ardhan_tel-x-ardhan_act_tex.../20/01.txt

1 line
1.0 KiB
Plaintext

\v 3 1.ఆ అల్లరి అణగిన తరువాత పౌలు శిష్యులను తన దగ్గరకు పిలువనంపించి హెచ్చరించిన తర్వాత వారియొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియకు వెళ్లుటకు బయలు దేరెను. 2.ఆ ప్రదేశములయందు సంచరించి, పెక్కుమాటలతో వారిని హెచ్చరించి గ్రీసునకు వచ్చెను. 3.అతడు అక్కడ మూడు నెలలు గడిపి ఓడయెక్కి సిరియకు వెళ్లవలెనని అనుకున్నాడు అతని విషయమై యూదులు కుట్ర చేయుచున్నందున మాసిదోనియమీదుగా తిరిగి రావలెనని నిశ్చయించుకున్నారు