STR_te_iev/54-2TH.usfm

99 lines
23 KiB
Plaintext

\id 2TH - Indian Easy Version (IEV) Telugu
\ide UTF-8
\h తెస్సలోనీకయులకు రాసిన రెండవ పత్రిక
\toc1 తెస్సలోనీకయులకు రాసిన రెండవ పత్రిక
\toc2 తెస్సలోనీకయులకు రాసిన రెండవ పత్రిక
\toc3 2th
\mt1 తెస్సలోనీకయులకు రాసిన రెండవ పత్రిక
\s5
\c 1
\p
\v 1 మన తండ్రి అయిన దేవుణ్ణి, యేసు క్రీస్తు ప్రభువును నమ్మిన తెస్సలోనిక నగరంలోని విశ్వాసుల సంఘానికి పౌలు, సిల్వాను, తిమోతి ఈ ఉత్తరం రాస్తున్నాము.
\v 2 తండ్రి అయిన దేవుడు, యేసు క్రీస్తు ప్రభువు మీ పట్ల కృప చూపిస్తూ మీకు శాంతిని ఇవ్వడం కొనసాగించాలని మేము ప్రార్థన చేస్తున్నాము.
\s5
\p
\v 3 మా తోటి విశ్వాసులారా! మీలో ప్రతి ఒక్కరూ ఒకరిని ఒకరు మరింతగా ప్రేమించుకుంటూ, యేసు ప్రభువులో విశ్వాసం పెంచుకుంటూ ఉన్నందుకు మేము ఎప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము.
\v 4 దీని ఫలితంగా, దేవునికి చెందిన ఇతర విశ్వాసుల సంఘాల్లో మీ గురించి గర్వంగా చెప్తున్నాము. మీరు ఎంత ఓర్పుగా ఉంటున్నారో, ఇతరులు మిమ్మల్ని తరచుగా ఎంతో ఇబ్బంది పెడుతున్నా యేసు ప్రభువులో మీరు విశ్వాసాన్ని ఎలా కొనసాగిస్తున్నారో మేము వాళ్లకి చెప్తున్నాము.
\p
\v 5 మీరు ఆ ఇబ్బందులను భరిస్తున్నారు కాబట్టి దేవుడు ప్రజలందరికీ న్యాయం తీర్చుతాడని స్పష్టంగా మీకు తెలుసు. మీరు ఆయనలో విశ్వాసం ఉంచి బాధలు పడుతున్నారు కాబట్టి ఆయన ఏలుబడిలో మీరు నిత్యం ఉంటారని ప్రతి ఒక్కరికీ ఆయన వెల్లడిస్తాడు.
\s5
\v 6 మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళకి దేవుడు కచ్చితంగా ఇబ్బంది కలిగిస్తాడు. ఇలా చేయడం ఆయనకు సరైనదే.
\v 7 మిమ్మల్ని కష్టాల గుండా తేవడం వల్ల ఆయన మీకు ప్రతిఫలం ఇస్తాడు. అది ఆయన సరైనదిగానే పరిగణిస్తాడు. యేసు ప్రభువు తన శక్తివంతమైన దూతలతో పరలోకం నుండి తిరిగి వచ్చినప్పుడు ఆయన మీకు, మాకు కూడా ప్రతిఫలం ఇస్తాడు.
\v 8 అప్పుడు మన యేసు ప్రభువు గురించిన శుభవార్త అంగీకరించకుండా నిరాకరించిన వాళ్ళని, తనకు నమ్మకంగా లేని వాళ్ళని ఆయన దావానలంతో శిక్షిస్తాడు.
\s5
\p
\v 9 మన యేసు ప్రభువు గొప్ప శక్తితో అలాటి వారిని తాను ఏలుతున్న చోటు నుండి దూరంగా తరిమి వేసి, శాశ్వతంగా నాశనం చేస్తాడు.
\v 10 దేవుడు నిర్ణయించిన సమయంలో యేసు ప్రభువు పరలోకం నుండి తిరిగి వచ్చినప్పుడు ఇలా జరుగుతుంది. దీని ఫలితంగా, మనమంతా ఆయనను స్తుతిస్తూ, ఆయన్ని చూసి ఆశ్చర్యపోతాము. మేము వివరించిన విధంగా మీరు నమ్మారు కాబట్టి మీరు కూడా అక్కడే ఉంటారు.
\s5
\p
\v 11 ఈ విధంగా యేసును మీరు స్తుతించాలని మేము కూడా మీకోసం ఎప్పుడూ ప్రార్థన చేస్తున్నాము. మీరు జీవించాలని దేవుడు మిమ్మల్ని పిలిచిన కొత్త మార్గంలో జీవించడానికి మీరు అర్హులయ్యేలా మేము ప్రార్థన చేస్తున్నాము. మీరు కోరుకున్న ప్రతి దానిలో మీరు మంచి చేయగలిగేలా ఆయన చేయాలని కూడా మేము ప్రార్థన చేస్తున్నాము. ఆయన శక్తిమంతుడు కాబట్టి, ఆయనలో మీరు విశ్వాసముంచిన కారణంగా ప్రతి విధమైన మంచి పనినీ మీరు చేయగలిగేలా ఆయన చేస్తాడు.
\v 12 మీరు యేసు ప్రభువును స్తుతించాలనీ ఆయన మిమ్మల్ని ఘనపరచాలనీ మేము ఇలా ప్రార్థన చేస్తున్నాము. మనం ఆరాధించే దేవుడు, మన యేసు క్రీస్తు ప్రభువు మీపైన కృప చూపిస్తాడు కాబట్టి ఇది జరుగుతుంది.
\s5
\c 2
\p
\v 1 యేసు క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చే సమయం గురించి, యేసుతో మనల్ని దేవుడు సమకూర్చడం గురించి నేను మీకు ఇప్పుడు రాయాలనుకుంటున్నాను.
\v 2 నా తోటి విశ్వాసులారా! యేసు ప్రభువు భూమికి తిరిగి రావడం ఇప్పటికే జరిగిపోయిందని మీకు వచ్చిన ఏ సందేశం గురించి అయినా సరే జాగ్రత్త పడమని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. అది దేవుని ఆత్మ తనకు బయలు పరిచాడని ఎవరైనా ఇచ్చే సందేశం కావచ్చు. లేదా ఎవరో ఒకరు నేను రాసిన ఉత్తరంలో ఉన్న సంగతి అని చెప్పవచ్చు.
\s5
\v 3 ఎవరైనా మిమ్మల్ని ఇలాంటి సందేశంతో నమ్మించి, ఒప్పించాలని ప్రయత్నిస్తే అంగీకరించకండి.
\p ప్రభువు వెంటనే రాడు. మొదట చాలామంది దేవునికి వ్యతిరేకం అవుతారు. దేవునికి పూర్తిగా వ్యతిరేకంగా పాపం చేసే వాడికీ దేవుడు నాశనం చేసే వాడికీ వాళ్ళు లోబడి, వాడిని అంగీకరిస్తారు.
\v 4 దేవునికి పెద్ద శత్రువు వాడే. ప్రజలు దేవునిగా పరిగణిస్తున్న ఆయనకు వాడు వ్యతిరేకంగా గర్వంగా పనిచేస్తాడు. దీని ఫలితంగా, దేవుని ఆలయంలోకి ప్రవేశించి, ఏలడానికి కూర్చుంటాడు. తననే దేవుడిగా బహిరంగంగా ప్రకటించుకుంటాడు.
\s5
\p
\v 5 నేను తెస్సలోనీకలో మీతో ఉన్నప్పుడు ఈ విషయాలు మీతో చెప్తూనే ఉన్నానని చెప్పగలను.
\v 6 ఇప్పుడైతే అందరికీ తనను వెల్లడి పరచుకోనియ్యకుండా అతడిని అడ్డగిస్తున్నది ఏదో ఉందని మీకు కూడా తెలుసు. దేవుడు వాడికి అనుమతిని ఇచ్చే సమయం వరకు వాడు తనను కనపరచుకోలేడు.
\v 7 అయినా దేవుని నియమాలను ప్రజలు నిరాకరించేలా ఇప్పటికే సాతాను రహస్యంగా పనిచేస్తూ ఉన్నా, తనను ప్రదర్శించుకోవాలని అనుకుంటున్న ఈ మనిషిని అడ్డుకునేవాడిని దేవుడు తొలగించే వరకు అతన్ని అడ్డుకోవడం కొనసాగుతూనే ఉంటుంది.
\s5
\p
\v 8 ఆ తరవాత దేవుని నియమాలను పూర్తిగా తిరస్కరించిన ఈ మనిషి ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ తనను కనపరచుకోడానికి దేవుడు అనుమతిస్తాడు.యేసు క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు ప్రతివారికీ తనను కనుపరచుకుంటూ, ఆ మనిషిని పూర్తిగా శక్తిహీనుణ్ణి చేస్తాడు. తరవాత వాడు నాశనం కావాలని యేసు ప్రభువు ఒక్క ఆజ్ఞ ఇస్తాడు.
\v 9 కానీ వాణ్ణి యేసు నాశనం చేయక ముందు సాతాను వాడికి చాలా గొప్ప శక్తినిస్తాడు. దాని ఫలితంగా వాడు అన్ని రకాల ఆశ్చర్యకార్యాలూ, అద్భుతాలూ చేస్తాడు. అవన్నీ చేయడానికి వాడికి ఆ సామర్ధ్యాన్ని దేవుడే ఇచ్చాడని చాలామంది నమ్ముతారు.
\p
\v 10 కీడు కలిగించేవి చేయడం ద్వారా ఆ మనిషి నాశనానికి గురయ్యే వాళ్ళని పూర్తిగా మోసగిస్తాడు. యేసు ఎలా వాళ్ళని రక్షించగలడో, దాని గురించిన నిజమైన సందేశాన్ని వాళ్ళు ఇష్టపడకుండా తిరస్కరించిన కారణంగా వాడు వాళ్ళని మోసం చేయగలిగాడు.
\s5
\v 11 వాళ్ళను సులభంగా మోసగించడానికి ఈ మనిషిని దేవుడు నియమించడం వల్ల ఈ మనిషి తన గురించి చెప్పిన అబద్ధాలను వాళ్ళు నమ్ముతారు.
\v 12 ఫలితంగా, చెడు చేసి ఆనందిస్తూ క్రీస్తు గురించిన సత్యాన్ని నమ్మకుండా తిరస్కరించిన అందరికీ దేవుడు తీర్పు తీర్చి, శిక్షిస్తాడు.
\s5
\p
\v 13 మా తోటి విశ్వాసులారా! మీరు యేసు ప్రభువును ప్రేమించే వారు. మిమ్మల్ని బట్టి మేము దేవునికి వందనాలు చెప్తున్నాము. యేసును గురించిన సత్యాన్ని విశ్వసించే వారిలోనూ దేవుడు రక్షించాలి అనుకునే వారిలోనూ మొదటి వారిగా ఉండాలనీ ఆయన మిమ్మల్ని తన కోసం తన ఆత్మ ద్వారా ప్రత్యేకపరచుకోవాలనీ మిమ్మల్ని ఎన్నుకున్నాడు కాబట్టి, మేము ఇలా కృతజ్ఞతలు చెప్తున్నాము.
\v 14 మన యేసు క్రీస్తు ప్రభువును దేవుడు ఘనపరచిన విధంగా మిమ్మల్ని కూడా దేవుడు ఘనపరిచే క్రమంలో క్రీస్తు గురించిన సందేశం మేము మీకు ప్రకటించిన ఫలితంగా మిమ్మల్ని ఆయన ఎన్నుకున్నాడు. అందుకే మేము దేవునికి వందనాలు చెప్తున్నాము.
\p
\v 15 అందుకే మా తోటి విశ్వాసులారా! క్రీస్తులో బలమైన విశ్వాసంతో కొనసాగండి. మేము మీకు రాసిన, చెప్పిన, బోధించిన నిజమైన విషయాలను విశ్వసించడం కొనసాగించండి.
\s5
\v 16 మనల్ని ప్రేమించి, ఆయన దయ చొప్పున ఆయన నుండి మంచి వాటిని పొందాలని మనలను నిత్యం ప్రోత్సహించిన తండ్రి అయిన దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తుకు మేము ప్రార్థన చేస్తున్నాము.
\v 17 దేవుడు, యేసు క్రీస్తు కలసి మిమ్మల్ని ప్రోత్సహించుదురు గాక! మంచి చెప్తూ, చేస్తూ ఉండేలా మిమ్మల్ని కొనసాగింపజేయు గాక!
\s5
\c 3
\p
\v 1 నా తోటి విశ్వాసులారా! ఇతర విషయాలకు వస్తే, మీరు అంగీకరించినట్టు యేసు ప్రభువును గురించిన మా సందేశాన్ని ఇతరులు కూడా తొందరగా విని, దానిని గౌరవించేలా మా కోసం ఇంకా ఇంకా ప్రార్థన చేయండి.
\v 2 ప్రభువులో విశ్వాసం అందరికీ ఉండదు. మాకు చెడు చేస్తూఉండే వాళ్ళను మాకు దూరంగా ఉంచేలా కూడా ప్రార్థన చేయండి.
\v 3 ఏది ఏమయినా యేసు ప్రభువు నమ్మదగినవాడు. అందుకే మీరు తప్పకుండా బలంగా ముందుకు కొనసాగేలా చేస్తాడు. చెడ్డ వాళ్ళ నుండి, సాతాను నుండి కూడా మిమ్మల్ని తప్పకుండా కాపాడతాడు.
\s5
\v 4 మనం అందరం యేసు ప్రభువుతో చేరాము కాబట్టి, మేము మీకు ఆజ్ఞాపించిన వాటికి మీరు విధేయత చూపారనీ, ఈ ఉత్తరంలో మేము ఆజ్ఞాపిస్తున్న వాటికీ విధేయత చూపిస్తారనీ మేము నమ్ముతున్నాము.
\v 5 దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో, క్రీస్తు మీ కోసం ఎంత హింస భరించాడో మీరు తెలుసుకోవడంలో మీకు సహాయం చెయ్యాలని మన యేసు ప్రభువుకు మేము ప్రార్థన చేస్తున్నాము.
\s5
\p
\v 6 మా తోటి విశ్వాసులారా! యేసుప్రభువే స్వయంగా మీతో చెబుతున్నట్టుగా అనుకుంటూ ఇది వినండి. పని చేయకుండా బద్ధకస్తులుగా ఉన్నవాళ్ళతో ఎలాటి సంబంధం పెట్టుకోవద్దని మీకు ఆజ్ఞాపిస్తున్నాము. ఇతరులు మాకు బోధించగా విని మేము మీకు బోధించిన విధంగా తమ జీవితాలను నిర్వహించుకోలేని వాళ్లకు దూరంగా ఉండండి.
\v 7 మేము ఎలా ప్రవర్తిస్తామో మీరు కూడా అలాగే ప్రవర్తిస్తారు. మీ మధ్య మేము ఉంటుండగా పని చేయకుండా మీ చుట్టూ ఊరికే కూర్చో లేదు కాబట్టి ఇది మీకు చెప్తున్నాము.
\v 8 మీ దగ్గర మేమెలా ప్రవర్తించామో మీరు తెలుసుకోవాలనీ, మీరూ అలాగే ప్రవర్తించాలనీ మేము చెప్తున్నాం. మీ దగ్గర ఉన్నప్పుడు మేము డబ్బు చెల్ల్లించకుండా ఎవరి దగ్గరా భోజనం చెయ్యలేదు. ఈ క్రమంలో మా అవసరాలకు ఎవరిపైనా ఆధారపడలేదు.
\v 9 నేను అపోస్తలుడను కాబట్టి మీపై ఆధారపడే హక్కు నాకు ఎప్పుడూ ఉంది, కానీ మీకు మంచి ఉదాహరణలుగా ఉండాలని మేము కష్టపడి పనిచేసాము. ఆ క్రమంలో మేము నడుచుకున్నట్టు మీరు కూడా నడుచుకోవాలి.
\s5
\p
\v 10 మేము మీతో ఉండగా ఏ తోటి విశ్వాసి అయినా పని చేయడానికి నిరాకరిస్తే, వాడికి భోజనం పెట్టవద్దని నేను మీకు ఆజ్ఞాపిస్తూనే ఉన్నానని గుర్తు చేసుకోండి.
\v 11 మీలో ఎవరో బద్ధకస్తులుగా ఉంటూ, పని చేయడం లేదని నాకు కొందరు చెప్పారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇది రాస్తున్నాను. అది మాత్రమే కాదు, వాళ్ళు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటూ ఉన్నారు.
\v 12 ఇలా పని చేయని తోటి విశ్వాసులకు యేసు ప్రభువే చెప్తున్నాడని భావిస్తూ వాళ్ళ పనిని వాళ్ళు చూసుకుంటూ, జీవించడానికి సొంతగా సంపాదించుకుంటూ వాళ్ళ పోషణ చూసుకోవాలని బతిమాలుకుంటున్నాను.
\s5
\p
\v 13 తోటి విశ్వాసులారా! సరైనది చేయడానికి ఎప్పుడూ విసుక్కోవద్దు.
\p
\v 14 ఈ ఉత్తరంలో రాసిన దానికి ఏ విశ్వాసి అయినా లోబడకపోతే అతన్ని కనిపెట్టండి. అతను సిగ్గుపడేలా అతనితో కలిసి ఉండవద్దు.
\v 15 అతన్ని శత్రువులా భావించకండి. మీ తోటి విశ్వాసులను హెచ్చరించినట్టు హెచ్చరించండి.
\s5
\p
\v 16 తన ప్రజలకు శాంతిని ఇచ్చే మన ప్రభువే ప్రతి పరిస్థితిలో మీకు ఎప్పుడూ శాంతిని కలిగించాలని నా ప్రార్థన. మన యేసు ప్రభువు మీకు సహాయం చేయడం కొనసాగించాలని నా ప్రార్థన.
\p
\v 17 రాసే వాడి నుండి కలం తీసుకుని పౌలు అనే నేను స్వయంగా రాస్తున్నాను. నా ఉత్తరాలన్నిటిలో మీకు నేనే రాసానని తెలియాలని నేను ఇలా చేసి, నా ఉత్తరాలన్నిటినీ ముగిస్తాను.
\v 18 యేసు క్రీస్తు ప్రభువు కృప మీ అందరి పైన కొనసాగాలని నా ప్రార్థన.