# ప్రకటన 11 సాధారణ అంశములు ## విభజన, క్రమం కొన్ని అనువాదాలు చదవడానికి సులువుగా ఉండటానికి కవిత్వంలోని ప్రతి పంక్తిని మిగిలిన వచనం కంటే కుడి వైపుకు అమర్చుతాయి. యుఎల్టి(ULT) తర్జుమా ఈ రీతిగా 15వ వచనం మరియు 17-18 వచనాలలో చేసియున్నారు. ## శ్రమ ప్రకటన గ్రంథములో యోహాను అనేకమైన “శ్రమలను” గూర్చి వివరించుచున్నాడు. 8వ అధ్యాయం ఆఖరి భాగములో చెప్పబడిన రెండవ, మూడవ “శ్రమను” ఈ అధ్యాయం వివరిస్తుంది. ## ఈ అధ్యాయంలోని విశేషమైన అంశములు ### అన్యులు “అన్యులు” అనే పదం ఇక్కడ దేవుడిని ఎరుగని ప్రజలను సూచిస్తుంది, క్రైస్తవ అవిశ్వాసులను సూచించుటలేదు. (చూడండి: [[rc://*/tw/dict/bible/kt/godly]]) ### ఇద్దరు సాక్ష్యులు ఈ ఇద్దరు సాక్ష్యులను గూర్చి పండితులు అనేక విధములైన ఆలోచనలను చెప్పియున్నారు. అనువాదకులు దీనిని తర్జుమా చేయడానికి దీనిని అర్థం చేసుకోవలసిన అవసరం లేదు. (చూడండి: [[rc://*/tw/dict/bible/kt/prophet]]) ### అడుగు భాగము లేని అగాధము ప్రకటన గ్రంథములో ఈ చిత్రము అనేక మార్లు కనబడుచున్నది. తప్పించుకోలేని నరకము ఒకవైపు మరియు దానికి ఎదురుగా పరలోకమున్నట్లు అది చిత్రీకరించి ఉంది. (చూడండి: [[rc://*/tw/dict/bible/kt/hell]])