mirror of https://git.door43.org/STR/te_iev
682 lines
150 KiB
Plaintext
682 lines
150 KiB
Plaintext
\id HEB - Indian Easy Version (IEV) Telugu
|
|
\ide UTF-8
|
|
\h హెబ్రీయులకు రాసిన పత్రిక
|
|
\toc1 హెబ్రీయులకు రాసిన పత్రిక
|
|
\toc2 హెబ్రీయులకు రాసిన పత్రిక
|
|
\toc3 heb
|
|
\mt1 హెబ్రీయులకు రాసిన పత్రిక
|
|
|
|
|
|
\s5
|
|
\c 1
|
|
\p
|
|
\v 1 పూర్వకాలంలో దేవుడు అనేక సమయాల్లో, అనేక విధాలుగా మన పూర్వికులతో మాట్లాడాడు. ఏమి చేయాలో, ఏమి మాట్లాడాలో, ఏమి రాయాలో తన ప్రవక్తలకు చెప్పాడు.
|
|
\v 2 అయితే ఈ చివరి రోజుల్లో దేవుడు తన సొంత కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఆ కుమారుణ్ణి అంతటికీ వారసుడిగా నియమించాడు. కుమారుని ద్వారా ఈ లోకాన్ని సృష్టించాడు.
|
|
\v 3 కుమారుణ్ణి చూడడం ద్వారా దేవుడు ఎంత అద్భుతమైనవాడో తెలుసుకోవచ్చు. దేవుడు నిజంగా ఎలాటి వాడో కుమారుడు చూపిస్తున్నాడు. ఆయన తన బల ప్రభావాల ద్వారా సమస్తాన్నీ నిర్వహిస్తున్నాడు. ప్రజల పాపాల కోసం ఆయన తనను తాను అర్పించుకున్న తరువాత, సజీవుడై తిరిగి లేచి దేవుడు రాజుగా ఏలుతున్న మహోన్నతమైన పరలోకంలో దేవుని పక్కన కూర్చున్నాడు.
|
|
\s5
|
|
\p
|
|
\v 4 ఆయన జరిగించి చూపిన గొప్ప కార్యం వల్ల దేవదూతల కంటే ఘనమైన స్థానం వారసత్వంగా పొంది "దేవుని కుమారుడు" అనే పేరు పొందాడు.
|
|
\v 5 "నువ్వు నా కుమారుడివి!
|
|
\q ఈ రోజు నేను నీ తండ్రినని ప్రకటిస్తున్నాను!"
|
|
\p అని దేవుడు ఏ దేవదూత గురించి అయినా చెప్పినట్టు లేఖనాల్లో ఎవ్వరూ రాయలేదు.
|
|
\s5
|
|
\p
|
|
\v 6 అంతేగాక, ఆయన తన ఏకైక కుమారుణ్ణి లోకంలోకి తీసుకువచ్చినప్పుడు,
|
|
\q "దేవదూతలందరూ కుమారుణ్ణి తప్పక ఆరాధించాలి" అంటూ ఆజ్ఞాపించడం ద్వారా కుమారుణ్ణి గౌరవించాడు.
|
|
\p
|
|
\v 7 లేఖనాల్లో ఆయన తన దూతల గురించి చెబుతూ,
|
|
\q "దేవుడు దూతలను వాయువులుగా,
|
|
\q తన సేవకులను అగ్నిజ్వాలలుగా చేసుకునేవాడు" అని పలికాడు.
|
|
\s5
|
|
\p
|
|
\v 8 అయితే దేవుడు తన కుమారుణ్ణి గురించి ఇంకా ఇలా అన్నాడు,
|
|
\q "నువ్వు కలకాలం పరిపాలించే రాజువు.
|
|
\q నీ పరిపాలన నీతి న్యాయాలతో నిండి ఉండేది."
|
|
\q
|
|
\v 9 నువ్వు ప్రజల నీతి కార్యాలను ప్రేమించి, వారి పాప క్రియలను అసహ్యించుకుంటావు.
|
|
\q కాబట్టి దేవా, నీవు ఆరాధించే నీ దేవుడు నీతో ఉన్నవారందరికంటే నీకు ఎక్కువ ఆనందం కలిగిస్తాడు.
|
|
\s5
|
|
\p
|
|
\v 10 కుమారుడు దూతల కంటే ఉన్నతుడు అని కూడా మనకు తెలుసు. ఎందుకంటే ఒకరు రాసినట్టు,
|
|
\q "ప్రభూ, ఆరంభంలో నువ్వు భూమిని సృష్టించావు.
|
|
\q ఆకాశంలో ఉండే నక్షత్రాలతో సహా విశ్వమంతటినీ నువ్వే నిర్మించావు.
|
|
\q
|
|
\v 11 ఇవేవీ శాశ్వతంగా నిలిచి ఉండేవి కావు, అయితే నువ్వు కలకాలం జీవించి ఉంటావు.
|
|
\q బట్టలు ఎలా మాసిపోతాయో అవి కూడా అలా మాసిపోతాయి.
|
|
\q
|
|
\v 12 పాత బట్టలను మార్చివేసినట్టు నువ్వు వాటిని చుట్టి పడేస్తావు.
|
|
\q ఒకడు కొత్త బట్టలు ధరించినట్టు,
|
|
\q నువ్వు విశ్వంలోని సమస్తాన్నీ నూతనంగా మారుస్తావు.
|
|
\q కానీ నువ్వు శాశ్వత కాలం ఒకేలా ఉంటావు!"
|
|
\s5
|
|
\p
|
|
\v 13 దేవుడు తన కుమారునితో చెప్పినట్టు ఎన్నడూ ఏ దూతతోనూ ఇలా చెప్పలేదు,
|
|
\q "నీ శత్రువులందరినీ ఓడించి నీ దాసులుగా చేస్తాను,
|
|
\q అతి ప్రాముఖ్యమైన నా తరువాతి స్థానంలో కూర్చుని నాతో కలిసి పరిపాలించు."
|
|
\p
|
|
\v 14 ఈ దూతలు కేవలం దేవుడు అనుగ్రహించిన రక్షణ పొంది శాశ్వత జీవం పొందబోయే విశ్వాసులకు పరిచర్య చేయడానికి దేవుడు వాగ్దానం ప్రకారం నియమించబడిన ఆత్మలు మాత్రమే.
|
|
|
|
\s5
|
|
\c 2
|
|
\p
|
|
\v 1 కాబట్టి దేవుని కుమారుణ్ణి గురించి మనం విన్న సంగతులపై మన నమ్మకం సన్నగిల్లిపోకుండా ఉండేందుకు ఆ విషయాలపై ఎక్కువ శ్రద్ధ నిలిపి ఉంచాలి.
|
|
\s5
|
|
\v 2 దేవదూతలు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పిన దేవుని చట్టాలు నమ్మదగినవి. వాటికి అవిధేయులైన ఇశ్రాయేలు ప్రజలు దేవుని శిక్షకు గురయ్యారు.
|
|
\v 3 మనం దేవుని నుండి తప్పించుకోలేం. ఆయన ఇచ్చిన ప్రాముఖ్యమైన రక్షణ సందేశాన్ని నిర్లక్ష్యం చేస్తే మనం తప్పక శిక్షకు గురౌతాం. ఆ సందేశాన్ని మొదట ప్రభువైన యేసే ప్రకటించాడు. అది విన్న ఆయన శిష్యులు దానిని రుజువు పరిచారు.
|
|
\v 4 విశ్వాసులు అద్భుతాలు, సూచక క్రియలు జరిగించడానికి తన శక్తి వారికి అనుగ్రహించడం ద్వారా దీన్ని ఖాయం చేశాడు. ఆయన కోరినట్టు పరిశుద్ధాత్మ కూడా కృపా వరాలు పంచి ఇచ్చాడు.
|
|
\s5
|
|
\p
|
|
\v 5 మనం మాట్లాడుతున్న ఈ రాబోతున్న లోకాన్ని దేవుడు దూతల ఆధీనంలో ఉంచలేదు.
|
|
\v 6 దీన్ని గూర్చి ఒక వ్యక్తి లేఖనాల్లో ఒకచోట ఇలా చెప్పాడు,
|
|
\q "నువ్వు మనిషి గురించి తలంచుకోవడానికి వాడు ఎంతటివాడు!
|
|
\q ఒక మనిషిని పట్టించుకోవడానికి అసలు వాడేపాటివాడు!
|
|
\s5
|
|
\q
|
|
\v 7 నువ్వు మనుషుల్ని దేవదూతలకంటే కొంచెం తక్కువగా చేశావు,
|
|
\q ప్రజలు తమ రాజుని గౌరవించినట్టు నువ్వు వాళ్ళని సన్మానించావు.
|
|
\q
|
|
\v 8 ప్రతిదానినీ వాళ్ళ ఆధీనంలో ఉంచావు."
|
|
\q మానవజాతి సమస్తాన్నీ పరిపాలిస్తుంది. అంటే మనిషి ఆధీనంలో లేకుండా ఏదీ లేదు. అయితే ఇప్పుడు సమస్తమూ మానవజాతి వశం కావడం మనం చూడడం లేదు.
|
|
\s5
|
|
\p
|
|
\v 9 అయితే దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేయబడిన యేసు మనకు తెలుసు. ఆయన హింసలు పొంది చనిపోయినందున దేవుడు ఆయనను అందరికంటే గొప్పవానిగా చేశాడు. యేసు అందరి కోసం చనిపోయాడు గనుక దేవుడు ఆయనను రాజుగా నియమించాడు. దేవుని కనికరం చొప్పున ఇదంతా జరిగింది.
|
|
\p
|
|
\v 10 సమస్తమూ ఆయన ద్వారా ఉనికిలో ఉన్నాయి, సమస్తమూ ఆయన వలన కలుగుతున్నాయి. అనేకమంది కుమారుల్ని మహిమలోకి తీసుకు రావడం కోసం వారి రక్షణ కర్తను ఆయన పొందే బాధల ద్వారా సంపూర్ణుణ్ణి చేయడం దేవుని సంకల్పం.
|
|
\s5
|
|
\v 11 సమస్తానికీ మూలమైన దేవుని వద్దకు ప్రజలను చేర్చడానికి, దేవుని ఎదుట పవిత్రులుగా ప్రకటించడానికి యేసు పని చేస్తున్నాడు. అలాంటి వారిని తన సొంత అన్నదమ్ములని, అక్కచెల్లెళ్ళని పిలవడానికి ఆయన ఏమాత్రం సంకోచించడు.
|
|
\v 12 క్రీస్తు దేవునితో పలికిన మాటలు కీర్తనకారుడు రాశాడు,
|
|
\q "నీ గొప్పదనాన్ని నేను నా సోదరులకు ప్రకటిస్తాను.
|
|
\q విశ్వాసుల సమాజం మధ్యలో నిన్ను స్తుతిస్తూ పాటలు పాడతాను."
|
|
\s5
|
|
\p
|
|
\v 13 మరో లేఖన భాగంలో వేరొక ప్రవక్త క్రీస్తు దేవుని గూర్చి పలికిన మాటలు రాసాడు,
|
|
\q "నేను ఆయనలో నమ్మకముంచుతాను."
|
|
\p వేరొక లేఖన భాగంలో,
|
|
\q "ఇదిగో, నేను, దేవుడు నాకిచ్చిన పిల్లలు" అని క్రీస్తు దేవునితో చెప్పినట్టు ఉన్నది.
|
|
\p
|
|
\v 14 కనుక దేవుడు తన కుమారులు అని పిలిచిన మనుషుల్లాగా యేసు కూడా మనిషిగా వచ్చాడు. మనుషులను మరణ భయానికి గురిచేసే శక్తి సాతానుకి ఉంది. యేసు తాను చనిపోయి, తిరిగి లేవడం ద్వారా మరణ బలం ఉన్న సాతానుని శక్తిహీనుడుగా చేశాడు.
|
|
\v 15 మరణ భయం నుండి మనలను విడిపించడానికి యేసు ఇలా చేశాడు.
|
|
\s5
|
|
\v 16 ఆయన దేవదూతలకు సహాయం చేయడానికి రాలేదు. తనపై విశ్వాసముంచిన అబ్రాహాముకు సహాయం చేసినట్టు మన కోసం వచ్చాడు.
|
|
\v 17 తన మానవ సోదరుల్లో ఒకడుగా, కచ్చితంగా మనలాంటి వాడిగానే దేవుడు యేసును చేశాడు. కరుణ గల ప్రధాన యాజకుడిగా ఉండడానికీ, ప్రజల పాపాలకు క్షమాపణ సాధించడానికీ ఆయన తన సోదరుల్లో ఒకడిగా మారాడు.
|
|
\v 18 యేసు శోధనలకు గురి అయి హింసలు సహించాడు గనుక శోధనలు ఎదుర్కొనేవారికి సహాయం చేయగల సామర్ధ్యం ఆయనకే ఉంది.
|
|
|
|
\s5
|
|
\c 3
|
|
\p
|
|
\v 1 నా తోటి విశ్వాసులారా, దేవుడు మిమ్మల్ని ఎన్నుకుని తన కోసం ఏర్పరచుకున్నాడు. యేసు విషయం గమనించండి. దేవుని అపోస్తలుడైన యేసు విశ్వాసులైన మనకందరికీ ప్రధాన యాజకుడుగా దేవుని సముఖంలో ఉన్నాడు.
|
|
\v 2 మోషే నమ్మకంగా దేవుని కుటుంబం అయిన ప్రజలకు సేవ చేసినట్టే ఈయన కూడా తనను నియమించిన దేవునికి నమ్మకంగా ఉన్నాడు.
|
|
\v 3 ఇప్పుడు ఎవరో ఒకరి ద్వారా ఇల్లు కట్టినట్టు దేవుడు సమస్తాన్నీ నిర్మించాడు. మోషే కంటే ఎక్కువ కీర్తి ప్రతిష్టలకు ఈయన యోగ్యుడిగా ఎంచబడ్డాడు.
|
|
\v 4 ఎందుకంటే నిర్మాణం అయిన ఇంటి కంటే దానిని నిర్మించిన వాడికే ఎక్కువ గౌరవం దక్కుతుంది.
|
|
\s5
|
|
\v 5 ఒక సేవకుడు తన యజమానికి నమ్మకంగా సేవ చేసినట్టు, మోషే దేవునికి నమ్మకంగా సేవ చేసి దేవుని ప్రజలకు సహాయం చేశాడు. దేవుడు భవిష్యత్తులో చెప్పే వాటికి సాక్షమివ్వడానికి మోషే ఒక సేవకుడిగా దేవుని ఇంట్లో నమ్మకమైనవాడుగా ఉన్నాడు.
|
|
\v 6 అయితే దేవుని కుమారుడిగా క్రీస్తు దేవుని ప్రజలను పరిపాలిస్తున్నాడు. దేవుడు మనకు వాగ్దానం చేసిన వాటిని పొందడానికి ఎదురుచూస్తూ క్రీస్తులో నమ్మకముంచి మనం ధైర్యంగా కొనసాగవచ్చు.
|
|
\s5
|
|
\p
|
|
\v 7 కాబట్టి పరిశుద్దాత్మ కీర్తనకారుణ్ణి ప్రేరేపించి ఇశ్రాయేలు ప్రజల గురించి లేఖనాల్లో ఇలా రాయించాడు:
|
|
\q "ఇప్పుడు దేవుడు చెబుతున్నది మీరు విన్నట్టయితే,
|
|
\v 8 అరణ్యంలో శోధన ఎదురైనప్పుడు తిరుగుబాటు చేసిన మీ పితరుల్లాగా మీ హృదయాలను కఠినం చేసుకోవద్దు."
|
|
\s5
|
|
\p
|
|
\v 9 అక్కడ మీ పితరులు మళ్ళీ మళ్ళీ నన్ను శోధించినప్పటికీ నేను వారిపట్ల సహనం వహించి, వారికి అనేక గొప్ప కార్యాలు చేశాను.
|
|
\p
|
|
\v 10 ఆ 40 సంవత్సరాల ప్రయాణ సమయంలో వారిపై నేను కోపం తెచ్చుకుని, "ఈ ప్రజలు నాపై ఎప్పుడూ విశ్వాసం చూపించలేదు. నేను వాళ్ళ జీవితాలను ఎలా నడిపించాలని కోరుకుంటున్నానో వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు."
|
|
\p
|
|
\v 11 అందువల్ల నేను వాళ్ళపై కోపంతో "వాళ్ళు విశ్రాంతిగా నివసించటానికి నేను వాళ్ళకు ఇస్తానని చెప్పిన కనాను ప్రదేశానికి వాళ్ళని చేరనివ్వను" అని ప్రకటించాను.
|
|
\s5
|
|
\p
|
|
\v 12 కాబట్టి సహోదరులారా, దేవునికి అవిధేయులయ్యేలా చేసే చెడ్డ తలంపులు మీ జీవితాలలో చొరబడకుండా ఉండేలా జాగ్రత్త వహించండి.
|
|
\v 13 ప్రతిరోజూ సమయం ఉండగానే మీరు ఒకరినొకరు ప్రోత్సహించుకోండి. అలా చెయ్యకపోతే మీలో కొందరు కఠిన మనస్కులై ఇతరులను పాపంలోకి నడిపించవచ్చు.
|
|
\s5
|
|
\p
|
|
\v 14 ఆరంభం నుండి మన అంతం వరకూ మనం క్రీస్తుపై మనకున్న స్థిర విశ్వాసంపై ఆధారపడి ఉండటం వల్ల మనం ఇప్పుడు క్రీస్తులో భాగస్వాములం అయ్యాం.
|
|
\v 15 లేఖనాల్లో దేవుడు కీర్తనకారుడి ద్వారా ఇలా చెబుతున్నాడు
|
|
\q "ఇప్పుడు మీరు నిర్ల్యక్షం చేయకుండా జాగ్రత్తగా నేను చెప్పే మాటలు వినండి. మీ పితరులు నాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు."
|
|
\s5
|
|
\p
|
|
\v 16 గుర్తుచేసుకోండి, దేవుడు తమతో పలికిన మాటలు విని కూడా ఆయనపై తిరుగుబాటు చేసిందెవరు? మోషే నాయకత్వంలో ఐగుప్తు నుండి బయటకు నడిచిన దేవుని ప్రజలే కదా.
|
|
\v 17 నలభై ఏళ్ళు దేవుడు ఎవరి మీద కోపగించుకున్నాడు? పాపం చేసిన దేవుని ప్రజల మీదనే కదా. వాళ్ళ శవాలను ఎడారిలోనే పాతిపెట్టారు.
|
|
\v 18 "నేను వాళ్ళను చేరుస్తానని చెప్పిన కనానులోనికి ఎన్నటికీ చేరుకోలేరు" అని దేవుడు ఎవరిని గూర్చి చెప్పాడు? తనకు అవిధేయులైన ఇశ్రాయేలు ప్రజల గురించే అని గుర్తు చేసుకోండి.
|
|
\v 19 దీన్ని బట్టి అవిశ్వాసం మూలంగానే వాళ్ళు ఆయన ఇస్తానని చెప్పిన వాగ్దాన భూమికి ప్రవేశించలేకపోయారని మనకు తెలుస్తుంది.
|
|
|
|
\s5
|
|
\c 4
|
|
\p
|
|
\v 1 దేవుడు మనకిచ్చిన నిత్య జీవంలో ప్రవేశం అనే వాగ్దానం ఇంకా కొనసాగుతూనే ఉంది. మీలో ఎవరైనా ఆ వాగ్దానం పొందకుండా వెనకబడి పోతారేమోనని జాగ్రత్త పడండి.
|
|
\v 2 ఇశ్రాయేలు ప్రజలు విన్న విధంగానే మనం కూడా దేవుణ్ణి గూర్చిన మాటలు, ఆయన చేసిన వాగ్దానం విన్నాం. అయితే ఈ సందేశం విన్నవాళ్ళు దేవునిపై విశ్వాసం ఉంచకుండా, లోబడకుండా ఉండడం వల్ల అది వాళ్లకు ఎలాంటి ప్రయోజనం కలిగించలేకపోయింది.
|
|
\s5
|
|
\p
|
|
\v 3 అవును, మనలో విశ్వసించే ప్రతివాడూ నిత్య రాజ్యంలో ప్రవేశిస్తాం. విశ్వసించని వాళ్లకు ప్రవేశం దక్కదు. ఎందుకంటే, "నేను ఇశ్రాయేలు ప్రజలపై కోపంగా ఉన్నాను. ఆ ప్రజలు నేను అనుగ్రహించే విశ్రాంతిలో ప్రవేశించరు" అని ఆయన దీన్ని గూర్చి చెప్పాడు. సృష్టి కార్యం ముగించిన తరువాత ఆయన ప్రణాళికలోని ఈ విశ్రాంతి స్థలం సిద్ధపరచానని దేవుడు చెప్పాడు.
|
|
\p
|
|
\v 4 ఆయన ఏడవ రోజున విశ్రాంతి తీసుకున్నాడని లేఖనాలు చెబుతున్నది నిజమే.
|
|
\q "దేవుడు తన పనులన్నీ ముగించి, ఏడవ రోజున విశ్రాంతి తీసుకున్నాడు."
|
|
\p
|
|
\v 5 అయితే నేను ఇంతకుముందు ప్రస్తావించిన విషయం మరొకసారి గమనించండి. ఆయన ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ.
|
|
\q "ఆ ప్రజలు నేను అనుగ్రహించే విశ్రాంతిలో ప్రవేశించరు" అని చెప్పాడు.
|
|
\s5
|
|
\p
|
|
\v 6 కాబట్టి దేవుని విశ్రాంతి కొందరు ప్రవేశించడానికి ఏర్పడిందన్నది స్పష్టం. అయితే దేవుని వాగ్దానం విన్న ఇశ్రాయేలు ప్రజలు దేవునిపై విశ్వాసం ఉంచడానికి నిరాకరించిన కారణంగా దానిలో ప్రవేశించలేక పోయారు.
|
|
\v 7 అయితే దేవుడు విశ్రాంతి స్థలంలోనికి ప్రవేశానికి మరొక సమయం సిద్ధం చేశాడు. ఆ సమయం నేడే! ఇది నిజమని మనకు తెలుసు. ఎందుకంటే, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో దేవునిపై తిరుగుబాటు చేసిన తరువాత, నేను ముందుగా ప్రస్తావించిన విధంగా ఆయన రాజైన దావీదు ద్వారా ఇలా రాయించాడు,
|
|
\q "నేడే మీ హృదయాలను కఠినపరచుకోకుండా ఆయన మాటకు లోబడండి."
|
|
\s5
|
|
\p
|
|
\v 8 ఒకవేళ యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకు విశ్రాంతి ఇవ్వగలిగితే దేవుడు మరొక విశ్రాంతి దినం గురించి చెప్పేవాడు కాదు. ఆయన వేరొక విశ్రాంతి గురించి వాగ్దానం చేశాడు.
|
|
\v 9 దేవుడు సృష్టి కార్యంలో తన పనులన్నీ చేసి ముగించి ఏడవ రోజున విశ్రాంతి తీసుకున్నట్టే ఆయన ప్రజలకు విశ్రాంతిలో ప్రవేశించే సమయం వస్తుంది.
|
|
\v 10 ఎందుకంటే దేవుడు సమస్తాన్నీ సృష్టించి తన పనులన్నీ చేసి ముగించి విశ్రాంతి తీసుకున్నట్లే ఆయన విశ్రాంతిలో ప్రవేశించేవాడు కూడా తన పనులన్నీ ముగించి విశ్రాంతిలో ప్రవేశిస్తాడు.
|
|
\p
|
|
\v 11 కాబట్టి, మనలో ఎవ్వరమూ ఇతరుల వలే అవిశ్వాసంలో పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి ఆత్రుత పడదాం.
|
|
\s5
|
|
\p
|
|
\v 12 ఎందుకంటే దేవుని మాట సజీవమైనది, శక్తిగలది, రెండు అంచులు ఉన్న ఎలాంటి కత్తి కంటే కూడా పదునుగా ఉండేది. అది ప్రాణం నుండి ఆత్మనూ, కీళ్ళ నుండి మూలుగనూ విభజించగలిగేంత శక్తి గలదిగా ఉంటుంది. అది మన హృదయాల్లో దాగి ఉన్న మంచి, చెడు తలంపులను నిర్ణయించి, మన ఆలోచనలపైనా ఉద్దేశాలపైనా తీర్పు చెప్పగలదు.
|
|
\v 13 ప్రతి ఒక్కరి గురించీ, ప్రతి విషయమూ దేవునికి తెలుసు. ఆయనకు కనిపించకుండా ఉండేది ఏదీ లేదు. ఆయన మనం చేసే పనులన్నీ చూస్తాడు. ఆయనకు సమస్తమూ బట్టబయలే. మనమంతా తప్పక దేవుని ఎదుట నిలబడి మన జీవితం ఎలా గడిపామో ఆయనకు లెక్క అప్పజెప్పాలి.
|
|
\s5
|
|
\p
|
|
\v 14 ఆకాశాలగుండా ఎక్కి వెళ్ళిన గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. ఆయనే దేవుని కుమారుడైన యేసు. కాబట్టి మన నమ్మకం క్రీస్తు యేసు పైనే అని బాహాటంగా, ధైర్యంగా ప్రకటిద్దాం.
|
|
\p
|
|
\v 15 మన బలహీనతల పట్ల మన ప్రధాన యాజకుడికి సానుభూతి ఉంది. ఎందుకంటే ఆయన కూడా మనలాగే శోధన ఎదుర్కొన్నాడు. సాతాను ఆయనను పాపం చేసేలా శోధించాడు. అయితే ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు.
|
|
\v 16 కాబట్టి పరలోకం నుండి మనలను పరిపాలిస్తూ, అయోగ్యులమైన మనకు తన కృప కనికరాలను అనుగ్రహిస్తున్న క్రీస్తు దగ్గరికి ధైర్యంగా వెళ్దాం.
|
|
|
|
\s5
|
|
\c 5
|
|
\p
|
|
\v 1 ప్రతి ప్రధాన యాజకుని విషయంలోనూ దేవుడు ప్రజలలో నుండే ఒక వ్యక్తిని ఎంపిక చేస్తాడు. ఈ వ్యక్తి ప్రజల పక్షంగా దేవునికి సేవ చేస్తాడు. ప్రజల పాపాల నిమిత్తం అర్పణలు, జంతు బలులు అతడే అర్పిస్తాడు.
|
|
\v 2 ప్రధాన యాజకుడు దేవుణ్ణి గురించి పూర్తి అవగాహన లేనివారి పట్ల, దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినవారి పట్ల దయ కలిగి ఉంటాడు. ఎందుకంటే, అతడు కూడా పాపం విషయంలో బలహీనుడే.
|
|
\v 3 ఫలితంగా అతడు కూడా ఇతర ప్రజల వలే తన పాపాల నిమిత్తం జంతు బలులు అర్పించాలి.
|
|
\s5
|
|
\p
|
|
\v 4 అయితే ఏ ఒక్కరూ కూడా తాను ప్రధాన యాజకుడు అయినందుకు అతిశయించకూడదు. దేవుడు ఆహారోనును ప్రధాన యాజకునిగా చేసుకున్నట్లే, మీలో ప్రతి ఒక్కరినీ యాజకునిగా ఎంపిక చేసుకుంటున్నాడు.
|
|
\v 5 ఆ విధంగానే, క్రీస్తు తాను ప్రధాన యాజకుడు అయినందుకు తనను తాను గొప్పచేసుకోలేదు. దేవుడే ఆయనను నియమించాడు. ఈ విషయం గురించి కీర్తనకారుడు లేఖనంలో ఇలా రాశాడు:
|
|
\q "నువ్వు నా కుమారుడివి.
|
|
\q నేను నీ తండ్రినని ప్రకటిస్తున్నాను."
|
|
\s5
|
|
\p
|
|
\v 6 అలాగే మరో లేఖన భాగంలో కీర్తనకారుడు,
|
|
\q "నువ్వు మెల్కీసెదెకు వరసలో కలకాలం ఉండే యాజకుడివి" అన్నాడు.
|
|
\s5
|
|
\p
|
|
\v 7 క్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన దేవుణ్ణి ప్రార్ధిస్తూ, కన్నీళ్ళతో ఎలుగెత్తి దేవునికి మొరపెట్టాడు. తనను రక్షించగల దేవుణ్ణి వేడుకున్నాడు. క్రీస్తు తనకు విధేయుడై తనను ప్రార్ధించినందున దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు.
|
|
\v 8 ఆయన దేవుని కుమారుడై ఉండి తాను పొందిన బాధల ద్వారా దేవునికి ఎలా విధేయత చూపించాలో నేర్చుకున్నాడు.
|
|
\s5
|
|
\p
|
|
\v 9 దేవుడు కోరినట్టు ఆయన అన్ని విషయాల్లో పరిపూర్ణత సాధించి, నేడు తనకు విధేయులయ్యే వాళ్ళందరి నిత్య రక్షణకు కారకుడయ్యాడు.
|
|
\v 10 ప్రధాన యాజకుడైన మెల్కీసెదెకు క్రమంలో దేవుడు ఆయనను మన ప్రధాన యాజకుడిగా నియమించాడు.
|
|
\p
|
|
\v 11 క్రీస్తు మెల్కీసెదెకును ఎలా పోలి ఉన్నాడో మరింత వివరంగా మీకు చెప్పాలని ఉంది. దీన్ని వివరించడం నాకు కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే దీన్ని విని, అర్థం చేసుకోవడానికి మీరు ఇబ్బంది పడతారు.
|
|
\s5
|
|
\p
|
|
\v 12 మీరు ఇంతకుముందే బోధకులుగా మారి దేవుని సత్యాలు ఇతరులకు బోధించవలసిన స్థితిలో ఉండవలసింది. అయితే ఇంకా మరొకరు దేవుని మాటల్లోని ఓనమాలు మీకు నేర్పించవలసి వస్తున్నది. చంటి పిల్లలవలె పాలు తాగే స్థితిలోనే మీరు ఉన్నారు. బలమైన ఆహారం వంటి కష్టతరమైన సంగతులు నేర్చుకోవడానికి సిద్ధంగా లేరు.
|
|
\v 13 గుర్తుంచుకోండి, కేవలం ప్రాథమిక సత్యాలు నేర్చుకునే ప్రతివాడూ పాలు మాత్రమే తాగే చంటి పిల్లవాడే. కాబట్టి అతడు నీతికి సంబంధించిన విషయాల్లో అనుభవం లేనివాడుగా ఉన్నాడు.
|
|
\v 14 ఎదిగిన వాళ్ళు పుష్టికరమైన ఆహారం తీసుకుంటున్నట్టు దేవుణ్ణి గూర్చిన కష్టతరమైన ఆత్మీయ సత్యాలు గ్రహించగలరు. వయస్సు వచ్చిన పెద్దవారు తమ సాధన చేత మంచి ఏదో, చెడు ఏదో వివేచించగలిగి, మంచీ చెడూ తేడా తెలుసుకోవడంలో శిక్షణ పొంది ఉంటారు.
|
|
|
|
\s5
|
|
\c 6
|
|
\p
|
|
\v 1 కాబట్టి క్రీస్తు గురించి విశ్వాసులు మొదట్లో తెలుసుకున్న విషయాలను గూర్చి చర్చించుకుంటూ కాలం గడపడం మానివేద్దాం. చావుకు దారి తీసే పాప కార్యాలు చేయకుండా ఉండడం, దేవుణ్ణి నమ్మడం ఎలా అనే విషయాలు వాటిలో కొన్ని.
|
|
\v 2 ఇవికాక అనేకమైన విషయాలు మేము బోధించాం: వివిధ రకాల బాప్తీసాలు, మనం తరచుగా ఒకరి తలపై ఒకరు చేతులుంచి ప్రార్ధిస్తున్న విధానం; దేవుడు చనిపోయిన మనలను తిరిగి లేపి ప్రతి ఒక్కరికీ తీర్పు తీరుస్తాడనే విషయాలు, మొదలైనవి.
|
|
\v 3 ఒకవేళ దేవుడు అనుమతిస్తే ఈ విషయాలు తరువాత మళ్ళీ చర్చించుకుందాం. అయితే ఇప్పుడు అర్థం చేసుకోవడానికి కష్టతరమైన విషయాలు మనంమాట్లాడుకోవాలి. ఏమి జరిగినా అన్ని సమయాల్లో క్రీస్తుపై మన నమ్మకం కోల్పోకుండా ఉండడానికి ఇవి మనకు సహాయం చేస్తాయి.
|
|
\s5
|
|
\p
|
|
\v 4 కొందరు తమ జీవితాల్లో తమ పాపాల నుండి మళ్ళుకుని, దేవుని వెలుగును పొంది, దేవుని నుంచి మంచి అనుభవాలు పొంది, పరిశుద్ధాత్మలో భాగం పొందిన తరువాత ఒకవేళ మార్గం విడిచి తప్పిపోతే వారిని తిరిగి పశ్చాత్తాప పడేలా చేయడం అసాధ్యం.
|
|
\v 5 వాళ్ళు దేవుని వాక్కు ఫలాలను, రాబోయే కాలపు ఆత్మీయ శక్తులను అనుభవించినవాళ్ళు.
|
|
\v 6 అయితే ఇప్పుడు వాళ్ళు క్రీస్తును తృణీకరిస్తున్నారు. ఇలాంటి వాళ్ళను తమ పాపాల నుంచి మళ్ళించి, దేవుణ్ణి నమ్ముకునేలా చేయడం ఎవరివల్లా కాదు. ఎందుకంటే వాళ్ళు దేవుని కుమారుణ్ణి మళ్ళీసిలువకు మేకులతో కొడుతున్నారు. ఇతరులు క్రీస్తును ద్వేషించడానికి కారణమౌతున్నారు.
|
|
\s5
|
|
\p
|
|
\v 7 ఈ సంగతి ఆలోచించండి. నేల తరచుగా కురిసే వాన నీటిలో తడిసి తనను దున్నిన రైతులకు ప్రయోజనకరమైన పంటలు ఇస్తూ దేవుని దీవెనలు పొందుతుంది.
|
|
\v 8 అయితే ముళ్ళూ, ముళ్ళ పొదలూ ఆ నేలపై మొలిస్తే అది పనికిరానిదై నిస్సారమౌతుంది. అది శాపానికి గురై ఆ మొక్కలన్నీ అగ్నికి ఆహుతి కావలసి వస్తుంది. దేవునికి అవిధేయులైన ప్రజలకు కూడా ఇదే గతి పడుతుంది.
|
|
\s5
|
|
\p
|
|
\v 9 ప్రియమైన స్నేహితులారా, క్రీస్తుని తిరస్కరించవద్దని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. అయితే మీరు మాత్రం అంతకంటే మంచి స్థితిలోనే ఉన్నారనీ, రక్షణకు సంబంధించిన విషయాల్లో మెరుగుగానే ఉన్నారనీ గట్టిగా నమ్ముతున్నాను.
|
|
\v 10 దేవుడు అన్నివేళలా న్యాయవంతుడు. ఆయన కోసం మీరు చేసిన దానినంతటినీ ఆయన మరచిపోడు. మీరు మీ తోటి విశ్వాసులను ప్రేమించి వాళ్లకు మీరు చేసిన, చేస్తున్న ఉపకారాలకు ఆయన తప్పక ప్రతిఫలం అనుగ్రహిస్తాడు.
|
|
\s5
|
|
\v 11 మీలో ప్రతి ఒక్కరూ ఇప్పుడు చూపిస్తున్న ప్రేమానురాగాలను మీ జీవితాంతం కొనసాగించడానికి కృషి చేసి దేవుడు నీకు వాగ్దానం చేసిన ప్రతిఫలం పొందాలన్నది నా ప్రగాఢ వాంఛ.
|
|
\v 12 మీరు సోమరిపోతులుగా ఉండడం నాకు ఇష్టం లేదు. దేవుణ్ణి నమ్మి ఆయన వాగ్దానాల కోసం సహనంతో కనిపెట్టి వాటిని సంపాదించుకున్న ఇతర విశ్వాసులను అనుకరించాలన్నది నా అభిలాష.
|
|
\s5
|
|
\p
|
|
\v 13 అబ్రాహాము విషయంలో గొప్ప కార్యాలు చేస్తానని దేవుడు ప్రమాణం చేసినప్పుడు తనకంటే గొప్పవాడు ఎవరూ లేరు గనక దేవుడు తన మీద తానే ఒట్టు పెట్టున్నాడు.
|
|
\v 14 "నేను నిన్ను తప్పక దీవించి నీ వంశాన్ని అభివృద్ది చేస్తాను" అని ఆయన అబ్రాహాముకు వాగ్దానం చేశాడు.
|
|
\v 15 అబ్రాహాము దేవుని వాగ్దాన నేరవేర్పు కోసం ఓపికగా కనిపెట్టాడు. దేవుడు తన వాగ్దానం నిలబెట్టుకున్నాడు.
|
|
\s5
|
|
\v 16 కొన్నిసార్లు మనుషులు తమకంటే గొప్పవారి మీద ఒట్టు పెట్టుకుంటారు. తాము చేసిన ప్రమాణం నెరవేర్చకపోతే ఆ పెద్ద వారు తమను శిక్షించ వచ్చని చెబుతారు. ఈ విధంగా వివాదాలు పరిష్కారం అవుతాయి.
|
|
\v 17 దేవుడు తాను చేసిన వాగ్దానం మార్పు లేనిదని స్పష్టం చేయడానికి దేవుడు తనపై తానే ఒట్టు పెట్టుకోవడం ద్వారా తన వాగ్దానానికి హామీ ఇచ్చాడు.
|
|
\p
|
|
\v 18 మనకు ప్రోత్సాహంగా ఉండడానికి ఆయన అలా చేశాడు. మార్పు లేని రెండు విషయాలు ఆయన చేశాడు. మనకు సహాయం చేస్తానని ఆయన వాగ్దానం చేశాడు. దేవుడు అబద్ధం ఆడడు. ఎన్నడూ దోషిగా నిలబడడు. అందువల్ల మనం నమ్మకంగా ఆయన ఇచ్చిన వాగ్దానాల నెరవేర్పు కోసం ఆయన చెంతకు చేరవచ్చు.
|
|
\s5
|
|
\p
|
|
\v 19 అవును, దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు పొందడానికి మనం నమ్మకంగా ఎదురుచూడవచ్చు. ఇది ఓడను స్థిరంగా నిలిపి ఉంచే లంగరు వంటిది. దేవాలయంలో లోపలి తెరలో ప్రవేశించి దేవుని సన్నిధిలో నిలిచే ప్రధాన యాజకుణ్ణి పోలిన యేసుపై స్థిరంగా మన ఆశాభావం నిలిపి ఉంచవచ్చు.
|
|
\v 20 మనం కూడా దేవుని సన్నిధానం లో ప్రవేశించడానికి మనకు మార్గం సిద్ధం చేయడానికి ఆయన ముందుగా అక్కడికి చేరాడు. ప్రధాన యాజకుడైన మెల్కీసెదెకు వలే యేసు మన తరపున కలకాలం ఉండే ప్రధాన యాజకుడు అయ్యాడు.
|
|
|
|
\s5
|
|
\c 7
|
|
\p
|
|
\v 1 ఇప్పుడు నేను మెల్కీసెదెకు గురించి వివరంగా చెబుతాను. సర్వలోకాన్నీ పరిపాలించే దేవుని యాజకుడైన అతడు షాలేము పట్టణానికి రాజు. నలుగురు రాజులను ఓడించి తిరిగి వస్తున్న అబ్రాహామును, అతని మనుషులను మెల్కీసెదెకు కలుసుకుని అబ్రాహామును ఆశీర్వదించాడు.
|
|
\v 2 అప్పుడు అబ్రాహాము యుద్ధంలో తాను కొల్లగొట్టిన సొత్తు నుండి పదవ భాగం మెల్కీసెదెకుకు సమర్పించాడు. మొదటగా, మెల్కీసెదెకు అనే పేరుకు "నీతికి రాజు" అని అర్థం. షాలేము అంటే "శాంతి" అని అర్థం. అతని పేరుకు "శాంతియుతంగా పాలించే రాజు" అని అర్థం.
|
|
\v 3 అతని పూర్వీకులు, తల్లిదండ్రులు ఎవరో, అతడు ఎప్పుడు పుట్టాడో, ఎప్పుడు చనిపోయాడో ఎలాంటి ఆధారాలూ లేవు. దేవుని కుమారునిగా ఇతడు కలకాలం యాజకుడుగా కొనసాగాడు.
|
|
\s5
|
|
\p
|
|
\v 4 మెల్కీసెదెకు ఎంత గొప్పవాడో గమనించండి. మన పూర్వికుడైన అబ్రాహాము యుద్ధంలో తాను కొల్లగొట్టిన శ్రేష్ఠమైన సొమ్ములో పదవ భాగం ఇతనికి ఇచ్చాడు.
|
|
\v 5 , ఇతర గోత్రాల ప్రజలు అబ్రాహాము సంతతి వారైనప్పటికీ, వారి దగ్గర లేవీ వంశం యాజకులు పదవ వంతును కానుకగా స్వీకరించాలని దేవుడు మోషేకు ఇచ్చిన ధర్మశాస్త్రం ఆదేశిస్తుంది.
|
|
\v 6 కానీ లేవీ వంశంతో ఎలాంటి సంబంధమూ లేని మెల్కీసెదెకు అబ్రాహాము దగ్గర పదో వంతు కానుకలు స్వీకరించి అబ్రాహామును ఆశీర్వదించాడు.
|
|
\s5
|
|
\v 7 మెల్కీసెదెకు వంటి ప్రముఖుడైన వ్యక్తి తనకంటే తక్కువవాడైన అబ్రాహామును ఆశీర్వదించినట్టు ఇక్కడ చూస్తాం. కనుక అబ్రాహాము కంటే మెల్కీసెదెకు గొప్పవాడని మనకు తెలుస్తున్నది.
|
|
\p
|
|
\v 8 లేవీ క్రమంలో యాజకుడుగా ఉండి కానుకలు స్వీకరించేవాడు ఏదో ఒకరోజు చనిపోతాడు. అయితే అబ్రాహాము కానుకను స్వీకరించిన వాడు శాశ్వతంగా జీవిస్తూ ఉన్నట్టుగా ఉంది. అతని మరణం గురించి లేఖనంలో ఎక్కడా రాసి లేదు.
|
|
\v 9 తమ పూర్వికుడైన అబ్రాహాము మెల్కీసెదెకును తనకంటే గొప్పవాడుగా గౌరవించి పదవ భాగం కానుకగా చెల్లించిన విధంగా లేవి, అతని వారసులకు ప్రజలు పదవ వంతు చెల్లిస్తూ వచ్చారు.
|
|
\v 10 ఎందుకంటే మెల్కీసెదెకును అబ్రాహామును కలుసుకున్నప్పుడు లేవి, అతని వారసులు అబ్రాహాము సంతతిగా భవిషత్తులో అతనికి పుట్టబోతున్నారు.
|
|
\s5
|
|
\p
|
|
\v 11 లేవీయులు యాజకులుగా ఉన్న సమయంలోనే దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అహరోను వారసుడైన లేవి వంశీకులు ప్రజల తిరుగుబాటుకు విరుగుడుగా దేవుని క్షమాపణ మార్గం కల్పిస్తూ వచ్చారు. అహరోను తరువాత వచ్చిన యాజకులు ఇందుకు చాలినవాళ్ళు. మరి ఇక మెల్కీసెదెకు వంటి యాజకుని అవసరం ఏమిటి?
|
|
\v 12 ఇకపై ఇలాంటి యాజకుల అవసరం లేదని మనకు తెలుసు. ఎందుకంటే, మెల్కీసెదెకు వంటి కొత్త యాజకుడు మనకోసం వచ్చాడు. ఈ కొత్త యాజకుని నియామకం తరువాత దేవుడు తన చట్టాలను కూడా మార్పు చెయ్యాలి.
|
|
\s5
|
|
\p
|
|
\v 13 యేసు గురించి నేను మాట్లాడుతున్నాను. ఆయన లేవి వంశం నుండి వచ్చినవాడు కాదు, యూదా వంశాంకురం. ఈ వంశం వారెవరూ యాజక వృత్తి నిర్వహించలేదు.
|
|
\v 14 యాజక ధర్మం నిర్వహణ విషయంలో మోషే ఎన్నడూ ప్రస్తావించని యూదా వంశంలో నుండి మన ప్రభువు వచ్చాడు.
|
|
\s5
|
|
\v 15 లేవి వంశం నుండి వచ్చిన యాజకులు సరిపోయినవారు కారని మనం తెలుసుకున్నాం. కాబట్టి మరింత స్పష్టంగా మెల్కీసెదెకు వంటి యాజకుడు మనకోసం వచ్చాడు.
|
|
\v 16 ఆ యాజకుడు యేసు. ఈయన దేవుని చట్టాల నెరవేర్పు కోసం లేవి వంశం ఆధారంగా వచ్చిన వాడు కాదు. ఈయన ఎన్నటికీ నాశనం కాని జీవానికి ఉన్న శక్తి ఆధారంగా వచ్చాడు.
|
|
\v 17 "నువ్వు కలకాలం మెల్కీసెదెకు క్రమంలో నిలిచి ఉండే యాజకుడివి" అని దేవుడు తన కుమారుని విషయంలో నిర్ధారించిన క్రమం నుండి వచ్చాడు.
|
|
\s5
|
|
\p
|
|
\v 18 పాపులైన ప్రజలను ఈ యాజకులు పవిత్రులుగా తీర్చలేకపోయారు గనుక దేవుడు ఈ విషయంలో ముందుగా ఇచ్చిన ఆజ్ఞను పక్కనబెట్టాడు.
|
|
\v 19 దేవుడు మోషేకిచ్చిన చట్టాల మూలంగా ఏ ఒక్కరూ నీతిమంతులుగా దేవుని లెక్కలోకి రాలేకపోయారు. మరోపక్క దేవుడు తనపై నమ్మకముంచి తనను సమీపించడానికి మరింత శ్రేష్టమైన మార్గం సిద్ధపరిచాడు.
|
|
\s5
|
|
\v 20 అయితే ఆయన క్రీస్తును యాజకుడుగా నియమించినప్పుడు దాన్ని గంభీరమైన శపథం ద్వారా స్థిరపరిచాడు. లేవీ గోత్ర యాజకుల విషయంలో ఇలాటి శపథం లేదు.
|
|
\v 21 దేవుడు క్రీస్తును యాజకుడుగా నియమించినప్పుడు ఈ మాటల్ని కీర్తనకారుడు లేఖనాల్లో ఇలా రాశాడు.
|
|
\q "నువ్వు కలకాలం యాజకుడుగా ఉంటావని
|
|
\q ఆయన గంభీరంగా చేసిన ప్రకటన విషయంలో
|
|
\q ఆయన ఎప్పటికీ మనసు మార్చుకోడు."
|
|
\s5
|
|
\p
|
|
\v 22 అందువల్ల పాత ఒడంబడిక కంటే కొత్త ఒడంబడిక మరింత శ్రేష్టంగా ఉంటుందని స్వయంగా యేసే హామీ ఇస్తున్నాడు.
|
|
\p
|
|
\v 23 యాజకులు ఎల్లకాలం యాజకులుగానే కచ్చితంగా ఉండలేరు. ఎందుకంటే వాళ్ళు చనిపోతారు. కాబట్టి ఆ చనిపోయిన యాజకుని స్థానాన్ని ఎంతో మంది ఒకరి తర్వాత ఒకరు భర్తీ చేస్తూ ఉంటారు.
|
|
\v 24 అయితే యేసు మాత్రం నిరంతరం జీవించేవాడు కాబట్టి ఆయన నిరంతరం ప్రధాన యాజకుడుగానే కొనసాగుతాడు.
|
|
\s5
|
|
\v 25 కాబట్టి యేసు తన ద్వారా దేవుని దగ్గరకు వచ్చేవారిని సంపూర్ణంగా, శాశ్వతంగా రక్షించడానికి సమర్ధుడుగా ఉన్నాడు. కాబట్టి వాళ్ళని క్షమించమనీ సురక్షితంగా ఉంచమనీ దేవునికి విజ్ఞాపన చేయడానికి చిరకాలం జీవించే ఉంటాడు.
|
|
\p
|
|
\v 26 యేసు మనకు సరిపోయిన ప్రధాన యాజకుడు. ఆయన కల్మషం అంటని పరిశుద్ధుడు. తప్పు లేనివాడు. నిర్దోషి. పాపుల మధ్యలో జీవిస్తున్న ఆయన్ని దేవుడు ఇప్పుడు ప్రత్యేకపరచి ఉన్నతమైన పరలోకానికి తీసుకువెళ్ళాడు.
|
|
\s5
|
|
\v 27 యూదీయ యాజకులు రోజు తర్వాత రోజు, సంవత్సరం తర్వాత సంవత్సరం జంతువుల్ని బలి అర్పించవలసిందే. వాళ్ళు మొదట తమ స్వంత పాపాల కోసం బలి అర్పించాలి. తర్వాత ఇతరుల పాపాల కోసం బలులు అర్పించాలి.
|
|
\p అయితే యేసులో ఎలాటి పాపం లేదు కాబట్టి ఆయన తన కోసం బలి అర్పించాల్సిన అవసరం లేదు. ఆయన చేయాల్సిందల్లా ప్రజలను రక్షించడానికి ఒక్కసారే తనకు తానే బలిగా అర్పించుకోవడమే. కచ్చితంగా ఆయన అదే చేశాడు.
|
|
\v 28 మనకు ఇలాంటి ప్రధాన యాజకుడే కావాలి. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఆజ్ఞాపించిన విధంగా నియమించిన ప్రధాన యాజకులు మనుషులందరిలాగే పాపం చేశారు. దేవుడు మోషేకు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు తన కుమారుడినే ప్రధాన యాజకుడుగా నియమిస్తానని గంభీరంగా ప్రకటించాడు. ఇప్పుడు దేవుని కుమారుడుగా యేసు నిత్యమూ జీవించే పరిపూర్ణమైన ప్రధాన యాజకుడు.
|
|
|
|
\s5
|
|
\c 8
|
|
\p
|
|
\v 1 నేను రాసిన దానంతటిలో చాలా ప్రాముఖ్యమైన భాగం ఏమిటంటే మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయన పరలోకంలో రాజుగా పరిపాలించడానికి ఆసీనుడై ఉన్నాడు.
|
|
\v 2 పరలోకంలో వాస్తవమైన ఆరాధనా స్థలం అయిన పరిశుద్ధ గర్భాలయంలో ఆయన పరిచర్య చేస్తాడు. అది నిజమైన ప్రత్యక్ష గుడారం, మోషే నెలకొల్పిన మానవ నిర్మిత ప్రత్యక్ష గుడారం కాదు. ఈ గుడారాన్ని ప్రభువే నిర్మించాడు.
|
|
\s5
|
|
\p
|
|
\v 3 ప్రజల పాపాల కోసం కానుకలూ, బలులూ అర్పించడానికి ప్రతి ప్రధాన యాజకుడినీ దేవుడే నియమిస్తాడు. అలాగే క్రీస్తు ప్రధాన యాజకుడైనప్పటి నుండీ ఆయన కూడా ఏదో ఒకటి అర్పించవలసి ఉంది.
|
|
\v 4 ఇప్పుడు క్రీస్తు భూమిపై ఉన్నట్టయితే ధర్మశాస్త్రం నియమాలను అనుసరించి కానుకలూ, బలులూ అర్పించే ప్రధాన యాజకునిలాగా ఉండనే ఉండదు. ఎందుకంటే అలాంటి యాజకులు ఇక్కడే ఉన్నారు.
|
|
\p
|
|
\v 5 మోషే ప్రత్యక్ష గుడారాన్ని నిర్మిస్తున్నప్పుడు "సీనాయి పర్వతం మీద నీకు ఏమి చూపించానో కచ్చితంగా దాని ప్రకారమే అంతా చేయాలి” అని దేవుడు చెప్పాడు.
|
|
\s5
|
|
\v 6 యూదీయ యాజకులు చేసే దానికంటే క్రీస్తు ఇప్పుడు అంతకన్నా మరింత మేలైన విధంగా పరిచర్య చేస్తాడు. అలాగే దేవుడు తన ప్రజల పక్షంగా ఇచ్చిన వాగ్దానాలు, చేసిన ఒప్పందాలూ, దేవుడు మోషేకు ఇచ్చిన ధర్మశాస్త్రం కంటే కూడా శ్రేష్టమైనవి.
|
|
\p
|
|
\v 7 రెండవ ఒప్పందాన్ని దేవుడు నిర్ణయించాల్సి వచ్చింది. ఎందుకంటే మొదటి ఒప్పందం తప్పుల తడక అయ్యింది.
|
|
\s5
|
|
\v 8 ఇశ్రాయేలీయులు ఆ మొదటి ఒప్పందానికి లోబడక పోవడం వల్ల దేవుడు వాళ్ళని దోషులుగా ప్రకటించాడు. ఆయన కొత్త ఒప్పందం చేయాలని కోరాడు. దీన్ని గురించి ఒక ప్రవక్త ఇలా రాశాడు,
|
|
\q "ప్రభువు చెప్తున్నాడు, వినండి! సమయం ఆసన్నం అయింది.
|
|
\q ఇశ్రాయేలు ప్రజలు యూదా ప్రజల పక్షంగా ఒక కొత్త ఒప్పందాన్ని చేసే రోజులు వస్తున్నాయి.
|
|
\q
|
|
\v 9 ఆ ఒప్పందం ఇంతకు ముందు వాళ్ళ పితరులతో చేసిన ఒప్పందంలాగా ఉండదు.
|
|
\q వాళ్ళను ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చినప్పుడు ఒక తండ్రి చంటి బిడ్డను నడిపించినట్టు వాళ్ళని నడిపించాడు.
|
|
\q వాళ్ళు ఆ ఒప్పందం పట్ల తమ విధేయతను కొనసాగించలేదు.
|
|
\q కాబట్టి వాళ్ళని ఒంటరిగా వదిలేశాను," అని ప్రభువు చెప్పాడు.
|
|
\s5
|
|
\q
|
|
\v 10 మొదటి ఒప్పందం ముగిసిన తరవాత ప్రభువు ఇలా చెప్పాడు. "ఇశ్రాయేలీయులతో చేసే ఒప్పందం ఇదే.
|
|
\q వాళ్ళు నా శాసనాల్ని అర్థం చేసుకొనేలా చేస్తాను.
|
|
\q అలాగే వాళ్ళు నిజంగా విధేయత చూపేలా చేస్తాను.
|
|
\q నేను వాళ్లకు దేవుడుగా ఉంటాను. వాళ్ళు నాకు ప్రజలుగా ఉంటారు.
|
|
\s5
|
|
\v 11 తమ ఇరుగు పొరుగు వాళ్ళకు ఎవడూ ఉపదేశం చేసే అవసరం ఉండదు.
|
|
\q అలాగే "ప్రభువును తెలుసుకో" అని ఎవడూ తన తోటి సోదరుడికి చెప్పనక్కర లేదు.
|
|
\q ఎందుకంటే నా ప్రజలందరూ నన్ను గుర్తిస్తారు.
|
|
\q నా ప్రజల్లో చిన్నవాళ్ళ నుండి పెద్ద వాళ్ళ వరకు ముఖ్యులైన వాళ్ళంతా నన్ను తెలుసుకుంటారు.
|
|
\q
|
|
\v 12 వాళ్ళు చేసిన దుష్ట కార్యాల విషయంలో కరుణ చూపించి క్షమిస్తాను.
|
|
\q వాళ్ళ పాపాల విషయంలో వాళ్ళని ఇంకా దోషులుగా పరిగణించను."
|
|
\s5
|
|
\p
|
|
\v 13 దేవుడు ఒక కొత్త ఒప్పందాన్ని చేస్తున్నానని చెప్పినప్పటినుండి, మొదటి ఒప్పందం పాతదనీ, అది ఇక మీదట ఆచరణలో ఉండదనీ, అది తొందరలోనే సమసిపోతుందనీ ఆయన భావించాడని మనకు తెలుసు.
|
|
|
|
\s5
|
|
\c 9
|
|
\p
|
|
\v 1 మొదటి ఒప్పందం ప్రకారం దేవుడు ఇశ్రాయేలీయులకు ఆరాధన ఎలా చేయాలనే విషయంలో నియమాలను విధించి, ఆరాధనా స్థలాన్ని సిద్ధం చేయమని వారికి చెప్పాడు.
|
|
\v 2 ఇశ్రాయేలీయులు సిద్ధపరచిన పవిత్ర స్థలమే ప్రత్యక్ష గుడారం. దాని ముందు గదిలో ఒక దీపస్తంభం, దేవుని ఎదుట పెట్టిన రొట్టెల బల్ల ఉంచారు. ఆ గదిని పరిశుద్ధ స్థలం అని పిలిచారు.
|
|
\s5
|
|
\v 3 పరిశుద్ధ స్థలంలో ఒక పక్కన తెర వెనుక భాగంలో ఇంకొక గది ఉంది. దానిని అతి పరిశుద్ధ స్థలం అని పిలిచారు.
|
|
\p
|
|
\v 4 అందులో ధూపం వేయడానికి బంగారంతో చేసిన బలిపీఠం ఉంది, అంతే కాకుండా నిబంధన మందసం కూడా అక్కడ ఉంది. దాని అన్ని ప్రక్కలా బంగారంతో పొదిగి ఉంది. అందులో మన్నా అని పిలిచే ఆహారం ఉన్న బంగారు పాత్ర ఉంది. దేవుని నిజమైన యాజకుడని నిరూపించే అహరోను చేతి కర్ర కూడా అందులో ఉంది. దేవుడు రాసి ఇచ్చిన పది ఆజ్ఞల రాతి పలకలు కూడా అందులో ఉన్నాయి.
|
|
\v 5 ఆ మందసం పెట్టె మీద దేవుని మహిమకు గుర్తుగా రెక్కలు ఉన్న జీవుల ఆకృతులు ఉన్నాయి. ప్రధాన యాజకుడు ప్రజల పాపాల కోసం బలి అర్పించిన రక్తాన్ని చల్లే చోట ఆ ప్రతిమల రెక్కలు మందసం పెట్టె మూతను కప్పుతూ ఉన్నాయి. ఈ విషయాల గురించి ఇప్పుడు వివరంగా రాయడం కుదరదు.
|
|
\s5
|
|
\p
|
|
\v 6 వీటన్నిటినీ సిద్ధం చేశాక ఇశ్రాయేలు యాజకులు వాడుక ప్రకారం ప్రత్యక్ష గుడారంలోని ముందు గదిలోకి వెళ్లి సేవలు చేస్తారు.
|
|
\v 7 లోపలి గదిలోకి మాత్రం ప్రధాన యాజకుడు సంవత్సరంలో ఒక్కసారే వెళ్తాడు. అతడు ఎప్పుడూ జంతువుల్ని బలి ఇచ్చిన రక్తం తీసుకు వెళ్తాడు. ఆ రక్తాన్ని తాను చేసిన పాపాల కోసమూ, ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపాల కోసమూ దేవునికి అర్పిస్తాడు. అంతేగాక ఈ అర్పణ పాపాలు చేస్తున్నామనే స్పృహ కూడా లేకుండా పాపంలో నిలిచి ఉండేవాళ్ళ కోసం కూడా అర్పిస్తారు.
|
|
\s5
|
|
\v 8 ఆ కారణం చేత మొదటి గది ఇంకా ఉనికిలో ఉండడం వల్ల సాధారణ ప్రజల కోసం లోపలి గదిలోకి, అంటే అతి పరిశుద్ధ స్థలం లోకి వెళ్ళే దారిని దేవుడు వెల్లడి చేయలేదని పరిశుద్ధాత్మ స్పష్టం చేస్తున్నాడు. అప్పట్లో యూదులు ఇంకా పాత పద్ధతిలోనే బలులు అర్పించినందుకు సాధారణ ప్రజలు దేవుని సన్నిధిలోకి వెళ్ళడానికి దారిని దేవుడు వెల్లడి చేయలేదు.
|
|
\p
|
|
\v 9 ఇప్పుడు మనం జీవిస్తున్న కాలానికి ఆ గుడారం ఉదాహరణగా ఉంది. ప్రత్యక్ష గుడారంలో అర్పించిన అర్పణలూ, కానుకలూ, ఒక వ్యక్తిని పూర్తిగా చెడు మార్గం నుండి మంచి మార్గంలోకి నడిపించి, దేవుణ్ణి సంతోషపెట్టేలా ఎప్పుడూ సరైనదే మన హృదయాలలో నుంచి వచ్చేలా చెయ్యలేకపోయాయి
|
|
\v 10 ఏం తినాలి, ఏం తాగాలి, దేనిని ప్రక్షాళన చేసుకోవాలి అనే నియమాలన్నీ శరీరానికి సంబంధించినవి. ఇవన్నీ దేవుడు మనతో కొత్త ఒప్పందం చేసుకొనే వరకే. ఆ కొత్త ఒప్పందంతోనే మళ్ళీ ఆయన సమస్తాన్నీ సరైన మార్గంలో పెట్టి బాగు చేస్తాడు.
|
|
\s5
|
|
\p
|
|
\v 11 అయితే క్రీస్తు మన ప్రధాన యాజకుడుగా వచ్చి ఇప్పుడు మనకు దక్కిన మంచి విషయాలను తీసుకొచ్చాడు. తరవాత ఆయన పరలోకంలో ఉన్న ప్రత్యక్ష గుడారం లాంటి దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయాడు. అయితే ఈ పరలోకం మోషే భూమి మీద తయారు చేసిన ప్రత్యక్ష గుడారం లాంటిది కాదు. ఇది చాలా విశాలమైంది, పూర్తిగా సంపూర్ణ మైంది. ఇది మనుషుల ఆలోచనతో తయారైంది కాదు.
|
|
\p
|
|
\v 12 ప్రతి సంవత్సరం ప్రధాన యాజకుడు ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్ళినప్పుడు అతడు మేకల, దూడల రక్తాన్ని తీసుకెళ్ళి అర్పిస్తాడు. కాని క్రీస్తు అలా చేయడు. ఆయన అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడం అయితే ఉంది గానీ, ఒకే ఒక్క సారి వెళ్ళాడు. ఎందుకంటే ఆయన సిలువ మీద తన స్వంత రక్తాన్ని ఒక్కసారే అర్పించేశాడు. అలా చేయడం వల్ల మన పాపాల కోసం శాశ్వతంగా వెల చెల్లించేశాడు.
|
|
\s5
|
|
\p
|
|
\v 13 యాజకులు మేకల, దూడల రక్తాన్నీ, ఎర్ర ఆవు దూడ దహనం తరవాత వచ్చిన బూడిదనూ నీళ్ళలో కలిపి, వడకట్టిన ఆ నీటిని ప్రజల మీద జల్లుతారు. ఇలా ఆచారపరంగా దీన్ని చేయడం వల్ల అపవిత్రులైన ఆ ప్రజలను అప్పుడు తనను ఆరాధించడానికి దేవుడు అంగీకరిస్తాడని వాళ్ళు చెప్తారు.
|
|
\v 14 ఇదే గనుక నిజమైతే, క్రీస్తు రక్తం వల్ల ఇంకెంత ఎక్కువగా శుద్ధి జరుగుతుందో కదా! నిత్యమైన ఆత్మ వల్ల ఆయన ఎలాంటి కళంకం లేకుండా తనకు తానే దేవునికి సమర్పించుకున్నాడు. ఆయన రక్తం మన మనస్సాక్షిని పనికిమాలిన ఆచారాలనుండి పవిత్రం చేసి జీవం గలిగిన దేవుణ్ణి సేవించడానికి మనల్ని శుద్ధి చేస్తుంది.
|
|
\p
|
|
\v 15 క్రీస్తు తనకు తానే దేవునికి బలిగా అర్పించుకోవడం వల్ల దేవుని నుండి ఒక కొత్త ఒప్పందం తీసుకురావడానికి వీలైంది. మొదటి ఒప్పందం ముసుగులో మనుషులు చేసిన పాపాల నుండి విడిపించి స్వతంత్రులుగా చేయడానికి ఆయన తన మరణం ద్వారా వెల చెల్లించాడు. ఆయన ఇలా చేయడం వల్ల ఎవరిని ఆయన పిల్లలని పిలిచాడో వాళ్ళు దేవుడు హామీ ఇచ్చిన వారసత్వాన్ని శాశ్వతంగా పొందుతారు.
|
|
\s5
|
|
\p
|
|
\v 16 ఒప్పందం అనేది ఒక వీలునామా లాంటిది. వీలునామా విషయానికి వస్తే దానిలో రాసిన అంశాలన్నీ ఆచరణలోకి రావాలంటే ఆ వీలునామా రాసిన వ్యక్తి చనిపోయాడని ఎవరో ఒకరు రుజువు చేయాలి.
|
|
\v 17 ఆ వీలునామా రాసిన వ్యక్తి చనిపోయినప్పుడు అది అమల్లోకి వస్తుంది గానీ, అతడు ఇంకా బతికి ఉంటే మాత్రం అది అమల్లోకి రాదు.
|
|
\s5
|
|
\p
|
|
\v 18 అలాగే యాజకులు జంతువుల్ని బలి ఇచ్చినప్పుడు ప్రవహించిన రక్తం వల్లే దేవుడు మొదటి ఒప్పందాన్ని అమల్లోకి తెచ్చాడు.
|
|
\v 19 మోషే ధర్మశాస్త్రంలో ఉన్న అన్ని ఆజ్ఞలనూ ఇశ్రాయేలు ప్రజలకి ప్రకటించిన తరవాత కోడె దూడల, మేకల రక్తాన్ని నీళ్ళతో కలిపాడు. తరవాత చిన్న హిస్సోపు కొమ్మను ఎర్రని ఉన్నితో కట్టి దానిని రక్తంలో ముంచాడు. దానిని తీసుకొని దేవుని ఆజ్ఞలు ఉన్న ధర్మశాస్త్ర గ్రంథం చుట్ట మీద చల్లాడు. తరవాత మరికొంత రక్తం తీసుకొని ప్రజలందరి మీదా చల్లాడు.
|
|
\v 20 అప్పుడు అతడు వాళ్ళతో "దేవుడు విధేయత చూపమని ఆజ్ఞాపించిన ఈ ఒప్పందాన్ని ఈ రక్తమే అమల్లోకి తెస్తుంది" అని చెప్పాడు.
|
|
\s5
|
|
\p
|
|
\v 21 అలాగే ప్రత్యక్ష గుడారం మీదా, అందులో ఉపయోగించే ప్రతి వస్తువు మీదా ఆ రక్తాన్ని చల్లాడు.
|
|
\v 22 ఇలా చల్లడం వల్ల దాదాపు అంతా శుద్ధి అవుతుంది. అదే ధర్మశాస్త్రంలో రాశారు. వారు ఒక జంతువును బలి ఇచ్చి దాని రక్తం చిందించకపోతే వారి పాపాలను దేవుడు క్షమించడు.
|
|
\s5
|
|
\p
|
|
\v 23 జంతువుల బలి ద్వారా వస్తువులను శుద్ధి చేయడం తప్పని సరిగా యాజకులు చేయాల్సిందే. ఎందుకంటే పరలోకంలో క్రీస్తు ఏం చేస్తాడో దానికి ఇది ఒక సూచనగా ఉంది. కానీ అసలు పరలోకానికి చెందిన వస్తువులు దేవుడు శుద్ధి చేయాల్సి వస్తే వీటికంటే శ్రేష్టమైన బలులు జరగాలి.
|
|
\v 24 అందువల్ల క్రీస్తు మనుషుల చేతులతో తయారు చేసిన పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించలేదు. అది కేవలం నిజమైన పరిశుద్ధ స్థలానికి సాదృశ్యం మాత్రమే. దానికి బదులు ఆయన నేరుగా పరలోకంలోకే ప్రవేశించి దేవుని సన్నిధిలో మనకు ప్రతినిధిగా ఉన్నాడు.
|
|
\s5
|
|
\p
|
|
\v 25 సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు తనది కాని వేరే రక్తాన్ని తీసుకొని బలి అర్పించడానికి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తాడు. అయితే క్రీస్తు పరలోకంలోకి ప్రవేశించినప్పుడు తనను అర్పించుకోడానికి అలా మళ్ళీ మళ్ళీ వెళ్ళలేదు.
|
|
\v 26 ఒకవేళ అదే గనుక అయితే దేవుడు ఈ లోకాన్ని సృష్టించినప్పటి నుండి అనేక సార్లు పదే పదే హింస పొందుతూ తన రక్తాన్ని కార్చవలసి వచ్చేది. కానీ క్రీస్తు ఈ చివరి కాలంలో ప్రత్యక్షమై తనను తాను ఒక్కసారే బలిగా అర్పించుకోవడం వల్ల దేవుడు కూడా ఒక్క సారే మన పాపాలన్నీ క్షమించి మనల్ని మరెన్నటికీ తన తీర్పులోకి తీసుకు రాడు.
|
|
\s5
|
|
\p
|
|
\v 27 మనుషులంతా ఎప్పుడో ఒకప్పుడు చనిపోతారు. ఆ తరవాత వాళ్ళ పాపాలకు దేవుడు తీర్పు తీరుస్తాడు.
|
|
\v 28 అదే విధంగా క్రీస్తు తన స్వంత వాళ్లైన అనేకమంది పాపాల కోసం వాళ్ళ స్థానంలో శిక్ష అనుభవించి చనిపోయి ఒక్క సారే తనను తానే బలిగా అర్పించుకున్నాడు. ఆయన మళ్ళీ రెండో సారి భూమి మీదకు వస్తాడు. అయితే ఈసారి మళ్ళీ పాపం చేసిన వాళ్ళ కోసం బలి కావడానికి కాదు, ఆయన రాకడ కోసం ఓపికగా ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళని రక్షించడానికి.
|
|
|
|
\s5
|
|
\c 10
|
|
\p
|
|
\v 1 దేవుడు భవిష్యత్తులో చేసే శ్రేష్టమైన విషయాన్ని ధర్మశాస్త్రం అంత స్పష్టంగా చూపించదు. ధర్మశాస్త్రం వేరొక దానికి నీడలా ఉంది, అది నిజ స్వరూపం కాదు. ప్రజలు దేవుణ్ణి ఆరాధించడానికి ప్రతి సంవత్సరం ఒకే రకమైన బలులు అర్పిస్తూ ఉంటే, ధర్మశాస్త్రం వాళ్ళను ఎప్పటికీ పరిపూర్ణం చెయ్యలేదు.
|
|
\v 2 ఈ బలులు అర్పించడానికి వచ్చిన వారి పాపాలను దేవుడు తీసేసి ఉంటే వాళ్ళు తాము ఇంకా పాపులమని భావించరు. కాబట్టి వాళ్ళు తప్పకుండా బలులు అర్పించడం మానేస్తారు కదా. ఆరాధిస్తున్న వారు ఒక్కసారే తమ పాపాల నుండి శుద్ధి అయ్యేవారు కదా! తమ గురించిన ఆలోచనల్లో వాళ్ళు ఎంతో నెమ్మది పొందేవాళ్ళు కదా!
|
|
\v 3 అంతే కాకుండా ప్రతి సంవత్సరం వాళ్ళు అర్పించే బలులు తాము ఇంకా తమ పాపాల విషయంలో దోషులుగా ఉన్నట్టు గుర్తు చేస్తాయి.
|
|
\v 4 కాబట్టి మనం అర్పించే ఎద్దులు, మేకల్లాటి జంతువుల్ని దేవునికి అర్పించినా సరే, వాటి రక్తం చిందించడం ఆయన చూసినా సరే, అది ఏమాత్రం మనం దోషులు కాకుండా ఆపలేదు.
|
|
\s5
|
|
\p
|
|
\v 5 అందువల్ల క్రీస్తుగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఆయన తండ్రితో ఇలా అన్నాడు.
|
|
\q "బలులు అర్పణలు నీవు అడగలేదు,
|
|
\q కానీ అర్పించడానికి నాకు ఒక శరీరాన్ని సిద్ధం చేశావు.
|
|
\q
|
|
\v 6 ప్రజలు దహించిన జంతువుల్ని నీకు అర్పించినా ఆ జంతు బలులు నిన్ను సంతోషపెట్టవు.
|
|
\q అంతే కాదు, ఇంకా ఇతర బలులు కూడా నిన్ను సంతోషపెట్టలేవు."
|
|
\q
|
|
\v 7 ఈ కారణం వల్ల నేను ఇలా అన్నాను, "నా దేవా, విను!
|
|
\q నేనేమి చెయ్యాలని నువ్వు కోరుతున్నావో అలాగే చెయ్యడానికి నేను వచ్చాను.
|
|
\q నా గురించి గ్రంథంలో రాసిన ప్రకారం నీ ఇష్టాన్ని చేయడానికి నేనున్నాను."
|
|
\s5
|
|
\p
|
|
\v 8 పైన చెప్పినట్టుగా క్రీస్తు ఇలా అన్నాడు, "పాపం చేసిన వాళ్ళ కోసం యాజకులు అర్పించే బలులు గానీ, అర్పణలు గానీ, జంతువులు గానీ దహన బలులు గానీ, పాప పరిహారం కోసం చేసే మరే ఇతర బలులు గానీ నువ్వు కోరుకోవు. అవి నిన్ను సంతోషపెట్టవు. దేవుడు మోషేకు ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారమే వాటిని అర్పించినా అవి నిన్ను సంతోషపెట్టవు."
|
|
\v 9 అప్పుడు, క్రీస్తు ప్రజల పాపాల కోసం తనను తానే బలిగా అర్పించుకొనే విషయం గురించి ఆయన "విను, నువ్వేది చెప్తే అది చెయ్యడానికే నేను వచ్చాను” అన్నాడు. అలా పాపాల కోసం బలులు అర్పించే మొదటి ప్రక్రియను పక్కకు నెట్టి క్రీస్తే తనకు తాను బలిగా అర్పించుకొనే రెండవ మార్గాన్ని నెలకొల్పడానికి దేవుడు ఆ విధంగా చేశాడు.
|
|
\p
|
|
\v 10 యేసుక్రీస్తు దేవుడి అభీష్టం మేరకు ఏమి చెయ్యమన్నా చెయ్యడానికి సిద్ధంగా ఉన్న కారణం చేత దేవుడు తన కోసం మనల్ని ప్రత్యేకపరిచాడు. యేసు క్రీస్తు తన స్వంత శరీరాన్ని పదే పదే కాకుండా ఒక్కసారే బలిగా అర్పించినప్పుడు ఈ రెండవ ప్రక్రియ అమలు జరిగింది.
|
|
\s5
|
|
\p
|
|
\v 11 యాజకుడు ప్రతి రోజూ బలిపీఠం ముందు నిలబడి ఒకేరకమైన బలులు, ఆచార కాండలు, అదేపనిగా చేస్తూ ఉంటాడు. అయితే అవి ఏ ఒక్కరి పాపాన్ని ఎన్నటికీ తీసివేయలేవు.
|
|
\v 12 అయితే క్రీస్తు మన పాపాల కోసం అర్పించిన బలి మాత్రం శాశ్వతంగా సరిపోతుంది. అంతే కాదు, ఆ బలిని ఒక్కసారే అర్పించేశాడు. ఇక పదే పదే బలులు అర్పించనక్కర లేదు. దీని తరవాత ఆయన అత్యున్నత గౌరవ స్థానంలో పాలించడానికి దేవుని పక్కన కూర్చున్నాడు.
|
|
\v 13 ఇప్పటినుండీ, దేవుడు తన శత్రువులనందరినీ పూర్తిగా ఓడించే వరకూ కనిపెడుతూ ఉన్నాడు.
|
|
\v 14 ఆయన తనను తాను అర్పించుకున్న ఒకే ఒక్క బలి ద్వారా, శుద్ధి పొందిన వారిని శాశ్వతంగా దేవుడు పరిపూర్ణులుగా చేశాడు.
|
|
\s5
|
|
\p
|
|
\v 15 ఇది సత్యమని దీని గురించి పరిశుద్ధాత్మ కూడా మనకి సాక్షమిస్తున్నాడు. మొదట ఆయన ఇలా అన్నాడు,
|
|
\q
|
|
\v 16 నా ప్రజల పక్షంగా నేను చేసిన మొదటి ఒప్పందం సమయం ముగిసిపోయింది.
|
|
\q వాళ్ళ పక్షంగా ఇప్పుడు ఒక కొత్త ఒప్పందం చేస్తాను.
|
|
\q వాళ్ళ కోసం నేను దీన్ని చేస్తాను” అని ప్రభువు చెప్తున్నాడు.
|
|
\q నా శాసనాన్ని వాళ్ళు అర్థం చేసుకొనేలా చేస్తాను.
|
|
\q వాళ్ళు నా శాసనాలకు విధేయత చూపేలా చేస్తాను."
|
|
\s5
|
|
\p
|
|
\v 17 తరవాత ఆయన ఇలా అన్నాడు,
|
|
\q "వాళ్ళ పాపాలను నేను క్షమిస్తాను,
|
|
\q వాళ్ళ పాపాలనూ అక్రమాలనూ ఇక ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోను, వాళ్ళు పాపులుగా ఎప్పటికీ ఉండరు."
|
|
\p
|
|
\v 18 దేవుడు ఎవరి పాపాలనైనా క్షమించినప్పుడు ఆ వ్యక్తి తన లోటును భర్తీ చేసుకోడానికి ఇంకా ఎలాంటి, ఏ రకమైన బలులూ అర్పించాల్సిన పని లేదు.
|
|
\s5
|
|
\p
|
|
\v 19 కాబట్టి నా సహ విశ్వాసులారా, యేసు మనకోసం తన స్వంత రక్తాన్ని చిందించి తన పనిని సంపూర్తి చేశాడని మనం నమ్ముతున్నాం కాబట్టి మనం దేవుని సన్నిధికి సూచనగా ఉన్న ప్రత్యక్ష గుడారంలోని అతి పరిశుద్ధ స్థలం లోకి ధైర్యంగా వెళ్ళగలం.
|
|
\v 20 ఒక కొత్త మార్గం ద్వారా ఎక్కడైతే నిత్యం జీవిస్తామో ఆ దేవుని సన్నిధి లోకి వెళ్ళే అనుమతిని ఆయన మనకి కలిగించాడు. ఈ కొత్త మార్గం మనకోసం చనిపోయిన యేసే.
|
|
\v 21 క్రీస్తు మనపై పరిపాలన చేసే గొప్ప ప్రధాన యాజకుడు. మనం దేవుని ప్రజలం.
|
|
\p
|
|
\v 22 కాబట్టి మనం విశ్వాసం విషయంలో యథార్థంగా సంపూర్ణ నిశ్చయతతో దేవుణ్ణి సమీపించాలి. మనం పాపం చేసిన తరవాత మన ఆలోచనలను నిర్మలం చేసేవాడు ఆయనే. ఇదెలా ఉంటుందంటే మన ఆలోచనల మీద స్వంత రక్తాన్ని చల్లి మన కోరికలను పవిత్రం చేసినట్గా మన శరీరాన్ని స్వచ్చమైన నీటితో కడిగినట్టుగా ఉంటుంది.
|
|
\s5
|
|
\p
|
|
\v 23 మనం నమ్మిన దానిని చలించకుండా గట్టిగా చెప్తూ ఉండాలి. దేవుడు ఆయన వాగ్దానం చేసినవన్నీ నమ్మకంగా చేస్తాడు. మనం అవి జరుగుతాయని సంపూర్ణ నిశ్చయంతో, ఆశతో ఉండాలి.
|
|
\v 24 అమితంగా ఒకళ్ళ నొకళ్ళు ప్రేమించుకోడానికీ మంచి పనులు చేయడానికీ ఒకళ్ళ నొకళ్ళు ప్రేరేపించుకుందాం.
|
|
\v 25 కొంత మంది చేస్తున్నట్టుగా ప్రభువును ఆరాధించడానికి సమాజంగా సమకూడటం మానకూడదు. దానికి బదులుగా మనలో ప్రతి ఒక్కరూ ఇతరుల్ని ప్రోత్సహించాలి. ప్రభువు రాకడ సమీపంగా ఉందని మనకు తెలుసు కాబట్టి ఆ రోజు దగ్గర పడుతున్న కొద్దీ ఇంకా ఎక్కువగా ఒకళ్ళ నొకళ్ళు పురికొల్పుకుందాం.
|
|
\s5
|
|
\p
|
|
\v 26 క్రీస్తు గురించిన సత్యాన్ని అనుభవించిన తరవాత కూడా బాహాటంగా అలవాటు ప్రకారం పాపం చేస్తే ఇక ఏ రకమైన బలులు కూడా మనకి సహాయం చేయలేవు. ఆ పాపాలకు ఇక బలులు ఉండవు.
|
|
\v 27 అంతే కాకుండా ఇంక మనల్ని దేవుడు తీర్పు తీరుస్తాడనే భయంతో ఎదురు చూడాలి. ఎందుకంటే ఆయన ప్రచండమైన అగ్నితో తన శత్రువులందరినీ న్యాయంగా శిక్షిస్తాడు.
|
|
\s5
|
|
\p
|
|
\v 28 మోషేకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని ఎవడైనా ఉల్లంఘిస్తే ఇద్దరో ముగ్గురో అతని మీద చెప్పిన సాక్ష్యం ప్రకారం ఎలాంటి దయా దాక్షిణ్యాలు లేకుండా అతన్ని చంపాల్సిందే.
|
|
\v 29 ఇది చాలా తీవ్రమైన శిక్ష. అయితే క్రీస్తు దేవుని కుమారుడు, దేవుడు కూడా. ఎవరైనా దేవుడు చేసిన ఒప్పందాన్ని తిరస్కరించి ఆయన చిందించిన రక్తాన్ని హేయమైందిగా ఎంచి, తన పాపాలను శుద్ధి చేసి, క్షమించిన ఆ రక్తాన్నీ, తన పట్ల కృపాభరితంగా వ్యవహరించిన దేవుని ఆత్మనూ తిరస్కరిస్తే వాళ్ళను దేవుడు తీవ్రంగా శిక్షిస్తాడు.
|
|
\s5
|
|
\p
|
|
\v 30 "పాపం చేసిన వాళ్ళని శిక్షించే హక్కు, అధికారం నాకే ఉన్నాయి, చేసిన దానికి తగిన శిక్ష నేనే వాళ్లకి ఇస్తాను" అని దేవుడు చెప్పాడని మనకు తెలుసు. "ప్రభువు తన ప్రజలకు తీర్పు తీరుస్తాడు"అని మోషే రాశాడు.
|
|
\v 31 జీవం గల సర్వ శక్తిమంతుడైన దేవుడు మిమ్మల్ని ముట్టడించి శిక్షించడం ఎంతో భయానకం!
|
|
\s5
|
|
\p
|
|
\v 32 మీరు క్రీస్తు గురించిన సత్యాన్ని మొదటిసారి అర్థం చేసుకున్న సమయాన్ని గుర్తు చేసుకోండి. మీరు ఎన్నో కష్టాలు ఓర్చుకున్నారు. మీరు ఎంత హింస ఎదుర్కొన్నా, దేవునిలో మీ విశ్వాసాన్ని కొనసాగించారు.
|
|
\v 33 మనుషులు బహిరంగంగా మిమ్మల్ని అవమానపరిచారు. కొన్నిసార్లు మిమ్మల్ని హింసకు గురి చేశారు. కొన్నిసార్లు మీ సాటి విశ్వాసులకు కలిగిన శ్రమల వల్ల మీరూ కష్టాల పాలయ్యారు.
|
|
\v 34 క్రీస్తును నమ్మినందుకు జైలు పాలైన వారి విషయంలో మీరు దయగా ఉండడమే కాకుండా అవిశ్వాసులు మీ ఆస్తి పాస్తులను లాగేసుకున్నా మీరు సంతోషంగా అంగీకరించారు. మీరు ఇలా ఎందుకు చేశారంటే పరలోకంలో మీకు శాశ్వతంగా ఆస్తి ఉందనీ, ఇక్కడ లాగేసుకొన్న ఆస్తిపాస్తుల కంటే ఆ పరలోకపు ఆస్తి చాలా గొప్పదనీ మీకు బాగా తెలుసు.
|
|
\s5
|
|
\p
|
|
\v 35 కాబట్టి వాళ్ళు మిమ్మల్ని హింసించినా సరే, నిరుత్సాహ పడవద్దు. అలా మీరు ఆయనలో విశ్వాసముంచుతూ ఓపికతో ఉంటే మీకు ఆయన గొప్ప బహుమతులిస్తాడు.
|
|
\v 36 ఇలా మీరు గనక ఓపికగా ఆయనలో విశ్వాసాన్ని కొనసాగిస్తూ, ఆయన కోరినట్టుగా చేయడం వల్ల ఆయన వాగ్దానం చేసిన వాటిని మీకు ఇస్తాడు.
|
|
\v 37 క్రీస్తు గురించి దేవుడు పలికిన మాటల్ని ఒక ప్రవక్త ఇలా రాశాడు,
|
|
\q "ఇక కొద్ది కాలంలోనే నేను వాగ్దానం చేసినవాడు తప్పకుండా వస్తాడు.
|
|
\q ఆయన ఆలస్యం చేసేవాడు కాదు.
|
|
\s5
|
|
\p
|
|
\v 38 "ఎవరు నాకు సంబంధించిన వాళ్ళో ఎవరు మంచి ప్రవర్తన కలిగి ఉంటారో, వాళ్ళు నాలో విశ్వాసాన్ని కొనసాగిస్తూ జీవిస్తారు.
|
|
\q ఒకవేళ వాళ్ళు గనుక పిరికితనంతో నన్ను విశ్వసించడం మానేసి వెనకడుగు వేస్తే
|
|
\q నేను వాళ్ళ గురించి సంతోషించను."
|
|
\p
|
|
\v 39 అయితే మనం పిరికి వాళ్ళంగా ఉండి దేవుడి చేతిలో నాశనానికి గురి కాకుండా ఆయనపై నమ్మకం ఉంచి ఆయన ద్వారా నిత్యం జీవించేలా రక్షణ పొందే వాళ్ళంగా ఉన్నాం.
|
|
|
|
\s5
|
|
\c 11
|
|
\p
|
|
\v 1 మనుషులు దేవుణ్ణి నమ్మి తాము ఎదురు చూస్తున్న వాటిని ఆయన కచ్చితంగా ఇస్తాడనీ, తాము వాటిని పొందుతామనీ నిశ్చయత కలిగి ఉండడమే విశ్వాసం. విశ్వాసం అంటే కొన్ని విషయాలు ఇప్పుడు కాకపోయినా, అవి కంటికి కనబడక పోయినా, ఎప్పటికైనా జరగడం తప్పనిసరిగా చూస్తామని మనుషులు నమ్మడం.
|
|
\v 2 ఎందుకంటే మన పూర్వికులు దేవుణ్ణి నమ్మారు. ఆయన వాళ్ళను ఆమోదించాడు.
|
|
\p
|
|
\v 3 మనం దేవుణ్ణి నమ్మాము కాబట్టి దేవుడు ఒక్క ఆజ్ఞ ఇవ్వడం ద్వారా ఈ విశ్వమంతా ఉనికిలోకి వచ్చిందని మనం అర్థం చేసుకున్నాం. కాబట్టి మనం విశ్వంలో ఇప్పుడు చూస్తున్న విషయాలు ఇంతకు ముందే ఉనికిలో ఉన్నవాటినుండి తయారైనవి కావు.
|
|
\s5
|
|
\v 4 ఆదాము కొడుకు హేబెలు దేవుణ్ణి నమ్మడం వల్ల తన అన్న కయీను అర్పణ కంటే శ్రేష్టమైన అర్పణ చెల్లించాడు. దేవుడు హేబెలు అర్పణ గురించి గొప్పగా మాట్లాడి అతడు నీతిమంతుడని ప్రకటించాడు. హేబెలు చనిపోయినప్పటికీ అతడు దేవుణ్ణి నమ్మిన విషయం గురించి మనం ఇప్పటికీ చెప్పుకుంటున్నాం.
|
|
\s5
|
|
\p
|
|
\v 5 హనోకు దేవుణ్ణి నమ్మడం వల్ల దేవుడు అతణ్ణి పరలోకానికి తీసుకెళ్ళిపోయాడు. హనోకు చనిపోలేదు, దేవుడే అతణ్ణి తీసుకెళ్ళిపోయాడు కాబట్టి అతడు ఎవరికీ కనిపించకుండా పోయాడు. దేవుడు అతణ్ణి తీసుకుని వెళ్లక ముందు హనోకు తనను సంతోషపెట్టాడని అతని గురించి ఆయన సాక్ష్యం ఇచ్చాడు.
|
|
\v 6 ఇప్పుడు మనుషులు దేవుణ్ణి సంతోషపెట్టడం సాధ్యమే. కేవలం వాళ్ళు దేవుణ్ణి నమ్మితే చాలు. ఎందుకంటే ఎవరైనా దేవుడి దగ్గరకి రావాలంటే మొట్టమొదటగా దేవుడున్నాడనీ, తనను తెలుసుకోవాలని ప్రయత్నించే వాళ్లకి ఆయన ప్రతిఫలం ఇస్తాడనీ నమ్మాలి.
|
|
\s5
|
|
\p
|
|
\v 7 దేవుడు జలప్రళయం పంపిస్తానని నోవహును హెచ్చరించాడు. ఇంతకు ముందెప్పుడూ నోవహు దానిని చూడలేదు. అయితే నోవహు ఆయన్ని నమ్మాడు. ఆయనపై పూజ్యభావంతో దేవుని మాటతో ఒక ఓడ కట్టి తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. అతడు ఇలా చేయడం వల్ల మిగిలిన ప్రజలు దేవుడిచ్చే శిక్షకు తగిన వారు అని లోకానికి చూపించాడు. నోవహు దేవుణ్ణి నమ్మాడు కాబట్టి దేవుడికి నచ్చిన వ్యక్తి అయ్యాడు.
|
|
\s5
|
|
\p
|
|
\v 8 దేవుడు అబ్రాహామును పిలిచి అతనికి, అతని వారసులకు ఇవ్వబోయే స్థలానికి వెళ్ళమన్నాడు. అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడు కాబట్టి ఆ మాటకి లోబడి తన దేశాన్ని వదిలి తానెక్కడికి వెళ్తున్నాడో తెలియక పోయినప్పటికీ అక్కడికి వెళ్ళాడు.
|
|
\v 9 అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడు కాబట్టి దేవుడు వారసత్వంగా ఇస్తానని వాగ్దానం చేసిన ఆ దేశంలో పరదేశిగా నివసించాడు. అబ్రాహాము గుడారాల్లో నివసించాడు. అతని కొడుకు ఇస్సాకు, మనవడు యాకోబు కూడా అలాగే నివసించారు. అబ్రాహాముకు ఇస్తానని వాగ్దానం చేసిన వాటిని ఇస్సాకు, యాకోబులకు కూడా ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు.
|
|
\v 10 దేవుడే స్వయంగా శిల్పిగా ఉండి నిర్మించే ఆ శాశ్వత నగరం కోసం అబ్రాహాము ఎదురు చూశాడు.
|
|
\s5
|
|
\p
|
|
\v 11 శారా వృద్ధాప్యం వల్ల పిల్లల్ని కనే శక్తి లేకపోయినా సరే, విశ్వాసం వల్ల కొడుకుని కనడానికి శక్తి పొందింది. ఎందుకంటే ఆమెకు కొడుకు పుడతాడని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని ఆమెకు తెలుసు.
|
|
\v 12 అబ్రాహాము పిల్లల్ని కనే స్థితిలో లేకపోయినా దేవుడు వాగ్దానం చేసినట్టే ఆ ఒక్క మనిషి నుండి ఆకాశ నక్షత్రాల్లాగా, సముద్ర తీరంలో ఇసుక రేణువుల్లాగా లెక్క లేనంత మంది వారసులు పుట్టుకొచ్చారు.
|
|
\s5
|
|
\p
|
|
\v 13 వాళ్ళు దేవునిలో నమ్మకం ఉంచుతూనే ఈ మనుషులంతా చనిపోయారు. దేవుడు వాళ్లకి ఇస్తానని వాగ్దానం చేసిన వాటిని ఇంకా పొందకుండానే దూరం నుండే వాటిని చూసేసినట్టుగా సంతోషించారు. తాము ఈ లోకానికి సంబంధించిన వాళ్ళం కాదన్నట్టుగా ఇక్కడ తాత్కాలికంగా ఉంటున్నట్టుగా ఒప్పుకున్నారు.
|
|
\v 14 ఇలాంటి విషయాలు చెప్తున్న వాళ్ళు తాము తమ నిజమైన స్వదేశం కోసం ఆశ పెట్టుకుని ఉన్నట్టుగా తెలుస్తుంది.
|
|
\s5
|
|
\p
|
|
\v 15 ఒకవేళ వాళ్ళు విడిచి వచ్చిన దేశం గురించి ఆలోచిస్తున్నట్టైతే, వాళ్ళు తిరిగి ఆ దేశానికే వెళ్ళడానికి అవకాశం ఉంది.
|
|
\v 16 కానీ వాళ్ళు నివసించడానికి మరింత శ్రేష్టమైన దేశాన్ని కోరుకున్నారు. వాళ్ళు పరలోకంలో ఉండే ఒక ఇంటిని కోరుకున్నారు. కాబట్టి దేవుడు వారు తనతోబాటు నివసించడానికి ఒక పట్టణాన్ని సిద్ధం చేశాడు. అంతే కాదు, తాను వాళ్ళ దేవుడనని చెప్పుకోడానికి ఎంతో సంతోషిస్తున్నాడు.
|
|
\s5
|
|
\p
|
|
\v 17 అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడు కాబట్టి దేవుడు అతణ్ణి తీవ్రంగా పరీక్షకు గురి చేసినప్పుడు అతడు తన కొడుకు ఇస్సాకును చంపి బలిగా అర్పించడానికి సిద్ధపడ్డాడు. దేవుడు అతనికి కొడుకును ఇస్తానని వాగ్దానం చేసి ఇచ్చిన ఆ ఒకే ఒక్క కొడుకుని, తన స్వంత భార్య ద్వారా పుట్టిన వాణ్ణి అబ్రాహాము బలిగా అర్పించబోతున్నాడు.
|
|
\v 18 ఆ కొడుకు గురించే దేవుడు ఇలా చెప్పాడు, "ఇస్సాకు నుండే నీకు వారసులు వస్తారు."
|
|
\v 19 అబ్రాహాము ఆ వాగ్దానం నెరవేరుతుందని నమ్మాడు. ఒక వేళ అతడు తన కొడుకుని బలిగా అర్పించినా చనిపోయిన ఇస్సాకును దేవుడు తిరిగి బతికించ గలడు. చెప్పాలంటే అబ్రాహాము చనిపోయిన వాణ్ణి తిరిగి పొందాడు.
|
|
\s5
|
|
\p
|
|
\v 20 ఇస్సాకు దేవుణ్ణి నమ్మాడు కాబట్టి దేవుడు తాను చనిపోయిన తరవాత తన కొడుకులైన యాకోబు, ఏశావుల్ని దీవించాలని ప్రార్థన చేశాడు.
|
|
\p
|
|
\v 21 యాకోబు దేవుణ్ణి నమ్మాడు గాబట్టి అతడు చనిపోయే ముందు తన కొడుకైన యోసేపు ఇద్దరు కుమారుల భవిష్యత్తులో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడని ప్రార్థించాడు. చనిపోక ముందు అతడు తన చేతి కర్ర మీద ఆనుకొని దేవుణ్ణి ఆరాధించాడు.
|
|
\v 22 యాకోబు దేవుణ్ణి నమ్మాడు కాబట్టి తన అంతిమ సమయంలో ఇశ్రాయేలీయులు భవిష్యత్తులో ఐగుప్తు నుండి స్వదేశానికి పయనమయ్యే విషయం గురించి మాట్లాడాడు. ఐగుప్తు వదిలి వెళ్ళే సమయంలో తన ఎముకల్ని వాళ్ళతోబాటు తన దేశానికి తీసుకు వెళ్ళమని తన సంతానానికి సూచించాడు.
|
|
\s5
|
|
\p
|
|
\v 23 మోషే తల్లిదండ్రులు దేవుణ్ణి నమ్మారు కాబట్టి తమకు కొడుకు పుట్టిన తరవాత అతడు అందంగా ఉండడం చూసి అతణ్ణి మూడు నెలలు దాచిపెట్టారు. ఇశ్రాయేలు సంతానమైన మగ పిల్లలందరినీ చంపమని ఆజ్ఞాపించిన ఐగుప్తు రాజుకు కూడా వాళ్ళ భయపడలేదు.
|
|
\v 24 ఫరో రాకుమారి మోషేని పెంచి పెద్ద చేసింది. మోషే పెరిగి పెద్దవాడయ్యాక అతడు దేవుణ్ణి నమ్మాడు, "ఫరో కుమార్తె కొడుకు" అనిపించుకోడానికి ఇష్టపడలేదు. రాజభోగాలు అనుభవించడానికి నిరాకరించాడు.
|
|
\v 25 రాజ మందిరంలో కొద్ది కాలం పాప జీవితాన్ని అనుభవించే కంటే దేవుని ప్రజలతో దీర్ఘ కాలం ఇతరుల చేత అవమానం భరించడం లోనే గొప్పదనం ఉందని నిర్ణయించుకున్నాడు.
|
|
\v 26 క్రీస్తు కోసం హింసలు అనుభవించడమే ఫరో కుటుంబం లోని ఐశ్వర్యాన్ని పొందడం కంటే దేవుని దృష్టిలో మరింత శ్రేష్టమని అతడు భావించాడు. దేవుడు భవిష్యత్తులో ఇచ్చే శాశ్వతమైన బహుమానం కోసం అతడు ఎదురు చూశాడు.
|
|
\s5
|
|
\p
|
|
\v 27 మోషే దేవుణ్ణి నమ్మాడు కాబట్టి అతడు ఐగుప్తును విడిచిపెట్టాడు. ఐగుప్తునుంచి వెళ్ళిపోవడం వల్ల రాజుకు కోపం వస్తుందని కూడా భయపడలేదు. ఇతరులెవ్వరూ చూడలేక పోయిన దేవుణ్ణి అతడు చూస్తూ ఉన్నట్టుగా అతడు ముందుకు వెళ్ళిపోయాడు.
|
|
\v 28 మోషే దేవుణ్ణి నమ్మాడు కాబట్టి తన స్వంత ప్రజలను రక్షించ గలిగాడు. దేవుడు పస్కా గురించి ఇచ్చిన ఆజ్ఞకు లోబడ్డాడు. అదే చివరికి ప్రతి సంవత్సరం ఆచరించే పండగ అయింది. గొర్రెల్ని చంపి వాటి రక్తాన్ని తమ ద్వారబంధాల మీద పూయమనీ, అలా పూయడం వల్ల మరణ దూత ఆ రక్తం చూసి, ఇశ్రాయేలీయుల ఇళ్ళలో ఉన్న తొలిచూలు సంతానాన్ని చంపకుండా దాటి పోతాడనీ దేవుడు తన ప్రజలకు ఆజ్ఞాపించాడు.
|
|
\s5
|
|
\p
|
|
\v 29 ఇశ్రాయేలీయులు దేవుణ్ణి నమ్మారు కాబట్టి ఎర్ర సముద్రం గుండా నడిచినప్పుడు కూడా వాళ్ళు పొడి నేల మీద నడిచారు. ఐగుప్తు సైన్యం కూడా వాళ్ళ లాగే సముద్రాన్ని దాటడానికి ప్రయత్నించింది. అయితే సముద్రం మళ్ళీ మామూలుగా ప్రవహించి వాళ్ళని ముంచివేసింది.
|
|
\p
|
|
\v 30 ఇశ్రాయేలీయులు దేవుణ్ణి నమ్మారు కాబట్టి ఏడు రోజులు యెరికో గోడల చుట్టూ కవాతు చేసిన తరవాత ఆ నగర ప్రాకారాలు కూలిపోయాయి.
|
|
\p
|
|
\v 31 రాహాబు ఒక వేశ్య. అయితే ఆమె దేవుణ్ణి నమ్మింది కాబట్టి దేవుని నమ్మని యెరికో ప్రజలతో బాటు ఆమె నాశనం కాకుండా తప్పించుకుంది. యెహోషువ ఆ నగర నాశనానికి వ్యూహం రచించడానికి గూఢచారుల్ని పంపాడు. రాహాబు వారిని సమాధానంగా తన ఇంటిలోకి ఆహ్వానించడం వలన దేవుడు ఆమెను రక్షించాడు.
|
|
\s5
|
|
\p
|
|
\v 32 ఇంకా ఏమి చెప్పను? దేవుణ్ణి నమ్మిన ఇంకా ఎంత మందిని గురించి చెప్పాలో తెలియడం లేదు. గిద్యోను, బారాకు, సంసోను, ఎఫ్తా, దావీదు, సమూయేలు, ఇంకా ఎందరో ఇతర ప్రవక్తలు, వీళ్ళందరి గురించీ చెప్పాలంటే చాలా సమయం పడుతుంది.
|
|
\v 33 వాళ్ళు దేవుణ్ణి నమ్మారు కాబట్టి వీళ్ళలో కొంత మంది గొప్ప పనులు చేశారు, కొంతమంది శక్తివంతులైన రాజుల చేతిలోనుండి రాజ్యాలను గెల్చుకొని స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది ఇశ్రాయేలును పరిపాలించి, ప్రజలకు, జాతులకు న్యాయం జరిగించారు. కొంతమంది దేవుడు ఇస్తానని వాగ్దానం చేసిన వాటిని పొందారు. కొంతమంది సింహాల నోళ్ళు మూయించారు.
|
|
\v 34 కొంతమంది అగ్ని నుండి తప్పించుకున్నారు. కొంతమంది కత్తి పోట్లను తప్పించుకున్నారు, కొంతమంది రోగాలనుంచి స్వస్థత పొందారు. కొంతమంది యుద్ధాల్లో పోరాడి శక్తివంతులయ్యారు. కొంతమంది విదేశీ సైన్యాలను తరిమికొట్టారు.
|
|
\s5
|
|
\p
|
|
\v 35 దేవుణ్ణి నమ్మిన కొంతమంది స్త్రీలు తమ రక్త సంబంధుల్ని దేవుడు బతికించగా తిరిగి పొందారు. అయితే కొంతమంది దేవుణ్ణి నమ్మడం వల్ల చనిపోయే వరకు చిత్రహింసలు భరించారు. వాళ్ళు ఎందుకు అలా భరించారంటే, "దేవుణ్ణి నమ్మడం మానేస్తే మిమ్మల్ని విడుదల చేస్తాం" అని శత్రువులు అన్నపుడు అలా చేయడానికి వాళ్ళు తిరస్కరించారు. అలా ఈ లోకంలో బతకడం కంటే దేవునితో శాశ్వతంగా జీవించాలని వాళ్ళు కోరుకున్నారు.
|
|
\v 36 ఇంకా కొందరు దేవుణ్ణి నమ్మడం వల్ల వెక్కిరింతలకు గురి అయ్యారు. కొంతమంది కొరడా దెబ్బలకు తమ వీపులు చూపారు. కొందరు సంకెళ్ళను, ఖైదును కూడా సహించారు.
|
|
\v 37 కొంతమంది విశ్వాసులను రాళ్ళతో కొట్టి చంపారు. కొంతమంది విశ్వాసులను రంపాలతో కోశారు. కొందరిని కత్తులతో చంపారు. దేవుణ్ణి నమ్మిన కొంతమంది గొర్రెల, మేకల చర్మాలు కట్టుకొని తిరిగారు. వాళ్ళ దగ్గర డబ్బు లేదు. ప్రజలు ప్రతి నిత్యం వాళ్ళని అణచివేస్తూ హాని చేస్తూ ఉన్నారు.
|
|
\v 38 ఈ లోకంలో ఉన్న ఇలాంటి వాళ్లకు, దేవుణ్ణి నమ్మినందుకు హింసలు అనుభవిస్తున్న వాళ్లకు ఈ లోకపు మనుషులతో కలిసి నివసించడానికి అర్హత లేదు. వీళ్ళలో కొంతమంది ఎడారుల్లో కొండల్లో తిరుగుతూ గడిపారు. కొంతమంది గుహల్లో, భూమి కింద సొరంగాల్లో బతికారు.
|
|
\s5
|
|
\p
|
|
\v 39 వాళ్ళ విశ్వాసాన్ని అనుసరించి దేవుడు వాళ్ళని ఆమోదించాడు గానీ తాను వాగ్దానం చేసింది మాత్రం వాళ్లకి ఇవ్వలేదు.
|
|
\v 40 వాగ్దానం చేసిన దానిని వెంటనే ఇవ్వడం కంటే ఆలస్యంగా ఇవ్వడమే మరింత మేలైనదని దేవుడికి ముందుగానే తెలుసు. మనం లేకుండా వాళ్ళు పరిపూర్ణులు కాదు కాబట్టి వాళ్ళూ మనమూ కలిసినప్పుడే దేవుడు ఇవ్వాలనుకున్నది పొందుతాం.
|
|
|
|
\s5
|
|
\c 12
|
|
\p
|
|
\v 1 దేవుణ్ణి నమ్మాము అని రుజువు చేసుకున్న ఇలాంటి వాళ్ళు ఎంతోమంది గురించి మనకి తెలుసు. కాబట్టి మనల్ని కృంగదీసే బరువులన్నిటినీ వదిలేసి మనల్ని పట్టుకు వేలాడే ప్రతి పాపాన్నీ వదిలించుకుందాం. దేవుడు మనకు ఇచ్చి చేయమని చెప్పే ప్రతిదాన్నీ చివరి వరకూ చేస్తూ మన పరుగు పందెంలో ఓపికతో పరుగెత్తుదాం.
|
|
\v 2 యేసును గురించి ఆలోచిస్తూ మన పూర్తి ధ్యాస అంతా ఆయన మీద పెడదాం. ఆయనే మనల్ని నడిపించేవాడు, మన విశ్వాసాన్ని పరిపూర్ణం చేసేవాడు. ఆయనే సిలువలో భయంకరమైన హింస అంతా భరించి తనను అవమాన పరుస్తున్న వాళ్ళని ఎంత మాత్రం లెక్క చెయ్యలేదు. తరవాత భవిష్యత్తులో దేవుడు ఇవ్వబోయే ఆనందం కోసమే వీటన్నిటినీ ఆయన భరించాడు. ప్రస్తుతం ఎక్కడైతే దేవుని అధికారం ఉందో ఆ పరలోకంలో ఆయన దేవుని కుడివైపున కూర్చుని ఉన్నాడు.
|
|
\p
|
|
\v 3 పాపాత్ములైన ప్రజలు అసహ్యకరంగా ఆయనకు వ్యతిరేకంగా చేసిన దాన్నంతా యేసు ఓపికగా భరించాడు. యేసు ఆదర్శాన్ని చూసి మీ హృదయాలనూ, మనసులనూని బలపరచుకోండి. దీనివల్ల ఇంక మీరు దేవుణ్ణి వదలిపెట్టరు, నిరుత్సాహపడరు.
|
|
\s5
|
|
\p
|
|
\v 4 పాపం విషయంలో మీరు శోధనలు ఎదుర్కొంటూ వాటికి వ్యతిరేకంగా మీరు ఆ పాపాన్ని అడ్డుకొనే విషయంలో పెనుగులాడేటప్పుడు యేసు చేసినంతగా ఇంతవరకు మీరు రక్తం కార్చలేదు, చనిపోలేదు.
|
|
\v 5 సొలోమోను తన కుమారుడికి చెప్పిన ఈ మాటలుని మరచిపోవద్దు. దేవుని పిల్లలుగా అవే మాటలతో ఆయన మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాడు: "నా కుమారుడా, ప్రభువు నిన్ను క్రమశిక్షణలో పెడుతున్నప్పుడు మనసు పెట్టు. ప్రభువు నిన్ను శిక్షించినప్పుడు నిరుత్సాహ పడవద్దు.
|
|
\q
|
|
\v 6 ఎందుకంటే ప్రభువు ప్రేమించిన ప్రతివాడినీ క్రమశిక్షణలో పెడతాడు.
|
|
\q తన స్వంత వాళ్ళు అనిపించిన ప్రతివాడినీ ఆయన తీవ్రంగా సరి చేస్తాడు."
|
|
\s5
|
|
\p
|
|
\v 7 దేవుడు మిమ్మల్ని క్రమశిక్షణలో పెట్టడానికి హింసలు భరించడం ఒకవేళ అవసరమేమో. ఆయన మిమ్మల్ని క్రమశిక్షణలో పెట్టినప్పుడు, పిల్లల్ని సరిదిద్దే ఒక తండ్రిలాగా, మిమ్మల్ని తన పిల్లల్లాగా ఆయన భావిస్తాడు. తండ్రులందరూ తమ పిల్లల్ని క్రమశిక్షణలో పెడతారు.
|
|
\v 8 కాబట్టి ఒకవేళ దేవుడు మిమ్మల్ని తన పిల్లలుగా భావించి క్రమశిక్షణలో పెడుతున్నప్పుడు మీకు అలాంటి అనుభవమే లేకపోతే మీరు ఆయన నిజమైన పిల్లలు కాదన్నమాట. అప్పుడు మీరు క్రమశిక్షణ చేసే తండ్రి లేని అక్రమ సంతానం అన్నమాట.
|
|
\s5
|
|
\p
|
|
\v 9 ఇంకా చెప్పాలంటే ఈ లోకంలోని తండ్రులు మనం చిన్న వాళ్ళంగా ఉన్నప్పుడు మనల్ని క్రమశిక్షణలో పెడతారు. వాళ్ళు అలా చేసినందుకు మనం వాళ్ళని గౌరవించాం. అయితే అంతకన్నా ఎక్కువైన మన ఆత్మీయ తండ్రి మనల్ని క్రమశిక్షణలో పెడుతున్నప్పుడు మనం అంతకన్నా ఎక్కువగా దాని కింద ఉండడానికి సిద్ధంగా ఉంటే మనం శాశ్వతంగా జీవిస్తాం.
|
|
\v 10 మన తండ్రులు వాళ్లకి మంచిది అని తోచింది కొంతకాలం మనకి నేర్పించి క్రమశిక్షణలో పెంచారు. అయితే దేవుడెప్పుడూ తన పరిశుద్ధతను పంచుకోడానికి మన మంచి కోసమే మనల్ని క్రమశిక్షణలో పెడుతూ మనకి సహాయపడతాడు.
|
|
\v 11 దేవుడు మనల్ని క్రమశిక్షణలో పెడుతున్నప్పుడు దానిలో సంతోషం ఏమీ ఉండదు. పైపెచ్చు అది మనకు బాధాకరంగా ఉంటుంది. కానీ ఎవరైతే ఈ క్రమశిక్షణను అలవాటు చేసుకుంటారో వాళ్ళు యథార్థంగా జీవించడం నేర్చుకుంటారు. అది మనసుకు శాంతినిస్తుంది.
|
|
\s5
|
|
\p
|
|
\v 12 కాబట్టి ఆత్మీయంగా అలసిపోయినట్టుగా చేతలుడిగిపోయినట్టుగా ఉండడం మాని దేవుని క్రమశిక్షణ మిమ్మల్ని పునరుజ్జీవింపజేస్తుందని నమ్మండి.
|
|
\v 13 క్రీస్తును అనుకరిస్తూ ముందుకు కదలండి. దానివల్ల బలహీనంగా ఉన్న విశ్వాసులు మిమ్మల్ని చూసి ఆత్మీయంగా బలం తెచ్చుకొని క్రీస్తులో నమ్మకం ఉంచడం వల్ల చచ్చుబడిపోకుండా ఉంటారు. అప్పుడు ఆత్మీయంగా గాయపడి పనికి రాకుండా ఉన్న మోకాళ్ళు తిరిగి బలం పుంజుకుంటాయి.
|
|
\s5
|
|
\p
|
|
\v 14 మనుషులందరితో సమాధానంగా ఉండటానికి ప్రయత్నించండి. పరిశుద్ధంగా ఉండడానికి మీ శాయశక్తులా ప్రయత్నించండి. ఎందుకంటే పరిశుద్ధంగా లేకపోతే ఎవరూ దేవుణ్ణి చూడలేరు.
|
|
\v 15 మీలో ప్రతి ఒక్కళ్ళూ దేవుడు మన విషయంలో చేసే కృపాకార్యాన్ని అనుభవించేలా చూసుకోవాలి. దేవుని కృపా కార్యాలకు మనం తగినవాళ్ళం కాదు. మీలో ఎవరూ ఇతరుల విషయంలో చెడుగా ప్రవర్తించకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఆ పాపం చిన్న వేరులాగా మొలకెత్తి తరవాత పెద్ద వృక్షమై విశ్వాసులెంతోమంది పాపం చేయడానికి దారి తీస్తుంది.
|
|
\v 16 ఏశావు లాగా అనైతికంగా అవిధేయులుగా ఉండకండి. అతడు ఒక్క పూట భోజనం కోసం తన పెద్ద కుమారుడి హక్కును మార్చేసుకున్నాడు.
|
|
\v 17 ఆ తరవాత ఏశావు తన తండ్రి ఇస్సాకు నుండి దీవెనలు పొందాలని ఆశపడి, ఆ హక్కును మళ్ళీ పొందాలని ఆశించాడు. ఏశావు కోరినట్టుగా చేయడానికి ఇస్సాకు ఒప్పుకోలేదు. ఏశావు తాను చేసిన దానిని మార్చుకోవాలని కన్నీళ్ళతో ప్రయత్నించినా పరిస్థితుల్ని చక్కదిద్దే దారి లేకపోయింది.
|
|
\s5
|
|
\p
|
|
\v 18 ఇక దేవుని విషయానికొస్తే ఇశ్రాయేలు ప్రజలు ఎదుర్కొన్న సీనాయి కొండలాంటి అనుభవాలు మీకెదురు కాలేదు. స్వయంగా దేవుడే దిగి వచ్చిన ఆ సీనాయి కొండను ముట్టుకోవద్దని దగ్గరకు వచ్చిన ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఆజ్ఞాపించాడు. వాళ్ళు అగ్నితో మండుతూ ఉన్న కొండ దగ్గరకు వచ్చారు. మబ్బుగా, చీకటిగా ఉంది భయంకరమైన తుఫాను అక్కడ ఉంది.
|
|
\v 19 వాళ్ళు అక్కడ బాకా శబ్దం విన్నారు. తరవాత దేవుడు పలికిన మాటలు విన్నారు. అవి చాలా శక్తివంతమైన మాటలు. కాబట్టి వాళ్ళు ఇలా ఇంకెప్పుడూ తమతో మాట్లాడవద్దని దేవుణ్ణి బతిమాలుకున్నారు.
|
|
\v 20 అక్కడ దేవుడు ఏం చెప్పాడంటే, "ఎవరైనా సరే, ఒక వ్యక్తి గానీ, జంతువు గానీ ఈ పర్వతాన్ని ముట్టుకుంటే గనక వాళ్ళని తప్పకుండా మీరు చంపేయాలి." దీనికే ఇశ్రాయేలు ప్రజలు భయపడి పోయారు.
|
|
\v 21 నిజంగా పర్వతం మీద ఏం జరిగిందో చూసిన తరవాత మోషే భయపడి పోయి "నేనెంతో వణుకుతున్నాను, హడలిపోయాను” అన్నాడు.
|
|
\s5
|
|
\p
|
|
\v 22 ఇప్పుడు మీరు పరలోకంలో నివసించే ఆ దేవుని సన్నిధికి అంటే, పరలోకపు "కొత్త యెరూషలేము” కు వచ్చారు. ఇది ఇశ్రాయేలులో సీయోను కొండ మీద కట్టిన ఈ భూలోకపు యెరూషలేములో మీ పితరులు ఆరాధించినట్టుగా ఉంది. లెక్క పెట్టలేనంత మంది దూతలు గుమిగూడి ఉత్సహించే చోటికి మీరు వచ్చారు.
|
|
\p
|
|
\v 23 జేష్ఠ కుమారుని ఆధిక్యతలు పొందిన విశ్వాసులందరూ ఉన్న సమాజానికి, ఎవరి పేర్లయితే దేవుడు పరలోకంలో నమోదు చేశాడో అలాంటి చోటికి మీరు వచ్చారు. ప్రతి ఒక్కరికీ న్యాయం తీర్చే దేవుని దగ్గరకి మీరు వచ్చారు. దేవుని ప్రజల ఆత్మల దగ్గరకి మీరు వచ్చారు. ఈ ప్రజలు చనిపోక ముందు భూలోకంలో సత్ప్రవర్తనతో జీవించారు. ఇప్పుడు దేవుడు ఈ పరలోకంలో వాళ్ళని పరిపూర్ణులుగా చేశాడు.
|
|
\v 24 దేవుడికీ మనకూ మధ్య ఒక కొత్త ఒప్పందం అమర్చి పెట్టిన యేసు ప్రభువు దగ్గరికి మీరు వచ్చారు. ఆయన సిలువలో చనిపోయినప్పుడు ప్రవహించిన రక్తం వల్ల ఈ కొత్త ఒప్పందం జరిగింది. ఈ రక్తం వల్లే దేవుడు మనల్ని క్షమించడం సాధ్యం అయ్యింది. హేబెలు రక్తం కంటే యేసు రక్తం మనకు శ్రేష్టమైన వాగ్దానాలను స్థిరపరచింది.
|
|
\s5
|
|
\p
|
|
\v 25 దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల్ని నిరాకరించకుండా జాగ్రత్త పడండి. ఇశ్రాయేలు ప్రజలు దేవుని హెచ్చరికలు వినకుండా పెడచెవిని పెట్టడం వల్ల దేవుని శిక్ష నుండి తప్పించుకోలేక పోయారు. ఆయన పరలోకం నుండి చెప్తున్న మాటల్ని, హెచ్చరికల్ని, మనం గనక తిరస్కరిస్తే, కచ్చితంగా శిక్షను తప్పించుకోలేం.
|
|
\v 26 సీనాయి పర్వతం నుండి దేవుడు పలికిన మాటలకు భూమి వణికిపోయింది. అయితే ఇప్పుడు ఆయన మళ్ళీ ఒక వాగ్దానం చేస్తున్నాడు: "ఇంకొకసారి నేను భూమినే కాదు, ఆకాశాలను కూడా వణికిస్తాను."
|
|
\s5
|
|
\p
|
|
\v 27 "మళ్ళీ”, "ఇంకొకసారి” అనే మాటలు దేవుడు భూమి మీద ఉన్నవాటినీ, ఆయన చేసిన సృష్టినంతటినీ కదిలించి తీసివేస్తాడని సూచిస్తున్నాయి. పరలోకంలో ఉన్న కదలనివి శాశ్వతంగా ఉండడం కోసం ఆయన ఇలా చేయొచ్చు.
|
|
\v 28 కాబట్టి మనం ఆయన రాజ్యంలో సభ్యులుగా ఉండబోతున్నాం. ఏదీ మనల్ని కదలించలేదు. అందుకు దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఈ రాజ్యంలో ఆయన్ని ఆరాధించడం ద్వారా ఆయనకు చెందాల్సిన గొప్ప ఘనతనూ, గౌరవాన్నీ ఆపాదించడం ద్వారా ఆయన్ని సంతోషపెడదాం.
|
|
\v 29 మనం ఆరాధించే దేవుడు అపవిత్రమైన ప్రతిదాన్నీ దహించే అగ్నిలాంటి వాడు!
|
|
|
|
\s5
|
|
\c 13
|
|
\p
|
|
\v 1 మీ సాటి విశ్వాసుల్ని ప్రేమిస్తూ ఉండండి.
|
|
\v 2 అవసరంలో ఉన్న యాత్రికులకు ఆతిథ్యం ఇవ్వడం విస్మరించకండి. అపరిచితుల్ని ఆహ్వానించే క్రమంలో కొంతమంది తెలియకుండానే దేవదూతల్ని కూడా తమ ఇంటికి ఆహ్వానించారు.
|
|
\s5
|
|
\p
|
|
\v 3 విశ్వాసులు కావడం వల్ల చెరసాల పాలైన వాళ్లకు సహాయం చేయడం మర్చిపోకండి. వాళ్ళతో పాటు హింసలు పొందుతున్నట్టు గా భావించి వాళ్ళను పరామర్శ చేయండి.
|
|
\p
|
|
\v 4 వివాహం చేసుకున్న స్త్రీ పురుషులు ప్రతి విషయంలో ఒకళ్ళ నొకళ్ళు గౌరవించుకొని పవిత్రంగా ఒకళ్ళ పట్ల ఒకళ్ళు నమ్మకస్తులుగా కట్టుబడి ఉండండి. లైంగిక అవినీతిపరుల్నీ, వ్యభిచారుల్నీ దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు.
|
|
\s5
|
|
\p
|
|
\v 5 ఎప్పుడూ డబ్బు యావ లేకుండా జీవించండి. ఎక్కువ ఉన్నా, కొంచెమే ఉన్నా, ఎంత ఉన్నా సంతోషంగా ఉండండి. మోషే ద్వారా దేవుడు రాసిన మాటలు గుర్తు చేసుకోండి:
|
|
\q "నేను నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టను.
|
|
\q నేను నీకు సమకూర్చి పెట్టడం ఎప్పుడూ మానను."
|
|
\p
|
|
\v 6 కాబట్టి కీర్తనకారుడు చెప్పినట్టు మనం ధైర్యంగా ఇలా చెప్పగలం,
|
|
\q "ప్రభువే నాకు సహాయుడుగా ఉండగా ఇక నేను ఏమాత్రం భయపడను! దేవుడు నాకు సహాయం చేయకుండా మనుషులు ఎవరూ అడ్డుపడ లేరు."
|
|
\s5
|
|
\p
|
|
\v 7 మీ ఆత్మీయ నాయకులు క్రీస్తు గురించిన దేవ సువార్తను మీకు బోధించారు. వాళ్ళు మార్గదర్శకులుగా ఎలాంటి జీవితం గడిపారో, ఎలా వాళ్ళు క్రీస్తును నమ్మారో జ్ఞాపకం చేసుకోండి.
|
|
\v 8 యేసు క్రీస్తు నిన్న, ఇప్పుడు, ఎప్పుడూ ఉన్నట్టుగా శాశ్వతంగా ఒకేలాగా ఉంటాడు.
|
|
\s5
|
|
\p
|
|
\v 9 ఇతరులు దేవుని గురించి చెప్పే రక రకాల విషయాలు మిమ్మల్ని తప్పుదారి పట్టించనివ్వకండి. మేమెప్పుడూ మీకు కొత్త విషయాలు బోధించలేదు. దేవుని కృపా కార్యాలతోనే మనకు నిజమైన బలం వస్తుంది గానీ ఏది తినొచ్చు, ఏది తినకూడదు అనే రక రకాల నియమాలు ఆచరించడం వల్ల ఏమీ రాదు.
|
|
\p
|
|
\v 10 ప్రత్యక్ష గుడారంలో పని చేసేవాళ్లకి క్రీస్తును ఆరాధించే మన బలిపీఠం దగ్గర తినే హక్కు లేదు.
|
|
\v 11 పాపాల గురించి బలి అర్పించిన జంతువుల రక్తాన్ని అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రధాన యాజకుడు తెచ్చిన తరవాత వేరే వ్యక్తులు మిగిలిన ఆ జంతు కళేబరాన్ని శిబిరం బయట కాల్చివేస్తారు.
|
|
\s5
|
|
\p
|
|
\v 12 అదే విధంగా మనల్ని తన ప్రజలుగా చేసుకోవడం కోసం మరి ముఖ్యంగా దేవునికి ప్రత్యేక పరచడానికి యేసు ప్రభువు కూడా యెరూషలేము నగర ద్వారం బయట హింసలపాలై చనిపోయాడు. మన పాపాలకు బలిగా తన స్వంత రక్తాన్ని చిందించడం ద్వారా దీన్ని జరిగించాడు.
|
|
\p
|
|
\v 13 కాబట్టి మనం రక్షణ పొందాలంటే యేసు దగ్గరకు వెళ్ళాలి. మన నియమాలనూ, ఆచారాలనూ పక్కన పెట్టి, మనుషులు యేసును అవమానించినట్టుగానే మనం కూడా అవమానాల పలు కావాలి.
|
|
\v 14 ఇక్కడ లోకంలో విశ్వాసులమైన మనకు యెరూషలేము లాంటి పట్టణం లేదు, శాశ్వతంగా నిలిచిపోయే పరలోక పట్టణం కోసం మనం ఎదురుచుస్తున్నాము.
|
|
\s5
|
|
\p
|
|
\v 15 యేసు మనకోసం చనిపోయాడు కాబట్టి మనం ఎప్పుడూ ఆయన్ని స్తుతించాలి. జంతుబలులకు బదులుగా మనం ఆయనకి ఇవ్వగలిగే బలి ఇదే. మనం క్రీస్తును నమ్ముతున్నామని బహిరంగంగా ఇతరులకు చెప్పడానికి సిద్ధంగా ఉండాలి.
|
|
\p
|
|
\v 16 ఇతరుల కోసం ఎప్పుడూ మంచి పనులు చేయండి. మీకున్నది ఇతరులతో పంచుకోండి. ఎందుకంటే ఇలాంటి పనులు చేయడమే దేవునికి మీరర్పించే ఇష్టమైన బలి.
|
|
\p
|
|
\v 17 మీ నాయకులకు లోబడి ఉండండి. వాళ్ళు ఏది చెప్తే అది చేయండి. ఎందుకంటే మొదటి నుండీ వాళ్ళే మీ యోగక్షేమాలు చూస్తున్నవాళ్ళు. ఒకానొక రోజు వాళ్ళు తాము చేసిన దానిని దేవుడు అంగీకరించాడా లేదా అని ఆయన ముందు నిలబడాల్సి ఉంటుంది. వాళ్లకి లోబడండి. అప్పుడే వాళ్ళు మీ ఆత్మలను కావలి కాసే పనిని విచారంగా కాకుండా సంతోషంగా చేస్తారు. వాళ్లకి విచారం కలిగిస్తే అది మీకు ఎంత మాత్రం మంచిది కాదు.
|
|
\s5
|
|
\p
|
|
\v 18 నా గురించీ, నాతో ఉన్నవాళ్ళ గురించీ ప్రార్థన చేయండి. నేను దేవునికి ఏవిధంగానూ అసంతృప్తి కలిగించ లేదని నాకు కచ్చితంగా తెలుసు. ప్రతి విషయంలో యోగ్యంగా జీవించడానికే ప్రయత్నించాను.
|
|
\v 19 మీ దగ్గరికి రావడానికి ఎలాంటి అడ్డంకులు కలగకుండా నా గురించి బలంగా ప్రార్థన చేయమని మిమ్మల్ని బతిమిలాడుతున్నాను.
|
|
\s5
|
|
\p
|
|
\v 20 యేసు ప్రభువు మనకు సమస్తం సమకూర్చి పెడతాడు, మనల్ని కాపాడతాడు, గొర్రెల కాపరి గొర్రెల్ని నడిపించినట్టుగా మనల్ని నడిపిస్తాడు. మనకు మనశ్శాంతి నిచ్చే దేవుడు యేసు ప్రభువును మృతుల్లో నుండి లేపాడు. క్రీస్తు సిలువలో చనిపోయి కార్చిన రక్తం వల్ల మనతో నిత్యమైన ఒప్పందాన్ని సుస్థిరం చేశాడు.
|
|
\v 21 కాబట్టి ప్రతి మంచి విషయంలో ఆయన కోరినట్టుగా ఆయన ఇష్టాన్ని జరిగించడానికి మిమ్మల్ని ఆయన సిద్ధపరచాలని ప్రార్థిస్తున్నాను. మనకోసం తనకు తానే అర్పించుకొన్న యేసును మనం వెంబడించడాన్ని గమనిస్తూ ఆయన దృష్టిలో ఇష్టమైన వాటిని యేసు క్రీస్తు ద్వారా మనలో జరిగిస్తాడు. ప్రజలందరూ యేసు క్రీస్తును నిత్యమూ స్తుతిస్తారు గాక, ఆమెన్!
|
|
\s5
|
|
\p
|
|
\v 22 నా సాటి విశ్వాసులారా, ఈ చిన్న ఉత్తరంలో రాసిన మాటల్ని ఓపికగా గమనించండి. కేవలం మిమ్మల్ని ప్రోత్సహించడానికే ఈ మాటలు రాస్తున్నాను.
|
|
\p
|
|
\v 23 మన సాటి విశ్వాసి తిమోతి చెరసాల నుండి విడుదల అయ్యాడు. ఇది మీకు తెలియాలని చెప్తున్నాను. అతడు నా దగ్గరకి తొందరగా వస్తే నేను మిమ్మల్ని చూడడానికి వచ్చేటప్పుడు నాతోబాటు వస్తాడు.
|
|
\s5
|
|
\p
|
|
\v 24 మీ పట్టణంలో దేవునికి చెందిన మీ ఆత్మీయ నాయకులకూ మీ సాటి విశ్వాసులందరికీ నా వందనాలు తెలియజేయండి. ఇక్కడ ఉన్న విశ్వాసులందరూ ఇటలీ నుండి వచ్చిన విశ్వాసులందరూ మీకు వందనాలు తెలుపుతున్నారు.
|
|
\p
|
|
\v 25 దేవుడు మిమ్మల్ని తన కృపతో ప్రేమించి కాపాడును గాక.
|