\id 1JN - Indian Easy Version (IEV) Telugu \ide UTF-8 \h యోహాను రాసిన మొదటి పత్రిక \toc1 యోహాను రాసిన మొదటి పత్రిక \toc2 యోహాను రాసిన మొదటి పత్రిక \toc3 1jn \mt1 యోహాను రాసిన మొదటి పత్రిక \s5 \c 1 \p \v 1 సృష్టిలో ఇంకా ఏమైనా ఉనికిలోకి రాకముందే ఉన్నవాడిని గూర్చి యోహాననే నేను మీకు రాస్తున్నాను. ఆయన బోధిస్తుండగా అపోస్తులమైన మేము ఆయన చెప్పింది విన్నాము. మేము ఆయన్ని చూశాము. మా అంతట మేమే ఆయన వైపు చూసి, ఆయన్ని తాకాము. నిత్యజీవాన్ని గూర్చిన సువార్తను మాకు నేర్పినవాడు ఆయనే. \v 2 ఆయన ఈ లోకంలోకి వచ్చాడు, మేము ఆయన్ని చూశాము. మేము చూసిన ఆ వ్యక్తే ఎప్పుడూ జీవిస్తున్న వాడని మేము మీకు స్పష్టంగా ప్రకటిస్తున్నాము. ఆయన ఇంతకుమునుపు పరలోకంలో తండ్రితో పాటు ఉన్నాడు, కానీ మన మధ్య నివసించటానికి పరలోకం నుంచి దిగి వచ్చాడు. \s5 \p \v 3 మీరు మాతోపాటు సహవాసంలో కలవడానికి వీలుగా మేము చూసిన, విన్న యేసును గూర్చిన సువార్తను మేము మీకు ప్రకటిస్తున్నాము. మన తండ్రియైన దేవుడితోను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోను ఒకేసారి మేము సహవాసంలో జత కలిశాము. \v 4 అవి సత్యాలని మీరు కూడా నమ్మి తద్వారా మీరు ఒప్పుకుంటారని ఈ విషయాలను గూర్చి మీకు రాస్తున్నాను. దాని ఫలితంగా మనందరమూ సంపూర్ణ ఆనందాన్ని పొందుతాము. \s5 \v 5 మేము దేవుని నుంచి విన్న సువార్తనే మీకు ప్రకటిస్తున్నాము. ఆయన ఎన్నడూ పాపం చేయలేదు. ఆయన అసలు చీకటంటూ లేనివాడు, ప్రకాశమానమైన వెలుగు వంటివాడు. \v 6 మనం దేవునితో కలసి సహవాసంలో ఉన్నామని చెప్పుకుంటూ, ఇంకా అపవిత్రమైన పద్ధతుల్లో జీవితాలను కొనసాగిస్తే, అది పాపకూపంలో జీవించడం లాంటిదే. ఇంకా చీకటిలోనే ఉన్నట్లే. మనం అబద్ధాలను చెబుతున్నామన్నమాట. దేవుని నిజమైన సందేశంమనకు బోధించిన విధంగా మన జీవితాలను కొనసాగించడం లేదు. \p \v 7 అన్ని విషయాల్లో దేవుడు పవిత్రంగా జీవిస్తున్నట్టే, మనం పవిత్రంగా జీవించడం అంటే దేవుని వెలుగులో జీవించడం లాంటిదే. మనం అలా జీవించినట్లయితే మనం ఒకరితో ఒకరం కలిసిమెలిసి ఉంటాము. యేసు మన కోసం మరణించాడు కాబట్టి దేవుడు మన పాపాలను క్షమించి, మనలను అంగీకరిస్తాడు. \s5 \v 8 మేము ఎన్నడూ పాపం చేయలేదని చెప్పుకునే వాళ్ళు, తమను తాము మోసం చేసుకుంటున్నారు. అంతేకాకుండా దేవుడు వాళ్ళను గూర్చి చెప్పినదాన్ని నమ్మటానికి నిరాకరిస్తున్నారు. \v 9 కానీ దేవుడు చేస్తానని చెప్పినది ఆయన ఎప్పుడూ చేస్తూనే ఉన్నాడు. అంతేకాక ఆయన చేస్తున్నది ఎప్పుడూ సరైనదే. కాబట్టి మనం పాపం చేశామని ఆయన ముందు ఒప్పుకుంటే, ఆయన మన కోసం మన పాపాలను క్షమిస్తాడు. మనం చేసిన ప్రతి పాపకృత్యం యొక్క అపరాధం నుంచి మనల్ని విముక్తుల్ని చేస్తాడు. అందుచేత మనం పాపం చేశామని ఆయన ఎదుట ఒప్పుకోవాలి. \v 10 ప్రతి ఒక్కరూ పాపం చేశారని దేవుడు చెప్పినందున, మేము ఎన్నడూ పాపం చేయలేదని చెబుతున్నవాళ్ళు, దేవుడు అబద్ధం చెబుతున్నట్లుగా మాట్లాడుతున్నారు. మన గూర్చి దేవుడు చెబుతున్న దాన్ని వాళ్ళు తిరస్కరిస్తున్నారు. \s5 \c 2 \p \v 1 నాకు ఎంతో ప్రియమైన నా సొంత పిల్లల్లాంటి వాళ్ళు మీరు. మీరు పాపానికి దూరంగా ఉండాలని ఈ ఉత్తరం రాస్తున్నాను. విశ్వాసులైన మీలో ఎవరైనా పాపం చేస్తే, నీతిమంతుడైన యేసు మనలను క్షమించమని మన కోసం దేవుణ్ణి వేడుకుంటాడని గుర్తుంచుకోండి. \v 2 మన ప్రభువైన యేసు క్రీస్తు స్వచ్చందంగా తన సొంత ప్రాణాన్ని మన కోసం బలిగా అర్పించాడు. తద్వారా దేవుడు మన పాపాలను క్షమించాడు. పిల్లల్లారా అవును. దేవుడు మన పాపాలు క్షమిస్తాడు. మన పాపాలను మాత్రమే కాదు, లోకమంతటా ఉన్న ప్రజల పాపాలను ఆయన క్షమిస్తాడు. \p \v 3 దేవుడు మనకు కచ్చితంగా తెలుసని ఎలా చెప్పగలము అనేది నేను మీకు చెబుతాను. ఆయన మనకు చేయమని ఆజ్ఞాపించినట్టుగా మనం నడుచుకుంటే మనం ఆయనతో కలిసి సహవాసంలో ఉన్నామని అది మనకు తెలియజేస్తుంది. \s5 \v 4 మాకు దేవుడు తెలుసు అని చెబుతున్న వాళ్ళందరూ, దేవుడు చేయమని ఆజ్ఞాపించిన వాటిని పాటించని అబద్ధీకులే. దేవుని సువార్తకు అనుగుణంగా వాళ్ళు తమ జీవితాలను కొనసాగించడం లేదు. \v 5 అయితే దేవుడు చేయమని ఆజ్ఞాపించిన వాటిని పాటిస్తున్న మనుషులు దేవుణ్ణి అన్ని రకాలుగా ప్రేమిస్తున్నారు. ఈ విధంగా మనం దేవునితో కలిసి సహవాసంలో ఉన్నామని కచ్చితంగా చెప్పవచ్చు. \p \v 6 మనం దేవునితో ఐక్యంగా ఉన్నామని చెబితే, క్రీస్తు ఏవిధంగా జీవించాడో, ఆ విధంగా మన జీవితాలను కొనసాగించుకోవాలి. \s5 \v 7 నా ప్రియమైన స్నేహితుల్లారా, మీరేదో కొత్తది చేయమని నేను రాయడం లేదు. మీరు క్రీస్తులో మొదట విశ్వాసం ఉంచినప్పటి నుంచి, ఏది చేస్తున్నారో దాన్నే చేయమని మీకు తెలిసిందే నేను రాస్తున్నాను. మీరు ఎప్పుడూ వింటున్న సందేశంలోని భాగమే ఇది. \v 8 కానీ ఈ విషయం పైనే నేను మీకు మళ్ళీ ఒకటి చెబుతాను. ఒక కొత్త విషయాన్ని చేయమని నేను మీకు చెబుతున్నాను. క్రీస్తు చేసిన పని కొత్తది. అలాగే మీరు చేస్తున్న పని కొత్తది. దీని కారణంగా మీరు పాపం చేయడం ఆపేస్తున్నారు. అంతే కాకుండా మరింత మంచిని చేస్తున్నారు. రాత్రి గడిచిపోయి మెల్లగా తెల్లవారుతున్నట్లుగా, క్రీస్తు తిరిగి వచ్చే రోజు ఉంటున్నది. \s5 \p \v 9 వెలుగులో నివసిస్తున్నామని ప్రకటించుకుంటున్న వాళ్ళు విశ్వాసులను ఇంకా ద్వేషిస్తున్నట్లయితే, వాళ్ళు ఇంకా చీకటిలో నివసిస్తున్న వ్యక్తులే. \v 10 కానీ తమ తోటి విశ్వాసులను ప్రేమించేవాళ్ళు, వెలుగులో నివసించే మనుషుల్లాగా ప్రవర్తిస్తారు. వాళ్ళు పాపం చేయడానికి ఇకపై ఏ కారణం లేదు. \v 11 కానీ తమ తోటి విశ్వాసులను ద్వేషిస్తున్న వాళ్ళు చీకటిలోనే నివసిస్తున్న మనుషుల్లా ఇంకా అపవిత్రమైన విధానాల్లోనే తమ జీవితాలు కొనసాగిస్తున్నారు. చివరికి వాళ్ళు తాము కూర్చున్న కొమ్మ తామే నరుక్కుంటున్నామని వాళ్ళకు తెలియదు. ఆత్మీయ సత్యాన్ని ఎరుగక ఆత్మీయంగా అంధులుగా మారారు. \s5 \p \v 12 నేను ప్రేమిస్తున్న నా సొంత పిల్లలే అయినప్పటికీ, ఇది మీకు రాస్తున్నాను. క్రీస్తు మీ కోసం చేసిన బలియాగం వల్ల దేవుడు మీ పాపాలను క్షమించాడు. \v 13 మిగతావాళ్ళలో పెద్దవాళ్ళైన విశ్వాసులకు నేను ఈ విధంగా రాస్తున్నాను. క్రీస్తు ఎప్పుడూ జీవించే వాడని మీకు తెలుసు. యువకులకు కూడా నేను ఈ విధంగా రాస్తున్నాను. మీరు దుర్మార్గుడైన సాతానును ఓడించారు. \v 14 చిన్న పిల్లలకు నేను రాస్తున్నదేమిటంటే, దేవుడు మనకు తండ్రి అని మీకు తెలుసు. దాన్నే మళ్ళీ మీకు చెబుతున్నాను. వృద్ధులకు నేను చెబుతున్నదేమిటంటే ఎప్పుడూ ఉనికిలో ఉన్నవాడు క్రీస్తే అని మీరు తెలుసుకున్నారు. యువకులకు నేను రాస్తున్నదేమిటంటే, మీరు దృఢంగా ఉన్నారు. మీకు దేవుడు ఆజ్ఞాపించిన వాటిని పాటించడం కొనసాగించండి. ఎందుకంటే మీరు దుర్మార్గుడైన సాతానును ఓడించారు. \s5 \v 15 ఈ లోకంలో దేవుణ్ణి గౌరవించని మనుషుల్లాగా ప్రవర్తించకండి. అలాంటి వ్యక్తులు కోరుకుంటున్న వస్తువులను కోరుకోవద్దు. అలాంటి వ్యక్తులు జీవిస్తున్నట్లుగా ఎవరైనా జీవించాలనుకుంటే, వాళ్ళు మన తండ్రియైన దేవుణ్ణి ప్రేమించడం లేదని నిరూపిస్తున్నారు. \p \v 16 మనుషులు చేసే అన్ని పాపకార్యాలు, అన్ని విషయాలవైపు మనుషులు చూసే దృక్పథం, వాటిని పొందటానికి తమకుతాము చేసే ప్రయత్నాలు, అన్ని విషయాలను గూర్చి వాళ్ళు తమను తాము పొగుడుకునే ప్రగల్భాల వంటి విషయాలలో పరలోకంలో ఉన్న మన తండ్రికి ఎలాటి సంబంధం లేదు. వీళ్ళు ఈ పాప లోకానికి సంబంధించిన మనుషులు కాబట్టే నేను ఇలా రాస్తున్నాను. \v 17 దేవుణ్ణి గౌరవించలేని ఈ లోకంలోని మనుషులు, తాము ఎంతో కోరుకునే నశించిపోయే వస్తువులతో పాటు కనిపించకుండా పోతారు. కానీ ఎవరైతే దేవుడు చేయమని కోరిన వాటిని తుచ తప్పకుండా చేస్తారో, వాళ్ళు శాశ్వతంగా జీవిస్తారు. \s5 \p \v 18 మీరు నాకు అత్యంత ప్రియమైన వారు. యేసు భూమి మీదకు తిరిగి వచ్చే సమయం దగ్గరలో ఉంది. రాబోయే క్రీస్తును నేనే అంటూ నటించే వ్యక్తి వస్తాడని మీరు ఇప్పటికే విన్నారు. వాస్తవానికి అటువంటి వ్యక్తులు ఇప్పటికే వచ్చారు. వాళ్ళందరూ క్రీస్తుకు వ్యతిరేకులు. ఇలాంటి అబద్ధపు క్రీస్తుల కారణంగానే క్రీస్తు త్వరలో రాబోతున్నాడని మనకు తెలుస్తుంది. \v 19 నిజానికి వీళ్ళు మొదటి నుంచి మనకు చెందిన వాళ్ళు కాదు కాబట్టే, ఈ మనుషులు మన సంఘంలో ఉండటానికి నిరాకరించారు. వాళ్ళు మనల్ని వదలి వెళ్ళినప్పుడు, వారెన్నడు మనతో కలసి సహవాసంలో లేరని మనం స్పష్టంగా చూశాము. \s5 \v 20 కానీ పరిశుద్దుడైన క్రీస్తు మీ కోసం తన ఆత్మను ఇచ్చాడు. సమస్త సత్యాన్ని ఈయన ఆత్మయే మనకు బోధిస్తుంది. \p \v 21 ఈ లేఖ మీకు రాసేది దేవుని గురించిన సత్యం మీకు తెలియదని కాదు. అది ఏమిటో మీకు తెలిసినందువల్లే రాస్తున్నాను. దేవుడు మనకు ఆ సత్యాన్ని ఎన్నడూ బోధించలేదని మీకు తెలుసు. దానికి బదులుగా ఏది సత్యమో, దాన్ని మాత్రమే ఆయన మనకు బోధిస్తాడు. \s5 \p \v 22 ఘోరమైన దగాకోరులు ఎవరంటే యేసుక్రీస్తును నిరాకరించే వాళ్ళు. ఈ విధంగా చేస్తున్న వాళ్ళందరూ క్రీస్తు వ్యతిరేకులు. ఎందుకంటే వాళ్ళు తండ్రిని, ఆయన కుమారుణ్ణి నమ్మడానికి నిరాకరించారు. \v 23 యేసును దేవుని కుమారుడని గుర్తించడానికి నిరాకరించే వాళ్ళు, ఏవిధంగానూ దేవునితో చేరిన వాళ్ళు కాదు. అయితే ఎవరైతే యేసును దేవుని కుమారుడని గుర్తిస్తారో, వాళ్ళు తండ్రితో కలిసి జీవిస్తారు. \s5 \p \v 24 కాబట్టి మీకు సంబంధించినంత వరకు, మీరు ప్రారంభంలో యేసుక్రీస్తును గూర్చి విన్న సత్యంలో మీ విశ్వాసాన్ని కచ్చితంగా కొనసాగించండి. మీరు దానికి అనుగుణంగానే జీవించండి. మీరు అలా చేయగలిగినట్లయితే, మీరు తండ్రి అయిన దేవునితోను, ఆయన కుమారుడితోను కలిసి ఉంటారు. \v 25 మనం శాశ్వతంగా జీవించటానికి కారణం ఆయనే అవుతాడు అని దేవుడు మనకు చెబుతున్నాడు. \p \v 26 క్రీస్తును గురించిన సత్యానికి సంబంధించి మిమ్మల్ని మోసం చేయాలనుకునే వాళ్ళను గూర్చి మిమ్మల్ని హెచ్చరించటానికి నేను మీకు ఇది రాస్తున్నాను. \s5 \v 27 మీకోసం క్రీస్తు నుంచి మీరు పొందిన దేవుని ఆత్మ మీలోనే ఉంది. కాబట్టి మరెవరో మీకు బోధకులుగా ఉండనవసరం ఏమీ లేదు. మీరు తెలుసుకోవలసిన ప్రతి విషయం దేవుని ఆత్మ మీకు బోధిస్తాడు. ఆయన ఎన్నడూ అసత్యాన్ని బోధించడు. ఎప్పుడూ సత్యాన్నే బోధిస్తాడు. కాబట్టి ఆయనతో కలసి కొనసాగుతూ, ఆయన మీకు బోధించే మార్గంలో జీవితాన్ని కొనసాగించండి. \p \v 28 ఇప్పుడు మీరు నా ప్రియమైనవారే అని భావిస్తూ, క్రీస్తుతో కలసి జీవితాన్ని కొనసాగిస్తూ ఉండమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ఆయన మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు, ఆయన మనల్ని అంగీకరిస్తాడని నమ్మకం ఉండేలా మన పనులు ఉండాలి. మనం అలా చేస్తే, ఆయన వచ్చినప్పుడు మనం ఆయన ఎదుట నిలబడి ఎంతమాత్రం సిగ్గుపడే అవసరం ఉండదు. \v 29 క్రీస్తు ఎప్పుడూ సరైనదే చేస్తాడని మీకు తెలిసినప్పటినుంచి, సరైన దాన్ని చేస్తున్న వాళ్ళందరూ దేవుని పిల్లలుగా మారారని మీకు తెలుసు. \s5 \c 3 \p \v 1 మన తండ్రి మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడనే దాన్ని గూర్చి ఆలోచించండి. మనం ఆయన పిల్లలమని చెప్పడానికి ఆయన మనకు అనుమతినిస్తున్నాడు. అది వాస్తవం. కానీ అవిశ్వాసులైన మనుషులకు నిజమైన దేవుడు ఎవరో అర్థం కాలేదు. కాబట్టి దేవుని పిల్లలమైన మనం ఎవరో కూడా వాళ్లకు అర్థం కాలేదు. \v 2 నా ప్రియమైన స్నేహితుల్లారా, ప్రస్తుతానికి మనం దేవుని పిల్లలమైనప్పటికీ, భవిష్యత్తులో మనం ఎలా ఉండబోతున్నామో అనేది ఇంకా మనకు దేవుడు చూపించలేదు. అయినప్పటికీ క్రీస్తు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు మనం ఆయనలా మారిపోతామని మాత్రం మనకు తెలుసు. ఎందుకంటే మనం ఆయన్ని ముఖాముఖిగా చూస్తాము. \p \v 3 కాబట్టి ఎవరైతే క్రీస్తును ముఖాముఖిగా చూస్తామని ఆత్మవిశ్వాసంతో ఉంటారో, వాళ్ళు పాపమే లేని క్రీస్తువలే తమను తాము పాపానికి దూరంగా ఉంచుకుంటారు. \s5 \v 4 దేవుని ధర్మశాస్త్రాన్ని నిరాకరిస్తున్న ప్రతి ఒక్కరూ పాపంలోనే కొనసాగుతున్నారు. ఎందుకంటే పాపమంటే దేవుని ధర్మశాస్త్రాన్ని నిరాకరించడమే. \v 5 మన అపరాధాన్ని పూర్తిగా తొలిగించటానికి క్రీస్తు వచ్చాడని మీకు తెలుసు. ఆయన ఎప్పుడూ పాపం చేయలేదని మీకు తెలుసు. \v 6 క్రీస్తు కోరిన విధంగా చేస్తూ పదే పదే పాపం చేయకుండా ఉండండి. కానీ పదే పదే పాపాన్ని చేస్తున్న వాళ్ళకు క్రీస్తు ఎవరనేది అర్థం కాలేదు. అంతేకాక వాళ్ళు ఆయనతో నిజంగా కలవలేదు. \s5 \v 7 కాబట్టే ఈ పాపం పెద్ద విషయం కాదు అంటూ చెప్పడం ద్వారా ఎవ్వరు కూడా మిమ్మల్ని మోసం చెయ్యకుండా చూసుకోమని నాకు ప్రియమైన మిమ్మల్ని అభ్యర్ధిస్తున్నాను. ఏది మంచిదో దాన్ని చేయడం, కొనసాగించడం ద్వారా నీతిమంతుడైన క్రీస్తు వలే మీరు నీతిమంతులు అవ్వండి. \p \v 8 కానీ ఎవరైతే పదే పదే పాపం చేస్తున్నారో వాళ్ళు సాతాను వంటి వాళ్ళు. ఎందుకంటే ఈ లోకం ప్రారంభమైనప్పటి నుంచే సాతాను పాపం చేస్తూనే ఉన్నాడు. సాతాను చేసిన పనులను నాశనం చేయడానికే దేవుని కుమారుడు సాధారణమైన మనిషిగా వచ్చాడు. \s5 \v 9 మనుషులు దేవుని పిల్లలుగా మారినట్లయితే వాళ్ళు పదే పదే పాపం చేయటం కొనసాగించరు. వాళ్ళు దేవుని పిల్లలుగా మారినందువల్ల నిరంతరం పాపం చేయలేరు. దేవుడు వాళ్ళను తన పిల్లలుగా చేసుకున్నాడు. అంతేకాక ఆయన తాను ఎలాంటివాడో అలాంటిదాన్నే వాళ్ళలో పెట్టాడు. \v 10 దేవుని పిల్లలకు, సాతాను పిల్లలకు మధ్య స్పష్టమైన తేడా ఉంటుంది. సాతాను పిల్లలు ఎవరో మనం తెలుసుకోవడానికి సరైన మార్గం ఏమిటంటే, సరైన మంచి పనులు చేయని వాళ్ళు దేవుని పిల్లలు కారు. తమ తోటి విశ్వాసులను ప్రేమించనివాళ్ళు దేవుని పిల్లలు కారు. \s5 \p \v 11 మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి అనేదే మనం మొదట క్రీస్తులో విశ్వాసముంచినప్పుడు మనం విన్న సువార్త సందేశం. \v 12 సాతాను సంబంధీ, దుర్మార్గుడు అయిన ఆదాము కుమారుడు కయీను చేసినట్లు, మనం ఒకరినొకరు ద్వేషించుకోకూడదు. ఎందుకంటే కయీను తన తమ్ముణ్ణి ద్వేషించి అతణ్ణి చంపాడు. కయీను తన తమ్ముణ్ణి ఎందుకు చంపాడు అనేది నేను మీకు చెప్తాను. కయీను సాతానుకు చెందిన దుర్మార్గమైన పద్ధతుల్లో ప్రవర్తించటం అలవాటుగా మారడం, అదే సమయంలో అతని తమ్ముడు నీతి మార్గంలో ప్రవర్తించడం వల్ల అతడు తన తమ్ముణ్ణి ద్వేషించాడు. \s5 \v 13 మిమ్మల్ని అవిశ్వాసులు ద్వేషించినప్పుడు మీరు ఆశ్చర్యపోవద్దు. \v 14 మన తోటి విశ్వాసుల్ని మనం ప్రేమిస్తునందువల్ల దేవుడు మనల్ని శాశ్వతంగా తనతో పాటు జీవింప చేస్తాడని మనకు తెలుసు. కానీ తమ తోటి విశ్వాసులను ప్రేమించని వాళ్ళను నిత్యజీవంతో ఉన్నవాళ్ళుగా కాకుండా, మరణపు ముల్లు క్రిందనే జీవించే వాళ్ళుగానే పరిగణిస్తాడు. \p \v 15 తమ తోటి విశ్వాసులను ద్వేషించి, వాళ్ళ పట్ల ఏ కొద్దిగానైనా చెడు చెయ్యాలని ఆలోచించే వాళ్ళను, దేవుడు హంతకులుగానే చూస్తాడు. హంతకులకు పరలోక ప్రవేశం లేదని మీకు తెలుసు. \s5 \v 16 క్రీస్తు స్వచ్చందంగా మనకోసం మరణించాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవడం ద్వారా, మన తోటి విశ్వాసులను నిజంగా ఏ విధంగా ప్రేమించాలనేది ఇప్పుడు మనకు తెలుసు. కాబట్టి, అదే విధంగా మన తోటి విశ్వాసుల కోసం ఏమి చేయటానికైనా సిద్ధపడాలి. అవసరమైతే వాళ్ళ కోసం మనం మరణించాలి. \v 17 ఈ లోకంలో బ్రతకటానికి అవసరమైనవన్నీ మనలో చాలా మంది దగ్గర ఉన్నాయి. అయితే మన తోటి విశ్వాసుల్లో బ్రతకటానికి అవసరమైన వాటిల్లో ఏవైనా తక్కువయ్యాయని మనకు తెలిసి, వాటిని ఇవ్వడానికి నిరాకరిస్తే, మనం చెప్పుకుంటునట్లుగా దేవుణ్ణి ప్రేమించడం లేదనేది స్పష్టమౌతుంది. \v 18 నేను ఎంతగానో ప్రేమిస్తున్న మీకు చెప్పేదేమిటంటే, మనం ఒకరినొకరు ప్రేమించుకుంటున్నామని కేవలం ఒట్టి మాటల్లోనే చెప్పుకోవడడం కాదు. మనం ఒకరికొకరు సహాయం చేసుకోవడం ద్వారా యధార్ధమైన ప్రేమను చూపించుకుందాము. \s5 \p \v 19 మనం మన తోటి విశ్వాసుల్ని నిజంగా ప్రేమించినట్లయితే, క్రీస్తును గూర్చిన సత్యసువార్తకు అనుగుణంగా మనం కచ్చితంగా జీవిస్తాము అనుకోవచ్చు. తద్వారా దేవుని సన్నిధిలో మనకు ఎలాటి అపరాధభావం ఉండదు. \v 20 మనం పాపం చేసినందువల్ల మనం అపరాధ భావంతో ఉన్నప్పటికీ, మనం ఆయన్ని విశ్వసించటానికి అర్హులుగా దేవుడు చేశాడు. అందువల్ల మనం నమ్మకంగా ప్రార్ధించవచ్చు. మన గూర్చి దేవునికి తెలుసు. \p \v 21 ప్రియ స్నేహితుల్లారా, మన మనసు మనం పాపం చేశామని నిందించకపోతే, మనం దేవునికి ఆత్మవిశ్వాసంతో ప్రార్ధించవచ్చు. \v 22 మనం ఆత్మవిశ్వాసంతో ఆయనకు ప్రార్ధించి, ఆయన నుంచి ఏదైనా ఆభ్యర్ధిస్తే, మనం ఆయన నుంచి పొందుతాము. ఎందుకంటే దేవుడు చేయమని ఆజ్ఞాపించిన దాన్ని మనం చేశాము. ఆయన్ని సంతోషపరిచేదే మనం చేశాము. \s5 \v 23 ఆయన మనకు చేయమని ఆజ్ఞాపించినదేమిటో నేను మీకు చెబుతాను. యేసుక్రీస్తు దేవుని కుమారుడని మనం కచ్చితంగా నమ్మాలి. దేవుడు చేయమని మనకు ఆజ్ఞాపించినట్లుగా మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి. \v 24 దేవుడు ఆజ్ఞాపించినట్లుగా చేసేవాళ్ళు దేవుడుతో సహవాసం ఉన్నవాళ్లు. దేవుడు వాళ్ళతో కలిసిపోతాడు. ఎందుకంటే దేవుడు మనకు ఇచ్చిన దేవుని ఆత్మ మన దగ్గర ఉన్నది. తద్వారా మనకు దేవునితో సహవాసం ఉందని కచ్చితంగా చెప్పవచ్చు. \s5 \c 4 \p \v 1 నా ప్రియ స్నేహితులారా, అనేకమంది మనుషులు ప్రజలకు తప్పుడు సందేశాలు బోధిస్తున్నారు. అయితే ఇలాంటి వాళ్ళు బోధిస్తున్న బోధలను వినే మీరందరూ దాన్ని గూర్చి తప్పక జాగ్రత్త వహించాలి. ఎందుకంటే వాళ్ళు దేవుడి నుంచి వచ్చిన సత్యాన్నే బోధిస్తున్నారా, లేదా అనేది మీకు తెలుస్తుంది. \v 2 దేవుని ఆత్మ నుంచి వచ్చిన సత్యాన్నే వాళ్ళు బోధిస్తున్నారో, లేదో మీరు ఎలా తెలుసుకోవాలో నేను మీకు చెబుతాను. దేవుడు పంపిన యేసుక్రీస్తు, మనలాంటి మనిషిగా వచ్చాడనే సువార్తను బోధిస్తూ, ధృవపరిచేవాళ్ళే దేవుని నుంచి వచ్చిన సందేశాన్ని బోధించే బోధకులు. \v 3 యేసును గూర్చిన సత్యాన్ని ధృవపరచని వాళ్ళు, దేవుని నుంచి వచ్చిన సువార్త సందేశాన్ని బోధించేవాళ్ళు కాదు. అటువంటి వ్యక్తులు క్రీస్తును వ్యతిరేకించే బోధకులు. మన మధ్యకు అలాంటి వ్యక్తులు వస్తారని మీరు విన్నారు. ఇప్పటికే అలాంటి వ్యక్తులు మన మధ్యకు వచ్చారు. \s5 \p \v 4 నాకు ఎంతో ప్రియమైన మీకోసం నేను చేబుతున్నదేమిటంటే మీరు దేవుని సంబంధులు, అందుకే అలాంటి వ్యక్తుల బోధనలను నమ్మడానికి నిరాకరించారు. ఎందుకంటే మహాఘనుడైన దేవుడు తాను కోరినట్లు మీరు చేయడానికి మీకు అనుమతి ఇచ్చాడు. \v 5 ఈ లోకంలో దేవుణ్ణి సన్మానించకుండా నిరాకరిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అలాంటి వ్యక్తులకు చెందినవాళ్ళే ఈ అబద్ధాలను బోధిస్తున్న బోధకులు. అందుకే ఇలాంటి వ్యక్తుల నుంచి అలాంటి మాటలే వస్తాయి. అలాంటి మాటలు అలాంటి వ్యక్తులే వింటారు. \v 6 మన విషయానికొస్తే మనం దేవునికి చెందిన వాళ్ళం. దేవునికి చెందని వాళ్ళు మనం బోధించే మాటలు వినరు. దేవునికి చెందినవాళ్ళే వింటారు. ఇతరులను మోసం చేసే వాళ్ళకూ, దేవుని గూర్చి సువార్త సత్యాన్ని బోధించే వ్యక్తులకూ మధ్య ఉన్న తేడా ఈ విధంగా మనం గుర్తించవచ్చు. \s5 \p \v 7 నా ప్రియమైన స్నేహితుల్లారా, మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఎందుకంటే మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలనేదే దేవుని కోరిక. తమ తోటి విశ్వాసుల్ని ప్రేమించేవాళ్ళు దేవుణ్ణి తెలుసుకుని, ఆయన పిల్లలయ్యారు. \v 8 అలాంటి వ్యక్తులకే దేవుడు తన ప్రేమను చూపిస్తాడు. కాబట్టి తమ తోటి విశ్వాసుల్ని ప్రేమించలేని వాళ్ళకు దేవుడు అంటే ఏమిటో అర్థం కాలేదు. \s5 \v 9 దేవుడు తన ప్రేమను మనపై ఎలా చూపిస్తున్నాడో నేను మీకు వివరిస్తాను. తన ఏకైక కుమారుణ్ణి మన కోసం భూమి మీదకు పంపి, ఆయన ద్వారా మనకు నిత్య జీవాన్ని ప్రసాదిస్తున్నాడు. \v 10 మరో వ్యక్తిని నిజంగా ప్రేమించడం అంటే ఏమిటో దేవుడు మనకు అర్ధమయ్యేలా చూపించాడు. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించడం కాదు. దేవుడే మనల్ని మొదట ప్రేమించాడు. కాబట్టే, మనం పాపం చేసి పాపాత్ములం అయినప్పుడు దేవుడే మనల్ని క్షమించటం కోసం, తనను తాను బలిగా ఆర్పించుకోవడం కోసం ఆయన తన కుమారుణ్ణి పంపాడు. \s5 \v 11 నా ప్రియమైన స్నేహితులారా, దేవుడు అంతలా మనల్ని ప్రేమించాడు, కాబట్టి ఒకరినొకరు ప్రేమించుకోవడం మన బాధ్యత. \p \v 12 దేవుణ్ణి ఎవ్వరూ, ఎన్నడూ చూడలేదు. ఏది ఏమైనా మనం ఒకరినొకరు ప్రేమించుకున్నట్టయితే, దేవుడు మనలోనే నివసిస్తాడని స్పష్టమౌతుంది. అంతేకాక మనం ఒకరినొకరు ప్రేమించుకోవడమనేది దేవుని ఉద్దేశ్యాలను చేయడమే కదా. \v 13 మనం దేవునితో కలసి ఉన్నామనీ, అలానే దేవుడు మనతో కలసి ఉన్నాడనేది మనం ఎలా స్పష్టంగా తెలుసుకోగలమో నేను మీకు స్పష్టంగా వివరిస్తాను. ఆయన తన ఆత్మను మనలో ఉంచాడు. \v 14 అపోస్తులమైన మేము దేవుని కుమారుణ్ణి దగ్గరగా చూశాము. ఈ లోకంలోని వ్యక్తులు తమ పాపాలతో శాశ్వతంగా బాధపడుతుంటే, వాళ్ళను రక్షించటం కోసం తండ్రి తన కుమారుణ్ణి పంపాడని అందరికి దృఢంగా చెబుతాము. \s5 \v 15 కాబట్టి యేసును గూర్చి సత్యాన్ని చెప్పేవాళ్ళతోనే దేవుడు కలసి ఉంటాడు. యేసును దేవుని కుమారుడని అన్నవాళ్ళతోనే దేవుడు ఉంటాడు, కాబట్టి వాళ్ళు దేవునితోనే కలసి ఉంటారు. \p \v 16 ఆయన మనల్ని ఎలా ప్రేమిస్తాడు అనేది మేము అనుభవపూర్వకంగా తెలుసుకున్నాము. ఆయన మనల్ని ప్రేమిస్తాడనేది మేము నమ్ముతున్నాము. దాని ఫలితంగా మేము ఇతరుల్ని ప్రేమిస్తున్నాము. ఎందుకంటే ఇతరుల్ని ప్రేమించడమే దేవుని స్వభావం. ఎవరైతే ఇతరుల్ని ప్రేమించడం కొనసాగిస్తారో, వాళ్ళు దేవునితో సహవాసం ఉన్నవాళ్లు, అలాగే దేవుడు వాళ్ళతో కలసి ఉంటాడు. \s5 \v 17 మనం ఇతరుల్ని సంపూర్ణంగా ప్రేమించాలి. మనం అలా చేసినట్లయితే, దేవుడు మనల్ని తీర్పు తీర్చే సమయం వచ్చినప్పుడు ఆయన మనల్ని వ్యతిరేకించడని మనకు నమ్మకం ఉంటుంది. యేసు తనకు తానుగా దేవునితో కలసి ఉన్నట్లుగానే, మనం ఈ లోకంలో జీవించినంత కాలం దేవునితో కలసి ఉంటామని మనం నమ్మకంతో ఉంటాము. \p \v 18 మనం నిజంగా ఆయన్ని ప్రేమించినట్లయితే, మనం దేవునికి ఏమాత్రం భయపడము. ఎందుకంటే ఎవరైతే దేవుణ్ణి సంపూర్ణంగా ప్రేమిస్తారో, వాళ్ళు ఆయనకు భయపడనవసరం లేదు. ఆయన మనల్ని శిక్షిస్తాడని ఆలోచన ఉన్నప్పుడు మాత్రమే మనం భయపడతాము. కాబట్టి దేవుణ్ణి సంపూర్ణంగా ప్రేమించనివాళ్ళే కచ్చితంగా దేవునికి భయపడతారు. \s5 \v 19 దేవుడే మొదట మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం దేవుణ్ణి , మన తోటి విశ్వాసుల్ని ప్రేమిస్తున్నాము. \v 20 కాబట్టి నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెబుతూ, తన తోటి విశ్వాసుల్ని ద్వేషిస్తే వాళ్ళు అబద్ధం చెబుతున్నారు. మనకు కనిపిస్తున్న మన తోటి విశ్వాసులనే ప్రేమించలేనివాళ్ళు, తాము చూడని దేవుణ్ణి ఎలా ప్రేమించగలరు? \v 21 మనం ఆయన్ని ప్రేమించినట్లయితే, మన తోటి విశ్వాసులను కూడా ప్రేమించాలి. దేవుడు మనకు ఆజ్ఞాపించిన ఈ విషయాలను మీ మనసుల్లో గుర్తుపెట్టుకోండి. \s5 \c 5 \p \v 1 యేసు ప్రభువుని క్రీస్తుగా నమ్ముతున్న వాళ్ళందరూ దేవుని పిల్లలు, వాళ్ళు దేవుని నుండి పుట్టిన పిల్లలు. దేవుడైన తండ్రిని ప్రేమించే ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఆయన బిడ్డలను కూడా ప్రేమిస్తారు. \v 2 మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నప్పుడు, ఆయన మనకు ఆజ్ఞాపించినట్లుగా తప్పకుండా మనం దేవుని పిల్లలను ప్రేమిస్తాము. అంతేకాకుండా ఆయన ఆజ్ఞాపించినట్లుగా మనం చేస్తాము. \v 3 నేను ఈ మాటలను ఎందుకు చెబుతున్నానంటే, నిజంగా దేవుణ్ణి ప్రేమించడం అంటే అర్థం ఆయన మనకు ఆజ్ఞాపించినట్లుగా చేయడమే. అంతేకాకుండా ఆయన ఆజ్ఞాపించినట్లు చేయడం ఏమంత కష్టం కాదు. \s5 \v 4 దేవుని కారణంగా ఆయన పిల్లలుగా మారిన మనమందరం, అవిశ్వాసులు చెయ్యాలని కోరుకున్న వాటిని చేయడానికి నిరాకరించాము. అంతేకాక మీరు దేవునికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి దానికంటే బలమైనవాళ్లు. క్రీస్తులో నమ్మిక ఉంచినందువల్ల మనం చెడును చేయడానికి నిరాకరించాము. \v 5 దేవునికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి దానికంటే, ప్రతి వ్యక్తి కంటే బలమైన వాళ్ళు ఎవరు? యేసు దేవుని కుమారుడని నమ్మే వాళ్ళే. ఆయనకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి దానికంటే, ప్రతి వ్యక్తి కంటే వ్యతిరేకించి బలంగా నిలుచున్న వాళ్ళే. \s5 \p \v 6 యేసుక్రీస్తును గురించి ఆలోచించండి. దేవుని దగ్గర నుండి భూమి మీదకు వచ్చినవాడు ఆయనే. యోహాను యేసుకు నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చినప్పుడు, యేసు రక్తం కార్చి చనిపోయినప్పుడు దేవుడు యేసును పంపాడని దేవుడు మనకు చూపిస్తున్నాడు. యేసుక్రీస్తు దేవుని నుంచి వచ్చాడని దేవుని ఆత్మ మనకు కచ్చితంగా ప్రకటిస్తున్నాడు. \v 7 ఈ ముగ్గురు సాక్షులు అంటే దేవుని ఆత్మ, నీరు, రక్తం. \v 8 ఈ ముగ్గురూ ఒకే విషయాన్ని మనకు చెబుతున్నారు. \s5 \v 9 ఎవరైనా ఇతరులు మనకు ఏదైనా విషయాన్ని చెబితే మనం సాధారణంగానే నమ్ముతాము. అంతకంటే దేవుడు మనకు చెప్పిన దానిపై మనం కచ్చితంగా ఎక్కువ నమ్మకం పెట్టుకోవచ్చు. ఆయన తన కుమారుణ్ణి గూర్చి కచ్చితంగా సాక్ష్యమిస్తూ, నిరూపిస్తున్నాడు. \p \v 10 దేవుని కుమారునిలో నమ్మకం ఉన్న వాళ్ళకు, తమ అంతరంగాల్లో ఆయన గూర్చిన సత్యమేమిటో స్పష్టంగా తెలుసు. కానీ దేవుడు చెప్పిన దాన్ని నమ్మని వాళ్ళు ఆయన్ని అబద్ధాలకోరు అని పిలుస్తున్నారన్న మాట. ఎందుకంటే దేవుడు తన కుమారుణ్ణి గూర్చి ఇచ్చిన సాక్ష్యాన్ని, రుజువును నమ్మటానికి వాళ్ళు నిరాకరించారు. \s5 \v 11 దేవుడు మనతో మీకు నిత్యజీవాన్ని ఇచ్చాను అని చెబుతున్నాడు. మనకు ఆయన కుమారుడితో సహవాసం ఉన్నట్లయితే మనం శాశ్వత కాలం జీవిస్తాము. \v 12 దేవుని కుమారుడితో సహవాసం ఉన్నవాళ్లు దేవునితో శాశ్వత కాలం జీవిస్తారు. ఆయనతో సహవాసం లేనివాళ్ళు నిత్య జీవాన్ని పొందలేరు. \s5 \p \v 13 యేసు దేవుని కుమారుడని నమ్ముతున్న మీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. ఎందుకంటే మీరు మీ నమ్మిక ప్రకారంగానే శాశ్వతంగా జీవిస్తారని మీరు తెలుసుకోవచ్చు. \v 14 మనం ఆయనతో సహవాసంలో ఉన్నందువల్ల, ఆయనకు ఆమోదయోగ్యంగా ఉన్న దాన్ని మనం ఏదైనా అడిగినప్పుడు, ఆయన మన మనవి వింటాడని మనకు చాలా నమ్మకం ఉంది. \v 15 అలాగే మనం ఏదైనా అడిగితే ఆయన మన మనవి వింటాడని మనకు తెలిస్తే, అప్పుడు మనం ఆయన్ని ఏది అడిగినా, ఆయన నుంచి పొందుతామని కచ్చితంగా అనుకోవచ్చు. \s5 \p \v 16 ఒకవేళ నీ తోటి విశ్వాసుల్లో ఒకరు దేవుని నుంచి వాళ్ళను, వేరు చేయని పాపం చేస్తున్నారని మీరు చూశారనుకోండి, మీరు వాళ్ళు పాపం చేస్తున్నపుడు చూసి, మీరు దేవుణ్ణి అతడు చేసిన పాపం కోసం ప్రార్ధించి అడిగితే, మీ ప్రార్థన బట్టి దేవుడు ఆ వ్యక్తికి అతని జీవితాన్ని అతడికి తిరిగి ఇస్తాడు. అంటే దేవుని నుంచి వేరు చేయని పాపానికి పాల్పడే వ్యక్తికోసం మీరు దేవుణ్ణి ప్రార్ధించవచ్చు. కానీ కొంత మంది దేవునినుంచి దూరం అవ్వడానికి కారణమయ్యే విధంగా పాపం చేస్తారు. ఆ విధంగా పాపం చేస్తున్న వాళ్ళకు సహాయంగా దేవుణ్ణి ప్రార్ధించి అడగమని నేను చెప్పడం లేదు. \v 17 దేవునికి వ్యతిరేకంగా చేసే ప్రతి అపరాధం పాపమే. కానీ మనం చేసే ప్రతి చెడ్డ పని మనల్ని దేవుని నుంచి శాశ్వతంగా దూరం చేయలేదు. \s5 \p \v 18 ఏ వ్యక్తి అయినా దేవుని బిడ్డ అయితే అతడు మళ్ళీ, మళ్ళీ పాపం చేయడని మనకు తెలుసు. దానికి బదులుగా దుర్మార్గుడైన సాతాను అతడికి హాని చెయ్యనివ్వకుండా దేవుని కుమారుడు రక్షిస్తాడు. \v 19 మనం దేవునికి చెందిన వాళ్ళమని మీకు తెలుసు. అలాగే ఈ ప్రపంచం మొత్తం దుర్మార్గుడైన సాతాను గుప్పెట్లో ఉందని మనకు తెలుసు. \s5 \v 20 దేవుని కుమారుడు మన మధ్యకు వచ్చాడని, దేవుని సత్యాన్ని మనకు అర్థమయ్యేలా చేశాడని మనకు తెలుసు. సత్యవంతుడైన దేవుని కుమారుడైన యేసు క్రీస్తుతో మనం సహవాసంలో చేరాము. యేసు క్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు, మనం నిత్య జీవాన్ని పొందడానికి అవకాశం కల్పించే వాడు ఆయనే. \v 21 నాకు ఎంతో ప్రియమైన మీకు నేను చెబుతున్నదేమిటంటే, ఎలాటి శక్తి లేని దేవుళ్ళను ఆరాధించకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి.