STR_te_iev/60-JAS.usfm

212 lines
64 KiB
Plaintext

\id JAS - Indian Easy Version (IEV) Telugu
\ide UTF-8
\h యాకోబు రాసిన పత్రిక
\toc1 యాకోబు రాసిన పత్రిక
\toc2 యాకోబు రాసిన పత్రిక
\toc3 jas
\mt1 యాకోబు రాసిన పత్రిక
\s5
\c 1
\p
\v 1 ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునికి కట్టుబడి దేవునికి సేవ చేస్తున్నవాడనైన యాకోబు అనే నేను క్రీస్తులో విశ్వాసముంచి ప్రపంచమంతటికీ చెదిరిపోయిన ఇశ్రాయేలు పన్నెండు వంశాల వారికి ఈ ఉత్తరం రాస్తున్నాను. మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను.
\p
\v 2 నా తోటి విశ్వాసుల్లారా రక రకాల హింసలను, కష్టాలను మీరు అనుభవిస్తున్నప్పుడు అది అంతా సంతోషంగానే పరిగణించండి.
\v 3 మీకు కలిగే హింసలలో కష్టాలలో దేవునిలో నమ్మిక ఉంచడం ద్వారా ఆ నమ్మికే మీకు కలిగే మరిన్ని హింసలను, కష్టాలను భరించడం ఎలానో నేర్పిస్తుందని అర్థం చేసుకోండి.
\s5
\v 4 మీరు పొందే హింసలనూ, కష్టాలనూ చివరివరకూ భరించడం ద్వారా క్రీస్తును అన్ని విషయాలలోనూ మీరు అనుసరించిన వారు కావొచ్చు. అప్పుడు మీరు మంచి చేయడంలో ఎంతమాత్రమూ తప్పి పోరు.
\v 5 ఏం చేయాలో తెలుసుకోవాలని మీలో ఎవరైనా అనుకుంటే అతడు ధారాళంగా ఇచ్చే దేవుణ్ణి అడగాలి. దేవుడు ఎవరైనా తన దగ్గరికి వచ్చి ఏదైనా అడిగితే ఆయన ఎంత మాత్రమూ వాళ్ళపై కోప్పడడు.
\s5
\p
\v 6 అయితే మీరు దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన తప్పక జవాబు ఇస్తాడని నమ్మాలి. అంతే కానీ ఆయన నాకు జవాబు ఇస్తాడో లేదో, ప్రతి సారీ సహాయం చేస్తాడో లేదో అని అనుమాన పడకూడదు. ఎందుకంటే ఎవరైతే దేవుని అనుగ్రహంపై నిత్యం అనుమానపడతారో వాళ్ళు దేవుణ్ణి అనుసరించేవారు కారు. అటువంటి వ్యక్తులు సముద్రపు అలలు గాలికి ముందుకు వచ్చి మళ్ళీ వెనక్కి కొట్టుకుపోతూ ఉన్నట్టు ఎప్పుడూ ఒకే దిశలో సాగలేనివాళ్ళుగా ఉంటారు.
\v 7 నిజానికి అటువంటి అనుమానం ఉన్న వారు తాము కోరింది ఏదైనా ప్రభువైన దేవుడు చేస్తాడని ఆలోచించటం వ్యర్ధం.
\v 8 వారు యేసును అనుసరించాలా లేదా అని నిర్ణయించుకోలేని వాళ్ళు. వీరు తాము చేస్తామని చెప్పింది చేయని వారు.
\s5
\p
\v 9 విశ్వాసుల్లో పేదలైన వాళ్ళు తప్పక సంతోషించాలి. ఎందుకంటే దేవుడు వాళ్ళని సన్మానించాడు.
\v 10 విశ్వాసుల్లో ధనవంతులైన వాళ్ళు తప్పక సంతోషించాలి. ఎందుకంటే దేవుడు వాళ్ళను వినయవంతులుగా అణుకువతో వుండే వాళ్ళుగా చేశాడు. వాళ్ళ అణుకువతనం వాళ్ళని యేసు క్రీస్తులో నమ్మిక ఉంచడానికి సహాయ పడుతుంది. ఎందుకంటే అడివి గడ్డి పువ్వు వాడిపోయినట్టు వాళ్ళ ఐశ్వర్యం ఏదో ఒక నాడు వాళ్ళ దగ్గిరనుండి వెళ్లిపోవచ్చు.
\v 11 సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఎండ వేడిమి పెరుగుతున్నకొద్దీ ఆ వేడి గాలులకు ఆ పూల మొక్కల్లోని తడిని ఆ గాలులు పీల్చివేయడం వల్ల ఆ పూవులు వాడిపోయి తలలు వాలుస్తాయి. చివరకు ఆ మొక్క అందవిహీనమై చనిపోతుంది. చనిపోయిన పూల మొక్కలానే ధనవంతులైన మనుషులు తమ సంపాదనలో పడి చనిపోతారు.
\s5
\v 12 కష్టమైన దారుల్లో నడుస్తూ భరిస్తున్న వాళ్ళను దేవుడు గొప్పగా సన్మానిస్తాడు. ఎందుకంటే తనను ప్రేమించే వాళ్ళందరికీ ఆయన చేసిన వాగ్దానం ప్రకారం దేవుడు వాళ్ళందరికీ ప్రతిఫలంగా నిత్యజీవాన్ని ఇస్తాడు.
\p
\v 13 మనం పాపపు ఆలోచనతో ప్రలోభాలకు లోనైనపుడు దేవుడే మనల్ని పాపపు ప్రలోభాలతో శోధిస్తున్నాడని అనుకోరాదు. ఎందుకంటే దేవుణ్ణి చెడు చేయటానికి ఎవరూ ప్రేరేపించలేరు. అలాగే దేవుడు ఎవర్నీ చెడు చెయ్యమని ప్రేరేపించడానికి ప్రయత్నించడు.
\s5
\v 14 అయితే ప్రతిఒక్కరూ చెడు చెయ్యాలని అనుకుంటున్నారు కాబట్టే, వాళ్ళు ఆ పాపపు ఉచ్చులో పడ్డవాళ్ళలా పాపపు పనులు చేస్తారు.
\v 15 పాపపు కార్యాలు చేయాలని కోరిక మనసులో ఉన్నవాళ్ళు కాబట్టే, వాళ్ళు ఆ కార్యాలు చేయడం ప్రారంభిస్తారు. వీళ్ళకు అలాటివి చేయడం ఒక అలవాటుగా మారిపోతుంది. అయితే వీళ్ళు తమ పాపపు స్వభావం నుంచి తప్పుకోక పోతే వాళ్ళు దేవునికి ఇక ఎప్పటికీ దూరం అవుతారు.
\p
\v 16 నేను ప్రేమిస్తున్న నా తోటి విశ్వాసుల్లారా, మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం మానండి.
\s5
\v 17 పరిపూర్ణమైనదీ నిజంగా మంచిదీ అయిన ప్రతి బహుమతీ పరలోకంలోఉన్న మన తండ్రి అయిన దేవుని నుండి వస్తుంది. ఆయన మన జీవితాలకు వెలుగిచ్చే నిజమైన దేవుడు. మన నీడ కనిపించి, మళ్ళీ అదృశ్యమైపోయినట్టుగా ఈ సృష్టిలోనివి మారి పోతాయి. కానీ దేవుడు ఎన్నడూ మారని వాడు. ఆయన ఎప్పుడూ మంచి వాడే.
\p
\v 18 మనం ఆయన సత్య సువార్తలో నమ్మిక ఉంచినప్పుడు, మనకు ఆత్మీయ జీవితాన్ని ఇవ్వడానికి దేవుడు మనల్ని ఎంచుకున్నాడు. కాబట్టి ఇప్పుడు యేసులో విశ్వాసముంచిన విశ్వాసులు నిజమైన ఆత్మీయ జీవితాన్ని పొందిన మొదటి వ్యక్తులు అయ్యారు. ఈ ఆత్మీయ జీవితం యేసు క్రీస్తు ప్రభువు మాత్రమే ఇవ్వగలడు.
\s5
\p
\v 19 నేను ప్రేమిస్తున్న నా తోటి విశ్వాసుల్లారా, దేవుని సత్య సువార్తకు మీలో ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపాలని మీకు తెలుసు. మీరు మీ సొంత ఆలోచనలతో తొందరపడి మాట్లాడకూడదు. అలాగే ప్రతి విషయానికీ త్వరపడి కోప్పడటం తగదు.
\v 20 ఎందుకంటే మనం ఇలా ప్రతిదానికీ కోప్పడుతుంటే, మనం చేయాలని దేవుడు కోరుకున్న నీతికరమైన పనులు మనము చేయలేము.
\v 21 కాబట్టి అన్ని రకాల పాపకృత్యాలు చేయటం మానండి. దేవుడు మీ అంతరంగాలలో నాటిన సువార్తను వినయంతో అంగీకరించండి. ఎందుకంటే ఆయన మాత్రమే మిమ్మల్ని రక్షించే శక్తి ఉన్న వాడు.
\s5
\p
\v 22 తన సువార్తలో దేవుడు మీకు ఆజ్ఞాపించినది చేయండి. ఆయన చెప్పినది విని ఊరుకోవద్దు. ఎందుకంటే ఆయన చెప్పినది వినటం మాత్రమే చేసి, దానిని పాటించని వ్యక్తులు దేవుడు తమను రక్షిస్తాడని తప్పుగా ఆలోచిస్తున్నారు.
\v 23 కొంతమంది దేవుని సువార్త వింటారు. కానీ ఆ సువార్త ఏం చెబుతుందో దాని ప్రకారం చేయరు. ఇలాంటి వ్యక్తులందరూ తమ ముఖాన్ని అద్దంలో చూసుకొని అవతలకు వెళ్ళగానే మర్చిపోయే వ్యక్తులు.
\v 24 ఆ వ్యక్తి తనను తాను అద్దంలో చూసుకున్నప్పటికీ అతడు అద్దం ముందునుంచి అవతలకు వెళ్ళగానే తాను ఎలా ఉన్నాడో వెంటనే మర్చిపోయిన వాడిలా అవుతాడు.
\p
\v 25 అయితే పరిపూర్ణమైనదీ, మనుషులను స్వతంత్రులనుగా చేసేదీ దేవుడు కోరుతున్నదీ అయిన దాన్ని స్వచ్చందంగా చేసేలా ప్రేరేపించే శక్తివంతమైన దేవుని సువార్తను ఇతరులు నిశితంగా పరిశీలిస్తున్నారు. వాళ్ళు దేవుని సువార్తను ఎదో వినీ విననట్టు కాక దాన్ని మర్చిపోకుండా కొనసాగిస్తూ దేవుడు చేయమని చెప్పినట్టు చేస్తే వాళ్ళు చేసే పనులవల్ల దేవుడు తప్పక వాళ్ళను ఆశీర్వదిస్తాడు.
\s5
\p
\v 26 కొంతమంది తాము దేవుణ్ణి సరిగ్గానే ఆరాధిస్తున్నామని అనుకుంటున్నారు. కానీ వారి నోటివెంట చెడ్డ మాటలు, బూతులూ అలవాటుగా, అలవోకగా వస్తుంటాయి. అటువంటి వ్యక్తులు తాము దేవుణ్ణి సరిగ్గానే ఆరాధిస్తున్నామని అనుకోవటం చాలా తప్పు. వీళ్ళు ఈ విధంగానే చేస్తూ దేవుణ్ణి ఆరాధించడం వల్ల ఫలితం లేదు.
\v 27 దేవుడు మనకు చెప్పిన విషయాలలోఒకటేమిటంటే కష్టాలలోను హింసలలోను ఉన్నఅనాధలను వితంతువులను జాగ్రత్తగా చూసుకోవడం. దేవునికి విధేయత చూపించని వాళ్ళలా కాకుండా అనైతికంగా ఆలోచించకుండా, ప్రవర్తించకుండా దేవుడు చెప్పినట్లు చేస్తూ అనాధలపట్ల, వితంతువుల పట్ల దయగా ఉన్న వాళ్ళు మన తండ్రి అయిన దేవుణ్ణి నిజంగా ఆరాధించే వాళ్ళు. వాళ్ళనే దేవుడు ఆమోదిస్తాడు.
\s5
\c 2
\p
\v 1 నా సోదరి, సొదరులారా, మీరు కొంతమందిని మిగతా వాళ్ళకంటే గొప్పవాళ్ళుగా భావించి గౌరవించడం చేయవద్దు. అందరినీ సమానంగానే గౌరవించి, ప్రేమించండి. అలాగే అందరికంటే అన్నిటికంటే మహోన్నతుడైన మన ప్రభువైన యేసుక్రీస్తులో నమ్మిక ఉంచండి.
\v 2 ఉదాహరణకు, ఒకవేళ ఒకవ్యక్తి చేతికి బంగారు ఉంగరాలు ధరించి, ఖరీదైన బట్టలు ధరించి మీ సమావేశ మందిరాల్లోకి వచ్చాడు అనుకోండి, అదే సమయంలో పేదవాడైన ఒకవ్యక్తి కూడా చిరిగిన బట్టలతో లోపలికి వస్తున్నాడు అనుకోండి.
\v 3 అప్పుడు మీరు ఖరీదైన బట్టలు ధరించిన వ్యక్తితో దయచేసి ఇక్కడకు రండి, ఈ చక్కని కుర్చీలో ముందు వరసలో కూర్చోండి అంటూ ప్రత్యేకమైన శ్రద్ధ చూపెట్టారని అనుకుందాము. అదే సమయంలో పేదవాడితో నువ్వు అలా దూరంగా నిలబడు, లేదా ఒక ప్రక్కన నేల మీద కూర్చో అంటూ అతణ్ణి చిన్నచూపు చూస్తూ విసుక్కున్నారనుకోండి
\v 4 మీరు చూపిస్తున్న ఈ తేడాతో ఒకరితో నొకరు తీర్పు తీర్చుకున్నారు.
\s5
\p
\v 5 నేను ప్రేమిస్తున్న నా సోదరి, సోదరుల్లారా నేను చెబుతున్న మాటలను వినండి. ఎలాటి విలువ, గౌరవం లేని వాళ్ళుగా కనిపిస్తున్న ఈ పేదవాళ్ళను దేవుడు తనపై ఎంతో గొప్ప నమ్మిక ఉన్నవాళ్ళుగా ఎంచుకున్నాడు. అందువల్ల ఆయన ప్రతి ఒక్కరినీ, ప్రతి దాన్నీ పాలించేటప్పుడు, ఆయన వీళ్ళకు గొప్ప అధికారాలను, బహుమతులను ఇస్తాడు. తనను ప్రేమించే ప్రతి ఒక్కరికీ ఇలాగే ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు.
\v 6 అయితే మీరు పేదవాళ్ళను అవమానిస్తారు. అయితే మిమ్మల్ని అనేక బాధలకు గురి చేసేది ఈ ధనవంతులే, పేదవాళ్ళు కాదు. ఒకసారి దీన్ని గూర్చి ఆలోచించండి. ఈ ధనవంతులు మిమ్మల్ని బలవంతంగా న్యాయ స్థానాలకు ఈడ్చి, న్యాయమూర్తుల ముందు మీపై అనేక నిందారోపణలను చేస్తారు.
\v 7 మన ప్రభువైన యేసుక్రీస్తు మన స్తుతులకు పూర్తిగా అర్హుడు. మనం ఆయనకు చెందిన వాళ్ళం కాగా, అలాంటి మన ప్రభువైన యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా చెడుగా మన ఎదుటే మాట్లాడే వాళ్ళే ఈ ధనవంతులు.
\s5
\p
\v 8 మన వాళ్ళు లేఖనాల్లో రాసిన ధర్మశాస్త్రాన్ని మీరు పాటిస్తున్నట్టయితే నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువాడిని కూడా ప్రేమించాలి అనే ఆజ్ఞను మీరు చూస్తారు. మీరు ఇతరులను, మీ పొరుగు వాళ్ళను ప్రేమిస్తే మీరు సరైన విధంగా ప్రవర్తిస్తున్నట్టు అవుతుంది.
\v 9 అలా కాకుండా మీరు కొంతమందినే ఎక్కువగా గౌరవిస్తే, మీరు తప్పు చేస్తున్నారు. దేవుడు చేయమని మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను మనం పాటించకపోతే, ఆయన ధర్మశాస్త్రాన్ని పాటించలేదు కాబట్టి, ఆయన మనల్ని వ్యతిరేకిస్తాడు.
\s5
\p
\v 10 దేవుని ధర్మశాస్త్రంలోని ఏదో ఒక ఆజ్ఞను మాత్రమే పాటించకుండా, మిగతా అన్ని ఆజ్ఞలను పాటిస్తున్నప్పటికీ దేవుడు అలాంటి వాళ్ళను మొత్తం ధర్మశాస్త్రాన్ని మీరిన వారుగానే భావించి దోషులుగా తీర్పు తీరుస్తాడు.
\v 11 ఉదాహరణకు దేవుడు వ్యభిచారం చేయవద్దని చెప్పాడు. అయితే దానితో పాటు దేవుడు హత్య చేయరాదని కూడా చెప్పాడు. అయితే మీరు వ్యభిచారం చేయకపోయినప్పటికీ, ఎవరినైనా హత్య చేస్తే, దేవుని ధర్మశాస్త్రాన్ని ధిక్కరించినట్టే.
\s5
\p
\v 12 దేవుని ధర్మశాస్త్రం ప్రకారం మన పాపాలకు తగిన శిక్ష విధించకుండా తప్పించుకునే మార్గం ఏమిటంటే, ఎప్పుడూ ఇతరులతో సరైన విధంగా మాట్లాడటం, వాళ్ళతో సరైన విధంగా ప్రవర్తించటం.
\v 13 ఎందుకంటే మనలో ఎవరైతే ఇతరులతో దయగా ప్రవర్తించకుండా ఉంటారో, దేవుడు తీర్పు తీర్చేటప్పుడు, వాళ్ళ పట్ల దయగా వ్యవహరించడు. అయితే మనం ఇతరులతో దయగా ప్రవర్తిస్తే, అప్పుడు మనకు దేవుడు తీర్పు తీర్చేటప్పుడు మనం ఎలాటి భయం లేకుండా ఉండవచ్చు.
\s5
\p
\v 14 నా సహోదరి, సహోదరుల్లారా, కొంతమంది వ్యక్తులు నేను ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముతున్నాను అంటారు. కానీ వాళ్ళు మంచి పనులు చేయరు. వాళ్ళ మాటలకూ చేతలకు పొంతన ఉండదు. వాళ్ళు నమ్ముతున్నామని చెబుతున్న మాటలు వాళ్ళకు ఎలాటి మంచీ చేయవు. వాళ్ళు తమ నమ్మికను మాటల్లో మాత్రమే చూపిస్తే, అటువంటి వాళ్ళను దేవుడు కచ్చితంగా రక్షించడు.
\v 15 మీకు అర్ధమయ్యేలా నేను ఒక ఉదాహరణ చెబుతాను. మన సహోదరుడో, సహోదరియో అనుదినం ఆహరం లేకుండా, బట్టలు లేకుండా ఉన్నారనుకుందాం.
\v 16 మీలో ఒకరు వాళ్ళతో "బాధ పడకండి, దూరంగా వెళ్ళండి, చలి కాచుకోండి. మీకు కావలసిన ఆహారాన్ని, బట్టలను సంపాదించుకోండి" అంటూ వాళ్ళ శరీరాలను కాపాడుకోవడానికి కావలసిన వాటిని ఇవ్వకుండా, వట్టి మాటలు చెప్పినందువల్ల వాళ్ళకు ఏం ప్రయోజనం?
\v 17 అదే విధంగా ఇతరులకు, మీ పొరుగు వాళ్ళకు ఉపయోగపడే మంచి పనులు మీరు చేయకుండా, క్రీస్తులో నమ్మిక ఉంచామని వట్టిమాటలే మీరు చెబుతుంటే, చనిపోయిన శవం ఎందుకు పనికిరానట్లుగానే, ఆ మాటలు ఎందుకు పనికి వచ్చేవి కావు. అంటే మీకు నిజంగా క్రీస్తులో నమ్మిక లేదు.
\s5
\p
\v 18 అయితే కొంతమంది నాతో ఇలా చెప్పవచ్చు. దేవుడు కొంతమందిని తనలో కేవలం విశ్వాసముంచడం ద్వారానే రక్షిస్తాడు. అలాగే ఇతరులకు వాళ్ళు చేసిన మంచి పనులను బట్టి రక్షిస్తున్నాడు అని అంటున్నారు. అయితే ఇతరులకు మంచి పనులతో ఉపయోగపడకుండా దేవుడిలో నిజంగా నమ్మిక ఉంచామని మీరు నాకు రుజువు పరచలేరు. కానీ ఇతరులకు మంచి పనుల చేస్తూ ఉపయోగపడటం ద్వారా నేను నిజంగా దేవుడులో నమ్మిక ఉంచానని మీకు నిరూపించవచ్చని అలాంటి వారికి సమాధానం చెబుతున్నాను.
\p
\v 19 నేను చెబుతున్న ఈ విషయాలను గూర్చి ఆలోచించండి. ఈ లోకంలో నిజంగా జీవిస్తున్న వాడు ఆయన ఒక్కడే అని మీరు నమ్ముతున్నారు. మీరు ఆ విధంగా నమ్మడం సరైనదే, అయితే దయ్యాలు కూడా అదే విధంగా నమ్ముతున్నాయి. వాటికి కూడా దేవుడు నిజంగా ఎప్పుడూ జీవిస్తాడని తెలుసు కాబట్టే, తమను శిక్షిస్తాడని తెలుసు. అందుకే ఆయన్ని తలుచుకొని భయంతో వణుకుతున్నాయి.
\p
\v 20 తెలివిలేని మనుషులారా, నేను దేవుణ్ణి నమ్ముతున్నాను అని ఎవరైనా చెబుతూ, మంచి పనులు చేయకపొతే, ఆ మాటలు అతనికి ఏవిధంగానూ ఉపయోగపడవని నేను మీకు రుజువులతో సహా చెప్పగలను.
\s5
\p
\v 21 మనమందరం మన పూర్వికుడైన అబ్రాహామును ఎంతో గౌరవిస్తాము. అతడు దేవుడు తనకు చేయమని చెప్పిన దాన్ని పాటించటానికి ప్రయత్నించాడు. అతడు తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠంపై దేవుని కోసం బలి ఇవ్వడానికి ప్రయత్నించాడు. అతడు దేవుడు తనకు చెప్పినది పాటించటానికి ప్రయత్నించాడు. కాబట్టే దేవుడు అతణ్ణి నీతిమంతుడిగా పరిగణించాడు.
\v 22 ఈ విధంగా అబ్రాహాము దేవునిలో నమ్మిక ఉంచాడు. ఆయన చెప్పినది పాటించి, విధేయత చూపించాడు. అతడు ఆయనకు విధేయత చూపించినప్పుడు, అతడు దేవునిలో ఎందుకోసం నమ్మిక ఉంచాడో, దాన్ని అతడు చేసి ముగించాడు.
\v 23 అబ్రాహాము నిజంగా దేవునిలో నమ్మిక ఉంచాడు. అందువల్లే దేవుడు అతణ్ణి సరైన పనులు చేసే వ్యక్తిగా, నీతిమంతుడిగా చూశాడని మన గ్రంథాల్లో రాసినట్లుగా ఇది జరిగింది. అంతే కాకుండా అబ్రాహాము నా స్నేహితుడు అని కూడా దేవుడు చెప్పాడు.
\p
\v 24 అబ్రాహాము ఉదాహరణ నుంచి మనం గ్రహించేది ఏమిటంటే వ్యక్తులు చేసిన మంచి పనులను బట్టే దేవుడు వాళ్ళను నీతిమంతులుగా భావిస్తాడని, అంతే తప్ప ఆయనలో కేవలం నమ్మకం ఉంచడం వల్ల కాదని మీరు గ్రహించవచ్చు.
\s5
\v 25 అదే విధంగా రాహాబు చేసిన మంచి పనిని బట్టే, దేవుడు ఆమెను నీతిమంతురాలుగా భావించాడు. ఆమె ఒక వేశ్య అయినా కూడా ఆ దేశాన్ని వేగు చూడటానికి వచ్చిన ఇశ్రాయేలు దూతలకు, వాళ్ళు వచ్చిన దారిలో కాకుండా, మరొక దారిలో నుంచి తప్పించుకోవడానికి వాళ్ళకు సహాయపడింది.
\p
\v 26 ఒక వ్యక్తి ఇక శ్వాస తీసుకోవడం లేనప్పుడు, అతడి శరీరం చనిపోయినట్టే, అది ఇక దేనికీ పనికి రానిదే. అదే విధంగా నేను దేవుణ్ణి నమ్ముతున్నానని చెప్పే వ్యక్తి, ఆ నమ్మిక చొప్పున ఏ మంచీ చేయని వాడైతే దేవునికి అతడు ఎందుకూ పనికి రానివాడే.
\s5
\c 3
\p
\v 1 నా సహోదరీ సహోదరులారా, మీలో చాలా మంది దేవుని వాక్యాన్ని బోధించే బోధకులుగా మారాలని కోరుకోవద్దు. ఎందుకంటే తీర్పు తీర్చే దేవుడు ఇతరుల కంటే బోధకులమైన మనకే తీవ్రమైన తీర్పు తీరుస్తాడని మీకు తెలుసు.
\v 2 మనం అనేక విషయాలలో తప్పులు చేస్తున్నాము. కాని ఎవరైతే తమ మాటలను నియంత్రించుకుంటారో వారే దేవుని సంకల్పంలో ఉంటారు. అలాంటి వాళ్ళే తమ చేతలన్నింటినీ నియంత్రిస్తారు.
\s5
\v 3 దీనికి ఒక ఉదాహరణ ఇస్తాను. గుర్రం మనం చెప్పినట్లే వినే విధంగా చేసుకోవడానికి ఒక చిన్న లోహం ముక్కను గుర్రం నోటిలో పెడతాము. దానితో గుర్రం భారీ శరీరాన్ని మనకు కావలసిన విధంగా ఎటుకావాలంటే అటు తిప్పవచ్చు.
\v 4 ఒకసారి పెద్ద ఓడలను గూర్చి ఆలోచించండి. ఆ ఓడ ఎంత పెద్దదైనప్పటికీ, పెద్ద, పెద్ద గాలుల వలన కదిలిపోతున్నప్పటికీ, చాలా చిన్న చుక్కానితో ఆ ఓడను తిప్పుకొని ఎటు వెళ్ళాలనుకుంటున్నామో, అటు నడిపించవచ్చు.
\s5
\v 5 అదే విధంగా మన నాలుక ఎంత చిన్నదైనప్పటికి, ఆ నాలుకను మనం నియత్రించకపోతే, మన నోటి నుంచి వచ్చే పెద్ద, పెద్ద మాటల ద్వారా మనుషులకు గొప్ప హాని చేస్తాము. ఎంత చిన్న మంట పెద్ద అడివి కాలిపోవడానికి కారణం అవుతుందో ఒకసారి ఆలోచించండి.
\p
\v 6 చిన్న చిన్న అగ్ని కీలలే అడివినంతా కాల్చినట్లుగా, మనం మాట్లాడే చెడ్డ మాటలే అనేకమంది మనుషుల జీవితాలను నాశనం చేస్తాయి. మనలో ఎంత చెడు దాగి ఉందో, మనం మాట్లాడే మాటలే బహిర్గతం చేస్తాయి. మన ఆలోచనలనూ, పనులన్నిటినీ మన మాటలే కలుషితం చేస్తాయి. ఏ విధంగానైతే అగ్ని కీలలు తేలిగ్గా తమ చుట్టు ప్రక్కల ప్రాంతమంతటినీ కాలిపోవడానికి కారణం అవుతాయో, సరిగ్గా అలాగే మన కుమారులు, కుమార్తెలు, వాళ్ళ వారసులు తమ మిగతా జీవితమంతా చెడ్డపనులు చేయాలనుకునేలా మనం మాట్లాడే మాటల కారణంగా ప్రభావితం అవుతున్నారు. మనం చెడు మాటలు మాట్లాడేలా సాతాను తనంతట తాను మనల్ని ప్రభావితం చేస్తాడు.
\s5
\p
\v 7 మనుషులు నీటిలో జీవించే ప్రాణుల్ని, నేలమీద ప్రాకే, నడిచే అన్ని రకాల ప్రాణుల్ని, పక్షుల్ని, అడవి జంతువుల్ని ఇలా అన్ని రకాల ప్రాణుల్ని మచ్చిక చేసుకున్నప్పటికిని,
\v 8 వాటిని మచ్చిక చేసుకున్నట్టుగా, ఎవ్వరు కూడా తమ మాటల్ని నియంత్రించుకోలేక పోతున్నారు. మనం మాట్లాడే మాటలు అదుపులేని చెడుతనంతో నిండి ఉంటాయి. మన మాటలు మనిషి ప్రాణం తీసే కాలకూట విషంలా గొప్ప హాని చేస్తాయి.
\s5
\v 9 మన తండ్రి, మన ప్రభువు అయిన దేవుణ్ణి స్తుతించటానికి మనం మన నాలుకను ఉపయోగిస్తాము. అయితే అదే నాలుకను ఉపయోగించి మనుషులకు చెడు చేయమని దేవుణ్ణి అడుగుతాము. అది తప్పు. ఎందుకంటే దేవుడు మనుషుల్ని తనలానే రూపించాడు.
\p
\v 10 మనం దేవుణ్ణి స్తుతిస్తాము కానీ అదే నోటితో ఇతరులకు చెడు జరగాలని కోరుకుంటాము. నా సహోదరి, సహోదరులారా, ఈ విధంగా ఉండకూడదు.
\s5
\v 11 ఒకే నీటి బుగ్గ నుంచి మంచినీరు, చేదునీరు బయటకు రావు.
\v 12 నా సోదరి సహోదరులారా, అంజూరు చెట్టుకు ఒలీవలు కాయవు. అలాగే ద్రాక్ష చెట్టుకు అంజూరాలు కాయవు. ఉప్పునీటి బుగ్గ నుంచి మంచి నీరు ఉబకదు. అదే విధంగా మంచిమాటలే మనం మాట్లాడాలి. చెడుమాటలు మాట్లాడరాదు.
\s5
\p
\v 13 మీలో ఎవరైనా తాము జ్ఞానవంతులమని, ఎక్కువ తెలిసిన వాళ్ళమని అనుకుంటే మీరు ఎప్పుడూ మంచిమార్గంలో ఇతరులతో మంచిగా ప్రవర్తిస్తూ, మీరు నిజంగా జ్ఞానవంతులు కావడం వల్ల మీ మంచి పనుల ఫలితాలను మనుషులకు అందించాలి. ఇతరుల పట్ల సున్నితంగా ప్రవర్తించటానికి మనకున్న జ్ఞానంతో సహాయపడాలి.
\v 14 కానీ మీరు ఇతరుల పట్ల అసూయ పడుతూ, వాళ్ళకు వ్యతిరేకంగా అబద్ధాలు చెబుతూ, వాళ్ళకు చెడు చేస్తూ మరోవైపు జ్ఞానవంతుల్లాగా నటించకూడదు. అలాంటి బడాయి పనులు చేయడం ద్వారా మీరు చెబుతున్నదేమిటంటే, ఏది అసలైన నిజమో అది అబద్ధంగా అవుతుంది.
\s5
\p
\v 15 దేవుడు మిమ్మల్ని ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో అలా కాకుండా, ఈ విధంగా ఆలోచన చేసేవాళ్ళు జ్ఞానవంతులు కారు. దానికి బదులుగా వీళ్ళు ఆయన్ని గౌరవించని మనుషుల్లా ఆలోచిస్తూ, ప్రవర్తిస్తున్నారు. వీళ్ళు తమ సొంత స్వార్ధ, చెడ్డ కోరికల ప్రకారం ఆలోచిస్తూ, ప్రవర్తిస్తున్నారు. సాతాను వీళ్ళు ఏం చేయాలని కోరుకుంటున్నాడో, వాటిని చేస్తున్నారు.
\v 16 ఈ విధంగా ఆలోచించే వ్యక్తులు తమను తాము నియత్రించుకోలేరని గుర్తుంచుకోండి. వీళ్ళు ఇతర మనుషులంటే అసూయతో ఉంటారు. తాము చేస్తున్నది సరైనదే అనేలా ప్రవర్తిస్తారు. ప్రతి విధమైన చెడ్డ పనులు చేస్తారు.
\p
\v 17 పరలోకంలో ఉన్న దేవుడే మనల్ని జ్ఞానవంతులుగా చేస్తాడు. అన్నిటికంటే ముందుగా ఆయన మనకు నైతికంగా, స్వచ్ఛంగా ఉండాలని బోధిస్తాడు. ఇతరులతో స్నేహంగా, సమాధానంగా, శాంతిగా ఉండటాన్ని ఆయన మనకు నేర్పిస్తాడు. ఇతరుల పట్ల దయగా ఉండాలని వాళ్ళకు సహాయపడాలని ఆయన మనకు బోధిస్తాడు, నేర్పిస్తాడు. అర్హతలేని వాళ్ళకి కూడా దయ చూపాలని ఆయన మనకు బోధిస్తాడు. శాశ్వత ఫలాలను ఇచ్చే మంచి పనులను చేయమని ఆయన మనకు బోధిస్తాడు. ఎదుటివాళ్ళకు మంచి చేయడం ఆపవద్దని, అందరితోను నిజాయితీగా ఉండాలని ఆయన మనకు బోధిస్తాడు.
\v 18 ఇతరులపట్ల శాంతియుతంగా ప్రవర్తించే వాళ్ళతో, అవతలి వాళ్ళు కూడా అదేవిధంగా శాంతియుతంగా ప్రవర్తిస్తారని, దాని ఫలితంగా వీళ్ళందరూ కలిసిమెలిసి జీవిస్తూ ఒకరితో నొకరు మంచి పద్దతుల్లో జీవిస్తారు.
\s5
\c 4
\p
\v 1 మీరు ఎందుకు ఒకరితోనొకరు పోట్లాడుకుంటూ ఘర్షణ పడుతున్నారో ఇప్పుడు నేను మీకు చెబుతాను. మీలో ప్రతి ఒక్కరూ మీ స్వంత సంతోషాలకోసం పాపపు పనులు చెయ్యాలనే కోరుకుంటున్నారు. అవి తోటి విశ్వాసులను సంతోష పెట్టవు.
\v 2 మీరు కోరుకునేవి ఎన్నో ఉన్నాయి. కానీ మీరు ఆ విషయాలను పొందలేరు. కాబట్టే వాటిని పొందకుండా అడ్డుపడుతున్న వాళ్ళను చంపాలని కోరుకుంటున్నారు. అయితే మీరు కోరుకున్న వాటిని పొందలేకపోతున్నారు కాబట్టే, మీరు ఒకరితోనొకరు గొడవపడుతూ, కొట్లాడుకుంటున్నారు. మీరు మీకు కావలసిన వాటి కోసం దేవుణ్ణి అడగలేదు. కాబట్టే మీరు కోరుకున్నవి పొందలేకపోతున్నారు.
\v 3 మీరు ఆయన్ని అడిగినా కూడా, మీరు అడిగినది మీకు ఇవ్వడు. ఎందుకంటే మీరు మీ దురుద్దేశాల కోసం, చెడ్డ మార్గాల్లో మీకు మీరు సుఖభోగాలు అనుభవించాలని, దేవుణ్ణి అడుగుతారు. అందుకే మీకు అవి అందని ద్రాక్ష పళ్ళు.
\s5
\p
\v 4 ఒక స్త్రీ తన భర్తపట్ల నమ్మకంగా లేనట్టుగానే , మీరు దేవుని పట్ల ద్రోహులై ఆయనకు ఏమాత్రం విధేయత చూపించడం లేదు. దుర్మార్గులై, చెడ్డగా ప్రవర్తించే వాళ్ళందరూ ఈ లోకానికి చెందినవాళ్ళే. వీళ్ళు దేవునికి శత్రువులు. బహుశా మీరు ఈ విషయాలను గ్రహించి ఉండరు.
\v 5 మన జీవితాలు దేవుణ్ణి సంతోషపెట్టేలా జీవించాలని, ఆయన మనలో ఉంచిన ఆత్మ మన కోసం ఆరాటపడుతుందని లేఖనాల్లో దేవుడు మన కోసం ఏ కారణంతో చెప్పాడో దాని గూర్చి మీరు ఎంతమాత్రం ఆలోచించరు.
\s5
\v 6 కానీ శక్తిమంతుడైన దేవుడు మన పట్ల చాలా దయగా ఉంటాడు. అందుకే మనం పాపం చేయకుండా ఉండటానికి మనకు సహాయపడాలని దేవుడు కోరుకుంటాడు. అందువల్లే దేవుడు గర్విష్టులను వ్యతిరేకిస్తాడు, కాని ఎవరైతే వినయంగా ఉంటారో, వాళ్ళకి సహాయం చేస్తాడు అని లేఖనాలు చెబుతున్నాయి.
\p
\v 7 కాబట్టి మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోండి. సాతాన్ని ఎదిరిస్తే, వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడు.
\s5
\v 8 ఆత్మీయంగా దేవుని దగ్గరకు రండి. మీరు అలా చేస్తే, ఆయన మీకు మరింత దగ్గరగా వస్తాడు. పాపం చేసే మీరు పాపపు పనులనుంచి దూరంగా జరిగి, మంచి పనులను మాత్రమే చెయ్యండి. మీకు మీరు దేవునికి కట్టుబడి ఉంటారో లేదో పాపపు ఆలోచనలను ఆలోచించటం మానివేసి, ఆయన ఆలోచనలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారో, లేదో మీరు నిర్ణయించుకోలేరా?
\v 9 మీరు చేసినది పాపమైనందువల్ల దుఖంతో విలపించండి. స్వార్ధపూరితంగా మాత్రమే మీరు వీటిని కోరుకున్నారు కాబట్టి, ఎంతమాత్రం ఆనంద పడవద్దు, నవ్వవద్దు. దానికి బదులుగా మీరు చేసిన ఈ స్వార్ధపూరిత ఆలోచనలను గూర్చి బాధపడండి, విచారించండి. మీరు చేసినదంతా స్వార్ధపూరిత ఆలోచనలు కాబట్టి బాధపడండి.
\v 10 ప్రభువు ముందు వినయంగా మీకు మీరు మోకరిల్లండి, మిమ్మల్ని మీరు తగ్గించుకుని మీ పాపాలను ఒప్పుకోండి. మీరు ఇలా చేస్తే ఆయన మిమ్మల్ని సన్మానిస్తాడు.
\s5
\p
\v 11 నా సోదరీ సోదరుల్లారా, ఒకరికి వ్యతిరేకంగా చెడ్డగా మాట్లాడడం మానేయండి. ఎందుకంటే తోటి విశ్వాసికి వ్యతిరేకంగా చెడ్డగా మాట్లాడే వాళ్ళు, మన సొంత సహోదరి, సహోదరుల్లాంటి వాళ్ళను వ్యతిరేకించే వాళ్ళు, దేవుడు పాటించమని ఇచ్చిన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మీరు ఇలా ఆయన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడినట్లైతే మీరు ఒక న్యాయమూర్తిలా దానిని ఖండిస్తున్నట్లుగా ప్రవర్తిస్తున్నారు.
\v 12 కానీ వాస్తవానికి మన పాపాలను క్షమించటానికి, మనుషులను ఖండించటానికి అధికారం ఉన్నది ఆయన ఒక్కడికి మాత్రమే. ఆయన ఒక్కడే మనలను రక్షించగలడు, మనలను నాశనం చేయనూ గలడు. దేవుని స్థానాన్ని తీసుకుని ఇతరులకు తీర్పు తీర్చే హక్కు నీకు ఎంతమాత్రం లేదు.
\s5
\p
\v 13 మీలో కొందరు పొగరుగా ఇలా అంటున్నారు. నేడో, రేపో మేము ఇదిగో ఆ నగరానికి, ఈ నగరానికి వెళ్తాము. మేము అక్కడ ఒక సంవత్సరం పాటు గడుపుతాము. అక్కడ మేము వస్తువులు కొని, ఆమ్మి చాలా డబ్బు సంపాదిస్తాము. ఇప్పుడు నా మాటలు శ్రద్ధగా వినండి.
\v 14 మీరు ఆ రకంగా మాట్లాడరాదు. ఎందుకంటే రేపేమి జరుగుతుందో మీకు తెలియదు. మీరెంత కాలం బ్రతుకుతారో మీకు తెలియదు. మీ జీవితం చాలా చిన్నది. పొగమంచులా కొద్దిసేపు ఉండి, తరువాత అదృశ్యమైపోతుంది.
\s5
\v 15 కాబట్టి మీరు చెబుతున్న దానికి బదులుగా ప్రభువుకు ఇష్టమైతే మేము జీవిస్తాము. ఆయనకు ఇష్టమైతే ఇది చేస్తాము, ఆయనకు ఇష్టమైతే అది చేస్తాము అని చెప్పాలి.
\v 16 కానీ మీరు చేస్తున్నదేమిటంటే, మీరు బడాయిగా అన్ని విషయాలను గూర్చి ప్రణాళికలు వేస్తున్నారు. మీ గర్వపు మాటలు చెడ్డవి.
\p
\v 17 కాబట్టి ఎవరైనా చేయవలసినదేమిటంటే, సరైనవేవో తెలుసుకుని చెయ్యాలి, అలా చేయకపోతే, అతడు పాపం చేస్తున్నాడు.
\s5
\c 5
\p
\v 1 క్రీస్తులో నమ్మిక ఉంచామని చెప్పే ధనవంతులకు నేను ఒక విషయాన్ని ఇప్పుడు చెప్పాలి. నా మాట వినండి. మీరు భయంకరమైన కష్టాలు అనుభవిస్తారు. కాబట్టి మీరు కన్నీరు కారుస్తూ, బిగ్గరగా ఏడవండి.
\v 2 మీ ఐశ్వర్యం కుళ్ళుతో నిండినది. పనికిరానిది. మీ ఖరీదైన బట్టలు చెద పట్టి నాశనం అయినట్టుగా ఎందుకూ పనికి రానివి.
\v 3 మీ వెండి, బంగారం క్రమంగా క్షీణించి పోయినట్లుగా ఏమాత్రం విలువ లేనివి. దేవుడు మీకు తీర్పు తీర్చేటప్పుడు మీ పనికి రాని ఈ సంపద మీరు అత్యాశతో సంపాదించారనీ, ఆ సంపాదనే మీరు దోషి అనీ రుజువు చేస్తుంది. తుప్పు, అగ్ని వస్తువులను నాశనం చేసినట్లుగా, దేవుడు మిమ్మల్ని కఠినంగా శిక్షిస్తాడు. దేవుడు మీకు తీర్పు తీర్చబోయే సమయంలో మీరు పనికిరాని ఈ సంపాదనను నిల్వ చేశారు.
\s5
\p
\v 4 మీరు చేసిన దాని గూర్చి ఒకసారి ఆలోచించండి. మీ పొలాల్లో పనిచేసిన కూలీలకు ఇస్తామని వాగ్దానం చేసిన కూలి డబ్బు మీరు చెల్లించలేదు. ఆ డబ్బుని మీ దగ్గరే ఉంచుకోవడం ద్వారా మీకు మీరే వాళ్ళ పట్ల ఎంత అన్యాయంగా ఉన్నారో అని మీ అపరాధాన్ని నాకు చూపిస్తున్నారు. మీరు వాళ్ళ పట్ల ప్రవర్తిస్తున్న తీరుగూర్చి ఆ కూలీలు దేవునికి మొర పెడుతున్నారు. దేవదూతల సైన్యానికి ప్రభువైన దేవుడు వాళ్ళు పెడుతున్న ఆర్తనాదాలు వింటున్నాడు.
\v 5 మీరు రాజుల్లా జీవించటానికి ఏది కావాలంటే దాన్ని కోరుకున్నారు. తమను వధిస్తారని గ్రహింపులేని కొవ్వు పట్టిన పశువుల్లా మీరు మీ జీవితాలను ఆస్వాదించటానికి మాత్రమే బ్రతుకుతున్నారు. దేవుడు మిమ్మల్ని కఠినంగా శిక్షిస్తాడని మీరు గ్రహించడం లేదు.
\v 6 అమాయకులైన ప్రజలను ఖండించడానికే మీరు అనుకూలులైన ఇతరులను మీ కోసం ఏర్పాటు చేసుకున్నారు. ఆ మనుషులు ఏ తప్పూ చేయకపోయినా, వాళ్ళను చంపటానికి మీకు అనుకూలంగా మాట్లాడే ఇతరులను మీరు ఏర్పాటు చేసుకున్నారు. మీకు వ్యతిరేకంగా తమను తాము రక్షించుకోవడం ఆ అమాయకుల వల్ల కాలేదు. నా సహోదరి, సహోదరుల్లారా, మిమ్మల్ని అణచివేసిన ఈ ధనవంతులకు నేను చెప్పేది అదే.
\s5
\p
\v 7 నా సహోదరి, సహోదరుల్లారా, ధనవంతులు మీ బాధలకు కారణం అయినప్పటికీ, ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి వచ్చేదాకా సహనంతో ఓపిక పట్టండి. రైతులు పొలంలో పైరు నాటినప్పుడు, తమ విలువైన పంట ఎదిగి, చేతికి వచ్చేదాకా ఎలా వేచి ఉంటారో గుర్తుకు తెచ్చుకోండి. నాట్లు వేసే కాలంలో పడే వర్షం కోసం, కోతకాలానికి ముందు వచ్చే వర్షం కోసం రైతులు ఓపిగ్గా వేచి ఉండాలి. పంట ఎదిగి, పరిపక్వం కావడం కోసం వాళ్ళు కోతకాలం దాకా ఎదురు చూడాలి.
\v 8 అదే విధంగా యేసుక్రీస్తు ప్రభువు పై గట్టి విశ్వాసముంచి ఓపికతో వేచి ఉండాలి. ఎందుకంటే ఆయన త్వరలోనే తిరిగి వస్తాడు. ప్రజలందరికీ న్యాయమైన తీర్పు తీరుస్తాడు.
\s5
\p
\v 9 నా సహోదరీ సహోదరుల్లారా, యేసు ప్రభువు మిమ్మల్ని ఖండించి, శిక్షించకుండా ఉండే విధంగా ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోకండి. ఆయనే మనకు తీర్పు తీర్చేవాడు. మనకు ప్రత్యక్షం కావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు.
\v 10 నా సహోదరి, సహోదరుల్లారా, సహనంగా ఎలా ఉండాలో అనేదానికి ఉదాహరణగా, చాలా కాలం క్రిందట ప్రభువైన దేవుడు పంపిన ప్రవక్తలను చూడండి. వాళ్ళకు ప్రజలు చాలా బాధలు కలిగించినప్పటికీ, ఎంతో సంతోషంతో, ఓపికతో వాటిని భరించారు.
\v 11 దేవుడు తన కోసం బాధలు పడే వాళ్ళకు సహాయం చేస్తూ, సన్మానిస్తాడని మనకు తెలుసు. మీరు యోబును గూర్చి విన్నారు కదా. అతడు చాలా బాధలు పడ్డప్పటికీ ఆ బాధలను తన సహనంతో భరించినందువల్ల యోబుకు తగిన ఫలితాన్ని తీసుకు రావడానికి ప్రభువైన దేవుడు యోచించాడని మీకు తెలుసు. ఈ సంఘటన నుంచి మనకు తెలిసినది ఏమిటంటే, మన ప్రభువైన దేవుడు దయామయుడు, కరుణామయుడని.
\s5
\p
\v 12 అలాగే నా సహోదరి, సహోదరుల్లారా, ముఖ్యంగా మీరు ఎలా మాట్లాడుతున్నారనే దాని గూర్చి నేను కొద్దిగా చెప్పాలని అనుకుంటున్నాను. మీరు చేసే ప్రమాణాలకు సాక్షిగా ఉండటానికి పరలోకం మీద, భూమిమీద ఒట్టు పెట్టకూడదు. మీరందరూ అవును అంటే అవుననే ఉండాలి. కాదు అంటే కాదనే ఉండాలి. మీరు అంతకంటే ఎక్కువ చెప్పారంటే దేవుడు మీకు తీర్పు తీరుస్తాడు.
\s5
\p
\v 13 మీలో ఎవరైతే కష్టాలను అనుభవిస్తున్నారో, వాళ్ళు దేవుడు తనకు సాయం చేసేలా మొరపెట్టాలి. మీలో ఎవరైతే ఆనందంగా ఉన్నారో, వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ, పాటలు పాడాలి.
\v 14 మీలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, అతడు తన కోసం ప్రార్థన చేయటానికి సంఘ పెద్దలను పిలవాలి. ఆ సంఘ పెద్దలు వెళ్లి, ఆలివ్ నూనెను అతనికి పూసి , ప్రభువు అధికారంతో ప్రార్ధించాలి.
\v 15 విశ్వాసంతో దేవునికి సమర్పించిన ఆ ప్రార్థన ఆనారోగ్యంతో ఉన్న ఆ వ్యక్తిని బాగుచేస్తుంది. అతని ఆరోగ్యాన్ని ప్రభువు తిరిగి అతనికి ఇస్తాడు. ఆ వ్యక్తి పాపం చేస్తే, దేవుడు అతణ్ణి క్షమిస్తాడు.
\s5
\v 16 ప్రభువు రోగులను బాగు చేస్తాడు, మన పాపాలను క్షమిస్తాడు. కాబట్టి మీరందరూ చేసిన పాతకాలను ఒకరితో ఒకరు చెప్పుకోండి. ఒకరి కోసం మరొకరు స్వస్థత పొందేలా ప్రార్ధించండి. నీతిమంతులైన మనుషులు ప్రార్ధించి, దేనికోసమైనా దేవుణ్ణి తీవ్రంగా అడిగినట్టయితే, దేవుడు శక్తివంతంగా స్పందిస్తాడు. కచ్చితంగా వాళ్ళ ప్రార్థనకు అనుగుణంగా చేస్తాడు.
\v 17 మనలాగే ఏలియా ప్రవక్త కూడా సాధారణ మానవుడు అయినప్పటికీ, వర్షం పడకూడదని దృఢ సంకల్పంతో ప్రార్ధించాడు. అప్పుడు మూడున్నర సంవత్సరాలు వర్షం పడలేదు.
\v 18 అతడు మళ్ళీ వర్షం పంపించమని ప్రార్ధించినప్పుడు, దేవుడు వర్షం కురిపించాడు. అప్పుడు మళ్ళీ మొక్కలు పెరిగి పంటలు పండాయి.
\s5
\p
\v 19 నా సహోదరీ సహోదరుల్లారా, దేవుని నుంచి వచ్చిన సత్యసువార్తను మీలో ఎవరైనా పాటించకుండా అడ్డగిస్తే మీలో ఎవరో ఒకరు అతని దగ్గరకు వెళ్ళి దేవుడు మనకు ఏం చేయమని చెప్పాడో మళ్ళీ అతనికి వివరించి చెప్పాలి. ఆ పాపం చేస్తున్న వ్యక్తి, తాను చేస్తున్న తప్పులను తెలుసుకుని అపివేసినట్లయితే,
\v 20 అతనికి ఆ విధంగా చెప్పిన వ్యక్తి కారణంగా దేవుడు ఆ పాపిని ఆత్మీయ మరణం నుంచి రక్షిస్తాడు. అతని విస్తారమైన పాపాలను దేవుడు క్షమించాడని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి.