STR_te_iev/67-REV.usfm

918 lines
192 KiB
Plaintext

\id REV - Indian Easy Version (IEV) Telugu
\ide UTF-8
\h ప్రకటన గ్రంథము
\toc1 ప్రకటన గ్రంథము
\toc2 ప్రకటన గ్రంథము
\toc3 rev
\mt1 ప్రకటన గ్రంథము
\s5
\c 1
\p
\v 1 యోహాననే నాకు, యేసుక్రీస్తు చూపించిన దర్శనం. దేవుడు ఈ విషయాలను యేసుక్రీస్తుకు వెల్లడించాడు. వాటిని యేసు తన సేవకులకు వెల్లడి చేయాలని ఆయన ఉద్దేశ్యం. ఈ విషయాలను యేసు తన దేవదూతను పంపి తన సేవకుడైన యోహాననే నాకు తెలియజేశాడు. ఈ విషయాలు త్వరలో జరగబోతున్నాయి.
\v 2 యోహాననే నేను యేసుక్రీస్తు గురించిన నిజమైన వివరణను, అలాగే దేవుని వాక్కు గురించి నేను విన్న, కన్న వాటికి ప్రత్యక్ష సాక్షిగా ఉండి తెలియజేస్తున్నాను.
\v 3 ఈ విషయాలు నెరవేరే సమయం దగ్గర పడింది కాబట్టి, ఈ మాటలను బిగ్గరగా చదివే వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాగే అలా చదివిన వాక్యాలను విన్నవారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన చెప్పినది జాగ్రత్తగా విని, దాని ప్రకారం నడిచే వారికి దేవుడు మేలు చేస్తాడు.
\s5
\p
\v 4 ఆసియాలోని ఏడు సంఘాలలో విశ్వాసులకు యోహాననే నేను ఈ ఉత్తరాలు రాస్తున్నాను. దేవుడు మీపై దయ చూపిస్తూ, మీ హృదయాలకు శాంతిని ప్రసాదించు గాక. ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ ఇప్పుడూ భవిష్యత్తులో కూడా ఉండే దేవుడు. దేవుని సింహాసనం ఎదుట ఉన్న దేవుని ఆత్మ సర్వ శక్తిమంతుడు. దేవుని సింహాసనం ఎదుట ఉన్న ఏడు ఆత్మలు దీనికి ప్రతీకలు.
\p
\v 5 దేవుని గురించిన సత్యాన్ని నమ్మకంగా మనకు తెలియజేస్తున్న యేసుక్రీస్తు ప్రభువు మీకు తన దయను, శాంతిని ప్రసాదించు గాక. చనిపోయిన వారిలో నుండి మొదటివాడిగా దేవుడు ఆయనను లేపాడు. భూమి మీద ఉన్న రాజులందరినీ పాలించేవాడు ఆయనే. ఆయన మనలను ఎంతో ప్రేమించి, మన పాపాలను పరిహరించిన వాడు.
\v 6 ఆయన తన రాజ్యపాలన మొదలు పెట్టాడు. తన తండ్రి అయిన దేవుడు ఆజ్ఞాపించినట్టుగా ఆయన్ని ఆరాధించే యాజకులుగా మనలను ఆయన ప్రత్యేకపరుస్తున్నాడు. యేసుక్రీస్తుకు ఎల్లకాలం స్తుతి, కీర్తి చెందు గాక.
\s5
\p
\v 7 చూడండి! క్రీస్తు మేఘాల్లో వస్తున్నాడు. అందరూ ఆయన్ని చూస్తారు. ఆయన్ని సిలువకు మేకులతో కొట్టి చంపిన వాళ్ళు కూడా చూస్తారు. భూమి మీద ఉన్న ప్రతి జాతీ, ఆయన రావడం చూసి బాధలో, శోకంలో మునిగిపోతారు. అది నిజం.
\p
\v 8 మన ప్రభువైన దేవుడు, "అన్ని విషయాలనూ ప్రారంభించిన వాడిని, ఆల్ఫాను నేనే. అన్ని విషయాలూ అంతం చేయగల వాడిని, ఒమేగాను నేనే. నేను ప్రస్తుతం జీవిస్తున్నవాణ్ణి, ఎల్లప్పుడూ జీవిస్తూ ఉండే వాణ్ణి నేనే. అన్నిటినీ శాసించే వాణ్ణి నేనే. అందరినీ పాలించే వాణ్ణి నేనే" అని ప్రకటిస్తున్నాడు.
\s5
\p
\v 9 యోహాననే నేను మీ సాటి విశ్వాసిని. యేసు పరిపాలనలో మనందరం ఉన్నాము కాబట్టి మీలానే నేనూ బాధలు అనుభవిస్తున్నాను. మన విశ్వాసం కోసం బాధలు పడాలని పిలిచిన పిలుపును మనందరం పంచుకుంటున్నాము. అన్నిటిపైనా ఆయన చేస్తున్న పాలనలో, నియంత్రణలో మనందరం భాగస్తులం. మనకు వచ్చే ప్రతి న్యాయ విమర్శను, పరీక్షను ఓపికతో భరిస్తున్నాము. నేను దేవుని గురించిన సందేశాన్ని, యేసును గురించిన సత్యాన్ని నిరంతరం మనుషులకు చెబుతున్నాను గనక నన్ను ఖైదు చేసి పత్మాసు ద్వీపానికి పంపించారు.
\p
\v 10 ఇతర విశ్వాసులతో కలిసి ప్రభువును ఆరాధిస్తున్న రోజున దేవుని ఆత్మ నన్ను తన స్వాధీనంలోకి తీసుకున్నాడు. అప్పుడు ఎవరో నా వెనుక మాట్లాడుతున్నట్టు వినిపించింది. ఆ స్వరం పెద్ద బాకా శబ్దంలా ఉంది.
\v 11 అతడు నాతో, "నువ్వు చూస్తున్న దాన్ని పుస్తకం చుట్టలో రాసి, ఏడు సంఘాలకు పంపించు. అంటే ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియ, లవొదికయ అనే పట్టణాలలోని విశ్వాసులకు పంపించు" అని చెప్పాడు.
\s5
\p
\v 12 ఈ మాటలు విని ఎవరు మాట్లాడుతున్నారా అని తిరిగి చూశాను. అప్పుడు నాకు ఏడు దీప స్తంభాలు కనిపించాయి.
\v 13 ఆ దీపస్తంభాల మధ్యలో చూడడానికి మనిషి ఆకారంలో ఎవరో కనిపించారు. ఆయన కాళ్ళదాకా ఉన్న అంగీ ధరించి, రొమ్ముకు బంగారు దట్టీ కట్టుకున్నాడు.
\s5
\p
\v 14 ఆయన జుట్టు ఉన్ని వలె తెల్లగా, అప్పుడే కురిసిన స్వచ్ఛమైన మంచులా ఉన్నాయి. ఆయన కళ్ళు దేదీప్యమానమైన అగ్ని జ్వాలల్లా ఉన్నాయి.
\v 15 ఆయన కాళ్ళు మిలమిలా మెరుస్తున్న కరిగిన కంచులా ఉన్నాయి. ఆయన మాట్లాడుతుంటే వచ్చే శబ్దం నీటితో పరవళ్ళు తొక్కుతూ లోతైన, గొప్ప నది పరుగెడుతున్నట్టు ఉంది.
\v 16 ఆయన తన కుడి చేతితో ఏడు నక్షత్రాలు పట్టుకున్నాడు. ఆయన నోటి నుంచి రెండు అంచులా పదును ఉన్న ఒక కత్తి బయటకు వస్తూ ఉంది. ఆయన ముఖం మధ్యాహ్నం సూర్యబింబమంత దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంది.
\s5
\p
\v 17 నేను ఆయన్ని చూడగానే చచ్చిన వాడిలాగా ఆయన పాదాలపై పడిపోయాను. ఆయన తన కుడి చెయ్యి నాపై ఉంచి, "ధైర్యంగా ఉండు. నేనే సమస్తాన్ని ప్రారంభించిన వాణ్ణి, మొదటి వాణ్ణి. సమస్తం నాశనం చేయగల వాణ్ణి, చివరి వాణ్ణీ నేనే.
\v 18 నేను చనిపోయి మరలా సజీవంగానే ఉన్నాను. నేను ఎప్పటికీ జీవిస్తూనే ఉంటాను. నాకు మరణంపై పూర్తి అధికారం ఉంది. పాతాళం నా ఆధీనంలో ఉంది."
\s5
\p
\v 19 "కాబట్టి నువ్వు చూసిన దాన్నీ, ఇప్పుడు జరగుతున్న దాన్నీ, భవిష్యత్తులో జరగబోతున్న దాన్నీ వ్రాయి.
\v 20 నా కుడి చేతిలో నువ్వు చూసిన ఏడు నక్షత్రాలు, ఏడు దీపస్తంభాల అర్థం ఇదే. ఆ ఏడు నక్షత్రాలు ఆసియాలోని ఏడు సంఘాలను కనిపెట్టుకుని చూస్తున్న ఏడుగురు దేవదూతలను సూచిస్తున్నాయి. ఆ ఏడు దీపస్తంభాలు ఏడు సంఘాలు" అన్నాడు.
\s5
\c 2
\p
\v 1 "ఎఫెసు పట్టణంలో ఉన్న విశ్వాసుల సంఘదూతకు ఈ సందేశాన్ని వ్రాయి. ఏడు నక్షత్రాలను తన కుడి చేతిలో పట్టుకుని, ఏడు దీపస్తంభాల మధ్య నడయాడుతున్న వాడు ఇది చెబుతున్నాడు."
\p
\v 2 "నీ పనులన్నీ నాకు తెలుసు. నా కోసం నీవు ఎంత కష్టపడ్డావో తెలుసు. కష్టసమయాలు వచ్చినప్పుడు ఎంతో ఓర్పుతో సహించావు. దుర్మార్గులను ఎంతమాత్రం సహించక, ఆ మనుషుల విశ్వాసాన్ని ప్రశ్నించావని కూడా నాకు తెలుసు. తమను తాము దేవుడు పంపినట్టు చెప్పుకుంటున్నప్పటికీ, వాళ్ళను దేవుడు పంపలేదని వారి లోగుట్టు పసిగట్టావు."
\s5
\p
\v 3 "నాలో నమ్మిక ఉంచడం కోసం నువ్వు ఎన్నో బాధలు ఓపికతో సహిస్తున్నావని నాకు తెలుసు. నన్ను సేవించడంలో నీవు స్థిరంగా ఉన్నావు. నన్ను అనుసరిస్తున్న కారణంగా మనుషులు నిన్ను ఎన్నో బాధలు పెట్టారు. ఎంత కష్టమైనా నా వాక్యాన్ని వదలక నీ సేవను కొనసాగించావు. నీకు ఎంత కష్టమైనప్పటికీ, ఎన్నడూ వదిలిపెట్టలేదు, ఆపలేదు."
\p
\v 4 "అయితే, నువ్వు కొంత తప్పు చేస్తున్నావు. నువ్వు విశ్వసించిన తొలి రోజుల్లో లాగా మీరు ఒకరినొకరు ప్రేమించుకోవడం లేదు. నాపై కూడా ప్రేమ సన్నగిల్లింది.
\v 5 కాబట్టి నువ్వు నన్ను ఎలా ప్రేమిస్తూ ఉండేవాడివో గుర్తు తెచ్చుకోవాలి సుమా. మొదట్లో ఏ విధంగా నన్ను ప్రేమించే వాడివో ఆ విధంగా మరలా ప్రేమించు. నువ్వు అలా చేయకపోతే, నేను నీ దగ్గరకు వచ్చి , నీ దీపస్తంభాన్ని తీసివేస్తాను. అప్పుడు నువ్వు ఇకపై నా వారిలో ఒకడిగా ఉండవు."
\s5
\p
\v 6 "అయితే నువ్వు ఒక పని బాగా చేస్తున్నావు. అనైతికంగా వ్యవహరించవచ్చనీ, విగ్రహరాధన చేయవచ్చనీ చెబుతున్న ఆ నీకొలాయితులను నేను ఎలా ద్వేషిస్తున్నానో, నువ్వు కూడా వాళ్ళు చేసేదాన్ని అలానే ద్వేషిస్తున్నావు.
\v 7 నా సందేశాన్ని అర్ధం చేసుకోవాలనే ప్రతి ఒక్కరికీ, విశ్వాసుల సంఘాలన్నిటికీ దేవుని ఆత్మ చెబుతున్న సందేశాన్ని జాగ్రత్తగా వినండి. ఆ సందేశం ఇదే. జయించిన వారికి నిత్యజీవాన్నిచ్చే చెట్టు పండును తినేలా నేను అనుమతిస్తాను. ఈ చెట్టు దేవుని తోటలో ఉంది."
\s5
\p
\v 8 "స్ముర్న పట్టణంలో ఉన్న విశ్వాసుల సంఘ దూతకు ఈ సందేశాన్ని వ్రాయి. సమస్తాన్నీ ప్రారంభించిన మొదటి వాణ్ణి నేనే. సమస్తాన్నీ అంతం చేయగల చివరి వాణ్ణి నేనే. నేనే మృత్యుంజయుడిని.
\v 9 నీవు పడ్డ బాధలు నాకు తెలుసు. నువ్వు ఎలాంటి పేదరికంలో ఉన్నావో, నువ్వు ఎంత లేమిలో ఉన్నావో నాకు తెలుసు (కాని ఎవ్వరూ దోచుకోలేని పరలోక సిరిసంపదల్లో నువ్వు నిజంగా ధనవంతుడివే). నువ్వు క్రీస్తును అనుసరిస్తున్న కారణాన మనుషులు నీ గురించి చెడ్డ మాటలు పలుకుతూ నిన్ను శపిస్తున్న అనుభవాలు నీకు తెలుసు. ఆ యూదులు (వాళ్ళు వాస్తవానికి యూదులు కారు) నీ గురించి చెడ్డ విషయాలు చెబుతూ శాపనార్ధాలు పెట్టేవారు. వాళ్ళందరూ సాతాను సమావేశాల్లో సభ్యులు. వాళ్ళెవ్వరూ దేవుని ప్రజల సమావేశాల్లోని వారు కాదు."
\s5
\p
\v 10 "నువ్వు పడబోతున్న బాధలలో దేని విషయం గురించీ భయపడవద్దు. సాతాను మీలో కొందరిని జైల్లో పెడతాడు. నువ్వు ఎలాటి విశ్వాసంతో ఉన్నావో చూడడానికి వాడు నిన్ను కష్ట స్థితిలోకీ నెట్టి పరీక్షిస్తాడు. కొద్దికాలమే నువ్వు బాధలు పడతావు. నాపై నమ్మిక ఉంచడం వల్ల వాళ్ళు నిన్ను చంపినా సరే, నాపై విశ్వాసం కొనసాగించు. నేను నీ తలపై కిరీటం పెడతాను. అది నీకు ఇలాంటి వాటన్నిటినీ అధిగమించే శక్తి ఇస్తుంది. అది నీకు ఉన్న నిత్యజీవానికి చిహ్నం.
\v 11 విశ్వాసుల సంఘాలన్నీ సమావేశమైనప్పుడు దేవుని ఆత్మ చెప్పే సందేశాన్ని జాగ్రత్తగా వినండి. విజయం సాధించిన వారంతా రెండోసారి చనిపోరు."
\s5
\p
\v 12 "పెర్గము పట్టణంలో ఉన్న విశ్వాసుల సంఘ దూతకు ఈ సందేశాన్ని వ్రాయి. నేను ఈ విషయాలు నీకు చెబుతున్నాను. నాది రెండంచుల పదును ఉన్న కత్తి.
\v 13 నువ్వు జీవిస్తున్న చోటు నాకు తెలుసు. ప్రజలను సాతాను తన గుప్పెట్లో ఉంచుకున్న చోటు అది. నీ కుటుంబం నాలో విశ్వాసం ఉంచిందని నాకు తెలుసు. నాపై విశ్వాసాన్ని, నమ్మికను నీవు ఎన్నడూ కాదనలేదు. నా గురించి ప్రజలకు నమ్మకంగా చెప్పిన అంతిపా జీవించిన రోజుల్లో కూడా నువ్వు నన్ను తిరస్కరించలేదు. ప్రజలు నిత్యం అలవాటుగా సాతానుకు విధేయత చూపిస్తున్న పట్టణంలో వారు అతడిని చంపారు."
\s5
\p
\v 14 "అయినా, నీ సాక్ష్యాన్ని దెబ్బతీసి, నీ విధేయతను బలహీన పరిచే కొన్ని విషయాలను నేను చూశాను. చాలాకాలం క్రితం బిలాము బోధించిన విషయాలను నీ సభ్యుల్లో కొందరు బోధించడానికి నువ్వు అనుమతిస్తున్నావు. దేవుని ప్రజల మధ్య అనైతిక లైంగిక కార్యకలాపాలు చేసేలా విగ్రహాలకు బలిగా అర్పించిన వాటిని తినేలా దేవుని ప్రజలను ప్రేరేపించమని బాలాకుకు అతడు బోధించాడు.
\v 15 అదే మార్గంలో, నువ్వు కూడా నీ సభ్యులను నీకొలాయితుల బోధలను అనుసరించేలా, అనైతిక లైంగిక కార్యకలాపాలకు పాల్పడేలా అనుమతిస్తున్నావు."
\s5
\p
\v 16 "నీ ఆలోచన పధ్ధతి మార్చుకో. ఇలా చేయడం మానెయ్యి. లేకపోతే అకస్మాత్తుగా నేను నీ దగ్గరకు వచ్చి, దేవుని వాక్యమనే నా నోటి ఖడ్గంతో వారికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తాను.
\v 17 విశ్వాసుల సంఘాలన్నీ కలిసి సమావేశమైనప్పుడు దేవుని ఆత్మ చెప్పే సందేశాన్ని జాగ్రత్తగా వినండి. జయించిన వారికి నేను దాచి ఉంచిన మన్నాను ఇస్తాను. అది వారికి ఆహారంగా ఉండి, శక్తినిస్తుంది. అంతే కాకుండా అతనికి ఒక తెల్లని రాయిని ఇస్తాను. దానిపై ఒక కొత్త పేరు చెక్కాను. అతనికి నేను ఇచ్చే ఆ పేరు అతనికి మాత్రమే తెలుస్తుంది."
\s5
\p
\v 18 "తుయతైర పట్టణంలో ఉన్న విశ్వాసుల సంఘం యొక్క దూతకు ఈ సందేశాన్ని వ్రాయి. అగ్ని జ్వాలల్లా ప్రకాశించే కళ్ళు, కరిగి తళతళలాడే కంచులా ప్రకాశించే కాళ్ళు కలిగిన దేవుని కుమారుడినైన నేను ఈ విషయాలు నీకు చెబుతున్నాను.
\v 19 నువ్వు చేస్తున్న మంచి పనులన్నీ నాకు తెలుసు. నా మీద నీకున్న ప్రేమ, మీకు ఒకరిపై ఒకరికున్న ప్రేమ నాకు తెలుసు. నా మీద నీకున్న విశ్వాసం కూడా నాకు తెలుసు. నువ్వు ఇతరులకు సేవ చేస్తున్నావని నాకు తెలుసు. ఆ క్రమంలో అనేకమైన ఇబ్బందులను నీవు స్థిరంగా భరిస్తున్నావు. గతంలో చేసిన దానికంటే ఇప్పుడు నువ్వు ఇలాటి పనులు మరి ఎక్కువగా చేస్తున్నావని నాకు తెలుసు."
\s5
\p
\v 20 "అయితే నీలో తప్పు ఉంది. చాలాకాలం క్రితం జీవించిన దుర్మార్గురాలైన యెజెబెల్ రాణి లాంటి స్త్రీని నీ సభ్యుల మధ్య నువ్వు ఉండనిస్తున్నావు. తాను ఒక ప్రవక్తినని ఆమె చెప్పుకుంటున్నది. అయితే ఆమె తన బోధల ద్వారా నా సేవకులను మోసం చేస్తున్నది. విగ్రహాలకు బలి ఇచ్చిన ఆహారాన్ని తినమని, అనైతిక లైంగిక కార్యకలాపాలు చేయమని వాళ్ళను పురిగొల్పుతున్నది.
\v 21 ఈ విగ్రహారాధన ఆచారాలు, లైంగిక అనైతికత నుంచి తప్పుకోవడానికి ఆమెకు నేను సమయం ఇచ్చినా ఆమె వాటిని ఆపడానికి ఇష్టపడలేదు.
\s5
\v 22 దాని ఫలితంగా నేను ఆమెకు తీవ్రమైన అనారోగ్యం కలిగిస్తాను. ఆమె చేస్తున్న పనులు ఆపకపోతే, నీతి తప్పి ప్రవరించిన వారిని కూడా ఆమె పడ్డ తీవ్రమైన బాధలు పడేలా చేస్తాను.
\v 23 కొందరు ఆమె బోధించిన వాటిని అంగీకరించి ఆమె పిల్లలౌతున్నారు. వాళ్ళను నేను కచ్చితంగా చంపుతాను. అప్పుడు ప్రతి ఒక్కరి ప్రతి కదలికా నాకు తెలిసి పోతుందని అన్ని విశ్వాస సంఘాల వాళ్ళు గ్రహిస్తారు. మీ క్రియల ప్రకారం మీలో ప్రతి ఒక్కరికీ ప్రతిఫలం ఇస్తాను."
\s5
\p
\v 24 "అయితే తుయతైర నగరంలో ఉన్న మిగతా విశ్వాసులను గురించి కొంత మంచిగా చెప్పడానికి ఒక విషయం ఉంది. మీలో కొందరు ఈ తప్పుడు విషయాలను అంగీకరించక పోవడం మంచిది. వాళ్ళకు సాతాను బోధించిన నిగూఢ పద్దతులను తిరస్కరించడం మంచిది. ఇక ఏ ఇతర ఆజ్ఞలతో నేను నీపై మరింత భారం పెట్టను.
\v 25 నేను వచ్చే దాకా నాకు విధేయత చూపుతూ, స్థిరంగా నీ నమ్మకాన్ని కొనసాగించు."
\s5
\p
\v 26 "సాతానును జయించే వారికీ మరణం వరకూ నా ఆజ్ఞకు విధేయులయ్యే వారికీ ప్రజలందరి మీదా అధికారం ఇస్తాను.
\v 27 వాళ్ళు ఇనప దండంతో ప్రజలను ఏలుతారు. మట్టి కుండను ముక్కలుగా చేసినట్టే వాళ్ళు దుర్మార్గులను నాశనం చేస్తారు.
\v 28 నా తండ్రి నాకు ఇచ్చిన అధికారంతో ఇదంతా చేస్తాను. విజయంలో గొప్ప సంతోషం పొందడానికై నాతో కలిసి పాలించిన వాళ్ళకి ఉదయతారను ఇస్తాను.
\v 29 విశ్వాసుల సంఘాలన్నిటికీ దేవుని ఆత్మ చెబుతున్న సందేశాన్ని ప్రతి ఒక్కరూ తప్పక జాగ్రత్తగా వినండి, అర్ధం చేసుకోండి."
\s5
\c 3
\p
\v 1 "సార్దీస్ నగరంలో ఉన్న విశ్వాసుల సంఘం దూతకు ఈ సందేశాన్ని వ్రాయి. ఈ విషయాలను నేను నీకు చెబుతున్నాను. ఏడు నక్షత్రాలూ, దేవుని ఏడు ఆత్మలూ కలిగి ఉన్నవాణ్ణి నేనే. నువ్వు చేసిన పనులన్నీ నాకు తెలుసు. నువ్వు బతికి ఉన్నట్టు కనిపిస్తున్నావు గానీనువ్వు చనిపోయావు.
\v 2 జాగ్రత్త. నిద్రనుంచి మేల్కొన్న వాడిలా నీ భక్తి ఎలా ఉందో పరిశీలించుకో. నీకు నీవుగా నీ భక్తిని బలపరుచుకో. ఎందుకంటే నీవు చనిపోయిన వాడిలాగా ఎందుకూ కొరగాకుండా ఉన్నావు. నువ్వు కచ్చితంగా ఇలా చేయాలి. ఎందుకంటే నువ్వు చేస్తున్నది ఏదీ సంతృప్తికరంగా లేదని నా దేవుడు భావిస్తున్నాడని నాకు తెలుసు."
\s5
\p
\v 3 "అయితే మరి నువ్వు మొదట్లో విన్నప్పుడు ఒప్పుకున్న సత్యాన్ని, దేవుని సందేశాన్ని గుర్తుకు తెచ్చుకో. విధేయుడుగా నీ పాప స్వభావం నుంచి మళ్ళుకో. నీవు ఇలా చేయకపోతే, నువ్వు అనుకోని సమయంలో నేను దొంగలా నీ దగ్గరకు వస్తాను. నీకు తీర్పు తీర్చడానికి ఏ సమయంలో నీ దగ్గరకు వస్తానో నీకు ఎంతమాత్రం తెలియదు."
\p
\v 4 "అయితే సార్దిస్ నగరంలో నీలో ఉన్న కొందరు విశ్వాసులు ఏ తప్పూ చేయడం లేదు. తమ బట్టలను మురికి చేసుకోలేదు. తత్ఫలితంగా వారు నాతో కలిసి జీవించే అర్హత ఉన్నవారు కాబట్టి స్వచ్ఛమైన తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారిలాగా వాళ్ళు నాతో కలిసి జీవిస్తారు.
\s5
\v 5 సాతాన్ని జయించిన వాళ్ళకి నేను ఇలాటి తెల్లని బట్టలే ధరింపజేస్తాను. శాశ్వతజీవం పొందినవారి పేర్లు రాసి ఉన్న జీవగ్రంథం నుంచి నేను ఎన్నడూ వాళ్ళ పేర్లు కొట్టివేయను. నా తండ్రి సమక్షంలో, ఆయన దేవదూతల సమక్షంలో నాకు చెందిన వాళ్ళుగా వాళ్ళను అంగీకరిస్తాను.
\v 6 నా సందేశాన్ని అర్ధం చేసుకోవాలనే ప్రతి ఒక్కరికీ, ఒక చోటికి చేరి కలుసుకున్న విశ్వాసుల సంఘాలన్నిటికీ దేవుని ఆత్మ చెబుతున్న సందేశాన్ని తప్పక జాగ్రత్తగా వినండి."
\s5
\p
\v 7 "ఫిలదెల్ఫియ నగరంలో ఉన్న విశ్వాసుల సంఘం దూతకు ఈ సందేశాన్ని వ్రాయి. ఈ విషయాలను నీకు నేను చెబుతున్నాను. నేను పవిత్రుణ్ణి, సత్యవంతుణ్ణి. పురాతన నగరం యెరూషలేములోకి ప్రజల్ని అనుమతించే అధికారం రాజైన దావీదుకు ఉన్నట్టే మనుషులను నా రాజ్యంలోకి అనుమతించే అధికారం నాకు ఉంది. తలుపులు తెరిచే వాణ్ణి నేనే. ఎవ్వరూ వాటిని మూయలేరు. తలుపులు మూసే వాణ్ణి నేనే. ఎవరూ వాటిని తెరవలేరు.
\v 8 నువ్వు చేసిన ప్రతిదీ నాకు తెలుసు. ఎవరూ మూయలేని తలుపును నీ కోసం తెరిచి ఉంచాను. జాగ్రత్తగా తెలుసుకో. నీ శక్తి కొంచెమే అయినా నీవు నాపై నమ్మకం వదలకుండా నేను చెప్పిన దానికి విధేయత చూపించావని నాకు తెలుసు."
\s5
\p
\v 9 "జాగ్రత్తగా ఉండండి. నీ ప్రజల్లో కొందరు సాతానును అనుసరించే వాళ్ళతో ఏకమౌతారు. తాము యూదులమని చెప్పుకుంటారు గానీ వాళ్ళు నిజంగా యూదులు కాదని నాకు తెలుసు. వాళ్ళు అబద్ధం చెపుతున్నారు. నేను వాళ్ళని నీ దగ్గరకు రప్పించి నీ పాదాల వద్ద వినయంగా నమస్కరించేలా చేసి, నేను నిన్ను ప్రేమిస్తున్నానని వాళ్ళు గుర్తించేలా చేస్తాను."
\p
\v 10 "ఎందుకంటే ఓపికతో బాధను భరించమని నేను నీకు ఆజ్ఞాపించినప్పుడు, నాకు నువ్వు విధేయత చూపించావు. నువ్వు నాకు అవిధేయుడయ్యేలా చేయడానికి ప్రయత్నిస్తున్న వారి నుంచి నిన్ను సురక్షితంగా ఉంచుతాను. వాళ్ళు త్వరలోనే ప్రపంచం లోని ప్రతిఒక్కరికీ ఇలా చేస్తారు.
\v 11 నేను త్వరలో వస్తాను. కాబట్టి దేవుడు నీకోసం కేటాయించిన నీ బహుమతిని పోగొట్టుకోవడానికి ఎవరూ కారణం కాకుండా ఉండేలా, నేను చెప్పిన వాటిని కొనసాగించు.
\s5
\v 12 సాతాన్ని జయించిన వాళ్ళను నేను సురక్షితంగా ఉంచుతాను. వాళ్ళు నా దేవుని ఆలయంలో స్తంభాల్లా బలంగా ఉంటారు. వాళ్ళు స్తంభాల్లా అక్కడే ఉండిపోతారు. వాళ్ళను ఆయనకు చెందిన వారిగా చూపిస్తూ, నా దేవుని పేరుతో వాళ్ళకు గుర్తు వేస్తాను. అలాగే వాళ్ళకు నా దేవునికి చెందిన నగరంతో కూడా గుర్తు వేస్తాను. అది నా దేవుని దగ్గర నుంచి దిగి వచ్చే పరలోక నగరం. అదే కొత్త యెరూషలేము. అలాగే వాళ్ళను నాకు చెందిన వారుగా చూపిస్తూ, నా కొత్త పేరును కూడా వాళ్ళకు గుర్తుగా వేస్తాను.
\v 13 నా సందేశాన్ని అర్ధం చేసుకోవాలనే ప్రతి ఒక్కరికీ, ఒక చోటికి చేరి కలుసుకున్న విశ్వాసుల సంఘాలన్నిటికీ దేవుని ఆత్మ చెబుతున్న సందేశాన్ని తప్పక జాగ్రత్తగా వినండి."
\s5
\p
\v 14 "లవొదికయ నగరంలో ఉన్న విశ్వాసుల సంఘం దూతకు ఈ సందేశాన్ని వ్రాయి. ఈ విషయాలను నీకు నేను చెబుతున్నాను. దేవుని వాగ్దానాలన్నిటికీ హామీ ఇచ్చే వాణ్ణి, దేవుని విశ్వాస్యతగురించీ, నమ్మదగిన గుణం గురించీ సాక్ష్యం ఇచ్చే వాణ్ణి నేనే. దేవుని సమస్త సృష్టికీ పాలకుణ్ణి.
\v 15 నువ్వు చేసిన ప్రతిదీ నాకు తెలుసు. నాపై నమ్మికను నువ్వు తిరస్కరించలేదు గానీ నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించడం లేదు. నువ్వు వేడిగా గాని చల్లగా గాని లేని నులివెచ్చని నీళ్ళవలె ఉన్నావు. నువ్వు చల్లగా గాని వెచ్చగా గాని ఉండాలని నేను కోరుకుంటున్నాను.
\v 16 ఇటు నీ భక్తిలో ఎటువంటి ఎదుగుదలా లేకపోవడం గురించి నీకు ఆందోళన గాని, అటు నా గురించిన ఉత్సాహం గాని నీలో లేదు. కాబట్టి నేను నా నోట్లో నుంచి గోరువెచ్చని నీళ్ళు ఉమ్మివేస్తున్నట్లుగా, నేను నిన్ను తిరస్కరించబోతున్నాను."
\s5
\p
\v 17 "నేను చాలా సంపద కూడబెట్టుకున్నాను, నేను ధనికుణ్ణి, నాకు ఏ లోటూ లేదు, అని నువ్వు చెబుతున్నావు. కాని నువ్వు ఎన్ని విధాల అవసరతల్లో ఉన్నవో ఆ సంగతి తెలుసుకోలేక పోతున్నావు. దిగంబరిగా, అంధుడిగా, దరిద్రుడిగా, దయనీయమైన స్థితిలో దౌర్భాగ్యుడిలా నువ్వు ఉన్నావు.
\v 18 నీకు అవసరమైన వాటన్నిటినీ నా దగ్గర నుంచి పుచ్చుకోమని హెచ్చరిస్తున్నాను. నీవు నిజమైన ధనవంతుడు కావడానికి నా దగ్గర మేలిమి బంగారం కొనుక్కో. దిగంబరంగా సిగ్గుతో ఉండడానికి బదులుగా వేసుకోవడానికి తెల్లని వస్త్రాలు నా దగ్గర కొనుక్కో. ఆ విధంగా నేను నిన్ను నీతిపరుడుగా మారుస్తాను. నీ కళ్ళకు పెట్టుకోడానికి కలికాన్ని నా దగ్గర కొనుక్కో. ఆ విధంగా నువ్వు సత్యాన్ని అర్ధం చేసుకునేలా నీకు సహాయం చేస్తాను."
\s5
\p
\v 19 "నేను ఎవరిని ప్రేమిస్తానో, వాళ్ళని మందలించి సరిదిద్దుతాను కాబట్టి నీ పాపస్వభావం నుంచి మనస్ఫూర్తిగా దూరం తొలుగు.
\v 20 నేను ఇక్కడే ఉన్నాను. ప్రతి ఒక్కరినీ పిలుస్తున్నాను. నీ ఇంటి తలుపు తడుతూ, నీ కోసం వేచి చూస్తూ నిల్చున్నాను. నువ్వు నా స్వరం విని తలుపు తీస్తే, లోపలికి వస్తాను. మనం స్నేహితుల్లా కలసి భోజనం చేస్తాము."
\s5
\p
\v 21 "నేను సాతానును జయించి, ఇప్పుడు నా తండ్రి సింహాసనం మీద కూర్చుని ఎలా పరిపాలిస్తున్నానో, అలా మీలో సాతాన్ని జయించిన వాళ్ళందరికీ నా సింహాసనం మీద కూర్చుని నాతో కలసి పాలించే అవకాశం ఇస్తాను.
\v 22 నా సందేశాన్ని అర్ధం చేసుకోవాలనే ప్రతి ఒక్కరికీ, ఒక చోటికి చేరి కలుసుకున్న విశ్వాసుల సంఘాలన్నిటికీ దేవుని ఆత్మ చెబుతున్న సందేశాన్ని తప్పక జాగ్రత్తగా వినండి."
\s5
\c 4
\p
\v 1 ఈ విషయాలు జరిగిన తరువాత, యోహాననే నేను ఒక దర్శనం చూశాను. అందులో పరలోక ద్వారాలు తెరిచి ఉన్నాయి. పెద్ద బాకానాదంలా ధ్వనించే స్వరంతో నాతో ఇంతకు ముందు మాట్లాడిన వాడు నాతో, "ఇక్కడికి ఎక్కి రా. ఇకపై జరగబోయే సంఘటనలను నేను నీకు చూపిస్తాను" అన్నాడు.
\p
\v 2 వెంటనే దేవుని ఆత్మ జరగబోయే విషయాలను నాకు వెల్లడి చేయడం ప్రారంభించాడు. ఆయన పరలోక సింహాసనాన్నీ, దానిపై కూర్చున్న పరిపాలకుణ్ణి నాకు చూపించాడు.
\v 3 సింహాసనం మీద కూర్చున్న పరిపాలకుడు ఎర్రని కెంపు లాగా స్పటికాకార చంద్రకాంత మణిలాగా ధగధగా మెరుస్తున్నాడు. సింహాసనం చుట్టూ ఇంద్రధనస్సు కళ్ళు మిరుమిట్లు గొలిపే పచ్చని మరకతం లాగా మెరుస్తున్నది.
\s5
\p
\v 4 ఆ సింహాసనం చుట్టూ మరో ఇరవై నాలుగు సింహాసనాలు ఉన్నాయి. ఈ ఇరవై నాలుగు సింహాసనాలపై ఇరవై నలుగురు పెద్దలు కూర్చుని ఉన్నారు. వారు తమ తలమీద బంగారు కిరీటాలతో, స్వచ్ఛమైన తెల్లని వస్త్రాలు ధరించుకుని ఉన్నారు.
\v 5 ఆ సింహాసనం నుంచి మెరుపులతో, ఉరుములతో కూడిన పెద్ద శబ్దాలు వెలువడుతున్నాయి. ఆ సింహాసనం ముందు ఏడు వెలుగుతున్న దీపాలు ఉన్నాయి. అవి దేవుని ఏడు ఆత్మలు.
\s5
\p
\v 6 ఆ సింహాసనం ఎదుట గాజుతో చేసినట్టుగా ఉన్న సముద్రం కూడా ఉంది. అది స్పటికంలా పారదర్శకంగా ఉంది. ఇరువైపులా ఒక జీవి చొప్పున, సింహాసనానికి నాలుగు వైపులా నాలుగు జీవులు ఉన్నాయి. ప్రతి ఒక్క జీవికీ ముందూ వెనకా కళ్ళు ఉన్నాయి.
\s5
\p
\v 7 ఆ మొదటి జీవి సింహంలా ఉంది. రెండోది ఎద్దులా ఉంది. మూడో దానికి మనిషి ముఖం లాంటి ముఖం ఉంది. నాలుగో జీవి ఎగురుతున్న గరుడ పక్షిలా ఉంది. నాలుగు జీవుల్లో ప్రతి దానికీ ఆరేసి రెక్కలున్నాయి. ఈ రెక్కలు కిందా పైనా కళ్ళతో నిండి ఉన్నాయి.
\v 8 ఆ జీవులు రేయింబవళ్ళు ఎడతెగక,
\q1 "సమస్తాన్నీ ఏలుతున్న ఆ ప్రభువు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు.
\q1 ఆయన నిరంతరం జీవించే వాడు,
\q1 ఇప్పుడు ఎల్లప్పుడు జీవించేవాడు" అంటున్నాయి.
\s5
\p
\v 9 ఆ జీవులు, సింహాసనంపై కూర్చుని ఉన్న చిరంజీవికి ఘనత, కీర్తి, కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తున్నాయి. ఆ జీవులు ఆయన్ని స్తుతిస్తున్నప్పుడు, సింహాసనంపై కూర్చున్న ఆ ఇరవైనాలుగు మంది పెద్దలు ఆయన ఎదుట నేలపై సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు.
\v 10 చిరకాలం జీవిస్తూ ఉన్న ఆయన్ని వాళ్ళు ఆరాధిస్తున్నారు. సింహాసనం ఎదుట తమ కిరీటాలను పెడుతూ,
\q1
\v 11 "స్వామీ, దేవా, నీవు
\q1 సర్వశక్తిమంతుడవు, గౌరవనీయుడవు, మహిమాన్వితుడవు కాబట్టి అందరిచేతా స్తుతులు పొందడానికి అర్హుడవు.
\q1 సమస్తాన్నీ నీవొక్కడివే సృష్టించావు.
\q1 ఎందుకంటే అవి ఉనికిలో ఉండాలని నువ్వు సంకల్పించావు.
\q1 నువ్వు వాటిని సృష్టించావు. అందుకే అవి ఉనికిలో ఉన్నాయి" అని ప్రస్తుతించారు.
\s5
\c 5
\p
\v 1 సింహాసనంపై కూర్చున్న ఆయన చేతిలో ఒక పుస్తకపు చుట్టను నేను చూశాను. ఆ పుస్తకపు చుట్టకు లోపల, బయట వ్రాత ఉంది. దానికి ఏడు సీళ్లు వేసి ఉన్నాయి.
\v 2 ఒక బలిష్టుడైన దేవదూత బిగ్గరగా "ఈ పుస్తకపు చుట్టను సీళ్లు విప్పి, తెరిచే అర్హత ఉన్నవారెవరో రండి! ఈ తోలు చుట్ట విప్పండి!" అని ప్రకటించాడు.
\s5
\p
\v 3 ఆ తోలు చుట్టను విప్పి, దానిలో ఏం రాసుందో చూడడానికి పరలోకంలో గానీ, భూమి మీద గానీ, భూమి కింద గానీ సృష్టి అయిన ఏ జీవికి అర్హత లేదు.
\v 4 ఆ గ్రంథం విప్పడానికి ఎవరికి అర్హత లేనట్టు కనిపించి నేను వెక్కి వెక్కి ఏడ్చాను.
\v 5 కాని పెద్దల్లో ఒకడు నాతో "ఇక ఏడ్చే పని లేదు. చూడు, యూదా జాతి సింహ౦, దావీదు రాజు వారసుడు, హక్కుదారుడు సాతానును ఓడించాడు. ఫలితంగా ఆయన ఏడు సీళ్లు ఉన్న గ్రంథం చుట్ట విప్పి చూడడానికి అర్హుడు" అన్నాడు.
\s5
\p
\v 6 సింహాసనం ఎదుట ఉన్న పెద్దల మధ్యా నాలుగు ప్రాణుల మధ్యా గొర్రెపిల్ల ఉండడం నేను చూశాను. తాను వధ అయినట్టుగా కనిపించే గుర్తులు ఆయన ఒంటిపై ఉన్నాయి. అయినా ఆయన బ్రతికే ఉన్నాడు. ఆయనకు ఏడు కొమ్ములూ, ఏడు కన్నులూ ఉన్నాయి. ఆ కళ్ళు దేవుని ఏడు ఆత్మలు. దేవుడు వాటిని భూలోకమంతటికీ పంపిస్తున్నాడు.
\v 7 గొర్రెపిల్ల వచ్చి సింహాసనంపై కూర్చున్న వాడి కుడి చేతిలో నుంచి గ్రంథాన్ని తీసుకున్నాడు.
\s5
\p
\v 8 ఆయన ఆ పుస్తకపు చుట్టను తీసుకోగానే ఆ నాలుగు జీవులు, ఇరవై నలుగురు పెద్దలూ తమకు తాముగా ఆయన ఎదుట సాష్టాంగ నమస్కారం చేశారు. ప్రతి ఒక్కరి దగ్గరా వీణ, దేవుని ప్రజల ప్రార్ధనతో నిండిన బంగారు గిన్నెలు ఉన్నాయి.
\s5
\p
\v 9 పెద్దలు, జీవులు ఒక కొత్త పాట పాడారు. వాళ్ళు,
\q1 "గ్రంథాన్ని తీసుకొని, దాని సీళ్లు విప్పడానికి నువ్వే అర్హుడివి.
\q1 ఎందుకంటే నువ్వు విమోచకుడివి గనక వధ అయ్యావు, ఎందుకంటే
\q1 నువ్వు చనిపోయి దేవుని కోసం ప్రతి జనం నుంచి, ప్రతి భాష నుంచి, ప్రతి జాతి నుంచి, ప్రతి వంశం నుంచి మనుషులను నీ రక్తంతో కొన్నావు.
\q1
\v 10 నీ వల్లనే వాళ్ళు దేవుని రాజ్య ప్రజలయ్యారు.
\q1 ఆయన్ని సేవించే యాజకులయ్యారు. వాళ్ళు భూమిపై పరిపాలిస్తారు."
\s5
\p
\v 11 నేను అలా చూస్తూనే ఉన్నాను. పెద్దల చుట్టూ, జీవుల చుట్టూ, సింహాసనం చుట్టూ చేరిన చాలా మంది దేవదూతల స్వరం నేను విన్నాను. వాళ్ళు లక్షల కొద్దీ అక్కడ ఉన్నారు, లెక్కకు మిక్కుటమైన పెద్ద గుంపు ఉంది.
\v 12 పెద్ద స్వరంతో వాళ్ళు పాట పాడుతున్నారు.
\q1 వధ అయిన గొర్రెపిల్ల,
\q1 ఆయనకున్న శక్తి, సంపద, జ్ఞానం, బలాన్ని బట్టి మనం స్తుతులు చెల్లించడానికి ఆయన అర్హుడు.
\q1 ఆయన చేసిన సృష్టి అంతా ఆయన్ని కీర్తించి, స్తుతించడం మంచిది.
\s5
\p
\v 13 పరలోకంలో, భూమి మీదా, భూమి లోపలా, సముద్రంలోనూ ఉన్న జీవులు చెప్పగా నేను విన్నాను,
\q1 "సింహాసనంపై కూర్చున్న వాడికి , ఎప్పటికీ మహిమ, కీర్తి, స్తుతి.
\q1 ఎప్పటికీ సంపూర్ణ శక్తితో ఆయన ఏలు గాక."
\v 14 నాలుగు జీవులు, "అలానే జరుగుగాక" అన్నాయి. అప్పుడు పెద్దలు సాష్టాంగ నమస్కారం చేసి దేవుణ్ణి, గొర్రెపిల్లను ఆరాధించారు.
\s5
\c 6
\p
\v 1 ఆ గ్రంథం చుట్టకు ఉన్న మొదటి సీలు గొర్రెపిల్ల విప్పడం నేను చూశాను. అప్పుడు ఉరుము వంటి స్వరంతో నాలుగు జీవుల్లో ఒకటి బిగ్గరగా గట్టిగా "ఇటు రా" అన్నది.
\p
\v 2 ఒక తెల్ల గుర్రం కనిపించింది. దానిపై కూర్చుని ఉన్నవాడి దగ్గర విల్లు, బాణాలు ఉన్నాయి. అతడు జయించడానికి వెళ్తున్నాడని చూపించడానికి దేవుడు అతనికి తలపై పెట్టుకోవడానికి ఆకుల కిరీటం ఇచ్చాడు. అతడు యుద్ధం కొనసాగిస్తూ, గెలుస్తూ బయలుదేరాడు.
\s5
\p
\v 3 అప్పుడు గొర్రెపిల్లలా కనిపిస్తున్న ఆయన రెండో సీలు విప్పాడు. అప్పుడు రెండో జీవి "ఇక్కడకు రా" అని చెప్పడం నేను విన్నాను.
\p
\v 4 అతడు అలా చెప్పినప్పుడు, ఎర్రని గుర్రం కనిపించింది. దానిపైన కూడా ఒకడు కూర్చుని ఉన్నాడు. ఇక మనుషులు ఎంత మాత్రం ప్రశాంతంగా జీవించక, పరస్పరం చంపుకునేలా ప్రేరేపించే శక్తిని దేవుడు అతనికి ఇచ్చాడు. ఇందుకోసం అతడు ఒక పెద్ద కత్తి చేతబట్టుకుని వెళ్ళాడు.
\s5
\p
\v 5 అప్పుడు గొర్రెపిల్ల మూడో సీలు విప్పాడు. అప్పుడు మూడో జీవి "ఇక్కడకు రా" అని చెప్పడం నేను విన్నాను.
\p ఈ సారి నల్ల గుర్రం కనిపించింది. దానిపై ఒకడు కూర్చుని, తన చేతిలో త్రాసు పట్టుకొని ఉన్నాడు.
\v 6 అప్పుడు ఆ నాలుగు జీవుల మధ్య నుంచి వస్తున్నట్లుగా ఒక స్వరం నేను విన్నాను. అది గుర్రం మీద ఉన్నవాడికి "ఒక కిలో గోదుమల ధర చాలా ఎక్కువగా ఉండాలి, మనుషులు కొనుక్కోవడానికి వాళ్ళు రోజ౦తా కష్టపడి పని చేసి డానికి తగిన డబ్బు సంపాదించుకోవాలి. మూడు లీటర్ల బార్లీకీ అదే ధర ఉండాలి. ఒలీవ నూనే ద్రాక్ష రసం పుష్కలంగా లభించాలి" అని చెప్పింది.
\s5
\p
\v 7 అప్పుడు గొర్రెపిల్ల నాలుగో సీలు విప్పాడు. అప్పుడు నాలుగో జీవి "ఇక్కడకు రా" అని చెప్పడం నేను విన్నాను.
\p
\v 8 ఈ సారి బూడిద రంగులో పాలిపోయినట్టు ఉన్న గుర్రం కనిపించింది. దానిపై కూర్చున్న వాడి పేరు "మృత్యు దూత." మరొకడు అతని వెనకాలే వెళుతున్నాడు. అతడి పేరు "చనిపోయిన వాళ్ళు వెళ్ళే ప్రదేశం." భూమి జనాభాలో నాలుగో వంతును చంపడానికి ఈ ఇద్దరికీ దేవుడు శక్తి ఇచ్చాడు. వాళ్ళు క్రూర మృగాల వలనా వ్యాధుల వలనా కరువుకాటకాల వలనా ఆయుధాల వలనా మనుషులను మట్టు పెడతారు.
\s5
\p
\v 9 అప్పుడు గొర్రెపిల్ల ఐదవ సీలు విప్పాడు. అప్పుడు నేను పరలోకంలోని బలిపీఠం కింద దేవుని సేవకుల ఆత్మలను చూశాను. దేవుని సందేశంపై నమ్మిక ఉంచిన కారణంతో వారు మరణశిక్ష పాలయ్యారు. ఆ సందేశానికి దేవుడు తానే సాక్షి.
\v 10 వాళ్ళు గావుకేకలు పెడుతూ దేవుణ్ణి "సార్వభౌమాధికారి అయిన ప్రభూ, నీవు పరిశుద్ధుడవు, సత్యవంతుడవు. మమ్మల్ని హత్య చేసిన వాళ్ళకు తీర్పు తీర్చడానికీ శిక్షించడానికీ ఇంకా ఎంత కాలం ఆలస్యం?" అంటూ అడుగుతున్నారు.
\v 11 అప్పుడు దేవుడు వారిలోని ప్రతి ఒక్కరికీ తెల్ల అంగీ ఇచ్చి, ఇంకా కొంచెం కాలం ఓపిక పట్టమని చెప్పాడు. దేవుని ఇతర సేవకుల, శిష్యుల హతసాక్షుల లెక్క పూర్తి అయ్యే వరకు వారు వేచి ఉండవలసిందే.
\s5
\p
\v 12 అప్పుడు గొర్రెపిల్ల ఆరవ సీలు విప్పాడు. అప్పుడు భూమి భయంకరమైన కుదుపుకు గురైంది. సూర్యుడు నల్లని ఉన్ని వస్త్రంలా అయిపోయాడు. చంద్రబింబం రక్తంలా ఎర్రగా మారిపోయింది.
\v 13 పెనుగాలికి అంజూరపు చెట్టు కదిలిపోయి ఇంకా పండని అంజూరు కాయలు రాలినట్లు, పెద్ద సంఖ్యలో నక్షత్రాలు భూమి మీద పడ్డాయి.
\v 14 పాత కాగితం చుట్ట రెండుగా విడిపోయి ముడుచుకు పోయినట్టు ఆకాశం బద్దలై ముడుచుకు పోయింది. ప్రతి పర్వతం, ద్వీపం తన తావు నుంచి తొలిగి పోయింది.
\s5
\p
\v 15 ఫలితంగా, శక్తిమంతులైన ప్రజలు, ధనికులు, సేనాధిపతులు, ఉన్నత స్థాయి వ్యక్తులు, బానిసలు, స్వతంత్రులు, మిగతా అందరితో కలిపి, రాజులతో సహా భూమి మీద ఉన్న సమస్త ప్రజానీకం పర్వతాల్లోనూ బండ సందుల్లోనూ గుహల్లోనూ దాక్కున్నారు.
\v 16 వాళ్ళు , "మా మీద పడి మమ్మల్ని కప్పండి. సింహాసనంపై కూర్చున్న ఆయనకు మేము కనిపించకుండా గొర్రెపిల్ల మమ్మల్ని శిక్షించడానికి వీలు లేకుండా మమ్మల్ని దాచిపెట్టండి!" అని పర్వతాలతోను, రాళ్లతోను గగ్గోలుగా అరుస్తూ ప్రాధేయ పడ్డారు.
\v 17 "ఇది మమ్మల్ని శిక్షిస్తున్న భయానకమైన ప్రళయ దినం. ఈ రోజు ఎవ్వరూ ప్రాణాలతో బయట పడే అవకాశం లేదు" అని వాళ్ళంతా ఆక్రోశించారు.
\s5
\c 7
\p
\v 1 ఇది జరిగిన తరువాత నలుగురు దేవదూతలు భూమి మీద నిలబడి ఉండడం నేను చూశాను. ఒకరు ఉత్తరం వైపు ఒకరు దక్షిణం వైపు, ఒకరు తూర్పు వైపు ఒకరు పడమర వైపు నిల్చుని ఉన్నారు. భూమి మీదా సముద్రం మీదా ఏ చెట్టు మీదా కూడా గాలి వీచకుండా వారు అడ్డుకుంటున్నారు.
\p
\v 2 అప్పుడు మరో దేవదూత తూర్పు నుంచి పైకి రావడం నేను చూశాను. అతడు దేవుని ముద్రను ధరించి ఉన్నాడు. సర్వశక్తిమంతుడైన దేవుని ముద్రతో తన సొంత ప్రజలను రక్షించడానికి వారిపై గుర్తు వేస్తున్నాడు. భూమికీ సముద్రానికీ హాని చేయమని దేవును చేత ఆజ్ఞ పొందిన దేవదూతలను అతడు పెద్ద స్వరంతో పిలిచాడు.
\v 3 అతడు వారితో, "మన దేవుని సేవకుల నుదిటిపై గుర్తు వేసేంత వరకూ భూమికి గానీ, సముద్రానికి గానీ, ఆఖరికి చెట్లకు కూడా హాని చేయవద్దు" అని చెప్పాడు.
\s5
\p
\v 4 అప్పుడు దేవదూత, అతడి సాటి దేవదూతలు దేవుని సేవకులకు గుర్తు వేశారు. వారు ఎంతమందికి గుర్తు వేశారో నేను విన్నాను. ఆ సంఖ్య లక్షా నలభై నాలుగు వేలు. వారు ప్రతి ఇశ్రాయేలు గోత్రం నుంచి తీసుకొన్నవారు. దేవుడు ఎవరిని రక్షిస్తాడో, ఆ పూర్తి సంఖ్యను సూచిస్తున్నారు.
\q1
\v 5 యూదా గోత్రం నుంచి 12,000 మందికి గుర్తు వేశారు,
\q1 రూబేను గోత్రం నుంచి 12,000 మందికి,
\q1 గాదు గోత్రం నుంచి 12,000 మందికి,
\q1
\v 6 ఆషేరు గోత్రం నుంచి 12,000 మందికి,
\q1 నఫ్తాలి గోత్రం నుంచి 12,000 మందికి,
\q1 మనష్షే గోత్రం నుంచి 12,000 మందికి,
\s5
\q1
\v 7 షిమ్యోను గోత్రం నుంచి 12,000 మందికి,
\q1 లేవి గోత్రం నుంచి 12,000 మందికి,
\q1 ఇశ్శాఖారు గోత్రం నుంచి 12,000 మందికి,
\q1
\v 8 జెబూలూను గోత్రం నుంచి 12,000 మందికి,
\q1 యోసేపు గోత్రం నుంచి 12,000 మందికి,
\q1 బెన్యామీను గోత్రం నుంచి 12,000 మందికి, ఇలా అన్ని గోత్రాల వారికీ గుర్తువేశారు.
\s5
\p
\v 9 ఈ విషయం జరిగిన తరువాత, ఒక పెద్ద సమూహాన్ని నేను చూశాను. అక్కడ చాలా మంది ప్రజలు ఉన్నారు, వారిని లెక్కబెట్టడం ఎవరి తరం కాదు. ప్రతి భాష నుంచి, ప్రతి జనం నుంచి, ప్రతి జాతి నుంచి, ప్రతి దేశం నుంచి వారు వచ్చారు. సింహాసనం ఎదుటా గొర్రెపిల్ల ఎదుటా వారంతా నిల్చున్నారు. వాళ్ళు తెల్లని అంగీలు వేసుకొని, ఖర్జూర చెట్ల కొమ్మలను రెండు చేతుల్లోనూ పట్టుకొని సంబరంగా ఊపుతున్నారు.
\v 10 వాళ్ళు బిగ్గరగా, "సింహాసనంపై కూర్చున్న మా దేవుడూ, గొర్రెపిల్లా సాతాను శక్తినుంచి మమ్ములను రక్షించారు" అని హర్ష ధ్వానాలు చేస్తున్నారు.
\s5
\p
\v 11 దేవదూతలంతా సింహాసనం చుట్టూ, పెద్దల చుట్టూ, ఆ నాలుగు జీవుల చుట్టూ నిల్చున్నారు. వాళ్ళందరూ సింహాసనం ఎదుట తమ ముఖాలను నేలకు ఆనించి దేవుణ్ణి ఆరాధించారు.
\v 12 వాళ్ళు , "అవును, ఆలా జరుగు గాక. నిత్యుడవైన మా దేవా, నీవు సర్వజ్ఞుడవని, శక్తిమంతుడవని, నీకు అసాధ్య మేమీ లేదని స్తుతులు, కృతజ్ఞతలు, కీర్తి నీకు చెల్లిస్తున్నాము. నిత్యుడివైన మా దేవా, అలా జరుగు గాక" అన్నారు.
\s5
\p
\v 13 అప్పుడు పెద్దల్లో ఒకాయన నన్ను అడిగాడు, "ఈ తెల్లని అంగీలు వేసుకున్న వాళ్ళు ఉన్నారే, వీరెవరో ఎక్కడినుంచి వచ్చారో నీకు తెలుసా?"
\v 14 నేను "అయ్యా, నాకు తెలియదు. మీకు తప్పకుండా వాళ్ళెవరో తెలుసు" అన్నాను. ఆయన నాతో, "వీళ్ళందరూ మహా బాధలను దాటుకుని వచ్చిన వాళ్ళు" అని చెప్పాడు. గొర్రెపిల్ల వాళ్ళ కోసం చనిపోయాడు. తద్వారా దేవుడు వాళ్ళ పాపాలను క్షమించాడు. వాళ్ళు తమ అంగీలను ఆయన రక్తంలో ఉతుక్కుని తమను శుభ్రపరుచుకున్నారు."
\s5
\p
\v 15 "ఈ కారణం గానే వాళ్ళందరూ దేవుని సింహాసనం ఎదుట ఉన్నారు. వాళ్ళు రేయింబవళ్ళు ఆయన ఆలయంలో ఆయన్ని ఆరాధిస్తున్నారు. సింహాసనంపై కూర్చున్న దేవుడు వాళ్ళని సంరక్షిస్తాడు.
\v 16 దాని ఫలితంగా, వాళ్ళకి మరలా ఎప్పటికీ ఆకలి వేయదు. వాళ్ళకి ఎన్నటికీ దాహం వేయదు. వాళ్ళకు ఎన్నటికీ ఎండ దెబ్బ తగలదు, ఎలాంటి వేడిమీ వాళ్ళను ఏమీ చేయదు.
\v 17 కాపరి తన గొర్రెలను జాగ్రత్తగా సంరక్షిస్తున్నట్టుగా, సింహాసనం వద్ద ఉన్న గొర్రెపిల్ల వాళ్ళను జాగ్రత్తగా సంరక్షిస్తాడు. కాపరి తన గొర్రెలను నీటి కాలవల దగ్గరకు ముందుండి నడిపించినట్టు ఆయన వాళ్ళకు నిత్యజీవపు ఊటల వద్దకు దారి చూపిస్తాడు. వాళ్ళకి ఇకపై ఎలాటి దుఃఖం లేకుండా చూస్తాడు. వాళ్ళందరి కన్నీరంతటినీ ఆయన తుడిచివేస్తాడు" అని చెప్పాడు.
\s5
\c 8
\p
\v 1 అప్పుడు గొర్రెపిల్ల ఏడవ సీలు తెరిచాడు. అప్పుడు పరలోకంలో కొంతసేపటి వరకు నిశ్శబ్దం అలుముకుంది.
\v 2 దేవుని ఎదుట నిల్చున్న ఏడుగురు దేవదూతలను నేను చూశాను. ఆయన వాళ్ళల్లో ప్రతి ఒక్కరికీ ఒక్కొక్క ఒక బాకా ఇచ్చాడు.
\s5
\p
\v 3 మరో దేవదూత వచ్చి బలిపీఠం వద్ద నిల్చున్నాడు. ధూపం వేయడం కోసం అతడి చేతుల్లో బంగారు గిన్నె ఉంది. దేవుని సింహాసనం ఎదుట ఉన్న బంగారు బలిపీఠం మీద దేవుని ప్రజలందరి ప్రార్ధనలతో కలిపి అతడు దానిపై అర్పించడం కోసం పరిమళ ద్రవ్యాలను దేవుడు అతడికి ఇచ్చాడు.
\v 4 దేవదూత చేతిలో ఉన్న గిన్నెలో నుంచి దేవుని ప్రజల ప్రార్ధనలతో పాటు పరిమళ ధూపం దేవుని వద్దకు చేరింది.
\v 5 అప్పుడు దేవదూత బంగారు గిన్నె తీసుకొని, బలిపీఠంలోని నిప్పు కణికలతో దానిని నింపాడు. అతడు వాటిని భూమిపై విసిరాడు. అప్పుడు ఉరుములు పడ్డాయి, మెరుపులు మెరిసాయి, భూమి కంపించి పోయింది.
\s5
\p
\v 6 అప్పుడు ఒక్కొక బాకా చొప్పున ఏడు బాకాలు ఉన్న ఏడుగురు దేవదూతలు, వాటిని ఊదటానికి సిద్ధమయ్యారు.
\p
\v 7 మొదటి దేవదూత తన బాకా ఊదాడు. అప్పుడు రక్తసిక్తమైన వడగళ్ళు, నిప్పులు భూమిపై కురిసాయి. దాని ఫలితంగా భూమి పైభాగం మొత్తంలో మూడోవంతు కాలిపోయింది. మూడోవంతు చెట్లు కాలిపోయాయి. పచ్చ గడ్డిలో మూడోవంతు కాలిపోయింది.
\s5
\p
\v 8 రెండో దేవదూత తన బాకా ఊదాడు. అప్పుడు, మండుతున్న పెద్ద పర్వతం లాంటిది సముద్రంలో పడింది. దాని ఫలితంగా సముద్రం మూడో వంతు రక్తంలా ఎర్రగా మారింది.
\v 9 సముద్ర జీవులు మూడో వంతు చనిపోయాయి. సముద్రంలోని మూడో వంతు ఓడలు నాశనం అయ్యాయి.
\s5
\p
\v 10 మూడో దేవదూత తన బాకా ఊదాడు. అప్పుడు, ప్రచండంగా కాలుతున్న ఒక పెద్ద నక్షత్రం ఆకాశం నుంచి రాలి మూడోవంతు నదుల్లోనూ మూడోవంతు నీటి ఊటల్లోనూ పడింది.
\v 11 ఆ నక్షత్రానికి చేదు అని పేరు. దాని ఫలితంగా నదుల్లో, నీటిఊటల్లో ఉన్న నీళ్ళు చేదుగా అయిపోయాయి. అవి చేదుగా మారినందువల్ల ఆ నీళ్ళు తాగిన చాలా మంది ప్రజలు చనిపోయారు.
\s5
\p
\v 12 నాలుగో దేవదూత తన బాకా ఊదాడు. అప్పుడు దేవుడు సూర్య చంద్ర నక్షత్రాదులు దెబ్బ తినేలా చేశాడు. దానివల్ల అవి తమ కాంతిలో మూడోవంతు కోల్పోయాయి. సూర్యుడు పగటిలో మూడో వంతు సమయం ప్రకాశించడం లేదు. చంద్రుడు, నక్షత్రాలు రాత్రిలో మూడో వంతు సమయం ప్రకాశించడం లేదు.
\s5
\p
\v 13 నేను చూస్తుండగా ఆకాశంలో ఎగురుతున్న ఒక గరుడ పక్షి బిగ్గరగా అరవడం నేను విన్నాను. "దేవదూతలు ఇంకా మిగతా మూడు బాకాలు ఊదినప్పుడు భూనివాసులకు మహా యాతనలు సంప్రాప్తిస్తాయి!" అని అతడు ప్రకటిస్తున్నాడు.
\s5
\c 9
\p
\v 1 ఐదో దేవదూత తన బాకా ఊదాడు. అప్పుడు ఆకాశం నుంచి ఒక నక్షత్రం రాలి పడటం నేను చూశాను. దేవుడు దానికి పాతాళానికి (అగాధానికి) వెళ్ళే తాళం చెవిని ఇచ్చాడు.
\v 2 అగాధాన్ని తెరచినప్పుడు, గొప్ప కొలిమి నుంచి వచ్చే పొగలా, దానినుంచి పొగ లేచింది. ఆ పొగ సుర్యుడి నుంచి, ఆకాశం నుంచి వచ్చే కాంతిని ఎవ్వరూ చూడకుండా కమ్మేసింది.
\s5
\p
\v 3 ఆ పొగలో మిడతల వంటివి భూమిపైకి వచ్చాయి. తేళ్ళవలె మనుషుల్ని కుట్టే అధికారాన్ని దేవుడు వాటికి ఇచ్చాడు.
\v 4 భూమిపై ఉన్న గడ్డికి గాని, మొక్కలకు గాని, ఏ చెట్టుకు గాని హాని చేయరాదని దేవుడు మిడతలకు చెప్పాడు. దేవునికి చెందినవారుగా సూచించడానికి ఎవరికైతే దేవుడు వేసిన గుర్తు లేదో, వారికి మాత్రమే హాని చేయాలని ఆయన వాటికి చెప్పాడు.
\s5
\p
\v 5 అయితే ప్రజలను చంపే అధికారం దేవుడు మిడతలకు ఇవ్వలేదు. దానికి బదులుగా మనుషులను ఐదు నెలల పాటు చిత్రహింసలు పెట్టమని అనుమతి ఇచ్చాడు. తేళ్ళు కుడితే ఎలాంటి బాధ కలుగుతుందో, అలాంటిదే మనుషులు వాటివల్ల అనుభవించారు.
\v 6 దేవునిపై తిరుగుబాటు చేసిన వారిని మిడతలు చిత్రహింసలు పెడుతున్న సమయంలో, ఆ బాధ, నొప్పి తాళలేక వాళ్ళు చనిపోవాలని కోరుకున్నారు. కాని అది వాళ్ళ వల్లగాలేదు. వాళ్ళకు చావు అల్లంత దూరంలో ఉన్నా వాళ్ళు చనిపోలేక పోయారు.
\s5
\p
\v 7 ఆ మిడతలు చూడడానికి యుద్ధానికి సిద్ధమైన గుర్రాల్లా ఉన్నాయి. బంగారు కిరీటాల వంటివి వాటి తలపై ఉన్నాయి. వాటి ముఖాలు మనుషుల ముఖాల్లా ఉన్నాయి.
\v 8 వాటికి స్త్రీలకు ఉండే పొడుగాటి జుట్టు ఉంది. వాటి కోరలు సింహం కోరల్లా దృఢంగా ఉన్నాయి.
\v 9 లోహంతో చేసినట్టున్న కవచాన్ని అవి రొమ్ముకు ధరించుకున్నాయి. అవి ఎగురుతుంటే, వాటి రెక్కల చప్పుడు యుద్ధంలో రథాలు లాగుతూ దౌడు తీస్తున్న అనేకమైన అశ్వాల ఘోషలా ఉంది.
\s5
\v 10 వాటి తోకలు తేళ్ళ కొండీల వంటివి. అవి తమ తోకలతో మనుషుల్ని కుడుతున్నాయి. తమ తోకలతో ఆ ఐదు నెలల కాలం ప్రజలకు హాని చేసే అధికారం వాటికి ఉంది.
\v 11 వాటిని పాలించే రాజు అంతం లేని అగాధం కిందికి వెళ్ళిన ఆ దేవదూత. హీబ్రూ భాషలో అతడి పేరు "అబద్దోను." గ్రీకు భాషలో అతడికి "అపోల్యోన్" అని పేరు. ఈ రెండు పేర్లకు అర్ధం "విధ్వంసకుడు."
\p
\v 12 ఆ భయంకరమైన సంఘటన ముగిసింది. అయితే ఇంకా రెండు భయంకరమైన సంఘటనలు రానున్నాయని తెలుసుకో.
\s5
\p
\v 13 ఆరో దేవదూత తన బాకా ఊదాడు. అప్పుడు దేవుని సన్నిధిలో ఉండే బంగారు బలిపీఠపు నాలుగు కొనలనుంచి వస్తున్న స్వరం నేను విన్నాను.
\v 14 ఆరో బాకా ఊదే దేవదూతతో ఆ స్వరం, "యూఫ్రటీసు మహా నది దగ్గర బంధించి ఉన్న ఆ నలుగురు దేవదూతలను విడుదల చెయ్యి!" అని ఆజ్ఞాపించింది.
\v 15 అప్పుడు ఆ నలుగురు దేవదూతలను విడుదల చేశారు. ఫలానా సంవత్సరం, ఫలానా నెల ఫలానా రోజు ఫలానా గంట కోసమే వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ప్రజల్లో మూడోవంతును చంపడానికి తమ సైనికులకి అనుమతి ఇవ్వడానికి వాళ్ళు చెర నుండి విడుదల అయ్యారు.
\s5
\p
\v 16 ఆ గుర్రాలపై కూర్చుని స్వారీ చేస్తున్న సైనికుల సంఖ్య ఇరవై కోట్లు. "వాళ్ళు ఎంతమంది?" అని ఎవరో అడగడం నేను విన్నాను.
\v 17 నా దర్శనంలో అవి ఎలాంటి గుర్రాలో, వాటిపై స్వారి చేసే ఆ సైనికులు చూడడానికి ఎలాంటివారో నేను చూశాను. ఆ సైనికులు వేసుకున్న కవచాలు అగ్నిలాంటి ఎరుపుతో, పొగలాంటి ముదురు నీలం రంగుతో, గంధంలా పసుపచ్చ రంగులో ఉన్నాయి. గుర్రాల తలలు సింహాల తలల్లా ఉన్నాయి. అవి నోటి నుంచి అగ్ని, పొగ, కాలుతున్న గంధకం ఆవిర్లు వెళ్లగక్కుతున్నాయి.
\s5
\p
\v 18 గుర్రాల నోటి నుంచి వస్తున్న అగ్ని, పొగ, కాలుతున్న గంధకపు ఆవిరితో అవి మూడింట ఒక వంతు ప్రజల్ని మట్టుబెట్టాయి.
\v 19 ఆ గుర్రాల శక్తి వాటి నోళ్ళలోనూ, వాటి తోకల్లోనూ ఉంది. వాటి తోకలకు పాము లాంటి తలలు ఉన్నాయి, వాటితో అవి ప్రజలకు హాని చేస్తున్నాయి.
\s5
\p
\v 20 అయితే అగ్ని , పొగ, కాలుతున్న గంధకపు ఆవిరి చేత హతం కాని వాళ్ళు తాము చేస్తున్న పాపకృత్యాల విషయం పశ్చాత్తాప పడలేదు. కొయ్య, రాయి, కంచు, వెండి, బంగారం మొదలైన వాటితో వాళ్ళు చేసుకున్న విగ్రహాలను, దయ్యాలను ఆరాధించడం మానలేదు. ఆ విగ్రహాలు చూడలేనివి, వినలేనివి, నడవలేనివి అయినా కూడా ప్రజలు వాటిని పూజించడం మానలేదు.
\v 21 వాళ్ళు హత్యలు, మాయమంత్ర విద్యలు, లైంగిక అవినీతి, దొంగతనాలు మానలేదు.
\s5
\c 10
\p
\v 1 దర్శనంలో మహా శక్తిమంతుడైన దేవదూత పరలోకం నుంచి బయటకు రావడం నేను చూశాను. ఒక మేఘం ఆయన్ను ఆవరించి ఉంది. ఆయన తలపై ఇంద్రధనస్సు ఉంది. ఆయన ముఖం సూర్యబింబంలా ప్రకాశిస్తున్నది. ఆయన కాళ్ళు చూడడానికి అగ్ని స్తంభాల్లా ఉన్నాయి.
\v 2 తెరిచి ఉన్న ఒక చిన్న పుస్తకం చుట్ట ఆయన చేతిలో ఉంది. ఆయన తన కుడి కాలును సముద్రం మీదా, ఎడమ కాలును భూమి మీదా ఉంచాడు.
\s5
\p
\v 3 ఆయన పెద్ద గొంతుకతో ఏదో అరిచాడు. ఆ శబ్దం సింహ గర్జనలా ఉంది. ఆయన అరిచినప్పుడు ఏడు సార్లు ఉరుము శబ్దం వచ్చింది. ఆ ఉరుములు పలికిన మాటలను నేను అర్ధం చేసుకున్నాను.
\v 4 నేను ఆ ఏడు ఉరుములు పలికిన మాటలను రాయబోతుంటే, ఒక స్వరం పరలోకం నుంచి నాతో, "ఉరుములు పలికిన మాటలను రహస్యంగా ఉంచు, వాటిని రాయకు" అని చెప్పింది.
\s5
\p
\v 5 అప్పుడు సముద్రం మీదా, భూమి మీదా నిలబడిన ఆ దేవదూత, తన కుడి చేతిని పరలోకం వైపుకు ఎత్తి,
\v 6 "శాశ్వత జీవం ఉన్నవాడూ, పరలోకాన్నీ, దానిలోని సమస్తాన్నీ సృష్టించిన వాడూ, భూమినీ, దానిలోని సమస్తాన్నీ సృష్టించిన వాడూ, సముద్రాన్నీ, దానిలోని సమస్తాన్నీ సృష్టించిన వాడూ అయిన ఆయన చెప్పబోయేది సత్యం" అని చెప్పాడు. "దేవుడు తాను చేయాలనుకున్నది ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయడు" అని ఆ దేవదూత చెప్పాడు.
\v 7 ఏడవ దేవదూతకు తన బాకా ఊదే సమయం వచ్చినప్పుడు దేవుడు యుగాలకు పూర్వం తన సేవకులకు, ప్రవక్తలకు చెప్పిన తన రహస్య ప్రణాళిక ముగిస్తాడని అతడు చెప్పాడు.
\s5
\p
\v 8 పరలోకం నుంచి నాతో ఇంతకుముందు మాట్లాడిన వాడు మళ్ళీ నాతో , "భూమి మీదా, సముద్రం మీదా నిల్చున్న ఆ దేవదూత చేతిలో నుంచి తెరిచిన పుస్తకం చుట్టను వెళ్ళి తీసుకో" అన్నాడు.
\v 9 కాబట్టి నేను దేవదూత దగ్గరకు వెళ్ళి "ఆ చిన్న చుట్టను నాకు ఇవ్వండి" అని అడిగాను. అతడు నాతో, "దీన్ని తీసుకుని తిను. నీ నోటికి ఇది తేనెలా తియ్యగా ఉంటుంది, కానీ ఇది నీ కడుపును చేదు చేస్తుంది" అన్నాడు.
\s5
\p
\v 10 నేను దేవదూత చేతిలో నుంచి ఆ చిన్న పుస్తకం చుట్టను తీసుకుని తిన్నాను. నా నోటికి అది తేనెలా తియ్యగా ఉంది కానీ ఆ తరువాత అది నా కడుపులో చేదుగా అయింది.
\v 11 అప్పుడు మరొకరు నాతో, "నువ్వు అనేకమంది రాజులను గురించీ, అనేక భాషలు మాట్లాడే వాళ్ళను గురించీ, జాతుల గురించీ, అనేక దేశాలను గురించీ దేవుని సందేశం మళ్ళీ చెప్పాలి" అన్నాడు.
\s5
\c 11
\p
\v 1 అప్పుడు దేవదూత కొలబద్ద వంటి బెత్తాన్ని నాకు ఇచ్చాడు. దేవుడు నాతో, "దేవాలయానికి వెళ్ళి, ఆలయం, దానిలోని బలిపీఠం కొలత వేయి. అక్కడ ఆరాధిస్తున్న వారిని లెక్కబెట్టు.
\v 2 కానీ ఆలయం బయట ఆవరణను కొలవ వద్దు, ఎందుకంటే దాన్ని నేను యూదేతరులకు ఇచ్చాను. దాని ఫలితంగా వాళ్ళు యెరూషలేము నగరాన్ని 42 నెలల పాటు కాలితో తొక్కుతారు" అన్నాడు.
\s5
\p
\v 3 "నేను ఇద్దరు సాక్షులను పంపుతాను. నేను వాళ్ళకి వెల్లడి చేసిన దాన్ని వాళ్ళు చాటిస్టారు. వాళ్ళు మేక వెంట్రుకలతో చేసిన ముతక బట్టలు ధరించి తాము ప్రజల పాపం విషయం చాలా వేదనలో ఉన్న సంగతిని వెల్లడిస్తారు" అన్నాడు.
\v 4 భూమిని పరిపాలించే వాడి సన్నిధిలో ప్రాతినిధ్యం వహిస్తూ ఉండే రెండు దీప స్తంభాలుగా రెండు ఒలీవ చెట్లుగా ఉండే ఆ ఇద్దరు సాక్షులు వీరే.
\v 5 ఎవరైనా ఈ సాక్షులకు హాని చేయాలని చూస్తే, వాళ్ళ నోటి నుంచి అగ్ని వచ్చి వాళ్ళను నాశనం చేస్తుంది. వారికి ఏ విధంగా హాని చేయాలని వాళ్ళు ప్రయత్నిస్తారో వాళ్ళను ఆ ఇద్దరు సాక్షులు సరిగ్గా అలానే చంపుతారు.
\s5
\p
\v 6 దేవుడు వారికి వెల్లడి చేసిన దాన్ని చాటించే కాలంలో వర్షం పడకుండా ఆపే అధికారం ఆ సాక్షులకు ఉంది. ప్రతి చోటా నీటిని రక్తంగా మార్చే అధికారం కూడా వారికి ఉంది. అన్ని రకాలైన వ్యాధులను మనుషులకు దాపురించేలా చేసే అధికారం కూడా వారికి ఉంది. వారు తరుచుగా తమకు ఇష్టమైన రీతిలో ఇలాటివి చేస్తారు.
\v 7 దేవుని నుంచి తెచ్చిన సందేశాన్ని వారు చాటించడం పూర్తి కాగానే, అడుగు లేని అగాధం నుంచి క్రూర మృగం పైకి వచ్చి వారిపై దాడి చేసి, జయించి హతమారుస్తుంది.
\s5
\p
\v 8 ఎక్కడైతే వారి ప్రభువుని సిలువ వేసారో, ఆ నగర వీధుల్లో ఆ ఇద్దరు సాక్షుల శవాలు పడి ఉంటాయి. ఆ నగరాన్ని సొదొమ, ఈజిప్టు పోలికతో పిలుస్తారు, ఎందుకంటే దానిలోని ప్రజలు సొదొమ, ఈజిప్టుల్లో నివసించే ప్రజల్లా చాలా దుర్మార్గులు.
\v 9 మూడున్నర రోజుల పాటు వారి శవాలను అనేక దేశాలవారు, భాషాసమూహాల వారు, జాతులవారు, చూస్తారు. వారి శవాలను పాతిపెట్టనివ్వరు.
\s5
\p
\v 10 భూమిమీద నివసించే ప్రజానీకం ఆ సాక్షులు చావడం చూసి సంతోషంతో పండగ చేసుకుంటారు. ఒకరికొకరు బహుమతులు పంపించుకుంటారు, ఎందుకంటే ఈ ఇద్దరు సాక్షులు అసంఖ్యాకంగా వ్యాధుల్నీ, హింసల్నీ వారిపైకి పంపారు.
\p
\v 11 కాని మూడున్నర రోజుల తరువాత దేవుడు వారిని మళ్ళీ బ్రతికేలా చేస్తాడు. వారు లేచి నిలబడగానే, అది చూసి ప్రజలు హడలిపోతారు.
\v 12 ఆ ఇద్దరు సాక్షులు పరలోకం నుంచి పెద్ద స్వరం పిలవగా వింటారు. వారితో ఆ స్వరం, "పైకి రండి" అని చెప్పగా వారు మేఘాల్లోకెగసి పైకి వెళ్తారు. వారు అలా వెళ్ళడం వారి శత్రువులు చూస్తారు.
\s5
\p
\v 13 అదే సమయంలో అక్కడ ఒక పెద్ద భూకంపం కలుగుతుంది. ఫలితంగా నగరంలోని పదోవంతు కట్టడాలు కూలిపోతాయి. ఏడు వేల మంది చనిపోతారు.
\v 14 అది ఘోరమైన రెండవ సంఘటన. జాగ్రత్త! ఇది ముగిసిన వెంటనే మూడవ ఘోరం ముంచుకు రానుంది.
\s5
\p
\v 15 ఏడవ దూత బాకా ఊదాడు. అప్పుడు పరలోకంలో స్వరాలు ఇలా ఘోషించాయి. "మన ప్రభువైన దేవుడు, ఆయన నియమించిన క్రీస్తు ఇకపై ఈ లోక ప్రజలందరి మీదా రాజ్యం చేస్తారు. వారు యుగయుగాలు పరిపాలన చేస్తారు."
\s5
\p
\v 16 అప్పుడు దేవుని ఎదుట సింహాసనాలపై కూర్చున్న ఇరవై నలుగురు పెద్దలూ సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధించారు.
\q1
\v 17 "ప్రభువైన దేవా, సర్వ లోక పరిపాలకా, సర్వ శక్తిశాలీ,
\q1 పూర్వం ఉండి ప్రస్తుతం ఉన్నవాడా, నీవే నిత్యుడవు,
\q1 నిన్నెదిరించిన వారి పీచమణచిన వాడా,
\q1 నువ్వు నీ మహాశక్తి సమేతంగా పాలించడం ప్రారంభించినందుకు నీకు మా కృతజ్ఞతలు.
\s5
\q1
\v 18 విశ్వాసహీనుల క్రోధం మితిమీరింది.
\q1 అందుకే నీ తీవ్ర ఆగ్రహం వారు చవి చూశారు.
\q1 చనిపోయిన వారికి తీర్పు తీర్చడానికీ,
\q1 నీ సేవకులైన ప్రవక్తలకీ, పరిశుద్ధులకీ, గొప్పవారైనా, అనామకులైనా
\q1 నీ పేరు అంటే భయభక్తులు ఉన్న వారికి పారితోషికాలు ఇవ్వడానికీ,
\q1 భూమిని నాశనం చేసే వారిని లేకుండా చేయడానికీ నీ నిర్ణయ సమయం వచ్చింది" అన్నారు.
\s5
\p
\v 19 అప్పుడు పరలోకంలో దేవుని ఆలయం తెరుచుకుంది. దేవుని నిబంధన మందసం అందులో కనిపించింది. అప్పుడు మెరుపులూ, గొప్ప శబ్దాలూ, ఉరుములూ, భూకంపమూ కలిగాయి. పెద్ద వడగళ్ళు పడ్డాయి.
\s5
\c 12
\p
\v 1 అప్పుడు ఒక దృశ్యం ఆకాశంలో కనిపించింది. ఒక స్త్రీ సూర్యుణ్ణి తన వస్త్రంగా ధరించి ఉంది. ఆమె కాళ్ళ కింద చంద్ర బింబం ఉంది. ఆమె తలపై పన్నెండు నక్షత్రాల కిరీటం విజయ సంకేతంగా ఉంది.
\v 2 ఆమె నిండు చూలాలు. పురిటి నొప్పులతో తీవ్ర వేదన పడుతూ కేకలు వేస్తూ ఉంది.
\s5
\v 3 ఇంతలో మరో అసాధారణ సంకేతం ఆకాశంలో కనిపించింది. అది రెక్కలున్న మహా సర్పం. వాడికి ఏడు తలలున్నాయి. పది కొమ్ములున్నాయి. వాడి ఏడు తలలపై ఏడు కిరీటాలున్నాయి.
\v 4 వాడు తన తోకతో ఆకాశంలో ఉన్న నక్షత్రాల్లో మూడవ భాగాన్ని ఈడ్చి వాటిని భూమి మీదికి విసిరికొట్టాడు. ఆ మహాసర్పం కనడానికి నొప్పులు పడుతున్న స్త్రీకి ఎదురుగా నిలబడ్డాడు. ఆ స్త్రీ బిడ్డకు జన్మ నివ్వగానే ఆ బిడ్డను మింగివేయాలన్నది వాడి ఉద్దేశం.
\s5
\p
\v 5 ఆమె ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ శిశువు ఇనప దండం పట్టుకుని మానవజాతులన్నిటిపై పూర్తి అధికారంతో పరిపాలన చేయాల్సి ఉంది. దేవుడు ఆమె బిడ్డను ఆమె దగ్గరనుంచి లాక్కుని తన సింహాసనం దగ్గరకు తీసుకు వెళ్ళాడు.
\v 6 ఆ స్త్రీ అరణ్యంలోకి పారిపోయింది. అక్కడ ఆమెను 1,260 రోజులు ఉంచి పోషించడానికి దేవుడు ఒక స్థలాన్ని సిద్ధం చేసి ఉంచాడు.
\s5
\p
\v 7 అప్పుడు పరలోకంలో యుద్ధం జరిగింది. మిఖాయేలూ అతని దూతలూ ఆ మహాసర్పంతో యుద్ధం చేశారు. ఆ మహా సర్పం తన దూతలతో కలసి ఎదిరించి పోరాడాడు.
\v 8 కానీ గెలవడానికి ఆ మహా సర్పానికి బలం చాలలేదు. అప్పుడు దేవుడు పరలోకంలో ఆ మహా సర్పానికీ వాడి అనుచర గణాలకూ మరెప్పటికీ స్థానం లేకుండా చేశాడు.
\v 9 ఈ మహా సర్పానికి అపవాది అనీ, సాతాను అనీ పేర్లున్నాయి. వాడు లోకాన్నంతా మోసం చేసే ప్రాచీన సర్పం. దేవుడు వాణ్ణీ వాడితో పాటు వాడి అనుచరగణాలనూ భూమి మీదికి తోసి వేశాడు.
\s5
\v 10 అప్పుడు పరలోకం నుండి బిగ్గరగా ఒక స్వరం నాకు వినపడింది,
\q1 "మన దేవుడు తన శక్తితో తన వారిని రక్షించాడు. ఇకపై ఆయనే వారి పాలకుడు.
\q1 అభిషిక్తుడు తన పరిపాలన మొదలు పెట్టాడు.
\q1 మన సోదరులను నిత్యం నిందించే వాణ్ణి దేవుడు పరలోకం నుండి తోసేశాడు.
\q1 అహర్నిశలు దేవుని ఎదుట మన సోదరులపై నేరం మోపే వాడు, అపవాది వీడే.
\s5
\q1
\v 11 గొర్రెపిల్ల తన రక్తాన్ని చిందించి, ప్రాణం పెట్టడం వల్ల మన సహోదరులు వాణ్ణి జయించారు.
\q1 గొర్రెపిల్లను గురించిన సత్యసాక్షులుగా నిలిచి, మన సహోదరులు ఈ విజయాన్ని సొంతం చేసుకున్నారు.
\q1 అలా సత్యానికి సాక్షులుగా నిలిచినపుడు మరణం వచ్చినా సరే వారు తమ ప్రాణాలను ప్రేమించలేదు.
\q1
\v 12 కాబట్టి పరలోకమూ పరలోకంలో నివసించే వారూ సంబరాలు చేసుకోండి.
\q1 భూమి మీదా సముద్రం మీదా నివసించే ప్రజలారా, మీకు యాతన. ఎందుకంటే అపవాది మీ దగ్గరికి దిగి వచ్చాడు.
\q1 వాడు భీకరమైన కోపంతో ఉన్నాడు. దేవుడు తనకు తీర్పు తీర్చి శిక్షించడానికి ఇక కొంచెం సమయమే మిగిలిందని వాడు గ్రహించాడు."
\s5
\p
\v 13 తనను భూమి పైకి తోసివేయడాన్ని చూసి ఆ మహాసర్పం, మగబిడ్డను ప్రసవించిన ఆ స్త్రీని వెంటాడాడు.
\v 14 కానీ అరణ్యంలో తనకు సిద్ధం చేసిన చోటుకు వెళ్ళడానికి ఆమెకు పెద్ద డేగకుండే బలమైన రెక్కల్లాంటి రెండు రెక్కలు దేవుడు ఇచ్చాడు. అక్కడ ఆమె సర్పం బారిన పడకుండా మూడున్నర సంవత్సరాల కాలం ఆమెకు పోషణ ఏర్పాటు అయింది.
\s5
\p
\v 15 అప్పుడు ఆ స్త్రీ నీళ్ళలో కొట్టుకుపోవాలని సర్పం తన పుక్కిటి నుండి నీటిని నదీ ప్రవాహంగా వెళ్ళగక్కాడు.
\v 16 కానీ భూమి నోరు తెరచి ఆ మహాసర్పం నోటి నుండి వచ్చిన నదీ ప్రవాహాన్ని మింగివేసి ఆ స్త్రీకి సహాయం చేసింది.
\v 17 అందుచేత తీవ్ర ఆగ్రహతో ఆ మహా సర్పం, దేవుని ఆదేశాలు పాటిస్తూ యేసును గురించిన సత్యం ప్రకటిస్తూ ఆమె సంతానంలో మిగిలి ఉన్న వారితో యుద్ధం చేయడానికి బయల్దేరాడు.
\v 18 అందుకోసం ఆ మహా సర్పం సముద్ర తీరంలో ఇసుక తిన్నెలపై నిలబడ్డాడు.
\s5
\c 13
\p
\v 1 తరువాత క్రూర మృగం ఒకటి సముద్రంలో నుండి బయటకు రావడం చూశాను. దానికి పది కొమ్ములూ, ఏడు తలలూ ఉన్నాయి. దాని కొమ్ములపై పది కిరీటాలున్నాయి. దాని తలల మీద దేవుణ్ణి అవమానపరిచే పేర్లు ఉన్నాయి.
\v 2 నేను చూసిన ఆ మృగం చిరుత పులిలా ఉంది. దాని కాళ్ళు ఎలుగుబంటి కాళ్ళలాగా దాని నోరు సింహం నోరులాగా ఉన్నాయి. ఆ మహాసర్పం ఈ మృగానికి, మనుషుల మీద పరిపాలన చెయ్యడానికి తన శక్తినీ, తన సింహాసనాన్నీ, గొప్ప అధికారాన్నీ ఇచ్చాడు.
\s5
\p
\v 3 దాని తలల్లో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్టుగా కనిపించింది. అయితే ఆ గాయం మానిపోయింది. భూనివాసులంతా ఆశ్చర్యచకితులై ఆ మృగం వెంట వెళ్ళారు.
\v 4 తమకు రాజుగా ఉండడానికి ఆ మృగానికి అధికారమిచ్చాడని వారంతా మహాసర్పానికి కూడా పూజలు చేశారు. "ఈ మృగంలాంటి శక్తిమంతుడు ఎవడన్నా ఉన్నాడా? ఇతనితో యుద్ధం చేయగల వారెవరు?" అని చెప్పుకుంటూ వారంతా మృగానికి కూడా పూజలు చేశారు.
\s5
\p
\v 5 బడాయి కబుర్లూ, దైవ దూషణలూ చేయడానికి దానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. నలభై రెండు నెలలు అధికారం చెలాయించడానికి కూడా దానికి అనుమతి ఇచ్చాడు.
\v 6 కాబట్టి దేవుణ్ణి దూషించడానికీ, ఆయన నామాన్నీ, ఆయన నివాస స్థలాన్నీ, పరలోకంలో నివసించే వారినందరినీ దూషించడానికి అది నోరు తెరిచింది.
\s5
\p
\v 7 ఇంతేకాకుండా తన పరిశుద్ధులతో యుద్ధం చేసి వారిని జయించే అవకాశం కూడా దేవుడు దానికి ఇచ్చాడు. ప్రతి వంశం పైనా, ప్రజల పైనా, భిన్నమైన భాషలు మాట్లాడే వారిపైనా, ప్రతి జాతి పైనా దానికి అధికారం ఉంది.
\v 8 భూమిపై నివసించే వారంతా, అంటే సృష్టి ప్రారంభం నుండీ వధకు గురి అయిన గొర్రెపిల్లకు చెందిన జీవ గ్రంథంలో తమ పేర్లు లేని వారే ఆ మృగాన్ని పూజిస్తారు.
\s5
\p
\v 9 దేవుని నుండి వచ్చిన ఈ సందేశాన్ని అర్ధం చేసుకోవాలి అనుకునే ప్రతివారూ జాగ్రత్తగా చెవులు రిక్కించి వినాలి.
\v 10 చెరలోకి పోవలసిన వాడు చెరలోకి పోతాడు. కత్తితో హతం కావలసిన వాడు కత్తితో హతమౌతాడు. దేవుని చిత్తం మేరకు పరిశుద్ధులైన వారు ఈ విషయంలో తప్పక సహనం, విశ్వాసం కలిగి ఉండాలి.
\s5
\p
\v 11 అప్పుడు భూమిలో నుండి మరో మృగం పైకి రావడం చూశాను. దానికి గొర్రెపిల్ల కొమ్ముల వంటి చిన్న కొమ్ములు రెండు ఉన్నాయి. ఆ మృగం మహాసర్పంలాగే పరుషంగా మాట్లాడుతూ ఉంది.
\v 12 ఈ రెండవ మృగం ప్రాణాంతకమైన దెబ్బ తగిలి ఆ తరువాత గాయం మానినట్టున్న మొదటి క్రూర మృగానికున్న అధికారాన్ని దాని సమక్షంలో ఉపయోగిస్తూ, తద్వారా ఆ మొదటి మృగాన్ని భూమీ దానిలో నివసించే వారంతా పూజించేలా ఒత్తిడి చేసింది.
\s5
\v 13 రెండవ మృగం కూడా అనేక చిత్ర చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తూ మనుషులంతా చూస్తుండగా ఆకాశం నుండి భూమికి అగ్ని రప్పించడం వంటి మాయలు కూడా చేస్తూ ఉంది.
\p
\v 14 తనకు అనుమతి ఉన్నంత మేర తాను చేస్తున్న అద్భుతాలతో భూమిపై అందర్నీ మోసం చేస్తూ ఉంది. కత్తి దెబ్బ తిని కూడా బతికే ఉన్న మొదటి క్రూరమృగానికి ఒక విగ్రహాన్ని స్థాపించాలనీ, దాన్ని ఆరాధించాలనీ అది అందరికీ చెబుతూ ఉంది. దేవుడు అనుమతిస్తేనే ఇదంతా జరిగింది.
\s5
\v 15 పైగా అలా స్థాపించిన విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేసి అది మాట్లాడేలా చేయడానికీ, ఆ మృగం విగ్రహాన్ని పూజించని వారిని చంపడానికీ కూడా దేవుడు దానికి అనుమతి ఇచ్చాడు.
\v 16 ఇంకా తమ కుడి చేతిపై గానీ నుదిటిపై గానీ మొదటి మృగానికున్న పేరును ముద్ర వేయించుకోవాలని ప్రముఖులనూ, అనామకులనూ, ధనవంతులనూ, నిరుపేదలనూ, అధికారులనూ, పనివారినీ అందర్నీ అది బలవంతం చేసింది.
\v 17 ఈ ముద్ర, అంటే ఆ మృగం పేరు గానీ దాని పేరును సూచిస్తున్న సంఖ్య గానీ లేని పక్షంలో ఎవరికైనా క్రయవిక్రయాలు చేసుకునే వీలు లేకుండా చేసింది.
\s5
\v 18 కాస్త తెలివిగా ఆలోచిస్తేనే గానీ ఈ ముద్ర సంగతి అర్ధం కాదు. ఈ సంఖ్య మానవ జాతిని సూచించే 666.
\s5
\c 14
\p
\v 1 ఆ తరువాత నా ఎదురుగా యెరూషలేములో సీయోను పర్వతంపై గొర్రెపిల్ల నిలబడి ఉండడం నాకు కనిపించింది. ఆయనతో కూడా లక్షా నలభై నాలుగు వేల మంది ఉన్నారు. వారందరి నొసళ్ళపై ఆయన పేరూ, ఆయన తండ్రి పేరూ రాసి ఉన్నాయి.
\p
\v 2 అప్పుడు విస్తార జలధారలతో కూడిన సెలయేటి ధ్వనిలా లా, పెద్ద ఉరుము ఉరిమినట్టు పరలోకం నుండి ఒక శబ్దం రాగా విన్నాను. వీణలు వాయించేవారు చాలా మంది కలిసి వాయిస్తున్న శబ్దం వలే అది ఉంది.
\s5
\v 3 ఆ లక్షా నలభై నాలుగు వేల మందిమంది ఏకమై సింహాసనం ఎదుటా, ఆ నాలుగు ప్రాణుల ఎదుటా, పెద్దల ఎదుటా ఒక కొత్త పాట పాడారు. భూలోకంలో గొర్రెపిల్ల విమోచించిన ఈ లక్షా నలభై నాలుగు వేల మంది తప్ప ఇంకెవ్వరూ ఆ పాటను నేర్చుకోలేరు.
\p
\v 4 ఈ లక్షా నలభై నాలుగు వేల మంది, కన్యకలు నైతికంగా ఎంత స్వచ్ఛంగా ఉంటారో అంతలా తమ ఆత్మ విషయంలో కల్మషం లేని వారు. దేవుడు కాని వాడిని ఆరాధించి అపవిత్రులైపోకుండా, తమని తాము కాపాడుకున్నవారు వీరే. వీళ్ళు గొర్రెపిల్లగా వున్న యేసు వెళ్ళిన చోటికల్లా వెళ్తూ ఆయనను అనుసరిస్తూ ఉన్నారు. వీళ్ళు మానవాళిలో నుండి దేవుని కోసమూ, గొర్రెపిల్ల కోసమూ ప్రథమ ఫలాలుగా విమోచన పొందిన వారు.
\v 5 అబద్ధమన్నది వీళ్ళ నోటి నుండి రాదు. వీళ్ళు నిందా రహితులు.
\s5
\p
\v 6 అప్పుడు మరో దూతను చూశాను. అతడు ఆకాశంలో ఎగురుతున్నాడు. భూమి మీద నివసించే వారందరికీ ప్రతి దేశానికీ, ప్రతి తెగకూ, ప్రతి భాష మాట్లాడే వారికీ, ప్రతి జాతికీ ప్రకటించడానికి అతని దగ్గర శాశ్వత సువార్త ఉంది.
\v 7 అతడు, "మీరు దేవునికి భయపడండి. ఆయనకు మహిమ ఆపాదించండి. ఆయన మనుషులకు తీర్పు తీర్చే సమయం వచ్చింది. కాబట్టి భూమినీ, ఆకాశాలనూ, సముద్రాన్నీ, భూమి మీద నీటి ఊటలనూ సృష్టించిన ఆయనను పూజించండి" అంటూ బిగ్గరగా చెప్పాడు.
\s5
\p
\v 8 వేరొక దూత, అంటే రెండవ దూత అతని వెనకే వచ్చాడు. "నాశనమైపోయింది! తన విపరీతమైన లైంగిక దుర్నీతి అనే ఘాటు సారాయిని భూమి మీద జనాలందరికీ తాగించిన మహా బబులోను, దుష్ట నగరం ధ్వంసమైపోయింది" అని చెప్పాడు.
\s5
\v 9 తరువాత మూడవ దూత వీరి వెనకే వచ్చి పెద్ద స్వరంతో ఇలా చెప్పాడు. "ఆ క్రూర మృగాన్ని గానీ దాని విగ్రహాన్ని గానీ ఎవరు పూజించినా, దాని ముద్రను నుదుటి మీద గానీ చేతి మీద గానీ ఎవరు వేయించుకున్నా,
\v 10 అలాంటి వాళ్ళు ఒకడు కల్తీ లేకుండా తయారు చేసిన ఘాటైన సారాయి తాగినప్పటిలా దేవుని ఆగ్రహాన్ని చవి చూస్తారు. పరిశుద్ధ దేవదూతల ఎదుటా, గొర్రెపిల్ల ఎదుటా అగ్ని గంధకాలు వారిని బాధిస్తాయి.
\s5
\v 11 వారి యాతనకి సంబంధించిన పొగ కలకాలం లేస్తూనే ఉంటుంది. ఆ క్రూర మృగాన్ని గానీ, దాని విగ్రహాన్ని గానీ పూజించిన వాళ్ళనీ, దాని ముద్ర వేయించుకున్నవాళ్ళనీ రేయింబవళ్ళు విరామం లేకుండా నిత్య నరకాగ్నికి దేవుడు అప్పగిస్తాడు.
\v 12 దేవుని ఆదేశాలు పాటించేవారూ, యేసును విశ్వసించిన వారూ అయిన పరిశుద్ధులు సహనంతో, విధేయతతో కొనసాగాలి."
\s5
\p
\v 13 అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం నాకిలా వినిపించింది, "ఇలా వ్రాయి. ఇక నుండి ప్రభువులో ఉంటూ చనిపోయే వారు ఎంతో ధన్య జీవులు." దేవుని ఆత్మ ఇలా అన్నాడు "నిజమే, వారు తమ బాధలన్నీ ప్రయాసలన్నీ విడిచి విశ్రాంతి పొందుతారు. ఎందుకంటే వారు చేసిన మంచి పనులు అందరికీ తెలుసు."
\s5
\p
\v 14 మళ్ళీ నేను చూసినప్పుడు ఒక తెల్లని మేఘం కనిపించింది. ఆ మేఘంపై మనుష్య కుమారుడి లాంటి వ్యక్తి కూర్చుని ఉన్నాడు. ఆయన తలపై బంగారు కిరీటం ఉంది. ఆయన చేతిలో పదునైన కొడవలి ఉంది.
\v 15 అప్పుడు మరో దూత దేవాలయంలో నుండి బయటకు వచ్చి మేఘంపై కూర్చున్న వ్యక్తితో పెద్ద స్వరంతో ఇలా అన్నాడు, "పంట కోసే సమయం వచ్చింది. భూలోకంలో పంట పండింది. నీ కొడవలితో కోయడం మొదలుపెట్టు."
\v 16 అప్పుడు మేఘంపై కూర్చున్న వ్యక్తి భూమి మీదికి కొడవలి విసిరాడు. వెంటనే భూమి మీద కోత కోయడం అయిపోయింది.
\s5
\p
\v 17 అంతలోనే పరలోకంలోని ఆలయంలో నుండి మరో దూత బయటకు వచ్చాడు. అతని చేతిలో కూడా ఒక పదునైన కొడవలి ఉంది.
\v 18 మరో దూత బలిపీఠంలో నుండి బయటకు వచ్చాడు. ఇతనికి ఆ బలిపీఠంపై ఉన్న అగ్నిపై అధికారం ఉంది. ఇతడు పదునైన కొడవలి చేతిలో పట్టుకున్నఆ దూతను బిగ్గరగా పిలిచి, "భూమి మీద ద్రాక్ష పళ్ళు పండాయి. పదునైన నీ కొడవలితో ద్రాక్ష గుత్తులు కోసుకో" అన్నాడు.
\s5
\v 19 అప్పుడు ఆ దూత తన కొడవలిని భూమి మీదికి విసిరి భూమిమీద ఉన్న ద్రాక్షగుత్తులను కోశాడు. వాటిని దేవుని ఆగ్రహమనే గొప్ప ద్రాక్ష గానుగ తొట్టిలో పడవేశాడు.
\v 20 పట్టణానికి బయట ఆ ద్రాక్ష గానుగ తొట్టిలో ద్రాక్షలు తొక్కడం జరిగింది. దానిలో నుండి రక్తం ఉవ్వెత్తున చిమ్మింది. గుర్రాల కళ్ళెం అంత ఎత్తున సుమారు రెండు వందల మైళ్ళ వరకూ ప్రవహించింది.
\s5
\c 15
\p
\v 1 పరలోకంలో మరో ఆశ్చర్యకరమైన గొప్ప సంకేతం నేను చూశాను. బ్రహ్మాండంగానూ, అద్భుతంగానూ ఉన్న ఏడుగురు దేవదూతలు కనపడ్డారు. తిరుగుబాటుదారులను శిక్షించడానికి తమ చేతుల్లో ఏడు తెగుళ్ళు పట్టుకుని ఉన్నారు. ఇవి ఉగ్రతతో దేవుడు విధించే చివరి శిక్ష. వీటితో దేవుడు ఎంత ఆగ్రహంగా ఉన్నాడో తెలుస్తుంది.
\s5
\p
\v 2 తరువాత నేను ఒక గాజు సముద్రం లాంటిది చూశాను. దానితో అగ్ని కలసి ఉంది. క్రూర మృగాన్ని గానీ దాని విగ్రహాన్ని గానీ పూజించకుండా, దాని పేరును సూచించే సంఖ్యను తమపై రాయనివ్వకుండా దానినీ, దాని దూతలనూ జయించిన వారు ఆ గాజు సముద్రం దగ్గర నిలబడి ఉండడం నేను చూశాను. వారి చేతుల్లో దేవుడు ఇచ్చిన వీణలు ఉన్నాయి.
\s5
\p
\v 3 వారు ప్రాచీన కాలంలో దేవుని సేవకుడైన మోషే పాడిన గొర్రెపిల్ల పాట పాడుతూ,
\q1 "ప్రభూ, దేవా, సర్వపరిపాలకా,
\q1 నీవి ఘన కార్యాలు, అద్భుతాలు.
\q1 సార్వభౌమా, నీ క్రియలు శక్తివంతమైనవి, ఆశ్చర్యమైనవి.
\q1 నీ విధానాలు న్యాయమైనవి, సత్యమైనవి.
\q1 స్వామీ, సమస్త మానవాళిపై నిత్యం రాజ్యం చేస్తున్న వాడివి నీవే.
\q1
\v 4 నువ్వు మాత్రమే పరిశుద్ధుడివి, నీకు భయపడనివారెవరు? నీ నామాన్ని కీర్తించనిదెవరు?
\q1 నీ న్యాయమైన తీర్పులు అందరికీ తెలిశాయి. కాబట్టి అన్ని జాతుల వారూ నీ సన్నిధికి వచ్చి నిన్ను పూజిస్తారు."
\s5
\p
\v 5 ఆ తరువాత నేను చూస్తున్నప్పుడు పరలోకంలో సాక్షపు గుడారం ఉన్న అతి పరిశుద్ధ మందిరం తెరుచుకుంది.
\v 6 అప్పుడు ఎదురు తిరిగిన వారిని శిక్షించడానికి ఏడు తెగుళ్ళు చేతిలో పట్టుకున్న ఏడుగురు దూతలు ఆ పరిశుద్ధ స్థలంలో నుండి బయటకు వచ్చారు. వారంతా పవిత్రమైన, ప్రకాశవంతమైన తెల్లటి నార బట్టలు వేసుకుని ఉన్నారు. రొమ్ముకు బంగారు వల్లెవాటు కట్టుకుని ఉన్నారు.
\s5
\p
\v 7 అప్పుడు ఆ నాలుగు ప్రాణుల్లో ఒకడు మద్యం నింపిన ఏడు బంగారు పాత్రలను ఆ ఏడుగురు దూతలకు ఇచ్చాడు. ఆ మద్యం తనను తిరస్కరించిన వాళ్ళ నిమిత్తం నిత్యం జీవించే దేవుడు అత్యాగ్రహంతో సిద్ధపరిచిన శిక్షకు గుర్తు.
\v 8 దేవుని దివ్య యశస్సు నుండీ, ప్రభావం నుండీ లేచిన పొగతో దేవాలయం నిండిపోయింది. ఆ ఏడుగురు దూతలు శిక్షార్హులను శిక్షించే ఏడు కీడులన్నీ పూర్తి అయ్యే వరకూ దేవాలయంలోకి ఎవరూ ప్రవేశించలేకపోయారు.
\s5
\c 16
\p
\v 1 దర్శనంలో ఒక పెద్ద స్వరం అతి పరిశుద్ధ స్థలంలో నుంచి, "మీరు వెళ్ళి ఏడు పాత్రల్లో నిండి ఉన్న దేవుని ఆగ్రహ మద్యం భూమి మీద కుమ్మరించండి. దేవుడు వారిపై అమిత క్రోధంతో ఉన్నాడు. ఆ మద్యం అక్కడి వారిని బాధిస్తుంది." అని ఆ ఏడుగురు దేవదూతలతో చెప్పడం విన్నాను.
\s5
\p
\v 2 అప్పుడు మొదటి దూత బయటకు వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరించాడు. దాని వల్ల ఆ క్రూరమృగానికి చెందిన ముద్ర వేసుకున్న వారికీ, వాడి ప్రతిమను పూజించే వారికీ ఒంటిపై బాధాకరమైన, వికారమైన కురుపు పుట్టింది.
\s5
\p
\v 3 రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరించాడు. సముద్రమంతా చచ్చిన మనిషి రక్తంలా మారిపోయింది. దాంతో సముద్రంలోని ప్రాణులన్నీ చచ్చాయి.
\s5
\p
\v 4 మూడవ దూత తన పాత్రను నదుల్లోనూ, నీటి ఊటల్లోనూ కుమ్మరించాడు. అప్పుడు ఆ నీళ్లన్నీ రక్తంగా మారాయి.
\v 5 అప్పుడు నీటి మీద అధికారం ఉన్న దూత దేవుడితో, "పూర్వముండి ప్రస్తుతమున్న దేవా, నిత్యుడా, పరిశుద్ధుడా, ప్రజలపై నీ తీర్పులు న్యాయ సమ్మతమైనవి.
\v 6 నీ పరిశుద్ధుల రక్తాన్నీ, ప్రవక్తల రక్తాన్నీ వారు ఒలికించారు. అందుకే నువ్వు వారికి తాగడానికి రక్తం ఇచ్చావు. ఈ విధమైన తీర్పు చెప్పావు గనక నువ్వు న్యాయవంతుడివి. దీనికి వారు అర్హులే" అని చెప్పాడు.
\p
\v 7 అప్పుడు బలిపీఠం నుండి ఒకడు, "అవును ప్రభూ, దేవా సర్వశక్తిశాలీ, నీ తీర్పులు సత్యమైనవి, న్యాయమైనవి" అనడం వినిపించింది.
\s5
\p
\v 8 నాలుగవ దూత తన పాత్రలో ఉన్న దానిని సూర్యుడిపై కుమ్మరించాడు. అప్పుడు సూర్య ప్రతాపం విపరీతంగా పెరిగిపోయింది. అలా మనుషుల్ని సూర్యుడి వేడితో మాడ్చివేయడానికి ఆ దూతకు అనుమతి వచ్చింది.
\v 9 మనుషులు తీవ్రమైన వేడికి మాడిపోయారు. అయితే ప్రజలు ఈ కీడులపై అధికారం కలిగిన దేవుని పేరును దూషించారే గానీ పశ్చాత్తాప పడడానికీ ఆయన్ని ఆరాధించడానికీ నిరాకరించారు.
\s5
\p
\v 10 అయిదవ దూత తన పాత్రలోనిది క్రూరమృగం సింహాసనం పైన కుమ్మరించాడు. అప్పుడు వాడి రాజ్యం అంతా చీకటి అలముకుంది. మనుషులు ఈ యాతనలకి తట్టుకోలేక నాలుకలు కరచుకున్నారు.
\v 11 అయితే తమకు కలిగిన వేదనలను బట్టీ, కురుపులను బట్టీ పరలోకంలో ఉన్న దేవుణ్ణి దూషించారే తప్ప తమ చెడు క్రియలు మాని పశ్చాత్తాప పడలేదు.
\s5
\p
\v 12 ఆరవ దూత తన పాత్రలో ఉన్న దానిని యూఫ్రటీసు అనే మహానదిపై కుమ్మరించాడు. దాంతో ఆ నది ఎండిపోయింది. తూర్పు దిక్కునున్న రాజులకు మార్గం సుగమం అయింది. వాళ్ళు తమ సైనికులతో దాడి చేయ గలిగారు.
\p
\v 13 అప్పుడు ఆ మహాసర్పం నోటినుండీ, క్రూరమృగం నోటినుండీ, అబద్ధ ప్రవక్త నోటినుండీ కప్పల్లా కనిపిస్తున్న మూడు అపవిత్రాత్మలు బయటకు రావడం చూశాను.
\v 14 అవి ఆశ్చర్యమైన సూచనలు జరిగించే దయ్యాల ఆత్మలే. శక్తిశాలి అయిన దేవుని మహాదినాన ఆయన తన శత్రువులను శిక్షించబోతున్నాడు. ఆ రోజు జరగబోయే యుద్ధానికి లోకంలో ఉన్న రాజులందర్నీ కూడగట్టడానికి వారి దగ్గరికి వెళ్తున్న ఆత్మలు అవి.
\s5
\p
\v 15 (యేసు ప్రభువు ఇలా అనడం నేను విన్నాను, "జాగ్రత్తగా వినండి! నేను దొంగలా మీరు ఊహించని సమయంలో రాబోతున్నాను. అప్రమత్తంగా ఉండి, సన్మార్గాన్ని అనుసరిస్తూ జీవిస్తున్న వారు సిగ్గుపడరు. వారి విషయంలో నేను సంతోషిస్తున్నాను. ఎలా అంటే పదిమందిలో బయటకు వెళ్ళినప్పుడు తన నగ్నత్వం కనిపించకుండా జాగ్రత్త పడి దుస్తులు ధరించే వాడు సిగ్గుపడాల్సిన అవసరం లేదు.")
\p
\v 16 ఆ అపవిత్రాత్మలు హీబ్రూ భాషలో హర్ మెగిద్దోన్ అనే పేరున్న స్థలానికి ఆ రాజులందర్నీ పోగు చేశారు.
\s5
\p
\v 17 ఏడవ దూత తన పాత్రలోనిది గాలిలో వెదజల్లాడు. అప్పుడు అతి పరిశుద్ధ స్థలం లోని సింహాసనం నుండి, "దేవుడు తనను ఎదిరించిన వారిని శిక్షించే సమయం ఇక అయిపోయింది" అని ఒకడు పెద్ద శబ్దంతో అనడం వినిపించింది.
\p
\v 18 దూత కుమ్మరించిన పాత్రలోనిది ఖాళీ అయిపోయిన వెంటనే భీకర శబ్దాలూ, మెరుపులూ, భారీ ఉరుములూ కలిగాయి. భయంకరమైన భూకంపం వచ్చింది. మనుషుల సృష్టి జరిగిన కాలం నుండి అలాంటి భూకంపం ఎన్నడూ కలగలేదు.
\v 19 ఆ కారణాన ప్రసిద్ధమైన ఆ మహా నగరం మూడు భాగాలుగా చీలిపోయింది. మిగిలిన దేశాల్లోని నగరాలన్నీ నాశనమయ్యాయి. అప్పుడు దేవుడు మహా బబులోను నగర ప్రజలు ఎంత పాపం చేశారో జ్ఞాపకం చేసుకున్నాడు. కోపంతో తన తీవ్ర ఆగ్రహం అనే మద్యంతో నిండిన పాత్రలోనిది ఆ నగర ప్రజలకు తాగడానికిచ్చాడు.
\s5
\v 20 భూకంపం వల్ల ప్రతి ద్వీపమూ అదృశ్యమైపోయింది. ప్రతి పర్వతం నేలమట్టమై పోయింది.
\v 21 ఆకాశం నుండి మనుషుల మీద సుమారు ముప్పై మూడు కిలోల బరువున్న భీకరమైన వడగళ్ళు పడ్డాయి. ఆ వడగళ్ళ దెబ్బ భయానకంగా ఉంది. కాబట్టి ఇంత ఘోరంగా తమను శిక్షిస్తున్నందుకు మనుషులు దేవుణ్ణి దూషించారు.
\s5
\c 17
\p
\v 1 ఏడు పాత్రలు చేతబట్టుకున్న ఏడుగురు దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో, "అనేక కాలువలున్న నగరానికి ప్రతినిధి అయిన మహావేశ్యకు కలిగే శిక్ష నీకు చూపిస్తాను రా.
\v 2 భూరాజులు ఆమెతో వ్యభిచారం చేశారు. భూమిపై నివసించే వారు ఆమె లైంగిక విశృంఖలత అనే మద్యాన్ని తాగి మత్తులో మునిగారు. అందరూ నీతిమాలి బతికారు" అన్నాడు.
\s5
\p
\v 3 అప్పుడు నేను దేవుని ఆత్మ స్వాధీనంలోకి వెళ్ళాను. ఒక దూత నన్ను అరణ్యంలోకి తీసుకు వెళ్ళాడు. అక్కడ నేను ఒక స్త్రీని చూశాను. ఆమె ఒక ఎర్రని మృగం మీద కూర్చుని ఉంది. ఆ మృగానికి ఏడు తలలూ పది కొమ్ములూ ఉన్నాయి. దాని ఒళ్ళంతా దేవ దూషణ పేర్లు రాసి ఉన్నాయి.
\v 4 ఆ స్త్రీ ఊదారంగు, ఎర్ర రంగు వస్త్రాలు కట్టుకుని ఉంది, బంగారంతో, రత్నాలతో, ముత్యాలతో అలంకరించుకుంది. ఆమె చేతిలో ఒక బంగారు పాత్ర ఉంది. ఆ పాత్రలో తాను చేస్తున్న అతి జుగుప్సాకరమైన పనులూ, లైంగిక అవినీతికి సంబంధించిన అపవిత్రకార్యాలూ ఉన్నాయి.
\v 5 ఆమె నుదుటి మీద ఆమె పేరు రాసి ఉంది. దానికో రహస్యమైన అర్థం ఉంది. "ఇది మహా బబులోను. భూమి మీద ఉన్న వేశ్యలందరికీ, ఏహ్యమైన వాటన్నిటికీ తల్లి."
\s5
\v 6 ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తాన్నీ, యేసు హతసాక్షుల రక్తాన్నీ తాగి మత్తెక్కి ఉండడం చూశాను. వారు యేసును గురించిన సత్యాన్ని ప్రకటించినందుకు హింసల పాలయ్యారు. ఆ స్త్రీని చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను.
\p
\v 7 అప్పుడు ఆ దూత నాతో ఇలా అన్నాడు, "నువ్వెందుకు ఆశ్చర్యపడ్డావు? ఈమెకు సంబంధించిన రహస్యాన్నీ ఏడు తలలూ పది కొమ్ములూ ఉండి ఈ స్త్రీని మోస్తున్న క్రూరమృగానికి సంబంధించిన రహస్యాన్నీ నీకు తెలుపుతాను.
\s5
\v 8 నువ్వు చూసిన ఆ మృగం పూర్వం ఉంది కానీ ఇప్పుడు జీవించి లేదు. కానీ అది లోతైన అగాధంలో నుండి పైకి రావడానికి సిద్ధంగా ఉంది. తరవాత అది దేవుని చేతిలో నాశనమైపోతుంది. ఒకప్పుడు ఉండి, ఇప్పుడు లేని, మున్ముందు రాబోయే మృగాన్ని చూసి భూమిమీద నివసించేవారు, అంటే సృష్టి ప్రారంభం నుండీ దేవుని జీవ గ్రంథంలో తమ పేర్లు లేని వారు ఆశ్చర్యపోతారు."
\s5
\p
\v 9 "దీనిని అర్ధం చేసుకోవడానికి జ్ఞానం కలిగిన మనసు అవసరం. ఆ స్త్రీ కూర్చున్న మృగానికి ఉన్న ఏడు తలలు, ఆ స్త్రీ ఏ నగరానికి ప్రతినిధిగా వుందో ఆ నగరం లోని ఏడు కొండలు. ఆ కొండలు కూడా ఏడుగురు రాజులను సూచిస్తూ వున్నాయి.
\v 10 వారిలో ఐదుగురు నాశనమయ్యారు. ప్రస్తుతం ఒకడున్నాడు. చివరి వాడు ఇంకా రాలేదు. వాడు వచ్చినప్పుడు కొంచెం కాలమే ఉంటాడు.
\s5
\v 11 ఒకప్పుడు ఉండి ఇప్పుడు లేనిది అయిన ఈ క్రూరమృగం ఆ ఏడుగురిలో ఒకడు. కానీ ఎనిమిదవ రాజు కూడా వాడే. నాశనానికి పోయేదీ వాడే.
\s5
\v 12 నీకు కనిపించిన ఆ పది కొమ్ములూ పదిమంది రాజులు. వారికి ఇంత వరకూ రాజ్యం లేదు. కానీ క్రూరమృగం ఏలేటప్పుడు వారు ఒక గంటసేపు రాజుల్లా అధికారం చెలాయిస్తారు.
\v 13 వీరికి ఒకే ఉద్దేశం ఉంటుంది. వీళ్ళు తమ శక్తినీ అధికారాన్నీ మృగానికి అంకితం చేస్తారు.
\v 14 వీళ్ళు గొర్రెపిల్లతో యుద్ధం చేస్తారు కానీ ఆయన వారిని ఓడిస్తాడు. ఎందుకంటే గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. ఆయనతో ఉన్నవారు పిలుపునందుకున్న వారు, ఎన్నిక అయినవారు, నమ్మకమైన వారు."
\s5
\p
\v 15 ఆ దూత ఇంకా నాతో ఇలా చెప్పాడు, "ఆ వేశ్య కూర్చున్న నగరంలో నువ్వు చూసిన జలాలు ప్రజలనూ, జన సమూహాలనూ, జాతులనూ, వివిధ భాషలు మాట్లాడే వారినీ సూచిస్తాయి.
\s5
\v 16 నువ్వు చూసిన పది కొమ్ములూ పదిమంది రాజులను సూచిస్తున్నాయి. వారూ, ఆ మృగమూ ఆ వేశ్యను ద్వేషించి, ఆ నగరంలోని సమస్తాన్నీ దోచుకుంటారు. ఆమె బట్టలూడదీసి దిక్కుమాలిన దాన్నిగా చేసినట్టు ఆ నగరానికి చేస్తారు. ఆమె శరీరాన్ని నాశనం చేసినట్టు ఆ నగరాన్ని మంటల్లో కాల్చివేస్తారు.
\v 17 దేవుని మాటలు నెరవేరే వరకూ వారు తమ హృదయాల్లో ఏకీభవించి తమ రాజ్యాన్ని ఆ మృగానికి అప్పగించడం ద్వారా తన సంకల్పం కొనసాగించేలా దేవుడు వారికి ఆ మనసు పుట్టించాడు.
\s5
\v 18 ఇక నువ్వు చూసిన ఆ వేశ్య భూమిపై రాజులను పరిపాలిస్తున్న మహా నగరమే."
\s5
\c 18
\p
\v 1 ఆ తరవాత పరలోకం నుండి మరో దూత దిగి రావడం చూశాను. అతనికి గొప్ప అధికారం ఉంది. అతనికున్న యశస్సు చేత భూమి అంతా ప్రకాశించింది.
\v 2 అతడు గొప్ప స్వరంతో బిగ్గరగా ఇలా అన్నాడు.
\q1 "బబులోను నాశనం కాబోతుంది.
\q1 దేవుడు బబులోనును పూర్తిగా నాశనం చేయబోతున్నాడు.
\q1 అందువల్ల అది దయ్యాలకు నివాసమైంది.
\q1 ప్రతి అపవిత్రాత్మకూ ఉనికిపట్టు అయింది.
\q1 అపవిత్రమూ అసహ్యమూ అయిన ప్రతి పక్షికీ గూడు అయింది.
\q1 బబులోను ఒక వేశ్య లాంటిది.
\q1
\v 3 ఎందుకంటే దైవాగ్రహాన్ని తెచ్చే దాని లైంగిక విశృంఖలతా మద్యాన్ని జనమంతా తాగి మత్తెక్కి పడిపోయారు.
\q1 భూమి మీద రాజులు ఆమెతో వ్యభిచారం చేశారు.
\q1 లోకంలో వ్యాపారులు ఆమె అధిక సుఖభోగాల వల్ల సంపన్నులయ్యారు."
\s5
\p
\v 4 తరువాత యేసు స్వరం పరలోకం నుండి ఇలా వినిపించింది. "నా ప్రజలారా, మీరు బబులోను పాపాల్లో భాగం పంచుకోకుండా, దానికి సంభవించబోయే ఏడు రకాల కీడుల్లో ఏదీ మీకు సంభవించకుండా దానిని విడిచి వచ్చెయ్యండి."
\q1
\v 5 దాని పాపాలు ఆకాశాన్నంటుతున్నాయి.
\q1 దేవుడు దాని నేరాలన్నిటినీ జ్ఞాపకం చేసుకున్నాడు.
\q1
\v 6 దేవుడు బబులోనును శిక్షించడానికి నియమించిన దూతలతో
\q1 అది చెల్లించిన ప్రకారం దానికి చెల్లించండి.
\q1 అది చేసిన దానికి రెట్టింపు చేయండి.
\q1 అది కలిపిన పాత్రలోనే దాని కోసం రెండొంతులు కలపండి.
\s5
\q1
\v 7 బబులోను ఒక స్త్రీ లాగా తనను తాను హెచ్చించుకుంది. విలాస భోగాల్లో జీవించింది.
\q1 అంతే మొత్తంలో దానికి హింసనూ, వేదననూ కలగజేయండి.
\q1 ఎందుకంటే అది తన మనసులో, "నేను రాణిగా కూర్చుండేదాన్ని, వితంతువును కాను.
\q1 సంతాపం చూడనే చూడను" అనుకుంది.
\p
\v 8 కాబట్టి ఆమెకి కీడులన్నీ ఒక్క రోజే కలుగుతాయి. మరణమూ, దుఖమూ, కరువూ వస్తాయి. దాంతో ఆ నగర ప్రజలు చస్తే మిగిలినవారు కుమిలిపోతారు. ఆహారం లేక ఆకలితో విల విల లాడిపోతారు. నగరం అగ్నికి ఆహుతైపోతుంది. ప్రభువైన దేవుడు మహా శక్తిశాలి. ఆమెకు తీర్పు చెప్పేది ఆయనే.
\s5
\p
\v 9 ఆమెతో అక్రమ లైంగిక సంబంధాలు పెట్టుకుని సుఖభోగాలు అనుభవించిన భూరాజులు అందరూ ఆమెకు కలుగుతున్న వేదననూ, ఆమె తగలబడి పోతుంటే వచ్చే పొగనూ చూస్తూ రోదిస్తారు.
\v 10 ఆమెను చుట్టుముట్టిన కీడు తమపై కూడా పడుతుందేమో అని అందరూ భయంతో దూరంగా నిలబడి,
\q1 "అయ్యో, అయ్యో, బబులోను మహానగరమా,
\q1 శక్తివంతమైన నగరమా, ఒక్క గంటలోనే నీ మీదికి శిక్ష వచ్చి పడిందా!" అంటూ ఏడుస్తారు.
\s5
\p
\v 11 లోకంలోని వ్యాపారులు కూడా ఆ నగరాన్ని చూసి శోకాలు పెడతారు. ఎందుకంటే, ఇక మీదట వారి వస్తువులు కొనేవారు ఎవ్వరూ ఉండరు.
\v 12 వారి సరుకులు ఏవంటే బంగారం, వెండి, రత్నాలు, ముత్యాలు, సన్నని నేత బట్టలు, ఊదారంగు బట్టలు, పట్టు బట్టలు, ఎర్రని బట్టలు. ఇంకా పరిమళాన్నిచ్చే విలువగల ప్రతి రకమైన కలప, దంతం, ప్రశస్తమైన చెక్క, ఇత్తడి, ఇనుము, చలువరాళ్ళూ మొదలైన వాటితో చేసిన ఎన్నో రకాల వస్తువులూ.
\v 13 దాల్చిన చెక్క, పెద్ద యాలుకలు, ధూపం కోసం వాడే వస్తువులూ, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షారసం, నూనె, మెత్తని పిండి. గోదుమలు, పశువులు, గొర్రెలు మొదలైనవి. ఇంకా గుర్రాలూ, రథాలూ, బానిసలూ, మనుషుల ప్రాణాలు.
\s5
\v 14 వారంతా "నీవు ఆశించినదంతా నిన్ను విడిచి పోయింది. నీ విలాసం, వైభోగం మాయమై పోయాయి. అవి ఇక కనపడవు" అని చెబుతూ ఏడుస్తారు.
\s5
\p
\v 15 ఆ నగరంలో తమ సరుకుతో వ్యాపారం చేసి సంపన్నులైన వ్యాపారులు ఆమె దుస్థితిని చూసి ఆ కీడు తమకెక్కడ చుట్టుకుంటుందోనని భయంతో దూరంగా నిలిచి అంగలారుస్తారు, రోదిస్తారు.
\v 16 "సన్నని నేత బట్టలు, ఊదారంగు, ఎర్రని బట్టలు కట్టుకుని బంగారంతో, రత్నాలతో, ముత్యాలతో అలంకరించుకున్న మహా నగరమా, అయ్యో, అయ్యో, అంత ఐశ్వర్యమూ ఒక్క గంటలోనే మాయమైపోయిందే!" అంటూ శోకాలు పెడతారు.
\p
\v 17 ప్రతి నౌకాధిపతి, సముద్ర యాత్రికులు, ఓడ నావికులు, ఇలా సముద్రం మీద ఆధారపడి బతికే వారంతా దూరంగా నిలబడి,
\s5
\v 18 తగలబడి పోతున్న నగరాన్ని, అందులో రాజుకున్న పొగను చూసి, "ఈ నగరానికి సమానమైనదేది?" అంటూ కేకలు పెడతారు.
\v 19 తమ తలల మీద దుమ్ము చల్లుకుని ఏడుస్తూ రోదిస్తూ, "అయ్యో, అయ్యో, మహా నగరమా! సొంత నౌకలు ఉన్న వారంతా ఈ నగరంలోని సంపద వల్ల ధనవంతులయ్యారు. అలాంటిది దేవుని చేతిలో ఒక్క గంటలోనే ఇది ఇలా నామరూపాలు లేకుండా మట్టిపాలై పోయిందే" అంటారు.
\p
\v 20 ఆ తరువాత పరలోకం నుండి ఒక స్వరం "పరలోకమా, పరిశుద్ధులారా, అపొస్తలులారా, ప్రవక్తలారా, ఆమెను గురించి సంతోషించండి. ఎందుకంటే మీరు దేవుని వారు. అది మిమ్మల్ని అత్యంత క్రూరంగా శిక్షించిన దానికి ప్రతిగా దేవుడు ఆమెను శిక్షించాడు."
\s5
\v 21 ఆ తరువాత బలవంతుడైన ఒక దూత పెద్ద తిరగలి రాయి వంటి రాయి ఎత్తి సముద్రంలో పడవేసి ఇలా అన్నాడు, "బబులోను ప్రజలారా, మీ మహా నగరమైన బబులోను కూడా ఇలాగే హింసల పాలై కూలిపోతుంది. ఇక అది ఎన్నటికీ కనిపించదు.
\v 22 కాబట్టి వీణల శబ్దాలూ, గాయకుల పాటలూ, పిల్లనగ్రోవి, బూరలు ఊదేవారి శబ్దాలూ ఇక ఎన్నటికీ నీ దగ్గర వినిపించవు. ఎలాంటి శిల్పమైనా చెక్కే శిల్పి ఎవరూ నీ దగ్గర ఇక కనపడడు. గానుగల శబ్దాలు ఇక ఎప్పటికీ నీ దగ్గర వినపడవు.
\s5
\v 23 దీపం వెలుతురు నీలో ఇక కనిపించదు. పెళ్ళి కొడుకు స్వరం, పెళ్ళి కూతురు స్వరం ఇక ఎన్నటికీ నీలో వినపడవు. ఎందుకంటే నీ వర్తకులు ప్రపంచంలో ఘనులు. దేశాలన్నీ నీ మాయలో పడి మోసపోయాయి.
\v 24 ఇంకా ప్రవక్తల రక్తం, హతసాక్షుల రక్తం, భూమిపై హతమైన ప్రతివారి రక్తం నీలో కనిపిస్తూ ఉంది."
\s5
\c 19
\p
\v 1 ఈ విషయాలు జరిగిన తరువాత జన సముదాయాలు ఘోష పెడుతున్నట్టు పెద్ద ధ్వనులు పరలోకంలో నుండి నాకు వినిపించాయి.
\q1 "హల్లెలూయ! రక్షణ, యశస్సు,
\q1 బల ప్రభావాలు మన దేవునివే.
\q1 ఆయన మనల్ని కాపాడాడు.
\q1
\v 2 ఆయన తీర్పులు సత్యంగా న్యాయంగా ఉన్నాయి.
\q1 తన లైంగిక అవినీతితో భూలోకాన్ని భ్రష్టత్వంలోకి నెట్టిన
\q1 మహా వేశ్యను ఆయన శిక్షించాడు.
\q1 ఆమె ఒలికించిన తన సేవకుల రక్తానికి ఆయన ప్రతికారం తీర్చాడు, స్తుతించండి."
\s5
\p
\v 3 రెండోసారి వారంతా, "హల్లెలూయా! ఆ నగరం నుండి పొగ కలకాలం పైకి లేస్తూనే ఉంటుంది" అన్నారు.
\q1
\v 4 అప్పుడు ఆ ఇరవై నలుగురు పెద్దలూ ఆ నాలుగు ప్రాణులూ సాష్టాంగపడి
\q1 సింహాసనంపై కూర్చున్న దేవునికి,
\q1 "ఆమెన్, హల్లెలూయ! ఇది సత్యం" అని చెబుతూ ఆయనను పూజించారు.
\s5
\p
\v 5 అప్పుడు, "దేవుని దాసులు, ఆయనంటే భయ భక్తులు కలవారు,
\q1 గొప్పవారైనా అనామకులైనా అందరూ మన దేవుణ్ణి స్తుతించండి" అంటూ ఒక స్వరం సింహాసనం నుండి వినిపించింది.
\s5
\p
\v 6 తరువాత అనేకమంది మాట్లాడుతున్నట్టు, అనేక జలపాతాల గర్జనలా, బలమైన ఉరుముల ధ్వనిలా ఒక స్వరం ఇలా వినిపించింది.
\q1 "హల్లెలూయ! సర్వ శక్తిశాలి,
\q1 మన ప్రభువైన దేవుడు పరిపాలిస్తున్నాడు."
\s5
\p
\v 7 "గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చింది.
\q1 పెండ్లికుమార్తె సిద్ధపడి ఉంది.
\q1 కాబట్టి మనం సంతోషించి ఆనందించుదాం.
\q1 ఆయనకు మహిమ ఆపాదించుదాం."
\p
\v 8 ఆమె ధరించుకోడానికి మెరిసిపోయే, ప్రశస్తమైన శ్రేష్ఠవస్త్రాలు ఇచ్చారు. ఈ వస్త్రాలు పరిశుద్ధుల నీతి కార్యాలు.
\s5
\v 9 అప్పుడు ఆ దూత నాతో ఇలా అన్నాడు, "గొర్రెపిల్ల పెళ్ళి విందుకు ఆహ్వానం అందినవారు ధన్యులు అని వ్రాయి." అతడే ఇంకా, "ఇవి నిజంగా దేవుని మాటలు" అన్నాడు.
\v 10 అందుకు నేను అతణ్ణి పూజించడానికి అతని ముందు సాష్టాంగపడబోయాను. కానీ అతడు, "అలా చేయకు. యేసుకు సాక్షులుగా ఉన్న నీకూ నీ సోదరులకూ నేను దాసుణ్ణి మాత్రమే. దేవుడికి మాత్రమే నువ్వు నమస్కరించాలి. ఆయనే నీకు శక్తినిచ్చి, యేసును గురించి సాక్ష్యం చెప్పడానికి నిన్ను నిలబెట్టాడు" అన్నాడు.
\s5
\p
\v 11 తరువాత పరలోకం తెరుచుకోవడం చూశాను. అక్కడ తెల్లని గుర్రం ఒకదాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. దానిమీద కూర్చున్న వ్యక్తి పేరు "నమ్మకమైన వాడు, సత్యవంతుడు." ఆయన ప్రతివారికీ న్యాయ తీర్పులు వినిపిస్తూ, శత్రువులపై యుద్ధం చేస్తాడు.
\v 12 ఆయన నేత్రాలు అగ్నిజ్వాలల్లా ఉన్నాయి. ఆయన తలపై అనేక కిరీటాలున్నాయి. ఆయనపై ఒక పేరు రాసి ఉంది. దాని అర్ధం ఆయనకు తప్ప వేరెవరికీ తెలియదు.
\v 13 ఆయన ధరించిన దుస్తులు రక్తంలో ముంచి తీసినవి. "దేవుని వాక్కు" అనే పేరు కూడా ఆయనకుంది.
\s5
\v 14 ఆయన వెనకే పరలోక సేనలు తెల్లని నార బట్టలు వేసుకుని తెల్ల గుర్రాలపై ఎక్కి వెళ్తున్నారు.
\v 15 తనను తిరస్కరిస్తున్న వివిధ జాతి ప్రజలను దండించడానికి ఆయన నోటి నుండి పదునైన కత్తి బయటకు వస్తూ ఉంది. ఆయన ఇనుప దండంతో వారిని పరిపాలిస్తాడు. తన శత్రువులను ద్రాక్షల్ని గానుగల తొట్టిలో పడేసి తొక్కినట్టు ఆయనే తొక్కుతాడు. అది సర్వాధికారి అయిన దేవుని తీక్షణమైన ఆగ్రహం.
\v 16 ఆయన తొడ మీదుగా వున్నా బట్టల మీద "రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు" అనే పేరు రాసి ఉంది.
\s5
\p
\v 17 అప్పుడు ఒక దూత సూర్యబింబంలో నిలబడి ఉండడం నేను చూశాను. అతడు బిగ్గరగా కేక వేసి మాంసాహార పక్షుల్ని పిలిచాడు, "రండి, దేవుడు ఏర్పాటు చేసిన మహా విందును ఆరగించండి.
\v 18 రాజుల మాంసం, సైన్యాధిపతుల మాంసం, బలవంతుల మాంసం, గుర్రాల మాంసం, వాటిపై స్వారీ చేసేవారి మాంసం, స్వతంత్రులూ, బానిసలూ, పలుకుబడి లేనివారూ, గొప్పవారూ అయిన మనుషులందరి మాంసం, దేవుని శత్రువుల మాంసం వచ్చి తినండి" అన్నాడు.
\s5
\p
\v 19 క్రూరమృగం, భూమి మీదనున్న రాజులందరూ తమ సైన్యాలతో వ్యూహం తీరి ఉండడం నేను చూశాను. వారు ఆ గుర్రం మీద కూర్చున్న వ్యక్తితోనూ ఆయన సైన్యంతోనూ యుద్ధం చేయడానికి సిద్ధం అవుతున్నారు.
\v 20 అప్పుడు ఆ మృగమూ, వాడి ముందు అద్భుతాలు చేసిన అబద్ధ ప్రవక్తా తెల్ల గుర్రమెక్కి వస్తున్న వ్యక్తికి పట్టుబడ్డారు. అద్భుతాలతోనే వీడు మృగం ముద్ర వేయించుకున్న వారిని, ఆ విగ్రహాన్ని పూజించిన వారిని మోసం చేస్తూ వచ్చాడు. అప్పుడు దేవుడు ఈ ఇద్దరినీ గంధకంతో మండుతున్న అగ్ని సరస్సులో ప్రాణాలతోనే పడవేశారు.
\s5
\v 21 మిగిలిన వారు గుర్రం మీద కూర్చున్న వ్యక్తి నోటి నుండి వస్తున్న కత్తివాత పడి చచ్చిపోయారు. వారి మాంసాన్ని పక్షులు కడుపారా ఆరగించాయి.
\s5
\c 20
\p
\v 1 తరువాత ఒక దేవదూత పరలోకం నుండి దిగి రావడం చూశాను. అతని దగ్గర అగాధానికి వేసిన తాళం చెవి వుంది. అతని చేతిలో ఒక పెద్ద గొలుసు ఉంది.
\v 2 అతడు అపవాది, సాతాను అనే పేర్లున్న ఆది సర్పం. ఆ మహా సర్పాన్ని చేతిలో ఉన్న గొలుసుతో బంధించి వెయ్యి సంవత్సరాల వరకూ అగాధంలో పడవేశాడు.
\v 3 వాణ్ణి ఆ చీకటి అగాధంలో పడవేసి, దాన్ని మూసివేసి దానికి ముద్ర వేశాడు. ఆ వెయ్యి సంవత్సరాలయ్యే వరకూ ప్రజలను మోసం చేయకుండా వాడు అగాధంలోనే బందీగా ఉండాలి. ఆ తరువాత కొద్ది సమయం వాణ్ణి దేవుని ప్రణాళిక చొప్పున వదిలిపెట్టాలి.
\s5
\p
\v 4 అప్పుడు సింహాసనాలూ, వాటిపై కూర్చున్న వారినీ చూశాను. దేవుడు ఆ కూర్చున్న వారికి తీర్పు చెప్పే అధికారం ఇచ్చాడు. యేసును గురించి సాక్ష్యం చెప్పినందుకూ, దేవుని వాక్కును ప్రకటన చేసినందుకూ శిరచ్చేదనానికి గురి అయిన భక్తుల ఆత్మలు కూడా చూశాను. వారు క్రూర మృగాన్ని గానీ, వాడి విగ్రహాన్ని గానీ పూజించలేదు. వారి నుదుటి మీద గానీ చేతి మీద గానీ ముద్ర వేయనీయలేదు. వారు సజీవులై క్రీస్తుతో కలిసి ఈ వెయ్యేళ్ళు పరిపాలించారు.
\s5
\v 5 ఇదే మొదటి పునరుత్థానం. ఆ వెయ్యి సంవత్సరాలు ముగిసే వరకూ చనిపోయిన మిగిలిన వారు సజీవులు కాలేదు.
\v 6 ఈ మొదటి పునరుత్థానంలో పాల్గొన్నవారు పరిశుద్ధులు, దీవెన పొందిన వారు. వీళ్ళపై రెండవ మరణానికి అధికారం లేదు. వీరు దేవునికీ, క్రీస్తుకీ యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరాలు పరిపాలన చేస్తారు.
\s5
\p
\v 7 వెయ్యి సంవత్సరాలు ముగిశాక సాతాను తన చెరలో నుండి విడుదల అవుతాడు.
\v 8 వాడు బయల్దేరి భూమి నాలుగు దిక్కుల్లో యెహెజ్కేలు ప్రవక్త చెప్పిన గోగు, మాగోగులను మోసం చేసి, లెక్కకు సముద్రపు ఇసుకలాగా ఉన్న వారిని దేవుని ప్రజలమీద యుద్ధానికై సమకూరుస్తాడు.
\s5
\v 9 వారు అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమూ, దేవుని ప్రియ పట్టణమూ అయిన యెరుషలేమును ముట్టడి వేస్తారు. అప్పుడు పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించి వేస్తుంది.
\v 10 వారిని మోసం చేసిన అపవాదిని దేవుడు గంధకంతో మండుతున్న అగ్ని సరస్సులో పడవేస్తాడు. అక్కడే క్రూర మృగమూ, అబద్ధ ప్రవక్తా ఉన్నారు. వారు రాత్రీ పగలూ కలకాలం బాధల పాలవుతారు.
\s5
\p
\v 11 తరవాత తెల్లని సింహాసనాన్నీ దానిపై కూర్చున్న వాడినీ చూశాను. భీతి గొలిపేలా ఉన్న ఆయన సన్నిధి నుండి భూమీ ఆకాశాలూ పారిపోయాయి. అవి ఇక కనపడలేదు.
\v 12 చనిపోయిన వారు అధికులైనా, అల్పులైనా ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండడం చూశాను. అప్పుడు ప్రజలందరి క్రియలు లిఖించిన గ్రంథాలు తెరిచారు. మరో గ్రంథాన్ని కూడా తెరిచారు. అది జీవ గ్రంథం. ఈ గ్రంథం లో నిత్య జీవాన్ని పొందిన వారి పేర్లన్నీ దేవుడు రాశాడు. ఆ గ్రంథాల్లో చనిపోయి ఇప్పుడు తిరిగి లేచిన వారు తమ కార్యాలను గురించి రాసి ఉన్న దాన్ని బట్టి తీర్పు పొందారు.
\s5
\v 13 సముద్రం తనలో చనిపోయిన వారు తిరిగి లేవగా దేవుని సింహాసనం ఎదుట నిలబడడానికి అప్పగించింది. భూమి దాని వశంలో ఉన్న చనిపోయిన వారిని అప్పగించింది. వారంతా తమ కార్యాలను బట్టి తీర్పు పొందారు.
\v 14 అవిశ్వాసులందరూ చనిపోయాక తామున్న స్థలాలు వదిలి లేవగా వారందర్నీ ప్రచండమైన వేడిమిగల అగ్ని సరస్సులో పడవేయడం జరిగింది. ఈ అగ్ని సరస్సే రెండవ మరణం.
\v 15 జీవ గ్రంథంలో పేరు లేని ప్రతివాణ్ణి దేవుడు అగ్ని సరస్సులో పడేశాడు.
\s5
\c 21
\p
\v 1 అప్పుడు నేను కొత్త ఆకాశాన్నీ, కొత్త భూమినీ చూశాను. మొదటి ఆకాశం, మొదటి భూమీ అంతర్థానం అయ్యాయి. సముద్రం అనేది ఇక లేదు.
\v 2 అప్పుడు నేను కొత్త యెరూషలేము అనే దేవుని పరిశుద్ధ పట్టణం తన భర్త కోసం అలంకరించుకున్న కొత్త పెళ్ళికూతురిలా తయారై పరలోకంలో ఉన్న దేవుని దగ్గర నుండి దిగి రావడం చూశాను.
\s5
\v 3 అప్పుడు పరలోకంలో దేవుని సింహాసనం నుండి ఒక గొప్ప స్వరం, "వినండి, దేవుని నివాసం మనుషులతో ఉంది. ఆయన వారితో కలసి జీవిస్తాడు. వారు ఆయన ప్రజలై ఉంటారు. దేవుడు తానే వారితో ఉంటాడు. వారికి దేవుడై ఉంటాడు.
\v 4 ఆయన వారి కన్నుల నుండి ప్రతి కన్నీటి బొట్టునూ తుడుస్తాడు. దుఃఖం మరి లేకుండా చేస్తాడు. ఇక మరణం గానీ, వేదన గానీ, ఏడుపు గానీ బాధ గానీ ఉండవు. మొదటి సంగతులు గతించి పోయాయి" అని చెబుతుండగా విన్నాను.
\s5
\p
\v 5 అప్పుడు సింహాసనంపై కూర్చున్న ఆయన, "చూడండి, అన్నిటినీ కొత్తవిగా చేస్తున్నాను” అన్నాడు, "ఈ మాటలు సత్యమైనవీ, నమ్మదగినవీ. నేను వీటిని నెరవేరుస్తాను కాబట్టి వ్రాయి” అని నాతో అన్నాడు
\v 6 ఆయన ఇంకా నాతో ఇలా అన్నాడు, "అన్నిటినీ సమాప్తం చేశాను. ఆల్ఫా నేనే, ఒమేగా నేనే. అంటే ఆదీ నేనే అంతమూ నేనే. దప్పిగొన్న ప్రతి వాడికి నిత్య జీవ జలాల ఊట నీరు ఉచితంగా ఇచ్చి దాహార్తి తీరుస్తాను. వారికిక మరణం లేదు.
\s5
\v 7 సాతానుపై విజయం సాధించిన ప్రతి వాడు వీటిని పొందుతాడు. నేను అతనికి దేవుడిగా ఉంటాను. అతడు నాకు కుమారుడిగా ఉంటాడు.
\v 8 అయితే పిరికివారూ, అవిశ్వాసులూ, అసహ్యులూ, నరహంతకులూ, వ్యభిచారులూ, మాంత్రికులూ, విగ్రహారాధకులూ, అబద్ధికులందరూ అగ్ని గంధకాలతో మండే సరస్సులో పడతారు. ఇది రెండవ మరణం."
\s5
\p
\v 9 అప్పుడు ఆ చివరి ఏడు కీడులతో నిండిన ఏడు పాత్రలను పట్టుకుని ఉన్న ఏడుగురు దేవదూతల్లో ఒకడు నా దగ్గరికి వచ్చాడు. "ఇలా రా, నిత్యం గొర్రె పిల్లతో కలిసి జీవించబోతున్న నూతన వధువును అంటే గొర్రె పిల్ల భార్యను నీకు చూపిస్తాను" అన్నాడు.
\p
\v 10 అత్మావేశుడనై ఉన్న నన్ను దేవదూత ఎత్తైన గొప్ప పర్వతం పైకి తీసుకు వెళ్ళాడు. అక్కడ యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం పరలోకంలోని దేవుని దగ్గర నుండి రావడం నాకు చూపించాడు.
\s5
\v 11 యెరూషలేము దేవుని మహిమలో విరాజిల్లుతున్నది. అది ప్రశస్తమైన సూర్యకాంతం రాయిలా స్ఫటికంలా ధగ ధగా మెరుస్తూ ఉంది.
\v 12 ఆ పట్టణానికి ఎత్తయిన ప్రహరీ గోడా, ఆ గోడకు పన్నెండు ద్వారాలూ ఉన్నాయి. ప్రతి ద్వారం దగ్గరా పన్నెండు మంది దేవదూతలున్నారు. ఇశ్రాయేలు వారి పన్నెండు గోత్రాల పేర్లూ ఆ ద్వారాలపై రాసి ఉన్నాయి.
\v 13 తూర్పున మూడు ద్వారాలూ, ఉత్తరాన మూడు ద్వారాలూ, దక్షిణాన మూడు ద్వారాలూ, పశ్చిమాన మూడు ద్వారాలూ ఉన్నాయి.
\s5
\v 14 ఆ పట్టణపు ప్రహరీ గోడకు పన్నెండు పునాదులున్నాయి. ఆ పునాదులపై పన్నెండు మంది గొర్రెపిల్ల నియోగించిన అపొస్తలుల పేర్లు కనిపిస్తున్నాయి.
\v 15 నాతో మాట్లాడే దూత దగ్గర ఆ పట్టణాన్నీ, దాని ద్వారాలనూ, ప్రహరీ గోడనూ కొలవడానికి ఒక బంగారు కొలబద్ద ఉంది.
\s5
\v 16 ఆ పట్టణం చతురస్రాకారంగా ఉంది. దాని పొడవు దాని వెడల్పుతో సమానం. అతడు ఆ కొలబద్దతో పట్టణాన్ని కొలిస్తే దాని కొలత సుమారు రెండు వేల రెండు వందల కిలో మీటర్లు ఉంది. దాని పొడవూ, వెడల్పూ, ఎత్తూ అన్నీ సమానమే.
\v 17 తరువాత అతడు ప్రహరీ గోడను కొలిచాడు. అది మనుషుల లెక్క ప్రకారం నూట నలభై నాలుగు మూరలుంది.
\s5
\p
\v 18 ఆ పట్టణపు ప్రహరీ గోడను సూర్యకాంత మణులతో కట్టారు. పట్టణం చూస్తే నిర్మలమైన స్ఫటికం లాంటి మేలిమి బంగారంతో కట్టి ఉంది.
\v 19 ఆ పట్టణపు ప్రహరీ గోడ పునాదులు ప్రశస్తమైన రకరకాల విలువైన రాళ్ళతో అలంకరించారు. మొదటి పునాది సూర్యకాంతం, రెండవది ఇంద్ర నీలం, మూడోది యమునారాయి, నాలుగోది పచ్చ,
\v 20 అయిదోది వైఢూర్యం, ఆరోది కెంపు, ఏడోది సువర్ణ రత్నం, ఎనిమిదోది గోమేధికం, తొమ్మిదోది పుష్యరాగం, పదోది సువర్ణలశునీయం, పదకొండోది పద్మరాగం, పన్నెండోది పద్మరాగమణి.
\s5
\v 21 దాని పన్నెండు ద్వారాలూ పన్నెండు ముత్యాలు. ఒక్కో ద్వారాన్నీ ఒక్కో ముత్యంతో కట్టారు. పట్టణపు రాజవీధి స్వచ్ఛమైన స్ఫటికం లాంటి మేలిమి బంగారం.
\p
\v 22 అక్కడ ఎలాంటి దేవాలయమూ నాకు కనిపించలేదు. ఎందుకంటే సర్వశక్తిశాలి, ప్రభువు అయిన దేవుడూ, గొర్రెపిల్లా దానికి దేవాలయంగా ఉన్నారు.
\s5
\v 23 ఆ పట్టణంలో వెలుగివ్వడానికి సూర్యుడూ చంద్రుడూ అక్కరలేదు. దేవుని దివ్యతేజస్సు అక్కడ ప్రకాశిస్తూ ఉంటుంది. గొర్రెపిల్ల దాని దీపం.
\v 24 వివిధ జాతి ప్రజలు ఆ వెలుగులో జీవిస్తారు. భూరాజులు తమ వైభవాన్ని దానిలోకి తెస్తారు.
\v 25 సాయంత్రం వేళ దాని ద్వారాలు మూయరు. ఎందుకంటే అక్కడ రాత్రి లేదు.
\s5
\v 26 ప్రపంచంలోని వివిధ జాతి ప్రజలు తమ వైభవాన్నీ గౌరవాన్నీ దానిలోకి తెస్తారు.
\v 27 పవిత్రం కానిదేదీ దానిలో ప్రవేశించదు. అవమానకరమైన దానినీ, మోసకరమైన దానినీ చేసిన వారు దానిలో కచ్చితంగా ప్రవేశించరు. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేర్లున్న వారు మాత్రమే దానిలో ప్రవేశిస్తారు.
\s5
\c 22
\p
\v 1 అప్పుడు జీవజల నదిని ఆ దూత నాకు చూపించాడు. అది స్ఫటికంలా నిర్మలంగా మెరుస్తూ ఉంది. అది దేవునిదీ గొర్రెపిల్లదీ అయిన సింహాసనం నుండీ,
\v 2 ఆ పట్టణం ప్రధాన వీధి మధ్యలో నుండి ప్రవహిస్తుంది. ఆ నదికి రెండు పక్కలా జీవ వృక్షం ఉంది. దాని ఫలాలు నిత్య జీవాన్ని ఇస్తాయి. అది నెల నెలా ఫలిస్తూ, ఏడాదికి పన్నెండు కాపులు కాస్తుంది. ఆ చెట్టు ఆకులు జనాల స్వస్థత కోసం ఉపయోగపడతాయి.
\s5
\v 3 అక్కడ ఇక శాపం అనేది ఉండదు. దేవునిదీ గొర్రెపిల్లదీ అయిన సింహాసనం అక్కడ ఉంటుంది. ఆయన సేవకులు ఆయనను ఆరాధిస్తూ సేవ చేస్తారు.
\v 4 ఆయన్ని ముఖా ముఖిగా చూస్తారు. ఆయన పేరు వారి నొసళ్ళపై ఉంటుంది.
\v 5 రాత్రి ఇక ఎప్పటికీ కలగదు. దీపాల కాంతీ, సూర్యుడి వెలుగూ వారికి అక్కర లేదు. దేవుడైన ప్రభువే వెలుగై వారిమీద ప్రకాశిస్తూ ఉంటాడు. వారు కలకాలం పరిపాలిస్తారు.
\s5
\p
\v 6 ఆ దూత నాతో ఇలా చెప్పాడు, "ఈ మాటలు నమ్మదగ్గవి, సత్యమైనవి. ప్రవక్తల ఆత్మలకు ప్రభువైన దేవుడు త్వరలో జరగాల్సిన వాటిని తన దాసులకు చూపించడానికి తన దూతను పంపాడు."
\p
\v 7 యేసు తన వారితో మాట్లాడుతూ "చూడండి! నేను త్వరగా వస్తున్నాను. ఈ పుస్తకంలోని ప్రవచనవాక్కులన్నిటినీ విశ్వాసంతో స్వీకరించేవాడు ధన్యుడు” అన్నాడు.
\s5
\v 8 యోహాను అనే నేను ఈ సంగతులన్నీ విన్నాను, చూశాను. అలా నేను వింటూ చూస్తూ ఉన్నప్పుడు వాటిని నాకు చూపిస్తున్న దూతను పూజించడానికి అతని ఎదుట సాష్టాంగపడ్డాను.
\v 9 అప్పుడు అతడు, "నాకు సాగిల పడకు. నేను కూడా నీలాటి దైవ సేవకుడినే. ప్రవక్తలకూ, ఈ పుస్తకంలోని దేవుని మాటలను విధేయతతో పాటించే వారందరికీ నీ సాటి విశ్వాసులకూ నీ తోటి సేవకుణ్ణి. దేవుణ్ణి పూజించు” అని చెప్పాడు.
\s5
\p
\v 10 అతడు నాతో ఇంకా ఇలా చెప్పాడు, "ఈ పుస్తకంలో ఉన్న ప్రవచన వాక్కులను రహస్యంగా దాచి పెట్టవద్దు. ఎందుకంటే అవి నెరవేరే సమయం దగ్గర పడింది.
\v 11 అన్యాయం చేసేవాణ్ణి అన్యాయం చేస్తూనే ఉండనియ్యి. అపవిత్రుణ్ణి ఇంకా అపవిత్రుడిగానే ఉండనియ్యి. వారికి ముట్టవలసిన జీతం వారికి దేవుడు త్వరలోనే ముట్టచెబుతాడు. నీతిమంతుణ్ణి ఇంకా నీతిమంతుడిగానే ఉండనియ్యి. పరిశుద్ధుణ్ణి ఇంకా పరిశుద్ధుడిగానే కొనసాగనియ్యి."
\s5
\v 12 యేసు అందరితో ఇలా చెప్పారు, "చూడండి, నేను త్వరగా వస్తున్నాను. ప్రతి వ్యక్తికీ తాను చేసిన పనుల ప్రకారం నేనివ్వబోయే ప్రతిఫలం నా దగ్గర ఉంది.
\v 13 ఆల్ఫా, ఓమెగా నేనే. మొదటి వాణ్ణి, చివరి వాణ్ణి నేనే. ఆరంభాన్నీ ముగింపునీ నేనే."
\s5
\v 14 జీవ వృక్ష ఫలాన్ని ఆరగించడానికీ, ఆ పట్టణ ద్వారాల నుండి లోపలికి ప్రవేశించడానికీ యోగ్యత పొందాలని తమ వస్త్రాలను ఉతుక్కునే వారు దీవెన పొందిన వారు. అలాంటి వారు దేవునికి బహు ఇష్టులు.
\p
\v 15 కుక్కలూ, మాంత్రికులూ, వ్యభిచారులూ, హంతకులూ, విగ్రహ పూజ చేసేవారూ, అబద్ధాన్ని ప్రేమించి అభ్యాసం చేసేవారూ పట్టణం బయట ఉంటారు. వారెప్పటికీ ఈ పట్టణంలో ప్రవేశించలేరు.
\s5
\v 16 యేసు అనే నేను సంఘాలకు చెప్పడం కోసం ఈ విషయాలను మీకు తెలియజేయడానికి నా దూతను పంపించాను. నేనే దావీదు వేరునూ, దావీదు సంతానాన్నీ, ప్రకాశవంతమైన వేకువ నక్షత్రాన్నీ."
\s5
\v 17 క్రీస్తుతో పెళ్ళికి సిద్ధపడినట్టు ఉన్నఆయన స్వజనం, దేవుని ఆత్మా కలిసి విశ్వాసం ఉంచడానికి ఇష్టపడిన ప్రతి ఒక్కరితో ఆత్మా, పెళ్ళికూతురూ "రండి" అని చెబుతున్నారు. వింటున్నవాడూ, "రండి" అని చెప్పాలి. దాహం వేసిన వాడు రావాలి. ఇష్టమున్న వ్యక్తి జీవ జలాన్ని ఉచితంగా తీసుకోవచ్చు.
\s5
\v 18 ఈ పుస్తకంలోని ప్రవచనవాక్కులను వినే ప్రతి వ్యక్తినీ నేను హెచ్చరించేది ఏమిటంటే ఎవడైనా వీటిలో ఏదైనా కలిపితే దేవుడు ఈ పుస్తకంలో రాసి ఉన్న కీడులన్నీ వాడికి కలగజేస్తాను.
\v 19 ఎవడైనా దేనినైనా తీసి వేస్తే దేవుడు ఈ పుస్తకంలో వివరించిన జీవవృక్షంలోనూ, పరిశుద్ధ పట్టణంలోనూ వాడికి భాగం లేకుండా చేస్తాడు.
\s5
\v 20 ఈ సంగతులను గురించి సాక్షమిస్తున్న వాడు అంటున్నాడు.
\p "అవును, త్వరగా వస్తున్నాను."
\p ఆమేన్‌! ప్రభు యేసూ, త్వరగా రా.
\v 21 ప్రభు యేసు కృప పరిశుద్ధులందరికీ నిత్యమూ తోడై ఉండు గాక. ఆమేన్‌.