# కొలస్సయులకు వ్రాసిన పత్రిక 03 సాధారణ విషయాలు ## నిర్మించుట మరియు క్రమపరచుట ఈ అధ్యయము యొక్క రెండవ భాగము ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 5 మరియు 6వ అధ్యాయములకు సమాంతరంగా ఉంటుంది. ### ఈ అధ్యాయములోని ప్రత్యేకమైన అంశాలు #### పాత మరియు నూతన స్వభావము పాత మరియు నూతన స్వభావము అనేది పాత మరియు క్రొత్త మనిషి అని ఒకే అర్థం కలిగియుండును. “పాత మనిషి” అనే పదము పుట్టుకతో పాప స్వభావము కలిగియున్న ఒక వ్యక్తిని సూచించుచుండవచ్చు. “నూతన మనిషి” అనే పదము క్రీస్తును విశ్వసించిన తరువాత దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చే నూతన స్వభావము లేక నూతన జీవితమును సూచించుచున్నది. (చూడండి: [[rc://*/tw/dict/bible/kt/sin]] మరియు [[rc://*/tw/dict/bible/kt/faith]]) ### ఈ అధ్యాయములో ఎదురైయే ఇతర తర్జుమా ఇబ్బందులు #### ప్రవర్తన ఒక వ్యక్తి తన ఆచరణలతో కాకుండా తన ప్రవర్తన ద్వారా దేనినైన వెంబడించాలని లేక తప్పించుకోవాలని పౌలు తన చదువరులకు చెప్పుచున్నాడు. ఇందువలన, తర్జుమా చేయుటకు వారికి ఇబ్బందులు కలుగవచ్చు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-abstractnouns]]) #### “పైనున్న వాటిని” దేవుడు నివసించు ప్రదేశమును సూచించుటకు అనేక మార్లు “పైన” అని సంబోధించబడియున్నది. “పైనున్న వాటి మీద మీ మనస్సుంచండి” మరియు “పైనున్న వాటిని గూర్చి వెదకుడి” అని పౌలు చెప్పుచున్నాడు. క్రైస్తవులు పరలోక సంబంధమైన వాటిని మరియు దైవిక సంబంధమైనవాటిని వేదకాలని మరియు వాటిపై తమ మనస్సులను ఉంచాలని అతడు చెప్పుచున్నాడు.