\id DEU \ide UTF-8 \sts Deuteronomy \h ద్వితీయోపదేశ కాండము \toc1 ద్వితీయోపదేశ కాండము \toc2 ద్వితీయోపదేశ కాండము \toc3 deu \mt1 ద్వితీయోపదేశ కాండము \s5 \c 1 \p \v 1 యొర్దాను ఇవతల ఉన్న ఎడారిలో, అంటే పారాను, తోపెలు, లాబాను, హజేరోతు, దీజాహాబు అనే ప్రదేశాల మధ్య సూపుకు ఎదురుగా ఉన్న ఆరాబా ఎడారిలో మోషే, ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పాడు. \v 2 హోరేబు నుండి శేయీరు ఎడారి దారిలో కాదేషు బర్నేయ వరకూ ప్రయాణ సమయం 11 రోజులు. \s5 \v 3-4 హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజు సీహోనునూ అష్తారోతులో నివసించిన బాషాను రాజు ఓగునూ ఎద్రెయీలో చంపిన తరువాత 40 వ సంవత్సరంలో 11 వ నెల మొదటి రోజున మోషే యెహోవాా తనకు ఆజ్ఞాపించినదంతా ఇశ్రాయేలు ప్రజలకు బోధించాడు. \p \s5 \v 5 యొర్దాను ఇవతల ఉన్న మోయాబు దేశంలో మోషే ఈ ధర్మశాస్త్రాన్ని ప్రకటించడం మొదలుపెట్టి ఇలా అన్నాడు, \v 6 <<మన దేవుడు యెహోవాా హోరేబులో మనకిలా చెప్పాడు, ఈ కొండ దగ్గర మీరు నివసించింది చాలు. \s5 \v 7 మీరు బయలుదేరి అమోరీయుల కొండ ప్రాంతానికీ అరాబా లోయలో దక్షిణ దిక్కున సముద్రతీరంలో ఉన్న స్థలాలన్నిటికీ కనాను దేశానికీ లెబానోనుకూ యూఫ్రటీసు మహానది వరకూ వెళ్ళండి. \v 8 ఇదిగో, ఆ దేశాన్ని మీకు అప్పగించాను. మీరు వెళ్లి, యెహోవాా మీ పూర్వీకులు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకూ, వారి సంతానానికీ ఇస్తానని నేను వాగ్దానం చేసిన దేశాన్ని స్వాధీనం చేసుకోండి.>> \p \s5 \v 9 ఆ సమయంలో, నేను మీతో <<నేను ఒక్కడినే మిమ్మల్ని మోయలేను. \v 10 యెహోవాా దేవుడు మిమ్మల్ని విస్తరింపజేశాడు కనుక ఈ రోజు మీరు ఆకాశంలో నక్షత్రాల్లాగా విస్తరించారు. \v 11 మీ పూర్వీకుల దేవుడు యెహోవాా మీ జనసంఖ్యను వెయ్యి రెట్లు ఎక్కువ చేసి, తాను మీతో చెప్పినట్టు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు గాక. \s5 \v 12 నేనొక్కడినే మీ కష్టాన్ని, భారాన్ని, మీ వివాదాల్ని ఎలా తీర్చగలను? \v 13 జ్ఞానం, తెలివి కలిగి మీ గోత్రాల్లో పేరు పొందిన మనుషుల్ని ఎన్నుకోండి. వారిని మీకు నాయకులుగా నియమిస్తాను>> అని చెప్పాను. \p \v 14 అప్పుడు మీరు<<నీ మాట ప్రకారం చేయడం మంచిది>> అని నాకు జవాబిచ్చారు. \s5 \v 15 కాబట్టి నేను మీ గోత్రాల్లో పేరు పొంది, తెలివీ జ్ఞానమూ కలిగిన వారిని పిలిచి, మీ గోత్రాలకు వెయ్యి మందికి ఒకడు, వంద మందికి ఒకడు, యాభై మందికి ఒకడు, పది మందికి ఒకడు చొప్పున వారిని మీ మీద న్యాయాధికారులుగా నియమించాను. \p \v 16 అప్పుడు నేను వారితో, <<మీ సోదరుల వివాదాలు తీర్చి, ప్రతివాడికీ వాడి సోదరుడికీ వాడి దగ్గర ఉన్న పరదేశికీ న్యాయం ప్రకారం తీర్పు తీర్చండి. \s5 \v 17 అలా చేసేటప్పుడు తక్కువ, ఎక్కువ అనే పక్షపాతం లేకుండా వినాలి. న్యాయపు తీర్పు దేవునిది కాబట్టి మీరు మనుషుల ముఖం చూసి భయపడవద్దు. మీకు కష్టమైన వివాదాన్ని నా దగ్గరకు తీసుకు రండి. దాన్ని నేను విచారిస్తాను>> అని ఆజ్ఞాపించాను. \v 18 అలాగే మీరు చేయాల్సిన పనులన్నిటిని గూర్చి మీకు ఆజ్ఞాపించాను. \p \s5 \v 19 మనం హోరేబు నుండి ప్రయాణించి యెహోవాా దేవుడు మనకి ఆజ్ఞాపించినట్టు మీరు చూసిన ఘోరమైన ఎడారి ప్రాంతం నుండి వచ్చి, అమోరీయుల కొండ ప్రాంతం మార్గంలో కాదేషు బర్నేయ చేరాం. \s5 \v 20 అప్పుడు నేను <<మన దేవుడైన యెహోవాా మనకిస్తున్న అమోరీయుల కొండ ప్రాంతానికి వచ్చాం. \p \v 21 ఇదిగో, మీ దేవుడు యెహోవాా ఈ దేశాన్ని మీకు అప్పగించాడు. మీ పూర్వీకుల దేవుడైన యెహోవాా మీతో చెప్పినట్టు దాన్ని స్వాధీనం చేసుకోండి. భయపడవద్దు, నిరుత్సాహం వద్దు>> అని మీతో చెప్పాను. \s5 \v 22 అప్పుడు మీరంతా నా దగ్గరకు వచ్చి <<ముందుగా మన మనుషుల్ని పంపుదాం, వాళ్ళు మన కోసం ఈ దేశాన్ని పరిశీలించి తిరిగి వచ్చి దానిలో మనం వెళ్ళాల్సిన మార్గం గురించీ మనం చేరాల్సిన పట్టణాలను గురించీ మనకు సమాచారం తెస్తారు>> అన్నారు. \v 23 ఆ మాట అంగీకరించి ఒక్కొక్క గోత్రానికి ఒక్కరు చొప్పున పన్నెండు మందిని పంపాను. \p \v 24 వాళ్ళు ఆ కొండ ప్రదేశానికి వెళ్ళి ఎష్కోలు లోయకు వచ్చి దాన్ని పరిశీలించారు. ఆ దేశంలో దొరికే పండ్లు కొన్నిటిని మన దగ్గరికి తెచ్చి, \s5 \v 25 <<మన దేవుడు యెహోవాా మనకిస్తున్న దేశం మంచిది>> అని మనకు చెప్పారు. \s5 \v 26 అయితే మీరు వెళ్లడానికి ఇష్టపడలేదు. మీ దేవుడైన యెహోవాా మాటకు తిరగబడ్డారు. \p \v 27 మీ గుడారాల్లో సణుక్కుంటూ, <<యెహోవాా మన మీద పగబట్టి మనల్ని చంపడానికి, అమోరీయులకు అప్పగించడానికి ఐగుప్తు దేశం నుండి మనల్ని రప్పించాడు. \v 28 మనమెక్కడికి వెళ్లగలం? అక్కడి ప్రజలు మన కంటే బలిష్ఠులు, ఎత్తైనవారు. ఆ పట్టణాలు గొప్పవి, ఆకాశాన్నంటే ప్రాకారాలతో ఉన్నాయి. అక్కడ అనాకీయుల్ని చూశాం>> అని మన సోదరులు చెప్పి మా హృదయాలు కరిగిపోయేలా చేశారు అని అన్నారు. \p \s5 \v 29 అప్పుడు నేను మీతో, <<దిగులు పడొద్దు, భయపడొద్దు. \v 30 మీకు ముందు నడుస్తున్న మీ యెహోవాా దేవుడు మీరు చూస్తుండగా \v 31 ఐగుప్తులో, అరణ్యంలో చేసినట్టు మీ పక్షంగా యుద్ధం చేస్తాడు. మీరు ఇక్కడికి వచ్చేవరకూ దారిలో మీ యెహోవాా దేవుడు ఒక తండ్రి తన కొడుకుని ఎత్తుకున్నట్టు మిమ్మల్ని ఎత్తుకుని వచ్చాడని మీకు తెలుసు>> అన్నాను. \p \s5 \v 32 అయితే మీకు దారి చూపించి మీ గుడారాలకు స్థలం సిద్ధపరిచేలా \v 33 రాత్రి అగ్నిలో, పగలు మేఘంలో మీ ముందు నడిచిన మీ యెహోవాా దేవుని మీద మీరు విశ్వాసముంచలేదు. \s5 \v 34 కాబట్టి యెహోవాా మీ మాటలు విని, \v 35 బాగా కోపం తెచ్చుకొని, <<నేను మీ పూర్వీకులకు ఇస్తానని వాగ్దానం చేసిన ఈ మంచి దేశాన్ని ఈ చెడ్డతరంలో \v 36 యెఫున్నె కొడుకు కాలేబు తప్ప మరెవరూ చూడడు. అతడు పూర్ణమనస్సుతో యెహోవాాను అనుసరించాడు కాబట్టి కేవలం అతడు మాత్రమే దాన్ని చూస్తాడు. అతడు అడుగుపెట్టిన భూమిని నేను అతనికీ అతని సంతానానికీ ఇస్తాను>> అని ప్రమాణం చేశాడు. \p \s5 \v 37 అంతేగాక యెహోవాా మిమ్మల్ని బట్టి నా మీద కోపపడి, <<నీ సేవకుడు, నూను కొడుకు యెహోషువ దానిలో అడుగు పెడతాడు గాని నువ్వు అడుగు పెట్టవు. \v 38 అతడే దాన్ని ఇశ్రాయేలీయులకు స్వాధీనం చేస్తాడు. కాబట్టి అతణ్ణి ప్రోత్సహించు. \s5 \v 39 అయితే మంచీ చెడూ తెలియని మీ కొడుకులు, అంటే అన్యాయానికి గురౌతారు అని మీరు చెప్పే మీ పిల్లలు దానిలో అడుగు పెడతారు. దాన్ని వారికిస్తాను. వారు దాన్ని స్వాధీనం చేసుకుంటారు. \p \v 40 మీరు మాత్రం వెనక్కి ఎర్రసముద్రం వైపుకు తిరిగి ఎడారిలోకి ప్రయాణించండి>> అని చెప్పాడు. \s5 \v 41 అందుకు మీరు, <<మేము యెహోవాాకు విరోధంగా పాపం చేశాం. మా యెహోవాా దేవుడు మాకాజ్ఞాపించిన ప్రకారం మేము వెళ్ళి యుద్ధం చేస్తాం>> అని నాతో చెప్పి, మీ ఆయుధాలతో ఆ కొండ ప్రాంతానికి బయలుదేరారు. \v 42 అప్పుడు యెహోవాా నాతో ఇలా అన్నాడు, <<యుద్ధానికి వెళ్లొద్దు. నేను మీతో ఉండను కాబట్టి మీరు వెళ్లినా మీ శత్రువుల చేతిలో ఓడిపోతారని వారితో చెప్పు.>> \p \s5 \v 43 ఆ మాటలు నేను మీతో చెప్పినా మీరు వినకుండా యెహోవాా మాటకు ఎదురు తిరిగి మూర్ఖంగా ఆ కొండ ప్రాంతానికి వెళ్ళారు. \v 44 అప్పుడు అక్కడ ఉన్న అమోరీయులు మీకెదురు వచ్చి, కందిరీగల్లాగా మిమ్మల్ని హోర్మా వరకూ తరిమి శేయీరులో మిమ్మల్ని హతం చేశారు. \s5 \v 45 తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవాా సన్నిధిలో ఏడ్చారు. అయినా యెహోవాా మిమ్మల్ని లెక్కచేయలేదు, మీ మాట వినలేదు. \v 46 కాబట్టి మీరు కాదేషులో చాలా రోజులు ఉండిపోయారు. అక్కడ ఎన్ని రోజులు నివసించారో మీకు తెలుసు. \s5 \c 2 \p \v 1 అప్పుడు యెహోవాా నాతో చెప్పిన విధంగా మనం తిరిగి ఎర్రసముద్రం దారిలో ఎడారి గుండా చాలా రోజులు శేయీరు కొండ చుట్టూ తిరిగాం. \v 2 యెహోవాా నాకు ఇలా చెప్పాడు, <<మీరు ఈ కొండ చుట్టూ తిరిగింది చాలు, \v 3 ఉత్తరం వైపుకు వెళ్ళండి. నువ్వు ప్రజలతో ఇలా చెప్పు. \s5 \v 4 <శేయీరులో నివసించే ఏశావు సంతానమైన మీ సోదరుల సరిహద్దులు దాటి వెళ్లబోతున్నారు, వారు మీకు భయపడతారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. \v 5 వారితో కలహం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఏశావుకు శేయీరును స్వాస్థ్యంగా ఇచ్చింది నేనే. వారి భూమిలోనిది ఒక్క అడుగైనా మీకియ్యను. \s5 \v 6 మీరు డబ్బులిచ్చి వారి దగ్గర ఆహారం కొని తినవచ్చు. డబ్బులిచ్చి నీళ్లు కొని తాగవచ్చు.> \v 7 ఎందుకంటే మీ చేతి పని అంతటినీ మీ యెహోవాా దేవుడు ఆశీర్వదించాడు. ఈ గొప్ప ఎడారిలో నువ్వు ఈ నలభై సంవత్సరాలు తిరిగిన సంగతి ఆయనకు తెలుసు. ఆయన మీకు తోడుగా ఉన్నాడు, మీకేమీ తక్కువ కాదు.>> \p \s5 \v 8 అప్పుడు శేయీరులో నివసించే ఏశావు సంతానమైన మన సోదరుల్ని విడిచి, ఏలతు, ఎసోన్గెబెరు, అరాబా దారిలో మనం ప్రయాణించాం. \s5 \v 9 మనం తిరిగి మోయాబు ఎడారి మార్గంలో వెళుతుండగా యెహోవాా నాతో ఇలా అన్నాడు. <<మోయాబీయుల్ని బాధ పెట్టవద్దు. వారితో యుద్ధం చేయొద్దు. లోతు సంతానానికి ఆర్ దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాను. వారి భూమిలో దేనినీ నీ స్వంతానికి ఇవ్వను.>> \p \s5 \v 10 గతంలో ఏమీయులు ఆ ప్రాంతాల్లో ఉండేవారు. వారు అనాకీయుల్లాగా పొడవైనవారు, బలవంతులైన గొప్ప ప్రజ. అనాకీయుల్లాగా వారిని కూడా <<రెఫాయీయులు>> అని పిలిచారు. \v 11 మోయాబీయులు వారికి <<ఏమీయులు>> పేరు పెట్టారు. \p \s5 \v 12 పూర్వకాలంలో హోరీయులు శేయీరులో నివసించారు. ఇశ్రాయేలీయులు యెహోవాా తమకిచ్చిన స్వాస్థ్యమైన దేశంలో చేసినట్టు ఏశావు సంతానం హోరీయుల దేశాన్ని స్వాధీనం చేసుకుని వారిని చంపి వారి దేశంలో నివసించారు. \s5 \v 13 <<ఇప్పుడు మీరు లేచి జెరెదు వాగు దాటండి>> అని యెహోవాా ఆజ్ఞాపించగా మనం జెరెదు వాగు దాటాం. \p \v 14 మనం కాదేషు బర్నేయ నుండి బయలుదేరి జెరెదు వాగు దాటే వరకూ మనం ప్రయాణించిన కాలం 38 సంవత్సరాలు. యెహోవాా వారితో శపథం చేసినట్టు అప్పటికి ఆ తరంలో యుద్ధం చేయగల మనుషులందరూ గతించిపోయారు. \v 15 అంతే కాదు, వారు గతించే వరకూ ఆ తరం వారిని చంపడానికి యెహోవాా హస్తం వారికి విరోధంగా ఉంది. \p \s5 \v 16 ఈ విధంగా సైనికులైన వారంతా చనిపోయి గతించిన తరువాత యెహోవాా నాకు ఇలా చెప్పాడు, \v 17 <<ఈ రోజు నువ్వు మోయాబుకు సరిహద్దుగా ఉన్న ఆర్ దేశాన్ని దాటబోతున్నావు. \v 18 అమ్మోనీయుల పక్కగా వెళ్ళేటప్పుడు వారిని బాధించవద్దు. \v 19 వారితో యుద్ధం చేయొద్దు. ఎందుకంటే లోతు సంతానానికి దాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాను. కాబట్టి వారి దేశంలో భూమిని నీకు ఏ మాత్రం ఇవ్వను.>> \s5 \v 20 దాన్ని కూడా రెఫాయీయుల దేశం అని పిలిచారు. పూర్వం రెఫాయీయులు అందులో నివసించారు. అమ్మోనీయులు వారిని <<జంజుమీయులు>> అనేవారు. \p \v 21 వారు అనాకీయుల్లాగా పొడవైన వారు, బలవంతులైన గొప్ప ప్రజలు. అయితే యెహోవాా అమ్మోనీయుల ఎదుట నుండి వారిని వెళ్లగొట్టడం వలన అమ్మోనీయులు వారి దేశాన్ని స్వాధీనం చేసుకుని అక్కడ నివసించారు. \v 22 ఆయన శేయీరులో నివసించే ఏశావు సంతానం కోసం వారి ఎదుట నుండి హోరీయుల్ని నశింపజేశాడు కాబట్టి వారు హోరీయుల దేశాన్ని స్వాధీనం చేసుకుని ఈ రోజు వరకూ అక్కడ నివసిస్తున్నారు. \s5 \v 23 గాజా వరకూ ఉన్న గ్రామాల్లో నివసించిన ఆవీయులను కఫ్తోరు నుండి వచ్చిన కఫ్తోరీయులు నాశనం చేసి అక్కడ నివసించారు. \p \s5 \v 24 <<మీరు బయలుదేరి అర్నోను లోయ దాటండి. ఇదిగో అమోరీయుడు, హెష్బోను రాజు అయిన సీహోనునూ అతని దేశాన్నీ మీ చేతికి అప్పగించాను. అతనితో యుద్ధం చేసి దాన్ని ఆక్రమించుకోండి. \v 25 ఈ రోజు ఆకాశం కింద ఉన్న జాతుల ప్రజలందరికీ నువ్వంటే భయం పుట్టించడం మొదలు పెడుతున్నాను. వారు మీ గురించిన సమాచారం విని నీ ఎదుట వణకి, కలవరపడతారు>> అని యెహోవాా నాతో చెప్పాడు. \p \s5 \v 26 అప్పుడు నేను కెదేమోతు ఎడారిలో నుండి హెష్బోను రాజు సీహోను దగ్గరికి దూతల్ని పంపి \v 27 <<మమ్మల్ని నీ దేశం గుండా వెళ్ళనివ్వు. కుడి, ఎడమలకు తిరగకుండా దారిలోనే నడిచిపోతాము. \s5 \v 28 నా దగ్గర సొమ్ము తీసుకుని తినడానికి ఆహార పదార్థాలు, తాగడానికి నీరు ఇవ్వు. \v 29 శేయీరులో ఏశావు సంతానమూ ఆర్ లో మోయాబీయులూ నాకు చేసినట్టు, మా దేవుడు యెహోవాా మాకిస్తున్న దేశానికి వెళ్ళడానికి యొర్దాను నది దాటేవరకూ కాలి నడకతోనే మమ్మల్ని వెళ్లనివ్వు>> అని శాంతికరమైన మాటలు పలికించాను. \s5 \v 30 అయితే హెష్బోను రాజు సీహోను మనం తన దేశం గుండా వెళ్లడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే ఈ రోజు జరిగినట్టుగా మన చేతికి అతణ్ణి అప్పగించడం కోసం మీ యెహోవాా దేవుడు అతని మనస్సును కఠినపరచి అతని హృదయాన్ని బండబారిపోయేలా చేశాడు. \p \v 31 అప్పుడు యెహోవాా, <<చూడు, సీహోనును అతని దేశాన్ని నీకు అప్పగిస్తున్నాను. అతని దేశాన్ని స్వాధీనం చేసుకోవడం మొదలు పెట్టు>> అని నాతో చెప్పాడు. \s5 \v 32 సీహోనూ అతని ప్రజలంతా యాహసులో మనతో యుద్ధం చేయడానికి వచ్చారు. \v 33 మన యెహోవాా దేవుడు అతణ్ణి మనకప్పగించాడు కాబట్టి మనం అతన్నీ అతని కొడుకులనూ అతని ప్రజలందరినీ చంపివేశాం. \p \s5 \v 34 అప్పుడున్న అతని పట్టణాలనూ, వాటిలోని స్త్రీ పురుషులనూ పిల్లలనూ ఏదీ మిగలకుండా నాశనం చేశాం. \v 35 కేవలం పశువులనూ ఆ పట్టణాల ఆస్తినీ దోచుకున్నాం. \s5 \v 36 అర్నోను ఏటిలోయ ఒడ్డున ఉన్న అరోయేరు, ఆ లోయలో ఉన్న పట్టణం మొదలుపెట్టి గిలాదు వరకూ మనకు లొంగిపోని పట్టణం ఒక్కటి కూడా లేదు. మన దేవుడు అన్నిటినీ మనకి అప్పగించాడు. \v 37 అయితే అమ్మోనీయుల దేశానికైనా, యబ్బోకు నది లోయలోని ఏ ప్రాంతానికైనా ఆ కొండప్రాంతంలోని పట్టణాలకైనా మన యెహోవాా దేవుడు వెళ్ళవద్దని చెప్పిన మరే స్థలానికైనా మీరు వెళ్ళలేదు. \s5 \c 3 \p \v 1 మనం తిరిగి బాషాను దారిలో వెళ్తుండగా బాషాను రాజు ఓగు, అతని ప్రజలంతా ఎద్రెయీలో మనతో యుద్ధం చేయడానికి ఎదురుగా వచ్చారు. \v 2 యెహోవాా నాతో ఇలా అన్నాడు, <<అతనికి భయపడ వద్దు. అతన్నీ అతని ప్రజలనూ అతని దేశాన్నీ నీ చేతికి అప్పగించాను. హెష్బోనులో అమోరీయుల రాజు సీహోనుకు చేసినట్టే ఇతనికి కూడా చేయాలి.>> \s5 \v 3 ఆ విధంగా మన దేవుడు యెహోవాా బాషాను రాజు ఓగును, అతని ప్రజలందరినీ మన చేతికి అప్పగించాడు. అతనికి ఎవ్వరూ మిగలకుండా అందరినీ హతం చేశాం. \p \v 4 ఆ కాలంలో అతని పట్టణాలన్నీ స్వాధీనం చేసుకున్నాం. మన స్వాధీనంలోకి రాని పట్టణం ఒక్కటీ లేదు. బాషానులో ఓగు రాజ్యం అర్గోబు ప్రాంతంలో ఉన్న 60 పట్టణాలు ఆక్రమించుకున్నాం. \s5 \v 5 ఆ పట్టణాలన్నీ గొప్ప ప్రాకారాలు, ద్వారాలు, గడియలతో ఉన్న దుర్గాలు. అవిగాక ప్రాకారాలు లేని ఇంకా చాలా పట్టణాలు స్వాధీనం చేసుకున్నాం. \v 6 మనం హెష్బోను రాజు సీహోనుకు చేసినట్టు వాటిని నిర్మూలం చేశాం. ప్రతి పట్టణంలోని స్త్రీ పురుషులనూ పిల్లలనూ నాశనం చేశాం. \v 7 వారి పశువులనూ ఆ పట్టణాల ఆస్తినీ దోచుకున్నాం. \p \s5 \v 8 ఆ కాలంలో అర్నోను లోయ నుండి హెర్మోను కొండ వరకూ, యొర్దాను అవతల ఉన్న దేశాన్ని ఇద్దరు అమోరీయుల రాజుల దగ్గర నుండి స్వాధీనం చేసుకున్నాం. \v 9 సీదోనీయులు హెర్మోనును <<షిర్యోను>> అనేవారు. అమోరీయులు దాన్ని <<శెనీరు>> అనేవారు. \v 10 మైదానంలోని పట్టాణాలన్నిటిని, బాషానులోని ఓగు రాజ్య పట్టణాలైన సల్కా, ఎద్రెయీ అనేవాటి వరకూ గిలాదు అంతటినీ బాషానునూ ఆక్రమించాం. \s5 \v 11 రెఫాయీయులలో బాషాను రాజు ఓగు మాత్రం మిగిలాడు. అతనిది ఇనుప మంచం. అది అమ్మోనీయుల రబ్బాలో ఉంది గదా? దాని పొడవు తొమ్మిది మూరలు, వెడల్పు నాలుగు మూరలు. \p \s5 \v 12 అర్నోను లోయలో ఉన్న అరోయేరు నుండి గిలాదు కొండ ప్రాంతంలో సగమూ మనం అప్పుడు స్వాధీనం చేసుకొన్న దేశమూ దాని పట్టణాలూ రూబేనీయులకు, గాదీయులకు ఇచ్చాను. \v 13 ఓగు రాజుకు చెందిన బాషాను అంతటినీ, గిలాదులో మిగిలిన రెఫాయీయుల దేశమని పిలిచే బాషానునూ, అర్గోబు ప్రాంతమంతా మనష్షే అర్ధ గోత్రానికి ఇచ్చాను. \p \s5 \v 14 మనష్షే కొడుకు యాయీరు గెషూరీయుల, మాయాకాతీయుల సరిహద్దుల వరకూ అర్గోబు ప్రాంతాన్ని పట్టుకొని, తన పేరును బట్టి వాటికి యాయీరు బాషాను గ్రామాలు అని పేరు పెట్టాడు. ఈ రోజు వరకూ వాటి పేరు అదే. \s5 \v 15 మాకీరీయులకు గిలాదును ఇచ్చాను. \v 16 గిలాదు నుండి అర్నోను లోయ మధ్య వరకూ, యబ్బోకు నది వరకూ, అమ్మోనీయుల పడమటి సరిహద్దు వరకూ రూబేనీయులకూ గాదీయులకూ ఇచ్చాను. \s5 \v 17 ఇవి కాక, కిన్నెరెతు నుండి తూర్పున పిస్గా కొండ వాలుల కింద, ఉప్పు సముద్రం అని పిలిచే అరాబా సముద్రం దాకా వ్యాపించిన అరాబా ప్రాంతాన్ని, యొర్దాను లోయ మధ్యభూమిని, రూబేనీయులకూ గాదీయులకూ ఇచ్చాను. \p \s5 \v 18 అప్పుడు నేను మీతో, <<మీరు స్వాధీనం చేసుకోడానికి మీ దేవుడు యెహోవాా ఈ దేశాన్ని మీకిచ్చాడు. మీలో యుద్ధవీరులంతా సిద్ధపడి మీ సోదరులైన ఇశ్రాయేలు ప్రజలతో కలిసి నది దాటి రావాలి. \s5 \v 19 యెహోవాా మీకు విశ్రాంతినిచ్చినట్టు మీ సోదరులకు కూడా విశ్రాంతినిచ్చే వరకూ నేను మీకిచ్చిన పట్టణాల్లో నివసించాలి. \v 20 అంటే మీ యెహోవాా దేవుడు యొర్దాను అవతల వారికి ఇస్తున్న దేశాన్ని వారు స్వాధీనం చేసుకునే వరకూ, మీ భార్యలు, మీ పిల్లలు, మీ మందలు నేను మీకిచ్చిన పట్టణాల్లో నివసించాలి. ఆ తరువాత మీరు మీ స్వాస్థ్యాలకు తిరిగి రావాలి అని మీకు ఆజ్ఞాపించాను. మీ మందలు చాలా ఎక్కువని నాకు తెలుసు>> అన్నాను. \p \s5 \v 21 ఆ సమయంలో నేను యెహోషువకు ఇలా ఆజ్ఞాపించాను, <<మీ యెహోవాా దేవుడు ఈ ఇద్దరు రాజులకు చేసినదంతా నువ్వు కళ్ళారా చూశావు గదా. నువ్వు వెళ్తున్న రాజ్యాలన్నిటికీ యెహోవాా అదే విధంగా చేస్తాడు. \v 22 మీ యెహోవాా దేవుడు మీ పక్షంగా యుద్ధం చేస్తాడు కాబట్టి వారికి భయపడ వద్దు.>> \p \s5 \v 23 ఆ రోజుల్లో నేను, <<యెహోవాా, ప్రభూ, నీ మహిమనూ, నీ బాహుబలాన్నీ నీ దాసునికి చూపించడం ప్రారంభించావు. \v 24 ఆకాశంలో గాని, భూమిపై గాని నువ్వు చేసే పనులు చేయగల దేవుడెవడు? నీ అంత పరాక్రమం చూపగల దేవుడెవడు? \v 25 నేను అవతలికి వెళ్లి యొర్దాను అవతల ఉన్న ఈ మంచి దేశాన్ని, ఆ మంచి కొండ ప్రాంతాన్ని, ఆ లెబానోనును చూసేలా అనుగ్రహించు>> అని యెహోవాాను బతిమాలుకున్నాను. \p \s5 \v 26 యెహోవాా మీ కారణంగా నా మీద కోపపడి నా మనవి వినలేదు. ఆయన నాతో ఇలా అన్నాడు. <<చాలు. ఇంక ఈ సంగతిని గూర్చి నాతో మాట్లాడవద్దు. \v 27 నువ్వు ఈ యొర్దాను దాటకూడదు. అయితే, పిస్గా కొండ ఎక్కి పడమటి వైపు, ఉత్తరం వైపు, దక్షిణం వైపు, తూర్పు వైపు తేరి చూడు. \s5 \v 28 నీకు బదులుగా యెహోషువకు ఆజ్ఞాపించి, అతణ్ణి ప్రోత్సహించి, బలపరచు. అతడు ఈ ప్రజలను నడిపించి, నది దాటి, నువ్వు చూడబోయే దేశాన్ని వారు స్వాధీనపరచుకొనేలా చేస్తాడు.>> \v 29 ఆ సమయంలో మనం బేత్పయోరు ఎదుట ఉన్న లోయలో ఉన్నాం. \s5 \c 4 \p \v 1 కాబట్టి ఇశ్రాయేలు ప్రజలారా, మీరు జీవించి మీ పూర్వీకుల దేవుడైన యెహోవాా మీకిస్తున్న దేశంలో ప్రవేశించి దాన్ని స్వాధీనం చేసుకోవడానికి పాటించాల్సిన నియమాలు, కట్టడలు నేను మీకు బోధిస్తున్నాను. వినండి. \v 2 యెహోవాా దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను మీకందిస్తున్నాను. వాటిని పాటించడంలో నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనినీ కలపకూడదు, దానిలో నుండి దేనినీ తీసివేయకూడదు. \p \s5 \v 3 బయల్పెయోరు విషయంలో యెహోవాా చేసినదాన్ని మీరు కళ్ళారా చూశారు కదా. బయల్పెయోరును వెంబడించిన ప్రతి పురుషుడినీ మీ యెహోవాా దేవుడు మీ మధ్య ఉండకుండాా నాశనం చేశాడు. \v 4 యెహోవాా దేవుణ్ణి హత్తుకొన్న మీరంతా ఈ రోజు వరకూ జీవించి ఉన్నారు. \s5 \v 5 యెహోవాా దేవుడు నాకు ఆజ్ఞాపించిన విధంగా మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలో మీరు పాటించాల్సిన కట్టడలను, విధులను మీకు నేర్పాను. \v 6 ఈ కట్టడలన్నిటినీ మీరు అంగీకరించి వాటిని అనుసరించాలి. వాటిని గూర్చి విన్న ప్రజల దృష్టికి అదే మీ జ్ఞానం, అదే మీ వివేకం. వారు మిమ్మల్ని చూసి, <<నిజంగా ఈ గొప్ప జాతి జ్ఞానం, వివేచన గల ప్రజలు>> అని చెప్పుకుంటారు. \p \s5 \v 7 ఎందుకంటే మనం ఆయనకు మొర పెట్టిన ప్రతిసారీ మన యెహోవాా దేవుడు మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జాతికి ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? \v 8 ఈ రోజు నేను మీకు అప్పగిస్తున్న ఈ ధర్మశాస్త్రమంతటిలో ఉన్న కట్టడలు, నీతివిధులు కలిగి ఉన్న గొప్ప జనమేది? \s5 \v 9 అయితే మీరు జాగ్రత్తపడాలి. మీరు కళ్ళారా చూసిన వాటిని మరచిపోకుండా ఉండేలా, అవి మీ జీవితమంతా మీ హృదయాల్లో నుండి తొలగిపోకుండేలా, మీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకోండి. మీ కొడుకులకు, వారి కొడుకులకు వాటిని నేర్పించండి. \v 10 మీరు హోరేబులో మీ యెహోవాా దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నప్పుడు ఆయన, నా దగ్గరకు ప్రజల్ని సమావేశపరచు. వారు ఆ దేశంలో నివసించే రోజులన్నీ నాకు భయపడడం నేర్చుకొని, తమ పిల్లలకు నేర్పేలా వారికి నా మాటలు వినిపిస్తాను అని ఆయన నాతో చెప్పాడు. \p \s5 \v 11 అప్పుడు మీరు దగ్గరకి వచ్చి ఆ కొండ కింద నిలబడ్డారు. చీకటి, మేఘం, గాఢాంధకారం కమ్మి ఆ కొండ ఆకాశం వరకూ అగ్నితో మండుతుండగా \v 12 యెహోవాా ఆ అగ్నిలో నుండి మీతో మాట్లాడాడు. మీరు ఆ మాటలు విన్నారు గాని ఏ రూపాన్నీ చూడలేదు, స్వరం మాత్రమే విన్నారు. \s5 \v 13 మీరు పాటించడానికి ఆయన విధించిన నిబంధనను, అంటే పది ఆజ్ఞలను మీకు తెలిపే రెండు రాతి పలకల మీద వాటిని రాశాడు. \p \v 14 అప్పుడు మీరు నది దాటి స్వాధీనం చేసుకోబోయే దేశంలో పాటించాల్సిన కట్టడలు, విధులను మీకు నేర్పమని యెహోవాా నాకు ఆజ్ఞాపించాడు. \s5 \v 15 హోరేబులో యెహోవాా అగ్నిజ్వాలల్లో నుండి మీతో మాట్లాడిన రోజు మీరు ఏ స్వరూపాన్నీ చూడలేదు. \v 16 కాబట్టి మీరు భూమి మీద ఉన్న ఏ జంతువు గాని, \v 17 ఆకాశంలో ఎగిరే రెక్కలున్న ఏ పక్షి గాని, \v 18 నేలమీద పాకే ఏ పురుగు గాని, భూమి కింద ఉన్న నీళ్లలో ఏ చేప గాని, ఆడదైనా మగదైనా ఎలాటి ప్రతిమను ఏ స్వరూపంలోనైనా విగ్రహాన్ని మీ కోసం చేసుకుని చెడిపోకుండేలా జాగ్రత్త పడండి. \s5 \v 19 ఆకాశం వైపు చూసి సూర్య చంద్ర నక్షత్రాలను, ఇంకా ఆకాశ సైన్యాలను చూసి మైమరచిపోయి మీ యెహోవాా దేవుడు ఆకాశమంతటి కింద ఉన్న మనుషులందరి కోసం ఏర్పాటు చేసిన వాటికి నమస్కరించి, వాటిని పూజించకుండేలా మీరు ఎంతో జాగ్రత్త వహించండి. \p \v 20 యెహోవాా మిమ్మల్ని తీసుకుని ఈ రోజులాగా మీరు తనకు స్వంత ప్రజలుగా ఉండడానికి, ఇనపకొలిమి లాంటి ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించాడు. \s5 \v 21 యెహోవాా మిమ్మల్ని బట్టి నా మీద కోపపడి, నేను ఈ యొర్దాను దాటకూడదనీ మీ యెహోవాా దేవుడు స్వాస్థ్యంగా మీకిస్తున్న ఈ మంచి దేశంలో ప్రవేశింపకూడదనీ ఆజ్ఞాపించాడు. \v 22 కాబట్టి నేను ఈ యొర్దాను దాటకుండా ఈ దేశంలోనే చనిపోతాను. మీరు దాటి ఆ మంచి దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు. \p \s5 \v 23 మీ దేవుడు యెహోవాా మీకు ఏర్పరచిన నిబంధనను మరచి, మీ దేవుడైన యెహోవాా మీకు ఆజ్ఞాపించిన ప్రకారం ఎలాంటి రూపంతోనైనా విగ్రహాన్ని చేసుకోకుండేలా జాగ్రత్తపడండి. \v 24 ఎందుకంటే మీ దేవుడు యెహోవాా దహించే అగ్ని, రోషం గల దేవుడు. \s5 \v 25 మీరు పిల్లలను, వారు తమ పిల్లలను కని ఆ దేశంలో చాలా కాలం నివసించిన తరువాత మీరు చెడిపోయి, ఎలాంటి రూపంతోనైనా విగ్రహాలు చేసుకుని మీ యెహోవాా దేవునికి కోపం పుట్టించి, ఆయన ఎదుట చెడు జరిగినప్పుడు \v 26 మీరు ఈ యొర్దాను దాటి స్వాధీనం చేసుకోబోయే దేశంలో ఉండకుండాా త్వరలోనే పూర్తిగా నాశనమై పోతారని భూమ్యాకాశాలను మీమీద సాక్షులుగా ఉంచుతున్నాను. ఆ దేశంలో ఎక్కువ రోజులు నిలబడకుండా మీరు పూర్తిగా నాశనమైపోతారు. \p \s5 \v 27 అంతేగాక యెహోవాా మిమ్మల్ని ఆయా జాతుల మధ్యకు చెదరగొడతాడు. ఆయన మిమ్మల్ని ఎక్కడికి తోలివేస్తాడో అక్కడి ప్రజల్లో మీరు కొద్దిమందిగా మిగిలి ఉంటారు. \v 28 అక్కడ మీరు మనుష్యులు చేతితో చేసిన కర్ర, రాతి దేవుళ్ళను పూజిస్తారు. అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు. \s5 \v 29 అయితే అక్కడ నుండి మీ దేవుడు యెహోవాాను మీ పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో వెదకితే, ఆయన మీకు ప్రత్యక్షమౌతాడు. \p \s5 \v 30 ఈ సంగతులన్నీ జరిగి మీకు బాధ కలిగినప్పుడు చివరి రోజుల్లో మీరు మీ యెహోవాా దేవుని వైపు చూసి ఆయన మాటకు లోబడినప్పుడు \v 31 మీ దేవుడు యెహోవాా కనికరం గలవాడు కాబట్టి మీ చెయ్యి విడవడు, మిమ్మల్ని నాశనం చేయడు. తాను మీ పూర్వీకులతో చేసిన నిబంధన వాగ్దానాన్ని మరచిపోడు. \s5 \v 32 దేవుడు భూమి మీద మానవుణ్ణి సృష్టించింది మొదలు, మీ కంటే ముందటి రోజుల్లో ఆకాశం ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకూ ఇలాటి గొప్ప కార్యం జరిగిందా? దీనిలాంటి వార్త వినబడిందా? అని అడుగు. \v 33 మీలా దేవుని స్వరం అగ్నిలో నుండి మాట్లాడడం విని మరి ఏ ప్రజలైనా జీవించారా? \p \s5 \v 34 మీ యెహోవాా దేవుడు ఐగుప్తులో మా కళ్ళ ఎదుట చేసిన వాటన్నిటి ప్రకారం ఏ దేవుడైనా సరే, కష్టాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు, యుద్ధం, బాహుబలం, చాచిన చేయి, మహా భయంకర కార్యాలు, వీటన్నిటితో ఎప్పుడైనా వచ్చి ఒక ప్రజలోనుండి తనకోసం ఒక జాతి ప్రజని తీసుకోడానికి ప్రయత్నించాడా? \s5 \v 35 అయితే యెహోవాాయే దేవుడనీ, ఆయన తప్ప మరొకడు లేడనీ మీరు తెలుసుకొనేలా అది మీకు చూపించాడు. \v 36 మీకు బోధించడానికి ఆయన ఆకాశం నుండి తన స్వరాన్ని వినిపించాడు. భూమి మీద తన గొప్ప అగ్నిని మీకు చూపినప్పుడు ఆ అగ్నిలో నుండి ఆయన మాటలు మీరు విన్నారు. \p \s5 \v 37 ఆయన మీ పూర్వీకుల్ని ప్రేమించాడు కాబట్టి వారి తరువాత వారి సంతానాన్ని ఏర్పరచుకున్నాడు. \v 38 మీకంటే బలమైన గొప్ప జాతుల ప్రజలను మీ ఎదుట నుండి వెళ్లగొట్టి మిమ్మల్ని ప్రవేశపెట్టి ఆయన ఈ రోజు జరుగుతున్నట్టు వారి దేశాన్ని మీకు స్వాస్థ్యంగా ఇవ్వడానికి మీకు తోడుగా ఉండి ఐగుప్తు నుండి తన మహాబలంతో మిమ్మల్ని బయటికి రప్పించాడు. \p \s5 \v 39 కాబట్టి, పైన ఆకాశంలో, కింద భూమిపైనా యెహోవాాయే దేవుడనీ, మరొక దేవుడు లేడనీ ఈరోజు గ్రహించండి. \v 40 అంతే గాక మీకు, మీ తరువాత మీ సంతానానికి సుఖశాంతులు కలగడానికి మీ యెహోవాా దేవుడు ఎప్పటికీ మీకిస్తున్న దేశంలో మీకు దీర్ఘాయువు కలిగేలా నేను మీకాజ్ఞాపిస్తున్న ఆయన కట్టడలను, ఆజ్ఞలను మీరు పాటించాలి. \p \s5 \v 41 ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కాక, అనాలోచితంగా తన పొరుగువాణ్ణి చంపినప్పుడు \v 42 అతడు పారిపోడానికి మోషే తూర్పు దిక్కున, యొర్దాను ఇవతల మూడు పట్టణాలను ఎన్నిక చేశాడు. అలాటి వ్యక్తి ఎవరైనా ఉంటే అతడు పారిపోయి ఆ పట్టణాల్లో ప్రవేశించి జీవించవచ్చు. \v 43 అవేవంటే, రూబేనీయులకు మైదాన దేశపు ఎడారిలోని బేసెరు, గాదీయులకు గిలాదులో ఉన్న రామోతు, మనష్షీయులకు బాషానులో ఉన్న గోలాను. \s5 \v 44 ఇదీ మోషే ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రం. \p \v 45 ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటికి వస్తున్నప్పుడు \v 46 యొర్దాను ఇవతల బేత్పయోరు ఎదుటి లోయలో హెష్బోనులో, సీహోను రాజుగా పాలించే అమోరీయుల దేశంలో \s5 \v 47 మోషే ఇశ్రాయేలు ప్రజలకు నియమించిన శాసనాలు, కట్టడలు, న్యాయ విధులు ఇవి. \v 48 మోషే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వస్తూ ఆ సీహోనును చంపి అతని దేశాన్నీ యొర్దాను ఇవతల తూర్పు దిక్కున ఉన్న బాషాను రాజు ఓగు పాలించే దేశాన్నీ అర్నోను లోయలో ఉన్న అరోయేరు మొదలు హెర్మోను అనే సీయోను కొండ వరకూ ఉన్న అమోరీయుల ఇద్దరు రాజుల దేశాన్ని, \v 49 పిస్గా ఊటలకు కిందుగా అరాబా సముద్రం వరకూ తూర్పు దిక్కున యొర్దాను అవతల ఆరాబా ప్రదేశమంతటినీ స్వాధీనం చేసుకున్నారు. \s5 \c 5 \p \v 1 మోషే ఇశ్రాయేలు ప్రజలందరినీ పిలిపించి ఇలా చెప్పాడు, ఇశ్రాయేలు ప్రజలారా, నేను మీకు ఈ రోజు చెబుతున్న కట్టడలను, విధులను విని నేర్చుకొని వాటిని పాటించండి. \v 2 మన దేవుడు యెహోవాా హోరేబులో మనతో ఒప్పందం చేశాడు. \v 3 ఆయన మన పూర్వీకులతో కాదు, ఈ రోజు, ఇక్కడ జీవించి ఉన్న మనతోనే ఈ ఒప్పందం చేశాడు. \s5 \v 4 యెహోవాా ఆ కొండ మీద అగ్నిలో నుండి ముఖాముఖిగా మీతో మాటలాడినప్పుడు మీరు ఆ అగ్నికి భయపడి ఆ కొండ ఎక్కలేదు. \p \v 5 కాబట్టి యెహోవాా మాట మీకు తెలపడానికి నేను యెహోవాాకూ మీకూ మధ్య నిలబడి ఉన్నప్పుడు యెహోవాా ఇలా చెప్పాడు. \p \v 6 <<బానిసల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనైన యెహోవాాను నేనే. \p \s5 \v 7 నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. \p \v 8 పైన ఉన్న ఆకాశంలో గాని, కింద ఉన్న భూమిపైనే గాని, భూమి కింద ఉన్న నీళ్లలోనే గాని ఉండే దేని పోలికలోనైనా విగ్రహాన్ని చేసుకోకూడదు. \p \s5 \v 9 వాటికి నమస్కరించకూడదు, వాటిని పూజింపకూడదు. మీ దేవుడైన యెహోవాా అనే నేను రోషం గల దేవుణ్ణి. నన్ను ద్వేషించేవారి విషయంలో మూడు నాలుగు తరాల వరకూ తండ్రులు చేసిన దోషాన్ని కొడుకులపైకి రప్పిస్తాను. \v 10 నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు పాటించే వారి విషయంలో వెయ్యి తరాల వరకూ కరుణిస్తాను.>> \p \s5 \v 11 మీ దేవుడు యెహోవాా పేరును అనవసరంగా పలకకూడదు, యెహోవాా తన పేరును అనవసరంగా పలికేవాణ్ణి దోషిగా ఎంచుతాడు. \p \s5 \v 12 మీ యెహోవాా దేవుడు మీకు ఆజ్ఞాపించినట్టు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించండి. \v 13 ఆరు రోజులు మీరు కష్టపడి మీ పని చేయాలి. \v 14 ఏడో రోజు మీ యెహోవాా దేవునికి విశ్రాంతి దినం. ఆ రోజు మీరు, మీ కొడుకు, కూతురు, దాసుడు లేక దాసి, మీ ఎద్దు లేక గాడిద, మీ పశువుల్లో ఏదైనా సరే, మీ ఇంట్లో ఉన్న పరదేశితో సహా, ఏ పనీ చేయకూడదు. ఎందుకంటే మీకులాగా మీ దాసుడు, మీ దాసి కూడా విశ్రాంతి తీసుకోవాలి. \p \s5 \v 15 మీరు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు మీ దేవుడు యెహోవాా తన బాహుబలంతో, చాచిన చేతితో మిమ్మల్ని అక్కడ నుండి రప్పించాడని జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి, విశ్రాంతి దినాన్ని పాటించాలని ఆయన మీకు ఆజ్ఞాపించాడు. \p \s5 \v 16 మీ దేవుడు యెహోవాా మీకిచ్చే దేశంలో మీరు దీర్ఘాయువుతో, సుఖశాంతులు కలిగి ఉండేలా ఆయన మీకు ఆజ్ఞాపించినట్టు మీ తల్లి తండ్రులను గౌరవించండి. \p \s5 \v 17 హత్య చేయకూడదు. \p \v 18 వ్యభిచారం చేయకూడదు. \p \v 19 దొంగతనం చేయకూడదు. \p \v 20 మీ సాటి మనిషికి వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు. \p \s5 \v 21 మీ పొరుగువాడి భార్యపై ఆశపడకూడదు. మీ పొరుగువాడి ఇంటిని, పొలాన్ని, పనివాణ్ణి, పనికత్తెని, ఎద్దును, గాడిదను, ఇంకా అతనికి చెందిన దేనినీ ఆశించకూడదు. \p \s5 \v 22 యెహోవాా ఆ కొండ మీద అగ్ని, మేఘం, గాఢాంధకారాల మధ్య నుండి గొప్ప స్వరంతో మీ సమాజమంతటితో ఈ మాటలు చెప్పి, రెండు రాతి పలకల మీద వాటిని రాసి నాకిచ్చాడు. ఇంతకు మించి ఆయన మరేమీ చెప్పలేదు. \p \s5 \v 23 ఆ కొండ అగ్నితో మండుతున్నప్పుడు మీరు ఆ చీకటి మధ్య నుండి ఆ స్వరం విని, అంటే మీ గోత్రాల ప్రధానులు, పెద్దలు నా దగ్గరకు వచ్చి, \v 24 మన యెహోవాా దేవుడు తన మహిమని గొప్పతనాన్ని మాకు చూపించాడు. అగ్నిలో నుండి ఆయన స్వరాన్ని విన్నాం. దేవుడు మానవులతో మాట్లాడినప్పటికీ వారు బతికి ఉండగలరని ఈ రోజు గ్రహించాం. \s5 \v 25 కాబట్టి మేము చావడమెందుకు? ఈ గొప్ప అగ్ని మమ్మల్ని కాల్చివేస్తుంది. మేము మన దేవుడు యెహోవాా స్వరం ఇంకా వింటే చనిపోతాం. \v 26 మాలాగా మానవులందరిలో సజీవుడైన దేవుని స్వరం అగ్నిలో నుండి పలకడం విని ఇంకెవరు జీవించి ఉన్నారు? \v 27 నువ్వే వెళ్ళి మన దేవుడు యెహోవాా చెప్పేదంతా విను. ఆయన నీతో చెప్పిన దానంతటినీ నువ్వే మాతో చెబితే మేము విని దాన్ని పాటిస్తాం అని చెప్పారు. \p \s5 \v 28 మీరు నాతో చెప్పిన మాటలు యెహోవాా విన్నాడు. అప్పుడు యెహోవాా నాతో ఇలా చెప్పాడు.<<ఈ ప్రజలు నీతో చెప్పిన మాటలు నేను విన్నాను. వారు చెప్పినదంతా మంచిదే. \v 29 వారికీ వారి సంతానానికీ ఎల్లప్పుడు సుఖశాంతులు కలిగేలా వారు నాపట్ల భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని పాటించే మనస్సు వారికి ఉండడం మంచిది. \v 30 వారి వారి గుడారాల్లోకి తిరిగి వెళ్ళమని వారితో చెప్పు. \s5 \v 31 నువ్వు మాత్రం ఇక్కడ నా దగ్గర ఉండు. నువ్వు వారికి బోధించాల్సిన కట్టడలనూ విధులనూ నేను నీతో చెబుతాను. \p \s5 \v 32 వారు స్వాధీనం చేసుకోడానికి నేను వారికి ఇస్తున్న దేశంలో వారు ఆ విధంగా ప్రవర్తించాలి. \v 33 మీరు కుడికి ఎడమకి తిరగకుండా మీ దేవుడు యెహోవాా ఆజ్ఞాపించిన విధంగా చేయడానికి జాగ్రత్తపడాలి. మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలో నివసిస్తూ సుఖశాంతులతో దీర్ఘాయుష్మంతులయ్యేలా మీ దేవుడు యెహోవాా మీకు ఆజ్ఞాపించిన మార్గాలన్నిటిలో నడుచుకోవాలి.>> \s5 \c 6 \p \v 1 మీరూ మీ కొడుకులూ మీ మనుమలూ \v 2 మీ దేవుడైన యెహోవాాకు భయపడి, నేను మీకు ఆజ్ఞాపించే ఆయన కట్టడలు, ఆజ్ఞలు అన్నిటినీ మీ జీవితకాలమంతా పాటిస్తే మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. మీరు స్వాధీనం చేసుకోడానికి నది దాటి వెళ్తున్న దేశంలో మీరు పాటించడానికి మీకు బోధించాలని మీ యెహోవాా దేవుడు ఆజ్ఞాపించిన కట్టడలు, విధులు ఇవే. \p \s5 \v 3 ఇశ్రాయేలూ, నీ పూర్వీకుల దేవుడైన యెహోవాా నీతో చెప్పిన ప్రకారం పాలు తేనెలు ప్రవహించే దేశంలో సుఖశాంతులతో బాగా అభివృద్ధి చెందడానికి నువ్వు వాటిని విని, అనుసరించాలి. \p \s5 \v 4 ఇశ్రాయేలూ విను. మన యెహోవాా దేవుడు అద్వితీయుడు. \v 5 నీ పూర్ణహృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణశక్తితో నీ దేవుడైన యెహోవాాను ప్రేమించాలి. \p \s5 \v 6 ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించే ఈ మాటలు మీ హృదయంలో ఉంచుకోవాలి. \p \v 7 మీరు మీ కొడుకులకు వాటిని నేర్పించి, మీ ఇంట్లో కూర్చున్నప్పుడూ దారిలో నడిచేటప్పుడూ నిద్రపోయేటప్పుడూ లేచేటప్పుడూ వాటిని గూర్చి మాట్లాడాలి. సూచనగా వాటిని మీ చేతికి కట్టుకోవాలి. \p \s5 \v 8 అవి మీ రెండు కళ్ళ మధ్యలో బాసికం లాగా ఉండాలి. \v 9 మీ ఇంట్లో గుమ్మాల మీదా తలుపుల మీదా వాటిని రాయాలి. \p \s5 \v 10 మీ దేవుడు యెహోవాా మీ పూర్వీకులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన వాగ్దానం ప్రకారం మిమ్మల్ని ఆ దేశంలోకి తీసుకెళ్ళి, మీరు కట్టని గొప్ప, మంచి పట్టణాలను మీకు ఇస్తున్నాడు. \v 11 మీరు నింపని మంచి వస్తువులతో నిండిన ఇళ్ళనూ, మీరు తవ్వని బావులనూ, మీరు నాటని ద్రాక్షతోటలనూ ఒలీవ తోటలనూ మీకిస్తున్నాడు. \p \v 12 అక్కడ మీరు తిని, తృప్తి పొందినప్పుడు, బానిసలుగా ఉన్న ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాాను మరచిపోకుండా జాగ్రత్త వహించాలి. \s5 \v 13 మీ యెహోవాా దేవునికే భయపడాలి, ఆయననే పూజించాలి, ఆయన పేరట మాత్రమే ప్రమాణం చేయాలి. \v 14 మీరు ఇతర దేవుళ్ళను, అంటే మీ చుట్టూ ఉన్న ఇతర జాతుల ప్రజల దేవుళ్ళను పూజింపకూడదు. \p \v 15 మీ మధ్య ఉన్న మీ యెహోవాా దేవుడు రోషం గల దేవుడు కాబట్టి ఆయన కోపాగ్ని మీ మీద చెలరేగి దేశంలో ఉండకుండాా మిమ్మల్ని నాశనం చేస్తాడు. \s5 \v 16 మీరు మస్సాలో ఆయన్ని పరీక్షించిన విధంగా మీ దేవుడైన యెహోవాాను శోధింపకూడదు. \v 17 ఆయన ఇచ్చిన ఆజ్ఞలను, అంటే ఆయన శాసనాలను, కట్టడలను జాగ్రత్తగా పాటించాలి. \p \s5 \v 18 మీకు సుఖశాంతులు కలిగేలా, మీ ఎదుట నుండి మీ శత్రువులందరినీ తరిమి వేస్తానని \v 19 యెహోవాా చెప్పిన ప్రకారం మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన ఆ మంచి దేశంలో మీరు ప్రవేశించి దాన్ని స్వాధీనం చేసుకొనేలా మీరు యెహోవాా దృష్టికి యథార్థమైనదీ ఉత్తమమైనదీ చేయాలి. \p \s5 \v 20 ఇక ముందు మీ కొడుకులు, మన యెహోవాా దేవుడు మీకు ఆజ్ఞాపించిన శాసనాలు, కట్టడలు, విధులు ఏవి? అని మిమ్మల్ని అడిగినప్పుడు \v 21 మీరు వారితో ఇలా చెప్పాలి, మనం ఐగుప్తులో ఫరోకు బానిసలుగా ఉన్నప్పుడు యెహోవాా తన బాహుబలంతో మనల్ని విడిపించాడు. \v 22 యెహోవాా ఐగుప్తు మీదా ఫరో మీదా అతని ఇంటివారందరి మీదా బాధాకరమైన, గొప్ప సూచకక్రియలూ అద్భుతాలూ మన కళ్ళ ఎదుట కనపరచి, \v 23 తాను మన పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశాన్ని మనకిచ్చి మనల్ని దానిలో ప్రవేశపెట్టడానికి అక్కడ నుండి మనల్ని రప్పించాడు. \p \s5 \v 24 మనం ఎప్పుడూ సుఖశాంతులు కలిగి ఈ రోజు ఉన్నట్టు మనం జీవించేలా మన యెహోవాా దేవునికి భయపడి ఈ కట్టడలనన్నిటినీ పాటించాలని మనకు ఆజ్ఞాపించాడు. \v 25 మన యెహోవాా దేవుడు మనకి ఆజ్ఞాపించిన విధంగా ఆయన ఎదుట ఈ ఆజ్ఞలన్నిటినీ పాటిస్తూ నడుచుకుంటే అదే మన విషయంలో నీతి అనిపించుకుంటుంది. \s5 \c 7 \p \v 1 మీ దేవుడైన యెహోవాా మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలోకి మిమ్మల్ని రప్పించి అనేక జాతుల ప్రజల్ని, అంటే సంఖ్యలో గాని, బలంలో గాని మిమ్మల్ని మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు అనే ఏడు జాతుల ప్రజల్ని మీ ఎదుట నుండి వెళ్లగొట్టాడు. \p \s5 \v 2 తరువాత, మీ యెహోవాా దేవుడు యుద్ధంలో వారిపై మీకు విజయం అనుగ్రహించినప్పుడు మీరు వారిని చంపి పూర్తిగా నాశనం చేయాలి. వారితో ఒప్పందాలు చేసుకోకూడదు. వారిపై దయ చూపకూడదు. \v 3 మీరు వారితో పెళ్ళి సంబంధాలు కలుపుకోకూడదు. వారి కొడుకులకు మీ కూతుళ్ళను ఇవ్వకూడదు. మీ కొడుకులకు వారి కూతుళ్ళను పుచ్చుకోకూడదు. \s5 \v 4 ఎందుకంటే వారు నన్ను కాకుండా ఇతర దేవుళ్ళను పూజించేలా మీ కొడుకులను తిప్పివేస్తారు. దాని కారణంగా యెహోవాా కోపం మీమీద రేగి ఆయన మిమ్మల్ని త్వరగా నాశనం చేస్తాడు. \p \v 5 కాబట్టి మీరు చేయవలసింది ఏమిటంటే, వారి బలిపీఠాలు కూలదోసి, వారి విగ్రహాలు పగలగొట్టి, వారి దేవతాస్తంభాలు నరికేసి, వారి ప్రతిమలను అగ్నితో కాల్చివేయాలి. \s5 \v 6 మీరు మీ యెహోవాా దేవునికి ప్రతిష్ఠితమైన ప్రజలు. ఆయన భూమి మీద ఉన్న అన్ని జాతుల కంటే మిమ్మల్ని హెచ్చించి, మిమ్మల్ని తన స్వంత ప్రజగా ఏర్పాటు చేసుకున్నాడు. \s5 \v 7 అంతేగానీ మీరు ఇతర జాతులకంటే విస్తారమైన ప్రజలని యెహోవాా మిమ్మల్ని ప్రేమించి ఏర్పరచుకోలేదు. ఇతర జాతుల ప్రజలకంటే సంఖ్యలో మీరు తక్కువే గదా. \v 8 అయితే యెహోవాా మిమ్మల్ని ప్రేమించాడు. ఆయన మీ పూర్వీకులకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చేవాడు కనుక తన బాహుబలంతో మిమ్మల్ని బానిసత్వం నుండీ ఐగుప్తు రాజు ఫరో చేతి నుండి విడిపించాడు. \p \s5 \v 9 కాబట్టి మీ దేవుడు యెహోవాాయే దేవుడనీ తనను ప్రేమించి, తన ఆజ్ఞలను పాటించే వారికి తన నిబంధనను స్థిరపరచేవాడనీ మీరు తెలుసుకోవాలి. ఆయన వేయి తరాల వరకూ కృప చూపేవాడనీ, నమ్మదగిన దేవుడనీ గ్రహించాలి. తనను ద్వేషించే ప్రతి ఒక్కరినీ నేరుగా నాశనం చేసి వారిని శిక్షించేవాడనీ మీరు తెలుసుకోవాలి. \v 10 ఆయన తనను ద్వేషించేవారి విషయంలో నేరుగా, త్వరగా దండన విధిస్తాడు. \v 11 కాబట్టి ఈ రోజు నేను మీకాజ్ఞాపించే విధులను, కట్టడలను మీరు పాటించాలి. \p \s5 \v 12 మీరు ఈ విధులను విని వాటిని పాటిస్తూ జీవిస్తే మీ యెహోవాా దేవుడు మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన ఒప్పందాన్ని నెరవేర్చి మీ పట్ల కృప చూపిస్తాడు. \v 13 ఆయన మిమ్మల్ని ప్రేమించి, ఆశీర్వదించి, అభివృద్ధి పరుస్తాడు. మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశంలో మీ గర్భఫలాన్ని, భూఫలాన్ని, ధాన్యాన్ని, ద్రాక్షారసాన్ని, నూనెను, పశువులు, గొర్రెెలు, మేకల మందలను దీవిస్తాడు. \p \s5 \v 14 అన్ని ఇతర జాతుల ప్రజలకంటే మీరు ఎక్కువగా ఆశీర్వాదం పొందుతారు. మీలో మగవారికే గాని, ఆడవారికే గాని సంతాన హీనత ఉండదు, మీ పశువుల్లో కూడా ఉండదు. \v 15 యెహోవాా మీలో నుండి వ్యాధులన్నిటినీ తీసివేసి, మీకు తెలిసిన ఐగుప్తులోని కఠినమైన క్షయ వ్యాధులన్నిటినీ మీకు దూరపరచి, మిమ్మల్ని ద్వేషించే వారి మీదికే వాటిని పంపిస్తాడు. \p \s5 \v 16 మీ దేవుడైన యెహోవాా మీకు అప్పగిస్తున్న సమస్త జాతులనూ మీరు బొత్తిగా నాశనం చేయాలి. వారి మీద దయ చూపకూడదు. వారి దేవుళ్ళను పూజింపకూడదు. ఎందుకంటే అది మీకు ఉరి అవుతుంది. \p \s5 \v 17 ఈ ప్రజలు మా కంటే విస్తారంగా ఉన్నారు, మేము వారిని ఎలా వెళ్లగొట్టగలం అని మీరనుకుంటారేమో. వారికి భయపడవద్దు. \v 18 మీ యెహోవాా దేవుడు ఫరోకీ ఐగుప్తు దేశానికి చేసిన దాన్ని, అంటే ఆయన మిమ్మల్ని బయటికి తెచ్చినప్పుడు \v 19 మీ కళ్ళు చూసిన ఆ గొప్ప బాధలు, సూచక క్రియలు, మహత్కార్యాలు, ఆయన బాహుబలం, ఆయన చూపిన మహా శక్తి, వీటన్నిటినీ బాగా జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రజలకు కూడా మీ యెహోవాా దేవుడు అలాగే చేస్తాడు. \s5 \v 20 మిగిలినవారు, మీ కంటబడకుండా దాక్కున్నవారు నశించేదాకా ఆయన వారి మీదికి పెద్ద కందిరీగలను పంపుతాడు. \p \v 21 కాబట్టి వారిని చూసి భయపడవద్దు. మీ యెహోవాా దేవుడు మీ మధ్య ఉన్నాడు, ఆయన భయంకరుడైన మహా దేవుడు. \v 22 మీ యెహోవాా దేవుడు మీ ఎదుట నుండి క్రమక్రమంగా ఈ ప్రజలను తొలగిస్తాడు. అడవి జంతువులు విస్తరించి మీకు ఆటంకంగా ఉండవచ్చు కాబట్టి వారినందరినీ ఒక్కసారే మీరు నాశనం చేయవద్దు. అది మీకు క్షేమకరం కాదు. \p \s5 \v 23 అయితే మీ యెహోవాా దేవుడు యుద్ధంలో వారిని మీకప్పగించి వారిని నాశనం చేసేవరకూ వారిని కలవరానికి గురిచేస్తాడు. \v 24 ఆయన వారి రాజులను మీ చేతికి అప్పగిస్తాడు. మీరు ఆకాశం కింద నుండి వారి పేరు తుడిచి వేయాలి. మీరు వారిని నాశనం చేసేవరకూ ఏ మనిషీ మీ ఎదుట నిలవలేడు. \s5 \v 25 వారి దేవతా ప్రతిమల్ని మీరు అగ్నితో కాల్చివేయాలి. వాటి మీద ఉన్న వెండి బంగారాల మీద ఆశ పెట్టుకోకూడదు. మీరు దాని ఉచ్చులో పడతారేమో. అందుకే వాటిని మీరు తీసుకోకూడదు. ఎందుకంటే అది మీ యెహోవాా దేవునికి అసహ్యం. \v 26 దానివలే మీరు శాపగ్రస్తులు కాకుండేలా మీరు హేయమైన దాన్ని మీ ఇళ్ళకు తేకూడదు. అది శాపగ్రస్తం కాబట్టి దాని పూర్తిగా తోసిపుచ్చి దాన్ని అసహ్యించుకోవాలి. \s5 \c 8 \p \v 1 మీరు జీవించి, ఫలించి యెహోవాా మీ పితరులకు వాగ్దానం చేసిన దేశంలో ప్రవేశించి దాన్ని స్వాధీనం చేసుకునేలా ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని పాటించాలి. \v 2 మీరు ఆయన ఆజ్ఞలను పాటిస్తారో లేదో మిమ్మల్ని పరీక్షించి మీ హృదయాన్ని తెలుసుకోడానికీ, మిమ్మల్ని లోబరచుకోడానికీ మీ యెహోవాా దేవుడు అరణ్యంలో ఈ 40 సంవత్సరాలు మిమ్మల్ని నడిపించిన సంగతి జ్ఞాపకం చేసుకోండి. \p \s5 \v 3 రొట్టె వలన మాత్రమే కాక యెహోవాా పలికిన ప్రతి మాట వలన మనుషులు జీవిస్తారని మీకు తెలిసేలా చేయడానికి ఆయన మిమ్మల్ని అణగదొక్కి, మీకు ఆకలి కలిగించి, మీరు గాని, మీ పూర్వీకులు గాని ఎప్పుడూ చూడని మన్నాతో మిమ్మల్ని పోషించాడు. \p \s5 \v 4 ఈ 40 సంవత్సరాలు మీరు వేసుకున్న బట్టలు పాతబడిపోలేదు, మీ కాళ్ళు బరువెక్కలేదు. \v 5 ఒక వ్యక్తి తన సొంత కొడుకుని ఏవిధంగా శిక్షిస్తాడో అదే విధంగా మీ దేవుడైన యెహోవాా మిమ్మల్ని శిక్షిస్తాడని మీరు తెలుసుకోవాలి. \v 6 ఆయన మార్గాల్లో నడుస్తూ ఆయనకు భయపడుతూ మీ యెహోవాా దేవుని ఆజ్ఞలను పాటించాలి. \p \s5 \v 7 ఆయన నిన్ను ప్రవేశపెడుతున్న ఈ మంచి దేశం నీటి వాగులు, లోయలు కొండల నుండి పారే ఊటలు, అగాధ జలాలు గల దేశం. \v 8 దానిలో గోదుమలు, బార్లీ, ద్రాక్షచెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు ఉంటాయి. అది ఒలీవ నూనె, తేనె లభించే దేశం. \s5 \v 9 మీరు తినడానికి ఆహారం పుష్కలంగా లభించే దేశం. అందులో మీకు దేనికీ కొదువ ఉండదు. అది ఇనపరాళ్లు గల దేశం. దాని కొండల్లో మీరు రాగిని తవ్వి తీయవచ్చు. \p \v 10 మీరు తిని తృప్తి పొంది మీ యెహోవాా దేవుడు మీకిచ్చిన మంచి దేశాన్నిబట్టి ఆయన్ను స్తుతించాలి. \s5 \v 11 ఈ రోజు నేను మీకాజ్ఞాపించే ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నిర్లక్ష్యం చేసి మీ దేవుడైన యెహోవాాను మరచిపోకుండా జాగ్రత్త పడండి. \v 12 మీరు కడుపారా తిని, మంచి ఇళ్ళు కట్టించుకుని వాటిలో నివసిస్తారు. \s5 \v 13 మీ పశువులు, గొర్రెెలు, మేకలు వృద్ధి చెంది, మీ వెండి బంగారాలు విస్తరించి, మీకు కలిగినదంతా వర్థిల్లుతుంది. \p \v 14 అప్పుడు మీ మనస్సు గర్వించి, బానిసల ఇల్లైన ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు యెహోవాాను మరచిపోతారేమో. \p \s5 \v 15 బాధ కలిగించే పాములు, తేళ్లతో నిండి, నీళ్ళు లేని ఎడారిలాంటి భయంకరమైన ఆ గొప్ప అరణ్యంలో ఆయన మిమ్మల్ని నడిపించాడు. రాతిబండ నుండి మీకు నీళ్లు రప్పించాడు. \v 16 చివరికి మీకు మేలు చేయాలని ఆయన మిమ్మల్ని అణగదొక్కి, మీకు ఆకలి కలిగించి, మీరు గాని మీ పూర్వీకులు గాని ఎప్పుడూ ఎరగని మన్నాతో మిమ్మల్ని పోషించాడు. \v 17 అయితే <<మీరు, మా సామర్ధ్యం, మా బాహుబలమే మాకింత ఐశ్వర్యం కలిగించాయి>> అనుకుంటారేమో. \p \s5 \v 18 కాబట్టి మీరు దేవుడైన యెహోవాాను జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే తాను మీ పూర్వీకులతో వాగ్దానం చేసినట్టు తన నిబంధనను ఈ రోజులాగా స్థాపించాలని మీరు ఐశ్వర్యం సంపాదించుకోడానికి మీకు సామర్ధ్యం కలిగించేవాడు ఆయనే. \v 19 మీరు మీ యెహోవాా దేవుణ్ణి మరచిపోయి ఇతర దేవుళ్ళను అనుసరించి, వారిని పూజించి నమస్కరిస్తే మీరు తప్పకుండా నశించి పోతారని ఈ రోజు మీ విషయంలో నేను సాక్ష్యం పలుకుతున్నాను. \v 20 యెహోవాా మీ ఎదుట ఉండకుండా నాశనం చేస్తున్న ఇతర జాతుల ప్రజలు విననట్టు మీ దేవుడైన యెహోవాా మాట వినకపోతే మీరు కూడా వారిలాగానే నాశనమౌతారు. \s5 \c 9 \p \v 1 ఇశ్రాయేలూ విను. మీకంటే ఎక్కువ బలం ఉన్న ప్రజలు, ఆకాశాన్నంటే ప్రాకారాలు ఉన్న గొప్ప పట్టణాలను స్వాధీనం చేసుకోడానికి ఈ రోజు మీరు యొర్దాను నది దాటబోతున్నారు. \v 2 ఆ ప్రజలు గొప్పవారు, పొడవైన దేహాలు గలవారు, మీకు తెలిసిన అనాకీయుల వంశస్థులు. <<అనాకీయుల్ని ఎవరూ ఎదిరించలేరు>> అనే మాట మీరు విన్నారు కదా. \p \s5 \v 3 కాబట్టి మీ యెహోవాా దేవుడు తానే దహించే అగ్నిలాగా మీకు ముందుగా దాటిపోతున్నాడని మీరు తెలుసుకోవాలి. ఆయన వారిని నాశనం చేసి మీ ఎదుట వారిని కూలదోస్తాడు. యెహోవాా మీతో చెప్పినట్టు మీరు వారిని వెళ్ల గొట్టి త్వరగా వారిని నాశనం చేస్తారు \s5 \v 4 మీ యెహోవాా దేవుడు మీ ఎదుట నుండి వారిని తోలివేసిన తరవాత, <<మేము ఈ దేశాన్ని స్వాధీనం చేసుకునేలా యెహోవాా మా నీతిని బట్టి మమ్మల్ని దీనిలో ప్రవేశపెట్టాడు>> అని అనుకోవద్దు. ఈ ప్రజల దుష్టత్వాన్ని బట్టి యెహోవాా మీ ఎదుట నుండి వారిని వెళ్లగొడుతున్నాడు. \p \s5 \v 5 మీరు వారి దేశానికి వచ్చి దాన్ని స్వాధీనం చేసుకోడానికి కారణం మీ నీతి గానీ మీ హృదయంలో ఉన్న యథార్థత గానీ కాదు. ఈ ప్రజల చెడుతనం వల్లనే యెహోవాా మీ పూర్వీకులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన వారిని మీ ఎదుట నుండి వెళ్లగొడుతున్నాడు. \s5 \v 6 మీ యెహోవాా దేవుడు మీకు ఈ మంచి దేశాన్ని స్వాధీనం చేయడం మీ నీతిని బట్టి కాదని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు మూర్ఖులైన ప్రజలు. \p \s5 \v 7 ఎడారిలో మీరు మీ దేవుడైన యెహోవాాకు కోపం పుట్టించిన సంగతి జ్ఞాపకం చేసుకోండి. దాన్ని మరచిపోవద్దు. మీరు ఐగుప్తు దేశంలో బయలుదేరిన రోజు నుండి ఈ ప్రాంతంలో మీరు ప్రవేశించేంత వరకూ మీరు యెహోవాా మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. \v 8 హోరేబులో మీరు యెహోవాాకు కోపం పుట్టించినప్పుడు యెహోవాా మిమ్మల్ని నాశనం చేయాలన్నంత కోపం తెచ్చుకున్నాడు. \p \s5 \v 9 ఆ రాతి పలకలు, అంటే యెహోవాా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలు తీసుకోడానికి నేను కొండ ఎక్కినప్పుడు, అన్నపానాలు మాని అక్కడ నలభై పగళ్లు, నలభై రాత్రులు ఉన్నాను. \v 10 అప్పుడు యెహోవాా తన వేలితో రాసిన రెండు రాతి పలకలు నాకిచ్చాడు. మీరు సమావేశమైన రోజు ఆ కొండ మీద అగ్నిలో నుండి యెహోవాా మీతో పలికిన మాటలన్నీ వాటి మీద ఉన్నాయి. \p \s5 \v 11 ఆ నలభై పగళ్లు, నలభై రాత్రుల తరువాత యెహోవాా నిబంధన సంబంధమైన ఆ రెండు రాతి పలకలు నాకు అప్పగించి, \v 12 <<నువ్వు ఇక్కడ నుండి త్వరగా దిగి వెళ్ళు. నువ్వు ఐగుప్తు నుండి రప్పించిన నీ ప్రజలు చెడిపోయి, నేను వారికి ఆజ్ఞాపించిన మార్గం నుండి త్వరగా తప్పిపోయి తమ కోసం పోత విగ్రహం చేసుకున్నారు>> అని నాతో చెప్పాడు. \p \s5 \v 13 యెహోవాా ఇంకా, <<నేను ఈ ప్రజలను చూశాను, ఇదిగో వారు మూర్ఖులైన ప్రజలు. \v 14 నాకు అడ్డం రావద్దు. నేను వారిని నాశనం చేసి వారి పేరు ఆకాశం కింద లేకుండా తుడిచివేసి, నిన్ను వారికంటే బలమైన, విస్తారమైన జనంగా చేస్తాను>> అని నాతో చెప్పాడు. \p \s5 \v 15 నేను కొండ దిగి వచ్చాను. కొండ అగ్నితో మండుతూ ఉంది. ఆ రెండు నిబంధన పలకలు నా రెండు చేతుల్లో ఉన్నాయి. \v 16 నేను చూసినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవాాకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు. దూడ పోత విగ్రహం చేయించుకొని యెహోవాా మీకు ఆజ్ఞాపించిన మార్గం నుండి అప్పటికే తప్పిపోయారు. \p \s5 \v 17 అప్పుడు నేను ఆ రెండు పలకలను, నా రెండు చేతులతో మీ కళ్ళ ఎదుట కింద పడవేసి పగలగొట్టాను. \v 18 మీరు యెహోవాా దృష్టికి దుర్మార్గం జరిగించి చేసిన మీ పాపాలను బట్టి ఆయనకు కోపం పుట్టించడం వలన, అన్నపానాలు మానివేసి మళ్ళీ నలభై పగళ్లు, నలభై రాత్రులు నేను యెహోవాా సన్నిధిలో సాగిలపడి ఉన్నాను. \s5 \v 19 ఎందుకంటే మిమ్మల్ని నాశనం చేయాలన్నంత కోపగించిన యెహోవాా మహోగ్రతను చూసి భయపడ్డాను. ఆ సమయంలో కూడా యెహోవాా నా మనవి ఆలకించాడు. \v 20 అంతేగాక యెహోవాా అహరోనుపై కోపపడి, అతణ్ణి నాశనం చేయడానికి చూసినప్పుడు నేను అప్పుడే అహరోను కోసం కూడా బతిమాలుకున్నాను. \p \s5 \v 21 అప్పుడు మీరు చేసిన పాపాన్ని, అంటే ఆ దూడను నేను అగ్నితో కాల్చి, నలగ్గొట్టి, మెత్తగా పొడి చేసి, ఆ కొండ నుండి ప్రవహిస్తున్న ఏటిలో ఆ ధూళిని పారపోశాను. \s5 \v 22 అంతేగాక మీరు తబేరాలో, మస్సాలో, కిబ్రోతు హత్తావాలో యెహోవాాకు కోపం పుట్టించారు. \v 23 యెహోవాా <<కాదేషు బర్నేయలో మీరు వెళ్లి నేను మీకిచ్చిన దేశాన్ని స్వాధీనం చేసుకోండి>> అని మీతో చెప్పినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవాాను నమ్మక ఆయన మాటకు ఎదురు తిరిగారు. \v 24 నేను మిమ్మల్ని ఎరిగిన రోజు నుండీ మీరు యెహోవాా మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. \p \s5 \v 25 కాబట్టి నేను మునుపు సాగిలపడినట్టు యెహోవాా సన్నిధిలో నలభై పగళ్లు, నలభై రాత్రులు సాగిలపడ్డాను. ఎందుకంటే యెహోవాా మిమ్మల్ని నాశనం చేస్తానని అన్నాడు. \v 26 నేను యెహోవాాను ప్రార్థిస్తూ ఈ విధంగా చెప్పాను, <<ప్రభూ, యెహోవాా, నువ్వు నీ మహిమ వలన విమోచించి, నీ బాహుబలంతో ఐగుప్తులో నుండి రప్పించిన నీ స్వాస్థ్యమైన ప్రజల్ని నాశనం చేయవద్దు. \s5 \v 27 నీ సేవకులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకో. ఈ ప్రజల కాఠిన్యాన్ని, వారి చెడుతనాన్ని, వారి పాపాన్ని చూడవద్దు. \p \v 28 ఎందుకంటే నువ్వు ఏ దేశంలో నుండి మమ్మల్ని రప్పించావో ఆ దేశస్థులు, యెహోవాా తాను వారికి వాగ్దానం చేసిన దేశంలోకి వారిని చేర్చలేక, వారిపైని ద్వేషం వలన అరణ్యంలో చంపడానికి వారిని రప్పించాడని చెప్పుకుంటారేమో. \v 29 నువ్వు నీ మహాబలం చేత, చాపిన నీ బాహువు చేత రప్పించిన నీ స్వాస్థ్యమూ నీ ప్రజలూ వీరే.>> \s5 \c 10 \p \v 1 అప్పుడు యెహోవాా, <<నువ్వు మొదటి పలకల వంటివి రెండు రాతిపలకలు చెక్కి, కొండ ఎక్కి నా దగ్గరకు రా. అలాగే చెక్కతో ఒక పెట్టె చేసుకో. \v 2 నువ్వు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న మాటలను నేను ఈ పలకల మీద రాసిన తరవాత వాటిని నువ్వు ఆ పెట్టెలో ఉంచాలి>> అని నాతో చెప్పాడు. \s5 \v 3 కాబట్టి నేను తుమ్మకర్రతో ఒక పెట్టె చేయించి మొదటి పలకలవంటి రెండు రాతి పలకలను చెక్కి వాటిని పట్టుకొని కొండ ఎక్కాను. \v 4 మీరు సమావేశమైన రోజున ఆయన ఆ కొండ మీద అగ్నిలో నుండి మీతో పలికిన పది ఆజ్ఞలనూ మొదట రాసినట్టే ఆ పలకల మీద రాశాడు. యెహోవాా వాటిని నాకిచ్చిన తరువాత నేను కొండ దిగి వచ్చి \s5 \v 5 నేను చేసిన మందసంలో ఆ పలకలు ఉంచాను. అదుగో, యెహోవాా నాకాజ్ఞాపించినట్టు వాటిని దానిలో ఉంచాను. \p \s5 \v 6 ఇశ్రాయేలు ప్రజలు యహకానీయులకు చెందిన బెయేరోతు నుండి బయలుదేరి మోసేరుకు వచ్చినప్పుడు అహరోను చనిపోయాడు. అక్కడ అతణ్ణి సమాధి చేశారు. అతని కొడుకు ఎలియాజరు అతని స్థానంలో యాజకుడయ్యాడు. \v 7 అక్కడ నుండి వారు గుద్గోదకు, గుద్గోద నుండి నీటివాగులతో నిండి ఉండే యొత్బాతా ప్రాంతానికి ప్రయాణమయ్యారు. \s5 \v 8 అప్పటి వరకూ జరుగుతున్నట్టు యెహోవాా నిబంధన మందసాన్ని మోయడానికి, యెహోవాా సన్నిధిలో నిలబడి సేవించడానికి, ప్రజల్ని ఆయన పేరిట దీవించడానికి ఆ సమయంలో యెహోవాా లేవీ గోత్రం వారిని ఎన్నుకున్నాడు. \v 9 అందుకే లేవీయులు తమ సోదరులతో పాటు స్వాస్థ్యం పొందలేదు. మీ దేవుడైన యెహోవాా వారితో చెప్పినట్టు వారి స్వాస్థ్యం ఆయనే. \p \s5 \v 10 ఇంతకు ముందులాగా నేను నలభై పగళ్లు, నలభై రాత్రులు కొండ మీద ఉన్నప్పుడు యెహోవాా నా మనవి ఆలకించి మిమ్మల్ని నాశనం చేయడం మానుకున్నాడు. \v 11 యెహోవాా నాతో, <<ఈ ప్రజలు నేను వారి పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశంలో ప్రవేశించి స్వాధీనం చేసుకొనేలా వారికి ముందుగా నడువు>> అని చెప్పాడు. \p \s5 \v 12 కాబట్టి ఇశ్రాయేలూ, మీ దేవుడైన యెహోవాాకు భయపడి ఆయన మార్గాల్లో నడుస్తూ, ఆయన్ని ప్రేమించి, మీ పూర్ణ మనస్సుతో, మీ పూర్ణాత్మతో సేవించు. \p \v 13 మీ మేలు కోసం ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించే యెహోవాా ఆజ్ఞలను, కట్టడలను పాటించడం తప్ప మీ దేవుడైన యెహోవాా మిమ్మల్ని ఇంకేమి కోరుతున్నాడు? \p \s5 \v 14 చూడు, ఆకాశ మహాకాశాలు, భూమి, వాటిలో ఉన్నదంతా మీ దేవుడైన యెహోవాావే. \v 15 అయితే యెహోవాా మీ పూర్వీకుల్ని ప్రేమించి వారి విషయంలో సంతోషించి వారి సంతానమైన మిమ్మల్ని మిగిలిన ప్రజలందరిలో ఈ రోజు ఏర్పాటు చేసుకున్నాడు. \p \s5 \v 16 కాబట్టి మీరు మూర్ఖంగా ప్రవర్తించకుండా సున్నతి లేని మీ హృదయాలకు సున్నతి చేసుకోండి. \v 17 ఎందుకంటే మీ దేవుడు యెహోవాా దేవుళ్లకే దేవుడు, ప్రభువులకే ప్రభువు. ఆయనే మహా దేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన మానవులెవరినీ లక్ష్య పెట్టడు. లంచం పుచ్చుకోడు. \s5 \v 18 ఆయన అనాధలకు, విధవరాళ్ళకు న్యాయం తీరుస్తాడు, పరదేశుల మీద దయ చూపి వారికి అన్నవస్త్రాలు అనుగ్రహిస్తాడు. \p \v 19 మీరు ఐగుప్తు దేశంలో ప్రవాసులుగా ఉన్నవారే కాబట్టి పరదేశి పట్ల జాలి చూపండి. \s5 \v 20 మీ దేవుడైన యెహోవాాకు భయపడి, ఆయన్ను సేవించి, ఆయన్నే హత్తుకొని, ఆయన పేరటే ప్రమాణం చేయండి. \v 21 ఆయనే మీ స్తుతికి పాత్రుడు. మీరు కళ్ళారా చూస్తుండగా భీకరమైన గొప్ప కార్యాలు మీ కోసం చేసిన మీ దేవుడు ఆయనే. \s5 \v 22 మీ పూర్వీకులు 70 మంది గుంపుగా ఐగుప్తుకు వెళ్ళారు. ఇప్పుడైతే మీ యెహోవాా దేవుడు ఆకాశనక్షత్రాల్లాగా మిమ్మల్ని విస్తరింపజేశాడు. \s5 \c 11 \p \v 1 కాబట్టి మీరు మీ దేవుడైన యెహోవాాను ప్రేమించి, ఆయనను అనుసరిస్తూ ఆయన కట్టడలనూ, విధులనూ, ఆజ్ఞలనూ అన్నివేళలా పాటించాలి. \s5 \v 2 మీ దేవుడు యెహోవాా పంపిన శిక్షను గురించీ ఆయన గొప్పతనం, ఆయన బాహుబలం, ఆయన ప్రభావం గురించీ తెలియని మీ పిల్లలతో చెప్పడం లేదని మీరు గ్రహించాలి. \p \v 3 ఐగుప్తు రాజైన ఫరోకు, అతని రాజ్యమంతటికి ఆయన చేసిన సూచక క్రియలు, అద్భుత కార్యాలు, \s5 \v 4 ఆయన ఐగుప్తు సైన్యానికి, వారి గుర్రాలకు, రథాలకు జరిగించినది మీరు చూశారు. వారు మిమ్మల్ని తరుముతున్నప్పుడు ఆయన ఎర్రసముద్రపు నీటిని వారి మీదకి ప్రవహించేలా చేసిన విషయం వారికి తెలియదు. \p \v 5 యెహోవాా ఇప్పటి వరకూ వారిని నాశనం చేసినదీ మీరు ఇక్కడికి వచ్చేదాకా ఎడారిలో మీకోసం చేసినదీ వారు చూడలేదు. \s5 \v 6 అంతేకాదు, యెహోవాా రూబేనీయుడైన ఏలీయాబు కొడుకులు దాతాను, అబీరాములకు చేసినదీ భూమి నోరు తెరచి వారిని, వారి ఇళ్ళను, గుడారాలను, వారికి ఉన్న సమస్తాన్నీ ఇశ్రాయేలు ప్రజలందరి మధ్య మింగివేసిన వైనం వారు చూడలేదు, వారికి తెలియదు. \v 7 యెహోవాా చేసిన ఆ గొప్ప కార్యాలన్నీ మీ కళ్ళ ఎదుట చేసాడు కదా. \p \s5 \v 8 కాబట్టి మీరు బలం తెచ్చుకుని నది దాటి వెళ్తున్న ఆ దేశంలో ప్రవేశించి దాన్ని స్వాధీనం చేసుకోడానికీ, \v 9 యెహోవాా మీ పూర్వీకులకు, వారి సంతానానికి ఇస్తానని వాగ్దానం చేసిన దేశంలో, అంటే పాలు తేనెలు ప్రవహించే దేశంలో మీరు దీర్ఘాయుష్షు కలిగి ఉండడానికి నేను ఈ రోజు మీకు ఆజ్ఞాపించే వాటన్నిటిని మీరు పాటించాలి. \p \s5 \v 10 మీరు స్వాధీనం చేసుకోబోయే దేశం మీరు విడిచి వచ్చిన ఐగుప్తు లాంటిది కాదు. అక్కడ మీరు విత్తనాలు చల్లి కూరమొక్కలకు చేసినట్టు మీ కాళ్లతో తోటకు నీరు కట్టారు. \v 11 మీరు నది దాటి స్వాధీనం చేసుకోడానికి వెళ్తున్న ఈ దేశం కొండలు, లోయలు ఉన్న దేశం. \v 12 అది ఆకాశం నుండి కురిసే వర్షం నీరు తాగుతుంది. అది మీ దేవుడు యెహోవాా తన దృష్టి ఉంచిన దేశం. ఆయన కనుదృష్టి సంవత్సరం ప్రారంభం నుండి అంతం వరకూ ఎల్లప్పుడూ దానిమీద ఉంటుంది. \p \s5 \v 13 కాబట్టి మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణాత్మతో, మీ దేవుడైన యెహోవాాను ప్రేమించి, ఆయనను సేవించాలి. ఈ రోజు నేను మీకిచ్చే ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా విని పాటిస్తే, \v 14 మీ దేశానికి వర్షం, అంటే తొలకరి, కడవరి వానలు వాటి కాలంలో కురుస్తాయి. అందువలన మీరు మీ ధాన్యాన్నీ ద్రాక్షారసాన్నీ నూనెనూ పోగు చేసుకుంటారు. \v 15 మీరు తిని తృప్తిపొందుతారు. ఆయన మీ పశువుల కోసం మీ పొలాల్లో గడ్డి మొలిపిస్తాడు. \p \s5 \v 16 మీ హృదయం మోసపోయి, మీరు దారి తప్పి ఇతర దేవుళ్ళను పూజించి, వాటికి మొక్కకుండా జాగ్రత్త వహించండి. \v 17 లేకపోతే యెహోవాా మీమీద కోపపడి ఆకాశాన్ని మూసివేస్తాడు. అప్పుడు వాన కురవదు, భూమి పండదు. యెహోవాా మీకిస్తున్న ఆ మంచి దేశంలో నివసించకుండా మీరు త్వరగా నాశనమైపోతారు. \p \s5 \v 18 కాబట్టి మీరు ఈ నా మాటల్ని మీ హృదయాల్లో, మనస్సుల్లో ఉంచుకోండి. వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకోండి. వాటిని మీ నుదిటి మీద బాసికాలుగా ఉండనివ్వండి. \v 19 మీరు మీ ఇంట్లో కూర్చున్నప్పుడు, దారిలో నడిచేటప్పుడు, నిద్రపోయే ముందు, లేచినప్పుడు వాటి గురించి మాట్లాడాలి, వాటిని మీ పిల్లలకు నేర్పించాలి. \s5 \v 20 మీ ఇంటి గుమ్మాల మీద వాటిని రాయాలి. \v 21 ఆ విధంగా చేస్తే యెహోవాా మీ పూర్వీకులకు ఇస్తానని వాగ్దానం చేసిన దేశంలో మీరు జీవించే కాలం, మీ సంతతివారు జీవించే కాలం భూమిపై ఆకాశం ఉన్నంత కాలం విస్తరిస్తాయి. \p \s5 \v 22 మీరు మీ దేవుడు యెహోవాాను ప్రేమించి, ఆయన మార్గాల్లో నడుస్తూ, ఆయనకు కట్టుబడి, నేను మీకు ఆదేశించే ఈ ఆజ్ఞలన్నిటినీ జాగ్రత్తగా పాటించాలి. \v 23 అప్పుడు యెహోవాా మీ ఎదుట నుండి ఈ జాతులన్నిటినీ వెళ్లగొడతాడు. మీరు మీకంటే బలమైన, గొప్ప జాతి ప్రజల దేశాలను స్వాధీనం చేసుకుంటారు. \s5 \v 24 మీరు అడుగుపెట్టే ప్రతి స్థలం మీదవుతుంది. ఎడారి నుండి లెబానోను వరకూ, యూఫ్రటీసు నది నుండి పడమటి సముద్రం వరకూ మీ సరిహద్దుగా ఉంటుంది. \v 25 ఏ మానవుడూ మీ ఎదుట నిలవలేడు. ఆయన మీతో చెప్పినట్టు మీ దేవుడు యెహోవాా మీరు అడుగుపెట్టే స్థలమంతటి మీదా మీరంటే భయం, వణుకు పుట్టిస్తాడు. \p \s5 \v 26 చూడండి, ఈ రోజు నేను మీ ఎదుట దీవెననూ శాపాన్నీ ఉంచుతున్నాను. \v 27 నేను మీకాజ్ఞాపించే మీ దేవుడు యెహోవాా ఆజ్ఞలను మీరు విని, వాటిని పాటిస్తే దీవెన కలుగుతుంది. \v 28 మీరు వాటిని విని పాటించకుండా నేను మీకు ఆజ్ఞాపించే మార్గాన్ని విడిచిపెట్టి అప్పటివరకూ మీకు తెలియని ఇతర దేవుళ్ళను అనుసరిస్తే మీకు శాపం కలుగుతుంది. \p \s5 \v 29 కాబట్టి మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలో మీ దేవుడైన యెహోవాా మిమ్మల్ని రప్పించిన తరువాత గెరిజీము కొండ మీద ఆ దీవెననూ ఏబాలు కొండ మీద ఆ శాపాన్నీ ప్రకటించాలి. \v 30 అవి యొర్దాను అవతల పడమటి వైపు మైదానం మార్గం వెనుక మోరేలోని సింధూరవృక్షాల పక్కన గిల్గాలు ఎదురుగా అరాబాలో నివసించే కనానీయుల దేశంలో ఉన్నాయి కదా. \p \s5 \v 31 మీ యెహోవాా దేవుడు మీకిస్తున్న దేశాన్ని స్వాధీనం చేసుకోడానికి ఈ యొర్దాను నదిని దాటబోతున్నారు. మీరు దాన్ని స్వాధీనం చేసుకుని దానిలో నివసిస్తారు. \v 32 ఈ రోజు నేను మీకు నియమించే కట్టడలు, విధులన్నిటిని మీరు పాటించాలి. \s5 \c 12 \p \v 1 మీరు స్వాధీనం చేసుకోడానికి మీ పూర్వీకుల దేవుడు యెహోవాా మీకిచ్చిన దేశంలో మీ జీవితకాలమంతా మీరు పాటించాల్సిన కట్టడలు, విధులు ఇవి. \p \v 2 మీరు స్వాధీనం చేసుకోబోయే జాతుల ప్రజలు గొప్ప పర్వతాల మీదా మెట్టల మీదా పచ్చని చెట్ల కిందా ఎక్కడెక్కడ వారి దేవుళ్ళను పూజించారో ఆ స్థలాలన్నిటినీ మీరు పూర్తిగా ధ్వంసం చేయాలి. \s5 \v 3 వారి హోమపీఠాలను కూలదోసి, వారి విగ్రహాలను పగలగొట్టాలి. వారి దేవతా స్తంభాలను అగ్నితో కాల్చివేసి, వారి దేవుళ్ళ ప్రతిమలను కూల్చి వెయ్యాలి. ఆ స్థలం లో వాటి పేర్లు కూడా లేకుండా నాశనం చేయాలి. \p \v 4 వారు తమ దేవుళ్ళను ఆరాధించినట్టు మీరు యెహోవాాను అరాధించకూడదు. \s5 \v 5 మీ దేవుడు యెహోవాా మీ గోత్రాలన్నిటిలో నుండి తన పేరుకు నివాసస్థానంగా ఏర్పాటు చేసుకునే స్థలాన్ని వెదికి అక్కడికి మీరు యాత్రలు చేస్తూ ఉండాలి. \v 6 మీ హోమ బలులు, అర్పణ బలులు, మీ దశమభాగాలు, ప్రతిష్టిత నైవేద్యాలు, మొక్కుబడి అర్పణలు, స్వేచ్ఛార్పణలు, పశువులు, మేకలలో తొలిచూలు పిల్లలు, వీటన్నిటినీ అక్కడికే తీసుకురావాలి. \s5 \v 7 అక్కడే మీరు, మీ దేవుడు యెహోవాా మిమ్మల్ని ఆశీర్వదించి ఇచ్చిన మీ కుటుంబాలు యెహోవాా సన్నిధిలో భోజనం చేసి మీ పనులన్నిటిలో సంతోషించాలి. \p \s5 \v 8 ఈ రోజు మనమిక్కడ చేస్తున్నట్టు మీలో ప్రతివాడూ తనకిష్టమైనట్టు చేయకూడదు. \v 9 నీ దేవుడు యెహోవాా మీకిస్తున్న విశ్రాంతిని, స్వాస్థ్యాన్ని మీరింతకు ముందు పొందలేదు. \s5 \v 10 మీరు యొర్దాను దాటి మీ దేవుడు యెహోవాా మీకు స్వాస్థ్యంగా ఇస్తున్న దేశంలో స్థిరపడిన తరువాత ఆయన మీ చుట్టూ ఉన్న శత్రువులందరి నుండి మీకు విశ్రాంతినిచ్చి నెమ్మది కలిగిస్తాను. \v 11 నేను మీకు ఆజ్ఞాపించేవాటన్నిటిననీ, అంటే మీ హోమ బలులు, బలులు, దశమ భాగాలు, ప్రతిష్ఠిత నైవేద్యాలు, మీరు యెహోవాాకు చేసే శ్రేష్ఠమైన మొక్కుబళ్లను మీ దేవుడైన యెహోవాా తన పేరుకు నివాసంగా ఏర్పాటు చేసుకునే స్థలానికే మీరు తీసుకురావాలి. \p \s5 \v 12 మీరు, మీ కొడుకులు, కూతుళ్ళు, దాసులు, దాసీలు, మీలో స్వాస్థ్యం లేకుండా మీ ఇళ్ళలో ఉండే లేవీయులు మీ దేవుడు యెహోవాా సన్నిధిలో సంతోషించాలి. \s5 \v 13 మీరు చూసిన ప్రతి స్థలంలో మీ దహనబలులు అర్పించకూడదు. \v 14 కేవలం యెహోవాా మీ గోత్రాల్లో ఒకదాని మధ్య ఏర్పాటు చేసుకునే స్థలంలోనే మీ హోమబలులు అర్పించి నేను మీకు ఆజ్ఞాపించే సమస్తాన్నీ అక్కడే జరిగించాలి. \p \s5 \v 15 అయితే మీ దేవుడు యెహోవాా మిమ్మల్ని దీవించిన కొలది మీ ఇళ్ళలో మీకిష్టమైన దాన్ని చంపి తినవచ్చు. పవిత్రులైనా, అపవిత్రులైనా ఎర్రజింకను, చిన్న దుప్పిని తినవచ్చు. \v 16 వాటి రక్తం మాత్రం తినకూడదు. దాన్ని నీళ్లలాగా నేల మీద పారబోయాలి. \s5 \v 17 మీ ధాన్యంలో, ద్రాక్షారసంలో, నూనెలో, దశమ భాగం, మీ ఆవులు, గొర్రెెలు, మేకలలో తొలిచూలు పిల్లల్లో, మీరు చేసే మొక్కుబళ్లలో స్వేచ్ఛార్పణలు, ప్రతిష్ఠార్పణలు మీ ఇంట్లో తినకూడదు. \s5 \v 18 వాటిని మీ దేవుడైన యెహోవాా ఏర్పాటు చేసుకునే స్థలం లోనే మీరు, మీ కొడుకులు, కూతుళ్ళు దాసదాసీలు, మీ ఇంట్లో ఉండే లేవీయులు, అందరూ మీ యెహోవాా దేవుని సన్నిధిలో తిని, మీరు చేసే ప్రయత్నాలన్నిటిలో సంతోషించాలి. \p \v 19 మీరు మీ దేశంలో జీవించిన కాలమంతటిలో లేవీయులను విడిచిపెట్టకూడదు. \s5 \v 20 మీ దేవుడు యెహోవాా తాను మీ కిచ్చిన మాట ప్రకారం మీ సరిహద్దుల్ని విశాలపరచిన తరువాత తప్పకుండా మాంసం తినాలని కోరుకుంటావు. అప్పుడు నీకిష్టమైన మాంసం తినవచ్చు. \s5 \v 21 నీ దేవుడు యెహోవాా తన సన్నిధిని నిలిపి ఉంచడానికి ఎన్నుకున్న స్థలం మీకు దూరంగా ఉన్నట్లయితే, \v 22 యెహోవాా మీకిచ్చిన ఆవుల్లో గాని, గొర్రెెలు, మేకల్లో గాని దేనినైనా నేను మీకాజ్ఞాపించినట్టు చంపి నీ ఇంట్లో తినవచ్చు. జింకను, దుప్పిని తిన్నట్టుగానే దాన్ని తినవచ్చు. పవిత్రులు, అపవిత్రులు అనే భేదం లేకుండ ఎవరైనా తినవచ్చు. \p \s5 \v 23 అయితే వాటి రక్తాన్ని మాత్రం తినకూడదు, జాగ్రత్త సుమా. ఎందుకంటే రక్తమే ప్రాణం. మాంసంతో ప్రాణాధారమైన దాన్ని తినకూడదు. \v 24 మీరు దాన్ని తినకుండా భూమి మీద నీళ్లలాగా పారబోయాలి. \v 25 మీరు దాన్ని తినకుండా యెహోవాా దృష్టికి ఇష్టమైనదాన్ని చేసినందుకు మీకు, మీ సంతానానికి మేలు కలుగుతుంది. \p \s5 \v 26 మీకు నియమించిన ప్రతిష్టితార్పణలు, మొక్కుబడుల్ని మాత్రం యెహోవాా ఏర్పాటు చేసుకున్న స్థలానికే మీరు తీసుకువెళ్ళాలి. \v 27 మీ దహనబలులనూ వాటి రక్తమాంసాలనూ మీ దేవుడు యెహోవాా బలిపీఠం మీద అర్పించాలి. మీ బలుల రక్తాన్ని మీ దేవుడు యెహోవాా బలిపీఠం మీద పోయాలి. వాటి మాంసం మీరు తినాలి. \p \s5 \v 28 నేను మీకు ఆజ్ఞాపిస్తున్న ఈ మాటలన్నిటినీ మీరు జాగ్రత్తగా విని పాటిస్తే మీ దేవుడైన యెహోవాా దృష్టికి మంచిదాన్నీ, యుక్తమైనదాన్నీ మీరు చేసినందుకు మీకు, మీ తరువాత మీ సంతతి వారికి ఎల్లప్పుడూ సుఖశాంతులు కలుగుతాయి. \s5 \v 29 మీరు స్వాధీనం చేసుకోడానికి వెళ్తున్న దేశ ప్రజల్ని మీ యెహోవాా దేవుడు మీ ఎదుట నుండి నాశనం చేసిన తరువాత, మీరు ఆ దేశంలో నివసించేటప్పుడు, మీరు వారిని అనుసరించాలనే శోధనలో చిక్కుకోవద్దు. \p \v 30 ఈ ప్రజలు తమ దేవుళ్ళను పూజిస్తున్నట్టే మేము కూడా వారి దేవుళ్ళను పూజిస్తాము అనుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. \s5 \v 31 వారు తమ దేవుళ్ళకు చేసిన విధంగా మీరు మీ దేవుడైన యెహోవాా విషయంలో చేయవద్దు. ఎందుకంటే వారు తమ దేవుళ్ళకు చేసేదంతా యెహోవాా ద్వేషిస్తాడు. అవి ఆయనకు హేయం. వారు తమ దేవుళ్ళ పేరట తమ కొడుకులనూ, కూతుళ్ళనూ అగ్నిగుండంలో కాల్చివేస్తారు. \v 32 నేను మీకాజ్ఞాపిస్తున్న ప్రతి మాటను మీరు పాటించాలి. దానిలో ఏమీ కలపకూడదు, దానిలో నుండి ఏమీ తీసివేయకూడదు. \s5 \c 13 \p \v 1 ప్రవక్త గానీ కలలు కనేవాడు గానీ మీ ఎదుట సూచక క్రియను లేక మహత్కార్యాన్ని చూపించి, \v 2 మీరు ఎరుగని <<ఇతర దేవుళ్ళను అనుసరించి పూజిద్దాం రండి>> అని చెబుతాడేమో. \v 3 అలా చెప్పినప్పుడు అతడు మీతో చెప్పిన సూచక క్రియ లేక మహత్కార్యం జరిగినా సరే, ఆ ప్రవక్త, లేక కలలు కనేవాడి మాటలు వినవద్దు. ఎందుకంటే మీరు మీ దేవుడైన యెహోవాాను మీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకోడానికి మీ దేవుడు యెహోవాా మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. \p \s5 \v 4 మీరు మీ యెహోవాా దేవునికి లోబడి, ఆయనకే భయపడి, ఆయన ఆజ్ఞలను పాటించి, ఆయన మాట విని, ఆయనను సేవించి, ఆయననే హత్తుకొని ఉండాలి. \v 5 మీరు నడుచుకోవాలని మీ దేవుడు యెహోవాా మీకాజ్ఞాపించిన మార్గం నుండి మిమ్మల్ని తొలగించి, ఐగుప్తు దేశం అనే బానిసల ఇంట్లో నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడైన యెహోవాా మీద తిరుగుబాటు చేయడానికి మిమ్మల్ని ప్రేరేపించారు కాబట్టి ఆ ప్రవక్తకు, లేక కలలు కనేవాడికి మరణశిక్ష విధించాలి. ఆ విధంగా మీ మధ్య నుండి ఆ దుష్టత్వాన్ని పరిహరించాలి. \p \s5 \v 6 మీ తల్లి కొడుకు, మీ సోదరుడు, మీ కొడుకు, మీ కూతురు, మీ భార్య, ప్రాణస్నేహితుడు, \v 7 ఎవరైనా సరే, భూమి ఈ చివరి నుండి ఆ చివర వరకూ మీకు దగ్గరైనా, దూరమైనా, మీరు, మీ పూర్వీకులు ఎరగని మీ చుట్టూ ఉన్న ప్రజల దేవుళ్ళను పూజిద్దాం రమ్మని రహస్యంగా మిమ్మల్ని ప్రేరేపిస్తే \s5 \v 8 వారి మాటకు ఒప్పుకోవద్దు. వారి మాట వినవద్దు. వారిని విడిచిపెట్టవద్దు, వారి మీద దయ చూపవద్దు. వారిని తప్పించడానికి ప్రయత్నించకుండా వారిని తప్పకుండా చంపాలి. \v 9 వారిని చంపడానికి ప్రజలందరి కంటే ముందుగా మీ చెయ్యి వారి మీద పడాలి. \s5 \v 10 రాళ్లతో వారిని చావగొట్టాలి. ఎందుకంటే ఐగుప్తు దేశం నుండి బానిసల ఇంటి నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడైన యెహోవాా నుండి మిమ్మల్ని దూరం చేయడానికి వారు ప్రయత్నించారు. \v 11 అప్పుడు ఇశ్రాయేలు ప్రజలంతా అది విని భయపడి, మళ్ళీ అలాంటి చెడ్డ పని మీ మధ్య చేయరు. \p \s5 \v 12 మీరు నివసించడానికి మీ దేవుడైన యెహోవాా మీకు ఇస్తున్న వాటిలో ఏదైనా ఒక పట్టణంలో \v 13 దుష్టులైన కొందరు మీరు ఎరుగని ఇతర దేవుళ్ళను పూజిద్దాం రండని తమ పట్టణ ప్రజల్ని ప్రేరేపించారని వింటే, మీరు ఆ సంగతిని బాగా పరీక్షించి విచారించాలి. \v 14 అది నిజమైతే, అంటే అలాంటి హేయమైన పని మీ మధ్య జరిగి ఉంటే \s5 \v 15 ఆ పట్టణస్తుల్ని తప్పకుండా కత్తితో చంపి, దానినీ దానిలో ఉన్న సమస్తాన్నీ దాని పశువులనూ కత్తితో చంపివేయాలి. \v 16 దానిలో దోచుకున్న సొమ్మంతటినీ దాని వీధిలో పోగుచేసి, మీ దేవుడు యెహోవాా పేరున ఆ పట్టణాన్ని, దాని సొత్తునీ పూర్తిగా కాల్చివేయాలి. దాన్ని ఇక ఎన్నటికీ తిరిగి కట్టకూడదు, అది పాడుదిబ్బలాగా ఉండిపోవాలి. \s5 \v 17 ఈ రోజు నేను మీకాజ్ఞాపిస్తున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ పాటిస్తూ \v 18 మీ దేవుడైన యెహోవాా దృష్టికి సరైన దాన్ని చేస్తూ, ఆయన మాట వినాలి. యెహోవాా తన కోపం నుండి మళ్లుకుని మిమ్మల్ని కనికరించి, దయ చూపి మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన విధంగా మిమ్మల్ని విస్తరింపజేయాలంటే నాశనం చేయాల్సిన దానిలో కొంచెమైనా మీ దగ్గర ఉంచుకోకూడదు. \s5 \c 14 \p \v 1 మీరు మీ యెహోవాా దేవుని ప్రజలు కాబట్టి ఎవరైనా చనిపోతే మిమ్మల్ని మీరు కోసుకోవడం, మీ ముఖంలో ఏ భాగాన్నైనా గొరుక్కోవడం చేయకూడదు. \v 2 ఎందుకంటే మీ దేవుడైన యెహోవాాకు మీరు ప్రతిష్టితమైన ప్రజలు. భూమి మీద ఉన్న అన్ని జాతుల ప్రజల నుండి ప్రత్యేకంగా తన స్వంత ప్రజలుగా యెహోవాా మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. \p \s5 \v 3 మీరు హేయమైనది ఏదీ తినకూడదు. మీరు ఈ జంతువుల్ని తినవచ్చు. \v 4 ఎద్దు, గొర్రెె, మేక. \v 5 దుప్పి, ఎర్ర చిన్న జింక, దుప్పి, కారు మేక, కారు జింక, లేడి, కొండ గొర్రెె. \s5 \v 6 జంతువుల్లో రెండు డెక్కలు ఉండి నెమరు వేసే వాటిని తినవచ్చు. \v 7 నెమరు వేసేవైనా రెండు డెక్కలు గలదైనా నెమరు వేసి ఒక్కటే డెక్క కలిగిన ఒంటె, కుందేలు, పొట్టి కుందేలు అనే జంతువుల్ని తినకూడదు. అవి మీకు నిషిద్ధం. \s5 \v 8 అలాగే పంది రెండు డెక్కలు కలిగినదైనా నెమరు వేయదు కాబట్టి అది మీకు నిషిద్ధం. వాటి మాంసం తినకూడదు, వాటి శవాలను తాక కూడదు. \p \s5 \v 9 నీటిలో నివసించే వాటిలో రెక్కలు, పొలుసులు గలవాటినన్నిటినీ తినవచ్చు. \v 10 రెక్కలు, పొలుసులు లేని దాన్ని మీరు తినకూడదు. అది మీకు నిషిద్ధం. \p \s5 \v 11 పవిత్రమైన ప్రతి పక్షినీ మీరు తినవచ్చు. \v 12 మీరు తినరాని పక్షులు ఏవంటే, పక్షిరాజు, రాబందు, గద్ద. \v 13 ఎర్ర గద్ద, నల్ల గద్ద, డేగ. \s5 \v 14 అన్ని రకాల కాకులు. \v 15 నిప్పు కోడి, నిశి డేగ, అన్ని రకాల డేగలు. \v 16 చిన్న గుడ్లగూబ, పెద్ద గుడ్లగూబ, తీతువు పిట్ట, \v 17 గూడబాతు, బోడి రాబందు, గండ భేరుండం. \s5 \v 18 కొంగ, అన్ని రకాల బకాలు, కూకుడు గువ్వ, గబ్బిలం. \v 19 ఎగిరే ప్రతి పురుగూ మీకు నిషిద్ధం. వాటిని తినకూడదు. \v 20 ఎగిరే పవిత్రమైన ప్రతి దాన్నీ తినవచ్చు. \p \s5 \v 21 దానికదే చచ్చిన దాన్ని మీరు తినకూడదు. అయితే దాన్ని మీ ఇంటి ఆవరణంలో ఉన్న పరదేశికి తినడానికి ఇయ్యవచ్చు. లేక అన్యునికి దాన్ని అమ్మవచ్చు. ఎందుకంటే మీ దేవుడైన యెహోవాాకు మీరు ప్రతిష్ఠితమైన ప్రజలు. మేకపిల్లను దాని తల్లి పాలతో కలిపి వండకూడదు. \p \s5 \v 22 ప్రతి సంవత్సరం, మీ విత్తనాల పంటలో దశమ భాగాన్ని తప్పనిసరిగా వేరు చెయ్యాలి. \v 23 మీ జీవితమంతటిలో మీ దేవుడైన యెహోవాాను మీరు గౌరవించాలంటే ఆయన తన నామానికి నివాస స్థానంగా ఏర్పాటు చేసుకొన్న స్థలంలో, ఆయన సన్నిధిలో మీ పంటలో, ద్రాక్షారసంలో, నూనెలో పదో పంతును, మీ పశువుల్లో గొర్రెెల్లో మేకల్లో తొలిచూలు వాటిని తినాలి. \p \s5 \v 24 యెహోవాా తన సన్నిధి కోసం ఏర్పాటు చేసుకున్న స్థలం దూరంగా ఉంటే, మీరు వాటిని మోయలేరు కాబట్టి మీ దేవుడైన యెహోవాా మిమ్మల్ని ఆశీర్వదించినప్పుడు, \v 25 వాటిని వెండిగా మార్చి దాన్ని తీసుకుని మీ యెహోవాా దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలానికి వెళ్లి, \s5 \v 26 ఎద్దులు, గొర్రెెలు, ద్రాక్షారసం, మద్యం, వీటిలో మీరు కోరిన దానికి ఆ వెండిని ఇచ్చి, అక్కడ మీ దేవుడు యెహోవాా సన్నిధిలో భోజనం చేసి, మీరు, మీ ఇంటివారు, మీ ఇంట్లో ఉండే లేవీయులు సంతోషించాలి. \v 27 లేవీయులను విడిచిపెట్టకూడదు. ఎందుకంటే మీ మధ్యలో వారికి వంతు గాని, స్వాస్థ్యం గాని లేదు. \p \s5 \v 28 మీ దేవుడు యెహోవాా మీరు చేసే పని అంతటిలో మిమ్మల్ని ఆశీర్వదించేలా మూడు సంవత్సరాల కొకసారి, ఆ సంవత్సరం మీకు కలిగిన పంటలో పదో వంతుని బయటికి తెచ్చి మీ ఇంట్లో ఉంచాలి. \v 29 అప్పుడు మీ మధ్యలో వంతు గాని, స్వాస్థ్యం గాని లేని లేవీయులు, మీ ఇంట్లో ఉన్న పరదేశులు, అనాధలు, విధవరాళ్ళు వచ్చి భోజనం చేసి తృప్తి పొందుతారు. \s5 \c 15 \p \v 1 ప్రతి ఏడవ సంవత్సరం అంతంలో అప్పులన్నీ రద్దు చేయాలి. అది ఎలాగంటే, \v 2 తన పొరుగువాడికి అప్పు ఇచ్చిన ప్రతివాడూ దాన్ని రద్దు చేసి వారిని విడిచిపెట్టాలి. అది యెహోవాా ప్రకటించిన గడువు కాబట్టి అప్పు ఇచ్చినవాడు తన పొరుగువాడిపై లేక తన సోదరునిపై ఒత్తిడి తేకూడదు. \v 3 ఇశ్రాయేలీయుడు కాని వ్యక్తిపై ఒత్తిడి తేవచ్చు గాని మీ సోదరుని దగ్గర ఉన్న మీ సొమ్మును విడిచిపెట్టాలి. \s5 \v 4 మీరు స్వాధీనం చేసుకోడానికి యెహోవాా దేవుడు మీకు స్వాస్థ్యంగా ఇస్తున్న దేశంలో యెహోవాా మిమ్మల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు. \p \v 5 కాబట్టి ఈ రోజు నేను మీకు ఆదేశించే యెహోవాా దేవుని ఆజ్ఞలన్నిటినీ జాగ్రత్తగా విని పాటిస్తే మీలో పేదవాళ్ళు ఉండనే ఉండరు. \v 6 ఎందుకంటే ఆయన మీతో చెప్పినట్టు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు కాబట్టి మీరు ఇతరులు అనేకులకు అప్పిస్తారు గాని అప్పు చెయ్యరు. అనేక రాజ్యాలను పాలిస్తారు గాని ఎవరూ మిమ్మల్ని పరిపాలించరు. \p \s5 \v 7 మీ దేవుడు యెహోవాా మీకిస్తున్న దేశంలోని మీ పట్టణాల్లో ఎక్కడైనా మీ సోదరుల్లో ఒక బీదవాడు ఉంటే అతనిపై దయ చూపాలి. మీ హృదయాలను కఠినపరచుకోకూడదు. \v 8 మీ చెయ్యి ముడుచుకోకుండా తప్పక వాడి వైపు చాచి, వాడి అక్కరకు చాలినంతగా వాడికి అప్పు ఇవ్వాలి. \s5 \v 9 అప్పు రద్దు చేయాల్సిన ఏడో సంవత్సరం దగ్గర పడింది అనే చెడ్డ తలంపు మీ మనస్సులో కలగనీయవద్దు. బీదవాడైన మీ సోదరునిపై మీరు దయ చూపి అతనికేమీ ఇవ్వకపోతే వాడొకవేళ మిమ్మల్ని గూర్చి యెహోవాాకు మొరపెడితే అది మీకు పాపం అవుతుంది. \p \v 10 కాబట్టి మీరు తప్పకుండా అతనికి ఇవ్వాలి. అతనికి ఇచ్చినందుకు మనస్సులో విచారపడకూడదు. ఇందువలన యెహోవాా దేవుడు మీ పనులన్నిటిలో, మీరు చేసే ప్రయత్నాలన్నిటిలో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. \s5 \v 11 బీదలు దేశంలో ఉండక మానరు. అందుచేత నేను మీ దేశంలో దీనులు, బీదలు అయిన మీ సోదరులకు తప్పకుండా సహాయం చేయాలని మీకు ఆజ్ఞాపిస్తున్నాను. \p \s5 \v 12 మీ సోదరుల్లో మీరు కొన్న హెబ్రీయుడు, లేక హెబ్రీయురాలు ఆరు సంవత్సరాలు మీకు దాస్యం చేసిన తరవాత ఏడో సంవత్సరం వారికి విడుదలనిచ్చి నీ దగ్గర నుండి పంపివేయాలి. \v 13 అయితే ఆ విధంగా పంపేటప్పుడు మీరు వారిని వట్టి చేతులతో పంపకూడదు. \v 14 వారికి మీ మందలో, ధాన్యంలో, మీ ద్రాక్ష గానుగలో నుండి ఉదారంగా ఇవ్వాలి. మీ దేవుడు యెహోవాా మిమ్మల్ని ఆశీర్వదించి మీకిచ్చిన కొలదీ వారికి ఇవ్వాలి. \p \s5 \v 15 మీరు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు మీ యెహోవాా దేవుడు మిమ్మల్ని విమోచించాడని జ్ఞాపకం చేసుకోండి. అందుకే నేను ఈ సంగతి ఈ రోజు మీకు ఆజ్ఞాపించాను. \v 16 అయితే వారు నీ దగ్గర పొందిన మేలును బట్టి మిమ్మల్ని, మీ ఇంటివారిని ప్రేమించి, <<నేను మీ దగ్గర నుండి వెళ్లిపోను>> అని మీతో చెబితే, \v 17 మీరు ఒక లోహపు ఊచ తీసుకుని, తలుపులోకి దిగేలా వాడి చెవికి దాన్ని గుచ్చాలి. ఆ తరువాత అతడు ఎన్నటికీ మీకు దాసుడుగా ఉంటాడు. అదే విధంగా మీరు మీ దాసికి కూడా చేయాలి. \p \s5 \v 18 మీ దాసులను స్వతంత్రులుగా విడిచిపెట్టడాన్ని కష్టంగా భావించకూడదు. ఎందుకంటే వారు ఆరు సంవత్సరాలు మీకు దాస్యం చేయడం ద్వారా జీతగాడికి మీరు చెల్లించే జీతానికి రెండు రెట్లు లాభం మీకు కలిగింది. మీ యెహోవాా దేవుడు మీరు చేసే వాటన్నిటిలో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. \s5 \v 19 మీ ఆవులు, గొర్రెెలు, మేకల్లో ప్రతి తొలి చూలు మగపిల్లను యెహోవాా దేవునికి ప్రతిష్ఠించాలి. మీ కోడెలలో తొలిచూలు దానితో పనిచేయకూడదు. మీ గొర్రెెలు, మేకలలో తొలిచూలు దాని బొచ్చు కత్తిరించకూడదు. \p \v 20 మీ యెహోవాా దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలంలో మీరు, మీ ఇంటివారు ఆయన సన్నిధిలో ప్రతి సంవత్సరం దాన్ని తినాలి. \v 21 దానిలో లోపం, అంటే కుంటితనం గాని, గుడ్డితనం గాని, మరే లోపమైనా ఉంటే మీ దేవుడైన యెహోవాాకు దాన్ని అర్పించకూడదు. \s5 \v 22 జింకను, దుప్పిని తినే విధంగానే, పట్టణాల్లోని మీ ఆవరణల్లో పవిత్రులు, అపవిత్రులు కూడా దాన్ని తినవచ్చు. \v 23 వాటి రక్తాన్ని మాత్రం మీరు తినకూడదు. నీళ్లలాగా భూమి మీద దాన్ని పారబోయాలి. \s5 \c 16 \p \v 1 మీరు ఆబీబు నెలలో పండుగ ఆచరించి మీ యెహోవాా దేవునికి పస్కా పండగ జరిగించాలి. ఎందుకంటే ఆబీబు నెలలో రాత్రివేళ మీ యెహోవాా దేవుడు ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని బయటకు రప్పించాడు. \v 2 యెహోవాా తన నామాన్ని స్థాపించడానికి ఏర్పాటు చేసుకున్న స్థలంలోనే మీ యెహోవాా దేవునికి పస్కా ఆచరించి, గొర్రెెలను, మేకలను, ఆవులను బలి అర్పించాలి. \p \s5 \v 3 పస్కా పండగలో కాల్చినప్పుడు పొంగకుండా ఉన్న రొట్టెలను తినాలి. మీరు ఐగుప్తు దేశం నుండి త్వరత్వరగా వచ్చారు గదా. మీరు వచ్చిన రోజును మీ జీవితం అంతటిలో జ్ఞాపకం ఉంచుకునేలా పొంగని రొట్టెలు ఏడు రోజులపాటు తినాలి. \v 4 మీ పరిసరాల్లో ఏడు రోజులపాటు పొంగినది ఏదీ కనిపించకూడదు. అంతేకాదు, మీరు మొదటి రోజు సాయంత్రం వధించిన దాని మాంసంలో కొంచెం కూడా ఉదయం వరకూ మిగిలి ఉండకూడదు. \p \s5 \v 5 మీ దేవుడు యెహోవాా మీకిస్తున్న పట్టణాల్లో ఏదో ఒక దానిలో పస్కా పశువును వధించకూడదు. \v 6 మీ దేవుడు యెహోవాా తన నామాన్ని స్థాపించడానికి ఏర్పాటు చేసుకునే స్థలం లోనే, మీరు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన సమయంలో, అంటే సూర్యుడు అస్తమించే సాయంత్రం వేళలో పస్కా పశువును వధించాలి. \s5 \v 7 అదే స్థలం లో దాన్ని కాల్చి, తిని, ఉదయాన్నే తిరిగి మీ గుడారాలకు వెళ్ళాలి. ఆరు రోజులపాటు మీరు పొంగని రొట్టెలు తినాలి. \v 8 ఏడవరోజు మీ దేవుడైన యెహోవాాను ఆరాధించే రోజు. ఆ రోజు మీరు జీవనోపాధి కోసం ఎలాంటి పనీ చేయకూడదు. \p \s5 \v 9 మీరు ఏడు వారాలు లెక్కబెట్టండి. పంట చేను మీద కొడవలి వేసింది మొదలు ఏడు వారాలు లెక్కబెట్టండి. \v 10 మీ యెహోవాా దేవునికి వారాల పండగ ఆచరించడానికి మీ చేతనైనంత స్వేచ్ఛార్పణను సిద్ధపరచాలి. మీ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కొద్దీ దాన్ని ఇవ్వాలి. \s5 \v 11 అప్పుడు మీరు, మీ కొడుకులు, కూతుళ్ళు, దాసదాసీలు, మీ పట్టణాల్లో ఉన్న లేవీయులు, మీ మధ్య ఉన్న పరదేశులు, అనాధలు, వితంతువులు మీ యెహోవాా దేవుడు తన నామాన్ని స్థాపించడానికి ఏర్పాటు చేసుకున్న స్థలం లో ఆయన సన్నిధిలో సంతోషించాలి. \v 12 మీరు ఐగుప్తులో బానిసలుగా ఉన్న సంగతి జ్ఞాపకం చేసుకుని, ఈ కట్టడలను పాటించి అమలు జరపాలి. \p \s5 \v 13 మీ కళ్ళంలో నుండి ధాన్యాన్ని, మీ తొట్టిలో నుండి ద్రాక్షరసాన్ని తీసినప్పుడు పర్ణశాలల పండగను ఏడు రోజులపాటు ఆచరించాలి. \v 14 ఈ పండగలో మీరు, మీ కొడుకులు, కూతుళ్ళు, దాసదాసీలు, మీ ఆవరణలో నివసించే లేవీయులు, పరదేశులు, అనాధలు, వితంతువులు సంతోషించాలి. \s5 \v 15 మీ యెహోవాా దేవుడు మీ రాబడి అంతటిలో, మీ చేతిపనులన్నిటిలో మిమ్మల్ని ఆశీర్వస్తాడు. కనుక ఆయన ఏర్పాటు చేసుకున్న స్థలం లో మీ యెహోవాా దేవునికి ఏడురోజులు పండగ చేసుకుని మీరు అధికంగా సంతోషించాలి. \p \s5 \v 16 సంవత్సరానికి మూడుసార్లు, అంటే పొంగని రొట్టెల పండగలో, వారాల పండగలో, పర్ణశాలల పండగలో మీ దేవుడైన యెహోవాా ఏర్పాటు చేసుకున్న స్థలం లో మీలో ఉన్న పురుషులందరూ ఆయన సన్నిధిలో కనిపించాలి. \v 17 వారు వట్టి చేతులతో యెహోవాా సన్నిధిలో కనిపించకుండా, మీ దేవుడు యెహోవాా మిమ్మల్ని దీవించిన ప్రకారం ప్రతివాడూ తన శక్తి కొలదీ ఇవ్వాలి. \p \s5 \v 18 మీ యెహోవాా దేవుడు మీకు ఇస్తున్న మీ పట్టణాలన్నిటిలో మీ గోత్రాలకు న్యాయాధిపతులనూ నాయకులనూ నియమించుకోవాలి. వారు న్యాయంగా ప్రజలకు తీర్పుతీర్చాలి. \v 19 మీరు న్యాయం తప్పి తీర్పుతీర్చకూడదు, పక్షపాతం చూపకూడదు, లంచం పుచ్చుకోకూడదు. ఎందుకంటే లంచం జ్ఞానుల్ని గుడ్డివారుగా చేసి, నీతిమంతుల మాటల్ని వక్రీకరిస్తుంది. \p \v 20 మీ యెహోవాా దేవుడు మీకిస్తున్న దేశాన్ని స్వాధీనం చేసుకుని జీవించగలిగేలా మీరు కేవలం న్యాయాన్నే జరిగించాలి. \s5 \v 21 యెహోవాా దేవునికి మీరు కట్టే బలిపీఠం దగ్గరగా ఏ విధమైన చెట్టును నాటకూడదు, దేవతా స్తంభాన్నీ నిలబెట్టకూడదు. \v 22 మీ యెహోవాా దేవుడు విగ్రహాన్ని ద్వేషించేవాడు కాబట్టి మీరు ఏ స్తంభాన్నీ నిలబెట్టకూడదు. \s5 \c 17 \p \v 1 ఎలాంటి మచ్చలు, లోపాలు ఉన్న ఎద్దులు, గొర్రెెలు మీ యెహోవాా దేవునికి బలిగా అర్పించకూడదు. అది మీ యెహోవాా దేవునికి అసహ్యం. \s5 \v 2 మీ యెహోవాా దేవుని నిబంధన మీరి ఆయన దృష్టిలో దుర్మార్గం చేస్తూ నేనిచ్చిన ఆజ్ఞకు వ్యతిరేకంగా అన్యదేవుళ్ళకు, అంటే సూర్యునికి గానీ చంద్రునికి గానీ ఆకాశ నక్షత్రాలలో దేనికైనా నమస్కరించి మొక్కే పురుషుడు, స్త్రీ ఎవరైనా మీ యెహోవాా దేవుడు మీకిస్తున్న ఏ గ్రామంలోనైనా మీ మధ్య కనబడినప్పుడు, \v 3 ఆ విషయం మీకు తెలిసిన తరువాత మీరు విచారణ జరిగించాలి. అది నిజమైతే, అంటే అలాంటి అసహ్యమైన పని ఇశ్రాయేలీయులలో జరగడం నిజమైతే \v 4 ఆ చెడ్డ పని చేసిన పురుషుణ్ణి, స్త్రీని మీ ఊరి బయటకు తీసుకువెళ్ళి రాళ్లతో కొట్టి చంపాలి. \p \s5 \v 5 అలాంటి వాడికి మరణశిక్ష విధించాలంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తుల సాక్ష్యం సరిపోతుంది. \v 6 కేవలం ఒక్క వ్యక్తి సాక్ష్యంపై అతణ్ణి చంపకూడదు. \v 7 అతన్ని చంపడానికి, మొదట సాక్షులు, తరువాత ప్రజలంతా అతని మీద చేతులు వేయాలి. ఆ విధంగా మీ మధ్య నుంచి ఆ చెడుతనాన్ని రూపుమాపాలి. \p \s5 \v 8 హత్యకూ, ప్రమాదవశాత్తూ జరిగిన మరణానికీ మధ్య, ఒకడి హక్కూ మరొకడి హక్కూ మధ్య, దెబ్బ తీయడం మరొక రకంగా నష్టపరచడం మధ్య, మీ గ్రామాల్లో భేదాలు వచ్చి, వీటి తేడా తెలుసుకోవడం మీకు కుదరకపోతే \v 9 మీరు లేచి మీ యెహోవాా దేవుడు ఏర్పరచుకొనే స్థలానికి వెళ్లి యాజకులైన లేవీయులనూ, విధుల్లో ఉన్న న్యాయాధిపతినీ విచారించాలి. వారు దానికి తగిన తీర్పు మీకు తెలియచేస్తారు. \p \s5 \v 10 యెహోవాా ఏర్పరచుకొనే చోటులో వాళ్ళు మీకు తెలియచేసే తీర్పు ప్రకారం మీరు జరిగించి వారు మీకు చెప్పే పరిష్కారం ప్రకారం మీరు చెయ్యాలి. \v 11 వారు మీకు బోధించే చట్టాన్ని పాటించాలి. వారు ఇచ్చిన తీర్పు ప్రకారం జరిగించాలి. వారు మీకు చెప్పే మాట నుంచి కుడికిగాని ఎడమకుగాని తిరగకూడదు. \p \s5 \v 12 ఆ ప్రదేశంలో ఎవరైనా అహంకారంతో మీ యెహోవాా దేవునికి పరిచర్య చేయడానికి నిలిచే యాజకుని మాటగానీ ఆ న్యాయాధిపతి మాటగానీ వినకపోతే అతన్ని చంపివేయాలి. ఆ విధంగా దుర్మార్గాన్ని ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి రూపుమాపాలి. \v 13 అప్పుడు ప్రజలంతా విని, భయపడి అహంకారంతో ప్రవర్తించకుండా ఉంటారు. \p \s5 \v 14 మీ యెహోవాా దేవుడు మీకిస్తున్న దేశంలో మీరు ప్రవేశించి దాన్ని స్వాధీనం చేసుకుని అందులో నివసించి, మా చుట్టూ ఉన్న అందరి ప్రజల్లాగా మా మీద రాజును నియమించుకుంటాం అనుకుంటే, మీ యెహోవాా దేవుడు ఎన్నుకునే వ్యక్తిని తప్పకుండా మీ మీద రాజుగా నియమించుకోవాలి. \v 15 మీ సోదరుల్లోనే ఒకణ్ణి మీ మీద రాజుగా నియమించుకోవాలి. మీ సోదరుడుకాని విదేశీయుణ్ణి మీపై రాజుగా నియమించుకోకూడదు. \p \s5 \v 16 అతడు గుర్రాలను చాలా ఎక్కువగా సంపాదించుకోకూడదు. గుర్రాలను ఎక్కువగా సంపాదించడానికి ప్రజల్ని ఐగుప్తుకు తిరిగి వెళ్లనివ్వకూడదు. ఎందుకంటే యెహోవాా ఇక మీదట మీరు ఈ దారిలో వెళ్లకూడదని మీతో చెప్పాడు. \v 17 తన హృదయం తొలగిపోకుండా అతడు ఎక్కువమంది స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు. వెండి బంగారాల్ని అతడు తన కోసం ఎక్కువగా సంపాదించుకోకూడదు. \p \s5 \v 18 అతడు రాజ్యసింహాసనంపై కూర్చున్న తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథాన్ని చూసి ఆ ధర్మశాస్త్రానికి ఒక ప్రతిని తనకోసం రాసుకోవాలి. \v 19 అది అతని దగ్గర ఉండాలి. అతడు జీవించి ఉన్న కాలమంతా ఆ గ్రంథం చదువుతూ ఉండాలి. \s5 \v 20 అలా చేస్తున్నప్పుడు దేవుడైన యెహోవాా పట్ల భయంతో తన సోదరులపై గర్వించకుండా ఈ ఆజ్ఞల విషయంలో కుడికి గాని ఎడమకు గాని తొలగకుండా ఉంటాడు. అప్పుడు రాజ్యంలో అతడూ అతని కొడుకులూ ఇశ్రాయేలులో ఎక్కువ కాలం జీవిస్తారు. \s5 \c 18 \p \v 1 యాజకులుగా నియమితులైన లేవీయులకు, అంటే లేవీగోత్రం వారికి ఇశ్రాయేలు ప్రజలతో భాగం గానీ, వారసత్వపు హక్కు గానీ ఉండవు. వారు యెహోవాాకు దహనబలిగా అర్పించే వాటినే తింటారు. \v 2 వారి సోదరులతో వారికి వారసత్వం ఉండదు. యెహోవాా వారితో చెప్పినట్టు ఆయనే వారి వారసత్వం. \p \s5 \v 3 ఎవరైనా ఎద్దును గానీ, గొర్రెెను గానీ, మేకను గానీ బలిగా అర్పించినప్పుడు అర్పించిన వాటి కుడి జబ్బ, రెండు దవడలు, పొట్ట భాగం యాజకులకు ఇవ్వాలి. \v 4 ధాన్యంలో, ద్రాక్షారసంలో, నూనెలో ప్రథమ ఫలం యాజకునికి ఇవ్వాలి. గొర్రెెల బొచ్చు కత్తిరింపులో మొదటి భాగం యాజకునికి ఇవ్వాలి. \v 5 యెహోవాా పేరున నిలబడి ఎప్పుడూ సేవ చేయడానికి మీ గోత్రాలన్నిటిలో అతణ్ణి, అతని సంతానాన్నీ మీ యెహోవాా దేవుడు ఎన్నుకున్నాడు. \p \s5 \v 6 ఒక లేవీయుడు ఇశ్రాయేలు దేశంలో తాను నివసిస్తున్న ఒక ఊరిలో నుంచి యెహోవాా ఏర్పరచుకునే చోటుకు వచ్చేందుకు ఆసక్తి కనపరిస్తే \v 7 అక్కడ యెహోవాా ఎదుట నిలబడే లేవీయుల్లాగే అతడు తన యెహోవాా దేవుని పేరున సేవ చేయవచ్చు. \v 8 తన పిత్రార్జితాన్ని అమ్మగా వచ్చినది కాక, ఇతరుల్లాగే అతడు వంతు పొందాలి. \p \s5 \v 9 మీ యెహోవాా దేవుడు మీకిస్తున్న దేశంలో మీరు ప్రవేశించిన తరువాత ఆ ప్రజల నీచమైన పనులను మీరు చేయడానికి నేర్చుకోకూడదు. \v 10 తన కొడుకుని గానీ కూతుర్ని గానీ మంటల్లోనుంచి దాటించేవాణ్ణి, శకునం చెప్పే సోదెగాణ్ణి, మేఘ శకునాలూ సర్ప శకునాలూ చెప్పేవాణ్ణి, చేతబడి చేసేవాణ్ణి, మాంత్రికుణ్ణి, ఇంద్రజాలకుణ్ణి, \v 11 ఆత్మలను సంప్రదించేవాణ్ణి, దయ్యాలను సంప్రదించే వాణ్ణి మీమధ్య ఉండనివ్వకూడదు. \s5 \v 12 వీటిని చేసే ప్రతివాడూ యెహోవాాకు అసహ్యం. ఇలాంటి అసహ్యమైన వాటిని బట్టే మీ యెహోవాా దేవుడు మీ ఎదుట నుంచి ఆ ప్రజల్ని వెళ్లగొట్టేస్తున్నాడు. \p \v 13 మీరు మీ యెహోవాా దేవుని దృష్టిలో యథార్థంగా ఉండాలి. \v 14 మీరు స్వాధీనం చేసుకోబోయే ప్రజలు మేఘ శకునాలు చెప్పేవారి మాట, సోదె చెప్పేవారి మాట వింటారు. మీ యెహోవాా దేవుడు అలా చేయడానికి మిమ్మల్ని అనుమతించలేదు. \p \s5 \v 15 మీ యెహోవాా దేవుడు మీ మధ్య నా వంటి ప్రవక్తను మీ సోదరుల్లోనుంచి మీ కోసం పుట్టిస్తాడు. ఆయన మాట మీరు వినాలి. \p \v 16 హోరేబులో సమావేశమైన రోజున మీరు, <<మా యెహోవాా దేవుని స్వరం మళ్ళీ మనం వినొద్దు, ఈ గొప్ప అగ్నిని ఇకనుంచి మనం చూడొద్దు. లేకపోతే మేమంతా చస్తాం>> అన్నారు. \s5 \v 17 అప్పుడు యెహోవాా నాతో ఇలా అన్నాడు, <<వాళ్ళు చెప్పిన మాట బాగానే ఉంది. \p \v 18 వాళ్ళ సోదరుల్లోనుంచి నీలాంటి ప్రవక్తను వారికోసం పుట్టిస్తాను. అతని నోట్లో నా మాటలు ఉంచుతాను. నేను అతనికి ఆజ్ఞాపించేదంతా అతడు వారితో చెబుతాడు. \v 19 అతడు నా పేరుతో చెప్పే నా మాటల్ని విననివాణ్ణి నేను శిక్షిస్తాను. \p \s5 \v 20 అయితే, ఏ ప్రవక్త అయినా అహంకారంతో, నేను చెప్పమని తనకాజ్ఞాపించని మాటను నా పేరున చెబితే, లేదా ఇతర దేవుళ్ళ పేరున చెబితే ఆ ప్రవక్త కూడా చావాలి.>> \p \v 21 ఏదైనా ఒక సందేశం యెహోవాా చెప్పింది కాదని మేమెలా తెలుసుకోగలం అని మీరనుకుంటే, \s5 \v 22 ప్రవక్త యెహోవాా పేరుతో చెప్పినప్పుడు ఆ మాట జరగకపోతే, ఎన్నటికీ నెరవేరకపోతే అది యెహోవాా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారంతోనే దాన్ని చెప్పాడు కాబట్టి దానికి భయపడవద్దు. \s5 \c 19 \p \v 1 మీ యెహోవాా దేవుడు ఎవరి దేశాన్ని మీకిస్తున్నాడో ఆ ప్రజల్ని యెహోవాా దేవుడు నాశనం చేసిన తరువాత మీరు వారి దేశాన్ని స్వాధీనం చేసుకుని, వారి పట్టణాల్లో వారి ఇళ్ళల్లో నివసించాలి. \v 2 మీరు స్వాధీనం చేసుకొనేలా యెహోవాా దేవుడు మీకిస్తున్న దేశంలో మూడు పట్టణాలను వేరు పరచాలి. \v 3 మీరు స్వాధీనం చేసుకొనేలా యెహోవాా దేవుడు మీకిస్తున్న దేశపు సరిహద్దుల్లో హంతకుడు పారిపోయి తలదాచుకోవడానికి ఉన్న పట్టణాలను మూడు భాగాలుగా చేయాలి. \p \s5 \v 4 హంతకుడు పారిపోయి బతకడానికి నియమించిన పద్ధతి ఏమిటంటే, ఒకడు అంతకు ముందు తన పక్కనున్న వాడి మీద పగ ఏమీ లేకుండా \v 5 పొరపాటున వాణ్ణి చంపితే, అంటే ఒకడు చెట్లు నరకడానికి వేరొక వ్యక్తితో అడవికి వెళ్ళి చెట్లు నరకడానికి తన చేతితో గొడ్డలి దెబ్బ వేసినప్పుడు, గొడ్డలి పిడి ఊడి ఆ వ్యక్తికి తగిలి, వాడు చనిపోతే ఆ హంతకుడు ప్రాణం నిలుపుకునేందుకు వీటిలో ఎదో ఒక పట్టణానికి పారిపోవాలి. \p \s5 \v 6 చనిపోయిన వాడి బంధువు కోపంతో హంతకుణ్ణి తరిమి, దారి చాలా దూరం గనక వాణ్ణి పట్టుకుని చంపకుండేలా వాడు ఇలా చెయ్యాలి. అతనికి ఆ వ్యక్తిపై గతంలో ఎలాంటి పగ లేదు కనుక అతడు మరణశిక్షకు పాత్రుడు కాక పోయినా ఇలా జరగవచ్చు. \v 7 అందుచేత మూడు పట్టణాలను మీ కోసం ఏర్పరచుకోవాలని నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను. \p \s5 \v 8 యెహోవాా దేవుడు మీ పూర్వీకులతో ప్రమాణం చేసినట్టు ఆయన మీ సరిహద్దుల్ని విశాలపరచి, మీ పూర్వీకులకు ఇస్తానని చెప్పిన దేశాన్నంతా మీకిచ్చినప్పుడు మీరు యెహోవాా దేవుణ్ణి గౌరవించాలి. \v 9 ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించినట్టు ఎప్పుడూ ఆయన మార్గాల్లో నడవడానికి ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తూ ఈ మూడు పట్టణాలు కాక మరో మూడు పట్టణాలను ఏర్పాటు చేసుకోవాలి. \v 10 ఎవరినైనా హత్య చేశామన్న నేరారోపణ మీ మీదికి రాకుండా ఉండేందుకు యెహోవాా దేవుడు మీకు వారసత్వంగా ఇస్తున్న మీ దేశంలో నిర్దోషిని హత్య చేయకూడదు. \p \s5 \v 11 ఒకడు తన పొరుగువాడి మీద పగ పట్టి, అతని కోసం కాపు కాసి అతని మీద పడి వాడు చనిపోయేలా కొట్టి \v 12 ఆ పట్టణాలలో ఒక దానిలోకి పారిపోతే, ఆ ఊరిపెద్దలు మనుషుల్ని పంపి అక్కడనుంచి వాణ్ణి రప్పించాలి. హత్య విషయం ప్రతీకారం చేసేవాడి చేతికి అతన్ని అప్పగించి చంపించాలి. \v 13 అతడిపై కనికరం చూపించకూడదు. మీకు మేలు కలిగేలా ఇశ్రాయేలు ప్రజల మధ్యనుంచి నిర్దోషి ప్రాణం విషయంలో దోషాన్ని పరిహరించాలి. \p \s5 \v 14 మీరు స్వాధీనం చేసుకొనేలా యెహోవాా దేవుడు మీకిస్తున్న దేశంలో మీకు వచ్చే మీ వారసత్వంలో పూర్వీకులు నియమించిన మీ పొరుగువాడి సరిహద్దు రాయిని తొలగించ కూడదు. \p \s5 \v 15 ఒకడు జరిగించే పాపం, అపరాధం విషయంలో దాన్ని నిర్ధారించడానికి కేవలం ఒక్క వ్యక్తి సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకోకూడదు. ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తుల సాక్ష్యం మీద ప్రతి దానినీ నిర్థారణ చేయాలి. \v 16 ఒక వ్యక్తిపై అబద్ద నేరం మోపి, అన్యాయ సాక్ష్యం చెబుతున్నట్టు అనిపిస్తే \s5 \v 17 ఆ వివాదం ఏర్పడిన ఇద్దరూ యెహోవాా ఎదుట, అంటే అప్పుడు విధుల్లో ఉన్న యాజకుల ఎదుట, న్యాయాధిపతుల ఎదుట నిలబడాలి. \p \v 18 ఆ న్యాయాధిపతులు బాగా పరీక్షించిన తరువాత వాడి సాక్ష్యం అబద్ధసాక్ష్యమై తన సోదరుని మీద వాడు అబద్ధసాక్ష్యం చెప్పిన సంగతి వెల్లడైతే వాడు తన సోదరునికి చేయాలని కోరినది వాడి పట్ల జరిగించాలి. \v 19 ఆ విధంగా మీ మధ్యనుంచి చెడుతనాన్ని తొలగిస్తారు. \s5 \v 20 ఇది తెలుసుకున్న మిగిలినవారు భయం వల్ల మీ దేశంలో అలాంటి దుర్మార్గపు పనులు జరిగించరు. \v 21 దుష్ట కార్యాలు జరిగించే ఎవరిపైనా కనికరం చూపకూడదు. అలాంటివారి విషయంలో ప్రాణానికి ప్రాణం, కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, కాలికి కాలు నియమం పాటించాలి. \s5 \c 20 \p \v 1 మీరు యుద్ధానికి వెళ్లినప్పుడు శత్రువు వద్ద గుర్రాలు, రథాలు, సైనికులు మీ దగ్గర కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశంలోనుంచి మిమ్మల్ని రప్పించిన మీ యెహోవాా దేవుడు మీకు తోడుగా ఉంటాడు. \s5 \v 2 మీరు యుద్ధానికి సిద్దమైనప్పుడు యాజకుడు ప్రజల దగ్గరకి వచ్చి వారితో ఇలా చెప్పాలి. \p \v 3 <<ఇశ్రాయేలూ, విను. ఇవ్వాళ మీరు మీ శత్రువులతో యుద్ధం చేయడానికి వెళ్తున్నారు. మీ హృదయాల్లో కుంగిపోవద్దు. భయపడవద్దు. \v 4 అధైర్యపడవద్దు. వాళ్ళ ముఖాలు చూసి బెదరొద్దు. మీ కోసం మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించేవాడు మీ యెహోవాా దేవుడే.>> \p \s5 \v 5 సేనాధిపతులు ప్రజలతో ఇలా చెప్పాలి, <<మీలో ఎవరైనా కొత్త ఇల్లు కట్టుకుని దాన్ని ప్రతిష్ట చేయకుండా ఉన్నాడా? యుద్ధంలో అతడు చనిపోతే వేరొకడు దాన్ని ప్రతిష్ట చేస్తాడు. కనుక అలాంటివాడు ఎవరైనా ఉంటే అతడు తన ఇంటికి తిరిగి వెళ్ళొచ్చు. \s5 \v 6 ఎవరైనా ద్రాక్షతోట వేసి ఇంకా దాని పళ్ళు తినకుండా యుద్ధంలో చనిపోతే వేరొకడు దాని పళ్ళు తింటాడు. కాబట్టి అలాంటివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళొచ్చు. \v 7 ఒకడు ఒక స్త్రీని ప్రదానం చేసుకుని ఆమెను ఇంకా పెళ్లి చేసుకోకముందే యుద్ధంలో చనిపోతే వేరొకడు ఆమెను పెళ్లిచేసుకుంటాడు. కాబట్టి అలాంటివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళొచ్చు.>> \p \s5 \v 8 సేనాధిపతులు ప్రజలతో ఇంకా ఇలా చెప్పాలి, <<ఎవడైనా భయపడుతూ ఆందోళనలో ఉన్నాడా? అలాంటివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళొచ్చు. అతడి భయం, ఆందోళనల వల్ల అతని సోదరుల గుండెలు కూడా అధైర్యానికి లోను కావచ్చు.>> \v 9 సేనాధిపతులు ప్రజలతో మాట్లాడడం అయిపోయిన తరువాత ప్రజల్ని నడిపించడానికి నాయకులను నియమించాలి. \p \s5 \v 10 యుద్ధం చేయడానికి ఏదైనా ఒక పట్టణం సమీపించేటప్పుడు శాంతి కోసం రాయబారం పంపాలి. \v 11 వాళ్ళు మీ రాయబారం అంగీకరించి వారి ద్వారాలు తెరిస్తే దానిలో ఉన్న ప్రజలంతా మీకు పన్ను చెల్లించి మీకు బానిసలవుతారు. \s5 \v 12 మీ శాంతి రాయబారాన్ని అంగీకరించకుండా యుద్ధానికి తలపడితే దాన్ని ఆక్రమించండి. \p \v 13 మీ యెహోవాా దేవుడు దాన్ని మీ చేతికి అప్పగించేటప్పుడు అందులోని పురుషులందరినీ కత్తితో హతమార్చాలి. \s5 \v 14 స్త్రీలనూ పిల్లలనూ పశువులనూ ఆ పట్టణంలో ఉన్న సమస్తాన్నీ కొల్లసొమ్ముగా మీరు తీసుకోవచ్చు. మీ యెహోవాా దేవుడు మీకిచ్చిన మీ శత్రువుల కొల్లసొమ్మును మీరు వాడుకోవచ్చు. \v 15 ఈ ప్రజల పట్టణాలు కాకుండా మీకు చాలా దూరంగా ఉన్న పట్టణాలన్నిటి విషయంలో ఇలాగే చేయాలి. \p \s5 \v 16 అయితే మీ యెహోవాా దేవుడు వారసత్వంగా మీకిస్తున్న ఈ ప్రజల పట్టణాలలో ఊపిరి పీల్చే దేనినీ బతకనివ్వకూడదు. \v 17 మీ యెహోవాా దేవుడు మీ కాజ్ఞాపించినట్టుగా హీత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు అనే వారిని పూర్తిగా నిర్మూలం చెయ్యాలి. \v 18 వారు తమ దేవుళ్ళకు జరిగించే అన్ని రకాల నీచమైన పనులు మీరు చేసి మీ యెహోవాా దేవునికి విరోధంగా పాపం చేయకుండా ఉండేలా వారిని పూర్తిగా నిర్మూలం చెయ్యాలి. \p \s5 \v 19 మీరు ఒక పట్టాణాన్ని ఆక్రమించుకోవడానికి, దానిపై యుద్ధం చేయడానికి ముట్టడి వేసిన సమయంలో ఆ ప్రాంతంలోని చెట్లను గొడ్డలితో పాడు చేయకూడదు. వాటి పండ్లు తినవచ్చు గాని వాటిని నరికి వేయకూడదు. మీరు వాటిని ముట్టడించడానికి పొలంలోని చెట్లు మనిషి కాదు కదా! \v 20 తినదగిన పండ్లు ఫలించని చెట్లు మీరు గుర్తిస్తే వాటిని నాశనం చేసి నరికి వెయ్యవచ్చు. మీతో యుద్ధం చేసే పట్టణం ఓడిపోయే వరకూ వాటితో దానికి ఎదురుగా ముట్టడి దిబ్బలు కట్టవచ్చు. \s5 \c 21 \p \v 1 మీ యెహోవాా దేవుడు మీకిస్తున్న దేశంలోని పొలంలో ఒకడు చచ్చి పడి ఉండడం మీరు చూస్తే, వాణ్ణి చంపిన వాడెవడో తెలియనప్పుడు \v 2 మీ పెద్దలూ, న్యాయాధిపతులూ వచ్చి, చనిపోయిన వ్యక్తి చుట్టూ ఉన్న గ్రామాల దూరం కొలిపించాలి. \s5 \v 3 ఆ శవానికి ఏ ఊరు దగ్గరగా ఉందో ఆ ఊరి పెద్దలు ఏ పనికీ ఉపయోగించని, మెడపై కాడి పెట్టని పెయ్యను తీసుకోవాలి. \v 4 దున్నని, సేద్యం చేయని ఏటి లోయ లోకి ఆ పెయ్యను తోలుకుపోయి అక్కడ, అంటే ఆ లోయలో ఆ పెయ్య మెడ విరగదీయాలి. \p \s5 \v 5 తరువాత యాజకులైన లేవీయులు దగ్గరకు రావాలి. యెహోవాాను సేవించి యెహోవాా పేరుతో దీవించడానికి ఆయన వారిని ఏర్పరచుకున్నాడు. కనుక వారి నోటి మాటతో ప్రతి వివాదాన్ని, దెబ్బ విషయమైన ప్రతి వ్యాజ్యాన్ని పరిష్కరించాలి. \s5 \v 6 అప్పుడు ఆ శవానికి దగ్గరగా ఉన్న ఆ ఊరి పెద్దలంతా ఆ ఏటి లోయలో మెడ విరగదీసిన ఆ పెయ్య మీద తమ చేతులు కడుక్కొని \v 7 మా చేతులు ఈ రక్తాన్ని చిందించలేదు, మా కళ్ళు దీనిని చూడలేదు. \s5 \v 8 యెహోవాా, నువ్వు విమోచించిన నీ జనమైన ఇశ్రాయేలు ప్రజలను క్షమించు. నీ ప్రజలు ఇశ్రాయేలు ప్రజల మీద నిర్దోషి ప్రాణం తీసిన దోషాన్ని మోపవద్దు అని చెప్పాలి. అప్పుడు ప్రాణం తీసిన దోషానికి వారికి క్షమాపణ కలుగుతుంది. \p \v 9 ఆ విధంగా మీరు యెహోవాా దృష్టికి యథార్థమైనది చేసేటప్పుడు మీ మధ్యనుంచి నిర్దోషి ప్రాణం కోసమైన దోషాన్ని తీసివేస్తారు. \s5 \v 10 మీరు మీ శత్రువులతో యుద్ధం చేయబోయేటప్పుడు మీ యెహోవాా దేవుడు మీ చేతికి వారిని అప్పగించిన తరువాత \v 11 వారిని చెరపట్టి ఆ బందీల్లో ఒక అందమైన అమ్మాయిని చూసి ఆమెను మోహించి, ఆమెను పెళ్లి చేసుకోడానికి ఇష్టపడి, \v 12 నీ ఇంట్లోకి ఆమెను చేర్చుకున్న తరువాత ఆమె తల క్షౌరం చేయించుకొని గోళ్ళు తీయించుకోవాలి. \s5 \v 13 ఆమె తన ఖైదీ బట్టలు తీసేసి మీ ఇంట్లో ఉండే నెలరోజులు తన తల్లిదండ్రులను గురించి ప్రలాపించడానికి ఆమెను అనుమతించాలి. తరువాత నువ్వు ఆమెను పెళ్లిచేసికోవచ్చు. ఆమె నీకు భార్య అవుతుంది. \v 14 నువ్వు ఆమె వలన సుఖం పొందలేకపోతే ఆమెకు ఇష్టమున్న చోటికి ఆమెను పంపివేయాలే గాని ఆమెను వెండికి ఎంతమాత్రమూ అమ్మివేయకూడదు. మీరు ఆమెను అవమాన పరిచారు కాబట్టి ఆమెను బానిసగా చూడకూడదు. \p \s5 \v 15 ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలున్నప్పుడు అతడు ఒకరిని ఇష్టపడి, మరొకరిని ఇష్టపడకపోవచ్చు. ఇద్దరికీ పిల్లలు పుడితే, \v 16 పెద్ద కొడుకు ఇష్టం లేని భార్యకు పుట్టిన వాడైతే తండ్రి తనకున్నఆస్తిని తన కొడుకులకు వారసత్వంగా ఇచ్చే రోజున ఇష్టం లేని భార్యకు పుట్టిన పెద్ద కొడుక్కి బదులు ఇష్టమైన భార్యకు పుట్టినవాణ్ణి పెద్ద కొడుకుగా పరిగణించకూడదు. \v 17 ఇష్టం లేని భార్యకు పుట్టిన వాడికి తండ్రి తన ఆస్తి అంతట్లో రెట్టింపు భాగమిచ్చి అతణ్ణి పెద్ద కొడుకుగా ఎంచాలి. ఇతడు అతని బలారంభం కాబట్టి జ్యేష్ఠత్వ అధికారం అతనిదే. \p \s5 \v 18 ఒక వ్యక్తి కొడుకు మొండివాడై తిరగబడి తండ్రి మాట, తల్లి మాట వినక, వారు అతణ్ణి శిక్షించిన తరువాత కూడా అతడు వారికి విధేయుడు కాకపోతే \v 19 అతని తలిదండ్రులు అతని పట్టుకొని ఊరి గుమ్మం దగ్గర కూర్చునే పెద్దల దగ్గరికి అతణ్ణి తీసుకురావాలి. \s5 \v 20 మా కొడుకు మొండివాడై తిరగబడ్డాడు. మా మాట వినక తిండిబోతూ తాగుబోతూ అయ్యాడు, అని ఊరి పెద్దలతో చెప్పాలి. \v 21 అప్పుడు ఊరి ప్రజలంతా రాళ్లతో అతన్ని చావగొట్టాలి. ఆ విధంగా చెడుతనాన్ని మీ మధ్యనుంచి తొలగించిన వాడివౌతావు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఈ సంగతి విని భయపడతారు. \p \s5 \v 22 మరణశిక్ష పొందేటంత పాపం ఎవరైనా చేస్తే అతణ్ణి చంపి మాను మీద వేలాడదీయాలి. \v 23 అతని శవం రాత్రి వేళ ఆ మాను మీద ఉండనియ్యకూడదు. వేలాడదీసినవాడు దేవుని దృష్టిలో శాపగ్రస్తుడు కనుక మీ దేవుడైన యెహోవాా వారసత్వంగా మీకిస్తున్న దేశం అపవిత్రం కాకుండా ఉండేలా అదే రోజు ఆ శవాన్ని తప్పకుండా పాతిపెట్టాలి. \s5 \c 22 \p \v 1 మీ సహోదరుని ఎద్దు, లేదా గొర్రెె దారి తప్పిపోయి తిరగడం మీరు చూస్తే దాన్ని చూడనట్టు కళ్ళు మూసుకోకుండా తప్పకుండా దాని యజమాని వద్దకు మళ్లించాలి. \v 2 మీ సహోదరుడు మీకు అందుబాటులో లేకపోయినా, అతడు మీకు తెలియకపోయినా దాన్ని మీ ఇంటికి తోలుకుపోవాలి. అతడు దాన్ని వెతికే వరకూ అది మీ దగ్గర ఉండాలి. అప్పుడు అతనికి దాన్ని తిరిగి అప్పగించాలి. \s5 \v 3 అతని గాడిద, దుస్తుల విషయంలో కూడా మీరు అలాగే చెయ్యాలి. మీ తోటి ప్రజలు పోగొట్టుకున్నది ఏదైనా మీకు దొరకితే దాన్ని గురించి అలాగే చెయ్యాలి. మీరు దాన్ని చూసీ చూడనట్టు ఉండకూడదు. \v 4 మీ సాటి మనిషి గాడిద, ఎద్దు దారిలో పడి ఉండడం మీరు చూస్తే వాటిని చూడనట్టు కళ్ళు మూసుకోకూడదు. వాటిని లేపడానికి తప్పకుండా సాయం చెయ్యాలి. \p \s5 \v 5 ఏ స్త్రీ పురుష వేషం వేసుకోకూడదు. పురుషుడు స్త్రీ వేషం ధరించకూడదు. అలా చేసేవారంతా మీ దేవుడైన యెహోవాాకు అసహ్యులు. \p \s5 \v 6 చెట్టు మీదగానీ, నేల మీదగానీ, దారిలోగానీ పక్షిగుడ్లు గానీ పిల్లలు గానీ ఉన్న గూడు మీకు కనబడితే తల్లి ఆ పిల్లల మీద గానీ, ఆ గుడ్ల మీద గానీ పొదుగుతూ ఉన్నప్పుడు ఆ పిల్లలతో పాటు తల్లిపక్షిని తీసుకోకూడదు. \v 7 మీకు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులయ్యేలా తప్పకుండా తల్లిని విడిచిపెట్టి పిల్లల్ని తీసుకోవచ్చు. \p \s5 \v 8 మీరు కొత్త ఇల్లు కట్టించుకొనేటప్పుడు ఇంటి పైకప్పు చుట్టూ పిట్టగోడ కట్టించాలి. అప్పుడు దాని మీద నుంచి ఎవరైనా పడిపోతే మీ ఇంటి మీద హత్యాదోషం ఉండదు. \p \s5 \v 9 మీ ద్రాక్షతోటలో రెండు రకాల విత్తనాలను విత్తకూడదు. అలా చేస్తే మీరు వేసిన పంట, ద్రాక్షతోట రాబడి మొత్తం, దేవాలయానికి ప్రతిష్టితమవుతుంది. \v 10 ఎద్దునూ గాడిదనూ జతచేసి భూమిని దున్నకూడదు. \v 11 ఉన్ని, జనపనారతో కలిపి నేసిన దుస్తులు ధరించకూడదు. \s5 \v 12 మీరు కప్పుకొనే మీ దుస్తుల నాలుగు అంచులకు అల్లికలు చేసుకోవాలి. \p \s5 \v 13 ఒకడు స్త్రీని పెళ్లి చేసుకుని ఆమెతో శారీరకంగా ఏకమైన తరువాత ఆమెను అనుమానించి \v 14 <<ఈ స్త్రీని పెళ్ళి చేసుకుని ఈమె దగ్గరకు వస్తే ఈమెలో నాకు కన్యత్వం కనబడలేదు>> అని నేరారోపణ చేసాడనుకోండి. \s5 \v 15 ఆ స్త్రీ తల్లిదండ్రులు పట్టణ ద్వారం వద్ద ఉన్న ఆ ఊరి పెద్దల దగ్గరకు ఆ యువతి కన్యాత్వత్వ నిదర్శనం చూపించాలి. \p \s5 \v 16 అప్పుడు ఆ స్త్రీ తండ్రి <<నా కూతుర్ని ఇతనికిచ్చి పెళ్ళిచేస్తే ఇతడు ఈమెలో కన్యాత్వం కనబడలేదని అవమానించి ఆమె మీద నింద మోపాడు. \v 17 అయితే నా కూతురు కన్య అని రుజువు పరిచే నిదర్శనం ఇదే>> అని పెద్దలతో చెప్పి, పట్టణపు పెద్దల ఎదుట ఆ వస్త్రం పరచాలి. \s5 \v 18 అప్పుడు ఆ ఊరి పెద్దలు ఆ వ్యక్తిని పట్టుకొని శిక్షించి, 100 వెండి నాణాలు అపరాధ రుసుం అతడి వద్ద తీసుకుని ఆ స్త్రీ తండ్రికి చెల్లించాలి. \p \v 19 ఎందుకంటే అతడు ఇశ్రాయేలు కన్యను అవమానపరిచాడు. ఇకపై ఆమె అతనికి భార్యగా ఉంటుంది. అతడు తాను జీవించే కాలమంతా ఆమెను విడిచి పెట్టకూడదు. \s5 \v 20 అయితే ఆ వ్యక్తి ఆరోపించిన నింద నిజమైనప్పుడు, అంటే ఆ కన్యలో కన్యాత్వం కనబడని పక్షంలో \v 21 పెద్దలు ఆమె తండ్రి ఇంటికి ఆమెను తీసుకురావాలి. అప్పుడు ఆమె ఊరి ప్రజలు ఆమెను రాళ్లతో కొట్టి చావగొట్టాలి. ఎందుకంటే ఆమె తన తండ్రి ఇంట్లో వ్యభిచరించి ఇశ్రాయేలులో చెడ్డ పని చేసింది. ఆ విధంగా ఆ దుర్మార్గాన్ని మీ మధ్యనుంచి మీరు రూపుమాపుతారు. \p \s5 \v 22 ఎవడైనా మరొకడి భార్యతో శారీరకంగా కలుస్తూ పట్టుబడితే వారిద్దరినీ, అంటే ఆ స్త్రీతో శారీరకంగా కలిసిన పురుషుడినీ, స్త్రీనీ చంపాలి. ఆ విధంగా ఆ దుర్మార్గాన్ని ఇశ్రాయేలులోనుంచి రూపుమాపుతారు. \s5 \v 23 కన్య అయిన స్త్రీ తనకు ప్రదానం జరిగిన తరువాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకుని ఆమెతో శారీరకంగా కలిస్తే \v 24 ఆ ఊరి ద్వారం దగ్గరకు వారిద్దరినీ తీసుకువచ్చి, ఆ స్త్రీ ఊరిలోని ప్రజలను పిలవనందుకు ఆమెనూ, తన పొరుగువాడి భార్యను అవమాన పరచినందుకు ఆ వ్యక్తినీ రాళ్లతో చావగొట్టాలి. ఆ విధంగా ఆ దుర్మార్గాన్ని మీలోనుంచి రూపు మాపాలి. \s5 \v 25 ప్రదానం జరిగిన కన్యను పొలంలో ఒకడు కలుసుకున్నప్పుడు అతడు ఆమెను బలవంతం చేసి, ఆమెతో శారీరకంగా కలిస్తే, ఆమెతో శారీరకంగా కలిసిన వాడు మాత్రమే చావాలి. \v 26 ఆ కన్యను ఏమీ చేయకూడదు, ఎందుకంటే ఆ కన్య మరణానికి గురి అయ్యేంత పాపం చేయలేదు. ఒకడు తన పొరుగు వాడి మీద పడి చంపేసినట్టే ఇది జరిగింది. \v 27 అతడు ఆమెను పొలంలో కలుసుకుంటే ప్రదానం జరిగిన ఆ కన్య కేకలు వేసినప్పుడు ఆమెను కాపాడడానికి ఎవరూ లేరు. \p \s5 \v 28 ఒకడు ప్రదానం జరగని కన్యను పట్టుకొని ఆమెతో శారీరకంగా కలిసిన విషయం తెలిసినప్పుడు \v 29 ఆమెతో శారీరకంగా కలిసినవాడు ఆ కన్య తండ్రికి 50 వెండి నాణాలు చెల్లించి ఆమెను పెళ్లి చేసుకోవాలి. అతడు ఆమెను ఆవమానపరచాడు కాబట్టి అతడు జీవించినంత కాలం ఆమెను విడిచి పెట్టకూడదు. \s5 \v 30 ఎవ్వరూ తన తండ్రి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోకూడదు. తన తండ్రికి అప్రతిష్ట కలిగించకూడదు. \s5 \c 23 \p \v 1 చితికిన వృషణాలు ఉన్నవాళ్ళు, లేదా పురుషాంగం కోసిన వాళ్ళు యెహోవాా సమాజంలో చేరకూడదు. వ్యభిచారం వలన పుట్టినవాడు యెహోవాా సమాజంలో చేరకూడదు. \v 2 అతని పదవ తరం వరకూ ఎవరూ యెహోవాా సమాజంలో చేరకూడదు. \p \s5 \v 3 అమ్మోనీయులు, మోయాబీయులు యెహోవాా సమాజంలో చేరకూడదు. వారి పదవ తరం వరకూ ఎవరూ యెహోవాా సమాజంలో చేరకూడదు. \v 4 ఎందుకంటే మీరు ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు ప్రయాణ మార్గంలో వాళ్ళు భోజనాలు తీసుకువచ్చి మిమ్మల్నికలుసుకోలేదు. అరాము నహారాయీములో ఉన్న పెతోరు నుంచి మిమ్మల్ని శపించడానికి మీకు విరోధంగా బెయోరు కొడుకు బిలాముకు బహుమతులు ఇచ్చి పిలిపించారు. \p \s5 \v 5 అయితే మీ దేవుడైన యెహోవాా బిలాము మాట అంగీకరించలేదు. మీ దేవుడైన యెహోవాా మిమ్మల్ని ప్రేమించాడు కనుక మీకోసం ఆ శాపాలను ఆశీర్వాదాలుగా మార్చాడు. \v 6 మీరు జీవించే కాలమంతా వారి క్షేమం గురించి గానీ, వాళ్లకు శాంతి సమకూరాలని గానీ ఎన్నటికీ పట్టించుకోవద్దు. \p \s5 \v 7 ఎదోమీయులు మీ సోదరులు కనుక వాళ్ళను ద్వేషించవద్దు. \p ఐగుప్తు దేశంలో మీరు పరదేశీయులుగా ఉన్నారు, కనుక ఐగుప్తీయులను ద్వేషించవద్దు. \v 8 వారి సంతానంలో మూడవ తరం వారు యెహోవాా సమాజంలో చేరవచ్చు. \p \s5 \v 9 మీ సేన శత్రువులతో యుద్ధానికి బయలుదేరేటప్పుడు ప్రతి చెడ్డపనికీ దూరంగా ఉండాలి. \v 10 రాత్రి జరిగినదాని వలన మైలపడినవాడు మీలో ఉంటే వాడు శిబిరం వెలుపలికి వెళ్లిపోవాలి. \v 11 అతడు శిబిరంలో చేరకూడదు. సాయంత్రం అతడు నీళ్లతో స్నానం చేసి పొద్దుపోయిన తరువాత శిబిరంలో చేరవచ్చు. \p \s5 \v 12 శిబిరం బయట మల విసర్జనకు మీకు ఒక చోటుండాలి. \v 13 మీ ఆయుధాలు కాకుండా ఒక పార మీ దగ్గరుండాలి. నువ్వు మల విసర్జనకు వెళ్ళేటప్పుడు దానితో తవ్వి వెనక్కి తిరిగి నీ మలాన్ని కప్పేయాలి. \v 14 మీ యెహోవాా దేవుడు మిమ్మల్ని విడిపించడానికి, మీ శత్రువుల్ని మీకు అప్పగించడానికి మీ శిబిరంలో తిరుగుతూ ఉంటాడు. కాబట్టి మీ శిబిరాన్ని పవిత్రంగా ఉంచాలి. లేకపోతే ఆయన మీలో ఏదైనా అసహ్యమైన దాన్ని చూసి మిమ్మల్ని వదిలేస్తాడేమో. \p \s5 \v 15 తన యజమాని దగ్గర నుంచి తప్పించుకొని మీ దగ్గరికి వచ్చిన సేవకుణ్ణి వాడి యజమానికి అప్పగించకూడదు. \v 16 అతడు తన ఇష్టప్రకారం మీ గ్రామాల్లోని ఒకదాన్లో తాను ఏర్పరచుకున్న చోట మీతో కలిసి మీ మధ్య నివసించాలి. మీరు అతణ్ణి అణచివేయకూడదు. \p \s5 \v 17 ఇశ్రాయేలు కుమార్తెల్లో ఎవరూ వేశ్యలుగా ఉండకూడదు. ఇశ్రాయేలు కుమారుల్లో ఎవరూ పురుష సంపర్కులుగా ఉండకూడదు. \v 18 పురుష సంపర్కం వల్ల గానీ పడుపు సొమ్ము వల్ల గానీ వచ్చే ధనాన్ని మొక్కుబడిగా మీ దేవుడైన యెహోవాా ఇంటికి తీసుకురాకూడదు. ఎందుకంటే ఆ రెండూ మీ దేవుడైన యెహోవాాకు అసహ్యం. \p \s5 \v 19 మీరు వెండిని గానీ, ఆహారపదార్ధాలు గానీ వడ్డీకి ఇచ్చే మరి దేనినైనా తోటి ఇశ్రాయేలు ప్రజలకు వడ్డీకి ఇవ్వకూడదు. \v 20 పరదేశులకు వడ్డీకి అప్పు ఇవ్వవచ్చు. మీ దేవుడైన యెహోవాా మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలో మీ ప్రయత్నాలన్నిటిలో మిమ్మల్ని ఆశీర్వదించేలా నీ తోటి ఇశ్రాయేలు ప్రజలకు దేనినీ వడ్డీకి ఇవ్వకూడదు. \p \s5 \v 21 మీరు మీ దేవుడైన యెహోవాాకు మొక్కుకున్న తరువాత ఆ మొక్కుబడిని చెల్లించే విషయంలో ఆలస్యం చేయకూడదు. మీ దేవుడైన యెహోవాా అది చెల్లించడం జరగాలని చూస్తాడు. అలా చేయకపోతే అది మీకు పాపంగా పరిణమిస్తుంది. \v 22 ఎలాంటి మొక్కులు మొక్కుకోకుండా ఉండడం పాపం అనిపించుకోదు. \v 23 మీ నోటి వెంబడి వచ్చే మాట నెరవేర్చుకోవాలి. మీ దేవుడైన యెహోవాాకు స్వేచ్ఛగా మొక్కుకుంటే మీరు మీ నోటితో పలికినట్టుగా అర్పించాలి. \p \s5 \v 24 మీరు మీ పొరుగువాడి ద్రాక్షతోటకు వెళ్ళేటప్పుడు మీ కిష్టమైనన్ని ద్రాక్షపండ్లు తినవచ్చు గానీ మీ సంచిలో వేసుకోకూడదు. \v 25 మీ పొరుగువాడి పంటచేలోకి వెళ్ళేటప్పుడు మీ చేతితో వెన్నులు తుంచుకోవచ్చు గానీ మీ పొరుగువాడి పంటచేలో కొడవలి వెయ్యకూడదు. \s5 \c 24 \p \v 1 ఎవరైనా ఒక స్త్రీని పెళ్ళి చేసుకుని, ఆ తరువాత ఆమె ఇంతకు ముందే పరాయి పురుషునితో లైంగికంగా సంబంధం కలిగి ఉన్నట్టు అనుమానం కలిగితే ఆమెపై అతనికి ఇష్టం తొలగిపోతే అతడు ఆమెకు విడాకులు రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట్లోనుంచి ఆమెను పంపేయాలి. \v 2 ఆమె అతని వద్ద నుండి వెళ్లిపోయిన తరువాత వేరొక పురుషుణ్ణి పెళ్లి చేసుకోవచ్చు. \p \s5 \v 3 ఆ రెండోవాడు కూడా ఆమెను ఇష్టపడకుండా ఆమెకు విడాకులు రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంటి నుంచి ఆమెను పంపి వేసినా, లేదా ఆమెను పెళ్ళిచేసుకున్న ఆ వ్యక్తి చనిపోయినా, \v 4 ఆమెను తిరస్కరించిన ఆమె మొదటి భర్త ఆమెను తిరిగి పెళ్లి చేసుకోకూడదు. ఎందుకంటే ఆమె అపవిత్రురాలు. అది యెహోవాాకు అసహ్యం. కాబట్టి మీ యెహోవాా దేవుడు మీకు వారసత్వంగా ఇవ్వబోయే దేశానికి పాపం తెచ్చిపెట్టకూడదు. \p \s5 \v 5 కొత్తగా పెళ్ళిచేసుకున్న వాళ్ళు సైన్యంలో చేరకూడదు. వాళ్లకు ఎలాంటి బాధ్యతలు అప్పగించకూడదు. ఒక సంవత్సరం పాటు అతడు కులాసాగా తన ఇంట్లో ఉంటూ పెళ్లి చేసుకున్న భార్యను సంతోషపెట్టాలి. \p \s5 \v 6 తిరగలిని, తిరగటి పైరాతిని తాకట్టు పెట్టకూడదు. అలా చేస్తే ఒకడి జీవనాధారాన్ని తాకట్టు పెట్టినట్టే. \p \s5 \v 7 ఒకడు ఇశ్రాయేలు ప్రజల్లోని తన సోదరుల్లో ఎవరినైనా బలాత్కారంగా ఎత్తుకుపోయి అతణ్ణి తన బానిసగా చేసుకున్నా, లేదా అమ్మివేసినా అతణ్ణి చంపివేయాలి. అలా చేస్తే ఆ చెడుతనాన్ని మీ మధ్యనుంచి రూపుమాపిన వారవుతారు. \p \s5 \v 8 కుష్ఠరోగం విషయంలో యాజకులైన లేవీయులు మీకు బోధించే దాన్నంతా చేసే విషయంలో జాగ్రత్త వహించండి. ఈ విషయంలో నేను వారికి ఆజ్ఞాపించినదంతా జాగ్రత్తగా జరిగించండి. \v 9 మీరు ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు దారిలో మీ దేవుడైన యెహోవాా మిర్యాముకు చేసిన దాన్ని గుర్తుంచుకోండి. \p \s5 \v 10 మీ పొరుగువాడికి ఏదైనా అప్పు ఇచ్చినప్పుడు అతని వద్ద తాకట్టు వస్తువు తీసుకొనేందుకు అతని ఇంటి లోపలికి వెళ్లకూడదు. \v 11 ఇంటి బయటే నిలబడాలి. అప్పు తీసుకునేవాడు బయట నిలబడి ఉన్న నీ దగ్గరికి ఆ తాకట్టు వస్తువు తీసుకు వస్తాడు. \s5 \v 12 అతడు పేదవాడైన పక్షంలో నువ్వు అతని తాకట్టు వస్తువు నీదగ్గరే ఉంచుకొని నిద్రపోకూడదు. అతడు తన దుప్పటి కప్పుకొని నిద్రబోయేముందు నిన్ను దీవించేలా సూర్యాస్తమయంలోగా తప్పకుండా ఆ తాకట్టు వస్తువును అతనికి తిరిగి అప్పగించాలి. \v 13 అది మీ యెహోవాా దేవుని దృష్టిలో మీకు నీతి అవుతుంది. \p \s5 \v 14 మీ సోదరుల్లో గానీ మీ దేశంలోని గ్రామాల్లో ఉన్న విదేశీయుల్లోగానీ దరిద్రులైన కూలివారిని బాధించకూడదు. ఏ రోజు కూలి ఆ రోజే ఇవ్వాలి. \v 15 సూర్యుడు అస్తమించేలోగా అతనికి కూలి చెల్లించాలి. అతడు పేదవాడు కాబట్టి అతనికి వచ్చే సొమ్ము మీద ఆశ పెట్టుకుంటాడు. వాడు నిన్ను బట్టి యెహోవాాకు మొర్ర పెడతాడేమో. అది నీకు పాపమవుతుంది. \p \s5 \v 16 కొడుకుల పాపాన్నిబట్టి తండ్రులకు మరణశిక్ష విధించకూడదు, తండ్రుల పాపాన్ని బట్టి కొడుకులకు మరణశిక్ష విధించకూడదు. ఎవరి పాపానికి వారే మరణశిక్ష పొందాలి. \s5 \v 17 పరదేశులకు గానీ తండ్రిలేని వారికి గానీ అన్యాయంగా తీర్పు తీర్చకూడదు. విధవరాలి దుస్తులు తాకట్టుగా తీసుకోకూడదు. \v 18 మీరు ఐగుప్తులో బానిసలుగా ఉండగా మీ దేవుడైన యెహోవాా మిమ్మల్ని అక్కడనుంచి విమోచించాడని గుర్తుచేసుకోవాలి. అందుకే ఈ పనులు చెయ్యాలని మీకు ఆజ్ఞాపిస్తున్నాను. \p \s5 \v 19 మీ పొలంలో మీ పంట కోస్తున్నప్పుడు పొలంలో ఒక పన మర్చిపోతే దాన్ని తెచ్చుకోడానికి మీరు తిరిగి వెనక్కి వెళ్ళకూడదు. మీ దేవుడైన యెహోవాా మీరు చేసే పనులన్నిటిలో మిమ్మల్ని ఆశీర్వదించేలా అది పరదేశులకు, తండ్రి లేనివారికీ, విధవరాళ్లకూ మిగల్చాలి. \v 20 మీ ఒలీవ పండ్లను ఏరుకునేటప్పుడు మీ వెనక ఉన్న పరిగెను ఏరుకోకూడదు. అవి పరదేశులకు, తండ్రి లేనివారికీ, విధవరాళ్లకూ మిగల్చాలి. \s5 \v 21 మీ ద్రాక్షపండ్లను కోసుకొనేటప్పుడు మీ వెనకపడిపోయిన గుత్తిని ఏరుకోకూడదు. అది పరదేశులకు, తండ్రి లేనివారికీ, విధవరాళ్లకూ మిగల్చాలి. \v 22 మీరు ఐగుప్తు దేశంలో బానిసగా ఉన్నారని గుర్తుచేసుకోండి. అందుకే ఈ పని చెయ్యాలని మీకు ఆజ్ఞాపిస్తున్నాను. \s5 \c 25 \p \v 1 ప్రజలు తమ వివాదాల పరిష్కారానికి న్యాయస్థానానికి వస్తే న్యాయమూర్తులు వారికి తీర్పు చెప్పాలి. నీతిమంతుణ్ణి విడిపించి నేరస్తులను శిక్షించాలి. \v 2 ఆ దోషి శిక్షార్హుడైతే, న్యాయమూర్తి అతన్ని పడుకోబెట్టి అతని నేర తీవ్రత బట్టి దెబ్బలు లెక్కపెట్టి తన ఎదుట వాణ్ణి కొట్టించాలి. \s5 \v 3 నలభై దెబ్బలు కొట్టించవచ్చు. అంతకు మించకూడదు. అలా చేస్తే మీ సోదరుడు మీ దృష్టిలో నీచుడుగా కనబడతాడేమో. \p \s5 \v 4 కళ్ళం నూర్చే ఎద్దు మూతికి చిక్కం కట్టకూడదు. \p \s5 \v 5 సోదరులు కలిసి నివసిస్తూ ఉన్నప్పుడు వారిలో ఒకడు మగ సంతానం కనకుండా చనిపోతే, చనిపోయిన వాడి భార్య అన్య వంశంలోని వ్యక్తిని పెళ్ళిచేసుకోకూడదు. ఆమె భర్త సోదరుడు ఆమె దగ్గరికి వెళ్లి ఆమెను పెళ్లి చేసుకుని తన సోదరునికి బదులు ఆమె పట్ల భర్త ధర్మం జరిగించాలి. \v 6 చనిపోయిన సోదరుని పేరు ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి రద్దు కాకుండా ఆమె కనే పెద్దకొడుకు, చనిపోయిన సోదరునికి వారసుడుగా ఉండాలి. \p \s5 \v 7 అతడు తన సోదరుని భార్యను పెళ్లి చేసుకోకపోతే వాడి సోదరుని భార్య, పట్టణ ద్వారం దగ్గరికి, అంటే పెద్దల వద్దకు వెళ్లి, నా భర్త సోదరుడు ఇశ్రాయేలు ప్రజల్లో తన సోదరుని పేరు స్థిరపరచడానికి నిరాకరిస్తున్నాడు. భర్త సోదరుని ధర్మం నాపట్ల జరిగించడం లేదు, అని చెప్పాలి. \v 8 అప్పుడు అతని ఊరి పెద్దలు అతణ్ణి పిలిపించి, అతనితో మాటలాడిన తరువాత అతడు నిలబడి <<ఆమెను పెళ్ళిచేసుకోవడం నా కిష్టం లేదు>> అంటే, అతని సోదరుని భార్య \s5 \v 9 ఆ పెద్దలు చూస్తూ ఉండగా అతని దగ్గరికి వెళ్ళి అతని చెప్పు ఊడదీసి అతని ముఖం మీద ఉమ్మి, తన సోదరుని వంశం నిలబెట్టని వాడికి ఇలా జరుగుతుంది అని చెప్పాలి. \v 10 అప్పుడు ఇశ్రాయేలు ప్రజల్లో వాడికి <<చెప్పు ఊడ దీసినవాడి ఇల్లు>> అని పేరు వస్తుంది. \p \s5 \v 11 ఇద్దరు పురుషులు ఒకడితో ఒకడు పోట్లాడుకుంటున్న సమయంలో ఒకడి భార్య తన భర్తను కొడుతున్నవాడి చేతి నుంచి తన భర్తను విడిపించడానికి వచ్చి, చెయ్యి చాపి అతడి మర్మాంగాల్ని పట్టుకుంటే ఆమె చేతిని నరికెయ్యాలి. \v 12 మీ కన్నులు జాలి చూపించకూడదు. \p \s5 \v 13 వేరు వేరు తూకం రాళ్లు పెద్దదీ, చిన్నదీ రెండు రకాలు మీ సంచిలో ఉంచుకోకూడదు. \v 14 వేరు వేరు తూములు పెద్దదీ, చిన్నదీ మీ ఇంట్లో ఉంచుకోకూడదు. \s5 \v 15 మీ దేవుడైన యెహోవాా మీకిస్తున్న దేశంలో మీరు శాశ్వతకాలం జీవించి ఉండేలా కచ్చితమైన న్యాయమైన తూనికరాళ్లు ఉంచుకోవాలి. కచ్చితమైన న్యాయమైన కొలత మీకు ఉండాలి. \v 16 ఆ విధంగా చేయని ప్రతివాడూ అంటే అన్యాయం చేసే ప్రతివాడూ మీ యెహోవాా దేవునికి అసహ్యుడు. \p \s5 \v 17 మీరు ఐగుప్తు నుంచి ప్రయాణిస్తున్న మార్గంలో అమాలేకీయులు మీకు చేసిన దాన్ని గుర్తు చేసుకోండి. వాళ్ళు దేవుని భయం లేకుండా మార్గమధ్యలో మీకు ఎదురు వచ్చి, \v 18 మీరు బలహీనంగా, అలసిపోయి ఉన్నప్పుడు, మీ ప్రజల్లో వెనక ఉన్న బలహీనులందరినీ చంపివేశారు. \v 19 కాబట్టి మీరు స్వాధీనం చేసుకోడానికి మీ దేవుడైన యెహోవాా వారసత్వంగా మీకిస్తున్న దేశంలో, మీ దేవుడైన యెహోవాా మీ చుట్టూ ఉన్న శత్రువులందరి నుంచీ మీకు నెమ్మది ఇచ్చిన తరువాత అమాలేకీయుల పేరు ఆకాశం కింద ఉండకుండాా తుడిచిపెట్టుకు పోయేలా చేయండి. ఈ సంగతి ఎన్నడూ మర్చిపోవద్దు. \s5 \c 26 \p \v 1 మీ దేవుడైన యెహోవాా మీకు వారసత్వంగా అనుగ్రహించే దేశానికి మీరు చేరుకొని దాన్ని స్వాధీనం చేసుకుని దానిలో నివసిస్తున్నప్పుడు \v 2 మీ దేవుడైన యెహోవాా మీకిస్తున్న మీ భూమిలో నుంచి మీరు కూర్చుకొనే పంటలన్నిట్లో మొదట పండిన పంటలో కొంత భాగాన్ని తీసుకుని ఒక గంపలో ఉంచి, మీ దేవుడైన యెహోవాా తనకు మందిరంగా ఏర్పరచుకొనే స్థలానికి తీసుకువెళ్ళాలి. \p \s5 \v 3 ఆ సమయంలో సేవ జరిగిస్తున్న యాజకుని దగ్గరకు వెళ్లి, <<యెహోవాా మన పితరులకు ఇస్తానని ప్రమాణం చేసిన దేశానికి నేను వచ్చానన్న విషయాన్ని ఈ రోజు మీ దేవుడైన యెహోవాా ముందు ఒప్పుకుంటున్నాను>> అని అతనితో చెప్పాలి. \v 4 యాజకుడు ఆ గంపను నీ చేతిలోనుంచి తీసుకుని మీ దేవుడైన యెహోవాా బలిపీఠం ఎదుట ఉంచాలి. \p \s5 \v 5 మీ దేవుడైన యెహోవాా ఎదుట నువ్వు ఇలా చెప్పాలి, <<నా పూర్వీకుడు సంచారం చేసే అరామీ దేశస్థుడు. అతడు కొద్దిమందితో ఐగుప్తు వెళ్లి అక్కడ పరదేశిగా ఉండిపోయాడు. అతడు అక్కడికి వెళ్లి అసంఖ్యాకంగా వృద్ధి పొంది గొప్పదైన, బలమైన జనసమూహం అయ్యాడు. \s5 \v 6 ఐగుప్తీయులు మనల్ని హింసించి, బాధించి మనమీద కఠినమైన దాస్యం మోపారు. \v 7 మనం మన పూర్వీకుల దేవుడైన యెహోవాాకు మొరపెట్టాం. యెహోవాా మన మొర విని, మన బాధ, ప్రయాస, మనకు కలిగిన హింసను చూశాడు. \s5 \v 8 యెహోవాా తన బలిష్టమైన చేతితో, తన బలప్రదర్శనతో, తీవ్రమైన భయం కలిగించే కార్యాలతో, అద్భుతమైన సూచనలతో ఐగుప్తు నుంచి మనల్ని బయటకు రప్పించాడు. \v 9 ఈ స్థలానికి మనల్ని రప్పించి పాలు తేనెలు పారుతూ ఉన్న ఈ దేశాన్ని మనకిచ్చాడు. \p \s5 \v 10 కాబట్టి యెహోవాా, నువ్వే నాకిచ్చిన భూమి ప్రథమ ఫలాలు నేను తెచ్చి నీ ఎదుట ఉంచాను.>> ఇలా చెప్పిదాన్ని మీ దేవుడైన యెహోవాా ఎదుట ఉంచి ఆయనను ఆరాధించాలి. \v 11 నీకూ, నీ ఇంటి వారికీ నీ దేవుడైన యెహోవాా అనుగ్రహించిన మేలులన్నిటి గురించి నువ్వూ, లేవీయులూ నీ దేశంలో ఉన్న పరదేశులూ సంతోషించాలి. \p \s5 \v 12 పదవ భాగమిచ్చే మూడవ సంవత్సరం నీ రాబడిలో పదవ వంతు చెల్లించి, అది లేవీయులకూ పరదేశులకూ, తండ్రి లేనివారికీ, విధవరాళ్లకూ ఇవ్వాలి. వారు నీ ఊరిలో వాటిని తిని తృప్తి పొందిన తరువాత \v 13 నువ్వు మీ యెహోవాా దేవుని ఎదుట నువ్వు నాకాజ్ఞాపించిన నీ ఆజ్ఞలన్నిటి ప్రకారం <<నా ఇంటినుంచి ప్రతిష్ట చేసిన వాటిని విభజించి లేవీయులకూ పరదేశులకు తండ్రి లేనివారికీ విధవరాళ్లకూ ఇచ్చాను. నీ ఆజ్ఞల్లో దేనినీ నేను మీరలేదు, దేనినీ మరచిపోలేదు. \s5 \v 14 నా దుఃఖ సమయంలో దానిలో కొంచెమైనా నేను తినలేదు, అపవిత్రంగా ఉన్న సమయంలో దానిలో నుండి దేనినీ తీసివేయలేదు. చనిపోయిన వారి కోసం దానిలో నుండి ఏదీ ఇవ్వలేదు. నా దేవుడైన యెహోవాా మాట విని, నువ్వు నా కాజ్ఞాపించినట్టు అంతా జరిగించాను. \v 15 నువ్వు నివసించే నీ పరిశుద్ధ స్థలం, పరలోకం నుంచి చూసి, నీ ప్రజలైన ఇశ్రాయేలును దీవించు. పాలు తేనెలు ప్రవహించే దేశం అని నువ్వు మా పితరులతో ప్రమాణం చేసి, మాకిచ్చిన దేశాన్ని దీవించు>> అని చెప్పాలి. \p \s5 \v 16 ఈ కట్టుబాట్లకు, ఆజ్ఞలకూ లోబడి ఉండాలని మీ దేవుడైన యెహోవాా ఈనాడు మీకు ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి మీరు మీ హృదయ పూర్వకంగా మీ పూర్ణ మనసుతో వాటిని అనుసరించి నడుచుకోవాలి. \v 17 యెహోవాాయే మీకు దేవుడుగా ఉన్నాడనీ మీరు ఆయన మార్గాల్లో నడిచి, ఆయన చట్టాలనూ, ఆజ్ఞలనూ, విధులనూ అనుసరిస్తూ ఆయన మాట వింటామనీ ఈనాడు ఆయనకు మాట ఇచ్చారు. \s5 \v 18 యెహోవాా మీతో చెప్పినట్టు మీరే ఆయనకు సొంత ప్రజలుగా ఉంటూ ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొంటారని \v 19 ఆయన సృజించిన అన్ని జాతుల ప్రజలందరి కంటే మీకు కీర్తి, ఘనత, పేరు కలిగేలా మిమ్మల్ని హెచ్చిస్తానని యెహోవాా ఈనాడు ప్రకటించాడు. ఆయన చెప్పినట్టుగా మీరు మీ యెహోవాా దేవునికి పవిత్ర ప్రజగా ఉంటారనీ ప్రకటించాడు. \s5 \c 27 \p \v 1 మోషే ఇశ్రాయేలు ప్రజల పెద్దలకు, ప్రజలకు ఇలా ఆజ్ఞాపించారు, ఈరోజు నేను మీకు ఆజ్ఞాపిస్తున్న ఆజ్ఞలన్నిటినీ పాటించాలి. \v 2 మీ దేవుడైన యెహోవాా మీకు అనుగ్రహిస్తున్న దేశంలో ప్రవేశించడానికి మీరు యొర్దాను నది దాటే రోజు మీరు పెద్ద రాళ్లను నిలబెట్టి వాటి మీద సున్నం పూయాలి. \v 3 మీ పితరుల దేవుడు యెహోవాా మీతో చెప్పిన ప్రకారం మీరు మీ దేవుడైన యెహోవాా మీకిస్తున్న పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశించడానికి మీరు నది దాటిన తరువాత ఈ ధర్మశాస్త్ర వాక్యాలన్నీ వాటి మీద రాయాలి. \p \s5 \v 4 మీరు ఈ యొర్దాను దాటిన తరువాత నేను ఈ రోజు మీకు ఆజ్ఞాపించినట్టుగా ఈ రాళ్లను ఏబాలు కొండ మీద నిలబెట్టి వాటి మీద సున్నం పూయాలి. \v 5 అక్కడ మీ యెహోవాా దేవునికి బలిపీఠం కట్టాలి. ఆ బలిపీఠాన్ని రాళ్లతో నిర్మించాలి. ఆ పని కోసం ఇనుప పనిముట్లు ఉపయోగించకూడదు. \p \s5 \v 6 చెక్కకుండా ఉన్న రాళ్లతో మీ యెహోవాా దేవునికి బలిపీఠం కట్టి దాని మీద మీ దేవుడైన యెహోవాాకు హోమబలులు అర్పించాలి. \v 7 మీరు సమాధాన బలులు అర్పించి అక్కడ భోజనం చేసి మీ దేవుడైన యెహోవాా ఎదుట సంతోషించాలి. \v 8 ఈ ధర్మశాస్త్ర వాక్యాలన్నీ ఆ రాళ్ల మీద చాలా స్పష్టంగా రాయాలి. \p \s5 \v 9 మోషే, యాజకులైన లేవీయులూ ఇశ్రాయేలు ప్రజలందరితో ఇలా చెప్పారు, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు మౌనంగా ఉండి మా మాటలు వినండి. \v 10 ఈనాడు మీరు మీ దేవుడైన యెహోవాాకు స్వంత ప్రజలయ్యారు. కాబట్టి మీ దేవుడైన యెహోవాా మాటలు విని, ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించే ఆయన చట్టాలూ, ఆజ్ఞలూ పాటించాలి. \p \s5 \v 11 ఆ రోజే మోషే ప్రజలకు ఇలా ఆజ్ఞాపించాడు, మీరు యొర్దాను దాటిన తరువాత, షిమ్యోను, లేవీ, యూదా, ఇశ్శాఖారు, యోసేపు, \v 12 బెన్యామీను గోత్రాలవాళ్ళు ప్రజలకు దీవెన పలుకులు అందించడానికి గెరిజీము కొండ మీద నిలబడాలి. \s5 \v 13 రూబేను, గాదు, ఆషేరు, జెబూలూను, దాను, నఫ్తాలి గోత్రాల వాళ్ళు శిక్షలు పలకడానికి ఏబాలు కొండ మీద నిలబడాలి. \p \v 14 అప్పుడు లేవీయులు ఇశ్రాయేలు ప్రజలందరితో బిగ్గరగా ఇలా చెప్పాలి. \p <<యెహోవాాకు అసహ్యం కలిగించే శిల్పి చేతులతో \s5 \v 15 మలిచిన విగ్రహాన్ని గానీ పోత విగ్రహాన్ని గానీ చేసుకుని దాన్ని రహస్య స్థలంలో నిలబెట్టేవాడు శాపగ్రస్తుడు>> అని చెప్పినప్పుడు ప్రజలంతా, <<ఆమేన్‌>> అనాలి. \p \s5 \v 16 <<తన తండ్రినిగానీ, తల్లినిగానీ అవమాన పరచేవాడు శాపగ్రస్తుడు>> అని చెప్పినప్పుడు, ప్రజలంతా <<ఆమేన్‌>> అనాలి. \p \v 17 <<తన పొరుగువాడి సరిహద్దు రాయిని తొలగించినవాడు శాపగ్రస్తుడు>> అని చెప్పినప్పుడు, ప్రజలంతా <<ఆమేన్‌>> అనాలి. \p \s5 \v 18 <<గుడ్డివాణ్ణి దారి తప్పించేవాడు శాపగ్రస్తుడు>> అని చెప్పినప్పుడు, ప్రజలంతా, <<ఆమేన్‌>> అనాలి. \p \v 19 <<పరదేశికి గానీ, తండ్రి లేనివాడికిగానీ, విధవరాలికి గానీ అన్యాయపు తీర్పు తీర్చేవాడు శాపగ్రస్తుడు>> అని చెప్పినప్పుడు, ప్రజలంతా <<ఆమేన్‌>> అనాలి. \p \s5 \v 20 <<తన తండ్రి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకున్నవాడు, తన తండ్రి పడకను హేళన చేసినవాడు శాపగ్రస్తుడు>> అని చెప్పినప్పుడు, ప్రజలంతా <<ఆమేన్‌>> అనాలి. \p \v 21 <<ఏదైనా జంతువుతో లైంగిక సంబంధం పెట్టుకున్నవాడు శాపగ్రస్తుడు>> అని చెప్పినప్పుడు, ప్రజలంతా <<ఆమేన్‌>> అనాలి. \p \s5 \v 22 <<తన సోదరితో, అంటే తన తండ్రి కూతురుతో గానీ, తన తల్లి కూతురుతో గానీ లైంగిక సంబంధం పెట్టుకున్నవాడు శాపగ్రస్తుడు>> అని చెప్పినప్పుడు, ప్రజలంతా <<ఆమేన్‌>> అనాలి. \p \v 23 <<తన అత్తతో లైంగిక సంబంధం పెట్టుకున్నవాడు శాపగ్రస్తుడు>> అని చెప్పినప్పుడు, ప్రజలంతా <<ఆమేన్‌>> అనాలి. \p \s5 \v 24 <<రహస్యంగా తన పొరుగువాణ్ణి చంపేవాడు శాపగ్రస్తుడు>> అని చెప్పినప్పుడు, ప్రజలంతా <<ఆమేన్‌>> అనాలి. \p \v 25 <<నిర్దోషి ప్రాణం తీయడానికి లంచం తీసుకునేవాడు శాపగ్రస్తుడు>> అని చెప్పినప్పుడు, ప్రజలంతా <<ఆమేన్‌>> అనాలి. \p \s5 \v 26 <<ఈ ధర్మశాస్త్రానికి సంబంధించిన విధులను పాటించకుండా వాటిని లక్ష్యపెట్టనివాడు శాపగ్రస్తుడు>> అని చెప్పినప్పుడు, ప్రజలంతా <<ఆమేన్‌>> అనాలి. \s5 \c 28 \p \v 1 మీరు మీ యెహోవాా దేవుని మాట శ్రద్ధగా విని ఈరోజు నేను మీకు ఆజ్ఞాపిస్తున్న ఆయన ఆజ్ఞలన్నిటి ప్రకారం నడుచుకుంటే మీ దేవుడైన యెహోవాా భూమి మీదున్న ప్రజలందరి కంటే మిమ్మల్ని హెచ్చిస్తాడు. \v 2 మీరు మీ యెహోవాా దేవుని మాట వింటే ఈ దీవెనలన్నీ మీరు స్వంతం చేసుకుంటారు. \p \s5 \v 3 పట్టణంలో, పొలంలో మీకు దీవెనలు కలుగుతాయి. \v 4 మీ గర్భఫలం, మీ భూఫలం, మీ పశువుల మందలూ, మీ దుక్కిటెద్దులూ, మీ గొర్రెె మేకల మందల మీద దీవెనలుంటాయి. \p \s5 \v 5 మీ గంప, పిండి పిసికే తొట్టి మీదా దీవెనలుంటాయి. \v 6 మీరు లోపలికి వచ్చేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు దీవెనలుంటాయి. \s5 \v 7 యెహోవాా మీ మీదికి వచ్చే మీ శత్రువులు మీ ఎదుట హతమయ్యేలా చేస్తాడు. వాళ్ళు ఒక దారిలో మీ మీదికి దండెత్తి వచ్చి ఏడు దారుల్లో మీ ఎదుట నుంచి పారిపోతారు. \p \v 8 మీ ధాన్యపు గిడ్డంగుల్లో మీరు చేసే ప్రయత్నాలన్నిటిలో మీకు దీవెన కలిగేలా యెహోవాా ఆజ్ఞాపిస్తాడు. మీ యెహోవాా దేవుడు మీకిస్తున్న దేశంలో ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. \s5 \v 9 మీరు మీ యెహోవాా దేవుని ఆజ్ఞల ప్రకారం ఆయన మార్గాల్లో నడుచుకుంటే యెహోవాా మీకు ప్రమాణం చేసినట్టు ఆయన తనకు ప్రతిష్టిత ప్రజగా మిమ్మల్ని స్థాపిస్తాడు. \v 10 భూప్రజలంతా యెహోవాా పేరుతో మిమ్మల్ని పిలవడం చూసి మీకు భయపడతారు. \p \s5 \v 11 యెహోవాా మీకిస్తానని మీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో యెహోవాా మీ గర్భఫలాన్నీ మీ పశువులనూ మీ పంటనూ సమృద్ధిగా వర్ధిల్లజేస్తాడు. \v 12 యెహోవాా మీ దేశం మీద దాని కాలంలో వాన కురిపించడానికీ మీరు చేసే పనంతటినీ ఆశీర్వదించడానికీ ఆకాశ గిడ్డంగుల్ని తెరుస్తాడు. మీరు అనేక రాజ్యాలకు అప్పిస్తారు కాని అప్పు చెయ్యరు. \p \s5 \v 13 ఇవ్వాళ నేను మీకాజ్ఞాపించే మాటలన్నిటిలో ఏ విషయంలోనూ కుడివైపుకు గాని, ఎడమవైపుకు గాని తొలగిపోకుండా \v 14 వేరే దేవుళ్ళను పూజించడానికి వాటి వైపుకు పోకుండా మీరు అనుసరించి నడుచుకోవాలని ఇవ్వాళ నేను మీ కాజ్ఞాపిస్తున్నాను. మీ యెహోవాా దేవుని ఆజ్ఞలు విని, వాటిని పాటిస్తే యెహోవాా మిమ్మల్ని తలగా చేస్తాడు గానీ తోకగా చెయ్యడు. మీరు పైస్థాయిలో ఉంటారు గానీ కిందిస్థాయిలో ఉండరు. \p \s5 \v 15 నేను ఇవ్వాళ మీకాజ్ఞాపించే అన్ని ఆజ్ఞలనూ, చట్టాలనూ మీరు పాటించాలి. మీ దేవుడైన యెహోవాా చెప్పిన మాట వినకపోతే ఈ శాపాలన్నీ మీకు వస్తాయి. \s5 \v 16 పట్టణంలో మీకు శాపాలు ఉంటాయి. పొలంలో మీకు శాపాలు ఉంటాయి. \v 17 మీ గంప, పిండి పిసికే మీ తొట్టి మీద శాపాలు ఉంటాయి. \s5 \v 18 మీ గర్భఫలం, మీ భూపంట, మీ పశువుల మందల మీద శాపాలు ఉంటాయి. \v 19 మీరు లోపలికి వచ్చేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు శాపాలు ఉంటాయి. \p \s5 \v 20 మీరు నన్ను విడిచిపెట్టి, మీ దుర్మార్గపు పనులతో మీరు నాశనమైపోయి త్వరగా నశించే వరకూ, మీరు చేద్దామనుకున్న పనులన్నిటిలో యెహోవాా శాపాలను, కలవరాన్నీ, నిందనూ మీ మీదికి తెప్పిస్తాడు. \v 21 మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలో ఉండకుండాా మీరు నాశనమయ్యే వరకూ తెగులు మీకు అంటిపెట్టుకుని ఉండేలా చేస్తాడు. \p \s5 \v 22 యెహోవాా మీపై అంటు రోగాలతో, జ్వరంతో, అగ్నితో, కరువుతో, మండుటెండలతో, వడగాడ్పులతో, బూజు తెగులుతో దాడి చేస్తాడు. మీరు నాశనమయ్యే వరకూ అవి మిమ్మల్ని వెంటాడతాయి. \p \s5 \v 23 మీ తల మీద ఆకాశం కంచులా ఉంటుంది. మీ కిందున్న నేల ఇనుములా ఉంటుంది. \v 24 యెహోవాా మీ ప్రాంతంలో పడే వానను పిండిలాగా, ధూళిలాగా చేస్తాడు. మీరు నాశనమయ్యే వరకూ అది ఆకాశం నుంచి మీ మీద పడుతుంది. \p \s5 \v 25 యెహోవాా మీ శత్రువుల ఎదుట మిమ్మల్ని ఓడిస్తాడు. ఒక దారిలో మీరు వారికెదురుగా వెళ్ళి ఏడు దారుల్లో పారిపోతారు. ప్రపంచ దేశాలన్నిటిలో అటూ ఇటూ చెదరిపోతారు. \v 26 నీ శవం అన్ని రకాల పక్షులకూ, క్రూర మృగాలకూ ఆహారమవుతుంది. వాటిని బెదిరించే వాడెవడూ ఉండడు. \p \s5 \v 27 యెహోవాా ఐగుప్తు కురుపులతో, పుండ్లతో, చర్మవ్యాధులతో, దురదతో మిమ్మల్ని బాధిస్తాడు. మీరు వాటిని బాగుచేసుకోలేరు. \v 28 పిచ్చి, గుడ్డితనం, ఆందోళనతో యెహోవాా మిమ్మల్ని బాధిస్తాడు. \v 29 ఒకడు గుడ్డివాడుగా చీకట్లో వెతుకుతున్నట్టు మీరు మధ్యాహ్న సమయంలో వెతుకుతారు. మీరు చేసే పనుల్లో అభివృద్ది చెందరు. ఇతరులు మిమ్మల్ని అణిచివేస్తారు, దోచు కుంటారు. ఎవ్వరూ మిమ్మల్ని కాపాడలేరు. \p \s5 \v 30 ఒక కన్యను నువ్వు ప్రదానం చేసుకుంటావు కానీ వేరేవాడు ఆమెను లైంగికంగా కలుస్తాడు. మీరు ఇల్లు కడతారు కానీ దాన్లో కాపురం చెయ్యరు. ద్రాక్షతోట నాటుతారు కానీ దాని పండ్లు తినరు. \v 31 మీ కళ్ళముందే మీ ఎద్దును కోస్తారు కానీ దాని మాంసాన్ని మీరు తినరు. మీ దగ్గర నుంచి మీ గాడిదను బలవంతంగా తీసుకెళ్ళిపోతారు. దాన్ని తిరిగి మీకు ఇవ్వరు. మీ గొర్రెెల్ని మీ విరోధులకు ఇస్తారు కానీ మీకు సహాయం చేసేవాడు ఎవ్వడూ ఉండడు. \p \s5 \v 32 మీ కొడుకులను, కూతుళ్ళను అన్య జనులతో పెండ్లికి ఇస్తారు. వారి కోసం మీ కళ్ళు రోజంతా ఎదురు చూస్తూ అలిసిపోతాయి గానీ మీ వల్ల ఏమీ జరగదు. \s5 \v 33 మీకు తెలియని ప్రజలు మీ పొలం పంట, మీ కష్టార్జితమంతా తినివేస్తారు. మిమ్మల్ని ఎప్పుడూ బాధించి, అణచి ఉంచుతారు. \v 34 మీ కళ్ళ ముందు జరిగే వాటిని చూసి మీకు కలవరం పుడుతుంది. \v 35 యెహోవాా నీ అరకాలి నుంచి నడినెత్తి వరకూ మోకాళ్ల మీదా తొడల మీదా మానని కఠినమైన పుండ్లు పుట్టించి మిమ్మల్ని బాధిస్తాడు. \p \s5 \v 36 యెహోవాా మిమ్మల్నీ, మీ మీద నియమించుకునే మీ రాజునూ, మీరూ మీ పూర్వీకులూ ఎరగని వేరే దేశప్రజలకు అప్పగిస్తాడు. అక్కడ మీరు చెక్క ప్రతిమలను, రాతిదేవుళ్ళనూ పూజిస్తారు. \v 37 యెహోవాా మిమ్మల్ని చెదరగొట్టే ప్రజల్లో సామెతలు పుట్టడానికీ, నిందలకూ అస్పదం అవుతావు. \p \s5 \v 38 ఎక్కువ విత్తనాలు పొలంలో చల్లి కొంచెం పంట ఇంటికి తెచ్చుకుంటారు. ఎందుకంటే మిడతలు వాటిని తినివేస్తాయి. \v 39 ద్రాక్షతోటల్ని మీరు నాటి, వాటి బాగోగులు చూసుకుంటారు కానీ ఆ ద్రాక్షారసాన్ని తాగరు. ద్రాక్ష పండ్లు కొయ్యరు. ఎందుకంటే పురుగులు వాటిని తినేస్తాయి. \p \s5 \v 40 మీ ప్రాంతమంతా ఒలీవ చెట్లు ఉంటాయి కానీ ఆ నూనె తలకు రాసుకోరు. ఎందుకంటే మీ ఒలీవ కాయలు రాలిపోతాయి. \v 41 కొడుకులనూ కూతుర్లనూ కంటారు కానీ వారు మీదగ్గర ఉండరు. వారు బందీలుగా కొనిపోబడతారు. \p \s5 \v 42 మీ చెట్లూ, మీ పంట పొలాలూ మిడతల వశమైపోతాయి. \v 43 మీ మధ్యనున్న పరదేశి మీకంటే ఉన్నత స్థాయికి ఎదుగుతాడు. మీరు అంతకంతకూ కిందిస్థాయికి దిగజారతారు. \v 44 అతడు మీకు అప్పిస్తాడు గానీ మీరు అతనికి అప్పివ్వలేరు. అతడు తలగా ఉంటాడు, మీరు తోకగా ఉంటారు. \p \s5 \v 45 మీరు నాశనమయ్యేవరకూ ఈ శిక్షలన్నీ మీమీదికి వచ్చి మిమ్మల్ని తరిమి పట్టుకుంటాయి. ఎందుకంటే మీ యెహోవాా దేవుడు మీకాజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలనూ, ఆయన చట్టాలనూ అనుసరించి నడుచుకొనేలా మీరు ఆయన మాట వినలేదు. \v 46 అవి ఎప్పటికీ మీ మీద, మీ సంతానం మీద సూచనలుగా, ఆశ్చర్యం కలిగించేవిగా ఉంటాయి. \p \s5 \v 47 మీకు సమృద్ధిగా ఉన్నప్పుడు మీరు సంతోషంగా, హృదయపూర్వకంగా మీ దేవుడైన యెహోవాాను ఆరాధించలేదు. \v 48 కాబట్టి యెహోవాా మీ మీదికి రప్పించే మీ శత్రువులకు మీరు బానిసలవుతారు. ఆకలితో, దాహంతో, దిగంబరులుగా, పేదరికం అనుభవిస్తూ వారికి సేవ చేస్తారు. మీరు నాశనం అయ్యే వరకూ మీ మెడ మీద ఇనుపకాడి ఉంచుతారు. \p \s5 \v 49 దేవుడైన యెహోవాా చాలా దూరంలో ఉన్న ఒక దేశం మీ మీదికి దండెత్తేలా చేస్తాడు. వారి భాష మీకు తెలియదు. గద్ద తన ఎర దగ్గరకు ఎగిరి వచ్చినట్టు వాళ్ళు వస్తారు. \v 50 వాళ్ళు క్రూరత్వం నిండినవారై ముసలివాళ్ళను, పసి పిల్లలను కూడా తీవ్రంగా హింసిస్తారు. \v 51 మిమ్మల్ని నాశనం చేసే వరకూ మీ పశువులనూ మీ పొలాల పంటనూ దోచుకుంటారు. మీరు నాశనం అయ్యేంత వరకూ మీ ధాన్యం, ద్రాక్షారసం, నూనె, పశువుల మందలు, గొర్రెె మేకమందలు మీకు మిగలకుండా చేస్తారు. \p \s5 \v 52 మీరు ఆశ్రయించే ఎత్తయిన కోట గోడలు కూలిపోయే వరకూ మీ దేశమంతా మీ పట్టణ ద్వారాల దగ్గర వారు మిమ్మల్ని ముట్టడిస్తారు. మీ యెహోవాా దేవుడు మీకిచ్చిన మీ దేశమంతటిలో మీ పట్టణ గుమ్మాల దగ్గర మిమ్మల్ని ముట్టడిస్తారు. \v 53 ఆ ముట్టడిలో మీ శత్రువులు మిమ్మల్ని పెట్టే బాధలు తాళలేక మీ సంతానాన్ని, అంటే మీ దేవుడైన యెహోవాా మీకిచ్చిన మీ కొడుకులను, కూతుళ్ళను చంపి, వాళ్ళ మాంసం మీరు తింటారు. \p \s5 \v 54 మీలో మృదు స్వభావి, సుకుమారత్వం గల వ్యక్తి కూడా తన సొంత పిల్లల మాంసాన్ని తింటాడు. వాటిలో కొంచెమైనా తన సోదరునికి గానీ, తన ప్రియమైన భార్యకుగానీ, తన మిగతా పిల్లలకు గానీ మిగల్చడు. వాళ్ళపై జాలి చూపడు. \v 55 ఎందుకంటే మీ శత్రువులు మీ గ్రామాలన్నిటిలో మిమ్మల్ని పెట్టే ఇబ్బందిలో ముట్టడిలో అతనికేమీ మిగలదు. \p \s5 \v 56 మీలో మృదువైన, అతి సుకుమారం కలిగిన స్త్రీ, సుకుమారంగా నేల మీద తన అరికాలు మోపలేని స్త్రీ కూడా తన కాళ్లమధ్యనుండి బయటకు వచ్చే శిశువును రహస్యంగా తింటుంది. వాటిలో కొంచెమైనా తనకిష్టమైన సొంత భర్తకూ తన కొడుకూ కూతురుకూ పెట్టదు. \v 57 వారిపట్ల దయ చూపించదు. ఎందుకంటే మీ శత్రువులు మీ గ్రామాలన్నిటిని ముట్టడించి మిమ్మల్ని దోచుకోవడం వల్ల, కడుపు నింపుకోవడానికి మీకేమీ మిగలదు. \p \s5 \v 58 ఈ గ్రంథంలో రాసిన ఈ ధర్మశాస్త్ర సూత్రాలను పాటించి వాటి ప్రకారం ప్రవర్తించక, మీ యెహోవాా దేవుని ఘనమైన నామానికి, భయభక్తులు కనపరచకపోతే \v 59 యెహోవాా మీకూ మీ సంతానానికీ దీర్ఘకాలం ఉండే, మానని భయంకరమైన రోగాలు, తెగుళ్ళు రప్పిస్తాడు. \p \s5 \v 60 మీకు భయం కలిగించే ఐగుప్తు రోగాలన్నీ మీమీదికి రప్పిస్తాడు. అవి మిమ్మల్ని వదిలిపోవు. \v 61 మీరు నాశనం అయ్యే వరకూ ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయని ప్రతి రోగం, ప్రతి వ్యాధి ఆయన మీకు తెస్తాడు. \v 62 మీరు మీ యెహోవాా దేవుని మాట వినలేదు కాబట్టి, అంతకుముందు మీరు ఆకాశనక్షత్రాల్లాగా విస్తరించినప్పటికీ కొద్దిమందే మిగిలి ఉంటారు. \p \s5 \v 63 మీకు మేలు చేయడంలో, మిమ్మల్ని అభివృద్ది చేయడంలో మీ యెహోవాా దేవుడు మీపట్ల ఎలా సంతోషించాడో అలాగే మిమ్మల్ని నాశనం చెయ్యడానికి, మిమ్మల్ని హతమార్చడానికి యెహోవాా సంతోషిస్తాడు. మీరు స్వాధీనం చేసుకోడానికి ప్రవేశిస్తున్న దేశం నుంచి తొలగించి వేస్తాడు. \v 64 యెహోవాా భూమి ఈ చివర నుంచి ఆ చివరి వరకూ అన్య దేశాలలో మీరు చెదిరిపోయేలా చేస్తాడు. అక్కడ మీ పితరులు సేవించని చెక్కతో, రాయితో చేసిన అన్య దేవుళ్ళను కొలుస్తారు. \p \s5 \v 65 ఆ ప్రజల మధ్య మీకు నెమ్మది ఉండదు. నీ అరికాలికి విశ్రాంతి కలగదు. అక్కడ మీ గుండెలు అదిరేలా, కళ్ళు మసకబారేలా, మీ ప్రాణాలు కుంగిపోయేలా యెహోవాా చేస్తాడు. \v 66 చస్తామో, బతుకుతామో అన్నట్టుగా ఉంటారు. బతుకు మీద ఏమాత్రం ఆశ ఉండదు. పగలూ రాత్రి భయం భయంగా గడుపుతారు. \p \s5 \v 67 రాత్రింబవళ్ళూ భయం భయంగా కాలం గడుపుతారు. మీ ప్రాణాలు నిలిచి ఉంటాయన్న నమ్మకం మీకు ఏమాత్రం ఉండదు. మీ హృదయాల్లో ఉన్న భయం వల్ల ఉదయం పూట ఎప్పుడు సాయంత్రం అవుతుందా అనీ, సాయంకాలం పూట ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తుంటారు. \p \v 68 మీరు ఇకపై ఐగుప్తు చూడకూడదు అని నేను మీతో చెప్పిన మార్గంలోగుండా యెహోవాా ఓడల మీద ఐగుప్తుకు మిమ్మల్ని మళ్ళీ రప్పిస్తాడు. మీరు అక్కడ దాసులుగా, దాసీలుగా మీ శత్రువులకు మిమ్మల్ని మీరే అమ్ముకోవాలని చూస్తారు కానీ మిమ్మల్ని కొనేవారెవ్వరూ ఉండరు. \s5 \c 29 \p \v 1 యెహోవాా హోరేబులో ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధన కాకుండా ఆయన మోయాబు దేశంలో వారితో చెయ్యమని మోషేకు ఆజ్ఞాపించిన నిబంధన మాటలు ఇవే. \p \s5 \v 2 మోషే ఇశ్రాయేలు ప్రజలందరినీ సమకూర్చి వారితో ఇలా చెప్పాడు, యెహోవాా మీ కళ్ళ ఎదుట ఐగుప్తు దేశంలో ఫరోకు, అతని సేవకులందరికీ అతని దేశమంతటికీ చేసినదంతా, \v 3 అంటే తీవ్రమైన ఆ బాధలూ సూచకక్రియలూ, అద్భుత కార్యాలూ మీరు చూశారు. \v 4 అయినప్పటికీ గ్రహించే హృదయాన్నీ చూసే కళ్ళనూ వినే చెవులనూ ఇప్పటికీ యెహోవాా మీకు ఇవ్వలేదు. \p \s5 \v 5 నేను మీ దేవుడనైన యెహోవాాను అని మీరు తెలుసుకొనేలా 40 ఏళ్ళు నేను మిమ్మల్ని ఎడారిలో నడిపించాను. మీ దుస్తులు మీ ఒంటి మీద పాతబడలేదు. మీ చెప్పులు మీ కాళ్ల కింద అరిగిపోలేదు. \v 6 మీరు రొట్టెలు తినలేదు, ద్రాక్షారసం గానీ, మద్యం గానీ తాగలేదు. \p \s5 \v 7 మీరు ఈ ప్రాంతానికి చేరినప్పుడు హెష్బోను రాజు సీహోను, బాషాను రాజు ఓగు మనపై దండెత్తినప్పుడు \v 8 మనం వారిని హతమార్చి వాళ్ళ దేశాలను స్వాధీనం చేసుకుని రూబేను, గాదు, మనష్షే అర్ధగోత్రాల వాళ్లకు వారసత్వంగా ఇచ్చాము. \v 9 కాబట్టి మీరు చేసేదంతా సవ్యంగా జరిగేలా ఈ నిబంధన కట్టడలు పాటించి, వాటి ప్రకారం ప్రవర్తించండి. \p \s5 \v 10 మీరంతా ఈ రోజు మీ దేవుడైన యెహోవాా ఎదుట నిలబడ్డారు. ఇశ్రాయేలు ప్రజలలో ప్రతివాడూ, \v 11 అంటే మీ నాయకులూ, గోత్రాల ప్రజలూ, పెద్దలూ, అధికారులూ, పిల్లలూ, మీ భార్యలూ మీ శిబిరంలో ఉన్న పరదేశులూ, కట్టెలు నరికేవాడు మొదలుకొని మీకు నీళ్లు తోడేవారి వరకూ అందరూ ఇక్కడ నిలబడ్డారు. \s5 \v 12 మీ దేవుడైన యెహోవాా మీకు ఆజ్ఞాపించినట్టు, మీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణం చేసిన విధంగా \v 13 ఈ రోజు మిమ్మల్ని తన స్వంత ప్రజగా నియమించుకుని తానే మీకు దేవుడుగా ఉండాలని మీ దేవుడైన యెహోవాా సంకల్పించాడు. ఈనాడు మీకు నియమిస్తున్న మీ దేవుడైన యెహోవాా నిబంధనలో, ఆయన ప్రమాణం చేసిన దానిలో మీరు పాలు పొందడానికి ఇక్కడ నిలబడ్డారు. \p \s5 \v 14 నేను ఈ నిబంధన, ఈ ప్రమాణం చేసేది మీతో మాత్రమే కాదు, ఇక్కడ మనతో, మన దేవుడైన యెహోవాా ఎదుట నిలబడిన వాళ్ళతో \v 15 ఇక్కడ ఈ రోజు మనతో కూడ కలవని వారితో కూడా చేస్తున్నాను. \v 16 మనం ఐగుప్తు దేశంలో ఎలా నివసించామో, మీరు దాటి వచ్చిన ప్రజల మధ్యనుంచి మనమెలా దాటివచ్చామో మీకు తెలుసు. \s5 \v 17 వారి నీచమైన పనులూ, కర్ర, రాయి, వెండి, బంగారంతో చేసిన విగ్రహాలను మీరు చూశారు. \p \v 18 ఆ దేశాల ప్రజల దేవుళ్ళను పూజించడానికి మన దేవుడైన యెహోవాా వద్ద నుంచి తొలగే హృదయం, మీలో ఏ పురుషునికీ ఏ స్త్రీకీ ఏ కుటుంబానికీ ఏ గోత్రానికీ ఉండకూడదు. అలాంటి చేదైన విషం పుట్టించే మూలాధారం మీమధ్య ఉండకూడదు. \v 19 అలాంటివాడు ఈ శిక్ష విధులు విన్నప్పుడు, తన హృదయంలో తనను తాను పొగడుకుంటూ, <<నేను నా హృదయాన్ని కఠినం చేసుకుంటున్నాను, నాకు క్షేమమే కలుగుతుంది>> అనుకుంటాడు. \p \s5 \v 20 యెహోవాా అలాంటివాణ్ణి క్షమించడు. యెహోవాా కోపం, రోషం అతని మీద రగులుకుంటుంది. ఈ గ్రంథంలో రాసి ఉన్న శాపాలన్నీ వాడికి ప్రాప్తిస్తాయి. యెహోవాా అతని పేరు ఆకాశం కింద ఉండకుండాా తుడిచివేస్తాడు. \v 21 ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాసి ఉన్న నిబంధన శాపాలన్నిటి ప్రకారం శిక్షించడానికి యెహోవాా ఇశ్రాయేలు ప్రజల గోత్రాలన్నిటిలో నుంచి అతణ్ణి వేరు చేస్తాడు. \p \s5 \v 22 కాబట్టి రాబోయే తరం వారు, మీ తరువాత పుట్టే మీ సంతానం, చాలా దూరం నుంచి వచ్చే పరాయి దేశీయులు మీ దేశానికి యెహోవాా రప్పించిన తెగుళ్లనూ రోగాలనూ చూస్తారు. \v 23 యెహోవాా తన కోపోద్రేకంతో నాశనం చేసిన సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయీము పట్టణాలవలె ఆ ప్రాంతాలన్నీ గంధకంతో, ఉప్పుతో చెడిపోయి, విత్తనాలు మొలకెత్తకుండా, పంటలు పండకపోవడం చూసి, \v 24 వారు యెహోవాా ఈ దేశాన్ని ఎందుకిలా చేశాడు? ఇంత తీవ్రమైన కోపానికి కారణం ఏమిటి? అని చెప్పుకుంటారు. \p \s5 \v 25 అప్పుడు ప్రజలు ఇలా చెబుతారు. <<వారి పితరుల దేవుడు యెహోవాా ఐగుప్తు దేశం నుంచి వారిని రప్పించిన తరువాత ఆయన తమతో చేసిన నిబంధనను వారు లక్ష్యపెట్టలేదు. \v 26 తమకు తెలియని అన్య దేవుళ్ళను, మొక్కవద్దని యెహోవాా వారికి చెప్పిన దేవుళ్ళకు మొక్కి, పూజించారు. \s5 \v 27 కాబట్టి ఈ గ్రంథంలో రాసిన శిక్షలన్నీ ఈ దేశం మీదికి రప్పించడానికి దాని మీద యెహోవాా కోపాగ్ని రగులుకుంది. \p \v 28 యెహోవాా తన తీవ్రమైన కోపాగ్నితో, ఉగ్రతతో వాళ్ళను తమ దేశం నుంచి పెళ్ళగించి, వేరొక దేశానికి వెళ్లగొట్టాడు. ఇప్పటి వరకూ వాళ్ళు అక్కడే ఉండిపోయారు.>> \p \s5 \v 29 రహస్యంగా ఉండే విషయాలన్నీ మన దేవుడు యెహోవాాకు చెందుతాయి. అయితే మనం ఈ ధర్మశాస్త్ర విధులన్నిటి ప్రకారం నడుచుకోవడానికి మనకు వెల్లడైన సంగతులు మాత్రం ఎప్పటికీ మనకూ, మన సంతానానికీ చెందుతాయి. \s5 \c 30 \p \v 1 నేను మీకు తెలియపరచిన ఈ విషయాలన్నీ అంటే దీవెనలు, శాపాలు మీ మీదికి వచ్చిన తరువాత మీ దేవుడు మిమ్మల్ని వెళ్లగొట్టించిన \v 2 అన్ని రాజ్యాలలో వాటిని గుర్తుకు తెచ్చుకుంటారు. అప్పుడు మీరూ, మీ పిల్లలూ మీ దేవుడైన యెహోవాా వైపు తిరిగితే, ఈవేళ నేను మీకాజ్ఞాపించే వాటి ప్రకారం మీరు హృదయపూర్వకంగా సంపూర్ణ ఆత్మతో ఆయన మాట వింటే \v 3 మీ దేవుడైన యెహోవాా చెరలో ఉన్న మిమ్మల్ని మళ్ళీ రప్పిస్తాడు. ఆయన మిమ్మల్ని కనికరించి, మీ యెహోవాా దేవుడు ఏ ప్రజల్లోకి మిమ్మల్ని చెదరగొట్టాడో వారందరిలో నుంచి మిమ్మల్ని సమకూర్చి ఇక్కడకు తీసుకువస్తాడు. \p \s5 \v 4 చెదిరిపోయిన మీలో ఎవరైనా భూమి అంచులలో ఉన్నప్పటికీ అక్కడ నుంచి మీ దేవుడైన యెహోవాా మిమ్మల్ని సమకూర్చి అక్కడ నుంచి తీసుకు వస్తాడు. \v 5 మీ పూర్వీకులు స్వాధీనం చేసుకున్న దేశానికి మీ యెహోవాా దేవుడు మిమ్మల్ని చేరుస్తాడు. మీరు దాన్ని స్వాధీనం చేసుకుంటారు. ఆయన మీకు మేలు చేసి మీ పూర్వీకుల కంటే మిమ్మల్ని అసంఖ్యాకంగా చేస్తాడు. \p \s5 \v 6 మీరు బతకడానికి, హృదయపూర్వకంగా సంపూర్ణ ఆత్మతో మీ యెహోవాా దేవుని ప్రేమించేలా మీ యెహోవాా దేవుడు మీ హృదయానికీ మీ పిల్లల హృదయానికీ సున్నతి చేస్తాడు. \p \v 7 మిమ్మల్ని హింసించిన మీ శత్రువుల మీదికీ మిమ్మల్ని ద్వేషించినవారి మీదికీ మీ యెహోవాా దేవుడు ఆ శాపాలన్నీ రప్పిస్తాడు. \v 8 మీరు తిరిగి వచ్చి యెహోవాా మాట వింటారు. నేనిప్పుడు మీకాజ్ఞాపించే ఆయన ఆజ్ఞలన్నిటి ప్రకారం ప్రవర్తిస్తారు. \p \s5 \v 9 మీ యెహోవాా దేవుడు, మీరు చేతులతో చేసే పనులన్నిటిలో, మీ గర్భఫలం విషయంలో మీ పశువుల గర్భఫలం విషయంలో మీ భూపంట విషయంలో మీకు అభివృద్ధి కలిగిస్తాడు. \v 10 ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాసిన ఆయన ఆజ్ఞలనూ, చట్టాలనూ మీరు పాటిస్తే మీ యెహోవాా దేవుని మాట విని, మీ హృదయపూర్వకంగా సంపూర్ణ ఆత్మతో మీ యెహోవాా దేవుని వైపు తిరిగితే, యెహోవాా మీ పూర్వీకుల గురించి సంతోషించినట్టు మీకు మేలు చేయడానికి మీపట్ల మళ్ళీ సంతోషిస్తాడు. \p \s5 \v 11 ఇవ్వాళ నేను మీకు ఆజ్ఞాపించే ఈ విధులు గ్రహించడం మీకు కష్టం కాదు, వాటిని అందుకోవడం అసాధ్యమూ కాదు. \v 12 <<మనం విని, దాని ప్రకారం చేయడం కోసం పరలోకానికి ఎక్కిపోయి మన దగ్గరికి దాన్ని ఎవరు తెస్తారు?>>అని మీరు భావించడానికి అది ఆకాశంలో ఉండేది కాదు. \s5 \v 13 <<మనం విని, దాని ప్రకారం చేయడానికి సముద్రం దాటి మన దగ్గరికి దాన్ని ఎవరు తెస్తారు?>> అని భావించడానికి అది సముద్రం అవతల ఉండేదీ కాదు. \v 14 మీరు దాని ప్రకారం చేయడానికి ఆ మాట మీకు చాలా సమీపంగా ఉంది. అది మీ నోటి వెంట, మీ హృదయంలో ఉంది. \p \s5 \v 15 చూడండి, ఈరోజు నేను జీవాన్నీ మేలునూ, చావునూ కీడునూ మీ ఎదుట ఉంచాను. \v 16 మీ దేవుడైన యెహోవాాను ప్రేమించి ఆయన మార్గాల్లో నడుస్తూ ఆయన ఆజ్ఞలూ చట్టాలూ విధులూ ఆచరించమని నేను మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను. అలా చేస్తే మీరు స్వాధీనం చేసుకోడానికి ప్రవేశించే దేశంలో మీ యెహోవాా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. \p \s5 \v 17 అయితే మీ హృదయం వేరొక వైపుకు మళ్ళి, మాటకు లోబడక అన్య దేవుళ్ళకు మొక్కి, పూజిస్తే \v 18 మీరు తప్పకుండా నాశనమైపోతారని, స్వాధీనం చేసుకోడానికి యొర్దాను నది దాటిపోతున్న దేశంలో మీరు శాశ్వితకాలం జీవించరనీ తెలియచేస్తున్నాను. \s5 \v 19 ఈరోజు జీవాన్నీ చావునూ ఆశీర్వాదాన్నీ శాపాన్నీ నేను మీ ఎదుట ఉంచుతున్నాను. భూమినీ, ఆకాశాన్నీ మీ మీద సాక్షులుగా పిలుస్తున్నాను. \v 20 మీ పితరులు అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించడానికి యెహోవాాయే మీ ప్రాణానికీ మీ దీర్ఘాయుష్షుకూ మూలం. కాబట్టి మీరూ మీ సంతానం జీవిస్తూ మీ జీవానికి మూలమైన మీ యెహోవాా దేవుణ్ణి ప్రేమించి ఆయన ఉపదేశం విని ఆయనను హత్తుకొని ఉండేలా జీవాన్ని కోరుకోండి. \s5 \c 31 \p \v 1 మోషే ఇశ్రాయేలు ప్రజలతో ఈ విధంగా మాట్లాడిన తరువాత మళ్ళీ ఈ మాటలు చెప్పాడు, నాకు ఇప్పుడు 120 ఏళ్ళు. \v 2 ఇకనుంచి నేను అటూ ఇటూ వస్తూ పోతూ ఉండలేను. యెహోవాా నాతో ఈ యొర్దాను నది దాటకూడదు అని చెప్పాడు. \v 3 మీ యెహోవాా దేవుడు మీకు ముందుగా దాటిపోయి ఈ రాజ్యాల్ని మీ ఎదుట ఉండకుండా నాశనం చేస్తాడు. మీరు వారి దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు. యెహోవాా చెప్పినట్టుగా యెహోషువ మీకు ముందుగా దాటిపోతాడు. \p \s5 \v 4 యెహోవాా నాశనం చేసిన అమోరీయుల రాజులు సీహోను, ఓగుకూ, వారి దేశాలకూ ఏమి జరిగించాడో అలానే వారికీ చేస్తాడు. \v 5 మీరు వాళ్ళతో యుద్ధానికి వెళ్ళినప్పుడు యెహోవాా మీ చేతికి వారిని అప్పగిస్తాడు. నేను మీకు ఆజ్ఞాపించినదంతా వారిపట్ల చెయ్యండి. \v 6 నిబ్బరంగా, ధైర్యంగా ఉండండి. భయపడవద్దు. వాళ్ళను చూసి కంగారు పడవద్దు. మీతో వచ్చేవాడు మీ యెహోవాా దేవుడే. ఆయన మిమ్మల్ని వదిలిపెట్టడు, మర్చిపోడు. \p \s5 \v 7 మోషే యెహోషువను పిలిచి, నువ్వు నిబ్బరంగా, ధైర్యంగా నిలబడు. యెహోవాా ఈ ప్రజలకిస్తానని వారి పితరులతో ప్రమాణం చేసిన దేశానికి నువ్వు వీరితోబాటు వెళ్లి దాన్ని వారికి స్వాధీనం చెయ్యాలి. \v 8 నీకు ముందుగా వెళ్ళేవాడు యెహోవాాయే. ఆయన నీతో ఉంటాడు. ఆయన నిన్ను వదిలిపెట్టడు, మర్చిపోడు. భయపడవద్దు. వాళ్ళను చూసి దిగులు పడవద్దు అని ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట అతనితో చెప్పాడు. \p \s5 \v 9 మోషే ఈ ధర్మశాస్త్రాన్ని రాసి, యెహోవాా నిబంధన మందసాన్ని యాజకులైన లేవీయులకూ ఇశ్రాయేలీయుల పెద్దలందరికీ ఇచ్చాడు. \v 10 మోషే వారికిలా ఆజ్ఞాపించాడు, ప్రతి ఏడవ సంవత్సరంలో అంటే అప్పులు రద్దు చేసే ఆ నిర్ణీత గడువు సంవత్సరంలో పర్ణశాలల పండగ సమయంలో \v 11 మీ దేవుడైన యెహోవాా ఎన్నుకున్న స్థలంలో ఇశ్రాయేలు ప్రజలంతా ఆయన ఎదుట కనబడాలి. ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట ఈ ధర్మశాస్త్రాన్ని చదివి వారికి వినిపించాలి. \p \s5 \v 12 మీ యెహోవాా దేవునికి భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యాలన్నిటినీ విని, వాటి ప్రకారం నడుచుకునేలా ప్రజలను సమకూర్చాలి. పురుషులనూ స్త్రీలనూ పిల్లలనూ మీ పట్టణాల్లో ఉన్న పరదేశులను పోగు చెయ్యాలి. \v 13 అలా చేస్తే, ఆ వాక్యాలు ఎరగనివారి పిల్లలు వాటిని విని, మీరు స్వాధీనం చేసుకోడానికి యొర్దాను నది దాటబోతున్న దేశంలో మీరు జీవించే రోజులన్నీ మీ యెహోవాా దేవునికి భయపడడం నేర్చుకుంటారు. \p \s5 \v 14 యెహోవాా, మోషేతో ఇలా చెప్పాడు. <<చూడు. నువ్వు తప్పకుండా చనిపోయే రోజు వస్తుంది. నువ్వు యెహోషువను పిలిచి నేనతనికి ఆజ్ఞలు ఇవ్వడానికి సన్నిధి గుడారంలో నిలబడండి.>> \v 15 మోషే, యెహోషువలు సన్నిధి గుడారంలో నిలబడ్డారు. యెహోవాా మేఘస్తంభంలో నుండి గుడారం దగ్గర కనిపించాడు. ఆ మేఘస్తంభం గుడారపు ద్వారం పైగా నిలిచింది. \p \s5 \v 16 యెహోవాా మోషేతో ఇలా అన్నాడు, <<చూడు. నువ్వు చనిపోయి నీ పితరుల వద్దకు చేరుకోబోతున్నావు. ఈ ప్రజలు బయలుదేరి ఏ దేశ ప్రజల మధ్య ఉండబోతున్నారో ఆ ప్రజల మధ్య, ఆ అన్య దేవుళ్ళను అనుసరించి వ్యభిచారుల్లా ప్రవర్తిస్తారు. నన్ను విడిచిపెట్టి నేను వారితో చేసిన నిబంధన మీరతారు. \p \s5 \v 17 అప్పుడు వారిమీద నా కోపం రేగుతుంది. నేను వాళ్ళని వదిలిపెడతాను. వారికి నా ముఖం చాటు చేస్తాను. వాళ్ళు నాశనమైపోతారు. ఎన్నో విపత్తులూ కష్టాలూ వాళ్లకు సంభవిస్తాయి. ఆ సమయంలో వాళ్ళు, మన దేవుడు మన మధ్య లేనందువల్లనే మనకు ఈ విపత్తులు వచ్చాయి గదా! అనుకుంటారు. \v 18 వాళ్ళు ఇతర దేవుళ్ళ వైపు తిరిగి, చేసిన దుర్మార్గమంతటిబట్టి ఆ రోజు నేను తప్పకుండా వారికి నా ముఖం చాటు చేస్తాను. \p \s5 \v 19 కాబట్టి మీరు ఈ పాట రాసి ఇశ్రాయేలు ప్రజలకు నేర్పండి. ఈ పాట ఇశ్రాయేలు ప్రజల మీద నీకు సాక్ష్యంగా ఉండేలా దాన్ని వారికి కంఠస్తం అయ్యేలా నేర్పించండి. \v 20 నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ప్రకారం పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారిని నడిపించిన తరువాత వారు తిని తాగి తృప్తిపొంది అహంకారం తెచ్చుకుంటారు. ఇతర దేవుళ్ళ వైపు తిరిగి వాటిని పూజించి నన్ను విడిచిపెట్టి నా నిబంధన మీరతారు. \p \s5 \v 21 ఎన్నో ఆపదలూ కష్టాలూ వారికి సంభవిస్తాయి. అప్పుడు ఈ పాట వారి ఎదుట సాక్షిగా నిలబడి సాక్ష్యమిస్తూ ఉంటుంది. ఆ పాట మరచిపోకుండా ఉండేలా వారి సంతానానికి కంఠోపాఠంగా ఉంటుంది. ఎందుకంటే, నేను ప్రమాణం చేసిన దేశంలో వాళ్ళను నడిపించక ముందే, ఈనాడే వాళ్ళు జరిగించే ఆలోచన నాకు తెలుసు>> అన్నాడు. \p \s5 \v 22 మోషే ఆ రోజు ఈ పాట రాసి ఇశ్రాయేలు ప్రజలకు నేర్పించాడు. \v 23 యెహోవాా నూను కొడుకు యెహోషువకు ఇలా చెప్పాడు. <<నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. నేను ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తానని ప్రమాణం చేసిన దేశానికి నువ్వు వాళ్ళని నడిపించాలి. నేను నీకు తోడుగా ఉంటాను.>> \p \s5 \v 24 మోషే ధర్మశాస్త్ర వాక్యాలన్నీ గ్రంథంలో పూర్తిగా రాయడం ముగించిన తరువాత \v 25 యెహోవాా నిబంధన మందసాన్ని మోసే లేవీయులను చూసి మోషే ఇలా ఆజ్ఞాపించాడు, మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకుని మీ యెహోవాా దేవుని నిబంధన మందసం పక్కన ఉంచండి. \v 26 అది అక్కడ మీమీద సాక్షిగా ఉంటుంది. \p \s5 \v 27 మీ తిరుగుబాటుతత్వం, మీ తలబిరుసుతనం నాకు తెలుసు. ఇవ్వాళ నేను ఇంకా జీవించి మీతో కలిసి ఉండగానే మీరు యెహోవాా మీద తిరుగుబాటు చేశారు. \v 28 నేను చనిపోయిన తరువాత ఇంకా ఎక్కువ తిరుగుబాటు చేస్తారు కదా! మీ గోత్రాల పెద్దలందరినీ, మీ అధికారులనూ నా దగ్గరకు తీసుకురండి. ఆకాశాన్నీ భూమినీ వారిమీద సాక్షంగా పెట్టి నేనీ మాటల్ని వాళ్ళు వినేలా చెబుతాను. \p \v 29 ఎందుకంటే నేను చనిపోయిన తరువాత మీరు పూర్తిగా చెడిపోయి నేను మీరు పాటించాలని ఆజ్ఞాపించిన మార్గం తప్పిపోతారని నాకు తెలుసు. ఆయన దృష్టిలో చెడ్డగా ప్రవర్తించి, మీరు చేసే పనులతో యెహోవాాకు కోపం పుట్టిస్తారు. రాబోయే రోజుల్లో విపత్తులు మీకు కలుగుతాయి. \p \s5 \v 30 తరువాత మోషే ఇశ్రాయేలు ప్రజలు వింటుండగా ఈ పాట పూర్తిగా పాడి వినిపించాడు. \s5 \c 32 \p \v 1 ఆకాశమా! నేను చెప్పేది విను! నన్ను మాట్లాడనియ్యి. \q భూగోళమా, నా నోటి మాటలు ఆలకించు. \q \v 2 నా ఉపదేశం వానలా కురుస్తుంది. \q నా మాటలు మంచు బిందువుల్లా, \q లేతగడ్డిపై పడే చినుకుల్లా, \q పచ్చికపై కురిసే చిరుజల్లులా, \q మొక్కలపై కురిసే జల్లులా ఉంటాయి. \q1 \s5 \v 3 నేను యెహోవాా పేరును ప్రకటిస్తాను. \q మన దేవునికి ఘనత ఆపాదించండి. \q \v 4 ఆయన మనకు ఆశ్రయ దుర్గం. \q ఆయన పని పరిపూర్ణం. \q ఆయన మార్గాలన్నీ న్యాయమైనవి. \q ఆయన నమ్మదగిన దేవుడు. \q1 ఆయన పక్షపాతం చూపని దేవుడు. \q ఆయన న్యాయవంతుడు, యథార్థవంతుడు. \q1 \s5 \v 5 వారు తమను తాము చెడగొట్టుకున్నారు. \q వారు ఆయన సంతానం కారు. \q వారు దోషులు, మూర్ఖులైన వక్రతరం. \q1 \v 6 బుద్ధి, ఇంగితం లేని మనుషులారా, \q యెహోవాాకు ఇదా మీరిచ్చే కానుక? \q ఆయన మీ తండ్రి కాడా? \q ఆయనే గదా మిమ్మల్ని పుట్టించి స్థిరపరచింది? \q1 \s5 \v 7 గతించిన కాలాన్ని గుర్తుకు తెచ్చుకోండి. \q తరతరాల సంవత్సరాల సంగతుల్ని తలపోయండి. \q మీ తండ్రిని అడుగు, అతడు నీకు చూపిస్తాడు. \q పెద్దలను అడుగు, వాళ్ళు నీకు చెబుతారు. \q1 \v 8 మహోన్నతుడు ప్రజలకు వారి వారి వారసత్వాలను పంచి ఇచ్చినప్పుడు, \q మానవ జాతులను వేరు పరచినపుడు, \q ఇశ్రాయేలు ప్రజల లెక్క ప్రకారం ప్రజలకు హద్దులు నియమించాడు. \q1 \s5 \v 9 యెహోవాా వంతు ఆయన ప్రజలే. \q ఆయన వారసత్వం యాకోబు సంతానమే. \q \v 10 ఆయన ఆ ప్రజను ఎడారి ప్రదేశంలో కనుగొన్నాడు. \q బీడు భూమిలో, భీకరమైన శబ్దాలు ఉన్న నిర్జన ప్రదేశంలో అతణ్ణి రక్షించి ఆదుకున్నాడు. \q తన కనుపాపలా అతణ్ణి కాపాడాడు. \q1 \s5 \v 11 గద్ద తన గూడు రేపి తన పిల్లలపై ఎగురుతూ \q1 రెక్కలు చాపుకొని ఆ పిల్లలను రెక్కల మీద మోసినట్టు యెహోవాా చేశాడు. \q1 \v 12 యెహోవాా ఒక్కడే ఆ ప్రజలకు దారి చూపుతున్నాడు. \q వేరే దేవుళ్ళెవరూ ఆయనకు సాటిరారు. \q1 \s5 \v 13 లోకంలో ఎత్తైన స్థలాలపై ఆ ప్రజలను ఎక్కించాడు. \q పొలాల పంటలు వారికి తినిపించాడు. \q కొండబండల తేనెతో, చెకుముకి రాతిబండ నూనెతో వారిని తృప్తిపరిచాడు. \q1 \s5 \v 14 ఆవు మజ్జిగను, గొర్రెెల, మేకల పాలనూ, \q గొర్రెెపిల్లల కొవ్వునూ, బాషాను పొట్టేళ్లను, \q మేకపోతులనూ, శ్రేష్ఠమైన గోదుమ పిండినీ మీకిచ్చాడు. \q మంచి ద్రాక్షరసంతో చేసిన మద్యం మీరు తాగారు. \q1 \s5 \v 15 యెషూరూను కొవ్వి కాలు దువ్వాడు, \q మీరు కొవ్వుతో బలిసి మొద్దులాగా అయ్యారు. \q యెషూరూను తనను పుట్టించిన దేవుణ్ణి వదిలేశాడు. \q తన రక్షణ శిలను నిరాకరించాడు. \q1 \v 16 వారు ఇతర దేవుళ్ళను అనుసరించి ఆయనకు రోషం పుట్టించారు. \q అసహ్యమైన విగ్రహాలు పెట్టుకొని ఆయనకు కోపం తెప్పించారు. \q1 \s5 \v 17 వారు దేవత్వం లేని దయ్యాలకు బలులు అర్పించారు. \q తమకు తెలియని దేవుళ్ళకూ, కొత్తగా పుట్టుకొచ్చిన దేవుళ్ళకూ, \q మీ పితరులు భయపడని దేవుళ్ళకూ బలులర్పించారు. \q1 \v 18 నీకు తండ్రి లాంటి బండను వదిలేశావు, \q నిన్ను కన్న దేవుణ్ణి మరిచావు. \q1 \s5 \v 19 యెహోవాా దీన్ని చూసి వాళ్ళని వదిలేశాడు, \q తన కొడుకులూ కూతుర్లూ ఆయన్నలా రేపారు. \q1 \v 20 ఆయనిలా అన్నాడు. <<వారికి నా ముఖాన్ని దాచు కుంటాను. \q వాళ్ళ అంతం ఎలా ఉంటుందో చూస్తాను. \q వాళ్ళు మొండి తరం, \q విశ్వసనీయత లేని పిల్లలు. \q1 \s5 \v 21 దేవుడు కాని దానితో వాళ్ళు నాకు రోషం తెప్పించారు. \q తమ పనికిమాలిన విగ్రహాలతో నాకు కోపం తెప్పించారు. \q ప్రజలు కాని వారిని చూసి వారు అసూయ పడేలా చేస్తాను. \q తెలివిలేని రాజ్యాన్ని చూసి వారికి కోపం వచ్చేలా చేస్తాను. \q1 \s5 \v 22 నా కోపాగ్ని రగులుకుంది. \q పాతాళ అగాధం వరకూ అది మండుతుంది. \q భూమినీ దాని పంటనూ అది కాల్చేస్తుంది. \q పర్వతాల పునాదుల్ని రగులబెడుతుంది. \q1 \s5 \v 23 వారిపై విపత్తుల సమూహం తెప్పిస్తాను. \q వారి మీదికి నా బాణాలు వదులుతాను. \q1 \v 24 వారు కరువుతో అల్లాడతారు. \q ఒళ్ళు కాలే మంటతో, పెను నాశనంతో క్షీణిస్తారు. \q దుమ్ములో పాకే వాటి విషాన్నీ \q అడివి జంతువుల కోరలనూ వారిమీదికి రప్పిస్తాను. \q1 \s5 \v 25 బయట కత్తి చావు తెస్తుంది. \q పడక గదుల్లో భయం పీడిస్తుంది. \q యువకులూ, కన్యలూ, శిశువులూ, \q నెరిసిన వెంట్రుకలున్నవారూ నాశనం అవుతారు. \q1 \v 26 వాళ్ళను చాలా దూరం విసిరేస్తాను. \q వాళ్ళ జ్ఞాపకాలు మానవ జాతిలో లేకుండా తుడిచేస్తాను. \q1 \s5 \v 27 కానీ అలా ఎందుకు చెయ్యలేదంటే, \q వాళ్ళ విరోధులు రెచ్చిపోతారేమో, \q వాళ్ళ విరోధులు అపార్థం చేసుకుని, <పైచెయ్యి మనదే, \q ఇది చేసింది యెహోవాా కాదు> అంటారేమో. >> \q1 \s5 \v 28 ఇశ్రాయేలు తెలివిలేని ప్రజ. \q వాళ్ళలో వివేకమే లేదు. \q \v 29 వారికి జ్ఞానముంటే, దీన్ని వాళ్ళు అర్ధం చేసుకుంటే, \q వాళ్లకు రాబోయే ఆపద గమనించుకుంటే, \q1 \s5 \v 30 వారి ఆశ్రయదుర్గం వారిని అమ్మి వేయకపోతే, \q యెహోవాా వారిపై మనకు విజయాన్నివ్వకపోతే, \q ఒకడు వేయి మందిని ఎలా తరుముతాడు? \q పదివేల మందిని ఇద్దరు ఎలా పారదోలతారు? \q1 \v 31 మన శత్రువుల బండ మన ఆశ్రయదుర్గం లాంటిది కాదు. \q మన శత్రువులే దీనికి సాక్షులు. \q1 \s5 \v 32 వారి ద్రాక్షచెట్టు సొదొమ ద్రాక్ష చెట్టు నుంచి వచ్చింది. \q అది గొమొర్రా పొలాల్లోనిది. \q వారి ద్రాక్షపళ్ళు విషపు ద్రాక్షపళ్ళు. \q వాటి గెలలు చేదు. \q1 \s5 \v 33 వారి ద్రాక్షారసం పాము విషం. \q నాగుపాముల క్రూర విషం. \q1 \v 34 ఇది నా రహస్య ఆలోచన కాదా? \q నా ఖజానాల్లో భద్రంగా లేదా? \q1 \s5 \v 35 వారి కాలు జారే కాలంలో పగ తీర్చే పని నాదే. \q ప్రతిఫలమిచ్చేది నేనే. \q వారి ఆపద్దినం దగ్గర పడింది. \q వారి అంతం త్వరగా వస్తుంది. \q1 \s5 \v 36 బానిస గానీ, స్వతంత్రుడు గానీ, మరెవరూ మిగలకపోతే, \q వారికి ఆధారం లేనప్పుడు చూసి, \q తన సేవకులకు జాలి చూపిస్తాడు, \q తన ప్రజలకు యెహోవాా నిర్ణయం చేస్తాడు. \q1 \s5 \v 37 అప్పుడాయన వారి దేవుళ్ళు ఎక్కడ? \q వాళ్ళు నమ్ముకున్న బండ ఏది? \q1 \v 38 వారికి ఆధారం లేనప్పుడు చూసి, \q వారి నైవేద్యాల కొవ్వు తిని, \q వారి పానీయార్పణ ద్రాక్షారసాన్ని తాగిన వారి దేవుళ్ళు ఎక్కడ? \q వారు లేచి మీకు సాయపడనివ్వండి. \q వారినే మిమ్మల్ని కాపాడనివ్వండి. \q1 \s5 \v 39 చూడండి. నేనే, నేను మాత్రమే దేవుణ్ణి. \q నేను తప్ప మరో దేవుడు లేడు. \q చంపేది నేనే, బతికించేది నేనే. \q దెబ్బ కొట్టేది నేనే, బాగు చేసేది నేనే. \q నా చేతిలోనుంచి విడిపించేవాడెవడూ లేడు. \q1 \v 40 ఆకాశం వైపు నా చెయ్యెత్తి \q నేనెప్పటికీ జీవిస్తున్నట్టుగా పని చేస్తాను. \q1 \s5 \v 41 నేను తళతళలాడే నా కత్తి నూరి, \q నా చెయ్యి న్యాయం తీర్చడం మొదలెడితే, \q నా శత్రువులకు ప్రతీకారం చేస్తాను. \q నన్ను ద్వేషించే వారికి ప్రతిఫలమిస్తాను. \q1 \s5 \v 42 నా బాణాలు రక్తంతో మత్తెక్కి పోయేలా చేస్తాను. \p నా కత్తి, మాంసం భక్షిస్తుంది! \q చచ్చిన వారి రక్తాన్నీ, బందీల రక్తాన్నీ, \q శత్రువు అధికారులనూ అవి తింటాయి. \q1 \s5 \v 43 ఇతర రాజ్యాల ప్రజలారా, దేవుని ప్రజలతో ఆనందించండి. \q వధకు గురి అయిన తన సేవకుల రక్తానికి ఆయన పగ తీరుస్తాడు. \q తన విరోధులకు ప్రతీకారం చేస్తాడు. \q తన దేశం కోసం, తన ప్రజల కోసం ప్రాయశ్చిత్తం చేస్తాడు. \p \s5 \v 44 మోషే, నూను కొడుకు యెహోషువ ఈ పాటలోని పదాలన్నీ ప్రజలకు పాడి వినిపించారు. \v 45 మోషే ఈ పాట ఇశ్రాయేలు ప్రజల కోసం పాడి ముగించాడు. \p \s5 \v 46 తరువాత అతడు వారితో ఇలా చెప్పాడు, దీనికి మీరే సాక్ష్యం. ఈ రోజు నేను పలికిన మాటలన్నీ మీ మనస్సుల్లో నింపుకుని, ఈ ధర్మశాస్త్ర ప్రమాణాలన్నీ అనుసరించి నడుచుకోవాలని మీ సంతానానికి ఆజ్ఞాపించాలి. \v 47 ఇవి మీకు నిష్ఫలమైన మాటలు కావు, ఇవి మీకు జీవదాయకమైనవి. మీరు యొర్దాను దాటి స్వాధీనం చేసుకోబోతున్న దేశంలో దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులవుతారు. \p \s5 \v 48 అదే రోజు యెహోవాా మోషేతో ఇలా చెప్పాడు, యెరికో ఎదుట ఉన్న మోయాబు దేశంలోని అబారీం అనే ఈ పర్వతం, \v 49 అంటే నెబో కొండ ఎక్కు. నేను ఇశ్రాయేలీయులకు వారసత్వంగా ఇస్తున్న కనాను దేశాన్ని నువ్వు చూస్తావు. \s5 \v 50 నీ సోదరుడు అహరోను, హోరు కొండ మీద చనిపోయి తమ పితరుల వద్దకు చేరినట్టు, నువ్వు ఎక్కబోతున్న కొండ మీద చనిపోయి, నీ పితరుల దగ్గరికి వెళ్తావు. \v 51 ఎందుకంటే, మీరు సీను ఎడారిలో కాదేషు మెరీబా నీళ్ల దగ్గర ఇశ్రాయేలు ప్రజల మధ్య నన్ను ఘనపరచక ఇశ్రాయేలు ప్రజల మధ్య నా మీద తిరుగుబాటు చేశారు. \v 52 నువ్వు ఆ దేశాన్ని దూరం నుంచి చూస్తావు. నేను ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తున్న ఆ దేశంలో నువ్వు అడుగుపెట్టవు. \s5 \c 33 \p \v 1 దేవుని సేవకుడు మోషే చనిపోయేముందు ఇశ్రాయేలు ప్రజలను ఇలా దీవించాడు, \p యెహోవాా సీనాయి పర్వతం నుంచి బయలుదేరాడు \q \v 2 శేయీరు నుంచి వారికి ఉదయించాడు. \q ఆయన పారాను పర్వతం నుంచి ప్రకాశించాడు \q వేలాది వేల పవిత్రులతో ఆయన వచ్చాడు. \q ఆయన కుడివైపు మెరుపులు మెరుస్తున్నాయి. \q \s5 \v 3 నిజంగా ఆయన ఆ ప్రజలను ప్రేమిస్తాడు. \q ఆయన పరిశుద్ధులంతా నీ చేతిలో ఉన్నారు, \q వారు నీ పాదాల దగ్గర వంగి నీ మాటలు విన్నారు. \q \v 4 మోషే మనకు ధర్మశాస్త్రాన్ని బోధించాడు, \q యాకోబు సమాజానికి అది వారసత్వం. \q \s5 \v 5 అప్పుడు ప్రజల అధికారులూ \q ఇశ్రాయేలు గోత్రాలవారూ ఒకచోట చేరితే \q యెహోవాా యెషూరూనులో రాజయ్యాడు. \q \v 6 రూబేను చావకూడదు. బతకాలి. \q అయితే వారు కొద్ది మంది మాత్రమే. \q \s5 \v 7 యూదా గురించి మోషే ఇలా పలికాడు, \q యెహోవాా, యూదా ప్రజల మనవి విని, \q మళ్ళీ అతన్ని తన ప్రజల దగ్గరికి చేర్చు. \q అతని కోసం పోరాడు. \q అతని శత్రువులకు విరోధంగా అతనికి సహాయం చెయ్యి \q \s5 \v 8 లేవీ గురించి మోషే ఇలా పలికాడు, \q నీ తుమ్మీము, నీ ఊరీము నీ భక్తుడి కోసం ఉన్నాయి. \q మస్సాలో నువ్వు అతణ్ణి పరీక్షించావు. \q మెరీబా నీళ్ల దగ్గర అతనితో నువ్వు పోరాడావు. \q \s5 \v 9 నేను వాళ్ళని చూడలేదు, అని తన తండ్రి గురించి, \q తన తల్లి గురించి అన్నవాడు అతడు. \q తన సోదరుల్ని లెక్క చెయ్యలేదు. \q తన సొంత కొడుకుల్ని పట్టించుకోలేదు. \q ఎందుకంటే అతడు నీ మాటల్ని భద్రం చేశాడు. \q నీ నిబంధన పాటించాడు. \q \s5 \v 10 అతడు యాకోబుకు నీ విధులనూ, \q ఇశ్రాయేలుకు నీ ధర్మశాస్త్రాన్నీ నేర్పిస్తాడు. \q అతడు నీ ఎదుట సాంబ్రాణి వేస్తాడు. \q నీ బలిపీఠం మీద సర్వాంగబలి అర్పిస్తాడు. \q \s5 \v 11 యెహోవాా, అతని ఆధిపత్యాలను దీవించు, \q అతడు చేసే పనులను అంగీకరించు. \q అతనికి విరోధంగా లేచే వారి, \q అతన్ని ద్వేషించేవారి నడుములు విరగ్గొట్టు. \q వాళ్ళు మళ్ళీ లేవరు. \q \s5 \v 12 బెన్యామీను గురించి మోషే ఇలా పలికాడు, \q యెహోవాాకు ప్రియుడు. \q ఆయన దగ్గర అతడు క్షేమంగా ఉంటాడు. \q రోజంతా యెహోవాా అతనికి అండగా ఉంటాడు. \q అతడు యెహోవాా భుజాల మధ్య నివసిస్తాడు. \q \s5 \v 13 యోసేపు గురించి మోషే ఇలా పలికాడు. \q యెహోవాా అతని భూమిని దీవిస్తాడు \q ఆకాశం నుంచి వచ్చే శ్రేష్ఠమైన మంచుతో, \q కింద ఉన్న జలాగాధంతో, \q \s5 \v 14 సూర్యుని వల్ల వచ్చే శ్రేష్ఠమైన పంటతో, \q నెలనెలా పండే శ్రేష్ఠమైన పండ్లతో, \q \v 15 పురాతన పర్వతాల శ్రేష్ఠ పదార్థాలతో, \q శాశ్వతమైన కొండల శ్రేష్ఠ పదార్థాలతో, \q \s5 \v 16 భూమి ఇచ్చే శ్రేష్ఠ పదార్థాలతో, దాని సమృద్ధితో, \q పొదలో కనిపించిన వాడి దయ యోసేపు తల మీదికి వస్తుంది గాక. \q తన సోదరుల్లో రాకుమారుడి నుదిటి మీదకు అది వస్తుంది గాక. \q \s5 \v 17 తొలిచూలు ఎద్దు ఠీవి అతనికుంది. \q అతని కొమ్ములు అడవి ఎద్దు కొమ్ములు. \q వాటితో అతడు ప్రజలను \q భూదిగంతాలకు తోలివేస్తాడు. \q వీరంతా ఎఫ్రాయింకు చెందిన వేలమంది. \q మనష్షేకు చెందిన వేలమంది. \q \s5 \v 18 జెబూలూను గురించి మోషే ఇలా పలికాడు, \q జెబూలూనూ, నువ్వు బయలు దేరేటప్పుడు సంతోషించు. \q ఇశ్శాఖారూ, నువ్వు నీ గుడారాల్లో సంతోషించు. \q \v 19 వాళ్ళు ప్రజల్ని పర్వతాలకు పిలుస్తారు. \q అక్కడ సరైన బలులు అర్పిస్తారు. \q వారు సముద్రాల సమృద్ధినీ \q సముద్ర తీర ఇసుకలో దాగిన నిధులనూ తీస్తారు. \q \s5 \v 20 గాదు గురించి మోషే ఇలా పలికాడు. \q గాదు ప్రాంతాన్ని విశాలం చేసేవాడికి దీవెన. \q ఆ గోత్రం ఆడ సింహంలా పొంచి ఉంటుంది \q చేతిని, నడినెత్తిని చీల్చివేస్తుంది. \q \s5 \v 21 అతడు తనకోసం శ్రేష్ఠమైన భాగాన్ని చూసుకున్నాడు. \q నాయకుని భాగం అక్కడ కేటాయించబడింది. \q ప్రజల ప్రముఖులు సమకూడినప్పుడు, \q యెహోవాా తీర్చిన న్యాయాన్ని అమలు చేశాడు. \q ఇశ్రాయేలు ప్రజల విషయం యెహోవాా న్యాయ విధుల ప్రకారం జరిగించాడు. \q \s5 \v 22 దాను విషయం మోషే ఇలా పలికాడు, \q దాను సింహపు పిల్ల వంటిది \q అది బాషానునుంచి దూకుతుంది. \q \s5 \v 23 నఫ్తాలి విషయం మోషే ఇలా పలికాడు. \q కనికరంతో సంతృప్తి నొందిన నఫ్తాలి, \q యెహోవాా దీవెనతో నిండిన నఫ్తాలి, \q పశ్చిమ దక్షిణ ప్రాంతాలు నీ స్వాధీనం. \q \s5 \v 24 ఆషేరు విషయం మోషే ఇలా పలికాడు, \q మిగిలిన కొడుకుల కంటే ఆషేరుకు ఎక్కువ దీవెన. \q తన సోదరుల కంటే ఎక్కువ కటాక్షం పొందుతాడు. \q తన పాదాలు ఒలీవ నూనెలో ముంచుతాడు \q \v 25 నీ కమ్ములు ఇనుపవీ, కంచువీ. \q నువ్వు బతికిన కాలమంతా నీకు భద్రతే. \q \s5 \v 26 యెషూరూనూ, నీ దేవుణ్ణి పోలిన వాడెవడూ లేడు \q నీ సహాయానికి ఆకాశ వాహనుడుగా ఆయన వస్తాడు \q తన ఘనతతో మేఘాల్లో నుండి వస్తాడు. \q \s5 \v 27 నిత్య దేవుడు నీకు ఆశ్రయం, \q శాశ్వతమైన హస్తాలు నీ కింద ఉన్నాయి. \q శత్రువును ఆయన నీ ఎదుట నుంచి గెంటి వేస్తాడు. \q నాశనం చెయ్యి! అంటాడు. \q \s5 \v 28 ఇశ్రాయేలు ప్రజలు భద్రంగా నివసిస్తారు. \q యాకోబు ఊట సురక్షితం. \q ధాన్యం, కొత్త ద్రాక్షారసాలున్న దేశంలో \q అతనిపై ఆకాశం నిజంగా మంచు కురుస్తుంది. \q \s5 \v 29 ఇశ్రాయేలూ! మీరెంత ధన్యులు! \q యెహోవాా రక్షించిన ప్రజలారా, మీలాంటి వారెవరు? \q ఆయనే మిమ్మల్ని కాపాడే డాలు వంటివాడు, \q ఆయన మీకు ఘనమైన కత్తి వంటివాడు. \q నీ శత్రువులు వణుకుతూ నీకు లోబడతారు \q నువ్వు వారి ఎత్తయిన స్థలాలను తొక్కుతావు. \s5 \c 34 \p \v 1 ఆ తరువాత మోషే మోయాబు మైదానాల నెబో కొండకు వెళ్ళాడు. యెరికోకు ఎదురుగా ఉన్న పిస్గా కొండ శిఖరం ఎక్కాడు. యెహోవాా ఆ దేశం అంతటినీ మోషేకు చూపించాడు. \v 2 దాను వరకూ గిలాదు ప్రదేశాన్నీ, నఫ్తాలి ప్రాంతాన్నీ, ఎఫ్రాయీము మనష్షే ప్రాంతాన్ని, పశ్చిమ సముద్రం వరకూ యూదా ప్రాంతమంతా, \v 3 దక్షిణ దేశాన్నీ, ఈత చెట్లు ఉన్న యెరికో పట్టణం నుంచి సోయరు వరకూ ఉన్న మైదానాన్నీ అతనికి చూపించాడు. \p \s5 \v 4 యెహోవాా అతనితో ఇలా చెప్పాడు, నేను నీ సంతానానికి ఇస్తానని అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు నేను ప్రమాణం చేసిన దేశం ఇదే. దాన్ని నీ కళ్ళారా చూడనిచ్చాను. అయితే నువ్వు నది దాటి అక్కడికి వెళ్లకూడదు. \p \v 5 యెహోవాా సేవకుడు మోషే యెహోవాా మాట ప్రకారం మోయాబు దేశంలో చనిపోయాడు. \v 6 బెత్పయోరు ఎదుట మోయాబు దేశంలో ఉన్న లోయలో అతణ్ణి సమాధి చేశారు. అతని సమాధి ఎక్కడ ఉన్నదో ఇప్పటి వరకూ ఎవరికీ తెలియదు. \p \s5 \v 7 మోషే చనిపోయినప్పుడు అతని వయసు 120 సంవత్సరాలు. అప్పటికి అతని కళ్ళు మసకబారలేదు. అతని బలం తగ్గలేదు. \v 8 ఇశ్రాయేలు ప్రజలు మోయాబు మైదానాల్లో మోషే కోసం 30 రోజులపాటు దుఃఖించారు. తరువాత మోషే కోసం దుఃఖించిన రోజులు ముగిసాయి. \p \s5 \v 9 నూను కొడుకు యెహోషువ, జ్ఞానం కలిగిన ఆత్మతో నిండి ఉన్నాడు. ఎందుకంటే మోషే తన చేతులు అతని మీద ఉంచాడు. ఇశ్రాయేలు ప్రజలు అతని మాట విని, యెహోవాా మోషేకు ఆజ్ఞాపించినట్టు చేశారు. \p \s5 \v 10 యెహోవాాను ముఖాముఖిగా ఎరిగిన మోషేవంటి వ్రవక్త ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరూ లేరు. ఐగుప్తు దేశంలో ఫరోకూ అతని సేవకులందరికీ \v 11 అతని దేశమంతట్లో సూచక క్రియలనూ మహత్కార్యాలనూ చేయడానికి యెహోవాా పంపిన ఇలాంటి ప్రవక్త ఎన్నడూ లేడు. \v 12 మహా బల ప్రభావాలతో ఇశ్రాయేలు ప్రజలందరి కళ్ళ ముందు, భయం గొలిపే పనులు చేసిన మోషే లాంటి ప్రవక్త ఇంతకుముందు ఎన్నడూ పుట్టలేదు.