STR_te_iev/62-2PE.usfm

124 lines
26 KiB
Plaintext

\id 2PE - Indian Easy Version (IEV) Telugu
\ide UTF-8
\h పేతురు రాసిన రెండవ పత్రిక
\toc1 పేతురు రాసిన రెండవ పత్రిక
\toc2 పేతురు రాసిన రెండవ పత్రిక
\toc3 2pe
\mt1 పేతురు రాసిన రెండవ పత్రిక
\s5
\c 1
\p
\v 1 సీమోను పేతురు అనే నేను మీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. యేసుక్రీస్తు తన సేవకుడనైన నన్ను అపొస్తలుడుగా నియమించుకున్నాడు. క్రీస్తు అపొస్తలులమైన మాతో సమానంగా ఆయనలో విశ్వాసముంచిన కారణంగా మీ అందరి కోసం ఈ ఉత్తరం పంపుతున్నాను. క్రీస్తులో విశ్వాసం విషయంలో మేమూ, మీరూ ఒకే స్థాయిలో ఉన్నాము. మనం సేవించే దేవుడు నీతిమంతుడు. ఆయనే మన రక్షకుడు. ప్రభువైన యేసులో నమ్మకముంచిన మీ అందరికి కృప కలగాలని కోరుకుంటున్నాను.
\v 2 దేవుడు మీకు కృపను, శాంతిని కలుగచేయాలని ప్రార్ధిస్తున్నాను, ఎందుకంటే మీరు దేవుడు ప్రభువైన యేసును నిజంగా తెలుసుకున్నారు.
\s5
\p
\v 3 మనం నిత్యజీవంతో ఆయన్ని ఘనపరిచేలా దేవుడు మనకి సమస్తమూ దయచేశాడు. దేవునిగా ఆయన శక్తితో ఇదంతా చేశాడు. మనం ఆయనను తెలుసుకున్నదానికి ఫలితంగా మనకి ఇదంతా దయచేశాడు. మన దేవుడు మంచివాడు, శక్తివంతుడు గనుక మనల్ని తన ప్రజలుగా ఎంపిక చేసుకున్నాడు.
\v 4 దీన్ని బట్టే ఆయన మనకు అమూల్యమైన వాగ్దానాలు దయచేశాడు. ఆయన వాగ్దానంపై నమ్మకం ఉంచి, దేవుని వలె నీతికరమైన మార్గంలో నడుచుకుంటే, అవిశ్వాసుల వలె దుష్ట కోరికలు కలిగి ఉండక మంచి మార్గంలో ఉంటాము.
\s5
\p
\v 5 ఎలాగైతే దేవుడు అవన్నీ చేశాడో, మనం కూడా క్రీస్తులో విశ్వాసముంచడమే కాక, మంచి జీవితం గడపటానికి ప్రయత్నం చెయ్యాలి. అంతే కాకుండా దేవుని గురించి కూడా ఎక్కువగా తెలుసుకుంటూ ఉండాలి.
\v 6 అంతేకాకుండా మీ మాటల్లో, మీరు చేసే పనుల్లో అదుపు కలిగి ఉండాలి. అదుపులో ఉండటమే కాకుండా దేవునికి విధేయులై ఉండాలి. విధేయత కలిగి ఆయన్ని ఘనపరచాలి.
\v 7 ఆయనను ఘనపరచడమే కాకుండా నీ తోటి విశ్వాసులు, సోదర సోదరీల విషయంలో జాగ్రత వహించాలి. దాంతోపాటు ఇతరులను ప్రేమించాలి.
\m
\s5
\v 8 ఈ విషయాలు ఎక్కువగా చెయ్యడం వలన, దేవుణ్ణి తెలుసుకున్నవారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి.
\v 9 కాని ఈ గుణాలు లేనివాడు, అంటే ఈ విషయాలు ముఖ్యం కావు అనుకునేవాడు దూరదృష్టి లేని గుడ్డివాడు. గుడ్డివారికి తమ చుట్టూ ఏమి జరుగుతుందో తెలియదు. అలాంటివారికి లోకసంబంధమైన విషయాలే ముఖ్యం. వారికి దేవుడు తాము గతంలో చేసిన పాపాలనుండి కాపాడాడు అనే విషయం మర్చిపోతారు.
\m
\s5
\v 10 అలాంటి వారిలా ఉండక, దేవునిచే ఎంపికైన వారిలా అందరికీ తెలిసేలా ప్రవర్తించండి. మీరు అలా చేస్తే, ఎప్పటికి దేవుని నుండి విడిపోరు.
\v 11 అంతేకాక దేవుడు మిమ్మల్ని హృదయపూర్వకంగా రక్షకుడైన యేసు తన ప్రజలను పాలించే చోటికి ఆహ్వానిస్తాడు.
\s5
\p
\v 12 వీటి గురించి మీకు ముందే తెలిసినా, మీరు అంగీకరించిన సత్యంలో స్థిరంగా ఉన్నా ఈ సంగతులు మీకు ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటాను.
\v 13 నేను జీవించి ఉన్నంత వరకూ ఈ విషయాలను మీకు గుర్తు చేయడం మంచిదని భావిస్తున్నాను.
\v 14 మన ప్రభువు యేసు క్రీస్తు ముందుగానే నాకు చెప్పిన ప్రకారం నేను త్వరలోనే చనిపోతానని నాకు తెలుసు.
\v 15 కాని, నేను చనిపోయిన తరువాత కూడా మీరు వీటిని ఎప్పుడూ గుర్తు చేసుకునేలా శ్రద్ధ తీసుకుంటాను.
\s5
\p
\v 16 అపొస్తలులమైన మేము ప్రభువైన యేసు శక్తివంతుడనీ ఆయన తిరిగి రాబోతున్నాడనీ చెప్పాము. మేము ఏదో కట్టుకథలను ఆధారం చేసుకొని ఈ విషయాలను చెప్పడం లేదు. మేము మా కళ్ళతో చూసిన యేసు గొప్పదనాన్ని చెప్పాము.
\v 17 ఆయన మన తండ్రి అయిన దేవుని నుండి గొప్ప వెలుగు రూపంలో ఘనత, మహిమ పొందగా, "ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన విషయంలో నేను ఆనందిస్తున్నాను" అని చెప్పాడు.
\v 18 ఆయనతో మేము ఆ పవిత్ర పర్వతం మీద ఉండగా పైనుండి వచ్చిన ఆ స్వరాన్ని చెవులారా విన్నాము.
\s5
\p
\v 19 క్రీస్తు గురించి ప్రవక్తలు ఎప్పుడో చెప్పిన విషయం వాస్తవమేననిమేము విశ్వసిస్తున్నాం. వారు రాసిన విషయాన్ని నమ్మండి, ఎందుకంటే అది చీకట్లో మనకి దారి చూపించి వెలుగునిచ్చే దీపం వంటిది. ఆ వెలుగు వేకువచుక్క మీ హృదయాల్లో ఉదయించే వరకూ వెలుగుతుంది.
\v 20 ఏ ప్రవక్త అయినా ఈ విషయాలను ఊహించి చెప్పడం అసాధ్యమని గ్రహించండి.
\v 21 ఏ ప్రవచనం మానవ నిర్ణయం నుండి రాలేదు. దేవుని సందేశం అందించే వాళ్ళు దేవుని ఆత్మచే ప్రేరేపణ పొందినవారు. అందుకని పరిశుద్ధాత్మ కూడా వాటిని అర్థం చేసుకోడానికి సహాయం చెయ్యాలి.
\s5
\c 2
\p
\v 1 గతంలో కూడా ఇశ్రాయేలు ప్రజల్లో అబద్ధ ప్రవక్తలు ఉండేవారు. అదే విధంగా మీ మధ్య కూడా అబద్ధ బోధకులు వస్తారు. మొదట్లో వారెవరో మీకు తెలియదు, వారు క్రీస్తు మీద నమ్మకాన్ని పోగొడతారు. వాళ్ళని విమోచించినవాడు ఆయనే అయినప్పటికీ, వాళ్ళు మన ప్రభువు ముఖ్యమైన వాడు కాదని ఆలోచించడం ప్రారంభిస్తారు. కానీ దేవుడు తొందరగానే ఆ అబద్ధ ప్రవక్తలను నాశనం చేస్తాడు.
\v 2 అనేకమంది ఆ అబద్ధ ప్రవక్తల్లా జీవిస్తారు. ఆ విధంగా వారు దేవుణ్ణి అవమానిస్తారు.
\v 3 ఈ అబద్ధ బోధకులు కట్టు కథలతో తమ స్వలాభం కోసం మిమ్మల్ని వాడుకుంటారు. వారిని శిక్షించడానికి దేవుడు ఆలస్యం చెయ్యడు, త్వరలోనే వారు నాశనమవుతారు.
\s5
\p
\v 4 పాపం చేసిన దేవదూతల్ని కూడా ఆయన నాశనం చేశాడు. వాళ్ళను నరకంలో దారుణమైన చోటుకి విసిరివేసి, తీర్పు తీర్చి శిక్షించే వరకు చీకటిలో బంధించి ఉంచాడు.
\v 5 అలాగే పూర్వకాలంలో జీవించిన ఉన్న ప్రజలను దేవుడు నాశనం చేశాడు. నీతిని ప్రకటించిన నోవహుతో పాటు మొత్తం ఎనిమిదిమందిని కాపాడి, దైవభక్తి లేని ప్రజల మీదికి జల ప్రళయం రప్పించాడు.
\v 6 దేవుడు సొదొమ, గొమొర్రా పట్టణాలపై తీర్పు విధించి వాటిని భస్మీపటలం చేశాడు. దేవుణ్ణి దూషించే వారికి ఇదొక హెచ్చరిక వంటిది.
\m
\s5
\v 7 కాని దేవుడు అబ్రాహాము బంధువు, నీతిపరుడైన లోతును రక్షించాడు. సొదొమలో ప్రజల అనైతిక కార్యాలు చూసి లోతు మనస్తాపానికి గురయ్యాడు.
\v 8 దినదినం ఆ దుర్మార్గుల మధ్య ఉంటూ, వారు చేసే అక్రమమైన పనులు చూస్తూ, వింటూ, నీతిగల అతను వేదన చెందేవాడు.
\v 9 లోతును కాపాడిన దేవునికి తనను మహిమ పరిచే వారిని ఎలా కాపాడాలో తెలుసు, అలాగే తనను మహిమ పరచని వారిని తీర్పు రోజున ఎలాశిక్షించాలో కూడా ప్రభువుకు తెలుసు.
\s5
\p
\v 10 ముఖ్యంగా తాము చెయ్యాలనుకునే పనులు చేసేవాళ్ళు, దేవునికి ఇష్టం లేని పనులు చేసేవాళ్ళని దేవుడు తీవ్రంగా శిక్షిస్తాడు. వారు అహంకారంతో తమ ఇష్టం వచ్చిన పనులు చేస్తూ, దేవదూతల్ని కూడా దూషిస్తారు.
\v 11 దేవదూతలు వారికంటే ఎంతో గొప్ప బలం, శక్తి కలిగి ఉండి కూడా ప్రభువు ముందు వారిని దూషించి అవమానించలేదు.
\s5
\p
\v 12 చెడ్డ విషయాలను బోధించే పశువుల్లాంటి మనుషులు మన లాగా ఆలోచించరు, వారు దేవుణ్ణి గురించి తెలియక పోయినా దూషిస్తారు. అలాంటి వారిని క్రూర మృగాలను వేటాడినట్టు దేవుడు నాశనం చేస్తాడు.
\v 13 వారి చెడుతనానికి ప్రతిఫలంగా వారికే హాని కలుగుతుంది. వారు అహోరాత్రాలు తాగుతూ విందులు చేసుకుంటారు. వారు ఒకసారి శుభ్రంగా ఉతకిన వస్త్రంపై అంటిన మురికి మచ్చల వంటివారు.
\v 14 వారు కనబడిన ప్రతి స్త్రీతో వ్యభిచరించాలి అనుకుంటారు. వారి పాపానికి అంతం ఉండదు. వారు దేవునిలో బలహీనులుగా ఉన్నవారిని తమతో కలవాలని ఒప్పిస్తారు. క్రీడాకారులు తమ క్రీడలు కోసం శిక్షణ పొందినట్టు వారు అత్యాశపరులుగా మారడానికి తమను తాము తయారు చేసుకున్నారు. కానీ దేవుడు వాళ్ళని శపించాడు.
\s5
\p
\v 15 దేవునికి నచ్చినట్టు వారు జీవించరు. వారు బెయోరు కొడుకైన బిలామును అనుసరించారు. అతడు అవినీతి సంబంధమైన జీతం కోసం ఆశపడ్డాడు.
\v 16 కాని, బిలాము చేసిన దుష్టకార్యాలకు మాటలు రాని గాడిద మానవ స్వరంతో మాటలాడడం ద్వారా దేవుడు నిరోధించాడు.
\s5
\p
\v 17 అబద్దాలను బోధించేవారు నీళ్ళు లేని బావులు. బలమైన గాలికి కొట్టుకుపోయే పొగమంచు వంటివారు. అలాంటి వారికి దేవుడు గాఢమైన చీకటి సిద్ధపరిచి ఉంచాడు.
\v 18 వారు పనికిమాలిన డంబాలు పలుకుతూ ఉంటారు. వారు అప్పుడే విశ్వాసులైన వారిని పాపపు మార్గం లోకి తిరిగి రప్పించి వారిని పాపం చేసేలా ప్రేరేపిస్తారు.
\v 19 ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చెయ్యొచ్చని అందరినీ ప్రేరేపిస్తారు. కాని వారే స్వయంగా చెడుకు బానిసలై ఉండి, వారి చెడు మనసు చెప్పినట్లు చేసేవాళ్ళు. ఒక వ్యక్తిని ఏదైతే అదుపు చేస్తుందో, దానికి అతను బానిస.
\s5
\v 20 ఎవరైనా ప్రభువు, రక్షకుడు అయిన యేసు క్రీస్తు విషయంలో జ్ఞానం వల్ల ఈ లోకపు అపవిత్రతను తప్పించుకున్న తరువాత మళ్లీ తిరిగి పాపంలోకి వస్తే , వారి మొదటి స్థితి కన్నా చివరి స్థితి మరింత దారుణంగా ఉంటుంది.
\v 21 అలాంటి వారు సరైన మార్గంలోకి రాకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే దేవుడు వారిని మరింతగా శిక్షిస్తాడు. వారు దేవుని ఆజ్ఞను, అపోస్తలుల బోధను తిరస్కరించారు.
\v 22 వారు ప్రవర్తించే తీరు "కుక్క తాను కక్కిన దాన్ని తిన్నట్టుగా, కడిగిన తరువాత పంది బురదలో పొర్లడానికి తిరిగి వెళ్లినట్టుగా" అన్న సామెతలాగా ఉంది.
\s5
\c 3
\p
\v 1 ప్రియులారా, ఇది నేను మీకు రాస్తున్న రెండవ ఉత్తరం. మీకు ముందే తెలిసిన విషయాలను గుర్తు చేయడానికి, ఆ విషయాలు గురించి మిమ్మల్ని ఉత్తేజపరచడానికి ఈ రెండు ఉత్తరాలు మీకు రాస్తున్నాను.
\v 2 పవిత్ర ప్రవక్తలు పూర్వకాలంలో చెప్పిన మాటలనూ, మన ప్రభువు, రక్షకుడు అయిన యేసుక్రీస్తు మీ అపొస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు గుర్తు చేసుకోవాలని ఈ ఉత్తరం రాస్తున్నాను.
\s5
\p
\v 3 మీరు ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, క్రీస్తు తిరిగి వచ్చే చివరి రోజుల్లో, ప్రజలు ఆ విషయంపై హేళన చేస్తారు, వారు తమకు నచ్చినట్టు చెడు కార్యాలు చేస్తారు.
\v 4 "ఆయన మళ్ళీ వస్తాడన్న వాగ్దానం ఏమయ్యింది? మన పూర్వీకులు చనిపోయారు, కాని సృష్టి ఆరంభం నుండి అన్ని విషయాలూ ఏమీ మార్పు లేకుండానే జరిగిపోతున్నాయి" అంటూ మిమ్మల్ని హేళన చేస్తారు.
\s5
\p
\v 5 వారు హేళనగా , పూర్వం దేవుని ఆజ్ఞ ద్వారా భూమి, పరలోకం సృష్టి అయిందని, ఆయనే నీటిలోంచి భూమిని వేరు పరిచాడని,
\v 6 ఆయన వాక్కును బట్టే, ఆ రోజుల్లో ఉన్న లోకం వరద నీటిలో మునిగి నాశనం అయ్యిందనీ,
\v 7 అంతేకాక ఆయన తన వాక్కును బట్టి ఆకాశాన్ని భూమిని వేరు చేసాడని, భక్తిహీనులకు జరిగే తీర్పు రోజున అగ్నికీలల్లో ఆకాశాలనూ భూమినీ నాశనం చేస్తాడని, వారు గుర్తుంచుకోరు.
\s5
\p
\v 8 ప్రియులారా, దేవుడు భూమిపై జనులకు తీర్పు తీర్చడానికి ఇంకా చాలా కాలం వేచి ఉంటాడని మీకు చెప్పాలనుకుంటున్నాను. కాని ఆయనకు కాలంతో సంబంధం లేదు. ప్రభువు దృష్టికి ఒక్క రోజు వెయ్యి సంవత్సరాలుగా, వెయ్యి సంవత్సరాలు ఒక్క రోజుగా ఉంటాయి.
\v 9 కనుక, దేవుడు తీర్పు తీర్చడానికి రావడం లేదనీ , ఆయన వాగ్దానం ఆలస్యమైందనీ అనుకోకూడదు. కొందరైతే క్రీస్తు అసలు తిరిగి రాడని అంటారు. కాని మనం గమనించాల్సింది ఏమిటంటే, దేవుని ఆలస్యానికి కారణం మన పట్ల ఆయన కృప. ఎందుకంటే ఆయన అందరూ పాపపు జీవితాల నుంచి మారిన మనసుతో తిరిగి రావాలనీ, ఎవ్వరూ నశించ కూడదనీ కోరుతూ మీ పట్ల చాలా ఓర్పుతో ఉన్నాడు.
\s5
\p
\v 10 అయితే ప్రభువు రాకడ ఎవరికీ తెలియని విధంగా ఉంటుంది. హెచ్చరిక లేకుండా వచ్చే దొంగలాగా ఆయన రాక ఉంటుంది. ఆ సమయంలో పెద్ద గర్జన శబ్దం వస్తుంది. ఆకాశాలు గతించిపోతాయి. పంచభూతాలు మంటల్లో దగ్ధమై పోతాయి. భూమి, దానిలో ఉన్నవన్నీ దేవుని ఎదుట తీర్పుకు గురౌతాయి.
\s5
\p
\v 11 దేవుడు ఈ విధంగా అన్నిటిని నాశనం చేస్తాడు గనుక, మీ ప్రవర్తన మీకు తెలిసి ఉండాలి, అది దేవుణ్ణి మహిమ పరిచే విధంగా ఉండాలి.
\v 12 దేవుడు వచ్చే రోజు కోసం మీరు ఎదురు చూస్తున్నారు గనుక ఆ రోజు త్వరగా రావాలని ఆశించండి. ఆ రోజున ఆకాశం నాశనం అయిపోతుంది. పంచభూతాలు మంటల్లో దహించుకుపోయి కరిగిపోతాయి.
\v 13 ఇవన్నీ జరుగుతున్నప్పుడు దేవుడు వాగ్దానం చేసిన కొత్త ఆకాశం, కొత్త భూమి కోసం మనం ఎదురు చూస్తూ సంతోషంగా ఉంటాము. అందులో నీతిపరులు మాత్రమే నివాసముంటారు.
\s5
\p
\v 14 కాబట్టి, ప్రియులారా, మీరు వీటి కోసం ఎదురు చూస్తున్నారు గనక, మనం చేసే ప్రతి పనీ దేవుణ్ణి మహిమ పరిచే విధంగా, ఆయన దృష్టిలో ఏ పాపం లేకుండా ప్రశాంతంగా జీవించాలి.
\v 15 మన ప్రభువు చూపించే సహనం మన రక్షణ కోసమే అని గ్రహించండి. ఆ విధంగానే మన ప్రియ సోదరుడు పౌలు కూడా దేవుడు తనకు ఇచ్చిన జ్ఞానంతో ఇవే విషయాలు రాశాడు.
\v 16 పౌలు రాసిన ఉత్తరాల్లో కొన్నిటిని అర్థం చేసుకోవడం కష్టం. అయితే దేవుని గురించి తెలియని, నిలకడ లేని కొందరు అనేక ఇతర లేఖనాలను చేసినట్టే వీటిని కూడా వక్రీకరిస్తున్నారు. దాని ప్రతిఫలం, దేవుడు వారిని శిక్షిస్తాడు.
\s5
\p
\v 17 కాబట్టి ప్రియులారా, ఈ విషయాలు మీకు తెలుసు కాబట్టి, ఈ చెడు బోధకుల నుంచి దూరంగా ఉండండి. చెడు విషయాలతో మిమ్మల్ని మోసం చేయ్యనివ్వకండి. మీ విశ్వాసంలో స్థిరత్వాన్ని వాళ్ళు పాడు చేయకుండా జాగ్రత్తపడండి.
\v 18 దానికి బదులుగా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపలో జీవించండి. తద్వారా ఆయనను మరింత ఎక్కువగా తెలుసుకోండి.
\p ఇప్పుడు, నిరంతరం మన ప్రభువైన యేసు క్రీస్తును మీరంతా ఘనపరిచేలా నేను వేడుకుంటున్నాను. ఇది నిజమగు గాక.