# ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 03 సాధారణ విషయాలు ## నిర్మాణము మరియు క్రమపరచుట ### ”నేను ప్రార్థిస్తాను” పౌలు ఈ అధ్యాయములో ఒక భాగమును దేవునికి స్తుతి ప్రార్థనగా చేసియున్నాడు. అయితే, పౌలు కేవలము దేవునితో మాట్లాడుటలేదు. ఆయన ఎఫెసిలోని సంఘమునకు ప్రార్థిస్తూ బోధ చేయుచున్నాడు. ## ఈ అధ్యాయములో ప్రత్యేకమైన అంశాలు ### రహస్యము పౌలు సంఘమును ఒక “రహస్యముగా” సూచించుచున్నాడు.దేవుని ప్రణాళికలో సంఘము యొక్క పాత్ర ఒకసారి కూడా చెప్పబడలేదు. కాని దేవుడు దానిని ఇప్పుడు బయలుపరచియున్నాడు. ఈ రహస్యములో భాగము ఏమనగా దేవుని ప్రణాళికలలో యూదులతోపాటు సమానముగా అన్యులను ఉంచుటయైయున్నది.E