# అపొస్తలుల కార్యములు 08 సాధారణ విషయాలు ## నిర్మాణము మరియు క్రమము చదవడానికి చాలా సులభముగా ఉండుటకు ప్రతి పంక్తిని పద్యభాగ రూపములో కొన్ని తర్జుమాలలో అమర్చియున్నారు. 8:32-33 వచనభాగములో పాతనిబంధననుండి తీసిన వ్యాఖ్యలను పద్యభాగ రూపములో యుఎల్.టి అనువాదం చేసింది. 1వ వచనముయొక్క మొదటి వాక్యము 7వ అధ్యాయములోని సంఘటనల వివరములతో ముగుస్తుంది. “ఆరంభించబడిన ఆ రోజునుండి” అనే పదాలతో తన చరిత్ర నూతన భాగమును లూకా ఆరంభిస్తున్నాడు. ## ఈ అధ్యాయములో విశేషమైన అంశాలు లేక ఉద్దేశములు ### పరిశుద్ధాత్మను పొందుకొనుట ఈ అధ్యాయములో లూకా మొట్ట మొదటిసారిగా ప్రజలు పరిశుద్ధాత్మను పొందుకొనుటనుగూర్చి మాట్లాడుచున్నాడు ([అపొ.కార్య.8:15-19] (../08/15.ఎం.డి)). పరిశుద్ధాత్ముడే ఇప్పటికే విశ్వాసులు భాషలు మాట్లాడునట్లు, రోగులను స్వస్థపరచునట్లు మరియు ఒక వర్గముగా జీవించునట్లు వారిని బలపరచియున్నాడు, మరియు ఆయన స్తెఫెనును నింపియుండెను. అయితే యూదులు విశ్వాసులను చెరసాలలో వేయించుటను ఆరంభించినప్పుడు, ఆ విశ్వాసులలో యెరూషలేమును విడిచి వెళ్ళగలిగినవారు విడిచి వెళ్లిపోయిరి, మరియు వారు వెళ్ళిన ప్రతిచోట, వారు యేసును గూర్చి చెప్పిరి. యేసును గూర్చి వినిన ప్రజలందరూ పరిశుద్ధాత్మను పొందుకొనిరి, ఆ ప్రజలు నిజముగా విశ్వాసులుగా మార్పు చెందియున్నారని సంగతి సంఘ నాయకులు ఎరుగుదురు. ### ప్రకటించబడెను అపొస్తలుల కార్యముల గ్రంథములో ఇతర అధ్యాయములకంటే ఈ అధ్యాయము విశ్వాసులు వాక్యము ప్రకటించుట, సువార్తను ప్రకటించుట, మరియు యేసు క్రీస్తని ప్రకటించుటను గూర్చి మాట్లాడుచున్నది. “ప్రకటన” అనే పదము గ్రీకు పదమునుండి తర్జుమా చేయబడింది, దీనికి అర్థము దేనినిగూర్చియైన శుభవార్తను తెలియజేయుటయైయున్నది.