STR_te_iev/53-1TH.usfm

183 lines
42 KiB
Plaintext

\id 1TH - Indian Easy Version (IEV) Telugu
\ide UTF-8
\h తెస్సలోనీకయులకు రాసిన మొదటి పత్రిక
\toc1 తెస్సలోనీకయులకు రాసిన మొదటి పత్రిక
\toc2 తెస్సలోనీకయులకు రాసిన మొదటి పత్రిక
\toc3 1th
\mt1 తెస్సలోనీకయులకు రాసిన మొదటి పత్రిక
\s5
\c 1
\p
\v 1 పౌలు అనే నేను ఈ ఉత్త్తరం రాస్తున్నాను. నాతోబాటు సిల్వాను, తిమోతి కూడా ఉన్నారు. తండ్రి అయిన దేవునితో, యేసు క్రీస్తు ప్రభువుతో చేరిన తెస్సలోనీక సంఘ విశ్వాసులకు మేము ఈ ఉత్తరాన్ని పంపుతున్నాము. దేవుడు మీపైన దయ చూపి శాంతిని ఇచ్చు గాక!
\s5
\p
\v 2 మేము ప్రార్థన చేస్తున్నపుడు మీ అందరి విషయంలో ఎప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెప్తుంటాము.
\v 3 మీరు దేవునిలో విశ్వాసముంచి, మనుషుల్ని ప్రేమించి ఎంతో ఆదరంగా వాళ్లకు సాయం చేస్తున్నారు కాబట్టి మీరు మన తండ్రి అయిన దేవుని కోసం పని చేస్తున్నారని మేము జ్ఞాపకం ఉంచుకుంటూనే ఉన్నాం. మన యేసు క్రీస్తు ప్రభువు మీకు తెలుసు కాబట్టి మీకు భవిష్యత్తు మీద దృఢమైన విశ్వాసం ఉంది.
\s5
\v 4 తన ప్రజలుగా అవ్వాలని దేవుడు మిమ్మల్ని ఎంపిక చేసుకున్నాడని మాకు తెలుసు కాబట్టి, ఆయన ప్రేమించే నా తోటి విశ్వాసులుగా మీ గురించి దేవుడికి మేము వందనాలు చెప్తున్నాము.
\p
\v 5 మేము మీకు సువార్త చెప్పినప్పుడు అది మాటలకు మించి ఉంది కాబట్టి, ఆయన మిమ్మల్ని ఎన్నుకున్నాడని మాకు తెలుసు. పరిశుద్ధాత్మ మీ మధ్య శక్తివంతంగా పనిచేస్తున్నాడు. మేము మీకు ఇచ్చే వర్తమానం నిజమైనదని ఆయన మనకు బలంగా హామీ ఇస్తున్నాడు. అదే విధంగా మేము ఎలా మాట్లాడామో మీకు తెలుసు. మీకు సాయం చేయాలనుకున్న క్రమంలో మేము మీతో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించామో మీకు తెలుసు.
\s5
\p
\v 6 ఇప్పుడు మీరు మా ఆదర్శాన్ని అనుసరిస్తూ, మేము జీవిస్తున్నట్టే మీరు కూడా జీవిస్తున్నారని విన్నాము. అంతకంటే ముఖ్యమైంది మన ప్రభువు జీవించిన విధానంలోనే మీరు కూడా జీవిస్తున్నారు. మీరు ఎన్నో కష్టాల, పరీక్షల గుండా వెళ్ళవలసి వచ్చింది. అయినా సరే పరిశుద్ధాత్మ నుండి మాత్రమే వచ్చే గొప్ప ఆనందంతో దేవుని ప్రేమ సందేశాన్ని మీరు పొందారు.
\v 7 మాసిదోనియా, అకయ రాష్ట్రాల్లో ఉన్న విశ్వాసులందరూ దేవునిలో నమ్మకం ఎలా ఉంచాలో మీరు నేర్చుకున్నట్టే, ఆయన్ని మీరు నమ్మినట్టే, వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు.
\s5
\v 8 యేసు ప్రభువు నుండి మీరు చెప్పిన సందేశం ఇతరులు కూడా విన్నారు. వాళ్ళు కూడా మాసిదోనియ, అకయ అంతా నివసించే వాళ్లకు శుభవార్త ప్రకటించారు. అది మాత్రమే కాదు, మీరు దేవునిలో విశ్వాసం ఉంచారని దూర ప్రాంతాల వాళ్ళు కూడా విన్నారు. కాబట్టి మీ జీవితాల్లో దేవుడు ఏమి చేసాడో ప్రజలకి మేము చెప్పే అవసరం లేదు. మీ జీవితాలు తెరిచిన పుస్తకాలు.
\p
\v 9 మేము మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు మమ్మల్ని ఎంత హృదయ పూర్వకంగా ఆహ్వానించారో దూర ప్రాంతాల వాళ్ళు ఇతరులకి చెప్తున్నారు. అబద్ధ దేవుళ్ళను పూజించడం మీరు మానివేశారనీ జీవిస్తున్న ఏకైక దేవుణ్ణి సేవిస్తున్నారనీ ఒకే ఒక్క, నిజమైన దేవుడు ఆయనే అనీ వాళ్ళు కూడా సమాచారం అందించారు.
\v 10 పరలోకం నుండి భూమికి ఆయన కుమారుడు తిరిగి వస్తాడని మీరు కనిపెడుతూ ఎదురు చూస్తున్నారు అని కూడా వాళ్ళు చెప్పారు. ఆయన చనిపోయాక దేవుడు మళ్ళీ బ్రతికించాడని మీరు స్థిరంగా నమ్ముతున్నారు. లోకంలో ఉన్న వాళ్ళందర్నీ దేవుడు శిక్షించినప్పుడు, యేసులో విశ్వాసం ఉంచిన వాళ్ళని ఆయన రక్షిస్తాడని కూడా మీరు నమ్ముతున్నారు.
\s5
\c 2
\p
\v 1 నా తోటి విశ్వాసులారా, మీతో మేము గడిపిన సమయం చాలా విలువైనది.
\v 2 ఫిలిప్పీ నగర ప్రజలు మమ్మల్ని అవమానించి వేధింపులకి గురిచేసారని మీకు తెలుసు. మేము ధైర్యం పొందడానికి దేవుడు ఇలా జరిగించాడు. దీని ఫలితంగా, మీ ఊరి వారు కొందరు వ్యతిరేకించినా దేవుడు మమ్మల్ని పంపి, చెప్పమన్న శుభవార్త మీకు చెప్పాము.
\s5
\v 3 దేవుని ఉపదేశానికి లోబడమని మేము మిమ్మల్ని ప్రోత్సహించినప్పుడు మేము మీకు అబద్ధం ఏమీ చెప్పలేదు. నీతిమాలిన విధానంలో మీనుండి మేము ఏమీ పొందాలనుకోలేదు. మేము మిమ్మల్ని కానీ ఎవరినైనా కానీ మోసం చేయడానికి ప్రయత్నించలేదు.
\v 4 దీనికి విరుద్ధంగా, దేవుడు మమ్మల్ని పరీక్షించి, ఈ పని చేయడానికి సరైన వారుగా భావించాడు కాబట్టి మీకు శుభవార్త చెప్పడంలో దేవుడు మమ్మల్ని నమ్మాడు. మేము బోధించినప్పుడు వాళ్లకి ఇష్టమయ్యింది. మేము వాళ్లకి చెప్పలేదు. మన ఆలోచనలు అన్నిటికీ ఆయన తీర్పు తీర్చుతాడు కాబట్టి మేము ఏమి చెప్పాలని దేవుడు అనుకున్నాడో అదే చెప్పాము.
\s5
\p
\v 5 మీ దగ్గర నుండి ఏదో పొందాలని మేము ఎప్పుడూ మిమ్మల్ని పొగడలేదు. మీరు మాకు ఏదో ఇచ్చేలా ఒప్పించడానికి ఎప్పుడూ మాట్లాడలేదు. ఇది నిజమని దేవునికి తెలుసు.
\p
\v 6 క్రీస్తు మమ్మల్ని పంపాడు కాబట్టి మేము మీతో ఉన్నప్పుడు మా జీవనోపాధికి కావలసినవి నమకూర్చమని మా హక్కుగా భావించి అడగవచ్చు. కానీ మేము మీ నుండి అలాటివి పొందడానికి ప్రయత్నించలేదు.
\s5
\v 7 ఒక తల్లి తన సొంత పిల్లలతో ఉన్నట్టు మీ మధ్య ఉన్నప్పుడు మేము మీతో మృదువుగా ఉన్నాము.
\v 8 మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం కాబట్టి దేవుడు మనకు ఇచ్చిన ఆ మంచి సందేశాన్ని మీతో వ్యక్తిగతంగా పంచుకోడం మాకు సంతోషం. మేము మిమ్మల్ని ఎంతో ప్రేమించడం మొదలు పెట్టాము కాబట్టి మేము చేయగలిగే సాయం చేయవచ్చని అనుకున్నాం కూడా.
\p
\v 9 నా తోటి విశ్వాసులారా! మేము అహర్నిశలు ఎంతో కష్టపడి పనిచేశామని గుర్తుంచుకోండి. దేవుని గురించిన శుభవార్త మీకు ప్రకటిస్తూ ఇలా చేసాము. ఇలా డబ్బు సంపాదించడం వల్ల మా అవసరాల కోసం మాకు ఇమ్మని ఎవరినీ మేము అడగవలసిన అవసరం లేదు.
\s5
\v 10 చాలా మంచిగా, సరైన దారిలో ఎవరూ విమర్శించలేని విధంగా విశ్వాసులైన మీ పట్ల మేము ఉన్నామని ఇద్దరికీ అంటే - దేవుడికీ మీకూ కూడా తెలుసు.
\v 11 ఒక తండ్రి తన పిల్లల్ని ప్రేమిస్తూ వాళ్ళ పట్ల నడుచుకున్నట్టు మేము మీలో ప్రతి ఒక్కరి పట్లా నడుచుకున్నాము అని మీకు తెలుసు.
\v 12 దేవుడు మహాద్భుత శక్తితో తనను కనపరచుకునే రాజుగా మీరు తన ప్రజలు కావడానికి మిమ్మల్ని పిలుచుకున్నాడు కాబట్టి దేవుని ప్రజలుగా జీవించేలా మిమ్మల్ని మేము గట్టిగా హెచ్చరించి, ప్రోత్సహిస్తున్నాము.
\s5
\p
\v 13 దేవుడు మనకు ఇచ్చిన మంచి సందేశాన్ని మేము మీకు చెప్పినప్పుడు మీరు విని దానిని నిజమైన దైవ సందేశంగా అంగీకరించారు. దీనికి మేము ఎప్పుడూ దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మాకు మేము దీన్ని కొత్తగా కల్పించలేదు. ఈ సందేశాన్ని మీరు నమ్మిన కారణంగా దేవుడు మీ జీవితాలను మార్చుతూ ఉన్నందుకు కూడా మేము దేవునికి వందనాలు చెప్తున్నాము.
\s5
\p
\v 14 యూదయలోని సంఘ విశ్వాసుల్లాగా మీరు నడుచుకుంటున్నారు కాబట్టి ఈ విషయాలను గురించి మాకు కచ్చితంగా తెలుసు. వాళ్ళు కూడా క్రీస్తు యేసుతో చేరారు. క్రీస్తు కారణంగా వాళ్ళ జాతి మనుషులు వాళ్ళని వేధించినప్పుడు వాళ్ళు భరించినట్టే, మీ జాతివారు మిమ్మల్ని వేధించినప్పుడు మీరు కూడా భరిస్తున్నారు.
\v 15 ఆ యూదులు చాలా మంది ప్రవక్తలను, యేసు ప్రభువును కూడా చంపారు. చాలా పట్టణాలలో అవిశ్వాసులుగా ఉన్న ఇతర యూదులు మమ్మల్ని విడిచి పొమ్మని బలవంతపెట్టారు. మనుషులకు ఉత్తమం అయిన దానికి వ్యతిరేకంగా వాళ్ళు పనిచేశారు. వాళ్ళు నిజంగా దేవునికి కోపం తెప్పించారు.
\v 16 ఉదాహరణకు, యూదులు కానివారికి శుభవార్త చెప్పనివ్వకుండా ఆపేశారు. వాళ్ళని దేవుడు రక్షించడం వీళ్ళకి ఇష్టం లేదు. చివరికి దేవుడు వాళ్ళని శిక్షించే సమయం దాకా దేవుడు అనుమతించే దానికంటే అధికంగా వాళ్ళు పాపం చేశారు.
\s5
\p
\v 17 నా తోటి విశ్వాసులారా! మేము మీకు కొంత కాలం దూరంగా ఉన్నప్పుడు పిల్లల్ని కోల్పోయిన తలిదండ్రుల్లాగా ఉన్నాము. మీ దగ్గరికి రావాలని బలంగా కోరుకుంటున్నాము.
\v 18 నిజానికి నేను మిమ్మల్ని మళ్ళీ చూడడానికి రావాలని ప్రయత్నించాను. కానీ ప్రతిసారీ సాతాను అడ్డుకుంటున్నాడు.
\v 19 నిజానికి మీ కారణంగా దేవుని పని బాగా చేయాలనే ఆశ మాకు కలుగుతోంది. మేము గర్వపడేలా మీరు చేస్తున్నారు. మీ వల్ల దేవుని సేవ చేయడంలో విజయవంతం అవుతామని మా ఆశ. ప్రభు యేసు క్రీస్తు భూమికి తిరిగి వచ్చినప్పుడు మనకు ప్రతిఫలం ఇస్తాడనే ఆశ మీ వల్ల, ఇతరుల వల్ల మనకు కలుగుతుంది.
\v 20 నిజానికి మీ కారణంగానే ఇప్పుడు కూడా ఆనందంగా ఉత్సాహంగా ఉన్నాము.
\s5
\c 3
\p
\v 1 దాని ఫలితంగా, మీ గురించి ఇక ఉండబట్ట లేక సిల్వాను, నేను ఎతెన్సులోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాం.
\v 2 మేము తిమోతిని మీ దగ్గరికి పంపాం. అతను మాకు సన్నిహిత సహచరుడు అనీ దేవుని ద్వారా క్రీస్తు గురించిన శుభవార్త ప్రకటిస్తున్నాడు అనీ మీకు తెలుసు. క్రీస్తులో మీరు బలమైన విశ్వాసం కొనసాగించాలని కోరడానికి అతన్ని మీ దగ్గరికి పంపుతున్నాం.
\v 3 మీరు పొందే హింసను బట్టి భయపడి మీలో ఎవరూ క్రీస్తుకు దూరం కాకూడదని మేము అనుకుంటున్నాము.
\s5
\v 4 మేము మీతో ఉన్నప్పుడు ఇతరులు మనల్ని బాధపెడతారని మేము మీకు చెప్తూనే వచ్చామని గుర్తు తెచ్చుకోండి, మీరు అనుకున్నదే జరిగింది.
\p
\v 5 క్రీస్తులో మీ విశ్వాసం స్థిరంగా ఉందో లేదో తెలియక ఆత్రుత అణుచుకోలేక తిమోతిని మీ దగ్గరికి పంపుతున్నాను. మనల్ని శోధించే సాతాను క్రీస్తులో నమ్మకం ఉంచకుండా అడ్డుకుంటూ ఉంటాడు కాబట్టి నేను ఆందోళన పడుతున్నాను. మీ కోసం మేము పడిన ప్రయాస అంతా అడవి కాసిన వెన్నెల అవుతుందేమోనని నా భయం.
\s5
\p
\v 6 కానీ ఇప్పుడు నేనూ సిల్వానూ ఉన్న చోటికి తిమోతి తిరిగి వచ్చాడు. మీరు క్రీస్తును ప్రేమించి, ఆయనలో మీ విశ్వాసం స్థిరంగా ఉంది అనే శుభవార్త మాకు చెప్పాడు. అంతే కాదు, మేము మిమ్మల్ని దర్శించాలని అనుకున్నట్టే మీరు కూడా మేము మమ్మల్ని దర్శించాలని ఎంతో కోరుకుంటున్నారనీ మమ్మల్ని సంతోషంగా గుర్తు చేసుకుంటున్నారని కూడా చెప్పాడు.
\p
\v 7 నా తోటి విశ్వాసులారా! మనుషులు మనకు చేసిన దానికి మనం హింస పొందుతున్నా మీరు ఇంకా క్రీస్తులో విశ్వాసంతో ఉన్నారని తిమోతి చెప్పడం వల్ల ఆదరణ పొందాము.
\s5
\v 8 యేసు ప్రభువులో మీకు చాలా విశ్వాసం ఉంది కాబట్టి మనం ఇప్పుడు కొత్త మార్గంలో జీవిస్తున్నట్టే.
\v 9 మీకు దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవునికి ఎంత కృతజ్ఞతలు చెప్పినా చాలదు. మేము ప్రార్థన చేసినప్పుడు మిమ్మల్ని బట్టి మా ఉత్సాహం రెట్టింపు అవుతుంది.
\v 10 క్రీస్తులోని విశ్వాసంతో మీరు మరింతగా బలపడడానికి సాయం అందించేలా, మేము మిమ్మల్ని దర్శించడానికి వీలు కలిగించమని మేము దేవుణ్ణి నిరంతరం మనస్పూర్తిగా అడుగుతున్నాము.
\s5
\v 11 మీ దగ్గరికి మళ్ళీ రావడానికి సాధ్యం చేయమని మన తండ్రి అయిన దేవుడికి , మన యేసు ప్రభువుకు మేము ప్రార్థన చేస్తున్నాము.
\p
\v 12 మేము మిమ్మల్ని ఇంకా ప్రేమించడం కొనసాగించినట్టే, మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ ఇతరుల్ని కూడా ఇంకా ఇంకా ప్రేమించడానికి యేసు ప్రభువు మీకు సాయం చేసేలా మీ కోసం మేము ప్రార్థన చేస్తున్నాము.
\v 13 మీరు యేసుప్రభువును మరింతగా సంతోషపెట్టాలనుకోవాలని ప్రార్థన చేస్తున్నాం. మిమ్మల్ని ఎవరూ విమర్శించలేని విధంగా మీరు ఆయనలా రూపాంతరం పొందాలని తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తున్నాను. మళ్ళీ యేసు, ఆయనకి చెందిన వాళ్ళు ఆయనతో కలిసి భూమికి వచ్చినప్పుడు ఆయన మీ విషయంలో సంతోషపడతాడని మేము ఇలా ప్రార్థన చేస్తున్నాము.
\s5
\c 4
\p
\v 1 నా తోటి విశ్వాసులారా! ఇతర విషయాలు మీకు నేను రాయాల్సి ఉంది.
\v 2 దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా మీ జీవితాలు నడుపుకోవాలని నేను మిమ్మల్ని బతిమాలుతున్నాను. నేను ఇలా కోరుతున్నప్పుడు, యేసు ప్రభువు మిమ్మల్ని అదే విధంగా నడుచుకోవాలని కోరుతున్నట్టే. యేసుప్రభువు మీకు ఏమి చెప్పమని మాకు చెప్పాడో అదే చేయమని మేము మీకు బోధించాము. మీ జీవితాలు అలాగే నడుపుకుంటూ ఉన్నారని మాకు తెలుసు, కానీ అంతకన్నా ఎక్కువగా అభివృద్ది పొందాలని బలంగా కోరుకుంటున్నాను.
\s5
\p
\v 3 మీరు పాపం చెయ్యకుండా ఉండాలనీ, పూర్తిగా దేవునికి చెందినవాళ్ళలాగా మీ జీవితాలు కనిపించాలనీ ఆయన కోరుకుంటున్నాడు. మీరు లైంగిక ఆకృత్యాలకు దూరంగా ఉండాలని ఆయన కోరుతున్నాడు.
\v 4 మీలో ప్రతి ఒక్కరూ భార్యతో ఎలా జీవించాలో, ఆమెను ఎలా గౌరవించాలో, ఆమెకు వ్యతిరేకంగా పాపం చేయకుండా ఎలా ఉండాలో తెలుసుకోవాలి.
\v 5 దేవుడంటే తెలియని యూదేతరుల్లాగా మీ కామవాంఛలను తృప్తిపరచడానికి ఆమెను ఉపయోగించుకోకూడదు.
\v 6 మీ తోటి విశ్వాసులుగా ఉన్న స్త్రీకైనా పురుషునికైనా వ్యతిరేకంగా మీలో ఎవరూ పాపం చేయకుండా ఉండడం కోసం ప్రతి ఒక్కరూ మీ లైంగిక కోరికలను అదుపులో పెట్టుకోవాలి. లైంగిక అవినీతి కార్యాలు చేసే వాళ్ళను యేసు ప్రభువు శిక్షిస్తాడని ఇంతకు ముందు నేను మిమ్మల్ని గట్టిగా హెచ్చరించిన విషయం జ్ఞాపకం తెచ్చుకోండి.
\s5
\v 7 విశ్వాసులుగా దేవుడు మనల్ని ఎంచుకున్నప్పుడు, మనం లైంగిక అవినీతి మార్గంలో నడుచుకోవడం ఆయన ఇష్టపడడు. పాపం చేయని వారిగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటాడు.
\p
\v 8 ఒక మనిషిగా నేను బోధించిన దానిని నిర్లక్ష్యం చేసే వాళ్లను నేను హెచ్చరిస్తున్నాను. ఇది దేవుని ఆజ్ఞ కాబట్టి వాళ్ళు దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తున్నారు. పాపం చేయని ఆత్మను మీలో నివసించడానికి దేవుడు పంపించాడని జ్ఞాపకం తెచ్చుకోండి.
\s5
\p
\v 9 మీ తోటి విశ్వాసులను ప్రేమించాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీరు ఒకరిని ఒకరు ఎలా ప్రేమించుకోవాలో దేవుడు మీకు ముందే నేర్పించాడు కాబట్టి దీని గురించి మీకు ఎవరూ రాయనక్కరలేదు.
\v 10 ఇప్పటికే మాసిదోనియా రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లోని మీ తోటి విశ్వాసులను మీరు ప్రేమిస్తున్నారని ఋజువు చూపిస్తున్నారు. అయినా, నా తోటి విశ్వాసులారా, మీరు ఒకరినొకరు ఇంకా ఇంకా ప్రేమించుకోవాలని కోరుతున్నాను.
\v 11 ఇతరుల విషయాల్లో మీరు అనవసరంగా జోక్యం చేసుకోకుండా మీ సొంత విషయాలు చూసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించమని మిమ్మల్ని కోరుతున్నాము. ఇలా జీవించమని ముందు కూడా మీకు నేర్పించిన సంగతి జ్ఞాపకం చేసుకోండి.
\v 12 మీరు ఇలాంటివి చేయడం వల్ల అవిశ్వాసులు మీ మర్యాదతో కూడిన ప్రవర్తన గుర్తిస్తారు. మీ అవసరాలకు ఇతరులపై ఆధారపడనవసరం లేదు.
\s5
\p
\v 13 నా తోటి విశ్వాసులారా, ఇప్పుడు చనిపోయిన మన తోటి విశ్వాసులకు ఏమి జరుగుతుందో దాని గురించి మీకు అవగాహన కల్పించాలని అనుకుంటున్నాను. మీరు అవిశ్వాసుల్లాగా ఉండకూడదు. చనిపోయాక తిరిగి బ్రతుకుతారని వాళ్ళు అనుకోరు కాబట్టి వాళ్ళు తీవ్ర శోకంలో మునిగి పోతారు.
\v 14 యేసు చనిపోయి మళ్ళీ బ్రతకడానికి తిరిగి లేచాడని విశ్వాసులుగా ఉన్న మనకు తెలుసు. యేసుతో చేరిన వాళ్ళని దేవుడు మళ్ళీ జీవింపజేస్తాడని కూడా మనకు తెలుసు. ఆయన వాళ్ళను యేసుతో కూడా తిరిగి తీసుకువస్తాడు.
\p
\v 15 నేను మీకు చెప్పేది యేసు ప్రభువు నాకు వెల్లడి చేశాడు కాబట్టి ఈ విషయం మీకు రాస్తున్నాను. యేసు మళ్ళీ వచ్చినప్పుడు చనిపోయిన వారికంటే ముందే యేసును కలుసుకుంటామని కొందరు అనుకుంటారు, అది నిజం కాదు.
\s5
\p
\v 16 నేను ఇది ఎందుకు రాస్తున్నాను అంటే యేసు ప్రభువు తనకు తానే పరలోకం నుండి దిగి వస్తాడు. ఆయన దిగి వచ్చినప్పుడు, మన విశ్వాసులందరినీ తిరిగి లేవమని ఆజ్ఞాపిస్తాడు. ప్రధాన దూత గొప్ప స్వరంతో చెప్తుండగా, ఇంకొక దూత దేవుని పక్షంగా బూర ఊదుతాడు. అప్పుడు మొట్టమొదటగా ఏమి జరుగుతుందంటే క్రీస్తుతో చేరిన వాళ్ళందరూ తిరిగి బ్రతుకుతారు.
\v 17 దాని తరువాత, భూమిపై ఇంకా నివసిస్తూ విశ్వాసులుగా ఉన్న మన అందరినీ దేవుడు మేఘాల్లోకి తీసుకుపోతాడు. చనిపోయిన ఇతర విశ్వాసుల్ని మనం అక్కడ కలుసుకుంటాము. మనం అందరం కలిసి యేసు ప్రభువును ఆకాశంలో కలుసుకుంటాము. మనమందరం ఎప్పటికీ ఆయనతోనే ఉంటాము.
\v 18 ఇదంతా నిజమే కాబట్టి ఈ బోధను ఒకరితో ఒకరు పంచుకుంటూ ప్రోత్సహించుకోండి.
\s5
\c 5
\p
\v 1 నా తోటి విశ్వాసులారా! యేసు ప్రభువు తిరిగి వచ్చే సమయం గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. నిజానికి దాని గురించి నేను మీకు రాయవలసిన అవసరం లేదు.
\v 2 ఊహించని సమయంలో యేసు ప్రభువు తిరిగి వస్తాడని మీకు తెలుసు కాబట్టి దాని గురించి మీకు కచ్చితమైన అవగాహన ఉందని మీకే తెలుసు. రాత్రిపూట దొంగ ఎలా వస్తాడో ఎవరూ ఊహించలేనట్టే, ఆయన రాక ఎప్పుడు వస్తుందో మనుషులు తెలుసుకోలేరు.
\p
\v 3 ఏదో ఒక సమయంలో, "అంతా ప్రశాంతంగా ఉంది, మనమంతా క్షేమం" అని మనుషులు అనుకొనే సమయంలో, అకస్మాత్తుగా దేవుడు వచ్చి కఠినంగా శిక్షిస్తాడు. గర్భవతికి పురిటి నొప్పులు వస్తే ఆ నొప్పులను ఎవరూ ఆపలేనట్టే, దేవుని నుండి తప్పించుకొనే దారి వాళ్లకు దొరకదు.
\s5
\v 4 కానీ నా తోటి విశ్వాసులారా! దేవుని గురించిన సత్యం మీకు తెలుసు కాబట్టి మీరు చీకటిలో జీవించే వాళ్ళలాగా కాదు. అందుకే యేసు తిరిగి వచ్చినప్పుడు ఆయన కోసం మీరు సిద్ధంగా ఉంటారు.
\v 5 మీరు రాత్రి చీకటికి చెందినవారు కాదు, పగటి వెలుగుకు చెందినవారు.
\v 6 అందుకే విశ్వాసులం అయిన మనం జరుగుతున్న విషయాలను గురించి తెలుసుకుంటూ ఉండాలి. మనల్ని మనం అదుపులో ఉంచుకుంటూ యేసు రాక కోసం సిద్ధంగా ఉండాలి.
\p
\v 7 రాత్రి సమయంలో ఏమి జరుగుతుందో తెలియకుండా మనుషులు నిద్రపోతున్నప్పుడు, మనుషులు తాగి ఉన్నప్పుడు ఇది సంభవిస్తుంది.
\s5
\v 8 కానీ విశ్వాసులమైన మనం పగటికి చెందిన వాళ్ళం, అందుకే మనల్ని అదుపులో ఉంచుకుందాం. సైనికుల్లాగా ఉందాం. వాళ్ళు తమ ఛాతీని కవచంతో భద్రపరచుకున్నట్టు, క్రీస్తులో విశ్వాసం ఉంచి, ఆయన్ని ప్రేమిస్తూ మనల్ని భద్రపరచుకుందాం. వాళ్ళు హెల్మెట్లతో తమ తలలు భద్రపరచుకున్నట్టు, చెడుతనం నుండి క్రీస్తు మనల్ని రక్షించాలని కోరుకుంటూ మనల్ని భద్రపరచుకుందాం.
\p
\v 9 ఆయన శిక్షించే వాళ్ళల్లో మనం ఉండాలని దేవుడు మనల్ని ఎంచుకోలేదు. యేసు క్రీస్తు మన కోసం చేసిన కార్యాన్ని మనం నమ్ముతున్నాం కాబట్టి, ఆయన మనల్ని రక్షించాలని నిర్ణయించుకున్నాడు.
\v 10 మనం బ్రతికి ఉన్నా చనిపోయినా ఆయన భూమికి తిరిగి వచ్చినప్పుడు ఆయనతో కలిసి జీవించాలనే ఉద్దేశంతో మన పాపాలకు పరిహారంగా యేసు మరణించాడు.
\v 11 ఇది నిజం అని మీకు తెలుసు కాబట్టి ఇప్పుడు మీరు చేస్తున్నట్టుగానే ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవడం కొనసాగించండి.
\s5
\p
\v 12 నా తోటి విశ్వాసులారా! మీ కోసం కష్టపడి పనిచేసే వాళ్ళను నాయకులుగా మీరు గుర్తించాలని మేము కోరుతున్నాము. మీరు విశ్వాసంలో ఎదగడానికి వాళ్ళు ఎంత ప్రయాసపడుతూ ఉన్నారో మీరు చూసారా! ఈ నాయకుల్ని మీ తోటి విశ్వాసుల్లాగా చూస్తూ, వాళ్ళ పట్ల మర్యాదగా నడుచుకోవాలని దీని అర్థం. వీళ్ళు ప్రభువు కోసం ఎలా జీవించాలో దారి చూపిస్తూ మీకు నేర్పిస్తారు.
\v 13 వాళ్ళు చేసే పనిని బట్టి మీరు వాళ్ళను ప్రేమిస్తారు కాబట్టి, వాళ్ళను గౌరవించమని కూడా చెప్తున్నాము. ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి జీవించాలని మేము వేడుకుంటున్నాము.
\p
\v 14 నా తోటి విశ్వాసులారా! పని చేయకుండా ఇతరుల నుండి ఆశిస్తూ సోమరులుగా బ్రతికే వాళ్ళను హెచ్చరించమని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాను.
\p భయపడే విశ్వాసుల్ని ప్రోత్సహించండి.
\p బలహీనంగా ఉన్న వాళ్ళందరికీ ఏదొక విధంగా సహాయం చేయండి.
\p ప్రతి ఒక్కరి పట్ల సహనంతో ఉండమని కూడా మేము వేడుకుంటున్నాము.
\s5
\p
\v 15 మీకు ఎవరైనా కీడు చేసినా మీరు వాళ్లకి ప్రతి కీడు చేయొద్దు. మీరు ఒకరి పట్ల ఒకరు ప్రతి ఒక్కరికీ ఎప్పుడూ మేలైనదే చేయడానికి ప్రయత్నం చేయాలి.
\p
\v 16 అన్ని సమయాల్లో ఆనందంగా ఉండండి.
\p
\v 17 నిరంతరం ప్రార్థన చేయండి.
\p
\v 18 అన్ని పరిస్థితులలో దేవునికి కృతజ్ఞతలు చెప్పండి. క్రీస్తు యేసు చేసిన కార్యాన్ని బట్టి మీరు ఇలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు.
\s5
\p
\v 19 దేవుని ఆత్మ మీ మధ్య పనిచేయనీయకుండా చేయవద్దు.
\v 20 ఉదాహరణకు, పరిశుద్ధాత్మ ఎవరికైనా ఏమైనా చెప్తే దాన్ని తృణీకరించొద్దు.
\v 21 అలాంటి సందేశాలు అన్నిటినీ పరీక్షించండి. మంచి వాటిని అంగీకరించి వాటికి లోబడండి.
\v 22 చెడు సంబంధమైన సందేశాలకు లోబడొద్దు.
\s5
\p
\v 23 దేవుడు మీలో ఎలాంటి తప్పిదం లేకుండా చేసి, మీకు శాంతిని ఇస్తాడు. అప్పుడు మీరు పాపం చేయరు. యేసు ప్రభువు భూమికి తిరిగి వచ్చేసరికి ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని పాపం చేయకుండా ఉంచును గాక!
\p
\v 24 దేవుడు తన ప్రజలుగా మిమ్మల్ని పిలిచాడు కాబట్టి, అలా మీకు సహాయం చేస్తూ ఉంటాడని మీరు కచ్చితంగా నమ్మవచ్చు.
\s5
\p
\v 25 నా తోటి విశ్వాసులారా! నా కోసం, సిల్వాను కోసం, తిమోతి కోసం ప్రార్థన చేయండి.
\v 26 విశ్వాసులుగా మీరు కలిసి సమకూడినప్పుడు తోటి విశ్వాసులను ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలకరించుకోండి.
\p
\v 27 మీ మధ్య విశ్వాసులందరూ ఉన్నప్పుడు ఈ ఉత్తరం తప్పకుండా చదివి వినిపించండి. ఇప్పుడు దేవుడు మాట్లాడినా నేను మీకు చెప్పిందే చెప్తాడు.
\p
\v 28 మీ అందరి పట్ల మన యేసు క్రీస్తు ప్రభువు కృప చూపడం కొనసాగించును గాక!