te_tn/rev/21/intro.md

24 lines
2.7 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# ప్రకటన 21 సాధారణ అంశములు
## విభజన మరియు క్రమం
క్రొత్త యేరుషలేమును గూర్చి ఈ అధ్యాయం వివరణాత్మకమైన చిత్రమును ఇచ్చుచున్నది.
## ఈ అధ్యాయములోని విశేషమైన అంశములు
### రెండవ మరణం
మరణం ఎడబాటులో ఒక విధమైనదిగా ఉన్నది. ఆత్మ శరీరములోనుండి వెళ్లిపోవటం, భౌతికమైన మొదటి మరణం. దేవుడి నుండి నిత్యము దూరము కావడం రెండవ మరణము. (చూడండి: [[rc://*/tw/dict/bible/other/death]] మరియు [[rc://*/tw/dict/bible/kt/soul]] మరియు [[rc://*/tw/dict/bible/kt/eternity]])
## ఈ అధ్యాయములోని ప్రాముఖ్యమైన అలంకార పదములు
### జీవగ్రంథము
ఇది నిత్య జీవముకు రూపకఅలంకారంగా ఉంది. నిత్యజీవం పొందేవారు తమ పేర్లు జీవగ్రంథములో వ్రాయబడియుండునని చెబుతారు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
## ఈ అధ్యాయములో ఎదురైయ్యె ఇతర తర్జుమా ఇబ్బందులు
### క్రొత్త ఆకాశము మరియు క్రొత్త భూమి
ఇది పూర్తిగా క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిగా ఉన్నదా లేక ప్రస్తుతం ఉన్న ఆకాశము మరియు భూమిని పునర్నిర్మించి ఉందా అనే విషయం అస్పష్టముగా ఉన్నది. నూతన యేరుషలేము విషయములోను అదే విధముగా ఉన్నది. బహుశ ఇది కొన్ని భాషల్లో తర్జుమాలకు ఇబ్బందులు కలుగజేయవచ్చు. “క్రొత్త” అనే పదం మూల భాషలో పాత దానికన్న శ్రేష్ఠమైనది మరియు వేరైనది అని అర్థమిచ్చుచున్నది. అది కాలం ప్రకారము క్రొత్తదిగా మారతుందని అర్థమివ్వడం లేదు.