీ చనిపోయాయి. అయితే ఇశ్రాయేలు ప్రజల పశువుల్లో ఒక్కటి కూడా చావలేదు.
\v 7 ఇశ్రాయేలు ప్రజల పశువుల్లో ఒక్కటి కూడా చనిపోలేదనే విషయం ఫరో నిర్ధారణ చేసుకున్నాడు. అయినప్పటికీ ఫరో హృదయం కఠినంగా మారిపోవడం వల్ల ప్రజలను పంపడానికి అంగీకరించలేదు.
\s అరవ తెగులు. కురుపులు
\p
\s5
\v 8 అప్పుడు యెహోవా <<మీరు మీ పిడికిళ్ల నిండా బూడిద తీసుకోండి. మోషే ఫరో చూస్తూ ఉండగా దాన్ని ఆకాశం వైపు చల్లండి.
\v 9 అప్పుడు అది ఐగుప్తు దేశమంతా సన్నని దుమ్ములాగా మారి దేశంలోని మనుష్యుల మీదా, జంతువుల మీదా చీము పట్టే కురుపులు కలగజేస్తుంది>> అని మోషే అహరోనులతో చెప్పాడు.
\p
\v 10 మోషే అహరోనులు బూడిద తీసుకుని ఫరో దగ్గర నిలబడ్డారు. మోషే ఆకాశం వైపు దాన్ని చల్లాడు. దానివల్ల మనుష్యులకు, జంతువులకు చీము కురుపులు పుట్టాయి.
\s5
\v 11 ఆ కురుపుల దురదల వల్ల మాంత్రికులు మోషే ఎదుట నిలబడలేకపోయారు. ఆ కురుపులు మాంత్రికులకు, ఐగుప్తీయులందరికీ పుట్టాయి.
\v 12 అయినప్పటికీ యెహోవా మోషేతో చెప్పినట్టు యెహోవా ఫరో హృదయాన్ని కఠినం చేయడం వల్ల అతడు వాళ్ళ మాట వినలేదు.
\p
\s5
\v 13 తరువాత యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. <<నువ్వు ఉదయం కాగానే లేచి ఫరో ఎదుటికి వెళ్లి అతనితో ఇలా చెప్పు, యెహోవా ఆరాధించడానికి నా ప్రజలను వెళ్లనివ్వు.
\v 14 భూమి అంతటిలో నాలాంటివాడు ఎవరూ లేరని నీవు తెలుసుకోవాలని నీ హృదయం తీవ్రంగా కలత చెందేలా ఈసారి నేను నా తెగుళ్ళన్నీ నీ సేవకుల పైకి, నీ దేశ ప్రజల పైకి పంపుతాను.
\s5
\v 15 ఇంతకు ముందే నేను నా చెయ్యి చాపి నిన్నూ నీ ప్రజలనూ విపత్తుతో కొట్టి భూమి మీద లేకుండా నాశనం చేసి ఉండేవాణ్ణి.
\s ఏడవ తెగులు. వడగండ్లు
\p
\v 16 నిన్ను బతికి ఉంచిన కారణం నా సామర్ధ్యం నీకు చూపడానికే. తద్వారా భూలోకమంతటా నా పేరు ప్రఖ్యాతి పొందాలి.
\v 17 నువ్వు ఇంకా నా ప్రజలను వెళ్ళనీయకుండా వాళ్ళపై మిడిసిపడుతున్నావు.
\s5
\v 18 ఇదిగో విను, రేపు ఈ పాటికి నేను తీవ్రమైన బాధ కలిగించే వడగళ్ళు కురిపిస్తాను. ఐగుప్తు సామ్రాజ్యం ఏర్పడినది మొదలు ఇప్పటి వరకూ అలాంటి వడగళ్ళు కురియలేదు.
\p
\v 19 అందువల్ల నువ్వు నీ పశువులను, పొలాల్లో ఉన్న నీ పంటలనూ త్వరగా భద్రం చేయించుకో. ఇంటికి చేరకుండా పొలంలో ఉన్న ప్రతి వ్యక్తీ ప్రతి జంతువూ వడగళ్ళ బారిన పడి చనిపోతారు.>>
\s5
\v 20 యెహోవా మోషే చేత పలికించిన మాటలు విన్న ఫరో సేవకుల్లో కొందరు తమ పశువులను ఇళ్లలోకి తెప్పించుకున్నారు.
\v 21 యెహోవా మాట లక్ష్యపెట్టనివారు తమ పనివాళ్ళను, పశువులను పొలంలోనే ఉండనిచ్చారు.
\s5
\v 22 యెహోవా <<నీ చెయ్యి ఆకాశం వైపు చాపు. ఐగుప్తు దేశంలో ఉన్న మనుషుల మీదా, జంతువుల మీదా పంటలన్నిటి మీదా వడగళ్లు కురుస్తాయి>> అని మోషేతో చెప్పాడు.
\p
\v 23 మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములు వడగండ్లు కురిపించాడు. భూమి మీద పిడుగులు పడుతున్నాయి. ఐగుప్తు దేశం అంతటా యెహోవా వడగళ్ళు కురిపించాడు.
\v 24 ఆ విధంగా వడగళ్ళు, వడగళ్ళతో కూడిన పిడుగులు ఎంతో బాధ కలిగించాయి. ఐగుప్తు దేశం ఏర్పడినది మొదలు ఇలాంటిది సంభవించ లేదు.
\s5
\v 25 ఐగుప్తు దేశమంతటా కురిసిన ఆ వడగళ్ళు మనుష్యులను, జంతువులను, బయట ఉండిపోయిన సమస్తాన్నీ నాశనం చేశాయి. పొలంలో ఉన్న పంట అంతా నాశనం అయ్యింది. చెట్లన్నీ విరిగిపోయాయి.
\v 26 అయితే ఇశ్రాయేలు ప్రజలు నివసించే గోషెను దేశంలో మాత్రం వడగళ్ళు పడలేదు.
\p
\s5
\v 27 ఇది చూసిన ఫరో మోషే అహరోనులను పిలిపించాడు. <<ఈసారి నేను తప్పు చేశాను. యెహోవా న్యాయవంతుడు, నేనూ నా ప్రజలూ దుర్మార్గులం.
\v 28 ఇంతవరకూ జరిగింది చాలు. ఈ భయంకరమైన ఉరుములు, వడగళ్ళు ఇంకా రాకుండా యెహోవాను వేడుకోండి. ఇక నేను మిమ్మల్ని ఆపను, మీరు కోరిన చోటికి వెళ్ళనిస్తాను>> అని వాళ్ళతో చెప్పాడు.
\s5
\v 29 మోషే అతనితో <<నేను ఈ పట్టణం నుండి బయటకు వెళ్ళి నా చేతులు యెహోవా వైపు ఎత్తుతాను. ఈ ఉరుములు ఆగిపోతాయి, వడగళ్ళు ఇకపై కురియవు. దీన్నిబట్టి ఈ లోకమంతా యెహోవాదేనని నువ్వు తెలుసుకొంటావు.
\v 30 అయినప్పటికీ నీకూ, నీ సేవకులకూ దేవుడు యెహోవా పట్ల భయభక్తులు ఏర్పడలేదని నాకు తెలుసు>> అన్నాడు.
\p
\s5
\v 31 ఆ రోజుల్లో జనపనార చెట్లు మొగ్గ తొడిగాయి. బార్లీ చేలు వెన్నులు వేశాయి కనుక అవన్నీ నాశనం అయ్యాయి.
\v 32 గోదుమలు, మిరప మొక్కలు మొలకలు వేయనందువల్ల అవి పాడవలేదు.
\v 33 మోషే ఫరోతో మాట్లాడి ఆ పట్టణం నుండి బయటకు వెళ్లి యెహోవా వైపు తన చేతులు ఎత్తి ప్రార్థించినప్పుడు వాన ఆగిపోయింది. ఉరుములు, వడగళ్ళు నిలిచిపోయాయి.
\p
\s5
\v 34 అయితే వర్షం, వడగళ్ళు, ఉరుములు ఆగిపోవడం చూసిన ఫరో, అతని సేవకులు ఇంకా పాపం చేస్తూ తమ హృదయాలను కఠినం చేసుకున్నారు.
\v 35 యెహోవా మోషేకు చెప్పినట్టు ఫరో హృదయం కఠినంగా మారింది, అతడు ఇశ్రాయేలు ప్రజలను వెళ్ళనియ్యలేదు.
\s5
\c 10
\s ఎనిమిదవ తెగులు. మిడతలు
\p
\v 1 యెహోవా మోషేతో <<ఫరో దగ్గరికి తిరిగి వెళ్ళు. నేను చేసిన అద్భుత కార్యాలను వాళ్ళ మధ్య కనపరచాలని నేను అతడి గుండె, అతని సేవకుల గుండెలు బండబారిపోయేలా చేశాను.
\v 2 నేను ఐగుప్తీయుల పట్ల వ్యవహరించిన విధానాన్ని, యెహోవాను నేనేనని మీరు తెలుసుకొనేలా నేను చేస్తున్న అద్భుత కార్యాలను నువ్వు నీ కొడుకులకూ, మనవలకూ తెలియజేయాలి>> అని చెప్పాడు.
\p
\s5
\v 3 మోషే అహరోనులు ఫరో దగ్గరికి వెళ్లి అతనితో ఇలా చెప్పారు. <<హెబ్రీయుల దేవుడు యెహోవా చెబుతున్నది ఏమిటంటే, ఎంతకాలం వరకూ నా మాట వినకుండా ఉంటావు? నన్ను ఆరాధించడానికి నా ప్రజలను వెళ్లనివ్వు.
\v 4 నువ్వు నా ప్రజలను వెళ్ళనివ్వని పక్షంలో రేపు నేను నీ దేశం మీదికి మిడతలను రప్పిస్తాను.
\s5
\v 5 నేల కనపడనంతగా అవి భూమిని కప్పివేస్తాయి. మీ దేశంలో మిగిలిన దాన్ని అంటే వడగండ్ల దెబ్బ నుండి తప్పించుకున్నదాన్ని, అంటే పొలాల్లో మొలకెత్తిన ప్రతి మొక్కనూ అవి తినేస్తాయి.
\v 6 మీ గృహాలూ మీ సేవకుల గృహాలూ ఐగుప్తీయుల ఇళ్ళన్నీ వాటితో నిండిపోతాయి. మీ తండ్రులు, పూర్వికులు ఈ దేశంలో ఉన్నప్పటి నుండి ఈనాటి వరకూ ఇలాంటి వాటిని చూసి ఉండలేదు>> అని చెప్పి ఫరో దగ్గర నుండి వెళ్ళిపోయారు.
\p
\s5
\v 7 అప్పుడు ఫరో సేవకులు ఫరోతో <<ఎంతకాలం వరకూ ఈ మనిషి మనలను ఇబ్బందులకు గురిచేస్తాడు? వాళ్ళ దేవుడు యెహోవాను ఆరాధించడానికి ఇశ్రాయేలీయులను వెళ్లనివ్వు. మన ఐగుప్తు దేశం పాడైపోతున్నదని నీకింకా తెలియడం లేదా?>> అన్నారు.
\v 8 కాబట్టి మోషే అహరోనులను ఫరో దగ్గరికి తీసుకు వచ్చారు. ఫరో <<మీరు వెళ్లి మీ దేవుడు యెహోవాను ఆరాధించుకోండి. ఈ పని కోసం ఎవరెవరు వెళ్తారు?>> అని అడిగాడు.
\s5
\v 9 అందుకు మోషే <<మేము యెహోవాకు మహోత్సవం జరిపించాలి. కాబట్టి మా కొడుకులను, కూతుళ్ళను, మందలను, పశువులను వెంటబెట్టుకుని మా పిల్లలతో, పెద్దలతో కలసి వెళ్తాం>> అని బదులిచ్చాడు.
\p
\v 10 అందుకు ఫరో <<యెహోవా మీకు కావలిగా ఉంటాడా? నేను మిమ్మల్ని మీ పిల్లలతో సహా వెళ్ళనిస్తానా? చూడండి, మీలో దురుద్దేశం ఉంది.
\v 11 కాబట్టి పురుషులైన మీరు మాత్రమే వెళ్ళి యెహోవాకు ఉత్సవం జరుపుకోండి. మీరు కోరుకున్నది అదే గదా>> అన్నాడు. తరువాత వాళ్ళను ఫరో ఎదుట నుండి వెళ్ళగొట్టారు.
\s5
\v 12 అప్పుడు యెహోవా మోషేతో <<మిడతల దండు వచ్చేలా ఐగుప్తు దేశం మీద నీ చెయ్యి చాపు. అవి ఐగుప్తు మీదకి వచ్చి ఈ దేశంలో ఉన్న పంటలన్నిటినీ అంటే వడగళ్ళ ద్వారా పాడవని పంటలన్నిటినీ తినివేస్తాయి>> అని చెప్పాడు.
\v 13 మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపాడు. యెహోవా ఆ పగలూ, రాత్రీ ఆ దేశం మీద తూర్పు గాలి వీచేలా చేశాడు. తెల్లవారేసరికి తూర్పు గాలికి ఎగిరే మిడతలు దండుగా వచ్చిపడ్డాయి.
\p
\s5
\v 14 తీవ్రంగా హాని కలిగించే ఆ మిడతలు ఐగుప్తు దేశమంతటి మీదికీ వచ్చి ఐగుప్తు దేశంలోని అన్ని సరిహద్దుల్లో నిలిచి భూమి మొత్తాన్నీ కప్పివేశాయి. అంతకు ముందెప్పుడూ ఇలాంటి మిడతలు లేవు, ఇకముందు కూడా ఉండబోవు.
\v 15 ఆ దేశమంతా చీకటి కమ్మింది. ఆ దేశంలో కూరగాయలన్నిటినీ వడగళ్ళు పాడు చేయని పంటలన్నిటినీ చెట్లనూ ఫలాలనూ అవి తినివేశాయి. ఐగుప్తు దేశమంతా చెట్లు గానీ పొలాల పంటలు గానీ పచ్చగా ఉండేది ఏదీ మిగలలేదు.
\p
\s5
\v 16 కాబట్టి ఫరో మోషే అహరోనులను వెంటనే పిలిపించాడు. <<నేను మీ పట్లా మీ దేవుడు యెహోవా పట్లా తప్పిదం చేశాను.
\v 17 దయచేసి ఈ ఒక్కసారి మాత్రం నా తప్పు క్షమించండి. ఈ చావును తెచ్చే విపత్తును మాత్రం నా మీద నుండి తప్పించమని మీ దేవుడైన యెహోవాను వేడుకోండి>> అన్నాడు.
\v 18 మోషే ఫరో దగ్గర నుండి బయలుదేరి వెళ్ళి యెహోవాకు ప్రార్ధించాడు.
\p
\s5
\v 19 అప్పుడు యెహోవా, గాలిని తిప్పి శక్తివంతమైన పడమటి గాలి విసిరేలా చేశాడు. ఆ గాలి తీవ్రతకు మిడతలు కొట్టుకుపోయి ఎర్ర సముద్రంలో పడిపోయాయి. ఐగుప్తు దేశమంతటిలో ఒక్క మిడత కూడా మిగలలేదు.
\v 20 అయితే యెహోవా ఫరో హృదయాన్ని కఠినం చేయడం వల్ల అతడు ఇశ్రాయేలు ప్రజలను వెళ్ళనియ్యలేదు.
\s5
\v 21 అప్పుడు యెహోవా మోషేతో <<ఆకాశం వైపు నీ చెయ్యి చాపు. ఐగుప్తు దేశమంతా కటిక చీకటి కమ్ముకుంటుంది>> అని చెప్పాడు.
\s తొమ్మిదవ తెగులు. చీకటి
\p
\v 22 మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతా మూడు రోజులపాటు గాఢాంధకారం కమ్ముకుంది.
\v 23 ఆ మూడు రోజులు ఒకరికి ఒకరు కనబడలేదు. తామున్న చోటు నుండి ఎవ్వరూ లేచి కదలలేకపోయారు. అయితే ఇశ్రాయేలు ప్రజలందరి ఇళ్ళలో వెలుగు ఉంది.
\p
\s5
\v 24 ఫరో మోషేను పిలిపించాడు. <<మీరు వెళ్లి యెహోవాను ఆరాధించండి. అయితే మీ మందలూ, పశువులూ మాత్రం ఇక్కడే ఉండాలి. మీ బిడ్డలు మాత్రం మీతో వెళ్ళవచ్చు>> అన్నాడు.
\v 25 అందుకు మోషే <<మేము మా దేవుడైన యెహోవాకు అర్పించవలసిన హోమ బలి అర్పణల కోసం నువ్వు మా పశువుల మందలను ఇవ్వ వలసి ఉంటుంది.
\v 26 మా పశువులు, మందలు మాతో కూడా రావాలి. మా పశువుల కాలి గిట్ట కూడా విడిచిపెట్టం. మేము వేటిని యెహోవాకు బలి అర్పించాలో అక్కడికి చేరే వరకూ మాకు తెలియదు. మా దేవుడైన యెహోవాను ఆరాధించే సమయంలో మా మందల్లోనుంచే వాటిని తీసుకోవాలి>> అని చెప్పాడు.
\p
\s5
\v 27 అయితే యెహోవా ఫరో హృదయాన్ని కఠినం చేయడం వల్ల అతడు వారిని వెళ్ళనియ్యలేదు.
\v 28 అప్పుడు ఫరో <<బయటకు వెళ్ళు, జాగ్రత్త సుమా. ఇకపై నాకు కనిపించకు. నువ్వు నాకు ఎదురు పడిన రోజున తప్పకుండా చస్తావు>> అన్నాడు.
\v 29 అందుకు మోషే <<సరే నువ్వే అన్నావు గదా, ఇకపై నీ ముఖం చూడను>> అన్నాడు.
\s5
\c 11
\s పదవ తెగులు. ఐగుప్తు వారి ఇళ్ళలో ప్రథమ సంతానం మరణం
\p
\v 1 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. <<ఫరో మీదికీ ఐగుప్తు మీదికీ మరొక తెగులు రప్పించబోతున్నాను. దాని తరువాత అతడు ఇక్కడ నుండి మిమ్మల్ని వెళ్ళనిస్తాడు. ఎవ్వరూ మిగలకుండా శాశ్వతంగా అతడు మిమ్మల్ని దేశం నుండి పంపించి వేస్తాడు.
\v 2 కాబట్టి ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ ఐగుప్తు జాతి వాళ్ళైన తమ పొరుగువాళ్ళ దగ్గర నుండి వెండి, బంగారు నగలు అడిగి తీసుకోవాలని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాలి.>>
\p
\v 3 యెహోవా ఇశ్రాయేలు ప్రజల పట్ల ఐగుప్తీయులకు కనికరం కలిగేలా చేశాడు. అంతేకాక ఐగుప్తు దేశవాసులు, ఫరో సేవకులు మోషేను చాలా గొప్పగా ఎంచారు.
\s5
\v 4 మోషే ఫరోతో ఇలా అన్నాడు<<యెహోవా చెప్పింది ఏమిటంటే, అర్థరాత్రి నేను బయలుదేరి ఐగుప్తు దేశంలోకి వెళ్తాను.
\v 5 ఐగుప్తు దేశంలో మొదట పుట్టిన సంతానమంతా చనిపోతారు. సింహాసనంపై ఉన్న ఫరో మొదటి సంతానం మొదలుకుని తిరగలి విసిరే పనిమనిషి మొదట పుట్టిన సంతానం దాకా, పశువుల్లో కూడా మొదట పుట్టినవన్నీ చనిపోతాయి.
\p
\s5
\v 6 అప్పుడు ఐగుప్తు దేశంలో ప్రతి చోటా గొప్ప విలాపం ఉంటుంది. అలాంటి ఏడుపు ఇంతవరకూ ఎన్నడూ పుట్టలేదు, ఇకపై ఎన్నడూ పుట్టదు.
\v 7 యెహోవా ఐగుప్తీయుల నుండి ఇశ్రాయేలు ప్రజలను ప్రత్యేకపరుస్తాడని మీరు తెలుసుకొనేలా ఇశ్రాయేలు ప్రజలపై గానీ జంతువులపై గానీ ఇశ్రాయేలు ప్రజల్లో ఏ ఒక్కరి మీదా కుక్క అయినా నాలుక ఆడించదు.
\v 8 అప్పుడు నీ సేవకులైన వీరంతా నా దగ్గరికి వస్తారు. నా ఎదుట సాష్టాంగపడి, <నువ్వు, నిన్ను అనుసరించే వాళ్ళంతా ఈ దేశం విడిచి బయలుదేరండి> అని చెబుతారు. అప్పుడు నేను నా ప్రజలతో వెళ్ళిపోతాను>> అని చెప్పి మోషే మండిపడుతూ ఫరో దగ్గరనుండి వెళ్ళిపోయాడు.
\p
\s5
\v 9 అప్పుడు యెహోవా <<ఐగుప్తు దేశంలో నేను చేసే అద్భుత క్రియలు అధికం అయ్యేలా ఫరో మీ మాట వినడు>> అని మోషేతో చెప్పాడు.
\v 10 మోషే అహరోనులు ఫరో సమక్షంలో ఈ అద్భుతాలు చేశారు. అయినప్పటికీ యెహోవా ఫరో హృదయాన్ని కఠినం చేశాడు. అతడు ఇశ్రాయేలు ప్రజలను తన దేశం నుండి వెళ్ళనియ్యలేదు.
\s5
\c 12
\s మొదటి పస్కా
\p
\v 1 మోషే అహరోనులతో ఐగుప్తు దేశంలో యెహోవా ఇలా చెప్పాడు.
\v 2 <<నెలల్లో ఈ నెల మీకు మొదటిది. ఇది మీ సంవత్సరానికి మొదటి నెలన్న మాట.
\s5
\v 3 ఇశ్రాయేలు సమాజంతో ఇలా చెప్పు. మీరు ఇశ్రాయేలు ప్రజల సమాజమంతటితో కలసి ఈ నెల పదవ రోజున తమ కుటుంబాల ప్రకారం ప్రతి ఒక్కడూ, అంటే ప్రతి ఇంటి లెక్క చొప్పున ఒక గొర్రెపిల్లను గానీ, మేకపిల్లను గానీ తీసుకోవాలి.
\p
\v 4 ఒక కుటుంబం ఆ గొర్రెపిల్లను తినడానికి చిన్నదైతే ఆ కుటుంబ పెద్ద ఒక గొర్రె పిల్ల, లేక మేక పిల్ల సరిగ్గా సరిపోయే విధంగా తన పొరుగింటి కుటుంబ సభ్యులను కలుపుకుని ఆ ప్రకారం వారిని లెక్కగట్టాలి.
\p
\s5
\v 5 మీరు ఎన్నుకొనే గొర్రె లేదా మేక పిల్ల ఒక సంవత్సరం వయసు గల మగదై ఉండాలి. అది ఎలాంటి లోపం లేకుండా ఉండాలి.
\v 6 ఈ నెల 14 వ రోజు వరకూ దాన్ని ఉంచాలి. తరువాత ఇశ్రాయేలు ప్రజలంతా సాయంకాల సమయంలో దాన్ని చంపాలి.
\v 7 కొంచెం రక్తం తీసుకుని ఆ మాంసం ఏ ఇంట్లో తింటారో ఈ ఇంటి గుమ్మం రెండు నిలువు కమ్ముల మీద, పై కమ్మీ మీద చల్లాలి.
\p
\v 8 ఆ రాత్రివేళ నిప్పులతో మాంసాన్ని కాల్చి తినాలి. పొంగకుండా చేసిన రొట్టెలతో, చేదు కూరలతో కలిపి దాన్ని తినాలి.
\s5
\v 9 దాన్ని పచ్చిగా గానీ ఉడికించిగానీ తినకూడదు. దాని తల, కాళ్ళు, లోపలి భాగాలను నిప్పుతో కాల్చి తినాలి.
\v 10 తెల్లవారే పాటికి దానిలో ఏమీ మిగల్చకూడదు. ఒకవేళ ఏమైనా మిగిలితే దాన్ని పూర్తిగా కాల్చివెయ్యాలి.
\p
\v 11 మీరు దాన్ని తినవలసిన విధానం ఇది. మీ నడుముకు నడికట్టు కట్టుకుని, కాళ్ళకు చెప్పులు వేసుకుని, మీ కర్రలు చేతబట్టుకుని
\f +
\fr 12:11
\ft అంటే ప్రయాణానికి సిద్ధమై తినాలి.
\f* త్వరత్వరగా తినాలి. ఎందుకంటే అది యెహోవాకు
\f +
\fr 12:11
\ft పస్కా అంటే, ఐగుప్టు వారి మొదటి సంతానాన్ని వధించడానికి సంహార దూత బయలు దేరినప్పుడు అతడు ఇశ్రాయేల్ వారిని దాటిపోయిన సంగతిని జ్ఞాపకం చేసుకోవడానికి ఉన్న పండగ.
\f* పస్కా బలి.
\p
\s5
\v 12 నేను ఆ రాత్రి వేళ ఐగుప్తు దేశమంతా తిరుగుతూ ఆ దేశంలోని మనుషుల్లో, జంతువుల్లో మొదటి సంతానం మొత్తాన్ని చంపివేస్తాను. ఐగుప్తు దేవుళ్ళ విషయంలో
\f +
\fr 12:12
\ft ఐగుప్తు దేవుళ్ళు అందరూ నిజమైన దేవుళ్ళు కారని రుజువు చేస్తాను.
\f* తీర్పు తీరుస్తాను. నేను యెహోవాను.
\v 13 మీరు నివసించే ఇళ్ళపై ఉన్న ఆ రక్తం యెహోవా రాక విషయంలో మీకు ఆనవాలుగా ఉంటుంది. నేను ఐగుప్తు జాతి మొదటి సంతానాన్ని నాశనం చేస్తూ ఉన్న సమయంలో ఆ రక్తాన్ని చూసి మిమ్మల్ని చంపకుండా దాటి వెళ్ళిపోతాను. ఈ విపత్తు మీ మీదికి వచ్చి మిమ్మల్ని నాశనం చేయదు.
\s పొంగని రొట్టెల పండగ
\p
\v 14 కాబట్టి ఈ రోజు మీకు స్మారక దినంగా ఉంటుంది. ఈ రోజును యెహోవా పండగ దినంగా తరతరాలుగా మీరు ఆచరించాలి. ఎందుకంటే ఇది యెహోవా నియమించిన శాశ్వతమైన కట్టుబాటు.
\s5
\v 15 ఏడు రోజులపాటు మీరు పొంగకుండా కాల్చిన రొట్టెలు తినాలి. మొదటి రోజున మీ ఇళ్ళలో పొంగ జేసే పదార్ధమంటూ ఏదీ లేకుండా చెయ్యాలి. మొదటి రోజు నుంచి ఏడవ రోజు వరకూ పొంగ జేసే పిండితో చేసిన రొట్టెలు తింటే ఆ వ్యక్తిని ఇశ్రాయేలు ప్రజల్లో లేకుండా చేయాలి.
\v 16 ఆ మొదటి రోజు మీరు నా కోసం పరిశుద్ధ సమాజంగా సమకూడాలి. ఏడవ రోజున అలాటి సమావేశమే జరగాలి. ఆ రెండు రోజుల్లో అందరూ తినడానికి భోజనం సిద్ధం చేసుకోవడం తప్ప ఏ పనీ చేయకూడదు. మీరు చేయగలిగిన పని అదొక్కటే.
\p
\s5
\v 17 ఈ పొంగని రొట్టెల పండగను మీరు ఆచరించాలి. ఎందుకంటే నేను మిమ్మల్నందరినీ ఐగుప్తు దేశం నుండి బయటకు తీసుకు వచ్చే రోజు అదే. కాబట్టి మీరు, మీ రాబోయే తరాలన్నీ ఈ రోజును ఆచరించాలి. ఇది మీకు శాశ్వతమైన కట్టుబాటుగా ఉంటుంది.
\v 18 మొదటి నెల 14 వ రోజు సాయంత్రం మొదలు అదే నెల 21 వ రోజు సాయంత్రం దాకా మీరు పొంగని పిండితో చేసిన రొట్టెలు తినాలి.
\s5
\v 19 ఏడు రోజులపాటు మీ ఇళ్ళలో పొంగజేసే పదార్ధమేదీ కనబడ కూడదు. పొంగజేసే పదార్ధంతో చేసిన దాన్ని మీలో ఎవరైనా తింటే అతడు విదేశీయుడైనా దేశంలో పుట్టిన వాడైనా ఇశ్రాయేలు ప్రజల సమాజంలో లేకుండా చేయాలి.
\v 20 మీరు పొంగజేసే పదార్థంతో చేసిన దేనినీ తినకూడదు. మీకు చెందిన అన్ని ఇళ్ళలో పొంగకుండా కాల్చిన రొట్టెలు మాత్రమే తినాలి.>>
\s మొదటి పస్కా పండగ ఆచరణ
\p
\s5
\v 21 అప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజల పెద్దలను పిలిపించాడు. వాళ్ళతో ఇలా చెప్పాడు. <<మీరు మీ కుటుంబాల కోసం మందలోనుండి మేకపిల్లను గానీ గొర్రెపిల్లను గానీ తీసుకుని పస్కా బలి అర్పించండి.
\v 22 తరువాత హిస్సోపు కుంచె తీసుకుని పళ్ళెంలో ఉన్న రక్తంలో దాన్ని ముంచి, గుమ్మాల పైకమ్మికీ రెండు నిలువు కమ్ములకూ పూయాలి. మీలో ఎవ్వరూ తెల్లవారే వరకూ మీ ఇళ్ళ గుమ్మాల గుండా బయటకు వెళ్ళకండి.
\s5
\v 23 యెహోవా ఐగుప్తీయులను హతమార్చడానికి తిరుగుతూ ఇంటి గుమ్మం పైకమ్మి మీదా రెండు నిలువు కమ్ముల మీదా ఉన్న రక్తాన్ని చూసి ఆ ఇంటిని దాటిపోతాడు. సంహారం చేసే దూతను మీ ఇళ్ళలోకి ప్రవేశించడానికి మిమ్మల్ని సంహరించడానికి ఆయన అనుమతి ఇయ్యడు.
\p
\s5
\v 24 అందుచేత మీరు దీన్ని ఆచరించాలి. ఇది మీకు, మీ సంతతికి శాశ్వతమైన చట్టంగా ఉంటుంది.
\v 25 యెహోవా వాగ్దానం చేసినట్టు ఆయన మీకు ఇస్తున్న దేశంలో ప్రవేశించిన తరువాత మీరు దీన్ని ఒక ఆచార క్రియగా పాటించాలి.
\s5
\v 26 మీ కొడుకులు <మీరు జరిగిస్తున్న ఈ ఆచారం ఎందుకోసం?> అని మిమ్మల్ని అడిగితే,
\v 27 <ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తీయులను సంహరించే సమయంలో వారి మధ్య నుండి ఇశ్రాయేలు ప్రజల ఇళ్ళను దాటి ఐగుప్తులో మనల్ని కాపాడాడు> అని చెప్పాలి>> అన్నాడు. అప్పుడు సమకూడిన ప్రజలంతా అది విని తమ తలలు వంచి దేవుణ్ణి ఆరాధించారు.
\v 28 అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు విధేయులై యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్టు చేశారు.
\s పదవ తెగులు-ఐగుప్తు వారి ప్రథమ సంతానం మరణం
\p
\s5
\v 29 ఆ అర్థరాత్రి సమయంలో ఏం జరిగిందంటే, ఐగుప్తు దేశంలో ఉన్న మొదటి సంతానమంతటినీ యెహోవా హతమార్చాడు. సింహాసనం మీద కూర్చున్న రాజు మొదలుకుని, చెరసాలలోని ఖైదీల వరకూ వాళ్ళకు పుట్టిన మొదటి పిల్లలు మరణించారు. పశువుల తొలిచూలు పిల్లలు చనిపోయాయి.
\v 30 ఆ రాత్రి గడిచిన తరువాత మరణం సంభవించని ఇల్లు ఒక్కటి కూడా లేదు. ఐగుప్తు దేశంలో తీవ్రమైన మరణ రోదన చెలరేగింది.
\p
\s5
\v 31 ఫరో మోషే అహరోనులను పిలిపించాడు. వాళ్ళతో <<మీరూ ఇశ్రాయేలు ప్రజలూ త్వరగా నా దేశం నుండి, నా ప్రజల మధ్యనుండి వెళ్ళిపొండి. మీరు కోరుకున్నట్టు వెళ్లి యెహోవాను ఆరాధించండి.
\v 32 మీ ఇష్టప్రకారం మీ మందలనూ పశువులనూ తోలుకు వెళ్ళండి. నన్ను దీవించండి కూడా>> అన్నాడు.
\v 33 ఐగుప్తీయులు మేము కూడా చనిపోతాం అనుకుని ఆత్రంగా ఇశ్రాయేల్ ప్రజను తమ దేశం నుండి వెళ్ళిపొమ్మని తొందర పెట్టారు.
\s ఇశ్రాయేలీయుల నిర్గమనం- రామెసేసునుండి సుక్కోతుకు
\p
\s5
\v 34 ఇశ్రాయేలు ప్రజలు పొంగజేసే పదార్థం కలపని తమ పిండి ముద్దలు, పిండి పిసికే గిన్నెలు మూటగట్టుకుని భుజాలపై మోసుకు పోయారు.
\v 35 అంతకుముందు ఇశ్రాయేలు ప్రజలు మోషే చెప్పిన మాట ప్రకారం ఐగుప్తీయుల దగ్గర నుండి వెండి, బంగారం నగలు, దుస్తులు అడిగి తీసుకున్నారు.
\v 36 ఐగుప్తీయులకు ఇశ్రాయేలు ప్రజల పట్ల యెహోవా జాలి గుణం కలిగించడం వల్ల వారు ఇశ్రాయేలు ప్రజలు అడిగినవన్నీ ఇచ్చారు. ఆ విధంగా వారు ఐగుప్తీయులను దోచుకున్నారు.
\p
\s5
\v 37 తరువాత ఇశ్రాయేలు ప్రజలు రామెసేసు నుండి సుక్కోతు వరకూ ప్రయాణం సాగించారు. వారిలో పిల్లలు కాక, కాలి నడకన బయలుదేరిన పురుషులు ఆరు లక్షల మంది.
\v 38 అంతేకాక వేరువేరు జాతుల మనుషులు చాలా మంది వారితో వచ్చారు. గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువులతో కూడిన గొప్ప మందలు కూడా వాళ్ళతో కలసి బయలుదేరాయి.
\v 39 తరువాత వాళ్ళు ఐగుప్తు నుండి తెచ్చిన పిండి ముద్దలతో పొంగని రొట్టెలు కాల్చారు. ఆ పిండి ముద్ద పులియలేదు. వాళ్ళు ఐగుప్తునుండి బయలు దేరే ముందు సమయం లేకపోవడం వల్ల తమ కోసం వేరే ఆహారం సిద్ధం చేసుకోలేక పోయారు.
\p
\v 40 ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలం 430 సంవత్సరాలు.
\s5
\v 41 ఆ 430 సంవత్సరాలు ముగిసిన రోజునే యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశం నుండి తరలి వెళ్లాయి.
\v 42 ఆయన ఐగుప్తు దేశం నుండి వారిని బయటికి రప్పించిన ఆ రాత్రి యెహోవా కోసం కేటాయించి ఇశ్రాయేలు ప్రజలంతా తరతరాలకూ ఆ రాత్రి యెహోవా కోసం జాగారం చెయ్యాలి.
\s పస్కా గురించిన ఆదేశాలు
\p
\s5
\v 43 తరువాత యెహోవా మోషే అహరోనులతో ఇలా అన్నాడు. <<ఇది పస్కా పండగను గూర్చిన నియమం. వేరే జాతికి చెందిన వాడెవడూ దాన్ని తినకూడదు.
\v 44 మీలో ఎవరైనా డబ్బిచ్చి కొనుక్కున్న దాసుడు సున్నతి పొందితే అలాంటి వాడు దాన్ని తినవచ్చు.
\s5
\v 45 వేరే దేశాలకు చెందిన వాళ్ళు, కూలి పనికి వచ్చిన సేవకులు దాన్ని తినకూడదు.
\v 46 ఏ ఇంట్లో వారు ఆ ఇంట్లో మాత్రమే దాన్ని తినాలి. దాని మాంసంలో కొంచెం కూడా ఇంట్లో నుండి బయటికి తీసుకు వెళ్ళకూడదు. వధించిన జంతువులోని ఒక్క ఎముకను కూడా మీరు విరగ్గొట్టకూడదు.
\p
\s5
\v 47 ఇశ్రాయేలు ప్రజల సమాజం అంతా పండగ ఆచరించాలి.
\v 48 మీ దగ్గర నివసించే ఎవరైనా విదేశీయులు యెహోవా పస్కాను ఆచరించాలని కోరుకుంటే వాళ్ళ కుటుంబంలోని ప్రతి మగవాడూ సున్నతి పొందాలి. అప్పుడు వాళ్ళు సమాజంతో కలసి పస్కా ఆచరింపవచ్చు. వాళ్ళు మీ దేశంలో పుట్టిన వాళ్ళతో సమానం అవుతారు. సున్నతి పొందనివాడు దాన్ని తినకూడదు.
\s5
\v 49 స్వదేశీయుడికీ మీతో కలసి నివసించే విదేశీయుడికీ ఈ విషయంలో ఒకే నియమం ఉండాలి.>>
\p
\v 50 యెహోవా మోషే అహరోనులకు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం ఇశ్రాయేలు ప్రజలందరూ చేశారు.
\v 51 ఆ రోజే యెహోవా ఇశ్రాయేలు ప్రజలను వారి వారి సేనల క్రమం ప్రకారం ఐగుప్తు దేశం నుండి బయటకు నడిపించాడు.
\s5
\c 13
\s ఇశ్రాయేల్ ప్రథమ సంతానం ప్రతిష్ట
\p
\v 1 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు.
\v 2 <<ఇశ్రాయేలు ప్రజల్లో మొదట పుట్టిన సంతానాన్ని నాకు ప్రతిష్టించాలి. మనుషుల, పశువుల ప్రతి తొలిచూలు నాది.>>
\s పొంగని రొట్టెల పండగ
\p
\s5
\v 3 అప్పుడు మోషే ప్రజలను సమకూర్చి ఇలా చెప్పాడు. <<మీరు ఐగుప్తులో బానిసత్వం నుండి విడుదల పొంది బయటకు వచ్చిన ఈ రోజును జ్ఞాపకం చేసుకోండి. యెహోవా తన బలమైన చేతులు చాపి ఆ దాస్యం నుండి మిమ్మల్ని విడిపించాడు. మీరు పొంగ జేసే పిండితో చేసిన రొట్టెలు తినకూడదు.
\v 4 అబీబు అనే ఈ నెలలో ఈ రోజునే మీరు బయలుదేరి వచ్చారు.
\v 5 కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, హివ్వీయులు, యెబూసీయులు నివసించే
\f +
\fr 13:5
\ft సారవంతమైన
\f* పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తానని మన పూర్వీకులతో యెహోవా ఒప్పందం చేశాడు. ఆయన వాగ్దానం చేసినట్టు ఆ దేశానికి మీరు చేరుకున్న తరువాత ఈ ఆచారాన్ని ఈ నెలలోనే జరుపుకోవాలి.
\p
\s5
\v 6 మీరు ఏడు రోజులపాటు పొంగని పదార్థం కలపని పిండితో చేసిన రొట్టెలు తినాలి. ఏడవ రోజు యెహోవా పండగ ఆచరించాలి.
\v 7 ఏడు రోజులూ పొంగకుండా చేసిన రొట్టెలనే తినాలి. మీ దేశంలో ఈ హద్దు నుంచి ఆ హద్దు వరకూ పొంగే పదార్థం కలిపిన పిండి మీ దగ్గర ఉండకూడదు. పొంగేలా చేసేదేదీ మీ దగ్గర కనబడకూడదు.
\p
\s5
\v 8 ఆ రోజు మీ పిల్లలకు <నేను ఐగుప్తు నుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దాన్ని బట్టి పొంగకుండా కాల్చిన ఈ రొట్టెలు తింటున్నాను> అని చెప్పాలి.
\v 9 యెహోవా తన బలిష్టమైన చేతితో మిమ్మల్ని ఐగుప్తు నుండి రప్పించాడు. ఆయన ఉపదేశం మీ నోట ఉండేలా, ఈ ఆచారం మీ చేతులపై గుర్తుగా మీ నుదుటిపై జ్ఞాపక చిహ్నంగా ఉంటుంది.
\s ప్రథమ సంతానాన్ని యెహోవాకు ప్రతిష్టించడం
\p
\v 10 అందువల్ల మీరు ప్రతి ఏటా ఈ నియమాన్ని దాని నిర్ణయకాలంలో ఆచరించాలి.
\s5
\v 11 యెహోవా మీతో మీ పూర్వికులతో వాగ్దానం చేసినట్టు కనాను దేశంలోకి నిన్ను రప్పించిన తరువాత
\v 12 మీకు పుట్టే ప్రతి మొదటి సంతానాన్ని, మీ పశువులకు పుట్టే ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠించాలి. పశువులకు, మందలకు కలిగే తొలి మగ సంతానం యెహోవాదే.
\p
\v 13 ప్రతిష్ఠించినది గాడిద పిల్ల అయితే దాని ఖరీదు చెల్లించి విడిపించి దానికి బదులు గొర్రెపిల్లను
\f +
\fr 13:13
\ft గాడిదను అర్పించడం ఆమోదం కాదు. అందుకని గొర్రె పిల్ల అర్పణ ఆమోదయోగ్యం.
\f* ప్రతిష్ఠించాలి. అలా విడిపించలేకపోతే దాని మెడ విరగదీయాలి. మీ కొడుకుల్లో మొదట పుట్టిన వారి నిమిత్తం ఖరీదు చెల్లించి వారిని విడిపించుకోవాలి.
\s5
\v 14 ఇకముందు మీ కొడుకులు <ఇలా ఎందుకు చెయ్యాలి?> అని అడిగితే, వాళ్ళతో, <ఐగుప్తు బానిసత్వంలో ఉన్న మనలను తన బలమైన హస్తం కింద యెహోవా బయటికి రప్పించాడు.
\v 15 ఫరో మనలను వెళ్ళనివ్వకుండా తన మనస్సును కఠినం చేసుకున్నప్పుడు యెహోవా ఐగుప్తు దేశంలో ఉన్న మనుషుల, పశువుల మొదటి సంతానం అంతటినీ సంహరించాడు. అందుకే నేను ప్రతి తొలిచూలు మగ పిల్లలన్నిటినీ యెహోవాకు బలిగా అర్పిస్తాను. మొదట పుట్టిన నా కొడుకుల కోసం ఖరీదు చెల్లించి విడిపించుకుంటాను> అని చెప్పాలి.
\v 16 యెహోవా తన బలమైన హస్తం చేత మనలను ఐగుప్తు నుండి బయటికి రప్పించాడు గనుక నీ చెయ్యి మీదా నొసటి మీదా ఆ సంఘటన జ్ఞాపక సూచనగా ఉండాలి.>>
\s అగ్ని స్థంభం, మేఘ స్థంభం
\p
\s5
\v 17 ఫరో ఆ ప్రజలను వెళ్ళనిచ్చినప్పుడు దేవుడు వాళ్ళను ఫిలిష్తీయ దేశం నుండి దగ్గర దారి అయినప్పటికీ ఆ దారిన వాళ్ళను వెళ్లనీయలేదు. <<ఈ ప్రజలు ఫిలిష్తీయులతో జరిగే యుద్ధం చూసి మనసు మార్చుకుని తిరిగి ఐగుప్తుకు వెళ్లిపోతారేమో>> అనుకున్నాడు.
\v 18 అందువల్ల ప్రజలను చుట్టూ తిప్పి ఎడారి మీదుగా ఎర్ర సముద్రం వైపుకు ప్రయాణం చేయించాడు. ఇశ్రాయేలు ప్రజలు తమ
\f +
\fr 13:18
\ft అంటే సిద్ధపడి వెళ్లారు, ఆయుధాలు పట్టుకుని కాదు. వారు గోత్రాల వారిగా క్రమ పద్ధతిలో బయలు దేరారు అని భావం.
\f* గోత్రాల వారీగా ఐగుప్తు నుండి వచ్చారు.
\p
\s5
\v 19 మోషే యోసేపు ఆస్తికలను వెంట తీసుకు వచ్చాడు. ఎందుకంటే యోసేపు <<దేవుడు మిమ్మల్ని తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాడు, అప్పుడు మీరు నా ఆస్తికలను ఇక్కడి నుంచి తీసుకు వెళ్ళండి>> అని ఇశ్రాయేలు ప్రజలతో కచ్చితంగా ఒట్టు పెట్టించుకున్నాడు.
\v 20 వాళ్ళు సుక్కోతు నుండి ప్రయాణం చేసి ఎడారి దగ్గర ఉన్న ఏతాములో బస చేశారు.
\p
\v 21 పగలు, రాత్రి ప్రయాణాల్లో యెహోవా వారికి తోడుగా ఉన్నాడు. పగటి వేళ స్తంభాకార మేఘంలో రాత్రి వేళ వెలుగు ఇవ్వడానికి స్తంభాకార మంటల్లో ఉండి ఆయన వారికి ముందుగా నడిచాడు.
\v 22 దేవుడు ప్రజల కోసం ఉంచిన పగటి మేఘస్తంభాన్ని, రాత్రి వేళ వెలుగిచ్చే అగ్నిస్తంభాన్ని తొలగించకుండా ప్రయాణం కొనసాగేలా చేశాడు.
\s5
\c 14
\s ఎర్ర సముద్రం దాటడం
\p
\v 1 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు,
\v 2 <<ఇశ్రాయేలు ప్రజలు వెనక్కి తిరిగి పీహహీరోతు ఎదుట, అంటే మిగ్దోలుకూ, సముద్రానికీ మధ్యలో ఉన్న బయల్సెఫోను దగ్గర విడిది చేయమని వారితో చెప్పు. వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు
\v 3 ఫరో, <ఆ ప్రజలు ఈ దేశంలో ఎడారి మధ్యలో చిక్కుబడిపోయారు> అనుకుంటాడు.
\s5
\v 4 నేను ఫరో హృదయాన్ని కఠినపరుస్తున్నాను. అతడు వాళ్ళను తరుముతాడు. నేను ఫరో ద్వారా, మిగిలిన అతని సేన ద్వారా మహిమ పొందుతాను. నేను యెహోవాను అని ఐగుప్తీయులు తెలుసుకుంటారు.>>
\v 5 ఇశ్రాయేలు ప్రజలు దేశం విడిచి వెళ్ళిపోయిన విషయం ఐగుప్తు రాజుకు చెప్పినప్పుడు ఫరో హృదయం, అతని సేవకుల హృదయాలు ఇశ్రాయేలు ప్రజపై కక్షతో నిండి పోయాయి. <<మనం చేసిందేమిటి? మన కోసం పనులు చేయకుండా వాళ్ళను ఎందుకు వెళ్ళనిచ్చాం?>> అని చెప్పుకున్నారు.
\p
\s5
\v 6 అప్పుడు ఫరో తన రథాలు సిద్ధం చేయించి తన సైన్యాన్ని వెంట బెట్టుకుని బయలుదేరాడు.
\v 7 అతడు తన ఐగుప్తులోని శ్రేష్ఠమైన 600 రథాలను, ప్రతి రథంలోనూ సైన్యాధిపతులను తీసుకు పోయాడు.
\v 8 యెహోవా ఐగుప్తు రాజు ఫరో హృదయాన్ని కఠినం చేసినందువల్ల అతడు ఇశ్రాయేలు ప్రజలను తరిమాడు. ఇశ్రాయేలు ప్రజలు తమ బలగం అంతటితో తరలి వెళ్తున్నారు.
\v 9 బయల్సెఫోను ఎదురుగా ఉన్న పీహహీరోతుకు దగ్గరలో సముద్రం దగ్గర వాళ్ళు విడిది చేసి ఉన్న సమయంలో ఫరో రథాలు, గుర్రాలు, గుర్రాల రౌతులు, ఐగుప్తు సైన్యం ఇశ్రాయేలు ప్రజలను తరుముతూ వాళ్ళను సమీపించారు.
\p
\s5
\v 10 ఫరో, అతని సైన్యం తమను తరుముతూ రావడం చూసిన ఇశ్రాయేలు ప్రజలు హడలిపోయారు. కేకలు వేస్తూ యెహోవాకు మొరపెట్టారు.
\v 11 అప్పుడు వాళ్ళు మోషేతో <<ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఈ ఎడారిలో చనిపోవడానికి తీసుకొచ్చావా? మమ్మల్ని ఐగుప్తు నుండి బయటికి తీసుకువచ్చి ఈ విధంగా చేస్తావా?
\v 12 మేము ఐగుప్తీయులకు బానిసలుగానే ఉంటాం, మా జోలికి రావద్దు అని ఐగుప్తులో ఉన్నప్పుడే చెప్పింది ఇందుకే గదా. మేము ఈ ఎడారిలో చనిపోవడం కంటే ఐగుప్తులో బానిసలుగా బతకడమే మంచిది>> అని నిష్టూరంగా మాట్లాడారు.
\p
\s5
\v 13 అందుకు మోషే <<భయపడకండి, ఈ రోజు యెహోవా మీకు కలిగించే రక్షణను అలా నిలబడి చూడండి. మీరు ఈ రోజు చూసిన ఐగుప్తీయులను ఇకపై ఎన్నడూ చూడరు.
\v 14 మీరు ఊరికే నిలబడి ఉండండి. మీ పక్షంగా యెహోవా యుద్ధం చేస్తాడు>> అని ప్రజలతో చెప్పాడు.
\p
\s5
\v 15 యెహోవా మోషేతో <<నువ్వెందుకు నాకు మొర పెడుతున్నావు? <ముందుకు కొనసాగండి> అని ప్రజలతో చెప్పు.
\v 16 నీ కర్ర ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని రెండు పాయలుగా చెయ్యి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు సముద్రం మధ్యలో ఆరిన పొడి నేల మీద నడిచి వెళ్తారు.
\v 17 చూడు, నేను ఐగుప్తీయుల హృదయాలను కఠినం చేస్తాను. వాళ్ళు మీ వెంటబడి తరుముతారు. నేను ఫరో ద్వారా, అతని సైన్యం అంతటి ద్వారా, అతని రథాల, గుర్రపు రౌతుల ద్వారా ఘనత తెచ్చుకొంటాను.
\v 18 నేను ఫరో ద్వారా, సైన్యం ద్వారా, అతని రథాల, గుర్రపు రౌతుల ద్వారా ఘనత పొందడం వల్ల నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుంటారు.>>
\p
\s5
\v 19 అప్పటి వరకూ ఇశ్రాయేలు ప్రజల ముందు నడిచిన దేవదూత వాళ్ళ వెనక్కి వెళ్ళాడు. మేఘస్తంభం కూడా వాళ్ళ వెనక్కి వచ్చి నిలిచింది.
\v 20 అది ఐగుప్తు సేనలకూ ఇశ్రాయేలు ప్రజల సమూహనికీ మధ్య నిలిచింది. ఆ మేఘం ఆ రాత్రంతా ఐగుప్తు సైన్యానికి చీకటి కమ్మేలా, అదే సమయంలో ఇశ్రాయేలు ప్రజలకు వెలుగు ఉండేలా చేసింది.
\s5
\v 21 మోషే సముద్రంపై తన చెయ్యి చాపాడు. యెహోవా ఆ రాత్రి అంతా బలమైన తూర్పు గాలి వీచేలా చేసి, సముద్రం పాయలుగా చీలి మధ్యలో ఆరిపోయి పొడి నేల ఏర్పడేలా చేశాడు.
\v 22 సముద్రం నీళ్లు రెండుగా విడిపోగా ఇశ్రాయేలు ప్రజలు సముద్రం మధ్యలో ఆరిన నేలపై నడిచి వెళ్ళారు. ఆ నీళ్లు వారి కుడి పక్కన, ఎడమ పక్కన గోడల్లాగా నిలబడ్డాయి.
\p
\s5
\v 23 ఫరో సైన్యం, గుర్రాలు, రథాలు, రౌతులు వారిని తరుముకుంటూ సముద్రం మధ్యకు చేరుకున్నారు.
\v 24 తెల్లవారుతుండగా యెహోవా ఆ అగ్ని స్తంభం నుండీ మేఘ స్తంభం నుండీ ఐగుప్తు సైన్యాన్ని చూసి వాళ్ళను కలవరానికి గురి చేశాడు.
\v 25 ఆయన వాళ్ళ రథచక్రాలు ఊడిపోయేలా చేసినప్పుడు వాళ్ళు అతి కష్టంగా రథాలు తోలవలసి వచ్చింది. అప్పుడు ఐగుప్తువాళ్ళు <<రండి, మనం ఇశ్రాయేలు ప్రజల ఎదుట నుండి పారిపోదాం. యెహోవా వారికి తోడుగా ఉండి వాళ్ళ పక్షంగా యుద్ధం చేస్తున్నాడు>> అని చెప్పుకున్నారు.
\s తరుముతున్న ఐగుప్తు సైన్యం మునిగిపోయారు
\p
\s5
\v 26 యెహోవా మోషేతో <<ఐగుప్తు సైన్యం మీదికి, వాళ్ళ రథాల, రౌతుల మీదికి నీళ్లు తిరిగి వచ్చేలా సముద్రం పైకి నీ చెయ్యి చాపు>> అని చెప్పాడు.
\v 27 మోషే సముద్రం పైకి తన చెయ్యి చాపాడు. సాయంత్రం అయ్యేటప్పటికి సముద్రం వడిగా మళ్ళీ కలిసిపోయింది. అది చూసిన ఐగుప్తు సైన్యం వెనక్కి పారిపోవాలని చూశారు. అప్పుడు యెహోవా సముద్రం మధ్యలో ఐగుప్తు సైన్యం నాశనమయ్యేలా చేశాడు.
\v 28 నీళ్లు వేగంగా ప్రవహించి ఆ రథాలను, రౌతులను, వారి వెనుక సముద్రంలోకి వచ్చిన ఫరో సైన్యం మొత్తాన్నీ ముంచివేశాయి. వాళ్ళలో ఒక్కడు కూడా మిగలకుండా అంతా తుడిచిపెట్టుకు పోయారు.
\p
\s5
\v 29 అయితే ఇశ్రాయేలు ప్రజలు సముద్రం మధ్యలో ఆరిన నేలపై నడిచినప్పుడు ఆ నీళ్లు వారికి కుడి, ఎడమ పక్కల గోడల్లాగా నిలబడ్డాయి.
\v 30 ఆ రోజున యెహోవా ఐగుప్తు సైన్యం నుండి ఇశ్రాయేలు ప్రజలను రక్షించాడు. చనిపోయి ఒడ్డుకు కొట్టుకు వచ్చిన ఐగుప్తు వాళ్ళను ఇశ్రాయేలు ప్రజలు చూశారు.
\v 31 తమ కోసం యెహోవా ఐగుప్తు వాళ్ల పట్ల చేసిన ఈ గొప్ప కార్యం చూసిన ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా అంటే భయభక్తులు కలిగాయి. ఆ ప్రజలు యెహోవా మీదా, ఆయన సేవకుడు మోషే మీదా నమ్మకముంచారు.
\s5
\c 15
\s మోషే మిర్యాముల కీర్తన
\p
\v 1 అప్పుడు మోషే, ఇశ్రాయేలు ప్రజలు యెహోవాను ఇలా కీర్తించారు. <<యెహోవాను గురించి పాడతాను.ఆయన శత్రువు గుర్రాన్నీ, రౌతునూ,
\p సముద్రంలో ముంచి వేశాడు.
\p గొప్ప విజయం సాధించాడు.
\p
\s5
\v 2 యెహోవాయే నా బలం, నా గానం,
\p నా రక్షణకర్త. ఆయన నా దేవుడు,
\p ఆయనను స్తుతిస్తాను.
\p ఆయన నా పూర్వీకుల దేవుడు,
\p ఆయనను ఘనపరుస్తాను.
\p
\v 3 యెహోవా యుద్ధశూరుడు, ఆయన పేరు యెహోవా.
\p
\s5
\v 4 ఆయన ఫరో రథాలను, సైన్యాన్ని సముద్రంలో ముంచివేశాడు.
\p సైన్యాధిపతుల్లో ప్రముఖులు ఎర్ర సముద్రంలో మునిగిపోయారు.
\p
\v 5 రాళ్లవలె వాళ్ళు నడి సముద్రం అడుక్కి చేరుకున్నారు.
\p
\s5
\v 6 యెహోవా, నీ కుడి చెయ్యి బలిష్ఠమైనది.
\p యెహోవా, నీ కుడిచెయ్యి శత్రువుని అణిచి వేస్తుంది.
\p
\v 7 నీకు విరోధంగా నీపై లేచేవాళ్లను నీ మహిమా ప్రకాశంతో అణచి వేస్తావు.
\p నీ కోపాగ్ని రగిలినప్పుడు వాళ్ళు చెత్తలాగా కాలిపోతారు.
\p
\v 8 నీ ముక్కుపుటాల నుండి వెలువడిన పెనుగాలికి నీళ్లు కుప్పగా నిలబడిపోయాయి.
\p ప్రవాహాలు గోడలాగా నిలబడి పోయాయి.
\p సముద్రం లోతుల్లో నీళ్ళు గడ్డకట్టిపోయాయి.
\p
\s5
\v 9 <వాళ్ళను తరిమి నా కత్తి దూసి నాశనం చేసి దోచుకున్న సొమ్ముతో నా కోరిక తీర్చుకుంటాను> అని శత్రువు అనుకున్నాడు.
\p
\v 10 నువ్వు నీ గాలి విసిరి లోతైన నీళ్ళలో సీసం లాగా వాళ్ళను మునిగి పోయేలా చేశావు.
\p
\v 11 పూజింపదగ్గ వాళ్ళలో యెహోవాలాంటివాడు ఎవడు?
\p పవిత్రత వైభవంలో నీ వంటి వాడెవడు?
\p స్తుతికీర్తనలతో ఘనపరచదగిన వాడు,
\p అద్భుతాలు చేసే నీవంటి వాడెవడు?
\p
\s5
\v 12 నీ కుడి చెయ్యి చాపినప్పుడు వాళ్ళను భూమి మింగివేసింది.
\p
\v 13 నీ కనికరం వల్ల ఈ ప్రజలను విడిపించి నీ శక్తి ద్వారా నీ సన్నిధికి తీసుకువచ్చావు.
\p
\s5
\v 14 ఈ సంగతి ఇతర ప్రజలకు తెలుస్తుంది.
\p వాళ్ళు భయపడతారు.
\p అది ఫిలిష్తీయులకు భయం కలిగిస్తుంది.
\p
\v 15 ఎదోము అధిపతులు భయపడతారు.
\p మోయాబులో బలిష్ఠులు వణికిపోతారు.
\p కనానులో నివసించే వారు భయంతో నీరసించి పోతారు,
\p
\s5
\v 16 భయ భీతులు వారిని ఆవరిస్తాయి.
\p యెహోవా, నీ ప్రజలు అవతలి తీరం చేరే వరకూ నీ హస్తబలం చేత శత్రువులు రాళ్ళ వలే కదలకుండా నిలిచిపోతారు.
\p
\s5
\v 17 నువ్వు నీ ప్రజలకు స్థిర నివాసంగా ఏర్పాటు చేసిన వారసత్వ పర్వతానికి తెస్తావు. అక్కడ వారిని నాటుతావు. యెహోవా, నీ చేతులు నిర్మించిన మందిరానికి వారిని తెస్తావు.
\p
\v 18 యెహోవా, శాశ్వతంగా రాజ్యం చేస్తాడు.>>
\p
\s5
\v 19 ఫరో గుర్రాలు, రథాలు, రౌతులు సముద్రంలోకి అడుగుపెట్టగానే యెహోవా వాళ్ళ మీదికి సముద్రపు నీళ్ళు పొంగిపొరలేలా చేశాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు సముద్రం మధ్యలో ఆరిన నేల మీద నడిచారు.
\v 20 అహరోను సోదరి, ప్రవక్త్రి మిర్యాము తంబుర వాయిస్తూ బయలుదేరింది. స్త్రీలంతా తంబురలు వాయిస్తూ, నాట్యం చేస్తూ ఆమెను వెంబడించారు.
\v 21 మిర్యాము వాళ్ళతో కలిసి ఈ విధంగా పాడింది.
\s మిర్యాము కీర్తన
\p <<యెహోవాను స్తుతిస్తూ పాటలు పాడండి,
\p ఆయన ఘన విజయం సాధించాడు,
\p శత్రువు గుర్రాలను, వాటి రౌతులను సముద్రంలో ముంచి వేశాడు.>>
\p
\s5
\v 22 మోషే నాయకత్వంలో ప్రజలు ఎర్ర సముద్రం దాటిన తరువాత మూడు రోజులు ప్రయాణించి షూరు ఎడారి ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ వాళ్ళకు తాగడానికి నీళ్లు దొరకలేదు. తరువాత
\f +
\fr 15:22
\ft అంటే చేదు
\f* మారాకు చేరుకున్నారు.
\v 23 మారాలో ఉన్న నీళ్ళు చేదుగా ఉన్నాయి కనుక ఆ నీళ్లు తాగలేకపోయారు. అందువల్ల దానికి మారా అనే పేరు వచ్చింది.
\p
\s5
\v 24 ప్రజలు మోషే మీద సణుగుతూ <<మేమేమీ తాగాలి?>> అన్నారు.
\v 25 మోషే యెహోవాను వేడుకున్నాడు. అప్పుడు యెహోవా మోషేకు ఒక చెట్టును చూపించాడు. దాన్ని ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు తియ్యగా మారిపోయాయి. అక్కడ ఆయన వాళ్లకు ఒక కట్టుబాటును, శాసనాన్ని విధించాడు,
\v 26 <<మీరు మీ దేవుడైన యెహోవా మాటలు శ్రద్ధగా విని ఆయన దృష్టిలో న్యాయం జరిగించి, ఆయన ఆజ్ఞలకు విధేయత కనపరచి వాటి ప్రకారం నడుచుకుంటే ఐగుప్తు వాళ్ళకు కలిగించిన ఎలాంటి జబ్బూ మీకు రానియ్యను. యెహోవా అనే నేనే మిమ్మల్ని బాగుచేసేవాణ్ణి.>>
\p
\s5
\v 27 తరువాత వాళ్ళు ఏలీముకు చేరుకున్నారు. అక్కడ పన్నెండు నీటి ఊటలు, డెబ్భై ఈత చెట్లు ఉన్నాయి. నీళ్ళు ఉన్న ఆ ప్రాంతంలో వాళ్ళు విడిది చేశారు.
\s5
\c 16
\s పరలోకం నుండి ఆహారం
\p
\v 1 తరువాత ఇశ్రాయేలు ప్రజలంతా ఏలీము నుండి బయలుదేరి వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన రెండవ నెల పదిహేనోరోజున ఏలీముకు సీనాయికి మధ్య ఉన్న సీను ఎడారి ప్రాంతానికి వచ్చారు.
\v 2 అక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ మోషే, అహరోనుల మీద సణుగుకున్నారు.
\v 3 ప్రజలు వారితో <<మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మాంసం వండుకుని కుండల దగ్గర కూర్చుని తృప్తిగా భోజనం చేసేవాళ్ళం. ఆ సమయంలోనే యెహోవా చేతిలో మేము చనిపోయి ఉన్నట్టయితే బాగుండేది. మేమంతా ఆకలితో చనిపోవడం కోసం ఇక్కడికి తీసుకు వచ్చారు>> అన్నారు.
\p
\s5
\v 4 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. <<నేను ఆకాశం నుండి మీ కోసం ఆహారం కురిపిస్తాను. ప్రతిరోజూ ప్రజలు వెళ్లి ఆనాటికి సరిపడేటంత ఆహారం సమకూర్చుకోవాలి. వాళ్ళు నా ఉపదేశం ప్రకారం నడుచుకుంటున్నారో లేదో నేను పరిశీలిస్తాను.
\v 5
\f +
\fr 16:5
\ft అంటే శుక్రవారం.
\f* ఆరవ రోజున వాళ్ళు మిగతా అన్ని రోజుల కంటే రెండింతలు సేకరించుకుని తెచ్చుకున్నది వండుకోవాలి.>>
\p
\s5
\v 6 మోషే, అహరోనులు ఇశ్రాయేలు ప్రజలతో ఇలా అన్నారు. <<మీరు మా మీద ఎందుకు సణుక్కుంటారు? మేము ఎంతటి వాళ్ళం? యెహోవా మీద మీరు సణిగిన సణుగులను ఆయన విన్నాడు.
\v 7 ఐగుప్తు దేశం నుండి యెహోవాయే మిమ్మల్ని బయటికి రప్పించాడని సాయంత్రం నాటికి మీరు తెలుసుకుంటారు. రేపు ఉదయానికి మీరు యెహోవా మహిమా ప్రభావం చూస్తారు.>>
\p
\v 8 మోషే వాళ్ళతో <<మీరు సాయంత్రం తినడానికి మాంసం, ఉదయాన సరిపడినంత ఆహారం యెహోవా మీకు ఇస్తున్నప్పుడు మీరు ఇది తెలుసుకుంటారు. మీరు ఆయన మీద సణుక్కోవడం ఆయన విన్నాడు. మీరు సణుక్కోవడం యెహోవా మీదే, మా మీద కాదు. మాపై సణుక్కోవడానికి మేమెంతటివాళ్ళం?>> అన్నాడు.
\p
\s5
\v 9 మోషే అహరోనులతో యెహోవా <<ప్రజల సర్వ సమాజంతో ఇలా చెప్పు, ఆయన మీ సణుగులు విన్నాడు. సర్వ సమాజం అంతా యెహోవా సన్నిధికి రండి.>>
\v 10 అహరోను ఇశ్రాయేలు సమాజమంతటితో మాట్లాడుతున్న సమయంలోనే ప్రజలు ఎడారి వైపు చూశారు. అప్పుడు మేఘంలో యెహోవా మహిమ వాళ్లకు కనిపించింది.
\p
\v 11 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు. <<నేను ఇశ్రాయేలు ప్రజల సణుగులు విన్నాను.
\v 12 వాళ్ళతో ఇలా చెప్పు. సాయంత్రం పూట మీరు మాంసం తింటారు, ఉదయం పూట తృప్తిగా ఆహారం తింటారు. అప్పుడు నేను మీ దేవుడైన యెహోవాను అని మీరు తెలుసుకుంటారు.>>
\s5
\v 13 అలాగే జరిగింది. సాయంకాలం అయినప్పుడు పూరేడు పిట్టలు వచ్చి శిబిరం అంతా కమ్ముకున్నాయి. ఉదయమయ్యాక శిబిరం అంతా మంచు పడి ఉంది.
\v 14 నేలపై మంచు ఇంకిపోయాక నేలమీద సన్నని కణాలు పొరలుగా ఎడారి భూమి మీద కనబడ్డాయి.
\v 15 ఇశ్రాయేలీయులు దాన్ని చూసి, అది ఏమిటో తెలియక <<ఇదేంటి?>> అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.
\p
\s5
\v 16 మోషే వాళ్ళతో <<ఇది తినడానికి యెహోవా మీకిచ్చిన ఆహారం. యెహోవా ఏమి చెబుతున్నాడంటే, ప్రతి ఒక్కరూ తమకు అవసరమైనంత మేరకు సేకరించుకోవాలి. తమ గుడారంలో ఉన్న వాళ్ళ కోసం ప్రతి ఒక్కరికీ
\f +
\fr 16:16
\ft వ. 36 చూడండి
\f* ఒక ఓమెరు చొప్పున తీసుకోవాలి.>>
\v 17 ఇశ్రాయేలు ప్రజలు ఆ విధంగా చేశారు. అయితే కొందరు ఎక్కువగా, కొందరు తక్కువగా కూర్చుకున్నారు.
\p
\v 18 వాళ్ళు కొలత ప్రకారం చూసినప్పుడు ఎక్కువగా తీసుకొన్న వారికి ఏమీ మిగల్లేదు, తక్కువ తీసుకొన్నవారికి ఏమీ తక్కువ కాలేదు. ప్రతి ఒక్కరూ తమ అవసరం మేరకు తమ ఇంటి వాళ్ళ భోజనానికి సరిపడినంత సమకూర్చుకున్నారు.
\s5
\v 19 అప్పుడు మోషే <<ఉదయమయ్యే దాకా ఎవ్వరూ దీన్లో ఏమీ మిగుల్చుకోకూడదు>> అని వాళ్ళతో చెప్పాడు.
\p
\v 20 అయితే కొందరు మోషే మాట వినకుండా తెల్లవారే దాకా దానిలో కొంచెం మిగుల్చుకున్నారు. మోషే వారిపై కోపగించుకున్నాడు. అది పురుగు పట్టి దుర్వాసన కొట్టింది.
\v 21 కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి ఉదయమూ తమ ఇంటివారి కోసం ఏ రోజుకు సరిపడినది ఆ రోజు సేకరించుకున్నారు. ఎండ ఎక్కువైనప్పుడు అది కరిగిపోయింది.
\p
\s5
\v 22 ఆరవ రోజున వాళ్ళు ఒక్కొక్కరు రెండు లీటర్లకు రెట్టింపు లెక్క చొప్పున నాలుగు లీటర్లు సేకరించారు. ప్రజల అధికారులు వచ్చి ఆ విషయం మోషేకు చెప్పారు.
\v 23 అందుకు మోషే <<యెహోవా చెప్పిన మాట ఇదే. రేపు వివేచనాపూర్వక విశ్రాంతి దినం. అది యెహోవాకు గౌరవార్థం ఆచరించ వలసిన పవిత్ర విశ్రాంతి దినం. మీరు వండుకోవలసింది వండుకోండి, ఉడికించుకోవలసింది ఉడికించుకోండి. తినగా మిగిలినది రేపటికి ఉంచుకోండి.>>
\s5
\v 24 మోషే ఆజ్ఞాపించిన ప్రకారం వాళ్ళు తెల్లవారే వరకూ దాన్ని ఉంచుకున్నారు. అది దుర్వాసన వేయలేదు, దానికి పురుగు పట్టలేదు.
\v 25 అప్పడు మోషే <<ఈ రోజు దాన్ని తినండి, ఈ రోజు యెహోవాకు విశ్రాంతి దినం, నేడు అది బయట మైదానంలో దొరకదు.
\s5
\v 26 మీరు ఆరు రోజులే దాన్ని సమకూర్చుకోవాలి. విశ్రాంతి దినమైన ఏడవ రోజున అది దొరకదు>> అని చెప్పాడు.
\v 27 ఆ విధంగానే జరిగింది. ప్రజల్లో కొందరు ఏడవ రోజున దాన్ని ఏరుకోవడానికి వెళ్ళారు గానీ వాళ్లకు ఏమీ దొరకలేదు.
\p
\s5
\v 28 అందుచేత యెహోవా మోషేతో ఇలా అన్నాడు<<మీరు ఎంతకాలం నా ఆజ్ఞలను, ఉపదేశాన్ని అనుసరించి నడుచుకోకుండా ఉంటారు?
\v 29 వినండి, యెహోవా ఈ విశ్రాంతి దినాన్ని తప్పకుండా ఆచరించాలని సెలవిచ్చాడు. కనుక ఆరవ రోజున రెండు రోజులకు సరిపడే ఆహారం మీకు ఇస్తున్నాడు. ఏడవ రోజున ప్రతి ఒక్కరూ తమ స్థలాల్లోనే ఉండిపోవాలి.>>
\v 30 అందువలన ఏడవ రోజున ప్రజలు విశ్రాంతి తీసుకున్నారు.
\p
\s5
\v 31 ఇశ్రాయేలీయులు ఆ పదార్థానికి <<మన్నా>> అని పేరు పెట్టారు. అది తెల్లగా ధనియాల వలే ఉంది. దాని రుచి తేనెతో కలిపిన పిండి వంటకం లాగా ఉంది.
\v 32 మోషే ఇలా చెప్పాడు<<యెహోవా ఏమి చెబుతున్నాడంటే, ఈ మన్నాను ఒక ఓమెరు పట్టే పాత్రలో నింపండి. నేను ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఎడారిలో తినడానికి మీకిచ్చిన ఈ ఆహారాన్ని మీ తరతరాల కోసం మీ వంశాల కోసం వాళ్ళు దగ్గర ఉంచుకోవాలి.>>
\s5
\v 33 అప్పుడు మోషే అహరోనుతో <<నువ్వు ఒక గిన్నె తీసుకుని, దాన్ని ఒక ఓమెరు మన్నాతో నింపి, మీ తరతరాల సంతతి కోసం యెహోవా సన్నిధిలో ఉంచు>> అని చెప్పాడు.
\p
\v 34 యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం చేశాడు. ఆది భద్రంగా ఉండేలా
\f +
\fr 16:34
\ft సాక్షపు పెట్టె, లేక ఒడంబడిక మందసం. 25:10-12 చూడండి.
\f* శాసనాలు ఉంచే స్థలం ఎదుట ఉంచాడు.
\v 35 తాము చేరుకోవలసిన కనాను దేశపు సరిహద్దుల వరకూ నలభై సంవత్సరాల వాళ్ళ ప్రయాణంలో మన్నా తింటూ వచ్చారు.
\v 36 ఓమెరు అంటే ఏఫాలో పదవ వంతు.
\s5
\c 17
\s బండ నుండి నీరు
\p
\v 1 యెహోవా మాట ప్రకారం ఇశ్రాయేలు ప్రజల సమూహమంతా సీను ఎడారి ప్రాంతం నుండి ప్రయాణం చేసి రెఫీదీములో దిగారు. అక్కడ ప్రజలు తాగడానికి నీళ్ళు లేవు.
\v 2 దానికి వాళ్ళు మోషే పై నింద మోపుతూ <<మాకు తాగడానికి నీళ్లియ్యి>> అన్నారు. అప్పుడు మోషే <<మీరు నాతో ఎందుకు పోట్లాడుతున్నారు? యెహోవాను ఎందుకు శోధిస్తున్నారు?>> అన్నాడు.
\v 3 ప్రజలు దాహంతో మోషే మీద సణుగుతూ <<ఇదేంటి? మమ్మల్ని, మా పిల్లలను, మా పశువులను దాహంతో చంపడానికి ఐగుప్తు నుండి ఇక్కడికి తీసుకువచ్చావా?>> అన్నారు.
\p
\s5
\v 4 అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టాడు. <<ఈ ప్రజలను నేనేం చెయ్యాలి? కొంచెం సేపట్లో వీళ్ళు నన్ను రాళ్లతో కొట్టి చంపుతారేమో>> అన్నాడు.
\v 5 అప్పుడు యెహోవా <<ప్రజల పెద్దల్లో కొందరిని వెంటబెట్టుకుని నువ్వు నదిని కొట్టిన నీ కర్రను చేతబట్టుకుని ప్రజలకు ఎదురుగా వెళ్లి నిలబడు.
\v 6 నేను అక్కడ హోరేబులోని బండ మీద నీకు ఎదురుగా నిలబడతాను. నువ్వు ఆ బండను కర్రతో కొట్టు. అప్పుడు ప్రజలు తాగడానికి ఆ బండలో నుంచి నీళ్లు బయటకు వస్తాయి>> అని మోషేతో చెప్పాడు. మోషే ఇశ్రాయేలు ప్రజల పెద్దల కళ్ళెదుట ఆ విధంగా చేశాడు.
\v 7 అప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలు చేసిన గొడవనుబట్టి, వారు <<యెహోవా మన మధ్య ఉన్నాడా, లేడా?>> అని యెహోవాను శోధించడాన్నిబట్టి ఆ స్థలానికి <<
\f +
\fr 17:7
\ft పరీక్ష
\f* మస్సా>> అనీ <<
\f +
\fr 17:7
\ft కలహం
\f* మెరీబా>> అనీ పేర్లు పెట్టాడు.
\s అమాలేకీయులతో యుద్ధం
\p
\s5
\v 8 తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధానికి సిద్ధమయ్యారు.
\v 9 మోషే
\f +
\fr 17:9
\ft యెహోషువా ఇశ్రాయేల్ వారి సేనాని. 33: 11 చూడండి.
\f* యెహోషువతో <<మన కోసం కొంతమందిని సిద్ధం చేసి బయలుదేరి అమాలేకీయులతో యుద్ధం చెయ్యి. నేను రేపు దేవుని కర్ర చేత్తో పట్టుకుని ఆ కొండ శిఖరంపై నిలబడతాను>> అన్నాడు.
\p
\v 10 యెహోషువ మోషే తనతో చెప్పినట్టు అమాలేకీయులతో యుద్ధానికి వెళ్ళాడు. మోషే, అహరోను, హూరు ఆ కొండ శిఖరం ఎక్కారు.
\s5
\v 11 మోషే తన చెయ్యి పైకెత్తి ఉంచినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు గెలుస్తున్నారు, మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలేకీయులు గెలవ సాగారు.
\v 12 మోషే చేతులు బరువెక్కినప్పుడు అహరోను, హూరు ఒక రాయి తెచ్చి మోషేను దానిపై కూర్చోబెట్టారు. అహరోను, హూరు ఇద్దరూ మోషేకు అటు ఇటు ఆనుకుని నిలబడి సూర్యుడు అస్తమించేదాకా అతని చేతులు ఎత్తి పట్టుకున్నారు.
\v 13 ఆ విధంగా యెహోషువ కత్తి బలంతో అమాలేకు రాజును, అతని సైన్యాన్ని ఓడించాడు.
\p
\s5
\v 14 అప్పుడు యెహోవా మోషేతో <<చిరకాలం జ్ఞాపకం ఉండేలా పుస్తకంలో ఈ విషయం రాసి అది యెహోషువకు వినిపించు. నేను అమాలేకీయులను ఆకాశం కింద నామరూపాలు లేకుండా పూర్తిగా తుడిచి పెట్టేస్తాను>> అన్నాడు.
\v 15 తరువాత మోషే ఒక బలిపీఠం కట్టి దానికి <<
\f +
\fr 17:15
\ft యెహోవా నా జెండా.
\f* యెహోవా నిస్సీ>> అని పేరు పెట్టాడు.
\v 16 అమాలేకీయులు యెహోవా సింహాసనానికి వ్యతిరేకంగా చెయ్యి ఎత్తారు గనక <<యెహోవాకు అమాలేకీయులతో తరతరాలకు వైరం ఉంటుంది అని యెహోవా శపథం చేశాడు>> అన్నాడు కాబట్టి అతడు ఇలా చేశాడు.
\s5
\c 18
\s మోషే దగ్గరికి యిత్రో రాక
\p
\v 1 యెహోవా ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి బయటకు రప్పించిన సంగతి, మోషేకు, అతని ప్రజలైన ఇశ్రాయేలీయులకు జరిగించినదంతా మిద్యానులో యాజకుడైన మోషే మామ యిత్రో విన్నాడు.
\v 2 మోషే మామ యిత్రో మోషే తన దగ్గరికి పంపిన మోషే భార్య సిప్పోరాను,
\v 3 ఆమె ఇద్దరు కొడుకులను వెంటబెట్టుకుని మోషే దగ్గరికి బయలుదేరాడు. వారిలో ఒకడి పేరు
\f +
\fr 18:3
\ft పరదేశి
\f* గెర్షోము. ఎందుకంటే మోషే <<నేను అన్య దేశంలో పరాయివాణ్ణి>> అన్నాడు.
\v 4 రెండో వాడి పేరు
\f +
\fr 18:4
\ft నా దేవుడు సహాయకుడు
\f* ఎలియాజరు. ఎందుకంటే <<నా పూర్వీకులు దేవుడే నాకు సహాయం. ఆయన ఫరో ఖడ్గం నుండి నన్ను రక్షించాడు>> అని అతడు అన్నాడు.
\p
\s5
\v 5 మోషే మామ యిత్రో అతని కుమారులనిద్దరినీ అతని భార్యనూ వెంటబెట్టుకుని ఎడారిలో దేవుని పర్వతం దగ్గర బస చేసిన మోషే దగ్గరికి వచ్చాడు.
\v 6 <<నీ మామ యిత్రో అనే నేనూ నీ భార్య, ఆమెతో కలసి ఆమె ఇద్దరు కొడుకులు నీ దగ్గరికి వస్తున్నాము>> అని మోషేకు కబురు పంపాడు.
\s5
\v 7 మోషే తన మామకు ఎదురు వెళ్ళాడు. అతనికి వందనం చేసి ముద్దు పెట్టుకున్నాడు. ఒకరినొకరు యోగక్షేమాలు తెలుసుకుని గుడారంలోకి వచ్చారు.
\p
\v 8 తరువాత యెహోవా ఇశ్రాయేలు ప్రజల పక్షంగా ఫరోకు, ఐగుప్తీయులకు చేసినదీ మార్గంలో తమకు సంభవించిన కష్టాలూ వాటి నుండి యెహోవా తమను విడిపించిన విషయం మోషే తన మామకు వివరంగా చెప్పాడు.
\s5
\v 9 యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించడంలో ఇశ్రాయేలు ప్రజలకు చేసిన మేళ్ళు విని యిత్రో సంతోషించాడు.
\v 10 యిత్రో <<ఐగుప్తీయుల చేతిలో నుండి, ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి, ఐగుప్తీయుల కింద బానిసత్వం నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవాకు స్తుతి కలుగు గాక.
\v 11 యెహోవాయే మిగిలిన దేవుళ్ళ కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసింది. ఎందుకంటే ఇశ్రాయేలీయుల పట్ల అహంకారంతో మెలిగిన ఐగుప్టు వారి వశంనుండి ఆయన తన ప్రజలను రక్షించాడు>> అన్నాడు.
\p
\s5
\v 12 మోషే మామ యిత్రో హోమబలి, ఇతర బలులు దేవునికి అర్పించాడు. అహరోను, ఇశ్రాయేలు ప్రజల పెద్దలు మోషే మామతో కలిసి దేవుని సన్నిధిలో భోజనం చేశారు.
\s5
\v 13 మోషే మరుసటి రోజు ప్రజలకు న్యాయం తీర్చడానికి కూర్చున్నాడు. పొద్దుటి నుంచి సాయంత్రం వరకూ ప్రజలు మోషే దగ్గర బారులు తీరి నిలబడ్డారు.
\s న్యాయాధికారుల నియామకం
\r ద్వితీ 1:9-18
\p
\v 14 ప్రజల విషయంలో మోషే చేస్తున్నదంతా యిత్రో చూశాడు. అతడు మోషేతో <<నువ్వు ఈ ప్రజలకు చేస్తున్నదేమిటి? ఉదయం నుండి సాయంత్రం దాకా నువ్వొక్కడివే తీర్పరిగా కూర్చుని ఉంటే మిగిలిన వాళ్ళంతా నీ చుట్టూ నిలబడి ఉండడం ఏమిటి?>> అని అడిగాడు.
\s5
\v 15 మోషే <<దేవుని నిర్ణయం ఏమిటో తెలుసుకోవడం కోసం వాళ్ళు నా దగ్గరికి వస్తారు.
\v 16 వాళ్ళ మధ్య ఏవైనా గొడవలు వస్తే వాటి పరిష్కారం కోసం నా దగ్గరికి వస్తారు. నేను వారికి తీర్పు తీర్చి, దేవుని చట్టాలను, ఆయన ధర్మశాస్త్ర నియమాలను వారికి తెలియజేస్తాను>> అని తన మామతో చెప్పాడు.
\p
\s5
\v 17 అందుకు మోషే మామ అతనితో <<నీవు చేస్తున్న పని మంచిది కాదు.
\v 18 ఇలా చేస్తే నువ్వూ నీతో ఉన్న ఈ ప్రజలూ నలిగిపోయి నీరసించి పోతారు. నువ్వొక్కడివే ఈ పని చెయ్యలేవు. ఇది నీకు చాలా కష్టంగా ఉంటుంది.
\v 19 నా మాట విను. నేను నీకొక ఆలోచన చెబుతాను. దేవుడు నీకు తోడై ఉంటాడు. నువ్వు దేవుని ఎదుట ఈ ప్రజల ప్రతినిధిగా నిలబడి వారి వ్యవహారాలు దేవుని సముఖానికి తీసుకురావాలి.
\v 20 ప్రజలకు దేవుని చట్టాలూ ధర్మశాస్త్ర నియమాలూ బోధించాలి. వాళ్ళు నడుచుకోవలసిన మార్గాలను, చేయవలసిన పనులనూ వాళ్ళకు తెలియజెయ్యాలి.
\p
\s5
\v 21 నువ్వు ప్రజలందరిలో దేవుని పట్ల భయభక్తులు, సత్యం పట్ల ఆసక్తి ఉండి లంచగొండులుకాని సమర్ధులైన వ్యక్తులను ఏర్పాటు చేసుకోవాలి. వారిని న్యాయాధిపతులుగా నియమించు. వెయ్యి మందికి ఒకడు, వంద మందికి ఒకడు, యాభై మందికి ఒకడు, పది మందికి ఒకడు చొప్పున వాళ్ళను నియమించు.
\v 22 వాళ్ళు అన్ని సమయాల్లో ప్రజలకు న్యాయం తీరుస్తారు. పరిష్కారం కాని సమస్యలు మాత్రం నీ దగ్గరికి తీసుకు వస్తారు. చిన్న చిన్న తగాదాలు మాత్రం వాళ్ళే పరిష్కరిస్తారు. ఆ విధంగా వాళ్ళు నీ భారం పంచుకుంటే నీకు తేలికగా ఉంటుంది.
\v 23 ఇలా చేయడానికి దేవుడు అనుమతి ఇస్తే, నీ పని తేలిక అవుతుంది. ఈ ప్రజలంతా తమ ఇళ్ళకు సంతృప్తిగా వెళ్తారు>> అని చెప్పాడు.
\s5
\v 24 మోషే తన మామ మాట విని అతడు చెప్పినట్టు చేశాడు.
\p
\v 25 మోషే ఇశ్రాయేలు ప్రజలందరిలో సామర్థ్యం ఉన్న వ్యక్తులను గుర్తించి వెయ్యి మందికి ఒకడు, వంద మందికి ఒకడు, యాభై మందికి ఒకడు, పది మందికి ఒకడు చొప్పున అధికారులుగా నియమించి వాళ్లకు న్యాయం తీర్చే అధికారం ఇచ్చాడు.
\v 26 వాళ్ళు అన్ని సమయాల్లో ప్రజలకు న్యాయాధికారులుగా ఉన్నారు. చిన్న చిన్న తగాదాలు తమకు తాము పరిష్కరించేవాళ్ళు. కఠినమైన తగాదాలు మోషే దగ్గరికి తెచ్చేవారు.
\v 27 తరువాత మోషే తన మామను సాగనంపాడు, అతడు తన స్వదేశానికి వెళ్ళిపోయాడు.
\s5
\c 19
\s ఇశ్రాయేల్ ప్రజా సీనాయి కొండకు చేరుకోవడం
\p
\v 1 ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన మూడవ నెల మొదటి రోజున సీనాయి ఎడారి ప్రాంతానికి వచ్చారు.
\v 2 వాళ్ళు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి ఎడారికి వచ్చి అక్కడ పర్వతం ఎదుట ఎడారిలో విడిది చేశారు.
\p
\s5
\v 3 మోషే యెహోవా సన్నిధి ఉన్న కొండపైకి ఎక్కి వెళ్ళాడు. యెహోవా ఆ కొండపై నుండి అతణ్ణి పిలిచాడు. యెహోవా మోషేతో <<నువ్వు యాకోబు సంతతితో మాట్లాడి ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పు.
\p
\v 4 <నేను ఐగుప్తీయులకు ఏమి జరిగించానో, గరుడ పక్షి రెక్కల మీద మోసినట్టు మిమ్మల్ని నా దగ్గరికి ఎలా చేర్చుకొన్నానో మీరు చూశారు.
\v 5 ఇప్పుడు మీరు నా మాట శ్రద్ధగా విని, నా ఒడంబడిక ప్రకారం నడుచుకుంటే అన్ని దేశ ప్రజల్లో నాకు విశేషమైన ఆస్తిగా ఉంటారు. భూమి అంతా నాదే గదా.
\v 6 మీరు యాజక రాజ్యంగా పవిత్రప్రజగా ఉంటారు.> నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాల్సిన మాటలు ఇవే>> అన్నాడు.
\p
\s5
\v 7 మోషే కొండ దిగి వచ్చి ప్రజల పెద్దలను పిలిపించాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారికి తెలియజేశాడు.
\v 8 అందుకు ప్రజలంతా <<యెహోవా చెప్పినదంతా మేము చేస్తాం>> అని ముక్తకంఠంతో జవాబిచ్చారు. అప్పుడు మోషే తిరిగి వెళ్లి ప్రజలు చెప్పిన మాటలను యెహోవాకు తెలియజేశాడు.
\v 9 యెహోవా మోషేతో <<ఇదిగో నేను కారుమబ్బులో నీ దగ్గరికి వస్తున్నాను. నేను నీతో మాట్లాడుతూ ఉండగా ప్రజలు విని ఎప్పటికీ నీ మీద నమ్మకం ఉంచుతారు>> అన్నాడు. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పాడు.
\p
\s5
\v 10 అప్పుడు యెహోవా మోషేతో <<నీవు ప్రజల దగ్గరికి వెళ్లి ఈ రోజూ రేపూ వాళ్ళను పవిత్రపరచు. నా రాక కోసం వాళ్ళు సిద్ధం చెయ్యి. వాళ్ళు తమ బట్టలు ఉతుక్కుని
\v 11 మూడవ రోజుకల్లా సిద్ధంగా ఉండాలి. మూడవ రోజు యెహోవా అనే నేను ప్రజలందరి కళ్ళెదుట సీనాయి కొండ పైకి దిగివస్తాను.
\p
\s5
\v 12 నువ్వు కొండ చుట్టూ హద్దు ఏర్పాటు చెయ్యి. ప్రజలతో, <మీరు ఈ కొండ ఎక్కకూడదు. దాని అంచును కూడా ముట్టుకోకూడదు. జాగ్రత్త. ఈ కొండను ముట్టుకున్న ప్రతివాడూ మరణశిక్షకు లోనవుతాడు.
\v 13 ఎవ్వరూ తమ చేతులతో ముట్టుకున్న వాణ్ణి తాకకూడదు. రాళ్ళతో గానీ బాణాలతో గానీ కచ్చితంగా అతణ్ణి చంపెయ్యాలి. మనిషైనా జంతువైనా మరణ శిక్ష విధించాల్సిందే. సుదీర్ఘమైన బూర శబ్దం వినినప్పుడు వాళ్ళు కొండ పాదానికి చేరుకోవాలి> అని చెప్పు>> అన్నాడు.
\p
\s5
\v 14 అప్పుడు మోషే కొండ దిగి ప్రజల దగ్గరికి వచ్చి ప్రజలను పవిత్ర పరిచాడు. ప్రజలు తమ బట్టలు ఉతుక్కున్నారు.
\v 15 అప్పుడు మోషే <<మూడవ రోజుకల్లా సిద్ధంగా ఉండండి. మీ భార్యల దగ్గరికి వెళ్లొద్దు.>> అని చెప్పాడు.
\s5
\v 16 మూడవ రోజు తెల్లవారగానే ఆ కొండ మీద దట్టమైన మేఘాలు కమ్మి ఉరుములు, మెరుపులు వచ్చాయి. భీకరమైన బూర శబ్దం వినిపించినప్పుడు శిబిరంలోని ప్రజలంతా భయంతో వణకిపోయారు.
\v 17 దేవుణ్ణి ఎదుర్కొనడానికి మోషే శిబిరంలో నుండి ప్రజలను బయటకు రప్పించాడు. ప్రజలంతా కొండ పాదం దగ్గర నిలబడ్డారు.
\p
\v 18 మండుతున్న మంటలతో యెహోవా సీనాయి కొండపైకి దిగి వచ్చాడు. ఆ కొండ అంతా పొగ కమ్మింది. అది కొలిమి పొగలాగా పైకి లేస్తూ ఉంది.
\f +
\fr 19:18
\ft ప్రజలంతా వణికిపోయారు
\f* ఆ కొండంతా తీవ్రంగా కంపించింది.
\s5
\v 19 ఆ బూర శబ్దం మరింత పెరుగుతూ ఉండగా మోషే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఉరుములాంటి కంఠ స్వరంతో అతనికి జవాబిస్తున్నాడు.
\v 20 యెహోవా సీనాయి కొండ శిఖరం మీదికి దిగి వచ్చాడు. కొండ శిఖరం మీదికి రమ్మని మోషేను పిలిచినప్పుడు మోషే ఎక్కి వెళ్ళాడు.
\p
\v 21 అప్పుడు యెహోవా మోషేతో <<ఈ ప్రజలు యెహోవాను చూద్దామని హద్దు మీరి వచ్చి వారిలో చాలా మంది నశించిపోకుండేలా నువ్వు కొండ దిగి వెళ్లి వాళ్లను కచ్చితంగా హెచ్చరించు.
\v 22 ఇంకా నన్ను సమీపించే యాజకులు సిద్ధపడి నేను వారిని చంపకుండేలా తమను తాము పవిత్ర పరుచుకోవాలని చెప్పు>> అన్నాడు.
\p
\s5
\v 23 అందుకు మోషే యెహోవాతో <<ప్రజలు సీనాయి కొండ ఎక్కలేరు. నువ్వు కొండకు హద్దులు ఏర్పాటు చేసి దాన్ని పవిత్రంగా ఉంచాలని మాకు కచ్చితంగా ఆజ్ఞాపించావు గదా>> అన్నాడు.
\v 24 అప్పుడు యెహోవా <<నువ్వు కిందకు దిగి వెళ్లు. నువ్వు అహరోనును వెంటబెట్టుకుని తిరిగి రావాలి. అయితే యెహోవా వారి మీద పడకుండా ఉండేలా యాజకులు, ప్రజలు హద్దు మీరి ఆయన దగ్గరికి ఎక్కి రాకూడదు>> అని చెప్పాడు.
\v 25 మోషే ప్రజల దగ్గరికి వెళ్లి ఆ మాట వాళ్ళతో చెప్పాడు.
\s5
\c 20
\s పది ఆజ్ఞలు
\r ద్వితీ 1:1-21
\p
\v 1 దేవుడు ఈ ఆజ్ఞలన్నిటినీ వివరించి చెప్పాడు,
\v 2 నేను యెహోవాను, మీ దేవుణ్ణి. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న మిమ్మల్ని బయటకు తీసుకు వచ్చిన దేవుణ్ణి నేనే.
\p
\v 3 నేను కాక వేరే దేవుడు మీకు ఉండకూడదు.
\p
\s5
\v 4 పైన ఆకాశంలో గానీ, కింద భూమి మీద గానీ, భూమి కింద ఉండే నీళ్లలో గానీ ఎలాంటి ఆకారాన్నీ, ప్రతిమను తయారు చేసుకోకూడదు, వాటి ముందు సాష్టాంగపడ కూడదు, వాటిని పూజించ కూడదు.
\p
\v 5 ఎందుకంటే నీ దేవుడనైన నేను రోషం గలవాణ్ణి. నన్ను లక్ష్యపెట్టని వారి విషయంలో వాళ్ళ మూడు నాలుగు తరాల దాకా వాళ్ళ పూర్వికుల దుష్టత్వం వారి సంతతి పైకి రప్పిస్తాను.
\p
\v 6 నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు పాటించే వారిపై వెయ్యి తరాల వరకూ నా కరుణ చూపిస్తాను.
\p
\s5
\v 7 నీ దేవుడైన యెహోవా నామాన్ని వ్యర్థంగా పలకకూడదు. తన నామాన్ని వ్యర్థంగా పలికే వాణ్ణి యెహోవా దోషిగా పరిగణిస్తాడు.
\p
\s5
\v 8 విశ్రాంతి దినాన్ని పవిత్రంగా ఆచరించాలని జ్ఞాపకం ఉంచుకోవాలి.
\v 9 నువ్వు కష్టపడి ఆరు రోజుల్లో నీ పని అంతా ముగించాలి.
\v 10 ఏడవ రోజు నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. ఆ రోజున నువ్వు, నీ కొడుకు, కూతురు, సేవకుడు, దాసీ, నీ ఇంట్లో ఉన్న విదేశీయుడు, నీ పశువులు ఎవ్వరూ ఏ పనీ చెయ్యకూడదు.
\p
\v 11 ఆరు రోజుల్లో యెహోవా ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, సముద్రంలో ఉన్న సమస్తాన్నీ సృష్టించాడు. ఏడవ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. అందువల్ల యెహోవా విశ్రాంతి దినాన్ని దీవించి తనకోసం పవిత్ర పరిచాడు.
\p
\s5
\v 12 నీ దేవుడైన యెహోవా మీకివ్వబోయే దేశంలో నువ్వు దీర్ఘకాలం జీవించేలా నీ తండ్రిని, తల్లిని గౌరవించాలి.
\p
\v 13 హత్య చెయ్యకూడదు.
\p
\v 14 వ్యభిచారం చెయ్యకూడదు.
\p
\s5
\v 15 దొంగతనం చెయ్యకూడదు.
\p
\v 16 నీ పొరుగువాడిపై తప్పుడు సాక్ష్యం చెప్పకూడదు.
\p
\v 17 నీ పొరుగువాడి ఇల్లు గానీ, అతని భార్యను గానీ, దాస దాసీలను గానీ, అతని ఎద్దును గానీ, గాడిదను గానీ, నీ పొరుగు వాడికి చెందిన దేనినీ ఆశించకూడదు.
\s ప్రజల భయభీతులు
\p
\s5
\v 18 ప్రజలంతా ఆ ఉరుములు, మెరుపులు, భీకరమైన బూర శబ్దం, ఆ కొండ నుండి రగులుతున్న పొగ చూసి భయపడ్డారు. భయంతో దూరంగా తొలగిపోయి మోషేతో,
\v 19 <<దేవుడే గనక మాతో మాట్లాడితే మేమంతా చచ్చిపోతాం. నువ్వే మాతో మాట్లాడు, మేము వింటాం>> అన్నారు.
\p
\v 20 అందుకు మోషే <<భయపడకండి. మిమ్మల్ని పరీక్షించడానికి, ఇక నుంచి మీరు పాపం చేయకుండా ఆయన భయం మీకు ఉండేలా దేవుడు వచ్చాడు>> అని ప్రజలతో చెప్పాడు.
\p
\v 21 ప్రజలు దూరంగా నిలబడ్డారు. మోషే దేవుడు ఉన్న కారుమబ్బుల దగ్గరికి చేరుకున్నాడు.
\s5
\v 22 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. <<ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పు. నేను ఆకాశంలో నుండి దిగి వచ్చి మీతో మాట్లాడాను అనడానికి మీరే సాక్షులు.
\v 23 మీరు నన్ను ఆరాధించడానికి వెండి, లేదా బంగారపు ప్రతిమలను తయారు చేసుకోకూడదు.
\s బలిపీఠం
\p
\s5
\v 24 మట్టితో నా కోసం బలిపీఠం నిర్మించి దాని మీద మీ హోమబలులూ, శాంతిబలులూ, మీ గొర్రెలూ, ఎద్దులూ అర్పించాలి. నా పేరు గుర్తుంచుకొనేలా నేను దాన్ని ఉంచే ప్రతి స్థలం లో మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను.
\v 25 ఒకవేళ మీరు నాకు రాళ్లతో బలిపీఠం నిర్మించే పక్షంలో చెక్కిన రాళ్లతో దాన్ని కట్టకూడదు, దానికి నీ చేతి పనిముట్టు తగిలితే అది అపవిత్రం అవుతుంది.
\v 26 అంతేకాదు, నా బలిపీఠం సమీపించేటప్పుడు మీ నగ్నత్వం కనిపించకూడదు కాబట్టి మెట్ల మీదుగా ఎక్కకూడదు.>>
\s5
\c 21
\s హెబ్రీ బానిసల గురించిన చట్టాలు
\r ద్వితీ 15:12-18
\p
\v 1 నువ్వు ఈ న్యాయ నిర్ణయాలు వాళ్ళు పాటించేలా చెయ్యాలి.
\s5
\v 2 మీరు హెబ్రీవాడైన వ్యక్తిని దాసుడుగా కొనుక్కున్న పక్షంలో ఆరు సంవత్సరాలపాటు మీకు దాసుడుగా ఉండి, ఏడో సంవత్సరంలో మీకు ఏమీ చెల్లించకుండానే మీ నుండి విడుదల పొందవచ్చు,
\v 3 ఆ దాసుడు ఒంటరిగా వస్తే ఒంటరిగా వెళ్లవచ్చు. భార్యతో కలసి వస్తే వాడి భార్యను కూడా తీసుకుని వెళ్ళవచ్చు.
\v 4 ఒకవేళ వాడి యజమాని అతనికి భార్యగా ఒక స్త్రీని అప్పగించినప్పుడు ఆమెకు ఆ దాసుడి ద్వారా కొడుకులు గానీ, కూతుళ్ళు గానీ పుట్టినట్టయితే ఆ భార్య, పిల్లలు ఆమె యజమానికి సొంతం అవుతారు, వాడు ఒంటరిగానే వెళ్లిపోవాలి.
\p
\s5
\v 5 అయితే ఆ దాసుడు <<నేను నా యజమానిని, నా భార్య పిల్లలను ప్రేమిస్తున్నాను, వాళ్ళను విడిచిపెట్టి విడుదల పొందను>> అని తేటగా చెబితే
\v 6 వాడి యజమాని అతణ్ణి న్యాయాధిపతి దగ్గరకి తీసుకు రావాలి. తరువాత ఆ యజమాని వాణ్ణి తలుపు దగ్గరికి గానీ, గుమ్మం దగ్గరికి గానీ తీసుకువచ్చి వాడి చెవిని సన్నని కదురుతో గుచ్చాలి. అప్పటి నుంచి వాడు ఎల్లకాలం ఆ యజమానికి దాసుడుగా ఉండిపోవాలి.
\p
\s5
\v 7 ఒకడు తన కూతురిని దాసిగా అమ్మేస్తే దాసులుగా ఉండే పురుషులు స్వతంత్రంగా వెళ్లిపోయినట్టు ఆమె వెళ్ళిపోకూడదు.
\v 8 ఆమెను భార్యగా ఉంచుకోదలచే ఆమె యజమానికి ఆమె నచ్చక పోతే వెల ఇచ్చి ఆమెను విడిపించడానికి ఆమె బంధువులకు అవకాశం ఇవ్వాలి. యజమాని ఆమె పట్ల అన్యాయం జరిగించిన కారణంగా ఆమెను విదేశీయులకు అమ్మే హక్కు అతనికి ఉండదు.
\p
\s5
\v 9 యజమాని తన కొడుక్కి ఆమెను ఇస్తే తన కూతుళ్ళ పట్ల ఎలా వ్యవహరిస్తాడో అదే విధంగా ఆమె పట్ల కూడా వ్యవహరించాలి.
\v 10 ఆ కొడుకు మరొకామెను చేసుకున్నా మొదటి ఆమెకు తిండి, బట్ట, సంసార ధర్మం విషయంలో ఏమీ తక్కువ చేయకూడదు.
\v 11 ఈ మూడు విషయాల్లో ఏది తక్కువ చేసినా వెల ఏమీ చెల్లించకుండా ఆమె విడుదల పొందవచ్చు.
\s హింసాత్మక చర్యల గురించిన చట్టాలు
\p
\s5
\v 12 ఒక వ్యక్తిని చనిపోయేలా కొట్టిన వాడికి తప్పకుండా మరణశిక్ష విధించాలి.
\v 13 అయితే ఉద్దేశపూర్వకంగా కాక, అనుకోకుండా వాడి ద్వారా ఆ హత్య జరిగితే వాడు పారిపోవడానికి ఒక స్థలం మీకు నిర్ణయిస్తాను.
\v 14 అయితే ఒకడు తన పొరుగువాడిపై కోపంతో, కుయుక్తితో వాణ్ణి చంపేసి నా బలిపీఠం దగ్గర ఆశ్రయం పొందాలని చూస్తే వాణ్ణి బయటకు లాగి చంపాలి.
\s5
\v 15 తన తండ్రిని, తల్లిని కొట్టేవాడు తప్పకుండా మరణశిక్షకు అర్హుడు.
\p
\v 16 ఎవడైనా ఒక వ్యక్తిని దొంగిలించి అమ్మినా, తన దగ్గర అక్రమంగా ఉంచుకొన్నా వాడు తప్పకుండా మరణశిక్షకు అర్హుడు.
\v 17 తన తండ్రిని, తల్లిని దూషించేవాడు తప్పక మరణశిక్ష పొందుతాడు.
\s5
\v 18 ఎవరి మధ్యనైనా గొడవ జరిగినప్పుడు ఒకడు మరొకడిని రాయితో కొట్టి గానీ, పిడికిలితో గుద్దిగానీ చనిపోకుండా మంచాన పడేలా చేస్తే,
\v 19 తరువాత గాయపడ్డవాడు లేచి తన చేతికర్ర సాయంతో తిరుగుతుంటే అతణ్ణి కొట్టిన వాడికి శిక్ష ఏమీ ఉండదు. అయితే గాయపడిన వ్యక్తి పని చేయలేకపోయిన కాలానికి సరిపడ్డ సొమ్ము కొట్టినవాడు ఇచ్చి, అతణ్ణి పూర్తిగా బాగుచేయించాలి.
\p
\s5
\v 20 ఎవరైనా ఒకడు తన దాసుణ్ణి, దాసిని చనిపోయేలా కర్రతో కొట్టినప్పుడు అతడు తప్పకుండా శిక్షకు అర్హుడు.
\v 21 అయితే ఆ దాసులు ఒకటి రెండు రోజులు చనిపోకుండా బతికితే ఆ శిక్ష అతనికి ఉండదు. ఎందుకంటే ఆ దాసులు అతని సొమ్ము.
\s5
\v 22 ఎవరి మధ్యనైనా గొడవ జరిగినప్పుడు గర్భంతో ఉన్న స్త్రీకి దెబ్బ తగిలి ఆమెకు గర్భస్రావం జరిగితే, గర్భస్రావం కాక మరి ఏ ఇతర హానీ కలగకపోతే ఆ స్త్రీ భర్త హాని కలిగించినవాడిపై మోపిన నష్టాన్ని వాడు చెల్లించాలి. అయితే అది న్యాయాధిపతుల నిర్ణయం మేరకు వాళ్ళ సమక్షంలో జరగాలి.
\p
\v 23 తీవ్రగాయం కలిగినప్పుడు మీరు విధించ వలసిన శిక్షలు: ప్రాణానికి ప్రాణం,
\v 24 కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, కాలికి కాలు,
\v 25 వాతకు వాత, గాయానికి గాయం, దెబ్బకు దెబ్బ.
\p
\s5
\v 26 ఒకడు తన దాసుణ్ణి గానీ, దాసిని గానీ కొట్టి వాళ్ళ కన్ను పోయేలా చేస్తే ఆ కన్నుకు పరిహారంగా వాళ్ళను విడుదల చెయ్యాలి.
\v 27 తన దాసుడి, దాసి దంతం ఊడిపోయేలా కొట్టినప్పుడు ఆ దంతానికి పరిహారంగా వాళ్ళను విడుదల చెయ్యాలి.
\p
\s5
\v 28 ఎవరిదైనా ఎద్దు పురుషుణ్ణి గానీ, స్త్రీని గానీ పొడిచి చంపితే ఆ ఎద్దును కచ్చితంగా రాళ్లతో కొట్టి చంపాలి. అలా చనిపోయిన ఎద్దు మాంసం తినకూడదు. ఈ విషయంలో ఎద్దు యజమానికి దోషం అంటదు.
\v 29 అయితే ఆ ఎద్దు ఇతరులను పొడుస్తుంది అని ఇంతకు ముందు దాని యజమానికి తెలిసి కూడా అతడు దాన్ని అదుపు చేయక పోవడం వల్ల దాని ద్వారా పురుషుడు గానీ, స్త్రీ గానీ చనిపోతే ఆ ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి. అప్పుడు దాని యజమానికి మరణశిక్ష విధించాలి.
\v 30 మరణశిక్షకు బదులు జరిమానా విధిస్తే అతడు ఆ మొత్తం చెల్లించి తన ప్రాణం దక్కించుకోవాలి.
\s5
\v 31 ఆ ఎద్దు చిన్న పిల్లవాణ్ణి గానీ చిన్న పిల్లనుగానీ పొడిచినప్పుడు ఈ నియమం వర్తిస్తుంది.
\v 32 ఎద్దు దాసుణ్ణి గానీ, దాసిని గానీ పొడిచినప్పుడు ఆ దాసుల యజమానికి ఎద్దు యజమాని
\f +
\fr 21:32
\ft 342 గ్రాముల వెండి.
\f* 30 తులాల వెండి చెల్లించాలి. ఇంకా ఆ ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి.
\p
\s5
\v 33 ఒక గొయ్యి మీద మూత తీసి ఉంచినప్పుడు గానీ, గొయ్యి తవ్వి దానిపై కప్పు ఉంచక పోవడం వల్ల గానీ దానిలో వేరొకరి ఎద్దు గానీ, గాడిద గానీ పడి చనిపోతే
\v 34 ఆ గొయ్యి ఉన్న స్థలం యజమానులు ఆ నష్టానికి బాధ్యత వహించాలి. వాటి యజమానికి తగిన మొత్తం చెల్లించాలి. అప్పుడు చచ్చిన జంతువు అతని సొంతం అవుతుంది.
\p
\s5
\v 35 ఒకరి ఎద్దు వేరొకరి ఎద్దును చనిపోయేలా పొడిచినప్పుడు బతికి ఉన్న ఎద్దును అమ్మి దానికి వచ్చిన మొత్తాన్ని ఇద్దరూ పంచుకోవాలి. చచ్చిన ఎద్దు మాంసం కూడా పంచుకోవాలి.
\v 36 అయితే ఆ ఎద్దు ఇతరులను పొడుస్తుంది అని ఇంతకు ముందు దాని యజమానికి తెలిసి కూడా అతడు దాన్ని అదుపు చేయకపోతే వాడు తప్పకుండా ఎద్దుకు బదులు ఎద్దును ఇవ్వాలి, చనిపోయిన ఎద్దు అతనిది అవుతుంది.
\s5
\c 22
\s ఆస్తిపాస్తుల సంరక్షణ
\p
\v 1 <<ఎవరైనా ఒకడు ఎద్దును గానీ, గొర్రెను గానీ దొంగిలించి వాటిని అమ్మినా, లేదా చంపినా ఒక ఎద్దుకు బదులు ఐదు ఎద్దులు, ఒక గొర్రెకు బదులు నాలుగు గొర్రెలు చెల్లించాలి.
\v 2 ఎవరైనా దొంగతనం చేస్తూ దొరికిపోతే వాణ్ణి చనిపోయేలా కొట్టినప్పుడు కొట్టిన వాళ్ళ మీద నేరం ఉండదు.
\v 3 సూర్యుడు ఉదయించిన తరువాత దొంగతనానికి వచ్చిన వాణ్ణి కొట్టిన వ్యక్తి పై హత్యానేరం ఉంటుంది. దొంగిలించిన సొత్తు తిరిగి చెల్లించాలి. దొంగ దగ్గర చెల్లించడానికి ఏమీ లేకపోతే వాడు దొంగతనం చేశాడు కాబట్టి వాణ్ణి బానిసగా అమ్మివేయాలి.
\v 4 దొంగిలించిన ఎద్దు గానీ, గాడిద గానీ, గొర్రె గానీ ఏదైనా సరే, ప్రాణంతో దొరికితే వాడు దానికి రెండు రెట్లు చెల్లించాలి.
\p
\s5
\v 5 ఒకడు తన పశువును మేత మేయడానికి తన పొలం లోకి గానీ, ద్రాక్ష తోటలోకి గానీ వదిలినప్పుడు అది వేరొక వ్యక్తి పొలంలో మేస్తే ఆ పొలం యజమానికి తన పంటలో, ద్రాక్షతోటలో శ్రేష్ఠమైనది తిరిగి చెల్లించాలి.
\s5
\v 6 నిప్పు రాజుకుని ముళ్ళకంపలు అంటుకోవడం వల్ల వేరొకరి పంట కుప్పలైనా, పొలంలో పైరులైనా, పొలమైనా తగలబడి పోతే నిప్పు అంటించిన వాడు జరిగిన నష్టాన్ని పూడ్చాలి.
\p
\s5
\v 7 ఒక వ్యక్తి సొమ్మును గానీ, సామాన్లు గానీ జాగ్రత్త చెయ్యమని తన పొరుగు వాడికి అప్పగించినప్పుడు ఆ వ్యక్తి ఇంట్లో దొంగతనం జరిగినట్టయితే ఆ దొంగ దొరికిన పక్షంలో వాడు దానికి రెండు రెట్లు చెల్లించాలి.
\v 8 ఒకవేళ ఆ దొంగ దొరకని పక్షంలో ఆ ఇంటి యజమాని తన పొరుగువాడి వస్తువులు తీసుకున్నాడో లేదో పరిష్కారం చేసుకోవడానికి
\f +
\fr 22:8
\ft అక్షరాలా, దేవుళ్ళ దగ్గరికి.
\f* న్యాయాధికారుల దగ్గరికి రావాలి.
\v 9 ఎద్దులు, గాడిదలు, గొర్రెలు, దుస్తులు వంటి ప్రతి విధమైన వాటి అపహరణ గూర్చిన ఆజ్ఞ ఇదే. పోగొట్టుకున్నవాడు వాటిని చూసి, అవి నావి అని వాదించినప్పుడు ఆ విషయంలో పరిష్కారం కోసం
\f +
\fr 22:9
\ft అక్షరాలా, దేవుళ్ళ దగ్గరికి.
\f* న్యాయాధికారుల దగ్గరికి రావాలి. న్యాయాధిపతి ఎవరి మీద నేరం రుజువు చేస్తాడో వాడు తన పొరుగువాడికి రెండు రెట్లు చెల్లించాలి.
\p
\s5
\v 10 ఒకడు గాడిద, ఎద్దు, గొర్రె, మరి ఏ జంతువునైనా కాపాడమని తన పొరుగు వాడికి అప్పగించినప్పుడు, అది చనిపోయినా, గాయపడినా, లేదా ఎవరూ చూడకుండా ఎవరైనా వాటిని తోలుకు పోయినా,
\v 11 అ వ్యక్తి తన పొరుగువాడి సొమ్మును తాను దొంగిలించలేదని యెహోవా నామం పేరట ప్రమాణం చెయ్యాలి. ఆ ప్రమాణం వారిద్దరి మధ్యనే ఉండాలి. ఆస్తి స్వంత దారుడు దానికి సమ్మతించాలి. జరిగిన నష్టపరిహారం చెల్లించనక్కర లేదు.
\v 12 ఒకవేళ అది నిజంగా అతని దగ్గర నుండి ఎవరైనా దొంగిలిస్తే అతడు స్వంత దారుడికి పరిహారం చెల్లించాలి.
\v 13 లేదా ఒకవేళ మృగాలు దాన్ని చీల్చివేస్తే రుజువు కోసం దాన్ని తీసుకురావాలి. అలా చనిపోయినప్పుడు దాని నష్టం చెల్లించనక్కర లేదు.
\p
\s5
\v 14 ఒక వ్యక్తి తన పొరుగువాని దగ్గర ఏదైనా బదులు తీసుకుంటే, దాని యజమాని దాని దగ్గర లేనప్పుడు దానికి హాని కలిగినా, లేదా అది చనిపోయినా ఆ నష్టాన్ని తప్పకుండా పూరించాలి.
\v 15 దాని యజమాని దానితో ఉన్నట్టయితే దాని నష్టం చెల్లించనక్కర లేదు. ఒకవేళ అది కిరాయికి తెచ్చినదైతే దాని కిరాయి డబ్బు యజమానికి చెల్లించాలి.
\s సమాజంలో బాధ్యతలు
\p
\s5
\v 16 ఒకడు పెళ్లి నిర్ణయం కాని ఒక కన్యను లోబరచుకుని ఆమెతో తన వాంఛ తీర్చుకుంటే ఆమె కోసం కట్నం ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకోవాలి.
\v 17 ఒకవేళ ఆమె తండ్రి ఆమెను అతనికిచ్చేందుకు నిరాకరిస్తే వాడు కన్యల కట్నం ప్రకారం సొమ్ము చెల్లించాలి.
\p
\s5
\v 18 మంత్రగత్తెను బతకనివ్వకూడదు.
\p
\v 19 జంతువులతో సంపర్కం చేసే ప్రతి ఒక్కరికీ మరణశిక్ష విధించాలి.
\p
\s5
\v 20 యెహోవాకు మాత్రమే బలులు అర్పించాలి, వేరొక దేవునికి బలి అర్పించే వాడు శాపానికి గురౌతాడు.
\p
\v 21 పరాయి దేశస్థులను పీడించకూడదు. మీరు ఐగుప్తు దేశంలో పరాయివాళ్ళుగా ఉన్నారు గదా.
\p
\s5
\v 22 విధవరాళ్ళను, తల్లి తండ్రులు లేని పిల్లలను బాధపెట్టకూడదు.
\v 23 వాళ్ళను ఏ కారణంతోనైనా నీవు బాధ పెడితే వాళ్ళు పెట్టే మొర నాకు వినబడుతుంది. నేను వాళ్ళ మొరను తప్పకుండా ఆలకిస్తాను.
\v 24 నా కోపాగ్ని రగులుకొంటుంది. నా కత్తివేటుతో నిన్ను హతం చేస్తాను. మీ భార్యలు విధవరాళ్ళు అవుతారు. మీ పిల్లలు దిక్కులేని వాళ్ళవుతారు.
\p
\s5
\v 25 నా ప్రజల్లో మీ దగ్గర ఉండే ఒక పేదవాడికి అప్పుగా సొమ్ము ఇచ్చినప్పుడు వారి పట్ల కఠినంగా ప్రవర్తించ కూడదు. వాళ్ళ దగ్గర వడ్డీ వసూలు చేయకూడదు.
\v 26 మీరు ఒకవేళ ఎప్పుడైనా మీ పొరుగువాడి దుస్తులు తాకట్టు పెట్టుకుంటే సూర్యుడు అస్తమించే సమయానికి వాటిని వాళ్లకు తిరిగి అప్పగించాలి.
\v 27 వాళ్ళు ఏమి కప్పుకుని పండుకుంటారు? వాళ్ళ దేహాలు కప్పుకొనే దుస్తులు అవే కదా. వాళ్ళు నాకు మొర పెట్టినప్పుడు నేను వింటాను. నేను దయగల వాణ్ణి.
\p
\s5
\v 28 నువ్వు దేవుణ్ణి దూషించకూడదు. నీ ప్రజల అధికారుల్లో ఎవరినీ శపించ కూడదు.
\p
\s5
\v 29 నీ మొదటి కోత అర్పణలు ఇవ్వడంలో ప్రథమ ఫలాలు ఇవ్వడంలో ఆలస్యం చేయకూడదు. నీ కొడుకుల్లో మొదటివాణ్ణి నాకు ప్రతిష్టించాలి.
\v 30 అదే విధంగా నీ ఎద్దులు, గొర్రెలు అర్పించాలి. మీరు ప్రతిష్ఠించినవి మొదటి ఏడు రోజులు తమ తల్లి దగ్గర ఉన్న తరువాత ఎనిమిదవ రోజు నాకు ప్రతిష్ఠించాలి.
\v 31 మీరు నాకు ప్రత్యేకంగా ఉన్న వాళ్ళు గనుక పొలాల్లో మృగాలు చీల్చిన జంతు మాంసం తినకూడదు. దాన్ని కుక్కలకు పారవెయ్యాలి.>>
\s5
\c 23
\s జాలి, కరుణల గురించిన చట్టాలు
\p
\v 1 పుకార్లు పుట్టించకూడదు. అన్యాయ సాక్ష్యం చెప్పడానికి దుష్టులతో చేతులు కలప కూడదు.
\v 2 దుష్టకార్యాలు జరిగించే గుంపులతో కలిసి ఉండ కూడదు. న్యాయాన్ని తారుమారు చేసే గుంపుతో చేరి న్యాయం విషయంలో అబద్ద సాక్ష్యం చెప్ప కూడదు.
\v 3 ఒక పేదవాడు న్యాయం కోసం పోరాడుతుంటే అతని పట్ల పక్షపాతంగా వ్యవహరించకూడదు.
\p
\s5
\v 4 నీ శత్రువుకు చెందిన ఎద్దు గానీ, గాడిద గానీ తప్పిపోతే అది నీకు కనబడినప్పుడు నువ్వు తప్పకుండా దాన్ని తోలుకు వచ్చి అతనికి అప్పగించాలి.
\v 5 నీ విరోధి గాడిద బరువు క్రింద పడిపోయి ఉండడం నువ్వు చూస్తే దాని పక్కనుండి దాటిపోకుండా వెంటనే వెళ్లి అతడితో కలసి ఆ గాడిదను విడిపించాలి.
\p
\s5
\v 6 దరిద్రునికి న్యాయం చేసే విషయంలో అన్యాయంగా తీర్పు తీర్చకూడదు
\v 7 అబద్ధానికి దూరంగా ఉండు. నీతిమంతుణ్ణి, దోషం లేనివాణ్ణి చంపకూడదు. అలాంటి చెడ్డ పనులు చేసేవాణ్ణి నేను దోషం లేనివాడిగా చూడను.
\v 8 లంచాలు తీసుకోవద్దు.
\f +
\fr 23:8
\ft అధికారులను, లేక న్యాయాధికారులను.
\f* చూపు ఉన్నవాణ్ణి లంచం గుడ్డివాడిగా చేస్తుంది. నీతిమంతుల మాటలకు అపార్థాలు పుట్టిస్తుంది.
\p
\v 9 విదేశీయులను ఇబ్బందుల పాలు చేయకూడదు. మీరు ఐగుప్తు దేశంలో విదేశీయులుగా ఉన్నారు కదా. వాళ్ళ మనస్సు ఎలా ఉంటుందో మీకు తెలుసు.
\s విశ్రాంతి దినం, సంవత్సరం గురించిన చట్టం
\p
\s5
\v 10 ఆరు సంవత్సరాల పాటు నీ భూమిని దున్ని దాని పంట సమకూర్చుకోవాలి.
\v 11 ఏడవ సంవత్సరం నీ భూమిని బీడుగా వదిలి పెట్టాలి. అప్పుడు మిగిలి ఉన్న పంటను నీ ప్రజల్లోని పేదవారు తీసుకున్న తరువాత మిగిలినది అడవి జంతువులు తినవచ్చు. మీకు చెందిన ద్రాక్ష, ఒలీవ తోటల విషయంలో కూడా ఈ విధంగానే చెయ్యాలి.
\p
\s5
\v 12 ఆరు రోజులు నీ పనులు చేసిన తరువాత ఏడవ రోజున నీ ఎద్దులు, గాడిదలు, దాసీ కొడుకులూ, విదేశీయులూ సేద దీర్చుకొనేలా విశ్రాంతి తీసుకోవాలి.
\v 13 నేను మీతో చెప్పే సంగతులన్నీ జాగ్రత్తగా వినాలి. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు. అది నీ నోటి వెంట రానియ్యకూడదు.
\s వార్షిక పండగలు
\r నిర్గమ 34:18-26; ద్వితీ 16:1-17
\p
\s5
\v 14 సంవత్సరంలో మూడుసార్లు నాకు ఉత్సవం జరిగించాలి.
\v 15 పొంగ జేసే పదార్థం లేని రొట్టెల పండగ ఆచరించాలి. నేను మీకు ఆజ్ఞాపించిన ప్రకారం ఐగుప్తు నుండి మీరు బయలుదేరి వచ్చిన ఆబీబు నెలలో నియమిత సమయంలో ఏడు రోజుల పాటు పొంగ జేసే పదార్థం లేని రొట్టెలు తినాలి. నా సన్నిధానంలో ఒక్కడు కూడా ఖాళీ చేతులతో నిలబడకూడదు.
\p
\s5
\v 16 మీ పొలాల్లో పండిన తొలి పంటల కోత సమయంలో పండగ ఆచరించాలి. సంవత్సరం చివరలో పొలాల నుండి నీ వ్యవసాయ ఫలాలన్నీ సమకూర్చుకుని జనమంతా సమావేశమై పండగ ఆచరించాలి.
\v 17 సంవత్సరంలో మూడు సార్లు పురుషులందరూ ప్రభువైన యెహోవా సన్నిధిలో సమకూడాలి.
\p
\s5
\v 18 నాకు అర్పించే బలుల రక్తంలో పొంగజేసే పదార్థమేమీ ఉండకూడదు. నా పండగలో అర్పించిన కొవ్వు ఉదయం దాకా నిలవ ఉండకూడదు.
\v 19 నీ భూమిలో పండే వాటిలో ప్రథమ ఫలాలు యెహోవా దేవుని మందిరానికి తీసుకురావాలి. మేకపిల్ల మాంసం దాని తల్లిపాలలో కలిపి ఉడకబెట్ట కూడదు.
\s కనానుకు నడిపిస్తానని వాగ్దానం
\p
\s5
\v 20 నేను సిద్ధపరచిన దేశానికి మీరు క్షేమంగా చేరుకోవడానికి మార్గంలో మిమ్మల్ని కాపాడుతూ మీకు ముందుగా వెళ్ళడానికి ఒక దూతను పంపిస్తున్నాను.
\v 21 ఆయన సన్నిధిలో ఉండి ఆయన మాట జాగ్రత్తగా వినండి. ఆయనకు కోపం వచ్చే పనులు చేయకూడదు. మీరు ఆయనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఆయన క్షమించడు. ఎందుకంటే
\f +
\fr 23:21
\ft ఆయనకు పూర్తి అధికారం ఇచ్చాను.
\f* ఆయనకు నా పేరు పెట్టాను.
\v 22 మీరు ఆయనకు లోబడి ఆయన మాటలు జాగ్రత్తగా వింటూ ఉంటే నేను మీ శత్రువులకు శత్రువుగా, మీ విరోధులకు విరోధిగా ఉంటాను.
\p
\s5
\v 23 ఎలాగంటే నా దూత మీకు ముందుగా వెళ్తాడు. అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబూసీయులు నివసిస్తున్న దేశానికి మిమ్మల్ని నడిపిస్తాడు. నేను వాళ్ళను హతం చేస్తాను.
\v 24 మీరు వారి దేవుళ్ళ ఎదుట సాష్టాంగపడ కూడదు, వారికి మొక్క కూడదు. వాళ్ళు చేసే పనులు చేయ కూడదు. వాళ్ళ విగ్రహాలను తుత్తునియలు చేసి
\f +
\fr 23:24
\ft ఆ దేవుళ్ళను.
\f* వాటిని పూర్తిగా నాశనం చెయ్యాలి.
\p
\v 25 మీరు మీ దేవుడైన యెహోవానే ఆరాధించి సేవించాలి. అప్పుడు నువ్వు తినే ఆహారం మీదా, తాగే నీళ్ళ మీదా ఆయన దీవెనలు ఉంటాయి. ఎలాంటి రోగాలూ మీకు సంక్రమించవు.
\s5
\v 26 మీ దేశంలో గర్భస్రావాలు ఉండవు. సంతాన సాఫల్యత లేని వాళ్ళు మీ దేశంలో ఉండరు. మీరు జీవించే రోజుల లెక్క పూర్తి చేస్తాను.
\v 27 నా పేరును బట్టి ఇతరులు మీకు భయపడేలా చేస్తాను. మీ ప్రయాణంలో మీరు దాటుతున్న సమస్త దేశ ప్రజలను ఓడించి నీ శత్రువులు నీ ఎదుట నుండి పారిపోయేలా చేస్తాను.
\p
\v 28 మీకు ముందుగా పెద్ద పెద్ద కందిరీగలను పంపిస్తాను. అవి హివ్వీయులను, కనానీయులను, హిత్తీయులను మీ ఎదుట నుండి వెళ్ళగొడతాయి.
\v 29 అయితే ఒక్క సంవత్సరంలోనే వాళ్ళను వెళ్లగొట్టను. ఎందుకంటే దేశం పాడైపోతుంది. క్రూరమృగాలు విస్తరించి మీకు ప్రమాదకరంగా మారతాయి.
\s5
\v 30 మీరు వృద్ధి చెంది ఆ దేశాన్ని స్వాధీనం చేసుకునే దాకా వాళ్ళను కొంచెం కొంచెంగా మీ ఎదుట నుండి వెళ్ళగొడతాను.
\p
\v 31 ఎర్ర సముద్రం నుంచి ఫిలిష్తీయుల సముద్రం దాకా, ఎడారి నుంచి నది దాకా మీకు సరిహద్దులు నియమిస్తాను. ఆ దేశ నివాసులను మీ చేతికి అప్పగిస్తాను. మీరు మీ ఎదుట నుండి వాళ్ళను వెళ్లగొడతారు.
\v 32 మీరు వాళ్ళతో గానీ, వాళ్ళ దేవుళ్ళతో గానీ ఎలాంటి ఒప్పందాలూ చేసుకోకూడదు.
\v 33 వాళ్ళు మీ దేశంలో నివసించకూడదు. వాళ్ళను ఉండనిస్తే వాళ్ళు మీ చేత నాకు విరోధంగా పాపం చేయిస్తారు.
\f +
\fr 23:33
\ft వాళ్ళు వాళ్ళ దేవుళ్ళను పూజిస్తే, అని కూడా అర్థం వస్తుంది. అంటే ఆ దేశంలో విగ్రహ పూజ జరగకూడదు అని అర్థం.
\f* వాళ్ళ దేవుళ్ళను పూజిస్తే అది మీకు ఉరిగా పరిణమిస్తుంది.
\s5
\c 24
\s రక్త నిబంధన
\p
\v 1 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. <<నువ్వు, అహరోను, నాదాబు, అబీహు, ఇశ్రాయేలు ప్రజల పెద్దల్లో 70 మంది యెహోవా దగ్గరికి ఎక్కి వచ్చి దూరాన సాగిలపడండి.
\v 2 మోషే ఒక్కడు మాత్రమే యెహోవాను సమీపించాలి. మిగిలినవారు ఆయన సమీపానికి అతనితో కలసి ఎక్కి రాకూడదు.>>
\p
\s5
\v 3 మోషే వచ్చి యెహోవా మాటలను, కట్టుబాట్లను ప్రజలకు వివరించాడు. ప్రజలంతా <<యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారం చేస్తాం>> అని ముక్త కంఠంతో జవాబిచ్చారు.
\v 4 మోషే యెహోవా చెప్పిన మాటలన్నిటినీ రాశాడు. అతడు ఉదయాన్నే లేచి ఆ కొండ పాదం దగ్గర బలిపీఠం కట్టాడు. ఇశ్రాయేలు ప్రజల పన్నెండు గోత్రాల ప్రకారం పన్నెండు స్తంభాలు నిలిపాడు.
\s5
\v 5 తరవాత ఇశ్రాయేలు ప్రజల్లో కొందరు యువకులను పంపినప్పుడు వాళ్ళు వెళ్లి హోమ బలులు అర్పించి యెహోవాకు సమాధానబలులగా కోడెలను వధించారు.
\p
\v 6 అప్పుడు మోషే వాటి రక్తంలో సగం పళ్ళెంలో పోశాడు. మిగతా సగం బలిపీఠం మీద కుమ్మరించాడు.
\s5
\v 7 తరువాత అతడు నిబంధన గ్రంథం చేతబట్టుకుని ప్రజలకు వినిపించాడు. ప్రజలంతా <<యెహోవా చెప్పినవన్నీ చేస్తూ ఆయనకు విధేయులుగా ఉంటాం>> అన్నారు.
\v 8 మోషే అప్పుడు రక్తం తీసుకుని ప్రజల మీద చిలకరించాడు. <<ఇది
\f +
\fr 24:8
\ft ఈ విషయాలన్నింటిలో యెహోవా మీతో చేసిన తన నిబంధన ఇదే.
\f* నిబంధన రక్తం. ఇదిగో ఈ విషయాలన్నిటి ప్రకారం యెహోవా మీతో చేసిన నిబంధన ఇదే>> అని చెప్పాడు.
\s దేవునితో కొండపై
\p
\s5
\v 9 ఆ తరువాత మోషే, అహరోను, నాదాబు, అబీహు, ఇశ్రాయేలు ప్రజల పెద్దలు 70 మంది కొంతవరకూ కొండ ఎక్కి వెళ్ళారు.
\v 10 అక్కడ వారికి ఇశ్రాయేలీయుల దేవుని ప్రత్యక్షత కలిగింది. ఆయన పాదాల కింద మెరిసిపోతున్న నీలాలు అలికినట్టున్న వేదిక ఉంది. అది ఆకాశమంత నిర్మలంగా ఉంది.
\v 11 ఆయన ఇశ్రాయేలు ప్రజల పెద్దలకు ఎలాంటి హాని కలిగించలేదు. అక్కడ వాళ్ళు దేవుని దర్శనం చేసుకుని అన్న పానాలు పుచ్చుకున్నారు.
\s సీనాయి కొండపై మోషే
\p
\s5
\v 12 అప్పుడు యెహోవా మోషేతో <<నువ్వు కొండ ఎక్కి నా దగ్గరికి వచ్చి అక్కడ ఉండు. నేను రాతి పలకలపై రాసిన ఆజ్ఞలనూ, ధర్మశాస్త్రాన్నీ నీకు ఇస్తాను. నువ్వు వాటిని ప్రజలకు బోధించాలి.>>
\v 13 మోషే తన సహాయకుడు యెహోషువను తీసుకుని దేవుని పర్వతం ఎక్కాడు.
\p
\s5
\v 14 మోషే ఇశ్రాయేలు పెద్దలతో <<మేము తిరిగి మీ దగ్గరికి వచ్చేంత వరకూ ఇక్కడే ఉండండి. ఇక్కడ అహరోను, హూరు మీతోనే ఉన్నారు. మీలో ఏవైనా తగాదాలు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్లి పరిష్కరించుకోండి>> అని చెప్పి దేవుని కొండ ఎక్కాడు.
\p
\v 15 మోషే కొండ ఎక్కినప్పుడు దేవుని మేఘం ఆ కొండంతా కమ్మివేసింది.
\s5
\v 16 యెహోవా మహిమా ప్రకాశం సీనాయి కొండపై కమ్ముకుంది. ఆరు రోజులపాటు మేఘం కమ్ముకుని ఉంది. ఏడవ రోజున ఆయన ఆ మేఘంలో నుండి మోషేను పిలిచాడు.
\p
\v 17 యెహోవా మహిమా ప్రకాశం ఆ కొండ శిఖరంపై దహించే మంటల్లాగా ఇశ్రాయేలు ప్రజలకు కనబడింది.
\v 18 అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ ఎక్కాడు. మోషే ఆ కొండ మీద నలభై పగళ్ళూ, నలభై రాత్రులూ ఉండిపోయాడు.
\s5
\c 25
\s సన్నిధి గుడారం కోసం కానుకలు
\r నిర్గమ 35:4-9
\p
\v 1 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు.
\v 2 <<నాకు ప్రతిష్ఠార్పణ తీసుకు రావాలని ఇశ్రాయేలీయులతో చెప్పు. మనసారా అర్పించే ప్రతి వాడి దగ్గరా దాన్ని తీసుకోవాలి.
\s5
\v 3 మీరు వారి దగ్గర తీసుకోవలసిన అర్పణలు ఇవి. బంగారం, వెండి, ఇత్తడి.
\v 4 నీలం, ఊదా రక్త వర్ణాల ఉన్ని, సన్నని నార బట్టలు, మేక వెంట్రుకలు.
\v 5 ఎరుపురంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సీలు జంతువు చర్మం, తుమ్మ చెక్క.
\v 6 మందిరంలో దీపాల కోసం నూనె, అభిషేక తైలం కోసం, పరిమళ ధూపం కోసం సుగంధ ద్రవ్యాలు,
\v 7 ఏఫోదు కోసం, వక్ష పతకం కోసం గోమేధికాలు, ఇతర రత్నాలు.
\p
\s5
\v 8 నేను వారి మధ్య నివసించేలా వారు నాకు పరిశుద్ధస్థలాన్ని నిర్మించాలి.
\v 9 నేను నీకు చూపించే విధంగా మందిరం స్వరూపాన్ని దాని ఉపకరణాలను చెయ్యాలి.
\s నిబంధన మందసం
\r నిర్గమ 37:1-9
\p
\s5
\v 10 వారు తుమ్మకర్రతో ఒక మందసం చెయ్యాలి. దాని పొడవు రెండు మూరలున్నర, దాని వెడల్పు మూరెడున్నర, దాని ఎత్తు మూరెడున్నర
\v 11 దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగించాలి. లోపలా బయటా దానికి బంగారు రేకు పొదిగించాలి. దాని మీద బంగారు అంచు కట్టాలి.
\s5
\v 12 దానికి నాలుగు బంగారు రింగులు పోత పోసి, ఒక వైపు రెండు, మరొక వైపు రెండు రింగులు ఉండేలా దాని నాలుగు కాళ్లకు వాటిని తగిలించాలి.
\p
\v 13 తుమ్మ చెక్కతో మోతకర్రలు చేసి వాటికి బంగారు రేకు పొదిగించి
\v 14 వాటితో ఆ మందసాన్ని మోయడానికి అంచులకు ఉన్న రింగుల్లో ఆ మోతకర్రలను దూర్చాలి.
\s5
\v 15 ఆ మోతకర్రలు ఆ మందసం రింగుల్లోనే ఉండాలి. వాటిని రింగుల్లోనుండి తీయకూడదు.
\v 16 ఆ మందసంలో నేను నీకివ్వబోయే శాసనాలను ఉంచాలి.
\p
\v 17 నీవు మేలిమి బంగారంతో ప్రాయశ్చిత్త స్థానమైన మూతను చెయ్యాలి. దాని పొడవు రెండు మూరలున్నర. దాని వెడల్పు మూరెడున్నర.
\v 18 సాగగొట్టిన బంగారంతో రెండు బంగారు కెరూబు రూపాలను చెయ్యాలి. ప్రాయశ్చిత్త మూత రెండు అంచులతో వాటిని ఏకాండంగా చెయ్యాలి.
\s5
\v 19 ఈ కొనలో ఒక కెరూబును ఆ కొనలో ఒక కెరూబును చెయ్యాలి. ప్రాయశ్చిత్త మూతపై దాని రెండు కొనల మీద కెరూబులను దానితో ఏకాండంగా చెయ్యాలి.
\v 20 ఆ కెరూబులు రెక్కలు పైకి విచ్చుకుని ప్రాయశ్చిత్త మూతను తమ రెక్కలతో కప్పుతూ ఉండాలి. వాటి ముఖాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండాలి. ఆ కెరూబుల ముఖాలు ప్రాయశ్చిత్త మూత వైపుకి తిరిగి ఉండాలి.
\v 21 నీవు ఆ మూతను మందసం మీద ఉంచాలి. నేను నీకిచ్చే శాసనాలను ఆ మందసంలో ఉంచాలి.
\s5
\v 22 అక్కడ నేను నిన్ను కలుసుకుని ప్రాయశ్చిత్త మూత మీద నుండి, శాసనాలున్న మందసం మీద ఉన్న రెండు కెరూబుల మధ్య నుండి, ఇశ్రాయేలీయుల కోసం ఇచ్చే ఆజ్ఞలన్నిటినీ నీకు తెలియజేస్తాను.
\s సన్నిధి రొట్టెల బల్ల కోసం సూచనలు
\r నిర్గమ 37:10-16
\p
\s5
\v 23 నీవు తుమ్మచెక్కతో ఒక బల్ల చేయాలి. దాని పొడవు రెండు మూరలు. వెడల్పు ఒక మూర. దాని ఎత్తు మూరెడున్నర.
\v 24 మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దానికి బంగారు అంచును చేయించాలి.
\s5
\v 25 దానికి చుట్టూ బెత్తెడు చట్రం చేసి దానిపై చుట్టూ బంగారు అంచు పెట్టాలి.
\v 26 దానికి నాలుగు బంగారు రింగులు చేసి దాని నాలుగు కాళ్లకి ఉండే నాలుగు మూలల్లో ఆ రింగులను తగిలించాలి.
\v 27 బల్లను మోయడానికి చేసిన మోతకర్రలు రింగులకు, చట్రానికి దగ్గరగా ఉండాలి.
\s5
\v 28 ఆ మోతకర్రలను తుమ్మచెక్కతో చేసి వాటి మీద బంగారు రేకు పొదిగించాలి. వాటితో బల్లను మోస్తారు.
\p
\v 29 నీవు దాని పళ్ళేలను, గరిటెలను, గిన్నెలను, పానీయార్పణం కోసం పాత్రలను చేయాలి. మేలిమి బంగారంతో వాటిని చేయాలి.
\v 30 నిత్యం నా సన్నిధిలో సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచాలి.
\s దీపం
\r నిర్గమ 37:17-24
\p
\s5
\v 31 నీవు మేలిమి బంగారంతో దీపవృక్షాన్ని చేయాలి. సాగగొట్టిన బంగారంతో ఈ దీపవృక్షాన్ని చేయాలి. దాని కాండాన్ని, కొమ్మలను సాగగొట్టిన బంగారంతోనే చెయ్యాలి. దాని కలశాలు, దాని మొగ్గలు, దాని పువ్వులు దానితో ఏకాండంగా ఉండాలి.
\v 32 దీప వృక్షం ఒక వైపు నుండి మూడు కొమ్మలు, రెండవ వైపు నుండి మూడు కొమ్మలు, అంటే దాని పార్శ్వాల నుండి ఆరుకొమ్మలు మొలవాలి.
\s5
\v 33 ఒక కొమ్మలో బాదం మొగ్గ, పువ్వు రూపాలు ఉన్న మూడు కలశాలు, రెండవ కొమ్మలో బాదం మొగ్గ, పువ్వురూపాలు ఉన్న మూడు కలశాలు, ఈ విధంగా దీపవృక్షం నుండి మొలిచిన కొమ్మల్లో ఉండాలి.
\v 34 దీపవృక్ష కాండంలో బాదం పువ్వు రూపంలో ఉన్న నాలుగు కలశాలు, వాటి మొగ్గలు, వాటి పువ్వులు ఉండాలి.
\s5
\v 35 దీపవృక్ష కాండం నుండి నిగిడే ఆరుకొమ్మలకు దాని రెండేసి కొమ్మల కింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండాలి.
\v 36 వాటి మొగ్గలు, వాటి కొమ్మలు దానితో ఏకాండంగా ఉండాలి. అదంతా ఏకాండంగా సాగగొట్టిన మేలిమి బంగారంతో చెయ్యాలి.
\s5
\v 37 నీవు దానికి ఏడు దీపాలు చేయాలి. దాని ఎదుటి భాగానికి వెలుగు ప్రసరించేలా దాని దీపాలు వెలిగించాలి.
\v 38 దాని పట్టుకారును, పటకారు పళ్ళేన్ని మేలిమి బంగారంతో చెయ్యాలి.
\v 39 ఆ ఉపకరణాలన్నిటిని 30 కిలోల మేలిమి బంగారంతో చెయ్యాలి.
\v 40 కొండ మీద నీకు చూపించిన వాటి నమూనా ప్రకారం వాటిని చేయడానికి జాగ్రత్త పడు.>>
\s5
\c 26
\s సన్నిధి గుడారం
\p
\v 1 <<నీవు పది తెరలతో ఒక మందిరాన్ని కట్టాలి. సన్న నారతో, నీల ధూమ్ర రక్త వర్ణాలు కలిపి పేనిన ఉన్నితో కెరూబు ఆధార నమూనాగా వాటిని చెయ్యాలి. అది నేర్పుగల కళాకారుని పనిగా ఉండాలి.
\v 2 ప్రతి తెర పొడవు 28 మూరలు. వెడల్పు నాలుగు మూరలు. ఆ తెరలన్నిటికీ ఒకటే కొలత.
\p
\v 3 ఐదు తెరలను ఒక దానితో ఒకటి కలిపి కుట్టాలి. మిగిలిన ఐదు తెరలను కూడా ఒక దానితో ఒకటి కలిపి కుట్టాలి.
\s5
\v 4 తెరల కూర్పు చివర మొదటి తెర అంచుకి నీలినూలుతో ఉచ్చులు చేయాలి. రెండవ కూర్పులోని బయటి తెర చివర కూడా అలానే చేయాలి.
\v 5 ఒక తెరలో ఏభై ఉచ్చులు చేసి, అవి ఒకదానికొకటి తగులుకునేలా ఆ రెండవ కూర్పులోని తెర అంచులో ఏభై ఉచ్చులు చేయాలి.
\v 6 ఏభై బంగారు గుండీలను చేసి ఆ గుండీలతో ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్చాలి. అది అంతా ఒకటే మందిరంగా రూపొందుతుంది.
\p
\s5
\v 7 మందిరం పైకప్పుగా మేకవెంట్రుకలతో తెరలు చెయ్యాలి. అలా పదకొండు తెరలు చెయ్యాలి.
\v 8 ప్రతి తెర పొడవు ముప్ఫై మూరలు, వెడల్పు నాలుగు మూరలు, అలా పదకొండు తెరల కొలత ఒక్కటే.
\v 9 ఐదు తెరలను ఒకటిగా, ఆరు తెరలను ఒకటిగా ఒక దానికొకటి కూర్చాలి. ఆరవ తెరను గుడారం ఎదుటి భాగాన మడత పెట్టాలి.
\s5
\v 10 తెరల కూర్పుకు బయటున్న తెర అంచున ఏభై ఉచ్చులను, రెండవ కూర్పులోపల తెర అంచున ఏభై ఉచ్చులను చెయ్యాలి.
\p
\v 11 ఏభై యిత్తడి గుండీలు చేసి ఒకటే గుడారమయ్యేలా ఆ గుండీలను ఆ ఉచ్చులకు తగిలించి కూర్చాలి.
\s5
\v 12 ఆ తెరల్లో మిగిలిన వేలాడే భాగం అంటే మిగిలిన సగం తెర మందిరం వెనక భాగంలో వ్రేలాడుతూ ఉండాలి.
\v 13 గుడారపు తెరల పొడవులో మిగిలినది ఈ వైపు ఒక మూర, ఆ వైపు ఒక మూర మందిరం పైకప్పుగా ఈ వైపు, ఆ వైపు వేలాడాలి.
\v 14 ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో పై కప్పును చేసి, దాన్ని సీలు జంతువు తోళ్లతో కప్పాలి.
\p
\s5
\v 15 మందిరానికి తుమ్మ చెక్కతో నిలువు పలకలు చెయ్యాలి.
\v 16 పలక పొడవు పది మూరలు, వెడల్పు మూరెడున్నర ఉండాలి.
\v 17 ప్రతి పలకలో ఒకదానిలో ఒకటి కూర్చునే విధంగా రెండు కుసులు ఉండాలి. ఆ విధంగా మందిరం పలకలన్నిటికీ చెక్కాలి.
\v 18 నీవు మందిరానికి పలకలు చేసేటప్పుడు ఇరవై పలకలు కుడి వైపున, అంటే దక్షిణ దిక్కున చెయ్యాలి.
\p
\s5
\v 19 ఒక్కొక్క పలక కింద దాని రెండు కుసులకు రెండు దిమ్మలను, అంటే ఆ ఇరవై పలకల కింద నలభై వెండి దిమ్మలను చెయ్యాలి.
\v 20 మందిరం రెండవ వైపు అంటే ఉత్తర దిక్కున
\v 21 ఒక్కొక్క పలక కింద రెండు దిమ్మలు చొప్పున ఇరవై పలకలకు నలభై వెండి దిమ్మలు ఉండాలి.
\p
\s5
\v 22 పడమర వైపు అంటే మందిరం వెనక వైపు ఆరు పలకలు చెయ్యాలి.
\v 23 ఆ వెనక వైపు మందిరం మూలలకు రెండు పలకలు చెయ్యాలి.
\v 24 అవి అడుగున దేనికదేగా ఉండాలి గానీ పై భాగంలో మాత్రం ఒకే రింగులో కూర్చుని ఉండాలి. ఆ విధంగా ఆ రెంటికీ ఉండాలి.
\v 25 పలకలు ఎనిమిది. వాటి వెండి దిమ్మలు పదహారు. ఒక్కొక్క పలక కింద రెండు దిమ్మలుండాలి.
\p
\s5
\v 26 తుమ్మచెక్కతో అడ్డ కర్రలు చెయ్యాలి. మందిరం ఒక వైపు పలకలకు ఐదు అడ్డ కర్రలు,
\v 27 మందిరం రెండవ వైపు పలకలకు ఐదు అడ్డ కర్రలు, పడమటి వైపున మందిరం పలకలకు ఐదు అడ్డ కర్రలు ఉండాలి.
\v 28 ఆ పలకల మధ్య ఉండే అడ్డ కర్ర ఈ చివరి నుండి ఆ చివరి వరకూ ఉండాలి.
\s5
\v 29 ఆ పలకలకు బంగారు రేకు పొదిగించాలి. వాటి అడ్డ కర్రలుండే వాటి రింగులను బంగారంతో చేసి అడ్డ కర్రలకు కూడా బంగారు రేకు పొదిగించాలి.
\v 30 కొండ మీద నీకు చూపించిన దాని నమూనా ప్రకారం మందిరాన్ని నిలబెట్టాలి.
\p
\s5
\v 31 నీవు నీల ధూమ్ర రక్త వర్ణాల సన్న నారతో నేసిన ఒక అడ్డ తెరను చెయ్యాలి. అది కళాకారుని నైపుణ్యంతో కెరూబు ఆధార నమూనాగా చెయ్యాలి.
\v 32 తుమ్మచెక్కతో చేసి బంగారు రేకు పొదిగిన నాలుగు స్తంభాలపై దాన్ని వెయ్యాలి. దాని కొక్కేలు బంగారువి. వాటి దిమ్మలు వెండివి.
\v 33 ఆ అడ్డతెరను ఆ కొక్కేల కింద తగిలించి సాక్ష్యపు మందసం అడ్డ తెర లోపలికి తేవాలి. ఆ అడ్డతెర పరిశుద్ధస్థలాన్ని అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేస్తుంది.
\p
\s5
\v 34 అతి పరిశుద్ధ స్థలం లో సాక్ష్యపు మందసం మీద ప్రాయశ్చిత్త మూతను ఉంచాలి.
\v 35 అడ్డతెర బయట బల్లను, ఆ బల్ల ఎదుట దక్షిణం వైపున ఉన్న మందిరం ఉత్తర దిక్కున దీప వృక్షాన్ని ఉంచాలి.
\s5
\v 36 నీల ధూమ్ర రక్త వర్ణాలతో పేనిన సన్న నారతో కళాకారుని నైపుణ్యంతో చేసిన తెరను గుడారపు ద్వారం కోసం చెయ్యాలి.
\v 37 ఆ తెరకు ఐదు స్తంభాలను తుమ్మ చెక్కతో చేసి వాటికి బంగారు రేకు పొదిగించాలి. వాటి కొక్కేలు బంగారువి. వాటికి ఐదు ఇత్తడి దిమ్మలు పోత పోయాలి.>>
\s5
\c 27
\s దహన బలిపీఠం
\p
\v 1 <<నీవు తుమ్మచెక్కతో ఐదు మూరల పొడవు ఐదు మూరల వెడల్పు గల బలిపీఠం చెయ్యాలి. ఆ బలిపీఠం నలుచదరంగా ఉండాలి. దాని యెత్తు మూడు మూరలు.
\v 2 దాని నాలుగు మూలలా దానికి కొమ్ములు చెయ్యాలి. దాని కొమ్ములు దానితో ఏకాండంగా ఉండాలి. దానికి ఇత్తడి రేకు పొదిగించాలి.
\s5
\v 3 దాని బూడిద ఎత్తడానికి కుండలను, గరిటెలను, గిన్నెలను, ముళ్ళను, అగ్నిపాత్రలను చెయ్యాలి. ఈ ఉపకారణాలన్నిటినీ ఇత్తడితో చెయ్యాలి.
\p
\v 4 దానికి వలలాంటి ఇత్తడి జల్లెడ చెయ్యాలి.
\s5
\v 5 ఆ వల మీద దాని నాలుగు మూలలా నాలుగు ఇత్తడి రింగులు చేసి ఆ వల బలిపీఠం మధ్యకి చేరేలా కిందిభాగంలో బలిపీఠం గట్టు కింద దాన్ని ఉంచాలి.
\v 6 బలిపీఠం కోసం మోతకర్రలను చెయ్యాలి. ఆ మోతకర్రలను తుమ్మచెక్కతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగించాలి.
\s5
\v 7 ఆ మోతకర్రలను ఆ రింగుల్లో చొప్పించాలి. బలిపీఠం మోయడానికి ఆ మోతకర్రలు దాని రెండువైపులా ఉండాలి.
\v 8 పలకలతో గుల్లగా దాన్ని చెయ్యాలి. కొండ మీద నీకు చూపించిన నమూనా ప్రకారం దాన్ని చెయ్యాలి.
\s ఆవరణం తెరలు
\r నిర్గమ 38:9-20
\p
\s5
\v 9 నీవు మందిరానికి ఆవరణం ఏర్పాటు చెయ్యాలి. కుడివైపున, అంటే దక్షిణ దిక్కున ఆవరణం నూరు మూరల పొడవు ఉండాలి. పేనిన సన్న నార తెరలు ఒక వైపుకు ఉండాలి.
\v 10 దాని ఇరవై స్తంభాలు, వాటి ఇరవై దిమ్మలు ఇత్తడివి. ఆ స్తంభాల కొక్కేలు, వాటి పెండెబద్దలు వెండివి.
\s5
\v 11 అలాగే పొడవులో ఉత్తర దిక్కున నూరు మూరల పొడవు గల తెరలు ఉండాలి. దాని ఇరవై స్తంభాలు, వాటి ఇరవై దిమ్మలు ఇత్తడివి. ఆ స్తంభాల కొక్కేలు, వాటి పెండెబద్దలు వెండివి.
\v 12 పడమటి దిక్కున ఆవరణం వెడల్పులో ఏభై మూరల తెరలు ఉండాలి. వాటి స్తంభాలు పది. వాటి దిమ్మలు పది.
\v 13 తూర్పు వైపున, అంటే తూర్పు దిక్కున ఆవరణం వెడల్పు ఏభై మూరలు.
\s5
\v 14 ఒక వైపు పదిహేను మూరల తెరలుండాలి. వాటి స్తంభాలు మూడు, వాటి దిమ్మలు మూడు.
\v 15 రెండవ వైపు పదిహేను మూరల తెరలుండాలి. వాటి స్తంభాలు మూడు, వాటి దిమ్మలు మూడు.
\v 16 ఆవరణ ద్వారానికి నీల ధూమ్ర రక్త వర్ణాల తెరలు ఇరవై మూడు ఉండాలి. అవి పేనిన సన్ననారతో కళాకారుని పనిగా ఉండాలి. వాటి స్తంభాలు నాలుగు, వాటి దిమ్మలు నాలుగు.
\s5
\v 17 ఆవరణం చుట్టూ ఉన్న స్తంభాలన్నీ వెండి పెండెబద్దలు కలవి. వాటి కొక్కేలు వెండివి. వాటి దిమ్మలు ఇత్తడివి.
\v 18 ఆవరణం పొడవు నూరు మూరలు. దాని వెడల్పు ఏభై మూరలు. దాని ఎత్తు ఐదు మూరలు. అవి పేనిన సన్ననారతో చేశారు. వాటి దిమ్మలు ఇత్తడివి.
\v 19 మందిరంలో వాడే ఉపకరణాలన్నీ ఆవరణపు మేకులన్నీ ఇత్తడివై యుండాలి.
\s దీపాల కోసం నూనె
\r లేవీ 24:1-4
\p
\s5
\v 20 దీపం నిత్యం వెలుగుతుండేలా ప్రమిదలకు దంచి తీసిన స్వచ్ఛమైన ఒలీవల నూనె తేవాలని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించు.
\v 21 సాక్ష్యపు మందసం ఎదుట ఉన్న తెర బయట ప్రత్యక్ష గుడారంలో అహరోను, అతని కుమారులు సాయంకాలం మొదలు ఉదయం దాకా యెహోవా సన్నిధిలో దాన్ని సవరిస్తూ ఉండాలి. అది ఇశ్రాయేలీయులకు వారి తరతరాల వరకూ నిత్య శాసనం.>>
\s5
\c 28
\s యాజకుల దుస్తులు
\p
\v 1 <<నాకు యాజకత్వం చేయడానికి నీ సోదరుడు అహరోనును అతని కొడుకులు నాదాబును, అబీహును, ఎలియాజరును ఈతామారును ఇశ్రాయేలీయుల్లో నుండి నీ దగ్గరికి పిలిపించు.
\v 2 అతనికి గౌరవం, వైభవం కలిగేలా నీ సోదరుడు అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రాలు కుట్టించాలి.
\v 3 అహరోను నాకు యాజక సేవ జరిగించేలా నీవు అతణ్ణి ప్రత్యేక పరచడం కోసం అతని దుస్తులు కుట్టించాలి. నేను జ్ఞానాత్మతో నింపిన నిపుణులు అందరికీ ఆజ్ఞ జారీ చెయ్యి.
\p
\s5
\v 4 వారు కుట్టవలసిన దుస్తులు ఇవి. వక్ష పతకం, ఏఫోదు, నిలువుటంగీ, రంగు దారాలతో కుట్టిన చొక్కా, తల పాగా, నడికట్టు. అతడు నాకు యాజకుడై యుండేలా వారు నీ సోదరుడు అహరోనుకు, అతని కుమారులకు ప్రతిష్ఠిత దుస్తులు కుట్టించాలి.
\v 5 కళాకారులు బంగారు, నీల, ధూమ్ర, రక్త వర్ణాలు గల నూలును సన్ననారను దీనికి ఉపయోగించాలి.
\s ఏఫోదు
\p
\s5
\v 6 బంగారం నీల ధూమ్ర రక్త వర్ణాల ఏఫోదును పేనిన సన్న నారతో కళాకారుని నైపుణ్యంతో చెయ్యాలి.
\v 7 రెండు భుజాలకు సరిపడేలా రెండు పై అంచుల్లో కూర్చిన పట్టీలు దానికి ఉండాలి.
\v 8 ఏఫోదుపై ధరించడానికి పనితనంతో చేసిన నడికట్టు ఏకాండంగా ఉండి, బంగారంతో, నీల, ధూమ్ర, రక్త వర్ణాల నూలుతో, పేనిన సన్ననారతో కుట్టాలి.
\v 9 నీవు రెండు లేత పచ్చలను తీసుకుని వాటి మీద ఇశ్రాయేలీయుల పేర్లను అంటే వారి పుట్టుక క్రమం చొప్పున
\s5
\v 10 ఒక రత్నం మీద ఆరు పేర్లు, రెండవ రత్నం మీద తక్కిన ఆరు పేర్లను చెక్కించాలి.
\v 11 ముద్ర మీద చెక్కిన పనిలాగా ఆ రెండు రత్నాలపై ఇశ్రాయేలీయుల పేర్లు చెక్కి బంగారు కుదురుల్లో వాటిని పొదగాలి.
\v 12 అప్పుడు ఇశ్రాయేలీయులకు స్మారక సూచకమైన ఆ రెండు రత్నాలను ఏఫోదు
\f +
\fr 28:12
\ft యాజకుడు తొడుక్కునే పైవస్త్రం
\f* భుజాలపై నిలపాలి. ఆ విధంగా అహరోను తన రెండు భుజాలపై యెహోవా సన్నిధిలో జ్ఞాపక సూచనగా ఆ పేర్లను ధరిస్తాడు.
\s న్యాయనిర్ణయ (వక్ష)పతకం
\p
\s5
\v 13 బంగారు కుదురులను తయారు చెయ్యాలి.
\v 14 మేలిమి బంగారంతో రెండు అల్లిక గొలుసులను చెయ్యాలి. ఆ అల్లిక పనికి అల్లిన గొలుసులను తగిలించాలి.
\s5
\v 15 కళాకారుని నైపుణ్యంతో న్యాయనిర్ణయ పతకాన్ని చెయ్యాలి. ఏఫోదు పని లాగా దాన్ని చెయ్యాలి. బంగారంతో, నీల ధూమ్ర రక్త వర్ణాల నూలుతో పేనిన సన్ననారతో దాన్ని చెయ్యాలి.
\v 16 నలుచదరంగా ఉన్న ఆ పతకాన్ని మడత పెట్టాలి. దాని పొడవు జానెడు, వెడల్పు జానెడు ఉండాలి.
\p
\s5
\v 17 దానిలో నాలుగు వరసల్లో రత్నాలుండేలా రత్నాల కుదుర్లు చెయ్యాలి. మొదటి వరస మాణిక్యం, గోమేధికం, మరకతం.
\v 18 రెండో వరస పద్మరాగం, నీలం, వజ్రం.
\v 19 మూడవది గారుత్మతం, యష్మురాయి, ఇంద్రనీలం.
\v 20 నాలుగవ వరస గరుడ పచ్చ, సులిమాని రాయి, సూర్యకాంతం. వాటిని బంగారు కుదురుల్లో పొదగాలి.
\p
\s5
\v 21 ఆ రత్నాలపై ఇశ్రాయేలీయుల పేర్ల ప్రకారం పన్నెండు పేర్లు ఉండాలి. ముద్ర మీద చెక్కినట్టు వారిలో ఒక్కొక్క పేరు చొప్పున పన్నెండు గోత్రాల పేర్లు ఉండాలి.
\v 22 ఆ పతకాన్ని అల్లిక పనిగా పేనిన గొలుసులతో మేలిమి బంగారంతో చెయ్యాలి.
\v 23 పతకానికి రెండు బంగారు రింగులు చేసి
\v 24 ఆ రెండు రింగులను పతకపు రెండు కొసలకు అల్లిన ఆ రెండు బంగారు గొలుసులను తగిలించాలి.
\s5
\v 25 అల్లిన ఆ రెండు గొలుసుల కొసలను రెండు కుదురులకు తగిలించి ఏఫోదు ముందు వైపు భుజాలపై కట్టాలి.
\p
\v 26 నీవు బంగారంతో రెండు రింగులు చేసి ఏఫోదు ముందు భాగంలో పతకం లోపలి అంచున దాని రెండు కొసలకు వాటిని తగిలించాలి.
\s5
\v 27 నీవు రెండు బంగారు రింగులు చేసి ఏఫోదు నమూనా ప్రకారం చేసిన నడికట్టుపై దాని ముందు వైపు కింది భాగంలో ఏఫోదు రెండు భుజాలకు వాటిని తగిలించాలి.
\v 28 అప్పుడు పతకం ఏఫోదు నమూనా ప్రకారం చేసిన నడికట్టుకు పైగా ఉండేలా బిగించాలి. అది ఏఫోదునుండి విడిపోకుండా ఉండేలా వారు దాని రింగులను నీలి దారంతో కట్టాలి.
\p
\s5
\v 29 ఆ విధంగా అహరోను పరిశుద్ధ స్థలం లోకి వెళ్ళినప్పుడల్లా అతడు తన రొమ్ము మీద న్యాయనిర్ణయ పతకంలోని ఇశ్రాయేలీయుల పేర్లను నిత్యం యెహోవా సన్నిధిలో జ్ఞాపకార్థంగా ధరించాలి.
\v 30 నీవు ఈ న్యాయనిర్ణయ పతకంలో
\f +
\fr 28:30
\ft ఇవి యాజకులు దైవ చిత్తాన్ని తెలుసుకునేందుకు ఉపయోగించే రంగు రాళ్లు, లేక రత్నాలు.
\f* ఊరీము తుమ్మీము అనే వాటిని ఉంచాలి. అహరోను యెహోవా సన్నిధికి వెళ్లినప్పుడల్లా అవి అతని రొమ్ముపై ఉంటాయి. అతడు యెహోవా సన్నిధిలో తన రొమ్ముపై ఇశ్రాయేలీయుల న్యాయనిర్ణయాలను నిత్యం భరిస్తాడు.
\s యాజకుల కోసం ఇతర దుస్తులు
\p
\s5
\v 31 ఏఫోదు నిలువుటంగీని కేవలం నీలిరంగు దారంతోనే కుట్టాలి.
\v 32 దాని మధ్య భాగంలో తల దూర్చడానికి రంధ్రం ఉండాలి. అది చినిగి పోకుండా మెడ కవచం లాగా దాని రంధ్రం చుట్టూ నేతపని గోటు ఉండాలి.
\s5
\v 33 దాని అంచుల చుట్టూ నీల ధూమ్ర రక్త వర్ణాల దానిమ్మ కాయ ఆకారాలను, వాటి మధ్యలో బంగారు గంటలను నిలువు టంగీ చుట్టూ తగిలించాలి.
\v 34 ఒక్కొక్క బంగారు గంట, దానిమ్మకాయ ఆ నిలువుటంగీ కింది అంచున చుట్టూరా ఉండాలి.
\v 35 సేవ చేసేటప్పుడు అహరోను దాని ధరించాలి. అతడు యెహోవా సన్నిధిలో పరిశుద్ధస్థలం లోకి ప్రవేశించేటప్పుడు అతడు చావకుండేలా వాటి చప్పుడు వినబడుతూ ఉండాలి.
\p
\s5
\v 36 నీవు మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కినట్టు దానిపై <యెహోవాకు పరిశుద్ధం> అనే మాట చెక్కాలి.
\v 37 పాగాపై ఉండేలా నీలి దారంతో దాన్ని కట్టాలి. అది పాగా ముందు వైపు ఉండాలి.
\v 38 ఇశ్రాయేలీయులు అర్పించే పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో వాటిలో ఇమిడి ఉన్న దోషాలను అహరోను భరించేలా అది అహరోను నుదిటిపై ఉండాలి. వారికి యెహోవా సన్నిధిలో ఆమోదం ఉండేలా అది నిత్యం అతని నుదుటిపై ఉండాలి.
\p
\s5
\v 39 సన్న నారతో చొక్కాయిని బుట్టాపనిగా చెయ్యాలి. సన్న నారతో పాగాను నేయాలి. నడికట్టును కూడా బుట్టాపనిగా చెయ్యాలి.
\s5
\v 40 నీవు అహరోను కుమారులకు చొక్కాలు కుట్టించాలి. వారికి నడికట్లు తయారు చెయ్యాలి. వారి ఘనత, వైభవాలు కలిగేలా వారికీ టోపీలు చెయ్యాలి.
\v 41 నీవు నీ సోదరుడు అహరోనుకు, అతని కుమారులకు వాటిని తొడిగించాలి.
\p వారు నాకు యాజకులయ్యేలా వారికి అభిషేకం చేసి, వారిని ప్రతిష్ఠించి పవిత్రపరచాలి.
\s5
\v 42 వారి నగ్నతను కప్పుకొనేందుకు నీవు వారికి నారతో చేసిన లోదుస్తులు కుట్టించాలి.
\v 43 వారు ప్రత్యక్ష గుడారంలోకి ప్రవేశించేటప్పుడు గానీ పరిశుద్ధస్థలం లో సేవ చేయడానికి బలిపీఠం దగ్గరికి వచ్చేటప్పుడు గానీ వారు దోషులై చావకుండేలా అహరోను, అతని కుమారులు వాటిని ధరించాలి. ఇది అతనికి, అతని తరువాత అతని సంతానానికి ఎప్పటికీ నిలిచి ఉండే శాసనం.>>
\s5
\c 29
\s యాజకుల ప్రతిష్ట, నియామకం
\r లేవీ 8:1-36
\p
\v 1 <<నాకు యాజకులయ్యేలా వాళ్ళను ప్రతిష్ట చేయడానికి నువ్వు ఈ విధంగా చెయ్యి.
\v 2 ఒక కోడెదూడను, లోపం లేని రెండు పొట్టేళ్లను తీసుకో. పొంగకుండా కాల్చిన రొట్టెను, పొంగకుండా వండిన నూనెతో కలిసిన వంటకాలను, నూనె పూసిన పలచని అప్పడాలు తీసుకో.
\s5
\v 3 వాటిని గోదుమపిండితో చెయ్యాలి. వాటిని ఒక గంపలో ఉంచి ఆ గంపను, ఆ కోడెదూడను, ఆ రెండు పొట్టేళ్లను తీసుకు రావాలి.
\p
\v 4 అహరోనును అతని కొడుకులను సన్నిధి గుడారం గుమ్మం దగ్గరికి తీసుకువచ్చి వాళ్లకు నీళ్లతో స్నానం చేయించాలి.
\s5
\v 5 అహరోనుకు దుస్తులు తొడిగి ఏఫోదు నిలువుటంగీని, ఏఫోదు వక్షపతకాన్ని వేసి, అల్లిక పని గల నడికట్టును అతనికి కట్టాలి.
\v 6
\f +
\fr 29:6
\ft 28:36 చూడండి.
\f* అతని తలమీద పాగా పెట్టి ఆ పాగా మీద పవిత్ర కిరీటం నిలబెట్టాలి.
\v 7 తరువాత అభిషేక తైలం తీసుకుని అతని తల మీద పోసి అతణ్ణి అభిషేకించాలి.
\p
\s5
\v 8 తరువాత అతని కొడుకులను రప్పించి వారికి అంగీలు తొడిగించాలి.
\v 9 అహరోనుకు, అతని కొడుకులకూ నడికట్లు కట్టి వారికి టోపీలు పెట్టాలి. ఈ విధంగా అహరోనును, అతని కొడుకులను ప్రతిష్టించాలి. యాజకత్వ నిర్వహణ పదవి వారికి చెందుతుంది.
\f +
\fr 29:9
\ft యాజకత్వం అనేది శాశ్వతంగా నిలిచి ఉండే ఆజ్ఞ.
\f* ఇది ఎప్పటికీ నిలిచి ఉండే కట్టుబాటు.
\p
\s5
\v 10 నువ్వు సన్నిధి గుడారం ఎదుటికి ఆ కోడెదూడను తెప్పించాలి. అహరోను, అతని కొడుకులు ఆ కోడెదూడ తలపై తమ చేతులు ఉంచాలి.
\v 11 సన్నిధి గుడారం ద్వారం దగ్గర యెహోవా సన్నిధానంలో ఆ కోడెదూడను వధించాలి.
\s5
\v 12 వధించిన ఆ కోడెదూడ రక్తంలో కొంచెం తీసుకుని నీ వేలుతో బలిపీఠం కొమ్ముల మీద పూయాలి. మిగిలిన రక్తమంతా బలిపీఠం కింద పారబోయాలి.
\p
\v 13 దాని పేగులకు, కాలేయానికి, రెండు మూత్రపిండాలకు పట్టిన కొవ్వు అంతటినీ తీసివేసి బలిపీఠంపై కాల్చివెయ్యాలి.
\v 14 ఆ దూడ మాంసం, చర్మం, దాని పేడ అంతటినీ శిబిరం బయట కాల్చివెయ్యాలి. అది పాప పరిహారం కోసం అర్పించే బలి.
\s5
\v 15 నువ్వు ఆ రెండు పొట్టేళ్లలో ఒకదాన్ని తీసుకోవాలి. అహరోను, అతని కొడుకులు ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచాలి.
\v 16 ఆ పొట్టేలును వధించి దాని రక్తం తీసి బలిపీఠం చుట్టూ రక్తాన్ని చల్లాలి.
\p
\v 17 తరువాత ఆ పొట్టేలును దాని అవయవాలను దేనికి అది విడదీసి దాని పేగులు, కాళ్ళు కడిగి, దాని అవయవాలను, తలను మొత్తంగా పేర్చాలి.
\v 18 పోట్టేలులోని ఆ భాగాలన్నిటినీ బలిపీఠంపై కాల్చివెయ్యాలి. అది యెహోవాకు హోమబలి. అది యెహోవాకు పరిమళం కలిగించే ఇష్టమైన హోమం.
\p
\s5
\v 19 తరువాత రెండవ పొట్టేలును తీసుకోవాలి. అహరోను, అతని కొడుకులు ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచిన తరువాత
\v 20 ఆ పొట్టేలును వధించి దాని రక్తంలో కొంచెం తీసుకుని అహరోను కుడి చెవి అంచు మీద, అతని కొడుకుల కుడి చెవుల అంచుల మీద, వాళ్ళ కుడి చెయ్యి, కుడి కాలు బొటన వేళ్ళపై చిలకరించి మిగిలిన రక్తం బలిపీఠం మీద చుట్టూ చిలకరించాలి.
\p
\s5
\v 21 బలిపీఠంపై ఉన్న రక్తంలో కొంచెం, అభిషేక తైలంలో కొంచెం తీసుకుని అహరోను మీదా, అతని వస్త్రాల మీదా, అతని కొడుకుల మీదా, వాళ్ళ వస్త్రాల మీదా చిలకరించాలి. అప్పుడు అతడూ అతని వస్త్రాలూ, అతని కొడుకులూ వాళ్ళ వస్త్రాలూ పవిత్రం అవుతాయి.
\p
\s5
\v 22 ఆ పొట్టేలు సేవ కోసం ప్రతిష్ఠితమైనది గనక దాని కొవ్వునూ, కొవ్విన తోకనూ, పేగులపై ఉన్న కొవ్వునూ, కాలేయం, రెండు మూత్రపిండాల చుట్టూ ఉన్న కొవ్వునూ, కుడి తొడను వేరు చెయ్యాలి.
\v 23 వాటితోపాటు యెహోవా ఎదుట ఉన్న పొంగకుండా కాల్చిన గుండ్రని రొట్టెను, నూనెతో వండిన వంటకాలను, ఒక పలచని అప్పడాన్ని తీసుకోవాలి.
\s5
\v 24 అహరోను, అతని కొడుకుల చేతుల్లో వాటినన్నిటినీ ఉంచాలి. కదలించే నైవేద్యంగా యెహోవా సన్నిధిలో వాటిని కదిలించాలి.
\p
\v 25 తరువాత వాళ్ళ చేతుల్లోనుంచి వాటిని తీసుకుని బలిపీఠంపై కాల్చివెయ్యాలి. అది యెహోవాకు హోమబలి. అది యెహోవాకు పరిమళం కలిగించే ఇష్టమైన హోమం.
\p
\s5
\v 26 అహరోను సేవా ప్రతిష్ట కోసం నియమించిన ఆ పొట్టేలు బోరను తీసుకుని యెహోవా సన్నిధిలో కదిలించే అర్పణగా దాన్ని కదిలించాలి. ఆ భాగం నీది అవుతుంది.
\v 27 ప్రతిష్టించిన ఆ పొట్టేలులో అంటే అహరోను, అతని కొడుకులకు చెందిన దానిలో కదిలించే బోరను, ప్రతిష్ఠితమైన తొడను నాకు ప్రతిష్ఠించాలి.
\v 28 ఆ ప్రతిష్టార్పణ అహరోనుది, అతని కొడుకులది అవుతుంది. అది ఇశ్రాయేలు ప్రజలు ఇచ్చిన కానుక. అది నిత్యమూ నిలిచి ఉండే కట్టుబాటు. అది ఇశ్రాయేలు ప్రజలు అర్పించే శాంతి బలుల్లో నుండి యెహోవాకు అర్పించిన కానుక.
\p
\s5
\v 29 అహరోను ధరించిన ప్రతిష్ఠిత వస్త్రాలు అతని తరువాత అతని కొడుకులకు చెందుతాయి. వాళ్ళ అభిషేకం, ప్రతిష్ట జరిగే సమయంలో వారు ఆ వస్త్రాలను ధరించాలి.
\v 30 అహరోను కొడుకుల్లో అతనికి బదులుగా యాజక వృత్తి ఎవరు చేపడతాడో అతడు పవిత్ర స్థలం లో సేవ చేయడానికి సన్నిధి గుడారంలోకి వెళ్ళే సమయానికి ముందు ఏడు రోజులపాటు ఆ వస్త్రాలు ధరించాలి.
\p
\s5
\v 31 నువ్వు ప్రతిష్ట అయిన పొట్టేలును తీసుకుని పవిత్రమైన చోట దాని మాంసం వండాలి.
\v 32 అహరోను, అతని కొడుకులు సన్నిధి గుడారం గుమ్మం దగ్గర ఆ పొట్టేలు మాంసాన్నీ, గంపలో ఉన్న రొట్టెలనూ తినాలి.
\v 33 వారిని ప్రతిష్ఠ చేయడానికీ, పవిత్రపరచడానికీ వేటి ద్వారా
\f +
\fr 29:33
\ft పాప క్షమాపణ.
\f* ప్రాయశ్చిత్తం జరిగిందో వాటిని వాళ్ళు తినాలి. అవి పవిత్రమైనవి కాబట్టి యాజకుడు కానివాడు వాటిని తినకూడదు.
\p
\v 34 సేవ కోసం ప్రతిష్ఠి అయిన మాంసంలో గానీ, రొట్టెల్లో గానీ ఉదయం దాకా ఏమైనా మిగిలిపోతే వాటిని కాల్చివెయ్యాలి. అది ప్రతిష్ట అయినది గనక దాన్ని తినకూడదు.
\s5
\v 35 నేను నీకు ఆజ్ఞాపించిన విషయాలన్నిటి ప్రకారం నువ్వు అహరోనుకు, అతని కొడుకులకూ జరిగించాలి. ఏడు రోజుల పాటు వాళ్ళను సేవా ప్రతిష్ట కోసం సిద్ధపరచాలి.
\p
\v 36 వారి పాపాలను కప్పివేయడానికి ప్రతిరోజూ ఒక కోడెదూడను పరిహార బలిగా అర్పించాలి. బలిపీఠానికి ప్రాయశ్చిత్తం చేయడానికి దానికి పాపపరిహార బలి అర్పించి దానికి అభిషేకం చేసి తిరిగి ప్రతిష్ఠించాలి.
\v 37 ఏడు రోజులపాటు బలిపీఠం కోసం ప్రాయశ్చిత్తం చేస్తూ దాన్ని పవిత్రం చెయ్యాలి. ఆ బలిపీఠం అతి పవిత్రంగా ఉంటుంది. బలిపీఠానికి తగిలేదంతా పవిత్రం అవుతుంది.
\s అనుదిన అర్పణలు
\r సంఖ్యా 28:1-8
\p
\s5
\v 38 బలిపీఠం మీద ఎప్పుడూ అర్పణలు జరుగుతూ ఉండాలి. ఒక సంవత్సరం లోపు వయసున్న రెండు గొర్రెపిల్లలను ప్రతి రోజూ అర్పించాలి.
\v 39 ఉదయం ఒక గొర్రెపిల్ల, సాయంత్రం ఒక గొర్రెపిల్ల అర్పించాలి.
\s5
\v 40 ఉదయం అర్పించే గొర్రెపిల్లతోబాటు దంచి తీసిన నూనెతో కలిపిన ఒక కిలో పిండిని, పానార్పణగా లీటరు ద్రాక్షరసాన్నీ అర్పించాలి.
\p
\s5
\v 41 ఉదయం అర్పించినట్టు సాయంత్రం కూడా చెయ్యాలి. యెహోవాకు అర్పణనూ, పానార్పణనూ అర్పించాలి. అది యెహోవాకు హోమబలి. అది యెహోవాకు పరిమళంగా ఉండే ఇష్టమైన హోమం.
\v 42 ఇది యెహోవా సన్నిధానంలో సన్నిధి గుడారం ద్వారం దగ్గర మీరు తరతరాలకు అర్పించవలసిన హోమబలి. నేను అక్కడకు వచ్చి మిమ్మల్ని కలుసుకుని మీతో మాట్లాడతాను.
\s5
\v 43 అక్కడ ఇశ్రాయేలు ప్రజలను కలుసుకుంటాను. ఆ స్థలం నా మహిమా ప్రకాశం వల్ల పవిత్రం అవుతుంది.
\p
\v 44 నేను సన్నిధి గుడారాన్ని, బలిపీఠాన్ని పవిత్రం చేస్తాను. నాకు యాజకులుగా ఉండేందుకు అహరోనును, అతని కొడుకులను పరిశుద్ధ పరుస్తాను.
\s5
\v 45 నేను ఇశ్రాయేలు ప్రజల మధ్య నివసించి వారికి దేవుడుగా ఉంటాను.
\v 46 వాళ్ళ మధ్య నివసించడానికి తమను ఐగుప్తు దేశం నుండి బయటకు రప్పించిన దేవుణ్ణి నేనే అని వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళ దేవుడైన యెహోవాను నేనే.>>
\s5
\c 30
\s పరిమళ ధూప వేదిక
\r నిర్గమ 37:25-28
\p
\v 1 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. <<ధూపం వేయడానికి తుమ్మకర్రతో మందసాన్ని తయారు చెయ్యాలి.
\v 2 దాని పొడవు ఒక మూర, వెడల్పు ఒక మూర, ఎత్తు రెండు మూరలు ఉండాలి. అది చదరంగా ఉండాలి. దాని కొమ్ములు దానితో ఏకాండంగా ఉండాలి.
\s5
\v 3 దాని లోపల, బయటా నాలుగు పక్కలా స్వచ్ఛమైన బంగారం రేకు పొదిగించాలి. దాని అంచును బంగారంతో అలంకరించాలి.
\p
\v 4 దానికి బంగారంతో నాలుగు గుండ్రని కొంకీలు తగిలించి, ఒక వైపు రెండు కమ్మీలు, ముందు భాగంలో రెండు గుండ్రని కమ్మీలు ఉండేలా దాని నాలుగు కాళ్లకు వాటిని తగిలించాలి.
\s5
\v 5 తుమ్మకర్రతో మందసాన్ని మోసే కర్రలు సిద్ధం చేసి వాటికి బంగారం రేకులు పొదిగించాలి.
\v 6 వేదికను శాసనాల పెట్టెకు ముందు ఉన్న తెర బయట, శాసనాలపై ప్రాయశ్చిత్త స్థానం ఎదురుగా ఉంచాలి. అక్కడ నేను నిన్ను కలుసుకుంటాను.
\p
\s5
\v 7 అహరోను ఆ వేదికపై పరిమళ ద్రవ్యాల ధూపం వెయ్యాలి. అతడు ప్రతిరోజూ ఉదయం దీపాలను సర్దే సమయంలో దాని మీద ధూపం వెయ్యాలి.
\v 8 అలాగే సాయంత్రాలు అహరోను దీపాలు వెలిగించే సమయంలో కూడా వేదికపై ధూపం వెయ్యాలి. యెహోవా సన్నిధిలో మీ తరతరాలకూ నిత్యంగా ఆ ధూపం ఉండాలి.
\p
\v 9 దాని మీద నిషిద్ధమైన వేరే ధూపాలు వెయ్యకూడదు. హోమాన్ని గానీ, నైవేద్య ద్రవ్యాలను గానీ అర్పించకూడదు. పానార్పణలు అర్పించ కూడదు.
\p
\s5
\v 10 అహరోను ఆ వేదిక కొమ్ముల మీద సంవత్సరానికి ఒకసారి ప్రాయశ్చిత్తం చెయ్యాలి. పాప పరిహారార్థబలి రక్తంతో దాని కొమ్ముల కోసం ప్రాయశ్చిత్తం చెయ్యాలి. మీ తరతరాలకూ సంవత్సరానికి ఒకసారి అతడు వేదిక కోసం ప్రాయశ్చిత్తం చెయ్యాలి. అది యెహోవాకు అతి పవిత్రమైనదిగా ఉంటుంది.>>
\p
\s5
\v 11 యెహోవా మోషేతో ఇంకా ఇలా చెప్పాడు,
\v 12 <<నువ్వు ఇశ్రాయేలు ప్రజల సంఖ్య లెక్కబెట్టాలి. వాళ్ళను లెక్కించే సమయానికి తమపై ఎలాంటి కీడు రాకుండా ప్రతి ఒక్కరూ తమ ప్రాణం కోసం విడుదల పరిహార ధనం యెహోవాకు చెల్లించాలి.
\p
\v 13 జాబితాలో నమోదు అయిన ప్రతివాడూ
\f +
\fr 30:13
\ft గేరా అనేది అన్నిటికన్నా చిన్న కొలత. ఇది దాదాపు అర గ్రాము.
\f* అర తులం వెండి చెల్లించాలి. పవిత్ర స్థలం లెక్క చొప్పున పూర్తి బరువు ఇవ్వాలి. యెహోవాకు అర్పణగా దాన్ని చెల్లించాలి.
\p
\v 14 ఇరవై సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవాళ్ళంతా జన సంఖ్యలో నమోదు కావాలి. జన సంఖ్యలో చేర్చే ప్రతి ఒక్కరూ యెహోవాకు అర్పణ చెల్లించాలి.
\p
\s5
\v 15 విడుదల పరిహార ధనంగా యెహోవాకు మీరు చెల్లించే అర్పణ ధనవంతుడైనా, పేదవాడైనా సమానంగా ఉండాలి. ఇద్దరూ అర తులం చొప్పున చెల్లించాలి.
\p
\v 16 ఇశ్రాయేలు ప్రజలు విడుదల పరిహార ధనంగా చెల్లించిన వెండిని సన్నిధి గుడారం సేవ కోసం ఉపయోగించాలి. అది ప్రాయశ్చిత్త పరిహారంగా ప్రజల పక్షంగా యెహోవా సన్నిధానంలో ఇశ్రాయేలు ప్రజలకు జ్ఞాపకార్ధంగా ఉంటుంది.>>
\s ఇత్తడి గంగాళం
\p
\s5
\v 17 యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు. <<నువ్వు ఇత్తడితో ఒక గంగాళం సిద్ధం చేసి ఇత్తడి పీటపై ఉంచాలి.
\v 18 సన్నిధి గుడారానికి, బలిపీఠానికి మధ్యలో ఆ గంగాళం ఉంచి దాన్ని నీళ్లతో నింపాలి.
\s5
\v 19 ఆ నీళ్లతో అహరోను, అతని కొడుకులు తమ కాళ్ళు, చేతులు కడుక్కోవాలి.
\p
\v 20 వాళ్ళు సన్నిధి గుడారం లోపలికి వెళ్ళే సమయంలో చనిపోకుండా ఉండేలా నీళ్ళతో తమను శుభ్రం చేసుకోవాలి. సేవ చేయడానికి బలిపీఠం సమీపించి యెహోవాకు హోమం అర్పించే ముందు వారు నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి. అలా చెయ్యని పక్షంలో చనిపోతారు.
\p
\v 21 వాళ్ళు చనిపోకుండా ఉండేలా తమ కాళ్ళు, చేతులు కడుక్కోవాలి. ఇది వారికి, అంటే అహరోనుకి, అతని సంతానానికి, తరతరాలకు నిలిచి ఉండే చట్టం.>>
\s అభిషేక తైలం, ధూపద్రవ్యం
\p
\s5
\v 22 యెహోవా మోషేతో ఇంకా ఇలా చెప్పాడు,
\v 23 <<నువ్వు సుగంధ ద్రవ్యాల్లో ముఖ్యమైన వాటిని తీసుకుని అభిషేకం చెయ్యాలి. పవిత్ర స్థలానికి సంబంధించిన కొలతల ప్రకారం స్వచ్ఛమైన గోపరసం
\f +
\fr 30:23
\ft సుమారు 6 కిలోలు.
\f* 500 షెకెల్, సుగంధం గల దాల్చిన చెక్క సగం అంటే 250 షెకెల్,
\v 24 నిమ్మగడ్డి నూనె 250 షెకెల్, లవంగిపట్ట 500 షెకెల్, మూడు పాళ్ళు ఒలీవ నూనె తీసుకోవాలి.
\v 25 పరిమళ ద్రవ్యాలు మిళితం చేసే నిపుణుడైన పనివాడి చేత పరిమళ ద్రవ్యం సిద్ధపరచాలి. అది యెహోవాకు ప్రతిష్ఠి అభిషేక తైలం అవుతుంది.
\p
\s5
\v 26 ఆ తైలంతో నువ్వు సన్నిధి గుడారాన్ని అభిషేకించాలి. దానితోపాటు సాక్ష్యపు గుడారాన్ని,
\v 27 సన్నిధి బల్లను, దాని సామగ్రిని, దీపస్తంభాన్ని, దాని సామగ్రిని,
\v 28 హోమ బలిపీఠాన్ని, దాని సామగ్రిని, గంగాళాన్ని, దాని పీటను అభిషేకించాలి.
\s5
\v 29 అవన్నీ అతి పవిత్రమైనవిగా ఉండేలా వాటిని పవిత్రపరచాలి. వాటికి తగిలే ప్రతి వస్తువూ పవిత్రం అవుతుంది.
\p
\v 30 అహరోను, అతని కొడుకులు నాకు యాజకులై నాకు సేవ చేసేలా వాళ్ళను అభిషేకించి ప్రతిష్ఠించాలి.
\p
\v 31 నీవు ఇశ్రాయేలు ప్రజలతో, <ఇది మీ తరతరాలకు నాకు పవిత్ర అభిషేక తైలంగా ఉండాలి.
\s5
\v 32 దాన్ని యాజకులు కాని వాళ్ళ మీద పోయకూడదు. దాని పాళ్ళ ప్రకారం అలాంటి వేరే దాన్ని చెయ్యకూడదు. అది పవిత్రమైనది. దాన్ని మీరు పవిత్రంగా ఎంచాలి.
\v 33 దాని వంటి దాన్ని కలిపే వాణ్ణి గానీ, యాజకుడు కాని వారిపై దాన్ని చల్లే వాణ్ణి గానీ తన ప్రజల్లో లేకుండా చెయ్యాలి> అని చెప్పు.>>
\p
\s5
\v 34 యెహోవా మోషేతో ఇంకా ఇలా చెప్పాడు<<నువ్వు జటామాంసి, గోపిచందనం, గంధం, సాంబ్రాణి సమపాళ్ళలో తీసుకుని వాటితో పరిమళ ద్రవ్యాలను, ధూపద్రవ్యం సిద్ధపరచాలి.
\v 35 పరిమళ ద్రవ్యాల నిపుణుడైన పనివాడు దాన్ని కలపాలి. దానికి ఉప్పు కలపాలి. ఆ ధూప మిబాధం స్వచ్ఛమైనదిగా, పవిత్రంగా ఉంటుంది.
\p
\v 36 దానిలో కొంచెం పొడి తీసి నేను నిన్ను కలుసుకొనే సన్నిధి గుడారంలో శాసనాల మందసం ఎదుట ఉంచాలి. మీరు దాన్ని పరిశుద్ధమైనదిగా భావించాలి.
\p
\s5
\v 37 నీవు చేయవలసిన ఆ ధూప ద్రవ్యాల వంటి ధూపాలను మీ కోసం కలుపుకోకూడదు. అది కేవలం యెహోవాకు ప్రత్యేకమైనది అని భావించాలి.
\v 38 దాని వాసన చూద్దామని అలాంటి దాన్ని తయారు చేసేవాణ్ణి ప్రజల్లో లేకుండా చెయ్యాలి.>>
\s5
\c 31
\s బెసలేలు, అహోలియాబు
\r నిర్గమ 35:30
\p
\v 1 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు,
\v 2 <<యూదా గోత్రానికి చెందిన బెసలేలును నేను నియమించుకున్నాను. అతడు ఊరీ కొడుకు, హూరు మనుమడు.
\s5
\v 3 అతనికి నేను అన్ని రకాల పనులు చెయ్యడానికి తెలివితేటలు, సమస్త జ్ఞానం, నేర్పరితనం ప్రసాదించాను. అతణ్ణి నా ఆత్మతో నింపాను.
\v 4 అతడు బంగారంతో, వెండితో, ఇత్తడితో వివిధ రకాల ఆకృతులు నైపుణ్యంగా తయారు చేయగల నేర్పరి. రత్నాలు సానబెట్టి పొదగడంలో, చెక్కను కోసి నునుపు చేయడంలో నిపుణుడు.
\v 5 నేను ప్రసాదించిన సమస్త జ్ఞానం, వివేకాలతో అతడు పనులు జరిగిస్తాడు.
\p
\s5
\v 6 దాను గోత్రానికి చెందిన అహీసామాకు కొడుకు అహోలీయాబు అతనికి సహాయంగా ఉంటాడు. నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ తయారు చేయగల నిపుణులందరి హృదయాల్లో నా జ్ఞానం ఉంచుతాను.
\v 7 నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం వాళ్ళు సన్నిధి గుడారం, సాక్ష్యపు మందసం, దాని మీద ఉన్న కరుణాపీఠాన్ని, గుడారపు సామగ్రిని తయారు చెయ్యాలి.
\v 8 సన్నిధి బల్ల, దాని సామగ్రి, నిర్మలమైన దీపవృక్షం, దాని సామగ్రి తయారు చెయ్యాలి.
\v 9 ధూపవేదిక, దహన బలిపీఠం, దాని సామగ్రి, గంగాళం, దాని పీట,
\s5
\v 10 యాజక ధర్మం నెరవేర్చే అహరోనుకు, అతని కొడుకులకు ప్రతిష్టించిన దుస్తులు సిద్ధం చెయ్యాలి.
\v 11 పరిశుద్ధ స్థలం కోసం అభిషేక తైలాన్ని, సుగంధ ధూప ద్రవ్యాలను సిద్ధం చెయ్యాలి. ఇవన్నీ నేను నీకు ఆజ్ఞాపించినట్టు జరగాలి.>>
\s విశ్రాంతి దినం గురించిన ఆజ్ఞలు
\p
\s5
\v 12 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. <<నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పు. మీరు నేను నియమించిన విశ్రాంతి దినాన్ని కచ్చితంగా ఆచరించాలి.
\v 13 మిమ్మల్ని పవిత్రంగా చేసే యెహోవాను నేనే అని మీరు తెలుసుకునేలా విశ్రాంతి దినం నాకు, మీకు, మీ తరతరాలకు ఒక చిహ్నంగా ఉంటుంది.
\v 14 అందువల్ల మీరు విశ్రాంతి దినాన్ని కచ్చితంగా ఆచరించాలి. అది మీకు పవిత్రమైనది. ఆ దినాన్ని అపవిత్రం చేసే వాణ్ణి ప్రజల్లో లేకుండా చెయ్యాలి.
\p
\v 15 ఆరు రోజులు పని చేసిన తరువాత యెహోవాకు ప్రతిష్ఠితమైన ఏడవ రోజును విశ్రాంతి దినంగా పాటించాలి. విశ్రాంతి దినాన పని చేసే ప్రతివాడికీ తప్పకుండా మరణశిక్ష విధించాలి.
\s5
\v 16 ఇశ్రాయేలు ప్రజలు తమ తరతరాలు విశ్రాంతి దిన ఆచారం పాటించి ఆ దినాన్ని ఆచరించాలి. ఇది శాశ్వత కాలం నిలిచి ఉండే నియమం.
\v 17 నాకు, ఇశ్రాయేలు ప్రజలకు మధ్య అది శాశ్వతంగా ఒక గుర్తుగా ఉంటుంది. ఎందుకంటే, యెహోవా ఆరు రోజులు భూమి ఆకాశాలను సృష్టి చేసి ఏడవ దినాన విశ్రాంతి తీసుకున్నాడు.>>
\p
\s5
\v 18 ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడడం ముగించిన తరువాత ఆయన తన వేలితో రాసిన శాసనాలు ఉన్న రెండు పలకలను మోషేకు అందించాడు.
\s5
\c 32
\s బంగారం దూడ
\r ద్వితీ 9:6-29
\p
\v 1 మోషే కొండ దిగి రావడం ఆలస్యం కావడం చూసిన ప్రజలు అహరోను దగ్గరికి వచ్చారు. <<లే, మా ముందుండి మమ్మల్ని నడిపించడానికి మా కోసం ఒక దేవుణ్ణి సిద్ధం చెయ్యి. ఐగుప్తు నుండి మమ్మల్ని బయటకు తీసుకు వచ్చిన మోషే అనే వాడు ఏమయ్యాడో మాకు తెలియడం లేదు>> అన్నారు.
\p
\v 2 అప్పుడు అహరోను <<మీ భార్యల, కొడుకుల, కూతుళ్ళ చెవులకు ఉన్న బంగారు పోగులు తీసి నా దగ్గరికి తీసుకు రండి>> అని చెప్పాడు.
\s5
\v 3 ప్రజలంతా తమ చెవులకున్న బంగారు పోగులు తీసి అహరోను దగ్గరికి తెచ్చారు.
\v 4 అతడు వాటిని తీసుకుని దూడ రూపం అచ్చుతో పోత పోసి బంగారం దూడను తయారు చేయించాడు. అప్పుడు ప్రజలు<<ఓ ఇశ్రాయేలూ, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే>> అని కేకలు వేశారు.
\p
\s5
\v 5 అహరోను దాన్ని చూసి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టించాడు. తరువాత అహరోను <<రేపు యెహోవాకు పండగ జరుగుతుంది>> అని చాటింపు వేయించాడు.
\v 6 తరువాతి రోజు ప్రజలు ఉదయాన్నే లేచి హోమబలులు, శాంతిబలులు సమర్పించారు. తరువాత ప్రజలు తినడానికి, తాగడానికి కూర్చున్నారు. నాట్యం చేయడం మొదలు పెట్టారు.
\p
\s5
\v 7 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు. <<కొండ దిగి వెళ్ళు. ఐగుప్తు దేశం నుండి నువ్వు తీసుకు వచ్చిన నీ ప్రజలు చెడిపోయారు.
\v 8 వాళ్ళు పాటించాలని నేను నియమించిన ఉపదేశాల నుండి అప్పుడే తప్పిపోయారు. వాళ్ళ కోసం పోత పోసిన దూడ విగ్రహం తయారు చేసుకుని దానికి సాగిలపడి బలులు అర్పించి <ఓ ఇశ్రాయేలూ, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే> అని చెప్పుకుంటున్నారు.>>
\p
\s5
\v 9 యెహోవా ఇంకా ఇలా అన్నాడు. <<నేను ఈ ప్రజలను గమనిస్తున్నాను. వాళ్ళు
\f +
\fr 32:9
\ft తలబిరుసు, మొండి, మెడవంచని మనుషులు
\f* కఠిన హృదయులయ్యారు.
\v 10 నువ్వు చూస్తూ ఉండు, నా కోపం వారి మీద రగులుకునేలా చేస్తాను. వాళ్ళను దహించివేసి నిన్ను గొప్ప జనంగా చేస్తాను.>>
\v 11 అందుకు మోషే తన దేవుడైన యెహోవాను బతిమిలాడాడు. <<యెహోవా, నీ ప్రజల మీద నీ కోపం ఎందుకు రగులుకోవాలి? నీ బలిష్టమైన చెయ్యి చాపి ఐగుప్తు దేశం నుండి వీళ్ళను బయటకు రప్పించావు కదా.
\s5
\v 12 ఐగుప్తీయులు <వాళ్ళ దేవుడు వాళ్ళకు కీడు కలిగించి భూమిపై లేకుండా నశింపజేసి కొండల్లో చనిపోయేలా చేయడానికి వాళ్ళను తీసుకు వెళ్ళాడు> అని ఎందుకు చెప్పుకోవాలి? నీ కోపాగ్ని నుండి మళ్లుకుని వాళ్లకు కీడు చెయ్యకు.
\v 13 నీ సేవకులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకో. ఆకాశంలో ఉండే నక్షత్రాలవలే మీ సంతానాన్ని అభివృద్ధి పరచి నేను చెప్పిన ఈ భూమి అంతటినీ మీ సంతానానికి ఇస్తాననీ, వాళ్ళు శాశ్వతంగా దాన్ని స్వాధీనం చేసుకుంటారనీ, దానికి నువ్వే సాక్ష్యం అనీ వాళ్ళతో ఒప్పందం చేశావు>> అన్నాడు.
\p
\v 14 అప్పుడు యెహోవా పరితపించి తన ప్రజలకు చేస్తానని చెప్పిన కీడు చెయ్యలేదు.
\s5
\v 15 దేవుడు తన స్వహస్తాలతో రాసి ఇచ్చిన రెండు పలకలు మోషే చేతిలో ఉన్నాయి. ఆ పలకలపై రెండువైపులా దేవుడు నియమించిన ఆజ్ఞలు రాసి ఉన్నాయి.
\v 16 ఆ పలకలు దేవుడు తయారు చేశాడు. ఆ పలకలు పట్టుకుని మోషే కొండ దిగి వచ్చాడు.
\p
\s5
\v 17 శిబిరంలో ప్రజలు వేస్తున్న కేకల శబ్దం యెహోషువకు వినబడింది. <<మన శిబిరంలో యుద్ధ ధ్వని వినబడుతోంది>> అన్నాడు.
\v 18 మోషే <<అది జయ ధ్వని కాదు, అపజయ ధ్వని కాదు, సంగీత వాయిద్యాల శబ్దం నాకు వినబడుతోంది>> అన్నాడు.
\s5
\v 19 అతడు శిబిరం చేరుకున్నప్పుడు ప్రజలు చేసుకున్న ఆ దూడ, నాట్యం చేస్తున్న ప్రజలు కనిపించారు. మోషే కోపం రగులుకుంది. అతడు తన చేతుల్లో ఉన్న పలకలను కొండ కింది భాగానికి విసిరేసి వాటిని పగలగొట్టాడు.
\v 20 ప్రజలు తయారు చేసుకున్న ఆ దూడను తీసుకుని అగ్నితో కాల్చి పొడి చేశాడు. ఆ పొడిని నీళ్లలో కలిపి ఇశ్రాయేలు ప్రజల చేత తాగించాడు.
\p
\s5
\v 21 అప్పుడు మోషే <<ఈ ప్రజల మీదికి ఈ గొప్ప అపరాధం వచ్చేలా చేయడానికి వీళ్ళు నిన్ను ఎలా ప్రేరేపించారు?>> అని అహరోనును అడిగాడు.
\v 22 అహరోను <<నా ప్రభూ, నీ కోపం రగులుకోనియ్యకు. ఈ ప్రజలు దుర్మార్గులు అనే విషయం నీకు తెలుసు.
\v 23 వాళ్ళు <మా ముందుండి మమ్మల్ని నడిపించడానికి ఒక దేవుణ్ణి సిద్ధం చెయ్యి. ఐగుప్తు దేశం నుండి మమ్మల్ని తీసుకు వచ్చిన మోషే ఏమయ్యాడో మాకు తెలియడం లేదు> అన్నారు.
\v 24 అప్పుడు నేను ఎవరి దగ్గర బంగారం ఉన్నదో వాళ్ళంతా దాన్ని ఊడదీసి తీసుకు రండి అని చెప్పాను. వాళ్ళు తెచ్చిన దాన్ని అగ్నిలో వేస్తే ఈ దూడ అయ్యింది>> అని చెప్పాడు.
\p
\s5
\v 25 ప్రజలు తమ శత్రువుల ఎదుట నవ్వులపాలు కావడానికి అహరోను కారకుడయ్యాడు. ప్రజలు విచ్చలవిడితనంగా తిరగడం మోషే గమనించాడు.
\v 26 అప్పుడు మోషే శిబిరం ద్వారం దగ్గర నిలబడి <<యెహోవా పక్షంగా ఉన్నవాళ్ళంతా నా దగ్గరికి రండి>> అన్నాడు. లేవీయులంతా అతని దగ్గరికి వచ్చారు.
\p
\v 27 అతడు వాళ్ళను చూసి <<మీలో ప్రతి ఒక్కరూ మీ కత్తులు నడుముకు కట్టుకోండి, శిబిరంలో గుమ్మం నుండి గుమ్మానికి వెళ్తూ ప్రతి ఒక్కరూ తమ సోదరుణ్ణి, తమ స్నేహితుణ్ణి, తమ పొరుగువాణ్ణి సంహరించండి>> అన్నాడు.
\s5
\v 28 లేవీయులు మోషే మాట ప్రకారం చేసారు. ఆ రోజున ప్రజల్లో సుమారు మూడు వేల మంది హతమయ్యారు.
\p
\v 29 మోషే లేవీయులతో <<మిమ్మల్ని మీరు యెహోవాకు ప్రతిష్ట చేసుకోండి. మీలో ప్రతి ఒక్కరూ మీ కొడుకులనూ, సోదరులనూ చంపి యెహోవా ఆశీర్వాదాలు పొందారు>> అన్నాడు.
\s5
\v 30 మరుసటి రోజు మోషే ప్రజలతో<<మీరు గొప్ప పాపం చేశారు. నేను యెహోవా దగ్గరికి కొండ ఎక్కి వెళ్తాను. ఒకవేళ మీరు చేసిన పాపం కోసం ఏదైనా ప్రాయశ్చిత్తం చేయగలనేమో>> అన్నాడు.
\p
\v 31 మోషే యెహోవా కొండకు మళ్ళీ వెళ్ళాడు. <<అయ్యో, ఈ ప్రజలు ఎంతో పాపం చేశారు. వాళ్ళు తమ కోసం బంగారు దేవుణ్ణి చేసుకున్నారు.
\v 32 అయ్యో, వాళ్ళు చేసిన పాపాన్ని పరిహరించు, లేని పక్షంలో నువ్వు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తొలగించు>> అని బతిమాలుకున్నాడు.
\p
\s5
\v 33 అందుకు యెహోవా <<నాకు విరోధంగా ఎవరు పాపం చేస్తారో వాళ్ళ పేర్లు మాత్రమే నా గ్రంథంలో నుండి తొలగిస్తాను.
\v 34 నువ్వు వెళ్లి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించు. నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను. నేను శిక్షించే రోజున వాళ్ళ పాపం విషయంలో వాళ్ళకు శిక్ష రప్పిస్తాను>> అని మోషేతో చెప్పాడు.
\v 35 ప్రజలు అహరోను చేత చేయించిన దూడను బట్టి యెహోవా వాళ్ళను బాధలకు గురి చేశాడు.
\s5
\c 33
\s సీనాయి పర్వతం వదిలి వెళ్ళమని ఆజ్ఞ.
\p
\v 1 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. <<నీవూ ఐగుప్తు దేశం నుండి బయటకు తీసుకు వచ్చిన ప్రజలూ బయలుదేరి, నేను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల సంతానానికి ఇస్తానని చెప్పిన
\f +
\fr 33:1
\ft సారవంతమైన
\f* పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళండి.
\v 2 నేను నీకు ముందుగా దూతను పంపుతాను. ఆ దూత కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను అక్కడినుండి వెళ్ళగొడతాడు.
\v 3 మీరు నాకు
\f +
\fr 33:3
\ft కఠిన హృదయులు
\f* అవిధేయులయ్యారు కనుక నేను మీతో కలసి రాను. ఒకవేళ మార్గమధ్యంలో మిమ్మల్ని చంపేస్తానేమో.>>
\p
\s5
\v 4 ఆ దుర్వార్త విని ప్రజలు దుఃఖించారు. ధరించిన ఆభరణాలన్నీ పక్కనబెట్టారు.
\p
\v 5 అప్పుడు యెహోవా మోషేతో <<నీవు ఇశ్రాయేలు ప్రజలతో <మీరు అవిధేయులైన ప్రజలు. ఒక్క క్షణం నేను మీ మధ్యకు వచ్చినా మిమ్మల్ని హతం చేస్తాను. మీరు ధరించుకొన్న ఆభరణాలన్నీ తీసివెయ్యండి. అప్పుడు మిమ్మల్ని ఏం చెయ్యాలో చూస్తాను> అని చెప్పు>>అన్నాడు.
\p
\v 6 ఇశ్రాయేలు ప్రజలు హోరేబు కొండ దగ్గర తమ నగలు తీసివేశారు.
\s5
\v 7 అప్పుడు మోషే శిబిరం బయటకు వెళ్లి అక్కడ ఒక గుడారం వేశాడు. దానికి
\f +
\fr 33:7
\ft ప్రత్యక్ష గుడారం.
\f* సన్నిధి గుడారం అని పేరు పెట్టాడు. యెహోవాను కనుగొనాలనుకున్న ప్రతివాడూ శిబిరం బయట ఉన్న సన్నిధి గుడారానికి వచ్చాడు.
\p
\v 8 మోషే ఆ గుడారానికి వెళ్తూ ఉన్నప్పుడల్లా తమ గుడారాల్లో ఉన్న ప్రజలు లేచి నిలబడి అతడు గుడారం లోకి వెళ్ళేదాకా అతని వైపు నిదానంగా చూస్తూ ఉండేవాళ్ళు.
\v 9 మోషే ఆ గుడారంలోకి వెళ్ళినప్పుడు స్తంభం లాంటి మేఘం దిగి వచ్చి ఆ గుడారం ద్వారం దగ్గర నిలిచేది. అప్పుడు యెహోవా మోషేతో మాట్లాడుతూ ఉండేవాడు.
\p
\s5
\v 10 ఆ మేఘస్తంభం ఆ గుడారం ద్వారాన నిలవడం చూసిన ప్రజలందరూ తమ తమ గుడారాల ద్వారాల్లో లేచి నిలబడి నమస్కారం చేసేవారు.
\v 11 ఒక వ్యక్తి తన స్నేహితునితో మాట్లాడుతున్నట్టు యెహోవా మోషేతో ముఖాముఖీగా మాట్లాడేవాడు. తరువాత అతడు శిబిరంలోకి తిరిగి వచ్చేవాడు. అయితే మోషే సేవకుడు, నూను కొడుకు అయిన యెహోషువ అనే యువకుడు గుడారం నుండి బయటకు వచ్చేవాడు కాదు.
\s మోషే ప్రార్థన
\p
\s5
\v 12 మోషే యెహోవాతో ఇలా చెప్పాడు. <<ఈ ప్రజలను వెంటబెట్టుకుని వెళ్ళమని నాకు చెబుతున్నావు గానీ నాతో ఎవరిని పంపుతున్నావో అది నాకు చెప్పలేదు. అదీగాక <నిన్ను నీ పేరుతో ఎరుగుదును. నిన్ను నేను కరుణించాను> అని నాతో చెప్పావు కదా.
\v 13 అందువల్ల నాపై నీ దయ ఉంటే నీ విధానాలు నేను గ్రహించగలిగేలా దయచేసి నీ మార్గాలు నాకు చూపించు. అప్పుడు నేను నీ గురించి తెలుసుకుంటాను. అయ్యా, చూడు, ఈ జనమంతా నీ ప్రజలే గదా.>>
\p
\s5
\v 14 అందుకు ఆయన <<నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. నేను నీకు నెమ్మది కలుగజేస్తాను>> అన్నాడు.
\v 15 మోషే <<నీ సన్నిధి మాతో రాని పక్షంలో ఇక్కడ నుండి మమ్మల్ని తీసుకు వెళ్ళకు.
\v 16 నా పట్ల, నీ ప్రజల పట్ల నువ్వు దయ చూపిస్తున్నావని మాకు దేని వల్ల తెలుస్తుంది? నువ్వు మాతో కలసి రావడం వల్లనే కదా. ఆ విధంగా మేము, అంటే నేను, నీ ప్రజలు భూమి మీద ఉన్న ప్రజల్లో నుండి ప్రత్యేకంగా గుర్తింపు పొందుతాం>> అని ఆయనతో అన్నాడు.
\p
\s5
\v 17 అప్పుడు యెహోవా <<నీవు చెప్పినట్టు చేస్తాను. నీ మీద నాకు దయ కలిగింది. నీ పేరును బట్టి నిన్ను తెలుసుకున్నాను>> అని మోషేతో చెప్పాడు.
\v 18 మోషే <<దయచేసి నీ మహిమను నాకు చూపించు>> అన్నాడు.
\s5
\v 19 ఆయన <<
\f +
\fr 33:19
\ft నా మహిమ. అంతా.
\f* నా మంచితనమంతా నీ ఎదుట నుండి దాటిపోయేలా చేస్తాను. యెహోవా అనే నా పేరును నీ ఎదుట ప్రకటిస్తాను. నాకు ఎవరిమీద కరుణ చూపాలని ఉందో వాళ్ళను కరుణిస్తాను, ఎవరి మీద జాలిపడాలో వారిపట్ల జాలి చూపిస్తాను>> అన్నాడు.
\p
\v 20 ఆయన ఇంకా <<నువ్వు నా ముఖాన్ని చూడలేవు. నన్ను చూసిన ఏ మనిషీ బతకడు>> అన్నాడు.
\s5
\v 21 యెహోవా <<ఇదిగో నాకు దగ్గరలో ఒక చోటు ఉంది. నువ్వు ఆ బండ మీద నిలబడు.
\v 22 నా మహిమ నిన్ను దాటి వెళ్ళే సమయంలో ఆ బండ సందులో నిన్ను దాచి ఉంచి, నిన్ను దాటి వెళ్ళే వరకూ నా చేత్తో నిన్ను కప్పుతాను.
\v 23 నేను నా చెయ్యి తీసివేసిన తరువాత నా వీపును మాత్రం నువ్వు చూడగలవు గానీ నా ముఖ దర్శనం నీకు కలగదు>> అని మోషేతో చెప్పాడు.
\s5
\c 34
\s మోషే కొత్త రాతి పలకలు తయారు చేశాడు.
\r ద్వితీ 10:1-5
\p
\v 1 యెహోవా మోషేతో <<మొదటి పలకల్లాంటి రాతి పలకలు మరో రెండు చెక్కు. నువ్వు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న మాటలు నేను ఆ పలకల మీద రాస్తాను.
\v 2 తెల్లవారేటప్పటికి నువ్వు సిద్ధపడి సీనాయి కొండ ఎక్కి దాని శిఖరం మీద నా సన్నిధిలో నిలిచి ఉండాలి.
\s5
\v 3 ఏ మనిషీ నీతోబాటు ఈ కొండ దగ్గరికి రాకూడదు, ఏ మనిషీ ఈ కొండ మీద ఎక్కడా కనబడకూడదు. ఈ కొండ పరిసరాల్లో గొర్రెలు గానీ, ఎద్దులుగానీ మేత మేయకూడదు>> అని చెప్పాడు.
\p
\v 4 కాబట్టి మోషే మొదటి పలకల్లాంటి రెండు రాతి పలకలు చెక్కాడు. తనకు యెహోవా ఆజ్ఞాపించినట్టు ఉదయాన్నే తొందరగా లేచి ఆ రెండు రాతి పలకలను చేత పట్టుకుని సీనాయి కొండ ఎక్కాడు.
\s5
\v 5 యెహోవా మేఘం నుండి దిగి అక్కడ మోషే దగ్గర నిలిచి యెహోవా తనను వెల్లడి చేసుకున్నాడు.
\p
\v 6 యెహోవా అతని ఎదురుగా అతణ్ణి దాటి వెళ్తూ<<యెహోవా కనికరం, దయ, దీర్ఘశాంతం, అమితమైన కృప, సత్యం గల దేవుడు.
\v 7 ఆయన వేలాది మందికి తన కృప చూపిస్తాడు. అతిక్రమాలు, అపరాధాలు, పాపాలు క్షమిస్తాడు. అయితే దోషులను ఏమాత్రం శిక్షించకుండా ఉండడు. తండ్రుల దోష ఫలితం మూడు నాలుగు తరాలదాకా వారి సంతానం మీదికి రప్పించేవాడు>> అని ప్రకటించాడు.
\p
\s5
\v 8 మోషే వెంటనే నేలకు తల వంచి సాష్టాంగపడి నమస్కరించాడు.
\v 9 <<ప్రభూ, నా మీద నీకు దయ ఉంటే నా మనవి ఆలకించు. దయచేసి నా ప్రభువు మా మధ్య మాతో ఉండి మాతో కలసి ప్రయాణించాలి. ఈ ప్రజలు
\f +
\fr 34:9
\ft తలబిరుసు మనుషులు.
\f* మాటకు లోబడేవాళ్ళు కారు. మా అపరాధాలను, పాపాలను క్షమించు. మమ్మల్ని నీ సొత్తుగా స్వీకరించు>> అన్నాడు.
\s నిబంధన వినూత్నం
\r నిర్గమ 23:14-15; ద్వితీ 7:1-5; 16:1-17
\p
\s5
\v 10 అందుకు ఆయన <<ఇదిగో, నేను ఒక ఒడంబడిక చేస్తున్నాను. ఇంతవరకూ భూమిపై ఎక్కడైనా, ఏ ప్రజల్లోనైనా ఇంత వరకూ చేయని అద్భుత కార్యాలు నీ ప్రజలందరి ఎదుట చేస్తాను. నువ్వు నాయకత్వం వహించి నడిపిస్తున్న ఆ ప్రజలంతా యెహోవా చేసే పనులు చూస్తారు. నేను నీ పట్ల చేయబోయే కార్యాలు భయం కలిగిస్తాయి.
\v 11 ఇప్పుడు నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ పాటించు. నేను మీ ఎదుట నుండి అమోరీయులను, కనానీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను వెళ్ళగొడతాను.
\p
\s5
\v 12 మీరు వెళ్లబోయే ఆ పరదేశపు నివాసులతో ఎలాంటి ఒప్పందాలు చేసుకోకుండా జాగ్రత్త వహించాలి. అలా గనక చేసుకుంటే అవి మీకు ఉరిగా మారవచ్చు.
\v 13 అందువల్ల మీరు వాళ్ళ బలిపీఠాలను విరగగొట్టాలి, వాళ్ళ దేవుళ్ళ ప్రతిమలను పగలగొట్టాలి, వాళ్ళ దేవతా స్తంభాలను పడదోయాలి.
\v 14 మీరు వేరొక దేవునికి మొక్కకూడదు. నేను <రోషం గల దేవుడు> అనే పేరున్న యెహోవాను. నేను రోషం గల దేవుణ్ణి.
\p
\s5
\v 15 ఆ దేశాల్లో నివసించే ప్రజలతో ఎలాంటి ఒప్పందాలు చేసుకోకుండా ఉండేలా జాగ్రత్త వహించాలి. ఆ ప్రజలు ఇతరుల దేవుళ్ళ విషయం వ్యభిచారుల్లా ప్రవర్తిస్తారు. వాళ్ళ దేవుళ్ళకు అర్పించిన నైవేద్యాలు తినమని ఎవరైనా నిన్ను ప్రేరేపించినప్పుడు వాటి విషయం జాగ్రత్త వహించాలి.
\v 16 మీ కొడుకులకు వాళ్ళ కూతుళ్ళను పెళ్లి చేసుకోకూడదు. అలా గనక చేస్తే వాళ్ళ కూతుళ్ళు తమ తమ దేవుళ్ళను పూజిస్తూ మీ కొడుకులు కూడా వాళ్ళ దేవుళ్ళను పూజించేలా ప్రలోభ పెడతారేమో.
\v 17 పోత పోసిన దేవుళ్ళ విగ్రహాలను తయారు చేసుకోకూడదు.
\p
\s5
\v 18 పొంగజేసే పిండి లేని రొట్టెల పండగ ఆచరించాలి. నేను మీకు ఆజ్ఞాపించిన ప్రకారం ఐగుప్తునుండి మీరు బయలుదేరి వచ్చిన ఆబీబు నెలలో నియమించిన సమయంలో ఏడు రోజులపాటు పొంగజేసే పిండి లేని రొట్టెలు తినాలి. మీరు అబీబు నెలలో ఐగుప్టులో నుండి బయలుదేరి వచ్చారు గదా.
\p
\s5
\v 19 జంతువుల్లో మొదట పుట్టిన ప్రతి పిల్ల నాది. నీ పశువుల్లో మొదటిగా పుట్టిన ప్రతి మగది, అది దూడ గానీ, గొర్రెపిల్ల గానీ అది నాకు చెందుతుంది.
\v 20 గాడిదను విడిపించాలంటే దానికి బదులు గొర్రెపిల్లను అర్పించాలి. గాడిదను విమోచించకపోతే దాని మెడ విరగగొట్టాలి. మీ సంతానంలో పెద్ద కొడుకుని వెల చెల్లించి విడిపించాలి. నా సన్నిధానంలో ఒక్కడు కూడా ఖాళీ చేతులతో కనిపించకూడదు.
\p
\s5
\v 21 ఆరు రోజులు మీ పనులు చేసుకున్న తరువాత ఏడవ రోజున విశ్రాంతి తీసుకోవాలి. అది పొలం దున్నే కాలమైనా, కోత కోసే కాలమైనా.
\v 22 మీ పొలాల్లో పండిన గోదుమల తొలి పంటల కోత సమయంలో వారాల పండగ ఆచరించాలి. సంవత్సరం ముగింపులో పొలాలనుండి నీ వ్యవసాయ ఫలాన్ని కూర్చుకుని జనమంతా సమకూడి పండగ ఆచరించాలి.
\s5
\v 23 సంవత్సరంలో మూడుసార్లు పురుషులంతా ఇశ్రాయేలియుల దేవుడు, ప్రభువు అయిన యెహోవా సముఖంలో కనబడాలి.
\p
\v 24 మీరు సంవత్సరంలో మూడు సార్లు మీ దేవుడైన యెహోవా సన్నిధానంలో సమకూడడానికి వెళ్ళినప్పుడు ఎవ్వరూ నీ భూమిని స్వాధీనం చేసుకోరు. ఎందుకంటే నీ ఎదుట నుండి నీ శత్రువులను వెళ్లగొట్టి నీ సరిహద్దులు విస్తరించేలా చేస్తాను.
\p
\s5
\v 25 నాకు అర్పించే బలుల రక్తంలో పొంగజేసే పదార్థమేమీ ఉండకూడదు. పస్కా పండగలో అర్పించిన ఎలాటి మాంసమైనా ఉదయం దాకా నిలవ ఉండకూడదు.
\v 26 నీ భూమిలో పండే వాటిలో ప్రథమ ఫలాల్లో శ్రేష్ఠమైన వాటిని దేవుడైన యెహోవా మందిరానికి తీసుకురావాలి. మేకపిల్ల మాంసం దాని తల్లిపాలలో కలిపి ఉడకబెట్టకూడదు.>>
\p
\s5
\v 27 యెహోవా మోషేతో ఇంకా చెప్పాడు<<ఇప్పుడు పలికిన మాటలు రాసి ఉంచు. ఎందుకంటే ఈ మాటలను బట్టి నేను నీతో, ఇశ్రాయేలు ప్రజలతో ఒప్పందం చేసుకుంటున్నాను.>>
\s ప్రకాశిస్తున్న మోషే ముఖం
\p
\v 28 మోషే నలభై రాత్రింబగళ్ళు యెహోవా దగ్గరే ఉండిపోయాడు. అతడు భోజనం చెయ్యలేదు, నీళ్ళు తాగలేదు. ఆ సమయంలో దేవుడు చెప్పిన శాసనాలను, అంటే పది ఆజ్ఞలను ఆ పలకల మీద రాశాడు.
\s5
\v 29 మోషే సీనాయి కొండ దిగే సమయానికి ఆజ్ఞలు రాసి ఉన్న ఆ రెండు పలకలు మోషే చేతిలో ఉన్నాయి. అతడు ఆయనతో మాట్లాడుతున్న సమయంలో అతని ముఖం వెలుగుతో ప్రకాశించిన సంగతి మోషేకు తెలియలేదు. అతడు కొండ దిగి వచ్చాడు.
\p
\v 30 అహరోను, ఇశ్రాయేలు ప్రజలు మోషేకు ఎదురు వచ్చారు. ప్రకాశిస్తున్న అతని ముఖం చూసి అతణ్ణి సమీపించడానికి భయపడ్డారు.
\v 31 మోషే వాళ్ళను పిలిచాడు. అహరోను, సమాజంలోని పెద్దలంతా అతని దగ్గరికి వచ్చినప్పుడు మోషే వాళ్ళతో మాట్లాడాడు.
\s5
\v 32 అ తరువాత ఇశ్రాయేలు ప్రజలందరూ అతన్ని సమీపించినప్పుడు సీనాయి కొండ మీద యెహోవా తనతో చెప్పిన విషయాలన్నీ వాళ్లకు ఆజ్ఞాపించాడు.
\p
\v 33 మోషే వాళ్ళతో ఆ విషయాలు చెప్పడం ముగించిన తరువాత తన ముఖం మీద ముసుగు వేసుకున్నాడు.
\s5
\v 34 కానీ మోషే యెహోవాతో మాట్లాడడానికి ఆయన సన్నిధానం లోకి వెళ్ళినప్పుడల్లా ముసుగు తీసివేసి బయటకు వచ్చేదాకా ముసుగు లేకుండా ఉన్నాడు. అతడు బయటికి వచ్చినప్పుడల్లా యెహోవా తనకు ఆజ్ఞాపించిన విషయాలన్నీ ప్రజలకు చెప్పేవాడు.
\v 35 ఇశ్రాయేలు ప్రజలు మోషే ముఖం చూసినప్పుడు అది కాంతిమయమై ప్రకాశిస్తూ ఉంది, మోషే ఆయనతో మాట్లాడడానికి లోపలికి వెళ్ళేవరకూ తన ముఖాన్ని ముసుగుతో కప్పుకునేవాడు.
\s5
\c 35
\s విశ్రాంతి దినం గురించిన ఆజ్ఞలు
\p
\v 1 మోషే ఇశ్రాయేలు ప్రజల సమాజమంతటినీ సమకూర్చి ఇలా చెప్పాడు. <<యెహోవా ఆజ్ఞాపించినట్టు మీరు జరిగించవలసిన నియమాలు ఇవి.
\p
\v 2 మొదటి ఆరు రోజులు మీరు పని చెయ్యాలి. ఏడవ రోజు మీకు పరిశుద్ధమైనది. అది యెహోవా నియమించిన విశ్రాంతి దినం. ఆ రోజు పని చేసే ప్రతివాడూ మరణ శిక్షకు పాత్రుడు.
\p
\v 3 విశ్రాంతి దినాన మీరు మీ ఇళ్ళలో ఎలాంటి వంటకాలు వండుకోకూడదు.>>
\s సన్నిధి గుడారం నిర్మాణం
\r నిర్గమ 25:1-9
\p
\s5
\v 4 మోషే ఇశ్రాయేలు ప్రజల సమాజమంతటితో ఇంకా ఇలా చెప్పాడు. <<యెహోవా ఆజ్ఞాపించినది ఏమిటంటే,
\v 5 మీలో మీరు యెహోవా కోసం అర్పణలు, కానుకలు పోగుచేయండి. ఎలాగంటే, యెహోవా సేవ కోసం కానుకలు ఇవ్వాలనే మనసు కలిగిన ప్రతివాడూ బంగారం, వెండి, ఇత్తడి లోహాలు,
\v 6 నీలం, ఊదా, ఎర్రరంగు నూలు, సన్నని నార, మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, డాల్ఫిన్ తోళ్లు, తుమ్మకర్ర,
\v 7 దీపాలు వెలిగించడానికి నూనె,
\v 8 అభిషేక తైలం, పరిమళ ద్రవ్య ధూపం వేయడానికి సుగంధ ద్రవ్యాలు,
\v 9 ఏఫోదు కోసం, వక్షపతకం కోసం లేత పచ్చలు, చెక్కిన రత్నాలు తీసుకురావాలి.
\p
\s5
\v 10 ఇంకా, నైపుణ్యం, జ్ఞానం ఉన్నవాళ్ళు వచ్చి యెహోవా ఆజ్ఞాపించినట్టు ఈ పనులు చేయాలి.
\v 11 ఆ పనులేవంటే, ఆయన నివాసం, నివాస మందిరం ఉండే గుడారం, దాని పైకప్పు, కొలుకులు, పలకలు, అడ్డ కర్రలు, స్తంభాలు, దిమ్మలు.
\p
\v 12 మందసం పెట్టె, దాన్ని మోసే కర్రలు, కరుణా పీఠం మూత, దాన్ని మూసి ఉంచే తెర,
\p
\s5
\v 13 సన్నిధి బల్ల, దాన్ని మోసే కర్రలు, దానిలోని సామగ్రి, సన్నిధి రొట్టెలు,
\p
\v 14 వెలుగు కోసం దీప స్థంభం, దాని సామగ్రి, దానిలో ఉండాల్సిన దీపాలు, దీపాలకు నూనె.
\p
\v 15 ధూపవేదిక, దాన్ని మోసే కర్రలు, అభిషేక తైలం, పరిమళ ద్రవ్య ధూపం వేయడానికి సుగంధ ద్రవ్యాలు, మందిరం ద్వారానికి తెర.
\p
\v 16 బలులు అర్పించే దహన బలిపీఠం, దానికి ఉండే ఇత్తడి జల్లెడ, దాన్ని మోసే కర్రలు, దాని సామగ్రి, గంగాళం, దాని పీట.
\p
\s5
\v 17 ఆవరణపు తెరలు, దాని స్తంభాలు, వాటి దిమ్మలు, ప్రవేశ ద్వారానికి తెర.
\p
\v 18 నివాస మందిరం కోసం, ఆవరణ కోసం మేకులు, వాటికి తాళ్లు.
\p
\v 19 పవిత్ర స్థలం లో సేవ చేయడానికి నేసిన వస్త్రాలు, అంటే, యాజకుడుగా సేవ చెయ్యడానికి అహరోనుకు, అతని కొడుకులకూ పవిత్ర వస్త్రాలు అనేవి.>>
\s సన్నిధి గుడారం కోసం అర్పణలు
\p
\s5
\v 20 ఇశ్రాయేలు ప్రజల సమూహమంతా మోషే ఎదుట నుండి వెళ్ళిపోయారు.
\v 21 తరువాత ఎవరి హృదయం వాళ్ళను ప్రేరేపించినట్టు వాళ్ళంతా సన్నిధి గుడారం కోసం, దానిలోని సేవ అంతటికోసం, పవిత్ర వస్త్రాల కోసం అర్పణలు తెచ్చి యెహోవాకు సమర్పించారు.
\p
\v 22 తమ హృదయాల్లో ప్రేరణ పొందిన స్త్రీలు, పురుషులు యెహోవాకు బంగారం సమర్పించిన ప్రతి ఒక్కరూ పైట పిన్నులు, పోగులు, ఉంగరాలు, కంకణాలు, వివిధ రకాల బంగారం వస్తువులు తీసుకువచ్చారు.
\p
\s5
\v 23 ఇంకా, నీలం, ఊదా, ఎర్ర రంగు దారాలు, సన్నని నార, మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, డాల్ఫిన్ తోళ్లు వీటిలో ఏవేవి ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు తీసుకువచ్చారు.
\p
\v 24 వెండి, ఇత్తడి సమర్పించిన ప్రతి ఒక్కరూ యెహోవాకు కానుకలు తెచ్చారు. సేవలో ఏ పని కోసమైనా ఉపయోగపడే తుమ్మకర్ర ఎవరి దగ్గర ఉన్నదో వాళ్ళు దాన్ని తెచ్చారు.
\p
\s5
\v 25 నైపుణ్యం గల స్త్రీలు తమ చేతులతో వడికిన నీలం, ఊదా, ఎర్ర రంగు దారాలు, సన్నని నార, నూలు తీసుకు వచ్చారు.
\p
\v 26 నేర్పు గల స్త్రీలు తమ జ్ఞానహృదయంతో ప్రేరణ పొంది మేక వెంట్రుకలు వడికారు.
\p
\s5
\v 27 నాయకులు ఏఫోదు కోసం, వక్షపతకం కోసం లేత పచ్చలు, వెలగల రాళ్ళూ రత్నాలు,
\v 28 అభిషేక తైలం, పరిమళ ద్రవ్య ధూపం వేయడానికి సుగంధ ద్రవ్యాలు తీసుకువచ్చారు.
\p
\v 29 మోషేను చెయ్యమని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కోసం ఇశ్రాయేలు ప్రజల్లో తమ మనస్సులలో నిర్ణయించుకున్న పురుషులు, స్త్రీలు తమ ప్రేరణను బట్టి వాళ్ళంతా తమ ఇష్టపూర్వకంగా యెహోవాకు కానుకలు అర్పించారు.
\s బెసలేలు, అహోలీయాబు
\r నిర్గమ 31:1-11
\p
\s5
\v 30 మోషే ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పాడు,
\v 31 <<వినండి, ఊరు కొడుకు, హూరు మనుమడు బెసలేలును యెహోవా ప్రత్యేకంగా పిలుచుకున్నాడు. అతడు బంగారంతో, వెండితో, ఇత్తడితో వివిధ రకాల ఆకృతులు నైపుణ్యంగా తయారు చేయగల నేర్పరి.
\v 32 రత్నాలు సానబెట్టి పొదగడంలో, చెక్కలను కోసి నునుపు చేయడంలో నిపుణుడు.
\v 33 అతనికి ఆయన అన్ని రకాల పనులు చెయ్యడానికి తెలివితేటలు, జ్ఞానం, నైపుణ్యం ప్రసాదించాడు. అతణ్ణి దేవుడు తన ఆత్మతో నింపాడు.
\s5
\v 34 అతడు, దాను గోత్రానికి చెందిన అహీసామాకు కొడుకు అహోలీయాబు ఇతరులకు ఈ పనులు నేర్పించడానికి సామర్ధ్యం కలిగినవాళ్ళు.
\p
\v 35 వాళ్ళు ఆ విధమైన ఎలాంటి పని అయినా చేయడానికి దేవుడు వాళ్ళకు సామర్ధ్యం ఇచ్చాడు. చెక్కేవాళ్ళ పనిగానీ, చిత్రకారుల పనిగానీ నీలం ఊదా ఎర్ర రంగు సన్నని నార దారాలతో బుటాపని గానీ, నేతపని గానీ వాళ్లకు బాగా తెలుసు. వాళ్ళు అలాంటి పనులు చెయ్యగలరు, చేయించగలరు.>>
\s5
\c 36
\p
\v 1 మోషే <<పవిత్ర స్థలం లో జరిగే సేవ కోసం అన్నిరకాల పనులు చేయడానికి బెసలేలు, అహోలీయాబు మొదలైన ప్రతిభావంతులను నియమించాము. ఈ పనులు చేయడానికి యెహోవా వాళ్లకు జ్ఞానం, వివేకం ప్రసాదించాడు. వీళ్ళు యెహోవా ఆజ్ఞాపించినట్టు పనులు జరిగిస్తారు>> అన్నాడు.
\s5
\v 2 బెసలేలు, అహోలీయాబులతో పాటు యెహోవా ఎవరి హృదయాల్లో జ్ఞాన వివేకాలు ఉంచి ఆ పని చేయడానికి ప్రేరేపణ కలిగించాడో వాళ్ళందరినీ మోషే పిలిపించాడు.
\s గుడారం నిర్మాణం కోసం స్వేచ్చార్పణలు
\p
\v 3 వాళ్ళు వచ్చి పవిత్ర స్థలం లో సేవ జరగడానికి, పవిత్ర స్థలం కట్టించడానికి ఇశ్రాయేలు ప్రజలు తీసుకువచ్చిన సామగ్రి అంతటినీ మోషే దగ్గర నుండి తీసుకున్నారు. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఇంకా ప్రతిరోజూ మనస్ఫూర్తిగా మోషే దగ్గరికి కానుకలు తెస్తూనే ఉన్నారు.
\v 4 అప్పుడు పవిత్ర స్థలానికి చెందిన వేరు వేరు పనులు చేసే నిపుణులందరూ తాము చేస్తున్న పని వదిలిపెట్టి మోషే దగ్గరికి వచ్చారు.
\s5
\v 5 <<సేవ జరిగించడానికి యెహోవా చేయమని చెప్పిన పని కోసం ప్రజలు కావలసిన దానికంటే చాలా ఎక్కువగా తీసుకు వస్తున్నారు>> అని మోషేతో చెప్పారు.
\p
\v 6 మోషే <<ఇక నుండి ఏ పురుషుడు గానీ, స్త్రీ గానీ పవిత్ర స్థలం పని కోసం ఎలాంటి కానుకలూ తేవద్దు>> అని ప్రకటించాడు. శిబిరం అంతటా ఈ విషయం చాటింపు వేయించారు. ఆ పని మొత్తం జరిగించడానికి సరిపోయినంత సామగ్రి జమ అయింది. అంతకంటే ఎక్కువగానే సమకూడింది.
\v 7 ఇక ప్రజలు కానుకలు తేవడం మానుకున్నారు.
\s గుడారం నిర్మాణం
\r నిర్గమ 26:1-37
\p
\s5
\v 8 ఆ పని చేసినవాళ్ళలో నిపుణులైన వారంతా నీలం, ఊదా, ఎర్రని రంగులతో నేసిన సన్నని దారాలతో దైవ సన్నిధి గుడారం కోసం కెరూబు నమూనాతో పది తెరలు చేశారు. ఇది అత్యంత నైపుణ్యం గల బెసలేలు చేతి పని.
\v 9 ఒక్కొక్క తెర పొడవు 28 మూరలు, వెడల్పు నాలుగు మూరలు. ఆ తెరలన్నిటి కొలతలు ఒక్కటే.
\v 10 ఐదు తెరలు చొప్పున రెండు జతలుగా ఒక దానితో ఒకటి కూర్చారు.
\p
\s5
\v 11 ఒక తెరల కూర్పు చివరి తెర అంచున నీలం రంగు నూలుతో ఉంగరాలు చేశారు. రెండవ కూర్పు బయటి తెర అంచుకు కూడా అదే విధంగా చేశారు.
\v 12 మొదటి కూర్పులో ఒక తెరకు ఏభై ఉంగరాలు, రెండవ కూర్పులో ఉన్న తెర అంచుకు ఏభై ఉంగరాలు చేశారు. అవి ఒకదానికొకటి ఎదురెదురుగా ఉన్నాయి.
\p
\v 13 ఏభై బంగారు గుండీలను సిద్ధం చేసి ఆ గుండీలతో ఆ రెండు తెరలను ఒక దానితో ఒకటి కలిపినప్పుడు అది దైవ సన్నిధి మందిరంగా నిలిచింది.
\s5
\v 14 దైవ సన్నిధి మందిరం పైకప్పుగా మేక వెంట్రుకలతో పదకొండు తెరలు సిద్ధం చేశారు.
\p
\v 15 ఒక్కో తెర పొడవు ముప్ఫై మూరలు, వెడల్పు నాలుగు మూరలు.
\v 16 ఆ పదకొండు తెరల కొలతలు ఒక్కటే. ఐదు తెరలను ఒక కూర్పుగా, ఆరు తెరలను ఒక కూర్పుగా చేశారు.
\v 17 మొదటి కూర్పులో బయటి తెర అంచుకు ఏభై ఉంగరాలు, రెండవ కూర్పులో బయటి తెర అంచుకు ఏభై ఉంగరాలు ఏర్పాటు చేశారు.
\p
\s5
\v 18 వాటిని ఒక గుడారంగా కలపడానికి ఏభై యిత్తడి గుండీలు ఉపయోగించారు.
\v 19 ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో గుడారం కప్పునూ, గండుచేప తోళ్ళతో దానికి పైకప్పునూ సిద్ధం చేశారు.
\p
\s5
\v 20 దైవ నివాసమైన మందిరం కోసం తుమ్మ కర్రతో నిలువు పలకలు చేశారు.
\v 21 ఒక్కో పలక పొడవు పది మూరలు, వెడల్పు మూరన్నర.
\v 22 ప్రతి పలకకు ఒకదాని కొకటి సమానమైన నిడివిలో రెండు కుసులు చేశారు. అదే విధంగా పలకలన్నిటికి అమర్చారు.
\p
\v 23 మందిరానికి దక్షిణం దిక్కున, అంటే కుడివైపున ఇరవై పలకలు ఉండేలా చేశారు.
\s5
\v 24 ఒక్కొక్క పలక చొప్పున ఇరవై పలకల కింద రెండు కుసులకు రెండు దిమ్మలు, మొత్తం నలభై వెండి దిమ్మలు చేశారు.
\p
\v 25 మందిరం రెండవ వైపు, అంటే ఉత్తరం వైపు ఇరవై పలకలను వాటి నలభై వెండి దిమ్మలను,
\v 26 ఒక్కో పలక కింద రెండు దిమ్మలను చేశారు.
\p
\s5
\v 27 పడమటి దిక్కున మందిరం వెనక ఆరు పలకలు చేశారు.
\v 28 వెనుక వైపు మందిరం మూలలకు రెండు పలకలు చేశారు.
\s5
\v 29 ఆ పలకలు కింది భాగంలో నిలిపి మొదటి ఉంగరం దాకా ఒకదానితో ఒకటి అంచు దాకా కలిపారు. అలా రెండు మూలల్లో ఆ రెండు పలకలు చేశారు.
\p
\v 30 ఎనిమిది పలకలు ఉన్నాయి. వాటికి అమర్చిన వెండి దిమ్మలు పదహారు. ప్రతి పలక అడుగునా రెండు దిమ్మలు ఉన్నాయి.
\s5
\v 31 తుమ్మకర్రతో వాటికి అడ్డకర్రలు చేశారు. మందిరం ఒకవైపు పలకలకు ఐదు అడ్డకర్రలు,
\v 32 రెండో వైపు పలకలకు ఐదు అడ్డకర్రలు, పడమటి వైపు మందిరం వెనుక వైపు పలకలకు ఐదు అడ్డకర్రలు చేశారు.
\p
\v 33 పలకల మధ్యలో ఉన్న ముఖ్యమైన అడ్డకర్ర ఈ అంచు నుండి ఆ అంచు వరకూ కలిసి ఉండేలా చేశారు.
\v 34 ఆ పలకలకు బంగారు రేకులు పొదిగించారు. వాటి అడ్డకర్రలు ఉండే గుండ్రని కమ్మీలు బంగారంతో చేసి అడ్డకర్రలకు బంగారు రేకులు పొదిగించారు.
\p
\s5
\v 35 నీలం ఊదా ఎర్రని రంగులు గల సన్నని నారతో పేని అడ్డతెరను సిద్ధం చేశారు. కెరూబు రూపాలను నైపుణ్యం గల పనితనంతో చేశారు.
\v 36 దాని కోసం తుమ్మకర్రతో నాలుగు స్తంభాలు సిద్ధం చేసి వాటికి బంగారు రేకులు పొదిగించారు. వాటి బంగారపు కొక్కేల కోసం నాలుగు వెండి దిమ్మలు పోతపోశారు.
\p
\s5
\v 37 గుడారం ద్వారం కోసం నీలం, ఊదా, ఎర్ర రంగుల దారాలతో పేనిన సన్నని నారతో, అడ్డ తెరను నేయించారు.
\v 38 దాని ఐదు స్తంభాలూ, వాటి కొక్కేలూ తయారు చేశారు. ఆ స్థంభాలకూ, వాటి కొక్కేలకూ, వాటి పెండె బద్దలకూ బంగారం రేకులు పొదిగించారు. వాటికి ఉన్న ఐదు దిమ్మలు ఇత్తడివి.
\s5
\c 37
\s నిబంధన మందసం తయారీ
\r నిర్గమ 25:10-22
\p
\v 1 బెసలేలు తుమ్మకర్రతో మందసాన్ని తయారుచేశాడు. దాని పొడవు రెండు మూరలు, దాని వెడల్పు, ఎత్తు మూరన్నర,
\p
\v 2 దాని లోపల, బయటా స్వచ్ఛమైన బంగారం రేకు పొదిగించాడు. దాని చుట్టూ బంగారంతో అలంకరించాడు.
\p
\v 3 దానికి బంగారంతో నాలుగు గుండ్రని కొంకీలు చేసి, ఒక పక్క రెండు కమ్మీలు, ముందు భాగంలో రెండు గుండ్రని కమ్మీలు ఉండేలా దాని నాలుగు కాళ్లకు వాటిని తగిలించాడు.
\p
\s5
\v 4 అతడు తుమ్మకర్రతో మందసాన్ని మోసే కర్రలు సిద్ధం చేసి వాటికి బంగారం రేకులు పొదిగించాడు.
\p
\v 5 మందసాన్ని మోయడానికి వీలుగా దాని చుట్టూ ఉన్న గుండ్రని కమ్మీలలో ఆ మోసే కర్రలు ఉంచాడు.
\p
\v 6 అతడు స్వచ్ఛమైన బంగారంతో
\f +
\fr 37:6
\ft ఇది నిబంధన మందసం మూత.
\f* కరుణా స్థానం మూత చేశాడు. దాని పొడవు, వెడల్పు మూరన్నర.
\p
\s5
\v 7 బంగారంతో రెండు కెరూబు ఆకారాలను చేశాడు. కరుణా స్థానం రెండు అంచులను బంగారు రేకులతో అలంకరించాడు.
\p
\v 8 రెండు కొనలకు రెండు కెరూబు ఆకారాలను జత చేసి, అవి కరుణా స్థానం మూతకు ఏకాండంగా నిలిచేలా చేశాడు.
\p
\v 9 ఆ రెండు కెరూబులు పైకి రెక్కలు విప్పి, కరుణా స్థానాన్ని వాటి రెక్కలతో కప్పాయి. కెరూబుల ముఖాలు కరుణా స్థానాన్ని కప్పుతూ ఒక దానికొకటి ఎదురెదురుగా నిలిచాయి.
\s సన్నిధి రొట్టెల కోసం తుమ్మకర్రతో బల్ల
\r నిర్గమ 25:23-30
\p
\s5
\v 10 అతడు తుమ్మకర్రతో బల్ల తయారు చేశాడు. దాని పొడవు రెండు మూరలు, వెడల్పు ఒక మూర, ఎత్తు మూరన్నర.
\p
\v 11 అతడు దాని పైన స్వచ్ఛమైన బంగారంతో రేకు పొదిగించి, దాని చుట్టూ బంగారంతో అలంకరించాడు.
\p
\v 12 దాని చుట్టూ బెత్తెడు బద్దె చేసి దాని బద్దె పైన చుట్టూ బంగారు రేకు అమర్చాడు.
\p
\v 13 బల్ల కోసం బంగారంతో నాలుగు గుండ్రని కమ్మీలు పోతపోసి బల్ల నాలుగు కాళ్ళ మూలలకు వాటిని బిగించాడు.
\p
\s5
\v 14 బల్లను మోసేందుకు వీలుగా గుండ్రని కమ్మీలు దాని బద్దెకు దగ్గరగా ఉన్నాయి.
\p
\v 15 బల్లను మోసే కర్రలను తుమ్మకర్రతో చేయించి వాటికి బంగారం రేకులు పొదిగించాడు.
\p
\v 16 బల్లమీద ఉండే సామగ్రి, అంటే దాని పాత్రలు, ధూపం వేసే కలశాలు, గిన్నెలు, పానీయ అర్పణకు పాత్రలు స్వచ్ఛమైన బంగారంతో చేశాడు.
\s దీప స్తంభం.
\p
\s5
\v 17 అతడు దీప స్తంభాన్ని స్వచ్ఛమైన బంగారంతో చేశాడు. దాన్నీ, దాని అడుగు భాగాన్నీ, నిలువు భాగాన్నీ బంగారు రేకుతో అలంకరించాడు. దాని కలశాలు, మొగ్గలు, పువ్వులు ఏకాండంగా చేశాడు.
\p
\v 18 దీపవృక్షం రెండు వైపుల నుండి మూడేసి కొమ్మల చొప్పున ఆరు కొమ్మలు బయలుదేరాయి.
\p
\v 19 దీపవృక్షం నుండి బయలు దేరిన ఆరు కొమ్మలకు ఒక్కో కొమ్మకు బాదం ఆకారంలో పువ్వులు, మొగ్గలు ఉన్నాయి. ఆ విధంగా దీపవృక్షం నుండి బయలు దేరిన ఆరు కొమ్మలకు ఉన్నాయి.
\p
\s5
\v 20 దీపవృక్షంలో బాదం రూపంలో మొగ్గలు, పువ్వులు ఉన్న నాలుగు కలశాలు ఉన్నాయి.
\p
\v 21 దీపవృక్షం నుండి బయలు దేరిన ఆరు కొమ్మలలో రెండేసి కొమ్మల కింద ఒక్కో పువ్వు మొగ్గ ఏకాండంగా ఉన్నాయి.
\p
\v 22 వాటి మొగ్గలు, కొమ్మలు ఏకాండంగా ఉన్నాయి. ఏకాండంగా ఉన్న అవన్నీ స్వచ్ఛమైన బంగారంతో అలంకరించాడు.
\p
\s5
\v 23 దానికి ఏడు దీపాలు, దాని కత్తెరలు, కత్తెర చిప్పలు, దాని పట్టుకారులు మేలిమి బంగారంతో చేశాడు.
\p
\v 24 దీపవృక్షం, దాని సామగ్రి అంతటినీ
\f +
\fr 37:24
\ft ఒక తలాంతు
\f* 35 కిలోల మేలిమి బంగారంతో చేశాడు.
\s ధూపవేదిక
\r నిర్గమ 30:1-5
\p
\s5
\v 25 అతడు తుమ్మకర్రతో ధూపవేదికను చేశాడు. దాని పొడవు, వెడల్పు ఒక మూర. అది చదరంగా ఉంది. దాని ఎత్తు రెండు మూరలు, దాని కొమ్ములు మలుపులు లేకుండా ఏకాండంగా ఉన్నాయి.
\p
\v 26 దాని కప్పుకు, నాలుగు పక్కలకు, దాని కొమ్ములకు స్వచ్ఛమైన బంగారు రేకులు పొదిగించి దానికి పై అంచు చుట్టూ బంగారం అలంకరించాడు.
\p
\s5
\v 27 ఆ అలంకారం కింద వేదికకు రెండు గుండ్రని బంగారపు కమ్మీలను చేసి దాని రెండు పక్కలా రెండు మూలల్లో బంగారం అలంకారం చేశాడు.
\p
\v 28 దాన్ని మోసే కర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారం రేకులు తొడిగించాడు.
\s అభిషేక తైలం, పరిమళ ధూపద్రవ్యాలు
\r నిర్గమ 30:22-38
\p
\v 29 పవిత్ర అభిషేక తైలాన్నీ, స్వచ్ఛమైన పరిమళ ధూపద్రవ్యాన్ని నిపుణుడైన పనివాడితో చేయించాడు.
\s5
\c 38
\s హోమ బలిపీఠం
\r నిర్గమ 27:1-8
\p
\v 1 అతడు తుమ్మకర్రతో హోమ బలిపీఠం తయారుచేశాడు. దాని పొడవు, వెడల్పు ఐదు మూరలు. ఎత్తు మూడు మూరలు, దాన్ని చతురస్రంగా చేశారు.
\p
\v 2 దాని నాలుగు మూలలా ఏకాండంగా నాలుగు కొమ్ములు చేశాడు. దానికి ఇత్తడి రేకు పొదిగించాడు.
\p
\v 3 బలిపీఠం సంబంధిత సామగ్రి అంటే, బూడిద ఎత్తే గిన్నెలూ, గరిటెలు, పళ్ళేలూ, ముళ్ళూ, నిప్పులు వేసే పళ్ళాలు అన్నీ కంచుతో చేశాడు.
\p
\s5
\v 4 బలిపీఠానికి ఇత్తడి జల్లెడను దాని అంచుల కింద దాని మధ్య భాగం వరకూ లోతుగా చేశాడు.
\p
\v 5 ఆ ఇత్తడి జల్లెడ నాలుగు మూలల్లో దాని మోతకర్రలు ఉంచే నాలుగు గుండ్రని కొంకీలు పోతపోశాడు.
\p
\s5
\v 6 ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేశాడు. వాటికి రాగిరేకులు పొదిగించాడు.
\p
\v 7 ఆ బలిపీఠం మోసేందుకు దాని నాలుగు వైపులా గుండ్రని కొంకీల్లో మోసే కర్రలు చొప్పించాడు. బలిపీఠాన్ని పలకలతో గుల్లగా చేశాడు.
\p
\s5
\v 8 గంగాళాన్నీ, పీటనూ ఇత్తడితో చేశాడు. వాటిని చెయ్యడానికి సన్నిధి గుడారం ద్వారం దగ్గర సేవించడానికి వచ్చిన స్త్రీల అద్దాలను ఉపయోగించాడు.
\s ఆవరణం
\r నిర్గమ 27:9-19
\p
\s5
\v 9 అప్పుడు అతడు ప్రహరీ నిర్మించాడు. ప్రహరీ కుడి వైపున, అంటే దక్షిణం దిక్కున 100 మూరల పొడవు ఉన్న నారతో నేసిన సన్నని తెరలు ఉంచాడు.
\p
\v 10 ఆ తెరల స్తంభాలు ఇరవై, వాటి ఇత్తడి దిమ్మలు ఇరవై. ఆ స్తంభాల కొక్కేలు, పెండెబద్దలు వెండితో చేశారు.
\p
\s5
\v 11 ఉత్తర దిక్కున ఉన్న తెరల పొడవు 100 మూరలు. వాటి స్తంభాలు ఇరవై. వాటి ఇత్తడి దిమ్మలు ఇరవై. ఆ స్తంభాల కొక్కేలు, వాటి పెండెబద్దలు వెండితో చేశారు.
\p
\v 12 పడమటి దిక్కున తెరల పొడవు ఏభై మూరలు. వాటి స్తంభాలు పది, వాటి దిమ్మలు పది, ఆ స్తంభాల కొక్కేలు, వాటి పెండె బద్దలు వెండితో చేశారు.
\p
\s5
\v 13 తూర్పువైపు అంటే ఉదయం దిక్కున వాటి పొడవు ఏభై మూరలు.
\p
\v 14 ద్వారం ఒక వైపు తెరల పొడవు పదిహేను మూరలు. వాటి స్తంభాలు మూడు, వాటి దిమ్మలు మూడు.
\p
\v 15 ఆ విధంగా రెండవ వైపున అంటే రెండు వైపులా ఆవరణ ద్వారానికి పదిహేను మూరల పొడవైన తెరలు ఉన్నాయి. వాటి స్తంభాలు మూడు, వాటి దిమ్మలు మూడు.
\p
\v 16 ప్రహరీ చుట్టూ ఉన్న తెరలన్నీ సన్నని నారతో నేశారు.
\p
\s5
\v 17 స్తంభాల దిమ్మలు రాగివి, వాటి కొక్కేలు, వాటి పెండెబద్దలు వెండితో చేశారు. వాటి పైభాగాలకు వెండి రేకులు పొదిగించారు. ప్రహరీలోని స్తంభాలన్నీ వెండి రేకులతో కూర్చారు.
\p
\v 18 ప్రహరీ ద్వారంలో ఉంచిన తెర నీలం ఊదా ఎర్రని రంగు గలది. అది సన్నని నారతో నేసి అల్లిక పని చేసి ఉంది. దాని పొడవు ఇరవై మూరలు. దాని వెడల్పు ప్రహరీ తెరలతో సరిగా ఐదు మూరలు.
\p
\v 19 వాటి స్తంభాలు నాలుగు, వాటి ఇత్తడి దిమ్మలు నాలుగు. వాటి కొక్కేలు వెండితో చేశారు.
\p
\v 20 వాటి పైభాగాలకు వెండి రేకు పొదిగించారు. వాటి పెండె బద్దలు వెండివి, మందిరానికి, మందిరం చుట్టూ ఉన్న ప్రహరీకీ కొట్టిన మేకులన్నీ ఇత్తడివి.
\s గుడారం కోసం సామగ్రి
\r నిర్గమ 38:24
\p
\s5
\v 21 మందిరం సామాను మొత్తం, అంటే శాసనాల గుడార మందిరం సామగ్రి మొత్తం ఇదే. యాజకుడైన అహరోను కొడుకు ఈతామారు లేవీ గోత్రికుల చేత మోషే ఆజ్ఞ ప్రకారం ఆ వస్తువులు లెక్క పెట్టించాడు.
\p
\v 22 యూదా గోత్రికుడు హూరు మనుమడు, ఊరీ కొడుకు బెసలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతా పూర్తి చేశాడు.
\p
\v 23 దాను గోత్రికుడు అహీసామాకు కొడుకు అహోలీయాబు అతనికి సహాయకుడుగా ఉన్నాడు. ఇతడు చెక్కడంలో నేర్పు గలవాడు. నిపుణత గల పనివాడు, నీలం ఊదా ఎర్ర రంగుల సన్నని నారతో అల్లిక పని చేయడంలో నేర్పరి.
\p
\s5
\v 24 పవిత్ర స్థలాన్ని పూర్తి స్థాయిలో నిర్మించే పని అంతటిలో ఉపయోగించిన బంగారం పవిత్ర స్థలం తులం కొలత ప్రకారం సుమారు
\f +
\fr 38:24
\ft ఒక షెకెల్ సుమారు 20 గ్రాములు. ఒక తలాంతు 35 కిలోలు.
\f* 29 తలాంతులు, 730 షెకెల్.
\p
\v 25 జాబితాలో చేరినవారి సమాజపు ప్రజలు ఇచ్చిన వెండి పవిత్ర స్థలం తులం కొలత ప్రకారం 100 తలాంతులు, 1,775 షెకెల్.
\p
\v 26 ఇరవై సంవత్సరాలు పైబడి లెక్కలో చేరినవారు 6,03,550 మంది. వీరి అర్పణ ఒక్కొక్కటి అర తులం.
\p
\s5
\v 27 అడ్డతెరల కోసం, ఆరాధన గుడారం కోసం దిమ్మలు పోత పోయడంలో ఒక్కో దిమ్మకు నాలుగు మణుగుల వెండి ఉపయోగించారు. అంటే ఒక దిమ్మకు నాలుగు మణుగుల చొప్పున నూరు దిమ్మలు పోతపోశారు.
\p
\v 28 1,575 తులాల వెండితో అతడు స్తంభాలకు కొక్కేలు చేసి, వాటిని స్తంభాల పైభాగాలకు తొడిగించి వాటిని పెండెబద్దలతో కట్టాడు.
\p
\v 29 అర్పించిన ఇత్తడి మొత్తం 280 మణుగుల 2,400 తులాలు.
\p
\s5
\v 30 అతడు ఆ ఇత్తడితో సన్నిధి గుడారం ద్వారం కోసం దిమ్మలు, బలిపీఠం, జల్లెడ, బలిపీఠం సామగ్రి చేశాడు.
\p
\v 31 ఇంకా ప్రహరీ చుట్టూ ఉన్న దిమ్మలు, ప్రహరీ ద్వారం దిమ్మలు, దైవ నివాసం మేకులు, ప్రహరీ చుట్టూ వాడిన మేకులన్నిటినీ ఆ ఇత్తడితో చేశాడు.
\s5
\c 39
\p
\v 1 యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం పవిత్ర స్థలం లో నిలిచి చేసే సేవ కోసం నీలం ఊదా ఎర్రని రంగుల సేవా వస్త్రాలు అంటే ప్రతిష్ఠిత వస్త్రాలు కుట్టారు.
\p
\s5
\v 2 అతడు బంగారంతో, నీలం ఊదా ఎర్ర రంగుల దారాలతో పేనిన సన్నని నారతో ఏఫోదు చేశాడు.
\p
\v 3 ఏఫోదు కోసం నీలం ఊదా ఎర్ర రంగుల దారాలతో, సన్నని నారతో నేర్పుగల పనివారు నేయడానికి బంగారాన్ని రేకులుగా కొట్టి దాన్ని తీగెలుగా కత్తిరించారు.
\p
\s5
\v 4 ఏఫోదుకు రెండు భుజ ఖండాలు చేసి రెండు అంచులలో నిలబెట్టారు.
\p
\v 5 దానికి బంగారంతో నీలం ఊదా ఎర్ర రంగుల సన్నని నారతో పేనిన అందమైన అల్లిక ఏకాండంగా రెండు వైపులా కుట్టారు. అలా చేయమని యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు.
\p
\s5
\v 6 బంగారు అంచులలో పొదిగిన లేత పచ్చలు సిద్ధం చేశారు. ఇశ్రాయేలు కొడుకుల పేర్లు శాశ్వతంగా ఉండేలా ముద్రల రూపంలో చెక్కారు.
\p
\v 7 అవి ఇశ్రాయేలు ప్రజల జ్ఞాపకార్ధంగా ఉండేలా ఆ ముద్రలను ఏఫోదు భుజాల మీద ఉంచారు. అలా చేయమని యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు.
\p
\s5
\v 8 అతడు బంగారంతోనూ నీలం ఊదా ఎర్ర దారాలతోను పేనిన సన్న నారతో ఏఫోదును చేసినట్టు నైపుణ్యంగా ఒక వక్షపతకం తయారుచేశాడు.
\p
\v 9 దాని పొడవు ఒక జాన, వెడల్పు ఒక జాన. ఆ పతకాన్ని మడత పెట్టినప్పుడు అది చదరంగా ఉంది.
\p
\s5
\v 10 వారు దానిలో నాలుగు వరుసలుగా రత్నాలు పొదిగారు. మొదటి వరుసలో మాణిక్యం, గోమేధికం, మరకతం ఉన్న రత్నాలు,
\v 11 రెండవ వరుసలో పద్మరాగం, నీలం, సూర్యకాంత మణులు ఉన్న రత్నాలు,
\v 12 మూడవ వరుసలో గారుత్మతకం, యష్మురాయి, ఇంద్రనీలాల రత్నాలు,
\v 13 నాలుగవ వరుసలో ఎర్ర రంగు రాయి, సులిమాని రాయి, సూర్యకాంతాలు ఉన్న రత్నాలు క్రమ పద్ధతిలో పొదిగించారు.
\s5
\v 14 ఇశ్రాయేలు కొడుకులు పన్నెండు మంది పేర్ల ప్రకారం ఆ రత్నాలు పన్నెండు. ఆ రత్నాలపై ముద్రపై చెక్కిన విధంగా పన్నెండు గోత్రాల పేర్లు ఒక్కొక్కదాని మీద ఒక్కొక్క పేరు చెక్కారు.
\p
\v 15 వక్షపతకం కోసం దారాలు అల్లినట్టు స్వచ్ఛమైన బంగారంతో గొలుసులు అల్లారు.
\v 16 వారు రెండు బంగారు అంచులు, రెండు బంగారు గుండ్రని కొంకీలు చేసి వక్షపతకం రెండు అంచులకు బిగించారు.
\s5
\v 17 అల్లిన ఆ రెండు బంగారు గొలుసులను వక్షపతకం అంచులలో ఉన్న రెండు గుండ్రని కొంకీలలో వేశారు.
\v 18 అల్లిన ఆ రెండు గొలుసుల అంచులు ఆ రెండు అంచులకు తగిలించి ఏఫోదు భుజఖండాలపై దాని ఎదురుగా ఉంచారు.
\p
\s5
\v 19 బంగారంతో రెండు గుండ్రని కొంకీలు చేసి ఏఫోదు ఎదురుగా ఉన్న వక్షపతకం లోపలి అంచు రెండు కొనలకు తగిలించారు.
\v 20 బంగారంతో మరో రెండు గుండ్రని కొంకీలు ఏఫోదు అల్లిక పైగా దాని రెండవ కూర్పు దగ్గర దాని ఎదురుగా, ఏఫోదు రెండు భుజఖండాలకు కింది భాగంలో వేశారు.
\p
\s5
\v 21 వక్షపతకం ఏఫోదు అల్లిక కట్టు మీద ఉండేలా, ఏఫోదు నుండి విడిపోకుండా ఉండేలా ఆ పతకాన్ని దాని గుండ్రని కొంకీలకూ ఏఫోదు కొంకీలకూ నీలం రంగు దారంతో కట్టారు. అలా చేయమని యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు.
\p
\s5
\v 22 అతడు ఏఫోదు అంగీ కేవలం నీలం రంగు దారంతో అల్లిక పనిగా చేశాడు. ఆ అంగీ మధ్య ఉన్న రంధ్రాన్ని మూసి ఉంచే కవచం ఏర్పాటు చేశారు.
\v 23 ఆ రంధ్రం చిరిగి పోకుండా ఉండేందుకు రంధ్రం చుట్టూ కవచం ఉంచారు.
\v 24 అంగీ అంచుల మీద నీలం ఊదా ఎర్రని రంగుల గల నూలుతో పేని దానిమ్మ పండ్ల ఆకారాలు చేశారు.
\p
\s5
\v 25 స్వచ్ఛమైన బంగారంతో గంటలు చేసి ఆ దానిమ్మపండ్ల ఆకారాల మధ్యలో, అంటే అంగీ అంచుల మీద చుట్టూ ఉన్న దానిమ్మ పండ్లవంటి వాటి మధ్యలో ఆ గంటలను పెట్టారు.
\p
\v 26 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు సేవ జరిగించడానికి ఒక్కొక్క గంటను ఒక్కొక్క దానిమ్మ పండు వంటి ఆకారాన్ని అంగీ అంచుల మీద చుట్టూ తగిలించారు.
\p
\s5
\v 27 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు అహరోనుకు, అతని కొడుకులకు సన్నని నారతో అల్లిక పని చేసి అంగీలు నేశారు. సన్నని నారతో తలపాగాలను చేసారు.
\v 28 సన్నని నారతో టోపీలు, చొక్కాలు నేశారు.
\v 29 నీలం, ఊదా, ఎర్ర రంగులతో పేనిన సన్నని నారతో నడికట్టును అల్లిక పనిగా చేశారు.
\p
\s5
\v 30 స్వచ్ఛమైన బంగారంతో కిరీటం వంటి ఆకారంలో ఒక రేకు తయారు చేసి యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధంగా దాని మీద <<యెహోవాకు పవిత్రం>> అని చెక్కించారు.
\s మందిరం నిర్మాణం సంపూర్తి
\r నిర్గమ 35:10-19
\p
\v 31 ఆ ముద్రను తలపాగాకు అంటుకుని ఉండేలా నీలం రంగు దారంతో కట్టారు. ఇదంతా యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు చేశారు.
\s5
\v 32 ఈ విధంగా సన్నిధి గుడారం అనే దైవ నివాసం పని పూర్తిగా ముగించారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధంగా ఆ ప్రజలు చేశారు.
\p
\v 33 దైవ నివాసాన్ని, దానిలో సామగ్రి మొత్తాన్నీ అంటే, దాని కొక్కేలు, పలకలు, అడ్డకర్రలు, స్తంభాలు, దిమ్మలు,
\v 34 ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ల పైకప్పు, గండుచేప తోళ్ల పైకప్పు, పైకప్పు తెర,
\v 35 శాసనాల పెట్టె, దాన్ని మోసే కర్రలు, కరుణాపీఠం,
\s5
\v 36 సన్నిధి బల్ల, దాని సామగ్రి, సన్నిధి రొట్టెలు,
\v 37 పవిత్ర దీపవృక్షం, దాని దీపాలు, దీపాల వరుస, వాటి సామాను, దీపాలు వెలిగించేందుకు నూనె,
\v 38 బంగారం వేదిక, అభిషేక తైలం, పరిమళ ధూప ద్రవ్యం, వేదిక ద్వారానికి తెర,
\v 39 ఇత్తడి బలిపీఠం, దాని ఇత్తడి జల్లెడ, దాన్ని మోసే కర్రలు, దాని సామగ్రి మొత్తం, గంగాళం, దాని పీట,
\s5
\v 40 ప్రహరీ తెరలు, దాని స్తంభాలు, దాని దిమ్మలు, ప్రహరీ ద్వారానికి తెర, దాని తాళ్ళు, మేకులు, సన్నిధి గుడారం మందిర సేవ కోసం కావలసిన సామగ్రి అంతా,
\v 41 పవిత్ర స్థలం లో సేవ చేసే యాజకుడైన అహరోనుకూ, అతని కొడుకులకూ యాజక పరిచర్య పవిత్ర వస్త్రాలు సిద్ధం చేసి వాటన్నిటినీ మోషే దగ్గరికి తీసుకు వచ్చారు.
\p
\s5
\v 42 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలు ప్రజలు పనులన్నీ పూర్తిచేశారు.
\v 43 వాళ్ళు చేసిన పని అంతా మోషే పరిశీలించాడు. యెహోవా ఆజ్ఞాపించినట్టే వాళ్ళు ఆ పనులు పూర్తి చేశారు కనుక మోషే వాళ్ళను దీవించాడు.
\s5
\c 40
\s సన్నిధి గుడారం గురించిన అంతిమ ఆదేశాలు
\p
\v 1 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు.
\v 2 <<మొదటి నెల మొదటి రోజున నువ్వు సన్నిధి గుడారం ఉన్న మందిరాన్ని నిలబెట్టాలి.
\s5
\v 3 అక్కడ శాసనాల పెట్టెను నిలబెట్టి దాన్ని అడ్డ తెరతో మూసి ఉంచాలి.
\v 4 బల్లను లోపలికి తెచ్చి దాని మీద ఉంచవలసిన వాటిని క్రమంగా ఉంచాలి. దీప స్తంభాన్ని లోపలికి తెచ్చి దాని దీపాలు వెలిగించాలి.
\s5
\v 5 శాసనాల పెట్టె ఎదురుగా బంగారు ధూపవేదికను ఉంచి, మందిర ద్వారానికి తెర తగిలించాలి.
\p
\v 6 సన్నిధి గుడారం ఉన్న మందిరం ద్వారం ఎదురుగా హోమ బలిపీఠం ఉంచాలి.
\v 7 సన్నిధి గుడారం, హోమ బలిపీఠం మధ్యలో ఒక గంగాళం పెట్టి, దాన్ని నీళ్ళతో నింపాలి.
\p
\s5
\v 8 తెరల చుట్టూ ప్రహరీ నిలబెట్టి, ప్రహరీ ద్వారానికి తెర తగిలించాలి.
\p
\v 9 అభిషేక తైలం తీసుకుని దైవ నివాసాన్నీ, అందులోని వాటన్నిటినీ అభిషేకించాలి. దానినీ, దానిలోని సామగ్రి అంతటినీ ప్రతిష్టించాలి. అప్పుడు అది పవిత్రం అవుతుంది.
\v 10 హోమ బలిపీఠాన్ని అభిషేకించి, దాన్ని ప్రతిష్ఠించాలి. అప్పుడు ఆ పీఠం పవిత్రం అవుతుంది.
\v 11 గంగాళాన్ని, దాని పీటను అభిషేకించి, వాటిని ప్రతిష్ఠించాలి.
\p
\s5
\v 12 తరువాత అహరోనును, అతని కొడుకులను సన్నిధి గుడారం ద్వారం దగ్గరికి వెంటబెట్టుకుని తీసుకువచ్చి నీళ్లతో స్నానం చేయించాలి.
\v 13 అతనికి పవిత్ర వస్త్రాలు తొడిగి అతడు నాకు యాజకుడుగా సేవ జరిగించడానికి అతన్ని అభిషేకించి ప్రతిష్ఠించాలి.
\p
\s5
\v 14 తరువాత అతని కొడుకులను తీసుకువచ్చి వాళ్లకు చొక్కాలు తొడిగించాలి.
\v 15 వాళ్ళు కూడా నాకు యాజకులుగా ఉండేలా వాళ్ళ తండ్రిని అభిషేకించినట్టు వాళ్ళను అభిషేకించి ప్రతిష్టించు. వారి అభిషేకం తరతరాలకు నిత్యమూ నిలిచే యాజకత్వ చిహ్నంగా ఉంటుంది.>>
\p
\v 16 మోషే ఆ విధంగా చేశాడు. యెహోవా అతనికి ఆజ్ఞాపించినదంతా జరిగించాడు.
\s5
\v 17 రెండవ సంవత్సరం మొదటి నెల మొదటి రోజున దైవ నివాస మందిరం నిలబెట్టాడు.
\v 18 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు దైవ నివాస మందిరం నిలబెట్టి దాని దిమ్మలు వేసి, దాని పలకలను నిలబెట్టి దాని అడ్డకర్రలు అమర్చి, స్తంభాలను నిలిపాడు.
\v 19 యెహోవా మందిరం పైన గుడారం పరిచాడు. గుడారానికి పైకప్పు వేశాడు.
\p
\v 20 యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్టు శాసనాలను మందసంలో ఉంచాడు. మందసాన్ని మోసే కర్రలను పెట్టెకు దూర్చి దానిపైన కరుణా స్థానం మూత ఉంచాడు.
\s5
\v 21 మందసాన్ని యెహోవా మందిరంలోకి తెచ్చి అడ్డతెర వేలాడదీసి శాసనాల పెట్టెను కప్పాడు.
\p
\v 22 సన్నిధి గుడారంలో, దైవ సన్నిధి మందిరం ఉత్తర దిక్కున, అడ్డతెరకు బయట బల్లను ఉంచాడు.
\v 23 యెహోవా సన్నిధి ఎదుట బల్ల మీద రొట్టెలను క్రమంగా పేర్చాడు.
\s5
\v 24 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు అతడు సన్నిధి గుడారంలో మందిరానికి దక్షిణం వైపున బల్ల ఎదుట దీపస్తంభం ఉంచాడు.
\v 25 యెహోవా సన్నిధానంలో దీపాలు వెలిగించాడు.
\p
\s5
\v 26 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు అతడు సన్నిధి గుడారంలో అడ్డతెర ఎదుట బంగారు ధూపవేదిక ఉంచాడు.
\v 27 ధూపవేదిక మీద పరిమళ ద్రవ్యాలను కాల్చి ధూపం వేశాడు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతా చేశాడు.
\p
\s5
\v 28 మందిర ద్వారానికి తెర ఏర్పాటు చేశాడు. అతడు దైవ సన్నిధి గుడారం ద్వారం దగ్గర హోమపీఠం ఉంచాడు.
\v 29 యెహోవా హోమ బలిపీఠం మీద హోమబలి అర్పించి నైవేద్యం సమర్పించాడు.
\p
\v 30 యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్టు దైవసన్నిధి గుడారానికి, హోమ పీఠానికి మధ్య గంగాళం ఉంచి శుభ్రపరచుకోవడానికి దానిలో నీళ్లు పోయించాడు.
\s5
\v 31 అక్కడ మోషే, అహరోను, అతని కొడుకులు తమ కాళ్ళు, చేతులు కడుక్కున్నారు.
\v 32 వాళ్ళు యెహోవా గుడారం లోపలికి ప్రవేశించినప్పుడు, హోమపీఠం చెంతకు వచ్చినప్పుడు తమ కాళ్ళు, చేతులు కడుక్కున్నారు.
\p
\v 33 మోషే మందిరానికి, హోమపీఠానికి చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేశాడు. ఆవరణ ద్వారం తెర వేశాడు. ఈ విధంగా మోషే పని మొత్తం ముగించాడు.
\s యెహోవా సన్నిధి మహిమ మేఘం
\r సంఖ్యా 9:15-23
\p
\s5
\v 34 అప్పుడు మేఘం యెహోవా సన్నిధి గుడారాన్ని కమ్ముకుంది. దైవ నివాసం యెహోవా మహిమా ప్రకాశంతో నిండింది.
\v 35 ఆ మేఘం యెహోవా సన్నిధి గుడారంపై నిలిచి ఉండడం వల్ల మందిరం యెహోవా తేజస్సుతో నిండిపోయింది. అందువల్ల మోషే యెహోవా సన్నిధి గుడారం లోపలి వెళ్ళలేక పోయాడు.
\p
\s5
\v 36 మేఘం మందిరం మీద నుండి పైకి వెళ్ళే సమయంలో ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేసేవాళ్ళు.
\v 37 ఆ మేఘం పైకి వెళ్ళకపోతే అది వెళ్ళే రోజు దాకా ప్రయాణం ఆపివేసే వాళ్ళు. ఇది వాళ్ళు ప్రయాణం చేసే పద్ధతి.
\p
\v 38 ఇశ్రాయేలు ప్రజలందరి సమక్షంలో పగటివేళ యెహోవా మేఘం దైవనివాసం మీద ఉండేది. రాత్రి సమయాల్లో మేఘంలో అగ్ని స్థంభం ఉండేది. ప్రజల ప్రయాణాలన్నిటిలో ఈ విధంగా జరిగింది.