STR_te_iev/48-2CO.usfm

479 lines
121 KiB
Plaintext

\id 2CO - Indian Easy Version (IEV) Telugu
\ide UTF-8
\h కొరింతీయులకు రాసిన రెండవ పత్రిక
\toc1 కొరింతీయులకు రాసిన రెండవ పత్రిక
\toc2 కొరింతీయులకు రాసిన రెండవ పత్రిక
\toc3 2co
\mt1 కొరింతీయులకు రాసిన రెండవ పత్రిక
\s5
\c 1
\p
\v 1 మన సోదరుడు తిమోతీతో కలిసి పౌలు అనే నేను రాస్తున్న ఉత్తరం. తనను సేవించడానికి, దేవుని అభీష్టాన్ని ఆచరించడానికి క్రీస్తు యేసు నన్ను పంపాడు. మేము ఈ పత్రిక కొరింతు నగరంలో దేవుని ప్రజలుగా సమకూడుతున్న వారికీ, దేవుడు అకయ ప్రాంతమంతటా తనకోసం ప్రత్యేకించుకున్న పరిశుద్ధులందరికీ పంపుతున్నాం.
\v 2 మన తండ్రి అయిన దేవుని నుండీ, యేసు క్రీస్తు ప్రభువు నుండీ మీకు ప్రేమ, శాంతిసమాధానాలు ధారాళంగా కలుగు గాక.
\s5
\p
\v 3 మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతి కలుగు గాక. మనయెడల ఆయన దయాకరుడు, అన్ని విధాలా ఆదరించే దేవుడు.
\v 4 మాకెలాంటి కష్టం వచ్చినా ఆయన మమ్మల్ని ఆదరిస్తున్నాడు. దేవుడు మాపై చూపిన ఆ ఆదరణ మేమూ చూపి ఎలాంటి కష్టాల్లో ఉన్నవారినైనా బాగుచేయగలిగేలా ఆయన మమ్మల్ని ఆదరిస్తున్నాడు.
\s5
\v 5 లెక్కకు మించి క్రీస్తు పడిన బాధలు మా అనుభవంలో అధికమయ్యే కొద్దీ, క్రీస్తు ఆదరణ కూడా మాలో అంతకంతకూ కొలతకందనంతగా అధికం అవుతూ ఉంది.
\v 6 మాకు కష్టాలు వస్తే అవి మీ విమోచన కోసం, మీ ఆదరణ కోసమే. మాకు ఆదరణ కలిగితే అది కూడా మీ బాగు కోసమే. మాలాగే మీరూ పడుతున్న కష్టాలను సహించడానికి, దేవుని కొరకు కనిపెట్టడానికి కావలసిన ఓర్పును ఈ ఆదరణ కలిగిస్తున్నది.
\v 7 మీరు మా కష్టాలను ఎలా పంచుకుంటున్నారో అలాగే దేవుడు మాపై చూపుతున్న ఆదరణను కూడా పంచుకుంటున్నారని మాకు తెలుసు. అందుచేత మీకు ఏమేమి జరుగుతుందో తేటగా తెలుసు.
\s5
\p
\v 8 సోదర, సోదరీమణులారా ఆసియ ప్రాంతంలో మేము పడిన బాధలు మీకు తెలియాలి. అవి మాకు దుర్భరం అనిపించాయి. అసలు మేము చచ్చిపోతామేమో అన్నంత పని అయింది.
\v 9 మాకు మరణదండన విధించారు. వాళ్ళ చేతిలో చావు కోసం మేము ఎదురు చూస్తున్నాం. అయితే ఆ మరణ దండన చనిపోయిన వారిని తిరిగి జీవింపచేయగల దేవుని మీద తప్ప, మా మీద మేము నమ్మకం ఉంచరాదని నేర్పించింది.
\v 10 అలాంటి భయంకరమైన ఆపదల నుండి ఆయన మమ్మల్ని రక్షించాడు, మళ్లీ మళ్ళీ రక్షిస్తాడు. ఆయన మీద మా నమ్మకమంతా పెట్టుకున్నాము. ఎడతెగక మమ్మల్ని తప్పిస్తాడు.
\s5
\v 11 మీరు మా కోసం మీ ప్రార్థన ద్వారా సహాయం చేస్తూ ఉంటే ఆయన దీన్ని చేస్తాడు. అనేకమంది ప్రార్థనల వల్ల దేవుడు మమ్మల్ని కనికరించినందుకు చాలామంది మా తరపున ధన్యవాదాలు చెబుతారు.
\s5
\v 12 ప్రజలందరి యెడల నీతిగా, నిజాయితీగా ఎలాటి మోసానికి తావు లేకుండా జీవించామని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాము. ఈ లోకంలో దేవుని స్వజనమై, ఆయనయందు ప్రగాడ విశ్వాసం కలిగి జీవించాం. అది ఆయన వరమే. ఈ లోకపు విలువలూ, సాంప్రదాయాలూ మేము ఏమాత్రం అనుసరించలేదు. మా పనుల ఎంపికలో ఈ లోకపు జ్ఞానానికి చెవియెగ్గలేదు. బదులుగా దేవుడే మా బతుకు బండినీ, మార్గాన్నీ నిజాయితీగా, పరిశుద్ధంగా చేశాడు.
\v 13 నా ఉత్తరాలు మీరు చదివారు. నేను రాసిన దానిని మీరు కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. ఏదో ఒక రోజున మీరు మమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు.
\v 14 మేము మీకు కొంతవరకు తెలుసు. కానీ ప్రభువైన యేసు వచ్చిన రోజున ఆయన సమక్షంలో మేము మీకు చాలా గర్వ కారణంగా ఉంటామని, మీరూ మాకు గర్వకారణంగా ఉంటారని నేను ఆశిస్తున్నాను.
\s5
\p
\v 15 నేను అనుకున్నట్లు కచ్చితంగా జరిగివుంటే, ఇంతకు మునుపు నేను మొదటిగా మీ దగ్గరకు రావాలని కోరుకున్నాను. అలా రెండు పర్యటనల వల్ల మీరు మేలు పొందవచ్చు అనుకున్నాను.
\v 16 నేను మాసిదోనియకు వెళ్ళేటప్పుడూ, వచ్చేటప్పుడూ మార్గంలో రెండు సార్లూ మిమ్మల్ని కలుసుకునేలా యోచించాను. అప్పుడు మీరు నన్ను యూదయకు పంపిస్తారని అనుకున్నాను.
\s5
\v 17 ఈ విధంగా నా మనసులో ప్రణాళిక తయారు చేసుకున్నాను. నేను మీకు అవును అని ఒకసారీ కాదు అని మరోసారీ చెప్పలేదు. అవిశ్వాసులు తరచుగా చేసే ప్రయత్నాలు నేను చేయలేదు.
\v 18 అయితే నమ్మదగిన దేవుడు మనల్ని నడిపిస్తాడు. అలాగే మేము కూడా మిమ్మల్ని కలవరపెట్టము. మేము మా ప్రణాళికను తయారు చేసుకుని వాటి ప్రకారంగానే ఉన్నాము.
\s5
\v 19 నాతో కలిసి సిల్వాను, తిమోతి మీకు ప్రకటించిన దేవుడి కుమారుడైన యేసు క్రీస్తు నుండే మేము మీతో "అవును” అని పలికినది వచ్చింది. ఆయనలో ఎప్పుడూ ఎలాంటి గందరగోళం వుండదు. ఆయన "అవును” అని చెప్పి, తరువాత "కాదు” అనేవాడు కాదు. వీటన్నిటికంటే ఆయనలోనుండి ఎప్పుడూ సాధారణంగా "అవును” అనే సమాధానం వస్తుంది.
\v 20 దేవుని వాగ్దానాలు నిజమైనవి. ఎందుకంటే అవి ఆయన నుండి వచ్చాయి. ఆయన అవును అనే సమాధానానికి మా నిర్ధారణను జోడిస్తున్నాము. మనం దేవుని కీర్తి గూర్చి చెబుతున్నాం. అవును, ఇది నిజం.
\s5
\v 21 క్రీస్తు సంబంధంలో మమ్ములను మీతో కలిపి స్థాపించిన వాడు దేవుడే. ప్రజలకు సువార్త ప్రకటించడానికి మనల్ని పంపిన వాడు ఆయనే.
\v 22 ఆయన తన అధికారిక ముద్రను మనపై వేశాడు. కాబట్టి ఆయన మనల్ని అంగీకరించాడని ప్రజలకు తెలుస్తుంది. మనలో నివసించే ఆత్మను ఆయన మనకు ఇచ్చాడు. ఇంతకంటే ఇంకా ఎక్కువైన మేలులే చేస్తానని శాశ్వతమైన వాగ్దానాన్ని ఆయన చేశాడు.
\s5
\v 23 కొరింతులోని క్రైస్తవులకు నేను రాకపోవడానికి గల కారణం దేవుడే తనకు తానుగా మీకు తప్పక తెలియ చేస్తాడు. మిమ్మల్ని మీరు సరిదిద్దుకునే వరకూ నాకోసం ఎదురు చూడవలసిన అవసరం లేదు.
\v 24 మేము దేవునిలో విశ్వాసం ఉంచడం గూర్చి ఆజ్ఞలు ఇచ్చే యజమానుల్లాంటి వారం కాము. అయినప్పటికీ మేము మీతో కలిసి పని చేయాలని అనుకుంటున్నాం. తద్వారా ఏం జరిగినా దేవునిపై నమ్మకం ఉంచడం ఎలాగో నేర్చుకోవచ్చు. అంతేకాకుండా ఆయనను విశ్వసించడంలోని ఆనందం పొందవచ్చు.
\s5
\c 2
\p
\v 1 చివరిసారి నేను కొరింతుకు వచ్చినపుడు నా మాటలు మిమ్మల్ని గాయపరిచాయని నాకు తెలుసు. ఈసారి తిరిగి మీ దగ్గరికి వచ్చినపుడు అది పునరావృతం కాకూడదని నిశ్చయించుకున్నాను.
\v 2 క్రితం సారి నా రాక వల్ల ఎంతో బాధపడిన మీరు, నిజానికి నన్నెంతో సంతోష పెడతారనుకున్నాను. అలాంటిది నేనే అక్కడికి వచ్చి మిమ్మల్ని నొప్పించేలా మాట్లాడాల్సి వచ్చింది.
\s5
\v 3 ఇంకోసారి నేను మీ దగ్గరకు వచ్చినపుడు మిమ్మల్నిబట్టి నాకు దుఃఖం కలుగకూడదని నేను ఆ ఉత్తరం రాశాను. వాస్తవానికి మీరు నా ఆనంద కారకులవ్వాలి. నిశ్చయంగా మనందరి సంతోషానికి కారణాలు ఉన్నాయి.
\v 4 గాయపడిన నా హృదయంలో బాధ ఇప్పటికీ అలానే ఉంది. కన్నీరు మున్నీరై పోతున్నాను. ఇంకెప్పుడూ మిమ్మల్ని బాధ పెట్టను. మీ పట్ల నాకున్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకోవాలని, ఎంతో బాధతో, హృదయ వేదనతో, కన్నీళ్ళతో ఆ ఉత్తరం రాశాను.
\s5
\p
\v 5 పాపం చేసిన ఆ మనిషి నన్ను మాత్రమే కాదు, తన పాడు పని మీ అందర్నీ కూడా బాధపెట్టింది.
\v 6 అతనిని, అతని చెడుతనాన్ని గురించి ఏమి చెయ్యాలో మనందరికీ ఏకాభిప్రాయం ఉంది. ఇప్పటికే మీలో చాలామంది అతనికి విధించిన శిక్ష చాలు.
\v 7 ఇకమీదట అతనిని క్షమించి దయతో ఆదరించడం మంచిది. అలా చేయకపోతే అతను మరింత వేదనతో క్రుంగి పోయి మీరు తనను మరెన్నటికీ క్షమించరు అనుకునే ప్రమాదముంది.
\s5
\v 8 అందుచేత విశ్వాసులందరి సమక్షంలో అతనికి మీ ప్రేమను వెల్లడించమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను.
\v 9 మీరు ఈ విషయంలో దేవునికి విధేయులై సమస్యను చక్కదిద్దుతారో లేదో అని మిమ్మల్ని పరీక్షించేందుకే అలా రాశాను.
\s5
\v 10 మీరు క్షమించిన వానిని నేను కూడా క్షమించాను. దేన్నయితే నేను క్షమించానో అది ఎంత చిన్నదైనప్పటికీ, మీ యెడల నా ప్రేమనుబట్టే. క్రీస్తు నా ముందు ఉన్నట్టే నేను ఇలా క్షమించగలిగాను.
\v 11 చెడు చేసిన ఇతనిని క్షమించడం ద్వారా మనం సాతాను కుయుక్తిలో పడి మరింత కీడు జరుగకుండా చేయగలుగుతాము. వాడి పన్నాగాలూ, అబద్ధాలూ మనకు తెలియనివా?
\s5
\p
\v 12 మేము త్రోయ పట్టణానికి వచ్చినప్పుడు క్రీస్తును గూర్చిన సువార్త ప్రకటించడానికి ప్రభువు మాకు ఎన్నో ద్వారాలు తెరిచాడు. అయినప్పటికీ,
\v 13 మన సోదరుడు తీతు అక్కడ కనిపించకపోవడంతో నాకు మనశ్శాంతి లేక, అక్కడి విశ్వాసుల దగ్గర సెలవు తీసుకుని మాసిదోనియకు బయలుదేరాను.
\s5
\p
\v 14 క్రీస్తుతో మనందరం పొత్తు కలిశాం, అందుకోసం దేవునికి కృతజ్ఞతలు. క్రీస్తు ఎప్పుడూ విజయ కేతనం ఎగురవేస్తూ తన ఊరేగింపులో మమ్మల్ని నడిపిస్తున్నాడు.
\v 15 ఈ క్రీస్తు తన జ్ఞాన పరిమళాన్ని విమోచన పొందుతున్న వారి మధ్య, నాశనమైపోతున్న వారి మధ్య అంతటా మా ద్వారా గుబాళించేలా, మరి ముఖ్యంగా దేవునికే చెందేలా చేస్తున్నాడు. ఆయనకు మా ధన్యవాదాలు.
\s5
\v 16 దేవుడు మరణానికి నియమించిన వారికి క్రీస్తు వాసన చచ్చిన శవం వాసనగా అనిపిస్తుంది. అయితే దేవుడు రక్షించిన వారికి, మరణాన్ని జయించిన ఈ క్రీస్తు, తమను మరణం నుండి లేపి జీవింప చేసేవానిగా, జీవపు సువాసనగా ఉన్నాడు. ఇలాంటి సువాసన నిజానికి ఈయన కాక ఇంకెవరు వ్యాపింప చేయగలరు.
\v 17 దేవుని వాక్యాన్ని లాభం కోసం చాలామంది ఊరూరూ తిరుగుతూ అమ్మేస్తున్నారు. మేము అలాంటి వాళ్ళం కాదు. దేవుని ప్రసన్నత కోసం ఆయన మాట చొప్పున మేము ఎంత శ్రమైనా ఓర్చి పని చేయగలం. మేము క్రీస్తును గూర్చి మాట్లాడుతాం, క్రీస్తును ఎలుగెత్తి చాటుతాం. ఎందుకంటే మా ప్రతి కదలికలోనూ ఆయన కనుల ముందే ఉన్నామని, ఆయనతో ఏకమై ఉన్నామని మాకు తెలుసు.
\s5
\c 3
\p
\v 1 మేము మీకు బాగా తెలుసు, మమ్మల్ని నమ్మాలి. కొంతమందికి అవసరమైనట్టు, మీకు గానీ, మీ నుండి గానీ పరిచయ లేఖలు మాకు అవసరమా? మా గురించి మీకు తెలియంది ఏముంది? అంతా తెలుసు.
\v 2 మీ విషయం అంటారా! మా పరిచయ లేఖ మీరే. ఈ లేఖ మా హృదయాల మీద రాసి ఉండగా, ప్రజలందరూ మాపై మీరు ఉంచిన నమ్మకాన్ని తెలుసుకుని చదువుకోగలుగుతున్నారు.
\v 3 అది మీ జీవిత విధానం, రాతి పలక మీద సిరాతో రాసింది కాదు. మెత్తని హృదయాలు అనే పలకల మీద జీవం గల దేవుని ఆత్మతో, మా సేవ ద్వారా క్రీస్తు రాసిన ఉత్తరంగా మీరు కనబడుతున్నారు.
\s5
\p
\v 4 క్రీస్తు ద్వారా మీ మధ్య మాచే దేవుడు జరిగించిన ఈ పరిచర్య విషయాలను స్థిరచిత్తంతో రాశాను. వాటి యధార్దత దేవునికి తెలుసు.
\v 5 మావల్ల ఏదైనా అవుతుందని ఆలోచించడానికి మేము సమర్థులమని కాదు. మా సామర్ధ్యం దేవుని నుండే కలిగింది.
\v 6 ఆయనే తన కొత్త ఒడంబడికకు సేవకులుగా, ప్రజలకు దానిని వివరించడానికి మాకు అర్హత కలిగించాడు. వ్రాత రూపంలో ఉండి, అందులో ఉన్న ప్రతి నియమానికీ విధేయత చూపాలని, యూదులతో చేసిన తన పాత ఒడంబడిక లాంటిది కాదు. దేవుడు మనకు తన ఆత్మను అనుగ్రహిస్తున్నాడు అని ప్రకటిస్తున్న ఆత్మ మూలమైన శుభవార్తకే మేము సేవకులం. ఎందుకంటే అక్షరం, విధేయత చూపని వానిని దేవుని నుండి ఎప్పటికీ దూరం చేస్తుంది. అంటే చంపుతుంది. కానీ ఆత్మ బ్రతికిస్తుంది. ఎలాగంటే, తన కొత్త ఒడంబడిక ద్వారా, ప్రజలు తన ఆత్మను పొంది నిత్యం జీవించేటట్లు చేస్తాడు.
\s5
\p
\v 7 దేవుడు రాతి పలకల మీద వ్రాసి, మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రం , మరణాన్ని వెంట తెచ్చింది. ఇలాంటి మరణ కారణమైన ధర్మశాస్త్రం కూడా దేవుని సన్నిధికాంతితో ప్రకాశించింది. ఆ ప్రభతో మోషే ముఖం ఎంతగా వెలిగి పోయిందంటే, ఇశ్రాయేలీయులు అతని ముఖాన్ని నేరుగా చూడలేక పోయారు. అలా మోషే ముఖంపై ప్రకాశించిన వెలుగు క్రమంగా సన్నగిల్లుతూ వచ్చింది.
\v 8 అలాంటిది, ఆత్మ సంబంధమైన సేవ మరి ఇంకెంత గొప్పగా వెలుగుతూ ఉంటుందో గదా!
\s5
\v 9 ప్రతి వాని విషయంలో మరణ కారణమైన ధర్మశాస్త్రమే దేవుని ప్రభతో ఇంతలా వెలిగిపోతుంటే, స్వయానా ఆ దేవుడే మనల్ని తనతో సమాధాన పరచుకున్నప్పుడు, దేవుని ప్రకాశం మనలో ఇంకెంత గొప్పగా వెలుగుతుందో!
\p
\v 10 ధర్మశాస్త్ర సంబంధమైన వెలుగు ఒకప్పుడు వైభవంగా ఉండేది. కానీ దేవుడు మనల్ని సరిచేసి, తనతో సమాధాన పరుచుకున్న కార్యంతో ఆ వెలుగును పోల్చినపుడు, ఏమాత్రం వైభవం లేనిదిగా కనబడుతుంది. దాని స్థానంలో దేవుడు చేసిన కార్యం అపారమైన వైభవాన్ని సంతరించుకుంది.
\v 11 గతించి పోయే ధర్మశాస్త్రమే గొప్పగా ఉంటే, దాని స్థానంలో వచ్చి, ఎప్పటికీ నిలిచిపోయేది ఇంకా ఎక్కువ గొప్పగా ఉంటుంది గదా!
\s5
\v 12 మేము అపోస్తలులం, మా భవిష్యత్తు విషయంలో దేవుడిని నమ్మిన వారం. కాబట్టి చాలా గొప్ప భరోసాతో ఉన్నాం.
\p
\v 13 తేజోహీనమౌతున్న తన ముఖాన్ని ఇశ్రాయేల్ ప్రజలు గమనించడం ఇష్టంలేని మోషే, ముసుగు ధరించినట్టు మేము లేము.
\s5
\v 14 ఇశ్రాయేల్ ప్రజలు చాలా కాలం క్రితమే దేవుడిని నమ్మకుండా తిరస్కరించారు. ఇప్పటికీ, ప్రాచీన ధర్మం చదువుతున్నప్పుడల్లా, ఇశ్రాయేల్ వారు, ఆ ముసుగునే ధరించినట్టు ఉన్నారు. క్రీస్తును చేరుకున్న క్షణంలోనే ఆ ముసుగు తొలగిపోతుంది కదా.
\v 15 అవును, ఈ నాటికీ, వారు మోషే ధర్మశాస్త్రం చదువుతున్న ప్రతిసారీ, వాళ్ళ మనసులపై ఆ ముసుగు ధరించే ఉంటున్నారు.
\v 16 ఎవరైనా ప్రభువు వైపుకు తిరిగితే, అప్పుడు మాత్రం, దేవుడే ఆ ముసుగును తొలగిస్తాడు.
\s5
\p
\v 17 ప్రభువే ఆత్మ. ప్రభువు ఆత్మ ఎక్కడ ఉంటాడో అక్కడ స్వేచ్ఛ ఉంటుంది.
\v 18 విశ్వాసులమైన మనమంతా ముసుకు లేని ముఖాలతో ప్రభువు వైభవాన్ని చూస్తూ, అదే వైభవంతో, ఆయన పోలిక లోకి క్రమక్రమంగా మారుతూ ఉన్నాము. ఇది ఆత్మరూపి అయిన ప్రభువు ద్వారా జరుగుతుంది.
\s5
\c 4
\p
\v 1 దేవుడి నుంచి కనికరం ఎలా పొందామో అలానే బాధ్యతాయుతమైన ఈ సేవ కూడా పొందాము, కాబట్టి నిరుత్సాహపడము.
\v 2 సిగ్గుపడే పనులేవీ చేయకుండా మేము జాగ్రత్త పడుతున్నాము. మాలో ఎలాటి దాపరికమూ లేదు. దేవుడు చేయని వాగ్దానాన్ని, కుయుక్తితో చేస్తాడని మాట ఇవ్వం. ఆయన సందేశాన్ని వక్రీకరించి మాకు అనుకూలంగా ప్రకటించం. ప్రతివాడి మనస్సాక్షికీ, దేవుడి ముందు నిలబడినట్టుగా మమ్మల్ని మేమే అప్పగించుకొంటూ సత్యం ప్రకటిస్తున్నాము.
\s5
\v 3 ఒకవేళ మేము ప్రకటిస్తున్న సువార్త ముసుగేసినట్టు అగోచరంగా ఉంది అంటే అది కేవలం దేవునికి దూరమై నాశనమై పోతున్నవారికే.
\v 4 దేవుని స్వరూపమైన క్రీస్తు వైభవాన్ని కళ్ళకు కట్టినట్టు చూపే సువార్త వెలుగు, వారి అవిశ్వాసం వలన చూడలేకుండా, ఈ లోక దేవుడు వారి అవిశ్వాస మనో నేత్రాలకు గుడ్డితనం కలగజేశాడు.
\s5
\v 5 కాబట్టి ఎలాంటి దుష్టత్వం నుండైనా మిమ్మల్ని విడిపించే వారమైనట్టు మమ్మల్ని మేము ప్రకటించుకోకుండా, క్రీస్తు యేసును మా ప్రభువుగా, ఆ యేసుతో ఏకమైన వారిమై, మీ కోసం పనివాళ్ళమై ప్రకటిస్తున్నాము.
\v 6 "చీకట్లో నుండి వెలుగు ప్రకాశిస్తుంది” అని చెప్పిన దేవుడే తన జ్ఞాన వైభవపు వెలుగును ఇవ్వడానికి మా హృదయాల్లో ప్రకాశించాడు. కాబట్టి నమ్మికతో యేసు క్రీస్తు దరి చేరినపుడు, దేవుడు ఎంత ఆశ్చర్యకరుడో మనం తెలుసుకుంటాము.
\s5
\p
\v 7 దేవుని నుండి వచ్చిన ఈ అమూల్యమైన బహుమానం ఇప్పుడు మట్టి కుండల్లాంటి బలహీనమైన మా శరీరాలలో సంపదగా మాకు లభించింది. కాబట్టి ఈ అత్యధికమైన శక్తి దేవునిదే తప్ప మాది కాదు అని స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ విషయమై మాకెలాంటి అవగాహనారాహిత్యమూ లేదు.
\v 8 ఎన్నో రకాలుగా బాధలు పడుతున్నా మేము చితికిపోవడం లేదు. ఎటూ పాలుబోని పరిస్థితులు ఎదురైనప్పటికీ కృంగిపోవడం లేదు.
\v 9 కొందరు మాకు హాని తలపెడుతున్నారు. కానీ ఒక్కనాటికీ ఒంటరి వాళ్ళం కాదు. కొందరైతే మమ్మల్ని కొట్టి పడేశారు కానీ ప్రతిసారీతిరిగి లేచాం.
\v 10 తరచూ యేసు మరణం లాంటి మరణ గండాలు మాకు సంభవించాయి. అయినా, యేసు సజీవుడు గనక, ఆ యేసు జీవం మా దేహాల్లో కనబడేలా ప్రాణాలతో తిరిగి లేచాం.
\s5
\v 11 మేమిప్పుడు జీవించి ఉన్నప్పటికీ, యేసును బోధిస్తున్న కారణాన, ఏదో ఒక రోజు ఈ మనుషుల చేతిలో మా మరణం పొంచి వుందని సదా జ్ఞాపకముంచుకుంటాం. యేసు జీవించి ఉన్నాడనీ, ఏదో ఒక రోజు చావుకు లోనయ్యే మా ఈ శరీరాలను ఇప్పుడు బలపరుస్తున్నాడనీ ప్రజలందరికీ అర్ధమయ్యేలా, దేవుడు మాకు శ్రమలను అనుమతిస్తున్నాడు.
\v 12 ఈ విధంగా మాలో నిరంతర శ్రమలూ, ఆనక చావూ సంభవించినప్పటికీ, వాటి పర్యవసానం ఇప్పుడు మీరందరూ నిత్యజీవ గ్రహీతలయ్యారు.
\s5
\v 13 మేము అధైర్యపడలేదు. పవిత్ర లేఖనాల్లో "దేవుడిని నమ్మాను, కాబట్టే మాట్లాడుతున్నాను." అని వ్రాసిన మనిషిలాగ మేము ఉన్నాం. మేము దేవుడిని నమ్మాం, అంతేకాక ఆయన మాకొరకు ఏం చేశాడో అది మాట్లాడుతాం కూడా.
\v 14 ప్రభువైన యేసును మరణం నుండి లేపిన దేవుడు, యేసుతో మమ్మల్ని కూడా లేపుతాడు. ఆ యేసు మీతో సహా మమ్మల్ని దేవుడు ఉండే చోటుకు చేరుస్తాడని మాకు తెలుసు.
\v 15 నా శ్రమల అంతిమ ఉద్దేశ్యం మీకు సాయపడడమే. దీని వలన ప్రజలు దేవుని ప్రేమను తాము సయితం పొందగలమని, ఇతోధికంగా తెలుసుకోవడమే కాకుండా, ఆయనను మరింతగా శ్లాఘిస్తారు.
\s5
\p
\v 16 మా దేహాలు రోజురోజుకీ క్షీణించి పోతున్నా లోలోపల ప్రతి రోజూ దేవుడు మమ్మల్ని కొత్తవారినిగా చేస్తున్నాడు. అందుచేత మేము నిరుత్సాహపడడం లేదు.
\v 17 క్షణమాత్రం ఉండే స్వల్ప బాధ, దానికి ఎన్నో రెట్లు అధికమైన అద్భుతమైన వైభవానికి మమ్మల్ని సిద్ధం చేస్తూ ఉంది. అది ఎప్పటికీ ఉండే వైభవం, ఏ ఒక్కడూ కొలవనూ లేడూ, వివరించనూ లేడు.
\v 18 కళ్ళెదుట కనిపించే వాటికోసం మేము కనిపెట్టుకుని లేము కానీ, ఈ కళ్ళకు కనిపించని వాటి కోసం చూడాలని కాచుకుని ఉన్నాం. కళ్ళ ముందుండి చూస్తున్నవైతే తాత్కాలిక మైనవే, అదే అగుపించనివైతే నిత్యమైనవి.
\s5
\c 5
\p
\v 1 భూలోక నివాసులమైన మనం నివసిస్తున్న ఈ గుడారం, అంటే మన శరీరం తాత్కాలిక నివాసమే. చిరకాలం ఉండని డేరాలు చివికిపోయినట్టు, అది నశిస్తే, పరలోకంలో మనం నివసించటానికి దేవుడు ఒక శాశ్వత భవనం సిద్దం చేసాడు. దాన్ని మానవుడు నిర్మించలేదు. శాశ్వతమైన ఆ భవనాన్ని దేవుడే నిర్మించాడు.
\v 2 ఈ శరీరంతో ఉన్నంతకాలం శ్రమ అనుభవిస్తాం. శాశ్వతకాలం దేవునితో ఉండబోయే సమయంలో మనకు లభించే ఆ శరీరం కోసం తరచూ ఆశగా మూలుగుతున్నాం.
\v 3 ఎందుకంటే దేవుడు మనకు కొత్త దేహాలను ధరింప చేస్తున్నప్పుడు, అది మనకు నూతన వస్త్రధారణా సమయం.
\s5
\p
\v 4 అశాశ్వతమైన దేహాలలో జీవిస్తూ, పదే పదే మూలుగుతున్న మనం, దాని నుండి విడుదల కోరుకుంటున్నాం. అంతమాత్రాన శరీరం అక్కర్లేదు అని కాదు. పరలోకంలో మనకివ్వబోయే నూతన శరీరాలను స్వీకరించాలన్న కోరికే ఈ మూలుగంతా. ఏదో ఒక రోజు చావుకు లోనయ్యే ఈ దేహం అకస్మాత్తుగా మరెప్పటికీ మరణం లేని శరీరంగా మారిపోవాలని మా ఆశ.
\v 5 దీని కోసం మనల్నీ, మనకోసం నిత్య నూతన దేహాలనూ సిద్ధపరచినవాడు దేవుడే. అందుకు ఆయన తన ఆత్మను మనకు హామీగా ఇచ్చాడు.
\s5
\p
\v 6 దేవుని ఆత్మ మనలో నివాసం చేయడం వలన, మనకు నూతన దేహాలను ఆయన ఇస్తాడనే నమ్మకం ఎప్పుడూ తప్పక కలుగుతుంది. ఈ భూమిమీద, ఈ శరీరంలో మనం నివసిస్తున్నంత కాలం, పరలోకంలోని ప్రభువుకు దూరంగా ఉన్నామని మనకు తెలుసు.
\v 7 కంటికి కనిపించే వాటిని బట్టి కాక విశ్వాసంతోనే మనం నడచుకుంటున్నాము.
\v 8 ఈ దేహాన్ని విడిచి పెట్టి ప్రభువు దగ్గర నివసించడానికి ఇష్టపడుతున్నాం కాబట్టి ఆయన దగ్గర ఉన్నట్టే నిబ్బరంగా ఉన్నాం.
\s5
\v 9 అందుచేత దేహంలో ఉన్నా దేహాన్ని విడిచినా, ఆయనకు ఇష్టులంగా ఉండాలనేదే మా లక్ష్యం.
\v 10 మనమంతా క్రీస్తు న్యాయపీఠం ఎదుట కనబడాలి. ఎందుకంటే ప్రతివాడూ దేహంతో జరిగించిన వాటి ప్రకారం, అవి మంచివైనా చెడ్డవైనా, వాటికి తగినట్టుగా ప్రతిఫలం పొందాలి.
\s5
\p
\v 11 కాబట్టి మేము ప్రభువు పట్ల భయభక్తులంటే ఏంటో తెలిసిన వారంగా, ప్రజలకు ఆయన ఎలాంటి వాడో చెప్పి ఒప్పిస్తున్నాము. మేమేంటో దేవుడు స్పష్టంగా చూస్తున్నాడు. మీ మనస్సాక్షికి కూడా అది స్పష్టంగా ఉండాలని మేము ఆశిస్తున్నాము
\v 12 మాకు మేమే దేవుని నిజమైన సేవకులమని మీ ఎదుట మళ్ళీ, మళ్ళీ మెప్పు కోసం ప్రయత్నించడంలేదు. హృదయంలో ఉన్న విషయాలను బట్టి కాక పై రూపాన్ని బట్టే అతిశయించే వారికి మీరు జవాబు చెప్పగలిగేలా, మేము ఎలాంటి వారమో మీకు అర్థం అవ్వాలనీ, మా విషయమై మీరు అతిశయించాలనీ భావిస్తున్నాము.
\s5
\v 13 కొంత మంది మాకు మతి తప్పింది అనుకుంటున్నారు. అయినా సరే, దేవుని మెప్పు తప్ప మరేదీ కోరం. ఇంకోవైపు నేను కటువుగా మాట్లాడుతున్నట్టూ, ప్రవర్తిస్తున్నట్టూ మీకు అనిపిస్తే అది కూడా మంచిదే. మీ మేలు కోరి అలా చేశామని మీకు అర్ధమైతే చాలు.
\v 14 క్రీస్తు అంటే మాకున్న ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తూ ఉంది. ఎలాగంటే, అందరి కోసం క్రీస్తు చనిపోయాడు కాబట్టి మనందరం ఆయనతోపాటూ చనిపోయామనే విషయం కచ్చితం.
\v 15 క్రీస్తు మరణించింది అందరికోసం. అందుకే, జీవిస్తున్న వారందరూ ఇక నుంచి తమ కోసం బతకకుండా, తమ పాపాలకోసం చనిపోయి, దేవుడు లేపగా సజీవంగా తిరిగి లేచిన క్రీస్తు కోసమే బతకాలి.
\s5
\p
\v 16 మాకోసం మేము ఇక మీదట బ్రతకం. ఈ కారణం చేత ఇప్పటి నుండి మేము ఎవరితోనూ ఈ లోక ప్రమాణాల ప్రకారం వ్యవహరించం. ఒకప్పుడు మేము క్రీస్తును ఈ లోక ప్రమాణాలనుబట్టే చూశాం. అయితే క్రీస్తును వెంబడిస్తూ ఉన్న మేము ఇకమీదట అలా వ్యవహరించం.
\v 17 కాబట్టి ఎవరైనా క్రీస్తుతో ఏకమై, విశ్వాసులై ఉంటే వారు కొత్త సృష్టి. పాతవన్నీ గతించి పోయాయి. చూడూ, నీలో దేవుడు సమస్తమూ కొత్తగా చేశాడు.
\s5
\v 18 ఈ బహుమతులన్నీ దేవుడే ఇచ్చాడు. ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని, మనం ఇక ఎన్నటికీ ఆయన శత్రువులం కాకుండా చేశాడు. క్రీస్తు సిలువ ద్వారా ఇప్పుడు మనకు దేవునితో శాంతి కలిగింది. దేవుడే సిలువ చెంతకు ప్రజలని తీసుకువస్తూ, తాను వారికి చేరువౌతూ ఆ సమాధాన పరచే బాధ్యతాయుతమైన సేవను మాకిచ్చాడు.
\v 19 క్రీస్తు చేసిన కార్యాన్ని బట్టి దేవుడు ఎలా లోకానికి శాంతిని ఏర్పాటు చేశాడన్నదే దేవుణ్ణి, ప్రజలను జతపరుస్తున్న సువార్త. దేవుడు వారి అతిక్రమాల్ని వారి మీద మోపడంలేదు. బదులుగా క్రీస్తు మన అతిక్రమాలను పరిహరించి శాంతి కర్తగా దేవుణ్ణి, ప్రజల్నీ ఏకం చేస్తున్నాడు.
\s5
\v 20 కాబట్టి మేము దేవుడు నిర్ణయించిన క్రీస్తు ప్రతినిధులం. దేవుడు మా ద్వారా మిమ్మల్ని బతిమాలుతున్నట్టే, మేమాయన తరపున మిమ్మల్ని బతిమాలుతున్నాము. క్రీస్తు ద్వారా ఆయనని మీతో శాంతి నెలకొల్పనియ్యండి. మిమ్మల్ని తన దగ్గరకు చేర్చుకోనివ్వండి.
\v 21 పాపమెరుగని యేసును మన సమస్త పాపాల నిమిత్తం, దేవుడు శిక్షించాడు. మన పాపాలన్నీ యేసే చేసినట్టుగా ఆయన్ని శిక్షించాడు. క్రీస్తుతో మనకున్న దగ్గరి బంధుత్వాన్ని బట్టి, మన పాప అపరాధం మన మీద ఇక లేదని ప్రకటించాడు.
\s5
\c 6
\p
\v 1 మేము దేవునితో కలిసి పనిచేస్తూ దేవుని ప్రేమను తేలికగా ఎంచవద్దనీ, కృపను వ్యర్ధం చేసుకో వద్దనీ, మిమ్మల్ని వేడుకొంటున్నాము.
\v 2 దేవుడు,
\q "నేను కరుణించిన సమయంలోనూ, కటాక్షించిన సమయంలోనూ మీ ప్రార్థన విన్నాను.
\q నేను రక్షణ కార్యం ముగించిన దినాన్న మీకు సాయం చేసాను." అని చెప్తున్నాడు.
\m చూడండి, దేవుడు కరుణను కుమ్మరిస్తున్నాడు. ఇది కరుణా సమయం, అనుకూల సమయం. ఇదే రక్షణ దినం.
\p
\v 3 ముఖ్యంగా మా సువార్త ప్రకటన అను మా సేవపై ఎవని వల్లా, ఎలాంటి నిందా పడకూడదని, ఏ విషయంలోనూ చెడు ప్రోత్సహించం.
\s5
\v 4 పదే పదే మేము అన్ని విషయాలలో దేవుని సేవకులమని మమ్మును మేము రుజువు చేసుకుంటూ ఉన్నాము. బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అన్ని కఠిన సమయాలలో ఓర్చుకున్నాము. గాయపరిచిన వారి మధ్య ధైర్యంగా నిలబడ్డాము.
\v 5 మమ్మల్ని విపరీతంగా కొట్టారు. మిగతా వారినైతే జైళ్లలో పడేశారు. మమ్మల్ని సాకుగా చూపించి అల్లరి మూకలు చెలరేగాయి. చాలా సార్లు సుదీర్ఘమైన నిద్ర లేని రాత్రులు గడిపాము. నామ మాత్రంగా ఆహారం దొరికేది. విపరీతమైన కాయ కష్టం చేయాల్సి వచ్చేది. అయినా ఎంతో సహనం చూపాం.
\v 6 అయినప్పటికీ వీటన్నిటిలో స్వచ్ఛంగా ఉన్నాం. స్థిరమైన జ్ఞానం కలిగి, మా ఈ శ్రమలన్నిటిలో దేవుడనుగ్రహించు విడుదల కోసం దీర్ఘశాంతంతో ఎదురు చూడగలుగుతున్నాం. మాపై ఉన్న క్రీస్తు దయ అంతా ఇంతా కాదు. నిండైన పరిశుద్ధాత్మతో, ఇతరులపై నిష్కపటమైన ప్రేమ చూపిస్తున్నాం.
\v 7 దేవుని సత్యవాక్య క్రమంలో నడుస్తూ, ఆయనచే శక్తిని పొందుతున్నాం. క్రీస్తు వలన దేవుడు, మమ్మల్ని తనతో సమాధాన పరచుకున్నాడు. నిరంతరం మేము నమ్ముతున్న సత్యమిదే. ఇది ఒక సైనికుడు, కవచం ధరించి, కుడి ఎడమల రెండు చేతుల్లోనూ ఆయుధాలతో ఉన్నట్టు.
\s5
\v 8 ఘనతలో ఘనహీనతలో, అపవాదుల్లో ప్రశంసల్లో మేము ఒకేలా పని చేస్తున్నాం. మేము యథార్థవంతులమే, అయినా మోసం చేస్తున్నామనే నింద మా మీద ఉంది.
\v 9 అనామకుల్లాగా మేము ఉంటున్నా, కొద్దిమందికి మేమేమిటో తెలుసు, వారి మధ్య సుప్రసిద్ధులమే. క్రీస్తును గూర్చిన సువార్త ప్రకటిస్తున్నందుకు, కొంతమంది మమ్మల్ని, అన్యాయంగా చంపాలని చూశారు. చట్టప్రకారం మాలో మరణదండనకు తగిన నేరం ఎవరూ కనుగొనలేదు.
\v 10 మా జీవనమంతా ఏడుపే కానీ ఎప్పుడూ ఆనందిస్తూనే ఉన్నాం. దరిద్రులంగా కనబడుతున్నా, మాలో ఉన్న సువార్త అనే నిధి సాయంతో అనేకమందిని ఐశ్వర్యవంతులుగా చేస్తున్నాం. ఏమీ లేని వాళ్ళంగా కనబడుతున్నా, నిజానికి అన్నీ ఉన్నవాళ్ళమే.
\s5
\p
\v 11 కొరింతులో ఉన్న మా తోటి విశ్వాసులారా, సత్యం సంపూర్ణంగా మీకు వివరించాం, విశాల హృదయంతో, ధారాళమైన ప్రేమ చూపించాం,
\v 12 మీ విషయంలో ఏమాత్రం సంకుచితంగా లేము. అయినా, మమ్మల్ని ప్రేమించడానికి మీరెందుకో అయిష్టంగా కనబడుతున్నారు.
\v 13 మేము చేసినట్టే మీరూ చేయండి. మీ ప్రేమను ఆశిస్తున్నాను. నా పిల్లలకు చెప్పినట్టు చెబుతున్నాను.
\s5
\v 14 క్రీస్తును నమ్మని అవిశ్వాసులతో మీరు జతకట్టి, విశ్వాసులకు తగని పనులు చేయొద్దు. తమకు తోచినట్టు ఉంటూ, దేవుని ధర్మాన్ని లెక్క చేయని వాళ్ళతో, ఆయన ప్రమాణాలూ, నియమాలే శ్వాసగా ఉంటున్న వాళ్లకీ పోలికే లేదు. చీకటి, వెలుగులు కలిసుండే ప్రసక్తే లేదు.
\v 15 భూతంతో క్రీస్తు ఏ రకంగానూ సమ్మతించడు. దేవుని నమ్మిన వాడికి, నమ్మని వాడితో ఎలాటి సహచర్యమూ ఉండదు.
\v 16 దేవుని ఆలయానికి విగ్రహాలు తేకూడదు. మన దేహాలే జీవం గల దేవుని ఆలయం. అందుకు దేవుడు ఇలా సెలవిస్తున్నాడు.
\q "నేను నా ప్రజలలో నివసిస్తాను.
\q నేను వారి మధ్యలో సంచరిస్తాను.
\q నేను వారి దేవుడుగా ఉంటాను.
\q వారు నా ప్రజలుగా ఉంటారు."
\s5
\p
\v 17 కాబట్టి, మీరు అవిశ్వాసుల మధ్యనుండి బయటికి వచ్చి,
\q ప్రత్యేకంగా ఉండండి, అని ప్రభువు చెబుతున్నాడు.
\q "మీరు నన్ను ఆరాధించకుండా మిమ్మల్ని అసమర్ధులను చేసే అపవిత్రమైనది ఏదీ దరి చేర నివ్వకండి.
\q నేను మిమ్మల్ని మనసారా చేర్చుకుంటాను,
\q1
\v 18 మీకు తండ్రిగా ఉంటాను,
\q1 మీరు నాకు కొడుకులుగా కూతుళ్ళుగా ఉంటారు
\m అని సర్వశక్తి గల ప్రభువు చెబుతున్నాడు.
\s5
\c 7
\p
\v 1 ప్రియులారా, మనకు దేవుడు చేసిన ఈ వాగ్దానాలు ఉన్నాయి, కాబట్టి మనం శరీరంతో చేసే పనులైనా, మనసులో ఉద్దేశించిన విషయాలైనా దేవుణ్ణి ఆరాధించడానికి అడ్డుపడుతుంటే వాటిని మానుకోవాలి. దేవుని మీద భయభక్తులతో, ఆయన సన్నిధిలో వణుకుతూ మన దేహాలకీ, మనసులకీ మురికి అంటకుండా ఉండాలని ప్రయత్నిద్దాం.
\s5
\v 2 మమ్మల్ని మీ హృదయాల్లో చేర్చుకోండి. మా గురించి మీరు ఎలాంటి విషయాలు విన్నారో తెలీదు, అయినా మేమెవరికీ ఏ హాని చేయలేదు. ఎవరికీ అపకారం తలపెట్టలేదు. ఎవరినీ స్వార్థానికి వినియోగించుకోలేదు.
\v 3 మీమీద నింద మోపాలని నేనిలా అనడం లేదు. మీరు మా హృదయాల్లో ఉన్నారు. మీతో పాటు చావడానికైనా జీవించడానికైనా సిద్ధంగా ఉన్నామని నేను ముందే చెప్పాను.
\v 4 నేను మిమ్మల్ని ప్రేమించడం మాత్రమే కాదు మీ గురించి నేనెంతో గర్విస్తున్నాను. మాకెన్ని బాధలున్నా సరే, మిమ్మల్ని బట్టి ఆనందంతో పొంగి పోతున్నాను.
\s5
\p
\v 5 మేము మాసిదోనియలో మీ దగ్గరకు వచ్చినప్పుడు మా శరీరాలకు ఎంత మాత్రం విశ్రాంతి దొరకలేదు, అలిసిపోయాం. అన్నివైపులా మాకు కష్టాలే. బయటివారి వల్ల ఎన్నో తిప్పలు పడ్డాం. చాలా విషయాలు భయపెట్టాయి.
\v 6 కానీ కృంగినప్పుడల్లా ఆదరించే దేవుడు, తీతు రాక ద్వారా మమ్మల్ని ఆదరించాడు.
\v 7 తీతు రాక వలన మాత్రమే కాక, అతడు మీ దగ్గర ఉన్నప్పుడు పొందిన ఆదరణ వలన కూడా దేవుడు మమ్మల్ని భాగ్యవంతుల్ని చేసాడు. మాపై ఉన్న మీ అభిమానం, మా శ్రమలనుబట్టి మా పట్ల మీ దుఃఖం, మరి ముఖ్యంగా నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తి మాకు తెలియజేశాడు. కాబట్టి నేను మరెక్కువగా ఆనందించాను.
\s5
\p
\v 8 నా లేఖ మీకు దుఃఖం కలిగించినా, అది రాయక తప్పలేదు. రాస్తున్నప్పుడు చింతించాను, కానీ రాసిన విషయాలు క్రైస్తవ సమాజంలో ఉన్న ఇబ్బందులను ఎదుర్కోవడానికి మీకు చాలా ఉపయోగపడతాయి. మీ ఈ చింత ఎక్కువ కాలం ఉండబోదని నాకు తెలుసు.
\v 9 కాని ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది. మీరు నా లేఖ చదివి విచారించినందుకు కాదు గానీ, మీ విచారం మిమ్మల్ని ఆయాసపెడుతున్న పాపం నుండి మీరు విముఖులై పశ్చాత్తాపపడేలా చేసింది. దీన్నిబట్టి మీరు దైవిక విచారాన్ని అనుభవించారు. అందువలన పోగొట్టుకున్న దానికంటే పొందినదే ఎక్కువ.
\v 10 ఈ విధమైన దైవిక విచారం పశ్చాత్తాపాన్ని తెస్తుంది. దాని వలన ఒకడు పాపం నుండి దూరంగా పోతాడు, ఆపై అతనికి దేవుని రక్షణ లభిస్తుంది. చివరకు ప్రజలు సంతోషిస్తారు. ఇంకోవైపు ప్రకృతి సంబంధమైన చింత, పాపం వలన వచ్చిన దుఃఖం. ఇందులో చిక్కుబడిన వారిని మరణానికే తీసుకెళుతుంది.
\s5
\v 11 దేవుని వలన కలిగిన ఈ దుఃఖం ఇప్పుడు ఎంత మేలు చేసిందో చూడండి. నాకు మీరు నిర్దోషులమని తెలియ చెప్పాలనుకున్నారు. ఆ నేరారోపణ వల్ల మీరెంతో వ్యసనపడ్డారు. ఎలా అతను ఇంత పాపానికి ఒడిగట్టాడూ, అని మీరు కలత చెందారు. తప్పక న్యాయం జరగాలనే ఆశ మీలో కలిగింది. దైవిక విచారం మీలో ఎలాంటి పట్టుదల తెచ్చిందో చూడండి. మొత్తానికీ ఆ విషయంలో అన్ని విధాలుగా మీరు నిర్దోషులని నిరూపించుకున్నారు.
\v 12 నేను మీకు రాసినా ఆ చెడ్డ పని చేసినవాడి కోసం రాయలేదు. వాడి వలన అన్యాయం పొందిన వాడి కోసం కూడా రాయలేదు. మాపట్ల మీకున్న నమ్మకత్వం దొడ్డదని తెలియ చెప్పేందుకే రాశాను. మాపై మీకున్న నమ్మకం దేవునికి తెలుసు.
\s5
\p
\v 13 వీటన్నిటితో మాకెంతో ప్రోత్సాహం లభించింది. అంతే కాదు, తీతు పొందిన ఆనందం ద్వారా మాకు మరెక్కువ ఆనందం కలిగింది. ఆయనకు మీరు విశ్రాంతినిచ్చారనీ, సాయపడ్డారనీ తీతు మాతో అన్నాడు.
\v 14 ఎందుకంటే నేనతనికి మీ గురించి గొప్పగా చెప్పిన విషయాల్లో, అతను మీదగ్గరకు వచ్చినపుడు మీరు నన్ను సిగ్గుపరచలేదు. మేము మీ గురించి తీతుకు గొప్పగా చెప్పినదంతా వాస్తవమని మీరు రుజువు చేశారు.
\s5
\v 15 మీరు ఎంత ఆసక్తిగా దేవుణ్ణి వెంబడిస్తున్నారో స్వయంగా చూసిన తీతు మీరు అతన్ని చేర్చుకొని విధేయత చూపిన సంగతి జ్ఞాపకం చేసుకున్నపుడు, దేవుని పవిత్రతనుబట్టి మీరు భయంతోనూ, దేవుని ఘనతనుబట్టి అతనిని వణుకుతోనూ చేర్చుకున్నారనీ అతనికి మీ పట్ల ప్రేమ అధికమయ్యింది.
\v 16 ప్రతి విషయంలో మీ గురించి నాకు ఉన్న నమ్మకాన్ని బట్టి నేను ఆనందభరితుడినయ్యాను.
\s5
\c 8
\p
\v 1 సోదరీ సోదరులారా, మాసిదోనియ సంఘాలలో ప్రీతిగా దేవుడు జరిగిస్తున్న పనులూ, వారి మధ్య అద్భుతమైన రీతిలో ఆయన చూపిన కృపను గూర్చి మీకు తెలియాలని అనుకుంటున్నాం.
\v 2 అక్కడి విశ్వాసులు ఎన్ని కఠిన పరీక్షలు ఎదురైనా సంతోషంగా నిలిచారు. కడుపేద వారైనప్పటికీ యెరూషలేము విశ్వాసుల కోసం ఎక్కువ మొత్తంలో ధనాన్ని సేకరించారు.
\s5
\v 3 ఇవ్వగలిగినంతా ఇచ్చారు, అందుకు నేనే సాక్ష్యం. కొంతమందైతే తమ అక్కర పక్కనపెట్టి, ఎలాగైనా సాయపడాలని త్యాగపూరితంగా ఇచ్చారు.
\v 4 పరిశుద్ధుల సేవ నిమిత్తం సేకరిస్తున్నప్పుడు, ఆ పనిలో తమకు కూడా భాగం ఇవ్వాలని మరీ మరీ బతిమాలారు. ఇలా చేసి దేవుడు తన కోసం ప్రత్యేకించుకున్న ఆ సహ విశ్వాసులకు సాయపడగలమని భావించారు.
\v 5 వారు ఇలా ఇవ్వగలుగుతారని మేము తలంచనేలేదు. కానీ వారు మొదట ప్రభువుకూ, తరువాత దేవుని సంకల్పం వలన మాకూ తమను తామే అప్పగించుకున్నారు.
\s5
\p
\v 6 కాబట్టి సహాయపడడం కోసం చేస్తున్న ధన సమీకరణను మీ దగ్గర తీతు ఇప్పటికే మొదలు పెట్టి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నందున ఈ కృపా పరిచర్యను తుదమట్టుకూ చేపట్టమని మేము అతన్ని కోరాము.
\v 7 మీరు ప్రతి విషయంలో అంటే దేవుని పట్ల విశ్వాసంలో, ఉపదేశాన్ని స్వీకరించే విషయంలో, జ్ఞాన సముపార్జనలో, మొదలు పెట్టిన పని చివరి వరకూ శ్రద్ధగా చేయడంలో, ధైర్యం చెప్పడంలో, అంతటిలో మీకు మా పట్ల ఉన్న ప్రేమలో ఎలా రాణిస్తున్నారో అలానే మీరు ఈ కృపా పరిచర్యలో కూడా తప్పక రాణించండి.
\s5
\p
\v 8 ఆజ్ఞలా మీతో చెప్పడం లేదు. కానీ సహాయ కార్యక్రమాలలో ఇతరుల శ్రద్ధాసక్తులు మీకు తెలియజేసి, వారికంటే మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షిస్తున్నాను.
\v 9 మీకు మన యేసు క్రీస్తు ప్రభువు దయ తెలుసు గదా? ఆయన సమస్తమూ కలిగి ఉండీ తన పేదరికం వలన మీరు ధనవంతులు కావాలని, మీ కోసం తన సమస్తాన్ని ఇచ్చి పేదవాడయ్యాడు.
\s5
\v 10 ఈ విషయంలో మిమ్మల్ని ప్రోత్సాహపరిచే సలహా ఇస్తాను. ఏడాది క్రితం ఈ పని చేయాలని ఎంతో ఆతురతతో మొదలు పెట్టారు.
\v 11 కాబట్టి మీరిప్పుడు ఆ పని త్వరపడి పూర్తి చేయండి. పని చేయాలనే ఆశ, ఉత్సాహం అప్పుడు మీకెలా ఉన్నాయో ఆ విధంగానే వీలైనంత త్వరగా మీరిప్పుడు దాన్ని ముగింపుకు తీసుకు రండి.
\v 12 అసలు ఈ పని చేయాలనే శ్రద్ధ ఉంటే దేవుని ఆమోదం తప్పక దొరుకుతుంది. మీకున్న దాన్ని బట్టి దానం చేసి ఈ పనిని తప్పక పూర్తీ చేయండి. ఒక వ్యక్తి, తనకున్న దాన్ని బట్టే గానీ లేని దాన్ని బట్టి చేయలేడు.
\s5
\v 13 ఇతరుల బాధ ఉపశమనం చేసి మీకు భారంగా ఉండాలని ఇలా చెప్పడం కాదు కానీ, ఇతరులను ఆదుకోవడం మంచిదని మా ఉద్దేశ్యం.
\v 14 ప్రస్తుతం మీ సమృద్ధి వారి అవసరానికీ మరొకప్పుడు వారి సమృద్ధి మీ అవసరానికీ ఉపయోగపడాలని ఇలా చెబుతున్నాను.
\v 15 పవిత్ర లేఖనాల లో
\q "ఎక్కువ ఉన్న వాడికి ఏమీ మిగల్లేదు.
\q1 తక్కువ ఉన్న వాడికి కొదువ లేదు” అని రాసి ఉంది.
\s5
\p
\v 16 మీ పట్ల నాకున్న ఈ ఆసక్తినే తీతు హృదయంలో పుట్టించిన దేవునికి వందనాలు.
\v 17 అతడు మా విన్నపాన్ని అంగీకరించడమే గాక దాని గురించి ఎంతో ఆసక్తితో తన ఇష్టప్రకారమే మీ దగ్గరికి వస్తున్నాడు.
\s5
\v 18 క్రైస్తవ సంఘాలన్నిటిలో సువార్త ప్రకటించే పనిలో ప్రసిద్ధి చెందిన సోదరుణ్ణి అతనితో పంపిస్తున్నాం. సువార్త చక్కగా ఉపదేశిస్తున్నందున సంఘాలన్నీ అతన్ని మెచ్చుకుంటున్నాయి.
\v 19 క్రైస్తవ సమాజంలోని విశ్వాసులందరూ అతన్ని మాకు తోడుగా యెరుషలేము వరకూ వెళ్ళమనీ, మీరూ ఇంకా ఇతరులూ ఇచ్చిందంతా అక్కడివారికి ఇవ్వడంలో సాయపడమనీ అడిగారు. ఈ విరాళం ద్వారా విశ్వాసులమైన మన మధ్య సహాయ సహకారాలు పదిమందికీ తెలిసేలా, దేవుడిని ఘనపరిచేలా వుండాలని మా అభీష్టం.
\s5
\p
\v 20 మీ దాతృత్వాన్ని బట్టి మేము సేకరిస్తున్న ఈ విరాళాల విషయంలో ఎవరూ మమ్మల్ని విమర్శించకుండా ఉండాలని జాగ్రత్త పడుతున్నాం.
\v 21 ఎందుకంటే ప్రభువు దృష్టిలోనే కాక మనుషుల దృష్టిలో కూడా గౌరవించదగిన వాటినే చేయాలని, దాపరికం లేని యోగ్యమైన మార్గాన్ని ఎంచుకోవడంలో మేము జాగ్రత్త పడుతున్నాం.
\s5
\v 22 వారితో కూడా మరొక సోదరుణ్ణి మేము పంపుతున్నాం. అతన్ని చాలా విషయాల్లో చాలా సార్లు పరీక్షించి, ఆసక్తి గలవాడని గ్రహించాం. అతనికి మీమీద నమ్మకం కుదిరింది. అతడిప్పుడు మరింత ఆసక్తితో ఉన్నాడు.
\v 23 తీతు విషయంలోనైతే, అతడు నా సేవలో భాగస్థుడు, మీ విషయంలో నా జత పనివాడు. మన ప్రాంతంలోని క్రైస్తవ సంఘాలు మాతో యెరూషలేము ప్రయాణానికి ఎంపికచేసిన సోదరులయితే అందరి మన్ననలు పొందుతూ క్రీస్తుకు మహిమ తెచ్చేవారిగా ఉన్నారు.
\v 24 కాబట్టి వారికి మీ ప్రేమ చూపించండి. ఇతర సంఘాల్లో మీ గురించి మేము ఎందుకు గొప్పగా చెప్పకుండా ఉండలేకపోయామో వారికి రుజువు చేయండి.
\s5
\c 9
\p
\v 1 దేవుడు తనకోసం ప్రత్యేక పరుచుకున్న యెరూషలేములోని పరిశుద్ధుల కోసమైన ఈ ద్రవ్య సేకరణ గురించి ఇంతకంటే ఎక్కువ నేను మీకు రాయనవసరం లేదు.
\v 2 ఇతరులకు సాయం చేయడానికి మీకున్న ఆసక్తి నాకు తెలుసు. దాన్ని గురించి మాసిదోనియ ప్రజల ముందు మిమ్మల్ని పొగిడాను గదా! పోయిన సంవత్సరం నుండి అకయ ప్రాంతం వారు సిద్ధంగా ఉన్నారని వారికి చెప్పాను. మీ ఆసక్తి వారిలో చాలా మందిని ఈ విరాళాలకోసం ప్రోత్సహించింది.
\s5
\v 3 మాకంటే ముందుగా మేము పంపిస్తున్న సహోదరులు మిమ్మల్ని కలిసినపుడు మీ గురించి మేము గొప్పగా చెప్పిన సంగతులు అక్షర సత్యాలని తెలుసుకుంటారు. ఈపాటికే విరాళసేకరణ పూర్తి చేసి నేను చెప్పినట్టు మీరు సిద్దంగా ఉంటే ఇంకొకళ్ళకి నేను ఇచ్చిన మాట వ్యర్థం కాకూడదనీ సోదరులను పంపాను.
\v 4 ఒకవేళ నా ప్రయాణం కాస్త ఆలస్యమైతే మాసిదోనియ వారెవరైనా నాతో వచ్చే అవకాశం ఉంది. వారు వచ్చి, ఇస్తామని మీరు చెప్పినదానికి పూర్తి సిద్ధంగా లేరని, ఏదో కొంచమే సిద్ధం చేశారనీ తెలుసుకుంటే మీకే కాదు, మీ మీద ఇంత నమ్మకం ఉంచిన మాకు కూడా అవమానం.
\v 5 అందుచేత సోదరులు ముందుగానే మీ దగ్గరికి వచ్చి పూర్వం మీరు వాగ్దానం చేసిన విరాళం పోగుచేయడంలో మిమ్మల్ని ప్రోత్సహించడం అవసరమని నేను భావించాను. అప్పుడు మీ విరాళం మా బలవంతం మీద ఇచ్చినట్టు కాకుండా మీకై మీరు స్వచ్ఛందంగా ఇచ్చినట్టు ఉంటుందని నేను నమ్ముతున్నాను.
\s5
\p
\v 6 "కొద్దిగా చల్లేవాడు కొద్ది పంట కోస్తాడు. విస్తారంగా చల్లేవాడు విస్తారమైన పంట కోస్తాడు." అలాగే మీరు కొద్ది సాయమే చేశారనుకోండీ దేవుని నుండి కొద్దిపాటి దీవెనలే పొందుతారు అనీ, అదే మనఃపూర్వకంగా, ఉత్సాహంగా ఇచ్చారనుకొండీ దేవుని అనేక దీవెనలు స్వీకరిస్తారనీ దీన్ని బట్టి చెప్పవచ్చు.
\v 7 సణుక్కోకుండా బలవంతం లేకుండా తన హృదయంలో మొదట నిశ్చయించుకున్న ప్రకారం ప్రతి ఒక్కరూ ఇవ్వాలి. అప్పుడు ఒకరి ఒత్తిడివల్ల ఇవ్వాల్సి వస్తోందన్న భావన ఉండదు. హృదయంలో ఎలాటి విచారం లేకుండా ఆ పని చేయగలుగుతారు. ఎందుకంటే, దేవుడు ఉత్సాహంగా ఇచ్చే వ్యక్తిని ప్రేమిస్తాడు.
\s5
\v 8 నానా విధాలుగా దేవుడు మీకు నజరానాలు ఇతోధికంగా ఇస్తాడు. అందువల్ల మీరు కొరత లేకుండా ఉండడమే కాకుండా చాలినన్ని మంచిపనులు చేయగలుగుతారు.
\v 9 దీని గురించి
\q "అతడు ఉద్దేశించిన సంగతులు సర్వత్రా శుభాలే.
\q అతడు వారి అక్కర కొద్దీ తన సంపద దరిద్రులకు పంచి ఇచ్చాడు.
\q అతని పనులు ఎప్పటికీ నిలిచి ఉంటాయి” అని లేఖనంలో రాసి ఉంది.
\s5
\p
\v 10 విత్తనాలు చల్లేవారికి విత్తనాన్నీ భోజనం సిద్దపరిచేవాడు తినడానికి ఆహారాన్నీ దయచేసే దేవుడు, మీకు విత్తనాన్ని దయచేసి ఇతరుల అవసరాలు తీర్చగలిగేంతగా వృద్ధి చేస్తాడు.
\v 11 అనేక విధాలుగా దేవుడు మిమ్మల్ని భాగ్యవంతుల్ని చేస్తాడు. ఆ కారణాన మీలో దాతృత్వం పరిమళిస్తుంది. పొందిన వారందరూ మా పని ద్వారా దేవుడు మీలో వెల్లడించిన ఔదార్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్తారు.
\s5
\p
\v 12 అక్కరలో ఉన్న క్రైస్తవ సహోదరీ సహోదరుల కోసం మాత్రమే కాక పెద్ద సంఖ్యలో విశ్వాసులు సైతం దేవునికి కృతజ్ఞత చెప్పేటట్లు ఈ ద్రవ్య సేకరణను అంగీకరించాము.
\v 13 మీరు ఆరంభించిన ఈ సేవ ద్వారా మీ యోగ్యత కనబడుతుంది. దేవుడు పలికిన క్రీస్తు సువార్తను ఒప్పుకొని ఆయనకి విధేయులై, ఇంత ఉదారంగా అందరికీ పంచిపెట్టడం బట్టి, మీరు కూడా దేవుణ్ణి మహిమ పరుస్తారు.
\v 14 మీ ద్వారా పొందిన వారు మీ పట్ల దేవుడు కనపరచిన అత్యధికమైన కృపను చూసి, వారు మీ కోసం ప్రార్థన చేస్తూ, మిమ్మల్ని చూడాలని ఎంతో కోరికతో ఉన్నారు.
\v 15 వర్ణింప శక్యం గాని దేవుని బహుమానానికి ధన్యవాదాలు.
\s5
\c 10
\p
\v 1 పౌలు అనే నేను క్రీస్తులో ఉన్న సాత్వీకంతో, మృదుత్వంతో మీకు స్వయంగా విన్నపం చేస్తున్నాను. ఆయనే నన్ను ఈ రీతిగా మలిచాడు. మీతో ఉన్నపుడు దీనునిగా సంకోచిస్తూ ఉన్న నేను, దూరాన మీరు లేనపుడు జంకూ గొంకూ లేకుండా ఈ లేఖ రాస్తూ ప్రబలమైన ధైర్యంతో ఉన్నాను.
\v 2 మేము శరీరానుసారంగా నడుస్తున్నామని కొందరంటున్నారు. అలాంటి వారితో నేను విభేదించి ధైర్యంతో వ్యవహరించాలని అనుకుంటున్నాను. అయితే మీతో ఉన్నపుడు నేనలా ఉండకుండాా చేయమని మిమ్మల్ని బతిమాలుతున్నాను.
\s5
\v 3 మేము శరీరంతో జీవిస్తున్నా యుద్ధ సమయంలో సైనికులు శరీరానుసారంగా పోరాడుతున్నట్టు శరీర నియమాలతో పోరాటం చేయం.
\v 4 మేము యుద్ధం చేస్తున్నప్పుడు వాడే ఆయుధాలు ఈ లోక సంబంధమైనవి కావు. మనుషులచే చేయబడినవి అంతకంటే కావు. దేవునిచే అనుగ్రహించబడినవి. ఈ ఆయుధాలు అత్యంత శక్తివంతమైనవి, మనుషుల్ని పక్కదోవ పట్టించే కపట తర్కాలను ఓడించే దైవ శక్తి వాటికి ఉంది.
\s5
\v 5 ఈ విధంగా ఈ ఆయుధాలతో దేవుని జ్ఞానాన్ని అడ్డగించే తప్పుడు వాదాలతో కూడిన ప్రతి ఆటంకాన్నీ నాశనం చేయగలం. దేవుని గూర్చిన అనుభవజ్ఞానం నుండి ప్రతి వానినీ దూరం చేసేవే ఈ తర్కాలు. దేవుడు అలాంటి ప్రతి ఆలోచననూ అవిధేయతనూ పట్టి వశపరచుకున్నప్పుడు వారు వెనుతిరిగి క్రీస్తుకు లోబడేలా చేస్తున్నాడు.
\v 6 మీ అంతట మీరే క్రీస్తుకు విధేయులైన పిదప మిగిలిన వారి అవిధేయతంతటినీ శిక్షించడానికి సిద్ధపడి ఉన్నాం.
\s5
\p
\v 7 మీ ముందున్న వాస్తవాలను స్పష్టంగా చూడండి. మీలో ఎవరికైనా విశ్వాసం ఉండి, తాను క్రీస్తు వాడినని నమ్మకం కుదిరితే, అతనెలా క్రీస్తువాడో మేము కూడా అలానే క్రీస్తు వారిమని తాను గుర్తుంచుకోవాలి.
\v 8 మీ నాశనం కోసం కాక మిమ్మల్ని కట్టడానికే అపోస్తలుడుగా ఉండడానికి ప్రభువు ఇచ్చిన అధికారాన్ని గురించి నాకై నేను కాస్త ఎక్కువ అతిశయంగా చెప్పుకోవడం మీకు అతిగా అనిపించినా సిగ్గుపడను.
\s5
\v 9 నేను రాసే ఉత్తరాలు చదువుతున్నప్పుడు కాస్త కఠినంగా ఉన్నప్పటికీ అవి మిమ్మల్ని భయపెట్టేలా ఉండకూడదు. అలా మీరు భయపడాలని నేను ఆశించ లేదు.
\v 10 నన్నెరిగిన కొందరు నా ఉత్తరాలు చదివి ఇలా అంటారు, "అతని ఉత్తరాలు గంభీరంగా బలీయంగా ఉన్నాయి అశ్రద్ధ చేయడం మంచిది కాదు, కానీ పౌలు మనతో ఉన్నప్పుడు అతని శరీరం బలహీనంగానూ, మాటలు చప్పగానూ ఉంటాయి."
\s5
\v 11 అలాంటి వారు తెలుసుకోవలసింది ఏంటంటే మేము మీతో లేనపుడు ఉత్తరాల్లో రాసిన ప్రకారం ఏమి చెప్పామో మేము మీతో ఉన్నప్పుడూ అలానే ప్రవర్తిస్తాము.
\p
\v 12 తమను తామే మెచ్చుకొనే వారిలో ఒకరిగా ఉండడానికి గానీ వారితో పోల్చుకోడానికి గానీ మేము తెగించం. అయితే వారు తమకు తాము ఒకరిని బట్టి మరొకరు బేరీజు వేసుకుంటూ ఒకరితో ఒకరు పోల్చుకుంటూ ఉంటే వారు తెలివిలేని పని చేస్తున్నారు అనడానికి అదే రుజువు.
\s5
\v 13 మేమైతే దేవుడు మాకు అనుగ్రహించిన స్థాయికి మించి అతిశయపడం. మిమ్మల్ని చేరగలిగేలా దేవుడు మాకు ఏ పని నిర్దేశిస్తే అదే చేస్తాం. ఏది ఏమైనా మీరు దేవుడు మాకిచ్చిన పనిలో భాగస్తులే.
\v 14 మేము మీ దగ్గరికి వచ్చినపుడు దేవుడు మాకు అనుగ్రహించిన పని మట్టుకే చేస్తూ అంతకు మించి మా హద్దులు మీరలేదు. క్రీస్తు సువార్త మోసుకుంటూ మీ దాకా మొట్టమొదట వచ్చింది మేమే.
\s5
\v 15 మేము మా హద్దు మీరి ఇతరుల కష్ట ఫలంలో మాకు వంతు ఉన్నట్టూ, ఆ పని మేమే చేసినట్టూ అతిశయపడము. అయితే మీ విశ్వాసం అభివృద్ధి అయ్యే కొద్దీ మా పరిధిలో మా కర్తవ్య నిర్వహణా భాద్యత ఇంకా ఎక్కువ అవుతుందని ఆశిస్తున్నాము.
\v 16 మీకు అవతల ఉన్న ప్రాంతాల్లో కూడా మీ ద్వారా సువార్త ప్రకటించాలనీ మా ఆశ. దేవుని సేవకులు తమ పరిధిలో చేస్తున్న పని గురించి మేమే దాన్ని జరిగించినట్టూ, మాకే పేరు రావాలన్నట్టూ అతిశయించం.
\s5
\v 17 అయితే,
\q "అతిశయించేవాడు ప్రభువులోనే అతిశయించాలి." అని పవిత్ర లేఖనాలు చెప్తున్నాయి.
\p
\v 18 ప్రభువు మెచ్చుకొనే వాడే యోగ్యుడు. అతనికి దేవుని బహుమానం ప్రాప్తిస్తుంది. గానీ తనను తానే మెచ్చుకొనేవాడు యోగ్యుడు కాడు. అతనికి దేవునిచే మెప్పు కలుగదు.
\s5
\c 11
\p
\v 1 తన గొప్ప తాను చెప్పుకోవడం బుద్ధి హీనతే. నేను ఇప్పుడు చేస్తున్నది అదే. నా బుద్దిహీనతను మరి కొంత కాలం దయతో సహించమని కోరుతున్నాను, నిజానికి మీరు సహిస్తూనే ఉన్నారు.
\v 2 మీకు కావలి కాస్తూ దేవుడు ఏ రీతిగా మిమ్మల్ని పదిలంగా చూసుకుంటాడో అలాగే నేనూ చూసుకోవాలనుకొంటున్నాను. ఒక తండ్రికి ఉన్నట్లు మీ పట్ల నాకు దైవిక రోషం ఉంది. ఎందుకంటే వివాహ బంధంలో పవిత్ర కన్యగా ఒక్క భర్తకే, అంటే క్రీస్తుకు సమర్పించాలని మిమ్మల్ని ప్రదానం చేశాను.
\s5
\v 3 అయితే, ఆలోచించే కొద్దీ ఎవరైనా మిమ్మల్ని కుయుక్తిగా తప్పుదోవ పట్టిస్తున్నారేమో అని భయం వెంటాడుతోంది. సర్పం తన కుయుక్తితో హవ్వను మోసగించినట్టు మీరూ ఎవని మోసంలోనైనా చిక్కినపుడు, క్రీస్తులో ఉన్న నిజాయితీ నుండి, పవిత్ర భక్తి నుండి మీ మనసులు తొలగిపోతాయేమో అని నేను భయపడుతున్నాను.
\v 4 ఎందుకంటే ఎవరైనా వచ్చి మేము ప్రకటించిన యేసును కాక మరొకరిని ప్రకటించినా, లేక దేవునినుండి మీరు పొందని వేరొక ఆత్మను పొందాలని బోధించినా , మీరు మొదట విన్న సువార్తకు భిన్నంగా వేరొక సువార్త మీకు వినిపించినా, మీరు వాటిని ఖండించక బాగానే సహిస్తున్నారు.
\s5
\v 5 పైగా గురువులుగా చెలామణీ అవుతున్న అలాంటి వారికి ప్రజలు గొప్పతనం అంటగడుతున్నప్పుడు, ఆ "గొప్ప అపొస్తలుల” కంటే నేనేమాత్రం తక్కువ వాణ్ణి కానని అనుకుంటున్నాను.
\v 6 అద్భుతమైన ప్రసంగాలు చేయడంకోసం నేనెప్పుడూ తర్ఫీదు పొందలేదు. అయితే దైవ జ్ఞానం మెండుగా వుందని మాత్రం నికరంగా చెప్పగలను. నా మాటల్ని బట్టి మీరు ఆ విషయం గ్రహించే ఉంటారు.
\s5
\p
\v 7 మీకు దేవుని సువార్త ఉచితంగా ప్రకటిస్తూ మిమ్మల్ని హెచ్చించడానికి నన్ను నేనే తగ్గించుకొని తప్పు చేశానా?
\v 8 ఇతర విశ్వాస సమాజాల ధన సహాయంతో మీకు సేవ చేయగలిగాను. వారి నుంచి పైకం తీసుకుని, నేను ఒక విధంగా ఆ సంఘాలను దోచుకున్నాను. చిల్లి గవ్వ కూడా మీ దగ్గర ఆశించలేదు.
\v 9 నేను మీతో ఉన్నప్పుడు నాకు అక్కర కలిగితే మీలో ఎవరి మీదా భారం మోపలేదు. మాసిదోనియ ప్రాంతం నుండి వచ్చిన సోదరులు నా అవసరాలు తీర్చారు. ప్రతి విషయంలో నేను మీకు భారంగా ఉండకుండాా చూసుకున్నాను. ఇంకా అలానే చేస్తూ ఉంటాను.
\s5
\v 10 క్రీస్తును గూర్చిన సత్యం సంపూర్ణంగా ప్రకటించడమే కాక ఆయనకి నేను చేస్తున్న సేవ కూడా వివరిస్తున్నాను. అకయ ప్రాంతాల్లో ఉన్న వారందరూ ఈ విషయాన్ని సాంతం గ్రహించేలా చేస్తాను.
\v 11 మీ ధనాన్ని ముట్టుకోనంత మాత్రాన మిమ్మల్ని ద్వేషిస్తున్నానని కాదు. నిజంగా అలాంటి ఆలోచనకి తావివ్వకండి. నేను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నానో దేవునికే ఎరుక.
\s5
\p
\v 12 మీ సేవలో ఇలాగే ఎడతెగక ఉంటూ కొందరిని నిరోధిస్తాను. ఎందుకంటే, కొందరు సేవ విషయాల్లో మాలాగే మాతో సమానులై ఉన్నట్టు అనిపించుకోవాలని లేనిది ఉన్నట్టు పై పై మెరుగులతో తమని తాము హెచ్చుగా చూపించు కుంటున్నారు. అలాంటి వారిని క్షమించేది లేదు.
\v 13 అలాంటి వారు క్రీస్తు అపొస్తలుల వేషం వేసుకున్న అబద్ధ అపొస్తలులు. దేవుడిచేత పంపబడ్డామని చెప్పుకుంటూ తిరుగుతున్న మోసకారి సేవకులు. అబద్దాలనే ఆధారంగా చేసుకుని పనిచేస్తూ పైకి మాత్రం స్వయానా క్రీస్తుచే ఎన్నుకోబడిన శిష్యులుగా అపోస్తలులుగా నటిస్తున్నారు.
\s5
\v 14 ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. సాతాను కూడా దేవుని సముఖపు వెలుగుతో దూత వేషం వేసుకుంటాడు.
\v 15 అందుచేత, వాడి సేవకులు కూడా నీతిగల పరిచారకుల్లాగా వేషం వేసుకోవడం వింతేమీ కాదు. దేవుడు వారిని తగినట్టుగా శిక్షిస్తాడు.
\s5
\p
\v 16 మళ్ళీ చెబుతున్నాను. నేను బుద్ధిహీనుడినని ఎవరూ అనుకోవద్దు. అలా అనుకుంటే, నేను ఇంకొంచెం అతిశయపడేలా కొనసాగుతాను.
\v 17 గొప్పలు చెప్పుకుంటూ అతిశయపడుతున్న నేను, ఈ విషయాలు ప్రభువు మాటగా చెప్పడం లేదు, ఒక బుద్ధిహీనుడిలా చెబుతున్నాను.
\v 18 చాలామంది శరీరానుసారంగా అతిశయిస్తున్నారు. మంచిది, నేనూ అతిశయిస్తాను.
\s5
\v 19 మీరు చాలా తెలివైన వాళ్ళు. నిజానికి నా బుద్ధిహీనతని ఆనందంతో సహిస్తున్నారు.
\v 20 ఇలా ఎందుకు అంటున్నానంటే, ఎవరైనా మిమ్మల్ని బానిసలుగా చూస్తున్నా మీరు ఓర్చుకుంటున్నారు , మీలో విభేదాలు కలిగించినా మౌనంగా వెంబడిస్తున్నారు, వారి సొంత ప్రయోజనాల్ని ఆశించి మిమ్మల్ని వశం చేసుకున్నా తలూపుతున్నారు, తమ గురించి తాము గొప్పలు చెప్పుకుంటున్నా ఆమోదిస్తున్నారు, చెంప దెబ్బ గట్టిగా కొట్టినా మీరు ఏమీ అనక మిన్నకున్నారు. వాస్తవానికి ఇందులో వివేకం ఏమాత్రం లేదు.
\v 21 తిమోతీ గానీ నేను గానీ వారు చేసినట్టు చేయలేని బలహీనులమని సిగ్గుతో చెబుతున్నాను. అయితే, ఎవరైనా ఎపుడైనా అలా చేస్తూ బడాయిలు పోతుంటే - బుద్ధిహీనుడిలా మాట్లాడుతున్నాను - నేనూ అలాగే అతిశయించగలను.
\s5
\v 22 వారు స్వచ్చమైన హెబ్రీయులా? నేను కూడా స్వచ్చమైన హెబ్రీయుడినే. వారు ఇశ్రాయేలీయులా? నేను కూడా ఇశ్రాయేలీయుడినే. వారు అబ్రాహాము సంతానమా? నేను కూడా.
\v 23 వెర్రివాడిలాగా మాట్లాడుతున్నాను, వారు క్రీస్తు సేవకులా? వారందరికంటే చాలా ఎక్కువగా కష్టపడ్డాను. అనేక సార్లు చెరసాల పాలయ్యాను. లెక్కలేనన్ని సార్లు దెబ్బలు తిన్నాను. అనేకమార్లు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాను.
\s5
\v 24 యూదుల చేత ఐదు సార్లు "ఒకటి తక్కువ నలభై” కొరడా దెబ్బలు తిన్నాను. ప్రతిసారి కొన ప్రాణంతో వదిలారు.
\v 25 నన్ను బంధించిన వాళ్ళు మూడు సార్లు బెత్తాలతో కొట్టారు. ఒకసారి చంపేయడానికి రాళ్లతో కొట్టారు. మూడుసార్లు నేనెక్కిన ఓడలు సముద్రపు తుఫాన్ల తాకిడికి పగిలిపోయాయి కొట్టుకుపోయాను. ఒకసారైతే ఒక పగలు, ఒక రాత్రి నడిసముద్రంలో సహాయం కోసం ఎదురుచూస్తూ గడిపాను.
\v 26 తరచుగా ప్రయాణాల్లో అపాయాలకు గురయ్యాను. నదుల్లో సంభవించే అపాయాలూ, దోపిడీ దొంగల వలన అపాయాలూ, నా సొంత ప్రజల వలన అపాయాలూ, యూదేతరుల వలన అపాయాలూ, పట్టణాల్లో అపాయాలూ, అరణ్యాల్లో అపాయాలూ, సముద్రంలో అపాయాలూ, మనల్ని మోసగించిన కపట సోదరుల వల్ల అపాయాలూ నాకు ఎదురయ్యాయి.
\s5
\v 27 కష్ట పడ్డాను. వేదన అనుభవించాను. నిద్ర కరువైన అనేక రాత్రులు గడిపాను. చలితో, ఆకలి దప్పులతో, తినడానికి ఏమీ లేక, చాలీ చాలని బట్టలతో ఉన్నాను.
\v 28 వీటికి తోడు యేసు క్రీస్తును వెంబడిస్తున్న సంఘాలన్నిటిని గూర్చిన దిగులు, వారు ఎలా ఉన్నారో నన్నఆలోచన రోజూ నా మీద భారంగా ఉంది.
\v 29 మీలో ఒకడు బలహీనుడైతే, నేనూ బలహీనుణ్ణి కాకుండా ఉండగలనా? ఒకడు ఇతరుల వల్ల పాపంలో పడితే, నేను నా అంతరంగంలో మండిపోకుండా ఉండగలనా?
\s5
\p
\v 30 అతిశయపడాల్సి వస్తే నేను దుర్భలుడనని నా బలహీనతలు స్పష్టం చేస్తున్నపుడు వాటిలోనే అతిశయిస్తాను.
\v 31 ఎప్పటికీ స్తుతి పాత్రుడైన మన యేసు ప్రభువు తండ్రి అయిన దేవునికి ప్రతివారూ, ప్రతిదీ స్తోత్రములు చెల్లించుదురు గాక! నేను అబద్ధమాడడం లేదని ఆ దేవ దేవునికి తెలుసు.
\s5
\v 32 దమస్కులో అరెత అనే రాజు కింద ఉన్న అధికారి నన్ను పట్టుకోవడం కోసం దమస్కు పట్టణం చుట్టూ కాపలా పెట్టాడు
\v 33 అప్పుడు నా మిత్రులు నన్ను గంపలో వుంచి గోడ కిటికీ గుండా పట్టణం వెలుపల దించితే అతని చేతికి చిక్కకుండా తప్పించుకున్నాను.
\s5
\c 12
\p
\v 1 ప్రభువు అనుగ్రహించిన దర్శనాలూ, ప్రత్యక్షతలూ నన్ను నేను సమర్ధించుకోవడానికి అన్నట్టు దాని వలన ప్రయోజనమేమీ రాదని తెలిసినా బడాయిగా మీకు తెలియజేస్తాను.
\v 2 క్రీస్తులో ఉన్న ఒక వ్యక్తి నాకు తెలుసు. అది నేనే. పద్నాలుగు సంవత్సరాల క్రితం దేవుడు నన్ను అత్యున్నత ఆకాశానికి కొనిపోయాడు.
\s5
\v 3 నేను శరీరంతో వెళ్ళానో లేక శరీరం లేకుండా వెళ్ళానో నాకు తెలియదు. దేవునికే తెలుసు.
\v 4 దేవుడు నన్ను ఆనంద నివాసం అని పిలవబడుతున్న ఉన్నత స్థలంలోకి కొనిపోయాడు. నేనక్కడ పలకడానికి వీలు కాని అతి పవిత్రమైన విషయాలు విన్నాను.
\p
\v 5 అలాంటి అనుభవాలతో నేను అతిశయించగలను. కానీ, నేను కాదు దేవుడే సమస్త సంభవానికీ కారకుడు. నేనయితే బలహీనుడను. నా బలహీనతల విషయంలో దేవుడు నాలో ఉండి ఎలా పని చేస్తున్నాడో ఏం చేస్తున్నాడో అదే నా అతిశయ కారణం. అది తప్ప నాకు నేనుగా అతిశయించను.
\s5
\v 6 ఒకవేళ అతిశయించాలనుకొన్నా అది తెలివి తక్కువతనమేమీ కాదు. ఎందుకంటే నేను సత్యమే చెబుతున్నాను. కానీ ఎవరైనా నాలో చూసినదాని కంటే, నేను చెప్పింది విన్నదాని కంటే నన్ను ఎక్కువ ఘనంగా ఎంచకుండా ఉండేలా అతిశయించడం మానుకుంటాను.
\v 7 నాకు కలిగిన ప్రత్యక్షతలు అసాధారణమైనవి కాబట్టి నేను గర్వంతో రెచ్చిపోకుండా దేవుడు నా దేహంలో ఒక ముల్లు పెట్టాడు. అది నన్ను బాధించడానికి, అతిశయించకుండా ఉండటానికి ఉన్న సాతాను దూత.
\s5
\v 8 అది నా దగ్గర నుండి తొలగిపోవాలని దాని గురించి మూడు సార్లు ప్రభువును బతిమాలాను.
\v 9 అప్పుడాయన నాతో ఇలా అన్నాడు, "దానిని పోగొట్టను. నా కృప నీకు చాలు. నా ప్రేమ, నా సన్నిధి తోడుగా ఉండడమే నీకు ముఖ్యం. నీ బలహీనతలోనే నా అత్యున్నత బలం పరిపూర్ణమవుతుంది." కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండి నన్ను బలవంతుణ్ణి చేసేలా, నేను నా బలహీనతల్లోనే అతిశయిస్తాను.
\p
\v 10 క్రీస్తు నా పాలిట ఉండగా దేన్నైనా నేను ఎదుర్కోగలను. అది నేను అశక్తుడుగా ఉన్నప్పుడైనా, ఒకరు నన్ను తిరస్కరించినపుడైనా, నేను నానా అగచాట్లు పడుతున్నప్పుడైనా, వారు నన్ను అంతమొందించాలని ప్రయత్నించినపుడైనా, ఇలాంటి పలురకాల శ్రమలు ఎన్ని సంభవించినా, పరిస్థితి ఎలాంటిదైనా నేను అశక్తుడనై నిలిచినపుడు అప్పుడే నేను బలవంతుడిని.
\s5
\p
\v 11 ఇలా రాస్తూ నన్ను నేనే మెచ్చుకుంటున్నాను. కానీ తప్పదు ఎందుకంటే, నాపై మీకు నమ్మకం కలగాలి. నేను వట్టివాడినైనా ఆ "గొప్ప అపొస్తలుల” కంటే ఏ మాత్రం తక్కువ వాణ్ణి కాను.
\v 12 అసలైన అపొస్తలునికి ఉండాల్సిన గురుతులు మీకు చూపెట్టాను. దేవుడు నా ద్వారా సూచకక్రియలూ అద్భుతాలూ మహత్కార్యాలూ కనపరిచాడు. నేను యేసు క్రీస్తును సేవిస్తున్నాను అనడానికి రుజువులివే.
\v 13 నాకు ఇతర క్రైస్తవ సమూహాలు ఎంత ముఖ్యమో మీరూ అంతే ముఖ్యం. వారికీ మీకూ ఒకే ఒక్క తేడా ఏంటంటే, ధన సహాయం వారినుంచే పొందాను తప్ప మిమ్మల్ని కోరనూ లేదూ, మీ నుంచి పొందనూ లేదు. అందుకు నన్ను క్షమించండి.
\s5
\p
\v 14 కాబట్టి ఈ మాట వినండి. ఇప్పుడు ఈ మూడవసారి మీ దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నాను. వచ్చినప్పుడు ఇంతకు ముందు లాగే మీకు భారంగా ఉండను, మిమ్మల్ని అడగను. మీకేముందో అది నాకు అక్కరలేదు. నాకు మీరే కావాలి. తల్లిదండ్రుల కోసం పిల్లలు సొమ్ము చెల్లించరు. కానీ తల్లిదండ్రులే పిల్లల కోసం దాచి ఖర్చు పెడతారు. ఈ సూత్రం మన కుటుంబాలలో ఉన్నదని మీకు విదితమే.
\v 15 కాబట్టి మీ కోసం ఎంతో ఆనందంగా ఖర్చు చేస్తాను. మీకోసం నా ప్రాణం ఖర్చయిపోయినా పరవాలేదు. మీపై నా ప్రేమ అంతకంతకూ అధికమౌతుంటే మీరు నన్ను ఇంతకంటే ఎక్కువగా ప్రేమించరా?
\s5
\p
\v 16 అదలా ఉంచండి. నేను మీకు భారంగా ఉండడం ఇష్టం లేక మీ నుంచి ద్రవ్యాన్ని ఆశించలేదు. గానీ నేను యుక్తిగా మాయోపాయం చేత మిమ్మల్ని పట్టుకోవడం కోసం అలా చేశానని అని చెబుతారేమో!
\v 17 ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, నేను మీ దగ్గరికి పంపిన వారిని మీ నుండి ధనాన్ని సేకరించమని గానీ, నా దగ్గరకు తెమ్మని గానీ నేను ఎప్పుడూ అడగలేదు.
\v 18 ఉదాహరణకి మీ దగ్గరికి వెళ్ళమని తీతును ప్రోత్సహించాను. అతనితో వేరొక సోదరుని పంపాను. తీతు తన ఖర్చుల నిమిత్తం మీ దగ్గర ఏమైనా సంపాదించాడా? తీతూ ఆ వేరొక సహోదరుడూ నేను మీతో ఉన్నట్లే ఉన్నారు కాదా! మేము ఏక మనసుతో ఏక విధానంతో ప్రవర్తించలేదా? మీరు మా కొరకు ఎలాటి ఖర్చూ పెట్టవలసి రాలేదు.
\s5
\p
\v 19 మేమింత వరకూ మా ఈ లేఖా ముఖంగా మా పక్షాన మేము వాదించుకుంటున్నామని మీరు అనుకుంటున్నారా? దేవుని దృష్టిలో క్రీస్తును బట్టి మీ క్షేమాభివృద్ధి కోసం అంటే, ఆయనపై మీకున్న విశ్వాసం దృఢపరచడం కోసం ఇవన్నీ చెబుతున్నాం.
\s5
\v 20 నేను వచ్చినప్పుడు మీరు నేను ఆశించినట్టుగా నాకు ఇష్టులుగా ఉండరేమో అనీ, నేనంటే కూడా మీరు ఇష్టపడక నా మాటలను సైతం అంగీకరించరేమోననీ భయపడుతున్నాను. మీలో మీరు అతిగా వాగ్వాదాలకు చోటిస్తున్నారనీ, మీలో కొద్దిమందికి ఒకరంటే ఒకరికి పడదనీ, కొద్దిమంది మధ్య ద్వేష పూరిత వాతావరణం ఉందనీ సందేహిస్తున్నాను. ఇంకొంతమందైతే ఒకరికంటే ఒకరు ఎక్కువంటూ పోటీ తత్వాన్ని ప్రదర్శిస్తున్నారనీ, ఎదుటివారిని విమర్శించడంలోనే కాలం గడుపుతున్నారనీ, తమ సుఖం తప్ప మరేదీ పట్టని వారుగా ఉన్నారనీ భయపడుతున్నాను.
\v 21 నేను తిరిగి వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చుతాడేమో అనీ, గతంలో పాపం చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వం, ఇంద్రియలోలత్వం విషయాలలో పశ్చాత్తాపపడి, వాటినుండి దూరంగా తొలగని అనేకుల గురించి దుఖించాల్సి వస్తుందేమో అనీ భయపడుతున్నాను.
\s5
\c 13
\p
\v 1 ఇలాంటి విషయాలను పరిష్కరించడం కోసం మీ దగ్గరికి నేను రావడం ఇది మూడోసారి. ఇలాంటి వ్యవహారాలలో "ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి విషయం నిర్ధారణ కావాలి." అంతేకానీ ఏ ఒక్కరివల్లా కాదు అని పవిత్ర లేఖనాలు సూత్రప్రాయంగా చెప్తున్నాయి.
\v 2 నేను రెండవసారి వచ్చి మీ దగ్గర ఉన్నపుడు, పాపం చేసి విశ్వాసుల గుంపంతటి ఆగ్రహం రుచి చూసిన వారికీ, మిగతా వారందరికీ ముందే చెప్పినట్టు, మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను. మూడవసారి వచ్చినపుడు ఇలాంటి ఆరోపణలు ఉన్నవారిని వదిలి పెట్టను.
\s5
\v 3 క్రీస్తు నా ద్వారా మాట్లాడుతున్నాడని రుజువు కావాలని కోరుతున్నారు కాబట్టి ఈ విషయం మీకు చెబుతున్నాను. ఆయన మీ పట్ల బలహీనుడు కాడు, మీలో శక్తిశాలిగా తన పని జరిగిస్తూ ఉన్నాడు.
\v 4 క్రీస్తునే ఉదాహరణగా తీసుకుని నేర్చుకుందాము. బలహీనుడుగా ఉన్నప్పుడు ఆయనను సిలువ వేశారు అయినప్పటికీ, దేవుడు తన శక్తిని బట్టి ఆయనను సజీవుడుగా లేపాడు. మేము కూడా మా జీవన శైలిలో బలహీనులమైనా, మీలో కొంతమంది జరిగించిన పాపాల గురించి మాట్లాడేటప్పుడు మాత్రం క్రీస్తు దృష్టాంతం మాలో నెరవేరుతూ, మేము దేవుని శక్తితో జీవం కలిగి ఉంటాము.
\s5
\p
\v 5 మీరు విశ్వాసాన్ని బట్టి జీవిస్తున్నారో లేదో మిమ్మల్ని మీరే పరిశోధించుకోండి. దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఎంతలా తన కనికరాన్ని కుమ్మరిస్తున్నాడో మీకై మీరు తెలుసుకునేలా మీ నమ్మకాన్ని పరీక్షించుకోండి. మీలో క్రీస్తు నివసిస్తున్నాడో లేదో తెలుసుకునేలా మీ విశ్వాసాన్ని మీరే పరీక్షకు అప్పగించుకోండి. పరీక్షలో ఓడిపోకుండా ఉంటే క్రీస్తు మీ ప్రతి ఒక్కరిలో ఉన్నట్టు.
\v 6 మేమైతే ఈ పరీక్షలో గెలిచామనీ, క్రీస్తు మాలో నివసిస్తున్నాడనీ మీరు మమ్మల్ని చూసి ఈ సంగతులు తెలుసుకుంటారనీ ఆశిస్తున్నాను.
\s5
\v 7 మీరు ఏ చెడ్డ పనీ చేయకుండా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. మేము పరీక్ష నెగ్గాము కాబట్టి మీ ముందు యోగ్యులుగా కనబడాలని కాదు గానీ మీరు మా నుంచి మంచి విషయాలను గ్రహించి సరైన మార్గంలో నడుస్తారని. ఒకవేళ మేము అయోగ్యులంగా కనబడినా మీరు మంచినే చేసి గెలవాలని మా ఉద్దేశం.
\v 8 మా సమస్త కార్యాలూ సత్యాధీనంలో మాత్రమే జరుగుతాయి. మేము కేవలం సత్యం కోసమే గానీ సత్యానికి విరుద్ధంగా ఏమీ చెయ్యలేము.
\s5
\v 9 మేము బలహీనులమై ఉన్నా మీరు బలవంతులై ఉన్నారని సంతోషిస్తున్నాము. మీరు విశ్వాస, విధేయతలలో సంపూర్ణులు కావాలని ఎప్పుడూ ప్రార్థిస్తున్నాం.
\v 10 అందువల్లే నేను దూరంగా ఉండగానే ఈ సంగతులు రాస్తున్నాను. ఇలా రాయడం వల్ల నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు నా అధికారం ఉపయోగించటంలో కాఠిన్యత చూపనవసరం ఉండదు. అపోస్తలుడిగా దేవుడు ఇచ్చిన ఈ అధికారం మిమ్మల్ని పడగొట్టడానికి కాక, కట్టడానికే ఇచ్చాడు.
\s5
\p
\v 11 చివరిగా, సోదరీ సోదరులారా, ఆనందించండి! దేవుడు అనుగ్రహించే ధైర్యాన్ని అలవరుచుకుంటూ మునుపటి ప్రవర్తన కంటే మెరుగైన ప్రవర్తనతో జీవించండి. ఒకరిని ఒకరు ఏక మనసు కలిగి ఓర్చుకుంటూ, ఒప్పుకుంటూ శాంతితో జీవించండి. మిమ్మల్ని ప్రేమించే దేవుడు శాంతి సమాధానాలను అనుగ్రహించి మీతో ఉంటాడు.
\v 12 ప్రతి ఒక్కరికీ అర్థం అయ్యేలా పూర్ణ మనస్సుతో ఒకర్నొకరు ఆహ్వానించుకోండి, అభినందించుకోండి.
\s5
\v 13 యేసు క్రీస్తు ప్రభువు నిండైన తన దయతో, తన సమస్త దీవెనలతో దీవించు గాక. దేవుడు తన ప్రేమంతటితో మిమ్మల్ని ఆశీర్వదించును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మీ మనస్సులకు కాపరియై ఏకాత్మను దయచేయును గాక.
\v 14 ప్రభువైన యేసు క్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మీకందరికీ తోడై యుండుగాక.