# 1 థెస్సలొనీకయులు 04 సాధారణ గమనికలు ## ఈ అధ్యాయంలోని ప్రత్యేక అంశాలు ### లైంగిక అనైతికత వివిధ సంస్కృతులు లైంగిక నైతికత విషయంలో భిన్నమైన ప్రమాణాలను కలిగి ఉంటాయి. ఈ విభిన్న సాంస్కృతిక ప్రమాణాలు ఈ భాగాన్ని తర్జుమా చేయడాన్ని కష్టతరం చేస్తాయి. సాంస్కృతిక నిషేధాల గురించి అనువాదకులు కూడా అప్రమత్తులై ఉండాలి. ఇవి చర్చించటానికి అనుచితమైన అంశాలు. ### క్రీస్తు తిరిగి రాకముందే మరణించడం ప్రారంభ సంఘంలో, క్రీస్తు తిరిగి రాకముందే విశ్వాసి మరణిస్తే ఏమి జరుగుతుందో అని ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేసేవారు. క్రీస్తు తిరిగి రాకముందే చనిపోయేవారు దేవుని రాజ్యంలో భాగమేనా అని వారు భయపడి ఉండవచ్చు. పౌలు ఆ ఆందోళనకు సమాధానమిచ్చాడు. ### ""ఆకాశమండలంలో ప్రభువును కలవడానికి మేఘాలపై తీసుకెళ్లబడడం"" ఈ భాగం యేసు తనను నమ్మిన వారిని తనను తాను పిలిచే సమయాన్ని సూచిస్తుంది. ఇది క్రీస్తు యొక్క చివరి అద్భుతమైన రాకడని సూచిస్తుందా లేదా అనే దానిపై పండితులు విభేదిస్తున్నారు. (చూడండి: [[rc://*/tw/dict/bible/kt/believe]])