# తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 03 సాధారణ అంశాలు ## నిర్మాణము మరియు క్రమపరచుట [1 తిమోతి.3:16] (./16.md) వచనము బహుశః పాటనో లేక పద్యమో అయ్యుండవచ్చును, లేక విశ్వాసులందరూ పంచుకొనదగిన ప్రామఖ్యమైన సిద్ధాంతముల పట్టికకు ఆదిమ సంఘము ఉపయోగించే ప్రధానాంశమైయుండవచ్చును. ## ఈ అధ్యాయములో విశేషమైన అంశాలు ### పెద్దలు మరియు పరిచారకులు సంఘము సంఘ నాయకులకొరకు విభిన్నమైన బిరుదులను ఉపయోగించియున్నది. కొన్ని బిరుదులు లేక బాధ్యతలలో పెద్ద, సంఘకాపరి, మరియు అధ్యక్షుడు అనేవి కూడా ఉన్నాయి. “పెద్ద” అనే పదముకు అర్థము 1-2వచనములలోని మూల భాషలో కనబడును. పౌలు 8 మరియు 12వ వచనములలోని “పరిచారకులను” గూర్చి సంఘములోని ఇంకొక సంఘ నాయకులుగా వ్రాయుచున్నాడు. ## ఈ అధ్యాయములో తర్జుమాపరమైన కీలక విషయాలు ### ప్రవర్తనకు సంబంధించిన అర్హతలు లేక గుణలక్షణములు పురుషుడు సంఘములో పెద్దగాను లేక పరిచారకుడిగాను ఉండగోరినట్లయితే ఆ పురుషుడు కలిగియుండవలసిన అనేక అర్హతలను ఈ అధ్యాయము బోధించుచున్నది. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-abstractnouns]])