te_ulb/44-JHN.usfm

1874 lines
266 KiB
Plaintext
Raw Normal View History

2017-05-19 05:56:45 +00:00
\id JHN John
\s5
\c 1
\s యేసు క్రీస్తు దైవత్వము (హెబ్రీ 1: 5-13)
\p
\v 1 ప్రారంభంలో వాక్కు ఉన్నాడు. ఆ వాక్కు దేవుడి దగ్గర ఉన్నాడు. ఆ వాక్కు దేవుడే.
\v 2 ఈ వాక్కు ప్రారంభంలో దేవుడితో ఉన్నాడు.
\s అయన అవతారపూర్వ కార్యము (హెబ్రీ 1:2)
\p
\v 3 సృష్టి అంతా ఆ వాక్కు ద్వారానే కలిగింది. ఉనికిలో ఉన్న వాటిలో ఏదీ ఆయన లేకుండా కలగలేదు.
\s5
\v 4 ఆయనలో జీవం ఉంది. ఆ జీవం సమస్త మానవాళికీ వెలుగుగా ఉంది.
\v 5 ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది. చీకటి ఆ వెలుగును నిర్మూలం చేయలేక పోయింది.
\s బాప్తిసమిచ్చే యోహాను పరిచర్య (వ. 29-34; మత్తయి 3: 1- 17; మార్కు 1:1-11; లూకా 3: 1- 23)
\s5
\p
\v 6 దేవుని దగ్గర నుండి వచ్చిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు యోహాను.
\v 7 అందరూ ఆ వెలుగును నమ్మడం కోసం అతడు ఆ వెలుగుకి సాక్షిగ ఉండి దానిని నిరూపించడానికి వచ్చాడు.
\v 8 ఈ యోహానే ఆ వెలుగు కాదు. కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం చెప్పటానికి వచ్చాడు.
\s యేసుక్రీస్తు నిజమైన వెలుగు (యోహాను 8: 12; 9: 5; 12: 46)
\s5
\p
\v 9 లోకంలోకి వస్తున్న నిజమైన వెలుగు ఇదే. ఈ వెలుగు ప్రతి వ్యక్తినీ వెలిగిస్తూ ఉంది.
\s5
\v 10 లోకం అంతా ఆయన ద్వారానే కలిగింది. ఆయన లోకంలో ఉన్నాడు. అయినా లోకం ఆయనని తెలుసుకోలేదు.
\s కుమారులు, అవిశ్వాసులు (1 యోహాను 2: 5, 11, 12; 3: 1)
\p
\v 11 ఆయన తన సొంత ప్రజల దగ్గరకు వచ్చాడు. కానీ వారు ఆయనను ఒప్పుకోలేదు.
\s5
\v 12 తనను ఎవరెవరు ఒప్పుకున్నారో, అంటే తన పేరులో నమ్మకం ప్రకటించారో, వారికందరికీ దేవుని పిల్లలు అయ్యే హక్కును ఆయన ఇచ్చాడు.
\v 13 వారంతా దేవుని వలన పుట్టినవారే గాని, వారి పుట్టుకకు రక్తమూ, శరీర వాంఛలూ, మనుషుల ఇష్టాలూ కారణం కానే కావు.
\s అయన అవతారము (మత్తయి 1: 18- 23; లూకా 1: 30- 35; రోమా 1: 3, 4)
\s5
\p
\v 14 ఆ వాక్కు శరీరమై మన మధ్యలో కృపా సత్యాల సంపూర్ణ స్వరూపంగా నివసించాడు. తండ్రి నుండి వచ్చిన ప్రత్యేక వ్యక్తికి ఉండే మహిమ లాగా ఉన్న ఆయన మహిమను మేము చూశాము.
\s బాప్తిసమిచ్చే యోహాను సాక్ష్యం (మత్తయి 3: 1- 17; మార్కు 1: 1- 11; లూకా 3: 1- 18)
\p
\v 15 యోహాను ఆయనను గురించి పెద్ద స్వరంతో ఇలా సాక్ష్యం చెప్పాడు, "'నా వెనుక వచ్చేవాడు నాకు ముందే ఉన్నవాడు కాబట్టి ఆయన నాకంటే గొప్పవాడు' అంటూ నేను ఎవరిని గురించి చెప్పానో ఆయనే ఈయన"
\s5
\p
\v 16 ఆయన సంపూర్ణతలోనుండి మనమందరం కృప తర్వాత కృపను పొందాం.
\v 17 మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కృప, సత్యం యేసు క్రీస్తు మూలంగా కలిగాయి.
\v 18 దేవుణ్ణి ఇంతవరకూ ఎవరూ చూడలేదు. తండ్రిని అనునిత్యం హత్తుకుని ఉండే ఏకైక కుమారుడే ఆయనను వెల్లడి చేశాడు.
\s5
\p
\v 19 యెరూషలేము నుండి యూదులు, "నువ్వు ఎవరు?" అని యోహానును అడగడానికి యాజకుల నుండీ లేవీయుల నుండీ కొందరిని పంపించారు. అప్పుడు అతడు ఇదే సాక్ష్యం ఇచ్చాడు.
\v 20 అతడు "నాకు తెలియదు" అనకుండా, "నేను క్రీస్తును కాదు" అంటూ ఒప్పుకున్నాడు.
\v 21 కాబట్టి వాళ్ళు "అయితే నువ్వు ఎవరివి? ఏలీయావా?" అంటే అతడు "కాదు" అన్నాడు.
\s5
\v 22 "నువ్వు ప్రవక్తవా?" అని అడిగితే కాదని జవాబిచ్చాడు. దాంతో వాళ్ళు, "అయితే అసలు నువ్వు ఎవరివి? మమ్మల్ని పంపిన వారికి మేమేం చెప్పాలి? అసలు నీ గురించి నువ్వేం చెప్పుకుంటున్నావ్?" అన్నారు.
\v 23 దానికి అతడు, "యెషయా ప్రవక్త పలికినట్టు నేను,
\q1 'ప్రభువు కోసం దారి తిన్నగా చేయండి' అని
\q1 అరణ్యంలో బిగ్గరగా కేక పెట్టే ఒక వ్యక్తి స్వరాన్ని" అన్నాడు.
\s5
\p
\v 24 అలాగే అక్కడ పరిసయ్యులు పంపిన కొందరున్నారు.
\v 25 వారు, "నువ్వు క్రీస్తువు కావు, ఏలీయావు కావు, ప్రవక్తవూ కావు. అలాంటప్పుడు మరి బాప్తిస్మం ఎందుకు ఇస్తున్నావు?" అని అడిగారు.
\s5
\v 26 దానికి యోహాను "నేను నీళ్లలో బాప్తిసం ఇస్తున్నాను. కాని మీ మధ్య మీరు గుర్తించని వ్యక్తి నిలిచి ఉన్నాడు.
\v 27 నా వెనుక వస్తున్నది ఆయనే. నేను ఆయన చెప్పుల పట్టీని విప్పడానిక్కూడా యోగ్యుణ్ణి కాదు" అని వారితో చెప్పాడు.
\v 28 ఈ విషయాలన్నీ యోర్దాను నదికి అవతల వైపు ఉన్న బేతని లో జరిగాయి. ఇక్కడే యోహాను బాప్తిస్మం ఇస్తున్నాడు.
\s5
\v 29 తర్వాత రోజు యేసు యోహాను దగ్గరకు వచ్చాడు. ఆయనను చూసి యోహాను ఇలా అన్నాడు, "చూడండి, లోకంలోని పాపాన్నంతా తీసివేసే దేవుని గొర్రెపిల్ల!
\v 30 'నా వెనక వచ్చేవాడు నాకు ముందే ఉన్నవాడు కాబట్టి ఆయన నాకంటే గొప్పవాడు' అంటూ నేను ఎవరిని గురించి చెప్పానో ఆయనే ఈయన.
\v 31 నేను ఆయనని గుర్తించలేదు, కానీ ఆయన ఇశ్రాయేలు ప్రజలకు వెల్లడి కావాలని నేను నీళ్ళలో బాప్తిస్మం ఇస్తూ వచ్చాను"
\s5
\v 32 యోహాను ఇంకా సాక్ష్యమిస్తూ "ఆత్మ ఒక పావురంలా ఆకాశం నుండి దిగి వచ్చి ఆయనపై నిలిచి పోవడం చూశాను.
\v 33 నేను ఆయన్ని గుర్తు పట్టలేదు. కాని 'ఎవరి మీద ఆత్మ దిగివచ్చి నిలిచిపోవడం చూస్తావో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చేవాడు' అని నీళ్ళలో బాప్తిస్మం ఇవ్వడానికి నన్ను పంపినవాడు నాకు చెప్పాడు.
\v 34 ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకున్నాను, సాక్ష్యమూ ఇచ్చాను."
\s 35 యేసుక్రీస్తు బహిరంగ పరిచర్య (యోహాను 1: 35- 12: 50)
\s5
\p
\v 35 తర్వాతి రోజు యోహాను తన శిష్యులు ఇద్దరితో నిలిచి ఉన్నాడు.
\v 36 అప్పుడు యేసు అక్కడ నడచుకుంటూ వెళ్తుంటే యోహాను ఆయన వైపు చూసి, "చూడండి, దేవుని గొర్రెపిల్ల" అన్నాడు.
\s5
\p
\v 37 అతడు చెప్పిన మాట విని ఆ యిద్దరు శిష్యులు యేసు వెనకే వెళ్ళారు.
\v 38 యేసు వెనక్కి తిరిగి, వాళ్ళు తన వెనకాలే రావడం చూసి "మీకేం కావాలి?" అని అడిగాడు. వాళ్ళు "రబ్బీ, (రబ్బీ అనే మాటకు బోధకుడు అని అర్ధం) నువ్వు ఎక్కడ ఉంటున్నావ్?" అని అడిగారు.
\v 39 ఆయన "వచ్చి చూడండి" అన్నాడు. వాళ్ళు వచ్చి ఆయన ఉంటున్న స్థలం చూశారు. అప్పటికి సాయంత్రం నాలుగు గంటలైంది. దాంతో వాళ్ళు ఆ రోజుకి ఆయనతో ఉండిపోయారు.
\s5
\v 40 యోహాను మాట విని ఆయన వెనకాల వెళ్ళిన ఇద్దరిలో ఒకరు అంద్రెయ. ఇతడు సీమోను పేతురు సోదరుడు.
\v 41 ఇతడు అన్నిటికంటే ముందు తన సోదరుడైన సీమోను వెదకి పట్టుకొని, అతనితో "మేం మెస్సీయను (మెస్సీయ అంటే క్రీస్తు అని అర్ధం) కనుక్కున్నాం" అని చెప్పాడు.
\v 42 యేసు దగ్గరకు అతణ్ణి తీసుకుని వచ్చాడు. యేసు అతణ్ణి చూసి, "నువ్వు యోహాను కొడుకువి, నీ పేరు సీమోను. నిన్ను ఇక కేఫా అని పిలుస్తారు" అన్నాడు (కేఫా అనే మాటకి పేతురు (రాయి) అని అర్ధం).
\s5
\p
\v 43 మర్నాడు యేసు గలిలయకు వెళ్ళాలని బయల్దేరినప్పుడు ఫిలిప్పును చూశాడు. ఫిలిప్పుతో "నా వెనకే రా" అన్నాడు.
\v 44 ఫిలిప్పు సొంత ఊరు బేత్సయిదా. అంద్రెయ, పేతురుల సొంత ఊరు కూడా అదే.
\v 45 ఫిలిప్పు నతనయేలును చూసి, "ధర్మశాస్త్రంలో మోషే, ఇంకా ప్రవక్తలూ ఎవరి గురించి రాశారో ఆ వ్యక్తిని మేం చూశాం. ఆయన నజరేతు వాడూ, యోసేపు కుమారుడూ అయిన యేసు" అని చెప్పాడు.
\s5
\v 46 దానికి నతనయేలు, "నజరేతులో నుండి మంచిదేమన్నా రాగలదా?" అన్నాడు. ఫిలిప్పు "నువ్వే వచ్చి చూడు" అన్నాడు.
\v 47 నతనయేలు తన దగ్గరకు రావడం యేసు చూశాడు. "చూడండి. ఇతడు నిజమైన ఇశ్రాయేలీయుడు. ఇతనిలో ఎలాంటి కపటమూ లేదు" అన్నాడు.
\v 48 అప్పుడు నతనయేలు, "నేను నీకెలా తెలుసు?" అన్నాడు. అందుకు యేసు, "ఫిలిప్పు నిన్ను పిలవక ముందు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను" అన్నాడు.
\s5
\p
\v 49 బోధకుడా, నువ్వు దేవుని కుమారుడివి! ఇశ్రాయేలు రాజువి నువ్వే" అని నతనయేలు బదులిచ్చాడు.
\v 50 అందుకు యేసు "ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూశానని చెప్పినందుకే నువ్వు నమ్మేస్తున్నావా? దీని కంటే గొప్ప విషయాలను నువ్వు చూస్తావు" అన్నాడు. "
\v 51 తర్వాత యేసు ఇలా అన్నాడు, "ఆకాశం తెరచుకుంటుంది. దేవుని దూతలు మనుష్య కుమారుడి మీదుగా ఎక్కడం, దిగడం చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా చెప్తున్నా, ఇదంతా మీరు చూస్తారు."
\s5
\c 2
\s కానా పెండ్లి మొదటి అద్భుతకార్యం
\p
\v 1 మూడో రోజున గలిలయ ప్రాంతంలో కానా అనే ఊరిలో ఒక పెళ్ళి జరిగింది.
\v 2 యేసు తల్లి అక్కడే ఉంది. ఆ పెళ్ళికి యేసునీ ఆయన శిష్యుల్ని కూడా పిలిచారు.
\s5
\v 3 విందులో ద్రాక్షారసం అయిపోయింది. అప్పుడు యేసు తల్లి ఆయనతో, "వీరి దగ్గర ఇక ద్రాక్షారసం అయిపోయింది" అని చెప్పింది.
\v 4 యేసు ఆమెతో "అమ్మా, అయితే నాకేం పని? నా సమయం ఇంకా రాలేదు" అన్నాడు.
\v 5 ఆయన తల్లి పనివాళ్ళను చూసి "ఆయన మీకు ఏం చెబుతాడో దానిని చేయండి" అంది.
\s5
\v 6 యూదుల సంప్రదాయం ప్రకారం శుద్ధి చేసుకోడానికి నూరు లీటర్ల నీళ్ళు పట్టే ఆరు రాతి బానలు అక్కడ ఉన్నాయి.
\v 7 యేసు, "ఆ బానల్ని నీళ్లతో నింపండి" అన్నాడు. వాళ్ళు అలాగే వాటిని నిండుగా నింపారు.
\v 8 అప్పుడు ఆయన, "ఇప్పుడు దీనిని కొంచెం విందు ప్రధాన పర్యవేక్షకుడి దగ్గరకు తీసుకుని వెళ్ళండి" అన్నాడు. వాళ్ళు అలాగే తీసుకు వెళ్ళారు.
\s5
\v 9 ద్రాక్షారసంగా మారిన ఆ నీటిని విందు ప్రధాన పర్యవేక్షకుడు రుచి చూశాడు. ఆ ద్రాక్షరసం ఎక్కడినుండి వచ్చిందో అతనికి తెలియలేదు (కానీ దానిని తీసుకుని వచ్చిన పనివాళ్ళకు మాత్రం తెలుసు). అప్పుడు అతడు పెళ్ళి కొడుకుని పిలిపించి అతనితో,
\v 10 "అందరూ ముందు నాణ్యమైన ద్రాక్షారసం ఇస్తారు. అందరూ తాగి మత్తుగా ఉన్నప్పుడు చౌకబారు రసం పోస్తారు. అయితే నువ్వు చివరి వరకూ నాణ్యమైన రసాన్ని ఉంచావు" అన్నాడు.
\s5
\v 11 యేసు చేసిన అద్భుతాలలో ఈ మొదటిదానిని ఆయన గలిలయకు చెందిన కానాలో చేసి, తన మహిమను ప్రకటించాడు. దీనివల్ల ఆయన శిష్యులు ఆయనలో విశ్వాసముంచారు.
\s5
\v 12 ఇదయ్యాక ఆయన తన తల్లీ, సోదరులూ, శిష్యులతో కలసి కపెర్నహూం కు వెళ్ళాడు. అక్కడ వాళ్ళు కొన్ని రోజులు ఉన్నారు.
\s మొదటి పస్కా (యోహాను 6: 4; 11: 55) మొదటి ఆలయ శుద్ధి (మత్తయి 21: 12, 13; మార్కు 11: 15- 17; లూకా 19: 45, 46)
\s5
\p
\v 13 యూదుల పండగ అయిన పస్కా దగ్గర పడినప్పుడు యేసు యెరూషలేముకు వెళ్ళాడు.
\v 14 అక్కడ దేవాలయంలో ఎద్దుల్నీ, గొర్రెల్నీ, పావురాల్నీ అమ్ముతున్న వాళ్ళను చూశాడు. అక్కడే కూర్చుని డబ్బును మారకం చేసే వాళ్ళను కూడా చూశాడు.
\s5
\v 15 ఆయన పేనిన తాళ్ళను ఒక కొరడాగా చేసి దానితో వాళ్ళందర్నీ దేవాలయం నుండి వెళ్ళగొట్టాడు. గొర్రెలనూ ఎద్దులను కూడా అక్కడ్నించి తోలివేశాడు. డబ్బును మారకం చేసే వాళ్ళ బల్లల్ని పడవేశాడు. వాళ్ళ డబ్బును చెల్లాచెదరు చేశాడు.
\v 16 పావురాలు అమ్మేవారితో ఆయన, "వీటిని ఇక్కడ్నించి తీసివేయండి. నా తండ్రి ఇంటిని వ్యాపార స్థలంగా చేయడం మానండి" అన్నాడు.
\s5
\v 17 ఆయన శిష్యులు "నీ యింటిని గురించిన ఆసక్తి నన్ను తినివేస్తూ ఉంది" అని రాసి ఉన్న మాటను జ్ఞాపకం చేసుకున్నారు.
\p
\v 18 అప్పుడు అక్కడి యూదు అధికారులు ఆయనతో, "నీవు ఈ పనులు చేస్తున్నావే. దీనిని బట్టి మాకు ఏ సంకేతం చూపుతావు?" అన్నారు.
\v 19 దానికి యేసు, "ఈ దేవాలయాన్ని కూల్చండి. మూడు రోజుల్లో దీనిని లేపుతాను" అన్నాడు.
\s5
\v 20 అప్పుడు యూదు అధికారులు "ఈ దేవాలయాన్ని నిర్మించడానికి నలభై ఆరు సంవత్సరాలు పట్టింది. దీనిని మూడు రోజుల్లోనే లేపుతావా?" అన్నారు.
\v 21 అయితే ఆయన చెప్పింది తన శరీరం అనే దేవాలయం గురించి.
\v 22 ఆయన చనిపోయి లేచిన తర్వాత ఆయన శిష్యులు ఆయన పలికిన ఈ మాటను జ్ఞాపకం చేసుకున్నారు. ఆయన మాటను, లేఖనాలను వారు నమ్మారు.
\s5
\p
\v 23 ఆయన పస్కా పండగ రోజుల్లో యెరూషలేములో ఉన్నప్పుడు చాలామంది ఆయన చేసిన అద్భుతాలను చూసి ఆయన నామంలో విశ్వాసం ఉంచారు.
\v 24 అయితే యేసుకు అందరూ తెలుసు. కాబట్టి ఆయన వారిని సంపూర్ణంగా నమ్మలేదు.
\v 25 ఆయనకు మనుషుల అంతరంగం బాగా తెలుసు. ఎవరూ మనుషుల గురించి ఆయనకు చెప్పాల్సిన అవసరం లేదు.
\s5
\c 3
\s నికోదేముతో యేసు : నూతన జన్మ
\p
\v 1 నికోదేము అనే పేరు గల ఒక పరిసయ్యుడున్నాడు. అతడు యూదుల చట్ట సభలో ఒక సభ్యుడు.
\v 2 అతడు రాత్రి సమయంలో యేసు దగ్గరకు వచ్చాడు. ఆయనతో, "బోధకా, నువ్వు దేవుని దగ్గరనుండి వచ్చిన బోధకుడివి అని మాకు తెలుసు. దేవుడు తోడు లేకపోతే ఎవరూ నువ్వు చేసే అద్భుతాలు చేయలేరనీ మాకు తెలుసు" అన్నాడు.
\s5
\v 3 దానికి జవాబుగా యేసు అతనితో, "ఎవరైనా కొత్తగా జన్మించకపోతే దేవుని రాజ్యాన్ని చూడలేరని ఖచ్చితంగా చెబుతున్నాను" అన్నాడు.
\v 4 అందుకు నికొదేము, "మనిషి ముసలి వాడయ్యాక మళ్ళీ ఎలా పుడతాడు? రెండో సారి పుట్టడానికి మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించలేడు గదా! అలా ప్రవేశిస్తాడా?" అని ఆయనను అడిగాడు.
\s5
\v 5 అప్పుడు యేసు ఇలా జవాబిచ్చాడు, "ఖచ్చితంగా చెప్తున్నాను. నీళ్ళ మూలంగా ఆత్మ మూలంగా తిరిగి పుట్టకుండా ఎవరూ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు.
\v 6 శరీర మూలంగా పుట్టింది శరీరం, ఆత్మ మూలంగా పుట్టింది ఆత్మ.
\s5
\v 7 నువ్వు కొత్తగా పుట్టాలని చెప్పినందుకు విడ్డూరంగా భావించవద్దు.
\v 8 గాలి తన కిష్టమైన వైపుకు వీస్తుంది. నువ్వు దాని శబ్దాన్ని మాత్రం వినగలవు, కానీ అది ఎక్కడి నుండి వస్తుందో ఎక్కడికి వెళ్తుందో నీకు తెలియదు. ఆత్మ మూలంగా పుట్టినవాడు అలాగే ఉన్నాడు."
\s5
\v 9 దీనికి జవాబుగా నికొదేము "ఈ విషయాలు ఎలా సాధ్యం అవుతాయి?" అన్నాడు.
\v 10 యేసు ఇలా అన్నాడు, "నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు బోధకుడడివై ఉండీ ఈ సంగతులు అర్ధం చేసుకోలేవా?
\v 11 మాకు తెలిసిన సంగతులను చెప్తున్నాం, మేం చూసిన వాటి గురించి వివరిస్తున్నాం. అయినా మీరు మా సాక్ష్యాన్ని ఒప్పుకోరని ఖచ్చితంగా చెప్తున్నాను.
\s5
\v 12 భూసంబంధమైన సంగతులు నేను మీకు చెప్పినప్పుడు నమ్మని వారు ఇక నేను పరలోక సంబంధమైన సంగతులు చెప్పినప్పుడు ఎలా నమ్ముతారు?
\v 13 పరలోకం నుండి దిగి వచ్చిన మనుష్యకుమారుడు తప్ప పరలోకానికి ఎక్కి వెళ్ళిన వాడు ఎవడూ లేడు.
\s5
\v 14 అరణ్యంలో మోషే సర్పాన్ని ఎలా పైకి ఎత్తాడో
\v 15 అలాగే విశ్వసించే ప్రతి ఒక్కరూ నశించకుండా ఆయన వల్ల నిత్యజీవం పొందడానికి మనుష్యకుమారుణ్ణి కూడా పైకి ఎత్తాలి.
\s5
\p
\v 16 దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అందుకే ఆయన తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి అనుగ్రహించాడు. ఆయనలో విశ్వాసం ఉంచే ప్రతీ వాడూ నశించకుండా నిత్యజీవం పొందుతాడు.
\v 17 తన కుమారుని వల్ల లోకం రక్షణ పొందడానికే దేవుడు ఆయనను పంపాడు, కానీ లోకానికి శిక్ష విధించడానికి కాదు.
\v 18 ఆయనలో విశ్వాసం ఉంచిన వాడికి శిక్ష ఉండదు. ఆయనలో విశ్వాసం ఉంచని వాడికి ఇదివరకే శిక్ష విధించడం జరిగింది. ఎందుకంటే వాడు దేవుని ఏకైక కుమారుడి నామంలో విశ్వాసం ఉంచలేదు.
\s5
\v 19 ఆ శిక్ష విధించడానికి కారణం ఇది, ఈ లోకం లోకి వెలుగు వచ్చింది. వాళ్ళు చేసే పనులు దుర్మార్గమైనవి కాబట్టి మనుషులు వెలుగును కాకుండా చీకటిని ప్రేమించారు.
\v 20 దుర్మార్గపు పనులు చేసే వాడు వెలుగు దగ్గరకు రాడు. వెలుగులో వాడు చేసే దుర్మార్గం అంతా తెలిసిపోతుంది కాబట్టి దుర్మార్గపు పనులు చేసే ప్రతీ వాడూ వెలుగును ద్వేషిస్తాడు.
\v 21 అయితే సత్యాన్ని అనుసరించే వాడు తన పనులు మరింత స్పష్టంగా కనిపించడానికీ దేవుని పట్ల విధేయతలో అవి జరిగాయని వెల్లడి చేయడానికీ వెలుగు దగ్గరకు వస్తాడు."
\s బాప్తిసమిచ్చే యోహాను చివరి సాక్ష్యం
\s5
\p
\v 22 ఇదయ్యాక యేసు తన శిష్యులతో కూడా యూదయ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ బాప్తిసం ఇస్తూ, తన శిష్యులతో కాలం గడుపుతూ ఉన్నాడు.
\v 23 సలీము అనే ప్రాంతం దగ్గర ఉన్న ఐనోను అనే స్థలంలో నీళ్ళు సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి యోహాను అక్కడ బాప్తిస్మం ఇస్తున్నాడు. ప్రజలు అక్కడికి వెళ్లి బాప్తిసం తీసుకుంటూ ఉన్నారు.
\v 24 యోహానును ఇంకా చెరసాలలో వేయలేదు.
\s5
\v 25 అప్పుడు శుద్ధి ఆచారాల గురించి యోహాను శిష్యులకీ ఒక యూదుడికీ వివాదం పుట్టింది.
\v 26 వారు యోహాను దగ్గరకు వచ్చారు. "బోధకా, యోర్దాను నది అవతల నీతో ఒక వ్యక్తి ఉన్నాడే, ఆయన గురించి నువ్వు సాక్ష్యం కూడా చెప్పావు. చూడు, ప్రస్తుతం ఆయన కూడా బాప్తిసం ఇస్తున్నాడు. అందరూ ఆయన దగ్గరకే వెళ్తున్నారు" అని చెప్పారు.
\s5
\v 27 అందుకు యోహాను ఇలా అన్నాడు, "పరలోకం నుండి ఇస్తేనే గానీ ఎవరూ ఏదీ పొందలేరు.
\v 28 నేను క్రీస్తును కాననీ ఆయన కంటే ముందుగా నన్ను పంపడం జరిగిందనీ నేను చెప్పాను. దానికి మీరే సాక్షులు.
\s5
\v 29 పెళ్లి కొడుక్కే పెళ్లి కూతురు ఉంటుంది. అయితే పెళ్లి కొడుకు స్నేహితుడు నిలబడి పెళ్ళికొడుకు స్వరం వింటూ ఉంటాడు. పెళ్ళికొడుకు స్వరం వింటూ ఎంతో సంతోషిస్తాడు. అందుకే నా సంతోషం సంపూర్ణం అయింది.
\v 30 ఆయన అధికం కావాలి, నేను తగ్గిపోవాలి.
\s యేసుక్రీస్తు గురించిన అమోఘ ప్రకటన
\s5
\p
\v 31 పై నుండి వచ్చిన వాడు అందరికీ పైవాడే. భూమి సంబంధమైన వాడు భూమి నుండి వస్తాడు కాబట్టి భూ సంబంధమైన సంగతులే మాట్లాడతాడు. పరలోకం నుండి వచ్చిన వాడు అందరికీ పైనున్న వాడు.
\v 32 ఆయన తను చూసిన వాటిని గురించీ విన్న వాటిని గురించీ సాక్ష్యం ఇస్తాడు కానీ ఎవరూ ఆయన సాక్ష్యాన్ని అంగీకరించరు.
\v 33 ఆయన సాక్ష్యాన్ని అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడని నిరూపిస్తున్నాడు.
\s5
\v 34 దేవుడు పంపిన వ్యక్తి దేవుని మాటలు పలుకుతాడు. ఎందుకంటే తాను పంపిన వ్యక్తికి ఆయన కొలత లేకుండా ఆత్మను దయ చేస్తాడు.
\v 35 తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తాడు. సమస్తాన్నీ ఆయన చేతులకు అప్పగిస్తాడు.
\v 36 కుమారునిలో విశ్వాసం ఉంచే వాడికి నిత్యజీవం ఉంటుంది. అయితే కుమారునికి విధేయుడు కాని వాడు జీవాన్ని చూడడు. వాడి పైన దేవుని మహా కోపం నిలిచి ఉంటుంది."
\s5
\c 4
\s యేసు గలిలయకు తరలి పోవడం
\p
\v 1 యోహాను కంటె యేసు ఎక్కువ మందిని శిష్యులుగా చేసికొన్నట్టూ, వారికి బాప్తిసం ఇస్తున్నట్టూ పరిసయ్యులు విన్నారని ప్రభువుకు తెలిసింది.
\v 2 నిజానికి యేసు బాప్తిసం ఇవ్వలేదు గానీ ఆయన శిష్యులు ఇస్తూ ఉన్నారు.
\v 3 అప్పుడు ఆయన యూదయ దేశం నుండి ప్రయాణమై గలిలయ దేశానికి వెళ్ళాడు.
\s5
\v 4 మార్గంలో సమరయ ప్రాంతం గుండా ఆయన ప్రయాణం చేయాల్సి వచ్చింది.
\v 5 అలా ఆయన సమరయ లో ఉన్న సుఖారు అనే ఊరికి వచ్చాడు. ఈ ఊరి దగ్గరే యాకోబు తన కొడుకు యోసేపుకు కొంత భూమిని ఇచ్చాడు.
\s సమరయ స్త్రీతో యేసు
\s5
\p
\v 6 యాకోబు బావి అక్కడ ఉంది. ప్రయాణంలో అలసిన యేసు ఆ బావి దగ్గర కూర్చున్నాడు. అది మిట్ట మధ్యాహ్నం.
\p
\v 7 ఒక సమరయ స్త్రీ నీళ్ళు తోడుకోడానికి ఆ బావి దగ్గరకు వచ్చింది. యేసు ఆమెతో "తాగడానికి నీళ్ళు ఇస్తావా?" అని అడిగాడు.
\v 8 ఆయన శిష్యులు ఆహారం కొనడానికి ఊరిలోకి వెళ్ళారు.
\s5
\v 9 ఆ సమరయ స్త్రీ యేసుతో ఇలా అంది, "నువ్వు యూదుడివి. సమరయ స్త్రీ అయిన నన్ను నీళ్ళు ఎలా అడుగుతున్నావు?" ఎందుకంటే యూదులు సమరయులతో ఎలాంటి సంబంధాలూ పెట్టుకోరు.
\v 10 దానికి యేసు, "నువ్వు దేవుని బహుమానాన్నీ, తాగడానికి నీళ్ళు కావాలని నిన్ను అడుగుతున్న వ్యక్తినీ తెలుసుకుంటే నువ్వే ఆయన్ని అడిగే దానివి. ఆయన నీకు జీవజలం ఇచ్చి ఉండేవాడు" అన్నాడు.
\s5
\v 11 అప్పుడా స్త్రీ "అయ్యా, ఈ బావి చాలా లోతు. తోడుకోడానికి నీ దగ్గర చేద లేదు. ఆ జీవజలం నీకెలా దొరుకుతుంది?
\v 12 మన తండ్రి అయిన యాకోబు ఈ బావి నీళ్ళు తాగాడు. తన సంతానానికీ, తన పశువులకూ తాగడానికి ఈ నీళ్ళే ఇచ్చాడు. మాకూ తాగడానికి ఈ బావిని ఇచ్చాడు. నువ్వు ఆయన కంటే గొప్పవాడివా?" అంది.
\s5
\v 13 దానికి యేసు "ఈ నీళ్లు తాగే ప్రతి ఒక్కరికీ మళ్ళీ దాహం వేస్తుంది.
\s అంతరంగంలో నివాసముండే ఆత్మ (యోహాను 7: 37- 39)
\p
\v 14 నేను ఇచ్చే నీళ్ళు తాగే వాడికి ఇక ఎప్పటికీ దాహం వేయదు. నేను వాడికి ఇచ్చే నీళ్ళు వాడిలో ఒక నీటి ఊటగా మారి నిత్యజీవం లోకి ఊరుతూ ఉంటుంది" అన్నాడు.
\s5
\p
\v 15 అప్పుడు ఆమె ఆయనతో, "అయ్యా, నీళ్ళు చేదుకోడానికి నేను ఇంత దూరం రానవసరం లేకుండా ఆ నీళ్ళు నాకివ్వు" అంది.
\v 16 యేసు ఆమెతో, "నువ్వు వెళ్లి నీ భర్తను తీసుకుని ఇక్కడికి రా" అన్నాడు.
\s5
\v 17 దానికి ఆ స్త్రీ "నాకు భర్త లేడు" అంది. యేసు ఆమెతో "'నాకు భర్త లేడని నువ్వు సరిగ్గానే చెప్పావు.
\v 18 ఎందుకంటే నీకు ఐదుగురు భర్తలున్నారు. ఇప్పుడు నీతో ఉన్నవాడు నీ భర్త కాడు. ఈ విషయంలో నువ్వు బాగానే చెప్పావు" అన్నాడు.
\s5
\v 19 అప్పుడా స్త్రీ "అయ్యా, నువ్వు ఒక ప్రవక్తవి అని నాకు అర్ధమౌతున్నది.
\v 20 మా పూర్వీకులు ఈ కొండ పైన ఆరాధించారు. కానీ ఆరాధించే స్థలం యెరూషలేములో ఉందనీ అందరూ అక్కడికే వెళ్ళి ఆరాధించాలని మీరు అంటారు" అంది. అందుకు యేసు ఇలా చెప్పాడు,
\s5
\v 21 " "అమ్మా, తండ్రిని ఈ కొండ మీదో, యెరూషలేములోనో ఆరాధించని కాలం వస్తుంది. నా మాట నమ్ము.
\v 22 మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తారు. మేము మాకు తెలిసిన దానిని ఆరాధిస్తాము. ఎందుకంటే రక్షణ యూదులలోనుండే వస్తుంది.
\s5
\v 23 తండ్రిని హృదయ పూర్వకంగా ఆత్మతోనూ సత్యం తోనూ ఆరాధించే కాలం వస్తుంది. ఇప్పటికే వచ్చేసింది. అలాంటి వారే తనను అరాధించాలని తండ్రి చూస్తున్నాడు.
\v 24 దేవుడు ఆత్మ కాబట్టి ఆయన్ని ఆరాధించే వారు ఆత్మతో, సత్యంతో ఆరాధించాలి."
\s5
\v 25 అప్పుడు ఆ స్త్రీ ఆయనతో, "క్రీస్తు అని పిలిచే మెస్సియా వస్తున్నాడని నాకు తెలుసు. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమూ వివరిస్తాడు" అంది.
\v 26 అది విని యేసు "నీతో మాట్లాడుతున్న నేనే ఆయన్ని" అని చెప్పాడు.
\s5
\p
\v 27 ఇదే సమయానికి ఆయన శిష్యులు తిరిగి వచ్చారు. ఆ స్త్రీ తో ఆయన మాట్లాడుతూ ఉండటం చూసి 'ఎందుకు మాట్లాడుతున్నాడా' అనుకున్నారు. కానీ 'నీకేం కావాలని' గానీ 'ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావు' అని గానీ ఎవరూ అడగలేదు.
\s5
\v 28 ఇక ఆ స్త్రీ తన నీళ్ళ కుండ అక్కడే విడిచి ఊరి లోకి వెళ్ళింది.
\v 29 ఆ ఊరి వారితో, "మీరు నాతో వచ్చి నేను చేసిన పనులన్నిటినీ నాతో చెప్పిన వ్యక్తిని చూడండి. ఈయన క్రీస్తు కాడా?" అంది.
\v 30 వాళ్ళంతా ఊరు విడిచి ఆయన దగ్గరకు వచ్చారు.
\s5
\p
\v 31 ఆ లోగా శిష్యులు "బోధకుడా, భోజనం చేయి" అని ఆయన్ని బతిమాలారు.
\v 32 దానికి ఆయన, "తినడానికి మీకు తెలియని ఆహారం నాకుంది" అని వారితో చెప్పాడు.
\v 33 "ఆయన తినడానికి ఎవరైనా భోజనం ఏదైనా తెచ్చారా ఏమిటి?" అని శిష్యులు ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.
\s5
\v 34 యేసు వారిని చూచి "నన్ను పంపించిన వాని ఇష్టాన్ని చేయడం, ఆయన పనిని చేసి ముగించడమే నా ఆహారం.
\v 35 పంట కోయడానికి కోతకాలం రావాలంటే ఇంకా నాలుగు నెలలు ఉన్నాయని మీరు చెబుతారు కదా! మీ తలలెత్తి పొలాలను చూడండి. అవి ఇప్పటికే పక్వానికి వచ్చి కోతకు సిద్ధంగా ఉన్నాయని మీతో చెప్తున్నాను.
\v 36 విత్తనాలు చల్లేవాడూ పంట కోసేవాడూ కలసి సంతోషించేట్లుగా కోసేవాడు వేతనం తీసుకుని శాశ్వత జీవం కోసం ఫలాన్ని సమకూర్చుకుంటున్నాడు.
\s5
\v 37 ఈ విషయంలో విత్తనాలు చల్లేది ఒకరు, పంట కోసేది మరొకరు అనే మాట నిజమే.
\v 38 మీరు దేని కోసం ప్రయాస పడలేదో దానిని కోయడానికి మిమ్మల్ని పంపాను. ఇతరులు శ్రమించారు, వారి శ్రమ ఫలాన్ని మీరు అనుభవిస్తున్నారు" అన్నాడు.
\s5
\p
\v 39 'నేను చేసినవన్నీ ఆయన నాతో చెప్పాడు' అంటూ నివేదిక ఇచ్చిన స్త్రీ మాటను బట్టి ఆ పట్టణంలోని అనేక మంది సమరయులు ఆయనలో విశ్వాసముంచారు.
\s సమరయ ప్రజానీకంతో యేసు
\p
\v 40 ఆ సమరయులు ఆయన దగ్గరకు వచ్చి తమతో ఉండమని ఆయనను వేడుకున్నారు. కాబట్టి ఆయన అక్కడ రెండు రోజులు ఉన్నాడు.
\s5
\v 41 ఆయన మాటలు విని ఇంకా అనేకులు ఆయనలో విశ్వాసముంచారు. వారు ఆ స్త్రీతో, "మేం విశ్వసించింది కేవలం నీ మాట మీదే కాదు.
\v 42 మేం కూడా ఆయన మాటలు విన్నాం. ఇప్పుడు ఈయన నిజంగా ఈ లోక రక్షకుడని తెలుసుకున్నాం" అన్నారు.
\s5
\v 43 ఆ రెండు రోజులయ్యాక ఆయన గలిలయకు ప్రయాణమై వెళ్ళాడు.
\v 44 ఎందుకంటే ఏ ప్రవక్తా తన స్వదేశంలో గౌరవం పొందడని ఆయనే స్వయంగా ప్రకటించాడు.
\v 45 ఆయన గలిలయకు వచ్చినప్పుడు గలిలయులు ఆయనకు స్వాగతం పలికారు. పండగ ఆచరించడం కోసం గలిలయులు కూడా యెరూషలేముకు వెళ్తారు. అక్కడ ఆయన చేసిన పనులన్నీ వారు చూశారు.
\s5
\p
\v 46 యేసు గలిలయ లోని కానా అనే ఊరికి వచ్చాడు. ఆయన నీటిని ద్రాక్షారసంగా మార్చింది ఇక్కడే. అదే సమయంలో కపెర్నహూం లో ఒక రాజ వంశానికి చెందిన ఒక అధికారి కొడుకు జబ్బుపడి ఉన్నాడు.
\v 47 యేసు యూదయ నుండి గలిలయకు వచ్చాడని అతడు విన్నాడు. ఆయన దగ్గరకు వెళ్ళాడు. తన కొడుకు చావడానికి సిద్ధంగా ఉన్నాడనీ వచ్చి బాగుచేయాలనీ ఆయనను వేడుకున్నాడు.
\s5
\v 48 యేసు అతడితో ఇలా అన్నాడు, "సూచనలూ అద్భుతాలూ చూడందే మీరు నమ్మనే నమ్మరు."
\v 49 అందుకా అధికారి, "ప్రభువా, నా కొడుకు చావక ముందే రా" అని వేడుకున్నాడు.
\v 50 యేసు అతడితో "నువ్వు వెళ్ళు. నీ కొడుకు బదికే ఉన్నాడు" అని చెప్పాడు. ఆ మాటను నమ్మి అతడు వెళ్లి పోయాడు.
\s5
\v 51 అతడు దారిలో ఉండగానే అతడి సేవకులు ఎదురొచ్చారు. అతని కొడుకు బదికి ఉన్నాడని తెలియజేశారు.
\v 52 "ఏ సమయంలో వాడు బాగవ్వడం ప్రారంభమైంది" అని అతడు వారిని అడిగాడు. వారు, "నిన్న ఒంటి గంటకు జ్వరం తగ్గడం మొదలైంది" అని చెప్పారు.
\s5
\v 53 'నీ కొడుకు బతికి ఉన్నాడు' అని యేసు తనతో చెప్పిన సమయం సరిగ్గా అదేనని అతడు తెలుసుకున్నాడు. కాబట్టి అతడూ, అతని ఇంట్లో అందరూ నమ్మారు.
\v 54 ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన రెండవ సూచకక్రియ.
\s5
\c 5
\s పండుగ : బెతెస్డ కోనేటి వద్ద స్వస్థత
\p
\v 1 ఇదయ్యాక యూదుల పండగ ఒకటి వచ్చింది. యేసు దానికోసం యెరూషలేముకు వెళ్ళాడు.
\v 2 యెరూషలేములో గొఱ్ఱల ద్వారం దగ్గర ఒక కోనేరు ఉంది. హీబ్రూ భాషలో దాని పేరు బేతెస్ద. దానికి అయిదు ద్వార మంటపాలున్నాయి.
\v 3-4 రకరకాల రోగాలున్న వారూ, గుడ్డివారూ, కుంటి వారూ నిర్జీవమైన కాళ్ళూ చేతులున్న వారూ గుంపులుగా ఆ మంటపాల్లో పడి ఉన్నారు.
\s5
\v 5 అక్కడ ముప్ఫై ఎనిమిది సంవత్సరాల నుండి అంగ వైకల్యంతో ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు.
\v 6 యేసు అతనిని చూసి వాడు అక్కడ చాలా కాలం నుండి పడి ఉన్నాడని గ్రహించాడు. అతనిని చూసి, "బాగవ్వాలని కోరుతున్నావా?" అని అడిగాడు.
\s5
\v 7 అప్పుడు ఆ రోగి, " అయ్యా, దేవదూత నీటిని కదిలించినప్పుడు నన్నుకోనేటిలో దించడానికి ఎవరూ లేరు. నేను సర్దుకుని దిగేంతలో నాకంటే ముందు మరొకడు దిగుతాడు" అని జవాబిచ్చాడు.
\v 8 యేసు "నువ్వు లేచి నీ చాపా పరుపూ తీసుకుని నడిచి వెళ్ళు" అని అతనితో చెప్పాడు.
\s5
\v 9 వెంటనే ఆ వ్యక్తి బాగుపడి తన పడక తీసుకుని నడవడం మొదలు పెట్టాడు.
\p ఆ రోజు విశ్రాంతి దినం.
\s5
\v 10 అందుకని యూదా మత నాయకులు ఆ వ్యక్తితో, "ఈ రోజు విశ్రాంతి దినం. నువ్వు పరుపును మోయకూడదు కదా!" అన్నారు.
\v 11 అందుకు ఆ వ్యక్తి "నన్ను బాగు చేసిన వాడు 'నీ చాపా పరుపూ ఎత్తుకుని నడువు' అని నాకు చెప్పాడు" అన్నాడు.
\s5
\v 12 అప్పుడు వాళ్ళు "నీకసలు నీ పరుపెత్తుకుని నడవమని చెప్పిందెవరు?" అని అతణ్ణి అడిగారు.
\v 13 అయితే తనని బాగు చేసినదెవరో అతనికి తెలియదు. ఎందుకంటే అక్కడ ప్రజలంతా గుంపు కూడి ఉండటం వలన యేసు నెమ్మదిగా అక్కడ్నించి వెళ్ళిపోయాడు.
\s5
\v 14 ఆ తర్వాత యేసు దేవాలయంలో అతణ్ణి చూశాడు. "చూడు, నీవు స్వస్థత పొందావు. ఇప్పుడు పాపం చేస్తే నీకు ఎక్కువ కీడు కలుగుతుంది. అందుకని ఇక పాపం చేయ వద్దు." అని అతడితో చెప్పాడు.
\v 15 వాడు యూదా నాయకుల దగ్గరకు వెళ్ళి తనను బాగు చేసింది యేసు అని చెప్పేశాడు.
\s5
\p
\v 16 ఈ పనుల్ని యేసు విశ్రాంతి దినాన చేశాడు కాబట్టి యూదులు ఆయనను బాధించారు.
\v 17 యేసు వారితో, "నా తండ్రి ఇప్పుడు కూడా పని చేస్తున్నాడు. నేను కూడా చేస్తున్నాను" అన్నాడు.
\v 18 ఆయన విశ్రాంతి దినాచారాన్ని భంగం చేయడం మాత్రమే కాక దేవుణ్ణి తండ్రి అని సంబోధించి తనను దేవునికి సమానుడిగా చేసుకున్నందుకు వాళ్ళు ఆయనను చంపాలని మరింత గట్టి ప్రయత్నం చేశారు.
\s5
\v 19 కాబట్టి యేసు వారికి ఇలా జవాబిచ్చాడు. "మీకు ఖచ్చితంగా చెప్తున్నాను. కుమారుడు తనంత తానుగా ఏదీ చేయడు. తండ్రి దేనిని చేయడం చూస్తాడో దానినే కుమారుడు కూడా చేస్తాడు. ఎందుకంటే తండ్రి ఏది చేస్తాడో అదే కుమారుడు కూడా చేస్తాడు.
\v 20 తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తాడు కాబట్టి తాను చేసే పనులన్నిటినీ కుమారుడికి చూపిస్తున్నాడు. అంత మాత్రమే కాదు. ఆయన మీకందరికీ విభ్రాంతి కలిగేలా ఇంతకంటే గొప్ప సంగతులను కుమారునికి చూపిస్తాడు.
\s5
\p
\v 21 తండ్రి చనిపోయిన వారిని లేపి ఎలా ప్ర్రాణం ఇస్తాడో అలాగే కుమారుడు కూడా తనకు ఇష్టం అయిన వారిని బతికిస్తాడు.
\v 22 తండ్రి ఎవరికీ తీర్పు తీర్చడు కానీ అందరికీ తీర్పు తీర్చే సమస్త అధికారాన్ని ఆయన కుమారుడికి ఇచ్చాడు.
\v 23 దీని వల్ల తండ్రిని గౌరవించే అందరూ అదే విధంగా కుమారుని కూడా గౌరవించాలి. కుమారుని గౌరవించని వాడు ఆయనను పంపిన తండ్రిని కూడా గౌరవించడు.
\s5
\v 24 ఖచ్చితంగా చెప్తున్నాను. నా మాట విని నన్ను పంపించిన వానిలో విశ్వాసం ఉంచే వాడికి నిత్యజీవం ఉంది. అతనికి ఇక శిక్ష ఉండదు. అతడు మరణం నుండి జీవం లోకి దాటి వెళ్ళాడు.
\s5
\v 25 మీకు ఖచ్చితంగా చెప్తున్నాను. చనిపోయిన వారు దేవుని కుమారుడి నైన నా స్వరాన్ని వినే సమయం రాబోతుంది. ఇప్పుడు వచ్చేసింది. ఆ స్వరాన్ని వినే వారు బదుకుతారు.
\s5
\v 26 తండ్రి ఎలా స్వయంగా జీవం కలిగి ఉన్నాడో అలాగే కుమారుడు కూడా స్వయంగా తనలో జీవం కలిగి ఉండటానికి కుమారుడికి అధికారం ఇచ్చాడు.
\v 27 అలాగే ఆయన కుమారునికి తీర్పు తీర్చే అధికారం ఇచ్చాడు. ఎందుకంటే ఆయన మనుష్య కుమారుడు.
\s రెండు పునరుత్థానాలు
\s5
\p
\v 28 దీనికి మీరు ఆశ్చర్యపడ వద్దు. సమాధుల్లో ఉన్నవారు ఆయన స్వరాన్ని వినే కాలం వస్తుంది.
\v 29 అలా విన్నవారు బయటికి వస్తారు. మంచి చేసిన వాళ్ళు జీవపు పునరుత్థానానికీ చెడు చేసినవాళ్ళు తీర్పు పునరుత్థానానికీ బయటకు వస్తారు.
\s5
\p
\v 30 నా అంతట నేనే దేనినీ చేయలేను. నేను ముందు విని దాని ప్రకారం తీర్పు తీరుస్తాను. నా స్వంత ఇష్టాన్ని నెరవేర్చుకోవాలని నేను చూడను గానీ నన్ను పంపిన వాని ఇష్టం నెరవేరాలని చూస్తాను. కాబట్టి నా తీర్పు న్యాయవంతంగా ఉంటుంది.
\v 31 నా గురించి నేనే సాక్ష్యం చెప్పుకుంటే అది సత్యం కాదు.
\v 32 నా గురించి సాక్ష్యమిచ్చేవాడు మరొకరున్నారు. నా గురించి ఆయన ఇచ్చే సాక్ష్యం సత్యమని నాకు తెలుసు.
\s యేసును గురించి నాలుగు సాక్షాలు
\s5
\p
\v 33 మీరు యోహాను దగ్గరకు కొందరిని పంపారు. అతడు సత్యాన్ని గురించి సాక్ష్యం చెప్పాడు.
\v 34 కానీ నేను మనుషుల సాక్ష్యాన్ని ఒప్పుకోను గానీ మీ రక్షణ కోసం ఈ మాటలు చెప్తున్నాను.
\v 35 యోహాను మండుతూ ప్రకాశించే దీపంలా ఉన్నాడు. మీరు అతని వెలుగులో కొంతకాలం సంతోషించడానికి ఇష్టపడ్డారు.
\s5
\p
\v 36 అయితే యోహాను నా గురించి చెప్పిన సాక్ష్యం కంటే గొప్ప సాక్ష్యం నాకుంది. నేను సాధించడానికి నా తండ్రి నా కిచ్చిన పనులే ఆ సాక్ష్యం. ప్రస్తుతం నేను చేస్తున్న ఈ కార్యాలే తండ్రి నన్ను పంపాడని నా గురించి సాక్ష్యం చెప్తున్నాయి.
\v 37 నన్ను పంపిన తండ్రి తానే నాగురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన స్వరాన్ని మీరు ఏనాడూ వినలేదు. ఆయన స్వరూపాన్నీ ఏనాడూ చూడలేదు.
\v 38 ఆయన పంపించిన వ్యక్తిని మీరు నమ్మలేదు కాబట్టి ఆయన వాక్కు మీలో నిలిచి లేదు.
\s5
\v 39 లేఖనాలలో మీకు నిత్య జీవం ఉందనుకుని మీరు వాటిని పరిశోధిస్తున్నారు. కానీ అవే నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి.
\v 40 అయితే మీకు జీవం కలిగేలా నా దగ్గరకు రావడానికి మీరు ఇష్టపడటం లేదు.
\s5
\v 41 మనుషులు ఇచ్చే గౌరవాన్ని నేను స్వీకరించను.
\v 42 ఎందుకంటే దేవుని ప్రేమ మీలో లేదని నాకు తెలుసు.
\s5
\p
\v 43 నేను నా తండ్రి పేరు మీద వచ్చాను. మీరు నన్ను అంగీకరించలేదు. మరొకడు తన స్వంత పేరు ప్రతిష్టలతో మీ దగ్గరకు వస్తే మీరు వాణ్ణి అంగీకరిస్తారు.
\v 44 ఇతరుల నుండి కలిగే మెప్పును అంగీకరిస్తూ ఏకైక దేవుని నుండి కలిగే మెప్పును వెదకని మీరు ఎలా విశ్వసిస్తారు?
\s5
\v 45 నేను తండ్రి ముందు మీమీద నేరం మోపుతానని అనుకోవద్దు. మీ మీద నేరం మోపడానికి మరో వ్యక్తీ ఉన్నాడు. మీరు మీ ఆశలన్నీ పెట్టుకున్న మోషేయే మీ మీద నేరం మోపుతాడు.
\v 46 మీరు మోషేను నమ్మినట్టయితే నన్ను కూడా నమ్ముతారు. ఎందుకంటే మోషే నా గురించే రాశాడు.
\v 47 మీరు అతడు రాసిందే నమ్మకపోతే ఇక నా మాటలు ఎలా నమ్ముతారు?"
\s5
\c 6
\s ఐదు వేల మందికి ఆహారం (మత్తయి 14: 13- 21; మార్కు 6: 32- 44; లూకా 9: 10- 17)
\p
\v 1 ఈ సంగతులు జరిగిన తర్వాత యేసు తిబెరియ సముద్రం, అంటే గలిలయ సముద్రాన్ని దాటి అవతలి తీరానికి వెళ్ళాడు.
\v 2 రోగుల విషయంలో ఆయన చేసే అద్భుతాలను చూస్తున్న ప్రజలు గొప్ప సంఖ్యలో ఆయన వెనక వెళ్తూ ఉన్నారు.
\v 3 యేసు ఒక కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడ కూర్చున్నాడు.
\s5
\v 4 యూదుల పండగ అయిన పస్కా దగ్గరలోనే ఉంది.
\v 5 యేసు తలెత్తి చూసినప్పుడు పెద్ద జన సమూహం తన వైపు రావడం కనిపించింది. అప్పుడు ఆయన ఫిలిప్పుతో "వీళ్ళంతా భోజనం చేయడానికి రొట్టెలు ఎక్కడ కొన బోతున్నాం?" అని అడిగాడు.
\v 6 యేసుకు తాను ఏం చేయబోతున్నాడో స్పష్టంగా తెలుసు. కేవలం ఫిలిప్పును పరీక్షించడానికి అలా అడిగాడు.
\s5
\v 7 దానికి ఫిలిప్పు, "రెండు వందల దేనారాలతో రొట్టెలు కొని తెచ్చినా ఒక్కొక్కడికి చిన్న ముక్క ఇవ్వడానికి కూడా చాలదు" అన్నాడు.
\v 8 ఆయన శిష్యులలో మరొకడు, అంటే సీమోను పేతురు సోదరుడైన అంద్రెయ
\v 9 "ఇక్కడ ఒక చిన్న కుర్రాడి దగ్గర ఐదు యవల రొట్టెలూ, రెండు చిన్న చేపలూ ఉన్నాయి గాని ఇంత మందికి ఎలా సరిపోతాయి?" అని ఆయనతో అన్నాడు.
\s5
\p
\v 10 యేసు "ప్రజలందర్నీ కూర్చోబెట్టండి" అని శిష్యులకు చెప్పాడు. అక్కడ చాల పచ్చిక ఉండటంతో ఆ ప్రజలంతా కూర్చున్నారు. వాళ్ళంతా సుమారు ఐదు వేలమంది ఉంటారు.
\v 11 యేసు ఆ రొట్టెల్ని చేతిలో పట్టుకుని కృతజ్ఞతలు చెప్పి కూర్చున్న వారికి పంచి ఇచ్చాడు. అలాగే చేపలు కూడా వాళ్లకు ఇష్టమైనంత వడ్డించాడు.
\v 12 అందరూ కడుపు నిండా తిన్నారు. తర్వాత ఆయన "మిగిలిన రొట్టే, చేపల ముక్కలన్నీ పోగు చేయండి. ఏదీ వ్యర్ధం కానీయ వద్దు" అని శిష్యులతో చెప్పాడు.
\s5
\v 13 అందరూ తిన్న తర్వాత మిగిలిన ఐదు యవల రొట్టెల ముక్కలన్నీ పోగు చేశారు. అవి పన్నెండు గంపలు నిండాయి.
\v 14 వాళ్ళందరూ యేసు చేసిన అద్భుతాన్ని చూసి, "ఈ లోకానికి రాబోయే ప్రవక్త ఈయనే" అని చెప్పుకున్నారు.
\v 15 వాళ్ళు తనను పట్టుకుని బలవంతంగా రాజుని చేయడానికి సిద్ధపడుతున్నారని యేసుకు అర్ధమై తిరిగి ఒంటరిగా కొండ పైకి వెళ్లి పోయాడు.
\s యేసు నీటిపై నడక (మత్తయి 14: 22- 36; మార్కు 6: 45- 56)
\s5
\p
\v 16 సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రం దగ్గరకు వెళ్లి పడవ పైన సముద్రానికి అవతల ఉన్న కపెర్నహూంకు వెళ్తున్నారు.
\v 17 అప్పటికే చీకటి పడింది. యేసు వాళ్ళ దగ్గరకు ఇంకా రాలేదు.
\v 18 అప్పుడు పెను గాలి వీయడం మొదలైంది. సముద్రం అల్లకల్లోలంగా తయారైంది.
\s5
\v 19 వారు సుమారు ఐదారు కిలోమీటర్లు ప్రయాణించాక యేసు సముద్రం మీద నడుస్తూ రావడం చూసి భయపడ్డారు.
\v 20 అయితే ఆయన "నేనే, భయపడవద్దు" అని వాళ్ళతో చెప్పాడు.
\v 21 ఆయన అలా చెప్పాక వారు ఆయనను పడవ పైన ఎక్కించుకోడానికి ఇష్టపడ్డారు. వెంటనే ఆ పడవ తీరానికి చేరింది.
\s జీవాహారం గురించి ఉపదేశం
\s5
\p
\v 22 తరువాతి రోజు సముద్రానికి ఇవతల ఉండిపోయిన జన సమూహం అక్కడికి వచ్చారు. అక్కడ ఒక చిన్న పడవ మాత్రమే ఉంది. మరో పడవ వాళ్లకు కనిపించలేదు. శిష్యులు యేసు లేకుండానే పడవలో ప్రయాణమై వెళ్ళారని వాళ్ళు తెలుసుకున్నారు.
\v 23 అయితే ప్రభువు కృతఙ్ఞతలు చెప్పి వారికి రొట్టెలు పంచగా వాళ్ళు తిన్న స్థలానికి దగ్గరలో ఉన్న తిబెరియనుండి వేరే చిన్న పడవలు వచ్చాయి.
\s5
\v 24 యేసూ ఆయన శిష్యులూ అక్కడ లేక పోవడంతో ప్రజలందరూ ఆ చిన్న పడవలెక్కి యేసును వెదకుతూ కపెర్నహూముకు వచ్చారు.
\v 25 సముద్రం అవతల తీరాన వారు ఆయన్ని చూశారు. "బోధకా, నువ్వు ఇక్కడికి ఎప్పుడొచ్చావు?" అని అడిగారు.
\s5
\p
\v 26 యేసు "ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు అద్భుతాలను చూసినందు వల్ల కాదు గానీ రొట్టెలు కడుపునిండా తిని తృప్తి పొందడం వల్లే నన్ను వెదకుతున్నారు.
\v 27 నాశనమయ్యే ఆహారం కోసం కష్టపడవద్దు, నిరంతర జీవం కలగజేసే నాశనం కాని ఆహారం కోసం కష్టపడండి. దాన్ని మనుష్య కుమారుడు మీకిస్తాడు. దానికోసం తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి అధికారమిచ్చాడు" అని చెప్పాడు.
\s5
\v 28 అప్పుడు వాళ్ళు, "దేవుని పనులు చేయాలంటే మేమేం చేయాలి?" అని ఆయనను అడిగారు.
\v 29 దానికి యేసు, "దేవుడు పంపిన వ్యక్తి పైన విశ్వాసముంచడమే దేవుని కార్యాలు చేయడమంటే" అన్నాడు.
\s5
\v 30 వాళ్ళు, "అలా అయితే మేం నిన్ను నమ్మడానికి నువ్వు ఏ అద్భుతాన్ని చేస్తున్నావ్? ఇప్పుడు ఏం చేస్తావ్?
\v 31 'వారు తినడానికి పరలోకం నుండి ఆయన వారికి ఆహారం ఇచ్చాడు' అని రాసి ఉన్నట్టుగా మన పూర్వీకులు అరణ్యంలో మన్నాను భుజించారు" అని చెప్పారు.
\s5
\v 32 అప్పుడు యేసు ఇలా జవాబిచ్చాడు, "పరలోకం నుండి వచ్చే ఆహారాన్ని మోషే మీకివ్వలేదు. పరలోకం నుండి వచ్చే నిజమైన ఆహారాన్ని నా తండ్రే మీకిస్తున్నాడు.
\v 33 ఎందుకంటే దేవుడిచ్చే ఆహారం పరలోకం నుండి దిగి వచ్చి లోకానికంతటికీ జీవాన్నిస్తుంది."
\v 34 అందుకు వాళ్ళు, "ప్రభూ, మాకు ఎప్పుడూ ఈ ఆహారాన్ని ఇస్తూ ఉండు" అన్నారు.
\s5
\p
\v 35 దానికి జవాబుగా యేసు, "జీవాన్నిచ్చే ఆహారాన్ని నేనే. నా దగ్గరకు వచ్చే వాడికి ఆకలి వేయదు. నాపై విశ్వాసముంచే వాడికి దాహం వేయదు.
\v 36 మీతో చెప్పాను, నన్ను చూసి కూడా మీరు నమ్మలేదు.
\v 37 తండ్రి నాకు ఇచ్చే వాళ్ళంతా నా దగ్గరకు వస్తారు. ఇక నా దగ్గరకు వచ్చేవాళ్ళను నేను ఎంత మాత్రం నా దగ్గరనుండి తోలివేయను.
\s5
\v 38 నేను నా స్వంత ఇష్టాన్ని జరిగించడానికి రాలేదు. నన్ను పంపించిన వాని ఇష్టాన్ని జరిగించడానికే పరలోకం నుండి వచ్చాను.
\v 39 ఆయన నాకు ఇచ్చిన వాళ్ళలో ఏ ఒక్కరినీ పోగొట్టుకోకుండా ఉండటమూ, వారందరినీ ఆఖరు దినాన లేపడమూ నన్ను పంపిన వాని ఇష్టం.
\v 40 ఎందుకంటే కుమారుణ్ణి చూసి ఆయనలో విశ్వాసముంచిన ప్రతి ఒక్కరూ నిత్య జీవాన్ని పొందాలన్నదే దేవుని ఇష్టం. ఆఖరు రోజున నేను వాణ్ణి సజీవంగా లేపుతాను."
\s5
\p
\v 41 అప్పుడు 'నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారాన్ని' అని ఆయన చెప్పినందుకు యూదు నాయకులు సణగడం మొదలు పెట్టారు.
\v 42 "ఈయన యోసేపు కుమారుడైన యేసు కదా? ఇతని తలిదండ్రులు మనకు తెలుసు కదా! 'నేను పరలోకం నుండి వచ్చాన'ని ఎలా చెప్తున్నాడు?" అనుకున్నారు.
\s5
\v 43 యేసు వారికి ఇలా జవాబిచ్చాడు, "మీలో మీరు సణుక్కోవడం ఆపండి.
\v 44 తండ్రి ఆకర్షించకపోతే ఎవరూ నా దగ్గరకు రాలేరు. అలా వచ్చిన వాణ్ణి నేను ఆఖరు రోజున సజీవంగా లేపుతాను.
\v 45 "వారికి దేవుడు ఉపదేశిస్తాడు" అని ప్రవక్తలు రాశారు. కాబట్టి తండ్రి దగ్గర విని నేర్చుకున్నవాడు నా దగ్గరకు వస్తాడు.
\s5
\v 46 దేవుని దగ్గరనుండి వచ్చిన వాడు తప్ప తండ్రిని ఎవరూ చూడలేదు. ఆయన తండ్రిని చూశాడు.
\v 47 ఖచ్చితంగా చెప్తున్నాను. విశ్వసించేవాడు నిత్యజీవం గలవాడు.
\s5
\v 48 జీవాన్నిచ్చే ఆహారం నేనే.
\v 49 మీ పూర్వీకులు అరణ్యంలో మన్నాను తిన్నారు. అయినా చనిపోయారు.
\s5
\v 50 పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. దీన్ని తిన్నవాడు చనిపోడు.
\v 51 పరలోకం నుండి దిగి వచ్చిన జీవాన్నిచ్చే ఆహారం నేనే. ఈ ఆహారం ఎవరైనా తింటే వాడు కలకాలం జీవిస్తాడు. లోకానికి జీవాన్నిచ్చే ఈ ఆహారం నా శరీరమే."
\s5
\p
\v 52 యూదులకు కోపం వచ్చింది. "ఈయన తన శరీరాన్ని ఎలా తిననిస్తాడు" అంటూ తమలో తాము వాదించుకున్నారు.
\v 53 అప్పుడు యేసు వాళ్ళతో ఇలా చెప్పాడు, "మీకు ఖచ్చితంగా చెబుతున్నాను. మీరు మనుష్య కుమారుడి శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని తాగకపోతే మీలో మీకు జీవం ఉండదు.
\s5
\v 54 నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగే వాడే నిత్యజీవం ఉన్నవాడు.
\v 55 నా శరీరమే నిజమైన ఆహారం, నా రక్తమే నిజమైన పానీయం.
\v 56 నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగేవాడు నాలో ఉండి పోతాడు. నేను అతనిలో ఉండి పోతాను.
\s5
\v 57 సజీవుడైన తండ్రి నన్ను పంపాడు. ఆయన వల్లనే నేను జీవిస్తున్నాను. అలాగే నన్ను తినేవాడు కూడా నా వల్ల జీవిస్తాడు.
\v 58 పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. మీ పూర్వీకులు మన్నాను తిని చనిపోయినట్టుగా కాకుండా ఈ ఆహారాన్ని తినే వాడు కలకాలం జీవిస్తాడు."
\v 59 ఆయన ఈ మాటలన్నీ కపెర్నహూం లోని సమాజ మందిరంలో ఉపదేశిస్తూ చెప్పాడు.
\s యేసును అనుసరించేవారికి పరీక్ష
\s5
\p
\v 60 ఆయన శిష్యులలో అనేకమంది ఈ మాటలు విన్నప్పుడు "ఇది చాల కష్టమైన బోధ. దీనిని ఎవరు అంగీకరిస్తారు" అని చెప్పుకున్నారు.
\v 61 తన శిష్యులు ఇలా సణుగు కుంటున్నారని యేసుకు తెలిసిపోయింది. ఆయన వారితో ఇలా అన్నాడు, "ఈ మాటలు మీకు కోపం తెప్పించాయా?
\s5
\v 62 మనుష్యకుమారుడు ఇంతకు ముందు ఉన్న చోటికే ఆరోహణం కావడం చూస్తే మీరు ఏమంటారు?
\v 63 జీవాన్ని ఇచ్చేది ఆత్మ. శరీరం వల్ల ప్రయోజనం లేదు. నేను మీతో చెప్పిన మాటలే ఆత్మ. అవే జీవం.
\s5
\v 64 కానీ మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారు." తన మీద నమ్మకం ఉంచని వారెవరో, తనను పట్టి ఇచ్చేదెవరో యేసుకు మొదటి నుంచీ తెలుసు.
\v 65 ఆయన "నా తండ్రి ఆ కృప ఇస్తే తప్ప ఎవరూ నా దగ్గరకు రాలేరని ఈ కారణం బట్టి చెప్పాను" అన్నాడు.
\s5
\p
\v 66 ఆ తరువాత ఆయన శిష్యులలో చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. వాళ్ళు ఆయన్ని ఇక ఎప్పుడూఅనుసరించలేదు.
\s పేతురు విశ్వాసపు ఒప్పుకోలు (మత్తయి 16: 13- 20; మార్కు 8: 27- 30; లూకా 9: 18 -21)
\p
\v 67 అప్పుడు యేసు, "మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా?" అని తనతో ఉన్న పన్నెండుమంది శిష్యులను అడిగాడు.
\v 68 సీమోను పేతురు ఆయనతో, "ప్రభూ, మేము ఇక ఎవరి దగ్గరకు వెళ్ళాలి? నీదగ్గర మాత్రమే నిత్య జీవపు మాటలు ఉన్నాయి.
\v 69 నువ్వు దేవుని పరిశుద్ధుడివి అని మేం విశ్వసించాం. తెలుసుకున్నాం" అని చెప్పాడు.
\s5
\v 70 యేసు వాళ్ళతో, "నేను మీ పన్నెండు మందిని ఎంపిక చేసుకున్నాను కదా, మీలో ఒకడు సాతాను" అని చెప్పాడు.
\v 71 పన్నెండు మందిలో ఒకడుగా ఉండి ఆయన పట్టి ఇవ్వబోతున్న సీమోను ఇస్కరియోతు కొడుకైన యూదా గురించి ఆయన ఈ మాట చెప్పాడు.
\s5
\c 7
\s పర్ణశాలల పండుగకు యేసు పయనం (లూకా 9: 51-62)
\p
\v 1 ఆ తర్వాత యేసు గలిలయకు వెళ్లి అక్కడే సంచరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే యూదయలో యూదులు ఆయనను చంపాలని వెదకుతూ ఉండటంతో అక్కడ సంచరించడానికి ఆయన ఇష్టపడలేదు.
\v 2 ఇంతలో యూదుల పర్ణశాలల పండగ సమీపించింది.
\s5
\v 3 అప్పుడు ఆయన తమ్ముళ్ళు ఆయనతో "నువ్వు చేసే కార్యాలు నీ శిష్యులు చూడాలి కదా. అందుకే ఈ స్థలం వదిలి యూదయకు వెళ్ళు.
\v 4 అందరూ మెచ్చుకోవాలని చూసేవాడు తన పనులు రహస్యంగా చేయడు. నువ్వు నిజంగా ఈ కార్యాలు చేస్తున్నట్లయితే లోకమంతటికీ తెలిసేలా చేయి. నిన్ను నువ్వే చూపించుకో" అన్నారు.
\s5
\v 5 ఆయన తమ్ముళ్ళు కూడా ఆయనలో విశ్వాసం ఉంచలేదు.
\v 6 అప్పుడు యేసు, "నా సమయం ఇంకా రాలేదు. మీ సమయం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది.
\v 7 లోకం మిమ్మల్ని ద్వేషించదు. కానీ దాని పనులన్నీ చెడ్డవని నేను సాక్ష్యం చెప్తున్నాను కాబట్టి అది నన్ను ద్వేషిస్తూ ఉంది.
\s5
\v 8 మీరు పండగకు వెళ్ళండి. నా సమయం ఇంకా సంపూర్ణం కాలేదు. కాబట్టి నేను ఈ పండగకి ఇప్పుడే వెళ్ళను" అని వారితో చెప్పాడు.
\v 9 వారికి ఇలా చెప్పి ఆయన గలిలయలో ఉండి పోయాడు.
\s గలిలయ నుండి అంతిమ నిష్క్రమణం
\s5
\p
\v 10 కానీ తన తమ్ముళ్ళు పండగకి వెళ్ళిన తర్వాత ఆయన బహిరంగంగా కాకుండా రహస్యంగా పండగకి వెళ్ళాడు.
\v 11 ఆ ఉత్సవంలో యూదులు 'ఆయన ఎక్కడ ఉన్నాడు' అంటూ ఆయన కోసం వెదకుతూ ఉన్నారు.
\s5
\v 12 ప్రజల మధ్య ఆయనను గురించి పెద్ద వాదం ప్రారంభమైంది. కొందరేమో "ఆయన మంచివాడు" అన్నారు. మరికొందరు "కాదు. ఆయన ఒక మోసగాడు" అన్నారు.
\v 13 అయితే యూదులకు భయపడి ఆయనను గురించి ఎవరూ బయటకు మాట్లాడలేదు.
\s పర్ణశాలల పండుగలో యేసు
\s5
\p
\v 14 పండగ ఉత్సవాల్లో సగం రోజులు గడిచాక యేసు దేవాలయానికి వెళ్లి అక్కడ ఉపదేశించడం ప్రారంభించాడు.
\v 15 ఆయన ఉపదేశానికి యూదులు ఆశ్చర్యపడి "చదువూ సంధ్యా లేనివాడికి ఇంత పాండిత్యం ఎలా కలిగింది" అని చెప్పుకున్నారు.
\v 16 దానికి యేసు "నేను చేసే ఉపదేశం నాది కాదు. ఇది నన్ను పంపిన వానిదే.
\s5
\v 17 దేవుని ఇష్టప్రకారం చేయాలని నిర్ణయం తీసుకున్నవాడు నేను చేసే ఉపదేశం దేవుని వలన కలిగిందో లేక నా స్వంత ఉపదేశమో తెలుసుకుంటాడు.
\v 18 తనంతట తానే బోధించేవాడు సొంత గౌరవం కోసం పాకులాడతాడు. తనను పంపిన వాని గౌరవం కోసం తాపత్రయ పడేవాడు సత్యవంతుడు. ఆయనలో ఎలాంటి అన్యాయమూ ఉండదు.
\s5
\v 19 మోషే మీకు ధర్మశాస్త్రం ఇచ్చాడు కదా! కానీ మీలో ఎవరూ ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించరు. అలాంటి మీరు నన్ను చంపాలని ఎందుకు చూస్తున్నారు" అన్నాడు.
\v 20 అందుకు ప్రజలంతా "నీకు దయ్యం పట్టింది. నిన్ను చంపాలని ఎవరు కోరుకుంటారు?" అన్నారు.
\s5
\v 21 యేసు వారితో "నేనో కార్యం చేశాను. దానికి మీరంతా ఆశ్చర్యపడుతున్నారు.
\v 22 మోషే మీకు సున్నతి అనే ఆచారాన్ని నియమించాడు. ఈ ఆచారం మోషే వల్ల కలిగింది కాదు. ఇది పూర్వీకుల వల్ల కలిగింది. అయినా విశ్రాంతి దినాన మీరు సున్నతి కార్యక్రమం చేస్తున్నారు.
\s5
\v 23 విశ్రాంతి దినాన సున్నతి పొందినా మోషే ధర్మ శాస్త్రాన్ని అతిక్రమించినట్టు కాదు గదా! అలాంటప్పుడు నేను విశ్రాంతి దినాన ఒక వ్యక్తిని బాగు చేస్తే నా మీద ఎందుకు కోపం చూపుతున్నారు?
\v 24 బయటకు కనిపించే దాన్ని బట్టి కాక న్యాయసమ్మతంగా నిర్ణయం చేయండి" అన్నాడు.
\s5
\p
\v 25 యెరూషలేము వారిలో కొందరు "వారు చంపాలని వెదకుతున్నవాడు ఈయన కాదా?
\v 26 చూడండి, ఈయన బహిరంగంగా మాట్లాడుతున్నా ఈయన్ని ఏమీ అనరు. ఈయనే క్రీస్తని అధికారులకి తెలిసి పోయిందా ఏమిటి?
\v 27 అయినా ఈయన ఎక్కడి వాడో మనకు తెలుసు. క్రీస్తు వచ్చినప్పుడైతే ఆయన ఎక్కడి వాడో ఎవరికీ తెలియదు" అని చెప్పుకున్నారు.
\s5
\p
\v 28 కాబట్టి యేసు దేవాలయములో ఉపదేశిస్తూ "మీకు నేను తెలుసు. నేను ఎక్కడనుండి వచ్చానో మీకు తెలుసు. నేను నా స్వంతంగా ఏమీ రాలేదు. నన్ను పంపినవాడు సత్యవంతుడు. ఆయన మీకు తెలియదు.
\v 29 నేను ఆయన దగ్గరనుండి వచ్చాను. ఆయనే నన్ను పంపాడు కాబట్టి నాకు ఆయన తెలుసు" అని గొంతెత్తి చెప్పాడు.
\s5
\v 30 దానికి వాళ్ళు ఆయనను పట్టుకోడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆయన సమయం ఇంకా రాలేదు. కాబట్టి ఎవరూ ఆయనను పట్టుకోలేకపోయారు.
\v 31 ప్రజలలో అనేక మంది ఆయనలో విశ్వాసముంచారు. "క్రీస్తు వచ్చినప్పుడు ఇంతకంటే గొప్ప కార్యాలు చేస్తాడా ఏమిటి" అని వారు చెప్పుకున్నారు.
\v 32 ప్రజలు ఆయనను గురించి ఇలా మాట్లాడుకోవడం పరిసయ్యుల దృష్టికి వెళ్ళింది. అప్పుడు ప్రధాన యాజకులూ, పరిసయ్యులూ ఆయనను పట్టుకోడానికి సైనికులను పంపించారు.
\s5
\p
\v 33 యేసు మాట్లాడుతూ, "నేను ఇంకా కొంత కాలం మాత్రమే మీతో ఉంటాను. ఆ తర్వాత నన్ను పంపినవాని దగ్గరకు వెళ్లిపోతాను.
\v 34 అప్పుడు మీరు నన్ను వెదకుతారు. కానీ నేను మీకు కనిపించను. నేను ఉండే చోటికి మీరు రాలేరు" అన్నాడు.
\s5
\v 35 దానికి యూదులు "మనకు కనిపించకుండా ఈయన ఎక్కడికి వెళ్తాడు? గ్రీసు దేశం వెళ్ళి అక్కడ చెదరి ఉన్న యూదులకు, గ్రీసు వారికి ఉపదేశం చేస్తాడా?
\v 36 'నన్ను వెదకుతారు. కానీ నేను మీకు కనిపించను. నేను ఉండే చోటికి మీరు రాలేరు' అన్న మాటలకి అర్ధం ఏమిటో" అంటూ తమలో తాము చెప్పుకుంటూ ఉన్నారు.
\s పరిశుద్ధాత్మ గురించిన గొప్ప ప్రవచనం (అపో. కా. 2: 2- 4; యోహాను 4: 14)
\s5
\p
\v 37 ఆ పండగలో మహాదినమైన చివరి రోజున యేసు నిలబడి, "ఎవడికైనా దాహం వేస్తె నా దగ్గరకు వచ్చి దాహం తీర్చుకోవాలి.
\v 38 లేఖనాలు చెబుతున్నాయి. నాపై విశ్వాసముంచే వాడి కడుపులోనుండి జీవ జలనదులు ప్రవహిస్తాయి" బిగ్గరగా చెప్పాడు.
\s5
\v 39 తనఫై నమ్మకం ఉంచేవారు పొందబోయే దేవుని ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాడు. యేసు అప్పటికి తన మహిమా స్థితి పొందలేదు కనుక దేవుని ఆత్మ దిగి రావడం జరగలేదు.
\s ప్రజల్లో భేదాభిప్రాయాలు
\s5
\p
\v 40 ప్రజలలో కొందరు ఆ మాట విని "ఈయన నిజంగా ఆ ప్రవక్తే" అన్నారు.
\v 41 మరికొందరు "ఈయన క్రీస్తే" అన్నారు. దానికి జవాబుగా ఇంకా కొందరు "ఏమిటీ, క్రీస్తు గలిలయ నుండి వస్తాడా?
\v 42 క్రీస్తు దావీదు వంశంలో పుడతాడనీ, దావీదు ఊరైన బెత్లెహేము అనే గ్రామంలో నుండి వస్తాడనీ గ్రంథాలలో రాసి లేదా?" అన్నారు.
\s5
\v 43 ఈ విధంగా ప్రజలలో ఆయనను గురించి భేదాభిప్రాయం కలిగింది.
\v 44 వారిలో కొందరు ఆయనను పట్టుకోవాలని అనుకున్నారు కానీ ఎవరూ ఆయను పట్టుకోలేదు.
\s5
\p
\v 45 పరిసయ్యులు పంపిన సైనికులు తిరిగి వచ్చారు. ప్రధాన యాజకులూ, పరిసయ్యులూ, "మీరు ఆయనను ఎందుకు తీసుకురాలేదు?" అని అడిగారు.
\v 46 దానికి ఆ సైనికులు "ఆ వ్యక్తి మాట్లాడినట్టు ఇంతకు ముందు ఎవరూ మాట్లాడలేదు" అని జవాబిచ్చారు.
\s5
\v 47 దానికి పరిసయ్యులు "మీరు కూడా మోస పోయారా?
\v 48 అధికారులలో గానీ పరిసయ్యులలో గానీ ఎవరైనా ఆయనను నమ్మారా?
\v 49 ధర్మశాస్త్రం తెలియని ఈ ప్రజల పైన శాపం ఉంది" అని సైనికులతో అన్నారు.
\s5
\v 50 అంతకు ముందు యేసు దగ్గరకు వచ్చిన నికోదేము అనే పరిసయ్యుడు,
\v 51 "ఒక వ్యక్తి చెప్పే మాట వినకుండా అతడేం చేశాడో తెలుసుకోకుండా మన ధర్మశాస్త్రం అతడికి తీర్పు తీరుస్తుందా?" అన్నాడు.
\v 52 దానికి వారు, "నువ్వు కూడా గలిలయుడవేనా? ఆలోచించు, గలిలయలో ఎలాంటి ప్రవక్తా పుట్టడు" అన్నారు.
\s5
\v 53 ఇక ఎవరి ఇంటికి వారు వెళ్ళారు.
\s5
\c 8
\s వ్యభిచారంలో దొరికిన స్త్రీ
\p
\v 1 యేసు ఒలీవ కొండకు వెళ్ళాడు.
\v 2 ఉదయం పెందలకడనే యేసు తిరిగి దేవాలయంలోకి వచ్చాడు. అప్పుడు ప్రజలంతా ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన కూర్చుని వాళ్లకు ఉపదేశించడం మొదలెట్టాడు.
\v 3 అప్పుడు ధర్మశాస్త్ర పండితులూ, పరిసయ్యులూ ఒక స్త్రీని తీసికొని వచ్చారు. వాళ్ళు ఆమెను వ్యభిచారం చేస్తుండగా పట్టుకున్నారు. ఆమెను అందరి మధ్య నిలబెట్టారు.
\s5
\v 4 వాళ్ళు ఆయనతో "బోధకా, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టుబడింది.
\v 5 ఇలాంటి వారిని రాళ్ళతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రంలో మోషే ఆదేశించాడు కదా! నువ్వేమంటావ్?" అని అడిగారు.
\v 6 ఆయన మీద ఎలాగైనా నేరం మోపాలని ఆయన్ని పరీక్షిస్త్తూ ఇలా అడిగారు. అయితే యేసు విననట్టు తన వేలితో నేల మీద ఏదో రాస్తూ ఉన్నాడు.
\s5
\v 7 వారు పట్టు విడవకుండా ఆయనను అడుగుతూనే ఉన్నారు. దాంతో ఆయన తల ఎత్తి చూసి, "మీలో పాపం లేనివాడు ఆమె మీద మొదటి రాయి వేయవచ్చు" అని వాళ్ళతో చెప్పి
\v 8 మరల వంగి వేలితో నేల మీద రాస్తూ ఉన్నాడు.
\s5
\v 9 ఆయన పలికిన మాట విని పెద్దా చిన్నా అంతా ఒకరి తర్వాత ఒకరు బయటకు వెళ్ళారు. చివరికి యేసు ఒక్కడే మిగిలిపోయాడు. ఆ స్త్రీ అలానే మధ్యలో నిలిచే ఉంది.
\v 10 యేసు తలెత్తి ఆమెను చూశాడు. "అమ్మా, వీళ్ళంతా ఎక్కడ? నీకు ఎవరూ శిక్ష వేయలేదా?" అని అడిగాడు.
\v 11 ఆమె "లేదు ప్రభూ" అంది. దానికి యేసు "నేను కూడా నీకు శిక్ష వేయను. వెళ్ళు, ఇంకెప్పుడూ పాపం చేయకు" అన్నాడు.
\s పండుగ తరువాత ఉపదేశం: లోకానికి వెలుగు యేసే (యోహాను 1: 9)
\s5
\p
\v 12 మళ్ళీ యేసు ఇలా అన్నాడు, "నేను లోకానికి వెలుగుని. నా వెనక వచ్చేవాడు చీకటిలో జీవించడు. జీవాన్నిచ్చే వెలుగుని కలిగి ఉంటాడు."
\v 13 అప్పుడు పరిసయ్యులు "నీ గురించి నువ్వే సాక్ష్యం చెప్పుకుంటున్నావు. నీ సాక్ష్యం సరైనది కాదు" అన్నారు.
\s5
\v 14 జవాబుగా యేసు, "నా గురించి నేను సాక్ష్యం చెప్పినా అది సత్యమే అవుతుంది. ఎందుకంటే నేను ఎక్కణ్ణించి వచ్చానో, ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలుసు. నేను ఎక్కణ్ణించి వస్తున్నానో ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలియదు.
\v 15 మీరు శరీర సంబంధంగా తీర్పు తీరుస్తారు. నేను ఎవరికీ తీర్పు తీర్చను.
\v 16 నేను అందులో ఒంటరిని కాదు. నేనూ నన్ను పంపిన నా తండ్రితో కలిసి ఉన్నాను. కాబట్టి ఒకవేళ నేను తీర్పు తీర్చినా అది సత్యమే అవుతుంది.
\s5
\v 17 ఇద్దరు వ్యక్తుల సాక్ష్యం సత్యం అవుతుందని మీ ధర్మశాస్త్రంలోనే రాసి ఉంది కదా!
\v 18 నా గురించి సాక్ష్యం నేను చెప్పుకుంటాను. నన్ను పంపిన తండ్రి కూడా నా గురించి సాక్ష్యం ఇస్తున్నాడు" అన్నాడు.
\s5
\v 19 వాళ్ళు, "నీ తండ్రి ఎక్కడ ఉన్నాడు?" అని అడిగారు. అందుకు యేసు, "మీకు నేను గానీ నా తండ్రి గానీ తెలియదు. ఒకవేళ నేను మీకు తెలిస్తే నా తండ్రి కూడా తెలిసే ఉంటాడు" అన్నాడు.
\v 20 ఆయన దేవాలయంలో ఉపదేశిస్తూ చందా పెట్టె ఉన్నచోట ఈ మాటలు చెప్పాడు. ఆయన సమయం రాలేదు కాబట్టి ఎవరూ ఆయన్ని పట్టుకోలేదు.
\s5
\p
\v 21 మరోసారి ఆయన, "నేను వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళాక మీరు నాకోసం వెదకుతారు. కానీ మీ పాపాల్లోనే మీరు మరణిస్తారు. నేను వెళ్ళే స్థలానికి మీరు రాలేరు" అని వాళ్ళతో చెప్పాడు.
\v 22 దానికి యూదులు, "'నేను వెళ్ళే స్థలానికి మీరు రాలేరు' అంటున్నాడేమిటి? ఆత్మహత్య చేసుకుంటాడా ఏమిటి?" అని చెప్పుకున్నారు.
\s5
\v 23 అప్పుడు అయన, "మీరు కింద ఉండేవారు. నేను పైన ఉండేవాణ్ణి. మీరు ఈ లోకానికి సంబంధించిన వారు. నేను ఈ లోకానికి సంబంధించిన వాణ్ణి కాదు.
\v 24 కాబట్టి మీరు మీ పాపాల్లోనే మరణిస్తారని చెప్పాను. ఎందుకంటే నేనే క్రీస్తునని మీరు నమ్మకపోతే మీరు మీ పాపాల్లోనే మరణిస్తారు" అని వారితో చెప్పాడు.
\s5
\v 25 కాబట్టి వారు, "అసలు నువ్వు ఎవరు?" అని అడిగారు. అప్పుడు ఆయన వాళ్ళతో ఇలా చెప్పాడు, "నేను ప్రారంభం నుండి ఎవరినని మీకు చెబుతూ ఉన్నానో ఆయననే.
\v 26 మీ గురించి చెప్పడానికీ మీకు తీర్పు తీర్చడానికీ నాకు అనేకమైన సంగతులు ఉన్నాయి. అయితే నన్ను పంపినవాడు సత్యవంతుడు. నేను ఆయన దగ్గర విన్న విషయాలనే ఈ లోకానికి బోధిస్తున్నాను."
\v 27 తండ్రి అయిన దేవుని గురించి ఆయన తమకు చెబుతున్నాడని వాళ్ళు అర్ధం చేసుకోలేక పోయారు.
\s5
\p
\v 28 కాబట్టి యేసు, "మీరు మనుష్యకుమారుణ్ణి పైకెత్తినప్పుడు 'ఉన్నవాడు' అనేవాణ్ణి నేనే అని తెలుసుకుంటారు. నా స్వంతగా నేను ఏమీ చేయననీ తండ్రి నాకు చెప్పినట్టుగానే ఈ సంగతులు మాట్లాడుతున్నాననీ మీరు గ్రహిస్తారు.
\v 29 నన్ను పంపినవాడు నాకు తోడుగా ఉన్నాడు. ఆయనకు ఇష్టమైన వాటినే నేను చేస్తూ ఉన్నాను కాబట్టి ఆయన నన్ను విడిచి పెట్టలేదు" అని చెప్పాడు.
\v 30 ఆయన ఇలా మాట్లాడుతూ ఉండగానే అనేకమంది ఆయనలో నమ్మకముంచారు.
\s5
\v 31 కాబట్టి యేసు, తనలో నమ్మకముంచిన యూదులతో, "మీరు నా వాక్కు లో స్థిరంగా ఉంటే నిజంగా నాకు శిష్యులౌతారు. సత్యాన్ని గ్రహిస్తారు.
\v 32 అప్పుడు ఆ సత్యమే మిమ్మల్ని విడుదల చేస్తుంది" అన్నాడు.
\v 33 అప్పుడు వాళ్ళు "మేము అబ్రాహాము వారసులం. మేం ఎప్పుడూ ఎవరికీ బానిసలుగా ఉండలేదే. 'మీరు విడుదల పొందుతారు' అని ఎలా అంటున్నావ్?" అన్నారు.
\s5
\v 34 దానికి యేసు, "మీకు ఖచ్చితంగా చెబుతున్నాను, పాపం చేసే ప్రతీ వాడూ పాపానికి బానిసే.
\v 35 బానిస ఎప్పుడూ ఇంట్లో ఉండడు. కానీ కుమారుడు ఎప్పుడూ ఇంట్లోనే నివాసం ఉంటాడు.
\v 36 కుమారుడు మిమ్మల్ని విడుదల చేస్తే మీరు నిజంగా స్వతంత్రులై ఉంటారు.
\s5
\v 37 మీరు అబ్రాహాము వారసులని నాకు తెలుసు. అయినా మీలో నా వాక్కుకు చోటు లేదు. కాబట్టే నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు.
\v 38 నేను ఉపదేశించేదంతా నా తండ్రి దగ్గర నేను చూసినవే. అలాగే మీరు మీ తండ్రి దగ్గర విన్న సంగతుల ప్రకారమే కార్యాలు చేస్తున్నారు" అని చెప్పాడు.
\s5
\p
\v 39 దానికి వారు, "మా తండ్రి అబ్రాహాము" అన్నారు. అప్పుడు యేసు, "మీరు అబ్రాహాము పిల్లలైతే అబ్రాహాము చేసిన పనులే చేసేవారు.
\v 40 దేవుని దగ్గర నేను విన్న సత్యాన్ని మీకు చెప్పినందుకు నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారే. అయితే అబ్రాహాము అలా చేయలేదు.
\v 41 మీరు మీ తండ్రి పనులే చేస్తున్నారు" అని వాళ్ళతో చెప్పాడు. దానికి వాళ్ళు "మేం వ్యభిచారం వల్ల పుట్టిన వాళ్ళం కాదు. మాకు ఒక్కడే తండ్రి. ఆయన దేవుడు" అన్నారు.
\s5
\v 42 యేసు వాళ్ళతో ఇలా అన్నాడు, "దేవుడు మీ తండ్రి అయితే మీరు నన్ను ప్రేమించి ఉండేవారు. నేను వచ్చింది దేవుని దగ్గర్నుంచే. నా అంతట నేను రాలేదు. ఆయనే నన్ను పంపించాడు.
\v 43 నా మాటలు మీరు ఎందుకు అర్ధం చేసుకోవడం లేదు? నా మాట వినడానికి సహించలేక పోవడమే దానికి కారణం.
\v 44 మీరు మీ తండ్రి అయిన సాతానుకు సంబంధించిన వాళ్ళు. మీ తండ్రి దురాశల్ని నెరవేర్చాలని మీరు చూస్తున్నారు. మొదట్నించీ వాడు హంతకుడు, వాడు సత్యంలో నిలిచి ఉండడు. ఎందుకంటే వాడిలో సత్యం లేదు. వాడు అబద్ధం చెప్పినప్పుడల్లా తన స్వభావాన్ని అనుసరించి మాట్లాడతాడు. వాడు అబద్ధికుడూ, అబద్ధానికి తండ్రీ.
\s5
\p
\v 45 నేను చెబుతున్నది సత్యమే అయినా మీరు నన్ను నమ్మరు.
\v 46 నాలో పాపం ఉందని మీలో ఎవరు నిరూపించ గలరు? నేను సత్యాన్నే చెబుతున్నా మీరెందుకు నమ్మడం లేదు?
\v 47 ఒకడు దేవునికి చెందినవాడు అయితే దేవుని మాటలు వింటాడు. మీరు దేవుని సంబంధులు కారు కాబట్టి మీరు ఆయన మాటలు వినరు."
\s5
\v 48 అందుకు యూదులు, "నువ్వు సమరయుడివి, నీకు దయ్యం పట్టింది అని మేం చెబుతున్న మాట నిజమే!" అన్నారు.
\v 49 అప్పుడు యేసు "నాకు దయ్యం పట్టలేదు. నేను నా తండ్రిని గౌరవిస్తున్నాను. మీరు నన్ను అవమానిస్తున్నారు.
\s5
\v 50 నేను నా పేరు ప్రతిష్టల కోసం వెదకడం లేదు. అలా వెదికే వాడూ, తీర్పు తీర్చే వాడూ వేరే ఉన్నాడు.
\v 51 మీకు ఖచ్చితంగా చెప్తున్నాను. నా మాటలు అంగీకరించిన వాడు మరణం రుచి చూడడు" అని జవాబిచ్చాడు.
\s5
\p
\v 52 అందుకు యూదులు, "నీకు దయ్యం పట్టిందని ఇప్పుడు మేము నిశ్చయంగా తెలుసుకున్నాం. అబ్రాహామూ, ప్రవక్తలూ చనిపోయారు. 'నా మాట విన్న వాడు మరణం రుచి చూడడని' నువ్వు అంటున్నావ్.
\v 53 మన తండ్రి అయిన అబ్రాహాము చనిపోయాడు కదా! నువ్వు అతని కంటే గొప్పవాడివా? ప్రవక్తలూ చనిపోయారు. అసలు నువ్వు ఎవరినని చెప్పుకుంటున్నావు?" అని ఆయన్ని అడిగారు.
\s5
\v 54 అందుకు యేసు, "నన్ను నేనే గౌరవించుకుంటే ఆ గౌరవం అంతా ఒట్టిది. ఎవరిని మా దేవుడు అని మీరు చెప్పుకుంటున్నారో ఆయనే నా తండ్రి. ఆయనే నన్ను గౌరవిస్తున్నాడు.
\v 55 మీకు ఆయన ఎవరో తెలియదు. నాకు ఆయన తెలుసు. ఆయన ఎవరో నాకు తెలియదు అని నేను చెబితే మీలాగా నేనూ అబద్ధికుడిని అవుతాను. కానీ నాకు ఆయన తెలుసు. ఆయన మాటను నేను పాటిస్తాను.
\v 56 నా రోజును చూడటం మీ తండ్రి అయిన అబ్రాహాముకు సంతోషం. అతడు దానిని చూసి ఎంతో సంతోషించాడు" అన్నాడు.
\s5
\p
\v 57 అందుకు యూదులు, "నీకింకా యాభై సంవత్సరాలు కూడా లేవు. నువ్వు అబ్రాహామును చూశావా?" అన్నారు.
\v 58 దానికి జవాబుగా యేసు, "మీతో ఖచ్చితంగా చెబుతున్నాను. నేను అబ్రాహాము పుట్టక ముందు నుంచీ ఉన్నాను" అన్నాడు.
\v 59 అప్పుడు వాళ్ళు ఆయన మీద విసరడానికి రాళ్ళు తీశారు. కానీ యేసు దేవాలయంలో దాగి అక్కడనుంచి బయటకు వెళ్ళిపోయాడు.
\s5
\c 9
\s పుట్టు గుడ్డి వాడు చూపు పొందడం
\p
\v 1 ఆయన దారిలో వెళ్తూ ఉన్నాడు. అక్కడ పుట్టినప్పటి నుండీ గుడ్డివాడుగా ఉన్న ఒక వ్యక్తి కనిపించాడు.
\v 2 ఆయన శిష్యులు, "బోధకా, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి కారణం వీడు చేసిన పాపమా, లేక వీడి తలిదండ్రులు చేసిన పాపమా?" అని ఆయన్ని అడిగారు.
\s5
\v 3 అందుకు యేసు, "వీడైనా, వీడిని కన్నవారైనా ఏ పాపమూ చేయలేదు. కానీ దేవుని పనులు వీడిలో వెల్లడి కావడానికే వీడు గుడ్డి వాడుగా పుట్టాడు.
\v 4 పగలున్నంత వరకూ నన్ను పంపిన వాని పనులు మనం చేస్తూ ఉండాలి. రాత్రి వస్తుంది. అప్పుడిక ఎవరూ పని చేయలేరు.
\v 5 ఈ లోకంలో ఉన్నంత వరకూ నేను ఈ లోకానికి వెలుగుని" అని చెప్పాడు.
\s5
\v 6 ఆయన ఇలా చెప్పి, నేలపై ఉమ్మి వేసి, దానితో బురద చేసి ఆ బురదను ఆ గుడ్డివాడి కన్నులపై పూశాడు.
\v 7 "సిలోయం కోనేటికి వెళ్ళి దాంట్లో కడుక్కో" అని వాడికి చెప్పాడు. సిలోయం అనే మాటకు 'వేరొకరు పంపిన వాడు' అని అర్ధం. వాడు వెళ్ళి ఆ కోనేటిలో కడుగుకొని చూపు పొంది తిరిగి వచ్చాడు.
\s5
\v 8 అప్పుడు ఇరుగు పొరుగు వారూ, ఇంతకు ముందు వాడు అడుక్కుంటుంటే చూసిన వారూ, "వీడు కూర్చుని అడుక్కునే వాడు ఇతడే కదా!" అన్నారు.
\v 9 "వీడే" అని కొందరూ, "వీడు కాదు" అని కొందరూ అన్నారు. ఇక వాడైతే "అది నేనే" అన్నాడు.
\s5
\p
\v 10 వాళ్ళు. "నీ కళ్ళు ఎలా తెరచుకున్నాయి?" అని వాణ్ణి అడిగారు.
\v 11 దానికి వాడు, "యేసు అనే ఒకాయన బురద చేసి నా కన్నుల పైన పూసి సిలోయం కోనేటికి వెళ్ళి కడుక్కోమని నాకు చెప్పాడు. నేను వెళ్ళి కడుక్కుని చూపు పొందాను" అన్నాడు.
\v 12 వాళ్ళు, "ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు?" అని అడిగితే వాడు "నాకు తెలియదు" అన్నాడు.
\s5
\v 13 ఇంతకు ముందు గుడ్డి వాడిగా ఉన్న ఆ వ్యక్తిని వాళ్ళు పరిసయ్యుల దగ్గరకు తీసుకు వెళ్ళారు.
\v 14 యేసు బురదచేసి వాడి కన్నులు తెరచిన రోజు విశ్రాంతిదినం.
\v 15 వాడు చూపు ఎలా పొందాడో చెప్పమని పరిసయ్యులు కూడా వాడినడిగారు. వాడు, "ఆయన నా కన్నులపై బురద ఉంచాడు. నేను వెళ్ళి కడుగుకొని చూపు పొందాను" అని వాళ్ళకు చెప్పాడు.
\s5
\p
\v 16 కాబట్టి "ఈ వ్యక్తి విశ్రాంతి దినాన్ని ఆచరించడం లేదు కాబట్టి ఇతడు దేవుని దగ్గరనుండి రాలేదు" అని పరిసయ్యులలో కొందరు అన్నారు. మరి కొందరు, "ఇతడు పాపి అయితే ఇలాటి అద్భుతాలు ఎలా చేయగలడు?" అన్నారు. ఈ విధంగా వారిలో భేదాభిప్రాయం కలిగింది.
\v 17 దాంతో వాళ్ళు గుడ్డివాడుగా ఉన్నవాడితో, "నీ కన్నులు తెరిచాడు కదా! ఆయన గురించి నీ అభిప్రాయం ఏంటి?" అని అడిగారు. అప్పుడు వాడు, "ఆయన ఒక ప్రవక్త" అన్నాడు.
\v 18 వాడు గుడ్డి వాడుగా ఉండి చూపు పొందాడని యూదులు మొదట నమ్మలేదు. అందుకని వాడి తలిదండ్రులను పిలిపించారు.
\s5
\v 19 "గుడ్డివాడుగా పుట్టాడని మీరు చెప్పే మీ కొడుకు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడు ఎలా చూడ గలుగుతున్నాడు?" అని వాళ్ళను అడిగారు.
\v 20 దానికి వాడి తలిదండ్రులు, "వీడు మా కొడుకే. వీడు గుడ్డివాడిగానే పుట్టాడు.
\v 21 అయితే ఇప్పుడు వీడు ఎలా చూస్తున్నాడో మాకు తెలీదు. వీడి కన్నులు తెరిచిన దెవరో మాకు తెలీదు. అయినా వీడికి వయస్సు వచ్చింది. వీడినే అడగండి. తన సంగతి వీడే చెప్పుకో గలడు" అన్నారు.
\s5
\p
\v 22 వాడి తలిదండ్రులు యూదులకు భయపడి ఆ విధంగా చెప్పారు. ఎందుకంటే యూదులు అప్పటికే ఎవరైనా ఆయన్ని క్రీస్తు అని ఒప్పుకుంటే వారిని తమ సునగోగుల్లో నుండి బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు.
\v 23 కాబట్టే వాని తలిదండ్రులు 'వాడు వయస్సు వచ్చినవాడు, వాడినే అడగండి' అన్నారు.
\s5
\v 24 కాబట్టి వాళ్ళు అప్పటివరకూ గుడ్డివాడిగా ఉన్న వ్యక్తిని రెండో సారి పిలిపించారు. "దేవునికి మహిమ చెల్లించు. ఈ మనిషి పాపాత్ముడు అని మాకు తెలుసు" అని అతనితో అన్నారు.
\v 25 అందుకు వాడు, "ఆయన పాపాత్ముడో కాదో నాకు తెలియదు. అయితే నాకు ఒక్కటి తెలుసు. నేను గుడ్డివాడుగా ఉండేవాణ్ణి, ఇప్పుడైతే చూస్తున్నాను" అన్నాడు.
\s5
\v 26 దానికి వాళ్ళు, "అసలు ఆయన నీకేం చేసాడు? నీ కన్నులు ఎలా తెరిచాడు?" అని మళ్ళీ అడిగారు.
\v 27 దానికి వాడు, "ఇంతకు ముందే మీకు చెప్పాను. మీరు వినలేదు. మళ్ళీ ఎందుకు వినాలనుకుంటున్నారు? మీరు కూడా ఆయన శిష్యులు కావాలనుకుంటున్నారా ఏంటి?" అని వాళ్ళతో అన్నాడు.
\p
\v 28 అందుకు వారు "నువ్వే వాడి శిష్యుడివి. మేం మోషే శిష్యులం.
\v 29 దేవుడు మోషేతో మాట్లాడాడని తెలుసు కానీ ఈ మనిషి విషయమైతే అసలు ఇతడు ఎక్కడినుండి వచ్చాడో కూడా తెలియదు" అంటూ వాణ్ణి బాగా తిట్టారు.
\s5
\v 30 అయితే వాడు, "ఆయన ఎక్కడినుండి వచ్చాడో కూడా మీకు తెలియక పోవడం ఆశ్చర్యంగా ఉంది. ఏదేమైనా ఆయన నా కళ్ళు తెరిచాడు.
\v 31 దేవుడు పాపుల ప్రార్థనలను వినడని మనకు తెలుసు. అయితే దేవునిలో భక్తి కలిగి ఆయన ఇష్టాన్ని జరిగిస్తే అతని ప్రార్థనలు ఆయన వింటాడు.
\s5
\v 32 గుడ్డివాడిగా పుట్టిన వ్యక్తి కళ్ళు ఎవరైనా తెరిచినట్టు లోకం ప్రారంభం నుండీ ఎవరూ వినలేదు.
\v 33 ఈయన దేవుని దగ్గర నుండి రాకపోయినట్లయితే ఇలాంటివి ఏమీ చేయలేడు" అని చెప్పాడు.
\v 34 దానికి వాళ్ళు, "పాపిగా పుట్టినవాడివి, నువ్వు మాకు బోధ చేస్తున్నావా?" అని చెప్పి వాణ్ణి తమ సునగోగు నుండి బహిష్కరించారు.
\s5
\p
\v 35 పరిసయ్యులు వాణ్ణి బహిష్కరించారని యేసు విన్నాడు. ఆయన వాణ్ణి కనుగొని, "నువ్వు దేవుని కుమారునిలో విశ్వాసముంచుతున్నావా?" అని వాణ్ణి అడిగాడు.
\v 36 అందుకు వాడు "ప్రభూ, అలా విశ్వాసముంచడానికి ఆయన ఎవరో నాకు తెలియదే" అన్నాడు.
\v 37 యేసు, "ఇప్పుడు నువ్వు ఆయనను చూస్తున్నావు. నీతో మాట్లాడుతున్న నేనే ఆయన్ని" అన్నాడు.
\v 38 అప్పుడు వాడు, "’నేను నమ్ముతున్నాను ప్రభూ" అంటూ ఆయనను ఆరాధించాడు.
\s5
\p
\v 39 అప్పుడు యేసు, "'చూడనివారు చూడాలి. చూసేవారు గుడ్డివారు కావాలి’ అనే తీర్పు జరగడం కోసం నేను ఈ లోకంలోకి వచ్చాను" అన్నాడు.
\v 40 ఆయనకు దగ్గరలో ఉన్న పరిసయ్యుల్లో కొంత మంది ఆ మాట విని, "అయితే మేం కూడా గుడ్డివాళ్ళమేనా?" అని అడిగారు.
\v 41 అందుకు యేసు, "మీరు గుడ్డివారైతే మీకు పాపం ఉండేది కాదు. కానీ 'మాకు చూపు ఉంది' అని మీరు చెప్పుకుంటున్నారు కాబట్టి మీ పాపం నిలిచి ఉంటుంది" అని చెప్పాడు.
\s5
\c 10
\s మంచి కాపరి గురించిన ఉపదేశం (కీర్తన 23; హెబ్రీ 13:20; 1 పేతురు 5:4)
\p
\v 1 మీతో ఖచ్చితంగా చెబుతున్నాను, గొర్రెల దొడ్డిలోకి ప్రవేశ ద్వారం ద్వారా కాకుండా వేరే విధంగా ఎక్కి లోపలికి వచ్చేవాడు దొంగే, వాడు దోపిడీగాడే.
\v 2 ప్రవేశ ద్వారం ద్వారా వచ్చేవాడు గొర్రెల కాపరి.
\s5
\v 3 అతని కోసం కాపలావాడు ద్వారం తెరుస్తాడు. గొర్రెలు అతని స్వరం వింటాయి. తన సొంత గొర్రెల్ని అతను పేరు పెట్టి పిలిచి బయటకు నడిపిస్తాడు.
\v 4 తన సొంత గొర్రెల్ని బయటకి ఎప్పుడు నడిపించినా, వాటికి ముందుగా అతను నడుస్తాడు. అతని స్వరం గొర్రెలకు తెలుసు కాబట్టి అవి అతని వెంట నడుస్తాయి.
\s5
\v 5 వేరేవారి స్వరం వాటికి తెలియదు కాబట్టి అవి వారి వెంట వెళ్ళకుండా తప్పుకుంటాయి.
\v 6 యేసు ఈ ఉదాహరణ ద్వారా వారితో మాట్లాడాడు గాని ఆయన వారితో చెప్పిన ఈ సంగతులు వారికి అర్ధం కాలేదు.
\s5
\v 7 అందుకు యేసు మళ్ళీ వాళ్ళతో ఇలా అన్నాడు, "మీతో ఖచ్చితంగా చెబుతున్నాను, గొర్రెల ప్రవేశ ద్వారం నేనే
\v 8 నా ముందు వచ్చిన వాళ్ళంతా దొంగలు, దోపిడిగాళ్ళే. గొర్రెలు వాళ్ళ మాట వినలేదు.
\s5
\v 9 నేనే ప్రవేశ ద్వారం, నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశిస్తే వాడికి రక్షణ దొరుకుతుంది. వాడు లోపలికి వస్తూ బయటకి వెళ్తూ పచ్చిక కలిగి ఉంటాడు.
\v 10 దొంగ కేవలం దొంగతనం, హత్య, నాశనం చెయ్యడానికి మాత్రమే వస్తాడు. గొర్రెలకు జీవం కలగాలని, ఆ జీవం సమృధ్ధిగా కలగాలని నేను వచ్చాను.
\s5
\p
\v 11 నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కోసం తన ప్రాణం ఇస్తాడు.
\v 12 జీతం కోసం పనిచేసేవాడు కాపరిలాంటి వాడు కాదు. గొర్రెలు తనవి కావు కాబట్టి తోడేలు రావడం చూసి గొర్రెల్ని వదిలిపెట్టి పారిపోతాడు. తోడేలు ఆ గొర్రెల్ని పట్టుకొని చెదరగొడుతుంది.
\v 13 జీతగాడు జీతం మాత్రమే కోరుకుంటాడు కాబట్టి గొర్రెల్ని పట్టించుకోకుండా పారిపోతాడు.
\s5
\v 14 నేను గొర్రెలకు మంచి కాపరిని. నా గొర్రెలు నాకు తెలుసు. నా సొంత గొర్రెలకు నేను తెలుసు.
\v 15 నా తండ్రికి నేను తెలుసు. నాకు నా తండ్రి తెలుసు. నా గొర్రెల కోసం నా ప్రాణం పెడతాను.
\v 16 ఈ శాలకు చెందని ఇతర గొర్రెలు నాకు ఉన్నాయి. వాటిని కూడా నేను తీసుకురావాలి. అవి నా స్వరం వింటాయి. అప్పుడు ఉండేది ఒక్క మంద, ఒక్క కాపరి.
\s5
\v 17 నా ప్రాణం మళ్ళీ పొందడానికి దానిని పెడుతున్నాను. అందుకే నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు.
\v 18 నా ప్రాణాన్ని నానుంచి ఎవ్వరూ తీసివేయలేరు. దానిని పెట్టడానికి, తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. ఈ ఆజ్ఞ నా తండ్రి నుంచి నేను పొందాను."
\s5
\p
\v 19 ఈ మాటలవల్ల యూదులలో మళ్ళీ విభేదాలు వచ్చాయి.
\v 20 వాళ్ళలో చాలా మంది, "ఇతనికి దయ్యం పట్టింది. ఇతను పిచ్చివాడు. ఇతని మాటలు మీరు ఎందుకు వింటున్నారు?" అన్నారు.
\v 21 ఇంకొంతమంది, "ఇవి దయ్యం పట్టినవాడి మాటలు కాదు. దయ్యం గుడ్డివారి కళ్ళు తెరవగలదా?" అన్నారు.
\s యేసు తన దైవత్వాన్ని రూఢి పరచడం (యోహాను 14:9; 20: 28, 29)
\s5
\p
\v 22 ఆ తరువాత యెరూషలేములో ప్రతిష్ట పండగ వచ్చింది.
\v 23 అది చలికాలం. అప్పుడు యేసు దేవాలయ ప్రాంగణంలో ఉన్న సొలొమోను మంటపంలో నడుస్తూ ఉండగా
\v 24 యూదులు ఆయన చుట్టూ చేరి ఆయనతో. "ఎంతకాలం మమ్మల్ని ఇలా సందేహంలో ఉంచుతావు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టంగా చెప్పు" అన్నారు.
\s5
\v 25 అందుకు యేసు వాళ్ళతో ఇలా అన్నాడు, "నేను మీకు చెప్పాను గాని మీరు నమ్మడం లేదు. నా తండ్రి పేరట నేను చేస్తున్న క్రియలు నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి.
\v 26 అయినా, మీరు నా గొర్రెలు కానందువల్ల మీరు నమ్మడం లేదు.
\s5
\v 27 నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నాకు తెలుసు, అవి నా వెంట వస్తాయి
\v 28 నేను వాటికి శాశ్వత జీవం ఇస్తాను కాబట్టి అవి ఎప్పటికీ నశించిపోవు. వాటిని నా చేతిలోనుంచి ఎవ్వరూ ఎత్తుకుపోరు.
\s5
\v 29 వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికన్నా గొప్పవాడు కాబట్టి నా తండ్రి చేతిలోనుంచి ఎవ్వరూ వాటిని ఎత్తుకుపోలేరు.
\v 30 నేను, నా తండ్రి, ఒకటే!"
\p
\v 31 అప్పుడు యూదులు ఆయన్ని కొట్టడానికి రాళ్ళు పట్టుకొన్నారు.
\s5
\v 32 యేసు వాళ్ళతో, "తండ్రి నుంచి వచ్చిన ఎన్నో మంచి పనులు మీకు చూపించాను. వాటిలో ఏ మంచి పనినిబట్టి నన్ను రాళ్ళతో కొట్టాలని అనుకుంటున్నారు?" అన్నాడు.
\v 33 అందుకు యూదులు, "నువ్వు మనిషివై ఉండి నిన్ను నీవు దేవుడుగా చేసుకుంటున్నావు. దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొడుతున్నాం. మంచి పనులు చేసినందుకు కాదు" అని ఆయనతో అన్నారు.
\s5
\v 34 యేసు వాళ్లకు జవాబిస్తూ ఇలా అన్నాడు, "'మీరు దేవుళ్ళని నేనన్నాను' అని మీ ధర్మశాస్త్రంలో రాసి లేదా?
\v 35 లేఖనం వ్యర్ధంగా ఉండదు. దేవుని వాక్కు ఎవరికి వచ్చిందో, వాళ్ళని ఆయన దేవుళ్ళని పిలిస్తే,
\v 36 తండ్రి పవిత్రంగా యీ లోకంలోకి పంపినవాడు 'నేను దేవుని కుమారుణ్ణి' అని అంటే 'నువ్వు దేవదూషణ చేస్తున్నావు' అని మీరు అంటారా?
\s5
\v 37 నేను నా తండ్రి పనులు చెయ్యకపోతే నన్ను నమ్మకండి,
\v 38 అయితే, నేను నా తండ్రి పనులు చేస్తూ ఉంటే, మీరు నన్ను నమ్మకపోయినా, తండ్రి నాలోను నేను తండ్రిలోను ఉన్నామని మీరు తెలిసికొని అర్ధంచేసుకునేందుకు ఆ పనులను నమ్మండి."
\v 39 వాళ్ళు మళ్ళీ ఆయన్ని పట్టుకోవాలనుకున్నారు గాని ఆయన వాళ్ళ చేతిలోనుండి తప్పించుకున్నాడు.
\s5
\p
\v 40 యేసు మళ్ళీ యోర్దాను నది అవతలికి వెళ్ళి అక్కడే ఉన్నాడు. యోహాను మొదట బాప్తీసం ఇస్తూ ఉన్న స్థలం ఇదే.
\v 41 చాలా మంది ఆయన దగ్గరకు వచ్చారు. వారు, "యోహాను ఏ సూచక క్రియలను చేయలేదు గాని ఈయన గురించి యోహాను చెప్పిన సంగతులన్నీ నిజమే" అన్నారు.
\v 42 అక్కడ చాలా మంది యేసుని నమ్మారు.
\s5
\c 11
\s లాజరు చనిపోయి బ్రతకడం
\p
\v 1 బేతనియ గ్రామానికి చెందిన లాజరుకు జబ్బు చేసింది. మరియ, ఆమె సోదరి మార్త, ఆ గ్రామానికి చెందిన వాళ్ళే.
\v 2 ప్రభువు పాదాలకు అత్తరు పూసి తన తల వెంట్రుకలతో తుడిచిన మరియ సోదరుడు లాజరు జబ్బుగా ఉన్నాడు.
\s5
\v 3 "ప్రభువా, నువ్వు ప్రేమించే వాడికి జబ్బు చేసింది" అని అక్క చెల్లెళ్ళు యేసుకు కబురు పంపించారు.
\v 4 యేసు అది విని, "ఈ జబ్బు చావు కోసం రాలేదు. దీని ద్వారా దేవుని కుమారునికి మహిమ కలిగేలా దేవుని మహిమ కోసమే వచ్చింది" అన్నాడు.
\s5
\v 5 మార్త, ఆమె సోదరి, లాజరులను యేసు ప్రేమించాడు.
\v 6 లాజరు జబ్బు పడ్డాడని యేసు విన్నప్పుడు, ఆయన ఉన్న స్థలంలోనే ఇంకొక రెండు రోజులు ఉండిపోయాడు.
\v 7 దాని తరువాత ఆయన తన శిష్యులతో, "మనం మళ్ళీ యూదయకు వెళ్దాం పదండి" అన్నాడు.
\s5
\v 8 ఆయన శిష్యులు ఆయనతో, "రబ్బీ, ఇంతకు ముందే యూదులు నిన్ను రాళ్ళతో కొట్టే ప్రయత్నం చేశారు కదా, అక్కడికి మళ్ళీ వెళ్తావా?" అని అన్నారు.
\v 9 అందుకు యేసు జవాబిస్తూ, "పగలు పన్నెండు గంటల వెలుగు ఉండదా? ఒకడు పగటి వేళ నడిస్తే తడబడడు. ఎందుకంటే అతను వెలుగులో అన్నీ చూస్తాడు.
\s5
\v 10 అయితే ఒకడు రాత్రివేళ నడిస్తే అతనిలో వెలుగు లేదు కాబట్టి తడబడతాడు" అని చెప్పాడు.
\v 11 యేసు ఈ సంగతులు చెప్పిన తరువాత వారితో ఇలా అన్నాడు, "మన స్నేహితుడు లాజరు నిద్రపోయాడు. అతన్ని నిద్ర లేపడానికి వెళ్తున్నాను."
\s5
\v 12 అందుకు శిష్యులు ఆయనతో, "ప్రభువా, అతను నిద్రపోతూ ఉంటే బాగుపడతాడు" అన్నారు.
\v 13 యేసు అతని చావు గురించి మాట్లాడాడు గాని వాళ్ళు నిద్రలో విశ్రాంతి తీసుకోవడం గురించి మాట్లాడుతున్నాడు అని అనుకున్నారు.
\v 14 అప్పుడు యేసు వాళ్ళతో స్పష్టంగా "లాజరు చనిపోయాడు,
\s5
\v 15 నేను అక్కడ లేకపోవడాన్ని బట్టి సంతోషిస్తున్నాను. ఇది మీ కోసమే. మీకు నమ్మకం కలగడానికే. అతని దగ్గరకి వెళ్దాం పదండి" అన్నాడు.
\v 16 దిదుమ అనే మరొక పేరు ఉన్న తోమా, "యేసుతో చనిపోవడానికి మనం కూడా వెళ్దాం పదండి" అని తన తోటి శిష్యులతో అన్నాడు.
\s5
\p
\v 17 యేసు అక్కడికి చేరుకుని, అప్పటికే నాలుగు రోజులుగా లాజరు సమాధిలో ఉన్నాడని తెలుసుకొన్నాడు.
\v 18 బేతనియ యెరూషలేముకు దగ్గరే. సుమారు మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది.
\v 19 చాలామంది యూదులు మార్త మరియలను వాళ్ళ సోదరుని విషయం ఓదార్చడానికి వచ్చి, అక్కడ ఉన్నారు.
\v 20 అప్పుడు మార్త, యేసు వస్తున్నాడని విని ఆయన్ని ఎదుర్కోడానికి వెళ్ళింది గాని మరియ ఇంట్లోనే ఉండిపోయింది.
\s5
\v 21 అప్పుడు మార్త యేసుతో, "ప్రభువా, నువ్వు ఇక్కడ ఉండి ఉంటే, నా సోదరుడు చనిపోయేవాడు కాదు,
\v 22 ఇప్పుడైనా నువ్వు దేవుణ్ణి ఏమడిగినా దేవుడు నీకు ఇస్తాడని నాకు తెలుసు" అంది.
\v 23 యేసు ఆమెతో, "నీ సోదరుడు మళ్ళీ బతికి లేస్తాడు" అన్నాడు.
\s5
\v 24 మార్త ఆయనతో, "చివరి రోజున పునరుత్థానంలో బ్రతికి లేస్తాడని నాకు తెలుసు" అంది.
\v 25 అందుకు యేసు, "పునరుత్థానం, జీవం నేనే. నన్ను నమ్మినవాడు చనిపోయినా మళ్ళీ బతుకుతాడు,
\v 26 బతికి ఉండి నన్ను నమ్మినవాళ్ళు ఎప్పుడూ చనిపోరు. ఇది నువ్వు నమ్ముతున్నావా?" అన్నాడు.
\s5
\v 27 ఆమె, "అవును ప్రభువా, నువ్వు లోకానికి రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువి అని నమ్ముతున్నాను" అని ఆయనతో చెప్పింది.
\v 28 ఈ మాట చెప్పిన తరువాత, వెళ్లి ఎవరికీ తెలియకుండా తన సోదరి మరియను పిలిచి, "బోధకుడు ఇక్కడ ఉన్నాడు, నిన్ను పిలుస్తున్నాడు" అంది.
\v 29 మరియ ఇది విన్నప్పుడు, త్వరగా లేచి యేసు దగ్గరకు వెళ్ళింది.
\s5
\p
\v 30 యేసు ఇంకా గ్రామంలోకి రాలేదు. మార్తని కలుసుకున్న చోటే ఉన్నాడు.
\v 31 మరియతో ఇంట్లో ఉండి ఆమెను ఓదారుస్తున్న యూదులు, ఆమె త్వరగా లేచి బయటకు వెళ్ళడం చూసి, ఆమె వెంట వెళ్లారు. ఆమె ఏడవడానికి సమాధి దగ్గరకు వెళ్తూ ఉందని వాళ్ళు అనుకున్నారు.
\v 32 అప్పుడు మరియ యేసు ఉన్న చోటికి వచ్చి, ఆయన్ని చూసి, ఆయన కాళ్ళమీద పడి, "ప్రభువా, నువ్వు ఇక్కడ ఉండి ఉంటే, నా సోదరుడు చనిపోయేవాడు కాదు" అంది.
\s5
\v 33 ఆమె ఏడవడం, ఆమెతో వచ్చిన యూదులు కూడా ఏడవడం యేసు చూసినప్పుడు, ఆయన కలవరంతో ఆత్మలో మూలుగుతూ, "అతణ్ణి ఎక్కడ పెట్టారు?" అన్నాడు.
\v 34 వాళ్ళు, "ప్రభువా, వచ్చి చూడు" అన్నారు.
\v 35 యేసు ఏడ్చాడు.
\s5
\v 36 అప్పుడు యూదులు, "ఆయన లాజరుని ఎంతగా ప్రేమించాడో చూడండి" అని చెప్పుకున్నారు.
\v 37 వారిలో కొంతమంది, "గుడ్డివాని కళ్ళు తెరిచాడు కదా, ఇతను చనిపోకుండా చెయ్యలేడా?" అన్నారు.
\s లాజరు సమాధి దగ్గర యేసు
\s5
\p
\v 38 యేసు తనలో తాను మూలుగుతూ ఆ సమాధి గుహ దగ్గరకు వెళ్ళాడు.
\v 39 యేసు, "రాయి తీసి వెయ్యండి" అన్నాడు. చనిపోయిన లాజరు సోదరి మార్త యేసుతో, "ప్రభువా, ఇప్పటికి నాలుగు రోజులయ్యింది. శరీరం కుళ్ళిపోతూ ఉంటుంది" అంది.
\v 40 యేసు ఆమెతో, "నువ్వు నమ్మితే, దేవుని మహిమను చూస్తావని నేను నీతో చెప్పలేదా?" అన్నాడు.
\s5
\v 41 కాబట్టి వాళ్ళు ఆ రాయి తీసి వేశారు. యేసు పైకి చూస్తూ, "తండ్రీ, నా ప్రార్థన విన్నందుకు నీకు కృతజ్ఞతలు.
\v 42 నువ్వు నా ప్రార్థన ఎప్పుడూ వింటావని నాకు తెలుసు. కాని, నా చుట్టూ నిలుచుని ఉన్న ఈ ప్రజలు నువ్వు నన్ను పంపించావని నమ్మాలని ఈ మాట పలికాను" అన్నాడు.
\s5
\v 43 ఆయన ఈ మాట చెప్పిన తరువాత పెద్ద స్వరంతో కేక వేసి, "లాజరూ, బయటికి రా!" అన్నాడు.
\v 44 చనిపోయినవాడు కాళ్లు చేతులు సమాధి బట్టలతో చుట్టి ఉండగా బయటికి వచ్చాడు. అతని ముఖానికి ఒక బట్ట చుట్టి ఉంది. అప్పుడు యేసు వాళ్ళతో, "అతని కట్లు విప్పి, అతణ్ణి వెళ్ళనివ్వండి" అన్నాడు.
\s బేతని మరియ స్నేహితులు యేసుపై విశ్వాసముంచడం (లూకా 10: 38- 42; యోహాను 12: 1- 7)
\s5
\p
\v 45 అప్పుడు మరియ దగ్గరకు వచ్చిన యూదుల్లో చాలామంది యేసు చేసింది చూసి ఆయన్ని నమ్మారు, కాని
\v 46 వాళ్ళల్లో కొంతమంది వెళ్లి యేసు చేసిన పనులు పరిసయ్యులకు చెప్పారు.
\s 47 యేసును సంహరించాలని పరిసయ్యుల కుట్ర
\s5
\p
\v 47 అప్పుడు ప్రధాన యాజకులు, పరిసయ్యులు, మహా సభను సమావేశపరచి, "మనం ఏం చేద్దాం? ఈ మనిషి అనేక సూచక క్రియలు చేస్తున్నాడే,
\v 48 మనం ఇతన్ని ఇలాగే వదిలేస్తే, అందరూ ఇతన్నే నమ్ముతారు. రోమీయులు వచ్చి మన భూమినీ, మన రాజ్యాన్నీ, రెంటినీ తీసుకు పోతారు" అన్నారు.
\s5
\v 49 అయితే, వాళ్ళలో ఒకడు, ఆ సంవత్సరం ప్రధాన యాజకుడిగా ఉన్న కయప వాళ్ళతో, "మీకేమీ తెలియదు.
\v 50 మన జాతి అంతా నాశనం కాకుండా ఉండాలంటే ఒక్క మనిషి ప్రజలందరి కోసం చనిపోవడం మీకు లాభం అన్నది మీరు అర్థం చేసుకోవడం లేదు" అన్నాడు.
\s5
\v 51 అతడు తనంతట తానే ఈ విధంగా చెప్పలేదు. గాని ఆ సంవత్సరం ప్రధాన యాజకుడిగా ఉన్నాడు కాబట్టి, జాతి అంతటి కోసం యేసు చనిపోవాలని అతను ప్రవచించాడు.
\v 52 ఆ జాతి కోసం మాత్రమే కాకుండా, వివిధ ప్రాంతాల్లోకి చెదిరిపోయిన దేవుని పిల్లల్ని ఒకటిగా సమకూర్చేలా యేసు చనిపోవాలని ప్రవచించాడు.
\v 53 కాబట్టి, ఆ రోజు నుండి యేసును ఎలా చంపాలా అని వాళ్ళు ఆలోచన చేస్తూ వచ్చారు.
\s5
\p
\v 54 అందుచేత యేసు అప్పటినుంచి యూదులలో బహిరంగంగా తిరగకుండా, అక్కడనుంచి వెళ్ళి ఎడారి ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఎఫ్రాయిము అనే గ్రామంలో తన శిష్యులతో కలిసి ఉన్నాడు.
\v 55 యూదుల పస్కాపండగ దగ్గర పడింది. చాలా మంది ప్రజలు తమను తాము శుద్ధి చేసుకోడానికి పండగకు ముందే గ్రామాలనుంచి యెరూషలేముకు వచ్చారు.
\s5
\v 56 వాళ్ళు యేసు కోసం చూస్తున్నారు. దేవాలయంలో నిలబడి, ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటున్నారు, "మీరేమంటారు? ఆయన పండగకు రాడా?"
\v 57 యేసు ఎక్కడ ఉన్నది ఎవరికైనా తెలిస్తే, తాము ఆయన్ని పట్టుకోవడం కోసం, వాళ్లకు తెలియచేయాలని ప్రధాన యాజకులు, పరిసయ్యులు, ఒక ఆజ్ఞ జారీ చేశారు.
\s5
\c 12
\s బేతనిలో రాత్రి భోజనం (మత్తయి 26: 6- 13; మార్కు 14: 3- 9; లూకా 7: 37- 38)
\p
\v 1 పస్కాకు ఆరు రోజుల ముందు యేసు బేతనియ వచ్చాడు. మరణించిన లాజరును యేసు మళ్ళీ బతికించిన గ్రామం ఇదే.
\v 2 అక్కడ ఆయన కోసం భోజనం ఏర్పాటు చేశారు. మార్త వడ్డిస్తూ ఉంది. యేసుతో భోజనం బల్ల దగ్గర కూర్చున్నవారిలో లాజరు కూడా ఒకడు.
\v 3 అప్పుడు మరియ, అర కిలో బరువు ఉన్న స్వచ్చమైన జటామాంసి చెట్లనుంచి తీసిన అత్యంత ఖరీదైన అత్తరును యేసు పాదాల మీద పోసి అభిషేకించి, ఆయన పాదాలు తన తలవెంట్రుకలతో తుడిచింది. ఇల్లంతా ఆ అత్తరు సువాసనతో నిండిపోయింది.
\s5
\v 4 ఆయన్ని అప్పగించ బోతున్నవాడూ, ఆయన శిష్యుల్లో ఒకడు అయిన ఇస్కరియోతు యూదా,
\v 5 "ఈ అత్తరు మూడువందల దేనారాలకు అమ్మి పేదలకు ఇవ్వచ్చు గదా?" అన్నాడు.
\v 6 అతనికి పేదవాళ్ళ పట్ల శ్రద్ధ ఉండి ఇలా అనలేదు గాని, అతడొక దొంగ. అతని ఆధీనంలో ఉన్న డబ్బు సంచిలో నుండి కొంత సొమ్ము తన సొంతానికి తీసుకుంటూ ఉండేవాడు.
\s5
\v 7 యేసు, "ఈమెను చెయ్యనివ్వండి, నా సమాధి రోజు కోసం ఈమె దీనిని సిద్ధపరచింది.
\v 8 పేదవాళ్ళు ఎప్పుడూ మీతో ఉంటారు, కాని నేను ఎప్పుడూ మీతో ఉండను కదా" అన్నాడు.
\s5
\p
\v 9 అప్పుడు పెద్ద యూదుల సమూహం యేసు అక్కడ ఉన్నాడని తెలిసికొని, యేసు కోసమే కాక, యేసు చావు నుంచి తిరిగి లేపిన లాజరును కూడా చూడాలని అక్కడికి వచ్చారు.
\v 10 లాజరును బట్టి చాలా మంది యూదులు వెళ్ళిపోయి యేసు మీద నమ్మకం ఉంచారు.
\v 11 కాబట్టి ప్రధాన యాజకులు లాజరును కూడా చంపాలని అనుకున్నారు.
\s జయ ప్రవేశం (మత్తయి 21: 4- 9; మార్కు 11: 7- 10; లూకా 19: 35- 38)
\s5
\p
\v 12 ఆ తరువాతి రోజున పండగకి వచ్చిన గొప్ప జనసమూహం అక్కడ పోగయ్యింది. యేసు యెరూషలేముకు వస్తున్నాడని విన్నప్పుడు,
\v 13 వారంతా ఖర్జూరపు మట్టలు తీసికొని ఆయనకు ఎదురుగా వెళ్లి, "హోసన్నా! ప్రభువు పేరిట వస్తున్న ఇశ్రాయేలు రాజుకు స్తుతి కలుగుతుంది గాక!" అని కేకలు వేశారు.
\s5
\v 14 "సీయోను కుమారీ, భయపడకు! నీ రాజు గాడిదపిల్ల మీద కూర్చుని వస్తున్నాడు"
\v 15 అని రాసి ఉన్న విధంగా యేసు చిన్న గాడిదను చూసి దాని మీద కూర్చున్నాడు.
\s5
\v 16 ఆయన శిష్యులు ఈ సంగతులు మొదట్లో గ్రహించలేదు గాని యేసు మహిమ పొందిన తరువాత, ఈ సంగతులు ఆయన గురించి రాసినవనీ, వాళ్ళు ఆయనకు ఈ విధంగా చేశారనీ గుర్తు చేసుకున్నారు.
\s5
\p
\v 17 ఆయన లాజరును సమాధిలోనుంచి పిలిచి, చావు నుండి తిరిగి బతికించినప్పుడు యేసుతో ఉన్న ప్రజలు ఆయన గురించి ఇతరులకు సాక్ష్యం ఇచ్చారు.
\v 18 ఆయన ఈ సూచక క్రియ చేశాడని విన్న కారణంగా జన సమూహం ఆయన్ని కలుసుకోడానికి వెళ్ళారు.
\v 19 దీనిగురించి పరిసయ్యులు "చూడండి, మనం ఏమీ చెయ్యలేం. ఈ లోకం ఆయన వెంట వెళ్ళిపోయింది." అని తమలో తాము చెప్పుకున్నారు.
\s యేసును చూడగోరిన గ్రీకులు
\s5
\p
\v 20 ఆ పండగలో ఆరాధించడానికి వచ్చినవారిలో కొంతమంది గ్రీకులు ఉన్నారు.
\v 21 వాళ్ళు, గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు దగ్గరకు వచ్చి, "అయ్యా, మాకు యేసును చూడాలని ఉంది" అన్నారు.
\v 22 ఫిలిప్పు వెళ్లి అంద్రెయతో చెప్పాడు. అంద్రెయ ఫిలిప్పుతో కలిసి వెళ్లి యేసుతో చెప్పారు.
\s యేసు జవాబు
\s5
\p
\v 23 యేసు వాళ్లకు జవాబిస్తూ, "మనుష్య కుమారుడు మహిమ పొందే గడియ వచ్చింది.
\v 24 మీతో ఖచ్చితంగా చెబుతున్నాను, గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే, అది ఒకటిగానే ఉండిపోతుంది. అది చస్తే అధికంగా ఫలం ఇస్తుంది.
\s5
\v 25 తన ప్రాణాన్ని ప్రేమించుకునే వాడు దాన్ని పోగొట్టుకుంటాడు, కాని, ఈ లోకంలో తన ప్రాణాన్ని ద్వేషించేవాడు శాశ్వత జీవం కోసం దాన్ని భద్రం చేసుకుంటాడు.
\v 26 నాకు సేవ చేసేవాడు నా వెంట రావాలి. అప్పుడు నేను ఎక్కడ ఉన్నానో, నా సేవకుడూ అక్కడ ఉంటాడు. నాకు సేవ చేసేవాణ్ణి తండ్రి ఘనపరుస్తాడు.
\s5
\v 27 ఇప్పుడు నా ప్రాణం ఆందోళన చెందుతూ ఉంది. నేనేం చెప్పను? 'తండ్రీ! ఈ గడియ నుంచి నన్ను తప్పించు' అని చెప్పనా? కాని, దీనికోసమే నేను ఈ గడియకు చేరుకున్నాను.
\v 28 తండ్రీ, నీ పేరుకు మహిమ కలిగించుకో." అప్పుడు ఆకాశంలో నుంచి ఒక స్వరం వచ్చి ఇలా అంది, "నేను దానికి మహిమ కలిగించాను. మళ్ళీ మహిమ కలిగిస్తాను."
\v 29 అప్పుడు, అక్కడ నిలుచుని విన్న జనసమూహం, "ఉరిమింది" అన్నారు. మిగతా వాళ్ళు, "ఒక దేవదూత ఆయనతో మాట్లాడాడు" అన్నారు.
\s5
\p
\v 30 అందుకు యేసు జవాబిస్తూ ఇలా అన్నాడు, "ఈ స్వరం నా కోసం కాదు. మీ కోసమే వచ్చింది.
\v 31 ఇప్పుడు ఈ లోకానికి తీర్పు సమయం. ఇది ఈ లోకపాలకుణ్ణి తరిమివేసే సమయం.
\s5
\v 32 నన్ను భూమిమీద నుంచి పైకి ఎత్తినప్పుడు, ప్రజలందరిని నా దగ్గరకు ఆకర్షించుకుంటాను."
\v 33 ఆయన ఎలాంటి మరణం పొందుతాడో, దానికి సూచనగా ఆయన ఈ మాట చెప్పాడు.
\s5
\v 34 ఆ జనసమూహం ఆయనతో, "క్రీస్తు ఎల్లకాలం ఉంటాడని ధర్మశాస్త్రంలో ఉందని విన్నాం. 'మనుషకుమారుణ్ణి పైకెత్తడం జరగాలి' అని నువ్వెలా చెబుతావు? ఈ మనుషకుమారుడు ఎవరు?" అన్నారు.
\v 35 అప్పుడు యేసు వాళ్ళతో, "వెలుగు మీ మధ్య ఉండేది ఇంకా కొంత కాలం మాత్రమే. చీకటి మిమ్మల్ని కమ్ముకోక ముందే, ఇంకా వెలుగు ఉండగానే, నడవండి. చీకట్లో నడిచేవానికి, తాను ఎక్కడికి వెళ్తున్నాడో అతనికే తెలియదు.
\v 36 మీకు వెలుగుండగానే, ఆ వెలుగులో నమ్మకముంచి వెలుగు సంబంధులు కండి" అన్నాడు. యేసు ఈ సంగతులు చెప్పి, అక్కడ నుంచి వెళ్లి వాళ్ళకు కనబడకుండా రహస్యంగా ఉన్నాడు.
\s5
\p
\v 37 యేసు వాళ్ళ ముందు ఎన్నో సూచక క్రియలు చేసినా, వాళ్ళు ఆయన్ని నమ్మలేదు.
\q1
\v 38 ప్రభూ, మా సమాచారం ఎవరు నమ్మారు? ప్రభువు హస్తం ఎవరికి వెల్లడయ్యింది?"
\p అని ప్రవక్త యెషయా చెప్పిన మాట నెరవేరేలా ఇది జరిగింది.
\s5
\v 39 ఈ కారణంగా వాళ్ళు నమ్మలేకపోయారు, ఎందుకంటే యెషయా మళ్ళీ ఇలా అన్నాడు,
\q1
\v 40 "ఆయన వాళ్ళ కళ్ళకు గుడ్డితనం కలగచేశాడు. ఆయన వాళ్ళ హృదయాలను కఠినం చేశాడు.
\q1 అలా చెయ్యకపోతే వాళ్ళు తమ కళ్ళతో చూసి, హృదయాలతో గ్రహించి,
\q1 నా వైపు తిరిగేవాళ్ళు.
\q1 అప్పుడు నేను వాళ్ళని బాగు చేసేవాణ్ణి."
\s5
\p
\v 41 యెషయా యేసు మహిమను చూశాడు కాబట్టి ఆయన గురించి ఈ మాటలు చెప్పాడు.
\v 42 అయినా, పాలకవర్గం వారిలో కూడా చాలామంది యేసులో నమ్మకం ఉంచారు, కాని పరిసయ్యులు సునగోగులోనుంచి తమను వెలివేస్తారని భయపడి, ఆ విషయం ఒప్పుకోలేదు.
\v 43 వాళ్ళు దేవుని నుంచి వచ్చే మెప్పుకంటే, మనుషుల నుంచి వచ్చే మెప్పునే ఇష్టపడ్డారు.
\s5
\p
\v 44 అప్పుడు యేసు పెద్ద స్వరంతో, "నాలో నమ్మకం ఉంచినవాడు నాలో మాత్రమే కాక నన్ను పంపినవానిలో కూడా నమ్మకం ఉంచుతాడు.
\v 45 నన్ను చూసినవాడు నన్ను పంపినవాణ్ణి కూడా చూస్తున్నాడు.
\s5
\v 46 నాలో నమ్మకం ఉంచేవాడు చీకట్లో ఉండిపోకుండా ఉండాలని, ఈ లోకంలోకి నేను వెలుగుగా వచ్చాను.
\v 47 ఎవరైనా నా మాటలు విని, వాటిని పాటించకపోతే నేను అతనికి తీర్పు తీర్చను. ఎందుకంటే నేను ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చాను కాని, తీర్పు తీర్చడానికి కాదు.
\s5
\v 48 నన్ను తోసిపుచ్చి, నా మాటలు అంగీకరించని వానికి తీర్పు తీర్చేవాడు ఒకడున్నాడు. నేను పలికిన వాక్కే చివరి రోజున అతనికి తీర్పు తీరుస్తుంది.
\v 49 ఎందుకంటే, నా అంతట నేనే మాట్లాడడం లేదు. నేనేం చెప్పాలో, ఏం మాట్లాడాలో నన్ను పంపిన తండ్రి నాకు ఆదేశించాడు.
\v 50 ఆయన ఆదేశం శాశ్వత జీవం అని నాకు తెలుసు. అందుకే నేను ఏ మాట చెప్పినా తండ్రి నాతో చెప్పినట్టే వారితో చెబుతున్నాను" అన్నాడు.
\s5
\c 13
\s చివరి రాత్రి భోజనం (మత్తయి 26: 7-30; మార్కు 14: 17- 26; లూకా 22: 14- 29)
\p
\v 1 అది పస్కా పండగకు ముందు సమయం. తాను ఈ లోకం విడిచి తండ్రి దగ్గరకు వెళ్ళే సమయం వచ్చిందని యేసు గ్రహించాడు. ఈ లోకంలో ఉన్న తన సొంత వాళ్ళను ఆయన ప్రేమించాడు. చివరి వరకు వాళ్ళని ప్రేమించాడు.
\s యేసు తన శిష్యుల పాదాలు కడగడం
\p
\v 2 యేసును అప్పగించాలని సీమోను కొడుకు ఇస్కరియోతు యూదా హృదయంలో అప్పటికే సాతాను ఆ ఉద్దేశం పెట్టాడు.
\s5
\v 3 తండ్రి సమస్తం తన చేతుల్లో పెట్టాడనీ, తాను దేవుని దగ్గర నుంచి వచ్చాడనీ, తిరిగి దేవుని దగ్గరకే వెళ్తున్నాడనీ, యేసుకు తెలుసు.
\v 4 ఆయన భోజనం దగ్గర నుంచి లేచి, తన పైవస్త్రం పక్కన పెట్టి, తువాలు తీసికొని, దానిని నడుముకు చుట్టుకున్నాడు.
\v 5 అప్పుడు పళ్ళెంలో నీళ్ళు పోసి, శిష్యుల పాదాలు కడిగి, తన నడుముకు చుట్టుకున్న తువాలుతో తుడవడం ప్రారంభించాడు.
\s5
\p
\v 6 ఆయన సీమోను పేతురు దగ్గరకు వచ్చాడు. అప్పుడు పేతురు ఆయనతో, "ప్రభువా, నువ్వు నా కాళ్ళు కడుగుతావా?" అన్నాడు.
\v 7 యేసు అతనికి జవాబిస్తూ, "నేను చేస్తున్నది ఇప్పుడు నీకు అర్ధం కాదు. కాని, నువ్వు తరువాత అర్ధం చేసుకుంటావు" అన్నాడు.
\v 8 పేతురు ఆయనతో, "నువ్వు నా పాదాలు ఎన్నడూ కడగకూడదు" అన్నాడు. యేసు అతనికి జవాబిస్తూ, "నేను నిన్ను కడగకపోతే, నాతో నీకు సంబంధం ఉండదు" అన్నాడు.
\v 9 సీమోను పేతురు ఆయనతో, "ప్రభువా, నా కాళ్ళు మాత్రమే కాదు. నా చేతులు, నా తల కూడా కడుగు" అన్నాడు.
\s5
\v 10 యేసు అతనితో, "స్నానం చేసినవాడు తన పాదాలు తప్ప ఇంకేమీ కడుక్కోవలసిన అవసరం లేదు. అతను పూర్తిగా శుద్ధుడే. మీరూ శుద్ధులే గాని, మీలో అందరూ శుద్ధులు కాదు" అన్నాడు.
\v 11 ఎందుకంటే, తనకు ద్రోహం చేసేది ఎవరో ఆయనకు తెలుసు. అందుకే ఆయన, "మీలో అందరూ శుద్ధులు కాదు" అన్నాడు.
\s5
\v 12 యేసు వాళ్ళ కాళ్ళు కడిగి, ఆయన వస్త్రాలు తీసుకుని, యథాప్రకారం కూర్చుని, వాళ్ళతో, "నేను మీ కోసం ఏం చేశానో మీకు తెలుసా?
\v 13 మీరు నన్ను 'బోధకుడు, 'ప్రభువు' అని సరిగానే పిలుస్తున్నారు.
\v 14 బోధకుడు, ప్రభువు అయిన నేను మీ కాళ్ళు కడిగితే, మీరు కూడా ఒకరి కాళ్ళు ఒకరు కడగాలి.
\v 15 నేను మీకోసం చేసినట్టే మీరు కూడా చెయ్యడానికి మీకు ఒక ఆదర్శం చూపించాను.
\s5
\p
\v 16 నేను మీకు ఖచ్చితంగా చెబుతున్నాను, దాసుడు తన యజమానికన్నా గొప్పవాడు కాదు. వెళ్ళినవాడు వానిని పంపినవానికన్నా గొప్పవాడు కాదు.
\v 17 ఈ సంగతులు మీకు తెలుసు కాబట్టి, వీటి ప్రకారం చేస్తే మీరు ధన్యులు.
\v 18 మీ అందరి గురించి నేను మాట్లాడడం లేదు. నేను ఎంపిక చేసిన వాళ్ళు నాకు తెలుసు. అయితే, లేఖనం సంపూర్ణం అయ్యేలా ఇది చెబుతున్నాను, 'నా రొట్టె తినేవాడు నాకు వ్యతిరేకంగా తన మడం ఎత్తాడు.'
\s5
\v 19 అది జరగక ముందే, ఇప్పుడు దీనిని మీతో చెబుతున్నాను. ఎందుకంటే అది జరిగినప్పుడు, నేను 'ఉన్నవాడను' అని మీరు నమ్మాలని నా ఉద్దేశం.
\v 20 నేను మీతో ఖచ్చితంగా చెబుతున్నాను. నన్ను స్వీకరించినవాడు నేను ఎవరిని పంపినా స్వీకరిస్తాడు. నన్ను స్వీకరించినవాడు నన్ను పంపినవాణ్ణీ స్వీకరిస్తాడు.
\s యేసు తనను శత్రువులకు పట్టిస్తారని ముందుగా చెప్పడం (మత్తయి 26: 20-25; మార్కు 14: 17- 21; లూకా 22: 21, 22)
\s5
\p
\v 21 యేసు ఈ మాటలు చెప్పిన తరువాత ఆత్మలో కలవరం చెంది, "మీలో ఒకడు నాకు ద్రోహం చేస్తాడని మీతో ఖచ్చితంగా చెబుతున్నాను" అన్నాడు.
\v 22 ఆయన ఎవరి గురించి ఇలా చెబుతున్నాడో తెలియక శిష్యులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.
\s5
\v 23 భోజనం బల్ల దగ్గర, ఆయన శిష్యులలో ఒకడైన యేసు ప్రేమించిన శిష్యుడు, యేసు రొమ్మున ఆనుకొని ఉన్నాడు.
\v 24 ఎవరి గురించి యేసు అలా అన్నాడో తమకు చెప్పమని సీమోను పేతురు ఆ శిష్యునికి సైగ చేశాడు.
\v 25 ఆ శిష్యుడు యేసు రొమ్మున ఆనుకొని ఆయనతో, "ప్రభువా, ఆ వ్యక్తి ఎవరు?" అని అడిగాడు.
\s5
\v 26 అప్పుడు యేసు జవాబిస్తూ, "ఈ రొట్టె ముక్క ఎవరికి ముంచి ఇస్తానో, అతడే" అన్నాడు. తరువాత ఆయన రొట్టె ముంచి ఇస్కరియోతు సీమోను కొడుకు యూదాకు ఇచ్చాడు.
\v 27 అతడు ఆ ముక్క తీసుకోగానే, సాతాను అతనిలో ప్రవేశించాడు. అప్పుడు యేసు అతనితో , "నువ్వు చెయ్యబోయేది త్వరగా చెయ్యి" అన్నాడు.
\s5
\v 28 ఆయన అతనితో ఇలా ఎందుకు చెప్పాడో, బల్ల దగ్గర ఉన్నవాళ్ళకు తెలియలేదు.
\v 29 డబ్బు సంచి యూదా దగ్గర ఉంది కాబట్టి యేసు అతనితో, "పండగకు కావలసినవి కొను" అని గాని, పేదవాళ్ళకు ఇమ్మని గాని చెప్పాడని వాళ్ళల్లో కొంతమంది అనుకున్నారు.
\v 30 అది రాత్రి సమయం. అతను ఆ రొట్టె ముక్క తీసుకొని వెంటనే బయటకు వెళ్ళిపోయాడు.
\s5
\p
\v 31 యూదా వెళ్ళిపోయిన తరువాత, యేసు, "ఇప్పుడు మనుషకుమారుడు మహిమ పొందాడు. దేవుడు ఆయనలో మహిమ పొందుతున్నాడు" అన్నాడు.
\v 32 దేవుడు ఆయనకు ఆయనలోనే మహిమ కలిగిస్తాడు. ఆయనకు వెంటనే మహిమ కలిగిస్తాడు.
\v 33 పిల్లలూ, ఇంకా కొంత కాలం నేను మీతో ఉంటాను. మీరు నా కోసం వెదుకుతారు. కాని, నేను యూదులకు చెప్పినట్టు మీతో కూడా చెబుతున్నాను, 'నేను వెళ్ళే స్థలానికి మీరు రాలేరు.'
\s5
\v 34 మీరు ఒకరిని ఒకరు ప్రేమించాలన్న కొత్త ఆజ్ఞ మీకు ఇస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించాలి.
\v 35 మీరు ఒకనిపట్ల ఒకడు ప్రేమగలవారైతే, దాన్నిబట్టి మీరు నా శిష్యులు అని అందరూ తెలిసికొంటారు" అన్నాడు.
\s యేసును గురించి పేతురు చెప్పనున్న అబద్ధాన్ని గురించి యేసు ముందుగా చెప్పడం (మత్తయి 26: 33-35; మార్కు 14: 29-31; లూకా 22: 33,34)
\s5
\p
\v 36 సీమోను పేతురు ఆయనతో, "ప్రభువా, నువ్వెక్కడికి వెళ్తున్నావు?" అన్నాడు. యేసు జవాబిస్తూ, "నేను వెళ్ళే స్థలానికి నువ్వు నా వెంట రాలేవు, కాని నువ్వు తరువాత వస్తావు" అన్నాడు.
\v 37 అందుకు పేతురు, " ప్రభువా, నేను ఇప్పుడే నీ వెంట ఎందుకు రాలేను? నీకోసం నా ప్రాణం పెడతాను" అన్నాడు.
\v 38 యేసు జవాబిస్తూ, "నా కోసం నీ ప్రాణం పెడతావా? నేను నీతో ఖచ్చితంగా చెబుతున్నాను, నేనెవరో తెలియదని నువ్వు మూడు సార్లు చెప్పక ముందు కోడి కూయదు" అన్నాడు.
\s5
\c 14
\s పస్కా భోజనగదిలో మాటలు: తన వారికోసం వస్తానని యేసు అభయం (1 తెస్స 4: 14- 17)
\p
\v 1 "మీ హృదయం కలవరపడనీయ వద్దు. మీరు దేవుణ్ణి నమ్ముతున్నారు. నన్నూ నమ్మండి.
\v 2 నా తండ్రి లోగిలిలో ఎన్నో నివాస స్థలాలు ఉన్నాయి. అవి లేకపోతే మీతో చెప్పేవాణ్ణి. మీకు స్థలం సిద్ధం చెయ్యడానికి వెళ్తున్నాను.
\v 3 నేను వెళ్లి మీకు స్థలం సిద్ధం చేస్తే, నేను మళ్ళీ వచ్చి, నేను ఉండే స్థలంలో మీరు కూడా ఉండేలా, నా దగ్గరకు మిమ్మల్ని తీసుకొని వెళ్తాను.
\s5
\v 4 నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలుసు" అన్నాడు.
\v 5 తోమా యేసుతో, "ప్రభువా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదు. మాకు దారి ఎలా తెలుస్తుంది?" అన్నాడు.
\v 6 యేసు అతనితో, "నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని. నా ద్వారా తప్ప ఎవ్వరూ తండ్రి దగ్గరకు రారు.
\s యేసూ తండ్రీ ఒక్కటే
\p
\v 7 మీరు నన్ను తెలుసుకొని ఉంటే, నా తండ్రిని కూడా తెలుసుకొని ఉండేవాళ్ళే. ఇప్పటినుంచి మీకు ఆయన తెలుసు. ఆయన్ని మీరు చూశారు" అన్నాడు.
\s5
\v 8 ఫిలిప్పు యేసుతో, "ప్రభువా, తండ్రిని మాకు చూపించు. అది మాకు చాలు" అన్నాడు.
\v 9 యేసు అతనితో, ఫిలిప్పూ, ఇంత కాలం నేను మీతో ఉన్నానే, అయినా నేను నీకు తెలియదా? ఎవరైనా నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. 'తండ్రిని చూపించు' అని నువ్వు ఎలా అంటున్నావు?
\s5
\v 10 నేను తండ్రిలో, తండ్రి నాలో ఉన్నాం అని నువ్వు నమ్మడంలేదా? నేను మాట్లాడే మాటలు నా సొంత మాటలు కాదు. నాలో నివాసం ఉంటున్న తండ్రి తన పని చేస్తున్నాడు.
\v 11 తండ్రిలో నేను, నాలో తండ్రి, ఉన్నాం అని నమ్మండి. అదీ కాకపోతే, ఈ క్రియల గురించి అయినా నమ్మండి.
\s5
\v 12 నేను మీతో ఖచ్చితంగా చెబుతున్నాను, నా మీద, నేను చేసే క్రియల మీద, నమ్మకం ఉంచినవాడు, తాను కూడా ఈ క్రియలు చేస్తాడు. నేను నా తండ్రి దగ్గరకు వెళ్తున్నాను కాబట్టి, ఇంతకన్నా గొప్ప క్రియలు చేస్తాడు.
\s ప్రార్థన గురించిన కొత్త వాగ్దానం
\p
\v 13 తండ్రికి తన కుమారునిలో మహిమ కలగడం కోసం, మీరు నా పేరిట ఏం అడిగినా, అది నేను చేస్తాను.
\v 14 మీరు నా పేరిట ఏం అడిగినా, అది నేను చేస్తాను.
\s5
\v 15 మీరు నన్ను ప్రేమిస్తే, నా ఆజ్ఞలు పాటిస్తారు.
\s ఆత్మను గురించిన వాగ్దానం
\p
\v 16 నేను తండ్రిని అడుగుతాను. మీతో ఎల్లప్పుడూ ఉండేలా ఇంకొక ఆదరణకర్తను ఆయన మీకు ఇస్తాడు. ఆయన సత్యం అయిన ఆత్మ.
\v 17 లోకం ఆయన్ని చూడదు, తెలుసుకోదు కాబట్టి ఆయన్ని స్వీకరించదు. అయితే మీకు ఆయన తెలుసు. ఎందుకంటే ఆయన మీతో ఉంటాడు, ఆయన మీలో ఉంటాడు.
\s5
\v 18 నేను మిమ్మల్ని అనాధలుగా విడిచిపెట్టను. మీకోసం నేను మళ్ళీ వస్తాను. కొద్దికాలం తరువాత ఇంక ఈ లోకం నన్ను చూడదు.
\v 19 కాని, మీరు నన్ను చూస్తారు. నేను జీవిస్తున్నాను కాబట్టి మీరు కూడా జీవిస్తారు.
\v 20 నేను నా తండ్రిలో, మీరు నాలో, ఉన్నాం అని ఆ రోజు మీరు తెలుసుకొంటారు.
\s5
\v 21 నా ఆజ్ఞలను కలిగి, వాటిని పాటించేవాడే నన్ను ప్రేమించేవాడు. నన్ను ప్రేమించేవాణ్ణి నా తండ్రి ప్రేమిస్తాడు. నేను అతన్ని ప్రేమించి, నన్నుఅతనికి ప్రత్యక్ష్యం చేసుకుంటాను" అన్నాడు.
\v 22 యూదా (ఇస్కరియోతు కాదు) యేసుతో, "ప్రభువా, నీవు లోకానికి కాకుండా మాకు మాత్రమే నిన్ను నీవు ప్రత్యక్ష్యం చేసుకోడానికి కారణం ఏంటి?" అన్నాడు.
\s5
\v 23 యేసు జవాబిస్తూ, "ఎవడైనా నన్ను ప్రేమిస్తే వాడు నా మాట ప్రకారం చేస్తాడు. నా తండ్రి అతణ్ణి ప్రేమిస్తాడు. మేం అతని దగ్గరకు వచ్చి అతనితో సహనివాసం చేస్తాం,
\v 24 నన్ను ప్రేమించని వాడు నా మాట ప్రకారం చెయ్యడు. మీరు వినే ఈ మాట నాది కాదు, నన్ను పంపిన తండ్రిది.
\s5
\v 25 మీ మధ్య నేను బతికి ఉండగానే ఈ సంగతులు మీతో చెప్పాను.
\v 26 నా తండ్రి నా పేరిట పంపే ఆదరణ కర్త అయిన పవిత్రాత్మ మీకు అన్ని సంగతులు బోధించి, నేను మీతో చెప్పినవన్నీ మీకు గుర్తు చేస్తాడు.
\s శాంతి ప్రదాత యేసు
\p
\v 27 శాంతి మీకిచ్చి వెళ్తున్నాను. నా శాంతి మీకు ఇస్తున్నాను. లోకం ఇచ్చినట్టుగా కాదు. మీ హృదయం కలవరం చెందనివ్వకండి, భయపడకండి.
\s5
\v 28 'నేను వెళ్లిపోతున్నాను గాని మీ దగ్గరకు తిరిగి వస్తాను' అని నేను చెప్పడం మీరు విన్నారు. మీరు నన్ను ప్రేమిస్తే, మీరు సంతోషించేవాళ్ళే. ఎందుకంటే నేను నా తండ్రి దగ్గరకు వెళ్తున్నాను. నా తండ్రి నాకన్నా గొప్పవాడు.
\v 29 ఈ సంగతి జరగక ముందే నేను మీతో చెప్పాను. ఎందుకంటే, ఇది నిజంగా జరిగినప్పుడు మీరు నమ్మాలని నా ఉద్దేశం.
\v 30 ఇంతకన్నా ఎక్కువ మీతో మాట్లాడను. ఈ లోకాధికారి వస్తున్నాడు. అతనికి నా మీద అధికారం లేదు.
\v 31 నేను నా తండ్రిని ప్రేమిస్తున్నానని ఈ లోకానికి తెలిసేలా, నా తండ్రి నాకు ఆజ్ఞాపించింది ఉన్నది ఉన్నట్టు నేను చేస్తాను. లేవండి, ఇక్కడి నుంచి వెళ్దాం."
\s5
\c 15
\s తోటకు వెళ్ళే దారిలో చెప్పిన మాటలు; ద్రాక్ష చెట్టు, దాని తీగెలు
\p
\v 1 "నేను నిజమైన ద్రాక్ష తీగ. నా తండ్రి ద్రాక్ష రైతు.
\v 2 నాలో ఫలించని ప్రతి కొమ్మనూ ఆయన తీసేస్తాడు. పళ్ళు కాసే ప్రతి కొమ్మ ఇంకా ఎక్కువ పళ్ళు కాసేలా దానిని శుభ్రం చేస్తాడు.
\s5
\v 3 నేను మీతో చెప్పిన సందేశం కారణంగా మీరు ఇప్పటికే శుద్ధులు అయ్యారు.
\v 4 నాలో మీరు ఉండండి. మీలో నేను ఉంటాను. కొమ్మ ద్రాక్ష తీగలో ఉంటేనే తప్ప తనంతట తాను ఫలించలేదో, మీరు కూడా నాలో ఉంటేనే తప్ప ఫలించలేరు.
\s5
\v 5 ద్రాక్ష తీగ నేను, కొమ్మలు మీరు. నాలో ఎవరు ఉంటారో, నేను ఎవరిలో ఉంటానో, ఆ వ్యక్తి అధికంగా ఫలిస్తాడు. ఎందుకంటే, నా నుంచి వేరుగా ఉండి మీరు ఏమీ చెయ్యలేరు.
\v 6 ఎవరైనా నాలో ఉండకపోతే, అతడు తీసి పారేసిన కొమ్మలా ఎండిపోతారు. మనుషులు ఆ కొమ్మల్ని పోగుచేసి మంటలో వేసేస్తారు. అవి కాలిపోతాయి.
\v 7 మీరు నాలో, నా మాటలు మీలో ఉంటే, ఎలాంటి కోరికైనా అడగండి. అది మీకు జరుగుతుంది.
\s5
\v 8 మీరు అధికంగా ఫలించి, నా శిష్యులుగా ఉంటే, నా తండ్రికి మహిమ కలుగుతుంది.
\v 9 తండ్రి నన్ను ప్రేమించినట్టే నేను మిమ్మల్ని ప్రేమించాను. నా ప్రేమలో నిలకడగా ఉండండి.
\s5
\v 10 నేను నా తండ్రి ఆజ్ఞలు పాటించి ఆయన ప్రేమలో నిలకడగా ఉన్నట్టే, మీరు కూడా నా ఆజ్ఞలు పాటిస్తే నా ప్రేమలో నిలకడగా ఉంటారు.
\v 11 మీలో నా ఆనందం ఉండాలని, మీ ఆనందం సంపూర్తి అవ్వాలని, ఈ సంగతులు మీతో మాట్లాడాను.
\s5
\v 12 నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించాలి. ఇది నా ఆజ్ఞ.
\v 13 స్నేహితుల కోసం తన ప్రాణం పెట్టిన వాడి ప్రేమకన్నా గొప్ప ప్రేమ లేదు.
\s5
\v 14 నేను మీకు ఆజ్ఞాపించినట్టు చేస్తే, మీరు నాకు స్నేహితులు.
\s నూతన సాన్నిహిత్యం
\p
\v 15 ఇక మిమ్మల్ని దాసులు అని నేను పిలవను. ఎందుకంటే దాసునికి యజమానుడు చేసేది తెలియదు. నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తున్నాను. ఎందుకంటే, నా తండ్రి నుంచి నేను విన్నవి అన్నీ మీకు తెలియ చేశాను.
\s5
\v 16 మీరు నన్ను కోరుకోలేదు. మీరు వెళ్లి ఫలవంతం అవ్వాలని, మీ ఫలం నిలకడగా ఉండాలని నేను మిమ్మల్ని కోరుకుని నియమించాను. నా పేరిట మీరు తండ్రిని ఏది అడిగినా ఇవ్వాలని ఇది చేశాను.
\v 17 మీరు ఒకరినొకరు ప్రేమించాలని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపిస్తున్నాను.
\s విశ్వాసి, లోకం
\s5
\p
\v 18 ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తే, మీకన్నా ముందు అది నన్ను ద్వేషించిందని తెలుసుకోండి.
\v 19 మీరు ఈ లోకానికి చెందిన వాళ్ళైతే ఈ లోకం దాని సొంతవాళ్ళలా మిమ్మల్ని ప్రేమిస్తుంది. కాని, మీరు లోకానికి చెందిన వాళ్ళు కాదు. ఎందుకంటే, నేను మిమ్మల్ని ఈ లోకంలోనుంచి వేరుపరిచాను. అందుకే ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది.
\s5
\p
\v 20 'దాసుడు తన యజమానికంటే గొప్పవాడు కాదు' అని నేను మీతో చెప్పిన మాట గుర్తు చేసుకోండి. వాళ్ళు నన్ను హింసిస్తే, మిమ్మల్ని కూడా హింసిస్తారు. వాళ్ళు నా మాట ప్రకారం చేస్తే, మీ మాట ప్రకారం కూడా చేస్తారు.
\v 21 వాళ్ళకు నన్ను పంపిన వాడు తెలియదు కాబట్టి, నా పేరిట ఇవన్నీ మీకు చేస్తారు.
\v 22 నేను వచ్చి వాళ్ళతో మాట్లాడి ఉండకపోతే, వాళ్ళకు పాపం ఉండేది కాదు. కాని, ఇప్పుడు వాళ్ళ పాపం నుండి తప్పించుకునే అవకాశం వారికి లేదు.
\s5
\p
\v 23 నన్ను ద్వేషించేవాడు నా తండ్రిని కూడ ద్వేషిస్తున్నాడు.
\v 24 ఎవ్వరూ చెయ్యని క్రియలు నేను వారి మధ్య చేయకపోతే వాళ్లకు పాపం ఉండేది కాదు. కాని, ఇప్పుడు వాళ్ళు నన్నూ, నా తండ్రినీ చూశారు, ద్వేషిస్తున్నారు కూడా.
\v 25 'కారణం లేకుండా నన్ను ద్వేషించారు' అని వాళ్ళ ధర్మశాస్త్రంలో ఉన్న వాక్కు నెరవేరేలా ఇది జరుగుతూ ఉంది.
\s విశ్వాసి, ఆత్మ
\s5
\p
\v 26 తండ్రి దగ్గర నుంచి మీ దగ్గరకు నేను పంపబోయే ఆదరణకర్త, సత్యమైన ఆత్మ వచ్చినపుడు, ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు.
\v 27 మీరు మొదటనుంచి నాతో ఉన్నవాళ్ళే కాబట్టి మీరుకూడా సాక్షులుగా ఉన్నారు.
\s5
\c 16
\s హింసల గురించి శిష్యులకు హెచ్చరికలు (మత్తయి 24: 9, 10; లూకా 21: 16- 19)
\p
\v 1 "మీరు తడబడకుండా ఉండాలని ఈ సంగతులు మీతో మాట్లాడుతున్నాను.
\v 2 వారు మిమ్మల్ని సునగోగుల్లో నుండి బహిష్కరిస్తారు. మిమ్మల్ని చంపినవాళ్ళు, దేవుని కోసం మంచి పని చేస్తున్నామని అనుకునే సమయం వస్తుంది.
\s5
\v 3 నేను గాని, తండ్రిగాని వాళ్లకు తెలియదు కాబట్టి అలా చేస్తారు.
\v 4 అవి జరిగే సమయం వచ్చినప్పుడు, వాటిని గురించి నేను మీతో చెప్పినవి గుర్తు చేసుకోవాలని ఈ సంగతులు మీతో చెబుతున్నాను. నేను మీతో ఉన్నాను కాబట్టి మొదట్లో ఈ సంగతులు మీతో చెప్పలేదు.
\s5
\v 5 అయితే ఇప్పుడు నన్ను పంపినవాని దగ్గరకు వెళ్తున్నాను. అయినా, 'నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు?' అని మీలో ఎవ్వరూ నన్ను అడగడం లేదు గాని
\v 6 నేను ఈ సంగతులు మీతో చెప్పినందుకు మీ హృదయం నిండా దుఖం ఉంది.
\s లోకం కోసం ఆత్మ చేసే మూడు విధాల పరిచర్య
\p
\v 7 అయినప్పటికీ, నేను మీతో సత్యం చెబుతున్నాను, నేను వెళ్ళిపోవడం మీకు మంచిదే. నేను వెళ్ళకపోతే, ఆదరణకర్త మీ దగ్గరకు రాడు. కాని నేను వెళ్తే, ఆయన్ని మీ దగ్గరకు పంపిస్తాను.
\s5
\p
\v 8 ఆదరణకర్త వచ్చినప్పుడు, పాపం గురించి, నీతి గురించి, తీర్పు గురించి, లోకాన్ని ఒప్పిస్తాడు.
\v 9 ప్రజలు నాలో నమ్మకం ఉంచలేదు కాబట్టి పాపం గురించి ఒప్పిస్తాడు
\v 10 నేను తండ్రి దగ్గరకు వెళ్తున్నాను కాబట్టి, మీరు ఇంక నన్ను ఎన్నడూ చూడరు కాబట్టి, నీతి గురించి ఒప్పిస్తాడు
\v 11 ఈ లోకపాలకుడు తీర్పు పొందాడు కాబట్టి తీర్పును గురించి ఒప్పిస్తాడు.
\s ఆత్మ వెల్లడించ నున్న నూతన సత్యం
\s5
\p
\v 12 నేను మీతో చెప్పే సంగతులు ఇంకా చాలా ఉన్నాయి గాని ఇప్పుడు మీరు వాటిని అర్ధం చేసుకోలేరు.
\v 13 అయితే ఆయన, సత్య ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని పూర్తి సత్యంలోకి నడిపిస్తాడు. ఆయన తనంతట తానే ఏమీ మాట్లాడడు. ఏం వింటాడో అదే మాట్లాడతాడు. జరగబోయే వాటిని మీకు ప్రకటిస్తాడు.
\v 14 ఆయన నా వాటిని తీసికొని మీకు ప్రకటిస్తాడు కాబట్టి నాకు మహిమ కలిగిస్తాడు.
\s5
\v 15 నా తండ్రికి ఉన్నవన్నీ నావే, అందుచేత ఆ ఆత్మ నా వాటిని తీసికొని మీకు ప్రకటిస్తాడని నేను చెప్పాను.
\s యేసు తన మరణ, పునరుత్థానాల గురించీ, రెండవ రాక గురించీ ప్రవచించడం
\p
\v 16 కొద్ది కాలం తరువాత మీరు నన్ను ఇక చూడరు. ఆ తరువాత మరి కొద్ది కాలానికి మీరు నన్ను చూస్తారు."
\s5
\p
\v 17 ఆయన శిష్యులలో కొంతమంది "'కొద్ది కాలంలో మీరు నన్ను ఇక చూడరు. ఆ తరువాత కొద్ది కాలంలో మీరు నన్ను చూస్తారు,' ఇంకా, 'నేను తండ్రి దగ్గరకు వెళ్తున్నాను,' అంటున్నాడు, ఇది ఏంటి? ఆయన మనతో ఏం చెబుతున్నాడు?" అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు,
\v 18 కాబట్టి వాళ్ళు, "కొద్ది కాలం అంటే ఆయన అర్ధం ఏంటి?, ఆయన ఏం చెబుతున్నాడో మాకు తెలియడం లేదు" అన్నారు.
\s5
\v 19 వాళ్ళు ఈ విషయం తనను అడగాలని ఆతురతతో ఉన్నారని యేసు గమనించి వాళ్ళతో, "'కొద్ది కాలం తరువాత మీరు నన్ను ఇక చూడరు. ఆ తరువాత మరి కొద్ది కాలానికి మీరు నన్ను చూస్తారు' అని నేను అన్నదానికి అర్ధం ఏంటని ఆలోచిస్తున్నారా?
\v 20 నేను మీతో ఖచ్చితంగా చెబుతున్నాను, మీరు శోకంతో ఏడుస్తారు, కాని ఈ లోకం ఆనందిస్తుంది. మీకు దుఃఖం కలుగుతుంది, కాని మీ దుఃఖం ఆనందంగా మారుతుంది.
\v 21 స్త్రీ ప్రసవించే సమయం వచ్చినప్పుడు ప్రసవ వేదన కలుగుతుంది. కాని, బిడ్డ పుట్టిన తరువాత ఆ బిడ్డ ఈ లోకంలోకి వచ్చిన ఆనందంలో ప్రసవంలో తాను పడిన బాధ ఆమెకు ఇక గుర్తు రాదు.
\s5
\p
\v 22 అలాగే, మీరు ఇప్పుడు దుఖపడుతున్నారు గాని, నేను మిమ్మల్ని మళ్ళీ చూస్తాను. అప్పుడు మీ హృదయం ఆనందిస్తుంది. మీ ఆనందం మీ దగ్గరనుంచి ఎవ్వరూ తీసివేయలేరు.
\v 23 ఆ రోజున మీరు నన్ను ఏ ప్రశ్నలూ అడగరు. నేను మీతో ఖచ్చింతంగా చెబుతున్నాను, మీరు తండ్రిని ఏది అడిగినా, నా పేరిట ఆయన మీకు అది ఇస్తాడు.
\v 24 ఇంతవరకు నా పేరిట మీరు ఏమీ అడగలేదు. అడగండి, అప్పుడు మీ ఆనందం సంపూర్తి అయ్యేలా మీరు పొందుతారు.
\s5
\v 25 ఈ సంగతులు ఇంతవరకు తేలికగా అర్ధంకాని భాషలో మీకు చెప్పాను. ఇప్పుడు తండ్రి గురించి స్పష్టంగా చెబుతాను.
\s5
\v 26 ఆ రోజున మీరు నా పేరిట అడుగుతారు. అయితే మీ కోసం నేను తండ్రికి ప్రార్థన చేస్తానని అనడంలేదు.
\v 27 ఎందుకంటే మీరు నన్ను ప్రేమించి, నేను తండ్రి దగ్గర నుంచి వచ్చానని నమ్మారు కాబట్టి తండ్రే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు.
\v 28 నేను తండ్రి దగ్గరనుంచి ఈ లోకానికి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఈ లోకాన్ని విడిచి తండ్రి దగ్గరకు వెళ్తున్నాను" అన్నాడు.
\s5
\p
\v 29 ఆయన శిష్యులు, "చూడు, ఇప్పుడు నువ్వు అర్ధం కానట్టు కాకుండా, స్పష్టంగా మాట్లాడుతున్నావు.
\v 30 నువ్వు అన్నీ తెలిసిన వాడివని, నిన్ను ఎవరూ ప్రశ్నలు అడగవలసిన అవసరం లేదని, ఇప్పుడు మేం తెలుసుకున్నాం. దీనివలన నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చావని మేం నమ్ముతున్నాం" అన్నారు.
\v 31 యేసు జవాబిస్తూ, "మీరు ఇప్పుడు నమ్ముతున్నారా? అన్నాడు.
\s5
\v 32 మీరందరూ ఎవరి ఇంటికి వాళ్ళు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టే సమయం రాబోతూ ఉంది. వచ్చేసింది కూడా. అయినప్పటికీ, నా తండ్రి నాతో ఉన్నాడు కాబట్టి నేను ఒంటరిని కాదు.
\v 33 నన్నుబట్టి మీకు శాంతి కలగాలని నేను ఈ సంగతులు మీతో చెప్పాను. ఈ లోకంలో మీకు శ్రమ ఉంది. కాని ధైర్యం తెచ్చుకోండి. నేను లోకాన్ని జయించాను."
\s5
\c 17
\s విజ్ఞాపన ప్రార్థన
\p
\v 1 యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు చూసి, ఇలా అన్నాడు, "తండ్రీ, సమయం వచ్చింది.
\v 2 నీ కుమారుడు నీకు మహిమ కలిగించేలా, నీ కుమారునికి మహిమ కలిగించు. నువ్వు నీ కుమారునికి అప్పగించిన వాళ్ళందరికీ ఆయన శాశ్వత జీవం ఇచ్చేలా మనుషులందరి మీదా ఆయనకు అధికారం ఇచ్చావు.
\s5
\v 3 ఒకే ఒక్క సత్య దేవుడవైన నిన్నూ, నువ్వు పంపిన యేసు క్రీస్తునూ తెలుసుకోవడమే శాశ్వతజీవం.
\v 4 నువ్వు నాకు అప్పగించిన పని పూర్తి చేసి, భూమిమీద నీకు మహిమ కలిగించాను.
\v 5 తండ్రీ, ఈ ప్రపంచం ఆరంభానికి ముందు నీ దగ్గర నాకు ఎలాంటి మహిమ ఉండేదో, ఇప్పుడు నీతోపాటు అలాంటి మహిమ నాకు కలిగించు.
\s5
\v 6 లోకంలోనుంచి నువ్వు నాకు అప్పగించిన వాళ్లకు నిన్ను వెల్లడి చేశాను. వాళ్ళు నీ వాళ్ళు. నువ్వు వాళ్ళను నాకు అప్పగించావు. వాళ్ళు నీ వాక్కు పాటించారు.
\v 7 నువ్వు నాకు ఇచ్చినవన్నీ నీ దగ్గర నుంచి వచ్చినవే అని ఇప్పుడు వాళ్లకు తెలుసు.
\v 8 ఎందుకంటే నువ్వు నాకు ఇచ్చిన వాక్కులు నేను వాళ్లకు ఇచ్చాను. వాళ్ళు వాటిని స్వీకరించి, నిజంగా నేను నీ దగ్గర నుండి వచ్చాననీ, నీవే నన్ను పంపావనీ నమ్మారు.
\s5
\p
\v 9 నేను వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను. ఈ లోకం కోసం కాదు గాని, నువ్వు నాకు అప్పగించిన వాళ్ళు నీ వాళ్ళు కాబట్టి, వాళ్ళ కోసమే ప్రార్థన చేస్తున్నాను.
\v 10 నావన్నీ నీవి, నీవన్నీ నావి. వాళ్ళలో నాకు మహిమ కలిగింది.
\v 11 నేనింక ఈ లోకంలో ఉండను గాని ఈ ప్రజలు లోకంలో ఉన్నారు. నేను నీ దగ్గరకు వస్తున్నాను. పవిత్రుడవైన తండ్రీ, నువ్వు నాకిచ్చిన పేరును బట్టి, మనం ఏకంగా ఉన్నట్టే వాళ్ళూ ఏకంగా ఉండేలా వాళ్ళని కాపాడు.
\s5
\v 12 నేను వాళ్ళతో ఉన్నప్పుడు నువ్వు నాకు ఇచ్చిన నీ పేరును బట్టి వాళ్ళను కాపాడాను. లేఖనం నెరవేరేలా, నాశనానికి తగినవాడు తప్ప ఏ ఒక్కరూ నశించకుండా, వాళ్ళను సంరక్షించాను.
\v 13 ఇప్పుడు నేను నీ దగ్గరకు వస్తున్నాను. నా ఆనందం వాళ్ళలో సంపూర్తి అవ్వాలని లోకంలో ఉండగానే ఈ సంగతులు చెబుతున్నాను.
\v 14 వాళ్లకు నీ వాక్కు ఇచ్చాను. నేను ఈ లోకానికి చెందినవాణ్ణి కానట్టే, వాళ్ళు కూడా ఈ లోకానికి చెందినవాళ్ళు కాదు కాబట్టి ఈ లోకం వాళ్ళను ద్వేషించింది.
\s5
\v 15 నువ్వు ఈ లోకంలో నుంచి వాళ్ళని తీసుకు వెళ్ళమని నేను ప్రార్థన చేయడం లేదు గాని, దుర్మార్గుని నుంచి వాళ్ళని కాపాడమని ప్రార్థన చేస్తున్నాను.
\v 16 నేను లోకానికి చెందినవాణ్ణి కానట్టే వాళ్ళు కూడా లోకానికి చెందినవాళ్ళు కాదు.
\v 17 సత్యం ద్వారా వాళ్ళని పవిత్రం చెయ్యి. నీ వాక్యమే సత్యం.
\s5
\p
\v 18 నువ్వు నన్ను ఈ లోకంలోకి పంపినట్టే, నేను వాళ్ళని ఈ లోకంలోకి పంపించాను.
\v 19 వాళ్ళు సత్యం ద్వారా పవిత్రం అవ్వాలని, వాళ్ళ కోసం నన్ను నేను పవిత్రం చేసుకుంటున్నాను.
\s5
\v 20 నువ్వు నన్ను పంపావని లోకం నమ్మేలా, తండ్రీ, నాలో నువ్వు, నీలో నేను ఉన్నట్టే,
\v 21 వాళ్ళు మనలో ఏకమై ఉండాలని వాళ్ళ కోసం మాత్రమే నేను ప్రార్థన చేయడం లేదు గాని, వాళ్ళ మాటవల్ల నాలో నమ్మకం ఉంచే వారంతా ఏకమై ఉండాలని వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను.
\s5
\v 22 మనం ఏకమై ఉన్నట్టే, వాళ్ళు కూడా ఏకమై ఉండాలని నువ్వు నాకిచ్చిన మహిమను, నేను వాళ్ళకు ఇచ్చాను.
\v 23 వాళ్ళలో నేను, నాలో నువ్వు ఉన్న కారణంగా వాళ్ళు పరిపూర్ణులుగా ఏకంగా ఉన్న దాన్ని బట్టి, నువ్వు నన్ను పంపావని, నువ్వు నన్ను ప్రేమించినట్టే వాళ్ళను కూడా ప్రేమించావని, లోకం తెలుసుకునేలా, నువ్వు నాకు ఇచ్చిన మహిమను వాళ్లకు ఇచ్చాను.
\s5
\p
\v 24 తండ్రీ, నేను ఎక్కడ ఉంటానో, నువ్వు నాకిచ్చిన వాళ్ళు నాతో కూడా అక్కడ ఉండాలని, నువ్వు నాకు ఇచ్చిన మహిమను వాళ్ళు చూడాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే భూమి పునాదికి ముందు నుంచే నువ్వు నన్ను ప్రేమించావు.
\s5
\v 25 నీతిమంతుడవైన తండ్రీ, లోకం నిన్ను తెలుసుకోలేదు, కాని నువ్వు నాకు తెలుసు. నువ్వు నన్ను పంపావని వీళ్ళకు తెలుసు.
\v 26 నువ్వు నా పట్ల చూపించిన ప్రేమ వాళ్ళలో ఉండాలనీ, నేను వాళ్ళలో ఉండాలనీ, నిన్ను వాళ్లకు తెలియచేశాను. ఇంకా తెలియచేస్తాను."
\s5
\c 18
\s గేత్సేమనే లో యేసు (మత్తయి 26: 36-46; మార్కు 14: 32-42; లూకా 22: 39-46)
\p
\v 1 యేసు ఇలా మాట్లాడిన తరువాత తన శిష్యులతో కలిసి కెద్రోను లోయ దాటి, అక్కడ ఉన్న తోటలో ప్రవేశించాడు.
\s ద్రోహం, అరెస్టు కావడం (మత్తయి 26: 47-56; మార్కు 14: 43- 50; లూకా 22: 47-53)
\p
\v 2 యేసు తన శిష్యులతో తరచు అక్కడికి వెళ్తూ ఉండేవాడు కాబట్టి, ఆయన్ని పట్టించబోతున్న యూదాకు కూడా ఆ ప్రదేశం తెలుసు.
\v 3 అతడు సైనికుల గుంపును, ప్రధాన యాజకులు, పరిసయ్యులు తనకు ఇచ్చిన దేవాలయ అధికారులను వెంటతీసుకొని, దివిటీలతో, దీపాలతో ఆయుధాలతో అక్కడికి వచ్చాడు.
\s5
\v 4 అప్పుడు యేసు, తనకు జరుగుతున్నవన్నీ తెలిసినవాడే కాబట్టి, ముందుకు వచ్చి వాళ్ళతో, "మీరు ఎవరి కోసం చూస్తున్నారు?" అని అడిగాడు.
\v 5 వారు "నజరేతు వాడైన యేసు" అని జవాబిచ్చారు. యేసు వాళ్ళతో, "నేనే ఆయన్ని" అన్నాడు. ద్రోహంతో యేసును పట్టించిన యూదా కూడా ఆ సైనికులతో నిలుచుని ఉన్నాడు.
\s5
\v 6 ఆయన వాళ్ళతో, "నేనే" అని చెప్పినప్పుడు వాళ్ళు వెనక్కి జరిగి, నేల మీద పడ్డారు.
\v 7 ఆయన మళ్ళీ, "మీరు ఎవరి కోసం చూస్తున్నారు?" అని అడిగాడు. వాళ్ళు మళ్ళీ, "నజరేతు వాడైన యేసు కోసం" అన్నారు.
\s5
\v 8 యేసు వాళ్ళతో, "ఆయన్ని నేనే అని మీతో చెప్పాను. మీరు నా కోసమే చూస్తూ ఉంటే, మిగిలిన వాళ్ళను వెళ్లిపోనివ్వండి" అన్నాడు.
\v 9 "నువ్వు నాకు ఇచ్చిన వాళ్ళల్లో ఏ ఒక్కరినీ నేను పోగొట్టుకోలేదు" అన్న వాక్కు నెరవేరేలా ఆయన ఈ మాట అన్నాడు.
\s5
\v 10 అప్పుడు సీమోను పేతురు, తన దగ్గర ఉన్న కత్తి దూసి, ప్రధాన యాజకుని సేవకుడి కుడిచెవి తెగ నరికాడు.
\v 11 ఆ సేవకుడి పేరు మల్కు. యేసు పేతురుతో, "కత్తిని దాని ఒరలో పెట్టు, తండ్రి నాకు ఇచ్చిన గిన్నెలోది నేను తాగకుండా ఉంటానా?" అన్నాడు.
\s ప్రధాన యాజకుని ఎదుట యేసు(మత్తయి 26; 57- 68; మార్కు 14: 53-65; లూకా 22: 66- 71)
\s5
\p
\v 12 అప్పుడు సైనికుల గుంపు, వాళ్ళ అధిపతీ, యూదుల అధికారులు, యేసును పట్టుకుని, బంధించారు. మొదట ఆయన్ని అన్న దగ్గరకు తీసుకువెళ్ళారు.
\v 13 అతడు ఆ సంవత్సరం ప్రధాన యాజకునిగా ఉన్న కయపకు మామ.
\v 14 ప్రజలందరి కోసం ఒక మనిషి చనిపోవడం అవశ్యం అని యూదులకు ఆలోచన చెప్పినవాడే ఈ కయప.
\s యేసు ఎవరో తెలియదని పేతురు నిరాకరణ (మత్తయి 26: 69- 75; మార్కు 14: 66- 72; లూకా 22: 54- 62)
\s5
\p
\v 15 సీమోను పేతురూ, ఇంకొక శిష్యుడూ, యేసు వెంట వెళ్ళారు. ఆ శిష్యుడు ప్రధాన యాజకునికి పరిచయం ఉన్నవాడు కాబట్టి అతను ప్రధాన యాజకుని యింటి ముంగిటిలోకి యేసుతో కూడా వెళ్ళాడు.
\v 16 కాని, పేతురు గుమ్మం దగ్గర బయటే నిలబడి ఉన్నాడు. అప్పుడు ప్రధాన యాజకునికి పరిచయం ఉన్న శిష్యుడు బయటకు వచ్చి గుమ్మానికి కాపలా ఉన్న దాసీతో మాట్లాడి పేతుర్ని లోపలికి తీసుకొచ్చాడు.
\s5
\v 17 గుమ్మం దగ్గర కాపలా ఉన్న దాసీ పేతురుతో, "నువ్వు ఇతని శిష్యుల్లో ఒకడివి కదూ?" అంది. అతడు "కాదు" అన్నాడు.
\v 18 చలిగా ఉన్న కారణంగా అక్కడ ఉన్న సేవకులు, అధికారులు చలి మంట వేసుకుని దాని చుట్టూ నిలుచుని చలికాచుకొంటున్నారు. పేతురు కూడా వాళ్ళతో నిలుచుని చలికాచుకొంటున్నాడు.
\s5
\p
\v 19 ప్రధాన యాజకుడు ఆయన శిష్యుల గురించీ, ఆయన ఉపదేశం గురించీ యేసును అడిగాడు.
\v 20 యేసు జవాబిస్తూ, "నేను బహిరంగంగానే ఈ లోకంతో మాట్లాడాను. నేను ఎప్పుడూ యూదులు సమావేశమయ్యే సమాజ ప్రాంగణాలలో, దేవాలయంలో ఉపదేశం చేశాను. చాటుగా ఏమీ మాట్లాడలేదు.
\v 21 నువ్వు నన్ను ఎందుకు అడుగుతావు? నేనేం మాట్లాడానో, నా మాటలు విన్నవాళ్ళని అడుగు. నేను మాట్లాడిన సంగతులు ఈ ప్రజలకు తెలుసు" అన్నాడు.
\s5
\v 22 యేసు ఇలా అన్నప్పుడు, అక్కడ నిలుచుని ఉన్న అధికారుల్లో ఒకడు, యేసును తన అరచేతితో చెంప మీద కొట్టి, "ప్రధాన యాజకునికి నువ్వు జవాబిచ్చే విధానం అదేనా?" అన్నాడు.
\v 23 యేసు అతనికి జవాబిస్తూ, "నేను ఏదైనా చెడు మాట్లాడి ఉంటే, ఆ చెడు ఏంటో చెప్పు. కాని, నేను సరిగానే చెప్పి ఉంటే, నన్ను ఎందుకు కొడతావు?" అన్నాడు.
\v 24 తరువాత అన్న, బంధించి ఉన్న యేసును ప్రదాన యాజకుడు కయప దగ్గరకు పంపాడు.
\s5
\v 25 అప్పుడు సీమోను పేతురు నిలుచుని చలి కాచుకొంటూ ఉన్నాడు. ప్రజలు అతనితో, "నువ్వు కూడా అతని శిష్యులలో ఒకడివి కాదా?" అన్నారు. పేతురు ఒప్పుకోలేదు. "కాదు" అన్నాడు.
\v 26 పేతురు చెవి తెగ నరికినవాని బంధువు ప్రధాన యాజకుని సేవకుల్లో ఒకడు. వాడు పేతురుతో, "నువ్వు తోటలో ఆయనతో ఉండడం నేను చూడలేదా?" అన్నాడు.
\v 27 పేతురు మళ్ళీ ఒప్పుకోలేదు. వెంటనే కోడి కూసింది.
\s పిలాతు ఎదుట యేసు (మత్తయి 27: 1- 4; మార్కు 15: 1- 5; లూకా 23: 1-7, 13, 16)
\s5
\p
\v 28 వాళ్ళు యేసును కయప దగ్గరనుంచి రోమా రాజ్యాధికార భవనానికి తీసుకు వచ్చారు. అది తెల్లవారుతూ ఉన్న సమయం. పస్కా భోజనం తినడానికి ముందు వాళ్ళు మైల పడకుండా ఉండడానికి వాళ్ళు ఆ రోమా రాజ్యాధికార భవనంలో ప్రవేశించలేదు.
\v 29 కాబట్టి పిలాతు బయట ఉన్న వాళ్ళ దగ్గరకు వచ్చి, "ఈ మనిషి మీద మీరు ఏ నేరం మోపుతున్నారు?" అన్నాడు.
\v 30 వాళ్ళు అతనితో, "ఇతను దుర్మార్గుడు కాకపోతే ఇతన్ని నీకు అప్పగించే వాళ్ళం కాదు" అన్నారు.
\s5
\v 31 అందుకు పిలాతు వాళ్ళతో, "అతణ్ణి మీరే తీసుకుకొని వెళ్లి మీ ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు తీర్చండి" అన్నాడు.
\v 32 యూదులు, "ఎవరికైనా మరణశిక్ష విధించే అధికారం మాకు లేదు" అన్నారు. తాను ఎలాంటి మరణం పొందుతాడో, దాని గురించి ఆయన ముందుగానే చెప్పిన మాట నెరవేరేలా వాళ్ళు ఈ మాట పలికారు.
\s5
\v 33 అప్పుడు పిలాతు మళ్ళీ రోమా రాజ్యాధికార భవనంలోకి వెళ్లి, యేసును పిలిచి, ఆయనతో, "నువ్వు యూదులకు రాజువా?" అన్నాడు.
\v 34 యేసు జవాబిస్తూ, "ఈ మాట నీ అంతట నువ్వే అంటున్నావా, లేక ఎవరైనా నా గురించి నీతో చెప్పారా?" అన్నాడు.
\v 35 అందుకు పిలాతు, "నేను యూదుణ్ణి కాదు. అవునా? నీ సొంత ప్రజలు, ప్రధాన యాజకులు, నిన్ను నాకు అప్పగించారు. నువ్వేం చేశావు?" అని అడిగాడు.
\s5
\p
\v 36 యేసు, "నా రాజ్యం ఈ లోకానికి సంబంధించింది కాదు. నా రాజ్యం ఈ లోకానికి సంబంధించిందే అయితే, నేను యూదుల చేతిలో పడకుండా నా సేవకులు పోరాటం చేసేవాళ్ళే. నిజానికి నా రాజ్యం ఇక్కడిది కాదు" అని జవాబిచ్చాడు.
\v 37 అప్పుడు పిలాతు, "అయితే నువ్వు రాజువా??" అని యేసుతో అన్నాడు. యేసు, "నేను రాజునని నువ్వు అంటున్నావు. సత్యం గురించి సాక్ష్యం చెప్పడానికి నేను జన్మించాను. అందుకే నేను ఈ లోకంలోకి వచ్చాను. సత్యానికి సంబంధించిన వాళ్ళందరూ నా మాట వింటారు" అని జవాబిచ్చాడు.
\s5
\v 38 పిలాతు ఆయనతో, "సత్యం అంటే ఏంటి?" అన్నాడు.
\s యేసుకు మరణ శిక్ష, బరబ్బా విడుదల (మత్తయి 27: 15-26; మార్కు 15: 6-15; లూకా 23: 18- 25)
\p అతను ఇలా అన్న తరువాత మళ్ళీ బయటకు వెళ్లి యూదులతో, "ఈ మనిషిలో నాకు ఏ అపరాధం కనిపించ లేదు,
\v 39 పస్కా సమయంలో నేను ఒకణ్ణి విడుదల చేసే ఆనవాయితీ ఉంది కదా? కాబట్టి యూదుల రాజును మీకు విడుదల చెయ్యమంటారా?" అన్నాడు.
\v 40 అప్పుడు వాళ్ళు మళ్ళీ పెద్దగా కేకలు పెడుతూ, "ఈ మనిషిని కాదు. బరబ్బాను విడుదల చెయ్యండి!" అన్నారు. బరబ్బా బందిపోటు దొంగ.
\s5
\c 19
\s యేసుకు ముళ్ళ కిరీటం (మత్తయి 27: 27- 30; మార్కు 15 : 16-20)
\p
\v 1 ఆ తరువాత పిలాతు యేసును పట్టుకొని కొరడాలతో కొట్టించాడు.
\v 2 సైనికులు ముళ్ళతో కిరీటం అల్లి, ఆయన తలమీద పెట్టి
\v 3 ఊదారంగు వస్త్రం ఆయనకు తొడిగించి ఆయన దగ్గరకు వచ్చి, "యూదుల రాజా, దండం," అని చెప్పి ఆయన్ని అర చేతులతో కొట్టారు.
\s జన సమూహం ఎదుట యేసు
\s5
\p
\v 4 పిలాతు మళ్ళీ బయటకు వెళ్లి ప్రజలతో, "ఈయనలో ఏ అపరాధం నాకు కనిపించలేదని మీకు తెలిసేలా ఈయన్ని మీ దగ్గరకు బయటకి తీసికొని వస్తున్నాను," అని వాళ్ళతో అన్నాడు.
\v 5 కాబట్టి, యేసు బయటకు వచ్చినప్పుడు ముళ్ళ కిరీటం పెట్టుకుని, ఊదారంగు వస్త్రం ధరించి ఉన్నాడు. అప్పుడు పిలాతు వాళ్ళతో, "ఇదిగో ఈ మనిషి!" అన్నాడు.
\v 6 ప్రధాన యాజకులు, యూదుల అధికారులు యేసును చూసినప్పుడు, "సిలువ వెయ్యండి, సిలువ వెయ్యండి!" అని, కేకలు వేశారు. పిలాతు వాళ్ళతో, "ఈయనలో నాకు ఏ అపరాధం కనిపించడం లేదు కాబట్టి మీరే తీసుకువెళ్ళి ఇతన్ని సిలువ వెయ్యండి," అన్నాడు.
\s5
\p
\v 7 యూదులు పిలాతుతో, "మాకు ఉన్న ధర్మశాస్త్రాన్ని బట్టి, అతను తనను తాను దేవుని కుమారుడుగా ప్రకటించుకున్నాడు కాబట్టి, అతను చావ వలసిందే," అన్నారు.
\v 8 పిలాతు ఆ మాట విని ఇంకా ఎక్కువగా భయపడి, మళ్ళీ రాజ్యాధికార భవనంలో ప్రవేశించి,
\v 9 "నువ్వు ఎక్కడ నుంచి వచ్చావు?" అని యేసును అడిగాడు. అయితే యేసు అతనికి ఏ జవాబూ చెప్పలేదు.
\s5
\v 10 అప్పుడు పిలాతు ఆయనతో, "నువ్వు నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చెయ్యడానికీ, సిలువ వెయ్యడానికీ, నాకు అధికారం ఉందని నీకు తెలియదా?" అన్నాడు.
\v 11 యేసు జవాబిస్తూ, "నీకు ఆ అధికారం పైనుంచి వస్తే తప్ప నా మీద నీకు ఏ అధికారం ఉండదు. కాబట్టి నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపం ఉంది" అన్నాడు.
\s5
\v 12 అప్పటి నుంచి పిలాతు యేసును విడుదల చెయ్యాలని ప్రయత్నం చేశాడు గాని యూదులు కేకలు పెడుతూ, "నువ్వు ఇతన్ని విడుదల చేస్తే, కైసరుకు మిత్రుడవు కాదు. తనను తాను రాజుగా చేసుకున్నవాడు కైసరుకు విరోధంగా మాట్లాడినట్టే" అన్నారు.
\v 13 పిలాతు ఈ మాటలు విని, యేసును బయటికి తీసుకొచ్చి, 'రాళ్లు పరచిన స్థలం'లో న్యాయపీఠం మీద కూర్చున్నాడు. హెబ్రీ భాషలో ఆ స్థలానికి 'గబ్బతా' అని పేరు.
\s రాజును ప్రజలు, యూదుల పెద్దలు చివరిగా తిరస్కరించడం
\s5
\p
\v 14 అది పస్కా సిద్ధపాటు రోజు. ఉదయం ఇంచుమించు ఆరు గంటల సమయం. అప్పుడు పిలాతు యూదులతో, "ఇదిగో మీ రాజు!" అన్నాడు.
\v 15 వాళ్ళు కేకలు పెడుతూ, "చంపండి, చంపండి, సిలువ వేయండి!" అని అరిచారు. పిలాతు వాళ్ళతో, "మీ రాజును సిలువ వేయమంటారా?" అన్నాడు. ప్రధాన యాజకుడు, "మాకు కైసరు తప్ప వేరే రాజు లేడు," అన్నాడు.
\s యేసుక్రీస్తు సిలువ (మత్తయి 27: 33-54; మార్కు 15: 22-39; లూకా 23: 33-47)
\p
\v 16 అప్పుడు, పిలాతు సిలువ వేయడానికి యేసును వాళ్లకు అప్పగించాడు.
\s5
\v 17 వాళ్ళు యేసును తీసుకువెళ్ళారు. తన సిలువ తానే మోసుకుంటూ బయటకు వచ్చి, 'కపాల స్థలం' అనే ప్రాంతానికి వచ్చాడు. హెబ్రీ భాషలో ఆ స్థలానికి 'గొల్గొతా' అని పేరు.
\v 18 అక్కడ వాళ్ళు యేసును, ఇరువైపులా ఇద్దరు మనుషుల మధ్య, సిలువ వేశారు.
\s5
\p
\v 19 పిలాతు, ఒక పలక మీద 'నజరేతు వాడైన యేసు, యూదుల రాజు' అని రాయించి సిలువకు తగిలించాడు.
\v 20 యేసును సిలువ వేసిన స్థలం పట్టణానికి దగ్గరగా ఉంది. పలక మీద రాసిన ప్రకటన హెబ్రీ, రోమా, గ్రీకు భాషల్లో రాసి ఉంది కాబట్టి చాలా మంది యూదులు దాన్ని చదివారు.
\s5
\v 21 యూదుల ప్రధాన యాజకుడు పిలాతుతో, "'యూదుల రాజు' అని కాకుండా, అతను చెప్పుకున్న ప్రకారం 'నేను యూదుల రాజును' అని రాయించండి" అన్నాడు.
\v 22 పిలాతు, "నేను రాసిందేదో రాశాను" అని జవాబిచ్చాడు.
\s5
\p
\v 23 సైనికులు యేసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రాలు తీసికొని, నాలుగు భాగాలు చేసి తలొక భాగం పంచుకున్నారు. ఆయన పైవస్త్రం కూడా తీసుకొన్నారు. ఆ పైవస్త్రం కుట్టు లేకుండా, అంతా ఒకే నేతగా ఉంది కాబట్టి,
\v 24 వాళ్ళు ఒకరితో ఒకరు, "దీన్ని మనం చింపకుండా, ఇది ఎవరిది అవుతుందో చూడడానికి చీట్లు వేద్దాం" అన్నారు.
\q1 "నా వస్త్రాలు తమలో తాము పంచుకున్నారు,
\q1 నా దుస్తుల కోసం చీట్లు వేశారు,"
\p అన్న లేఖనం నెరవేరేలా ఇది జరిగింది. అందుకే సైనికులు అలా చేశారు.
\s5
\v 25 యేసు తల్లి, ఆయన తల్లి సోదరి, క్లోపా భార్య మరియ, మగ్దలేనే మరియ, యేసు సిలువ దగ్గర నిలుచుని ఉన్నారు.
\v 26 ఆయన తల్లి, ఆయన ప్రేమించిన శిష్యుడు దగ్గరలో నిలుచుని ఉండడం చూసి, యేసు తన తల్లితో, "అమ్మా, ఇదిగో నీ కొడుకు" అన్నాడు.
\v 27 తరువాత ఆ శిష్యునితో, "ఇదిగో నీ తల్లి" అన్నాడు. ఆ సమయం నుంచి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట్లో చేర్చుకున్నాడు.
\s5
\v 28 దాని తరువాత, అన్నీ సమాప్తం అయ్యాయని యేసుకు తెలుసు కాబట్టి, లేఖనం నెరవేర్చడానికి, "నాకు దాహంగా ఉంది," అన్నాడు.
\v 29 అక్కడే ఉన్న పులిసిన ద్రాక్షారసం కుండలో స్పంజిని ముంచి, ఆ స్పంజిని హిస్సోపు కొమ్మకు చుట్టి ఆయన నోటికి అందించారు.
\v 30 యేసు, ఆ పులిసిన ద్రాక్షారసం పుచ్చుకొని, "సమాప్తం అయ్యింది" అని, తల వంచి తన ఆత్మను అప్పగించాడు.
\s5
\v 31 అది పండగ సిద్ధపాటు రోజు. సబ్బాతు రోజున (ఎందుకంటే సబ్బాతు చాలా ప్రాముఖ్యమైన రోజు) దేహాలు సిలువ మీదే ఉండిపోకూడదు కాబట్టి, వాళ్ళ దేహాలు అక్కడ వేలాడకుండా, వాళ్ళ కాళ్ళు విరగగొట్టి, వాళ్ళని కిందకి దింపమని యూదులు పిలాతును అడిగారు.
\v 32 కాబట్టి సైనికులు వచ్చి, యేసుతోకూడా సిలువ వేసిన మొదటి వాని కాళ్ళు, రెండవవాని కాళ్ళు విరగగొట్టారు.
\v 33 వాళ్ళు యేసు దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన అప్పటికే చనిపోయాడని గమనించి, ఆయన కాళ్ళు విరగగొట్టలేదు.
\s5
\p
\v 34 అయితే, సైనికులలో ఒకడు ఈటెతో ఆయన డొక్కలో పొడిచాడు. వెంటనే రక్తం, నీళ్లు బయటకు వచ్చాయి.
\v 35 ఇదంతా చూసినవాడు సాక్ష్యం ఇస్తున్నాడు. అతని సాక్ష్యం సత్యం. అతను చెప్పింది సత్యం అని అతనికి తెలుసు. ఇది మీరు కూడా నమ్మడానికే.
\s5
\v 36 "అతని ఎముకల్లో ఒక్కటైనా విరగదు" అన్న లేఖనం నెరవేరేలా ఇవి జరిగాయి.
\v 37 "వాళ్ళు తాము పొడిచిన వాని వైపు చూస్తారు," అని మరొక లేఖనం చెబుతూ ఉంది.
\s సమాధి (మత్తయి 27: 57-60; మార్కు 15: 43- 47; లూకా 23: 50-56)
\s5
\p
\v 38 ఆ తరువాత, యూదులకు భయపడి రహస్యంగా యేసుకు శిష్యుడిగా ఉన్న అరిమతయియ యోసేపు, యేసు దేహాన్ని తాను తీసికొని వెళ్తానని పిలాతును అడిగాడు. పిలాతు అందుకు ఒప్పుకున్నాడు. కాబట్టి యోసేపు వచ్చి యేసు దేహాన్ని తీసుకొని వెళ్ళాడు.
\v 39 మొదట్లో రాత్రి సమయంలో ఆయన దగ్గరకు వచ్చిన నికోదేము కూడా ఇంచుమించు ముప్పై ఐదు కిలోల బోళం, అగరుల మిశ్రమం తనతో తీసుకొని వచ్చాడు.
\s5
\v 40 వాళ్ళు యేసు దేహాన్ని తీసుకొని వచ్చి సుగంధ ధ్రవ్యాలతో, నార బట్టలో చుట్టారు. ఇది యూదులు దేహాలను సమాధి చేసే సాంప్రదాయం.
\v 41 ఆయన్ని సిలువ వేసిన ప్రాంగణంలో ఉన్న తోటలో, అంత వరకు ఎవరినీ పాతిపెట్టని కొత్త సమాధి ఉంది.
\v 42 ఆ సమాధి దగ్గరగా ఉంది కాబట్టి, ఆ రోజు యూదులు సిద్ధపడే రోజు కాబట్టి, వాళ్ళు యేసును అందులో పెట్టారు.
\s5
\c 20
\s యేసుక్రీస్తు పునరుత్థానం (మత్తయి 28: 1-10; మార్కు 16: 1- 14; లూకా 24: 1-43)
\p
\v 1 ఆదివారం ఉదయాన్నే ఇంకా చీకటిగా ఉండగానే మగ్దలేనే మరియ సమాధి దగ్గరకు వచ్చింది. అక్కడ సమాధి పైన ఉంచిన రాయి తీసి ఉండటం చూసింది.
\v 2 కాబట్టి ఆమె సీమోను పేతురు దగ్గరకూ, యేసు ప్రేమించిన మరో శిష్యుడి దగ్గరకూ పరుగెత్తుకుని వెళ్ళింది. వారితో, "ప్రభువుని ఎవరో సమాధిలోనుండి తీసుకొని పోయారు. ఆయనను ఎక్కడ ఉంచారో తెలియడం లేదు" అని చెప్పింది.
\s5
\v 3 కాబట్టి పేతురూ, ఆ మరో శిష్యుడూ వెంటనే బయలుదేరి సమాధి దగ్గరకు వచ్చారు.
\v 4 వాళ్ళిద్దరూ కలసి వెళుతుండగా ఆ మరో శిష్యుడు పేతురు కంటే వేగంగా పరుగెత్తి మొదటగా సమాధి దగ్గరకు వచ్చాడు.
\v 5 అతడు ఆ సమాధి లోకి తొంగి చూశాడు. నార బట్టలు అతనికి కనిపించాయి. కానీ అతడు సమాధిలోకి ప్రవేశించ లేదు.
\s5
\v 6 అ తర్వాత సీమోను పేతురు అతని వెనకాలే వచ్చి నేరుగా సమాధిలోకి ప్రవేశించాడు.
\v 7 అక్కడ నారబట్టలు పడి ఉండటమూ, ఆయన తలకు కట్టిన రుమాలు నార బట్టలతో కాకుండా వేరే చోట చక్కగా చుట్టి పెట్టి ఉండటమూ చూశాడు.
\s5
\v 8 ఆ తర్వాత మొదట సమాధిని చేరుకున్న శిష్యుడు కూడా లోపలి వెళ్ళి చూసి విశ్వసించాడు.
\v 9 అయితే ‘ఆయన చనిపోయిన వారినుండి బతికి లేవడం తప్పనిసరి’ అన్న లేఖనం వాళ్ళింకా గ్రహించలేదు.
\v 10 అప్పుడు ఆ శిష్యులు తిరిగి తమ ఇళ్ళకు వెళ్ళిపోయారు.
\s యేసు మగ్దలేనే మరియకు ప్రత్యక్షం కావడం
\s5
\p
\v 11 కానీ మరియ సమాధి బయటే నిలబడి ఏడుస్తూ ఉంది. ఆమె సమాధిలోకి వంగి చూసింది.
\v 12 ఆమెకు ఇద్దరు దేవదూతలు కనిపించారు. వాళ్ళు తెల్లని బట్టలు వేసుకుని ఉన్నారు. యేసు దేహం ఉంచిన చోట ఒకడు తల వైపునా మరొకడు కాళ్ళ వైపునా కూర్చుని ఉన్నారు.
\v 13 వాళ్ళు మరియతో "అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడిగారు. దానికి ఆమె, "ఎవరో నా ప్రభువును తీసుకు వెళ్ళిపోయారు. ఆయనను ఎక్కడ ఉంచారో తెలియడం లేదు" అంది.
\s5
\v 14 ఆమె ఇలా పలికి వెనక్కి తిరిగి అక్కడ యేసు నిలబడి ఉండటం చూసింది. కానీ ఆయనను ఆమె గుర్తు పట్ట లేదు.
\v 15 యేసు "అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవర్ని వెదకుతూ ఉన్నావు?" అని ఆమెను అడిగాడు. ఆమె ఆయన్ను తోటమాలి అనుకుంది. "అయ్యా, ఒకవేళ నువ్వు ఆయన్ను తీసుకు వెళ్తే ఆయన్ను ఎక్కడ ఉంచావో చెప్పు. నేను ఆయన్ను మోసుకొని వెళ్తాను" అంది.
\s5
\p
\v 16 అప్పుడు యేసు ఆమెను చూసి, "మరియా" అని పిలిచాడు. ఆమె ఆయన వైపుకు తిరిగి "రబ్బూనీ" అని పిలిచింది. రబ్బూనీ అనే మాటకు హీబ్రు భాషలో ఉపదేశకుడు అని అర్ధం.
\v 17 యేసు ఆమెతో, "నేను ఇంకా తండ్రి దగ్గరకు ఎక్కి పోలేదు. కాబట్టి నన్ను తాకవద్దు. కానీ నా సోదరుల దగ్గరకు వెళ్లి నా తండ్రీ, మీ తండ్రీ, నా దేవుడూ, మీ దేవుడూ అయిన ఆయన దగ్గరకు ఆరోహణం అవుతున్నానని వారికి చెప్పు" అన్నాడు.
\v 18 మగ్దలేనే మరియ వచ్చిశిష్యులతో, "నేను ప్రభువును చూశాను. ఆయన నాతో ఈ మాటలు చెప్పాడు" అంటూ ఆయన మాటలన్నీ వారికి తెలియజెప్పింది.
\s తోమా లేనప్పుడు యేసు తన శిష్యులకు ప్రత్యక్షం కావడం (లూకా 24: 36- 49)
\s5
\p
\v 19 ఆదివారం సాయంకాలం యూదులకు భయపడి శిష్యులు తామున్న ఇంటి తలుపులు మూసుకుని ఉన్నారు. అప్పుడు యేసు వచ్చి వారి మధ్యలో నిలబడి, వారితో, "మీకు శాంతి కలుగుతుంది గాక" అన్నాడు.
\v 20 ఆయన అలా చెప్పిన తర్వాత వారికి తన పక్కనూ చేతుల్నీ చూపించాడు. వారు అది చూసి ఎంతో సంతోషించారు.
\s5
\v 21 అప్పుడు యేసు తిరిగి, "మీకు శాంతి కలుగుతుంది గాక!. తండ్రి నన్ను పంపించిన విధంగానే నేనూ మిమ్మల్ని పంపుతున్నాను" అని వారితో చెప్పాడు.
\v 22 ఈ మాట చెప్పిన తర్వాత ఆయన వారి మీద ఊది, "పరిశుద్ధాత్మను పొందండి.
\v 23 మీరు ఎవరి పాపాల్ని క్షమిస్తారో వారి పాపాలకు క్షమాపణ ఉంటుంది. ఎవరి పాపాలు ఉండనిస్తారో అవి అలా నిలిచి ఉంటాయి " అని చెప్పాడు.
\s తోమా ఉండగా యేసు తన శిష్యులకు ప్రత్యక్షం కావడం
\s5
\p
\v 24 పన్నెండుమంది శిష్యులలో ఒకడైన తోమా యేసు వచ్చినప్పుడు వాళ్ళతో లేడు.
\v 25 మిగిలిన శిష్యులు, "మేం ప్రభువును చూశాం" అని అతడితో చెప్పారు. అప్పుడు అతడు "నేను ఆయన మేకుల గుర్తును చూడాలి. నావేలు ఆ గాయపు రంధ్రం లో ఉంచాలి. అలాగే నేను నా చేతిని ఆయన పక్కలో ఉంచాలి. అప్పుడే నేను నమ్ముతాను" అన్నాడు.
\s5
\v 26 ఎనిమిది రోజులైన తర్వాత మరల ఆయన శిష్యులు లోపల ఉన్నారు. ఈసారి తోమా కూడా వాళ్ళతో ఉన్నాడు. తలుపులు మూసుకుని ఉన్నాయి. అప్పుడు యేసు వాళ్ళ మధ్యకు వచ్చి, " మీకు శాంతి కలుగు గాక!" అన్నాడు.
\v 27 తర్వాత ఆయన తోమాను చూసి, "నీ వేలు ఇలా చాచి నా చేతిని చూడు. అలాగే నీ చెయ్యి చాచి నా పక్కలో పెట్టు. విశ్వాసిగా ఉండు. అవిశ్వాసివి కావద్దు" అన్నాడు.
\s5
\v 28 దానికి జవాబుగా తోమా, "నా ప్రభూ, నా దేవా" అన్నాడు.
\v 29 అప్పుడు యేసు, "నువ్వు నన్ను చూసి నమ్మావు. అయితే నన్ను చూడకుండానే నమ్మిన వాళ్ళు ధన్యులు" అన్నాడు.
\s యోహాను సువార్త రాసిన కారణం
\s5
\p
\v 30 యేసు క్రీస్తు ఇంకా అనేకమైన అద్భుతాలను తన శిష్యుల ముందు చేశాడు. వాటన్నిటినీ ఈ పుస్తకంలో రాయలేదు.
\v 31 కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మడానికీ నమ్మి ఆయన పేరులో జీవం పొందడానికీ ఇవన్నీ రాయడం జరిగింది.
\s5
\c 21
\s ఉత్థానం చెందిన క్రీస్తు మన సేవకు యజమాని
\p
\v 1 ఆ తర్వాత తిబెరియ సముద్రం ఒడ్డున యేసు తనను మరోసారి కనపరచు కున్నాడు. ఎలాగంటే
\v 2 సీమోను పేతురూ, దిదుమ అనే పేరున్న తోమా, గలిలయలోని కానా ఊరివాడైన నతనయేలూ, జెబెదయి కొడుకులూ, ఇంకా ఆయన శిష్యులలో మరో ఇద్దరూ కలిసి ఉన్నారు.
\v 3 సీమోను పేతురు, "నేను చేపలు పట్టడానికి వెళ్తున్నా" అన్నాడు. మిగిలిన వాళ్ళు, "మేం కూడా నీతో వస్తాం" అన్నారు. వాళ్ళంతా పడవ ఎక్కి వెళ్ళారు. కానీ ఆ రాత్రి వాళ్ళు ఏమీ పట్టలేదు.
\s5
\v 4 తెల్లవారింది. యేసు ఒడ్డున నిలబడి ఉన్నాడు. కానీ ఆయన యేసు అని శిష్యులు గుర్తు పట్టలేదు.
\v 5 యేసు "పిల్లలూ, తినడానికి మీ దగ్గర ఏమైనా ఉందా?" అని వారిని అడిగాడు.
\v 6 వాళ్ళు "ఏమీ లేదు" అన్నారు. అప్పుడాయన, "పడవకు కుడి వైపున వలలు వేయండి. మీకు చేపలు దొరుకుతాయి" అన్నాడు. కాబట్టి వాళ్ళు అలాగే చేశారు. చేపలు నిండుగా పడ్డాయి. దాంతో వాళ్ళు వలను లాగలేకపోయారు.
\s క్రీస్తు కనుసన్నల్లో సేవ, ఫలితం
\s5
\p
\v 7 అప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు, "ఆయన ప్రభువు!" అని పేతురుతో చెప్పాడు. ఆయన ప్రభువని సీమోను పేతురు వినగానే తీసివేసిన పైబట్ట మళ్ళీ వేసుకుని సముద్రంలో దూకాడు.
\v 8 ఒడ్డుకి ఇంకా రెండు వందల మూరల దూరం మాత్రమే ఉంది. కాబట్టి మిగిలిన శిష్యులు చేపలు ఉన్న వలని లాగుతూ ఆ చిన్న పడవలో వచ్చారు.
\v 9 ఒడ్డుకి రాగానే వాళ్ళకు అక్కడ నిప్పులూ, వాటిపైన ఉన్న చేపలూ, రొట్టే కనిపించాయి.
\s5
\v 10 అప్పుడు యేసు, "ఇప్పుడు మీరు పట్టిన చేపలలో కొన్ని తీసుకుని రండి" అని వాళ్లకు చెప్పాడు.
\v 11 సీమోను పేతురు పడవ ఎక్కి వలను ఒడ్డుకి లాగాడు. దాంట్లో 153 పెద్ద చేపలున్నాయి.
\s తన సేవకుల అవసరాలు తీర్చే యజమాని (లూకా 22: 35; ఫిలిప్పీ 4: 19)
\s5
\p
\v 12 అన్ని చేపలు పడినా వల మాత్రం పిగిలి పోలేదు. అప్పుడు యేసు, "రండి, భోజనం చేయండి" అని వారిని పిలిచాడు. అప్పటికి ఆయన ప్రభువని వాళ్ళకు తెలిసి పోయింది కాబట్టి "నువ్వు ఎవరు" అని అడిగే సాహసం ఎవరూ చేయలేదు.
\v 13 యేసు వచ్చి ఆ రొట్టెను తీసికొని వారికి పంచి పెట్టాడు. అలాగే చేపలు కూడా ఇచ్చాడు.
\v 14 యేసు చనిపోయి సజీవుడిగా లేచిన తర్వాత శిష్యులకి ప్రత్యక్షం కావడం ఇది మూడోసారి.
\s సేవకు ఉండవలసిన ఒకే ఒక ఆమోదయోగ్యమైన ప్రేరణ (2 కొరింతి 5: 14; ప్రకటన 2: 4- 5)
\s5
\p
\v 15 వాళ్ళంతా భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, "యెహాను కొడుకువైన సీమోనూ, వీళ్ళకంటె నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?" అని ప్రశ్నించాడు. అతడు, "అవును ప్రభూ, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు" అన్నాడు. దానికి యేసు, "నా గొర్రెల్ని మేపు" అని అతనితో చెప్పాడు.
\v 16 మరోసారి ఆయన, "యోహాను కొడుకువైన సీమోనూ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?" అని అతణ్ణి అడిగాడు. అతడు "అవును ప్రభూ, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు" అన్నాడు. దానికి యేసు, "నా గొర్రెలకు కాపరిగా ఉండు" అన్నాడు.
\s5
\p
\v 17 ఆయన మూడోసారి, "యోహాను కొడుకువైన సీమోనూ, నన్ను ప్రేమిస్తున్నావా?" అని అడిగాడు. ఇలా ‘నన్ను ప్రేమిస్తున్నావా’ అని మూడోసారి తనను అడిగినందుకు పేతురు ఇబ్బంది పడి "నీకు సమస్తమూ తెలుసు. నిన్ను ప్రేమిస్తున్నానని నీకు బాగా తెలుసు" అన్నాడు.
\s తన సేవకుని మరణ సమయం విధానం యజమాని నిర్ణయించడం
\p
\v 18 అప్పుడు యేసు, "నా గొర్రెలను మేపు. నువ్వు యువకుడిగా ఉన్నప్పుడు నీ అంతట నువ్వే నీ నడుం కట్టుకుని నీకిష్టమైన స్థలాలకు తిరిగే వాడివి. ఖచ్చితంగా నీకు చెప్తున్నాను. నువ్వు ముసలి వాడివి అయినప్పుడు నువ్వు నీ చేతులు చాపుతావు. వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టం లేని చోటికి నిన్ను మోసుకొని వెళ్తాడు" అని అతనితో చెప్పాడు.
\s5
\v 19 దేవుని మహిమ కోసం అతడు ఎలాంటి మరణం పొందుతాడో దానిని సూచిస్తూ ఆయన ఈ మాటలు చెప్పాడు. ఇలా చెప్పి ఆయన "నాతో రా" అని అతనితో అన్నాడు.
\s5
\p
\v 20 పేతురు వెనక్కి తిరిగి యేసు ప్రేమించిన వాడూ, పస్కా పండుగ సందర్భంలో భోజన సమయంలో ఆయన పక్కనే కూర్చుని ఆయన ఛాతీని ఆనుకుంటూ, "ప్రభూ నిన్ను పట్టిచ్చేది ఎవరు" అని అడిగిన శిష్యుడు తమ వెనకే రావడం చూశాడు.
\v 21 పేతురు అతణ్ణి చూసి, "ప్రభూ, మరి ఇతడి విషయం ఏమవుతుంది?" అని ఆయన్ని అడిగాడు.
\s5
\v 22 దానికి యేసు "నేను వచ్చే వరకూ అతడు జీవించి ఉండటం నాకిష్టమైతే నీకేమిటి? నువ్వు నన్ను అనుసరించు" అన్నాడు.
\v 23 దాంతో ఆ శిష్యుడు మరణించడు అనే మాట శిష్యులలో పాకి పోయింది. అయితే అతడు మరణించడు అని యేసు చెప్పలేదు గానీ నేను వచ్చే వరకూ అతడు ఉండటం నాకిష్టమైతే నీకేంటి, అని మాత్రమే అన్నాడు.
\s5
\v 24 ఈ సంగతులను గురించి సాక్ష్యమిస్తూ ఇవన్నీ రాసింది ఈ శిష్యుడే. ఇతని సాక్ష్యం సత్యమని మనకు తెలుసు.
\v 25 యేసు చేసిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ వివరించి రాసే గ్రంథాలకు ఈ భూలోకం సరిపోదని నాకు అనిపిస్తుంది.