\id 3JN - Indian Easy Version (IEV) Telugu \ide UTF-8 \h యోహాను రాసిన మూడవ పత్రిక \toc1 యోహాను రాసిన మూడవ పత్రిక \toc2 యోహాను రాసిన మూడవ పత్రిక \toc3 3jn \mt1 యోహాను రాసిన మూడవ పత్రిక \s5 \c 1 \p \v 1 ప్రియమైన స్నేహితుడు గాయికి, నీ దృష్టికి పెద్దలలో ప్రముఖుడనైన నేను యథార్థమైన ప్రేమతో రాస్తున్నది. \v 2 ప్రియ సోదరా, నీవు ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతూ ఉన్నట్టుగానే అన్ని విషయాల్లో వర్ధిల్లాలనీ, ముఖ్యంగా దేవుని విషయాల్లో ఆరోగ్యవంతుడివిగా ఉండాలనీ నేను ప్రార్ధిస్తున్నాను. \v 3 నీవు ఎప్పుడూ నడుస్తున్నట్టే క్రీస్తును గూర్చిన సువార్తకు అనుకూలంగా సత్యమార్గంలో నడచుకొంటున్నావని నీ గురించి కొందరు సోదరులు వచ్చి చెప్పగా విని చాలా సంతోషించాను. అన్ని విషయాలలోనూ నువ్వు దైవ సత్యాన్ని స్థిరంగా అమలుచేస్తూ వెంబడిస్తున్నావని వాళ్ళు చెప్పారు. \v 4 క్రీస్తును విశ్వసించడంలో నా సాయం పొందిన పిల్లలు దేవుని సత్యానికి అనుగుణ్యంగా జీవిస్తున్నారని విన్నప్పుడు నా సంతోషానికి అవధుల్లేవు. \s5 \p \v 5 ప్రియ సోదరా, నీ తోటి విశ్వాసులకుగానీ, దేవుని పని నిమిత్తం సంచారం చేస్తూ నీవున్న చోటికి వచ్చిన అపరిచితులకుగానీ నువ్వు చేస్తున్న సాయం స్వామిభక్తితో యేసుకు చేస్తున్న సేవే. \v 6 నీ ద్వారా మేలు పొందిన కొంతమంది ఇక్కడి సంఘం ఎదుట నీ ప్రేమను గూర్చి సాక్ష్యం ఇచ్చారు. అలాంటివారు ఇకముందు కూడా తమ పనిలో దేవుణ్ణి ఘనపరిచేలా నీ సాయం ఎట్టి స్థితిలోనూ మానక కొనసాగించు. \p \v 7 అలా బయటి ప్రాంతాలకు వెళ్ళి యేసును ప్రకటిస్తున్న నీ తోటి విశ్వాసులు, క్రీస్తును విశ్వసించని వారినుండి ఎలాటి ధన సహాయమూ స్వీకరించడం లేదు. \v 8 కాబట్టి క్రీస్తును నమ్మి వెంబడిస్తున్న మనలాంటి వారు, దేవుని సత్య సువార్తను ప్రకటిస్తున్న ఇలాంటి వారిని జత పనివారిగా స్వీకరించి, వారికి కావలిసిన ఆహారం, ధనం ఇచ్చి ఎలాగైనా వారి పనిలో తోడ్పడాలి. \s5 \p \v 9 అక్కడి ఇతర విశ్వాసులకు అండగా నిలవమని మీ విశ్వాస బృందాలకు నేను ఉత్తరం రాసాను. అయినప్పటికీ దియోత్రెఫే దీన్ని అంగీకరించడం లేదు. అతను మిమ్మల్ని తన చెప్పు చేతల్లో ఉంచుకోవాలని చూస్తున్నాడు. \v 10 కాబట్టి, నేను అక్కడికి వచ్చినప్పుడు అతడు చేసిన పనులూ, మాకెంతో నష్టం కలిగేలా మా గురించి ఇతరులకు చెప్పిన చాడీలూ, చెడ్డ మాటలూ అందరిముందూ బయట పెడతాను. అంతే కాదు, దేవుని సువార్త పనిలో అటూ ఇటూ తిరుగుతున్న సాటి సహోదరుల్ని స్వయంగా ఆహ్వానించకపోగా, ఆహ్వానించిన వారిని కూడా అడ్డగించి, సంఘంలో నుండి వెళ్ళగొడుతున్నాడు. \s5 \p \v 11 ప్రియ మిత్రమా, ఇలాంటి చెడ్డ తరహా మనుషులను ఏ రకంగానూ అనుకరించవద్దు. మంచి ఉదాహరణను ఎదుట ఉంచుకో. మంచి పనులు చేసేవాడు వాస్తవంగా దేవుని సంబంధి. అలాగే నిత్యం చెడు చేస్తుండేవాడు ఏమాత్రం దేవుణ్ణి దర్శించినవాడు కాడు. \p \v 12 దేమేత్రి గురించి విశ్వాసులు అందరూ మంచి సాక్ష్యం చెప్పారు. సత్యం ఒక వ్యక్తి అయితే అతను కూడా దేమేత్రి విషయంలో మంచివాడనే సాక్ష్యం చెప్తాడు. మేమూ అతను మంచివాడనే స్పష్టం చేస్తున్నాము. మేము చెప్పింది నిజమని నీకు బాగా తెలుసు. \s5 \p \v 13 ఈ లేఖ మొదలు పెట్టినపుడు మాత్రం చాలా విషయాలు నీతో ప్రస్తావించదలిచాను. కానీ ఇక రాయడం మానుకుంటున్నాను. ఒక ఉత్తరానికే ఆ విషయాలన్నీ పరిమితం చేయదలచ లేదు. \v 14 బదులుగా, నేను నిన్ను త్వరలోనే చూడగలనని ఆశిస్తున్నాను. అప్పుడు మనం ముఖాముఖీ మాట్లాడుకుందాం. \v 15 దేవుడు తన శాంతిని నీకు ప్రసాదించుగాక. ఇక్కడి నీ స్నేహితులు నీకు అభివందనాలు చెబుతున్నారు. అక్కడి మన స్నేహితులందరికీ పేరు పేరునా మా అభివందనాలు తెలియజెయ్యి.