STR_te_iev/46-ROM.usfm

832 lines
214 KiB
Plaintext

\id ROM - Indian Easy Version (IEV) Telugu
\ide UTF-8
\h రోమీయులకు రాసిన పత్రిక
\toc1 రోమీయులకు రాసిన పత్రిక
\toc2 రోమీయులకు రాసిన పత్రిక
\toc3 rom
\mt1 రోమీయులకు రాసిన పత్రిక
\s5
\c 1
\p
\v 1 క్రీస్తు యేసును సేవించే పౌలు అనే నేను రోమా నగరంలో ఉన్న విశ్వాసులైన మీ అందరికీ ఈ ఉత్తరం రాస్తున్నాను. దేవుడు నన్ను అపొస్తలుడిగా ఉండడానికి ఎన్నుకుని, ఆయన నుండి వచ్చిన శుభవార్త చాటడానికి నన్ను నియమించాడు.
\v 2 దేవుడు తన ప్రవక్తలు రాసిన పవిత్ర లేఖనాల ద్వారా ఈ శుభవార్తను వెల్లడి చేస్తానని భూమి మీదకి యేసు రావడానికి చాలా కాలం ముందే వాగ్దానం చేసాడు.
\p
\v 3 ఈ శుభవార్త తన కుమారుడి గురించే. సహజ స్వభావ రీత్యా ఆ కుమారుడు దావీదు రాజు సంతానంగా పుట్టాడు.
\s5
\v 4 దైవిక స్వభావరీత్యా ఆయన తన సొంత కుమారుడు అని దేవుడు శక్తివంతంగా కనపరిచాడు. ఆయన చనిపోయాక పరిశుద్ధాత్మ ఆయన్ని తిరిగి బ్రతికించడం ద్వారా దీన్ని చూపించాడు. ఆయన మన ప్రభువైన క్రీస్తు యేసు.
\p
\v 5 ఆయన మన మీద గొప్ప దయ చూపి మనల్ని అపొస్తలులనుగా నియమించాడు. వివిధ జాతుల ప్రజలందరూ ఆయనకు లోబడి ఆయనలో విశ్వాసం ఉంచాలని ఆయన ఇలా చేసాడు.
\v 6 రోమ్ లో విశ్వాసులుగా జీవిస్తున్న మీరందరూ కూడా యేసు క్రీస్తుకు చెందిన వాళ్ళుగా, దేవుడు ఎన్నుకున్న వాళ్ళలో చేరారు.
\s5
\v 7 దేవుడు ప్రేమించి తన ప్రజలుగా ఎన్నుకున్న రోమ్ లోని మీ అందరికీ నేను ఈ ఉత్తరం రాస్తున్నాను. మన తండ్రి అయిన దేవుడు, మన ప్రభువైన యేసు క్రీస్తు మీ పట్ల దయ కలిగి ఉంటూ మీకు శాంతి అనుగ్రహించాలని నేను ప్రార్థన చేస్తున్నాను.
\s5
\p
\v 8 ఈ ఉత్తరం రాస్తూ మొదటిగా రోమ్ లో ఉన్న విశ్వాసులందరిని బట్టి నా దేవునికి వందనాలు చెప్తున్నాను. మన కోసం యేసు క్రీస్తు చేసిన దాన్ని బట్టి నేను ఇలా చేయగలుగుతున్నాను. ఆయనలో మీరు ఎలా విశ్వాసం ఉంచారో రోమా సామ్రాజ్యం అంతా ప్రజలు చెప్పుకుంటున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
\v 9 ఆయన కుమారుడి గురించిన శుభవార్త ప్రజలకు ప్రకటించడం ద్వారా నేను భక్తితో సేవిస్తున్న దేవునికి మీ గురించి ఎడతెగక ప్రార్థిస్తున్నాను అని చెప్పడంలో నేను నిజమే చెబుతున్నానని తెలుసు.
\p
\v 10 నేను మిమ్మల్ని సందర్శించడం దేవుని చిత్తమైతే ఎదో ఒక విధంగా ఎట్టకేలకు మిమ్మల్ని చూడగలనని నేను ప్రత్యేకంగా దేవుణ్ణి అడుగుతున్నాను.
\s5
\v 11 మీరు క్రీస్తు పట్ల విశ్వాసంలో, స్తుతి చెల్లించడంలో, ఎదుగుతూ ఉండేందుకు సాయపడాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని సందర్శించాలని నేను ఇలా ప్రార్థన చేస్తున్నాను.
\v 12 మనం యేసులో ఎలా విశ్వాసం ఉంచామో, అలానే ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలని నా ఉద్దేశం.
\s5
\p
\v 13 నా సహ విశ్వాసులారా! చాలా సార్లు మిమ్మల్ని చూడాలని అనుకున్నాను. కానీ ఎప్పుడూ ఏదో ఆటంకం వల్ల నేను మీ దగ్గరికి రాలేకపోయాను. ఇది మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఇతర ప్రాంతాల్లో ఉన్న యూదేతరుల్లో ఉన్నట్టు, మీలో కూడా ఎక్కువ మంది యేసులో విశ్వాసం పెట్టుకునేలా చూడాలని నేను రావాలనుకున్నాను.
\v 14 యూదేతరుల్లో బుద్ధిమంతులకు, బుద్దిహీనులకు, గ్రీకు భాష మాట్లాడే వాళ్ళకీ మాట్లాడని వాళ్ళకీ శుభవార్త ప్రకటించడం నా బాధ్యత.
\v 15 దీని ఫలితంగా రోమ్ లో నివసించే వాళ్లకు కూడా ఈ శుభవార్త చాటాలని తహతహలాడుతున్నాను.
\s5
\p
\v 16 క్రీస్తు చేసిన కార్యాన్ని గురించిన శుభవార్తను నేను చాలా ధైర్యంగా ప్రకటిస్తాను. ఎందుకంటే క్రీస్తు తమ కోసం చేసినది ఎవరు నమ్ముతారో, వాళ్ళను దేవుడు రక్షిస్తాడనే విషయంలో ఈ శుభవార్త శక్తివంతమైన మార్గం. ప్రత్యేకించి దేవుడు ముందుగా శుభవార్తను నమ్మిన యూదులను రక్షిస్తాడు, తరువాత యూదేతరులను రక్షిస్తాడు.
\v 17 ఈ శుభవార్త ద్వారా దేవుడు మనుషులను ఎలా తన కోసం న్యాయవంతులుగా చేసుకుంటాడో వెల్లడిస్తాడు. చాలా కాలం క్రితం ప్రవక్తలు లేఖనాల్లో రాసింది ఇదే. "దేవుడు ఎవరిని న్యాయవంతులుగా చేసాడో వారు ఆయనపై నమ్మకం ఉంచడం ద్వారా జీవిస్తారు.
\s5
\p
\v 18 పరలోకంలోని దేవుడు తన పట్ల మర్యాద లేకుండా చెడు పనులు చేసే వాళ్ళ విషయంలో కోపంగా ఉన్నాను అని స్పష్టం చేసాడు. తన చేతుల్లో శిక్ష పొందడానికి వాళ్ళు అర్హులని ఆయన వాళ్ళకి చూపిస్తాడు. కూసే గాడిద మేసే గాడిదను చెడగొట్టినట్టు వాళ్ళు చెడు పనులు చేస్తారు, దేవుని విషయంలో ఏది సత్యమో దాన్ని తెలుసుకోకుండా ఇతరులకూ అడ్డుపడతారు.
\p
\v 19 దేవుడు ప్రతివారికీ తనను వెల్లడి చేసుకున్నాడు కాబట్టి దేవుడు ఎలాంటివాడో యూదులు కాని వారందరూ స్పష్టంగా తెలుసుకోగలరు.
\s5
\v 20 దేవుడు ఎలా ఉంటాడో మనుషులు తమ కళ్ళతో చూడలేరు. కాని, ఆయన లోకాన్ని సృష్టించినప్పటి నుండి, అందులోని విషయాలు మనం ఆయన్ని గురించి అర్థం చేసుకునేలా చేస్తున్నాయి. ఉదాహరణకు, ఆయన అన్ని సమయాల్లో శక్తివంతమైన కార్యాలు చేస్తూనే ఉన్నాడు. ఇంకొక ఉదాహరణ - ఆయన చేసిన సృష్టి అంతటికీ ఆయన భిన్నంగా ఉంటాడని అందరికీ తెలుసు. కాబట్టి, "దేవుని గురించి మాకు తెలీదు" అని నిజాయితీగా ఎవరూ అనలేరు.
\p
\v 21 యూదేతరులకు దేవుడు ఎలా ఉంటాడో తెలిసినా ఆయన్ని దేవుడుగా గౌరవించలేదు, ఆయన చేసిన వాటిని బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెప్పలేదు. దానికి బదులు ఆయన్ని గురించి బుద్ధిహీనంగా ఆలోచించడం మొదలుపెట్టారు. తన గురించి వాళ్ళు ఏమి తెలుసుకోవాలని ఆయన ఆశించాడో దాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు.
\s5
\v 22 వాళ్ళు తమకు తామే తెలివైన వాళ్ళుగా చెప్పుకుంటూ తెలివి తక్కువ వాళ్ళుగా తయారయ్యారు.
\v 23 దేవుడు మహిమ గలవాడనీ, ఆయనకి చావు లేదనీ అంగీకరించ లేకపోయారు. దానికి బదులుగా ఏదో ఒకనాడు చనిపోయే మనుషులను పోలిన విగ్రహాలను చేసి, పూజించారు. తరువాత నాలుగు కాళ్ళ జంతువులు, పక్షులను పోలిన ఇతర విగ్రహాలను చేశారు. చివరిగా సరీసృపాలను పోలిన ప్రతిమలను కూడా చేశారు.
\s5
\p
\v 24 కాబట్టి యూదేతరులు తీవ్రంగా ఆశించిన అక్రమ లైంగిక కార్యాలు చేయడానికి దేవుడు వాళ్లకు అనుమతి ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళు వాటిని చేయాలని ఆత్రుత పడ్డారు. దాని ఫలితంగా తమ కామకేళీ విలాసాల వల్ల ఒకరి శరీరాలను ఒకరు అశుద్ధం చేసుకున్నారు.
\v 25 దేవుని గురించిన సత్యాన్ని అంగీకరించడానికి బదులుగా అబద్ధ దేవుళ్ళపూజను ఎన్నుకున్నారు. దేవుణ్ణి పూజించడానికి బదులు ఆయన సృష్టించిన వాటిని పూజిస్తున్నారు. సమస్తం సృష్టించిన ఆయనకే మనందరం నిత్యం స్తుతులు చెల్లించాలి, ఆమెన్.
\s5
\p
\v 26 సిగ్గుమాలిన లైంగిక కార్యాలను చేయాలని తాపత్రయపడిన యూదేతరులను దేవుడు అలానే చేయనిచ్చాడు. ఫలితంగా చాలా మంది స్త్రీలు స్త్రీలతో లైంగికంగా కలవడం మొదలుపెట్టారు. ఇది సహజ స్వభావానికి విరుద్ధం.
\v 27 అదే విధంగా చాలా మంది పురుషులు స్త్రీలతో ఉండే సహజ సంబంధాలను వదిలేసారు. ఒకరిపై ఒకరు బలమైన లైంగిక వాంఛలు పెంచుకున్నారు. పురుషులు పురుషులతో సిగ్గుమాలిన స్వలింగ సంపర్క చర్యలకు పాల్పడ్డారు. అలాంటి పాపానికి సరైన పర్యవసానంగా దేవుడు వాళ్ళ శరీరాలలో అనారోగ్యం కలిగించి శిక్షించాడు.
\s5
\p
\v 28 ఇకపోతే దేవుణ్ణి తెలుసుకోవడం కొరగాని విషయంగా వాళ్ళు నిర్ణయించుకున్నారు. కాబట్టి తమ వ్యర్థ ఆలోచనల అదుపులోకి వాళ్ళు పూర్తిగా వెళ్ళిపోయేలా దేవుడు అనుమతించాడు. దాని ఫలితంగా వాళ్ళు ఇతరులెవ్వరూ చేయరాని చెడ్డ పనులు చేయడం మొదలుపెట్టారు.
\s5
\v 29 ఇతరుల పట్ల అన్ని రకాల అవినీతి కార్యాలు చేయడం, ఇతరుల నుండి దొంగిలించడం, రకరకాలుగా ఇతరులకు హాని కలిగించడం వాళ్ళు బలంగా కోరుకున్నారు. కొందరికి ఇతరుల్ని చూస్తే అస్తమానం కన్ను కుడుతుంది. మనుషుల్ని మట్టుపెట్టాలనే దుర్బుద్ధి వాళ్ళల్లో ఉంటుంది. మనుషుల మధ్య తగాదాలు, గిల్లికజ్జాలు పెడతారు. ఇతరుల్ని మోసగిస్తారు, ఇతరుల గురించి అసహ్యంగా మాట్లాడతారు.
\p
\v 30 వీళ్ళు చాలా మంది ఇతరుల గురించి చాడీలు చెబుతారు. నీలాపనిందలు వేస్తారు. చాలా మంది దేవునిపై అక్కసు వెళ్ళగక్కుతారు. ఇతరులను హింసిస్తారు. తమ గురించి గొప్పగా చెప్పుకుంటూ ఇతరుల్ని తక్కువ చేసి మాట్లాడతారు. దుష్ట కార్యాలు చేయడానికి కొత్త దారులు కనిపెడతారు. చాలా మంది పిల్లలు తమ తల్లిదండ్రులను ఎదిరిస్తారు.
\v 31 చాలా మంది బుద్ధిహీనంగా దేవునికి కోపం తెప్పించే చర్యలు చేస్తారు. ఇతరులకి చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోరు. తమ సొంత వాళ్ళను సైతం ప్రేమించలేరు. ఇతరుల పట్ల కనికరం చూపించరు.
\s5
\v 32 ఇలాంటివి చేసిన వాళ్ళు మరణానికి గురవుతారని దేవుడు ప్రకటించాడని వాళ్లకి తెలిసినా ఈ చెడ్డ కార్యాలు వాళ్ళు చేయడమే కాదు, అవి చేసే వాళ్ళని కూడా సమర్ధిస్తారు.
\s5
\c 2
\p
\v 1 దేవుడు ద్వేషించే వాటిని మనుషులు చేసినప్పుడు దేవుడు శిక్షించాలి అని నువ్వు అనవచ్చు. కాని నువ్వు అది అన్నప్పుడు నువ్వు కూడా అలాంటి జీవితమే గడిపావు కాబట్టి, దేవుడు నిన్ను కూడా శిక్షించాలని నువ్వు అంటున్నావు. వాళ్ళు చేసిందే నువ్వూ చేసావు.
\v 2 ఇలాంటి దుర్మార్గపు పనులు చేసే వాళ్ళందరికీ దేవుడు తీర్పు తీర్చి, న్యాయంగా శిక్ష వేస్తాడని మనకు బాగా తెలుసు.
\s5
\v 3 కాబట్టి చెడు పనులు చేసే వాళ్ళందరినీ దేవుడు శిక్షించాలని నువ్వు అంటున్నావు. అయినా నీకు నువ్వు చెడ్డ పనులు చేస్తావు కాబట్టి దేవుడు నిన్ను శిక్షించేటప్పుడు తప్పించుకుంటానని నీలో నువ్వు అనుకోకు.
\v 4 దేవుడు నా పట్ల సహనం, ఓర్పు చూపిస్తున్నాడు కాబట్టి నేను నా పాపం నుండి దూరంగా మళ్ళి పోవాల్సిన అవసరం లేదని నువ్వు అనకూడదు. నీ పాపాల విషయంలో నీకు పశ్చాత్తాపం వస్తుందని దేవుడు ఓపికగా నీ కోసం ఎదురు చూస్తున్నాడు.
\s5
\p
\v 5 కానీ దానికి బదులుగా, నువ్వు మొండితనం చూపుతూ పాపం చేయడం మానడానికి నిరాకరిస్తున్నావు. దేవుడు నిన్ను ఇంకా ఎక్కువగా శిక్షిస్తాడు. ఆయన ప్రజలందరికీ న్యాయంగా తీర్పు ఇచ్చినప్పుడు తన కోపాన్ని చూపించే సమయంలో అలా చేస్తాడు.
\v 6 ప్రతి ఒక్కరూ చేసిన పనులకు తగినట్టు దేవుడు వాళ్లకు చెల్లిస్తాడు.
\v 7 ప్రత్యేకంగా కొందరు దేవుణ్ణి ఘనపరచాలని అనుకుని మంచి పనులు చేస్తారు. వీళ్ళు ఆయనతో నిత్యం జీవించాలని అనుకుంటారు. వీళ్లకు ఆయన ఈ విధంగానే ప్రతిఫలం ఇస్తాడు.
\s5
\v 8 కాని కొందరు స్వార్ధంతో ఉంటూ దేవుడు చెప్పిన సత్యాన్ని నమ్మడానికి నిరాకరిస్తారు. దేవుడు తప్పు అని చెప్పిన వాటన్నిటినీ వీళ్ళు చేస్తారు. దానివల్ల దేవునికి చాలా కోపం వచ్చి, వాళ్ళని కఠినంగా శిక్షిస్తాడు.
\p
\v 9 అలవాటుగా చెడు పనులు చేసే ప్రతి ఒక్కరూ బాధపడేలాగా, ఇబ్బందులు ఎదుర్కొనేలాగా ఆయన చేస్తాడు. తన ప్రత్యేక ప్రజలుగా అయ్యే అధికారాన్ని దేవుడు వాళ్లకి ఇచ్చాడు కాబట్టి దేవుని సందేశాన్ని అంగీకరించకుండా నిరాకరించిన యూదులకు కచ్చితంగా ఇది సంభవిస్తుంది. ఇది యూదేతరులకు కూడా సంభవిస్తుంది.
\s5
\v 10 అలవాటుగా మంచి పనులు చేసే ప్రతి వ్యక్తికీ దేవుడు ఘనత, గౌరవం, ప్రశాంతమైన ఆత్మను ఇస్తాడు. తన ప్రత్యేక ప్రజలుగా ఆయన యూదులను ఎన్నుకున్నాడు కాబట్టి ఇది వాళ్ళకు తప్పకుండా ఇస్తాడు. కానీ యూదులు కాని వారికి కూడా ఇస్తాడు.
\v 11 ఎవరు ఏమిటీ అనేది చూడకుండా దేవుడు దీన్ని న్యాయంగా చేస్తాడు.
\p
\v 12 దేవుడు మోషేకు ఇచ్చిన ధర్మశాస్త్రం యూదేతరులకు లేదు. ధర్మశాస్త్రం వాళ్ళకి లేకపోయినా పాపం చేస్తారు. దేవుడు వాళ్ళని శాశ్వతంగా నాశనం చేస్తాడు. ధర్మశాస్త్ర ప్రకారం యూదులకు తీర్పు తీరుస్తాడు కాబట్టి తన ధర్మశాస్త్రానికి లోబడని యూదుల్ని కూడా ఆయన శిక్షిస్తాడు.
\s5
\v 13 దేవుని ధర్మశాస్త్రం గురించి తెలుసుకోవడం వల్ల దేవుడు వాళ్ళను నీతిమంతులుగా చేయడు గానీ, దేవుని ధర్మశాస్త్రానికి ఎవరు విధేయత చూపిస్తారో వాళ్ళను మాత్రమే ఆయన నీతి మంతులుగా చేస్తాడు కాబట్టి వాళ్ళకు శిక్ష వేయడం సరైనదే.
\p
\v 14 ధర్మశాస్త్రం లేని యూదేతరుల విషయానికి వస్తే దేవుడు మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రం వాళ్లకు లేకపోయినా, వాళ్లకు ఉన్న వెలుగు స్వభావం వల్ల ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి, దానికి లోబడి, వాళ్ళల్లోనే ఒక ధర్మశాస్త్రం ఉన్నట్టు నిరూపించారు.
\s5
\v 15 దేవుడు తన ధర్మశాస్త్రంలో ఏమి ఆజ్ఞాపించాడో, అది మనసులో తెలుసుకున్నారని వాళ్ళు చూపిస్తారు. ప్రతి వ్యక్తి తన చెడు ప్రవర్తనను బట్టి మనస్సాక్షిలో తనను తాను నిందించుకుంటాడు లేదా సమర్ధించుకుంటాడు.
\v 16 వాళ్ళు రహస్యంగా ఆలోచించిన, చేసిన వాటి ప్రకారం దేవుడు మనుషులకు తీర్పు తీర్చి, శిక్ష వేస్తాడు. దేవుడు వాళ్లకు తీర్పు తీర్చడానికి క్రీస్తు యేసుకు అధికారం ఇవ్వడం ద్వారా ఆయన వాళ్లకు తీర్పు తీర్చుతాడు. శుభవార్త ప్రకటించినప్పుడు నేను మనుషులకు ఇదే బోధిస్తాను.
\s5
\p
\v 17 ఈ ఉత్తరం రాస్తున్న నేను మీ యూదులకు ఇప్పుడు చెప్పాల్సింది ఒకటి ఉంది. దేవుడు మోషేకు ఇచ్చిన ధర్మశాస్త్రం మీకు తెలుసు కాబట్టి, దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడని మీరు అనుకుంటున్నారు. మీరు దేవునికి చెందిన వాళ్ళని గొప్ప చెప్పుకుంటారు.
\v 18 దేవుడు ఆశించేది ఏమిటో మీకు తెలుసు. మీకు దేవుని ధర్మశాస్త్రం బోధించారు కాబట్టి ఏవి సరైనవో, ఏవి చేయడానికి ఎంచుకోవాలో మీరు తెలుసుకోగలరు.
\v 19 మీరు యూదేతరులకు దేవుని సత్యాన్ని చూపించగలరనీ దేవుని గురించి ఏమీ తెలియని వారికి మీరు సూచనలు ఇవ్వగలరనీ మీకు కచ్చితంగా తెలుసు.
\v 20 దేవుని గురించి అవివేకమైన విషయాలను నమ్మేవారికి, దేవుని గురించి ఏమీ తెలియని చిన్న పిల్లల వంటి వారికి మీరు సూచనలు ఇవ్వగలరని మీకు తెలుసు. దేవుని గురించి సత్యాన్ని బోధించే ధర్మశాస్త్రం మీకు ఉంది కాబట్టి ఇవన్నీ మీకు స్పష్టంగా తెలుసు.
\s5
\p
\v 21 మీరు ఇతరులకి బోధిస్తారు కానీ ఆ ధర్మశాస్త్రానికి మీరే విధేయత చూపించక పోవడం అసహ్యంగా అనిపిస్తుంది. మీరు యూదులు కాబట్టి మీకు ఈ ప్రయోజనాలన్నీ ఉన్నాయని చెప్పుకుంటారు. ఇతరులకు దొంగతనం చేయకూడదని చెప్పి మీరు దొంగతనం చేయడం రోత కలిగిస్తుంది.
\v 22 నీ భార్య కని వారితో లైంగిక సంబంధం పెట్టుకోకూడదని ఇతరులకు ఆదేశించి, మీరు వ్యభిచారం చేయడం అసహ్యం. విగ్రహాలను పూజించవద్దని ఇతరులకి ఆజ్ఞాపిస్తావు, నువ్వు అసహ్యం కలిగించే పనులు మానుకోవు.
\s5
\v 23 "నాకు దేవుని ధర్మశాస్త్రం ఉంది" అని మీరు గొప్పలు చెప్తూ, అవే ఆజ్ఞలు మీరు పాటించకపోవడం అసహ్యం. దీని ఫలితంగా మీరు దేవుణ్ణి అవమానిస్తున్నారు.
\v 24 "యూదులైన మీరు చేసే చెడ్డ పనుల వల్ల యూదేతరులు దేవుని గురించి అవమానకరంగా మాట్లాడుతున్నారు" అని లేఖనాలు చెప్పినట్టే ఉంది.
\s5
\p
\v 25 మీలో దేవునికి చెందిన వారు అని చూపించుకోవడానికి సున్నతి పొందినవాళ్ళు ఎవరైనా దేవుడు మోషేకు ఇచ్చిన ధర్మశాస్త్రానికి లోబడితే లాభం ఉంటుంది. కానీ నువ్వు సున్నతి చేసుకుని ధర్మశాస్త్రానికి లోబడకపోతే, దేవుని దృష్టిలో సున్నతి పొందని వాడి కంటే మెరుగుగా దేవుడు నిన్ను పరిగణించడు.
\v 26 దీని అర్థం సున్నతి చేసుకోని యూదేతరులైనా ధర్మశాస్త్రంలోని దేవుని ఆజ్ఞలకు లోబడితే కచ్చితంగా ఆయన ప్రజలుగా దేవుడు పరిగణిస్తాడు.
\v 27 మీరు సున్నతి చేసుకున్నా ధర్మశాస్త్రాన్ని పాటించక పోవడం వల్ల దేవుడు మిమ్మల్ని శిక్షించినప్పుడు, దేవుని ఆజ్ఞలకి లోబడే వీళ్ళు సున్నతి చేసుకోనప్పటికీ దేవుడు సరైనదే చేసాడని బాహాటంగా చెప్తారు.
\s5
\v 28 దేవుని కోసం ఆచారాలు చేసేవాళ్ళు నిజమైన యూదులు కాదు. దేవుడు వాళ్ళని అంగీకరించడానికి కారణం శరీరానికి సున్నతి చేసుకోవడం కాదు.
\v 29 దీనికి భిన్నంగా చెప్పాలంటే - ధర్మశాస్త్ర ఆచారాలు ఆచరించడం వల్ల కాదు, ఎవరి అంతరంగాన్నిదేవుడు మార్చుతాడో వాళ్ళు నిజమైన యూదులు. దేవుడు మనల్ని అంగీకరించాడు, మన స్వభావాన్ని దేవుని ఆత్మ మార్చాడు. ఇతరులు మనల్ని పొగడకపోయినా దేవుడు మనల్ని పొగుడుతాడు.
\s5
\c 3
\p
\v 1 అదే నిజమైతే యూదేతరుడి కంటే యూదుడుగా ఉండడం వల్ల ప్రయోజనం లేనట్టు అనిపిస్తుంది. సున్నతి చేసుకోవడం మన యూదులకు లాభం ఏమీ కాదు.
\v 2 కానీ యూదులు కావ్వడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మొదటిగా దేవుడు తన వాక్కులు వాళ్ళ పితరులకే ఇచ్చాడు. ఆ వాక్కులే దేవుడు ఎవరో మనకు తెలిపాయి.
\s5
\v 3 యూదులు నమ్మకంగా ఉండకపోతే దేవుడు వాగ్దానం చేసినట్టుగా యూదుల్ని ఆశీర్వదించడు అని ఎవరైనా అనుకోవచ్చు.
\v 4 కాదు, దాని అర్థం కచ్చితంగా అది కాదు. మనుషులు దేవునికి ఇష్టమైనట్టు ఉండకపోయినా దేవుడు తాను చేసిన వాగ్దానం నిలబెట్టుకుంటాడు. యూదులుగా ఉన్న మన పట్ల దేవుడు వాగ్దానాలు నిలబెట్టుకోవడం లేదని ఆయన్ని నిందించే వాళ్ళందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. దావీదు మహారాజు దీని గురించి, "వాళ్ళ గురించి నువ్వు చెప్పినది అంతా నిజమే, నువ్వు తప్పు చేసావని నిన్ను ఎవరైనా నిందించినప్పుడు ఆ విచారణలో నువ్వు ఎప్పుడూ గెలుపొందుతావని ప్రతి ఒక్కరూ గుర్తించాలి" అని రాసాడు.
\s5
\p
\v 5 అందుకే మనం చెడ్డ వాళ్ళం కాబట్టి, దేవుడు దీవించడు అని మనం అనకూడదు. ఆయన కోపంతో మనల్ని శిక్షించడం తప్పు అనీ ఆయన అన్యాయం చేసాడనీ మనం అనకూడదు. (మామూలు మనుషులు మాట్లాడినట్టు నేను మాట్లాడుతున్నాను.)
\v 6 దేవుడు తీర్పు చెప్పి ఉండకపోతే, ఆయన లోకానికి తీర్పు చెప్పడం సరి కాకపోవచ్చు గనక టి దేవుడు తీర్పు చెప్పకూడదని మనం కచ్చితంగా తేల్చి చెప్పకూడదు.
\s5
\v 7 "దేవుడు తన వాగ్దానాలను నిలబెట్టుకుంటాడనే నిజం చాలా స్పష్టం అవుతుంది. ఉదాహరణగా, నేను ఒక అబద్ధం చెప్పాను అనుకోండి. దాని ఫలితంగా ప్రజలు దేవుణ్ణి స్తుతిస్తారు. ఆయనకు కనికరం ఉంది కాబట్టి ప్రజలు ఆయన్ని పొగుడుతున్నారు. అందుకే నేను పాపం చేసినందుకు నన్ను శిక్షించాలని దేవుడు ఇక అనకూడదు.
\v 8 పౌలూ నువ్వు చెప్పేది నిజమైతే, అప్పుడు మనం ఆ విధమైన మంచి పనుల వంటి ఫలితాన్ని ఇవ్వడానికి చెడు పనులు చేయవచ్చు" అని కొందరు అనొచ్చు. అలా కొందరు మాట్లాడుతూ, నేను అలా మాట్లాడానని చెడ్డగా చెప్తూ నా మీద నింద వేస్తున్నారు. ఇలా నా గురించి మాట్లాడే వాళ్ళని దేవుడు శిక్షిస్తాడు. ఆయన శిక్షకు వాళ్ళు అర్హులే.
\s5
\p
\v 9 దేవుడు మనకు ఎంతో అనుకూలంగా వ్యవహరిస్తాడనీ యూదేతరులకు తక్కువ అనుకూలంగా వ్యవహరిస్తాడనీ మనం అనుకోవచ్చా? అలా మనం కచ్చితంగా చెప్పలేము. యూదులు, యూదేతరులు కూడా పాపం చేసారు కాబట్టి దేవుని శిక్షకు వాళ్ళు కూడా అర్హులే.
\v 10 లేఖనాల్లో - "ఎవరూ నీతిమంతుడు కాడు. ఒక్క నీతిమంతుడు కూడా లేడు" అని రాసిన మాటలు దీన్ని తెలుపుతున్నాయి.
\s5
\v 11 సరైన విధంగా ఎలా జీవించాలో ఎవరికీ తెలీదు. దేవుణ్ణి ఎలా వెదకాలో ఎవరికీ తెలీదు.
\p
\v 12 కచ్చితంగా అందరూ దేవుని నుండి తొలిగిపోయారు. వాళ్ళను భ్రష్టులుగా దేవుడు పరిగణించాడు. నీతిగా ప్రవర్తించే వాళ్ళు ఎవరూ లేరు. లేరు, ఒక్కరు కూడా లేరు.
\s5
\v 13 వారు తెరచిన సమాధి కంపు కొట్టినట్టు అసహ్యం కలిగించే మాటలు మాట్లాడతారు. తమ మాటలతో ప్రజలను మోసం చేస్తారు.
\q1 పాము విషం మనుషుల్ని గాయపరచినట్టే వాళ్ళు మాటలతో మనుషుల్ని గాయపరుస్తారు.
\q1
\v 14 వాళ్ళు ఆపకుండా ఇతరుల్ని శపిస్తూ క్రూరంగా మాట్లాడుతున్నారు.
\s5
\q1
\v 15 వాళ్ళు మనుషులను హత్య చేయడానికి ముందుంటారు.
\q1
\v 16 వాళ్ళు వెళ్ళిన ప్రతి చోట అంతా నాశనం చేస్తూ మనుషుల్ని బాధపెడతారు.
\q1
\v 17 ఇతరులతో సమాధానంగా జీవించడం వాళ్లకు తెలీదు.
\q1
\v 18 దేవుణ్ణి గౌరవించడానికి వాళ్ళు నిరాకరిస్తారు.
\s5
\p
\v 19 ఏమైనప్పటికి, ఈ ధర్మవిధుల ఆజ్ఞలు పొందిన వాళ్ళకు దాన్ని పాటించవలసిన అవసరం ఉన్నదని మాకు తెలుసు. దీని అర్థం - పాపం చేసినందుకు దేవుడు సంజాయిషీ అడిగినప్పుడు, యూదులు కానీ యూదేతరులు కానీ డానికి సంజాయిషీగా ఏమీ చెప్పలేరు.
\v 20 దేవుని ధర్మశాస్త్రం కోరినట్టు మనుషులు చేయడం వల్ల కాదు కానీ ఎవరూ అవి పూర్తిగా పాటించలేదు కాబట్టి వాళ్ళ పాపాల గురించి నమోదైన సమాచారాన్ని దేవుడు తుడిచివేస్తాడు. నిజానికి దేవుని ధర్మశాస్త్రం తెలియడం వల్ల మనం పాపం చేసామని స్పష్టంగా తెలుసుకున్నాం.
\s5
\p
\v 21 దేవుడు మోషేకు ఇచ్చిన ధర్మశాస్తానికి లోబడడం మీద ఆధారపడి ఆయన మనల్ని ఆయనతో సమాధాన పరచలేదు. దేవుడు మన పాపాలను వేరే మార్గంలో క్షమిస్తాడని శాస్త్రాల్లో ప్రవక్తలు రాసారు.
\v 22 మనం యేసు క్రీస్తులో విశ్వాసం ఉంచాము కాబట్టి దేవుడు మన పాపాల చిట్టాను చెరిపేసాడు. యూదులకూ యూదులు కానివారికీ దేవుని దృష్టిలో తేడా ఉండదు కాబట్టి క్రీస్తులో విశ్వాసముంచిన ప్రతి వ్యక్తి విషయంలో దేవుడు ఇలా చేస్తాడు.
\s5
\p
\v 23 మనుషులందరూ చెడ్డపనులు చేసిన వాళ్ళే. దేవుడు ఏర్పాటు చేసిన ఘనమైన లక్ష్యాలు సాధించడంలో ప్రతి ఒక్కరూ విఫలం అయ్యారు.
\v 24 దేవుడు మన పట్ల దయ చూపించి మన పాపాలు క్షమించడానికి మన పాపాల చిట్టా చెరిపేసాడు. క్రీస్తు యేసు మనల్ని విడిపించడం ద్వారా ఇది సాధించాడు.
\s5
\v 25 దేవుని కోపాన్నిమళ్ళించడానికి క్రీస్తు తన రక్తాన్ని చిందించి, చనిపోయాడని దేవుడు చూపించాడు. ఆయన మన కోసం చేసింది మనం నమ్మాలి. దేవుడు న్యాయంగా వ్యవహరించాడని క్రీస్తు బలియాగం తెలియ చేస్తుంది. అలా కాకపోతే, ఆయన న్యాయవంతుడని అనుకోకపోవచ్చు. దానికి కారణం దేవుడు సహనం ఉన్నవాడు కాబట్టి, మనుషులు గతంలో చేసిన పాపాలను ఆయన పట్టించుకోలేదు.
\v 26 మన కోసం మరణించడానికి క్రీస్తును దేవుడు నియమించాడు. అలా చేయడం ద్వారా ఆయన న్యాయవంతుడనీ, యేసులో నమ్మిన ప్రతి ఒక్కరి పాపాల చిట్టాని చెరిపివేయగల సామర్ధ్యం ఆయనకు ఉందని ఆయన చూపిస్తున్నాడు.
\s5
\p
\v 27 మనం మోషే ధర్మశాస్త్రానికి లోబడతాం కాబట్టి మన పాపాల చిట్టా దేవుడు చెరిపేస్తాడు అనేది అసలు కానే కాదు. కాబట్టి ఆ నియమాలకు మనం లోబడడం వల్ల దేవుడు మన పట్ల అనుకూలంగా ఉంటాడని మనం గొప్పలు చెప్పుకొనే అవకాశం లేదు. దీనికి బదులుగా క్రీస్తులో మన విశ్వాసాన్ని బట్టి దేవుడు మన పాపాల చిట్టాను చెరిపేస్తాడు.
\v 28 కాబట్టి ధర్మశాస్త్రానికి లోబడే వ్యక్తిని కాదు కానీ క్రీస్తులో విశ్వాసం ఉంచిన వ్యక్తిని దేవుడు ఆయనతో సమాధానంగా ఉంచుతాడని స్పష్టం అవుతుంది.
\s5
\v 29 దేవుడు మిమ్మల్ని మాత్రమే అంగీకరిస్తాడని యూదులుగా ఉన్న మీరు కచ్చితంగా అనుకోకూడదు. ఆయన యూదులుకాని వాళ్ళను అంగీకరిస్తాడని మీరు కూడా గ్రహిస్తారు.
\v 30 యూదులుకాని వారిని ఆయన అంగీకరిస్తాడు ఎందుకంటే మీరు స్థిరంగా నమ్మినట్టుగా దేవుడు ఒక్కడే. ఆ దేవుడే యూదుల్ని సృష్టించాడు. సున్నతి పొందిన యూదుల్ని క్రీస్తులో విశ్వాసం ఉంచినందుకు దేవునితో సమాధాన పరచింది ఆయనే. యూదులుకాని వారిని సృష్టించింది కూడా ఆ దేవుడే. వీళ్ళు కూడా ఆయనలో విశ్వాసం ఉంచడంతో సున్నతి పొందకపోయినా వీళ్ళను సమాధానపరిచాడు.
\s5
\v 31 క్రీస్తులో విశ్వాసం ఉంచినందుకు తనతో సమాధానపరచింది దేవుడే అని మీరు అంటే, ధర్మశాస్త్రం ఉపయోగం లేనిదని దాని అర్ధమా? కచ్చితంగా కాదు. ధర్మశాస్త్రం నిజంగా చెల్లుతుంది.
\s5
\c 4
\p
\v 1 అబ్రాహాము మన యూదులు గౌరవించే పితరుడు. కాబట్టి అబ్రాహాముకు ఏమి జరిగిందో, మనం ఏమి నేర్చుకోవాలో దాని గురించి ఆలోచిద్దాం.
\v 2 అబ్రాహాము చేసిన మంచి పనుల వల్ల దేవుడు అతన్ని తనతో సమాధానపరచుకొని ఉంటే, ఆ విషయం గురించి ప్రజల మధ్య అబ్రాహాము గొప్పలు చెప్పుకుని ఉండేవాడు. (అయినప్పటికి దాని గురించి దేవుని దగ్గర గొప్పలు చెప్పుకోవడానికి ఎలాటి కారణం ఉండేది కాదు.)
\v 3 లేఖనాల్లో రాసి ఉన్నది మనం గుర్తు చేసుకోవాలి. దేవుడు అబ్రాహాముకు చేస్తానని ఇచ్చిన వాగ్దానం అతను నమ్మాడు. ఈ కారణంగా దేవుడు అబ్రాహాము తనతో సమాధానంగా ఉంటాడని భావించాడు.
\s5
\v 4 మనం చేసిన పనికి మనం జీతం తీసుకుంటే ఆ జీతం బహుమానం అవ్వదు కానీ మన సంపాదనగా భావిస్తాం. అలాగే దేవుని దయ పొందాలని మనం ఆయన కోసం ఏదొకటి చేసి బలవంతం పెడితే, అది బహుమానం అవ్వదు.
\v 5 కానీ వాస్తవానికి గతంలో ఆయన్ని గౌరవించని వాళ్ళను కూడా దేవుడు తనతో సమాధానపరచుకున్నాడు. వాళ్ళు ఇప్పుడు ఆయనలో నమ్మకం ఉంచారు కాబట్టి వాళ్ళని దేవుడు తనతో సమాధానపరచుకున్నాడు.
\s5
\p
\v 6 అలాగే అసలు కష్టపడి సంపాదించకుండానే దేవుడు తనతో సమాధానపరచుకున్న వాళ్ళ గురించి దావీదు ఇలా రాసాడు -
\q1
\v 7 ఎవరి పాపాలను దేవుడు క్షమించాడో, ఎవరి పాపాలను ఆయన ఇక మీదట లెక్కచేయడో వాళ్ళకి ఎంత భాగ్యం!
\v 8 పాపాల చిట్టా ఇక ఉండని వాళ్ళకి ఎంత భాగ్యం!
\s5
\p
\v 9 ఇలాంటి భాగ్యం కలిగే అనుభవం మన యూదులకు మాత్రమే కాదు. యూదేతరులకు కూడా ఇలాంటి అనుభవం ఉంటుంది. "అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను" అని లేఖనాల్లో రాసి ఉన్న కారణం బట్టి మనకు ఇది తెలిసింది.
\v 10 దేవుడు అబ్రాహామును ఎప్పుడు తనతో సమాధానపరచుకున్నాడో ఆలోచించండి. అబ్రాహాము సున్నతి పొందక ముందే కానీ సున్నతి పొందాక కాదు.
\s5
\v 11 దేవుడు అబ్రాహామును అంగీకరించిన చాలా సంవత్సరాల తరువాత అబ్రాహామును సున్నతి చేసుకోమని ఆయన ఆజ్ఞాపించాడు. అబ్రాహాము అప్పటికే దేవునితో సమాధానంగా ఉన్నాడని, సున్నతి ఒక గుర్తుగా చూపడం అయ్యింది. కాబట్టి సున్నతి పొందనివాళ్లయినా, దేవునిలో విశ్వాసం ఉంచిన ప్రతి వారికి అబ్రాహాము పితరుడు అవుతాడు. ఈ విధంగా దేవుడు వీళ్ళందరూ తనతో సమాధానంగా ఉండాలని భావిస్తాడు.
\v 12 దేవుడు నిజమైన యూదులుగా ఉన్న మన అందరికీ అభ్రాహాము పితరుడుగా ఉంటాడని భావిస్తాడు. శరీరాలకు సున్నతి గుర్తు ఉన్న యూదులకు మాత్రమే కాదు కాని, చాలా ముఖ్యంగా మన పితరుడు అబ్రాహాము సున్నతి పొందడానికి ముందు దేవునిలో ఉన్నప్పుడు ఎలా జీవించాడో, అలాంటి జీవితం ఉన్న వాళ్ళ విషయంలో కూడా అలాగే భావిస్తాడు.
\s5
\p
\v 13 దేవుడు అబ్రాహాముకూ అతని సంతానానికీ భూమిని స్వాధీనం చేస్తానని చెప్పాడు. కానీ అబ్రాహాము ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నాడని వాగ్దానం చేయలేదు. దేవుడు చేసిన వాగ్దానం ఆయన తప్పకుండా నెరవేరుస్తాడనినమ్మాడు. కాబట్టి దేవుడు అబ్రాహామును తనతో సమాధానపరచుకున్నాడు.
\v 14 దేవుని ధర్మశాస్త్రానికి లోబడడం వల్ల ప్రజలు భూమిని స్వాధీనం చేసుకుంటే, అప్పుడు దేవునిలో విశ్వాసం ఉంచడం వల్ల ఉపయోగం లేదు, ఆయన వాగ్దానానికి అర్థం లేదు.
\v 15 వాస్తవానికి మనం ఏమి గుర్తుంచుకోవాలంటే, దేవుడు తన ధర్మశాస్త్రంలో సరిగ్గా లోబడని ప్రతివాడిని శిక్షిస్తాను అన్నాడు. అయినా ధర్మశాస్త్రం లేని వాళ్లకి దానికి లోబడకపోవడం అసంభవం అని కూడా మనం గుర్తుంచుకోవాలి.
\s5
\p
\v 16 ఆయన దయగలవాడు కాబట్టి దేవుడిలో నమ్మకం ఉంచడం చేత ఆయన ఇస్తానని వాగ్దానం ఇచ్చిన బహుమానాలను మనం పొందుతాం. దేవుని ధర్మశాస్త్రం ఉండి, ఆయనలో విశ్వాసముంచిన మన యూదీయ విశ్వాసులకూ దేవుని ధర్మశాస్త్రం లేకపోయినా అబ్రాహాములాగా ఆయనలో విశ్వాసం ఉంచిన యూదులు కానివారికీ నిజమైన అబ్రాహాము సంతానం అనబడే ప్రతి ఒక్కరికీ ఆయన వీటిని ఇస్తాడు. విశ్వాసులైన మనందరికీ అసలైన పితరుడిగా అబ్రాహాము ఉన్నాడని దేవుడు భావిస్తాడు.
\v 17 "అనేక జాతుల ప్రజలకు నిన్ను పితరుడిగా నేను చేస్తాను" అని దేవుడు అబ్రాహాముతో చెప్పిన మాటలు లేఖనాలలో రాసి ఉంది. శూన్యం నుండి సృష్టిని చేసి, చనిపోయిన వాళ్ళను తిరిగి బ్రతికించిన దేవుడే ఈ వాగ్దానం అబ్రాహాముకు ప్రత్యక్షంగా ఇచ్చాడు.
\s5
\v 18 అబ్రాహాము, అతని భార్య పిల్లలను కనే వయసు దాటిపోయి ముసలివారు అయిపోయారు. తనకు సంతానం కలిగే భౌతిక కారణాలు కనిపించక పోయినా అతను దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని స్థిరంగా నమ్మాడు. "నీ సంతానం ఆకాశంలోని నక్షత్రాల్లా ఉంటారు" అంటూ అనేక జాతులకు తండ్రిగా అవుతాడని దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసాడు.
\p
\v 19 (అతనికి 100 సంవత్సరాల వయస్సు కాబట్టి) తన శరీరం తండ్రి అవ్వడానికి సహకరించదని అతనికి తెలిసినా, శారా ముసలితనాన్ని బట్టి బిడ్డను కనలేదని తెలిసినా, దేవుడు చేసిన వాగ్దానం గురించి అబ్రాహాము సందేహించలేదు.
\s5
\v 20 దేవుడు చేసిన వాగ్దానం గురించి అసలు అనుమానమే రాలేదు. దేవునిలో ఎంతో బలంగా నమ్మకం ఉంచాడు. దేవుడు నెరవేర్చబోయే వాగ్దానం విషయంలో ఆయనకు కృతజ్ఞతలు చెప్పాడు.
\v 21 దేవుడు ఏ విషయంలో వాగ్దానం చేసాడో అది తప్పకుండా చేస్తాడని అతను ఒప్పుకున్నాడు.
\v 22 అబ్రాహామును దేవుడు తనతో సమాధానపరచుకోడానికి కారణం అది.
\s5
\p
\v 23 "అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడు కాబట్టి అతనిని దేవుడు తనతో సమాధానపరచుకున్నాడు" అని లేఖనాల్లో ఉన్న మాటలు కేవలం అబ్రాహాము గురించి మాత్రమే కాదు.
\v 24 మన యేసు ప్రభువు చనిపోయిన తరువాత ఆయన్ని తిరిగి బ్రతికించిన దేవునిలో నమ్మకం ఉంచడం వల్ల ఆయన తనతో సమాధానపరచుకునే మన అందరి గురించి లేఖనాల్లో రాసారు.
\v 25 మన చెడు పనుల కారణంగా దేవుడు యేసును చంపడానికి మనుషులకు అనుమతి ఇచ్చాడు. దేవుడు మనల్ని ఆయనతో సమాధానపరచుకోడానికి యేసును మళ్ళీ బ్రతికించాడు.
\s5
\c 5
\p
\v 1 మనం యేసు క్రీస్తు ప్రభువులో నమ్మకం ఉంచాము కాబట్టి దేవుడు మనల్ని ఆయనతో సమాధానంగా ఉంచాడు. అందుకే ఇప్పుడు మనం దేవునితో ప్రశాంతత కలిగి ఉన్నాం.
\v 2 క్ర్రీస్తు చేసిన కార్యం వల్ల దేవుడు ఎక్కడ మన పట్ల దయ చూపించగలడో అ తలుపును మన కోసం తెరచినట్టుగా ఉంది. అందుకే దేవుడు సంతోషంతో తన ఘనతను మనతో పంచుకుంటాడని మనం నమ్మకంతో ఎదురు చూస్తున్నాం కాబట్టి మనం దానికి సంతోషించాలి.
\s5
\v 3 యేసుతో మనం చేరాం కాబట్టి మనం హింస పొందినప్పుడు వాటిని ఓర్పుతో భరించడం నేర్చుకుంటున్నాం, అందుకే మనం కూడా సంతోషించాలి.
\v 4 మనం హింసను భరిస్తున్నప్పుడు దేవుడు దాన్ని ఆమోదిస్తాడని మనకు తెలుసు. దేవుడు ఆమోదించాడని మనకు తెలిసినప్పుడు ఆయన మన కోసం గొప్ప కార్యాలు చేస్తాడని మనం నమ్మకంతో ఎదురుచూస్తున్నాం.
\v 5 దేవుడు మనల్ని చాలా ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ఎదురు చూసే వాటిని పొందుతామని మనం చాలా నమ్మకంతో ఉన్నాము. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఆయన మనకు ఇచ్చిన పరిశుద్ధాత్మ మనకు అవగాహన కలిగిస్తున్నాడు.
\s5
\p
\v 6 మనల్ని మనం రక్షించుకోలేక పోయినప్పుడు మనం దేవుణ్ణి గౌరవించకపోయినప్పటికీ మనుషుల కోసం చనిపోయిన క్రీస్తును ఆ సమయంలో దేవుడు ఎన్నుకున్నాడు.
\v 7 మంచి వ్యక్తి అయినాకాని, ఇతరుల కోసం ఎవరైనా చనిపోవడం చాలా అరుదు. బహుశా ఒక మంచి వ్యక్తి కోసం అయితేనే చనిపోవడానికి ధైర్యం చేయవచ్చు.
\s5
\v 8 మనం దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూనే ఉన్నాం. అయినాకానీ, క్రీస్తు మన కోసం చనిపోవడం ద్వారా మన మీద దేవునికి ఉన్న ప్రేమను మనకు చూపించాడు.
\v 9 మన పాపాల కోసం క్రీస్తు తన రక్తం చిందించి, మన కోసం చనిపోవడం వల్ల మన పాపాల విషయంలో దేవుని మహా కోపం నుండి క్రీస్తు మనల్ని మరింత కచ్చితంగా రక్షించి, దేవునితో సమాధానపరిచాడు.
\s5
\v 10 మనం ఆయనకు శత్రువులుగా ఉన్నప్పటికీ తన కుమారుడు మన కోసం చనిపోయిన కారణంగా దేవుడు మనల్ని తన స్నేహితులుగా చేసుకున్నాడు. క్రీస్తు మరణం నుండి తిరిగి బ్రతికి, ఇంకా మనల్ని రక్షించే పనిలో ఉన్నాడు కాబట్టి, దేవునితో మన బంధాలను దేవుడే పునరుద్ధరిస్తాడని ఇంకా కచ్చితంగా చెప్పగలం.
\v 11 అంతే కాదు, దేవుడు చేసిన కార్యానికి మనం ఆనందించాలి. మన యేసు క్రీస్తు ప్రభువు మన కోసం చనిపోయాడు కాబట్టి ఆయన దేవునితో మన సంబంధాలను పునరుద్ధరించాడు.
\s5
\p
\v 12 దేవుడు చేసిన ఆది మానవుడైన ఆదాము పూర్వం పాపం చేసిన కారణం బట్టి ప్రజలందరూ పాపాత్ములయ్యారు. పాపం చేసిన కారణంగా కాలక్రమేణా మరణించాడు. అప్పటి నుండి మానవులందరూ పాపాత్ములుగా జీవించి మరణించారు.
\v 13 మోషేకు దేవుడు ధర్మశాస్త్రం ఇవ్వకముందు లోకంలోని మనుషులు పాపం చేశారు కానీ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉన్న పాపాన్ని వాళ్ళు గుర్తించలేకపోయారు.
\s5
\v 14 ఆదాము జీవించినప్పటి కాలం నుండి మోషే జీవించిన కాలం వరకు ఉన్న మనుషులు కూడా పాపం చేశారు, దాని పర్యవసానంగా వాళ్ళు మరణించారు. ప్రతి వాళ్ళూ చనిపోయారు. ఆదాము చేసినట్టు దేవుని నుండి ప్రత్యక్ష ఆదేశం పొందని వాళ్ళూ చనిపోయారు. ఆదాము పాపం మనుషుల్ని ప్రభావితం చేసింది. అలాగే అతని తరువాత వచ్చిన క్రీస్తు, చేసిన కార్యం కూడా మనుషులందర్నీ ప్రభావితం చేస్తుంది.
\v 15 కానీ దేవుడు ఇచ్చే బహుమానం ఆదాము చేసిన పాపం వంటిది కాదు. ఆదాము పాపం చేసాడు కాబట్టి ప్రతి వారూ చనిపోతారు. కానీ మరొక మానవుడైన యేసు క్రీస్తు మన కోసం చనిపోవడం వల్ల దేవుడు మన మీద దయ చూపించాడు. మనకు అర్హత లేదు, అయినా సరే మనలో చాలా మందికి నిత్య జీవం అనే బహుమానం ఇస్తాడు.
\s5
\v 16 ఆదాము ఒక్కడు చేసిన పాపానికి విరుద్ధంగా ఉన్న దేవుని బహుమానంలో ఇంకొకటి ఉంది. ఆదాము పాపం చేసాడు కాబట్టి అతని తరువాత వచ్చిన వాళ్ళందరూ అతని తరువాత పాపం చేసిన వాళ్ళే. అందుకే మనుషులు అందరూ శిక్షకు అర్హులే అని దేవుడు ప్రకటించాడు. మన పాపాలు ఎన్నో ఉన్నప్పటికీ దయగల బహుమానంగా మనల్ని దేవుడు తనతో సమాధానపరచుకున్నాడు.
\v 17 ఆదాము ఒక్కడు చేసిన పని వల్ల మనుషులందరికి మరణం వచ్చింది. మనం అర్హులం కానప్పటికీ మనల్ని ఆయన తనతో సమాధానపరచుకున్నాడు. దేవుడు ఇచ్చిన ఆ దయగల గొప్ప బహుమానం మనలో చాలా మందికి అనుభవం అయ్యింది. క్రీస్తుతో కలిసి పరలోకంలో కచ్చితంగా రాజ్యం ఏలుతాం. అందుకు ఒక మనిషిగా యేసు క్రీస్తు చేసిన కార్యం కారణంగా ఇది జరుగుతుంది.
\s5
\p
\v 18 కాబట్టి, ఒక మనిషి - ఆదాము దేవుని ఆజ్ఞకు లోబడలేదు, దాని వల్ల మనుషులందరూ శిక్షకు అర్హులయ్యారు. అదే విధంగా ఒక మనిషి - యేసు న్యాయంగా నడుచుకుంటూ తను జీవించి ఉన్నంత కాలంలోనూ మరణంలోనూ కూడా దేవునికి లోబడడం ద్వారా దేవుడు మనలను ఆయనతో సమాధానపరచుకున్నాడు. జీవితాన్ని పునరుద్ధరించడానికి దేవుడు ప్రతి ఒక్కరిని తనతో సమాధానపరచుకున్నాడు.
\v 19 ఆదాము ఒక్కడు దేవునికి లోబడని కారణంగా చాలా మంది పాపులు అయ్యారు. అలాగే క్రీస్తు ఒక్కడు దేవునికి లోబడి, దేవునితో చాలా మందిని సమాధానపరచడానికి మరణించాడు.
\s5
\v 20 మనుషులు ఎంత ఘోరంగా పాపం చేస్తున్నారో తెలుసుకుంటారనే ఉద్దేశంతో దేవుడు మోషేకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. కానీ మనుషులు ఇంకా పాపం చేయడం ఎక్కువ అవ్వడం వల్ల, వాళ్లకు అర్హత లేకపోయినా దేవుడు వాళ్ళ పట్ల ఎంతో దయ చూపించడం కొనసాగించాడు.
\v 21 మనుషులు వాళ్ళ పాపం కారణంగా చనిపోకుండా, ఆయన దయగల బహుమానం వాళ్ళను ఆయనతో సమాధానంగా ఉంచుతుంది. మన యేసు క్రీస్తు ప్రభువు చేసిన కార్యాన్ని బట్టి వాళ్ళు నిత్యం జీవించగలరు.
\s5
\c 6
\p
\v 1 నేను రాసిన దానికి జవాబిస్తూ, దేవుడు మన పట్ల దయ చూపిస్తూనే ఉన్నాడు కాబట్టి ఆయన ఇంకా ఎక్కువగా కనికరం చూపించేవాడు కాబట్టి ఆ క్రమంలో బహుశా మనం ఇంకా పాపం చేయడం కొనసాగించవచ్చు అని ఎవరైనా అనొచ్చు.
\v 2 అలా కచ్చితంగా కాదు. మనం చచ్చినవాళ్ళలాగా ఉన్నాం, ఇకనుంచి ఎవ్వరూ ఎలాంటి చెడుపనులు చెయ్యలేరు. కాబట్టి మనం పాపం చేయడం కొనసాగించకూడదు.
\v 3 యేసు క్రీస్తుతో ఐక్యమై మనం బాప్తిసం పొందినప్పుడు, క్రీస్తుతో కలిసి సిలువ మీద మనం చనిపోతూ ఉండడం దేవుడు చూసాడు. మీరు అది తప్పకుండా గ్రహించాలి.
\s5
\p
\v 4 అందుకే మనం బాప్తిసం తీసుకున్నప్పుడు క్రీస్తుతో సమాధిలో ఉండడం దేవుడు చూసాడు. తండ్రి అయిన దేవుడు తన శక్తిని ఉపయోగించి క్రీస్తును మరణం నుండి లేపాడు. అదే విధంగా, మనం జీవించడం కోసం కొత్త మార్గాన్ని ఆయన సాధ్యం చేసాడు.
\v 5 క్రీస్తు చనిపోయినప్పుడు మనం ఆయనతో చేరడం దేవుడు చూసి, ఆయనతో మరణం నుండి మనల్ని లేపాడు.
\s5
\v 6 మన పాప స్వభావానికి ముగింపు పెట్టే క్రమంలో క్రీస్తుతో పాటు సిలువ మీద పాపంతో మనం చనిపోవడం దేవుడు చూస్తాడు. దాని ఫలితంగా మనం ఇక పాపం చేయలేము.
\v 7 ఇలా ఎవరు చనిపోయి ఉన్నా సరే వాళ్ళు ఇక పాపం చేయలేరు.
\s5
\p
\v 8 క్రీస్తు చనిపోయినప్పుడు మనతో కలిసి చనిపోవడం దేవుడు చూసాడు కాబట్టి, మనం కూడా ఆయనతో జీవిస్తామని మనం నమ్ముతాము.
\v 9 క్రీస్తు చనిపోయిన తరువాత తిరిగి బ్రతకడానికి దేవుడు అనుమతించాడు. క్రీస్తు ఇక ఎప్పటికి మరణించడు. ఆయన్ని ఏదీ చంపలేదు.
\s5
\v 10 ఆయన చనిపోయినప్పుడు మన పాప లోకం నుండి విడుదల పొందాడు. కాని ఆయన మళ్ళీ జీవిస్తున్నాడు కాబట్టి దేవుని సేవించడానికి ఆయన జీవిస్తాడు.
\p
\v 11 అదే విధంగా దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడో నిన్ను నువ్వు కూడా అలాగే చూసుకోవాలి - మీరు చనిపోయిన వాళ్ళు, ఇక ముందు పాపం చేయలేరు, కానీ మీరు కూడా జీవిస్తున్నవారు. క్రీస్తు యేసుతో మీరు చేరి, దేవుణ్ణి సేవించడానికి జీవిస్తున్నారు.
\s5
\v 12 అందుకే మీకు పాపం చేయాలని అనిపించినప్పుడు మీకు ఇష్టం అయ్యింది చేయడానికి మిమ్మల్ని మీరు అనుమతించకండి. మీ శరీరం ఏదో ఒక రోజు చనిపోతుందని గుర్తుంచుకోండి.
\v 13 చెడు చేయడానికి మీ శరీర భాగాన్ని దేన్నీ వాడొద్దు. దీనికి బదులుగా, చనిపోయిన వాళ్లకు చెందిన రాజ్యం నుండి ఇప్పుడు తిరిగి బ్రతికిన వ్యక్తిగా దేవునికి నువ్వు చూపించుకోవాలి. నీ శరీరంలోని ప్రతి భాగాన్ని దేవుని కోసం వాడాలి. నీతి కార్యాలు చేయడానికి నువ్వు ఆయన్ని అనుమతించు.
\v 14 నీకు పాపం చేయాలని అనిపించినా చేయొద్దు. మోషేకు దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రం పాపం చేయడాన్ని అసలు ఆపలేకపోయింది. కాని ఇప్పుడు దేవుడు నిన్ను క్రమపరచి, పాపం చేయకుండా నీకు దయతో సహాయం చేస్తాడు.
\s5
\v 15 దీని నుండి మనం ఏమి ఆలోచించాలంటే దేవుడు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు పాపాన్ని చేయడాన్ని ఆపలేకపోయాయి. దేవుడు ఇప్పుడు మన మీద దయ చూపిస్తూ ఉంటే దేవుడు మనల్ని పాపం చేయడం కొనసాగించడాన్ని అనుమతిస్తాడా? కచ్చితంగా కాదు!
\v 16 మీరు ఎవరికి అయినా లోబడాలి అనుకుంటే మీరు వాళ్లకి బానిసలు అవుతారు. పాపం చేయాలని అనిపించినప్పుడు మీరు దానికి లొంగిపోతే, మీరు పాపానికి బానిసలు అవుతారు. దాని ఫలితంగా చనిపోతారు. కాని మీరు దేవునికి లోబడితే, అప్పుడు మీరు ఆయనకు బానిసలు అవుతారు. దాని ఫలితంగా మీరు దేవుడు కోరిన మంచి పనులు చేస్తారు.
\s5
\v 17 గతంలో మీరు ఎలాంటి పాపం చేయాలనుకుంటే అలాంటి పాపం చేశారు. అప్పుడు మీరు పాపానికి బానిసలు. కానీ తరువాత మీరు క్రీస్తు బోధకు నిజంగా లోబడడం మొదలుపెట్టారు. అందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను.
\v 18 కాబట్టి మీరు ఇక పాపం చేయకూడదు. ఇక పాపం మీ గురువు కాదు. మీరు ఇప్పుడు నీతి ఉన్నవారు, దేవునికి బానిసలు.
\s5
\p
\v 19 సామాన్య ప్రజలు అర్థం చేసుకునే విధానంలో నేను మీకు రాస్తున్నాను. గతంలో మీరు మీ కోరికలకు బానిసలు అయితే, మీరు అన్ని రకాల చెడు పనులు, అపవిత్రం అయినవీ చేశారు. కానీ ఇప్పుడు మీరు దేవుడు వ్యవహరించినట్టే న్యాయంగా వ్యవహరించండి. అప్పుడు ఆయన మిమ్మల్ని ప్రత్యేకించుకొని తన ప్రజలుగా చేసుకుంటాడు.
\v 20 గతంలో మీరు దేవుని శక్తిని, ఆయన నీతిని వదిలేసిన వాళ్ళలా ఉన్నారు (మీ చెడు మనసాక్షి మీకు ఏమి చెప్పిందో అవన్నీ చేశారు). అవన్నీ చేయాల్సినవి కాదు.
\v 21 అయినప్పటికీ మీరు చేశారు, దాని ఫలితంగా దేవుని నుండి విడిపోయారు. అలాంటివి చేయడంవల్ల మీకు ప్రయోజనం ఏమీ లేకుండా పోయింది. అది మీకు సిగ్గు తెచ్చి పెట్టింది.
\s5
\p
\v 22 కానీ ఇప్పుడు మీరు ఇక పాపం చేయకూడదు. ఆ విధంగా మీరు బానిసలు కాదు. మీరు దేవునికి బానిసలు. ఆయన సొంత ప్రజలుగా మిమ్మల్ని ప్రత్యేకపరచుకున్నాడు. ఆయనతో మీరు ఎప్పటికీ జీవించడానికి ఆయన అనుమతిస్తాడు.
\v 23 తమ చెడు మనస్సు చెప్పేది చేసే వాళ్ళందరూ దాని పరిహారం పొందుతారు. ఆ పరిహారానికి పర్యవసానం మరణం. వీళ్ళు దేవునికి శాశ్వతంగా దూరం అయిపోతారు. కానీ దేవుని విషయంలో తన బానిసలకు ఎలాంటి జీతం దేవుడు ఇవ్వడు, దానికి బదులుగా ఉచిత బహుమానం ఇస్తాడు. నిత్యం ఆయనతో జీవించడానికి, మన ప్రభు క్రీస్తు యేసును చేరడానికి అనుమతిని ఇస్తాడు.
\s5
\c 7
\p
\v 1 నా తోటి విశ్వాసులారా, మీకు ధర్మశాస్త్రం గురించి తెలుసు. మనుషులు జీవించినంత కాలం మాత్రమే ధర్మశాస్త్రానికి లోబడి ఉండాలి.
\s5
\v 2 ఉదాహరణకు ఒక స్త్రీ తన భర్త విషయంలో జీవించి ఉన్నంత వరకు అతనికి నమ్మకంగా ఉండాలి. కానీ ఆమె భర్త చనిపోతే, ఆమె వివాహిత అయినా ఇక వివాహ సంబంధ నియమం పాటించాల్సిన అవసరం లేదు. వివాహ సంబంధ నియమం నుండి ధర్మశాస్త్రం ఆమెకు విడుదల ఇస్తుంది.
\v 3 భర్త బ్రతికి ఉండగానే వేరొక పురుషుని దగ్గరికి ఆమె వెళ్తే, వ్యభిచారిణి అవుతుంది. కానీ ఆమె భర్త చనిపోతే, ఆమె ధర్మశాస్త్రానికి ఇక లోబడవలసిన అవసరం లేదు. అప్పుడు ఆమె ఇంకొక పురుషుని పెళ్ళి చేసుకుంటే ఆమె వ్యభిచారంలో ఉన్నట్టు కాదు.
\s5
\p
\v 4 అదే విధంగా నా సోదరి, సోదరులారా! యేసుతో మీరు ఆయన సిలువ మీద చనిపోయినప్పుడు దేవుని ధర్మశాస్త్రం మిమ్మల్ని అదుపు చేయలేదు. క్రీస్తును చేరుకోడానికి మీరు స్వేచ్ఛ పొందారు కాబట్టి మీరు దేవుని ఘనపరచగలరు. మీరు తిరిగి బ్రతికారు కాబట్టి మీరు ఈ విధంగా చేయగలరు. దేవుడు క్రీస్తును మరణం నుండి లేపాడు, మిమ్మల్ని క్రీస్తుతో చేర్చాడు.
\v 5 మన చెడు ఆలోచనలు చెప్పినట్టుగా మనం చేసినపుడు ధర్మశాస్త్రం నేర్చుకున్నప్పటికీ మనకు ఇంకా ఇంకా పాపం చెయ్యాలనిపిస్తుంది. అలా చేసిన చెడు పనుల వల్ల దేవుడు మనల్ని తన నుండి శాశ్వతంగా వేరు చేయడానికి దారి తీస్తుంది.
\s5
\v 6 కానీ ఇప్పుడు మోషే ధర్మశాస్త్రానికి లోబడవలసిన అవసరం లేకుండా దేవుడు మనల్ని విడిపించాడు. మనం చనిపోతే మనం ఏమి చెయ్యాలో ధర్మశాస్త్రం మనకు ఇక చెప్పదు. దేవుడు మనకు చేసిన కార్యాన్ని బట్టి పాత పద్ధతి ప్రకారం ధర్మశాస్త్రం అవసరం లేకుండా, పరిశుద్ధాత్మ మనకు చూపించిన విధంగా కొత్త పద్ధతిలో మనం దేవుని ఆరాధించవచ్చు.
\s5
\p
\v 7 ప్రజలు దేవుని ధర్మశాస్త్రాన్ని తెలుసుకుంటే, పాపం ఎక్కువగా చేస్తారని అనుకోవచ్చా? అలా అనుకుంటే అందులోని నియమాలన్నీ చెడ్డవి అవుతాయి. అలా అస్సలు కానే కాదు. ధర్మశాస్త్రం చెడ్డది కాదు. ధర్మశాస్త్రం నేను తెలుసుకునేంత వరకు పాపం అంటే ఏమిటో నాకు తెలీదు, ఇది నిజం. ఉదాహరణగా, "నీది కాని దానిని నువ్వు ఆశించకూడదు" అని ధర్మ శాస్త్రం చెప్పింది. నాది కానిది ఆశపడడం తప్పు అని, నేను ధర్మశాస్త్రం తెలుసుకునే వరకు నాకు తెలీదు.
\v 8 ఆ ఆజ్ఞ ఏమి చెప్తుందంటే, ఇతరులకు చెందిన వస్తువులను నేను కావాలనుకొనే నా పాపపు కోరిక చాలా రకాలైన లైంగిక వాంఛలకు నేను లోను కావడానికి కారణం అయ్యింది. మనం చేసే పాపపు పనులను అరికట్టడానికి ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం చేయాలనే కోరిక మనల్ని ప్రేరేపించలేదు.
\s5
\p
\v 9 అంతకు ముందు దేవుని ధర్మశాస్త్రంలో ఏముందో నాకు తెలియనప్పుడు నేను ఏమి చేస్తున్నానో తెలియదు కాబట్టి నాలో ఆందోళన లేకుండా నేను పాపం చేసాను. కానీ దేవుడు తన ధర్మశాస్త్రం ఇచ్చాడని నాకు తెలిసినప్పుడు, నేను పాపం చేస్తున్నానని అకస్మాత్తుగా గ్రహించాను.
\v 10 దేవుని నుండి నేను వేరు పడ్డానని కూడా గ్రహించాను. నేను ధర్మశాస్త్రం పాటిస్తే నిత్య జీవం పొందడానికి అనుమతి కోరుకుంటున్న నన్ను దానికి బదులుగా మరణానికి నడిపిస్తుంది.
\s5
\p
\v 11 నేను పాపం చేయాలని అనుకున్నప్పుడు, నేను ధర్మశాస్త్రానికి లోబడితే చాలు నిత్యం జీవిస్తానని అనుకున్నాను. అదే సమయంలో నేను పాపం చేస్తూనే ఉండొచ్చని అనుకున్నాను. కానీ నేను తప్పుగా అనుకున్నాను. నిజానికి, నేను ధర్మశాస్త్రానికి నిజంగా లోబడలేదు కాబట్టి దేవుడు నన్ను తన నుండి ఎప్పటికీ వేరు చేస్తాడు.
\v 12 కాబట్టి దేవుడు మోషేకు ఇచ్చిన ధర్మశాస్త్రం కచ్చితంగా మంచిదే. దేవుడు మనకు పాటించమని ఆజ్ఞాపించింది అంతా దోషం లేనిదీ న్యాయమైనదీ మంచిది.
\s5
\p
\v 13 "దేవుడు మోషేకు ఇచ్చిన ఆ మంచి ధర్మ విధుల ఫలితంగా దేవుని నుండి వేరయ్యాం" అని ఎవరో ఒకరు అభ్యంతరం చెప్పవచ్చు. "కచ్చితంగా ఆ విధులు అలా చేయలేదు" అని నేను జవాబిస్తాను. కానీ బదులుగా, ఆ మంచి ధర్మ విధులు పాపం చేయడానికి ప్రేరణ కలిగించాయి. ఆ ప్రేరణకు ఫలితమే నన్ను దేవుని నుండి వేరు చేసింది. దేవుడు ఆజ్ఞాపించింది నేను తెలుసుకున్నాను కాబట్టి, నేను చేసేది పాపం అనే నిజం నాకు తెలిసింది.
\p
\v 14 దేవుని నుండి ధర్మశాస్త్రం వచ్చిందని మనకు తెలిసాక మన తీరు మారిపోయింది. పాపం వైపు మొగ్గుచూపే ధోరణిలో ఉంటున్న మనిషిని నేను. పాపం చేయాలనే బలమైన కోరిక నన్ను బలవంతంగా దానికి బానిసను చేసింది కాబట్టి, నా కోరికలు నన్ను చేయమని చెప్పినవన్నీ చేసాను.
\s5
\v 15 నేను చేసే పనులు ఎందుకు చేస్తున్నానో చాలావరకు నాకు అర్థంకావు. కొన్నిసార్లు మంచి పనులు చేయాలని అనుకుంటాను కానీ అవి చేయను. కొన్నిసార్లు నేను దేనిని అసహ్యించుకుంటానో ఆ చెడ్డ పనులనే చేస్తాను.
\v 16 నేను చెడ్డ పనులు చేయకూడదు అనుకుంటాను, అయినా చేస్తాను. దేవుని ధర్మశాస్త్రం నాకు సరి అయిన దారి చూపిస్తుందని ఒప్పుకుంటాను.
\s5
\v 17 కాబట్టి నేను పాపం చేయాలనే ఉద్దేశంతో నేను చేయట్లేదు. బదులుగా నాలో ఉన్న పాపం చేయాలనే కోరిక కారణంగా నేను పాపం చేస్తున్నాను.
\p
\v 18 నా సొంత ధోరణిని అనుసరిస్తూ ఉన్నప్పుడు నేను ఏ మంచి చేయలేను అని నాకు తెలుసు. మంచినే నేను చేయాలనుకుంటాను కాని చేయలేను కాబట్టి ఇది నాకు తెలుసు.
\s5
\v 19 నేను చేయాలనుకునే మంచి పనులు నేను చేయను. బదులుగా, చేయకూడదు అనుకున్న చెడ్డ పనులు నేను చేస్తాను.
\v 20 నేను చేయడానికి ఇష్టపడని చెడ్డ పనులు నేను చేసినప్పుడు, ఆ పనులు చేసేది నిజంగా నేను కాదు. నాతో పాపం చేయించేది నా పాపపు పద్ధతి మాత్రమే.
\v 21 మంచి చేయాలని నేను అనుకున్నప్పుడు నాలోని చెడు కోరిక వచ్చి నన్ను మంచి పని చేయకుండా చేస్తుంది అని తరువాత నేను తెలుసుకున్నాను.
\s5
\v 22 నేను నా ఈ నూతన వైఖరిలో దేవుని ధర్మశాస్త్రం గురించి చాలా సంతోషిస్తున్నాను.
\p
\v 23 అయినా నా శరీరంలో వేరే శక్తి ఉన్నట్టు నేను గ్రహించాను. అది నా మనస్సులో నేను కోరుకున్నది చేయకుండా వ్యతిరేకిస్తుంది. నా పాత ధోరణి నేను ఏమి చేయాలని అనుకుంటుందో దానినే నాతో చేయిస్తుంది.
\s5
\v 24 ఇది నేను ఆలోచించినప్పుడు నేను చాలా దౌర్భాగ్యుడినని అనిపిస్తుంది. దేవుని నుండి నేను వేరు కాకుండా ఉండడానికి, నన్ను నా శరీర వాంఛల అదుపు నుండి నన్ను విడిపించే ఒకరు నాకు కావాలి.
\v 25 మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మన శరీర కోరికల అదుపు నుండి మనల్ని విడిపిస్తున్న దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాను. మన మనస్సులతో దేవుని ధర్మశాస్త్రానికి కట్టుబడి ఉండాలని నేను కోరుకుంటున్నాను. కానీ నా పాత పాపపు ధోరణి వల్ల నేను తరచుగా పాపం చేయాలనే కోరికల అదుపులో కూడా ఉంటాను.
\s5
\c 8
\p
\v 1 క్రీస్తు యేసుతో చేరిన వాళ్ళను దేవుడు నిందించడు, శిక్షించడు.
\v 2 దేవుని ఆత్మ కారణంగా క్రీస్తుతో చేరాము కాబట్టి కొత్త మార్గంలో జీవిస్తాం. ఈ పద్ధతిలో పాపం గురించి ఆలోచన వచ్చినా ఇక నేను పాపం చేయను. దేవుని నుండి ఇక విడిపోను.
\s5
\v 3 దేవునితో జీవించే క్రమంలో దేవుని ధర్మశాస్త్రానికి లోబడడానికి మనం ప్రయత్నించాం. పాపం చేయడం మానేయాలని అనుకున్నాం కానీ అలా అనుకోవడం వల్ల ప్రయోజనం దొరకలేదు. అందుకే పాపానికి ప్రాయశ్చిత్తం చెల్లించడానికి తన సొంత కుమారుణ్ణి దేవుడు ఈ లోకానికి పంపి మనకు సహాయం చేసాడు. పాపం చేసే మన శరీరం లాంటి శరీరంతో తన కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. మన పాపాల కోసం బలిగా తనను తాను అర్పించుకోడానికి వచ్చాడు. ఆయన ఇది చేసినప్పుడు మన పాపాలు నిజంగానే చెడ్డవి అనీ పాపం చేసిన వాళ్ళు శిక్షకు అర్హులు అనీ మనకు చూపించాడు.
\p
\v 4 కనుక ఇప్పుడు దేవుడు తన ధర్మశాస్త్రంలో కోరినవన్నీ మనం నేరవేర్చగలం. ఇది మన పాత చెడ్డ ధోరణిలో కొనసాగుతూ చేయలేము కానీ మనం జీవించాలని దేవుని ఆత్మ అనుకున్న మార్గం ద్వారా మనం చేయగలం.
\v 5 చెడు ధోరణితో జీవించే వాళ్ళు అలాంటి వైఖరి మీద శ్రద్ధ ఉంచుతూ ఆలోచిస్తారు. కాని దేవుని ఆత్మ ఇష్టపడే పద్ధతి ప్రకారం జీవించే వాళ్ళు ఆత్మ సంబంధమైన విషయాలు ఆలోచిస్తారు.
\s5
\v 6 చెడు ధోరణిలోని కోరికలతో ఆలోచించి, ఆందోళన చెందేవాళ్ళు నిత్యం జీవించలేరు. కానీ దేవుని ఆత్మ కోరుకునేది కావాలనుకునేవాళ్ళు శాంతితో, నిత్యం జీవిస్తారు.
\p
\v 7 నేను ఇది వివరిస్తాను. చెడు ధోరణిలోని కోరికలతో ఉన్నవాళ్ళు దేవుడికి విరుద్ధంగా ప్రవర్తిస్తారు. వాళ్ళు ఆయన విధులకు లోబడరు. నిజానికి ఆయన ధర్మశాస్త్రానికి వాళ్ళు లోబడలేరు.
\v 8 వాళ్ళ చెడ్డ ధోరణి చెప్పింది చేసే వాళ్ళు దేవుని సంతోష పెట్టలేరు.
\s5
\v 9 కానీ పాత చెడ్డ ధోరణి మనల్ని అదుపు చేయనివ్వకూడదు. బదులుగా, దేవుని ఆత్మ మనలో నివసిస్తాడు కాబట్టి, దేవుని ఆత్మను మనల్ని అదుపు చేయనివ్వాలి. క్రీస్తు నుండి వచ్చిన ఆత్మ మనుషుల్లో నివసించకపోతే వాళ్ళు ఆయనకు చెందరు.
\v 10 కానీ క్రీస్తు తన ఆత్మ ద్వారా మీలో నివసిస్తుంటే, మీ శరీరాలు చనిపోయినట్టు దేవుడు చూస్తాడు. అందుకే మీరు ఇక పాపం చేయరు. మీ ఆత్మలు బ్రతకడం ఆయన చూస్తాడు కాబట్టి ఆయనతో మిమ్మల్ని సమాధానంతో ఉంచుతాడు.
\s5
\v 11 యేసు చనిపోయిన తరువాత దేవుడు యేసును బ్రతికించాడు. ఆయన ఆత్మ మీలో నివసిస్తుంది కాబట్టి ఇప్పుడు చనిపోయే మీ శరీరాలను కూడా దేవుడు తిరిగి బ్రతికిస్తాడు. క్రీస్తు యేసు చనిపోయాక తిరిగి బ్రతికించాడు, ఆయన ఆత్మ ద్వారా ఆయన మిమ్మల్ని మళ్ళీ బ్రతికిస్తాడు.
\s5
\p
\v 12 కాబట్టి నా తోటి విశ్వాసులారా! ఆత్మ మనకు సూచించినట్టు జీవించడానికి మనం బద్ధులం. మన పాత ధోరణి కోరినట్టుగా జీవించడానికి మనం బద్ధులం కాదు.
\v 13 మీ పాత ధోరణి కోరినట్టు మీరు చేస్తే మీరు నిత్యం దేవునితో జీవించలేరు. కాని ఆత్మ అలాంటి పనులు చేయకుండా మిమ్మల్ని ఆపితే అప్పుడు మీరు నిత్యం జీవిస్తారు.
\s5
\v 14 దేవుని ఆత్మకు లోబడిన వాళ్ళు దేవుని పిల్లలు.
\v 15 పిరికితనంతో జీవించే ఆత్మను మీరు పొందుకోలేదు. మీరు యజమానులకు భయపడే బానిసల వంటి వాళ్ళు కాదు. దీనికి విరుద్ధంగా దేవుడు మీకు తన ఆత్మను ఇచ్చాడు. ఆయన ఆత్మ మనల్ని దేవుడి పిల్లలుగా చేసింది. ఆ ఆత్మ ఇప్పుడు, "నువ్వు నా తండ్రివి!" అని దేవునికి మొరబెట్టడానికి సహాయం చేస్తుంది.
\s5
\v 16 మనం దేవుని పిల్లలమని మన ఆత్మ చెప్తుండగా దేవుడి ఆత్మ తనకు తానే నిర్ధారిస్తాడు.
\v 17 మనం దేవుడి పిల్లలం కాబట్టి మనం కూడా ఒక రోజున దేవుడు చేసిన వాగ్దానాన్ని పొందుకుంటాం. క్రీస్తుతో దీన్ని మనం పొందుకుంటాం. కానీ దేవుడు మనల్ని గౌరవించాలంటే క్రీస్తు చేసినట్టు మనం కూడా మంచిని చేసినందుకు హింస పొందాలి.
\s5
\p
\v 18 దేవుడు వెల్లడి చేసే భవిషత్ వైభవం కోసం కనిపెడుతూ ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొనే హింస మీద శ్రద్ధ పెట్టకూడదని నేను అనుకుంటున్నాను.
\v 19 దేవుడు సృష్టించినవి అన్నీ ఆయన అసలైన పిల్లలు ఎవరో వెల్లడి చేసే సమయం కోసం ఎదురు చూస్తున్నాయి.
\s5
\v 20 దేవుని సృష్టి అయిన మానవుడు ఆయన ఉద్దేశించినట్టు సాధించలేకపోయాడు. వాళ్ళు విఫలం అవ్వాలని అనుకోవడం కారణం కాదు. ఇంకొక విధంగా చెప్పాలంటే దేవుడు కచ్చితమైన వాడు కాబట్టి ఆయన వాళ్ళని అలా చేసాడు.
\v 21 ఆయన సృష్టించినవి ఒక రోజున ఇక చనిపోవు, కుళ్ళిపోవు , రాలిపోవు. ఆయన దాని నుండి వాటికి స్వేచ్ఛ కలిగించే క్రమంలో అద్భుతమైనవి ఆయన తన పిల్లలకూ అదే చేస్తాడు.
\v 22 ఇప్పటి వరకు దేవుని సృష్టి అంతా కలిసి ఆయన అవే అద్భుతాలు చేయాలని మూలుగుతున్నాయి. ఇది ఒక స్త్రీ బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు పడే ప్రసవ వేదనలా ఉంది.
\s5
\v 23 దేవుని సృష్టే కాదు, మనం కూడా లోలోపల మూలుగుతూనే ఉన్నాం. దేవుడు మనకు బహుమతిగా ఇచ్చిన ఆత్మను మనం కలిగి ఉన్నాం. దేవుడు మనకు ఇచ్చే ప్రతిదాని కోసం ఎదురుచూస్తూ కూడా మనం లోలోపల సణుగుతూనే ఉంటాము. దేవుడు దత్తత తీసుకున్న పిల్లలంగా మనం మన పూర్తి హక్కులు స్వీకరించే సమయం కోసం ఆత్రంగా ఎదురుచూసేటప్పుడు కూడా మనం మూలుగుతూనే ఉంటాము. అందుకని, భూమిపై మనకు ఆటంకం కలిగించే సంగతుల నుండి ఆయన మన శరీరాలను విడిపించుకుంటాడు. ఆయన మనకు కొత్త శరీరాలను ఇవ్వడం ద్వారా దీన్ని చేస్తాడు.
\v 24 మనము ఆయనపై నమ్మకం ఉంచాము, అందుకే దేవుడు మనల్ని రక్షించాడు. మనం ఇప్పుడు ఎదురుచూస్తున్న వస్తువులను మనం కలిగి ఉంటే, ఇకపై వాటి కోసం వేచి చూడాల్సిన పని లేదు. అన్నింటికంటే మీరు పొందాలని ఎదురుచూస్తున్న ఏదైనా మీరు కలిగి ఉంటే కచ్చితంగా మీరు వాటికోసం వేచి ఉండాల్సిన పని లేదు.
\v 25 కాని, మనకు ఇంకా రాని వాటికోసం మనం ఎంతో ఆత్రంగా, ఓపికగా ఎదురుచూస్తూనే ఉంటాం.
\s5
\p
\v 26 అదేవిధంగా మనం బలహీనంగా ఉన్నప్పుడు దేవుని ఆత్మ మనకు సహాయం చేస్తాడు. మనకి ఎలా ప్రార్థన చేయాలో సరిగ్గా తెలియదు. కాని, దేవుని ఆత్మకి తెలుసు. ఆయన మాటలలో చెప్పలేని మూలుగులతో మన కోసం ప్రార్థన చేస్తాడు.
\v 27 మన అంతర్గత ధోరణిని మన మనసుని చూసే దేవుడు ఆయన ఆత్మ కోరుకునేది ఏమిటో అర్థం చేసుకోగలడు. దేవుడు ఎలాగైతే ప్రార్ధించాలని ఆయన ఆత్మను కోరుకున్నాడో ఆలాగే ఆ ఆత్మ మన కోసం ప్రార్ధిస్తున్నాడు.
\s5
\p
\v 28 ఇంకా దేవుణ్ణి ప్రేమిస్తున్న వారు, వారికి జరిగే అన్ని విషయాలను దేవుడు మంచిగానే చేస్తాడని వారికి తెలుసు. ఆయన ఎన్నుకున్నవారి కోసమే ఆయన ఇలా చేస్తాడు ఎందుకంటే ఆయన చేయాలనుకున్నది ఇదే.
\v 29 మనము దేవునిలో విశ్వాసము ఉంచుతామనీ ఆయన కుమారుని లక్షణాలను మనం కలిగి ఉంటాం అనీ దేవునికి ముందుగానే తెలుసు. దాని ఫలితంగా క్రీస్తు దేవుని ప్రథమ పుత్రుడుగా ఎవరైతే ఆయన పిల్లలుగా ఉంటారో వారు క్రీస్తు యొక్క అనేకమంది సహోదరులుగా అయ్యారు.
\v 30 తన కుమారుడిలాగా ఎవరు ఉంటారో దేవుడు ముందే నిర్ణయించుకున్నాడు, వాళ్ళు తనతో ఉండాలని వారిని కూడా పిలిచాడు. ఆయన ఎవరినైతే తనతో ఉండాలని పిలిచాడో, వారిని ఆయనతో సరిగ్గా ఉండేలా చేసాడు. ఇంకా ఆయన ఎవరినైతే తనతో సరిగ్గా ఉండేలా చేసాడో, వారికి దేవుడు ఘనతను కూడా ఇస్తాడు.
\s5
\v 31 కాబట్టి నేను మీకు చెప్పేది ఏమిటంటే ఈ సంగతులను బట్టి దేవుడు మన కొరకు ఏమి చేస్తాడో అది మనం తప్పకుండా నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుడు మన తరుపున ఉన్నాడు మనపై ఎవరు గెలవలేరు.
\v 32 దేవుడు తన సొంత కొడుకుని కూడా విడిచి పెట్టలేదు. బదులుగా, ఆయన మనందరి కోసం చనిపోవడం వల్ల మనం లాభం పొందుతామని నమ్మి ఆయనలో విశ్వాసం ఉంచడానికి తన కుమారుడిని క్రూరంగా చంపటానికి ఇతరులకు అప్పగించాడు. ఎందుకంటే ఆయన కోసం జీవించటానికి మనకి కావలిసినవన్నీ కచ్చితంగా ఇవ్వటానికి అలా చేసాడు.
\s5
\v 33 దేవుడు మనలను ఆయనకే చెందినవారిగా ఎన్నుకున్నాడు కాబట్టి, తప్పు చేసామని దేవుని ఎదుట ఎవరూ మనపై నిందలు వేయలేరు. మనలను తనతో సమాధానపరచుకునేవాడు ఆయనే.
\v 34 ఇకపై మనల్ని ఎవరూ ఖండించలేరు. క్రీస్తు ఒక్కడే మన కొరకు చనిపోయాడు అంతకంటే ఎక్కువగా ఆయన చావు నుండి తిరిగి లేచాడు. ఇంకా మహిమగల స్థలంలో ఉండి దేవునితో కలిసి పరిపాలన చేస్తున్నాడు. ఆయనే మన కోసం వేడుకుంటున్నాడు.
\s5
\v 35 ఎవరైనా మనకు హాని చేసినా మనల్నిబాధించినా మనకి తినడానికి ఏమి లేకపోయినా మనకు సరైన బట్టలు లేకపోయినా మనం ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంటున్నా లేదా ఎవరైనా మనల్ని చంపాలని చూసినా, క్రీస్తు మనలను ప్రేమించకుండా ఎవ్వరూ, ఏదీ అసలు ఆపలేదు.
\v 36 ఇలాంటి సంగతులు మనకు కూడా జరగవచ్చు. లేఖనాలలో రాసినట్లు దావీదు దేవునితో చెప్పాడు, "మేము నీ ప్రజలుగా ఉన్నందున, మిగిలినవారు పదేపదే మమ్మల్ని చంపటానికి ప్రయత్నిస్తున్నారు. కసాయివాడు గొర్రెలూ జంతువులూ చంపడానికే అనుకున్నట్టు, చంపించుకోవడానికే మేము ఉన్నట్టుగా వాళ్ళు మమ్మల్ని చూస్తున్నారు."
\s5
\v 37 ఇలాంటి చెడ్డ సంగతులన్నీ మాకు జరిగినప్పటికీ క్రీస్తు మమ్మల్ని ప్రేమించి సహాయం చేస్తునాడు కాబట్టి వీటన్నిటిపై మేము పూర్తి విజయాన్ని పొందాము.
\p
\v 38 నేను నిశ్చయంగా నమ్మేదేమంటే, చావైనా - బతుకైనా, దేవదూతలైనా - దయ్యాలైనా, ఇప్పుడున్నవైనా - రాబోయేవైనా, శక్తిగల జీవులులైనా,
\v 39 ఆకాశం పైనగానీ - కిందగాని ఉన్నశక్తిగల జీవులైనా, సృష్టిలోని మరేదైనా సరే, దేవుని ప్రేమ నుండి మనల్ని వేరు చేయలేవు. మన ప్రభువైన యేసు క్రీస్తుని మన కొరకు చనిపోవడానికి పంపడం ద్వారా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని చూపించాడు.
\s5
\c 9
\p
\v 1 నేను క్రీస్తుతో కలిసి ఉన్నందున నేను మీకు నిజమే చెపుతాను. అబద్ధం చెప్పడం లేదు. నా మనస్సాక్షి నేను చెప్తున్నదాన్ని ధృవీకరిస్తుంది ఎందుకంటే పరిశుద్దాత్మ నన్ను ఏలుతున్నాడు.
\v 2 నా తోటి ఇశ్రాయేలీయుల గురించి నేను కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నానని మీకు చెప్తున్నాను.
\s5
\v 3 దేవుడు నన్ను శపించడానికి నాకు నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. ఇంకా నేను క్రీస్తుకు దూరంగా ఉంటే నా తోటి ఇశ్రాయేలీయులు, నా బంధువులూ క్రీస్తును నమ్ముతారు అంటే , నేను ఎప్పటికీ ఆయనకు దూరంగానే ఉంటాను.
\v 4 వారు కూడా నాలాగే ఇశ్రాయేలీయులు. తన పిల్లలుగా ఉండడానికి దేవుడు వారిని ఎన్నుకున్నాడు. ఆయన ఎంత ఆశ్చర్యకరుడో వారికే ఆయన చూపించాడు. వారితోనే ఆయన తన నిబంధనలను చేసాడు. వారికే తన ధర్మశాస్త్రం ఇచ్చాడు. వారే దేవుణ్ణి ఆరాధించేవారై ఉన్నారు. దేవుడు చాలా సంగతులను వారికే వాగ్దానం చేసాడు.
\v 5 మన జాతిని మొదలుపెట్టటానికి దేవుడే మన పూర్వీకులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులను ఎన్నుకొన్నాడు. ఈ మన ఇశ్రాయేలీయుల నుండే క్రీస్తు ఒక మనుష్యుడిగా పుట్టాడు. ఆయన దేవుడు. ఎప్పటికీ మనం స్తుతించడానికి ఆయన యోగ్యమైనవాడు. ఇది ముమ్మాటికి నిజం.
\s5
\p
\v 6 దేవుడు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేశాడు, వారి వారసులందరికి తన దీవెనలు ఉంటాయని. కాని, నా తోటి ఇశ్రాయేలీయులు చాలామంది క్రీస్తుని తిరస్కరించారు. అయితే దేవుడు వాగ్దానం చేసిన పనులను చేయడంలో విఫలమయ్యాడని ఇది రుజువు చేయదు. ఎందుకంటే, ఇది యాకోబు నుండి వచ్చిన వారసులని కాదు, లేక మనుషులు తమనుతామే ఇశ్రాయేలీయులమని పిలుచుకోవడం కాదు కాని దేవుడే వారిని తన ప్రజలుగా పరిగణించాడు.
\v 7 అబ్రాహాముకు పుట్టిన వారంతా నిజంగా అబ్రాహాము వారసులుగా దేవుడు చూడలేదు. బదులుగా కొంతమందిని మాత్రమే అబ్రాహాముకు నిజమైన వారసులుగా దేవుడు పరిగణించాడు. ఆయన అబ్రాహాముతో చెప్పిన ఈ మాటలు తెలియచేస్తాయి: "నీ వారసులకు నిజమైన తండ్రిగా ఇస్సాకు మాత్రమే ఉంటాడు కాని నీ ఇతర కొడుకులు కారు."
\s5
\v 8 నా ఉద్దేశ్యం ఏమిటంటే, అబ్రాహాము వారసులనందరినీ దేవుడు తన సొంత పిల్లలనుగా అంగీకరించలేదు. బదులుగా అబ్రాహాముకు వాగ్దానం చేసినప్పుడు ఆయన మనసులో ఎవరైతే ఉన్నారో, వారినే దేవుడు అబ్రాహాము వారసులుగా, తన సొంత పిల్లలుగా అనుకున్నాడు.
\v 9 ఇదే దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసాడు: "వచ్చే యేడాది నేను తిరిగి నీ దగ్గరకు వస్తా, అప్పుడు నీ భార్య శారా ఒక కొడుకుని కంటుంది."
\s5
\v 10 అబ్రాహాము కొడుకు, ఇస్సాకు భార్య రిబ్కా కవలపిల్లలను కనేటప్పుడు కూడా ఇదే జరిగింది.
\v 11 వారు పుట్టకముందే, మంచి చెడులు ఏదీ చేయకముందే ఆమెకు దేవుడి నుండి ఒక సందేశం అందింది. (దేవుడు తన ఇష్టానుసారంగానే ప్రజలను ఎన్నుకుంటాడనీ
\v 12 వారు చేసే మంచి, చెడ్డ పనుల ప్రకారం వారిని పిలవడని ఈ సందేశం వల్ల మనకు తెలుస్తుంది.) "నీ పెద్ద కొడుకు నీ చిన్న కొడుకుకి సేవ చేస్తాడు." అని ఆమెకు దేవుడు చెప్పాడు.
\v 13 ఇదే దేవుడు లేఖనాలలో చెప్పాడు, "చిన్న కొడుకైన యాకోబుని నేను ఎన్నుకున్నాను. పెద్దవాడు ఏశావుని తిరస్కరించాను."
\s5
\p
\v 14 ఎవరైనా నన్ను అడగొచ్చు "కొంతమందిని మాత్రమే ఎన్నుకోవడానికి దేవుడు అన్యాయస్థుడా?" నేను వారికి సమాధానం ఇస్తూ, "దేవుడు ఎప్పటికి అన్యాయస్థుడు కాదు."
\v 15 దేవుడు మోషేతో చెప్పాడు, "నేను జాలిపడి ఎంచుకున్న ఎవరికైనా సహాయం చేస్తాను."
\v 16 దేవుడే మనుష్యులను ఎన్నుకుంటాడు. అంతేకాని వారిని దేవుడు ఎన్నుకోవాలని కోరుకున్నందువల్ల కానీ, ఆయనను సంతోషపెట్టటానికి ఎంతో ప్రయాసపడినందువల్ల కానీ కాదు.
\s5
\v 17 దేవుడు ఫరోతో చెప్పిన మాటలను మోషే గుర్తుపెట్టుకొన్నాడు. "ఇందుకే నేను నిన్ను ఐగుప్తుకు రాజుగా చేసాను. నేను నీతో పోరాడాలి, దాంతో ఈ లోకంలోని ప్రతిఒక్కరు నా ప్రతిష్టను గౌరవించడానికి సహాయం చేస్తారు."
\v 18 కాబట్టి , దేవుడు ఎవరిని కనికరించాలి అని అనుకుంటాడో వారిని కనికరిస్తాడు, ఎవరిని ఫరోలా కఠిన పరచాలి అని అనుకుంటాడో వారిని కఠిన పరుస్తాడు.
\s5
\p
\v 19 ఒకవేళ మీలో ఒకరు నాతో, "మనుష్యులందరూ ఏంచేయాలో దేవుడు ఎప్పుడో నిర్ణయించేస్తే, ఆయన అనుకున్నదాన్ని ఎవరూ వ్యతిరేకించరు. అప్పుడు తప్పులు చేస్తున్నవారిని దేవుడు శిక్షించడం సరికాదు కదా." అని అడిగితే,
\v 20 నేను వారితో "మీరు కేవలము మనుషులు మాత్రమే. దేవుణ్ణి విమర్శించేటంతటి జ్ఞానం మీకు లేదు. ఆయన మట్టి కుండలు తయారు చేసే మనిషిలాంటివాడు. ఆ కుండ, ""నన్ను ఎందుకు ఇలా చేసావు?"" అని తయారీదారుని అడగడానికి హక్కు లేదు."
\v 21 బదులుగా ఆ కుమ్మరి కొంత మట్టి ముద్దను తీసుకుని అందులో కొంత భాగముతో అందరూ చాల విలువైనదిగా చూసే ఒక అందమైన కుండనూ చేయవచ్చు. మిగిలిన ముద్దతో అందరూ ప్రతిరోజు వాడుకునే కుండనూ చేయవచ్చు. కచ్చితంగా దేవునికి అదే హక్కు ఉంది.
\s5
\v 22 దేవుడు పాపం గురించి కోపంగా ఉన్నానని చూపించాలనుకుంటాడు. అలా పాపం చేసినవారిని ఆయన తీవ్రంగా శిక్షించగలనని అందరికీ స్పష్టంగా తెలియచేయాలనుకుంటాడు. కానీ, తనకు కోపం తెప్పించీ, నాశనం కావటానికి అర్హులైన మనుష్యులను దేవుడు చాలా శాంతంగా భరిస్తున్నాడు.
\v 23 దేవుడు సహనంతో ఉన్నాడు. ఆయన ఎవరిపై దయ చూపించాడో వారి గురించి ఎంత అద్భుతంగా వ్యవహరిస్తాడో ఆయన స్పష్టంగా తెలియచేస్తున్నాడు. వారు ఆయనతో నివసించడానికి ముందునుండీ సిద్దం చేస్తున్నాడు.
\v 24 అంటే, ఆయన యూదులను మాత్రమే కాదు యూదేతరులను కూడా ఎంచుకున్నాడు.
\s5
\v 25 యూదులు, యూదేతరులు ఈ రెండిటి నుండి ఎన్నుకునే హక్కు దేవునికి ఉంది. ప్రవక్త హోషేయ రాశాడు:
\q "నా ప్రజలు కాని చాలామంది నా ప్రజలే అని నేను చెప్తున్నాను.
\q ఇంతకుముందు నేను ప్రేమించని చాలామంది ప్రజలను ఇప్పుడు ప్రేమిస్తున్నానని చెప్తున్నాను."
\p
\v 26 ఇంకొక ప్రవక్త రాసాడు: "మీరు నా ప్రజలు కాదు అని దేవుడు ఇంతకుమునుపు ఎవరితో చెప్పాడో,
\q అదే స్థలాలలో వారు దేవుని పిల్లలు అవుతారని చెపుతారు."
\s5
\p
\v 27 ఇశ్రాయేలీయుల గురించి యెషయా కూడా ఆశ్చర్య పోయాడు. "ఇశ్రాయేలీయులు సముద్రం పక్కన ఇసుక రేణువుల వలె లెక్కపెట్టలేనంతమంది ఉన్నప్పటికీ వారిలో కొద్దిమంది మాత్రమే రక్షించబడతారు,
\v 28 ఎందుకంటే దేవుడు చేస్తానని చెప్పినట్లు ఆ దేశంలో నివసించే ప్రజలను ఆయన పూర్తిగా, వేగంగా శిక్షిస్తాడు."
\p
\v 29 యెషయా ఇంకా ఏం రాసాడంటే, "పరలోకపు సైన్యాల ప్రభువు మన వారసులలో కొంతమందిని జీవించడం కోసం దయతో అనుమతించకపోతే, మనం కూడా పూర్తిగా నాశనమైపోయిన సొదోమ గోమొర్ర పట్టణాలలోని ప్రజలవలె ఉంటాము."
\s5
\p
\v 30 మనం దీన్ని ఇంతటితో ముగిద్దాం. యూదేతరులు పవిత్రంగా ఉండటానికి ప్రయత్నించినప్పటికీ, వారు క్రీస్తు నమ్మకం ఉంచితే దేవుడు వారిని తనతోనే ఉంచుకుంటాడు.
\v 31 కాని ఇశ్రాయేలు ప్రజలు దేవుని చట్టాలను పాటించడం ద్వారా పవిత్రంగా ఉండటానికి ప్రయత్నించారు. కాని వారు చేయలేకపోయారు.
\s5
\v 32 వారు చేయలేకపోయారు ఎందుకంటే, వారు దేవుణ్ణి అంగీకరించటానికి కొన్ని పనులు చేశారు. వారు క్రీస్తు చనిపోతాడని ఊహించలేదు. ఇంకా యేసు చావుని వారు నమ్మలేదు. ఇదే వారు చేసిన పెద్ద పొరబాటు.
\v 33 ఒక ప్రవక్త ఇదే జరుగుతుందని చెప్పాడు. "వినండి, నేను ఇశ్రాయేల్ లో ఒక రాయిలాంటి వాడిని ఉంచాను. వాని వల్ల ప్రజలు పొరబాట్లు చేస్తారు. అతను చేసేది ప్రజలకు కోపం తెప్పిస్తుంది. అయినప్పటికీ, ఆయనను నమ్మేవారు సిగ్గుపడరు."
\s5
\c 10
\p
\v 1 నా తోటి విశ్వాసులారా, నేను ఎంతో కోరుకునేది ఇంకా నమ్మకంతో ప్రార్థించేది దేవుడు నా సొంత ప్రజలైన యూదులను రక్షిస్తాడు.
\v 2 నేను వారి గురించి నిజాయితీగా ప్రకటిస్తున్నాను. వారు దేవుణ్ణి దృఢంగా అనుసరిస్తున్నప్పటికీ సరైన మార్గంలో ఆయనను ఎలా అనుసరించాలో వారికి అర్థం కావటం లేదు.
\v 3 దేవుడు ప్రజలను తనతో ఎలా ఉంచుకుంటున్నాడో వారికి తెలియదు. వారు తమకు తామే దేవునితో సరిదిద్దుకోవాలని కోరుకుంటారు. అందువల్ల దేవుడు తమకోసం ఏమి కోరుకుంటున్నాడో వారు అంగీకరించరు.
\s5
\v 4 తనను విశ్వసించే ప్రతి ఒక్కరిని దేవునితో సరిగ్గా ఉంచటానికి క్రీస్తు చట్టాన్ని పాటించాడు. అందుకే చట్టం ఇక అవసరం లేదు.
\p
\v 5 దేవుని చట్టాన్ని పాటించటానికి ప్రయత్నించిన ప్రజల గురించి మోషే రాశాడు. "వీరు చట్టం కోరుకునే పనులను సంపూర్ణంగా చేసి శాశ్వతంగా జీవించాలనుకోనేవారు."
\s5
\v 6 వీరంతా క్రీస్తును నమ్మినందున దేవుడు కూడా తనకుతానే వారిని నమ్మాడు. వారితో మోషే మాట్లాడుతూ, "స్వర్గానికి వెళ్ళటానికి ఎవరూ అంతగా ప్రయత్నించాల్సిన అవసరం లేదు." ఎందుకంటే క్రీస్తే కిందికి దిగి వచ్చాడు.
\v 7 మోషే ఇది కూడా వారికి చెప్తున్నాడు, "మనకోసం క్రీస్తును చనిపోయినవారి దగ్గరనుండి తిరిగి తీసుకురావటానికి మనం మళ్ళీ చనిపోయిన వారు ఉన్న చోటికి వెళ్ళడానికి ఎవరూ ప్రయత్నించనక్కర్లేదు."
\s5
\v 8 బదులుగా, మోషే రాసినట్టు క్రీస్తుని నమ్మినవారు ఇలా చెప్తారు, "మీరు దేవుని సందేశం గురించి చాలా తేలికగా తెలుసుకోవచ్చు. మీరు దాని గురించి మాట్లాడనూ వచ్చు అలోచించనూ వచ్చు." ఇదే మనం ప్రకటించాల్సిన సందేశం. అందరూ క్రీస్తుని నమ్మాలి.
\p
\v 9 ఈ సందేశం ఏమిటంటే, యేసు ప్రభువు అని మీలో ఎవరైనా ధృవీకరిస్తే ఇంకా దేవుడు ఆయనను మృతులలోనుండి లేపాడని మీరు నిజంగా నమ్మితే ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు.
\v 10 ఈ సంగతులను ప్రజలు నమ్మితే , దేవుడు వారితోనే జీవిస్తాడు. యేసు ప్రభువు అని బహిరంగంగా ఎవరైతే చెప్తారో దేవుడు వారిని రక్షిస్తాడు.
\s5
\v 11 క్రీస్తు గురించి లేఖనాలలో రాసి ఉంది. "ఎవరైతే ఆయనను నమ్ముతారో వారు ఒక్క నాటికీ నిరుత్సాహపడరు, సిగ్గుపడరు."
\v 12 ఈ విధంగా దేవుడు యూదులను, యూదేతరులను ఒకేలాగా చూసాడు. ఎందుకంటే ఆయనను నమ్మిన వారికందరకు ఆయన ఒక్కడే ప్రభువు. ఆయనను సహాయం అడిగిన వారందరికి ఆయన తప్పక సహాయం చేస్తాడు.
\v 13 ఇది వాక్యంలో చెప్పినట్టుగానే ఉంది, "ప్రభువైన దేవుడు తనను అడిగిన వారందరినీ రక్షిస్తాడు."
\s5
\v 14 చాలామంది క్రీస్తును నమ్మరు. ఇంకా కొంతమంది వారు ఎందుకు నమ్మటం లేదో వివరించటానికి ప్రయత్నిస్తుంటారు. వారు ఇలా చెప్తుంటారు, "ప్రజలు మొదట క్రీస్తుని నమ్మకపోతే వారికి సహాయం చేయమని ఆయనను కచ్చితంగా అడగలేరు. వారు ఆయన గురించి వినకపోతే కచ్చితంగా ఆయనను నమ్మలేరు. ఎవరైనా ఆయన గురించి వారికి బోధించకపోతే వారు కచ్చితంగా ఆయన గురించి వినలేరు."
\v 15 క్రీస్తు గురించి బోధించడానికి వారి దగ్గరకు వెళ్ళేవారిని దేవుడు పంపితేనేగాని వారు వెళ్ళలేరు. కాని కొంతమంది నమ్మినవారు వారికి బోధించితే అది వాక్యంలో చెప్పినట్టుగా ఉంటుంది. "ప్రజలు వచ్చి శుభవార్త తెచ్చినప్పుడు అది చాలా అద్భుతంగా ఉంటుంది."
\s5
\v 16 అలాంటి సంగతులు చెప్పేవారికి నేను ఈ విధంగా జవాబు చెప్తాను. క్రీస్తు గురించిన సందేశాన్ని బోధించడానికి దేవుడు ప్రజలను ఎప్పుడో పంపేశాడు. కాని ఇశ్రాయేలు ప్రజలందరూ సువార్త వినడానికి శ్రద్ద చూపలేదు. ఇది యెషయాకు చాలా నిరుత్సాహంగా అనిపించి ఇలా అన్నాడు," ప్రభూ, మేము బోధించేది ఎవరు విన్నారు?"
\p
\v 17 కాబట్టి నేను అనేది ఏమిటంటే , ప్రజలు క్రీస్తుని గురించి వింటున్నారు గనక ఆయనను నమ్ముతున్నారు. కొందరు క్రీస్తు గురించి బోధిస్తున్నారు గనక వారు వింటున్నారు.
\s5
\v 18 కాని ఎవరైనా ఆ ప్రజలతో, "ఇశ్రాయేలీయులు ఈ శుభవార్తను విన్నారు గదా" అంటే నేను ఏమి చెబుతానంటే, "అవును అవశ్యం. లేఖనం చెబుతున్నది దీన్ని గురించే.
\q ప్రపంచమంతటా నివసిస్తున్న వారందరూ సృష్టిని చూసారు.
\q దానిని బట్టే దేవుడు ఎవరో వారికి రుజువు అవుతుంది.
\q ప్రపంచంలోని మారుమూల ప్రాంతాలలో నివసించే ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకున్నారు."
\s5
\p
\v 19 ఇంకా చెప్పాలంటే, ఇశ్రాయేలీయులు ఈ శుభవార్తను నిజంగానే విన్నారు, వారు అర్థం చేసుకున్నారు కూడా. కానీ వారు దానిని నమ్మడానికి నిరాకరించారు. ఇలా ప్రజలను హెచ్చరించిన మొదటి వ్యక్తి మోషే అని గుర్తుకు తెచ్చుకోండి. దేవుడు చెప్పినదాన్ని మోషే వారితో అన్నాడు, "యూదేతర దేశాలు నిజమైన దేశాలు కాదని మీరు అనుకుంటున్నారు. కానీ వాటిల్లో కొన్ని నన్ను నమ్ముతాయి. నేను వారిని దీవిస్తాను. అప్పుడు మీరు వారిపై అసూయపడతారు, ఇంకా వారితో కోపంగా ఉంటారు. మీరు ఊహించని ప్రజలు నన్ను అర్థం చేసుకుంటారు."
\s5
\v 20 దేవుడు ఎంతో నిర్భయంగా యెషయా ద్వారా చెప్పిన మాటలను కూడా గుర్తు తెచ్చుకోండి, "నన్ను తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించని యూదేతరులు నన్ను కచ్చితంగా కనుగొంటారు. నన్ను అడగని వారికి నేను ఎలా ఉన్నానో తప్పక తెలియచేస్తాను."
\p
\v 21 కానీ దేవుడు ఇశ్రాయేలీయుల గురించి కూడా మాట్లాడాడు. ఆయన వారి గురించి చెప్తూ, "నాపై అవిధేయత చూపి తిరుగుబాటు చేసిన మనుష్యులందరు నా దగ్గరకు తిరిగి రావాలని ఆహ్వానిస్తూ నేను నా చేతులు ఇంకా చాపి ఉన్నాను."
\s5
\c 11
\p
\v 1 ఎవరైనా నన్ను, "దేవుడు తన ప్రజలైన యూదులను వదిలేశాడా" అని అడిగితే, నా జవాబు ఇలా ఉంటుంది, "ఎప్పటికీ అలా జరగదు. గుర్తుంచుకోండి, నేను కూడా ఇశ్రాయేలు ప్రజలకు చెందినవాడినే. అబ్రాహాము వారసుడినే. బెన్యామీను గోత్రం వాడినే. అయినా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు.
\v 2 దేవుడు చాలాకాలం క్రితమే తాను ఏర్పాటు చేసుకుని ఒక ప్రత్యేకమైన రీతిలో ఆశీర్వదించిన తన ప్రజలను ఆయన తిరస్కరించలేదు. ఈ ఇశ్రాయేలు ప్రజల గురించి ఒకసారి ఏలీయా పొరపాటున దేవునికి చాడీలు చెప్పటం గుర్తుతెచ్చుకోండి. అదే వాక్యంలో చెప్తుంది.
\v 3 "ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపేశారు, నీ బలిపీఠమును నాశనం చేశారు. నిన్ను నమ్మినవారిలో నేనొక్కడినే మిగిలి ఉన్నాను. ఇప్పుడు వారు నన్ను కూడా చంపాలని ప్రయత్నిస్తున్నారు."
\s5
\p
\v 4 దేవుడు అతనికి ఇలా జవాబిచ్చాడు, "నాకు నమ్మకంగా ఉండి మిగిలిపొయినది నీవొక్కడివే కాదు. ఇశ్రాయేలులో 7 వేల మంది పురుషులను నా కోసమే ఉండడానికి నేను జాగ్రత్త తీసుకున్నాను. వారు అబద్ద దేవుడైన బయలును పూజించేవారు కాదు."
\v 5 అలాగే, ఈ సమయంలో యూదులలో మిగిలిపోయిన ఒక విశ్వాసుల గుంపు కూడా ఉంది. ఏ విధంగాను మనకు అర్హత లేకపోయినా దేవుడు కేవలం ఆయన దయవలన మనల్ని విశ్వాసులుగా ఎన్నిక చేశాడు.
\s5
\p
\v 6 ఆయన ఎన్నిక చేసిన వారిపట్ల ఆయన దయ చూపించాడు అంటే, వారంతా మంచి పనులు చేసారని కాదు. మంచి పనులు చేసిన వారిని దేవుడు ఎన్నిక చేసుకొంటే ఇంక ఆయన మనపట్ల దయ చూపించాల్సిన అవసరత ఉండదు.
\p
\v 7 దేవుడు ఇశ్రాయేలీయులలో కొంతమందిని మాత్రమే ఎన్నిక చేసుకొంటే, యూదులలో చాలామంది వారు వెతుకుతున్నదాన్ని పొందలేకపోయారని మనకి తెలుస్తుంది. (దేవుడు ఎన్నిక చేసుకున్న వారు కొందరు పొందారు.) చాలామంది యూదులు దేవుడు చేబుతున్నదానిని అర్థం చేసుకోవడానికి ఇష్టం చూపించలేదు.
\v 8 ప్రవక్త యెషయా ఇలా రాసాడు, "దేవుడు వారిని మొండివారిగా చేసాడు. క్రీస్తు గురించిన నిజం వారు అర్థం చేసుకోగలరు కాని వారు చేయరు. దేవుడు మాట్లాడుతుండగా వారు లోబడాలి కాని వారు లోబడరు. ఈ రోజు వరకూ అది అలాగే ఉంది."
\s5
\p
\v 9 రాజైన దావీదు చెప్పింది ఈ యూదులు గుర్తుచేస్తున్నారు. తన శత్రువు ఇంద్రియాలను పనిచేయకుండా ఉంచమని దావీదు దేవుడిని అడిగినప్పుడు, "వలలు లేదా ఉచ్చులలో పడి ఉన్న జంతువులలాగా వారిని తెలివితక్కువ వారినిగా చెయ్యి. అయినా వారు విందుల వద్ద సురక్షితంగా ఉన్నట్లు అనుకుంటారు. కాని ఆ విందులు వారికి పరీక్షా సమయాలుగా ఉండాలి. అప్పుడు వారు పాపం చేస్తారు. దాంతో నువ్వు వారిని నాశనం చేయవచ్చు.
\q
\v 10 ప్రమాదం వచ్చినప్పుడు వారు చూడకుందురు గాక. వారి కష్టాలవల్ల నువ్వు వారిని ఎప్పుడూ బాధపెడతావు గాక."
\s5
\p
\v 11 నన్ను ఎవరైనా "క్రీస్తుని నమ్మకపోవడం వలననే యూదులు పాపం చేసి ఉంటారా, వారు ఎప్పటికీ దేవునికి దూరంగానే ఉంటారా?" అని అడిగితే, నేను వారికి జవాబిస్తూ, "లేదు. వారు ఎప్పటికీ తమని తాము దేవునితో వేరుచేసుకోలేరు. బదులుగా వారు పాపం చేసి ఉన్నారు. వారు అసూయపడేలా దేవుడు యూదేతరులను రక్షించి దీవిస్తున్న విధం చూసీ వారు కూడా దేవుణ్ణి రక్షించమని అడుగుతారు."
\v 12 యూదులు క్రీస్తుని తిరస్కరించినందువల్ల దేవుడు ప్రపంచంలోని మిగిలిన వారిని ఎంతో ఎక్కువగా దీవించి ఆయనను నమ్మటానికి అవకాశాలను ఇచ్చాడు. యూదులు ఆధ్యాత్మికంగా విఫలమైనందువల్ల దేవుడు యూదేతరులను ఎక్కువగా దీవించాడు. అదే నిజమైతే దేవుడు ఏర్పాటు చేసుకున్న యూదులందరూ క్రీస్తుని నమ్మితే ఎంత అద్భుతంగా ఉంటుందో ఆలోచించండి.
\s5
\p
\v 13 ఇప్పుడు నేను యూదేతరులైన మీకు చెప్తున్నాను. నేను మీకు పరిచారకుడిగా ఉన్నాను. దేవుడు నాకు అప్పగించిన ఈ పనిని నేను ఎంతో గౌరవిస్తున్నాను.
\v 14 నేను పడుతున్న నా కష్టం చూసి నా తోటి యూదులు అసూయపడతారని అనుకుంటున్నాను. కాని అందువల్ల వారిలో కొంతమందైనా నమ్మి రక్షణ పొందుతారని ఆశిస్తున్నాను.
\s5
\v 15 నా తోటి యూదులు క్రీస్తుని నమ్మకపోవడం వలన దేవుడు వారిని తృణీకరించాడు. దానివల్ల ఆయన ప్రపంచంలోని మిగిలిన ప్రజలతో సమాధానంగా ఉన్నాడు. ఒకవేళ చాలామంది యూదులు క్రీస్తుని నమ్మకపోతే ఎం జరుగుతుందో చూడండి. ఆ తర్వాత వారంతా ఆయనలో విశ్వాసం ఉంచితే ఎంత గొప్ప సంగతులు జరుగుతాయో చూడండి. అప్పుడు వారంతా చనిపోయిన రాజ్యం నుండి లేచినట్టుగా ఉంటుంది.
\v 16 ఒక పిండి ముద్దలోనుండి కొంతభాగం తీసి రొట్టె చేసి దేవునికి అర్పిస్తే అది ఆయనకే చెందుతుంది. యూదులు దేవునికి చెందినవారు. ఎందుకంటే వారి పితరులూ దేవునికి చెందివారే. ఒక చెట్టులో వేరు దేవునికి చెందినది అయితే దాని కొమ్మలు కూడా ఆయనకే చెందుతాయి. అలాగే మన గొప్ప యూదు పితరులు దేవునికి చెందినవారు కాబట్టి ఎదో ఒకరోజున వీరంతా దేవునికి చెందుతారు.
\s5
\p
\v 17 మనుషులు ఎండిన కొమ్మలను నరికినట్టుగా దేవుడు చాలమంది యూదులను తృణీకరించాడు. దేవుడు అంగీకరించిన యూదేతరులైన మీలో ప్రతి ఒక్కరు సాగుచేయని ఒలీవ కొమ్మ వలే ఉండి, సాగుచేసిన ఒలీవ చెట్టుకి అంటుకట్టబడి ఉన్నారు. సాగుచేసిన ఒలీవ చెట్టు వేరు మొదలు నుండి కొమ్మలు ఎలా లాభం పొందుతాయో మీరు కూడా మన మొదటి యూదు పితరులనుండి ఆశీర్వాదాలను పొందేలా దేవుడు చేసాడు.
\v 18 అయినప్పటికీ యూదులను దేవుడు తృణీకరించినా ఎవరో వచ్చి చెట్టునుండి కొమ్మలు నరికివేసినట్టుగా ఉన్నాకూడా యూదేతరులైన మీరు మాత్రం వారిని ద్వేషించకూడదు. దేవుడు మిమ్మల్ని ఎలా రక్షించాడో మీకు మీరు గొప్పలు చెప్పుకోవాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. కొమ్మలు వేరును పోషించవు. వేరులే కొమ్మలను పోషిస్తాయి. అలాగే, మీరు యూదుల నుండి తీసుకున్నదానివల్లనే దేవుడు మీకు సహాయం చేస్తాడు. మీరు యూదులకు ఉపయోగపడేది ఏదీ వారికి ఇవ్వలేదు.
\s5
\v 19 ఒకవేళ మీరు నాతో అనొచ్చు "మనుషులు చెట్టు నుండి ఎండిన కొమ్మలు నరికినట్టుగా దేవుడు యూదులను తృణీకరించాడేమో. ఎందుకంటే, మనుషులు అడవిలోని ఒలీవ చెట్టు నుండి కొమ్మలు తెచ్చి మంచి చెట్టుకి అంటుకట్టినట్టుగా యూదేతరులైన మనల్ని అంగీకరించటానికి దేవుడు అలా చేసి ఉండవచ్చు."
\v 20 ఇది నిజం. క్రీస్తుని వారు నమ్మలేదు కాబట్టే దేవుడు వారిని తృణీకరించాడు. మీరైతే క్రీస్తుని నమ్మినందువల్లనే గట్టిగా నిలబడగలుగుతున్నారు. కాబట్టి గర్వపడకండి. బదులుగా విధేయతతో నిండి ఉండండి.
\v 21 చెట్టు వేరు నుండి సహజంగా కొమ్మలు ఎలా పెరుగుతాయో అలా యూదులు పెరిగినా, వారు క్రీస్తునందు నమ్మకం లేకపోతే దేవుడు వారిని వదిలిపెట్టడు. మీరూ నమ్మకపోతే మిమ్మల్నీ వదిలిపెట్టడు.
\s5
\p
\v 22 దేవుడు దయతో ఉంటాడు, కఠినంగా కూడా ఉంటాడు. క్రీస్తుని నమ్మని యూదులతో ఆయన కఠినంగా ఉంటాడు. మీ పట్ల దయ కలిగి ఉంటాడు. కానీ మీరూ క్రీస్తుని నమ్మకపోతే మీతోనూ ఆయన కఠినంగా ఉంటాడు.
\s5
\p
\v 23 ఒకవేళ యూదులు క్రీస్తుని నమ్మితే దేవుడు వారిని తిరిగి చెట్టుకి అంటుకడతాడు. దేవుడు అలా చేయగలడు కూడా.
\v 24 యూదేతరులైన మీరు ఇంతకుముందు దేవునికి దూరంగా ఉండి దేవుడు యూదులను ఆశీర్వదించిన విధానం నుండి మీరు లాభం పొందారు. అది ఎలాగంటే, ఎవ్వరూ నాటకుండా అడవిలో పెరిగిన ఒలీవ చెట్టునుండి కొమ్మలు తీసుకోవడం లాంటిది. మనుషులు సహజంగా చేసే పనులకు భిన్నంగా ఒక సాగుచేసిన ఒలీవ చెట్టులోకి దానిని ఉంచడం. యూదులు ఎప్పుడో దేవునికి చెందినవారు గనుక ఆయన వారిని తిరిగి చేర్చుకోవడానికి సిద్దంగా ఉంటాడు. ఎవరో కొట్టివేసిన అసలు కొమ్మలను తిరిగి అదే ఒలీవ చేట్టులోకి ఉంచడం లాంటిదే ఇది.
\s5
\p
\v 25 నా తోటి యూదులు కాని విశ్వాసులారా, మీకు అన్నీ తెలుసునని అనుకోకుండా ఉండాలంటే ఈ రహస్య సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలని నేను కచ్చితంగా కోరుతున్నాను. దేవుడు ఎన్నుకున్న యూదేతరులందరూ యేసులో విశ్వాసముంచే వరకూ చాలామంది ఇశ్రాయేలీయులు ఇలాగే మొండివారుగానే ఉంటారు.
\s5
\p
\v 26 అప్పుడు దేవుడు తన నిజమైన ప్రజలను రక్షిస్తాడు. తర్వాత లేఖనాలలో రాసిన ఈ మాటలు నిజమౌతాయి.
\p "ఆయన ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చేవాడు యూదులలోనుండి వస్తాడు. ఆయనే దేవుని ప్రజల పాపాలను క్షమిస్తాడు."
\p
\v 27 ఇంకా దేవుడు చెప్తున్నాడు.
\p "వారితో నేను చేసుకున్న నిబంధన ఒకటే ఏమిటంటే నేను వారి పాపాలను క్షమిస్తాను."
\s5
\p
\v 28 యూదులు క్రీస్తును గురించిన మంచి వార్తను తిరస్కరించారు. అందుకు దేవుడు వారిని తన శత్రువులుగా చూస్తున్నాడు. కాని అదే మీ యూదేతరులకు మేలు జరిగింది. ఎందుకంటే, దేవుడు వారిని ఎన్నుకున్నాడు. వారి పితరులకు వాగ్దానం చేసినందున దేవుడు వారిని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు.
\v 29 ఆయన వారికి ఇస్తానని వాగ్దానం చేసిన దాని గురించి ఇంకా తన సొంత ప్రజలుగా వారిని ఎలా పిలిచాడనే దాని గురించి ఆయన ఎప్పటికీ మనసు మార్చుకోలేదు.
\s5
\v 30 మీరు ఒకప్పుడు దేవునికి అవిధేయత చూపారు, కాని ఇప్పుడు యూదులు ఆయనకు అవిధేయత చూపినందున ఆయన మీపట్ల దయ కలిగి ఉన్నాడు.
\v 31 అలాగే ఇప్పుడు వారు దేవునికి అవిధేయత చూపారు. ఫలితం ఏమిటంటే, ఆయన మీ పట్ల ఎలా దయతో ఉన్నాడో మళ్ళీ వారిపట్ల కూడా దయ చూపిస్తూ ఉన్నాడు.
\v 32 ప్రజలందరూ, యూదులు, యూదులు కానివాళ్ళు అందరూ ఆయనకు అవిధేయత చూపారని దేవుడు ప్రకటించాడు. ఇంకా నిరూపించాడు. ఎందుకంటే దేవుడు మనందరి పట్ల దయతో ఉండాలని కోరుకుంటున్నట్టుగా ప్రకటించాడు.
\s5
\p
\v 33 దేవుడు చేసిన తెలివైన పనులు, ఆయనకు ఎప్పుడు తెలిసినవి ఎంత గొప్పవని నేను ఆశ్చర్యపోతున్నాను. వాటిని తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం ఎవరి తరమూ కాదు.
\v 34 లేఖనాలలో చెప్పింది నాకు గుర్తుకు వస్తుంది. "ప్రభువు ఆలోచించేది ఎవరికీ తెలియదు. ఆయనకు సలహాలు చెప్పగలిగే వారెవరు."
\s5
\p
\v 35 "ఆయన దగ్గర నుండి తిరిగి పొందాలని ముందుగా ఆయనకు ఇచ్చేవాడెవడు?"
\v 36 దేవుడే సమస్తాన్నీ సృష్టించాడు. ఆయన అన్నిటినీ నడిపించేవాడు కూడా. ఆయన అన్నింటిని సృష్టించడానికి కారణం వారు ఆయనను స్తుతించడమే. యుగయుగాలకు ఆయనకే మహిమ కలుగును గాక. ఆమెన్.
\s5
\c 12
\p
\v 1 నా తోటి విశ్వాసులారా, దేవుడు మీ పట్ల అన్ని విధాలుగా దయ కలిగి ఉన్నందున, మీకు మీరే సజీవంగా ఆయనకు సమర్పించుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీ సమర్పణ దేవునికి ఇష్టంగా ఉండి ఆయనను సంతోషపరిచేదిగా ఉండాలి. ఆయనను ఆరాధించడానికి ఇదే సరైన మార్గం.
\v 2 మీరు ఎలా ప్రవర్తించాలో అవిశ్వాసులచేత చెప్పించుకోవద్దు. బదులుగా దేవుడే మీ ఆలోచనా విధానాన్నిమార్చటానికీ క్రొత్తగా చేయటానికీ ఆయనకే అవకాశం ఇవ్వండి. దానివలన ఆయన మీరు ఏమి చేయాలని కోరుకుంటున్నాడో మీకు తెలుస్తుంది. ఆయన్ని ఎలా సంతోషపెట్టాలో, ఆయన స్వయంగా వ్యవహరించే మార్గాల్లో మీరు ఎలా ఉండాలో మీకు తెలుస్తుంది.
\s5
\p
\v 3 దేవుడు నాకు అర్హత లేకపోయినా నన్ను తన పరిచారకుడిగా నియమించుకున్నాడు. అందువల్ల ఇది నేను మీ అందరితో చెప్పాలనుకున్నాను. మీకు మీరే మంచివారని అనుకోవద్దు. బదులుగా దేవుడు ఆయనపై నమ్మకం ఉంచడానికి మిమ్మల్ని ఎలా అనుమతించాడో ఆ విధంగానే మీ గురించి మీరే తగినరీతిలో ఆలోచించుకోండి.
\s5
\p
\v 4 ఒక వ్యక్తికి ఒకే శరీరం ఉండి అనేక అవయవాలను కలిగి ఉంటుంది. అన్నీ అవయవాలు శరీరానికి అవసరమే కాని, అవన్నీ ఒకే విధంగా పని చేయవు.
\v 5 అదే విధంగా మనం అనేకులం ఉన్నప్పటికీ ఒకే గుంపుగా కలిసి ఉన్నాము. ఎందుకంటే మనం క్రీస్తులో కలిసి ఉండి, ఒకరికొకరం చెంది ఉన్నాం.
\s5
\v 6 దేవుడు మనల్ని ఒకరొకరికి భిన్నంగా చేసాడు. మనలో ప్రతి ఒక్కరు భిన్నమైన పనులను చేస్తాము. ఆ పనులను మనం ఆత్రుతతో సంతోషంతో చేయాలి. దేవుని సందేశాలను ఇతరులకు ఇచ్చేవారు మనలో ఉంటే వారు దేవునిపై మనకున్న నమ్మకానికి తగినట్టుగా మాట్లాడాలి.
\v 7 ఇతరులకు సేవ చేయటానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసాడో వారు అదే చేయాలి. ఆయన సత్యాన్ని బోధించాలని దేవుడు ఎవరిని ఏర్పాటు చేసాడో వారు అదే చేయాలి.
\v 8 ఇతరులను ప్రోత్సహించాలని దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసాడో వారు నిండు మనసుతో దానిని చేయాలి. ఇతరులకు ఇవ్వడానికి దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసాడో వారు వెనక్కి తగ్గకుండా అలానే చేయాలి. ఇతరులను సంరక్షించాలని దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసాడో వారు జాగ్రత్తగా చేయాలి. అవసరతలో ఉన్నవారికి సహాయం చేయాలని దేవుడు ఎవరిని ఏర్పాటు చేసాడో వారు సంతోషంతో చేయాలి.
\s5
\p
\v 9 మనుష్యులను ప్రేమిస్తే హృదయపూర్వకంగా ప్రేమించాలి. చెడుని ద్వేషించాలి. దేవుడు మంచిగా చూసేదానిని మీరూ ఆత్రుతతో కొనసాగించండి.
\v 10 మీ సొంత కుటుంబంలోని వారిని మీరు ప్రేమించినట్టే మీరూ ఒకరికొకరు ప్రేమించుకోండి. అలా చేయడంలో మీరు మొదటివారిగా ఉండాలి.
\s5
\p
\v 11 సోమరులుగా ఉండొద్దు. దేవుణ్ణి సేవించడంలో ఆత్రుతగా ఉండండి. ప్రభువుకి సేవ చేస్తున్నప్పుడు ఉత్సాహంగా ఉండండి.
\v 12 దేవుడు మీకోసం చేయబోయే దానిని గురించి నమ్మకంతో ఎదురు చూస్తున్నారు గనుక సంతోషించండి. హింసల పాలైనప్పుడు సహనంతో ఉండండి. ప్రార్థన చేస్తూ ఉండండి. నిరుత్సాహపడకండి.
\v 13 దేవుని ప్రజలు ఎవరికైనా ఏదైనా లేకపోతే మీకున్న దానిని వారితో పంచుకోండి. ఇతరులను ఆదరించడంలో ఆసక్తి కలిగి ఉండండి.
\s5
\p
\v 14 మీరు యేసుని విశ్వసించారు కాబట్టి మిమ్మల్ని ఎవరైనా హింసిస్తుంటే వారియందు దయగా ఉండమని దేవుణ్ణి వేడుకొండి. వారికి చెడు విషయాలు జరగాలని ఆయనను అడగొద్దు.
\v 15 వారు సంతోషంగా ఉంటే వారితోపాటు మీరు సంతోషంగా ఉండండి. వారు విచారంగా ఉంటే మీరూ వారితో విచారంగా ఉండండి.
\v 16 మీకు మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఇతరులకు కూడా అదే కోరుకోండి. మీ ఆలోచనలలో కూడా గర్వపడకండి. ముఖ్యులు కానివారితో కూడా స్నేహం చేయండి. మీకు మీరే తెలివైనవారుగా ఎంచుకోవద్దు.
\s5
\p
\v 17 మీకు ఎవరైనా కీడు చేసినట్లైతే మీరు వారికి తిరిగి కీడు తలపెట్టవద్దు. మనుష్యులందరికీ మంచిది అని తెలిసే విధంగా నడచుకోండి.
\v 18 మీరు పరిస్థితులను అర్థం చేసుకుని సాధ్యమైనంత వరకు ఇతరులతో సమాధానంగా జీవించండి.
\s5
\p
\v 19 నేను ప్రేమిస్తున్న నా తోటి విశ్వాసులారా, మనుషులు మీకు చేసిన కీడుకు ప్రతిగా మీరు వారికి కీడు చేయవద్దు. వారిని శిక్షించడం దేవునికే వదిలెయ్యండి. లేఖనాలు చెప్తున్నాయి, "కీడు చేసేవారికి నేను తిరిగి చెల్లిస్తాను. అలా చెల్లించడం నా హక్కు, అని ప్రభువు చెప్తున్నాడు."
\v 20 మీకు కీడు చేసిన వారికి మీరు తిరిగి కీడు చేయకుండా లేఖనాలు బోధించిన రీతిగా చేయండి. "మీ శత్రువులు ఆకలిగా ఉంటే వారికి భోజనం పెట్టండి. వారికి దాహంగా ఉంటే తాగడానికి నీరు ఇవ్వండి. అలా చేయడం వలన మీరు వారికి సిగ్గుతో కూడిన బాధను కలిగించవచ్చు. ఇంకా మీ పట్ల వారి వైఖరిని కూడా మార్చుకోవచ్చు."
\v 21 ఇతరులు మీకు చేసిన కీడు గురించి ఆలోచించవద్దు. దానికి బదులుగా వారు మీకు చేసిన దానికన్నాఎక్కువ మంచిని వారికి చేయండి.
\s5
\c 13
\p
\v 1 విశ్వాసులందరూ ప్రభుత్వ అధికారులకు తప్పక లోబడాలి. దేవుడే వారికి ఆ అధికారాన్ని ఇచ్చాడని గుర్తుంచుకోండి. ఇంకా, ఇప్పుడున్న ఆ అధికారులందరినీ దేవుడే నియమించాడు.
\v 2 కాబట్టి ఎవరైతే ఆ అధికారులను ఎదిరిస్తారో వారు దేవుని ఏర్పాటుని ఎదిరించినట్టే. ఇంకా, ఆ అధికారులను ఎదిరిస్తే వారి ద్వారానే శిక్షించబడతారు.
\s5
\p
\v 3 మంచి పనులు చేసేవారు అధికారులకు భయపడాల్సిన పని లేదు. చెడ్డ పనులు చేసేవారే భయపడాలి. కాబట్టి మీలో ఎవరైనా మంచి చేస్తే వారు మిమ్మల్ని శిక్షించే బదులు మెచ్చుకుంటారు.
\v 4 దేవునికి సేవ చేయడానికే అధికారులందరూ ఉన్నారు. అంతేకాకుండా మీలో ప్రతి ఒక్కరికి కూడా వారు సహాయం చేస్తారు. మీలో ఎవరైనా చెడు చేస్తే మీరు తప్పక వారికి భయపడాల్సిందే. చెడు చేసే వారిని శిక్షించడం ద్వారా అధికారులు దేవునికి సేవ చేస్తున్నారు.
\v 5 కాబట్టి, అధికారులకు మీరు లోబడి ఉండటం చాలా అవసరం. ఎందుకంటే, మీరు వారికి లోబడకపోతే మిమ్మల్ని శిక్షిస్తారు అంతేకాకుండా మీలో మీకు తెలుసు మీరు వారికి లోబడి ఉండాలని.
\s5
\p
\v 6 ఈ కారణం వల్లనే మీరు పన్నులు కూడా కడుతున్నారు. అధికారులు నిరంతరం తమ పనిని చేస్తూ దేవునికి సేవ చేస్తూన్నారు.
\v 7 అధికారులకు ఇవ్వాల్సింది ఏదైనా ఉంటే అది వారికి ఇచ్చేయ్యండి. మీరు పన్నులు చెల్లించాల్సిన వారికి పన్నులు చెల్లించండి. మీరు వస్తువులపై సుంకాలు చెల్లించాల్సిన వారికి సుంకాలు చెల్లించండి. మర్యాద ఇవ్వాల్సి ఉంటే మర్యాదను , గౌరవం ఇవ్వాల్సి ఉంటే గౌరవాన్ని ఇవ్వండి.
\s5
\p
\v 8 మీరు చెల్లించాల్సిన అప్పులు ఏమైనా ఉంటే చెల్లించెయ్యండి. మీరు ఎప్పటికీ చెల్లించనక్కరలేని అప్పు ఏదైనా ఉంటే అది మీరు ఒకరినొకరు ప్రేమించుకోవడమే. ఎవరైతే పొరుగువాడిని ప్రేమిస్తారో వారే దేవుని ధర్మశాస్త్రాన్ని నేరవేర్చినవారు అవుతారు.
\v 9 దేవుని ధర్మశాస్త్రంలో చాలా ఆజ్ఞలు ఉన్నాయి. వ్యభిచరించవద్దు, ఎవరిని చంపొద్దు, దొంగతనం చేయొద్దు, ఇతరులకు చెందినవాటిని కోరుకోవద్దు మొదలైనవి. కాని ఈ ఆజ్ఞలన్నింటిలోని సారాంశం తీసుకొంటే, "నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే నీ పొరుగువాడిని ప్రేమించు" అనే వాక్యంలో ఇమిడి ఉన్నాయి.
\v 10 నీ చుట్టూ ఉన్నవారిని నువ్వు ప్రేమించితే ఇంక నువ్వు ఎవ్వరికీ కీడు చేయవు. కాబట్టి ఎవరైతే ఇతరులను ప్రేమిస్తారో వారు దేవుని ఆజ్ఞలను నేరవేర్చినవారు అవుతారు.
\s5
\p
\v 11 మనం జీవిస్తున్న ఈ కాలంలో సమయం ఎంత ముఖ్యమో మీకు తెలుసు కాబట్టి నేను మీకు చెప్పినదానిని చేయండి. నిద్ర నుండి మేల్కొన్న మనుషులుగా మీరు పూర్తిగా చురుకుగా, అప్రమత్తంగా ఉండవలసిన సమయం ఇదేనని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ దుఃఖం, పాపం నుండి క్రీస్తు మనలను విడుదల చేసే సమయం దగ్గరలోనే ఉంది. మనం క్రీస్తుని నమ్ముకున్న దానికంటే ఇప్పుడు ఆ సమయం దగ్గరగా ఉంది.
\v 12 ఈ లోకంలో జీవించే కాలం చాలావరకు ముగిసిపోయింది. క్రీస్తు తిరిగి వచ్చే కాలం దగ్గరలో ఉంది. మనుషులు చీకటిలో చేయాలని చూసే చెడు పనులను మనం చేయటం ఆపెయ్యాలి. శత్రువులను ఎదిరించడానికి సైనికులు తమ ఆయుధాలను ధరింఛి ఎప్పుడూ సిద్దంగా ఉన్నట్టు మనం కూడా చెడును ఎదిరించడానికి సహాయపడే పనులను ఎప్పుడూ చేస్తుండాలి.
\s5
\p
\v 13 క్రీస్తు తిరిగి వచ్చే సమయం ఎప్పుడో వచ్చేసింది అన్నట్లుగా మనం మర్యాదగా నడచుకోవాలి. మద్యపానం చేయకూడదు. ఇతరులతో కలిసి చెడు పనులను చేయకూడదు. ఎలాంటి లైంగిక అనైతికత, క్రూరమైన ఇంద్రియ ప్రవర్తనకు పాల్పడకూడదు. పోట్లాడకూడదు. ఇతరులను చూసి అసూయ పడకూడదు.
\v 14 దానికి బదులుగా మనం ప్రభువైన యేసుక్రీస్తులా ఉండి ఆయన ఎలా ఉంటాడో ఇతరులకు చూపించాలి. మీ పాత దుష్ట స్వభావం చేయాలనుకునే పనులను మీరు చేయాలనుకోవడం ఆపెయ్యాలి.
\s5
\c 14
\p
\v 1 కొంతమంది తప్పుగా అనుకునే కొన్ని పనులను చేయడానికి దేవుడు వారిని అనుమతిస్తాడో లేదో కచ్చితంగా తెలియని వారిని అంగీకరించండి. కాని మీరు వారిని అంగీకరించినప్పుడు వారు అలోచిస్తున్నవాటి గురించి వారితో వాదం పెట్టుకోవద్దు. వారు అడిగే ప్రశ్నలు అన్నీ కేవలం వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే.
\v 2 కొంతమంది మనుషులు అన్ని రకాల ఆహార పదార్థాలు తినవచ్చని నమ్ముతారు. ఇంకా కొంతమంది కొన్ని ఆహార పదార్ధాలను తినటం దేవునికి ఇష్టం లేదని నమ్ముతారు. అందుకే వారు కూరగాయలను మాత్రమే తినాలని నమ్ముతారు.
\s5
\p
\v 3 అన్ని రకాల ఆహారాలను తినడం సరైనదే అని నమ్మేవారు అలా తినని వారిని తృణీకరించకూడదు. ఇంకా, అన్ని రకాల ఆహారాన్ని తినడం సరి కాదు అని భావించేవారు ఎవరైనా అలా తినేవారిని ఖండించకూడదు. ఎందుకంటే దేవుడు వారిని కూడా అంగీకరించాడు.
\v 4 వేరొకరి సేవకుని విషయంలో నువ్వు న్యాయం చెప్పడం తప్పు. మనందరం దేవుని సేవకులం కాబట్టి దేవుడే మనందరికీ యజమాని. ఆ మనుషులు తప్పు చేసారా లేదా అని నిర్ణయించేది దేవుడు ఒక్కడే. ఈ విషయంలో ఎవరూ మరొకరిని తీర్పు తీర్చకూడదు. ఎందుకంటే ఆయన వారిని తనకు నమ్మకంగా ఉంచగలడు.
\s5
\p
\v 5 కొంతమంది మనుషులు ఒక రోజు కంటే మరొక రోజు పవిత్రమైనదని నమ్ముతారు. మరి కొంతమంది దేవుణ్ణి ఆరాధించడానికి అన్ని రోజులూ మంచివే అని నమ్ముతారు. ఇలాంటి విషయాలలో ప్రతి ఒక్కరూ ఇతరుల కోసం కాకుండా తమ కోసమే ఆలోచించుకుని, దృఢంగా నిర్ణయించుకోవాలి.
\v 6 వారంలో ఒక కచ్చితమైన రోజున దేవుణ్ణి ఆరాధించాలని నమ్మేవారికి, అదే రోజు ఆయనను ఆరాధించడం ఆయనను గౌరవించడమే. ఇంకా అన్ని రకాల ఆహారాన్ని తినడం సరైనదే అని నమ్మేవారికి ఆ ఆహారాన్ని తింటున్నప్పుడు ప్రభువుని గౌరవిస్తూ ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. అలాగే కొన్నిరకాల ఆహారపదార్ధాలను తిననివారు కూడా, ఆ ఆహారాన్ని తినడం లేదని ప్రభువుని గౌరవిస్తూ ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. కాబట్టి ఈ మనుషులు వేరే విధంగా ఆలోచిస్తున్నప్పటికీ వారిది తప్పు కాదు.
\s5
\p
\v 7 మనలో ఎవరూ మనల్ని మనమే సంతోషపెట్టుకోవడానికి మాత్రమే జీవించకూడదు. మనం చనిపోయినప్పుడు కూడా మనం మాత్రమే నష్టపోతామని ఎవరూ అనుకోకూడదు.
\v 8 మనం జీవించి ఉన్నప్పుడు మనం దేవునికి చెందినవారము కనుక ఆయననే సంతోషపరచాలి కానీ, మనల్ని మనం కాదు. మనము చనిపోయినప్పుడు కూడా ప్రభువును సంతోషపర్చడానికే ప్రయత్నం చేయాలి. కాబట్టి మనం జీవించినా చనిపోయినా ప్రభువునే సంతోషపరచాలి. ఎందుకంటే మనము ఆయనకు చెందినవారము.
\v 9 బ్రతికి ఉన్నవారికీ చనిపోయిన వారికీ ప్రభువుగా ఉండి అందరూ తనకు లోబడి ఉండాలనే క్రీస్తు మనకోసం చనిపోయి తిరిగి లేచాడు.
\s5
\p
\v 10 కొన్ని నియమాలు మాత్రమే పాటించే మీరు, మీ తోటి విశ్వాసులు వాటికి లోబడకపోతే దేవుడు వారిని శిక్షిస్తాడు అని చెప్పడం చాలా అవమానకరం. కాని దేవుడు మనలో ప్రతి ఒక్కరికీ తీర్పు తీరుస్తాడు.
\v 11 అది మనకు ఎలా తెలిసింది అంటే ఈ విషయం లేఖనాలలో రాయబడింది.
\q "ప్రతి ఒక్కరూ నా ముందు మోకరిల్లాలి.
\q ప్రతి ఒక్కరూ నన్ను స్తుతించాలి."
\s5
\p
\v 12 కాబట్టి మనం ప్రతి ఒక్కరం ఏమి చేసామో దేవునికి చెప్పవలసి ఉంటుంది. ఇంకా దానిని ఆయన ఆమోదించాడో లేదో ఆయనే నిర్ణయించాలి.
\p
\v 13 ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చేది దేవుడే కాబట్టి మన తోటి విశ్వాసులలో కొంతమందిని దేవుడు శిక్షించాలని అనడం మనం మానేయాలి. దానికి బదులుగా, మన సహోదరుడు గానీ సహోదరి గానీ పాపం చేయడానికి కారణంగా మనం ఉండకూడదని నిర్ణయించుకోవాలి. ఇంకా వారికి క్రీస్తుపై నమ్మకం పోకుండా చూసుకోవాలి.
\s5
\p
\v 14 నేను యేసు ప్రభువుతో కలిసి ఉన్నందున తినడానికి ఏదీ అపవిత్రం కాదని కచ్చితంగా అనుకుంటున్నాను. కాని మనుషులు ఏదైనా తినడం తప్పు అని అనుకుంటే వారికి అది తప్పుగానే ఉంటుంది. కాబట్టి వారిని అది తినమని బలవంతం చేయవద్దు.
\v 15 నీ తోటి విశ్వాసి తప్పు అని భావించే ఆహారాన్ని నువ్వు తింటుంటే అతడు దేవునికి విధేయత చూపడం మానేయవచ్చు. మీరు అతన్ని ప్రేమించలేకపోవచ్చు. నీ తోటి విశ్వాసులు ఎవ్వరైనా క్రీస్తునందు విశ్వాసం లేకుండా పోవడానికి నువ్వు కారణంగా ఉండ వద్దు. ఎందుకంటే క్రీస్తు వారికోసం కూడా చనిపోయాడు.
\s5
\v 16 అదే విధంగా నీకు మంచిగా అనిపించిన దేనినీ కూడా నీ తోటి విశ్వాసులకు చేయవద్దు, అది వారికి చెడు గానే ఉంటుంది.
\v 17 మనం ఎలా జీవించాలో దేవుడు నిర్ణయిస్తున్నప్పుడు, ఏమి తినాలో ఏమి తాగాలో వాటి గురించి చింతించకండి. ఆయనకు ఎలా లోబడి ఉండాలీ దానికి సరియిన మార్గం ఏదీ ఒకరికొకరం సమాధానంతో ఎలా ఉండాలి పరిశుదాత్మలో ఎలా సంతోషించాలీ అని మనం ఆలోచించాలి.
\s5
\v 18 ఈ విధంగా చేస్తూ దేవునికి సేవ చేసి ఆయనను సంతోషపరిస్తే మిగిలినవారు కూడా వారిని గౌరవిస్తారు.
\p
\v 19 కాబట్టి మనం మన తోటి క్రైస్తవులలో శాంతిని కలిగించే విధంగా జీవించడానికి తీవ్రంగా ప్రయత్నించాలి. మనం ఒకరికొకరం సహాయం చేసుకోవడానికీ క్రీస్తునందు నమ్మిక ఉంచి ఆయనకు లోబడి ఉండడానికీ తప్పక ప్రయత్నం చెయ్యాలి.
\s5
\v 20 మీరు ఏదైనా ఒక రకమైన ఆహారం నచ్చడం వల్ల ఎవరైనా విశ్వాసికి దేవుడు చేసిన సహాయాన్ని నాశనం చేయవద్దు. దేవుడు మనకు అన్ని రకాల ఆహార పదార్ధాలను తినమని అనుమతినిచ్చాడు అనేది నిజం. ఇతర విశ్వాసులు మీరు తినే ఆహారాన్ని చూసి తప్పుగా అనుకుంటే మీరు అతను తప్పు అని అనుకున్నది చేయమని అతన్ని ప్రోత్సహిస్తున్నారు.
\v 21 మాంసం తినడం, ద్రాక్షారసం తాగటం, ఇంకా మరేదైనా సరే, నీ తోటి విశ్వాసులు ఆటంకంగా భావించి దేవునిపై నమ్మకాని వదిలేస్తే, దాన్ని మానివేయడం మంచిది.
\s5
\v 22 మీరు ఏమి చేయాలో దేవునికే వదిలెయ్యండి. కాని మీరు నమ్మేదాన్ని ఇతరులు అంగీకరించాలని వారిని బలవంతం చేయటానికి ప్రయత్నం చెయ్యొద్దు. ఏది సరైనది ఏది సరికాదు అనే నీ నమ్మకాలలో నీకు అనుమానాలు లేకపోతే నువ్వే దేవుణ్ణి సంతోషపరచు.
\v 23 కాని, కొన్నిరకాల ఆహార పదార్ధాలను తింటే దేవుడు సంతోషపడడని కొంతమంది విశ్వాసులు నమ్ముతారు. వారు సరైనది అని నమ్మిన దానిని చేయకపోతే వారు తప్పు చేస్తున్నట్టే అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఏదైనా పనిని ఆమోదించాడని తెలియకుండా మనం ఆ పనిని చేస్తే మనం పాపం చేసినట్టే.
\s5
\c 15
\p
\v 1 ఇతర విశ్వాసులు చేసే పనులు కంటే చాలా ఎక్కువ పనులు చేయటానికి దేవుడు మనకే అనుమతి ఇస్తాడని మనలో ఉన్న విశ్వాసులు ఎక్కువమంది నమ్ముతారు. మనం వారితో ఓపికతో ఉండాలి, ఇంకా వారి అసౌకర్యాన్ని అనుమతించాలి. మనల్ని మనం సంతోషపరచుకోవడం కంటే ఇలా చేయటం చాలా ముఖ్యం.
\v 2 మనలో ప్రతి ఒక్కరూ మన తోటి విశ్వాసులు సంతోషపడే పనులను చేయాలి. వారికి సహాయం చేయాలి. క్రీస్తులో నమ్మకముంచేలా వారిని ప్రోత్చహించాలి.
\s5
\v 3 క్రీస్తు మనకు ఒక ఆదర్శంగా ఉన్నాడు కాబట్టి ఆయన వలె మనం మన తోటి విశ్వాసులను సంతోషపెట్టాలి. తనకు తాను సంతోష పడడానికి ఆయన ఏమీ చేసుకోలేదు. దానికి విరుద్ధంగా ఇతరులు తనను నిందిస్తున్నా, ఆయన మాత్రం దేవుణ్ణి సంతోషపెట్టటానికే ప్రయత్నించాడు అని లేఖనాలు చెప్తున్నాయి, "మనుషులు నిన్ను అవమానించినప్పుడు వారు నన్ను అవమానించినట్టుగానే ఉంది."
\v 4 లేఖనాలలో రాసిన అన్ని విషయాలూ మనకు బోధించడానికే ఉన్నాయి. వాటి ద్వారా మనం కష్టాలలో కూడా ఓపికతో ఉండొచ్చు. ఈ విధంగా దేవుడు చేసిన వాగ్దానాలన్నీ మన కోసం ఆయన నెరవేరుస్తాడని మనం ఎప్పుడూ ఆశించాలని లేఖనాలు ప్రోత్సహిస్తున్నాయి.
\s5
\v 5 దేవుడు మీకు సహనాన్నీ, ప్రోత్సాహాన్నీ ఇవ్వాలని నేను ప్రార్థన చేస్తున్నాను. మీరందరూ యేసుక్రీస్తులా ఒకరికొకరు శాంతితో జీవించాలి.
\v 6 మీరు ఇలా చేసి మనందరం కలిసి మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరచాలి.
\p
\v 7 రోమ్ లో ఉన్న విశ్వాసులైన మీ అందరికి నేను చెప్తున్నాను. మీరు ఒకరిని ఒకడు చేర్చుకోండి. మీరు అలా చేస్తే, మీరు క్రీస్తులానే ఉన్నారని మనుష్యులందరూ చూసి వారు దేవుణ్ణి మహిమ పరుస్తారు. క్రీస్తు మిమ్మల్ని ఎలాగైతే చేర్చుకున్నాడో అలాగే మీరూ ఒకరిని ఒకడు చేర్చుకోండి.
\s5
\v 8 దేవుని గురించిన సత్యం తెలియడానికి క్రీస్తే మనకు సహాయం చేసాడని మీరు గుర్తుచుకోవాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు మన పూర్వీకులకు తాను చేస్తానని వాగ్దానం చేసిన ప్రతిదాన్ని నిజం చేయడానికి వచ్చాడు.
\v 9 కాని ఆయన యూదేతరుల కోసం కూడా వచ్చాడు. అందుకే వారు దేవుని దయ కొరకు ఆయనను స్తుతిస్తున్నారు. లేఖనాలలో దేవుని కృపను గురించి రాసిన దానిని దావీదు దేవునితో చెప్తున్నాడు. "ఈ కారణం చేత యూదేతరుల్లో నేను నిన్ను స్తుతిస్తాను. నీ నామ సంకీర్తనం చేస్తాను."
\s5
\v 10 ఇంకా మోషే కూడా రాసాడు, "యూదేతరులారా, ఆయన ప్రజలైన మాతో కలిసి సంతోషించండి."
\v 11 దావీదు లేఖనాలలో రాసాడు, "యూదేతరులందరూ ప్రభువును స్తుతించండి. ప్రజలంతా ఆయనను కొనియాడతారు."
\s5
\v 12 యెషయా రాసాడు, "రాజైన దావీదు వారసుడు యూదేతరులను ఏలడానికి వస్తాడు. ఆయనలో యూదేతరులు నమ్మకం పెట్టుకుంటారు."
\s5
\p
\v 13 దేవుడు వాగ్దానం చేసినట్టుగా ఆయన మీ కొరకు చేస్తాడని మీరు నమ్మకంగా ఎదురుచూడాలని నేను ప్రార్ధిస్తున్నాను. మీరు ఆయనపై నమ్మకం ఉంచినప్పుడు ఆయన మిమ్మల్ని పూర్తిగా ఆనందంగా ప్రశాంతంగా ఉంచాలని నేను ప్రార్ధిస్తున్నాను. దేవుడు వాగ్దానం చేసినవాటిని తప్పక ఇస్తాడని పరిశుద్దాత్మ మీకు మరింత నమ్మకాన్ని కలిగిస్తున్నాడు.
\s5
\p
\v 14 నా తోటి విశ్వాసులారా, మీకు మీరు మంచి మార్గంలో ఉండి ఇతరులపట్ల కూడా మంచిగా ప్రవర్తించారని నాకు పూర్తిగా తెలుసు. మీరు ఆ పని చేసారు. ఎందుకంటే దేవుడు కోరుకుంటున్నట్టుగా మీకు అన్నీ పూర్తిగా తెలియాలి ఇంకా మీరు ఒకరినొకరు బోధించగలగాలి.
\s5
\v 15 అయినా నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని మరింత ధైర్యం తెచ్చుకుని రాస్తున్నాను. దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి నాకు అర్హత లేకపోయినా యేసుక్రీస్తు సేవకుడినయ్యాను కాబట్టి నేను మీకు ఇది రాస్తున్నాను.
\v 16 యూదేతరుల మధ్యలో నేను యేసుక్రీస్తు పనిచేయటానికి దేవుడు నన్ను ఇలా చేసాడు. ఆయన సువార్తను ప్రకటించడానికి దేవుడు నన్ను ఒక యాజకునిగా నియమించాడు. క్రీస్తును నమ్మటానికి సిద్ధపడిన యూదేతరులను ఆయన అంగీకరిస్తాడు. వారు పరిశుద్దాత్మ వలన పవిత్రమై దేవునికి ఇష్టమైన అర్పణలాగా ఉన్నారు.
\s5
\p
\v 17 కాగా, క్రీస్తు యేసును బట్టి దేవుని సేవ విషయాల్లో నాకు సంతోషంగానే ఉంది.
\v 18 క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గురించి నేను ధైర్యంగా మాట్లాడతాను. అదేమిటంటే యూదేతరులు లోబడేలా మాటల చేతా, క్రియల చేతా
\v 19 సూచనల చేతా ఇతర సంగతుల చేతా క్రీస్తు సువార్తను వారికి బోధించాను. పరిశుద్ధాత్మ శక్తి చేత నేను ఇదంతా చేసాను. ఈ విధంగా యెరూషలేముతో ప్రారంభించి చుట్టుపట్ల అన్ని ప్రదేశాల్లో, ఇల్లూరికు ప్రాంతం వరకూ క్రీస్తు సువార్తను పూర్తిగా ప్రకటించాను.
\s5
\v 20 నేను సువార్తను ప్రకటించేందుకు క్రీస్తు నామం తెలియని చోట్ల సువార్త ప్రకటించాలని ఎంతో ఆశతో ఉన్నాను. ఇలా ఎందుకు చేసానంటే ఇంకొకరు మొదలుపెట్టిన పనిని నేను కొనసాగించకూడదని నా ఆలోచన. వేరొకడు వేసిన పునాది మీద ఇల్లు కట్టడం నాకు ఇష్టం లేదు.
\v 21 దానికి విరుద్దంగా, నేను యూదేతరులకు బోధించేవాడిని. దీన్ని గురించి ఇలా రాసి ఉంది. "ఆయన గూర్చి ఎవరికి సమాచారం అందలేదో వారు చూస్తారు, ఎవరు వినలేదో వారు గ్రహిస్తారు."
\s5
\p
\v 22 ఈ కారణం వల్లనే నేను మీ దగ్గరికి రాకుండా నాకు చాలాసార్లు ఆటంకం కలిగింది.
\v 23 ఇక ఈ ప్రాంతాల్లో నేను వెళ్ళవలసిన స్థలం మిగిలి లేదు కాబట్టి, అనేక సంవత్సరాలుగా మీ దగ్గరికి రావాలని ఎంతో ఆశతో ఉన్నాను.
\s5
\v 24 కాబట్టి నేను స్పెయిను దేశానికి ప్రయాణించినప్పుడు దారిలో ముందు మిమ్మల్ని చూసి, మీ సహవాసంలో కొద్ది సమయం ఆనందిస్తాను.
\v 25 కాని ఇప్పుడు నేను మిమ్మల్ని కలవలేను. అయితే యెరూషలేములోని దేవుని ప్రజల కోసం కొంత డబ్బు వారికి ఇవ్వటానికి వెళ్తున్నాను.
\s5
\v 26 ఎందుకంటే యెరూషలేములోని పరిశుద్ధుల్లో పేదల కోసం మాసిదోనియ, అకయ విశ్వాసులు కొంత చందా పంపడానికి ఇష్టపడ్డారు.
\v 27 వీరు చాలా ఇష్టంగా ఆ పనిని వారికి వారే చేశారు. నిజానికి వారు యెరూషలేములోని దేవుని ప్రజలకు రుణపడి ఉన్నారు. ఎలాగంటే యూదేతరులు వారి ఆధ్యాత్మిక విషయాల్లో యూదువిశ్వాసులు ఎంతో సహాయం చేసారు. క్రీస్తుని గురించిన సువార్తను వారు యూదు విశ్వాసుల వల్లనే విన్నారు. కాబట్టి శరీర సంబంధమైన విషయాల్లో యూదేతరులు వారికి సహాయం చేయడం సబబే.
\s5
\v 28 నేను ఈ డబ్బుని వారికప్పగించి నా పని ముగించిన తరువాత నేను యెరూషలేమును విడిచి రోములో ఉన్న మిమ్మల్ని కలిసి మీ పట్టణం మీదుగా స్పెయినుకు ప్రయాణం చేస్తాను.
\v 29 నేను మీ దగ్గరికి వచ్చేటప్పుడు, క్రీస్తు సంపూర్ణమైన దీవెనలతో వస్తానని నాకు తెలుసు.
\s5
\p
\v 30 మీరు దేవునికి చేసే ప్రార్థనల్లో నా కోసం నాతో కలిసి పోరాడమని మన యేసు క్రీస్తు ప్రభువును బట్టి, ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలుతున్నాను.
\v 31 నేను యూదయలోని అవిశ్వాసుల చేతుల్లో నుండి తప్పించుకోగలిగేలా, యెరూషలేములో ఉన్న పరిశుద్ధులు నేను తీసుకెళ్ళిన డబ్బును సంతోషంతో అంగీకరించేలా ప్రార్ధించండి.
\v 32 దేవుని చిత్తమైతే నేను సంతోషంతో మీ దగ్గరికి వచ్చి, మీతో కలిసి సేద దీరడానికి వీలు కలిగేలా ప్రార్ధించండి.
\s5
\v 33 సమాధానకర్త అయిన దేవుడు మీకందరికీ తోడుగా ఉండు గాక. ఆమేన్‌.
\s5
\c 16
\p
\v 1 ఈ ఉత్తరం ద్వారా మన సాటి విశ్వాసి అయిన ఫీబేను మీకు పరిచయం చేస్తున్నాను. ఆమే ఈ ఉత్తరం మీ దగ్గరకు తీసుకు వస్తున్నది. ఆమె కెంక్రేయ సంఘంలో పరిచారిక.
\v 2 మీరు మాతో ప్రభువులో కలిసి ఉన్నారు గనక ఆమెను చేర్చుకోండి. ఎందుకంటే దేవుని ప్రజలు సాటి విశ్వాసులకు ఆతిథ్యం ఇస్తుండాలి. ఆమెకు అవసరమైనవన్నీ ఇచ్చి సహకరించమని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఈమె నాతో సహా అనేకమందికి తోడ్పడింది.
\s5
\p
\v 3 క్రీస్తు యేసులో ప్రిస్కిల్లకు, అకులకు నా అభివందనాలు చెప్పండి. వారు నాతో యేసు క్రీస్తు పనిలో పాల్గొన్నారు.
\v 4 నాకోసం ప్రాణాలు ఫణంగా పెట్టడానికి సైతం సిద్ధపడ్డారు. నా ప్రాణాలు కాపాడినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వారి ఇంట్లో ఆరాధనకు సమావేశమయ్యే వారందరికీ వందనాలు చెప్పండి. నేనే కాదు యూదేతర సంఘాలన్నీ వీరి పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నాయి.
\p
\v 5 నా మిత్రుడు ఎపైనెటుకు అభివందనాలు. ఆసియా రాష్ట్రంలో మొట్టమొదటగా క్రీస్తును నమ్ముకున్న వాడు ఇతడే.
\s5
\v 6 మీకు సహాయం చెయ్యడానికి క్రీస్తు కోసం ఎంతో కష్టపడిన మరియను అడిగానని చెప్పండి.
\p
\v 7 నా సాటి యూదులు, నాతోబాటు జైల్లో ఉన్న అంద్రొనీకు, అతని సతీమణి యూనీయలకు కూడా అదే మాట చెప్పండి. వీరు అపొస్తలులకు చిర పరిచితులు. నాకంటే ముందే క్రీస్తులో నమ్మకం ఉంచిన వారు.
\p
\v 8 ప్రభువులో నాకు ప్రియమైన అంప్లీయతుకు అభివందనాలు.
\s5
\p
\v 9 క్రీస్తు కోసం మనతో కలిసి పాటు పడిన ఊర్బానుకు, నా ప్రియ స్నేహితుడు స్టాకుకు అభివందనాలు.
\p
\v 10 క్రీస్తు అభిమానాన్ని చూరగొన్న అపెల్లెకు వందనాలు తెలుపుతున్నాను. అరిస్టొబూలు కుటుంబంలో ఉన్న విశ్వాసులకు నా వందనాలు చెప్పండి.
\p
\v 11 నా బంధువు హెరోదియోనుకు అభివందనాలు. నార్కిస్సు కుటుంబంలో ప్రభువుకు చెందిన వారికి అభివందనాలు.
\s5
\p
\v 12 త్రుపైనాకు, ఆమె చెల్లెలు త్రుఫోసాకు ఇదే మాట చెప్పడి. వీళ్ళు ప్రభువు కోసం చెమటోడ్చి పని చేశారు. ప్రియమైన పెర్సిసుకు కూడా నా అభివందనాలు పంపుతున్నాను. ఆమె ప్రభువులో ఎంతో కష్టపడింది.
\p
\v 13 రూఫస్ కు అభివందనాలు. అతడు అసమాన క్రైస్తవుడు. అతని తల్లికి కూడా వందనాలు. ఆమె నన్నూ సొంత కొడుకులాగా చూసుకుంది.
\p
\v 14 అసుంక్రితు, ప్లెగో, హెర్మే, పత్రొబ, హెర్మా, వారితో కూడా ఆరాధించే సోదరులకు కూడా అభివందనాలు పంపుతున్నానని చెప్పండి.
\s5
\p
\v 15 పిలొలొగుకు, యూలియాకు, నేరియకు, అతని సోదరికీ, ఒలుంపాకు వారితో కూడా ఆరాధనకు సమకూడే అందరికీ అభివందనాలు.
\p
\v 16 మీరు కలిసినప్పుడు పవిత్రంగా ఆప్యాయంగా పలకరించుకోండి. క్రీస్తుకు చెందిన అసెంబ్లీలన్నిటిలోని విశ్వాసులు మీకు వందనాలు చెబుతున్నారు.
\s5
\p
\v 17 నా తోటి విశ్వాసులారా, మీలో చీలికలు తెచ్చే వారి విషయం జాగ్రత్తగా ఉండండి. మీరు దేవుణ్ణి సన్మానించకుండా వారు మీకు అడ్డు తగులుతున్నారు. అలాటి వారికి దూరంగా ఉండండి.
\v 18 వారు యేసు క్రీస్తు భక్తులు కాదు. తమ సొంత కోరికలు తీర్చుకోవడమే వారి ధ్యేయం. తేనె పూసిన కత్తి వంటి ఇచ్చకం మాటలు మాట్లాడుతూ వారు మనుషులను బుట్టలో వేసుకుంటారు. వారు తంటాలమారులనీ దుర్బోధకులనీ మనుషులు గ్రహించరు.
\s5
\v 19 ఇవన్నీ మీరు పాటిస్తే సువార్తలో క్రీస్తు చెప్పిన వాటికి మీరు లోబడినట్టే. మిమ్మల్ని గురించి నేను సంతోషిస్తాను. మీరు కూడా చురుకుగా మంచిదేదో గుర్తించి దుర్మార్గతకు దూరంగా ఉండాలి.
\v 20 మీరు ఇవన్నీ చేస్తే దేవుడు మీకు శాంతి ప్రసాదిస్తాడు. త్వరలో మీ అధికారం చొప్పున ఆయన సాతాను పనిని పటాపంచలు చేస్తాడు. మన యేసు క్రీస్తు ప్రభువు కృప మీకు తోడై ఉండు గాక.
\s5
\p
\v 21 నా సహచరుడు తిమోతి, నా జాతివారైన లూకియ, యాసోను, సోసిపత్రు మీకు అభివందనాలు చెబుతున్నారు.
\p
\v 22 ఈ ఉత్తరాన్ని పౌలు చెబుతుండగా స్వదస్తూరితో రాసిన తెర్తియు అనే నేను ప్రభువులో మీకు అభివందనాలు చెబుతున్నాను.
\s5
\p
\v 23 పౌలు అనే నేను ప్రస్తుతం గాయి ఇంట్లో ఉంటున్నాను. అసెంబ్లీ ఈ ఇంట్లోనే ఆరాధనకు కలుసుకుంటారు. అతడు కూడా మీకు వందనాలు చెబుతున్నాడు. నగర కోశాధికారి ఎరస్తు, మన సోదరుడు క్వర్తు కూడా వందనాలు చెబుతున్నారు.
\p
\v 24 మన యేసు క్రీస్తు ప్రభువు కృప మీకు తోడుగా ఉండు గాక. ఆమెన్.
\s5
\p
\v 25 మనకు ముందటి యుగాల్లో వెల్లడి పరచకుండా ఇప్పుడు యేసు క్రీస్తు సువార్తను నా ద్వారా ప్రకటించిన దేవుడు మిమ్మల్ని అత్మసంబంధంగా బలపరచు గాక.
\v 26 ఇప్పుడు లేఖనాలు చెప్పిన దాని ప్రకారం ఆయన దాన్ని బహిర్గతం చేసి అన్ని జాతుల ప్రజలూ క్రీస్తును నమ్ముకుని ఆయనకు విధేయులయ్యేలా చేశాడు.
\s5
\v 27 ఏకైక జ్ఞాని అయిన దేవునికి క్రీస్తు మన కోసం చేసిన దాన్ని బట్టి నిరంతరం స్తుతి కలుగు గాక. ఆమెన్.