## **వివరణ** సభ్యోక్తి అంటే చావు, లేదా ఎవరికీ కనిపించకుండా చేసే ఇబ్బందికరమైన కటువైన సాంఘికంగా ఆమోదం అయితే మాటను ఒక మృదువైన, మర్యాదకరమైన రీతిలో చెప్పే పధ్ధతి. నిర్వచనం … అప్పుడే వాళ్ళు సౌలు, అతని కుమారులూ గిల్బోవ పర్వతంపై చనిపోయి పడి ఉండటం చూశారు. (1 దిన10:8 ULT) అంటే సౌలు అతని కొడుకులు చనిపోయారు. అయితే ముఖ్యమైన విషయం వాళ్ళు పడి ఉన్నారని కాదు, చనిపోయారన్నదే. ఇది సభ్యోక్తి. కొన్నిసార్లు మరణం అనేది అమంగళం కాబట్టి మనుషులు సూటిగా దానిని గురించి మాట్లాడరు. **కారణం ఇది అనువాద సమస్య** వివిధ భాషలు వివిధ సభ్యోక్తులు వాడతాయి. లక్ష్య భాషలో మూల భాషలో వాడిన సభ్యోక్తి లేకపోతే చదివే వారు అర్థం చేసుకోలేక పోవచ్చు. అక్కడున్న మాటలకు అక్షర అర్థాన్నే వారు తీసుకునే అవకాశం ఉంది. **బైబిల్ నుండి ఉదాహరణలు** … సౌలు మూత్ర విసర్జన కోసం వెళితే, దావీదు, అతని అనుచరులు ఆ గుహ లోపలి భాగంలో ఉన్నారు… (1 సమూయేలు 24:3 ULT) మొదటి శ్రోతలకు సౌలు మూత్రవిసర్జన కోసం గుహలోకి వెళ్ళాడు అనే అర్థం అవుతుంది. అయితే రచయిత చదివే వారికి అమర్యాదగా ఉండకూడదని స్పష్టంగా సౌలు ఇందుకోసం వెళ్ళాడో చెప్పడం లేదు. మరియ, “నేను కన్యను గదా, ఇదెలా జరుగుతుంది?” అంది. (లూకా 1:34 ULT) ఇక్కడ మర్యాద కోసం, మరియ తనకు పురుషునితో లైంగిక సంబంధం లేదు అని చెప్పడానికి సభ్యోక్తి వాడుతున్నది. **అనువాదం వ్యూహాలు** సభ్యోక్తి మీ భాషలో సహజం అయితే సరైన అర్థం ఇస్తుంటే దానిని వాడండి. అలా కాకుంటే కొన్ని ప్రత్యామ్నాయాలు ఇవి- 1. మీ సంస్కృతిలో ఉన్న సభ్యోక్తి వాడండి. 2. సభ్యోక్తి వాడక పొతే అక్కడ ఇచ్చిన సమాచారం కటువుగా ధ్వనిస్తుంటే సభ్యోక్తి వాడండి. **అన్వయించిన అనువాద వ్యూహాలకు ఉదాహరణలు** 1. మీ సంస్కృతిలో ఉన్న సభ్యోక్తి వాడండి. * … గుహ ఉన్నచోట సౌలు మూత్ర విసర్జనకు (1 సమూయేలు 24:3 ULT) – కొన్ని భాషలు ఇటువంటి సభ్యోక్తులను వినియోగిస్తాయి. * "అక్కడ ఒక గుహ ఉంది. గుంట తవ్వడానికి" సౌలు గుహలోనికి వెళ్ళాడు" * "అక్కడ ఒక గుహ ఉంది. ఒంటరిగా కొంత సమయం కలిగియుండడానికి సౌలు గుహలోకి వెళ్ళాడు." * మరియ దేవదూతతో ఇలా అంది. “ఇదెలా జరుగుతుంది? నాకు పురుషునితో లైంగిక సంబంధం లేదు కదా?” (లూకా 1:34 ULT) * మరియ దేవదూతతో ఇలా అంది. “ఇదెలా జరుగుతుంది నేను పురుషుణ్ణి ఎరగని దానిని కదా?” (ఇది గ్రీకు మూల భాషలో సభ్యోక్తి) 1. సభ్యోక్తితో పని లేకుండా ఆ సమాచారం అంత కటువైనది కాకపోతే సూటిగానే చెప్పండి. * \*\*సౌలు, అతని కొడుకులు గిల్బోవ పర్వతంపై పడి ఉన్నారు. \*\* (1 దిన 10:8 ULT) * "వారు సౌలును, అతని కొడుకులు గిల్బోవ పర్వతంపై చచ్చి పడి ఉండడం చూసారు.