# 1వ యోహాను పత్రిక 05వ అధ్యాయములోని సాధారణ గమనికలు ## ఈ అధ్యాయములోని ప్రత్యేక అంశాలు ### దేవునినుండి పుట్టిన పిల్లలు మనుష్యులు విశ్వసించినప్పుడు, దేవుడు వారిని తన పిల్లలుగా చేసి వారికి నిత్యజీవమును ఇస్తాడు. (చూడండి: [[rc://*/tw/dict/bible/kt/believe]]) ### క్రైస్తవ జీవితం యేసును విశ్వసించే ప్రజలు దేవుని ఆజ్ఞలను పాటించాలి ఆయన పిల్లలను ప్రేమించాలి. ## ఈ అధ్యాయములో ఇతర తర్జుమా ఇబ్బందులు ### మరణము యోహాను ఈ అధ్యాయములో మరణం గురించి వ్రాసినప్పుడు, అతను శారీరిక మరణాన్ని తెలియపరుస్తున్నాడు. (చూడండి: [[rc://*/tw/dict/bible/other/death]]) ### “ప్రపంచమంతా చెడుతనముతో నిండియున్నది” “చెడుతనం” అనేది సాతాను అని తెలియచేస్తుంది.ప్రపంచాన్ని పరిపాలించడానికి దేవుడు వాడికి అనుమతించాడు, కాని చివరికి దేవుడు ప్రతిదాన్ని నియంత్రణలో ఉంచుతాడు. దేవుడు తన పిల్లలను చెడుతనము నుండి కాపాడతాడు (చూడండి: [[rc://*/tw/dict/bible/kt/satan]])