STR_te_iev/44-JHN.usfm

1638 lines
315 KiB
Plaintext

\id JHN - Indian Easy Version (IEV) Telugu
\ide UTF-8
\h యోహాను సువార్త
\toc1 యోహాను సువార్త
\toc2 యోహాను సువార్త
\toc3 jhn
\mt1 యోహాను సువార్త
\s5
\c 1
\p
\v 1 ఆరంభంలో వాక్కు ఉన్నాడు. ఆ వాక్కు దేవుడితో ఉన్నాడు. ఆ వాక్కు దేవుడే.
\v 2 సృష్టి ప్రారంభం కాకముందే ఆయన దేవునితో ఉన్నాడు.
\v 3 దేవుని ఆజ్ఞను అమలు పరుస్తూ సృష్టిని చేసింది ఆయనే. అవును! కచ్చితంగా ప్రతిదానినీ చేసింది ఆయనే.
\s5
\v 4 ప్రతిదానికీ, ప్రతి ఒక్కరికీ ప్రాణం వచ్చేలా జీవం అంతా ఆ వాక్కులోనే ఉంది. ఆ వాక్కు ప్రతి వారిపైనా, ప్రతి చోటా దేవుని వెలుగుగా ప్రకాశించింది.
\v 5 ఈ వెలుగు చీకటిలో ప్రకాశించింది, చీకటి ఈ వెలుగును ఆర్పివెయ్యాలని చూసింది గానీ దానివల్ల కాలేదు.
\s5
\p
\v 6 బాప్తిసమిచ్చే యోహాను అనే వ్యక్తిని దేవుడు పంపించాడు.
\v 7 వెలుగును గురించి మనుషులకు సాక్ష్యమివ్వడానికి అతను వచ్చాడు. ప్రతి ఒక్కరికీ వెలుగు నిచ్చే వాడిపై విశ్వాసం ఉంచాలని అతను ప్రకటించాడు. అతడు చెప్పింది నిజం.
\v 8 యోహాను ఆ వెలుగు కాదు. ప్రజలందరికీ ఆ వెలుగును గురించి బోధించడానికి అతను వచ్చాడు.
\s5
\v 9 ఆ వెలుగు లోకంలోకి వచ్చింది. ప్రతి ఒక్కరిపైనా ప్రకాశించే నిజమైన వెలుగు ఇది.
\s5
\p
\v 10 లోకంలోకి వాక్కు వచ్చాడు. ఆయనే లోకాన్ని చేసినప్పటికీ లోకంలోని మనుషులు ఆయన్ని తెలుసుకోలేదు.
\v 11 తన సొంతం అయిన లోకానికి ఆయన వచ్చినప్పటికీ పెరట్లో తోట కూర వైద్యానికి పానికి రాదన్నట్టు తన సొంత ప్రజలైన యూదులు ఆయన్ని తిరస్కరించారు.
\s5
\v 12 కానీ ఎవరైతే ఆయనలో విశ్వాసముంచి, ఆయన్ని తమ జీవితాల్లోకి తెచ్చుకుంటారో వాళ్ళందరికీ దేవుని పిల్లలయ్యే హక్కును ఆయన ఇచ్చాడు.
\v 13 వీళ్ళు దేవుని నుండి పుట్టిన పిల్లలు. వీళ్ళు పిల్లల్ని కనాలనే కోరిక కారణంగా కానీ, మానవపరమైన అభిలాష లేదా ఎంపిక వల్ల కానీ సాధారణ మానవ జన్మ ద్వారా పుట్టిన వాళ్లు కాదు.
\s5
\p
\v 14 ఇప్పుడు ఈ వాక్కు నిజమైన మానవుడిగా మారి, కొంతకాలం మనం నివసించే ఈ లోకంలో మన మధ్య నివసించాడు. నమ్మకమైన ప్రేమతో దేవుడు మన పట్ల ఉన్నాడని చూపిస్తూ, ఆయన సత్యాన్ని బోధిస్తూ, తండ్రికి ఉన్న విలక్షణమైన కుమారుడిగా ఆయన తన శ్రేష్టమైన, అద్భుతమైన స్వభావాన్ని ప్రదర్శించగా మేము చూశాం.
\p
\v 15 ఒకరోజు బాప్తిసమిచ్చే యోహాను, ఆ వాక్కు గురించి ప్రజలకి చెప్తూ ఉండగా యేసు అతని దగ్గరికి వచ్చాడు. యోహాను పెద్ద స్వరంతో తన చుట్టూ ఉన్న సమూహంతో, "నా తరవాత ఒకరు వస్తారనీ ఆయన నాకంటే చాలా ప్రాముఖ్యమైనవాడనీ నేను మీకు చెప్పాను గదా. ఆయన నాకంటే చాలాకాలం ముందే, నేను పుట్టడానికి ముందే నిత్యం ఉండే యుగాల్లో ఉన్నవాడు. ఆయన ఇక్కడ ఉన్నాడు. నేను చెప్పేది ఈయన గురించే!" అని చెప్పాడు.
\s5
\p
\v 16 "ఆయన చేసిన దానిమూలంగా మనం అందరం ఎంతో లాభం పొందాము. పదే పదే ఆయన మన పట్ల ఎంతో దయ చూపించాడు.
\v 17 యూదులకు మోషే దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రకటించాడు. యేసుక్రీస్తు మన అర్హతకు మించి ఎంతో ఎక్కువగా మన మీద దయ చూపించి, దేవుని గురించి నిజమైన విషయాలు మనకు నేర్పించాడు.
\v 18 ఎవ్వరూ, ఎన్నడూ దేవుణ్ణి చూడలేదు. అభిషిక్తుడైన యేసు తానే దేవుడుగా తండ్రిని ఎప్పుడూ హత్తుకుని ఉండి, ఆయన్ని మనకు వెల్లడి పరచాడు."
\s5
\p
\v 19 బాప్తిసమిచ్చే యోహాను ఇచ్చిన సాక్ష్యం ఇదే - యెరూషలేము నుండి యూదులు యాజకులనూ లేవీయులనూ పంపించారు. వాళ్ళు యోహాను దగ్గరికి వచ్చి, "నువ్వు ఎవరు?" అని అడిగారు.
\v 20 అందుకు యోహాను సాక్ష్యం ఇస్తూ, "నేను మెస్సీయను కాను" అన్నాడు.
\v 21 అప్పుడు వాళ్ళు అతన్ని, "నీ గురించి ఏమి చెప్పుకుంటావు? నువ్వు ఏలీయావా?" అని అడిగారు. అతడు "కాదు" అన్నాడు. వాళ్ళు మళ్ళీ "రాబోయే ప్రవక్త అని ప్రవక్తలు చెప్పింది నీ గురించేనా?" అని అడిగారు. యోహాను "కాదు" అని జవాబిచ్చాడు.
\s5
\v 22 దానికి వాళ్ళు అతన్ని మళ్ళీ "నువ్వెవరివో చెప్పు. మేము తిరిగి వెళ్ళి మమ్మల్ని పంపిన వాళ్లకి సమాచారం ఇవ్వాలి. నీ గురించి నువ్వేమి చెప్పుకుంటావు?" అని అడిగారు.
\v 23 దానికి అతడు, యెషయా ప్రవక్త రాసినట్టు
\q1 నిర్జన ప్రదేశంలో ప్రజలు ఒక ముఖ్యమైన అధికారి కోసం మార్గం సిద్ధం చేసినట్టు,
\q1 ప్రభువు వచ్చినప్పుడు ఆయన్ని అంగీకరించడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి, అని బిగ్గరగా వినిపించే కేకను, అన్నాడు.
\s5
\p
\v 24 వీళ్ళల్లో కొందరు పరిసయ్యుల దగ్గర నుండి వచ్చిన వాళ్ళు.
\v 25 వాళ్ళు అతణ్ణి - "నువ్వు ఏలియా ప్రవక్తవు కాదు, మెస్సీయవూ కాదని చెప్పావు. మరి నువ్వు బాప్తిసం ఎందుకు ఇస్తున్నావు?" అని అడిగారు.
\s5
\v 26 అందుకు యోహాను, "నేను ప్రజలకి నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను, కానీ ఇప్పుడు మీకు తెలియని వ్యక్తి మీ మధ్య ఉన్నాడు."
\v 27 "ఆయన నా తరువాత వస్తాడు. కానీ ఆయన చెప్పులు విప్పడానికి కూడా నేను సరిపోను" అని చెప్పాడు.
\v 28 ఈ విషయాలు యొర్దాను నదికి తూర్పు దిక్కున ఉన్న బేతనీ అనే ఊరిలో జరిగాయి. అది యోహాను బాప్తిసం ఇచ్చే చోటు.
\s5
\p
\v 29 మరుసటి రోజు యేసు తన దగ్గరికి రావడం యోహాను చూశాడు. అతను ప్రజలతో, "చూడండి! తన ప్రాణాన్ని అర్పించి లోక పాపాల్ని తీసివేసే దేవుని గొర్రెపిల్ల ఈయనే!
\v 30 నా తరువాత వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు. ఎందుకంటే నేను పుట్టడానికి ముందే నిత్యం ఉండే యుగాలలో నాకంటే చాలా కాలం ముందే ఉన్నవాడు.
\v 31 మొదట్లో ఆయన నాకు తెలియలేదు. కానీ ఆయన ఎవరో నాకిప్పుడు తెలుసు. నా పని ఏమిటంటే ఎవరైతే వాళ్ళ పాపాల నుండి మళ్ళుకుని పశ్చాత్తాపపడి వస్తారో, వాళ్లకి బాప్తిసమివ్వడం. ఆయన ఎవరో ఇశ్రాయేలు ప్రజలకు తెలపడమే నా పని" అన్నాడు.
\s5
\v 32 అతడు ఇలా చెప్పాడు - "దేవుని ఆత్మ పావురం రూపంలో పరలోకం నుండి దిగి రావడం నేను చూశాను. ఆ ఆత్మ క్రిందికి వచ్చి యేసు మీద నిలిచింది."
\p
\v 33 "మొదట నేను ఆయన్ని గుర్తించలేదు కానీ, మనుషుల్లో వాళ్ళ పాప మార్గాల నుండి తొలగిపోవాలని కోరుకునే వాళ్లకి నీళ్ళలో బాప్తిసం ఇవ్వడానికి దేవుడు నన్ను పంపాడు. దేవుడు నాతో, "నా ఆత్మ దిగి వచ్చి ఎవరి మీద నిలిచి ఉండడం నువ్వు చూస్తావో ఆయనే మీ అందరికీ పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాడు" అని చెప్పాడు.
\v 34 నేను ఇది చూసి, ఆయనే దేవుని కుమారుడని మీకు సాక్ష్యమిస్తున్నాను."
\s5
\p
\v 35 మళ్ళీ ఆ తర్వాత రోజు కూడా బాప్తిసమిచ్చే యోహాను తన ఇద్దరు శిష్యులతో కలిసి అదే చోట ఉన్నాడు.
\v 36 అప్పుడు యేసు ఆ దారిన వెళ్తుండగా చూసి, "చూడండి! ఈయనే దేవుని గొర్రెపిల్ల! ఇశ్రాయేలు ప్రజలు తమ పాపాలకు పరిహారంగా గొర్రెపిల్లను వధించినట్టుగా ప్రజల కోసం తన ప్రాణం ఇవ్వడానికి దేవుడు ఈయనను నియమించాడు."
\s5
\p
\v 37 యోహాను చెప్పింది విన్న ఇద్దరు శిష్యులు, యోహానును విడిచి యేసును అనుసరించారు.
\v 38 యేసు వెనక్కి తిరిగి వాళ్ళు తన వెంట రావడం చూసి, "మీరు దేని కోసం చూస్తున్నారు?" అని వాళ్ళని అడిగాడు. వాళ్ళు ఆయనతో, "రబ్బీ (అంటే, బోధకుడా అని అర్థం), నువ్వు ఎక్కడ ఉంటున్నావో మాకు చెప్పు" అన్నారు.
\v 39 ఆయన జవాబిస్తూ, "మీరే చూద్దురు గాని నాతో రండి" అన్నాడు. కాబట్ట్టి వాళ్ళు వచ్చి యేసు ఎక్కడ ఉంటున్నాడో చూసారు. సాయంత్రం నాలుగు గంటలు అయ్యింది. ఆలస్యం కావడంతో వాళ్ళు ఆ రోజు ఆయనతోనే ఉండిపోయారు.
\s5
\p
\v 40 యోహాను చెప్పింది విని యేసును వెంబడించిన ఆ ఇద్దరు శిష్యుల్లో ఒకడి పేరు అంద్రెయ. అతడు సీమోను పేతురు తమ్ముడు.
\v 41 అంద్రెయ మొట్టమొదటగా తన అన్న సీమోను కోసం వెదికాడు. అతను కనిపించినప్పుడు, "మేము మెస్సీయ (గ్రీకు భాషలో "క్రీస్తు")ను చూశాం" అన్నాడు.
\v 42 అంద్రెయ సీమోనును యేసు దగ్గరికి తీసుకెళ్ళాడు. యేసు పేతురును చూసి, "నువ్వు యోహాను కుమారుడైన సీమోనువి. ఇకమీదట నిన్ను కేఫా అని పిలుస్తారు" అన్నాడు. కేఫా అంటే అరమేయిక్ భాషలో రాయి అని అర్ధం. (ఇదే అర్ధం ఉన్న "పెత్రోస్" అనే గ్రీకు పదం నుండి పేతురు అనే పేరు వచ్చింది.)
\s5
\p
\v 43 ఆ తరవాత రోజు యేసు యొర్దాను నదీ లోయను వదిలి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. ఆయన గలిలయ ప్రాంతానికి వెళ్ళి, ఫిలిప్పు అనే వ్యక్తిని కలిశాడు. అతణ్ణి "నాతో రా" అని పిలిచాడు.
\v 44 ఫిలిప్పు, అంద్రెయ, పేతురు వీళ్ళందరూ గలిలయలోని బేత్సయిదా ఊరికి చెందినవాళ్ళు.
\v 45 ఫిలిప్పు తన స్నేహితుడు నతనియేలును కలుసుకోవడానికి వెళ్ళాడు. అతడు నతనియేలు దగ్గరికి వచ్చి అతనితో, "మోషే ఎవరి గురించి రాశాడో ఆ మెస్సీయని కనుగొన్నాం. ప్రవక్తలు ఆయన వస్తాడని ప్రవచించారు. ఆ మెస్సీయ యేసే. ఆయన నజరేతు ఊరివాడు. ఆయన తండ్రి పేరు యోసేపు" అన్నాడు.
\s5
\p
\v 46 నతనియేలు జవాబిస్తూ, "నజరేతు నుండా? నజరేతు వంటి ప్రాముఖ్యత లేని చోటు నుండి మంచిది ఏదైనా వస్తుందా?" అన్నాడు. అప్పుడు ఫిలిప్పు, "రా! నువ్వే చూస్తావుగా" అన్నాడు.
\v 47 నతనియేలు తన దగ్గరికి వస్తూ ఉండడం యేసు చూసి అతని గురించి చెప్తూ, "చూడండి. అతను నిజాయితీపరుడైన ఉత్తమ ఇశ్రాయేలీయుడు. అతడు ఎవ్వరినీ ఎప్పుడూ మోసగించలేదు" అన్నాడు.
\v 48 "బోధకా, నేను ఎలాంటి వాడినో నీకు ఎలా తెలుసు? నేను నీకు పరిచయం లేదు కదా" అని నతనియేలు ఆయన్ని అడిగాడు. యేసు జవాబిస్తూ, "అంజూరపు చెట్టు కింద నువ్వు కూర్చున్నప్పుడే, ఫిలిప్పు నిన్ను పిలవక ముందే నిన్ను చూశాను" అన్నాడు.
\s5
\p
\v 49 అప్పుడు నతనియేలు, "బోధకా, నువ్వు కచ్చితంగా దేవుని కుమారుడివే. మేము వేచి చూస్తున్న ఇశ్రాయేలు రాజువు నువ్వే" అని ప్రకటించాడు.
\v 50 యేసు అతనికి జవాబిస్తూ, "అంజూరపు చెట్టు కింద నిన్ను చూశానని నీతో చెప్పినందుకు నన్ను నమ్మావా? దానికంటే గొప్పవి నేను చేయడం నువ్వు చూస్తావు" అన్నాడు.
\v 51 యేసు మళ్ళీ అతనితో, "నేను నీతో నిజం చెబుతున్నాను. చాలాకాలం క్రితం నీ పూర్వీకుడు యాకోబు చూసిన దర్శనంలా మనుష్యకుమారుడినైన నా మీదుగా దేవదూతలు పైకి ఎక్కడం, దిగడం నువ్వు చూస్తావు" అన్నాడు.
\s5
\c 2
\p
\v 1 మూడు రోజుల తర్వాత గలిలయలోని కానా అనే చోట ఒక పెళ్లి జరిగింది. యేసు తల్లి అక్కడ ఉంది.
\v 2 వాళ్ళు యేసుని, ఆయన శిష్యుల్నికూడా పెళ్ళికి పిలిచారు.
\s5
\p
\v 3 పెళ్ళికి వచ్చిన వాళ్ళకి ద్రాక్షరసం పోశారు. కొంతసేపటికి ద్రాక్షరసం అయిపోయింది. యేసు తల్లి ఆయనతో, "ద్రాక్షరసం అయిపోయింది" అని చెప్పింది.
\v 4 యేసు ఆమెతో, "అమ్మా, దానికి నేనేమి చెయ్యాలి? ఎంతో ప్రాముఖ్యమైన నా పని ప్రారంభించడానికి ఇంకా సమయం రాలేదు" అన్నాడు.
\v 5 యేసు తల్లి అక్కడి పనివాళ్ళతో, "ఆయన మీకు ఏమి చెప్తే అది చెయ్యండి" అని చెప్పింది.
\s5
\p
\v 6 అక్కడ ఆరు పెద్ద రాతి బానలు ఉన్నాయి. యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారం, వచ్చిన అతిథులూ, పనివాళ్ళూ కాళ్ళూ చేతులు కడుక్కోడానికి వాటిలో నీళ్ళు పట్టి ఉంచారు. ఒక్కొక్క బానలో 75 నుండి 115 లీటర్ల నీళ్ళు పడతాయి.
\v 7 యేసు అక్కడి పనివాళ్ళతో, "బానలను నీళ్ళతో నింపండి" అని చెప్పాడు. కాబట్టి వాళ్ళు అంచుల వరకు బానలను నింపారు.
\v 8 అప్పుడు ఆయన వాళ్ళతో, "ఇప్పుడు ఆ నీళ్ళను పెళ్ళి విందు మేస్త్రి దగ్గరికి తీసుకు వెళ్ళండి" అన్నాడు. పనివాళ్ళు ఆయన చెప్పినట్టు చేశారు.
\s5
\p
\v 9 ఆ విందు మేస్త్రి ద్రాక్షరసంగా మారిన ఆ నీళ్ళను రుచి చూశాడు. పనివారికి దీని విషయం తెలిసినప్పటికీ అతనికి మాత్రం ఆ ద్రాక్షరసం ఎక్కడ నుండి వచ్చిందో తెలియ లేదు. పెళ్ళికొడుకుతో,
\v 10 "అందరూ మంచి ద్రాక్షరసం ముందు పోసి, అతిథులు తాగి మత్తుగా ఉన్నప్పుడు, చవకబారు ద్రాక్షరసం పోస్తారు. కానీ నువ్వు శ్రేష్టమైన ద్రాక్షరసం ఇప్పటి వరకూ ఉంచావే" అన్నాడు.
\s5
\p
\v 11 యేసు చేసిన మొదటి అద్భుతం అది. ఆయనను గూర్చిన ప్రాముఖ్యమైన వాస్తవాన్ని తెలియజేసింది అదే. ఆయన దీన్ని గలిలయ ప్రాంతంలోని కానాలో చేశాడు. అక్కడ ఆయన గొప్ప కార్యాలు చేయగలడని రుజువు చేశాడు. కాబట్టి ఆయన శిష్యులు ఆయనలో విశ్వాసముంచారు.
\s5
\p
\v 12 దీని తరవాత యేసు, ఆయన తల్లి, తమ్ముళ్ళు ఆయన శిష్యులతో కలిసి కపెర్నహోము అనే ఊరికి వెళ్ళి, అక్కడ కొన్ని రోజులు ఉన్నారు.
\s5
\p
\v 13 యూదుల పస్కా పండగ దగ్గర పడింది. యేసు, ఆయన శిష్యులు యెరూషలేముకు వెళ్ళారు.
\v 14 అక్కడ దేవాలయం ఆవరణంలో కొందరు పశువుల్నీ, గొర్రెల్నీ, పావురాల్నీ అమ్మడం యేసు చూశాడు. దేవాలయంలో బలి ఇచ్చే వాళ్లకు ఆ జంతువుల్ని అమ్ముతూ ఉంటారు. కొందరు అక్కడ బల్లల దగ్గర కూర్చుని దేవాలయ నాణాల మారకానికి అమ్మడం కూడా ఆయన చూశాడు.
\s5
\p
\v 15 కాబట్టి యేసు తోలు పట్టీలను కొరడాలాగా చేసి, దేవాలయ ఆవరణం నుండి గొర్రెల్నీ, పశువుల్నీ వెళ్ళగొట్టాడు. డబ్బు మారకం చేసే దళారుల బల్లలను పడేసి, నాణాలు నేలపాలు చేసాడు.
\v 16 పావురాలు అమ్మే వాళ్ళతో, "వీటిని ఇక్కడ నుండి బయటికి తీసుకు పొండి! నా తండ్రి ఇంటిని వ్యాపార స్థలంగా మార్చకండి" అని గదిమాడు.
\s5
\p
\v 17 చాలాకాలం క్రితం లేఖనాల్లో, "దేవా! నీ ఇల్లంటే నాకెంతో ఇష్టం, దాని కోసం నేను ప్రాణాలు అర్పిస్తాను" అని రాసి ఉన్న మాటలను ఆయన శిష్యులకు ఈ సంఘటన గుర్తు చేసింది.
\p
\v 18 యూదుల నాయకులు కొందరు ఆయన్ని, "నువ్వు చేసే వాటన్నిటికీ దేవుని నుండి నీకు అధికారం ఉందని నిరూపించడానికి మాకు ఏ అద్భుతం చేసి చూపిస్తావు?" అని అడిగారు.
\v 19 యేసు వారికి జవాబిస్తూ, "ఈ దేవాలయాన్ని పడగొట్టండి, మూడు రోజుల్లో తిరిగి కడతాను" అన్నాడు.
\s5
\p
\v 20 అందుకు వాళ్ళు, "ఈ మొత్తం దేవాలయాన్ని మూడు రోజుల్లోనే కట్టేస్తానంటున్నావా? రాళ్ళన్నీ తొలిచి ఈ ఆలయం కట్టడానికి 46 ఏళ్ళు పట్టింది తెలుసా?" అన్నారు.
\v 21 అయితే యేసు మాట్లాడింది ఆలయ భవనం గురించి కాదు, దేవాలయం అనే తన సొంత శరీరం గురించి.
\v 22 యేసు చనిపోయి తిరిగి మూడవ రోజున లేచిన తరవాత, దేవాలయం గురించి ఆయన చెప్పిన మాటలు ఇవేనని శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారు.
\s5
\p
\v 23 పస్కా పండగ జరుగుతున్న సమయంలో యేసు యెరూషలేములో ఉన్నప్పుడు చాలా మంది ప్రజలు యేసు గురించిన వాస్తవాన్ని సూచించే అద్భుతాలు చూసి ఆయనలో నమ్మకం ఉంచారు.
\v 24 అయితే యేసుకు ప్రజలు ఎలాటివారో, వాళ్ళ బుద్ధి ఎలాంటిదో తెలుసు. కనుక ఆయన వాళ్ళను నమ్మలేదు.
\v 25 మనుషులు ఎంత చెడ్డవారో ఆయనకు ఎవ్వరూ చెప్పనక్కరలేదు. వాళ్లకు ఏమి కావాలో, వాళ్ళు ఏమి ఆలోచిస్తున్నారో ఆయనకు అంతా తెలుసు.
\s5
\c 3
\p
\v 1 నికోదేము అనే మనిషి ఒకడు ఉన్నాడు. ఆ రోజుల్లో యూదీయ విశ్వాసంలో నిష్టగా ఉండే పరిసయ్యుల గుంపులో అతడు సభ్యుడు. ఆనాటి సమాజంలో నికోదేము చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి. యూదీయ ఉన్నత పాలక మండలిలో సభ్యుడు.
\v 2 అతడు చీకటి పడిన తర్వాత యేసును కలుసుకోవడానికి వెళ్ళాడు. అతడు యేసుతో, "బోధకా, నువ్వు దేవుడి నుండి వచ్చిన వాడివని మాకు తెలుసు. దేవుని సహాయం లేకుండా నువ్వు ఈ అద్భుతాలు చేయలేవని తెలుసు" అన్నాడు.
\s5
\p
\v 3 నికోదేము మాటలకి యేసు జవాబిస్తూ, "నేను నీకు నిజం చెప్తున్నాను. రెండవ సారి పుట్టకుండా ఎవరూ దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు" అన్నాడు.
\v 4 అప్పుడు నికోదేము ఆయనతో, "ముసలి వాడయ్యాక మనిషి మళ్ళీ ఎలా పుట్టగలడు? తల్లి గర్భంలో ప్రవేశించి ఎవరూ రెండోసారి పుట్టలేరు గదా" అన్నాడు.
\s5
\p
\v 5 అందుకు యేసు ఇలా జవాబిచ్చాడు. "నువ్వు చెప్పింది నిజమే. నీటి మూలంగా, ఆత్మ మూలంగా పుట్టకపోతే ఎవ్వరూ దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు.
\v 6 ఎవరైనా మనిషి నుండి పుడితే ఆ వ్యక్తి మనిషి అవుతాడు. కానీ దేవుని ఆత్మ చేసే పని ద్వారా మళ్ళీ పుట్టిన వాళ్ళకు కొత్త ఆధ్యాత్మిక స్వభావం వస్తుంది. దీనిని దేవుడు వాళ్ళలో కలిగిస్తాడు."
\s5
\p
\v 7 "నువ్వు మళ్ళీ పుట్టాలనీ దేవుని నుండి కొత్త జీవం పొందాలనీ నేను చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు.
\v 8 అది ఎలానంటే, గాలి తనకి ఇష్టమైన వైపుకు వీస్తుంది. దాని శబ్దాన్ని నువ్వు వింటావు, కానీ అది ఎక్కడ నుండి వస్తుందో, ఎక్కడికి వెళ్తుందో నీకు తెలియదు. ఆత్మ ద్వారా పుట్టిన వాళ్ళందరి విషయంలో ఇలానే అవుతుంది. ఆత్మ తాను కోరుకున్న వాళ్లకి కొత్త జన్మ ఇస్తాడు."
\s5
\p
\v 9 నికోదేము ఆయనతో, "ఇది ఎలా సాధ్యం?" అన్నాడు.
\v 10 యేసు అతనితో, "నువ్వు ఇశ్రాయేలులో ముఖ్య బోధకుడివైనా నేను చెప్పేది నీకు అర్ధం కావడం లేదు.
\v 11 నేను నీకు నిజం చెప్తున్నాను. నాకూ నా శిష్యులకూ తెలిసిన విషయాలే చెప్తున్నాము. మేము చూసిన వాటినే మీకు చెప్తున్నాము. మేము మీకు చెప్పే ఈ విషయాలు మీలో ఎవరూ ఇంకా నమ్మడం లేదు."
\s5
\p
\v 12 "నేను చెప్పేది నువ్వు నమ్మకపోతే ఈ భూసంబంధమైన విషయాలూ, పరలోక సంబంధమైన విషయాలూ నీకు చెప్పినప్పుడు ఎలా నమ్ముతావు?
\v 13 నేనే మనుష్యకుమారుణ్ణి. పరలోకానికి వెళ్ళిన వాణ్ణి. భూమికి దిగి వచ్చినవాణ్ణి నేను ఒక్కణ్ణి మాత్రమే."
\s5
\p
\v 14 "మోషే కాలంలో నిర్గమం సమయంలో అరణ్య ప్రదేశంలో ఉన్నప్పుడు ఒక స్తంభం పై విషసర్పం ప్రతిమను పైకెత్తి ఉంచినప్పుడు దాన్ని చూసిన వాళ్ళందరూ చావు తప్పించుకుని బ్రతికి బయటపడ్డారు. అదే విధంగా మనుష్యకుమారుడు తనను సిలువమీద పైకెత్తడానికి స్వయంగా అనుమతించాలి.
\v 15 అప్పుడు ఆయన్ని చూసే వాళ్ళకి, ఆయనలో నమ్మకం ఉంచే వాళ్ళకి నిత్యజీవం దొరుకుతుంది."
\s5
\p
\v 16 "దేవుడు లోకాన్ని హృదయపూర్వకంగా ప్రేమించాడు. ప్రేమించి ఆయన తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఇచ్చేశాడు. ఆయనలో నమ్మకం ఉంచిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు చనిపోరు, అంతంలేని జీవితం పొందుతారు.
\v 17 దేవుడు తన కుమారుణ్ణి పంపింది దుష్ట శిక్షణకోసం కాదు, లోకరక్షణ కోసం పంపాడు.
\v 18 తన కుమారుడిలో నమ్మకం ఉంచిన వాళ్ళని దేవుడు ఎన్నడూ శిక్షించడు. ఆయనలో నమ్మకం ఉంచని వాళ్ళకి దేవుడు ఇప్పటికే శిక్ష విధించాడు. ఎందుకంటే దేవుని ఒకే ఒక్క కుమారుడి నామంలో వాళ్ళు నమ్మకం ఉంచలేదు."
\s5
\p
\v 19 "పాపులు అందరూ స్పష్టంగా తెలుసుకునేలా దేవుడు తన తీర్పును వినిపించాడు. ఆయన వెలుగు లోకంలోకి వచ్చింది గానీ ఈ లోక ప్రజలు తాము ఉన్న చీకటినే ఇష్టపడ్డారు. వెలుగు నుండి వాళ్ళు దాకున్నారు. చీకటినే ప్రేమించారు. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు చెడ్డవి, పాపభూయిష్టమైనవి.
\v 20 చెడు పనులు చేసే ప్రతి ఒక్కరూ వెలుగును ద్వేషిస్తారు. వాళ్ళు చేసే పనులను వెలుగు బట్టబయలు చేసి, వారి నిజస్వరూపాలుబయట పడతాయి కాబట్టి వాళ్ళు వెలుగులోకి రారు.
\v 21 కానీ సత్యమైన యధార్థమైన పనులు చేసే వాళ్ళు తాము దేవునికి లోబడుతున్నారని అందరూ తెలుసుకునేలా, అందరూ చూసేలా వెలుగులోకి వస్తారు."
\s5
\p
\v 22 తరువాత యేసు, ఆయన శిష్యులు యూదయ ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ ఆయన తన శిష్యులతో కలిసి కొంతకాలం ఉన్నాడు. ఆయన చాలామందికి బాప్తిసం ఇచ్చాడు.
\p
\v 23 బాప్తిసమిచ్చే యోహాను కూడా సమరయ ప్రాంతంలోని సలీము దగ్గర ఉన్న ఐనోను అనే ఊరిలో ప్రజలకి బాప్తిసం ఇస్తున్నాడు. అక్కడ నీళ్ళు ఎక్కువగా ఉండడంతో చాలామంది ప్రజలు యోహాను దగ్గరికి వస్తున్నారు.
\v 24 ఇది శత్రువులు యోహానును జైల్లో పెట్టకముందు జరిగిన సంగతి.
\s5
\p
\v 25 తనను తాను దేవుని అంగీకారం పొందడానికి చేసుకునే శుద్ధి ఆచారం గురించి ఒక యూదునికి, యోహాను శిష్యులకి మధ్య వివాదం జరిగింది.
\v 26 వారు యోహాను దగ్గరికి వచ్చి, "బోధకా, యొర్దాను అవతల వైపున నువ్వు ప్రజలకు బాప్తిసం ఇస్తున్నప్పుడు నీతో కూడా ఒక మనిషి ఉన్నాడు. నువ్వు అతణ్ణి చూపించి అతని గురించి మాకు చెప్పావు గదా. బాగానే ఉంది. ఇప్పుడు యూదయలో అతడు బాప్తిసం ఇస్తున్నాడు. చాలామంది ఆయన దగ్గరికి వెళ్తున్నారు" అన్నారు.
\s5
\p
\v 27 యోహాను వాళ్లకి జవాబిస్తూ, "దేవుడు ఇవ్వకుండా ఎవరూ ఏమీ పొందలేరు.
\v 28 నేను మీకు చెప్పినప్పుడు, నేను మెస్సీయను కాదనీ ఆయన వచ్చినప్పుడు దారి సరిచేయడానికి ఆయనకు ముందుగా వచ్చిన వాడిననీ నేను చెప్పింది నిజమే.
\s5
\v 29 నేను పెళ్ళికొడుకు స్నేహితుడిలాంటి వాణ్ణి, పెళ్ళికొడుకు వస్తాడని ఎదురుచూస్తున్నాను. చివరికి పెళ్ళికొడుకు వచ్చినప్పుడు, అతని స్వరం విని పెళ్ళికొడుకు స్నేహితుడు సంతోష పడుతున్నాడు. ఇదంతా జరిగింది కనుక అతడు వచ్చినందుకు నాకు ఆనందం పొంగి పొర్లుతున్నది.
\v 30 కాలక్రమేణా ఆయన స్థితి, ప్రాముఖ్యత పెరుగుతాయి. నా ప్రాముఖ్యత తగ్గుతుంది" అన్నాడు.
\s5
\p
\v 31 యేసు పరలోకం నుండి వచ్చాడు. ఆయన అందరికంటే ఉన్నత స్థానంలో ఉన్నవాడు. మనకు భూమి మీద ఇల్లు ఉంది. మనం భూసంబంధమైనవే మాట్లాడుకుంటాం. పరలోకం నుండి వచ్చినవాడు భూమి మీద ఉన్న అన్నిటికంటే, అందరికంటే పైనున్నవాడు.
\v 32 తాను చూసిందీ విన్నదీ సాక్ష్యమివ్వడానికి ఇప్పుడు ఇక్కడ ఒకరున్నారు కానీ ఆయన చెప్పింది ఎవ్వరూ అంగీకరించరు, నిజమని నమ్మరు.
\v 33 అయితే ఆయన చెప్పింది నమ్మిన వాళ్ళు దేవుడు సత్యానికి ఆధారం అనీ సత్యమైన ప్రతిదానికీ కొలత, ప్రామాణికం ఆయన ఒక్కడే అనీ ధృవీకరించుకుంటారు.
\s5
\p
\v 34 దేవుడు తన ప్రతినిధిని పంపాడు. ఆయన దేవుని మాటలే చెప్తాడు కాబట్టి ఆయన చెప్పినదంతా నిజమే.
\v 35 తండ్రి తన కుమారుణ్ణి ప్రేమించి, ఆయన అధికారం క్రింద సమస్తం ఉంచాడు.
\v 36 దేవుని కుమారుడిలో ఎవరు నమ్మకం ఉంచుతారో వాళ్లకి నిత్యజీవం ఉంటుంది. దేవుని కుమారునికి లోబడని వాళ్లకి నిత్యజీవం ఎప్పటికీ ఉండదు. ఆ వ్యక్తి చేసిన ప్రతి పాపానికీ దేవుని న్యాయమైన ఉగ్రత అతని మీద ఎప్పటికీ నిలిచి ఉంటుంది.
\s5
\c 4
\p
\v 1 బాప్తిసమిచ్చే యోహాను కంటే యేసుకు అనుచరులు ఎక్కువ అవుతున్నారనీ యోహాను కంటే యేసు ఎక్కువ మందికి బాప్తిసం ఇస్తున్నాడనీ పరిసయ్యులు విన్నారు. పరిసయ్యులు ఆ సంగతి విన్నారని యేసుకు తెలిసింది.
\v 2 అసలు విషయానికొస్తే బాప్తిసం ఇచ్చే పని యేసు స్వయంగా చెయ్యలేదు కానీ ఆ పని ఆయన శిష్యులు చేస్తున్నారు.
\v 3 యేసూ ఆయన శిష్యులూ యూదయను విడిచిపెట్టి గలిలయకు తిరుగు ప్రయాణమయ్యారు.
\s5
\p
\v 4 ఇప్పుడు వాళ్ళు సమరయ ప్రాంతం గుండా పోవాలి.
\v 5 వారు సమరయ ప్రాంతంలో సుఖారు అనే ఊరికి వచ్చారు. పూర్వం యాకోబు తన కొడుకు యోసేపుకు ఇచ్చిన స్థలం సుఖారుకు దగ్గరే.
\s5
\p
\v 6 సుఖారు ఊరి బయటే యాకోబు బావి ఉంది. యేసు ప్రయాణం చేసి అలిసిపోయి, విశ్రాంతి కోసం ఆ బావి గట్టు మీద కూర్చున్నాడు. అప్పుడు మిట్ట మధ్యాహ్నం కావస్తున్నది.
\p
\v 7 సుఖారు నుండి ఒకామె బావి దగ్గర నీళ్ళు తోడుకోడానికి వచ్చింది. యేసు ఆమెతో, "నాకు తాగడానికి నీళ్ళు ఇస్తావా?" అని అడిగాడు.
\v 8 ఆ సమయంలో ఆయన శిష్యులు ఆయన్ని ఒంటరిగా వదిలి ఆహారం కొనడానికి ఊరిలోకి వెళ్ళారు.
\s5
\p
\v 9 యూదులు సాధారణంగా తమలాంటి వాళ్ళను ద్వేషిస్తారని సమరయులకి తెలుసు కనుక ఆ స్త్రీ ఆయనతో, "నువ్వు యూదుడివి కదా, నీవు సమరయ స్త్రీని నీళ్ళు అడగడం ఆశ్చర్యంగా ఉంది" అంది.
\v 10 యేసు ఆమెతో "దేవుడు నీకు ఇవ్వాలనుకునే బహుమానం గురించి నీకు తెలిసి ఉంటే, నిన్ను నీళ్ళు అడిగేది ఎవరో నీకు తెలిస్తే, నువ్వే నన్ను నీళ్ళు ఇమ్మని అడిగి ఉండే దానివి. అప్పుడు నేను నీకు జీవజలం ఇచ్చేవాణ్ణి" అన్నాడు.
\s5
\p
\v 11 "అయ్యా, ఈ బావి చాలా లోతు. నీదగ్గర నీళ్ళు తోడడానికి చాద కానీ, తాడు కానీ లేవు. నీకు జీవజలం ఎలా దొరుకుతుంది?
\v 12 నువ్వు మా పితరుడు యాకోబు కంటే గొప్పవాడివా? ఆయన ఈ రోజుకీ మేము వాడుతున్న ఈ బావిని తవ్వించాడు. ఆయన కూడా దీనిలో నీళ్ళే తాగాడు, తన పిల్లలకీ పశువులకీ ఇచ్చాడు" అంది.
\s5
\p
\v 13 యేసు ఆమెతో, "ఈ బావి నీళ్ళు తాగిన వాళ్ళందరికీ మళ్ళీ దాహం వేస్తుంది.
\v 14 కానీ నేను ఇచ్చే నీళ్ళు తాగే వాళ్ళకి మాత్రం మళ్ళీ ఎప్పటికీ దాహం వేయదు. నేను ఇచ్చే నీళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ కడుపులో ఊరుతూ ఉండి వాళ్లకు నిత్యజీవం ఇస్తాయి" అన్నాడు.
\s5
\v 15 ఆ స్త్రీ ఆయనతో, "అయ్యా, నాకు మళ్ళీ దాహం వెయ్యకుండా నాకు ఆ నీళ్ళు ఇవ్వండి. లేకపోతే నేను మాటిమాటికీ వచ్చి నీళ్ళు చేదుకోవాల్సి వస్తూ ఉంది" అంది.
\p
\v 16 తాను చెప్పినది ఆమెకి అర్ధం కాలేదని యేసు గ్రహించి ఆమెతో, "అమ్మా, వెళ్ళి నీ భర్తని పిలుచుకు రా" అన్నాడు.
\s5
\p
\v 17 ఆ స్త్రీ "నాకు భర్త లేడు" అంది. యేసు ఆమెతో, "నీకు భర్త లేడని సరిగ్గానే చెప్పావు.
\v 18 ఎందుకంటే నీకు ఒక్కడు కాదు ఐదుగురు భర్తలు ఉన్నారు. నువ్వు ఇప్పుడు ఎవరితో ఉంటున్నావో అతడు నీ భర్త కాదు. నీకు భర్త లేడని నువ్వు చెప్పింది నిజమే" అన్నాడు.
\s5
\p
\v 19 ఆ స్త్రీ "అయ్యా, నువ్వు ప్రవక్తవని నాకు అర్ధమయ్యింది.
\v 20 మా పూర్వీకులు ఇక్కడే ఈ కొండ మీద దేవుణ్ణి ఆరాధించారు. కానీ యూదులు మన దేవుణ్ణి యెరూషలేములోనే ఆరాధించాలి అంటారు. ఏది సరైనది?" అంది.
\s5
\p
\v 21 యేసు ఆమెతో, "అమ్మా, రాబోయే కాలంలో ఈ కొండ మీద గానీ యెరూషలేములో గానీ తండ్రిని ఆరాధించరు. నన్ను నమ్ము.
\v 22 మీ సమరయ ప్రజలు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తారు. మేము యూదా ప్రజలం, ఎవర్ని ఆరాధిస్తున్నామో మాకు తెలుసు. ఎందుకంటే రక్షణ యూదుల్లో నుండే వస్తుంది."
\s5
\p
\v 23 "నిజంగా ఆరాధించే వాళ్ళు ఆత్మతో, సత్యంతో తండ్రిని ఆరాధించే సమయం వస్తున్నది. అది ఇప్పటికే వచ్చేసింది. ఇలా ఆరాధించే వాళ్ళు కావాలని దేవుడు వెదుకుతూ ఉంటాడు.
\v 24 దేవుడు ఆత్మ. ఆయన్ని ఆరాధించే వాళ్ళు ఆత్మతో ఆరాధించాలి. ఆరాధించడంలో సత్యం వాళ్ళని నడిపించాలి" అన్నాడు.
\s5
\p
\v 25 ఆ స్త్రీ ఆయనతో, "మెస్సీయ (గ్రీకులో క్రీస్తు) వస్తాడని నాకు తెలుసు. ఆయన వచ్చినప్పుడు మాకు అవసరమైనదంతా చెప్తాడు" అంది.
\v 26 యేసు ఆమెతో, "నీతో మాట్లాడుతున్న నేనే ఆయన్ని" అన్నాడు.
\s5
\p
\v 27 అప్పుడే ఆయన శిష్యులు ఊరి నుండి తిరిగి వచ్చారు. ఆయన కుటుంబంతో సంబంధం లేని ఆ స్త్రీతో యేసు మాట్లాడడం చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. అది యూదా సంప్రదాయానికి విరుద్ధం అయినా "నువ్వు చేసే పనేంటి?" అని గానీ "ఆ స్త్రీతో ఎందుకు మాట్లాడుతున్నావు?" అని గానీ ఆయన్ని అడిగే ధైర్యం చెయ్యలేదు.
\s5
\p
\v 28 ఆ స్త్రీ తన నీళ్ళ కుండ అక్కడే వదిలి ఊర్లోకి తిరిగి వెళ్ళింది. ఊరి వాళ్ళందరికీ జరిగిన విషయం చెప్పింది.
\v 29 "నేను చేసినదంతా నాతో చెప్పిన వ్యక్తిని వచ్చి చూడండి. ఆయన మెస్సీయ కాదు గదా!"
\v 30 చాలామంది ఊరిలో నుండి బయలుదేరి, యేసు ఉన్న చోటికి వచ్చారు.
\s5
\p
\v 31 అప్పుడే భోజనం తీసుకు వచ్చిన శిష్యులు, "బోధకా, ఏమన్నా తిను" అని బతిమాలారు.
\v 32 యేసు వాళ్ళతో, "తినడానికి మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉంది" అన్నాడు.
\v 33 దానికి వాళ్ళు ఒకరితో ఒకరు, "ఆయన తినడానికి ఎవరన్నా ఏమన్నా తెచ్చారా ఏంటి!" అనుకున్నారు.
\s5
\p
\v 34 యేసు "నా ఆకలి ఎలాటిదో తెలుసా? నన్ను పంపిన తండ్రి ఇష్టాన్ని చేయడం, ఆయన పని అంతా పూర్తి చేయడమే నాకు అన్నపానాలు.
\v 35 సంవత్సరంలో సాధారణంగా మీరు కోతకాలం ఇంకా నాలుగు నెలలుంది, ఈ సమయానికి పొలాల్లో పంట కోతకు వస్తుంది, అనుకుంటారు కదా. యూదులు కానివారు ఇప్పుడు దేవుడు తమను పాలించాలని కోరుకుంటున్నారు. వాళ్ళు కోతకు వచ్చిన పొలాల వంటి వాళ్ళు.
\v 36 ఇది నమ్మి, ఇలాంటి పంటలో పనికి సిద్ధపడిన వాడు తన జీతం అందుకుంటూ నిత్యజీవం కోసం ఫలాలను సేకరిస్తున్నాడు. విత్తనం చల్లేవాడు, పంట కోసేవాడు కలిసి సంతోషిస్తారు."
\s5
\p
\v 37 "నేను చెప్పిన ఈ మాట నిజమే. ఒకడు విత్తనం చల్లితే, మరొకడు పంట కోస్తాడు.
\v 38 మీరు పండించని పంట నుండి కోసింది సేకరించడానికి మిమ్మల్ని నేను పంపాను. ఇతరులు కష్టపడి పని చేశారు కానీ, ఇప్పుడు మీరు వాళ్ళ పనిలో ప్రతిఫలం పొందుతున్నారు" అన్నాడు.
\s5
\p
\v 39 ఆమె చెప్పిన మాటలు విన్న సుఖారు ప్రజలు సమరయులు యేసులో నమ్మకముంచారు.
\v 40 వాళ్ళంతా యేసు దగ్గరికి వచ్చి మరి కొంతకాలం తమతో ఉండమని బతిమాలారు. అందువల్ల యేసు ఇంకా రెండు రోజులు అక్కడ ఉన్నాడు.
\s5
\p
\v 41 ఆయన వాళ్లకు చెప్పిన మాటలకు ఇంకా చాలామంది యేసులో విశ్వాసం ఉంచారు.
\v 42 వాళ్ళు ఆ స్త్రీతో, "మేము ఇప్పుడు యేసులో నమ్మకం ఉంచాం. నువ్వు ఆయన గురించి చెప్పినందుకే కాదు, మేము స్వయంగా ఆయన సందేశం విన్నాం కాబట్టి. ఆయన నిజంగా లోక రక్షకుడని ఇప్పుడు మేము తెలుసుకున్నాం" అన్నారు.
\s5
\p
\v 43 ఆ రెండు రోజుల తరవాత యేసూ ఆయన శిష్యులూ సమరయను విడిచి గలిలయ ప్రాంతానికి వచ్చారు.
\v 44 ప్రవక్త చాలా చోట్ల గౌరవం పొందుతాడు కానీ తాను పుట్టి పెరిగిన చోట గౌరవం పొందడని యేసు తానే చెప్పాడు.
\p
\v 45 యేసు గలిలయ చేరినప్పుడు అనేకులు ఆయనకు స్వాగతం పలికారు. అంతకు ముందే జరిగిన పస్కా పండగ సమయంలో అక్కడి వాళ్ళు చాలామంది యెరూషలేము వెళ్ళారు, అక్కడ ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలన్నీ వాళ్ళు చూశారు.
\s5
\p
\v 46 యేసు మళ్ళీ కానాకు వెళ్ళాడు (అక్కడే ఆయన నీళ్ళను ద్రాక్షరసంగా మార్చింది). అక్కడ 27 కిలో మీటర్ల దూరాన ఉన్న కపెర్నహోములో రాజు ఆస్థానంలో పనిచేసే ఒక అధికారి ఉన్నాడు. అతని కొడుకు జబ్బుపడ్డాడు.
\v 47 యేసు యూదయ నుండి గలిలయ వచ్చాడని విని, కానాలో యేసు దగ్గరికి వెళ్ళి, "నా కొడుకు చనిపోయేలా ఉన్నాడు. కపెర్నహోము వచ్చి వాణ్ణి బాగుచేయండి" అని బతిమాలాడు.
\s5
\p
\v 48 యేసు అతనితో, "నేను అద్భుతాలు చేయడం చూసి, నేను ఎవరో నిరూపించుకుంటే తప్ప మీరు నన్ను నమ్మరు" అన్నాడు.
\v 49 అప్పుడు ఆ అధికారి ఆయనతో "అయ్యా, దయచేసి నా కొడుకు చనిపోకముందే నా ఇంటికి రండి" అని వేడుకున్నాడు.
\v 50 యేసు అతనితో "నువ్వు ఇంటికి వెళ్ళు, నీ కొడుకు బ్రతుకుతాడు" అన్నాడు. అతను యేసు చెప్పింది నమ్మాడు. తన ఇంటికి తిరుగు ప్రయాణం కట్టాడు.
\s5
\p
\v 51 అతను కపెర్నహోములో ఉన్న తన ఇంటికి వెళుతూ ఉండగానే అతని పనివాళ్ళు దారిలో ఎదురుపడ్డారు. వాళ్ళు అతనితో, "నీ కొడుకు బ్రతికాడు" అన్నారు.
\v 52 అతను, "ఏ సమయం నుండి కోలుకోవడం మొదలుపెట్టాడు?" అని వాళ్ళని అడిగాడు. వాళ్ళు అతనితో, "నిన్న మధ్యాహ్నం ఒంటి గంట నుండి జ్వరం తగ్గింది" అన్నారు.
\s5
\v 53 అప్పుడు ఆ పిల్లవాడి తండ్రి "నీ కొడుకు బ్రతుకుతాడు" అని యేసు చెప్పిన సమయం అదే అని గ్రహించాడు. కాబట్టి అతడు, అతని ఇంటిలో నివసించే ప్రతి ఒక్కరూ యేసులో నమ్మకముంచారు.
\p
\v 54 యేసు ఎవరో ప్రజలకు రుజువు చేసుకోవడానికి ఇది ఆయన చేసిన రెండవ సూచక క్రియ. ఆయన యూదయ నుండి ప్రయాణం చేసి గలిలయ ప్రాంతానికి వెళ్తున్న సమయంలో దీనిని చేశాడు.
\s5
\c 5
\p
\v 1 తరవాత మరొక యూదుల పండుగ వచ్చినప్పుడు యేసు ఆ పండగ ఆచరించడానికి యెరూషలేము వెళ్ళాడు.
\v 2 యెరూషలేము పట్టణ ద్వారాల్లో ఒకదాని పేరు గొర్రెల ద్వారం. ఆ గేటు దగ్గర యూదులు వాడే భాషలో బేతెస్థ అని పిలిచే ఒక కోనేరు ఉంది. దానికి ఐదు మంటపాలు ఉన్నాయి.
\v 3 చాలామంది రోగులు అక్కడ పడి ఉండేవాళ్ళు. వాళ్ళు నయం కాని జబ్బులు ఉన్నవాళ్ళు, గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, పక్షవాతం వచ్చినవాళ్ళు.
\p
\v 4 (కొన్ని సమయాల్లో ప్రభువు దూత కొలనులోకి దిగి నీళ్ళు కదిపే వాడు. అలా నీళ్ళు కదిపినప్పుడు అందులో దిగిన వాళ్ళు ఎలాంటి వ్యాధితో బాధ పడుతున్నా స్వస్థపడే వాళ్ళు).
\s5
\v 5 అక్కడ నడవలేని రోగి ఒకడు 38 ఏళ్ళ నుండి పడి ఉన్నాడు.
\v 6 యేసు అతణ్ణి చూసి, అతడు చాలాకాలం నుండి అదే పరిస్థితిలో అతడు ఉన్నాడని గ్రహించాడు. ఆయన "ఆరోగ్యంగా బలంగా అవ్వాలని ఉందా?" అని అతణ్ణి అడిగాడు.
\s5
\p
\v 7 ఆ వ్యక్తి ఆయనతో, "అయ్యా, నీళ్ళు కదిలినప్పుడు ఆ కోనేట్లో దిగడానికి నాకు ఎవ్వరూ సాయం చేయడం లేదు. నేను దిగడానికి ప్రయత్నించే లోపలే నా కంటే ముందే ఎవరో ఒకరు దిగిపోతూ ఉన్నారు" అన్నాడు.
\v 8 యేసు అతనితో, "లే, నీ పడక ఎత్తుకుని నడువు" అన్నాడు.
\s5
\v 9 ఒక్కసారిగా ఆ వ్యక్తి స్వస్థపడి తన పడక చుట్టుకుని వెళ్ళిపోయాడు.
\p ఆ రోజు సబ్బాతు అనే యూదుల విశ్రాంతి దినం.
\s5
\v 10 కాబట్టి యూదు నాయకులు స్వస్థపడిన ఆ వ్యక్తితో, "ఇది విశ్రాంతి దినం. ఈ పవిత్ర దినాన నీ పరుపు మోయడం ధర్మశాస్త్రానికి వ్యతిరేకం అని నీకు తెలియదా" అన్నారు.
\v 11 బాగుపడిన మనిషి "మరి నన్ను స్వస్థపరచిన వ్యక్తి నీ పడక తీసుకుని నడువు అన్నాడే" అని జవాబిచ్చాడు.
\s5
\p
\v 12 వాళ్ళు అతన్ని, "ఆ మనిషి ఎవరు?" అని అడిగారు.
\v 13 యేసు అతణ్ణి స్వస్థపరచినా అతనికి ఆయన పేరు తెలీదు. ఎందుకంటే అతణ్ణి స్వస్థపరిచాక యేసు అతణ్ణి విడిచి జనంలో కలిసిపోయాడు.
\s5
\p
\v 14 తరవాత యేసు అతణ్ణి దేవాలయంలో కలుసుకుని అతనితో, "చూడూ! నువ్వు ఇప్పుడు బాగుపడ్డావు. ఇక నుండి పాపం చెయ్యొద్దు. అప్పుడు నీ పరిస్థితి మరింత అధ్వానం కాకుండా ఉంటుంది" అన్నాడు.
\v 15 ఆ వ్యక్తి వెళ్ళిపోయి యూదుల నాయకులతో, తనను స్వస్థపరిచింది యేసు అని చెప్పాడు.
\s5
\p
\v 16 యేసు అద్భుతాలు చేస్తూ, తరచుగా యూదుల విశ్రాంతి దినాన ఈ పనులు చేయడంతో యూదులు ఆయన్ని ఆపడానికి శాయశక్తులా ప్రయత్నం చేయసాగారు.
\v 17 యేసు వాళ్లతో "నా తండ్రి అస్తమానం పనిచేస్తున్నాడు, నేను కూడా పని చేస్తున్నాను" అని చెప్పాడు.
\v 18 వారి దృష్టిలో యేసు విశ్రాంతి రోజు నియమాలు పాటించక పోవడమే కాదు, తనను దేవునితో సమానం చేసుకుంటూ దేవుణ్ణి తన సొంత తండ్రి అని పిలుస్తున్నాడు. ఆ కారణాన వాళ్ళు ఆయనను చంపాలని శాయశక్తులా ప్రయత్నించ సాగారు.
\s5
\p
\v 19 యేసు వాళ్లకి జవాబిస్తూ, "నేను మీకు నిజం చెప్తున్నాను. నేను మనుష్యకుమారుణ్ణి. నేను నా సొంత అధికారంతో ఏమీ చేయలేను. తండ్రి చేసింది నేను చూడడం మాత్రమే చేయగలను. తండ్రి ఏమి చేస్తే అదే కుమారుడిగా నేను చేస్తాను.
\v 20 తండ్రి తన కుమారుడినైన నన్ను ప్రేమించి ఆయన చేసేది అంతా నాకు చూపిస్తాడు. ఈ గొప్ప పనులు కూడా తండ్రి నాకు చూపిస్తాడు. కాబట్టి నేను చేసినవన్నీ మీరు చూసి ఆశ్చర్యపోతున్నారు."
\s5
\p
\v 21 "తండ్రి చనిపోయిన వాళ్ళకి ప్రాణమిచ్చి తిరిగి బ్రతికించినట్టే కుమారుణ్ణి అయిన నేను కూడా నాకు ఇష్టమైన వాళ్లని బ్రతికించగలను.
\v 22 దేవుడు ఎవరికీ తీర్పు తీర్చడు కానీ అందరికీ తీర్పు తీర్చే అధికారాన్ని నాకు ఇచ్చాడు.
\v 23 కాబట్టి మనుషులంతా తండ్రిని గౌరవించినట్టు కుమారుణ్ణి అయిన నన్ను కూడా గౌరవిస్తారు. నన్ను గౌరవించనివాడు నన్ను పంపిన తండ్రిని గౌరవించ లేడు."
\s5
\p
\v 24 "నేను నిజం చెప్తున్నాను. ఎవరైనా నా సందేశం విని దేవుడు నన్ను పంపాడని నమ్మితే వాళ్లకి నిత్యజీవం ఉంటుంది. వాళ్ళు దేవుని తీర్పులోకి రారు. చావు అనేది లేకుండా బ్రతుకుతారు."
\s5
\p
\v 25 "నేను మీకు నిజం చెప్తున్నాను. ఒక సమయం వస్తుంది అప్పుడు చనిపోయినవాళ్ళు దేవుని కుమారుడి స్వరం, అంటే నా స్వరం వింటారు. అది విన్నవాళ్ళు బ్రతుకుతారు. నిజానికి ఆ సమయం వచ్చేసింది."
\s5
\p
\v 26 "తండ్రికి ఏ విధంగా మనుషులను బ్రతికించగల శక్తి ఉందో అదే విధంగా ఆయన కుమారుణ్ణి అయిన నాకు ఆ అధికారం ఇచ్చి వాళ్ళను బ్రతికిస్తాడు.
\v 27 తండ్రికి కేవలం న్యాయమే తెలుసు కాబట్టి నేను మనుష్యకుమారుణ్ణి అయినందుకు ఇవి చేయడానికి ఆయన నాకు అధికారమిచ్చాడు.
\s5
\v 28 చనిపోయిన వాళ్ళందరూ నా పిలుపు వినే సమయం ఒకటి ఉంది. దీనికి ఆశ్చర్యపోకండి.
\v 29 అప్పుడు వాళ్ళు సమాధుల నుండి బయటికి వస్తారు. మంచి చేసిన వాళ్ళని దేవుడు లేపి నిత్య జీవం ఇస్తాడు. కానీ చెడు చేసిన వాళ్ళని దేవుడు లేపుతాడు గానీ శాశ్వతమైన శిక్ష విధిస్తాడు.
\s5
\v 30 నా సొంతంగా నేను ఏమీ చేయలేను. తండ్రి నుండి నేను ఏమి వింటానో ఆ తీర్పునే ఇస్తాను. నా తీర్పు న్యాయంగా ఉంటుంది. నేను న్యాయంగా తీర్పు ఇస్తాను. ఎందుకంటే నాకు ఇష్టమైనది చేయడానికి నేను ప్రయత్నించను. నన్ను ఇక్కడికి పంపిన తండ్రి కోరుకున్నది చేస్తాను."
\p
\v 31 "నేనే స్వయంగా నా గురించి సాక్ష్యమిస్తే అది నిజమని ఎవ్వరూ నమ్మరు.
\v 32 అలా కాకుండా నా గురించి సాక్ష్యం చెప్పే ఒకరు ఉన్నారు. ఆయన సాక్ష్యం నిజమని నాకు తెలుసు.
\s5
\v 33 బాప్తిసమిచ్చే యోహాను దగ్గరికి మీరు మనుషుల్ని పంపారు. అతను మీకు నా గురించి అంతా నిజమే చెప్పాడు.
\v 34 నాకు అతని సహాయం అసలు అవసరం లేదు, నా విషయంలో ఎవరి సాక్ష్యం అక్కరలేదు. దేవుడు మిమ్మల్ని రక్షించాలని నేను మీకు ఈ విషయాలు చెప్తున్నాను.
\v 35 బాప్తిసమిచ్చే యోహాను మండుతూ ప్రకాశిస్తున్న దీపశిఖ. అతని సందేశ వెలుగులో కొంతకాలం మీరు ఆనందించారు.
\s5
\v 36 అయితే నా విషయంలో స్వయంగా నేను ఇచ్చే సాక్ష్యం యోహాను ఇచ్చే సాక్ష్యం కంటే గొప్పది. తండ్రి నేను చెయ్యడానికి అనుమతించినవన్నీ నేను ప్రతిరోజూ చేస్తూ ఉంటాను. అవి నేను చేయడం మీరు చూస్తున్నారు కూడా. నేను ఎవరో మీకు ఇంకా ఎక్కువగా నేను చేసే పనులు చెప్తాయి. నేను ఇక్కడికి రావడంలో నీ ఉద్దేశాన్ని అవి వివరిస్తాయి. దేవుడు నన్ను పంపాడు అనడానికి అవే నిదర్శనం.
\p
\v 37 నన్ను పంపిన తండ్రే నా గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మీరు ఆయన స్వరాన్ని ఎప్పుడూ వినలేదు. ఆయన్ని మీరు శరీర రూపంలో ఎప్పుడూ చూడలేదు.
\v 38 నన్ను పంపిన వాణ్ణీ, నన్నూ నమ్మలేదు అనడానికి నిదర్శనం మీలో ఆయన వాక్యం జీవించక పోవడమే."
\s5
\p
\v 39 "మీరు జాగ్రత్తగా లేఖనాలు చదవాలి. ఎందుకంటే వాటిని చదవడం వల్ల మీకు నిత్య జీవం దొరుకుతుందని మీరు అనుకుంటారు. ఆ లేఖనాలే నా గురించి చెప్తాయి.
\v 40 అయినా నా నుండి మీరు నిత్య జీవం పొందుతారు అనే విషయంలో ఇంకా మీరు నన్ను తిరస్కరిస్తున్నారు."
\s5
\p
\v 41 "ప్రజలు నన్ను పొగిడి, ఘనపరుస్తూ ఉంటే నేను పట్టించుకోను.
\v 42 మీ గురించి నాకు తెలుసు. మీరు దేవుని ప్రేమించరు."
\s5
\p
\v 43 "నేను నా తండ్రి అధికారంతో వచ్చాను. అయినా మీరు ఇంకా నన్ను అంగీకరించలేదు, ఆహ్వానించలేదు. ఇంకొకరు ఎవరైనా వాళ్ళ సొంత అధికారంతో వస్తే వాళ్ళ మాట మీరు వింటారు.
\v 44 ఇతరుల మెప్పు పొందాలని మీరు శాయశక్తులా కృషి చేస్తుంటే నన్ను మీరు ఎలా నమ్ముతారు? ఇక అన్ని సమయాల్లో ఒకే ఒక్క దేవుని నుండి వచ్చే అసలైన మెప్పును తోసిపుచ్చడానికే చూస్తారు."
\s5
\p
\v 45 "నా తండ్రి సమక్షంలో మిమ్మల్ని నేను నిందిస్తానని అనుకోకండి. మోషే మిమ్మల్ని రక్షిస్తాడని మీరు అనుకుంటున్నారు కదా. మీ ఆశలన్నీ అతని మీదే. అయితే మిమ్మల్ని నిందించేవాడు మోషేనే.
\v 46 మోషే చెప్పింది మీరు అంగీకరించి ఉంటే నేను చెప్పింది మీరు నమ్మేవారు. ఎందుకంటే అతడు నా గురించి వివరిస్తున్నాడు.
\v 47 కనీసం మోషే చెప్పింది కూడా మీరు నమ్మలేదు కాబట్టి నేను మీకు చెప్పింది మీరు ఎలా నమ్ముతారు?"
\s5
\c 6
\p
\v 1 యేసు ఆయన శిష్యులు సరస్సు అవతలి వైపుకు వెళ్ళారు. ఆ సరస్సును గలిలయ సముద్రం అనీ తిబెరియా సముద్రం అనీ పిలుస్తారు.
\v 2 ఆయన రోగుల్ని బాగుచేయడం ద్వారా చేసిన అద్భుతాలు చూసిన పెద్ద జన సమూహం ఆయన్ని వెంబడించింది.
\v 3 ఏటవాలుగా ఉన్న కొండ మీదకి వెళ్ళి యేసు ఆయన శిష్యులతో కూర్చున్నాడు.
\s5
\p
\v 4 అది యూదులకు ప్రత్యేకమైన పర్వదినం అయిన పస్కా సమయం.
\v 5 పెద్ద జన సమూహం తన వైపు రావడం యేసు చూశాడు. ఆయన ఫిలిప్పుతో, "వీళ్ళందరూ తినడానికి రొట్టెలు ఎక్కడ దొరుకుతాయి?" అన్నాడు.
\v 6 ఫిలిప్పు ఎలాంటి జవాబు చెప్తాడో చూద్దామని ఆయన ఆ ప్రశ్న అడిగాడు. ఈ సమస్య ఎలా తీర్చాలో ఆయనకి ముందే తెలుసు.
\s5
\v 7 ఫిలిప్పు "ఒకడు రెండు వందల రోజులు పని చేస్తే వచ్చే మొత్తం డబ్బు మన దగ్గర ఉన్నా, అది ఈ పెద్ద సమూహంలో ఒక్కొక్కరికి చిన్న ముక్క చొప్పున ఇవ్వడానికి కూడా సరిపోదు" అన్నాడు.
\v 8 తన శిష్యుల్లో ఒకడైన సీమోను పేతురు తమ్ముడు అంద్రెయ యేసుతో,
\v 9 "ఇక్కడ ఒక అబ్బాయి దగ్గర బార్లీతో చేసిన ఐదు రొట్టెలు, రెండు చిన్న చేపలు ఉన్నాయి. అయినా ఇంత మందికి అవి ఎలా సరిపోతాయి?" అన్నాడు.
\s5
\p
\v 10 ప్రజలందరూ వచ్చిన ఆ ప్రదేశంలో వత్తుగా గడ్డి ఉంది. యేసు వాళ్ళను అక్కడ కూర్చోబెట్టమని తన శిష్యులతో చెప్పాడు. ప్రజలందరూ కూర్చున్న తరవాత శిష్యులు ఆ మనుషుల్ని లెక్కపెట్టారు. వారి లెక్క సుమారు ఐదు వేలు.
\v 11 అప్పుడు యేసు ఆ చిన్న రొట్టెల్ని, చేపల్ని తీసుకుని వాటి కోసం దేవునికి వందనాలు చెప్పాడు. అప్పుడు వాటిని అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ పంచారు. ప్రజలు రొట్టె ముక్కలు, చేపలు కడుపారా తిన్నారు.
\v 12 అందరూ తినడం అయిపోయాక ఆయన తన శిష్యులతో, "మిగిలిపోయిన రొట్టె ముక్కల్ని సేకరించండి. ఏదీ వ్యర్థం చేయకండి" అన్నాడు.
\s5
\p
\v 13 కాబట్టి వాళ్ళు మిగిలిన ముక్కల్ని సేకరిస్తే అవి పన్నెండు పెద్ద గంపలు అయ్యాయి.
\p
\v 14 యేసు చేసిన అద్భుతాలు చూసిన తరవాత ప్రజానీకం "దేవుడు ఈ లోకానికి పంపే ప్రవక్త కచ్చితంగా ఈయనే" అన్నారు.
\v 15 ప్రజల ఉద్దేశాలు యేసుకు తెలుసు. ఆయన్ని వాళ్ళు బలవంతంగా రాజును చెయ్యాలని అనుకుంటున్నారు. అందుకే ఆయన వాళ్ళని విడిచి ఒక్కడే కొండ పైకి వెళ్ళిపోయాడు.
\s5
\p
\v 16 సాయంత్రం అవుతుండగా ఆయన శిష్యులు గలిలయ సముద్రం దగ్గరికి వెళ్లి,
\v 17 పడవ ఎక్కి, అవతలి వైపు ఉన్న కపెర్నహోముకు వెళ్ళడానికి పడవ నడుపుతున్నారు. చీకటి పడింది కానీ యేసు ఇంకా వాళ్ళని చేరుకో లేదు.
\v 18 బలమైన ఈదురు గాలి మొదలయ్యింది. అలలు పెద్ద ఎత్తున లేస్తున్నాయి.
\s5
\v 19 ఐదో ఆరో కిలో మీటర్లు ప్రయాణించాక యేసు నీళ్ళపై నడుస్తూ పడవ దగ్గరికి రావడం శిష్యులు చూసి బెదిరిపోయారు.
\v 20 యేసు వాళ్ళతో, "నేనే! భయపడకండి" అన్నాడు.
\v 21 అప్పుడు వాళ్ళు ఆయన్ని సంతోషంగా పడవలో ఎక్కించుకున్నారు. ఆయన వాళ్ళతో చేరిన కొద్ది సమయానికే పడవ వాళ్ళు వెళ్ళాలనుకున్న స్థలానికి చేరింది.
\s5
\p
\v 22 ఆ తరవాత రోజు అవతలి వైపునే ఉండిపోయిన జన సమూహం అంతకు ముందు రోజు అక్కడ ఒకే పడవ ఉండడం గుర్తించారు. యేసు తన శిష్యులతో వెళ్లిపోయారని కూడా తెలుసుకున్నారు.
\v 23 ఆ సమయంలో కొందరు వాళ్ల పడవల్లో తిబెరియ సరస్సు దాటి వచ్చారు. వారు అంతకు ముందు తమ పడవలను ప్రభువు ఆహారం కోసం దేవునికి వందనాలు చెప్పి ప్రజలకు రొట్టెలు పంచిన చోట పెట్టుకున్నారు.
\s5
\v 24 యేసు, ఆయన శిష్యులు అక్కడ లేరని రొట్టెలు తిన్న ఆ సమూహం గ్రహించి, వాళ్ళల్లో కొందరు అక్కడి పడవలు ఎక్కి వెళ్ళి యేసును వెదుక్కుంటూ కపెర్నహోముకు వచ్చారు.
\p
\v 25 వాళ్ళకు సరస్సుకు అవతలి వైపున ఉన్న కపెర్నహోములో యేసు కనిపించాడు. వాళ్ళు ఆయన్ని, "బోధకా, నువ్వు నావలో రాలేదని మాకు తెలుసు. మరి ఇక్కడికి ఎప్పుడు వచ్చావు, ఎలా వచ్చావు?" అని అడిగారు.
\s5
\v 26 అందుకు యేసు, "నిజంగా చెప్తున్నాను. మీరు నన్ను వెదుకుతున్నది నేను అద్భుతాలు చేసినందుకో, లేక నేనెవరో మీకు చూపించినందుకో కాదు. కడుపు నిండా తిండి తిన్నందుకే.
\v 27 తొందరగా చెడిపోయే ఆహారం కోసం పనిచేయడం మానుకోండి. దాని బదులు మీకు నిత్య జీవాన్ని తెచ్చే ఆహారం కోసం కృషి చెయ్యండి. దేవుడు ఎంచుకున్నవాణ్ణీ మనుష్యకుమారుణ్ణి అయిన నేనే ఆ ఆహారం మీకు ఇస్తాను. తండ్రి అయిన దేవుడు ప్రతి దానిలో నన్ను ఆమోదిస్తాడు" అన్నాడు.
\s5
\p
\v 28 అప్పుడు ప్రజలు ఆయన్ని, "దేవుణ్ణి సంతోషపెట్టాలంటే మేము ఏ పనులు, ఏ సేవలు చెయ్యాలి?" అని అడిగారు.
\v 29 అప్పుడు యేసు, "దేవుడు మీరు ఏం చెయ్యాలని కోరుతున్నాడంటే ఆయన పంపిన నాపై నమ్మకం ఉంచడం" అన్నాడు.
\s5
\v 30 అప్పుడు వాళ్ళు యేసుతో, "నువ్వు ఎవరివో నిరూపించడానికి ఒక సూచక క్రియ చేసి చూపించు. అప్పుడు నువ్వు దేవుని దగ్గర నుండి వచ్చావని నమ్ముతాం. మా కోసం నువ్వు ఏమి చేయబోతున్నావు?
\v 31 వాళ్ళు తినడానికి దేవుడు పరలోకం నుండి ఆహారం ఇచ్చాడు అని లేఖనాలు చెప్పినట్టు మన పితరులు ఆ అరణ్య ప్రదేశంలో మన్నా తిన్నారు కదా" అన్నారు.
\s5
\p
\v 32 యేసు వాళ్ళతో, "పరలోకం నుండి మన పితరులకి ఆహారం ఇచ్చింది మోషే కాదు, నా తండ్రే. నిజమైన ఆహారం పరలోకం నుండి మీకు ఇస్తున్నవాడే.
\v 33 దేవుని నిజమైన ఆహారం నేనే, లోకంలోని ప్రతి ఒక్కరినీ నిజంగా జీవింప జేయడానికి పరలోకం నుండి క్రిందికి దిగి వచ్చిన వాణ్ణి నేనే" అన్నాడు.
\p
\v 34 ఆయన చెప్పింది వాళ్లకి అర్ధం కాక ఆయనతో, "అయ్యా, మాకు ఎప్పుడూ ఈ ఆహారం ఇవ్వు" అని అడిగారు.
\s5
\p
\v 35 యేసు వాళ్ళతో, "మనుషులు జీవించడానికి భోజనం అవసరం అయినట్టే ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా బ్రతకడానికి నేను అవసరం. సాధారణ భోజనం, నీళ్ళు తీసుకునే వాళ్లకి మళ్ళీ ఆకలి, దాహం వేస్తాయి. కానీ నన్ను నమ్మి, అడిగే వాళ్ళకి ఆధ్యాత్మికంగా జీవించడానికి నేను వీలు కలిగిస్తాను.
\v 36 అయినా నేను మీకు చెప్పినట్టు నన్ను మీరు చూసినా ఇంకా నమ్మడం లేదు.
\v 37 నా తండ్రి నాకు ఇచ్చిన వాళ్ళందరూ నా దగ్గరికి వస్తారు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళని నేను ఎప్పుడూ వెళ్ళగొట్టను."
\s5
\p
\v 38 "నా ఇష్టానుసారంగా చేయడానికి నేను పరలోకం నుండి దిగి రాలేదు. నన్ను పంపిన వాని ఇష్టాన్ని జరిగించడానికే నేను వచ్చాను.
\v 39 నన్ను పంపిన వానికి కూడా ఇదే కావాలి. ఆయన నాకు ఇచ్చిన వాళ్ళను ఎవ్వరినీ వదులుకోను. నేను తీర్పు ఇచ్చే రోజున వాళ్ళను అందరినీ బ్రతికిస్తాను.
\v 40 కుమారుణ్ణి అయిన నాలో విశ్వాసంతో ప్రతి ఒక్కరూ నిరీక్షించాలని నా తండ్రి కూడా కోరుకుంటున్నాడు. అలా నాలో నమ్మకముంచిన వాళ్లకి నిత్యజీవం ఇస్తాను. యుగాంతం రోజున వాళ్ళని బ్రతికిస్తాను."
\s5
\p
\v 41 "పరలోకం నుండి దిగి వచ్చిన నిజమైన ఆహారం నేనే" అని యేసు చెప్పినందుకు యూదుల నాయకులు యేసు మీద గింజుకోవడం మొదలుపెట్టారు.
\v 42 వాళ్ళు, ఇతడు యోసేపు కొడుకు కాదా? అతని తల్లి, తండ్రి ఎవరో మనకు తెలుసు కదా. నేను పరలోకం నుండి వచ్చాను అని ఎలా చెప్పగలుగుతున్నాడు, అనుకున్నారు.
\s5
\p
\v 43 యేసు వారికి జవాబిస్తూ, "నేను చెప్పిన దాని గురించి సణగడం ఆపెయ్యండి.
\v 44 నన్ను పంపిన నా తండ్రి నా దగ్గరికి వచ్చే వాళ్ళని ఏర్పాటు చేస్తాడు. ఇతరులు ఎవ్వరూ నిత్యజీవం పొందడానికి నా దగ్గరికి రారు. తీర్పు రోజున నా దగ్గరికి వచ్చిన వాళ్ళని మళ్ళీ బ్రతికిస్తాను.
\v 45 దేవుడు వాళ్ళందరికీ నేర్పిస్తాడు అని పూర్వం ఒక ప్రవక్త రాసాడు. నా తండ్రి నుండి నేర్చుకున్న ప్రతి వాళ్ళూ నాలో నమ్మకం ఉంచడానికి వస్తారు.
\s5
\v 46 నేను దేవుని నుండి వచ్చాను. తండ్రిని చూసింది నేనొక్కడినే. ఇంకెవ్వరూ ఆయన్ని చూడలేదు."
\p
\v 47 "నేను సత్యం చెప్తున్నాను - నాలో నమ్మకం ఉంచిన వాళ్ళకే నిత్య జీవం."
\s5
\p
\v 48 "నిజమైన జీవాన్ని ఇచ్చే ఆహారం నేనే.
\v 49 మీ పితరులు అరణ్య ప్రదేశంలో మన్నా తిన్నారు అయినా చనిపోయారు.
\s5
\v 50 కానీ నేను పరలోకం నుండి వచ్చిన ఆహారం గురించి మాట్లాడుతున్నాను. ఆ ఆహారం తిన్నవాడి ఆత్మకు మరణం లేదు.
\v 51 మనుషులు నిజంగా జీవించేలా చేసే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారాన్ని నేనే. ఎవరైనా ఈ ఆహారం తింటే చిరకాలం బ్రతుకుతారు. లోకాన్ని బ్రతికించడానికి నేను ఇచ్చే ఆహారం ఏమిటో తెలుసా? నా మరణం."
\s5
\p
\v 52 యేసు చెప్పిన ఈ మాటలు విన్న యూదులు తమలో తాము ఉక్రోషంగా వాదించుకున్నారు. వాళ్ళకు ఆయన మాటలు అర్ధం కాలేదు. "ఇతడు తన శరీరం ఎలా తిననిస్తాడు?" అన్నారు.
\v 53 యేసు కఠినంగా వారికి బదులిచ్చాడు. "నేను నిజమే చెప్తున్నాను - నేను మనుష్యకుమారుణ్ణి. నా శరీరాన్ని మీరు తినకపోయినా, నా రక్తం తాగకపోయినా మీరు నిత్యం జీవించలేరు.
\s5
\v 54 నా శరీరం తిని, నా రక్తం తాగే ఎవరినైనా నేను యుగాంతం రోజున బతికిస్తాను.
\v 55 ఎందుకంటే నా శరీరం నిజమైన ఆధ్యాత్మిక ఆహారం, నా రక్తం ఆధ్యాత్మిక పానం.
\v 56 నా శరీరం తిని, నా రక్తం ఎవరు తాగుతారో వాళ్ళు నాతో సన్నిహిత సంబంధం కలిగి ఉంటారు. నాకు వాళ్ళతో సన్నిహిత సంబంధం ఉంటుంది."
\s5
\p
\v 57 "ప్రతి ఒక్కర్నీ బ్రతికించే నా తండ్రి నన్ను పంపాడు. నా తండ్రి వల్లే నేను జీవిస్తున్నాను. అదే విధంగా నా నుండి ఆహారం పొందిన వాళ్ళు వాళ్ల కోసం నేను చేసిన దాని కారణంగా నిత్య జీవం కలిగి ఉంటారు.
\v 58 నేను పరలోకం నుండి దిగి వచ్చిన నిజమైన ఆహారాన్ని. ఈ ఆహారం ఎవరు తింటారో వాళ్ళు ఎప్పటికీ చనిపోరు. శాశ్వతంగా జీవిస్తూనే ఉంటారు. మీ పూర్వీకులు మన్నా తిని చనిపోయారు. నేను అలా వీళ్ళకు జరగనివ్వను" అన్నాడు.
\v 59 కపెర్నహోములో యూదుల ఉపదేశ స్థలంలో యేసు ఈ మాటలు చెప్పాడు.
\s5
\p
\v 60 ఆయన శిష్యుల్లో చాలామంది "ఆయన చెప్పేది అర్ధం చేసుకోవడం చాలా కష్టం. ఆయన చెప్పేది ఎవరు అంగీకరించగలరు?" అనుకున్నారు.
\v 61 ఈ రకంగా తన శిష్యుల్లో కొందరి సణుగుడు చూసి వాళ్ళతో, "నేను బోధించింది మీకు కోపం తెప్పించిందా?
\s5
\v 62 బహుశా పరలోకం నుండి వచ్చినవాడిగా నేను ఇంతకు ముందు ఉన్న చోట నుండి దిగి రావడం చూస్తే నా సందేశాన్ని మీరు నమ్మేవారేమో.
\v 63 ఎవరినైనా నిత్యం జీవించేలా చేసేది ఆత్మ ఒక్కటే. మానవ స్వభావం ఇందుకు సహకరించలేదు. నేను మీకు బోధించిన మాటలు ఆత్మ గురించి, నిత్య జీవం గురించి చెప్తాయి."
\s5
\v 64 "నేను బోధించేది నమ్మని వాళ్ళు ఇంకా మీలో కొందరు ఉన్నారు" అన్నాడు. యేసు తన పని మొదలుపెట్టినప్పటి నుండి ఆయనలో ఎవరు నమ్మకం ఉంచటం లేదో ఆయనకు తెలుసు. తనకు ఎవరు ద్రోహం చేస్తారో కూడా తెలుసు కాబట్టి ఆయన ఇలా అన్నాడు.
\v 65 "అందుకే తండ్రి ద్వారా తప్ప నా దగ్గరికి ఎవరూ రాలేరనీ ఎవరూ నిత్య జీవానికి వెళ్ళలేరనీ చెప్పాను" అని యేసు అన్నాడు.
\s5
\p
\v 66 ఆ సమయం నుండి చాలామంది యేసు శిష్యులు ఆయన్ని విడిచిపెట్టి, ఇక ఎప్పుడూ ఆయన్ని అనుసరించలేదు.
\v 67 కనుక ఆయన తన పన్నెండు మంది శిష్యులతో, "మీరు కూడా నన్ను విడిచి పెట్టి పోవాలనుకుంటున్నారా?" అన్నాడు.
\v 68 సీమోను పేతురు - "ప్రభూ! మేము నిన్ను వదలిపెట్టం. ఎందుకంటే మేము వెళ్ళడానికి నీలాంటి మనిషి వేరెవరూ లేడు.
\v 69 మేము నీలో నమ్మకం ఉంచుతున్నాం. దేవుడు నిన్ను పంపించాడనీ నువ్వు పరిశుద్దుడివనీ మాకు స్పష్టంగా తెలుసు" అన్నాడు.
\s5
\p
\v 70 యేసు - "నేను ఎంచుకున్న మీ పన్నెండుమందీ నన్ను నమ్ముతున్నాం అంటున్నారు కదా. కానీ మీలో ఒకడు సాతాను స్వాధీనంలో ఉన్నాడు" అన్నాడు.
\v 71 ఆయన ఇస్కరియోతు కొడుకు యూదా గురించి మాట్లాడాడు. యూదా ఆ పన్నెండు మందిలో ఒకడు. అయినా ఆ తర్వాత యేసుకు ద్రోహం చేసింది అతడే.
\s5
\c 7
\p
\v 1 దీని తరవాత యేసు గలిలయ ప్రాంతంలోని ఇతర చోట్లకి వెళ్ళాడు. యూదుల అధికారులు ఆయన మీద నేరం మోపి మరణ శిక్ష విధించేలా చేయాలని దారి వెదుకుతున్నందుకు యూదయ ప్రాంతం వైపు ప్రయాణించడానికి యేసు ఇష్టపడలేదు.
\v 2 యూదుల పర్ణశాలల పండుగ సమయం వచ్చింది. చాలాకాలం క్రితం నిర్గమనం సమయంలో యూదు ప్రజలు గుడారాలలో నివసించిన విషయం జ్ఞాపకం చేసుకునే సమయం ఇది.
\s5
\p
\v 3 యూదయలో ఈ పండగ జరుగుతుంది కాబట్టి యేసు తమ్ముళ్ళు ఆయనతో, "ఈ చోటు వదిలి యూదయకు వెళ్ళు. అక్కడ నీ ఇతర అనుచరులు నువ్వు చేసే శక్తివంతమైన పనులు చూస్తారు.
\v 4 కీర్తి సంపాదించాలి అనుకునే వాళ్ళు తాము చేసే పనులు రహస్యంగా చేయరు. నువ్వు ఈ అద్భుతాలు చేస్తున్నానని అంటున్నావు కదా, ఇంకా కొన్ని అద్భుతాలు అందరూ చూసేలా చేయి" అన్నారు.
\s5
\p
\v 5 తన సొంత తమ్ముళ్ళు కూడా ఆయన నిజం చెప్తున్నా నమ్మలేదు.
\v 6 కాబట్టి యేసు వాళ్ళతో, "నా పనులు ముగించడానికి ఇది నాకు సమయం కాదు. మీరు అనుకున్నది నెరవేరడానికి మీకు ఇష్టమైన సమయాన్ని ఎంచుకోవచ్చు.
\v 7 తమ కోసమే జీవించే వాళ్ళని, ఈ లోక విషయాలు ఇష్టపడే వాళ్ళని మనుషులు ద్వేషించరు. వాళ్ళు నన్ను ద్వేషిస్తారు. వాళ్ళ చెడు నడత గురించి వాళ్లకు చెప్పేది నేనొక్కడినే.
\s5
\v 8 మీరు పండగకు వెళ్ళండి. నేను అప్పుడే యెరూషలేముకు వెళ్ళడం లేదు. నేను వెళ్ళడానికి ఇది తగిన సమయం కాదు అన్నాడు."
\p
\v 9 అలా చెప్పాక యేసు కొంత సమయం గలిలయలోనే ఉన్నాడు.
\s5
\v 10 అయితే తన తమ్ముళ్ళు పండగకు వెళ్ళిన కొన్ని రోజులకి ఆయన కూడా వెళ్ళాడు కానీ రహస్యంగా వెళ్ళాడు.
\v 11 యేసును వ్యతిరేకించే యూదులు ఆయన కోసం చూస్తూ, పండుగలో ఆయన కనిపిస్తాడని చూస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రజల్ని "యేసు వచ్చాడా?" అని మాట్లాడుకుంటున్నారు.
\s5
\p
\v 12 ఆ సమూహాల మధ్యలో చాలామంది ఒకరినొకరు యేసు గురించి మాట్లాడుకుంటున్నారు. కొందరు ఆయన మంచివాడు అంటున్నారు. ఇంకొందరు, "కాదు. ఆయన మోసకారి, తప్పుదారి పట్టిస్తున్నాడు" అన్నారు.
\v 13 యేసుకు శత్రువులుగా ఉన్నయూదులకు భయపడి వాళ్ళు మాట్లాడుకునేది ఎవరూ వినకూడదని పండగలో ఎవరూ బహిరంగంగా ఆయన గురించి పెదవి విప్పలేదు.
\s5
\p
\v 14 పర్ణశాలల పండగ సగం ముగిసిన తర్వాత యేసు దేవాలయ ఆవరణలోకి వెళ్లి బోధించడం మొదలుపెట్టాడు.
\v 15 ఆయన చెప్పింది విని యూదుల పెద్దలు ఆశ్చర్యపోయారు. వాళ్ళు, "ఇతడు ఆమోదించిన గురువు ద్వారా మన సిద్ధాంతాలు ఎప్పుడూ నేర్చుకోలేదు. మన పాఠశాలల్లో చేరిందీ లేదు. లేఖనాల గురించి ఇతనికి ఇంత పరిజ్ఞానం ఉండడం, నమ్మశక్యంగా లేదు" అనుకున్నారు.
\v 16 యేసు వాళ్ళకి జవాబిస్తూ, "నేను బోధించేది నాలో నుండి వచ్చింది కాదు. నన్ను పంపిన దేవుని నుండి వచ్చింది."
\s5
\p
\v 17 "దేవునికి ఇష్టమైనది ఎంచుకున్న ఎవరైనా నేను బోధించేది దేవుని నుండి వస్తుందో, నా సొంత అధికారంతో నేనే మాట్లాడుతున్నానో తెలుసుకుంటాడు.
\v 18 తన సొంత అధికారంతో ఎవరైనా మాట్లాడితే అప్పుడు ఇతరులు ఆ మనిషినే గౌరవిస్తారు. తనను పంపిన వ్యక్తి కోసం పనివాడు కష్టపడి పని చేస్తే, నిజాయితీ ఉన్న వాడిగా యజమానికి మంచి పేరు తెచ్చి పెట్టినప్పుడు అలాంటి పనివాడిలో లోపం ఉండదు."
\s5
\p
\v 19 "మోషే మీకు ఇచ్చిన చట్టాలు గుర్తు చేసుకోండి. ఆ విధులకు మీలో ఒక్కరు కూడా లోబడరు. నన్నెందుకు చంపడానికి చూస్తున్నారు? విశ్రాంతి దినానికి సంబంధించిన విధులకి నేను లోబడనందుకేనా?"
\p
\v 20 ఆ గుంపులో ఒక మనిషి, "నీకు దయ్యం పట్టుకుంది. నిన్ను చంపాలనుకునే మనిషి పేరు చెప్పు?" అన్నాడు.
\s5
\v 21 దానికి యేసు జవాబిస్తూ, "విశ్రాంతి దినాన్న నేను ఒక్క అద్భుతం చేయడం మీకు మింగుడు పాడడం లేదు."
\p
\v 22 "మోషే మీకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. అందులో మీ మగపిల్లలు పుట్టిన తరవాత ఏడవ రోజున కచ్చితంగా సున్నతి చేయించాలి (సరిగ్గా చెప్పాలంటే ఈ ఆచారం మీ పితరులు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల నుండి వచ్చింది. ధర్మశాస్త్రాన్ని రాసి ఇచ్చిన మోషే నుండి వచ్చింది కాదు). ధర్మశాస్త్రం ఆజ్ఞలు పాటించవలసిన అవసరాన్ని బట్టి మీరు కొన్నిసార్లు విశ్రాంతి దినాన శిశువుకు సున్నతి చేయడం అనే పని చేస్తారు గదా."
\s5
\p
\v 23 "అది విశ్రాంతి దినం అయినా సరే మోషే ఆజ్ఞల్ని మీరకుండా ఉండడానికి మీరు కొన్నిసార్లు మగ శిశువులకి సున్నతి చేస్తారు. కాబట్టి ఒక వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు నేను విశ్రాంతి దినాన పని చేసానని మీరు నా మీద పగ పెంచుకుంటారేమిటి? ఒక వ్యక్తికి స్వస్థత చాలా అవసరం. అది చిన్నబిద్దకు సున్నతి చేయడం కంటే ఘనమైన పని.
\v 24 దేవుని ధర్మశాస్త్రానికి తప్పుగా వ్యాఖ్యానించుకుంటూ ఆలోచన లేకుండా ఒక వ్యక్తిని స్వస్థపరచడం తప్పా ఒప్పా అని నిర్ణయించడం మానేయండి. అందుకు బదులుగా మనిషి ఏం చేయాలో, మానవ పద్ధతిలో కాకుండా దేవుని న్యాయ ప్రకారం ఏది సరైనదో అది నిర్ణయించండి" అన్నాడు.
\s5
\p
\v 25 యెరూషలేము ఊరివాళ్ళు కొందరు, "వాళ్ళు చంపాలనుకున్నది ఇతన్నే.
\v 26 ఆయన ఈ విషయాలన్నీ బహిరంగంగానే చెప్తున్నా అధికారులు ఆయనకు వ్యతిరేకంగా పల్లెత్తు మాట అనడం లేదు. ఆయన మెస్సీయ అని వాళ్ళు గ్రహించారా ఏమిటి?
\v 27 కానీ ఈయన మెస్సీయ అయి ఉండడు. ఈయన ఎక్కడి నుండి వచ్చాడో మనకు తెలుసు. కానీ మెస్సీయ వచ్చినప్పుడు ఆయన ఎక్కడి నుండి వస్తాడో ఎవరికీ తెలీదు" అనుకున్నారు.
\s5
\p
\v 28 దేవాలయ ఆవరణంలో యేసు బోధిస్తుండగా ఆయనకి ఎవరో చెప్పినట్టు "ఔను. నేను మీకు తెలుసని మీరు అనుకుంటారు. నేను ఎక్కడి నుండి వచ్చానో మీకు తెలుసు అనుకుంటారు. నాకు నేనుగా రాలేదు. నన్ను పంపినవాడు నిజమైన సాక్షి. ఆయన మీకు తెలియదు.
\v 29 నేను ఆయన దగ్గర నుండి వచ్చాను కాబట్టి ఆయన నాకు తెలుసు. నన్ను పంపినవాడు ఆయనే." అన్నాడు.
\s5
\p
\v 30 అప్పుడు ఆయన్ని వాళ్ళు బంధించాలనుకున్నారు. కానీ అలా చేయలేకపోయారు ఎందుకంటే ఆయన పని పూర్తి చేసుకుని తన జీవితం ముగించే సమయం ఇంకా రాలేదు.
\v 31 ఆ సమూహంలో ఉన్నవాళ్ళు చాలామంది ఆయన చెప్పింది విని, ఆయన చేసిన పనులు చూసి ఆయనలో నమ్మకం ఉంచారు. "మనం ఎదురు చూసే మెస్సీయ వచ్చినప్పుడు ఆయన్ని గుర్తించగలిగే అద్భుతమైన గుర్తులు ఇవే గదా" అనుకున్నారు.
\p
\v 32 వాళ్ళు అలా మాట్లాడుకోవడం పరిసయ్యులు విన్నారు. కాబట్టి వాళ్ళూ, ప్రధాన యాజకులూ కలిసి కొందరు అధికారుల్ని ఆయన్ని బంధించమని పంపారు.
\s5
\p
\v 33 యేసు, "నేను మీతో కొంత కాలమే ఉంటాను. తరవాత నన్ను పంపిన వాని దగ్గరికి నేను వెళ్తాను.
\v 34 నా కోసం మీరు వెదుకుతారు కానీ నేను మీకు కనిపించను. నేను వెళ్ళే చోటికి మీరు రాలేరు" అన్నాడు.
\s5
\v 35 యూదులలో ఆయన శత్రువులు తమలో తాము, ఈ మనిషి ఎక్కడికి వెళ్తాడు? మనం కనిపెట్టలేని చోటు ఏముంది? యూదులు వలసబోయిన గ్రీసు దేశం వెళ్లి అక్కడ ఈ కొత్త విషయాలు బోధించాలని ఇతని ఉద్దేశమా? అనుకున్నారు,
\v 36 నన్ను మీరు వెదుకుతారు కానీ మీరు నన్ను కనిపెట్టలేరు, నేను వెళ్ళే చోటికి మీరు రాలేరు, అనే ఆయన మాటల అంతర్యం ఏంటి? అనుకున్నారు.
\s5
\p
\v 37 అతి ప్రాముఖ్యమైన పండగ చివరి రోజున యేసు దేవాలయ ఆవరణలో లేచి నిలబడి బిగ్గరగా "నాలో నమ్మకం ఉంచిన వాళ్ళకు వారి హృదయంలో నుండి జీవ జలాలు ప్రవహిస్తాయి, అని లేఖనం చెప్పినట్టు,
\v 38 దాహంతో ఉన్న వాళ్ళు నేను ఇచ్చింది తాగడానికి నా దగ్గరికి రావాలి" అన్నాడు.
\s5
\v 39 తండ్రి తనలో నమ్మకం ఉంచిన వాళ్ళకి ఇచ్చే ఆత్మను గురించి ఆయన చెప్పాడు. ఆయనలో నమ్మకం ఉంచిన వాళ్ళలో జీవించడానికి దేవుడు ఇంకా ఆత్మను పంపలేదు. ఎందుకంటే యేసు తన మరణం ద్వారా ప్రజల్ని రక్షించి దేవునికి గొప్ప ఘనత తెచ్చే తన పనిని ఇంకా పూర్తి చేయలేదు.
\s5
\p
\v 40 ఆ గుంపులో ఈ మాటలు విన్న వాళ్ళు కొందరు మనం ఎదురు చూస్తున్న ప్రవక్త నిజంగా ఈయనే అన్నారు.
\v 41 కొందరు, "ఈయన మెస్సీయ" అన్నారు. ఇంకొందరు యేసు గలిలయలో పుట్టాడు అనుకుని, "మెస్సీయ గలిలయ ప్రాంతం నుండి రాడు.
\v 42 దావీదు వంశం నుండి వస్తాడు, దావీదు సొంత గ్రామమైన బేత్లెహేములో పుడతాడు అని లేఖనాలు చెప్తున్నాయి" అన్నారు.
\s5
\v 43 ఇలా యేసు గురించి రకరకాల అభిప్రాయాలు ప్రజల్లో ఉన్నాయి.
\p
\v 44 కొందరు సైనికులు ఆయన్ని బంధించాలని చూశారు కానీ పట్టుకోలేక పోయారు.
\s5
\v 45 వాళ్ళు ప్రధాన యాజకులూ పరిసయ్యులూ ఉన్న చోటికి తిరిగి వచ్చారు. పరిసయ్యులు యేసును ఎందుకు బంధించ లేదని వాళ్ళని అడిగారు.
\v 46 "ఆ మనిషి చెప్పిన అద్భుతమైన విషయాలు ఎవరూ ఎప్పుడూ చెప్పలేదు" అని సైనికులు జవాబిచ్చారు.
\s5
\p
\v 47 అందుకు పరిసయ్యులు, "అతడు మిమ్మల్ని కూడా బుట్టలో వేసుకున్నాడా?
\v 48 యూదు పాలకుల వంటి ప్రముఖులు గానీ, మా పరిసయ్యులు గానీ యేసుపై నమ్మకం ఉంచామా?
\v 49 మన ధర్మశాస్త్ర బోధల్నిఅర్ధం చేసుకోలేని పామరులు మాత్రమే ఆయనలో విశ్వాసం ఉంచారు. వాళ్ళ చేజేతులా వాళ్ళే శాపం కొని తెచ్చు కుంటారు" అన్నారు.
\s5
\p
\v 50 అప్పుడు నికోదేము (రాత్రివేళ యేసును కలిసి మాట్లాడిన పరిసయ్యుడు) వాళ్ళతో,
\v 51 "ఒక వ్యక్తి చెప్పేది వినకుండా అతని మీద నింద వేయడానికి మన యూదు ధర్మశాస్త్రం ఒప్పుకోదు. ముందు అతడు చెప్పేది వినాలి. తరవాత అతని గురించి నిర్ణయానికి రావాలి" అన్నాడు.
\v 52 అప్పుడు వాళ్ళు అతన్ని అవమానిస్తూ, "నువ్వు కూడా గలిలయ వాడివేనా ఏంటి? లేఖనాలను జాగ్రత్తగా చదువు. గలిలయ నుండి ఏ ప్రవక్తా రాడని నీకు తెలుస్తుంది" అన్నారు.
\s5
\p
\v 53 తరవాత వాళ్ళందరూ ఎవరికీ వారు ఇంటి ముఖం పట్టారు.
\s5
\c 8
\p
\v 1 యేసు తన శిష్యులతో కలిసి ఒలీవల కొండకు వెళ్ళి, ఆ రాత్రి అక్కడ గడిపాడు.
\v 2 ఆ మరుసటి ఉదయాన్నే యేసు దేవాలయ ఆవరణానికి తిరిగి వెళ్ళాడు. చాలామంది ఆయన చుట్టూ మూగారు. ఆయన వాళ్లకు బోధించడానికి కూర్చున్నాడు.
\v 3 యూదుల ధర్మశాస్త్రాన్ని బోధించే కొందరు, పరిసయ్యులు కొందరు ఒక స్త్రీని యేసు దగ్గరికి తెచ్చారు. ఆమె వ్యభిచరిస్తూ దొరికింది. ఆమెని ప్రశ్నించడానికి ఈ గుంపు యేసు ఎదుట నిలబెట్టారు.
\s5
\p
\v 4 వాళ్ళు యేసుతో, "బోధకా, ఈమె ఒక పరాయి మగాడితో వ్యభిచారం చేస్తూ దొరికింది.
\v 5 ఇలాంటి కులటను రాళ్ళతో కొట్టి చంపాలని మోషే ధర్మశాస్త్రంలో ఆజ్ఞాపించాడు. అయినా ఈ విషయంలో నువ్వు ఏమి చెప్తావో చెప్పు" అని అడిగారు.
\v 6 ఆయన్ని ఎలాగైనా ఇరకాటంలో పెట్టాలనే ఉద్దేశంతో ఈ ప్రశ్న అడిగారు. ఆమెని చంపకూడదని ఆయన అంటే మోషే ఆజ్ఞల్ని గౌరవించట్లేదు అనవచ్చు. ఆమెని చంపేయండి అంటే రోమా గవర్నరుకు మాత్రమే ఉన్న చట్టపరమైన అధికారం తన చేతుల్లోకి తీసుకున్నాడు అనవచ్చు. అయితే యేసు తలవంచుకుని నేల మీద ఏదో రాయసాగాడు.
\s5
\p
\v 7 వాళ్ళు ఆయన్ని అదేపనిగా ప్రశ్నిస్తూ ఉంటే ఆయన వాళ్ళతో, "మీలో ఎప్పుడూ పాపం చెయ్యని వారెవరో ఆమె మీద మొదటి రాయి వేసి శిక్షించొచ్చు" అన్నాడు.
\v 8 ఇలా చెప్పి మళ్ళీ నేల మీద రాయసాగాడు.
\s5
\v 9 ఆయన చెప్పింది విని, ఆయన్ని ప్రశ్నించిన వాళ్ళంతా ఒకరి తరవాత ఒకరు తేలుకుట్టిన దొంగల్లా వెళ్ళిపోసాగారు. తాము పాపం చేస్తున్నట్టు వాళ్లకు తెలుసు. చివరికి యేసు మాత్రమే అక్కడ ఆమెతో మిగిలాడు.
\p
\v 10 యేసు నిలబడి, "అమ్మా, నీ మీద నేరం మోపిన వాళ్ళు ఏరీ? ఎవరూ నీకు శిక్ష వేయలేదా?" అని ఆమెని అడిగాడు.
\v 11 ఆమె "లేదయ్యా" అంది. అప్పుడు యేసు, "నేను కూడా నీకు శిక్ష వేయను. ఇంటికి వెళ్ళు. ఇప్పటి నుండి ఇలా ఎప్పుడూ పాపం చెయ్యొద్దు" అన్నాడు.
\s5
\p
\v 12 యేసు మళ్ళీ ప్రజలతో మాట్లాడాడు. ఆయన, "నేను లోకానికి వెలుగును. నన్ను వెంబడించే వాడికి నిత్య జీవాన్నిచ్చే వెలుగు దొరుకుతుంది. వాడు ఇంకెప్పుడూ చీకటిలో నడవడు."
\v 13 అప్పుడు పరిసయ్యులు ఆయనతో, "నీ గురించి నువ్వు గొప్పలు చెప్పుకుని నిన్ను నమ్మేలా మమ్మల్ని ఒప్పించడానికి చూస్తున్నట్టు ఉందే! నీ గురించి నువ్వు చెప్పుకొనే సాక్ష్యం చెల్లుబాటు కాదు. అది నిరాధారం" అన్నారు.
\s5
\p
\v 14 అందుకు యేసు, "నా గురించి నేను ఒక్కడినే సాక్ష్యం చెప్పుకున్నా నేను చెప్పేది నిజమే. ఎందుకంటే నేను ఎక్కడి నుండి వచ్చానో , ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలుసు. నేను ఎక్కడి నుండి వచ్చానో ఎక్కడికి వెళ్తానో మీకు తెలియదు.
\v 15 మానవ ప్రమాణాల ప్రకారం , మనుషులు పెట్టిన చట్టాల ప్రకారం మీరు ప్రజలకి తీర్పు తీరుస్తారు. నేను ఎవరికీ తీర్పు తీర్చడానికి రాలేదు.
\v 16 నేను తీర్పు తీర్చినప్పుడు అది సరైనదీ న్యాయమైనదే అవుతుంది. నేను ఒక్కడినే న్యాయం తీర్చను. నేనూ నన్ను పంపిన తండ్రీ ఉభయులం కలిసి న్యాయం తీర్చుతాము.
\s5
\v 17 మీ ధర్మశాస్త్రాన్ని మోషే రాసినప్పుడు ఒక విషయాన్ని పరిష్కరించాలంటే కనీసం ఇద్దరు వ్యక్తుల సాక్ష్యాలు అవసరమని చెప్పాడు.
\v 18 నా గురించిన సాక్ష్యం మీకు ఇస్తున్నాను. నన్ను పంపిన తండ్రి కూడా నా గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి మేము చెప్పేది నిజమని మీరు నమ్మాలి" అన్నాడు.
\s5
\p
\v 19 అప్పుడు పరిసయ్యులు ఆయన్ని "నీ తండ్రి ఎక్కడ ఉన్నాడు?" అని అడిగారు. యేసు జవాబిస్తూ, "మీకు నేను తెలియదు. నా తండ్రి కూడా తెలియదు. మీకు నేను తెలిస్తే నా తండ్రి కూడా తెలిసే ఉండాలి" అన్నాడు.
\v 20 ఆయన ఈ విషయాలు చెప్పినప్పుడు దేవాలయ ఆవరణలో ప్రజలు తమ కానుకలు తెచ్చే హుండీ దగ్గర ఉన్నాడు. అయినా ఆయన్ని ఎవరూ అరెస్ట్ చేయలేదు ఎందుకంటే ఆయన మరణ సమయం ఇంకా రాలేదు.
\s5
\p
\v 21 యేసు వాళ్ళతో ఇంకా చెప్తూ, "నేను వెళ్ళిపోతున్నాను, మీరు నన్ను వెదుకుతారు. కానీ దేవుడు మీ పాపాలు క్షమించకుండానే మీరు చనిపోతారు. నేను వెళ్ళే చోటికి మీరు రాలేరు" అన్నాడు.
\v 22 యూదులలో ఆయన్ని వ్యతిరేకించే వాళ్ళు, బహుశా ఇతడు ఆత్మహత్య చేసుకుంటాడేమో. నేను వెళ్ళే చోటికి మీరు రాలేరు అని చెప్పిన మాటకి అర్ధం అదే, అని తమలో తాము అనుకున్నారు.
\s5
\p
\v 23 యేసు ఇంకా, "మీరు ఈ క్రింది భూమి నుండి వచ్చినవాళ్ళు, నేను పైన పరలోకం నుండి వచ్చిన వాడిని. మీరు ఈ లోకానికి చెందిన వాళ్ళు. నేను ఈ లోకానికి చెందిన వాణ్ణి కాదు.
\v 24 మీరు మరణిస్తారనీ దేవుడు మీ పాపాలకు శిక్ష విధిస్తాడనీ నేను మీకు చెప్పాను. నేను చెప్పినట్టు నేను దేవుణ్ణి అని మీరు నమ్మకపోతే ఇది తప్పక జరుగుతుంది."
\s5
\p
\v 25 "నువ్వెవరు?" అని వాళ్ళు ఆయన్ని అడిగారు. యేసు వాళ్ళతో, "మొదటి నుండి నేను చెప్తూనే ఉన్నాను.
\v 26 చాలా విషయాల్లో మీరు పాపం చేశారని నేను మీకు తీర్పు చెప్పగలను. అలా కాక నన్ను పంపిన వాడు నిజమే చెప్తాడు. ఆయన నుండి నేను ఏం విన్నానో లోకంలో ఉన్న మనుషులకి అదే చెప్తాను."
\p
\v 27 యేసు పరలోకంలోని తండ్రి గురించి మాట్లాడుతున్నాడని వాళ్ళు అర్ధం చేసుకోలేదు.
\s5
\v 28 కాబట్టి యేసు - "నన్ను చంపడానికి నన్ను సిలువ ఎక్కించినప్పుడు మనుష్యకుమారుణ్ణి అయిన నేను దేవుణ్ణి అని మీరు తెలుసుకుంటారు. అంతే కాదు, నా సొంత అధికారంతో నేను ఏమీ చేయలేదని తెలుసుకుంటారు. నా తండ్రి నాకు చెప్పింది మాత్రమే చెప్తాను.
\v 29 నన్ను పంపినవాడు నాతో ఉన్నాడు. ఆయన నన్ను ఏకాకిని చేయలేదు. ఎందుకంటే ఆయన్ని సంతోషపెట్టేవే నేను చేస్తాను."
\v 30 యేసు ఈ విషయాలు చెప్పినప్పుడు ఇంకా చాలామంది ఆయన దేవుడు పంపిన వాడని నమ్మారు.
\s5
\p
\v 31 ఇప్పుడు ఆయనలో నమ్మకం ఉంచామని చెప్పిన యూదులకి యేసు, "నేను బోధించినది అంతా మీరు వింటే మీ ప్రవర్తన మార్చుకుని ఆ విధంగా జీవించండి. అప్పుడు మీరు నా నిజమైన శిష్యులు అవుతారు.
\v 32 మీరు సత్యాన్ని తెలుసుకుంటారు. ఆ సత్యమే మిమ్మల్ని బానిసత్వం నుండి విడిపించి, స్వేచ్ఛను ఇస్తుంది" అని చెప్పాడు.
\v 33 వాళ్ళు, "మేము అబ్రాహాము పిల్లలం. మేము ఎప్పుడూ బానిసలుగా ఉండలేదు. మాకు స్వేచ్చ అవసరమని ఎందుకు అంటున్నావు?" అని అడిగారు.
\s5
\p
\v 34 యేసు, "నేను మీకు నిజం చెప్తున్నాను. "బానిస తన యజమానికి బలవంతంగా లోబడినట్టే పాపపు కోరికలకు లోబడిన వాళ్ళు పాపానికి బానిసలు.
\v 35 బానిసలు కుటుంబంలో శాశ్వత సభ్యులు కారు. వారిని వేరొక యజమానికి అమ్మివేసినా ఇప్పుడున్న యజమాని వారికి విడుదల ఇచ్చినా వారు తమ ఇంటికి తిరిగి వెళ్ళిపోయినా, వారు ఇకపై ఆ కుటుంబంలో భాగం కాదు. అయితే కుమారుడు ఎప్పటికీ కుటుంబ సభ్యుడే.
\v 36 కాబట్టి కుమారుడు మిమ్మల్ని విడిపిస్తే, మీరు పూర్తిగా స్వేచ్చ పొందుతారు."
\s5
\p
\v 37 "మీరు అబ్రాహాము కుటుంబం నుండి వచ్చారనీ, మీరు ఆయన పిల్లలనీ నాకు తెలుసు. అయితే మీ మనుషులు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. నేను చెప్పింది ఏదీ మీరు నమ్మరు.
\v 38 నేను ఆశ్చర్యకరమైన విషయాలన్నీ మీకు చెప్తున్నాను, మీరు మాత్రం మీ తండ్రి మీకు చెప్పిందే చేస్తారు" అన్నాడు.
\s5
\p
\v 39 అప్పుడు వాళ్ళు, "అబ్రాహాము మా పితరుడు" అన్నారు. యేసు వాళ్ళతో, "మీరు అబ్రాహాము పిల్లలైతే అతను చేసిన మంచి పనులు చేయాలనుకుంటారు.
\v 40 నేను దేవుని నుండి విన్న నిజాన్నే నేను మీకు చెప్పాను. కానీ మీరు నన్ను చంపాలని చూస్తున్నారు. అబ్రాహాము ఇలాంటి పనులు చేయలేదు.
\v 41 మీ అసలైన తండ్రి చేసేవి మీరు చేస్తున్నారు" అన్నాడు. వాళ్ళు, "నీ గురించి మాకు తెలీదు. మేము మాత్రం అక్రమ సంతానం కాదు. మాకు ఒక్కడే తండ్రి. అది దేవుడే" అన్నారు.
\s5
\p
\v 42 యేసు వాళ్ళతో, "దేవుడు మీ తండ్రి అయితే నేను దేవుని దగ్గర నుండి లోకానికి వచ్చాను కాబట్టి మీరు నన్ను ప్రేమిస్తారు. నాకు నేనుగా రాలేదు. నన్ను ఆయనే పంపాడు.
\v 43 నేను చెప్పేది మీకు ఎందుకు అర్ధం కావడం లేదో చెప్తాను. నా బోధలూ నా సందేశాలూ మీరు అంగీకరించలేక పోతున్నారు.
\v 44 మీరు మీ తండ్రి సాతానుకు చెందినవాళ్ళు. వాడికి ఇష్టమైనదే మీరు చేయడానికి ఇష్టపడతారు. మొదటిగా మనుషులు పాపం చేసిన కాలం నుండి వాడు నరహంతకుడు. వాడు దేవుని సత్యాన్ని వదిలేసాడు. వాడిలో ఆ సత్యం ఇప్పుడు లేదు. వాడు అబద్ధాలకోరు కాబట్టి వాడు అబద్ధాలు చెప్పిన ప్రతిసారీ తన స్వభావం ప్రకారం మాట్లాడతాడు. అబద్ధాలు చెప్పేవాళ్ళు సాతాను వాళ్ళను ఎలా ఉండాలని కోరుకుంటాడో అలానే ఉంటారు."
\s5
\p
\v 45 "నేను నిజం చెప్పినా మీరు నన్ను నమ్మరు.
\v 46 నేను పాపం ఏమీ చేయలేదు కాబట్టి ఆ విషయంలో నా మీద మీరు నేరం మోపలేరు. నేను సత్యం చెప్పినా నన్ను నమ్మకపోడానికి సరైన కారణం ఏం లేదు.
\v 47 దేవునికి చెందిన వాళ్ళు ఆయన ఏం చెబితే అది విని, లోబడతారు. ఆయన సందేశం విని, లోబడకపోడానికి కారణం మీరు దేవునికి చెందిన వాళ్ళు కాక పోవడమే."
\s5
\p
\v 48 యూదులలో ఉన్న ఆయన శత్రువులు ఆయనతో, "నువ్వు సమరయుడివని మేము అన్నది నిజమే. నువ్వు యూదుడివే కాదు. నీలో దయ్యం ఉంది" అన్నారు.
\v 49 యేసు జవాబిస్తూ, "దయ్యం నాలో నివసించదు. నేను నా పరలోక తండ్రిని గౌరవిస్తాను. కానీ మీరు ఆయన్ని గౌరవించరు."
\s5
\p
\v 50 "నన్ను పొగడడానికి మనుషుల్ని నేను ఒప్పించను. నా అర్హతను బట్టి నాకు ఇవ్వడానికి ఇంకొకరు ఉన్నారు. నేను చెప్పేదీ చేసేదీ ప్రతిదీ న్యాయమో కాదో తీర్పు తీర్చేది ఆయనే.
\v 51 నేను మీకు నిజం చెప్తున్నాను - నా మాటలను స్థిరంగా పట్టుకుని, నేను ఇచ్చిన దానిలో నమ్మకంగా ఉన్నవాడు ఎప్పటికీ చనిపోడు" అన్నాడు.
\s5
\p
\v 52 దానికి యూదు ప్రత్యర్థులు ఆయనతో, "నీలో దయ్యం ఉందని ఇప్పుడు తేట తెల్లం అయిపోయింది. అబ్రాహాము, ప్రవక్తలు పూర్వం ఎప్పుడో చనిపోయారు. మరి నీవేమో నీవు బోధించిన దానిలో స్థిరంగా ఉంటే ఎప్పటికీ చనిపోరని చెప్తున్నావు.
\v 53 నువ్వు మా పితరుడు అబ్రాహాము కంటే గొప్పవాడివా ఏంటి? అతను చనిపోయాడు, ప్రవక్తలందరూ చనిపోయారు. ఇప్పుడు నీ గురించి నువ్వు ఏమని అనుకుంటున్నావు?" అన్నారు.
\s5
\p
\v 54 యేసు వాళ్లతో, "ప్రజలు నన్ను పొగడాలని నేను ప్రయత్నిస్తే అది వ్యర్ధమే. మీరు మీ దేవుడు అని ఎవరి గురించి చెప్తున్నారో ఆయన నా తండ్రి. నా మంచితనాన్నీ గుణాన్నీ పొగిడేది ఆయనే.
\v 55 మీకు ఆయన తెలియకపోయినా ఆయన నాకు తెలుసు. ఆయన నాకు తెలియదని చెప్తే మీలా నేను కూడా అబద్ధికుడిని అవుతాను. నాకు ఆయన తెలుసు, ఆయన చెప్పిన దానికి నేను ఎప్పుడూ లోబడతాను.
\v 56 నేను చేయబోయేది ఒక ప్రవక్తగా మీ పితరుడు అబ్రాహాము చూసినప్పుడు సంతోషిస్తాడు."
\s5
\p
\v 57 యూదు నాయకులు ఆయనతో, "అబ్రాహాము చాలాకాలం క్రితం చనిపోయాడు. నీకు ఇంకా 50 ఏళ్ళు కూడా లేవు. అబ్రాహామును చూశానని ఎలా చెప్తున్నావు?" అని అడిగారు.
\v 58 యేసు వాళ్లతో, "నిజం చెప్పాలంటే అబ్రాహాము పుట్టక ముందే నేను ఉన్నాను" అన్నాడు.
\v 59 వాళ్ళు రాళ్ళు తీసుకుని ఆయన్ని చంపడానికి ఆయన మీదికి విసిరారు. వాళ్ళకి కనిపించకుండా ఆయన తప్పించుకుని దేవాలయ ప్రాంగణం విడిచి వేరే చోటికి వెళ్ళిపోయాడు.
\s5
\c 9
\p
\v 1 యేసు, ఆయన శిష్యులు కలిసి నడిచి వెళ్తున్నారు. పుట్టిన దగ్గర నుండి జీవితమంతా గుడ్డివాడిగా ఉన్న వ్యక్తిని ఆయన చూశాడు.
\v 2 ఆయన శిష్యులు, "బోధకా, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి ఏ పాపం కారణం అయి ఉంటుంది? ఇతను స్వయంగా పాపం చేశాడా, లేక ఇతని తలిదండ్రులా?" అని అడిగారు.
\s5
\p
\v 3 అప్పుడు యేసు, "ఇతడు గానీ ఇతని తలిదండ్రులు గానీ పాపం చేయలేదు. ఈ రోజున దేవుని శక్తివంతమైన కార్యాన్ని మనుషులు చూడాలనే ఇతను పుట్టుకతో గుడ్డివాడిగా పుట్టాడు.
\v 4 ఇంకా సమయం ఉన్నప్పుడే నన్ను పంపినవాడు నన్ను చేయమన్న పని నేను చేయాలి. పగలు తరువాత రాత్రి వచ్చినప్పుడు మనుషులు పని చెయ్యరు. దేవుడు మనం ఏం చేయాలని అనుకుంటున్నాడో అది చేయడానికి చాలా ఆలస్యం అయిపోయిందే అనుకునే సమయం వస్తుంది.
\v 5 నేను ఈ లోకంలో ఇంకా జీవిస్తుండగా లోకానికి వెలుగును ఇచ్చేది నేనే" అని జవాబిచ్చాడు.
\s5
\p
\v 6 ఆయన ఇలా చెప్పి నేల మీద ఉమ్మివేసి, దానితో బురద చేసి, ఆ గుడ్డివాడి కళ్ళకు మందులా రాసాడు.
\v 7 అప్పుడు యేసు అతనితో "సిలోయం అనే చెరువుకు వెళ్లి కడుక్కో" అన్నాడు. సిలోయం అనే మాటకి "పంపించడం" అని అర్థం. అప్పుడు వాడు వెళ్లి ఆ చెరువులో కళ్ళు కడుక్కున్నాడు. కంటి చూపుతో తిరిగి వచ్చాడు.
\s5
\p
\v 8 అతడు అడుక్కుంటూ ఉండగా చూసిన వాళ్ళు, "వీడు ఇక్కడ కూర్చుని అడుక్కునేవాడు కదా" అన్నారు.
\v 9 కొందరు ఔను వీడే అన్నారు. మరికొందరు, "కాదు. అదే పోలికలున్న వేరే మనిషి" అన్నారు. అయితే వాడు స్వయంగా వాళ్ళతో, "ఆ మనిషి నేనే" అన్నాడు.
\s5
\p
\v 10 దానికి వాళ్ళు, "ఇప్పుడు నువ్వు ఎలా చూడగలుగుతున్నావు?" అని అడిగారు.
\v 11 అతను, "యేసు అనే మనిషి బురదను మందులా వాడి నా కళ్ళ మీద పూసి, సిలోయం చెరువు దగ్గరికి వెళ్లి కడుక్కోమన్నాడు. అక్కడికి వెళ్లి కడుక్కున్నాను. అప్పుడు మొదటిసారి ప్రపంచాన్ని చూడగలిగాను" అని చెప్పాడు.
\v 12 "ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు?" అని వాళ్ళు అతణ్ణి అడిగారు. అతడు "నాకు తెలియదు" అన్నాడు.
\s5
\p
\v 13 కొందరు మనుషులు పరిసయ్యులు కూర్చుని ఉన్నచోటికి అతణ్ణి తీసుకువెళ్ళారు.
\v 14 యేసు బురద చేసి అతని చూపు తెప్పించిన రోజు యూదుల విశ్రాంతి దినం.
\v 15 కాబట్టి పరిసయ్యులు "నీకు చూపు ఎలా వచ్చింది?" అని అతణ్ణి మళ్ళీ అడిగారు. వాడు "ఒక మనిషి నా కళ్ళకి బురద రాసాడు, నేను కడుక్కున్నాను, నాకు చూపు వచ్చింది" అన్నాడు.
\s5
\v 16 కొందరు పరిసయ్యులు "ఈ యేసు విశ్రాంతి దిన్నాన్ని పాటించడం లేదు కాబట్టి అతడు దేవుడి నుండి వచ్చినవాడు కాదని తెలుసి పోతూ ఉంది" అన్నారు. ఆ గుంపులో నుండి కొందరు, "అతను పాపి అయితే అందరూ చూసేలా ఇంత శక్తివంతమైన పనులు ఎలా చేయగలడు?" అన్నారు. పరిసయ్యుల్లో అభిప్రాయభేదాలు పుట్టాయి.
\p
\v 17 వాళ్ళు ఆ గుడ్డివాణ్ణి మళ్ళీ, "అతడు నీకు చూపు తెప్పించాడు కదా. అతని గురించి నువ్వు ఏం చెప్తావు?" అని అడిగారు. "అతను ప్రవక్త అయ్యి ఉండాలి" అని ఆ మనిషి చెప్పాడు.
\p
\v 18 పరిసయ్యులు అతడు గతంలో గుడ్డివాడుగా ఉండి, ఇప్పుడు చూడగలుగుతున్నాడని నమ్మలేకపోయారు. యేసుకు వ్యతిరేకంగా పోగయ్యారు. అతని తలిదండ్రుల్ని ప్రశ్నించాలని వాళ్ళని తీసుకు రమ్మని కొందరిని పంపారు.
\s5
\p
\v 19 అతని తలిదండ్రుల్ని, "వీడు మీ కొడుకేనా? పుట్టినప్పటి నుండి గుడ్డివాడేనా? ఇప్పుడు ఎలా చూడగలుగుతున్నాడు?" అని అడిగారు.
\v 20 అందుకు వాళ్ళు, "వీడు మా కొడుకే. వాడు పుట్టినప్పుడు గుడ్డివాడని మాకు తెలుసు.
\v 21 అయితే వాడు ఎలా చూడగలుగుతున్నాడో మాకు తెలియదు. వాడి కళ్ళు ఎవరు స్వస్థపరిచారో మాకు తెలియదు. వాడినే అడగండి. జవాబు చెప్పగల వయస్సు వాడికి ఉంది కదా" అన్నారు.
\s5
\v 22 యేసును మెస్సీయ అని ఎవరైనా అంటే సమాజ మందిరంలోకి రాకుండా నిషేధించాలని ముందుగానే యూదులు ఒక అంగీకారానికి వచ్చారు కాబట్టి అతని తలిదండ్రులు యూదుల నాయకులకు భయపడ్డారు.
\v 23 అందుకే వాళ్ళు, "వాడినే అడగండి, వాడు చిన్న పిల్లవాడేమీ కాదు గదా" అన్నారు.
\s5
\p
\v 24 అప్పుడు యూదుల నాయకులు ఆ గుడ్డివాడిని రెండోసారి పిలిపించారు. వాడు వచ్చాక, "నిజమే చెప్తానని దేవుని మీద ఒట్టు వెయ్యి. నిన్ను స్వస్థపరచిన ఈ మనిషి పాపాత్ముడని మాకు తెలుసు. అతడు మోషే మనకు ఇచ్చిన ఆజ్ఞల్ని పాటించడు" అని అతనితో అన్నారు.
\v 25 అందుకు వాడు, "ఆయన పాపి ఔనో కాదో నాకు తెలీదు. నాకు తెలిసిన ఒకే విషయం నేను గుడ్డివాడిగా ఉండేవాణ్ణి. ఇప్పుడు చూడగలుగుతున్నాను" అన్నాడు.
\s5
\p
\v 26 దానికి వాళ్ళు అతనితో, "ఆయన నీకు ఏమి చేశాడు? నువ్వు చూడగలిగేలా నిన్ను ఎలా స్వస్థపరచాడు?" అన్నారు.
\v 27 వాడు జవాబిస్తూ, "నేను మీకు ముందే చెప్పాను. కానీ మీరు నన్ను నమ్మలేదు. మళ్ళీ నన్ను చెప్పమని పదే పదే ఎందుకు అడుగుతున్నారు? మీరు కూడా ఆయన శిష్యులు అవ్వాలని అనుకుంటున్నారా ఏమిటి?" అన్నాడు.
\s5
\p
\v 28 అప్పుడు వాళ్ళు మండిపడి ఈసడింపుగా "నువ్వే అతని శిష్యుడివి. మేము మోషే శిష్యులం.
\v 29 దేవుడు మోషేతో మాట్లాడాడని మాకు తెలుసు. కానీ ఈ మనిషి ఎక్కడి నుండి వచ్చాడో కూడా తెలియదు" అన్నారు.
\s5
\p
\v 30 అప్పుడు చూపు పొందిన గుడ్డివాడు వాళ్ళతో, "చాలా ఆశ్చర్యంగా ఉందే! ఆయనకు శక్తి ఎక్కడి నుండి వచ్చిందో మీకు తెలీదు కానీ నా కళ్ళు బాగుచేసింది మాత్రం ఆయనే.
\v 31 తన ఆజ్ఞలు పట్టించుకోని పాపుల ప్రార్ధనలు దేవుడు వినడని తెలుసు. ఆయనకి ఇష్టమైనట్టు ప్రవర్తిస్తూ ఆయన్ని ఆరాధించే వాళ్ళ ప్రార్ధనలు ఆయన వింటాడు."
\s5
\p
\v 32 "లోకం ఆరంభమైనప్పటి నుండి పుట్టు గుడ్డివాణ్ణి స్వస్థపరచడం ఎక్కడైనా జరిగిందా?
\v 33 ఈ మనిషి దేవుని దగ్గర నుండి రాకపోతే ఇలాంటిది చేయలేడు గదా" అన్నాడు.
\v 34 దానికి వాళ్ళు, "నీ తలిదండ్రుల పాప ఫలితంగా నువ్వు పుట్టావు. నీ జీవితం అంతా పాపంలోనే బ్రతికావు. మమ్మల్ని సవాలు చేసేటంత వాడివా?" అని, వాణ్ణి యూదా సమాజ మందిరంలోనించి వెలివేశారు.
\s5
\p
\v 35 తను స్వస్థపరచిన వ్యక్తిని పరిసయ్యులు సమాజ మందిరం నుండి వెలివేసిన సంగతి యేసు విని, అతని కోసం వెదకడానికి వెళ్ళాడు. అతను కనిపించినప్పుడు ఆయన అతనితో, "మనుష్యకుమారుడి మీద నువ్వు నమ్మకం ఉంచుతున్నావా?" అన్నాడు.
\v 36 అతను, "అయ్యా! నమ్మడానికి ఆయన ఎవరో ముందు చెప్పండి" అన్నాడు.
\v 37 యేసు అతనితో, "నువ్వు ఆయన్ని చూసావు. నీతో మాట్లాడుతున్నది ఆయనే" అన్నాడు.
\v 38 అప్పుడు అతను, "ప్రభూ! నేను నమ్ముతున్నాను" అని, కాళ్ళపై పడి ఆయన్ని పూజించాడు.
\s5
\p
\v 39 యేసు, "గుడ్డివాళ్ళు చూపు పొందేలా, చూపు ఉన్న వాళ్ళు గుడ్డివాళ్ళు అయ్యేలా తీర్పు తీర్చడానికి నేను ఈ లోకానికి వచ్చాను" అన్నాడు.
\v 40 అక్కడ ఉన్న కొందరు పరిసయ్యులు ఆయన్ని, "మేము కూడా గుడ్డి వాళ్ళమేనా?" అని అడిగారు.
\v 41 యేసు వాళ్ళతో, "మీరు గుడ్డివాళ్ళు అయితే మీకు పాపం ఉండేది కాదు. అయితే మీకు అనుకూలంగా మాట్లాడుతూ "మాకు చూపు ఉంది" అని చెప్పుకుంటున్నారు కాబట్టి మీ పాపం నిలిచి ఉంటుంది" అని చెప్పాడు.
\s5
\c 10
\p
\v 1 "నేను నిజమే చెప్తున్నాను - గొర్రెల దొడ్డిలోకి వెళ్ళేవాడు ద్వారం గుండా వెళ్తాడు. వేరే దారిలో ఎక్కి వెళ్ళేవాడు గొర్రెల కాపరి కాదు. గొర్రెల్ని దొంగిలించే దొంగ.
\v 2 గొర్రెల దొడ్డిలో గొర్రెల్ని జాగ్రత్త చేసి, ద్వారం గుండా ప్రవేశించేవాడు నిజమైన గొర్రెల కాపరి."
\s5
\p
\v 3 "గొర్రెల కాపరి లేనప్పుడు గొర్ర్రెలను కాయడానికి జీతానికి పెట్టుకున్న కాపలావాడు కాపరి వచ్చినప్పుడు తలుపులు తెరుస్తాడు. అయితే గొర్రెలు మాత్రం కాపరి తమను పేరుతో పిలిచినప్పుడు అతని గొంతును మాత్రమే గుర్తుపడతాయి. అప్పుడు కాపరి వాటిని దొడ్డిలో నుండి బయటికి తీసుకు వెళ్ళి మేత, నీళ్ళు పెడతాడు.
\v 4 తన సొంత గొర్రెల్ని బయటికి తెచ్చాక కాపరి వాటి ముందు నడుస్తాడు. అతని స్వరం గొంతు వాటికి తెలుసు కాబట్టి అతణ్ణి నమ్మకంగా వెంబడిస్తాయి.
\s5
\v 5 పరిచయం లేనివాడు వాటిని పిలిచినా అవి వెంబడించవు. అతని స్వరం పరిచయం లేక పారిపోతాయి."
\p
\v 6 గొర్రెల కాపరి చేసే పని నుండి ఈ ఉదాహరణను యేసు వాడాడు. అయితే ఆయన శిష్యులు ఆయన చెప్పింది అర్ధం చేసుకోలేకపోయారు.
\s5
\p
\v 7 కాబట్టి యేసు వాళ్ళతో, "నేను మీకు నిజం చెప్తున్నాను, గొర్రెల దొడ్డి లోకి గొర్రెలు ప్రవేశించే ద్వారాన్ని నేనే.
\v 8 నాకు ముందు వచ్చిన వాళ్ళందరూ దొంగలూ బందిపోట్లూ. కానీ గొర్రెలు నా మాట వినిపించుకోలేదు. నన్ను అవి వెంబడించలేదు.
\s5
\v 9 నేనే గొర్ర్రెలు ప్రవేశించే ద్వారం. నాలో నమ్మకం ఉంచి తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ దేవుడు రక్షిస్తాడు. అవి భద్రత గల ద్వారాల నుండి బయటికి వెళుతూ లోపలికి వస్తూ మేత భూములకు పోతూ ఉండేలా వాటిని జాగ్రత్తగా కాపాడతాను.
\v 10 దొంగ దొంగిలించడానికీ చంపడానికీ నాశనం చేయడానికీ మాత్రమే వస్తాడు. జీవం పొంగి పొర్లేలా వాళ్ళు నిత్యజీవం పొందేలా చేయడానికి నేను వచ్చాను."
\s5
\p
\v 11 "నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల్ని భద్రం చేసి, రక్షించడానికీ చనిపోడానికీ కూడా ఇష్టపడతాడు.
\v 12 గొర్రెల కాపరిని జీతం ఇచ్చిఎవరైనా పెట్టుకోవచ్చు. అతడు గొర్రెల్ని తనవిగా చూడడు. అతడు జీతగాడే. కాబట్టి తోడేలు వాటిని వేటాడ డానికి వచ్చినప్పుడు అతడు తన ప్రాణాన్ని ఫణంగా పెట్టడు. అతడు గొర్రెల్ని వదిలి పారిపోతాడు. అప్పుడు తోడేలుకి గొర్రెల మీద దాడి చేయడం సులువు అవుతుంది. కొన్ని తోడేలుకు చిక్కుతాయి, కొన్ని చెదిరిపోతాయి.
\v 13 జీతగాడు కేవలం జీతం కోసం పనిచేస్తాడు కాబట్టి పారిపోతాడు. గొర్రెలకి ఏం అవుతుందో అతనికి పట్టదు."
\s5
\p
\v 14 "నేనే మంచి గొర్రెల కాపరిని. నాకు చెందిన వాళ్ళు నాకు తెలుసు, వాళ్ళకి నేను తెలుసు.
\v 15 నా తండ్రికి నేనూ నాకు తండ్రీ తెలిసినట్టుగా నాకు చెందిన వాళ్ళ కోసం నన్ను అర్పించుకుంటాను.
\v 16 ఇతర గొర్రెల దొడ్డిలోని గొర్రెల్లా వాళ్ళను నా దగ్గరికి తెచ్చుకుంటాను. నేను చెప్పే దానిమీద వాళ్ళు దృష్టి పెడతారు. చివరికి నాకు చెందిన మందతో కలిసి అవి ఒకటిగా ఉంటాయి. నేను ఒక్కడినే కాపరిగా ఉంటాను."
\s5
\p
\v 17 "నా ప్రాణం అర్పిస్తాను గనక నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. మళ్ళీ నా ప్రాణం నేను తీసుకుని బ్రతుకుతాను.
\v 18 నా ప్రాణం ఇవ్వడానికి ఎవరూ కారణం కాదు. నా ప్రాణం అర్పించడానికి నేనే స్వయంగా ఎంచుకున్నాను. నా ప్రాణం ఇవ్వడానికీ దాన్ని మళ్ళీ తీసుకుని బ్రతకడానికీ నాకు అధికారం ఉంది. ఈ పని నా తండ్రి నుండి వచ్చింది. ఇలా చేయమని ఆయన ఆజ్ఞ ఇచ్చాడు."
\s5
\p
\v 19 యేసు చెప్పిన ఈ మాటలు విన్న తరువాత యూదులలో ఆయన గురించి అభిప్రాయ భేదాలు వచ్చాయి.
\v 20 వాళ్ళలో చాలామంది, "అతనికి దయ్యం పట్టి ఇలా పిచ్చి వాడైపోయాడు. అతని మాటలు విని సమయం పాడు చేసుకోవద్దు" అన్నారు.
\v 21 "అతను చెప్పేవి దయ్యం పట్టిన వాడి మాటలు కానే కాదు. గుడ్డివాణ్ణి దయ్యం స్వస్థపరచగలదా?" అని మరికొందరు అన్నారు.
\s5
\p
\v 22 యూదా ప్రజలు తమ పితరులు దేవాలయాన్ని శుద్దీకరించి, మళ్ళీ దేవునికి ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఆచరించే పండగను ప్రతిష్టిత పండగ అంటారు. ఆ ప్రతిష్టిత పండగ చేసుకునే సమయం వచ్చింది. అది చలికాలం.
\v 23 యేసు దేవాలయ ప్రాంగణంలో నడుస్తూ సోలోమోను మంటపం అనే చోట ఉన్నాడు.
\v 24 యేసుకు వ్యతిరేకంగా ఉన్న యూదులు ఆయన చుట్టూ చేరి, "ఎంతకాలం మమ్మల్ని గందరగోళంలో ఉంచుతావు? నువ్వు మెస్సీయ అయితే మాకు స్పష్టంగా చెప్పు" అన్నారు.
\s5
\v 25 యేసు వాళ్ళతో, "నేను మీకు చెప్పాను గానీ మీరు నన్ను నమ్మలేదు. నా తండ్రి పేరిట ఆయన అధికారంతో నేను చేసిన అద్భుతాల వల్లా ఇతర విషయాల వల్లా నేను ఎవరో మీకు తెలుసు. నా గురించి అవే తేటతెల్లం చేస్తాయి.
\v 26 మీరు నాకు చెందని వారు కాబట్టి నాలో విశ్వాసం ఉంచరు. మీరు వేరొక కాపరికి చెందిన గొర్రెలు."
\s5
\p
\v 27 "గొర్రెలు వాటి నిజమైన కాపరి గొంతు విని గుర్తు పట్టినట్టే, నా ప్రజలు నేను చెప్పే దాని మీద దృష్టి పెడతారు. వాళ్ళు నాకు తెలుసు, వాళ్ళు నా అనుచరులు అయ్యారు.
\v 28 నేను వాళ్లకు నిత్య జీవం ఇస్తాను. ఎవరూ ఎప్పుడూ వాళ్ళను నాశనం చేయలేరు. నా నుండి ఎవరూ వాళ్ళను దొంగిలించలేరు."
\s5
\p
\v 29 "నా తండ్రి వాళ్ళను నాకు ఇచ్చాడు. ఆయన అందరికంటే గొప్పవాడు. కాబట్టి ఎవరూ ఆయన నుండి దొంగిలించలేరు.
\v 30 నేను నా తండ్రి ఒకటిగా ఉన్నాం" అన్నాడు.
\v 31 ఆ మాటకు యేసు శత్రువులు ఆయనను చంపాలని ఆయన మీదికి మళ్ళీ రాళ్ళు ఎత్తారు.
\s5
\p
\v 32 యేసు వాళ్ళతో, "నా తండ్రి నాకు చెప్పగా నేను చాలా అద్భుతాలు చేయడం మీరు చూశారు. వాటిలో దేని విషయంలో నన్ను రాళ్ళతో కొట్టాలని అనుకుంటున్నారు?" అని అడిగాడు.
\v 33 యేసును వ్యతిరేకించే ఆ యూదులు, "నువ్వు చేసిన ఏ మంచి పని వలనా నిన్ను చంపాలని మేము అనుకోవడం లేదు. కానీ నువ్వు మానవమాత్రుడివి, నిన్ను నువ్వు దేవుడిగా చేసుకుని, దేవుణ్ణి అవమానిస్తున్నావు" అన్నారు.
\s5
\p
\v 34 యేసు వాళ్ళతో, "దేవుడు పాలకులుగా నియమించిన వాళ్ళతో లేఖనాల్లో ఇలా రాయించాడు - మీరు దేవుళ్ళ వంటివారు (అనేక మంది మీద అధికారులుగా, ఘనతతో ఉండడానికి).
\v 35 ఈ మాటలు ఆయన నాయకుల్ని నియమిస్తూ చెప్పాడు. వాళ్ళు ఎవ్వరూ దానికి అభ్యంతరం చెప్పలేదు. లేఖనాల్లో ఉన్నది ఏదీ తప్పుగా చూపలేదు.
\v 36 నా తండ్రి ఈ లోకానికి పంపడానికి నన్నుఎంచుకున్నాడు. నేను దేవుని కుమారుణ్ణి అన్నందుకు దేవునితో నిన్నెందుకు సమానం చేసుకున్నావని మీరు నా మీద మండిపడుతున్నారు?
\s5
\v 37 నా తండ్రి నాకు చెప్పిన పనులు నేను చెయ్యకపోతే నాలో మీరు నమ్మకం ఉంచాలని నేను అనుకునేవాణ్ణి కాదు.
\v 38 నేను చెప్పింది మీరు నమ్మకపోయినా నేను ఈ పనులు చేస్తున్నందుకు అయినా ఆ పనులు మీకు వెల్లడి చేస్తున్న దాని మీద నమ్మకం ఉంచండి. మీరు అలా చేస్తే అప్పుడు నా తండ్రి నాలో ఉన్నాడనీ, నేను నా తండ్రిలో ఉన్నాననీ మీకు అర్ధం అవుతుంది."
\p
\v 39 ఆ మాటలు వాళ్ళు విని యేసుని బంధించాలని మళ్ళీ ప్రయత్నం చేశారు గానీ మరొకసారి ఆయన వాళ్ళ నుండి తప్పించుకున్నాడు.
\s5
\p
\v 40 అప్పుడు యేసు యొర్దాను నది దాటి తూర్పు వైపు ఉన్న ప్రాంతానికి తిరిగి వెళ్ళాడు. అది ఆయన పరిచర్య ప్రారంభంలో యోహాను బాప్తిసం ఇచ్చిన చోటు. యేసు చాలా రోజులు అక్కడే ఉన్నాడు.
\v 41 చాలామంది ఆయన దగ్గరికి వచ్చారు. వాళ్ళు, "బాప్తిసమిచ్చే యోహాను ఎప్పుడూ అద్భుతాలు చెయ్యలేదు. కానీ ఈ మనిషి చాలా అద్భుతాలు చేస్తున్నాడు. యోహాను ఈయన గురించి చెప్పింది అంతా నిజమే" అని చెప్పుకున్నారు.
\v 42 అనేకులు ఆయనలో నమ్మకముంచారు. ఆయన ఎవరో గ్రహించారు. ఆయన వాళ్లకి చేయబోయేది ఏమిటో అర్థం చేసుకున్నారు.
\s5
\c 11
\p
\v 1 లాజరు అనే మనిషి జబ్బుపడ్డాడు. అతడు తన అక్కలు మార్త, మరియలతో కలిసి బేతనియ అనే ఊరిలో ఉండేవాడు.
\v 2 ఒకసారి యేసుపై తన ప్రేమాభిమానాలు చూపడం కోసం ఆయనను అత్తరుతో అభిషేకించి తన జుట్టుతో ఆయన పాదాలు తుడిచింది ఈ మరియే. ఆమె తమ్ముడే ఈ జబ్బు పడిన లాజరు.
\s5
\p
\v 3 ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు లాజరు గురించి యేసుకు "ప్రభూ, నువ్వు ప్రేమించే వాడు జబ్బు పడ్డాడు" అని కబురు పంపారు.
\v 4 లాజరు జబ్బు గురించి విని యేసు, "ఈ జబ్బు లాజరు చనిపోవడంతో ముగిసిపోదు. ఈ జబ్బు రావడంలో ఉద్దేశం దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసినప్పుడు మనుషులు దాన్ని చూసి ఆయన ఎంత గొప్పవాడో తెలుసుకోవడం. కాబట్టి దేవుని కుమారుణ్ణి అయిన నేను ఆయన శక్తిని చూపిస్తాను" అన్నాడు.
\s5
\p
\v 5 యేసు మార్తనూ ఆమె సోదరి మరియనూ, సోదరుడు లాజరునూ ప్రేమించాడు.
\v 6 లాజరుకు జబ్బుచేసిందని యేసు విని కూడా అతణ్ణి చూడడానికి వెళ్ళకుండా ఆలస్యం చేసాడు. ఆయన ఉన్న చోటే ఇంకా రెండు రోజులు ఉండిపోయాడు.
\p
\v 7 అప్పుడు తన శిష్యులతో ఆయన, "మనం యూదయకు వెళ్దాం" అన్నాడు.
\s5
\v 8 ఆయన శిష్యులు ఆయనతో, "బోధకా కొన్ని రోజుల క్రితమే యూదులు నీకు వ్యతిరేకమై నిన్ను రాళ్ళతో చంపాలని చూశారు. ఇప్పుడు నువ్వు తిరిగి ఆ ప్రాంతానికి వెళ్ళాలంటున్నావు" అన్నారు.
\v 9 యేసు జవాబిస్తూ, "మీకు తెలుసా, రోజులో పన్నెండు గంటలపాటు పనులు చేసుకోడానికి వెలుగు ఉంటుంది. పగలు నడిచే వ్యక్తి దారిలో ఏమి ఉందో చూడగలడు కాబట్టి క్షేమంగా నడుస్తాడు.
\s5
\v 10 అయితే రాత్రివేళ చీకటిలో నడిచే వాడికి ఏమీ కనబడదు గనుక ఆ వ్యక్తి సులువుగా తడబడతాడు."
\p
\v 11 ఈ మాటలు చెప్పి ఆయన వాళ్ళతో, "మన స్నేహితుడు లాజరు నిద్రపోయాడు, నేను అతణ్ణి నిద్రలేపడానికి వెళ్తాను" అన్నాడు.
\s5
\p
\v 12 ఆయన శిష్యులు ఆయనతో, "ప్రభూ, అతను నిద్రపోతుంటే కోలుకుంటాడు" అన్నారు.
\v 13 యేసు నిజానికి లాజరు చనిపోవడం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన శిష్యులు మాత్రం యేసు మాట్లాడుతున్నది మనిషికి విశ్రాంతినిచ్చే నిద్ర గురించి అనుకున్నారు.
\v 14 అప్పుడు ఆయన స్పష్టంగా, "లాజరు చనిపోయాడు" అని చెప్పాడు.
\s5
\p
\v 15 యేసు మాట్లాడడం కొనసాగిస్తూ, "అతను చనిపోయినప్పుడు నేను అక్కడ లేనందుకు మీ విషయంలో సంతోషపడుతున్నాను. దీని వల్ల మీరు నాలో ఎందుకు నమ్మకం ఉంచాలో మీరు చూస్తారు. ఇప్పుడు సమయం వచ్చింది అతని దగ్గరికి వెళ్దాం పదండి" అన్నాడు.
\v 16 అప్పుడు కవల అనే పేరున్న తోమా మిగతా శిష్యులతో, "యేసుతో చనిపోడానికి మనం కూడా వెళ్దాం పదండి" అన్నాడు.
\s5
\p
\v 17 వాళ్ళు బేతనియకు దగ్గరలో ఉండగా లాజరు చనిపోయాడనీ నాలుగు రోజుల క్రితమే అతని శరీరాన్ని సమాధి చేశారనీ ఆయనకి ఎవరో చెప్పారు.
\v 18 బేతనియ యెరూషలేముకు మూడు కిలోమీటర్లు మాత్రమే.
\v 19 అనేకమంది యూదులకు లాజరు, అతని కుటుంబం పరిచయమే. మార్త మరియల తమ్ముడు చనిపోయినందుకు ఓదార్చడానికి వాళ్ళు యెరూషలేము నుండి వచ్చారు.
\v 20 యేసు దగ్గరలో ఉన్నాడని ఎవరో చెప్తుండగా మార్త విని, ఆయన్ని కలవడానికి ఆ దారి వెంట ఎదురు వెళ్ళింది. మరియ వెళ్ళకుండా ఇంట్లోనే ఉండిపోయింది.
\s5
\p
\v 21 మార్త యేసును చూసి, "ప్రభూ! నువ్వు ఇక్కడ ఉండి ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు.
\v 22 ఇప్పుడైనా సరే నువ్వు దేవుణ్ణి ఏమి అడిగితే అది నీకు ఇస్తాడు" అని అన్నది.
\v 23 యేసు ఆమెతో, "నీ తమ్ముడు మళ్ళీ బ్రతుకుతాడు" అని చెప్పాడు.
\s5
\p
\v 24 మార్త ఆయనతో, "యుగాంతం రోజున దేవుడు చనిపోయిన వాళ్ళందరినీ లేపినప్పుడు మళ్ళీ బ్రతుకుతాడని నాకు తెలుసు" అంది.
\v 25 యేసు "చనిపోయిన వాళ్ళకు తిరిగి ప్రాణం పోసేది నేనే. వాళ్ళకు జీవాన్ని ఇచ్చేది నేనే. నాలో ఎవరు నమ్మకం ఉంచుతారో వాళ్ళు చనిపోయినా తిరిగి బ్రతుకుతారు.
\v 26 జీవాన్ని పొందిన వాళ్ళు అందరూ నాతో చేరారు. నాలో నమ్మకం ఉంచిన వాళ్ళు ఎప్పటికీ చనిపోరు. నువ్వు నన్ను నమ్ముతున్నావా?" అని ఆమెని అడిగాడు.
\s5
\v 27 ఆమె, "ఔను ప్రభూ! నువ్వు చెప్పింది నమ్ముతున్నాను. నువ్వు దేవుని కుమారుడు అనీ మెస్సీయ అనీ దేవుని వాగ్దానం చొప్పున ఈ లోకానికి వచ్చావనీ నమ్ముతున్నాను" అంది.
\p
\v 28 ఆమె అలా చెప్పి, ఇంట్లోకి వెళ్లి తన చెల్లెలు మరియను పక్కకు పిలిచి, "బోధకుడు వచ్చాడు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు" అని చెప్పింది.
\v 29 మరియ ఇది విని, వెంటనే లేచి ఆయన దగ్గరికి వెళ్ళింది.
\s5
\v 30 అప్పటికీ యేసు ఇంకా ఊళ్లోకి రాలేదు. మార్త ఆయన్ని కలిసిన చోటే ఉన్నాడు.
\v 31 అక్కాచెల్లెళ్ళను ఓదార్చడానికి వచ్చిన వాళ్ళు మరియ ఉన్నట్టుండి లేచి బయటికి వెళ్ళడం చూశారు. లాజరు సమాధి దగ్గర ఏడవడానికి వెళ్తుంది అనుకుని ఆమెని వెనకాలే వెళ్లారు.
\p
\v 32 మరియ యేసు ఉన్నచోటికి వచ్చింది. ఆమె ఆయన్ని చూసినప్పుడు ఆయన పాదాల మీద పడి, "ప్రభూ! నువ్వు ఇక్కడ ఉండి ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు" అంది.
\s5
\p
\v 33 ఆమె, ఆమెతో వచ్చిన ఏడ్చేవాళ్ళని యేసు చూసినప్పుడు చాలా కలతతో తన ఆత్మ లోతుల్లో బాధపడ్డాడు.
\v 34 "అతణ్ణి ఎక్కడ సమాధి చేశారు?" అని అడిగాడు. వాళ్ళు, "ప్రభూ, రండి" అన్నారు.
\v 35 యేసు కన్నీరు కార్చాడు.
\s5
\p
\v 36 అది చూసి యూదులు, "చూడండి, లాజరంటే ఆయనకెంత ఇష్టమో!" అనుకున్నారు.
\v 37 అయితే కొందరు, "గుడ్డివాణ్ణి బాగు చేశాడు గానీ ఇతను చావకుండా చేయడానికి చాలిన శక్తి ఆయనకు లేదేమో" అన్నారు.
\s5
\p
\v 38 ఆయన సమాధి దగ్గరికి వచ్చినప్పుడు యేసు ఉద్వేగంతో చలించిపోయాడు. కలత చెందాడు. ఆ సమాధి ఒక గుహ. పెద్ద రాయితో దాని ద్వారం మూసి ఉంది.
\p
\v 39 ఆయన అక్కడ నిలుచున్న వాళ్లతో "ఆ రాయి తొలగించండి" అని ఆజ్ఞాపించాడు. అప్పుడు మార్త, "ప్రభూ! ఇప్పటికి నాలుగు రోజులు అయ్యింది. దేహం కుళ్ళి కంపు కొడుతూ ఉంటుంది" అంది.
\v 40 యేసు ఆమెతో, "నువ్వు నన్ను నమ్మితే దేవుడు ఎవరో ఏమి చేయగలడో చూస్తావు అని నీకు చెప్పలేదా?" అన్నాడు.
\s5
\p
\v 41 అప్పుడు వాళ్ళు ఆ పెద్ద బండను తొలగించారు. యేసు ఆకాశం వైపు చూసి, "తండ్రీ, నా ప్రార్ధన విన్నావు, నీకు వందనాలు.
\v 42 నువ్వు నా ప్రార్ధన ఎప్పుడూ వింటావని తెలుసు. వీళ్ళు నీలో నమ్మకం ఉంచేలా నిజానికి నువ్వు నన్ను పంపావని విశ్వాసం ఉంచేలా ఇక్కడ నిలబడి ఉన్నవాళ్ళ కోసం నేను ఈ మాటలు పలికాను" అని ప్రార్థించాడు.
\s5
\p
\v 43 ఆయన ఈ మాటలు పలికి పెద్ద స్వరంతో, "లాజరూ, బయటికి రా!" అన్నాడు.
\v 44 చనిపోయిన వాడు బయటికి వచ్చాడు. అతని చేతులకు కట్లు ఉన్నాయి. ఒళ్ళంతా నార బట్ట చుట్టి ఉంది. అతని ముఖం కూడా రుమాలుతో చుట్టి ఉంది. యేసు వాళ్ళతో, "చుట్టిన బట్ట విప్పి అతణ్ణి పోనియ్యండి" అన్నాడు.
\s5
\p
\v 45 మరియను చూడడానికి వచ్చిన యూదులు చాలామంది యేసు చేసిన దానికి సాక్ష్యమిస్తూ ఆయనలో నమ్మకం ఉంచారు.
\v 46 అయినా కొందరు పరిసయ్యుల దగ్గరికి వెళ్ళి యేసు చేసింది చెప్పారు.
\s5
\p
\v 47 కాబట్టి, ప్రధాన యాజకులూ, పరిసయ్యులూ యూదా పాలక మండలి సభ్యులతో సమావేశమయ్యారు. వాళ్ళు ఒకరితో ఒకరు "మనం ఏం చెయ్యాలి? ఈ మనిషి చాలా అద్భుతాలు చేస్తున్నాడు.
\v 48 అతణ్ణి ఇలాగే చేయనిస్తే ప్రతివాడూ ఆయనలో నమ్మకం ఉంచుతాడు, అంతా మనకు వ్యతిరేకం అవుతారు. అప్పుడు రోమా సైన్యం వచ్చి దేవాలయాన్నీ మన దేశాన్నీనాశనం చేస్తుంది" అనుకున్నారు.
\s5
\p
\v 49 ఆ పాలకమండలిలో కయప ఒక పెద్ద. అతడు ఆ ఏడాది అంతటికీ నియమించబడిన ప్రధాన యాజకుడు. అతడు, "మీకు ఏమీ తెలియదు.
\v 50 యూదా జాతి ప్రజల్ని రోమీయులు చంపేదానికంటే, మన ప్రజలందరి కోసం ఒక మనిషి చనిపోవడం మంచిది. అది మీరు గ్రహించట్లేదు" అన్నాడు.
\s5
\p
\v 51 అతను తన గురించి ఆలోచించుకున్నాడు. ఆ సంవత్సరం అతను ప్రధాన యాజకుడు కావడంవల్ల యూదా జాతి కోసం యేసు చనిపోవాలని ప్రవచించాడు.
\v 52 కానీ అతను యూదా జాతి కోసమే ప్రవచించలేదు. ఇతర ప్రదేశాల్లో ప్రతి చోటా ఉన్నదేవుని పిల్లలను అందరినీ ఒకే జాతిగా పోగు చేయడానికి యేసు చనిపోతాడని ప్రవచించాడు.
\v 53 ఆ రోజు నుండి ఆ పాలక మండలి యేసును బంధించి, చంపించాలని ఎదురు చూస్తున్నారు.
\s5
\p
\v 54 అందుకే యేసుకు వ్యతిరేకంగా ఉన్న యూదుల కారణంగా యేసు బహిరంగంగా చుట్టుప్రక్కల ప్రాంతం అంతా ప్రయాణించ లేకపోయాడు. డానికి బదులుగా తన శిష్యులతో కలిసి యెరూషలేము విడిచి నిర్జన ప్రదేశం సమీపాన ఉన్న ఎఫ్రాయీము అనే ఊరికి వెళ్ళాడు. అక్కడ ఆయన తన శిష్యులతో కలిసి కొంతకాలం ఉన్నాడు.
\p
\v 55 మళ్ళీ యూదుల పస్కాపండగ సమయం వచ్చింది. చాలామంది భక్తులు దేశమంతటి నుండి యెరూషలేముకు చేరుకున్నారు. యూదుల నియమాల ప్రకారం సిద్ధపాటులో భాగంగా తమను శుద్ధి చేసుకుంటారు. అప్పుడే పస్కా పండగ చేసుకోడానికి వారిని అనుమతిస్తారు.
\s5
\p
\v 56 పస్కా పండగకి యెరూషలేముకు వచ్చిన భక్తులందరూ యేసు కోసం చూస్తున్నారు. వచ్చిన వాళ్ళు వచ్చి దేవాలయంలో నిలబడి ఒకరితో ఒకరు, "ఆయన పస్కాకు వస్తాడంటావా రాడంటావా?" అని చెప్పుకుంటున్నారు.
\v 57 యేసు ఎక్కడైనా కనిపిస్తే ఆయన్ని బంధించడం కోసం తమకు సమాచారం అందించాలని యూదా ప్రధాన యాజకులూ, పరిసయ్యులూ ఆజ్ఞలు జారీ చేశారు.
\s5
\c 12
\p
\v 1 పస్కాపండుగ ఇంకా ఆరు రోజుల్లో మొదలు కాబోతోంది. ఆ సమయంలో యేసు బేతనియ గ్రామం చేరుకున్నాడు. చనిపోయిన లాజరును యేసు తిరిగి బతికించింది ఈ గ్రామంలోనే.
\v 2 అక్కడ యేసు కోసం విందు ఏర్పాటు చేశారు. మార్త వంటకాలు సిద్ధం చేసింది. భోజనం చేయడానికి లాజరు కూడా కూర్చున్నాడు.
\v 3 అప్పుడు మరియ (నార్డ్ అనే పేరుగల) ఎంతో ఖరీదైన అత్తరు సీసా తీసుకువచ్చి యేసు పాదాలపై పోసి ఆయనను అభిషేకించింది. ఆయన పాదాలను ఆమె తన తల వెంట్రుకలతో తుడిచింది. ఆ ఇల్లంతా అత్తరు సువాసనతో నిండిపోయింది.
\s5
\p
\v 4 అయితే ఆయన శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదాకు ఇది నచ్చలేదు. (యేసుకు నమ్మకద్రోహం చేసి ఆయనను శత్రువులకు అప్పగించ బోయేవాడు ఇతడే).
\v 5 "ఆ అత్తరు అమ్మగా వచ్చిన డబ్బుతో పేదవాళ్ళకి మూడు వందల రోజులకు సరిపడా కూలి ఇవ్వచ్చు గదా" అన్నాడు.
\v 6 అతడు ఈ మాటలు పేదవాళ్ళ మీద ప్రేమతో చెప్పలేదు. అతడు దొంగ బుద్ది గలవాడు. డబ్బు సంచి అతని దగ్గరే ఉంటుంది. తన సొంత అవసరాల కోసం ఆ డబ్బును వాడుకుంటూ ఉంటాడు.
\s5
\p
\v 7 అప్పుడు యేసు "ఆమెను ఇలా చెయ్యనివ్వండి. నేను చనిపోయి సమాధి అయ్యే సమయం కోసం ఆమె దీనిని సిద్ధం చేసింది.
\v 8 పేదవాళ్ళు మనచుట్టూ ఎప్పుడూ ఉంటారు. ఎప్పుడైనా వాళ్లకు సహాయం చెయ్యవచ్చు. నేనైతే ఎంతోకాలం మీ మధ్య ఉండను. కాబట్టి నన్ను గౌరవిస్తూ ఈమె చేసిన పని మంచిదే" అని చెప్పాడు.
\s5
\p
\v 9 యెరూషలేములో ఉన్న యూదులు యేసు బేతనియలో ఉన్నాడని విన్నప్పుడు గుంపులుగా బయలుదేరారు. వాళ్ళు కేవలం యేసును చూడ్డానికి మాత్రమే కాక, యేసు బతికించిన లాజరును కూడా చూడ్డానికి వచ్చారు.
\v 10 అవసరమైతే లాజరును చంపాలని యూదుల ప్రధాన బోధకులు నిర్ణయించుకున్నారు.
\v 11 ఎందుకంటే, ప్రజలు యేసు బోధలు వింటూ ఆయనపై నమ్మకం ఉంచుతున్నారు. తమ బోధలు పట్టించుకోకుండా పెడచెవిన పెడుతున్నారు.
\s5
\p
\v 12 పస్కా పండగ కోసం వచ్చిన ప్రజలకు మరుసటి రోజు యేసు యెరూషలేముకు వస్తున్నాడని తెలిసింది.
\v 13 వాళ్ళంతా గుంపులు గుంపులుగా పోగై ఖర్జూర మట్టలు పట్టుకుని యేసుకు స్వాగతం పలుకుతూ "హోసన్నా! దేవునికి స్తుతులు! ప్రభువు పేరట వస్తున్న ఇశ్రాయేలు రాజును దేవుడు దీవిస్తాడు గాక!" అంటూ గట్టిగా కేకలు వేశారు.
\s5
\q
\v 14 "యెరూషలేము నివాసులారా, భయపడవద్దు.
\q చూడండి, గాడిద పిల్లపై ఎక్కి నీ రాజు వస్తున్నాడు!"
\p
\v 15 అని లేఖనాల్లో రాసి ఉన్నట్టు ఇది నెరవేరింది.
\s5
\p
\v 16 జరిగిన సంఘటన ప్రవచనాల నెరవేర్పు అని శిష్యులు గ్రహించలేకపోయారు. కాని యేసు తన పని ముగించి మహిమ పొందిన తరువాత ఈ ప్రవచం ఆయనను గురించి రాసినదనీ, అందువల్లనే ప్రజలు ఈ విధంగా చేశారనీ శిష్యులు గుర్తు చేసుకున్నారు.
\s5
\p
\v 17 యేసును వెంబడిస్తున్న ప్రజలు తాము చూసిన లాజరు గురించి, అతణ్ణి యేసు సమాధిలో లేపిన విషయం గురించి ఒకరికొకరు చెప్పుకున్నారు.
\v 18 ఆయన ఈ సూచక క్రియ చేశాడని విన్న ఇతర ప్రజలు యేసును కలుసుకోవడానికి నగర ద్వారం వద్దకు చేరుకున్నారు.
\v 19 "చూడండి, లోకమంతా ఆయన వెంట వెళ్తున్నది. మనం చేయ్యగలిగింది ఏమీ లేదు. పరిస్థితులు చెయ్యి దాటిపోతున్నాయి" అని పరిసయ్యులు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు.
\s5
\p
\v 20 ఆ సమయంలో పస్కా పండగ ఆచరించడానికి యెరూషలేముకు వచ్చిన వారిలో కొందరు గ్రీకు జాతివాళ్ళు కూడా ఉన్నారు.
\v 21 వాళ్ళు గలిలయలోని బేత్సయిదా ఊరివాడైన ఫిలిప్పు వద్దకు వచ్చి, "అయ్యా, మాకు యేసును పరిచయం చేస్తారా?" అని అడిగారు.
\v 22 ఫిలిప్పు అంద్రెయకు ఈ సంగతి చెప్పాడు. ఇద్దరూ యేసు వద్దకు వచ్చారు.
\s5
\v 23 యేసు వాళ్ళిద్దరితో ఇలా చెప్పాడు, "నేను చెప్పినట్టుగా దేవుడు ప్రజలందరి ఎదుటా మనుష్య కుమారుణ్ణి మహిమ పరిచే సమయం వచ్చింది.
\v 24 నేను మీతో నిజం చెబుతున్నాను. గోదుమ గింజను భూమిలో పాతిపెట్టిన తరువాత అది చావకపోతే అది ఒక్కటిగానే ఉంటుంది. అయితే అది భూమిలో చనిపోతే అది పెరిగి మరింత అధికంగా పంట ఇస్తుంది."
\s5
\p
\v 25 "ఈ లోకంలో ఎవరైనా తనను మాత్రమే ప్రేమించుకునేవాడు దానిని పోగొట్టుకుంటాడు. అలా కాక తనను తాను ద్వేషించుకునే వాడు శాశ్విత జీవం పొందుతా డు.
\v 26 నా సేవకుడుగా ఉండాలని కోరుకునేవాడు నన్ను తప్పక అనుసరించాలి. ఎందుకంటే నేను ఎక్కడ ఉంటే నా సేవకుడు అక్కడే ఉండాలి. నన్ను సేవించేవాళ్ళను దేవుడు ఘనపరుస్తాడు."
\s5
\p
\v 27 "ఇప్పుడు నా ప్రాణం ఆందోళనగా ఉంది. నేనిలా చెప్పనా, తండ్రీ, ఈ వేదన, మరణం పొందే ఈ సమయం నుండి నన్ను తప్పించు. కానీ కేవలం ఈ కారణం కోసమే నేను ఈ లోకానికి వచ్చాను.
\v 28 నా తండ్రీ, నువ్వు ఏమై ఉన్నావో, నువ్వు ఏమి పలికావో, నీ శక్తి ప్రభావాలు ఏమిటో కనపరచు."
\p అప్పుడు ఆకాశంలో నుంచి ఒక స్వరం వినబడింది, "నేను నా స్వభావం, నా కార్యాలు, నా మాటలు ముందుగానే బయలు పరిచాను. మళ్ళీ బయలు పరుస్తాను"
\v 29 అక్కడ ఉన్న జనసమూహం ఆ స్వరం విన్నారు. కొందరు అది ఉరుము శబ్దం అన్నారు. కొందరు "ఒక దేవదూత యేసుతో మాట్లాడాడు" అన్నారు.
\s5
\p
\v 30 యేసు వారికి ఇలా జవాబిచ్చాడు, "మీరు విన్నది దేవుని స్వరం. ఇది నాకోసం కాదు, మీ మేలు కోసమే వచ్చింది.
\v 31 ఇప్పుడు లోకానికి దేవుని తీర్పు సమయం వచ్చింది. ఇది లోకాన్ని ఏలుతున్న సాతాన్ను తరిమివేసే సమయం.
\s5
\v 32 నన్ను సిలువపై పైకి ఎత్తినప్పుడు నేను ప్రతి ఒక్కరినీ ఆకర్షించుకుంటాను."
\v 33 ఆయన ఎలాంటి మరణం పొందబోతున్నాడో ప్రజలు తెలుసుకునేందుకు ఇలా చెప్పాడు.
\s5
\p
\v 34 సమూహంలో కొందరు యేసుతో, "లేఖనాల ప్రకారం మెస్సీయ శాశ్విత కాలం జీవిస్తాడని మేము అర్థం చేసుకున్నాము. మరైతే మనుష్యకుమారుడు చనిపోతాడని నువ్వు ఎందుకు చెబుతున్నావు? అసలు మనుష్యకుమారుడు ఎవరు?" అని అడిగారు.
\v 35 అందుకు యేసు, "నా సందేశం వెలుగు వలే కొంతకాలం మాత్రమే మీ మధ్య ఉంటుంది. ఇంకా వెలుగు ఉండగానే, చీకటి మిమ్మల్ని కమ్ముకోక ముందే వెలుగులో నడవండి. చీకట్లో నడిచే వాడికి తాను ఎక్కడి వెళ్తున్నాడో తెలియదు.
\v 36 మీకు వెలుగు ఉండగానే దానిని నమ్మండి, అప్పుడు మీరు వెలుగు సంబంధులు అవుతారు."
\p యేసు ఈ మాటలు చెప్పిన తరువాత జనసమూహం నుండి దూరంగా వెళ్ళిపోయాడు.
\s5
\p
\v 37 యేసు అనేక అద్భుతాలు చేసినా, మంచి విషయాలు బోధించినా ప్రజలు ఆయనను నమ్మలేదు.
\v 38 యెషయా ప్రవక్త రాసినట్టు ఇదంతా నిజమయ్యింది:
\q "ప్రభూ, మా సమాచారం విన్న వాళ్ళలో దానిని నమ్మిన వాళ్ళెవరు?
\q ప్రభువు ఎంతటి శక్తి గల సంరక్షకుడో కనపరచుకున్నాడు."
\s5
\p
\v 39 అయినా ప్రజలు నమ్మలేకపోయారు. ఎందుకంటే యెషయా మరోచోట ఇలా రాశాడు.
\p
\v 40 ప్రభువు వాళ్ళ కళ్ళకు గుడ్డితనం కలగజేశాడు.
\q వాళ్ళ హృదయాలు బండబారిపోయాయి.
\q వాళ్ళు తమ కళ్ళతో చూడలేకపోతున్నారు.
\q వాళ్ళు చూడగలిగితే అర్థం చేసుకునే వారే.
\q క్షమాపణ కోసం పశ్చాత్తాపపడి నన్ను వేడుకునే వారే.
\q ఈ కారణం వల్ల, నేను వాళ్ళను బాగుచెయ్యను.
\s5
\p
\v 41 మెస్సీయ మహిమ ప్రభావాలను యెషయా అర్థం చేసుకున్నాడు కనుక ఆయన గురించి ఈ మాటలు రాశాడు.
\p
\v 42 ఇది నిజమని నమ్మిన కొందరు యూదు నాయకులు యేసుపై నమ్మకముంచారు. అయితే తమను పరిసయ్యులు సమాజ మందిరం నుండి వెలి వేస్తారన్న భయంతో ఈ విషయం బయట పడనివ్వలేదు.
\v 43 వాళ్ళు దేవుని వల్ల కలిగే మెప్పు కంటే ప్రజల నుండి వచ్చే మెప్పునే కోరుకున్నారు.
\s5
\p
\v 44 యేసు అక్కడ చేరి ఉన్న జనసమూహంతో బిగ్గరగా ఇలా చెప్పాడు, "నా మీద నమ్మకం ఉంచినవాడు నాపై మాత్రమే కాక, నన్ను పంపిన నా తండ్రిపై కూడా నమ్మకముంచుతాడు.
\v 45 నన్ను చూసినవాడు నన్ను పంపినవాణ్ణి కూడా చూస్తున్నాడు."
\s5
\p
\v 46 "నేను లోకానికి వెలుగుగా ఉండడానికి వచ్చాను. నన్ను నమ్మినవాడు చీకటిలో ఉండిపోడు.
\v 47 నా మాటలు విని వాటికి లోబడని వాళ్లకు నేను తీర్పు తీర్చను. నేను ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చాను గానీ లోక ప్రజల తప్పులు ఎత్తి చూపడానికి రాలేదు."
\s5
\p
\v 48 "అయితే నా మాటలు త్రోసిపుచ్చి నన్ను తిరస్కరించిన వాళ్లకు ఒక రోజు వస్తుంది. నేను పలికిన మాటలే వాళ్లకు తీర్పు తీరుస్తాయి.
\v 49 నేను తండ్రి గురించి మాట్లాడినప్పుడు అవి నాకు నేనుగా చెప్పిన మాటలు కావు. తండ్రే నేను ఏమి చెప్పాలో, ఏమి మాట్లాడాలో నాకు ఆదేశించాడు.
\v 50 నేను బోధించిన తండ్రి ఆదేశాలు శాశ్వత జీవానికి నడిపిస్తాయని నాకు తెలుసు. అందుకే నేను ఏమి చెప్పినా తండ్రి నాతో చెప్పినట్టే వాళ్ళతో చెబుతున్నాను."
\s5
\c 13
\p
\v 1 పస్కా పండగ దగ్గర పడింది. యేసు తాను ఈ లోకం విడిచి తండ్రి వద్దకు వెళ్లబోయే సమయం దగ్గర పడిందని గ్రహించాడు. ఈ లోకంలో తనతో ఉన్నవారి పట్ల ఆయన తన ప్రేమను కనపరచాడు. తన జీవితం చివరి వరకూ ఆయన వాళ్ళను ప్రేమించాడు.
\p
\v 2 యేసు తన శిష్యులతో సాయంత్రం భోజనానికి కూర్చున్నాడు. అప్పటికే సాతాను యేసును అప్పగించాలనే దుష్ట తలంపును సీమోను కొడుకైన యూదా ఇస్కరియోతు హృదయంలో పెట్టాడు.
\s5
\p
\v 3 తండ్రి సమస్తాన్నీ తన ఆధీనంలో ఉంచాడని యేసుకు తెలుసు. తాను దేవుని వద్ద నుండి వచ్చాననీ, తిరిగి ఆయన దగ్గరకే వెళ్ళబోతున్నాననీ కూడా ఆయనకు తెలుసు.
\v 4 యేసు భోజనం బల్ల వద్ద నుండి లేచి తన పైవస్త్రం తీసివేసి, ఒక తువాలు తన నడుముకు కట్టుకున్నాడు.
\v 5 ఒక గిన్నెలో నీళ్ళు పోసి, శిష్యుల కాళ్ళు కడిగి తువాలుతో తుడవడం మొదలుపెట్టాడు.
\s5
\p
\v 6 ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు పేతురు, "ప్రభూ, నువ్వు నా కాళ్ళు కడుగుతావా?" అన్నాడు.
\v 7 అప్పుడు యేసు, "నేను చేస్తున్నది ఇప్పుడు నీకు అర్థం కాదు. తరవాత నువ్వు దీన్ని అర్థం చేసుకుంటావు" అన్నాడు.
\v 8 పేతురు "నువ్వు నా కాళ్ళు ఎప్పటికీ కడగకూడదు" అన్నాడు. అందుకు యేసు, "నేను నిన్ను కడగకపోతే నీతో నాకు సంబంధం ఉండదు" అన్నాడు.
\v 9 అప్పుడు పేతురు "అయితే ప్రభూ, నా కాళ్ళు మాత్రమే కాదు, నా చేతులు, తల కూడా కడుగు" అన్నాడు.
\s5
\p
\v 10 యేసు అతనితో, "స్నానం చేసినవాడు తన కాళ్ళు తప్ప ఇంకేమీ కడుక్కోనవసరం లేదు. మిగిలిన శరీరం అంతా ముందుగానే శుభ్రం అయింది. నువ్వు శుద్ధుడివే, అయితే మీలో అందరూ శుద్ధులు కాదు" అన్నాడు.
\v 11 తనకు ద్రోహం చేసేవాడెవడో ఆయనకు తెలుసు. అందుకే "మీలో అందరూ శుద్ధులు కాదు" అన్నాడు.
\s5
\p
\v 12 శిష్యుల కాళ్ళు కడగడం పూర్తి అయిన తరువాత తన పైవస్త్రం తీసుకుని బల్ల దగ్గర కూర్చుని, "నేను మీకు చేసినదేమిటో అర్థం చేసుకున్నారా?" అని శిష్యులను అడిగాడు.
\v 13 మీరు నన్ను బోధకుడు, ప్రభువు అని పిలుస్తున్నారు. నిజమే, నేను మీకు బోధకుడిని, ప్రభువును.
\v 14 నేను మీ బోధకుడిగా, ప్రభువుగా మీ కాళ్ళు కడిగినట్టే మీరు కూడా ఒకరి కాళ్ళు ఒకరు కడగాలి.
\v 15 నేను చేసినట్టు మీరు చెయ్యాలని మీకోసం ఒక ఆదర్శంగా ఈ పని చేసి చూపించాను."
\s5
\p
\v 16 "మీకొక విషయం చెబుతున్నాను. సేవకుడు తన యజమాని కంటే గొప్పవాడు కాదు. అలాగే సందేశం తెచ్చేవాడు సందేశం పంపినవాడి కంటే గొప్పవాడు కాదు.
\v 17 ఈ విషయాలు మీకు తెలుసు కాబట్టి వీటి ప్రకారం చేస్తే దేవుడు మీ విషయంలో సంతోషిస్తాడు."
\p
\v 18 "మీ అందరి గురించి నేను మాట్లాడడం లేదు. నేను ఎంపిక చేసుకున్నవారు నాకు తెలుసు. అయితే, నా రొట్టె తిన్నవాడు నాకు వ్యతిరేకంగా మారి నాకు శత్రువయ్యాడు అనే లేఖనం నేరవేరేలా ఈ విధంగా జరుగుతుంది."
\s5
\p
\v 19 "ఇది జరగముందే ఇప్పుడు దీన్ని మీతో చెబుతున్నాను. ఎందుకంటే అది జరిగినప్పుడు నేను దేవుని కుమారుణ్ణి అని మీరు నమ్మాలని నా ఉద్దేశం.
\v 20 నేను మీతో నిజం చెబుతున్నాను. నేను పంపినవాణ్ణి స్వీకరించినవాడు నన్ను స్వీకరిస్తాడు. నన్ను స్వీకరించినవాడు నన్ను పంపినవాణ్ణి స్వీకరిస్తాడు."
\s5
\p
\v 21 ఈ మాటలు చెప్పిన తరువాత యేసు తనలో తాను కలవరానికి గురయ్యాడు. "నేను మీతో ఒక విషయం చెబుతున్నాను, తల్లి పలు తాగి రొమ్ము గుద్దినట్టుగా మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగింపబోతున్నాడు" అన్నాడు.
\v 22 శిష్యులు ఒకళ్ళ మొహాలు ఒకరు చూసుకున్నారు. యేసు తమలో ఎవరి గురించి చెబుతున్నాడో వాళ్లకు అర్థం కాలేదు.
\s5
\p
\v 23 శిష్యులలో ఒకడైన యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను భోజనం బల్ల వద్ద యేసును ఆనుకుని కూర్చుని ఉన్నాడు.
\v 24 యేసు ఏ శిష్యుడి గురించి మాట్లాడుతున్నాడో అడగమని సీమోను పేతురు యోహానుకు సైగ చేశాడు.
\v 25 కాబట్టి యోహాను తన భుజం యేసుకు ఆనించి నెమ్మదిగా, "ప్రభూ, ఆ వ్యక్తి ఎవరు?" అని అడిగాడు.
\s5
\p
\v 26 యేసు, "ఈ రొట్టె ముక్కను గిన్నెలో ముంచి ఎవరికి ఇస్తానో అతడే” అని జవాబు చెప్పాడు. తరవాత యేసు రొట్టెను ముంచి సీమోను ఇస్కరియోతు కొడుకైన యూదాకి ఇచ్చాడు.
\v 27 అతడు ఆ రొట్టె ముక్కను తీసుకున్న వెంటనే సాతాను అతనిలోకి ప్రవేశించి అతన్ని వశపరచుకున్నాడు. యేసు అతనితో, "నువ్వు చెయ్యవలసింది తొందరగా చెయ్యి" అన్నాడు.
\s5
\p
\v 28 యేసు ఎందుకు అలా చెప్పాడో ఆ భోజనం బల్ల దగ్గర ఉన్న వాళ్ళెవ్వరికీ తెలీదు.
\v 29 డబ్బు సంచి యూదా దగ్గర ఉంది. కాబట్టి వెళ్లి పస్కా పండుగకు అవసరమైన సామగ్రిని కొనమని యేసు చెప్తున్నాడేమో అని వాళ్ళు అనుకున్నారు. ఇంకొంతమంది పేదలకు డబ్బులు ఏమైనా ఇవ్వమని యూదాకు చెప్తున్నాడేమో అనుకున్నారు.
\v 30 రొట్టెను తీసుకున్న వెంటనే యూదా బయటికి వెళ్ళిపోయాడు. అది రాత్రి సమయం.
\s5
\p
\v 31 యూదా వెళ్ళిపోయిన తరవాత యేసు, "ఇప్పుడు మనుష్య కుమారుడిగా ఉన్న నేను ఏమిటో, చేస్తున్నదేమిటో మనుషులంతా తెలుసుకునేలా దేవుడు చేస్తాడు. అలాగే మనుష్య కుమారుడనైన నేను దేవుడు చేస్తున్నదేమిటో మనుషులంతా తెలుసుకునేలా చేస్తాను. దీని గురించి మనుషులంతా ఆయన్ని కీర్తిస్తారు.
\v 32 మనుష్య కుమారుణ్ణి అయిన నేను దేవుణ్ణి గౌరవిస్తున్నాను కాబట్టి అందరికీ ఆయన్ని వెల్లడి చేశాను. దేవుడు కూడా నన్ను మహిమపరుస్తాడు. దేవుడు దీనిని వెంటనే చేస్తాడు."
\p
\v 33 "మీరు నా ప్రేమను చూరగొన్న పిల్లలైనప్పటికీ, కొంతకాలం మాత్రమే నేను మీతో కూడా ఉంటాను. అప్పుడు నా గురించి మీరు వెతుకుతారు గానీ ఇక్కడ నేను ఉండను. యూదు నాయకులకు చెప్పినట్టుగా ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, నేనెక్కడికి వెళ్తున్నానో అక్కడికి మీరు రాలేరు.
\s5
\v 34 నేను మీకు ఈ ఆజ్ఞ ఇస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగా మీరు కూడా తప్పకుండా ఒకరినొకరు ప్రేమించుకోవాలి.
\v 35 మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటే మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు."
\s5
\p
\v 36 సీమోను పేతురు ఆయనతో, "ప్రభూ, నువ్వెక్కడికి వెళ్తున్నావు?" అని అడిగాడు. అప్పుడు యేసు, "నేను ఎక్కడికి వెళ్తున్నానో అక్కడికి ఇప్పుడు మీరు నాతో రాలేరు. తరవాత వస్తారు."
\v 37 పేతురు, "ప్రభూ, ఇప్పుడు ఎందుకు నేను నీతో రాలేను? నేను నీకోసం చనిపోడానికైనా సిద్ధంగా ఉన్నాను" అన్నాడు.
\v 38 యేసు, "నాకోసం చనిపోడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పావు. నేను నిజం చెప్తున్నాను, నేనెవరో నీకు తెలియదని మూడుసార్లు నువ్వు చెప్పక ముందు కోడి కూయదు" అని చెప్పాడు.
\s5
\c 14
\p
\v 1 "తలకిందులై పోవద్దు, ఆదుర్దా పడొద్దు. దేవుణ్ణి నమ్ముతున్నట్టుగానే నన్ను కూడా నమ్మండి.
\v 2 నా తండ్రి ఉండే చోట నివసించడానికి ఎన్నో నివాసాలు ఉన్నాయి. అది నిజం కాదనుకుంటే, నేను మీతో చెప్పేవాడిని. మీరు నివసించే స్థలం సిద్ధం చేయడానికే నేను అక్కడికి వెళ్తున్నాను.
\v 3 నేను వెళ్లి స్థలం సిద్ధం చేయడం వల్ల నేను తిరిగి వచ్చి నాతోబాటు ఉండడానికి మిమ్మల్ని తీసుకువెళ్తాను, ఆ విధంగా నేను ఎక్కడ ఉంటానో, అక్కడే నాతోబాటు మీరు కూడా ఉండవచ్చు.
\s5
\v 4 నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలుసు. దాని దారి కూడా మీకు తెలుసు."
\v 5 తోమా ఆయనతో, "ప్రభూ, నేవెక్కడికి వెళ్తున్నావో తెలియనప్పుడు, దాని దారి మాకెలా తెలుస్తుంది?" అన్నాడు.
\v 6 యేసు అతనితో, "తండ్రి ఎక్కడ ఉన్నాడో అక్కడికి మార్గం నేనే. దేవుని గురించిన సత్యాన్ని వెల్లడించేవాణ్ణి నేనే, ప్రజలందరికీ నిత్యజీవాన్ని ఇచ్చేవాణ్ణీ నేనే. నావల్లే ప్రజలందరికీ తండ్రి దగ్గరికి రావడం సాధ్యమౌతుంది. ఇంకొక మార్గం లేనే లేదు.
\v 7 నేనెవరినో మీరు నిజంగా తెలుసుకుంటే నా తండ్రిని కూడా తెలుసుకొని ఉండేవాళ్ళు. ఇప్పటినుండి మీకు ఆయన తెలుసు, ఆయనను మీరు చూశారు" అన్నాడు.
\s5
\p
\v 8 ఫిలిప్పు యేసుతో, "ప్రభూ, తండ్రిని మాకు చూపించు, ఎప్పటికీ మాకు అదే చాలు" అన్నాడు.
\v 9 యేసు అతనితో, "ఫిలిప్పూ, ఎప్పటినుండో నేను మీతోటే ఉంటున్నాను, ఇప్పటికీ నన్ను నీవు తెలుసుకోలేదు. నన్ను చూసినవాళ్ళు తండ్రినీ చూసేశారు. కాబట్టి మళ్ళీ తండ్రిని చూపించమని ఎందుకు అడుగుతున్నావు?
\s5
\v 10 నేనూ, తండ్రీ కలిసే ఉన్నామనీ, తండ్రిలో నేనూ, నాలో తండ్రీ ఉన్నామనీ మీరు నమ్మడం లేదా? నేను చెప్పిన సంగతులు నేను అలోచించినవి కాదు. ఈ విషయాలన్నీ మీకు తెలపమని తండ్రే నన్ను పంపాడు. నాలో ఉన్న తండ్రి నా ద్వారా పని చేస్తున్నాడు.
\v 11 నన్ను నమ్మండి, నేను చెప్పాను కదా, తండ్రిలో నేనూ, నాలో తండ్రీ ఉన్నామని. అలా కాకపోతే నేను చేసిన అద్భుతాలూ, గొప్ప కార్యాల గురించైనా నన్ను నమ్మండి."
\s5
\p
\v 12 "నేను ఒక సత్యం చెప్తున్నాను, ఎవరైతే నన్ను నమ్ముతారో, వారు కూడా నేను చేసిన కార్యాలు చేస్తారు. అంతకంటే ఇంకా గొప్ప పనులు కూడా చేస్తారు. ఎందుకంటే నేను తండ్రితో ఉండటానికి వెళ్తున్నాను.
\v 13 నా పేరు మీద మీరేమి అడిగినా నేను చేస్తాను. ఎందుకంటే ఆయన కుమారుడినైన నేనూ తండ్రి అందరిలో మహిమ పొందాలనీ, అలా వారు తండ్రిని తెలుసుకోగలుగుతారనీ అలా చేస్తాను.
\v 14 మీరు తండ్రిని ఏమైనా అడిగితే నేను చేస్తాను. ఎందుకంటే మీరు నాకు చెందినవారు."
\s5
\p
\v 15 "మీరు నన్ను ప్రేమించినట్టైతే నేను బోధించినట్టుగా జీవిస్తారు.
\v 16 అప్పుడు నేను తండ్రిని మీకు ఒక బహుమానం ఇమ్మని అడుగుతాను. ఆయన మీకు ఒక సహాయకుణ్ణి పంపిస్తాడు. ఆయన వచ్చి మీ పక్కనే ఎప్పుడూ ఉంటాడు.
\v 17 మీకు దేవుని గురించిన సత్యాన్ని తెలిపే ఆత్మ ఆయనే. ఈ లోకంలో ఉన్న అవిశ్వాసులు ఆయన్ని అంగీకరించరు. ఈ లోకం ఆయన్ని చూడలేదు, తెలుసుకోలేదు. మీకు ఆయన తెలుసు. ఎందుకంటే ఆయన మీతో జీవిస్తాడు, మీలో ఉంటాడు."
\s5
\p
\v 18 "మిమ్మల్ని ఎవరూ పట్టించుకోని అనాధలుగా వదలి వెళ్ళిపోను. మీ దగ్గరికి వస్తాను.
\v 19 తొందరలో ఈ లోకం ఇంక నన్ను ఎప్పటికీ చూడదు, అయితే మీరు మాత్రం చూస్తారు. ఎందుకంటే నేను జీవిస్తున్నాను కాబట్టి మీరు కూడా జీవిస్తారు.
\v 20 మీరు మళ్ళీ నన్ను చూసినప్పుడు, నేను నా తండ్రిలో, మీరు నాలో, నేను మీలో ఉన్నామని ఆ రోజు మీరు తెలుసుకుంటారు.
\s5
\v 21 నా ఆజ్ఞలు విని వాటిని పాటించే ప్రతివాడూ నన్ను ప్రేమించేవాడు. నన్ను ప్రేమించే వాణ్ణి నా తండ్రి కూడా ప్రేమిస్తాడు. నేను అతణ్ణి ప్రేమించి నన్ను అతనికి ప్రత్యక్షం చేసుకుంటాను."
\p
\v 22 అప్పుడు యూదా (ఇతడు ఇస్కరియోతు యూదా కాదు, అదే పేరుగల మరొక శిష్యుడు) యేసుతో, "ప్రభూ, లోకమంతటికీ కాకుండా మాకు మాత్రమే నిన్ను నీవు ప్రత్యక్షం చేసుకోడానికి కారణం ఏమిటి?" అన్నాడు.
\s5
\v 23 యేసు అతనికి ఇలా జవాబిచ్చాడు, "మనుషులు నన్ను ప్రేమిస్తున్నారో లేదో ఎలా చెప్పగలము? ఎవరైనా నన్ను ప్రేమిస్తే, వాళ్ళు నేను చెప్పినట్టు చేస్తారు. నా తండ్రి అతణ్ణి ప్రేమిస్తాడు. తండ్రీ, నేనూ వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళతో నివాసం చేస్తాము.
\v 24 ఎవరైతే నన్ను ప్రేమించరో వాళ్ళు నేను చెప్పినట్టు చేయరు. నేను చెప్తున్న ఈ విషయాలు నేను స్వంతంగా నిర్ణయించి చెప్పినవి కాదు, నా తండ్రి మీతో ఈ విషయాలు చెప్పమని నన్ను పంపించాడు.
\s5
\v 25 ఈ విషయాలు నేను మీతో ఉన్నప్పుడే చెప్పాను."
\p
\v 26 "నా తండ్రి పరిశుద్దాత్మను పంపుతాడు. ఆయన మిమ్మల్ని ప్రోత్సహిస్తాడు. ఆయన నా అధికారంతో వస్తాడు. మీరు దేవుని గురించి తెలుసుకోవాల్సిన సత్యాలన్నిటినీ ఆయన మీకు బోధిస్తాడు. అంతే కాదు, నేను మీకు బోధించిన విషయాలన్నింటినీ మీకు గుర్తు చేస్తాడు."
\p
\v 27 "నేను శాంతితో మిమ్మల్ని వదిలి వెళ్తూ నా శాంతినే మీకూ ఇస్తున్నాను. నేను ఇచ్చేలాంటి శాంతి ఈ లోకానికి సంబంధించింది కాదు, ఎవ్వరూ ఇవ్వగలిగిందీ కాదు. కాబట్టి మీరు గాభరా పడొద్దు, ఆదుర్దా పడొద్దు, భయపడొద్దు."
\s5
\p
\v 28 "నేను దూరంగా వెళ్ళిపోతున్నాను. మళ్ళీ తరవాత తిరిగి మీ దగ్గరకు వస్తాను అని నేను చెప్పడం మీరు విన్నారు కదా. మీరు గనక నన్ను ప్రేమిస్తున్నట్టయితే, నేను తిరిగి తండ్రి దగ్గరికి వెళ్తున్నానని సంతోషిస్తారు. ఎందుకంటే నాతండ్రి నాకంటే గొప్పవాడు.
\v 29 ఈ సంగతులు ఇంకా జరగక ముందే ఇప్పుడే చెప్పేశాను. ఎందుకంటే ఇవి జరిగినప్పుడు మీరు నా మీద నమ్మకంతో కొనసాగాలన్నది నా ఉద్దేశం.
\s5
\v 30 ఇంకా ఎక్కువ సేపు మీతో మాట్లాడలేను. ఎందుకంటే ఈ లోకాధికారి అయిన సాతాను వస్తున్నాడు. అయితే నాకు జరిగే వాటిపై అతనికి ఏ నియంత్రణా, అధికారమూ లేదు.
\v 31 తండ్రి నాకు ఏం చేయమని ఆజ్ఞాపించాడో దానిని నేను చేస్తాను. ఆ విధంగా నేను తండ్రిని నిత్యమూ ప్రేమిస్తున్నానని లోకం తెలుసుకుంటుంది. ఇక పదండి. మనం ఇక్కడినుంచి వెళ్దాం."
\s5
\c 15
\p
\v 1 "నేను నిజమైన ద్రాక్ష తీగెను (సత్యాన్ని బోధించని ఆ యూదా పెద్దలలాగా కాదు). నా తండ్రి, తోటమాలి లాంటివాడు.
\v 2 నాలో ఫలించని ప్రతి కొమ్మనూ నా తండ్రి కత్తిరించి పారేస్తాడు. నాలో ఉన్న ప్రతి కొమ్మా మంచికాయలు కాయాలని పనికి రాని వాటిని కత్తిరించేసి ఇంకా ఎక్కువగా పళ్ళు కాసేలా వాటిని శుభ్రం చేస్తాడు.
\s5
\v 3 నేను చెప్పిన దాన్ని బట్టి మీరు ఇప్పటికే పవిత్రులుగా ఉన్నారు.
\v 4 నాలో నిలిచి ఉండండి. నేను మీలో ఉంటాను. కొమ్మ ద్రాక్ష తీగెలో ఉండకుండా ఒక్కటే వేరుగా ఉంటే తనంతట తానే ఏ విధంగా ఫలించదో, అలాగే మీరు నాలో ఉండి, ప్రతి దానికీ నాపై ఆధారపడితేనే తప్ప ఫలించ లేరు."
\s5
\p
\v 5 "నేను ద్రాక్షతీగె లాంటి వాడిని. మీరు కొమ్మల్లాంటి వారు. మీరు నాతో కలిసి ఉన్నట్టయితే నేను మీతో ఉంటాను. అప్పుడు మీరు బాగా ఫలిస్తారు. నాకు వేరుగా ఉంటే మీరు ఏమాత్రం ఫలించలేరు.
\v 6 అప్పుడు తోటమాలి పనికిరాని కొమ్మల్ని కత్తిరించి బయట పడేస్తాడు. అవి ఎండిపోయిన తరవాత వాటిని తీసుకెళ్ళి తగలబెడతారు. అలాగే నాతో కలిసి ఉండని ప్రతివారినీ దేవుడు వదిలించుకుంటాడు.
\v 7 మీరు గనక నాతో కలిసి ఉండి, నా సందేశం ప్రకారం జీవిస్తూ ఉంటే దేవుణ్ణి మీరు ఏం అడిగినా ఆయన చేస్తాడు.
\s5
\v 8 మీరు ఎక్కువగా ఫలించడం వల్ల ప్రజలంతా నా తండ్రిని ఘనపరుస్తారు. ఇలా చేయడం వల్ల మీరు నా శిష్యులని అందరికీ తేటతెల్లం అవుతుంది."
\p
\v 9 "నా తండ్రి నన్ను ప్రేమించినట్టుగానే నేను మిమ్మల్ని ప్రేమించాను. నేను ప్రేమించే వారికి తగినట్టుగా ఇప్పుడు మీరు జీవిస్తూ నిలకడగా ఉండండి.
\s5
\v 10 నేనిచ్చిన ఆజ్ఞల్ని పాటించినట్టైతే నాకు తగినట్టుగా జీవిస్తున్నట్టే. అదే విధంగా నా తండ్రి ఆజ్ఞల్ని నేను పాటించాను కాబట్టి నన్ను ప్రేమించిన ఆయనకు తగినట్టుగా నడుస్తారు.
\v 11 మీలో నా ఆనందం ఉండాలనీ, మీ ఆనందం పరిపూర్ణం కావాలనీ ఈ సంగతులు మీతో చెప్పాను.
\s5
\v 12 నేను చేయమని ఆజ్ఞాపిస్తున్నది ఇదే. నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగానే మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి."
\p
\v 13 "తన స్నేహితుల కోసం తన ప్రాణాన్ని ఫణంగా పెట్టే ఒక వ్యక్తి ప్రేమ కన్నా మించిన ప్రేమ ఏదీ లేదు.
\s5
\v 14 నా ఆజ్ఞల్ని పాటించడం మాత్రమే కాదు, వాటిని అనుసరిస్తూ జీవిస్తే మీరే నా స్నేహితులు."
\p
\v 15 "ఇకపై మిమ్మల్ని దాసులు అని పిలవను. దాసులకి యజమానులు చేసేది ఏమీ తెలియదు. కాబట్టి అతడు అర్ధం చేసుకోలేడు. ఇప్పుడు మిమ్మల్ని స్నేహితులు అని పిలుస్తాను. ఎందుకంటే నా తండ్రి చెప్పిన వాటన్నిటినీ నేను మీకు తెలియజేశానని మీకు తెలుసు. కాబట్టి మీరు అన్నీ అర్థం చేసుకోగలరు.
\s5
\v 16 నా శిష్యులు కావాలని మీరు కోరుకోలేదు, నేనే మిమ్మల్ని ఎంచుకున్నాను. మీరు వెళ్లి ఫలించి అభివృద్ధి చెందాలనీ, మీ ఫలాలు ఎప్పటికీ నిలిచి ఉండాలనీ నేనే మిమ్మల్ని ఎంచుకొని నియమించాను. అందువల్ల నా అధికారాన్ని ఉపయోగించి నా తండ్రి పేరు మీద ఏమడిగినా ఆయన మీకు చేస్తాడు.
\v 17 ఇది మీరు చేయాలని నేను ఆజ్ఞాపిస్తున్నాను. మీరు ఒకళ్ళ నొకళ్ళు ప్రేమించుకోవాలి."
\s5
\p
\v 18 "లోకం ఒకవేళ మిమ్మల్ని ద్వేషిస్తే, మీకన్నా ముందు అది నన్ను ద్వేషించింది అని తెలుసుకోండి.
\v 19 మీరు ఈ లోకానికి చెందిన అవిశ్వాసులైతే మట్టుకు ఈ లోకం మిమ్మల్ని స్వంత వాళ్ళలాగా ప్రేమిస్తుంది. అప్పుడు మీరు వాళ్ళు ప్రేమించేదాన్నే ప్రేమిస్తారు, వాళ్ళు చేసేదే మీరూ చేస్తారు. అయితే మీరు లోకానికి చెందిన వాళ్ళలాగా ఉండొద్దు. నేను వాళ్ళలోనుండి మిమ్మల్ని బయటికి తెచ్చాను. అందుకే లోకంలో ఉన్న అవిశ్వాసులు మిమ్మల్ని ద్వేషిస్తారు."
\s5
\p
\v 20 "దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాదు అని నేను చెప్పానని గుర్తు పెట్టుకోండి. వాళ్ళు నన్ను హింసించారంటే మిమ్మల్ని కూడా తప్పకుండా హింసిస్తారని తెలుసుకోండి. వాళ్ళలో ఎవరైనా నా బోధలు విని వాటిని పాటిస్తే వాళ్ళు మీ బోధలు కూడా విని వాటిని కూడా పాటిస్తారు.
\v 21 నన్ను ప్రేమించిన తండ్రి వాళ్లకి తెలీదు. మీరు నాకు ప్రతినిధులుగా ఉన్నారు కాబట్టి ఈ లోకంలోని అవిశ్వాసులు మీ పట్ల భయంకరంగా ప్రవర్తిస్తారు.
\v 22 ఒక వేళ నేను వచ్చి దేవుని సందేశాన్ని వాళ్లకి తెలియ జేయక పోయి ఉంటే నన్ను తిరస్కరించిన దోషారోపణ వాళ్ళపై ఉండేది కాదు. ఇప్పుడు నేను వచ్చి దేవుని సందేశాన్ని వాళ్లకి తెలియజేశాను కాబట్టి వాళ్ళ పాపానికి క్షమాపణ లేదు.
\s5
\v 23 నన్నెవరైతే ద్వేషిస్తారో వాళ్ళు నా తండ్రిని కూడా ద్వేషిస్తారు.
\v 24 నేను వారి మధ్యలో ఎవ్వరూ, ఎప్పుడూ చేయని పనులూ, నా శక్తిని నిరూపించే పనులూ చేయకపోతే వాళ్లకి పాపం ఉండేది కాదు. అయితే ఇప్పుడు వాళ్ళు నన్ను చూశారు, నన్ను ద్వేషించారు, నా తండ్రిని కూడా ద్వేషించారు.
\v 25 వాళ్ళు నన్ను అకారణంగా ద్వేషించారు అని ధర్మశాస్త్ర గ్రంథంలో రాసిన మాటలు ఇప్పుడు నెరవేరాయి."
\s5
\p
\v 26 "తండ్రి దగ్గర నుండి వచ్చిన సహాయకుణ్ణి నేను పంపినప్పుడు ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు. ఆయన ఆత్మ రూపంలో ఉండి దేవుని గురించిన, నా గురించిన వాస్తవాలను తెలియజేస్తాడు. ప్రతివాళ్లకీ నేనెవరినో చెప్తాడు, నేనేమి చేశానో వాటిని అందరికీ చూపిస్తాడు.
\v 27 నేను ఉపదేశించడం, అద్భుతాలు చేయడం మొదలు పెట్టిన నాటినుండి ఇంతకాలం నాతోబాటు ఉన్నారు కాబట్టి నా గురించి మీరు తెలుసుకున్న విషయాలను మీరు కూడా ప్రతి ఒక్కరికీ తప్పకుండా చెప్పాలి."
\s5
\c 16
\p
\v 1 "మీరు తడబడకుండా అపనమ్మకం లేకుండా ఉండాలని మీరు ఎదుర్కోబోయే పరిస్థితుల గురించి మీకు ముందుగానే చెప్పాను.
\v 2 కష్టకాలం ముందుంది. సమాజ మందిరాలలో ఆరాధించకుండా మీ శత్రువులు మిమ్మల్ని అడ్డుకుంటారు. ఏది ఏమైనా ఏదో కీడు మాత్రం జరుగుతుంది. వాళ్ళు మిమ్మల్ని చంపి దేవుని కోసం గొప్ప పనులు చేస్తున్నామని అనుకునే రోజులు వస్తాయి.
\s5
\v 3 వాళ్లకి నిజంగా నేను ఎవరో, నా తండ్రి ఎవరో తెలియదు కాబట్టే ఇలాంటి పనులు చేస్తారు.
\v 4 ఇవి జరిగే ఆ కష్టకాలం వచ్చినప్పుడు ఈ విషయాలను మీకు ముందుగానే చెప్పానని మీరు గుర్తు చేసుకుంటారని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఈ సంగతులు ఆరంభంలో ఎందుకు చెప్పలేదంటే అప్పుడు మీతో పాటు నేనూ ఉన్నాను."
\s5
\p
\v 5 "ఇప్పుడు నేను తిరిగి తండ్రి దగ్గరకు వెళ్తున్నాను. ఆయనే నన్ను ఈ లోకానికి పంపాడు. "నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు?" అని మీలో ఎవరూ నన్ను అడగడం లేదు.
\v 6 ఈ విషయాలు చెప్పినందుకు ఇప్పుడు మీరు విచారంగా ఉన్నారు.
\v 7 నేను వెళ్ళిపోవడం మీకు నిజంగా మంచిది. నేను వెళ్ళకపోతే, మిమ్మల్ని ఆదరించే సహాయకుడు రాడు. నేను వెళ్తే ఆయన్ని మీ దగ్గరికి పంపిస్తాను.
\s5
\v 8 సహాయకుడు వచ్చినప్పుడు తాము చేసిన పాపాల గురించి ఆయన మనుషుల్ని ఒప్పింప జేస్తాడు. మనుషులు దేవుని మంచితనం స్థాయిని అందుకోలేరని తెలియజేస్తాడు. మనుషులు చేయకూడదని దేవుడు ఆజ్ఞాపించిన వాటిని వాళ్ళు చేయడం వల్ల వాళ్లకి దేవుడు తీర్పు తీరుస్తాడని హెచ్చరిస్తాడు.
\v 9 వాళ్ళు నన్ను నమ్మకపోవడమే వాళ్ళు చేసిన పెద్ద పాపం అని ఆయన ప్రజలకు తెలియజేస్తాడు.
\v 10 నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను కాబట్టీ ఇంకెంతో కాలం నన్ను మీరు చూడలేరు కాబట్టీ నేను నిజంగా నీతిమంతుణ్ణి అని మీరు తెలుసుకుంటారని ఆయన తెలియచేస్తాడు."
\p
\v 11 "దేవుడు ఇప్పటికే లోకాన్ని ఏలే సాతానుని శిక్షించడానికి నిర్ణయం తీసుకున్నాడనే వాస్తవాన్ని ఆయన ప్రజలకు తెలియజేస్తాడు. అదే విధంగా ఒకానొక రోజు ఆయనకు చెందని వారిని కూడా ఇలాగే శిక్షిస్తాడు."
\s5
\p
\v 12 "నేను మీతో చెప్పవలసిన సంగతులు ఎన్నో ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్తే ఆ విషయాలు తెలుసుకుని మీరు సంతోషంగా జీవించలేరు.
\v 13 సత్యాత్మ వచ్చినప్పుడు మీరు తెలుసుకోవలసిన సర్వ సత్యంలోకి ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. ఆయన తన స్వంత అధికారంతో తనంతట తానే మాట్లాడడు. ఆయన విన్నదంతా మీకు తెలియజేస్తాడు. అంతే కాదు, రాబోయే కాలంలో జరిగే సంగతులు కూడా మీకు తెలియజేస్తాడు.
\v 14 నేనెవరినో, ఏమి చేశానో మీకు తెలియచేయడం ద్వారా ఆత్మ నన్ను మహిమపరుస్తాడు. నానుండి విన్నదంతా, ఆయన మీకు వివరిస్తాడు.
\s5
\v 15 నా తండ్రికి చెందినవన్నీ నావే. అందుకే నేను చెప్పాను, ఆత్మ నానుండి పొందినవన్నీ మీకు వివరిస్తాడు."
\p
\v 16 "కొంత కాలం తరవాత మీరు నన్ను చూడరు. మరి కొంతకాలం అయ్యాక మీరు మళ్ళీ నన్ను చూస్తారు."
\s5
\v 17 కాబట్టి ఆయన శిష్యులలో కొంతమంది ఒకళ్ళతో ఒకళ్ళు, "కొంత కాలం తరవాత మీరు నన్ను చూడరు అనీ, మరి కొంత కాలం తరవాత మీరు నన్ను మళ్ళీ చూస్తారు, అనీ, నేను తిరిగి తండ్రి దగ్గరకు వెళ్తున్నాను అనీ అంటున్నాడు.
\v 18 ఇలా యేసు మనతో చెప్పిన మాటల అర్ధం ఏమిటో" అని ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకున్నారు.
\s5
\p
\v 19 వాళ్ళు ఎన్నో ప్రశ్నలు అడగాలి అనుకుంటున్నారని యేసు గమనించాడు. కాబట్టి ఆయన తన శిష్యులతో, "దాని అర్థం గురించి ఎందుకు తర్జనభర్జనలు పడుతున్నారు? నేను, కొంతకాలం తరవాత మీరు నన్ను చూడరు, మరి కొంతకాలం తరవాత నన్ను మళ్ళీ చూస్తారు, అని చెప్పాను.
\v 20 నేను నిజం చెప్తున్నాను, మీరు ఏడుస్తారు, దుఖపడతారు. ఈ లోక సంబంధులు మాత్రం సంతోషిస్తారు. మీరు గొప్ప దుఖం గుండా వెళ్తారు. కానీ మీ దుఖం సంతోషంగా మారుతుంది.
\v 21 ఒక స్త్రీ బిడ్డను కనే సమయంలో పురిటి నొప్పులతో ఎలా వేదన అనుభవిస్తుందో, ఇది కూడా అలాగే ఉంటుంది. అయితే బిడ్డ పుట్టగానే, బిడ్డ లోకంలోకి వచ్చిన ఆనందంలో ఆ స్త్రీ తాను పడ్డ బాధ అంతా మర్చిపోతుంది.
\s5
\v 22 ఆమెలాగే మీకు ఇప్పుడు దుఖం కలుగుతుంది, కానీ మళ్ళీ నేను మిమ్మల్ని చూస్తాను. అప్పుడు దేవుడు మీకు గొప్ప ఆనందాన్ని కలిగిస్తాడు, ఆ ఆనందాన్ని మీనుండి ఎవరూ తీసివేయలేరు."
\p
\v 23 "ఆ రోజున నన్ను అడగడానికి మీకు ఇంకా ప్రశ్నలు ఏవీ ఉండవు. నేను కచ్చితంగా మీతో చెప్తున్నాను, నాలో మీరున్నందువల్ల మీరు నా పేరు మీద తండ్రిని ఏది అడిగినా అది ఆయన మీకు ఇస్తాడు.
\v 24 ఇంతవరకూ మీరు నా పేరు మీద అలా ఏమీ అడగలేదు. అడగండి, మీరు పొందుతారు. దేవుడు మీ ఆనందం సంపూర్ణం అయ్యేలా గొప్ప ఆనందం మీకు దయచేస్తాడు."
\s5
\p
\v 25 "ఉపమాన శైలిలో నేనిప్పటి వరకూ ఈ విషయాలన్నీ మాట్లాడుతూ వచ్చాను గానీ, ఇక కొద్ది కాలంలో ఈ రకమైన భాష వాడను. నా తండ్రి గురించి అందరికీ అర్థమయ్యే భాషలో స్పష్టంగా మీకు చెప్తాను.
\s5
\v 26 ఆ సమయంలో మీ మనవులన్నిటినీ నా పేరు మీద దేవుని ఉద్దేశ ప్రకారం దేవునికి తెలియజేయండి. మీ అవసరాలు తీర్చమని నేను తండ్రిని వేడుకోవలసిన అవసరం లేదు.
\v 27 ఎందుకంటే మీరు నన్ను ప్రేమించి, నేను తండ్రి దగ్గరనుండి వచ్చానని నమ్మారు కాబట్టి తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు.
\v 28 నేను తండ్రి దగ్గర నుండి వచ్చాను. నేను ఈ లోకంలోకి ప్రవేశించాను, తిరిగి నా తండ్రి దగ్గరకు తొందరలోనే ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతున్నాను" అన్నాడు.
\s5
\p
\v 29 అప్పుడు ఆయన శిష్యులు, "ఇన్నాళ్ళకు అర్ధం కాని భాషలో కాకుండా స్పష్టంగా మాతో మాట్లాడుతున్నావు.
\v 30 నీకు అన్నీ తెలుసని ఇప్పటికి మాకు అర్ధం అయ్యింది. ఇంకా మేము ప్రశ్నలు అడగవలసిన అవసరం లేదు. దీనివల్లే నీవు దేవుని దగ్గర నుండి వచ్చావని మేము నమ్ముతున్నాము" అన్నారు.
\p
\v 31 యేసు వారితో, "మీరు ఇప్పుడు నమ్ముతున్నారా?
\s5
\v 32 చూడండి, ఇతరులు మిమ్మల్ని అన్ని చోట్లకు చెదరగొట్టేచెల్లా చెదరు చేసే సమయం వస్తుంది. ప్రతి ఒక్కరూ చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోతారు. నన్ను ఒంటరిగా వదిలేస్తారు. అయినప్పటికీ నేను ఒంటరిగా ఉండను. నా తండ్రి నాతో ఎప్పుడూ ఉంటాడు.
\v 33 నాతో మీకున్న సంబంధం కారణంగా మీరు మనశ్శాంతిగా ఉండాలని ఈ సంగతులు మీతో చెప్పాను. ఈ లోకంలో మీకు శ్రమలు, విచారాలే ఉంటాయి, అయిన సరే, ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను" అన్నాడు.
\s5
\c 17
\p
\v 1 యేసు ఈ సంగతులన్నీ చెప్పిన తరవాత ఆకాశం వైపు చూసి, "తండ్రీ నేనెవరినో, ఏమి చేశానో, నువ్వు అందరికీ వెల్లడి చేయాల్సిన సమయం వచ్చేసింది. సమస్తం చేయగలిగిన గొప్ప రాజువైన నీవు ఎవరివో, ప్రతి ఒక్కరికీ నీ కుమారుడ నైన నేను వెల్లడి చేయగలిగేలా దీనిని జరిగించు.
\v 2 నువ్వు నీ కుమారునికి అప్పగించిన వాళ్ళందరికీ శాశ్వత జీవం ఇచ్చేలా మనుషులందరి మీదా ఆయనకు అధికారం ఇచ్చావు."
\s5
\p
\v 3 "నువ్వు మాత్రమే ఏకైక సత్య దేవుడవని నీ గురించి తెలుసుకోవడం, మెస్సీయ అయిన యేసు అనే నన్ను నీవే ఈ లోకంలోకి పంపావని తెలుసుకోవడమే శాశ్వత జీవం.
\v 4 నీ గురించి తెలియజెప్పడానికి అన్ని రకాల మనుషుల్నీ నీ దగ్గరికి తెచ్చాను. నువ్వు నాకప్పగించిన పనిని ఈ విధంగా చేసి పూర్తి చేశాను.
\v 5 తండ్రీ, మనం ఈ లోకాన్ని సృష్టించక ముందు నాకు ఎలాంటి మహిమ ఉండేదో, అలాంటి మహిమనే ఇప్పుడు నీ సమక్షానికి నన్ను తీసుకెళ్ళినప్పుడు నాకు మళ్ళీ కలిగించు."
\s5
\p
\v 6 "లోకంలో నుండి నీవు ఎంపిక చేసి నాకప్పగించిన వాళ్ళందరికీ నిజంగా నీవెవరివో, నీవెలా ఉంటావో తెలియజేశాను. వాళ్ళు నీ వాళ్ళే. నువ్వే వాళ్ళని నాకిచ్చావు. వాళ్ళు నువ్వు చెప్పిన వాక్కును నమ్మి దానికి లోబడ్డారు.
\v 7 వీళ్ళు నానుండి విన్న మాటలన్నీ నీనుండే వచ్చాయని ఇప్పుడు తెలుసుకున్నారు.
\v 8 నువ్వు నాకిచ్చిన సందేశాన్ని నేను వాళ్ళకిచ్చాను. దాన్ని వాళ్ళు అంగీకరించారు. ఇప్పుడు నీ దగ్గరనుండి నేను వచ్చాననీ, నువ్వే నన్ను పంపావనీ, వాళ్ళు కచ్చితంగా తెలుసుకున్నారు."
\s5
\p
\v 9 "నేను వాళ్ళ గురించి ప్రార్ధిస్తున్నాను. ఈ లోకానికి సంబంధించిన వాళ్ళ కోసం, నిన్ను ఎప్పుడూ వ్యతిరేకిస్తున్న వాళ్ళ కోసం, నేను ప్రార్థించడం లేదు. నువ్వు నాకప్పగించిన వాళ్ళ కోసమే ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు నీకు చెందినవారు.
\v 10 నావన్నీ నీవి, నీవన్నీ నావి. నేనెవరో వాళ్లకు తెలుసు. నేనెవరినో, నన్ను గురించిన వాస్తవాన్ని వాళ్ళు యథార్థంగా చెప్తారు."
\p
\v 11 నేనిక ఎంతో కాలం ఈ లోకంలో ఉండను. వాళ్ళు ఈ లోకంలో ఉంటారు. నేను నీ దగ్గరికి వస్తున్నాను. పవిత్రుడవైన తండ్రీ, వాళ్ళని క్షేమంగా ఉంచు. నువ్వు నాకిచ్చిన అదే శక్తితో మనం ఏకంగా ఉన్నట్టే వాళ్ళూ కలిసి ఐక్యతగా ఉండేలా వాళ్ళని కాపాడు."
\s5
\p
\v 12 "నేను వారితో ఉన్నప్పుడు నువ్వు నాకిచ్చిన శక్తితో వాళ్ళని క్షేమంగా కాపాడాను. వాళ్ళలో ఒక్కడూ తప్పిపోలేదు. అయితే లేఖనాల్లో ముందుగా చెప్పినట్టుగా నాశనానికి తగినవాడు తప్ప ఇంకెవరూ తప్పిపోలేదు."
\p
\v 13 "ఇప్పుడు నేను నీ దగ్గరికి వస్తున్నాను. నా సంపూర్ణమైన ఆనందాన్ని వాళ్ళకీ ఇవ్వవచ్చని లోకంలో ఉండగానే ఈ సంగతులు చెప్తున్నాను.
\v 14 నీ సందేశాన్ని వాళ్లకి చెప్పాను. లోకం వాళ్ళను ద్వేషించి నీ సందేశాన్ని వినలేదు. నన్ను ద్వేషించినట్టే లోకం వాళ్ళను కూడా ద్వేషించింది. వాళ్ళు కూడా ఈ లోకానికి చెందినవారు కాదు, ఎందుకంటే వారికి ఇంకొక ఇల్లు ఉంది."
\s5
\p
\v 15 "వాళ్ళను ఈ లోకంలోనుండి బయటికి తీసుకెళ్ళమని నేను ప్రార్థన చేయడం లేదు. దుష్టుడు తలపెట్టే హాని నుండి వాళ్ళని కాపాడమని ప్రార్థన చేస్తున్నాను."
\p
\v 16 "నేను ఈ లోకానికి చెందిన వాణ్ని కానట్టే వాళ్ళు కూడా ఈ లోకానికి చెందిన వాళ్ళు కారు.
\v 17 నా శిష్యులు సంపూర్ణంగా నీకు చెందిన వాళ్ళుగా ఉండేలా, ఏది సత్యమో దాన్ని అనుసరించి జీవించేలా వాళ్ళని ప్రత్యేకపరచు. నీ సందేశమే సత్యం."
\s5
\p
\v 18 "నువ్వు నన్ను ఈ లోకంలోకి పంపినట్టుగానే నేనూ వీళ్ళని లోకంలోకి పంపుతున్నాను.
\v 19 వాళ్ళ కోసం నన్ను నేను సంపూర్ణంగా నీకు సమర్పించుకుంటున్నాను. అలా చేయడం వల్ల వాళ్ళు కూడా తమను తాము నీకు సమర్పించుకుంటారు."
\s5
\p
\v 20 "నేను ఇక్కడ ఉన్న శిష్యుల గురించే కాదు, వాళ్ళు చెప్పిన సందేశం విని నా మీద విశ్వాసముంచిన వారందరి కోసం కూడా ప్రార్థిస్తున్నాను.
\v 21 మనం ఐక్యంగా ఉన్నట్టుగా వాళ్ళంతా కూడా ఐక్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. తండ్రీ, నువ్వు నాతో, నేను నీతో ఐక్యంగా ఉన్నట్టు వాళ్ళు కూడా మనతో ఐక్యంగా ఉండాలి. ఇది లోకం గమనించినప్పుడు నన్ను పంపింది నువ్వేనని తెలుసుకుంటుంది."
\s5
\p
\v 22 "నేనెవరినో వాళ్లకి చూపించాను, నేనేమి చేశానో వాళ్ళు చూశారు. మనం ఐక్యంగా ఉన్నట్టే వాళ్ళు కూడా ఐక్యంగా ఉండాలని నేను వాళ్ళకి ఇలా బోధించాను.
\v 23 వాళ్ళలో నేను, నాలో నువ్వు ఐక్యంగా ఉన్నాం. ఈ కారణంగా వాళ్ళు పరిపూర్ణంగా ఐక్యంగా ఉండటం వల్ల నువ్వు నన్ను పంపావనీ, నువ్వు నన్ను ప్రేమించినట్టే వాళ్ళని కూడా ప్రేమించావనీ, అవిశ్వాసులు తెలుసుకుంటారు."
\s5
\p
\v 24 "తండ్రీ, నేనెక్కడ ఉంటానో నువ్వు నాకప్పగించిన వారు కూడా ఎప్పుడూ నాతోబాటు అక్కడ ఉండాలనీ, నువ్వు నాకీయబోయే వైభవాన్నీ, ఠీవినీ వాళ్ళూ చూడాలని నేను ఆశ పడుతున్నాను. ఎందుకంటే భూమికి పునాది వేయక ముందునుంచే నువ్వు నన్ను ప్రేమించావు."
\s5
\p
\v 25 "నీతి న్యాయాలు కలిగిన తండ్రీ, లోకం నిన్ను తెలుసుకోలేదు, కానీ నువ్వు నాకు తెలుసు. ఇప్పుడు నాతో ఉన్న వీళ్ళకి నువ్వు నన్ను పంపావని తెలుసు.
\v 26 నువ్వు నన్ను ప్రేమించినట్టుగానే వాళ్ళని కూడా ప్రేమిస్తావని నువ్వెవరివో వాళ్ళు తెలుసుకొనేలా చేశాను. ఇంకా తెలియజేస్తూనే ఉంటాను."
\s5
\c 18
\p
\v 1 యేసు తన ప్రార్థన ముగించాక, ఆయనా ఆయన శిష్యులూ కిద్రోను లోయను దాటారు. ఆ లోయ అవతల పక్కన గుబురుగా పెరిగిన ఒలీవ తోటలోకి వాళ్ళు వెళ్ళారు.
\p
\v 2 యేసును శత్రువులకు అప్పగించబోతున్న యూదాకు ఆ ప్రదేశం కొట్టిన పిండి. ఎందుకంటే యేసు తన శిష్యులతో తరచుగా అక్కడికి వెళ్తూ ఉండేవాడు.
\v 3 కాబట్టి యూదా కొంతమంది రోమా సైనికులనూ, పరిసయ్యులు, ముఖ్య యాజకులు పంపించిన దేవాలయ అధికారులనూ వెంటబెట్టుకొని ఆ తోట దగ్గరికి వచ్చాడు. వాళ్ళు కాగడాలూ, దీపాలూ, ఆయుధాలూ పట్టుకొని వచ్చారు.
\s5
\v 4 యేసు తనకు ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి ముందుకు వచ్చి వాళ్ళతో, "మీరెవరి కోసం చూస్తున్నారు?" అని అడిగాడు.
\v 5 వాళ్ళు, "నజరేతు వాడైన యేసు కోసం" అన్నారు. యేసు వాళ్ళతో, "నేనే ఆ మనిషిని" అన్నాడు. (యేసును పట్టించి ఇచ్చే యూదా వాళ్ళతో పాటు నిలబడి ఉన్నాడు).
\s5
\v 6 యేసు వాళ్ళతో, "నేనే ఆయన్ని" అనగానే ఆయన శక్తి చూసి వాళ్ళు వెనక్కి తూలి నేల మీద పడిపోయారు.
\v 7 కాబట్టి ఆయన మళ్ళీ వాళ్ళను "మీరు ఎవరి కోసం చూస్తున్నారు?" అని అడిగాడు. వాళ్ళు, "నజరేతు వాడైన యేసు కోసం" అన్నారు.
\s5
\v 8 యేసు వాళ్ళతో, "నేనే ఆయన్ని అని మీతో చెప్పాను. మీరు నా కోసమే చూస్తూ ఉంటే మిగిలిన వారిని వెళ్ళనివ్వండి" అన్నాడు.
\v 9 "నువ్వు ఇచ్చిన వారిలో ఏ ఒక్కరినీ నేను పోగొట్టుకోలేదు" అని ఆయన చేసిన ప్రార్థన నెరవేరడానికి ఆయన ఈ మాటలు అన్నాడు.
\s5
\p
\v 10 అప్పుడు సీమోను పేతురు తన ఒరలో ఉన్న చిన్న కత్తిని బయటికి లాగి ప్రధాన యాజకుడి పనివాడి కుడి చెవి నరికాడు. అతని పేరు మల్కు.
\v 11 యేసు పేతురుతో, "కత్తిని ఒరలో పెట్టు. తండ్రి నాకోసం ఉద్దేశించిన ప్రకారంగానే నేను హింసలు పొందుతాను" అన్నాడు.
\s5
\p
\v 12 అప్పుడు సేనాధిపతితో కలిసి ఆ సైనికుల గుంపు, కొందరు దేవాలయ అధికారులు యేసుని చుట్టుముట్టి, ఆయన్ని బంధించారు.
\v 13 అప్పుడు వారు ఆ సంవత్సరం ప్రధాన యాజకుడైన కయప మామ అయిన అన్న దగ్గరికి ఆయన్ని తీసుకు వెళ్ళారు.
\v 14 ప్రజలందరూ చనిపోవడం కంటే ప్రజలందరి కోసం ఒక్క మనిషి చనిపోవడం మంచిదని మిగిలిన నాయకులకు ఆలోచన చెప్పినవాడే ఈ కయప.
\s5
\p
\v 15 సీమోను పేతురు, ఇంకొక శిష్యుడు యేసును వెంబడించారు. ఇంకొక శిష్యుడు ప్రధాన యాజకుడికి పరిచయం ఉన్నవాడు కాబట్టి సైనికులు యేసును ప్రధాన యాజకుని ఇంటి ఆవరణలోకి తీసుకు వెళ్ళేటప్పుడు వాళ్ళతో కూడా వెళ్ళడానికి అతనికి అనుమతి దొరికింది.
\v 16 పేతురు గుమ్మం ముందే ఆగిపోవలసి వచ్చింది. కాబట్టి ఆ మరొక శిష్యుడు మళ్ళీ బయటికి వెళ్లి గుమ్మం దగ్గర కాపలా కాస్తున్న పనిపిల్లతో మాట్లాడాడు. అప్పుడు ఆమె పేతురును లోపలికి రానిచ్చింది.
\s5
\v 17 ఆ పనిపిల్ల పేతురుతో, "వాళ్ళు బంధించిన ఆ మనిషి శిష్యులలో నువ్వూ ఒకడివి కదా?" అని అడిగింది. అప్పుడు అతడు, "కాదు, నేను కాదు" అన్నాడు.
\p
\v 18 బాగా చలిగా ఉండడం వల్ల ప్రధాన యాజకుని సేవకులూ, దేవాలయ అధికారులూ, చలిమంట వేసుకుని చుట్టూ నిలబడి చలి కాచుకుంటున్నారు. పేతురు కూడా వాళ్ళతో ఉండి చలి కాచుకుంటున్నాడు.
\s5
\p
\v 19 ప్రధాన యాజకుడు యేసును ఆయన శిష్యుల గురించీ, ఆయన వారికి చేసే ఉపదేశాల గురించీ ప్రశ్నలు వేశాడు.
\v 20 యేసు, "నేను ప్రతి ఒక్కరితో బహిరంగంగానే మాట్లాడాను, నేనేదీ రహస్యంగా మాట్లాడలేదు. నేను ఎప్పుడైనా సరే, యూదులు సమావేశమయ్యే సమాజమందిరాల్లో, దేవాలయంలో, ఎక్కడైతే మనుషులు పోగవుతారో అక్కడే మాట్లాడాను.
\v 21 నన్ను ఎందుకు ఈ ప్రశ్నలు అడుగుతున్నారు? నేనేమి చెప్పానో నా ఉపదేశాలు విన్నవారిని అడగండి. నేనేమి చెప్పానో వాళ్లకు తెలుసు" అన్నాడు.
\s5
\p
\v 22 యేసు ఈ విషయాలు మాట్లాడుతూ ఉండగానే ఆయన పక్కన నిలబడిన అధికారులలో ఒకడు తన అరచేతితో ఆయన్ని గట్టిగా కొట్టి, ప్రధాన యాజకునితో అలాగేనా మాట్లాడేది?" అన్నాడు.
\v 23 యేసు అతనితో, "నేను ఏదైనా తప్పు మాట్లాడి ఉంటే ఆ తప్పు ఏమిటో చెప్పు. కానీ నేను సరిగ్గానే చెప్పి ఉంటే నన్నెందుకు కొడతావు" అన్నాడు.
\v 24 తరవాత అన్న యేసును ప్రధాన యాజకుడైన కయప దగ్గరకి పంపించాడు.
\s5
\p
\v 25 సీమోను పేతురు నిలబడి చలి కాచుకుంటూ ఉన్నాడు. ఇంకో వ్యక్తి అతనితో, "వాళ్ళు అరెస్ట్ చేసిన ఆ మనిషి శిష్యులలో వాడివే కదా నువ్వు?" అని అడిగాడు. పేతురు, "నేను కాదు" అన్నాడు.
\v 26 ప్రధాన యాజకుని సేవకుల్లో ఒకడూ, పేతురు ఎవరి చెవి నరికాడో అతని బంధువూ అయిన ఆ సేవకుడు పేతురుతో, "కచ్చితంగా ఆ మనిషిని అరెస్ట్ చేసేటప్పుడు ఆ ఒలీవ తోట దగ్గర ఆ మనిషితో నిన్ను చూశాను. అవునా, కాదా?" అన్నాడు.
\v 27 పేతురు మళ్ళీ ఒప్పుకోకుండా దానిని ఖండించాడు. వెంటనే కోడి కూసింది.
\s5
\p
\v 28 తరవాత సైనికులు యేసును కయప దగ్గరనుండి రోమా గవర్నర్ అయిన పిలాతు రాజమందిరానికి తీసుకెళ్ళారు. అది తెల్లవారుతున్న సమయం. పిలాతు యూదుడు కాదు గనక యేసు మీద నేరారోపణ చేస్తున్నవారు ఒకవేళ తాము రోమీయుడైన అధికారి రాజమందిరం లోకి వెళ్తే మైల పడి పస్కా పండుగను ఆచరించలేక పోతామేమోనని భావించారు. కాబట్టి వాళ్ళు లోపలి వెళ్ళలేదు.
\v 29 కాబట్టి పిలాతు బయటికి వచ్చి వాళ్ళతో మాట్లాడాడు. అతడు, "ఈ మనిషి పై ఏ నేరాన్ని మోపుతున్నారు?" అని అడిగాడు.
\v 30 వాళ్ళు, "ఇతడు నేరస్తుడు కాకపోతే నీ దగ్గరికి తీసుకు వచ్చే వాళ్ళం కాదు గదా?" అన్నారు.
\s5
\v 31 అప్పుడు పిలాతు వాళ్ళతో, "అతణ్ణి మీరే తీసుకుపోయి మీ ధర్మశాస్త్ర ప్రకారం తీర్పు తీర్చుకోండి" అన్నాడు. అప్పుడు ఆ యూదు నాయకులు, "మేము అతనికి మరణ శిక్ష వేయాలనుకుంటున్నాం. కానీ ఆ పని చేయడానికి మీ రోమా చట్టాలు అడ్డుపడుతున్నాయి" అన్నారు.
\v 32 యేసు తాను ఏ విధంగా చనిపోతానని చెప్పాడో దాన్ని నిజం చేయడానికే వారు అలా చెప్పారు.
\s5
\p
\v 33 పిలాతు మళ్ళీ తన రాజమందిరంలోకి వెళ్లి, యేసును రప్పించి ఆయనతో, "నువ్వు యూదులకు రాజువా?" అని అడిగాడు.
\v 34 యేసు, "ఈ ప్రశ్న నువ్వు తెలుసుకోవాలని అడుగుతున్నావా లేకపోతే ఈ ప్రశ్న ఎవరైనా నిన్ను అడగమన్నారా?" అన్నాడు.
\v 35 దానికి పిలాతు, "నాకేం పని? నేను యూదుడినా ఏంటి? మీ స్వజాతి ప్రజలు, మీ ముఖ్య యాజకులు నిన్ను నాకు అప్పగించారు. నీవేం తప్పు చేశావు?" అని అడిగాడు.
\s5
\p
\v 36 యేసు అతనితో, "నా రాజ్యం ఈ లోకానికి సంబంధించింది కాదు. ఒకవేళ నా రాజ్యం ఈ లోకానికి సంబంధించిందే అయితే నేను ఈ యూదుల చేతిలో పడకుండా నా సేవకులు పోరాడేవాళ్ళు. కానీ నా రాజ్యం ఈ లోకసంబంధమైనది కాదు" అని జవాబిచ్చాడు.
\v 37 అప్పుడు పిలాతు యేసుతో, "అయితే నువ్వు రాజువా?" అన్నాడు. యేసు, "అవును, నేను రాజునని నువ్వంటున్నది నిజమే. నేను రాజును కావడానికే పుట్టాను. దేవుని గురించిన సత్యం చెప్పడానికి నేను ఈ లోకానికి వచ్చాను. ఎవరైతే ఈ సత్యాన్ని నమ్ముతారో వాళ్ళే నేను చెప్పేదాని మీద ఆసక్తి చూపుతారు."
\s5
\p
\v 38 పిలాతు ఆయనతో, "సత్యం అంటే ఏమిటో ఎవరికైనా ఎలా తెలుస్తుంది?" అన్నాడు.
\p పిలాతు ఆ ప్రశ్న అడిగి బయటికి వెళ్లి యూదీయ నాయకులతో మళ్ళీ మాట్లాడాడు. అతడు వాళ్ళతో, "అతడు ఏ చట్టాన్నీ ఉల్లంఘించలేదు.
\v 39 ఎలాగైనా మీ యూదులకు ప్రతి సంవత్సరం పస్కా పండగ సమయంలో జైలు నుండి ఒకరిని విడుదల చేసే ఆనవాయితీ ఉంది. కాబట్టి మీరు యూదుల రాజు అని చెప్తున్న ఇతన్ని మీకోసం విడుదల చేయమంటారా?" అని అడిగాడు.
\v 40 వాళ్ళు "వద్దు, ఈ మనిషిని విడుదల చేయొద్దు. బరబ్బాని విడుదల చేయండి" అని గట్టిగా కేకలు వేశారు. బరబ్బా ఒక తిరుగుబాటుదారుడు.
\s5
\c 19
\p
\v 1 అప్పుడు పిలాతు యేసును పిలిపించాడు. తన సైనికులచేత ఆయన్ని కొరడాలతో కొట్టించాడు.
\v 2 సైనికులు ముళ్ళ తీగెను కిరీటం లాగా అల్లి దానిని ఆయన తల మీద పెట్టారు. ఆయనకు లేత ఎరుపు రంగు అంగీని తొడిగించారు. యూదుల రాజా అని పిలుస్తూ ఆయన్ని ఎగతాళి చేయడం కోసమే ఇవన్నీ చేశారు.
\v 3 వాళ్ళు ఆయన్ని హేళన చేస్తూ "యూదుల రాజా, జయహో" అని చెప్పి ఆయన్ని మళ్ళీ మళ్ళీ కొట్టారు.
\s5
\p
\v 4 పిలాతు మళ్ళీ బయటికి వచ్చి ఆ ప్రజలతో, "చూడండి, ఈ మనిషిని శిక్షించడానికి నాకు ఏ కారణం కనబడలేదని మీకు తెలిసేలా మీ దగ్గరికి తీసుకు వస్తున్నాను" అన్నాడు.
\v 5 కాబట్టి యేసు ముళ్ళ కిరీటం, లేత ఎరుపు రంగు అంగీ వేసుకొని బయటికి వచ్చాడు. పిలాతు వారితో, "ఇదిగో ఈ మనిషి!" అన్నాడు.
\p
\v 6 అప్పుడు ముఖ్య యాజకులూ, దేవాలయ అధికారులూ ఆయన్ని చూసి, సిలువ వెయ్యండి! సిలువ వెయ్యండి! అని కేకలు వేశారు. పిలాతు వారితో, "నాకైతే శిక్షించడానికి ఇతనిలో ఏకారణం కనబడడం లేదు. కాబట్టి మీరే తీసుకువెళ్ళి సిలువ వేసుకోండి" అన్నాడు.
\s5
\v 7 యూదు నాయకులు పిలాతుతో, "ఇతడు తనను దేవుని కుమారుడుగా ప్రకటించుకున్నాడు. కాబట్టి మాకు ఒక కచ్చితమైన చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారం అతడు చావవలసిందే" అన్నారు.
\p
\v 8 పిలాతు ఇది విని ఒకవేళ యేసును చంపమని తన సైనికులకు ఆజ్ఞాపిస్తే తనకేమి జరుగుతుందో అని భయపడ్డాడు.
\v 9 మళ్ళీ ఇంకొకసారి అతడు రాజమందిరంలోకి వెళ్లి సైనికులను పిలిచి యేసును లోపలి తీసుకు రమ్మని చెప్పాడు. అప్పుడు అతడు యేసుతో "నువ్వు ఎక్కడినుండి వచ్చావు?" అని అడిగాడు. యేసు అతనికి జవాబు చెప్పలేదు.
\s5
\v 10 అప్పుడు పిలాతు ఆయనతో, "నువ్వు నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేసే అధికారం, సిలువ వేసే అధికారం కూడా నాకు ఉన్నాయని నీకు తెలియదా?" అన్నాడు.
\v 11 యేసు అతనితో, "దేవుడు నీకు అధికారం ఇస్తే తప్ప నామీద నీకు ఏమాత్రం అధికారం లేదు. కాబట్టి నన్ను నీకు అప్పగించిన వాడికి ఇంకా ఎక్కువ పాపం చుట్టుకుంటుంది" అన్నాడు.
\s5
\p
\v 12 ఆ క్షణం నుండీ పిలాతు యేసును విడుదల చేయడానికి ఇంకా ఎక్కువగా ప్రయత్నం చేశాడు. దానికి యూదీయ నాయకులు, "నువ్వు గనక ఈ మనిషిని విడుదల చేస్తే నువ్వు రోమా చక్రవర్తి కైసరుకు స్నేహితుడివి కాదు. ఎవరైనా తనకు తానే రాజుగా చేసుకొనేవాడు కైసరుకు వ్యతిరేకంగా మాట్లాడినట్టే" అని కేకలు వేశారు.
\v 13 పిలాతు ఆ కేకలు విని యేసును బయటికి తీసుకొచ్చి, తీర్పులు ప్రకటించే న్యాయపీఠం మీద యేసుకు ఎదురుగా కూర్చున్నాడు. ఆ స్థలాన్ని హెబ్రీ భాషలో "గబ్బతా" అంటారు. ఆ మాటకు "రాళ్ళు పరచిన స్థలం" అని అర్థం.
\s5
\p
\v 14 అది పస్కా పండుగకు ముందు రోజైన సిద్ధబాటు రోజు. అది దాదాపు మధ్యాహ్న సమయం. అప్పుడు పిలాతు యూదులతో, "ఇదిగో మీ రాజు" అన్నాడు.
\v 15 వారు, "అతణ్ణి చంపెయ్యండి! చంపెయ్యండి! అతణ్ణి సిలువ వేయండి" అని అరిచారు. పిలాతు వారితో, "మీ రాజును సిలువ వేయమంటారా?" అన్నాడు. ముఖ్య యాజకులు, "కైసరు తప్ప మాకు రాజెవ్వరూ లేరు" అని జవాబిచ్చారు.
\v 16 ఆఖరికి అతడు వాళ్ళ ఇష్ట ప్రకారమే చెయ్యడానికి ఒప్పుకుని, యేసును సిలువ వేయమని తన సైనికులతో చెప్పాడు. అప్పుడు సైనికులు యేసును తీసుకెళ్ళిపోయారు.
\s5
\p
\v 17 యేసు తన సిలువ తానే మోసుకుంటూ బయటికి వచ్చి, "కపాల స్థలం" అనే చోటికి వచ్చాడు. ఆ చోటును హెబ్రీ భాషలో "గొల్గొతా" అని పిలుస్తారు.
\v 18 అక్కడ వారు ఆయన్ని సిలువ వేశారు. అదే సమయంలో ఇద్దరు నేరస్తులను కూడా సిలువ వేశారు. వారిద్దరినీ ఇరువైపులా ఉంచి మధ్యలో యేసును సిలువ వేశారు.
\s5
\p
\v 19 పిలాతు, "యూదుల రాజైన నజరేయుడైన యేసు" అని రాయించి ఒక పలకను సిలువకు బిగించమని చెప్పాడు.
\v 20 యేసును సిలువ వేసిన స్థలం పట్టణానికి సమీపంలో ఉంది కాబట్టి చాలామంది యూదులు ఆ రాతను చదివారు. పైగా అది హీబ్రూ, లాటిన్, గ్రీకు అనే మూడు భాషల్లో రాసి ఉంది.
\s5
\v 21 ముఖ్య యాజకులు మళ్ళీ పిలాతు దగ్గరికి వెళ్లి, "యూదులకు రాజు అని రాయకుండా దానికి బదులుగా "ఈ మనిషి తాను యూదుల రాజు అని చెప్పుకున్నాడు" అని రాయాల్సింది" అన్నారు.
\v 22 అప్పుడు పిలాతు, "నేనేమి రాయమని చెప్పానో వాళ్ళు అదే రాశారు, దాన్ని మార్చేది లేదు" అన్నాడు.
\s5
\p
\v 23 యేసును సిలువ వేసిన తరవాత సైనికులు ఆయన బట్టలు నాలుగు భాగాలుగా చేసికుని తలొక భాగం పంచుకున్నారు.
\v 24 ఆయన అంగీని మాత్రం "దీన్ని మధ్యకు చింపకుండా ఎవరు తీసుకోవాలో నిర్ణయించడానికి మనం చీట్లు వేద్దాం" అనుకున్నారు. అలా అనడంతో "వారు నా వస్త్రాలు పంచుకున్నారు, వారు నా అంగీ కోసం చీట్లు వేసుకున్నారు" అని లేఖనాల్లో రాసి ఉన్నది నెరవేరింది. అందుకే సైనికులు ఆ విధంగా చేశారు.
\s5
\p
\v 25 సిలువ దగ్గర యేసు తల్లీ, ఆమె సోదరీ, క్లోపా భార్య మరియ, మగ్దలేనే మరియ నిలబడి ఉన్నారు.
\v 26 తన తల్లీ, తాను ప్రత్యేకంగా ప్రేమించే తన శిష్యుడైన యోహానూ దగ్గరగా నిలబడి ఉండడం యేసు చూసి, తన తల్లితో, "అమ్మా, ఇదిగో ఇకనుండి నీ కొడుకు" అనీ,
\v 27 ఆ శిష్యుడితో, "ఇదిగో నీ తల్లి" అనీ అన్నాడు. ఆ క్షణం నుండీ ఆ శిష్యుడు ఆమెను తనతోబాటు ఉండడానికి తన ఇంటికి తీసుకెళ్ళాడు.
\s5
\p
\v 28 కొద్దిసేపటి తరవాత దేవుడు తనను చేయమని పంపినవన్నీ సమాప్తం అయ్యాయని యేసుకు తెలుసు కాబట్టి లేఖనాల్లో ముందుగా చెప్పిన చివరి విషయాన్నీ నెరవేర్చడానికి, "నాకు దాహంగా ఉంది!" అన్నాడు.
\v 29 అప్పుడు ఒక సైనికుడు పులిసిన ద్రాక్షరసం కుండలో ఒక స్పాంజి ముంచి దాన్ని ఒక హిస్సోపు చెట్టు బెత్తానికి తగిలించి ఆయన నోటికి అందించాడు.
\v 30 ఆ పులిసిన ద్రాక్షరసాన్ని తాగిన తరవాత యేసు, "సమాప్తం అయ్యింది" అని కేక పెట్టి తలవంచి ప్రాణం విడిచాడు.
\s5
\p
\v 31 అది పస్కా పండగ ముందు రోజైన సిద్ధపాటు రోజు (మరుసటి రోజు యూదులకు చాల ప్రత్యేకమైన విశ్రాంతి దినం). ఆ సెలవు రోజున చనిపోయిన వారి శరీరాలను సిలువ మీదే వదిలి పెట్టడం వాళ్ళ చట్టానికి వ్యతిరేకం కాబట్టి వాళ్ళు పిలాతు దగ్గరికి వెళ్లి ఆ ముగ్గురి కాళ్ళను విరగ్గొడితే తొందరగా చనిపోతారనీ, అప్పుడు వెంటనే ఆ శరీరాలను సిలువ మీదనుండి కిందికి దింపడానికి వీలవుతుందనీ అతణ్ణి అడిగారు.
\v 32 ఆ సైనికులు వెళ్లి యేసుతోబాటు సిలువ వేసిన ఇద్దరు దొంగల కాళ్ళు విరగ్గొట్టారు.
\p
\v 33 వాళ్ళు యేసు దగ్గరికి వచ్చి చూస్తే, ఆయన అప్పటికే చనిపోయి ఉన్నాడు. కాబట్టి వాళ్ళు ఆయన కాళ్ళను విరగ్గొట్ట లేదు.
\s5
\v 34 దానికి బదులుగా ఆ సైనికుల్లో ఒకడు ఒక బల్లెంతో ఆయన కుడివైపున డొక్కలో పొడిచాడు. వెంటనే రక్తం, నీళ్ళు ఆ శరీరంలో నుండి కారాయి.
\v 35 ఇదంతా ప్రత్యక్షంగా చూసినవాడి సాక్ష్యం సత్యం. సత్యమే చెప్తున్నానని అతనికి తెలుసు. కాబట్టి మీరు కూడా యేసుపై నమ్మకం ఉంచవచ్చు.
\s5
\v 36 "ఆయన ఎముకలలో ఒక్క ఎముక కూడా ఎవ్వరూ విరగ్గొట్టలేదు" అని లేఖనాల్లో రాసి ఉన్నది నెరవేరడానికే ఇలా జరిగింది.
\v 37 "వాళ్ళు తాము పొడిచిన వాని వైపు చూస్తారు" అని లేఖనాల్లో రాసి ఉన్న ఇంకొక ప్రవచనం కూడా వాళ్ళు నెరవేర్చారు.
\s5
\p
\v 38 ఇలా జరిగిన తరవాత, అప్పటిదాకా యూదులకు భయపడి రహస్య శిష్యుడిగా ఉన్న అరిమతయ యోసేపు పిలాతు దగ్గరికి వెళ్లి యేసు దేహాన్ని ఇస్తే తాను తీసుకు వెళ్తానని అడిగాడు. పిలాతు అందుకు అనుమతించాడు. కాబట్టి అతడు వచ్చి యేసు దేహాన్ని తీసుకు పోయాడు.
\v 39 యేసు దగ్గరికి ఒకసారి రాత్రి సమయంలో వచ్చిన నికోదేము కూడా యేసు దేహాన్ని సిద్ధం చేయడానికి సుగంధ ద్రవ్యాల మిశ్రమాన్నీ, బోళాన్నీ తీసుకువచ్చాడు. అవి ఇంచుమించు 33 కిలోలు.
\s5
\v 40 వాళ్ళు యేసు దేహాన్ని తీసుకువచ్చి నారబట్టతో చుట్టి, ఆ బట్టలో సుగంధ ద్రవ్యాలు నింపారు. ఇది యూదుల సాంప్రదాయం ప్రకారం చనిపోయిన వారి దేహాలను సమాధి చేసే పద్ధతి.
\p
\v 41 యేసును సిలువ వేసిన స్థలం ఒక తోట. ఆ తోట అంచున ఎవ్వరినీ అప్పటి వరకూ పాతిపెట్టని ఒక కొత్త సమాధి ఉంది.
\v 42 పస్కా పండగ ఆ సాయంత్రం నుండి మొదలవుతుంది కాబట్టి ఇది దగ్గరగా ఉండడం వలన యేసును తొందరగా అక్కడ సమాధి చెయ్యవచ్చని ఆ సమాధిని వాళ్ళు ఎంచుకున్నారు. కాబట్టి వాళ్ళు యేసును అక్కడ సమాధి చేశారు.
\s5
\c 20
\p
\v 1 వారంలో మొదటి రోజైన ఆదివారం నాడు ఇంకా చీకటిగా ఉండగానే మగ్దలేనే మరియ సమాధి దగ్గరికి వచ్చింది. అక్కడ సమాధిలోకి వెళ్ళే ముందు ఉన్న రాయిని ఎవరో తీసివేసినట్టు కనిపించింది.
\v 2 కాబట్టి ఆమె సీమోను పేతురూ, యేసు ప్రేమించిన శిష్యుడూ ఉంటున్న యెరూషలేముకు పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఆమె వాళ్ళతో, "వాళ్ళు ప్రభువు దేహాన్ని సమాధిలో నుండి ఎత్తుకు పోయారు. దానిని వాళ్ళు ఎక్కడ పెట్టారో తెలియడం లేదు" అని చెప్పింది.
\s5
\p
\v 3 వాళ్ళు ఆ మాటలు వినగానే వెంటనే గబగబా దగ్గరికి వచ్చారు.
\v 4 వారిద్దరూ పరుగెడుతూ ఉండగా మరొక శిష్యుడు పేతురు కంటే ముందుగా పరిగెత్తి సమాధి దగ్గరికి చేరుకున్నాడు. కానీ లోపలికి వెళ్ళడానికి తటపటాయించాడు.
\v 5 అతడు వంగి కిందికి ఆ సమాధిలోకి చూశాడు. అక్కడ బట్టలు చుట్టి పడి ఉన్నాయి.
\s5
\v 6 అప్పుడు అతని వెనక పరిగెత్తి వచ్చిన సీమోను పేతురు అక్కడికి చేరుకొని, సమాధి లోపలికి వెళ్ళాడు. అతడు కూడా నారబట్టలు చుట్టి పడి ఉండడం చూశాడు.
\v 7 అంతే కాదు, యేసు తలకు కట్టిన గుడ్డ వేరుగా మరొక చోట పెట్టి ఉండడం చూశాడు.
\s5
\v 8 అప్పుడు ముందుగా వచ్చిన శిష్యుడు కూడా లోపలికి వెళ్ళాడు. అతడు అక్కడి పరిస్థితిని చూసి యేసు నిజంగానే తిరిగి లేచాడని అతనిలో నమ్మకం కలిగింది.
\v 9 ఇది జరగక ముందు యేసు మరణించి తిరిగి లేవడం తప్పనిసరి అని లేఖనాల్లో ప్రవక్తలు రాసినవి వాళ్ళు అర్థం చేసుకోలేక పోయారు.
\p
\v 10 శిష్యులు తిరిగి తమ ఇళ్ళకు వెళ్ళిపోయారు.
\s5
\v 11 కానీ మరియ మాత్రం సమాధి బయటే నిలబడి ఏడుస్తూ ఉంది. ఆమె ఏడుస్తూ, సమాధిలోకి వంగి చూసింది.
\v 12 అప్పుడు తెల్లని అంగీలు వేసుకున్న ఇద్దరు దేవదూతలు యేసు శరీరాన్ని ఎక్కడ ఉంచారో అక్కడ తల దగ్గర ఒకరు, కాళ్ళ దగ్గర ఒకరు కూర్చుని ఉండడం ఆమె చూసింది.
\v 13 వాళ్ళు ఆమెతో, "అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడిగారు. ఆమె వాళ్ళతో, "నా ప్రభువు శరీరాన్ని ఎవరో తీసుకెళ్ళిపోయారు. ఎక్కడికి తీసుకెళ్లారో నాకు తెలియడం లేదు" అంది.
\s5
\v 14 అలా మాట్లాడిన తరవాత ఆమె వెనక్కి తిరిగి అక్కడ ఎవరో ఉండడం చూసింది. కానీ ఆయన యేసు అని ఆమెకు తెలియలేదు.
\v 15 ఆయన ఆమెతో, "అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరి కోసం చూస్తున్నావు?" అని అడిగాడు. ఆమె తనతో మాట్లాడుతున్నది తోటమాలి అనుకొని ఆయనతో, "అయ్యా, ఆయన్ని గనక నువ్వు తీసుకుపోయి ఉంటే ఆయన శరీరాన్ని ఎక్కడ ఉంచావో చెప్పు. నేను ఆయన్ని తీసుకెళ్తాను" అంది.
\s5
\v 16 అందుకు యేసు ఆమెను, "మరియా" అని పిలిచాడు. ఆమె ఆయన వైపు తిరిగి హెబ్రీ భాషలో "రబ్బూనీ" (అంటే బోధకుడు) అని పిలిచింది.
\v 17 యేసు ఆమెతో, "నన్ను తాకవద్దు, నేను నా తండ్రి దగ్గరికి పరలోకానికి ఇంకా వెళ్ళలేదు. నా శిష్యుల దగ్గరికి వెళ్లి నా తండ్రీ, మీ తండ్రీ, నా దేవుడూ, మీ దేవుడూ అయిన ఆయనతో ఉండడానికి పరలోకానికి ఆరోహణం అవుతున్నానని చెప్పు" అని చెప్పాడు.
\v 18 వెంటనే మగ్దలేనే మరియ శిష్యుల దగ్గరికి వెళ్లి "నేను ప్రభువును చూశాను" అని చెప్పింది. యేసు ఆమెతో ఏమి చెప్పమన్నాడో ఆ సమాచారం అంతా వారికి తెలియజేసింది.
\s5
\p
\v 19 ఆదివారం సాయంత్రం, వారంలో మొదటి రోజున శిష్యులు యూదుల అధికారులు తమను అరెస్ట్ చేస్తారేమో అని భయపడి ఇంటి తలుపులు వేసుకుని లోపల ఉన్నారు. అకస్మాత్తుగా యేసు వచ్చి ఆ గుంపు మధ్యలో నిలబడ్డాడు. ఆయన వారితో, "మీకు దేవుడు శాంతిని ఇచ్చు గాక" అన్నాడు.
\v 20 ఆయన అలా చెప్పిన తరవాత వారికి తన చేతుల్నీ, తన పక్కనూ చూపించాడు. ప్రభువుని చూసిన శిష్యులు చాలా సంతోషించారు.
\s5
\v 21 యేసు వారితో, "దేవుడు మీకు శాంతిని ప్రసాదిస్తాడు గాక. తండ్రి నన్ను పంపిన విధంగానే ఇప్పుడు నేను మిమ్మల్ని పంపుతున్నాను" అన్నాడు.
\p
\v 22 అలా చెప్పిన తరవాత ఆయన వారి మీద ఊది, "పరిశుద్ధాత్మను పొందండి.
\v 23 మీరు ఎవరి పాపాలు క్షమిస్తారో వాళ్ళ పాపాలను దేవుడు క్షమిస్తాడు. మీరు ఎవరి పాపాలను క్షమించక వాటిని అలాగే ఉండనిస్తారో అవి అలా నిలిచి ఉంటాయి" అన్నాడు.
\s5
\p
\v 24 పన్నెండు మంది శిష్యులలో ఒకడైన తోమా యేసు వారి దగ్గరికి వచ్చినప్పుడు వారి మధ్య లేడు. ఇతన్ని "దిదుమ" అని కూడా పిలుస్తారు.
\v 25 మిగిలిన శిష్యులు అతనితో, "మేము యేసును చూశాము" అని చెప్పారు. అయితే తోమా వారితో, "నేను ఆయన చేతుల్లో మేకులు కొట్టిన గుర్తులు చూసి, ఆ రంధ్రాలలో నా వేలు పెట్టి, ఆయన పక్కలో అయిన గాయంలో నా చెయ్యి పెట్టి తడిమితే గానీ నమ్మనే నమ్మను" అన్నాడు.
\s5
\p
\v 26 ఎనిమిది రోజుల తరవాత ఆయన శిష్యులు మళ్ళీ ఇంట్లో ఉన్నప్పుడు ఈసారి తోమా కూడా వారితో ఉన్నాడు. తలుపులు తాళాలు వేసి ఉన్నా యేసు వచ్చి వారి మధ్య నిలుచున్నాడు. ఆయన వాళ్ళందరితో, "దేవుడు మీకు శాంతిని ప్రసాదించు గాక!" అన్నాడు.
\v 27 అప్పుడు ఆయన తోమాతో, "నా చేతులు చూసి నీ వేళ్ళు పెట్టు. నీ చేయి నా పక్కలోని గాయంలో పెట్టు. నేనే, సందేహపడ వద్దు. నన్ను నమ్ము" అన్నాడు.
\s5
\v 28 తోమా ఆయనతో, "నా ప్రభూ, నా దేవా!" అన్నాడు.
\v 29 యేసు తోమాతో, "నేను తిరిగి లేచానని ఇప్పుడు నన్ను చూసి నమ్మావు. కానీ చూడకుండానే నమ్మినవాళ్ళకు దేవుడు గొప్ప సంతోషాన్ని ఇస్తాడు" అన్నాడు.
\s5
\p
\v 30 యేసు తానెవరో రుజువుపరిచే అనేక రకాల శక్తివంతమైన పనులూ, అద్భుతాలూ చేశాడు. ఆయన శిష్యులు వాటిని కళ్ళారా చూశారు. అవి లెక్కకు మించి ఉండడం వల్ల నేను అన్నిటినీ ఈ పుస్తకంలో రాయలేదు.
\v 31 అయితే యేసే మెస్సీయ అనీ, దేవుని కుమారుడనీ, మీరు నమ్మడం వల్ల ఆయన నామంలో మీకు నిత్య జీవం కలుగుతుందన్న సంపూర్ణమైన నమ్మకం మీకు కలగాలని వీటన్నిటినీ రాశాను.
\s5
\c 21
\p
\v 1 ఆ తరవాత యేసు తిబెరియ సరస్సు (దీన్ని గలిలయ సరస్సు అని కూడా అంటారు) తీరాన శిష్యులకు ఇంకొకసారి కనిపించాడు. ఆయన తనను తాను ఈ విధంగా వారికి తెలియపరచుకున్నాడు.
\v 2 సీమోను పేతురు, తోమా (ఇతన్ని దిదుమ అని కూడా పిలుస్తారు), గలిలయలోని కానా ఊరివాడైన నతనయేలూ, జెబెదయి కొడుకులూ (అంటే యాకోబూ, యోహానూ), ఇంకా ఆయన శిష్యులలో ఇద్దరూ కలిసి ఉన్నారు.
\p
\v 3 సీమోను పేతురు మిగిలిన వాళ్ళతో, "నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను" అన్నాడు. వాళ్ళు, "మేము కూడా నీతో వస్తాం" అన్నారు. వాళ్ళు వెళ్లి పడవ ఎక్కారు. కానీ ఆ రాత్రి వాళ్ళు చేపలేమీ పట్టలేదు.
\s5
\v 4 తెల్లవారగానే యేసు ఒడ్డున నిలబడి ఉన్నాడు. కానీ శిష్యులు ఆయన యేసు అని గుర్తుపట్ట లేదు.
\v 5 యేసు వాళ్ళతో, "మిత్రులారా, చేపలు ఏమైనా ఉన్నాయా?" అని అడిగాడు. వాళ్ళు "లేదు" అన్నారు.
\v 6 ఆయన వాళ్ళతో, "మీ వలలు పడవకు కుడి వైపున వేయండి. చేపలు దొరుకుతాయి" అన్నాడు. ఆయన చెప్పినట్టే వాళ్ళు వలలు వేశారు. వెంటనే చాలా చేపలతో తమ వల నిండిపోవడం వల్ల వాళ్ళు ఆ వలను పడవలోకి లాగలేక పోయారు.
\s5
\p
\v 7 యేసు ప్రత్యేకంగా ప్రేమించిన శిష్యుడైన యోహాను పేతురుతో "ఆయన ప్రభువు" అన్నాడు. అతడు అలా చెప్పడం వినగానే సీమోను పేతురు తన పైబట్టను కప్పుకుని నీళ్ళలోకి దూకేశాడు (చేపలు పట్టే పనిలో ఉన్నప్పుడు అతడు దాదాపుగా ఏమీ ధరించడు).
\v 8 మిగిలిన శిష్యులు పడవలో ఒడ్డుకు చేరుకున్నారు. వాళ్ళు ఒడ్డుకు ఎంతో దూరంలో లేరు. కేవలం 90 మీటర్ల దూరంలో ఉన్నారు.
\v 9 వాళ్ళు ఒడ్డుకు చేరుకోగానే వారికి అక్కడ మండుతున్న నిప్పులు, వాటిపైన ఉన్న చేపలు, రొట్టె కనిపించాయి.
\s5
\p
\v 10 యేసు వారితో, "మీరు పట్టిన చేపల్లో కొన్నిటిని తీసుకు రండి" అన్నాడు.
\v 11 సీమోను పేతురు పడవ ఎక్కి వలను ఒడ్డుకి లాగాడు. దానిలో 153 పెద్ద చేపలు ఉన్నాయి. అయినా ఆ వల పిగిలిపోలేదు.
\s5
\v 12 యేసు వారితో, "వచ్చి భోజనం చేయండి" అని పిలిచాడు. శిష్యులలో ఒక్కరు కూడా "నువ్వెవరివి?" అని అడిగే ధైర్యం చేయలేకపోయారు. ఎందుకంటే ఆయన ప్రభువని వారికి తెలుసు.
\v 13 యేసు వచ్చి ఆ రొట్టె తీసుకొని వాళ్ళందరికీ ఇచ్చాడు. అలాగే చేపలు కూడా పంచిపెట్టాడు.
\v 14 యేసు చనిపోయి దేవుడు ఆయన్ని తిరిగి లేపిన తరవాత ఆయన శిష్యులకు కనపడడం ఇది మూడో సారి.
\s5
\p
\v 15 వాళ్ళు భోజనం ముగించిన తరవాత యేసు సీమోను పేతురుతో, "యోహాను కొడుకైన సీమోనూ, వీరికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?" అని అడిగాడు. అప్పుడు పేతురు ఆయనతో, "అవును ప్రభూ, నేను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు" అన్నాడు. యేసు, "నా గొర్రెల్ని మేపు" అన్నాడు.
\p
\v 16 యేసు రెండవసారి పేతురుతో, "యోహాను కొడుకైన పేతురూ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?" అని అడిగాడు. అతడు, "అవును ప్రభూ, నేను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు" అన్నాడు. అప్పుడు యేసు అతనితో, "నా గొర్రెలకు కాపరిగా ఉండు" అన్నాడు.
\s5
\p
\v 17 యేసు మూడవసారి అతనితో, "యోహాను కొడుకైన సీమోనూ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?" అని అడిగాడు. యేసు మూడుసార్లు అడిగినందుకు పేతురు బాధపడి, "ప్రభూ, నీకు అంతా తెలుసు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు" అన్నాడు. అప్పుడు యేసు, "నా గొర్రెల్ని మేపు.
\v 18 నేను ఒక వాస్తవం చెప్తున్నాను, నువ్వు యువకుడిగా ఉన్నప్పుడు నీకు నువ్వే బట్టలు వేసుకొని ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి నడిచి వెళ్లిపోయే వాడివి. అయితే నువ్వు ముసలివాడవైనప్పుడు నువ్వు చేతులు చాపితే ఎవ్వరో నీకు బట్టలు వేసి వాళ్ళే నిన్ను మోసుకుంటూ నీకిష్టం లేని చోటికి తీసుకు వెళతారు” అని అతనితో చెప్పాడు.
\s5
\v 19 పేతురు దేవుణ్ణి మహిమ పరచడం కోసం ఎలా మరణిస్తాడో దానిని యేసు చూచాయగా చెప్పాడు. తరవాత యేసు అతనితో, "నన్ను అనుసరించు” అన్నాడు.
\s5
\p
\v 20 పేతురు వెనక్కి తిరిగి చూసి, యేసు ప్రత్యేకంగా ప్రేమించిన శిష్యుడు వారి వెనక నడుస్తుండడం చూశాడు. వారంతా భోజనం చేసే సమయంలో యేసు పక్కనే కూర్చుని ఆయనకు తన భుజం ఆనించి, "ప్రభూ, నిన్ను శత్రువులకు అప్పగించేది ఎవరు?" అని అడిగిన వాడు అతడే.
\v 21 పేతురు అతణ్ణి చూసి "ప్రభూ, ఇతనికేమౌతుంది?" అని యేసును ప్రశ్నించాడు.
\s5
\v 22 అందుకు యేసు అతనితో, "నేను తిరిగి వచ్చేవరకు అతడు బతికి ఉండడం నాకిష్టమైతే నీకేం సంబంధం? నువ్వు నన్ను అనుసరించు" అన్నాడు.
\v 23 కాబట్టి యేసు తిరిగి వచ్చేవరకూ అతడు మరణించడనే మాట సోదర సోదరీలందరికీ పాకిపోయింది. అయితే యేసు అతడు చనిపోడు అనలేదు. ఆయన కేవలం "నేను తిరిగి వచ్చేవరకూ అతడు బతికి ఉండడం నాకిష్టమైతే నీకేం సంబంధం?" అన్నాడు, అంతే.
\s5
\p
\v 24 యోహాను అనే నేను ఆయన శిష్యులలో ఒకడిగా ఈ విషయాలన్నీ ప్రత్యక్షంగా చూసి రాశాను. ఇతని సాక్ష్యం నిజమని మనకు తెలుసు.
\v 25 యేసు ఇంకా ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. వాటన్నిటినీ రాయాలంటే ఆ పుస్తకాలకు ఈ లోకమే సరిపోదని నా అభిప్రాయం.