te_tn/eph/04/intro.md

22 lines
2.7 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 04 సాధారణ అంశాలు
## నిర్మాణము మరియు క్రమపరచుట
కొన్ని తర్జుమాలలో పద్యభాగ పంక్తులను సులభముగా చదువుటకు వాక్యములోకాకుండా వాక్యభాగానికి కుడి ప్రక్కన పెట్టుదురు. 8వ వచనములోనున్న పాత నిబంధన వాక్యములను యుఎల్టి అలాగే చేసి పెట్టింది.
## ఈ అధ్యాయములో ప్రత్యేకమైన అంశాలు
### ఆత్మీయ వరాలు
క్రైస్తవులు యేసునందు విశ్వాసముంచిన తరువాత వారికందరికి పరిశుద్ధాత్ముడు ఇచ్చే అద్భుతముగా ఉండే విశేషమైన సామర్థ్యములే ఆత్మీయ వరాలు. ఈ ఆత్మీయ వరాలన్నియు సంఘమును వృద్ధి చేయుటకు పునాదియైయున్నవి. పౌలు ఇక్కడ కొన్ని ఆత్మీయ వరములను మాత్రమె పట్టిక చేసి చెప్పియున్నాడు. (చూడండి: [[rc://*/tw/dict/bible/kt/faith]])
### ఐక్యత
సంఘము ఐక్యముగా ఉండడమనేది చాలా ప్రాముఖ్యమని పౌలు ఎంచుచున్నాడు. ఇది ఈ అధ్యాయములో చాలా పెద్ద అంశము.
## ఈ అధ్యాయములో తర్జుమాపరమైన ఇతర క్లిష్ట భాగాలు
### పాత పురుషుడు మరియు నూతన పురుషుడు
“పాత పురుషుడు” అనే పదము బహుశః పాప స్వభావముతో జన్మించిన ఒక వ్యక్తిలో ఉండే పాప స్వభావమును సూచించును. “నూతన పురుషుడు” అనేది నూతన స్వభావమును లేక ప్రజలు క్రీస్తు విశ్వాసములోనికి వచ్చిన తరువాత దేవుడు వారికి ఇచ్చే నూతన జీవితమును సూచించును.