te_tn/rom/07/intro.md

26 lines
3.2 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# రోమా 07 సాధారణ విషయాలు
## నిర్మాణము మరియు క్రమపరచుట
### “లేక మీరు ఎరుగరా”
ముందు ఉపదేశించిన బోధతోపాటు అనుబంధ విషయాలను కలుపుతూ క్రొత్త విషయాన్ని చర్చించుటకు పౌలు ఈ మాటను ఉపయోగించుచున్నాడు.
## ఈ అధ్యాయములో ప్రత్యేకమైన ఉద్దేశ్యాలు
### “మనము ధర్మశాస్త్రమునుండి విడుదల చేయబడియున్నాము”
మోషే ఇచ్చిన ధర్మశాస్త్రము ఎటువంటి ప్రభావము చూపించదని పౌలు వివరించుచున్నాడు. ఇది వాస్తవమైయుండగా, ధర్మశాస్త్రమునకు వెనకాల ఉన్నటువంటి దేవుని గుణలక్షణమును ప్రతిబింబింపజేస్తుంది. (చూడండి: [[rc://*/tw/dict/bible/kt/lawofmoses]])
## ఈ అధ్యాయములో ప్రాముఖ్యమైన అలంకారిక మాటలు
### వివాహము
లేఖనము సహజముగా వివాహమును ఒక రూపకలంకారముగా ఉపయోగించును. ఇక్కడ సంఘము మోషే ధర్మశాస్త్రముకు మరియు ఇప్పుడు క్రీస్తుకు ఎలా సంబంధము కలిగియున్నదని వివరించుటకు దీనిని వివరించుచున్నాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
## ఈ అధ్యాయములో తర్జుమాపరమైన ఇతర క్లిష్ట భాగములు
### శరీరము
ఇది సంక్లిష్టమైన విషయము. “శరీరము” అనే పదము మన పాప సంబంధమైన స్వభావముకు రూపకఅలంకారముగా ఉపయోగించబడియున్నది. మన భౌతిక సంబంధమైన శరీరములు పాపసంబంధమైనవని పౌలు బోధించుట లేదు. క్రైస్తవులు బ్రతికియున్నంత కాలము (“శరీరమందు జీవించు కాలము”), మనము పాపము చేస్తూనే ఉంటాము అని పౌలు బోధించునట్లుగా కనబడుతుంది. అయితే మన క్రొత్త స్వభావము మన పాత స్వభావముతో పోరాటము చేస్తూనే ఉంటుంది. (చూడండి: [[rc://*/tw/dict/bible/kt/flesh]] మరియు [[rc://*/tw/dict/bible/kt/sin]])